Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

సహనాన్ని పరీక్షించొద్దు..

0
0

కరీంనగర్ టౌన్, డిసెంబర్ 12: మజ్లిస్ పార్టీ అండదండలతో ఎన్నికల్లో గెలిచిన టీఆర్‌ఎస్ బీజేపీ పట్ల అసహనంతోవ్యవహరిస్తూ, దాడులకు తెగబడుతోందని, అధికార దర్పంతో నిర్వహిస్తున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆధ్యాత్మిక గురువు స్వామి పరిపూర్ణానంద అన్నారు. బీజేపి అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌తో కలిసి ఆపార్టీ ఎన్నికల కార్యాలయంలోబుధవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, ఓట్ల లెక్కింపు రోజున బీజేపీ రాష్ట్ర నాయకుడు బండి సంజయ్‌కుమార్ ఇంటిపై మజ్లిస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాళ్ళతో దాడి చేయడాన్ని ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా ఆయన అభివర్ణించారు. ధర్మం పక్షాన దేశం కోసం పనిచేస్తున్న సంజయ్‌లాంటి నాయకుడిపైనే దాడికి దిగితే, బీజేపి కార్యకర్తలు ప్రతిదాడులకు దిగుతారని హెచ్చరించారు. హిందూ ధర్మాన్ని నమ్మే బీజేపీ కార్యకర్తల సహనాన్ని పరీక్షిస్తే, వారికి మిగిలేది అపజయమేనని అన్నారు. మరోసారి దాడులు పునరావృతమైతే, చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల రాజకీయాలుండాలి తప్ప, ఘర్షణ వాతావరణంలో ఉండరాదని, అది ధర్మ విరుద్దమన్నారు. ధర్మబద్దంగా కాకుండా, అధర్మమే పరమావధిగా వ్యవహరిస్తే టీ ఆర్ ఎస్, మజ్లిస్ పార్టీలకు ప్రజాక్షేత్రంలో తిరుగుబాటు తప్పదన్నారు. ఈ విలేఖరుల సమావేశంలోభాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాస సత్యనారాయణరావు, జిల్లా ఉపాధ్యక్షుడు కొట్టె మురళీకృష్ణ, నాయకులు బేతి మహేందర్‌రెడ్డి, బోయినపల్లి ప్రవీన్‌రావు, రాపర్తి ప్రసాద్, దుబాల శ్రీనివాస్, దుర్గం మారుతి, భాషవేని మల్లేశం, దాసరి రమణారెడ్డి, గాజే రమేశ్, కటకం లోకేశ్, ఎన్నం ప్రకాశ్,తదితరులు పాల్గొన్నారు.


అసదుద్దీన్ వ్యాఖ్యలు సరికాదు: ఫరూఖ్

0
0

విశాఖపట్నం: తెలంగాణ ఎన్నికలకు సంబంధించి టీడీపీ రెండు స్థానాల్లో గెలుపుసాధించిన అంశంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు సరికాదని వైద్య విద్యాశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూఖ్ అన్నారు. విశాఖలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో ముస్లిం, మైనార్టీలను టీడీపీ ప్రభుత్వం అన్ని రకాలుగా అభివృద్ధి చేసిందని, హైదరాబాద్‌లో హజ్ హౌస్ నిర్మాణానికి పది కోట్లు రూపాయాల నిధులు కేటాయించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. అన్యాక్రాంతమైన వక్ఫ్‌బోర్డు భూములను పరిరక్షించిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. నాడు షాదీ ముబారక్, నేడు చంద్రన్న కానుక పేరుతో ముస్లిం మైనార్టీలకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఎంపీగా ఒవైసీ తన బాధ్యతను మరిచి మాట్లాడటం సరికాదన్నారు. ప్రజాతీర్పును ప్రతీ ఒక్కరూ గౌరవించాల్సిందేనని, టీఆర్‌ఎస్‌కన్నా టీడీపీ ప్రభుత్వమే ముస్లింలను అభివృద్ధి చేసిందన్నారు.

అశల పల్లకీలో ఎమ్మెల్యేలు

0
0

వరంగల్, డిసెంబర్ 12: అందరి దృష్టి మంత్రివర్గ కూర్పుపైన పడింది. సీఎంగా కేసీఆర్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపధ్యంలో ఆయనతోపాటు ఒక్కరు లేదా ఆరడజన్ పైగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉండడంతో మొదటి విడత మంత్రి వర్గ కూర్పులో ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ఎవ్వరికి దక్కుతుందోనన్న టెన్షన్ , ఉత్కంఠం ఆశావాహుల్లో నెలకొంది. గత ప్రభుత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు మంత్రి పదవులు కేటాయించడంలో సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇచ్చారు. కీలకమైన స్పీకర్ పదవితోపాటు డీప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ పదవి ఉమ్మడి వరంగల్ జిల్లాకు కేటాయించారు. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో స్పీకర్ మధుసూదనాచారి, మంత్రి చందులాల్ ఇద్దరు కూడా ఓటమి చెందగా డీప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాత్రం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అయితే వారిద్దరి స్దానంలో మరో ఇద్దరికి మంత్రి పదవులు దక్కడంతో పాటు కడియం శ్రీహరిని డిప్యూటీ సీఎంగా కొనసాగిస్తారన్నా ఉహగానాలు వినిపిస్తున్నాయి. అయితే కొత్తగా ముగ్గురికి మంత్రి పదవులు దక్కుతాయన్న అంచనాలతో ఇప్పటికే మంత్రి పదవులు అశిస్తున్న పలువురి ఎమ్మెల్యేలు వారి గాడ్‌ఫాధర్ల ద్వారా ప్రయత్నాలు కొనసాగిస్తునట్లు తెలిసింది. ప్రధానంగా మంత్రి పదవి ఆశిస్తున్న వారిలో పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌తో పాటు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దాస్యం వినయ్‌భాస్కర్ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొనడమే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో ఎకైక టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా పార్టీని, కార్యకర్తలను కాపాడుకుంటు వచ్చాడనే పేరుంది. అంతే కాక టీఆర్‌ఎస్ నుండే మూడు సార్లు హాట్రిక్ విజయంతో పాటు ఉప ఎన్నికల్లో కూడా గెలుపొందారు. అంతే కాకుండా మంత్రి కేటీ ఆర్‌తో దాస్యం వినయ్‌భాస్కర్‌కు మంచి సంబందాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలోనే మంత్రి పదవి రావాల్సి ఉండగా అనేక సమీకరణాల కారణంగా దక్కలేదు. ఈ సారి మాత్రం మంత్రి పదవి ఖాయంగా దక్కుతుందన్న ధీమాలో ఉన్నారు. కడియం శ్రీహరికి డిప్యూటీ సీ ఎం పదవి కొనసాగే అవకాశం ఉన్నాయి. ఒక వేళ కడియం సేవలు పార్టీకే అవసరం అనుకోవడంతో పాటు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలనే పార్టీ భావిస్తే మంత్రి పదవి దక్కక పోవచ్చనే వాదనాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌కు మంత్రి పదవి వరించే అవకాశం ఉంది. ఇక గిరిజన సంక్షేమ మంత్రిగా గత మంత్రి వర్గ కూర్పులో పనిచేసిన ఆజ్మీర చందులాల్ ఈ సారి జరిగిన ఎన్నికల్లో ఒటమి పాలుకావడంతో ఆ పదవిని అదే సామాజిక వర్గానికి చెందిన డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌కు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. రెడ్యానాయక్ 2014లో కాంగ్రెస్ నుండి ఎకైక ఎమ్మెల్యేగా గెలుపొంది టీఆర్‌ఎస్‌లో చేరారు. రెడ్యా నాయక్‌తో పాటు ఆయన కూతురు మాజీ ఎమ్మెల్యే కవిత కూడా టీఆర్‌ఎస్ చేరినప్పటికి ఇప్పటి వరకు ఎలాంటి పదవి వారికి దక్కలేదు. ఈ సారి రెడ్యా నాయక్‌కు గిరిజన సంక్షేమ మంత్రి పదవి ఖాయంగా చెపుతున్నారు. అదే విధంగా పాలకుర్తి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఎర్రబెల్లి దయాకర్‌రావు ఓటమి ఎరుగని నాయకుడిగా కొనసాగుతున్నారు.
2014 ఎన్నికల్లో పాలకుర్తి నుండి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొంది ఆ పార్టీ శాసనసభా పక్ష నేతగా ఉంటునే పార్టీని మొత్తాన్ని టీఆర్‌ఎస్‌లో వీలినం చేస్తూ ఆయన కూడా టీఆర్‌ఎస్‌లో చేరడంతో అప్పుడే దయాకర్‌రావుకు మంత్రి పదవి వస్తుందన్న ప్రచారం జరిగింది. అయితే ఈ సారి ఆయనకు మంత్రి పదవి ఖాయంగా కనిపిస్తుంది.

కోస్తాంధ్రకు తుపాను హెచ్చరికలు

0
0

విశాఖపట్నం: కోస్తాంధ్రకు వాయుగుండం ముప్పు పొంచివుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ఇది మచిలీపట్నానికి 1350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రాగల 24 గంటల్లో తుపానుగా బలపడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుపాను ప్రభావం వల్ల కోస్తాంధ్ర అంతటా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

మనస్తాపంతో తల్లీ ముగ్గురు పిల్లలు మృతి

0
0

లక్నో: మనస్తాపంతో తల్లీ ముగ్గురు పిల్లలు మృతిచెందారు. ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లా బవాస్‌పూర్ గ్రామానికి చెందిన 25 సంవత్సరాల నిర్మలకు ముగ్గురు పిల్లలు. వీరిలో అంచల్ అనే ఐదేళ్ల పిల్లాడు బెలూన్ కొనివ్వమని నానమ్మను అడిగాడు. ఆమె నాన్న వచ్చి కొనిస్తాడని చెప్పటంతో ఈ సందర్భంగా అత్తాకోడళ్ల కు మధ్య తీవ్రమైన వాగ్వివాదం జరిగింది. ఈ గొడవతో తీవ్ర మనస్తాపానికి గురైన నిర్మల ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి తాను విషం తాగింది. వాంతులు చేసుకుంటున్న వారిని ఆసుపత్రికి తరలించినప్పటికీ నలుగురు మృతిచెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షం

0
0

ఆదిలాబాద్: జిల్లాలో గురువారంనాడు అకాల వర్షం కురిసింది. దీంతో రైతులు పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయారు. నిర్మల్, మంచిర్యాలతో సహా పలు ప్రాంతాల్లో గత రాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. పలు ప్రాంతాల్లో వరి పంట నీట మునిగింది.

దంపతుల ఆత్మహత్యాయత్నం: భార్య మృతి

0
0

హైదరాబాద్: నగరంలోని కర్మాన్‌ఘాట్‌లోని సాయినగర్‌లో సంతోష్, రజిత అనే భార్యభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తెల్లవారు జామున ఇంటిలో ఉరివేసుకుని ఉండగా గుర్తించి ఆసుపత్రికి తరలించగా భార్య మృతిచెందగా, భర్త పరిస్థితి విషమంగా ఉంది. కాగా సంతోష్ ఆర్టీసీలో మెకానిక్‌గా పనిచేస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

0
0

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా సోపోర్ సమీపంలోని బ్రత్ కలాన్ గుండ్ మహల్లా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. భద్రతా సిబ్బంది ఇంకా గాలింపు చర్యలు చేపట్టారు.


లోకసభ ఎన్నికల తరువాత టీడీపీ ఉనికి గల్లంతు

0
0

హైదరాబాద్: లోకసభ ఎన్నికల తరువాత టీడీపీ ఉనికి గల్లంతవుతుందని టీఆర్‌ఎస్ నేత కేటీఆర్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ స్థానం మజ్లీస్ ఆధీనంలో ఎప్పటి నుంచో ఉంటుందని, ఆ సీటు మినహా మిగిలిన 16 సీట్లలోనూ టీఆర్‌ఎస్ విజయం సాధిస్తుందని, దేశ రాజకీయాల్లో టీఆర్‌ఎస్ ముఖ్య పాత్ర పోషిస్తుందని అన్నారు.

పార్లమెంటు ఆవరణలో టీడీపీ ఎంపీల ఆందోళన

0
0

న్యూఢిల్లీ: విభజన చట్టంలోని హామీలను అమలుచేయాలని కోరుతూ టీడీపీ ఎంపీలు గురువారంనాడు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట ఆందోళన చేశారు. ఎంపీలు అశోక్ గజపతి రాజు, టీజే వెంకటేష్, మురళీమోహన్, శివప్రసాద్ తదితర ఎంపీలు పాల్గొన్నారు.

పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా

0
0

న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయ. ప్రతిపక్షాల ఆందోళనతో లోకసభ రేపటికి వాయిదా పడింది. కాంగ్రెస్ సభ్యులు రాఫెల్ ఒప్పందంపై, అన్నాడీఎంకే సభ్యులు కావేరీ జల వివాదంపై, అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని చేపట్టాలంటూ శివసేన సభ్యులు ఆందోళన చేయటంతో స్పీకర్ లోకసభను శుక్రవారానికి వాయిదా వేశారు. టీడీపీ సభ్యులను స్పీకర్ తన ఛాంబర్‌కు పిలుపించుకుని మాట్లాడారు. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొనటంతో చైర్మన్ వెంకయ్యనాయుడు రాజ్యసభను రేపటికి వాయదా వేశారు.

సీఎంగా కేసీఆర్ ప్రమాణస్వీకారం

0
0

హైదరాబాద్: తెలంగాణ సీఎంగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లోని దర్భార్ హాలు వేదికగా జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున నాయకులు తరలిచవ్చారు. సరిగ్గా మధ్యాహ్నాం 1.25 గంటలకు కేసీఆర్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్‌తో పాటు మహమూద్ ఆలీ ఉర్దూలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు ‌కేసీఆర్‌ కుటుంబ సభ్యులు, మహమూద్‌ అలీ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. నూతన ఎమ్మెల్యేలు, తెరాస ఎంపీలు, మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ, ఇతర ప్రముఖులు తరలివచ్చారు.

మెహుల్ ఛోక్సీకి రెడ్‌కార్నర్ నోటీసు

0
0

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసుల ప్రధాన నిందితుడు మెహుల్ ఛోక్సీకి రెడ్‌కార్నర్ నోటీసు జారీ అయింది. సీబీఐ అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్ ఈ నోటీసులు జారీచేసింది. పదమూడు వేల కోట్ల పీఎన్‌బీ స్కామ్‌లో నీరవ్ మోదీ, మెహుల్ ఛోక్సీ ప్రధాన నిందితులు. వీరివురు బ్రిటన్ పారిపోయిన విషయం విదితమే.

పేదలకు ఉచిత వైద్య సేవలు: చంద్రబాబు

0
0

విశాఖపట్నం: పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలనేది ప్రభుత్వం ప్రధాన ఉద్దేశ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆయన విశాఖ జిల్లా పెద్ద గంట్యాడలోని మెడ్ టెక్ జోన్‌లో నిర్వహించిన డబ్ల్యూహెచ్‌ఓ సదస్సుకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సదస్సులో వైద్యపరంగా అనేక సమస్యలపై చర్చించాలని సూచించారు.

కేసీఆర్‌పై రాజకీయ విమర్శలు చేయను

0
0

హైదరాబాద్: కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, మంత్రులు ఎవరిపైనా అయినా రాజకీయ విమర్శలు చేయనని సంగారెడ్డిలో ఎమ్మెల్యేగా గెలిచిన తూర్పు జయప్రకాశ్‌రెడ్డి(జగ్గారెడ్డి) అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ఒకట్రెండు తప్పులు చేశానని, ఇకపై ఎలాంటి తప్పులు చేయనని అన్నారు. అవినీతి, అక్రమాలకు తావులేకుండా పనిచేస్తానని అన్నారు.


బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

0
0

న్యూఢిల్లీ: బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ సీనియర్ నాయకులు ఎల్ కే అద్వానీ, వివిధ రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై చర్చించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల గురించి చర్చించారు.

మహాభారతంలో ఉపాఖ్యానాలు-73

0
0

మానవుడు తప్పు చేసినా నిండు మనస్సుతో పశ్చాత్తాపం చెందితే అతను పాప విముక్తుడు అవుతాడు. మన శాస్త్రాల్లో చెప్పిన జపతపోయజ్ఞాదులలో దేనినైనా నిష్కామంగా ఆచరిస్తే అతనికి పాపవిముక్తి కలుగుతుంది. ఇతరులలో మంచినే చూడాలి. తప్పును,చెడును చూడకూడదు.
సూర్యుని ఉదయం చేత అంతకు ముందు ఉన్న చీకట్లు తొలగిపోయి నట్లు మనం నిష్కామంగా మంచి పనులు చేస్తే పాపాల నుంచి విముక్తులము అవుతాము. పాపాలకు నివాసస్థానం లోభము. బాగా శాస్తజ్ఞ్రానం లేని లోభులే పాపకార్యాలు చేస్తారు.
గడ్డితో మూసుకున్న బావి ఎలా కన్పడదో అదేవిధంగా ధర్మం ముసుగులో అధర్మం ఉంటుంది. బయటికి ధర్మాత్ములుగా కనిపించే ఈ అధార్మికులలో ఇంద్రియ నిగ్రహం, ధర్మాన్ని బోధించే మాటలు అన్నీ ఉంటాయి. కాని ఆచరణమాత్రం శూన్యం. ధర్మాలన్నీ మాటలకే పరిమితం. శిష్టాచారం ఉండదు.’’
అప్పుడు కౌశికుడు వ్యాధుని ఇలా ప్రశ్నించాడు. ‘‘శిష్టాచారం అనగా ఏమిటి? దాని గురించి నాకు దయచేసి బోధించు’’.
ధర్మవ్యాధుడు ఇలా సమాధానం చెప్పాడు. ‘‘నాయనా! యజ్ఞం, దానం, తపస్సు, వేదాధ్యయనం, సత్యం పలుకడం ఇవి శిష్టుల వ్యవహారాలలో ఉత్తమమైనవి అని పెద్దలు చెప్తారు. ఇంకా శిష్టాచారాల్లో రెండవది సదాచార రక్షణ. గురుసేవ, సత్యం చెప్పటం, కోపం లేకుండా ఉండడం, దానం చేయడం కూడా ముఖ్యమైన ఆచారాలు.
ఇంద్రియ నిగ్రహం, త్యాగం ఆచరణలో ఉండాలి. శిష్టులు సదా ధర్మార్థాల మీద మనసు నిలుపుతారు. అహింస, నిజం చెప్పటం అన్ని ప్రాణులకు మేలు కలిగిస్తాయి. అహింస అన్నింటినీ మించిన ధర్మం. అది సత్యం మీద ఆధారపడి ఉంటుంది. అనాచారమే అధర్మం అని శిష్టుల ఉపదేశం. న్యాయంతో కూడిన కార్యమే ధర్మము.
కోపం లేనివారు, ఇతరులలో తప్పులు ఎంచని వారు అహంకారం, గర్వం, ఈర్ష్య లేనివారు, మనో నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం ఉన్నవారు శిష్టాచారులు అవుతారు.
వేదంతో చెప్పిన ధర్మం ఉత్తమం. ధర్మశాస్త్రాలలో చెప్పినది రెండవది. శిష్టుల సదాచారం మూడవది. ఈ విధంగా ధర్మలక్షణం మూడు విధాలు.
దాతలు, తమ దగ్గర ఉన్న వస్తువులు కాని ధనం కాని సమానంగా ఇతరులతో పంచుకొనే వారు కొంత ఇతరులకిచ్చి తర్వాత తాము ఉపయోగించుకొనేవారు దీనులపై దయకల్గిన వారు. విద్యయే ధనంగా భావించేవారు, స్వధర్మాలను పాటించేవారు, సర్వప్రాణుల హితం కోరేవారు- వీరిని శిష్టులు అంటారు.
నిరహంకారులు, ఓర్పు, దమం, శమ కలవారు, దయ దాక్షిణ్యం కలవారు సంతృప్తి కలవారు, కామం, ద్వేషం లేనివారు - ఇటువంటి వారు ఇతరులకు ప్రమాణంగా ఉంటారు. అసూయ లేకపోవడం, ఓర్పు, శాంతి, సంతోషం, ప్రేమ కలిగి ఉండడం, కోరికలని, కోపాన్ని వదిలిపెట్టడం, శిష్టాచారాన్ని అనుసరించడం - ఇవి సజ్జనుల శ్రేష్ఠమార్గం’’.
తనకు తెలిసిన ధర్మ సంబంధ గుణాల గురించి తెలిపిన ధర్మవ్యాధుడు మరల కౌశికునితో ఇలా అన్నాడు. ‘‘ఈ మాంసం విక్రయించడం ఘోరమైన పని. కాని కౌశికా! విధి బలీయమైనది. మనం పూర్వజన్మలో చేసిన కర్మఫలాన్ని ఈ జన్మలో ఖచ్చితంగా అనుభవించాలి. ఈ వ్యాధుని జన్మ నేను పూర్వజన్మలో చేసిన పాపఫలితం. ఆ దోషాన్ని పోగొట్టుకొనడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. నేను ఇతరులు చంపిన మాంసానే్న అమ్ముతున్నాను.
జంతువులను యాగంలో వినియోగించి ఆ శేషం భుజిస్తే అది ధర్మమవుతుంది. కాని మామూలుగా మాంసభక్షణం మాత్రం ధర్మం కాదు. ఇది మాంసవిక్రయం కనుక దీన్ని వదలను. ఇదే నా కులవృత్తి. స్వధర్మాన్ని వదిలివేసిన వానిని అధర్ముడని అంటారు. దానం చేయటం, నిజం చెప్పటం, గురుసేవ, బ్రాహ్మణులను గౌరవించడం, అతివాదానికి, అభిమానికి దూరంగా ఉండడం నాకు అలవాటు. మంచి వంశంలో పుట్టినవారు కూడ మంచి గుణాలు కలవారు కూడా ఘోరకార్యాలు చేసి సిగ్గు పడుతూ ఉంటారు’’.
ధర్మవ్యాధుడు మరల చెప్పసాగాడు.
‘‘్ధర్మస్వరూపం చాలా సూక్ష్మాతిసూక్ష్మంగా ఉంటుంది. ప్రాణులకు మేలు కలిగించేది సత్యం. ఎవరికైనా హాని చేసేది అది నిజమైనా అసత్యం క్రింద పరిగణించాలి. ఇలా పరిశీలిస్తే ధర్మగతి ఎంత సూక్ష్మమో తెలుస్తుంది.’’
కౌశికుడు ఇలా ప్రశ్నించాడు. ‘‘్జవుఢు ఎలా శాశ్వతుడు అవుతాడు?’’
వ్యాధుడు ‘‘శరీరం నశించవచ్చు కాని అందులోని జీవుడు నశించడు. అతని శరీరంలో ఉండే పంచతత్త్వాలు పంచభూతాలలో కలిసిపోతాయి. అందుకే పూర్వం చనిపోతే పంచత్వం పొందాడు అనేవారు. ఈ లోకంలో మనం చేసే కర్మ యొక్క ఫలితం ఇంకొకడు అనుభవించడు. చేసిన కర్తయే అనుభవించును. అతను చేసిన పాపపుణ్యాలు అతనితో వస్తాయి’’.
కౌశికుడు మళ్లీ ఇలా అడిగాడు ‘‘జీవుడు ఇంకొకరి గర్భంలో ఎలా ప్రవేశిస్తాడు?’’
ధర్మవ్యాధుడు ఇలా జవాబు ఇచ్చాడు. ‘‘పుణ్యకర్మలు చేసినవాడు పుణ్యాత్ముల గర్భం నుంచి అలాగే పాపాలు చేసినవాడు పాపాత్ముల గర్భం నుంచి జన్మిస్తారు. పుణ్యకర్మల వల్ల జీవునికి దైవత్వమూ, పుణ్యపాప కర్మల వల్ల మానవత్వమూ, తామసకర్మలవల్ల పశుపక్ష్యాది జన్మలూ కలుగుతాయి. కేవలం దుష్కర్మల వల్ల నరకం కలుగుతుంది. వారు అనేకమార్లు పశుపక్ష్యాదుల జన్మ ఎత్తి చివరకు నరకానికి వెళతారు. దుఃఖాన్ని అనుభవించడానికి పాపపు జన్మ ఎత్తుతారు. ఆ కొత్త జన్మలలో మరల పాపకర్మలు చేస్తాడు. వాటివల్ల ఇంకా పాపజన్మలు ఎత్తుతాడు. అతనికి పాపాలు చేయడమే అలవాటు అవుతుంది.
ఇంకావుంది...

స్వాధ్యాయ సందోహం-168

0
0

దైవం తన వద్దగల ప్రాకృతిక సంపదనంతా తనకొఱకు కాస్తంత కూడ స్వార్థబుద్ధితో దాచుకొనక జీవులందరకు పంచిపెట్టాడు. అంతేకాక జీవులకు భోగంతోబాటు మోక్షాన్ని కూడ ప్రదానం చేసేందుకు విశ్వాన్ని బహుధా విస్తరించాడు. జీవుల కర్మానుసారంగా వారికి తగిన నూతన లోకాలను కూడ సృష్టించాడు. కర్మానుగుణమైన భోగం పరిసమాప్తి అయినవారికి, కర్తవ్యకర్మభ్రష్టులైన జీవులకు తిరిగి వైభోగాన్ని కల్పించేందుకు మరల వారిని కర్తవ్యనిష్ఠులను చేసేందుకు దైవం మాటిమాటికి వారికి ప్రబోధంచేస్తూనే ఉంటుంది. ఈ రీతిగా పరమాత్మ సదా క్రియాశీలుడై యుంటాడు. అట్టి సర్వేశ్వరుడికి తనలా సర్వస్వమూ దానం చేసేవారంటె చాలా ప్రీతి. అది ఆయన సహజ స్వభావం. స్వార్థ్భావనను వీడి కల్యాణప్రదమైన శుభకర్మలను చేసేవాడు భగవత్కార్యాన్ని చేసినవాడే. అంటే నిష్కామబుద్ధితో కర్మలనాచరిస్తే ఆ కర్మలు భగవదర్పణమయినట్లే. ఈ ప్రకారంగా జీవితంలో నిత్కమూ నిష్కామకర్మల నాచరించినవాడికి భగవానుడే రక్షకుడుగా ఉంటాడు.
మన ఎడల భగవత్ప్రీతి కలగడానికి ప్రధాన సూత్రం స్వార్థత్యాగమే. ఎవరికైనా దేనినైనా ఇచ్చే సమయంలో దానిమీద మమకారాన్ని వీడి అతడినే దైవంగా భావించి ‘‘ఓ ప్రభూ! నీ వస్తువును నీకే అర్పిస్తున్నాను’’ అని సమర్పణం చేయాలి. శ్రమపడి తాను సంపాదించిన సంపాదనను భగవదర్పణం చేసిన వానికి నిజంగా ‘్భవస్తస్య స్వతవాన్ పాయుః’ భగవంతుడే సంరక్షకుడవుతాడు. ఆ విధంగా రక్షించేందుకు ఆ పరమాత్ముడికి ఎవరితోనూ ప్రమేయమవసరం లేదు. ఆయనే స్వయంశక్తి సమన్వితుడై ‘స్వతవాన్’ రక్షిస్తాడు.
పాపానికి మూలం స్వార్థం, స్వార్థాన్ని వీడి ‘యస్త ఇధం జభరత్’ ‘‘దేవా! నీ కొఱకు సమిధను ఎవడుతెస్తాడో’’ తెచ్చినప్పుడల్లా ‘ఇదం న మమ’ ‘‘ఇది నాకొఱకు కాదు అని సమర్పిస్తాడో అతడికి పాపమెలా సంభవిస్తుంది?’’ లేదా ‘‘సిష్విదానో మూర్ధానం వా తతపతే త్వాయా’ ‘‘చెమట కక్కుతూ నినే్న కోరినవాడై తన శిరస్సు మాటిమాటికి తపింపచేస్తాడో’’ అతడికి కూడ పాపమెలా సంభవిస్తుంది? శిరస్సు తపింపచేయడమంటె తలలో మెదిలే సమస్త ఆలోచనలను దైవచింతనా మయం చేయడమని భావం. అలాచేసి దైవకృపకై ఆర్తిచెందడమే శిరస్సును తపింపచేయడం. చెమటలు కక్కడమంటె ఆ తపనలో శరీరాన్ని ఎంతటి శ్రమకైనా గురిచేయడమని భావార్థం. ఈ రీతి పరిశ్రమించి ఆత్మరక్షణకు వివశుడై జగత్ప్రభువును ఆర్తితో ప్రార్థిస్తాడు. ఆ ప్రార్థనను విన్న సర్వాధారుడు ‘విశ్వస్మాత్సీమఘాయత ఉరుష్య’ ఆ జీవుణ్ణి సమస్త అరిష్టాలనుండి, అపకారుల నుండి రక్షిస్తాడు. జీవులకు నిజమైన రక్షణ ఆ దైవంగాక మరెవ్వరు కల్పించగలరు? ఈ భావానే్న ఋగ్వేదం మరో సందర్భంలో ‘అవితాసి సున్వతో వృక్తబర్హిషః’ (ఋ.8-36-1)
‘‘ఇంటి గుమ్మందాటి వెళ్లిన నిరాశ్రయుడగు యాజ్ఞికుడికి దైవమా! నీవే రక్ష’’అను పునరుద్ఘాటించింది. శరణార్థులైన జీవుల రక్షణభారం దైవం స్వయంగా చేసిన ప్రతిజ్ఞయేకదా! భగవద్రక్షితుడు నిర్భయుడై ఉంటాడు. కాబట్టి మానవులందరు మంత్రోమపదేశానుసారం ప్రార్థిస్తూ భగవద్రక్షణను పొందెదరు గాక!
**
ఓ ప్రభూ!
మమ్ము నలుదెసల నుండి రక్షించు
పశ్చా త్పురస్తా దధరా దుదక్తాత్కవిః కావ్యేన పరి పాసి రాజన్‌
సఖే సఖాయమజరో జరిమ్ణే- గ్నే మర్తా అమర్త్యస్త్య న.॥
ఋ.10-87-21.
భావం:- ఓ రాజాధిరాజ పరమేశ్వరా! నీవు ఆంతరమైన దృష్టికలవాడవు. నీ క్రాంతదర్శిత్వ దృష్టిచేత నాలుగుదిక్కుల నుండి మమ్ము రక్షించు. ఓ మిత్రుడా! నీవు జరారహితుడవు. నీ మిత్రుని వృద్ధాప్యంనుండి రక్షించు. సర్వరక్షకుడవైన ఓ అగ్నీ! నీవు అమరుడవు. మమ్ము మరణం నుండి రక్షించు.
వివరణ:- ఓ పరమేశ్వరా! మేము అల్పజ్ఞులం. అల్పగమనశీలురం. అల్పశక్తిగలవారం. అల్పమైన మేధకలవారం. మమ్ము కుడి, ఎడమలలో, ఊర్ధ్వ, అధో దిశలలో ఏది ఉందో మేము చూడలేము. అందువల్ల మాకే విపత్తు పొంచియుందో ఎరుగనివారం. ఓ ప్రభూ! నీవు చర్మచక్షువులకు కానరానివానిని చూడగల లోచూపుగల వాడవు. సర్వవ్యాపకుడవు. సర్వజ్ఞుడవుగావున నీ క్రాంతదర్శిత్వానికి గోచరంకాని వస్తువేదీ ఉండదు. అందువలన నీవు మమ్ములను నలుదెసలనుండి కలిగే ఆపదలనుండి రక్షించు. నాకు ఒకటే కోరిక ప్రభూ! ‘సర్వా ఆశా మమ మిత్రం భవంతు’(అథ.వే.19-15-6) ‘అన్ని దిశలలో నాకు మిత్రులే ఉండాలి అని.
ఓ మిత్రుడా! నీవు జరావస్థ(ముసలితనం) లేనివాడవు. నేను నీ మిత్రుడను.
ఇంకావుంది...

సుందరకాండ

0
0

తతో రావణనీతాయాః సీతాయాః శత్రుకర్శనః
ఇయేష పదమనే్వష్టుం చారణా చరితేపథి
తన దర్శన మాత్రం చేతనే శత్రువులను కృశింపజేయగల ఆంజనేయస్వామి సీతానే్వషణం కొరకు చారణా మార్గంలో బయలుదేరాడు.
చారణ విధ్యాధర కిన్నర కింపురుష గంధర్వాది దేవతాగణములు తమతమ యోగ బలస్థాయిల ననుసరించి ఆకాశంలో సంచరిస్తూ ఉంటారు.
వారిలో భూమికి దగ్గరగా ఆకాశ సంచారంచేస్తూ ఉండేవారు. శుభవార్తలను అందిస్తూ ఉండేవారు- విశ్వహితం కలవారు చారణులని మనకు సుందరకాండలోనే కనిపిస్తుంది.
అదిగో- ఆ చారణ సామర్థ్యంతో స్వామి బయలుదేరడానికి సిద్ధపడుతున్నాడు.
పారాయణ సంప్రదాయంలో దీన్ని శ్లోకం అనరు. మంత్రమనే అంటారు. అటువంటి ఈ మంత్రంలో-
‘రావణ’ శబ్దంలోని ‘వ’అనే అక్షరం గాయత్రీ మహామంత్రలోని భర్గోదేవస్య అనేచోట 12వ అక్షరమైన ‘వ’
బాలకాండ తరువాత గాయత్రీ బీజంతో ప్రారంభమైన కాండ ఇదే. ఇదొక విశేషం.
భౌతి భాసయితే లోకాన్ రేతి రంజయతే ప్రజాః
గ ఇత్యాగచ్ఛతే జన్రం భరగో భర్గ ఉచ్యతే.
ఈ వ అనే బీజాని భర్గుడు దేవత అయితే మైత్రా వరుణుడు అంటే అగస్త్యుడు ఋషి. సీతాదేవి లంకను చేదడానికి ఈయనే కారకుడు.
భర్గాఖ్యం రుద్ర సంజ్ఞంతు జ్ఞాత్వాత్వమృతమిచ్ఛతి ‘్భర్గః‘ స్వసాక్షాత్కారేణ అవిద్యా తత్కార్యదాహకః
‘దేవస్య’ ద్యోతమానస్య హ్యానందాత్క్రీడతో పివా
‘దీమహ్యం’ సేవేతి తేనైవా భేద సిద్ధయే.
(విశ్వామిత్ర కల్వే యోగ యాజ్ఞవల్క్వః)
అందువలన ఆంజనేయస్వామి రుద్ర సంజ్ఞకలవాడై మన అవిద్యా దాహకత్వానికి కారణమవుతున్నాడు. మన అమృత స్థితికీ కారణమవుతున్నాడు. ఆయన ఆనందంలో క్రీడిస్తాడు. మనల్ని క్రీడింపజేస్తాడు.
ఇదీ సుందరకాండ వలన వాల్మీకి మహర్షి మనకు అందింపవలసిన మహాఫలం.
ఈ మంత్రంలో చారణాపథి అంటే యోగ మార్గం.
మేరు దండం ద్వారా యోగులు మూలాధారమునుండి సహస్రారానికి సహస్రారం నుండి మూలాధారానికి సంచరిస్తూ ఉంటారు. అందుకని స్వామి మహాయోగియై బయలుదేరుతున్నాడు.
అందుకని చారణామార్గమని సంకల్పం చేసేడు.
ఇది బాహ్య స్థితి.
మానసిక స్వామి ఇంతకుముందే లంకలో ఉన్నాడు. అది ఇచ్ఛా (ఉత్సాహ) శక్తి. ఇప్పటిది క్రియాశక్తి. రామానుజ్ఞ రూపమైన ప్రభు (జ్ఞాన) శక్తి స్వామికి ఇదివరకే ఉన్నది.
సీతాదేవిని చూడడానికి స్వామి శక్తిత్రయనమన్వితుడై బయలుదేరుతున్నాడు.
ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తి స్వరూపిణీ అని లలితాస్తుతి చేస్తాం. దేవతా శక్తిని ఉపాసకుడు ఒంటబట్టించుకొని (అంగన్యాస కరన్యాసాదులవలన) తానాదేవతా రూపమైనట్లు అభేద భావనచేసి ఉపాసిస్తాడు. అదీ ఈ స్థితి-
అందుకే స్వామి ఎంతటి దుష్కరకార్యమైనా చేయసంకల్పించేడు.
దుష్కరం నిష్ప్రతి ద్వంద్వ చికీర్షన్కర్మవానరః
సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివాబభౌ
దుష్కరమై కర్మ అంటే వానర దుష్కరమైన కర్మ. అట్టిదాన్ని స్వామి చేయాలని సంకల్పించేడు. అలా సంకల్పించిన స్వామి ఆ మహేంద్రగిరి శిఖరమీద నిలిచి తలపైకెత్తి చూస్తూన్నాడు. - అలా ఉన్న స్వామిని మహర్షి ‘‘గవాంపతిరివాబభౌ’’ అంటారు.
- అంటే నందీశ్వరునిలా ఉన్నాడని అర్థం.
పరాశక్తియొక్క స్వరూపాన్ని మొదట తాను ఉపాసించి తెలిసికొని చూసాడు.

శ్రీ పరమహంస బోధామృతము

0
0

ఆతని జీవితము బ్రహ్మానందానుభవ నందనవనమై, సర్వమత సామరస్య నిలయమై దీపించుటకిదియే హేతువు.
శ్రీరామకృష్ణుని ప్రథమ గురువు భైరవీ బ్రాహ్మణియను యోగినీమణి. ఈమె విశేష విద్యావంతురాలు, తాంత్రిక సాధనలయందఖండ విజయమును బడసిన మహనీయురాలు.
*( ‘బ్రహ్మానంద తేజము బహువిధములుగా ప్రకాశితమై శ్రీరామ కృష్ణుని దివ్య జీవితమున సామరస్య దేవాలయమును నిర్మించియున్న’దనియు ‘ఆ దేవళమున కివే నా ప్రణతు’ అనియు కవి చంద్రుడు రవీంద్రుడు నుడివి యున్నాడు.)
హృదయము ఱంపముతో గోయబడినట్లు బాధగలుగ నేలపైబడి పొరలాడుచు, నాతడు పడు వేదనను గాంచిన జనులు, ‘‘అయ్యో, పాపము! ఈతడేదియో ‘శూలనొప్పి’చే బాధపడుచున్నాడు కాబోలును, లేక నిజముగా మాతృవియోగముచే గుందుచున్నాడు కాబోలును’’అని జాలిపడువారు. ఆతడిక హతాశుడై యొకనాడు జీవితము నంతమొందించుకొన బ్రయత్నించునంతలో అకస్మాత్తుగా సాక్షాత్కారము లభించెను. ‘దేదీప్యమానమగు ననంత చైతన్య సాగరరూపమున’ దైవమును గాంచి యాతడు సమాధి నిమగ్నుడయ్యెను.
* (అపుడు తన యంతరంగమున అనిర్వచనీయానందసాగరము- అంతకుముందు తానెన్నడనుభవించి యెఱుగని దివ్యానందము- ప్రసరించుచుండెనని మాత్రమే తనకెఱుకయనియు, అయినను తన దివ్యజనని భవ్యసాన్నిధ్యము మాత్రము తన హృదయాంతరాళమున భాసించుచునే యుండెననియు తన దివ్యానుభూతినిగూర్చి కాలాంతరముననాతడు శిష్యులకు దెలిపియున్నాడు.)
కాని రుూ భగవదనుభవము శ్రీరామకృష్ణునకు నిరంతర బ్రహ్మానుభూతిని గల్గింపజాలదయ్యె. బ్రహ్మానందామృతము ననొకపరి రుచి చూపినను సంతతానుభవపిపాస నయ్యది తీర్పజాలదయ్యె. నిరంతర బ్రహ్మానుప్రాప్తికై పరితప్త హృదయుడై యాతడు దినములు గడపుచుండెను. సర్వకాల సర్వావస్థలయందును, సమస్త ప్రదేశములందును బ్రహ్మానుభూతి నొందుటకై యాతడు బాష్పధారలు ప్రవహింప వెక్కివెక్కియేడ్చుచు మునుపటికంటెను తీవ్రతర పరితాపముతో తన దివ్యజననిని బ్రార్థింపసాగెను. ఆ హృదయ మథనము నాతనికి బాహ్యలోకమే స్ఫురించెడిది కాదు- ఒకవేళ స్ఫురించినను కేవలము మిథ్యగా దోచెడిది. ఆతని ప్రార్థనలచేతను రోదల చేతను ఆకృష్టులై జనులు చుట్టును మూగిన యెడల వారు కేవలము ఆతనికి నీడలవలెను తెరపై వ్రాయబడిన బొమ్మలవలెను- అంత మిథ్యగా- అంతమాయగా- దోచెడివారు. నిద్రాహారములను మఱచి రేయింబవళ్లాతడు తదేకముగా జగజ్జననిని బ్రార్థింపసాగెను. తుద కాలయమున దేవి నర్చించుటాతని కసాధ్యమైపోయెను. ఆలయ నిర్వహకుడును రాణి రాసమణి యల్లుడునగు మథురనాథుడు శ్రీరామకృష్ణుని స్థితినిగాంచి ప్రేమ గౌరవములతో నాతని పూజావిధులనుండి తొలగించి సాధనకు దిగిన సమస్త సదుపాయములను సమకూర్చెను. ఈ సదవకాశమును గొని శ్రీరామకృష్ణుడు లోకాతీతమగు భగవత్పరితాపముతో, అపూర్వాశ్రయములతో, ధ్యానాది సాధనలందు నిమగ్నుడయ్యెను.
తన యఖండ పరింపమును గూర్చి కాలాంతరమున నాతడు- నీటముంచి యుంపబడినవాడుక్కిరిబిక్కిరియై యెట్లు గిజగిజలాడునో- సాక్షాత్కరమునకై అట్టివేదన ననుభవించితినని శిష్యులకు దెల్పియున్నాడు. లోభికి తాను కూడబెట్టి కొనిన ధనమునందుండు మక్కువ, పవిత్రతకు భర్తయందలి ప్రణయము, తలిదండ్రులకు తమ యేకైక పుత్రునందుండు ననురాగము- ఎట్టిదో- ఊహించిన యెడల తన భగవదనురాగమును భగవత్ పరితాపమును లేశము గ్రహింపవచ్చునని యాతడు శిష్యులకు దెలుపువాడు.
ఇంచుమించుగా ఈ సమయమున నాతడు స్వగ్రామమగు కామారి పుష్కరము నొకసారి చూచుటకై వెడలెను. పెండ్లి చేసినచో, ఆతని భగవదున్మాదమును ప్రపంచ విముఖతయు గొంత లొంగుబాటునకు వచ్చుననియు, ‘‘నలుగురితోబాటు నారాయణా’’యనునట్లు క్రమముగా సంసారధోరణి యలవడుననియు తల్లి చంద్రమణీదేవి తల పోయసాగెను.
ఇంకావుంది...
శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 1121 మహోపదేశములు గల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -సంగ్రహ జీవిత సహితము - అనువాదకుడు: శ్రీ చిరంతనానందస్వామి

Viewing all 69482 articles
Browse latest View live