Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

కాలాతీత వ్యక్తులు- పి. శ్రీదేవి

0
0

నిజానికి ప్రకాశం భీరువు! చాలామంది యువకుల్లాగే అవకాశవాది! సుఖవాది! పోరాటం, ప్రతిఘటన అంటే భయపడే వెనె్నముకలేని జీవుల జాతిలోని వాడు! కల్యాణికి షరామామూలుగానే కష్టాలు త్రోసుకువచ్చాయి. తండ్రి పోయాడు! ఊరంతా అప్పులు! ఒంటరితనం! ఓదార్పు కోరే కష్టాలు!
సాయం రమ్మంటే ప్రకాశం అనే భీరువు బిగుసుకుపొయ్యాడు! ‘వెళ్లి కల్యాణిని ఆదుకుంటే- తనను పెంచిపోషించే కోపం వస్తుందేమో! అదేమో! ఇదేమో!’ అంటూ కల్యాణికి దూరంగా జరిగాడు. కల్యాణికి విస్ఫోటనమంత బలమైన దెబ్బ. ‘‘కన్నీరెందుకు కల్యాణీ! నేనుండగా నీకు దుఃఖమా!’’ అన్న ప్రకాశమేనా? అని దుఃఖపడి, ‘్ఛ ఇతనూ మనిషేనా?’అని అసహ్యించుకొని ‘అన్నివిధాలా నష్టపోయాను!’- దిగాలుపడుతుంది! జీవితం అంతా మునిగిపోయినట్లుగా కుంచుకుపోయింది.
‘‘ఏమిటీ మనుష్యులు- ఇట్టే మమతలు పెంచేసుకుంటారు! ఇట్టే కన్నీళ్లు కార్చేస్తారు. దౌర్బల్యాన్ని చూసి బాధపడటం ఒక దౌల్బల్యం!’’ అనగలిగే అమ్మాయి ఈ ఇందిర- హఠాత్తుగా అలా బీచ్‌వైపు వెళ్దాం పద అని ఆజ్ఞాపించగల అమ్మాయి. రిక్షాలో పక్కనే కూర్చోడానికి భయపడే ప్రకాశాన్ని- ‘‘ఫరవాలేదులే ఇంతలోకే నా పాతివ్రత్యానికేం భయం రాదు! ఇద్దరం కూర్చుని పోదాం!’’అనగలిగే ఇందిర- పారసైట్ లాంటి తండ్రి- ఎవర్నీ లెక్కచేయనితనం- సగంలో ఆపేసిన చదువు, చిన్న ఉద్యోగం- అరమరికలు లేకుండా స్నేహహస్తాన్ని చాటగల ఉదారత- ప్రకాశంతో బీచ్‌కి షికారుకు వెళ్లగలదు! అట్లాగే ప్రకాశం స్నేహితుడు కృష్ణమూర్తితో సెకండ్‌షోకి వెళ్లగలదు. జీవితం ఎప్పుడూ మధురంగా పలవరించే పాటలా ఉండాలనుకునే ఇందిర-
‘‘గడియ గడియకి కాళ్లుచాపి కూర్చుని ఏడవడం నాకు చేతకాదు!’’అనే ఇందిర- అంత బరువులోనూ, నేను బలపడి ఇంకొకరిని బలమివ్వాలనే తత్త్వం నాది!’’ ఇందిర ప్రకాశానికి ఎప్పుడూ చెబుతూనే ఉంటుంది- ఇది కాదు బ్రతికే విధానం అంటూ- పిరికితనం, అణచివేసిన ఆశలతో నిండిన ప్రకాశంలో- కొత్త చిగురులేవో వేయాలనే- ‘‘అన్ని విధాలా ఏకాకిగా నన్ను విడిచిపెట్టేరు’’అని రోధించే ప్రకాశానికి ‘‘నేనెక్కడికిపోతాను! నువ్వు నా వాడివి!’’ అంటూ స్నేహహస్తాన్ని ఇస్తుంది.
ప్రకాశానికి మామయ్యనే యములాడు. అతణ్ణి, అతడి తల్లి జీవితాన్ని శాశించే కర్త, కర్మ, క్రియ- ఆ మామయ్యను ఎదిరించలేడు! ప్రకాశం ప్రేమ పురాణాల్ని ఆకాశరామన్న ఉత్తరాల ద్వారా తెలుసుకొన్న మామయ్య- ముక్కుపట్టుకొని పల్లెటూరుకు లాక్కువెళతాడు. ఎనిమిది వేల కట్నంతో రాజమండ్రి అమ్మాయితో లగ్నం కుదురుస్తాడు. ఎదిరించలేడు, ఎదిరిస్తే చదువు ఆగిపోతుందనే భయం- నిశ్చితార్థం అయినాక, పారిపోయి దొంగలా ఇందిర దగ్గరకు వస్తాడు. ఆమె ముందు దీనంగా మోకరిల్లి- ‘‘అలా ప్రాధేయపడి నా జాలిని రెచ్చగొట్టి నువ్వేమీ సంపాదించలేవు ప్రకాశం! అన్ని హక్కులూ ఉండే మేనమామను ఎదిరించలేని పిరికివాడివి. అచ్చంగా చింతామణిలో భవానీశంకరంలా మాట్లాడుతున్నావు! నువ్వసలు పుట్టుకతోనే సగం మనిషివి. మొదటినుంచీ బీటలువారిన వ్యక్తిత్వమే నీది. మొదటి పరీక్షలోనే తలవంచేసి లొంగిపోయిన వాడివి! కొన్ని అనుభవాల తరువాతనైనా ఒక మనిషిలా ప్రవర్తిస్తావనుకున్నాను! నీకూ నాకూ గుడ్‌బై!’’అనేసి దిగ్గున లేచి వెళ్లిపోయింది ఇందిర.
ఈ ప్రయోగాల ఫలితం- ఇన్‌ఫెరెన్స్ ఏమిటని అడగవద్దు. పందొమ్మిది వందల యాభైనాటి ప్రయోగ పరిస్థితులు- ఇవాళా ఉన్నాయి. ప్రకాశం అనే వానపాములూ ఉన్నాయి.
ఇవాల్టి స్ర్తి ఎలా రియాక్టు అవుతుంది?
కల్యాణిలానా? ఇందిరాలానా? సమాధానం మన అభిరుచులు, సంస్కారం, మానవ సంబంధాలపై, స్ర్తి పురుష సంబంధాలపై మనకున్న అవగాహనలపై ఆధారపడి ఉంటుంది! ఇంతకూ కాలాతీత వ్యక్తి ఎవరు?
సమాప్తం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..


శ్రీనరసింహ శతకము

0
0

సీ॥ శ్రీ మనోహర! సురా ర్చిత!సింధు గంభీర!
భక్త వత్సల! కోటి భానుతేజ!
కంజనేత్ర! హిరణ్య -కశ్య పాంతక శూర!
సాధు రక్షణ! శంఖ -చక్ర హస్త
ప్రహ్లాదవరద పాప ధ్వంస సర్వేశ
క్షీరసాగర శయన కృష్ణవర్ణ
పక్షివాహన నీల భ్రమర కుంతలజాల!
పల్లవారుణ పాద పద్మయుగళ!
చారు శ్రీ చందనాగురు చర్చితాంగ
కుంద కుట్మలదంత!వైకుంఠ ధామ!
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురిత దూర!

భావం: ఆభరణాల కాంతిచే ప్రకాశించేవాడివి, ధర్మపురిలో నివసించేవానివి, దుర్జునుల్ని మట్టు పెట్టేవానివి, కోటిసూర్యులంత వెలుగు గలవాడివి,. అగరువంటి పరిమళద్రవ్యాలచే పూయబడ్డ శరీరం నీది. నీ పలువరుస మల్లెమొగ్గల్ని పోలుతాయ. ఓ స్వామీ నీ రూపసౌందర్యాన్నిబ్రహ్మకూడా వర్ణించలేడు. నీ నిత్యనివాసం వైకుంఠంగా ఉంటుంది.

maatata

0
0
Cross Image: 
Date: 
Saturday, December 15, 2018

నిర్మాత ఆనందమే సక్సెస్

0
0

సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో బీరం సుధాకర్ రెడ్డి నిర్మాతగా సుమంత్, ఈషా రెబ్బా హీరో హీరోయిన్లుగా వచ్చిన చిత్రం -సుబ్రహ్మణ్యపురం. సినిమాకు మంచి టాక్ వచ్చిన సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్‌లో మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ మిత్రుడు బీరం నిర్మించిన సుబ్రహ్మణ్యపురం అంచనాలకు అనుగుణంగానే మంచి టాక్ సంపాదించుకుంది. సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. తెలంగాణలో ఎన్నికల వేడి తగ్గనప్పటికీ సినిమాకు స్క్రీన్స్ పెరగడం చూస్తుంటే ఆనందంగా ఉంది. శాటిలైట్, డిజిటల్, హిందీ రైట్స్ రూపంలోనూ నిర్మాతకు మంచి ఫలితాలే అందాయన్నారు. దర్శకుడు సంతోష్ జాగర్లపూడి మాట్లాడుతూ కథ, కథనాలను నమ్మి నాతో సినిమా తీసిన నిర్మాత సుధాకర్ రెడ్డికి ధన్యవాదాలు. నా ఫేవరేట్ హీరో సుమంత్‌తో దర్శకుడినయ్యే అవకాశం రావడం కల నిజమైనట్టుగా ఉందన్నారు. సినిమా విజయానికి కృషిచేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. నిర్మాత బీరం మాట్లాడుతూ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు, సక్సెస్‌కు కారణమైన హీరో సుమంత్ సహా యూనిట్‌కు థాంక్స్ చెప్పారు. హీరో సుమంత్ మాట్లాడుతూ పెట్టుబడులు కూడా తిరిగి రావడం గగనమైపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాత పెట్టిన పెట్టుబడి తిరిగి రావడం నిజమైన సక్సెస్ అన్నారు. ఆమేరకు నిర్మాత బీరం హ్యాపీగా ఉండటం సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. ప్రతి సినిమాకు పాజిటివ్స్, నెగిటివ్స్ ఉంటాయని, మా సినిమా అన్నింటినీ దాటి మంచి సక్సెస్ సొంతం చేసుకుందన్నారు. దర్శకుడు సంతోష్‌కు మంచి భవిష్యత్ ఉందని, సినిమా సక్సెస్‌లో భాగమైన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

అమ్మ బయోపిక్‌లో అరవిందస్వామి

0
0

తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి పురుచ్చితలైవి జయలలిత నిజ జీవితం ఆధారంగా ఏకంగా 3 బయోపిక్‌లు తెరకెక్కుతున్నాయ. అందులో భాగంగా ‘ది ఐరన్ లేడీ’ అనే టైటిల్‌తో లేడీ డైరెక్టర్ ప్రియదర్శిని తెరకెక్కించనున్న చిత్రంలో జయలలిత పాత్రలో నిత్యమీనన్ నటించనుంది. అలాగే సీనియర్ డైరెక్టర్ భారతీరాజా కూడా అమ్మ మీద ఒక బయోపిక్‌ను తెరకెక్కించనున్నాడు. ఇక వీరిద్దరితోపాటు ఏఎల్ విజయ్ కూడా జయలలిత బయోపిక్‌ను తెరకెక్కించనున్నాడు. ఈ చిత్రంలో జయలలిత పాత్రలో విద్యాబాలన్ నటించనుండగా ఎంజిఆర్ పాత్రలో అరవిందస్వామిని ఎంపికచేశారని సమాచారం. లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్న చిత్రం జయలలిత జయంతి ఫిబ్రవరి 24న లాంచ్ కానుంది. ఇక ఈ చిత్రంకోసం విద్యా బరువు పెరుగుతుంది. ఈ చిత్రాన్ని 2020లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

మళ్లీ గీతా ఆర్ట్స్‌లోనే..

0
0

‘గీత గోవిందం’తో తిరుగులేని విజయాన్ని అందుకొని స్టార్ డైరెక్టర్‌గా మారిపోయారు పరశురాం. గీతాఆర్ట్స్ 2 పతాకంపై నిర్మితమైన ఈ చిత్రం విడుదలై 4 నెలలు కావస్తున్నా ఇంతవరకు తన నెక్స్ట్ సినిమాను ప్రకటించలేదు ఈ డైరెక్టర్. అయితే పరుశురాం రెండు పెద్ద బ్యానర్లలో సినిమాలకు కమిట్ అయ్యాడు. అందులో ఒకటి గీతాఆర్ట్స్ కాగా మరొకటి మైత్రీ మూవీమేకర్స్. అయితే వీటిలో ముందుగా గీతాఆర్ట్స్‌లోనే సినిమాచేసే అవకాశాలు వున్నాయని సమాచారం. ప్రస్తుతం పరుశురాం రెండు స్క్రిప్ట్‌లతో రెడీగా వున్నాడట. త్వరలోనే తన కొత్త చిత్రాన్ని ప్రకటించనున్నాడు. ఇక అన్ని కుదిరితే ఈ దర్శకుడు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో కూడా సినిమాచేసే అవకాశాలు వున్నాయట. పరుశురాం ఎప్పటినుండో బన్నీతో సినిమా చేయాలనీ అనుకుంటున్నాడు.

మిస్టర్.. గిన్నీ ఛత్రాత్

0
0

స్టార్ కమెడియన్ నిన్నటితో ఓ ఇంటివాడయ్యాడు. ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ కామెడీ షోతో నవ్వులు పూయించి ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న కపిల్‌శర్మ నిన్న వివాహం చేసుకున్నారు. కాగా కపిల్‌శర్మ చాలాకాలంగా గిన్నీ ఛత్రాత్‌ను ప్రేమిస్తున్నాను. ఈ ప్రేమికులు ఇద్దరూ ఇరుకుటుంబాల అంగీకారంతో పెళ్లిచేసుకొని ఒకటయ్యారు. వీరి వివాహవేడుక జలంధర్‌లో జరిగింది. పలువురు సినీ ప్రముఖులు వీరి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఇక కపిల్‌శర్మ-కామెడీ నైట్స్ విత్ కపిల్ షోతోనే కమెడియన్‌గా మంచి స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు. అలాగే ఈమధ్య ‘సన్ ఆఫ్ మంజీత్ సింగ్’అనే చిత్రం నిర్మాణంలో కూడా పాలుపంచుకొని నిర్మాతగా కూడా మారాడు ఈ స్టార్ కమెడియన్.

దుమ్మురేపుతున్న దేవ్

0
0

ప్రయోగాలు, ప్రయోగాత్మక చిత్రాలకు ఇప్పుడు బెస్ట్ ఆప్షన్ హీరో -కార్తి. ప్రతి చిత్రంలోనూ వైవిధ్యమైన పాత్రలతో మార్కెట్‌ను విస్తరించుకుంటూ వెళ్తున్నాడు. రజత్ రవిశంకర్ దర్శకత్వంలో బైక్ రేసర్ క్యారెక్టర్‌తో వస్తున్న కార్తి, తరువాతి ప్రాజెక్టుల్లోనూ ప్రత్యేకత కనిపించే పాత్రలే ఎన్నుకుంటున్నాడట. ఇక తాజాగా విడుదలైన దేవ్ తొలి లిరికల్ వీడియో ఇప్పుడు దుమ్ము లేపుతోంది. గతంలో ఖాకీలో జతకట్టి మంచి కెమిస్ట్రీ పండించిన రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి కార్తితో ఈ చిత్రం కోసం జతకట్టింది. హారిస్ జైరాజ్ సంగీతాన్ని సమకూర్చిన దేవ్ నుంచి తాజాగా లిరికల్ వీడియో విడుదల చేశారు. ‘చెలియా అడుగుదామా చలిని కాస్త పెరగమని/ సఖియా తెలుపుదామా సుధనే కాస్త పొంగమని’ అంటూ చంద్రబోస్ రాసిన ఫాస్ట్‌బీట్ సాంగ్‌ను హరిహరన్, భరత్‌సుందర్, అర్జున్ చండి, క్రిష్, శరణ్య గోపీనాథ్ ఉత్సాహంగా ఆలపించారు. విడుదలైన కొద్దిసేపటికే కుర్రకారు మైండ్‌లో హమ్మింగ్ నడుస్తుందంటే -సాంగ్ బాగా కనెక్టైనట్టే. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు యూనిట్ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కార్తి, రకుల్ హీరోయిన్లుగా గతంలో వచ్చిన ఖాకి మంచి విజయాన్ని అందుకోవడంతో, వీళ్లిద్దరి కాంబినేషన్‌పై అంచనాలు పెరిగాయి. రేసర్‌గా వస్తున్న దేవ్ -ఈసారి తెలుగులో ఎలాంటి రేసింగ్ చూపిస్తాడో చూడాలి. ఇదిలావుంటే, తరువాతి ప్రాజెక్టులో లవ్వూ గివ్వూలేని పాత్ర ఒకటి చేస్తున్నాడట. దక్షిణాది సినిమాలు ఎక్కువశాతం కమర్షియల్ ఫార్మాట్లోనే తెరకెక్కుతాయి. అంటే హీరో, హీరోయిన్, విలన్ కంప్లసరీ. కనీసం విలన్‌లేని స్టోరీ ఉండొచ్చేమోగానీ, హీరోయిన్ లేని సినిమాను మనవాళ్లు ఊహించుకోవడమే కష్టం. అయితే కార్తి మాత్రం కావాలనే అలాంటి చిత్రానికి ఒప్పుకున్నాడట. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ అని, సినిమాకు హీరోయిన్ పాత్ర అవసరం లేదంటున్నారు. విమర్శకుల ప్రశంసలందుకున్న ‘మానగరం’లాంటి చిత్రాన్ని నిర్మించిన దర్శకుడు లోకేష్ కనగరాజ్, తరువాతి కార్తి చిత్రాన్ని తెరకెక్కిస్తాడట. హీరోయిన్ లేదంటే లవ్వూ గివ్వూ లేదు. పెళ్లి గిళ్లి జాన్తానై. హీరో ఫుల్‌గా యాక్షన్ మోడ్‌లో ఉంటాడట. కార్తి ఈమధ్యే పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో ‘చినబాబు’ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేశాడు. త్వరలో విడుదల కానున్న దేవ్ సినిమా ఓ స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్. దేవ్ తరువాత లోకేష్ కనగరాజ్‌తో కార్తి చేయనున్న సినిమా నిజానికి ప్రయోగమే. హీరోయిన్ లేని ఇలాంటి సినిమాతో ప్రేక్షకులను ఏమేరకు కార్తి మెప్పిస్తాడో చూడాలి.


ప్రయోగాలంటే మహా పిచ్చి

0
0

తెలుగులో కొత్త తరహా సినిమాలు, సరికొత్త ప్రయోగాలకు తెరలేపిన దర్శకుడు సంకల్ప్. ఘాజిలాంటి సినిమాతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించాడు. తాజాగా మరో కొత్త ప్రయోగంగా ఆడియన్స్‌ను అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాడు. మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి, ఆదితిరావు హైదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అంతరిక్షం 9000 కెఎంపిహెచ్. డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న చిత్రాన్ని ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సినిమా విడదలకు దగ్గరపడిన నేపథ్యంలో మీడియాకు సినిమా విశేషాలను వెల్లడించాడు దర్శకుడు సంకల్ప్. ‘ఇలాంటి చిత్రాలు తెరకెక్కించే అవకాశాలు మనకు బహుతక్కువ. ఈ చిత్రంలో 1500 సీజీ షాట్స్ పెట్టాం. సినిమా చూసి అంతా అమేజింగ్ అనకుండా ఉండలేరనే నమ్ముతున్నా. ఈ సినిమా కోసం ఘాజీకంటే ఎక్కువ వత్తిడి ఎదుర్కోవాల్సి వచ్చింది. ఘాజి హిట్టయిన ఆనందంలో ఉన్నపుడే ఈ సినిమా ఆలోచన పుట్టింది. ఓ పత్రికలో స్పేస్‌కు సంబంధించిన ఓ ఆర్టికల్ చదివినపుడు -అలాంటి ప్రయత్నం ఎందుకు చేయకూడదన్న ఆలోచన నుంచి ఈ కథ రాసుకున్నా. హీరో వరుణ్ తేజ్ అయితే బాగుంటుదని సంప్రదించి, కథతో ఆయన ఇంప్రెస్ అయిన తరువాతే ప్రాసెస్ మొదలుపెట్టాం. నిజానికి ఇలాంటి చిత్రాలు ఒప్పుకోడానికి చాలామంది హీరోలు వెనుకడుకు వేయొచ్చు. కానీ, వరుణ్ ఉత్సాహంగా ఈ సినిమా పూర్తి చేయడం హ్యాపీగా ఉంది. తెలుగు ప్రేక్షకుడికి తప్పకుండా ఇదో కొత్త అనుభూతి. స్పేస్ నేపథ్యంగా తెరకెక్కిన కథే అయినా, కమర్షియల్ ఫార్మాట్‌కు అనుగుణంగా అన్నిరకాల ఎమోషన్స్‌నీ క్యారీ చేశాం. వరుణ్, ఆదితిరావ్‌లు ఆస్ట్రోనాట్స్‌గా కనిపిస్తే, వరుణ్‌కు జోడీగా లావణ్య త్రిపాఠి కనిపిస్తారు. నిర్మాతల సహకారానికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలి. స్క్రిప్ట్ కారణంగా బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువే అయినా, అర్థం చేసుకుని క్రిష్ సపోర్ట్ చేశారు. నా కష్టానికి పూర్తిగా సహకరించిన యూనిట్‌కు థాంక్స్ చెప్పకుండా ఉండలేను. ఈ సినిమా తరువాత బాలీవుడ్‌కు వెళ్తారా? అన్న ప్రశ్న తరచూ ఎదురవుతోంది. ఇప్పటికే అక్కడ రెండు ప్రాజెక్టులు రెడీగా ఉన్నాయి. ఈ సినిమా తరువాత బాలీవుడ్‌ల సినిమా ప్లాన్ చేస్తున్నా. ఒకవేళ అది ఆలస్యమైతే -ఇదే బ్యానర్‌లో అంతరిక్షం-2 చేయాలన్న ఆలోచన ఉంది. నాకు ప్రయోగాత్మక సినిమాలంటే పిచ్చి. సినిమా విషయంలో బాగా రీసెర్చ్ చేస్తాను. ఇప్పటి వరకూ వచ్చిన స్పేస్ సినిమాలకు ఇది చాలా దూరం. ఎక్కడా ఏ సినిమాకూ పోలిక ఉండదు’ అంటూ వివరించాడు సంకల్ప్.

వినమ్రతతో..

0
0

సూపర్‌స్టార్ మహేష్, నమ్రతల ఔదార్యం ప్రపంచానికి తెలిసిందే. సేవా కార్యక్రమాల్లో ఈ జంట ఎప్పుడూ ముందే. సంపాదనలో తోచినంత చారిటీకి కేటాయిస్తూ అనాథలకు చేయూతనందిస్తారు. తాజాగా అనాథ పిల్లల ముఖాల్లో ఆనందాన్ని చూడటానికి నమ్రత మరో బృహత్కార్యాన్ని నిర్వహించింది. సోనీ పిక్చర్స్
ఇండియాతో కలిసి సొంత మల్టీప్లెక్స్ ఎఎంబి సినిమాస్‌లో ‘స్పైడర్‌మాన్ -ఇన్ టు ద స్పైడర్ వెర్సే’ చిత్రాన్ని ఉచితంగా చూపించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత సుందరంగా రూపుదిద్దుకున్న
అతిపెద్ద సినిమాస్‌లో 3డి చిత్రాన్ని చూసే అవకాశం రావడం పట్ల పిల్లలు ముఖాలు వెలిగిపోయాయి.
చిన్నారులతో కాసేపు ప్రత్యేక సమయాన్ని గడిపిన నమ్రత, వాళ్లతో కూర్చుని
సినిమా చూడటాన్ని మరింతగా ఎంజాయ్ చేసిందట. దటీజ్ నమ్రత.

గౌతమ్.. విక్రమ్.. మోహనం

0
0

బన్నీని ఒప్పించడంలో విఫలమైన విక్రమ్‌కుమార్ -స్క్రీన్‌మీదకు నానిని లాక్కురావడంలో విజయం సాధించాడు. తీరిగ్గా పిట్టగోడపై కూర్చుని విక్రమ్ చెప్పిన కథ హీరో నానికి బలంగా అతుక్కుపోవడంతో -ప్రాజెక్టును సెట్స్‌పైకి తెచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. వచ్చే ఫిబ్రవరి నుంచి ప్రాజెక్టు ఖాయంగా సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉందన్నది టాక్. ప్రస్తుతం ‘జెర్సీ’తో బిజీగావున్న నాని -గ్యాప్‌లేకుండా షూటింగ్‌ను పరిగెత్తిస్తూనే, విక్రమ్ సినిమా పనులు చక్కబెట్టుకుంటున్నాడట. అందుకే వీళ్లిద్దరి కాంబోలో రాబోతున్న చిత్రానికి సంబంధించి విశేషాలు ఒక్కొక్కటిగా బయటకు రావడం మొదలైంది. అందులో ఒకటి -నాని, విక్రమ్ ప్రాజెక్టులో అచ్చంగా ఐదుగురు హీరోయిన్లు ఉంటారని. కథకు సంబంధించినంత వరకూ కథానాయిక ఒక్కరే అయినా -కథను మలుపు తిప్పే, కథకు ట్విస్ట్‌నిచ్చే కీలక పాత్రల్లో మరో నలుగురు హీరోయిన్లు కనిపిస్తారన్నది వినిపిస్తోన్న మాట. సో, నాని సినిమా కోసం ఐదుగురు అందమైన భామలను వెతికే పనిలో నిమగ్నమైందట యూనిట్. నానికి సరిపడే హీరోయిన్లలో అవకాశం ఎవరి తలుపు తడుతుందో చూడాలి. అప్పుడప్పుడూ స్టార్, మీడియం హీరోల సినిమాల్లో ఇద్దరు లేదా ముగ్గురు హీరోయిన్లతో సందడి చేయడం తెలుగు పరిశ్రమకు అలవాటైన ప్రక్రియే. కాకపోతే నాని సినిమాలో ఎకాఎకిన ఐదుగురు అందగత్తెలు స్క్రీన్‌మీద కనిపిస్తారంటే -కథలో విశేషమేదో ఉండే ఉంటుందన్న ఆసక్తి మొదలైంది. ఇదిలావుంటే విక్రమ్ తదుపరి ప్రాజెక్టునూ నాని లైన్లో పెడుతున్నట్టు టాక్. తనతో అష్టా-చెమ్మా, జెంటిల్‌మేన్ చిత్రాలు తీసి హ్యాట్రిక్ హిట్టు కోసం ఎదురు చూస్తున్న డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణతో ఓ మూవీ చేయబోత్నున్నట్టు గత కొద్దిరోజులుగా కథనాలు వస్తున్నాయి. ఆ ప్రాజెక్టులో నాని క్రైంబ్రాంచ్ ఇన్స్‌పెక్టర్ క్యారెక్టర్ చేయొచ్చని తెలుస్తోంది. అయితే కథకు అనుగుణంగా హీరోయిజాన్ని ఎలివేట్ చేయగల విలన్ పాత్ర కోసం వెతుకులాటలో ఉన్నట్టు సమాచారం. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌తో ఆ పాత్ర చేయించే ప్రయత్నాల్లో ఇంద్రగంటి ఉన్నట్టు చెబుతున్నారు. దీనిపై దుల్కర్ నుంచి ఇంతవరకూ ఎలాంటి ప్రతిస్పందన రాలేదని తెలుస్తోంది.

సమంత @ 96

0
0

తమిళ చిత్రం ‘96’ హిట్టు టాక్ తెచ్చుకోవడంతో -టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఆలస్యం చేయకుండా రీమేక్ హక్కులు సొంతం చేసుకున్నాడు. హిట్టు ఊపులోనే రీమేక్ మొదలుపెట్టాలని అనుకున్నా -కాస్టింగ్ సంగతి ఎటూ తేలక ఆలస్యమైంది. తొలుత నాని, అల్లు అర్జున్, గోపీచంద్.. ఇలా చాలా పేర్లు పరిశీలనకు వచ్చినప్పటికీ, ఎవరితోనూ ప్రాజెక్టు సెట్ కాలేదు. అయితే ఎట్టకేలకు నాయకా నాయకల పాత్రల్ని దిల్ రాజు ఫైనల్ చేయగలిగాడట. రీమేక్ చిత్రంలో శర్వానంద్, సమంత ప్రధాన పాత్రలు పోషించే అవకాశం ఉందని తెలుస్తోంది. శర్వా బాడీ లాంగ్వేజ్‌కు ‘96’ రీమేక్ బాగా సెట్టవుతుందని భావిస్తున్నట్టు సమాచారం.
తమిళంలో విజయ్ సేతుపతి లీడ్ రోల్‌లో అద్భుతంగా నటించాడు. అతడిని శర్వా మ్యాచ్ చేయగలడని భావిస్తున్నార్ట. ఇక పెళ్లయ్యాక సంప్రదాయబద్ధమైన పాత్రలే చేస్తున్న సమంత.. త్రిష పాత్రకు పర్ఫెక్ట్ మ్యాచ్ అని ఫిక్సయ్యారు. తమిళ వర్షన్‌ను రూపొందించిన ప్రేమ్‌కుమారె తెలుగులోనూ దర్శకత్వం వహిస్తాడట. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానుంది.

రొమాంటిక్ ట్రీట్

0
0

హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్, సాయిపల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం పడిపడి లేచె మనసు. రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం 21న థియేటర్లకు రానుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూర్చిన చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి నిర్మిస్తున్నారు. సునీల్, మురళీశర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘నా పేరు సూర్య. పేరులోని వెలుగు జీవితంలో మిస్సై సంవత్సరం అవుతుంది. ఏడాదిపాటు చీకటితో నేను చేసిన యుద్ధంలో ఇంకా బతికున్నానంటే కారణం వైశాలి’ అంటూ శర్మానంద్ వాయిస్‌పై ట్రైలర్ మొదలైంది. ‘ఒక మనిషి గురించి జీవితంలో ఇంతగా తాపత్రయపడటం కరెక్ట్ కాదేమో. సూర్య అనేవాడు ఇక నా జీవితంలో లేడుగాక లేడు’ అంటూ ఆసక్తికర సమాధానంగా సాయిపల్లవి డైలాగ్ కట్ చేశారు. సాయిపల్లవి కారులో వెళ్తుంటే పక్కనే బైక్‌పై వచ్చిన శర్వానంద్ ‘హలోమేడమ్ పడనేమోనని భయపడకండి. మిమ్మల్ని పడేసే బాధ్యత నాది’ అని చమత్కార డైలాగ్ హైలెట్‌గా నిలిచింది. రొమాంటిక్ లవ్, ఎమోషనల్ లవ్‌కు ప్రాధాన్యతనిస్తూ యూత్‌కి కనెక్టయ్యేలా ట్రైలర్ రూపొందించారు. ట్రైలర్ లాంచ్ వేడుకలో హీరో సునీల్ మాట్లాడుతూ ‘రెండు గంటలపాటు అందర్నీ, ముఖ్యంగా యూత్‌ని అలరించే లవ్ ఎంటర్‌టైనర్ ఈ సినిమా. శర్వా కెరీర్‌కు ఉపయోగపడేలా మంచి హిట్టవ్వాలి, నిర్మాతకు ఆర్థిక లాభాలు సమకూరాలి ’ అని ఆకాంక్షించాడు. నటుడు శత్రు మాట్లాడుతూ ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ నుంచి హనుతో మంచి అనుబంధం ఏర్పడింది. ఈ సినిమాలో నాది చిన్న పాత్ర. కానీ వైవిధ్యంగా ఉంటుంది. అవకాశం ఇచ్చిన నిర్మాత, దర్శకుడికి కృతజ్ఞతలు. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అన్నాడు. దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ పడి పడి లేచె మనసు తప్పకుండా అందరికీ నచ్చుతుందన్నాడు. ఆ క్రెడిట్ శర్వానంద్‌కు దక్కుతుందని, ఇది ఇష్టపడి చేసిన సినిమా అన్నాడు. పాటలు, టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చిందని తప్పకుండా సినిమా ఆడియన్స్‌ని అలరిస్తుందన్న నమ్మకం పెరిగిందన్నాడు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ సాంగ్స్, టీజర్ సినిమాపై ఆసక్తి పెంచాయన్నారు. ఇండస్ట్రీకి వచ్చే నిర్మాతల సంఖ్య ఎంతవున్నా కొద్దిమందే సక్సెస్ అందుకుంటున్నారని, అలాంటి వారిలో నిర్మాత సుధాకర్ ఒకరన్నారు. హను తొలి సినిమా అందాల రాక్షసి ఎందుకు హిట్టవ్వలేదో తెలీదుకానీ, మణిరత్నం స్టయిల్ టేకింగ్ ఆయన సినిమాలో చూడొచ్చన్నారు. ఈ సినిమా కోసం అందరూ కష్టపడి పని చేశారని, శర్వానంద్‌తో మంచి కెమిస్ట్రీ పండించే హీరోయిన్ సాయిపల్లవి ప్రాజెక్టుకు ఒక ప్లస్‌పాయింట్ అన్నారు. శతమానంభవతి చిత్రం నుంచే శర్వాతో అనుబంధం బలపడిందని, సినిమాను ప్యాషన్‌గా చేసే హీరోకి ఈ చిత్రం మంచి హిట్టవ్వాలని ఆకాంక్షించారు. హీరో శర్వానంద్ మాట్లాడుతూ సినిమా గురించి ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడతానని, టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ రావడం హ్యాపీగా ఉందన్నాడు. సినిమాను ఆదరించాలని కోరుతూ, కార్యక్రమానికి వచ్చి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.

రాశిఫలం 12/15/2018

0
0
తిథి: 
శుద్ధ అష్టమి రా.1.33
నక్షత్రం: 
పూర్వాభాద్ర రా.9.40,
వర్జ్యం: 
లేదు
దుర్ముహూర్తం: 
ఉ.06.00 నుండి 07.36 వరకు
రాహు కాలం: 
ఉ.9.00 నుండి 10.30 వరకు
మేషం: 
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) కుటుంబ పరిస్థితులు సంతృప్తికంగా ఉంటాయి. ఆరోగ్యం గూర్చి శ్రద్ధవహించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ఆత్మీయుల సహాయ సహకారాలకై సమయం వెచ్చించాల్సి వస్తుంది.
వృషభం: 
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్నకార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగానెరవేరుతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపకరించు పనులు చేపడుతారు.
మిథునం: 
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. వృత్తి ఉద్యోగరంగాల్లో స్థాన చలన సూచనలున్నాయి. ఆర్థికపరిస్థితిలో మార్పులుంటాయి. ఋణప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా అందుతుంది.
కర్కాటకం: 
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) అనారోగ్య బాధలు అధికమవుతాయి. అకారణంగా కలహాలేర్పడవచ్చు. అనవసర భయానికి లోనవుతారు. విద్యార్థులు చంచలంగా ప్రవర్తిస్తారు. వ్యాపారరంగంలోనివారు జాగ్రత్తగా ఉండడం మంచిది. స్ర్తిలు పిల్లల పట్ల మిక్కిలి శ్రద్ధ వహిస్తారు.
సింహం: 
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ధననష్టం ఏర్పడవచ్చు. కొన్ని ముఖ్యమైన కార్యాలు వాయిదా వేసుకొంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. వృథాప్రయాణాలు చేస్తారు. స్థాన చలన సూచనలున్నాయి. సన్నిహితులతో విరోధమేర్పడకుండా మెలగుట మంచిది.
కన్య: 
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) ఆకస్మిక ధనలాభముంటుంది. నూతన వస్తు ఆభరణాలు పొందుతారు. కీర్తి ప్రతిష్ఠలు వస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేస్తారు. ఋణ బాధలు తొలగిపోతాయి. శత్రుబాధలుండవు.
తుల: 
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) కుటుంబ మంతాసంతోషంగా ఉంటారు. అనుకొన్న పనులు పూర్తి చేసుకొంటారు. గృహంలో జరిగే మార్పుల వల్ల ఆందోళన చెందుదురు. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. గృహంలో కోరుకున్న మార్పులు జరుగుతాయి
వృశ్చికం: 
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) శుభకార్య యత్నాలు ఫలిస్తాయి. శుభవార్తలువింటారు. ధనలాభంతో అనుకొన్న పనులు పూర్తిచేస్తారు. ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతులవుతారు. కీర్తి ప్రతిష్ఠలు అందుకుంటారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు
ధనుస్సు: 
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) అద్భుతమైన అవకాశాలను పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభగానెరవేరుతాయ. అనుకోకుండా డబ్బు చేతికి అందుతుంది. నూతన వస్తు ఆభరణాలు సేకరిస్తారు. ఆతీయుల సహాయ సహకారాలు పూర్తిగా అందుతాయి.
మకరం: 
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) కుటుంబ పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. ధననష్టం ఏర్పడవచ్చు. వృథాప్రయాణాలు చేస్తారు. బంధు మిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.వృత్తి వుద్యోగరంగాల్లో సహనం వహించక తప్పదు.
కుంభం: 
(్ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) గృహంలో జరిగే మార్పుల వల్ల ఆందోళన చెందుదురు.కుటుంబ పరిస్థితులు అనుకూలంగా మారుతాయి.శుభకార్య ప్రయత్నాలు సులభంగానెరవేరుతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు.
మీనం: 
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలసి విందులు వినోదాలల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తుఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలను చేయడానికి ప్రయత్న పతకాలను వేస్తారు.
Date: 
Saturday, December 15, 2018
author: 
- గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి

కళతప్పిన ‘కళలవాణి’

0
0

కళలబోషించు...వార్తలందించు..
జనవాణి భద్రపరచు...జగతినాకాశవాణి..
.. అన్నాడో కవి. ఆకాశవాణి... ఈ పేరు వింటేనే జ్ఞాపకాలు రీలులా గిర్రున తిరుగుతాయి..ఎప్పటి రేడియో...బ్రిటిష్ రాజ్ కాలంలో...1927లో జూలై నెలలో ఒక చిన్న రేడియోక్లబ్‌గా పురుడుపోసుకుని అంచెలంచెలుగా ఇంతింతై వటుడింతింతై అన్నట్టు ఈనాడు భారతదేశ నలుదిశలా కొండాకోనల్లో భరతజాతి ప్రతిష్ఠయై అల్లుకున్న భవ్యవాణి... రాజస్థాన్ ఎడారుల్లోనూ, మంచుకొండల లడాఖ్‌లోనూ, ఈశాన్య భారతంలోని చివరి అంచునా, దక్షిణాన అండమానన్ దీవుల్లోనూ దేశసమగ్రతనూ కాపాడుతూ జనజీవితాల్లో పెనవేసుకున్న ప్రేమలత... దాదాపు 425 రేడియో కేంద్రాలతో విలసిల్లుతున్న తల్లి ఆకాశవాణి ఈరోజున దుఃఖిత వదనయై దిగాలుగా ఉంది...
కళాకారుల నిలయం..
మన తెలుగునాట ఎందరో కవులు కళాకారులు తమ గళాలతో కలాలతో ఆ తల్లికి ఊపిరిలూదారు... హైదరాబాద్ కేంద్రమంటే గుర్తుకొచ్చే దేవులపల్లి, స్థానం నరసింహారావు, బుచ్చిబాబు, గోపిచంద్, రావూరి భరద్వాజ, సీత-అనసూయ, పాలగుమ్మి విశ్వనాథం, మునిమాణిక్యం, కె.చిరంజీవి... ఇలా ఎంతోమంది ఆకాశవాణికి కైమోడ్పులతో తమ సేవ లందించారు. ఎనభయవ పడిలో పడుతున్నా శారదా శ్రీనివాసన్, చిత్తరంజన్, కోకాసంజీవరావు, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ వంటి వారు వనె్నతగ్గనివారు ఇంకా కార్యక్రమాలలో పాల్గొంటూనే ఉన్నారు.. ఇక అలనాటి మద్రాసు కేంద్రం ఆచంట జానకిరామ్, ఆమంచర్ల గోపాలరావు, బాలాంత్రపు రజనీకాంతరావు, గొల్లపూడి మారుతీరావు, జనమంచి రామకృష్ణ వంటివారితో కళకళలాడిన ప్రాంగణం... బాలమురళీకృష్ణ, శ్రీరంగంగోపాలరత్నం, బందా కనకలింగేశే్వరరావు, వోలేటి వెంకటేశ్వర్లు, నండూరి సుబ్బారావు, వి.బి.కనకదుర్గ వంటి ప్రతిభామూర్తులతో పునీతమయింది విజయవాడ కేంద్రం.... ఏవితల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు అన్నట్టు కార్యక్రమాల రూపశిల్పులయిన ఈ ప్రోగ్రాం స్ట్ఫా ఆనాడు ఆకాశమే హద్దుగా చెలరేగారు... ఆకాశవాణి పతాకనెగరేశారు... ఇది గతం పరచిన స్వగతం.. మరి నేడు.. ఆకాశవాణి కేంద్రాలకు మార్గదర్శకత్వం నెరపిన ప్రోగ్రాం సిబ్బంది గత రెండు దశాబ్దాలుగా సరైన ప్రమోషన్ అవకాశాలులేక రిక్రూట్మెంట్ కుంటుపడి మసక చీకట్లలో ధైర్యం వెక్కిరించినా స్థైర్యాన్ని కోల్పోకుండా కార్యక్రమ రూపకల్పనలో పాలుపంచుకుంటున్నారు.. ప్రసారభారతి వెలుగు హారతి పడుతుందనుకుంటే చీకటిలో చిరుదివ్వెకూడా కాలేకపోయింది...
జాతి నిర్మాణంలో..
స్వాతంత్య్రం వచ్చిన అనంతరం దశాబ్దాలుగా రేడియోతో పెరిగిన తరం కవులు, కళాకారులయ్యారు.. అడ్మినిస్ట్రేటలయ్యారు... భాషా సంగీత సాహిత్యాలను కాచివడపోశారు.. జాతి నిర్మాణంలో రేడియోదో గణనీయపాత్ర... కెరీర్ నిచ్చెనలో ఆకాశవాణి తొలిమెట్టుగా ఉండేది. కానీ ఉప్పుపాతరేసినట్టు ఈరోజు ఆకాశవాణి అలోలక్ష్మణా అంటోంది.. కాస్త వీళ్ళని పట్టించుకోండయా అంటూ వాపోతోంది. ఆకాశవాణిని నడిపించే కార్యక్రమ సిబ్బంది కాళళూ చేతులు కట్టేసి పనిచేయమంటున్నారు. ఒకప్పుడు స్టేషన్ డైరక్టర్ అంటే ఒక గౌరవహోదాయే కాదు షిప్ కెప్టెన్ లా ఉండి మార్గదర్శకం చేసేవాడు...ప్రోగ్రాం సిబ్బందిని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా ఇప్పడు స్టేషన్ డైరక్టర్లని లేకుండా చేశారు.. దానిఫలితం స్టేషన్ల మీద పడింది... ఈరోజున రేడియో స్టేషన్లన్నీ నాయకత్వలేమితో కునారిల్లుతున్నాయి.. యూపీఎస్‌సీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థ ఎంపిక చేసిన ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ లు ఇంకా ముప్ఫై ఏళళుదాటినా అదే స్థాయిలో లేదా ఒకేఒక్క తాత్కాలిక పదోన్నతితో అడహాక్ అసిస్టెంట్ డైరక్టర్లుగా కొనసాగటం దేనిని సూచిస్తుంది..ఏ ప్రసారమాధ్యమానికైనా ష్యశఆళశఆ జఒ ఆ్దళ రీజశ అన్నధి తారకమంత్రం..అది తప్పించి మిగిలిన వాటిపై దృష్టి పెడుతున్న ప్రసారభారతి దేనికి సంకేతం..ప్రజా సేవా ప్రసారాల అతి పెద్ద వ్యవస్థను నడిపేందుకు ప్రోగ్రాం సిబ్బందికి అవకాశాలివ్వకుండా డిప్యుటేషన్ పై సిబ్బందిని రప్పించటం కార్యక్రమాలను అధోగతికి నెట్టేయడమే కదా...
ఐబిపిఎస్ సర్వీస్..
1990లో ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ సర్వీస్ అనే వ్యవస్థీకృత సర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చారు.వెయ్యికిపైగా పోస్ట్స్ ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. వేళ్ళపై లెక్కించేమంది మాత్రమే ఉన్నారు. పోస్టులు ఖాళీగా ఉన్నాయికదా అని ప్రసారరంగం గురించి కనీస పరిజ్ఞానం లేకపోయినా గ్రేడ్ పే ఉంటే చాలని వారిని డెప్యుటేషన్ పై నియమిస్తోంది ప్రసారభారతి. ఇది ఒక్క ప్రోగ్రాం సిబ్బంది లోనే జరుగుతోంది.మరోపక్క అత్యవసర అవసరమన్న ముసుగేసి రిటైర్డ్ ఉద్యోగులకు కన్సల్టెంట్స్ రూపంలో వారిని నియమిస్తోంది. ఉన్న సిబ్బందికి ప్రమోషన్లు ఇవ్వకుండా. ఇవ్వకపోవటానికి కోర్టు కేసులని, అర్హులు లేరన్న సాకులు సిద్ధం చేసుకుంది.
విషాదాల పరంపర..
ప్రోగ్రాం రూపొందించటంకన్నా మీరెంత ఆదాయం సంపాదిస్తున్నారు అంటున్నారు డెప్యుటేషన్ పై వచ్చిన అధికారులు. బి.బి.సి,నేషనల్ పబ్లిక్ రేడియోలాంటి అంతర్జాతీయ ప్రసార సంస్థలు కూడా ఆదాయాన్ని సమకూర్చుకునే బాధ్యతను కంటెంట్ క్రియేటర్స్ నెత్తిన పడేయలేదు. దానికి సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నాయి.. అంతదాకా ఎందుకు మనదేశంలోనే ప్రైవేట్ బ్రాడ్ కాస్టర్స్ కూడా కమర్షియల్ రెవెన్యూ కోసం వారి వారి అవసరాలకోసం మార్కెటింగ్ వింగ్‌ని నియ మించుకున్నాయి. వారు ప్రోగ్రాంలను మార్కెట్‌కు అనుగుణంగా రూపొందించమంటారు. మీరేం చేస్తారో తెలియదు...కమర్షియల్ రెవెన్యూ సంపాదించటం మీ బాధ్యతే అని ప్రసారభారతి అధికారులు ప్రోగ్రాం సిబ్బందిపై వత్తిడి తేవటం మరో విషాదం.
వార్తల ప్రసారంలో పూర్తి స్వేచ్ఛ స్వీయనియంత్రణ ఉండాలన్న ప్రాతిపదికన ప్రసారభారతి పురుడు పోసుకుంది.కానీ వాస్తవమేమిటంటే వార్తలను సేకరించేది వడపోసేది సమాచార మంత్రిత్వశాఖ అధికారులు.. వార్తా ప్రసారమంతా మినిస్ట్రీ కనుసన్నలలోనే ఈనాటికి జరుగుతోంది.. ప్రసారభారతి రాకముందు ఏ పరిస్థితి ఉందో అదే స్థితి నేటికీ కొనసాగుతోంది. ఇక ప్రసారభారతి నిర్వహణ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిది. 430 ఆకాశవాణి కేంద్రాలలో ఏం జరుగుతోంది అక్కడి సమస్యలేమిటి అవసరాలేమిటి అన్నదానితో సంబంధంలేకుండా ప్రసారభారతి బోర్డ్ సభ్యులు ఐదు నక్షత్రాల హోటళ్ళలో సమావేశాలు పెట్టుకుని ఖర్చు తగ్గించే మార్గాలను అనే్వషిస్తారు.
కోర్టు కేసుల విషాదం...
మరో మార్గంలేక తమ సమస్యలకు పరిష్కారాలు లభించక ప్రోగ్రాం సిబ్బంది న్యాయస్థానాలను ఆశ్రయిస్తే దాన్ని సాకుగా చూపించి చేతులు దులుపేసుకోవటం ఆనవాయితీగా పెట్టుకుంది ప్రసారభారతి.
పరిష్కారమార్గం..
ఆకాశవాణికి పూర్వ వైభవం వస్తేనే కానీ పెడదారిపెడుతున్న యువతరానికి ప్రబోధంచేసే ప్రసారమాధ్యమం అందుబాటు లోకిరాదు.. ఒకప్పుడు యువతకు కెరీర్ లాంచింగ్ ప్యాడ్ ఆకాశవాణి. సినిమా పాటలతో హోరెత్తిస్తూ వారి భజనే లక్ష్యంగా సాగుతున్న ప్రైవేటు రేడియోలతో పోలిస్తే పిల్లలు, పెద్దలు, రైతులు, మహిళలు, యువత, జానపద కళాకారులు, శాస్ర్తీయ సంగీత కళాకారులు, రచయితలు.. ఇలా ఎందరెందరినో అక్కున చేర్చుకుని అవకాశాలిచ్చి వారి ప్రతిభకు సానబెట్టే ఆకాశవాణిని తిరిగి కళలు పోషించే జనవాణిగా నిలిచే ఈ ప్రసారమాధ్యమాన్ని బతికించుకోవాలంటే ప్రోగ్రాం సిబ్బందిని పటిష్టం చేసి వారినో బలమైన వ్యవస్థగా తిరిగి రూపొందిస్తేకానీ సాధ్యంకాదు. అందుకు వారి గోడును వినే దయార్ద్ర హృదయం కలిగిన మానవీయ వ్యవస్ధ కావాలి. పాలకులు ప్రసారభారతిని అలా తీర్చిదిద్దినప్పుడే అది సాధ్యం. ప్రసారభారతి స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ దాని అవసరాలు అదే తీర్చుకోవాలి అని వదిలేస్తే అది జాతికి తీరని నష్టం అవుతుంది. భవిష్యత్ తరాలు క్షమించవు.


పుణ్యపురుషుడు.. ‘మోక్షగుండం’

0
0

(నేడు మోక్షగుండం విశే్వశ్వరయ్య జయంతి)
ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలన్నారు మన తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ. ఏ దేశమైనా అభివృద్ధి సాధించాలంటే.. అక్కడ సాంకేతికపరమైన ఇంజనీరింగ్ రంగం పటుత్వంగా ఉండాలి. ప్రపంచంలో గొప్ప ఇంజనీర్‌గా పేరుప్రతిష్ఠలు సాధించిన మన దేశ కీర్తిని ఇనుమడింపజేసిన మహోన్నత వ్యక్తి సర్ మోక్షగుండం విశే్వశ్వరయ్య.
1955 భారత ప్రభుత్వం మన దేశపు అత్యుత్తమ అవార్డు ‘్భరతరత్న’ బిరుదునిచ్చి సర్ విశే్వశ్వరయ్యను సత్కరించిందంటే, ఆయన ప్రతిభను అర్థం చేసుకోవచ్చు.
సెప్టెంబర్ 15న వారి 158 జయంతి. మైసూర్ రాష్ట్రం కోలార్ జిల్లాలోని కుగ్రామంలో జన్మించిన సర్ మోక్షగుండం విశే్వశ్వరయ్య 20వ యేట బెంగుళూర్ కాలేజిలో పట్ట్భద్రుడై, పూణె ఇంజనీరింగ్ కళాశాలలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యారు. ఆ రోజుల్లో సింధూ రాష్ట్రంలోని ‘సుక్కూర్’కు నీటికొరత ఉండేది. ఆ కొరతను తీర్చే మార్గాన్ని అనే్వషించవలసిందిగా సర్ విశే్వశ్వరయ్యను ప్రభుత్వం అక్కడకు పంపగా, ఆయన ఎంతో సమర్థతతో సుక్కూర్ వాటర్‌వర్క్స్ స్కీమును రూపొందించి, ఆ నిర్మాణాన్ని పూర్తిచేసి అక్కడి ప్రజలకు నీటికొరతను నివారించి వారి మన్ననలందుకొని తన ప్రతిభా నైపుణ్యాలను ప్రదర్శించటంతో కాలక్రమంలో ఆయనకు ఎన్నో ఉన్నత పదవులు లభించాయి.
విశే్వశ్వరయ్య ప్రఖ్యాత భారత ఇంజనీర్‌గా జపాన్, చైనా దేశాలు సందర్శించారు. అప్పటికే ఆయన ప్రతిభను గుర్తించి ఆ ప్రభుత్వాలు తాము ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలను సలహాల రూపంలో ఆయన నుంచి స్వీకరించాయి. ఆయన ప్రతిభను ప్రత్యక్షంగా చూసిన చైనా ప్రభుత్వం, ఆ దేశపు ప్రధాన ఇంజనీర్ సలహాదారునిగా నియమించుకోవాలని ప్రయత్నించింది. కాని చైనా ప్రభుత్వం కోర్కెను తిరస్కరించి, తన దేశభక్తిని చాటుకున్న గొప్ప జాతీయవాది మోక్షగుండం విశే్వశ్వరయ్య.
1909లో రిటైర్ అయ్యేనాటికి విదేశాలలోని ఏ ప్రసిద్ధ ఇంజనీర్‌కు తీసిపోని ప్రతిభ, పేరుప్రతిష్టలు, అనుభవాన్ని ఆయన సంపాదించారు. అది విన్న మైసూర్ మహారాజు సర్ విశే్వశ్వరయ్యను తన ప్రభుత్వ చీఫ్ ఇంజనీర్‌గా, మరికొద్ది కాలానికి ప్రభుత్వ, దివానుగా నియమించడం ఆయన మహోన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం.
ఇప్పుడు పంచవర్ష ప్రణాళికలు, దశవర్ష ప్రణాళికలు మారిస్తే మన ప్రభుత్వం ప్రణాళికాబద్ధమైన ఆర్థికాభివృద్ధి సాధించేదని ఆ మహానీయుడు 1934లోనే ‘ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా’ అనే గ్రంథంలో రాశారు.
వరదలతో ముంచివేస్తుండే ‘మూసీ’ని ముక్కుతాళ్లతో బంధించిన ఘనత విశే్వశ్వరయ్యకే దక్కింది. ఆయన మేధాసంపత్తితో కృషితో జరిగిన అభివృద్ధి పనులు కోకొల్లలు. అందులో మచ్చుకు కొన్ని మైసూర్ యూనివర్సిటీ, మైసూర్ బ్యాంక్, సబ్బు ఫ్యాక్టరీ, భద్రావతి స్టీలు, వర్క్ మొదలైనవి. మన దేశాన్ని ‘నవభారత’ దేశంగా మార్చేందుకు, నవసూత్ర పథకాన్ని రూపొందించారాయన. అవి, 1) వయోజన విద్యాప్రచారం 2) పరస్పర సహకారం 3) స్వయం సహాయం 4) నిరక్షరాస్యత నిర్మూలన 5) అవసరాన్నిబట్టి ఆదుకోవడం 6) ఆధునిక సాధన సామగ్రిని వృద్ధిపరచటం 7) పొదుపు 8) నూతన పద్ధతులను ఉపయోగించడం 9) దేశాభివృద్ధి సాధించడం.
విశేష సేవలందించిన విశే్వశ్వరయ్యకు బ్రిటిష్ ప్రభుత్వ ‘సర్’ బిరుదునిచ్చి సత్కరించింది. స్కాట్లాండులోని లేక్‌షైర్ స్టోరేజి రిజర్వాయర్ తలుపులను నిర్మించడంలో అక్కడి ఇంజనీర్లు విఫలమైతే, అక్కడికి వెళ్ళి విశే్వశ్వరయ్య అత్యంత నైపుణ్యంతో వాటిని నిర్మించి మన దేశ ప్రతిష్టను పెంపొందించారాయన. 1861లో జన్మించి 1962లో మరణించి సరిగ్గా నూరు సంవత్సరాలు జీవించిన విశే్వశ్వరయ్య పూర్ణపురుషుడే గాక పుణ్యపురుషుడు. భారతీయ ఇంజనీరింగ్ రంగంలో విప్లవం తెచ్చి మన ఇంజనీర్లకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి విశే్వశ్వరయ్య చిరస్మరణీయుడు. ఆత్మగౌరవం గల స్వయం పోషకత్వంతో, అభ్యుదయ దృక్పథంగల జాతిగా భారతదేశాన్ని అభివృద్ధిపరచాలని ఎంతగానో ఆశించిన వ్యక్తి విశే్వశ్వరయ్య. తుప్పుపట్టిన ఇనుములా గాక, కరిగిపోయే గంధంలా సమాజసేవకు పాటుపడాలని ఆయన ఆకాంక్ష. ఆయన చేసిన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం విశే్వశ్వరయ్య జన్మదినం సెప్టెంబర్ 15ను ‘ఇంజనీర్స్ డే’గా అధికారికంగా ప్రకటించి, ఆరోజు ఉత్తమ ఇంజనీర్లకు అవార్డులను ప్రవేశపెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ మహనీయునికి హృదయ పూర్వక అక్షర నివాళి.

కాంగ్రెస్ ఎన్నికల వ్యూహంలో సోనియా బృందమే సారథ్యం

0
0

కాం గ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని రాహుల్ గాంధీ చేపట్టిన తర్వాత సుదీర్ఘకాలం ఈ పదవిలో ఉన్న సోనియా గాంధీ ఇక దాదాపు ప్రేక్షక పాత్రకే పరిమితం అవుతారని అందరూ భావించారు. ఆందోళన కలిగిస్తున్న ఆమె ఆరోగ్యం కూడా అందుకు కాగా, కొంత స్వతంత్రత ఇస్తే గానే రాహుల్ ఒక నాయకుడిగా ఎదగలేరని ఆమె కూడా భావించడమే ప్రధాన కారణం. పార్టీలో ఒకే అధికార కేంద్రం ఉండాలనే భావనతో చివరకు ప్రియాంక గాంధీ క్రియాశీల పాత్ర వహించాలని ఎంతగా వత్తిడులు వస్తున్నా ఆమె స్పందించడం లేదు.
రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టగానే సోనియా బృందంలో పార్టీలో కీలక బాధ్యతలు వహిస్తూ వస్తున్న సీనియర్ నాయకులు అందరూ తెరమరుగు అవుతారని, రాహుల్ బృందంలోని యువనేతలకు కీలక పదవులు కట్టబెడుతూ ఉంటారని విశేషంగా ప్రచారం సాగింది. పార్టీలో వివిధ స్థాయిలలో నియమించే కమిటీలు అన్ని రాహుల్ బృందంలోని సభ్యులతో నింపుతారనే ప్రచారం సాగింది. అయితే ఈ ప్రచారం ఎంతోకాలం నిలవలేదు.
ఎంతోకాలం ఎదురు చూసిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నియామకంలో ఈ విషయం బయట పడింది. ఎప్పుడైతే సోనియా రాజకీయ కార్యదర్శిగా గత దశాబ్దకాలానికి పైగా పార్టీలో నిర్ణయాత్మక పాత్ర వహిస్తున్న అహ్మద్ పటేల్‌ను కోశాధికారిగా నియమించారో అప్పుడే ఇంకా పార్టీలో సోనియా బృందం పెత్తనమే కొనసాగుతున్నట్లు స్పష్టమైనది. అట్లాగే వృద్ధాప్యంలో ఉన్న మోతిలాల్‌ను కోశాధికారిగా తప్పించినా ప్రధాన కార్యదర్శిగా నియమించడం కూడా ఈ అంశానే్న స్పష్టం చేసింది.
కుమారుడు రాహుల్ గాంధీకి పార్టీ అధ్యక్ష పదవిని అప్పజెప్పినా 2019 ఎన్నికల బాధ్యతను కూడా అప్పజెప్పడానికి సోనియా గాంధీ వెనుకడుగు వేస్తున్నారు. అందుకనే వచ్చే ఎన్నికలలో రాహుల్ బృందానికి పెద్దగా ప్రాధాన్యత లభించే అవకాశాలు లభించడం లేదు. పార్టీ అధ్యక్షుడు మారినా ఇంకా పార్టీలో పెత్తనం సోనియా సన్నిహితులదే సాగుతున్నది.
ఈ నియామకాలతో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అద్యక్ష పదవి చేపట్టగానే పార్టీలోను ‘వృద్ధ తరం’ నాయకులను పక్కన పెట్టి, యువతరం అన్ని స్థాయిలలో నాయకత్వ బాధ్యతలను చేబడుతుందని రెండేళలుగా జరుగుతున్న ప్రచారానికి కాంగ్రెస్ తెర దించింది. సుమారు రెండు శతాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలపై ఆధిపత్యం వహిస్తున్న సోనియా గాంధీ హయాంలో పార్టీ వ్యవహారాలపై పెత్తనం సాగిస్తూ వస్తున్న వృద్ధతరం సారధ్యంలోనే 2019 ఎన్నికలను ఎదుర్కోబోతున్నారన్న స్పష్టమైన సంకేతాలు వెలువడి నట్లు అయింది.
రాహుల్ గాంధీ బృందంలోని యువనాయకులకు ఇంకా చెప్పుకోదగినంత ప్రజాదరణ లేకపోవడం, రాజకీయ ఎత్తుగడలలో వారికి తగిన అనుభవం లేకపోవడం, ముఖ్యంగా ఇతర పార్టీ నేతలతో చెప్పుకోదగిన సంబంధాలు లేకపోవడంతో వారికి సారధ్యం అప్పచెబితే పార్టీ ముందుకు వెళ్ళడం అసాధ్యమని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అస్తిత్వ సమస్యను ఎదుర్కొంటున్నది. అందుకనే రాహుల్ తరహా ప్రయోగాలు చేయడానికి సిద్ధంగా లేదు.
కాంగ్రెస్ సారధ్యంలో పనిచేయడానికి దేశంలో ఏ రాజకీయ పక్షం, రాజకీయ నేత నేడు ముందుకు రావడం లేదు. తమ సారధ్యంలో కాంగ్రెస్ పని చేయాలనే ధోరణిని మమతా బెనర్జీ, మాయావతి, శరద్ పవర్ వంటి నేతలు వ్యక్తం చేస్తున్నారు. అటువంటి నాయకులతో మాట్లాడి, రాజకీయ వ్యవహారాలను సరిదిద్దగల స్థాయి రాహుల్ గాంధీకి కూడా ఇంకా అలవడలేదు. ఈ విషయం సోనియా గాంధీ కూడా గ్రహించారు. అందుకనే ఆమె, ఆమె బృందమే ఇంకా పార్టీలో నిర్ణయాత్మక పాత్ర వహించక తప్పడం లేదు.
పార్టీ అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుండి పార్టీలో వివిధ స్థాయిలలో పలువురు యువ నేతలకు రాహుల్ ప్రాధాన్యత ఇస్తూ వచ్చినప్పటికీ ‘సోనియా బృందం’ ఇంకా కీలక నిర్ణయాలు తీసుకొంటున్నది. నరేంద్ర మోదీ వంటి బలమైన నాయకుడిని, 19 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పరచిన బిజెపిని ఎదుర్కోవడం యువనేతలకు సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చారు. పైగా ఇప్పుడు కాంగ్రెస్ తీవ్రమైన వనరుల సమస్య ఎదుర్కొంటున్నది. అపారమైన ఆర్థిక, మానవ వనరులు ఉన్న బిజెపితో పోటీ పడటం కాలపరీక్ష వంటిదే.
పార్టీ సంస్థాగత వ్యవహారాల నుండి, పార్టీకి నిధులు సమకూర్చడం, ఇతర రాజకీయ పక్షాలతో సంప్రదింపులు జరపడం వంటి అన్ని వ్యవహారాలను సీనియర్ నేతలే పర్యవేక్షిస్తున్నారు. కాంగ్రెస్ చరిత్రలో మొదటి సారిగా తొమ్మిది మంది సభ్యులతో కోర్ కమిటీని ఏర్పాటు చేసారు. 2019 ఎన్నికలకు సంబంధించి అన్ని వ్యవహారాలు పర్యవేక్షించడం కోసం తొమ్మిది నెలల ముందే ఈ కమిటీని ఏర్పాటు చేసారు. ఈ కమిటీ సారథ్యంలోనే 2019 ఎన్నికలకు సంబంధించిన అన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
ఈ కమిటీలో ఏడుగురు సోనియా గాంధీతో దీర్ఘకాలంగా సన్నిహితంగా పనిచేస్తున్న వారే ఉండటం గమనార్హం. అంటే ఎన్నికల వ్యూహాలను రూపొందించడంలో చివరకు రాహుల్ గాంధీ సహితం ప్రేక్షక పాత్ర వహించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. పలు సంవత్సరాలుగా రాహుల్ బృందంగా పేరొందిన యువనేతలో మరో ఐదేళలు తమ అదృష్టం కోసం వేచి ఉండక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.
రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గేహ్లోట్, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబి ఆజాద్, కొత్తగా పార్టీ కోశాధికారి బాధ్యతలు చేపట్టిన అహ్మద్ పటేల్, మాజీ కేంద్ర మంత్రులు ఏ.కే.ఆంథోని, పి.చిదంబరం, మల్లికార్జున ఖర్గే, జైరాం రమేష్ ఈ కమిటీలో ఉన్నారు. ఇక రాహుల్ బృందంగా పేరొందిన వారిలో కేవలం ఇద్దరు మాత్రమే ఈ కమిటీలో ఉన్నారు. వారు కె.సి.వేణుగోపాల్, రణదీప్ సుర్జేవాల.
2014 ఎన్నికలలో పార్టీలో కీలక పాత్ర వహించిన దిగ్విజయ్ సింగ్, జనార్దన్ ద్వివేది మాత్రమే ఈ పర్యాయం ఎక్కడా పార్టీ వ్యవహారాలలో కనిపించడం లేదు. మిగిలిన అందరూ దాదాపు క్రియాశీలంగానే ఉన్నారు. అంటే 2014 ఎన్నికల బృందమే ఇప్పుడు 2019లో కూడా కాంగ్రెస్‌కు సారధ్యం వహిస్తున్నది. అంటే సోనియా బృందమే ఇప్పుడు కాంగ్రెస్‌ను ఎన్నికల వైపు నడిపిస్తున్నది. రెండు, మూడేళళుగా రాహుల్ గాంధీ చేసిన ప్రయోగాలను 2019లో చేయడానికి పార్టీ సిద్ధంగా లేదని కూడా వెల్లడైనది.
కోర్ గ్రూప్ సభ్యుడిగా ఉండడంతో పాటు పార్టీ సంస్థాగత వ్యవహారాలకు సహితం గేహ్లోట్‌ను ఇన్ చార్జ్ గా చేసారు. సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శిగా దీర్ఘకాలం పార్టీ వ్యవహారాలలో కీలక భూమిక వ్యవహరించిన అహ్మద్ పటేల్ తీవ్రమైన నిధుల కొరత ఎదుర్కొంటున్న పార్టీకి కోశాధికారి అయ్యారు. ఇక ఇతర పార్టీలతో సంప్రదింపులు జరిపి, పొత్తులకు రంగం సిద్దం చేసే బాధ్యతలను పటేల్, ఆజాద్‌లకు అప్పజెప్పారు. పైగా కీలకమైన ఉత్తరప్రదేశ్‌కు ఇంచార్జ్‌గా కూడా ఆజాద్‌ను నియమించారు.
రాహుల్‌గాంధీ దేశంలో లేని సమయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వంపై క్షేత్ర స్థాయిలో పోరాటం చేపట్టే విధంగా పెట్రోల్ ధరల పెరుగుదలకు నిరసనగా ‘్భరత్ బంద్’ సెప్టెంబర్ 10న జరపాలని పార్టీ సీనియర్ నేతలు ఓర, పటేల్, ఖర్గే, గేహ్లోట్ సంయుక్తంగా పిలుపిచ్చారు. ఖర్గే కి ఈ మధ్య కీలకమైన మహారాష్ట్ర బాధ్యతలను కూడా అప్పజెప్పారు. శరద్ పవర్ వంటి నేతలతో సంప్రదింపులు జరపడానికి సీనియర్ నేత ఒకరు కావాలని ఆయనను నియమించారు.
అయితే రాజకీయంగా అంతగా ప్రాధాన్యత లేని 19 మందితో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రణాళిక కమిటీలో సేనియర్లు ముగ్గురు - పి.చిదంబరం, సల్మాన్ ఖుర్షిద్, భూపిందర్ సింగ్ హూడా మాత్రమే ఉన్నారు. మిగిలిన వారంతా సుష్మిత దేవ్, మాన్ ప్రీత్ బాదల్, ముకుల్ సంగమ వంటి యువనేతలు ఉన్నారు. అట్లాగే 13 మందితో ఏర్పాటు చేసిన ప్రచార కమిటీలో కూడా ఆనంద్ శర్మ, ప్రమోద్ తివారి, భక్త చరణ్ దాస్ - ముగ్గురే సీనియర్లు ఉన్నారు. మనిష్ తివారి, దివ్య స్పందన, మిలింద్ దేఒర వంటి యువకులే ఎక్కువగా ఉన్నారు.
ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్‌లో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా విశేష ప్రజాదరణ ఉన్న జ్యోతిరాదిత్య సింధియాను కాకుండా సీనియర్ నేత కమల్‌నాథ్‌ను నియమించడం కూడా ఈ సందర్భంగా గమనార్హం. రాజస్థాన్‌లో యువనేత సచిన్ పైలట్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొంతకాలంగా కొనసాగుతున్నా అక్కడ మాజీ ముఖ్యమంత్రి గేహ్లోట్ లేకుండా ఎటువంటి కీలక నిర్ణయం తీసుకోలేక పోతున్నారు. గుజరాత్, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఎన్నికల వ్యూహం, ప్రచారం విషయాలలో ఆయన మీదనే రాహుల్ గాంధీ ఎక్కువగా ఆధారపడటం తెలిసిందే. అంటే ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా పైలట్‌కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
పలు రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌లుగా అంతగా ప్రాధాన్యత లేని నాయకులనే రాహుల్ గాంధీ నియమించారు. దానితో ఆయా రాష్ట్రాలలో ఇతర పార్టీలతో పొత్తులు వంటి విషయాలను ఇన్‌ఛార్జ్‌లు కాకుండా పటేల్, ఆజాద్ వంటి కేంద్ర నాయకులే నేరుగా చూస్తున్నారు. బీహార్‌లో శక్తిసిన్హా గోహిల్, పశ్చిమ బెంగాల్‌లో గౌరవ్ గొగోయ్, తెలంగాణ లో కుంతియా వంటి నాయకులను ఆయా రాష్ట్రాలలో పొత్తు ఏర్పర్చుకొంటున్న లాలూ ప్రసాద్ యాదవ్, మమతా బెనర్జీ, చంద్రబాబునాయుడు వంటి నేతలు లెక్కచేసే పరిస్థితి లేదు.
చమురు ధరల పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్ చేపట్టిన ‘్భరత్ బంద్’కు మమతా బెనర్జీ, మాయావతి వంటి నాయకులు మద్దతు ఇవ్వలేదు. అంటే వారు రాహుల్ గాంధీతో కలసి పనిచేయడానికి సిద్ధంగా లేరని స్పష్టం అవుతుంది. పైగా చమురు ధరల పెరుగుదలకు బిజెపిని మాత్రమే కాకుండా కాంగ్రెస్‌ను కూడా నిందించడం ఒక విధంగా కాంగ్రెస్ నాయకత్వం ఖంగు తిన్నది. రాహుల్‌ను ప్రధానమంత్రి అభ్యర్థిగా బహిరంగం గా ప్రకటించదానికి కూడా ఇప్పుడు కాంగ్రెస్ వెనుకడుగు వేస్తున్నది. ఎన్నికల తర్వాతనే ఈ అంశంపై ఒక నిర్ణయానికి వస్తామని ప్రాంతీయ పక్షాల నేతలు చెబుతూ ఉండటం ఒక విధంగా రాహుల్ పేరుకు తమ మద్దతు లేదని వ్యక్తం చేయడమే.
అందుకనే బిజెపికి వ్యతిరేకంగా రాస్త్రాలలో వీలున్న చోట్ల తప్ప జాతీయ స్థాయిలో ఒక ‘మహాకూటమి’ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని కాంగ్రెస్ నిర్ణయానికి వచ్చింది. పరిస్థితుల వాస్తవికతను గ్రహించి, సంయమనంతో అడుగులు వేయక తప్పడం లేదు.

అభివృద్ధే గెలిపించింది.. ప్రజల వెంటే ఉంటా..

0
0

ఖమ్మం, డిసెంబర్ 14: తన నాలుగున్నరేళ్ళ పదవీకాలంలో ఖమ్మం నియోజకవర్గంలో చేసిన అభివృద్ధే తిరిగి తనను గెలిపించిందని, తనను ఓడించేందుకు అనేక శక్తులు పలు రకాలుగా ప్రయత్నించినప్పటికీ ప్రజలు తనవెంటే ఉన్నారని రుజువైందని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకెళ్ళడంలో ముందున్నామన్నారు. అందుకే పోలైన ఓట్లలో సగానికి పైగా తనకు దక్కాయని, ప్రజలు తనవెంటే ఉన్నారనేందుకు ఇంతకంటే నిదర్శనం అవసరం లేదన్నారు. తనను ఓడించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పెద్దలు, నిధులు వచ్చినా ప్రజలు వాటిని పట్టించుకోకపోవడం రాజకీయ చైతన్యానికి మారుపేరైన ఖమ్మం ప్రజలకే దక్కిందన్నారు. దాదాపు రెండునెలల పాటు తనతో పాటు కష్టపడిన కార్పొరేటర్లు, నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో తనను ఓడించేందుకు కొందరు ఉద్యోగులతో పాటు కొందరు రాజకీయ పార్టీల నేతలు ప్రయత్నించారని, వారు ఇకనైనా ప్రజాభిప్రాయాన్ని గౌరవించి మారాలని హితవు పలికారు. కాగా ఖమ్మం జిల్లాలో టిఆర్‌ఎస్ పార్టీ తరపున తానొక్కడినే గెలిచినప్పటికీ అధినేత కెసిఆర్ ఏ బాధ్యతను అప్పగించినా పనిచేస్తానని, యువ నాయకుడు కెటిఆర్‌కు రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం కొత్త విధానాలను ప్రవేశపెడుతున్నామనేందుకు నిదర్శమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొందరు నేతలు ఖమ్మంలోనే మకాంవేసి తనను ఓడించేందుకు ప్రయత్నించారని, అదే సమయంలో తన కుటుంబీకులతో పాటు స్నేహితులు, మద్దతుదారుల సహకారంతో వారికి గుణపాఠం చెప్పగలిగామన్నారు. ప్రచార సమయంలో తాను అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ప్రజలు అనేక సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని, ముందు వాటిని పరిష్కరించి తాను ప్రజలతోనే ఉంటానని నిరూపించుకుంటానన్నారు. అనంతరం నగరానికి చెందిన పలువురు ప్రముఖులు అజయ్‌కుమార్‌కు శుభాకాంక్షలు తెలపగా, బాణాసంచా పేల్చి సంబురాలు జరుపుకున్నారు.

టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ నియామకంతో గూడెంలో సంబరాలు

0
0

కొత్తగూడెం, డిసెంబర్ 14: తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వహణ అధ్యక్షునిగా కల్వకుంట్ల తారక రామారావును అధిష్టానం నియమించటంతో శుక్రవారం కొత్తగూడెంలో గులాబీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. ఖమ్మం పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో, మాజీ శాసనసభ్యుడు జలగం వెంకటరావు క్యాంపు కార్యాలయంలో టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు ఊకంటి గోపాలరావు వర్గం నాయకులు వేర్వేరుగా సంబరాలు జరుపుకున్నారు. కొత్తగూడెంలోని మాజీ శాసనసభ్యుడు జలగం వెంకటరావు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో టీఆర్‌ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు కంచర్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కేటీఆర్ తీవ్రంగా శ్రమించారని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం కీలక దశకు చేరుకున్న క్రమంలో అమెరికాలో ఉన్నత ఉద్యోగాన్ని వదిలి ఉద్యమంలో తారక రామారావు పనిచేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మంత్రిగా, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రపంచానికి చాటారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాలను గుర్తించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కేటీఆర్‌కు అవార్డులు లభించాయని అన్నారు. తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటిన కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న గ్రామ పంచాయతీ, జడ్పీటిసి, ఎంపిటిసి, కోఆపరేటివ్ ఎన్నికల్లో సైతం టీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు కేటీఆర్ నాయకత్వంలో కార్యకర్తలు సమష్టిగా శ్రమించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహణ అధ్యక్షునిగా ఎంపిక చేసిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు, కేటీఆర్‌కు అభినందనలు తెలిపారు. కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధిలో జలగం పాత్ర కీలకమైనదని అన్నారు. అనంతరం మున్సిపల్ చైర్‌పర్సన్ పులి గీత కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు బానోతు కేస్లీ, కోఆపరేటివ్ చైర్మన్ మండే వీర హనుమంతరావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హరిలాల్, టిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షురాలు లక్ష్మీబాయి, మున్సిపల్ కౌన్సిలర్లు మోరె భాస్కర్, ధర్మరాజు, మామిడి శ్రీనివాస్, నర్శింహ, యూసుఫ్, టిఆర్‌ఎస్ నాయకులు గొల్ల శ్రీను, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఖమ్మం పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో కేటీఆర్‌ను కార్యనిర్వాహణ అధ్యక్షునిగా నియమించినందుకు సంబరాలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులు కొదమసింహం పాండురంగాచారి, లక్కినేని వెంకట సాయికృష్ణ, దాసిరెడ్డి వెంగళ కృష్ణప్రసాద్, కందుల సుధాకర్‌రెడ్డి, సరిత, సంగీత, శిరీష, రమేష్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక నర్సెస్ క్వార్టర్స్‌లో గోపాలరావు ఇంటి వద్ద టిఆర్‌ఎస్ కార్యకర్తలు బాణాసంచాలు పేల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సోమిరెడ్డి, కుదురుపాక రాజేంద్ర ప్రసాద్, బందెల విజయేందర్, తాండ్ర నాగబాబు, సుధాకర్‌రెడ్డి, కలకోట శేఖర్‌బాబు, కాసాని రమేష్, రావూరి వీరభద్రం, సతీష్, అజయ్, జల్లి కిరణ్, నర్సయ్య, రాము, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

వైరాలో గెలిచిన ఎమ్మెల్యేల రూటే సపరేటు
కారేపల్లి, డిసెంబర్ 14: ఖమ్మం జిల్లాలోని నియోజకవర్గంలో వైరా శాసనసభ స్థానంలో గెలిచిన ఎమ్మెల్యేల రూటే సపరేటుగా ఉంటుంది. తెలంగాణా రాష్ట్రం అంతా ఒకెత్తు అయితే ఖమ్మం జిల్లా ఒకెత్తు అందునా వైరా నియోజకవర్గం నుండి గెలిచినవారు మరింత దూకుడుగా ప్రవర్తించారు. జిల్లా అంతా కారు జోరు తగ్గి మహాకూటమి అభ్యర్థులు గెలుపొందగా వైరా నియోజకవర్గంలో మాత్రం స్వతంత్ర అభ్యర్థికి పట్టం కట్టడం విశేషం. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఎక్కడా లేని ప్రాధాన్యత ఈ నియోజకవర్గానికి ఉంది. అదేమంటే ఇక్కడ గెలిచిన అభ్యర్థులు ఎవ్వరూ తాము గెలిచిన చోట ఉండరు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలోకి జంప్ తప్పనిసరిగా ఇప్పటి వరకు గెలిచినవారు చెప్పుకొచ్చారు. గతాన్ని పరిశీలిస్తే వైరా శాసనసభా నియోజకవర్గానికి తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో సీపీఐ నుండి గెలుపొందిన బానోత్ చంద్రావతి గెలిచిన కొన్నినాళ్ళకే అధికారంలో ఉన్న కారు పార్టీలో చేరిపోయింది. రెండవసారి వైఎస్‌ఆర్‌సీపీ నుండి గెలిచిన మదన్‌లాల్ తన వెంట ఉండి అన్నీ తానై చూసుకున్న పొంగులేటి కంటే ముందే కారులోకి జంప్ చేశారు. తాజాగా మూడవసారి జరిగిన ఎన్నికల్లో గెలిచిన స్వతంత్ర అభ్యర్థి లావుడ్యా రాములునాయక్ సైతం తనేమి తక్కువ తినలేదని, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా శనివారం కెసిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. జిల్లా ఖమ్మం స్థానంలో గెలిచిన కారు పార్టీకి స్వతంత్ర ఎమ్మెల్యే చేరికతో బలం రెండుగా మారనుంది. ఏది ఏమైనా వైరా శాసనసభ స్థానంలో ఎవ్వరు గెలిచినా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేగా మారిపోవడం ఖాయంగా కనిపిస్తుంది.
ముగిసిన బీసీ ఓటర్ల గుర్తింపు గ్రామసభలు
తిరుమలాయపాలెం, డిసెంబర్ 14: మండలంలోని వివిధ గ్రామాలలో బిసి ఓటర్ల గుర్తింపు గ్రామసభలు శుక్రవారంతో ముగిసాయి. ఓటర్ల జాబితాలోని ఓటర్లను గుర్తించేందుకు గ్రామసభలు నిర్వహించారు. ఈగ్రామసభల్లో ఎలాంటి అభ్యంతరాలను వ్యక్తం చేయలేదు. ఈగ్రామసభలు బచ్చోడుతండా, బచ్చోడు, జూపెడ, రఘునాధపాలెం, పైనంపల్లి, తాళ్ళచెరువు, తిమ్మక్కపేట తదితర గ్రామాలలో నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ బి జయరామ్, ఎంపిడిఓ కార్యాలయం పర్యవేక్షకులు నాసర్ అహ్మద్, ఇఓపిఆర్‌డి డి రాజేశ్వరి, పంచాయతీ కార్యదర్శులు బాణోతు బాలాజీ, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రాతినిధ్యం కోల్పోయన తుమ్మల, జలగం

0
0

దమ్మపేట, డిసెంబర్ 14: ఐదు దశాబ్దాల ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో జలగం, తుమ్మల కుటుంబీకులకు ప్రాతినిధ్యం లేకుండాపోయింది. జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీలో ఖమ్మం నుండి గెలుపొందిన ఏకైక నేత పువ్వాడ అజయ్‌కుమార్ చుట్టూ జిల్లా రాజకీయాలు తిరిగే పరిస్థితులు నెలకొన్నాయి. జలగం కుటుంబానికి జిల్లాలో ఘనమైన చరిత్రే వుంది. జలగం వెంగళరావు జిల్లాపరిషత్ చైర్మన్‌గా, శాసనసభ్యునిగా, హోంమంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా జిల్లా రాజకీయాలను శాసించారు. ఆయన సోదరుడు కొండలరావు ఖమ్మం నుండి రెండుసార్లు ఎంపిగా, జిల్లా పరిషత్ చైర్మన్‌గా సేవలందించారు. వెంగళరావుపెద్దకుమారుడు ప్రసాదరావు సెంట్రల్ బ్యాంకు చైర్మన్ గాను, పంచాయితీరాజ్ శాఖా మంత్రి గా పనిచేసారు. చిన్నకుమారుడు వెంకట్రావు సత్తుపల్లి, కొత్తగూడెం నుండి రెండుసార్లు శాసనసభ్యునిగా సేవలందించారు. ఖమ్మం జిల్లా అంటే జలగం జిల్లా, జలగం అంటే ఖమ్మం అన్నంతగా జలగం కుటుంబం ప్రభావితం చేసింది. జలగం కుటుంబానికి వ్యతిరేకంగా రాజకీయాల్లోకొచ్చిన తుమ్మల నాగేశ్వరరావు సత్తుపల్లి నుండి శాసనసభ్యునిగా ఎన్నికై తెలుగుదేశం ప్రభుత్వంలో కీలక శాఖల మంత్రిగా సేవలందించి జిల్లా అంతటా తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సత్తుపల్లి కేంద్రంగా రాజకీయాలు నెరిపిన జలగం - తుమ్మల కుటుంబాలు ఢీ అంటే ఢీ అనే రీతిలో రాజకీయాలను చేశారు. నియోజక వర్గాల పునర్విభజనతో సత్తుపల్లిని వీడినా వీరి మధ్య ఆధిపత్య పోరు ఆగలేదు. ఖమ్మం నుండి జలగం వెంకట్రావుతో పోటీపడి తుమ్మల విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో తుమ్మల ఖమ్మం నుండి పరాజయం పాలవగా టిఆర్‌ఎస్ తరుపున పొటీ చేసిన వెంకట్రావు కొత్తగూడెం నుండి శాసనసభ్యునిగా ఎంపికయ్యారు. ఓటమి పాలయిన తుమ్మలను పార్టీలోకి ఆహ్వనించి ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రి పదవి కట్టబెట్టారు. ఒకేవరలో రెండుకత్తులు ఇముడుతాయా అని ఆశ్శర్యం వెళ్ళబుచ్చిన రాజకీయపండితుల అంచనాలను తలకిందులు చేస్తూ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఇద్దరు కలిసి పనిచేసారు. వీరికి తోడుగా జలగం ప్రసాదరావు టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఇటీవలి ఎన్నికల్లో ఇద్దరు ఓటమిపాలవడం జలగం, తుమ్మల వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. తిరిగి తుమ్మలకు మంత్రి పదవి దక్కుతుందని తుమ్మల వర్గీయులు, ఒకదఫా ఆ ప్రయోగం విఫలం అయినందున వెంకట్రావుకు మంత్రి పదవి దక్కుతుందని జలగం వర్గీయులు నమ్మకంతో ఉన్నారు. ఓటమిపాలయిన వారికి కేబినెట్‌లో స్థానం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేయడంతో జలగం, తుమ్మల వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఖమ్మం నుండి గెలుపొందిన పువ్వాడ అమాత్యపదవిపై ఆశలు పెట్టుకున్నారు. కమ్యూనిస్ట్ నేతగా పువ్వాడ నాగేశ్వరావు జిల్లా రాజకీయాలకు సుపరిచితులు కావడం తండ్రి నుండి రాజకీయ ఓనమాలు దిద్దుకుని గతంలో కాంగ్రెస్‌నుండి, ఇటీవల ఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్ నుండి రెండవ దఫా శాసనసభ్యునిగా ఎంపికైన పువ్వాడ అజయ్‌కు మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తుమ్మల, జలగంలను కాదని పువ్వాడకే మంత్రి పదవి కట్టబెడితే ఐదు దశాబ్దాల జలగం తుమ్మల శకం ముగిసినట్లేనని రాజకీయ విశే్లషకలు అభిప్రాయపడుతున్నారు.

పార్టీల పోస్టుమార్టం
* కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతారని ప్రచారం
* ఖండించిన కాంగ్రెస్ నేతలు
* రాష్టవ్య్రాప్తంగా ఖమ్మంపైనే చర్చ
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, డిసెంబర్ 14: ఎన్నికల్లో గెలుపోటములపై అన్ని రాజకీయ పార్టీలు పోస్టుమార్టం ప్రారంభించాయి. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దారుణంగా ఓడిపోయిన టీఆర్‌ఎస్ నేతలు అందుకు గల కారణాలను విశే్లషిస్తున్నారు. పలుచోట్ల గెలుస్తామనే ధీమా ఉన్నప్పటికీ నాయకుల మధ్య సమన్వయ లోపం, పార్టీలోని కొందరు నేతలు వ్యతిరేకంగా చేయడం వల్లే ఓడిపోయారనే ప్రచారం విస్తృతంగా జరుగుతున్న నేపథ్యంలో పోస్టుమార్టం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది స్థానాలు ఉండగా ఆరుచోట్ల కాంగ్రెస్, రెండుచోట్ల టీడీపీ, ఒకచోట టీఆర్‌ఎస్, ఒకచోట స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. టిఆర్‌ఎస్ ఖచ్చితంగా గెలుస్తుందనుకున్న పాలేరు స్థానంలో ఓటమిని ఇంకా ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సాధారణమే అయినా పాలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన తుమ్మల లాంటి నేత ఓటమి పాలవ్వడం ఆ పార్టీ నేతలను మరింత కుంగతీస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నేతలు ఓడిపోవడానికి ప్రయత్నించిన నేతలను పార్టీ నుంచి పంపేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో ఒకరిద్దరు పెద్దనేతలు కూడా ఉన్నారని తెలుస్తున్నది. ఇదే క్రమంలో ఐదు దశాబ్దాల కాలంలో జలగం, తుమ్మల కుటుంబీకులు లేకుండా రాజకీయాలు లేని పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మంత్రి మండలిలో వీరిద్దరికే ప్రాధాన్యతనిస్తారని ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉండగా ఖమ్మం జిల్లాలో టిఆర్‌ఎస్ దారుణంగా ఓడిపోవడం, రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో జిల్లాలో గెలిచిన పలువురు శాసన సభ్యులు టిఆర్‌ఎస్ బాట పట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. వైరా నియోజకవర్గంలో గెలిచిన స్వతంత్ర అభ్యర్థి లావుడ్యా రాములునాయక్ ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌ను కలిశారు. ఇదే వరుసలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పాలేరు కొత్తగూడెం, ఇల్లెందు ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రచారం జరుగుతుండగా తాము పార్టీ మారే ప్రశే్న లేదని, కొందరు టిఆర్‌ఎస్ నేతలు కావాలని తమపై దుష్ప్రచారం చేస్తున్నారని సదరు శాసన సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము కాంగ్రెస్ పార్టీలోనే ఉంటామని, తాము చెప్పకుండా తామే చెప్పినట్లుగా ప్రచారం చేయడం దారుణమన్నారు. ఇదే క్రమంలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలుచుకున్న రెండు స్థానాలు ఖమ్మం జిల్లాలోనే ఉండటం, ఆ స్థానాల శాసన సభ్యులు కూడా కొన్ని రాజకీయ పరమైన కారణాలతో టిఆర్‌ఎస్ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో రాష్టవ్య్రాప్తంగా ఖమ్మం జిల్లాపైనే సుదీర్ఘచర్చ జరుగుతుండటం విశేషం.

సహకార పోరుకు సన్నద్ధం
* సహకారశాఖ షెడ్యూల్ విడుదల
* 74 సంఘాలలో 1.65లక్షల ఓటర్లు
ఖమ్మం(మామిళ్ళగూడెం), డిసెంబర్ 14: సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వెంటనే వరుస ఎన్నికలకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. పంచాయతీ ఎన్నికలను జనవరి 10లోపు నిర్వహించాలని సర్కార్ భావించగా అదే తరుణంలో ఫిబ్రవరిలోపు సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(్ఫ్యక్స్)కు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్)లకు, జిల్లా సహకార కేంద్రబ్యాంకు(డిసిసిబి)ల ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు పూర్తయిన వెంటనే సాధ్యమైనంత వరకు ఫిబ్రవరి 15లోపు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2013లో ఫిబ్రవరిలో సహకార సంఘాలకు అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించారు. ఆనాటి పాలక వర్గాల ఐదేండ్ల పదివీకాలం గత ఫిబ్రవరి మొదటి వారంలో ముగిసింది. సహకార చట్టం ప్రకారం పాత పాలక వర్గాలనే పర్సన్ ఇంచార్జిగా(పీఐసీ)గా నియమిస్తూ ఆరునెలల పాటు పదవీకాలాన్ని పొడిగిస్తూ సహకారశాఖ ఆదేశాలు జారీచేసింది. ఆ గడువుకాస్తా ఆగస్టులో ముగియగానే మరో 6 నెలల పాటు పొడిగించింది. ఈ గడువు వచ్చే ఫిబ్రవరి మొదటివారంలో ముగియనుంది. ఈలోపు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సహకారశాఖ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఖమ్మం జిల్లాలో మొత్తం 76 ప్రాథమిక సహకార పరపతి సంఘాలున్నాయి. వీటిలో 74 సంఘాలు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలో ఉండగా ఒకటి ఆంద్రాబ్యాంకు మరొకటి ఎఎస్పీఐ పరిధిలో ఉన్నాయి. ఈ సంఘాల పరిధిలో 1,65,369మంది ఓటర్లు ఉన్నారు. సహకార సంఘాల ఎన్నికలకు ఈ ఏడాది నూతన విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఓటర్ల జాబితాలో ఓటరు పేరుతో సహా ఓటరు ఫొటోను ముద్రించనున్నారు. ఈ జాబితా సహకార చట్టం నియమనిబంధలకు లోబడి ఉంటుంది. 2017 మార్చి 31నుండి 2018 మార్చి 31లోపు ఓటరుగా నమోదై సంవత్సరకాలం పూర్తయినవారికే సభ్యత్వం ఇవ్వనున్నారు. సభ్యత్వ వాటాధనంగా 300 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. సహకార సంఘాల ఎన్నికల్లో పోటీ చేయదలచినవారు సహకార సంఘంలో, బ్యాంకులలో డిఫాల్టర్ అయి ఉండరాదు. పాలకవర్గంలో సహకార చట్టాల్లో శిక్ష పడి ఉండకూడదు. ప్రభుత్వం సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించడంతో జిల్లా సహకారశాఖ అధికారి ఝంకీలాల్ సిబ్బందితో శాఖాపరమైన అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సహకారశాఖ విడుదలచేసిన షెడ్యూల్‌ను వెల్లడించారు. ఈ నెల 14నుండి 20వ తేది వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాల ఆహ్వానం, 21న అభ్యంతరాల పరిశీలన, 22న ఓటర్ల తుదిజాబితా విడుదల చేయనున్నారు. ఈ జాబితాను 23వ తేదిన సహకార రిజిష్ట్రార్ అనుమతికి పంపుతారు. 24 నుండి 27వ తేది వరకు తుది జాబితాపై అభ్యంతరాలను రిజిష్ట్రార్ స్వీకరిస్తారు. 28న సహకారశాఖ రిజిష్ట్రార్ ఓటరు జాబితాకు అనుమతిస్తారు. 30వ తేదిన తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు.

Viewing all 69482 articles
Browse latest View live