Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

కేటీఆర్ నాయకత్వాన్ని స్వాగతిస్తూ తెరాస శ్రేణుల సంబరాలు

$
0
0

నిజామాబాద్, డిసెంబర్ 14: యువనేత కే.తారకరామారావుకు తెరాస రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించడం పట్ల ఆ పార్టీ శ్రేణులు హర్షాతిరేకాలు వెలిబుచ్చుతూ సంబరాలు జరుపుకున్నారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఏకపక్షంగా విజయాన్ని నమోదు చేసిన జోష్‌లో ఉన్న గులాబీ దండు, కేటీఆర్‌కు కొత్తగా పార్టీ నిర్వహణ బాధ్యతలు కట్టబెట్టడంతో ఎక్కడికక్కడ బాణాసంచా పేలుస్తూ, మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. బాన్సువాడ తదితర చోట్ల కేసీఆర్, కేటీఆర్‌ల చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వహించారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు జాతీయ రాజకీయాలపై దృష్టిని కేంద్రీకరించనున్న నేపథ్యంలో, రాష్ట్రంలో పార్టీ సారథ్య బాధ్యతలను కేటీఆర్ చక్కబెట్టనున్నారని స్పష్టమవుతోంది. దీంతో తెరాస శ్రేణులు ఆయన నాయకత్వం పట్ల ఎనలేని నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నారు. కార్యనిర్వాహక అధ్యక్ష పదవికి కేటీఆర్ అన్ని విధాలుగా సమర్ధులని తెరాస జిల్లా పార్టీ అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే కేటీఆర్ జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో పాటు ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ తన నాయకత్వ పటిమను నిరూపించుకున్నారని, అన్ని వ్యవహారాలను చక్కబెడుతూ పార్టీ నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించే సత్తా తనకు ఉందని చాటుకున్నారని అన్నారు. కేటీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ మరింత ముందుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా, కేటీఆర్‌కు కీలక పదవి దక్కడం పట్ల ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు నాయకుల్లో ఎనలేని హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనతో ఈ ప్రాంత పలువురు ఎమ్మెల్యేలకు మంచి సాన్నిహిత్యం ఉండగా, కేటీఆర్ చొరవతో కీలక పదవులను దక్కించుకునే అవకాశం లభించిందని ఉవ్విళ్లూరుతున్నారు.

ఓటరు లిస్ట్‌ను సిద్ధంగా ఉంచుకోవాలి
- రాష్ట్ర ఎన్నికల కమిషన్ సెక్రటరీ అశోక్‌కుమార్
కామారెడ్డి, డిసెంబర్ 14: త్వరలో జరుగనున్న గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ఓటరు లిస్ట్‌ను సిద్దంగా ఉంచుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ సెక్రటరీ అశోక్‌కుమార్ అన్నారు. ఆయన శుక్రవారం జిల్లా పంచాయతీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, రిటర్నింగ్ అధికారి స్టేజ్ -1, స్టేజ్-2, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు పంచాయితీ ఎన్నికల శిక్షణను ఎన్నిసార్లు ఇచ్చారో వివరాలు ఆడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఓటరు లిస్ట్‌ను పూర్తిగా సిద్దంగా ఉంచుకోవాలని సూచించారు. పంచాయితీ ఎన్నికల ఏర్పాట్లకు కార్యాచరణ రూపోందించాలని ఆదేశించారు. పోలింగ్‌కు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు, పేపర్ సీల్స్, మిగతా సామాగ్రిని సరిపడినంత ఉంచుకోవాలని తెలిపారు. పోలింగ్ సామాగ్రి అందినదో లేదా అని తెలుసుకున్నారు. పోలింగ్ సిబ్బందికి ప్రణాళిక ప్రకారం శిక్షణను ఇవ్వాలని ఆదేశించారు. ఓటర్ల లిస్ట్‌ను ఆప్‌డేట్ చేసుకోవాలని సూచించారు. మండలాల వారిగా పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని ఆధికారులను ఆదేశించారు. అభ్యంతరకరమైన ఓట్లను ఎలా నిర్ణయించాలో పోలింగ్ సిబ్బందికి శిక్షణలో వివరించాలని సూచించారు. ఆనంతరం జనహిత హాల్‌లోని బ్యాలెట్ బాక్సులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జేసీ యాదిరెడ్డి, ఇంఛార్జీ డీపీవో సాయన్న, ట్రైనీ డీపీవో జయసుధ, ఎంపీడీవో నాగేశ్వర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ
ఇందూర్, డిసెంబర్ 14: పోలీసు శాఖలో విధులు నిర్వర్తించి అనారోగ్యం, వివిధ కారణాలతో మృతి చెందిన సిబ్బంది కుటుంబాలకు సీపీ కార్తికేయ శుక్రవారం డెత్‌ఫండ్ చెక్కులను అందజేశారు. నవీపేట పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తూ ఆగస్టు 26న డి.చంద్రకాంత్ మృతి చెందగా, ఆయన కుమారుడు డి.అరుణ్‌ముమార్‌కు 1,33,200రూపాయల చెక్కు, ఏఆర్‌పీసీ-670 కమ్యూనికేషన్ నందు విధులు నిర్వర్తిస్తూ హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో మృతి చెందిన రవిబాబు సతీమణి శ్రీమతి అమ్మాజీకి 1,32,900రూపాయల చెక్కు, రుద్రూర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తూ అనారోగ్య కారణంగా ఆత్మహత్య చేసుకొని మరణించిన ఎ.గంగాధర్ భార్య లావణ్యకు 1,35,500రూపాయల చెక్కును సీపీ కార్తికేయ చేతుల మీదుగా బాధిత కుటుంబాలకు అందజేశారు. పోలీసు శాఖలో విధులు నిర్వర్తిస్తూ అనుకోకుండా గానీ, ప్రమాదవశాత్తు గానీ మృతి చెందిన కుటుంబాలను ఆదుకునేందుకు వీలుగా ఆ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న సీపీ స్థాయి అధికారి నుండి కానిస్టేబుల్ వరకు సిబ్బంది ఒకరోజు వేతనాన్ని డెత్‌ఫండ్‌కు అందజేస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో పై ముగ్గురు మృత్యువాతపడగా, ఆ కుటుంబాలకు డెత్‌ఫండ్ ఆర్థిక సహాయం చెక్కులను అందజేయడం జరిగిందని పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు షకీల్‌పాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో షకీల్‌పాషాతో పాటు బాధిత కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు.


ప్రజలకు రుణపడి ఉంటా

$
0
0

సుల్తానాబాద్, డిసెంబర్ 14: తనను పెద్ద మనసుతో రెండవసారి ఆశీర్వదించి గెలిపించిన పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని, ఈ విజయం ప్రజల విజయమని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి నుండి భారీగా ద్విచక్ర వాహనాలతో టిఆర్‌ఎస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యేగా ఎన్నికై మొదటిసారి సుల్తానాబాద్ మండలానికి వచ్చిన మనోహర్ రెడ్డికి ప్రజలు, టిఆర్‌ఎస్ శ్రేణులు, మహిళలు పెద్దఎత్తున ఘనస్వాగతం పలికారు. సుల్తానాబాద్‌లోని శాస్ర్తినగర్‌లో గల అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుండి ర్యాలీగా వచ్చి తెలంగాణ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి దాసరి మనోహర్ రెడ్డి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసిఆర్‌పై నమ్మకంతో ప్రజలంతా తనను ఆశీర్వదించారని, నమ్మకాన్ని వమ్ము చేయకుండా పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ, అన్ని రంగాల ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ సేవలు చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు, మున్సిపల్ చైర్మన్ ఎల్.రాజయ్య, ఎంపిపి పారుపెల్లి రాజేశ్వరి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కోట రాంరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బాలాజీ రావు, సింగిల్‌విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ డాక్టర్ అయిల రమేష్, నాయకులు బుర్ర శ్రీనివాస్ గౌడ్, ధీకొండ భూమేష్, పోచంపల్లి పోచమల్లు, అశోక్ రెడ్డి, గాజుల రాజమల్లు, కాంపెల్లి నారాయణ, ఆడెపు అంబదాసు, కోడెం అజయ్, పడాల అజయ్, పాల రామారావు, పారుపెల్లి గుణపతి, మెంగాని చంద్రశేఖర్, పసెడ్ల రవీందర్, కల్వల నారాయణ, గండి శ్రీనివాస్, బండి మల్లిఖార్జున్, సజయ్, ముత్యం రమేష్, ఉస్తెం రమేష్, క్యాదాసి సంజీవ్, గట్టు శ్రీనివాస్, తుమ్మ రాజ్ కుమార్, బొంగాని శ్రీనివాస్ గౌడ్, బైరగోని ప్రభాకర్ గౌడ్, మొల్గూరి అంజయ్య పాల్గొన్నారు.

ఖైదీలు సత్పరివర్తనతో మెలగాలి
విడుదలైన ఖైదీలకు రాష్ట్ర స్థాయిలో జాబ్‌మేళా
జైళ్ళ శాఖ వరంగల్ రేంజ్ డీఐజీ మురళీ బాబు
జగిత్యాల, డిసెంబర్ 14: ఖైదీలు సత్ప్రరివర్తనతో మెలగాలని జైళ్ళ శాఖ వరంగల్ రేంజ్ డిఐజి మురళి బాబు అన్నారు. శుక్రవారం జగిత్యాల సబ్‌జైల్‌ను ఆకస్మీకంగా తనిఖి చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఖైదీలు తయారు చేసిన వస్తువులను ప్రతి మండలంలో విక్రయించేందుకు స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తామని, జగిత్యాల జిల్లాలో ఇప్పటికే 4 స్టాల్స్ ఏర్పాటు చేసామని అన్నారు. ఖైదీల్లో మార్పు తెచ్చెందుకు యోగా,వంటి శిక్షణ తరగతులు ఏర్పాటు చేసామని , వైద్య చికిత్సలు అందిస్తున్నామని వెల్లడించారు. విడుదలైన ఖైదీలకు రాష్టస్త్రాయిలో జాబ్ మేళా నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పెర్కొన్నారు. డిఐజి వెంట కరీంనగర్ జిల్లా డిఎస్‌జివో రతన్, జగిత్యాల సబ్‌జైల్ సూపరిండెంట్ శ్రీనివాస్‌రెడ్డిలు ఉన్నారు.

ప్రజాసంక్షేమానికి పట్టం
-కరీంనగర్ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ
ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, డిసెంబర్ 14: అనునిత్యం ప్రజాసంక్షేమానికోసమే పరితపించిన అధినేత కేసిఆర్‌పై అపారమైన నమ్మకంతోనే తెలంగాణ జనం రెండోసారి తెరాసకు పట్టం కట్టారని కరీంనగర్ జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ అన్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి కేసిఆర్‌ను, కార్యనిర్వాహక అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన కేటిఆర్‌లను కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల బాగుకోసం అనునిత్యం ఆలోచించే అధినేత కేసిఆర్ ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు గమనించి తెలంగాణ జనం రెండోసారి కేసిఆర్ కారు గుర్తుకు ఓటువేసి అఖండ మెజారిటీతో గెలిపించారని అన్నారు. సార్వత్రిక ఎన్నికలలో తిరుగులేని విజయం సాధించిన తెరాస అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును తెలంగాణ భవన్‌లో కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపినట్లు వెల్లడించారు. అనంతరం టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన కేటిఆర్‌కు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపినట్లు వెల్లడించారు. ఇదే స్పూర్తితో మరిన్ని విజయాలను సాధించాలని మనస్పూర్తిగా కోరుతూ కేటిఆర్‌కు ఉమ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసంక్షేమమే లక్ష్యంగా మరింత అంకితభావంతో పనిచేసే విధంగా ప్రజలు అపారమైన నమ్మకాన్ని తెరాసపై ఉంచడంతో రెట్టింపు ఉత్సాహం, బాధ్యతతో పనిచేయాలని అధినేత తెరాస ప్రజాప్రతినిధులను ఆదేశించిన నేపథ్యంలో ప్రజాసంక్షేమం కోసం సైనికుల్లా పనిచేసేందుకు ప్రజాప్రతినిధులందరం ముందుంటామని తుల ఉమ వెల్లడించారు.

ఇది ప్రజల విజయమే
అభివృద్ధే నా ఆశయం
కేటీఆర్‌తో పార్టీ మరింత బలోపేతం
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
జగిత్యాల, డిసెంబర్ 14: నావిజయం ప్రజల విజయమేనని, జగిత్యాల ప్రాంతం అబివృద్దే నాలక్ష్యమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం కౌండిన్య హల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ యువకిశోరం మంత్రి కెటిఆర్ ను టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడింట్‌గా నియమించినందుకు సిఎం కెసిఆర్‌కు దన్యవాదాలు తెలుపుచున్నానని పేర్కొన్నారు. కెటిఆర్‌తో టీఆర్‌ఎస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. కెటిఆర్ సహకారంతో జగిత్యాల నియోజకవర్గంలో15కోట్లతో 4సంవత్సరాల్లో ఉపాధి హమీ ద్వారా సీసీ రోడ్లు, వైకుంఠదామాల నిర్మాణం జరిగాయన్నారు. నియోజకవర్గ అబివృద్ది,వ్యవసాయరంగ అబివృద్దికి కృషి చేస్తానని, త్రాగు నీటి కోసం ఇప్పటికి ఇబ్బందులు పడుతున్న గూడెంలు ఉన్నాయని, మిషన్‌భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు అందిస్తామని అన్నారు. ఎంపి కవిత సహకారంతోపార్టీ బూత్ కమిటీలు వేయడంతో పార్టీ బలోపేతం అవడం జరిగిందని దీంతోనే బారీ మెజార్టీ వచ్చిందని అన్నారు.జగిత్యాల మున్సిపల్ పక్కకు జరిగితేనే అబివృద్ది జరుగుతుందని వెల్లడించారు. ఈసమావేశంలో పట్టణ , మండల, మైనార్టీ అద్యక్షులు గట్టు సతీష్, రౌత్ గంగాదర్, నక్కల రవీందర్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ దేశాయ్, ప్రభాత్ సింగ్, మాజీ కౌన్సిలర్ సమీండ్ల శ్రీనివాస్, జిల్లా టిఆర్‌ఎస్ యూత్ అద్యక్షుడు దావా సురేష్‌తదితరులుపాల్గొన్నారు.

సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే చర్యలు

$
0
0

కరీంనగర్ టౌన్, డిసెంబర్ 14: ప్రజా సంబంధాలు పెంపొందించుకునేందుకు ఉపయోగించుకోవాల్సిన సోషల్ మీడియాను స్వార్ధపూరిత విధానాలకుపయోగిస్తూ, దుర్వినియోగం చేయటం సముచితం కాదని, అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమీషనర్ విబి కమలాసన్‌రెడ్డి హెచ్చరించారు. సమాచారాన్ని వేగంగా చేరవేసేందుకు వేదికగా మాత్రమే వినియోగించుకోవాలని, సమాజంలో వైషమ్యాలు పెంచేలా, శాంతి భద్రతలకు భంగం కలిగించేలా, ఇతరుల వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేలా దుర్వినియోగం చేయటం నేరమని అన్నారు. కల్పిత విషయాలతో, ప్రజల భావోద్వేగాలతో చెలగాటమాడవద్దని, గ్రూపుల్లో ఇలాంటి విషయాలు షేర్ చేస్తే గ్రూప్ అడ్మిన్‌లపై సైబర్ చట్టాల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయటం జరుగుతుందన్నారు. విద్యార్థులు, యువకులపై కేసులు నమోదైతే, భవిష్యత్తులో ఉద్యోగాలకు అనర్హులవుతారని, ఉద్యోగ రీత్యా, ఉన్నత చదువుల కోసం ఇతర ప్రాంతాలు, దేశాలకు వెళ్ళాలనుకునే వారికి పాస్‌పోర్టు, వీసా పొందేందుకు అనర్హులవుతారని ఆయన పేర్కొన్నారు. అనాలోచిత, అవాస్తవమైన విషయాలు నమ్మి కేసుల్లో ఇరుక్కోవద్దని, గ్రూపుల్లో వివిధ వ్యక్తులు షేర్ చేసే విషయాలపై అడ్మిన్‌లు అప్రమత్తంగా ఉండాలని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో సిపి సూచించారు.

మత్సకార్మికుడి గల్లంతు
తిమ్మాపూర్, డిసెంబర్ 14: ఎల్‌ఎండి రిజర్వాయర్‌లో గురువారం వీచిన ఈదురు గాలులకు మండలంలోని అల్గునూర్ గ్రామశివారులోగల చేపల కాలనీకి చెందిన మత్సకార్మికుడు తిప్పరవేణి సత్తయ్య చేపలు పట్టేందుకు వెళ్లి గల్లంతైనంట్లు స్థానిక పోలీసులు తెలిపారు. మండలంలోని చేపల కాలనీకి చెందిన తిప్పరవేణి సత్తయ్య గురువారం ఉదయం చేపలు పట్టేందుకు డ్యామ్‌లోకి వెలుతున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లాడు. సత్తయ్య రాత్రి అయినప్పటికీ ఇంటి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఊరంతా, బంధువుల వద్ద వన్నాడేమోనని తెలుసుకున్నారు. తోటి మత్సకార్మికులను అడిగితే ఈదురు గాలులకు గల్లంతై ఉండవచ్చని, తన తెప్పే మాత్రం అక్కడే ఉంది. తాను వేటకు వెళ్లినప్పుడు తెలుపు రంగు చొక్క, ఎరువు రంగు గీతల లుంగీ, మెడలో ఎరుపు రంగు రుమాలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఎల్‌ఎండి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కరుణాకర్ రావు, ఎస్సై నరేశ్‌రెడ్డిలు తెలిపారు.

ఈసారైనా ఈశ్వర్ మంత్రి అయ్యేనా?
ధర్మపురి, డిసెంబర్ 14: తెరాస సీనియర్ నేత, రాజకీయ విధాన నిర్ణయ కమిటీ సభ్యులు, తాజామాజీ ప్రభుత్వ చీఫ్‌విప్, ధర్మపురి సిట్టింగ్ శాసనసభ్యులు కొప్పుల ఈశ్వర్‌కు ఆసారైనా మంత్రి పదవి దక్కేనా? అన్న చర్చ జరుగుతోంది. జూలపెల్లి మండలం కుమ్మరికుంట గ్రామంలో 1959 ఏప్రిల్ 20న కొప్పుల లింగయ్య, మల్లమ్మ దంపతులకు జన్మించిన ఈశ్వర్ బి.ఏ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. సింగరేణి కార్మిక నాయకుడిగా గుర్తింపు పొంది, మొదటిసారిగా 1994లో మేడారం నియోజకవర్గం నుండి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి స్పల్ప తేడాతో ఓటమి పాలైనారు. తెరాస అధినేత కేసిఆర్ స్వయంగా ఆహ్వానించిన సందర్భంగా తన బాట ఉద్యమ బాటేయని తలంచి, తెలంగాణ రాష్ట్ర సాధనే ద్యేయంగా ఉద్యమాలకు నాయకత్వం వహించి, 2004లో మేడారం నుండి టిఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. కేసిఆర్ సూచనపై ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించి, 2007లో తిరిగి ఉప ఎన్నికలో గెలుపొందారు. మేడారం నియోజకవర్గం కనుమరుగై, తాను ప్రాతినిథ్య, వహించిన గ్రామాలు చేర్చబడిన నూతన ధర్మపురి (ఎస్సీ) నియోజకవర్గం నుండి 2009 ఎన్నికలలో టిఆర్‌ఎస్ పక్షాన పోటీ చేసి, విజయ లక్ష్మిని వరించారు. అలాగే కేసిఆర్ ఆదేశానుసారం మళ్ళీ తన పదవికి రాజీనామా చేసి, 2010లో తిరిగి పోటీ చేసి ఘన విజయాన్ని నమోదు చేసుకున్నారు. 2014 రెండవసాధారణ ఎన్నికలలో తెరాస పక్షాన పోటీచేసి, ధర్మపురి నుండి మూడవ సారి, వరుసగా గెలుపొంది, కేసిఆర్ ప్రదిపాదిత స్పీకర్ పదవికి మొగ్గు చూపక, తర్వాత రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్‌గా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత మూడవ సాధారణ ఎన్నికలలో పోటీ చేసి, ఆరవ సారి జయకేతనం ఎగురవేసి విజయుడై, డబుల్ హ్యాట్రిక్ సాధించి వరుస విజయాలతో రికార్డు నెలకొల్పారు. పార్టీలో సీనియర్‌గా, సౌమ్యునిగా, కేసిఆర్‌కు అత్యంత విశ్వసనీయునిగా, అంతకు మించి వీర విధేయునిగా ఉన్న, అత్యంత విశ్వాస పాతృడైన కొప్పుల ఈశ్వర్‌కు ఈసారి తప్పక మంత్రి పదవి రానున్నదనే చర్చ జోరుగా సాగుతోంది.

నేతన్న విగ్రహంకై భూమి పూజ
చొప్పదండి, డిసెంబర్ 14: పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో ఫౌంటేన్ స్థలంలో శుక్రవారం నేతన్న విగ్రహం ఏర్పాటుకై నేతన్నలు భూమి పూజ నిర్వహించారు. ఈ మేరకు గత కొంత కాలంగా ఫౌంటేన్ కొనసాగక నిర్వీర్యంగా ఉంటుంది. అయితే పట్టణంలో పద్మశాలీలు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో నేతన్న విగ్రహం ఏర్పాటుకై ఇదే స్థలంలో నేతన్న విగ్రహ ఏర్పాటుకై భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ సంఘం అధ్యక్షుడు సామల రాజన్న, గౌరవ అధ్యక్షుడు దండె రాజయ్య, మండల అధ్యక్షుడు గ్యాజంగి రాములు, జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం, జడ్పిటిసి ఇప్పనపల్లి సాంబయ్య, కరీంనగర్ ఎంపిపి వాసాల రమేష్, ఎంపిటిసి ఎలిగేటి తిరుపతి, మాజీ ఎంపిపి వల్లాల క్రిష్ణహరి, గడ్డం వెంకటేశం, ఎన్నం మునీందర్, అనుమల్ల నర్సయ్య, వలస భద్రయ్య పాల్గొన్నారు.

అవినీతి కేసులో మహిళకు జైలుశిక్ష
కరీంనగర్ (లీగల్), డిసెంబర్ 14: రెవెన్యూ విభాగంలో విధులు నిర్వహిస్తున్న నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి తహశీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంటుగా పనిచేస్తున్న స్వర్ణలత లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసులో కరీంనగర్ ప్రత్యేక ఎసీబీ కోర్టు న్యాయమూర్తి భాస్కర్ రావు సంవత్సరం జైలుశిక్ష విధించారు. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం సిద్ధపల్లి గ్రామానికి చెందిన ఉప్పునూతి రాజుగౌడ్ తండ్రి ఆర్టీసిలో డ్రైవర్‌గా పనిచేస్తూ చనిపోయాడు. దీనికి సంబంధించి లీగల్ ఏయిర్ సర్ట్ఫికేట్ కోసం డిచ్‌పల్లి తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. తహశీల్దార్ సూచన మేరకు ఆయా సర్ట్ఫికేట్లు పొందుటకు జూనియర్ అసిస్టెంటుగా ఉన్న స్వర్ణలతను కలువమని కోరారు. తహశీల్దార్ సూచన మేరకు స్వర్ణలతను కలువగా రూ.1500 లంచం ఇస్తేనే ఆయా సర్ట్ఫికేట్స్‌ను మంజూరు చేస్తానని తెలిపింది. ఆయా డబ్బులు ఇవ్వలేని రాజుగౌడ్ నిజామాబాద్ ఎసీబీ అధికారులను 10.8.2007న సంప్రదించాడు. దీంతో ఎసీబీ అధికారులు పథకం ప్రకారం స్వర్ణలత లంచం డబ్బులు తీసుకుంటుండగా ఎసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. తగిన సాక్షాధారాలను పరిశీలించిన కరీంనగర్ ప్రత్యేక ఎసీబీ కోర్టు న్యాయమూర్తి భాస్కర్ రావు నిందితురాలు స్వర్ణలతపై నేరం రుజువు కావడంతో సంవత్సరం కఠిన కారాగారపు జైలుశిక్షతో పాటు ఆరు వేల రూపాయలు జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు వెల్లడించారు.

గతమెంతో ఘనకీర్తి.. నేడేమో అపకీర్తి

$
0
0

కరీంనగర్, డిసెంబర్ 14: వారంతా ఒకప్పుడు తమ ఇలాకాల్లో ఎదురులేని నాయకులు. వారు చెప్పిందే వేదం..వారు చేసిందే పని అన్నట్లుగా రాజకీయ పటాటోపం సాగించారు. వారు లేకుంటే ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పనులు స్థంభించినట్లే.కార్యకర్తలు కూడా వారి మాట వేదవాక్కులా పాటించారు. వారి వారి అసెంబ్లీనియెజకవర్గాల్లో అన్నీ తామై పార్టీని పెంచి పోషించారు. ఎన్నికల్లో అయితే వారు, లేకుంటే వారి అనుచరులను మాత్రమే బరిలో నిలిపి, గెలిపించుకునేవారు. వారంతా పలుమార్లు పోటీ చేసి ఓటమి పాలైనా, ఆతర్వాత జరిగే ఎన్నికల్లో అధిష్టానం తిరిగి వారికే అవకాశం కల్పించేది. అయితే, కాలక్రమేణా పరిస్థితులు తారుమారయ్యాయి. యువరక్తం పార్టీలోకి ప్రవేశిస్తుండగా, వారి చతురత చెల్లాచెదురవుతుండగా, విసిరే పాచికలు పారటం లేదు. రాజకీయంగా సీనియర్లైనా, వయసు మీరుతుండటంతోజాతీయ, రాష్ట్ర నాయకత్వం వీరికి ప్రాధాన్యత తగ్గిస్తూ, గత కొంతకాలంగా ఆయా సెగ్మెంట్లలో యువ నేతలను ప్రోత్సహిస్తోంది. పట్టువదలని విక్రమార్కుల్లా వీరు తమ ప్రాధాన్యతను పెంచుకుంటూ, పార్టీలో, తమ సెగ్మెంట్లలో పూర్వ వైభవం పొందేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. తాజాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం తమకే టికెట్లు కేటాయించాలంటూ రాష్ట్ర నాయకుల నుంచి మొదలు అగ్రనాయకుల వద్దకు వెళ్ళి ధరఖాస్తులు చేసుకున్నారు.అయినా, అధిష్టానం మాత్రం వారి పట్ల సానుకూల ధోరణితో లేకపోవటంతో ఇక తాము విశ్రాంతి తీసుకోకతప్పదేమోననే వైరాగ్యంలోకొట్టుమిట్టాడుతున్నారు. మరి కొద్దిరోజుల్లో తమ రాజకీయ భవితవ్యంపై స్పష్టమైన నిర్ణయం కూడా తీసుకునేందుకు వారి వారి అనుచర గణంతోచర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుండగా, వారిలో ప్రముఖులు పశ్చిమ డివిజన్‌లో పేరు గాంచిన సీనియర్ కాంగ్రెస్ నేత కొమొరెడ్డి రామ్‌లు, మరొకరు రాజకీయ దురంధరుడు, ఎర్రజెండా జోరుకు ఎదురొడ్డి పోరాడిన అపర చాణక్యుడు బొమ్మ వెంకటేశ్వర్లు, ఇంకొకరు సీనియర్ నాయకునిగా కొనసాగుతున్న సుద్దాల దేవయ్య. వీరు ముగ్గురు ప్రతికూల పరిస్థితుల్లో సైతం రాజకీయ పోరాటాల్లో ఎదురీదుతూ, ఆయా సెగ్మెంట్లలో తమ కార్యకర్తలను కాపాడుకుంటూ, పార్టీని ముందుకు నడిపిన రోజులు కోకొల్లలుగా ఉన్నాయి. 1983లో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కొమొరెడ్డి రామ్‌లు 1985లోసంజయ్ విచార్ మంచ్ నుంచి మెట్‌పల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా, 1994లో కాంగ్రెస్ పార్టీనుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2004లో జనతా పార్టీ నుంచి గెలుపొంది, తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం 2014లో కూడా మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోగా, ఈసారి కూడా బరిలోకి దిగేందుకు చివరి వరకు యత్నించినా, టికెట్ లభించలేదు. ఇందుర్తిఅసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన బొమ్మ వెంకటేశ్వర్ అనంతర కాలంలో కాంగ్రెస్‌లో చేరారు. 1989, 1994లో కాంగ్రెస్ అభ్యర్థిగా రెండు సార్లు పోటీ చేసి ఓడిపోగా, 1999లో మాత్రం బరిలోకి దిగి గెలిచాడు. 2004లో కూడా పోటీ చేసి, పరాజయం పాలయ్యాడు. 2009లోమరోసారి తీవ్ర యత్నాలు చేయగా, ఫలించలేదు. 2014లోవేములవాడ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఈసారి జరిగిన ముందస్తు ఎన్నికల్లో కూడా హుస్నాబాద్ అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు తనవంతు ప్రయత్నాలు చేయగా, ఫలించలేదు. 1985లో రాజకీయాల్లోకి వచ్చిన సుద్దాల దేవయ్య 1994లో నేరెళ్ళ నుంచి అసెంబ్లీ బరిలోకి దిగాడు. గెలిచాడు. అనంతరం 1999లో కూడా నిలిచి, గెలిచాడు. నియోజకవర్గాల పునర్విభజన చొప్పదండి సెగ్మెంట్ నుంచి 2004,2009లోబరిలోకి దిగి గెలిచి, తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. 2014లో కూడా పోటీ చేసినా ఓటమి పాలయ్యాడు. అనంతరం ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మరోసారి టికెట్ కోసం ప్రయత్నం చేసినా, ఫలితం లేకపోవటంతోమిన్నకుండి పోయారు. అయితే, వీరిని ప్రచారంలో కానీ, ఇతరత్రా పార్టీ కార్యక్రమాల్లో కానీ ఉపయోగించుకోవటంలో పార్టీ నాయకత్వం పట్టించుకోలేదు. సేవలందించేందుకు వారు కూడా అంతగా ఆసక్తి కనబర్చటం లేదు. దీంతోవారి రాజకీయ శకం ఇక ముగిసినట్లేనా అనే చర్చ కొద్దిరోజులుగా ఉమ్మడి జిల్లాలో కొనసాగుతుండగా, వారి స్తబ్ధతతోకాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.

తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టి మిల్లులకు తరలించాలి
-జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్‌లాల్

కరీంనగర్, డిసెంబర్ 14: అన్నదాతలు ఆరుగాలం శ్రమించి అనేక కష్టనష్టాలకోర్చి పండించిన పంటలను విక్రయించేందుకు ఐకెపి కేంద్రాలలోకి తీసుకురాగా తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టి రైస్‌మిల్లులకు పంపించాలని జాయింట్ కలెక్టర్ జి.వి.శ్యాం ప్రసాద్‌లాల్ అన్నారు. శుక్రవారం పౌరసరఫరాల శాఖ డిప్యూటి తహశీల్దార్లు, టెక్నికల్ అసిస్టెంట్లు ఇన్‌స్పెక్టర్లతో కరీంనగర్ కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైస్‌మిల్లులకు తీసుకువచ్చిన సిఎంఆర్ బియ్యం నాణ్యతను నిర్ధిష్ట ప్రణాళికలను కలిగి ఉన్న వాటిని మాత్రమే తీసుకోవాలని సూచించారు. బియ్యం నాణ్యత నిర్ధిష్ట ప్రమాణాలు లేని వాటిని ఆంగీకరించవద్దని ఆదేశించారు. ఒకవేళ అంగీకరించినట్లు తెలిస్తే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సరియైన ప్రమాణాలతో రాని బియ్యాన్ని గుర్తించినట్లయితే మిల్లర్లకు వెంటనే తిరస్కరణ నోట్ ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్‌లాల్ సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో ఫౌరసఫరాల శాఖ డిప్యూటి తహశీల్దార్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

నిరుద్యోగులకు 3 నెలలు ఉచిత శిక్షణ

$
0
0

జనగామ టౌన్, డిసెంబర్ 14: నిరుద్యోగులకు మూడు నెలల పాటు వృత్తివిద్య కోర్సులలో శిక్షణ ఇప్పించి వారికి జీవనోపాది మార్గం చూపించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ జిల్లా కో- ఆర్డినేటర్ చింతరవి తెలిపారు. శుక్రవారం ఆయన జనగామలో విలేకరులతో మాట్లాడుతూ శిక్షణకు సంబందించిన వివరాలను తెలియచేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవల్‌ప్‌మెంట్ మిషన్‌చే ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగ యువతి, యువకులకు వృత్తివిద్యలో మూడు నెలల పాటు స్వల్పకాలిక శిక్షణ ఇప్పించనున్నట్లు తెలిపారు. 18సంవత్సరాలు పూర్తయి 35సంవత్సరాలలోపు ఉన్న 10వ తరగతి నుండి ఆ పైన చదివిన వారు తమ పేర్లను నమోదు చేసుకొని శిక్షణ పొందాలని కోరారు. బ్యుటీషియన్, హోటల్ మేనేజ్‌మెంట్, కంప్యూటర్స్ రంగాల్లో మూడు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ పొందిన వారికి స్కిల్ డెవల్‌ప్‌మెంట్ మిషన్‌ద్వారా దృవీకరణ పత్రాలు ఇస్తారని అన్నారు. మూడు నెలల పాటు శిక్షణ పొందే యువతి, యువకులకు హాస్టల్, భోజన వసతి కల్పిస్తామని అన్నారు. అలాగే యునిఫామ్, బుక్స్, సెల్‌ఫోన్ ట్యాబ్‌లు అందచేస్తామని తెలిపారు. ఆసక్తి గల వారు ఈ నెల 20వ తేదీలోగా 8297316451, 8142554665 సెల్ నంబర్లకు డయల్‌చేసి పూర్తి వివరాలు తెలుసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిథి స్వప్న పాల్గొన్నారు.

అడవిలో పొంచి ఉన్న ఆపద
భూపాలపల్లి అడవుల్లో మూగజీవాల విచ్చలవిడి వేట..
తీగలవాగు వెంట 6కి.మీ మేర విద్యుత్ తీగలు
పశువుల కాపరి మృతితో బయటపడుతున్న నిజాలు
చోద్యం చూస్తున్న అటవీశాఖ అధికారులు
భూపాలపల్లి, డిసెంబర్14: భూపాలపల్లి అడువుల్లో ఉన్న మూగ జీవాలు ఆపదలో ఉన్నాయి. వేటగాళ్ళ విద్యుత్ తీగల ఉచ్చుల్లో పడి విలవిలలాడుతున్నాయి. భూపాలపల్లి సమీప అడవులైన బాంబుల గడ్డ, తీగలవాగు వెంట 6 కిలోమీటర్ల మేర అక్రమంగా విద్యుత్ తీగలను ఏర్పాటు చేశా రు. వాగు వెంట ఉన్న చెట్లను ఆసరా చేసుకోవడంతో పాటు కొన్ని చోట్ల కర్రలను పాతి 11 కేవీ లైన్ ద్వారా జంతువులకు విద్యుత్ షాక్ తగిలేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంతో కాలం గా అడవి జంతువులను విచ్చలవిడిగా స్మగ్లర్లు వేటాడుతు న్నా అటివి శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. భూపాలపల్లి ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి అటవీ సిబ్బందిని మచ్చిక చేసుకొని విచక్షణరహితంగా జంతువులను వేటాడుతున్నారు. వాగు వెంట నీరు తాగేందుకు వచ్చే అడివిపందులు, అడవి దున్నలు కుందేళ్ళు విద్యుత్ తీగలు తగిలి మృత్యు వాత పడుతున్నా యి. జంతవులతో పాటు తాజాగా భూపాలపల్లి మండలం గడ్డిగానిపల్లి గ్రామానికి చెందిన పశువుల కాపరి దుర్గం అంకయ్య వేటగాళ్ళు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలకు తగిలి అకారణంగా మృత్యు వాత పడ్డాడు. అడవిలోకి వెళ్ళే పశువుల కాపర్లు గొర్లకాపర్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అడవిలో తిరగాల్సి వస్తుంది. అంకయ్య మృతితో వేటగాళ్ళ వ్యవహారం బయటపడింది.ఏళ్ళ తరబడి జంతువుల వేట కొనసాగుతున్నా అటవీ శాఖ అధికారులు మామూళ్ళ మత్తులు తూగుతున్నారు. మూగ జీవాలతో పాటు మనుషుల ప్రాణాలను తీస్తున్న వేటగాళ్ళపై చర్యలు తీసుకోవాలని రైతులు, జంతు ప్రేమికులు కోరుతున్నారు.

కార్యకర్తల జోలికొస్తే ఊరుకునేది లేదు
* కాంగ్రెస్ నియోజకవర్గ కన్వీనర్ రవీందర్‌రావు
నర్సంపేట, డిసెంబర్ 14: నర్సంపేటలో గెలిచామని టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ శ్రేణులపై భౌతికదాడులకు దిగుతున్నారని, తక్షణమే దాడులకు స్వస్తి పలకకపోతే తగిన బుద్ది చెబుతామని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తక్కళ్లపల్లి రవీందర్‌రావు హెచ్చరించారు. ఖానాపురం మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రవీందర్‌రావు మాట్లాడారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసి ఓట్లు దండుకున్నారని, అయితే గెలిచామనే అహంకారంతో కొన్ని గ్రామాలలో దాడులకు దిగడం సరి కాదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సత్తానా చాటి చెపుతామని స్పష్టం చేశారు. రాజకీయాలలో గెలుపు ఓటములను కాంగ్రెస్ పార్టీ సహజంగానే స్వీకరిస్తుందని, ఓటమికి గల కారణాలను అధ్యయనం చేసి, రాబోయే రోజులలో టీఆర్‌ఎస్ ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వానికి కోరుతుందని చెప్పారు. ఓటమితో కాంగ్రెస్ శ్రేణులంతా కుంగిపోవద్దని, పార్టీలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాల్సిందిగా కోరారు. ఈవిలేఖరుల సమావేశంలో జడ్పీటీసీ ఎడ్ల జగన్మోహన్‌రెడ్డి, శాఖమూరి హరిబాబు, వీరమనేని సాగర్, తక్కళ్లపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

పాలకుర్తిని సస్యశ్యామలం చేస్తా..
కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటా: ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు
రాయపర్తి, డిసెంబర్ 14: నామీద ఎంతో నమ్మకంతో అఖండ మెజార్టీతో గెలిపించిన పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు సేవకుడిలా పనిచేస్తూ ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటానని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శుక్రవారం ఎన్నికలలో గెలిచి మొదటిసారిగా విచ్చేసిన దయాకర్‌రావుకు ప్రజలు, కార్యకర్తలు భారీ సంఖ్య లో నిరాజనాలు పలుకుతూ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ ప్రజలు ముఖ్యమంత్రి కేసీ ఆర్‌పై నమ్మకంతో, నాపై ఉన్న మమకారంతో అఖండ మెజార్టీతో నన్ను గెలిపించిన కార్యకర్తలు, ప్రజలందరికి రుణపడి ఉంటానని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అవ్వగానే గోదావరి జలాలను తీసుకువచ్చి పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోని చెరువులన్నిటిని నింపి చెరువులు మత్తడి పడేలా చేస్తానని ఆయన అన్నా రు. ముఖ్యమంత్రి కేసీఆర్ అండదండలతో నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలోనే మొదటి స్ధానంలో ఉంచుతానని అన్నారు. కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలే తెరాసను భారీ మెజార్టీతో అధికారంలోకి రావడం జరిగిందన్నారు. మూడు దశబ్ధాలుగా పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు నాకు వెన్నంటే ఉండి నన్ను బలపరుస్తున్నారని వారికి ఎప్పుడు నేను రుణపడి ఉంటానని అన్నారు. కార్యకర్తలు గెలిచామని గర్వం ఉండకుండా గ్రామాలలో అభివృద్ధి పనులను చేయాలని అన్నారు. ప్రభు త్వం ప్రవేశపెడుతున్న ప్రతి సంక్షేమ పథకాలను పారదర్శకంగా లబ్దిదారులకు అందేలా కార్యకర్తలు చొరువ చూపాలని అన్నారు. నాపై మమకారంతో గత 30 సంవత్సరాలుగా అదరిస్తున్న రాయపర్తి మండల ప్రజలను ఏనాడు మరిచిపోనని, ఇది నా సొంత మండలంగా భావిస్తున్నానని అన్నారు. యువతకు పెద్దపీట వేసి, యువకులలోని సృజనాత్మకతను గుర్తించి వారికి కంపెనీలలో ఉద్యోగం వచ్చేలా చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మం డల నాయకులు ఎంపీపీ విజయ, జెడ్పీటీసీ వంగాల యాకమ్మ, నాయకులు అనీమిరెడ్డి, గోపాల్‌రావు, నర్సింహానాయక్, సురేందర్‌రావు పాల్గొన్నారు.

అడిగిన ప్రతి అన్నదాతకు విద్యుత్ పంప్‌సెట్

$
0
0

నర్సంపేట, డిసెంబర్ 14: నర్సంపే ట నియోజకవర్గ అభివృద్ధే తన ధ్యేయమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు. నర్సంపేటలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడారు. నర్సంపేట అభివృద్ది గత 18 ఏళ్లుగా వెనక్కి నెట్టివేయబడిందని అన్నారు. నర్సంపేటలో గెలిచిన శాసనసభ్యుడు ఒకరు ఉంటే రాష్ట్రంలో అధికారంలో మరో పార్టీకి చెందిన ప్రభుత్వం ఉండేదని చెప్పారు. అయితే ఈసారి ప్రజలు విస్పష్టంగా తీర్పు ఇచ్చారని, రాజకీయాలకతీతంగా అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని వెల్లడించారు. గత ఎన్నికల ముందు అనేక పథకాలకు సంబంధించిన జీఓలను తీసుకవచ్చి, నిధుల ను సైతం మంజూరు చేయించానని, కొంత మంది అభివృద్ది నిరోధకుల వల్ల ఆపనులు నిలిచిపోయాయని అన్నారు. నియోజకవర్గంలోని లక్షా నలబై వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు తగిన ప్రణాళికలు సిద్దం చేసినట్లు తెలిపారు. పాఖాల, రంగయ్య చెరువు ప్రాజెక్టులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. మరికొద్ది రోజులలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రానుందని, స్థానికంలో తెరాస విజయం ఏకపక్షంగా వచ్చేలా పార్టీ శ్రేణులు సమన్వయంతో కృషి చేయాలని కోరారు. ఈ విలేఖరుల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ నాగెల్లి వెంకటనారాయణగౌడ్, నాయకులు మునిగాల వెంకట్‌రెడ్డి, రాయిడి రవీందర్‌రెడ్డి, లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, కామగోని శ్రీనివాస్, కిషన్, దార్ల రమాదేవి, ఎంవీ.రామారావు, పుట్టపాక కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
* విద్యుత్ పంప్‌సెట్లు పంపిణీ
నర్సంపేట నియోజకవర్గానికి పైలెట్ ప్రాజెక్టు కింద రూ.9 కోట్లు తీసుకవచ్చి, 7 వేల పైచీలుకు విద్యుత్ పంప్‌సెట్లను మంజూరు చేయించానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి వెల్లడించా రు. నర్సంపేటలో శుక్రవారం రైతులకు సబ్సీడీ మోటార్లను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పంపిణీ చేశారు. ఈసందర్భం గా పెద్ది మాట్లాడుతూ తన చేతుల మీదుగా రైతులకు యాబై శాతం సబ్సీ డీ మోటార్లను పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. అడిగిన ప్రతి రైతుకు సబ్సీడీ మోటార్లను అందజేస్తామని, తొలి ప్రాధాన్యతలో దళిత, గిరిజన రైతులకు ఇవ్వనున్నట్లు చెప్పా రు. ఈకార్యక్రమంలో రైతు సమన్వయ సమితి డైరెక్టర్ రాయిడి రవీందర్‌రెడ్డి, వ్యవసాయ శాఖ జేడీఏ ఉషాదయళ్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, ఏడీఏ శ్రీనివాసరావు, మార్కె ట్ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.

సామాజిక మాద్యమాలతో జరభద్రం
వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ పిలుపు
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, డిసెంబర్ 14: ప్రస్తుతం అందుబాటులో ఉన్న సామాజిక మాధ్యమాల వినియోగంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉం టుందని వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తం గా ఉన్న సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోవడంతో పాటు ఇతరులతో పంచుకోవడం కోసం రూపొందించిన మాధ్యమాల వినియోగం పట్ల ప్రజల ను అప్రమత్తం చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సోమవారం ప్రకట న విడుదల చేశారు. ముఖ్యంగా మహళలు, యువతలు, విద్యార్ధునిలను వేధింపులకు గురిచేయడమే తమ లక్ష్యంగా నేరగాళ్లు తమ కార్యకలపాలను కోనసాగిస్తున్నారు. ఇలాంటి సైబ ర్ నేరగాళ్ల బారిన పడకుండా ప్రజల ను అప్రమత్తం చేయడంతో పాటు వారి కార్యకలపాలను నియంత్రణ, నింధితులను గుర్తించి వారిని అరెస్ట్ చేయడంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైం విభాగం చాలా చురుకుగా వ్యవహరించడం జరుగుతుందని అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో సామాజిక మాధ్యమాల ద్వారా చట్టవ్యతిరేక కార్యాకలపాలతో పాటు మహిళలను, వ్యాపారస్థులపై వేధింపులకు గురిచేస్తూనట్లుగా నమోదుయిన కేసులోని నిందితులను గుర్తించడంతో పాటు వారిని అరెస్ట్ చేసి జైలుకు సైతం పంపడంతో పాటు, ప్రపంచంలోని ప్రస్తుతం అందుబాటులో ఉన్న 26 వేల రకాల సెల్‌ఫోన్ల తో పాటు ఏ విధమైన హార్డ్‌డిస్క్‌లలో తొలగించిన సమాచారాన్ని పూర్తిగా తిరిగి రాబట్టడం, ధర్యాప్తులో భాగం గా పోలీసులు సేకరించిన సీసీ కెమెరాల దృశ్యల్లో సరిగా కనిపించడని దృష్యాల నుండి కేసు సంబంధించిన స్యాక్ష్యాలను సేకరించడం కోసం ప్రత్యేకమైన అధునిక వ్యవస్థను ఈ సైబర్ విభాగంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 62 కేసులు నమోదు కాబడ్డాయి. ఇందు లో అత్యధికంగా సెంట్రల్ జోన్ పరిధిలో 36 కేసులు నమోదు కాగా, వెస్ట్‌జోన్ పరిధిలో 14, ఈస్ట్‌జోన్ పరిధిలో 12 కేసులు నమోదు కాబడ్డాయి. అత్యధికంగా సెంట్రల్ జోన పరిధిలో 36 కేసులు నమోదు కాగా, వెస్ట్‌జోన్ పరిధిలో 14, ఈస్ట్‌జోన్ పరిధిలో 12 కేసు లు నమోదు కావడం జరిగింది. వాట్సప్, ఫెస్‌బుక్‌ల ద్వారా మహిళలు, యువతల పరువుకు భంగం కలిగించి న కేసులు నమోదుకాగా, మొబైల్ కాల్స్, ఇంటర్‌నెట్ ఫోన్ కాల్స్ ద్వారా మహిళలను వేధించడం లాంటి కేసులతో పాటు, బ్యాంకుల పేరుతో ఖాతాదారుల ఖాతా నుండి సోమ్మును కాజేసి నింధితులు, ఆన్‌లైన్ జాబ్స్, లాటరీ మోసాలకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కావడంతో పాటు వీటిలో చాల వరకు సైబర్ విభాగం పోలీసులతో పాటు స్థానిక పోలీసుల సదరు నిందితులను గుర్తించి అరెస్ట్ చేయడం జరిగిందిని తెలిపారు.

సమష్టి కృషితోనే
ఎన్నికలు విజయవంతం
జిల్లా పోలీసులను అభినందించిన ఎస్పీ భాస్కరన్
భూపాలపల్లి, డిసెంబర్14: అసెంబ్లీ ఎన్నికలు సమిష్టి కృషితోనే విజయవంతం అయ్యాయని ఎస్పీ ఆర్ భాస్కరన్ అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసులు, అధికారులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖాముఖి మాట్లాడుతూ జయశంకర్ జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నప్పటికి సంయమనంతో అధికారులు, పోలీసులు పని చేశారని ప్రశంసించారు. సివిల్ పోలీసులతో పాటు స్పెషల్ పార్టీ, ఏఆర్ పోలీసులు ఎంతో సహనంతో ఎన్నికల్లో పని చేయడం, రాష్ట్రంలో జిల్లా పోలీసులకు మంచి గుర్తింపు లభించిందన్నారు. జిల్లాకు జాతీయ నాయకులు వచ్చినప్పటికి ఎంతో ఓర్పుతో బందోబస్తు నిర్వహించారని, అందరి సేవలను గుర్తించామన్నారు. కష్టపడి పనిచేసిన వారి పేర్ల జాబితాను పంపిస్తే వారికి బహుమతులు అందజేస్తామన్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసిన పోలీసు అధికారులను ఆయన ఈ సందర్బంగా అభినందించారు. ఇదే స్పూర్తితో రాబోయే రోజుల్లో పనిచేసి జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ బానోత్ రాజమహేంద్రనాయక్, ఓఎస్‌డి సురేష్ కుమార్, సయ్యద్ బాషా, ములుగు డీఎస్పీ విజయ సారథి పాల్గొన్నారు.

నజర్..

$
0
0

పరకాల, డిసెంబర్ 14: సహకార ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీంతో సహకార ఎన్నికల సన్నాహాలకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు రాష్ట్ర సహకార శాఖ కమిషనర్ అండ్ రిజిస్టార్ ఆదేశాల మేరకు ఓటర్ల తయారీ షెడ్యూలను విడుదల చేశారు. దీంతో ఎన్నికలకు ప్రభు త్వం పచ్చజెండా ఊపినట్లయ్యింది. శాసనసభ ఎన్నికల్లో తెరాసకు ప్రజలు బ్రహ్మరథం పడడంతో ఇదే సమయంలో ఎన్నికలు నిర్వహిస్తే రైతులు తమకు అండగా ఉంటారని భావించి ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. దీంతో ఎన్నికల ప్రక్రియపై జిల్లాలోని అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ముఖ్య కార్యనిర్వహణాధికారులతో ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. వరంగల్ రూరల్ జిల్లా పరిధిలో 1లక్ష 5వేల ఓటర్లను ఉన్నట్లు అధికారులు తెలిపారు. రూరల్ జిల్లాలో మొత్తం 32 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఉన్నాయి. వీటిలో 1 సంగెం ప్రాథమిక సహకార సంఘానికి ఎన్నికల కాల పరిమితి 2020 వరకు ఉంది. దీంతో 31 ప్రాథమిక సహకార పరపతి సంఘాలలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. మొత్తం 1లక్ష 58 మంది ఓటర్లు ఉండగా అధికారులు మాత్రం అర్హత కలిగిన వారిని 1 లక్ష 5 వేల మంది ఓటరుగా గుర్తించారు. అయితే ప్రభుత్వం సంఘాల్లోని సభ్యులకు ఓటు అర్హత నియనిబంధనలను జారీ చేసింది. 31-12-2017లోపు సభ్యునిగా ఉన్న వారికి ప్రస్తుతం ఓటు హక్కు బాకీలు చెల్లించక మొండిగా వ్యవహరిస్తున్న వారిని, మృతి చెందిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించారు. సంవత్సరానికి రూ. 300 చెల్లించి సభ్యులుగా ఉన్న వారు ఓటు వేసేందుకు అర్హులు. సభ్యుడికి భూమి కూడా ఉండాలి. మొండి బకాయిలను ఈ నెల 27 లోపు చెల్లించి ఓటు హక్కును పునరుద్దరించుకునేందుకు అవకాశం కల్పిస్తారు. తెలంగాణలో ఇప్పుడు కొత్త జిల్లాల ఆధారంగా సహకార ఎన్నికలు నిర్వహిస్తారు. ఎన్నికల నిర్వహణ కోసం ఈసారి కొత్తగా స్టేట్‌కో ఆపరేటివ్ ఎలక్షన్ ఆథారిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీనికి సహకార శాఖ అదనపు ప్రధాన అధికారిగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఓటర్ల జాబితా తయారీ షెడ్యూల్ విడుదల చేశారు. 14న సహకార సంఘాల పాలక వర్గాలు ఓటర్ల జాబితాను ప్రదర్శించాలి, 21 లోపు అభ్యంతరాలను స్వీకరించాలి, 22న తుది ఓటర్ల జాబితా ప్రదర్శించాలి, 23న తయారు చేసిన తుది ఓటర్ల జాబితాను జిల్లా సహకార అధికారికి పంపించాలి, 24 నుంచి 27 వరకు జిల్లా సహకార అధికారి అభ్యంతరాలను స్వీకరిస్తారు, 28న జిల్లా సహకార అధికారి తుది ఓటర్ల జాబితాను ఖరారు చేస్తారు. 30న తుది జాబితాను జిల్లా సహకార అధికారి స్టేట్ కో ఆపరేటివ్ ఎన్నికల ఆథారిటీకి పంపించనున్నారు.

వరంగల్‌లో ప్రజాకూటమి
పప్పులు ఉడకలే..!
అమరావతి డబ్బులతో వరంగల్ పశ్చిమలో టీడీపీ పోటీ
బాబు కుట్రలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టారు
నాలుగోసారి గెలుపుతో నా బాధ్యత మరింత పెరిగింది
విపక్షాలు నాపై చేసిన ఆరోపణలు కుట్రే
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్

వరంగల్, డిసెంబర్ 14: వరంగల్‌లో ప్రజా కూట మి పప్పులు ఉడకలేదని, ఉమ్మడి వరంగల్ నాలు గు జిల్లాల్లో కూటమి కుదేలైపోయిందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నుండి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలుపొందిన దాస్యం వినయ్‌భాస్కర్ మొదటి సారిగా శుక్రవారం మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ముసుగులో టీడీపీ ఏకంగా వరంగల్ పశ్చిమపై పోటీకి దింపడం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర ఉందన్నారు. అమరావతి డబ్బులతో ఓట్లను కొనుగోలు చేసి వరంగల్ పశ్చిమలో గెలుపొందాలనే టీడీపీ చేసిన కుట్రలను ప్రజలు తిప్పి కొట్టారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల కింద కూటమి కుట్రలు పారలేదన్నారు. వరసగా నాలుగుమార్లు తనను ఇక్కడ నుండి గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. కేసీఆర్ సంక్షేమ ఫలాలే తనను భారీ మెజార్టీతో గెలిపించాయని అన్నారు. ఎన్నికల సందర్భంగా కూటమి అభ్యర్ధులు తనపై చేసిన ఆరోపణలకు ప్రజలే ఓటర్ రూపంలో సమాధానం ఇచ్చారని అన్నారు. స్వార్ధ రాజకీయాల కోసం వ్యక్తిగత విమర్శలు చేసిన మహాకూటమి నాయకులకు ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన విధంగా గుణపాఠం చెప్పి తిరిగి వారిని అమరావతికే పంపించారని అన్నారు. ఈ ఎన్నికల్లో తనకు సహకరించిన నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా కేటీ ఆర్‌కు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పదవి రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. యువనేత కేటీఆర్ కృషి వల్లే గతంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ వంద సీట్లు గెలుచుకున్నామని, అదే తరహా అసెంబ్లీ ఎన్నికల్లో 90 సీట్లు గెలుచుకోవడం వెనుక కేటీఆర్ కృషి ఉందన్నారు. ప్రజలు కేటీఆర్ నాయకత్వం మొగ్గుచూపుతున్నారని అనడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని అన్నారు. ప్రతిపక్షాలు ఆరోపణలు మాని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలన్నారు. సమావేశంలో కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, డీప్యూటీ మేయర్ సిరాజుద్దీన్ పాల్గొన్నారు.

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

$
0
0

జమ్మూకాశ్మీర్: జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. పూల్వామా జిల్లాలో సిర్నో గ్రామంలో భద్రతాబలగాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరపటంతో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.


లోయలో పడిన ట్రక్కు: 20 మంది మృతి

$
0
0

ఖాట్మాండ: నేపాల్‌లోని నువాకోట్ జిల్లాలోని జ్ఞాన్‌ఫెడీ ఏరియాలో శుక్రవారం రాత్రి ఒక ట్రక్కు లోయలోపడి ఇరవై మంది చనిపోయారు. 19 మంది అక్కడికక్కడే చనిపోగా, మరొకరు ఆసుపత్రకి తరలిస్తుండగా చనిపోయారు. మరో 17మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు.

తుపాను ముందస్తు చర్యలపై చంద్రబాబు సమీక్ష

$
0
0

అమరావతి: తుపాను ముందస్తు చర్యలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారంనాడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. సీఎం ఆర్డీసీఎస్ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తీవ్ర వాయుగుండం ఈరోజు మధ్యాహ్నానికి తుపానుగా మారే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు.

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

$
0
0

ముంబయి: ముంబయి నుంచి ఢిల్లీ మీదుగా లక్నో నగరానికి వెళ్లాల్సిన ఇండిగో విమానంలో బాంబు ఉందని ఓ మహిళా ప్రయాణీకురాలి నుంచి కాల్ రావటంతో అధికారులు అప్రమత్తమై తనిఖీలు నిర్వహించారు. విమాన సర్వీసును రద్దుచేసి నిర్మానుష్య ప్రాంతానికి తరలించి తనిఖీలు జరిపారు. విమానంలో ఎలాంటి బాంబు లేదని తేలటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ఏనుగుల బీభత్సం

$
0
0

భువనేశ్వర్: ఒడిశాలోని రాస్ గోవింద్‌పూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని ఓ గ్రామంలోకి 120కి పైగా ఏనుగులు దాడి చేశాయి. వరి పంట పొలాలను ధ్వంసం చేశాయి. గుడిసెలన్నీ కూలిపోయాయి. వందల ఎకరాల్లోని పంట పొలాలు నాశనం అయ్యాయి.

హరీశ్ అభిమానులతో కిక్కిరిసిన ఎమ్మెల్యే క్వార్టర్స్

$
0
0

హైదరాబాద్: సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అభిమానులతో ఎమ్మెల్యే క్వార్టర్స్ కిక్కిరిసి పోయింది. హరీశ్‌రావును కలిసేందుకు అభిమానులు, కార్యకర్తలు వేలాదిమంది తరలివచ్చారు. దీంతో రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. ట్రాపిక్ జామ్ ఏర్పడటంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు.

దూసుకొస్తున్న పెథాయ్

$
0
0

అమరావతి: కోస్తాంధ్రపై పెథాయ్ తుపాను దూసుకువస్తోంది. గంటకు 13 కి.మీ వేగంతో ఇది తీరం వెంబడి దూసుకువస్తోంది. ఇది మచిలీపట్నానికి 900 కి.మీ, శ్రీహరి కోటకు 730 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. మరికొన్ని గంటల్లో తుపానుగా మారనున్నది. ఇది 17వ తేదీన తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కోస్తాంధ్ర, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు తుపాను హెచ్చరికలు చేశారు. శనివారం నుంచి కోస్తాంధ్రలో గాలుల తీవ్రత అధికంగా ఉంటుందని హెచ్చరించారు.

శ్రీలంక ప్రధాని రాజపక్స రాజీనామా

$
0
0

కొలంబో: శ్రీలంక ప్రధాని రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో శ్రీలంకలో రాజకీయ సంక్షోభానికి తెరపడింది. ప్రధానిగా ఉన్న రణిల్ విక్రమసింఘేను తప్పించి రాజపక్సను అధ్యక్షుడు నియమించారు. పార్లమెంటులోనూ రాజపక్స మెజార్టీని నిరూపించుకోలేకపోయారు. రాజపక్స ప్రధానిగా కొనసాగరాదంటూ అప్పీల్ కోర్టు తీర్పు నిచ్చింది. ఈ తీర్పుపై ఆయన సుప్రీం కోర్టుకు వెళ్లినా ప్రయోజనం లేకపోయంది. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేయకతప్పలేదు.


మిజోరం సీఎంగా జొరంతంగా ప్రమాణ స్వీకారం

$
0
0

ఐజ్వాల్: మిజోరం సీఎంగా జొరంతంగా ప్రమాణ స్వీకారం చేశారు. గత నెల 28న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో మిజో నేషనల్‌ ఫ్రంట్‌(ఎంఎన్‌ఎఫ్‌) విజయ ఢంకా మోగించింది. రాష్ట్రంలోని మొత్తం 40 స్థానాలకు 26 స్థానాలను ఎంఎన్‌ఎఫ్‌ కైవసం చేసుకుంది.

ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తా: కేటీఆర్

$
0
0

హైదరాబాద్: ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తానని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఆర్నెల్లలో రాష్ట్రంలో జరగబోయే వివిధ ఎన్నికలను సమర్థంగా ఎదుర్కోవాల్సిన బాధ్యత తనపై ఉందని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో 15 లోకసభ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ మెజార్టీ సాధించిందని, వచ్చే ఎన్నికల్లో 16 లోక్‌సభ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ తనకు గురుతరమైన బాధ్యతను అప్పగించారన్నారు.

సాగునీటి ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ సమీక్ష

$
0
0

హైదరాబాద్ : రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రగతి భవన్ లో జరిగిన ఈ సమావేశానికి హోంమంత్రి మహముద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఇంజినీర్లతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఎంపీ వినోద్ హాజరయ్యారు. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల, సీతారామ ప్రాజెక్టులపై అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

సుప్రీంకోర్టుకు అబద్ధాలు : ఖర్గే

$
0
0

న్యూఢిల్లీ : రఫేల్ ఒప్పందంపై ప్రభుత్వం క్లీన్ చిట్ పొందేందుకు సుప్రీంకోర్టుకు అబద్ధం చెప్పిందని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. పార్లమెంటులో కాగ్ నివేదికను సమర్పించినట్లు, పీఏసీ దానిని పరిశీలించినట్లు అబద్ధాలు చెప్పిందన్నారు. కాగ్ నివేదిక బహిరంగంగా అందరికీ అందుబాటులో ఉన్నట్లు తెలిపిందన్నారు. పీఏసీకి కాగ్ నివేదికను ఎప్పుడు సమర్పించారో చెప్పాలని అడగడానికి అటార్నీ జనరల్ కే కే వేణుగోపాల్‌ను, కాగ్ రాజీవ్ మహర్షిని పిలవాలని, వారికి సమన్లు జారీ చేయాలని పీఏసీని కోరుతామని చెప్పారు.

చెకుముకి రాయ( సండేగీత )

$
0
0

ప్రతి వ్యక్తిలో అతనికి తెలియని చెకుముకి రాయి ఉంటుంది.
ఈ రోజటి పరిభాషలో చెప్పాలంటే అగ్గిపుల్ల ఉంటుంది.
ఆ అగ్గిపుల్ల, ఆ చెకుముకి రాళ్లు అతని జీవితానికి సంబంధించినవి.
అది అతని ఇష్టాలు కావొచ్చు.
అతని శక్తిసామర్థ్యాలు కావొచ్చు.
అతని లక్ష్యాలు కావొచ్చు.
వాటివైపు అతని ప్రయాణం కొనసాగుతుందా లేదానన్నది ముఖ్య విషయం.
అతనిలో వున్న చెకుముకి రాయితో అగ్ని రాజేస్తున్నాడా లేదానన్నది ముఖ్యం.
అతనిలో అగ్గిపుల్లని వెలిగిస్తున్నాడా లేదానన్నది ప్రధానం.
వాటిని ఉపయోగించకుండా అతి మామూలుగా వుండిపోతారా అన్న విషయం ఆ వ్యక్తి మీదే ఉంటుంది.
మనం ఏం చేయవచ్చో
ఏ రకంగా మన చుట్టూ వున్న ప్రపంచాన్ని కొంత మేరకు బాగా చేయగలమా అన్నది మన మీదే వుంది.
నిర్వ్యాపకంగా కూర్చుంటే ఫలితం వుండదు.
మన లక్ష్యం మన ముందు, ప్రతి వ్యక్తి ముందు మెదలాలి.
అప్పుడే-
చెకుముకి రాయితో అగ్ని రాజేయగలం.
అగ్గిపుల్లతో
మన కాంక్షని వెలిగించగలం.

Viewing all 69482 articles
Browse latest View live