Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

స్నాతకోత్సవ ముఖ్యఅతిధిగా రామ్ గోపాలరావు

$
0
0

విశాఖపట్నం, డిసెంబర్ 15: ఆంధ్ర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 19న జరిగే స్నాతకోత్సవానికి ఢిల్లీ ఐఐటీ సంచాలకులు ఆచార్య వీ రామ్ గోపాలరావు హాజరుకానున్నారు. స్నాతకోత్సవానికి ఐఐటీ సంచాలకులు రామ్ గోపాలరావును ఆహ్వానించాలని శనివారం జరిగిన పాలకమండలి సమావేశంలో నిర్ణయించినట్టు వైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ జీ నాగేశ్వర రావు తెలిపారు. స్నాతకోత్సవానికి ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ హాజరుకానున్నట్టు వెల్లడించారు. స్నాతకోత్సవం సందర్భంగా ఆరుగురికి ఎంఫిల్ పట్టాలు, 546 మందికి పీహెచ్‌డీలు, 573 మందికి అ ప్రైజులు, మెడల్స్ అందజేస్తామన్నారు. 19వ తేదీ ఉదయం 11 గంటలకు స్నాతకోత్సవం జరుగుతుందన్నారు. అలాగే వర్శిటీలో పనిచేస్తున్న కన్సాలిడేటెడ్ ఎంప్లారుూస్‌కు సంబంధించి గతంలో నియమించిన కమిటీ నివేదిక కోరనున్నామన్నారు. వీరిని 28 రోజుల విధానంలోకి మార్చేందుకు గల అవకాశాలపై నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. వర్శిటీలో మినిమమ్ టైం స్కేల్ (ఎంటీఎస్) విధానంలో పనిచేస్తున్న వారిని వర్శిటీ ఉద్యోగులుగా రెగ్యులరైజ్ చేసేందుకు ప్రభుత్వ అనుమతిని కోరుతూ లేఖ రాశామన్నారు. వర్శిటీ ఆధ్వర్యంలోని కళాశాలలకు పూర్తి స్థాయిలో ప్లేస్‌మెంట్ అధికారులను నియమిస్తామని, ఇంజనీరింగ్, మహిళా ఇంజనీరింగ్ కళాశాలలు, ఏయూ న్యాయ, ఆర్ట్ అండ్ కామర్స్ కశాళాల, సైన్స్, ఫార్మశీ కళాశాలకు ముగ్గురు ప్లేస్‌మెంట్ అధికారులను కన్సాలిడేటెడ్ పేమెంట్ విధానంలో నియమించాలని నిర్ణయించామన్నారు. అలాగే ప్లేస్‌మెంట్ కార్యాలయ నిర్వహణకు వౌలిక వసతుల కల్పన, నిర్వహణ ఖర్చుల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని పాలకమండలి నిర్ణయించిందన్నారు. సమావేశంలో రెక్టార్ ప్రొఫెసర్ ఎం ప్రసాదరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె నిరంజన్, సభ్యులు ప్రొఫెసర్లు రామ్మోహనరావు, శశిభూషణ రావు, ఎన్ బాబయ్య, సురేష్ చిట్టినేని, డాక్టర్ ఎస్ విజయరవీంద్ర, డాక్టర్ పీ సోమనాధరావు తదితరులు పాల్గొన్నారు.

విద్యకు లేని నిధులు విగ్రహాలకు ఎక్కడివి
* కేంద్ర ప్రభుత్వ తీరుపై ఎస్‌ఎఫ్‌ఐ ధ్వజం *జాతీయ సంయుక్త కార్యదర్శి నితీష్ నారాయణ్

విశాఖపట్నం, డిసెంబర్ 15: యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించే విద్యకు దక్కని నిధులు దేశంలో విగ్రహాలకు ఖర్చవుతున్నాయని భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) జాతీయ సంయుక్త కార్యదర్శి నితీష్ నారాయణ్ విమర్శించారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఏయూ అంబేద్కర్ ఆసెంబ్లీ హాల్‌లో రెండు రోజుల పాటు జరగనున్న సదస్సు శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా తొలి రోజు కార్యక్రమంలో 3విద్యా రంగంలో మార్పులు-సవాళ్లు2 అంశంపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్ధార్ పటేల్, ఛత్రపతి శివాజీ విగ్రహాలకు వేల కోట్లు ఖర్చు పెట్టిన నరేంద్ర మోదీ ప్రభుత్వం విద్యకు మాత్రం అరకొర నిధులు విదుల్చుతోందని మండిపడ్డారు. ప్రధాని మోదీ ఆర్భాటపు ఖర్చులు రూ.3000 కోట్లు వెచ్చిస్తే ప్రస్తుతం అరకొర సదుపాయాలతో నడుస్తున్న ఐఐఎం, ఐఐటీ, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో వసతులు కల్పించవచ్చన్నారు. అయితే భిన్న జాతులు, మతాలకు నిలయమైన భారతదేశంలో కల్లోలం సృష్టించేందుకు బీజేపీ, అనుబంధ విభాగాలు యత్నిస్తున్నాయని ఆరోపించారు. చరిత్రలో ఎక్కడ భారతదేశం హిందువుల రాజ్యంగా చెప్పలేదన్నారు. అయితే పాలకులు మాత్రం హిందూరాజ్యం అంటూ ముస్లింలు, మైనార్టీలు, దళితులను అణచివేసే కుట్రలు పన్నుతోందన్నారు. అల్పసంఖ్యాక వర్గాలు బీజేపీ తీరుతో అభద్రత భావానికి గురికావాల్సి వస్తోందని, దీన్ని యువత ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. గోరఖ్‌పూర్ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందుబాటులో లేక 73 మంది చిన్నారులు మరణించారని, వీరి తల్లిదండ్రుల ఆవేదన ఏ ప్రభుత్వాలు తీర్చగలవన్నారు. విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీసి పోరాడేందుకు ఎస్‌ఎఫ్‌ఐ సిద్ధంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నగర అధ్యక్ష, కార్యదర్శులు ఎల్‌జే నాయుడు, అప్పలరాజు, ఎయూ విభాగం అధ్యక్ష, కార్యదర్శులు గౌతమ్, ఎల్ చిన్నారి తదితరులు పాల్గొన్నారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి

విశాఖపట్నం, డిసెంబర్ 15: అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా శనివారం ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సంస్థ అధికారులు సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు. సంస్థ కార్పొరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ హెచ్‌వై దొర పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా సిఎండి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం 1952 సంవత్సరంలో 58 రోజులపాటు నిరాహరదీక్ష చేసి, తన ఆశయ సాధనలో ప్రాణాలర్పించిన అమరజీవి అన్నారు. ఆయన ఆత్మార్పణ ఫలితంగా కర్నూలు రాజధానిగా 1953న నవంబర్ ఒకటవ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు. పొట్టి శ్రీరాములు అణగారిన వర్గాల అభివృద్ధికి, తన జీవిత్న్ని దారపోసిన మహోన్నత వ్యక్తిగా స్వాతంత్ర సమరయోధునిగా గొప్ప సంఘ సంస్కర్తగా ఆయన నిర్వర్తించిన పాత్రను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు బొడ్డు శేషుకుమార్, టీవీఎస్ చంద్రశేఖర్, సీజీఎంలు కెఎస్‌ఎన్ మూర్తి, పీ.నాగేశ్వరరావు, ఓ.సింహాద్రి, పీవీవీ సత్యనారాయణ, వైయస్‌ఎన్ ప్రసాద్, కార్పోరేట్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
విద్యుత్‌శాఖకు వాయుగండాలు2...
* ఈపీడీసీఎల్‌కు తుపాన్ల భయం...* నాడు హుదూద్, మొన్న తిత్లీ, నేడు పెథాయ్
* వరుస సంఘటనలతో ఆర్ధిక నష్టాలు * ప్రతి జిల్లాలో అప్రమత్తం

విశాఖపట్నం, డిసెంబర్ 15: విద్యుత్‌శాఖకు వాయుగండాలు, తుపాన్ల భయం పట్టుకుంది. ఏ క్షణంలో ఎటువంటి తుపాన్లు ముంచుకొస్తాయోనన్న గుబులుతోనే వణికిపోతోంది. వరుస తుపాన్లతో నిత్యం సంస్థకు ఆర్ధికపరమైన నష్టాలు తప్పడంలేదు. ఇవి కూడా తట్టుకోలేనంతగా ఉంటున్నాయి. హుదూద్, తిత్లీ వంటి భయంకరమైన తుపాన్ల నుంచి ఇంకా కోలోలేకపోతున్న విద్యుత్‌శాఖకు ఇపుడు పెథాయ్ తుపాను భయం పట్టుకుంది. ఈ నెల 17వ తేదీన విశాఖలో తీరం దాటే పెథాయ్ తుపానుతో మళ్ళీ ఏ విధంగా నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందోనన్న గుబులుతో సంస్థ ఉంది. ఒకవైపు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నా భారీ నష్టాలపైనే ఆందోళన చెందుతోంది. గత రెండు రోజులుగా ముందస్తు ఏర్పాట్లు తీసుకుంటూనే ఉంది. విద్యుత్ సబ్‌స్టేషన్లు భారీ టవర్లు, విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు వద్ద పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. భారీగా వీస్తోన్న ఈదురుగాలుల నుంచి విద్యుత్ వ్యవస్థను పరిరక్షించుకునేందుకు వీలుగా జనరల్ మేనేజర్లు, డిజిఎంల పర్యవేక్షణలో ఎప్పటికపుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఒకవైపు విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు లేకుండా చేస్తూనే మరోపక్క ఈదురుగాలులతో విద్యుత్ వ్యవస్థ చిన్నాభిన్నం కాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఏపీఈపీడీసీఎల్) పరిధిలోకి వచ్చే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు,పశ్చిమగోదావరి జిల్లాలకు సంబంధించి ముఖ్యమైన పట్టణ ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థ దెబ్బతినే పరిస్థితులను ఎప్పటికపుడు సమీక్షించి తక్షణ చర్యలు చేపట్టేందుకు వీలుగా క్షేత్రస్థాయి నుంచి అధికారుల వరకు అప్రమత్తమయ్యారు. ఎస్‌ఇలు, డిఇఇలు, ఏడీఇ, ఏఇలతోపాటు లైన్‌మెన్లు ఇతర సిబ్బంది విద్యుత్ లైన్లు, సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద పటిష్ట భద్రతాపరమైన చర్యలు చేపడుతున్నారు. ఆది,సోమవారాల్లో పెథాయ్ తుపాను మరింత ఉధృతం కానున్నందున దీనికి తగినట్టుగా యాజమాన్యం ప్రత్యేక యంత్రాంగాన్ని సిద్ధం చేస్తోంది.
పెరుగుతున్న తుపాన్ల నష్టం...
వరుస తుపాన్లతో ఈపీడీసీఎల్ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. 2014 అక్టోబర్ 12వ తేదీన విశాఖలో సంభవించిన హుదూద్ తుపానుతో ఏపీఈపీడీసీఎల్‌కు రూ.1200 కోట్లకు పైగానే ఆర్ధిక నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ నష్టాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పటికీ ఎటువంటి ఆర్ధిక సహాయం అందనేలేదు. దీని నుంచి తేరుకోకముందే ఇటీవల శ్రీకాకుళం జిల్లాను తిత్లీ తుపాను తుడిచిపెట్టుకుపోయింది. దీనివల్ల ఈపీడీసీఎల్ రూ.500 కోట్ల మేర నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది. ఈ విధంగా గడచిన నాలుగేళ్ళ కాలంలో రెండు తుపాన్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. వీటి వలన దాదాపు రెండు వేల కోట్ల మేర విద్యుత్‌పరంగా ఆస్తుల నష్టం ఏర్పడింది. ఈ రెండింటి నుంచి ఎదురైన నష్టాల నుంచి ఏమాత్రం బయటపడలేకపోతున్న సంస్థ యాజమాన్యానికి 3గోరుచుట్టుపై రోకటి పోటు2 మాదిరి పెథాయ్ తుపాను భయం పట్టుకుంది. విశాఖ నగరంలో శనివారం మధ్యాహ్నం భారీగా ఈదురుగాలులు వీస్తున్న పరిస్థితులు విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగిస్తుండగా బలహీనంగా ఉండే విద్యుత్ లైన్ల మార్గంలోను, జిల్లాలో పలుచోట్ల సబ్‌స్టేషన్ల వద్ద సాంకేతికపరమైన సమస్యలు తలెత్తున్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కాగా తుపాన్ల కారణంగా విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో విద్యుత్ పరంగా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న ఈపీడీసీఎల్‌కు ఇపుడు విశాఖ జిల్లాలోను, పొరుగు జిల్లాలకు నష్టాలు తప్పేటట్టు లేదని ఈ వర్గాలు అంటున్నాయి.


సాక్ష్యాధారాలు లేవు

$
0
0

లాహోర్, డిసెంబర్ 15: పాకిస్తాన్‌లోని కోట్ లఖ్‌పట్ జైలులో జరిగిన భారత్‌కు చెందిన సరబ్‌జిత్ సింగ్ హత్యకేసులో ప్రధాన నిందుతులు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దర్ని కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. 2013లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఐదేళ్ల తరువాత లాహోర్ సెషన్స్ కోర్టు శనివారం తీర్పును వెలువరించింది. కోర్టు వర్గాల కథనం ప్రకారం సరబ్‌జిత్ సింగ్ హత్యకేసులో అమీర్ తంబా, మదస్సార్‌లు ప్రధాన నిందితులు. సంచలం రేపిన ఈ కేసులో సాక్షులందరూ ప్రాసిక్యూషన్‌కు ఎదురుతిరిగారు. నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ఒక్కరూ ముందుకురాలేదు. లాహోర్ అడిషనల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ కేసులో ఐదేళ్లు నడిచింది. భద్రతాకారణాల దృష్ట్యా నిందితులు ఇద్దర్నీ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి విచారించారు. కోట్ లఖ్‌పట్ సెంట్రల్ జైలులో 49 ఏళ్ల సరబ్‌జిత్‌సింగ్‌ను హత్య చేసిన అమీర్ తంటా, మదస్సార్‌పై సాక్ష్యాధారాలు లభిస్తే మరణశిక్ష పడాల్సి ఉంది. ఇంతకు ముందు కేసు విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ తీరుపై న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సాక్షుల నుంచి వాంగ్మూలాలు నమోదు చేయలేకపోయారని జడ్జి తీవ్రంగా మండిపడ్డారు. సరబ్‌జిత్ అపస్మారక స్థితిలో ఉండగా ఆసుపత్రికి తరలించడం చూశానని ఓ సాక్షి కోర్టుకు వివరించాడు. సింగ్ నుంచి వివరాలు తీసుకునే ప్రయత్నం చేస్తుంటే వైద్యులు అడ్డుకున్నారని అతడు ఆరోపించాడు. ఈ కేసులో జస్టిస్ మజార్ అలీ అక్బర్ నఖ్వీ సారధ్యంలో ఏకసభ్య విచారణ కమిషన్‌ను లాహోర్ కోర్టు ఏర్పాటు చేసింది. 40 మంది సాక్ష్యులను జస్టిస్ సఖ్వీ విచారించారు. సంబంధిత నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. అయితే నివేదిక ఇప్పటికీ బహిర్గం చేయలేదు. అలాగే విదేశీ మంత్వ్రశాఖ ద్వారా సరబ్‌జిత్ సింగ్ బంధువులకు ఏకసభ్య కమిషన్ నోటీసులు జారీ చేసింది.
అయితే సింగ్ కుటుంబ సభ్యులు వాంగ్మూలం ఇవ్వడానికి నిరాకరించారని అధికారులు వెల్లడించారు. తంబా, మదస్సార్ కమిషన్ ముందు తమ నేరాన్ని అంగీకరించారు. లాహోర్, ఫైసాలాబాద్ బాంబు పేలుళ్లలో అమాయకుల మృతికి సరబ్‌జిత్ కారణమని వారు ఆరోపించారు. అందుకే కసితో జైలులోనే చంపేశామని ఒప్పుకున్నారు. 1990లో పంజాబ్ రాష్ట్రంలో బాంబు పేలుళ్ల ఘటనతో సరబ్‌జిత్ సంబంధాలున్నాయంటూ ఉరిశిక్ష విధించారు. కాగా కేసులో సరైన సాక్ష్యాధారాలు లేవంటూ లాహోర్ అడిషనల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి మహ్మద్ మొయిన్ ఖధోర్కర్ నిందితులిద్దర్నీ నిర్దోషులుగా ప్రకటించారు.

హిందూయిజంపై అమెరికాలో ప్రచారం

$
0
0

హూస్టన్, డిసెంబర్ 15: అమెరికాలో హిందూమతంపై చైతన్యం తీసుకురావడానికి ఆ దేశంలో ప్రచారాన్ని ప్రారంభించారు. మతం పేరిట జరిగే బెదిరింపులు, ఇతర అకృత్యాలను తగ్గించేందుకు ఉద్దేశించిన ‘అ యామ్ హిందూ అమెరికన్’ పేరిట యూఎస్‌లో ఉన్న హిందూ అమెరికన్ ఫౌండేషన్ (హెచ్‌ఏఎఫ్) సామాజిక మాధ్యమంలో ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా హిందూయిజం, ఇండో అమెరికన్ల గురించి 30 సెకండ్ల ప్రకటనను విడుదల చేసింది. హిందూ మతం ప్రాశస్త్యం, దాని ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలు, దానిపై ఉన్న అపోహలు, అపార్థాలు తొలగించేందుకు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. హిందూ అమెరికన్ వర్గం ఆన్‌లైన్ ద్వారా ముఖాముఖి కలుసుకోవడానికి, భావాలను పంచుకోవడానికి, అపోహలను తొలగించడానికి అయామ్ హిందూ అమెరికన్ ప్రచారాన్ని ప్రారంభించినట్టు వారు చెప్పారు. హిందూ అమెరికన్లు ఇక్కడ మైనారిటీలుగా ఉన్నప్పటికీ విజయవంతమైన వర్గంగా పేరుపొందారని, అయితే స్థానిక అమెరికన్లకు హిందువుల గురించి, హిందూయిజం గురించి అంతగా అవగాహన లేదని అన్నారు. తాము సేకరించిన వివరాల ప్రకారం ప్రతి ముగ్గురు హిందూ అమెరికన్ విద్యార్థులలో మతపరమైన విశ్వాసాలను ఉండటాన్ని గమనించామని సంస్థ ఈడీ సుహాగ్ శుక్లా తెలిపారు. చాలావరకు మతపరమైన బెదిరింపులు, ఇబ్బందులు హిందువుల గురించి అపార్థం చేసుకోవడం వల్ల ఏర్పడినవేనని, ఈ పరిస్థితిని తమ ప్రచారం ద్వారా తొలగించాలనుకుంటున్నట్టు చెప్పారు. 2016లో పోలిస్తే 2017లో ఇలాంటి ద్వేషపరమైన కేసులు 17 శాతం పెరిగినట్టు ఎఫ్‌బిఐ వెల్లడించిందన్నారు. ఇప్పుడు మనం నిత్యజీవితంలో భాగమైన మెడిటేషన్, యోగా, డెసిమల్ విధానం వంటివి హిందువులే కనుగొన్న విషయాన్ని మరువరాదని ఆయన అన్నారు.

క్రిస్టియన్ మిచెల్‌కు కస్టడీ పొడిగింపు

$
0
0

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: అగస్టావెస్ట్‌లాండ్ వీవీఐపీ హెలీకాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో మధ్యవర్తి క్రిస్టియన్ మిచెల్ కస్టడిని కోర్టు మరో నాలుగు రోజులు పొడిగించింది. 57ఏళ్ల బ్రిటన్ జాతీయుడు మిచెల్‌ను శనివారం సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి అరవింద్ కుమార్ ఎదుట హాజరుపరిచారు. యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో అరెస్టుచేసిన మిచెల్‌ను ఈనెల 4న భారత్‌కు తీసుకొచ్చారు. మర్నాడే అతడిని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా ఐదురోజల కస్టడికి తరలించారు. మళ్లీ ఐదురోజుల కస్టడి విధించారు. మిచెల్ నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉన్నందున మరో ఐదు రోజులు కస్టడీకి అప్పగించాలని సీబీఐ కోరింది.

శంకర్..! సీక్వెల్స్?

$
0
0

డైరెక్టర్ శంకర్ అంటేనే ఓ సంచలనం. అతనొక సినిమా ప్రకటిస్తే -మరింత సంచలనం. ప్రాంతీయ సినిమాను ప్రపంచస్థాయిలో చూపించగల సమర్థుత అతని ట్రాక్ రికార్డు. అప్పుడప్పుడూ ఫ్లాపుపడినా -వెంటనే బ్లాక్‌బస్టర్ హిట్‌తో సత్తా చాటుకోగల గ్రేట్ డైరెక్టర్. సామాజికాంశాన్ని కొత్త ఎత్తుగడతో చూపించగల అతని క్రియేటివిటీకి -ఆడియన్ ఫ్యాన్ మెయిల్ తక్కువేం కాదు. అందుకే -అతని
సినిమాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అలాంటి శంకర్.. కెరీర్‌ను సాఫ్ట్‌గా నడిపించేస్తూ
-కొత్త ట్విస్ట్ ఇచ్చాడు. అదే రోబో సీక్వెల్ -2.ఓ. ఈ బ్లాక్‌బస్టర్ సినిమా థియేటర్లలో ఉండగానే
-మరో సీక్వెల్ ప్రకటించి మరో ట్విస్ట్ ఇచ్చాడు. అది -ఇండియన్-2. ఈ సీక్వెల్ సెట్స్
ఎక్కకముందే మరో సీక్వెల్‌ను మనసులోంచి బయటపెట్టాడు. అంటే మరో ట్విస్ట్.
అదే -ఒకే ఒక్కడు. ట్విస్టుల మీద ట్విస్టులిస్తున్న శంకర్ స్ట్రాటజీ ఏమై ఉంటుందబ్బా!?
*
చెన్నైలో విద్యార్థులు, బస్ డ్రైవర్ల మధ్య తలెత్తిన వివాదం కుల ఘర్షణలకు దారితీస్తుంది. ఘర్షణలు తారాస్థాయికి చేరడంతో జనజీవనం స్థంభిస్తుంది. తన కులం, తన పార్టీకి చెందిన ఆందోళనకారులను అరెస్ట్ చేయొద్దంటూ సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రే (రఘువరన్) పోలీసులను వైర్‌లెస్ సెట్ మెసేజ్‌లో కట్టడి చేస్తాడు. అది -క్యూటీవీ న్యూస్ రిపోర్టర్ (అర్జున్) కెమెరాకు చిక్కుతుంది. తరువాత ముఖ్యమంత్రిని ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చిన సందర్భంలో -‘మేకవనె్న పులి’ బండారాన్ని బయటపెట్టడం సంచలనమవుతుంది. ఇద్దరి మధ్యా లైవ్‌లో సాగిన ఇంటర్వ్యూ సంవాదంలో నిగ్రహాన్ని కోల్పోయిన సీఎం -‘ఒక్కరోజు తన సీట్లో కూర్చుంటే తెలుస్తుంద’ని చాలెంజ్ విసురుతాడు. అనివార్య పరిస్థితుల్లో చాలెంజ్‌ను స్వీకరిస్తాడు అర్జున్. చట్టంలోని వెసులుబాటు ఆధారంగా ఒక్కరోజు సీఎం స్థానంలో కూర్చున్న కథానాయకుడు -అదే చట్టంలోని నిబంధనలను సక్రమతీరున ప్రయోగించి సెనే్సషన్ క్రియేట్ చేస్తాడు. ప్రతినాయకుడి ప్రతిబంధకాలను తిప్పికొడుతూనే -అపసవ్య పాలనను గాడినపెడతాడు. 24 గంటల్లో చేతల్లో చూపిన ప్రజాభీష్ట పాలనతో జనహృదయాన్ని, మరోపక్క ప్రియురాలి మనసు గెలిచి -‘ఒకే ఒక్కడు’ అవుతాడు.
*
20 పంక్తుల కథను రెండు గంటల రన్‌టైమ్‌తో స్క్రీన్‌పై రీళ్లురీళ్లుగా పరిగెత్తించాడు దర్శకుడు శంకర్. -‘పొలిటికల్ థ్రిల్లర్’గా వచ్చిన సినిమా అందుకే వంద రోజులాడింది. ఆడియన్స్ నుంచి సూపర్ హిట్ ఆదరణ సాధించింది. ప్రాంతీయ అవార్డులు కొల్లగొట్టింది. శంకర్‌ని తిరుగులేని డైరెక్టర్‌ని చేసింది. నిర్మాత (శంకర్ షణ్ముగం)కు కోట్ల లాభాలు ఆర్జించిపెట్టింది. రెండు దశాబ్దాల క్రితంనాటి సినిమాకు ఇంత ఉదోద్ఘాతం ఇప్పుడెందుకంటే -‘ఒకే ఓక్కడు’ స్క్రీన్స్‌కు వచ్చి పందొమ్మిదేళ్లయ్యింది కనుక. ’99 నవంబర్ 7న దీపావళి చిత్రంగా థియేటర్లకు వచ్చిన చిత్రానికి సీక్వెల్ తీయాలని శంకర్ అనుకుంటున్నాడు కనుక. ఇరవయ్యేళ్ల క్రితం శంకర్ దర్శకత్వ ప్రతిభే ఆ స్థాయిలోవుంటే -సాంకేతికతను దర్శకత్వానికి అనుసంధానించి ముందుకెళ్తున్న ఇప్పటి శంకర్ మెదడులో ‘సీక్వెల్’ కథ ఇంకెలా తయారవుతుందోనన్న ఆసక్తి మొదలైంది కనుక.
***
పరిస్థితి చూస్తుంటే -శంకర్ సీక్వెల్స్‌మీద పడ్డాడా? అనిపిస్తోంది. ఇకముందూ సీక్వెల్సే తీస్తాడా? అన్న ప్రశ్నలూ పుట్టుకొస్తున్నాయి. కొత్త కథలకంటే సీక్వెల్స్ మీదే శంకర్ ఎందుకు దృష్టి పెడుతున్నట్టు? అన్న డౌట్లు డామినేట్ చేస్తున్నాయి. దక్షిణాది చిత్ర పరిశ్రమలో సీక్వెల్స్‌కు సరైన సక్సెస్ గ్రాఫ్ లేకున్నా -శంకర్ కొత్త సెంటిమెంట్‌కు ఎందుకు పదును పెడుతున్నట్టు? అన్న సందేహాలూ ఇండస్ట్రీని కుదిపేస్తున్నాయి. ఇన్ని ‘?’ తలెత్తడానికి కారణం -ఇప్పటికే భారతీయుడు సీక్వెల్‌కు శంకర్ శ్రీకారం చుట్టాడు కనుక. రోబోకు సీక్వెల్ చేస్తున్న టైంలోనే ‘భారతీయుడు’ సీక్వెల్‌ను బుర్రకెక్కించుకున్న శంకర్ -ఇప్పుడు భారతీయుడు సీక్వెల్ మొదలెట్టాల్సిన టైంలో ‘ఒకే ఒక్కడు’ సీక్వెల్‌ను ప్రస్తావించాడు కనుక.
***
నిజానికి గొప్ప దర్శకులంతా కెరీర్‌లో తాము తీసిన హిట్టు చిత్రాలకు సీక్వెల్స్‌పై ఆసక్తి ప్రదర్శించినోళ్లే. కొందరు ఆలోచనల వద్దే ఆగిపోతే, ఇంకొందరు ముందుకెళ్లి మాడు పగులగొట్టుకున్న దాఖలాలు లేకపోలేదు. చిన్న చిత్రాలుగా వచ్చిన కొన్ని సీక్వెల్స్ అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ సక్సెస్ కొట్టిన దాఖలాలు ఉన్నాయేమోగానీ, స్టార్లతో చేసిన చిత్రాలేవీ మాతృకస్థాయి చిత్ర విజయాన్ని దాటిన సందర్భాలు లేవు. దీంతో ఒకదశలో సీక్వెల్స్‌పై అత్యుత్సాహం ప్రదర్శించిన స్టార్ డైరెక్టర్లంతా.. ఆ తరువాత వాటిని ప్రస్తావించడం మానేశారు. కోరికను కోరికలాగే అణిచిపెట్టేశారు. అయితే పెద్దఎత్తున సీక్వెల్స్ సీజన్ నడిచిన సందర్భంలోనూ -శంకర్ ఏనాడూ సీక్వెల్స్ ఊసెత్తలేదు. ‘సామాజికాంశా’లను కథలుగా మలచుకుని తన మార్క్ చిత్రాలు తీశాడే తప్ప, సీక్వెల్స్‌పై ఆసక్తిని ప్రదర్శించలేదు. అందుకే -రోబోకు సీక్వెల్ చేస్తున్నట్టు శంకర్ ప్రకటించినపుడు ఇండస్ట్రీ విస్మయానికి గురైంది. సూపర్‌స్టార్ రజనీని కొత్తగా చూపించి భారీ విజయం అందుకున్న రోబోకు సీక్వెల్ చేయడం అసాధ్యమేనన్న చర్చలేపింది. అయితే శంకర్ స్టయిల్ వేరు. అతని మనస్థత్వాన్ని అంచనా వేయడం కష్టమే. చాలెంజ్‌నుంచే సక్సెస్ అందుకోవాలన్న శంకర్ తపన -2.ఓగా అనూహ్య విజయాన్ని అందించింది.
‘రోబో’ చిత్రానే్న గమనిస్తే -సినిమాటిక్ ఈక్వెషన్స్‌తో కథ సిద్ధం చేసుకుని నాయకానాయికలుగా అనూహ్య కాంబినేషన్‌ను (రజనీ -ఐశ్వర్యరాయ్)ను స్క్రీన్‌మీద చూపించడంతోనే శంకర్ సక్సెస్ కొట్టాడు. మర మనిషికి మనసుపెట్టి మానవ మేథకు కొత్త ఆలోచన పుట్టించి -దటీజ్ శంకర్ అనిపించుకున్నాడు. నిజానికి శంకర్ తీసిన చిత్రాలన్నీ సూపర్ హిట్లే అనలేం. అతని ఖాతాలో ఫ్లాపులు సైతం బలంగానే ఉన్నాయి. అలా రోబో తరువాత తీసిన రెండు చిత్రాలూ శంకర్ ఉనికినే ప్రశ్నించే స్థాయిలో దెబ్బతిన్నాయి. హిందీలో వచ్చిన ‘3 ఇడియట్స్’ను ‘స్నేహితుడు’గా రీమేక్ చేసి పరాజయాన్ని ఎదుర్కొంటే, విక్రమ్ హీరోగా ప్రతిష్ఠాత్మకంగా తీసిన ‘ఐ-మనోహరుడు’ కోలుకోలేని దెబ్బకొట్టింది. ఆ పరాభవం నుంచి కోలుకోడానికి శంకర్‌కు కనిపించిన ఒకే ఒక్క మార్గం -సీక్వెల్. అందుకే అప్పటి వరకూ అతను ఆలోచించని అంశంపై దృష్టి పెట్టి రోబో సీక్వెల్‌కు శ్రీకారం చుట్టాడు. ఏ రోబో కోసం సినీ టెక్నాలజీని ఔపోసన పట్టాడో -అదే టెక్నాలజీ సాయంతో భారీ విజయాన్ని అందుకోవాలనుకున్నాడు. ఎలాగూ ‘సామాజిక కోణం’ అనే పేటెంట్ కానె్సప్ట్‌ను అలవాటు చేశాడు కనుక -మొబైల్ స్క్రీన్‌లో ఇరుక్కున్న ప్రపంచానికి కొత్త కథ చెప్పాలనుకున్నాడు. అదే రోబో 2.ఓ. భారీ బడ్జెట్టు, ఆధునిక సాంకేతికత కలబోతతో కథ చెబితే -ఆడియన్స్ వినోదానికి అంతుండదని ఇప్పటికే రుజువైన సినీ సూత్రాన్ని శంకర్ ప్రయోగించాడు. 2.ఓ చిత్రం ఎలాంటి విజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమా విడుదలకు ముందే సీక్వెల్ సక్సెస్‌ను రుచి చూసిన శంకర్ -2.ఓ విడుదలకు ముందే ‘భారతీయుడు’ని ప్రకటించడం ఇక్కడ కొత్త ట్విస్ట్. నిజానికి 2.ఓతో తనకు ఇష్టులైన రజనీ, కమల్‌ను ఒకే స్క్రీన్‌మీద చూపించాలన్న శంకర్ ప్రయత్నం ఫలించలేదు. ‘కాకాసుర’ పాత్రకోసం కమల్‌ను కలిసినా అయిష్టత చూపటం, ‘ఇండియన్’పై ఆసక్తి ప్రదర్శించటం గ్రేట్ డైరెక్టర్‌కు గ్రేట్ ఇన్సిడెంట్ అయ్యింది. దాంతో అప్పటి వరకూ ఊగిసలాటలోవున్న ఇండియన్ -2 సీక్వెల్ కన్ఫర్మ్ అయిపోయింది. ఆగమేఘాల మీద ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయడం, నాలుగేళ్ల 2.ఓ కష్టం నుంచి సేదతీరకుండానే -ఈ డిసెంబర్ నుంచే ఇండియన్ 2 రెగ్యులర్ షూటింగ్‌కు ఏర్పాట్లు చేసుకోవడం జరిగిపోయాయి. 2.ఓ షూటింగ్ మధ్యలో ‘ఇండియన్-2’ను ప్రకటిస్తే -ఇప్పుడు ఇండియన్-2 మొదలెట్టక మునుపే ‘ఒకే ఒక్కడు’ సీక్వెల్‌ను ప్రకటించడం శంకర్ ఇస్తోన్న మరో ట్విస్ట్.
దాదాపు రెండు దశాబ్దాల క్రితం వచ్చిన ‘ఒకే ఒక్కడు’ సక్సెస్‌ను ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పని లేదు. పైగా ‘నాయక్’ పేరుతో బాలీవుడ్‌లోనూ రీమేక్‌తో భారీ విజయాన్ని అందుకున్నాడు శంకర్. అర్జున్‌కు ‘ఒక్కరోజు ముఖ్యమంత్రి’ ఇమేజ్ ఇచ్చిన శంకర్ -ఈ సీక్వెల్‌నూ పొలిటికల్ థ్రిల్లర్‌గానే డిజైన్ చేయకతప్పదు. అయితే ప్రజెంట్ పాలిటిక్స్‌లో ఏ అంశాన్ని కథ చేసుకుంటాడన్నదే ఆసక్తిరేపుతోన్న అంశం. అయితే ఒకే ఒక్కడు చిత్రం చేసిన అర్జున్ అర్జాకు ఇప్పుడంత మార్కెట్ లేదు. అందుకే -సీక్వెల్‌లో రజనీ లేదా కమల్ అయితేనే మంచిదన్న అభిప్రాయాన్నీ ఆమధ్య శంకర్ బయటపెట్టాడు. ఒకవేళ ‘ఒకే ఒక్కడు’ సీక్వెల్ -యంగ్ హీరోను డిమాండ్ చేస్తే మాత్రం తప్పకుండా విజయ్‌తో సినిమా చేస్తానంటూ శంకర్ ఇప్పటికే డైలాగ్ వదిలాడు. దీనివెనుకా పెద్ద స్ట్రాటజీ లేకపోలేదన్న అంచనాలూ వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో రాజకీయాలపై అంతర్లీనంగా ఆసక్తి చూపుతున్న హీరో విజయ్ -పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో చేసిన ‘సర్కార్’ సంతృప్తికరమైన ఫలితాన్ని ఇవ్వలేదు. పైగా గత రెండేళ్లలో పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ కథలు, సీఎం నేపథ్య కథలపై దక్షిణాది చిత్ర పరిశ్రమ ఆసక్తి చూపిస్తోంది. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని -అటు తమిళం, ఇటు తెలుగు, పైగా ఓవర్సీస్‌లోనూ పెద్ద మార్కెట్‌వున్న విజయ్‌తోనే ‘ఒకే ఒక్కడు’ సీక్వెల్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో విజయ్ సైతం సామాజిక కోణాన్ని ప్రతిబింబించే కథలతోనే ముందుకెళ్తున్నాడు. ఈ ఈక్వెషన్సన్నీ వర్కౌటై -విజయ్ ‘ఒకే ఒక్కడు’ సీక్వెల్ చేస్తే ఫ్యాన్స్ సంతోషానికి పట్టపగ్గాలు ఉండవన్నది మరో విషయం.
ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థతో కలిసి పెద్ద నిర్మాత దీపక్ ముకుట్ ‘ఒకే ఒక్కడు’ సీక్వెల్‌పై ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. మరోపక్క కథను తయారు చేసే బాధ్యతను బజరంగీ భాయిజాన్, బాహుబలి లాంటి హిట్టు స్టోరీలు రచించిన సక్సెస్‌ఫుల్ రైటర్ విజయేంద్ర ప్రసాద్‌కు అప్పగించే అవకాశాలు లేకపోలేదనీ అంటున్నారు.
గ్రాఫ్ మారుస్తాడా?
నిజానికి దక్షిణాది చిత్ర సీమలో ‘సీక్వెల్స్’ సక్సెస్ గ్రాఫ్ ఏమంత క్షేమకరం కాదన్నది ఇప్పటికే అనేక సినిమాలు రుజువు చేశాయి. ఒక్క తెలుగు వరకూ చూసుకున్నా జగపతిబాబు హీరోగా గాయం తరువాత గాయం -2 వికటించింది. చిరంజీవి హీరోగా శంకర్‌దాదా ఎంబీబీఎస్ ఇచ్చిన సంతృప్తికర ఫలితం శంకర్‌దాదా జిందాబాద్ ఇవ్వలేకపోయింది. ఆర్యతో సెటిల్డ్ హీరో అనిపించుకున్న బన్నీ, ఆర్య-2తో మెప్పించలేకపోయాడు. రామూ తీసిన రక్తచరిత్ర గొప్ప చిత్రంగా నిలిస్తే -రక్తచరిత్ర-2 సోదిలోకి లేకుండా పోయింది. దీంతో చిత్రపరిశ్రమలో సీక్వెల్స్ సేఫ్ బెట్ అన్న మాటకు అర్థం చెరిగిపోయి -చేతులు కాల్చుకోవాలంటే సీక్వెల్స్ తీయాలనే నమ్మకాలు బలపడిపోయాయి. అంతేకాదు, రజనీకాంత్ చంద్రముఖి చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన వెంకటేష్ నాగవల్లి, పవన్ గబ్బర్‌సింగ్‌కు సీక్వెల్‌గా వచ్చిన సర్దార్ గబ్బర్‌సింగ్, రవితేజ కిక్‌కు సీక్వెల్‌గా వచ్చిన కిక్-2, జెడీ చక్రవర్తి చిత్రం మనీకి సీక్వెల్‌గా వచ్చిన మనీ మనీ మనీ, మంత్ర చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన మంత్ర-2.. ఇలా ముందు వెనుకల్లో వచ్చిన సీక్వెల్స్ అన్నీ నిర్మాతలకు చెమటలు పట్టించినవే. కొరియోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా మారి లారెన్స్ తీసిన ‘కాంచన’, ‘ముని’, ‘గంగ’లాంటి సీక్వెల్స్ మాత్రమే ఆడియన్స్‌ను మెప్పించగలిగాయి. సీక్వెల్స్ దెబ్బతింటాయన్న నమ్మకాల్ని 2.ఓతో పటాపంచలు చేశాడు శంకర్. సూపర్ స్టార్‌ను సీక్వెల్‌లోకి దించి -్భరీ బడ్జెట్‌తో తెరకెక్కించిన 2.ఓతో అనూహ్య విజయం అందుకున్నాడు. ఇప్పుడు ఇండియన్-2, ఒకే ఒక్కడు సీక్వెల్స్‌కు సిద్ధమవుతున్న శంకర్ -గ్రాఫ్‌నే మార్చేస్తాడా? అన్న ఆసక్తి పెరుగుతోంది.
శంకర్ హిట్టు చిత్రాల్లో ఇంకా ఏవేం సీక్వెల్స్‌కు తీయొచ్చన్న విషయాన్ని పరిశీలిస్తే -98లో తీసిన జీన్స్ హిట్టందుకున్నా, కుటుంబ కథే అవుతుంది తప్ప సామాజికాంశాన్ని అందులో ఇమడలేదు. 93లో అర్జున్ అర్జానే హీరోగా జెంటిల్‌మేన్ చిత్రాన్ని -వైద్య విద్య బ్యాక్‌డ్రాప్ పెట్టి చేశాడు. ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి కనుక, దాని సీక్వెల్ ఇప్పుడు వర్కౌట్ కాకపోవచ్చు. 94లో ప్రభుదేవా హీరోగా వచ్చిన ప్రేమికుడు ఓ లవ్ స్టోరీ. 2003లో తెచ్చిన బోయ్స్ యూత్ ఎంటర్‌టైనర్. పైగా యావరేజ్. 2007లో తెచ్చిన శివాజీ అట్టర్ ఫ్లాప్. రీమేక్ స్టోరీ స్నేహితుడు, విక్రమ్‌తో చేసిన మనోహరుడు ఫ్లాప్ రిజల్టే ఇచ్చాయి. ఇక 2005లో విక్రమ్ హీరోగా చేసిన అపరిచితుడు ఓ బ్లాక్‌బస్టర్ హిట్టు ఉంది. దీనికీ శంకర్ సీక్వెల్ ప్రకటిస్తాడేమో చూడాలి.
హాలీవుడ్‌లో..: సీక్వెల్స్ మీద సీక్వెల్స్ చేయడం హాలీవుడ్‌కు అలవాటైన స్టయిల్. హిట్టయిన చిత్రాలన్నీ సిరీస్‌లుగా వస్తూనే ఉంటాయి. ఏళ్లపాటు సిరీస్ సినిమాలను తీస్తున్న నిర్మాణ సంస్థలూ అక్కడ కనిపిస్తాయి. ది హ్యాంగోవర్, టేకెన్, ట్రాన్స్‌ఫార్మార్స్, ఎవాన్ అల్మైటీ, సన్ ఆఫ్ ది మాస్క్, స్పీడ్, హన్నీబాల్, ఎగ్జార్సిస్ట్, ద గ్రెడ్జ్, ద రింగ్, బేసిక్ ఇన్‌స్టింక్ట్.. అలాగే సూపర్ హీరోస్ సిరీస్‌లు.. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని.
తెలుగులో..:
తెలుగులోనూ కొన్ని చిత్రాలున్నాయి. నిజానికి వాటికి సీక్వెల్స్ తీస్తే హిట్టుకొట్టగలవన్న నమ్మకాలూ ఉన్నాయి. అయినా, దర్శకులు ధైర్యం చేయలేకపోవడానికి అనేక కారణాలు. ఉదాహరణకు: చిరంజీవి ‘జగదేకవీరుడు -అతిలోక సుందరి’ ‘టాగూర్’, వెంకటేష్ ‘క్షణక్షణం’, సూపర్‌స్టార్ కృష్ణ ‘గూఢచారి 116’, నాగార్జున ‘హలోబ్రదర్’, మోహన్‌బాబు ‘పెదరాయుడు’, శ్రీకాంత్ ‘ఖడ్గం’, మహేష్‌బాబు ‘పోకిరి’, నాని ‘ఈగ’, రవితేజ ‘విక్రమార్కుడు’.. ఈ చిత్రాలు సీక్వెల్స్ తీయతగ్గ చిత్రాలే. సీక్వెల్స్ కోసం వీటిపై కొన్ని ఆలోచనలు, ప్రయత్నాలు సాగినా.. మొదలైన చోటే ఆగిపోవడం గమనార్హం.
***
ఏదేమైనా డైరెక్టర్ శంకర్ గ్రేట్ ‘ట్విస్ట్’లు ఇస్తున్నాడు. సీక్వెల్స్‌పై ఆసక్తిని పెంచే ప్రయత్నాలకు పదును పెడుతున్నాడు. చూద్దాం.. కొత్తగా ఇంకెవరెవరు ఇంకెలాంటి సీక్వెల్స్‌కు సిద్ధమవుతారో.

రిద్దికుమార్

$
0
0

రిద్దికుమార్

చదివే అలవాటు పెంచుదాం..

$
0
0

ప్ర: పుస్తకాలు ఎందుకు చదవాలి?
జ: మానవ సమాజం నిర్మించకున్న విజ్ఞాన సంపదను వారసత్వంగా వర్తమాన సమాజానికి అందించేవి పుస్తకాలు. వీటిని చదవకుండా మానవ సమాజం అభివృద్ధి చెందదు.
ప్ర: పుస్తకాలు చదివితే అనుభూతి..?
జ: పుస్తకాలు చదవకుంటే జ్ఞానవృద్ధి అసంభవం. పుస్తకాలు తరగని సంపద. అక్షరమంటేనే నశించదని అర్థం. అదే నిజమైన సంపద. పుస్తకాలు చదివే అలవాటు నూతన తరాలకు అందించడం మన బాధ్యత. పుస్తకాలకు దూరమైన సమాజం మానవీయ విలువలు కోల్పోతుంది.
ప్ర: పుస్తకాలు ఎన్ని రకాలు..?
జ: మానవ జీవితంలోని అన్ని కోణాలను ఆవిష్కరించే క్రమంలో విద్య, విజ్ఞాన, సామాజిక, ఆధ్యాత్మిక , కాలక్షేప సాహిత్యంతో పాటు అనేక అంశాలపై పుస్తకాలు లభిస్తున్నాయి. ప్రతి మనిషికీ కొన్ని అవసరాలుంటాయి. ఆ అవసరాలను పుస్తకాలు విజ్ఞానాన్ని అందించడం ద్వారా తీరుస్తాయి, పరిపూర్ణం చేస్తాయి.
ప్ర: పుస్తకాల కథ ఏమిటి?
జ: అచ్చు యంత్రం కనుగొనడంతో ముద్రణ మొదలైంది. ముద్రణ ఆధునిక పోకడలకు పోతున్న కొద్దీ పుస్తకాల ప్రచురణ చాలా సులువైంది. 11వ శతాబ్దం నుండి మొదలైన తెలుగు సాహిత్యం తాళపత్ర గ్రంథాలతో వెలుగు చూసింది. మానవ నాగరికతతో సమాంతరంగానే పుస్తకాల చరిత్ర కూడా ఉంది.
ప్ర: విద్యార్థుల్లో పుస్తక పఠనం పెంచడం ఎలా?
జ: ఇది చాలా ముఖ్యమైన అంశం. రానురాను చదివే ఆసక్తిని కోల్పోతున్న సందర్భంలో బుద్ధిజీవులు ఆందోళన చెందుతున్న సంగతి మనకు తెలిసిందే. డిజిటల్ టెక్నాలజీ పెరగడంతో విజానంపై ఆసక్తి పెరిగింది. చదివే అలవాటు తగ్గింది. ఇది మానవ సంబంధాలను దెబ్బతీస్తోంది. పైగా ఎంత అవసరమో అంతే చదువుతున్నారు. ఇది మున్ముందు ప్రమాదకర ధోరణి కూడా. పుస్తకాలకు ప్రత్యామ్నాయం ఉండదనే అవగాహన విద్యార్థులకు కల్పించాలి. పుస్తక పఠనం తగ్గడంతో పిల్లలు ఎక్కువగా సామాజిక మాధ్యమాల్లో లీనవుతున్నారు. పుస్తకాలకు దూరమైన విద్యార్థులు పెడత్రోవ పడుతున్నారు. తాత్కాలిక ప్రయోజనాలు సమాజానికి ప్రమాదకరం. ముఖ్యంగా టీచర్లు, తల్లిదండ్రులు గొప్ప పుస్తకాల గురించి, వాటిని చదివి జీవితాలను మార్చుకున్నవాళ్ల గురించి పిల్లలకు చెప్పాలి. ఆత్మకథలు, జీవిత చరిత్రలు విధిగా చదివించాలి. విస్తృతంగా చదివిన అంబేద్కర్, నెహ్రూ , గాంధీ , పీవీ నర్సింహరావు లాంటి గొప్పవాళ్లను పిల్లలకు పుస్తకాల ద్వారా పరిచయం చేయాలి. పుస్తకాలు లేని ఇళ్లు, చెట్లు లేని ఇళ్లు ఇళ్లే కావని పిల్లలకు తెలియజెప్పాలి. బహుమతులుగా ఉత్తమ గ్రంథాలను అందజేయాలి.
ప్ర: పుస్తక ప్రదర్శన చరిత్ర ఏమిటి?
జ: నేషనల్ బుక్ ట్రస్టు ఆఫ్ ఇండియా 1967 నుండి ప్రచురణ , పుస్తక ప్రదర్శన ప్రారంభించింది. ప్రజల్లో పఠనాసక్తిని పెంపొందించుకునేందుకు, రచయితలకు ప్రాచుర్యం కల్పించేందుకు, రాబోయే తరాలకు విజ్ఞాన ఆసక్తిని రగిల్చేందుకు పుస్తక ప్రదర్శనలు మొదలయ్యాయి. దేశస్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మొదలైన పుస్తక ప్రదర్శనలు ఈరోజు పట్టణాల్లో, గ్రామస్థాయిలో కూడా జరుగుతున్నాయి. పుస్తక ప్రదర్శనలకు వస్తున్న ప్రజానీకాన్ని చూస్తుంటే ఆశావహంగా అనిపిస్తోంది. అమ్మకాలు బాగుంటున్నాయి, విజ్ఞానాన్ని అందించే గ్రంథాలపై వివిధ వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది.
ప్ర: హైదరాబాద్ పుస్తక ప్రదర్శన గురించి...
జ: ప్రతి సంవత్సరం హైదరాబాద్ నగరంలో పుస్తక ప్రదర్శన జరుగుతోంది. అందుకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ సమన్వయం చేస్తోంది. ప్రముఖ ప్రచురణ కర్తలు, దుకాణ దారులు కలిసి 1985లో మొదటిసారి సిటీ కేంద్రగ్రంథాలయంలో బుక్ ఫెయిర్ నిర్వహించారు. 1987లో సొసైటీని రిజిస్టర్ చేశారు
ప్ర: పుస్తక ప్రదర్శనల పురోగతి ఎలా ఉంది?
జ: ప్రపంచంలో అన్ని దేశాలూ వివిధ సందర్భాల్లో పుస్తక ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. కొన్ని దేశాలు నిర్దిష్టంగా కొన్ని రోజుల్లో పుస్తక ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో పుస్తకాల కొనుగోళ్లు, ప్రచురణలు చాలా గొప్పగా ఉన్నాయి. హైదరాబాద్ పుస్తక ప్రదర్శనకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. పుస్తక ప్రదర్శన సందర్భంగా సాహితీ సదస్సులు, కవి సమ్మేళనాలు, ప్రముఖుల ప్రసంగాలతో పండుగ వాతావరణం సంతరించుకుంటోంది. మార్పుకోరుకునే ప్రతి ఒక్కరూ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో దర్శనమిస్తుంటారు.
ప్ర: రాష్ట్ర విభజన అనంతరం పుస్తక ప్రదర్శనలో మార్పులు..?
జ: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి ముందు , తర్వాత కూడా హైదరాబాద్ పుస్తక ప్రదర్శనకు ప్రత్యేకత ఉంది, జాతీయ స్థాయిలో పేరు గడించింది. అత్యంత సంక్షుభిత సమయాల్లోనూ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనను దిగ్విజయంగా నిర్వహించగలిగాం. అందరికీ అందుబాటులో ఉండటం మరో విశేషం.
ప్ర: తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక, సామాజిక, రాజకీయ వికాసానికి హైదరాబాద్ పుస్తక ప్రదర్శన ఏ రూపంలో తోడ్పాటునిస్తోంది?
జ: పుస్తక ప్రదర్శనలకు హద్దులు లేవు.కాకపోతే ప్రదర్శన జరిగిన ప్రాంతంపై అక్కడ ప్రదర్శితమైన పుస్తకాల ప్రభావం. కవులు, రచయితలు, విద్యావేత్తలు, సామాజిక వేత్తలు, సాంస్కృతిక వివేచనాపరుల ప్రభావం తప్పకుండా పడుతుంది. హైదరాబాద్ పుస్తక ప్రదర్శన తప్పనిసరి తెలంగాణ దిశ, దశను మార్చడంలో తన వంతు పాత్రను ఏపుడూ పోషిస్తోంది. సాహిత్యం, సంస్కృతి అనేవి పరస్పర ఆధారితాలు. సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రధాన వాహిక అయిన సాంస్కృతిక బృందాలు మనకు తెలుసు. తెలంగాణ ఉద్యమంలో సాహిత్య, సాంస్కృతిక రంగాల పాత్ర //ఎంతో ప్రభావశీలమైంది. అన్ని రంగాల వికాసానికి పుస్తకాలు పునాదిగా ఉంటాయి.
ప్ర: ముద్రణా రంగంలో మార్పులు..?
జ: ముద్రణా రంగంలో పెనుమార్పులే సంభవించాయి. అక్షరాలను పేర్చుకునే దశ నుండి నేరుగా కంప్యూటర్లలో కంపోజ్ చేసుకోవడమే కాదు, ఫిల్ము చేయాల్సిన పని లేకుండా ముద్రణకు పంపించగలిగే ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చేసింది. ప్రపంచంలో ఎక్కడో మారుమూల ప్రాంతాల నుండి ముద్రించుకునే వీలు కలిగింది. ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో పుస్తక ప్రచురణ చాలా సులువైంది. వేగవంతమైంది. ఆకర్షణీయమైన ముద్రణకు అవకాశం దక్కింది. ప్రచురణ కర్తలు నిరంతరం నూతన పోకడలతో తాజా సమాచారాన్ని అప్‌డేట్ చేసి ఇచ్చేందుకు వీలు కలిగింది.
ప్ర: డిజిటల్ విప్లవం ప్రభావం..?
జ: డిజిటల్ విప్లవం వాస్తవానికి ముద్రణ రంగానికి ప్రాణం పోసింది. అయితే మరో కోణంలో ఉపాధి అవకాశాలను తగ్గించింది. ముద్రణ రంగంపై ఆధారపడి జీవించేవారికి పనిలేకుండా అయిపోయింది. ఇపుడు అన్ని పనులూ యంత్రాలే చేస్తున్నాయి. డిజిటల్ విప్లవంతో ప్రచురణ మరింత తేలికైంది. ప్రింటింగ్ సులువైంది. క్వాలిటీ పెరిగింది. అందమైన ముద్రణ ఆకర్షించే స్థితికి డిజిటల్ విప్లవం తోడ్పాటు నిచ్చింది.
ప్ర: ఆధునిక పుస్తకం ఎలా ఉండబోతోంది?
జ: మనం సాంకేతికంగా ఎంత ఎదిగినా విజ్ఞాన సముపార్జనలో పుస్తకానిదే అగ్రస్థానం. చేతిలో పుస్తకం అమరినట్టు కంప్యూటర్లు ఒదగవు.ప్రయాణిస్తూ కూడా చదువుకునే వీలు పుస్తకంతోనే ఉంటుంది. వీలున్నపుడు ఇష్టం వచ్చిన రీతిలో చదువుకోవచ్చు.
ప్ర: పుస్తక ప్రదర్శనలపై ఆధునికత ప్రభావం ?
జ: ఆధునికత ఆరంభంలో వెర్రితలలు వేసినా, కొంతకాలానికి నిశ్చల స్థితికి చేరుకుంటుంది. యువత మళ్లీ పుస్తకాలను ఆశ్రయిస్తోంది. ఆధునికత ముప్పు పుస్తకాలకేమీ లేదు.
ప్ర: విద్య వికాసానికి, వ్యక్తిత్వ వికాసానికి పుస్తకాలు ఏ విధంగా దోహదం చేస్తాయంటారు?
జ: ఒక్క తెలంగాణలోనే కాదు, ఏ ప్రాంతాన్నైనా చైతన్యం చేయడానికి ఉత్తమ అభిరుచిని వ్యాప్తి చేయడానికి పుస్తక ప్రదర్శనలు దోహదం చేస్తాయి.
ప్ర: తెలంగాణ చరిత్ర వక్రీకరణలను సరిచేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
జ: పరాయి పాలనలో చరిత్ర సాహిత్యం సహజంగానే వక్రీకరణకు గురవుతుంది. రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా చరిత్ర , సాహిత్యం పునర్నిర్వచించడం జరుగుతోంది. ప్రచురణ కర్తలు ఆ కోణంలో ఆలోచిస్తున్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ 31 జిల్లాల చరిత్రకు అక్షర రూపం ఇచ్చే పనికి పూనుకుంది. ఇదో ఆశావాహ ధోరణి.
ప్ర: హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ఇతర కార్యక్రమాలు..?
జ: ‘బుక్ ఫెయిర్’లో పుస్తకాలు అమ్ముకోవడం అనేది చాలా చిన్న భాగం మాత్రమే. జ్ఞాన సముద్రాన్ని సందర్శకుల ముందు ఆవిష్కరించి, వాళ్లలో అభిరుచిని కలిగించడం, వాళ్లకు కావల్సిన సమాచార కేంద్రాన్ని గుర్తించేట్టు చేయడం, సదస్సులు, సమావేశాలతో చైతన్యాన్ని రగల్చడం, సాంస్కృతిక ప్రదర్శలు నిర్వహించడంతో పాటు పలు అంశాల్లో శిక్షణ కూడా కొనసాగుతుంది. అన్నింటికీ మించి పుస్తక ప్రేమికుల ‘నెట్‌వర్క్’ ఏర్పడుతుంది. కొత్త పుస్తకాలు ఏం వచ్చాయో, రచయితల భావనలు, ధోరణులు ఎలా ఉన్నాయో, సమాజం దిశ ఎటుగా సాగుతుందో వంటి అంశాలను తెలుసుకోవచ్చు. విద్యార్థులకు పనికొచ్చే కొత్త పుస్తకాలు ఏం ఉన్నాయో అర్థం అవుతుంది.
*
జూలూరి గౌరీశంకర్
అధ్యక్షుడు, హైదరాబాద్ పుస్తక ప్రదర్శన కమిటీ

పుస్తకం.. ప్రియనేస్తం

$
0
0

‘‘ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత అదృష్టవంతులైన వారు తల్లిదండ్రుల సంపూర్ణ ప్రేమను పొందిన వారు కానే కాదు.. పుస్తక పఠనం ద్వారా సంపూర్ణ ఆనందాన్ని పొందిన వారే.. మొదటి అంశం ఆధారపడటానికి దోహదం చేస్తే, రెండోది మంచి వ్యక్తిత్వానికి దారి తీస్తుంది..’’
-అని ప్రఖ్యాత నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ఓ పుస్తకంలో రాసిన మాటలు అక్షరసత్యాలు. ‘పుస్తకం’ అంటే కాగితాల సంగ్రహం మాత్రమే కాదు. మనిషిని మరో లోకంలోకి తీసుకువెళ్లే ఓ ‘శాటిలైట్’. మన కళ్లెదుట నవీన రంగుల ప్రపంచాన్ని ఆవిష్కరించి మైమరిపించే శక్తి పుస్తకానిదే. మనిషికి ఆకాశమంత ఆత్మవిశ్వాసాన్నిచ్చేది పుస్తకమే. మహానీయుల భావజాలాన్ని, వ్యక్తిత్వాన్ని , వారి అడుగుజాడలను ఆవిష్కృతం చేసేది పుస్తకమే. సమాచార సాంకేతిక విప్లవం ఎంతగా ఎదిగినా- పుస్తకం ‘ఎవర్‌గ్రీన్’!
పుస్తకం విజ్ఞాన ఖని, గత చరిత్రనూ, వర్తమానాన్ని నిక్షిప్తం చేసుకుని భవిష్యత్‌లోకి తీసుకువెళ్లే విజ్ఞాన భాండాగారం అది. చరిత్రను వర్తమానానికి పరిచయం చేసే వారధి, విజ్ఞానాన్ని అందించే కరదీపిక పుస్తకం. సమాజ పరిణామ క్రమంలో నిర్మితమైన చరిత్ర, సాహిత్యం, తాత్త్వికత, సంస్కృతి వంటి అంశాలను భవిష్యత్ తరాలకు అందించే దూతగా వ్యవహరిస్తుంది పుస్తకం. పుస్తకం అంటే తరగతి గదికే పరిమితం కాదు, ఒక్కో పుస్తకం ఒక్కో చరిత్ర అయి ప్రపంచానే్న ప్రభావితం చేస్తుంది. పుస్తకాలు పలు రూపాల్లో ఉద్యమాలు నిర్మించాయి. అది మనం తెలంగాణలోనూ గమనించాం. అంతకు ముందు ఆంధ్రాప్రాంతంలోనూ చూశాం. ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో పుస్తకాలే ఉద్యమ స్ఫూర్తిని రగిలించాయి. ఎందరినో ప్రభావితం చేశాయి. ఆ స్ఫూర్తితోనే ఎంతో మంది ఆదర్శపురుషులు పుట్టుకొచ్చారు. గ్రీకు తత్త్వవేత్తలు సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ వంటి మేధావుల ఆలోచనలకు మనకున్న ఏకైక సాక్షి పుస్తకమే. మానవ జీవన సాంస్కృతిక పరిణామ క్రమంలో పుస్తకాలు పోషించే పాత్ర అనూహ్యం, అమోఘం.
పుస్తకాన్ని ఒక గుర్తింపుగా భావించకుండా తమ మానసిక పరిపూర్వత్వాన్ని సాధించుకునేందుకు ఒక వాహకంగా వినియోగించుకోవాలి. పిల్లల పుస్తకాలు, సాహిత్య గ్రంథాలు, చరిత్ర, బాల సాహిత్యం, వ్యక్తిత్వ వికాసం, ఆధ్యాత్మిక గ్రంథాలు, కథలు, నవలలు, కాల్పనిక సాహిత్యం వంటివి అమ్మకాల్లో ఎపుడూ ముందుంటున్నాయి. వీటి తర్వాతి స్థానంలో తరగతి పుస్తకాలు, జనరల్ నాలెడ్జి గ్రంథాలు ఎక్కువగా చదువుతున్నట్టు తేలింది. అనువాదనాలు, భాషా- సంస్కృతిపై మోనాగ్రాఫ్‌లు, అరవింద అడిగ నైట్ టైగర్ వంటి పుస్తకాలు, ఒమాబా జీవిత చరిత్ర, హ్యారీ పోటర్, , జిడ్డు కృష్ణమూర్తి కుతూహలం, ఇస్కాన్ భగవద్గీత, ఎడ్యుకేషన్ గ్రంథాలు, సామాజికశాస్త్ర గ్రంథాలు వంటివి అందర్నీ ఆకర్షిస్తుంటాయి.
ముఖచిత్రాలు చూసి కొనేవారు కొందరు, రచయితలను చూసి కొనేవారు మరికొందరు, విషయాన్ని అర్థం చేసుకుని పుస్తకం లోపలి విషయాలను తెలుసుకుని కొనేవారు ఇంకొందరు ఉంటారు. గొప్ప గొప్ప పుస్తకాలు ఒక్కో మారు అందమైన అట్టలు లేక పాలిపోయి, ఎవరి దృష్టినీ ఆకర్షించుకుండా అల్మరాలకే పరిమితం అవుతుంటాయి. ఇపుడిపుటే నేషనల్ బుక్ ట్రస్టు వంటి ప్రభుత్వ సంస్థలు, పలు ప్రైవేటు ప్రచురణ సంస్థలు కవర్‌పేజీలపై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నాయి. కొంత మంది మరో అడుగు ముందుకు వేసి అబ్ స్ట్రాక్ట్ ఆర్టును కవర్‌పేజీలపై వేసుకుంటూ పుస్తకాలను అందంగా ముద్రిస్తున్నారు. కొంత మంది మూడ్ కోసం పుస్తకాలు చదివితే, మరికొంత మంది మూడ్ ఆఫ్‌ను పోగొట్టుకోవడానికి పుస్తకాలు చదువుతుంటారు. కోపాన్ని తగ్గించుకునేందుకు, ప్రశాంతతను కోరుకునేందుకు పుస్తకాలు చదువుతుంటారు. ఇంకో పక్క నేటి తరంలో పుస్తక పఠనాన్ని పెంచేందుకు విభిన్నమైన మార్గాలను మానసిక శాస్తవ్రేత్తలు సూచిస్తున్నారు. పుస్తకం చదివే అలావాటు ఏకగ్రతను పెంచుతుంది. రోజుకో అరగంట చదివినా చాలు, ఆ సమయంలో మనసు, మెదడు అనుసంధానం జరిగి అదో ధ్యానంగా మారుతుంది. మతిమరుపు ఇబ్బంది పెడుతూ ఉంటే పుస్తకాలు చదవడం మొదలుపెడితే చాలు- మెదడులోని న్యూరాన్లు యాక్టివ్‌గా మారుతాయి. చూడటం, చదవడం, గ్రహించడం దానిని ‘స్టోర్’ చేసుకోవడం.. ఇలా అన్నీ ఒకే మారు జరిగి మెదడును చైతన్యపరుస్తాయి. రప్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్ అధ్యయనంలో- ‘వయసు ప్రభావం మెదడు మీద లేకుండా చేసే శక్తి పుస్తక పఠనానికే ఉంద’ని తేల్చి చెప్పింది. బాగా చదివే అలవాటున్న వారి మెదడు, వారి శారీరక వయస్సు కంటే తక్కువగా ఉండటాన్ని కూడా గుర్తించారు. మానసిక ధృడత్వం, సమస్యలను ఎదుర్కొనే ధైర్యం, ‘ఎమోషనల్ ఇంటెలిజెన్స్’ ఇలా ఎన్నో జీవన నైపుణ్యాలను పుస్తక పఠనం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది గట్టిగా చెపుతున్నారు నిపుణులు. ఒక్క పుస్తకం చేతిలో ఉంటే చాలు ఎందరో మనతో ఉన్నట్టే. మానసిక ప్రశాంతత , ఉత్సాహం అన్నీ లభిస్తాయి. ఒత్తిడికి సులువైన విరుగుడు పుస్తకం. చదవడం మొదలుపెట్టగానే శరీరం, మనసు రెండూ రిలాక్స్ అవ్వడం మొదలవుతుంది. ఇక భాషా జ్ఞానం పెరగడం వంటి లాభాలు , అందరికీ అన్ని విధాలుగా ఎంతో ప్రయోజనం ఈ పుస్తక పఠనం వల్ల అని తెలిశాక దానితో స్నేహం చేయకుండా ఉండగలమా? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకానొక సందర్భంలో స్వయంగా చెప్పుకున్నారు- తాను దాదాపు 70 వేల పుస్తకాలు చదివానని. అలా వందలాది పుస్తకాలు చదివిన హేమాహేమీలు చాలామంది ఉన్నారు.
‘అక్షర రూపం దాల్చిన ఒక సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక’ అన్నారు ప్రజాకవి కాళోజీ. ‘పాత చొక్కా అయినా తొడుక్కో.. కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో’ అని సంఘ సంస్కర్క, రచయిత కందుకూరి వీరేశలింగం పంతులు అన్నారు. నిత్యం అన్వయించుకోదగిన అంశం ఇది. వ్యక్తి తనను తాను అర్థం చేసుకోవడానికే కాదు, ప్రపంచాన్ని చూసేలా మన దృష్టిని మార్చడానికి ఉపయోగపడే గొప్ప సాధనం పుస్తకం. ఎన్ని పుస్తకాలు చదివినా, మనలో ఉన్న ఉత్తమమైన వ్యక్తిత్వం బయటకు వచ్చినపుడే పఠనానికి సార్థకత దక్కుతుందని మహాత్మాగాంధీ ఎన్నో మార్లు చెప్పారు. పుస్తకం కన్నతల్లి పాత్ర పోషిస్తుందని రష్యన్ రచయిత మాగ్జిం గోర్కి పేర్కొన్నారు. ‘కొన్ని పుస్తకాలను రుచి చూడాలి, కొన్నింటిని మింగేయాలి, మరికొన్నింటిని నమిలి జీర్ణం చేసుకోవాలి’ అంటాడు బేకన్. మనల్ని గుచ్చి గాయపరిచి, ఇబ్బంది పెట్టే రచనల్ని మనం చదవాలి. మనం చదువుకుతున్న పుస్తకం మన తలపై మొట్టి మేల్కొలపని పక్షంలో అసలు చదవడం ఎందుకు? మంచి పుస్తకం ఒక గొప్ప సంఘటనలా మనల్ని ప్రభావితం చేయాలి. మనకన్నా మిన్నగా మనం ప్రేమించే ఆప్తుల మరణంలా మనల్ని తీవ్రంగా కలచివేయాలి, అందరికీ దూరంగా ఏకంతంగా అరణ్యాలకు పోవాలనిపించేలా ప్రేరేపించాలి, పుస్తకం మనలో గడ్డకట్టిన సముద్రాల్ని గొడ్డలిలా పగలగొట్టాలి అంటారు కాఫ్కి. ఇలా పుస్తకాల గురించి ఎంతో మంది ఎన్నో విషయాలు చెప్పారు. టీవీ, రేడియో, ఎఫ్‌ఎంలు, ఇంటర్నెట్ సహా ఎన్ని మాధ్యమాలు అందుబాటులో ఉన్నా, పుస్తకాల చదువరుల సంఖ్య తగ్గలేదని ఇటీవలి సర్వేలు వెల్లడిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 23న పుస్తక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. అదే రోజును మనం పుస్తక, కాపీరైట్ దినోత్సవంగా కూడా నిర్వహిస్తున్నాం. ప్రపంచ పుస్తక ప్రదర్శన న్యూఢిల్లీ ప్రగతి మైదాన్‌లో వచ్చే ఏడాది జనవరి 5 నుండి 13 వరకూ జరగనుంది. అంతకంటే ముందే 32వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన ఎన్టీఆర్ స్టేడియం తెలంగాణ కళాభారతి ప్రాంగణంలో ఈనెల 15 నుండి 25వ తేదీ వరకూ జరగనుంది. ఏటా పుస్తక ప్రదర్శనను దాదాపు 10 లక్షల మంది సందర్శిస్తుంటారు. ఈ ఏడాది ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. దాదాపు 500 స్టాల్స్ వరకూ ఏర్పాటు చేసే యోచనలో కమిటీ ఉంది. దేశంలో అన్ని రాష్ట్రాల నుండి పుస్తక ప్రచురణ కర్తలు హైదరాబాద్ పుస్తక ప్రదర్శనకు హాజరుకాబోవడం విశేషం.
వాస్తవానికి ప్రపంచ పుస్తక ప్రదర్శనపై విభిన్నమైన కథనాలున్నాయి. 17వ శతాబ్దం నాటి యూరప్‌లో ఆ రోజును సెయింట్ జార్జి డేగా పాటించేవారు. స్పెయిన్‌లో ఇదే రోజున ప్రతి పుస్తకం కొనుగోలుపై ఒక గులాబీని బహుమతిగా ఇచ్చేవారు. సెవాంతెస్, షేక్సిపియర్, ఇన్కాగర్సిలాసో వేగా వంటి ప్రఖ్యాత రచయితలు 1616లో అదే రోజున మరణించారు. అంతేగాక జోసెఫ్ ప్లా, వ్లాదిమర్, మారిన్ ధ్రువాం ఇకా చాలా మంది ప్రఖ్యాత రచయితలకు ఈ తేదీతో ఏదో ఒక రకమైన అనుబంధం ఉంది. దీంతో అదేరోజున పుస్తక దినోత్సవాన్ని నిర్వహించడం ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తంగా వేర్వేరు తేదీల్లో పుస్తక మహోత్సవాలను నిర్వహించినా ఇన్ని ప్రత్యేకతలున్న ఏప్రిల్ 23న ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని నిర్వహించాలని 1955లో యునెస్కో
ప్రకటించింది. 2017లో రిపబ్లిక్ ఆఫ్ గినీలోని కోనాక్రీ నగరాన్ని , 2018లో గ్రీస్‌లోని ఎథీన్స్ నగరాన్ని ప్రపంచ పుస్తక రాజధానిగా ప్రకటించింది.
ప్రపంచంలో మొదటి పుస్తకం చైనాలోని 8వ శతాబ్దంలో ముద్రించారని చరిత్ర చెబుతోంది. ఇందుకు ఉడ్ బ్లాక్స్‌ను వాడారు. ఆ తర్వాత 14వ శతాబ్దంలో చైనాతో పాటు కొరియా కూడా పుస్తకాలను ముద్రించడం ప్రారంభించింది. మొట్టమొదటి ఆంగ్ల పుస్తకం 1473లో విలియం కాక్సటన్ అనే వ్యక్తి ప్రింట్ చేశారు. దీని పేరు ‘రీసైల్ ఆఫ్ ద హిస్టరీస్ ఆఫ్ ట్రోయి’. కానీ అధికారికంగా చాసర్స్ సెంచురీ చ్యూరీ టైల్స్ అనే పుస్తకం మొట్టమొదటిసారి ఆంగ్లంలో ప్రచురితమైనదిగా నమోదైంది. అది 1477లో ప్రచురితమైంది. 1638లో మసాచుసెట్స్ బే కాలనీ ఓత్ ఆఫ్ ఫ్రీ మాన్ అనే పుస్తకం ముద్రితమైంది. రెండో పుస్తకం 1639లో ప్రచురించారు, దాని పేరు అల్కనాక్ ఫర్ ద లియర్ ఆఫ్ అవర్ లార్డ్.
ఇంకో విచిత్రమైన విషయం ఏమంటే మనకంటే పాశ్చాత్యదేశాల వారు ఎక్కువగా పుస్తకాలు చదువుతారనే భావన అందరిలో ఉన్నా, పుస్తకాలు ఎక్కువగా చదివేది భారతీయులేనని ఒక సర్వే వెల్లడించింది. భారతీయులు వారానికి 10 గంటల 42 నిమిషాల పాటు సగటున పుస్తక పఠనానికి కేటాయిస్తారు. భారత్ తర్వాత ఎక్కువగా పుస్తకాలు చదివే అలవాటున్న దేశం థాయిలాండ్. మూడో స్థానంలో చైనా ఉంది. మారుతున్న జీవనశైలిలోనూ ఇప్పటికీ భారతీయలే పుస్తక పఠనంలో అగ్రపథంలో ఉన్నారు. ఈ సంఖ్య మరింతగా పెరగాలని పుస్తకాలు చదవడంలో ఎప్పటికీ భారతీయులే అగ్రస్థానంలో ఉండాలని పుస్తక ప్రియులు కోరుకుంటున్నారు.
మనిషికి మరణం ఉన్నా, పుస్తకానికి మరణం లేదు. అదో అద్భుతమైన కూడలి. తరతరాలుగా జ్ఞానాన్ని అందించే వారసత్వాన్ని కోల్పోని అద్భుతం పుస్తకం. అందుకే బమ్మెర పోతన ‘పుస్తకం హస్త్భూషణం’ అన్నారు. పుస్తక పఠనం ఆనందాన్ని, ఉల్లాసాన్ని, విజ్ఞానాన్ని, వివేచనను, నైతికతను పెంచుతుంది తద్వారా ప్రతి ఒక్కరిలో సాత్వికత అలవడుతుంది. అది మానసికంగానూ, శారీరకంగా ప్రభావితం చేస్తుంది. ఫలితంగా మనలో ఒత్తిడి తగ్గించి ఆరోగ్యాన్ని కుదుటపరుస్తుంది. వివిధ భాషలపై పట్టు పెంచుతుంది. ప్రపంచం ఏటుపోతోందన్న విషయాన్ని అరచేతిలో చూపిస్తుంది. సామాజిక మాధ్యమాల్లో ఎంత చదివినా కలగని సంతృప్తి పుస్తకాలు చదివినపుడే కలుగుతుంది. దానికి కారణం- పఠనంలోని అనుభూతి శాశ్వతమైనది. ఆ మాటకొస్తే జీవితమే ఒక పుస్తకం. చాలా వరకూ పుస్తకాలు అన్నీ అనుభవాల సారాంశాలే. ఎందరో మహానుభావులు తమ జీవిత గాధలు, జీవితంలో ఎదుర్కొన్న ఆటుపోట్లు, సమాజంలో నిబిడీకృతమైన అద్భుతాలకు, అనూహ్య చారిత్రక సత్యాలకు ఆధారం పుస్తకాలే. గతకాలపు మధురస్మృతులను మనముందుంచి భవిష్యత్‌కు మార్గదర్శనం చేస్తుంది.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అభిరుచులకు అనుగుణంగా డిజిటల్ పుస్తకాలు ఇపుడు అందుబాటులోకి వచ్చాయి. మరికొన్ని ఎలక్ట్రానిక్ పుస్తకాలు హవా కొంత కాలం కొనసాగినా, వాటిలో సాధారణ పుస్తకాన్ని చదివిన సౌకర్యం లేకపోవడంతో విముఖత పెరిగింది.
అందుకే ఒక చోట కవి సీతారాం పుస్తకాల గురించి రాస్తూ- ‘బహుశా తాము కారు కొనుక్కున్న రాత్రి కంటే పుస్తకాలు కొనుకున్న రాత్రి సుఖంగా నిద్రపోతారు’ అని పేర్కొన్నాడు. పుస్తకాల ప్రత్యేకత అది. పుస్తక ప్రియులు పుస్తకాలను తులసి ఆకుల్లా కళ్లకూ, హృదయానికి అద్దుకుని మరీ కొనుక్కుంటారని, బుక్కులకు బుక్కైపోయిన వారు ఎందరో ఉన్నారని సీతారాం పేర్కొన్నారు.
ఆ దాహం తీరనిది!
తెలుగులో అనేక మంది రచయితలు, సాహితీవేత్తలు, కవులు, అభ్యుదయవాదులు, విప్లవకారులు, ఆధ్యాత్మిక రచయితలు ఉన్నారు. పాల్కురికి సోమనాథుడి నుండి మొదలుపెడితే వందలాది మంది గొప్ప సాహిత్యకారులు తెలుగునేలపై ప్రభవించారు. వారు రాసిన గ్రంథాలు ప్రతి ఒక్కరి జీవితాలను మలుపుతిప్పేవే. తెలంగాణలో బమ్మెర పోతన, బద్దెన, మల్లినాథ సూరి, కంచర్ల గోపన్న, దాశరధి కృష్ణమాచార్య, కాళోజీ, వట్టికోట ఆళ్వార్‌స్వామి, బూర్గుల రామకృష్ణారావు, సామల సదాశివ, సి.నారాయణ రెడ్డి, దాశరధి రంగాచార్య, కపిలవాయి లింగమూర్తి, సురవరం ప్రతాప్‌రెడ్డి, గద్దర్, గోరటి వెంకన్న, సీతారాం, అఫ్సర్, ప్రసేన్, జూలూరి గౌరీశంకర్ వరకూ ఎందరో రచయితల గ్రంథాలు ప్రతి ఒక్కరిలో సరికొత్త స్ఫూర్తిని రగిలిస్తాయి. ఆంధ్రా ప్రాంతంలో పరవస్తు చిన్నయ్య సూరి, ఆదిభట్ల, కందుకూరి విరేశలింగం, గురజాడ అప్పారావు, గిడుగు, శ్రీపాద కృష్ణమూర్తి, చిలకమర్తి లక్ష్మీ నర్సింహం, విశ్వనాథ సత్యనారాయణ, కొమర్రాజు వేంకట లక్ష్మణరావు, తిరుపతి వెంకటకవులు, పార్వతీశ్వర కవులు, వేటూరి ప్రభాకరశాస్ర్తీ, మల్లంపల్లి సోమశేఖర శర్మ, మాడపాటి, దేవులపల్లి, గుర్రం జాషువా, అడవి బాపిరాజు, నోరి నర్సింహశాస్ర్తీ, శ్రీరంగం శ్రీనివాసరావు, చలం, ఇలా ఎందరో రచయితలు రాసిన గ్రంథాలు చదవాలంటే ఒక మనిషి జీవితం వేల సంవత్సరాలున్నా చాలదేమో, ఆ దాహం తీరదేమో..!


రాశిఫలం 12/16/2018

$
0
0
తిథి: 
శుద్ధ నవమి రా.2.50, కలియుగం - 5120 శాలివాహన శకం - 1940
నక్షత్రం: 
ఉత్తరాభాద్ర రా.11.31
వర్జ్యం: 
ఉ.8.00 నుండి 9.43 వరకు విశేషాలు: ధనుర్మాసారంభం
దుర్ముహూర్తం: 
సా.4.24నుండి 5.12 వరకు
రాహు కాలం: 
సా.4.30 నుండి 6.00 వరకు
మేషం: 
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించుట అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలేర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణవల్ల ఇబ్బందులనెదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టు కార్యాలకు దూరంగా వుంటారు.
వృషభం: 
(కృత్తిక 2,3,4పా., రోహిణి, మృగశిర 1,2పా.) స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగానుండుట మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. నూతన వ్యక్తుల పరిచయమేర్పడుతుంది. ప్రయాణాలవల్ల లాభాన్ని పొందుతారు. తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. నూతన కార్యాలు వాయిదావేసుకోక తప్పదు.
మిథునం: 
(మృగశిర 3,4పా., ఆర్ద్ర, పునర్వసు 1,2,3పా.) నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభముంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగియుంటారు. శుభవార్తలు వింటారు.
కర్కాటకం: 
(పునర్వసు 4పా., పుష్యమి, ఆశ్రేష) విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభమేర్పడే అవకాశముంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టాన్ని అధిగమిస్తారు. ఈరోజు ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.
సింహం: 
(మఖ, పుబ్బ, ఉత్తర 1పా.) అనుకోకుండా కుటుంబంలో కలహాలేర్పడే అవకాశముంటుంది. అశుభవార్తలు వినాల్సివస్తుంది. ఆకస్మిక ధననష్టం జరుగకుండా జాగ్రత్తపడుట మంచిది. మనస్తాపానికి గురి అవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. నూతన కార్యాలు వాయిదావేసుకోక తప్పదు.
కన్య: 
(ఉత్తర 2,3,4పా., హస్త, చిత్త 1,2పా.) అనారోగ్య బాధలతో సతమతమవుతారు. స్థానచలన సూచనలుంటాయి. నూతన వ్యక్తులు కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుండక మానసికాందోళన చెందుతారు. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి.
తుల: 
(చిత్త 3,4పా., స్వాతి, విశాఖ 1,2,3పా.) శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరును. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాలవల్ల లాభంచేకూరును. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధన చింత ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్నివిధాలా సుఖాన్ని పొందుదురు.
వృశ్చికం: 
(విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ) ఊహించని కార్యాల్లో పాల్గోవచ్చు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి వుంటుంది. ఆత్మీయులను కలియుటలో విఫలమవుతారు. అనవసర వ్యయప్రయాసలవల్ల ఆందోళన చెందుతారు. వృథా ప్రయాణాలెక్కువగా ఉంటాయి. స్ర్తిల మూలకంగా ధనలాభముంటుంది.
ధనుస్సు: 
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.) ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సివస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా డబ్బు ఖర్చగుటచే, ఆందోళన చెందుదురు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించక తప్పదు.
మకరం: 
(ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.) అన్ని కార్యములందు విజయాన్ని సాధిస్తారు. ప్రతిచోటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రుబాధలుండవు. శుభవార్తలు వింటారు. గౌరవ, మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తిసామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితోపాటు ఆకస్మిక ధనలాభముంటుంది.
కుంభం: 
(ధనిష్ఠ 3,4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.) ప్రయాణాల్లో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టమేర్పడకుండా జాగ్రత్తవహించుట మంచిది. అనారోగ్య బాధలు తొలగుటకు డబ్బు ఎక్కువ ఖర్చుచేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవదర్శనం ఉంటుంది. స్ర్తిలు మనోల్లాసాన్ని పొందుతారు.
మీనం: 
(పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి) స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. నిరుత్సాహం తప్పదు. అపకీర్తి వచ్చే అవకాశముంటుంది. ఇతరులకు అవకాశం కలిగించే పనులకు దూరంగానుండుట మంచిది. పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చినచో అనారోగ్య బాధలుండవు.
Date: 
Sunday, December 16, 2018
author: 
గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి

బాబోయ్.. పెథాయ్

$
0
0

విశాఖపట్నం/అమరావతి, డిసెంబర్ 15: దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శనివారం సాయంత్రానికి తుపానుగా బలపడింది. ఇది తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు శనివారం రాత్రి వెల్లడించారు. ఈ తుపానుకు పెథాయ్‌గా నామకరణం చేశారు. ప్రస్తుతం ఇది మచిలీపట్నానికి 770 కిమీ, చెన్నైకి 590 కిమీ దూరంలో ఉంది. పెథాయ్ తుపాను గంటకు 17 కిమీ వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల 17వ తేదీ సాయంత్రానికి మచిలీపట్నం - కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. పెథాయ్ తుపాను ప్రభావంతో 16, 17 తేదీల్లో కోస్తాలోని పలు ప్రాంతాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు కురుస్తాయన్నారు. 17న తుపాను తీరం దాటే సమయంలో ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. పెథాయ్ ప్రభావంతో ప్రస్తుతం కోస్తాలో గంటకు 60 నుంచి 70 కిమీ వేగంతో గాలులు వీస్తున్నాయన్నారు. 16న తీరం వెంబడి ఈశాన్య దిశలో గంటకు 45 నుంచి 55 కిమీ వేగంతోను, తీరం దాటే సమయంలో 17న తీరం వెంబడి గంటకు 80 నుంచి 90 కిమీ వేగంతోను గాలులు వీస్తాయని పేర్కొన్నారు. కోస్తా ప్రజానీకం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పెథాయ్ తుపాను ప్రభావంతో సముద్రం కల్లోలంగా ఉంటుందని, సముద్రంలో అలలు 6 మీటర్ల ఎత్తుకు ఎగసిపడే అవకాశం ఉందన్నారు. అన్ని పోర్టుల్లోనూ ఒకటవ
నెంబర్ ప్రమాద సూచి ఎగుర వేశారు. పెథాయ్ తీవ్రత నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.
ఇదిలాఉండగా రాష్ట్రంలో కోస్తాంధ్ర ప్రాంతంలో నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం తీర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరిలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా జిల్లాల్లో ప్రత్యేక కంట్రోల్ రూములతో పాటు సహాయ, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. తుపాను తీరం దాటే సమయంలో సాధారణ స్థాయి నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సముద్రతీర, నదీపరివాహక ప్రాంతాల్లో గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులను ఆదేశించారు. ప్రాణనష్టం జరక్కుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తుపాను కారణంగా మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లరాదని అధికారులు ఇప్పటికే నిషేధాజ్ఞలు విధించారు. కాగా ప్రకాశం జిల్లాకు చెందిన 50 మంది మత్స్యకారులు సముద్రంలో వేటకువెళ్లి తప్పిపోయినట్టు సమాచారం. గత ఐదురోజుల క్రితం వీరు వేటకు వెళ్లినట్టు చెప్తున్నారు. మత్స్యకారుల వద్ద ఉన్న మొబైల్ ఫోన్లు పనిచేయకపోవటంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. చీరాల వాడరేవుకు 40 కిలోమీటర్ల దూరంలో వీరు ఉండవచ్చనే సంకేతాలు అందుతున్నాయి. అయితే వారంతా సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు. కోస్తాంధ్ర ప్రాంతంలో కళ్లాల్లో ఉన్న వరి ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతాంగం ఉరకలు, పరుగులు తీస్తున్నారు. శనివారం సాయంత్రం వరకు వాతావరణం తుపాను ప్రభావం అంతగా లేకపోవటంతో రైతులకు వెసులుబాటు కలిగింది. దీంతో ఓదెలపై ఉన్న ధాన్యాన్ని బస్తాల్లో నింపి ఇళ్లకు చేరవేసుకుంటున్నారు.

ఫిబ్రవరిలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్?

$
0
0

న్యూఢిల్లీ: తెలంగాణ తదితర ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల ప్రక్రియ ముగియటంతో కేంద్ర ఎన్నికల సంఘం తన దృష్టిని 2019 ఏప్రిల్, మేలో జరపవలసిన లోక్‌సభ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరా 2019 లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రాథమిక చర్చలకు శ్రీకారం చుట్టినట్లు తెలిసింది. ఎన్నికల కమిషనర్ అశోక్ లవాసాతో ఈ అంశంపై ఇప్పటికే రెండు దఫాలుగా చర్చలు జరిపినట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. 17వ లోక్‌సభ ఎన్నికలను ఏప్రిల్, మేలో ఎనిమిది నుండి పది దశల్లో నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు ప్రారంభించిందని అంటున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఫిబ్రవరిలో ఓట్ ఆన్ అకౌంట్‌ను పార్లమెంటులో ప్రతిపాదించిన అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం 17వ లోక్‌సభ ఎన్నికలకు సంబందించిన షెడ్యూలును సిద్ధం చేస్తుందని అంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలు జనవరి 8వ తేదీతో ముగుస్తాయి. 16వ లోక్‌సభ ఆఖరు సమావేశాలు జనవరి ఆఖరు వారంలో ప్రారంభమై ఫిబ్రవరి 10 లేదా 12వ తేదీలోగా ముగుస్తాయని అంచనా వేస్తున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ ప్రక్రియను ముగించిన తరువాత ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు విడుదల కావచ్చునని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు అంటున్నారు. పదిహేడవ లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి త్వరలోనే వివిధ రాష్ట్రాల ఎన్నికల అధికారులతో ఒక విస్తృత స్థాయి సమావేశం జరుపుతారని తెలిసింది. 2014లో పదహారవ లోక్‌సభ ఎన్నికలు 2014 ఏప్రిల్ 7వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు తొమ్మిది దశల్లో జరిగాయి. భద్రతా కారణాల దృష్టా 17వ లోక్‌సభ ఎన్నికలు ఎనిమిది నుండి పది దశల్లో జరుగవచ్చునని అంటున్నారు. నరేంద్ర మోదీ 2014 మే పదహారో తేదీనాడు దేశ పధ్నాల్గవ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా లోక్‌సభ మొదటి సమావేశం జూన్ 4 నుంచి 11 వరకు జరిగింది.
ఫిబ్రవరి రెండో వారంలో పార్లమెంటు ఓట్ ఆన్ అకౌంట్ సమావేశాలు ముగిసిన వెంటనే ఎన్నికల రంగంలోకి దూకేందుకు జాతీయ, ప్రాంతీయ పార్టీలు సిద్ధం అవుతున్నాయి. 17వ లోక్‌సభతోపాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం, జమ్ముకాశ్మీర్ శాసనసభలకు ఎన్నికలు జరుగవలసి ఉన్నది. తెలంగాణ శాసనసభ ఎన్నికలు కూడా లోక్‌సభ ఎన్నికలతో జరుగవలసి ఉండగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయం సాధించిన విషయం తెలిసిందే.

వ్యవసాయ వర్సిటీలో ముగిసిన వర్క్‌షాప్

$
0
0

రాజేంద్రనగర్, డిసెంబర్ 15:రాజేంద్రనగర్‌లోని విస్తరణ విద్యా సంస్థలో 2019-20వ సంవత్సరానికిగాను నిర్వహించవలసిన శిక్షణ కార్యక్రమాల అవసరాలు గుర్తించుటకు జరిగిన వర్క్‌షాపు శనివారం ముగిసింది.
30 మంది ప్రతినిధులు(వ్యవసాయ, అనుబంధ రంగాల శిక్షణా సంస్థల అధికారులు) గ్రూపులుగా విభజించి వారి ద్వారా వివిధ శిక్షణ కార్యక్రమాల అవసరాలు గురించి ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో అన్ని దక్షిణ బారత రాష్ట్రాల నుంచి సంబంధించిన అధికారులు వారి వంతు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ప్రజెంటేషన్ కార్యక్రమంలో డైరెక్టర్ డా. కే.మధుబాబు, వి.శ్రీనివాస్ రావు, ఇతర బోధన సిబ్బంది పాల్గొని వివిధ రాష్ట్రాల అధికారులతో శిక్షణా కార్యక్రమాల అవసరాల నిమిత్తం చర్చించడం జరిగింది. కార్యక్రమం యొక్క ముగింపు సభలో ఈఈఐ డైరెక్టర్ డాక్టర్ కే.మధుబాబు మాట్లాడుతూ కార్యక్రమానికి విచ్చేసిన అధికారులకు ధన్యవాదాలు తెలుపడం జరిగింది.
అలాగే వారి యొక్క సలహాలు, సూచనలను తప్పకుండా 2019-20వ సంవత్సరానికి గాను ఖరారు చేసే శిక్షణ కార్యక్రమాల ప్రణాళికలో పాటిస్తామని తెలిపారు. ఇతర రాష్ట్రాల అధికారుల సమాచారాన్ని పరిగణనలోకి తీసుకొని ఆఫ్ - క్యాంపస్ ప్రణాళికను సిద్ధం చేస్తామని తెలిపారు.
అదే విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులకు సర్ట్ఫికేట్స్‌ను అందజేయడం జరిగింది. కార్యక్రమంలో 30 మంది ప్రతినిధులు, ఈఈఐ బోధనా సిబ్బంది డాక్టర్ జమునారాణి, డాక్టర్ ఆర్.వసంత, డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ ఎం.ప్రీతి, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ ప్రసూన, డాక్టర్ డి.శిరీష పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
అయ్యప్ప స్వామి నామస్మరణే ఉత్తమ సన్మార్గం
భక్తి గీతాలు విడుదల చేసిన వివేకానంద గురుస్వామి
రాజేంద్రనగర్, డిసెంబర్ 15: అయ్యప్ప స్వామి నామస్మరణయే మంచి సన్మార్గమని గురుస్వామి వివేకానంద వివరించారు. శనివారం హరిహర పుత్ర అయ్యప్ప ఆడియో - 2 భక్తిగీతాలు పాటలను విడుదల చేశారు. గురుస్వామి వివేకానంద మాట్లాడుతూ.. నమ్మిన భక్తుల కోర్కెల తీర్చే అయ్యప్ప నామస్మరణలో మాలధారులు శరణు వేడాలని అన్నారు. మాలను ధరించిన భక్తులు స్వామి నామజపంతో తరించాలని సూచించారు. ఆడియో విడుదల కార్యక్రమంలో సింగర్ వివేక్, సతీష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

అభివృద్ధితోనే ప్రజల కల సాకారం

$
0
0

ఉప్పల్, డిసెంబర్ 15: తెలంగాణ ప్రాంతా లు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినపుడే ప్రజల కల సాకారమైనట్లని మేడ్చల్ ఎమ్మెల్యే సీహెచ్.మల్లారెడ్డి అన్నారు. ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన మల్లారెడ్డిని శనివారం బోడుప్పల్, పీర్జాదిగూడ, పర్వతాపూర్, మేడిపల్లి, చెంగిచర్ల, కాచవానిసింగారం ముత్వెల్లిగూడ ప్రాంతాల టీఆర్‌ఎస్ నేతలు తరలి వచ్చి అభినందనలు తెలిపారు. జడ్పీటీసీ మంద సంజీవ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి పులకండ్ల జంగారెడ్డి, సీనియర్ నాయకులు బొబ్బల లక్ష్మారెడ్డి, నత్తి మైసయ్య, మల్లేష్, నగేష్ గౌడ్, రాసాల బాల మల్లేష్, వెంకటేశ్ యాదవ్, సురేందర్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, శివ, టీఆర్‌ఎస్ మండల బీసీ సెల్ కార్యదర్శి బుడిగె ఐలేష్ కురుమ, కాచవానిసింగారం గ్రామ శాఖ అధ్యక్షుడు మహేష్ గౌడ్, నేతలు, కార్యకర్తలు మల్లారెడ్డిని కలిసిన వారిలో ఉన్నారు. ఎమ్మెల్యేగా గెలిపించేందుకు రాత్రింబవళ్లు పని చేసిన పార్టీ నేతలు, కార్యకర్తలకు మంచి భవిష్యత్ ఉందని అన్నారు.
నర్సరీల్లో మొక్కలు సక్రమంగా పెంచాలి
కేశంపేట, డిసెంబర్ 15: నర్సరీల్లో మొక్కలను సక్రమంగా పెంచేందుకు ఉపాధి హామీ సిబ్బంది చర్యలు తీసుకోవాలని కేశంపేట మండల ఉపాధి హామీ ఏపీవో కృష్ణ అన్నారు. శనివారం కేశంపేట మండల కేంద్రంలోని ఉపాధి హామీ కార్యాలయంలో నర్సరీల నిర్వాహణపై అవగాసన సదస్సు నిర్వహించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నర్సరీల నిర్వాహణ సక్రమంగా చేపట్టాలని, ఎలాంటి నిర్లక్ష్యం వహించినా తగిన చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. 2019 ఖరీఫ్ సీజన్ నాటికి నర్సరీల్లో మొక్కలు నాటే విధంగా పెంచాలని సూచించారు. నీరు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. మొక్కల పెంపకంలో ఉపాధి హామీ సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఇసీ అజీజ్ అహ్మద్, టీఏలు రవితేజ, మహేందర్, నీలమ్మ పాల్గొన్నారు.

శిల్పారామంలో హస్తకళా మేళా

$
0
0

గచ్చిబౌలి: శిల్పారామంలో నిర్వహిస్తున్న అఖిల భారత హస్తకళా మేళా ( ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళా)ను జనరల్ మేనేజర్ కిషన్‌దాస్‌తో పాటు కళాకారులు ఢాంక మోగించి ప్రారంభించారు. ప్రత్యేక అధికారి కిషన్‌రావు జ్యోతి ప్రజ్వలన చేసి సంస్కృతికి కార్యక్రమాలను ప్రారంభించారు. కిషన్‌రావు మాట్లాడుతూ.. సంప్రదాయ కళలను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని చెప్పారు. కనుమరుగవుతున్న సంప్రదాయ కళలను ప్రోత్సహించేందుకు శిల్పారామం కృషి చేస్తుందని చెప్పారు. హస్త కళాకారుల కళారూపాలను ప్రదర్శించుకొనేందుకు 500స్టాల్స్‌ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సంప్రదాయ కళాకారుల చేతుల్లో రూపుదిద్దుకున్న చేనేత, జనుము, కలప, మట్టి కళాఖండాలు ఇక్కడ కొలువు దీరాయి. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన చేనేత కళాకారులు రూపొందించిన వస్త్రాలు మగువలను కట్టిపడేస్తున్నాయి. అనంతరం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా అభినేత్రి ఆర్ట్స్ అకాడమికి చెందిన ప్రమోద్‌రెడ్డి శిష్య బృందం ప్రదర్శించిన భరత నాట్యం కనువిందు చేసింది. నార్త్‌జోన్ కల్చరల్ సెంటర్ పటియాలకు చెందిన జమ్ము అండ్ కశ్మీర్ కళాకారులు ప్రదర్శించిన జాబరో, బాల్త్కి నృత్యలు ఆకట్టుకున్నాయి. పంజాబ్ కళాకారులు ప్రదర్శించిన బాంగర, ఘమర్, ఫాగ్ నృత్యలు కనువిందు చేశాయి. శిల్పారామం అధికారులు కళాకారులను ఘనంగా సన్మానించారు.
ఎగ్జిబిషన్లతో ప్రోత్సాహం

* వర్ధమాన తార దక్ష
ఖైరతాబాద్, డిసెంబర్ 15: నగరంలో కొలువుదీరుతున్న ఎగ్జిబిషన్లతో చేతివృత్తిదారులకు ఎంతగానో ప్రోత్సాహం లభిస్తోందని వర్ధమాన తార దక్ష అన్నారు. శనివారం గ్రామీణ హస్తకళా వికాస్ సమితి ఆధ్వర్యంలో సత్యసాయి నిగమాగమంలో ఏర్పాటు చేసిన నేషనల్ సిల్క్‌ఎక్స్‌పో-2018ను నటుడు తేజుతో కలిసి ఆవిష్కరించారు. చేనేతకారులు వారు ఉత్పత్తి చేసిన వస్తువులను నేరుగా విక్రయించుకునే అవకాశం ఎగ్జిబిషన్ల ద్వారా లభిస్తోందన్నారు. దీంతో వారు ఆర్థికంగా బలపడటంతో పాటు నగర వినియోగదారుల అభిరుచులను తెలుసుకొని వారి నైపుణ్యాలను మెరుగు పరుచుకుంటారని అన్నారు. 20 వరకు కొనసాగే ఎగ్జిబిషన్‌లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన చేతివృత్తిదారులు రూపొందించిన వస్త్రాలు, ఆభరణాలను అందుబాటులో ఉంచినట్టు నిర్వాహకులు జయేష్ తెలిపారు.

హెచ్‌ఎండీఏ అనుమతి లేకుండా అక్రమ వెంచర్లు

$
0
0

మహేశ్వరం, డిసెంబర్ 15: మహేశ్వరం మండల పరిధిలోని అమీర్‌పేట్,కోళ్ళపడకల్, మహేశ్వరం,తో పాటు పలు గ్రామాల్లో హెచ్‌ఎండీఏ అనుమతులు లేకుండా అక్రమ వెంచర్లు చేసి ప్లాట్లు విక్రయిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని వెంటనే అక్రమ వెంచర్లుకు అడ్డుకట్ట వేసి నిబంధనల అతిక్రమిస్తున్న రియల్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని మహేశ్వరం మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు డిమాండ్ చేశారు. శనివారం మహేశ్వరం ఎంపీపీ పీ.స్నేహ అధ్యక్షతన జరిగిన మండల సభలో ఎంపీటీసీ సభ్యులు బీ.ప్రేమలత, హెచ్.శశిరేఖ, టీ.రాములు మాట్లాడుతూ మహేశ్వరం గ్రామంలో ఊల్లేబాయి వద్ద అక్రమ లే ఔట్ తయారు చేస్తున్నా పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోళ్లపడకల్ గ్రామంలో అర ఎకరం గ్రామ పంచాయతీ స్థలాన్ని ఆక్రమించు కోవడం జరిగిందని అన్నారు.
అమీర్‌పేట్ లో హెచ్‌ఎండీఏ అనుమతి లేకుండా ప్లాట్లుచేసి అమాయకులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
ఎంపీడీవో జానకిరెడ్డి సమాధానమిస్తూ మహేశ్వరం మండలంలో 522 డీటీసీపీహెచ్‌ఎండీఏ లేఔట్‌లకు అనుమతి ఉందని, నిబంధనలు అతిక్రమించే రియల్టర్ల పై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉపాధిహామీ పథకాన్ని మహేశ్వరం గ్రామాల్లో అమలు చేసి ఉపాధి కల్పించాలని సభ్యురాలు ప్రేమలత కొరారు. ప్రతి గ్రామంలో పది గుంటల స్థలం చూపిస్తే గ్రామీణ ఉపాధిలో భాగంగా గ్రామీణ సంత పేరుతో రూ.15 నుంచి 30 లక్షల నిధులతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తామని వివరించారు.
మండల పరిధిలో రియల్ ఎస్టేట్ వెంచర్లలో విచక్షణా రహితంగా తాటి, ఈత వనాలను నరికి వేయడం వల్ల భవిష్యత్తులో గీత కార్మికులు ఉపాధి కోల్పొయే ప్రమాదం ఉందని వాటిని అడ్డుకోవాలని మంఖల్ ఎంఆర్‌పీటీసీ ఆర్.మదన్‌మోహన్ సభ దృష్టికి తేగా ఎక్సైజ్ ఇన్‌చార్టీ సీఐ.శిరీష మాట్లాడుతూ ప్రభుత్వం అనుమతి ఉంటేనే చెట్లను నరకనిస్తామని, అందుకు గీతా కార్మికులకు సొసైటీలకు పరిహారం చెల్లిస్తామని తెలిపారు. సమావేశంలో ఎంపీపీ స్నేహ జడ్పీటీసీ ఎన్.ఈశ్వర్ నాయక్, వైస్ ఎంపీపీఎం స్వప్న, సహకార సంఘం చైర్మన్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఎన్నికల్లో మద్దతిచ్చిన వారికి
అండగా ఉంటాం
* మాజీ మంత్రి చంద్రశేఖర్ ప్రకటన

వికారాబాద్, డిసెంబర్ 15: ఇటీవల ఎన్నికల్లో తన కోసం పనిచేసి, తనకు ఓట్లు వేసిన వారికి అండగా ఉంటామని మాజీ మంత్రి డాక్టర్ ఏ.చంద్రశేఖర్ ప్రకటించారు. శనివారం జిల్లా కేంద్రంలోని కొండా బాలకిష్టా రెడ్డి ఫంక్షన్ హాలులో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తుపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఓటమి పాలైన చంద్రశేఖర్ తనకు మద్దతుగా నిలిచిన వికారాబాద్ పట్టణ, మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు.
ఎన్నికల్లో తనకోసం పనిచేసిన నాయకులను నియోజకవర్గంలోని 170 గ్రామ పంచాయతీలలో వంద రెట్లు ప్రచారం నిర్వహించి గెలిపించుకుంటామని భరోసా ఇచ్చారు. ఐదు పర్యాయాలు శాసనసభ్యుడిగా టీడీపీ, టీఆర్‌ఎస్‌ల నుండి ఎన్నికైన తనను ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా విశ్వాసంతో ఆమోదించారని చెప్పారు.
రాజకీయ పార్టీలకు చెమటలు పట్టే విధంగా తన కోసం పనిచేయడం అభినందనీయమని పేర్కొన్నారు. సమావేశంలో మాజీ ఎంపీపీ, జడ్పీటీసీలు పీ.నర్సింహా రెడ్డి, పీ.మహిపాల్ రెడ్డి, సీనియర్ న్యాయవాది పీ.గోవర్ధన్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ చిగుళ్ళపల్లి రమేష్‌కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గుడిసె లక్ష్మణ్, మున్సిపల్ కౌన్సిలర్ నర్సింలు, జిల్లా వాల్టా సభ్యుడు సురేష్, మాజీ కౌన్సిలర్ విజయ్‌కుమార్, వీ.రాములు, లక్ష్మణ్ రావు, రంగరాజు, మాధవ రెడ్డి, సత్తార్, సిరాజుద్దీన్, జీ.చంద్రశేఖర్, నవాజ్, గణపతి రెడ్డి పాల్గొన్నారు.


అందుబాటులో విజ్ఞాన గనులు

$
0
0

హైదరాబాద్: ఓ మనిషి జీవితాన్ని మార్చే శక్తి, సామర్థ్యాలు మరో మనిషికి లేకపోవచ్చు గానీ, ఆ శక్తి ఒక పుస్తకానికి ఉంటుందనటంలో అతిశయోక్తి లేదు. మారుతున్న జీవన విధానాలు గాడిన పెట్టేందుకు, మంట గలుస్తున్న విలువలను పునరుద్దరించుకునేందుకు ఎంతో మంది మహానీయుల కలం నుంచి జాలువారిన మరెన్నో అక్షర సమూహాలు ఇక్కడ కొలువుదీరాయి.
ఎన్టీఆర్ స్టేడియంలో పుస్తక ప్రదర్శన శనివారం ప్రారంభమైంది. ఈ ప్రదర్శనలోని పుస్తకాల్లో నిక్షిప్తమైన ఏ కొత్త విషయమైనా మన జీవితానే్న మార్చేయవచ్చు. అలాంటి ఎన్నో విభిన్నమైన అంశాలతో అనేక రచనలు ఈ ప్రదర్శనలో కొలువుదీరాయి. ప్రతి సంవత్సరం మాధిరిగానే ఈ ఏడు కూడా హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియం లో జరుగుతున్న పుస్తక పండుగ కోసం ఎందరో పుస్తక పఠన ప్రక్రియులు ఎదురుచూస్తున్నారు. ఇక రచనలు, సాహిత్య ప్రక్రియలపై కాస్త అవగాహన ఉన్న రచయితలు, సాహితీవేత్తలు సైతం తమకు కావల్సిన ఏదైన కొత్త విషయాన్ని ఇక్కడ వెతుక్కుంటారు. గత సంవత్సరం నిర్వహించిన పుస్తక ప్రదర్శనకు దక్కిన ఆదరణను గమనిస్తే సెలవురోజులైన ఆదివారాల్లో సందర్శకుల సంఖ్య సుమారు లక్ష వరకు చేరుతోంది.
ఈ పుస్తకాల పండుగలో గతలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి తెలంగాణ ప్రాంతీయ రచయితలను ఒక వేదిపైకి తీసుకువచ్చి, వారి పుస్తకాలను వారే స్వల్ప తగ్గింపు ధరలకు అందుబాటులోకి తెచ్చారు. దీనికి తోడు ఈ సారి తమిళనాడు, కర్ణాటక, మహారాష్టక్రు చెందిన సుప్రసిద్ధ రచయితల పుస్తకాలు ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉన్నాయి. ఇతర భాషలపై నగరవాసులకు అవగాహన మాట అలా ఉంచితే, ఇతర భాషలకు చెందిన రచయితలు తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో రచించిన పుస్తకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
పుస్తకం విలువ, పుస్తక పఠనం ప్రాధాన్యతను తెలియజేసే విధంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
సందర్శకులను ఆకట్టుకునేందుకు పుస్తకావిష్కరణ సభలు, పుస్తకపఠనంపై ప్రత్యేక కార్యక్రమాలు వంటివి నిర్వహించనున్నారు. దీనికి తోడు రోజురోజుకీ పెరిగిపోతున్న ఆధునికత కారణంగా పుస్తకపఠనంపై ఆసక్తి చూపే వారి సంఖ్య తగ్గుతోందని, పుస్తక పఠనానికి పూర్వ వైభవాన్ని సంతరింపజేసేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ఈ పుస్తకాల పండుగ ఒకటని చెప్పవచ్చు. నేటి నుంచి ఈ ప్రదర్శనకు క్రమంగా ఆహుతుల సంఖ్య పెరగనుంది. ఇక సెలవు రోజుల్లో ఈ ప్రదర్శన కిటకిటలాడే అవకాశాలున్నాయి.

సరైన ఓటర్ల జాబితా లేకుండా ఎన్నికల నిర్వహణ

$
0
0

ఖైరతాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికలను సరైన ఓటర్ లిస్టు లేకుండా నిర్వహించారని ఎన్నికల నిఘా వేదిక నిర్వహించిన సమావేశంలో వివిధ స్వచ్ఛంద సంస్థలకు చెందిన ప్రతినిధులు పేర్కొన్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఎన్నికల నిఘా వేదిక ఇటీవల జరిగిన ఎన్నికలపై సమీక్ష-సమావేశాన్ని నిర్వహించింది. సమావేశంలో ఎన్నికల నిఘా వేదిక వీవీ.రావు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభరెడ్డి, రావు, రామ్‌మోహన్‌రావుతో పాటు 30 స్వచ్ఛంద సంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరై మాట్లాడారు. ఎన్నికలు నిర్వహించేందుకు ఫిబ్రవరి వరకు సమయం ఉన్నా కమిషన్ హడావుడిగా నిర్వహించిందన్నారు. తొందర పాటు వల్ల ఓటర్ల జాబితా సరిచేయడం సాధ్యం కాలేదని సాక్షాత్తు ఎన్నికల అధికారి రజత్‌కుమార్ పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలను సైతం సక్రమంగా అమలు చేయలేదని వాపోయారు. అభ్యర్థుల నేర చరిత్రను తప్పని సరిగా వెల్లడించాలని, నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు తమపై ఉన్న కేసులను విధిగా మూడు పర్యాయాలు పత్రికల ద్వారా ప్రజలకు వివరించాల్సి ఉన్నా ఇలా జరగేలేదని అన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల నిఘా వేదిక పలుమార్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరినా పట్టించుకోలేదని అన్నారు. ఈ సారి ఎన్నికల్లో డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ జరిగింది, వాటిని అడ్డుకోవడంలో ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలం అయిందని అన్నారు. ఎన్నికల సమయంలో పట్టుబడ్డ డబ్బుకు వందరేట్లు పంపిణీ జరిగి ఉండవచ్చునని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని తెలిపారు. రానున్న పంచాయితీ, పార్లమెంట్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కోరారు.

అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు

$
0
0

హైదరాబాద్: సనత్‌నగర్ నియోజకవర్గంలో రానున్న అయిదేళ్లలో చేపట్టనున్న అభివృద్ధి పనులపై జలమండలి అధికారులు ప్రత్యేకంగా ప్రణాళికలను సిద్దం చేయాలని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో తలసాని ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు కనీస వౌలిక వసతులు అందించటం, అభివృద్ధి పనులను చేపట్టడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని, ఇందులో భాగంగా అధికారులు కూడా ప్రజలకెలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మంచినీటి సరఫరాలో, డ్రైనేజీ వ్యవస్థలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పలు చోట్ల డ్రైనేజీ, మంచినీటి సమస్యకు సంబంధించి ఉన్న చిన్న చిన్న సమస్యలను త్వరలోనే పరిష్కరించుకోవాలని సూచించారు. ముఖ్యంగా మంచినీటిని సరఫరా చేసే వేళలను ఉద్యోగులు, కార్మికులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వాణిజ్య సముదాయాలకు కమర్షియల్ కనెక్షన్లు ఇవ్వటం, టెండర్ల ప్రక్రియలో యువత పాత్రను పెంచేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జలమండలి ఎండీ దాన కిషోర్ మాట్లాడుతూ అధికారులు సనత్‌నగర్ నియోజకవర్గంతో పాటు ప్రతిరోజు వివిధ ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి, మంచినీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థలకు సంబంధించిన సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేకంగా ప్రణాళికలను సిద్దం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఈడీ ఎం.సత్యనారాయణ, డైరెక్టర్లు ఎల్లాస్వామి, బి.విజయ్‌కుమార్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.

టీఆర్‌ఎస్ జెండా పైపు కూల్చివేత

$
0
0

షాద్‌నగర్, డిసెంబర్ 15: టీఆర్‌ఎస్ దిమ్మెకు ఉన్న జెండా పైపును కూల్చివేసిన దుండగులను పోలీసులు పట్టుకొని కఠినంగా శిక్షించాలని టీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం అర్థరాత్రి ఫరూక్‌నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్రామం పాత జాతీయ రహదారి పక్కన ఉన్న టీఆర్‌ఎస్ దిమ్మెకు ఉన్న జెండా పైపును గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు. విషయం తెలుసుకున్న ఫరూఖ్‌నగర్ మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు పీ.వెంకట్‌రాం రెడ్డితోపాటు గ్రామ టీఆర్‌ఎస్ నేతలు రోడ్డుపైకి చేరుకొని రాస్తారోకో నిర్వహించారు. టీఆర్‌ఎస్ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే కొంతమంది నాయకులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్ దిమ్మె జెండా పైపును ఎవరు కూల్చివేశారనే దానిపై పోలీసులు విచారణ చేసి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. షాద్‌నగర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ రెండవ సారి అధికారంలోకి వచ్చిన నేపధ్యంలో మింగుడు పడని కొంతమంది నాయకులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, త్వరలోనే వారిని బయట పెట్టనున్నట్లు వివరించారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడితే వారిపై తగిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. విషయం తెలుసుకున్న షాద్‌నగర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని టీఆర్‌ఎస్ కార్యకర్తలకు నచ్చజెప్పి రాస్తారోకోను విరమింప జేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నేతలు భీష్వ రామకృష్ణ, మాజీ సర్పంచ్ బి.నర్సింలు, లక్ష్మణ్‌నాయక్, గ్రామ టీఆర్‌ఎస్ యువకులు పాల్గొన్నారు.
పగిలిన భగీరథ పైపులు
* వృథాగా పోతున్న నీరు తీపట్టించుకోని అధికారులు
కొత్తూరు, డిసెంబర్ 15: మిషన్ భగీరథ పైపులైన్ పగిలిపోవడంతో నీళ్లు రోడ్డుపై వృథాగా పోతున్నాయి. శనివారం కొత్తూరు మండలం ఇన్ముల్‌నర్వ గ్రామంలో భగీరథ పైపులైన్ పగిలిపోయి నీళ్లు వృథాగా వెళ్తున్నాయి. మిషన్ భగీరథ నీళ్లను ఆపి పైపులు సరిచేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీరు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో భగీరథ పైపులైన్ పగిలిపోయి నీరు వృథాగా వెళ్లడం ఎంతో బాధగా ఉందని వాపోతున్నారు. సంబంధిత శాఖ అధికారులు సకాలంలో స్పందించి నీటిని నిలిపివేయాలని, మరమ్మతు పనులు చేసిన తరువాతే నీళ్లు వదలాలని కోరారు. మిషన్ భగీరథ అధికారులకు ఇప్పటికే ఒకసారి ఫిర్యాదు చేసినా స్పందన లేదని,ఉన్నతాధికారులు స్పందించి సకాలంలో నీటిని నిలిపివేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

‘స్వచ్ఛ’బృందాల పర్యటన

$
0
0

హైదరాబాద్: దేశంలోని అన్ని పట్టణాలు, మహానగరాల్లో స్వచ్ఛతను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి విధితమే. ఇందులో భాగంగా ఈ సంవత్సరం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ 2019 సర్వేలో భాగంగా నగరంలో స్వచ్ఛ కార్యక్రమాలను తనిఖీ చేసేందుకు కేంద్రం నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు నగరంలో పర్యటిస్తున్నందున, ఈసారైనా మెరుగైన ర్యాంక్ దక్కేలా క్షేత్ర స్థాయి అధికారులు స్వచ్ఛ కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయాలని కమిషనర్ దాన కిషోర్ అధికారులను ఆదేశించారు. దశవ్యాప్తంగా 5వేల నగరాల్లో ప్రారంభించిన ఈ సర్వేలో నాలుగు విభాగాల్లో ఐదు వేల మార్కులకు గాను పలు అంశాల్లో ప్రత్యక్ష పరిశీలన నిర్వహిస్తారని తెలిపారు. ఒక్కో అంశానికి 1250 మార్కులు కేటాయించనున్నట్లు తెలిపారు. గత సంవత్సరం సర్వేక్షణ్‌లో జీహెచ్‌ఎంసీ సాలిడ్ వేస్ట్ మెనేజ్‌మెంట్ విభాగంలో అగ్రస్థానం పొందగా, స్వచ్ఛ కార్యక్రమాల్లో 27వ స్థానంలో నిలిచింది. ఈ సంవత్సరం కూడా ఐదు వేల మార్కులకు గాను నిర్వహించనున్న ఈ సర్వేలో మెరుగైన ర్యాంక్ సాధించటమే లక్ష్యంగా, నగరంలో పారిశుద్ద్యం, పరిశుభ్రత కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహించాలని సూచించారు.
ఇందులో ముఖ్యంగా నివాస ప్రాంతాల్లో ప్రతి నుంచి నూటికి నూరు శాతం చెత్తను సేకరించాలని సూచించారు. స్వచ్ఛ కార్యక్రమాల్లో బస్తీల్లో, మురికివాడల్లో ప్రజల్లో చైతన్యం కోసం ప్రత్యేక ప్రచార, అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. దీంతో పాటు స్వచ్ఛ సర్వేక్షణ్ 2019 పోస్టర్‌ను అన్ని ప్రధాన మార్గాల్లో ప్రదర్శించాలని సూచించారు. దీంతో పాటు వ్యాపార ప్రాంతాల్లో కూడా స్వచ్ఛ కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. సర్వేలో భాగంగా స్వచ్ఛ మంచ్, స్వచ్ఛత యాప్‌లో స్వచ్ఛతపై నగరవాసులను, వ్యాపారస్తులను అడిగే ఆరు ప్రశ్నలకు పూర్తి స్థాయిలో జవాబు ఇవ్వాల్సి ఉన్నందున, దుకాణం దార్లకు అవగాహన కల్పించాల్సి ఉంటుందని సూచించారు. వ్యాపార, వాణిజ్య సంస్థలున్న ప్రాంతాల్లో రోజుకి కనీసం రెండుసార్లు స్వీపింగ్ చేసి, పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. దీంతో పాటు ఖాళీ ప్రాంతాల్లో కుప్పలుగా చెత్త పడకుండా చర్యలు చేపట్టాలని, ఎక్కడబడితే అక్కడ నగరంలో బహిరంగంగా మల, మూత్ర విసర్జనలు జరగకుండా పబ్లిక్ టాయిలెట్ల నిర్వాహణ చేపట్టాలని అన్నారు. దీంతో పాటు ఎక్కడబడితే అక్కడ భవన నిర్మాణ వ్యర్థాలను వేయకుండా చర్యలు చేపట్టాలని, ఎక్కడైనా ఇలాంటి వ్యర్థాలు కన్పిస్తే తరలించేందుకు ప్రత్యేక వాహనాలను అందుబాటులో ఉంచినట్లు కమిషనర్ క్షేత్ర స్థాయి అధికారులకు తెలిపారు.

Viewing all 69482 articles
Browse latest View live