Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

పలుచోట్ల భారీ వర్షాలు

0
0

విజయవాడ: పెథాయ్ తుపాను కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీనికితోడు డ్రైనేజీ తవ్వకాల కోసం గుంతలు తీయటంతో డ్రైనేజీ నీరు, వర్షం నీరు చేరటంతో చిట్టినగర్, ఇస్లాంపేట, వన్‌టౌన్ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి.


కోనసీమలో కుండపోత

0
0

విజయవాడ: పెథాయ్ తుపాను వల్ల కోనసీమలోని పలుప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడలో భారీవర్షాలతో పాటు బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరుగుతున్నాయి. చాలా కొబ్బరిచెట్లు, సెల్ టవర్లు కుప్పకూలాయి. ప్రజలు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. విజయనగరం జిల్లాలోనూ వర్షాలు కురుస్తున్నాయి. రాజోలు, సఖినేటిపల్లి, అమలాపురం, అంబాజీపేట, మామిడికుదురు, అల్లవరం, కాట్రేనుకోన, ముమ్మడివరం, అల్లవరం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

సీఎంగా కమలనాథ్ ప్రమాణ స్వీకారం

0
0

భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కమలనాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎంగా జోతిరాదిత్య వ్వవహరిస్తారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మన్నోహన్ సింగ్, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఫరూక్ అబ్దుల్లా, స్టాలిన్, మాజీ ప్రధాని దేవెగౌడ తదితరులు హాజరయ్యారు.

అనంతం-11

0
0

ఇప్పుడా తేనెపట్టు ముదురు గోధుమరంగులో నిగనిగలాడుతూ, నాణ్యమైన మామిడి తాండ్ర వ్రేలాడుతున్నట్టుంది!
పట్టునుంచి బొట్లుబొట్లుగా తేనె చుక్కలు పడుతూంటే ఓ బుంగను దానిక్రింద పెట్టారు.
తేనె బొట్లు లీలగా చప్పుడు చేస్తూ, బుంగలో పడుతున్నాయి.
ఇక, చెయ్యాల్సిందల్లా- మైనంలావున్న తేనెపట్టును తుంపులు తుంపులుగా లాగి, ఖాళీబుంగల్లో వెయ్యాలి. పిడికిళ్ళకు పట్టినంత మైనం ముద్దల్ని తీసికొని బలంగా పిండాలి.
మైనం అంతా పిండి అవతల పారేస్తే బుంగల్లో తేనెమాత్రమే మిగుల్తుంది.
ఇద్దరి మొహాలూ సంతోషంతో విప్పారాయి.
వాళ్ళు తేనె పిండే సంబరంలో వుండి పరిసరాలను గమనించలేదు.
పెనుముప్పు పొంచి వుందని వాళ్ళకు తెలియదు.
***
రాత్రికి రాత్రే నల్లకొండ దగ్గర నాగరికుల గుడారాలు వెలిసాయి! ఎవ్వరూ అది గమనించలేదు.
విఐపీల గుడారాలు అధికారుల గుడారాలు పోలీసు సిబ్బంది గుడారాలూ...
విడివిడిగా గుడారాలు నిర్మించి, వ్యక్తుల స్థాయినిబట్టి వాటిని కేటాయించారు.
పనివాళ్ళకు కొంచెం దూరంగా గుడారాలు వేశారు.
ప్రభుత్వ వాహనాలు వస్తూపోతున్నాయి.
అంత హంగామా ఎందుకు చేస్తున్నట్టు? రాత్రికిరాత్రి రహస్యంగా అన్ని గుడారాలువేసి, ప్రభుత్వ యంత్రాంగాన్నంతా అక్కడికి ఎందుకు తరలించినట్టు?
అంతా గోప్యంగా వుంది!
ఇంతకూ విషయం ఏమిటంటే-
అక్కడి అడవి భూముల్లో విలువైన ఖనిజ సంపద వుంది. బాక్సైట్ నిధులున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్టులో భారీ ధర పలికే అక్కడి ఖనిజ సంపద మీద బహుళ జాతి కంపెనీలు కనే్నశాయి.
అడవి భూముల్ని తవ్వి ఖనిజాలను వెలికితీసి మార్కెట్టుకు తరలించేందుకు అనుమతికోరి, అనుకున్నది సాధించాయా బహుళజాతి కంపెనీలు.
ప్రభుత్వం తలవంచింది వాళ్ళముందు!
నిజానికి, ఖనిజ సంపదకోసం అడవి భూముల్ని తవ్వితే పచ్చదనాల అడవి మరు భూమిగా మారిపోతుంది. అడవిని ఆశ్రయించి బ్రతుకుతున్న అడవి పుత్రులు తండాలుగా ఖాళీచేసి నిర్వాసితులౌతారు బ్రతుకుతెరువు కోల్పోతారు.
బహుళజాతి కంపెనీల పాలై, ధ్వంసమయ్యే అడవిలో క్రూర మృగాలక్కూడా స్థానం మిగలదు. నివాసం కోల్పోయే ఆ మృగాలు నిజారణ్యం వొదిలిపెట్టి జనారణ్యాల్లోకి తరలివస్తాయి!
తరతరాలుగా అక్కడే నివాసం ఉంటున్న అడవి పుత్రులు తండాలు ఖాళీచేసి వెళ్ళేందుకు ఒప్పుకోరు. బలవంతంగా పంపించటం అంత తేలిక పనికాదు.
సాంప్రదాయాక ఆయుధాలతోనే దీర్ఘకాలిక పోరాటాలకైనా సిద్ధపడతారు తప్ప, ప్రభుత్వానికి తలవంచరు!
అందుకే...
శాంతిభద్రతల పరిస్థితి తలెత్తకుండా అడవి పుత్రుల్ని లాలించి బుజ్జగించి, శాంతియుతంగా తండాలు ఖాళీచేయించటం ఎలా? బహుళజాతి కంపెనీలకు ప్రయోజనపడేదెలా? అన్న.
రెండేరెండు అజెండా అంశాలతో కమిటీ వేసింది.
రాజకీయ మేధావులు; క్లిష్ట సమయాల్లో కిటుకులు చెప్పి ప్రభుత్వాన్ని గట్టెక్కించే సలహాదార్లు: రాజకీయ వ్యూహ రచనా దురంధరులనూ సదరు కమిటీల్లో సభ్యులుగా వేసి, వాళ్ళందర్నీ ఒకచోట చేర్చి, సుదీర్ఘంగా చర్చించి-
ఓ నిర్ణయానికొచ్చింది ప్రభుత్వం!
‘‘అడవుల్ని భోంచేస్తాం- అడ్డుతొలగండి’’అన్నట్టు ఉండకూడదు ప్రభుత్వ వైఖరి!
లౌక్యంతో అనుకున్నది సాధించాలి!
డచ్చివాళ్ళూ ఫ్రెంచివాళ్ళూ ఈస్టిండియా కంపెనీ వాళ్ళూ- రాజ్యాధికారం కావాలని ముందుగా అడగలేదు.
వ్యాపారం పేరుతో భారతదేశంలో చోటు పొంది, అటు తర్వాత రాజ్యాధికారం స్థాపించినట్టే,
ప్రభుత్వం కూడా ముందుగా ఖనిజ సంపద విషయం చెప్పకూడదు. ‘‘పులుల రక్షిత ప్రాంతం’’, ‘‘జింకల రక్షిత ప్రాంతం’’అంటూ అడవుల్లో కంచెలువేసి కాపలాపెట్టినట్టే ‘‘కలివికోడి రక్షిత ప్రాంతం’’ ఏర్పాటుచెయ్యాలి.
ఇప్పుడు వార్తల్లో వున్నది కలివికోడి. గొప్ప జాతి కోడి.
అరుదైన కోడి. ఆంధ్ర దేశానికి గర్వకారణమైన కోడి.
దానికి అడవిలో రక్షణ కల్పించాలంటే ఎవ్వరూ కాదనరు.
పైగా, సంతోషిస్తారు సహకరిస్తారు.
అది జీవకారుణ్యం!
అంచేత-
నల్లకొండ , నెమలిగుట్ట, నీటి కొలను, రెడ్డియానాయక్, తండాలను ఓ వృత్తంలోకి తెచ్చి,- వృత్తం చుట్టూ బలమైన యినుప కంచె వెయ్యాలి. దాన్ని ‘కలివికోడి ప్రాజెక్టు’ అనాలి.
నిషిద్ధ ప్రాంతంగా ప్రకటించి సాయుధ పోలీసుల కాపలాపెట్టి, అడవి పుత్రుల్ని దాపుల్లో ఉండకండా చెయ్యాలి.
భూగర్భ ఖనిజాల త్రవ్వకం విషయం తెలియని అడవి పుత్రులు కలివికోడి రక్షిత ప్రాంత నిర్మాణాన్ని అడ్డుకోరు!
ప్రభుత్వంనుంచి రహస్య ఆదేశాలు అందిన వెంటనే యంత్రాంగం అంతా కదిలింది.
రాత్రికిరాత్రి నల్లకొండ దగ్గర గుడారాలు నిర్మించి వాటిల్లో మకాం పెట్టారందరూ.
కీ.శే.పెద్దిరెడ్డి కొడుకు ఎమ్మెల్యే పెంటారెడ్డి, పక్షి జాతులమీద పరిశోధనలు చేసి పట్టా పుచ్చుకున్న డాక్టర్ గరుడాచలం కూడా ఆగమేఘాల మీద వచ్చి గుడారాల్లో కుదురుకున్నారు.
* * *
కొండదేవర జాతరప్పుడు తప్ప ఎప్పుడూ చాలా ప్రశాంతంగా, ముని పర్ణశాలకుమల్లే శాంత గంభీరంగావుండే వాతావరణం పూర్తిగా మారిపోయింది!
నల్లకొండ దగ్గర నాగరికుల సంచారం, ప్రభుత్వ వాహనాల కదలికలు, సాయుధ పోలీసుల విన్యాసాలూ...
అవ్వి-
(ఇంకా ఉంది)

పరమ పవిత్రం వైకుంఠ ఏకాదశి

0
0

అనంతమైన కాలం భగవత్ స్వరూపం. ప్రాచీనులు కాలాన్ని నాలుగు ప్రమాణాలతో సూచించారు. మాస చతుర్థా...‘‘సావన: సౌర చాంద్రో నాక్షత్ర ఇతి’’ అని నిర్ణయ సింధులో పేర్కొబడింది. సావనము, సౌరము, చాంద్రము, నాక్షత్రము ద్వారా గణించడం పరిపాటి. చైత్ర వైశాఖ మాసములు, ప్రతిపద విదియాది తిథులు చాంద్రమానం ప్రకారం లెక్కిస్తారు. చాంద్రమానం ప్రకారం పౌర్ణమి నాడు చంద్రుడున్న నక్షత్రాన్ని బట్టి మాస నిర్ణయం చేయగా, సూర్యుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించి ఉండే నెల రోజులు సౌరమానం ప్రకారం మాసంగా గణిస్తారు.
సౌరమాన మాసాలు ఆయా ఇంగ్లీషు తేదీలను పోలి, అధికంగా ఆయా తేదీలలోనే వస్తాయి. అందుకే తమిళులకు ఏప్రిల్ 14ననే మేషారంభమై సంవత్సరాది వస్తుంది. నాగర ఖండ ఆధారంగా ‘‘రవే: సంక్రమణం రాశౌ సంక్రాంతి రిథి కథ్యతే’’. ఒక్కొక్క మాసము ఒకొక్క సంక్రాంతిగా చెప్పబడుతుంది. మకర సంక్రాంతి జనవరి 14నుండి కర్కాటక సంక్రాంతి జూలై 16వరకు ఉత్తరాయణం, తదాది మరల మకర సంక్రాంతి వరకు దక్షిణాయనంగా చెప్పబడింది. సౌరకాలమానం ప్రకారం ధనుస్సంక్రమణమైన మాసం దేవతలకు ఉష:కాలం. ‘‘బ్రాహ్మీ ముహూర్తే బుద్ధేత ధర్మార్థౌ చాను చింతయేత్’’అని స్మృతి చెపుతున్నది. దేవతలకు ధనుర్మాసం బ్రాహ్మీ ముహూర్త కాలం. మహా విష్ణువు ఆషాఢం మొదలుకుని, కార్తీకం వరకు నిద్రించి, సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించాక, విష్ణు సంబంధ శ్లోకాలచే మేల్కొలిపి అరుణోదయంలో ఉష:కాల శోడశోపచార పూజలు చేసి, పులగం - పొంగలి - శర్కర నివేదించాలి. నిర్ణయ సింధు కారుని ప్రకారం ఉదయానికి పూర్వం నాలుగు ఘడియలు, ఘడియ అనగా ఇరువై నాలుగు నిమిషాలు - గంటన్నరపై ఆరు నిమిషాలకు పూర్వము అరుణోదయం అగును. ధనుర్మాసము సౌరమానము యొక్క ప్రామాణికానుసారము కాగా, శుక్ల ఏకాదశి చాంద్రమానమైన తిథి. ప్రతి మాసమునందలి ఏకాదశులు ఎంతో పవిత్రమైనవి. ‘‘గృహస్థో బ్రహ్మచారీ చ ఆహితాగ్నిస్థ థైవచ; ఏకాదశ్యాంశ భుంజిత పక్షయోరు భయోరపి’’ అని అగ్ని పురాణాదులు వివరిస్తున్నాయి. గృహస్తులకు, బ్రహ్మచారులకు, నిత్యాగ్ని హోత్రులకు నైమిత్తిక కర్మగా ఉపవాసాద్యాచరణము విధించబడినది. ఇట్టి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన దివసము కావునే ఏకాదశి ‘‘హరి వాసరము’’గా కొనియాడబడుచున్నది. అందు సౌరమానము నందలి ప్రశస్తమైన ధనుర్మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశి (మార్గశీర్షము లేక పుష్య మాసం) ‘‘వైకుంఠ ఏకాదశి’’గా పిలువ బడుచున్నది. సూర్య చంద్రులు నేత్రములుగా కలిగిన వైకుంఠ వాసునికి సౌర, చాంద్రమానాలలో ప్రశస్తమైన ధనుర్మా శుక్ల పక్ష ఏకాదశి అత్యంత ప్రీతికరమైనది. ‘‘్ధనూరాశి స్థితే సూర్యే శుక్ల ఏకాదశి తిథౌ; త్రింషత్ కోటి సురై: సాకం బ్రహ్మ వైకుంఠ మాగత: పాలస్త్యేనని పీడితా: సురగణా: వైకుంఠలోకం యయు:; ద్వారే తత్ర విషాదభావ మనసా సూకె్తైర్ హరిం తుష్టువు: శుక్లై: శ్రీ:హరి వాసరే ప్రభాత సమయే భానౌ ధను: సంస్థితే, తేభ్యోదాత్ సుఖ దర్శనం కరుణయా నారాయణో మాధవ:’’ రావణుని బాధలను తాళలేని దేవతలు బ్రహ్మను ఆశ్రయింపగా...ఆదేవుడు ధనుర్మాస శుక్ల ఏకాదశి దినమున దేవతలందరితో వైకుంఠమునుచేరి, హరి వాసరమునందు దేవతలు విషాద భావ మనస్కులై శ్రీహరిని వేదోక్తంగా స్తుతించగా, వారికి శ్రీహరి సుఖ దర్శనమును కలుగజేసెనని వివరించబడినది. శ్రీప్రశ్న సంహిత నందు గల ఐతిహ్యము ననుసరించి మధు కైటభులను భగవానుడు సంహరించినపుడు వారు దివ్యరూపధారులై దివ్య జ్ఞానము పొందగా, బ్రహ్మాదులెవరైనను నీలోకము వంటి మందిరమును నిర్మించి, ఏకాదశి దినోత్సవమును గావించి, నిన్ను నమస్కరించి ఉత్తర ద్వార మార్గమున సమీపింతురో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగునట్లు దీనిని మోక్షోత్సవ దినముగా వరమిచ్చినట్లు తెలియుచున్నది. ముక్కోటి దేవతల బాధలను నివారించినందున ‘ముక్కోటి ఏకాదశి’గాను, వైకుంఠ దర్శనము కలిగించునది కనుక ‘వైకుంఠ ఏకాదశి’గాను, భగవద్దర్శనము చేయు పవిత్ర దినమైనందున ‘్భగవదవలోక దివసము’గ కొనియాడ బడుచున్నది.

కాలాతీత వ్యక్తులు- పి. శ్రీదేవి

0
0

ఆదర్శాలు, విలువలులేని తిను, తాగు, సుఖించు! మార్కు సుఖవాదులు- ఈ కాసిన్ని పాత్రలలో అద్భుతమైన హ్యూమన్ డ్రామా నడుస్తుంది నవలలో. మరో ఇన్‌గ్రిడెంట్- క్యారెక్టరైజేషన్ లేదా ఇవాల్యుషన్ ఆఫ్ క్యారెక్టర్స్- ఇందిర అనే అమ్మాయి నవల రెండో పేజీలో పరిచయమైనప్పుడు ఎట్లా మాట్లాడుతుందో- చిట్టచివరి పేజీలోనూ అదే ధోరణి, అదే నిర్భయత్వం, అదే స్వేచ్ఛాప్రియత్వం- ప్రదర్శిస్తుంది. ‘‘ఇంత విశృంఖలత’’అని మనలో కొద్దిమంది- విసుక్కునే పరిస్థితి కొద్ది పేజీల తరువాత కనిపిస్తుంది. ఆమేరకు పురుషవాద అహంకార మనస్తత్వాన్ని ఎక్స్‌పోజ్ చెయ్యటంలో రచయిత సఫలీకృతం అయినట్లే! అయితే అట్లా విసుక్కునే పాఠకుడు ఇందిర వెంట నవల చివరదాకా ప్రయాణిస్తే ఇందిర పాత్రలో ఒక విధమైన రొమాన్సులో పడిపోతాడు. ఆమె స్వేచ్ఛాప్రియత్వానికి ఓపెన్‌నెస్‌కీ, ధీరత్వానికీ విస్మయులవుతాడు! ఒక గొప్ప స్ర్తిమూర్తిని చూసిన అనుభూతి కలుగుతుంది.
మరింత కల్యాణి ‘ఈ కన్నీళ్ళు, ఈ కష్టాలు, ఈ దారిద్య్రం నాకెందుకు దేవుడా!’అంటూ అందమైన సుకుమారమైన ఈ యువతి మనకు బాగా చిరపరిచితమైన స్ర్తి. ఈమె కొంచెం ధైర్యం, కొంచెం గాంభీర్యం చూపితే బాగుణ్ణు- అని నవల చివర్లో అనుకోకుండా ఉండలేం.
కృష్ణమూర్తి మనలోని వాడే. యవ్వన సంధ్యల్లో తప్పటడుగులు వేసినవాడు. కాని స్థిరంగా నిలబడి వెలుగువైపు ప్రయాణించి ఇందిర వ్యక్తిత్వపు ధగధగల్ని చూసి, ఆమె చెయ్యిఅందుకోను సాహసించిన యువకుడు.
పాత్రలు ఎట్లా ఎవాల్వ్ అవుతాయో గమనించాలంటే ఈ కృష్ణమూర్తిని ఫాలో అయితే చాలు.
చివరాకర్న చెప్పుకోవాల్సింది ఆనందరావును - ఆ్దళ ఒకౄఇ్య యచి జూళష్ఘకజశ ౄజజూజూళ ష్ఘఒఒ ఏ విలువలూ, వాధాలూ, ఆశయాలూ లేని కేవలం తన సుఖం, తన వస్తుతౌల్యం మాత్రమే పరమావధి అనుకునే నేటి మధ్యతరగతి ఆది పురుషుడు. అతని సంతతే వందలు, వేలుగా, మిలియన్లుగా దేశం అంతటా వర్ధిల్లుతుంది. ఈ ఆనందరావు గతాన్ని, అతని మనస్తత్వాన్ని పరిశీలిస్తే- ఒక జలదరింపు కలుగుతుంది. ఈ ఆనందరావు మనకో వార్నింగ్.
చివరి ఇన్‌గ్రిడెంట్ నవలలోని ఫిలాసఫీ లేదా సందేశం లేదా నవలా ప్రయోజనం వగైరా, వగైరా-
ఏ సందేశాన్నీ చెప్పకపోవటమే ఈ నవల విశిష్టత! జీవితాన్ని జీవించాలి. ధైర్యంగా పోరాటంగా ‘‘రెక్కలున్నాయని ఎగరడానికి ప్రయత్నిస్తాం. రెక్కలు లేవు మనకు. ఉన్నా అణిగిపోయాయు!’’అన్న వివేచన ‘‘ఏ పనిచేసినా నేను కళ్లుతెరచి చేస్తాను. ఏడుస్తూ ఏదీ చెయ్యను. ఏది జరిగినా ఏడవను’’అనే స్థిర చిత్తాన్ని ‘‘ఏ ఘట్టంలోనూ నా వ్యక్తిత్వాన్ని చంపుకోను!’’అనగలిగే తాత్త్వాక ధీరతా- ఇవాల్టి స్ర్తి నేర్చుకోవాలనే స్ఫూర్తిని అందించే ప్రయత్నం చేస్తుందీ నవల.
వ్యక్తి- ఉన్నతి, మానసిక పరిణితి అనే మాటల్ని కూడ మనం చెప్పుకోవాలి. అట్లాగే ళశజూళూ ఒళశఒజఆజ్పజఆక ళశజూళూ ళజిఖ్ఘజఆక అనే మాటల్ని కూఢా మనం గుర్తుచేసుకోవాలి. యాభై యేళ్లనాటి నవలలో యిన్ని సుగుణాలా అని మనం ముచ్చటపడతాం ఈ నవల చదివిన వెంటనే! ఆ ముచ్చట పడటమే ఈ నవలను గొప్ప నవలల జాబితాలోకి చేర్చింది.
- సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

శ్రీనరసింహ శతకము

0
0

సీ. నరసింహ! నీ దివ్యనామ మంత్రము చేత
దురిత జాలము లెల్ల -ద్రోలవచ్చు
నరసింహ! నీ దివ్యనామ మంత్రము చేత
బలుపైన రోగముల్ పాపవచ్చు
నరసింహ !నీ దివ్య నామ మంత్రము చేత
రిపుసంఘముల సంహరింపవచ్చు
నరసింహ ! నీ దివ్య నామ మంత్రము చేత
దండహస్తుని బంటల దఱమ వచ్చు
తే. భళిర నేనీ మహామంత్ర బలము చేత
దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు
భూషణ వికాస శ్రీధర్మ పురి నివాస!
దుష్టసంహార ! నరసింహ! దురిత దూర!

భావం: ఓ నరసింహాస్వామీ! నీ పవిత్ర నామ మంత్రాన్ని జపించడం వల్ల పాపాలన్ని పారద్రోలవచ్చు. కఠినమైన రోగాన్ని తొలగించుకోవచ్చు. శత్రువుల్ని తుదముట్టించవచ్చు. ప్రాణాలను కొనిపోవవచ్చిన యమదూతల్ని తరుమవచ్చు. నీ నామమంత్రాన్ని జపించి వైకుంఠ ధామాన్ని చేరవచ్చు.

పొంగలి రకాలెన్నో..

0
0

ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశిని ఎంతో పవిత్రమైన, శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన రోజుగా భావిస్తారు హిందువులు. ధనస్సు నెలపట్టిన తరువాత చాలామంది ప్రతిరోజూ పొంగలిని విష్ణువుకు నైవేద్యంగా పెట్టి భుజిస్తారు. అలాంటి పొంగళ్లలోని రకాలను ఇప్పుడు చూద్దాం..

కట్టు పొంగలి

కావలసిన పదార్థాలు

బియ్యం: ఒకటిన్నర కప్పులు
పెసరపప్పు: రెండు కప్పులు
నెయ్యి: అర కప్పు
కరివేపాకు: రెండు రెబ్బలు
అల్లం: చిన్నముక్క
మిరియాలు: ఒక చెంచా
జీడిపప్పు: ఒక కప్పు
జీలకర్ర: ఒక చెంచా
ఉప్పు: తగినంత

తయారుచేసే విధానం

బియ్యం, పెసరపప్పు కడిగి కొద్దిగా నీళ్లు ఎక్కువ పోసి వండాలి. నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉంచి దించేయాలి. పెద్ద కడాయి తీసుకుని నెయ్యి వేసి మిరియాలు, జీలకర్ర, కరివేపాకు, అల్లం ముక్కలు వేసి ఫ్రై చేయాలి. ఇవి వేగాక జీడిపప్పు వేయాలి. ఆ తర్వాత మెత్తగా చేసుకున్న అన్నాన్ని ఇందులో వేసి కలపాలి. అంతే.. మహా విష్ణువుకు ఎంతో ప్రీతికరమైన, రుచికరమైన కట్టుపొంగలి తయారు.

రవ్వ పొంగలి

కావలసిన పదార్థాలు

రవ్వ: ఒక కప్పు
పెసరపప్పు: పావు కప్పు
నెయ్యి: నాలుగు చెంచాలు
శనగపప్పు: రెండు చెంచాలు
మినపప్పు: రెండు చెంచాలు
జీడిపప్పు: పది
మిరియాలు: ఒక చెంచా
జీలకర్ర: ఒక చెంచా
కరివేపాకు: రెండు రెబ్బలు
పచ్చిమిర్చి: రెండు
ఉప్పు: తగినంత

తయారుచేసే విధానం

బాణలిలో కొద్దిగా నెయ్యివేసి పెసరపప్పు వేయించాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టేయాలి. పెసరపప్పు బాగా ఉడికాక సన్నని మంటపై కాసేపు అలాగే ఉంచాలి. ఈలోపు ఇంకో కడాయిలో కొద్దిగా నెయ్యివేసి రవ్వను వేయించి పెట్టుకోవాలి. మరుగుతున్న పప్పులో ఈ వేయించుకున్న రవ్వ వేసి మరికొన్ని నీళ్లు పోయాలి. దీంట్లో ఉప్పు వేసి బాగా ఉడకనివ్వాలి. దీన్ని పక్కనబెట్టి మరో కడాయిలో నెయ్యివేసి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర కరివేపాకు, పచ్చిమిర్చి, మిరియాలు, జీడిపప్పు వేసి వేయించాలి. దీన్ని ఉడికించిన రవ్వ మిశ్రమంలో వేసి కలపాలి. అంతే ఎంతో రుచికరమైన రవ్వ పొంగలి తయారు.

సెనగపిండి పాయసం

కావలసిన పదార్థాలు

సెనగపిండి: కప్పు
జీడిపప్పు పొడి: పావు కప్పు
పచ్చికొబ్బరి తురుము: పావు కప్పు
పంచదార: ఒకటిన్నర కప్పులు
నెయ్యి: పావుకప్పు
యాలకులపొడి: ఒక చెంచా
పాలు: నాలుగు కప్పులు
జీడిపప్పు: తగినన్ని
కిస్‌మిస్: తగినన్ని

తయారుచేసే విధానం

ముందుగా జీడిపప్పును డ్రై రోస్ట్ చేసి పొడి కొట్టుకోవాలి. బాణలిలో కొద్దిగా నెయ్యివేసి పచ్చి కొబ్బరిని వేయించుకోవాలి. తరువాత జీడిపప్పు, కిస్‌మిస్‌లను దోరగా వేయించుకుని తీసేసుకోవాలి. అదే బాణలిలో మరికాస్త నెయ్యివేసి సెనగపిండి వేసి కమ్మని వాసన వచ్చేవరకు వేయించుకోవాలి. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు పోసి సన్నని సెగపై ఉడికించాలి. ఇది బాగా ఉడికిన తరువాత జీడిపప్పు పొడి వేసి కలపాలి. ఆ తరువాత వేయించిన పచ్చికొబ్బరి తురుము, పంచదార వేసి కలపాలి. చివరగా యాలకులపొడి, వేయించి తీసిన జీడిపప్పు, కిస్‌మిస్ వేసి అందిస్తే రుచికరమైన పాయసం రెడీ..

తీపి పొంగలి

కావలసిన పదార్థాలు

బియ్యం: ఒక కప్పు
పెసరపప్పు: అర కప్పు
బెల్లం తురుము: ఒకటిన్నర కప్పు
నెయ్యి: పావు కప్పు
కొబ్బరి పాలు: రెండు కప్పులు
యాలకుల పొడి: అర చెంచా
జీడిపప్పు: పది
బాదాం: పది
కిస్‌మిస్: పది
కుంకుమపువ్వు: కొద్దిగా

తయారుచేసే విధానం

కుక్కర్‌లో పెసరపప్పు వేసి వేయించాలి. అవి వేగాక బియ్యం వేసి రెండు నిముషాల తర్వాత నాలుగు కప్పుల నీళ్లు పోయాలి. కొబ్బరిపాలు, ఒక చెంచా నెయ్యివేసి కుక్కర్ మూత పెట్టేయాలి. నాలుగైదు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. అది చల్లారే లోపు కడాయిలో నెయ్యి వేసి బాదాం, జీడిపప్పు, కిస్‌మిస్ వేయించి పక్కన పెట్టాలి. బెల్లం తురుములో కొన్ని నీళ్లు పోసి మొత్తం కరిగించి, మరిగించాలి. ఈ లోపు అన్నాన్ని మెత్తగా కలపాలి. దీన్ని మరుగుతున్న బెల్లం పాకంలో వేయాలి. నెయ్యి, యాలకులపొడి, కుంకుమపువ్వు వేసి సన్నని మంటపై కాసేపు ఉడికించి దించేయాలి. చివరగా వేయించిన బాదాం, జీడిపప్పు, కిస్‌మిస్‌లతో అందంగా గార్నిష్ చేయాలి. అంతే ఎంతో రుచికరమైన తీపి పొంగలి రెడీ..
పులి పొంగలి

కావలసిన పదార్థాలు

గోధుమరవ్వ: ఒక కప్పు
చింతపండు: కొద్దిగా
ఆలివ్ ఆయిల్: రెండు చెంచాలు
ఆవాలు: ఒక చెంచా
శనగపప్పు: ఒక చెంచా
ఎండుమిర్చి: రెండు
కరివేపాకు: రెండు రెబ్బలు
ఇంగువ: కొంచెం
నూనె: తగినంత
ఉప్పు: తగినంత

తయారుచేసే విధానం

చింతపండును కడిగి నీళ్లుపోసి అరగంట పాటు నానబెట్టాలి. ఆ తర్వాత రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అందులో రవ్వను నానేయాలి. ఇప్పుడు కుక్కర్‌లో నూనె పోసి ఆవాలు, శనగపప్పు, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు వేసి కలపాలి. ఇవి వేగాక చింతపండు నీళ్లతో సహా రవ్వని కుక్కర్‌లో వేసేయాలి. దీంట్లో ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టేయాలి. ఐదు విజిల్స్ వచ్చేంతవరకు ఉడకనివ్వాలి. కాసేపటి తర్వాత కుక్కర్ మూత తీసి దాన్ని ఒక గినె్నలో వేసుకుని కరివేపాకుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవచ్చు.


మోక్షమార్గం వైకుంఠ ద్వారం

0
0

ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుం ఠ ఏకాదశి అని అంటారు. దక్షిణాయణంలో యోగనిద్రలోకి వెళ్లిన మహావిష్ణువు ఈ రోజునే మేల్కొంటాడు. ఆయనను దర్శించుకోవడానికి ముక్కోటి దేవతలూ వైకుంఠానికి చేరుకుంటా రు. అందుకే దీన్ని ము క్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. దక్షిణాయణంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈ రోజునే స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు కాబట్టి స్వర్గద్వార ఏకాదశి అని కూడా పిలుస్తారు.
ఇక కృతయుగంలో ‘ముర’ అనే రాక్షసుడు దేవతలను, రుషులను క్రూరంగా హింసించేవాడు. ముర అక్రమాలను భరించలేక దేవతలు శ్రీహరికి తమ బాధలు చెప్పుకున్నారు. ఆ నారాయణుడు మురాసురుడిని వధించడానికి బయలుదేరతాడు. ఈ విషయం తెలిసిన మురాసురుడు సాగర గర్భంలోకి వెళ్లి దాక్కుంటాడు. దీంతో అతన్ని బయటకు రప్పించేందుకు ఉపాయం పన్నిన నారాయణుడు గుహలోకి వెళ్లి నిద్రపోతున్నట్లు నటిస్తాడు. ఇదే అదనుగా భావించిన మురాసురుడు గుహలోకి ఉత్తర ద్వారం గుండా వచ్చి.. మహావిష్ణువును వధించేందుకు కత్తి దూయగానే ఒక శక్తి ఉద్భవించి మురాసురుణ్ణి సంహరిస్తుంది. ఈవిధంగా దేవతలను సంరక్షించిన ఈ శక్తికే ఏకాదశి అని నామకరణం చేశారు. అందుకే ఈ రోజు ఉత్తర ద్వారం గుండా భక్తులకి ఆ శ్రీమహావిష్ణువు దర్శనం ఇస్తాడని భక్తుల నమ్మకం. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోకి ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నాయి.
మామూలుగా అన్ని దేవాలయాల్లో ఏడాదిలో అన్ని రోజులు ఉత్తర ద్వారాన్ని మూసి ఉంచుతారు. కేవలం వైకుంఠ ఏకాదశి రోజే ఉత్తర ద్వారాన్ని తెరచి ఉంచుతారు. ఉత్తరద్వారం గుండా వెళ్లి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగానూ, దివి నుంచి భువికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడ వాహనరూఢుడైన మహావిష్ణువు దర్శనానుగ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. దీనే్న హరివాసరమని, హరిదినమని, వైకుంఠ దినమని అంటారు. అందుకే ఈ పర్వదినాన ఉపవాసముండి లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును షోడశోపచార విధితో ఆరాధించాలి. నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశి రోజున మళ్లీ భగవదారాధన ముగించుకుని పారాయణ చేసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాదులతో సత్కరించాలి. ఉపవసించలేనివారు నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు భుజించి ఉండవచ్చును. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతాపారాయణం, గోవింద నామస్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తిని కలిగిస్తాయి.

రంగవల్లి

0
0

ముగ్గులకు ఆహ్వానం

నింగిలోని హరివిల్లులను నేలపైన పేర్చి.. కనులకింపైన రంగుల్ని అందంగా అద్దితే అది రంగుల మాలికవుతుంది. ముంగిట్లో రంగవల్లిక అవుతుంది. ధనుర్మాసం సందర్భంగా తెలుగు ముంగిళ్లలో రంగవల్లులను తీర్చిదిద్దడం ఆనవాయితీ.. ఆ సందర్భంగా ముగ్గులకు ఆహ్వానం పలుకుతోంది మాతృభూమి. ఆసక్తి కలవారు కింది చిరునామాకు ముగ్గులను పంపగలరు.
సూచనలు
* ముగ్గులను పంపేవారు ఎ4 సైజు తెల్లకాగితంపై వేయాలి.
* ముందుగా నల్లని ఇంక్‌తో ఔట్ లైన్ గీసిన తరువాత అందులో రంగుల్ని నింపాలి.
* ఎన్ని చుక్కలను పెట్టి ముగ్గులు వేశారో.. అంటే సరిచుక్కలా, బేసి చుక్కలా, సందు చుక్కలా.. అనే విషయం స్పష్టంగా రాయాలి.
* ముగ్గుతో పాటు, మీ పాస్‌పోర్ట్ సైజు కలర్ ఫొటోని, చిరునామాని జతచేయాలి.
* డౌన్‌లోడ్ చేసిన ముగ్గులు కాక, స్వయంగా చేతితో వేసిన ముగ్గులనే పంపాలి. అదీ చుక్కల ముగ్గులకే ఆహ్వానం.
ముగ్గులు పంపాల్సిన చిరునామా:

ఎడిటర్,
ఆంధ్రభూమి దినపత్రిక, సరోజినీదేవి రోడ్,
సికింద్రాబాద్- 500 003.

మహాభారతంలో ఉపాఖ్యానాలు-76

0
0

పూర్వం కృతయుగంలో అకంపనుడు అనే రాజు ఉండేవాడు. అతన్ని యుద్ధరంగంలో శత్రువులు జయించారు. అతని పుత్రుడు హరి. అతను నారాయణునితో సమాన బలం కలవాడు. అతన్ని యుద్ధంలో శత్రువులు సంహరించారు. అకంపనుడు పుత్రునికి ఉత్తరక్రియలు జరిపించి రాత్రింబవళ్లు పుత్రునికోసం దుఃఖిస్తూ ఉండేవాడు. అతని దుఃఖవిషయం తెలిసి నారదమహర్షి అతన్ని చూడడానికి వచ్చాడు. రాజు అతన్ని పూజించి తన కుమారుని మరణవార్త తెలిపాడు. అతను నారదునితో ఇలా అడిగాడు. ‘‘నా కుమారుడు మహావీరుడు. ఇంద్రునితో సమానమైనవాడు. అతన్ని శత్రువులు చంపారు. పూజ్యుడా! ఈ మత్యువు ఎవరు? ఆయన బలం ఏపాటిది? నేను తెలుసుకోవా లనుకుంటున్నాను’’.
అప్పుడు నారదమహర్షి అతనికి పుత్రశోకాన్ని పోగొట్టే మృత్యూపాఖ్యానాన్ని వివరించాడు.
‘‘రాజా! ఈ సృష్టి ప్రారంభంలో బ్రహ్మ ప్రజలను సృష్టించాడు. కాని వారెవరూ ఎప్పటికీ చనిపోకపోవడం చూసి దీని సంహారవిషయంలో బ్రహ్మకు తీవ్రమైన చింత కలిగింది. ఎంత ఆలోచించినా అతనికి మార్గం కన్పించలేదు. అప్పుడు ఆయనకు ఆగ్రహం కలిగింది. ఆ క్రోధం వలన అతని ఇంద్రియాలనుండి అగ్ని పుట్టింది. ఆ అగ్ని సర్వాన్ని దహించదలచి అన్ని దిక్కులకు వ్యాపించింది. అప్పుడు భూమ్యాకాశాలలో ప్రంచడమైన అగ్ని జ్వాలలు వ్యాపించాయి. అగ్నిదేవుడు తన జ్వాలలతో సమస్తాన్ని దహించి వేయసాగాడు. అప్పుడు రుద్రుడు పరమేష్ఠి అయిన బ్రహ్మదేవుని శరణుకోరాడు. అప్పుడు బ్రహ్మ రుద్రుని ఇలా అడిగాడు. ‘‘పుత్రా! నీ కోరిక ఏది నెరవేర్చాలి? చెబితే నీకు ఇష్టమైనది చేస్తాను’’.
అప్పుడు శంకరుడు బ్రహ్మతో ఇలా అన్నాడు. ‘‘దేవా! నీవు అన్ని రకాల ప్రాణులనూ సృష్టించావు. అవి వృద్ధి చెందాయి. కాని వాటినే నీ క్రోధాగ్ని అన్ని వైపులనుంచీ దహించి వేస్తున్నది. అది చూసి నాకు బాధ కలుగుతున్నది. ఆ ప్రాణులమీద దయ చూపండి’’. అప్పుడు బ్రహ్మ అన్నాడు. ‘‘రుద్రా! ఈ జగత్తు అంతా సంహారం కావాలని నా కోరిక కాదు. దీనికి మేలు చేయాలనే నా ఉద్దేశ్యం. ఇంతమంది జీవులతో ఈ భూమికి భారం ఎక్కువ అవుతున్నది. భూమి ఈ భారం భరించలేక నన్ను ప్రార్థించింది. ఇంత విశాలమైన భూమి భారం దించడానికి నాకు ఏ ఉపాయం తోచడం లేదు. అందువల్ల నాకు ఆగ్రహం కలిగింది’’.
రుద్రుడు మరల ఇలా అన్నాడు. ‘‘పితామహా! ఈ ప్రాణులను నాశనం చేయకు. ఈ జగత్తు భూత, భవిష్యత్, వర్తమానాలు అని మూడు రీతులుగా ఉండుగాక. నీ కోపంలోంచి అగ్ని పుట్టి ఈ జగత్తును దహిస్తున్నది.
ఈ జగత్తు కాలి బూడిద ఐపోతున్నది. నీవు శాంతించు. ఇదే నిన్ను నేను కోరే వరం.’’
రుద్రుని మాటలు విని ప్రజాపతి మన క్రోధాన్ని తనలోనే దాచుకున్నాడు. కోపం వల్ల కలిగిన అగ్నిని ఉపసంహరిస్తున్న బ్రహ్మదేవుని అగ్ని ఇంద్రియాల నుండి ఒక స్త్ర ఆవిర్భవించింది. ఆమె శరీరం నలుపు ఎరుపు రంగులలో ఉన్నది. ఆమె కన్నులు, నాలుక, పచ్చని ఎర్రని రంగుల్లో ఉన్నాయి. ఆమె సువర్ణ ఆభరణాలు ధరించింది. ఆమె బయటకు వచ్చి దక్షిణ దిక్కుని ఆశ్రయించి వారిద్దరినీ చూసి నవ్వింది. అప్పుడు బ్రహ్మదేవుడు ఆమెను దగ్గరకు పిలిచి ‘‘మృత్యువా!’’ అని సంబోధించి, ‘‘నీవు ఈ సమస్తలోకాలను సంహరించు. ఇది నా ఆజ్ఞ’’ అన్నాడు. బ్రహ్మదేవుని మాటలు విన్న ఆమె వెకి వెక్కి ఏడ్వసాగింది. బ్రహ్మ ఆమెను శాంతపరచి ఓదార్చాడు. అప్పుడు ఆమె అతనికి నమస్కరిస్తూ ఇలా అన్నది ‘‘దేవా! నీవు సృష్టంచిన స్త్ర అన్నీ తెలిసి కూడా లోకానికి మేలు చేయని ఇలాంటి కౄరకర్మ ఎలా చేయగలదు? ఇలాంటి అధర్మకార్యాన్ని చేయడానికి నేను భయపడుతున్నాను. జనులకు ఇష్టమైన పుత్రులను, భర్తలను, సోదరులను చేను చంపుతూ ఉంటే అందరూ నాకు కీడు కలగాలని దైవాన్ని ప్రార్థిస్తారు. కనుక నాయందు దయ ఉంచి నేను యముని నివాసానికి వెళ్లకుండా ఉండేటట్లు అనుగ్రహించు. మీరు అనుగ్రహిస్తే తపస్సు చేసుకోవా లనుకుంటున్నాను. దేవా! జీవులకు చాలా ఇష్టమైనది వారి ప్రాణాలు. వారు రోదిస్తూ ఉండగా ఆ ప్రాణాలు తీయడానికి అశక్తురాలను. ఈ అధర్మం చేయకుండా నన్ను రక్షించు’’.
అప్పుడు బ్రహ్మ ఇలా అన్నాడు - ‘‘మృత్యువా! ప్రజలను సంహరించడానికే నిన్ను సృష్టించాను. కనుక వారిని సంహరించు. ఇది ఇలాగే జరగాలి. నీకు లోక నిందరాదు. నా ఆజ్ఞను పాలించు.’’
బ్రహ్మదేవుడు అలా చెప్పగానే ఆమె మనసులో సంతోషించింది. తర్వాత బ్రహ్మకు కోపం తగ్గి ప్రసన్నుడయ్యాడు. మృత్యుదేవత బ్రహ్మతో ఏమీ అనకుండా ధేను కార్యక్రమానికి వెళ్లింది. అక్కడ ఆమె ఉత్తమమైన వ్రతాన్ని చేపట్టింది. ఆమె ఇంద్రియాలను నిగ్రహించి ఒంటికాలి మీద నిలిచి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసింది. మరల కొన్ని వేల సంవత్సరాలు తపించింది. మరల కొన్ని వేల సంవత్సరాలు మృగాలతో కలిసి సంచరించింది. మరల ఆమె నందానది దగ్గరికి వెళ్ళి ఆ నదీజలంలో ఎనిమిది వేల సంవత్సరాలు గడిపింది. ఆ విధంగా ఆమె దోషరహిత పాపరహిత అయింది. తర్వాత ఆమె కౌశికీనది తీరానికి వెళ్లి అక్కడ నియమాలు పాటిస్తూ గాలిని, నీటిని ఆహారం తీసుకొని జీవించింది.
ఇంకావుంది...

స్వాధ్యాయ సందోహం-171

0
0

అయితే అట్టి అంధ తమ సాకృత లోకాలలో పడినవారికి దైవానుగ్రహంవలన ఏనాడో వారు చేసిన పుణ్యకర్మ ఫల లవలేశాలు జాగృతమయితే ‘దోషాఃశివఃసహసః సూనో అగ్నే యం దేవ ఆ చి త్సచసే స్వస్తి’ ‘‘ఓ మహాబలాగ్రణీ భగవాన్! వారివద్దకు దయతో దరిచేరే శివస్వరూపులు మీరే’’అని ప్రతి మంత్రం వారికి స్వాంతన పలికింది.
ఈ మంత్రంలో మరొక ముఖ్య సంకేతం కూడ ఉంది. ధ్యానం రాత్రి సమయంలోనే జరగాలి. అప్పుడు నిశ్శబ్దమంతట గాఢంగా వ్యాపించియుంటుంది. ఆ సమయంలో దైవం సాధకుని చేరి జ్ఞానజ్యోతిని చూపుతుంది. దైవం ధ్యానంలో రాగానే సాధకునిలోని అమతి= నాస్తికత్వాన్ని తొలగించివేస్తుంది. అలా జరిగినంతనే సాధకునిలో నకారాత్మక భావాలకు (వ్యతిరేక భావాలకు) తావే యుండదు. సమస్త పాపాలకు మూలం నాస్తికతయే. భగవంతుని అస్తిత్వమూ, న్యాయశీలత, కర్మఫల ప్రదాతృత్వాలపై అచంచల విశ్వాసం లేనివాడికి పాపపంకిల కూపంలో పతనం తప్పదు. అందుచేతనే ధ్యానంలో దైవం ప్రవేశించిన వాడికి ‘అమతి’ వినాశనమేగాక పాపచింతన కూడ దరిజేరదు. దానివలన ధ్యాననిష్ఠుని మదిలో పాప సంబంధ సంస్కారాలు కూడ తలెత్తవు. ఆ విధంగా దైవం సాధకుని ఎడల కృపావీక్షణాన్ని సారించి అనుగ్రహిస్తుంది.
**
158. మహా సౌభాగ్య సాధనకు నీ శక్తిని వినియోగించు
అగ్నే శర్ధ మహతే సౌభగాయ తవ ద్యుమ్నాన్యుత్తమాని సంతు
సం జాస్పత్యం సుయమమా కృణుష్వ శత్రూయతామభి తిష్ఠా మహాంసి॥ ఋ.5-28-3.
భావం:- ఓ అగ్నీ! మా సౌభాగ్యానికి నీవు నీ బలాన్ని అనుసంధానం చేయి. అది నీ కీర్తిని మహోన్నతంగా వృద్ధిపరచుగాక! భార్యాభర్తల సంబంధం శుభకరంగా, పరస్పర సహకారయుతంగా, నియంత్రణగా ఉండే రీతిగా చేయి. మా యెడల శత్రుత్వం వహించేవారి బలాన్ని అణచివేసి వారిని నీవు నీ అదుపులో ఉంచుకొనుము.
వివరణ:- మానవులు కొద్దియో పని చేసే వారికి ఎంతోకొంత బలమవసరం. మరి ఆ బలం దేనికి వినియోగించాలో వేదం ‘అగ్నే శర్ధమహతే సౌభగాయ’ ‘‘ఓ జ్ఞానీ! బ మహాసౌభాగ్యంకోసమే నీవు నీ బలాన్ని ఉపయోగించు’’ అని హెచ్చరిస్తూంది. ఈ విషయానే్న పునరుద్ఘాటిస్తూ ఋగ్వేదము మరొక సందర్భంలో ‘ఉచ్ఛ్రయస్వ మహతే సౌభగాయ’ (ఋ.3-8-2) ‘‘మహాసౌభాగ్యంకోసం ఉద్యమించు లేదా ఉన్నతమైన దానిని ఆశ్రయించు’’మని చెప్పింది. నీకంటె గొప్పదాన్ని లేదా గొప్పవారి సహకారం పొందాలనుకొంటే ఒక గొప్ప ఆదర్శసాధనకోసమే పొందు. అలాచేస్తే ‘తవ ద్యుమ్నాని ఉత్తమాని సంతు’ ‘‘నీ కీర్తి శోభిస్తుంది’’. సౌభాగ్యశాలి కీర్తి శోభస్కరం కాకుండా మరోలా ఉండదు కదా!
చిత్రమేమంటే సౌభాగ్యప్రాప్తి ననుసరించి పతనప్రాప్తి అనే ప్రమాదం కూడ పొంచియుంది. అదే విలాసం. విలాసం వినాశ సహచరి. విలాసాన్ని కోరకో వినాశనం కోరకుండానే నీ చెంతకు చేరుతుంది. విలాసం రూపనాశనం, సంపత్తి నాశనం, తేజోనాశనం. కీర్తి నాశనం ఇలా ఎన్నో వినాశనాలను వెంట తీసుకొని వస్తుంది. ఈ అన్నింటిని సమీక్షించి వేదం ‘సం జాస్పత్యం సుయమమా కృణుష్వ’ ‘‘దాంపత్య జీవితాన్ని సంయమనంతో గడుపు’’ అని మానవ సమాజాన్ని సావధానపరుస్తూంది. వివాహ ప్రధానోద్దేశ్యం కామోపభోగం కాదు. ఉత్తమ సంతానప్రాప్తియే. భోగానుభవం కేవలమా సంతానప్రాప్తి పర్యంతమే. వివాహ ప్రధానోద్దేశ్యం సఫలంకాకపోతే అంటే సంతానప్రాప్తి కాకుంటే దానికోసం ఆచరించబడిన భోగం దూషిత మవుతుంది. కాబట్టి దాంపత్య ధర్మాన్ని దూషితం చేయవద్దని వేదం శాసిస్తూంది. వివాహ పద్ధతిద్వారా విలాసాన్ని- భోగాన్ని అనుభవించేందుకు వేదం అనుమతినిచ్చింది. కాని ఆ దాంపత్య ధర్మం ద్వారా సత్సంతానాన్ని పొంది పవిత్రమైన, ఉన్నత, ఆదర్శ సమాజ నిర్మాణాభివృద్ధికి తోడ్పడేటందుకు మాత్రమే.
వివాహపరంగా ఇంతటి మహోన్నత ఆదర్శభావన వేదాలలో ఉన్నంతగా ప్రపంచంలో మరెచ్చటకానరాదు. వైవాహిక జీవితం నిజంగా ఒక గొప్ప సామ్రాజ్యం. సాధారణ రాజ్యంలోవలెనే ఈ గృహస్థాశ్రమ సామ్రాజ్యంలో కూడ కష్ట-నష్టాలు ఉంటాయి. అయినా వాని యెడల ఉదాసీనంగా ఉండక ‘శత్రూయతామభి తిష్ఠా మహాంసి’ ‘‘శక్తివంతుడవై నీ శత్రువులను నిర్జంచు’’అని భగవంతుడీ మంత్రంద్వారా ధైర్యవచనంతో ప్రోత్సహపరుస్తున్నాడు. విలాసాల ఎడల అభిముఖ్యం కలవాడు ఆ విధంగా దైవోపదేశాన్ని ఆచరించలేక జీవితంలో పరాజితుడవుతాడు.

ఇంకావుంది...

సుందరకాండ

0
0

అయితే-
సర్వదేవతామూర్తులుగా స్వామిచేత నమస్కరింపబడిన వారిలో సూర్యుడు ఇంద్రుడు వాయువు బ్రహ్మ ఉన్నారు. మనుశ్చంద్ర కుబేరశ్చ లోపాముద్రాచ మన్మథః
అగస్తి రగ్ని సూర్యశ్చ ఇప్ద్రస్స్కందశ్కివస్త్థా
క్రోధభట్టారకో దేవ్యా ద్వాదశామీ ఉపాసకాః
అని ఈ పండ్రెండుగురు లలితా ఉపాసకులు. కనుక వీరిలో తూర్పు దిక్కుతో కలిపి సూర్యునకు, సూర్యునితో కలిపి ఆ దిక్కునకు పాలకుడైన ఇంద్రునకు నమస్కరించేడు. ఆమెచేత సృష్టింపబడి నిరంతరము ఆమెను సేవిస్తూ పంచ సంఖ్యోపచారిణి అనే నామాన్ని ఆమెకు స్థిరపరచిన పంచభూతములను స్మరించేడు.
తన జన్మకారకుడైన వాయువును స్మరించేడు.
ఎవని అనుగ్రహము తనయందుండవలెనో అట్టి బ్రహ్మను స్మరించేడు.
అంటే స్వామి సమయ పూజ చేసేడు. ఇప్పుడు స్వామి బయలుదేరడానికి సిద్ధమవుతున్నాడు. ఆంజనేయస్వామి సర్వదేవతా నమస్కారం చేయడమనేది సుందరకాండలో మూడుచోట్ల కనిపిస్తుంది. కానీ-స్వామి నమస్కారం చేసే పద్ధతిలో ఒక హెచ్చరిక ఉంటుంది.
కార్యసిద్ధికి చేసే ప్రయత్నంలో ఉత్సాహం ఎక్కువై కేవలం పౌరుషమీదనే విశ్వాసం పెరిగితే- అది అజ్ఞాన కారణం అవుతుంది. కనుక- దానివలన దుఃఖం పుట్టి ఆ తరువాత దైవం స్మృతికి వచ్చి స్మరించటం జరుగుతుంది.
స్వామి- ‘‘బుద్ధిమతాం వరిష్ఠుడు’’ కనుక. బుద్ధిలేని సామాన్యులకు కేవల పౌరుష భావనే కలిగి దుఃఖప్రాప్తి కలుగుతుందు.
ఆంజనేయస్వామికీ దుఃఖప్రాప్తి కలుగుతుంది.
ఆంజనేయస్వామికి దుఃఖప్రాప్తి కలిగిన అనుక్షణంలోనే దుఃఖ నివృత్తి కలగటం మనం ఎదరెదర చూస్తాం. సరే.
స్వామి సముద్రాన్ని లంఘించడానికి కావలసిన స్థితిని శారీరకంగా సకూర్చుకొంటున్నాడు.
భుజాల్ని సంకోచింపచేసి ముందుకు చాపేడు
శిరస్సును పైకెత్తేడు.
దూరంగా ఉన్న మార్గంవైపు దృష్టిని సారించేడు.
ప్రాణవాయువుల్ని నిరోధించేడు.
ఆకాశంపైనే దృష్టి పెట్టుకొన్నాడు.
శత్రుపరాభవాభిరూప సమర్ధమైన తేజస్సును జలరూపమైన సత్వాన్ని ఆకాశాభినిష్క్రమణ రూపమైన వీర్యాన్ని పొందేడు- స్వామి శ్రీమంతుడయ్యేడు.
శ్రీమంతుడంటే ఎవరు?-
ఎవడు తేజోవంతుడో, వాడు.
ఎవడు సత్వమంతుడో, వాడు
ఎవడు వీర్యవంతుడో, వాడు
అయితే- ఈ గుణాల ప్రయోజనమేమిటి!
తన తేజం ఎదుటి వానిలోని కాలుష్యాన్ని కడుగగలగాలి.
తన సత్వం ఎదుటి వానిలోని దోషాన్ని సహింపగలగాలి.
తన వీర్యం ఎదుట వానిని కష్టాల నుండి దాటింపగలిగి ఉండాలి.
ఇవి స్వామి యందు మనకు కనబడే లక్షణాలు.
సుందరకాండను పారాయణ గ్రంథంగా నమ్ముకొన్నవాళ్ళు పొందగలిగిన లక్షణాలు.
సరే, - స్వామి శ్రీమంతుడయ్యేడు.
ఇంకావుంది...

శ్రీ పరమహంస బోధామృతము

0
0

ఈ నలుగురినే ఎందుకు ధ్యానించినట్లు!కొంత కాలమునకు బిమ్మట క్రీస్తును క్రైస్తవాదర్శమును ధ్యానించి తద్గమ్యమును నితర మతముల గమ్యమునొక్కటియేయని గ్రహించెను.
అనంతరము 1872-వ సంవత్సరమున శ్రీరామకృష్ణుడు షోడశీ పూజయను మహాసాధనయందు తన భార్యను సాక్షాత్పరమేశ్వరీ స్వరూపముగా నారాధించెను. అతని దివ్యసాధనల కిదియే పరిసమాప్తియని చెప్పనగును. శ్రీరామకృష్ణుని బాల భార్యయగు శారదామణీదేవి నవవనమ నొందినను ఇంతవఱకు భర్తను రెండుమూడుసారులు మాత్రమే దర్శించి యుండెను. కాకిమూకలగు లోకుల తన భర్త పిచ్చివాడని చెప్పకొనుచుండిన ప్రలాపములను విని యోమె కలవరపడి యాతని సేవించి తమకమున (1872వ సంవత్సరమున) స్వయముగా దక్షిణేశ్వరము వచ్చెను. దివ్యప్రేమమూర్తియగు శ్రీరామకృష్ణుడు సామాన్య సన్న్యాసులవలెగాక, శారదాదేవి నఖండ సానుభూతితో నాదరించి యైహికా ముష్మిక విషయము లన్నిటిలో నామెకు గురుత్వము వహించెను. వినిర్మల హృదయయగు శారదాదేవియు వెంటనే తన మగని యాశయములను గని తన ప్రాణేశ్వరుడు సాక్షాత్పరమేశ్వరుడను భావముతోనాతని సేవింపసాగెను. చంద్ర మండలమునకై నను మచ్చ కలదు కాని యాదివ్యదంపతుల యన్యోన్య ప్రేమమున కామకళంక మణు మాత్రమైనను కానరాదయ్యె. మఱియు మేలిమి బంగారమగు తనజితేంద్రియత్వమును బరీక్షించుకొనుటకేమి, స్ర్తిలనందఱను సాక్షాజ్జగజ్జన నీ స్వరూపిణులనుగా గాంచుటకేమి, తనచెంత శారదా దేవియునికి శ్రీరామకృష్ణునకు దోడ్పడియెను.
షోడశీపూజ శ్రీరామకృష్ణుని దివ్య జీవితమున సాధక భావమునకు శాంతిపాఠము; ఇంతటినుండియు లోకమున కాతడొనర్చిన దివ్యజ్ఞాన దానమునకు- అతని జగద్గురు భావమునకు- గణపతి పూజ. సాధనల నిమిత్త మాతనితీర్పరాని దాహము షోడశీ పూజానంతర ముపశమించెను; తత్త్వము నికర తలామలకముగాగాంచుచు, తన మనశ్శరీరముల మూలమున జగజ్జనని లోకమునకు బ్రకటించు విజ్ఞానమును అఖండాధ్యాత్మిక శక్తిని విస్పష్టముగా నాతడు గుర్తింపసాగెను. ఆత్మమార్గమును లోకమునకు బోధించుటకై యాతడు పరితపింపసాగెను.
శ్రీరామకృష్ణుని జీవితమును బరిశీలించినచో, బాల్యమునుండియు నాతనియందు సద్గురువరేణ్యుని లక్షణములు పొడకట్టును. అనేకుల కీ బాలశుకుని పలుకులు జ్ఞానప్రదీపకములై భాసించెను. సాధనకాలమున ఈ శక్తి వికసింపసాగెను. దక్షిణేశ్వరాలయ నిర్వాహకులగు రాసమణీ మథుర నాథులయెడ అతడెన్నడును సేవక భావమ వహింపలేదు; సరికదా, సామాన్య బ్రహిఃప్రజ్ఞయందు వారి యాప్తుడుగను దివ్యభావములందు రక్షకుడుగను ఇలువేలుపుగను వర్తించెను. అతనికి బోధింపవచ్చిన గురువులాతనికి నేర్పిన దానికంటె విశేషము తామే నేర్చుకొని వెడలిరి. భైరవీ బ్రాహ్మణి యాతని సాంగత్యముచే తన శీలమునందలి లోపములను సవరించుకొని యఖండ వైరాగ్య మలవరచుకొనియెను. తోతాపురియు దనక పూర్వమగు భక్తిరహస్యముల నాతనికడ గ్రహించెను. మఱియు 1870-వ సంవత్సరమున శ్రీరామకృష్ణుడు మథురనాథునితో తీర్థయాత్రకు వెడలినవు డనేకులాతని సంసర్గమున ధన్యులైరి. విశేషము, వివిధ సంప్రదాయములకు జెందిన సాధకులును సన్న్యాసులును వందలకొలది దక్షిణేశ్వరము వచ్చి యాతని దివ్యోపదేనుధారసమును గ్రోలసాగిరి. పండితులాతని వచనామృతము నాస్వాదించి ముగ్ధులై, ముముక్షువులైరి.
ఇంకా ఉంది
శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 1121 మహోపదేశములు గల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -సంగ్రహ జీవిత సహితము - అనువాదకుడు: శ్రీ చిరంతనానందస్వామి

భగవద్గీత - శరణాగతి

0
0

‘శ్రేయన్ ద్రవ్యమియాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప
సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే
బద్ధ జీవితానికి అజ్ఞానం కారణం కనుక దానిని తొలగించే శ్రేష్టమైన యజ్ఞం జ్ఞాన యజ్ఞమేనని, పై శ్లోకం కర్మసాధనగానూ, జ్ఞానము సాధ్యంగానూ నిరూపిస్తోంది. ‘నేను దేహాన్నికాను నేను జీవాత్మను..’ ఈ భౌతిక బంధనంనుండి విముక్తిపొందటమే నా జీవితలక్ష్యం అని గ్రహించటమే జ్ఞానప్రాప్తికి తొలిమెట్టు.
ఇట్టి జ్ఞానాన్ని ఎలా పొందగలమో ఆ ఉపాయాన్నికూడా ఇలా తెలియచేస్తున్నారు కృష్ణపరమాత్మ.
‘తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశే్ననసేవయో
ఉపదేశక్య్రనితే జ్ఞానం జ్ఞానిన స్తత్త్వదర్శిన్‌ః’
అట్టి జ్ఞానమును తత్త్వవేత్తయగు ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయించి సాష్టాంగ నమస్కారమాచరించి- సమయము చూచి వినయ పూర్వకంగా ప్రశ్నించి, సేవించి గ్రహించు. ఆత్మసాక్షాత్కారం పొందినవారు సత్యాన్ని దర్శించినవారు కనుక వారు నీకు జ్ఞానాన్ని ఉపదేశించగలరు.
జ్ఞానసిద్ధి నిమిత్తం ఆధ్యాత్మిక క్షేత్రమున పురోగమించుటకు గురువు యొక్క సహాయము అత్యవసరమని పై శ్లోకం తెలియచేస్తోంది గురుకుల వాసమందు శిష్యుడు ప్రవర్తించవలసిన పద్ధతికూడా చక్కగా చెప్పబడింది. దేనిని తెలుసుకుని మరల ఇట్టి మోహమునకు లోనుకావో- దేనిచే సమస్త ప్రాణులను నీయందునుకూడా చూడగలవో అటువంటి జ్ఞానాన్ని తత్త్వవేత్తల నాశ్రయించి తెలుసుకోమన్నాడు.
భగవద్గీత ఆరంభంలో అర్జునుడు శ్రీకృష్ణుని కేవల మిత్రునిగా భావించి మాట్లాడినా తన సమస్యకు పరిష్కారం లభించనప్పుడు కృపణత్వమనే దోషమునిండిన స్వభావం కలవాడు. ధర్మవిషయమున సందేహ మనస్కుడు అయిన అర్జునుడు యబ్భ్రేయస్స్యాన్నిశ్చితం బ్రహితనే్మ శ్రేష్యస్నేహం శాధి మాంత్వాం ప్రసన్నమ్ ధర్మ విషయమున సందేహముతో నిన్ను అడుగుతున్నాను. ఏది నిశ్చయముగా శ్రేయస్కరమో దానిని నాకు చెప్పు. నేను నీకు శిష్యుడను నీ శరణుపొందాను. నన్ను శాసించు’అని అహంకారాన్ని పారద్రోలి శ్రీకృష్ణపరమాత్మ పాదాక్రాంతుడయ్యాడు పారమార్థిక క్షేత్రంలో పురోగతి పొందగలిగే మార్గం శరణాగతియే.
‘మనుష్యాణాం సహస్రేషు
కశ్చద్యతత సిద్ధయే
యతతామపి సిద్ధానాం
కశ్చిన్మాం వేత్తి తత్వత్‌’
అనేక వేల మంది మనుష్యులలో ఏ ఒకానొకడో మోక్షసిద్ధికై ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించే ముముక్షువులలో కూడా అనేకులలో ఏ ఒక్కడో మాత్రమే యదార్థంగా నన్ను తెలుసుకోగలుగుతున్నాడు.
మనిషి ఈ లోకంలో అనేక విధాలైన అభిమాన, మమకార, అహంకార దంభాలకై-్ధన, కనక, వస్తువాహనాలకై ఎవరో ఒకరిని ఆశ్రయించి శరణువేడుకున్నాడని కానీ సర్వాధారుడైన సర్వేశ్వరుని ఆశ్రయించటమే నిజమైన శరణాగతి ‘తలైవాహం, మమైవత్వసి తత్వమే వాహమితి ‘త్రేధా’అని మూడువిధాలైన శరణాగతి చెప్పబడింది. నేను నీవాడను అనే తవైవాహం పరమాత్మ సర్వస్వతంత్రుడుగాను భక్తుడాయన ఆధీనుడిగానూ భావించి ఆశ్రయించేవిధం. రెండవదైన తమైపిత్వం భగవంతుని పరతంత్రునిగా భక్తుని స్వతంత్రుడుగా సూచిస్తోంది. ఈ దశలో భగవంతుని తన హృదయంతో కట్టివేసుకోగలడు భక్తుడు. అంతటి మహనీయ భక్తిపరవశుడైన భక్తుని యోగక్షేమాలు తనవిగానే భావిస్తాడు భగవంతుడు. ‘యోగక్షేమం వహామ్యహం’ అని ప్రతిజ్ఞ చేసాడు- నిరూపించడు కృష్ణపరమాత్మ. మూడవ ‘త్వమేవాహం’అనేది నువ్వేనేను అనే అవిభక్తమైన భక్తి. ఇది అద్వైత శరణాగతి ‘వాసుదేవ సర్వమితి’. జీవాభిమానం కలిగివున్నంతవరకూ భగవంతుడు పూర్ణుడు. భక్తుడు అంశం ఉపాధుల అభిమానం వదిలి స్వరూప స్థితిలో నిలిచినప్పుడు భగవంతుడే భక్తుడు. భక్తుడే భగవంతుడు ఇద్దరూ ఒక్కటే! రామాయణంలో ఈ మూడు అవస్థలను హనుమంతుడు రామునివలన పొందాడు
అన్యథా శరణంనాస్తి త్వమే శరణం మమ’అని శరణుజొచ్చిన భక్తుడు ధన్యుడు తరించిపోగలడు. గజేంద్రమోక్షంలో గజేంద్రుడు, మహాభారంతలో ద్రౌపది ఈ స్థితికి వచ్చాకే అనుగ్రహింపబడ్డారు. అర్జునుని నిమిత్తంగా వుంచుకుని ‘సుధీ‘ జనులకు, గుణవంతులై పరితపించు వారికి ఉపనిషత్సారమైన క్షీరామృతం- గీతామృతం అందించాడు పరమాత్మ.తస్మాదేతం సమభ్యసేత్‌ సర్వదేవీ దేవతల స్వరూపం సర్వశాస్త్రాల రూపం. సకల ధర్మాలూ ఇందులో వున్నాయి. కనుక భగవద్గీతను సవ్యంగా- సవ్యంగా అభ్యసించాలి.


తెనాలి రామకృష్ణగా..

0
0

కుర్ర హీరో సందీప్ కిషన్ తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ అనే ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ చేస్తున్నారు. డిసెంబర్ 17న ఈ సినిమా ఓపెనింగ్ జరిగింది. ప్రముఖ నిర్మాతలు అనిల్ సుంకర, భోగవల్లి ప్రసాద్ ముఖ్య అతిథులుగా వచ్చారు. హీరో సందీప్ కిషన్‌పై తొలి క్లాప్‌ను అనీల్ సుంకర, భోగవల్లి ప్రసాద్ స్క్రిప్ట్ ఇచ్చారు. ఛార్మింగ్ బ్యూటీ హన్సిక ఇందులో తొలిసారిగా సందీప్‌కిషన్‌తో జోడీ కడుతున్నారు. భూమిక చావ్లా కీలక పాత్రలో నటిస్తున్నారు. జి.నాగేశ్వర్‌రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మురళీ శర్మ, వరలక్ష్మి శరత్‌కుమార్, వెనె్నల కిషోర్, పృధ్వీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ జనవరి నుంచి మొదలుకానుంది.

వస్తున్నాడు.. గూఢచారి 2

0
0

అడివి శేష్ హీరోగా వచ్చిన గూఢచారి భారీ విజయాన్ని అందుకోవడంతో, సీక్వెల్ తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. అడివి శేష్ పుట్టిన రోజు సందర్భంగా సీక్వెల్‌ను చిత్రవర్గాలు ప్రకటించాయి. స్క్రిప్ట్ పనులు మొదలయ్యాయని ప్రకటిస్తూనే, చిత్ర కానె్సప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. వచ్చే ఏడాది చిత్రీకరణ మొదలుపెట్టి 2020నాటికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తేనున్నట్టు ప్రకటించారు. కానె్సప్ట్ పోస్టర్‌లో ‘గూఢచారి విల్ బీ బ్యాక్’ క్యాప్షన్‌తో ‘2’ నెంబర్‌లో అడివి శేష్‌ను వెనుకనుంచి చూపించి ఆసక్తికలిగించారు. ‘శ్యాం’ పాత్రతో ఆకట్టుకున్న వెనె్నల కిషోర్ ఈ ప్రకటనపై స్పందిస్తూ ‘నేనూ ప్రాజెక్టులో భాగమైతే బావుండు’నంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. శశికిరణ్ టిక్కా తెరకెక్కించిన గూఢచారి గత ఆస్టులో విడుదలై -అడివి శేష్‌కు మంచి క్రేజ్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా నిర్మించిన చిత్రంలో ధూళిపాళ్ల శోభిత, ప్రకాష్‌రాజ్, జగపతిబాబు, వెనె్నల కిశోర్, మధుశాలిని, రవిప్రకాష్, సుప్రియ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఫస్ట్‌క్లాస్ డిటెక్టివ్ చిత్రంగానూ ‘గూఢచారి’ విమర్శకుల ప్రశంసలు అందుకోవడం తెలిసిందే.

118

0
0

‘నా నువ్వే’తో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ ప్రస్తుతం తన 16వ చిత్రం 118లో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ చిత్ర ట్రైలర్ రేపు ఉదయం విడుదల చేయనున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నివేద థామస్, షాలిని పాండే హీరోయిన్లుగా నటిస్తున్నారు. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది. ఈ చిత్రం తరువాత కళ్యాణ్‌రామ్ ఉయ్యాల జంపాల, మజ్ను చిత్రాల దర్శకుడు విరించి వర్మ దర్శకత్వంలో తన 17వ చిత్రంలో నటించనున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించనున్న ఈ చిత్రంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

పూరితో విజయ్

0
0

వరుసగా పరాజయాలతో సతమతం అవుతున్నాడు దర్శకుడు పూరి జగన్నాథ్. ప్రస్తుతం పూరి, ఎనర్జిటిక్ హీరో రామ్‌తో ఒక చిత్రం తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తరువాతి చిత్రాన్నీ పూరి లైన్లో పెట్టాడు. తాజా సమాచారం ప్రకారం క్రేజీ యంగ్ హీరో విజయ్ దేవరకొండతో సినిమా చేయనున్నట్టు తెలిసింది. కాకినాడలో డియర్ కామ్రేడ్ చిత్రం షూటింగ్‌లో బిజీగాఉన్న విజయ్ దగ్గరికొచ్చి మరీ పూరి తన స్టోరీని వినిపించాడట. కాగా పూరి స్టోరీకి ప్లాట్ అయిన విజయ్, వెంటనే యస్ చెప్పాడని అంటున్నారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పూరి జగన్నాథ్ తన సినిమాల్లో హీరోని విలక్షణ వ్యక్తిగా చూపించడంలో దిట్ట. మరి విజయ్‌ని ఎలా చూపిస్తాడన్న ఆసక్తి అప్పుడే మొదలైంది.

అదో మేలుకొలుపు

0
0

‘నిరాశ ఓ మేలుకొలుపు. అప్పుడప్పుడూ అలాంటిది ఎదురుకాకపోతే లైఫ్‌లో చాలా రుచులు మిస్సవుతాం’ అంటోంది బాలీవుడ్ బార్బీగాళ్ కత్రినా కైఫ్. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇటీవలే వచ్చిన ‘్థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ గురించేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్టార్‌వాల్ట్స్ అమితాబ్, అమీర్‌ఖాన్, కత్రినా కీలక పాత్రల్లో నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘్థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ తీవ్ర నిరాశ మిగిల్సిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టిన చిత్రంపై అమీర్‌ఖాన్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. చిత్ర పరాజయానికి తాను పూర్తి బాధ్యత వహిస్తున్నానంటూ ప్రకటించాడు కూడా. దీనిపై కత్రినా స్పందిస్తూ అమీర్‌కు ఒకింత ఓదార్పు సంకేతాలిచ్చింది. ‘పరాజయం బాధ్యతను నేనే తీసుకుంటున్నానంటూ అమీర్ చేసిన ప్రకటన నన్ను బాధించింది. ఆ ప్రకటన వెనుక అతని గొప్పతనాన్ని చూడాలి మనం. అప్పుడప్పుడు ఎదురయ్యే అలాంటి నిరాశలు మన జీవితానికి మేలుకొలుపు లాంటివి. థగ్స్ ఆఫ్ హిందస్థాన్ ప్రాజెక్టు విషయంలో మా ప్రయత్నలోపం ఏమీ లేదు. సినిమా ఫలితాల విషయంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలి’ అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది కత్రినా. ఇదిలావుంటే స్టార్ హీరోయిన్ కత్రినా సినిమా స్టార్‌గా ‘జీరో’లో కనిపించనుండటం తెలిసిందే. షారుక్‌ఖాన్ మరుగుజ్జు పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంతో హీరోతో లిప్‌లాక్ సీన్స్ చేసిన కత్రినా -అందుకు హీరో అదృష్టవంతుడు అంటూ హిలేరియస్ సెటైర్ వేయడం తెలిసిందే. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్న ‘జీరో’ ప్రాజెక్టుపై కత్రినా పెద్ద ఆశలే పెట్టుకుంది.

Viewing all 69482 articles
Browse latest View live