Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

ఆకాశంలో తేలిపోయా

0
0

వరుణ్‌తేజ్, అదితిరావు హైదరి, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన చిత్రం ‘అంతరిక్షం 9000 కెఎంపిహెచ్’. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో క్రిష్ జాగర్లమూడి, సాయిబాబా జాగర్లమూడి, రాజీవ్‌రెడ్డి నిర్మాతగా రూపొందింది. ఈనెల 21న చిత్రం విడుదలవుతుంది. ఆస్ట్రోనాట్ పాత్రతో ఆకాశంలో తేలిపోయనంత ఆనందం పొందానని చెబుతున్న అతిదిరావ్ హైదరి చెప్పిద విశేషాలు...

స్క్రిప్ట్ చాలాబావుంది. అయితే సినిమా చేయాలంటే ముంబై నుంచి వస్తూపోతూ ఉండాలి. అది ప్రొడక్షన్‌పరంగా చాలా ఇబ్బంది అవుతుందని చెప్పాను. తెలుగులో నేను ‘సమ్మోహనం’ చేస్తున్నా. ఆ సమయంలో సంకల్ప్ ఫోన్‌చేసి ‘స్క్రిప్ట్ మొత్తం రెడీ చేశాం. ఓసారి వినండి’ అన్నారు. సరేనన్నాను. ఇప్పటివరకు అంతరిక్షానికి వెళ్లిన ఇద్దరు మహిళా అస్ట్రానాయిడ్స్ మన దేశానికి చెందినవారే. అలాంటి నిజమైన పాత్రలు చేయాలనిపించింది. ఈ సినిమాకోసం చాలా ప్రిపేర్ అయ్యాం. బల్గేరియా, ఈస్ట్రన్ యూరప్ నుండి టెక్నీషియన్స్‌తో కలిసి వర్క్‌చేశాం. చాలారోజులపాటు రోప్స్‌లో అలాగే వేలాడుతూ ఉండటం, దారాల సహాయంతో వెనక్కి తిరిగి పల్టీకొట్టడం, గాలిలో ఈదడం వంటి స్టంట్స్ నేర్చుకున్నా. అదే సమయంలో నేను మణిరత్నం సినిమా షూటింగ్ చేస్తున్నాను. సాయంత్రం ఫ్లైట్ ఎక్కి చెన్నై చేరుకుని అక్కడ షూటింగ్ పూర్తిచేసుకుని, మళ్లీ పొద్దునే్న ఇక్కడకు వచ్చి ట్రయినింగ్ సెషన్‌లో పాల్గొనేదాన్ని. చాలా హార్డ్‌వర్క్ చేశాను. మేం ఉపయోగించిన హెల్మెట్ బరువుగా ఉండేది. దాన్ని వేసుకుంటే మెడనొప్పి వచ్చేది. తొమ్మిదో రోజున హెల్మెట్ ధరించగానే, భరించలేని నొప్పితో విలవిలలాడాను. డాక్టర్స్ పదిరోజులు కంప్లీట్ బెడ్‌రెస్ట్ అవసరం అని చెప్పారు. నేను మా ఇంట్లోవాళ్లకి చెప్పకుండా మా మేనేజర్ సహాయంతో డాక్టర్‌ని కలిసి పెయిన్ కిల్లర్స్ తీసుకుని మళ్లీ సెట్స్‌కువచ్చేశాను. భారీ ఖర్చుతో వేసిన సెట్‌లో నటీనటులు, సాంకేతిక నిపుణులు నాకోసం పదిరోజులు వెయిట్ చేయడం నాకు ఇబ్బందిగా అనిపించడంతో రెండురోజుల్లో సెట్స్‌కు వచ్చేశాను. పాత్రకోసం ప్రత్యేకంగా అస్ట్రానాయిడ్‌ను ఎవరినీ కలవలేదు. అయితే నేను చదువుకునే రోజుల్లో రాకేశ్‌శర్మగారి పిల్లలు మా స్కూల్లోనే చదివేవారు. ఆయన వారి పిల్లలకోసం తరుచుగా మా స్కూలుకు వస్తుండేవారు. ఆ సమయంలో ఆయనతో మాట్లాడేదాన్ని. ఆయన అంతరిక్ష్యంలో ఆయన ఫేస్ చేసిన పలు అనుభూతులను చెబుతూ వచ్చారు. అయితే ఎంత విన్నా, చదివినా, ప్రాక్టీస్ చేసినా సెట్స్‌లో చేసేటప్పుడు మనకుమనమే అస్ట్రానాయిడ్‌గా ఫీలై నటించాలంతే! ఇది ట్రయాంగిల్ లవ్‌స్టోరీ కాదు. ఫ్లాష్‌బ్యాక్‌లో లావణ్యత్రిపాఠిలో రోల్ కనపడుతుంది. నా పాత్ర సినిమా అంతటా ఉంటుంది.
నేను ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పుడు చిన్న పాత్ర చేయాలా? లేక పాత్ర నిడివి ఎక్కువగా ఉంటేనే చేయాలా? అని ఆలోచించలేదు. హాలీవుడ్ ఇండస్ట్రీలో నటీనటులు కూడా పాత్ర నిడివి గురించి ఆలోచించరు. మన సినిమాల్లోకి వస్తే ఇప్పటి తరానికి చెందిన వాళ్లలో పరిణీతి, ఆదిత్య ఇలా చాలామంది పాత్ర నిడివిబట్టి నటించాలని అనుకోలేదు. మంచి పాత్రలు చేయాలనే వచ్చారు. నేను మంచి సినిమాలో భాగమవ్వాలని అనుకోవడం, మంచి డైరెక్టర్స్‌తో వర్క్‌చేయాలనుకోవడంతో నా పాత్ర నిడివి గురించి ఆలోచించలేదు. ప్రేక్షకులు సినిమా చూసినప్పుడు మనపాత్ర వారికి గుర్తుండిపోతే చాలు. ఆ పాత్ర ఎంతసేపు ఉందనేది అనవసరం. నేను గొప్ప సినిమాలు చేస్తున్నాననో, చేశాననో గర్వపడటం లేదు. నటిగా ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. నేను పనిచేసే వారికి గౌరవం ఇస్తాను. నటిగా నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.


కాజల్.. కొత్త కళ

0
0

విలక్షణ నటుడు కమల్‌హాసన్ సరసన చాన్స్ కొట్టేసిన కాజల్ మంచి ఊపుమీదుంది. బ్లాక్‌బస్టర్ హిట్టుగా నిలిచిన ఇండియన్‌కు సీక్వెల్, మరోపక్క కమల్‌కు జోడీ, పైగా శంకర్ సినిమా.. ఇవన్నీ తన కెరీర్‌కు మరో బ్రేక్ త్రూ అంటోంది కాజల్. కాజల్ కెరీర్ గ్రాఫ్ డౌన్ అవుతున్నపుడల్లా అదృష్టంకొద్దీ ఇలాంటి ప్రాజెక్టు ఒకటి పడటం, మళ్లీ టాప్ హీరోయిన్ల రేస్‌లో తన స్థానాన్ని పదిలం చేసుకుంటూ రావడం కాజల్‌కు అలవాటైపోయింది. అదృష్టంకొద్దీ దక్కిన అవకాశంతో మరో రెండు మెట్లు పైకి ఎక్కాలన్న ఆలోచనతో కాజల్ ఉందట. అందుకే -ఇండియన్ 2లో తన పాత్రను పండించేందుక ‘ప్రత్యేక కళ’ను కాజల్ ప్రాక్టీస్ చేస్తోందని కోలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. 1996లో వచ్చిన ఇండియన్ సీక్వెల్‌ను గ్రేట్ డైరెక్టర్ శంకర్ సారథ్యంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్న విషయం తెలిసిందే. రోబో సీక్వెల్ 2.ఓ బ్లాక్‌బస్టర్ హిట్టు కావడంతో మంచి ఊపుమీదున్న లైకా, బడ్జెట్ విషయంలో ఎక్కడా తగ్గకుండా ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుగా ఇండియన్ 2ను తెచ్చే ఆలోచనలో ఉందని అంటున్నారు. వాస్తవానికి ఈనెలనుంచే చిత్రీకరణ మొదలుపెట్టాల్సి ఉన్నప్పటికీ, అనివార్య కారణాల వల్ల ప్రాజెక్టు వెనక్కి జరిగింది. 2019 జనవరి నుంచి ఇండియన్ 2ను సెట్స్‌మీదకు తీసుకెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.

స్వాతంత్య్ర.. సాహో!

0
0

బాలీవుడ్ బబ్లీ బ్యూటీ శ్రద్ధాకఫూర్‌తో ప్రభాస్ పండించే కెమిస్ట్రీ ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు తీపికబురు అందేసింది. బాహుబలి బిగినింగ్, కన్‌క్లూజన్ తరువాత చాలా గ్యాప్‌తో వస్తున్న ప్రభాస్ చిత్రం సాహో. బాహుబలి ప్రాజెక్టుతో యూనివర్శల్ హీరో అయిపోయిన ప్రభాస్ పవర్‌ఫుల్ పాత్ర పోషిస్తున్న చిత్రమిది. మూడు భాషల్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి యూనిట్ తాజా సమాచారం ప్రకారం వచ్చే ఆగస్టు 25న థియేటర్లకు రానుంది. ‘సాహో’ టైటిల్‌తో యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న చిత్రానికి దర్శకుడు సుజిత్. తొలి ప్రయోగంగా నిర్మాణమవుతున్న ట్రైలింగ్విల్ మూవీకి సంబంధించి ‘షాడో ఆఫ్ సాహో’ను అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయడం తెలిసిందే. దానికి మంచి స్పందన రావడంతో -సాహోను ఓ విజువల్ వండర్‌గా తీర్చిదిద్దేందుకు దర్శకుడు సుజిత్‌తోపాటు హాలీ, బాలీవుడ్ సాంకేతిక నిపుణులు కృషి చేస్తున్నారు. హైఎండ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న చిత్రానికి శంకర్- ఎహసాన్- లాయ్‌తో కలిసి తమన్ సైతం సంగీతం సమకూరుస్తున్నాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మధి, ఆర్ట్ డైరెక్టర్ సాబుసిరిల్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ వంటి టాప్ టెక్నీషియన్స్ సాహో చిత్రానికి పని చేస్తున్నట్టు నిర్మాతలు వంశీ, ప్రమోద్‌లు వెల్లడించారు. ప్రభాస్ స్టైలిష్ పెర్ఫార్మెన్స్, సుజిత్ వరల్డ్ క్లాస్ విజన్, శ్రద్ధాకఫూర్ క్లాసిక్ అందాలు, బాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ శంకర్ -ఎహసాన్ -లాయ్.. వెరసి ఆడియన్స్‌కు సాహో ఓ విజువల్ ఫీస్టే అవుతుందన్నది నిర్మాతల మాట. జాకీష్రాప్, నీల్ నితిన్ ముఖేశ్, ఎవ్లిన్ శర్మ, మందిరా బేడిలాంటి హేమాహేమీలు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ‘సాహో’తో సమాంతరంగా ప్రభాస్ మరో ప్రాజెక్టునూ పూర్తి చేస్తోన్న విషయం తెలిసిందే. ‘జిల్’ ఫేం ఎస్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ చిత్రానికి ఫ్రెంచ్ టైటిల్ ‘అమూర్’ను ఖరారు చేసి ఫ్యాన్స్‌లో ఆసక్తిపెంచారు. హీరోయిన్ పూజా హెగ్దెతో లవ్ అండ్ రొమాంటిక్ ఎడిసోడ్స్‌ని షూట్ చేశారు. అయితే, ఈ ప్రాజెక్టులో ‘స్వీటీ’ సైతం ఓ పాత్ర పోషించే అవకాశం లేకపోలేదన్న కథనాలు వెలువడుతున్నాయి. ప్రభాస్- అనుష్కల కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ క్రెడిట్‌ని ‘అమూర్’లో క్యాష్ చేసుకునే అవకాశం లేకపోలేదంటున్నారు. అయితే -స్వీటీ రోల్‌పై ఇంకా స్పష్టత లేదు.

maatata

0
0
Cross Image: 
Date: 
Tuesday, December 18, 2018

ఎట్టకేలకు కార్పొరేషన్‌కు చేరిన ‘స్వీపింగ్’ మిషన్

0
0

అనంతపురంటౌన్, డిసెంబర్ 17: ప్రైవేట్ కాంట్రాక్టర్‌కు ధారాదత్తమైన స్వీపింగ్ మిషన్ కమిషనర్ మూర్తి ‘మెమో’ జారీతో ఎన్విరాన్‌మెంట్ డీఈఈ సురేంద్రనాథ్‌లో కదలిక తెచ్చింది. కమిషనర్ మెమో జారీ చేసిన మూడు రోజులకు ధారాదత్తం చేసిన స్వీపింగ్ మిషన్ సోమవారం కార్పొరేషన్ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు పార్కింగ్ అయ్యింది. 24 గంటల గడువుదాటి అదనంగా మరో 60 గంటల సమయం తీసుకుని తీరికగా ఎన్విరాన్‌మెంట్ డీఈఈ సురేంద్రనాథ్ స్వీపింగ్ మిషన్‌ను కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో పార్కింగ్ చేయించారు. డీజిల్ వినియోగంలో అక్రమాలకు పాల్పడినట్లుగా ఆడిటర్ జనరల్ నివేదికలో నిగ్గుతేల్చినా అక్రమార్కులైన అధికారులపై చర్యలు చేపట్టాల్సిన ఉన్నతాధికార వర్గం చోద్యం చూస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా ఏకంగా స్వీపింగ్ మిషన్‌ను ప్రైవేట్ కాంట్రాక్టర్‌కు ధారాదత్తం చేసినా సదరు డీఈఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు పెదవి విప్పటానికి ఇష్టపడటం లేదంటున్నారు. వరుసగా ఎన్విరాన్‌మెంట్ డీఈఈ అవినీతి, అక్రమాల వ్యవహారాలు రోజుకొకటి వెలుగుచూస్తున్నా ఏమని ప్రశ్నించే నాథుడు కరువయ్యారని వాపోతున్నారు. కార్పొరేషన్‌లో అక్రమార్కులకు పాలకవర్గం, ఉన్నతాధికారుల అండ దండలు పుష్కలంగా ఉండటమే కారణంగా అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే పాలకవర్గం అండదండలు పుష్కలంగా ఉన్నందునే ఎన్విరాన్‌మెంట్ డీఈఈ అవినీతి, అక్రమాలపై ఆడిటర్ జనరల్ నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టకుండా దానిని మసి పూసి మారేడు కాయ చేయటానికి ఉన్నతాధికారులు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారని వారు పేర్కొంటున్నారు. అలాగే స్వీపింగ్ మిషన్‌ను ప్రైవేట్ కాంట్రాక్టర్‌కు ధారాదత్తం చేసిన అంశాన్ని కమిషనర్ మూర్తి పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ దృష్టికి తీసుకెళ్ళినందున క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు. ఎన్విరాన్‌మెంట్ డీఈఈ అక్రమ కార్యకలాపాలపై అటు ఆడిటర్ జనరల్ నివేదిక ఇటు స్వీపింగ్ మిషన్ ధారాదత్తం తదితర అంశాలు కార్పొరేషన్ ప్రతిష్టను దిగజారుస్తున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, పాలకవర్గం స్పందించి తగు చర్యలు చేపట్టకుంటే అక్రమార్కులు మరింత పెట్రేగే అవకాశాలు మెండుగా ఉన్నాయని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

లబ్ధిదారులకు సంతృప్తి కలిగేలా సమస్యల పరిష్కారం ఉండాలి

0
0

అనంతపురం సిటీ, డిసెంబర్ 17: మీకోసంలో వచ్చే ప్రజా సమస్యలను లబ్దిదారునికి సంతృప్తి కలిగేలా సకాలంలో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా సంయుక్త కలెక్టర్ ఢిల్లీరావు ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో జేసీ అధ్యక్షతన మీకోసం కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి 405 వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రజావాణిలో ప్రజల నుండి వచ్చే వినతులలోని పలు సమస్యలను సంతృప్తికరంగా పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. లేనిపక్షంలో లిఖిత పూర్వకంగా సరైన కారణాలతో వినతులను తిరస్కరించాలన్నారు. అలాగే జిల్లాలో రాబోయే ఐదు సంవత్సరాలలో ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది అన్ని శాఖలు ఒక ప్రణాళికలను తయారుచేసి కలెక్టర్‌కు అందించాలని సూచించారు. అనంతరం దివ్యాంగుల టీ-20 నందు రన్నర్‌గా నిలిచిన విద్యార్థులకు జేసీ పథకాలను అందజేసి, కెప్టన్ ఎస్.నాగరాజు, వైస్ కెప్టన్ సుధాకర్‌లను ఘనంగా సన్మానించారు.

ఆర్థిక సహకారం ఇప్పిస్తామని
డబ్బులు వసూలు చేసే వారిని నమ్మవద్దు
అనంతపురం సిటీ, డిసెంబర్ 17: భర్త చనిపోయి ఒంటరిగా ఉన్న మహిళల కుటుంబాలకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహకారం ఇప్పిస్తామని చెప్పి మోసం చేస్తున్న వారిని నమ్మవద్దని డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం మీకోసం కార్యక్రమంలో కదిరి డివిజన్‌లోని వివిధ ప్రాంతాల నుండి దాదాపు 30 మంది మహిళలు భర్తలు చనిపోయిన వారికి ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తామని ఒక్కొక్క అప్లికేషన్‌కు రూ.300 వసూలు చేసినట్లు తమ దృష్టికి తెచ్చారన్నారు. ఇలాంటి పథకం ఏమీ లేదని, మహిళలు ఇలాంటి వారిని నమ్మవద్దని ఆయన తెలిపారు. ఈ అంశంపై విచారణ చేసి నిరుపేదలను మోసం చేస్తున్న వారిని గుర్తించాలని జేసీ కదిరి డీఎస్పీని ఆదేశించారని ఆయన తెలిపారు.

49 చెరువులకు నీరివ్వాల్సిందే
అనంతపురం సిటీ, డిసెంబర్ 17: పీఏబీఆర్ కుడి కాలువ ద్వారా 49 చెరువులకు నీరు ఇవ్వాల్సిందేనని మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. సీపీఐ, రైతు సంఘం ఆధ్వర్యంలో హెచ్‌ఎల్సీ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే దీక్షలు సోమవారం నాల్గవ రోజు కొనసాగాయి. ఈ దీక్ష శిబిరంలో అనంత వెంకటరామిరెడ్డి మద్దతు ఇచ్చి మాట్లాడుతూ తుంగభద్ర ప్రాజెక్టులో కేసీ కెనాల్‌కు రిజర్వ్ చేసిన 10 టీఎంసీల నీటిని హెచ్‌ఎల్సీ ద్వారా పీఏబీఆర్‌కు మళ్లించాలని వైయస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2005లో స్పష్టమైన జీవో జారీ చేశారని తెలిపారు. జీవో ఉన్నప్పటికీ చెరువులకు నీరు అందించకపోవడం అన్యాయమన్నారు. తుంగభద్ర ప్రాజెక్టు నుండి అదనపు నీటిని తీసుకురావడానికి ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని కోరారు.
వ్యక్తిగత లబ్ధికే పనులు
* సున్నం వేయడం తప్ప చేసింది శూన్యం
అనంతపురం, డిసెంబర్ 17: నగరంలో పాలకపక్ష నాయకులు వ్యక్తిగత లబ్ది కోసమే పనులు చేస్తున్నారు తప్ప ఎటువంటి అభివృద్ధి జరుగలేదని వైసీపీ నాయకులు విమర్శించారు. 10వ డివిజన్‌లో సోమవారం రావాలి జగన్ - కావాలి జగన్ కార్యక్రమంలో అర్బన్ సమన్వయకర్త, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ రాగే పరశురామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తే అమలుచేయనున్న పథకాల గురించి వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ నగరంలో నాలుగున్నరేళ్ల క్రితం నాటి అభివృద్ధి తప్ప కొత్తగా ఈ నాలుగేళ్లలో చేసిందీ ఏమీ లేదన్నారు. గతంలో ఉన్న వాటికే కొత్తగా సున్నం వేసి ఏదో అభివృద్ధి చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని, అంతకు మించి వారు చేసింది శూన్యమన్నారు. రాంనగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి వెడల్పును ఎందుకు తగ్గించారన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని గెలిపించి, జగన్ నాయకత్వాన్ని బలపరచాలని వారు ప్రజలను కోరారు.

భాషా పండితుల ఉన్నతీకరణపై హర్షం
అనంతపురం సిటీ, డిసెంబర్ 17: రాష్ట్రంలోని భాషా పండితుల ఉన్నతీకరణకు జీవోను ప్రభుత్వం విడుదల చేయడంపై ఎస్‌ఎల్‌టీఏ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆదిశేషయ్య, వేణుగోపాల్‌లు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా 10244 భాషా పండితులు, 2603 పీఈటీల పోస్టులను ఉన్నతీకరిస్తూ నవంబర్ 6వ తేదీన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. కానీ ప్రభుత్వ ఉత్తర్వులు వెలువరించడానికి అనేక అడ్డంకులు అధిగమించి ఈరోజు ఆర్థిక శాఖ జివో ఎంఎస్ నంబర్ 91ను విడుదల చేసిందన్నారు. ఇందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎస్‌ఎల్‌టీఏ గౌరవాధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసరెడ్డి, అమరావతి జేఏసి ఛైర్మెన్ బొప్పరాజు వెంకటేశ్వరర్లు, విద్యా శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేసారు.
ముస్తాబైన ఆలయాలు
నేడు వైకుంఠ ఏకాదశి
అనంతపురం అర్బన్, డిసెంబర్ 17: విష్ణుమూర్తి ఆరాధకులు పరమ పవిత్రమైన దినంగా భావించే పండుగ ముక్కోటి ఏకాదశి. స్వర్గద్వారం, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. శ్రీ మహావిష్ణువు సర్వాలంకార భూషితుడై ఉత్తర ద్వారం వద్దకు విచ్చేయగా ఉత్తర ద్వారం వద్ద సకల దేవతలు ఆయనను సేవించి రోజు కనుక దీనికి వైకుంఠ ఏకాదశి అని పేరు వచ్చింది. అందువల్ల ఈ దినం అన్ని దేవాలయాలలో ఉత్తర ద్వారం తెరుస్తారు. ఈ మార్గం ద్వారా వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం పుణ్యప్రదంగా భావిస్తారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని నగరంలోని అన్ని ఆలయాలు విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలకరించారు. పాతవూరులోని శ్రీ లక్ష్మీచెన్నకేశ్వర స్వామి వద్ద భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేసారు. శ్రీకంఠం సర్కిల్ వద్ద వున్న శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయం, మారుతీనగర్‌లోని ఆలయం అదేవిధంగా బాబా మందిరాలలో, శివాలయాలలో ఉత్తర ద్వారం ఏర్పాటుచేసారు. వేకువజామున 2గం.నుండి రాత్రి 12 గం.ల వరకు దర్శనం వుంటుందని నిర్వాహకులు తెలిపారు.
నేడు ఎస్‌ఈ ఆఫీస్ ముందు నిరవధిక నిరసన
* సీపీఎం జిల్లా కార్యదర్శి వీ.రాంభూపాల్
అనంతపురం, డిసెంబర్ 17: హెచ్చెల్సీ దక్షిణ కాలువ కింద ఆయకట్టుకు వెంటనే నీరు విడుదల చేసి పంటలను కాపాడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వీ.రాంభూపాల్ డిమాండ్ చేశారు. అర్ధాంతరంగా నీరు నిలిపివేయడంతో రైతులు తీవ్ర ఆందోళనతో ఉన్నారని, పాలకులు ఇప్పటికైనా వౌనం వీడాలన్నారు. హెచ్చెల్సీ ఆయకట్టుకు నీరివ్వాలన్న డిమాండ్‌తో ఇరిగేషన్ ఎస్‌ఈ కార్యాలయం ముందు నేటి నుండి నిరవధిక నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు సోమవారం ప్రకటన ద్వారా తెలిపారు. నీరు విడుదలపై స్పష్టమైన హామీ ఇచ్చే దాకా అక్కడే వంటావార్పుతో నిరసన చేపడతామన్నారు. నీరు వదలకపోతే శింగనమల నియోజకవర్గం పరిధిలోనే రూ.250 కోట్ల పెట్టుబడిని రైతులు నష్టపోతారన్నారు. 120 రోజులు నీరు విడుదల చేస్తామని, కేవలం 60 రోజులకే నీరు నిలిపి వేసి రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. నేడు జరిగే నిరవధిక నిరసన కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు.
కందుకూరి ఆశయ సాధనలో నడుద్దాం
* విశ్రాంత రీడర్ డా.కనుపర్తి విజయ్‌భ
అనంతపురం, డిసెంబర్ 17: కందుకూరి వీరేశలింగం పంతులు వారసులుగా ప్రతి ఒక్కరు ఆయన ఆశయ సాధనలో నడవాలని విశ్రాంత రీడర్ డా. కనుపర్తి విజయభ పేర్కొన్నారు. ఆయన వేసిన అడుగులు నేటి సమాజానికి ఆదర్శంగా ఉన్నాయన్నారు. కందుకూరి వీరేశలింగం పంతులు శత వర్థంతి నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జడ్పీ హాలులో కందుకూరి సాహితీ సమాలోచన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో విజయ భతోపాటు ఎస్కేయూ ఇన్‌చార్జి వీసీ శుభ, కేంద్ర సాహిత్య అకాడమీ జనర్ కౌన్సిల్ సభ్యులు రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, ప్రముఖ రచయిత సింగమనేని నారాయణ, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు వివిధ అంశాలపై ప్రసంగించారు. కనుపర్తి విజయభ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా జిల్లాలో కందుకూరి శత వర్ధంతి సదస్సును ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఐద్వా ఇతర ప్రజా సంఘాలు సంయుక్తంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. సమాజంలోని రుగ్మతలను రూపు మాపేందుకు వందేళ్లకు పూర్వమే కందుకూరి పోరాటం సాగించారన్నారు. ఆయన ప్రతి అక్షరం సామాజిక చైతన్యం తెచ్చిందన్నారు. నేటి తరం ఆయన అడుగుజాడల్లో నడవాలన్నారు. ఎస్కేయూ వీసీ శుభ మాట్లాడుతూ కందుకూరి ఆశయాలు ఎంతో గొప్పవని, బాల్య వివాహాలు అరికట్టి, వితంతు వివాహాలను ప్రోత్సహించడం ద్వారా సమాజంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలకు ఎదురొడ్డి నిలిచారన్నారు. బాలికా విద్య కోసం ప్రత్యేక పాఠశాలలు నడిపారన్నారు. రాచపాళెం మాట్లాడుతూ సమాజంలోని దురాచారాలను వీరేశలింగం పంతులు ఆనాడే మట్టుపెట్టారన్నారు. ఆయన పోరాటాల ఫలితంగానే సమాజంలో నేడు మహిళలకు తగిన ప్రోత్సాహం, గుర్తింపు లభిస్తోందన్నారు. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ సాంఘిక దురాచారాలను ఎదిరించడంలో నేటి ప్రభుత్వాలు శ్రద్ధ చూపడం లేదన్నారు.

ఓటర్ల జాబితాపై మొదలైన రాజకీయ కసరత్తు

0
0

కడప,డిసెంబర్ 17: త్వరలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీల్లో చలనం మొదలైంది. తెలంగాణ ఎన్నికలతో కళ్లు తెరిచిన పార్టీలు ఎవరికి వారు కీలకమైన ఓటర్ల జాబితాపై దృష్టి సారించారు. తెలుగుదేశంపార్టీ పెద్ద ఎత్తున అక్రమ ఓటర్లను చేర్పించిందంటూ వైసీపీ నేతలు జిల్లా నుంచి రాష్టస్థ్రాయి వరకు ఫిర్యాదులపర్వం కొనసాగిస్తున్నారు. జిల్లాలోనూ అనేక ప్రాంతాల్లో దొంగ ఓటర్లను చేర్పించారంటూ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈనేపధ్యంలో జిల్లా యంత్రాంగం కూడా పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఇంటింటా సర్వేలు మొదలుపెట్టారు. రాజకీయ నాయకుల ఫిర్యాదులకు సంబంధం లేకుండా అధికారులే పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. అయితే ఇదే స్థాయిలో రాజకీయ పార్టీలు కూడా పోలింగ్ బూత్ స్థాయిలో జాబితా తెప్పించుకుని ఏప్రాంతంలో కొత్త ఓటర్లు చేరారు, ఎవరిని తొలగించారు అనే విషయాలపై కార్యకర్తలకు బాధ్యత అప్పగించారు. దీంతో రెండుపార్టీల నేతలు ఓటర్ల జాబితాపై కసరత్తు మొదలు పెట్టాయి. అయితే గత నెల నుంచి ఇప్పటి వరకు జిల్లాఅధికారులా పరీశీలనలో ఇంట్లో లేనివారు, ఇళ్లుమారిన వారు, చనిపోయినవారు, కొత్తవారు ఎవరున్నారన్న విషయాలపై విచారణ జరుపగా సుమారు 97,377 మంది ఓటర్ల పరిస్థితి అనుమానాస్పదంగా కనిపించింది. దీనిపై పూర్తిస్థాయి నివేదికకు అధికారులు దృష్టిసారించారు. మరోవైపు కొత్తగా ఓటర్లు చేరిన జాబితాను పరిశీలించగా 69,626మంది చేరినట్లు గుర్తించారు. ఇక పలుప్రాంతాలనుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు సుమారు 62,597 మంది వారి ఓట్లు సక్రమంగా ఉన్నట్లు గుర్తించారు. ఈనేపధ్యంలో ప్రతి ప్రాంతంలోనూ , కొత్తగా చేరినవారి నుంచి ఓట్లు తొలగించిన వారి వరకు అనేక ప్రశ్నలతో కూడిన ఫిర్యాదుల పత్రాలను ఇరువర్గాలు జిల్లా ఎన్నికల అధికారులకు నివేదించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి గత మూడునెలలుగా కొత్త ఓటర్ల చేరికపై జిల్లా యంత్రాంగం భారీగా కసరత్తు మొదలుపెట్టింది. ఇందుకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో ప్రచారం సాగించింది. అలాగే ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక అధికారిణి కూడా నియమించారు. ఎవరికి ఎలాంటి సమస్యవచ్చినా కొత్త ఓటర్లు చేరాలనుకున్నా, పాత ఓటర్లు తమ పేర్లు ఉన్నాయో లేదో తెలుసుకోవాలన్నా ఈ ప్రత్యేక అధికారి ద్వారా వివరాలు తెలుసుకునే విధంగా దృష్టిపెట్టారు. కొత్త ఓటర్లను చేర్పించేందుకు వీలుగా మండల స్థాయిలోని స్థానిక రెవెన్యూ కార్యాలయాల్లో కౌంటర్లు కూడా ప్రారంభించారు. అయితే కడప నియోజకవర్గంలో రాజకీయ పార్టీలు వదంతులకు తలొగ్గాయి. జిల్లా యంత్రాంగాన్ని నమ్మకుండా స్వయంగా వైసీపీ, తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ సైతం పెద్ద ఎత్తున వాహనాలు పెట్టి, వీధుల్లో ప్రచారాన్ని సాగించాయి. ఈ నియోజకవర్గంలో లక్ష ఓట్లు తొలగించారని వైసీపీ నేతలు ఆరోపిస్తూ ఎన్నికల కమిషన్‌కు సైతం ఫిర్యాదు చేశారు. అయితే రాజకీయ పార్టీలు తెరమీదకు వచ్చి ఓటర్ల చేరికపై సైతం ప్రచారం చేయడం జిల్లా ఎన్నికల అధికారులు మండిపడ్డారు. ఎవరికీ సంబంధం లేకుండా జిల్లా యంత్రాంగం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పినప్పటికీ రాజకీయ పార్టీలు విస్తృత ప్రచారానికి దిగడం అధికారులను విస్మయానికి గురిచేసింది. దీంతో కడప పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయంలో ప్రత్యేకంగా మూడు కౌంటర్లను ఏర్పాటు చేయడమేగాకుండా ఇతర ప్రాంతాల నుంచి విఆర్వోలను, తహశీల్దార్లను కడపలో పరిశీలన అధికారులుగా నియమించి ఇంటింటా సర్వే నిర్వహించారు. అయితే వదంతులు, అపోహలేనని అధికారులు నిగ్గుతేల్చారు. ఈనేపధ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలింగ్ బూత్‌ల వారీగా ఇంటింటాసర్వే సాగిస్తున్నారు. ఈనెల చివరి నాటికి ఈ జాబితా పూర్తినివేదిక అందే అవకాశాలున్నాయి. అయితే రాజకీయ పార్టీలు కూడా అధికారుల సర్వేపై ప్రతి గ్రామంలో వారు కూడా సర్వేపై కసరత్తు సాగిస్తూ కొత్త ఓటర్ల చేరిక, పాత ఓటర్ల తొలగింపు వంటి వాటిపై పూర్తిస్థాయిలో రాజకీయపార్టీలు కసరత్తు సాగిస్తున్నాయి.

జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలని ధర్నా
కడప,డిసెంబర్ 17: జిల్లాలో వర్షాభావ పరిస్థితులతో జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోయి ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఏపీ రైతు సంఘం సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి.చంద్ర మాట్లాడుతూ జిల్లాలో తగినంత వర్షపాతం లేకపోవడంతో రబీలోనూ, ఖరీఫ్‌లోనూ పంటలు సాగుచేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రభుత్వం పంటల బీమా, పెట్టుబడి రాయితీపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బీమా కంపెనీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. 2012-13లో రబీలో బుడ్డశెనగకు జాతీయ పంటల బీమా సంస్థకు రైతులు ప్రీమియం చెల్లించినా ఇంతవరకు పట్టించుకోలేదన్నారు. జిల్లా వ్యాప్తంగా 20వేల మంది రైతులకు రూ.112కోట్లు పరిహారం అందాల్సివుందన్నారు. 2014-15లో సుమారు 25వేల మంది రైతులకు ప్రీమియం కింద చెల్లించిన మొత్తానికి రూ.6.92కోట్లు రావాల్సివుందన్నారు. 2016-17లో ప్రధానమంత్రి ఫసల్ బీమాయోజన కింద 11,860మంది రైతులకు రూ.34.194కోట్లు పరిహారం రావాల్సివుండగా, కేవలం రూ.18కోట్లు మాత్రమే విడుదల చేశారన్నారు. 2017-18లో ప్రధాన మంత్రి ఫసల్ బీమా కింద వరి రైతులకు రూ.38.28కోట్లు ఇతర రైతులకు రూ.171.284కోట్లు పంటల బీమా పరిహారం అందించాల్సివుండగా, సంవత్సరాలు గడుస్తున్నా ఈ బీమా రైతులకు అందలేదన్నారు. అయితే ఈపంటల బీమా ప్రీమియం చెల్లింపులో కూడా అనేక ప్రాంతాల్లో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. ప్రీమియం విస్తీర్ణాన్ని తగ్గించి కంపెనీకి జమచేయడం వల్ల రైతులకు నష్టపరిహారం తగ్గిపోయిందన్నారు. 2014,2016లో ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం అందడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి గాకుండా అకాల వర్షాల వల్ల అరటి, బొప్పాయి, మామిడి, చీనీ లాంటి ఉద్యాన పంటలు భారీగా దెబ్బతిన్నాయని, వీటికి పంటల బీమా ప్రీమియం గురించి పట్టించుకోకపోవడంతో పరిహారం కూడా దక్కలేదన్నారు. మరోవైపు నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుతో రైతులు భారీగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలోని అన్ని నదుల్లో ఇసుక మాఫియా పెద్ద ఎత్తున సాగుతోందని దీని వల్ల భూగర్భ జలాలు తగ్గిపోయి రైతులు వేసిన బోర్లలో నీటిమట్టం పడిపోయి బోర్లు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో లక్షా 33వేల 556 హెక్టార్లకు గాను కేవలం 44,189 హెక్టార్లు మాత్రమే సాగైందన్నారు. రబీలో సైతం లక్షా 72,929 హెక్టార్లకు గాను లక్షా 24,070 హెక్టార్లలో పంట సాగుకాగా, ఇందులో బుడ్డశనగ 84,914 హెక్టార్లలో సాగైందని ఇది కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. దీంతో జిల్లా రైతాంగం పల్లెలు విడిచి పట్టణాల దారి పట్టిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే రైతులను ఆదుకోకపోతే గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం వలసబాట పట్టె పరిస్థితివుందన్నారు. అనంతరం వారు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు.
-------------

భక్తులకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కోసం ఏర్పాట్లు పూర్తి
* నేడు వైకుంఠ ఏకాదశి
కడప కల్చరల్,డిసెంబర్ 17:వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి పురస్కరించుకుని మంగళవారం భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారా దర్శనం చేసుకునేందుకు జిల్లాలోని వైష్ణవాలయాలన్నీ ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఆయా ఆలయాల ఇఓలు, చైర్మన్లు, కమిటీ సభ్యులు భక్తుల స్వామివారి దర్శనానికి ఇబ్బంది లేకుండా ఆలయం బయట, ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా బ్యారిగేట్లు ఏర్పాటు చేశారు. అలాగే మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున వారికి ప్రత్యేక క్యూలైన్లు కూడా ఏర్పాటు చేశారు. కాగా కొన్ని ఆలయాల్లో తెల్లవారు జామున 3గంటల నుంచి స్వామి దర్శనాలు ప్రారంభమయ్యే నేపధ్యంలో చీకటి కారణంగా క్యూలైన్లలో ప్రత్యేకంగా లైటింగ్ ఏర్పాట్లు చేశారు. ఆలయాలన్నింటికీ రంగు రంగుల విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అలాగే వైష్ణవాలయాలతోపాటు ఆంజనేయస్వామి ఆలయాల్లో విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆలయం, పుష్పగిరి చెన్నకేశవస్వామి ఆలయం, నందలూరు శ్రీసౌమ్యనాథస్వామి ఆలయం, జమ్మలమడుగు నారాపురస్వామి ఆలయంతోపాటు పలు ఆలయాల్లో ఉదయం 5గంటల నుంచి ఉత్తర దిక్కున గల ద్వారం నుంచి భక్తులకు స్వామి ఉత్సవమూర్తుల దర్శన భాగ్యం కల్పిస్తారు. కడప నగరంలోని దేవునికడప శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో కూడా మంగళవారం తెల్లవారు జామున 3గంటల నుంచే స్వామి మూలవిరాట్‌ను దర్శించుకునేందుకు భక్తులకు సౌకర్యం కల్పించారు. అలాగే వైకుంఠ ద్వారం ద్వారా తెల్లవారు జామున 3గంటల నుంచి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తుల దర్శనం కల్పిస్తారు. అదేవిధంగా కడపలోని జయనగర్ కాలనీలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఉదయం 5గంటల నుంచి స్వామి, అమ్మవార్లను వైకుంఠ ద్వారం నుంచి దర్శించుకునేందుకు భక్తులకోసం ప్రత్యేక ఏర్పాట్లు కల్పించారు. అదేవిధంగా కడప నగర శివార్లలోని శ్రీ పాలకొండరాయస్వామి ఆలయంలో కూడా ఉదయం 5గంటల నుంచి మూలవిరాట్, ఉత్సవ మూర్తుల దర్శనానికి భక్తులకు అనుమతిస్తారు. నగరంలోని జౌళి బజారులోని శ్రీ కోదండరామస్వామి ఆలయం తదితర ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఓ వైపు ధనుర్మాసపూజలు నిర్వహిస్తుండగా వైష్ణవాలయాల్లో అతి ముఖ్యమైన వైకుంఠ ఏకాదశి నిర్వహించవలసి రావడంతో నిర్వాహకులు బిజీ బిజీగా ఉన్నారు. అలాగే నగరంలోని గడ్డిబజారులోని శ్రీబాలాజీ దేవస్థానం, శ్రీలక్ష్మీసత్యనారాయణస్వామి దేవస్థానం, మున్సిపల్ మైదానంలోని శ్రీదత్తసాయి ఆలయంతోపాటు పలు ఆలయాల్లో వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక పూజలు చేయనున్నారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో అవినీతి పార్టీల ఏకమవుతున్నాయి..
* బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనాథరెడ్డి
కడప సిటీ,డిసెంబర్ 17: ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో దేశంలోని అవినీతి పార్టీలన్నీ ఏకమవుతున్నాయని జిల్లా బీజేపీ అధ్యక్షుడు పి.శ్రీనాథరెడ్డి సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉండగా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి, అన్ని ప్రభుత్వ, రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టుపట్టించిన సోనియా, రాహుల్ గాంధీలు వాటి పరిరక్షణ గురించి మాట్లాడటం వింతగా ఉందన్నారు. గత 10సంవత్సరాల నుంచి యుపీఏ హయాంలో ప్రభుత్వ వ్యవస్థలను భ్రష్టుపట్టించి బీజేపీనే వాటిని ధ్వంసం చేసిందని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. సోనియా, రాహుల్, చంద్రబాబునాయుడులు రాజ్యాంగ పరిరక్షణ పేరుతో రాజ్యాంగ విలువల గురించి మాట్లాడటం శోచనీయమన్నారు. కేంద్రంలో బీజేపీ కొనసాగినంతకాలం తమ అవినీతి ఆటలు చెల్లవన్న భయంతోనే ఆపార్టీలు ఉమ్మడి పోరాటానికి ఏకమైనట్లు స్పష్టవౌతోందన్నారు. రూ.6వేల కోట్లు బ్యాంకులకు ఎగనామం పెట్టిన సుజనా చౌదరి లాంటి వారిని ప్రోత్సహిస్తూ చంద్రబాబునాయుడు తిరిగి బ్యాంకుల్లోనే అవినీతి జరుగుతోందని ఆరోపించడం శోచనీయమన్నారు. గతంలో పెద్దనోట్ల రద్దును సమర్థించిన చంద్రబాబు ఇప్పుడు మాట మార్చి మోదీని విమర్శించడం దుర్మార్గమన్నారు. తన అవినీతిని పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే, విభజన హామీలపై నిలదీసినందుకే కేంద్రం తమపై కక్షకట్టిందని చంద్రబాబు ఆరోపించడం దారుణమన్నారు. స్వచ్ఛమైన పాలనను అందిస్తున్న మోదీనే తిరిగి ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, ప్రధాని కావాలనే రాహుల్ కల కలగానే మిగిలిపోవడం ఖాయమన్నారు. సమావేశంలో బీజేపీ నగర అధ్యక్షుడు ఎరికలప్ప, షిండే భాస్కర్, నగర ప్రధానకార్యదర్శి జి.లక్ష్మణరావు, ఉపాధ్యక్షుడు పి.నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

చతికిలపడ్డ గ్రామ కంఠాల అమ్మకాలు
* అవస్థలు పడుతున్న యజమానులు * నిలచిన ఇళ్లు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు
* చక్కదిద్దుతామని రంగంలో దిగిన దళారులు
కడప అర్బన్,డిసెంబర్ 17:జిల్లా వ్యాప్తంగా గ్రామ కంఠంలోని ఇళ్లు, ఆస్తుల భూములు క్రయ విక్రయాలు నిర్వహించుకుని అవసరాలు తీర్చుకోవడానికి రిజిస్ట్రేషన్ ఆటంకాలు, ఈ ఇబ్బందులు రాష్టవ్య్రాప్తంగా యజమానులకు ఎదురౌతున్నాయి. గ్రామకంఠంలో ఉన్న ఆస్తుల భూములు రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతుల అవసరం ఉంది. ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ ఆస్తులు గుర్తించి ప్రత్యేక సర్వేనెంబర్ కేటాయిస్తే తప్ప గ్రామకంఠంలోని ప్రైవేట్ ఆస్తులకు మోక్షం కలిగే పరిస్థితి లేదు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గ్రామకంఠంలోని భూములు, అస్తుల సర్వేనెంబర్లకు అనుమతులు లేకపోవడంతో లావాదేవీలు పూర్తిగా నిలచిపోయాయి. ఈవ్యవహారం రెవెన్యూ అధికారులు పూర్తిగా స్పష్టత ఇవ్వకపోవడం వల్ల ఇళ్లు, ఆస్తుల రిజిస్ట్రేషన్ నిలిచిపోయాయి. ఫలితంగా గ్రామ కంఠాల ఆస్తుల అమ్మకాలు చతికిలపడ్డాయి. గ్రామకంఠంలోని ఆస్తులు క్రయ విక్రయాలు జరగాలన్నా, రిజిస్ట్రేషన్ మాత్రం చట్టపరంగా కుదరదు. వాస్తవానికైతే ఆయా మండల తహశీల్దార్ల కార్యాలయాలకు ఆయా ఆస్తులపై పూర్తి ఆధారాలతో కూడిన దరఖాస్తు చేసుకోవాలి. అక్కడి నుంచి స్పష్టత పరిశీలన కోసం రెవెన్యూ డివిజన్ కార్యాలయానికి ఆధారాలను మండలస్థాయి అధికారులు సిఫార్సు చేస్తారు. ఆర్డీవో కార్యాలయంలో పరిశీలించిన ఆధారాలు బట్టి ఆస్తులకు ప్రత్యేక సర్వేనెంబర్ కేటాయించాలని కలెక్టర్ కార్యాలయం నుండి డివిజనల్, మండల స్థాయి అధికారులకు లిఖిత పూర్వకమైన ఉత్తర్వులు జారీ కావాల్సివుంది. ఇన్ని ఆటంకాలతో సతమతవౌతున్న ఆస్తుల యజమానుల అవసరాలు గుర్తించిన కొంతమంది దళారులు రంగప్రవేశం చేశారు. ఆస్తుల విలువలను బట్టి, విస్తీర్ణాన్ని బట్టి పై కార్యాలయాల్లో పనులు చక్కబెట్టేందుకు రూ.2లక్షల నుంచి రూ.3లక్షలు ఖర్చుచేసే ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకోవచ్చునని సంబంధిత యజమానులను దళారులు నమ్మబలుగుతున్నారు. ఇంత డబ్బులు గ్రామస్థాయి విఆర్వో దగ్గరనుంచి మండలస్థాయి, డివిజన్‌స్థాయి అధికారుల వరకు పంపకం జరిపినట్లయితే గ్రామకంఠాల అమ్మకాలు సులువుగా అమ్ముకోవడానికి వీలుంటుందనే తప్పుడు సంకేతాలతో యజమానులను దళారులు నమ్మిస్తున్నారు. వాస్తవంగా అయితే గ్రామకంఠంలోని ప్రభుత్వ ఆస్తులను గుర్తించి ప్రభుత్వాలే ప్రత్యేక సర్వేనెంబర్లు కేటాయించాల్సివుంది. ఎవరైనా ఆస్తులను అమ్ముకోవాలంటే పూర్తి ఆధారాలతో కలెక్టర్‌కు దరఖాస్తుచేసే అనుమతి కోసం ఆయా డివిజన్ల ఆర్డీవోలను కలెక్టర్ ఆదేశిస్తారు. అది కూడా జిల్లా రిజిస్టర్‌కు సంబంధిత వివరాలు పంపిస్తే అక్కడి నుంచి సబ్ రిజిస్టర్లకు లిఖిత పూర్వక ఆదేశాలు జారీ అవుతాయి. ఇలాంటి సమస్య జిల్లా అంతటా ఉంది. కడప నగరంలో అక్కాయపల్లి, ఊటుకూరు, నకాష్ ప్రాంతాల్లో కొన్ని వాణిజ్యభూముల భవనాలకు దాదాపు రూ.2కోట్ల 50లక్షలకు బేరం కుదిరించి,దీనికిగాను కొనుగోలు దారులు కొంత మొత్తాలు అడ్వాన్స్‌లు చెల్లించి భవన యజమానుల నుంచి అగ్రిమెంట్ పొందారు. తీరా రిజిస్ట్రేషన్ సమయానికి గ్రామకంఠం పేరుతో ఆటంకం ఏర్పడటంతో అనుమతి పత్రాలకు అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితి నెలకొంది. వాస్తవానికి ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్తులు గుర్తించి ప్రత్యేక సర్వేనెంబర్లు కేటాయించే పరిస్థితి లేకపోవడంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురౌతున్నాయి. గ్రామకంఠంలో ఉన్న ఇళ్లు, ఇతర నిర్మాణాలు, స్థలాల రిజిస్ట్రేషన్ విషయమై నెలకొన్న ప్రతిష్టంబన నానాటికి సమస్యాత్మకంగా మారుతోంది. గ్రామకంఠంలో ఉన్న ప్రభుత్వస్థలాలు, నిర్మాణాలు గుర్తించి వాటికి ప్రత్యేక సర్వేనెంబర్లు కేటాయించేంతవరకు మిగిలిన లావాదేవీలు నిర్వహించేందుకు ఏ అవకాశం లేదు. దీంతో తమ అవసరాలకోసం ఆస్తులు అమ్ముకునేందుకు సిద్ధమైన వారు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు.

టీఆర్‌ఎస్ గెలిస్తే వైకాపా, జనసేన నాయకుల సంబరాలేంటి?
* టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం
రాయచోటి, డిసెంబర్ 17: పొరుగు రాష్టమ్రైన తెలంగాణలో టీఆర్‌ఎస్ గెలిస్తే రాష్ట్రంలోని వైఎస్‌ఆర్‌సీపీ, జనసేన పార్టీల నాయకులు సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారో చెప్పాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ప్రశ్నించారు. సోమవారం స్థానిక మదనపల్లె మార్గంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మార్కెట్‌యార్డు ఛైర్మన్ గాజుల ఖాదర్‌బాషా, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అంజద్‌అలీఖాన్‌లతో కలిసి మాట్లాడారు. ఏపీకి ప్రత్యేకహోదా, పోలవరం ప్రాజెక్టులను టీఆర్‌ఎస్ వాళ్లు అడ్డుకోవడమే కాకుండా పార్లమెంటు సాక్షిగా దేశంలోని అన్ని పార్టీల వాళ్లు ఏపీకి ప్రత్యేకహోదా కావాలని డిమాండ్ చేస్తే అందుకు భిన్నంగా టీఆర్‌ఎస్ అవసరం లేదని చెప్పిన పార్టీ తెలంగాణలో గెలిస్తే జగన్, పవన్‌లకు ఎందుకు అంత సంతోషమన్నారు. నీచ రాజకీయాలు, పదవీవ్యామోహానికి వీరి చేష్టలే పరాకాష్ట అని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ గెలిచింది కావున ఏపీలో వైకాపా గెలుస్తుందని భ్రమలు కనడం వారి రాజకీయ అపరిపక్వతకు, అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో అనేక కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దేశంలోనే ఏపీని ముందంజలో నిలిపిన ఘనత చంద్రన్నదేనన్నారు. ఇంత అభివృద్ధిని చూసే ప్రజలు ఇంతకు 2019 ఎన్నికలలో అధిక స్థానాల్లో టీడీపీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏపీకి గుండె లాంటి పోలవరం ప్రాజెక్టుకు కేవలం 15వేల కోట్ల రూపాయలు ఇచ్చి తెలుగువారిని దెబ్బతీసిన ఘనత కేంద్ర ప్రభుత్వం, బీజేపీయేదని, అలాంటి పార్టీకి జగన్, పవన్‌లు వత్తాసు పలకడం రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. తెలంగాణ ఎన్నికల సమయంలో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలు ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పారని, ఇందుకు కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు మద్దతు పలుకుతున్నారన్నారు. రాహుల్‌గాంధీ పీఎం కావాలన్నది దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ బహిరంగంగా చెప్పారని, కానీ నేడు జగన్ అందుకు భిన్నంగా రాహుల్‌ను తిడుతుంటే వైఎస్‌ఆర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు. రాజకీయ దళారి సి.రామచంద్రయ్య అని, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలో పనిచేసి మంచి పదవులు అనుభవించి లబ్ది పొంది ఇపుడు ఆ పార్టీలనే విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. 2019 ఎన్నికల కురుక్షేత్రంలో టీడీపీ అభివృద్ధి నినాదంతో ముందుకు వెళ్లి, దేశానికి తలమానికంగా చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే టీడీపీ గెలుపు ఖాయమని జోష్యం చెప్పారు. టీ ఆర్ ఎస్, వైకాపా, జనసేన, మజ్లిస్ ఎన్ని పార్టీలు కలిసినా టీడీపీని ఏమీ చేయలేవని, 150 సీట్లకు పైగా టీడీపీ గెలవడం ఖాయమని ఆయన వివరించారు.

ఒంగోలు ట్రిపుల్ ఐటీ తరలింపునకు సన్నాహాలు
వేంపల్లె, డిసెంబర్ 17: ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ ఆవరణలోని పాత క్యాంపస్‌లో కొనసాగుతున్న డాక్టర్ ఏపీజే అబ్దుల్‌కలాం ఒంగోలు ట్రిపుల్ ఐటీని ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోకి మార్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ ఆఖరుకంతా ఒంగోలులోని తాత్కాలిక భవనాల్లో ఏర్పాటు చేసి విద్యాబోధన కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. పాత క్యాంపస్‌లో చదువుకుంటున్న పీయూసీ-1,2లకు చెందిన 2 వేల మంది విద్యార్థులను తరలించే యోచనలో ఉన్నారు. మూడు సంవత్సరాల క్రితం ఒంగోలు ట్రిపుల్ ఐటీని ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. ఇడుపులపాయ క్యాంపస్ ఆవరణలోనే తరగతులు అప్పటి నుంచి ప్రారంభించారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులు ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ నూతన ల్యాబ్ క్యాంపస్ భవనాలలో కొనసాగుతుండగా పీయూసీ-1,2 తరగతులకు గాను పాత క్యాంపస్‌లో నిర్వహిస్తున్నారు. పలుచోట్ల ఒంగోలు ప్రాంతంలో స్థలాలను గుర్తించనప్పటికీ అవి ట్రిపుల్ ఐటీకి అప్పగించే ప్రక్రియ జాప్యం జరుగుతూ వచ్చింది. మూడు నెలల క్రితం పామూరు వద్ద 208 ఎకరాలు ఒంగోలు ట్రిపుల్ ఐటీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే భవన నిర్మాణాలకు సంబంధించి డిజైన్ల ఏర్పాటు సర్వే దశలోనే ఉంది. ఇప్పటికే మూడేల్లు కావస్తున్నా నూతన భవనాలు నిర్మించుకోలేని పరిస్థితుల్లో ఒంగోలు ట్రిపుల్ ఐటీకి తలెత్తింది. ఈ క్రమంలో ఇక్కడి ట్రిపుల్ ఐటీ అధికారులు ఒంగోలుకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ పెద్దలతో చర్చించిన మీదట ఈ యేడాది డిసెంబర్ ఆఖరుకంతా ఒంగోలు పట్టణంలోకి ట్రిపుల్ ఐటీని మార్చేందుకు నిర్ణయించినట్లు తెలిసింది. ఒంగోలు పట్టణంలోని రావు అండ్ నాయుడు కళాశాల భవనాలు మరో రెండు చోట్ల పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కడ భవనాలు అయితే అనుకూలంగా ఉంటాయో అక్కడికి వెంటనే తరలించేలా అవసరమైన ఏర్పాట్లు చేసేలా అధికారులు సిద్దమవుతున్నారు. ఇందుకు సంబంధించి ప్రాధమిక పనులు ప్రారంభించి ఒంగోలు పట్టణంలో భవనాలు పరిశీలిస్తున్నట్లు అధికారుల ద్వారా సమాచారం. ఈ విషయమై ఒంగోలు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ నరసింహరాజును వివరణ కోరగా తాత్కాలిక భవనాల్లోకి ట్రిపుల్ ఐటీని మార్చాలనే ప్రయత్నాలు ఉన్నామని, త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఆయన తెలిపారు.

రోడ్డుప్రమాదంలో ఆటోడ్రైవర్ మృతి

0
0

చోడవరం, డిసెంబర్ 17: గూడ్సు ఆటోను టిప్పర్ ఢీకొన్న సంఘటనలో ఆటోడ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందిన ప్రమాదం మండలంలోని అడ్డూరు గ్రామం వద్ద ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలావున్నాయి. మాడుగుల మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన దాడి నాగ వెంకట సత్యనారాయణ కూరగాయలు తీసుకుని విశాఖకు వెళ్లి అక్కడ అన్‌లోడ్ చేసి తిరిగి ఇంటికి తిరుగుప్రయాణమై వస్తుండగా అడ్డూరు గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోడ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. అలాగే ఆటోలో ఉన్న కామాకుల రాజు గాయాలపాలయ్యారు. గాయపడిన అతడిని 108 అంబులెన్సులో విశాఖకు తరలించారు. ఆటోడ్రైవర్ సత్యనారాయణ భార్య మంగ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ మునాఫ్ కేసునమోదు చేస్తున్నారు. మృతునికి భార్యతోపాటు పాప, బాబు ఉన్నారు.


తుపాను సహాయక చర్యల నిరంతర పర్యవేక్షణ

0
0

విశాఖపట్నం, డిసెంబర్ 17: పెథాయ్ తుపానుతో సంభవించిన నష్టాన్ని అంచనావేస్తూ, బాధితుల సహాయ, పునరావాస కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. తుపాను తీవ్రత నేపథ్యంలో సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌ను సందర్శించి, కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో వచ్చిన హుదూద్, తిత్టీ తుపాను అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రియల్‌టైం గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) ద్వారా తుపాను, ఇతర విపత్తుల తీవ్రతను ముందుగానే అంచనావేయడంతో పాటు అందుకు అనుగుణంగా నివారణ, సహాయ చర్యలు చేపట్టేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఎటువంటి ప్రాణనష్టం సంభవించకుండా, లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. జిల్లాలోని పాయకరావుపేట, నక్కపల్లి, రాంబిల్లి, అచ్యుతాపురం తదితర మండలాల్లో తుపాను ప్రభావం అధికంగా ఉందని, దాదాపు 90 పునరావాస కేంద్రాలకు 26,323 మందిని తరలించామన్నారు. వీరికి అల్పాహారం, భోజనం తదితర సదుపాయాలు కల్పించామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ 23 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైందన్నారు. కలెక్టరేట్‌తో పాటు 67 ప్రాంతాల్లో కంట్రోల్ రూం లను ఏర్పాటు చేశామని, ఈపీడీసీఎల్, జీవీఎంసి, ఇరిగేషన్ శాఖలు ప్రత్యేక సెంటర్లను ఏర్పాటు చేసి సమన్వయం చేస్తున్నట్టు తెలిపారు. నగరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్మార్ట్‌పోల్స్ ద్వారా హెచ్చరికలు, సీసీ టీవీలు పనిచేస్తున్నాయన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పునరావాస కేంద్రాల వద్ద సహాయ బృందాలు, అత్యవసర సరుకులు సిద్ధంగా ఉంచామన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయమేర్పడినప్పటికీ మంచినీటి పథకాలను నిర్వహించేందుకు జనరేటర్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. మంచినీటి సరఫరా నిమిత్తం 50 ట్యాంకులను అందుబాటులో ఉంచామని, చెరువులు, ఇతర నీటి వనరులకు గండ్లు పడితే తక్షణమే వాటిని పూడ్చేందుకు 25వేల ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచామన్నారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఫైర్, నేవీ, కోస్టుగార్డ్, ఆర్మీకి చెందిన రెస్క్యూ బృందాలను సిద్ధం చేశామన్నారు. రహదార్లపై కూలిన వృక్షాలను తొలగించేందుకు పవర్ కటింగ్ మెషీన్లు, రంపాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. భారీ వర్షాల కారణంగా పారిశుద్ధ్య పనులకు విఘాతం కలగకుండా బ్లీచింగ్ బ్యాగులు సిద్ధం చేశామన్నారు.
ఇద్దరు మంత్రులు, ఆరుగురు ఐఏఎస్‌లు
తుపాను సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు మంత్రులను జిల్లాకు నియమించిందని మంత్రి గంటా తెలిపారు. మంత్రులు అమర్‌నాధ్ రెడ్డి, ఫరూక్ అబ్దుల్లా సహాయ కార్యక్రమాలు పరిశీలించనున్నారు. అలాగే మండలాలు, గ్రామాల్లో నష్టాన్ని అంచనావేసేందుకు ఆరుగురు ఐఏఎస్ అధికారులతో బృందాన్ని ఏర్పాటు చేశారన్నారు. జిల్లాలో పాయకరావుపేట, మండలంలో ఇప్పటి వరకూ 1300 హెక్టార్లలో వరి, 500 ఎకరాల్లో అరటి పంటకు నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా గుర్తించామన్నారు.

పెథాయ్‌పై అప్రమత్తంగా ఉండాలి

0
0

విశాఖపట్నం, డిసెంబర్ 17: పెథాయ్ తుపాను కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం నుంచి కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఎప్పటి కప్పుడు తుపాను ప్రభావాన్ని అంచనావేస్తూ అధికారులకు టెలికాన్ఫరెన్స్ ద్వారా సూచనలు జారీ చేశారు. పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్ రాయవరం, రాంబిల్లి, అచ్యుతాపురం మండలాల్లో భారీ గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అక్కడి అధికారులను కలెక్టర్ అప్రమత్తం చేశారు. తుపాను పునరావాస కేంద్రాలకు తరలించిన బాధితులకు అవసరమైన సాయం అందించాలన్నారు. కలెక్టరేట్‌లో డీఆర్‌ఓ చంద్రశేఖర రెడ్డి ఆయా మండలాల అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ అవసరమై ఆదేశాలు జారీ చేస్తున్నారన్నారు.

ఎక్కడి రైళ్ళు అక్కడే....

0
0

విశాఖపట్నం, డిసెంబర్ 17: పెథాయ్ తుపాను రైళ్ళ రాకపోకలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. పలు రైళ్ళు రద్దు కాగా, కొన్ని ముఖ్యమైన ఎక్స్‌ప్రెస్, సూపర్‌పాస్ట్‌లు రీషెడ్యూల్ చేయబడ్డాయి. ఇంకొన్ని దారి మళ్ళింపులో నడుస్తున్నాయి. ఆదివారం రాత్రి నుంచి రైళ్ళ రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుండగా సోమవారం రోజంతా ఎక్కడి రైళ్ళు అక్కడే అన్నట్టుగా నిలిచిపోయాయి. విజయవాడ-విశాఖల మధ్య కొన్ని నిలిచిపోగా, ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళే పలు రైళ్ళు గంటల తరబడి స్టేషన్‌లోనే నిలిచిపోవాల్సి వచ్చింది. వీటికి క్లియరెన్స్ లేక ఆలస్యంగా బయలుదేరి వెళ్ళాయి.
* మళ్ళింపు మార్గంలో వెళ్ళే రైళ్ళు...
హౌరా-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (22663) హౌరాలో సోమవారం ఖరగ్‌పూర్-ఝార్స్‌గుడ-బిలాస్‌పూర్-బాలహర్సాల మీదుగా మళ్ళింపు మార్గంలో నడుస్తుంది. సోమవారం బయలుదేరే హౌరా-హైదరాబాద్ (18645) ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ హౌరా కూడా ఖరగ్‌పూర్-టాటా-ఝార్స్‌గుడ-బిలాస్‌పూర్-బాల్‌హర్సాల మీదుగా మళ్ళింపు మార్గంలో నడుస్తోంది. వీటితోపాటు మరికొన్ని ఎక్స్‌ప్రెస్‌లను దారి మళ్ళింపులో నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా దిబ్రుగర్-కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్ (15906) దిబ్రుగర్‌లో సోమవారం బయలుదేరగా దీనిని పురులియా-విల్లుపురం ఎక్స్‌ప్రెస్ పురిలియాలో సోమవారం బయలుదేరింది. అయితే ఇది ఖరగ్‌పూర్-టాటా-ఝార్స్‌గుడ-బిలాస్‌పూర్-బాల్‌హర్హాల మీదుగా నడుస్తున్నట్టు వాల్తేరుడివిజన్ అధికారులు ప్రకటించారు. అలాగే పురిలియా-విల్లుపురం ఎక్స్‌ప్రెస్ పురిలియాలో సోమవారం బయలుదేరింది. ఇది కూడా హిజీ-ఝార్స్‌గుడ-బిలాస్‌పూర్-బాల్‌హర్సాల మీదుగా మళ్ళింపుమార్గంలోనే నడుస్తుంది.
* రీ షెడ్యూల్డ్ చేయబడినవి...
తుపాను కారణంగా గంటల తరబడి ఆలస్యమయ్యే మరికొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్ళు రీ షెడ్యూల్డ్ చేయబడ్డాయి. తిరుపతి-్భవనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ (22872) తిరుపతిలో మధ్యాహ్నం 12.15గంటలకు బయలుదేరాల్సి ఉండగా దీనిని సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహిస్తున్నారు. అలాగే కాచీగుడ-టాటా (07838) కాచీగుడ మధ్యాహ్నం ఒంటి గంటలకు కాచీగుడలో బయలుదేరాలి. అయితే దీనిని కూడా సాయంత్రం నాలుగు గంటలకే అక్కడ నుంచి బయలుదేరే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇదే తరహాలో మరికొన్ని ముఖ్యమైన రైళ్ళు రీ-షెడ్యూల్ చేయబడ్డాయి. విశాఖపట్నం-తిరుపతి ఎక్స్‌ప్రెస్ (17488) విశాఖపట్నం నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరాల్సి ఉండగా ఇది సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరి వెళ్లింది. విశాఖపట్నం-హజరత్ నిజాముద్ధీన్ దక్షిణ్ లింక్ ఎక్స్‌ప్రెస్ (12861)ను రీ షెడ్యూల్ చేయడంతో మధ్యాహ్నం 3.05గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరాల్సి ఉన్న దీనికి రాత్రి 6.05గంటలకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. అలాగే విశాఖపట్నం-హైదరాబాద్ (12727) గోదావరి ఎక్స్‌ప్రెస్ విశాఖ నుంచి సాయంత్రం 5.20గంటలకు బయలుదేరాల్సి ఉండగా రాత్రి 8.25గంటలకు బయలుదేరి వెళ్ళింది. విశాఖపట్నం-చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ (22869) విశాఖ నుంచి రాత్రి 10.05గంటలకు బయలుదేరి వెళ్ళింది. వాస్తవానికి ఇది రాత్రి 7.05గంటలకు బయలుదేరాల్సి ఉంది. అంటే మూడు గంటలపాటు ఆలస్యంగా బయలుదేరి వెళ్ళింది. దీంతోపాటు విశాఖపట్నం-రాజమండ్రి (67296) పాసింజర్ రాత్రి 6.20గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరాల్సి ఉండగా ఇది రాత్రి 9.20గంటలకు బయలుదేరి వెళ్ళింది.
* రైళ్ళ ఆలస్యంతో ప్రయాణికుల అవస్థలు...
గంటల తరబడి ఆలస్యంగా నడుస్తోన్న రైళ్ళ వలన ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. గమ్యానికి చేరుకోవాలనే ఆందోళనతో తామెక్కాల్సిన రైలు కోసం అవస్థలు పడాల్సి వచ్చింది. విశాఖ నుంచి భువనేశ్వర్, హౌరా వైపుగా వెళ్ళే రైళ్ళు, అలాగే రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, సికింద్రాబాద్, చెన్నై, ముంబై, బెంగళూరు, తిరుపతి తదితర ముఖ్యమైన ప్రాంతాలకు వెళ్ళే రైళ్ళు రీ షెడ్యూల్ చేయడంతో కనీసం మూడు గంటల నుంచి ఐదు గంటల ఆలస్యంగా నడుస్తున్నాయి. దీనివల్ల స్టేషన్‌లోనే ప్రయాణికులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. తుపాను కారణంగా బలమైన ఈదురుగాలులతో ప్లాట్‌ఫారాలపై బిక్కుబిక్కుమంటూ కనిపించారు. వృద్ధులు, పిల్లలు తీవ్ర అసౌకర్యానికి గురికావాల్సి వచ్చింది. బుధవారం రాత్రి నుంచి ప్రయాణికులకు అవస్థలు తప్పలేదు.

ఆగిన ఆర్టీసీ...

0
0

విశాఖపట్నం, డిసెంబర్ 17: ఆర్టీసీ ఆగింది. ఒకటీ, రెండూ కాదు...ఏకంగా 500కు మించి ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఇవేమీ రోడ్డెక్కనేలేదు. ఉన్న వాటిల్లో 60నుంచి 70శాతం మేర బస్సులు కదలనేలేదు. పెథాయ్ తుపాను హెచ్చరికలతో బుధవారం రాత్రి నుంచి కురుస్తోన్న భారీ వర్షాలు, ఈదురుగాలులు కారణంగా జనం సైతం రోడ్డెక్కలేదు. ముందస్తు జాగ్రత్తల కారణంగా తుపాను వలన ఎదురయ్యే నష్టాలను లేకుండా చేసుకోగలిగామని ఆర్టీసీ అదికారులు చెబుతున్నారు. లక్షల లీటర్ల డీజిల్‌ను రెండు రోజుల ముందుగానే సమకూర్చుకోగా, ప్రతి డిపో నుంచి బయలుదేరి వెళ్ళే బస్సులకు సంబంధించి అధికారులు ముందుగానే నిర్ణయం తీసుకున్నారు.
* నిలిచిన 500 బస్సులు...
ఆర్టీసీ విశాఖ రీజియన్ పరిధిలో దాదాపు 800 బస్సులు నడుస్తుంగా ఇందులో తెలుగు-వెలుగు, సిటీ సర్వీసులు, ఎక్స్‌ప్రెస్‌లు, సూపర్‌డీలక్స్‌లు, మెట్రోలున్నాయి. అయితే విశాఖ నుంచి సికింద్రాబాద్, విజయవాడ, గుంటూరు, తిరుమతి, భీమవరం, ఒంగోలు, నెల్లూరు, శ్రీకాళహస్తి, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి తదితర ప్రాంతాలకు వెళ్ళే బస్సులను అన్నింటినీ ముందుగానే నిలిపివేశారు. సోమవారం ఉదయం నుంచి ఇవి నిలిచిపోయాయి. అలాగే సిటీ బస్సుల్లో కొన్ని రూట్లకు సంబందించి నిలిపివేయగా, మరికొన్ని రూట్లలో కొన్నింటినే నిర్వహించారు. కొన్నింటినీ ఉదయం నిలిపివేయగా, మరికొన్నింటినీ మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు రద్దు చేయాల్సి వచ్చింది. విశాఖ ఏజెన్సీ చింతపల్లి, పాడేరు, అరకు, అనంతగిరి, ఎస్.కోట, నర్సీపట్నం, భద్రాచలం, సీలేరు తదితర ప్రాంతాలకు వెళ్ళే వాటిలో కొన్ని నిలిచిపోతాయి. ఈ విధంగా నిలిచిపోయిన బస్సుల వలన ఆర్టీసీ విశాఖ రీజియన్‌కు 30నుంచి 40 లక్షల మేర ఆదాయాన్ని కోల్పోవల్సి వచ్చింది. వాతావరణం పరిస్థితులనుబట్టి మంగళవారం ఉదయం నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళే బస్సుల నిర్వహణపై నిర్ణయాన్ని తీసుకుంటామని డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ బి.అప్పలనాయుడు సోమవారం రాత్రి 3ఆంధ్రభూమి2కి తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులను నిర్వహించకూడదంటూ ఆర్టీసీ ఎండీ చేసిన ఆదేశాలతో ఇక్కడి రీజనల్ మేనేజర్ సుదేశ్‌కుమార్ ముందస్తు చర్యలు తీసుకున్నారు.
* రోడ్డెక్కని జనం...
పెథాయ్ తుపానుకు సంబంధించి జిల్లా యంత్రాంగం ముందస్తు హెచ్చరికలు చేయడంతో జనం ఇళ్ళకే పరిమితమయ్యారు. తప్పనిసరి పరిస్థితుల్లో విధులకు హాజరుకావాల్సిన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు తప్పితే ఏ ఒక్కరూ సోమవారం ఉదయం నుంచి ఇళ్ళ నుండి బయటకు రాలేదు. పాఠశాలలు, కాలేజీలకు సోమవారం సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ఇళ్ళకే పరిమితమయ్యారు.

పొట్టకొట్టిన పెథాయ్...

0
0

విశాఖపట్నం, డిసెంబర్ 17: పెథాయ్ తుపాను కూలీల పొట్టకొట్టింది. పనుల్లేక వీరి కుటుంబాలు విలవిల్లాడిపోతున్నారు. రోడ్డెక్కలేక, ఇళ్ళల్లో ఉండలేక నానా అవస్థలు పడుతున్నారు. పెథాయ్ తుపాను ప్రభావంతో నిర్మాణ రంగంలో పనులు నిలిచిపోయాయి. మరెక్కడా లేనివిధంగా విశాఖ నగరంలోను, శివారుప్రాంతాల్లోనే బహుళ అంతస్తుల భవనాలు, విద్యాసంస్థలు, పరిశ్రమలు, ఐటీ రంగానికి సంబంధించిన భారీ ప్రాజెక్టుల నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. గత ఐదేళ్ళకాలం నుంచి నిర్మాణ రంగం వేగాన్ని అందుకుంది. దీంతో ఒడిశా, చత్తీస్‌గడ్, జయపూర్ రాష్ట్రాల నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో శ్రీకాకుళం, పలాస, సోంపేట, నరసన్నపేట, విజయనగరం జిల్లా పార్వతీపురం, పాలకొండ, బొబ్బిలి, సాలూరు తదర ప్రాంతాల నుంచి పనుల కోసం పొట్ట చేత పట్టుకుని విశాఖకు వచ్చిన కుటుంబాలు ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగాయి. వ్యవసాయంపైనే ఆధారపడిన రైతులకు వర్షాభావ పరిస్థితులు తీరని కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కరవు కోరల్లో చిక్కుకున్న మధ్యతరగతి రైతు కుటుంబాలు చేసేదిలేక విశాఖవైపు పయలనమవుతుండగా ఈ విధంగా వచ్చే వారిలో ఎక్కువ శాతం మంది నిర్మాణ రంగాల్లోను, విద్యాసంస్థల్లోను, ఐటీ రంగంలో చేరిపోతున్నారు. ఈ విధంగా మధురవాడ, ఆనందపురం, తగరపువలస, గాజువాక, పెందుర్తి, సింహాచలం తదితర ప్రాంతాల్లో బహుళ అంతస్తుల నిర్మాణాలు జరుగుతుండగా వీటిల్లో పనులకు చేరిపోతున్న వీరందరికీ ఇపుడు తుపాను దెబ్బతీసింది. దాదాపు 20నుంచి 30 ప్రాంతాల్లో జరుగుతున్న ప్రాజెక్టులు, గృహాలు, బహుళ అంతస్తుల భవనాలు, విద్యాసంస్థలు, ఐటీ రంగానికి చెందిన నిర్మాణ పనుల్లో ఉండేవారు 50నుంచి 60 శాతం మేర ఉంటారు. ఇపుడు వీరందరికీ పనుల్లేక విలవిల్లాడుతున్నారు. వలస కూలీలు, నిర్మాణ రంగ కార్మికులకు మరో రెండు రోజులపాటు ఆర్ధికపరమైన ఇబ్బందులు తప్టెటట్టు లేదు.
రేపు సింహాచలేశుని వైకుంఠ ద్వార దర్శనం
* మధ్యాహ్నం 11 గంటల వరకు ఉత్తర ద్వారంలో అప్పన్న * 3 గంటలకు కొండ మెట్ల దీపోత్సవం
* ఏర్పాట్లకు తుఫాన్ ఆటంకం * నేడు రాత్రి 7 గంటల వరకే దర్శనాలు
సింహాచలం, డిసెంబర్ 17: మార్గశిర శుద్ధ ఏకాదశి సందర్భంగా భక్తకోటికి బుధవారం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కలగనుంది. సూర్యోదయానికి ఏకాదశి తిధి ఉన్న రోజునే ప్రామాణికంగా తీసుకొని ఉత్సవాలు నిర్వహించడం సింహాచల క్షేత్రంలో ఆచారంగా వస్తున్న నేపథ్యంలో దేవాలయంలో బుధవారమే సింహాచలేశుని ఉత్తర ద్వార దర్శనం భక్తులకు ఏర్పాటు చేస్తున్నారు. మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత సుమారు ఒంటి గంట సమయంలో సుప్రభాతం, ఆరాధన సేవ నిర్వహిస్తారు. తెల్లవారుజామున మూడు గంటలకు కొండ దిగువ సింహగిరి మెట్ల మార్గంలో దీపోత్సవాన్ని ప్రారంభిస్తారు. మూడున్నర గంటలకు ఆలయంలో స్వామివారి సేవ మొదలవుతుంది. సుమారు 4 గంటల 15 నిమిషాలకు దేవాలయం ప్రాంగణంలో ఉన్న ఉత్తర ద్వారంలో అనుశంశిక ధర్మకర్తల కుటుంబానికి సంప్రదాయం ప్రకారం తొలిదర్శనం కల్పిస్తారు. అనంతరం వైకుంఠనాధుడిని భక్తుల దర్శనార్థం ఉత్తర ద్వారంలోకి తోడ్కొని వస్తారు. అక్కడ ప్రత్యేకంగా ఆలంకరించిన వైకుంఠ వేదిక పై ఉత్సవమూర్తులను వేంచింపజేస్తారు. మధ్యాహ్నం 11 గంటల వరకు సింహాచలేశుడు ఉత్తర దార్వంలో భక్తులు దర్శించుకునే వీలుగా ఆధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మెట్ల దీపోత్సవానికి అవసరమైన నూనె, వొత్తులు దేవస్థానమే ఉచితంగా పంపిణీ చేయనుంది. తెల్లవారు జామున నాలుగున్నర గంటల నుండి సింహగిరి పై సంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులందరికీ ఏకాదశి విశేష ప్రసాదమైన పొంగలిని పంపిణీ చేస్తున్నామని, అన్నప్రసాదంగా కూడా పొంగలి, పులుసు అందిస్తున్నామని అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. క్యూలలో భక్తులు కూడా స్వామివారి ఉత్తర ద్వార దర్శనం వీక్షించే విధంగా సీసీ టీవీలు ఏర్పాటు చేస్తున్నామని, భక్తుల కదలికలను గమనించేందుకు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు. కొండ దిగువన సింహగిరి పైన వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని దేవస్థానం అంబులెన్స్‌తో పాటు 108 వాహన సేవలను భక్తులకు అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు ప్రకటించారు.
* నేడు రాత్రి 7 గంటలకు దర్శనాలు నిలిపివేత : ముక్కోటి ఏకాదశి సన్నాహక చర్యల్లో భాగంగా మంగళవారం రాత్రి 7 గంటల వరకు మాత్రమే సింహాచలేశుని దర్శనాలు భక్తులకు లభిస్తాయని అనంతరం దర్శనాలు నిలిపివేయడం జరుగుతుందని అధికారులు తెలియజేసారు. సింహగిరికి వాహనాలను కూడా 7 గంటల తరువాత అనుమతించడం జరగదని, బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు మాత్రమే వాహనాలను సింహగిరికి అనుమతించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఏకాదశి ఉత్సవంలో భక్తులకు సేవలందించేందుకు వివిద ప్రభుత్వశాఖల అధికారులతో ఇప్పటికే పలుమార్లు సమావేశమై చర్చిండం జరిగిందని అధికారులు ప్రకటించారు. రెవిన్యూ, పోలీసు, జీవీఎంసీ, వైద్య, ఆరోగ్యశాఖ, అగ్నిమాపక విభాగాల సహకారం తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. కాగా పెథాయ్ తుఫాన్ ప్రభావం కారణంగా ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లకు అంతరాలయం వాటిల్లుతోంది. ఇప్పటికే భారీ క్యూలు ఏర్పాటు చేసినప్పటికీ వాటి పై షామియానాలు ఏర్పాటు చేయలేదు. గాలులు విపరీతంగా వీస్తున్న నేపథ్యంలో ఎగిరిపోయే ప్రమాదం ఉనందున పరిస్థితి చక్కబడేంతవరకు ఎదురు చూస్తున్నారు. మంగళవారం తుఫాన్ ప్రభావం తగ్గితే మరింత వేగవంతంగా ఏర్పాట్లు చేసేందుకు అధికారులు అన్ని సమకూర్చుకుని సిద్ధంగా ఉన్నారు.

అప్పన్న సేవలో శ్రీకాకుళం జెడ్పీ చైర్మెన్
సింహాచలం, డిసెంబర్ 17: శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ చౌదరి ధనలక్ష్మీ సోమవారం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారిని దర్శించుకున్నారు. కప్పస్తంభం అలింగనం చేసుకున్నారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేయించుకొని అర్చకుల ఆశీర్వాదం తీసుకున్నారు.

తీరుప్పావై ప్రవచానాలు ప్రారంభం
సింహాచలం, డిసెంబర్ 17: అడివివరం ప్రియాగార్డెన్స్‌లోని అపరాజిత ప్రాంగణంలో తిరుప్పావై ప్రవచానాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా తెల్లవారుజామున సన్నిథిలో విశేష పూజలు,పారాయణలు నిర్వహించారు. ఆధ్యాత్మిక ప్రవచనకారుడు డాక్టర్ శ్రీనివాస రామానుజం ఆధ్వర్యంలో ప్రారంభమైన తిరుప్పావై ప్రవచనాలలో జీ.నరసింహాచార్యులు, రఘనాథ గోపాలాచార్యులు, పద్మనాభాచార్యులు,శర్వాణీ, ధనలక్ష్మీ, హరిప్రియ, సాధకులు పాల్గొన్నారు.

ఏయూ స్నాతకోత్సవం వాయిదా
విశాఖపట్నం,డిసెంబర్ 17: ఆంధ్రవిశ్వవిద్యాలయం స్నాతకోత్సవం వాయిదాపడింది. పెథాయ్ తుఫాను కారణంగా స్నాతకోత్సవాన్ని వాయిదా వేసినట్లు రిజిస్ట్రార్ ఆచార్య కె.నిరంజన్ తెలిపారు. ఈ నెల 19న నిర్వహించాల్సిన స్నాతకోత్సవాన్ని తుఫాను కారణంగా తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందన్నారు. స్నాతకోత్సవంలో పీహెచ్‌డీ, మెడల్స్,ప్రైజులు స్వీకరించేవారు వివిధ ప్రాంతాల నుంచి రావాల్సి ఉంది. ప్రస్తుతం తుఫాను కారణంగా రవాణా వ్యవస్థలకు సైతం పలు ఇబ్బందులు ఎదురయ్యాయి. వీటిన్నింటిని పరిశీలించిన ఎటువంటి ఇబ్బందులు ఎదురువకుండా ముందు జాగ్రత్తగా స్నాతకోత్సవాన్ని వాయిదా వేశామన్నారు. తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియజేస్తామని, మార్పును గమనించాలన్నారు.
సామాజిక మార్పుకు కందుకూరి కృషి
* ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు
విశాఖపట్నం, డిసెంబర్ 17: సామాజిక మార్పుకు కందుకూరి వీరేశలింగం విశేష కృషి చేసారని ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ఉదయం ఏయూ తెలుగు శాఖలో కందుకూరి వీరేశలింగం రచనలు-సమాలోచన అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల సదస్సును ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ కందుకూరి ఆదర్శప్రాయడని, రచయితగా, కవిగా, సంస్కర్తగా విభిన్న బాధ్యతలను సమర్థవంతంగా ఆయన నిర్వర్తించారన్నారు. ఆయనను స్మర్తిస్తూ విభాగంలో సదస్సు ఏర్పాటు చేయడం మంచి పరిణామమన్నారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.రామమోహన్‌రావు మాట్లాడుతూ స్ర్తిలకకు సమాజంలో భాగస్వాములను చేయడానికి అవసరమైన ఉద్యమానికి అధ్యుల్లో ఒకరిగా కందుకూరి వీరేశలింగం ఒకరన్నారు.స్ర్తి విద్య,పునర్వివాహం కోసం ఆయన చేసిన కృషి నిరూపమానమని, సాహిత్యంలో ఆడుగిడి, స్ర్తిల సమస్యలను సమన్వయం పట్ల విభాగ ఆచార్యులను అభినందించారు. విభాగంలో గురుజాడ, కందుకూరి పేరుతో సాహితి సదస్సులు నిర్వహించడం పట్ల విభాగ ఆచార్యులను అభినందించారు. విభాగ ఆచార్యులు ఆచార్య జి.యోహన్‌బాబు , విభాగాధిపతి ఆచార్య జర్ర అప్పారావు, ఆచార్య వెలమల సిమ్మన్న, శరత్‌జ్యోత్న్స రాణి, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర సాహిత్రి త్రైమాసిక సంచికలను వీసీ ఆవిష్కరించారు.
శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో పూజలు
విశాఖపట్నం, డిసెంబర్ 17: పాత నగరంలో వేంచేసి యున్న శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా సోమవారం పదో రోజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచి అమ్మవారికి లక్ష్మీహోమం,వేదపారాయణ, సప్తశతీ పారాయణ, మహ విద్యాపారాయణ నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ఈవో జ్యోతిమాధవి అన్ని ఏర్పాట్లు చేశారు. అదే విధంగా ఆలయంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా వెంకటరమణ వారిచే అమ్మవారి చరిత్రపై బుర్రకధ నిర్వహించారు.
* నేడు అష్టదళ పద్మారాధన పూజ
శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో మంగళవారం ఉదయం అమ్మవారికి అష్టదళ పద్మారాధన పూజ నిర్వహించనున్నారు. స్వర్ణపుష్పార్చన(108 స్వర్ణపుష్పాలు)తో ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకూ నిర్వహించనున్నామని ఆలయ ఈవో జ్యోతి మాధవి తెలిపారు. ఈ పూజలో పాల్గొనే వారంతా రూ.1.116 పూజా రుసుము చెల్లించి పాల్గొనవచ్చునన్నారు.
నేటి నుంచి విశాఖ వేదికగా ఆలిండియా పోస్టల్ కబడ్డీ పోలీలు
విశాఖపట్నం, డిసెంబర్ 17: విశాఖ కేంద్రంగా 32వ ఆలిండియా పోస్టల్ కబడ్డీ పోటీలు ఈ నెల 18 నుంచి 21 వరకూ నగరంలోని స్వర్ణ్భారతి ఇండోర్ మైదానంలో నిర్వహించనున్నట్లు పోస్ట్ మాస్టర్ జనరల్ కల్నల్ ఎం. ఎలీషా తెలిపారు. నగరంలోని ఎంవీపీ కాలనీలోని ప్రధాన పోస్టల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ కబడ్డీ పోటీల్లో మొత్తం 11 జట్లు పాల్గొంటాయన్నారు. ఏపీ, తెలంగాణ,గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, పశ్చిమ బెంగాళ్, తమిళనాడు, ఢీల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ల జట్లు పోటీపడునున్నాయన్నారు. ఏపీ జట్టు సభ్యులతో పాటు కోచ్, మేనేజర్లుగా వ్యవహరిస్తున్న వారిలో జాతీయ, అంతర్జాతీయ కబడ్డీ పోటీల్లో ఆడిన అనుభవం కల్గినవారన్నారు. ఈ పోటీలను విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ ఎంటీ కృష్ణబాబు మంగళవారం ఉదయం 8.30 గంటలకు ప్రారంభించనున్నారన్నారు. ఈ ప్రారంభ సభకి ఏపీ తపాలా విభాగం ఛీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ కె.బాలసుబ్రహ్మణ్యన్ అధ్యక్షత వహిస్తారని, విశిష్ట అతిథిగా ద్రోణాచార్య అవార్డు గ్రహీత(బాక్సింగ్) వెంకటేశ్వరరావు పాల్గొంటారన్నారు. అదే విధంగా పోటీల ముగింపు సభకు ఏయూ వీసీ ఆచార్య నాగేశ్వరరావు, ఒలింపిక్ మాజీ క్రీడాకారుడు ఎంవీ మాణిక్యాలు, అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు సిహెచ్ పద్మరాజులు పాల్గొంటారన్నారు. భారతీయ తపాలా సంస్థ వివిధ క్రీడాంశాల్లో జాతీయ ,అంతర్జాతీయ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శించిన వారిని ప్రోత్సహించి, స్పోర్ట్స్ కోటా ప్రకారం సంస్థలో ఉద్యోగాలు సైతం కల్పించిందన్నారు.
ఏఆర్‌సి సంచాలకునిగా పుల్లారావు బాధ్యతల స్వీకరణ
విశాఖపట్నం,డిసెంబర్ 17: ఆంధ్రవిశ్వవిద్యాలయం ఆగ్రో ఎకనామిక్ రీసెర్చ్ సెంటర్( ఏ ఆర్‌సీ) సంచాలకునిగా ఏయూ ఆర్థశాస్త్ర విభాగాధిపతి ఆచార్య డి.పుల్లారావు పదవీ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం ఆయన కార్యాలయంలో సంచాలకునిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పుల్లారావును పలువురు ఆచార్యులు, విభాగ సిబ్బంది అభినందించారు.

మూడు గంటలు ఆలస్యంగా గోదావరి

0
0

విశాఖపట్నం, డిసెంబర్ 17: పెథాయ్ తుపాను ప్రభావం పలు రైళ్ళ రాకపోకలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యమైన రైళ్ళు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రముఖుల ఎక్స్‌ప్రెస్ అయిన గోదావరి సోమవారం రాత్రి 8.25గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళింది. దీంతో ఇందులో బయలుదేరి వెళ్ళే ప్రజాప్రతినిధులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన ఉన్నతాధికారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గంటల తరబడి ప్లాట్‌ఫారాలమీదే పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఎపుడూ ఆలస్యంగా కానీ గోదావరి చాలాకాలం తరువాత మళ్ళీ పెథాయ్ తుపాను కారణంగా గంటలు కొలది నిలిచిపోవాల్సి వచ్చింది. స్టేషన్‌కు చేరుకునే పలు రైళ్ళు ఔటర్‌లోనే నిలిచిపోవడంతో, బయలుదేరాల్సిన వాటికి గ్రీన్‌సిగ్నల్ లభించక ఇవేమీ కదలని పరిస్థితులు నెలకొన్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. అలాగే విశాఖపట్నం-చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ మూడు గంటలకు పైగానే ఇక్కడ నుంచి ఆలస్యంగా బయదేరాల్సి వచ్చింది. వీటితోపాటు విశాఖపట్నం-రాజమండ్రి పాసింజర్ మూడు గంటలపాటు ఆలస్యమైంది. ఈ విధంగా పలు రైళ్ళు గంటల తరబడి ఆలస్యంగా బయలుదేరడంతో ప్రయాణికులు సోమవారం రోజంతా నరకం చూడాల్సి వచ్చింది. తుపాను ప్రభావంతో బలమైన ఈదురుగాలులు, కుండపోత వర్షంతో దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులు విశాఖరైల్వేస్టేషన్‌కు చేరుకోవడం పెద్ద సమస్యగా మారింది. తీరా స్టేషన్‌కు చేరుకునేసరికి రైళ్ళ ఆలస్యంగా గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది.
* ఆటోలు, సిటీ బస్సుల్లేక ఇబ్బందులు...
తుపాను ప్రభావంతో ఆటోలు ఎక్కడా కనిపించనేలేదు. ఒక్క ఆటో కూడా రోడ్డెక్కలేదు. బంద్ వాతావరణాన్ని తలపించే విధంగా స్టాండ్‌ల్లోను, రోడ్డుపైనే ఎక్కడా కూడా ఒక్క ఆటో అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు నరకం చూడాల్సి వచ్చింది. ఇక సిటీ సర్వీసులు సైతం డిపోలకే పరిమితమయ్యాయి. సోమవారం ఉదయం నుంచి పల్చగా నడుస్తోన్న సిటీ సర్వీసుల్లో కొన్ని సోమవారం ఉదయం నుంచి ఏకదాటిగా కురుస్తోన్న కుండపోత వర్షానికి రోడ్డెక్కిన కొన్ని సిటీలు ఎక్కడికక్కడ నిలిచిపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విదంగా ఆటోలు రోజంతా ఎక్కడా కనిపించకపోగా, సిటీ సర్వీసులు అంతంత మాత్రంగానే ఉన్నందున ప్రయాణికులు అవస్థలు పడాల్సి వచ్చింది.

విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తం...

0
0

విశాఖపట్నం, డిసెంబర్ 17: పెథాయ్ తుపానుతో విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తమైంది. బలమైన ఈదురుగాలులు, భారీ వర్షంతో అనేకచోట్ల స్తంభాలు నేలకూలాయి. లైన్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. జిల్లా పరిధిలో ఎస్.రాయవరం, నక్కపల్లి, రాంబిల్లి, అచ్యుతాపురం, కోరుప్రోలు, పాయకరావుపేట తదితర ప్రాంతాల్లో స్తంభాలపై చెట్ల కొమ్మలు విరిగాపడటంతో సరఫరా నిలిచిపోయింది. మరికొన్నిచోట్ల సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినడం, సాంకేతికపరమైన సమస్యలు తలెత్తతున్నాయి. మధ్యాహ్నం నుంచి రాత్రి ఏడు గంటల వరకు నగరంలోను, శివారుప్రాంతాల్లో ఏకదాటిగా కురిసిన భారీ వర్షం, బలమైన ఈదురుగాలులు కారణంగా విద్యుత్ సరఫరా అనేకసార్లు నిలిచిపోయింది. ముందుస్తు చర్యల్లో భాగంగా అధికారులు అప్రమత్తం కావడంతో భారీ నష్టాల నుంచి బయటపడగలిగారు. ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపీడీసీఎల్) సిఎండి హెచ్‌వై దొర ఆదేశాలపై ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్‌ఇ) బి.సూర్యప్రకాష్ పలు మండల కేంద్రాల్లో విస్తృతంగా పర్యటించి సత్వర చర్యలు చేపడుతున్నారు. క్షేత్రస్థాయి నుంచి సిబ్బంది, ఉద్యోగులను అప్రమత్తం చేయడంతో సబ్‌స్టేషన్ల వారీగా సాంకేతికపరమైన సమస్యలను ఎప్పటికపుడు పరిష్కరిస్తున్నారు. తుపాను ప్రభావతి ప్రాంతాలు పాయకరావుపేట, కోరుప్రోలు, ఎస్.రాయవరం, నక్కపల్లి, రాంబిల్లి, అచ్యుతాపురం తదితర ప్రాంతాల పరిస్థితుల ఆయన ఎప్పటికపుడు సమీక్షిస్తున్నారు. దాదాపు వెయ్యి మంది సిబ్బందిని అందుబాటులోకి ఉంచడంతో పునరుద్ధరణ పనులు చురుగ్గా సాగుతున్నాయని సోమవారం రాత్రి 3ఆంధ్రభూమి2కి తెలియజేశారు. అలాగే అనకాపల్లి, యలమంచిలి మండలాల పరిధిలో ఎప్పటికపుడు విద్యుత్ పరిస్థితులను సమీక్షిస్తుండగా పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఒక్క జోన్‌లో డిఇఇలు, ఏడీఇలు, అసిస్టెంట్ల ఇంజనీర్ల పర్యవేక్షణలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారన్నారు. ఎటువంటి గంటల వ్యవదిలోనే విద్యుత్‌ను మెరుగుపర్చేందుకు వీలుగా యంత్రాంగాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు.

వెలవెలబోయిన సింహాచల క్షేత్రం
సింహాచలం, డిసెంబర్ 17: పెథాయ్ తుఫాన్ ప్రభావంతో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం భక్తుల తాకిడి లేక వెలవెలబోయింది. ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న జల్లులు సాయంత్రానికి పెరిగాయి. ఈదురుగాలులు వీస్తుండడంతో సింహగిరి పైన పందిళ్ల పరిస్థితి అధికారులను ఆందోళనకి గురిస్తోంది. సరుగుడు కర్రలు,వెదురు చాపలతో ఏర్పాటు చేసిన పందిళ్లు గాలులకు ఊగుతున్నాయి. సింహగిరికి వాహనాలు కూడా అడపదడపా మాత్రమే వచ్చాయి. భక్తులు తాకిడి అనూహ్యంగా తగ్గిపోవడంతో చాలా మంది వ్యాపారులు దుకాణాలను తెరవలేదు. రోజూ పెద్ద మొత్తంలో సింహగిరికి నడిచే స్థానిక ప్రయివేటు వాహనాలు కూడా నిలిచిపోయాయి. చిల్లర వ్యాపారులకు కనీస వ్యాపారం జరగలేదు. దీంతో వ్యాపారులంతా మధ్యాహ్నం నుండి ఇళ్లకే పరిమితమయ్యారు. పాఠశాలలకు సెలవుప్రకటించడంతో రహదారుల్లో వాహనాల రద్దీ గణనీయంగా తగ్గింది. పలుమార్లు విద్యుత్‌కి అంతరాయం ఏర్పడింది.
ఆనందపురంలో 60.4మిల్లీ లీటర్ల వర్షపాతం నమోదు
ఆనందపురం, డిసెంబర్ 17: మంగళవారం కురిసిన వర్షానికి ఆనందపురం మండలంలో 60.4మిల్లీ లీటర్ల వర్షపాతం నమోదైనట్లు మండల వ్యవసాయాధికారిణి శివకోమలి తెలిపారు. ఆమె మంగళవారం తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వరిపొలాలను సందర్శించిన ఆమె వరికుప్పలపై టార్మాన్లు కప్పుకోవాలని రైతులకు సూచించారు. అలాగే కోత పూర్తయి తడిచిపోయిన పనలను వర్షాలు తగ్గన అనంతరం రెండు శాతం ఉప్పుద్రావణాన్ని పిచికారి చేయడం ద్వారా మొలకెత్తకుండా నివారించుకోవచ్చన్నారు. ఇంకా వర్షాలు పెరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని రైతులకు సూచించారు. మండలంలో సాయింత్రం 5గంటల వరకు 60.4 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదైనట్లు శివకోమలి తెలిపారు.

భీమిలిలో తుఫాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన మంత్రి గంటా
భీమునిపట్నం, డిసెంబర్ 17: భీమిలి పరిధిలోని పెథాయ్ తుఫాను ప్రభావిత ప్రాంతాలను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం సందర్శించారు. ఒక వైపు వర్షం కురుస్తున్నా మంత్రి తుఫాను ప్రభావిత ప్రాంతాలు, ముంపు గ్రామాలైన మంగమారిపేట, భీమిలి బీచ్ ప్రాంతాలను ఆయన సందర్శించారు. ముంపు ప్రాంతాల్లో ఉన్న వారిని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. భీచ్ ప్రాంతంలో ఎటు


ఊరించి.. ఉసూరుమనిపించి..

0
0

నెల్లూరు, డిసెంబర్ 17 : జిల్లాపై వరుణుడు శీతకనే్నశాడు. ఎప్పటికప్పుడు వాయుగుండాల రూపంలో విరుచుకుపడుతున్నా నెల్లూరు ఛాయలకు కూడా రావడంలేదు. ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో కార్తెలవారీగా వానలు కురిసే రోజులు ఎప్పుడో పోయాయి. తుఫాన్లు, వాయుగుండాలు వంటి ప్రకృతి ప్రకోపాలతోనే వర్షాలు పడే పరిస్థితి నెలకొంది. కానీ అవి కూడా ఊరించి ఉసూరుమనిపించడం పరిపాటిగా మారింది. గత నెలలో వచ్చిన గజ తుఫాన్ అధికారులను వణికించిందే తప్ప జిల్లాకు ఒరిగిందేమీలేదు. మూడు రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడ్డ పెథాయ్ కూడా నిరాశనే మిగిల్చింది. అంతకుముందు పుట్టిన తితిలీ నెల్లూరు ఛాయలకు కూడా రాలేదు. అంతెందుకు నిన్నగాక మొన్న తీవ్ర తుఫాన్‌గా తీరం వైపు దూసుకువచ్చిన పెథాయ్ అధికారులను హడలెత్తించింది. ముందుస్తు జాగ్రత్తలతో నానాతంటాలూ పెట్టింది. చివరకు ముఖం చాటేసి రాష్ట్ర సరిహద్దుల్లో తీరం దాటింది. వాయుగుండాలు పుట్టినప్పుడల్లా ప్రజలు ఆందోళన చెందడం, అది దిశ మార్చుకుని ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లడం లేదా ప్రభావాన్ని కోల్పోవడం సాధారణ విషయంగా మారిపోయింది. సముద్రంలో వాయుగుండం పట్టిందంటే ఇప్పుడు ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోవడం మానేశారు. వాస్తవానికి జిల్లావాసులు సరైన తుఫాన్ చూచి ఎన్నో ఏళ్లు గడచిపోయాయి.
రైతుల్లో నిరాశ
తుఫాన్ వస్తుందంటే ముందుగా సంతోషించేది జిల్లా రైతులే. వానలు పంటలకు జీవనాధారం కనుక వర్షాలు వస్తే తమ కష్టాలు తీరుతాయని భావిస్తారు. జిల్లాలో గడచిన నాలుగేళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. వ్యవసాయాన్ని జీవనంగా ఎంచుకున్న రైతాంగం పంటలు లేక జీవనం గడిచే దారి కనిపించక పట్టణాలకు వలసలు వెళ్లి రోజులు గడుపుకోవాల్సిన పరిస్థితి. సొంత ఊర్లో భూస్వామిగా ఉన్న రైతు పక్క ఊరిలో కూలీగా బతుకీడ్చాల్సిన దుస్థితి. వ్యవసాయాధారిత జిల్లాలో రైతులు వలసలు వెళ్లడం దురదృష్టమనే చెప్పాలి. ఎప్పటికప్పుడు కొద్దిపాటి వర్షాలు వచ్చి కళ్లాపి చల్లుతున్నాయే తప్ప తడారిపోయిన భూములను తడిపిన దాఖలాలు లేవని రైతులు వాపోతున్నారు. వర్షాధార పంటలు తప్ప జల వనరుల వినియోగం ఎరుగని మెట్ట ప్రాంతాల పరిస్థితి మరీ దారుణంగా మారుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ కొద్దిపాటి వర్షాలు వచ్చినా సాగుకు సిద్ధం అయ్యేలోపు రెండో తడికి అవకాశం లేకుండా పోతోందని వాపోతున్నారు. ఈ ఏడాది జిల్లాలో 109 మిమీ సరాసరి వర్షపాతం నమోదవగా, మెట్ట ప్రాంతాల్లో మైనస్ 45 మిల్లీమీటర్లుగా నమోదైంది. ఈ పరిస్థితుల్లో రైతాంగం ఏ నమ్మకంతో వ్యవసాయం చేపట్టాలో అర్థంకాక ఆకాశం వైపు చూడ్డం మానేసి పలుగు, పారలను పక్కన పడేశారు. బతుకుదెరువు కోసం, నమ్ముకున్న వారికి పట్టెడన్నం పెట్టడం కోసం ఇతర ప్రాంతాలకు దినసరి కూలీలుగా వలసలు వెళ్తున్నారు. రైతు రాజైన రోజే స్వాతంత్య్రానికి నిజమైన నిర్వచనం అని వేదికలపై ప్రసంగాలు దంచేస్తున్న నాయకులు అన్నం పెట్టే రైతుల సాగునీటి కష్టాలను తొలగించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించిన దాఖలాలు లేవు. ఆదాయం రాదని తెలిసినా ఏటికేడు కష్టాల కమతం చేస్తూ దేశానికి అన్నం పెట్టడంలోనే ఆనందం వెతుక్కుంటున్నాడు రైతు. అమాయకులైన రైతులతో రాజకీయ నాయకులే కాదు చివరకు ప్రకృతీ పరాచికాలాడ్డం వైచిత్రిగాక మరేంటి!

టీడీపీ పాలనలోనే బీసీల అభ్యున్నతి

0
0

గూడూరు, డిసెంబర్ 17: తెలుగుదేశం పార్టీ పాలనలోనే బీసీలకు అభ్యున్నతికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు, గూడూరు నియోజకవర్గం నుంచి రూ. 24 కోట్లతో అభివృద్ధి చేసినట్లు ఎమ్మెల్సీ, జిల్లా టీడీపీ అధ్యక్షులు బీద రవిచంద్ర స్పష్టం చేశారు. సోమవారం పట్టణంలోని వనజాకృష్ణ కల్యాణ మండపంలో నియోజకవర్గ జయహో బీసీ సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. గూడూరు నియోజకవర్గంలో ఐదేళ్లలో 1413 మంది లబ్ధిదారులకు రూ. 5.72 కోట్ల సబ్సిడీ మంజూరు చేసినట్లు తెలిపారు. అలాగే 11 బీసీ ఫెడరేషన్ల ద్వారా 412 మంది లబ్ధిదారులకు రూ. 18.9 కోట్ల రూపాయలు సబ్సిడీ రూపంలో అందచేసిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. అత్యంత వెనుకబడిన కులాలు ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా 60 మంది లబ్ధిదారులకు రూ. 18 లక్షల సబ్సిడీని మంజూరు చేశామన్నారు. ఆదరణ 2 పథకం ద్వారా నియోజకవర్గంలో ఇప్పటివరకు 3,529 మంది లబ్ధిదారులను మండల సెలక్షన్ కమిటీ ద్వారా గుర్తించి వారిలో 1839 మందికి రూ. 3.13 కోట్లు విలువ కలిగిన ఆధునిక పరికరాలను అందచేసిన ఘనత కూడా తమ పార్టీదేనన్నారు. ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గమే కాక జిల్లా రాష్టవ్య్రాప్తంగా బీసీలు మొదటి నుంచి టీడీపీకి అండగా ఉంటున్నారని అన్నారు. అన్న ఎన్టీఆర్ నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, అందులో భాగంగానే బీసీలకు కార్పొరేషన్ల ద్వారా కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశారని వివరించారు. ఎప్పుడూ కూడా టీడీపీ ప్రభుత్వం బీసీల ప్రభుత్వమని అందుకే టీడీపీకి బీసీలు అండగా ఉంటున్నారని ఆయన అన్నారు. గూడూరు మున్సిపల్ చైర్‌పర్సన్ పొణక దేవసేన మాట్లాడుతూ టీడీపీ హయాంలోనే బీసీలకు కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగిందని అందుకే బీసీలు టీడీపీని వెన్నంటి వున్నారని తెలిపారు. ఈనెల 30న రాజమండ్రిలో జరిగే జయహో బీసీ చలో రాజమహేంద్రవరం గోడపత్రికను నాయకులు ఆవిష్కరించారు. దీనికి ముందు జ్యోతిరావుపూలే, ఎన్టీ రామారావు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్, గూడూరు చైర్‌పర్సన్ పొణక దేవసేనలను బీసీ సంఘ నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీసీ జిల్లా అధ్యక్షులు పిఎల్ రావు, నాయకులు జగన్‌మోహన్‌రెడ్డి, చేవూరు విజయ్‌మోహన్‌రెడ్డి, శీలం కిరణ్‌కుమార్, దయాకర్ గౌడ్, వెంకటేశ్వర్లురాజు, పులిమి శ్రీనివాసులు, బొమ్మిరెడ్డి పద్మజ, పలువురు నాయకులు, బీసీ సోదరులు పాల్గొన్నారు.

నాటుసారా స్థావరాలపై దాడులు
వెంకటగిరి, డిసెంబర్ 17: క్రిస్‌మస్, సంక్రాంతి పండుగులకు జిల్లాలో నాటాసారా తయారుచేస్తున్నారన్న సమాచారం మేరకు ప్రత్యేక బృందాలతో దాడులు నిర్వహిస్తున్నట్లు నెల్లూరు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ రాధయ్య తెలిపారు. సోమవారం వెంకటగిరి ఎక్సైజ్ కార్యాలయానికి విచ్చేసిన ఆయన విలేఖర్లతో మాట్లాడారు. నవోదయం పథకం ద్వారా జిల్లాను సారారహిత జిల్లాగా ప్రకటించామని తెలిపారు. కావలి ఎక్సైజ్ పరిధిలో బోగోలు, కప్పరాళ్ళతిప్ప, వెంకటగిరి ఎక్సైజ్ పరిధిలో అరవపాళెం, అటవీప్రాంతాల్లో పండుగల సమయంలో నాటాసారా తయారుచేస్తున్నట్లు సమాచారం రావడంతో ప్రత్యేక బృందాలతో దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ రెండు ప్రాంతాల్లో కూడా పూర్తిగా నాటుసారా లేకుండా చేస్తామన్నారు. ఇటీవల కాలంలో 160 లీటర్ల నాటుసారా, 1080 లీటర్ల నాటుసారా ఊటను స్వాధీనం చేసుకొని ముగ్గురుని అరెస్టు చేసినట్లు తెలిపారు. గత జనవరి నుంచి 1000 కేసులు నమోదు చేసి 1000 మందిని అరెస్టు చేశామన్నారు. 2600 లీటర్ల లిక్కర్, 70 లీటర్ల బీర్లు స్వాధీనం చేసుకొని 50 బ్రాందీ దుకాణాలను సీజ్ చేసినట్లు తెలిపారు. సమయపాలన పాటించని బ్రాందీ షాపులపై కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. జిల్లాలోని అన్ని బ్రాందీషాపుల్లో ఎంఆర్‌పి రేట్లకే విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఎక్కడైన ఎంఆర్‌పి రేట్లకు విక్రయించేకపోతే ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తే ఆ షాపులపై దాడులు నిర్వహించి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ వెంకటరామిరెడ్డి, సిఐ ద్వారకానాధ్, ఎస్‌ఐ శ్రీనివాసులు పాల్గొన్నారు.

న్యాయం కోసం టీవీ నటి వౌనపోరాటం
* భర్త ఇంటి ముందు నిరసన
ఆత్మకూరు, డిసెంబర్ 17 : పెళ్లి చేసుకుని రెండేళ్లపాటు కాపురం చేసి చివరకు వదిలించుకునేందుకు చూస్తున్నాడని ఓ క్యారెక్టర్ ఆర్టిస్టు భర్త ఇంటి ముందు బాధితురాలు సోమవారం వౌనపోరాటానికి దిగింది. ఏళ్ల తరబడి పోలీసుస్టేషన్, కోర్టుల చుట్టూ తిరిగినా తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కడప జిల్లాలోని యర్రముక్కాయపల్లి గ్రామానికి చెందిన హేమ హైదరాబాదులో సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. మనసు మమత, స్వాతిచినుకులు, మహాలక్ష్మి వంటి టీవీ సీరియళ్లలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది. వివాహమై భర్తతో తెగతెంపులు చేసుకుని తన ఇద్దరు పిల్లలతో హైదరాబాదులోనే ఉంటూ వేషాల కోసం ప్రయత్నిస్తోంది. ఈక్రమంలో ఆమెకు అడపాదడపా సీరియళ్లలో జూనియర్ ఆర్టిస్టుగా వేషాలు దక్కించుకుంటున్న నవతేజ అనే యువకుడితో పరిచయం అయ్యింది. ఇతడు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని క్రిస్టియన్‌పేటకు చెందినవాడు. నవతేజ 2012 నుండి తన చుట్టూ తిరిగి వేధించేవాడని బాధితురాలు తెలిపింది. తనకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారని తన జోలికి రావద్దని ప్రాధేయపడ్డానని పేర్కొంది. ఈనేపథ్యంలో ఇద్దరు ఒక అవగాహనకు వచ్చి 2014 వరకు సహజీవనం చేసి 2017లో వివాహం చేసుకున్నట్లు వెల్లడించింది. హైదరాబాదులోనే కలసి కాపురం ఉంటూ వేషాల కోసం ప్రయత్నించినట్లు పేర్కొంది. రెండేళ్లపాటు సజావుగా సాగిన తమ కాపురం కొద్దిపాటి కలతలు ఏర్పడడంతో నవతేజను కుటుంబ సభ్యులు హైదారాబాదు వచ్చి ఆత్మకూరుకు తీసుకెళ్లిపోయారని వివరించింది. అనంతరం కొద్దిరోజులు భర్త కోసం ఎదురుచూసిన హేమ ఓరోజు ఆత్మకూరుకు వచ్చి భర్త కుటుంబ సభ్యులతో మాట్లాడి తన భర్తను తనతో పంపించాల్సిందిగా వేడుకుంది. తన గోడు వినని భర్త తరపువారు తనపై దాడి చేశారని తనకు జరిగిన అన్యాయంపై ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పింది. సమస్య హైదరాబాదులో జరిగినందున అక్కడే ఫిర్యాదు చేయమని స్థానిక పోలీసులు సూచించడంతో హైదరాబాదుకు వెళ్లి అక్కడ ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. దీంతో విషయం కోర్టుదాకా వెళ్లినట్లు వివరించింది. ఈ క్రమంలో ఓ రోజు హైదరాబాదులో ఉన్న తన వద్దకు వచ్చిన తన భర్త నవతేజ తనతో కలసి ఉంటున్న క్రమంలో మళ్లీ తన మామ వచ్చి 15 రోజుల్లో పంపిస్తానని హామీ ఇచ్చి భర్తను తీసుకెళ్లాడని తెలిపింది. భర్త ఎంతకీ తన వద్దకు రాకపోవడంతో వేచిచూసిన తాను ఆత్మకూరుకు వచ్చినట్లు పాత్రికేయుల ఎదుట వాపోయింది. పోలీసులు తనకు న్యాయం చేసి తన భర్తను తన వద్దకు పంపించాలని వేడుకుంది. హేమ ఇంటి ముందు దీక్ష చేపట్టడంతో భర్త, అతని కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని హేమకు నచ్చచెప్పారు. నవతేజ సమాచారం తెలుసుకుని విచారించి న్యాయం చేస్తామని చెప్పి హేమను హైదరాబాదుకు పంపించారు.

కరవు నివారణకు సీతారాంసాగర్ నిర్మాణమే శరణ్యం
ఉదయగిరి, డిసెంబర్ 17: ఉదయగిరి ప్రాంతంలో నెలకొన్న కరవు పూర్తిగా తొలగిపోవాలంటే ఈ ప్రాంతంలోని సీతారాంసాగర్ నిర్మాణం ద్వారా సాధ్యమవుతుందని సీపీఎం డివిజన్ కార్యదర్శి కాకు వెంకటయ్య అన్నారు. ఆయన సోమవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో జరిగిన రైతుసంఘం డివిజన్ కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కరవు మండలాల్లో వ్యవసాయ రుణాలు పూర్తిగా రద్దుచేసి తిరిగి రుణాలు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈప్రాంతంలో కరవు దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా వుందని, యుద్ధప్రాతిపదికన నీటి సమస్య తీర్చాలని కోరారు. పశువులకు మేత కొరతతో పలువురు పశుపోషకులు పశువులను అమ్ముకుంటున్నారన్నారు. ప్రభుత్వం ఉచితంగా రైతులకు పశుగ్రాసం అందించాలన్నారు. ప్రజలకు విద్య, వైద్యసేవలు అందుబాటులో వుండేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలన్నారు. కరవు మండలాల్లో 200 వరకు ఉపాధి పనిదినాలు కల్పించి గిట్టుబాటు కూలీ 500 రూపాయలు చెల్లించాలన్నారు. గత కొనే్నళ్లుగా రావల్సిన ఇన్‌పుట్ సబ్సిడీ వెంటనే అందించాలన్నారు. అటవీ ప్రాంతాలకు వెళ్లే మూగజీవాలకు నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. ఈకార్యక్రమంలో రైతు సంఘం నాయకులు నాగూర్‌సాహెబ్, వెంకటేశ్వర్లు, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

మాటల్లో అభివృద్ధి.. చేతల్లో అవినీతి
చంద్రబాబు తీరుపై ఎమ్మెల్యే కాకాణి ఎద్దేవా
పొదలకూరు, డిసెంబర్ 17: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాల్లో అభివృద్ధిని జపిస్తూ చేతల్లో మాత్రం అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని సర్వేపల్లి శాసనసభ్యుడు, వైకాపా జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్థన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. స్థానిక తహశీల్దారు కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ సెల్‌లో ఆయన పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రైతులకు సాగునీరు, గిట్టుబాటు ధర కల్పించక రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. అవినీతి సంపాదన కోసం రైతులను లక్ష్యంగా చేసుకున్న సంఘటనలు సర్వేపల్లి నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. మంత్రి సోమిరెడ్డిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రైతుల పేరుతో దోచుకున్నారని ఆరోపించారు. అది చాలక సోమిరెడ్డి వ్యక్తిగత సహాయకులు రాపూరు మండలం పంగిలిలో అటవీ భూములు ఆక్రమించి దొంగ పట్టాలు సృష్టించారని అన్నారు. పొదలకూరు పంచాయతీలో రూ. 3 కోట్ల రూపాయల విలువైన గ్రామకంఠాన్ని నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించారని విమర్శించారు. ఇలాంటి వ్యక్తులు అధికారంలో కొనసాగితే ఈ ప్రాంతవాసుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ఈ రెండు ఉదంతాలపై విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. భూముల గోల్‌మాల్‌పై ప్రభుత్వానికి విచారణ జరిపించే ధైర్యం ఉందా అని ఆయన ప్రశ్నించారు. పంచాయతీ కార్యదర్శి తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ స్వయంగా ఫిర్యాదు చేసినా పోలీసులు మీనమేషాలు లెక్కించడం శోచనీయమన్నారు. టీడీపీ నాయకులు అధికార మత్తులో అవినీతికి పాల్పడుతూ నియోజకవర్గాన్ని కలుషితం చేశారన్నారు. అభివృద్ధికి తాను సహకరిస్తానే తప్ప దాని పేరుతో అవినీతికి పాల్పడితే చూస్తూ చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. పొదలకూరు మండలానికి దార్లు కూడా తెలియని వ్యక్తులు చేసే ప్రకనటలను పట్టించుకోనని కొట్టిపారేశారు. ఈ ప్రాంత ప్రజలతో తన కుటుంబానికి విడదీయలేని సంబంధ భాంధ్యవ్యాలు ఉన్నాయని తెలిపారు. చేతనైనంత అభివృద్ధి చేశామే తప్ప ఎప్పుడూ అవినీతి, అవకతవకలకు పాల్పడలేదన్నారు. గ్రీవెన్స్ డేలు మాత్రం క్రమం తప్పక జరుగుతున్నా సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోకుండా పేరుకుపోతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కోనం బ్రహ్మయ్య, నాయకులు రమణారెడ్డి, మూలి సతీష్‌కుమార్‌రెడ్డి, వాకాడు శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విద్యాశాఖ అధికారి దిష్టిబొమ్మ దగ్ధం
నాయుడుపేట, డిసెంబర్17: మండల పరిధిలోని మేనకూరు గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉధ్యాయురాలు గడచిన మూడేళ్లుగా విద్యార్థులతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారని ఆరోపిస్తూ ఏబీవీపీ విద్యార్థులు సోమవారం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. సాక్ష్యాధారాలతో సహా జిల్లా డిప్యూటీ డీఈవోకి ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ డివిజన్ కార్యదర్శి తరుణ్ మాట్లాడుతూ పాఠశాలలోని విద్యార్థులతో ప్రధానోపాధ్యాయులు ఊడిగం చేయిస్తున్నారన్నారు. ఉదయానే్న పాఠశాల ఆవరణాన్ని శుభ్రం చేయిస్తున్నారని, పాఠశాల బాత్రూమ్‌లను, మధ్యాహ్న భోజన పథకంలోని వంటపాత్రలను కడిగిస్తున్నారన్నారు. పల్లెటూరు విద్యార్థులు కావడంతో ఉపాధ్యాయుల సొంత పనులు కూడా చేయిస్తున్నారని ఆరోపించారు. వీటన్నింటిపై ఏబీవీపీ సమగ్ర దర్యాప్తు నివేదికను డిప్యూటీ డీఈవోకి అందచేసినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదన్నారు. పాఠశాల పనులను నిర్వహించడానికి వెలుగు మహిళా సభ్యులను నియమించాల్సి ఉందని ఆ నిధులన్నింటినీ దొడ్డిదారిన స్వాహా చేస్తూ విద్యార్థులను వాడుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ప్రధానోపాధ్యాయులపై తగు చర్యలు చేపట్టకుంటే జిల్లా ఏబీవీ ఆధ్వర్యంలో ఆందోళనలు ముమ్మరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హరికృష్ణ, కార్యకర్తలు నరేష్, ప్రశాంత్, సురేష్, ప్రసాద్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

ఓట్ల తొలగింపుపై ఎమ్మెల్యే ఆగ్రహం
వెంకటగిరి, డిసెంబర్ 17: కొత్తగా తయారుచేస్తున్న ఓటర్ల నమోదు జాబితాలో పట్టణంలో ఎక్కువగా ఓట్లు గల్లంతు కావడంపై స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సోమవారం తహశీల్దార్ రాజ్‌కుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది టీడీపీ నాయకులు జాబితాల్లో తమ ఓట్లు లేవని, తొలగించారని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యే తహశీల్దార్ కార్యాలయానికి చేరుకొని ఓటర్ల తొలగింపు పత్రం పెట్టకుండానే ఓట్లు ఎలా తొలగిస్తారని తహశీల్దార్‌ను ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఓట్లు పట్టణంలోని చాలావరకు తొలగించారని అవి ఎందుకు తొలగించారో చెప్పాలని అన్నారు. కొత్తగా తొలగించిన జాబితా, చేర్పుల జాబితా తనకు వెంటనే ఇవ్వాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. నియోజకవర్గ ఎన్నికల అధికారితో తహశీల్దార్ మాట్లాడి జాబితాను వెంటనే ఎమ్మెల్యేకు అందజేయాలని ఆదేశించారు. ఓటర్ల ప్రమేయం లేకుండా ఓట్లు తొలగించినట్లు తెలిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే అధికారులను హెచ్చరించారు.
అన్న క్యాంటీన్ పనులు పరిశీలన
తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా చేపట్టిన అన్న క్యాంటిన్ పనులను ఎమ్మెల్యే కురుగొండ్ల పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. అన్న క్యాంటిన్‌లో ప్రతిరోజు 300 మందికి టిఫిన్, భోజనం సరఫరా చేస్తామన్నారు. అవసరమైతే 500 మందికి పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట జిల్లా తెలుగుయువత ఉపాధ్యక్షులు కెవికె ప్రసాద్‌నాయుడు, జానపాటి బాలకృష్ణ, చెంచయ్య, చెలికం మధురెడ్డి, కరీముల్లా తదితరులు ఉన్నారు.

ఎర్రచందనం రక్షణకు కఠిన చట్టాలు అమలు
వెంకటగిరి, డిసెంబర్ 17: చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో ఉన్న అరుదైన సంపద ఎర్రచందనంను రక్షించేందుకు ప్రభుత్వం కఠిన చట్టాలను అమలు చేస్తోందని టాస్క్ఫోర్స్ అధికారులు తెలిపారు. టాస్క్ఫోర్స్ ఐజి మాగంటి కాంతారావు ఆదేశాల మేరకు సోమవారం మండలంలోని సిసి కండ్రిగలో ఎర్రచందనం రక్షణపై అవగాహన సదస్సు ఏర్పాటుచేసి లఘు చిత్రాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా టాస్క్ఫోర్స్ అధికారులు, స్థానిక అటవీశాఖ సిబ్బంది మాట్లాడుతూ ఎర్రచందనం కేసులతో సంబంధం ఉన్న వారికి 5 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు జైలుశిక్ష పడుతుందని అన్నారు. ఎర్రచందనం ఉన్న గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం వల్ల ప్రజల్లో చైతన్యం కలిగి మన రాష్ట్రంలో ప్రజలు ఎవరు ఈ అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనటం చాలావరకు తగ్గిందని అన్నారు. ఇది సంతోషించదగ్గ విషయమన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా తెలిపిన వారికి గతంలో 10వేల రూపాయలు ఇచ్చేవారని ఇప్పుడు ఎర్రచందనం దుంగలు, దొంగల సమాచారం తెలిపినవారి పేర్లు గోప్యంగా ఉంచడంతో పాటు లక్ష రూపాయలు బహుమతి ఇస్తామని ఐజి మాగంటి కాంతారావు ప్రకటించారని తెలిపారు.

స్టేట్ ర్యాంకింగ్ చెస్ విజేతలు

0
0

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన స్టేట్ ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. బాలబాలికల అండర్-15, 13, 11, 9, 7 విభాగంలో పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో మొత్తం 146 మంది చెస్ క్రీడాకారులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎన్‌వీడీ ప్రొడక్షన్ మీడియా లిమిటెడ్ సంస్థ చైర్మన్ టీ.నిర్మల్ దేవి విచ్చేసి గెలుపొందిన వారికి ట్రోఫీలు అందజేశారు. లాల్‌హదూర్‌స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ చెస్ సంఘం ప్రధాన కార్యదర్శి కే.శివప్రసాద్ పాల్గొన్నారు.
టెన్నిస్ టోర్నీ చాంప్ సూర్యపవన్
హైదరాబాద్, డిసెంబర్ 17: కొండాపుర్‌లోని ఎన్‌వీకే టెన్నిస్ అకాడమీలో నిర్వహించిన ద్వితీయ బీ.వెంకట సుబ్బయ్య స్మారక టెన్నిస్ టోర్నమెంట్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సూర్యపవన్ కైవసం చేసుకున్నాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో సూర్యపవన్ 8-7 స్కోరు తేడాతో ప్రత్యర్థి విసాఖ్‌పై గెలుపొందాడు. పురుషుల డబుల్స్ ఫైనల్లో సూర్యపవన్, సూర్యసిరిల జోడి 8-4 తేడాతో సమరఖాన్, విసాఖ్‌ల జోడీపై విజయం సాధించారు.

అష్టలక్ష్మీ దేవాలయంలో ఉత్తర ద్వార గోపుర కలశ ప్రతిష్ఠాపన

0
0

బాలాపూర్, డిసెంబర్ 17: అర్కేపురం డివిజన్ వాసవి కాలనీ అష్టలక్ష్మీ దేవాలయంలో నూతనంగా నిర్మించిన ఉత్తర ద్వార గోపుర కలశ ప్రతిష్ఠాపన శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి కుంభ ప్రోక్షణ నిర్వహించి ఉత్తర ద్వార కలశానికి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. సోమవారం ఉదయం యాగశాలలో హవనములు ప్రారంభించి మహాపూర్ణహుతి, కుంభోద్వాసన, చిన్న జీయర్ స్వామిచే యంత్ర కలశ ప్రతిష్ఠ, కుంభ సంప్రోక్షణ, గోపురమునకు హారతి అనంతరం స్వామివారు భక్తులకు ఆనుగ్రహ భాషణం చేసి, ధనుర్మాస విశిష్టతపై సంక్షిప్తంగా ప్రవచనం చేశారు. ఆలయ కమిటీచైర్మన్ గౌరిశెట్టి చంద్రశేఖర్ గుప్త, ప్రధాన కార్యదర్శి నాగమల్ల శ్రవణ్‌కుమార్, కోశాధికారి మురుగేషన్, మాజీ చైర్మన్ రమేష్, సుధాకర్, కమిటీ సభ్యులు దామోదర్, వనం యాదయ్య, జగన్, అంజయ్య, బారాజ్, ప్రభాకర్‌రావు, ఉమాపతి రావు పాల్గొన్నారు.
చిన్న జీయర్‌స్వామికి తృటిలో తప్పిన ప్రమాదం
ఉత్తర ద్వార గోపుర కలశ ప్రతిష్ఠాపన చేసే క్రమంలో కర్రలతో నిర్మించిన మెట్ల ద్వారా గోపురం పైకి చిన్న జీయర్‌స్వామి వెళుతున్న క్రమంలో కర్రలు విరగడంతో వెంటనే అప్రమత్తం అయిన జీయర్ స్వామి గోపురాన్ని పట్టుకొని నిలబడ్డారు. స్వామివారికి తృటిలో ప్రమాదం తప్పింది. స్వామివారికి స్వల్పగాయాలు అవడంతో వెంటనే ఆలయ కమిటీ నిర్వాహకులు వైద్యులను పిలిపించి వైద్యం చేయించారు.
జిల్లాకు ఎంపికైన జూనియర్ సెక్రటరీలు
వికారాబాద్, డిసెంబర్ 17: జిల్లాకు జూనియర్ కార్యదర్శులుగా ఎంపికైన అభ్యర్థులు ఈనెల 19, 20 తేదీలలో ఉదయం 11 గంటలకు సర్ట్ఫికెట్ల ధృవీకరణ కోసం హాజరు కావాలని జిల్లా కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. విద్యార్హతలు, వయస్సు, కుల, ఆదాయ, స్థానిక ఒరిజినల్ సర్ట్ఫికెట్‌లతో పాటు స్థానిక అడ్రస్ ప్రూఫ్, నాలుగు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో కలెక్టర్ కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు. రెండు రోజులు మాత్రమే సర్ట్ఫికెట్‌లు ధృవపర్చబడతాయని స్పష్టం చేశారు. వికారాబాద్ మండలం బుర్గుపల్లి గ్రామ సమీపంలోని కలెక్టర్ కార్యాలయానికి సకాలంలో అభ్యర్థులు చేరుకోవాలని కోరారు. ఎంపికైన అభ్యర్థుల వివరాల జాబితాను విడుదల చేశారు.
ప్రపంచ ధ్యాన మహాసభలకు మహాపిరమిడ్ ముస్తాబు
ఆమనగల్లు, డిసెంబర్ 17: కడ్తాల మండలం అన్మాస్‌పల్లి గ్రామ సమీపంలో ప్రపంచ ధ్యాన మహాసభలకు కైలాస్‌పురి మహేశ్వర మహాపిరమిడ్ మస్తాబు అవుతుంది. పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోప్రతి ఏటా ఘనంగా నిర్వహించే ధ్యాన సంబురాలకు కైలాసపురి పిరమిడ్‌ను విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. ధ్యాన మహోత్సవాలలో భాగంగా ఈనెల 21నుండి 31 వరకు 11 రోజులపాటు ప్రపంచ ధ్యానగురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ ఆధ్వర్యంలో ధ్యాన మహాచక్రం-9 నిర్వహిస్తున్నట్లు పిరమిడ్ ట్రస్ట్ సభ్యులు సాంబశివరావు మాధవి, లక్ష్మి, శిరీష, రాజేశ్, చంద్రశేఖర్, రాంబాబు, నందప్రసాద్, శివప్రసాద్, రవీందర్, రవిశాస్ర్తి తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహేశ్వర మహాపిరమిడ్‌లో ఆడంబరంగా కొనసాగే ధ్యాన మహోత్సవాలకు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ధ్యానులు ధ్యాన గురువులు, ప్రజలు సందర్శకులు ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున హాజరవుతారు. 11 రోజుల పాటు జరిగే ధ్యాన మహాచక్రంలో సాముహిక ధ్యానం ఆధ్యాత్మిక ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని నిర్వాహుకులు తెలిపారు. 31న ఉదయం 8 గంటలకు నూతన సంవత్సర సందేశం ముగింపుకార్యక్రమాలను చేపడుతున్నట్లు ప్రేమయ్య తెలిపారు. ధ్యాన మహాచక్రంలో పాల్గొను ధ్యానులు సందర్శకులందరికీ పిరమిడ్ ప్రాంగణంలో ఉచితంగా అన్నదానం ప్రపంచాన్ని ధ్యానమయం, శాఖహారమయం చేయడానికి సాగిస్తున్న ధ్యాన మహాచక్రంలో ప్రజలు, ధ్యానులు పాల్గొనాలని వారు కోరారు.

డెంగీ మరణాలు పునరావృతం కారాదు

0
0

బాలాపూర్, డిసెంబర్ 17: జల్‌పల్లి మున్సిపాలిటీలో శానిటేషన్ సమస్య తీవ్రంగా ఉందని, దానిపై అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి తగిన చర్యలు తీసుకొవాలని మహేశ్వరం ఎమ్మెల్యే పీ.సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సబితా రెడ్డి, సరూర్‌నగర్ ఎంపీపీ తీగల విక్రం రెడ్డి, కమిషనర్ సాబేర్ అలీతో కలిసి జల్‌పల్లి మున్సిపాలిటి ఉస్మాన్‌నగర్‌లో శానిటేషన్‌పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ప్రత్యేక డ్రైవ్‌కు ముందు జల్‌పల్లిలోని అంబేద్కర్ విగ్రహానికి సబితారెడ్డి పూలమాల వేసి నివాళి ఆర్పించారు. అనంతరం జల్‌పల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో సబితారెడ్డి మొక్కను నాటి, శానిటేషన్ సిబ్బంది కోసం ఏర్పాటుచేసి ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి ప్రసంగించారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో ఉన్న అని ప్రాంతాల కన్నా.. జల్‌పల్లి మున్సిపాలిటీలో శానిటేషన్ సమస్య తీవ్రంగా ఉందని అన్నారు. గత నాలుగున్నరేళ్లలో దాదాపు 10 మంది డెంగీతో మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఎక్కడ చూసిన రోడ్లపై మురుగు నీరు పారుతుందని, దీంతో దోమలు విపరీతంగా వృద్ధిచెంది, అనేకమంది రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. మరోసారి డెంగీ మరణాలు పునరావృతం కాకూడదని అధికారులను అదేశించారు. డ్రైనేజీ కోసం డీపీఆర్ సర్వే చేయించినట్లు కమిషనర్ తెలిపారని, దానికి కావాల్సిన ప్రత్యేక నిధులను తీసుకురావటానికి తగిన కృషి చేస్తానని తెలిపారు. ఇక్కడ నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తానని హమీ ఇచ్చారు. కార్యక్రమంలో జల్‌పల్లి మున్సిపాలిటి అధ్యక్షుడు సూరెడ్డి కృష్ణారెడ్డి, బాలాపూర్ అధ్యక్షుడు సయ్యద్ యూసుఫ్‌పటేల్, ఎంపీటీసీలు అప్జల్, జనార్ధన్, యాస్మిన్ బేగం, కాలేద్, రావుఫ్, పౌజీయా బేగం, యాయా, మహ్మద్ పాల్గొన్నారు.
ప్రజా తీర్పును శిరసావహిస్తా
ఆమనగల్లు, డిసెంబర్ 17: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తానని, కార్యకర్తలు అధైర్యపడవద్దని బీజేపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ.ఆచారి అన్నారు. సోమవారం ఆమనగల్లుకు వచ్చిన ఆచారిని కలిసేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. గెలుపు ఓటములు సహజమేనని కల్వకుర్తి ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తానని అన్నారు. ఆచారిని చూసిన కార్యకర్తలు, మహిళలు భావోద్వేగానికి లోనయ్యారు. వారిని ఓదార్చి మనోధైర్యం ఇచ్చారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో దృష్టి పెట్టాలని ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

Viewing all 69482 articles
Browse latest View live