Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

ఉల్లం‘ఘను’లపై కొరడా

$
0
0

హైదరాబాద్: మహానగరంలో స్వచ్ఛత, పరిశుభ్రతను పెంపొందించటంలో భాగంగా నాలాలు, చెరువుల్లో ప్లాస్టిక్, చెత్త వ్యర్థాలు వేయరాదన్న నిబంధనను ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పవని జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ మరోసారి ఆదేశాలు జారీ చేశారు. ఈ నిబంధనను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం ఆస్తిపన్ను వసూళ్లు, స్వచ్ఛ సర్వేక్షణ్ వంటి అంశాలపై జోనల్ కమిషనర్లు, ఇంజనీర్లతో ఆయన ప్రత్యేకంగా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నగరంలో ప్రస్తుతమున్న పబ్లిక్ టాయిలెట్లను మరింత పరిశుభ్రంగా నిర్వహించటంతో పాటు గతంలో గుర్తించిన బహిరంగ మూత్ర విసర్జన ప్రాంతాలు, చెరువుల వద్ద ప్రత్యేకంగా తాత్కాలిక టాయిలెట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నగరంలో బహిరంగ మూత్ర విసర్జన చేయటం, భవన నిర్మాణ వ్యర్థాలను వేయటం, నాలాలు, చెరువుల్లో ప్లాస్టిక్‌ను, చెత్తను వేయటం, రోడ్లపై చెత్తను వేసే వారిపై మరింత కఠినంగా వ్యవహారిస్తూ, జరిమానాలు విధించాలని ఆదేశించారు. ఇందుకోసం విజిలెన్స్ అధికారులతో ప్రత్యేకంగా లేక్ ప్రొటెక్షన్ టీంలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించేందుకు వీలుగా ఇప్పటికే 2500 స్వచ్ఛ ఆటోలను అందుబాటులో ఉంచామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని, రోడ్లపై, నాలాల్లో, చెరువుల్లో చెత్తను వేయరాదని సూచించారు. నేటికీ కొందరు నగరపౌరుల బాధ్యతారహిత్యం కారణంగా నగర సుందీరకరణకు భంగం కలుగుతోందని వాపోయారు. వచ్చే నెలలో నగరంలో నిర్వహించనున్న స్వచ్ఛ సర్వేక్షణ్ 2019కి సంబంధించి సర్వేక్షణ్‌కు స్వచ్ఛ్భారత్ మిషన్ నిర్దారించిన ఏడు ప్రశ్నల పట్ల నగరవాసుల్లో పూర్తి స్తాయిలో అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు గాను నగరంలోని మూడు వేల పై చిలుకు ఉన్న కాలనీ సంక్షేమ సంఘాల, బస్తీ కమిటీలు, స్వయం సహాయక బృందాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, స్వచ్ఛ సర్వేక్షణ్‌పై చైతన్యపర్చనున్నట్లు తెలిపారు.
స్వచ్ఛ ఆటోలకు జీపీఎస్
నగరంలోని ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించి, త్వరితగతిన చెత్తను నగరం నుంచి తరలించేందుకు ఇప్పటికే అందుబాటులో ఉన్న 2500 స్వచ్ఛ ఆటోల రాకపోకల్లో పారదర్శకతను పెంపొందించేందుకు జీపీఎస్ విధానాన్ని అనుసంధానం చేయనున్నట్లు కమిషనర్ దాన కిషోర్ వెల్లడించారు. ఇప్పటికే వివిధ దశల్లో ఉన్న ఈ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. నగరంలో వంద కిలోలకు పైగా వ్యర్థాలను ఉత్పత్తి చేసే హోటళ్లన్నింటిలో కంపోస్టు యూనిట్లు ఏర్పాటు చేయాలన్న లక్ష్యాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందుకు గాను జొనల్ కమిషనర్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆదేశించారు. దీనికి తోడు ప్రతి వ్యాపార సంస్థ, దుకాణాల ముందు తప్పకుండా డస్ట్‌బిన్లను, మెయిన్‌రోడ్లకిరువైపులా కూడా వీటిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

జలమండలి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు

హైదరాబాద్, డిసెంబర్ 17: జంటనగరాల దాహర్తిని తీర్చే జలమండలి ఆధ్వర్యంలో సోమవారం ఖైరతాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్‌లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా పలు వేషధారణలు ఆహూతుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. యేసు క్రీస్తు జననాన్ని వివరిస్తూ ప్రదర్శితమైన నాటక, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో జలమండలి ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఎం.సత్యనారాయణ, సెకండరీ ట్రాన్స్‌మిషన్ డైరెక్టర్ డా.పీఎస్ సూర్యనారాయణ, ఫైనాన్స్ డైరెక్టర్ వాసుదేవ నాయుడు, రెవెన్యూ డైరెక్టర్ బీ. విజయ్‌కుమార్ రెడ్డి, ఆపరేషన్స్ డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, పి.రవి, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ హైదరాబాద్ సెంటర్ చైర్మన్ ఆర్. రామేశ్వరరావు, జలమండలి ఉద్యోగులు పాల్గొన్నారు.


పత్తి రైతుకు కలిసిరాని ఖరీఫ్

$
0
0

షాద్‌నగర్ రూరల్, డిసెంబర్ 17: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ అన్నదాతలకు ఏమాత్రం కలిసి రాలేదని చెప్పవచ్చు. వర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో పంటలు ఆశించిన స్థాయిలో ఉండటం.. దిగుబడి రాకపోవడం..వంటి పరిస్థితుల నేపథ్యంలో సాగుకోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. 2018 ఖరీఫ్ సీజన్‌లో పత్తి, మొక్కజొన్న, కంది, జొన్న వంటి పంటలు సాగుచేసినప్పటికి వర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో అన్నదాతలు ఆశించిన స్థాయిలో పంటల దిగుబడి రాలేదని అంటున్నారు. పంటల సాగు విస్తీర్ణం తగ్గడమే కాకుండా దిగుబడి సైతం ఆశించిన స్థాయిలో రాకపోవడంతో పంటల సాగుకోసం చేసిన వేల రూపాయల అప్పులను ఎలా తీర్చాలని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు, నందిగామ, కేశంపేట, ఫరూఖ్‌నగర్, కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ మండలాల్లో పత్తి, మొక్కజొన్న, కంది, జొన్న పంటలను సాగుచేశారు. ఏ-గ్రేడ్ క్వింటాల్ పత్తికి రూ.5450, బి గ్రేడ్ క్వింటాల్ పత్తికి రూ.5150 చొప్పున కొనుగోలు చేసేందుకు సీసీఐ కొనుగోలు కేంద్రం ముందుకు వచ్చింది. ప్రభుత్వమే క్వింటాల్ పత్తికి ఐదు వేల రూపాయలకు పైగా ఇస్తుంటే ప్రైవేట్ వ్యాపారులు మాత్రం క్వింటాల్ పత్తికి ఆరువేల ఐదు వందల రూపాయలు చెల్లిస్తూ రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో పంటలు ఆశించిన స్థాయిలో లేకపోవడం.. దిగుబడి సైతం తగ్గిపోయిన నేపథ్యంలో ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయని రైతులు అంటున్నారు. ఖరీఫ్ సీజన్‌లో రైతుల నుంచి ప్రైవేట్ వ్యాపారస్తులు 68111 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేస్తే, సీసీఐ అధికారులు మాత్రం 4015.35 క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేసారు. ధర ఎక్కువగా ఉన్న ప్రైవేట్ వ్యాపారుల వైపే అన్నదాతలు మొగ్గు చూపిస్తున్నారు. షాద్‌నగర్ డివిజన్‌లో సీసీఐ అధికారులు తొమ్మిది జిన్నింగ్ మిల్లులు ఏర్పాటు చేసినప్పటికీ రైతులు విక్రయించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించడం లేదు. ప్రభుత్వం మద్దతు ధర పెంచి సాగు ఖర్చులను దూరం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
ధర పెరిగినా దిగుబడి లేదు
పత్తి పంటకు ధర పెరిగినప్పటికి దిగుబడి లేకపోవడంతో ఏమి చేయాలో తెలియడం లేదని నందిగామ మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన రైతు పాపిరెడ్డి పేర్కొన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో ప్రైవేట్‌గా అప్పులు తెచ్చి నాలుగున్నర ఎకరాల్లో పత్తిపంటను సాగుచేస్తే ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర చేతికి రాలేదని వివరించారు. పంట సాగుకు మాత్రం ఖర్చులు ఒక్కసారిగా పెరిగిపోయాయని, వాటిని ఎలా తీర్చాలో తెలియడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
కష్టం వృథాగా పోయింది
ఎంతో కష్టపడి పంటలను సాగుచేస్తే వర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో పంటలు చేతికి రాక కష్టం వృథాగా పోయిందని మామిడిపల్లి గ్రామ రైతు బొద్ద అశోక్ అన్నారు. వర్షాలు ఆశించిన స్థాయిలో వచ్చి పంటలు పుష్కలంగా పండుతాయని ఎన్నో ఆశలు పెట్టకున్నా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో సీజన్‌లో రెండున్నర ఎకరాల్లో పత్తిపంట సాగుచేస్తే గిట్టుబాటు రాలేదని, అప్పులపాలు కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించారు.

రజనీకి ఆత్మీయ సత్కారం

$
0
0

కాచిగూడ: బాపిరాజు మ్యూజిక్, కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి సోమవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి లయన్ విజయ్ కుమార్, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, రాఘవాచార్య పాల్గొని గాయనీ, గాయకులను అభినందించి సత్కరించారు. ప్రముఖ గాయనీ రజనీ వృతి రీత్యా ఆర్‌టివోలో సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగిగా సేవలందిస్తూ సంగీతంలో రాణించడం అభినందనీయమని అన్నారు. గాయనీ, గాయకులు సత్యనారాయణ, రాములు, స్వర్ణలతకు ఆత్మీయ సత్కారం చేశారు. గాయకుడు బాపిరాజు నిర్వహణలో గాయకులు అలపించిన సినీ గీతాలు అలరించాయి.
ఆధునిక రచయితల్లో ప్రసిద్ధుడు భాస్కరభట్ల
కాచిగూడ, డిసెంబర్ 17: తెలంగాణ తొలితరం ఆధునిక రచయితలలో ప్రసిద్ధుడు భాస్కరభట్ల కృష్ణారావు అగ్రజుడుగా ప్రసిద్ధి చెందాడని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. ప్రముఖ సాహితీవేత్త భాస్కరభట్ల కృష్ణారావు జయంతి సభ శ్రీత్యాగరాయ గానసభ, శారద లక్ష్మీ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు.
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వకుళాభరణం కృష్ణమోహనరావు పాల్గొని భాస్కర భట్ల చిత్రపటానికి నివాళి అర్పించారు. సమకాలిన సమాజంలో కుటుంబాల్లో జరిగే సంఘటనలు ఇతివృత్తాలను ఆయన రచనలో కొనసాగించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, గాయకుడు సుజాతమూర్తి పాల్గొన్నారు.
నటి భార్గవికి బాపు పురస్కారం
కాచిగూడ, డిసెంబర్ 17: బాపు జయంతి సందర్భంగా బాపు మనవరాలు నటి గాయత్రి భార్గవికి బాపు పురస్కార ప్రదానోత్సవం శిఖరం ఆర్ట్స్ థియేటర్స్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం గానసభలోని కళా వేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి యలవర్తి రాజేంద్రప్రసాద్, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, వై ఎస్ ఆర్ మూర్తి, సంస్థ అధ్యక్షుడు జి.కృష్ణ పాల్గొని భార్గవికి పురస్కారం ప్రదానం చేశారు. బాపు దర్శకత్వం వహించిన ‘మిస్టర్ పెళ్ళాం’ చిత్రాన్ని ప్రదర్శించారు.

మున్సిపల్ ఎన్నికల సమరానికి అధికారుల కసరత్తులు

$
0
0

తాండూరు, డిసెంబర్ 17: రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ పరిపాలన శాఖ ఉన్నతాధికార యంత్రాంగం ఆదేశాల మేరకు తాండూరు మున్సిపల్ అధికారులు ఎన్నికల సమరానికి ఏర్పాట్లు ప్రారంభించారు. మున్సిపాలిటీ పరిధిలో వార్డుల విభజన ప్రక్రియకు సంబంధించి మున్సిపల్ డైరెక్టర్ గత అక్టోబర్‌లో వెలువరించిన ఉత్తర్వుల ప్రకారం మున్సిపల్ వార్డుల విభజన ప్రక్రియలో అధికారులు, సిబ్బంది తల మునకలయ్యారు. శాసన సభ ఎన్నికల పర్వం ముగిసి ముగియగానే మున్సిపల్ ఎన్నికల నిర్వాహణ అంశం పై ఉన్నతాధికార యంత్రాంగం సూచన ప్రాయంగా ఆదేశాలు వెలువరించటం గమనార్హం. ప్రస్తుతం తాండూరు మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 31 వార్డులు ఉన్నాయి. పట్టణ శివార్లలో ఉన్న పలు గ్రామీణ ప్రాంతాలను, స్థానిక రాజీవ్ గృహకల్ప, ఇందిరమ్మ కాలనీ, ఎన్‌టీఆర్ నగర్, విజయనగర్ కాలనీలతో పాటు, సాయిపూర్, మల్‌రెడ్డిపల్లి, రసూల్‌పూర్ తదితర ప్రాంతాలను మున్సిపాలిటీలో విలీనం చేస్తుండటంతో ఆయా ప్రాంతాలను ప్రస్తుత మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో విలీనం చేసేందుకు అధికారులు కసరత్తులు ప్రారంభించారు. గత నాలుగైదు రోజులుగా స్థానిక మున్సిపల్ అధికార గణం ప్రస్తుతం ఉన్న 31 మున్సిపల్ వార్డులలోనే కొత్త ప్రదేశాలను విలీనం చేసేందుకు ప్రయత్నాలు చేపట్టారు. నూతనంగా మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చే యాలాల మండల పరిధిలో ఉన్న రాజీవ్ గృహ కల్ప, ఇందిరమ్మ కాలనీ, రసూల్ పూర్‌లతో పాటు, తాండూరు మండలం అంతారం గ్రామ పరిధిలో ఉన్న ఎన్‌టిఆర్ కాలనీ, విజయనగర్ కాలనీలను నూతన వార్డులుగా విభజించాలని ఆయా ప్రాంతాలకు చెందిన దాదాపు 5 నుంచి ఆరువేల మంది ప్రజలు సంబంధిత అధికారులను డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్ పరిపాలన ఉన్నతాధికార యంత్రాంగం మాత్రం తాండూరు మున్సిపాలిటీలో ప్రస్తుతం ఉన్న 31 వార్డులను యథావిధిగా కొనసాగిస్తూ నూతనంగా మున్సిపల్ పరిధిలోకి వస్తున్న ఆయా కాలనీలు, గ్రామాలను ఈ 31 వార్డులలోనే సర్దుబాటు చేయాలన్న తలంపుతో ముందుకు సాగుతున్నట్లు స్థానిక మున్సిపల్ అధికారులు, కమిషనర్ పీ.్భగేశ్వర్లు సమాచారం బట్టి తెలుస్తోంది. తమ కాలనీలు, గ్రామాలను మున్సిపల్ పరిధిలోకి తేస్తే నూతనంగా వార్డుల విభజన చేయాలన్న డిమాండ్‌లను ఆయా ప్రదేశాల ప్రజలు పునరుద్గాటిస్తున్నారు. మల్‌రెడ్డిపల్లి, ఎన్‌టీఆర్ నగర్, విజయనగర్ కాలనీలను వార్డు నెంబర్ 7లో విలీనం చేస్తూ, సాయిపూర్, రసూల్‌పూర్ వార్డు నెంబర్ 9లో, రాజీవ్ గృహకల్ప, ఇందిరమ్మ కాలనీలను వార్డు నెంబర్ 8లో విలీనం చేసేలా అధికారులు తమ కసరత్తులు ముమ్మరం చేస్తున్నారు. నూతన కాలనీలను మున్సిపల్‌లో విలీనం చేస్తూనే, కొత్తగా మరో ఐదు ఆరు వార్డులు ఏర్పాటు చేయాలని ఆయా ప్రాంతాల ప్రజలతో పాటు, స్థానిక రాజకీయులు, మున్సిపల్ కౌన్సిలర్‌లు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ తమ వాదనలు వినిపిస్తున్నారు.

20 నుంచి అంతర్జాతీయ సిమెంట్ ఎక్స్‌పో

$
0
0

ఖైరతాబాద్: ఫస్ట్ కన్‌స్ట్రక్షన్ కౌన్సిల్ (ఎఫ్‌సీసీ) ఆధ్వర్యంలో ఈనెల 20, 21 తేదీల్లో మాదాపూర్‌లోని హెటెక్స్‌లో అంతర్జాతీయ సిమెంట్ ఎక్స్‌పో -2018 నిర్వహిస్తున్నట్టు కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రతాప్ తెలిపారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో వివరాలను వెల్లడించారు. రెండు రోజులపాటు కొనసాగే ఎగ్జిబిషన్‌ను ఆర్‌అండ్‌బీ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభిస్తారని చెప్పారు. దేశంలో నిర్మాణ రంగం ప్రాధాన్యత నానాటికి పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు తగ్గట్టుగా సిమెంట్ తయారీలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. సిమెంట్ రంగంలో వస్తున్న ఆధునిక పద్ధతులను ఇక్కడి తయారీదారులకు, నిర్మాణదారులకు వివరించేందుకే ప్రతి రెండేళ్లకోసారి ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
కేటీఆర్ ప్రమాణ స్వీకారానికి తరలిన గులాబీ దళాలు
బేగంపట, డిసెంబర్ 17: రాష్ట్ర టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ ప్రమాణస్వీకారోత్సవానికి సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ శ్రేణులు భారీగా తరలాయి. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కేటీఆర్ ప్రమాణస్వీకారాన్ని విజయవంతం చేయాలని పిలుపునివ్వటంతో భారీగా పార్టీ కార్యకర్తలు, నేతలు తరలారు. సనత్‌నగర్ నియోజకవర్గంలోని స్థానిక కార్పొరేటర్లు అత్తెల్లి అరుణ, తరుణి, హేమలత, శేషుకుమారి, ఆకుల రూప, లక్ష్మీబాల్‌రెడ్డి తదితరులు కార్యకర్తలతో ఊరేగింపుగా వెళ్లారు. కేటీఆర్ ప్రమాణస్వీకార కార్యక్రమం జూబ్లీహిల్స్‌లోని తెలంగాణ భవన్‌లో జరగనున్నందున, ఉదయం నుంచి టీఆర్‌ఎస్ నేతలు, కార్పొరేటర్లు జన సమీకరణ చేశారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి చేరుకుని, అక్కడి నుంచి తలసాని శ్రీనివాస యాదవ్ ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లారు. ఊరేగింపులో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఫుట్‌‘పాట్లు’ కనుమరుగవుతున్నాయ

$
0
0

హైదరాబాద్: మహానగరాన్ని విశ్వనగరంగా, ప్రపంచ స్థాయి ప్రమాణాల సిటీగా తీర్చిదిద్దేందుకు పాలకులు చేస్తున్న ప్రకటనలు క్షేత్ర స్థాయిలో ఫలించటం లేదు. కనీసం రోడ్డుపై నడిచే పాదచారులు సురక్షితంగా ఇంటికెళ్తారన్న గ్యారంటీ లేదు. పాదచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్‌లపై జిహెచ్‌ఎంసి మొక్కలను నాటగా, విద్యుత్ శాఖ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేస్తోంది. అంతేగాక, మేమేం తక్కువా అన్నట్టు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ పోలీసులు గొడుగులు ఏర్పాటు చేయగా, మరికొందరు నేతలు ఫుట్‌పాత్‌లను కబ్జా చేసుకుని దందాలు చేస్తున్నారు. ఈ పరిస్థితులకు అక్రమ పార్కింగ్ కూడా తోడవ్వటంతో కాలక్రమేనా ఫుట్‌పాత్ కనుమరుగవుతోంది. పైగా ఇండియన్ రోడ్డు కాంగ్రెస్ నిబంధనల ప్రకారం 9 వేల కిలోమీటర్ల రోడ్లకు గాను సగానికి పైగా అంటే కనీసం 5వేల కిలోమీటర్ల వరకు ఫుట్‌పాత్‌లను నిర్మించాలన్న నిబంధన ఉన్నా, ఏ మాత్రం అమలు చేయటం లేదని కేటీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే! పరిస్థితి ఇప్పటికైనా మారాలి అని మంత్రి పాఠాలు చెప్పినా నేటికీ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కుదర లేదు. రోజురోజుకీ పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఎన్ని సంస్కరణలను ప్రవేశపెట్టినా, ఆధునిక రవాణా వ్యవస్థలను అందుబాటులోకి తెచ్చినా, పాదచారులకు కష్టాలు తప్పటం లేదు. నగరంలో ఏ ప్రధాన రహదారిని గమనించినా, కిలోమీటరు దూరంలో యూ టర్న్, ఎక్కడ కూడా రోడ్డు దాటేందుకు అనుకూలమైన పరిస్థితుల్లేవు. ఫుట్‌పాత్‌ల పరిరక్షణ కోసం పదేళ్ల క్రితం ప్రవేశపెట్టిన హాకర్స్ పాలసీ ప్రకారం అధికారులు ఫుట్‌పాత్‌ను మూడు జోన్లుగా విభజించి, కొన్నింటిలో షరతులతో కూడిన వ్యాపారాలను అనుమతించాల్సి ఉంది. కానీ అధికారులు ఈ పాలసీని కేవలం బోర్డులకే పరిమితం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో నగరంలో అసలు ఫుట్‌పాత్ ఉందా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫుట్‌పాత్‌ల పరిరక్షణ విషయంలో పలు సార్లు కోర్టు అక్షింతలు వేసినా, అధికారుల్లో చలనం రావటం లేదు. ఇందుకు ఒక రకంగా రాజకీయ నాయకుల ఓటు బ్యాంకు రాజకీయాలు అధికారులపై తీవ్ర స్థాయిలో వత్తిడి తెస్తున్నాయని చెప్పవచ్చు.
అంబులెన్స్ కూడా వెళ్లలేని అధ్వాన్న పరిస్థితి
ట్రాఫిక్ సమస్యకు సంబంధించి పాతబస్తీలో మాత్రం దేవుడు దిగి వచ్చినా పరిస్థితులు మారే అవకాశాలు కన్పించటం లేదు. ఫుట్‌పాత్ కబ్జాతో పాటు సగం రోడ్డును వ్యాపార సంస్థలు, తోపుడు బండ్లు కబ్జా చేసుకుని వ్యాపారాలు కొనసాగిస్తున్నందున అత్యవసర పరిస్థితుల్లో కనీసం 108, 104 వంటి అంబులెన్స్‌లు కూడా ముందుకు కదలని పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా అఫ్జల్‌గంజ్ మొదలుకుని, పత్తర్‌గట్టి, మదీనా, చార్మినార్, బహద్దూర్‌పురా, ఖిల్వత్, మొఘల్‌పురా, ఛిత్రినాఖ, తలాబ్‌కట్టా, లాల్‌దర్వాజ, ఇంజన్‌బౌలీ, ఫలక్‌నుమా తదితర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా పాదచారులు రాకపోకలు సాగించాల్సిన ఫుట్‌పాత్‌లు కబ్జాల పాలై కన్పిస్తున్నాయి. అంతేగాక, వాహనాల పార్కింగ్ కోసం మహానగర పాలక సంస్థ కేటాయించిన స్థలాన్ని సైతం కబ్జా చేసి కొందరు వ్యాపారులు షాపులను నిర్మించుకున్నా, కనీసం వారిని ప్రశ్నించేందుకు బల్దియా అధికారులు గానీ, ట్రాఫిక్ పోలీసులు గానీ ముందుకు రావటం లేదు. స్థానికంగా బాగా పలుకుబడి కల్గిన కొందరు రాజకీయ నేతల నుంచి ఎలాంటి పరిణామాలెదురవుతాయోనన్న భయంతోనే పోలీసులు పాతబస్తీలో ఫుత్‌పాత్‌లు, రోడ్లు, పార్కింగ్ స్థలాలు కబ్జా పాలవుతున్నా, చూసీచూడనట్టుగా వ్యవహారిస్తున్నారు. ట్రాఫిక్‌పై స్థానికుల్లో నెలకొన్న అవగాహన రాహిత్యం, పోలీసు ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే ఫుట్‌పాత్‌ల కనుమరుగుకు కారణం. నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు వేల కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేసిన సర్కారు ఫుట్‌పాత్‌ల పరిరక్షణపై కూడా దృష్టి సారించాలని పాదచారులు కోరుతున్నారు.

రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థిని దుర్మరణం

$
0
0

ఉప్పల్, డిసెంబర్ 17: రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్ధిని దుర్మరణం చెందిన సంఘటన మేడిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం పెద్దపల్లికి చెందిన అశ్ఛిత (18) వరంగల్‌లోని వాసుదేవ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. సోమవారం ఇక్కడ పరీక్ష రాయడానికి వచ్చిన ఆమెను బంధువు శివాజీ బైక్‌పై మేడిపల్లి నుంచి ఉప్పల్ వైపుకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు బోడుప్పల్ చౌరస్తాలోని సిగ్నల్స్ వద్ద లారీ ఢీకొని ఎగిరి కింద పడ్డారు. అశ్ఛితపై నుంచి టైర్లు పోవడంతో ఆమె అక్కడిక్కడే మరణించింది. బైక్ నడుపుతున్న శివాజీ ఎలాంటి ప్రమాదం లేకుండా ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ అంజిరెడ్డి తెలిపారు.

ఇనే్నళ్లు పట్టింది..!!

$
0
0

సిక్కులను ఊచకోత కోయించిన అభియోగంపై కాంగ్రెస్ నాయకుడు సజ్జన్‌కుమార్‌కు ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్షను విధించడం- మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్ పదవీ బాధ్యతలను స్వీకరించడానికి విచిత్రమైన నేపథ్యం. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతున్న సమయంలోనే సోమవారం ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం సజ్జన్‌కుమార్, మరో ముగ్గురు నిందితులు దోషులని నిర్ధారించింది. ముప్పయి నాలుగేళ్లపాటు సజ్జన్‌కుమార్ శిక్షను తప్పించుకోగలగడం న్యాయ విలంబన ప్రక్రియకు ఘోరమైన నిదర్శనం. ఇప్పుడు కూడ సజ్జన్‌కుమార్‌ను శిక్షించే ప్రక్రియ ముగిసిపోలేదు. ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం తీర్పునకు వ్యతిరేకంగా సర్వోన్నత న్యాయస్థానానికి న్యాయ యాచిక - అప్పీల్-ను నివేదించనున్నట్టు సజ్జన్‌కుమార్ ప్రకటించినట్టు ప్రచారం జరుగుతుండడం ఇందుకు కారణం! 1984 అక్టోబర్ ముప్పయి ఒకటవ తేదీన అప్పటి ప్రధాని, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి ఇందిరాగాంధీ హత్యకు గురి అయిన వెంటనే ఢిల్లీలోను, దేశవ్యాప్తంగాను అమాయకులైన వేలాది సిక్కులను సాంఘిక బీభత్సకారులు హత్యచేయడం చరిత్ర.. ‘‘ఈ హంతకులు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారన్నది, కాంగ్రెస్ నాయకులు హంతకులను ప్రోత్సహించారన్నది’’ కొనసాగుతున్న అభియోగం! ఇందిరాగాంధీని హత్యచేసిన సత్వంత్‌సింగ్, బియాంత్‌సింగ్ అనే బీభత్సకారులు సిక్కు మతానికి చెందినవారు కావడం మాత్రమే- ‘కాంగ్రెస్‌కు చెందిన హంతకులు’ సిక్కులను ఊచకోత కోయడానికి ఏకైక కారణం. ముప్పయి నాలుగు ఏళ్లుగా ఈ హంతకులలో అత్యధికులు తప్పించుకొని తిరుగుతుండడానికి కారణం కేంద్రంలో పెత్తనం చెలాయించిన కాంగ్రెస్ ప్రభుత్వం. దర్యాప్తు చేసిన ప్రభుత్వ నేర పరిశోధక సంస్థలు సాక్ష్యాధారాలను సేకరించడంలోను, న్యాయస్థానాలకు నివేదించడంలోను ఘోరమైన, అమానవీయమైన నిర్లక్ష్యం వహించడం వల్ల న్యాయ ప్రక్రియ కుంటుపడింది, నత్తనడక నడిచింది. నిందితులుగా నమోదైన జగదీశ్ టైట్లర్, సజ్జన్‌కుమార్ వంటి ఘరానాలు ఇనే్నళ్లుగా శిక్షలను తప్పించుకోవడానికి కారణం ఈ నేర పరిశోధక సంస్థల నిర్లక్ష్యం, కాంగ్రెస్ ప్రభుత్వాల ఒత్తిడికి లొంగిన ఈ ‘సంస్థలు’ సజ్జన్‌కుమార్, జగదీశ్ టైట్లర్ వంటి ‘నిందితులు’ నిర్దోషులని పదే పదే నిర్ధారించడం చరిత్ర. ఈ నిర్ధారణలను న్యాయస్థానాలను తోసిపుచ్చడం, వీరిపై మళ్లీమళ్లీ అభియోగాలు నమోదుకావడం కూడ చరిత్ర. ఈ అభియోగాలు పునరుద్ధరణ కావడం కారణంగానే జగదీశ్ టైట్లర్, సజ్జన్‌కుమార్ వంటి కాంగ్రెస్ నేతలు 2009నాటి లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయడం చివరి క్షణంలో తప్పిపోయింది. వారిని అభ్యర్థులుగా ఎంపిక చేసిన కాంగ్రెస్ తన నిర్ణయాన్ని మార్చుకోవలసి వచ్చింది!
ఈ ముప్పయి నాలుగేళ్లలో సాక్ష్యాధారాలు మాసిపోయి ఉండవచ్చు. కొందరు నిందితులు మరణించి ఉండవచ్చు. 1984లో యువ కాంగ్రెస్ నేతలుగా హత్యాకాండను ఉసిగొల్పినవారు ఇప్పుడు వృద్ధులు. 2013 మే నెలలో, 1984నాటి హత్యాభియోగాన్ని విచారించిన ప్రత్యేక న్యాయస్థానం వారు సజ్జన్‌కుమార్‌ను నిర్దోషిగా ప్రకటించి అభియోగ విముక్తిడిని చేయడానికి ‘‘ఇలా సాక్ష్యాధారాలు లభించకపోవడం’’ కారణం. దర్యాప్తుచేసిన కేంద్ర నేర పరిశోధక మండలి- సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్- సిబిఐ- వంటి సంస్థలు ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు మారినప్పుడల్లా మాటమార్చడం కూడ ఈ ముప్పయి నాలుగేళ్ల వైపరీత్యంలో భాగం.. 1984 నవంబర్ ఒకటవ తేదీనుంచి నాలుగవ తేదీ వరకు కొనసాగిన ఊచకోత, సజీవ దహనం వంటి పైశాచిక కాండ ఫలితంగా దేశవ్యాప్తంగా ఎనిమిది వేల మంది సిక్కులు ప్రాణాలను కోల్పోయినట్టు అనధికార కథనం. ఢిల్లీలో మాత్రమే రెండువేల ఏడువందల ముప్పయి ముగ్గురు సిక్కులను దుండగులు హతమార్చినట్టు సోమవారం తీర్పుచెప్పిన ఢిల్లీ ఉన్నత న్యాయమూర్తులు ఎస్.మురళీధర్, వినోద్ గోయల్ నిర్ధారించారు. 1984 నవంబర్ ఒకటవ తేదీన ఢిల్లీ శివారులోని రాజ్‌నగర్ ప్రాంతంలో ‘ఒక కుటుంబానికి చెందిన ఐదు మందిని హతమార్చి ఒక ‘గురుద్వార’ను దగ్ధం చేయించిన’ అభియోగం ఇప్పుడు ధ్రువపడింది. 2013లో ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఇప్పుడు హైకోర్టు రద్దు చేసింది. కానీ 1984 నుంచి ఇప్పటివరకు సజ్జన్‌కుమార్ వంటి దుర్మార్గులు శిక్షకు గురికాకపోవడం మన రాజ్యాంగ వ్యవస్థను నిలదీసిన, నిలదీస్తున్న వైపరీత్యాలలో ఒకటి మాత్రమే!
డెబ్బయి మూడేళ్ల సజ్జన్‌కుమార్ కనీసం ముప్పయి ఏళ్లకింద ఈ ‘యావజ్జీవ నిర్బంధ శిక్ష’కు గురి అయి ఉండాలి. దానివల్ల ‘శిక్ష’కు సార్ధకం ఏర్పడి ఉండేది. ఇప్పుడు ఇతగాడు సర్వోన్నత న్యాయస్థానానికి అభియోగాన్ని నివేదించినట్టయితే, నిజ నిర్ధారణ జరగడానికి మరో ఐదేళ్లు పట్టవచ్చు! ఎక్కువ కాలం పట్టినప్పటికీ ఆశ్చర్యపోనక్కరలేదు. ఈలోగా ‘శిక్ష’ అమలు జరుగకుండా తాత్కాలిక న్యాయాదేశం వెలువడవచ్చు! ఇలా ముప్పయి తొమ్మిదవ ఏట ఘోరమైన పాశవికమైన మారణకాండ జరిపించిన సజ్జన్‌కుమార్ వంటి దుర్జనులు శిక్షకు గురి అయినప్పటికీ వారు నిర్బంధంలో గడపవలసిన సమయం తగ్గిపోతోంది. ఈలోగా సజ్జన్‌కుమార్, ఇలాంటి ‘‘హంతకులు’’ పార్లమెంటుకు ఎన్నికయి ప్రజాప్రతినిధులుగా చెలామణి కాగలిగారు. ‘కటకటాల’కు వెనుక నిలబడవలసిన ‘‘దుర్జన’’కుమార్‌లు జగదీశ్ టైట్లర్‌లు సార్వజనిక, అధికార వేదికలెక్కి ‘నాగరిక’ అభినయం చేయగలగడం రాజ్యాంగ వ్యవస్థలో నిహితమై ఉన్న వికృతులకు నిదర్శనం. న్యాయ విలంబనం కావడానికి దోహదం చేస్తున్న రాజకీయం ప్రధానమైన వికృతి. ‘‘ఆ..! అభియోగం ధ్రువపడిన నాటిమాట కదా!’’అన్న వికృత చిత్తవృత్తి విష కీటకంగామారి దాడిచేస్తోంది, పైశాచిక దంష్టల్రతో మానవ మాంసాన్ని మెక్కుతోంది, అమాయకుల రక్తాన్ని బొక్కుతోంది! 1947లో భయంకరమైన హత్యాకాండ జరిగింది. అఖండ భారత్ విభజన జరిగింది. ఆ సమయంలో అనేక లక్షల మంది హత్యకు గురి అయ్యారని ముప్పయి ఏడు ఏళ్ల తరువాత వేలాది సిక్కులు ప్రాణాలను కోల్పోవడం మరో భయంకర విషాదమని ఢిల్లీ ఉన్నత న్యాయమూర్తులు సోమవారం వ్యాఖ్యానించారు. ‘‘సిక్కులను పాశవికంగా చంపారు.. వారి ఇళ్ళను ధ్వంసం చేశారు. ఢిల్లీ వెలుపల కూడ వేలమంది సిక్కులు హతమైపోయారు..’’అన్నది ఉన్నత న్యాయస్థానం చేసిన నిర్ధారణ! సజ్జన్‌కుమార్‌కు వ్యతిరేకంగా ఇప్పుడు ఒక బీభత్స ఘటనకు సంబంధించిన అభియోగం మాత్రమే ధ్రువపడింది. మరో నాలుగు అభియోగాలు ఇంకా విచారణలో ఉన్నాయి. ఇలాంటి ఘోర నేరాలు జరిగినప్పుడు వాటిని దర్యాప్తుచేయడానికి విచారించడానికి కచ్చితమైన సమయ నిర్ధారణ జరగాలి! ప్రత్యేక న్యాయస్థానం తీర్పుచెప్పిన తరువాత సమీక్షా యాచిక- అప్పీల్-ను ఉన్నత న్యాయస్థానానికి కాక- హైకోర్టునకు కాక- నేరుగా సర్వోన్నత న్యాయస్థానం- సుప్రీం కోర్టు- వారికి నివేదించే విధంగా ఇప్పుడైనా చట్టాన్ని సవరించాలి...
గత నవంబర్ ఇరవయ్యవ తేదీన ఢిల్లీలోని ఒక ప్రత్యేక న్యాయస్థానం 1984లో హత్యలు చేసిన ఒక నేరస్థుడికి మరణశిక్ష విధించింది, మరొకనికి యావజ్జీవ నిర్బంధ శిక్షను విధించింది. ఇప్పుడు ఉన్నత న్యాయస్థానం సజ్జన్‌కుమార్‌తోపాటు మరో ముగ్గురిని శిక్షించింది. కానీ వందల మంది నిందితులను శిక్షించేదెప్పుడు? బాధితులకు న్యాయం జరిగేదెప్పుడు?? ఇప్పుడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన కమల్‌నాథ్ కూడ 1984లో హంతకులను ఉసిగొల్పాడన్నది కొనసాగుతున్న ఆరోపణ.. అయితే ఆయనకు వ్యతిరేకంగా అభియోగం నమోదు కాలేదట!


*సీరియస్ మేటర్‌లో ‘సిల్లీ మిస్టేక్’!

$
0
0

వివాదాస్పదమైన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన తరువాత సహజంగా కేంద్ర ప్రభుత్వం ఊపిరి పీల్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఆ అంశం పాలక బీజేపీని ప్రజలముందు దోషిగా నిలబెట్టే రాజకీయ ఆయుధంగా తయారైంది. సుప్రీం తన తీర్పు ద్వారా రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోళ్లలో అవినీతి జరిగిందనడానికి ఏ ఆధారాలూ లేవని, అనుమానాల ప్రాతిపదికన దర్యాప్తుని ఆదేశించలేమంటూ కాంగ్రెస్ ఆశలపై నీళ్లు కుమ్మరించడంతోపాటు, ఉక్కిరిబిక్కిరిలోనున్న బీజేపీ నెత్తిపై పాలుపోసింది. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ప్రజల్ని తప్పుదోవ పట్టించినందుకు ‘సారీ’ చెప్పాల్సిందేనంటూ బీజేపీ ఎదురుదాడి మొదలుపెట్టి కుదురుకొనే లోగానే మళ్ళీ మరో అంశం కాంగ్రెస్ చేతికి అందివచ్చింది. రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు లెక్కల్ని ‘కాగ్’ పరిశీలించి, ప్రజాపద్దుల కమిటీ ముందు ఉంచిందని సుప్రీం తీర్పు ద్వారా వెల్లడైన వ్యాఖ్యలో నిజం లేదని, ప్రభుత్వం కోర్టుని తప్పుదోవ పట్టించడంతో అలా భావించడం జరిగిందంటూ, తద్వారా తీర్పుపై ప్రభావం పడిందంటూ చెప్తోంది. అందుకు ప్రభుత్వం నుండి వచ్చిన వివరణే అసంబద్ధం. ప్రభుత్వం తానిచ్చిన వివరణలో జరిగిన ‘గ్రామర్’ (వ్యాకరణ దోషం) పొరపాటుని కోర్టు వేరేలా అర్థం చేసుకొంది అంటూ ఆమేరకు కోర్టుకి విన్నవించింది- సరైన అర్థం ఇదంటూ. ‘కాగ్’ లెక్కలు చూశాక, ప్రజాపద్దుల సంఘం, అటు పిమ్మట పార్లమెంటు చూస్తాయంటూ ఆనవాయితీగా పాటించే పద్ధతిని వివరించిందట! న్యాయస్థానమేమో ఆ లెక్కలు వారంతా ‘చూసేశారు’ అని అర్థం చేసుకొందట. అదీ తిరకాసు. ప్రభుత్వం వివరణను న్యాయస్థానం ఎలా తీసుకొంటుందో తెలియదు కానీ- ‘మరీ అంత సిల్లీ మిస్టేక్ ఇంత సీరియస్ మేటర్‌లోనా?’ అన్నది సగటు భారతీయుని డౌటు. రాఫెల్ యుద్ధవిమానాలు దేశానికి ఎంత అవసరమో, వాటి ధరలపై అవకతవకలు జరిగాయో లేదో ఆ విషయాలన్నీ అటుంచండి. అసలు ఈ ఒప్పందంలో భాగంగా సంబంధిత రంగంలో అనుభవం ఉన్న హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనే ప్రఖ్యాత ప్రభుత్వరంగ సంస్థకి రావాల్సిన వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు దాని చేజారి ఏమాత్రం అనుభవం లేని, అప్పుల్లోఉన్న సరికొత్త ప్రయివేట్ సంస్థకి రావడంలో ఆంతర్యం ఏమిటి? పోనీ అలా దేశీయ భాగస్వామిని ఎన్నుకోవడం అన్నది ఒప్పందం చేసుకొన్న విదేశీ సంస్థ ఇష్టం అనుకొన్నా ప్రభుత్వం తరఫునా, దేశం తరఫునా ప్రభుత్వరంగ సంస్థని సిఫార్సు చెయ్యాల్సిన బాధ్యత ‘మేక్ ఇండియా’నినాదాన్ని తలకెత్తుకొన్న ఈ పాలకులకు లేదా? ఈ ప్రశ్నలకు మాత్రం ప్రభుత్వం జవాబులను బాకీ ఉంది.
- డా. డీవీజీ శంకరరావు, పార్వతీపురం

వెంకన్న ఆశీస్సులతోనే విజయం సాధించాం

$
0
0

రేణిగుంట, డిసెంబర్ 17: వెంకన్న ఆశీస్సులతోనే ఎన్నికల్లో విజయం సాధించామని, మొక్కు తీర్చుకునేందుకే వచ్చామని తెలంగాణ మాజీమంత్రి హరీష్‌రావు అన్నారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో పాటు ఎమ్మెల్యేగా ఆరోసారి విజయం సాధించిన టీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు, వారి కుటుంబ సభ్యులు, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ సతీమణి, వారి కుటుంబ సభ్యులు రేణిగుంట విమానాశ్రయంకు మధ్యాహ్నం 3గంటలకు చేరుకున్నారు. వీరికి అభిమానులు పుష్పగుచ్చాలిచ్చి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో టీఆర్‌ఎస్ చారిత్రాత్మక విజయం సాధించిందన్నారు. ప్రజల అభిమానమే తమను మరోసారి అధికారంలోకి తీసుకొచ్చిందన్నారు. తిరుమల శ్రీవారి మొక్కు తీర్చి ఆయన ఆశీస్సులు పొందేందుకు వచ్చామని అన్నారు. ఏపీలో జరగనున్న ఎన్నికల సమయంలో ప్రచారం చేస్తారా.. అన్న ప్రశ్నకు ఈ సమయం లో రాజకీయాలు మాట్లాడబోనన్నారు. అనంతరం రోడ్డుమార్గాన తిరుమలకు వెళ్లారు.

రేపే నింగిలోకి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 11 రాకెట్

$
0
0

సూళ్లూరుపేట, డిసెంబర్ 17: వరుస ప్రయోగ విజయాలతో దూసుకెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ సమాచార ఉపగ్రహ ప్రయోగానికి సన్నద్ధమైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈ నెల 19న జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 11 రాకెట్ ప్రయోగం జరగనుంది. ఈ ప్రయోగానికి సంబంధించిన మిషన్ రెడీనెష్ రివ్యూ సమావేశం (ఎంఆర్‌ఆర్) సోమవారం షార్‌లోని బ్రహ్మప్రకాష్‌హాలులో డాక్టర్ బిఎన్.సురేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సీనియర్ శాస్తవ్రేత్తలు పాల్గొని సుదీర్ఘంగా చర్చించారు. ఎంఆర్‌ఆర్ అనంతరం షార్ డైరెక్టర్ ఎస్.పాండ్యన్ అధ్యక్షతన లాచింగ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యాబ్) సమావేశమై ప్రయోగానికి సంసిద్ధత తెలిపారు. ప్రయోగ సన్నాహాల్లో భాగంగా శాస్తవ్రేత్తలు ప్రీ కౌంట్‌డౌన్, రిహార్సల్‌ను కూడా విజయవంతంగా నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం 2:10గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 26గంటలు కౌంట్‌డౌన్ సజావుగా సాగి వాతావరణం అనుకూలిస్తే బుధవారం సాయంత్రం 4:10గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 11 రాకెట్ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి ఎగరనుంది. ఈ రాకెట్ ద్వారా 2,250 కిలోల బరువుగల సమాచార రంగానికి చెందిన జీశాట్-7 ఏ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. 2013లో ప్రయోగించిన జీశాట్-7 ఉపగ్రహం కాలపరిమితి మించిపోవడంతో దాని స్థానంలో ఈ ఉపగ్రహాన్ని ప్రవేశపెడుతున్నారు. ఎయిర్స్ ఫోర్స్ సమాచార వ్యవస్థకోసం ఇస్రో ఈ ఉపగ్రహాన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. కమ్యూనికేషన్ ఉపగ్రహ ప్రయోగంలో ఇది 35వ ఉపగ్రహం కావడం విశేషం. ప్రయోగ దృష్ట్యా ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ మంగళవారం షార్‌కు రానున్నారు.

చిత్రాలు.. జీశాట్-7 ఏ ఉపగ్రహం
*ప్రయోగ వేదిక పై సిద్ధంగా ఉన్న జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 11

పెథాయ్‌తో గజగజ

$
0
0

ఖమ్మం, డిసెంబర్ 17: బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్ తుఫాన్ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు భారీ నష్టాన్ని చేకూర్చింది. 24 గంటలుగా కురుస్తున్న ఎడతెరపి లేని వర్షానికి వరి పంట తీవ్రమైన నష్టం జరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1.60 లక్షల హెక్టార్ల వరి వేయగా అధిక శాతం రైతుల పంట కల్లాలకు చేరింది. ఒక్కసారిగా వచ్చిన వర్షంతో ధాన్యం తడవడంతో ఆందోళన చెందుతున్నారు. అనేకచోట్ల మిర్చి కల్లాల్లో కూడా నీరు వచ్చి చేరడంతో వాటిని కాపాడుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వర్షానికి ధాన్యం తడిసిపోవడమే కాకుండా నీటిలో కొట్టుకుపోతుండటంతో కష్టించి పండించిన పంట కళ్ళ ముందే తడిచిపోతుంటే రోదించిన రైతులు కూడా ఉన్నారు. ధాన్యం కొనుగోలు చేసేందుకు సొసైటీలు, ఐకెపి కేంద్రాల ఆధ్వర్యంలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ఆ కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని ముందుగా ప్రత్యేక వాహనాలతో తరలించడంతో ఇబ్బందులు తప్పాయి. ఏజన్సీ ప్రాంతంలోని రైతులు తమ పంటను కాపాడుకునేందుకు అవసరమైన సామాగ్రి లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు.

చిత్రం..కళ్లాల్లో ధాన్యంపై పట్టాలు కప్పిన దృశ్యం

వైభవంగా భద్రాద్రి రామయ్య తెప్పోత్సవం

$
0
0

భద్రాచలం టౌన్, డిసెంబర్ 17: వైకుంఠ ఏకాదశి సందర్భంగా భద్రాద్రిలో రామయ్య స్వామివారి తెప్పోత్సవం సోమవారం సాయంత్రం అత్యంత వైభవంగా సాగింది. స్వామివారికి మధ్యాహ్నం 3 గంటలకు ఆలయంలో దర్బారుసేవ నిర్వహించారు. సాయంత్రం 4.30 గంటలకు రామాలయం నుంచి భారీ ఊరేగింపుగా సీతారామచంద్రులు గోదావరి నదీ తీరానికి బయలుదేరారు. భక్తుల సంప్రదాయ నృత్యాలు, కోలాటాలు, జయజయ ధ్వానాలతో ఉత్సవమూర్తులను ఊరేగింపుగా హంసవాహనంపై ఉంచి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ వేడుకలో సీతారామచంద్రస్వామికి భక్తులు నీరాజనం పలికారు. హంసవాహనంపై ఉన్న స్వామివారిని ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, ఎమ్మెల్యే పొదెం వీరయ్య దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు రాగా ఉత్సవం కడు వైభవంగా జరిగింది. వేద పాఠశాల విద్యార్థులు వేదాలు పఠిస్తూ రాముడిని కొలిచారు. కాగా తెప్పోత్సవ క్రతువులో నదిలో స్వామి విహారాన్ని వర్షం దృష్ట్యా అధికారులు నిలిపివేశారు. తుఫాను ప్రభావంతో ఏకధాటిగా వర్షం కురుస్తుండటంతో హంసవాహనంపై స్వామిని కూర్చుండబెట్టి పూజాది కార్యక్రమాలు జరిపించారు. జలవిహారాన్ని మాత్రం కొనసాగించలేకపోయారు. వర్షం వల్ల ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు.

చత్తీస్‌గఢ్ సీఎంగా బఘేల్ పగ్గాలు

$
0
0

రాయ్‌పూర్, డిసెంబర్ 17 : చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నాయకుడు భూపేశ్ బఘేల్ సోమవారం నాడు పదవి స్వీకారణ ప్రమాణం చేశారు. పదవికి చివరి వరకు పోటీ పడ్డ ఎమ్మెల్యేలు టిఎస్ సింగ్ దేవ్, తమరద్వజ్ సాహులు మంత్రులుగా ప్రమాణం చేశారు.
రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్ వీరిచేత ప్రమాణం చేయంచారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మిత్రపక్షాల నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇంతకుముందు వరకు ముఖ్యమంత్రి పదవి నిర్వహించిన బీజేపీ నాయకుడు రమణ్‌సింగ్ కొత్త ముఖ్యమంత్రిని అభినందించారు.
రాష్ట్రంలోని పటాన్ నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బఘేల్ పేరును కాంగ్రెస్ అధినాయకత్వం ఆలస్యంగా ఖరారు చేసిన విషయం తెలిసిందే. 2013లో రాష్ట్ర కాంగ్రెస్ సారథ్యాన్ని చేపట్టిన బఘేల్ తాజా ఎన్నికల్లో పార్టీ విజయంలో క్రియశీలక భూమిక పోషించారు. 90 స్థానాలు కలిగిన అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ మూడింట రెండో వంతు మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. 2003 నుంచి చత్తీస్‌గఢ్‌లో అధికారంలో ఉన్న బీజేపీకి తాజా ఎన్నికల్లో కేవలం 15 సీట్లు మాత్రమే వచ్చాయ. వరుసగా మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయాన్ని చవిచూసిన నేపథ్యంలో అమితుమి అన్న రీతిలో జరిగిన తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయం వెనుక బఘేల్ కృషి ఎంతో ఉంది. పార్టీని పునరుద్ధరించడంతో పాటు తిరుగులేని మెజారిటీని సాధించడంలో కూడా ఆయన అనుసరించిన రాజకీయ వ్యూహం ఫలించింది.

చిత్రం..చత్తీస్‌గఢ్ కొత్త ముఖ్యమంత్రి బఘేశ్ బఘేల్,
మంత్రులు సాహు, టీఎస్ సింగ్‌దేవ్‌తో గవర్నర్ ఆనందిబెన్ పటేల్

మధ్యప్రదేశ్ పీఠంపై కమలనాథ్

$
0
0

భోపాల్, డిసెంబర్ 17: మధ్యప్రదేశ్ 18వ ముఖ్యమంత్రిగా 72 సంవత్సరాల కమలనాథ్ సోమవారం పదవీస్వీకార ప్రమాణం చేశారు. రాష్ట్ర గవర్నర్ అనంది బెన్ ఆయనచేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పార్టీ సీనియర్ నేతలు అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, డీఎంకే అధినేత స్టాలిన్‌తో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. తొమ్మిదిసార్లు లోక్‌సభకు చింద్వారా నుంచి ఎన్నికైన కమలనాథ్ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎంపిక కావడం, ముఖ్యమంత్రిగా పదవీస్వీకార ప్రమాణం చేయడం చకచకా జరిగిపోయాయి. సీఎంగా నేడు కమలనాథ్ ఒక్కరే ప్రమాణం చేశారు. ఆయన కేబినెట్‌లో ఎవరు చేరుతారు, ఎంతమందికి స్థానం లభిస్తుందన్నది స్పష్టం కాలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన బీఎస్పీ అధినేత్రి మాయావతి, సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కమలనాథ్ ప్రమాణస్వీకారానికి హాజరు కాలేదు. పదవీ స్వీకార ప్రమాణానికి ముందు సర్వమత ప్రార్థనలు జరిగాయి. ప్రఖ్యాత డూన్ స్కూల్‌లో చదువుకున్న కమలనాథ్ కోల్‌కతాలోని సెయింట్ జేవియర్‌లో డిగ్రీ తీసుకున్నారు. నిజానికి ఏప్రిల్‌లో అసెంబ్లీకి ముందే రాష్ట్ర ముఖ్యమంత్రిగా కమలనాథ్ పేరును కాంగ్రెస్ నాయకత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. నాడు ప్రధాని ఇందిరాగాంధీతో అత్యంత సన్నిహితుడిగా కమలనాథ్ మెసిలారు. కమలనాథ్ తన మూడో కుమారిడిగా ఇందిరాగాంధీ 1979లో ప్రకటించిన విషయాన్ని ఈ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ అతిరథ మహారథులు గుర్తు చేసుకున్నారు. నాడు మొరార్జీదేశాయ్ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వాన్ని ఎదుర్కోవడంలో ఇందిరాగాంధీకి కమలనాథ్ ఎంతో చేయూతనిచ్చారు. 16వ లోక్‌సభలో అత్యంత సీనియర్ సభ్యుడిగా ఉన్న కమలనాథ్ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలకభూమిక పోషించారు.
2003 నుంచి అధికార పీఠాన్ని అంటిపెట్టుకుని ఉన్న బీజేపీని గద్దె దించడంలోనూ, అలాగే కాంగ్రెస్ పార్టీకి మెజారిటీని సాధించడంతో పాటు ఇతర పార్టీల మద్దతును సమకూర్చడంలోనూ కమలనాథ్ గురుతర భూమిక పోషించారు. కమలనాథ్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యూహాత్మక రీతిలోనే ప్రచారం సాగించి అంతిమంగా విజయాన్ని సంతరించుకోగలిగారు. 230 స్థానాలు కలిగిన ప్రస్తుత అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 114 సీట్లున్నాయి. సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీ, నలుగురు ఇండిపెండెంట్లతో కలిసి కాంగ్రెస్ బలం 121కు పెరిగింది. బీజేపీ బలం 109 సీట్లు కావడం గమనార్హం.
మాఫీపై మాట నిలబెట్టుకున్నారు
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల్లోనే రైతుల రుణమాఫీ ఫైలుపై కమలనాథ్ తొలి సంతకం చేశారు. రెండు లక్షల వరకు రైతుల రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ హామీ ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా కమలనాథ్ తొలిసంతకం ఈఫైలుపైనే జరగడం గమనార్హం. ముఖ్యమంత్రి సంతకం చేయడం రుణమాఫీకి సంబంధించిన ఉత్తర్వులు చకచకా జరిగిపోయాయి. జాతీయ బ్యాంకుల నుంచి, సహకార బ్యాంకుల నుంచి రెండు లక్షల వరకు రైతులు తీసుకున్న రుణాలు మాఫీ అవుతాయి.
చిత్రం..కమల్‌నాథ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అభివాదం చేస్తున్న
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పార్టీ నాయకులు జ్యోతిరాదిత్య సింథియా


రాజస్థాన్ సారథిగా గెహ్లాట్

$
0
0

జైపూర్, డిసెంబర్ 17: రాజస్థాన్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అశోక్ గెహ్లాట్ సోమవారం పదవీస్వీకార ప్రమాణం చేశారు. అలాగే రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు సచిన్‌పైలట్ ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు.
గత కొంతకాలంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కూటమి నేతలందరూ గెహ్లాట్ ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. చారిత్రక అల్బర్ట్ హాల్‌లో గవర్నర్ కల్యాణ్‌సింగ్ ఆయన చేత ప్రమాణం చేయించారు. సచిన్ పైలట్ అనంతరం మంత్రిగా ప్రమాణం చేశారు. ఆ వెంటనే ఆయనను ఉపముఖ్యమంత్రిగా నియమిస్తున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజెతో పాటు కాంగ్రెస్ మిత్రపక్షాలుగా ఉన్న ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా తదితరులు గెహ్లాట్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదిస్తూ బీజేపీ వ్యతిరేక కూటమికి లాంఛనంగా శ్రీకారం చుట్టిన డీఎంకే అధినేత స్టాలిన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన నాలుగో నేత గెహ్లాట్ కావడం గమనార్హం. 1998లో తొలిసారిగా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. 2008లో మరోసారి ఈ పీఠాన్ని అధిష్టించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తానని, అంతవరకు తలపాగా ధరించనని శపథం చేసిన సచిన్‌పైలట్ ఈ కార్యక్రమంలో తలపాగాతో కన్పించారు.

చిత్రం..రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అశోక్ గెహ్లాట్‌తో
రాష్ట్ర గవర్నర్ కళ్యాణ్ సింగ్, పక్కన ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్

ముచ్చటగా మూడు రాష్ట్రాల్లో..

$
0
0

మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, సీనియర్ నేతలు, ముఖ్యమంత్రులు, మిత్రపక్షాల నేతలు బస్సులో ఇలా కోలాహలంగా తరలివెళ్లారు. కేవలం కొన్నిగంటల వ్యవధిలోనే ప్రభుత్వాల ఆవిర్భావం ఉండడంతో అందరూ ఇలా కలసికట్టుగా కనిపించారు
*మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్ ప్రమాణ స్వీకారానికి హాజరైన డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, ఆ పార్టీ నాయకుడు సింథియా తదితరులు

స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి

$
0
0

ఖమ్మం రూరల్, డిసెంబర్ 17: త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధం కావాలని సీపీఐ మండల కార్యదర్శి పుచ్చకాయల సుధాకర్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని గూడూరుపాడులో దొడ్డా వాసయ్య అధ్యక్షతన జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ ప్రతిష్టకు తగిన విధంగా అత్యధిక మెజార్టీతో విజయఢంకా మోగించాలని కార్యకర్తలను కోరారు. 1971 నుండి నేటి వరకూ కమ్యూనిస్టు పార్టీ ద్వారా గ్రామాలలో ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి చేయడంలో ఎంతో కృషి చేసినట్టు తెలిపారు. గ్రామాలలో శాంతియుత వాతావరణం నెలకొల్పడంలో సీపీఐ ప్రత్యేక పాత్ర పోషించినట్టు చెప్పారు. గోళ్ళపాడు చెరువు నుండి మూడు కిలోమీటర్ల దూరంలో బావి తవ్వించి గూడూరుపాడుకు నీళ్లు తెప్పించి శాశ్వతంగా నీటి ఎద్దడి పరిష్కరించడంలో సీపీఐ విజయం సాధించిందన్నారు. గూడూరుపాడులో కమ్యూనిస్టు పార్టీని నిర్మాణపరంగా బలోపేతం చేస్తూ బలమైన శక్తిగా తీర్చిదిద్దిన త్యాగమూర్తులు, కార్యకర్తలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్‌లో కూడా గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొనే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ పధకాలు అందరికీ అందేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు పుచ్చకాయల కమలాకర్, ఎంపిటిసి బండి ముత్తమ్మ, చల్లా రామ్మూర్తి, బండి వెంకటయ్య, పల్లిపాటి అప్పారావు, బండి వెంకటనారాయణ, రామసంగం, కొలిచలం గోపయ్య, చందనబోయిన రాంబాబు, ఉపేందర్, మూర్తి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

అకాల వర్షంతో పంటలకు అపార నష్టం

$
0
0

అశ్వారావుపేట, డిసెంబర్ 17: పెథాయ్ తుఫాను కారణంగా మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షం, ఈదురుగాలులకు గాను వివిధ పంటలకు అపార నష్టం వాటిల్లింది. ముఖ్యంగా మొక్కజొన్న, అరటి, వేరుశనగ, వరి, ఎన్‌ఎల్‌ఎఫ్, వర్జీనియా పోగాకు పంటలకు అపారంగా నష్టం వాటిలింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వర్షం, ఈదురు గాలులలో మొక్కజొన్న, అరటి, పొగాకు పంటలు నేలకొరగాయి. వరి ధాన్యం కళ్యాల్లో ఉండటంతో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. వేరుశనగను కోసి పొలాల్లో ఆరబెట్టడం వలన అకాల వర్షం వేరుశనగ మొలకెత్తటమే కాకుండా గింజలు పూర్తిగా నల్లబడే ప్రమాదముందని రైతులు వాపోతున్నారు. ఎకరం వేరుశనగ పంటకు రూ 60వేల వరకు పెట్టుబడి సాగు చేయటం జరిగిందని పంట చేతికందుతున్న తరుణంలో అకాల వర్షం తమ పాలిట శాపంలా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. అదే విధంగా మొక్కజొన్న పంట ఏపుగా పెరిగి కంకికి నిండుగా గింజతో ఉందని త్వరలోనే పంట చేతికొచ్చి సొమ్ము చేసుకుందామనే తరుణంలో అకాల వర్షం కారణంగా పంట పూర్తిగా నేల మట్టమైందని రైతులు వాపోతున్నారు. వరి కోతలు పూర్తిచేసి పొలాల్లో ఉండటం, కొంత నూర్చిన ధాన్యం కళ్లాల్లో ఉండటంతో వర్షానికి తడిసిపోయింది. అదే విధంగా పొగాకు పంట సైతం నేల మట్టమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుర్రాల చెరువు, నారావారిగూడెం, పండువారిగూడెం, వినాయకపురం, మద్దికొండ, జమ్మిగూడెం, గంగారం, అచ్యుతాపురం గ్రామాల్లో సుమారు 200 ఎకరాల మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ అంచనా వేస్తున్నారు. తిరుమలకుంట, మామిళ్లవారిగూడెం, పండువారిగూడెం, నారావారిగూడెం గ్రామాల్లో 150 ఎకరాల్లో అరటి పంటకు, కొండతోగు, మల్లాయిగూడెం, రామన్నగూడెం, అనంతారం గ్రామాల్లో సుమార 200 ఎకరాల్లో వేరుశనగ, అల్లిగూడెం, తిమ్మాపురం గ్రామాల్లో సుమారు 100 ఎకరాల్లో పొగాకు పంటకు నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు. గుర్రాలపాడు చెరువు సమీపంలో నేలకొరిగిన మొక్కజొన్న పంటను ఎడిఎ అబ్దుల్‌బేగం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అకాల వర్షం కారణంగా మండలంలోని రైతులు తీవ్రంగా నష్టపోయారని, దీనిపై సర్వే చేసి ఉన్నతాధికారులకు నివేదికను పంపనున్నట్లు తెలిపారు.

ఒరిగిన పైరు... తడిసిన పనలు

$
0
0

ఖమ్మం రూరల్, డిసెంబర్ 17: పెథాయ్ తుఫాన్ ప్రభావంతో మండలంలోని పలు గ్రామాలలో కోసిన వరిపంట తడిసి ముద్దయింది. ఖరీఫ్ సాగులో భాగంగా మండలంలో రైతులు సుమారు వెయ్యి హెక్టార్లలో వరిసాగు చేశారు. ఇప్పటికే కొందరు రైతులు హార్వెస్టింగ్ మిషన్లు, కూలీల సహాయంతో వరి కోసి పంటను ఇళ్ళకు చేరువేసుకున్నారు. సుమారు 300 ఎకరాలలో వరి పంట కోసి పనలు పెట్టి ఉంది. మిగతా పంట కోత దశలో ఉంది. ఆదివారం మధ్యాహ్నం నుంచి మండలంలో కురుస్తున్న అకాల వర్షం, ఈదురు గాలులకు కోతకు వచ్చిన వరిపైరు నేలకొరిగింది. కోసి పనలు పెట్టిన, కల్లాల్లో ఆరబోసిన వరిధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది. వరి ధాన్యం కాపాడుకునేందుకు రైతులు పడరానిపాట్లు పడ్డారు. సోమవారం మండల వ్యవసాయాధికారి నాగేశ్వరరావు మండలంలోని తల్లంపాడు, గుదిమళ్ళ, ఆరెకోడు తదితర గ్రామాలలో పర్యటించి పంటల పరిస్థితిని పరిశీలించారు.

తడిసిన పంటను కాపాడుకోవాలి
రైతులు తడిసిన వరిపంటను కాపాడుకునేందుకు జాగ్రత్తలు పాటించాలని మండల వ్యవసాయాధికారి నాగేశ్వరరావు సూచించారు. రెండు మూడు రోజులు తుఫాన్ ప్రభావం ఇలాగే కొనసాగితే తడిసిన పంట మొలకలొచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. వర్షం ప్రభావం ఇంతటితో ఆగిపోతే తడిసిన వరి పనలపై ఉప్పు నీళ్లు స్ప్రే చేస్తే మొలకలు రాకుండా కాపాడుకోవచ్చని ఏవో సూచించారు.

Viewing all 69482 articles
Browse latest View live