Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

ఏన్కూరులో భారీ వర్షం

0
0

ఏన్కూరు, డిసెంబర్ 17: తుఫాన్ ప్రభావంతో మండలంలో సోమవారం భారీ వర్షం కురిసింది. దీంతో మిర్చి తోటలు, కూరగాయలు, ఆకు కూరల తోటలు మొత్తం నీట మునిగి రైతులు ఆందోళన చెందుతున్నారు. కల్లాల్లో, ఇళ్ల ముందు, మార్కెట్‌లో వరి ధాన్యం మొత్తం తడిసి ముద్దయింది. ఎన్నో వ్యయప్రయాసలతో పంటలు సాగు చేసి పండించినా చేతికందే సమయానికి తుఫాన్ రూపంలో పంటలు అన్ని నాశనం కావటంతో మండల రైతాంగం లబోదిబో మంటున్నారు. ప్రస్తుతం వరి ధాన్యం కొంత ఇళ్లకు చేరింది. మిర్చి తోటలు పూత కాతతో కళకళలాడుతున్నాయి. కొన్ని గ్రామాలలో టమాట, వంగ, బెండ, బీర, చిక్కుళ్లు, మునగ, కరివేపాకు తదితర పంటలు సాగు చేశారు. తుఫాన్ ప్రభావంతో గాలితో కూడిన వర్షం రావటంతో మిర్చి తోటలు గాలికి కింద పడిపోతున్నాయని, కూరగాయల తోటల్లో నీరు నిలిచి పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభం నుండి పంటలన్నింటికి చీడపీడలతో ఇబ్బందులు పడుతూ వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఎన్నో కష్టాలు పడ్డ రైతులకు పెథాయ్ తుఫాన్‌తో పంటలన్ని నీళ్లపాలై అప్పుల పాలైపోతున్నామని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షానికి గ్రామాలలోని అంతర్గత రోడ్లన్నీ జలమయమయ్యాయి. చలి గాలితో కూడిన వర్షం రావటంతో ప్రజలు ఇండ్లలో నుండి బయటకు రావటానికి భయపడి పోతున్నారు. మండలంలో ఆదివారం రాత్రి నుండి సోమవారం మద్యాహ్నం వరకు విద్యుత్ అంతరాయం కలిగింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులు స్పందించి పంట నష్టాన్ని సర్వే చేసి ప్రభుత్వం నుండి రైతాంగానికి సహాయం అందే విధంగా చర్యలు తీసుకోవాలని మండల రైతులు కోరుతున్నారు.

మండలంలో 945 ఎకరాల వరిపంట నష్టం

కామేపల్లి, డిసెంబర్ 17: తుఫాన్ ప్రభావం వల్ల మండలంలో 940 ఎకరాలు వరిపంట నష్టం వాటిల్లినట్లు మండల వ్యవసాయాధికారులు సోమవారం అంచనా వేశారు. గత రాత్రి నుండి మండలంలో కురుస్తున్న తుఫాను ప్రభావం వల్ల వర్షాలకు వరిపంట తీవ్రంగా నష్టం వాటిల్లింది. దీంతోపాటు పత్తి, మిర్చి పంటలు సైతం పాక్షికంగా నష్టం వాటిల్లినట్లు అంచనాలు చేస్తున్నారు. ఒకవైపు వర్షాభావంతో ఇతర నీటి వనరులు, బోరుబావుల ద్వారా ఎంతో కష్టపడి పండించుకున్న వరిపంట చేతికందే సమయంలో తుఫాను ప్రభావం వల్ల వర్షానికి నీటిపాలవ్వడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆరుగాలం శ్రమించి చేతికందిన పంట చేజారిపోవడంతో వారు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. కొందరు రైతులు మిషన్‌తో వరిపంటను కోయగా మరికొందరు పశుగ్రాసం కోసం కూలీలతో వరిపంటను కోయించారు. ఇవన్నీ వరిపొలాల్లో ఉండగానే వర్షం తాకిడితో పంటమొత్తం నీటి పాలయ్యాయి. సోమవారం మండల వ్యవసాయాధికారి తారాబాయి వివిధ గ్రామాల్లో నష్టపోయిన వరిపంటను పరిశీలించి అంచనాలు రూపొందించారు. 243 ఎకరాలు నిలిచిన వరి, 702 ఎకరాలు నీట మునిగిన వరి నష్టపోయినట్లు నివేదికలను ప్రభుత్వానికి అందజేశారు. అదే విధంగా తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.


పెథాయ్ తుఫాన్‌తో రైతుకు తీరని నష్టం

0
0

జూలూరుపాడు, డిసెంబర్ 17: పెథాయ్ తుఫాన్ కారణంగా గత రెండు రోజులుగా కురిసిన అకాల వర్షానికి మండలంలో రైతులు సాగు చేసిన వరి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కాకర్ల, జూలూరుపాడు, గుండెపుడి, పడమట నర్సాపురం, వెంగన్నపాలెం తదితర ప్రాంతాల్లో వరి పంటను కోసి పొలాల్లో ఉన్న సమయంలో వర్షం ముంచుకురావటంతో పంట దెబ్బతిని రైతులకు తీరని నష్టం జరిగింది. ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంట తీరా చేతికొచ్చిన తరుణంలో వర్షార్పణం కావటంతో రైతులు దిక్కుతోచక బిక్కమొఖం వేస్తున్నారు. ఇదిలా ఉండగా మండలంలోని పలు గ్రామాల్లో సాగులో ఉన్న మొక్కజొన్న వర్షంతోపాటు బలమైన ఈదురుగాలులకు నేలమట్టం కావటంతో పంట పూర్తిగా దెబ్బతింది.

తుఫాన్‌కు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఏఓ
వేంసూరు, డిసెంబర్ 17: ఫెథాయ్ తుఫాన్‌తో మండలంలో దెబ్బతిన్న పంటలను వ్యవసాయ అధికారి రామ్మోహనరావు సోమవారం పరిశీలించారు. కందుకూరు, దుద్దెపూడి, భరిణిపాడు, అమ్మపాలెం గ్రామంలో పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో ఆయన పర్యటించి సహాయక చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు రైతులకు వివరించారు. ప్రధానంగా అమ్మపాలెం, దుద్దెపూడి గ్రామాల్లో సుమారు 350 ఎకరాల్లో వరి పంట నష్టం జరిగినట్లు అంచనాలు వేశారు. వరి మడులలో నీరు నిల్వ లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని రైతులకు సూచించారు. తడిసన పంట మొక్క వచ్చే సూచనలు కనిపిస్తే పంటకు ఉప్పు నీటితో పిచకారి చేసి మొలక రాకుండా కొంత మేర పంట కాపాడుకోవచ్చని తెలియజేశారు. అత్యవసరం అయితే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని, ఒకవేళ వస్తే తడవకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట ఏఈఓలు ఆశాజ్యోతి, అనూష పలువురు రైతులు ఉన్నారు.

నిండా ముంచిన పెథాయ్ తుపాన్
* చేతికొచ్చిన పంట నీళ్ళపాలు * కంట నీటితో రైతులు

సత్తుపల్లి, డిసెంబర్ 17: పెథాయ్ తుఫాన్ ప్రభావం సత్తుపల్లి మండలంలో తీవ్ర నష్టం మిగిల్చింది. సోమవారం సత్తుపల్లి మండలంలో 88.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రెండు రోజులుగా వీస్తున్న చలిగాలులు, ఆదివారం రాత్రి, సోమవారం కురిసిన వర్షానికి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం బస్తాలు, రైతులు ఆరబోసుకున్న ధాన్యం రాసులపై పట్టాలు కప్పుకుని, వాటిచుట్టూ నీళ్ళు పోయేందుకు పారలతో కాలువలు తీసే పనిలో నిమగ్నమయ్యారు. తుంబూరు, సదాశివునిపేట, కిష్టారం ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉన్న ధాన్యం బస్తాలను వర్షంలోనే కూలీలతో లారీలలో లోడ్ చేసుకున్నారు. కొనుగోలు కేంద్రాలలో ఆరబోసుకున్న ధాన్యం వరద నీరు చేరి తడిసిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. సదాశివునిపాలెం, తుంబూరు గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిల్వ ధాన్యం బస్తాలను ఐకేపి అధికారులు సందర్శించి లారీలకు లోడింగ్ కేటాయించారు. చేతికొచ్చిన పంట అమ్ముకునే సమయంలో తుఫాన్ రూపంలో ముంచిందని రైతులు వాపోతున్నారు. బాసారం, కొమ్ముగూడెం, రుద్రాక్షపల్లి, గంగారం, తుంభూరు, గ్రామాలలో సీడ్ మొక్కజొన్న చేలు గాలులకు ఒరిగిపోయాయి.. ఖరీప్ నార్లు పోసుకున్న రైతులు ఈ వర్షం ఎంతగానో ఉపయోగపడిందని, నారుమళ్ళు సైతం మునిగిపోయాయని తెలిపారు. కిష్టారం గ్రామంలోని పాలకుర్తి భూషణం ఇళ్ళు వరదనీటితో నిండిపోయిందని తెలిపారు.

నేడు వైకుంఠ ఏకాదశి

0
0

ఖమ్మం(కల్చరల్), డిసెంబర్ 17: సంవత్సరానికి ఉన్న 24 ఏకాదశుల్లో ధనుర్మాసలో శుక్లపక్షంలో వచ్చే ఏకదశిని వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని అంటారు. దీనికున్న విశిష్టత, ప్రత్యేకతలు భక్తులకున్న విశ్వాసాలకు నిదర్శనంగా నిలుస్తాయి. ఆ ఏకాదశిని మంగళవారం నిర్వహించేందుకు భక్తులు సిద్ధమయ్యారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని జిల్లాలోని వైష్ణవాలయాలు ముస్తాబయ్యాయి. ముక్కోటి ఏకదశినాడు వైష్ణవాలయాల్లో స్వామి ఉత్తర ద్వారం నుండి దర్శనం ఇస్తారు. ఉత్తర ద్వారం ద్వారా శ్రీమన్నారాయణుడ్ని దర్శించుకుంటే పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఈ దర్శనం సూర్యోదయానికి ముందే చేసుకుంటే ముక్తి లభిస్తుందని వేదాలు చెబుతున్నాయి. ఈ రోజున ఆలయాలకు వెళ్ళి ఆ శ్రీమన్నారాయణుడ్ని దర్శించుకుంటే మూడు కోట్ల ఏకదశులతో సమానమని భక్తుల నమ్మకం. దీనితో భక్తులు తెల్లవారుజామునే దగ్గరలోని రామాలయాలు, వెంటేశ్వరాలయాలకు వెళ్ళి స్వామివారిని దర్శంచుకుని ప్రత్యేకపూజలు, హోమాలు, అభిషేకాలు, ప్రవచనాలు నిర్వహిస్తుంటారు. ముక్కోటి ఏకదశికి భక్తులు రోజంతా ఉపవాసదీక్షను చేపట్టి రాత్రంతా జాగరణ చేస్తారు. తరువాత జపం, ధ్యానంతో రోజంతా గడుపుతారు. ఏకదశి నాడు ఉపవాసదీక్ష చేసిన అనేక మంది భక్తులు తెల్లవారే ద్వాదశినాడు అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తారు. కొంతమంది భక్తులు ఇంటి పక్కలవారిని, దెగ్గర బంధుమిత్రులను ఇంటికి ఆహ్వానించి కలిసి భోజనంచేసి ఉపవాసదీక్షను వదిలేస్తారు. ముక్కోటి ఏకదశికి జిల్లాలోని వైష్ణవాలయాలను సుందరంగా తీర్చిదిద్దారు. నగరంలోని ఎనె్నస్పీ క్యాంపులోని శ్రీ కోదండరామాలయం, మామిళ్ళగూడెంలోని రామాలయం, ప్రభాత్ టాకీస్ వద్ద గల రామాలయం, కమాన్‌బజార్‌లోని శ్రీ వెంకటేశ్వరాలయం, యుపిహెచ్ కాలనీలోని అభయ వెంకటేశ్వరాలయం తదితరాలయాలను నిర్వాహకులు సుందరంగా తీర్చిదిద్దారు.

హంస వాహనంపై వైకుంఠరాముడు

0
0

బద్రాచలం టౌన్, డిసెంబర్ 17: గౌతమీ నదీ తీరంలో దీపకాంతుల వెలుగు జిలుగులు, భక్తజన సందోహం నడుమ అటు శాస్త్రోక్తంగా వేదఘోష వినిపిస్తుండగా.. ఇటు భక్తకోటి శ్రీరామనామస్మరణ చేస్తుండగా.. మనోహరంగా అలంకరించిన హంస వాహనంపై శ్రీ సీతాలక్ష్మణ సమేతుడైన నీలిమేఘశ్యాముడు శ్రీరాముడు రాజఠీవితో దర్శనమిచ్చారు. ఈ దృశ్యాన్ని చూసిన భక్తులు రామా.. రామా అంటూ జయజయధ్వానాలు చేశారు. సోమవారం సాయంత్రం సంధ్యవేళ చిరుజల్లులు కురుస్తుండగా హంసతూలికా యంత్ర వాహనంలో స్వాములోరు దర్శనం ఇస్తుంటే రాజసం ఉట్టిపడింది. ఏటా ముక్కోటి పర్వదినానికి ముందు హంసాలంకృత తెప్పపై సీతారామచంద్రస్వామిని విహరింపజేయడం ఆనవాయితీ. కానీ ఈ ఏడాది స్వామిని హంస వాహనంపై ఆశీనుల్ని చేసి పూజా క్రతువులు మాత్రమే పూర్తిచేశారు. వాతావరణం మార్పు చెందడం, వర్షం విపరీతంగా కురుస్తుండటంతో నెలకొన్న ఇబ్బందుల దృష్ట్యా విహారాన్ని కొనసాగించ లేకపోయారు. ఈ ఉత్సవానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి కళ్లారా వేడుకను చూసి ఆనందపరవశులయ్యారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి తెప్పోత్సవం వైభవంగా జరిగింది. తెప్పోత్సవాన్ని భక్తులు నయనానందకరంగా తిలకించి పరవశించి పోయారు. రామాలయంలో తిరుమంగై ఆళ్వార్ పరమపదోత్సవం అనంతరం శ్రీ సీతారామ చంద్రస్వామిని విశేషంగా అలంకరించారు. మధ్యాహ్నం 3గంటలకు దర్బార్ సేవ నిర్వహించారు. అనంతరం స్వామివారు 4.30 గంటలకు రామాలయం నుంచి భారీ ఊరేగింపుగా బయలుదేరారు. గోదావరి నదీ తీరానికి ఊరేగింపుగా బయలుదేరిన క్రమంలో భక్తుల కోలాటాలు, రామనామ స్మరణ, మేళతాళాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణలు, సంకీర్తనలతో గోదావరి తీరం మార్మోగింది. ఉత్సవానికి తరలివచ్చిన భక్తజనంతో పావన గౌతమీ తీరం భక్త్భివంతో ఉప్పొంగింది. ముందుగా హంస వాహనానికి దిష్టి తీశారు. వాహనాన్ని నడిపే వ్యక్తిని గుహుడుగా భావించి స్వామివారి శేషవస్త్రాలు ఇచ్చారు. అనంతరం స్వామిని వాహనంపైకి తీసుకెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన జరిగాక ఉత్సవమూర్తులను హంస వాహనంపై ఉంచారు. ఆద్యంతం ఈ ఉత్సవం కన్నులపండువగా జరిగింది.
రాజాధిరాజుగా రామయ్య
గోదావరి తీరంలో తెప్పోత్సవానికి శ్రీ సీతారామచంద్రస్వామి వారిని రాజాధిరాజ వాహనంపై ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఆలయం నుంచి బయలుదేరిన స్వామిని చూసి తరించేందుకు దారి పొడవునా భక్తులు బారులుతీరారు. మహిళలు కోలాటాలు, వేద మంత్రోచ్ఛారణలు, దేవస్థానం ఆస్థాన విద్వాంసుల వాయిద్యాల నడుమ ఊరేగింపు వేడుక కోలాహలంగా సాగింది. గోదావరి తీరానికి చేరిన తర్వాత అర్చకులు ముందుగా పుణ్యజలాలతో హంస వాహనానికి సంప్రోక్షణ చేశారు. హంస వాహనంపై విహరించేందుకు విచ్చేసిన స్వామికి ఆలయ ఈవో రమేష్‌బాబు గుమ్మడికాయతో దిష్టితీసి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా వేద పండితులు చతుర్వేదాలు, నాళాయర్ దివ్య ప్రబంధాలు, పంచ సూత్రాలు, స్తోత్ర పాఠాలు చదివారు. అనంతరం మంగళహారతి, చక్రపొంగలి నివేదన చేశారు. అంతకుముందు ఆలయంలో మధ్యాహ్నం రాజభోగం, శాత్తుమురై, పూర్ణ శరణాగతితో పగల్‌పత్ ఉత్సవాలకు ముగింపు పలికారు.
శాస్త్రోక్తంగా..
స్వామిని హంసాలంకృత తెప్పపై ఆశీనులు చేసి శాస్త్రోక్తంగా పూజలు జరిపించారు. వేద పఠనం పూర్తిచేసి ప్రత్యేక ప్రసాద నివేదన చేశారు. హంస వాహనానికి చుట్టూ బలిహరణం (పొంగలి) వేశారు. సాయంసంధ్య వేళ సూర్యాస్తమయాన హంస పాన్పుపై అలంకరించిన విద్యుద్దీపాల కాంతుల్లో సీతారామచంద్రస్వామి మరింత శోభాయమానంగా దర్శనమిచ్చారు. భక్తుల జయజయధ్వానాల మధ్య తెప్పోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. తర్వాత తారకబ్రహ్మ పరబ్రహ్మగా భక్తజనులు కొనియాడుతున్న రామచంద్రుడు, జ్ఞానానికి చిహ్నమైన హంస వాహనంలో తన భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. చిరుజల్లులు కురుస్తున్నా భక్తులు భారీ సంఖ్యలోనే హాజరయ్యారు. కాగా మంగళవారం స్వామివారు భక్తులకు ఉత్తరద్వార దర్శనంలో దర్శనమివ్వనున్నారు. అందుకు తగిన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. తెప్పోత్సవ కార్యక్రమంలో ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే పొదెం వీరయ్య, భద్రాచలం జడ్జి రాధిక, జిల్లా జాయింట్ కలెక్టర్ కె వెంకటేశ్వర్లు, సబ్ కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎస్పీ సునీల్ దత్, ఏఎస్పీ సంగ్రామ్‌సింగ్ పాటిల్, ఆలయ ఈవో తాళ్ళూరి రమేష్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.

అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

0
0

ఖమ్మం(ఖిల్లా), డిసెంబర్ 17: గ్రీవెన్స్‌డేలో అందిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సత్వరమే పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అయోషా మస్రత్ ఖానం అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్‌డేలో సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజల నుండి ఆర్జీలు తీసుకుని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు. పరిష్కారానికి సంబందించిన దరఖాస్తులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని సూచించారు. తమ పరిధిలోని వినతులపై సమస్య స్వభావాన్ని అర్జీదారులకు లిఖిత పూర్వకంగా తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామ, మండల స్థాయిలో పరిష్కారమయ్యే వినతులు జిల్లా కేంద్రానికి రాకుండా అధికారులు పరిష్కరించాలని సూచించారు. గ్రీవెన్స్‌డేలో కార్పొరేషన్ కమిషనర్ జె శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరెడ్డి, ఆర్‌టిఓ శంకర్‌నాయక్, డిఇఓ మదన్‌మోహన్, బిసి సంక్షేమ శాఖ అధికారి హృషికేషిరెడ్డి, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

పంచాయతీ ఎన్నికలపై ప్రత్యేక వ్యూహాలు

0
0

ఖమ్మం, డిసెంబర్ 17: సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో అన్ని పార్టీలు పంచాయతీ ఎన్నికలపై దృష్టి సారించాయి. ఈ నెల 26వ తేదీన పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని భావిస్తున్న నేపథ్యంలో ఎవరికి వారు మండలాల వారీగా తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం నేతలకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. అదే క్రమంలో రిజర్వేషన్ ప్రక్రియ ఆధారంగా ఆయా గ్రామాల్లో గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్థుల జాబితా కూడా తయారుచేస్తున్నారు. ఖమ్మం జిల్లా పరిధిలో 20 మండలాలు, 584 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 5,338 వార్డులు ఉండగా ప్రతి వార్డుకు ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తున్నారు. తాజా లెక్కల ప్రకారం 7,20,045 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 3,57,947 మంది కాగా, మహిళలు 3,62,054 మంది, ఇతరులు 44 మంది ఉన్నారు.
కాగా మెజార్టీ సర్పంచ్ స్థానాలను గెలుచుకోవడంతో పాటు అత్యధిక వార్డుల్లో పాగా వేసి ఉపాధ్యక్ష స్థానాలను కూడా కైవసం చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఖమ్మంలో టీఆర్‌ఎస్, మధిర, పాలేరులో కాంగ్రెస్, సత్తుపల్లిలో తెలుగుదేశం, వైరాలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి విజయం సాధించారు. వైరాలో గెలిచిన రాములునాయక్ టీఆర్‌ఎస్‌లో చేరిన నేపథ్యంలో టీఆర్‌ఎస్‌కు ఇప్పుడు రెండు స్థానాలున్నట్లయింది. ఆయా నియోజకవర్గాల్లో మెజార్టీ సర్పంచ్‌లను గెలిపించాల్సిన బాధ్యత పార్టీ శాసనసభ్యులకే అన్ని పార్టీలు అప్పగించాయి. శాసనసభ్యులు లేనిచోట్ల ప్రధాన నాయకులకు బాధ్యతలు అప్పగించారు. ఈ నెల 20వ తేదీ తర్వాత మండలాల వారీగా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తూ నేతలను, కార్యకర్తలను సన్నద్ధం చేసేందుకు కాంగ్రెస్, టీఆర్‌ఎస్, తెలుగుదేశం వ్యూహం రచిస్తున్నాయి. మరోవైపు ఖమ్మం జిల్లాలో బలమైన పార్టీలుగా ఉన్న సీపీఎం, సీపీఐ, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ సాధారణ ఎన్నికల్లో ఫలితాలు రాబట్టకపోయినప్పటికీ క్షేత్రస్థాయిలో పంచాయతీలలో తమ పట్టు నిరూపించుకునేందుకు ఇప్పటికే గ్రామాల వారీగా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. కొంతకాలం క్రితమే నేతలతో సమావేశాలు నిర్వహించి బాధ్యతలు అప్పగించిన ఈ పార్టీలు కాంగ్రెస్, టీఆర్‌ఎస్, తెలుగుదేశం పార్టీలకంటే పంచాయతీ ఎన్నికల ప్రణాళికలో ముందంజలోనే ఉన్నాయి. ఎవరికి వారు ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయా గ్రామాల్లో తమ పార్టీకి వచ్చిన ఓట్లు, పంచాయతీ గెలవాలంటే కావాల్సిన ఓట్లు లెక్కవేస్తున్నారు. పంచాయతీల్లో ఖచ్చితంగా పట్టు సాధించేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తుండటం విశేషం.

నేడు ఉత్తరద్వార దర్శనం

0
0

భద్రాచలం టౌన్, డిసెంబర్ 17: భక్తకోటి పరమ పవిత్రంగా భావించే ముక్కోటి ఏకాదశి వేళ ఉత్తర ద్వార దర్శనానికి భద్రాద్రి దేవస్థానం ముస్తాబైంది. ఏడాదిలో ముక్కోటి రోజున ఉత్తరద్వారం గుండా దర్శనమిచ్చే నీలిమేఘశ్యాముడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తనున్నారు. డిసెంబర్ 8వ తేదీ నుంచి వైకుంఠ ఏకాదశి అధ్యనోత్సవాలు సాగగా.. తొలి పదిరోజుల పాటు పగల్‌పత్తు ఉత్సవాలను నిర్వహించారు. పగల్‌పత్తు ఉత్సవాల ముగింపును పురస్కరించుకోని సోమవారం రామాలయంలో తిరుమంగై ఆళ్వార్ పరమపదోత్సవం, వేద పఠనం గావించారు. సాయం సంధ్యవేళ పవిత్ర గోదావరిలో తెప్పోత్సవాన్ని సైతం నిర్వహించారు. అనంతరం మంగళవారం తెల్లవారుజామున ఉత్తరద్వారంలో వైకుంఠ రాముడు భక్తులకు దర్శనమివ్వనుండటంతో అందుకు అనుగుణంగా దేవస్థానం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తమ ఆరాధ్య దైవమైన భద్రాద్రి రామయ్య వైకుంఠ ధామునిగా దర్శనం ఇవ్వనుండటంతో అశేష భక్తజనం ఆ మధుర ఘడియల కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.
నాటి నుంచి ఈ సంప్రదాయమే..
భక్తరామదాసు పాల్వంచ పరగణాకు తహసిల్దార్‌గా ఉన్న కాలం నుంచి వస్తున్న సంప్రదాయంలో భాగంగా.. వైకుంఠ ఏకాదశి నాడు ముందుగా స్థానిక తహసిల్దార్ ప్రత్యేక అభిషేకం నిర్వహించనున్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి మేళతాళాలు, భాజాభజంత్రీల నడుమ రామాలయం నుంచి ఉత్తరద్వారం వైపు స్వామిని తీసుకు రానున్నారు. సరిగ్గా ఐదు గంటల సమయంలో స్వామివారు వైకుంఠ రామునిగా భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ సమయంలో ఆరాధన, శ్రీరామ షడాక్షరి మంత్ర సంపుటిత అష్టోత్తర శతనామార్చన, చతుర్వేద విన్నపాలు గావించనున్నారు. ఇదే సమయంలో దేవస్థానం వైదిక సిబ్బంది ద్వారదర్శన ప్రాశస్త్యం వివరించనున్నారు. అనంతరం శరణాగతి గద్య విన్నపం, తిరుపల్లాండు, మంగళాశాసనం, 108 వత్తులతో హారతి సమర్పించి అడుగో కోదండపాణి కీర్తనతో వైకుంఠ ద్వారం నుంచి స్వామి ఉత్థాపన చేయనున్నారు.

నులిపురుగుల నివారణకు చిట్కాలు

0
0

నులిపురుగుల సమస్య కేవలం పిల్లల్లోనే కాదు.., పెద్దల్లో కూడా కనిపిస్తుంది. పిన్ వార్మ్స్, రౌండ్ వార్మ్స్, హుక్ వార్మ్స్.. ఇలా రకరకాల పురుగులు జీర్ణాశయంలోకి చేరుతూ ఉంటాయి. వీటిని నివారించడానికి రకరకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కానీ నులిపురుగులకు అల్లోపతి చికిత్స కంటే ఆయుర్వేద చికిత్సలే చక్కగా పనిచేస్తాయి. నులిపురుగులు కడుపులో ఉన్నట్లు తెలుసుకోవాలంటే.. అతిగా ఆకలివేయడం లేదా ఆకలి లేకపోవడం, కడుపు మందంగా అనిపించడం, రక్తహీనత, మలద్వారం వద్ద దురద, దగ్గు, వికారం, వాంతులు, విరేచనంలో పురుగులు కనబడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నులిపురుగులు రాకుండా ఉండాలంటే కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి.
* ఇంట్లో ప్రతిరోజూ కాచి, చల్లార్చిన నీటినే తాగాలి.
* పండ్లు, కూరగాయలను పరిశుభ్రంగా కడిగిన తరువాతే వినియోగించాలి. ముఖ్యంగా మాంసాహారం విషయంలో ఈ శుభ్రత మరింత అవసరం.
* గోర్లు కొరికే అలవాట్లు ఉంటే మానుకోవాలి.
* మలవిసర్జనకు వెళ్లి వచ్చిన తరువాత చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి.
* అపరిశుభ్రమైన ప్రాంతాల్లో ఆహారం తినకూడదు.
చిట్కాలు
* ఇంట్లో ఎవరికైనా నులిపురుగులు ఉన్నాయని తెలిస్తే మిగిలిన కుటుంబ సభ్యులు కూడా చికిత్సను తీసుకోవాలి.
* ఒక్కసారి కడుపులో పురుగుల సమస్య వచ్చిందంటే చాలు.. అవి వాటి సంతానాన్ని త్వరగా వృద్ధి చేసుకుంటాయి. కానీ వీటి నివారణ మాత్రం అంత సులభం కాదు.
* ముందుగా నులిపురుగుల సమస్యతో బాధపడేవారు తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
* ఎండగాల చూర్ణం, త్రిఫల చూర్ణం, పిప్పరీ చూర్ణంలను సరైన మోతాదుల్లో తీసుకుని బాగా కలుపుకోవాలి. రోజూ రెండు పూటలా వయసును అనుసరించి తేనెతో కలిపి తీసుకోవాలి. డాక్టరు సలహాతో మాత్రమే మందులను తీసుకోవాలి సుమా..
* కొబ్బరి తురుము కూడా నులిపురుగులకు చక్కని మందులా పనిచేస్తుంది. డాక్టరు సలహా మేరకు వయసును అనుసరించి తీసుకోవాలి. రెండు గంటల తర్వాత చిట్టాముదాన్ని తాగించాలి. అప్పుడు నులిపురుగులు చనిపోయి బయటకు వచ్చేస్తాయి.
* క్యారెట్ తురుమును వరుసగా వారం రోజులపాటు తింటే కడుపులోని పురుగులు మలం ద్వారా బయటకు వచ్చేస్తాయి.


పరిమళాల మొక్కలు

0
0

మొక్కలు ఇంటికి అందాన్ని తెచ్చిపెడతాయి. కొన్ని సువాసనలు వెదజల్లితే, మరికొన్ని ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఇంకొన్ని ఆరోగ్యాన్నిస్తాయి. అలా పెంచుకునే కొన్ని మొక్కలను చూద్దామా..
మరువం
ఇది సువాసనను అందిస్తుంది. దీన్ని బాల్కనీలో పెంచుకోవచ్చు. దీని ఆకులపై సన్నని పోగులుంటాయి. ఈ ఆకుల మొదళ్లలో పరిమళాలను వెదజల్లే గ్రంథులుంటాయి. అవే సువాసనను వ్యాపింపజేస్తాయి.
మల్లె
మల్లెల్లో చాలా రకాలున్నాయి. బొండు మల్లె, సన్నజాజి, రెక్క మల్లె.. ఇలా.. వీటిలో ఇష్టమైనదాన్ని ఎంచుకుని పెంచుకోవచ్చు. కొన్ని తీగలా పాకితే, మరికొన్ని ఒకేచోట పొదలా పెరుగుతాయి. కొంచెం పెద్ద కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. మల్లెల్లో కొన్ని రకాలు సంవత్సరం మొత్తం పూస్తూనే ఉంటాయి. వీటి నుంచి వచ్చే సువాసన మనస్సుకు ఎంతో సాంత్వననిస్తుంది.
నిమ్మ
నిమ్మ మొక్క ఉపయోగాలు అనేకం. దీనిలో పూలు, ఆకులు, కాండం, కాయలు.. ఇలా అన్నీ మనకు ఉపయోగమే.. ఔషధయుక్తమే.. ఈ మొక్క నుంచి గాఢమైన సువాసన వెలువడుతుంది. అలాగే నిమ్మ నూనెలను కొవ్వొత్తులు, సబ్బుల తయారీలో వాడతారు. బొన్సాయ్ రకం తెచ్చుకుంటే ఇంటికి కొత్త అందం వస్తుంది.
ఆర్కిడ్స్
ఈ పూలు భిన్న వర్ణాల్లో, విభిన్న ఆకృతుల్లో ఉండి ఆహ్లాదాన్ని పంచుతాయి. ఈ రోజుల్లో పెళ్లిళ్లు, పండుగల సమయాల్లో వీటిని అలంకరణలో ఉపయోగిస్తున్నారు.
టీ రోజ్ బిగోనియా
ఈ పూలు చాలా అందంగా ఉంటాయి. ఏడాదంతా పూస్తూనే ఉంటాయి. ఇవి అందంగా, ఆకర్షణీయంగా ఉండటమే కాదు.. సువాసనలను వెదజల్లుతాయి.
వాము
ఇది పుదీనా కుటుంబానికి చెందిన మొక్క. ఇంటి పెరట్లో ఉండాల్సిన మొక్కల్లో ఇది ఒకటి. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దీని ఆకులను నేరుగా తినొచ్చు. ఇలా తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు, కడుపునొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి.

రంగవల్లి

0
0

19చుక్కలు
1వచ్చే వరకు
సరిచుక్కలు
=====================================================
ముగ్గులకు ఆహ్వానం

నింగిలోని హరివిల్లులను నేలపైన పేర్చి.. కనులకింపైన రంగుల్ని అందంగా అద్దితే అది రంగుల మాలికవుతుంది. ముంగిట్లో రంగవల్లిక అవుతుంది. ధనుర్మాసం సందర్భంగా తెలుగు ముంగిళ్లలో రంగవల్లులను తీర్చిదిద్దడం ఆనవాయితీ.. ఆ సందర్భంగా ముగ్గులకు ఆహ్వానం పలుకుతోంది మాతృభూమి. ఆసక్తి కలవారు కింది చిరునామాకు ముగ్గులను పంపగలరు.
సూచనలు
* ముగ్గులను పంపేవారు ఎ4 సైజు తెల్లకాగితంపై వేయాలి.
* ముందుగా నల్లని ఇంక్‌తో ఔట్ లైన్ గీసిన తరువాత అందులో రంగుల్ని నింపాలి.
* ఎన్ని చుక్కలను పెట్టి ముగ్గులు వేశారో.. అంటే సరిచుక్కలా, బేసి చుక్కలా, సందు చుక్కలా.. అనే విషయం స్పష్టంగా రాయాలి.
* ముగ్గుతో పాటు, మీ పాస్‌పోర్ట్ సైజు కలర్ ఫొటోని, చిరునామాని జతచేయాలి.
* డౌన్‌లోడ్ చేసిన ముగ్గులు కాక, స్వయంగా చేతితో వేసిన ముగ్గులనే పంపాలి. అదీ చుక్కల ముగ్గులకే ఆహ్వానం.
======================================================================
ముగ్గులు పంపాల్సిన చిరునామా:

ఎడిటర్,
ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్- 500 003.

చలిని తరిమేద్దాం

0
0

చలిని తరిమేయడానికి స్వెటర్, జర్కిన్ వేసుకునే రోజులు ఎప్పుడో పోయాయి. ముఖ్యంగా నేటి తరం అమ్మాయిలైతే కనీసం వీటివైపు కూడా చూడరు. హుడీ, స్కార్ఫ్, టోపీ, షగ్.్ర. ఇలా.. నేటితరం అమ్మాయిలు ట్రెండ్‌కి, ఫ్యాషన్‌కు దగ్గరగా ఉంటూ చలిని తరిమేస్తున్నారు. వీరి అభిరుచులకు తగినట్లుగా మార్కెట్లో కూడా కొత్త కొత్త డిజైన్లు కనికట్టు చేస్తున్నాయి. అయితే సరైన వాటిని ఎంచుకోవడం తెలియాలి.. లేకపోతే ట్రెండీ సంగతి దేవుడెరుగు.. మొరటుగా కనిపిస్తారు. అందుకే కాలేజీకి వెళ్లేవారు ఆధునికతను, ఫ్యాషన్‌ను కలబోసిన డిజైనర్ వేర్‌లను ఎంచుకుని ట్రెండీగా, అందంగా కనిపిస్తున్నారు.
స్కార్ఫ్
చలిని ఆపడంలోనూ, స్టైల్‌గా కనిపించేలా చేయడంలోనూ దీని ప్రత్యేకతే వేరు. స్కార్ఫ్ అనేది ఎవర్‌గ్రీన్ ట్రెండ్.. ఈ స్కార్ఫ్‌లో రకరకాల డిజైన్లు, ప్రింట్లు ఉన్నాయి. సందర్భానుసారంగా వీటిని ఎంచుకుంటే ఆ అందమే వేరు. ముఖ్యంగా కాశ్మీరీ స్కార్ఫ్ అయితే ఇక చెప్పాల్సిన పనేలేదు. బ్లాంకెట్ వ్రాప్ స్కార్ఫ్‌లు కొత్తగా, ట్రెండీగా ఉంటాయి. ఇది కాస్త పెద్దగా ఉండి మల్టీలేయర్స్‌లో స్టైలిష్‌గా కనిపిస్తుంది.
షగ్
నేటి అమ్మాయిలు వాళ్ల ఆహార్యానికి మరింత అందాన్ని అందించే షగ్‌న్రు ఎంచుకుంటున్నారు. షగ్ కూడా స్వెటర్‌లాంటిదే కానీ స్వెటర్ అంత మందంగా, బరువుగా ఉండదు. షగ్ చాలా తేలికగా, పలుచగా ఉండి శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తుంది. చలికాలంలో ఇది వేసుకోవడం వల్ల శరీరాన్ని చలి నుంచి కాపాడుకుంటూ ఫ్యాషన్‌గానూ, ట్రెండీగానూ కనిపించవచ్చు. స్వెటర్ నడుము వరకూ ఉంటే షగ్ మాత్రం ఛాతి కింది భాగం మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా అనేక ఆధునిక హంగులను అద్దుకుని స్లీవ్స్, ఫుల్‌స్లీవ్స్, నో స్లీవ్స్, వేస్ట్ లాంగ్, ఫుల్ లాంగ్ వంటి రకరకాల లెంగ్త్‌లలో, రకరకాల ఫ్యాషన్లలో లభిస్తుంది. పాశ్చాత్య దుస్తులపై వేటికైనా చక్కగా నప్పే షగ్‌ల్ల్రో కాలర్డ్, క్రాప్డ్, టై అప్, బొహీమియన్, ఫ్రింజ్ వంటి ఎన్నో రకాలు ఉన్నాయి. వేసుకునే దుస్తులను, శరీరాకృతి అనుసరించి వీటిని ఎంచుకోవచ్చు. ట్యాంక్ టాప్స్, ఆఫ్ షోల్డర్ షర్ట్‌ల మీదకు కట్ స్లీవ్స్ బాగుంటాయి. రోజువారీ వేసుకోవాలనుకుంటే షిఫాన్, జార్జెట్ రకాలను ఎంచుకోవచ్చు. వీటిల్లో ఫ్లోరల్ డిజైన్స్ అయితే మరింత బాగుంటాయి. ఇవి లాంగ్ స్కర్టుల పైకి బాగుంటాయి. జీన్స్ పాంట్స్‌పైకి స్లీవ్‌లెస్ షగ్స్ నప్పుతాయి. వీటిపైకి ట్యాంక్, స్పగెట్టీ టాప్స్ అదిరిపోతాయి.
మునుపు షగ్ ఉన్నితో మాత్రమే తయారయ్యేది. నేడు క్రోషియా, అపై నెట్టెడ్, కాశ్మీరీ కాటన్, మిక్స్‌డ్ కాటన్, సింథటిక్ కాటన్, షిఫాన్, జార్జెట్ లేస్, డెనిమ్ క్లాత్‌లలో కూడా దొరుకుతోంది. నేటితరం అమ్మాయిలు ఎక్కువగా షిఫాన్, డెనిమ్, జార్జెట్‌లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రంగుల్లో కూడా నేడు చాలా మార్పులు వచ్చాయి. మ్యాచింగ్‌ను తప్పనిసరిగా పాటించే ఫ్యాషన్ గర్ల్స్‌కు రకరకాల రంగులు తప్పనిసరి. మునుపు షగ్‌ల్రు కేవలం నలుపు, తెలుపు రంగుల్లోనే వచ్చేవి. కానీ ఇప్పుడు అన్ని రంగుల్లోనూ లభిస్తున్నాయి. అమ్మాయి వేసుకున్న దుస్తులకు కాస్త భిన్నంగా అంటే కాంట్రాస్ట్ రంగుల్లో షగ్‌న్రు ఎంచుకుంటే లుక్కు చాలా బాగుంటుంది. సంప్రదాయ దుస్తులు అంటే పంజాబీ డ్రస్సులపైకి పోల్కాడాట్స్, ఫ్లోరల్ పనితరం ఉన్న షగ్స్ చాలా బాగుంటాయి. ఇవి పటియాలా, జోథ్‌పూరీ పాంట్లపైకి కూడా బాగా నప్పుతాయి. షగ్స్ అన్ని శరీరాకృతుల వారికీ నప్పుతాయి. అధిక బరువు ఉన్నవారికి ముదురు రంగులు, శరీరం తీరైన ఆకృతిలో లేనివారు, నడుము భాగం లావుగా ఉన్నవారు, భుజాలు లావుగా ఉన్నవారు పొడవు చేతులుండే షగ్‌న్రు ఎంచుకుంటే బాగుంటుంది.
ఉలెన్ కోటు
మెడ చుట్టూ కప్పి ఉండే క్రూనెక్ ఉలెన్ కోటు ఎంత బాగుంటుందో.. ముఖ్యంగా కాలర్ ఉన్న షర్ట్‌లపై వేసుకుంటే మరింత అందంగా ఉంటుంది. ఈ కోటు స్కర్ట్స్, జీన్స్, ట్రౌజర్స్, లెదర్ పాంట్లపైకి ఎంతో బాగుంటాయి. టర్టిల్ నెక్ కోటు స్లీవ్‌లెస్ టాప్‌పైకి బాగుంటుంది. న్యూట్రల్ రంగుల టాప్‌లపైకి లాంగ్ కోటు బాగుంటుంది. అలాగే దీన్ని జీన్స్ జంపర్‌సూట్‌లకు, టోన్ జీన్స్‌లకు జతగా వేసుకుంటే మరింత బాగుంటుంది.

చట్టసభల్లో కొందరికేనా గుర్తింపు?

0
0

గత అర్ధ శతాబ్దకాలం నుండి పరిశీలిస్తే కొన్ని రంగాలలో మహిళా సాధికారత జరిగిందని చెప్పక తప్పదు. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళ నేడు మాకెవ్వరు సాటిలేరు, మాకు మేమే సాటి అనే రీతిలో వున్నారంటే ఎలాంటి ఆశ్చర్యం అక్కర్లేదు. మగవారితో పోటీపడుతూ, వారికన్నా మేమేమీ తక్కువని అన్ని రంగాలలో ముందంజలో పయనిస్తున్నారు.
నేడు తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలో (ప్రభుత్వ, ప్రభుత్వేతర) పనిచేసే ఉపాధ్యాయులలో ఎక్కువగా మహిళలే ఉన్నారంటే అనుమానం అక్కర్లేదు. మునుపటి నీచమైన కొన్ని ఆచార వ్యవహారాలు ప్రక్కకుబెట్టి, అక్కరకు రాని సాంప్రదాయాల జోలికి వెళ్లకుండా నేడు అన్నిరకాల పనులను చేస్తూ కుటుంబాన్ని నడిపే స్థాయిలో వున్నారు.
గతంలో అన్ని కుటుంబాలలో పురుషాధిక్యత కనిపించేది. కానీ నేడు ఎక్కువ సంఖ్యల కుటుంబాలలో మహిళలే కుటుంబాన్ని చక్కదిద్దుతున్నారంటే నమ్మక తప్పని పరిస్థితి. ప్రతి మగాడి విజయం వెనుకాల ఒక మహిళ వుంటుందంటారు, అంటే విజయానికి వారు అందించే ప్రోత్సహం ఎలాంటిదో తెలియకనే తెలుస్తుంది. అన్నిరకాల ఉద్యోగాలు చేస్తూ, శాస్తవ్రేత్తలుగా మారుతూ, అంతరిక్షయానంలోకి ప్రవేశిస్తూ, అన్నిరకాల ఆటలు సైతం మేము ఆడగలమని నిరూపిస్తూన్నారు.
గతంలో ఇందిరాగాంధీ దేశానికి ప్రధానిగా చేసి, మహిళల పాలనలో కూడా రాణించగలరని నిరూపించింది. ఆమె అడుగుజాడల్లో దేశంలోని కొన్ని రాష్ట్రాలలో మహిళలు ముఖ్యమంత్రులుగా విజయవంతమైన పాలననందించారు. 1980లలో దేశంలో ప్రవేశపెట్టిన చట్టాలు-1.తల్లిదండ్రుల ఆస్తులమీద వారి పిల్లలందరికీ ఆడ, మగ అని తేడా లేకుండా హక్కు ఉండటం. 2.విద్యా, ఉపాధి అవకాశాలలో అమ్మాయిలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించడం లాంటి చట్టాలను సమర్థవంతంగా అమలుజరిపిన మన రాష్ట్రం, చట్టసభలలో వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం అనేది దేనికి నిదర్శనం? అంటే ఇక్కడ రెండు విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి.
ఒకటి ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీ కూడా వారికి అవకాశం కల్పించకపోవడం అయితే రెండవది రాజకీయాలపట్ల మక్కువ తక్కువగా ఉండటం. కానీ నేడు కళాశాలలో, విశ్వవిద్యాలయాలలో అమ్మాయిలపై జరిగే దాడులకు నిరసనగా, వ్యతిరేకంగా పోరాడటానికి వారు చేపట్టే కార్యక్రమాలు వారి నాయకత్వ పటిమతోపాటు ధైర్యాన్ని కూడా తెలియజేస్తున్నాయి. కానీ తెలంగాణలో దాదాపు 50 శాతం వున్న మహిళలు మొన్న జరిగిన ఎన్నికలలో కేవలం 3.36 శాతం ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే, వీరి విషయంలో ఎక్కడ లోపం జరుగుతోంది?
దేశంలో రాజకీయ విభాగంలో సోనియా గాంధీ, సుష్మాస్వరాజ్, షీలా దీక్షిత్, మమతా బెనర్జి, మాయావతి, ఉమాభారతి, వసుంధర రాజే, ఆనందిబెన్, ప్రతిభాపాటిల్, మీరాకుమారి లాంటి మహిళా రాజకీయ నాయకురాళ్లను ఆదర్శంగా తీసుకొని తమ హక్కులను తాము నెరవేర్చుకోవాల్సిన బాధ్యత లేకపోలేదు.
ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ఎక్కడైనా ఎవరి కుటుంబంలోనైనా ఇంట్లో ఇల్లాలు ఆదర్శంగా నిలుస్తూ, కుటుంబ బాధ్యతలను తీసుకొని తమ కుటుంబ సభ్యుల ఆలోచనలతో, సహకారాలతో బాధ్యతలు చేపడితే ఆ కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది. చాలా గ్రామీణ సమాజాలలో మగవారు మద్యపానానికి బానిసలైనప్పుడు, తాగివచ్చిన భర్తకు తగినబుద్ధి చెబుతూ, తన నియంత్రణలో వుంచుకుంటూ, పిల్లల ఆలనా పాలనా చూస్తూ, అన్నిరకాల పనులు చేస్తూ కుటుంబ భారాన్ని సైతం మోయగలిగే ధైర్యం కలిగి, కుటుంబ పోషణను ముందుండి నడిపించడం చూస్తుంటాము. ఇవన్నీ గమనించిన ప్రభుత్వాలు సైతం ప్రభుత్వ పథకాలను మహిళలకే వర్తింపజేసే విధంగా చర్యలు తీసుకోవడం మనం గమనిస్తూనే వుంటాం. కావున రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మహిళాలోకం వర్థిల్లాలని, వారికీ తగిన ప్రోత్సాహం లభించాలని, అభివృద్ధిలో భాగం కావాలని ఆశిద్దాం!

మహాభారతంలో ఉపాఖ్యానాలు-77

0
0

ఆ విధంగా పుణ్యవతి అయిన ఆ కన్యక పంచగంగలలో, వెదురు వనాలలో తపస్సు చేసి తన శరీరాన్ని కృశింపజేసింది. తర్వాత గంగాతీరానికి వెళ్లింది. అనంతరం ఆమె మహామేరువును చేరి అక్కడ ప్రాణాయామంతో నిశ్చలంగా రాయిలా ఉండిపోయింది.తర్వాత హిమవత్పర్వతం చేరింది. తర్వాత ఆమె అనేక తీర్థాలలో తిరిగింది. ఆమె బ్రహ్మయందు భక్తి కలిగి ఉన్నది. ఈ విధంగా తపస్సు చేసి ఆమె పితామహుని సంతోషపెట్టింది. అప్పుడు బ్రహ్మదేవుడు ఆమెతో ఇలా అన్నాడు. ‘‘మృత్యుదేవీ! నీవు ఎన్నో రకాలుగా తపస్సు ఎందుకు చేస్తున్నావు?’’
ఆమె ఇలా బ్రహ్మకు సమాధానమిచ్చింది ‘‘దేవా! ఆరోగ్యంగా ఉండి దుఃఖిస్తూ బాధపడేవారి ప్రాణాలను తీయలేను. నేను నీ నుండీ ఇదే వరం కోరుతున్నాను. అధర్మం చేయడానికి నేను భయపడుతున్నాను.’’
అంత బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు. ‘‘ఈ ప్రజలను సంహరించడం నీకు అధర్మం కాదు. నా మాట ఏ విధంగానూ అసత్యం కాదు. అందువల్ల చెమటనుండి పుట్టేవి (స్వేదజ), నేలను చీల్చుకొని వచ్చేవి (ఉద్బిజ), గుడ్డునుండి వచ్చేవి (అండజ), మావి నుండి పుట్టేవి (జరాయుజాలు) ఈ నాలుగు రకాల ప్రాణులను సంహరించు. సనాతనమైన ధర్మం నిన్ను సదా పవిత్రం చేస్తుంది. ఈ కార్యంలో నీకు లోకపాలకుడైన యముడు, వ్యాధులు సహకరిస్తాయి. నేను నీకు వరం ఇస్తున్నాను. నీవు పాపరహితవు అవుతావు’’. బ్రహ్మదేవుడిలా చెప్పగా ఆమె తలవంచి నమస్కరించి ఇలా అంది.
‘‘నీ ఆజ్ఞను స్వీకరిస్తున్నాను. నా రుూ విన్నపాన్ని వినండి. లోభం, క్రోధం, మోహం, లజ్జాహీనత ఒకరినొకరు నిందించడం - ఈ దోషాలు ప్రాణుల దేహాలను ఛేదించుగాక’’
అప్పుడు బ్రహ్మ ఇలా అన్నాడు - ‘‘మృత్యుదేవతా! ఆవిధంగానే జరుగు తుంది. ప్రాణులను సంహరించు. నీకు ధర్మం లభిస్తుంది. నీ మనస్సులో కలిగే దోషాలను వదిలి నీ ధర్మం ఆచరించు’’.
మృత్యువు బ్రహ్మకు భయపడి ‘సరే’నంది. కాని ఆమె వృద్ధులను వారి ఆయువు తీరిన వారి ప్రాణాలను హరిస్తున్నది. ఆమె నుండే వ్యాధులు పుట్టాయి. వీటివల్ల ప్రాణి అస్వస్థుడు అవుతాడు. ఆయువు తీరిన తర్వాత మృత్యువు ప్రాణులకు కలుగుతుంది.
ఆయువు తీరిన తర్వాత సర్వేంద్రియాలు ప్రాణులతోపాటు పరలోకకానికి వెళతాయి. ఆ లోకంలో కర్మభోగాలు అనుభవిస్తాయి.
ఆ భోగాలు పూర్తి అయ్యాక ఈ లోకాలకి తిరిగివస్తారు.’’
మృత్యువు గురించి నారద మహర్షి చెప్పిన విషయాలు విన్న అకంపన మహారాజు అతనితో ఇలా అన్నాడు. ‘‘మునిశ్రేష్ఠా! నీవు చెప్పిన విషయాలు విని నేను కృతార్థుడనయ్యాను. ఇక పుత్రుని కోసం దుఃఖించను’’ అని పుత్రుని కోసం శోకించడం మానివేశాడు.
ఇంకావుంది...

స్వాధ్యాయ సందోహం-172

0
0

కాబట్టి సంయమన శక్తితో గార్హస్థ్య జీవితాన్ని అందరు సాఫల్యమొనర్చుకొందురు గాక!
***
రాజా! మనం మిత్రులమై సహకరించుకొందాం
వధైర్దుః శంసాన్ అప దూధ్యో జహి దూరే వా యే
అంతి వా కే చిదత్రిణః అథా యజ్ఞాయ గృణతే సుగం
కృధ్యగ్నే సఖ్యే మా రిషామా వయం తవ॥
ఋ.1.94-9.
భావం:- ఓ రాజా! దుర్భాషలు పలికేవారిని, దురాలోచనాపరులను మారణాయుధాల ద్వారా చంపివేయి. తిండిపోతులై సోమరితనంతో ఉండేవారు దగ్గరున్నా దూరంగాఉన్నా వారిని కూడ చంపివేయి. యజ్ఞప్రశంస చేసే వారిని యజ్ఞం చేసేందుకు సర్వవిధాల సౌలభ్యాన్ని కల్పించు. ఓ అగ్నిరాజా! నీ చెలిమివలన మేమెన్నడు హింసింప బడకుండెదము గాక!
వివరణ:- ఓ రాజా! దేశంలో దురాచారులు. దురాలోచనలు కలవారు లేని విధంగా రాజ్యవ్యవస్థ నేర్పరచండి. వారివలన దేశంలో సమత, శాంతి భావనలకు విఘాతం కలుగుతూ ఉంది.
అంతేకాక దేశంలో ప్రజల రక్తాన్ని త్రాగి పీల్చి పిప్పిచేసే ఉద్యోగులు దగ్గరగా ఉన్నవారినైనా దూరంగా ఉన్నవారినైనా యథాశక్తిగా తరిమికొట్టి ప్రజలను సంరక్షించండి. లేకుంటే ప్రజలలో అశాంతి, సంక్షోభాలు పెల్లుబికి రాజ్యవ్యవస్థ సమూలంగా కుప్పకూలిపోతుంది. ధార్మికులు తమతమ పనులను నిరాటంకంగా నిర్వహించుకో గలిగియుండటమే సురాజ్యవ్యవస్థకొక చిహ్నం.
ఇలా ప్రజలు రాజునకు చేసే విన్నపానికి ప్రతీకగా వేదం ‘అథా యజ్ఞాయ గృణతే సుగం కృధి’ ‘‘యజ్ఞాచరణ చేస్తామన్న ధార్మిక జనుల సత్కర్మకు సానుకూల్యాన్ని కల్పించు’’మని వైదిక పరిభాషలో పేర్కొంది. లోకంలో ఎన్నివిధాల పరోపకార కార్యాలైతే ఉన్నాయో వానినన్నింటికి వైదిక భాషలో ‘‘యజ్ఞ’’మన్నది సాధారణ నామం. కాబట్టి దేశంలో పరోపకార కార్యాలకు (యజ్ఞాలకు) విఘ్నాలు రాకుండ చూడటం రాజు కర్తవ్యమని వేద మనోగతం.
ఇక రెండవ చరణంలో రాజు- ప్రజల మధ్య స్నేహబంధముండాలని వర్ణించబడింది. ఇది దాదాపు నేటి ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతీక. ప్రజలు రాజుతో విన్నవించుకొన్న రీతిగా ‘అగ్నే సఖ్యే మారిషామా వయం తవ’ ‘‘ఓ రాజా! నీ చెలిమిలో మేమెట్టి హానిని పొందకుండెదము గాక’’అని వేదం ప్రజారాజ సంబంధం స్నేహబంధంగా ఉండాలని ఉద్ఘాటించింది. మిత్రులైనవారి మధ్య అరమరికలకు (్భదభావాలకు) తావే ఉండదుకదా!
తనువులు వేరయినా మనసులు ఒకటిగా ఉన్నవారే మిత్రులు. ఋగ్వేదమే ఒక సందర్భంలో ‘సమానా హృదయాని పః’ (ఋ.10-191-4) ‘‘మా హృదయాలు ఒకటిగా ఉండునుగాక’’అని మిత్రుల మనోధర్మాన్ని నిర్వచించింది. కాబట్టి రాజు, ప్రజలు మిత్రులుగా ఏకహృదయులై పరస్పర సహకారభావంతో మెలగాలని వేదమెప్పుడో వచించింది. ఈ భావన నేటి ప్రజాస్వామ్య భావనకు పునాదిగా భావించవచ్చు.
‘మా రిషామ’ మేము హాని పొందకుందుముగాక అని ప్రజల ఆకాంక్ష. అంటే రాజు ప్రజల ఎడల కంటకుడుగా కారాదని భావం.
దీనినిబట్టి రాజు స్వాధికార గర్వంతో ప్రజల ఎడల పీడకుడుగాగాక ప్రజాభిప్రాయాన్ని మన్నించే సహృదయశీలుడుగా ఉండాలని వేదప్రతిపాదన. ఇదే ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టుగొమ్మ. ఇది విరిగిననాడు రాజు నియంతయే. పాలన నియంతృత్వమే. అలా కారాదని వేల ఏండ్లనాటి వేదప్రబోధం.
రాజా! ధనానే్వషకుల బుద్ధిని వృద్ధిపరచుము
యేన వంసామ పృతనాసు శర్ధతస్తరంతో అర్య ఆదిశః
స త్వం నో వర్ధప్రయసా శచీవసో జిన్వాధియో వసువిదః॥ ఋ.8-60-12.
భావం:- బుద్ధి మరియు శక్తి అనే ధనాలుకల ఓ రాజా! శత్రువుల ఎత్తులను చిత్తుచేస్తూ నీ ద్వారా యుద్ధాలలో కవ్వించే వారిని స్వాధీనపరచుకోగలం. నీవు మమ్ము విశేష ప్రయత్నంతో ఉత్సాహ పరచుము. సామ్రాజ్య ధనాన్ని అనే్వషించేవారి బుద్ధులను ఉత్తేజపరచుము.
ఇంకావుంది...

సోనాల, సాత్నాల నూతన మండలాలకు ఓకే

0
0

ఆదిలాబాద్, డిసెంబర్ 17: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును సోమవారం ప్రగతి భవన్‌లో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ఘన విజయం సాధించడంతో పాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో సిఎం పర్యటన సందర్భంగా బోథ్ నియోజకవర్గంలోని సోనాల, ఆదిలాబాద్ నియోజకవర్గంలోని సాత్నాల గ్రామ పంచాయతీలను కొత్త మండలాలుగా ఏర్పాటు చేసేందుకు ఇచ్చిన హామీని జోగురామన్న గుర్తుచేయగా కేసీఆర్ స్పందిస్తూ సత్వరమే వీటికి ఆమోదముద్ర వేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా జైనథ్ మండలంలోని కాప్రీ గ్రామపంచాయతీ పరిధిలోని ఉమ్రి అనుబంధ గ్రామాన్ని పంచాయతీగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి వినతిపత్రాన్ని సమర్పించారు. రెండు కొత్త మండలాలతో పాటు గ్రామపంచాయతీ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చినట్లు జోగురామన్న పేర్కొన్నారు. అనంతరం టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన కల్వకుంట్ల తారక రామారావును రామన్న మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చంతో అభినందనలు తెలిపారు. కేటీఆర్ సారథ్యంలో పార్టీ సంస్థాగతంగా మరింత బలపడనుందని, క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణాన్ని పకడ్బందీగా చేపడుతామని అన్నారు. జోగు రామన్న వెంట తుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

19 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ
* 20న క్రిస్మస్ గిప్ట్‌ల పంపిణీ
* ఆసరా పింఛన్ల జాబితాను సిద్ధం చేయండి
* వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్య కార్యదర్శి జోషి

ఆదిలాబాద్, డిసెంబర్ 17: 57ఏళ్ళ వయోపరిమితితో ఆసరా పింఛన్ల లబ్దిదారుల ఎంపిక కోసం జాబితాను సిద్ధం చేయాలని, ఈనెల 19 నుండి బతుకమ్మ చీరలు, 18న క్రిస్మస్ గిప్ట్‌ల పంపిణీకి రంగం సిద్ధం చేయాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ఎస్ కె జోషి ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. క్రిస్మస్ పండగను పురస్కరించుకొని క్రిస్మస్ గిప్టులతో పాటు పండగ సరకులను పంపిణీ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిలిచిపోయిన బతుకమ్మ చీరలను అర్హులైన పేద మహిళలకు అందజేయాలని, జిల్లా స్థాయి గోడౌన్‌ల్లో నిల్వ ఉన్న చీరల జాబితాను సిద్దం చేసి అర్హులైన పేద మహిళలందరికి పారదర్శకంగా పంపిణీ చేయాలన్నారు. చీరల పంపిణీ సందర్భంగా ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని చీఫ్ సెక్రెటరీ సూచించారు. జాతీయ రహదారి పనుల విస్తరణ కోసం అవసరమైన భూసేకరణ చేపట్టేందుకు రెవెన్యూ యంత్రాంగం కసరత్తు ప్రారంభించాలని, రాష్ట్రంలోని 16జిల్లాల్లో భూసేకరణ వేగవంతం చేయాల్సి ఉందన్నారు. సంక్షేమ పథకాలు అమలు మరింత వేగిరపర్చి కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్ చెక్కులను వెంటనే అందజేయాలన్నారు. రాష్ట్రంలో 90 లక్షల బతుకమ్మ చీరలు పంపిణీకి సిద్దంగా ఉన్నాయని ఎస్‌కె జోషి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9355 జూనియర్ గ్రామపంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే జిల్లాలకు అర్హులైన జాబితాను పంపించడం జరుగుతుందన్నారు. కలెక్టర్ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలో 2లక్షల బతుకమ్మ చీరలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తిచేశామని, ఆసరా పింఛన్లలో భాగంగా ఆధార్‌కార్డులో వయస్సు ధృవీకరణకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నట్లు తెలిపారు. ఉమ్మడి కుటుంబంలో 7 ఎకరాల భూమి ఉందని, వారికి ఆసరా పింఛన్ల మంజూరిలో సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. అభయ హస్తం పింఛన్ల మంజూరిలోను ఇబ్బందులు తలెత్తుతున్నాయని కలెక్టర్ వివరించారు. సంక్షేమ పథకాలు అమలు కోసం పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గ్రామపంచాయతీల ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయని, వార్డుల వారీగా కుల గణన పూర్తిచేయడం జరిగిందన్నారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో అసిస్టెంట్ కలెక్టర్ ప్రతీక్‌జైన్, జడ్పీ సీఈవో జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ఈదురు గాలులు.. వర్షపు జల్లులు

0
0

ఆదిలాబాద్, డిసెంబర్ 17: బంగాళఖాతంలో ఏర్పడ్డ పైథాన్ తూపాన్ ప్రభావంగా ఆదిలాబాద్ జిల్లాలో ఈదురుగాలులకు తోడు మోస్తారు వర్షాలు జిల్లా ప్రజలను గజ గజ వణికించాయి. సోమవారం ఉదయం నుండి ఆకాశం మేఘావృతమై పొగమంచు కమ్మేయడంతో రహదారులు అంధకారాన్ని తలపించాయి. పైగా 6.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జిల్లా ప్రజలు చలితీవ్రతతో అల్లాడిపోయారు. ఆదిలాబాద్, ఉట్నూరు, ఆసిఫాబాద్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఈదురు గాలులకు తోడు చలి తీవ్రత బెంబేలెత్తించింది. పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులు అవస్థలు పడ్డారు. ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ఆసిఫాబాద్, ఉట్నూరు, జన్నారం, ఇంద్రవెల్లి, గుడిహత్నూర్ మండలాల్లో ఆకాశానికి చిల్లుపడిందా అన్న విధంగా సాయంత్రం వరకు ఏకదాటిగా వర్షపు జల్లులు కురియడంతో పాటు పలు చోట్ల సాధారణ వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్ పట్టణంలో రోడ్లన్ని చిత్తడిని తలపించాయి. మరోవైపు విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మొక్కుబడిగానే పనిచేశాయి. ఎముకలు కొరికే చలి తీవ్రతతో ప్రజలు బయటకు వెళ్ళేందుకు జంకాల్సి వచ్చింది. గత రెండు రోజులుగా మంచు దుప్పటి కమ్మేసి చలి తీవ్రత పెరిగిపోవడంతో సాధారణ జనజీవనం స్తంభించిపోయింది.
రైతులకు దెబ్బమీది దెబ్బ
తుపాన్ ప్రభావంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మోస్తారు వర్షాలకు చేతికి వచ్చిన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కంది, పత్తి పంటలకు పెను నష్టం వాటిల్లగా జన్నారం, ఉట్నూరు, ఆసిఫాబాద్, బోథ్ ప్రాంతాల్లో పంట పొలాల్లో ఆరబోసిన వరి ధాన్యం తడిసిముద్దయింది. దీంతో రైతులు నష్టపోవాల్సి వచ్చింది. రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు ఉమ్మడి జిల్లాలోని 12 మండలాల్లో 4500 ఎకరాల్లో పంటలు దెబ్బతిని నష్టపోగా పైథాన్ తుపాన్ ప్రభావంగా రైతుల కళ్లెదుటే పంట నిల్వలు తడిసిపోవడంతో రైతులు దైన్యపరిస్థితిని ఎదుర్కోవల్సి వచ్చింది. పత్తి చేనుల్లోనే తడిసిపోవడంతో నాణ్యత దెబ్బతిని మార్కెట్‌లో ధర పలకకుండా పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది.

బాబోయ్ తుపాన్
* రైతులను కలవర పెడుతున్న పెథాయ్
* నేల రాలుతున్న తెల్ల బంగారం
* తడిసి ముద్ద అవుతున్న వరిధాన్యం
* జిల్లా వ్యాప్తంగా ప్రభావం
* ఈదురుగాలులతో పెరిగిన చలి తీవ్రత
మంచిర్యాల, డిసెంబర్ 17: బంగాళాఖాతం ఏర్పడిన వాయుగుండంతో జిల్లాలో వానజల్లులు పడ్డాయి. తుపాన్ తీవ్రరూపం దాల్చడంతో కురుస్తున్న వర్షానికి ఐకేపీ, కళ్లాల్లో ఆరబోసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు టార్ఫాలిన్ కవర్లతో పాటు బస్తాలలో ధాన్యాన్ని నింపుతూ రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. ఆరుగాలం కష్ట పడి రైతులు పండించిన పంట ఒక్కెంతు అయితే తుఫాన్ ప్రభావంతో పడుతున్న వాన జల్లులతో పండించిన పంటను కాపాడుకునేందుకు కష్టపడాల్సి వస్తుంది. కొన్ని మండలాల్లో వరి పంట నేలకొరగడంతో వర్షాభావం ప్రభావం వల్ల పంట పొలాల్లోనే వరి గింజలు మొలకెత్తే పరిస్థితి నెలకొంది. చేతికి వచ్చిన పత్తి పంట కూడా నేల పాలు కావాల్సిన దుస్థితి నెలకొంది. పత్తి తీయుటకు కూలీలు సైతం ఈ పెను తుఫాన్‌కు రాక పోవడంతో ఈదురుగాలుల ప్రభావంతో నేలరాలుతున్నాయి. ధాన్యం కొనుగోలు కోసం జిల్లా అధికార యంత్రాంగం అంఛనాలు వేసి కొనుగోలు కేంద్రాలను జిల్లా వ్యాప్తంగా 120 ఏర్పాటు చేసి లక్ష మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి అంఛనా వేయగా, ఇప్పటి వరకు 20వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. 85 కొనుగోలు కేంద్రాలలో మాత్రమే ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయి. జిల్లాలో చాలా చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కావడంతో రైతులంతా తమ పంట చేనులోనే వరి ధాన్యాన్ని ఆరబెట్టేందుకు కళ్లాలు చెక్కుకొని ధాన్యాన్ని ఆరబెట్టుకున్నప్పటికీ ఈ ఆకాల వర్షం వల్ల వరి ధాన్యం తడిసి ముద్ద అయ్యాయి. పత్తితో పాటు కంది, మిర్చి పూత నేల రాలుతున్న పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది రైతుకు పండించిన ఏ పంటకు కూడా రైతుల కాయ కష్టం పోనూ మిగిలేది ఏమిలేదని, చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఈ తుపాన్ ప్రభావం జిల్లాలో ఉండదని అనుకున్నప్పటికీ వాతావరణ శాఖ అంఛనా వేసిన ప్రకారం సోమవారం నుండి వర్షం జల్లులతో తుపాన్ గాలి వీస్తుండటంతో కొనుగోలు కేంద్రాలతో పాటు కళ్లాల వద్ద ధాన్యం నిల్వలు పేరుకుపోయ్యాయి. అధికార యంత్రాంగం తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలుచేస్తామని చెప్పినప్పటికీ మొలకెత్తిన ధాన్యం పరిస్థితి ఏమిటని రైతులు అందోళన చెందుతున్నారు. వాతావరణం మేఘావృత్తమై ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో జనం బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. అసలే చలి కాలం ఆపై ఉష్ణోగ్రత తగ్గుముఖం పట్టడంతో గజ గజ వణుకుతున్నప్పటికీ పెథాయ్ తుపాన్‌తో ఉష్ణోగ్రత మరింత తగ్గడంతో వెచ్చదనం కోసం ప్రజలు చలి మంటలు వేసుకున్నప్పటికీ ఈదురుగా లి ప్రభావంతో చలి మంటల ప్రభావం కాసేపు ఉపశమనం ఇస్తున్నాయే తప్పా వెచ్చదనం దొరకడం లేదని ప్రజలు వాపోతున్నారు.

చేతి వృత్తుల వారికి అధిక ప్రాధాన్యం

0
0

కామారెడ్డి, డిసెంబర్ 17: చేతి వృత్తుల వారికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని జిల్లా జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ఇందిరాగాంధీ స్టేడియంలో కుమ్మరి శాలివాహన సభ్యులకు మట్టి వాటర్ బాటిల్ తయారీపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆగస్టు 25వ తేదీన జిల్లా నుంచి 5 మంది శాలివాహనులకు రామానంద తీర్థ ట్రైనింగ్ సెంటర్ (్భదన్ పోచంపల్లి)లో శిక్షణ ఇచ్చిన్నట్లు తెలిపారు. ప్రసుత్తం జిల్లా కేంద్రంలో 30 మంది శాలివాహనులకు 3 రోజుల పాటు మట్టి వాటర్ బాటిల్‌పై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. నేటి సమాజంలో ప్లాస్టిక్ బాటిల్ వినియోగం ఎక్కువగా ఉందని, దీంతో విపరీతంగా కాలుష్యం పెరుగుతుందన్నారు. మట్టి వాటర్ బాటిల్‌లు కుండలు, మట్టి పాత్రలు తయారు చేసి కాలుష్యాన్ని నివారించవచ్చని తెలిపారు. శాలివాహనులు తయారు చేసిన ఉత్పత్తులకు విస్తృతంగా మార్కెంటింగ్ అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. మూడు రోజులు శిక్షణ తీసుకున్న శాలివాహనులు గ్రామాల్లోని మిగతా సభ్యులకు శిక్షణ ఇచ్చిమట్టి పాత్రలు ఎక్కువగా తయారుచేసేలా అవగాహన కల్పించాలని సూచించారు. మట్టికుండలు, పాత్రలతో కాలుష్యాన్ని అదుపు చేయవచ్చని తెలిపారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఝాన్సీరాణి మాట్లాడుతూ, శాలివాహనులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శాలివాహనులు ఆర్థికంగా ఎదగడానికి శిక్షణ కార్యక్రమం ప్రయోజనాత్మకంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ద్ధిఅధికారి జాన్సీరాణి, శాలివాహన జిల్లా అధ్యక్షుడు రమేశ్, ఉపాధ్యక్షుడు విఠల్, సెక్రటరీ మధు, ప్రవీణ్, చంద్రం, సంతోష్ పాల్గొన్నారు.

ప్రజావాణికి 17 ఫిర్యాదులు
అశోక్‌నగర్(కామారెడ్డి), డిసెంబర్ 17: కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని జనహిత సమావేశం మందిరంలో సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 17 ఫిర్యాదులు వచ్చిన్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. ఫిర్యాదుల్లో రెవెన్యూ శాఖకు 7, గృహశాఖకు 3, డీఎంహెచ్‌వోకు 3, డీఈవో 1, డీపీవో 2, ఎస్సీ కార్పోరేషన్ 1 ఫిర్యాదు చొప్పున మొత్తం 17 ఫిర్యాదులు వచ్చిన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీవో శ్రీనివాస్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

కేటీఆర్‌కు మాజీ ఎమ్మెల్యే శుభాకాంక్షలు
ఎల్లారెడ్డి, డిసెంబర్ 17: తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, కల్వకుంట్ల తారక రామారావును నియమించడంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి ఆయన సతీమణి ఏనుగు మంజులారెడ్డిలు హైద్రాబాద్‌లో కేటీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలుసుకుని, పుష్పగుచ్ఛాలను అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ, టీఆర్‌ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకోసం సీఎం కేసీఆర్ సరియైన నిర్ణయం తీసుకున్నారన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన కేటీఆర్ నేతృత్వంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అన్ని మండలల్లో టీఆర్‌ఎస్ పార్టీ జెండాను ఎగురవేస్తామని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసి లబ్దిపొందేలా కృషిచేస్తామన్నారు.

పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి
- జేసీ వెంకటేశ్వర్లు
కంఠేశ్వర్, డిసెంబర్ 17: ఉద్యోగ రీత్యా పదవీ విరమణ చేసి పింఛన్లు పొందుతున్న పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం నగరంలోని రిటైర్డ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో జాతీయ పెన్షనర్ల దినోత్సవాన్ని నిర్వహించగా, జే.సీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగి కొలువు చేసే సమయంలో సన్మానాలు చేసుకునేందుకు తీరిక ఉండదని, ఎందుకంటే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు అందించేందుకు బిజీగా ఉంటారని అన్నారు. పదవీ విరమణ చేశాక సన్మానం చేసుకునే వీలు కలుగుతుందన్నారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి అని, పెన్షనర్లకు ప్రభుత్వం పలు సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. పెన్షనర్లు తమ ఆరోగ్య సమస్యలను పరీక్షించుకునేందుకు వెల్‌నెస్ సెంటర్ కావాలని కోరుతున్నందున, ఈ అంశాన్ని సానుకూల దృక్పథంతో పరిశీలిస్తామని అన్నారు. అంతకుముందు పెన్షన్స్ కోసం పోరాడిన డీఎస్ నగార చిత్రపటానికి జే.సీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి, తాలూకా స్థాయి అధ్యక్షుడు జగత్‌రెడ్డి, పెన్షన్లు రాజారాం, భూంరెడ్డి, పోతన్‌కర్ లక్ష్మీనారాయణ, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

డయల్ యువర్ సీపీకి ఐదు ఫిర్యాదులు
వినాయక్‌నగర్, డిసెంబర్ 17: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10:30నుండి 11:30గంటల వరకు నిర్వహించిన డయల్ యువర్ పోలీస్ కమిషనర్ కార్యక్రమానికి ఎనిమిది ఫిర్యాదులు వచ్చాయి. కమిషనర్ కార్తికేయ అందుబాటులో లేకపోవడంతో ఆయన ఆదేశాల మేరకు అదనపు డీసీపీ శ్రీ్ధర్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ డివిజన్ల పరిధి నుండి వివిధ సమస్యలపై బాధితులు ఫోన్‌ల ద్వారా ఫిర్యాదులు చేశారని ఆయన వెల్లడించారు. ఈ ఫిర్యాదులను నమోదు చేసుకుని వాటి పట్ల సానుకూలంగా స్పందిస్తూ సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించామని అన్నారు. కాగా, గత వారం నమోదైన ఫిర్యాదులకు సంబంధించి క్షేత్ర స్థాయిలో అధికారులు ఏమేరకు చర్యలు చేపట్టారనే వివరాల గురించి బాధితులకు ఫోన్‌లు చేసి ఆరా తీశారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత పోలీస్ డివిజన్ల అధికారులను ఆదేశించారు. డయల్ యువర్ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

రేపటి నుండి బతుకమ్మ చీరల పంపిణీ

0
0

నిజామాబాద్, డిసెంబర్ 17: ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న కారణంగా వాయిదా పడిన బతుకమ్మ చీరల పంపిణీపై ప్రభుత్వం తాజాగా దృష్టిసారించింది. ఈ నెల 19వ తేదీ నుండి వీటి పంపిణీకి శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌కే.జోషి జిల్లా కలెక్టర్‌కు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. 19వ తేదీ నుండి బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లను పూర్తి చేయాలని, ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులందరూ పాల్గొనేలా చూడాలని, రోజువారీ పంపిణీకి సంబంధించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని ఆదేశించారు. బతుకమ్మ చీరలను ఇప్పటికే జిల్లాలకు పంపించామని, ఐదారు రోజుల్లో వాటి పంపిణీ పూర్తయ్యేలా చూడాలన్నారు. కాగా, జిల్లాలో 5.27లక్షల బతుకమ్మ చీరలు అవసరం ఉండగా, ఇప్పటివరకు 4.21లక్షల చీరలను మాత్రమే కేటాయించారని, మిగతా లక్షా 5వేల చీరలను కూడా పంపించాలని కలెక్టర్ ఎంఆర్‌ఎం.రావు సీఎస్ దృష్టికి తెచ్చారు. అయితే జిల్లా కేంద్రంలోని గిడ్డంగుల్లో ఉన్న బతుకమ్మ చీరలను గ్రామ స్థాయి వరకు చేరేలా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్ సూచించారు. గ్రామ స్థాయిలోని ప్రతి గిడ్డంగికి ఇన్‌చార్జ్‌లను నియమించాలన్నారు. గ్రామాలు, మున్సిపాలిటీలలో పంపిణీకి సంబంధించి మహిళా సంఘాలు, అధికారులు, వార్డు కమిటీలను నియమించి ఎప్పటికప్పుడు పంపిణీ ప్రక్రియను సమీక్షించాలని ఆదేశించారు. జిల్లాల వారీగా లబ్ధిదారుల జాబితాలు ఈపీడీఎస్ పోర్టల్‌లో ఉన్నాయని, వాటిని పరిశీలించి గ్రామాల వారీగా జాబితాలు రూపొందించుకోవాలని సూచించారు. బతుకమ్మ చీరల పంపిణీ తేదీల గురించి ఆయా గ్రామాల ప్రజలకు ముందుగానే తెలియపర్చాలని అన్నారు. జౌళి, చేనేత శాఖ కమిషనర్ శైలజారామయ్యర్ మాట్లాడుతూ, దాదాపు 90లక్షల చీరలు పంపిణీ చేస్తున్నామని, ఈ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పక్కాగా ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ఈ సందర్భంగా ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, జూనియర్ గ్రామ కార్యదర్శుల నియామకం, పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు, జాతీయ రహదారుల విస్తర్ణకై భూసేకరణ, క్రిస్మస్ బహుమతుల పంపిణీ తదితర అంశాలపై సంబంధిత శాఖల కార్యదర్శులు పలు సూచనలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఆర్‌డీఓ రాథోడ్ రమేష్, డీపీఓ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

ఆకతాయిల భరతం పడుతున్న ‘షీ’ టీమ్‌లు
వేధింపులకు పాల్పడుతున్న వారిపై కేసులు * కళాశాలల్లో విస్తృత ప్రచారం
ఇందూర్, డిసెంబర్ 17: మహిళలు, యువతులు, విద్యార్థినులకు భద్రత కల్పించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన షీ టీమ్‌లు ఆకతాయిల భరతం పడుతున్నాయి. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత ఏడాదిన్నర కాలం నుండి ఆరు బృందాలను రంగంలోకి దించిన విషయం విదితమే. ఈ బృందాలు నిజామాబాద్‌తో పాటు ఆర్మూర్, బోధన్ డివిజన్లలో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు, బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, ముఖ్య కూడళ్లు, ఆటో స్టాండ్‌లు, జన సమ్మర్ధం కలిగి ఉండే ప్రదేశాల్లో నిఘా ఉంచుతూ మహిళలను వేధింపులకు గురి చేయడం, విద్యార్థినులను ఈవ్‌టీజింగ్‌కు పాల్పడే వారిని గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నాయి. వేధింపులకు గురి చేసేందుకు ఎక్కువగా ఆస్కారం ఉన్న ప్రాంతాలను ముందుగానే ఎంపిక చేసుకుని మఫ్టీ దుస్తుల్లో షీ టీమ్ బృందాల్లోని పోలీసులు నిఘాను కొనసాగిస్తున్నారు. మహిళలు, యువతుల పట్ల అనుచితంగా ప్రవర్తించే వారిని గుర్తించి వారి చర్యలను వీడియోల్లో చిత్రీకరిస్తూ పక్కా ఆధారాలతో అదుపులోకి తీసుకుంటున్నారు. వారి ప్రవర్తనా తీరును బట్టి కౌన్సిలింగ్ నిర్వహించడం, వేధింపులు ఎక్కువగా ఉన్న సందర్భాల్లో కేసులు నమోదు చేస్తున్నారు. ఓ వైపు నిఘా పెడుతూనే, మరోవైపు షీ టీమ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం సిరికొండ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో షీ టీంల పనితీరు గురించి, ఈవ్‌టీజింగ్, వేధింపులు ఎదురైన సందర్భాల్లో అనుసరించాల్సిన పద్ధతుల గురించి విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది తలెత్తితే వెంటనే 100 డయల్‌కు కానీ, షీ టీమ్ నిర్వహణలో ఉండే 9490618029 వాట్స్‌యాప్ నెంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం తెలిపిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని భరోసా కల్పించారు. పోలీసు కళాజాత బృందం కళాకారులు సైతం ఆటపాటల ద్వారా విద్యార్థినులకు అవగాహన కల్పిస్తూ వారిలో ధైర్యాన్ని పెంపొందింపజేశారు. ఈ కార్యక్రమంలో సిరికొండ ఎస్‌ఐ బషీర్‌అహ్మద్, సిబ్బంది పాల్గొన్నారు. కాగా, షీ టీమ్‌లు ఇదే స్ఫూర్తితో ముందుకెళ్తే మహిళలు, యువతులను వేధింపులకు గురి చేసే వారికి తగిన శాస్తి జరగడంతో పాటు ఇలాంటి సంఘటనలు గణనీయంగా తగ్గుముఖం పట్టేందుకు ఆస్కారం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి పదవీ గండం తప్పదా?

0
0

నిజామాబాద్, డిసెంబర్ 17: తెరాస తరఫున శాసన మండలి సభ్యుడిగా ఎన్నికైన డాక్టర్ ఆర్.్భపతిరెడ్డికి పదవీ గండం వెంటాడుతోంది. పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్సీలపై వేటు వేయాలని కోరుతూ తెరాస శాసన మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డిలు సోమవారం మండలి చైర్మెన్ స్వామిగౌడ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన ఎమ్మెల్సీల జాబితాలో కొండా మురళి, యాదవరెడ్డి, రాములు నాయక్‌తో పాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన భూపతిరెడ్డి కూడా ఉన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం వీరు పార్టీ ఫిరాయింపునకు పాల్పడినందున నిబంధనల మేరకు చర్యలు చేపట్టాలని మండలి చైర్మెన్‌కు అందించిన వినతిపత్రంలో కోరారు. వీరిపై చర్యలు చేపట్టే అంశం మండలి చైర్మెన్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో తెరాసను వీడిన ఎమ్మెల్సీల పదవిపై వేటు పడే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు పేర్కొంటున్నారు. తెరాస ఆవిర్భావం నుండి డాక్టర్ భూపతిరెడ్డి ఆ పార్టీలో కొనసాగుతూ రాగా, గత 2014 ఎన్నికల్లో ఆయన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం టిక్కెట్‌ను ఆశించారు. అయితే చివరి నిమిషంలో టీఆర్‌ఎస్‌లో వచ్చి చేరిన బాజిరెడ్డి గోవర్ధన్‌కు తెరాస అధినేత కేసీఆర్ అభ్యర్థిత్వాన్ని కేటాయిస్తూ, ప్రత్యామ్నాయంగా ఎమ్మెల్సీ పదవి కట్టబెడతానని భూపతిరెడ్డికి హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు కొంత ఆలస్యమైనప్పటికీ, భూపతిరెడ్డికి శాసన మండలి పదవి దక్కేలా అవకాశం కల్పించారు. ఈ క్రమంలోనే రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డికు, భూపతిరెడ్డికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో భూపతిరెడ్డిపై నిజామాబాద్ ఉమ్మడి జిల్లా తెరాస ప్రజాప్రతినిధులంతా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడని అభియోగాలు మోపుతూ గత పది నెలల క్రితం అధిష్టానానికి ఫిర్యాదు లేఖ పంపారు. భూపతిరెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని సిఫార్సు చేశారు. అయితే నెలలు గడుస్తున్నప్పటికీ తెరాస అధిష్టానం ఆయనపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో భూపతిరెడ్డి తనంతటతానే తెరాసను వీడి, ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటీవల జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ అభ్యర్థిగా పోటీ సైతం చేశారు. గట్టి పోటీ ఇచ్చినప్పటికీ తెరాస సిట్టింగ్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చేతిలో భూపతిరెడ్డి ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తెరాస తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికై పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని మండలి చైర్మెన్‌కు ఫిర్యాదు చేసినందున, భూపతిరెడ్డి పదవికి ఎసరు వచ్చే అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు. జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు డీ.శ్రీనివాస్ కూడా నిజానికి ఇదే తరహా పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆయన పైనా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలతో నాలుగు మాసాల క్రితం అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అయితే డీఎస్ తన రాజకీయ అనుభవంతో రాజ్యసభ పదవికి ఎసరు రాకుండా ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తనపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలంటూ తెరాస అధిష్టానాన్ని డిమాండ్ చేసిన డీఎస్, తనంతటతాను మాత్రం రాజీనామా చేయలేదు. తన అనుచరులందరినీ కాంగ్రెస్‌లో చేర్పించినప్పటికీ, తాను ఇంకనూ తెరాస సభ్యత్వాన్ని కలిగి ఉండడంతో ఆయనపై చర్యలు తీసుకునేందుకు అవకాశం లేకుండాపోయింది. అదే సమయంలో ఎమ్మెల్సీ భూపతిరెడ్డి మాత్రం కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన దరిమిలా ఆయనపై మండలి చైర్మెన్‌కు తెరాస ఫిర్యాదు చేసేందుకు ఆస్కారం ఏర్పడింది.

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి
- కలెక్టర్ ఎంఆర్‌ఎం.రావు
ఆంధ్రభూమి బ్యూరో నిజామాబాద్, డిసెంబర్ 17: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు, సిబ్బంది అందరూ సన్నద్ధం కావాలని కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు సూచించారు. ఇటీవల జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎక్కడ కూడా ఏ ఒక్క అవాంఛనీయ ఘటనకు సైతం ఆస్కారం లేకుండా ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ఎన్నికలు నిర్వహించడం జరిగిందని, అదే స్ఫూర్తితో పంచాయతీ ఎన్నికలకు సమాయత్తం కావాలని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా దాదాపు రెండు నెలల విరామం అనంతరం సోమవారం స్థానిక ప్రగతిభవన్‌లో ప్రజావాణి కార్యక్రమాన్ని పునరుద్ధరించారు. ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన అనంతరం ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా అధికారులు, సిబ్బంది అందరూ ఎంతో చురుకుగా విధులు నిర్వర్తించారని, అందరి కృషితోనే ఎన్నికలను సాఫీగా నిర్వహించుకోగలిగామని అభినందించారు. ఇదే తరహాలో మునుముందు రానున్న పంచాయతీ, సహకార, మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికలను కూడా పకడ్బందీగా నిర్వహించి జిల్లాకు మంచి పేరు తేవాలని హితవు పలికారు. వచ్చే ఆరు నెలలు ఒకదాని వెంట ఒకటిగా ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాల్సిన ఆవశ్యకత నెలకొందన్నారు. అదే సమయంలో ప్రభుత్వ ప్రాధామ్యాల అమలులో ఎలాంటి విఘాతం ఏర్పడకుండా చూసుకోవాలన్నారు. ప్రధానంగా సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ కార్యక్రమాల విజయవంతానికి పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని కలెక్టర్ ఎంఆర్‌ఎం.రావు ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తూ, నిర్ణీత గడువులోగా లక్ష్యాలు సాధించాలన్నారు. క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయాన్ని పెంపొందించుకుని ఆయా కార్యక్రమాల అమలును వేగవంతం చేయాలని, ప్రాధాన్యతతో కూడుకున్న వాటి ప్రగతి గురించి తాను ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతానని పేర్కొన్నారు. ఇదివరకు సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు చేకూర్చిన లబ్ధి, అందించిన సేవలను మరింత విస్తృతం చేయాలన్నారు. ఎన్నికల దృష్ట్యా ప్రజావాణి కార్యక్రమాన్ని కొనసాగించలేకపోయినప్పటికీ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వాటిని పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఆర్‌డీఓ రాథోడ్ రమేష్, డీపీఓ కృష్ణమూర్తి, నిజామాబాద్ ఆర్డీఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

నెరవేరిన కల

0
0

నిజామాబాద్, డిసెంబర్ 17: ఎట్టకేలకు కొంత ఆలస్యంగానైనా మోస్రా, చందూర్ గ్రామాల ప్రజల కల నెరవేరింది. పై రెండు గ్రామాలను నూతన మండలాలుగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో అధికారికంగా ఉత్తర్వులు వెలువడడమే తరువాయిగా మారింది. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని వర్ని మండలంలో కొనసాగుతున్న మోస్రా, చందూర్ గ్రామాలను కొత్త మండలాల జాబితాలో చోటు కల్పించాలంటూ గత చాలాకాలం నుండి స్థానికులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. జిల్లాలు, మండలాల పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియను చేపట్టిన సమయంలోనే పై రెండు గ్రామాలను కొత్త మండలాలుగా ప్రకటిస్తారని ఆశించిన స్థానికులకు తీవ్ర నిరాశే ఎదురైంది. రెండు గ్రామాలలో కనీసం ఒక్కదానికి కూడా నూతన మండలాల జాబితాలో చోటు దక్కలేదు. వీటికి బదులుగా బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోనే ఉన్న రుద్రూర్, నస్రుల్లాబాద్ గ్రామాలను కొత్త మండలాలుగా ఏర్పాటు చేశారు. దీంతో అప్పట్లో మోస్రా, చందూర్ గ్రామాల ప్రజలు నిరవధిక ఆందోళనలు కొనసాగిస్తూ తీవ్ర స్థాయిలో నిరసనలు చాటారు. ఈ నిరసనల సెగ నిన్నమొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల పర్వం వరకు కూడా అధికార తెరాస పార్టీకి తగులుతూ వచ్చింది. ఎన్నికల ప్రచారం నిమిత్తం మోస్రా గ్రామానికి తెరాస అభ్యర్థిగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి హాజరైన సందర్భంగా స్థానికులు ఆయన పర్యటనను వ్యతిరేకించారు. ఓ యువకుడైతే ఏకంగా పోచారం తమ గ్రామానికి రావద్దంటూ సెల్ టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని సద్దుమణిగించారు. ఈ నేపథ్యంలోనే గత నవంబర్ 28న బాన్సువాడ నియోజకవర్గ కేంద్రానికి ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన సీఎం కేసీఆర్ దృష్టికి పోచారం ఈ విషయాన్ని తీసుకెళ్లారు. మోస్రా, చందూర్ గ్రామాలను మండలాలుగా ఏర్పాటు చేయాలంటూ స్థానికులు బలీయమైన ఆకాంక్షను వ్యక్తపరుస్తున్నారని తెలుపగా, సీఎం కేసీఆర్ కూడా అందుకు సానుకూలంగా స్పందిస్తూ తెరాసను అధికారంలోకి తెచ్చిన వెంటనే పై రెండు గ్రామాలను కొత్త మండలాలుగా ప్రకటిస్తామని ఎన్నికల ప్రచార సభలో స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ హామీకి కట్టుబడి ప్రస్తుతం మోస్రా, చందూర్ గ్రామాలను నూతన మండలాలుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు వెలువరించేందుకు కసరత్తులు కొనసాగిస్తున్నారు. తాజాగా వచ్చి చేరుతున్న ఈ రెండు మండలాలతో నిజామాబాద్ జిల్లాలో మొత్తం మండలాల సంఖ్య 29కి చేరుకోనుంది. అదేవిధంగా బాన్సువాడ నియోజకవర్గం పరిధిలో మొత్తం 8మండలాలు కొనసాగనున్నాయి. వాటిలో బీర్కూర్, నస్రుల్లాబాద్, బాన్సువాడ, మండలాలు కామారెడ్డి జిల్లా పరిధిలో ఉండగా, కోటగిరి, వర్ని, రుద్రూర్‌తో పాటు నూతనంగా ఏర్పాటవుతున్న చందూర్, మోస్రా మండలాలు నిజామాబాద్ జిల్లా పరిధిలో కొనసాగనున్నాయి. కాగా, ఇచ్చిన హామీ మేరకు నూతన మండలాలుగా ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించిన దరిమిలా మోస్రా గ్రామస్థులు సోమవారం హైదరాబాద్‌కు తరలివెళ్లి మాజీ మంత్రి, బాన్సువాడ నుండి తెరాస ఎమ్మెల్యేగా ఎన్నికైన పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిసి ఘనంగా సన్మానించారు. కొత్త మండలంగా ఏర్పాటు చేయడంతో తమ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధిని సంతరించుకునేందుకు ఆస్కారం ఏర్పడిందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పందిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే సాంప్రదాయం టీఆర్‌ఎస్ పార్టీదేనని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వారం రోజుల్లోపే అమలు చేసి తమ నిబద్ధతను నిరూపించుకున్నామని అన్నారు. ప్రజల అభీష్టం గురించి వివరించిన వెంటనే సానుకూలంగా స్పందిస్తూ కొత్త మండలాల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేయిస్తున్న సీఎం కేసీఆర్‌కు పోచారం కృతజ్ఞతలు ప్రకటించారు.

Viewing all 69482 articles
Browse latest View live