Are you the publisher? Claim or contact us about this channel


Embed this content in your HTML

Search

Report adult content:

click to rate:

Account: (login)

More Channels


Showcase


Channel Catalog


Articles on this Page

(showing articles 39301 to 39320 of 41370)
(showing articles 39301 to 39320 of 41370)

older | 1 | .... | 1964 | 1965 | (Page 1966) | 1967 | 1968 | .... | 2069 | newer

  0 0

  కరీంనగర్ టౌన్, డిసెంబర్ 17: రాష్ట్ర శాసనసభ ఎన్నికల లెక్కింపు రోజు కరీంనగర్‌లో జరిగిన రాళ్ల దాడి ఘర్షణలో అరెస్టయిన బిజెపి నాయకులు సోమవారం బెయిల్‌పై విడుదలయ్యారు. వారికి బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన బండి సంజయ్ కుమార్, బిజెపి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 11న తేదీన ఫలితాలు వెల్లడయిన రోజున టిఆర్‌ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన ఎంఐఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్ కుమార్ ఇంటిపై, బిజెపి కార్యకర్తలపై రాళ్లతో దాడి చేస్తూ సంజయ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. ఈక్రమంలో బిజెపి, ఎంఐఎం కార్యకర్తల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ అనంతరం పోలీసులు బిజెపి నాయకులపై కేసులు నమోదు చేశారు. బిజెవైఎం రాష్ట్ర ఫైనాన్స్ కమిటి కన్వీనర్ నందగిరి మహేందర్ రెడ్డి, బిజెవైఎం జిల్లా ఉపాధ్యక్షులు సింగిరాల రామరాజు, బిజెవైఎం నగర ఉపాధ్యక్షులు అక్షయ్ కుమార్‌లపై కేసులు నమోదు చేసి శనివారం అదుపులోకి తీసుకొని నందగిరి మహేందర్ రెడ్డి, సింగిరాల రామరాజులను రాత్రి 1 గంటలకు మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చి జైలుకు తరలించారు. పోలీస్ స్టేషన్‌లో బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ వారిద్దరినీ రిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం బిజెపి నాయకులు బెయిలుపై విడుదలయ్యారు. వారిని బిజెపి శ్రేణులు పెద్దఎత్తున సత్కరించి ఘనస్వాగతం పలికారు. బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాస సత్యనారాయణ రావు, జిల్లా ఉపాధ్యక్షులు కొట్టె మురళీకృష్ణ, నగర అద్యక్షులు భేతి మహేందర్ రెడ్డి, రాజ్‌పుత్ కిరణ్ సింగ్, బిజెవైఎం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బోయినపల్లి ప్రవీణ్ రావు, దుర్శెట్టి సంపత్, హుజూరాబాద్ బిజెపి అధ్యక్షులు మాడుగుల ప్రవీణ్ కుమార్, కొలిపాక చంద్రశేఖర్, పల్లె శ్రీనివాస్, ఎం.డి.అజహర్, ఎం.డి.ముజీబ్, ఈశ్వర్, జస్వంత్, ఉప్పరపల్లి శ్రీనివాస్, కచ్చు రవి, సాయిల్ల హరీష్ ఘనస్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

  సమష్టి కృషితో.. సత్ఫలితాలను సాధిద్దాం
  - బతుకమ్మ చీరలు, వివిధ కార్యక్రమాలపై సమీక్షా సమావేశంలో కలెక్టర్ వెంకట్రామరెడ్డి
  సిరిసిల్ల, డిసెంబర్ 17: అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది సమిష్టిగా పని చేస్తే ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల ఫలాలు ప్రజలకు త్వరితగతిన అందించవచ్చని కలెక్టర్ వెంకట్రామరెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం పొదుపు భవన్‌లో బతుకమ్మ చీరల పంపిణీ, జూనియర్ పంచాయతి కార్యదర్శుల నియామకం ఉత్తర్వులు, అసరా పెన్షన్ల లబ్దిదారుల గుర్తింపు, క్రిస్మస్ గిఫ్ట్‌ల పంపిణి, జీపీ ఎన్నికల ఏర్పాట్లు, సిరిసిల్ల పట్టణ అభివృద్దిపై జిల్లా అథికారులు, మండల ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలతో కలెక్టర్ సుదీర్ఘంగా సమీక్షించారు. జిల్లాలో లక్షా 98 వేల చీరల తెల్ల రేషన్ కార్డు కలిగి 18 సంవత్సరాలు నిండిన మహిళలకు ఈనెల 19 నుండి పంపిణీ చేయాలన్నారు. ఇందుకు గాను గ్రామాల వారిగా బతుకమ్మ చీరలను నిలువ చేసేందుకు గోదాములను గుర్తించాలన్నారు. గ్రామ స్థాయిలో పంచాయతి సెక్రటరీ, వీఆర్వో, గ్రామైక్య సంఘాల ఆఫీస్ బేరర్లు, చౌక ధరల దుకాణాల డీలర్లు పంపిణీ బాద్యత తీసుకోవాలన్నారు. మండల ప్రత్యేక అధికారి, తహశీల్దార్, ఎంపీడీవోలు, ఎంఈవోలు, మండల వ్యవసాయ అధికారులు, ఈవో, సాంకేతిక సహాయకులు గ్రామాలలో పంపిణీ పర్యవేక్షించాలన్నారు. పంపిణీ కార్యక్రమంకు ప్రజాప్రతినిథులను అనుమతించాలని, నాలుగు రోజుల్లో పంపిణీని పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న 171 జూనియర్ పంచాయతి కార్యదర్శి పోస్టులకు అభ్యర్థుల ఎంపిక పూర్తయినందున రెండు రోజుల్లో నియామక ఉత్తర్వులు అందించే ప్రక్రియను పూర్తి చేయనున్నట్టు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు సీనియర్ జిల్లా అధికారుల సహకారంతో దృవ పత్రాల పరిశీలన, నియామక ఉత్తర్వులు అందజేత ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వం అసరా పెన్షన్ వయో పరిమితిని 65 నుంచి 57కు తగ్గించినందున 57-64 మధ్య వయసు గల వారు ఎంత మంది ఉన్నారో ఓటరు జాబితా ఆధారంగా తహశీల్దార్లు డెస్క్ వర్క్ పూర్తి చేసి గుర్తించాలన్నారు. ఈనెల 17న సాయంత్రం లోగా తహశీల్దార్లు గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసి ఎంపీడీవోలకు అందించాలన్నారు. రైతు బంధు లబ్దిదారులు 16,624 మందికి సంబంధించి సర్వే చేసి రైతు బీమా లబ్దిదారులెవరో తేల్చాల్సి ఉందన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు కలిసి సర్వే ప్రక్రియను ఈనెల 24 కల్లా పూర్తి, అర్హులను రైతు బీమాలో చేర్చాలన్నారు. గ్రామ పంచాయతి ఎన్నికల సజావుగా జరిపేందుకు ఆర్డీవోను ఎన్నికల నోడల్ అధికారిగా నియమిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. జాయింట్ కలెక్టర్ సమన్వయకర్తగా వ్యవహరిస్తారన్నార. రిజర్వేషన్లు ఖరారు, ఎస్సీ ఎస్టీ బీసీల సంఖ్యను గుర్తించి ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. వచ్చే నెల మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం వెలువరించే అవకాశం ఉన్నందున అప్పటి కల్లా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.క్రిస్మస్ గిఫ్ట్‌లను ఈనెల 24 కల్లా పంపిణీ పూర్తి చేయాలని, తహశీల్దార్లు పంపిణీలో ముఖ్య పాత్ర పోషించాలన్నారు. అనంతరం కలెక్టర్ పట్టణాభివృద్దిపై మున్సిపల్ అధికారులతో చర్చించారు. చివరగా కలెక్టర్ మిషన్ భగీరథ ప్రగతిపై అధికారులతో సమీక్షించారు. మిషన్ భగిరథ సమగ్ర సమాచారంను సేకరించేందుకు ప్రొఫార్మా ఐఎ, ఐబీ, ప్రొఫార్మా 11ఎ, ప్రొఫార్మా 11 బిలను రూపొందించామన్నారు. మండల ప్రత్యేక అధికారులు ఫీల్డు అసిస్టెంట్ల సహకారంతో నాలుగు రోజుల్లో ఈ ప్రొఫార్మాల ద్వారా సమగ్ర సమాచారం సేకరించి నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్న డీఆర్‌డీవోకు అందచేయాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా, శిక్షణ కలెక్టర్ రాహుల్ శర్మ, ఆర్డీవో శ్రీనివాస్‌రావు, డీఆర్‌డీవో రవీందర్ పాల్గొన్నారు.


  0 0

  కరీంనగర్, డిసెంబర్ 17: జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతుల భూముల వివరాలను రాకార్డ్స్‌లో నమోదు చేయాలని (అప్‌డేట్) చేయాలని జాయింట్ కలెక్టర్ జి.వి.శ్యాం ప్రసాద్‌లాల్ తహశీల్దార్లను ఆదేశించారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ సమావేశమందిరంలో తహశీల్దార్లతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లోని గ్రామాల వారీగా భూముల వివరాలను రికార్డ్స్‌లో అప్‌డేట్ చేయాల్సిన బాధ్యత తహశీల్దార్లదేనని గుర్తు చేశారు. ఇందుకోసం ఆయా మండలాల్లోని తహశీల్దార్లు, డిప్యూటి తహశీల్దార్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, సీనియర్ అసిస్టెంట్లు పర్యటించి పెండింగ్‌లో ఉన్న భూముల వివరాలను సర్వే నెంబర్ల ఆధారంగా నమోదు చేసి రికార్డులను సిద్ధం చేయాలన్నారు. బతుకమ్మ చీరలు జిల్లాకు చేరాయని, వాటిని ఈ నెల 18న జిల్లాలోని అన్ని మండలాల తహశీల్దార్లకు అప్పగిస్తామని జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్‌లాల్ తెలిపారు. గ్రామాల్లోని గ్రామ పంచాయతీ కార్యాలయాలు, అంగన్‌వాడీ స్కూళ్లలో బతుకమ్మ చీరల స్టాక్ చేసుకోవాలని ఆయన సూచించారు. పట్టణాలు, గ్రామాల్లో తెలుపు రంగు కార్డుల జాబితా ప్రకారం ఆయా కుటుంబాలకు బతుకమ్మ చీరలను ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి పంపిణీ చేయాలని తెలిపారు. బతుకమ్మ చీరల పంపిణీ పారదర్శకంగా కొనసాగాలని, ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా తగు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత తహశీల్దార్లదేనన్నారు. ఒకేసారి బతుకమ్మ చీరల కోసం మహిళలు ఎగబడకుండా ఉండేందుకు జిల్లాలోని ఆయా మండలాల పోలీసుల సహకారం తీసుకోవాలని సూచించారు. ఇదేవిధంగా ఈ నెల 25వ తేదీన క్రిస్మస్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం క్రైస్తవులకు కూడా దుస్తుల పంపిణీ చేస్తుందని తెలిపారు. చర్చీలలో ఫాస్టర్లకు దుస్తులు అందుతాయని, వాటిని క్రైస్తవ సోదరులకు పంపిణీ చేయాల్సిన బాధ్యత ఫాస్టర్లు తీసుకోవాలని కోరారు. క్రైస్తవులకు క్రిస్మస్ ఫెస్టివల్ జరుపుకొనుటకు ప్రభుత్వం నియోజకవర్గాల వారీగా నిధులు మంజూరు చేసిందని, ఎమ్మెల్యేల సలహాలు, సూచనలు తీసుకొని తహశీల్దార్లు ఫెస్టివల్ ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్‌లాల్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ రాజర్షిషా, రెవెన్యూ డివిజనల్ అధికారి ఆనంద్ కుమార్, తహశీల్దార్లు, డిప్యూటి తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

  హామీలు అమలు చేయాలి
  ౄటీఆర్‌ఎస్‌కు 47శాతం ఓట్లు మాత్రమే..
  ౄడీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం
  గంభీరావుపేట, డిసెంబర్ 17: ప్రజాభీష్టంమేరకు అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ పార్టీ పాత హామీలతో పాటు ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కటకం మృత్యుంజయం డిమాండ్ చేశారు. సోమవారం గంభీరావుపేట మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జరిగిన ఎన్నికలలో ప్రజలు వేసిన ఓటులో 47 శాతం మాత్రమే టీఆర్‌ఎస్ పార్టీకి వేశారని, మిగిలిన 53శాతం మంది ప్రభుత్వ వ్యతీరేకానికే మొగ్గుచూపుతోందని ఆరోపించారు. సోనీయాగాంధీ తెలంగాణ ప్రకటించే నాటికి లాభాల బాటలో ఉన్న తెలంగాణను ప్రస్తుతం కేసీఆర్ నష్టాల బాట పట్టించారన్నారు. వీటన్నింటికీ లెక్కలు చెప్పాల్సిన బాధ్యత వారిదేనన్నారు. రబీకి అందచేయాల్సిన రైతుబంధు పథకాన్ని రబీ సీజన్‌కు ముందుగానే అందచేసి అధికారికంగా ఎన్నికల కోడ్‌ను ఉల్లఘించాలని విమర్శించారు. బీజేపీని మతతత్వాన్ని ప్రచారం చేస్తూ దానిని బూచిగా చూపి మైనార్టీల ఓట్లు కొల్లగొట్టారన్నారు. కేసీఆర్ దేశ రాజకీయాలపై దృష్టి సారించడమనేది ఆయన స్థాయికి తగదన్నారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేసిందన్నారు. మధ్యప్రదేశ్‌లో రాష్రీయంగా గెలిచిన పార్టీ దేశ రాజకీయాలను ఏలడం అనేది నాటి నుండి ఉన్నదేనన్నారు. రానున్న కాలంలో దేశ ప్రధానిగా రహుల్‌గాంధీ కావడం ఖాయమన్నారు. పలు అనుమానాలకు తావిస్తున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను తొలగించి, తిరిగి పూర్వపు బ్యాలెట్ పద్దతిని ప్రవేశపెట్టాలని ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియాను తాము అభ్యర్థించినట్లు తెలిపారు. దేశ రాజకీయాలను ఏలబోయేది కాంగ్రెస్ పార్టీయేనని ధీమా వ్యక్తంచేశారు.

  నృత్య కళాకారుల నూతన కార్యవర్గం
  కరీంనగర్ టౌన్, డిసెంబర్ 17: ఉమ్మడి కరీంనగర్ జిల్లా నృత్య కళాకారుల నూతన కార్యవర్గ సమావేశం ఏర్పాటు సోమవారం స్థానిక భాగ్యనగర్ లోని బ్లూమెన్స్ డ్యాన్స్ అకాడమీలో ఉదయం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కృపాదానం విశిష్ట అతిథిగా, రామోజి రామకృష్ణ, సంఘ ఆవిర్భావ వక్తగా కట్ట రమేష్, ఎన్నికల అధికారిగా మున్ననూరి వెంకట కిషన్ రావు హాజరయ్యారు. ఈ సమావేశానికి మిలీనియం శ్రీనివాస్ అధ్యక్షత వహించగా, పలువురు మంచి సూచనల అనంతరం ఉమ్మడి జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా శ్రీ రామోజు రామకృష్ణ, గౌరవసలహాదారులుగా వంగల శ్రీ్ధర్, మున్ననూరి వెంకటకిషన్ రావు, అధ్యక్షులుగా కట్ట రమేష్, కార్యనిర్వాహక అద్యక్షునిగా మిలీనియం శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా కరీంనగర్ జిల్లా నుండి దర్శనాల రామకృష్ణ, పెద్దపల్లి జిల్లా నుంచి ఓంకార్, జగిత్యాల జిల్లా నుంచి బదినేపల్లి నరేష్, సిరిసిల్ల జిల్లా నుంచి నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా జూపాక ఉమామహేశ్వర్, కోశాధికారిగా వంగల సురేంద్రాచారిలు ఎన్నికయ్యారు. ఇదేవిధంగా సంయుక్త కార్యదర్శిగా కరీంనగర్ జిల్లా నుండి వంశీనాథ్, పెద్దపల్లి జిల్లా నుండి కామెడి సర్వేష్, జగిత్యాల జిల్లా నుండి మల్యాల రాజేష్, సిరిసిల్ల జిల్లా నుంచి ఉమేష్, ప్రచార కార్యదర్శులుగా సౌందర్య, రాజేష్, డిస్క్ సతీష్, బాబా, సందీప్, ప్రశాంత్, కొమురవెల్లి చిరంజీవి, నాగరాజు, వెంకటేష్, రాజేష్‌లు ఎన్నికయ్యారు. జిల్లా కమిటి సభ్యులుగా కమల్‌సాగర్, చిన్న, మనోజ్, సాయిదీప్, తిరుపతి, ఉమ్మడి జిల్లాలోని కమిటి వేసేవరకు పెద్దపల్లి జిల్లా పర్యవేక్షకులుగా గౌరీశంకర్, టెక్నో రామకృష్ణ, జగిత్యాల జిల్లా నుంచి బొమ్మిడి నరేష్, ఆరెపల్లి బాబు, రాజన్న, సిరిసిల్ల జిల్లా నుంచి ధర్మేందర్, కత్తెరపాక శ్రీనివాస్‌లను నియమించినట్లు జిల్లా ఎన్నికల అధికారి మున్ననూరి వెంకటకిషన్ వెల్లడించారు.


  0 0

  ధర్మపురి, డిసెంబర్ 17: మంగళవారం ధర్మపురి క్షేత్రంలోని శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో నిర్వహించనున్న వైకుంఠ ఏకాదశి వేడుకలలో పలువురు ప్రముఖులు పాల్గొనున్నారు. శ్రీశ్రీశ్రీ సద్గురు విశ్వయోగి విశ్వజిత్ విశ్వంజీ, పరమహంస పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ, స్థానిక శాసనసభ్యులు కొప్పుల ఈశ్వర్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, జిల్లా కలెక్టర్ శరత్, జేసి రాజేశం, ఎస్పీ సింధుశర్మ, పలువురు జడ్జిలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు తదితరులు కార్యక్రమాలలో పాలొననున్నట్లు దేవస్థానం చైర్మన్ తెలిపారు.
  భారీ పోలీస్ బందోబస్తు
  వైకుంఠ ఏకాదశి వేడుకల సందర్భంగా ధర్మపురి దేవస్థానం వద్ద కనీ వినీ ఎరగని తీతిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. వైకుంఠ ద్వార దర్శనం, వేదికపై మువ్వురు స్వాముల ప్రత్యేక పూజాదులలో ఏ ఏటికాయేడు భక్తుల తాకిడి అధికమవుతున్న క్రమంలో ఈసారి ఎలాంటి అవాంఛనీయాలు చోటు చేసుకోకుండా ప్రత్యేక బందోబస్తుపై ప్రత్యేక దృష్టి నిలిపారు. జగిత్యాల ఎస్పీ సింధుశర్మ మార్గదర్శకత్వంలో, అడిషనల్ ఎస్పీ మురళీధర్ పర్యవేక్షణలో, జగిత్యాల డీఎస్పీ వెంకటరమణ మార్గదర్శకత్వంలో, ధర్మపురి సిఐ లక్ష్మీబాబు ఆధ్వర్యంలో 4గురు సిఐలు, 11మంది ఎస్‌ఐలు, 90మంది సివిల్ కానిస్టేబుల్స్, 80మంది హోంగార్డులు, 12మంది డిస్ట్రిక్ట్ గార్డులు, బందోబస్తులో భాగస్వాములు కానున్నట్లు ధర్మపురి సిఐ లక్ష్మీబాబు వివరించారు.

  అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
  - రామగుండం మేయర్ రాజమణి
  గోదావరిఖని, డిసెంబర్ 17: ముఖ్యమంత్రి హామీ నిధులతో చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రామగుండం మేయర్ జాలి రాజమణి, కమీషనర్ భువగిని శ్రీనివాస్ ఇంజనీరింగ్ సిబ్బందిని, కాంట్రాక్టర్లను కోరారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ముఖ్యమంత్రి హామీ నిధులు 100 కోట్లతో చేపడుతున్న వివిధ రకాల అభివృద్ధి పనులపై ఆర్ అండ్ బి, పబ్లిక్ హెల్త్, టి ఎస్ ఇ డబ్ల్యూ ఐడిసి సంస్థల ఇంజనీర్లు, ఆయా పనులు చేపట్టుటకు ఉత్తర్వులు పొందిన కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ రాజమణి ఎన్నికల కోడ్‌తో చాలా అభివృద్ధి పనులు ప్రారంభం కాక నిలిచిపోయాయని, వీటన్నింటిని వెంటనే ప్రారంభించాలని కోరారు. త్వరలో పంచాయతీ ఎన్నికల కోడ్ కూడా రానున్న దృష్ట్యా అన్ని ప్రక్రియలు త్వరితగతిన పూర్తి చేసి పనులు ప్రారంభమయ్యేలా చూడాలని ఆదేశించారు. టి ఎస్ ఎన్‌పిడిసి ఎల్ సంస్థను రూ.50లక్షల చెల్లించినందున రోడ్డు వెడల్పుకు అడ్డుగా ఉన్న విద్యుత్ స్థంబాలను తొలగించేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సత్యప్రసాద్, ఇ ఇలు మహేందర్, సుచరణ్, ఆర్ అండ్ బి ఇ ఇ కమలాకర్ రావు, డి ఇ జయప్రకాష్, పబ్లిక్ హెల్త్ డి ఇ సంపత్ రావు, డి ఇలు, ఎ ఇలు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.


  0 0

  సుల్తానాబాద్, డిసెంబర్ 17: ఆంధ్రా ప్రాంతంలో ఏర్పడిన ‘పెథాయ్’ తుఫాన్ ప్రభావంతో సుల్తానాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం సోమవారం ఉదయం నుండి రాత్రి వరకు ఏకదాటిగా పడింది. దీంతో ఒక్కసారిగా చలి తీవ్రత అధికంగా పెరగడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఇండ్లల్లో నుండి బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ఈదురు గాలుల కారణంగా ఇండ్లల్లో నుండి ప్రజలు బయటకు రాకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. సోమవారం సుల్తానాబాద్ మార్కెట్ సంత అయినప్పటికీ కూరగాయల మార్కెట్ వెలవెల బోయింది. విద్యార్థులు సైతం ముందు జాగ్రత్తగా షటర్లు ధరించి స్కూల్‌కు వెళ్లారు. ఈ వర్షం కారణంగా రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనాలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. అత్యవసర పనులు ఉన్న వారు గొడుగుల సహాయంతో బయటకు వెళ్లారు. ఈ చలి తీవ్రత ఇంత పెరగడంతో మహిళలు, వృద్ధులకు ఇబ్బందులు తప్పడం లేదు.
  తడిసిన ధాన్యం, పత్తి .. ఆందోళనలో రైతన్న
  పెద్దపల్లి: పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి, వరి ధాన్యం సోమవారం పెథాయ్ తుఫాన్ కారణంగా తడిసి ముద్దయ్యాయి. దీంతో మార్కెట్ యార్డుకు తెచ్చిన రైతులు ఆందోళన చెందుతున్నారు. కొంత మంది రైతులు పత్తిని షెడ్డుల కిందికి మార్చుకునే లోపే వర్షం పడడంతో పూర్తిగా పత్తి బస్తాలు తడిసి ముద్దయ్యాయి. వరిధాన్యం తడవకుండా కవర్లు కప్పినా సరియైన వసతులు లేకా దాన్యం చాలా వరకు తడిసింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తడిసిన ధాన్యాన్ని కోనుగోలు చేయాలని రైతులు కోరుకుంటున్నారు.


  0 0

  మహబూబాబాద్, డిసెంబర్ 17: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆగిపోయిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని 19వ తేదీ నుంచి నిర్వహించేందుకు జిల్లాలో అధికార యంత్రాంగం సమాయత్తం అవుతుంది. మళ్లీ గ్రామపంచాయతీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో అంతకు ముందే చీరల పంపిణీ పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో జిల్లాలోని 16 మండలాల్లో అధికారులు అప్రమత్తం అవుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని 16 మండలాలకుగాను 2,31,553 చీరలను మహిళలకు అందజేయాల్సి ఉంది. ఇప్పటికే మహబూబాబాద్ గోదాంలో 75వేలు, తొర్రూరు డివిజన్ కేంద్రంలో 68,200చీరలు పంపిణీ కోసం సిద్ధంగా ఉన్నాయి. ముందస్తు ఎన్నికల కోడ్‌తో బతుకమ్మ పం డుగకు అందని చీరలు నూతన సంవత్సర కానుకగా తమ ఇంటికి రానున్నాయని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మండలాల వారిగా లెక్కతేల్చి చీర లను గ్రామాలకు చేర్చే పనిలో ప్రస్తుతం అధికార యంత్రాంగం నిమగ్నమై ఉంది. మహబూబాబాద్ డివిజన్‌లోని 9 మండలాలకు 1,41,400 చీరలు, తొర్రూరు డివిజన్‌లోని 7 మండలాలకు 90,072 చీరలను కేటాయించారు. అందులో జిల్లాకు ఇప్పటి వరకు 1,43,200 చీరలు వచ్చాయి. మిగతా 88,353 చీరలను కూడా జిల్లాకు తెప్పించే పనిలో ప్రస్తుతం ఉన్నారు. రేషన్‌షాపుల ద్వారా, గ్రామ సంఘాల ద్వారా చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రప్రభుత్వం పండుగలకు బహుమతులు అందజేయడం రాష్ట్రప్రభుత్వం ఆనవాయితీగా పెట్టుకుంది. ముస్లింలకు రంజాన్ పండుగరోజు నూతన దుస్తులతోపాటు ఇఫ్తార్ విందులు నిర్వహిస్తుంది. అదేవిధంగా క్రిస్టియన్‌ల కోసం క్రిస్మస్ పండుగకు నూతన దుస్తులను అందిస్తుంది. హిందువులకు బతుకమ్మ పండుగ సందర్భంగా ఈ చీరలపంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. గత సంవత్సరం ప్రారంభమైన ఈ పథకం కొన్ని విమర్శలను ఎదుర్కొంది. నాణ్యతలేని చీరలను ఇచ్చిందనే అపవాదులను రాష్ట్ర ప్రభుత్వం మూటకట్టుకుంది. కాని ఈ సంవత్సరం ఆ విమర్శలకు తావులేకుండా నాణ్యమైన చీరలు అందించే విధంగా చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం గురించి హైదరాబాద్ నుండి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శైలెందర్‌కుమార్ జోషి జిల్లా కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని, ప్రజా ప్రతినిధులను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు. ఎన్నికల కోడ్ మూలంగా కొంత ఆలస్యం అయినప్పటికీ చీరలు అందనున్నాయని తెలియడంతో జిల్లావ్యాప్తంగా మహిళల్లో ఆనందం వ్యక్తం అవుతుంది.

  బతుకమ్మ చీరలు బల్క్‌గా ఇవొద్దు
  వరంగల్ అర్బన్ జిల్లా వ్యాప్తంగా 3,15,500 చీరల పంపిణీ: కలెక్టర్

  వరంగల్, డిసెంబర్ 17: జిల్లాలోని 18 సంవత్సరాల నిండి న 3,15,500 మంది పేద మహిళలకు ఈ నెల 19 నుండి బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నట్లు వరంగల్ అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమావేశం లో ఆయన మాట్లాడుతూ రేషన్ షాపుల వారిగా లబ్ధిదారులకు స్లీప్పులు జారీ చేయనున్నట్లు తెలిపారు. రెండు, మూ డు రోజులలో పంపిణీ ప్రక్రియను పూర్తి చేసేందుకు రేషన్ షాపు, వార్డుల వారిగా లబ్ధిదారులను పిలువాలని తెలిపా రు. జిల్లాలోని 130 గ్రామ పంచాయతీలలో ఒకే రోజు పంపిణీ ప్రారంభించాలన్నారు. అలాగే మున్సిపల్ వార్డుల లో నిర్ధేశిత ప్రాంతాలలో పంపిణీ చేయాలన్నారు. బల్క్‌గా ఇవ్వరాదని స్పష్టం చేశారు. లబ్ధిదారుల కుటుంబ సభ్యులు స్లీప్పులను తీసుకువస్తే నిర్ధారించుకుని బతుకమ్మ చీరలను అందజేయాలని కోరారు. ప్రతి బండిల్‌లో వేరు వేరు రం గుల కల్గిన 160 చీరలు ఉంటాయని తెలిపారు. నాణ్యతను పరిశీలించి మహిళలకు అందజేయాలని కోరారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ యస్ దయానంద్, ఆర్‌డివో వెంకారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


  0 0

  భూపాలపల్లి, డిసెంబర్ 17 : ఈనెల 19 నుండి బతుకమ్మ చీరల పంపిణి చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కె జోషి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లును ఆదేశించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడుతూ చీరల పంపిణి తో పాటు క్రిస్మస్ వేడుకల నిర్వహణ, గ్రామ పంచాయతీ ఎన్నికలపై దృష్టి సారించాలని జోషి అన్నారు. అదేవిధం గా పంచాయతీ కార్యదర్శుల నియామ కం, కల్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణితో పాటు ప్రభుత్వం నూతనంగా వృద్దులకు 57 సంవత్సరాల నుండే ఫించన్ అందించనుంద ని, అర్హులైన వృద్దులను గుర్తించి జాబి తా సిద్దం చేయాలన్నారు. బతుకమ్మ చీరల పంపిణికి శాసన సభ్యులను ఆహ్వానించాలని, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు తుది ఓటరు జాబితాను సిద్దం చేసి జిల్లాల వారిగా బీసీ జనాభా వివరాలను సేకరించి తుది జాబితా సిద్దం చేయాలన్నారు. ఎంపికైన పంచాయతీ కార్యదర్శుల జాబితాను జిల్లాకు పంపించడం జరుగుతుందని, వారి దృవపత్రాలను పరిశీలించి వెంటనే నియామక ఉత్తర్వులను అందించాలని ఆదేశించారు. క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు పలు అంశాలపై జోషికి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సం యుక్త కలెక్టర్ స్వర్ణలత, జిల్లా పంచాయితీ అధికారి చంద్రవౌలి, డిఆర్ డివో సంజీవరావు, భాగ్యలక్ష్మి, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.

  రైలు బోగీల దగ్ధంపై విచారణ కమిటీ
  కాజీపేట, డిసెంబర్ 17:కాజీపేట రైల్వేయార్డులో రెండు బోగీల దగ్ధంపై విచారణ కమిటీని రైల్వే ఉన్నతాధికారులు నియమించారు. కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలోని శనివారం అర్ధరాత్రి దాటాక నిరూపయోగంగా ఉన్న ఫ్యాసింజర్ రైలు అగ్నికి ఆహూతి అయిన విషయం విధితమే. ఈ ఘటనపై రైల్వే ఉన్నతాధికారులు విచారణ కమిటీని నియమించారు. రైల్వే పోలీసు అసిస్టెంట్ కమీషనర్ శ్రీనివాస్,కాజీపేట రైల్వే స్టేషన్ మాస్టర్ లక్ష్మీనారాయణ,రైల్వే ఏరియా అధికారి పూర్ణచందర్,క్యారెజ్ అండ్ వ్యాగన్ సెక్షన్ డిపో ఇన్‌చార్జీ యమునాకర్‌రెడ్డిలను విచారణ కమిటీలో నియమించారు.

  గైర్హాజరైన అధికారులకు షోకాజ్
  జిల్లా అధికారులు విధిగా హాజరుకావాలి: గ్రీవెన్స్‌డేలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

  వరంగల్, డిసెంబర్ 17: ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో ఉద యం 10.30 గంటలకు నిర్వహించే ప్రజావాణికి జిల్లా అధికారులందరు సకాలంలో హాజరుకావాలని వరంగల్ అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ స్పష్టం చేశారు. ఎన్నికల అనంతరం సోమవారం జరిగిన ప్రజావాణికి పలువురు అధికారులు హాజరుకాలేదు. ఆయా శాఖల నుండి క్రింద స్థాయి ఉద్యోగులు హాజరై ప్రజావాణి రిజిస్టర్‌లో సంతకాలు చేశా రు.ఆలస్యంగా వచ్చిన అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపట్ల కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్కూల్ విద్యార్ధులలాగా ప్రవర్తించవద్దని సూచించారు. ఇక నుండి ప్రతి సోమవారం ఎటువంటి సమావేశాలు, పర్యటనలు పెట్టుకోరాదని స్పష్టం చేశారు. ప్రజావాణి రోజు ఎవరికి సెలువు ఉండవని ఆయన వెల్లడించారు. అనంతరం కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ వివరాలను అందజేయాలని సంబందిత అధికారులను కలెక్టర ఆదేశించారు. శాఖల వారీగా మంజూరు చేసిన యూనిట్లు, గ్రౌండింగ్ నివేదకను సమర్పించాలని, జాప్యానికి కారణాలను పేర్కొనాలని ఆయన తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసినప్పటికి బీసీ సంక్షేమ శాఖ యూనిట్లు మంజూరు ప్రతి పాదనలు సిద్దం చేయకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారినిక జిల్లా అధికారులు వ్యక్తిగత చొరవతో పరిశీలించాలని ఆదేశించారు. అదే విధంగా రూరల్ జిల్లాలో కలెక్టరేట్‌లో సోమవారం జేసీ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా వాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజావాణి దృష్టికి వచ్చిన సమస్యలను విని సమస్యల పరిష్కారానికి పాటుపడాలని అధికారులకు ఆయన సూచించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో బల్దియా కమీషనర్ వీపీ గౌతమ్ పాల్గొని ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ జిల్లా సంయుక్త కలెక్టర్ యస్ దయానంద్, డీఆర్‌వో కృష్ణవేణి, కే వెంకా రెడ్డి, జెడ్‌పిసీ ఈవో విజయ్‌గోపాల్ తదితరులు పాల్గొన్నారు.


  0 0

  హంటర్‌రోడ్, డిసెంబర్ 17: క్రిస్మస్ పండుగ సంబురాల్లో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 1000 మంది, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 1000 మందికి గిఫ్ట్ ప్యాకెట్లను పంపిణీ చేయనునట్లు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. అలాగే నియోజకవర్గానికి 1000 మందికి క్రిస్మస్ విందును ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రజా ప్రతినిధులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని తెలిపారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులు, చర్చి మతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి గిఫ్ట్ ప్యాకెట్‌లో ఒక ప్యాంట్, ఒక షర్ట్, ఒక చీర, షాల్వార్‌కమీజ్, చున్నీ ఉంటాయని తెలిపారు. గిప్ట్ ప్యాకెట్ల పంపిణీకి నియోజకవర్గాల వారిగా కమిటీలను ఏర్పాటు చేసి, ప్రత్యేక బ్యాంక్ ఖాతాలను తెరవాలని తెలిపారు. వరంగల్ పశ్చిమకు ఆర్‌డీవో వెంకారెడ్డిని, వరంగల్ తూర్పుకు డిప్యూటీ కమీషనర్ బ్రహ్మయ్యను నోడల్ ఆఫీసర్లుగా నియమిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 20న గిఫ్ట్ ప్యాకెట్ల పంపిణీకి ఈ కార్యక్రమాలను చేపట్టుటకు అనువైన ప్రదేశాలను ఎంపిక చేయాలని ఆయన సూచించారు. నియోజకవర్గానికి ఒక చోటనే పండుగ వాతావరణం ప్రతిభింబే విధంగా గిప్ట్ ప్యాకెట్ల పంపిణీ, విందు భోజనాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. లబ్ధిదారుల ఎంపికలో హెచ్‌ఐవీ, బాధిత వ్యక్తులు, ఆనాథలు, వితంతువు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, నిరుపేదలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. జిల్లాలోని ప్రతి చర్చి పరిధి నుండి లబ్ధిదారులు ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ ఎస్ దయానంద్, డీ ఆర్‌వో కృష్ణవేణి, జెడ్పీ సీఈవో విజయ్‌గోపాల్, డీఆర్‌డీవో రాము, జిల్లా మైనార్టీ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

  రైతు రత్న అవార్డుకు దరఖాస్తులు
  భూపాలపల్లి టౌన్, డిసెంబర్ 17: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రైతులు రైతు రత్న అవార్డుల ఎంపికకు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం అధ్యక్షులు సత్యంబాబు తెలిపారు. అవార్డు ఎంపిక తెలంగాణ విశ్రాంత వ్యవసాయ అధికారుల సంఘం, తెలంగాణ వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు. ఉత్తమ రైతులు ఈ నెల 20వ తేది లోపు ఆయా మండలాల వ్యవసాయాధికారికి దరఖాస్తులు అందజేయాలని కోరారు.

  కేటీఆర్ తెరాసను తిరుగులేని శక్తిగా మారుస్తారు: చల్లా
  పరకాల, డిసెంబర్ 17: తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వహక అధ్యక్షులు కె. తారకరామారావు తెలంగాణ రాష్ట్ర సమితిని తిరుగులేని రాజకీయ శక్తిగా మారుస్తారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం నిర్వహించిన సమావేశంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ తెరాస కార్యనిర్వాహక అధ్యక్షులుగా కేటీఆర్ ఎన్నికైన తరువాత మొదటి సారిగా వరంగల్‌కు ఈనెల 20న వస్తున్నారని చెప్పా రు. వరంగల్‌కు వస్తున్న కేటిఆర్‌కు ఘన స్వాగతం పలకాలని కార్యకర్తలకు, నాయకులకు చల్లా ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. ఈనెల 20న హైగ్రీవాచారి మైదానంలో మధ్యాహ్నం 1 గంటకు వరంగల్ రూరల్, అర్బన్ జిల్లాకు సంబందించిన కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో కేటిఆర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని చెప్పారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెరాస సత్తా చాటేలా వ్యహ రచన చేయడమే కాకుండా తగు కార్యచరణ గురించి కార్యకర్తలతో మాట్లాడుతారని తెలిపారు. స్థానిక సంస్థల్లో వంద శాతం సీట్లు సాధించే లక్ష్యంతో కార్యచరణ రూపొందిస్తున్నారని పేర్కొన్నారు. సమావేశానికి గ్రామ శాఖ అధ్యక్షులు, బూతు కమిటీ కన్వీనర్లు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలన్నారు.


  0 0

  భూపాలపల్లి/మహదేవ్‌పూర్, డిసెంబర్ 17: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల పర్యటన రద్దు అయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా మహదేవ్‌పూర్ మం డలంలో నిర్మిస్తున్న మేడిగడ్డ బ్యారేజి, కనె్నపల్లి పంప్ హౌస్, అన్నారం బ్యారేజ్‌లను సందర్శించే నేపథ్యంలో పెథాయ్ తుఫాన్ ప్రభావంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన రద్దు అయినట్లు జిల్లా అధికారులు తెలిపారు. తుఫాన్ కారణంగా జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో సీఎం పర్యటన రద్దు చేశారు.

  20న కేటీఆర్ రాక
  టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వరంగల్‌లో తొలి పర్యటన
  ఘన స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు
  వేలాది సంఖ్యలో బైక్‌ర్యాలీ, కార్యకర్తల సమావేశాలు
  కడియం నేతృత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల, చైర్మన్ల సమావేశం

  వరంగల్, డిసెంబర్ 17: టీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేటీఆర్ తొలిసారిగా ఈ నెల 20వ తేదిన వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ జిల్లాల్లో పర్యటించి కార్యకర్తల సమావేశంలో పార్టీ పటిష్టత, రాబోయో పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేసే విధంగా పార్టీ శ్రేణులకు ఆయన దిశా నిర్ధేశం చేయనున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతల స్వీకరించిన ఆయన మొదటిసారిగా వరంగల్ జిల్లాకు వస్తున్న కేటీఆర్‌కు ఘన స్వా గతం పలికేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు సిద్దమయ్యారు. ఈ మేరకు హైదరాబాద్ టూరిజం ప్లాజా లో సోమవారం కడియం శ్రీహరి నేతృత్వంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, తాటికొండ రాజయ్య, దాస్యం వినయ్‌భాస్కర్, ఆరూరి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి, రైతు గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్ధ చైర్మన్ రాజయ్య యాదవ్ సమావేశమయ్యారు. ఈ నెల 20వ తేదిన ఉదయం 11గంటలకు జనగామ జిల్లాలోని ప్రిస్టన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసి పాలకుర్తి, స్టేషన్ ఘనపూర్, జనగామ నియోజకవర్గాల ఉమ్మడి కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు. జనగామ జిల్లా వస్తున్న నేపథ్యంలో పెంబర్తి కాకతీయ కళాతోరణం నుంచి ప్రిస్టన్ గ్రౌండ్స్ వరకు వేలాదిగా పార్టీ కార్యకర్తలు బైక్ ర్యాలీతో కేటీఆర్‌కు ఘన స్వాగతం పలకాలని నిర్ణయించారు. మధ్యా హ్నం రెండు గంటలకు వరంగల్ జిల్లాకు వస్తున్న నేపధ్యంలో మడికొండ నుండి కూడా మైదానం వరకు వేల సంఖ్యలో పార్టీ కార్యకర్తల బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలకాలని సమావేశం నిర్ణయించింది. అనంతరం అర్బన్ టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయానికి ఆయన శంఖుస్ధాపన చేయనున్నారు. ఆ తర్వాత కూడా మైదానంలో వరంగల్ అర్బన్, రూరల్ జిల్లా పార్టీ కార్యకర్తలతో ఉమ్మడి సమావేశంలో ఆయన మాట్లాడి దిశానిర్ధేశం చేయనున్నారు. వరంగల్ అర్బన్, రూరల్, జనగామ జిల్లాల పరిధిలోని ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించి రెండు చోట్ల నిర్వహించే కార్యర్తల సమావేశాలకు బూత్ కమిటి చైర్మన్లు, సభ్యులు, పార్టీ గ్రామ కమిటీ నాయకులు, గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్ధాయి రైతు సమన్వయ సమితి కో ఆర్టీనేటర్లు, సభ్యులు, మాజీ సర్పంచలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల పార్టీ బాధ్యులు, నేతలు పాల్గొని విజయవంతం చేయాలని కడియం కోరారు.

  పంచాయతీ ఎన్నికల పూర్తి బాధ్యత
  రిటర్నింగ్ అధికారులదే
  * మహబూబాబాద్ కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య
  మహబూబాబాద్, డిసెంబర్ 17: పంచాయతీ ఎన్నికల నిర్వహణ పూర్తి బాధ్యత రిటర్నింగ్ అధికారులపైనే ఉంటుందని జాగ్రత్తగా వ్యవహరించాలని కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య అన్నారు. మహబూబాబాద్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం రెండవదశ రిటర్నింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. మొదటి విడుత రిటర్నింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమం ఇప్పటికే నిర్వహించామన్నారు. రెండవదశ రిటర్నింగ్ అధికారులు ఎన్నికల నిర్వహణలో పూర్తిస్థాయి అవగాహన పెంచుకోవాలన్నారు. ఎన్నికల సంఘం నియమావళిని తూచా తప్పకుంటా పాటిస్తూ దానిప్రకారమే విధులు నిర్వహించాలని తెలిపారు. శిక్షణలో ప్రతి అంశాన్ని జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. ఎమైనా సందేహాలు ఉంటే శిక్షణలోనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. నోటిఫికేషన్ నుండి నామినేషన్‌ల స్వీకరణ, పరిశీలన, అభ్యంతరాల స్వీకరణ, ఉపసంహరణ, పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రకటించడం వంటి అన్ని కార్యక్రమాలు రిటర్నింగ్ అధికారులే నిర్వహించాల్సి ఉం టుందన్నారు. పోటీలో పాల్గొనే అభ్యర్థులు ఎన్నికల ఖర్చును కచ్చితంగా సమర్పించాలని తెలిపారు. గ్రామపంచాయతీలో పోలింగ్ స్టేషన్‌ల ఏర్పాటు, ఇతర అన్ని ఏర్పాట్లను పరిశీలించాలని, ఓటర్లకు ఫొటో ఓటర్ స్లిప్‌ను జారీచేయాలని అన్నారు. పోలింగ్ నిర్వహణకు ఎలాంటి అవాంతరాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఓట్లను లెక్కించిన తదుపరి ఫలితాలు ప్రకటించాలని సంబందిత ఎంపీడీవో సహాయంతో అధికారిక ఎన్నికల ఫలితాలను రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని తెలిపారు. ఎన్నికల ధృవపత్రాలను జారీచేయాలని, ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మండలస్థాయి ఎన్నికల అధికారికి వినియోగించిన, వినియోగించని బ్యాలెట్ పేపర్‌లతో కూడిన బ్యాలెట్ బాక్సులు, ఇతర స్టేషనరిలను అప్పగించాలని తెలిపారు. గత ఎన్నికల్లో ఎక్కువ మంది ఉద్యోగులే ఉన్నందున వారి అనుభవాలను జోడించి సమిష్టికృషితో ఎన్నికలను సజావుగా నిర్వహించాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు రిటర్నింగ్ అధికారులు అడిగిన సందేహాలను కలెక్టర్ స్వయంగా నివృత్తి చేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా పంచాయితీ అధికారి సూర్యనారాయణ, ఆర్డీవోలు కొంరయ్య, ఈశ్వరయ్యలతోపాటు రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.


  0 0

  మెదక్, డిసెంబర్ 17: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ చందనాదీప్తి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజావాణిలో భాగంగా ఫిర్యాదుదారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుదారులకు చట్టపరమైన విషయంలో న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రామాయంపేట మండలం శివాయిపల్లి గ్రామానికి చెందిన దోసల వెంకటయ్య తనను తన కొడుకు కార్తీక్ గత కొద్దికాలంగా తనపై అనేకసార్లు దాడిచేశాడని, కిరోసిన్ పోసి తగలబెట్టడానికి ప్రయత్నించాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మరొకసారి తాను మా ఇంట్లో పడుకొని ఉండగా తనను గొడ్డలితో నరకడానికి వచ్చాడని, అనేకసార్లు తనపై కర్రతో దాడి చేసి గాయపరిచాడని, తన కొడుకు దాడి చేస్తుండగా భయపడి కోనాపూర్‌లోని తన అక్క ఇంట్లో తలదాచుకుంటున్నానని, ఈ విషయం తెలుసుకొని తన కొడుకు అక్కడికి వచ్చి విపరీతంగా కొట్టాడని, తన కొడుకు వల్ల తనకు ప్రాణభయం ఉందని, తనకు తగిన న్యాయం చేయాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎస్పీ చట్టప్రకారం ఫిర్యాదుదారునికి న్యాయం చేయాలని రామాయంపేట సీఐని ఆదేశించారు. నర్సాపూర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి అనితను తన పాలివారు కె.చిత్తారి, నగేష్, మల్లమ్మ, మంజుల అకారణంగా కొట్టి బూతులు తిట్టారని, ఎందుకు కొడుతున్నారని అడుగగా తన భర్త యాదగిరి తనను గతంలో తిట్టాడని, బూతులు తిడుతూ పైన తెలిపిన వారు కొట్టారని తనకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీకి ఆమె ఫిర్యాదు చేయగా స్పందించిన చందనాదీప్తి చట్టప్రకారం విచారణ జరిపి ఫిర్యాదికి న్యాయం చేయాలని తూప్రాన్ డీఎస్పీని ఆదేశించారు. తూప్రాన్ గ్రామానికి చెందిన కిచ్చిగారి హంసను తన పిన తండ్రి సర్గల్ పోచయ్య తనకు పిల్లలు లేకపోవడంతో తనకు దత్తత తీసుకున్నాడని, అయితే అక్టోబర్ 27న తన పినతండ్రి మరణించాడని, ఆయన మరణం తరువాత మా కుటుంభానికి చెందిన సర్గల్ స్వామి, దేవయ్య, మంగమ్మ, ఎల్లమ్మ, విజయ్, తిమ్మాయిపల్లి భాగ్యమ్మ, భాస్కర్‌లు కలిసి మా పినతండ్రి ఆస్తిపాస్తులను అక్రమంగా స్వాదీనం చేసుకొని తనను ఇంట్లో నుండి వెళ్లగొట్టారని తనకు న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. దీనిపై జిల్లా ఎస్పీ స్పందిస్తూ ఫిర్యాదు ప్రకారం విచారణ జరిపి తగిన న్యాయం చేయాలని తూప్రాన్ ఎస్‌హెచ్‌ఓను ఆదేశించారు. ఈ విధంగా వచ్చిన అనేక ఫిర్యాదులను పరిశీలించి ఫిర్యాదుదారులకు న్యాయం చేస్తానని ఎస్పీ చందనాదీప్తి భరోసా ఇచ్చారు.
  విద్యార్థినులపై..
  ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు

  * చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీకి ఫిర్యాదు
  సంగారెడ్డి టౌన్, డిసెంబర్ 17: విద్యార్థినీలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైగింక వేధింపులకు పాల్పడుతున్న ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలంటూ పాఠశాల మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ చిప్పె సంగమేశ్వర్ సోమవారం జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డికి ఫిర్యాదు చేసారు. కీచక ఉపాధ్యాయునిపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మునిపల్లి మండలం తాటిపల్లి గ్రామ జెడ్పీహెచ్‌ఎస్ జీవశాస్త్ర ఉపాధ్యాయుడు పాత్త్యా కిషన్ పదవ తరగతి విద్యార్థినీలను గత కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నట్లు తెలిపారు. పాఠశాల మొదటి అంతస్తులో ఉన్న ల్యాబ్‌లోకి తీసుకెళ్లి తన ఫోన్‌లోని అసభ్య చిత్రాలను చూపిస్తూ వెలికి చేష్టలు చేస్తున్నట్లు తెలిపారు. ఇతర స్ట్ఫాకు గాని, విద్యార్థినీల తల్లిదండ్రులకు గాని చెప్పితే 10వ తరగతిలో ఫెయిల్ చేస్తానని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. భయపడి సంఘటనను విద్యార్థులు బయటకు చెప్పలేకపోయారని, ఈ నెల 15న కొంటి సాకులతో ల్యాబ్‌కు తీసుకెళ్లిన ఉపాధ్యాయుడి వైధింపులను భరించలేక విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు. సంఘటనను దృష్టిలో ఉంచుకొని పిల్లల భవిష్యత్‌పై అసభ్య ప్రభావం పడకుండ చూడాలని, ఆడపిల్లలకు రక్షణ కల్పించాలని చైర్మన్‌తో పాటు తల్లిదండ్రులు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


  0 0

  గజ్వేల్, డిసెంబర్ 17: గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీ రామకోటి భక్త సమాజం వ్యవస్థాపకులు రామకోటి రామరాజు సోమవారం శ్రీ రామ నామాల లిఖిత పుస్తకాన్ని సీఎం కేసీఆర్‌కు ప్రగతిభవన్‌లో అందజేశారు. టీఆర్‌ఎస్ గెలుపు కోసం 25 సార్లు శ్రీ సీతారాముల కళ్యాణం, 35 సార్లు శ్రీ రామకోటి జప మహాయజ్ఞం నిర్వహించినట్లు సీఎం కేసీఆర్‌కు రామరాజు వివరించారు. అయితే 100 కోట్ల రామనామాల పుస్తకాలను ఇప్పటికే లిఖింపజేయగా, ఒకసారి వాటిని దక్కించుకొని పూజలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ను ఆయన కోరారు.
  దీంతో స్పందించిన సీఎం కేసీఆర్ త్వరలోనే గజ్వేల్ పర్యటన ఉన్నందున తప్పకుండా లిఖిత రామనామాల పుస్తకాలను దర్శించుకోనున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు అధికారికంగా ఏర్పాట్లు చేయాలని అక్కడే ఉన్న మున్సిపల్ చైర్మెన్ గాడిపల్లి భాస్కర్‌కు సీఎం సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
  మెదక్ పురపాలికకు 25 కోట్లు
  * పురపాలక సంఘం కమిషనర్ సమ్మయ్య
  మెదక్, డిసెంబర్ 17: ప్రభుత్వ ఉత్తర్వులు 763 జీవో ప్రకారం టీయూఎఫ్‌ఐడీసీ ద్వారా 25 కోట్లు మెదక్ పురపాలక సంఘానికి విడుదలైనట్లు మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య సోమవారం మాట్లాడుతూ తెలిపారు. ఇందులో 10 కోట్ల రుపాయలను ఇంటింటి నల్లా కనెక్షన్ కోసం ప్రపంచ బ్యాంక్ నిధులకు అధనంగా తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రపంచ బ్యాంక్ మిషన్ భగీరథ క్రింద మెదక్ పట్టణానికి 50 కోట్లు మంజూరు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మెదక్ పురపాలక సంఘానికి మంజూరైన 25 కోట్లలో అధనంగా 10 కోట్లు తీసుకొని ఇంటింటి నల్లా కనెక్షన్ల కోసం వ్యయపరుస్తున్నట్లు ఆయన తెలిపారు. మిగిలిన 15 కోట్ల రుపాయలను పట్టణంలో గ్రేవ్‌యాడ్స్‌కు, ట్యాంక్‌బాండ్ బ్యూటిఫికేషన్ కోసం రాందాస్ చౌరస్తా, చేగుంట వెల్‌బోర్డ్ వద్ద జంక్షన్ నిర్మాణం, పార్కుల అభివృద్ది, మేజర్ డ్రైన్స్‌కు, రోడ్ల అభివృద్దికి వ్యయపరుస్తున్నట్లు తెలిపారు. అయితే జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అనుమతి ఇచ్చిన వెంటనే ఈ పనులు చేపడతామని సమ్మయ్య తెలిపారు.
  డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
  సంగారెడ్డి టౌన్, డిసెంబర్ 17: జిల్లాలో డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హన్మంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో డబుల్‌బెడ్‌రూం ఇళ్ల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
  జిల్లాలోని రూరల్‌లో 3478, అర్బన్‌లో 2077 మొత్తం 5555 ఇళ్లు మంజూరు కాగా, టెండర్ల ప్రక్రియ పూర్తయి ఇప్పటి వరకు వరకు 4606 ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభమై వివిధ దశలలో ఉన్నాయని, సుమారు రూ.57.71కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. ప్రారంభించిన ఇండలలో సంగారెడ్డి నియోజకవర్గంలోని కొండాపూర్ మండలం అలియాబాద్ గ్రామంలో 50 ఇళ్లు పూర్తయినట్లు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇండ్ల పనులలో వేగాన్ని పెంచాలని, సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందేలా చొరవ చూపాలన్నారు. ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలు తాత్సరం చేయరాదని, పనులు నాణ్యతగా ఉండాలని సూచించారు. నిర్ణీత లక్ష్యంగా ముందుకు వెల్లాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో హౌజింగ్ మేనేజర్ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలు, ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు.
  రాష్ట్రంలో మరో 20 యేండ్ల వరకు.. టీఆర్‌ఎస్‌కు ఢోకా లేదు
  గజ్వేల్, డిసెంబర్ 17: రాష్ట్రంలో మరో 20 యేండ్ల వరకు టీఆర్‌ఎస్‌కు డోకా లేదని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. సోమవారం గజ్వేల్ మండలం దాచారం గ్రామానికి చెందిన మోహన్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డిల నేతృత్వంలో ఆయా పార్టీలకు చెందిన 200ల మంది కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్బంగా ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలువగా, పేదల అభ్యున్నతి, సంక్షేమానికి పెద్దపీట వేసినందునే రాష్ట్రంలో టీఆర్‌ఎస్ మరోసారి అధికారంలోకి వచ్చిందని స్పష్టం చేశారు.
  ముఖ్యంగా రైతుబంధు, రైతుభీమా, షాదీముబారక్, కళ్యాణలక్ష్మి, ఉచిత విద్యుత్, మిషన్‌భగీరథ, మిషన్‌కాకతీయ వంటి పథకాలు టీఆర్‌ఎస్ గెలుపునకు ఎంతో దోహద పడినట్లు తెలిపారు. అలాగే ఎన్నికల సందర్బంగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉండగా, ప్రతిపక్ష పార్టీల హామీలు ప్రజలు నమ్మనందునే ఆ కూటమిని మహాకూటమి అభ్యర్థులను పాతరేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పటిష్టతకు కృషి చేస్తుండగా, పార్టీలో ఎలాంటి వర్గాలు, విబేదాలు లేవని ప్రతి ఒక్కరూ కలసికట్టుగా సీఎం కేసీఆర్ ఆదేశాలను శిరసావహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌వీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్, మండల టీఆర్‌ఎస్ బాద్యులు బెండ మదు, రైసస జిల్లా డైరెక్టర్ మద్దూరి శ్రీనివాస్‌రెడ్డి, మండల డైరెక్టర్ మద్ది రాజిరెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఊడెం కృష్ణారెడ్డి, లీగల్‌సెల్ నాయకులు అశోక్‌రెడ్డి, ఎంపీపీ వైస్ ప్రెసిడెంట్ నర్సింహారెడ్డి, జాగృతి చైర్మెన్ రమేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


  0 0

  సంగారెడ్డి, డిసెంబర్ 17: పేద మహిళలకు పంపిణీ చేయాల్సి ఉన్న బతుకమ్మ చీరలను రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 19వ తేదీ నుండి చీరల పంపిణీకి తగిన ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె.జోషి కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం సచివాలయం నుండి బతుకమ్మ చీరల పంపిణీ, ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మీ, షాదిముబారక్, జూనియర్ గ్రామ కార్యదర్శుల నియామకం, గ్రామ పంచాయతీల ఎన్నికల ఏర్పాట్లు, జాతీయ రహదారుల భూ సేకరణ, క్రిస్‌మస్ గిప్ట్ ప్యాకుల పంపిణీ తదితర అంశాలపై కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులందరూ పాల్గొనేలా చూడాలన్నారు. రోజువారి పంపిణీకి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జెయేష్ రంజన్ మాట్లాడుతూ బతుకమ్మ చీరలను ఇప్పటికే జిల్లాలకు పంపామని, వాటిని 5 లేదా 6 రోజుల్లోగా పంపిణీ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా గోడౌన్స్ నుండి గ్రామ స్థాయి గోదాములకు చేరేలా రవాణ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. గ్రామస్థాయి గోదాములకు పర్సనల్ ఇంచార్జిలను నియమించాలన్నారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో పంపిణీకి సంబంధించి మహిళా సంఘాలు, అధికారులు, వార్డు కమిటీలను నియమించి సమీక్షించాలని తెలిపారు. గ్రామాలలో పంపిణీ తేదీలను పత్రికల ద్వారా ప్రజలకు తెలిసేలా ప్రచారం చేపట్టాలన్నారు. జౌళి, చేనేత శాఖ కమీషనర్ శైలజా రామయ్యర్ మాట్లాడుతూ చీరల పంపిణీలో ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్లను కోరారు. ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 60 రోజులకు మించి దాదాపు వెయ్యి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని,
  ముక్కోటి ఏకాదశికి ముస్తాబైన వెంకటేశ్వరాలయం
  సిద్దిపేట, డిసెంబర్ 17 : ముక్కోటి ఏకాదశి పర్వదినానికి సిద్దిపేట కొత్త వేంకటేశ్వరాలయంలో ముస్త్భాంది. ఈనెల 18న మంగళవారం ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని ఆలయ కమిటీ పక్షాన ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ముక్కోటి ఏకాదశి,వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా వెంకటేశ్వరాలయాన్ని రంగు లు, విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు.వెంకటేశ్వరాలయాన్ని పూలతోప్రత్యేకంగా ముస్తాబు చేశారు.
  వెంకటేశ్వరాలయంలో వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా 50వేలకు పైగా పైగా భక్తులు హాజరవుతుండటం వల్ల భక్తులకు ఏలాంటి ఇబ్బందులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వెంకటేశ్వరాలయం నుండి జిల్లా జడ్జీ, గాంధీ చౌక్, వీర సావర్కర్ చౌరస్తా వరకు పెండెల్స్ ఏర్పాటు చేశారు. భక్తులకు జిల్లా జడ్జీ, గాంధీ చౌక్ వరకు క్యూలైన్లు ఏర్పాటు చేసి ధర్మ దర్శనానికి బారికేడ్లు నిర్మించారు. అలాగే వీవీఐపీలకు రూ. 500, రూ.100 రూపాయలకు ప్రత్యేక దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ అభివృద్ధికి, వైకుంఠ ద్వార నిర్మాణానికి సహాకరించిన వారికి దేవాలయం నుండి గుర్తింపుకార్డులుఇచ్చిప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. వీవీఐపీ ద్వారం గుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, జడ్జీలు, జిల్లా స్థాయి అధికారులు, జర్నలిస్టులకు అవకాశం కల్పిస్తున్నారు.
  భక్తులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండ అవసరమగు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ కమిటీ అధికారులు వెల్లడించారు. వెంకటేశ్వరాలయం సోమవారం ఉదయం నుండి ఎడతేరిపి లేకుండ కురుస్తున్న వర్షం వల్ల వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లలో నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. ఇప్పటికే ఆలయం ప్రాంగణం పెండిల్స్ ఏర్పాటు, భారికేడ్లు నిర్మిస్తున్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యగా భారీ బందోబస్తు చర్యలు చేపట్టనున్నారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవీస్, అడీషనల్ డీసీపీ నర్సింహరెడ్డి, ఏసీపీ రామేశ్వర్ పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు.
  వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండ అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఆలయ కార్యనిర్వాహాణాధికారి విశ్వనాథశర్మ, ఆలయకమిటీ చైర్మన్ నగేశ్ విష్టు తెలిపారు. భక్తులకు క్యూలైన్లలో తాగునీటి సౌకర్యం కలిస్తున్నట్లు తెలిపారు. భక్తులందరికి ప్రసాద వితరణ చేయనున్నట్లు తెలిపారు. మంగళవారం తెల్లవారు జామున 4గంటల నుండి వైకుంఠ ద్వార గుండా భక్తులకు వైకుంఠనాథుడు దర్శనమిస్తారన్నారు. అప్పటి నుండి రాత్రి వరకు భక్తులకు వైకుంఠ ద్వారంగుండ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారన్నారు. వైకుంఠద్వారం వెలుపలనే కొబ్బరికాయలు కొట్టెందుకు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. . భక్తులు పెద్దఎత్తున హాజరై స్వామికృపకు పాత్రులు కాగలని కోరారు.
  మిరుదొడ్డి : మండల కేంద్రంలోని శ్రీసీతారామచంద్రస్వామి, శ్రీవేంకటేశ్వరా దేవాలయాలు నిర్వహించనున్న ముక్కోంటి ఏకాదశి కోసం అలయాలను ముస్తాబు చేస్తున్నారు. ముక్కోంటి ఏకాదశి పురస్కరించుకొని ఉత్తర ద్వారా దర్శనం గుండా భక్తులు స్వామివారిని దర్శించుకోవాలని అలయ దర్మకర్తలు ఎకె వరదచారి, రాజగోపాల్‌చారి, అర్చకులు ఎకె పార్థసారిధి, చైర్మన్ అంజిరెడ్డి, శ్రీవెంకట్వేర స్వామి దేవాలయం ధర్మకర్త సుతారి సత్తయ్య కోరారు. ఈ కార్యక్రమాన్ని పురష్కరించుకొని భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు భక్తులు హజరుకావాలని వారు కోరారు.
  గాడిలో పడిన ప్రజాపాలన
  ఆయా జిల్లాల్లో ఉన్న పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం మాట్లాడుతూ కల్యాణలక్ష్మీ, షాదిముబారక్‌లకు జిల్లాల వారీగా అవసరమైన నిధుల వివరాల ప్రతిపాదనలు పంపాలన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి బెనహర్ మనేష్‌దత్ ఎక్యా మాట్లాడుతూ క్రిస్‌మస్ పండుగ సందర్భంగా క్రిస్టియన్లకు గిప్ట్ ప్యాక్‌లను ఈ నెల 18న, ఫుడ్ మెటీరియల్ ప్యాక్‌లను ఈ నెల 20న పంపిణీ చేయడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఆసరా పింఛన్లకు సంబంధించి సీఎస్ మాట్లాడుతూ 57 సంవత్సరాల వయస్సు నిండిన వారికి ఆసరా పింఛన్లు మంజూరు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా అర్హుల ఎంపిక కోసం ఓటరు జాబితాను వినియోగించుకోవాలని తెలిపారు. రెండు, మూడు రోజుల్లోగా జిల్లాల వారీగా లబ్దిదారుల సంఖ్యను తెలియజేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ మాట్లాడుతూ ఓటరు జామితాలో 57 నుండి 64 సంవత్సరాల వయస్సు గల వారి విరాలను తీసుకుని ఎస్‌కెఎఫ్ డాటాతో సరిచూసుకుని రెండు, మూడు రోజుల్లోగా డ్రాప్ట్ లీస్ట్‌ను గ్రామ సభల్లో పబ్లీష్ చెయ్యాలని సూచించారు. నిబంధనల మేరకు పింఛన్లు మంజూరి చేయాలని కలెక్టర్లతో స్పష్టం చేసారు. పింఛన్‌కు అర్హులు, అనర్హుల జాబితాలను గ్రామ సభలో పెట్టి ఆమోదం పొందిన తరువాత ప్రభుత్వానికి సమర్పించాలని సూచించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి కొత్త పెన్షన్లు అందించనున్నట్లు తెలిపారు. 9355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి సంబంధించి జిల్లాల వారీగా ఎంపిక చేసిన అభ్యర్థుల హాల్ టికెట్ల నంబర్లను పత్రికలలో ప్రచురించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సీఎస్ కోరారు. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 25లోగా నియామక పత్రాలు జారీ చేయాలని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లతో సంసిద్దంగా ఉండాలనితెలిపారు. జిల్లాల వారీగా క్యాటగిరి ప్రకారం సీట్లను రూపొందించాలన్నారు. జాతీయ రహదారుల భూ సేకరణపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని సీఎస్ తెలిపారు. ఎన్‌హెచ్‌ఐకీ సంబంధించి 16 జిల్లాలో, ఎన్‌హెచ్‌కు సంబంధించి 17 జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్నాయని ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ అన్నారు. ఆయా జిల్లా కలెక్టర్లు ఈ విషయమై ప్రత్యేకంగా సమీక్షించి పనులు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో సంగారెడ్డి నుండి కలెక్టర్ హన్మంతరావు, డీపీఓ వెంకటేశ్వర్లు, చేనేత, జౌళి శాఖ అధికారి విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. వీడియోకాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ సమావేశ మందిరంలో మెప్మా పీడీ రమేష్, డీపీఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమీషనర్లు, తహశీల్దార్లతో కలెక్టర్ హన్మంతరావు సమావేశం నిర్వహించారు. బతుకమ్మ చీరలు, క్రిస్‌మస్ గిప్ట్ ప్యాక్స్ పంపిణీ, 57 సంవత్సరాలు పూర్తయిన ఆసరా పింఛన్‌కు అర్హులైన వారి ఎంపిక, జూనియర్ పంచాయతీ సెక్రటరీల దృవపత్రాల పరిశీలన తదితర అంశాలపై దిశా నిర్దేశం చేసారు. ఏలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని కార్యక్రమాలు సజావుగా కొనసాగేలా బాధ్యతగా పని చేయాలని అధికారులకు సూచించారు.
  సంక్షేమ పథకాల పంపిణీ..
  జాబితాను సిద్ధం చేయండి
  - రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి
  సిద్దిపేట, డిసెంబర్ 17 : బతుకమ్మ చీరల పంపిణీ, కల్యాణలక్ష్మి షాదీ ముబారక్, 57 ఏండ్లు నిండిన వృద్ధులకు ఆసర పింఛన్ల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎస్‌కె జోషీ ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా రానున్న గ్రామ పంచాయతీ, సర్పంచ్ ఎన్నికలు, జూనియర్ గ్రామపంచాయతీ కార్యదర్శుల నియామకం విషయాలపై కలెక్టర్‌తో చర్చించారు. ఈకార్యక్రమంలో సిద్దిపేట జిల్లా నుండి కలెక్టర్ కృష్ణ్భాస్కర్, జేసీ పద్మాకర్, ట్రైనీ ఐఏఎస్ అవిష్యంత్ పండా, డీపీఓ సురేష్‌బాబు ,డీఆర్‌డీఎ పీడి నవిన్‌కుమార్, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు వీడియో కాన్పరెన్స్‌లో పాల్గొన్నారు.


  0 0

  ఆళ్లగడ్డ, డిసెంబర్ 18:నల్లమల అరణ్యంలో వెలసిన 108 దివ్యక్షేత్రాల్లో ఒకటైన, జిల్లాలోనే ప్రఖ్యాతిగాంచి వైష్ణవ క్షేత్రంగా బాసిల్లుతున్న శ్రీఅహోబిల క్షేత్రంలో మంగళవారం వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. ఆలయ ఈఓ కామేశ్వరమ్మ , జీపీఏ సంపత్, ప్రధానార్చకులు కిడాంబి వేణుగోపాలన్ ఆధ్వర్యంలో వేడుకలు కన్నుల పండువలా జరిగాయి. ఎగువ, దిగువ అహోబిలాల్లో వెలసిన శ్రీజ్వాలానరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను, శ్రీప్రహ్లాద వరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు పంచామృతాభిషేకం నిర్వహించి పట్టుపితాంబరాలు, పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించారు. అలాగే ఉత్సవమూర్తులను వస్త్రాలు, పూలమాలలతో అలంకరించి పూజలు నిర్వహించారు. గోదాదేవి, శ్రీప్రహ్లాదవరద స్వామి, అమ్మవార్లకు వేకువజామునే అర్చకులు ధనుర్మాస పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటలకు భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా వైకుంఠంలో వున్న శ్రీమన్నారాయణుని దర్శించుకునేందుకు వీలు కల్పించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు వేకువజామున 3గంటల నుంచే ఆలయ క్యూలైన్లలో వేచి వుండి స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానార్చకులు మాట్లాడుతూ ఏకాదశినాడు ఉత్తర ద్వారంలో స్వామి వారిని దర్శించుకోవడంతో సకల పాపాలు తొలగి స్వర్గలోక ప్రాప్తి లభిస్తుందన్నారు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువే ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శినమిస్తారన్నారు. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని తమిళనాడు, కర్ణాటక నుంచే కాక సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఎగువ, దిగువ అహోబిలాల్లో కొలువుదీరిన స్వామి వారిని ఉత్తర ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించి కనులారా చూసి తరించారు. అలాగే నవనారసింహులలో ఒకరైన కారంజ నరసింహస్వామి ఆలయం ఉత్తరం వైపే వుండడంతో భక్తులు కారంజ నరసింహస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. దిగువ అహోబిలంలో ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి గరుడ వాహనంపై కొలువుదీర్చి మాడ వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. అలాగే పట్టణ శివారులోని పడకండ్ల శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి, శ్రీ లక్ష్మీ చెన్నకేశవాలయంలో చెన్నకేశవస్వామి, సీతారామలక్ష్మణులు భక్తులకు ఉత్తర ద్వారం గుండా దర్శనమిచ్చారు. శ్రీ కోదండరామాలయం, ఆళ్లగడ్డ వెంకటేశ్వరస్వామి ఆలయం, మల్లన్న వీధిలో నూతనంగా నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో కూడా వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాగా మంత్రి భూమా అఖిలప్రియ, కలెక్టర్ సత్యనారాయణ, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డి, మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి, తదితరులు ఉత్తర ద్వారం ద్వారా స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. వారికి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు ఆలయంలో వెలసిన శ్రీస్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు.

  మహానందిలో భక్తిశ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి
  * ఉత్తరద్వారంలో శ్రీకృష్ణావతారంలో దర్శనమిచ్చిన స్వామి
  మహానంది, డిసెంబర్ 18:ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో వైకుంఠ ఏకాదశి పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని శివకేశవుల నిలయంగా వెలసిన మహానందిలో మంగళవారం శ్రీకోదండ రామస్వామిని శ్రీకృష్ణుని అవతారంలో అలంకరించి ఉత్తర ద్వారంలో కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. ముందుగా అభిషేక మండపం నుండి నేడి ఉభయదాతలైన పోచా జనార్థన్‌రెడ్డి, శృతి దంపతులచే, ఈవో సుబ్రమణ్యం, సంధ్యా దంపతులచే ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ప్రదక్షణగా స్వామి వారిని ఉత్సవంగా తీసుకువచ్చారు. ఉత్తరద్వారంలోకొలువుదీర్చి దాతలతో, అధికారులతో విశేష సేవా కాలపూజ, ఉత్తర ద్వార పూజలు, తిరుప్పావై సేవ, అలంకారం, శ్రీరామ హవనం నిర్వహించారు. అనంతరం శ్రీ కోదండ రామాలయంలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, దీక్షాధారణ, ఋత్విగ్వరణ నిర్వహించి లక్షపుష్పార్చన కార్యక్రమాన్ని వేదపండితులు రవిశంకర్ అవధాని, నాగేశ్వర శర్మ, శాంతారామ్‌భట్‌లతో పాటు ప్రత్యేక పండితుల వేదమంత్రాలతో నిర్వహించారు. అనంతరం స్వామి వారిని పుష్పాలంకరణ చేసి చతుర్వేద స్వస్తి, తీర్థ ప్రసాద వియోగ కార్యక్రమాలను నిర్వహించారు.
  ముక్కోటి ఏకాదశి పూజల్లో
  మంత్రి అఖిల, ఎమ్మెల్సీ గంగుల
  చాగలమర్రి, డిసెంబర్ 18:మండలంలో ప్రసిద్ధిగాంచిన మద్దూరు గ్రామంలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామిని మంగళవారం మంత్రి భూమా అఖిలప్రియ, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి గంగుల బ్రిజేంద్రారెడ్డి దర్శించుకున్నారు. వారు వేర్వేరుగా హాజరు కాగా వారికి ఆలయ చైర్మన్ దస్తగిరి, పూజారులు, గ్రామ కార్యదర్శి చిన్నబ్బి పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. మంత్రి అఖిల వెంట మండల టీడీపీ కన్వీనర్ నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ భాగ్యలక్ష్మి, నాయకులు అన్నపురెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, సుబ్రహ్మణ్యం, ఇండ్ల లక్ష్మిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, పుల్లయ్య, పులిశేఖర్‌రెడ్డి, రాంపల్లె లక్ష్మిరెడ్డి, మాజీ ఎంపీటీసీ నరసింహులు తదితరులు ఉన్నారు. అలాగే ఎమ్మెల్సీ గంగుల వెంట వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరభద్రుడు, ప్రచార కార్యదర్శి గణేష్‌రెడ్డి, సేవాదళ్ అధ్యక్షుడు వెంకటరమణ, మాజీ సర్పంచ్ రమణారెడ్డి, నాయకులు దేవేంద్రారెడ్డి, మనోహర్‌రెడ్డి, గోవిందయ్య, శ్రీనివాసులు, మల్లారెడ్డి, బాబి, సుబ్బరాయుడు తదితరులు ఉన్నారు. ఇక శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి, శ్రీవాసవీమాత ఆలయాలతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ముక్కోటి ఏకాదశి పూజలు పెద్దఎత్తున నిర్వహించారు.


  0 0

  కల్లూరు, డిసెంబర్ 18:రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ద్వారా రైతులకు అందించే పథకాలపై సిబ్బంది ఎప్పటికప్పుడు అవగాహన కల్పించి వాటిని రైతులు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని పశుసవర్ధకశాఖ జేడీ సుదర్శన్‌కుమార్ సిబ్బందికి సూచించారు. మండల పరిధిలోని చిన్నటేకూరు గ్రామం పశువైద్యశాలలో డా. రామ్‌సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో వీఎల్‌ఆర్‌పీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన సీఆర్‌పీ పీడీ సత్యకుమారి, జేడీ సుదర్శన్‌కుమార్ మాట్లాడుతూ ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో అనేక మంది పాడి పశువులను పెంచుతూ వాటి ద్వారా జీవనం సాగిస్తున్నారని, అలాంటి వారిని మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక సబ్సిడీ పథకాలు ప్రవేశపెట్టి వారికి అందించేందుకు ముందుకొచ్చిందన్నారు. ఆయా గ్రామాల పరిధిలో పని చేసే వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు రైతుల సమస్యలు తమకు అందజేయాలని ఏమైనా ఉంటే వాటిని వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అలాగే వైద్య సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వాటిని సంబంధిత వైద్యుల ద్వారా పరిష్కరిస్తామన్నారు. కాగా వీఎల్‌ఆర్‌పీలు గౌరవ వేతనం, టీఏ, డీఏలు సరిగారావడం లేదని వారి దృష్టికి తీసుకురాగా త్వరలో వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్రామాల్లో గోకులం షెడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని వాటి నిర్మాణాలపై ఎప్పటికప్పుడు రైతులకు సలహాలు ఇచ్చి బిల్లులు వచ్చేలా చూడాలన్నారు. కొందరు మహిళా రైతులకు కోళ్లు పంపిణీ చేశామని, పాడి పశువులను కూడా 70 శాతం సబ్సిడీతో ఎస్సీ, ఎస్టీలకు అందించామని వాటిని రైతులు పోషించుకుని జీవనం సాగించేలా చూడాలన్నారు. వారికి పశుగ్రాసం కొరత ఉంటే గడ్డి పెంచుకుంటున్న రైతులతో మాట్లాడి గడ్డి ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అందించేలా చూడాలన్నారు. గొర్రెలు, మేకలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా వారికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలపై రైతులకు సలహాలు, సూచనలు అందించడంలో సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు.
  మళ్లీ అధికారంలోకి వస్తాం
  * మంత్రి భూమా అఖిల ప్రియ
  చాగలమర్రి, డిసెంబర్ 18:ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధితోనే రాష్ట్రంలో టీడీపీ మరోమారు అధికారం చేపడుతుందని పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ ధీమా వ్యక్తం చేశారు. గ్రామదర్శినిలో భాగంగా మంగళవారం మంత్రి అఖిల స్థానిక శివాలయం వీధిలోని కూరగాయల మార్కెట్‌లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అలాగే ప్రతి ఇంటికీ వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరిస్తున్నామన్నారు. ముఖ్యంగా రోడ్లు, మురుగు కాల్వలు, తాగునీటి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. అలాగే అర్హులందరికీ రేషన్‌కార్డులు, పింఛన్లు, ఎన్‌టీఆర్ పక్కా గృహాలు, రుణాలు ఇస్తున్నామని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు గ్రామదర్శినిలో భాగంగా ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నామన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వచ్చి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.

  హోంగార్డులకు
  అన్ని సదుపాయాలు కల్పిస్తాం..
  * రాయలసీమ రీజియన్ కమాండెంట్ చంద్రవౌళిశర్మ
  మహానంది, డిసెంబర్ 18:పోలీసు శాఖతో పాటు వివిధ కంపెనీలు, దేవాలయాల్లో పని చేసే హోంగార్డులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని రాయలసీమ రీజియన్ కమాండెంట్ చంద్రవౌళిశర్మ తెలిపారు. ఆయన మంగళవారం మహానందిలో కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. తర్వాత ఆలయ అధికారులు వారికి జ్ఞాపిక అందజేసి సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాయలసీమ రీజియన్ పరిధిలో 4 వేల మంది హోంగార్డులు పని చేస్తున్నారని, హోంగార్డుల అభ్యున్నతికై ప్రభుత్వం రెండు దఫాలుగా జీతాలు పెంచిందన్నారు. ప్రభుత్వం జీతాలు పెంచడంతో కొన్ని దేవాలయాలతో పాటు సంస్థల్లో పని చేస్తున్న వారు బడ్జెట్ లేక వెనక్కి పంపుతున్నారని, దానిపై తెలుసుకునేందుకే పర్యటన చేస్తున్నామన్నారు. అన్ని దేవాలయాల ఈఓలతో చర్చిస్తున్నామని, మహానందిలో కూడా ఇద్దరు హోంగార్డులను పెంచాలని అడగ్గా ఉన్నవారిలోనే ఇద్దరిని తొలగించి వారి స్థానంలో మహిళా హోంగార్డులను ఇవ్వాలని ఈఓ కోరినట్లు తెలిపారు. ఏదైనా ప్రమాదంలో కానీ, సాధారణ మరణం పొందిన హోంగార్డు కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా వచ్చేలా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఎన్‌టీఆర్ వైద్య సేవ రూ. 2.5 లక్షలకు పెంచిందన్నారు. పోలీసులతో ఎక్కడికైనా వెళ్లినప్పుడు బ్లాస్టింగ్‌లలో కాని, ప్రమాదంలో కాని చనిపోతే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తూ ఫ్లాగ్ పని కింద ఇటీవల రూ. వెయ్యి ఇచ్చే వారని, ఇటీవల రూ. 5 వేలకు పెంచారన్నారు.

  మానవ జీవన విధానాన్ని నేర్పే
  అద్భుత గ్రంథం భగవద్గీత
  * వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు కిష్టన్న
  కర్నూలు ఓల్డ్‌సిటీ, డిసెంబర్ 18:్భగవద్గీత మానవ జీవన విధానాన్ని నేర్పే అద్భుత గ్రంథమని విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు కిష్టన్న పేర్కొన్నారు. గీతా జయంతి సందర్భంగా మంగళవారం వీహెచ్‌పీ నగర శాఖ ఆధ్వర్యంలో నగర శివారులోని విజ్ఞాన పీఠంలో సుమారు 30 పాఠశాలల నుంచి 1200 మంది విద్యార్థులచే సామూహికంగా శ్రీమత్ భగవద్గీత సహస్ర పారాయణం వైభవంగా జరిగింది. అనంతరం విజ్ఞాన పీఠం కార్యనిర్వహణ అధికారి పీపీ.గురుమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వీహెచ్‌పీ జిల్లా, నగర అధ్యక్షులు కిష్టన్న, లక్కిరెడ్డి అమరసింహారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కిష్టన్న మాట్లాడుతూ వీహెచ్‌పీ గత 30ఏళ్ల నుంచి ఈ భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహిస్తోందని, ఇంత మంది పిల్లలు పాల్గొనడం తమకెంతో ఆనందం ఇస్తుందన్నారు. గీతలోని 6వ అధ్యాయం ఆత్మ సంయమన యోగం నుంచి శ్లోకాలు చాలా బాగా కంఠస్థం చేశారని, ఇంత చిన్న వయస్సులోనే శ్లోకాలు నేర్చుకుని పోటీలో పాల్గొనడం విశేషమన్నారు. వీహెచ్‌పీ నగర అధ్యక్షుడు లక్కిరెడ్డి అమరసింహారెడ్డి మాట్లాడుతూ నగర శాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది నూతనంగా పిల్లలందరితో శ్రీ మత్ భగవద్గీత సహస్రగళ పారాయణం నిర్వహించామన్నారు. ఇందులో పిల్లలందరూ ఏకకంఠంతో పారాయణం చేశారని తెలిపారు. సుమారు 30 పాఠశాలల విద్యార్థులు, ఎంతో ఓపికగా నేర్పించిన ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జడ్పీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సురేంద్రనాథ్ మాట్లాడుతూ వీహెచ్‌పీ ఇంత అద్భుతమైన కార్యక్రమం నిర్వహించడం తనకెంతో ఆనందం కల్గించిందన్నారు. భగవద్గీతలో చెప్పినట్లుగా రాబోయే తమ జీవన విధానాలను సరిదిద్దుకుని, సరైన మార్గంలో వారి జీవన ప్రయాణం సాగించాలన్నారు. అనంతరం విజేతలకు అతిథులు బహుమతులు ప్రదానం చేశారు.
  టీడీపీ హయాంలోనే బీసీలకు న్యాయం
  * జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు
  నందికొట్కూరు, డిసెంబర్ 18:టీడీపీ హయాంలోనే బీసీలకు అన్నివిధాలా న్యాయం జరిగిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలపారు. పట్టణంలోని అల్లూరు రహదారిలో వున్న ఎన్‌ఎస్ కల్యాణ మండపంలో మంగళవారం నందికొట్కూరు నియోజకవర్గ జయహో బిసి సదస్సు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి సమక్షంలో నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే బీసీలతో మొదలైందన్నారు. పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు బీసీ నినాదంతో ముందుకు కదలి మొదటి ఎన్నికల్లోనే చరిత్ర సృష్టించారన్నారు. పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు బీసీలు తెలుగుదేశం పార్టీ వెన్నంటే వున్నారన్నారు. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి మాట్లాడుతూ సి ఎం చంద్రబాబునాయుడు బీసీల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. బీసీలలో వుండే కులవృత్తుల వారి కోసం ప్రత్యేకంగా ఆదరణ పథకం అమలు చేశారన్నారు. ఆదరణ పథకం బీసీలకు ఎంతగానో తోడ్పడిందన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా ఆదరణ పథకం కింద కులవృత్తుల వారికి వివిధ పరికరాలు అందజేయడంలో నందికొట్కూరు ప్రథమస్థానంలో నిలిచిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీలంతా ఐక్యంగా తెదేపాకు మద్దతు పలకాలని కోరారు.
  పోస్టల్ సిబ్బంది నిరవధిక సమ్మె
  ఆదోనిటౌన్, డిసెంబర్ 18:గ్రామీణ పోస్టల్ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని, జీడీఎస్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జేఏసీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా పోస్టల్ సిబ్బంది నిరవధిక సమ్మె చేస్తున్నట్లు ఆదోని బ్రాంచ్ గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు, మాజీ కార్యదర్శి మునిస్వామి, కార్యదర్శి విజయ్‌లక్ష్మీ, గంగాధర్ తెలిపారు. ఆదోని ప్రధాన పోస్ట్ఫాసు కార్యాలయం వద్ద పోస్టల్ సిబ్బంది ఆల్ ఇండియా డాక్ సేవక్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యంగా జీడీఎస్ కమిటీ ప్రధాన సిఫార్సులను అమలు చేయడంలో తపాలా శాఖ ఉన్నతాధికారులతో ఈ నెల 10వ తేదీ జరిగిన చర్చలు విఫలం కావడంతో నేడు నిరవధిక సమ్మె చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 2016 జనవరి 1 నుంచి జీడీఎస్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని, రిటైర్‌మెంట్ లబ్ధి చేకూర్చాలని, గ్రాట్యుటీ గరిష్ట పరిమితి రూ. 50 వేల నుంచి రూ. 5 లక్షలకు పెంచాలన్నారు. ఆయా సమస్యలను పరిష్కరించేంత వరకూ సమ్మె కొనసాగిస్తామన్నారు.
  టీడీపీ ప్రభుత్వంలోనే అభివృద్ధి
  * ఎమ్మెల్యే బీసీ జనార్ధనరెడ్డి
  బనగానపల్లె, డిసెంబర్ 18:మండల పరిధిలోని మీరాపురం పంచాయతీలోని మాదాసుపల్లె, సాదుకొట్టం గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బీసీ జనార్ధనరెడ్డి రూ. 80 లక్షల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్లు, సొంత నిధులు రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంటును ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే బీసీ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ద్వారానే అభివృద్ధి సాధ్యమన్నారు. తమ హయాంలో నియోజవర్గంలో ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు, మురుగుకాల్వల నిర్మాణాలు విస్తారంగా చేపట్టామన్నారు. దాదాపు ప్రతి గ్రామంలో రూ. కోటి ఖర్చు చేసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా ప్రణాళికతో ముందుకుసాగుతున్నామని తెలిపారు. గ్రామాల్లో ప్రజలు కూడా అభివృద్ధి చేస్తున్న నేతలు, పార్టీలను గుర్తుంచుకోవాలన్నారు. రానున్న ఎన్నికల్లో తమ పార్టీని మరోసారి బలపరచాలని అభ్యర్థించారు. సీఎం చంద్రబాబు సహకారంతో నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరుపుతున్నారని, దద్దనాల ఎత్తిపోతల పథకాన్ని రూ. 21.25 కోట్లతో పూర్తి చేశామని తెలిపారు. ఈ పథకం మీరాపురం, యాగంటిపల్లె, పాతపాడు, మాదాసుపల్లె, జ్వాలాపురం, తదితర గ్రామాలకు చెందిన 1,541 ఎకరాలకు సాగు నీరు అందిస్తుందని తెలిపారు.

  ప్రతిభావంతులైన క్రీడాకారులకు చేయూత
  * ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి
  ఎమ్మిగనూరు, డిసెంబర్ 18:ప్రతిభావంతులైన క్రీడాకారులకు చేయూతనందిస్తామని ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి తెలిపారు. శ్రీనీలకంఠేశ్వరస్వామి జాతర సందర్భంగా స్థానిక వీవర్స్ కాలనీలో నిర్వహించిన బీవీ స్మారక అంతర్రాష్ట్ర స్థాయి టెన్నిస్ క్రికెట్ పోటీలను మంగళవారం ఎమ్మెల్యే బ్యాటింగ్ చేసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీనీలకంఠేశ్వరస్వామి జాతర సందర్భంగా ప్రతి సంవత్సరం రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నైపుణ్యం కల్గిన క్రీడాకారులు ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే వారికి సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సంవత్సరం 150 జట్లు పాల్గొంటాయని తెలిపారు. క్రీడాకారులు స్నేహ పూర్వకంగా ఆడాలని తెలిపారు. ఎమ్మిగనూరు జాతర అంటే ముందుగా క్రీడలు గుర్తుకు వచ్చే విధంగా చేస్తామని తెలిపారు.


  0 0

  నెల్లూరు, డిసెంబర్ 18: శ్రీ మహావిష్ణువును ఉత్తరద్వారం గుండా దర్శనం చేసుకునేందుకు ముక్కోటి దేవతలు భువిపైకి వచ్చే పర్వదినం ముక్కోటి వైకుంఠ ఏకాదశినాడు తాము ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు జిల్లాలోని వైష్ణవాలయాల్లో భక్తులు పోటెత్తారు. వేకువజాము నుండే భక్తులు దేవాలయాల ఎదుట బారులు తీరారు. నగరంలోని శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా భక్తులకు స్వామివారిని ఉత్తర ద్వార దర్శన భాగ్యాన్ని కల్పించారు. స్వామివారిని దర్శించుకునేందుకు కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి వేచిచూశారు. చివరకు ముక్కోటినాడు స్వామివారిని దర్శించుకొని తన్మయులయ్యారు. ఆలయాన్ని సుందరంగా అలంకరించడంతో పాటు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి నారాయణ, మాజీ ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, నగర ఎమ్మెల్యే పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి, నగర మేయర్ అబ్దుల్ అజీజ్, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీ్ధరకృష్ణారెడ్డి, పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, శాంతి భద్రతలకు విఘాతం జరగకుండా నగర డిఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు.
  ఇతర ఆలయాల్లోనూ ఘనంగా ముక్కోటి
  జిల్లాలోని ఇతర వైష్ణవాలయాల్లోనూ ముక్కోటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరంలోని గురువాయూర్ ఆలయం, విడవలూరు మండలం పార్లపల్లిలోని శ్రీ అలఘనాథస్వామి, మూలాపేట శ్రీవేణుగోపాలస్వామి, మాగుంట లే అవుట్‌లోని శ్రీవేంకటేశ్వరస్వామి, శబరి శ్రీరామక్షేత్రం, వేదగిరి లక్ష్మీనరసింహస్వామి, పెంచలకోనలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి, గూడూరు, కావలి, ఆత్మకూరు డివిజన్లలోని పలు ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి పూజలు ఘనంగా జరిగాయి. అలఘనాథస్వామి ఆలయంలో స్వామివారికి ఘనంగా అభిషేకాలు జరిగాయి. అనంతరం సర్వాలంకృత శోభితులైన అళఘనాథస్వామి గరుడ వాహనమెక్కి గ్రామంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.


  0 0

  నెల్లూరు, డిసెంబర్ 18: ఎప్పుడూ మన మొబైల్‌కు రాని కొత్త నెంబరు నుండి ఫోన్ వస్తుంది. ఎవరా అని ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోగానే.. ‘నమస్కారం, నేను మీ చంద్రబాబునాయుడును మాట్లాడుతున్నాను’.. అంటూ ముఖ్యమంత్రి వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. ‘మీ ప్రాంత ఎమ్మెల్యేపై మీ అభిప్రాయం’.. ఇలా సాగుతుంది రికార్డెడ్ సంభాషణ. ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికకు కార్యకర్తల అభిప్రాయం కోసం ముఖ్యమంత్రి ఎంచుకున్న పలుమార్గాల్లో ఇదొకటి.
  ఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వ కార్యకలాపాలకు మాత్రమే పరిమితం కాకుండా పార్టీపైనే ఎక్కువ దృష్టి సారించాలని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది. అందులో భాగంగానే ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల్లో సానుకూల స్పందన ఉందని, స్థానిక ఎమ్మెల్యే పనితీరుపై ప్రజల్లో ఎంతమేర సానుకూల, ప్రతికూల అభిప్రాయం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇది మాత్రమే కొలమానం కాదనే విషయాన్ని పార్టీశ్రేణుల్లో వ్యక్తమవుతోంది. దీంతోపాటు సంక్రాంతి నెలలో జిల్లాలోని పార్టీ నేతలందరితోనూ ముఖ్యమంత్రి సమావేశం కాబోతున్నట్లు తెలిసింది. ఈ సమావేశంలో తాను చేయించిన సర్వేలో వచ్చిన ఫలితాలను జోడించి నేతలతో సమాలోచనలు చేయనున్నారు. ఎమ్మెల్యేలతో పాటు అతను కాని పక్షంలో మరో ఇద్దరు అభ్యర్థులను సిద్ధం చేసి వారిలో ఎవరు మెరుగైనవారో కూడా ఇదే రికార్డెడ్ వాయిస్ ద్వారా సేకరిస్తున్నారు. తొలుత కార్యకర్తల అభిప్రాయం, తదుపరి ప్రజల అభిప్రాయం కోరుతున్నారు. కార్యకర్తల్లో నెలకొన్న అసంతృప్తిని తెలుసుకొని ప్రత్యామ్నాయ అంశాలపై దృష్టి పెట్టడం కూడా ఇందులో ఒక భాగమని జిల్లాకు చెందిన టీడీపీ నేత ఒకరు తెలిపారు. తొలిసారిగా ముఖ్యమంత్రి గొంతుతో కార్యకర్తలు, ప్రజల స్పందన తెలుసుకునే ప్రయత్నం చేస్తుండడాన్ని జిల్లాలోని టీడీపీ కార్యకర్తలు స్వాగతిస్తున్నారు. అయితే ఈ సర్వేలో ఫలితాలు ఎలా వచ్చినా చివరకు తాను అనుకున్న వారికో, తప్పనిసరి పరిస్థితుల్లో సామాజిక సమీకరణాల పేరుతో అభ్యర్థులను మార్చే అవకాశాలు ఉండవచ్చని కార్యకర్తలు భావిస్తున్నారు. జిల్లాకు సంబంధించి పది నియోజకవర్గాల్లో ఒకటి రెండు నియోజకవర్గాలు మినహాయించి మిగతాచోట్ల టీడీపీ తరపున ఎవరు పోటీ చేయబోతున్నారనే విషయంలో స్పష్టత లేదు. పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లోనూ కచ్చితంగా వారికే టిక్కెట్ వస్తుందని చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా నెల్లూరురూరల్, ఆత్మకూరు, గూడూరు, సూళ్లూరుపేట, కోవూరు, ఉదయగిరిల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇప్పటికీ అస్పష్టత నెలకొని ఉందని ఆయా ప్రాంత టీడీపీ కార్యకర్తలే చెబుతున్నారు. ఎన్నికలకు మూడు నెలల ముందే అభ్యర్థులను ఎంపిక చేయాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని, జనవరి నెలలో దాదాపు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుందనే ధీమాను తెలుగు తమ్ముళ్లు వ్యక్తపరుస్తున్నారు. అభ్యర్థుల విషయంలో తుదికంటూ సస్పెన్స్ కొనసాగించడంలో ముందుండే చంద్రబాబునాయుడు రాబోయే ఎన్నికల్లో జిల్లాలో సత్ఫలితాలు పొందాలనుకుంటే ముందుగానే అభ్యర్థులను ఎంపిక చేయడం అందులో ఒకటని రాజకీయ విశే్లషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

  ఆలయాల అభివృద్ధికి పెద్దపీట
  * మంత్రి నారాయణ

  నెల్లూరు, డిసెంబర్ 18: రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలను అనుసంధానం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని ప్రణాళికలను సిద్ధం చేసిందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. మంగళవారం ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా రూరల్ మండలంలోని శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి, నెల్లూరు తల్పగిరి రంగనాథస్వామి ఆలయాలను మంత్రి సందర్శించి విశేష పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చారిత్రకమైన నరసింహకొండలోని లక్ష్మీనరసింహస్వామి, నగరంలోని తల్పగిరి రంగనాథస్వామి ఆలయాలను దర్శించుకోవడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఏటా ముక్కోటి రోజున కుటుంబ సభ్యులతో కలిసి తాను నరసింహకొండకు వెళ్లి పూజలు నిర్వహించడం తనకు ఆనవాయితీ వస్తోందన్నారు. క్రీశ 11వ శతాబ్దం నాటి రంగనాథస్వామి ఆలయం దర్శించుకునేందుకు మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి భక్తులు తరలివస్తుంటారని, ఇక్కడ భక్తుల కోసం స్నానఘట్టాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. జనవరి నెలాఖరుకల్లా ఈ నిర్మాణాన్ని పూర్తిచేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. నరసింహకొండపై గాలి గోపురానికి మరమ్మతులు రూ.6లక్షల వ్యయంతో పూర్తిచేశామన్నారు. రానున్న బ్రహ్మోత్సవాలకు గిరిప్రదక్షిణ కోసం సిమెంటు రోడ్డు నిర్మాణం పూర్తయిందన్నారు. ఇంకా దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పేదప్రజలు ఏడు దేవాలయాలు దర్శించుకునేందుకు దివ్యరథం పేరుతో దేవాలయ సందర్శనకు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఆలయానికి విచ్చేసిన మంత్రి నారాయణ కుటుంబ సభ్యులకు ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీ్ధరకృష్ణారెడ్డి, విజయా డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, వేదగిరి దేవస్థాన చైర్మన్ వెంకటేశ్వర్లునాయుడు, స్థానిక టీడీపీ నేతలు వేమిరెడ్డి అశోక్‌రెడ్డి, కార్పొరేటర్ నూనె మల్లికార్జున యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

  వౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత
  * మంత్రి నారాయణ స్పష్టం
  నెల్లూరు, డిసెంబర్ 18: ప్రజలకు అవసరమైన వౌలిక వసతులను కల్పించడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని, కానీ తమ ప్రభుత్వ హయాంలో ప్రజల కనీస అవసరాలను తీర్చేందుకు తొలి ప్రాధాన్యతనిచ్చిందని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. మంగళవారం నారాయణ మెడికల్ కళాశాల క్యాంపు కార్యాలయంలో ఇంజనీరింగ్, మున్సిపల్, పబ్లిక్ హెల్త్, స్వచ్ఛ సర్వేక్షణ్ అధికారులు, ఎల్ అండ్ టి, మేఘ సంస్థల ప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి నెలాఖరుకల్లా నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. నగరంలోని 450 కిమీ మేర రోడ్లు తవ్వేశారని, అందులో ఇప్పటికే 110 కిమీ మాత్రమే పునరుద్ధరించగలిగారని అన్నారు. మిగిలిన రోడ్లన్నీ మార్చి 31కల్లా పూర్తిచేయాలని, ఇందుకు సంబంధించి రోజూ 8 నుండి 10 కిమీ మేర రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉందన్నారు. రోడ్డు పనులు పూర్తికావాలంటే రోజుకు 2వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేయాలన్నారు. ఈనెల 20 నుండి పనులు వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. నెల్లూరు నెక్లెస్ రోడ్డు, స్వర్ణాలచెరువు నుండి ఇరుకళల పరమేశ్వరీ దేవస్థానం వరకూ 2 కిమీ మేర నిర్మించనున్నామని, అక్కడ పొట్టిశ్రీరాములు వంటి మహనీయుల విగ్రహాలు నెలకొల్పబోతున్నట్లు చెప్పారు. అమ్మవారి దేవస్థానం వద్ద 200 మీటర్ల ఘాట్ నిర్మిస్తామన్నారు. రంగనాథస్వామి దేవస్థానం వెనుక పెన్నానదిలో 100 మీటర్ల ఘాట్ నిర్మాణం కోసం రూ.9 కోట్లతో టెండర్లు పిలవడం జరిగిందన్నారు. 2 రూపాయలకే 20 లీటర్ల మంచినీరు సరఫరాకు సంబంధించిన పనులు టెండర్లు పూర్తయ్యాయని, వాటిని త్వరితగతిన పూర్తిచేసేందుకు తగిన ప్రణాళికతో అధికారులు ముందుకు సాగాలని సూచించారు. అక్కచెరువుపాడు వద్ద నిర్మించిన గృహాలకు వెళ్లే రహదారి బాగాలేనందున పొదలకూరు రోడ్డు నుండి గృహాల వరకూ రోడ్డు వేసేందుకు అటవీ అధికారులతో చర్చించినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుండి కూడా అటవీ శాఖ అధికారులకు ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. నగరంలోని రద్దీ ఉన్న రహదారులు, మినీబైపాస్, ట్రంక్‌రోడ్డు వంటి మార్గాల్లో ఫుట్‌పాత్‌ల నిర్మాణానికి కూడా రూ.9.8 కోట్ల అంచనాలతో టెండర్లు పూర్తయినట్లు చెప్పారు. మూలాపేటలో కోనేరు నిర్మాణం కోసం రూ.3 కోట్లు మంజూరైనట్లు, వారంలోగా పనులు కూడా ప్రారంభిస్తామని వెల్లడించారు. సంబంధిత అధికారులు ఈ పనులన్నింటినీ మార్చి 31లోగా పూర్తిచేయాలని మంత్రి కోరారు. ఈ సమావేశంలో స్వచ్ఛ మిషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు, మున్సిపల్ కమిషనర్ అలీంబాషా, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీ్ధరకృష్ణారెడ్డి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తాళ్లపాక అనూరాధ తదితరులు పాల్గొన్నారు.

  జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 11 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం
  * షార్ నుంచి 69వ ప్రయోగం
  సూళ్లూరుపేట, డిసెంబర్ 18: జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 11 రాకెట్ ప్రయోగానికి శాస్తవ్రేత్తలు సర్వం సిద్ధం చేశారు. ఈ ప్రయోగంతో షార్‌లో సందడి వాతావరణం నెలకొంది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ నుంచి ఇస్రో మరో సమాచార ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనుంది. ఈ ప్రయోగం దృష్ట్యా షార్‌లో భద్రతను కుట్టదిట్టం చేశారు. శ్రీహరికోట-సూళ్లూరుపేట మార్గమధ్యంలో సీఐఎస్‌ఎఫ్, పోలీస్ అవుట్ చెక్‌పోస్టు ఏర్పాటుచేసి అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేసి పంపుతున్నారు. ఇటు ఇస్రో శాస్తవ్రేత్తలతో పాటు అన్ని సెంటర్ల డైరెక్టర్లు షార్‌కు చేరుకొని ప్రయోగ ఏర్పాట్లో నిమగ్నమై ఉన్నారు. షార్‌ను సీఐఎస్‌ఎఫ్ బలగలాలు భద్రత గుప్పిట్లోకి తీసుకున్నాయి. శ్రీహరికోట చుట్టుపక్కల ఉన్న అడవులను సైతం జల్లెడ పట్టి గాలిస్తున్నారు. తీరప్రాంత గ్రామాలు, సముద్ర జల మార్గాల్లో మెరైన్ సిబ్బంది నిఘా పెట్టారు. షార్ నుండి ఇప్పటివరకు 68 ప్రయోగాలు చేపట్టారు. ఇది 69వ ప్రయోగం కాగా జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల్లో 13వ ప్రయోగం కావడం విశేషం. బుధవారం సాయంత్రం 4:10 గంటలకు షార్ నుంచి జీశాట్-7 ఏ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 11 రాకెట్ మోసుకెళ్లనుంది. ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ మంగళవారం మధ్యాహ్నం 2:10 గంటలకు ప్రారంభమై సజావుగా సాగుతోంది. 26 గంటలు కౌంట్‌డౌన్ నిర్విఘ్నంగా జరిగినంతరం రాకెట్ నింగిలోకి ఎగరనుంది. ప్రయోగానికి సంబంధించిన ఏర్పాట్లన్నింటిని శాస్తవ్రేత్తలు సర్వం సిద్ధం చేశారు. ఇస్రో చైర్మన్‌తో పాటు అన్ని సెంటర్ల డైరెక్టర్లు షార్‌కు చేరుకొని ప్రయోగ ఏర్పాట్లలో బిజీబిజీగా ఉన్నారు. 20 రోజుల వ్యవధిలోనే ఇస్రో మూడో ప్రయోగానికి సిద్ధం కావడం విశేషం. నవంబర్ 14న షార్ నుంచి జీఎస్‌ఎల్‌వీ మార్క్3-డీ 2, 29న పీఎల్‌ఎల్‌వీ-సీ 43 ప్రయోగాలు విజయవంతంగా ప్రయోగించారు. మళ్లీ డిసెంబర్ 5న ఫ్రెంచి గయాన నుంచి జీశాట్-11 ప్రయోగం కూడా విజయవంతమయ్యింది. వరుస ప్రయోగాల విజయాలతో దూసుకెళ్తున్న ఇస్రో ఇదే ఉత్సాహంతో జీశాట్-7 ఏ ఉపగ్రహాన్ని చేపట్టేందుకు సన్నద్ధం కావడం విశేషం.
  చెంగాళమ్మ సేవలో ఇస్రో చైర్మన్
  షార్ నుంచి ప్రయోగించే జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 11 ప్రయోగ విజయాన్ని ఆక్షాంక్షిస్తూ ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ మంగళవారం చెంగాళమ్మ ఆలయానికి విచ్చేసి అమ్మవారి చెంత రాకెట్ నమూనాను పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. చైర్మన్‌కు ఆలయ ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలనంతరం వేదపండితుల ఆశీర్వాదం ప్రత్యేక శాలువలతో సన్మానించి అమ్మవారి తీర్ధప్రసాదాలు అందజేశారు. చైర్మన్ శివన్‌తో పాటు శాస్తస్రాంకేతిక కార్యదర్శి (సైంట్‌ఫిక్ సెక్రటరీ) ఉమామహేశ్వరావు ఉన్నారు. ఈ కార్యక్రమంలో చెంగాళమ్మ మాజీ ట్రస్టుబోర్డు సభ్యులు చిట్టేటి పెరుమాల్, ఆకుతోట రమేష్ పాల్గొన్నారు.

  శ్రీకాళహస్తి - నడికుడి రైల్వే లైన్ భూసేకరణ పరిశీలన
  వెంకటగిరి, డిసెంబర్ 18: శ్రీకాళహస్తి-నడికుడి రైల్వేలైన్‌కు సంబంధించి భూసేకరణను గూడూరు సబ్ కలెక్టర్ ఆనంద్ మంగళవారం పరిశీలించారు. మండలంలోని జంగాలపల్లి, పారవోలు, బాలసముద్రం గ్రామాల మీదుగా నడికుడి రైల్వే లైన్ వెళుతుండడంతో ఆ గ్రామాల్లోని భూములను పరిశీలించారు. అనంతరం వెంకటగిరిలో ఎస్టీ గురుకుల పాఠశాల ఏర్పాటు చేయడానికి భవనాన్ని సబ్ కలెక్టర్ పరిశీలించారు. రైల్వేస్టేషన్ పక్కనే ఉన్న పాత కేంద్రీయ విద్యాలయ భవనాన్ని పరిశీలించారు. తాత్కాలికంగా ఎస్టీ గురుకుల పాఠశాలను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయన వెంట స్థానిక తహశీల్దార్ రాజ్‌కుమార్, సర్వేయర్ సుబ్రహ్మణ్యం, ఆర్‌ఐ రాజేష్ ఉన్నారు.

  హిందూ ధర్మ పరిరక్షణకు నడుం బిగించండి
  *స్వామీజీల ఉద్బోధ
  కొండాపురం, డిసెంబర్ 18 : ప్రతిఒక్కరూ హిందూ ధర్మ పరిరక్షణకు నడుం బిగించాలని పలువురు స్వామీజీలు ఉద్బోధించారు. సమసరసతా సేవా ఫౌండేషన్, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రమైన కొండాపురంలో ఆత్మీయ భజన బృందాల ధార్మిక సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ యోగాశ్రమానికి చెందిన రామానుజయోగి, ఆర్‌ఎస్‌ఎస్ విజయవాడ ప్రాంత సేవా ప్రముఖ్ కేశవయ్య, అనంతస్వామి, నెల్లూరు జిల్లా ఎస్‌ఎస్‌ఎఫ్ మహిళా కన్వీనర్ గిరిజాకుమారి ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రజలకు అందించారు. దేశంలో ధర్మానికి విఘాతం వాటిల్లుతోందని ఇందువల్ల మానవాళి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. ముఖ్యంగా హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతిఒక్కరూ నడుం కట్టాలన్నారు. భగవంతుడి దృష్టిలో అందరూ సమానులేనని కుల, మతాలు అనేవి మానవ సృష్టేనని అన్నారు. భగవంతుని ఆరాధించడానికి ఎన్నో మార్గాలున్నాయని ఇందులో ముఖ్యంగా భజన అనేది ఎంతో ప్రధానమైనదన్నారు. ప్రతి గ్రామంలో ఆలయం తప్పనిసరిగా వుండాలని, అందులో నిత్యం నైవేద్యాలు నిర్వహించే విధంగా చూడాలన్నారు. ఆలయంలో భజనలు చేయడం ద్వారా భగవంతుని నామాన్ని స్మరించవచ్చని తద్వారా మోక్షమార్గాన్ని పొందవచ్చన్నారు. ముందుగా బస్టాండ్ సెంటర్ నుండి ఆదర్శ పాఠశాల మైదానం వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో భజనలు, కోలాటం చేస్తూ సుమారు రెండు గంటలపాటు ర్యాలీ నిర్వహించారు. స్వామీజీల ప్రసంగం అనంతరం మండలంలోని వివిధ గ్రామాల నుండి భజన బృందాల వారు భజనలు నిర్వహించారు. ఈ సందర్భంగా భజన గురువులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సమరసతా సేవా ఫౌండేషన్ ధర్మప్రచారక్ మధు, సమరసతా ఫౌండేషన్ కొండాపురం మండల కన్వీనర్ గురవారెడ్డి, మహిళా కన్వీనర్ దార్ల మల్లీశ్వరి, బీజేపీ మండల అధ్యక్షుడు మల్లికార్జున, మెంటా సుధాకర్, బత్తల రామచంద్రయ్య, దాసరి వెంకటేశ్వర్లు, నర్రా చెంచునాయుడుతో పాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన భజన బృందాలు పాల్గొన్నాయి.


  0 0

  ఒంగోలు అర్బన్,డిసెంబర్ 18: మార్గశిరమాసం శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని మంగళవారం ముక్కోటి ఏకాదశిని ఘనంగా నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా జిల్లాలోని అన్ని దేవాలయాల్లో ఉత్సవమూర్తులను ఉత్తర ద్వారదర్శనానికి తీసుకొచ్చారు. భక్తులు ఉత్సవమూర్తులు ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివార్లను దర్శించుకోవటం ముక్తిదాయకమని వేదపండితులు తెలిపారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఒంగోలు నగరంలోని ఆలయాలు భక్తులతో బారులుతీరాయి. జిల్లా శాసనమండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్నచెన్నకేశవస్వామి దేవాలయంలో గంగాపార్వతి సమేత కాశీ విశే్వశ్వర స్వామిని దర్శించుకున్నారు. దర్శనానికి వచ్చిన మాగుంటను శ్రీప్రసన్న చెన్నకేశవస్వామి దేవస్థానం చైర్మన్ కొల్లిపల్లి సురేష్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కట్టాప్రసాదు, వేదపండితులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మాగుంటకు స్వామివారి శేషవస్త్రాలను బహుకరించారు. ఒంగోలు నగరంలోని గడియారం వారి వీధిలో వేంచేసి ఉన్నశ్రీకోదండరామస్వామి దేవాలయంలో, రంగారాయుడు చెరువు వద్ద ఉన్న పశుపతీశ్వరస్వామి ఆలయంలో, కొత్తపట్నం బస్టాండు సెంటరులోని శ్రీరాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో, సంతపేట, లాయరుపేటలోని సాయిబాబా మందిరాల్లో, గద్దలకుంటలోని శ్రీశక్తిపీఠంలో, మంగమూరు రోడ్డు లోని పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయంలో, బివిఎస్ హాలువద్ద ఉన్న మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ఉత్సవ మూర్తులను ఉత్తర ద్వార దర్శనానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా భక్తులు దేవాలయాల్లోబారులు తీరి ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివార్లను దర్శించుకున్నారు. అనంతరం ఆలయనిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ముక్కోటి ఏకాదశి సందర్బంగా ఉపవాస దీక్షలు చేసిన భక్తుల కోసం ప్రత్యేకంగా హరిహర నామ సంకీర్తనలు, భజనలు ఏర్పాటుచేశారు.


  0 0

  ఒంగోలు అర్బన్, డిసెంబర్ 18 : రానున్న 2019 ఎన్నికల్లో జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడాలని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా తెలుగుయువత కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా తెలుగు యువత అధ్యక్షులు షేక్ కరిముల్లా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ రానున్న 2019 ఎన్నికల్లో జిల్లాలోని 12 నియోజకవర్గాలను తెలుగుదేశం పార్టీ గెలుపొందే విధంగా తెలుగుయువత నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. తెలుగుదేశం పార్టీకి తెలుగు యువత మూలస్తంభం అని తెలిపారు. నామినేటెడ్ పదవుల్లో తెలుగు యువతకు తగిన ప్రాధాన్యత కల్పిస్తారని హామీ ఇచ్చారు. లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభివృద్ధి చేస్తే ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారని, ఆ విమర్శలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఒంగోలు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక వైకాపా నాయకులు తనపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. విమర్శలకు భయపడేది లేదని, అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళతామన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా జిల్లాలో తెలుగుదేశం పార్టీ జెండా మరలా రెపరెపలాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జాతీయ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, జిల్లా శాసన మండలి సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్భ్రావృద్ధికి అహర్నిశలు పాటు పడుతున్నారని, రానున్న ఎన్నికల్లో కార్యకర్తలు మళ్లీ సైనికుల్లా పనిచేసి జిల్లాలోని 12 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడాలన్నారు. ఆ దిశగా తెలుగు యువత నాయకులు, కార్యకర్తలు ప్రచార కార్యక్రమాలను విస్తృతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందే విధంగా మరింతగా కృషిచేయాలన్నారు. ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని సూచించారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా జిల్లాలో మరింత అభివృద్ధి జరిగిందన్నారు. పార్టీ గెలుపునకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని, ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ పూర్వ వైభవానికి కృషి చేయాలన్నారు. జిల్లాలో తెలుగు యువత అధ్యక్షులు కరిముల్లా పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించుకుని జిల్లాలో తిరిగి పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా తెలుగు యువత అధ్యక్షులు షేక్ కరిముల్లా మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖా మంత్రి నారా లోకేష్‌బాబు ఆధ్వర్యంలో తెలుగు యువత చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు. యువనేస్తం, చంద్రన్న బీమ, రైతు రుణమాఫీ, పెన్షన్లు, యువతకు ఉపాధి శిక్షణ, వృత్తివిద్య, ఎన్‌టిఆర్ ఆరోగ్య సేవ వంటి కార్యక్రమాలను కరపత్రాల ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళతామన్నారు. జిల్లాలోని 56 మండలాల్లో తెలుగు యువత సమావేశాలు నిర్వహించి ఆయాన మండలాల్లో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కరపత్రాల రూపంలో ముద్రించి ఇంటింటికి తిరిగి ప్రచారం చేసే విధంగా కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు. వచ్చే నెల 20వ తేది నుండి ఇంటింటికి తెలుగు యువత అనే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి టి ఆంజనేయులు, ప్రచార కార్యదర్శి నల్లూరి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు వీరేంద్రనాథ్‌చౌదరి, కె శివ శంకర్‌రావు, కార్యదర్శులు మీరావలి, టిఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షులు కె వెంకటేశ్వరావు, ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కామేపల్లి శ్రీనిసరావు, నగర పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు కొఠారి నాగేశ్వరరావు, దాయినేని ధర్మ, నాయకులు బెజవాడ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


  0 0

  ఒంగోలు,డిసెంబర్ 18: జిల్లాలో వచ్చేనెల నాల్గవతేదీ నాటికి ఓటర్ల తుదిజాబితాను పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా ప్రచురించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వి వినయ్‌చంద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ నుండి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లతో ఓటర్ల తుదిజాబితా ప్రచురణ, పోలింగ్ స్టేషన్లల్లో వౌలిక సదుపాయాలు కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరికి ఓటుహక్కు కల్పించాలన్నారు. ఓటర్ల జాబితాలో అర్హులైనవారు ఎవరూ కూడా మిస్‌కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో అర్హులైన వారందరికి డోర్‌టూ డోర్ బూత్ లెవల్ అధికారులు తిరిగి పరిశీలించాలన్నారు. ఓటర్ల జాబితాపై ఫిర్యాదులొస్తే నియోజకవర్గ ఇఆర్‌ఒ మీద చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఓటర్ల జాబితాను సూక్ష్మస్థాయిలో పరిశీలించి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో సుమోటోగా తొలగింపులు, చేర్పులు, మార్పులకు సంబంధించిన ఓటర్ల దరఖాస్తులను జాగ్రత్తగా భద్రపర్చాలన్నారు. ఎన్నికలకు ఓటర్ల జాబితా గుండెకాయలాంటిదన్నారు. రాబోయే లోకసభ, సాధారణ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాలను రాజకీయపార్టీలకు ఇస్తామన్నారు. ఎఇఆర్‌ఓలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించాలన్నారు. పోలింగ్ కేంద్రాలను రేషనలైజేషన్ చేయాలని ఆయన తెలిపారు. జిల్లాలోని ప్రతి పోలింగ్ కేంద్రాన్ని జియోట్యాగ్ చేయాలన్నారు. జిల్లాలో ప్రముఖుల పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయో లేదా అనే విషయాన్ని పరిశీలించాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్, తాగునీటి, ఫర్నీచర్ వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. జిల్లాలో పోలింగ్ కేంద్రాల వద్ద వికలాంగ ఓటర్లకు ఇబ్బంది లేకుండా ర్యాంప్ సౌకర్యాలు ఏర్పాటుచేయాలన్నారు. జిల్లాలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేదా అనేవిషయాలు పరిశీలించి బుధవారం సాయంత్రానికి నివేదికలు ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటసుబ్బయ్య, స్ట్ఫె సిఇఒ బి రవి, మెప్మా పీడీ సింగయ్య, జిల్లావిద్యాశాఖాధికారి సుబ్బారావు, ఎస్‌ఎస్‌ఎ ప్రాజెక్టు అధికారి ఎం వెంకటేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రభాకర్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.


  0 0

  చీరాల, డిసెంబర్ 18: మండలంలోని ఈపూరుపాలెం పంచాయతీలోని బోయినవారిపాలెంలో మంగళవారం చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన కొమ్మనబోయిన శ్రీనివాసరావు, కొమ్మనబోయిన నాగరాజుకు చెందిన పూరిళ్లు షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు వ్యాపించి అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో ఇంట్లోని గృహోపకరాలు, నగదు, బంగారు వస్తువులు, దుస్తులు, విలువైన డాక్యుమెంట్లు అగ్నికి పూర్తిగా కాలిపోయాయి. కట్టుబట్టలతో బాధితులు మిగలడంతోపాటు దాచుకున్న నగదు, బంగారు వస్తువులు కళ్లముందే కాలిబూడిద కావడంతో కుటుంబసభ్యుల రోదన అంతా ఇంతాకాదు. ఈ ప్రమాదంలో మొత్తం రూ. 8లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితులు అధికారుల ముందు వెల్లడించారు. ఈ మేరకు అగ్నిమాపక సిబ్బంది, రెవెన్యూ అధికారులు సమాచారం తీసుకున్నారు.


  0 0

  త్రిపురాంతకం, డిసెంబర్ 18 : మండలంలోని గణపవరం గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాకం కృపానందం (65) గుండెపోటుతో మృతి చెందారు. ఈయన సతీమణి మాకం ఎస్తేరమ్మ గణపవరం ఎంపీటీసీ సభ్యురాలిగా కొనసాగుతుంది. కృపానందం మృతదేహాన్ని యర్రగొండపాలెం వైకాపా ఇన్‌ఛార్జి, సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్, మాజీ ఎఎంసి చైర్మన్ కోట్ల సుబ్బారెడ్డి, మండలంలోని వైకాపా నాయకులు సందర్శించి పూలమాలలు ఉంచి నివాళులు అర్పించారు.


older | 1 | .... | 1964 | 1965 | (Page 1966) | 1967 | 1968 | .... | 2069 | newer