Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

పోలీసుల అదుపులో హైవే దొంగలు

$
0
0

మద్దిపాడు, డిసెంబర్ 18:జాతీయ రహదారిపై ఆగి ఉన్న వాహనాల్లో నగదు, వస్తువులను దొంగతనం చేస్తున్నవారిని మంగళవారం గ్రోత్ సెంటర్ వద్ద పట్టుకున్నట్లు ఒంగోలు రూరల్ సీఐ ఒ దుర్గాప్రసాదు తెలిపారు. స్థానిక పోలీసుస్టేషన్‌లో మంగళవారం జరిగిన విలేఖర్ల సమావేశంలో సీఐ మాట్లాడుతూ గత సంవత్సరం కాలంనుండి మండల పరిధిలోని జాతీయ రహదారిపై దొడ్డవరప్పాడు, వెల్లంపల్లి, గుండ్లాపల్లి దాబాల వద్ద జరిగిన దొంగతనాల్లో ఏడు సెల్‌ఫోన్లకు గాను ఐదు సెల్‌ఫోన్లు, 3.12లక్షలరూపాయలకు గాను 1.75లక్షల రూపాయల నగదును, స్తిరాస్థికి సంబంధించిన దస్తావేజులనుండి ఇద్దరు నిందితులనుండి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం కప్పరాళ్లతిప్పకు చెందిన కావటి క్రాంతికుమార్ అలియాస్ కాంతి, పీరిగ రమేష్ అలియాస్ చిన్న రమేష్‌గా గుర్తించినట్లు తెలిపారు. మరో నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఎస్‌పి బి సత్యఏసుబాబు ఉత్తర్వులు మేరకు డిఎస్‌పి రాధేష్‌మురళీ ఆదేశాలతో ఈ దొంగలను పట్టుకున్నట్లు తెలిపారు.
స్థానిక ఎస్‌ఐ వారి బృందం నిందితులను పట్టుకోవటంలో చాకచాక్యంగా వ్యవహరించారని ఈ కేసును చేధించిన కానిస్టేబుల్స్ అనిల్,కిశోర్‌లను సిఐ అభినందించారు. గతంలో జరిగిన ఇళ్ల దొంగతనాలు, జాతీయ రహదారిపై జరిగిన దొంగతనాలను త్వరలో చేధించనున్నట్లు, మండల పరిధిలోని ప్రధాన కూడళ్లల్లో జాతీయ రహదారిపై ఉన్న దాబాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటుచేయనున్నట్లు సిఐ తెలిపారు. ఈకార్యక్రమంలో ఎస్‌ఐ బి సురేష్, ట్రైనీ ఎస్‌ఐ శ్రీనివాసరావు, రైటర్ ఎన్‌వి రమణారెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


గండం గడచినా... ఆగని వణుకు!

$
0
0

విజయనగరం, డిసెంబర్ 18: పెథాయ్ తుపాను గండం నుంచి బయటపడినప్పటికీ చలి గాలులు ప్రజలను తీవ్రంగా వణికిస్తున్నాయి. గత రెండు రోజులుగా చలిగాలులకు ప్రజలు ఇంటి నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. ఈ గాలులు మరో 24 గంటల పాటు ఉంటాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. ఇదిలా ఉండగా గత రెండు రోజులుగా 3పెథాయ్2 తుపాను ప్రభావం వల్ల తీవ్ర చలిగాలులకు జిల్లాలో పాడి పంటలకు అపార నష్టం వాటిల్లింది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు జిల్లాలో రూ.30 లక్షల మేర పాడి పశువుల నష్టం ఏర్పడింది. పశుసంవర్థకశాఖ అందించిన లెక్కల ప్రకారం ఇప్పటి వరకు తుపాను వల్ల 20 పశువులు, 18 దూడలు, 10 ఎద్దులు, 618 గొర్రెలు, మేకలు మృతి చెందాయి. అలాగే 324 కోళ్లు చలిగాలులకు చనిపోయాయి. వీటి విలువ రూ.30.08 లక్షలు ఉందని పశుసంవర్థకశాఖ అధికారులు చెబుతున్నారు.
అలాగే వ్యవసాయశాఖ అంచనా ప్రకారం జిల్లాలో 520 హెక్టార్లలో మొక్కజొన్న, 3 హెక్టార్లలో చెరకు పంటకు నష్టం వాటిల్లింది. జిల్లాలో పూసపాటిరేగ, నెల్లిమర్ల, చీపురుపల్లి, మెరకముడిదాం మండలాల్లో మొక్కజొన్న, చెరకు పంటలకు నష్టం వాటిల్లిందని వ్యవసాయశాఖ జెడి జిఎస్‌ఎన్‌ఎస్ లీలావతి తెలిపారు. వీటి విలువ రూ.1.56 కోట్లు ఉంటుందని ప్రాథమిక అంచనా వేశారు. వరి పంట పనల మీద ఉన్నందున దానికి రంగు మారే అవకాశం ఉంటుందే తప్ప, దానివల్ల నష్టం ఏది ఉండదని వ్యవసాయశాఖ జెడి తెలిపారు. ఇక ఉద్యాన పంటలకు సంబంధించి జిల్లాలో అరటి, బొప్పాయి పంటలకు నష్టం వాటిల్లింది. జిల్లాలో పూసపాటిరేగ, వేపాడ, గంట్యాడ మండలాల్లో 25 హెక్టార్లలో అరటి పంటకు నష్టం వాటిల్లింది. అలాగే బొప్పాయి 10 హెక్టార్లలో నష్టం వాటిల్లిందని ఉద్యానశాఖ డిడి శ్రీనివాసరావు తెలిపారు. వీటి విలువ రూ.1.25 కోట్ల మేరకు ఉంటుందని ప్రాథమిక అంచనా వేశారు. ఇక మత్స్యశాఖకు సంబంధించి జిల్లాలో 25 బోట్లు గల్లంతయ్యాయని మత్స్యకారులు చెబుతున్నారు. వీటికి సంబంధించి ఇంకా ప్రాథమిక విచారణ జరుపుతున్నట్టు మత్స్యశాఖ డిడి దివాకరరావు తెలిపారు. ఏది ఏమైనప్పటికీ జిల్లాలో పెథాయ్ తుపాను వల్ల ప్రాణనష్టం లేనప్పటికీ, ఆస్తి నష్టం వాటిల్లింది. ఇక మండలాలు, గ్రామాల వారీగా తుపాను నష్టంపై అంచనాలు వేస్తున్నారు. మరో రెండు రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక అందే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ హరి జవహర్‌లాల్ తెలిపారు.

తుఫాను విధ్వంసానికి వరి రైతు విలవిల:
పార్వతీపురం (రూరల్), డిసెంబరు 18: పార్వతీపురం నియోజక వర్గంలో తుఫాను కారణంగా గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వరి పంటలు మొత్తం తడిచిపోయిందని, దీంతో వరి రైతుకు తీవ్ర నష్టం వాటిల్లిందని వై ఎస్సార్ సీ పీ నాయకులు జమ్మాన ప్రసన్నకుమార్ అన్నారు. మండలంలోని వెంకంపేట, చినబొండపల్లి, సంగంవలస, కొత్తపట్నం గ్రామాల్లో రైతులతో వరి పొలాలను మంగళవారం పరిశీలించిన ఆయన పంట పొలాల్లో ఉన్నరైతుకు ధైర్యం చెప్పి నష్టపోయిన పంటల వివరాలు తెలుసుకున్నారు. అట్టహాసంగా వరి ధాన్యం కేంద్రాలు ప్రభుత్వం ప్రారంభించింది.కానీ నేటి వరకు ఎక్కడ ధాన్యం సేకరణ జరగలేదన్నారు. ఈ సంవత్సరం వర్షాలు సరిగా లేక పంటలు సరిగా రాలేదు. తడిసిన ధాన్యాన్ని కొనలేని పక్షంలో పార్వతీపురం రైతులకు తక్షణమే పంట నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో బోను రామినాయుడు, గండి శంకర్రావు, తీళ్ల శివున్నాయుడు, రొంపిల్లి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.
పెథాయ్ తుఫాన్ కారణంగా జరిగిన నష్టాన్ని అంచనావేయాలి
గుమ్మలక్ష్మీపురం, డిసెంబర్ 18: పెథాయ్ తుఫాన్ కారణంగా జరిగిన పంట నష్టాలను సేకరించాలని తహశీల్దార్, రెవెన్యూ సిబ్బందికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె మనోరమ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ పెథాయ్ తుఫాన్‌కు మండలంలోని 3 ఆవులు, 5 దూడలు, 3మేకలు, ఒక ఎద్దు మృతిచెందాయని, అదేవిధంగా చప్పగూడ పంచాయతీలోని 3 ఆవులు, 5 దూడలు మృతిచెందాయన్నారు. ఈమేరకు వీఆర్‌ఓలను ఆయాగ్రామాల పరిధిలో అప్రమత్తం చేసి పంట నష్టాన్ని తగ్గించామని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మనోరమ దృష్టికి తీసుకువెళ్లారు. గత రెండు రోజులుగా 14సెం.మీ. వర్షం కురిసిందన్నారు. నష్టం ఏర్పడిన పంట వివరాలను జిల్లాకలెక్టర్, ఐటీడీఏ పీఓ, సబ్‌కలెక్టర్‌ల దృష్టికి తీసుకువెళతానని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మనోరమ తెలిపారు.

నష్టపోయిన పంటలను పరిశీలించిన ప్రత్యేక అధికారి
గుమ్మలక్ష్మీపురం, డిసెంబర్ 18: పెథాయ్ తుఫాన్ కారణంగా జరిగిన పంట నష్టాన్ని ప్రత్యేక అదికారి, పార్వతీపురం జీసీసీ డీఎం ఎస్ భాస్కరరావు మంగళవారం పరిశీలించారు. ఈమేరకు డుమ్మంగి పంచాయతీలోని గుణద, కొరడగూడ, పెంటసింగి, తదితర గ్రామాల్లోని వరిపంటలను పరిశీలించారు. గుణద గ్రామంలో 18మంది రైతులకు చెందిన 17 ఎకరాల వరిపంటకు తీవ్ర నష్టం ఏర్పడింది. పంట పొలాల్లో కోసిన వరిచేళ్లను కుప్పలుగా నిల్వ ఉంచడంతో అందులో వర్షపునీరు చేరడంతో పూర్తిగా తడిసిపోయాయని రైతులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఎకరాకు 30 నుంచి 40బస్తాలు దిగుబడి వచ్చే పంటలకు నష్టం ఏర్పడటంతో రైతులు లబోదిబోమంటున్నారు. నష్టపోయిన పంటలకు నష్టపరిహారం అందించాలని రైతులు మల్లేష్, అప్పలస్వామి, వైకుంఠరావులు కోరారు.

తడిసిన పంటలలో వైద్యాధికారుల సూచనలు పాటించాలి
మక్కువ, డిసెంబర్ 18: పెథాన్ తుఫాన్ వలన తడిచిన పంటలలో పలు జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ అధికారి కొల్లి తిరుపతిరావు తెలిపారు. మండలంలోని సరాయివలస, బంటుమక్కువ, కవిరిపల్లి గ్రామాల్లో తుఫాన్‌కు తడిసిన వరిచేళ్లను మంగళవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మట్లాడుతూ చేతికందిన పంటలను కళ్లాల్లో చిన్నచిన్న కుప్పలుగా వేయడంతో అవి కురిసిన వర్షాలకు పూర్తిగా తడిసిపోయాయన్నారు. పొలాల్లో నీరు అధికంగా చేరడంతో కుప్పలు సగానికిపైగా మునిగిపోయాయి. తడిసిన ధాన్యం పడవ్వకుండా ఉప్పు ద్రావణాన్ని వేసుకోవాలన్నారు. ఫసల్ బీమా చేయించుకున్న రైతులకు నష్టం ఏర్పడితే వ్యవసాయశాఖను సంప్రదిస్తే బీమాకంపెనీకి నివేదికలు అందిస్తామన్నారు. అలాగే మొక్కజొన్నలో నీరు నిల్వ ఉంటే పంటంతా పాడయ్యే అవకాశం ఉందని, నీటిని బయటకు తరలించేలా సదుపాయాలు చేసుకోవాలన్నారు. ఎండలు బాగా పెరిగిన తరువాత ఎకరాకు బస్తా యూరియా వేసుకోవాలన్నారు. పంట నష్టాలను తెలియజేయాలంటే దిగుబడి 33శాతం కంటే అధిక శాతం దిగుబడిలో నష్టం వస్తేనే వర్తిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఇఓలు నవీన, భారతి, ఎంపీఇఓలు, రైతులు పాల్గొన్నారు.
పెథాయ్ తుఫాన్‌తో తీవ్రనష్టం
* పశువులు మృత్యువాత
పాచిపెంట, డిసెంబర్ 18: మండలంలో పెథాయ్ తుఫాన్ కారణంగా వరిపంటకు నష్టం ఏర్పడటంతోపాటు పలు పశువులు మృత్యువాత పడ్డాయి. చెరకుపల్లి, విశ్వనాధపురం, చినచీపురువలస, పెదచీపురువలస, కర్రివలస, పాంచాలి, మోసూరు, తదితర గ్రామాల్లో వరి పంట సుమారు 120 ఎకరాలలో నష్టం వాటిల్లిందని వ్యవసాయశాఖాధికారులు అంచనా వేశారు. ఈమేరకు ఆయాగ్రామాల్లో వ్యవసాయశాఖ ఏడీఏ మదుసూధనరావు, వ్యవసాయ అధికారి గోవిందరావులు మంగళవారం పంట నష్టాలను పరిశీలించారు. అలాగే ఏజెన్సీ గ్రామాలైన చేరుకగుడ్డి, రాయివలస, బడ్నాయకవలస, తెట్టేడవలస, తదితర గ్రామాల్లో పశువులు మృత్యువాత పడ్డాయి. 12 మేకలు మృతిచెందగా ఆరు గొర్రెలు, 7 ఆవులు, 2 దూడలు మృతిచెందినట్లు బాధితులు తెలిపారని తహశీల్దార్ నాగేశ్వరరావు, పశువైద్యాధికారి వెంకటరమణలు తెలిపారు. నష్టపోయిన రైతుల జాబితాలతోపాటు మృత్యువాతపడిన పశువుల వివరాలను జిల్లాకలెక్టర్ దృష్టికి తీసుకువెళతామని తెలిపారు.
అన్నదాతను ముంచిన పెథాయ్
గజపతినగరం, డిసెంబర్ 18: పెథాయ్ తుఫాన్ అన్నదాతను నిలువునా ముంచింది. నిన్నటి వరకు వర్షాబావంతో రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేయగా అరకొరగా పండిన వరిపంటను అయినా ఇంటికి తెచ్చుకొని కొంతవరకైనా పెట్టుబడి తెచ్చుకుందామనుకొనే రైతులకు తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు వరికుప్పలు నీట మునిగాయి. వరి కుప్పలు పూర్తిగా తడిసి ముద్దవ్వడమే కాకుండా కుప్పలు చుట్టూ వరదనీరు చేరడంతో రైతులు పంటను రక్షించుకొనేందుకు నీటిని కిందకు వెళ్ళే విధంగా చర్యలు తీసుకొని పంటను రక్షించుకొనేందుకు నానా అవస్ధలు పడుతున్నారు. మండలంలోని పట్రువాడ, బూడిపేట, గ్రామాలలో 150 ఎకరాలలో వరి దిబ్బలు పూర్తిగా నీట మునిగి కుళ్ళిపోయే ప్రమాదం నెలకొన్నది. వ్యవసాయశాఖ అధికారులు దిబ్బలు వేసిన వరికి నష్టపరిహారం అందే అవకాశం లేదని ధాన్యం రంగుమారితే ముందుగా కొనుగోలు చేయడానికి మాత్రమే అవకాశం ఉందని చెప్పడంతో రైతులు లబోదిబోమంటున్నారు. అలాగే వెయ్యి ఎకరాలలో పత్తిపంట పూర్తిగా నాశనం అయింది. తుపాను ప్రభావంతో చెరువులలోకి నీరుభారీగా చేరి కిటకిటలాడుతూ ఖానాలు వెంబడి భారీగా వరదనీరు ప్రవహిస్తున్నది. ఇంకొక పక్క ప్రభుత్వ కమ్యూనిటి ఆసుపత్రి పాతభవనం పూర్తిగా వర్షం నీటితో నిండిపోవడంతోపాటు ఆసపత్రి చుట్టూ నీరుచేరడంతో రోగులు ఆసుపత్రికి రావాలంటే నరకయాతన అనుభవిస్తున్నారు. మరుపల్లి గ్రామంలో పెథాయ్ తుఫాన్ కారణంగా దేవర పోతయ్యకు చెందిన పశువుపాక కూలిపోవడంతో అతనికి చెందిన ఆవు, గొర్రె మృతి చెందాయి. నష్ట వివరాలను తెలుసుకొనేందుకు ఇన్‌చార్జి తహశీల్ధార్ శ్రీనివాసరావు గ్రామాన్ని సందర్శించి బాధితులకు అన్నివిధాలా ప్రభుత్వం తరుపున అందాల్సిన సహాయం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
చలిగాలులకు మూగజీవాలు బలి
బొండపల్లి, డిసెంబర్ 18: పెధాయ్ తుఫాన్ ప్రభావంతో మండలంలో వీచిన చలిగాలులకు మూగజీవులు మృత్యువాతపడాయి. గత మూడు రోజులుగా సుమారు 19 డిగ్రీలకు తగ్గిన పగటి ఉష్ణోగ్రతలకు తోడు రాత్రి వీచే తీవ్రమైన చలిగాలులకు పశువులు, మేకలు మృతిచెందాయి. మండలంలో రోళ్లవాక గ్రామంలో కొర్నాన జానకి చెందినవి 15, పైడన్నవి రెండు, నక్కాన నారాయణరావు11, కొర్నాన రాజేశ్వరి-1, ఎరకయ్య-2 గొర్రెలు అలాగే రయింద్రాం గ్రామానికి చెందిన నమ్మి సూర్యనారాయణ-10, యలమంచిలి దేవుడు-4, నమ్మి సత్యం-2 గొర్రెలు చలిగాలులకు మరణించాయి. అలాగే గొట్లాం గ్రామంలో కోరాడ సన్యాసికి చెందిన ఆవు పెయ్యి, ఒంపల్లి గ్రామంలో బోగాపుర సన్యాసిరావుకు చెందిన ఆవు పెయ్యి తుఫాన్ గాలులకు మృత్యువాతపడాయి. దీంతో ఆర్ధికంగా నష్టానికి గురయ్యారు. ఈ గ్రామాలకు చెందిన వి ఆర్ వోలు ఆదిరావు, శ్రీనివాసరావుల సమాచారం మేరకు మండల ప్రత్యేక అధికారి ఎస్.వెంకటరావు, రెవెన్యూ సిబ్బంది చప్ప సత్యనారాయణలతోపాటు బొండపల్లి, రాచకిండాం పశువైద్యాధికారులు లక్ష్మీదీపిక, కిరణ్‌లు గ్రామాలలో సందర్శించి బాధితులకు భరోసా కల్పించారు. బాధితులను ఆదుకొనేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని తహశీల్ధార్ శేఖర్ తెలిపారు.

వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

$
0
0

గజపతినగరం, డిసెంబర్ 18: నియోజకవర్గ కేంద్రమైన గజపతినగరంలో మంగళవారం వైకుంఠ ఏకాదశి పూజలు వైభవంగా జరిగాయి. శ్రీశ్రీశ్రీ సీతారామ శ్రీ కల్యాణ వేంకటేశ్వర అయ్యప్పస్వామి వారి దేవాలయ ప్రాంగణంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలలో భాగంగా వైకుంఠ ఏకాదశి పూజలు జరిపారు. ఆలయ అర్చకులు పీసపాటి శ్రీనివాసచార్యులు శ్రీనివాసునికి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. తెల్లవారుజామున 4.15గంటలకు సుప్రభాత సేవ, అర్చన, సేవాకాలం, నివేదన, మంగళాశాపనం, పాశుర విన్నపం జరిపారు. అనంతరం ఉత్తరద్వార దర్శనం ద్వార భక్తులు వచ్చారు. అదేవిధంగా తీర్ధప్రసాదం గావించారు. గజపతినగరం సీతారామస్వామి గ్రూపు దేవాలయాల ప్రాంగణంలో గల విష్ణుమూర్తి ఆలయంలో అర్చకులు తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేకపూజలు జరిపారు. ముక్కోటి ఏకాదశి కావడంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ కార్యక్రమంలో భజగోవిందం నియోజకవర్గ అధ్యక్షుడు డాక్టర్ వడలి సూర్యనారాయణమూర్తి, కమిటీ అధ్యక్షుడు కొల్లా వెంకటసాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు. గజపతినగరం శివారు గ్రామంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పూజలు నిర్వహించారు.

వైభవంగా ఉత్తరద్వార దర్శనం
బొండపల్లి, డిసెంబర్ 18: మండలంలోని దేవుపల్లి గ్రామంలో వెలసిన రాజరాజేశ్వరిదేవి ఆలయంలో కొలువైన ఉన్న శ్రీమన్నారాయణస్వామివారికి వైకుంఠ ముక్కోటి ఏకాదశి అర్చకులు దూసి శ్రీధర శర్మ వైభవంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటుచేశారు. భక్తులు ఉత్తరద్వార దర్శనానికి ఉదయం నుంచే ఆలయం దగ్గర క్యూకట్టారు. మహిళలు ఆలయంలో విష్ణు సహస్త్ర నామపారాయణ, క్షీరాభిషేకాలు, ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి శ్రీమన్నారాయణుడికి ప్రీతిపాత్రమైన రోజని ఈ రోజు ఉత్తరద్వారం నుంచి ముక్కోటి దేవతలు విష్ణుమూర్తిని దర్శించుకుంటారనేది ప్రతీకని తెలిపారు. సూర్యభగవానుడు ఉత్తరాయణ కాలానికి మారే ముందు వచ్చే ధనుర్మాష శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశిగా పిలుస్తారని, దీనికి ముక్కోటి ఏకాదశిగా మరోపేరుందని తెలిపారు. ఈరోజు మూడు కోట్ల దైవగణంతో గరుడ వాహనంపై మహావిష్ణువు భూలోకానికి దిగొచ్చి భక్తులకు దర్శనంమిస్తారని అందుకే ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందని అన్నారు.

హెల్త్ వాలంటీర్ల ఎంపికకు గిరిజన అభ్యర్థులు హాజరు
పార్వతీపురం, డిసెంబర్ 18: పార్వతీపురం ఐటిడి ఎ పరిధిలోని గిరిజన సంక్షేమశాఖ ఉన్నత పాఠశాలలల్లో గల విద్యార్థుల ఆరోగ్యం పట్ల పీవో డాక్టర్ జి.లక్ష్మీశ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంలో భాగంగా హెల్త్ వాలంటీర్లను నియమించే ప్రక్రియను చేపట్టారు. ఈమేరకు విశాఖపట్నంకు చెందిన త్రిల్ హెల్త్ అండ్ వెల్‌నెస్ ప్రైవేట్ లిమిటెడ్‌క చెందిన థర్డ్‌పార్టీ ద్వారా అవుట్ సోర్సింగ్ విధానం ఎంపిక ప్రక్రియను మంగళవారం చేపట్టారు. ఈమేరకు ఇంటర్వ్యూలకు 70పోస్టులకు గాను 150మందిని ఇంటర్వ్యూలకు పిలిచారు. జి ఎన్ ఎం, ఎ ఎన్ ఎంల శిక్షణ పొందిన మహిళా అభ్యర్థులకు బాలికల పాఠశాల్లో ఆరోగ్య సహాయకులుగాను, పురుష అభ్యర్థులకు బాలురు పాఠశాలల్లో నియామకానికి ఈ ఎంపిక ప్రక్రియ చేపట్టారు. వీరికి వేతనంగా రూ.10వేల వేతనం అందిస్తారు. ఈ కార్యక్రమాన్ని పీవో డాక్టర్ జి.లక్ష్మీశ పరిశీలించారు. ఈ ఇంటర్వ్యూలకు పెద్ద ఎత్తున గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులు పాల్గొన్నారు.

బలహీన వర్గాల సదస్సును విజయవంతం చేయండి
పార్వతీపురం (రూరల్), డిసెంబరు 18: పార్వతీపురం వై ఎస్సార్ సీపీ కార్యాలయంలో అరకు పార్లమెంటు బిసీ సెల్ అధ్యక్షుడు వాకాడ నాగేశ్వర్రావు, సమన్వయకర్త అలజంగి జోగారావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వాకాడ నాగేశ్వర్రావు మాట్లాడుతూ చంద్రబాబు బీ సీ వర్గాలకు ఇచ్చిన హమీలను నెరవేర్చకుండా వారిని మోసం చేసారన్నారు, ఈ విషయమై 20 వతేదీన ఆర్డీ ఓ కార్యాలయం ముందు బలహీన వర్గాల సదస్సు న్విహిస్తామన్నారు. ఈ సదస్సులో చంద్రబాబు మోసపూరిత పాలనను నిలదీస్తామన్నారు. అలజంగి జోగారావు మాట్లాడుతూ బలహీన వర్గాల గర్జన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాలుగు నియోజక వర్గాలకు చెందిన బలహీన వర్గాలకు చెందిన ప్రజలు పాల్గొంటారని, చంద్రబాబు బలహీన వర్గాలకు చేసిన మోసాలను నిగ్గుతేల్చే దిశగా, భారీ ర్యాలీ నిర్వహిస్తమని తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధిత శాసన సభ్యులు, రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షులు, జిల్లా రాజకీయ వ్యవహారాల నాయకులు పాల్గొంటారన్నారు. ఈ సమావేశంలో పార్వతీపురం పట్టణ అధ్యక్షులు కొండపల్లి బాలకృష్ణ, ఫ్లోర్ లీడర్ మంత్రి రవికుమార్, ఎస్సీ సెల్ కార్యదర్శి వార్డ్ కౌన్సిలర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
గృహ లబ్దిదారులు హాజరు కావాలి:
పార్వతీపురం (రూరల్), డిసెంబరు 18: పార్వతీపురం పురపాలక సంఘం పరిధిలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన క్రింద లబ్దిదారులకు ఈ నెల 20 న ఫ్లాట్ లు కేటాయించడం జరుగుతుందని మునిసిపల్ కమీషనర్ ఎస్.శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమం లబ్దిదారులు మరియు ప్రజా ప్రతినిధులు సమక్షంలో లయన్స్ క్లబ్ లో జరుగుతుందన్నారు. కాబట్టి లబ్దిదారులు హాజరు కావాలని కమీషనర్ తెలియచేసారు.

అక్రమ లే అవుట్లపై కొరడా:
పార్వతీపురం (రూరల్), డిసెంబరు 18: కొత్త వలస సమీపంలో గల నవిరి కోలనీ వద్ద ఇటీవల వెలసిన అక్రమ లే-అవుట్ పై మునిసిపల్ అధికారులు కొరడా ఝుళిపించారు. దాదాపు 4 ఎకరాలలో వేసిన లే- అవుట్ లో వేసిన రాళ్లను మునిసిపల్ అధికారులు తొలగించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ అక్రమ లే-అవుట్ పై చర్యలు తప్పవన్నారు. ఇందులో ఎవరైనా ప్లాట్ లు కొనుగోలు చేస్తే నష్టపోతారన్నారు.

కేంద్ర పధకాలు దిగమింగుతున్న చంద్రబాబు
* బీజేపీ రాష్ట్ర నేత దేవర ఈశ్వరరావు

గజపతినగరం, డిసెంబర్ 18: కేంద్ర ప్రభుత్వ పధకాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిగమింగుతున్నారని బీజేపీ రాష్ట్ర నాయకుడు, గజపతినగరం నియోజకవర్గ కన్వీనర్ దేవర ఈశ్వరరావు ఆరోపించారు. మంగళవారం మండలంలోని గంగచోళ్లపెంట గ్రామంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ప్రధాని నరేంద్రమోదీ ప్రతి ఇంటికి రెండు ప్యాన్లు, మూడు ఎల్‌ఇడి బల్బులు అందజేస్తే రెండు ఎల్‌ఇడి బల్బులు ఇచ్చి మిగిలినవి బాబు దిగమింగారని అన్నారు. అదే విధంగా ప్రతిపనిలో అవినీతి పెచ్చుమీరిపోయిందని తెలిపారు. ఉపాధి హామీ నిధులతో చేపట్టిన రహదారులను చంద్రన్నబాటగా పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రధానిమంత్రి అవాజ్‌యోజన పధకం ద్వారా మంజూరైన ఇళ్లనుంచి లబ్ధిదారుని నుంచి జన్మభూమి కమిటీల ద్వారా వసూలుచేశారని ఆరోపించారు. మరలా కేంద్రం రాష్ట్రానికి ఏమీ చేయలేదనడం దారుణమని చెప్పారు. కేంద్ర పధకాలను ప్రజలకు వివరించాలన్న ధ్యేయంతోనే ఇంటింటికి బీజేపీ కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు.
కార్యక్రమంలో బీజేపీ మండశాఖ నాయకులు ఆరిశెట్టి రామకృష్ణ, ఎం ఎస్ ఎన్ రాజు, తదితరులు పాల్గొన్నారు.

ప్రజలు సేవాభావం పెంపొందించుకోవాలి
గజపతినగరం, డిసెంబర్ 18: ప్రజలు సేవాభావాన్ని పెంపొందించుకోవాలని భజగోవిందం గజపతినగరం నియోజవర్గ అధ్యక్షుడు డాక్టర్ వడలి సూర్యనారాయణమూర్తి కోరారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని స్ధానిక వాసవీ కల్యాణ మండపంలో స్నేహ సేవా స్వచ్చంద సంస్ధ, బాపూజీ గ్రంధాలయ సంఘం వ్యవస్ధాపక అధ్యక్షుడు తాళ్ళపూడి ఈశ్వరరావు ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో నిరుపేదలు, దివ్యాంగులక నిత్యావసర సరకులతో పాటు సోలాపూర్ దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశినాడు ఇటువంటి మంచి కార్యక్రమాలు గత కొనే్నళ్లుగా చేపడుతున్న ఈశ్వరరావును అభినందించారు.
సీనియర్ న్యాయవాది ఉప్పలపాటి రమేష్ మాట్లాడుతూ ఈశ్వరరావు చేపడుతున్న కార్యక్రమాలకు తనవంతు సహకారం ఉంటుందని తెలిపారు. సంస్ధ అధ్యక్షుడు తాళ్లపూడి ఈశ్వరరావు మాట్లాడుతూ 22మంది నిరుపేదలు, దివ్యాంగులకు పది కిలోల బియ్యం, సోలార్ దుప్పటి, కిలో ఆయిల్, కిలో కంది పప్పు, అర కిలో చింతపండు, అరకిలో బెల్లం వస్తువులు అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం పలువురు సహాయ సహకారాలతో చేపడుతున్నామని తెలిపారు. అదే విధంగా న్యాయవాది ఉప్పలపాటి రమేష్ ఒక్కొక్కరికి వంద రూపాయల వంతున 2,200 రూపాయలు ఆర్ధిక సహాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవాస్ధానం వేదపండితులు వేదుల భువనేశ్వరప్రసాద శర్మ, జి.టి.పేట హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు బి. ఉమాహేశ్వరరావు, ఉపాధ్యాయుడు లెంక రామారావు, సభ్యులు కర్రి రామునాయుడు, జి.శ్రీనివాసరావు, కొల్లా మనోజ్‌కుమార్, ఎల్.రామారావు తదితరులు పాల్గొన్నారు.

డప్పు కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలి
గజపతినగరం, డిసెంబర్ 18: డప్పు కళాకారులను ప్రభుత్వం ఆదుకొని అన్ని విధాలా చర్యలు తీసుకోవాలని ఏపీ డప్పు కళాకారుల సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు రాకోటి రాములు అన్నారు. మంగళవారం స్ధానిక ఎంపిడివొ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ పి.సోమేశంకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డప్పు కళాకారులు పింఛన్లకు సంబంధించి నిబంధన వయసును 55నుంచి 45 ఏళ్లకు తగ్గించాలని కోరారు. పింఛన్‌ను 1500 నుండి మూడువేల రూపాయలకు ఇవ్వాలని డిమాండ్‌చేశారు. సంక్రాంతి సంబరాలలో డప్పు కళాకారులకు ప్రాధాన్యత కల్పించడంతోపాటు వారికి తగిన పారితోషికం ఇవ్వాలని కోరారు. ఈనెల 31న చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించనున్నామని ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగాగల డప్పుకళాకారులు తమ డప్పులుతో హాజరై ఆర్టీసీ కాంపెక్స్ నుండి కలెక్టరేట్ వరకు జరగనున్న భారీ ర్యాలీ జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు బొట్టా తవుడు, మండల అధ్యక్షుడు టి.రాము తదితరులు పాల్గొన్నారు.

మాతుమూరులో పారిశుద్ధ్యం పనులు
పాచిపెంట, డిసెంబర్ 18: రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నందున గ్రామాల్లో వ్యాధులు ప్రభలకుండా పారిశుద్ధ్యంపై దృష్టిసారించారు. మండలంలోని మాతుమూరు, పాంచాలి గ్రామాల్లో మంగళవారం అపారిశుద్ధ్యం నిర్మూలన పనులు చేపట్టారు. ఈమేరకు కాలువల్లో చెత్తాచెదారాలు తొలగించడం, తాగునీటి బోర్లు చుట్టు పారిశుద్ధ్యం పనులు నిర్వహించారు. ఈపనులను ఇఓపీఆర్‌డీ గణేష్ పరిశీలించి తగు సూచనలు, సలహాలు అందించారు. చెత్తాచెదారాలను రోడ్లుపై ఎవరు వేసిన, పశువులు కట్టిన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తాగునీటిలో కూడా క్లోరినేషన్ చేయిస్తున్నామన్నారు.

అక్రమంగా మద్యంను తరలిస్తే కఠిన చర్యలు
బాడంగి, డిసెంబర్ 18: అక్రమంగా మద్యం బాటిల్స్‌ను తరలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ సురేంద్రనాయుడు హెచ్చరించారు. ఈమేరకు బొత్సవానివలస గ్రామానికి చెందిన ఏ సత్యనారాయణ 14మద్యం బాటిల్స్‌ను తరలిస్తుండగా మంగళవారం స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ కొంతమంది వ్యక్తులు మద్యం బాటిల్స్‌ను కొనుగోలు చేసి గ్రామాల్లో అక్రమంగా విక్రయించేందుకు తరలిస్తున్నారన్నారు. అటువంటి వారిపై నిఘాపెంచామని, ఎవరైన దొరికితే అదుపులోనికి తీసుకుని కేసు నమోదుచేస్తామన్నారు. ఇందులో భాగంగా సత్యనారాయణపై కేసు నమోదుచేసి స్వాధీనం చేసుకున్న మద్యం బాటిల్స్‌ను ఎక్సైజ్‌శాఖకు అప్పగించామన్నారు.

మహిళలు స్వయం ఉపాధిని మెరుగుపర్చుకోవాలి
బాడంగి, డిసెంబర్ 18: నేటి ఆధునిక యుగంలో కుటుంబ పోషణ పెనుభారంగా మారుతున్నందున మహిళ కూడా స్వయం ఉపాధిని మెరుగుపర్చుకోవాలని ఎస్‌ఐ సురేంద్రనాయుడు అన్నారు. దీక్షామహిళావెల్ఫేర్ ఆధ్వర్యంలో ఈనెల 13నుంచి 25వ తేదీ వరకు మైక్రో డవలప్‌మెంట్ ఎంట్రపైజెస్ పథకంలో భాగంగా మహిళలకు టైలరింగ్‌లో శిక్షణలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్ల వద్ద ఉంటూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు టైలరింగ్‌లు ఎంతో దోహదపడతాయన్నారు. ఇందులో భాగంగా ఫ్యాషన్ టెక్నాలజీ, పచ్చళ్ల తయారీ, రంగులు అద్దడం, టైలరింగ్, చిన్నచిన్న ప్లేట్స్‌తయారీ, తదితర రంగాల్లో నిష్ణాతులుకావాలన్నారు. మహిళల అభివృద్ధి కోసం విశేష కృషి చేస్తున్న మహిళా దీక్షావెల్ఫేర్ సంస్థను అభినందించారు. ఈ కార్యక్రమంలో వీరసాగరం మాజీ సర్పంచ్ లచ్చుపత్తుల శాంతి, ఈశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
యువత పోటీపరీక్షలకు సిద్ధపడాలి
మక్కువ, డిసెంబర్ 18: యువత పోటీపరీక్షలకు సిద్ధంగా ఉండాలని ఎస్‌ఐ కృష్ణమోహన్ అన్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో నిరుద్యోగ యువతకు పోటీపరీక్షలకు ఉపయోగపడే విజ్ఞానకర పుస్తకాలు మంగళవారం పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చెడువ్యసనాలకు దూరంగా ఉంటూ విజ్ఞానకర పుస్తకాలను చదివి పోటీ పరీక్షలకు సిద్ధపడాలన్నారు. ఇటీవల నోటిఫికేషన్ విడుదలైన పోలీస్‌కానిస్టేబుల్, హోంగార్డు, ఎస్‌ఐ, డిఎస్సీ, తదితర పోటీ పరీక్షలకు నిరుద్యోగ యువతీయువకులు కష్టపడి చదివి విజయం సాధించాలన్నారు. విజ్ఞానకర పుస్తకాల ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకుని పోటీ పరీక్షలలో మంచి ప్రతిభ కనబర్చి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. అలాగే తోటి విద్యార్థులకు ఇటువంటి వాటిపై అవగాహన కల్పించాలన్నారు. మద్యం సేవించడం, పేకాట, దొంగతనాలు, తదితర చెడువ్యసనాలకు దూరంగా ఉంటూ మంచి మార్గంలో నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

భగవత్ గీత పఠన పోటీలకు విశేష స్పందన
సాలూరు, డిసెంబర్ 18: గీతా జయంతి సందర్భంగా మంగళవారం స్థానిక వేదసమాజం సంస్కృత ఉన్నత పాఠశాలలో నిర్వహించిన భగవద్గీత శ్లోక పఠన పోటీలకు విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి అనేకమంది విద్యార్థినీ విద్యార్థులు పోటీలలో పాల్గొన్నారు. న్యాయనిర్ధేతలుగా తెలుగు పండితులు, రచయితలు సిహెచ్ వెంకటరావు, బి రామునాయుడు, ఎం సూర్యనారాయణలు వ్యవహరించారు. ఉన్నత పాఠశాల స్థాయిలో ప్రథమ బహుమతికి జి సోమేశ్వరి(పారాది), ద్వితీయ బహుమతి కె వౌనిక(శివరాంపురం)లు ఎంపికయ్యారు. ప్రాథమికోన్నత స్థాయిలో పి ఊర్మిళ, పి శ్రావణిలు ప్రథమ, ద్వితీయ స్థానాలను సాధించారు. ప్రాథమిక స్థాయిలో కె కీర్తన, సిహెచ్ విఖ్యాత్‌లు ప్రథమ, ద్వితీయస్థానాలను కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సాలూరు సాహితమిత్రబృందం అధ్యక్ష, కార్యదర్శులు కెబి తిరుమలాచార్యులు, కె దాలినాయుడు, సిహెచ్ శ్రీదేవి, యశోదలు పాల్గొన్నారు.

రామతీర్థంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి
* పోటెత్తిన భక్తజనం
* వైభవంగా మెట్లోత్సవం, గిరిప్రదక్షణ
నెల్లిమర్ల, డిసెంబర్ 18: పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం, మెట్లోత్సవం, గిరి ప్రదక్షణ అత్యంత వైభవంగా నిర్వహించారు. వాతావరణం అనుకూలించకపోయనప్పటికీ వేలాదిగా భక్తులు తరలి వచ్చి ఉత్తర ద్వారం నుంచి రామచంద్రు ప్రభువును దర్శించుకున్నారు. శ్రీరామస్మరణతో రామతీర్థం మార్మోగిపోయింది. ఉదయం 3గంటలకు స్వామివారికి ఆరాధనా కార్యక్రమంతో ఈ వేడుక ప్రారంభమైంది. 4గంటలకు తిరుప్పావై సేవాకాలం, మంగళశాసనం, తీర్థఘోష్టి నిర్వహించారు. ఉదయం 5గంటల నుంచి 6గంటల వరకు స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిచ్చారు. 7గంటలకు సీతారామలక్ష్మణుల ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా భజన,కోలాటం,కీర్తన బృందములతో కోదండ రామస్వామి మెట్ల వద్దకు చేరుకున్నారు. పవిత్రమైన కొండమెట్లను శుభ్రపరచి పసుపుకుంకుమపూలతో అలంకరించారు. అనంతరం మెట్లోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అక్కడి నుంచి వేలాది భక్తజనంతో బోడుకొండ పడమరవైపుకు చేరుకుని గిరిప్రదక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గిరి ప్రదక్షణ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం శ్రీరామ స్మరణతో ఆధ్యాంతం వేడుకగా జరిగింది. ఉత్తరాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి, ఉత్తరాంధ్ర సాధుసంత్ పరిషత్ అధ్యక్షులు సమతానందస్వామి, శ్రవణచైతన్య స్వామి స్వామివారలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మెట్లోత్సవం, గిరిప్రదక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడు, ఉపాధ్యక్షుడు సువ్వాడ రవిశేఖర్, ఎంపీపీ సువ్వాడ వనజాక్షి, నాయకులు పతివాడ తమ్మినాయుడు, గేదెల రాజారావులు స్వామివారిని దర్శించుకుని గిరిప్రదక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సమస్త మానవాళికి గీత దివ్య ఔషధం
గజపతినగరం, డిసెంబర్ 18: సమస్త మానవాళికి గీత దివ్య ఔషధమని తిరుమల తిరుపతి దేవస్ధానం వేదపండితులు వేదుల భువనేశ్వర ప్రసాదశర్మ అన్నారు. మంగళవారం స్ధానిక సీతారామస్వామి ఆలయం ప్రాంగణంలో గీతా జయంతి పురష్కరించుకొని ఆలయంలో శ్రీకృష్ణుని, అర్జునుడు ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్వాపర యుగాంతం కురుక్షేత్రంలో మహాభారత యుద్దం నందు సర్వసైన్యం సమాయత్తంగా ఉన్న సమయంలో అర్జునుడికి కలిగిన విషాద నివారణకు శ్రీకృష్ణ పరమాత్మ గీతోపదేశం చేశారని తెలిపారు. శ్రీకృష్ణనుని విశ్వరూప సందర్శన దర్శనం అర్జునుడికి సమస్య విషాదం తొలగిందని అన్నారు. తద్వారా మానవాళికి గీతోపదేశం ద్వారా ఎందరో మహానుబావులు గీత మార్గాన్ని ఆచరించి మహోన్నతి పొందారని చెప్పారు. గజపతినగరానికి చెందిన కొల్లా అప్పలరాజు, సుధ దంపతులు ఈ గీతా జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్ధానం ఇవొ తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయ పోస్టుల ఉన్నతీకరణ
ఉత్తర్వుల విడుదల పట్ల హర్షం
విజయనగరం(పోర్టు), డిసెంబర్ 18: భాషా పండితులు, పిఇటి పోస్టులు ఉన్నతీకరణ ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేయడం పట్ల ఎపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జెసి రాజు హర్షం వ్యక్తంచేశారు. మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు 91ప్రకారం రాష్ట్రంలో 10,224 భాషా పండితుల పోస్టులు

అన్నదాతలను ముంచిన పెథాయ్

$
0
0

అరకులోయ, డిసెంబర్ 18: బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్ తుపాను అన్నదాతలను నిండా ముంచేసింది. కళ్లాల్లో నూర్పులకు సిద్ధం చేసిన వరి కుప్పలు తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు తడిసి ముద్దయ్యాయి. తడిసిన ముద్దయిన వరి చేళ్లను చూసి గిరిజన రైతన్నలను బోరున విలపిస్తున్నారు. రెండు రోజులుగా కుండ పోతగా కురిసిన భారీ వర్షాలతో వరి పంటలకు తీవ్ర నష్టం ఏర్పడింది. మండలంలోని పద్నాలుగు పంచాయతీలలో ఎక్కడ చూసినా రైతుల కన్నీటి రోదనే కనిపిస్తుంది. ఇటీవల కోత కోసిన వరి పంట పోలాల్లో ఉండగా, కొన్ని గ్రామాలలో రైతులు కుప్పలు వేసారు. విస్తారంగా కురిసిన వర్షాలకు కుప్పలతో పాటు పొలాల్లోని వరి తడిసిపోయాయి. కుప్పలలోకి వర్షం నీరు చేరడంతో ధాన్యం గింజలు మెలకెత్తుతాయని రైతాంగం ఆందోళన చెందుతున్నారు. తడిసిన వరి పొలాలను గట్లపైకి, కళ్లాలోకి చేర్చి ఆరబెడుతున్నారు. తడిసిన వరిని కాపాడుకునేందుకు రైతులు ఎంత ప్రయత్నిస్తున్నా మంగళవారం మళ్లీ వర్షం కురవడంతో వారి ప్రయత్నాలకు ఫలితం దక్కలేదు. మండలంలో సుమారు ఐదు వందల వరి కుప్పలలో నీరు చేరినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలుసుకున్న సి.పి.ఎం. నాయకుడు పొద్దు బాలదేవ్ చినలబుడు పంచాయతీలోని 13 గ్రామాలలో పర్యటించి తడిసిన వరి కుప్పలను పరిశీలించారు. చేతికి అంది వచ్చే పంట తుపాను ప్రభావంతో నాశనమై రైతులు నష్టపోయారని, అధికారులు స్పందించి వారిని ఆదుకోవాలని ఆయన కోరారు.
సరిహద్దులో వణికిస్తున్న చలి
గూడెంకొత్తవీధి, డిసెంబర్ 18: సరిహద్దు ప్రాంతంలో చలి గజగజ వణికిస్తోంది. గత రెండు రోజులుగా చలి మరింత పెరిగిపోయింది. ఒక పక్క పెథాయ్ తుఫాన్ ప్రభావం, మరో పక్క చలి తీవ్రత గిరిజనులను నానా ఇబ్బందులకు గురి చేస్తోంది. ఆదివారం నుండి ఎడతెరిపి లేని వర్షం కారణంగా దారాలమ్మ అమ్మవారి ఘాట్ రోడ్డులో రాకపోకలకు చాలా ఇబ్బందులకు ప్రయాణీకులు గురయ్యారు. ఉదయం, రాత్రి అనే సమయం లేకుండా నిరంతరం మంచు తెరలు కమ్ముకోవడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దట్టంగా పొగ మంచు కమ్ముకోవడంతో వాహన చోదకులు లైట్లు వేసుకుని ప్రయాణాలు సాగించారు. దారాలమ్మ అమ్మవారి గుడిపై మంచు తెరలు కమ్ముకున్నాయి. ఈ ప్రాంతం మీదుగా వాహనాల రాకపోకలు కూడా తగ్గుముఖం పట్టాయి.

పెథాయ్ దెబ్బకు నష్టపోయిన రైతాంగం
మునగపాక, డిసెంబర్ 18: గత మూడురోజులుగా రైతులను ఎంతో భయబ్రాంతులకు గురిచేసిన పెధాయ్‌తుపాన్ మునగపాక మండలంలో పలు గ్రామాల్లో చేతికి అందివచ్చిన పంటలను దెబ్బతీసింది. అసలే కరువుకోరల్లో చిక్కుకున్న వరి, చెరకు పంటలు కోతకు వచ్చే సమయంలో తీవ్రంగా రైతులను కుంగదీసింది. సోమవారం తీరం దాటే సమయంలో వీచిన గాలులకు వరిపంట, చెరకు పంటలు నేలకొరిగాయి. రైతులు తుపాన్ ముప్పునుండి తప్పించుకొనేందుకు వాతావరణశాఖ ఇచ్చిన సమచారంతో రైతులు ఆగమేగాలమీద కోతకోసిన వరిచేలు వ్యవసాయ క్షేత్రాల్లోనే కుప్పలుగా పెట్టారు. కుప్పలకింద వర్షంనీరు చేరడంతో రైతులు ఆంధోళన చెందుతున్నారు. అలాగే బెల్లం మార్కెట్‌లో రేటి పడిపోవడంతో రేటు పెరిగిన తర్వాత బెల్లం తయారికి సిద్దం అవుదామని సన్నద్దం అవుతున్న తరుణంలో గాలుల దాటికి తట్టుకోలేక నేలకొరిగాయి. గోరుచుట్టుపై రోకటిపోటులా అసలే కరువుతో అల్లాడిన మండలం రైతాంగాన్ని తుపాన్ రూపంలో తీవ్రంగా దెబ్బతీసిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు
మునగపాక, డిసెంబర్ 18: మండలంలో అంతంత మాత్రంగా ఉన్న రోడ్లు తుపాన్ వల్ల కురిసిన వర్షాలకు పెద్దపెద్ద గతుకులు పడి గతుకుల్లో నీరుచేరి చెరువుల్ని తలపిస్తున్నాయి. మునగపాక బైపాస్ రోడ్డు ఏర్పాటు చేసిన తర్వాత దానివైపు దిక్కుచూసే నేతలు కరువైయ్యారు. పలితంగా చాలా కాలంగా రోడ్డుకు మరమ్మత్తులు చేయకపోవడంతో అచ్యుతాపురం వెళ్లే మెయిన్‌రోడ్డు నుండి వాడ్రాపల్లి మార్గాన్ని కలిపే బైపాస్ రోడ్డు పూర్తిగా ద్వంసం అయ్యింది. ఇదే మార్గం ద్వారా వాడ్రాపల్లి, గొల్లలపాలెం, కుంచవానిపాలెం, మల్లవరం,నాగవరం , రాజుపేట, అలాగే పాటిపల్లి, మంగళవారపుపేట,మూలపేట, తోటాడ, టి సిరసపల్లి, నారాయడుపాలెం, తానాంకు వెళ్లె ఈ ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతినడంతో వాహనదారులు, పాదచారు పడరానిపాట్లు పడుతున్నారు. ఈ రహదారిని పూర్తిస్థాయిలో నిర్మాణం చేపట్టాలని ఇటీవల మూడు పర్యాయాలు విశాఖ పట్నంలోని ప్రజావాణిలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పిర్యాదులు చేసిన ప్రభుత్వం నుండి నేటి వరకు స్పందన లేదని మొల్లేటి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో ఉడా నిధులతో ఏర్పాటు చేసిన రోడ్డును ఉడా అధికారులుగాని, ఆర్‌అండ్‌బి, పంచాయితీరాజ్, అదికారులంతా ఆరోడ్డు ఏర్పాటు మాది కాదంటే మాదికాదు అంటు తప్పించుకుంటున్నారు. స్థానిక శాసనసభ్యుడు కలుగజేసుకొని రోడ్డుకు మోక్షం కల్గించాలని ప్రజలు కోరుతున్నారు.

వెయ్యి ఎకరాల వరి పంట నీటమునక
సీలేరు, డిసెంబర్ 18: పెథాయ్ తుఫాన్ కారణంగా గత రెండు రోజులగా కురిసిన అకాల వర్షాలకు దారకొండ, గుమ్మిరేవులు, దుప్పిలవాడ పంచాయతీల్లో వెయ్యి ఎకరాలకు పైగా వరి పంట నీటమునిగి గిరి రైతులకు భారీ నష్టం వాటిల్లింది. జీకేవీధి మండలం దారకొండ, దుప్పిలవాడ, కొంగపాకలు, పి.కొత్తూరు, పేట్రాయి, కుమ్మరాపల్లి తదితర గ్రామాల్లో గిరిజన రైతులు సాగు చేసిన వరి పంట నీట మునిగి భారీ నష్టం వాటిల్లింది. చేతికంది వచ్చిన పంట తుఫాన్ కారణంగా పూర్తి స్థాయిలో నాశమైందని గిరి రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించ పంట నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని ఈప్రాంత గిరి రైతులు కోరుతున్నారు.

కూలేందుకు సిద్ధంగా ఉన్న భారీ చెట్టును తొలగించరూ
సీలేరు, డిసెంబర్ 18: జనావాసాలమధ్యలో ఉన్న భారీ వృక్షం ఎండిపోవడంతో ఎప్పుడు కూలిపోతుందోనని చుట్టుపక్కల గిరిజనులు భయాందోళన చెందుతున్నారు. స్థానిక మేజర్ పంచాయతీలో ఉన్న కన్నబ్బాయి క్యాంప్‌లో ఇళ్ళ మధ్యలో ఉన్న భారీ వృక్షాన్ని సగభాగం వరకు నరికివేయడంతో ఏక్షణంలో కూలిపోతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తక్షణం పంచాయతీ అధికారులు చొరవ తీసుకుని చెత్తను తొలగించాలని పలువురు కోరుతున్నారు.

30 హెక్టార్లలో వరి పంటకు నష్టం
కొయ్యూరు,డిసెంబర్ 18: తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షానికి మండల వ్యాప్తంగా 30 హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేసారు. తుఫాన్‌కు ముందే కొద్ది మంది రైతాంగం పండిన చేలను కోసి కుప్పలు, నూర్చడం చేసారు. తుఫాన్ సూచనలతో కొందరు రైతాంగం పండిన చేలను సైతం కోయకుండా వదిలేసారు. గురు, శుక్రవారాల్లో కోసిన వరిచేలు ఎత్తే వీలు లేక మళ్ళలోనే వదిలేసారు. దీంతో సోమవారం కురిసిన వర్షానికి వరి పనలు నీట మునగగా పండిన చేలు నేలమట్టం అయ్యి నీట మునిగాయి. తుఫాన్ కారణంగా మంగళవారం నాటికి 30 హెక్టార్లలో వరి చేలకు నష్టం వాటిల్లినట్లు ఆశాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. మారుమూల గ్రామాల్లో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేయాల్సి ఉంది. అపరాలైన మినుములు, పెసలు, బొబ్బరు చేలు సైతం నీట మునగగా రైతాంగం ఆందోళన చెందుతున్నారు. పంటల ప్రారంభంలో వర్షాలు లేక ఇబ్బందులు పడిన రైతాంగం పంట చేతికి వచ్చే సమయంలో తుఫాన్ ప్రభావంతో నష్టపోవాల్సి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలుగ్రామాల్లో పంట నష్టాలను అంచనా వేసేందుకు బుధవారం అనకాపల్లి నుండి శాస్తవ్రేత్తల బృందం మండలానికి వస్తున్నట్లు వ్యవసాయ సిబ్బంది తెలిపారు.
పెథాయ్ తుఫాన్‌కు వందలాది ఎకరాల అరటి, చెరకు తోటలు నేలమట్టం
మాకవరపాలెం, డిసెంబర్ 18: మండలంలో పెథాయ్ తుఫాన్ కారణంగా వీచిన పెనుగాలులకు అరటి, చెరకు పంటలకు అపారనష్టం వాటిల్లి భారీగా ఆర్ధిక నష్టం జరిగిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆది, సోమవారాల్లో మండలంలో తుఫాన్ గాలులకు పైడిపాల సమీపంలో వై.రాజారావు అనే కౌలు రైతుకు చెందిన ఆరు ఎకరాల అరటి తోట పూర్తిగా నేలమట్టమై లక్షలాది రూపాయల నష్టం వాటిల్లిందని రైతు ఆందోళన చెందుతున్నాడు. అదే విధంగా మండలంలో లచ్చన్నపాలెం, కొండల అగ్రహారం , గిడుతూరు, వజ్రగడ, , జంగాలపల్లి, తదితర గ్రామాల్లో వరితో పాటు అరటి, చెరకు, కూరగాయాల తోటలకు భారీగా నష్టం వాటిల్లింది. తమకు జరిగిన నష్టానికి ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మండలంలో జరిగిన వివిధ పంటలకు జరిగిన నష్టాన్ని రెవెన్యూ, ఉద్యానవన , వ్యవసాయాధికాధికారులు గ్రామాల్లో తిరిగి నష్టం వివరాలను రైతుల నుంచి సేకరిస్తున్నారు.

చలిగాలులకు వృద్ధురాలి మృతి
రావికమతం, డిసెంబర్ 18 : తుఫాన్‌కు వీచిన చలిగాలులకు తట్టుకోలేక పి . పార్వతమ్మ(63) సోమవారం రాత్రి మృతి చెందింది. మండలంలో గుమ్మళ్ళపాడు గ్రామానికి చెందిన పార్వతమ్మ చలి గాలులకు వణుకుతుండడం గమనించిన కుటుంబీకులు కుంపటి సహాయంతో ఒళ్ళంతా వేడి చేసారు. అయినప్పటికీ రాత్రి సమయంలో మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఘాట్‌లో కూలిన చెట్టు
అరకులోయ, డిసెంబర్ 18: పెథాయ్ తుపానుతో అరకులోయ ఘాట్‌లో భారీ వృక్షం సోమవారం రాత్రి నేలకు ఒరిగి రోడ్డుకు అడ్డంగా పడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు ఈదురు గాలులకు డముకు సమీపంలో చెట్టు కూలిపోయింది. రోడ్డుకు అడ్డంగా భారీ వృక్షం కూలిపోవడంతో విశాఖపట్నం వైపు నుంచి అరకులోయ, అరకులోయ నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలు ఎక్కడివి అక్కడే నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సోమవారం రాత్రి నుంచి ఘాట్‌లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో ప్రయాణికులు, వాహన చోదకులు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విశాఖపట్నం నుంచి పాల ప్యాకెట్లను తీసుకువచ్చే వాహనం కూడా ట్రాఫిక్‌లో చిక్కుకోవడంతో పాలు కోసం ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వచ్చింది. మంగళవారం ఉదయం కూలిన చెట్టును తొలగించడంతో ట్రాఫిక్ పునరుద్ధరణై ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
ముంపుకు గురైన వరి పంట
జి.మాడుగుల, డిసెంబర్ 18: పెథాయ్ తుఫాన్ దాటికి మండంలోని పలు ప్రాంతాలలోని పంట పొలాలు నీటి ముంపుకు గురికాగా, మూగ జీవులు మృత్యుబారిన పడ్డాయి. సోమవారం రోజంతా వర్షం కురుస్తుండటంతో మండలంలోనష్టం ఎంత జరిగిందనేది తెలియలేదు. మంగళవారం వర్షం కాస్త ఉపసమనం ఇవ్వడంతో మారుమూల ప్రాంతాల నుంచి ప్రజలు మండల కేంద్రానికి చేరుకుని తహాశీల్ధార్ కార్యాలయానికి తమకు జరిగిన నష్టంపై పిర్యాదులు చేసారు. మండలంలోని జంగాలమెట్ట గ్రామానికి చెందన వంతాల చిలకమ్మ ఇళ్ళు కూలిపోగా, వంతాల పంచాయతీ గంట్రాయి గ్రామానికి చెందిన రీమలి కోమలమ్మకు చెందిన పశువులు సోమవరం మేతకోసం సమీప అడవికు వెళ్లి తుఫాన్ దాటికి ఒక ఆవు మృతి చెందింది. సొలభం పంచాయతీ కుడ్డంగి గ్రామంలో గంగపూజారి పద్దబాలంనాయుడుకి చెందన పెంకుటిల్లు, గంగపూజారి నీలకంఠంనాయుడు, అప్పలనాయుడు, లకే మత్స్య కొండబాబులకు చెందిన సుమారు నాలుగు ఎకరాలు పొలం నీట మునిగింది. సింగర్భ పంచాయతీ గొడ్డుబూసులు గ్రామానికి చెందిన కుమ్మరి నారాయణమ్మకు చెందిన ఆవు, కుమ్మరి కొండంనాయుడుకు చెందిన ఒక ఎద్దుకొండ ప్రాంతంలో సోమవారం మేతకు వెళ్ళి మృత్యువాత పడ్డాయి. వంతాల పంచాయతీ గంట్రాయి గ్రామానికి చెందిన రీమలి నాగరాజుకు చెందిన వరి పంట కోసి కుప్పలు వేయడానికి సిద్ధం అవుతుండగా పంట మెత్తం వర్షపు నీటిలో మునిగిపోయింది నష్టం చేకూర్చింది. సంవత్సర కాలం పంట కోసం ఎదురు చూస్తున్న రైతులకు పెథాయి తుఫాన్ కన్నీలను మిగిల్చింది. దీంతో సంవత్సరమంతా తమ కుటుంభాలు పస్తులు ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇదిలాఉండగా మండలంలో పెథాయ్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సి.పి.యం. మండల నాయకులు సాగేని ధర్మన్నపడాల్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

బీభత్సం సృష్టించిన ఫెథాయ్ తుఫాన్
కోటవుటర్ల, డిసెంబర్ 18: పెథాయ్ తుఫాన్ భీభత్సం సృష్టించింది. మండలంలో వరి, చెరకు, పత్తి తోటలకు తీవ్ర నష్టం జరిగింది. 200 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. చెరకు తోటలు నేలకొరిగాయి. పత్తి తోటల్లో నీరు ఎక్కువ కావడంతోకుళ్ళిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీకేపల్లి వద్ద రహదారికి అడ్డంగా పడిన పెద్ద వృక్షాన్ని యుద్ధప్రాతిపదికన రెవెన్యూ సిబ్బంది తొలగించారు. పలు గ్రామాల్లో రహదారులపై వర్షపునీరు ప్రవహిస్తుంది. లింగాపురంలో మండల ప్రత్యేకాధికారి డాక్టర్ వి.శ్రీ్ధర్ , ఎడీవో కళ్యాణి, ఇ ఓ ఆర్‌డీ ప్రభాకర్‌రావు నీటిని తొలగించే చర్యలు చేపట్టారు. వర్షం తగ్గినా చలిగాలుల తీవ్రత తగ్గలేదు. దీంతో పలువురు ఇబ్బందులు పడుతున్నారు. సోమ, మంగళవారాల్లో మండలంలో 8.8 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. పంట పొలాలపై వరి పనలు నీటమునిగితే వెంటనే నీటిని తీసివేయాలని మండల వ్యవసాయాదికారి ఎంవీ సోమశేఖర్ సూచించారు. పనలను రెండువైపులా ఆరబెట్టాలన్నారు. ఐదు గ్రాముల ఉప్పును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలన్నారు. దీని వలన మొలకలు రాకుండా కాపాడవచ్చన్నారు. అలాగే గింజలు రంగు మారకుండా ఉంటాయన్నారు. కోత కోకుండా ఉన్న పంట నేలమీద పడితే నీటిని తీసివేసి దుబ్బులను నిలబెట్టుకోవాలని సూచించారు.
వరి పంటకు నష్టం
పెదబయలు, డిసెంబర్ 18: పెదబయలు మండలం గోమంగి పంచాయతీ కరికొండా, బొడ్డాపుట్టు, కుంతురుపుట్టు గ్రామాలలో పెథాయ్ తుఫాన్ వర్షానికి కొట్టుకొచ్చిన వరద నీటితో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరి పంటతో పాటు రాజ్‌మా పంటకు కూడా తీవ్రంగా నష్టం వాటిల్లింది. పండిన పంట నూర్పులకు సిద్ధం అవుతున్న సమయంలో కల్లాలలో ఉన్న పంట సైతం వర్షానికి తడిసి ముద్దయ్యిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కరికొండా గ్రామంలో పెథాయ్ తుఫాన్‌కు తట్టుకోలేక మూడు మూగ జీవులు మృతి చెందాయి. గ్రామాలలో రెవిన్యూ అధికారులు సర్వే నిర్వహించి రైతులకు జరిగిన నష్టంపై అధ్యయనం చేసి నష్ట పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని గిరిజన రైతులు కోరుతున్నారు.

ఘనంగా ముక్కోటి ఏకాదశి

$
0
0

కృష్ణాదేవిపేట, డిసెంబర్ 18: మండలంలో ఎ ఎల్‌పురం, నాగాపురం గ్రామాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు పూజలు నిర్వహించారు. ఎ ఎల్‌పురం గొల్లవీధిలో ఉన్న శ్రీకృష్ణుడి ఆలయం లో భక్తులు పూజలు నిర్వహించారు. తుంపా శ్రీను దంపతుల ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి పూజలు ఘనంగా నిర్వహించారు. వేద పండితులచే ఈకార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారికి పూజలు చేసారు. స్థానిక యాదవ సంఘం ప్రతినిధులు పెదబాబు, కృష్ణ, రమణ, వాసు తదితరులు ముక్కోటి ఏకాదశి పూజల్లో పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి పూజలు
చోడవరం, డిసెంబర్ 18: మండలంలోని వైష్ణవ దేవాలయాలలో వైకుంఠ ఏకాదశి (ఉత్తర ద్వార దర్శనం) పూజలు అత్యంత భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగాయి. మంగళవారం చరిత్ర ప్రసిద్ధి కలిగిన కేశవస్వామి ఆలయం, స్థానిక ఆపదహర శ్రీనివాస క్షేత్రం, గోవాడ వేంకటేశ్వర స్వామి ఆలయం, లక్కవరం భూపతి వేంకటేశ్వర స్వామి ఆలయం తదితర దేవాలయాల్లోని స్వామివారి ఉత్సవమూర్తులు వైకుంఠనాథుని అలంకారంలో ఉత్తర ద్వార దర్శనం ఇచ్చారు. తెల్లవారుజామునుండి భక్తులు ఆలయాలకు చేరుకుని వైకుంఠద్వారం నుండి లోనికి ప్రవేశించి స్వామివారిని పూజించారు. స్థానిక ఆపదహర శ్రీనివాస క్షేత్రంలో కేశవ స్వామి ఆలయం వద్ద ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చిన శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామిని, కేశవ స్వామిని ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజు దర్శించి పూజలు చేసారు. అలాగే గోవాడ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద వైకుంఠ ద్వారంలో ఉన్న స్వామివారిని ఫ్యాక్టరీ యాజమాన్య సిబ్బంది, కార్మిక నాయకులు తదితరులు దర్సించుకున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడంతో మండలంలోని పలు గ్రామాల నుండి తరలివచ్చిన భక్తులు క్యూలైన్లు పాటించడంతో ఎమ్మెల్యే రాజు కూడా అదే క్యూలైన్ ద్వారానే స్వామివారిని దర్శించుకున్నారు. ప్రధానంగా కేశవ స్వామి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత కేశవస్వామిని నాణేలతో అలంకరించి భక్తిప్రపత్తులతో పూజలు చేసారు.

ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
సీలేరు, డిసెంబర్ 18: వైకుంఠ ఏకాదశి వేడుకలు వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా తెల్లవారు నుంచి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో భక్తులకు ఉత్తర మార్గం ద్వారా దర్శనం కల్పించారు. తులసి మాలలతో స్వామి వారికి పూజలు నిర్వహించారు. స్థానిక రామాలయంలో కుంకుమ పూజలు నిర్వహించారు. ఈకార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
మునగపాక, డిసెంబర్ 18: మండలంలో పలు దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. మేజర్ పంచాయితీ మునగపాక పంచాయితీ వీధిలో గల రామాలయం, వేపచెట్టు దగ్గర రామాలయంలో వైకుంఠ ఏకాదశి పూజలు ఘనంగా నిర్వహించారు. నాగులాపల్లి, సంతబయల , కాకరాపల్లి, తోటాడ, గవర్ల అనకాపల్లి, చూచుకొండ, గణపర్తి, అరబుపాలెంలో రామాలయాల్లో తెల్లవారు నాలుగు గంటల నుండి రామాలయాలు భక్తులతో కిటికిటలాడాయి. పిధాయ్ తుపాన్ గాలులను సైతం లెక్కచేయకుండా భక్తులు వేకువ జామునే చన్నీటి స్నానాలు అచరించి దేవాలయాలకు చేరుకొని దేవునిపట్ల తమకున్న భక్తిబావాన్ని చాటుకున్నారు. అలాగే నాగులాపల్లి శ్రీ వేంకటేశ్వరునికి నాగులాపల్లి గ్రామస్తులు పూజలు నిర్వహించి పల్లకి సేవలు చేపట్టారు. వైకుంఠ ఏకాదశిరోజు పూజలు నిర్వహించిన భక్తులకు ఎంతో మోక్షం లభిస్తుందని ప్రధాన పూజారి రేజేటి రాంబాబు భక్తులను ఆశ్వీర్వదించారు.
భక్తిశ్రద్ధలతో ముక్కోటి ఏకాదశి
కొయ్యూరు, డిసెంబర్ 18: ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని మండల వ్యాప్తంగా భక్తులు ఘనంగా జరుపుకున్నారు. మార్గశిర శుద్ధ ఏకాదశి వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడంతో ఆలయాలన్నీ భక్తులతో పోటెత్తాయి. శ్రీమహావిష్ణువుకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పలువురు ఉపవాస దీక్షలను చేపట్టారు.
ఘనంగా ముక్కోటి ఏకాదశి
కోటవురట్ల, డిసెంబర్ 18: ముక్కోటి ఏకాదశిని ఘనంగా నిర్వహించారు. మండలంలో కైలాసపట్నం రాజగోపాలస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి భక్తులు రాజగోపాలస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఉచితంగా ప్రసాదాలు పంపిణీ చేసారు. లింగాపురం దుర్గామల్లేశ్వరస్వామి ఆలయం, స్థానిక శివాలయంలో భక్తులు పూజలు నిర్వహించారు.
ఘనంగా వైకుంఠ ఏకాదశి పూజలు
మాకవరపాలెం, డిసెంబర్ 18: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురష్కరించుకుని మండలంలోని తామరంలో గల శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో భక్తులు పూజలు ఘనంగా నిర్వహించారు. వైకుంఠ ఏకాదశిని పురష్కరించుకుని మంగళవారం ఉదయం స్వామి ఉత్సవ విగ్రహాని మాకవరపాలెం నుంచి నగర సంకీర్తనలో ఊరేగించి, ఐదు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేసారు. అదే విధంగా వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఏకవారా, పాలాభిషేకాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో గోవింద నామస్మరణతో భక్తులు ప్రత్యేక పూజలు చేసారు. ఈకార్యక్రమంలో నగర సంకీర్తన సంఘం నాయకులు రఘుబాబు, చక్రవర్తి, ధర్మకర్తలు ప్రభాకర్‌రాజు, భక్తులు పాల్గొన్నారు.

మోదకొండమ్మను దర్శించుకున్న వైసిపి నేత అమర్
అనకాపల్లి టౌన్, డిసెంబర్ 18: స్థానిక గాంధీ బొమ్మ జంక్షన్‌లోకొలువైయున్న శ్రీ మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం వైసిపి జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్‌నాధ్, పట్టణ అధ్యక్షులు మందపాటి జానకిరామరాజులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఘటాలు ఉరేగింపులోవీరు ముఖ్య అతిధిలుగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఉత్సవ కమిటీ సభ్యులు మొగ్గ నూకరాజు, కోరుకొండ రాఘవ, పొలమరశెట్టి మొరళీకృష్ణ, సాయిరాజు అధ్వర్యంలో అమర్‌ను ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేసారు.్భక్తులు అధిక సంఖ్యలోపాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా అమ్మవారి ఆలయాన్ని విద్యుత్ లైటింగ్‌తోఅలంకరించారు.

పారిశుద్ధ్యంతో ప్రజలు ఇబ్బందులు
*ఎక్కడ చూసిన చెత్తకుప్పలు *పందులు సె్తైర్యవిహారం
అనకాపల్లి టౌన్, డిసెంబర్ 18: పట్టణంలోజనాభా తగ్గట్టుగా పారిశుద్ధ్యకార్మికులు లేకపోవడంతో పారిశుద్ధ్యపనులు పూర్తిస్థాయిలోనిర్వహించడంలో విఫలమవుతున్నారని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు.పారిశుద్ధ్య కార్మికులు పట్టణంలో ప్రధానా ప్రధాన మార్గాలకు ప్రధాన్యత ఇస్తూ మారుమూల వీధుల్లో పనులు నిర్వహించలేకపోతున్నారు.పట్టణంలోకొన్నిప్రాంతాల్లో గత కొద్దిరోజులుగా రోడ్లుపై చెత్తపేరుకుపోయి కుప్పలుగా దర్శినమిస్తున్నాయి. దాసరిగెడ్డరోడ్డు, బారువారి వీధి, శారదా కోలనీ, పూడిమడక రోడ్డు తదితర ప్రాంతాల్లోప్రజలు పారిశుద్ద్య సమస్యలుతో ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై వ్యర్ధాలుతో పేరుకుపోతున్న చెత్తకుప్పల్లో పందులు సె్తైర్యవిహారం చేసి సంచరించడంతోవాటి మూలంగా లేనిపోని అంటువ్యాధులు వ్యాపిస్తాయని ఆయా ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత రెండు రోజులుగా పడుతున్న చెదురుమదురు చికులకు చెత్తకుప్పలు తడిసి తీవ్ర దుర్గంధమైన వాసన వేధజల్లుతుందని అక్కడి ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.డ్రైనేజి కాలువల్లో పూడిక తొలగించక పోవడంతోకొన్ని ప్రాంతాల్లో కాలువలు శిధిలమై మెరుగు నీరు రోడ్లుపై ప్రవహిస్తుందని, తాగునీటి కోలాయి వద్ద మెరుగునీరు నిల్వ ఉండిపోవడంతో ఆ కోలాయి వద్దకు వెళ్ళడానికి స్థానికులు ఇష్టపడటలేదని పూడిమడక రోడ్డుకు ఆనుకోని ఉన్న ఒక వీధివారు వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన మార్గాల్లోనే కాకుండా చిన్నచిన్న వీధుల్లోకూడా పారిశుద్ధ్య కార్మికులు వచ్చి శుభ్రం చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయాప్రాంత ప్రజలుకోరుతున్నారు.

రంగురాళ్ళ తవ్వకాలకు పాల్పడితే కఠిన చర్యలు
గొలుగొండ, డిసెంబర్ 18: సాలికమల్లవరం రంగురాళ్ళ క్వారీలో అక్రమ తవ్వకాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నర్సీపట్నం రూరల్ సీ ఐ రేవతమ్మ అన్నారు. మంగళవారం మండలంలోని సాలికమల్లవరం గ్రామంలో గ్రామస్తులతో రంగురాళ్ళ తవ్వకంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సీ ఐ రేవతమ్మ మాట్లాడుతూ సాలికమల్లవరం గ్రామంలో రిజర్వ్ ఫారెస్ట్‌లో రంగురాళ్ళ క్వారీ ఉందని, ఈక్వారీ ప్రాంతంలో అక్రమ తవ్వకాలకు పాల్పడితే ఎంతటి వ్యక్తులపైనైనా చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. గ్రామస్తులు కాని, ఇతరప్రాంతాలకు చెందిన వారెవ్వరైనా ఈప్రాంతంలో తవ్వకాలు సాగించినట్లు తమ దృష్టికి వస్తే సంబంధిత వ్యక్తులపై చర్యలు తప్పవని సీ ఐ రేవతమ్మ హెచ్చరించారు. గత నాలుగు రోజుల క్రితం ఈ క్వారీ ప్రాంతంలో ఆధునిక యంత్రాలతో తవ్వకాలు సాగించారని, దీనిపై సమగ్ర దర్యాప్తు నిర్వహించడం జరుగుతుందన్నారు. అదే విధంగా పప్పుశెట్టిపాలెం, కరక రంగురాళ్ల క్వారీ ప్రాంతాల్లో తవ్వకాల నిరోధానికి నిఘా చర్యలు చేపట్టామన్నారు. ఎప్పటికప్పడు తమసిబ్బందితో పాటు అటవీ శాఖ కూడా ఈక్వారీల్లో దాడులు నిర్వహిస్తుందన్నారు. ఈసదస్సులో స్థానిక ఎస్సై ఉమామహేశ్వరరావుతో పాటు స్థానిక సర్పంచ్ భర్త డీవీ ఎస్ మల్లేశ్వరరావు,గ్రామస్తులు పాల్గొన్నారు.

పెథాయ్ తుఫాన్‌కు నీట మునిగిన వరి
గూడెంకొత్తవీధి, డిసెంబర్ 18: పెథాయ్ తుఫాన్‌కు విశాఖ మన్యంలో రైతు తీవ్రంగా నష్టపోయాడు. తుఫాన్ కారణంగా గూడెంకొత్తవీధి మండలం కొంగపాకలు, ఏనుగుబయలు,పి.కొత్తూరు గ్రామాల్లో వరి పంట నీట మునిగింది. తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతు తమ పంట పొలాలను చూసి బోరున విలపిస్తున్నారు. మండలంలోని వేలాది హెక్టార్లలో వివిధ రకాల వరి సాగును చేపట్టారు. వీటిలో కోసిన కుప్పులు పెట్టుకున్నారు. మరికొన్ని కోతకు సిద్ధంగా ఉన్నాయి. కొన్ని పంటలు కోసి వరి పనలను పొలాల్లో వదిలేసారు. ఈపరిస్థితుల్లో పెథాయ్ తుఫాన్ సంభవించిన నేపధ్యంలో సుమారు వెయ్యి ఎకరాల్లో పంట తడిసిపోయింది. కుంకుంపూడి, అగ్రహారం, పెదవలస, గూడెంకొత్తవీధి, దారకొండ తదితర గ్రామాల్లో పంటకు నష్టం వాటిల్లింది. కూలీల కొరత వలన పంట కోత చేపట్టలేకపోయామని, మరికొన్నిచోట్లచోట్ల నూర్పులు జరుగలేదని రైతులు వాపోతున్నారు. ఐదు రోజుల క్రితం ఏనుగుబయలు గ్రామంలో వరి కోసి పొలంలో వదిలేయడంతో తడిసిపోయింది. ఇలా అనే గ్రామాల్లో పెథాయ్ కారణంగా వరితో పాటు పలు పంటలు నీట మునగడంతో ఆదుకునే వారి కోసం గిరి రైతు ఆశగా ఎదురుచూస్తున్నాడు.

టీబీపై అప్రమత్తంగా వ్యవహరించండి
గూడెంకొత్తవీధి, డిసెంబర్ 18: టీబీ వ్యాధిపై అప్రమత్తంగా వ్యవహరిస్తూ సరైన సమయంలో వైద్య సేవలు పొందితే ఈ వ్యాధి త్వరగా నయం అవుతుందని జీకేవీధి వైద్యాధికారి లక్ష్మీకాంత్ అన్నారు. గూడెంకొత్తవీది మండల కేంద్రంలో మంగళవారం పలకరింపు, టీబీ మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఇక్కడ 45 మందికి చికిత్సలు చేసి వారికి ముందులు ఉచితంగా అందించారు. ఈకార్యక్రమంలో వైద్య సిబ్బంది కిశోర్, లావణ్య పాల్గొన్నారు.

మందగించిన నెట్ వర్క్, బ్యాంకు లావాదేవీల్లో జాప్యం
రావికమతం, డిసెంబర్ 18: మండల కేంద్రం ఆంధ్రా బ్యాంకులో లావాదేవీలు మంగళవారం తీవ్ర జాప్యం అయ్యాయి. దీంతో ఖాతాదారులు అసహనానికి గురయ్యారు. తుఫాన్ కారణంగా బీ ఎస్ ఎన్ ఎల్ నెట్ వర్క్‌లో సిగ్నల్ మందగించడంతో బ్యాంకుల చెందిన సర్వర్లు మొరాయించారు. దీంతో అన్ని రకాల సేవల్లో జాప్యం జరిగింది. నెట్క్ వర్క్ స్పీడ్ గణనీయంగా తగ్గడంతో తాత్కాలికంగా పనులు ఆలస్యం అవుతున్నాయని డీ ఎం కె.నాయుడు తెలిపారు. ఖాతాదారులు బ్యాంకు సిబ్బందికి సహకరించాలని కోరారు.

సమస్యల పరిష్కారానికై పోస్టల్ ఉద్యోగుల ధర్నా
కృష్ణాదేవిపేట, డిసెంబర్ 18: కేంద్ర ప్రభుత్వం తపాలా శాఖలో పని చేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తక్షణమే కృషి చేయాలని డిమాండ్ చేస్తూ ఎ ఎల్ పురంలో పోస్టల్ సిబ్బంది దర్నా నిర్వహించారు. ఈమేరకు పోస్టల్ అదనపు సిబ్బంది అధ్యక్షుడు ప్రసాద్, గవర్రాజు ఆధ్వర్యంలో స్థానిక పోస్టల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. మూడు దశాబ్దాలుగా అదనపు సిబ్బందిగా పని చేస్తున్న తమను కేంద్ర ప్రభుత్వం గుర్తించడం లేదని, రిటైర్డ్ అయిన వారికి ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు. పలు డిమాండ్లతో కూడిన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహిస్తున్నామన్నారు.

సహకార సంఘ సిబ్బంది సమ్మె
* మూతపడిన సంఘాలు
రావికమతం, డిసెంబర్ 18: మండలంలో ప్రాథమిక సహకార సంఘాల సిబ్బంది మంగళవారం నుంచి నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. ఫలితంగా కొత్తకోట, మేడివాడ, రావికమతం, చినపాచిల ప్రాథమిక సంఘాలు మూతపడ్డాయి. ప్రాథమిక సహకార సంఘాల్లో పని చేస్తున్న సిబ్బందికి సీనియార్టీ ప్రాతిపదికన జిల్లా సహకార సెంట్రల్ బ్యాంక్‌లో ఉద్యోగాలు కల్పించాలని పదవీ విరమణ వయోపరిమితి 60కు పెంచాలని డిమాండ్‌తో నిరవధిక సమ్మె చేస్తున్నామని కొత్తకోట సహకార సంఘ ప్రతినిధి జి.రఘు, కె.రమణ తెలిపారు.
అభివృద్ధికి అడ్రస్‌గా చోడవరానికి గుర్తింపు
*ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజు
చోడవరం, డిసెంబర్ 18: అభివృద్ధికి అడ్రసుగా చోడవరాన్ని తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజు అన్నారు. మంగళవారం స్థానిక హార్డింజ్ అతిధిగృహంలో 25లక్షల రూపాయలు ఎన్టీపీసి, ఎంపి ల్యాడ్ నిధులతో నిర్మించనున్న కల్యాణ మండపంకు భూమి పూజలు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చోడవరం పట్టణాన్ని ఒక మోడల్‌గా తీర్చిదిద్ది అభివృద్ధికి అడ్రస్‌గా గుర్తుండిపోయేలా కోట్లాది రూపాయల నిధులతో కల్యాణ మండపాలు, సిసి రోడ్లు, ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతీవార్డులోను శుభకార్యాలను నిర్వహించుకునేందుకు వీలుగా కల్యాణ మండపాలు నిర్మించడం జరుగుతుందన్నారు. హార్డింజ్ అతిధిగృహంలో ఏర్పాటు చేస్తున్న కల్యాణ మండపాలను అన్ని హంగులతో అందరికీ అందుబాటులో ఉండేలా నిర్మించడం జరుగుతుందన్నారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా అన్ని రంగాలలో చోడవరాన్ని అభివృద్ధి చేసి పూర్వవైభవం తీసుకువస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇవో సత్యనారాయణమూర్తి, జెడ్పీటిసి సభ్యులు కనిశెట్టి మత్స్యరాజు, మండల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.
బాలికల హక్కులను కాపాడాలి
జి.మాడుగుల, డిసెంబర్ 18: బాలికల హక్కులు కాపాడటానికి అందరూ సమిష్టిగా కృషి చెయ్యాలని మండల విద్యాశాఖ అధికారి కె.నాగభూషణం అన్నారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ప్రాధమిక, ఉన్నత పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులకు మీనా ప్రపంచం అనే కార్యక్రమం ద్వారా బాలికల హక్కులపై మంగళవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికల హక్కులను కాపాడేందుకు తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉందని అన్నారు. లింగవివక్ష లేకుండా బాలికలను అన్ని రంగాలలో ప్రోత్సహించాలని, వారిపట్ల వివక్ష చూపరాదని ఆయన చెప్పారు. బాలికలు కౌమర దశకు చేరుకున్నప్పుడు మన ప్రాంతంలో వివిధ రకాల కారణాలతో చదువును మాన్పించడం, ఇష్టం ఉన్న రంగాల వైపు బాలికలను పంపించకపోవడం వంటివి చేస్తుంటామని ఇలా చేయడం కూడా బాలికల హక్కులను హరించడంలోకే వస్తుందని ఆయన అన్నారు. గా గ్రామీణ ప్రాంతాలలో బాలికల పట్ల వివక్ష ఎక్కువగా ఉన్నట్టు ఆయన చెప్పారు. గ్రామీణ ప్రాంతంలో పనిచేసే ఉపాధ్యాయులు ఇటువంటివి గుర్తించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రిసోర్సు పర్సన్లు అప్పారావు, పుష్పవతి, శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ సమావేశాన్ని విజయవంతం చేయాలి
అరకులోయ, డిసెంబర్ 18: విశాఖపట్నంలో ఈ నెల 19వ తేది బుధవారం నిర్వహిస్తున్న ఉత్తరాంధ్ర కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలని అరకులోయ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకురాలు పాచిపెంట శాంతకుమారి కోరారు. మంగళవారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ తమ పార్టీ సీనియర్ నాయకుడు ద్రోణంరాజు సత్యనారాయణ 86వ జయంతి సందర్భంగా సమావేశం ఏర్పాటు చేసారని చెప్పారు. విశాఖపట్నంలోని గురజాడ కళాక్షేత్రంలో ద్రోణంరాజు జయంతి వేడుకల అనంతరం కార్యకర్తల సమావేశం జరుగుతుందని ఆమె అన్నారు. ఈ సమావేశంలో కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమేన్‌చాంధ్, పి.సి.సి. అధ్యక్షుడు రఘువీరారెడ్డి, పలువురు సీనియర్ నాయకులు హాజరవుతున్నట్టు ఆమె చెప్పారు. ఈ సమావేశానికి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని ఆమె కోరారు.

జీ ఓ నెంబర్ 132ను తక్షణం రద్దు చేయాలి
కొయ్యూరు,డిసెంబర్ 18: గిరిజన విద్యను బలహీన పరిచే జీ ఓ నెంబర్ 132ను తక్షణం రద్దుచేయాలని గిరిజన సంఘం జిల్లా నేత సూరిబాబు , సీటు నేత అప్పలనాయుడులు డిమాండ్ చేసారు. ఏజన్సీ వ్యాప్తంగా గిరిజన డీ ఎస్సీని తీయకపోవడంతో గిరిజన నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసారు. వెంటనే గిరిజన ప్రత్యేక డీ ఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని వారు డిమాండ్ చేసారు.

రాశిఫలం 12/19/2018

$
0
0
తిథి: 
ద్వాదశి రా.తె.3.36, కలియుగం - 5120 శాలివాహన శకం - 1940
నక్షత్రం: 
భరణి రా.2.06
వర్జ్యం: 
ఉ.11.28 నుండి 1.05 వరకు
దుర్ముహూర్తం: 
ఉ.11.36 నుండి 12.24
రాహు కాలం: 
మ.12.00 నుండి 1.30 వరకు
మేషం: 
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) తలచిన కార్యాలన్నియు విజయవంతంగా పూర్తిచేసుకోగలుగుతారు. బంధు, మిత్రుల మర్యాద మన్ననలను పొందుతారు. సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది. అనుకూల పరిస్థితులేర్పడతాయి.
వృషభం: 
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సహనం వహించుట అన్ని విధాలా మేలు. బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్తపడుట మంచిది. అనారోగ్య బాధలకు ఔషధసేవ అవసరం.
మిథునం: 
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) ఆకస్మిక ధనలాభముంటుంది. నూతన వస్తు, ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్ని రంగాల్లో అద్భుత విజయాలను సాధిస్తారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. ఋణవిముక్తి లభిస్తుంది. మానసికానందం పొందుతారు.
కర్కాటకం: 
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) వృత్తి, ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి.
సింహం: 
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) దూర బంధువులతో కలుస్తారు. తద్వారా లాభాలుంటాయి. విదేశయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభయోగముంటుంది. అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు.
కన్య: 
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనవసర భయం ఆవహిస్తుంది.
తుల: 
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) మానసికానందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుంటాయి.
వృశ్చికం: 
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) బంధు, మిత్రులతో మనస్పర్థలు రాకుండా జాగ్రత్త వహించుట మంచిది. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలున్నాయి. ఆరోగ్య విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం. చిన్న విషయాలకై ఎక్కువ శ్రమిస్తారు.
ధనుస్సు: 
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) బంధు, మిత్ర విరోధమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. మానసికాందోళన అధికమగును. అనారోగ్య బాధలను అధిగమిస్తారు.నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు.
మకరం: 
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) సంతోషంగా కాలం గడుపుతారు. శుభవార్త వింటారు. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. తోటివారి ప్రశంసలందుకుందురు. ఆర్థికంగా బలపడతారు. స్ర్తిలు మనోల్లాసాన్ని పొందెదరు.
కుంభం: 
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. కళలందు ఆసక్తి పెరుగుతుంది. నూతన వస్తు, వస్త్ర ఆభరణాలను పొందుతారు.
మీనం: 
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశముంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. క్రీడాకారులకు, రాజకీయ రంగాల్లోనివారికి మానసికాందోళన తప్పదు. నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది.
Date: 
Wednesday, December 19, 2018
author: 
గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి

త్వరలో విద్యుత్ రంగంలో సంస్కరణలు

$
0
0

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: వచ్చే మార్చినాటికి ‘అందరికీ విద్యుత్’ లక్ష్యాన్ని చేరుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నడుంబిగించింది. ఇందులో భాగంగా 2019 నుంచి విద్యుత్ శాఖలో సంస్కరణలను అమలు చేసే అజెండాతో ముందుకెళ్లాలని నిర్ణయించింది. బొగ్గు కొరత కారణంగా ఓవైపు విద్యుత్ ఉత్పాదనకు ఆటంకం కలగడంతోబాటు, పెరిగిన విద్యుత్ ధరలు, ఆర్థిక వత్తిడి వంటి సమస్యలు ఎదురవుతున్న క్రమంలో వినియోగదారుల కోరిక మేరకు సర్వీస్ ప్రొవైడర్లను మార్చుకునే వీలుకల్పించాలని ప్రభుత్వం తీర్మానించింది. ప్రభుత్వ ‘సౌభాగ్య‘ పథకం ద్వారా అన్ని నివాస గృహాలకూ విద్యుత్ కనెక్షన్లు కల్పించే విషయంలో లక్ష్యాన్ని వందశాతం పూర్తి చేయడంతోబాటు విద్యుత్ శాఖ సవరణ బిల్లు ప్రతిపాదనలను అమల్లోకి తేవాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఈ బిల్లు సవరణ జరిగితే క్యారేజి, కంటెంట్ వ్యాపారాలను విడదీయడానికి వీలుకలుగుతుంది. అందువల్ల వినియోగదారుడు తమకు అనుగుణంగా టెలికాం, లేదా మరేదైనా సర్వీస్ ప్రొవైడర్లలాగే మార్చుకోవడానికి మార్గం సుగమం అవుతుంది. మొత్తం 16,320 కోట్లతో చేపట్టిన ‘సౌభాగ్య పథకం’ ద్వారా ప్రభుత్వం ఇప్పటికే 2.2 కోట్ల కుటుంబాలకు విద్యుత్ కనెక్షన్లు కల్పించింది. 2019 నాటికి మరో 78 లక్షల కుటుంబాలకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. గడచిన యేడాది కాలం విద్యుత్ రంగం గణనీయమైన అభివృద్ధి పథాన్ని అందుకుంది.
దేశంలోని అన్ని పల్లెలకూ వచ్చే ఏప్రిల్ నాటికి విద్యుత్ వెలుగులు అందుతాయని, భారత ప్రభుత్వం చేపట్టిన విద్యుదీకరణ చర్యలపై యావత్ ప్రపంచం దృష్టి నిలిపిందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ పీటీఐకి చెప్పారు. ప్రస్తుతం ‘అందరికీ విద్యుత్’ పథకం అమలుపై ప్రత్యేక దృష్టినిలిపామని ఆయన చెప్పారు. విద్యుత్ ఉత్పాదక కేంద్రాలకు వౌలిక వసతుల కల్పన, విస్తరణ, బలోపేతం చేయడం ద్వారా ఉత్పాదన పెంచేందుకు బదలాయింపు, సరఫరా విషయంలోనూ సక్రమ చర్యల అమలుకు అనుగుణంగా ‘విద్యుత్ చట్టం, ధరల విధానం’లో సవరణలు తీసుకురానున్నట్టు సింగ్ వివరించారు. పారిశ్రామిక పరంగా ఎదురవుతున్న పలు సమస్యల పరిష్కారానికి యాజమాన్యాల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని, ఈ విషయంలో తమ సంస్థల ఆర్థిక స్థితిగతులను పరిగణనలోనికి తీసుకోవాలని కోరుతున్నారని మంత్రి చెప్పారు. కాగా విద్యుత్ ఉత్పాదకుల సంఘం (ఏపీపీ) డైరెక్టర్ అశోక్‌కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్ శాఖకు గడచిన యేడాది కొన్ని సానుకూల పరిణామాలు చోటుచేసుకున్నప్పటికీ సంక్లిష్టమైన సంవత్సరమేనని చెప్పారు. కొత్త బొగ్గు కేటాయింపు వౌలిక సూత్రాలు ఏర్పాటు ద్వారా ‘శక్తి’ పథకం 9 జిడబ్ల్యు ఆపరేషనల్ సామర్ధ్యం పెరిగిందన్నారు. ఈ పథకానికి సంబంధించిన అంశాలను సమీక్షించాలని న్యాయస్థానం ద్వారా ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ సిఫారసులు చేసిందన్నారు.

ఏపీలో నైపుణ్య శిక్షణ కార్యక్రమాలపై అధ్యయనానికి ఒడిశా బృందం రాక

$
0
0

విజయవాడ, డిసెంబర్ 18: నిరుద్యోగ యువతకు రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అందిస్తున్న నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు ఒడిశా ప్రభుత్వ అధికారుల బృందం రాష్ట్రానికి మంగళవారం వచ్చింది. ఇటీవల విడుదల చేసిన ఇండియా స్కిల్స్ రిపోర్టు 2019 ప్రకా రం దేశంలో అత్యధిక సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు పొం దే నైపుణ్యాలు ఉన్న యువత ఉన్న రాష్ట్రంగా ఏపీ ప్రథమ స్థానంలో నిలిచింది. దీనికి ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అమలు చేస్తున్న కార్యక్రమాలే కారణమని ఆ నివేదిక వెల్లడించింది. దీంతో వివిధ రాష్ట్రాలు ఏపీలో అమలు చేస్తు న్న నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు వస్తున్నాయి. ఇటీవలే గుజరాత్ అధికారుల బృందం వచ్చి అధ్యయనం చేసి వెళ్లింది. తాజాగా ఒడిశా స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారుల బృందం రెండు రోజుల ప ర్యటనకు విజయవాడకు వచ్చింది. ఈ బృందానికి ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ కృతిక శుక్లా పవర్ పా యింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం నం బూరు, నాగార్జున వర్సిటీ, విజయవాడ మాచవరంలోని శిక్ష ణా కేంద్రాలను ఆ బృందం సందర్శించింది. అక్కడి విద్యార్థులను శిక్షణ గురించి అడిగి తెలుసుకున్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ఏపీలో ఏర్పాటు చేస్తున్న వివిధ కంపెనీలతో కలసి పని చేయడాన్ని వివరించారు. వివిధ రంగాలకు అవసరమైన విధంగా యువతకు శిక్షణ ఇస్తున్న తీరు, విశాఖలో స్కిల్ డెవలప్‌మెంట్ వర్సిటీ ఏర్పాటు ప్రతిపాదన గురించి బృందానికి తెలిపారు. ముఖ్యమంత్రి యువనేస్తం కింద భృతి పొందుతున్న వారికి 522 కేంద్రాల ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు.


విజయ్ మాల్యాకు న్యాయపర చిక్కులు

$
0
0

లండన్, డిసెంబర్ 18: పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్‌మాల్యాకు న్యాయపరమైన చిక్కులు మరింతగా ముదిరాయి. భారత్‌లో బ్యాంకులను మోసగించి లండన్ పారిపోయిన మాల్యాకు అక్కడి హైకోర్టులోనూ విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇండియన్ బ్యాంక్స్ కన్సార్టియం మాల్యా మొండి బకాయిలను వసూలు చేసుకునేందుకు చేపట్టిన చర్యల నేపథ్యంలో మాల్యాకు వచ్చే యేడాది ఇంగ్లాండ్ హైకోర్టులో విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మాల్యా మొత్తం 1.145 బిలియన్ పౌండ్ల మేర బ్యాంకుల రుణాకు చెల్లించాల్సివుంది. భారతీయ స్టేట్ బ్యాంకు నేతృత్వంలోని 13 బ్యాంకుల తరపున ఈ కేసును ఈ యేడాది గెలిచిన లండన్‌కు చెందిన న్యాయ విభాగం టీఎల్‌టీ ఎల్‌ఎల్‌పీ మాల్యాకు చెందిన పిటిషన్‌ను లండన్ హైకోర్టు ఇన్సాల్వెంట్ జాబితాకు బదలాయించింది. ఈక్రమంలో కేసు విచారణ వచ్చే యేడాది ప్రథమార్థం లో జరిగనుందని లండన్ న్యాయ విభాగం మంగళవారం స్పష్టం చేసింది. ‘బ్యాంకులను మోసగించిన కేసులో మాల్యాపై భారతీయ బ్యాంకుల తరపున గత సెప్టెంబర్ 11న పిటిషన్ వేసిన విషయం వాస్తవమ’ని టీఎల్‌టీ వాటాదారు పాల్ గెయిర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మాల్యా నివాసం ఉంటున్న ప్రాంతం నార్తాంప్టన్ కౌంటీకి చెందిన లోకల్ కోర్టులో ఈ పిటిషన్ దాఖలైందని, అక్కడి నుంచి ప్రస్తుతం లండన్ హైకోర్టు ఆఫ్ జస్టిస్‌లోని ఇన్‌సాల్వెంట్ జాబితాలోకి విచారణ నిమిత్తం బదలాయింపు జరిగిందని పాల్ గెయిర్ వివరించారు. కాగా గత మేనెలలో ఇంగ్లాండ్ హైకోర్టు న్యాయమూర్తి ఈ కేసుపై విచారణ జరిపిన సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మాల్యా ఆస్తుల స్వాధీనానికి ఆదేశాలిచ్చేందు నిరాకరించారు. అయితే 13 భారతీయ బ్యాంకులతో కూడిన కన్సార్టియం మాల్యా నుంచి అప్పులు వసూలు చేసుకునే విషయంపై దాఖలైన పిటిషన్‌పై మాత్రం న్యాయమూర్తి కేసును యథావిధిగా కొనసాగించుకునే వీలుకల్పించారు. ఈక్రమంలో వచ్చే యేడాది ప్రథమార్థంలో ఈ కేసు హియరింగ్‌కు మాల్యా హాజరుకావాల్సిన పరిస్థితి నెలకొంది. దివాళాతీసిన కింగ్‌ఫిషర్ వైమానిక సంస్థకోసం తీసుకున్న రుణాలను చెల్లించని మాల్యా ప్రస్తుతం బెయిల్‌పై కొనసాగుతున్నారు. ఆయన్ను తిరిగి భారత్‌కు పంపేందుకు లండన్‌కు చెందిన వెస్ట్‌మినిస్టర్ కోర్టు ఆదేశాలు జారీచేయగా అవి ప్రసుత్తం అక్కడి హోం సెక్రటరీ సాజిద్ జావేద్ సంతకం కోసం ఎదురుచూస్తున్నాయి.

వరుసగా ఆరో సెషన్‌లోనూ సూచీల లాభాల పరుగు

$
0
0

ముంబయి, డిసెంబర్ 18: సూచీలు ఇదివరకు వచ్చిన నష్టాలను సైతం అధిగమించి వరుసగా ఆరో సెషన్‌లోనూ మంగళవారం లాభాల బాటపట్టాయి. సెనె్సక్స్ 77 పాయింట్లు అదనంగా నమోదుచేసి 36,347 వద్ద ముగిసింది. చివరి నిమిషాల్లో పార్మా, లోహ, వౌలిక వస్తువుల నిల్వల్లో పేర్లను మదుపర్లు అమ్మకాలకు పెట్టడంతో కొంత వత్తిడికి గురయ్యాయి. అదే క్రమంలో అంతర్జాతీయ మార్కెట్ స్థితిగతుల నేపథ్యంలో సమాచార సాంకేతిక రంగం, శీఘ్ర వినిమయ వస్తువుల రంగం నష్టాలను చవిచూశాయి. కాగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 10,900 మార్కుకు ఎగబాకింది. ఈ సెషన్‌లో అమ్మకాలు, కొనుగోళ్లు ముమ్మరంగా జరిగినప్పటికీ బీఎస్‌ఎ సెనె్సక్స్ 329 పాయింట్లతో లాభాలను సంతరించుకుంది. 30 షేర్లతో కూడిన ఈ ఇండెక్స్ మంగళవారం 36,226.38 వద్ద ప్రారంభమై అమ్మకాల వత్తిడితో ఒక దశలో 36.046.52కు దిగజారింది. వారం రోజులుగా దెబ్బతిన్న ఆసియన్ మార్కెట్లు ప్రభావం, యూరోపియన్ షేర్లు తక్కువ ఓపెనింగ్స్‌తో ఆరంభం కావడంతో మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. అయితే మధ్యాహ్నం తర్వాత కొనుగోళ్లు పుంజుకోవడంతో మార్కెట్ స్థితిగతుల్లో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పటి వరకు ఉన్న నష్టాలను అధిగమించి సెనె్సక్స్ స్కేలు 77.01 పాయింట్లు లాభపడి 36,375.38కి ఎగబాకింది. ఈ క్రమంలో గడచిన ఐదు సెషన్ల నుంచి సెనె్సక్స్ 1,310 పాయింట్లు లాభపడినట్టయింది. అలాగే 50 షేర్ ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 20.35 పాయింట్లు లాభపడి 0.19 శాతంతో ఒక దశలో 10,908.70వద్దకు ఆ తర్వాత వరుసగా 10,819.10 వద్దకు, 10.915.40 వద్దకు చేరుకుని లాభాల పంట పండించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గడం సూచీలకు ఊతమిచ్చిందని, దేశ దిగుబమతుల ఆర్థిక భారాన్ని తగ్గించడం ద్వారా స్థూల ఆర్థికాభివృద్ధికి సైతం ఈ పరిణామం సానుకూలంగా ఉందని విశే్లషకులు అంచనా వేశారు. అలాగే అమెరికన్ డాలర్‌తో రూపాయి విలువ బలపడడం కూడా మార్కెట్ మూడ్‌పై ప్రభావం చూపిందన్నారు. ఇక అంతర్జాతీయ స్టాక్ మార్కెట్‌లో మాత్రం గతరాత్రి నష్టాలు కొనసాగాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వు విధాన నిర్ణాయక విభాగం రెండు రోజుల సమావేశం మంగళవారం నుంచి ప్రారంభం కావడంతో ఇందుకు సంబంధించిన తుది నిర్ణయం ఈ నెల 19న వెలువడే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో ధరలు పెరిగే సూచలున్న దృష్ట్యా మదుపర్లు వేచ్చిసే దోరణిని అవలంభించారు. ఇలావుండగా దేశీయ సంస్థాగత మదుపర్లు 76.64 కోట్ల రూపాయల విలువైన షేర్లను మంగళవారం అమ్మకాలు జరిపారు. అయితే విదేశీ పెట్టుబడిదార్లు 60.95 కోట్ల రూపాయల విలువైన షేర్లను సోమవారం అమ్మకాలు చేశారు.

బులియన్

$
0
0

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,065.00
8 గ్రాములు: రూ.24,520.00
10 గ్రాములు: రూ. 30,650.00
100 గ్రాములు: రూ.3,06,500.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,278.075
8 గ్రాములు: రూ. 26,224.6
10 గ్రాములు: రూ. 32,780.75
100 గ్రాములు: రూ. 3,27,807.5
వెండి
8 గ్రాములు: రూ. 330.40
10 గ్రాములు: రూ. 413.00
100 గ్రాములు: రూ. 4,130.00
ఒక కిలో: రూ. 41,300.00
*
హైదరాబాద్‌లో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,004.00
8 గ్రాములు: రూ. 24,032.00
10 గ్రాములు: రూ. 30,040.00
100 గ్రాములు: రూ. 3,00,400.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,212.834
8 గ్రాములు: రూ. 25,702.672
10 గ్రాములు: రూ. 32,128.34
100 గ్రాములు: రూ. 3,21,283.4
వెండి
8 గ్రాములు: రూ. 330.40
10 గ్రాములు: రూ. 413.00
100 గ్రాములు: రూ. 4,130.00
ఒక కిలో: రూ. 41,300.00

విద్యారంగంపై ప్రత్యేక దృష్టి

$
0
0

హైదరాబాద్, డిసెంబర్ 18: విద్యారంగంపై కొత్త ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని పలు అధ్యాపక బృందాలు, యాజమాన్యాల ప్రతినిధులు మంగళవారం నాడు కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన కే చంద్రశేఖరరావును, టీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కేటీఆర్‌ను కలిసి వారు అభినందనలు తెలిపి, ఈసారి విద్యారంగం సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని కోరారు. కేజీటుపీజీ జాక్ నేతలు మంగళవారం నాడు హైదరాబాద్‌లో సమావేశం అయ్యారు. కేసీర్ భవిష్యత్‌లో చేపట్టే కార్యక్రమాలకు ముఖ్యంగా తెలంగాణ అభివృద్ధికి చేస్తున్న కృషి అభినందనీయమని వారు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో బడుగు వర్గాలకు విద్యను అందిస్తున్న బడ్జెట్ పాఠశాలలు కళాశాలలకు వౌలిక వసతుల కల్పనకు విద్యాసంబంధమైన కార్యక్రమాలకు న్యాయమైన ఇతర సమస్యల పరిష్కారం కోసం న్యాయమైన ఇతర సమస్యల పరిష్కారం కోసం సహకారం అందించాలని తీర్మానించారు. ముఖ్యమంత్రిని, ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారందరినీ జాక్ నేతలు అభినందించారు. తెలంగాణ కోసం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలులో కేజీటుపీజీ విద్యాసంస్థలు భాగస్వామ్యం అవుతాయని అన్నారు. కేటీఆర్‌ను టీఆర్‌ఎస్ వర్కింగ్ అధ్యక్షుడిగా నియమించడం అభినందనీయమని అన్నారు. జాక్ చైర్మన్ కంచాల పాపిరెడ్డి, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు వీ నరేందర్‌రెడ్డి, టీపీజేఎంఏ అధ్యక్షుడు గౌరీ శతీష్, జాక్ కన్వీనర్ ఎస్‌ఎన్ రెడ్డి, ట్రెస్మా అధికార ప్రతినిధి టీ విజయభాస్కరరెడ్డి, కాలేజీల సంఘం ప్రధానకార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి, జిల్లాల వారీ అధ్యక్షులు , కార్యదర్శులు పెద్దత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మధుసూధనరెడ్డి తదితరులు కేటీఆర్‌ను కలిసి అభినందించారు.

మార్మోగిన ‘నారాయణ’ నామం

$
0
0

హైదరాబాద్, డిసెంబర్ 18: వైకుంఠ ఏకాదశి (పెద్ద ఏకాదశి) సందర్భంగా రాష్టవ్య్రాప్తంగా వైష్టవ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రత్యేకంగా ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు వేకువజాము నుండే ఆలయాలకు చేరారు. ‘గోవిందా’, ‘నమో నారాయణాయ’ తదితర నామాలతో ఆలయాలు మార్మోగాయి. భద్రాచలం, యాదాద్రితో సహా వేలాది దేవాలయాలు ఉదయం మూడు గంటలకే తెరుకుచున్నాయి. తిరుప్పావై పాశురాలన్నింటినీ అన్ని ఆలయాల్లో పూజారులు చదివారు. ఆచార్యులు, గురువుల ప్రవచనాలు అంతటా కొనసాగాయి. లక్షలాది మంది భక్తులు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉపవాసాలు ఉన్నారు. గురువారం ఉదయం వరకు ఉపవాస దీక్షలు కొనసాగతాయి.

అదేమంత వివాదం కాదు: టిమ్ పైన్

$
0
0

పెర్త్‌లో జరిగిన రెండో టెస్టు సందర్భంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తనతో అసభ్యకరంగా, మితిమీరి, హద్దులు దాటి ప్రవర్తించిన అంశాన్ని ఆసిస్ కెప్టెన్ టిమ్ పైన్ తోసిపుచ్చాడు. అదేమంత పెద్ద వివాదం కాదని, దీనిని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు. అయితే, మిగిలిన మ్యాచ్‌లలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా వ్యవహరించాలని అభిప్రాయపడ్డాడు. తమ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ అర్ధవంతమైనదే తప్ప, ఎలాంటి వివాదాలకు తావులేదని పేర్కొన్నాడు. టెస్టులు వంటి గట్టి పోటీతత్వం కలిగిన మ్యాచ్‌లలో స్వల్ప ఘటనలు సహజమేనని, ఇరు జట్లు కూడా హద్దులు మీరి ప్రవర్తించలేదని అన్నాడు.

స్పిన్నర్ లేకుండా తప్పు చేశారు : మంజ్రేకర్

$
0
0

ముంబయి, డిసెంబర్ 18: ఆస్ట్రేలియాలోని పెర్త్ మైదానంలో ఆతిధ్య జట్టుతో జరిగిన రెండో టెస్టు సందర్భంగా భారత్ స్పిన్నర్ లేకుండా బరిలోకి దిగి పెద్ద తప్పు చేసిందని టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్ సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు. ఈ టెస్టును కోహ్లీ సేన చేజార్చుకోవడంతో స్పిన్నర్ లేని లోటు స్పష్టవౌతోందని, ఇందుకు టీమ్ మేనేజిమెంట్ బాధ్యత వహించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ఆసిస్ ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియాన్‌ను బరిలోకి దించి అద్భుత ఫలితం అందుకుందని పేర్కొన్నాడు.


పైన్‌ను కోహ్లీ నిందించలేదు:బీసీసీఐ

$
0
0

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టు సందర్భంగా ఆతిధ్య జట్టు కెప్టెన్ టిమ్ పైన్ వికెట్ల మధ్య పరుగులు తీస్తున్న సమయంలో టీమిండియా కెప్టె న్ విరాట్ కోహ్లీ ఎదురుపడి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఉభయ జట్ల కెప్టెన్ల మధ్య వాదోపవాదాలు జరిగినట్టు మీడియాలో వచ్చిన వార్తలను ఖండించింది. కెప్టెన్‌లిద్దరూ ఎలాంటి క్రీడా నిబంధనలను ఉల్లంఘించలేదని, హద్దులు మీరి ప్రవర్తించలేదని స్పష్టం చేసింది. ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్‌మన్ కోహ్లీ ఎప్పుడూ అతిగా ప్రవర్తించలేదని పేర్కొంటూ అతనికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఒక ప్రకటనను విడుదల చేసింది.

స్పిన్నర్ ఆలోచనే రాలేదు..

$
0
0

పెర్త్, డిసెంబర్ 18: రెండో టెస్టు మ్యాచ్‌లో 146 భారీ పరుగుల వ్యత్యాసంతో ఓటమిని చవి చూసిన టీమిండియా ఇప్పుడు లోపం ఎక్కడుందో కనుక్కునే పనిలో పడింది. పెర్త్ టెస్టులో నలుగురు పేసర్లతో బరిలోకి దిగిన భారత్‌కు స్పిన్నర్ ఆవశ్యకత తెలిసివచ్చింది. ప్రత్యర్థి జట్టు ఆఫ్‌స్పిన్నర్ నాథన్ లియాన్ ఈ టెస్టులో ఏకంగా 8 వికెట్లు పడగొట్టడం విశేషం. అయితే, టీమిండియా ఫాస్ట్‌బౌలర్ మహమ్మద్ షమీ సైతం ఈ టెస్టులో అత్యధికంగా 6 వికెట్లు తీసుకున్నా స్పిన్నర్ లేని లోటు స్పష్టమైంది. ఇదే విషయాన్ని కెప్టెన్ విరా ట్ కోహ్లీ అంగీకరించాడు. రెండో టెస్టులో నలుగురు పేసర్లను బరిలోకి దించి పోరాడామని, కానీ స్పిన్నర్ ఆవశ్యతను గుర్తించలేకపోయామని అంగీకరించాడు. పెర్త్ మైదానంలోని పిచ్‌ను చూసిన తర్వాత ఆఫ్‌స్పిన్నర్ రవీంద్ర జడేజా గురించి కనీసం ఆలోచనే రాలేదని, నలుగురు పేసర్లు ఉంటే సరిపోతుందనే అనుకున్నామని పేర్కొన్నాడు. అయితే, రెండో టెస్టులో కేవలం పేసర్లను నమ్ముకుని బరిలోకి దిగిన భారత్ కనీసం ఒక్క స్పిన్నర్‌ను అయినా జట్టులోకి తీసుకోకపోవడం వల్లే ఓటమిని చవిచూశామని వస్తున్న విమర్శకుల వాదనను కోహ్లీ తోసిపుచ్చాడు. తమ బౌలర్లు ఆద్యంతం ఆకట్టుకున్నారని, ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ అద్భుతంగా రాణించాడని ప్రశంసించాడు. అదేవిధంగా బ్యాట్స్‌మెన్‌లంతా కూడా పోరాడామని, కానీ ప్రత్యర్థి దూకుడును నిలువరించడంలో విఫలమయ్యామని అంగీకరించాడు. అయితే, ఈనెల 26 మెల్బోర్న్‌లో జరిగే ప్రతిష్టాత్మక మూడో టెస్టు కోసం తామంతా ఎదురుచూస్తున్నామని, ఇందులో పైచేయి సాధించేందుకు మానసికంగా సిద్ధమవుతున్నామని, ప్రత్యర్థిని దీటుగా ఎదుర్కొంటామనే గట్టి నమ్మకం తనకు ఉందని అన్నాడు. ఇదిలావుండగా, రెండో టెస్టు సందర్భంగా ఆతిధ్య జట్టు కెప్టెన్ టిమ్ పైన్ విషయంలో తాను హద్దులు మీరి వ్యవహరించలేదని, వ్యక్తిగత దాడులకు పాల్పడలేదని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. ఆసిస్ కెప్టెన్ వికెట్ల మధ్య పరుగులు తీస్తున్నపుడు తాను అతనిని అడ్డగించి వాగ్వావాదానికి దిగినట్టు వచ్చిన వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొన్నాడు.

ఐపీఎల్ వేలంలో కోటీశ్వరులు వరుణ్ చక్రవర్తి, జయదేవ్ ఉనద్కత్

$
0
0

జైపూర్, డిసెంబర్ 18: వచ్చే ఏడాది జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆటగాళ్ల ఎంపిక కోసం జరిగిన వేలంలో ఇద్దరు భారత క్రికెటర్లు మిలియనీర్లుగా ఘనత సాధించారు. అయితే, టీమిండియా ప్రపంచ కప్‌ల వీరుడు, సిక్సర్ల ధీరుడు యువరాజ్ సింగ్‌ను మొదటి రౌండ్‌లో కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపకపోడం విశేషం. అయతే రెండో రౌండ్‌లో ముంబై యువరాజ్‌ను కనీస ధర రూ.కోటికి సొంతం చేసుకుంది. జైపూర్‌లో మంగళవారం జరిగిన ఐపీఎల్ ఆటగాళ్ల ఎంపికలో వాస్తుశిల్పి నుంచి క్రికెటర్‌గా అవతారమెత్తిన వరుణ్ చక్రవర్తి అత్యధికంగా 8.4 కోట్ల రూపాయలకు అమ్ముడు కావడం గొప్ప విశేషం. వరుణ్ చక్రవర్తి కనీస ధర (20 లక్షలు) కంటే 40 రెట్లు ఎక్కువకు అమ్ముడుపోవడం సంచలనం సృష్టించింది. ఇతనిని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యాజమాన్యం చేజిక్కించుకుంది. తమిళనాడుకు చెందిన 27 ఏళ్ల వరుణ్ చక్రవర్తి చాలాకాలం పాటు వాస్తుశిల్పిగా ఉండి, ఆ తర్వాత కాలంలో క్రికెటర్‌గా అవతారమెత్తాడు. ఇతనిని జట్టులోకి తీసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని ఆశిస్తున్నామని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సతీష్ మీనన్ తెలిపాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో అద్భుతంగా రాణించిన వరుణ్ చక్రవర్తి మధురై పాంథర్స్ తరఫున ప్రాతినిధ్యం వహించి టీఎన్‌పీఎల్ టైటిల్ దక్కించుకునేందుకు ఎంతో కృషి చేశాడని పేర్కొన్నాడు. అదేవిధంగా ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ శాం కురణ్‌ను 7.2 కోట్ల రూపాయలతో పంజాబ్ జట్టు తీసుకుంది. భారత మీడియం పేసర్ జయదేవ్ ఉనద్కత్ సైతం మరోసారి మిలియనీర్‌గా ఘనత దక్కించుకున్నాడు. ఇతనిని రాజస్థాన్ రాయల్స్ 8.4 కోట్ల రూపాయలకు జట్టులోకి తీసుకుంది. ఈ ఏడాది ఇదే యాజమాన్యం ఉనద్కత్‌ను 11.5 కోట్ల రూపాయలు వెచ్చించి జట్టులోకి తీసుకుంది. వేలంలో కీలక ఆటగాళ్లను చేజిక్కించుకునేందుకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. ఈ ఏడాది రెండు కోట్ల రూపాయలతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌లో చోటుదక్కించుకున్న భారత సీనియర్ క్రికెటర్, 37 ఏళ్ల యువరాజ్ సింగ్ ఆశించిన రీతిలో ఆటతీరును కనబరచలేకపోయాడు. దీంతో రెండో రౌండ్ వేలంలో ముంబై ముందుకొచ్చింది. గతంలో 16 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన యువరాజ్ సింగ్‌ను ఈసారి రూ.కోటికే దక్కించుకుంది. వెస్టిండీస్ ఆటగాళ్లలో షిమ్రాన్ హెట్‌మెయిర్, కార్లోస్ బ్రాత్‌వైట్, నికొలస్ పూరన్‌తోపాటు పలువురు భారత క్రికెటర్లు అత్యధికంగా అమ్ముడుపోయినవారి జాబితాలో ఉన్నారు. హెట్‌మెయిర్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 4.2 కోట్ల రూపాయలకు చేజిక్కించుకుంది. హెట్‌మెయిర్ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ కేపిటల్స్ మధ్య గట్టి పోటీ ఎదురైనా ఆర్సీబీ చేజిక్కించుకుంది. హెట్‌మెయిర్ సహచర ఆటగాడు, 2016 వరల్డ్ టీ-20 స్టార్ కార్లోస్ బ్రాత్‌వైట్‌ను 5 కోట్ల రూపాయలకు కోల్‌కతా నైట్‌రైడర్స్ వశం చేసుకుంది. మరో విదేశీ ఆటగాడు, వికెట్ కీపర్, 23 ఏళ్ల యువకుడు కనీస ధర 75 లక్షలు కాగా, ఇతనిని 4.20 కోట్ల రూపాయలతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చేజిక్కించుకుంది. భారత స్పిన్నర్ అక్షర పటేల్‌ను ఢిల్లీ కేపిటల్స్ 5 కోట్ల రూపాయలతో తీసుకుంది. టీమిండియా టెస్టు ఆటగాడు హనుమ విహారిని 2 కోట్ల రూపాయలతో ఢిల్లీ కేపిటల్స్ తీసుకుంది. భారత పేసర్ ఇషాంత్ శర్మను సైతం 1.1 కోట్ల రూపాయలతో ఢిల్లీ కేపిటల్స్ జట్టులోకి తీసుకుంది. వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాను 1.2 కోట్ల రూపాయలతో సన్‌రైజర్స్ హైదరాబాద్ వశం చేసుకుంది. మహమ్మద్ షమీ గత సీజన్‌లో ఢిల్లీ తరఫున ప్రాతినిధ్యం వహించగా ఇపుడు పంజాబ్ జట్టు అతనిని రూ.4.8 కోట్లకు కొనుగోలు చేసింది. పేసర్ మొహిత్ శర్మను రూ.5కోట్లతో మళ్లీ చెన్నై సూపర్‌కింగ్స్‌లో చోటుదక్కించుకున్నాడు. వేలంలో ఇంకా అమ్ముడుపోని ఆటగాళ్లలో చటేశ్వర్ పుజారా, బ్రెండన్ మెక్‌కల్లమ్, క్రిస్ వోక్స్ ఉన్నారు.

140 ఆలౌట్!

$
0
0

పెర్త్: ఆస్ట్రేలియాతో పెర్త్ మైదానంలో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఓటమిని చవిచూసింది. అడెలైడ్‌లో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో 31 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించిన కోహ్లీ సేన పెర్త్‌లో జరిగిన రెండో టెస్టులో పరుగుల ఛేదనలో ఘోరంగా విఫలమైంది. 50 ఓవర్లలో 140 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఆతిధ్య ఆసిస్ 146 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడంతో నాలుగు టెస్టుల సిరీస్ 1-1తో సమం అయింది. అంతకుముందు ఆతిధ్య ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 108.3 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 105.5 ఓవర్లలో 283 పరుగులు చేసింది. ఆసిస్ రెండో ఇన్నింగ్స్‌లో 98.2 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 56 ఓవర్లలో 140 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో 286 పరుగుల లక్ష్య ఛేదనకు భారత్ బరిలోకి దిగింది. 41 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 112 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం ఐదోరోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన టీమిండియా ఆట ముగిసేసరికి కేవలం 28 పరుగులే అదనంగా చేసింది. క్రీజులో ఉన్న హనుమ విహారి 75 బంతులు ఎదుర్కొని 4 బౌండరీలతో 28 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో మార్కస్ హ్యారిస్‌కు క్యాచ్ ఇచ్చాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ 61 బంతులు ఎదుర్కొని 2 బౌండరీలతో 30 పరుగులు చేసి నాథన్ లియాన్ బౌలింగ్‌లో హ్యాండ్స్‌కాంబ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. 23 బంతులు ఎదుర్కొన్న ఉమేష్ యాదవ్ కేవలం 2 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చాడు. ఇషాంత్ శర్మ 5 బంతులు ఎదుర్కొని పరుగుల ఖాతా ప్రారంభించకుండానే ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో టిమ్ పైన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. జస్ప్రీత్ బుమ్రా 3 బంతులు ఎదుర్కొని ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చాడు. మహమ్మద్ షమీ నాటౌట్‌గా నిలిచాడు. ఆసిస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 17 ఓవర్లలో 46 పరుగులు, నాథన్ లియాన్ 19 ఓవర్లలో 39 పరుగులిచ్చి తలో 3 వికెట్లు తీసుకున్నారు. జొష్ హాజల్‌వుడ్ 11 ఓవర్లలో 24 పరుగులు, ప్యాట్ కమిన్స్ 9 ఓవర్లలో 25 పరుగులిచ్చి తలో 2 వికెట్లు పడగొట్టారు.
ఇరు జట్ల సంక్షిప్త స్కోరు:
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 108.3 ఓవర్లలో 326 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్: 105.5 ఓవర్లలో 283 ఆలౌట్
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 98.2 ఓవర్లలో 243 ఆలౌట్
భారత్ రెండో ఇన్నింగ్స్: 56 ఓవర్లలో 140 ఆలౌట్

రామమందిరం ఎప్పుడు నిర్మిస్తారు?

$
0
0

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: వివాదాస్పద అయోధ్య రామజన్మభూమి స్థలంలో రామమందిరాన్మి ఎప్పుడు నిర్మిస్తారు? దీనిపై ప్రభుత్వ వైఖరి ఏమిటి? అని పలువురు బీజేపీ నేతలు ప్రశ్నించారు. ఇక్కడ మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పలువురు నేతలు రామమందిరాన్ని నిర్మించేది ఎప్పుడంటూ ముక్తకంఠంతో నిలదీశారు. వారిని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సముదాయించారు. మందిరాన్మి నిర్మించాలన్నదే అందరి అభిమతమని, అయితే దీనిపై కొంత సహనం వహించాలని పార్టీ నేతలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం రాజ్‌నాథ్ సింగ్ ఎంపీలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో యూపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రవీంద్ర కుషావహ, హరినారాయణ రాజభర్ ఈ అంశాన్ని సమావేశంలో తొలుత లేవనెత్తారు. వీరికి మద్దతుగా పలువురు ఎంపీలు గళం కలిపారు. ప్రధాని మోదీ, అమిత్‌షా హాజరు కాకపోవడంతో రాజ్‌నాథ్ సింగ్ వారిని సముదాయించారు. అసలు మందిరాన్ని ఎప్పుడు నిర్మిస్తారు? నిర్మించే ఉద్దేశం పార్టీకి ఉందా? అంటూ పలువురు ఎంపీలు ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ను ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వివాదానికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉందని, లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ అంశంపై పార్టీ చేపట్టాల్సిన చర్యలపై పార్టీకి ఒక దృక్పథం ఉందని రాజ్‌నాథ్ చెప్పారు. విపక్ష పార్టీలకు సరైన నేత లేక దశ దిశ లేకుండా పోతోందని, ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో ఛరిష్మా కలిగిన మోదీ మన పార్టీకి ఉన్నారని, దానిని ఉపయోగించుకుని, మనం చేసిన అభివృద్ధిని వివరించి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చేలా అందరూ కృషి చేయాలని ఆయన కోరారు. అనంతరం పార్లమెంటరీ వ్యవహార శాఖ మంత్రి నరేంద్ర సింగ్ మాట్లాడుతూ ఈ శీతాకాల సమావేశంలో ట్రిపుల్ తలాక్ బిల్లుకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నట్టు తెలిపారు.
పరస్పర అవగాహనతోనే సమస్యకు పరిష్కారం: గడ్కరీ
రామమందిర నిర్మాణం అన్న డిమాండ్ కులానికో, మతానికో సంబంధించిన అంశం కాదని, మందిరాన్ని ఎట్టిపరిస్థితిల్లో నిర్మించి తీరుతామని, అయితే అది పరస్పర అవగాహనతో చేపట్టాలన్నది తమ ఉద్దేశమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.

Viewing all 69482 articles
Browse latest View live