Are you the publisher? Claim or contact us about this channel


Embed this content in your HTML

Search

Report adult content:

click to rate:

Account: (login)

More Channels


Showcase


Channel Catalog


Articles on this Page

(showing articles 39401 to 39420 of 41370)
(showing articles 39401 to 39420 of 41370)

older | 1 | .... | 1969 | 1970 | (Page 1971) | 1972 | 1973 | .... | 2069 | newer

  0 0

  మైలవరం, డిసెంబర్ 19: రైతు సహకార సంఘాల సభ్యులు విజ్ఞాన యాత్రను సద్వినియోగపరుచుకోవాలని దాల్మియా సిమెంట్ పరిశ్రమ టెక్నికల్ హెడ్ కరుణాకర రావు తెలిపారు. మండలపరిధిలోని చిన్నకొమ్మెర్ల వద్ద ఉన్న దాల్మియా సిమెంట్ పరిశ్రమ పరిధిలోని గ్రామల రైతులతో ఏర్పాటుచేసిన రైతు సహకార సంఘాల సభ్యులకు విజ్ఞానయాత్రను ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి బయలుదేరిన సంఘసభ్యుల బస్సును కరుణాకర రావు జెండాఊపి యాత్రను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సమగ్ర అభివృద్ధికి దాల్మియా పరిశ్రమ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఈక్రమంలోనే నాబార్డు సహకారంతో ఏర్పాటుచేసిన రైతు సహకార సంఘాలను ఏర్పాటుచేయడంతో పాటు వాటికి అందుబాటులోని అవకాశాలను తెలియజేసేందుకు విజ్ఞాన యాత్రల ద్వారా తెలియపరుస్తున్నామన్నారు. వాటిని సద్వినియోగ పరుచుకుని అవకాశాలను అందిపుచ్చుకుని రైతులు అన్నిరకాలుగా అభివృద్ది చెందాలని కోరారు. అనంతరం సీయస్‌ఆర్ విభాగాధిపతి రాజశేఖర రాజు మాట్లాడుతూ మైలవరం మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన దాదాపు 40 మంది రైతులను విజ్ఞాన యాత్రకు తీసుకెళ్తున్నామన్నారు. వారికి ముల్కనూరు రైతు సహకార సంఘం వద్దకు తీసుకెళ్లి సంఘాలు బలోపేతం అయ్యేవిధానాన్ని, అభివృద్దికి దృష్టిసారించాల్సిన అంశాలను వివరిస్తామన్నారు. ప్రస్తుతం దాల్మియా సిమెంట్ పరిశ్రమ ఆధ్వర్యంలో నాబార్డు సహకారంతో పాలు, శనగలు, పత్తి ఉత్పత్తిదారుల సహకార సంఘాలను ఏర్పాటుచేయడం జరిగిందని రాజశేఖర రాజు తెలిపారు. కార్యక్రమంలో సీయస్‌ఆర్ సిబ్బంది శ్రీనివాసులు, శివకోటేశ్వరరావు, సంఘాల సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

  రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దుచేయాలి
  రాజుపాళెం, డిసెంబర్ 19: బీజేపీ పార్టీ, ప్రధాని మోదీపై అసత్య ఆరోపణలు చేస్తున్న రాహుల్ గాంధీ ఎంపి సభ్యత్వాన్ని రద్దుచేయాలని బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌మెంబర్ పుత్తా లక్ష్మిరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో రాహుల్ గాంధీ ఎంపి సభ్యత్వాన్ని రద్దుచేయాలని తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ వినతి పత్రాన్ని రాష్టప్రతికి పంపాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2001లో దివంగత ప్రధాని వాజ్‌పేయ్ ప్రభుత్వం హయంలో రాఫెల్ యుద్ద విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. వాటి కొనుగోలుకు టెండర్లు పిలవడంతో 6 కంపెనీలు ముందుకు వచ్చాయన్నారు. అందులో డాటెట్ల కంపెనీ ఈ టెండర్‌ను దక్కించుకుందన్నారు. ఆ తర్వాత యూపియే1, యూపియే 2 ప్రభుత్వం హయంలో రాహుల్ గాంధీ బావ రాబర్ట్‌వాద్ర స్నేహితుడు రాఫెల్ ఒప్పందాలని తిరిగి తెరపైకి తీసుకువచ్చారన్నారు. ఆ తర్వాత 2015లో ఈ ఒప్పందం చేసుకోవడం జరిగిందన్నారు. అయితే ఈ యుద్ద విమానాల కొనుగోలులో ఎలాంటి అవకతవకలు జరగలేదని సుప్రీం కోర్టు తీర్పును ఇచ్చినాకూడా రాహుల్‌గాంధీ ప్రధాని మోదీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇది కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకే అని సుప్రీం కోర్టు తీర్పును ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇలాంటి ప్రకటనలు రాహుల్ గాంధీ మానుకోవాలని రాహుల్ గాంధీ ఎంపి సభ్యత్వాన్ని రాష్టప్రతి రద్దుచేయాలని కోరారు.


  0 0

  కడప అర్బన్,డిసెంబర్ 19: తలనొప్పి, పంటినొప్పి, నడుమునొప్పి, శరీరంలో ఏ ఇబ్బంది వున్నా ప్రజలు తొలుత పరుగెత్తేది మందుల దుకాణాల చెంతకే. డాక్టర్ ప్రిసిప్షన్ (మందుల చీటి) లేక పోయినా పై జబ్బులకే కాక మరే ఇతర అనారోగ్యసమస్యలు ఎదురైనా మందుల షాపులో పనిచేసే సిబ్బంది రోగులకు ఏదో ఒక గుళికలు కట్టబెడుతున్నారనే ఆరోపణలు వాస్తవ రూపంలోకి దాల్చాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న వందల షాపుల్లో ఫార్మసిస్టులు లేకుండా ఏదో ఒక షాప్‌లో పనిచేసిన అనుభవాన్ని తీసుకుని మందుల షాపు యజమానులు యువకులను ఫార్మసిస్టులుగా ఉపయోగించుకుంటున్నారు. రోగం చెబితే అంచనాల మీద ఔషధాలు ఇచ్చేస్తుంటారు. రోగం ఆ మందుల వల్ల తగ్గలేదని వస్తే మందులు మార్చుతారే కానీ వైద్యుల దగ్గరకెళ్లి చీటీ తెచ్చుకోవాలని మాత్రం రోగులకు చెప్పరు. జనరిక్ మందు గుళికలను బ్రాండెడ్ మందులుగా అంటకట్టి రోగుల జేబులను గుళ్ల చేస్తూ మరోవైపు వారి ఆరోగ్యాన్ని పరోక్షంగా దెబ్బతీస్తున్నారు. అమ్మిన మందు బిల్లలకు సంబంధించి బిల్లులు ఇవ్వరు. వాటి క్రయ విక్రయాలకు సంబంధించి దస్త్రాలు నిర్వహించరు. వైద్యులతో కమీషన్ ఒప్పందాలు చేసుకుని ఇష్టారాజ్యంగా ప్రజలను వివిధ రకాల మందులతో వారి ఆరోగ్యాన్ని చిత్తు చేస్తున్నారు. ఈప్రభావం నాడి మండల వ్యవస్థమీద, జీర్ణకోశ, కాలేయం, కిడ్నీల మీద పడుతుందనే విషయం చాలా మందికి తెలియదు. చాలా మందుల షాపుల్లో ఇటీవల విజిలెన్స్ ఇన్‌ఫోర్స్‌మెంట్ చేసిన దాడుల్లో పై వాస్తవాలన్నీ వెలుగులోకి వచ్చాయి. దీంతో మరికొన్ని షాపులను కూడా జిల్లా వ్యాప్తంగా విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టి సీజ్ చేశారు. వీరి తనిఖీలో ఫార్మసిస్టులుగా కోర్సు చదవకుండా మందులు విక్రయించే చాలామంది మందుల షాపుల్లో పనిచేస్తున్న యువకులను గుర్తించారు. కొన్ని ఔషధ కంపెనీల ప్రతినిధులు ఇచ్చే (మెడికల్ రెప్రజెంటేషన్స్) కానుకల కోసం కక్కుర్తిపడి నాసిరకం మందులనే అమ్మకాలు చేస్తూ కొంతమంది మందు దుకాణ యజమానులు అక్రమాలకు పాల్పడుతున్నట్లు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీలు వెల్లడైంది. వీరి తనిఖీలో అనేక లొసుగులు,లోపాలు, కాలం చెల్లిన మందులు ,్ఫర్మసిస్టు విద్యను అభ్యసించకుండా మందులు విక్రయిస్తున్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. జిల్లాలో ఉన్న ఔషధ నియంత్రణ అధికారి జోనల్ అధికారి కావడంతో వారి పర్యవేక్షణ సూపరింటెండెంట్ స్థాయి అధికారులు నిర్వహించాల్సివుండగా, నామమాత్రంగానే ఆ తనిఖీలు చేపడుతున్నారు. ప్రతినెలకొకసారి మందుల దుకాణాలు, నిల్వలు, మందులపై ఎమ్మార్పీ ధరలు, ఎక్స్‌ఫేర్ తేదీలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఔషధ నియంత్రణ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ ఇష్టారాజ్యంగా మందుల అమ్మకాలు చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న విషయాన్ని విజిలెన్స్ దాడుల్లో అధికారుల దాడుల్లో బయటపడింది. ఈ అక్రమ దందా లోపాల లొసుగులన్నింటిపై నివేదిక రూపంలో రాష్టవ్రిజిలెన్స్ అధికారులకు పంపించి సంబంధిత ఔషధ దుకాణదారులపై చర్యలకు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిఫార్సు చేశారు. 90శాతం దుఖాల్లో ఫార్మసిస్టులు లేకుండానే వారి సర్ట్ఫికెట్లు ఉంచుకుని అమ్మకాలు కొనసాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మందు బిల్లల అమ్మకాలు సంబంధించి రోగులకు బిల్లులు ఇవ్వకపోవడం, దస్త్రాలు నిర్వహించకపోవడాన్ని అధికారుల దాడుల్లో వాస్తవాలు బయటకు పొక్కాయి. కాలం చెల్లిన మందులను ప్రత్యేకంగా ఓ లేబిళ్లింగ్ చేసిన ర్యాక్‌లు పెట్టి వాటిని తిరిగి ఆయా కంపెనీలకు వెనక్కు చేరవేయాలి. లేకుంటే ధ్వంసం చేయాలి, అలా కాకుండానే సాధారణ మందులతోపాటే కాలం చెల్లిన మందులను ఓ పక్కన పెట్టి అమ్మేస్తున్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. అలాగే కంపెనీల మందులతోనే కాకుండా జనరిక్ మందులను విడిగాపెట్టి అమ్మాలని ఔషధ నియంత్రణ నియమ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే వాటిని రోగులకు ఇచ్చేటప్పుడు అవి జనరిక్ మందులని విధిగా చెప్పాల్సిన నైతిక బాధ్యత మందులు విక్రయించే నిర్వాహకులపై ఉంది. ఔషధ దుకాణాలు జిల్లాలో దాదాపు 90శాతం నిబంధనలకు విరుద్దగా నిర్వహిస్తున్నట్లు అధికారులు కనుగొన్నారు. అలాగే చిన్నపిల్లలకు అమ్మే పాల ఉత్పత్తులు ఐఎస్‌ఐ బ్రాండెడ్‌వి కాకుండా స్థానికంగా దొరికేవాటినే అమ్మడాన్ని గుర్తించారు. రోజూ మొత్తంగా ఏయే ఔషధాలు ఎంత మొత్తంలో అమ్మారు ? వాటి నెంబర్లు, కంపెనీల పేరుతో దస్త్రాలను మందుల దుకాణాల యాజమాన్యాలు నిర్వహించాల్సివుంది. అయితే చాలాచోట్ల బిల్లులు లేకుండా జీరో వ్యాపారం కొనసాగిస్తున్న విషయాన్ని అధికారులు పసిగట్టారు. ఇష్టారాజ్యంగా నడుపుతున్న కొన్ని మందుల షాపుపై ప్రభుత్వం కొరఢా ఝళిపించి ప్రజల ఆరోగ్యానికి అండగా నిలుస్తుండటంతో రోగ గ్రస్తులే కాకుండా, సామాన్యజనం కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.


  0 0

  కడప లీగల్,డిసెంబర్ 19: ఏ కార్యక్రమం అయినా విజయం సాధించాలంటే న్యాయవాదుల కృషితోనే సత్వర కేసులను పరిష్కరించేందుకు లోక్ అదాలత్‌కు సులువుగా ఉంటుందని జిల్లాప్రధాన జడ్జి జి.శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కోర్టుప్రాంగణంలోని న్యాయసేవా సదన్‌లో జిల్లాలోని ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు, కమలాపురం మొత్తం నాలుగు న్యాయవాద సంఘాల ప్రతినిధులైన బార్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులతో జిల్లా జడ్జి జనవరి 19వ తేదిన చాపాడు మండలంలోని సీబీఎస్ ఇంజనీరింగ్ కాలేజి ప్రాంగణంలో జరుగుతుందన్నారు. ఈ శిబిరంలో న్యాయసేవా సంస్థ సీనియర్ సిటీజన్ల సమస్యలు, ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ పిల్లల యొక్క రక్షణ, వెనుకబడిన వర్గాల హక్కులు, వివిధ రకాలైన ప్రజల సమస్యలపై అర్జీల ద్వారా న్యాయసమ్మతమైన పరిష్కారానికి న్యాయసేవా శిబిరంలో జడ్జీలు, హైకోర్టు న్యాయమూర్తుల చొరవతో సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేసేందుకు అందరం సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా నాలుగు న్యాయవాదుల సంఘాల ప్రతినిధులు న్యాయసేవా శిబిరానికి వేల సంఖ్యలో కక్షిదారులు,ప్రజలు హాజరై వారి సమస్యల పరిష్కారానికి తమ వంతుగా కృషి చేసేందుకు జడ్జికి హామీ ఇచ్చారు. అలాగే ఈ ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో ప్రజలకు రెవెన్యూ సమస్యలు ఉంటాయని, సివిల్ కేసులకు సంబంధించిన కేసులు ఉంటాయని వారు జిల్లా జడ్జికి వివరించారు.అలాంటి వారిని గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తామని వారు ఈసందర్భంగా తెలియజేశారు. ఈ న్యాయసేవా శిబిరం ద్వారా ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని, అలాగే పైసా ఖర్చులేకుండా వారి సమస్యలు తక్షణం పరిష్కారవౌతాయన్నారు. ఈ సమావేశంలో మొదటి అదనపు జిల్లా జడ్జి కె.సుధాకర్, నాల్గవ అదనపు జిల్లా జడ్జి జి.చక్రపాణి, 6వ అదనపు జిల్లా జడ్జి బి.మంజరి, సీనియర్ సివిల్ జడ్జి సిఎన్ మూర్తి, జమ్మలమడుగు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, న్యాయవాదుల సంఘం అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు.


  0 0

  చెన్నూరు,డిసెంబర్ 19: కడప -కర్నూలు జాతీయ రహదారిలోని మండలంలోని రామనపల్లి వక్ఫ్‌బోర్డు 13 ఎకరాల స్థలంలో రూ.13కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న హజ్‌హౌస్ పనులను బుధవారం కలెక్టర్ సి.హరికిరణ్ పరిశీలించారు. హజ్‌హౌస్‌లో గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. పై అంతస్తుకు వెళ్లి నిర్మాణ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. హజ్‌హౌస్ చుట్టూ కాంపౌండ్‌వాల్ నిర్మాణ పనులు జరుగుతుండగా వాటిని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హజ్‌హౌస్‌కు ముందుగా రూ.12 కోట్లు మంజూరు కాగా రూ.13కోట్లకు మంజూరు చేయడం జరిగిందన్నారు. హౌజ్‌హౌస్ నిర్మాణం పూర్తయితే ఫిబ్రవరి నెల నుంచి ఇక్కడినుంచే కార్యకలాపాలు జరుగుతాయన్నారు. జనవరి చివరికి హజ్‌హౌస్‌పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కలెక్టర్ వెంట ఇంజనీరింగ్ అధికారులు, ఎస్‌ఇ సుబ్బారెడ్డి, డీఈ శివసాగర్‌రెడ్డి, ఏఇ మురళీ, వక్ఫ్‌బోర్డు సభ్యులు బుఖారితోపాటు పలువురు మైనార్టీ నాయకులు ఉన్నారు.


  0 0

  గాలివీడు, డిసెంబర్ 19: మండలంలోని తూముకుంట గ్రామంలో రెండో విడత చేపట్టనున్న సోలార్ భూసేకరణ పనులు స్పెషల్ డ్రైవ్ ద్వారా చేపట్టినట్లు ఆర్డీవో మలోలా పేర్కొన్నారు. బుధవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో స్థానిక, లక్కిరెడ్డిపల్లె, రాయచోటి తహశీల్దార్లతో కలిసి సోలార్ భూసేకరణ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండో విడత సోలార్ భూసేకరణ చేపట్టనున్న 450 ఎకరాల్లో ప్రస్తుతానికి కేవలం 150 ఎకరాలకు మాత్రమే సమగ్రంగా పరిశీలించి ప్రతిపాదనలకు సిద్ధం చేశామన్నారు. మిగిలిన 300 ఎకరాల్లో క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి విచారించిన తరువాత నివేదికలు తయారుచేస్తామన్నారు. సోలార్ భూసేకరణ కోసం డీకేటీ పత్రాలను ఫేక్ చేసిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. సోలార్ భూసేకరణలో స్థానికులకే ప్రాధాన్యమిస్తామని, పొరపాటున స్థానికేతరులు, ఉద్యోగులు ఉన్నచో వారి ప్రతిపాదనలు తిరస్కరిస్తామన్నారు. గతంలో ఉద్యోగులు, స్థానికేతరులు పరిహారం పొంది ఉన్నా వారిపై విచారణ చేపట్టి పరిహారం రికవరీ చేయుటకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో రాయచోటి, గాలివీడు, లక్కిరెడ్డిపల్లె తహశీల్దార్లు మధుసూధన్‌రెడ్డి, భవానీ, రాంభూపాల్‌రెడ్డి, డీటీ తిమ్మారెడ్డి, ఆర్‌ఐ యునీత్‌కుమార్‌రెడ్డి, సీనియర్ సహాయకులు రాణాప్రతాప్‌రెడ్డి, సర్వేయర్ బాలాజీ, వీఆర్‌వో శివయ్య తదితరులు పాల్గొన్నారు. తూముకుంట గ్రామానికి చెందిన మహిళ తనకు రేషన్‌కార్డు రాలేదని ఆర్డీవోకు స్వయంగా ఫిర్యాదు చేయగా స్పందించిన ఆర్డీవో ప్రజాసాధికారసర్వే సక్రమంగా చేయకపోవడంతోనే ఇలాంటి పరిణామాలు ఎదురవుతున్నాయని వీ ఆర్‌వో, వీ ఆర్ ఏలపై మండిపడ్డారు.

  శిక్షణ పొందుతున్న అభ్యర్థులు
  లక్ష్యసాధన దిశగా ముందుకెళ్లాలి
  కడప కల్చరల్,డిసెంబర్ 19: పోలీసు ఉద్యోగం కోసం శిక్షణ పొందుతున్న అభ్యర్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకుని ఆ లక్ష్యసాధన దిశగా ముందుకెళ్లాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కోటేశ్వరరావు పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పోలీసు ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ ఇస్తున్న కోచింగ్ సెంటర్లను బుధవారం జేసీ పరిశీలించారు. ఈసందర్భంగా జెసి మాట్లాడుతూ జిల్లాలో ఆరోగ్యమాత చర్చి సమీపంలో ఉన్న లక్ష్య అకాడమి, సీఎస్‌ఐ చర్చి ఎదురుగా ఉన్న విద్యానికేతన్ కోచింగ్ సెంటర్, నాగరాజుపేట సమీపంలో ఉన్న శ్రీవెంకటసాయి కోచింగ్ సెంటర్, ఏడురోడ్ల వద్ద వున్న కెరియర్ చాయిస్ కోచింగ్ సెంటర్లలో అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లాలో సివిల్ కానిస్టేబుల్స్‌కు సంబంధించి 90, ఫైర్ కానిస్టేబుల్స్‌కు సంబంధించి 20 చొప్పున పోస్టులు ఉన్నాయన్నారు. సాంఘిక సంక్షేమశాఖ వారి ద్వారా ఒక్కొక్క అభ్యర్థికి నెలకు రూ.8వేలు చొప్పున కోచింగ్ సెంటర్‌లకు ఇవ్వడం జరుగుతోందన్నారు. అలాగే ప్రతి అభ్యర్థికి నెలకు రూ.3వేలు చొప్పున స్టయిఫండ్ కూడా ఇస్తున్నామని జేసీ వివరించారు. కావున అభ్యర్థులు ట్రైనరీలు ఇచ్చే మెలకువలు బాగా పాటించి పోలీసు ఉద్యోగం పొందే విదంగా ముందుకు వెళ్ళాలని ఆయన సూచించారు. ప్రభుత్వం పేదలను దృష్టిలో ఉంచుకుని ఒక అభ్యర్థికి నెలకు రూ.11వేలు ఖర్చుచేసి కోచింగ్ సెంటర్ల ద్వారా అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇప్పించడం జరుగుతుందన్నారు. అభ్యర్థులకు శిక్షణ ఇచ్చే ట్రైనర్లు ప్రతిరోజు మోడల్ టెస్టులులతోపాటు గత ఐదారు సంవత్సరాల ప్రశ్నాపత్రాలను చెప్పించి అభ్యర్థులకు అర్థమయ్యే విధంగా మోడల్ పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వం తరపున ఉచిత శిక్షణ పొందుతున్న అభ్యర్థులందరూ పోలీసు ఉద్యోగాలు పొంది ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమశాఖ సహాయ సంచాలకులు సరస్వతి, స్టెప్ సీఈవో రామునాయక్, ఎస్‌ఐ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.


  0 0

  తిరుపతి, డిసెంబర్ 19: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం ఉదయం శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. ముందుగా శ్రీ సుదర్శన చక్రతాళ్వార్‌ను శ్రీవారి ఆలయం నుండి శ్రీ భూవరాహస్వామి వారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. శ్రీవారి పుష్కరిణిలో ఉదయం 4.30 నుండి 5.30గంటల నడుమ స్నపనతిరుమంజనం, శ్రీసుదర్శన చక్రత్తాళ్వార్ల చక్రస్నాన మహోత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీస్వామి పుష్కరిణి తీర్ధంలో చక్రస్నానం సుమూహూర్తాన స్నానమాచరించిన వారికి తిరుమల శేషగిరుల్లో వెలసి ఉన్న 66కోట్ల పుణ్యతీర్థస్నానఫలం దక్కుతుందని పురాణాల ప్రాశస్త్యం. ద్వాదశి పర్వదినం కారణంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం వంటి ఆర్జితసేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, తిరుమల జేఈవో శ్రీనివాసరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు రుద్రరాజు పద్మరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

  అప్పలాయగుంటలో వైభవంగా చక్రస్నానం
  వడమాలపేట, డిసెంబర్ 19: అప్పలాయగుంటోలని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ద్వాదశి సందర్భంగా బుధవారం చక్రస్నానం వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు స్వామివారిని మేల్కొలిపి తిరుప్పావై ప్రవచనాలను స్తుతించారు. శుద్ధి, తోమాల సేవ, కొలువు, అర్చన, విశేష నివేదన గావించారు. అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. ఏడుగంటలకు నిత్యహోమం, ఎనిమిది గంటలకు మాడవీధుల ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. తొమ్మిది గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసునికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. 10గంటలకు చక్రత్తాళ్వార్‌ను కోనేటిలోకి వెళ్లి చక్రస్నానం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో డిప్యూటీ ఈవో ఝాన్సీరాణి, సూపరింటెండెంట్ గోపాలకృష్ణారెడ్డి, ఆలయ అధికారులు శ్రీనివాసరాజు, రాజేష్, సూర్యకుమారాచార్యులు, రమణాచార్యులు, తిప్పయ్య ఆచార్యులు, టీటీడీ సిబ్బంది పాల్గొన్నారు.

  లక్కీడీప్ ద్వారా పాడిపేట లబ్ధిదారులకు
  గృహాలు కేటాయింపు
  * ఎవరైనా బాడుగకు ఇచ్చినా, అమ్మినా కఠిన చర్యలు తప్పవు * కమిషనర్ విజయరామరాజు
  తిరుపతి, డిసెంబర్ 19: తిరుపతి సమీపంలోని పాడిపేట వద్ద నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన ఎన్‌టీఆర్ గృహ సముదాయం ఇళ్లను లక్కీడీప్ ద్వారా బుధవారం లబ్ధిదారులకు కేటాయించారు. బుధవారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలోని నెహ్రూ లలిత కళా ప్రాంగణంలో ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా చైర్మన్ నరసింహయాదవ్, కమిషనర్ విజయరామరాజులు లక్కీడీప్ ద్వారా లబ్ధిదారుల పేర్లను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాడిపేట వద్ద నిర్మించిన గృహ సముదాయంలో 2105మందికి ఇళ్ల కేటాయించారన్నారు. బుధవారం జరిగిన లక్కీడీప్‌లో 1255మందికి గృహాలు కేటాయించామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం లక్కీడిప్ ద్వారా ఇళ్లు పొందిన వారికి గృహాలను పంపిణీ చేస్తారన్నారు. పాడిపేట గృహ సముదాయం వద్ద నివసించే వారికి అనుకూలంగా అంగన్‌వాడీ స్కూల్, పార్కు, కమర్షియల్ షాపులు, రేషన్‌షాపు తదితర సదుపాయాలను కల్పించారన్నారు. అలాగే వికృతమాల వద్ద ఉన్న హౌసింగ్ బోర్డు గృహాలను జనవరి 2019లో లబ్ధిదారులకు కేటాయించనున్నట్లు తెలిపారు. లబ్ధిదారులకు కేటాయించి గృహాల్లో నివాసం ఉండకుండా బాడుగకు ఇవ్వడం, విక్రయించడం వంటివి చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సేతుమాదవ్, జన్మభూమి కమిటీ సభ్యులు, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


  0 0

  ఇంఫాల్, డిసెంబర్ 19: కేంద్ర ప్రభుత్వాన్ని, మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని సామాజిక మాధ్యమంలో విమర్శించిన ఒక పాత్రికేయునికి ఒక సంవత్సరం కారాగార శిక్ష విధిస్తూ స్థానిక కోర్టు తీర్పు చెప్పింది. ఇంఫాల్‌లోని వెస్టు డిస్ట్రిక్టు కోర్టు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రీట్ ఈ నెల 14న ఈ శిక్ష విధించినట్టు పీటీఐ బుధవారం వెల్లడించింది. నేషనల్ సెక్యూరిటీ యాక్టు (ఎన్‌ఎస్‌ఎ) సలహాబోర్డు ఈనెల 11న సమావేశమై పాత్రికేయుడు కిషోర్‌చంద్‌పై వచ్చిన ఆరోపణలను పరిశీలించింది. జర్నలిస్టుపై చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు ఉన్నందున ఎన్‌ఎస్‌ఎ ప్రకారం అతడికి శిక్ష సబబేనని సమర్థిస్తూ 13న ఉత్తర్వులు జారీ చేసింది. మణిపూర్ గవర్నర్ నజ్మాహెప్తుల్లా సైతం జర్నలిస్టుకు శిక్ష వేయాలని బోర్డు చేసిన సిఫార్సుకు ఆమోదముద్ర వేశారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రాణి జాన్సీలక్ష్మిబాయి జయంతి ఉత్సవాలు నిర్వహించాలని బీజేపీ అధికారంలోని మణిపూర్ ప్రభుత్వం, కేంద్రంలోని ప్రభుత్వం నిర్ణయించాయి. ఈ నిర్ణయాన్ని విమర్శిస్తూ స్థానిక టీవీ చానల్‌లో పనిచేసే జర్నలిస్టు కిషోర్‌చంద్ వాంగ్‌ఖేమ్ (39) కొన్ని వీడియోలను నవంబర్ 19న సామాజిక మాధ్యమంలోకి అప్‌లోడ్ చేశాడు. ఇంగ్లీష్, స్థానిక అధికార భాష మీతీల్లో ఉన్న ఆ వీడియో క్లిప్పింగ్‌లలో ఝాన్సీ లక్ష్మిబాయి జయంతి ఉత్సవాలు నిర్వహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం విస్మయానికి గురి చేసిందని, ఇది చాలా విచారకరమని, మణిపూర్‌కు కాని, రాష్ట్రానికి కాని ఝాన్సీ లక్ష్మిబాయి చేసిందేమీ లేకపోయినా రాష్ట్రప్రభుత్వం కేంద్రం నిర్ణయానికి తలొగ్గి జయంతిని నిర్వహించడమేమిటని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి బీరెన్‌సింగ్ ‘కేంద్రం ఆడించే బొమ్మ, హిందుత్వ బొమ్మ’గా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. కాగా, కిషోర్ చంద్ వ్యాఖ్యలను రాష్ట్ర ప్రభుత్వం ఖండించింది. భారతదేశం ఐకమత్యంగా ఉండటానికి ఝాన్సీ లక్ష్మిబాయి తిరుగులేని పాత్ర పోషించారని, 1857లో జరిగిన సిఫాయిల తిరుగుబాటు ఉద్యయంలో ఆమె చూపిన తెగువను ఎవరూ మర్చిపోలేరని, అటువంటి వీరురాలికి జయంతి ఉత్సవాలు నిర్వహిస్తే తప్పేమిటని ప్రశ్నించింది. కిషోర్‌చంద్ విమర్శలు చట్టాన్ని అతిక్రమించి ఉన్నందున ఆయనపై కేసు పెట్టినట్టు తెలిపింది. ఇలావుండగా తన భర్తపై పెట్టిన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని కిషోర్‌చంద్ భార్య రంజిత బుధవారం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.


  0 0

  చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ (ఓటీఏ)లో బుధవారం శిక్షణ పొందుతున్న
  అఫ్గానిస్తాన్ నేషనల్ ఆర్మీ (ఏఎన్‌ఏ) మహిళా అధికారి. అఫ్గానిస్తాన్ సైన్యంలోని అధికారులకు
  వారం రోజుల పాటు శిక్షణా శిబిరాన్ని భారత సైన్యం నిర్వహిస్తున్నది


  0 0

  న్యూఢిల్లీ, డిసెంబర్ 19: గత మూడేళ్లుగా జాతీయ మైనారిటీ కమిషన్ (ఎన్‌సిఎం)కు వచ్చే ఫిర్యాదుల సంఖ్య తగ్గుతూ వస్తోందని లోక్‌సభలో ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. సభ్యులు అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా సమాధానమిచ్చిన మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తర్ అబ్బాస్ తమకు అందిన ఫిర్యాదులపై ఎన్‌సీఎం యాక్టు కింద ఎప్పటికప్పుడు తగిన రీతిలో స్పందించి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ చట్టంలోని సెక్షన్ తొమ్మిది ప్రకారం మైనారిటీల రక్షణ, వారి హక్కులకు సంబంధించి వివిధ రాష్ట్రాలు, కేంద్రం నుంచి వచ్చిన కేసులను పరిశీలిస్తున్నామని చెప్పారు. గత మూడు సంవత్సరాలుగా ఎన్‌సీఎంకు వచ్చే ఫిర్యాదుల సంఖ్య తగ్గుతూ వస్తోందని ఆయన వివరించారు. 2015-16లో మొత్తం 1974 ఫిర్యాదులు రాగా, అందులో 1437 ముస్లింలకు, 144 క్రైస్తవులకు సంబంధించినవి. వీటిలో 1960 కేసులను పరిష్కరించారు. 2016-17లో మొత్తం 1647 ఫిర్యాదులు రాగా, అందులో 1231 ముస్లిలంకు, 102 క్రైస్తవులకు సంబంధించనవి, వీటిలో 1607 ఫిర్యాదులను పరిష్కరించారు. 2017-18లో 1498 ఫిర్యాదులు రాగా, ముస్లింలవి 1128, క్రైస్తవులకు వంద ఉన్నాయి. అందులో 1384 పరిష్కరించారు. 2018-19 సంవత్సరంలో డిసెంబర్ 13 వరకు 1342 కేసులు రాగా, వాటిలో ముస్లింలవి 1342, క్రైస్తవులకు 106 ఫిర్యాదులు ఉండగా, వాటిలో 253 పరిష్కరించినట్టు మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ వివరించారు.


  0 0

  లక్నోలోని అసెంబ్లీ సెంట్రల్ హాల్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్. ప్రభుత్వం ప్రజావ్యతిరేక కార్యకలాపాలు చేపడుతున్నదని ఆరోపిస్తూ ప్రతిపక్షం సమాజ్‌వాది పార్టీ సభ్యులు అసెంబ్లీ ఎదుట ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను యోగీ వివరించగా, ఆయన పాలనలో సామాన్యుడు అల్లాడిపోతున్నాడని సమాజ్‌వాది పార్టీ ఆరోపిస్తున్నది


  0 0

  హైదరాబాద్, డిసెంబర్ 19: సికింద్రాబాద్- విశాఖపట్నం- సికింద్రాబాద్ మధ్య తిరిగే జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను ఇక నుంచి లింగంపల్లి వరకూ నడుపుతారు. రైల్వే శాఖ ఈమేరకు నిర్ణయం తీసుకుంది. 2019 ఏప్రిల్ 14వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని సీపీఆర్‌ఓ ఉమాశంకర్ బుధవారం నాడొక ప్రకటనలో వెల్లడించారు. ఇంతకు ముందు కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, హైటెక్ సిటీ, చందానగర్, లింగంపల్లి ప్రయాణికులు జన్మభూమి కోసం సికింద్రాబాద్ వచ్చేవారు. రైలును లింగంపల్లి వరకూ పొడిగించడం వల్ల ఈ బాధ తప్పనుంది. ఇప్పటికే గౌతమి, కాకినాడ, విజయవాడ ఇంటర్ సీటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను లింగంపల్లికి నడుపుతున్నారు. ఆంధ్రా ప్రాంతానికి వెళ్లే ప్రయాణీకులు జన్మభూమిని లింగపల్లి వరకూ పొడిగించాలని చాలాకాలంగా కోరుతున్నారు.


  0 0

  పెనమలూరు, డిసెంబర్ 19: కృష్ణా జిల్లా పెనమలూరు సీనియర్ సర్వేయర్ కొల్లి హరిబాబు ఆస్తులపై ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఫిర్యాదుతో విస్తృత తనిఖీలు జరిపారు. రామచంద్రాపురంలోని కరెన్సీనగర్‌లో నివాసం ఉంటున్న ఇల్లు, పెనమలూరులో పనిచేసే కార్యాలయం సహా మరో ఐదుచోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హరిబాబు ఒక ఇంటితో పాటు ఏడు ఫ్లాట్లు, నాలుగు ఎకరాల పొలం, 750 గ్రాముల బంగారం, 11లక్షల నగదు, కిలోన్నర వెండి.. మొత్తం రూ. 25కోట్ల ఆస్తిని అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఏసీబీ అధికారులు పెనమలూరు తాహశీల్దారు కార్యాలయంలోనూ సమాచారం సేకరించి, తనిఖీలు చేశారు. గురువారం వరకు సోదాలు జరుగుతాయని తెలిపారు. మూడు బ్యాంకు లాకర్లను అధికారులు తెరవవలసి ఉన్నట్లు సమాచారం. కొల్లి హరిబాబు గన్నవరం తహశీల్దారు ఆఫీసు నుండి బదిలీపై పెనమలూరు తహశీల్దారు కార్యాలయానికి వచ్చి మూడేళ్లు అవుతోంది.

  చిత్రం.. కొల్లి హరిబాబు


  0 0

  హైదరాబాద్, డిసెంబర్ 19: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంయూవై) కింద దేశవ్యాప్తంగా 5.85 కోట్ల గ్యాస్ కనెక్షన్లు అందిస్తున్నట్టు ఇండియన్ ఆయిల్ డైరెక్టర్ గుర్మీత్ సింగ్ వెల్లడించారు. దేశంలో అర్హులైన వారందరికీ ఎల్పీజీ కనెక్షన్లు ఇస్తామని ఆయన చెప్పారు. 2016 ఏప్రిల్ 1 నాటికి 61.9 శాతం మందికి మాత్రమే గ్యాస్ కనెక్షన్లు ఉండగా, నేడు ఆ శాతం 89.5కు పెరిగిందని చెప్పారు. ఐదు కిలోల సిలిండర్లు కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు. వినియోగదారుల్లో చైతన్యం పెంచుతున్నామని అన్నారు. ఆవుపేడ, కర్రల వినియోగం, బొగ్గు వినియోగం కంటే గ్యాస్ వినియోగం అనేక విధాలా తోడ్పడుతోందని అన్నారు. తాజాగా 2.75 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లను పిఎంయువై కింద విడుదల చేసినట్టు ఆయన వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన వినియోగదారులు, అంత్యోదయ అన్న యోజన కింద ప్రయోజకులు, ఎంబీసీలు, గిరిజనులు ఈ ప్రయోజనాన్ని పొందవచ్చని అన్నారు. ఇందుకు ఇండియన్ ఆయిల్ సంస్థ పారదర్శకమైన విధానాన్ని అనుసరిస్తుందని పేర్కొన్నారు.


  0 0

  ముంబయి, డిసెంబర్ 19: మరాఠాలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ తాము మహారాష్ట్ర చట్టసభలో ఆమోదించిన బిల్లు ప్రకారం రిజర్వేషన్ల కోటాను వచ్చే ఏడాది జనవరి 23వరకు ఉద్యోగ నియామకాల్లో అమలు చేయమని మహారాష్ట్ర ప్రభుత్వం బాంబే హైకోర్టుకు తెలియజేసింది. రిజర్వేషన్ల కోటాపై ప్రభుత్వం బిల్లు తేవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లు కోర్టు వద్ద విచారణలో ఉన్న నేపథ్యంలో ఉద్యోగాల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన ఇవ్వటాన్ని ఈనెలలో కోర్టు ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం తరఫున విఏ తోరట్ బుధవారం చీఫ్ జస్టిస్ ఎన్‌హెచ్ పాటిల్, జస్టిస్ ఎంఎస్ కర్నిక్‌లతో కూడిన ధర్మాసనం ముందు మాట్లాడుతూ వచ్చే ఏడాది జనవరి 23 వరకు ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ నియామకాలు జరపదని స్పష్టం చేశారు. . శాసనసభలో ఆమోదం పొందిన కొత్త రిజర్వేషన్ల బిల్లు ప్రకారం ఎలాంటి నియామకాలు చేపట్టవద్దని తమ పరిధిలోని స్థానిక సంస్థలు, ప్రభుత్వ శాఖలు, ఇనిస్టిట్యూషన్స్‌కు ఆదేశాలు జారీ చేసినట్టు ఆయన తెలిపారు.
  మరాఠా కులస్తులకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం బిల్లు తేగా దానిని వ్యతిరేకిస్తూ పలువురు పిటిషన్లు దాఖలు చేయగా, దానిని సమర్థిస్తూ మరికొందరు కేసు వేశారు. రిజర్వేషన్ల వ్యతిరేకుల తరఫున కేసును వాదిస్తున్న అడ్వకేట్ గుణరతన్ మాట్లాడుతూ రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించి కోర్టులో కేసు జరుగుతుండగా ఉద్యోగాల నియామకానికి ప్రభుత్వం ప్రకటన ఇవ్వడాన్ని తప్పుబట్టారు. మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాల నియామకానికి ప్రకటన ఇచ్చిందని, దానిని వెంటనే నిలిపివేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో బుధవారం ప్రభుత్వం తరఫున హాజరైన తోరట్ మాట్లాడుతూ ఉద్యోగ ప్రకటన వచ్చిన మాట వాస్తవమేనని, కాని ఉద్యోగ నియామక ప్రక్రియకు ఏడాదికి పైగా సమయం పడుతుందని, రాతపరీక్ష, ఇంటర్వ్యూలు తదితరాలు పూర్తయిన తర్వాత మాత్రమే రిజర్వేషన్ల అంశాన్ని పరిశీలిస్తారని, రిజర్వేషన్ల కేసు ఫాస్టు ట్రాక్ ద్వారా పూర్తయితే రెండు మూడు నెలల్లో పూర్తవుతుందని ఆయన అఫిడవిట్ సమర్పించారు. రిజర్వేషన్ల అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుని మొత్తం నియామక ప్రక్రియను ఆపివేయమనడం సబబు కాదని, దీనివల్ల ఎంతో మంది నిరుద్యోగులకు నష్టం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన బొంబాయి హైకోర్టు కేసు తదుపరి విచారణ తేదీ జనవరి 23వరకు ఎలాంటి నియామకాలు చేపట్టమనిన్న మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని అంగీకరిస్తూ దీనికి సంబంధించి దాఖలైన పిటిషన్లపై పూర్తి వివరాలతో అఫిడవిట్ తదుపరి విచారణ సమయానికి సమర్పించాలని ఆదేశించింది.


  0 0

  కావేరీ నదిపై కర్నాటక చేపట్టిన మెగదాతు డ్యామ్ నిర్మాణాన్ని తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ,
  బుధవారం పార్లమెంటు భవనం ఎదుట నిరసనకు దిగిన ఏఐఏడీఎంకే పార్లమెంటు సభ్యులు


  0 0

  టోక్యో: ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ (ఐపీఓ) పథకం ద్వారా ప్రజల నుంచి పెద్దమొత్తంలో షేర్లు వసూలు చేసిన బ్యాంకుగా జపాన్‌కు చెందిన కార్పొరేట్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంకు రికార్డు సృష్టించింది. ప్రపంచంలో ఐపీఓ ద్వారా అతిపెద్ద మొత్తంలో నిధులు సమీకరించిన రెండో సంస్ధగా సాఫ్‌బ్యాంకు గణుతికెక్కింది. సాంకేతిక పరంగా ప్రపంచ గుర్తింపు పొందిన ఈ బ్యాంకు మొబైల్ యూనిట్ కోసం బుధవారం తొలిసారిగా వాటాల (షేర్లు)ను ఆహానించగా అనూహ్య స్పందన వచ్చిందని ఆ సంస్ధకు చెందిన అధికార ప్రతినిధి తెలిపారు. మొత్తం 2.65 ట్రిలియన్ యెన్‌లు (23.5 బిలియన్ డాలర్లు) సంస్ధకు సమకూరాయని ఆయన వివరించారు. 2014లో అలీబాబా పబ్లిక్ ఇస్యూకు వెళ్లగా ఆ తర్వాత ప్రజల నుంచి వాటాలు సమీకరించిన జపాన్‌కు చెందిన సంస్థల్లో అతిపెద్ద మొత్తం సమీకరణ ఇదేకావడం గమనార్హం. అయితే స్టాక్ మార్కెట్‌లో మాత్రం ఈ బ్యాంకు షేర్ విలువ గణనీయంగా తగ్గడం చర్చనీయాంశమైంది. బుధవారం ట్రేడింగ్ ప్రారంభానికి ముందు 1.463 యెన్లు ఉన్న షేర్ విలువ తర్వాత ఆరంభ ధర కింద 1.500 యెన్‌లకు పెరిగినా తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టి 14.5 శాతం తగ్గిపోయి ఐపీఓ ధర 1.282 యెన్‌ల వద్ద ముగిసింది. చివరి గంటల్లో మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో ఈ పరిస్థితి నెలకొందని సాఫ్ట్‌బ్యాంకు మొబైల్ డివిజన్ సీఈవో కెన్ మియాయుచి తెలిపారు. షేర్ విలువ ఇలా దిగువన ట్రేడ్ అవడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. కాగా సాఫ్ట్‌బ్యాంకు కార్పొరేషన్ ఐపీఓకు వెళ్లిన సమయం మంచిది కాదని మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అంతర్జాతీయంగా మార్కెట్లు గత కొన్ని నెలలుగా క్లిష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని, పైగా మొబైల్ మార్కెట్‌లో అధిక ధరలపై జపాన్‌లోని న్యాయ నిపుణులు సైతం పెదవి విరుస్తున్నారని వారంటున్నారు. బుధవారం నిక్కీ ఇండెక్స్ 0.6 శాతం తగ్గిపోగా, బ్రాడర్ టాపిక్స్ ఇండెక్స్ 04 శాతం తగ్గిందని తెలిపారు. హవాయ్‌కు చెందిన విడిభాగాలను వినియోగించకపోవడం వల్ల సాఫ్ట్ బ్యాంకుకు చెందిన మొబైళ్ల ధరలు అధికంగా ఉండే అవకాశాలున్నాయని ముదుపర్లు వెనకడుగు వేశారని రకుటెన్ సెక్యూరిటీస్‌కు చెందిన సీనియర్ మార్కెట్ విశే్లషకుడు మసయుకి టోషిడా తెలిపారు. కాగా మొత్తం పెట్టుబడుల్లో మూడోవంతును సాఫ్ట్‌బ్యాంకు తన మొబైల్ యూనిట్ ఏర్పాటు కోసం ప్రజల నుంచి వాటాలు స్వీకరించేందుకు నిర్ణయించి మొత్తం 1.76 బిలియన్ షేర్లను అమ్మకానికి పెట్టి ఐపీఓ ధర 1.500 యన్‌లకు అన్ని షేర్లు విజయవంతంగా అమ్మకాలు చేసింది. 1987లో ఎన్‌టీటీ డొకోమో నెలకొల్పిన రికార్డును ఈ సందర్భంగా సాఫ్ట్‌బ్యాంకు మొబైల్ యూనిట్ అధిగమించింది. ఈ బ్యాంకు యజమాని మసయోషి సన్స్ ఈ సంస్థను జపాన్‌కు చెందిన అతిపెద్ద టెలికాం సంస్థగానూ, తర్వాత అంతర్జాతీయ హైటెక్ పెట్టుబడుల సంస్థగానూ మార్చాలన్న వ్యూహ రచన చేయడంతో ఈ బ్లాక్ బస్టర్ ఐపీఓ ఆవిష్కృతమైంది. ఇలావుండంగా ఈ సంస్థకు చెందిన సగానికి పైగా నిధులు సౌదీ అరేబియా నుంచి వచ్చిన పెట్టుబడులవి. ఐతే ఈ కార్పొరేట్ సంస్థ ఎక్కువగా ఇంగ్లాండ్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇస్తాబుల్‌లోని సౌదీ కాన్సులేట్‌లో జర్నలిస్టు జమాల్ ఖషోగ్గీ హత్య జరిగిన సందర్భంగా ఈ సంస్థ పలు ఆరోపణలు ఎదుర్కొని సౌదీ నిధుల విషయంలో కష్టాల్లో పడింది. ఐతే సౌదీ అరేబియాతో తాము మంచి సంబంధాలను కొనసాగిస్తామని సాఫ్ట్‌బ్యాంక్ యజమాని సన్ చెబుతున్నారు.
  భారత్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా-టీమిండియా కెప్టెన్లు టిమ్ పైన్, విరాట్ కోహ్లీ మధ్య జరిగిన సంభాషణను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని, అదంతా నవ్వుకునేందుకు, హాస్యచతురత కోసమేనని ఆసిస్ కోచ్ జస్టిన్ లాంగర్ అన్నాడు. ఆసిస్ కెప్టెన్ బ్యాటింగ్ సమయంలో ఎదురుపడిన ప్రత్యర్థి కెప్టెన్‌తో జరిగిన సంభాషణను చిలువలు పలువలు చేయాల్సిన అవసరం లేదన్నాడు. ఇరు జట్ల కెప్టెన్లు మైదానంలో చాలాసార్లు ఎదురుపడ్డారని, ఆ సందర్భంగా ఎన్నో మాటలు క్రీడాస్ఫూర్తికి అనుగుణంగా జరిగాయే తప్ప ఇద్దరూ హద్దులు మీరి ప్రవర్తించలేదని అభిప్రాయపడ్డాడు. ఇరు జట్ల సారధులు ఆటపై ఆధిపత్యం కోసం తరచూ హాస్యస్పోరకం కోసం మాటల యుద్ధానికి దిగారని, దీనిని వాస్తవ రూపంలో సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. క్రీడాస్ఫూర్తికి అనుగుణంగా జరిగిన ఇలాంటి సంభాషణలను ఆశావహ దృక్పథంతో ఆలోచిస్తే బాగుంటుందని అన్నాడు.


  0 0

  ఖమ్మం/ కర్లపాలెం, డిసెంబర్ 19: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, గుంటూరు జిల్లాలో బుధవారం చలి తీవ్రతకు ముగ్గురు మృతి చెందారు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామానికి చెందిన వేల్పుల వీరాస్వామి(55) చలి తీవ్రత తట్టుకోలేక బుధవారం మృతి చెందాడు. పెథాయ్ తుఫాన్ ప్రభావం వల్ల మండలంలో రెండు రోజులు ఈదురుగాలులతో కూడిన వర్షం పడి చలి తీవ్రత ఎక్కువై తట్టుకోలేక పోవటంతో ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ పంచాయతీ గౌతంపురం కాలనీకి చెందిన పుట్టి పిచ్చయ్య చలి తీవ్రత తట్టుకోలేక మంగళవారం అర్ధరాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గుంటూరు జిల్లా కర్లపాలెంలో బుధవారం సాయంత్రం వెంకట రామారావు తీవ్ర చలిని తట్టుకోలేక మృతి చెందినట్లు కుమారుడు శివరామరాజు తెలిపారు.


  0 0

  విశాఖపట్నం, డిసెంబర్ 19: బీజేపీ పాలనపై ప్రజలంతా అసంతృప్తితో ఉన్నారని, మోదీ ప్రభుత్వానికి చరమగీతం తప్పదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. విశాఖలో సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందదర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2019 పార్లమెంట్ ఎన్నికలల్లో సీపీఐ అనుసరించాల్సిన వ్యూహాలపై కౌన్సిల్ సమావేశాల్లో చర్చించామన్నారు. దేశంలో మైనారిటీలు, దళితులపై మోదీ ప్రభుత్వం కక్ష గట్టి ప్రవరిస్తోందన్నారు. నోట్ల రద్దు కారణంగా దేశం తీవ్రంగా నష్టపోయిందని, సుమారు 120 మంది మరణించారన్నారు. కొత్తనోట్ల ముద్రణకు ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేసినా ఏ మాత్రం ఫలితం లేదన్నారు. రాఫెల్ కుంభకోణం విషయంలో సుప్రీం కోర్టు తీర్పు నిరుత్సాహ పరిచిందని, కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును సైతం తప్పుదోవ పట్టిస్తున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. దేశంలో హిందుస్తాన్ ఏరోనాటికల్ సంస్థ ఉండగా అంబానీ కంపెనీలకు యుద్ధ విమనాలు తయారీ ఎందుకు అప్పగించారని ప్రశ్నించారు. కేవలం ఒప్పందానికి మూడు రోజుల ముందే అంబానీ కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం నిజం కాదా అని ప్రశ్నించారు. జీఎస్టీ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతీ పన్ను చెల్లింపుదారునికి మోదీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంతో పాటు సెక్యులర్, డెమొక్రటిక్ భావాలు కలిగిన పార్టీలన్నీ ఎకతాటిపైకి రావాలన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్‌ది రిటైల్ అవినితీ, బీజేపీది హోల్‌సేల్ అవినితీ అని ఆరోపించారు. రాఫెల్ కుంభకోణం ఏ విధంగా జరిగింది? బీజేపీ పెద్దలకు ఎన్ని కోట్లు ముట్టాయన్న అంశాలను ప్రజలకు తెలియజేస్తామన్నారు. ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ వ్యవస్థ బతకాలంటే మోదీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలన్నారు. కేవలం బీజేపీని వ్యతిరేకించే వారిపైనే కక్షపూరితంగా సీబీఐతో దాడులు చేయిస్తోందని, మిగిలిన వారిపై ఎందుకు దాడులు చేయడం లేదని ప్రశ్నించారు. మన దేశానికి మన ప్రధాని నుంచే ప్రమాదం ఉందనే విషయాన్ని ప్రజలంతా గమనించాలన్నారు. శబరిమల, ఆయోధ్య కేసుల్లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను అమలు చేయడంలో బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. తక్షణమే గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలన్నారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, పలు రాష్ట్రాల పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా సెక్యులరిజమ్, ప్యూడలిజం అండ్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ డెమొక్రసీ అనే పుస్తకాన్ని అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించారు.


  0 0

  సిద్దిపేట ప్రజల ఆత్మీయతకు ఫిదా అయన హరీష్‌రావు భావోద్వేగం గుండెల్లో పెట్టుకొని కాపాడారు.. శక్తిమేరకు సేవ చేసి రుణం తీర్చుకుంటానని హామీ
  సిద్దిపేట, డిసెంబర్ 10: దేశంలోనే లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించిన ఘనత సిద్దిపేట ప్రజలదేనని, కష్టపడే నాయకుడిని గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటారని నిరూపించారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో 1వ వార్డు బారా ఇమామ్ సర్కిల్‌లో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిద్దిపేట ప్రజల ఎంత గొప్పవారో లక్ష ఓట్ల మెజార్టీతో దేశానికి చాటి చెప్పారన్నారు. ఎన్నికల తర్వాత మీపై అభిమానం, ప్రేమ రెట్టింపయ్యాయన్నారు. ఇతర చోట్ల ప్రచార బాధ్యతలవల్ల తాను నియోజకవర్గంలో అన్ని చోట్లా తిరుగకున్నా తనపై ప్రత్యేక అభిమానంతో దేశంలోనే అత్యధిక మెజార్టీతోనే గెలిపించారన్నారు. సాధారణంగా ప్రతిచోటా మంచి నాయకుడు ఉంటారు కానీ తన విషయంలో మాత్రం సిద్దిపేటలో మంచి ప్రజలు ఉన్నారని ఆత్మీయ ఆనందాను భూతులను వ్యక్తం చేశారు. ఈ నియోజకవర్గం ప్రజలు గౌరవాన్ని పెంచేలా పనిచేస్తానని భరోసా నిచ్చారు. ఏమి ఇచ్చినా మీ రుణం తీర్చుకోలేను. నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా తక్కువేనని ఆయన భావోద్వేగంతో అన్నారు. నియోజకవర్గం అంతా తన కుటంబమేనని, ప్రతి ఒక్కరి కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటానని పునరుద్ఘాటించాన్నారు. దేవుడు ఇచ్చిన శక్తి మేరకు ఊపిరి ఉన్నంత వరకూ సేవచేసి రుణం తీరుక్చకుంటానన్నారు. బతుకమ్మ చీరలపై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయటం వల్ల పంచలేకపోయామని, ఇప్పుడు అందరికీ అందచేయనున్నట్లు తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరికీ చీరలు అందజేస్తామని స్పష్టం చేశారు.
  శాలువాలు, బోకేలు వద్దు.. మొక్కలు నాటండి
  తనపై అభిమానం, ప్రేమ ఉన్నవారు శాలువాలు, బోకేలు తెచ్చి డబ్బు వృథా చేసుకోవద్దని హితవు పలికారు. ఆ ప్రేమ, అభిమానంతో మొక్కలను పెంచాలని, మొక్కలను దత్తత తీసుకొని హరిత సిద్దిపేటగా మార్చాలని సూచించారు. జిల్లా కలెక్టర్ కృష్ణ్భాస్కర్ మాట్లాడుతూ బతుకమ్మ చీరలను మూడు రోజుల్లో అర్హులందరికీ అందచేయనున్నట్లు పేర్కొన్నారు.


  0 0

  కరీంనగర్, డిసెంబర్ 19: సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, పేదల బాధలు తీర్చిన ఘనత సీఎం కేసిఆర్‌దేనని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం కరీంనగర్ ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత శాసనసభ ఎన్నికల్లో విపక్షాలు చిల్లరమల్లర ఆరోపణలు చేసినా తెలంగాణ జనం విశ్వసించకుండా తమకోసమే తాపత్రయపడే నేతగా భావించి కేసిఆర్ ప్రభుత్వాన్ని అఖండ మెజారిటీతో ఆదరించారన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కరీంనగర్ ప్రజానీకం టిఆర్‌ఎస్‌ను 2004 నుంచి ఇప్పటివరకు ఆదరిస్తూ వచ్చారని, జనం రుణం తీర్చుకునేందుకు మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలుపర్చేందుకు మొక్కవోని దీక్షతో ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పనిచేయాలని కేసీఆర్ సూచించినట్లు తెలిపారు. కూటమి ఎన్ని కుట్రలు చేసినా భగ్నంచేసి తెరాసకు పట్టం కట్టిన జనం రుణం తీర్చుకునేందుకు సైనికుల్లా పనిచేస్తామన్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల స్థాపనకు అంకితభావంతో కృషి చేస్తామని, ప్రజలు టిఆర్‌ఎస్ మీద పెట్టిన బాధ్యతలను నెరవేర్చే దిశగా పనిచేస్తామని వివరించారు. సోషల్ మీడియాలో కొంత మంది విష ప్రచారం చేస్తూ ఈటల ఓటమి తప్పదంటూ ప్రజలను మళ్లించే యత్నం చేసినా జనం తనపై అపారమైన విశ్వాసాన్ని ఉంచడం పట్ల మరింత బాధ్యత పెరిగిందన్నారు. పార్టీలో ఉండి కోవర్టులుగా పనిచేసినవారి చిట్టా అధిష్ఠానం వద్ద ఉందని, సమయం వచ్చినప్పుడు వారిపై వేటు వేయాలనే సమాలోచనతో అధినేత ఉన్నట్లు తెలిపారు. పార్టీకి విఘాతం కలిగించే శక్తులు ఏ స్థాయిలో ఉన్నా ఉపేక్షించకుండా నిర్ధాక్షిణ్యంగా చర్యలు తీసుకునేందుకు కేసిఆర్ సంసిద్ధతతో ఉన్నారన్నారు. రాబోయే కాలంలో ఏ పార్టీకి సూది మొనంత కూడా అవకాశం ఇవ్వకుండా టీఆర్‌ఎస్ పార్టీ బలోపేతానికి సైనికుల్లా కృషి చేస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాల్లో ఉన్న నాయకత్వానికి ప్రాధాన్యం ఇస్తామని, పార్టీకోసం కష్టపడి పనిచేసేవారికి ప్రాధాన్యత క్రమంలో పదవులు అప్పగించేందుకు అధిష్ఠానం నిర్ణయం తీసుకుందన్నారు.
  ఎన్నికల వరకే పార్టీలు ఉండాలని, రాజకీయాలు ఎప్పటికీ శాశ్వతం కాదని, సమాజహితం కోసం గెలిచిన పార్టీలు పనిచేయాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే రాబోయే అన్ని ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ఘనవిజయం సాధిస్తుందని, ఇందులో ఎవరు ఎలాంటి అనుమానాలు పడాల్సిన అవసరం లేదన్నారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
  ఎవరికి ఏ పదవి ఇవ్వాలనేది అధినేత కేసిఆర్ చూసుకుంటారని, ఆయన ఆదేశాల మేరకే తాము పనిచేయడం వల్లే రెండోసారి అధికారంలోకి అఖండ మెజారిటీతో రాగలిగామన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొదటి నుంచి తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ వస్తుందని, కేసీఆర్‌కు ఈ జిల్లా అంటే అపారమైన నమ్మకం, గౌరవం ఉందన్నారు. కరీంనగర్ జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ తుమ్మెట సమ్మిరెడ్డి, కట్ల సతీష్ పాల్గొన్నారు.


older | 1 | .... | 1969 | 1970 | (Page 1971) | 1972 | 1973 | .... | 2069 | newer