Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

ధాన్యం కొనుగోలు కోసం మార్క్‌ఫెడ్‌కు రెండు వేల కోట్ల రుణం

$
0
0

హైదరాబాద్, డిసెంబర్ 19: తెలంగాణలో మార్కెట్లోకి వరిధాన్యం భారీగా వస్తుండటంతో రైతులకు కనీస మద్దతు ధర లభించేందుకు, వేగంగా కొనుగోళ్లు జరిగేందుకు వీలుగా మార్క్‌ఫెడ్‌ను కూడా ప్రభుత్వం రంగంలోకి దించింది. ఇప్పటికే పౌరసరఫరాల శాఖ రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేస్తోంది. రైస్‌మిల్లర్లు కూడా నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్లోకి వస్తున్న ధాన్యం భారీగా ఉండటంతో వస్తున్న ధాన్యం కొనుగోలు చేసేందుకు వీరికి కష్టమవుతోంది. దాంతో మార్క్‌ఫెడ్ రంగంలోకి వస్తోంది. ధాన్యం కొనుగోలు చేసేందుకు మార్క్‌ఫెడ్ వద్ద అవసరమైన నిధులు లేకపోవడం వల్ల ఈ సంస్థ నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (ఎన్‌సీడీసీ) నుండి 2000 కోట్ల రూపాయలు రుణం తీసుకునేందుకు రాష్ట్రప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు సముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి పేరుతో బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.


వివాదాస్పదంగా మారిన ఫిరాయింపులు

$
0
0

హైదరాబాద్, డిసెంబర్ 19: శాసనసభ ఎన్నికల ముందు పార్టీ ఫిరాయించి కాంగ్రెస్‌లో చేరిన నలుగురు ఎమ్మెల్సీలపై చర్య తీసుకోవాలని టీఆర్‌ఎస్ పార్టీ చేసిన ఫిర్యాదు వివాదాస్పదంగా మారింది. టీఆర్‌ఎస్ నుంచే కాదు తమ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్‌రెడ్డి సంగతేంటనీ? అని కాంగ్రెస్ పార్టీ కూడా శాసనమండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేయడంతో చర్య తీసుకునేటట్టు అయితే పార్టీ మారిన అందరిపై చర్య తీసుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నం కావడంతో మండలి చైర్మన్ స్వామిగౌడ్ ఎటూ తేల్చుకోలేని సందిగ్ధంలో పడిపోయారు. ఒక వేళ టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీలపై చర్య తీసుకోవాల్సి వస్తే, కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్సీపై కూడా చర్య తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ‘కరిస్తే కప్పకు, కరవకపోతే పాముకు కోపం’ అన్న చందంగా మండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు ఇరకాటంలో పడిపోయారు. శాసనసభ ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీ కొండా మురళి తన భార్య కొండా సురేఖకు టీఆర్‌ఎస్ నుంచి టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్‌లో చేరారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. అలాగే మరో ఎమ్మెల్సీ రాములు నాయక్ ఉమ్మడి మెదక్ జిల్లా నారాయణఖేడ్ నుంచి టీఆర్‌ఎస్ టికెట్ ఆశించి భంగపడి కాంగ్రెస్‌లో చేరారు. టీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్సీ రేకుల భూపతిరెడ్డిని ఆరు నెలల కిందట పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో ఆయన ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. మరో ఎమ్మెల్సీ కొత్తకాపు యాదవరెడ్డి ఎన్నికలకు ముందు సోనియాగాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. ఈ నలుగురు ఎమ్మెల్సీలు టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరడంతో వీరిపై అనర్హత వేటు వేయాలని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు టీఆర్‌ఎస్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఐదు నెలల కిందట కాంగ్రెస్ పార్టీకి చెందిన కూచుకుళ్ళ దామోదర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీలపై చర్య తీసుకునేటట్టు అయితే మరి టీఆర్‌ఎస్‌లో చేరిన దామోదర్‌రెడ్డి సంగతేంటనీ బుధవారం కాంగ్రెస్ ప్రతినిధి బృందం శాసనమండలి చైర్మన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. టీఆర్‌ఎస్ చేసిన ఫిర్యాదు మేరకు నలుగురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేస్తే, కాంగ్రెస్ ఫిర్యాదుపై కూచుకుళ్ళపై కూడా అనర్హత వేటు వేయాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీపై అనర్హత వేటు వేస్తే తలెత్తబోయే పరిణామాలపై మండలి చైర్మన్ స్వామిగౌడ్ తర్జనభర్జన పడుతున్నారు. పైగా ఫిరాయింపులపై మరో సమస్య తలెత్తింది. పార్టీ ఫిరాయించిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలలో ఇద్దరు స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి, ఒకరు ఎమ్మెల్యేల కోటా నుంచి, మరొకరు గవర్నర్ కోటా నుంచి ఎమ్మెల్సీలుగా (రాములు నాయక్) ఎన్నికయ్యారు. స్థానిక సంస్థల, ఎమ్మెల్యేల నియోజకవర్గం నుంచి ఎంపికైన వారిని మాత్రమే పార్టీ ఎమ్మెల్సీలగా పరిగణిస్తారు. గవర్నర్ కోటా నుంచి ఎంపికైన ఎమ్మెల్సీ ఏ పార్టీకి చెందిన వ్యక్తి కిందకే వస్తారు. అలాంటప్పుడు గవర్నర్ కోటా కింద ఎంపికైన రాములు నాయక్‌పై చర్య తీసుకునే అధికారం తనకు ఉందా అని మండలి చైర్మన్ స్వామిగౌడ్ న్యాయ నిపుణులు, రాజ్యాంగ నిపుణులతో చర్చిస్తున్నారు. ప్రజా ప్రతినిధుల పార్టీ ఫిరాయింపు చర్యలకు దిగితే గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్య ఎందుకు తీసుకోలేదన్నది మరో వివాదంగా మారబోతుంది.

క్యూకట్టనున్న ప్రైవేటు వర్శిటీలు

$
0
0

హైదరాబాద్, డిసెంబర్ 19: రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్శిటీలను స్వాగతించేందుకు మార్గం సుగమం అయింది. ప్రైవేటు యూనివర్శిటీల ఏర్పాటుకు గత మార్చిలోనే శాసనసభ , శాసనమండలి ఆమోదం తెలిపాయి. అయితే విధివిధానాలతో కూడిన మార్గదర్శకాలను ఇంత వరకూ ఉన్నత విద్యాశాఖ జారీ చేయలేదు. దీనిపై పలు సంస్థల అభిప్రాయాలను సేకరించిన ఉన్నత విద్యాశాఖ, మార్గదర్శకాలకు ఉన్నత విద్యామండలికి సూచించింది. ఉన్నత విద్యామండలి దీనిపై పూర్తి కసరత్తు చేసి కొన్నిసూచనలను ప్రభుత్వానికి పంపింది. వీటన్నింటినీ క్రోడీకరించి ప్రైవేటు యూనివర్శిటీలకు సంబంధించి సమగ్ర జీవో జారీ చేయనున్నారు. మరో పక్క కొత్తగా ప్రైవేటు యూనివర్శిటీల ఏర్పాటుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కూడా ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటి నుండి అందుకు సిద్ధమైతే జూన్‌లో విద్యాసంవత్సరం ప్రారంభించే నాటికి కొన్ని యూనివర్శిటీల ఏర్పాటుకు, అడ్మిషన్లకు వీలుకలుగుతుందని భావిస్తోంది. ఇప్పటికే విట్, అమృత, రామచంద్ర, సెంచూరియన్ , ఆనందా గ్రూప్, ఎమిటీ, గ్రేట్ లేక్స్, ఐఎఫ్‌ఎంఆర్ తదితర ప్రైవేటు యూనివర్శిటీలు తమ కేంద్రాలను అమరావతిలో ప్రారంభించడమేగాక, అడ్మిషన్లను కూడా పూర్తి చేశాయి. రెండు నుండి ఐదు ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం సమకూర్చినట్టయితే యూనివర్శిటీలను నెలకోల్పేందుకు అంతర్జాతీయ ఖ్యాతి గడించిన అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఎ, బిఈడీ కోర్సులను నిర్వహిస్తున్న విద్యాసంస్థలు సైతం ప్రైవేటు యూనివర్శిటీలుగా మారేందుకు సిద్ధంగా ఉన్నాయి. కార్పస్ ఫండ్ 50 కోట్లుగా నిర్ణయించాలా లేక దానిని 20 కోట్లకు పరిమితం చేయాలా అనే విషయం కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. దానిని ఐదు కోట్లకు పరిమితం చేయాలని పలు సంస్థలు కోరుతున్నాయి. ఐదేళ్ల తర్వాత ఆ నిధులను ఆయా విద్యాసంస్థలు అభివృద్ధి పేరిట ఖర్చు చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. మల్లారెడ్డి, షాదాన్, శ్రీనిధి, సీవీఎస్‌ఆర్, గీతం, ఇక్ఫాయి, కేఎల్‌యూ తదితర సంస్థలు ఇప్పటికే ప్రైవేటు యూనివర్శిటీల ఏర్పాటుకు ఆసక్తిని వ్యక్తం చేశాయి.
తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్స్ అభ్యర్ధుల విజయకేతనం
రాష్ట్ర వెనుకబడిన తరగతుల ఉద్యోగ నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందిన 129 మందితెలంగాణ పంచాయతీరాజ్ కార్యదర్శి ఉద్యోగాల్లో ఎంపికైనట్టు బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.
పోర్టల్‌లో ఎన్‌టీఎస్‌ఈ సమాధాన పత్రాలు
గత నెల 4వ తేదీన నిర్వహించిన నేషనల్ ట్యాలెంట్ సెర్చి ఎగ్జామినేషన్ సమాధాన పత్రాలపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన మీద సమాధాన పత్రాలను పరీక్షల సంచాలకుడి కార్యాలయం వెబ్‌సైట్ బీఎస్‌ఈ డాట్ తెలంగాణ డాట్ జీవోవీ డాట్ ఇన్ అనే పోర్టల్‌లో ఉంచినట్టు సంచాలకుడు బి సుధాకర్ తెలిపారు.
అఖిల భారత వాణిజ్య సదస్సు
ఇన్నోవేషన్, ఉద్యోగ కల్పన, స్థిరమైన అభివృద్ధి తదితర అంశాలపై ఈ నెల 20 నుండి మూడు రోజుల పాటు ఉస్మానియా యూనివర్శిటీలో అఖిల భారత వాణిజ్య సదస్సు నిర్వహిస్తున్నట్టు వీసీ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం తెలిపారు. సదస్సుకు 28 రాష్ట్రాల నుండి ప్రతినిధులు హాజరవుతున్నారు. అత్యధికంగా మహారాష్ట్ర నుండి 300 మంది, యుపీ నుండి 200, కర్నాటక నుండి 140, బీహార్ నుండి 150, రాజస్థాన్ నుండి 100 మంది ప్రతినిధులు వస్తున్నారు.

ఒకవైపు చలి పులి...మరోవైపు స్వైన్‌ఫ్లూ

$
0
0

హైదరాబాద్, డిసెంబర్ 19: అసలే చలి కాలం, మరోవైపు ఫెథాయ్ తుపానుతో రాష్ట్రంలో వాతావరణం మరింత చల్లబడింది. చలికి ప్రజలు వణుకుతుంటే వ్యాధులు, స్వైన్‌ఫ్లూ విజృంభించే ప్రమాదం ఉంది. స్వైన్‌ఫ్లూతో గాంధీ ఆసుపత్రిలో వృద్దుడు మరణంచగా, మరో ఇద్దరికి స్వైన్‌ఫ్లూ సోకినట్లు అనుమానం. దీంతో వైద్యులు వారిద్దరినీ ప్రత్యేక వార్డులో చికిత్స చేస్తున్నారు. చలి తీవ్రత, ఈదురు గాలులతో స్వైన్‌ఫ్లూ వైరస్ విస్తరించే ప్రమాదం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. కొద్దిగా జ్వరం వచ్చినా, కాళ్ళు, చేతులు లాగినట్లు ఉన్నా, తలనొప్పిగా ఉన్నా, వాంతులు, విరేచనాలు అవుతున్నా సమీపంలోని ఆసుపత్రికి లేదా ప్రభుత్వ డిస్పెన్సరీలకు, ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళి మందులు తీసుకోవాలని వారు సూచించారు.

త్వరలో వరుస నోటిఫికేషన్లు

$
0
0

హైదరాబాద్, డిసెంబర్ 19: ఉద్యోగ నియామకాలకు సంబంధించి వరుస నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ సిద్ధమవుతోంది. ఇంత వరకూ 38వేల 59 పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టామని అన్నారు. 101 నోటిఫికేషన్ల ద్వారా ఇంత వరకూ 16వేల 50 పోష్టుల నియామకాలు చేశామని 20వేల 260 పోస్టులకు సంబంధించి నియామక ప్రక్రియ కొనసాగుతోందని అన్నారు. వివిధ కారణాల వల్ల 1877 పోస్టులను భర్తీ చేయలేకపోయమని ఇంత వరకూ సర్వీసు కమిషన్ నిర్వహించిన అన్ని పరీక్షలకు 34 లక్షల మంది హాజరయ్యారని, టీఆర్‌టీ- టీచర్సు రిక్రూట్‌మెంట్ టెస్టుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. కాగా గ్రూప్-1తో పాటు మిగిలిన సర్వీసుల నోటిఫికేషన్లు సైతం ఒకదాని వెంబడి మరొకట్టి రానున్నాయి.

ఆ చట్టం టీఆర్‌ఎస్‌కు వర్తించదా?

$
0
0

హైదరాబాద్: ఫిరాయింపుల చట్టం కాంగ్రెస్‌కే తప్ప టీఆర్‌ఎస్‌కు వర్తించదా? అని శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు షబ్బీర్ అలీ ప్రశ్నించారు. పార్టీలు ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై చర్య తీసుకోవాలని గత నాలుగేళ్లుగా తాము ఫిర్యాదు చేస్తే పట్టించుకోని పాలకపక్షం ఇప్పుడదే పార్టీ చర్య తీసుకోవాలని కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీలపై టీఆర్‌ఎస్ ఫిర్యాదు చేయగానే ముగ్గురికి నోటీసులు ఇచ్చిన మండలి చైర్మన్, మరి కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్‌రెడ్డికి నోటీసు ఎందుకు ఇవ్వడం లేదని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. బుధవారం నాడిక్కడ షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ, తలసాని శ్రీనివాస్‌యాదవ్ పార్టీ ఫిరాయించి టీఆర్‌ఎస్‌లో చేరి నాలుగున్నరేళ్లు మంత్రిగా కొనసాగితే చర్య ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డిపై తాము కూడా శాసనమండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేశామన్నారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమేనని, ఓడిపోయినంత మాత్రాన ఇంట్లో కూర్చొమని, ప్రజల పక్షాన నిలబడి పోరాడుతామన్నారు. నిరుద్యోగ భృతి, రైతు రుణ మాఫీపై సీఎం కేసీఆర్ అప్పుడే మాట మార్చారని షబ్బీర్ అలీ విమర్శించారు. రైతుల పంట రుణాల మాఫీకి పై తమ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు తొలి సంతకం చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ క్రెడిబిలిటీ ఏంటో, కేసీఆర్ క్రెడిబిలిటీ ఏంటో ప్రజలకు తెలుసన్నారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లపై ప్రభుత్వం కోర్టులో పిటిషన్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయంతో వేయి మంది బీసీ సర్పంచ్‌లు, 9 వేల మంది వార్డు మెంబర్లు నష్టపోతారన్నారు.

ఏకాభిప్రాయంతోనే ప్రధాని అభ్యర్థి ఎంపిక

$
0
0

కోల్‌కతా: ఏకాభిప్రాయంతోనే ప్రధాని అభ్యర్థి ఎంపిక జరుగుతుందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థి అని ఇటీవల స్టాలిన్ చేసిన ప్రకటనపై విలేకరులతో మాట్లాడుతూ ప్రధాని అభ్యర్థిని నిర్ణయించేందుకు ఇది సరైన సమయం కాదని అన్నారు. అందరం కలిసి పనిచేస్తున్నామని పేర్కొన్నారు.

రెండురోజుల్లోనే రైతురుణ మాఫీ:రాహుల్

$
0
0

న్యూఢిల్లీ: అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ చేసిన వాగ్ధానాన్ని నిలబెట్టుకుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు రైతురుణ మాఫీని ప్రకటించటంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హార్షం వ్యక్తం చేశారు. తాము రైతురుణ మాఫీకి పది రోజులు అడిగామని, కేవలం రెండు రోజుల్లో చేశామని అన్నారు.


సౌర విద్యుత్‌పై అవగాహన పెంచాలి:గవర్నర్

$
0
0

హైదరాబాద్: సౌర విద్యుత్ పై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని గవర్నర్ నరసింహాన్ అన్నారు. ఆయన ఖైరతాబాద్‌లోని మోక్షగుండం విశే్వశ్వరయ్య భవన్‌లో ఇంధన పొదుపు అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గవర్నర్ భవనంలో వంద శాతం సౌర విద్యుత్ వాడుతున్నామని అన్నారు. ఇంధన పొదుపు పాటించిన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ఆయన అవార్డులను అందజేశారు.

లాలూ ప్రసాద్‌కు తాత్కాలిక బెయిల్

$
0
0

పాట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు పటియాల కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. లాలూ రైల్వే మంత్రిగా ఉన్నపుడు ఐఆర్‌సీటీసీ కుంభకోణం కేసులో లాలూపై కేసు నమోదు అయింది. ఈమేరకు ఆయనకు జైలుశిక్ష పడింది.

పులి బతికే ఉంది:చౌహాన్

$
0
0

భోపాల్: చమత్కారంగా మాట్లాడటంలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అందెవేసిన చేయి. ఆయన మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత భుద్ని నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్ధేశించి మాట్లాడుతూ ‘‘్భయపడకండి. పులి బతికేవుంది. మీకేమి కాదు’’ అని అన్నారు. ఈయన వ్యాఖ్యలపై పలువురు పలువిధాలుగా వ్యాఖ్యానిస్తున్నారు.

పోలవరంపై అసత్య ప్రచారం చేస్తే చర్యలు:దేవినేని

$
0
0

విజయవాడ: పోలవరంపై వైకాపా అసత్య ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోలవరం నిర్మాణంపై కేంద్రం కూడా సంతృప్తిని వ్యక్తంచేసిందని అన్నారు. టీఆర్‌ఎస్‌తో కలిసి వైఎస్ జగన్ రాష్ట్రంలోని ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన హరీశ్

$
0
0

సిద్ధిపేట: పట్టణంలోని అంబేద్కర్ నగర్ అరుంధతి కల్యాణ మండపంలో ఎమ్మెల్యే హరీశ్‌రావు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ నుంచి పెన్షన్లు, యువతకు నిరుద్యోగ భృతీ ఇస్తామని వెల్లడించారు.

పార్లమెంటు ఆవరణలో టీడీపీ ఎంపీల నిరసన

$
0
0

న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని కోరుతూ టీడీపీ ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహాం ఎదుట గురువారంనాడు కూడా ఆందోళన చేశారు.

విశాల్ అరెస్టు: ముదురుతున్న వివాదం

$
0
0

చెన్నై: తమిళ సినీ నిర్మాతల సంఘంలో రగులుతున్న వివాదం రోజు రోజుకి ముదురుతుంది. సినీ నటుడు విశాల్‌ను విభేదిస్తున్న 50 మంది నిర్మాతలు నిన్న సంఘం కార్యాలయానికి తాళం వేశారు. తాళం పగులగొట్టి కార్యాలయంలోకి వెళ్లాలనుకున్న విశాల్‌ను ఈరోజు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయ. దీంతో పోలీసులు విశాల్‌ను అరెస్టు చేశారు. సినీ నిర్మాతలు సంఘం పనితీరుపై ఆగ్రహాం వ్యక్తంచేస్తున్నారు.


రాజ్యసభ రేపటికి వాయిదా

$
0
0

న్యూఢిల్లీ: నేడు కూడా ఎలాంటి కార్య క్రమాలు జరగకుండానే రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. చైర్మన్ సభను ప్రారంభించగానే టీడీపీ ఎంపీలు ప్లకార్డులు చేతబట్టి ప్రత్యేక హోదా కోసం, కావేరీ జల వివాదంపై అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన చేయటంతో చైర్మన్ వెంకయ్యనాయుడు అసహనం వ్యక్తం చేస్తూ.. ఆమోదించాల్సిన బిల్లులు చాలా వున్నాయని, దేశం మనల్ని గమనిస్తుందని అన్నారు. అయనప్పటికీ సభ్యులు ఆందోళన విరమించకపోవటంతో సభను రేపటికి వాయిదా వేశారు.

వణుకుతున్న ఉత్తర భారతం

$
0
0

న్యూఢిల్లీ: చలి గాలులతో ఉత్తర భారతం వణుకుతోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో పగటి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఒక విధంగా మంచు కురుస్తుండటంతో సిమ్లాను తలపిస్తోందని అంటున్నారు. చత్తీస్‌గఢ్‌లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో పాటు వీస్తున్న చలి గాలులకు పశువులు అధిక సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. చత్తీస్‌గఢ్‌లో 24 గంటల వ్యవధిలోనే 45కు పైగా పశువులు చనిపోయాయి. పశువుల సంరక్షణకు సరైన చర్యలు తీసుకోపోతే సంరక్షకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. రాజస్థాన్‌లో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు చేరుకుంది. మాతా వైష్ణోవి దేవాలయ సమీపంలో ఉష్ణోగ్రతలు అత్యంత మైనస్ స్థాయికి చేరుకున్నాయి. ఇక్కడ 7.0 స్థాయికి పడిపోయాయి.

రాజకీయ పార్టీలతో లోకసభ స్పీకర్ భేటీ

$
0
0

న్యూఢిల్లీ: లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈరోజు వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశమయ్యారు. లోకసభ జరుగకుండా ఏర్పడుతున్న అంతరాయాలపై ఆమే వివిధ పార్టీల నేతలతో చర్చించారు. సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరారు. సభలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు రేపు రూల్స్ కమిటీ వేయాలని నిర్ణయించారు. సమావేశానికి ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గేతో పాటు వివిధ పార్టీల నేతలు దాదాపు 20మంది హాజరయ్యారు.

పటియాల కోర్టుకు సజ్జన్ కుమార్

$
0
0

న్యూఢిల్లీ: సిక్కుల ఊచకోత కేసులో జీవిత ఖైదు పడిన కాంగ్రెస్ నేత సజ్జన్‌కుమార్ ఈరోజు పటియాల కోర్టుకు హాజరయ్యారు. నానావతి కమిషన్ సిఫార్సుల మేరకు సీబీఐ దాఖలు చేసిన రెండో కేసులో విచారణ కోసం ఆయన పటియాల కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు విచారణను జనవరి 2వ తేదీకి వాయిదా వేశారు.

తేజ్ ప్రతాప్‌కు బంగ్లా కేటాయింపు

$
0
0

పాట్నా: ఆర్జేడీ చీఫ్ లలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, యహువా ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్‌కు ప్రభుత్వం కొత్త బంగ్లా కేటాయించింది. రాజకీయ పోరాటం చేసేందుకు తనకు బంగ్లా కేటాయించాలని ఆయన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం బంగ్లా కేటాయించింది.

Viewing all 69482 articles
Browse latest View live