Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

ప్రసాదంలో విషం కలిపారు..

$
0
0

బెంగళూరు: కర్ణాటకలోని చామరాజనగర జిల్లా సూల్వాడలోని మారెమ్మ ఆలయంలో భక్తులకు ఇచ్చే ప్రసాదంలో 15 బాటిళ్ల విషపూరితమైన పురుగుమందు కలిపారని పోలీసుల వెల్లడించారు. గాఢత అధికంగా ఉండటంతో 15మంది భక్తులు చనిపోయారని పోలీసులు తెలిపారు. ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు ఇమ్మాడి మహదేశ్వర స్వామి అలియాస్ దేవన్న మరో ముగ్గురుతో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ట్రస్ట్ యాజమాన్యంతో దేవన్నకు ఉన్న విభేదాలే దీనికి కారణం.


ఇందిరాపార్క్ వద్ద బీసీల ధర్నా

$
0
0

హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల కోటాను తగ్గించటాన్ని నిరసిస్తూ బీసీలు ఈరోజు ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేశారు. జస్టిస్ ఈశ్వరయ్య, చెరుకు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

మహాకూటమిలో ఉపేంద్ర చేరిక

$
0
0

న్యూఢిల్లీ:ఆర్ఎస్ఎల్‌పీ అధ్యక్షుడు ఉపేంద్ర కుషవాహ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో'మహాకూటమి'లో చేరినట్టు ఆయన ప్రకటించారు.తనను మహాకూటమిలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణకు కేసీఆర్ దిక్సూచి

$
0
0

జనగాం: కేసీఆర్ నాయకత్వానికి ఈ రాష్ట్రానికి ఓ దిక్సూచి అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. జనగాంలో జరిగిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతూ తాను కార్యకర్తలకు అండగా ఉండాలన్నదే కేసీఆర్ ఆదేశమన్నారు. లక్షలాది మంది కార్యకర్తలకు కచ్చితంగా అండగా ఉంటామన్నారు.

నేడు వరంగల్‌కు కేటీఆర్

$
0
0

వరంగల్, డిసెంబర్ 19: టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు నేడు గురువారం జనగామ, వరంగల్ అర్బన్ జిల్లాల్లో పర్యటించనున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పదవి బాధ్యతలు స్వీకరించి మొదటి సారిగా జనగామ, వరంగల్ జిల్లాలకు వస్తున్న సందర్భంగా టీఆర్‌ఎస్ శ్రేణులు భారీగా స్వాగత ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటలకు జనగామ జిల్లా పొలిమేరలోని పెంబర్తి వద్దకు చేరుకోగానే కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలకనున్నారు. పాలకుర్తి, స్టేషన్‌ఘనపూర్, జనగామ నియోజకవర్గాలకు సంబంధించిన పార్టీ శ్రేణులు ఇక్కడ పాల్గొంటారు. ర్యాలీగా వచ్చిన అనంతరం జనగామలో టీఆర్‌ఎస్ అర్బన్ పార్టీ కార్యాలయానికి ఆయన శంకుస్ధాపన చేస్తారు. అనంతరం ప్రిస్టన్ గ్రౌండ్‌లో మూడు నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తలు, నాయకులతో సమావేశం అయ్యి కార్యకర్తలకు దిశనిర్ధేశం చేస్తారు. అక్కడి నుండి వరంగల్ అర్బన్ జిల్లాకు బయలుదేరుతారు. మధ్యాహ్నం 2 గంటలకు మడికొండ వద్ద టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలకనున్నారు. అక్కడి నుండి బైక్ ర్యాలీగా కాజీపేటకు చేరుకుంటారు. కాజీపేటలో కేటీఆర్ రోడ్‌షోలో పాల్గొంటారు. అక్కడి నుండి ర్యాలీగా హన్మకొండ బాలసముద్రంలో టీఆర్‌ఎస్ అర్బన్ పార్టీ కార్యాలయానికి ఆయన శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుండి ఆయన నేరుగా కాకతీయ డిగ్రీకళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వరంగల్ అర్బన్, రూరల్, వర్ధన్నపేట, నర్సంపేట, పరకాల నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొంటారు. అనంతరం అక్కడి నుండి ఆయన హైదరాబాద్‌కు తిరుగుప్రయాణం అవుతారు. కేటీఆర్ వరంగల్ పర్యటన ఏర్పాట్లను కడియం శ్రీహరి నేతృత్వంలో ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, డాక్టర్ రాజయ్య, దాస్యం వినయ్‌భాస్కర్, నన్నపునేని నరేందర్, ఆరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డితోపాటు రాష్ట్ర రైతు విమోచన సంస్ధ చైర్మన్ నాగుర్ల వేంకటేశ్వర్లు, రాష్ట్ర వికలాంగుల చైర్మన్ వాసుదేవరెడ్డి, కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి తదితరులు పర్యవేక్షిస్తున్నారు.

టీఆర్‌ఎస్ ప్రభుత్వ పథకాలు

$
0
0

గజ్వేల్, డిసెంబర్ 19: దేశంలోనే టీఆర్‌ఎస్ ప్రభుత్వ పథకాలు ఆదర్శంగా నిలవగా, పేదలకు చేరినందునే సీఎం కేసీఆర్ సారద్యంలో మరోసారి తెలంగాణలో అధికారం చేపట్టినట్లు రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మెన్ పన్యాల భూపతిరెడ్డి, రాష్ట్ర ఫుడ్ సొసైటీ చైర్మెన్ గంగుమల్ల ఎలక్షన్‌రెడ్డిలు పేర్కొన్నారు. బుధవారం గజ్వేల్, ప్రజ్ఞాపూర్ తదితర ప్రాంతాలలో ప్రభుత్వం చేపట్టిన చీరెల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొని వారు ప్రసంగించారు. మహిళా సంక్షేమానికి టీఆర్‌ఎస్ సర్కార్ పెద్దపీట వేయగా, గౌరవంగా బ్రతికేందుకే డ్వాక్రా రుణాలు అందజేయడంతోపాటు చీరెల పంపిణీకి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టినట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా రైతుల అభ్యున్నతిని కాంక్షిస్తూ ప్రాజెక్టుల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిదులు కెటాయించగా, రైతుబంధు, రైతుభీమా, 24 గంటల ఉచిత విద్యుత్, సబ్సీడీపై ట్రాక్టర్లు, పనిముట్లు, బిందుసేద్యం పరికరాలు వంటి సదుపాయాలు కల్పించడంతోపాటు నీటి తీరువా రద్దు చేసిన ఘనత కేసీఆర్ కే దక్కిందని తెలిపారు. అధికారం కోసం ఏపీ సీఎం చంద్రబాబుతోపాటు ఇక్కడి కాంగ్రెస్, సీపీఐ, కోదంరాం పార్టీలు కుట్రలు, కుతంత్రాలు పన్నినా ప్రజలు వారిని చీకొట్టినట్లు అన్నారు. జిల్లాలో 3లక్షల 80వేల మంది మహిళలకు చీరెలు అందజేస్తుండగా, పకడ్భందీగా అమలు చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. దేశంలో టీఆర్‌ఎస్ చక్రం తిప్పనుండగా, టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే సత్తా ఎవరికీ లేదని పేర్కొంటూ ఇక ప్రాంతీయ పార్టీలదే హవా అని అన్నారు. గజ్వేల్ నుండి సీఎం కేసీఆర్ ప్రాతినిత్యం వహించడం ఇక్కడి ప్రజల అదృష్టం కాగా, మరోసారి గెలిపించి రుణం తీర్చుకున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో గడా అధికారి ముత్యంరెడ్డి, మున్సిపల్ చైర్మెన్ గాడిపల్లి భాస్కర్, వైస్ చైర్మెన్ అరుణ భూపాల్‌రెడ్డి, కౌన్సిలర్‌లు సుబాష్‌చంద్రబోస్, వసీంఖాన్, ఉప్పల మెట్టయ్య, రామదాసు, నర్సింలు, రాజ్‌కుమార్, కళ్యాన్‌కర్ స్రవంతి శ్రీనివాస్, సంతోషి రాంచంద్రాచారి, నీరుడి మల్లమ్మ ఇస్తారి, వంటేరు బుచ్చమ్మ నారాయణరెడ్డి, జకియొద్దీన్, నంగునూరి విజయలక్ష్మి సత్యనారాయణ, నేతలు ఊడెం కృష్ణారెడ్డి, ఆకుల దేవేందర్, గోపాల్‌రెడ్డి, రజిత, అంజనేయులు, మంగలి సాయి పాల్గొన్నారు.

సిద్దిపేటలో సినీ నటి
లావణ్య త్రిపాఠి సందడి
సిద్దిపేట, డిసెంబర్ 19 : సిద్దిపేట జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన హ్యపీ మోబైల్ షోరూంను ప్రముఖ సినీ నటి లావాణ్య త్రిపాఠీ సందడి చేశారు. హ్యపీ షోరూం ప్రారంభించేందుకు సినీ నటి లావాణ్య త్రిపాఠీ విచ్చేస్తున్నట్లు ప్రచారం చేయటంతో మెదక్ రోడ్డు జనంతో సందడిగా మారింది. సినీ నటీ లావాణ్య త్రిపాఠీ కోసం జనం గుమిగూడారు. సినీ నటి లావణ్య త్రిపాఠీ రాగానే ప్రజలు పెద్దఎత్తున కేరింతలు కొట్టారు. నిర్వాహకులు లావణ్య త్రిపాఠీని సాదరంగా ఆహ్వానించారు. లావాణ్య త్రిపాఠీ జ్యోతి ప్రజ్వలన చేసి షోరూంను ప్రారంభించారు. అనంతరం సెల్‌ఫోన్ మోడల్స్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠీ మాట్లాడుతూ హాయ్ సిద్దిపేట బాగున్నారా అని ఆత్మీయంగా పలకరించారు. సిద్దిపేట పట్టణం ఏంతో బాగుందని, పచ్చదనంతో నిండి ఆహ్లదరకంగా ఉందన్నారు. హ్యపీ మోబైల్ షోరూం తెలుగు రాష్ట్రాల్లో 43వ దన్నారు. హ్యపీ షోరూం జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందన్నారు. అతి తక్కువ ధరలకే మన్నికైన సెల్‌ఫోన్‌లు లభిస్తాయన్నారు. వినియోగదారలు సద్వినియోగం చేసుకోవాలన్నారు
జిల్లా కేంద్రంలో వ్యాపార రంగంలో మరింత అభివృద్ధి- హరీష్‌రావు
సిద్దిపేట జిల్లా కేంద్రంగా ఏర్పాటు కావటంతో వ్యాపారపరంగా మరింత అభివృద్ధి చెందుతుందని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లాగా ఏర్పాటు కావటంతో కొత్తగా కార్పొరేట్ సంస్థలు వచ్చాయన్నారు. సిద్దిపేట వ్యాపార రంగంలో దిన,దిన అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తులో వ్యాపార కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

బతుకమ్మ చీరల పంపిణీ
జగదేవ్‌పూర్, డిసెంబర్ 19: మండలంలోని అన్ని గ్రామాలలో బుధవారం బతుకమ్మ చీరలను స్థానిక రేషన్ డీలర్లు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో అర్హులైన మహిళలందరికి పంపిణీ చేశారు. మంగళవారం అయా గ్రామపంచాయతీలకు కేటాయించిన ఇంచార్జీ అధికారులు బతుకమ్మ చీరలను గ్రామపంచాయతీ కార్యాలయాలకు చేర్చారు. ఉదయం నుండి చీరల పంపిణీని కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక నాయకుల సహకారంతో ఈ నెల 21 చీరల పంపిణీ కార్యాక్రమాన్ని పూర్తి చేయనున్నారు.

ఆగి ఉన్న లారీని ఢీకొన్న వజ్ర బస్సు
ముగ్గురికి విరిగిన కాళ్లు * మరికొంత మందికి గాయాలు
రామాయంపేట, డిసెంబర్ 19: ఆగి ఉన్న లారీని వజ్ర మినీ బస్సు ఢీకొట్టిన సంఘటన దామరచెర్వు వద్ద బుధవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మెహిదీపట్నం డిపోకు చెందిన వజ్ర బస్సు నిజామాబాద్ నుండి హైదరాబాద్‌కు వెళ్తుండగా దామరచెర్వు వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొంది. డ్రైవర్ రవీందర్ వెంటనే దూకి పరారయ్యాడు. రమేశ్, సాయన్నల కాళ్లు విరిగాయి. చంద్రకుమార్, సుబ్బయ్య, నర్సింహం, వీరేశం, మీరా, శరణ్య, విఠల్, ప్రశాంత్‌లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను రామాయంపేట ఆసుపత్రిలో చికిత్సలు నిర్వహించారు. పోలీసులు కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

$
0
0

సంగారెడ్డి టౌన్, డిసెంబర్ 19: ప్రభుత్వ సర్వీసులో ఉన్న ప్రతి ఒక్కరు ప్రజలకు ఏ విధంగా సేవలందించగలమన్న ఆలోచనతో ముందుకు సాగాలని జిల్లా జడ్జి సాయి కళ్యాణ్ చక్రవర్తి సూచించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ది ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆల్టర్‌నేటివ్ డిస్ప్యూట్ రిసౌల్యూషన్, రీజినల్ సెంట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్‌షాప్‌కు జడ్జి ముఖ్య అతిధిగా హాజరైనారు. నీటిపారుదల, రోడ్డు మరియు భవనాలు, పంచాయతీరాజ్ శాఖల ఇంజనీర్లకు ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కార పద్దతులు, ఇటివల వచ్చిన సవరణలపై అవగాహాన కల్పించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే అవకాశం అందరికి రాదని, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న ఆయా శాఖల అధికారులు ప్రజలకు చేరువై అన్ని విధాల మెరుగైన సేవలందించాలన్నారు. ఏ విషయంలోనైన సత్వర న్యాయం జరిగేలా చూడాలని కోరారు. రెండు రోజుల పాటు జరిగే శిక్షణలో పూర్తిస్థాయిలో అన్ని విషయాలు, చట్టాలపై అవగాహాన పొందాలని ఇంజనీర్లకు సూచించారు. ఐసిఏడిఆర్ ప్రాంతీయ ఇంచార్జి జెఎల్‌ఎన్ మూర్తి మాట్లాడుతూ ఐసిఏడిఆర్ సుప్రీం కోర్టు పరిభిలో పని చేస్తున్న స్వయం ప్రతిపత్తి గల సంస్థ అని తెలిపారు. ఆల్టర్‌నేటివ్ డిస్ప్యూట్ రిసౌల్యూషన్ పద్దతులను ప్రచారం చేసి కోర్టులలో కేసులను తగ్గించాలనే ఉద్దేశ్యంతో సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వివాదాల పరిష్కారానికి ఏడిఆర్ పద్దతులు ప్రోత్సాహకరంగా ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా ఇంజనీర్లు ఈ పద్దతులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రాజెక్టుకు సంబంధించి ఏవేని క్లేమ్స్ ఉన్నట్లయితే రూ.40లక్షల వరకు తమ సంస్థ వద్దకు వచ్చి మద్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. వివిధ శాఖల్లో ఉన్న పలు సమస్యలు, వివాదాలను కోర్టుకు వెల్లకుండా పరిష్కరించుకోవడానికి ఈ సంస్థను వినియోగించుకొని పరిష్కరించుకోవాలని సూచించారు. శిక్షణలో బాగంగా పవర్ ప్రాజెంటేషన్ ద్వారా ఇంజనీర్లకు చట్టాలపై అవగాహాన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హన్మంతరావు, ఆర్‌అండ్‌బి ఎస్‌ఈ వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

కేటీఆర్ సారథ్యంలో తిరుగులేని శక్తిగా టీఆర్‌ఎస్
* కాళేశ్వరం ప్రాజెక్టుకు
జాతీయ హోదా లక్ష్యం
* బీడు భూములు సస్యశ్యామలం చేయడంపై కేసీఆర్ దృష్టి
* రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మడుపు భూంరెడ్డి
గజ్వేల్, డిసెంబర్ 19: కేటీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా టీఆర్‌ఎస్ రూపుదిద్దుకోనుందని రాష్ట్ర హౌజింగ్ కార్పొరేషన్ చైర్మెన్ మడుపు భూంరెడ్డి పేర్కొన్నారు. బుధవారం గజ్వేల్ మండలం రిమ్మనగూడ, కొడకండ్లలో చీరలు పంపిణీ చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాల సద్వినియోగంతోనే తిరిగి టీఆర్‌ఎస్ అధికారం చేపట్టగా, ప్రతిపక్ష పార్టీల జిమ్మిక్కులు, మభ్య పెట్టే హామీలను ప్రజలు విశ్వసించ లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్రంపై టీఆర్‌ఎస్ సర్కార్ వత్తడి తెస్తుండగా, రాష్ట్రంలో బీడు భూములు సస్యశ్యామలం చేయడమే కేసీఆర్ ముందున్న లక్ష్యమని తెలిపారు. అలాగే టీఆర్‌ఎస్‌ను సంస్థాగతంగా తీర్చిదిద్దే బాద్యత ను రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్‌గా కేటీఆర్ పూర్తి స్థాయిలో సఫలీకృతం కానుండగా, పార్టీలో కష్టపడే నేతలందరికి కేసీఆర్ సముచిత గౌరవం కల్పించనున్నట్లు చెప్పారు. వచ్చే పంచాయతీ, సహకార, మున్సిపల్, ఎంపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని, రాష్ట్రంలో 16 పార్లమెంట్ సీట్లు దక్కించుకుంటే ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశం కలగడంతోపాటు సీఎం కేసీఆర్ ప్రధాని పదవిని దక్కించుకున్నా ఆశ్చర్య పోనక్కరలేదని వివరించారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పీటీసీ వెంకట్‌గౌడ్, ఎంపీపీ చిన్నమల్లయ్య, ఎంపీటీసీ అంజీయాదవ్, మండల టీఆర్‌ఎస్ బాద్యులు బెండ మదు, మాజీ సర్పంచ్‌లు మహేందర్ రెడ్డి, రాములు, రాష్ట్ర ఈజీఎస్ డైరెక్టర్ దాసరి అమరావతి, నేతలు రవీందర్‌రావు, మద్దూరి శ్రీనివాస్‌రెడ్డి, మద్ది రాజిరెడ్డి పాల్గొన్నారు.

ఎంబీసీలకు పెద్దపీట

$
0
0

సిద్దిపేట టౌన్, డిసెంబర్ 19: రోజు రోజుకు పెరిగిపోతున్న ప్లాస్టిక్ వాడకం దృష్ట్యా.. ప్రజాజీవనం దెబ్బతింటుందని, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ వాడకం నిషేధం చేద్దామని, మార్పు మనతోనే మొదలు కావాలని.. తొలి అడుగు మనమే వేద్దామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. సిద్దిపేట మున్సిపల్ టౌన్ హాల్‌లోని బీసీ స్టడీ సర్కిల్‌లో బుధవారం కుమ్మరి, శాలివాహన వృత్తి నైపుణ్యత సామర్థ్యం పెంపుదల కోసం మట్టి బాటిళ్ల తయారీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ మేరకు బీసీ జిల్లా బీసీ కార్పొరేషన్ ఈడీ ఆధ్వర్యంలో కుమ్మరి శాలివాహన ప్రతిభావంతులకు సిర్ట్ఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ ఎంబీసీలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. ఎంబీసీ కులాలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడంతో పాటు వారికి ఇతోధికంగా ఆర్థిక ప్రోత్సహకాలు అందిస్తుందన్నారు. కుమ్మరి శాలివాహన ప్రతిభావంతులు తయారు చేసిన మట్టి బాటిళ్లు, పాత్రలను విక్రయించే విధంగా మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడంతో పాటు సిద్దిపేట రైతుబాజార్‌లో స్టాల్ ఏర్పాటు చేయిస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కులవృత్తుల ప్రోత్సాహం అందించడమే కాకుండా నాయి బ్రాహ్మణులకు ప్రభుత్వ సౌజన్యంతో డీఈఓ కార్యాలయం సమీపంలో ఓ నాయి బ్రహ్మణుడి మంగలి దుకాణాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం కల్పించిన ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కృష్ణ్భాస్కర్, జేసీ పద్మాకర్, బీసీ కార్పొరేషన్ ఈడీ, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్‌ను కలిసిన విద్యార్థి విభాగం నేతలు
* టీఆర్‌ఎస్‌వీని మరింత బలోపేతం చేయండి * సీఎం కేసీఆర్
గజ్వేల్, డిసెంబర్ 19: సీఎం కేసీఆర్‌ను జిల్లా విద్యార్థి విభాగం నేతలు కలిసి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరారు. టీఆర్‌ఎస్‌వీ జిల్లా కోఅర్డినేటర్ పాండుగౌడ్ నేతృత్వంలో బుధవారం కేసీఆర్‌ను కలిసి పాఠశాలలో నెలకొన్న సమస్యలు, చేపడుతున్న కార్యక్రమాలను ఆయన దృష్టికి తేగా, టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ కోరారు. ముఖ్యంగా విద్యారంగానికి సర్కార్ పెద్దపీట వేస్తుండగా, ప్రభుత్వ విద్యను పేదలకు చేర్చాలన్నదే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే గురుకుల తరహాలో మైనార్టీ, బీసీ, ఎస్సీలకు ఆంగ్ల మాద్యమంలో మెరుగైన విద్యాబోదన అందిస్తూ పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలు విద్యార్థులకు అందజేస్తుండగా చక్కటి ఫలితాల సాదనలో ముందుండాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీఆర్‌ఎస్‌వీ సమన్వయ కర్త కుమార్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

వేగంగా మెదక్ రైల్వే పనులు

రూ. 117 కోట్లతో 17.5 కిలో మీటర్ల దూరం * పనుల పురోగతిపై సమీక్షించిన జీఎం వినోద్‌కుమార్

హైదరాబాద్, డిసెంబర్ 19: మెదక్ ప్రజల చిరకాల కోరిక త్వరలో తీరనున్నది. అక్కన్నపేట- మెదక్ పట్టణం మధ్య జరుగుతున్న రైల్వే పనుల పురోగతిపై బుధవారం దక్షిణ మధ్య రైల్వేశాఖ జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ అధికారులతో సమీక్షించారు. ఈ మార్గంలో చేపట్టిన పనులు త్వరిగతిగా పూర్తి చేయాలని ఆయన అభికారులకు సూచించారు. ఈ ప్రాజెక్టు పనులు 2014- 2015 ఆర్థిక సంవత్సరంలో పనులు ప్రారంభించారు. 2018-2019 ఆర్థిక సంవత్సరంలో పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేసి లక్ష్యాన్ని అధికమించాలని ఆయన చెప్పారు. జిల్లా కేంద్రంగా ఉన్న మెదక్‌కు రైల్వే మార్గం లేకపోవడంతో మెదక్ ప్రజలు సుదూర ప్రాంతలకు వెళ్ళలేక పోతున్నారు. అక్కన్నపేట- మెదక్ మధ్య చేపట్టనున్న రైల్వే మార్గానికి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా భూమిని రైల్వేశాఖకు అందచేయడంతో పాటు 50 శాతం నిధులను సమకూర్చించింది. ఈ మార్గంలో 3 కొత్త రైల్వే స్టేషన్లు, 3 పెద్ద వంతెనలు, 35 చిన్న వంతెనలు, ఒక రోడ్డు ఒవర్ వంతెన, 15 రోడ్ అండర్ వంతెనలు చేపట్టారు. రాబోవు రోజుల్లో అక్కన్నపేట రైల్వే జంక్సన్‌గా ఏర్పాటు కానున్నది. మెదక్ నుంచి ఇతర ప్రాతాలకు వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి చేసుకోవడానికి ఉపయోగపడనున్నది. మెదక్‌లో ఉన్న అతిమెద్ద చర్చి ( 1924) సందర్శంచడానికి ఇతర ప్రాంతల నుంచి యాత్రికులు రావడానికి ఈ రైలు సౌకర్యం కల్గున్నుది.


తహశీల్దార్‌ను అడ్డుకున్న రైతులు

$
0
0

ఊట్కూర్, డిసెంబర్ 19: ఊట్కూర్ తహశీల్దార్ కార్యాలయం చుట్టు ప్రక్కల ప్రహరీ గోడను నిర్మించేందుకు తహశీల్దార్ శ్రీనివాస్ కార్యాలయం సమీపంలో ఉన్న ముళ్ళ పొదలను జేసీబీతో తొలగిస్తుండగా రైతులు అడ్డుకున్నారు. దీంతో రైతులు తహశీల్దార్ మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ఊట్కూర్ తహశీల్దార్ కార్యలయం నిర్మించేందుకు కోర కుటుంబానికి చెందిన రైతులు భూమిని దానం ఇచ్చారు. అప్పట్లో భూమిని దానం ఇవ్వగా, ప్రస్తుతం 20 గుంటల భూమికి చుట్టూ తహశీల్దార్ శ్రీనివాస్ ప్రహరి గోడ నిర్మించేందుకు ముళ్ళ పొదల తొలగింపు పనులు చేపట్టగా గతంలో భూదానం చేసిన వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండ పనులు ఎలా చేపడుతున్నారని రైతులు నిలదీశారు. దీంతో తహశీల్దార్ రైతుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఎస్సై సురేష్‌గౌడ్ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని వారి వారించారు. తహశీల్దార్ మా భూముల్లో ప్రహరి గోడ నిర్మించేందుకు ముళ్ళ పొదలు తొలగిడం సరైంది కాదని మండిపడ్డారు. దీంతో వాగ్వాదం చోటు చేసుకోగా జడ్పిటీసీ సూర్యప్రకాష్‌రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ వైస్ చెర్మన్ నింగిరెడ్డి అక్కడికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ముళ్ల పొదల తొలగింపు పనులను నిలిపివేయాలని, రెండు రోజుల తర్వాత ఆధారాలు చూసి సమస్యను పరిస్కరిస్తామని ఇరువురికి సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. తహశీల్దార్ కార్యాలయానికి భూదానం చేసిన కుటుంబ సభ్యులు తమ భూమి అక్రమంగా కబ్జా చేసుకునేందుకు చూస్తున్నారని అరోపించారు. భూదానం చేసిన రికార్డులు ప్రకారం ఎవరికీ నష్టం జరగకుండా చూస్తామని గ్రామ పెద్దలు హమీ ఇవ్వడంతో శాంతించారు. ఈ విషయం తహశీల్దార్ శ్రీనివాస్‌ను విలేఖరులు సంప్రదించగా కార్యలయానికి 20 గుంటలు భూమిని గతంలో దానం చేసినట్లు తమ దగ్గర ఆధారాలున్నాయని తెలిపారు. అనంతరం సమస్యకు పరిస్కారం ఏవిధంగా వస్తుందోనని గ్రామస్థులు చర్చించుకుంటున్నారు.

అర్హులైన ప్రతీ పేద మహిళలకు బతుకమ్మ చీరలు
* వనపర్తి ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

వనపర్తి, డిసెంబర్ 19: రాష్ట్రంలోని అర్హులైన ప్రతి పేద ఆడపడుచుకు రాష్ట్రప్రభుత్వం బతుకమ్మ చీరలను అభిమానంతో, ప్రేమతో, సత్కారభావనతో ఇస్తుందని వనపర్తి ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరా కాలనీలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి చీరలను పంపిణి చేశారు. అనంతరం మహిళలను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను చేస్తున్నదని , ఇందులో భాగంగానే అర్హులైన ఆడపడుచులందరికి బతుకమ్మ చీరలను పంపిణి చేయడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున దసరా పండుగ సందర్బంగా బతుకమ్మ చీరలను పంపిణి చేయాలేకపోయామని, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి కేసీ ఆర్ ఆదేశాల మేరకు మొదటి కార్యక్రమంగా బతుకమ్మ చీరల పంపిణి చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను పజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలతోపాటు ప్రత్యేకించి రంజాన్, క్రిస్మస్, బతుకమ్మ పండుగలకు దుస్తులు పంపిణి చేస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాల్ చైర్మన్ రమేష్‌గౌడ్, మున్సిపాల్ కమిషనర్ రజనీకాంత్‌రెడ్డి, వార్డు కౌన్సిలర్ ప్రమీలమ్మ, కౌన్సిలర్లు వాకిటి శ్రీ్ధర్, లోక్‌నాథ్‌రెడ్డి, ఎంపిపి శంకర్‌నాయక్ పాల్గొన్నారు.

బతుకమ్మ చీరల పంపిణీ
పాన్‌గల్, డిసెంబర్ 19: పాన్‌గల్ మండల కేంద్రంలో బుధవారం గ్రామ పంచాయితీ వద్ద మహిళలకు బతుకమ్మ చీరలను కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను దుర్వినియోగం చేయకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఎన్నికల హామీల సందర్బంగా కొల్లాపూర్ నియోజక వర్గానికి ఇచ్చిన హామిలను నెరవేర్చాలని ఆయన కోరారు. సోమశిల,సిద్దేశ్వరం బ్రిడ్జి, కొల్లాపూర్ నియోజక వర్గాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి వెంకటేష్‌నాయుడు, జడ్పిటిసి రవికుమార్, ఎంపిటిసిలు రాంచందర్‌యాదవ్, వెంకటన్న, కో ఆప్షన్ సభ్యులు యూనిస్‌ఖాన్, ప్రత్యేక ఆధికారి స్వరణ్‌సింగ్, తహశీల్దార్ అలెగ్జాండర్, ఎంపిడివో సాయిబ్రింద, ఎం ఈవో లక్ష్మణ్‌నాయక్, ఏపి ఎం మద్దిలేటి, ఆర్ ఐలు పాల్గొన్నారు.

పంచాయతీ ఎన్నికలకు టీఆర్‌ఎస్ సన్నద్ధం

$
0
0

మహబూబ్‌నగర్, డిసెంబర్ 19: అసెంబ్లీ ఎన్నికల్లో సత్తాచాటిన టీఆర్‌ఎస్ నాయకులు. ఇక గ్రామపంచాయతీలపై దృష్టిసారించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 1631కిపైగా గ్రామపంచాయతీలుగా ఉన్నాయి. 12నియోజకవర్గాల్లో ప్రస్తుతం కొల్లాపూర్ మినహాయించి 11నియోజకవర్గాల్లో తెరాస ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దీంతో ఎప్పుడు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన రంగంలోకి దిగేందుకు టీఆర్‌ఎస్ నాయకులు కసరత్తులు మొదలుపెట్టారు. ఈ నెల చివరివారంలోగాని జనవరి మొదటివారంలోగానీ గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉండడంతో టీఆర్‌ఎస్ నాయకులు ముందస్తుగానే గ్రామాల్లో సమీకరణాలకు శ్రీకారం చుట్టారు. ఇకపోతే ప్రతి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహించేవాటిలో ప్రతిమండలంలో 10కి తక్కువ కాకుండా గ్రామపంచాయతీలను ఏకగ్రీవం చేసుకోవాలని టీఆర్‌ఎస్ నాయకులు భావిస్తున్నారు. అందుకుగాను వ్యూహాలను రచించుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆ దిశగా క్షేత్రస్థాయిలో కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 1600లకుపైగా గ్రామపంచాయతీల్లో బీసీ ఓటరు జాబితాను కూడా తుదిరూపం దాల్చి తుదిజాబితాను కూడా విడుదల చేశారు. గ్రామసభల ద్వారా వాటిని ఆమోదింపజేసుకుని జిల్లా ఎన్నికల అధికారి ద్వారా రాష్ట్ర ఎన్నికల అధికారికి గత రెండురోజుల క్రితమే జిల్లా ఓటర్ల తుదిజాబితా నివేదికను అందజేశారు. దాంతో గత రెండురోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల కమిషన్ సైతం గ్రామపంచాయతీ ఎన్నికలను డిసెంబర్ 31తర్వాతగానీ, అంతలోపల ప్రభుత్వం సహకరిస్తే అందుకు తాము సిద్ధమంటూ ప్రకటన వెలవడించడంతో అందరి దృష్టి పంచాయతీ ఎన్నికలపై పడింది. జనవరి మొదటివారంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడితే జనవరి చివరివారంలోగానీ, ఫిబ్రవరి మొదటివారంలోగానీ పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అలాకాకుంటే డిసెంబర్ చివరివారంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడినట్లు అయితే జనవరి మూడవవారంలో మూడువిడతల్లో గ్రామపంచాయతీ
ఎన్నికలు జరిగే అవకాశం కనబడుతుంది. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ రాకముందే గామపంచాయతీ ఎన్నికలను పూర్తి చేసుకుని ఆ ఎన్నికల్లో గ్రామగ్రామాన గులాబీ జెండాను ఎగురవేసుకుని అదే ఊపుతో పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లడానికి తెరాస సిద్దమవుతుంది. అయితే కొందరు ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం ఆశ పెట్టుకున్నారు. ఈ నెలఖారులో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు ఒకటిరెండు మంత్రి పదవులు దక్కుతాయని తెరాస వర్గాలు భావిస్తున్నారు. అలా జరిగితే ఇంకా జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో సత్తాచాటేందుకు సులువైన మార్గం లభిస్తుందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలకు ఇప్పటికే నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, మహబూబ్‌నగర్ జిల్లాల పంచాయతీ అధికారులు అంతా సమాయత్తంగా ఉన్నారు. ఇప్పటికే బ్యాలెట్ పేపర్ల ముద్రణకు సిద్దం చేసుకున్నారు. ఇకపోతే బ్యాలెట్ బాక్స్‌లను కూడా ఇదివరకే పరిశీలించిన జిల్లాల కలెక్టర్లు ఎన్నికల నోటిఫికేషన్ తరువాయి అన్నట్లుగానే ఉన్నారు. గ్రామాల్లో తెరాస నాయకుల కోలాహలంతో పంచాయతీ ఎన్నికల వేడి మొదలైంది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం తమ నియోజకవర్గాల్లో ప్రతి గ్రామపంచాయతీని పిలుపించుకునేందుకు పక్కా ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు. ఇందుకుగాను పార్టీ శ్రేణులను సిద్దం చేస్తున్నారు. మరో వారంరోజుల వ్యవధిలో ఆయా గ్రామపంచాయతీల రిజర్వేషన్లు కూడా ఖరారు కానున్న నేపథ్యంలో రిజర్వేషన్లు ఖరారు అయిన వెంటనే టీఆర్‌ఎస్ నాయకులను సర్పంచు అభ్యర్థులుగా ముందుగానే ప్రకటించుకుని అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే గ్రామాల్లో సైతం ప్రస్తుతం ముందస్తు ప్రచారానికి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు శ్రీకారం చుట్టేందుకు సమాయత్తం అవుతున్నారు.

అమ్రాబాద్ కేజీబీవీ ప్రత్యేకాధికారి సస్పెన్షన్
* డీఈవో కార్యాలయంలో అకౌంటెంట్ తొలగింపు
* డీఈవో సహదేవుడు
నాగర్‌కర్నూల్/ అమ్రాబాద్, డిసెంబర్ 19: జిల్లాలోని అమ్రాబాద్ కేజీబీవీ ప్రత్యేకాధికారి ఉమాదేవిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు డీఈవో సహదేవుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదర కేజీబీవీని ఈనెల 16న ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా సమగ్ర శిక్ష ఫైనాన్స్ అధికారి వరప్రసాద్ సందర్శన నివేదిక ఆధారంగా డీఈవో కార్యాలయంలో అకౌంట్స్ విభాగంలో కాంట్రాక్టు విధులు నిర్వహిస్తున్న బి. గంగాధర్‌ను ఆర్థిక పరమైన అవకతవకలకు పాల్పడినందున ఈనెల 20 నుంచి విధుల నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. అమ్రాబాద్ కేజీబీవీ ప్రత్యేకాధికారి ఉమాదేవి ప్రభుత్వ ఆర్థిక నిబంధలకు వ్యతిరేకంగా, పదర కేజీబీవీ ప్రత్యేకాధికారి శారదకు చెక్‌పవర్ అప్పగించకుండా వినియోగిస్తున్నందుకు ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఆమెతోపాటు తెలుగు సీఆర్టీ లక్ష్మీదేవికి మెమో ఇచ్చినట్లు తెలిపారు.
బతుకుదెరువుకు నీరే ఆధారం
* ప్రజాసేవ చేయడం కోసమే పాలమూరుకు వచ్చా..
* నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యం
* ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్‌టౌన్, డిసెంబర్ 19: వలసల జిల్లా అయిన పాలమూరు జిల్లాలో బతుకుదెరువుకు నీరే ఆధారమని అందువల్ల రానున్న రోజుల్లో గ్రామాల్లోని చెరువులను నింపి రైతులకు సాగునీటిని అందిస్తామని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ హామీ ఇచ్చారు. బుధవారం మహబూబ్‌నగర్ మండల పరిధిలోని జమిస్తాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి డబ్బు సంపాదించేందుకు రాలేదని ప్రజాసేవ చేయడం కోసమే వచ్చానని తెలిపారు.
డబ్బులు సంపాదించుకోవడం కోసం అయితే హైదరాబాద్ నుండి మహబూబ్‌నగర్‌కు వచ్చేవాడిని కాదని స్పష్టం చేశారు. నియోకవర్గ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని ఎవరు ఎన్ని కుట్రలు చేసిన ప్రజలు ఓట్ల ద్వారా ప్రతిపక్ష పార్టీలకు గుణపాఠం చెప్పారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు ప్రతిపక్ష పార్టీలు అడుగడుగున ఆటంకాలు సృష్టించాయని అందువల్లే పనుల నిర్వహణ అనుకున్న సమయంలో పూర్తి కాలేదన్నారు. ఎన్ని ఆటంకాలు సృష్టించిన పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విరామం ఎరుగని అవిశ్రాంత శ్రామికుడని ఆయన హయంలో ఎమ్మెల్యేగా కొనసాగడం పాలమూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆయన పెర్కోన్నారు. సీఎంగా భాద్యతలు స్వీకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మరుక్షణమే కాలేశ్వం, పాలమూరు ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి అధికారులతో సమీక్షా మావేశం ఏర్పాటుచేశారని అన్నారు. భవిష్యత్తులో దేశరాజకీయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలకపాత్ర పోషిస్తారని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సావిత్రి, జడ్పీటీసీ శ్రీదేవి, వైస్ ఎంపీపీ మల్లు సరస్వతమ్మ, గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, ఆర్డిఓ శ్రీనివాస్, తహశీల్దార్ రాజేందర్‌రెడ్డి, ఎంపీడీఓ మొగులప్ప పాల్గొన్నారు.
తహశీల్దార్‌ను అడ్డుకున్న రైతులు
* ప్రహరీగోడ నిర్మాణంలో వివాదం
ఊట్కూర్, డిసెంబర్ 19: ఊట్కూర్ తహశీల్దార్ కార్యాలయం చుట్టు ప్రక్కల ప్రహరీ గోడను నిర్మించేందుకు తహశీల్దార్ శ్రీనివాస్ కార్యాలయం సమీపంలో ఉన్న ముళ్ళ పొదలను జేసీబీతో తొలగిస్తుండగా రైతులు అడ్డుకున్నారు. దీంతో రైతులు తహశీల్దార్ మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ఊట్కూర్ తహశీల్దార్ కార్యలయం నిర్మించేందుకు కోర కుటుంబానికి చెందిన రైతులు భూమిని దానం ఇచ్చారు. అప్పట్లో భూమిని దానం ఇవ్వగా, ప్రస్తుతం 20 గుంటల భూమికి చుట్టూ తహశీల్దార్ శ్రీనివాస్ ప్రహరి గోడ నిర్మించేందుకు ముళ్ళ పొదల తొలగింపు పనులు చేపట్టగా గతంలో భూదానం చేసిన వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండ పనులు ఎలా చేపడుతున్నారని రైతులు నిలదీశారు. దీంతో తహశీల్దార్ రైతుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఎస్సై సురేష్‌గౌడ్ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని వారి వారించారు. తహశీల్దార్ మా భూముల్లో ప్రహరి గోడ నిర్మించేందుకు ముళ్ళ పొదలు తొలగిడం సరైంది కాదని మండిపడ్డారు. దీంతో వాగ్వాదం చోటు చేసుకోగా జడ్పిటీసీ సూర్యప్రకాష్‌రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ వైస్ చెర్మన్ నింగిరెడ్డి అక్కడికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ముళ్ల పొదల తొలగింపు పనులను నిలిపివేయాలని, రెండు రోజుల తర్వాత ఆధారాలు చూసి సమస్యను పరిస్కరిస్తామని ఇరువురికి సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. తహశీల్దార్ కార్యాలయానికి భూదానం చేసిన కుటుంబ సభ్యులు తమ భూమి అక్రమంగా కబ్జా చేసుకునేందుకు చూస్తున్నారని అరోపించారు. భూదానం చేసిన రికార్డులు ప్రకారం ఎవరికీ నష్టం జరగకుండా చూస్తామని గ్రామ పెద్దలు హమీ ఇవ్వడంతో శాంతించారు. ఈ విషయం తహశీల్దార్ శ్రీనివాస్‌ను విలేఖరులు సంప్రదించగా కార్యలయానికి 20 గుంటలు భూమిని గతంలో దానం చేసినట్లు తమ దగ్గర ఆధారాలున్నాయని తెలిపారు. అనంతరం సమస్యకు పరిస్కారం ఏవిధంగా వస్తుందోనని గ్రామస్థులు చర్చించుకుంటున్నారు.
కాంగ్రెస్‌లో చేరిన టీఆర్‌ఎస్ కార్యకర్తలు
పెద్దకొత్తపల్లి, డిసెంబర్ 19: మండల పరిధిలోని నాయినోనిపల్లికి చెందిన టీఆర్‌ఎస్ కార్యకర్తలు పలువురు బుధవారం కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, సీనియర్ నాయకులు చింతలపల్లి జగదీశ్వర్‌రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మండలంలోని ముష్టిపల్లిలోని జగదీశ్వర్‌రావు స్వగృహంలో జరిగిన కార్యక్రమంలో రాకాసి రవీందర్‌రెడ్డి, రాకాసి విష్ణువర్ధన్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, పెద్దిరెడ్డి సుధాకర్‌రెడ్డి, సింగిల్‌విండో డైరక్టర్ సుధాకర్‌రెడ్డి, యాదవ సంఘం మండల అధ్యక్షులు పర్వతాలు, భాస్కర్‌రెడ్డితోపాటు 50 మంది కార్యకర్తలు చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ప్రతి కార్యకర్తకు సమన్యాయం చేస్తానని అన్నారు. వచ్చే గ్రామపంచాయతీ ఎన్నికలలో కలిసికట్టుగా పని చేసి అధిక స్థానాలలో సర్పంచ్‌లుగా గెలవాలన్నారు. నాయినోనిపల్లి మైసమ్మ దేవస్థానంలో కొంతమంది అవినీతికి పాల్పడుతున్నారనే విషయం తన దృష్టికివచ్చిందని, ఇకమీదట ఎలాంటి అవినీతి జరగకుండా చర్యలు తీసుకుంటానని అన్నారు. అవినీతికి పాల్పడితే వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు రత్నకర్‌ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాసులు, నాయకులు నర్సింహ, నాగరాజు, రాజశేఖర్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

ఆడ పడచుల ఆనందమే సీఎం కేసీఆర్ లక్ష్యం

$
0
0

గోపాల్‌పేట, డిసెంబర్ 19: తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఆడపడుచు తెలంగాణ రాష్ట్ర ఆడపడుచుగా భావించి చీరల పంపిణీకి ముఖ్యమంత్రి కేసీ ఆర్ శ్రీకారం చుట్టారని వనపర్తి ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం తహశీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు చీరలను పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరలను దసరా పండుగ అప్పుడు జరుపుకునే బతుకమ్మ ఉత్సవాలలోనే పంపిణీ చేయాల్సి ఉందని , కొంత మంది చీరల పంపిణీని అడ్డుకోవాలని కోర్టుకు వెళ్లడంతో అగిపోగా ఎన్నికల అనంతరం బుధవారం నుంచి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని క్రైస్తవులకు క్రిస్మస్ కిట్లను పంపిణి చేయడం జరుగుతుందని , అలాగే ముస్లింలకు వారి పండుగల సందర్భంగా చీరలను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఆడ పడుచులకు చీర పెట్టడం ప్రతి ఇంట్లో సంప్రదాయంగా ఉంటుందని ఆ సంప్రదాయాన్ని ముఖ్యమంత్రి కేసీ ఆర్ రాష్ట్రంలోని మహిళలకు చీరలు అందేలా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. గోపాల్‌పేట మండలానికి 13241 చీరలు అవసరం ఉండగా ఇప్పటికి 10080 చీరలు వచ్చాని తహశీల్దార్ రాధాకృష్ణ తెలిపారు. అర్హత ఉన్న ప్రతి మహిళకు చీరలు పంపిణి చేయాలని ఆయన ప్రత్యేకంగా తహశీల్దార్‌కు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి జానకిరాంరెడ్డి, వైస్ ఎంపిపి రాజేశ్వరి, మాజీ సర్పంచు పద్మ, మండల టీ ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వనపర్తిలో..
వనపర్తి: అనురాగాలు, ఆత్మీయతలకు గుర్తుగా బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలోవనపర్తి మండలం అప్పాయిపల్లి గ్రామంలో నిర్వహించిన చీరల పంపిణిని ఎమ్మెల్యే చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇంటి ఆడపడుచుకు ఒడి బియ్యం పోసిన తరువాత చీర, సారెలు పెట్టిన విధంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆడ పడుచులకు బతుకమ్మ చీరలను పంపిణి చేస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమం హృదయస్పందనతో, మానవీయ కోణంతో చేస్తున్న కార్యక్రమమని ఆయన అభివర్ణించారు. కార్యక్రమానికి హజరైన జిల్లా కలెక్టర్ శే్వతామహంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక కార్యక్రమాలను చేపడుతున్నదని, ముఖ్యంగా గర్బవతి అయిన మహిళకు అంగన్‌వాడి కేంద్రాల పౌష్టికాహర పంపిణి, ఉచిత వైద్య సేవలు, ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు చేయించుకుంటే కేసీ ఆర్ కిట్టు అమలు, కిశోర బాలికలకు ఆరోగ్య కిట్టు పంపిణి, మహిళలకు బతుకమ్మ చీరల పంపిణి చేస్తున్నదన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పాలిస్టర్ చీరలను పంపిణి చేయడం జరుగుతుందని, సుమారు 80 రకాల చీరలు చిన్న బార్డర్‌తో కూడినవి జాకెట్‌తో కలుపుకొని ఈ సంవత్సరం పంపిణి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి శంకర్‌నాయక్, తహశీల్దార్ శాంతిలాల్, ఎంపిడివో జహిర్ తదితరులు పాల్గొన్నారు.

రెండో విడత గొర్రెల పంపిణీని
పకడ్బందీగా చేపట్టాలి
* కలెక్టర్ శే్వతా మహంతి

వనపర్తి, డిసెంబర్ 19: ఈనెల 24వ తేది నుండి రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం మొదలవుతుందని, ఈ కార్యక్రమాన్ని పకడ్బందిగా చేపట్టాలని కలెక్టర్ శే్వతామహంతి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె తన చాంబర్‌లో రెండవ విడత గొర్రెల పంపిణీ, పాడి పశువుల పంపిణీపై పశుసంవర్థక శాఖ అధికారులతో సమీక్షించారు. ఆయా మండలాల వారిగా కలెక్టర్ సమీక్షిస్తూ అన్ని మండలల్లో ముందుగా ఎంపిక చేసిన గ్రామాలలో గొర్రెల పంపిణీని చేపట్టాలన్నారు. రెండవ విడతలో గొర్రెల పంపిణికి లబ్ధిదారులు ముందుకు వచ్చి డీడీలు చెల్లించిన చోట పంపిణిని చేపట్టాలని, గొర్రెల కాపరుల సహకార సంఘాల అ్ధ్యక్ష, కార్యదర్శులు, లబ్ధిదారులతో డీడీలు కట్టించేలా చూడాలని కోరారు. ఎవరైనా లబ్ధిదారులు ఇష్టం లేనట్లయితే దరఖాస్తులు చేసుకుంటే వారి డీడీలను వాపస్ చేయడం జరుగుతుందన్నారు. ఆత్మకూర్, అమరచింత, పాన్‌గల్ మండలంలోని జమ్మాపూర్, చిక్కేపల్లిలోని మాదాసి కుర్వలు ఇప్పటి వరకు ఈ పథకం కింద నమోదు కాలేదని, అందు వల్ల వారికి గొర్రెల పంపిణి పథకం కింద ప్రాదాన్యత ఇవ్వాలని తెలిపారు. మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో గొర్రెలను పొంది చనిపోయిన 366 కేసులకు రూ.5వేల చొప్పున సుమారు రూ.19లక్షల 2వేలు బీమీ రావడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. చనిపోయిన గొర్రెల స్థానంలో కొత్త గొర్రెలను ఇవ్వడం జరుగుతుందని అన్నారు. చిన్నంబావి మండలం కొప్పునూర్ గ్రామంలో 43 మంది లబ్ధిదారులకు సోమవారం నుండి రెండవ విడత గొర్రెల పంపిణి చేపట్టాలని సంబంధిత పశువైద్యాదికారిని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ పాడి పశువుల పంపిణిని సమీక్షిస్తూ ఇప్పటి వరకు చెల్లించిన డిడిలు, యూనిట్ల గ్రౌండింగ్ తదితర విషయాలను సమీక్షించారు. ఈ సమావేశానికి జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి వెంకటేశ్వర్‌రెడ్డి, సహయ సంచాలకులు పూర్ణచంద్రారావు, పశుసంవర్థక అధికారులు పాల్గొన్నారు.

ధన ప్రవాహంతోనే టీఆర్‌ఎస్ గెలుపు

$
0
0

సూర్యాపేట, డిసెంబర్ 19: ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ విచ్చలవిడిగా డబ్బులు పంపిణీచేసి గద్దెనెక్కిందని సీపీఎం రాష్టక్రార్యదర్శివర్గ సభ్యు లు, మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ఎంవి భవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పార్టీ శాశ్వత పథకాలు కాకుండా తాత్కాలిక పథకాలను ప్ర జలకు ఎరవేసి, విచ్చల విడిగా డబ్బుల పంపిణీ చేశారన్నారు. ఎన్నికలలో అధికార యంత్రాగం మొత్తం అధికార పార్టీవైపు మొ గ్గు చూపారని అన్నారు. ఎన్నికలల్లో పోలైన ఓట్ల కంటే కౌంటింగ్‌లో అధిక ఓట్లు రావడం పరిశీలిస్తే ట్యాపరింగ్ జరినట్లుచెప్పక తప్పదన్నారు. ఇప్పటికైన ఎన్నికల సంఘం ఈవియంలతో కాకుండా బ్యాలెట్ పేపర్లతో ఎన్నికల నిర్వహించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్‌లో చట్టం తేవాలన్నారు. మహాకూటమి అభ్యర్దుల ఎంపికలో, టిక్కెట్ల పంపిణీలో చివరి వరకు ఢిల్లీలో ఉంటే కూటమి అభ్యర్దులు ప్రయత్నాలు చేయడం వలన ప్రజల్లో అసహనం కలిగిందన్నారు. అదేవిధంగా బిఎల్‌ఎఫ్, సిపిఎం పార్టీలు బలమైన ఉమ్మడి ఎజెండాతో ప్రజల్లోకి వెళ్ళడం జరిగిందన్నారు. తమ ఎజెండా ప్రజల్లోకి వెళ్ళకపోవడం వలన తమ పార్టీకి కొంతమేర నష్టం కలిగిందని, జరిగిన లోటుపాట్లను సవరించుకుంటూ ప్రజల్లోని సమస్యల పట్ల నిత్యం వారికి అండగా ఉండేందుకు కృషిచేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లాకార్యదర్శి ములకలపల్లి రాములు, రాష్ట్ర కమిటి సభ్యులు మల్లు నాగార్జునరెడ్డి, మల్లు లక్ష్మీ, జిల్లాకార్యదర్శివర్గ సభ్యులు నెమ్మది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, మట్టిపల్లి సైదులు, కోట గోపి, వేల్పుల వెంకన్న, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
వైద్యం వికటించి బాలుడు మృతి..
మునుగోడు, డిసెంబర్ 19: మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం వికటించి బాలుడు మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మునుగోడు గ్రామ పంచాయితీ పరిధిలోని లక్ష్మిదేవిగూడం గ్రామానికి చెందిన దాం స్వామి,అనూష దంపతులకు ఇద్దరూ కుమారులు. చిన్న కుమారుడు (45రోజులు)కు పుట్టిన 45రోజులకు వేయాల్సిన టీకా కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి పెంటా టీకా వేయించుకొని ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి వెళ్లిన తర్వాత నిద్రపోయిన బాలుడు ఎంతకు కళ్ళు తెరుకపోవడంతో అనుమానంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. బాలుడు పరిస్థితి విషమంగా ఉండడంతో నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అసుపత్రి వైదులు బాలుడు మృతి చెందినట్లుగా నిర్ధారించారు. ప్రభుత్వ అసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ బాలుడు మృతి చెందాడని సిబ్బందిని నిలదీశారు. బాలుడు మృతితో తల్లిదండ్రులు, బందువులు దుఖఃసాగరంలో మునిగారు. బాలుడు మృతి దేహాంతో అసుపత్రి ఎదుట దర్నా చేశారు. రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల నాయకులతో కలిసి రోడ్డుపై గంటల తరబడి రాస్తారోకో నిర్వహించారు. తమకు న్యాయం జరుగాలని నిర్లక్ష్యం వహించిన వైద్యాధికారిపై, సిబ్బందిపై చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా ఈ సంఘటనపై ద్యాధికారి శ్రీనివాస్,సిబ్బందిని వివరణ అడుగగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన 28మంది చిన్నారులకు పెంటా టీకా వేశామని మృతి చెందిన బాలుడు తప్ప అందరూ చిన్నారులు బాగున్నారని తెలిపారు.

లక్ష్యానికి మించి ధాన్యం కొనుగోళ్లు!

$
0
0

నల్లగొండ, డిసెంబర్ 19: ధాన్యం కొనుగోలులో నల్లగొండ జిల్లా మరోసారి లక్ష్యాన్ని అధిగమించి సాగుతుంది. ఖరీఫ్ సీజన్‌లో 2లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకోగా 102కేంద్రాల ద్వారా ఇప్పటికే 2లక్షల 4,291మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగింది. సీజన్ ముగింపు దశకు చేరి, మరోవైపు గ్రామాల్లో ముమ్మరంగా రబీ(యాసంగి) వరినాట్లు సాగుతున్నా ఇంకోవైపు పలు గ్రామాల్లో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు సాగుతునే ఉంది. జిల్లా పరిధిలో మరో 22కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు సాగుతుంది. సాగర్ కాలువల కింద పలుచోట్ల ఆలస్యంగా వరికోతలు సాగడంతో ధాన్యం అమ్మకాలు సాగుతున్నాయి. ఇటీవల తుఫాన్ వర్షాలతో పలుచోట్ల ధాన్యం తడిసిపోయి రైతులు ఇబ్బందులు పడుతుండగా అధికార యంత్రాంగం కొనుగోలుకు భరోసానిచ్చింది. ఇప్పటికే జిల్లాలో 40,578మంది రైతులకు సంబంధించి 361కోట్ల 60లక్షల విలువైన ధాన్యం కొనుగోలు చేసి 346కోట్ల 36లక్షల రూపాయలను రైతులకు చెల్లింపులు జరిపారు. మరో 15కోట్ల 24లక్షల చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో సైతం పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు సాగుతుంది. ముఖ్యంగా సూర్యాపేట మార్కెట్ యార్డులో ఇంకా 30వేల క్వింటాళ్ల పైగా ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉండటం, రైతుల నుండి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలివస్తుండటంతో ఈ జిల్లాలో కూడా ధాన్యం కొనుగోలు లక్ష్యం దాటిపోతుంది. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఇంకా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వస్తుండటంతో చివరి గింజ వరకు కొనుగోలు జరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లాల కలెక్టర్లు పౌరసరఫరాల సంస్థను ఆదేశించారు. మూసీ కాలువల పరిధిలోని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు సాగుతుంది. సూర్యాపేటలో ఐకేపి, పీఏసిఎస్ కేంద్రాల ద్వారా 5లక్షల 50వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. యాదాద్రి భువనగిరిలో లక్ష్యంకు మించి 1లక్ష 68వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా ఇంకా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వస్తుండటంతో కొనుగోలు కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు.
డబుల్ ఇళ్ల నిర్మాణాలు
వేగవంతం చేయాలి: కలెక్టర్
నల్లగొండ రూరల్, డిసెంబర్ 19: జిల్లాలో నిరుపేదలకు గృహవసతి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబు ల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల అధికారులను ఆదేశించారు. బుధవారం ఇండ్ల నిర్మాణాల ఎగ్జిక్యూటివ్ ఏజన్సీలు, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, కాంట్రాక్టర్లు, విద్యుత్, ఆర్‌డబ్లూఎస్, ఝనుల శాఖాధికారులతో, ఇతర అధికారులతో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలపై సమీక్షించారు. ముఖ్యంగా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు ప్రగతిలో ఉన్నవాటిని పూర్తి చేసి గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలపెప్రతి వారం సమీక్ష జరుపుతామని, ఇండ్ల నిర్మాణాల వేగం పెంచాలన్నారు. ఇసుక, నీటి సమస్య, విద్యుత్ సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలని, గ్రౌండింగ్ పూర్తి కానివాటిని వెంటనే ప్రారంభించాలన్నారు. ఈ సమావేశంలో హౌసింగ్ పీడీ రాజ్‌కుమార్, పంచాయతీరాజ్ ఎస్‌ఈ హనుమంతరావు, ఈఈలు తిరుపతయ్య, పాపారావు, అనిల్, ఆర్ అండ్ బీ ఎస్‌ఈ బాలస్వామి, ఈఈ నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

కార్యకర్తలు అధైర్యపడొద్దు

$
0
0

పెద్దవూర, డిసెంబర్ 19: రాష్ట్రంలో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కాంగ్రేస్ ఓటమిపాలైందని పార్టీ నాయకులు, కార్యకర్తలు అదైర్యపడవద్దని మాజీ సిఎల్పీనేత కుందూరు జానారెడ్డి అన్నారు. బుధవారం ఆయన పెద్దవూర మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. వచ్చే స్ధానిక సంస్ధల ఎన్నికలలో కాంగ్రేస్ పార్టీ అభ్యర్ధులు గెలుపొందుతారని వారి గెలుపుకు ప్రతి కాంగ్రేస్ కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని సూచించారు. కెసిఆర్ మాటలకు ప్రజలు మరోసారి మోసపోయారని కెసిఆర్ ప్రజలను మభ్యపెడుతూ రాష్ట్రాన్ని అప్పుల ఉబిలోకి నెడుతున్నారని ఆయన అన్నారు. పేదప్రజల కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉపాధి హమీ పధకం రూపాయికి కిలోబియ్యం, తదితర పధకాలను కాంగ్రేస్ ప్రభుత్వమే ప్రవేశపెట్టిందన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం డబ్బు ఖర్చుచేసి ముందస్ధు ఎన్నికలకు పోయి మాయమాటలతో అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రేస్ ప్రభుత్వ హయంలోనే నాగార్జునసాగర్ నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని ఈసందర్భంగా ఆయన అన్నారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు కూరాకుల అంతయ్యయాదవ్, జెడ్పి వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, తుమ్మలపల్లి చంద్రశేఖరరెడ్డి, వాసుదేవుల సత్యనారాయణరెడ్డి, గిరిధర్‌రెడ్డి, బి.లక్ష్మయ్యయాదవ్‌లు పాల్గొన్నారు.
19 ఎంఐఆర్ 6=సమావేశంలో మాట్లాడుతున్న జానారెడ్డి.
టీఆర్‌ఎస్ సంక్షేమ పథకాలు
సద్వినియోగం చేసుకోవాలి
* ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి
నల్లగొండ రూరల్, డిసెంబర్ 19: తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రజాసంక్షేమ పథాకాలతో ముందుకు సాగుతుందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. మండలంలోని చందనపల్లి గ్రామంలో, పట్టణంలోని పలు వార్డులలో బుధవారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ పంపిణీకి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రజాసంక్షేమ పథాకాలతో ముందుకు సాగుతుందన్నారు. సీఎం కేసీఆర్ దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రజా రంజక పాలన సాగిస్తున్నాడన్నా రు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు దైద రజిత, మార్కెట్ చైర్మన్ కరీం పాషా, ఎంపిడివో శ్రీనివాస్ రెడ్డి, ఈవోఆర్డీ సుధాకర్, పంచాయతీ కార్యదర్శులు శ్రవణ్, రవికుమార్, మాజీ సర్పంచ్ పాలడుగు లక్ష్మీశైలజ బిక్షం, బకరం వెంకన్న, దేప వెంకట్‌రెడ్డి, పబ్బతిరెడ్డి రవీందర్ రెడ్డి, రాంరెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
కేసీఆర్‌ది సంక్షేమ ప్రభుత్వం
* ఎమ్మెల్యే భాస్కర్‌రావు
మిర్యాలగూడ, డిసెంబర్ 19: రాష్ట్రంలో సిఎం కె.చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో పని చేస్తున్నది సంక్షేమ ప్రభుత్వమని స్థానిక శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. బుధవారం మిర్యాలగూడ పట్టణంలోని 1, 4, 11, 12, 13, 16 వార్డులో ఎంపిడిఓ, గాంధీపార్క్, వినోభానగర్, రాంనగర్, అహ్మద్‌నగర్‌లలో, మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం, తుంగపాడు గ్రామాల్లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ అందరు సుఖశాంతులతో ఉండాలన్నదే కెసిఆర్ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ జగన్నాధరావు, తహసీల్దార్ కార్తిక్, కమీషనర్ సి.సత్యబాబు, ఎంపిడిఓ ఎన్.ప్రేంకరణ్‌రెడ్డి, ఎంపిపి నూకల సరళ హనుమంతరెడ్డి, మునిసిపల్ వైస్ చైర్మన్ మగ్దుంపాషా, టిఆర్‌ఎస్ పట్టణ, మండల అధ్యక్షులు తిరునగరు భార్గవ్, చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్లు దైదా సోమసుందర్, వంగాల నిరంజన్‌రెడ్డి, మాజిద్, ఇలియాస్, వి.వెంకమ్మ, కోల పార్వతి వెంకన్న, సుశీల జోజి, రేపాల పురుషోత్తంరెడ్డి, పి.నవాబ్, కాత్యాయిని రాంచందర్, జగన్నాధరావు, ఎంఎ.గని, శాగ జయలక్ష్మిజలంధర్‌రెడ్డి, నాయకులు పెద్ది శ్రీనివాస్‌గౌడ్, ఎ.నాగార్జునాచారి, జి.సైదులుబాబు, రేపాల రమేష్, ఎన్.నాగభూషణం,ఉదయభాస్కర్, ఖాదర్, భీమ్లానాయక్, షహనాజ్‌బేగం, ధూలిపాల కళావతి, పద్మావతి, షోయేబ్, ఏడుకొండలు, జొన్నలగడ్డ రంగారెడ్డి, మాజీ సర్పంచ్ చిలుకూరు సత్యనారాయణ, లక్ష్మినారాయణ, వి.మధులు పాల్గొన్నారు.

మహాభారతంలో ఉపాఖ్యానాలు-79

$
0
0

మునులందరు ఈ విషయమై చర్చిస్తున్న సమయంలో తపస్వి హోత్రవాహనుడు అక్కడికి వచ్చాడు. అతను కూర్చున్న తర్వాత వారంతా అంబ సమస్యను అతనికి తెలిపారు. విషయం విని అతను విచారించాడు. అతను అంబకు తల్లి తండ్రి అంటే తాతగారు అవుతాడు. అతడు అంబను దగ్గర కూర్చోబెట్టుకొని జరిగినదంతా వివరించ మన్నాడు. అంబ అతనికి అన్ని సంగతులు చెప్పింది.
అంతా విని అతడు ఇలా అన్నాడు. ‘‘అమ్మారుూ! నీకిష్టం లేకపోతే నీ తండ్రి ఇంటికి వెళ్ళొద్దు. నేను నీ మాతామహుడిని. నా దగ్గర ఉండు. నా మాట విను. నీవు తపస్సు చేసుకుంటున్న జమదగ్ని కుమారుడైన పరశురాముని దగ్గరకు వెళ్ళు. అతను నీ దుఃఖాన్ని పోగొట్టగలడు. తాను చెప్పినట్లు భీష్ముడు చేయకపోతే అతను భీష్ముని యుద్ధంలో సంహరిస్తాడు. అతను నీకు చక్కని మార్గం చూపగలడు’’.
అంబ అతని మాటలు విని పరశురాముని ఎక్కడ దర్శించవచ్చు అని అడిగింది. అప్పుడు హోత్ర వాహనుడు ఇలా చెప్పాడు - ‘‘అతను మహారణ్యంలో తపస్సు చేసుకుంటున్నాడు. జమదగ్ని కుమారుడైన అతను మహావీరుడు, సత్యసంధుడు, మహాబలవంతుడు. అతని దగ్గరికి వెళ్ళి నమస్కరించి అతనికి నాగురించి చెప్పు. అతను నీకు తప్పక సహాయం చేస్తాడు. అతను నాకు మిత్రుడు’’.
హోత్రవాహనుడు ఇలా చెప్తూ ఉండగానే పరశురామునికి ఇష్టుడు, అనుచరుడు అయిన అకృతవ్రణుడు అక్కడ ప్రత్యక్షమైనాడు. అక్కడ మునులందరూ గౌరవపూర్వకంగా లేచి నిలబడ్డారు. తర్వాత వారంతా అనేక విషయాల గురించి చర్చించుకున్నారు. వారి సంభాషణలు ముగిసిన తర్వాత హోత్ర వాహనుడు ఆకృతవ్రణుని పరశురాముని గురించి అడిగాడు. ‘‘మహాత్మా ఆకృతవ్రణా! వేదవేత్తలలో శ్రేష్ఠుడు, పరాక్రమశాలి అయిన జమదగ్నిసుతుని ఇప్పుడు ఎక్కడ చూడగలం?’’
దానికి ఆకృతవ్రణుడు ఇలా సమాధానం చెప్పాడు. ‘‘రాజా! రాముడు ఎప్పుడూ తలుస్తూ ఉంటాడు. రేపు తెల్లవారేసరికి అతను ఇక్కడ ఉంటాడని అనుకుంటున్నాను. నిన్ను చూడాలనే వస్తున్నాడు. ఈ కన్య ఎవరు? అడవికి ఎందుకు వచ్చింది? నీకేమవుతుంది?’’
అప్పుడు హోత్రవాహనుడు అంబ గురించి ఇలా వివరించాడు. ‘‘ఈమె నా దౌహిత్రి. కాశీరాజు కూతురు అంబ. ఈమె తన చెల్లెళ్ళతో స్వయవరంలో పాల్గొంది. ఆ కన్యల కోసం క్షత్రియరాజులంతా కాశీనగరానికి విచ్చేశారు. అప్పుడు మహావీరుడు, శంతనుపుత్రుడు అయిన భీష్ముడు ఆ రాజులందరినీ ఎదిరించి వీరిని కొనిపోయాడు. అతను వీరిని తన తల్లికి అప్పగించి తమ్మునితో వీరి వివాహం నిశ్చయించాడట. అప్పుడు అంబ భీష్మునితో తాను సాళ్వరాజుని వరించానని చెప్పగా అతను సత్యవతితో ఆలోచించి ఈమెను సాళ్వరాజు దగ్గరకు పంపాడు. కాని సాళ్వుడు ఈమెను తిరస్కరించాడు. అందుకని ఈమె తపస్సు చేయాలన్న నిశ్చయంతో ఈ తపోవనానికి వచ్చింది. ఈమె దుఃఖానికంతటికీ కారణం భీష్ముడే’’.
అప్పుడు అంబ ఇలా అంది. ‘‘మహాత్మా! నా తాత
అయిన హోత్రవాహనుడు చెప్పినట్లుగానే జరిగింది. ఇప్పుడు నాకు నగరానికి వెళ్ళాలన్న కోరిక లేదు. మహర్షి అయిన పరశురాముడు నన్ను ఏది చేయుమని ఆజ్ఞాపిస్తాడో అదే చేస్తాను’’.
ఆకృతవ్రణుడు అంబతో ఇలా అన్నాడు. ‘‘అమ్మారుూ! నీకు ఇప్పుడు రెండు దుఃఖకారణాలు ఉన్నాయి. ఒకటి సాళ్వుడు, రెండు భీష్ముడు. వీరిద్దరిలో ఎవరి మీద ప్రతీకారం చేస్తావు? అది చెప్పు. నీకిష్టమైతే మహాత్ముడైన పరశురాముడు నీ కోసం సాళ్వుని ఆజ్ఞాపించి నీ వివాహం అతనితో చేయిస్తాడు. అలా కాక భీష్ముని రాముడు ఓడించాలనుకుంటే అది కూడా భార్గవరాముడు చేయగలడు. ఇప్పుడు నువ్వు ఏది చేయాలో నిశ్చయించుకొనుము.’’ అప్పుడు అంబ అతనితో ఇలా అంది. ‘‘్భగవన్! నా మనసులో సాళ్వుడు ఉన్నాడని తెలియక భీష్ముడు నన్ను తెచ్చాడు. ఇది మనసులో ఉంచుకొని మీరే నిర్ణయించి చేయండి. అన్ని విషయాలు మీకు తెలిపాను. మీరే న్యాయమైన ప్రతీకారం చేయండి’’.
అప్పుడు ఆకృతవ్రణుడిలా అన్నాడు ‘‘అమ్మారుూ! నీవు చెప్పినదంతా ధర్మబద్ధంగా ఉంది. భీష్ముడు నిన్ను ఎత్తుకొనిరాకపోతే సాళ్వుడు నిన్ను తప్పక వివాహం చేసుకొనేవాడు. భీష్ముడు నిన్ను జయించి హస్తినకు తీసుకొని వెళ్ళడం వల్లనే సాళ్వునకు నీపై అనుమానం కలిగి నిన్ను స్వీకరించలేదు. భీష్ముడు ధర్మం పట్ల నిష్ఠ కలవాడు. అతనిక జయకాంక్ష ఉంది. కనుక భీష్ముని పట్ల ప్రతీకారం తీర్చుకోవడమే ఉత్తమం’’.
అప్పుడు అంబ తన మనసులో కూడా అదే కోరిక కలదని చెప్పింది.
ఈ విధంగా మాట్లాడుకుంటూ ఆ రాత్రి కూడా గడిపారు. అప్పుడు శిష్యులతో కలిసి తేజస్వి అయిన పరశురాముడు చేతిలో విల్లు, ఖడ్గము, పరశువు ధరించి ప్రత్యక్షమైనాడు. అతను రజోరహితుడై తాపసి అయిన హోత్రవాహనుని సమీపించాడు. రాజు, అంబ కలిసి మహర్షికి అతిథిసత్కారాలు చేసి పూజించారు. రాజు పరశురాముడు కొంతసేపు ముచ్చటించుకొన్నారు. తరువాత హోత్రవాహనుడు మహర్షి పరశురామునితో తన దౌహిత్రి గురించి ఇలా చెప్పాడు. ‘‘ప్రభూ! రామా! ఈమె నా దౌహిత్రి అంబ. కాశీరాజు కుమార్తె. ఈమె కార్యమేమిటో ఈమె ద్వారానే విను’’.
అంబ తేజస్వి అయిన మహర్షి పాదాలమీద తలపెట్టి నమస్కరించి, నీళ్ళు నిండిన కళ్ళతో అతన్ని శరణు కోరింది. రాముడిలా అన్నాడు. ‘‘అమ్మారుూ! నీవు సృంజయునికి ఎలాగో నాకూ అలాగే దౌహిత్రివి. నీ కష్టమేమిటో చెప్పు తీరుస్తాను’’.
ఇంకావుంది...


స్వాధ్యాయ సందోహం-174

$
0
0

వేదమొక సర్వాంగ పూర్ణమైన ధర్మప్రబోధక గ్రంథం. సమస్త మానవ సమాజాన్ని ఒక పరిపూర్ణమైన సువ్యవస్థిత మార్గంలో నడిపేందుకు ఏ పదార్థాలు - ద్రవ్యాలు అవసరమో వానినన్నింటిని అందరూ పొందేందుకు అవసరమైన సాధనాలను వేదాలు వర్ణించాయి. మానవ జీవితాన్ని ఉత్కృష్ట చరమస్థాయికి చేర్చి ముక్తిమార్గానికి చేర్చటమే వేదాల పరమ లక్ష్యం.
అందుకొఱకై నిర్దోషమైన సాధనలనే వేదం ప్రతిపాదించింది. దోష భూయిష్ఠం, మోసం, కపటయుక్తమైన సాధనాలకు దూరంగా ఉండమని వేదం గట్టిగా ఉపదేశిస్తూంది.
సమాజం సువ్యవస్థితంగా నడిచేందుకు ధనమెంతో అవసరం. అందుకు మానవుణ్ణి అథర్వణ వేదం ‘శతహస్త సమాహర’(అథ.3-24-5) ‘‘వంద చేతులతో సంపాదించు’’మని ఆదేశించింది. అయితే ధన సంపాదనలో ధర్మమార్గాన్ని వీడి ధనార్జన చేయమని వేదోద్దేశ్యంకాదు.
ఈ ఉద్దేశ్యంతో ఈ మంత్రంలో సాధకుడు ‘నూ నే అగ్నే.... .... పథిభి? పర్ష్యంహః’ ‘‘ఓ అగ్నీ! సన్మార్గంలోనే సుఖదాయకమైన ధనాన్ని మాకు ప్రదానం చేస్తున్నావు.
మరియు మేము దుర్గతులపాలుకాకుండ కాపాడుతున్నావు’’అని విజ్ఞప్తి చేస్తాడు. దీనిలో ‘అవృకేభిః= పథిభిః’ ‘కుటిలం కాని సన్మార్గాలు’అన్న పదం సాభిప్రాయమైనది. నేడు సమాజం ధనార్జనలో పిచ్చిదైపోయింది. ధనార్జనలో ధర్మాధర్మ విచక్షణ నిస్సారమైనదిగా భావింపబడుతూంది. దీనిచేతనే లోకమంతా అవినీతితో అట్టుడికిపోతూంది. ఈ పరితాపంనుండి శాంతి పొందాలంటే మానవ సమాజ మీ వేదోపదేశాన్ని తు.చ.తప్పక పాటించాలి.
దురదృష్టవశాత్తు నేడు లోభగుణం చేత లోకంలోని మానవులందరు తోడేళ్లవలె ధనార్జనలో ఒకరినొకరు చంపుకొంటున్నారు. తోడేళ్లు గుంపులుకట్టి వేటకు బయలుదేరతాయి. మార్గమధ్యంలో ఏదేని తోడేలు మరణిస్తే దానిని మరొక తోడేలు తిని ముందుకు పోతుంది.
ఈ తోడేలు ధర్మానే్న లోకంలో మానవ వివిధ సమూహాలు దేశాల పట్ల వ్యవహరిస్తూ ఉన్నారు. సమాజంలో నెలకొన్న ఈ తోడేలు మనస్తత్వాన్ని వేదం గట్టిగా నిరసిస్తూ ‘పర్ష్యంహః’- వారి దుర్బలతను దూరం చేయి’’ అని ప్రబోధిస్తూంది. ఎంత ఉదార సందేశం!! ధనం ధర్మమార్గంలో రానిదయితే మనస్సు శాంతిగా ఉండదు. ఆ ధనం మృత్యుతుల్యమై అశాంతిదాయకమై- పోతుంది. అందుకే వేదం ధనం సుమ్న= మనస్సుకు సుఖాన్ని ఇస్తుందని వాచ్యంగా చెప్పింది. ధనం దానివలన సుఖం రెండూ లభిస్తే సంపూర్ణమైన ఆయువుతోబాటు ఆనందం కూడ చిరకాలం అనుభవంలోకి వస్తుంది అని ‘మదేమ శత హిమాః సువీరాః’ ‘మేము మంచి వీరులమై వందల ఏండ్లు జీవిస్తాం’’ అని వేదం శుభాశంసన పల్కింది.
***
ఈ జన్మలోనే నీ సేవ చేసుకొంటాను
ఇహ త్వా భూర్యా చరేదుప త్మందోషావస్తర్దీదివాంసమను డ్యూన్‌
క్రీళంతస్త్వా సుమనసః సపేమాభి ద్యుమ్నా తస్థివాంసో జనానామ్‌॥ ఋ.4-4-9.
భావం:- మానవులు ఈ జన్మలోనే దేదీప్యమానంగా వెలుగొందు నిన్ను ఎంతో సేవించుకోవాలి. లౌకిక వాంఛతత్పరులైన జనుల ధనాఢ్యతను, బలాఢ్యతను విస్మరించి సద్బుద్ధితో నినే్న పూజిస్తాము.
వివరణ:- మానవ జన్మను జాగ్రత్తగా పరిశీలిస్తే దాని సార్థక్యమెందులో ఉందో బోధపడుతుంది. తినడం, త్రాగడం, మేల్కోవడం, కూర్చోవడం, సంతోషపడటం, ఏడవటం, ఆకలిగొనడం, నిద్రించడం లైంగిక క్రియలు జరపటం ఇవన్నీ మానవులకూ- పశుపక్ష్యాదులకూ సమానమే. కాని పశుపక్ష్యాదుల కంటే మానవులలో ఒక విశేషముంది. పశుపక్ష్యాదులు తమ సాధారణ జీవనక్రియాకలాపాలను నిర్వహిస్తాయి. కాని తమ అభ్యున్నతికి ఎటువంటి ప్రయత్నాలు చేయవు.

సుందరకాండ

$
0
0

చేయవలసిన పనిని చేయకపోతే సత్పురుషులకు కోపం వస్తుంది. కనుక వెళ్ళు- అంటాడు.
ఇదీ కృతజ్ఞత-
తానెవరి వలన ఉపకారాన్ని పొందేడో వారికి తాను ఉపకారం చేయగలిగిన సమయం వచ్చినపుడు వారు అడుగ వలసిన అవసరం లేకుండానే తాను ఉపకారాన్ని చేయడానికి ప్రయత్నించడం. మరొక ముందడుగు ఏమంటే...
వారికి కాకపోతే వారివారి కెవరికైనా సరే సహాయం చేయటానికి సాహసించటం -
ఈ ముందడుగును సముద్రుడు వేసేడు.
మైనాకుడు వేసేడు - ఇదీ కృతజ్ఞతా లక్షణం
ఈ లక్షణం - శ్రీరామచంద్రునిది
ఈ లక్షణం - సీతా దేవిది.
ఈ లక్షణం - వారిని ఆశ్రయించిన వారందరిదీను.
అందుకే - సముద్రునియందీ లక్షణమున్నది.
మైనాకుని యందీ లక్షణమున్నది.
రామాయణాన్ని విశ్వసించిన జాతి యందీ లక్షణమున్నది.
కృతేచ ప్రతి కర్తవ్యం ఏషధర్మస్సనాతనః
ఉపకారాన్ని చేసిన వాణ్ణి మరచిపోకు. ఇదే మూడు కాలాలలోను ఉండవలసిన ధర్మం.
ఇదీ సుందరకాండ మనకిచ్చే సందేశం.
సరే - తనకు ఆశ్రయమిచ్చిన సముద్రుని మాటను
మైనాకుడు అంగీకరించేడు.
హిరణ్యనాభోమైనాకో నిశమ్యలవణాంభనః
ఉత్పపాత జలాత్తూర్ణం మహాద్రుమ లతాయుతః
జాతరూపమయైశ్శృంగై ఁర్భాజమానైస్స్వయంప్రభైః
ఆదిత్య శతసంకాశః సో‚్భవద్గిరి సత్తమః

బంగారు తేజస్సు కల మైనాకుడు మహా వృక్ష సంపదతో ఒక్కసారిగా అంటే అతివేగంతో సముద్ర జలాల నుండి పైకి వచ్చేడు.
ఆ స్వర్ణ శిఖరాల నుండి జలజలా నీరు కారుతూ ఉంటే ఉదయకాల సూర్యుడు ఆ శిఖర జలాలలో ప్రతిబింబించి ఆదిత్య శతమవుతున్నాడట. ఎంత అందమూ అద్భుతమూ అయిన దృశ్యమది. స్వామి ఆ ప్రకృతిని చూసేడు. ఆశ్చర్యపడలేదు. ఆగిపోలేదు.
విఘ్నోయమితి నిశ్చితః అనుకొన్నాడట.
లోభ కారకాలు మోహకారకాలు
భయకారకాలు - అయిన అనేక విఘ్నాలు పుడుతూ ఉంటాయి. మొదటి రెండు మనకు రుచిగా ఉంటాయి. అందుకని వాటిని విఘ్నాలుగా భావించడం. వాటిలో మునిగి అసలు పనిని వదిలేస్తాం. మూడవ దానిని మాత్రం. విఘ్నంగా భావిస్తాం. దాని నుండి బయట పడటానికి భగవంతుణ్ణి శరణు వేడతాం. బుద్ధిమంతులన్నిటిని ఒక విధంగానే భావిస్తారు. క్షీర సాగర మధన వేళ దేవతలే దీనికి ఉదాహరణ. సాధకుడైన స్వామి బుద్ధిమంతుడు కనుక దాన్ని విఘ్నంగానే భావించేడు. విఘ్నాన్ని తొలగించుకొనడానికి ప్రయత్నం చేసేడు. అతి వేగంతో వస్తూన్న స్వామి తన వక్షస్థలంతో మైకాన శిఖరాల్ని రాసి నీటిలోకి పడవేసేడట ఆ వేగానికి మైనాకుడు సంతోషించేడట.
వెంటనే ఆ జడరూపంలో నుండి దేవతాత్మా రూపాన్ని ధరించి శృంగాలపై నిలిచి నాయనా! చాలా దుష్కరమైన కర్మను చేస్తున్నావు కాస్సేపు నా శృంగములయందు యధా సుఖంగా విశ్రమించు అన్నాడు
ఇంకావుంది...

శ్రీ పరమహంస బోధామృతము

$
0
0

ఐనను కఠిన పరీక్షలకు దాళనిదే శిష్యులనాతడు స్వీకరించు వాడు కాడు. తన శిష్యులు లోకాదర్శపురుషులై వెలయుటమే శ్రీరామకృష్ణుని ప్రధానాశయము. శిష్యుల శారీర లక్షణములను ప్రవర్తనమును బరీక్షించుటలో నాతడఖండ నిపుణుడు. అజాగరూకులైయున్న తఱి వారల జీవిత చర్యలను అతిజాగరూకతతో బరిశీలించును; ప్రశ్నలు వైచి వారిమనోభావములను గమనించును; తన బోధలచే, వర్తనముచే, ఆదర్శములచే, వారియందు గలుగు మార్పులెట్టివో గుర్తించును.
మఱియు నావశ్యక మైనపుడెల్ల దనయోగశక్తియగు దివ్యతేజమును వారల హృదయాంతరాళమున బఱపి యథార్థవిషయములను గ్రహించును. ఒక్కొక్కప్పుడొక విధమైన సమాధి స్థితిని గలిగించి వారిచే తమ హృదయాంతర్గత రహస్యములను బ్రకాశింపజేయును. శ్రీరామకృష్ణ భాస్కరునకు శిష్యహృదయములు కమలములై యొప్పెను!
ఆకసముకంటె నున్నతమును సముద్రముకంటె నగాధము నగు తన యనంత ప్రేమచే శిష్యులనాతడు స్వవశముగావించుకొనెను. తన యఖండ ప్రేమచే తన్నాతడు దాసునిగా నొనర్చి వైచెనని శ్రీ వివేకానందస్వామియే పలికియున్నాడు.
తమ తల్లిదండ్రులైనను ఆతనివలె తమ్ము ప్రేమించి యెఱుగరని యితర శిష్యులు వక్కాణించి యున్నారు.
తన బోధలను శిష్యులాచరించు విషయమున నాతడఖండశ్రద్ధ వహించువాడు. అతని బోధన విధాన మత్యద్భుతము. శిష్యులతో నాతడెన్నడును తర్కించువాడు కాడు. ఒక్క మాటచే, స్పర్శచే, కటాక్షముచే, నాతకు బోధించును. ‘‘ఆత్మసాక్షాత్కారమే మానవుని పరమావధి. ఆత్మానంద ప్రపూర్ణమగు హృదయమున వాదోపవాదములకు తావులేదు.
జ్ఞానోదయమైనంతనే సంశయాంధకారము పటాపంచలగును’’- ఇదియే యాతని బోధన. ఆటలతో పాటలతో, వింతలతో, వినోదములతో నాతడు మహోన్నతాధ్యాత్మిక తత్త్వములను శిష్యులకు బోధించెను.
దైనందిన జీవిత చర్యలను బరిశీలించి క్రమవిరహితమగు నెట్టిస్వల్పవిషయమును గూర్చియైనను నుదపదేశములొనర్చెను. వర్తకులు నాణెములను బరీక్షించు చందమున తన మాటలను చేతలను పరిపూర్ణముగా బరీక్షించిననే కాని నమ్మనక్కఱలేదనెను. అట్టి సద్గురు చరణ సాన్నిధ్యము లభించిన యాశిష్యు లెంతటి ధన్యులోకదా!
ఆతని ప్రతిభాతిశయ మపూర్వము. ఆత్మవికాసమున ఏ దశలోనున్న వారినైనను అవలీలగా నాతడాకర్షింపగలుగువాడు- సాధకుల యధికారాంతరము ననుసరించి బోధించుచు తన బోధనలను వారికి విస్పష్ట మొనర్చువాడు. శశధరతర్క చూడామణి, ఈశ్వర చంద్ర విద్యాసాగరుడు మున్నగు పండిత వరేణ్యులను తన విజ్ఞానముచే నొకవైపున ముగ్ధులను జేయుచు, మఱియొకవైపున తమ సంసార తాపత్రయమును దెలుపుకొని శాంతినొందవచ్చిన పల్లెటూరి స్ర్తిలకు- వెఱ్ళిమొఱ్ఱి సంశయములను దీర్చుకొనవచ్చిన యమాయక వ్యక్తులకు- మనశ్శాంతి గలుగునట్లాతడు సంభాషించువాడు. ఆచార వ్యవహారములలో- మనోభావములలో సనాతనులకెల్ల సనాతనుడయ్యు.
పరమతస్థులయెడ, నవీన సంస్కర్తలయెడ, ప్రకృతిశాస్త్ర పండితుల యెడ- విశేష ప్రేమసానుభూతులను జూపువాడు.
అట్టిచో నరేంద్రనాథుడు, నాగమహాశయుడు, మహేంద్రలాల్ సర్కార్, గిరీశ చంద్రఘోషు- ఇట్టి విలక్షణ స్వభావులగు వ్యక్తులాతని సన్నిధానమున గూడి సోదర ప్రేమతో మెలగుటబ్బురము కానేరదు.
ఇంకా ఉంది
శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 1121 మహోపదేశములు గల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -సంగ్రహ జీవిత సహితము - అనువాదకుడు: శ్రీ చిరంతనానందస్వామి

సాధనతో అద్భుతాలు ( పురాణాల్లో శాస్తవ్రిజ్ఞానం )

$
0
0

శ్రీ చక్రము- మానవశరీరము
ప్రతులకు
H.No. 7-8-51, Plot నెం. 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2 హైదరాబాద్- 500079
=============================================================
ప్రస్తుత కాలమున గూడ తమ ఉపాసనాబలంతో దేవీమాత భగవతి అనుగ్రహంతో ఆహార పానీయాలు స్వీకరించకుండా చిరకాలము జీవిస్తున్నవారక్కడక్కడా వున్నారు. అందరూ చూడగలిగే ఒక ఉదాహరణ ఇక్కడ పేర్కొంటాను. గుజరాత్ రాష్ట్రంలో ‘శ్రీ మాతాజీ బాబా’ (ప్రహ్లాద జైనీ) అనే ఆయన ఒక గ్రామంలోని అమ్మవారి ఆలయంలో దీక్షలో వుంటారు. ఆయన అమ్మవారిలాగానే అలంకరణ చేసుకుని నిరంతరం అమ్మవారి ధ్యానయోగంలో వుంటారు. ఆయన గత అరవై ఐదు సంవత్సరాలుగా ఆహార పానీయాలు లేకుండా వున్నారు. వైద్యుల బృందం ఆయనను అన్ని రకములుగా పరీక్షించి చూశారు. ఆయననొక మూత్రశాల లేని గదిలో కొంతకాలముంచి సిసి కెమెరా పెట్టి కూడా గమనించారు. ఆయన పానీయాలు, మలమూత్ర విసర్జన లేకుండా ఉన్నారని వైద్యబృందం గమనించారు. ఈ విషయానికి సంబంధించి పాఠకులు అంతర్జాలం యూట్యూబ్‌లో మాతాజీ బాబా అని టైప్ చేసి వీక్షించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఇట్టి అతీంద్రియ శక్తులు సాధించటానికి మానవ శరీరము అనుకూలమైనదేనని మరియొకసారి రుజువైంది.
పతంజలి మహర్షి తన కైవల్య పాదమునందలి 12వ శ్లోకంలో కాలము గురించి రుూ విధంగా చెప్పారు.
శ్లో ‘‘అతీత నాగతమ్ స్వరూపతోన్
స్త్యధ్వ భేదార్థర్మాణామ్ అనగా గుణములు వ్యతిరేక దిశలో నుండుట వలన, భూత భవిష్యత్తులు, వాటి కాలము నెలకొని ఉన్నది. కాలమనేది గ్రహించగలిగినంతటి వేగంతో ప్రవహిస్తున్న శక్తి. దీనియొక్క స్పర్శయే వర్తమానము, అట్టి శక్తికై తయారుకావడమే భవిష్యత్తు. అనుభవించిన శక్తియే భూతకాలము. నేటి శాస్తజ్ఞ్రులు చెప్పే విషయాన్ని బట్టి కాలమనునదొక సాపేక్ష విషయమని, సంఘటనలు జరుగవని, మనమే ఆ సంఘటనలను అనుభూతి పొందుతున్నామని తెలుస్తోంది. సుప్రసిద్ధ శాస్తవ్రేత్త ఎడింగ్టన్ రుూ విషయం గురించి తన అభిప్రాయాన్నీవిధంగా చెప్పాడు. ఒక వ్యక్తి కాంతివేగంకన్నా తక్కువ వేగంతో ప్రయాణించేటప్పుడు మొదట వర్తమాన కాలాన్ని తరువాత భూతకాలాన్ని అనుభవిస్తాడు. కాంతి వేగంతో సమానమైన వేగంతో ప్రయాణించేటప్పుడు, ఎల్లప్పుడు వర్తమానంలోనే ఉంటాడు. కాంతి కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే వ్యక్తి భవిష్యత్తును కూడా చూడగలడు. ఎడింగ్టన్ యొక్క ఈ అభిప్రాయము కల్పనకాదు. సశాస్ర్తియమైన అభిప్రాయము. మహాయోగియైన వ్యక్తి తన మనస్సును కాలము యొక్క ముందు, వెనుకలకు కూడా సారించి భూత, భవిష్యత్తులను వర్తమానంలోనే దర్శించగలడు. మూల ప్రకృతి ఎల్లప్పుడూ వ్యక్తమగుచు, వ్యాప్తి చెందుచునే ఉండును. యోగియైనవాడు, ప్రకృతి యొక్క అవస్థలతోబాటు దానినుంచిద్భవించిన కాలము యొక్క అన్నిదశలను అనుభవించగలడు. భూత, భవిష్యత్ సంఘటనలను తెలుసుకొనగలడు. దీనినే మనవారు దివ్యదృష్టి అని చెబుతారు. దీనికంతటికీ కుండిలినీ శక్తి యొక్క పరిపూర్ణమైన జాగృతస్థితియే కారణము. ఆ విధంగా కుండలిని జాగృతి పొందిన యోగి, పరిణామం యొక్క పరిపూర్ణావస్థ పొందిన ఒక మహత్తర వ్యక్తి (మహర్షి)గా భావిస్తాము. యోగశాస్త్రానికి సంబంధించిన అనేక గ్రంధాలు, కుండలినీశక్తి యొక్క సప్తయోగభూమికలను వివరించాయి. మనలోని మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా, సహస్రార చక్రములయందు, మనస్సు ఉన్నపుడు కలిగిన, అనుభూతులు లేక శక్తులను తెలుసుకుందాం. మనస్సు ఇంద్రియముల ద్వారా బయటి విషయములయందు ఆసక్తి కలిగి, సంచరించేటప్పుడు మనలోని ప్రాణశక్తి, మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూరక చక్రములయందుంటుంది. అంటే జననేంద్రియముల వద్ద బొడ్డు (నాభి) వద్దగల నాడీ కేంద్రముల (చక్రముల) వద్ద వుంటుందన్నమాట. ఇటువంటి స్థితిలో మనస్సుకు ఆధ్యాత్మిక భావనలుగాని, తలంపులుగాని ఏమియు ఉండవు. మనస్సు అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములతో నిండి ఉంటుంది. మధ్యది, నాల్గవది అయిన అనాహత చక్రము వద్ద మనసు నిలిచినపుడు మనిషికి ఆధ్యాత్మిక భావనలు, తలంపులు కలుగుతాయి. అపుడు అంతటా వెలుగు దర్శనవౌతుంది. ఇది ఎంతో సాధనవల్ల కాని సాధ్యపడదు. గొప్ప ఆనందాన్ని పొందిన మనస్సు క్రింది చక్రముల వైపు మరలదు. అయిదవ కేంద్రమైన విశుద్ధి చక్రంపై మనస్సు ధ్యానమగ్నమైతే, భయము, అజ్ఞానము మొదలగు నకారాత్మక భావము లేమియును లేక మనసు పూర్తిగా భగవంతునిపై లగ్నమగును. ఇక మనస్సు ఆజ్ఞాచక్రము ధ్యానస్థితి పొందినపుడు రేయింబవళ్ళు నిరంతరాయంగా భగవద్దర్శనం కలుగుతుంది.
ఇంకావుంది...

అనంతం-15

$
0
0

చిదుగుల్లో దాగిన నిప్పురవ్వలు, కంబళ్ళూ కలిసి మళ్లీ మంటలు లేచాయి.
‘‘్ఛర్జ్..’’ అని అరిచాడతను.
ముందుగా లఠీలతో కొట్టి తేనె కుండలు పగులగొట్టారు.
వొలికిపోయిన తేనె మైనం ముద్దలతో కలిసి పాయల్లా పారుతూ నేలమీద దారులు వెదుకుతోంది.
మైనం ముద్దలు తేనె కన్నీళ్ళు కారుస్తున్నాయి!
సిబ్బంది అపుడు బాణావతు, కాళీచరంలపై విరుచుకొని పడ్డారు.
లాఠీలు గాల్లోకి లేచి వాళ్ళ శరీరాల మీద బలంగా పడుతున్నాయి. వాతలు తేలుతున్నాయి. భరించలేని బాధ. వాళ్ళ ఆర్తనాదాలతో అడవి దద్దరిల్లిపోతోంది.
‘‘మా తప్పేంటిది?’’ దెబ్బల్ని తప్పించుకొంటూ, కొంచెం ధైర్యం కూడగట్టుకొని బాణావతు అడిగాడు.
పోలీసు సిబ్బంది నివ్వెరపోయారు!
చదువులేదు, చట్టం తెలియదు, ఓట్లెయ్యటం తప్ప ఓట్లేసి గెలిపించినవాళ్లు ఏం చేస్తున్నారో తెలియదు. హక్కులు తెలియవు. హక్కుల్ని హరిస్తున్నది ఎవ్వరో తెలియదు.
వాడో అజ్ఞాని.
అలాంటివాడు ‘‘నా తప్పేంది’’ అని అడగటం, అందునా పోలీసుల్నే అడగటం ఎంత తప్పు!?
సృష్టి వైచిత్రం అనిపించింది!
‘‘పొగపెట్టటం మొదటి తప్పు! అడవిలో అధికారం చలాయించటం రెండో తప్పు. నివాసాలు ఏర్పాటుచేసుకొని అడవిని ఆక్రమించటం మూడో తప్పు. ఏమిటి? ఎందుకు? అని పోలీసులను ప్రశ్నించటం నాలుగో తప్పు.
కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్!
ఇదే మీకు లాస్ట్ వార్నింగ్! వెంటనే తండా ఖాళీచేసి ఎక్కడికైనా వెళ్లిపోండి. మళ్లీ కనిపిస్తే కాల్చేస్తాం జాగ్రత్త’’ అని హెచ్చరించి గుడారాల వైపునకు సాగిపోయారా పోలీసు సిబ్బంది.
బాణావతు, కాళీచరణ్ భయంనుంచి నెమ్మదిగా తేరుకొన్నారు.
ఒకళ్ళగాయాలొకళ్ళు చూసి కళ్ళతోనే ఓదార్చుకున్నారు. కొంత సమయం గడిచింది.
‘‘ఇంటికి బోదావా’’ అడిగాడు బాణావతు.
కాళీచరణ్ ఎందుకో అమాంతం ముందుకు వొంగాడు. నేలమీద పార్తోన్న తేనెలో చూపుడు వ్రేలు ముంచి నోట్లో పెట్టుకొని చప్పరించి ‘‘యమ్‌డన్ తేనెని సెడగొట్టారు’’ అన్నాడు.
బాణావతు కళ్ళల్లో కన్నీళ్ళు మెరిసాయి!
‘‘ఈగలు మళ్లీ వాల్తాయ్యి, కొత్త పట్టు పెడతయ్యి’’ అన్నాడు కాళీచరణ్‌తో బాణావతు.
వాళ్ళు దిగులు మొహాలతో ఇంటిదారి పట్టారు.
***
నగ్గూరాం ఇంట్లో లేడు. భూక్యా తండాలో వున్న ఎవ్వరో బంధువు జ్వరం తగిలి వైద్యం అందక మృతి చెందితే కబురంది వెళ్లాడు.
రాగ్యా ఒక్కడే ఇంట్లో ఉన్నాడు.
ఆలస్యంగా నిద్రలేచి హడావుడిగా కాలకృత్యాలు తీర్చుకున్నాడు.
ఆకలిగా వుంది. రాత్రి అన్నం తినే్లదు.
కల్లు తాగితే కడుపుబ్బరిస్తుందని అక్కడికి కోసుదూరం నడిచి వెళ్లి అడవి అంచులో నాగరికులు కాస్తున్న నాటుసారా తాగొచ్చాడు. అక్కడే నాలుగు చీకులు తిన్నాడు.
కడుపుబ్బరం లేదు కానీ, కడుపులో వికారంగా వుంది. ఒకటే మంట. పేగులు లుంగచుట్టుకొనిపోతూ విపరీతంగా నెప్పి!
అంత దూరం కాలినడకన తిరిగి ఎలావచ్చాడో కానీ, ఇంటికి చేరటంతోనే అమాంతం చాపమీద వాలిపోయాడు.. సరిగా నిద్రలేదు.
మగతనిద్రలో గరుడాచలాన్ని కలువరించాట్ట!
తండ్రి చెబితే ప్రొద్దునే్న ఆ విషయం తెలిసింది రాగ్యాకి!
వారం క్రితం పట్నంలో గరుడాచలాన్ని కలిశాడు. విందు భోజనం తిన్నాడు. విస్కీ తాగుతూ సిగరెట్లు కాల్చాడు.
అపుడు గరుడాచలం చెప్పిందాని ప్రకారం అతను ఎప్పుడైనా మళ్లీ అడవికి రావొచ్చు. వస్తే కొంతకాలం వుంటానని, ముఖ్యమైన పనేదో అడవిలో ఉందని కూడా చెప్పాడు గరుడాచలం.
అతనికోసం ఎదురుచూస్తూ రోజులు లెక్కిస్తున్నాడు రాగ్యా!
బైట్నించి ఎవ్వరో పిలుస్తున్నారు!
ఆలకించి విన్నాడు రాగ్యా. గొంతు గుర్తుపట్టాడు. సంతోషంగా రెండే రెండు అంగల్లో గుడిసెలోనుంచి బైటికి వెళ్లాడు. రాగ్యా ఊహించినట్టే-
ఫారెస్టు గార్డు యాదయ్య కనిపించాడు ఎదురుగా!
‘‘ఏంటి యిసయవ్?’’ యాదయ్యని రాగ్యా అడిగాడు.
‘‘గరుడాచలంగారొచ్చారు. నిన్ను రమ్మంటున్నారు’’ చెప్పాడు యాదయ్య.
రాగ్యా మొహం విప్పారింది.
‘‘యాడుండాడు సారు?’’ అని అడిగాడు.
‘‘నల్లకొండ దగ్గరున్నారు’’
‘‘తండాకి రావొచ్చుగదా..’’
యాదయ్య ఫక్కున నవ్వాడు.
‘‘అంత పెద్దసారు నీ గుడిసెకొస్తాడా’’ అన్నాడు.
రాగ్యా మొహం వాడిపోయింది.
‘‘పద.. పద’’ తొందరపెట్టాడు యాదయ్య.
‘‘బండలమీన కూకున్నాడా? సెట్లకింద కూకున్నాడా’’ అని రాగ్యా అడిగాడు.
‘‘వాళ్ళకేం కర్మ! రాత్రి టెంట్లు వేశారు. వంటా వార్పూ కూడా అక్కడే! మందు కేసులు ఉంచంరు. ఫారిన్ సిగరెట్లు కార్టన్లున్నాయి. టెంట్లలో ఎన్ని సదుపాయాలున్నాయో’’
‘‘ఒక్కడే వొచ్చిండా’’
‘‘కాదు! ఆఫీసర్లు, పోలీసులు..’’
‘‘పోలీసోళ్ళా? ఏంటికి?’’ అడిగాడు రాగ్యా.
‘‘తెలియదు. మొత్తానికేదో పెద్ద పనిమీదే వచ్చారు. ఎమ్మెల్యే సారు గూడా ఉన్నాడు’’.
రాగ్యా మాటలు పొడిగించకుండా తడక తలుపు దగ్గరికి వేసి, యాదయ్య వెంట బయల్దేరాడు.
‘‘సారేవన్నాడింకా?’’ దార్లో రాగ్యా అడిగాడు.
‘‘నిన్ను త్వరగా రమ్మన్నారు’’
‘‘అద్సరే! ఇంకేమన్నాడూ’’
‘‘అదృష్టం అంటే నీదేరా రాగ్యా’’
‘‘ఏంటికో’’
‘‘అంత గొప్పవాళ్ళు నీ కోసం ఎదురుచూట్టం..’’
రాగ్యా ఛాతీ ఉబ్బింది. గర్వంగా చూశాడు!
తండా గుడిసెల దాటి పదడుగులు వెయ్యగానే ఎందుకో రాగ్యా ఆగాడు.
(ఇంకా ఉంది)

Viewing all 69482 articles
Browse latest View live