Are you the publisher? Claim or contact us about this channel


Embed this content in your HTML

Search

Report adult content:

click to rate:

Account: (login)

More Channels


Showcase


Channel Catalog


Articles on this Page

(showing articles 39461 to 39480 of 41370)
(showing articles 39461 to 39480 of 41370)

older | 1 | .... | 1972 | 1973 | (Page 1974) | 1975 | 1976 | .... | 2069 | newer

  0 0

  శ్రీ అరుణాచల అక్షర మణిమాల
  అర్థ తాత్పర్య సహిత పద్యకృతి; తమిళ మూలం: శ్రీ భగవాన్ రమణ మహర్షి;
  తెలుగుసేత: ఒక రమణ భక్తుడు, డి.వి.ఎస్.శాస్ర్తీ,
  పుటలు:160, వెల:రూ.100/-,
  ప్రచురణ: రమణ భక్తమండలి ట్రస్టు, బెంగుళూరు ప్రతులకు:
  డా. దోనేడి నరేష్‌బాబు,
  శ్రీ షిర్డీ సాయిబాబా దేవాలయం, జూలేపల్లి-518674, గోస్పాడు మండలం, కర్నూలు జిల్లా
  =====================================================================
  ‘నీ పాద కమల సేవయు / నీ పాదార్చకులతోడి నెయ్యము నితాం /తాపార భూతదయయును /తాపస మందారనాకు దయసేయగదే’ అన్న పోతన్న యొక్క భూతదయాపూర్వక భగవద్భక్తిని త్రికరణశుద్ధిగా ఆచరించి చూపిన ఆధునిక మహర్షి అరుణాచల శ్రీ రమణులు. వారు తమిళంలో రాసిన 108 ద్విపదల భక్తిరచన ‘శ్రీ అరుణాచల అక్షర మణమాల’. దీనిని ఇటీవల ఒక రమణభక్తుడు (పేరు పేర్కొనలేదు), డి.వి.ఎస్.శాస్ర్తీగారు కలసి ప్రతిపదార్థ, తాత్పర్య, వాఖ్యాన సహితంగా తెలుగులో అందించారు.
  ఇంతకుముందు తమిళ మూలానికి ఆంగ్లంలో ప్రతిపదార్థం శ్రీ సాధు ఓం గారు, తాత్పర్యాదులు మైఖేల్ జేమ్స్‌గారు రాశారు. వారి రచనయే ఈ తెలుగు సేతకు ఆధారం.
  భారతీయ, ఆధ్యాత్మిక, పౌరాణిక, ఖగోళాది వాఙ్మయాలలోను, గణితశాస్త్రంలోను 108 సంఖ్యకు విశిష్టస్థానము, పవిత్రతా భావమూ ఉన్నాయి. ఉదాహరణకు మనిషి తనలోని దైవత్వాన్ని గ్రహించటానికి 108 మెట్లు దాటాలి అని అన్ని ప్రాచ్య మతాలవారి సిద్ధాంతం. ఆ సంఖ్య భగవంతునికీ భక్తునికీ మధ్య అనుసంధాన కారకమని భారతీయ తాత్విక వాఙ్మయం చెప్తుంది. ఇది తెలిసే రమణులు ఈ కృతిని 108 ద్విపదలలో కూర్చారు.
  పంచభూత మహాలింగాలలోని తేజో లింగం తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వరుడు. శైలాకారంలో వున్న అరుణాచల భగవద్రూపాన్ని మమైకభావంతో ఆరాధిస్తూ భగవాన్ రమణ మహర్షి ఈ తన ద్విపద గ్రంథంలో ఆ దేవునితో సంభాషిస్తారు కవితా భావాత్మకంగా. అక్షరములు అంటే వాక్కులు అనే అర్థం కూడా వుంది. మణమాల అంటే వరమాల. శ్రేష్ఠమైన మాల అని భావం. ఇందులోని వాగక్షరమాలలో రమణులవారి అచంచల భక్త్భివాలు ఒక ప్రవాహంలా సాగిపోతాయి.
  78వ పుటలోని ‘వెదలై వాష్‌త్తావైత్...’ అనే ద్విపదలో ‘ఓ అరుణాచలా! నీటిలో మంచువలె ప్రేమ స్వరూపుడవైన నీలో ప్రేమగా నన్ను కరగునట్లు చేయుము’ అనటంలోని భావం మనోహరం. మంచు కరగి నీటితో ఏకమైతే అది తన వ్యక్తిత్వాన్ని, ప్రత్యేకతను కోల్పోతుంది. అలాగే చిత్తము ఆత్మలో లీనమైతే అహంకారం కోల్పోతుంది. సత్తు అంటే సత్యం. అంటే భగవంతుడు. అదే సత్త్వం. ‘సత్త్వం’లో ఆ‘తత్త్వం’లో జీవాత్మ కలసిపోయి ‘అద్వైతం’ అయిపోతుంది, సాధన చేస్తే. ఇంత మనోజ్ఞ ఉపమా సౌందర్యం తోడి వ్యాఖ్యానాలు కూడా ఇందులోని ప్రతి ద్విపదలోనూ కనిపిస్తాయి.
  31వ పుటలోని ‘సోమ్‌బి-యాయ్‌చ్ సుమ్మా సుక్..’ అనే ద్విపదలో ‘‘ఓ అరుణాచలా! నీపాటికి నీవు- ఒక సోమరిలాగా-నీవు నీ ఆత్మానందాన్ని అనుభవిస్తూ నన్ను, నా ఆర్తిని పట్టించుకోకుండా (యోగ)నిద్రలో ఉండిపోతే ఇక నా గతి ఏమిటి?’’ అంటూ భగవంతుడిని అతి చనువుతో, ‘వ్యాజనింద’తో ప్రశ్నించిన రమణుల వాక్యంలోని గంభీర భావం కేవలం నిశిత ఆలోచనామథనం, వ్యాఖ్యానాలకే అంది ఒక కవితానుభూతిని కలిగిస్తుంది.
  15వ పుటలోని ‘గిరి-యురువాగియ కిరుపైక్..’ అనే ద్విపదలో ‘కొండ రూపంలో వున్న కరుణా సముద్రమా!’ అని సంబోధిస్తారు రమణులు అరుణాచలాన్ని. ఇలా భిన్న లక్షణాలను ఒకేచోట విక్షేపించటం రావణుని శివతాండవ స్తోత్రంలోని ‘దృషద్విచిత్ర తల్ప యోర్భుజంగ వౌక్తిక ప్రజోః’ అనే శ్లోకాన్ని స్ఫురింపచేస్తుంది. కఠిన శిలామయపు కొండేమో కరగనిది. కానీ ఆ కొండ దయ అనే ఒక ద్రవనిధిట. ఇది ఒక విరోధాభాసాలంకారం.
  ఇందులోని 108 ద్విపదలూ అరుణాచలా అనే సంబోధనతోనే ముగుస్తాయి. కనుక ఇది చదివితే అరుణాచలేశ్వరుని ‘అష్టోత్తర’ స్మరణ రూప అర్చన అవుతుంది-్భక్తి భావానుభూతి పరంగా.
  సరళ గ్రాంథికంలోనే అనువాదం ఉన్నది. కానీ పాఠకునికి అంతగా ధారాళ పఠనగ్రాహ్యంగా లేదు. పదాలు, వాక్య నిర్మాణం-ఈ రెండూ ఇనుమంత కృతకంగా వున్నాయి. మొత్తంమీద ఈ ‘అక్షర మణమాల’ (వాక్కుల వరమాల) కూడా రమణ మహర్షులు మనకు అందించిన భక్త సాహిత్యపు మణిపూసలలో ఒకటి.


  0 0

  నేటి సమాజంలో మహిళలకు రక్షణ చాలా అవసరం. ఆలస్యంగా ఇంటికి చేరుకునే క్రమంలో కొన్ని యాప్‌లు మహిళలు అండగా నిలుస్తున్నాయి. మహిళల రక్షణకోసం సాంకేతికంగా చాలా రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా చాలా యాప్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటివల్ల మన రక్షణ మన చేతుల్లోనే ఉంటుంది. ప్రమాద సమయంలో వీటిని ఉపయోగించినట్లయితే తక్షణ సహాయం అందుతుంది. అలాంటి యాప్‌లలో కొన్ని మీకోసం..
  లైఫ్ 360 ఫ్యామిలీ లొకేటర్
  దూరప్రాంతాలకు ఒంటరిగా వెళుతున్నప్పుడు, ఆలస్యంగా ఇంటికి చేరుకునే క్రమంలో ఈ యాప్ ఆడవారికి చాలా అండంగా ఉంటుంది. దీన్ని మనం ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని ముందుగా మనకు బాగా దగ్గరి వాళ్లవి, ఆరుగురి నెంబర్లను పొందుపరచాలి. ఒంటరిగా ఉన్నప్పుడు, క్యాబ్‌లో తిరుగుతున్నప్పుడు, దారి తప్పిపోయినప్పుడు ఈ యాప్‌ను ఓపెన్ చేస్తే సేవ్ చేసిన నెంబర్లకు మనం ఎక్కడున్నామనేది తెలుస్తుంది. దాంతో అందరికీ మన గురించిన సమాచారం అందుతుంది. అలా అవతలివాళ్లు అప్రమత్తమై మనం ఉన్న చోటికి చేరుకోగలుగుతారు.
  వాచ్ ఓవర్ మీ
  ఆ యాప్ మన ఫోన్‌లోనే కాదు.. ఇది కుటుంబ సభ్యులు, స్నేహితులకూ ఉంటే వారికి తక్షణ సమాచారం అందించడం తేలికవుతుంది. ఈ యాప్‌తో పాటు వారి నంబర్లను కూడా ఇందులో పొందుపరచాల్సి ఉంటుంది. దీనిద్వారా జీపీఎస్ లొకేషన్‌ను పంపుకోవచ్చు. ఒకవేళ అది కుదరకపోయినా ఎమర్జెన్సీ బటన్ నొక్కినా చాలు.. కుటుంబ సభ్యులకు, స్నేహితులకు వెంటనే అలర్ట్ వెళుతుంది. కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో మహిళలు ఫోన్ తీసి ఆపరేట్ కూడా చేయలేకపోవచ్చు. అలాంటప్పుడు ఈ యాప్ ఆన్‌లో ఉంచితే.. ఫోన్‌ని అటూ ఇటూ ఊపినా ఫోన్‌లోని కెమరా ఆన్ అవుతుంది. లేక ఫోన్ పవర్ బటన్‌ను నాలుగుసార్లు నొక్కగలిగినా చాలు వెంటనే కెమరా ఆన్ అవుతుంది. అంతేకాదు అక్కడి పరిస్థితులన్నింటినీ వీడియో రికార్డ్ అయి యాప్ కాంటాక్ట్‌లో ఉన్నవారికి క్షణాల్లో చేరిపోతుంది. ఫలితంగా వారు వెంటనే స్పందించి మీ రక్షణకై చర్యలు తీసుకుంటారు. ఈ యాప్ ఇంటర్నెట్ అవసరం లేకుండానే పనిచేస్తుంది.
  చిల్లా..
  చిల్లా అంటే అరుపు.. ఈ యాప్ కూడా మహిళల ఆత్మరక్షణకు సంబంధించినదే.. యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అన్ని యాప్‌లలో వలె దీనిలో కూడా కుటుంబ సభ్యుల, స్నేహితుల నెంబర్లను సేవ్ చేసుకోవాలి. ప్రమాదంలో ఉన్నప్పుడు ఫోన్‌లోని బటన్‌ను అయిదుసార్లు నొక్కితే చాలు ఈ యాప్ పనిచేయడం ప్రారంభిస్తుంది. ప్రమాద సమయంలో మీరు అరిచే అరుపు మీ ఫోన్ నుంచి అత్యవసర నెంబర్లకు అలారంలా.. మీరున్న ప్రాంతం వివరాలను పంపిస్తుంది. దీంతో మీరేదో ప్రమాదంలో ఉన్నట్లు సమాచారం కుటుంబ సభ్యులకు, స్నేహితులకు చేరుతుంది. ఒకవేళ మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా కూడా మీ ఆప్తులకు అలారం రూపంలో సమాచారాన్ని చేరవేస్తుంది. అంతేకాదు.. మీరు ఉన్న ప్రాంతం వివరాలను ఎస్సెమ్మెస్ లేదా ఈమెయిల్ ద్వారా మీరు ప్రమాదంలో ఉన్నట్లు సమాచారం అందజేస్తుంది.


  0 0

  సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ.. మరి ఆ పండుగరోజు ఎలా మెరవాలి? పండుగరోజు ఆధునిక దుస్తులతోనే సంప్రదాయంగా, కొత్తగా కనిపించడం సాధ్యం కాదా..? అనుకునే వారికి ఎన్నో ప్రత్యామ్నాయాలున్నాయి. అవేంటో చూద్దాం..
  కుర్తీలు
  పండుగల సీజన్ కాబట్టి షిఫాన్, జార్జెట్ వంటి వస్త్రాలు కాకుండా రాసిల్క్, ప్యూర్ సిల్క్‌లతో పాటు ఫ్యాన్సీ రకాలైన బ్రాసో, నెట్ వంటి వస్త్రాలతో కుర్తీలను కుట్టించుకుంటే బాగుంటుంది. చేతులు పొట్టిగా కాకుండా పొడవుగా, మోచేతి కిందివరకూ ఉండేలా చూసుకోవాలి. సిల్క్, రాసిల్క్ కుర్తీలపై చిన్న బూటీల్లా మగ్గం వర్క్ చేయించుకుంటే బాగుంటుంది. అలానే వీటిపై ఆప్లిక్ వర్క్, అద్దాల వంటి హంగులు చేరిస్తే చమక్కుమనిపించొచ్చు. ట్యూనిక్‌లకు బెనారస్, జార్జెట్, సిల్క్, మంగళగిరి రకాలు బాగుంటాయి. కుర్తీ సాదాగా ఉన్నప్పుడు దాన్ని కొత్తగా కనిపించేలా చేయాలంటే పైన ఎంబ్రాయిడరీ కేప్ ఎంచుకోవచ్చు. వీటికి జతగా పటోలా వస్త్రంతో స్ట్రెయిట్ కట్ ప్యాంట్లు చాలా బాగుంటాయి. వీటిపై కాస్త ఆధునికంగా ఎంబ్రాయిడరీ చేస్తే.. వీటిని అనార్కలీ, లేయర్డ్, ట్యూనిక్‌లకు జతగా వేసుకోవచ్చు. అలానే ఏ లైన్‌కు జతగా పలాజో చాలా బాగుంటుంది. సిల్క్ వంటి జాలువారే రకాల్లో ధోతీస్టైల్, పటియాలా ప్యాంటులను కుట్టించుకున్నా ప్రత్యేకంగా ఉంటుంది. ఇలాంటి మిక్స్ అండ్ మ్యాచింగ్‌లకు దుపట్టా కూడా భారీగానే ఉండాలి. పొడవాటి గౌన్లూ, అనార్కలీలు, పరికిణీలకు దుపట్టా కొత్తదనాన్ని తెచ్చిపెడుతుంది. కలంకారీ, బాందినీ, బెనారస్, పట్టు దుపట్టాలు ఇప్పుడు చాలా ప్రత్యేకం. వీటిని ప్లెయిన్ సిల్క్, రాసిల్క్ వంటివాటికి జత చేసుకుంటే సంప్రదాయసిద్ధంగానూ, అందంగానూ కనిపించవచ్చు. ఇంకాస్త భిన్నంగా కనిపించాలనుకుంటే వీటిపైన ఏనుగులు, పక్షుల మోటిఫ్‌లను ప్రయత్నించవచ్చు. గాగ్రా, పరికిణీలపైకి ధూపియాన్ సిల్క్‌పై బ్లాక్ ప్రింటింగ్ లేదా త్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ చక్కగా నప్పుతుంది.
  స్కర్టులు
  ఈ తరం అమ్మాయిలు తమ వస్త్రశ్రేణిలో తప్పనిసరిగా ఉండాలని భావిస్తున్న రకాల్లో స్కర్టులు ముందుంటాయి. సంప్రదాయ వేడుకలకు పొడవు స్కర్టులే బాగుంటాయి. వీటి తయారీకి రాసిల్క్, బెనారస్, పట్టు వంటి వస్త్రాలను వాడితేనే నిండుదనం. స్కర్టుకి జతగా క్రాప్‌టాప్, ఆ పైన జాకెట్ వేసుకుంటే కొత్తలుక్ వచ్చేస్తుంది. అలానే గద్వాల్ పట్టు స్కర్టులపై చిలుకలూ, నెమళ్లు, ఏనుగులు వంటి వాటిని మోటిఫ్‌లుగా వేసుకుంటే ఆ అందమే వేరు. వీటిపైకి లెహేరియా కోటా, బాందినీ తరహా దుపట్టాలు ట్రెండీగా ఉంటాయి.
  గౌనులు
  సందర్భం ఏదైనా గౌనులు చక్కగా కనిపించేలా చేస్తాయి. అందుకేనేమో కాలేజీ అమ్మాయిలు ఈ శైలికి ఫిదా అవుతుంటారు. సంప్రదాయ వేడుకల్లో పెళ్లికూతురితో పాటు అతిథులూ గౌనుకే ఓటేస్తున్నారు. కలంకారీ, ఇకత్ వంటి డిజైన్లతో, ప్యూర్ సిల్క్, రాసిల్క్, బెనారస్ వంటి వస్తర్రకాలతో వీటిని కుట్టించుకుంటే బాగుంటుంది. ఆధునికంగా కనిపించేందుకు దానికి దుపట్టాలు జతచేయడం, లేయర్డ్, ఎసెమెట్రికల్ కట్‌లతో, కోల్డ్‌షోల్డర్, షోల్డర్‌లతో డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది. లెహెంగాలు
  వీటిని కూడా అసెమెట్రికల్, బాక్స్‌ప్లీటెడ్, లేయర్డ్, హైవెయిస్టెడ్ వంటి రకాల్లో కుట్టించుకుంటే ఆధునికంగా మెరిసిపోవచ్చు. నెట్, జార్జెట్ వంటి వాటికి బదులుగా చేనేత రకాలైన ఇకత్, కలంకారీ, ప్యూర్ సిల్క్, ఖాదీ ఆర్గాంజా, చందేరీ వంటి వస్త్రాలను ప్రయత్నించొచ్చు.


  0 0

  సుమంత్ నటిస్తోన్న వైవిధ్య చిత్రం ‘ఇదం జగత్’. అనీల్ శ్రీకంఠం దర్శకుడు, అంజు కురియన్ కథానాయికగా పరిచయమవుతోంది. విరాట్ ఫిల్మ్స్ అండ్ శ్రీవిఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీ్ధర్‌లు సంయుక్తంగా నిర్మించారు. సినిమా ట్రైలర్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. అతిథిగా హాజరైన అడివి శేష్ మాట్లాడుతూ టీజర్, ట్రైలర్‌లో ‘ఇదం జగత్’ టైటిల్ వచ్చినపుడు ఒకే రకమైన సంగీతం వస్తుంది. ఆ బ్రాండింగ్, కనెక్షన్ రెండింటికీ ఇవ్వడం శ్రీచరణ్‌లో నచ్చిన విషయం. ట్రైలర్, పోస్టర్స్ తరహాలో సినిమా కూడా కనెక్టవుతుందని ఆశిస్తున్నా అన్నారు.
  నిర్మాతల్లో ఒకరైన పద్మావతి మాట్లాడుతూ సుమంత్ కెరీర్‌లో ఇది డిఫరెంట్ మూవీ. పైకి కనిపించే హీరో సుమంత్ అయినా, తెరవెనుక హీరోయే దర్శకుడే. ప్రతి ఒక్కరి కృషివల్లే సినిమా ఇంత బాగా వచ్చిందన్నారు. మరో నిర్మాత శ్రీ్ధర్ మాట్లాడుతూ ట్రైలర్ లాంచ్ చేసిన శేష్‌కి కృతజ్ఞతలు తెలిపారు. సినిమా బాగా వచ్చిందని, సుమంత్ కష్టం వృధాపోదన్నారు. సినిమాకు పనిచేసిన అందరికీ థాంక్స్ చెప్పారు. దర్శకుడు అనిల్ మాట్లాడుతూ ఇది టెక్నీషియన్స్ మూవీ. మ్యూజిక్, కెమెరా, ఎడిటింగ్‌లాంటి అన్నిశాఖలు కలిస్తేనే సినిమా అన్నారు. సుమంత్ మాట్లాడుతూ ట్రైలర్‌లో చూపించినట్టు రాత్రివేళలో షూటింగ్‌చేశాం. ఇలాంటి పాత్రలంటే నాకు ఇష్టం. మనిషిలో మంచి, చెడుతోపాటు అన్నికోణాలు ఉంటాయి. ఇలాంటి పాత్ర కోసం నేను చాలాకాలంగా ఎదురు చూస్తున్నాను. థ్రిల్లర్స్‌పట్ల నాకు మొదట ఆసక్తి ఉండేది కాదు. రెండేళ్ల క్రితం నా మిత్రుడు అడివి శేష్‌వల్ల ఆ ఆసక్తి పుట్టింది. నాకిప్పుడు ఈ జోనర్ అంటే పిచ్చి ఏర్పడింది. ఈ సినిమాలో చాలా కొత్తగా ప్రయత్నించాం. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగా కుదిరాయి. హార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతం. విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు.


  0 0

  ప్రియాంత్‌ని హీరోగా పరిచయం చేస్తూ నిశ్చయ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘కొత్తగా మా ప్రయాణం’. యామిని భాస్కర్ కథానాయిక. ‘ఈవర్షం సాక్షిగా’ ఫేం రమణ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరాయ. ఇటీవలే రిలీజైన టీజర్ ఆద్యంతం ఫన్, లవ్, యాక్షన్‌తో ఆకట్టుకుంది. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆడియో త్వరలో రిలీజ్ కానుంది. దర్శకుడు రమణ మాట్లాడుతూ ‘ఇటీవలే రిలీజైన టీజర్‌కి చక్కని స్పందన వచ్చింది. తాజాగా ట్రైలర్‌ని రిలీజ్ చేశాం. దీనికి అద్భుత స్పందన వస్తోంది. త్వరలో ఆడియో రిలీజ్ చేయనున్నాం. నిర్మాణానంతర పనులు వేగంగా పూర్తవుతున్నాయి. నవతరం సినిమాల్లో యూనీక్ పాయింట్‌తో తెరకెక్కుతున్న సినిమాకి ఇప్పటికే మంచి క్రేజు వచ్చింది. కథాంశం అందుకు తగ్గట్టే ప్రామిస్సింగ్‌గా, ఆసక్తికరంగా ఉంటుంది. స్క్రీన్‌ప్లే పరంగానూ కొత్తదనం చూపిస్తున్నాం. పదిమందికి సాయపడుతూ ఓపెన్ మైండెడ్‌గా ఉండే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రేమకథలో ట్విస్టులేమిటన్నది తెరపైనే చూడాలి.
  అందరికీ సాయపడే తత్వమున్నా హీరోకి ప్రేమ, పెళ్లి, కుటుంబం వంటి విలువలపై అంతగా నమ్మకముండదు. అయితే అలాంటివాడు మన సాంప్రదాయ విలువను, గొప్పతనాన్ని తెలుసుకున్న తర్వాత ఎలా మారాడు? అన్నది ఆద్యంతం ఆసక్తికరంగా చూపించాం. నెలకు రెండు లక్షల జీతం అందుకునే సాఫ్ట్‌వేర్ కుర్రాడి కథ ఇది. ప్రియాంత్‌కి తొలి సినిమానే అయినా తడబడకుండా నటించాడు. యామిని భాస్కర్ అందచందాలు సినిమాకి ఆకర్షణ. యూత్‌ని టార్గెట్ చేసి తీసిని చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తాం అన్నారు.


  0 0

  హర్రర్ ‘క్షుద్ర’ చిత్రాన్ని అందించిన దర్శకుడు నాగుల్ దర్శకత్వంలో ఎం. నరేంద్ర సమర్పణలో వర్కింగ్ యాన్ట్స్ పతాకంపై నిర్మించిన చిత్రం ‘బంజార’. షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉన్న చిత్రం తెలుగు, తమిళ భాషల్లో జనవరి నెలాఖరున ప్రేక్షకుల ముందుకు రానుంది. రొటీన్‌కు భిన్నమైన హారర్ కథాంశంతో కూడుకున్న చిత్రమని నిర్మాత కోయ రమేష్‌బాబు తెలిపారు. అమృత, ట్వింకిల్‌కపూర్, తేజేష్‌వీర, హరీష్ గౌరి, జీనా, జీవీ, బెనర్జి, శరత్, వేదం నాగయ్య, అనంత్, జ్యోతిశ్రీ, జబర్దస్త్ రాజు, అప్పరావు, శాంతి స్వరూప్, దొరబాబు నటించిన చిత్రానికి సంగీతం గంటాడి కృష్ణ, కెమెరా ఎ.వెంకట్ అందించారు.


  0 0

  వరుణ్‌సందేశ్, జీవన్, చరిష్మాశ్రీకర్, కారుణ్య చౌదరి హీరోహీరోయిన్లుగా మధుసోభా.టి దర్శకత్వంలో ఏ డీజే ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై శంకర్ ఆరా నిర్మిస్తున్న చిత్రం ‘దాడి’. ఈ సినిమా బుధవారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఏడిద శ్రీరామ్ కెమెరా స్విచాన్, శివాజీరాజా క్లాప్‌నిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌లో హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ, ‘ఏడాది తర్వాత ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నా. ఏడాదిపాటు యుఎస్ వెళ్ళాను. తిరిగొచ్చాక చాలా కథలు విన్నాను. ఈ క్రమంలో ఇది నాకు బాగా నచ్చింది. మధు మంచి స్క్రిప్ట్ తీసుకొచ్చాడు. గతంలో నేను చేసిన సినిమాలన్నింటికి భిన్నంగా ఉంటుంది. గోకుల్ చాట్ బాంబ్ దాడిలో కుటుంబం కోల్పోయిన ఓ వ్యక్తి పాత్రలో కనిపిస్తాను. తర్వాత జర్నలిస్ట్‌గా మారి ఏం చేశారనేది ఆసక్తికరం. మణిశర్మ సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలవనుంది. ఫిబ్రవరి మొదటివారంలో సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభిస్తాం. నెక్స్ట్ చంద్రమహేష్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నా’నన్నారు. ‘మల్టీపుల్’ జోనర్ చిత్రమిది. సమాజంలో జరుగుతున్న చీకటి కోణాలను వెలికితీసే కథ ఇది. యూత్‌కి మంచి సందేశం ఇచ్చేలా ఉంటుంది. ఈ సినిమాతో మంచి బ్లాక్‌బస్టర్ ఇస్తారన్న నమ్మకంతో చెబుతున్నా. నేను కాదు. సినిమా మాట్లాడాలనుకుంటాను’ అని దర్శకుడు అన్నాడు. నిర్మాత శంకర్ మాట్లాడుతూ దర్శకుడు చెప్పిన కథ ఆసక్తికరంగా అనిపించింది. అందుకే నిర్మాతగా మారాను. హీరో వరుణ్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. మంచి సందేశాత్మక చిత్రమిది అన్నారు. నా పాత్ర యూత్‌ని బాగా ఆకట్టుకుంటుందని హీరోయన్ కారుణ్య తెలిపారు. మంచి చిత్రంలో భాగం కావడం లక్కీగా భావిస్తున్నానని మరో హీరోయిన్ చెరిష్మా చెప్పారు. కార్యక్రమంలో జీవన్, శివశంకర్ మాస్టర్ పాల్గొన్నారు.


  0 0

  అందాల రాక్షసి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు హను రాఘవపూడి. తరువాత సరికొత్త కథలతో సినిమాలు చేస్తూ పరిశ్రమలో ప్రత్యేకత నిలుపుకున్నాడు. తాజాగా సరికొత్త ప్రేమకథతో ‘పడిపడి లేచె మనసు’ అంటూ ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. శర్వా, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం శుక్రవారం విడుదలవుతున్న నేపథ్యంలో మీడియాతో హను..
  సినిమా బాగా వచ్చింది. మంచి కాన్ఫిడెంట్‌తో ఉన్నాం. ఇదో మంచి ప్రేమకథ. ప్రేమకథ అంటే అమ్మాయి అబ్బాయి మధ్య ప్రేమ అంతే. కాకపోతే దాన్ని ఎలా భిన్నంగా చూపించామన్నదే సినిమా. కథ మొత్తం కలకత్తా నేపథ్యంలో సాగుతుంది. టైటిల్ గురించి చెప్పాలంటే.. ప్రేమలో పడటం, గొడవలు, కాంప్రమైజ్ కావడం.. ఇలా అన్నీ ఉంటాయి కాబట్టి ఈ టైటిల్ కనెక్టవుతుందని పెట్టాం. సినిమాలో హీరో పాత్ర పేరు సూర్య. యాక్టివ్ పర్సన్. సూర్యుడు ప్రపంచానికి వెలుగు పంచితే ఈ సూర్య అమ్మాయికి ప్రేమ పంచుతాడు. ఇందులో శర్వాది ఫుట్‌బాల్ ప్లేయర్ రోల్. అలాగని గేమ్‌కు సంబంధించిన నేపథ్యమేమీ ఉండదు. చాలామంది మణిరత్నం సఖి ఛాయల్లో ఉందంటున్నారు. ఆ సినిమాకు ఈ సినిమాకు ఎక్కడా పోలిక ఉండదు. జనాలు అలా ఓ గొప్ప దర్శకుడితో పోలిస్తే మంచిదే. శర్వానంద్ సాయిపల్లవి ఇద్దరు అద్భుతంగా చేశారు. ఓ సూపర్ కథకు.. ఓ సూపర్ క్లైమాక్స్.. అలాగే సూపర్ ఆర్టిస్టులు ఉంటే ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. నావరకు కథలో కొత్తదనం ఉండాలన్న ఆలోచనతో సినిమా చేస్తా. అలాగే ప్రయత్నించిన లై విషయంలో ఎక్కడో చిన్న పొరబాటు జరిగింది, కమర్షియల్‌గా ప్లాప్ అయ్యాం. అయినా ఏ సినిమా అయినా హిట్ కావాలనే చేస్తాం. అన్నీ మనమనుకున్నట్టు కావు. ఇక నెక్స్ట్ ప్రాజెక్టు విషయంలో నానితో కమిటయ్యాం. మిలటరీ నేపథ్యంలో సినిమా ఉంటుంది. దాంతోపాటు నెక్స్ట్ మైత్రి మూవీస్ బ్యానర్‌లో ఉంటుంది.. ఇంకా హీరో ఎవరన్నది కన్‌ఫర్మ్ చేయలేదు.


  0 0

  తొలిప్రేమ సినిమా టైంలో అనుకుంటా.. దర్శకుడు సంకల్ప్ ఈ కథ చెప్పాడు. స్పేస్ నేపథ్యంగా సాగే కథ వింటున్నపుడు చాలా థ్రిల్ ఫీలయ్యాను. దానికితోడు -లాపీలో కొన్ని స్పేస్ బొమ్మలూ చూపించి లైన్ వివరించడంతో బాగా కనెక్టయ్యాను. అందుకే ఆలోచించకుండా ఓకె చెప్పా. తరువాత పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయడం, సెట్స్‌పైకి వెళ్లడం వెంటవెంటనే జరిగిపోయాయ.

  మాస్ హీరోలుగా మెగా హీరోలకు మంచి క్రేజ్. కానీ మెగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ మాత్రం ఆరంభంనుంచీ వైవిధ్యానే్న ఎత్తుకున్నాడు. ఫిదా, తొలిప్రేమ విజయాల తరువాత అంతరిక్ష నేపథ్యం కలిగిన కథతో వ్యోమగామిగా ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఘాజిలాంటి సంచలన చిత్రాన్ని తెరకెక్కించిన సంకల్ప్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా శుక్రవారం థియేటర్లకు వస్తున్న తరుణంలో మీడియాతో హీరో వరుణ్ తేజ్ ముచ్చట్లు.

  అంతరిక్షం కథేమిటి?
  -ఇదొక వ్యోమగామి కథ. స్పేస్ నేపథ్యంగా సాగే సినిమా. అతని ఎమోషన్స్, లైఫ్, గోల్ లాంటి భావోద్వేగాలు ఇందులో చూస్తారు. సంకల్ప్ గొప్ప విజువల్స్‌తో తెరకెక్కించాడు.
  మీ పాత్ర గురించి?
  రియల్ ఇన్సిడెంట్‌ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని దర్శకుడు ఇందులో హీరో పాత్ర సృష్టించారు. దేవ్ అనే వ్యోమగామిగా కనిపిస్తా. దేశానికి గొప్ప పేరు తీసుకురావాలనే అతని కల ఎలా సాకారమైంది? అందుకు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడనేదే సినిమా.
  కామన్ ఆడియన్స్‌కి సైంటిఫిక్ సినిమా రుచిస్తుందా?
  -ప్రేక్షకుల అభిరుచి మారింది. పోస్టర్లు, ట్రైలర్లు చూసి సినిమాకు వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. ఈ చిత్రం తప్పకుండా వారికి మంచి అనుభూతి ఇస్తుందనుకుంటున్నాను. క్లాస్ అండ్ మాస్ అనే తేడా లేకుండా చిత్రం అన్ని వర్గాలవారినీ అలరిస్తుంది. ప్రేక్షకుడికి ఇదొక విజువల్ వండర్. తెలుగులో వస్తున్న మొదటి స్పేస్ థ్రిల్లర్ కాబట్టి సహజంగానే సినిమాపై అంచనాలు ఉంటాయి. కథ కొత్తది కాదు.. ప్రతి మనిషికి తెలిసిదే.
  ముందు రిఫరెన్స్ లాంటిది తీసుకున్నారా?
  -లేదు. స్టోరీ వినగానే ఎగ్జైట్ అయ్యాను. వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. ఎలా చేయాలని ఆలోచించాను. కొన్ని హాలీవుడ్ సినిమాలు చూశాను. అంతేకాని ఈ సినిమా చేయడానికి నాకెలాంటి రిఫరెన్స్‌లు లేవు. ఉన్న తక్కువ రిసోర్స్‌లతో సినిమా చేశాం. అయతే దర్శకుడు మాత్రం కొందరు సైంటిస్టుల రిఫరెన్స్ తీసుకున్నాడు.
  వ్యోమగామి డ్రెస్‌లో ఎలా ఫీలయ్యారు?
  -డ్రెస్సే బరువు. దానికితోడు వెనకాల దాదాపు 15 కిలోల బ్యాగ్. దాంతోనే అక్కడ డైవ్ చేయగలం. అలా అంత బరువుతో గాలిలో వేలాడడం రిస్క్ అనిపించింది. నిజంగా కష్టపడ్డాం కాబట్టి మంచి అవుట్‌పుట్ వచ్చింది.
  ఇలాంటి సినిమాలకు బడ్జెట్ ఎక్కువవుతుంది కదా.. తక్కువలో ఎలా వర్కవుటైంది?
  -స్పేస్ నేపథ్యంలో సినిమా అంటే నిజంగా వందల కోట్ల బడ్జెట్ అవుతుంది. కానీ మా సినిమాకు కేవలం 20-30కోట్లలోనే ప్లాన్ చేశాం. అయితే గ్రాఫిక్స్ విషయంలో మనం ఎంత ఖర్చుపెడితే అంత అవుట్‌పుట్ వస్తుంది. దాన్ని బట్టి ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు. సినిమాకు మంచి విఎఫ్‌ఎక్స్ టీమ్ కుదరడంతో అనుకున్న బడ్జెట్‌లో పూర్తయ్యింది.
  హీరోయిన్స్ గురించి?
  -లావణ్యతో రెండో సినిమా. తాను మంచి నటి. ఈ సినిమాలో మా ఇద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. అలాగే అదితిరావు హైదరీ వ్యోమగామిగా కనిపిస్తుంది.
  ప్రతిసారి కొత్తగా ట్రై చేస్తున్నారు.. మాస్ ఇమేజ్‌కు దూరమయ్యానని అనిపించడం లేదా?
  -అలా ఏమీ ఉండదు. మాస్ అన్నది ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి భిన్నమైన కథలు రావడం లక్కీ. ఇక మాస్ అంటారా, నేను చేస్తున్న సినిమాల్లో కుదిరినప్పుడు చేస్తూనే ఉంటా.
  ఎఫ్2 ఎంతవరకు వచ్చింది?
  -సినిమా పూర్తయ్యింది. ఫన్ ఫిల్మ్. కెరీర్‌లో అంత ఫన్ చేయడం హ్యాపీ. పైగా వెంకటేష్, రాజేంద్రప్రసాద్ లాంటి సీనియర్లతో పనిచేయడం మెమరబుల్ అనుభూతి.
  తదుపరి చిత్రాలు?
  -కిరణ్ డైరెక్షన్‌లో స్పోర్ట్స్ నేపథ్యంలో సినిమా చేస్తున్నా. మరో సినిమా ఉంది. ఇక హరీశ్ శంకర్ లైన్ చెప్పాడు. బాగా నచ్చింది కథ డెవలప్ చేయమని చెప్పా.


  0 0

  వింక్ సెనే్సషన్ ప్రియా ప్రకాష్ వారియర్ ప్రస్తుతం ఒక హిందీ సినిమాలో నటిస్తోంది. శ్రీదేవి బంగ్లా అనే టైటిల్‌తో రానున్న ఈ చిత్రంలో ఆమె బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ లండన్‌లో జరుగుతోంది. సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటించిన ‘్భగవాన్’ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్ మాబుల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రభుదేవా ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఇక ఇదిలా వుంటే ప్రియా ప్రకాష్ మలయాళంలో నటించిన మొదటి చిత్రం ‘ఒరు ఆదార్ లవ్’ ఎపుడో విడుదల కావాల్సి వుండగా, అనివార్య కారణాలతో వాయిదా పడి వచ్చే ఏడాది ప్రేమికుల రోజున ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. శుక్రవారం విడుదలవుతున్న యన్‌టిఆర్ బయోపిక్ ఆడియో, టీజర్


  0 0

  ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నందమూరి ఫ్యాన్స్ ముచ్చటపడే రోజు
  దగ్గరకు వచ్చేసింది. యన్‌టిఆర్ బయోపిక్ ఆడియో, టీజర్ శుక్రవారం విడుదలవుతున్న
  నేపథ్యంలో చిత్రయూనిట్ వయసులో ఉన్నప్పటి యన్‌టిఆర్, బసవతారకం
  చిత్రాన్ని యూనిట్ విడుదల చేసింది. ఆ చిత్రమే ఇది


  0 0

  కాగజ్‌నగర్, డిసెంబర్ 20: తెలంగాణ నుండి మహారాష్టక్రు వివిధ రైళ్లలో అక్రమంగా తరలిస్తున్న 300 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని బుధవారం రాత్రి స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్, రైల్వే పోలీసులు పట్టుకున్నారు. కాగజ్‌నగర్ రైల్వే ఆర్‌పిఎఫ్ పోలీసుల సమాచారం మేరకు వరంగల్, పెద్దపల్లి, మంచిర్యాల, కుమ్రంభీం, జిల్లాల నుండి నిత్యం అక్రమంగా రవాణా అవుతున్న రేషన్ బియ్యం మహారాష్టల్రోని వీరూర్ సమీపంలో డంప్‌చేసి 18 రూపాయల నుండి 20 రూపాయలకు అమ్ముతున్నారని అందిన సమాచారం మేరకు హైదరాబాద్ సివిల్ సప్లైస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి రాజేశం, కాగజ్‌నగర్ ఆర్‌పిఎఫ్ ఎస్సై ఎంవీ రాథోడ్ దాడులు చేయగా, దాదాపు 300క్వింటాళ్ల (సుమారు రూ.2లక్షలు) బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈబియ్యాన్ని కాగజ్‌నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే స్పాయింట్ కార్యాలయానికి తరలించినట్లు వారు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీదలకు అందిస్తున్న రేషన్ బియ్యాన్ని దళారులు 12 నుండి 15 వరకు కొనుగోలు చేసి 18 నుండి 20 రూపాయలకు వరకు అమ్ముతున్నారని అక్రమ దందా చేసే దళారులను వ్యాపారులను వదిలి పెట్టమని సివిల్ సప్ల్యై ఎన్ ఫోర్స్‌మెంట్ అదికారి ఈ సందర్బంగా హెచ్చరించారు.


  0 0

  నిర్మల్, డిసెంబర్ 20: జిల్లాలో పెన్షనర్ల కోసం డేకేర్ సెంటర్, సీనియర్ సిటిజన్‌ల కోసం ఓల్డ్ ఏజ్‌హోం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఎం. ప్రశాంతి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో జాతీయ పెన్షనర్ల దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశాంత్ర ఉద్యోగుల సంఘం నిర్మల్ వారు పెన్షనర్ల భవన్‌లో ఆచార్య జయశంకర్ స్మారక వేదిక వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజానికి స్పూర్తి ప్రధాతలు పెన్షనర్లని నేటి యువతకు దిశనిర్దేశం చేయాలని అన్నారు. చురుకుగా ఉండి సమాజ శ్రేయస్సుకు తమవంతు సహకారం అందించాలన్నారు. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు. జిల్లాలో 100 సంవత్సరాలు దాటిన వారు 17 మంది ఉన్నారని తెలిపారు. జిల్లాలో పెన్షనర్ల సౌలభ్యం కోసం డే కేర్ సెంటర్, సీనియర్ సిటిజన్ కోసం ఓల్డ్ ఏజ్‌హోం ఏర్పాటుకు తనవంతు బాధ్యతగా కృషి చేస్తానని వెల్లడించారు. 30 మంది పెన్షనర్లను ఘనంగా సన్మానించారు. నిర్మల్ జిల్లా విశాంత్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షులు జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులు సామాజిక సేవ దృక్పథంతో సేవలు అందిస్తున్నారని అన్నారు. 1684 మందికి కంటి పరీక్షలు, 50 మందికి దుపట్లు, కార్పోరేట్ ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళ శిశు సంక్షేమ ఆధికారిణి విజయలక్ష్మీ, ఆర్‌డీవో ప్రసునాంబ, డీటీవో సంజయ్‌కుమార్, ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్ శివకుమార్, ఆంధ్రాబ్యాంక్ చీఫ్ మేనేజర్ దేవదాస్, లోలం గంగన్న, పెన్షనర్లు, తదితరులు పాల్గొన్నారు.


  0 0

  ఆదిలాబాద్, డిసెంబర్ 20: పేదల అభ్యున్నతే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. గురువారం జైనథ్ మండలంలోని పలు గ్రామాల్లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాలకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. నాల్గవసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన తొలిసారిగా గ్రామాల సందర్శనకు వచ్చిన ఎమ్మెల్యే జోగురామన్నను ఆయా గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలతో ర్యాలీ నిర్వహించడంతో పాటు పూలమాలలతో సత్కరించారు. మండలంలోని గిమ్మ, పిప్పర్‌వాడ, పెండల్‌వాడ, మేడిగూడ తదితర గ్రామాల్లో మహిళా లబ్దిదారులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలకు బతుకమ్మ చీరలను అందజేయడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షిస్తూ ప్రభుత్వం అన్నివర్గాల పండగలకు పెద్దపీట వేస్తుందన్నారు. దసరా పండగకు ముందే చీరలను పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో చీరల పంపిణీ నిలిచిపోయిందన్నారు. రాష్ట్రంలో 94లక్షల మంది మహిళలకు చీరలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే రాష్ట్రం ముందు వరసలో ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు నాయకులు చంద్రయ్య, దేవన్న, లింగారెడ్డి, వెంకట్‌రెడ్డి, గిమ్మ సంతోష్, భోజన్న తదితరులు పాల్గొన్నారు.


  0 0

  మందమర్రి, డిసెంబర్ 20: ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం మరియు సిఈఆర్ క్లబ్‌లో చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు. నాలుగున్నర సంవత్సరాల టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్దికి , సంక్షేమ పథకాలే టి ఆర్ ఎస్ ప్రభుత్వానికి తిరిగి పట్టం కట్టారన్నారు. కేవలం బతుకమ్మ చీరల పంపిణి కార్యక్రమం కాకుండా ఇతర సంక్షేమ పథకాలు అమలు చేస్తు రాష్ట్రాన్ని అన్ని విధాల ప్రజలలోకి తీసుకెళ్లడం జరుగుతుందని ఆయన తెలిపారు. 14 సంవత్సరాలు ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తెలంగాణ ప్రజలు అదే స్పూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ది చేసే విధంగా కేసీఆర్‌కు సహకరించాలని వారు కోరారు. దేశంలో ఉన్న 29 రాష్ట్రాలకు పోటీ కాకుండా ఇతర దేశాలతో సమానంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందించడం జరిగిందని, ఆ దిశగా కేసి ఆర్ అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారని వారు పేర్కొన్నారు. మహిళల ఆశీర్వాదంతోనే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిందని వారు అన్నారు. ఈ సందర్బంగా మందమర్రి పట్టణానికి తొలిసారిగా విచ్చేసిన చెన్నూర్ ఎమ్మెల్యే పలు నాయకులు, కార్యకర్తలు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి బొలిశెట్టి కనకయ్య, జడ్పిటిసి సుదర్శన్ గౌడ్, మున్సిపల్ కమీషనర్ సమ్మయ్యతో పాటు టీఆర్‌ఎస్ నాయకులు జే రవీందర్, సంపత్, సూరిబాబు, నరేష్, రాం వేణు, తదితరులు పాల్గొన్నారు.
  పలు శాఖ అధికారులతో సమీక్ష సమావేశం
  మందమర్రి మున్సిపాలిటీ అభివృద్ది కోసం పలు శాఖల అధికారులతో ఎమ్మెల్యే బాల్క సుమన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ 22 కోట్ల డీఎంఎఫ్‌టి నిధులతో త్వరగా టెండర్ ఖరారు చేసి 24 వార్డులలో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు అదేశించారు. ముఖ్యంగా ఎలాంటి ఆరోపణలు లేకుండా పనులు అందరికి వచ్చేలా ఎంపిక చేయాలని వారు సూచించారు. ముఖ్యంగా వార్డులలో సీసీ రోడ్లు, మురుగు నీటి కాల్వలు, వీధిదీపాలు లాంటి వౌలిక సదుపాయాలు యుద్ద ప్రతిపాదికన చేపట్టాలని పేర్కొన్నారు. మిషన్ భగీరథ పనులను త్వరగా పూర్తి చేసి ఫిబ్రవరి నెలలో ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇంటికి నీరు వచ్చే విధంగా నీటి పారుదల అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. అనంతరం మందమర్రి మార్కెట్ ప్రాంతంలో ఉన్న బస్టాండ్ ప్రాంతాన్ని సందర్శించారు. బస్టాండ్‌కు అన్ని బస్సులు వచ్చే విధంగా ఆర్టీసి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.


  0 0

  ఆదిలాబాద్, డిసెంబర్ 20: ఆదిలాబాద్ జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్టాంపుల కుంభకోణం కార్యాలయ సిబ్బంది, అధికారుల మెడకు ఉచ్చు బిగిస్తోంది. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అవినీతి అక్రమాలు, స్టాంపులు, బాండ్‌పేపర్ల విక్రయాలకు సంబంధించి ప్రభుత్వానికి జమచేయాల్సిన రూ.78లక్షల నిధులను స్వాహా చేసిన వ్యవహారం ఆ శాఖలో దుమారం రేపుతుండగా.. క్యాషియర్ ఇంతియాజ్, జూనియర్ అసిస్టెంట్ కపిల్ కుమార్‌లపై సస్పెన్షన్ వేటు పడింది. 2014 నుండి 2018 వరకు నాలుగేళ్ళలో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో భారీఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు, అసైన్డ్ భూములకు సైతం రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రిజిస్ట్రార్ డిఐజి ట్వింకిల్ జాన్ ఆదేశాల మేరకు విచారణ బృందం దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. డిఐజి ఆదేశాల మేరకు టూటౌన్ పోలీసు స్టేషన్‌లో ఇద్దరు నిందితులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. పోలీసుల దర్యాప్తులో భాగంగా టూటౌన్ సిఐ నాగరాజు అధ్వర్యంలో పోలీసులు గురువారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి స్టాంపుల క్రయ విక్రయాలకు సంబంధించి పలు దస్తావేజులు, కీలకమైన డాక్యూమెంట్లను స్వాదీనం చేసుకున్నారు. భూముల రిజిస్ట్రేషన్‌లో సైతం రిజిస్ట్రార్ కార్యాలయంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రియల్టర్ల అక్రమ లావాదేవీలపై విచారణ సాగిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్ కాగా మరో నలుగురి ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. ఈమేరకు వారిపై కూడా దర్యాప్తు జరిపి పోలీసులు రిజిస్ట్రార్ డిఐజికి నివేదిక సమర్పించనున్నారు. మరోవైపు 78 లక్షల ప్రభుత్వ నిధులను స్వాహా చేసిన సంఘటన నేపథ్యంలో నిధుల రికవరీకి కూడా నోటీసులు జారీ కావడం గమనార్హం. పోలీసులు ప్రత్యేకంగా అక్రమాలపై కూపీ లాగుతూ దర్యాప్తు సాగిస్తున్న వ్యవహారం జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కలకలం సృష్టిస్తోంది.


  0 0

  ఆదిలాబాద్,డిసెంబర్ 20: బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్ తుపాన్ ఆదిలాబాద్ జిల్లాను గజ గజలాడిస్తోంది. ఉత్తరాది నుండి వీస్తున్న శీతల గాలులకు ఆదిలాబాద్ జిల్లాలో గురువారం 4.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గత ఏడాది డిసెంబర్ 27న 3.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదుకాగా ఈ సంవత్సరంలో అత్యల్పంగా రికార్డుస్థాయిలో 4.8 డిగ్రీలు నమోదు కావడం గమనార్హం. ఉదయం నుండి సాయంత్రం వరకు గడప దాటి బయటకు వెళ్లేందుకు ప్రజలు జంకుతున్నారు. సామాన్యుల పరిస్థితి కడు దైన్యంగా మారుతోంది. 2010 జనవరి 21న 6.2 డిగ్రీలు, 2011 జనవరి 7న 4.1కనిష్ట ఉష్ణోగ్రత, 2012 డిసెంబర్ 27న 6.3 డిగ్రీలు, 2013 జనవరి 11న 6.8 డిగ్రీలు, 2014 డిసెంబర్ 18న 4.2 డిగ్రీలు, 2015 డిసెంబర్ 19న 6.3 డిగ్రీలు, 2016 డిసెంబర్ 10న 5.5 డిగ్రీలు, 2017 డిసెంబర్ 27న 3.6 డిగ్రీలు నమోదైంది. గురువారం రికార్డుస్థాయిలో 4.8 డిగ్రీలు నమోదుకావడం గమనార్హం. మరో రెండు మూడు రోజుల్లో ఇదే స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.

  మహిళల ఆత్మగౌరవానికే బతుకమ్మ చీరల పంపిణీ
  రాష్ట్ర డెయిరీ కార్పోరేషన్ చైర్మెన్ లోక భూమారెడ్డి

  తలమడుగు,డిసెంబర్ 20: మహిళలో ఆత్మగౌరవాన్ని నింపేంథుకే తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తోందని రాష్ట్ర డెయిరీ కార్పోరేషన్ చైర్మెన్ లోక భూమారెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సంధర్భంగా లోక భూమారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మహిళలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం కోసం పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కెసి ఆర్‌ను రెండోసారి ఆశీర్వాదించి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో దాదాపు 12వేల మంది మహిళలందరికి బతుకమ్మ చీరలను అందజేయడం జరుగుతుందన్నారు. వచ్చే ఐదేళ్ళలో ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రాన్ని మరింత అభివృద్దిపర్చేందుకు ఎంతో కృషి చేస్తున్నానరి అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మెన్ ముడుపు దామోదర్ రెడ్డి, తహసీల్దార్ ఇమ్రాన్‌ఖాన్, ఎంపిపి సిడాం రాము, జడ్పీటీసీ జక్కుల గంగమ్మ ప్రభాకర్, ఉపాధ్యక్షులు శార్దస్వామి, రైసస మండల అధ్యక్షులు ముడుపుకేదరీశ్వర్ రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా విభాగం నాయకులు కాటిపెళ్ళి శ్రీనివాస్ రెడ్డి, మహిళా మండల అధ్యక్షురాలు సునీత, మండల కన్వీనర్ వెల్మ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
  ....................................................


  0 0

  కొయ్యూరు, డిసెంబర్ 20: తుఫాన్‌లో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల నేత యుగంధర్ ప్రభుత్వాన్ని కోరారు. మండలంలోని ఆడాకులు, బాలారం, కంఠారం తదితర ప్రాంతాల్లో పర్యటించి అక్కడి పంట నష్టాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా తుఫాన్ ప్రభావంతో రైతాంగం తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసారు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో నష్టపోవడం బాధాకరమన్నారు. నష్టపోయిన రైతాంగానికి పరిహారం అందించి ప్రభుత్వమే ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేసారు.
  జీ ఓ నెంబర్ 132ను రద్దు చేయాలి
  కొయ్యూరు, డిసెంబర్ 20: ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల డ్రాయింగ్ పవర్‌ను వెంటనే పునరుద్దరించే విధంగా చర్యలు తీసుకోవాలని సీపీ ఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.సత్యనారాయణ డిమాండ్ చేసారు . పార్టీ మండల కార్యదర్శి దేముడితో కలిసి మాట్లాడుతూ జీ ఓ నెంబర్ 132ను రద్దు చేయడం వలన ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం తక్షణం ఈజీ ఓను రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గత మూడు రోజులుగా విశాఖలో జరుగుతున్న జాతీయ సభ ముగింపు సందర్భంగా నేడు బారీ ర్యాలీ, బహిరంగ సభను జరుగనున్నాయన్నారు. ఈసభకు అధిక సంఖ్యలో కార్యకర్తలను తరలించేందుకు వీలుగా వాహనాలను ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు. కార్యకర్తలు,అభిమానులు, భారీ సంఖ్యలో పాల్గొని ఈసభలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

  కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి
  కోటవుటర్ల, డిసెంబర్ 20 : అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పని చేసి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని జగన్ సూచించినట్లు పార్టీ రాష్ట్ర అదనపు కార్యదర్శి దత్తుడు సీతబాబు తెలిపారు. గురువారం శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాళిలో జగన్‌ను కోటవురట్ల మండలం తంగేడు రాజుల కుటుంబానికి చెందిన దత్తుడు సీతబాబు, పార్టీ యువజన నాయకుడు నారాయణమూర్తి రాజు కలిసారు. ఈసందర్భంగా పాయకరావుపేట నియోజకవర్గంలో పార్టీ పటిష్టతపై దృష్టి సారించాలని తమకు సూచించినట్లు సీతబాబు తెలిపారు. కార్యకర్తలు, నాయకులు ఐక్యంగా పని చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని జగన్ చెప్పినట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని సీతబాబు ధీమా వ్యక్తం చేసారు.

  సమస్యల పరిష్కారం కోసం పోస్టల్ సిబ్బంది సమ్మె
  కోటవురట్ల, డిసెంబర్ 20: ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్ యూనియన్ ఆధ్వర్యంలో పోస్టల్ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం మూడవ రోజుకు చేరుకుంది. సమ్మెలో బాగంగా స్థానిక తపాలా కార్యాలయం వద్ద పోస్టల్ సిబ్బంది ఆందోళన నిర్వహించారు. ఆందోళనలో పాల్గొన్న యూనియన్ నాయకులు ఎస్‌వీ నాయుడు, పి.సీతారామ్, జీవీవీ సత్యనారాయణలు మాట్లాడుతూ జీడీ ఎస్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని డిమాండ్ చేసారు. గ్రాడ్యూటీ గరిష్ట పరిమితి ఐదు లక్షలకు పెంచాలన్నారు. కనీస సర్వీస్ పూర్తి చేసిన సిబ్బందికి అదనపు ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలన్నారు. పీసీ ఎంలకు కాంపోజిట్ అలవెన్స్ 1,600 రూపాయలకు పెంచాలన్నారు. ఈకార్యక్రమంలో సిబ్బంది బీవీ ఎస్ నాయుడు, వరహాలు, తాతరాజు పాల్గొన్నారు.

  జాతీయ సభలను విజయవంతం చేయాలి
  కోటవురట్ల, డిసెంబర్ 20: విశాఖలో ఈనెల 21న నిర్వహించే సీపీ ఐ జాతీయ సమావేశాలను జయప్రదం చేయాలని జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్. కొండలరావు విజ్ఞప్తి చేసారు. గుర


  0 0

  కొయ్యూరు, డిసెంబర్ 20: కొయ్యూరు గ్రామానికి చెందిన గంగిశెట్టి శ్రావ్యశ్రీ(3) మెదడు సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ మృతి చెందింది. జ్వరంతో బాధపడుతున్న బాలికను తండ్రి చిరంజీవి మెరుగైన వైద్య సేవలకై తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు గత 15 రోజుల క్రితం తరలించారు. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య సేవలందింప చేసారు. మొదట డెంగ్యూ జ్వర లక్షణాలు ఉన్నాయని వైద్యం అందించినట్లుగా ఆయన తెలిపారు. అనంతరం 10 రోజుల తరువాత బాలిక పరిస్థితి విషమంగా మారడంతో విజయవాడకు తరలించి వైద్య సేవలందింప చేసారు. శ్రావ్యశ్రీకి బ్రెయిన్ డెడ్ అయ్యి ఆర్గాన్స్‌పని చేయడం లేదని అక్కడి వైద్య నిపుణులు తెలిపారన్నారు. లక్షలాది రూపాయలు ఖర్చు చేసినా ఫలితం లేకపోయిందని, వైద్య సేవలు పొందుతూనే 17న బాలిక మృతి చెందిందని తల్లిదండ్రులు విలపిస్తూ తెలిపారు. నిత్యం కళ్ళ ముందే ఆడుతూ ఉండే చిన్నారి మృతి చెందడం జీర్ణించుకోలేక తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు చూపరులను కలిచివేస్తోంది.


  0 0

  బుచ్చెయ్యపేట, డిసెంబర్ 20: గడచిన 15రోజులుగా మండలంలోని వెలుగు సిబ్బంది సమ్మె చేస్తుండటంతో వడ్డాదిలోని వెలుగు కార్యాలయం మూతపడింది. దీంతో మండలంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. డ్వాక్రా రుణాలు, పసుపు కుంకుమ సొమ్ము పంపిణీ, మొబైల్ బ్యాంకింగ్, స్ర్తినిధి రికవరీ కార్యకలాపాలన్నీ వెలగు సిబ్బంది సమ్మెలతో నిలిచిపోయాయి. దీంతో గ్రామాల్లో ముఖ్యంగా డ్వాక్రా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు చంద్రన్న పెళ్లికానుక, నిరుద్యోగ భృతి తదితర అంశాలను కూడా వెలుగుతో అనుసంధానం చేయటంతో వారు కూడా ఇబ్బందులు ఎదుర్కోక తప్పటం లేదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి వెలుగు సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని మండల ప్రజలు కోరుచున్నారు.
  వచ్చే ఎన్నికల్లో వైకాపా 130సీట్లు గెలుపుఖాయం
  వైకాపాకే అనుకూల పవనాలు
  ఎన్నికల్లో బూత్ కమిటీలదే కీలక పాత్ర
  వైకాపా జిల్లా బూత్ కమిటీ పరిశీలకులు ఆదిత్యమనోహర్
  అనకాపల్లి టౌన్, డిసెంబర్ 20: వచ్చే ఎన్నికల్లో వైకాపా 130 సీట్లు కైశవం చేసుకోని వైఎస్ జగన్ సిఎం కావడం ఖాయమని వైకాపా ఎన్నికల బూత్ కమిటీ పరిశీలకులు ఆదిత్య మనోహర్ అన్నారు. స్థానిక రింగురోడ్డు వైకాపా కార్యాలయంలో గురువారం అనకాపల్లినియోజకవర్గ బూత్‌కమిటీ సభ్యులు, పార్టీకార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రజావ్యతిరేక పాలనకు రాష్ట్రప్రజలు విసుగుచెంది ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్‌ను గెలిపించి మళ్ళీ రాజన్న పాలన కోసం ఎదురుచూస్తున్నారని, ప్రజాసంకల్పయాత్రలోఎక్కడ చూసిన వైఎస్ జగన్‌కు ప్రజలు హారతులు పడుతూ తమ సమస్యలు మొరపెట్టుకుంటున్నారన్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో ఇప్పటికి 251బూత్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లోబూత్ కమిటీలు సమగ్రంగా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో బిసి సమాజిక వర్గాల ప్రజలను అనగదొక్కలని చూస్తున్నారన్నారు. తెలుగుదేశం అంటే బిసీలు అన్ని చెప్పుకుంటున్న అధికార పార్టీ నేడు ఆ బిసీలకు పంగనామాలు పెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. అదరణ 2పథకం ద్వారా లబ్ధిదారులకు అందజేసిన పరికరాలు నాణ్యత కొరవడి కమీషన్లురూపంలోకోట్లాది రూపాయల ప్రజాధనాన్ని స్వాహా చేసారన్నారు. వైకాపారాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్‌కుమార్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో వైకాపా పార్టీతరుపున పోటీ చేసి ఓటమీ చెందిన నాయుకులు జగన్‌పై అనేక కుంటి సాకులు చెప్పి పార్టీ వీడివెళ్ళిన వారు ఇంటిలో కూర్చోని అన్నికలు సమీపిస్తున్న తురుణంలో ఏ పార్టీ పిలుస్తే వెళ్ధామా అని ఎదురుచూస్తున్నారని ఆయన విమర్శించారు. అనకాపల్లి పార్లమెంటు సమన్వయకర్త వరుదుకళ్యాణి మాట్లాడుతూ గత ఎన్నికల్లోవైకాపాకు బూత్ కమిటీలు లేకపోవడం వలనే ఓటమి చెందవలసి వచ్చిందన్నారు. రానున్న ఎన్నిల్లోమాత్రం జగన్‌ను సిఎం చేయడమే లక్ష్యం ప్రతీ కార్యకర్త పనిచేస్తేగెలుపు ఖాయమన్నారు. అనకాపల్లి నియోజకవర్గ కన్వీనర్, వైకాపా జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్‌నాధ్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ శుక్రవారం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు.వచ్చే జన్మదిన వేడుకలకు సిఎం హోదాలో జరుపుకోవాలని కోరుతూ ఆలయాల్లో పూజలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక్కడి పార్టీ కార్యాలయంలో జగన్ జన్మదిన వేడుకలకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి మళ్ళ బుల్లిబాబు, పట్టణ అధ్యక్షులు మందపాటి జానకిరామరాజు,మండల పార్టీ అధ్యక్షులు గొర్లి సూరిబాబు, గొల్లవెల్లి శ్రీనివాసరావు, యువ నాయుకులు పలకారవి, యువజన విభాగ అధ్యక్షులు జాజుల రమేష్, మాజీ కౌన్సిలర్స్ కొణతాల మొరళీకృష్ణ, పి మొరళీ, కుండల రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
  బిసిలకు జరిగిన ఆన్యాయాన్ని నిరసిస్తూ అర్డీవో కార్యలయం వద్ద ధర్నా
  అనకాపల్లి టౌన్, డిసెంబర్ 20: గత ఎన్నికల్లో బిసీలకు ఇచ్చిన 110 హామీలు పూర్తిగా అమలుచేయకపోవడంతో బిసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని నిరశిస్తూ మాడుగుల వైకాపా ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, రాష్ట్రప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గొల్లబాబూరావు, జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్ నాధ్ అధ్వర్యంలో స్థానిక అర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.ముందుగా రింగురోడ్డులో ఉన్న వైకాపా కార్యాలయం నుండి పార్టీజెండాలతో భారీ ర్యాలీగా తరలివచ్చి అర్డీవోకార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ బిసీ సమాజంలోని కులాల పట్ల చంద్రబాబు ఆవలంబిస్తున్న వైఖరిని తీవ్రంగా ఖండిస్తూన్నామన్నారు. ఆదరణ పథకంలో నాణ్యతాలోపం పరికరాలు అందజేసి పథకాన్ని అవినీతిగా మార్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఎన్నికలు ముందు బీసిలకు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు బిసీలను చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. ఎడాదికి 10వేల కోట్లు బిసీ బడ్జెట్ పెడతానని హామీ ఇచ్చిన బాబు నాలుగేళ్ళలో 4వ వంతుకూడా కేటాయించలేదన్నారు.వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్ల బాబూరావు మాట్లాడుతూ అన్ని మండల కేంద్రాలలో కుల వృత్తికి ఆధునిక అభివృద్ది కేంద్రాల ఏర్పాటు ఏమైయిందని ప్రశ్నించారు.ఇతర రాష్ట్రాల్లో బిసీలకు ప్రాధాన్యత ఇస్తే మన రాష్ట్రంలో బిసీలకు కనీస విలువ ఇవ్వలేదన్నారు.ఈ సందర్బంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాధాలు చేసారు.అర్డీవో కార్యాలయం ఎవో సత్యనారాయణకు వినతిపత్రం అందజేసారు. ఈ కార్యక్రమంలో వైకాపా రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్‌కుమార్, అనకాపల్లి పార్లమెంటు కన్వీనర్ వరుదు కళ్యాణి, జిల్లా అధికార ప్రతినిధి మళ్ళ బుల్లిబాబు, పట్టణ అధ్యక్షులు మందపాటి జానకిరామరాజు, యువజన విభాగ అధ్యక్షులు జాజుల రమేష్, యువ నాయుకులు పలకారవి, కొణతాల మొరళీకృష్ణ, గొర్లి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

  గురుకులంలో వనభోజనాల సందడి
  కొయ్యూరు, డిసెంబర్ 20: ఎటువంటి బేధభావం లేకుండా అంతా ఒకే పంక్తిలో కూర్చొని భోజనాలు చేయడమే వన భోజనాలు ఉద్దేశ్యమని గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు అన్నారు. గురువారం పాఠశాల ఆవరణలో వన భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులంతా పాఠశాల ఆవరణను రంగులతో తీర్చిదిద్దారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ మాట్లాడుతూ తరతమ బేధం లేకుండా అంతా ఒకే పంక్తిలో కూర్చొనే భోజనాలు చేసే ఉద్దేశ్యంతో మన పూర్వీకులు వన భోజనాలను ఏర్పాటు చేసారన్నారు. ఇటువంటి కార్యక్రమాలు వలన విద్యార్థుల్లో మానసిక ఉల్లాసం పెరుగుతుందని, తద్వారా వారు చదువులో రాణించేందుకు దోహదపడుతుందన్నారు. ఈసందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి.


older | 1 | .... | 1972 | 1973 | (Page 1974) | 1975 | 1976 | .... | 2069 | newer