Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

మందుబాబులకు న్యాయమూర్తి జరిమానా

$
0
0

సబ్బవరం, డిసెంబర్ 20 : మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారనే అభియోగంపై స్థానిక పోలీసులు గురువారం నమోదు చేసిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నిందితులు నలుగురికి జరిమానా విధిస్తూ అనకాపల్లి సెకండ్ ఎంఎం కోర్టున్యాయమూర్తి గుప్తా తీర్పు వెలువరించారని స్థానిక ఎస్‌ఐ వై.నరసింహమూర్తి తెలిపారు. స్థానిక విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడిపిన నెక్కళ్ల సన్యాసినాయుడు (30)కు 800 రూపాయల జరిమానా విధించగా నంబారు వినయ్‌కుమార్ (22)కు -600, రొంగలి బంగారయ్య (45) - 800, అంగుళూరి చిన్న (45)కు- 6 వందల రూపాయల వంతున జరిమానా విధించారని పేర్గొన్నారు.

టీడీపీ నుంచి వైసీపీలో చేరిన అమ్ములపాలెం నేతలు
సబ్బవరం, డిసెంబర్ 20 : మండలంలోని అమ్ముల పాలెంలో గురువారం నిర్వహించిన అదీప్‌రాజ్ ప్రజాభరోసాయాత్రలో ఆ గ్రామానికి చెందిన ఐదుగురు టీడీపీ నేతలు ఆ పార్టీని వీడి వైసీపిలో చేరారు. ఈమేరకు వారికి పార్టీకండువాలు కప్పి అదీప్‌రాజ్ వైసీపీలోకి ఆహ్వానించారు. టీడీపీని వీడీ వైసీపీలో చేరిన వారిలో సూరిశెట్టిరామకృష్ణ, గండ్రెడ్డి అప్పారావు, బలిరెడ్డిపైడిబాబు, ఆకుల అప్పారావు, కనే్నపల్లి పైడిరాజు, కరణం నుకరాజులు ఉన్నట్లు ఆదీప్‌రాజు పంపించిన ప్రకటనలో వెల్లడించారు.
ఘనంగా సామూహిక హనుమాన్ వ్రతాలు
బుచ్చెయ్యపేట, డిసెంబర్ 20: మండలంలోని వడ్డాది శారదా నది ఒడ్డున ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని హనుమాన్ ఆలయంలో గురువారం సామూహిక హనుమాన్ వ్రతాలను భక్తులు అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించారు. గడచిన 15ఏళ్లుగా ప్రతి ఏటా ఈ ఆలయంలో ధనుర్మాసంలో ఈ సామూహిక వ్రతాలను వేద పండితులతో నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది నిర్వహించిన సామూహిక వ్రతాల్లో వడ్డాది పరిసరా గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అర్చకులు కృష్ణశర్మ భక్తులతో ఈ వ్రతాలను చేయించారు.
కేబుల్ ఆపరేటర్ల ధర్నా, రాస్తారోకో
బుచ్చెయ్యపేట, డిసెంబర్ 20: మండలంలోని కేబుల్ ఆపరేటర్లు గురువారం వడ్డాది జంక్షన్‌లో రాస్తారోకో నిర్వహించి, ధర్నా చేశారు. ట్రాయ్ పే చానళ్ల రుసుమును పెంచుతూ తీసుకున్న నిర్ణయం, కేబుల్ ఆపరేటర్లపై జిఎస్‌టిని విధించటాన్ని నిరసిస్తూ గురువారం మండలంలోని కేబుల్ ఆపరేటర్లు ఆందోళనకు దిగారు. కార్పొరేట్ సంస్ధలకు మేలు చేసేలా కేంద్ర ప్రభుత్వం ట్రాయ్ ద్వారా పే ఛానళ్ల రేట్లను పెంచటం వలన నేడు గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు 100నుండి 150 లకు అందుతున్న టివి ప్రసారాలు 300నుండి 700రూపాయలకు పెరుగుతుందని కేబుల్ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే స్వయం ఉపాధి కోసం కేబుల్ ఆఫరేటర్లుగా పనిచేస్తున్న తమకు ఉపాధి పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 5రూపాయల ఉన్న పేఛానల్ రేటును 19రూపాయల వరకు పెంచుకోవచ్చని ట్రాయ్ ఉత్తర్వులు జారీచేయటంతో, అన్ని ఛానళ్లు 19రూపాయలకు పెంచేశాయని, వెంటనే పెంచిన ఈ రేట్ల తగ్గించాలని, కేబుల్ ప్రసారాలపై వసూలు చేస్తున్న 18శాతం జిఎస్‌టిని రద్దు చేయాలని, కేబుల్ ఆపరేటర్లకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని ఆందోళన కారులు డిమాండ్ చేశారు. ఎంఎస్‌ఒ సంఘం జిల్లా కార్యదర్శి దొండా రమేష్ అధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో బేతి వెంకటరావు, ఎనుముల వాసు, బత్తుల వరాహమూర్తి, రాజు తదితర ఆపరేటర్లు పాల్గొన్నారు. ఆందోళన అనంతరం బుచ్చెయ్యపేట తహశీల్దార్ పి లక్ష్మీదేవిని కలిసి ఒక వినతిపత్రాన్ని అందజేశారు.


గిరిజన రైతులను ఆదుకోవాలి

$
0
0

హుకుంపేట, డిసెంబర్ 20 పెథాయ్ తుపానులో నష్టపోయిన గిరిజన రైతులను ఆదుకోవాలని వైసీపీ నాయకుడు జర్సింగి సూర్యనారాయణ కోరారు. మండలంలోని సరసపాడు, అమనగిరి, సంతారి, ఉప్ప తదితర గ్రామాలలో తుపాను కారణంగా పంట నష్టపోయిన గిరిజన రైతులను ఆయన గురువారం పరామర్శించి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుపాను వలన అనేక గ్రామాలలో వరి పంట పూర్తిగా నాశనమయ్యిందని చెప్పారు. చేతికి అంది వచ్చే పంట నీటమునగడంతో గిరిజన రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతుందని ఆయన చెప్పారు. దీంతో అనేక మంది రైతులు ఈ సంవత్సరం తినడానికి తిండి గింజలు లేక కరువు పరిస్థితిని ఎదుర్కొవలసిన దుస్థితి నెలకొందని ఆయన అన్నారు. ఈ విషయమై ప్రభుత్వం స్పందించి తుపానులో పంట నష్టపోయిన గిరిజన రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు.

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాభరోసాయాత్రకు విశేష స్పందన
సబ్బవరం, డిసెంబర్ 20 : పెందుర్తి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్‌రాజ్ మండలంలో చేపట్టిన ప్రజాభరోసాయాత్ర కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రజాసంకల్పయాత్ర ముగియక ముందే అదీప్‌రాజ్ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకంటూ నియోజకవర్గంలో చేపట్టిన ప్రజాభరోసాయాత్రతో రానున్న సాధారణ ఎన్నికల్లో పెందుర్తి అసెంబ్లీవైసీపీ అభ్యర్థిగా అదీప్‌రాజ్‌కు సీటు ఖాయమయిందనే సంకేతాలు ఇస్తున్నట్లయిందని పలువురు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. అయితే ఈయాత్ర పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం నుంచి ప్రారంభమయిన సంగతి తెల్సిందే. సబ్బవరం మండలంలో ప్రవేశించి మూడు రోజులు గడిచార ఫెథాయ్ తుపాను తో మూడురోజుల పాటు వాయిదాపడిన ప్రజాభరోసాయాత్ర తిరిగి బుధవారం నుంచి ప్రారంభమయిన సంగతి తెల్సిందే. ఈనేపధ్యంలో గురువారం మండలంలోని అసకపల్లి నుంచి యాత్ర ప్రారంభించి బాటజంగాలపాలెం, అజయ్‌నగర్, నూకరాజు బంజరి, అమ్ములపాలెం, నారపాడు గ్రామాల్లో సాగింది. దీంతో మహిళలు భారీ ఎత్తున హాజరయి బ్రహ్మరథం పట్టేవిధంగా హారతులిచ్చి స్వాగతం పలికారు. ఈ పర్యటనలోవైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలు,నవరత్నాలపై ప్రచారం చేశారు. పర్యటనలో ఆ పార్టీనేతలు తుంపాల అప్పారావు,వనం దేముడు, ఎస్.నారాయణమూర్తి, పడాల భాను, ఎస్.ముత్యాలనాయుడు, పి.సురేష్, బోకం శ్రావణ్,సురేష్‌లు పాల్గొన్నారు.
ఉత్తరాంధ్ర శెట్టిబలిజ,యాత మహాసభను విజయవంతం చేయండి
సబ్బవరం, డిసెంబర్ 20 : ఈనెల 23 వ తేదీన మండలంలోని గొటివాడ సమీపంలోని మ్యాంగో గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన ఉత్తరాంధ్ర శెట్టిబలిజ,యాత కులాల సంఘం ఏర్పాటు చేసిన మహాసభను విజయవంతం చేయాలని ఆ సంఘం మండల నేతలుకండిపల్లి గురుశెట్టి, వడిసెల రమేష్,అంగటి నానాజీలు ప్రకటించారు. ఈమేరకు స్థానిక రోడ్లుభవనాలశాఖ అతిధి గృహంలోజరిగిన సమావేశంలో ఆసంఘం నేతలు వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే తొలిసారిగా ఏర్పాటుచేస్తున్న ఈ భారీ మహాసభ-పిక్నిక్ కోసం మూడు జిల్లాల్లో ఉన్న తమ సంఘం నేతలతోపాటు జిల్లాసంఘం ప్రతినిధులు హాజరవుతారన్నారు. అంతేకాకుండా ముఖ్య అతిధిగా రాష్టక్రార్మికశాఖా మంత్రి పితాని సత్యనారాయణ, విద్యుత్‌శాఖామంత్రి కిమిడి కళావెంకటరావు,రోడ్లుభవనాలశాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు,వెనుకబడిన తరగతులు,టెక్స్‌టైల్స్‌శాఖా మంత్రి కింజారపు అచ్చిమనాయుడు, భూగర్భ గనుల శాఖా మంత్రి సుజయ్‌కృష్ణరంగారావులు హాజరవుతున్నట్లు వారు పేర్గొన్నారు. అంతేకాకుండా అనకాపల్లిఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు,ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, ఎంపీలు అశోక్‌గజపతిరాజు, కె.రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేలు గణబాబు, పి.విష్ణుకుమార్‌రాజు, పంచకర్లరమేష్‌బాబు,వెలగపూడి రామకృష్ణరాజు, పీలాగోవింద సత్యనారాయణ, వాసుపల్లి గణేష్‌కుమార్, పల్లాశ్రీనివాస్, కెఎస్‌ఎన్ రాజు, బూడి ముత్యాలనాయుడు, వంగలపూడి అనిత, మీసాల గీత, కోళ్ళ లలితకుమారి, కిమిడి మృణాళిని, పతివాడ నారాయణ స్వామి, మాజీ ఎమ్మెల్యే గండిబాబ్జీ తదితరులు హాజరవుతారని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పిక్నిక్ కూడా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.ఈకార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో పై సంఘాల ప్రజలు హాజరయిన విజయవంతం చేయాలని విజఞఫ్తిచేశారు.

గదాంజనేయ స్వామి ఆలయ కలశాల ఊరేగింపు
సబ్బవరం, డిసెంబర్ 20 : స్థానిక మాజీ సర్పంచు మండల సముద్రం సారధ్యంలో ఇక్కడి జోడుగుళ్ళువద్ద నూతనంగా నిర్మించిన శ్రీ గదాంజనేయ స్వామి ఆలయ విగ్రప్రతిష్ఠ శుక్రవారం జరుగుతుందని ఆలయ ధర్మకర్త సముద్రం తెలిపారు. ఈసందర్భంగా గురువారం ఆంజనేయ స్వామి ఏకశిలా విగ్రహాలతోపాటు కలశాలను ఇక్కడి భక్తులంతా సామూహిక ఊరేగింపు నిర్వహించి జలాభిషేకం చేస్తూ ఊరేగించారు. ఈసందర్భంగా నేడు ఆలయ విగ్రహ ప్రతిష్ఠతోపాటు భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ కలశాల ఊరేగింపుల్లో ముర్రు కనకరాజు, సత్యనారాయణ, పోతల కనకరాజు, పరవాడ వెంకటరావు,రామారావు,గండి సత్యం, మండల లక్ష్మణరావు,సబ్బవరపు సత్యనారాయణ(అడ్వకేట్), అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

2019 జనవరి 2న టైమ్ స్కేలు అమలు పై ఉపాధిహామీ ఉద్యోగుల సమ్మె
సబ్బవరం, డిసెంబర్ 20 : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 2008 నుంచి ఎపివోలు,జెఇ,ఇసీ,టెక్నికల్ అసిస్టెంట్,సీవో,ఎఎఎస్‌లుగా పనిచేస్తున్న ఉద్యోగులకు టైమ్ స్కేల్ అమలు చేయాలని కోరుతూ వచ్చే జనవరి 2 నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ఆసంఘం నేతలు సత్యనారాయణరాజు,పద్మాతిలు తెలిపారు. ఈమేరకు వారు గురువారం స్థానిక ఎంపీడీవో బి.రమేష్‌నాయుడుకు వినతిపత్రం అందజేశారు. దీంతోపాటు సమ్మెనోటీసును కూడా ఆయనకు అందించినట్లు వారు ప్రకటించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని భారత అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్డు ఇచ్చిన ఉత్తర్వులను కూడా తుంగలోతొక్కి తమతోవెట్టిచాకిరి చేయించుకోవటం అన్యాయమని వాపోయారు. ఈవిషయాన్ని పలుమార్లు రాష్ట్రప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినప్పటికీ ఎలాంటి న్యాయం జరగలేదని వారు ఆరోపించారు. కాబట్టి తమ న్యాయమైన కోర్కెల సాధనకై 2019 జనవరి 2 నుంచి చేపట్టిన సమ్మెను ఉద్యోగులంతా జయప్రధం చేయాలని వారు కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో కె.పూర్ణచంద్రరావు,ఎ.ఈశ్వరరావు, జి.రమేష్, ఎం.ప్రశాంతి, జి.రాజేశ్వరీ, సత్యవతిలు పాల్గొన్నారు.

ఎన్నికలకు సిద్ధం కండి

$
0
0

పాడేరు, డిసెంబర్ 20: త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు తెలుగు దేశం నాయకులు, కార్యకర్తలంతా సిద్ధం కావాలని పాడేరు శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరి పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన పాడేరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికలు జరిగేందుకు ఇక ఎంతో కాలం లేదని, దీనిని పార్టీ యంత్రాంగమంతా గుర్తించి ఇప్పటి నుంచే తగిన కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. ఈ సారి జరగనున్న ఎన్నికల్లో పాడేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులంతా పనిచేయాలని ఆమె చెప్పారు. గ్రామ స్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా పర్యటించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆమె కోరారు. గిరిజనుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలు చేసిందని, గిరిజన ప్రాంతాల అభివృద్ది గణనీయంగా జరిగిందని ఆమె అన్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలలోకి తీసుకువెళ్లి వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు నిశ్శబ్ధతను వీడి పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తే రానున్న ఎన్నికల్లో సునాయసంగా విజయాన్ని కైవసం చేసుకోవచ్చునని ఆమె అన్నారు. గ్రామాలలో పర్యటించేటప్పుడు గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించాలని ఆమె చెప్పారు. గ్రామాలలో నెలకొన్న సమస్యలను తాము ఇంకా చేయాల్సిందైమైనా ఉంటే వాటిని తన దృష్టికి తీసుకురావాలని ఆమె సూచించారు. గిరిజనుల సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పట్ల నాయకులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ఆమె కోరారు. నియోజకవర్గంలో మండలాల వారీగా నాయకులకు అప్పగించిన లక్ష్యాలను ఈ నెలాఖరులోగా పూర్తి చేసి సభ్యత్వ నమోదును వేగవంతంగా పూర్తి చేయాలని ఆమె చెప్పారు. సభ్యత్వ నమోదు పట్ల కొన్ని ప్రాంతాలలో అలసత్వం జరుగుతుందని, ఇకపై ఇటువంటి లోపాలకు తావు లేకుండా పనిచేయాలని ఈశ్వరి కోరారు. ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి మత్స్యరాస మణికుమారి మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని సమర్థంగా ప్రచారం చేసుకోవలసి ఉందని అన్నారు. గిరిజనుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నా పార్టీ శ్రేణులు తగినంత ప్రచారం చేయడం లేదని ఆమె చెప్పారు. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని చూసి ఓర్వలేని ప్రతిపక్ష పార్టీలు అనవసరమైన ఆరోపణలు, విమర్శలను చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శించారు. ప్రతిపక్షాలు చేసే ఆరోపణలను నాయకులు ఎప్పటికప్పుడు సమర్థంగా తిప్పి కొట్టాలని మణికుమారి కోరారు. ఈ సమావేశంలో దేశం నాయకులు వంజంగి కాంతమ్మ, సల్లంగి జ్ఞానేశ్వరి, లక్ష్మణరావు, సుబ్బారావు, రొబ్బి రాము, బి.నాగరాజు, విజయరాణి, మచ్చమ్మ, నళిని, పలు మండలాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
గిరిజనాభివృద్ధికి కేంద్రం పెద్ద పీట
పాడేఠు, డిసెంబర్ 20: కేంద్రంలోని తమ ప్రభుత్వం గిరిజనాభివృద్ధికి అనేక కార్యక్రమాలను అమలు చేసిందని బి.జె.పి. అరకులోయ పార్లమెంట్ నియోజకవర్గం కన్వీనర్ కురుసా ఉమామహేశ్వరరావు చెప్పారు. పాడేరు మండలం జి.ముంచంగిపుట్టు గ్రామంలో గురువారం ఇంటింటికి బి.జె.పి. కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న గిరిజనాభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తానే అమలు చేస్తున్నట్టుగా ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు. గిరిజన గ్రామాలలో రహదారుల నిర్మాణం, ఉపాధి హామీ పథకం అమలు, ఎల్.ఇ.డి. బుల్పుల పంపిణీ వంటి ఎన్నో కార్యక్రమాలను కేంద్రంలోని నరేంద్రమోడి ప్రభుత్వం అమలు చేస్తుందని ఆయన చెప్పారు. గిరిజనుల అభివృద్ధికి, వారి సంక్షేమానికి మోడి ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలు గతంలో ఏ కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేయలేదని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత నష్టపోయిన రాష్ట్రాన్ని కేంద్రం ఇతోధికంగా ఆదుకున్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం అనవసరమైన రాద్ధాంతం చేస్తూ కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. అయితే వాస్తవాలు ఏమిటో ప్రజలకు తెలుసునని, రానున్న ఎన్నికల్లో దేశం ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని ఆదరించి ఆశీర్వదించాలని ఉమామహేశ్వరరావు కోరారు. ఈ కార్యక్రమంలో బి.జె.పి. నాయకులు కురుసా రాజరావు, సల్లా రామక్రిష్ణ, కాకరి, చిన్నయ్య, వంటారి మత్స్యరాజు, పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

గిరిజన ప్రాంత ఉద్యోగులకు బి.సి.ఎ. అలవెన్స్ పునరుద్ధరించాలి
పాడేరు, డిసెంబర్ 20: గిరిజన ప్రాంతంలో పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బి.సి.ఎ. అలవెన్స్‌ను పునరుద్దరించేందుకు చర్యలు తీసుకోవాలని గిరిజన ఉద్యోగుల సంఘం రూరల్ శాఖ అధ్యక్షుడు కోడా సింహాద్రి కోరారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో గిరిజన ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యే ఈశ్వరిని గురువారం కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో గిరిజన ప్రాంత ఉద్యోగులకు బి.సి.ఎ. అలవెన్స్ చెల్లించేవారని చెప్పారు. అయితే దీనిని రద్దు చేయడం వలన ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోందని ఆయన అన్నారు. గిరిజన ప్రాంత ఉద్యోగులకు బి.సి.ఎ. అలవెన్న్‌ను పునరుద్ధరించాలని ఎప్పటి నుంచో కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన వాపోయారు. ఈ ప్రాంత వాతావరణం, భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులకు ఈ అలవెన్స్‌ను మంజూరు చేయాల్సి ఉందని ఆయన చెప్పారు. రానున్న శాసనసభ సమావేశంలో గిరిజన ప్రాంత ఉద్యోగులకు బి.సి.ఎ. అలవెన్స్ పునరుద్ధరణపై చర్చించి 11వ వేతన సవరణలో అమలు చేసేవిధంగా కృషి చేయాలని, గిరిజన ప్రాంతంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను మంజూరు చేయించాలని సింహాద్రి కోరారు. ఉద్యోగుల వినతిపై ఎమ్మెల్యే ఈశ్వరి సానుకూలంగా స్పందిస్తూ ఈ విషయమై ముఖ్యమంత్రితో చర్చించి ఉద్యోగులకు న్యాయం చేసే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు గిరిజన ఉద్యోగుల సంఘం నాయకులు పాల్గొన్నారు.
కనుమరుగవుతున్న వాలీబాల్‌కు ఊపిరి పోస్తా
అరకులోయ, డిసెంబర్ 20: గ్రామీణ ప్రాంతాలలో కనుమరుగవుతున్న వాలీబాల్ క్రీడకు మళ్లీ ఊపిరి పోయాలని సంకల్పించినట్టు వైసీపీ ఎస్.టి.సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు చెప్పారు. స్థానిక ఎన్.టి.ఆర్.మైదానంలో నిర్వహించిన దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి స్మారక మెగా వాలీబాల్ టోర్నమెంట్ గురువారం ముగిసింది. ఈ నెల 15వ తేదిన ప్రారంభమైన టోర్నీ పెథాయ్ తుపానుతో అర్థాంతరంగా నిలిచిపోయింది. వాతావరణం అనుకూలంగా ఉండడంతో మళ్లీ ఈ పోటీలను గురువారం నిర్వహించి ముగింపు పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ ప్రయత్నంలో చాలా వరకు విజయం సాధించామని అన్నారు. గిరిజన యువత ద్వారానే వాలీబాల్ క్రీడకు మళ్లీ ఊపిరి పోయాలన్న ప్రయత్నం సాధ్యపడుతుందని భావించి వారిని ప్రోత్సహిస్తున్నట్టు ఆయన చెప్పారు. క్రీడలలో యువతను తీర్చిదిద్దాలని భావించి టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నామని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అనతికాలంలోనే మంచి క్రీడాకారులుగా గుర్తింపు తెచ్చుకోవాలని ఆయన సూచించారు. గిరిజన యువకులు దీనిని సద్వినియోగం చేసుకుంటే క్రీడలలో రాణించడమే కాకుండా మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవచ్చునని ఆయన అన్నారు. గిరిజన యువకుల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు కృషి చేస్తున్నామని, ఇందులోభాగంగా గ్రామాలలో, మండలాల్లో, నియోజకవర్గ స్థాయిలో పోటీలు నిర్వహిస్తూ యువతను ప్రోత్సహిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఏజెన్సీలో రానున్న రోజుల్లో మరిన్ని క్రీడాపోటీలను నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాలలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గాను మినీ స్టేడియం, ఇండోర్ స్టేడియంలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. క్రీడా పోటీల్లో పాల్గొనే గిరిజన యువకులు గెలుపు ఓటములతో సంబంధం లేకుండా క్రీడా స్ఫూర్తిని చాటి చెప్పాలని రవిబాబు పిలుపునిచ్చారు. అనంతరం మెగా వాలీబాల్ టోర్నీలో గెలుపొందిన జట్లకు నగదు బహుమతులు, జ్ఞాపికలు ప్రధానం చేసారు. ఈ పోటీల్లో 102 జట్లు పాల్గొనగా వారందరికీ ఉచితంగా భోజన వసతి సౌకర్యం కల్పించి వాల్‌బాలీ కిట్లను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మత్స్యరాస బాలరాజు, వైసీపీ నాయకులు జి.మాధవి, సమర్డి భాస్కరరావు, పాంగి చిన్నారావు, సుందరరావు, విజయకుమార్, రమణమూర్తి, శోభ వీరభద్రరరాజు, కొండబాబు, ప్రసాద్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేదెపుడు?

$
0
0

విజయనగరం, డిసెంబర్ 20: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీసీలకు ఇచ్చిన ఎన్నికల హామీలలో ఏ హామీని అమలు చేయలేదని వైసీపీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జ 1శ్రీనివాసరావు విమర్శించారు. గురువారం స్థానిక కలెక్టరేట్ కార్యాలయం వద్ద వైసీపీ ఆధ్వర్యంలో బీసీల గర్జన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ బీసీలకు ఏడాదికి రూ.10వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయిస్తానని హామీ ఇచ్చినప్పటికీ నేటికి నాలుగేళ్లు గడచినా, నాల్గో వంతు కూడా ఖర్చు చేయలేదన్నారు. ఇక బీసీ వసతి గృహాల్లో విద్యార్ధులకు సరైన సౌకర్యాలు లేవన్నారు. బీసీలకు, క్షౌర వృత్తుల వారికి ఆదరణ కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేస్తామని చెప్పి, ఆదరణ-2 పథకాన్ని మొక్కబడిగా చేపట్టారని విమర్శించారు. బీసీ విద్యార్ధులు విద్యాభివృద్ధి సాధించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనం వంటి ప్రోత్సాహకాలు అందించి వారిని విద్యావంతులుగా చేశారని గుర్తు చేశారు. మరో నాలుగు నెలల్లో ఎన్నికలు ఉండటంతో బీసీల గర్జన పేరిట టీడీపీ ప్రభుత్వం బీసీలను మోసగించేందుకు మరోసారి ప్రయత్నిస్తుందని, బీసీలు వారికి బుద్ధి చెప్పాలన్నారు. అనంతరం డీఆర్వో వెంకటరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజాం ఎమ్మెల్యే కంబాళ జవగులు, ఎస్‌కోట నియోజకవర్గం సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నెక్కలి నాయుడుబాబు, మార్క్‌ఫెడ్ డైరెక్టర్ కెవి సూర్యనారాయణాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములనాయడు ఎంఎల్‌ఎన్ రాజు, ముద్దాడ మధు తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యతనివ్వాలి
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, డిసెంబర్ 20: జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు అధిక ప్రాధాన్యతనివ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు శతశాతం రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ హరి జవహర్‌లాల్ బ్యాంకర్లను కోరారు. గురువారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన డిసిసి, డిఎల్‌ఆర్‌సి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, గృహ నిర్మాణాలు తదితర వాటికి బ్యాంకర్లు రుణాలను విరివిగా మంజూరు చేయాలన్నారు. ఈనెల 28న జరగనున్న మెగా గ్రౌండింగ్ మేళాలో అత్యధిక సంఖ్యలో రుణాలు మంజూరు చేసి లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ చేపట్టాలన్నారు. జిల్లాలో పాడి పశువులకు మంచి ఆదరణ ఉందని, శతశాతం యూనిట్లు నెలకోల్పేలా బ్యాంకర్లు సహకరించాలన్నారు.
2018-19 జిల్లా వార్షిక రుణ ప్రణాళిక కింద వివిధ పథకాలకు ఏ మేరకు లక్ష్యాలను చేరుకున్నారో కలెక్టర్‌కు, ఎల్‌డిఎం గురవయ్య వివరించారు. స్వల్పకాలిక రుణాల కింద రూ.1290 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా రూ.1310 కోట్లు రుణాలు మంజూరు చేసి 101 శాతం సాధించామన్నారు. వ్యవసాయానికి సంబంధించి టెర్మ్ రుణాలు రూ.646 కోట్లు లక్ష్యం కాగా, రూ.255 కోట్లు మాత్రమ మంజూరు చేసి 40 శాతం మాత్రమే ప్రగతి సాధించడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పంట రుణాల కింద అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు రూ.824 కోట్లు లక్ష్యం కాగ, రూ.476 కోట్లు మాత్రమై రుణాలు మంజూరు చేశారని తెలిపారు. ఇదిలా ఉండగా ముద్ర రుణాల కింద జిల్లాలో 7905 మంది లబ్ధిదారులకు రూ.88.56 కోట్లు రుణాలు మంజూరు చేశారని పేర్కొన్నారు. జిల్లాలో పెట్టుబడి లేని సేంద్రీయ వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తున్నామని, బ్యాంకు అధికారులు దీనికి తోడ్పాటు అందించాలన్నారు. ఈ సమావేశంలో జెసి-2 సీతారామారావు, నాబార్డు ఎజిఎం, వివిధ బ్యాంకులకు చెందిన బ్యాంకర్లు, వ్యవసాయశాఖ జెడి లీలావతి, జెడ్పీ సిఇఒ వేంకటేశ్వరరావు, డిఐజి జనరల్ మేనేజర్ ఉదయ్‌భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతీ వార్డుకూ ఆర్‌ఓ ప్లాంట్
* మున్సిపల్ చైర్మన్ రామకృష్ణ
విజయనగరం (్ఫర్టు), డిసెంబర్ 20: పట్టణ ప్రజలకు సురక్షితమైన మంచినీటిని సరఫరా చేసేందుకు ప్రతీవార్డులో ఆర్‌ఓ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ తెలిపారు. పైలెట్ ప్రాజెక్ట్‌గా ముందుగా నాలుగు వార్డుల్లో దీనిని అమలు చేస్తామని చెప్పారు. నాలుగు వార్డుల్లో మంచి ఫలితాలను సాధించిన తర్వాత మిగతా అన్నివార్డుల్లో ఆర్‌ఓ ప్లాంట్లను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తామన్నారు. ఆర్‌ఓ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులతో గురువారం స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ మాజీ కేంద్రమంత్రి

మండల పరిషత్ బడ్జెట్‌కు ఆమోదం

$
0
0

పాచిపెంట, డిసెంబర్ 20: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురువారం బడ్జెట్‌పై సమావేశాన్ని నిర్వహించారు. ఎంపీపీ ఇజ్జాడ సింహాచలమమ్మ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈమేరకు 2019 నుంచి చేపట్టనున్న ఆదాయం, ఖర్చులపై చర్చించడంతోపాటు 2019-20కు సంబంధించిన బడ్జెట్‌పై పాలకవర్గం సభ్యులంతా ఏకగ్రీవంగా తీర్మాణం చేశారు. 2018-19గాకు రాబడులు 37కోట్ల 29లక్షల 18వేల రూపాయలు కాగా ఖర్చు 37కోట్ల 20లక్షల 91వేల రూపాయలు చేశారు. అలాగే 2019-20కు గాను ప్రారంభ విలువ 90లక్షల 7వేల 900 రూపాయలు, రాబడులు 42కోట్ల 57లక్షల 78వేల రూపాయలు, ఖర్చు 42కోట్ల 41లక్షల 32వేల రూపాయలను బడ్జెట్‌లో పొందుపరిచారు. అకౌంట్స్ ద్వారా ఏడాదికి 2వేల రూపాయలు వడ్డీ వచ్చిందని బడ్జెట్‌లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ తట్టికాయల గౌరీశ్వరరావు, పలువురు ఎంపీటీసీలు సభ్యులు పాల్గొన్నారు.

అక్రమ అరెస్టులు చేయడం అన్యాయం
కొమరాడ, డిసెంబర్ 20: మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులను అక్రమంగా అమలుచేయడం అన్యాయం సీఐటీయు నేత సాంబమూర్తి అన్నారు. గురువారం కొమరాడ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం జిల్లా కలెక్టరేట్ వద్ద మధ్యాహ్న భోజన నిర్వాహకులు న్యాయమైన సమస్యలను పరిష్కరించుకోవాలని ధర్నా చేసేందుకు వెళ్లిన వారిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయమన్నారు. 15 ఏళ్లుగా మధ్యాహ్న భోజన పథకంపై ఆధారపడి జీవిస్తు విద్యార్థులకు సకాలంలో భోజనాలు పెడుతున్న నిర్వాహకులకు కనీస వేతనం అందించకపోవడంతో పాటు ఆ పథకాన్ని ప్రైవేటీకరించేందుకు యోచించడం ఎంతవరకు సమంజసమన్నారు. ఇప్పటికైన ఈ పథకాన్ని ప్రైవేటీకరించ వద్దని లేనిపక్షంలో ఆందోళనలు మరింత ఉదృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీనాయకులు, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు పాల్గొన్నారు.

యువత నాయకత్వ
లక్షణాలను అలవర్చుకోవాలి
సీతానగరం, డిసెంబర్ 20: విద్యార్థి దశ నుంచే యువత నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని ఎంపీపీ సలహాదారుడు శానపతి ప్రసాదపాత్రుడు సూచించారు. మండలంలోని అంటిపేట పంచాయతీ ఏ వెంకటాపురం గ్రామంలో చినబోగిలి వివేకవర్ధిని జూనియర్ కళాశాల విద్యార్థుల ఎన్‌ఎస్‌ఎస్ సేవాశిబిరాన్ని గురువారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులలో సమాజం పట్ల సేవాగుణాన్ని పెంపొందించేందుకు ఎన్‌సీఎస్ కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విద్యార్థులంతా సేవాశిబిరం ద్వారా తెలుసుకున్న అంశాలను భవిష్యత్‌లో ఎంతో దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు, ఎన్‌ఎస్‌ఎస్ పీఓ కిరణ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.

లక్ష్మీపురంలో చెత్త
శుద్ధీకరణ కేంద్రం ప్రారంభం
సీతానగరం, డిసెంబర్ 20: మండలంలోని లక్ష్మీపురం పంచాయతీలో చెత్త శుద్ధీకరణ కేంద్రాన్ని గురువారం ఎంపీటీసీ దాసరి నాగరత్నం కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో డంపింగ్‌యార్డులు ఎంతో ఉపయోగపడతాయన్నారు. చెత్త నుంచి ఎరువులను తయారుచేసేందుకు ప్రభుత్వం ఈ కేంద్రాలను ప్రతీ గ్రామాల్లోను లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిందన్నారు. ఈ పంచాయతీ ప్రజలంతా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చప్ప సత్యవతి, ఎంపీడీఓ పైడితల్లి, ఇఓపీఆర్‌డీ పార్ధసారధి, పంచాయతీ కార్యదర్శి ప్రభుదాసు పాల్గొన్నారు.

మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటుపరం చేయవద్దు
సీతానగరం, డిసెంబర్ 20: మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటుపరం చేయవద్దని భోజన పథకం నిర్వాహకులు తహశీల్దార్ బాపిరాజుకు విన్నవించారు. ఈమేరకు ప్రభుత్వ పాఠశాలలో అమలుచేస్తున్న మధ్యాహ్న భోజన పథకం నిర్వహణను స్వచ్చంద సంస్థలకు అప్పగించడాన్ని నిరసిస్తు ఆ పథకం నిర్వాహకులు గురువారం తహశీల్దార్‌కు వినతిపత్రాన్ని అందించారు. ఈసందర్భంగా ఆ సంఘం సభ్యులు కురమమ్మ, కుమారి, ఉష, వరలక్ష్మిలు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో భోజన పథకాన్ని సమర్థవంతంగా అమలుచేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఈ పథకాన్ని స్వచ్ఛంద సంస్థలకు అప్పగించేందుకు చేస్తున్న చర్యలు సమంజసం కాదన్నారు. అనేక కష్టనష్టాలను భరిస్తు ప్రభుత్వ పాఠశాలలో పథకాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని, అయినప్పటికీ పథకాన్ని ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అప్పగించే యోచన న్యాయం కాదన్నారు. ఇప్పటికైన ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
పోలీస్ ఉద్యోగార్దులకు స్క్రీనింగ్ పరీక్షలు
సాలూరు, డిసెంబర్ 20: పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు శనివారం ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నామని సీఐ ఇలియాస్ మహ్మద్ తెలిపారు. గురువారం సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాలకు చెందిన అభ్యర్థులు శనివారం ఉదయం 10గంటలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హాజరుకావాలన్నారు. అభ్యర్థులకు శారీరిక, రాతపరీక్షలు నిర్వహించారు. ఎంపికైన వారికి జిల్లాకేంద్రంలో ఉచిత శిక్షణలు అందిస్తామన్నారు. జిల్లాకేంద్రంలోని పోలీస్‌శిక్షణా కళాశాలలో 20రోజులపాటు ఉచిత శిక్షణలు అందిస్తామన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

బీసీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత: భంజ్‌దేవ్
సాలూరు, డిసెంబర్ 20: రాష్ట్రంలోని బీసీల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి ఆర్‌పి భంజుదేవ్ అన్నారు. గురువారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలోను అమలుచేయని సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలుచేస్తున్నామన్నారు. వెనుకబడిన తరగతుల ప్రజల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఆదరణ పథకాన్ని అమలుచేస్తుందన్నారు. కనుమరుగైన కులవృత్తులు, చేతివృత్తుల ఉపాధి కల్పన కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రానున్న ఎన్నికలు టీడీపీకి అత్యంత ప్రతిష్టాత్మకమన్నారు. ప్రతీ కార్యకర్త సైనికుల్లా పనిచేయాలన్నారు. సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలన్నారు. గడిచిన 12 ఏళ్లుగా ప్రతిపక్ష ఎమ్మెల్యే నియోజకవర్గంలో గెలవడంతో అభివృద్ధి కుంటుపడిందన్నారు. అయిన రాష్ట్ర సీఎం చంద్రబాబు చొరవతో నియోజకవర్గంలో శక్తిమేరకు అభివృద్ధి పనులు చేశామన్నారు. మారుమూల ఏజెన్సీలకు రహదారులు, పట్టణ పేదలకు 96కోట్లతో గృహ నిర్మాణాలను చేపడుతున్నామన్నారు. మరో 200కోట్లతో ఎన్‌టి ఆర్ గృహసేవ ఇళ్లు మంజూరయ్యాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆశించిన స్థాయిలో నిదులు ఇవ్వకపోయిన చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్నారన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు మంత్రి లోకేష్ పెద్దపెద్ద ఐటీ కంపెనీలను తీసుకువస్తున్నారన్నారు.
మున్సిపల్ కార్యాలయం ముట్టడి
సాలూరు, డిసెంబర్ 20: మున్సిపల్ కార్యాలయాన్ని కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు ముట్టడించారు. సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్‌వై నాయుడు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు కార్యాలయం ముందు బైఠాయించారు. జీఓ 151ప్రకారం పెంచిన జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీఐటీయు ఉపాధ్యక్షుడు నాయుడు మాట్లాడుతూ 151జీఓను ఈ ఏడాది జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. పెంచిన జీతాలు, బకాయిలతో సహా కొత్త జీతాలను వెంటనే అమలుచేయాలన్నారు. కార్యాలయం ఉద్యోగులను కార్యాలయానికి రానివ్వకపోవడంతో సీఐ ఇలియాజ్ మహ్మద్, ఎస్‌ఐ అశోక్‌కుమార్‌లు ఆందోళన కార్యక్రమం వద్దకు చేరుకున్నారు. ధర్నా చేసే సమయానికి కమిషనర్ లేకపోవడంతో రెవెన్యూ అధికారి జి లక్ష్మి కార్మికులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. సీఐ, ఎస్‌ఐలు కార్మికులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపచేశారు. పెంచిన జీతాలను ఇవ్వకపోతే ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు వెంకటరావు, టి తవుడురాజు, శంకరరావులు పాల్గొన్నారు.
పిటిషన్ జమాబందీకి స్పందన కరువు
సాలూరు, డిసెంబర్ 20: మండల రెవెన్యూ కార్యాలయంలో గురువారం నిర్వహించిన పిటీషన్ జమాబందీకి స్పందన కరువైంది. కేవలం 6 సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. పార్వతీపురం సబ్ కలెక్టర్ చేతన్ జమాబందీ కార్యక్రమానికి ఇలా వచ్చి అలా వెళ్లారు. మండలంలోని రెవెన్యూ, భూ సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. రెవెన్యూ కార్యాలయం చుట్టు తిరుగుతున్న సమస్యలు పరిష్కారం కావడం లేదు. గురువారం పిటీషన్ జమాబందీ ఉందని, భూ సమస్యలు ఏమైన ఉంటే రైతులు చెప్పుకోవచ్చునని తహశీల్దార్ బుధవారం ప్రకటించారు. ఈ కార్యక్రమం నిర్వహణపై రైతులకు సమాచారం అందకపోవడంతో స్పందన కరువైంది. అధికారులు కూడా మొక్కుబడిగా కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాల్లో దండోరా వేయించడం, పత్రికల ద్వారా ముందస్తు ప్రకటనలు చేయకపోవడంతోనే రైతులు వినియోగించుకోలేకపోయారు.

వైభవంగా ధనుర్మాసోత్సవాలు

$
0
0

దత్తిరాజేరు, డిసెంబర్ 20: మండలంలోని దత్తి గ్రామంలో నూతనంగా నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాస పూజలు వైభవంగా జరుగుతున్నాయని ఆలయ ధర్మకర్త పెంకి తిరుపతినాయుడు తెలిపారు. ధనుర్మాసం అంతా శ్రీదేవి,్భదేవి సమేత వేంకటేశ్వరస్వామి పలు అలంకరణలో అలంకరించి వైభవంగా పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వేదపండితులు సంతోష్ ఆధ్వర్యంలో నిత్యం పూజలు జరుగుతున్నాయని తెలిపారు.

పోటీ పరీక్షలకు స్టడీ మెటీరియల్
నెల్లిమర్ల, డిసెంబర్ 20: నెల్లిమర్ల శాఖా గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉందని నిర్వాహకులు పి.రామారావు తెలిపారు. గురువారం ఆయన విద్యార్థులకు పోటీలు పరీక్షల మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షలు నిమిత్తం జిల్లా గ్రంథాలయ సంస్థ స్టడీ మెటీరియల్‌ను సరఫరా చేసిందని చెప్పారు. అంతేకాకుండా ఉపాద్యాయ పోస్ట్భుర్తీలకు డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో సెకెండ్రీగ్రేడ్, అసిస్టెంట్ పోస్టులకు తర్ఫీదు అవుతున్నవారికి ఈ మెటీరియల్ ఉపయోగపడుతుందని చెప్పారు.

ఉచిత గ్యాస్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి
నెల్లిమర్ల, డిసెంబర్ 20: బిసి, ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులు ఉచిత గ్యాస్ కనెక్షన్‌కు దరఖాస్తు చేసుకోవాలని జిఎస్‌డిటి వి.వి.ఆర్ జగన్నాధరావు తెలిపారు. గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ప్రభుత్వం ఉజ్వల గ్యాస్ పథకాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. ఈ పథకం ద్వారా బిసి, ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులకు గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ పథకానికి అర్హులైన బిసిలు, ఎస్సీ ఎస్టీలు ధరఖాస్తు చేసుకోవాలని కోరారు. లబ్దిదారులు కుల ధృవీకరణ పత్రం, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు గ్యాస్ ఏజెన్సీని సంప్రదించాలని సిఎస్‌డిటి కోరారు.

బీసీలకు తీరని అన్యాయం
పార్వతీపురం, డిసెంబర్ 20: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బీసీలకు ఇచ్చిన నెరవేర్చడంలో తీరని అన్యాయం చేశారని సాలూరు, పాలకొండ ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, కళావతిలు దుయ్యబట్టారు. గురువారం పార్వతీపురంలో వై ఎస్ ఆర్ సిపి ఆధ్వర్యంలో బీసీ గర్భన పేరుతో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు పూర్తిగా వైఫల్యం చెందారన్నారు. ఎన్నికల ముందు బీసీలకు 110 హామీలు ఇచ్చినా ఆ హామీలు పూర్తిగా నెరవేర్చలేదన్నారు. సంవత్సరానికి రూ.10వేల కోట్లు బీసీ బడ్జెట్ పెడతానని చెప్పినప్పటికీ నాలుగేళ్లలో నాల్గవ వంతు కూడా ఖర్చుచేయలేదని దయ్యబట్టారు. రూ.10వేల కోట్లు ఇవ్వలేని వ్యక్తి బీసీలకు రూ.80వేల కోట్లతో ఉప ప్రణాళిక పెడతానని మరోమోసపూరిత ప్రకటనను ఖండిస్తున్నామని తెలిపారు. కార్పొరేషన్, ఇతర మండల స్థాయి పదవులు, వైస్ ఛాన్సలర్ల పదవుల్లో బీసీలకు నామినేటెడ్ పదవులు ఇస్తామని చెప్పిన హామీలు ఏమైందని వారు ప్రశ్నించారు. విద్య, ఉద్యోగాల్లో బీసీల రిజర్వేషను 33.3శాతానికి పెంచుతానన్న హామీ, బీసీలకు ప్రమోషన్లలకు సంబంధించిన హామీలపై వారు తీవ్రంగా విమర్శించారు. మత్స్యకారులు, నారుూ బ్రాహ్మణుల కులాల విషయంలో చంద్రబాబు వైఖరిని వారు విమర్శించారు. ఈ ధర్నా కార్యక్రమంలో వై ఎస్ ఆర్ సి పి జిల్లా బీసీ సెల్ కార్యదర్శి, అరకు పార్లమెంట్ ఇన్ ఛార్జి వాకాడ నాగేశ్వరరావు, రాష్ట్ర బీసీ సెల్ నాయకుడు పాలవలస విక్రాంత్, వై ఎస్ ఆర్ సిపి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు రెడ్డి పద్మావతి, వై ఎస్ ఆర్ సి పి పార్వతీపురం నియోజవకర్గకం ఇన్‌ఛార్జి అలజంగి జోగారావు, వై ఎస్ ఆర్ సిపి నాయకుడు జమ్మాన ప్రసన్నకుమార్, రాష్ట్ర ఎస్సీ సెల్ విభాగం నాయకుడు గర్భాపు ఉదయభానుతో పాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అప్పలరాజుకు వినతిపత్రం అందించారు.

లబ్ధిదారులకు ఇళ్ల ప్లాట్ల కేటాయింపు
పార్వతీపురం, డిసెంబర్ 20: పార్వతీపురం పట్టణంలోని పేదలకు అడ్డాపుశీల వద్ద నిర్మించనున్న ఇళ్ల ప్లాట్లను కేటాయించే చర్యలు గురువారం స్థానిక లయన్స్ కల్యాణ మండలంలో లాటరీ సిస్టమ్ ద్వారా చేపట్టారు. మొత్తం 1500 ఇళ్లకు సంబంధించి ఈ కేటాయింపులను లబ్ధిదారులకు కేటాయించారు. కేటగిరి 1, 2,3 ల కింద వీటిని పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు జగదీశ్వరరావు, బొబ్బిలి చిరంజీవులు మాట్లాడుతూ పేదలకు ఇళ్లను నిర్మించి అందించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి సారించడం ఆనందదాయమన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీదేవి, మున్సిపల్ కమిషనర్ అప్పలనాయుడుతో పాటు పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

బీసీ బాలికల రెసిడెన్షియల్
పాఠశాల ఏర్పాటుకు భవనం ఇవ్వాలి
పార్వతీపురం, డిసెంబర్ 20: పార్వతీపురంలోని కానముద్ర పాఠశాల నిర్వహించిన భవనాన్ని కొత్తగా మంజూరైన బీసీ బాలికల పాఠశాల నిర్వహణకు ఇవ్వాలని పార్వతీపురం ఐటిడిఎ పీవో డాక్టర్ జి.లక్ష్మీశను గురువారం పార్వతీపురం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ద్వారపురెడ్డి జగదీశ్వరరావులు కోరారు. ఈసందర్భంగా దీనిని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని పీవోహామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు మాట్లాడుతూ జిల్లాలో పార్వతీపురం బాలికలు, విజయనగరం వద్ద జమ్ములో బాలికలు, కొత్తవలస, బొబ్బిలి కారాడ, సాలూరు, గంట్యాడలలో బాలురు బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు జరిగాయని తెలిపారు. 5వ తరగతి నుండి 8 వతరగతి వరకు ఈపాఠశాలల్లో వెంటనే ప్రారంభించే ప్రభుత్వం తీసుకుందన్నారు. ఈకార్యక్రమంలో అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారి అక్కుజోస్యుల అప్పలనర్సింహం తదితరులు పాల్గొన్నారు.

అగ్రిగోల్డ్ బాధితులకు
డబ్బులు చెల్లించాలని ఆందోళన
పార్వతీపురం, డిసెంబర్ 20: అగ్రిగోల్త్ బాధితులకు డబ్బులు చెల్లించాలని కోరుతూ దశల వారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు సిపి ఐ నియోజకవర్గ కార్యదర్శి ఆర్ వి ఎస్ కుమార్ తెలిపారు. గురువారం ఈమేరకు ఆయన సి పి ఐ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు శుక్రవారం మహాత్మాగాంధీ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించడం జరుగుతుందన్నారు. 22న మహిళలతో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడంతో పాటు అంబేద్కర్ విగ్రహానికి వినతి అందిస్తామన్నారు. 28న నియోజకవర్గంలో రోజూ 200 మంది బాధితులతో రిలే నిరాహారదీక్షలు చేపడతామని తెలిపారు. అందువల్ల ఆయా కార్యక్రమాల్లో అగ్రిగోల్త్ బాధితులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో అగ్రిగోల్డ్ బ్రాంచ్ అధ్యక్షుడు గెంబలి శ్రీనివాసరావు, పిన్నింటి కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
-0ళనఆ
కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేస్తున్న ప్రత్యేక అథికారి
పాచిపెంట, డిసెంబర్ 20: స్థానిక కేజీబీవీ పాఠశాలను ప్రత్యేక అధికారి భాస్కరరావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈమేరకు పాఠశాలలో వసతులతో పాటు విద్యార్థులకు అందిస్తున్న మెనూ పరిశీలించారు. అనంతరం 10వ తరగతి విద్యార్థుల చదువుపై ఆరాతీశారు. శతశాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అయితే పాఠశాల ప్రత్యేక అధికారి సెలవులో ఉండటంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

సివిల్ సర్వీసు కోచింగ్ సెంటర్లకు కృషి

$
0
0

గజపతినగరం, డిసెంబర్ 20: వసతిగృహాల విద్యార్ధు ఉజ్వల భవిష్యత్ కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లాలో వీరి కోసం సివిల్ సర్వీస్ గ్రూప్ వన్ పోటీ పరీక్షలకు సంబంధించి ఉచిత కోచింగ్ సెంటర్ నెలకొల్పడానికి కృషి చేస్తానని స్ధానిక ఎమ్మెల్యే డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు అన్నారు. గురువారం స్ధానిక సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహంలో ఎమ్మెల్యే నాయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన గావించి సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకొని విద్యార్ధులు భవిష్యత్‌కు బంగారుబాటలు వేసుకోవాలని తెలిపారు. వసతి గృహాల విద్యార్ధుల సంక్షేమానికి పెద్దపీట వేసిందని అందుకే మెస్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీలు తదితర వాటికి ధరలు పెంచిందని అన్నారు. విద్యార్ధులు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ప్రణాళికాబద్ధంగా చదవాలని సూచించారు. విద్యార్ధులు సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని చెప్పారు. గజపతినగరంలో మూడు వసతి గృహాలకు పక్కా భవనాలు నిర్మించడానికి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. నిధులకు ఇబ్బంది లేదని విద్యార్ధులంతా పట్టుదలతో చదువుకొని ఉన్నదస్ధాయికి ఎదగాలని అన్నారు. అనంతరం విద్యార్ధులకు బ్యాగులు, పాదరక్షలు, గ్లాసులు, ప్లేట్లు ఎమ్మెల్యే నాయుడు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమశాఖ డి.డి రాజ్‌కుమార్, ఎంపిపి గంట్యాడ శ్రీదేవి, జెడ్పీటీసీ బండారు బాలాజీ, గజపతినగరం ఎఎంసి చైర్మన్ బుద్దరాజు నరసింహవర్మ, టీడీపీ నాయకులు పి.వి.వి.గోపాలరాజు, గండ్రేటి అప్పలనాయుడు, బుద్ధరాజు రామ్‌జీ, వసతిగృహ సంక్షేమాధికారులు డి.రాధామణి, ఎస్.రామకృష్ణనాయుడు, తదితరులు పాల్గొన్నారు.

మార్గశిర మహాలక్ష్మిగా రాజ్యలక్ష్మి
బొండపల్లి, డిసెంబర్ 20: మండలంలోని దేవుపల్లి గ్రామంలో స్వయంభూగా వెలసిన రాజరాజేశ్వరీదేవి అమ్మవారు మార్గశిర మాస రెండవ గురువారం సందర్భంగా మార్గశిర మహాలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు దూసి శ్రీధర్ శర్మ మాట్లాడుతూ మార్గశిర మాసం మహాలక్ష్మిదేవికి ఎంతో ప్రీతికరమైనదని, ఈ మాసమంతా లక్ష్మిదేవి కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా కొలువై ఉంటుందని అన్నారు. ప్రత్యేకించి గురువాలలో అమ్మవారిని దర్శించుకొంటే రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు సంపద, ఆరోగ్యం కలుగుతాయని తెలిపారు. ఈ రోజు అమ్మవారిని బొబ్బిలి, మెరకముడిదాం, గజపతినగరం, దేవుపల్లి తదితర గ్రామాప్రజలు దర్శించుకొన్నారు.
నువ్వులకు పెరిగిన గిరాకీ
గజపతినగరం, డిసెంబర్ 20: పెథాయ్ తుపాన్ ఒకవైపు రైతులకు వరి, పత్తి,పెసర, మినుము పంటలకు తీవ్రనష్టం కలిగించిన సంగతి తెలిసిందే. తుపాన్ ప్రభావం భారీ వర్షాలు కురవడంతో రబి నువ్వుపంటను సాగుచేయడానికి రైతులు సన్నద్ధం అవుతున్నారు. దీంతో గత కొనే్నళ్లుగా ఈ ప్రాంతంలో రబీ నువ్వుసాగు చేయకపోవడంతో విత్తనాలకు తీవ్ర డిమాండ్ నెలకొంది. ఇదే అనువుగా బావించిన వ్యాపారులు నువ్వు విత్తనాలను పార్వతీపురం, బొబ్బిలి ప్రాంతాలనుంచి విత్తనాలు తీసుకొచ్చి రైతులకు విక్రయిస్తున్నారు. ఖరీప్‌లో పండిన నువ్వులు కిలో 60రూపాయలు పలకగా రైతులు క్వింటా ఆరువేల వంతున విక్రయించారు. ఇపుడు రబీ విత్తనాలను కిలో వ్యాపారులు 150రూపాయల నుంచి 160రూపాయలవరకు విక్రయిస్తున్నారు. కిలోకి వందరూపాయలు అధికంగా పెంచేసి ఇదే అదునుగా బావించి సొమ్ముచేసుకొంటున్నారు. మండలంలో ఏ గ్రామంలో చూసినా నువ్వు విత్తనాలు సేకరణ పనిలోనే రైతులు నిమగ్నం అయ్యారు. వ్యవసాయశాఖ అధికారుల వద్దకు విత్తనాల కోసం వెళితే విత్తనాలు తమ వద్ద లేవని సమాధానం చెప్పడంతో వ్యాపారులకు ఇది ఒక వరంగా మారింది. ప్రభుత్వం విత్తనాలను సరఫరా చేయాలని కోరుతున్నారు.
బిసిలకు ఉన్నత పదవులు ఇచ్చింది టీడీపీ
గజపతినగరం, డిసెంబర్ 20: తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాతనే బిసి కులాలకు తగిన గుర్తింపు లభించిందని కాంగ్రెస్ పార్టీ హయాంలో తీరని అన్యాయం జరిగిందని స్ధానిక ఎమ్మెల్యే డాక్టర్ కె. ఎ.నాయుడు అన్నారు. గురువారం స్ధానిక మార్కెట్ కమిటీ ఆవరణలో జరిగిన జయహో బిసి సదస్సులో ఎమ్మెల్యే నాయుడు ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. విజయనగరం జిల్లా నుంచి తన తండ్రి పైడితల్లినాయుడుకి శ్రీకాకుళం జిల్లా నుంచి ఎర్నాంనాయుడుకి, అచ్చింనాయుడుకు మంత్రి పదవులు ఇచ్చి సత్కరించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. బిసిలలోని అన్ని వర్గాల ప్రజలకు టీడీపీయే సముచిత స్ధానం కల్పించడంతోపాటు రాజకీయంగా వారికి దక్కాల్శిన పదవులు రిజర్వేషన్లుపరంగా వారికి అందాల్శిన సౌకర్యాలు అందిస్తున్న ప్రభుత్వం తమదేనని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్‌లో బిసిలకు 30శాతంపైగానే నిధులు కేటాయించడంతోపాటు వారికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని తెలిపారు. ఆదరణ-2 పధకం కింద కేవలం బిసిలకు మాత్రమే ఉపకరణాలను 90శాతం రాయితీపై అందిస్తున్నామని చెప్పారు. అందువలన బిసిలు అంతా టీడీపీ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరంలో 29న జరగనున్న జయహో బిసి సదస్సుకు తరలిరావాలని కోరారు. ఈ సదస్సులో భీమసింగి షుగర్స్ చైర్మన్ గులిపల్లి లలిత, ఎంపిపి గంట్యాడ శ్రీదేవి, బెజవాడ రాజేశ్వరి, జెడ్పీటీసీలు మక్కువ శ్రీధర్, బండారు బాలాజి, మార్కెట్ కమిటీ చైర్మన్ బుద్దరాజు నరిసింహవర్మ, టీడీపీ నాయకులు గండ్రేటి అప్పలనాయుడు, పి.వి.వి.గోపాలరాజు, బుద్దరాజు రామ్‌జీ తదితరులు పాల్గొన్నారు.

ప్రణాళికబద్దంగా చదివి మంచిఫలితాలు సాధించాలి
గజపతినగరం, డిసెంబర్ 20: విద్యార్ధులు ప్రణాళికాబద్దంగా చదివి మంచిఫలితాలు సాధించాలని విజయనగరం డిప్యూటీ డి ఇవొ సత్యనారాయణ అన్నారు. గురువారం మధ్యాహ్నం స్ధానిక ప్రభుత్వ బాలుర, బాలికల ఉన్నత పాఠాశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్ధులను పలు ప్రశ్నలు వేసి సమాదానాలు రాబట్టారు. పదవ తరగతి విద్యార్ధులకు ప్రభుత్వం ఇస్తున్న స్టడీమెటీరియల్ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పటినుంచే విద్యార్ధులు శ్రద్దతో చదువుకొని మెటీరియల్‌ను వినియోగించుకోవాలని కోరారు. ఆంగ్లం, గణితం, సైన్స్ సబ్జెక్టులపై మరింత దృష్టి కనబరచాలని అన్నారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఎస్.విమలమ్మ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కెవిబి ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు.

డప్పు కళాకారులను ఆదుకోవాలి
గజపతినగరం, డిసెంబర్ 20: డప్పు కళాకారులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని ఏపీ డప్పు కళాకారుల సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు రాకోటి రాములు కోరారు. ఆదివారం స్ధానిక ఎమ్మెల్యే నాయుడుకు మార్కెట్‌యార్డులో గురువారం వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు. డప్పు కళాకారులకు ఇచ్చే పింఛన్ వయసును 55 ఏళ్లనుంచి 45 ఏళ్లకు తగ్గించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. అదే విధంగా డప్పు కళాకారులకు ప్రభుత్వం నిర్వహించే అన్ని సాంస్కృతిక కార్యక్రమాలలో భాగస్వామ్యం కల్పించాలని కోరుతూ తగిన పారితోషికం అందజేయాలని అన్నారు. డప్పు కళాకారులకు ప్రభుత్వమే రెండు జతల బట్టలతోపాటు గజ్జెలు, డప్పులు అందజేయాలని అన్నారు. కార్యక్రమంలో సి ఐటియు డివిజన్ కార్యదర్శి పురం అప్పారావు, డప్పు కళాకారుల సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు టి.రాము తదితరులు పాల్గొన్నారు.

అగ్నిప్రమాదంలో వాహనాలు దగ్ధం
దత్తిరాజేరు, డిసెంబర్ 20: మండలంలోని గడసాం గ్రామంలో బుధవారం అర్థరాత్రి అగ్నిప్రమాదం సంభవించి ఆటో మోటారు సైకిల్ కాలిపోయిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం అర్థరాత్రి గడసాం శివారు కల్లాల వద్ద పందిరి శాల వేసి ఉండగా ఆ శాలలో ఆటో, మోటారు సైకిల్ రెండు వాహనాలను శేఖర్, రవిలు అనే ఇద్దరు వ్యక్తులు ఈ వాహనాలను అక్కడ ఉంచారు. అగ్నిప్రమాదం సంభవించడంతో ఆటో, బైక్‌లు రెండు ప్రమాదంలో కాలిపోయాయి. ఈ మేరకు పొట్నూరు అప్పలనాయుడు పెదమానాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు. గురువారం ఉదయం అగ్నిమాపక దళ అధికారులు వెళ్ళి పరిశీలించారు.

వినియోగదారులను డీలర్లు సంతృప్తి పరచాలి
దత్తిరాజేరు,డిసెంబర్ 20: రేషన్ దుకాణాలలో సరుకులు పంపిణీలో వినియోగదారులు సంతృప్తి చెందాలని తహశీల్దార్ కల్పవల్లి అన్నారు. గురువారం డీలర్లతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె తగు సూచనలు చేశారు. వినియోగదారులకు సకాలంలో సరుకులు అందించాలని అన్నారు. రేషన్ దుకాణానికి వినియోగదారులు వచ్చినపుడు సమంజసంగా మాట్లాడాలని ఆదేశించారు. సక్రమంగా సమయపాలన పాటించాలని సూచించారు. వినియోగదారులకు నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండేలా డీలర్లు చర్యలు తీసుకోవాలని సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఎస్‌డిటి రవిశంకర్,డిటి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి సామాజిక తనిఖీలను
సక్రమంగా జరపాలి
దత్తిరాజేరు, డిసెంబర్ 20: ఉపాధి సామాజిక తనఖీలను సిబ్బంది సక్రమంగా జరపాలి. గ్రామాలలో జరుగుతున్న ఉపాధి హామీ పనులకు సంబంధించి సామాజిక తనిఖీలను సిబ్బంది సక్రమంగా తనిఖీ చేయాలని ఎపివొ సుందరరావుకు సూచించారు. తనిఖీ బృందాలు ఏ సమాచారం అడిగినా సాంకేతిక క్షేత్ర సహాయకులు తక్షణమే స్పందించాలని అన్నారు. చిన్నచిన్న విషయాలకు గొడవలు తెచ్చుకోవద్దని సలహా ఇచ్చారు. మండలంలో కరవు పరిస్థితి నెలకొన్నందున రేషన్‌దారులు వలస వెళ్ళకుండా అన్ని గ్రామాలలో ఉపాధి పనులు చురుగ్గా నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జెడి దేముడు తదితరులు పాల్గొన్నారు.

పీఎస్‌బీ బ్యాంకులకు ఊతం

$
0
0

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: ప్రభుత్వ రంగంలో పని చేస్తున్న బ్యాంకులు (పీఎస్‌బీ)లకు ఊతమివ్వాలని నిర్ణయించామని, త్వరలోనే సుమారు 83,000 కోట్ల రూపాయలను ఈ రంగంలోకి విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్‌తో జైట్లీ పలు అంశాలను చర్చించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ పీఎస్‌యూ బ్యాంకులకు రాబోయే రెండుమూడు నెలల్లో భారీ మొత్తాలను అందుబాటులో ఉంచుతామన్నారు. అనుబంధ డిమాండ్లు, గ్రాంట్ల కింద 41,000 కోట్ల రూపాయలను పీఎస్‌యూలకు అందించే ప్రతిపాదనకు పార్లమెంటు ఆమోదం లభించాల్సి ఉందన్నారు.
పెట్టుబడుల ఉపసంహరణలను తగ్గించడమేగాక, మళ్లీ పెట్టుబడులను ఉంచేందుకు పీఎస్‌యూ బ్యాంకులకు వీలు కల్పిస్తామని జైట్లీ తెలిపారు.


ఓఎన్‌జీసీ షేర్ల ‘బైబ్యాక్‌‘కు బోర్డు గ్రీన్ సిగ్నల్

$
0
0

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) 25.29 కోట్ల షేర్లను బైబ్యాక్ కార్యక్రమం ద్వారా వెనక్కు తీసుకోనుంది. ఈ షేర్ల మొత్తం విలువ 4,022 కోట్లు కాగా ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు గురువారం ఇక్కడ జరిగిన ఆ సంస్థ బోర్డు సమావేశం ఆమోదముద్ర వేసింది. ప్రభుత్వ రంగ అనుబంధ సంస్థలను వాటి మిగులు నిధుల ఆధారంగా ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగానే ఓఎన్‌జీసీ ఈ తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీలో ప్రభుత్వ వాటా 65.64 శాతం ఉంది. కాగా బైబ్యాక్ కార్యక్రమం ద్వారా ఈ వాటాల్లో కొంత భాగాన్ని వేలానికి పెట్టి 2,640 కోట్ల రూపాయల నిధులు సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తం చెల్లింపులు జరిగి ఎక్కువ డివిడెండ్‌తో వున్న ఈక్విటీ షేర్లలో 1.97 శాతం ఒక్కో షేర్ విలువ 159 రూపాయలుగా ఉన్న వాటిని 25.29 కోట్ల షేర్లకు మించకుండా ఈ బైబ్యాక్ పథకం ద్వారా వెనక్కు తీసుకోనున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వ రంగ, అనుబంధ సంస్థల బడ్జెట్‌లోటును పూడ్చేందుకు ఆ సంస్థలకు సంబంధించిన షేర్లపై వచ్చే అధిక డివిడెండ్‌ను చెల్లించడం, లేదా షేర్లను విక్రయించడం వంటి చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని అధికారులు తెలిపారు. కాగా ప్రస్తుతానికి ఓఎన్‌జీసీ ఎలాంటి మధ్యంతర డివిడెండ్‌నూ చెల్లించడం లేదని, మూలధన ఖర్చుల పద్దుల గణన అనంతరం ఈ సంస్థకు ఎలాంటి అదనపు నిధులూ లేవని తేలిందని అధికారులు చెబుతున్నారు. ముంబ యి స్టాక్ ఎక్చేంజీలో ఓఎన్‌జీసీ షేర్ విలువ లాభనష్టాలకుఅతీతంగా మంగళవారం ప్లాట్‌గా 148.65 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. ఈక్రమంలో ఈ కంపెనీ షేర్లను తిరిగి కొనుగోలు చేసుకుని మళ్లీ వేలానికి పెట్టడం ఈ బైబ్యాక్ కార్యక్రమం ద్వారా నిర్వహిస్తారు. అంటే కంపెనీ మదుపర్లకు షేర్ల మార్కెట్ విలువను చెల్లించి తిరిగి ఆ షేర్లపై ఒకవంతు యాజమాన్య హక్కులను కంపెనీ తనవద్దే ఉంచుకుంటుంది. బైబ్యాక్ అనంతరం 6,556 కోట్ల రూపాయలను అదనంగా మధ్యంతర డివిడెండ్ చెల్లింపుకోసం ఖర్చు చేయనున్నట్టు ఈనెల ప్రథమార్థంలో ఓఎన్‌జీసీ ప్రకటించింది. ఇలావుండగా ఈ సంస్థ బోర్డు సమావేశం మొత్తం 3.06 శాతం వాటాను బైబ్యాక్ చేసుకోవడానికి తాజాగా ఆమోదముద్ర వేసింది. ఇప్పటికే సుమారు అరడజనుకు పైగా ప్రభుత్వ రంగ, అనుబంధ సంస్థలు షేర్ బైబ్యా క్ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఇందులో ఎన్‌హెచ్‌పీసీ, కోల్ ఇండియా, ఆయిల్ ఇండియా, బీహెచ్‌ఈఎల్, ఎన్‌ఏఎల్‌సీఓ, ఎన్‌ఎల్‌సీ, కొచ్చిన్ షిప్ యార్డు, కేఐఓసీఎల్ వంటి ప్రముఖ సంస్ధలున్నాయి. ఈ సంస్థల షేర్ బైబ్యాక్ కార్యక్రమం ద్వారా కనీసం ఐదువేల కోట్లు సమకూర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటికే ఐఓసీ 2018-19 ఆర్థిక సంవత్సరానికి ప్రతి వాటాలోని 6.75 శాతాన్ని మధ్యంతర డివిడెండ్‌గా మదుపర్లకు చెల్లించనున్నట్టు ప్రకటించింది. ఈ మొత్తం పన్నులను మినహాయించుకుని 6,556 కోట్లు. కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ పన్ను కింద మొత్తం 3,544 కోట్లు అందుతుంది.

దేశంలో విప్లవాత్మక మార్పు.. ఫెడరల్ ఫ్రంట్‌తోనే సాధ్యం

$
0
0

నకిరేకల్, డిసెంబర్ 20: దేశంలో విప్లవాత్మక మార్పు కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడే ఫెడరల్ ఫ్రంట్‌తోనే సాధ్యమని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. నకిరేకల్‌లోని మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ ప్రజలు, అనేక పార్టీలు కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి అలాంటి నాయకుడు దేశానికి అవసరమని కోరుకుంటున్నారన్నారు.

వారి పిల్లలేనా..! నిగ్గు తేల్చేందుకు ప్రత్యేక కోర్టు

$
0
0

నల్లగొండ, డిసెంబర్ 20: యాదాద్రి వ్యభిచార గృహాలపై నిర్వహించిన దాడుల్లో పోలీసులు రక్షించిన చిన్నారుల తల్లిదండ్రులు తామేనంటు నిర్వాహకులు చేస్తున్న వాదన నిగ్గు తేల్చేందుకు హైకోర్టు ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు నిర్ణయించింది. దీంతో యాదాద్రి వ్యభిచార కూపాల కేసులో హైకోర్టు మరో అడుగు ముందుకేసినట్లయ్యింది. యాదాద్రి వ్యభిచార గృహాల నిర్వాహకులు చిన్నారి ఆడపిల్లలను కొనుగోలు చేసి వారితో ఇంటిపని చాకిరి చేయిస్తునే వారు త్వరగా ఎదిగేలా ఆక్సిటోసిన్ హార్మోన్స్ ఇంజక్షన్స్ ఇచ్చి వారిని వ్యభిచార వృత్తిలోకి దించుతున్న ఘటనలు ఐదు నెలల క్రితం పోలీసులు జరిపిన ఆపరేషన్ ముస్కాన్ దాడుల్లో వెలుగుచూశాయి. ఈ అమానవీయ ఉదంతంపై పత్రికలు, ప్రసార సాధనాల్లో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు యాదాద్రి వ్యభిచార కూపాల పాపాలపైన, నివారించలేని ప్రభుత్వ యంత్రాంగంపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా బాయిలర్ కోళ్లకు మాదిరిగా చిన్నారి బాలికలు త్వరగా శారీరకంగా ఎదిగేందుకు ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు ఇచ్చిన నిర్వాకంపై తీవ్రంగా మండిపడింది. ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు ఇచ్చిన వైద్యుడికి, వ్యభిచార కూపాల నిర్వాహకుల్లో కొందరికి బెయిల్ మంజూరైన తీరుపై హైకోర్టు తీవ్రంగా నిలదీస్తు అధికారుల వ్యవహారశైలీని తప్పుబట్టింది. యాదాద్రిలో ఏళ్ల తరబడిగా సాగుతున్న వ్యభిచార దందాను అరికట్టడంలో పోలీసులు, అధికారుల చిత్తశుద్ధిపై అనుమానాలు వ్యక్తం చేసింది. కేసు విచారణకు సిట్ ఏర్పాటు చేసింది. పోలీసుల దాడుల్లో 36మంది చిన్నారులను రక్షించి పునరావాస కేంద్రాలకు తరలించి, 27మంది నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.

గ్రామాల్లో మొదలైన పంచాయతీ ఎన్నికల వేడి

$
0
0

అడ్డగూడూరు, డిసెంబర్ 20: పల్లెల్లో పంచాయతీ ఎన్నికల వాతావరణం రోజురోజుకు వేడెక్కుతుండడంతో ఏ గ్రామ పంచాయతీకి ఏ రిజర్వేషన్ వస్తుందో అని అన్ని వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. నూతనంగా ఏర్పాటైన గ్రామ పంచాయతీల్లో గ్రామస్థులు ఆశలతో పంచాయతీ ఎన్నికల కొరకు ఎదురు చూస్తున్నారు. నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కొత్త రిజర్వేషన్ల ప్రతిపాదికన ఎన్నికలు జరుగనుండడంతో పాత రిజర్వేషన్లకు మంగళం పాడినట్లైంది. గతంలో ఎస్సీ, ఎస్టీ జనాభపై గణణ చేసిన అధికారులు ఇప్పుడు బీసీ రిజర్వేషన్లపై గణణ చేస్తూ అధికారులు కసరత్తును మొదలు పెట్టారు. గ్రామాల్లో ప్రధానంగా అధికంగా ఉన్న సామాజిక వర్గాల వారికి రజర్వేషన్లు ఎప్పుడు ప్రకటిస్తారోనని యువకులు ఆశావాహులుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శాసనసభ ఎన్నికల వేడి ముగిసింది, టీఆర్‌ఎస్ విజయం సాధించింది, కేసీఆర్ తిరిగి రెండవ సారి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు తెలంగాణలో మరో ఎన్నికల పోరుకు రంగం సిద్ధమవుతుంది. స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్ జెండా ఎగురవేయాలని గులాబి బాస్‌లు కసరత్తు చేస్తున్నారు.
సర్పంచ్ పదవిపై యువత ఆసక్తి: పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవిపై నేటి యువత ఆసక్తి కనబరుస్తుంది. ప్రశ్నించేవారు ఎంతో అవసరమని గ్రామాల్లో అభివృద్ధికోసం మండల పరిషత్‌ను నిర్వహించే సర్వసభ్య సమావేశాల్లో యువకులు తమ గొంతు వినిపించేందుకు ముందుకొస్తున్నారు. గ్రామాల్లో ఎక్కువగా నిరక్షరాస్యులు, వృద్ధులను గెలిపిస్తే వారు మండల సమావేశంలో సమస్యలను ప్రస్తావించడం లేదని, అధికారుల పనితీరుపై ప్రశ్నించడం లేదని వాపోతున్నారు. దీనితో తామే సర్పంచ్‌లుగా ఎందుకు పోటీ చేయకూడదని గ్రామ రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్నారు.

అన్ని వర్గాల సంక్షేమానికి కృషి

$
0
0

నల్లగొండ రూరల్, డిసెంబర్ 20: తెలంగాణ ప్రభుత్వం అందించిన బతుకమ్మ చీరలను గురువారం నల్లగొండ పట్టణంలోని 21, 34, 36,33, 39వార్డులు తదితర ప్రాంతాలలో, మండలంలోని కొత్తపల్లి, అనంతారం గ్రామాలలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తుందని, పథకాలను సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి దైద రజిత, అబ్బగోని రమేష్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, నాయకులు, ఎంపీటిసిలు, అధికారులు పాల్గొన్నారు.
పెరిగిన పంచాయతీ ఎన్నికల ప్రచార ఖర్చులు
* ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం
వలిగొండ, డిసెంబర్ 20: పంచాయతీ ఎన్నికల్లో ధన ప్రవాహం మరింత పెరగనుంది. ఎన్నికల్లో ప్రచార వ్యయాన్ని పెంచుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఐదు వేలకు పైగా జనాభా ఉన్న గ్రామపంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి గరిష్టంగా 2.50లక్షల వరకు ఖర్చు చేసుకునే అవకాశం ఉండగా, వార్డు సభ్యుడు 50వేలు ఖర్చు చేసుకోవచ్చు. ఐదు వేల కంటే తక్కువ ఉన్న గ్రామపంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి 1.50లక్షల వరకు ఖర్చు చేసుకునే అవకాశం ఉండగా వార్డు సభ్యుడు 30వేలు ఖర్చు చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా సర్పంచ్‌గా పోటీ చేసే జనరల్ అభ్యర్థులైతే 2,500 రూపాయాలు, ఎస్సీ,ఎస్టీ,బిసీ అభ్యర్థులైతే 1,000 రూపాయలు, వార్డు సభ్యుడిగా పోటీ చేసే జనరల్ అభ్యర్థులైతే 500రూపాయాలు, ఎస్సీ,ఎస్టీ,బిసీ అభ్యర్థులైతే 250 రూపాయాలు నామినేషన్ డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. మొత్తానికి గతంలో కంటే సర్పంచ్, వార్డు సభ్యులు మూడు రేట్లు ఖర్చు చేసుకునే అవకాశం ఏర్పడింది. దీనితో ఈసారి పంచాయతీ ఎన్నికల్లో ధన ప్రవాహం జోరుగా కొనసాగే అవకాశం ఉందని చెప్పవచ్చు.
దేవరకొండను జిల్లాగా ప్రకటించాలి
* బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతి
దేవరకొండ, డిసెంబర్ 20: వెనుకబడిన దేవరకొండను ప్రభుత్వం వెంటనే జిల్లాగా ప్రకటించాలని కోరుతూ గురువారం బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్‌కు వినతీపత్రం సమర్పించారు. ఈసందర్భంగా దేవరకొండ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు కేతావత్ లాలూనాయక్ మాట్లాడుతూ తమకు పుట్టిన ఆడ సంతానాన్ని ఉపాధి లేక అమ్ముకునే దుస్ధితి ఈ ప్రాంతంలో నెలకొందని, చందంపేట, డిండి గ్రామాలకు చెందిన ప్రజలు ఏదైనా పని మీద జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే 100 కిలోమీటర్లకు పైగా వెళ్ళాల్సిన పరిస్ధితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సౌలభ్యం కోసం దేవరకొండను వెంటనే జిల్లాగా ప్రకటించాలని ఆయన కలెక్టర్‌ను కోరారు. కలెక్టర్‌కు వినతీపత్రం అందజేసిన వారిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నూకల నర్సింహ్మరెడ్డి, గోలి మధుసూదన్‌రెడ్డి, నక్క వెంకటేశ్‌యాదవ్ పాల్గొన్నారు.

దేవరకొండను జిల్లా
చేయాలని మానవహారం
దేవరకొండ, డిసెంబర్ 20: దేవరకొండను జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతూ గురువారం స్ధానిక బస్టాండ్ ఎదుట పలు విద్యార్ధిసంఘాల ఆధ్వర్యంలో మానవహారం ఏర్పాటు చేశారు.ఈసందర్భంగావిద్యార్ధి సం ఘాల నాయకులు మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి దూరంగా విసిరేసినట్లుగా ఉన్న దేవరకొండను నూతన జిల్లాగా ఏర్పాటు చేస్తే ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధిసంఘాల నాయకులు కొర్ర రాంసింగ్‌నాయక్, ఎర్ర కృష్ణజాంభవ్, కాట్రావత్ రాజు, నూనె సురేశ్, వల్లమల్ల ఆంజనేయులు, లక్ష్మణ్‌నాయక్,వెంకటేశ్వర్లు,సేవానాయక్, సతీష్‌గౌడ్, మురళీకృష్ణ, ఎండీ ఖదీర్, కుమార్‌నాయక్ తదితరులు పాల్గోన్నారు.

ఫిబ్రవరి 24 నుంచి పెద్దగట్టు జాతర

సూర్యాపేట, డిసెంబర్ 20: తెలంగాణలోనే రెండవ అతిపెద్ద జాతరగా పేరుగాంచిన దురాజ్‌పల్లి శ్రీలింగమంతుల స్వామి జాతరను ఫిబ్రవరి 24 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్నందున అన్నిశాఖల అధికారులు జాతర ఏర్పాట్లను ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ కె.సురేంద్రమోహన్ ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో పెద్దగట్టు జాతర నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లుతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత జాతరల కంటే 25 శాతం మేర భక్తులు అధికంగా ఈసారి జరిగే జాతరకు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎఫ్‌డీఎఫ్ కింద ప్రభుత్వానికి నిధుల మంజూరు కోసం ప్రతిపాదనలు అందించాల్సి ఉన్నందున సంబంధిత శాఖల అధికారులు రెండురోజుల్లో తమతమ శాఖల తరఫున ప్రతిపాదనలను అందించాలని కోరారు. జాతరకు వారం రోజుల ముందుగా నిర్వహించే దిష్టి పూజ నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని ఆదేశించారు. మిషన్ భగీరధ ప్రధాన పైప్‌లైన్ ద్వారా భక్తులకు తాగునీటిని అందించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. గత జాతర సమయంలో కోనేరు వద్ద నిర్మించిన స్నానాల గదులు, మరుగుదొడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టడంతోపాటు పరిసర ప్రాంతాల్లో తాత్కాలిక మరుగుదొడ్డు, మైబైల్ మూత్రశాలలు ఏర్పాటుచేయాలని సూచించారు. జాతర పరిసరాల్లో ఏర్పాటుచేసే దుకాణాలకు లాటరీ పద్ధతిలో అనుమతులు కేటాయించి కలెక్టరేట్ నందు అనుమతులు పొందాలని, అదేవిధంగా దుకాణాలను కేటాయించిన వారు మాత్రమే వినియోగించుకోవాలని, నిబంధనలను అతిక్రమించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సీసీ, డ్రోన్ కెమెరాల ద్వారా జాతర వద్ద భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆదేశించారు. శాంతి భద్రతల పరిరక్షణతోపాటు ట్రాఫిక్ నియంత్రణ, హైవేపై వాహనాల మళ్లింపు కోసం చేపట్టాల్సిన చర్యలపై ప్రణాళికలు రూపొందించుకోవాలని కోరారు. గట్టు ప్రాంతాన్ని 5 జోన్లుగా విభజించి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. జాతరకు వచ్చే భక్తులు విడిది చేసేందుకు గాను 30 ఎకరాల స్థలాన్ని కేటాయించి చదును చేయాలని అదేవిధంగా నీటి ట్యాంకులను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గుట్టపై నిర్మిస్తున్న విశ్రాంతి, అర్చకుల గదుల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీ ఆర్వో పి.చంద్రయ్య, అడ్మిన్ డీఎస్పీ పూజిత, డీఆర్డీవో పీడీ సుందరి కిరణ్‌కుమార్, డీపీవో రామ్మోహన్‌రాజు, సీపీవో అశోక్‌లతోపాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

గుజరాత్‌కు ‘స్టార్టప్’ ఫస్ట్‌ర్యాంక్

$
0
0

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: స్టార్టప్(అంకురాలు) ఏర్పాటుకు అత్యంత అనువైన రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది. చిన్న వ్యాపార సంస్థలు ఏర్పాటుకు అవసరమైన ప్రోత్సాహం, వౌలిక సదుపాయాలు, పర్యావరణ అనుకూలతలో గుజరాత్ ముందుండి ఉత్తమ రాష్ట్రంగా ఎంపికైంది. ఇండస్ట్రియల్ పాలసీ, ప్రమోషన్ శాఖ (డీఐపీపీ) విడుదల చేసిన ర్యాంకింగ్‌లో గుజరాత్ అగ్రస్థానంలోనిలిచింది. స్టార్టప్ పాలసీ, ఇంకుబేషన్, ప్రొక్యూర్‌మెంట్, కమ్యూనికేషన్ అంశాలను పరిగణనలోకి తీసుకున్న డీఐపీపీ రాష్ట్రాలను వర్గీకరించింది. రాష్ట్రాల పనితీరును బట్టి బెస్ట్ ఫెర్‌ఫార్మర్(అత్యుత్తమ ప్రదర్శన), టాప్ ఫెర్‌ఫార్మర్స్(మెరుగైన నిపుణత), లీడర్స్(మార్గ నిర్దేశం), యాస్పరెన్స్ లీడర్స్(ఆశాజనక ప్రదర్శన),ఎమర్జంగ్ స్టేట్స్(అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు), బిగినర్స్(ప్రారంభ ప్రదర్శన)గా వర్గీకరించారు. అత్యుత్తమ ర్యాంకింగ్ గుజరాత్ సాధించింది. కర్నాటక, కేరళ, ఒడిశా, రాజస్థాన్ మెరుగైన ప్రదర్శన కేటగిరీలోనిలిచాయి. ఆంధ్రప్రదేశ్, బిహార్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నాయకత్వ నైపుణ్యత కేటగిరిలో ఎంపికయ్యాయి. హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ అభివృద్ధి యాస్పరింగ్ తరువాత ర్యాంకింగ్ సాధించాయి. ఢిల్లీ, గోవా, అస్సా వంటి ఎనిమిది రాష్ట్రాలు ప్రారంభదశలోనే ఉన్నట్టు డీఐపీపీ వెల్లడించింది.
చిత్రం..

బంగ్లాదేశ్ టీ-20 లీగ్‌లో స్మిత్‌కు నో ఎంట్రీ!

$
0
0

ఢాకా, డిసెంబర్ 20: బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా సస్పెన్షన్ వేటును ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ స్టీవెన్ స్మిత్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లాదేశ్ టీ-20 లీగ్‌లో ఆడే అవకాశాన్ని అతను కోల్పోయాడు. ఈ ఏడాది దక్షిణాఫ్రికా టూర్‌కు వెళ్లినప్పుడు కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించి, కెమెరా కంటికి చిక్కిన విషయం తెలిసిందే. ఆ వివాదం కారణంగానే, బాన్‌క్రాఫ్ట్‌తోపాటు అప్పటి జట్టు కెప్టెన్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ను కూడా క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఏడాది పాటు అంతర్జాతీయ టోర్నీల నుంచి నిషేధించింది. అయితే, వివిధ దేశాల్లో జరిగే దేశవాళీ టోర్నీల్లో పాల్గొనేందుకు ఎలాంటి షరతులు విధించలేదు. వచ్చేనెల 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్‌ఙలో అతను కొమిల్లా విక్టోరియన్స్ తరఫున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే, కొన్ని ఫ్రాంచైజీలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అతనిని బీపీఎల్ నుంచి తప్పిస్తున్నామని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీఏ) ప్రకటించింది. స్మిత్ స్థానంలో పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను కొమిల్లా ఫ్రాంచైజీ తీసుకుంటుందని వివరించింది.


చైనా ఫుట్‌బాల్‌కు కష్టకాలం!

$
0
0

షాంఘై, అక్టోబర్ 20: చైనా ఫుట్‌బాల్ క్రీడకు కష్టకాలం వచ్చింది. పెరుగుతున్న ఖర్చులు, పెరగని ఆదాయం కారణంగా ఆర్థికంగా మల్లగుల్లాలు పడుతున్న చైనా ఫుట్‌బాల్ సంఘం (సీఎఫ్‌ఏ) ఇకపై ఆటగాళ్ల జీతభత్యాలపై గరిష్ట పరిమితిని విధించాలని నిర్ణయించింది. దేశీయ క్రీడాకారులకు ‘ఇన్ యాంగ్ కాంక్రాక్టు’ పేరుతో గరిష్టంగా 1.45 మిలియన్ డాలర్ల జీవితం చెల్లించన్నుట్టు స్పష్టం చేసింది. అదే విధంగా బోనస్, ఇతర ఆర్థిక పరమైన లాభాల్లోనూ కోత విధించింది. చైనీస్ సూపర్ లీగ్ (సీఎస్‌ఎల్)లో పాల్గొనే ఆటగాళ్లకు పారితోషికం కింద గరిష్టంగా 1.2 బిలియన్ డాలర్లను ఖర్చు చేయాలని సీఎఫ్‌ఏ తీర్మానించడంతో, ఆటగాళ్లు ఆందోళనకు గురవుతున్నారు. తక్కువ జీవితంతో సరిపుచ్చుకొని ఎంత మంది జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తారన్నది అనుమానంగా మారింది. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు యూఫా వంటి టోర్నీల్లో భారీగా పారితోషికం లభిస్తున్నది. ఈ కారణంగా వారు వివిధ ఫ్రాంచైజీల తరఫున ఆడేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. చైనాలో ఇప్పటికే చాలా మంది వివిధ దేశాల టోర్నీలవైపు మొగ్గు చూపిస్తుంటే, నివారణ చర్యలు తీసుకోవాల్సిన సీఎఫ్‌ఏ అందుకు భిన్నంగా జీతభత్యాలు తగ్గించడం ఫుట్‌బాల్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నది.

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్

$
0
0

బ్యాటింగ్‌లో ‘టాప్-10’
1. విరాట్ కోహ్లీ (్భరత్), 2. కేన్ విలియమ్‌సన్ (న్యూజిలాండ్), 3. స్టీవెన్ స్మిత్ (ఆస్ట్రేలియా), 4. చటేశ్వర్ పుజారా (్భరత్), 5. జో రూట్ (ఇంగ్లాండ్), 6. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా), 7. దిముత్ కరుణరత్నే (శ్రీలంక), 8. డీన్ ఎల్గార్ (దక్షిణాఫ్రికా), 9. హెన్రీ నికొల్స్ (న్యూజిలాండ్), 10. అజర్ అలీ (పాకిస్తాన్).
బౌలింగ్‌లో ‘టాప్-10’
1. కాగిసో రబదా (దక్షిణాఫ్రికా), 2. జేమ్స్ ఆండర్సన్ (ఇంగ్లాండ్), 3. వెర్నన్ ఫిలాండర్ (దక్షిణాఫ్రికా), 4. మహమ్మద్ అబ్బాస్ (పాకిస్తాన్), 5. రవీంద్ర జడేజా (భారత్), 6. రవిచంద్రన్ అశ్విన్ (్భరత్), 7. నాథన్ లియాన్ (ఆస్ట్రేలియా), 8. పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా), 9. జొష్ హాజెల్‌వుడ్ (ఆస్ట్రేలియా), 10. యాసిర్ షా (పాకిస్తాన్).
ఆల్‌రౌండర్స్‌లో ‘టాప్-10’
1. షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్), 2. రవీంద్ర జడేజా (భారత్), 3. వెర్నన్ ఫిలాండర్ (దక్షిణాఫ్రికా), 4. జాసన్ హోల్డర్ (వెస్టిండీస్), 5. బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్), 6. రవిచంద్రన్ అశ్విన్ (భారత్), 7. మోయిన్ అలీ (ఇంగ్లాండ్), 8. మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా), 9. క్రిస్ వోక్స్ (ఇంగ్లాండ్), 10. పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా).

కోహ్లీ స్థానం పదిలం

$
0
0

దుబాయ్, డిసెంబర్ 20: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజా టెస్టు ర్యాంకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన నంబర్ వన్ స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. 943 పాయింట్లతో అతను అగ్రస్థానంలో కొనసాగుతుండగా, కేన్ విలియమ్‌సన్ (న్యూజిలాండ్) 915, స్టీవెన్ స్మిత్ (ఆస్ట్రేలియా) 892 పాయింట్లతో వరుసగా రెండు, మూడు స్థినాల్లో ఉన్నారు. భారత ఆటగాడు చటేశ్వర్ పుజారా 816 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. టాప్-10లో కోహ్లీ, పుజారా తప్ప భారత బ్యాట్స్‌మెన్‌లో ఎవరూ చోటు దక్కలేదు. కాగా, బౌలింగ్ విభాగంలో దక్షిణాఫ్రికాకు చెందిన కాగిసో రబదా 882 పాయింట్లతో నెంబర్ వన్‌గా ఉన్నాడు. జేమ్స్ ఆండర్సన్ (ఇంగ్లాండ్) 874, వెర్నన్ ఫిలాండర్ (దక్షిణాఫ్రికా)
826 పాయింట్లతో రెండు, మూడు స్థానాలను ఆక్రమించారు. భారత్ తరఫున టాప్-10లో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌కు చోటు లభించింది. జడేజా 796 పాయింట్లతో ఐదు, అశ్విన్ 778 పాయింట్లతో ఆరు స్థానాల్లో ఉన్నారు. ఆల్‌రౌండర్ల విషయానికి వస్తే, రవీంద్ర జడేజా 384 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. బంగ్లాదేశ్‌కు చెందిన షకీబ్ అల్ హసన్ 415 పాయింట్లతో మొదటి స్థానాన్ని పదిలం చేసుకోగా, వెర్నన్ ఫిలాండర్ (దక్షిణాఫ్రికా) 370 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. టాప్-10లో భారత్ నుంచి జడేజాతోపాటు అశ్విన్ కూడా ఉన్నాడు. అతను 334 పాయింట్లతో ఆరో స్థానాన్ని దక్కించుకున్నాడు. భారత యువ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ 11 స్థానాలను అధిగమించి, కెరీర్‌లోనే అత్యుత్తమంగా 48వ స్థానాన్ని సంపాదించాడు. వైస్ కెప్టెన్ అజింక్య రహానే రెండు స్థానాలను మెరుగుపరచుకొని టాప్-15లోకి చేరాడు. బౌలింగ్ విభాగంలో భారత పేసర్ మహమ్మద్ షమీ రెండు స్థానాలను ముందుకు లంఘించి, 24వ స్థానాన్ని సంపాదించాడు.

మహిళా క్రికెట్ జట్టు కొత్త కోచ్ రామన్

$
0
0

ముంబయి, డిసెంబర్ 20: భారత మహిళా క్రికెట్ జట్టు కొత్త కోచ్‌గా మాజీ ఓపెనర్ డబ్ల్యూవీ రామన్‌ను భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) ఎంపిక చేసింది. ఈ విషయాన్ని బోర్డు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ధ్రువీకరించింది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడెమీ (ఎన్‌సీఏ)లో ప్రస్తుతం బ్యాంకింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న 53 ఏళ్ల రామన్‌కు దక్షిణాఫ్రికాకు చెందిన టీమిండియా మాజీ కోచ్ గారీ కిర్‌స్టెన్ నుంచి గట్టిపోటీ ఎదురవుతుందని అంతా భావించారు. బీసీసీఐ కూడా కిర్‌స్టెర్‌వైపే మొగ్గు చూపింది. అయితే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కోచ్‌గా సేవలు అందిస్తున్న కిర్‌స్టెన్ పూర్తిస్థాయిలో భారత మహిళా జట్టు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధపడలేదని బోర్డు వర్గాలు వెల్లడించాయి. దీనితో కపిల్ దేవ్, అంశుమాన్ గైక్వాడ్, శాంతా రంగస్వామితో కూడిన కోచ్ సెలక్షన్ కమిటీ రామన్‌కు ఓటేసింది. అతనిని కోచ్‌గా నియమించాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు బోర్డు ఆమోద ముద్ర వేసింది. మహిళా జట్టు కోచ్ ఎంపికను తాత్కాలికంగా ఆపాలంటూ బీసీసీఐ పాలనా వ్యవహారాల కమిటీ (సీఓఎ) సభ్యురాలు డయానా ఎడుల్జీ కోరింది. కానీ, కమిటీ చైర్మన్ వినోద్ రాయ్ అందుకు భిన్నంగా నిర్ణయం తీసుకున్నాడు. రాబోయే జాతీయ, అంతర్జాతీయ మహిళా క్రికెట్ షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకొని, ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. కిర్‌స్టెన్ పేరు చివరి వరకూ వినిపించినప్పటికీ, అతని నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో, కోచ్ పదవి రామన్‌కు దక్కింది. కెరీర్‌లో 11 టెస్టలు, 27 వనే్డ ఇంటర్నేషనల్స్ ఆడిన రామన్‌కు దేశంలోని ఉత్తమ కోచ్‌ల్లో ఒకడన్న పేరు ఉంది. రంజీ ట్రోఫీలో అతను తమిళనాడు, బెంగాల్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. 1992-93 సీజన్‌లో టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లినప్పుడు, అక్కడ సెంచరీ సాధించిన తొలి భారతీయుడిగా రామన్ రికార్డు సృష్టించాడు. మహిళా జట్టు కోచ్ కోసం ప్రకటన విడుదల చేసినప్పుడు, 28 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో మనోజ్ ప్రభాకర్, ట్రెంట్ జాన్సన్, దిమిత్రీ మస్కరెన్హాస్, బ్రాత్ హాగ్, కల్పనా వెంకటాచార్‌ను కోచ్ సెలక్షన్ కమిటీ మంగళవారం ఇంటర్వ్యూ చేసింది. కిర్‌స్టెన్‌ను స్కైప్ ద్వారా, రామన్, వెంకటేశ్ ప్రసాద్‌ను ఫోన్‌లో సంప్రదించింది. మిగతా వారిని తప్పించి, చివరిగా మూడు పేర్లను ఖాయం చేసింది. రామన్, వెంకటేశ్ ప్రసాద్, కిర్‌స్టెన్ ఈ జాబితాలో ఉన్నాయి. వెంకటేశ్ ప్రసాద్ కంటే కిర్‌స్టెన్, రామన్ మధ్యే పోటీ ఎక్కువగా కనిపించింది. కిర్‌స్టెన్ అనాసక్తతతో మహిళా జట్టు కోచ్ పదవి రామన్‌కు దక్కింది.

సివిల్స్‌లో తెలుగుతేజాలు

$
0
0

హైదరాబాద్, డిసెంబర్ 20: దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసుల్లోకి ఎంపిక చేసేందుకు యూపీఎస్‌సీ నిర్వహించిన ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ లిఖిత పరీక్ష ఫలితాలను గురువారం న్యూఢిల్లీలో విడుదల చేశారు. దాదాపు 4 లక్షల మంది పరీక్ష రాయగా, అందులో 8 వేల మంది వరకూ మెయిన్స్ పరీక్ష రాశారు. వారి నుండి 1994 మంది మెయిన్స్‌కు క్లాలిఫై అయ్యారు. వీరందరికీ ఫిబ్రవరి 4 నుండి వౌఖిక పరీక్ష నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల నుండి సివిల్ సర్వీసెస్‌కు 150 వరకూ ఎంపికయ్యారు. వీరిలో ఇంటర్వ్యూల అనంతరం కనీసం 75 నుండి 100 మంది ఎంపికయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. 2018 సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 7 వరకూ సివిల్స్ మెయిన్స్ పరీక్షలను నిర్వహించారు. ఈసారి సివిల్స్ నుండి 782 మందిని నియమించనున్నారు. అందు లో 27 ఖాళీలను పిహెచ్ అభ్యర్థులకు, ఏడు ఎల్‌డీసీపీ అభ్యర్థులకు 08 ఖాళీలు బిఎల్‌వీ, 12 ఖాళీలు హెచ్‌ఐవి అభ్యర్థులకు రిజర్వు చేశారు.

Viewing all 69482 articles
Browse latest View live