Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

పారదర్శకంగా ‘పెథాయ్’ నష్టం అంచనాలు

$
0
0

మచిలీపట్నం, : పెథాయ్ తుఫాన్ పంట నష్టం నమోదులో రైతులు అపోహలు వీడాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం విజ్ఞప్తి చేశారు. పంట నమోదు అంశంలో రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. నియమ నిబంధనల ప్రకారమే పంట నష్టం అంచనాలను వ్యవసాయ శాఖాధికారులు నమోదు చేస్తున్నారని శుక్రవారం కలెక్టర్ బంగ్లాలోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో స్పష్టం చేశారు. రైతులు అపోహలకు గురై పంట నష్టం నమోదు విషయంలో వ్యవసాయ శాఖాధికారులకు సహకారం అందించడం లేదన్నారు. ప్రత్యేక యాప్ ద్వారా పంట నష్టాన్ని నమోదు చేసి ఆర్టీజీ ద్వారా ప్రభుత్వానికి నివేదిస్తున్నట్లు తెలిపారు. క్షేత్ర స్థాయి, గ్రామ స్థాయి, వ్యవసాయ, రెవెన్యూ అధికారులు గత మూడు రోజుల నుండే గ్రామాల్లో తిరుగుతూ పంట నష్టం వివరాలను నమోదు చేస్తున్నారన్నారు. గతం కంటే భిన్నంగా ఈసారి పూర్తిగా ఆన్‌లైన్‌లో నష్టం అంచనాలను నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియ ఇతర జిల్లాలతో పోలిస్తే జిల్లాలో అత్యంత వేగంగా సాగుతోందన్నారు. రైతు పేరు, ఆధార్ నెంబరు, బ్యాంక్ ఖాతా వివరాలు, పంట వివరాలు, సర్వే నెంబరు, విస్తీర్ణం, నష్టం వివరాలు మొబైల్లోనే నమోదు చేస్తారన్నారు. మండల స్థాయిలో వ్యవసాయ అధికారి, తహశీల్దార్ పర్యవేక్షణ పంట నష్టం నమోదు జరుగుతుందని కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు.


నవదంపతులకు సీఎం ఆశీర్వాదం

$
0
0

మచిలీపట్నం, : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు, పార్లమెంట్ ప్యానల్ స్పీకర్ కొనకళ్ల నారాయణరావు ఇంట శుక్రవారం పెళ్లి సందడి నెలకొంది. నరసింహారావు కుమార్తె, న్యాయ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మేనకోడలైన నిఖిత-యశ్వంత్ వర్మ, ఎంపి కొనకళ్ల నారాయణరావు సోదరుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల జగన్నాధరావు (బుల్లయ్య) కుమార్తె సాహితి - రాహుల్ వీర్ వివాహ వేడుకలు అంబరాన్నంటాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఉండవల్లి నుండి నేరుగా రోడ్డు మార్గాన రాత్రి 9.30ని.ల సమయంలో మచిలీపట్నం వచ్చిన సీఎం చంద్రబాబు తొలుత హిందూ కళాశాలలో జరిగిన నిఖిత-యశ్వంత్ వివాహ వేడుకలు, తర్వాత హౌసింగ్ బోర్డు కాలనీలోని జల్దువారితోటలో జరిగిన సాహితి-రాహుల్ వీర్‌ల వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబుకి పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబుతో పాటు మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కాలువ శ్రీనివాసరావు, పితాని సత్యనారాయణ, కింజవరపు రామ్మోహన్, ముడ చైర్మన్ బూరగడ్డ వేదవ్యాస్, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, జిల్లా చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని, జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం, ఏలూరు రేంజ్ డీఐజీ రవికుమార్, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, జిల్లాకు ఎమ్మెల్యేలు కాగిత వెంకట్రావ్, బొండా ఉమామహేశ్వరరావు, బోడే ప్రసాదరావు, వల్లభనేని వంశీ మోహన్, మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ తదితరులు నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ రిజిస్ట్రార్

$
0
0

కైకలూరు, : కైకలూరు కో-ఆపరేటీవ్ కార్యాలయంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్న ఆలపాటి సాయి బాబు శుక్రవారం సాయంత్రం రూ.30వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోదక శాఖాధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. విజయవాడ ఎసీబీ డీఎస్పీ ప్రసాదరావు తెలిపిన వివరాల ప్రకారం కైకలూరుకు చెందిన మహ్మద్ అబ్దుల్ రహీమ్ కన్స్యూమర్ సెంట్రల్ కో-ఆపరేటీవ్ స్టోర్స్ (కెసీసీసీఎస్) బిజినెస్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 19వేల 802 క్వింటాళ్ల ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఆడిట్ విషయంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ రూ.30వేలు లంచం డిమాండ్ చేశారు. అంత మొత్తంలో లంచం ఇవ్వడానికి ఇష్టపడని రహీమ్ విషయాన్ని ఎసీబీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాడు. ఎసీబీ అధికారుల ముందస్తు పథకంలో భాగంగా రహీమ్ రూ.30వేలు నగదును కార్యాలయంలో ఉన్న అసిస్టెంట్ రిజిస్ట్రార్‌కు ఇచ్చాడు. ఇదే సమయంలో ఎసీబీ అధికారులు దాడి చేసి అసిస్టెంట్ రిజిస్ట్రార్‌ను పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న రూ.30వేలు నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎసీబీ డీఎస్పీ ప్రసాదరావు తెలిపారు.

నూజివీడు వైసీపీలో సమసిన ‘రగడ’

$
0
0

నూజివీడు, నూజివీడు పురపాలక సంఘం వైకాపాలో ఏర్పడిన చైర్‌పర్సన్ పదవి మార్పు వివాదానికి తాత్కాలికంగా తెరపడింది. చైర్‌పర్సన్ పదవి మార్పు కోసం గత సంవత్సరం నుండి నూజివీడు వైకాపాలో లోపాయికారిగా రగడ జరుగుతోంది. ప్రస్తుతం పురపాలక సంఘం ఛైర్‌పర్సన్‌గా బసవ రేవతి వ్యవహారిస్తున్నారు. మార్పు కోసం రామిశెట్టి త్రివేణి దుర్గ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. చివరకు రామిశెట్టి మురళీ వర్గానికి చెందిన ఏడుగురు కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేశారు. పలు పర్యాయాలు పార్టీ పెద్దల వద్ద జరిగిన పంచాయతీలతో పాటు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు కుమారుడు వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన పంచాయితీల ఫలితంగా రగడ సమసిపోయింది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో బసవ రేవతి శెలవు పెట్టడం, ప్రస్తుతం పురపాలక సంఘం వైస్ చైర్మన్ ఉన్న రామిశెట్టి త్రివేణి దుర్గ ఇన్‌చార్జి చైర్‌పర్సన్‌గా వ్యవహారించేందుకు నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం స్ధానిక ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు సమక్షంలో ఇరువర్గాలకు చెందిన నాయకులతో సమావేశం నిర్వహించారు. పార్టీకి చేసిన రాజీనామాలను రద్దు చేసు కుంటూ పార్టీ నిర్ణయాలకు కట్టుబడి, 2019 ఎన్నికలలో వైకాపా విజయానికి తామందరం కష్టపడతామని ఏకత్రాటిపై ఉంటామని రామిశెట్టి మురళీకృష్ణ తదితరులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు విలేఖరులతో మాట్లాడుతూ పట్టణ వైకాపాలో నెలకొని ఉన్న రగడ సమసిపోయిందని చెప్పారు. కౌన్సిల్ సభ్యులతో చర్చించి, చైర్‌పర్సన్ పదవి మార్పుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గతంలో పార్టీకి రాజీనామాలు చేసిన కౌన్సిలర్లు తమ రాజీనామాలు రద్దు చేసుకుంటున్నట్లు విలేఖరుల సమావేశంలో బహిర్గతం చేయాలని బసవ భాస్కరరావు కోరారు. చైర్‌పర్సన్ పదవిని వదిలేది లేదని గతంలో స్పష్టం చేసిన బసవ భాస్కరరావు, పార్టీ శ్రేయస్సుతో పాటు పార్టీ పెద్దలు, ఎమ్మెల్యే ప్రతాప్ ఉన్న గౌరవంతో పదవి మార్పుకు అంగీకరించటంతో నూజివీడు వైకాపాలో ఏర్పడిన ముసలానికి తెరపడింది.

టీడీపీ హయాంలోనే బ్రాహ్మణులకు సముచిత స్థానం

$
0
0

మచిలీపట్నం : బ్రాహ్మణుల సంక్షేమానికి పెద్దపీట వేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య అన్నారు. ఆగస్టు 20వ తేదీన బ్రాహ్మణ సంక్షేమ దినోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. స్థానిక పరాసుపేట త్రిపుర సుందరి ఫౌండేషన్ భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అట్టడుగున ఉన్న పేద బ్రాహ్మణుల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారన్నారు. భారతీ విద్యా పథకం కింద ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఉపకార వేతనాల మంజూరు, వృద్ధులకు పెన్షన్, అత్త వేధింపులు తాళలేని మహిళలు, 35 సంవత్సరాలు దాటిన ఒంటరి మహిళలకు పెన్షన్ అందించటం జరుగుతుందన్నారు. 1600 మంది లబ్ధిదారులకు ఆర్థిక సహకారం అందించామన్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలో రూ.కోటి 25లక్షలు ఆర్థిక సహాయం అందించామన్నారు. కార్లు, ఆటోలు, ట్యాక్సీలు నడుపుతున్న పేద బ్రాహ్మణులకు 25 కారులను మంజూరు చేయటం జరిగిందని, త్వరలోనే 25 మందికి కార్లు మంజూరు చేస్తామన్నారు. 50వేల మంది సభ్యులతో కమ్యూనిటీ కో-ఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేయటం, మహిళ సాధికారిత కొరకు అరంధతి, వశిష్ణ గ్రూపులు ఏర్పాటు చేసి సహకారం అందిస్తున్నామన్నారు. పథకాలను అమలును పర్యవేక్షించేందుకు ముగ్గురు డీఎల్‌ఓలు ఫణికుమార్, మహేష్, శివశర్మలను నియమించటం జరిగిందన్నారు. బ్యాంక్ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి చేసిన ప్రయత్నాన్ని ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలే వ్యతిరేకిస్తున్నారన్నారు. హిందుత్వం, హిందూ భావజాలాన్ని కాపాడుకొవల్సిన బాధ్యత బ్రాహ్మణులపై ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సీఎం కావటం తధ్యమన్నారు. ఈ సమావేశంలో వేమూరి రామకృష్ణ, పివి ఫణికుమార్, ఎఆర్‌కె మూర్తి, వాడపల్లి సువర్ణ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో రెండు లక్షల టన్నుల ధాన్యం కొన్నాం

$
0
0

మైలవరం, జిల్లాలో ఇప్పటి వరకూ రెండు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రెండు లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి నాగేశ్వరరావు వెల్లడించారు. శుక్రవారం ఆయన మైలవరం మార్కెట్ యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి కొనుగోళ్ళ పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ ఇటీవల పెధాయ్ తుఫాను కారణంగా జిల్లాలో పశ్చిమ కృష్ణాలో కొంత వరకూ నష్టం జరిగినా గింజ కూడా వదలకుండా కొనుగోలు చేస్తామన్నారు. ముఖ్యంగా ముందస్తు జాగ్రత్త చర్యలతో నష్టాన్ని తగ్గించగలిగినట్లు తెలిపారు. మైలవరం ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఇంకా 20 లోడ్లు ధాన్యం ఉందని రోజుకు పది లోడ్లు చొప్పున రెండు మూడు రోజుల్లో మొత్తం ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్లకు తరిలిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా ఐదు లోడ్లు సాంబమసూరి ధాన్యం ఉన్నాయని వీటిని కూడా రెండు రోజులలో కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. రైతులు తమ ధాన్యం నిల్వలను కోత కోసి నూర్చిన వెంటనే కొనుగోలు కేంద్రానికి తరలిస్తున్నారని దీని వల్ల తేమ శాతం ఎక్కువగా ఉంటుందని అలా కాకుండా ఆరబెట్టుకుని తీసుకురావాలని సూచించారు.

విఫలమైన రాయబారం

$
0
0

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 21: సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మికులు మంత్రి పీ నారాయణతో జరుపతలపెట్టిన సామూహిక రాయబార కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఇంటి వద్దనే ఉండి సమస్యలను పరిష్కరిస్తానంటూ ఇచ్చిన హామీ మేరకు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లారుూస్ రాష్ట్ర ఫెడరేషన్ ఆధ్వర్యంలో వందలాది మంది కార్మికులు, కార్మిక సంఘాల నేతలు శుక్రవారం నగరంలోని మంత్రి నారాయణ ఇంటికి బయలుదేరారు. అయితే మంత్రి ఇంటికి వెళ్లకముందే పోలీసులు రంగ ప్రవేశం చేసి మార్గ మధ్యలో రమేష్ హాస్పటల్ రోడ్డులో కార్మికులను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈక్రమంలో పోలీసులకు కార్మికులకు మధ్య తీవ్ర స్థాయిలో జరిగిన పెనుగులాటతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. అదుపులోకి తీసుకున్న వారిని నగరంలోని పటమట, మాచవరం, పెనమలూరు, కంకిపాడు తదితర పోలీస్ స్టేషన్లకు తరలించి నిర్బంధించారు. పోలీస్ స్టేషన్‌లో ఉన్న వారిని పరామర్శించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు ఆందోళనకారులను నుద్దేశించి మాట్లాడుతూ పోలీసులను అడ్డం పెట్టుకుని కార్మిక ఉద్యమాలను అణగదొక్కాలని చూడటం దారుణమన్నారు. ఇటువంటి అనైతిక చర్యలు మానుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. 279 జీవో రద్దు, 010 జీవో ద్వారా జీతాల చెల్లింపులతోపాటు గత అక్టోబర్‌లో 13రోజుల పాటు చేసిన సమ్మె విరమణ సదర్భంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని, లేనిపక్షంలో రానున్న రోజుల్లో ఉద్యమం మరింత తీవ్రతరం చేసి తెలుగుదేశం ప్రభుత్వానికి చరమగీతం పాడతామని హెచ్చరించారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించే నిరంకుశ చర్యలను లెక్కచేయకుండా పోరాడి తీరుతామని ప్రకటించారు. తాము కొత్త డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టడం లేదని, పాలకులు తమకు ఇచ్చిన హామీల అమలుకోసమే పోరాడుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షురాలు కె సామ్రాజ్యం, గౌరవ అధ్యక్షుడు పీ వెంకటరెడ్డి, జీ సుబ్బారావు, సిహెచ్ సైదులు, టీ నూకరాజు, కత్తి శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

తీరునున్న మున్సిపల్ ఉద్యోగుల ఆశ
* సంక్రాంతి కానుకగా 010 జీవో జీతాల చెల్లింపులు
* మేయర్ శ్రీ్ధర్‌కు మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వలవన్ హామీ
విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 21: విజయవాడ నగరపాలక సంస్థ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 010 జీవో జీతాల చెల్లింపుల ఆశ నెరవేరబోతోంది. 2019 సంక్రాంతి కానుకగా వీఎంసీ ఉద్యోగులకు 010 జీవో జీతాల చెల్లింపులకు జరిగేలా జీవో జారీ చేస్తామంటూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కరికల్ వలవన్ మేయర్ కోనేరు శ్రీ్ధర్‌కు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం వెలగపూడి సెక్రటేరియేట్‌లోని వలవన్ కార్యాలయంలో కలిసిన మేయర్ వీఎంసీకి సంబంధించిన పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వీఎంసీ ఆర్థిక పరిస్థితులు, ఆదాయ వనరులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వమే ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తే వీఎంసీ ఖజానాకు ఆర్ధిక వెసులుబాటు ఉంటుందని మేయర్ చేసిన విన్నపానికి స్పందించిన ఆయన 010 జీతాలపై త్వరలోనే జీవో జారీ చేస్తామన్నారు. ఈలోగా వీఎంసీ ఆడిట్ నివేదిక అందజేయాలని పేర్కొన్నారు. అలాగే నగరంలో ప్రతి ఏటా పెరుగుతున్న 7శాతం నీటి చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ తాము గతంలో పలుమార్లు కౌన్సిల్ తీర్మానాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపగా, ఆ విషయంపై ఇప్పటికీ సరైన సమాధానం రాలేదని తెలిపిన మేయర్ కోనేరు శ్రీ్ధర్‌కు పెరుగుతున్న చార్జీల తగ్గింపుపై కౌన్సిల్ తీర్మానం చేసుకుని అమలుచేసుకోవాలని ఆయన సూచించారు. వీఎంసీ పరిధిలో పునరావాసం పొందిన వారి ఇళ్లకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని కోరగా, మరికొద్ది రోజులలోనే రిజిస్ట్రేషన్ చేసే విధంగా ఉత్తర్వులు జారీ చేస్తానని ప్రిన్సిపల్ సెక్రటరీ పేర్కొన్నారు. తదుపురి అమరావతిలో నిర్మిస్తున్న ఎంఎల్‌ఏ క్వార్టర్లతోపాటు ఐఎఎస్ క్వార్టర్ల నిర్మాణ పనులను పరిశీలించిన మేయర్ కోనేరు శ్రీ్ధర్ ఆయా పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కో అప్షన్ మెంబర్ సిద్దెం నాగేంద్రరెడ్డి, ఏరుబోతు రమణారావు తదితరులు పాల్గొన్నారు.

రైతులకు 342.80కోట్లు చెల్లింపులు : కలెక్టర్

$
0
0

విజయవాడ (క్రైం), డిసెంబర్ 21: జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంధ్రాల ద్వారా రైతుల ఖాతాలకు నేరుగా జమ చేస్తున్నామని, ఇప్పటి వరకు 342.80 కోట్ల రూపాయలు చెల్లింపులు జరిపినట్లు కలెక్టర్ బి లక్ష్మీకాంతం తెలిపారు. జిల్లాలో 256 ధాన్యం కొనుగోలు ద్వారా రైతుల నుంచి ప్రభుత్వం కల్పిస్తున్న కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని, ఇప్పటి వరకు 19,458 మంది రైతుల నుంచి లక్షా 93వేల 890 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామన్నారు. 342.80 కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసి 297.85 కోట్ల రూపాయలు 16,709 మంది రైతులకు ఇప్పటి వరకు చెల్లించామన్నారు. ఇంకనూ 2,749 మంది రైతులకు 44.95 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని, వీటిని సంబంధిత బ్యాంకుల ద్వారా నేరుగా రైతుల ఖాతాలకు జమ చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. ధాన్యం నిల్వ చేసుకున్న చోటే నేరుగా కొనుగోలు చేసేలా అధికారులను ఆదేశించామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో గొనుసంచుల సమస్యలు లేకుండా ఎప్పటికప్పుడు అదనపు సంచులను ఉంచుకునేలా అధికారులను కోరామని కలెక్టర్ పేర్కొన్నారు.

కార్మిక సమస్యల పరిష్కారం కోసం జైలుకైనా సిద్ధమే
* సీపీఎం నేత బాబూరావు
పెనమలూరు, డిసెంబర్ 21: మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అరెస్ట్‌లే కాదు జైలుకు వెళ్లటానికైనా సిద్ధమేనని, వెంటనే వేతన జీవో ప్రకారం కనీస వేతనం చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ బాబూరావు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ మంత్రి పి నారాయణ ఇంటి ముట్టడి కార్యక్రమంలో భాగంగా రాష్టవ్య్రాప్తంగా పాల్గొన్న 500 మంది కార్మికులను అరెస్ట్ చేసి పెనమలూరు పోలీస్ స్టేషన్‌కు శుక్రవారం తరలించారు. అరెస్ట్‌లు అక్రమం అంటూ సీఐటీయు రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ బాబూరావు ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్‌లో ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా బాబూరావు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు 142 జీవో ప్రకారం రూ. 16,300ల కనీస వేతనం ఇవ్వాలని, తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్‌టీఎంఎస్ విధానం పేరుతో కార్మికులపై వేధింపులను అరికట్టాలన్నారు. బకాయిలు, యూనిఫారమ్, గ్లౌజులు, చెప్పులు సత్వరం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలపై పోరాడుతుంటే అక్రమంగా అరెస్ట్‌లు చేయడం దుర్మార్గమని ఖండించారు. సమస్య పరిష్కరించకుంటే మరిన్ని పోరాటాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎం డేవిడ్, సీఐటీయు పశ్చిమ కృష్ణా కార్యదర్శి బోయిన సత్యబాబు, సీఐటీయు పశ్చిమ కృష్ణా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్వరరావు, సీహెచ్ శ్రీనివాసరావు, పెనమలూరు మండల కార్యదర్శి ఉప్పాడ త్రిమూర్తులు, టీ నరేష్ పాల్గొన్నారు.

పర్యావరణాన్ని కలుషితం చేస్తున్న
ఆక్వా సాగును నిలిపివేయాలి
* సీపీఎం నేత రఘు డిమాండ్
పెనమలూరు, డిసెంబర్ 21: పర్యావరణాన్ని కాలుష్యమయం చేసే అక్రమ ఆక్వా సాగును నిలిపి వేయాలని కానూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజ్ దగ్గర ఆక్వా సాగుపై ఏర్పాటు చేసిన అవగాహన సభ వద్ద సీపీఎం ఆధ్వర్యాన శుక్రవారం నిరసన చేపట్టారు. అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి రఘు మాట్లాడుతూ పంట పొలాలను ప్రభుత్వ అధికారులు చవుడు భూములుగా చూపించి అక్రమ ఆక్వా సాగును ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. దీనికి ప్రభుత్వ అధికారులు అనుమతులిచ్చి ఆక్వా రైతులను ప్రోత్సహిస్తున్నారన్నారు. ఇది చాలా దుర్మర్గమని విమర్శించారు. సంవత్సరానికి రెండుసార్లు పండే పంట భూమిని సర్వనాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు తినే తిండి గింజలకు ఇబ్బంది ఎదుర్కోవలసి వస్తోందన్నారు. ప్రభుత్వం స్పందించి అక్రమ ఆక్వా సాగును నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో సీపీఎం తూర్పు జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఆర్‌సీపీ రెడ్డి, ఎం రాజేష్, ఉప్పాడ త్రిమూర్తులు, దుర్గారావు, టీ నరేష్, వి కోటేశ్వరరావు, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుండి వచ్చిన పేద రైతులు పాల్గొన్నారు.


ఆక్వా రైతులకు మరింత ప్రోత్సాహం

$
0
0

పెనమలూరు, డిసెంబర్ 21: ఆక్వా రైతులకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ సూచించారు. కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఆక్వా బిజ్ ఇండియా - 2018 సదస్సు, ప్రదర్శన, మత్స్య ఉత్సవాన్ని రాష్ట్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎస్పీ టక్కర్‌తో కలిసి శుక్రవారం ఆమె ప్రారంభించారు. మూడురోజులు నిర్వహించే ఈ కార్యక్రమంలో వైజ్ఞానిక, సాంకేతిక పరికరాలతో 120 స్టాళ్లు ఏర్పాటు చేసి జౌత్సాహిక రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఆక్వా సాగుపై ప్రభుత్వం, బ్యాంకులు అందించే వివిధ ప్రోత్సాహకాలపై ఎగ్జిబిషన్‌లో రైతులకు వివరిస్తున్నారు. ఈసందర్భంగా అనూరాధ మాట్లాడుతూ ఆక్వా ఉత్పత్తుల ద్వారా బలమైన పౌష్టికాహారం అందుతుందన్నారు. ఆక్వా సాగులో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా ఉందన్నారు. ఆక్వా రైతులకు ముఖ్యమంత్రి వేల కోట్ల సబ్సిడీలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నారన్నారు. రెండు రూపాయలకే యూనిట్ కరెంట్ అందిస్తున్నారని, ఆక్వా సాగుకు సులభమైన రిజిస్ట్రేషన్, రెన్యువల్ చేసుకునే సదుపాయం ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. ఆక్వా ఉత్పత్తులకు మద్దతు ధర అందించే దశలో ఫుడ్ ప్లాంట్ యూనిట్లను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. మత్స్య శాఖ కమిషనర్ రామ్‌నాయక్ మాట్లాడుతూ ఆక్వా బిజ్ రాష్ట్రానికే తలమానికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. మూడురోజుల సదస్సులో తొలిరోజు సమావేశాలు, వక్తల ప్రసంగాలు, చివరి రెండ్రోజుల్లో రైతుల భాగస్వామ్యంతో ఆక్వాపై శిక్షణతో కూడిన అవగాహన తరగతులు, నూతన సాంకేతిక పరికరాలపై వివరాలు అందిస్తామన్నారు. ఆక్వా సాగులో ఎలాంటి వ్యాధులు సోకకుండా రైతులకు తగిన సూచనలు కూడా అందిస్తామన్నారు. కేజ్ కల్చర్‌పై కూడా రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. సీఐఐ చైర్మన్ ఆర్వీఎస్ రుద్రరాజు మాట్లాడుతూ ఆక్వా బిజ్ ఎగ్జిబిషన్‌లో 120 స్టాళ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేశీయంగా ఆక్వా సాగుతో 45వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటే అందులో 17వేల కోట్లు ఆంధ్ర రాష్ట్రం నుంచే వస్తోందని చెప్పారు. రాష్ట్రంలో 970 కిలోమీటర్ల మేర సముద్ర తీరప్రాంతం రవాణాకు ఎంతో అనుకూలంగా ఉందన్నారు. మత్స్య ఉత్పత్తులకు దేశీయంగా, విదేశాల్లోనూ మంచి ఆదరణ లభిస్తోందని వివరించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యదర్శి గిరిజాశంకర్, జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం, రాష్ట్ర మత్య్స శాఖ, ఎంపెడా అధికారులు, ఔత్సాహిక రైతులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

నేటి నుంచి జాతీయస్థాయి
టెన్నిస్‌బాల్ క్రికెట్ టోర్నీ
* నగరానికి చేరుకున్న వివిధ రాష్ట్రాల జట్లు
విజయవాడ (ఎడ్యుకేషన్), డిసెంబర్ 21: ఆంధ్రప్రదేశ్ టెన్నిస్‌బాల్ క్రికెట్ అసోసియేషన్, గోస్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం నుండి 25వ తేదీ వరకు 29వ జాతీయస్థాయి సీనియర్ టెన్నిస్‌బాల్ క్రికెట్ పురుషుల, మహిళల చాంపియన్‌షిప్ స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో జరుగనుంది. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరుగనున్న చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు శుక్రవారానికే నగరానికి వివిధ రాష్ట్రాల జట్లు చేరుకున్నాయి. మొత్తం రెండు పిచ్‌లను సిద్ధం చేశారు. ఫ్లడ్‌లైట్ల వెలుగులో కూడా మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. టైటిల్ స్పాన్సర్‌గా గోస్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ వ్యవహరించగా కోస్పాన్సర్‌గా రోటరీక్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్‌టౌన్ వ్యవహరిస్తోంది. మ్యాచ్‌లు టెన్నిస్‌బాల్ క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం జరుగుతాయని రాష్ట్ర కార్యదర్శి ఆర్‌డీ ప్రసాద్ పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల క్రీడాకారులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లను చేశామని, శనివారం ఉదయం 10గంటలకు మ్యాచ్‌లు ప్రారంభమవుతాయని గోస్పోర్ట్స్ సీఈఓ మోహన్ తెలిపారు.

విశిష్ట ప్రక్రియ అష్టావధానం
విజయవాడ (ఎడ్యుకేషన్), డిసెంబర్ 21: తెలుగు అతి ప్రాచీన భాష అని, ఏ భాషలో లేని సరళత, స్పష్టత ఈ భాషకు ఉన్నాయని, తెలుగులో అష్టావధాన ప్రక్రియ చాలా విశిష్టమైందని డాక్టర్ వలివేటి శివరామకృష్ణమూర్తి అన్నారు. శుక్రవారం పీబీ సిద్ధార్థ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో తెలుగు వైభవం అనే అంశంపై సాహిత్య సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్యవక్తగా పాల్గొన్న శివరామకృష్ణమూర్తి మాట్లాడుతూ రామాయణం, భాగవతంలోని కొన్ని పద్యాలను శ్రావ్యంగా పాడి వినిపించారు. అందులోని ముఖ్యపాత్రల స్వభావాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం రమేష్, తెలుగు విభాగాధిపతి డాక్టర్ విజయానందరాజు, డాక్టర్ వై పూర్ణచంద్రరావు, కె మన్మథరావు, ఎం అంజయ్య, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

$
0
0

ఖాట్మాండ: నేపాల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 23మంది దుర్మరణం పాలయ్యారు. శుక్రవారం రాత్రి బొటానికల్ గార్డెన్ టూర్‌కు వెళ్లిన విద్యార్థుల బస్సు ఓ మారుమూల ప్రాంతంలో అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 23మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మరో 14మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.

జమ్మూకాశ్మీర్‌లో ఆరుగురు ఉగ్రవాదులు హతం

$
0
0

జమ్మూకాశ్మీర్: పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అవంతిపురా ఏరియాలోని ఆరాంపుర గ్రామంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారని అందిన పక్కా సమాచారం మేరకు భద్రతాబలగాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

స్తంభించిన ట్రంప్ సర్కార్

$
0
0

వాషింగ్టన్: ట్రంప్ సర్కార్ మరోసారి స్తంభించింది. ఈ విషయాన్ని ట్రంప్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. డెమోక్రాట్ల వల్లే స్తంభింపచేయవలసి వచ్చిందని అన్నారు. అమెరికా-మెక్సికో మధ్య జరగాల్సిన గోడ నిర్మాణానికి నిధులు వెచ్చించే విషయంలో ట్రంప్, డ్రెమోకాట్ల మధ్య రాజీ కుదరలేదు. ఈ ఆర్థిక కష్టాల వల్ల అసలు క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు జీతం లేకుండా ఇబ్బందులు పడాల్సివుంటుంది.

అక్బరుద్దీన్ ఓవైసీకి చికిత్స

$
0
0

హైదరాబాద్: మజ్లీస్ నాయకుడు, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి తీవ్ర కడుపునొప్పి రావటంతో కంచన్‌బాగ్‌లోని ఓవైసీ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. కుటుంబ సభ్యులు, సోదరుడు అసదుద్దీన్ ఓవైసీ, బంధువులు ఆయనను పరామర్శించి వెళ్లారు.

ఎమ్మెల్సీ పదవికి కొండా మురళి రాజీనామా

$
0
0

హైదరాబాద్: ఎమ్మెల్సీ పదవికి కొండా మురళి రాజీనామా చేశారు. ఈ మేరకు కొండా దంపతులు చైర్మన్ స్వామిగౌడ్‌ను కలిశారు. కొండా మురళి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కొండా మురళి మాట్లాడుతూ విలువలు పాటించే నాయకుడ్ని కాబట్టి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. సురేఖ మాట్లాడుతూ ఎర్రబెల్లి దయాకర్‌కు మంత్రి పదవి కోసం జూపల్లిని ఓడించారని అన్నారు.

తలసేమియాపై అవగాహన కల్పించాలి:రాష్టప్రతి

$
0
0

కరీంనగర్: తలసేమియా సమస్య అధికంగా ఉన్న దేశాల్లో మనదేశం ప్రధమ స్థానంలో ఉందని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. ఆయన కరీంనగర్‌లో ప్రతిమ వైద్య కళాశాలలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కేంద్రాన్ని రాష్టప్రతి ప్రారంభించారు. పిల్లల్లో రక్తహీనతను తగ్గించటానికి ప్రభుత్వాలు, వైద్యులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. రక్తదానంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలని అన్నారు.


ఆల్కా లంబా రాజీనామా!

$
0
0

న్యూఢిల్లీ: ఆప్ ఎమ్మెల్యే ఆల్కా లంబా తన పదవికి రాజీనామా చేశారు. సిక్కుల ఊచకోతకు సంబంధించి రాజీవ్‌గాంధీకి ఇచ్చిన భారతరత్న అవార్డును వెనక్కి తీసుకోవాలని ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ ప్రవేశపెట్టిన తీర్మానంపై దుమారం చెలరేగింది. ఈ ప్రితిపాదనను వ్యతిరేకిస్తూ ఆల్కా లంబా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. ఆప్ అధిష్టానం ఆమెను రాజీనామా చేయమని కోరటంతో లంబా తన పదవికి రాజీనామా చేశారు.

33 రకాల వస్తువులపై తగ్గిన జీఎస్టీ

$
0
0

న్యూఢిల్లీ: గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్‌ను 33 రకాల వస్తువులపై తగ్గించారు. ఈ మేరకు ఇక్కడ జరిగిన జీఎస్టీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సాధారణ ప్రజలకు అవసరమైన నిత్యావసరాలను ఈ పరిధిలోనికి తీసుకువచ్చారు. దాదాపు 33 రకాల వస్తువులను జీఎస్టీ పన్ను పరిధిని 18 నుంచి 12కు తగ్గించారు. అలాగే మరికొన్ని వస్తువులను 5శాతం పన్ను పరిధిలోకి తీసుకువచ్చారు. జీఎస్టీ మండలి సమావేశం ఇంకా కొనసాగుతుంది.

ఐరాస చీఫ్‌తో ఇమ్రాన్‌ఖాన్ సంభాషణ

$
0
0

ఇస్లామాబాద్: కాశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియా గుటెరస్‌తో మాట్లాడినట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని ఐరాస ప్రతినిధి స్టీఫెన్ డుజారక్ తెలిపారు. అయితే వారివురు మధ్య ఎలాంటి సంభాషణ చోటుచేసుకున్నది ఆయన తెలియజేయలేదు. కాశ్మీర్ సమస్యపై తాము ఎటువంటి అభిప్రాయాన్ని వెలిబుచ్చలేమని, దీనిని అబ్జర్వర్లు చూసుకుంటారని డుజారక్ తెలిపారు.

క్రిస్టియన్ మిషెల్‌ను అరెస్టు చేసిన ఈడీ

$
0
0

న్యూఢిల్లీ: అగస్టా హెలికాఫ్టర్ల ఒప్పందంలో మధ్యవర్తిగా వ్యవహరించిన క్రిస్టియన్ మిషెల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ శనివారంనాడు అదుపులోనికి తీసుకున్నారు. మిషెల్‌ను విచారించే అవకాశం కల్పించాలని ఈడీ చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక జడ్జి అరవింద్ కుమార్ అందుకు అనుమతినివ్వటంతో ఈడీ మిషెల్‌ను విచారించి అదుపులోకి తీసుకున్నారు.

లోకసభ ఎన్నికల్లో పోటీ చేస్తాం:కమల్

$
0
0

చెన్నై: రాబోయే లోకసభ ఎన్నికల్లో పోటీ చేస్తామని మక్కల్ నీధి మయ్యమ్ అధినేత, సినీ నటుడు కమల్‌హాసన్ వెల్లడించారు. ఆయన తన పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో భావసారూప్యత గల పార్టీలతో పొత్తులు పెట్టుకోనున్నట్లు తెలిపారు. కూటమిలో చేరతామా లేదా కూటమికి నాయకత్వం వహిస్తామా అనేది ఇపుడే చెప్పలేమని అన్నారు.

Viewing all 69482 articles
Browse latest View live