Are you the publisher? Claim or contact us about this channel


Embed this content in your HTML

Search

Report adult content:

click to rate:

Account: (login)

More Channels


Showcase


Channel Catalog


older | 1 | .... | 1978 | 1979 | (Page 1980) | 1981 | 1982 | .... | 2069 | newer

  0 0

  విశాఖపట్నం:ఎన్నికల తరువాతే ప్రధాని అభ్యర్థి ఎవరనేది నిర్ణయం తీసుకుంటామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన శనివారంనాడిక్కడ ఇండియాటుడే సదస్సులో మాట్లాడుతూ స్టాలిన్‌ది వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు. మోదీ విధానాలు నచ్చకే, తమ హక్కుల కోసం ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని వెల్లడించారు. రాజ్యాంగ వ్యవస్థలను వాడుకుంటూ మోదీ తమపై దాడి చేస్తున్నారని అన్నారు. ఫోన్లను సైతం ట్యాపింగ్‌కు గురిచేస్తున్నారని అన్నారు.


  0 0

  కొంతమంది న్యాయబద్దంగా పని చేస్తూ ఉంటారు.
  ఎలాంటి అవినీతికి తావులేకుండా పని చేస్తూ ఉంటారు.
  మరి కొంతమంది ఇతరులకి సహాయం చేస్తూ ఉంటారు.
  అవినీతిమయమైన ఈ సమాజంలో నీతిబద్ధంగా, న్యాయబద్ధంగా వుండటం కష్టమైన పని.
  మోచేతులతో ఇతరులని నెట్టుకుంటూ ప్రయాణం చేస్తున్న ప్రపంచంలో కాసింత దయతో బ్రతకడం కూడా కష్టమే.
  న్యాయబద్ధంగా, ధర్మంగా, దయగా వుండటం వల్ల ఏమిటీ లాభం అంటున్న వ్యక్తులు మన చుట్టూ వుంటారు.
  నిరుత్సాహపరుస్తూ ఉంటారు.
  మీ ఒక్కడి వల్ల ఏమవుతుందీ అని మనల్ని వెనక్కి లాగుతూ ఉంటారు.
  నీతిగా వుండటం వల్ల మనకు ఎలాంటి గుర్తింపూ రాకపోవచ్చు.
  అనుకున్న చోటికి బదిలీ కాకపోవచ్చు.
  కానీ తప్పదు.
  మనం అదే విధంగా ఉండాలి.
  మంచి చేస్తూనే బతకాలి.
  ఆశావహంగా వుండాలి.
  మనం గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే.
  మనం గుర్తింపు కోసం చేయడం లేదు.
  మనం మంచిదని భావించాం కాబట్టి చేస్తున్నాం.
  అంతే!
  మనం నీతిగా వుండాలని అనుకున్నాం
  కాబట్టి
  నీతిగా వుంటున్నాం.
  కాసింత దయతో వుండాలని అనుకుంటున్నాం.
  కాబట్టి
  అలా వుంటున్నాం.
  అంతే!


  0 0
 • 12/22/18--05:08: ఉత్తరం
 • ఇల్లు మారిన తరువాత పుస్తకాలని సర్దుతుంటే రెండుత్తరాలు దొరికాయి. ఒకటి మా అమ్మాయికి రాసిన ఉత్తరం. అప్పుడు మా పాప ఐదవ తరగతి చదువుతోంది. హైదరాబాద్‌లో హాస్టల్‌లో వుంది. ఆ ఉత్తరంలో నేను ఒక పేజి, మా అబ్బాయి రెండో పేజీలో రాశాడు. అప్పుడు వాడు మూడవ తరగతి చదువుతున్నాడు.
  మా పాప హాస్టల్‌లో ఉండలేకపోతున్నప్పుడు మేం రాసిన ఉత్తరం అది. అప్పటి మా పాప మానసిక స్థితి నా ఆలోచనా విధానం, మా అబ్బాయి పరిపక్వత అందులో కన్పించాయి.
  ఇక రెండవ ఉత్తరం నాకు హైదరాబాద్ నుంచి తిరుపతి బదిలీ అయిన తరువాత మా శాంతక్క రాసిన ఉత్తరం. చాలా అయిష్టంగా నేను అక్కడికి వెళ్లడం జరిగింది. మా అక్కయ్య రాసిన పద్ధతి అందరినీ సంబోధించిన పద్ధతి చాలా ముచ్చటేసింది. మా పాపకి ఉత్తరం రాసినప్పుడు ఆమెది నాలాంటి పరిస్థితే. హాస్టల్‌కి వెళ్లడం ఆమెకు ఇష్టం లేదు. ’94వ సంవత్సరంలో మా పాపకి ఉత్తరం రాశాను. ’93వ సంవత్సరంలో మా అక్కయ్య నాకు తిరుపతికి ఉత్తరం రాసింది. ఆమె చనిపోయి ఇరవై సంవత్సరాలు గడిచాయి.
  మా శాంతక్క రాసిన ఉత్తరం నన్ను ఎక్కడికో తీసుకొని వెళ్లింది. మా చిన్నప్పుడు మా అక్కయ్యతో గడిపిన రోజులు, హైదరాబాద్‌లో వున్నప్పుడు ఆమెను కలిసిన రోజులు, ఆమె ఆసుపత్రి పాలైనప్పుడు ఆమె కష్టపడిన తీరు అన్ని గుర్తుకొచ్చి మనస్సు ద్రవించిపోయింది.
  ఉత్తరాలు రాయడం దాదాపు తగ్గిపోయింది. సెల్‌ఫోన్లు వచ్చిన తరువాత మాట్లాడటం పెరిగిపోయింది. ఆత్మీయత తగ్గిపోయినట్టు అన్పిస్తుంది.
  టెలిఫోన్‌లో మాట్లాడటాన్ని, చూస్తూ మాట్లాడుకోవడం అత్యద్భుతం. కాదనలేం.
  కానీ ఉత్తరం వేరు.
  ఆలోచించి రాస్తాం.
  తరచూ చదువుకోవచ్చు.
  అప్పటి విషయాలు, వాతావరణం కళ్లకు కన్పిస్తాయి. మన ప్రకటన విధానం, భాష, ఇతరుల పట్ల మన గౌరవ ప్రపత్తులు, అభిప్రాయాలు అన్నీ అందులో కన్పిస్తాయి.
  మళ్లీ ఒక్కసారి ఉత్తరాలవైపు ప్రయాణం చేస్తే ఎంత బావుంటుంది.
  ఉత్తరం ఒక జ్ఞాపకంగా కాకుండా జ్ఞాపకాలని తవ్వే పనిముట్టుగా మారాలన్నది నా కోరిక.


  0 0

  అకంపనుడు శ్రీరాముడి వధోపాయంగా సీతాపహరణం చేయమని ఇలా చెప్పాడు రావణుడితో. ‘ఓ అసురరాజా! రామచంద్రుడి భార్యైన సీత గురించి నేనేం చెప్పగలను? రాముడి గురించి వృత్తబాహుడని, వృషాంసుడని చెప్పాను కాని సీతాదేవి విషయం చెప్పడానికి నాకు సాధ్యం కాదు. అయినా చెప్పాలి కాబట్టి చెప్తాను. ఆమె అందం లాంటి అందం ముల్లోకాలలో ఎక్కడా లేదు. ఆమె నడక ఏనుగు నడకలా ఉంటుంది. నడి వయస్సులో ఉంది. దేవతా స్ర్తిలలో కాని, గంధర్వ స్ర్తిలలో కాని, అప్సరసలలో కాని, రాక్షస స్ర్తిలలో కాని, జానకితో సమానమైన స్ర్తి లేనేలేదు. ఇక మనుష్య స్ర్తిలలో లేదని చెప్పాల్నా? ఆమెను నువ్విక్కడికి తెస్తే, ఆమె మీద ప్రేమ కల రాముడు, ప్రియురాలి ఎడబాటుతో కలిగే తాపం అనే అగ్నిలో పడి చస్తాడు’ అని అకంపనుడు చెప్పగా రావణుడు ఆ ఆలోచన బాగుందని ఆమోదించాడు. యుద్ధం లేకుండా శత్రువు చనిపోతున్నాడనే ఆలోచన రావణుడికి రుచించింది.
  అకంపనుడు చెప్పినట్లే చేస్తానని, ఉదయానే్న పోయి సీతాదేవిని తెస్తానని అంటూ, వాడిని వెళ్లమంటాడు రావణుడు. అలా చెప్పి సూర్యకాంతితో సమానమైన కంచర గాడిదలు కట్టిన తెల్లటి రథం మీద సారథితో ఒక్కడే బయల్దేరి పోయాడు. ఆకాశ మార్గంలో పోతున్న ఆ రథం ఆ సమయంలో మేఘాల మధ్యనుండే చంద్ర మండలంలాగా కనిపించింది. అలా పోయి మారీచుడి ఆశ్రమంలో దిగాడు రావణుడు. మారీచుడు ఆయనకు అర్ఘ్యపాద్యాలు ఇచ్చి, ఆసనం చూపించి, భక్ష్య భోజ్యాలిచ్చి తృప్తిపరిచాడు. ఆ తరువాత రావణుడితో ‘రాక్షస రాజా! నీకు, రాక్షసుల కందరికీ క్షేమమే కదా? ఉపద్రవం ఏదీ జరగలేదు కదా? ఇలా ఒంటరిగా, తోడు ఎవరూ లేకుండా, సరాసరి ఇక్కడికి వచ్చావంటే ఏదో గొప్ప పని పడిందని సందేహం కలుగుతున్నది’ అని అన్నాడు మారీచుడు. ఆ మాటలు విన్న రావణాసురుడు ‘తండ్రీ! రాముడనే ఒక్క మానవుడు రాక్షసులందరినీ యుద్ధ సామర్థ్యంతో వధించి జనస్థానాన్ని పాడుచేశాడు. అతడి భార్యను అపహరించాలనుకుంటున్నాను. ఈ విషయంలో నాకు నీ సహాయం కావాలి. ఆ విధంగా నేను నా పగ తీర్చుకుంటాను’ అని అంటాడు.
  రావణుడు ఈ విధంగా చెప్పగా విన్న మారీచుడు, సీతాదేవి గురించి లోపల శత్రుత్వం, బయటకి స్నేహం కలవాడెవడో, ఎప్పుడు రావణుడు చెడిపోవాలో అని ఎదురుచూస్తున్నవాడు ఇలా చెప్పాడని అంటాడు. ‘సీతను తెమ్మని చెప్పిన వాడు నీ మేలు కోరేవాడు కాదు. ఇప్పుడు ముల్లోకాలను పాలించే నీ గొప్పదనం చూసి ఓర్వలేనివాడెవడో అది భగ్నమైపోవడానికి ప్రయత్నించాడు. ప్రసిద్ధమైన విషసర్పం కోర పీకమని నీకెవడు చెప్పాడు? ఏమరుపాటుతో వాస్తవం తెలియకుండా నిద్రపోతున్న వాడిలాగా వున్న నీ తలను తన్నింది ఎవరు? రాక్షసరాజా! జగత్ప్రసిద్ధమైన గొప్ప వంశంలో పుట్టడమనే తొండం కొన, గొప్ప పరాక్రమమనే మదపు నీళ్లు, గడియమాకుల లాంటి చేతులనే దంతాలు, శత్రువులకు భయం కలిగించే రాముడనే మదపుటేనుగును, ఇప్పుడు కనురెప్పలు ఎతె్తైనా చూడడానికి ప్రయత్నం చేయవద్దు. యుద్ధ ముఖంలో నిలబడడం అనే పైకెత్తబడిన తోక కలిగి, రాక్షస సమూహాలను మృగాలలాగా సంహరించ గలిగి, గొప్ప బాణాలనే వాడి గోళ్లు కలిగి, వాడిగల కత్తులను కోరలుగా కలిగి, బలిష్టమైన నరరూపం ధరించిన రాముడనే సింహాన్ని, ఎక్కడో ఒకచోట ఎవర్నీ బాధించకుండా నిద్రిస్తుంటే, దాన్ని లేపవచ్చా? చక్కగా ఆలోచించు’ అని అంటాడు మారీచుడు.
  ఇంకా ఇలా అంటాడు మారీచుడు. ‘పాతాళంలో పడి అక్కడి నుండి మళ్లీ పైకి రాలేనట్లు రామ పాతాళంలో నువ్వు పడ్డావా మళ్లా ఊపిరితో వెలుపలికి రాలేవు. రామపాతాళం ఎలాంటిది అంటావా? మొసలి.. అది నీళ్లలో అడుగు పెట్టీ పెట్టకముందే వాతవేస్తుంది. అది దాటిపోతే భుజ వేగమనే పెద్ద బురద ఉంటుంది. దాంట్లో దిగబడితే అంతే సంగతి ఇక. అదీ దాటిపోగలిగితే, బాణపరంపరలనే అలలు మీద మీద వచ్చి పడి లోపలికి ఈడ్చుకుపోయి చంపుతాయి. ఇలాంటి యుద్ధ ప్రవాహంకల రామపాతాళంలో పడితే ఇక జీవితాశ లేదు. లంకాధిపతీ! నేను పరుషంగా చెప్పానని కోప్పడవద్దు. క్షమించు. వాస్తవంగా నీ మేలు కోరి చెప్పాను. కోపం తగ్గించుకొని లంకకు వెళ్లు. నీ భార్యలతో సంతోషంగా జీవించు. అడవిలో ఆయన భార్యతో రాముడు ఉంటాడు. ఆయన భార్యతో ఆయన లేకుండా చేశావా.. నీ భార్యలతో నువ్వు సుఖంగా ఉండవు.’
  ఇలా మారీచుడు చెప్పిన హితోక్తులు విన్న రావణుడు, అలాగే ఆయన చెప్పినట్లే చేస్తానని జవాబిచ్చి, లంకకు పోయి సంతోషంగా తన ఇంటికి చేరాడు. రాముడితో బలవద్విరోధం ఎందుకు? నేనొక్కడినే పోతే, అందర్నీ చంపిన రాముడిని తానొక్కడినే జయించగలనని నమ్మకం ఏమిటి? అని ఆలోచించి సంతుష్టుడై ఇంటికి పోయాడు రావణాసురుడు.
  (ఇప్పటికింకా రావణుడికి శూర్పణఖ ముక్కు చెవులు కోసిన సంగతి తెలియదు. ఎందుకు చెప్పలేదు? ఖరుడికి, రాముడికి యుద్ధం ఎందుకు జరిగిందని రావణాసురుడు అడగలేదు. అందరు ఋషులను చంపినట్లే రాముడిని కూడా చంపడానికి పోయి చచ్చారేమో అనుకున్నాడు. తనంతట తానుగా అకంపనుడు చెప్పలేదను.
  అసలు శూర్పణఖ రాముడి దగ్గరకు పోవాల్సిన అవసరం ఏమొచ్చిందనిరావణుడు అడుగుతాడని భావించి అకంపనుడు ఆ విషయాన్ని దాటేశాడు. అదే వచ్చి అన్ని సంగతులు చెప్పుకుంటుందిలే, మనకెందుకీ బాధ? అనుకున్నాడు.
  -సశేషం

  పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు, తెనాలి మండలం,
  గుంటూరు జిల్లా 7036558799 08644-230690


  0 0

  1.లోక్‌సభలో మెజారిటీ లేక మొదటిసారి 13 రోజులు రెండోసారి 13 నెలలకే తన ప్రభుత్వం పడిపోయినా మరొక పార్టీ మద్దతు కోసం, పదవి కోసం వాజ్‌పేయిగారు నైతికతపై రాజీ పడలేదు. నీతి, నిజాయితీ, విలువలు కల్గిన రాజకీయ నాయకుడు వాజ్‌పేయి అనడానికి నిదర్శనమిది. వాజ్‌పేయి పుట్టిన రోజు, డిసెంబర్ 25ని ఏ రోజుగా ప్రకటించారు?
  ఎ.సుపరిపాలన దినోత్సవం
  బి.నైతికత రాజకీయ దినోత్సవం
  సి.శాంతితో కూడిన పాలన దినోత్సవం
  డి.రాజకీయ చతురతా దినోత్సవం
  2.2015లో భారతీయ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అందుకొన్న అటల్ బిహారీ వాజ్‌పేయి జీవితంలో తొలిసారిగా ఏ పదవి చేపట్టారు?
  ఎ.కేంద్ర సహాయ విత్త మంత్రి
  బి.మధ్యప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి
  సి.ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి
  డి.కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రి
  3.సగర్వంగా ఐక్యరాజ్యసమితి అసెంబ్లీలో హిందీలో ఉపన్యాసమిచ్చి భారతీయ సంస్కృతిని చాటిచెప్పిన వాజ్‌పేయి పరిపూర్ణమైన సానుకూల జాతీయవాది అనడానికి తార్కాణానికి వచ్చిన పురస్కారాలేవి?
  ఎ.పద్మ విభూషణ్, భారతరత్న
  బి.లోకమాన్య తిలక్ అవార్డు, బంగ్లాదేశ్ విముక్తి యుద్ధ గౌరవం
  సి.పండిట్ గోవింద్ వల్లభ పంత్ అవార్డు
  డి.పైవన్నియు
  4.వాజ్‌పేయికి మూడు పదుల వయస్సులో పార్లమెంటులో అనర్గళంగా మాట్లాడుతూంటే ‘ఈ కుర్రోడు భవిష్యత్తులో ఏదో ఒకరోజు దేశ ప్రధాని అవుతాడు’ అని మెచ్చుకోలుగా జోస్యం చెప్పిందెవరు?
  ఎ.లాల్‌బహదూర్ శాస్ర్తీ
  బి.పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ
  సి.శ్యామాప్రసాద్ ముఖర్జీ
  డి.దీన్‌దయాళ్ ఉపాధ్యాయ
  5.1980లో వాజ్‌పేయి తొలి అధ్యక్షుడిగా బిజెపి పార్టీని స్థాపించారు. బిజెపి ఆవిర్భావం తరువాత తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో వాజ్‌పేయి ఓడినదెప్పుడు?
  ఎ.ఎప్పుడూ ఓటమి చవి చూడలేదు
  బి.1991, రాజీవ్‌గాంధీ మరణానంతరం
  సి.1983, ఇందిరాగాంధీ మరణానంతరం
  డి.1980, సంజయ్‌గాంధీ మరణానంతరం
  6.పాకిస్తాన్ కార్గిల్‌లో చొరబడి దురాక్రమణకు పాల్పడినా, కయ్యానికి కాలు దువ్వినా, ఓరిమి వహించి చివరి వరకు పాకిస్తాన్‌తో దౌత్య సంబంధాలను మెరుగుపరచాలని చూసి శాంతి సందేశాన్ని అందించిన మహనీయుడు వాజ్‌పేయి. ఏ సంఘటనలో పాకిస్తాన్ బూటకాన్ని వాజ్‌పేయి బట్టబయలు చేసి ఎండగట్టారు?
  ఎ.1999లో లాహోర్ బస్సు యాత్ర అప్పుడు
  బి.2001లో ముషారఫ్‌తో ఆగ్రా శిఖర సమావేశంలో
  సి.1994లో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి, జెనీవాలో
  డి.పైవన్నియు
  7.పూర్వ ప్రధానమంత్రి వాజ్‌పేయి నాయకత్వంలో 1998లో అబ్దుల్ కలాం ద్వారా పోఖ్రాన్ 2 అణు పరీక్షలు నిర్వహించాక వాజ్‌పేయిగారు ఏ నినాదం చేశారు?
  ఎ.ప్రపంచ దేశాల్లారా మా భారతదేశం అణ్వాయుధ దేశం, జాగ్రత్త
  బి.పాకిస్తాన్‌కి ముచ్చెమటలు కారిస్తుందిక మా భారత్
  సి.జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్
  డి.పాకిస్తాన్ నీ పిలక పీకిస్తాన్
  8.క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో నూనూగు మీసాలొచ్చిన వాజ్‌పేయి ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరక ముందు మొట్టమొదట ఏ సిద్ధాంతాన్ని కొన్నాళ్లపాటు ఆలింగనం చేసుకొని మ్రొగ్గు చూపారు?
  ఎ.సోషలిజం బి.కమ్యూనిజం
  సి.్ఫసిజం డి.మార్క్సిజం
  9.అనేక భాషలు మరియు మతాల వైవిధ్యభరితమైన భారతదేశానికి సేవ చేయడానికి పుడమి పై పుట్టిన మేటి నాయకుడు, మంచి వక్త, కవి, చతురత, రాజకీయ పరిజ్ఞానం గల ప్రతిభాశీలి, ఉన్నతమైన వ్యక్తిత్వం కల వాజ్‌పేయి ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరిన తొలి రోజుల్లో ఏ పత్రిక కోసం పని చేసేవారు?
  ఎ.స్వదేశ్ బి.పాంచజన్య, వీర్ అర్జున్
  సి.రాష్ట్ధ్రార్మ డి.పైవన్నియు
  10.శాంతిదూత, అటల్ బిహారీ వాజ్‌పేయి 16 ఆగస్టు 2018 నాడు వైకుంఠ ద్వారాన్ని చేరుకొన్నారు. 2003లో చైనాను సందర్శిస్తూ టిబెట్‌ను చైనాలో భాగంగా అటల్జీ గుర్తించేరు. వాజ్‌పేయి దౌత్యవ్యూహం ఫలితంగా, చైనా భారతదేశం యొక్క ఏ భూభాగాన్ని భారతదేశంలో భాగంగా అంగీకరించింది?
  ఎ.సిక్కిం బి.కాశ్మీర్
  సి.పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ డి.పైవన్నియు
  ================================================================
  గత వారం క్విజ్ సమాధానాలు
  1.సి 2.డి 3.డి 4.సి 5.సి 6.సి 7.డి 8.డి 9.డి 10.సి


  0 0

  మా చిన్నప్పుడు స్కూల్లో మొట్టమొదటగా ప్రార్థనగా పాడే పాట - ‘నమో హిందు మాతా! మాతా నమో జగన్మాతా’ - ఓ చరణం ఉంది- ‘గోలకొండ నీ రత్నకోశమలు - కోహినీరు నీ జెడలో పువ్వట.. ఆహాహా నీ భాగ్యమె!’ అంటూ కోరస్‌గా పాడించేవారు.
  పదహారో శతాబ్దం ఆరంభం దాకా- కులీ కుతుబ్ షాల రాజధాని గోలకొండ కోటే గానీ, అది ‘గొల్లకొండ’. అంటే గోపాలురు గోవుల్నీ, మేకల్నీ మేపుకొనే కొండగా మారింది. ఐతే, ఇది ‘గోల్’ (గుండ్రంగా) వున్న కొండ అని కొందరి వాదన. రచయితలు - చిన్నా పెద్దా చేరిన ఈ బృందం - ఉల్లాసంగా ఎక్కేస్తున్న ఈ కొండ మీదున్న కోట మాత్రం అద్భుతం! ఈ కొండ మీదే ప్రపంచంలో అత్యుత్తమం, అతి ఖరీదుగల కోహినూరు వజ్రం దొరికిందనీ, ‘హోప్’ - వజ్రం కూడా ఇక్కడిదేననీ అంటారు.
  మాతోపాటు పెద్దలు - కవి సమ్రాట్ పైడిపాటి సుబ్బరామశాస్ర్తీ గారున్నారు. ఈయనదీ బెజవాడే. బెజవాడ గొప్పదనం ఏమిటీ అంటే - కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు మాచవరం కాపురస్థులే! పైడిపాటి వారూ మాచవరంలోనే వుంటారు.
  పైలాపచ్చీసు ఆడా, మగా యిలా సాయిలా ఫాయిలా కబుర్లు చెప్పుకుంటూ - గోల్కొండని కబుర్లతో పేల్చి పారేస్తూ వుంటే - ఆయన ‘ఖస్సు’మనేవాడు. నాటకంలో పద్యాలు గొంతెత్తి పాడినట్లు ఆయన పద్యాలు కూడా వినిపించేవారు. వరంగల్ నుంచి ‘బాబూరావు’ అనే యువ కవి వచ్చాడు. వీళ్లంతా నా దృష్టిలో పిల్లలు. నేనేదో చాలా పెద్దవాణ్ణి అనేసుకుంటాను. కానీ, వాళ్లంతా మహా అయితే, రెండు మూడేళ్లు నాకు జూనియర్లు - అంతే. అలాగే చూడసాగారు నన్ను.
  బాబూరావు నాకు రైట్‌హ్యాండు అయిపోయాడు. అతనికే నేను - ముఖ్యమంత్రి ప్రభృతి హేమాహేమీలతో మేం దిగిన గ్రూపు ఫొటో కాపీ తెచ్చిస్తానంటే ముప్ఫయి రూపాయలు యిచ్చాను. ఐతే, ఫొటో గీటో ఇవ్వకుండా, ‘అంతే సంగతులు’ చేశాడనుకోండి. కానీ ‘పదండి ముందుకు, పదండి త్రోసుకు’ అని అరవడంలో ఫస్టు. శ్రీశ్రీ భక్తుడు. అతనికి ఈ విద్యార్థినులలో ఒక బంధువు వుండింది. దాంతో, అందరం కలిసిపోయాం. చివరికి రుూ వీరాజీ కూడాను. మళ్లీ ‘గ్యాంగ్ లీడర్’ అయిపోయాను - అబ్బే...!
  కవి సమ్రాట్‌కు నేను ‘కవి రాక్షసుడు’ అంటూ బిరుదు కూడా ఇచ్చాను. ఆయాసపడుతూ ఆయన కొంచెం వెనుకబడితే - ‘మన కవి రాక్షసుండు తప్పిపోయినచో మనము బాధ్యులం అవుతాం. కావున ఆగుదమా’ అని ఆగేవాళ్లం. ఈలోగా నేను పొరపాటున బాబూరావు చెయ్యి పట్టుకొని ‘దిగులు చెందకు బాబూ! మార్కులు ఈసారి వస్తాయి. చూడు, యిదుగో నీ చేతిలో ‘పాఠ్యరేఖ’ అంటూ - ‘మూన్ మవుంట్’ ఇదిగో - దీని మీద రేఖ చూడు’ అంటూ చెప్పేసరికి - మొదట ‘ఆరాధన’ చెయ్యి చాపింది.. లేడీస్ ఫస్ట్.
  ‘సార్! నా చెయ్యి చూడండి ముందు. నేనో ప్రాబ్లమ్‌లో ఇరుక్కున్నాను’ అంది. పైడిపాటి వారు వేళాకోళంగా నవ్వేరు. పెదవి విరిచారు. ఆ నవ్వు నన్ను ఇరిటేట్ చేసింది. చెయ్యి అందుకుని చెప్పడం మొదలెట్టాను. ‘సార్’ మళ్లీ నవ్వాడు.
  ‘ఆడపిల్లల కుడిచెయ్యి చూడరాదు. సాముద్రిక శాస్తవ్రేత్తకి ఆ మాత్రం తెలియదా?’ అన్నారు. నాకు మళ్లీ మండింది. ‘అది సాముద్రికుల వెర్రితనం. ‘ఖిరో’గారు రెండు చేతులూ చూడమని చెప్పారు.’ అంటూ లెక్చరివ్వబోయాను. అట్లా కొండ దిగేలోగా - కోటంతా చుట్టి వచ్చాం. నాకు అభిమానులు పెరిగారు. పెద్దాయన ‘బెజవాడలో నీ చిరునామా ఏమిటి బాబూ?’ అని అడిగారు. నవ్వేశాను. ‘నా పేరు రాసి, ‘వించిపేట’ విజయవాడ ఒకటి అని రాయండి. మర్నాడు భద్రంగా అందుతుంది మీ ‘అమ్మ’ అన్నాను. నిజం కూడా అంతే.
  దీంతో, అందరికీ నా పోస్టల్ అడ్రస్ తెలిసిపోయింది. ‘వించిపేట అన్నది జ్ఞాపకం ఉంటే చాలు’ అన్నాను. తిరుగుదలలో నేను ఒక ఇరానీ హోటల్ దగ్గర ముందనుకున్న ప్రకారమే దిగిపోయాను. అది మా షరీఫ్ చెప్పిన సంకేత స్థలం. షరీఫ్ వాళ్ల ఇంట్లో రాత్రికి మకాం.
  ‘గులాబమ్మా! కృష్ణమూర్తి కో షర్బత్‌లా. అమ్మా!’ అని చెల్లెల్ని కేకేశాడు. వాళ్ల మమీ జాన్ - ఖానా పఠోస్‌దూం?’ అని అడిగారు. ‘డోంట్‌వర్రీ, నీ కోసం మేం ‘సాల్నా’ చెయ్యలేదు. సలాడ్‌తో పరోటా రెడీ’ అంటూ నవ్వాడు. తేనె కూడా పెట్టారు. ‘తేనెమనసులు ఇలాగే వుంటాయి గులాబమ్మా!’ అన్నాను నేను. ‘్భరుూ జాన్ కొ అవుర్ షహద్ దేదో మా’ అన్నది మమీ జాన్ - ‘గులాబీ బాల - మా చిన్నచెల్లి రుూడుదా?’ అనడిగాను.
  షరీఫ్ అన్నాడు. - ‘కరెక్ట్’. అతను, నేను - క్యాంపస్‌లో వున్నప్పుడు - గుంటూరులో చదువుతూ వున్నా - వారం, రెండు వారాలకోమారు మా ఇంటికి వెళ్లి, అమ్మతో, వారి యోగక్షేమాలు మాట్లాడి - నాకు ‘కార్డు’ మీద వివరంగా రాసి పోస్ట్ చేస్తూండేవాడు. మా యిద్దరి ‘టేస్ట్’లూ ఒకటే. ఫుట్‌పాత్ మీద ‘పావలా’ యిచ్చి - రీడర్స్ డైజెస్టు, ‘కోర్నెట్’ లాంటి ఇంగ్లీషు డైజెస్ట్‌లు కొని చదివేవాళ్లం. ‘పాల్‌సన్స్ కాఫీ పౌడరు’ ప్యాకెట్ కొంటే అందులో ‘ఆర్.ఎం.డి.సి.’ అనే పజిల్స్ వుండేవి. అవి పంపితే ‘జెన్‌కిన్స్’ వారి ఇంగ్లీష్ గ్రామర్ బుక్స్, డిక్షనరీలు వగైరా బహుమతులుగా వచ్చేవి - కాలేజీలో చేరాక ఇద్దరం క్రికెట్ మీద పడ్డాం. అవి ‘జిడ్డాట’ రోజులు.
  పంకజ్ రాయ్ రోజంతా బ్యాటింగ్ చేసినా - యాభై.. అలాగ, నేను ఓపెనింగ్ వెళ్లి- ప్రతీ బంతీ‘నొక్కడమే’ ధ్యేయంగా ఆడేవాణ్ని. మా షరీఫ్ స్లో ఆర్‌మ్ బౌలర్. నేలబారున ప్రాకి వచ్చేలాగ యార్కర్‌లు వేసేవాడు. అతని బంతులకి ‘పాములు’ అని పేరెట్టాం.
  షరీఫ్ ఎర్రగా, సున్నితంగా వుండి - మెల్లిగా మాటాడుతూండేవాడు. కాలేజీలో అంతా బడా బాయ్స్. డిగ్రీ ఫైనలియర్స్ వారు క్రికెట్ ఆడేవారు. జూనియర్ ఇంటర్ గాళ్లం మేం. డోర్నకల్ రోడ్ గవర్నమెంట్ గెస్ట్‌హౌస్ ప్రక్కనున్న చిన్న మైదానం మీద ఆడుకునేవాళ్లం. అందరికీ నిక్‌నేమ్స్ వుండేవి. ‘స్పూనర్’ ‘వాల్కాట్’ ‘వీక్స్’ ‘పాలీ ఉమ్రీగర్- అంటూ, ఈ కబుర్లతోనే తెల్లారిపోయింది మాకు. మర్నాడు సాలార్‌జంగ్ మ్యూజియం టిప్పు షరీఫ్‌కి అక్కడ - చిన్న బొమ్మ వచ్చి గడియారం గంటలు కొట్టే దృశ్యం ఇష్టం.. అదే స్పెషల్ ఆకర్షణ.
  ప్రపంచంలోనే - ఒకే ఒక వ్యక్తి సేకరించి, సంగ్రహించి కూర్చిన మ్యూజియమ్స్‌లో ఇది అత్యుత్తమం. 1914 నుంచీ, మొదటి సాలార్జంగ్ సేకరించిన అమూల్య దంత శిల్పకళాఖండాలకు ప్రసిద్ధి కెక్కిన ఈ అపురూప వస్తు ప్రదర్శనశాలను మూడో సాలార్‌జంగ్ - నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఎలా తీర్చిదిద్దాడో - 1951 డిసెంబర్ నుంచీ ‘పబ్లిక్’ చూసే అవకాశం ఎలా లభించిందో - అంతా చెబుతూ, షరీఫ్ ‘పనె్నండు గంటలు కావస్తోంది రా.. జల్దీ కరో’ అంటూ నన్ను పరుగులు తీయించాడు.
  రంగురంగుల బొమ్మ వచ్చి, పనె్నండు గంటలు టాంగ్‌టాంగ్ కొట్టడం, మ్యూజియంలో హైలైట్. కాకపోతే, నాడు నేను చూసిన సాలార్జంగ్ మ్యూజియమ్ పాత భవనం, తరువాత అది అధునాతన ‘నిర్మాణం’లోకి మారిపోయింది. కనుక, నాటి మ్యూజియమ్ వర్ణన ఇక్కడ అనవసరం.
  తిరుగు ప్రయాణంలో - రైలులో నిలబడటానికి కూడా చోటుండదు. బస్సెక్కిస్తానంటూ షరీఫ్ వచ్చి బస్సెక్కించాడు. హైదరాబాద్ బస్సులలో - ‘ఘోషా పార్శ్వం’ వుంటుంది. సగంలో కర్టెన్ కట్టి ఉంటుంది. రిక్షాలకయితే పరదాలుంటాయి. పైగా ఆ రిక్షాలలో - కుర్చీలోలాగా కూర్చోలేం. మఠం వేసుకుని కూర్చోవాలి. అయితే, ఈ బస్సులో పర్దా లేదు. ఆడా, మగా క్రిక్కిరిసి పోయారు. అమ్మయ్య! అదో రిలీఫ్!
  ఆ సాయంకాలం నేనూ, షరీఫ్ ట్యాంక్‌బండ్, పబ్లిక్ గార్డెన్స్ - అన్నీ తిరుగుతూ, మళ్లీ రెడ్డీ హాస్టల్, ‘రచయితల సభ - వెన్యూ’కి వచ్చేశాం. వాలంటీర్లుగా ఉన్న అమ్మాయిలు, రమాపతి, దక్షిణామూర్తి వగైరాలు ప్రాంగణంలో సామాగ్రిని తిరిగి అప్పగించేసే హడావుడిలో వున్నారు. బాబూరావు లేడు.. ‘అయ్యో! ఫొటో ఇస్తానన్నాడు’ అనుకున్నాను. నా వ్రాత ప్రతులూ అవీ మహీధరతో వెళ్లిపోయాయి. డోన్ట్‌వర్రీ. అవి క్షేమం’ అన్నారు మిత్రులు - అక్కిరాజు పోరంకీ...
  అంతలో ఆరాధన వచ్చింది. లక్ష్మీకాంతం కూడా వచ్చింది. వాళ్లకి అపురూపమయిన గ్రూప్ ఫొటో - ప్రూఫ్ ఒకటి చిక్కింది. నాడు ఫ్లాష్ కెమేరాలా? పాడా? మూడు కాళ్ల బల్ల మీద కెమేరా పెట్టి నల్లగుడ్డ కప్పుకొని తీసే ఫోటోలే! సాంబశివరావుగారు చూసి ఎన్ని కాపీలు కావాలో చెప్పాలి కనుక రెండు మూడు ప్రూఫ్‌లు (చెత్త కాపీలు) అందించాడు స్టూడియో వాడు. అందులో ఒకటి ఈ స్టూడెంట్ అమ్మాయిలు కొట్టుకొచ్చారు. వర్కింగ్ కమిటీ మెంబర్ కనుక, నాకు ఒక కాపీ పోస్ట్ చెయ్యగలవా? అని అడిగాను ఆరాధనని. అయిదారుగురు అమ్మాయిలు వున్నారు. ‘పోతుకూచి సారుకి చెప్తాం’ అన్నారు కోరస్‌గా. ‘్ఫటో కాపీ పంపించమంటాం’ అని కూడా అన్నారు.
  ఇంటర్నెట్ యుగంలో నివసిస్తున్న ఈ తరం వాళ్లకి ఇటువంటి సన్నివేశాలు వూహకి కూడా అందవు. ‘మనుషులు దూరం - మనసులు దగ్గర’ కాలం అది. లక్ష్మీకాంతం అంది - ‘మరో ప్రూఫ్ సరళ దగ్గర ఉందిలే - అది సారుకి రిటన్ చేద్దాం. ఈ ఫొటో వీరాజీగారికి ఇచ్చేద్దాం - ఒక ‘యాద్‌గార్’గా వుంటుంది’ అని.
  ఆరాధన ఎగిరి గంతేసి - ఇలా పై ఎత్తి పట్టుకుందా ప్రూఫ్ ఫోటోని. ‘లేలో నా సాబ్.. లేలో’ అంటూ.
  ఎగిరి గల్లీలో క్యాచ్ పట్టుకున్నట్లు దాన్ని అందుకున్నాను. షరీఫ్ అన్నాడు. మనం ఎప్పుడైనా ఇలా క్యాచ్ పట్టామా? కృష్ణమూర్తీ? చేపలు పట్టేవాళ్లంగా’ అంటూ నవ్వి. నవ్వుకున్నాం నిండుగా.
  అదే ఫొటో కాపీ శిథిలమైనా, పదిలంగా మధుర స్మృతుల మంజూషగా, ఏండ్ల తరబడి మిగిలింది. థాంక్స్ టు ఇంటర్నెట్ యుగం. స్కాన్ చేసి దాన్ని సిస్టమ్‌లో పడేయగలిగాను. హార్డ్‌కాపీ లేదు ఇప్పుడు. జ్ఞాపకం తీసి మన మనసులోని ఒకరి చేతబెట్టలేంగా? అట్లాగాక.. ఫొటో ఉండాలి మరి.
  1960, మే నెలలో తొమ్మిది తారీఖు నాటికి తిరిగి బెజవాడ చేరుకునేసరికి విశాలాంధ్ర పబ్లిషింగ్ హవుస్ నుంచి తెచ్చిన ఆరు - ‘తొలిమలుపు’ కాపీలు - ‘స్నేహలత’ అనే పత్రికలో రివ్యూ కాపీ రెడీగా ఇచ్చాడు తమ్ముడు. ‘ఎనిమిది రూపాయలు ఒక ఎం.ఓ., పదిహేను రూపాయలు మరొక ఎంఓ (మనీ ఆర్డర్) అందేయి అన్నయ్యా!’ అని చెప్పాడు - ‘ఓహోయ్’!
  ‘యువజన’ పత్రికకు కథ పంపమని - ఆ పత్రిక యువ సంపాదకుడు శ్రీకాంత్ నుండి లెటర్ వచ్చింది. ‘రేపు దొరికింది’ అని శీర్షిక పెట్టి. ఆ కాగితం అక్కడ పెట్టి - హైదరాబాద్ కబుర్లు అమ్మకి చెప్పడానికి వంటింట్లోకి పరిగెట్టాను...
  ‘అజ్‌నబీ మిల్తే హై బి ఛుడ్ జానేకో’ అంటూ పాడుతున్నాడు తమ్ముడు. వాడు స్టేజి మీదికి ఎక్కి కూడా పాడేవాడు పాటలు, ధైర్యంగా.
  మే నెల వడగాడ్పులు కూడా చల్లగా తగిలాయి మా ఎదకు. ‘ముందే రాయి, రాత్రికి కథ. నేను పోస్ట్‌లో పడేయడం ఎంతసేపు’ అన్నాడు.
  కథ టైటిల్ ‘రేపు దొరికింది’ అది ఇద్దరు ఆడపిల్లల మధ్య జరిగిన సన్నివేశ కల్పన. అది - ఆడపిల్ల ఉద్యోగం చేయడాన్ని ప్రోత్సహిస్తుంది. కనుక విశాలాంధ్ర పెద్దలకి ప్రోగ్రెసివ్ స్టోరీ కింద లెక్క. ఆడపిల్ల చూపు మారుతున్నదిప్పుడు క్రమేపీ...
  (ఇంకా బోలెడుంది)


  0 0

  కర్ణాటక హిందుస్థానీ సంగీతం రికార్డింగులను సేకరించి పదుగురితో పంచుకోవడం చాలా సంవత్సరాలుగా నాకు ప్రవృత్తిగా సాగుతున్నది. కొంతమంది మిత్రులు ఈ సంగతి తెలిసిన వారు కనుక నాకు రికార్డింగులు పంపుతుంటారు. ఈ మధ్యన అనుకోకుండా ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారి రికార్డింగులు బోలెడు వచ్చాయి. అవి పంపిన వారి పేరు నాకు తెలియలేదు. తెలుసుకోవాలని అడిగాను. అసలు నాకు రికార్డింగులు పంపాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది అని కూడా అడిగాను. ఆవిడగారు చాలాకాలంగా సంగీత రంగంలో నా సేవను అలాగే నా సాహిత్య సేవలను కూడా ఎరిగి ఉన్నవారట. నాకెంతో సంతోషం కలిగింది. ఆవిడ పంపిన సుదీర్ఘ సమాధానంలో మా చుట్టుపక్కల వారు తమ దగ్గర క్యాసెట్లు ఉన్నాయి. వాటిని కంప్యూటర్లోకి మార్చడానికి తగిన వాళ్లు ఎవరు దొరకడం లేదు అంటున్నారని ప్రస్తావించారు. నేను నిజానికి కొంతకాలంగా ఈ క్యాసెట్లను అంటే వాటిలోని రికార్డింగులను డిజిటైజ్ చేయడం అనే కార్యక్రమాన్ని కొంత తగ్గించాను. దశాబ్దం పైన ఆ పనిని ఒక సరదాగా కాక మరింత సీరియస్‌గానే చేశాను. రకరకాల కారణాలుగా ఈ మధ్య ఆ పని కొంత తగ్గింది. కానీ నాకు ఇప్పటివరకు అందని రకం రికార్డింగులు దొరుకుతాయి అన్న అవకాశం కనిపిస్తున్నది కనుక మళ్లీ ఒకసారి ఆ పని మొదలుపెట్టాలి అనిపించింది. ఆ మాటే ఆవిడగారితో చెప్పాను.
  అసలు ముందు ఈ క్యాసెట్లు నన్ను తరిమే పద్ధతిని గురించి చెబితే బాగుంటుంది. నేను పరిశోధనలో ఉండగానే క్యాసెట్ ప్లేయర్ కొన్నాను. అది కొన్న పద్ధతి చెబితే మీరు ఆశ్చర్యపోతారు. కూరగాయల కని బయలుదేరాను. దారిలో ఎలక్ట్రానిక్స్ దుకాణం కనిపించింది. సరదాగా అందులోకి వెళ్లి ఒక టూ ఇన్ వన్ ఎంపిక చేసుకున్నాను. ఇల్లు పక్కనే గల్లీలో ఉంటుంది కనుక ఆ పరికరాన్ని పట్టుకుపోయి తరువాత డబ్బులు తెచ్చి ఇచ్చినట్టు గుర్తుంది. యంత్రం మాత్రం వస్తే ఏమిటి లాభం? అందులో వేసి వినడానికి క్యాసెట్లు ఉండాలి కదా! ఇక సేకరణ నెమ్మదిగా మొదలైంది. అప్పట్లో ఆదాయం చాలా తక్కువగానే ఉండేది. సంగీతం రికార్డింగ్ ఉన్న క్యాసెట్లు కొనాలంటే నాకు కొంచెం అందుబాటులో లేని పద్ధతిగా ఉండేది. నాలాంటి వాళ్లు మరి ఎంతోమంది ఉన్నట్టు గుర్తించారు. కాచిగూడ చౌరస్తాలో ఇద్దరు సోదరులు కలిసి నడుపుతున్న క్యాసెట్ల అంగడి ఒకటి దొరికింది. అక్కడ వారు క్యాసెట్‌లకు నకిలీలు చేసి ఇచ్చేవారు. క్యాసెట్ ధరతో పాటు మరో పది రూపాయలు తీసుకుని ఆ నకిలీ ఇచ్చేసేవారు. చేసిన పాపం చెబితే పోతుంది అంటారు. నా సంగీత సేకరణ దొంగతనంగా మొదలైంది అన్నమాట. ఆదాయం కొంచెం పెరిగిన కొద్దీ అసలు క్యాసెట్లు కొనడం కూడా మొదలుపెట్టాను. నకిలీ పద్ధతి మానేశాను. ఇక కావలసిన రికార్డింగులను వెతుకుతూ ఊరంతా తిరగడం నేర్చుకున్నాను. అన్ని అంగళ్ల వాళ్లు నన్ను గుర్తించడం మొదలైంది. నేను కనిపించగానే నాకు నచ్చే రకం క్యాసెట్లను అడగకుండానే ఇవ్వడం మొదలైంది. ఆ రకంగా నా దగ్గర సేకరణ పెరగసాగింది. ముందు బ్రీఫ్‌కేసు నిండింది. ఆ తరువాత అట్టపెట్టెలలో నిండసాగాయి. రానురాను వాటి సంఖ్య పెరగసాగింది.
  ఒక చిన్న కప్పదాటు వేసి కథను కొంచెం ముందుకు తీసుకుపోవాలి. సంగీతప్రియ అనే సంగీతాభిమానుల వర్గంలో నేను ఒక్కడినే అయ్యాను. వాళ్లకు వెబ్సైట్ వచ్చింది. అందులో ఇలాంటి వాళ్లను కొంతమందిని ఇవ్వడం మొదలుపెట్టాము. అది జరిగేలోగా క్యాసెట్లు నన్ను తరిమే పద్ధతి చిత్రంగా మారింది. అంతకు ముందు అందరికీ అందుబాటులో లేని రికార్డింగులను సంపాదించాలి. వాటిని డిజిటైజ్ చేయాలి. అప్పుడు వాటిని నెట్ ద్వారా అందరితో పంచుకోవాలి. సంగీతప్రియకు ముందు ఈ కార్యక్రమం మరొక పద్ధతిలో జరిగేది. దాని గురించి అంతగా ప్రచారం కూడా జరిగేది కాదు. కానీ సంగీతప్రియ రావడంతో పరిస్థితి బాగా మారింది. మిత్రులు వేణుగాన విద్వాంసులు ఎం.ఎస్.శ్రీనివాసన్ గారి క్యాసెట్ల కలెక్షన్ వాళ్లింట్లో భద్రంగా ఉందని తెలుసు. సారధి గారిని అడిగి ఆ క్యాసెట్లు కొద్దికొద్దిగా తేవడం మొదలుపెట్టాను. హాయ్ రా నిజంగా మంచి కచేరీలను రికార్డు చేసి ఉంచారు. ఇక నేను కూడా అంతకు ముందు రేడియో నుంచి రికార్డ్ చేసిన క్యాసెట్లు చాలా నా దగ్గర ఉండేవి. సంగీతప్రియ బృందానికి ఈ రకమైన రికార్డింగులు ఇవ్వడంతో ప్రపంచంతో సంగీతం పంచుకోవడం అనే కార్యక్రమం మొదలైంది. చాలా అరుదైన కచేరీలను సంగీతాభిమానులకు ఇవ్వగలిగే అవకాశం నాకు కలిగింది. వాక్యం వెనుక చాలా తతంగం ఉంది. అది కొంత లోకాభిరామంలో ఇంతకు ముందే ప్రస్తావించాను కూడా. కనుక ఇక్కడ మళ్లీ చెప్పను. ఇక్కడ కథ క్యాసెట్లు పోగు చేయడం గురించి.
  కమర్షియల్‌గా కంపెనీల వారు విడుదల చేసే కచేరీలను సంగీత ప్రియలో పంచుకునే పద్ధతి లేదు. అవి జరిగిన కచేరీలో రికార్డింగులు అయి ఉండాలి. కనీసం రేడియో నుంచి చేసిన రికార్డింగులు అయినా అయి ఉండాలి. నా దగ్గర కొంతకాలానికి క్యాసెట్ల సంఖ్య అడుగంటింది. ఈలోగా కొన్ని విచిత్రాలు జరగడం మొదలైంది.
  బెంగుళూరులో రాజాంగ శివకుమార్ గారని ఒక పెద్దమనుషులు ఉన్నారు. ఆయన తీవ్రమైన సంగీతాభిమాని. కొన్ని సంవత్సరాలుగా ఆ నగరంలో జరుగుతున్న కచేరీలకు వెళ్లి వాటిని రికార్డ్ చేస్తూ నా దగ్గర ఉన్న సంగీతంలో ఉన్నారు. కమర్షియల్ క్యాసెట్లు కూడా చాలా కొన్నారు. మొత్తానికి పెద్ద భాండాగారం చేరింది. కానీ కొన్ని కారణాలుగా ఆయన ఆ క్యాసెట్లను వదిలించుకోవలసిన పరిస్థితి వచ్చినట్లు ఉంది. కనీసం అవి పదిమందికి పనికి రావాలన్న ఆలోచన అయినా వచ్చి ఉండాలి. శివకుమార్ గారు నాకు మెయిల్ పంపించారు. ఆ తర్వాత మాట్లాడుకున్నాము. నేను ఈ క్యాసెట్లను ఏ రకంగానూ వాడలేక పోతున్నాను. నీ వంటి వారికి ఇస్తే వాటిలోని కచేరీలు పది మంది వినే వీలు కలుగుతుంది అన్నారు. నా ఆనందం ఆకాశాన్ని అందుకున్నది. కానీ క్యాసెట్లు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు రావాలి. ఆ కార్యక్రమంలో నాకు సహాయం చేసిన వారి అందరి పేర్లు చెప్పలేను కానీ శివరాంప్రసాద్ గారిని చెప్పకుండా ఉంటే తప్పు అవుతుంది. మొత్తానికి మూడు పెట్టెల నిండా క్యాసెట్లు మా ఇంటికి చేరుకున్నాయి. వాటి సంఖ్య సుమారు 600 వరకు ఉంది. నాకు చేతినిండా పని. కంపెనీల వారి కచేరీలను కేవలం వినడానికి పక్కన పెట్టుకున్నాను. నిజానికి ఈ మధ్యన సుమారు 200పైగా క్యాసెట్లను ఒక సాంస్కృతిక సంస్థ వారికి ఇచ్చాను. నా దగ్గర ఇంకా ఎన్నో క్యాసెట్లు ఉన్నాయి.
  అయితే అసలు కచేరీలను డిజిటైజ్ చేసి పాటలను విడదీసి రాగాలు తాళాలు గుర్తించి, వాటిని సంగీతప్రియలో అప్లోడ్ చేసి పంచుకోవడం ముమ్మరంగా మొదలైంది. నిజానికి ఈలోగానే మద్రాసులో ఉన్న మరొక అన్నగారు నాకు కన్వర్షన్ శ్రమ లేకుండానే డిజిటల్ రూపంలో ఉన్న రికార్డింగులు వందల కొద్దీ కచేరీలు ఇచ్చారు. మొత్తానికి నేను సంగీతప్రియలో ఇచ్చే కచేరీల నాణ్యత బాగా పెరిగింది. దీన్ని చాలామంది గుర్తించసాగారు. అందులో కొందరు తమ వద్ద ఉన్న రికార్డింగులను నాకు పంపే ప్రయత్నం కూడా చేశారు. బాంబే నగరం నుంచి ఒక మిత్రుడు పంపించిన రికార్డింగులు నిజంగా గొప్పవిగా ఉన్నాయి. ఆ నగరంలో సంగీత సభల వారు నిర్వహించే కచేరీలను సభ్యులకు కొంత ధరకు క్యాసెట్లలో అందజేసే పద్ధతి ఒకటి ఉన్నట్టుంది. కనుక నాకు మంచి రికార్డింగులు పంపగలిగారు. అక్కడి నుండి మరొక ఆవిడ కూడా నాకు మంచి రికార్డింగులు పంపారు. మొత్తానికి మా ఇల్లు క్యాసెట్లు లైబ్రరీగా మారిపోయింది.
  తమిళనాడు, కర్ణాటక నుంచి క్యాసెట్లు, రికార్డింగులు సంపాదించగలిగాను. నిజానికి విదేశాలలో ఉన్న వారు కూడా కొంతమంది నాకు రికార్డింగులు ఇచ్చే ప్రస్తావన వచ్చింది. కానీ ఆ ప్రయత్నాలు ఫలించినట్టు గుర్తులేదు. ఒక్క మాట చెప్పాలి. చుట్టుపక్కల ఉన్న వారు మాత్రం ఎవరూ నాకు సంగీతం ఇచ్చే పద్ధతి కనిపించలేదు. చాలామందిని అడిగాను. వారి వద్ద ఉన్న సంగీతం తీసుకుని నేను లాభపడి పోతానేమో అన్నట్టు మాట్లాడారు. ఇందులో నాకు సమయం, ద్రవ్యం ఖర్చు అయ్యాయి కానీ లాభం అన్నది ఏ రకంగానూ అందలేదు. నాకు సంగీతం మీద వల్లమాలిన అభిమానం ఉంది. ఒక కొత్త కచేరీ వినడంలో ఉన్న ఆనందం కోట్ల కన్నా ఎక్కువగా కనిపిస్తుంది. మంచి కచేరీలను మరింత మందికి వినిపించగలిగారు అన్న ఆనందం అంతకన్నా గొప్పదిగా కనిపించింది. అంతే తప్ప ఈ కార్యక్రమాన్ని వ్యాపార పరంగా మాత్రం ఎప్పుడూ చూడలేదు.
  ఒక్క కొమాండూరి శేషాద్రిగారి కుటుంబాన్ని గురించి మాత్రం విడిగా చెప్పుకోవాలి. వాళ్లు ఇంట్లో ఉన్న క్యాసెట్లు మొత్తం నాకు తెచ్చి ఇచ్చారు. వాటిలో చాలా మటుకు శేషాద్రి గారి గాత్రం, వయొలిన్, వయోలా రికార్డింగ్‌లలు ఉన్నాయి. ఆయన తన అబ్బాయిలతో కలిసి వాయించిన కచేరీలు కూడా ఉన్నాయి. వాటిని కూడా చాలా మటుకు డిజిటైజ్ చేసి ఇచ్చాను. కొన్నింటిని నెట్‌లో పంచుకున్నాను. శేషాద్రిగారు నాకు మరొక రెండు రకాలుగా సంగీతాన్ని ఇప్పించారు. విజయవాడలోని మిత్రులు ఒకాయన కలకాలంగా దాచుకున్న క్యాసెట్లను కన్వర్ట్ చేసి సీడీల రూపంలో ఇస్తున్నట్టు తెలుసుకొని శేషాద్రిగారు సి డిల సెట్లను నాకు ఇప్పించారు. నా దగ్గర ఉన్న సంగీతంలో వైవిధ్యం మరింత పెరిగింది. బెంగళూరులోని ఒక మిత్రుడు, మద్రాస్‌లోని మరొక మిత్రుడు, రాజమండ్రిలోని ఇంకొక మిత్రుడు అందరూ కూడా ఏదో ఒక రకంగా నాకు సంగీతాన్ని దానం చేశారు. మరొక యువమిత్రుడు వద్దంటున్నా సరే దగ్గరున్న కమర్షియల్ కచేరీల క్యాసెట్లు మొత్తం తెచ్చి నా తల మీద గుమ్మరించాడు. అవి నేను వినడానికి మాత్రమే పనికి వచ్చాయి. పదుగురితో వాటిని పంచుకునే పద్ధతి లేదు. నా సంగీత సేకరణ గురించి చాలామందికి తెలిసినట్లు ఉంది. సికిందరాబాద్‌లో ఉంటున్న ఒక తమిళ మిత్రుడు అలా రికార్డింగులు క్యాసెట్లు ఇచ్చాడు.
  ముందే చెప్పినట్టు నా దగ్గర ఇంకా బోలెడు క్యాసెట్లు మిగిలి ఉన్నాయి కానీ, వాటిని పట్టించుకుని డిజిటైజ్ చేసే కార్యక్రమం సరిగ్గా ముందుకు సాగడం లేదు. ఈలోగా నిజానికి రెండు చోట్ల నుంచి నాకు క్యాసెట్లు వచ్చాయి. కానీ వారు నాకు క్యాసెట్లు ఇచ్చి డిజిటైజ్ చేయించిన తీరులో కొత్త అర్థం నాకు తోచింది. వాళ్ల దగ్గర అరుదైన పాత కాలపు రికార్డింగులు కూడా ఉన్నాయని నాకు తెలుసు. కానీ వాళ్లు అవి నాకు ఇవ్వలేదు. తాము డిజిటైజ్ చేయించాలి అనుకున్న కొన్నింటిని మాత్రమే ఇచ్చారు. అయినా పర్వాలేదు నాకు మంచి సంగీతం దొరికింది. కనుక నేను చేయవలసింది చేశాను.
  చివరగా ఒక మాట. ఈ నాలుగు ముక్కలు చదివిన వాళ్లు కొంతమంది దగ్గర రేడియో రికార్డింగులు లేదా కచేరి రికార్డింగులు ఉంటే ఉండవచ్చు. వాటిని నాకు ఇవ్వాలి అని అభిప్రాయం వారికి కలగవచ్చు. కానీ నాకు ఇప్పుడు మరింత సంగీతం పోగుచేసి డిజిటైజ్ చేసే వెసులుబాటు లేదు. ఇంట్లో ఇప్పటికే చేరుకున్న సంగీత భాండాగారాన్ని జాగ్రత్త చేయాలన్న ఆలోచన నా మెదడును కలత పెడుతున్నది. ఎందరో అభిమానంగా నాకు ఇచ్చిన ఈ సంగీత సేకరణను నేను ఏదో ఒక పద్ధతిలో కాపాడాలి. ఆ పని నేను చేయగలిగితే చాలు!


  0 0

  మీ సంపద బ్లూ ప్రింట్ ఎలా ఉందో మీరు చూసుకున్నారా? అదేంటి అనుకుంటున్నారా?
  ఇంటిని నిర్మించాలనుకున్నప్పుడు ముందుగా ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకుంటాం. అదొక్కటే కాదు. ఒక పని ప్రారంభించేందుకు, ఒక పరిశ్రమ ప్రారంభించేందుకైనా ముందుగా ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకుంటారు. గృహ నిర్మాణం కోసం బ్లూ ప్రింట్ అంటే సరే కానీ సంపదకు సంబంధించిన బ్లూ ప్రింట్ ఏమిటి? చిత్రంగా అనిపిస్తుంది కదూ? నిజమే డాక్టర్ హార్వ్ సీక్రేట్ ఆఫ్ మిలియనీర్ మైండ్ పుస్తకంలో సంపద బ్లూ ప్రింట్ గురించి వివరించినప్పుడు ఇలానే అనిపించింది. ఐతే సామాన్యులకు ఇది చిత్రంగా అనిపించవచ్చు. కానీ సంపన్నులు మాత్రం సరైన బ్లూ ప్రింట్ ద్వారానే తాను అనుకున్న స్థాయికి, కోరుకున్న స్థాయికి ఈ బ్లూ ప్రింట్ ద్వారా చేరుకుంటారు.
  సంపదకు సంబంధించి మన సాధించే విజయాలకు సంబంధించి మన ఆలోచనలు, మన లక్ష్యాలు, డబ్బుకు సంబంధించి మన ఆలోచనల రూపమే ఈ బ్లూ ప్రింట్.
  పేదలు, సంపన్నులు, విజేతలు, పరాజితులు అనే తేడా లేదు. అందరికీ అంతర్లీనంగా ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది. దానికి తగ్గట్టే వారి జీవిత గమనం సాగుతుంది. దానికి తగ్గట్టే ఫలితాలు ఉంటాయి. నేను ఐఎఎస్‌ను కావాలి అని నిరంతరం మనసులో అనుకుంటూ తాను మాత్రం రోజూ సినిమాలు, క్రికెట్ చుట్టూ తిరిగితే ఐఎఎస్ కావడం మాట దేవుడెరుగు పదో తరగతి గట్టెక్కడమే కష్టం అవుతుంది. లక్ష్యాన్ని నిర్ణయించుకోవడమే కాదు దాన్ని చేరుకోవడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించే వారికే లక్ష్యం చేరువ అవుతుంది.
  * * *
  సంపన్నులు, పేదలు కాదు. ప్రతి ఒక్కరికీ సంపదకు సంబంధించిన బ్లూ ప్రింట్ ఉంటుంది. ఐతే అది మనసులో నిక్షిప్తమై ఉంటుంది. బయటకు కనిపించక పోవచ్చు. మన ఆలోచనలు, మన నిర్ణయాలు, మన విజయాలు అన్నీ ఈ బ్లూ ప్రింట్‌కు అనుగుణంగానే జరుగుతుంటాయి. సంపన్నుడు, పేదవాడు ముందు ఆలోచనల నుంచే పుడతాడు. ఆలోచనలను ఆచరణలో పెట్టినప్పుడు ఫలితమే పేదరికం, సంపద. ఈ రెండు కూడా ఆలోచనల నుంచే పుడతాయి. పేద ఆలోచన నుంచి పేదరికం పుడుతుంది. సంపన్నమైన ఆలోచన నుంచి సంపద పుడుతుంది.
  ఇటీవల సామాజిక మాధ్యమంలో కొందరి జీవితాలు ఇంతే అంటూ ఒకతను నిరాశాపూరితంగా తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఆ స్థితి నుంచి బయటకు వచ్చి పాజిటివ్ దృక్ఫథంతో ఆలోచించి ముందడుగు వేస్తే పేదరికాని దూరం కావచ్చునని, అలా బయటకు వచ్చిన వారి గురించి మరో వ్యక్తి వివరిస్తుంటే పూర్తిగా నిరాశలో మునిగిపోయిన ఆ వ్యక్తి మాత్రం పాజిటివ్‌గా ఎవరేం చెప్పినా దానికి నిరాశాపూరితంగానే స్పందించ సాగాడు. అంబానీ లాంటి వారు సామాన్య ఉద్యోగిగానే జీవితాన్ని ప్రారంభించి, వ్యాపార సామ్రాజ్యాన్ని ఏ విధంగా స్థాపించారో వివరిస్తే, అతను కొందరికి లిఫ్ట్ ఇచ్చే వారుంటారు. అలాంటి వారు ఎదుగుతారు. కానీ మా లాంటి వారికి అంటూ అదే విధంగా పేద ఆలోచనలను బయటపెడుతూనే ఉన్నారు. మనసు నిండా పేదరికం, నెగిటివ్ ఆలోచనలు నింపుకున్న ఇలాంటి వారు మారడం అంత సులభం కాదు. ఐతే అసాధ్యం కాదు. ఈ జీవితం ఇంతే అని నిరాశను నింపుకున్న వారి జీవితాలు నిజంగా పేదరికంలోనే సమస్యల్లోనే ముగుస్తాయి.
  మన మనసులో రూపుదిద్దుకునే బ్లూ ప్రింట్ వెనుక మన జీవిత చరిత్ర ఉంటుంది. తల్లిదండ్రుల మాటలు, వారి ప్రవర్తన, కుటుంబం, బంధువులు, చిన్నప్పటి నుంచి మన స్నేహితులు, మనకు తెలిసిన వారు అంటే మన జీవితంపై ప్రభావం చూపించే అందరి ప్రభావం మన బ్లూ ప్రింట్‌పై ఉంటుంది.
  ‘డబ్బు పాపిష్టిది, ధనవంతులు పాపాత్ములు, తప్పుడు పనులు చేస్తేనే సంపద చేకూరుతుంది. ఎంత సంపద ఉంటే అంతే తప్పులు చేసినట్టు, గుణ వంతున్ని కాబట్టి నా వద్ద డబ్బు లేదు. విలువలకు పాతర వేస్తే నేనూ సంపన్నుడిని అయ్యే వాడిని ’ అనే ఇలాంటి మాటల ప్రభావం బాల్యం నుంచి మనపై బలంగా ఉంటుంది. పేదరికంలో ఉండిపోవడానికి మన అసమర్థతే కారణం అని అంగీకరించడానికి మన మనసు ఒప్పుకోదు. పైగా మనం చాలా నిజాయితీ పరులం కాబట్టే పేదరికంలో ఉండిపోయామని చాలా మంది అనుకుంటారు. ఏ ప్రాంతం, ఏ కుటుంబం, ఎక్కడ పుట్టాలి అనేది మన చేతిలో లేకపోవచ్చు. కానీ వీటికి అతీతంగా మన కృషితో మనం ఎదగవచ్చు అనే ఆలోచన మనలో లేకపోతే అది ముమ్మాటికీ మనదే తప్పు.
  బాల్యం నుంచి సంపద గురించి ఇలాంటి తప్పుడు అవగాహన వల్ల సంపదపై వ్యతిరకేక బావం మనలో ఏర్పడుతుంది. మన ఆలోచనలు, మన పనితీరు కూడా దీనికి తగ్గట్టే ఉంటుంది. ఫలితాలు కూడా దీనికి తగ్గట్టుగానే వస్తుంది.
  సంపద చెడ్డది అనే అభిప్రాయం తప్పు. సంపన్నులంతా తప్పు చేసిన వారు కాదు. నేను కూడా సంపన్నున్ని కావాలి అనే ఆలోచన ఉంటే మన సంపద బ్లూ ప్రింట్‌ను సమీక్షించుకోవాలి. మనం వెళుతున్న దారి సరైనదే అనే అభిప్రాయం బలంగా ఉంటే అలానే కొనసాగించాలి. లేదు. నీతి తప్పకుండా సంపన్నులు కావచ్చు. మన ఆలోచనలతో సంపన్నులు కావచ్చు. సంపన్నులు కాకపోయినా కనీసం పేదరికంలో మగ్గిపోవద్దు అనుకుంటే సంపద బ్లూ ప్రింట్‌ను మార్చుకోవాలి.
  బ్లూ ప్రింట్‌ను మార్చుకున్నప్పుడు సంపాదించే మార్గాలు కనిపిస్తాయి. చిన్న ఉద్యోగంలో ఉన్నామా? చిన్న ఉద్యోగంలో ఉన్నామా అనే తేడా లేదు. మనం ఎదగాలి అనే భావన బలంగా ఎప్పుడు ఏర్పడితే అప్పుడు అవకాశాలు కనిపిస్తాయి. అన్ని పాపాలకు డబ్బే కారణం అనే భావనే తప్పు పుణ్య కార్యాలకు సైతం కావలసింది డబ్బే. మన ఆలోచనలకు అనుగుణంగానే మన చర్యలు ఉంటాయి. మన చర్యలకు తగినట్టుగానే మనకు ఫలితాలు ఉంటాయి.
  వడ్డీ రేట్లు, స్టాక్ మార్కెట్, ధరల పెరుగుదల, వడ్డీ, వ్యాపారం, ఇవన్నీ పైకి కనిపించేవి. కానీ సంపద సమకూరడానికి పైకి కనిపించే వీటి కన్నా కనిపించని ఆలోచనల ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఒక మనిషి సంపన్నుడిగా ఎదిగినా, పేదవాడిగా మిగిలిపోయినా పైకి కనిపించే వాటి కన్నా కనిపించని వాటి ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. పైకి కనిపించని ఆలోచనలే కీలక పాత్ర వహిస్తాయి. జీవితంలో ఏ స్థాయిలో ఉండదలిచాం. ఎంత సంపాదించాలని అనుకుంటున్నాం. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏ విధంగా కృషి చేయాలి. అనే అంశాలతో కొత్త బ్లూ ప్రింట్ తయారు చేసుకోవాలి. మన ఆలోచనలు ఏ తీరుగా ఉన్నాయో సమీక్షించుకుని , ఏ దశలో ఏ స్థాయిలో ఉండాలనుకుంటున్నామో దానికి తగినట్టు కొత్త బ్లూ ప్రింట్ రూపొందించుకుందాం. విజయాన్ని చవి చూద్దాం.


  0 0

  జీవనది లాంటి సంగీతం ఏ ఒక్కరి సొత్తూ కాదు. అదో గంగా స్రవంతి. ఎవరెవర్ని పునీతుల్ని చేస్తుందో? ఎవరి కెరుక?
  ‘కొనియాడ తరమే నిను కోమల హృదయా’ అనే పాట వినే వుంటారు. ఎప్పుడో 5,6 దశాబ్దాల క్రితం నాటి పాట. కుమారి శ్రీరంగం గోపాలరత్నం సోదరుడు గోవిందాచారి రేడియో కోసం పాడిన క్రైస్తవ భక్తిగీతం. ‘ఖమాస్’ రాగంలోని అందచందాలన్నీ ఇందులో, మృదువుగా పలికిస్తూ గానం చేశాడు. ఈనాటికీ ఆదివారాల్లో భక్తిరంజనిలో ప్రసారమవుతోంది.
  ఏ భాషైనా, మతమైనా ఏ ప్రాంతమైనా పాట లేనిదే ప్రపంచమే లేదు. డా.సి.నారాయణరెడ్డి అన్నట్లుగా ‘ప్రపంచంలో ఏ భాషలోనైనా, ఏ మతంలోనైనా ముందు పాటే పుట్టి వుంటుంది.
  పదిమందీ కలిసి పాడే పాట, ఆ గాయకుల్లో మాత్రమే కాదు సమాజంలో స్నేహ భావాన్ని పంచుతుంది. ఒకరిపై మరొకరికి మమతానురాగాలను పెంచుతుంది. విడతీయలేని బంధాన్ని కల్పిస్తుంది. ఈ మాయ ఒక్క సంగీతంలోనే ఉంది. 1956-60 మధ్య బాలాంత్రపు రజనీకాంతరావు విజయవాడలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసే రోజుల్లో ‘్భక్తిరంజని’ కార్యక్రమంలోకి చేర్చుకుంటూ వచ్చి చేరిన వివిధ రకాలైన భక్తి కీర్తనలలో క్రైస్తవ భజన కీర్తనలు ఆ రోజుల్లో ఒక అంశంగా వుండేవి.
  విజయవాడలోని ఒక క్రైస్తవ భక్తి ప్రచార ప్రసార కేంద్రానికి డైరెక్టర్‌గా ఉండే రెవరెండ్ సాల్మన్‌రాజు తమ సంస్థ కోసం చేసిన కొన్ని కార్యక్రమాలలో కొన్ని పాటలు విజయవాడ రేడియోలో ప్రసారమయ్యే ‘్భక్తిరంజని’ కోసం ఇచ్చిన సందర్భంలో రికార్డైన పాటల్లో ఇదొకటి. చంద్రకాంత కొట్నీస్ అనే మధురమైన గాయని కొన్ని మరవలేని క్రైస్తవ భక్తి గీతాలు పాడింది. ఎంతో మధురమైన కంఠం ఆమెది.
  ఈ రోజుకీ ఆ పాటలు విజయవాడ రేడియో కేంద్రం నుంచి ప్రసారమవుతూనే ఉన్నాయి. అప్పట్లో సాల్మన్ రాజు రాసిన పాటలు గ్రామఫోన్ రికార్డులుగా కూడా విడుదలయ్యాయి.
  ఆ రోజుల్లో సినీ నేపథ్య గాయకుడుగా కొన్ని పాటలు పాడిన జి.ఆనంద్ ‘నడిపించు నా నావ నడిసంద్రమున దేవా’ అనే పాటతో మరింత ప్రసిద్ధుడయ్యాడు.
  సినీ నేపథ్య గాయకుడుగా అప్పుడే సినీ రంగంలో అడుగుపెట్టిన కొత్తల్లో ‘దేవునికి స్తోత్రము పరిశుద్ధుడగు మా దేవునికి స్తోత్రము’ పాట ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యానికి మంచి గుర్తింపు తెచ్చింది. బాలు గొంతు ఎంతో మృదువుగా వుండేది.
  హెచ్‌ఎంవి ఆర్కెస్ట్రాతో ఎ.పి.కోమల, జిక్కి వంటి గాయనీ మణుల క్రైస్తవ భక్తిగీతాలు, ఊరూ వాడ మారుమ్రోగేవి. కృష్ణన్ కోయిల్ వేంకటాచలం మహదేవన్ అసలు పేరై, ఆ తర్వాత ప్రసిద్ధుడైన ప్రఖ్యాత సినీ సంగీత దర్శకుడు కె.వి.మహదేవన్, కోమల కలిసి కొన్ని పాటలు పాడారు. ‘సంతోషించుడి అందరు కలిసీ’ అనే పాట ఎంతో ప్రసిద్ధం.
  ఎం.ఎస్.విశ్వనాథన్ దగ్గర ఎకార్డియన్ వాయించే టి.ఎ. కల్యాణం హెచ్‌ఎంవి కోసం ఒకప్పుడు కొన్ని క్రైస్తవ భక్తి గీతాలు కూర్పు చేసి జిక్కి, ఎ.పి.కోమలచే పాడించిన పాటల సంఖ్య ఎక్కువే. కోమల, ఘంటసాలతో సినిమాలకు పాడిన పాటలన్నీ ప్రసిద్ధమైనవే. ఆమెకు ఇప్పుడు 85 ఏళ్లు.
  ఆనాడు బ్రిటీష్ పరిపాలనలోని దక్షిణ భారతానికంతకూ అవిభక్త మద్రాసు రాష్ట్రానికి రాజధానియైన మద్రాసు ఒకటే 1938 జూన్ 16న ఏకైక రేడియో కేంద్రంగా ప్రారంభమయ్యింది.
  1939లో తిరుచ్చిరాపల్లి కేంద్రం ఆవిర్భవించింది. కేవలం తమిళంలోనే ఈ కేంద్రంలో నడిచేవి.
  కానీ ఒక్క మద్రాసు కేంద్రంలో మాత్రం తమిళం, తెలుగు, కన్నడం, మలయాళ భాషల్లో, అన్ని ప్రాంతాల సంస్కృతులూ ప్రతిబింబించేలా కార్యక్రమలుండేవి. ఆ రోజుల్లో ఆ కేంద్రాలు నిర్వహించిన డైరెక్టర్లందరూ, వ్యక్తిగత సామర్థ్యంలో, విశిష్ట చాతుర్యంలో, వివిధ విషయ పరిజ్ఞానంలో ఎంతో విలక్షణమైన వ్యక్తులుగా వుండేవారని రజనీకాంతరావు చెబుతూండేవారు.
  మద్రాసు కేంద్ర డైరెక్టర్లలో మొట్టమొదటి ఆయన పేరు విక్టర్ పరంజ్యోతి. ఆయన మద్రాసులోని సెయింట్ ఆండ్రూస్ చర్చిలో క్వైర్ లీడర్‌గా ఆ గాయక బృందానికి నాయకుడు.
  1938 జూన్‌లో మద్రాసు కేంఅదం మొదటి డైరెక్టర్ ఆయనే. క్వైర్ లీడర్‌గా, పాశ్చాత్య సంగీత ప్రయోక్తగా ప్రొడ్యూసర్ ఎమిరటస్ రాష్టప్రతి గౌరవాన్ని అందుకున్న ‘హెండెల్ మాన్యూల్’ ఈ పరంజ్యోతికి శిష్య వర్గంలో ప్రధానుడు.
  1940, 60 మధ్యకాలంలో వీరు కంపోజ్ చేసిన ట్యూన్‌లే ప్రసిద్ధమై గ్రామఫోన్ రికార్డులుగా విడుదలయ్యాయి.
  విజయవాడ రేడియో కేంద్రానికి ఎప్పుడూ తలమానికంగా నిలిచిన కార్యక్రమాల్లో ప్రధానమైన కార్యక్రమం ‘్భక్తిరంజని’లో క్రైస్తవ భక్తి గీతాలకు ఆదరణ ఎక్కువ.
  శరణాగతి ప్రధానంగా వుండే క్రైస్తవ భక్తి గీతాలలోని సాహిత్యానికి కనిపించే మొదటి లక్షణం ఆర్తి. సరళమైన భాషలో తేలికైన మాటలతో హృదయానికి చేర్చే భావభరితమైన పాటల రచయితలెందరో వున్నారు.
  నేను విజయవాడలో రేడియో కేంద్రానికి సమీపంలో కాపురముండే రోజుల్లో పొద్దు పోయే వరకూ క్రైస్తవ మత సభలెన్నో జరుగుతూండేవి. ఆ రోజుల్లో (1970-75 ప్రాంతాల్లో) మనసు రంజిల్లేలా పాడిన గాయకులలో నేను విన్న గొంతు జాన్ బిల్‌మోరియా. అప్పుడతని వయస్సు 25-30 మధ్య. ఆయన సంగీత నేపథ్యం నాకు తెలియదు. కానీ ఎంతో ఆసక్తిగా వినేవాణ్ణి. కారణం, ఆయన గొంతులో సహజంగా వుండే శ్రుతి మాధుర్యం, అవసరమైనంత వరకే పలికించగల గమక సౌందర్యం, వింటున్నప్పుడు కలిగే భావ పరిణతితో కూడిన నాదం. సంగీతం బాగా నేర్చుకోకపోయినా అలవాటవ్వగల ప్రజ్ఞ. లబ్దప్రతిష్టులైన చాలామంది గాయనీ గాయకులకు ఆయన ఓ ఆదర్శ గాయకుడనుకునేవారు.
  ఏ పాటకైనా ఒక్కొక్క భావం వ్యక్తం కావటానికి తగిన మాటలుండాలి. అలాగే ఒక్కో సాహిత్యానికి ఒక్కొక్క బాణీయే నప్పుతుంది. సంగీత సాహిత్య స్రవంతులు ఒకదానితో మరొకటి కలిసిపోయి, పది కాలాలపాటు, పది మంది నోళ్లలో పడి బ్రతికే ఈ పాటలు ఎప్పుడూ చిరంజీవులే.
  పున్నమ్మ తోటలో విజయవాడ రేడియో కేంద్రం నూతన భవనం ప్రారంభించిన తొలి రోజుల్లో క్రిస్మస్ కోసం నేను కంపోజ్ చేసిన మొదటి సంగీత రూపకం ఆంధ్రా లయోలా కళాశాలలో పని చేసిన డా.శనగన నరసింహస్వామి రాశారు. ‘యువవాణి’లో ప్రసారమైంది.
  తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పుడు ఆస్థాన గాయకుడుగా ప్రసిద్ధి చెందిన పారుపల్లి రంగనాథ్ పాడిన ‘ఎంత దయానిధివయ్యా’ ‘తరలి పోదాం రండి’ ‘ఆశలు చిగురించెను గద’ వాంటి పాటలన్నీ అప్పట్లో భక్తి రంజనిలో ప్రసారమవుతూండేవి. సంగీతానికి భాష విషయంలో గానీ కులాలు, మతాల విషయంలో గానీ ఎటువంటి ప్రతిబంధకం వుండదు.
  మనుషుల్ని కలిపేదే సంగీతం. మమతల పందిరిలో కూర్చోపెట్టేదే గానం. నలుగురూ కలిసి పాడుతూ, తన్మయత్వం చెందే సంప్రదాయం క్రైస్తవ దేవాలయాల్లో అనాదిగా వస్తున్న సంప్రదాయం. హిందూ దేవాలయాల్లో వేద పఠనమే కనిపిస్తుంది.
  ఈ పాటల్లో కొన్ని సంప్రదాయ గీతాలున్నాయి. మరి కొన్ని అప్పటికప్పుడు తయారుచేసి పాడుకునేవి వున్నాయి.
  సంప్రదాయ సిద్ధమైన బాణీల్లోని పాటలు మార్చరు. యథాతథంగానే పాడతారు. ‘కనపడవదేమిరా! జగము కల్పన చేసిన గారడీడ!’ అని దేవుణ్ణే ప్రశ్నించిన కవి కోకిల జాషువా చెప్పినట్లు శుద్ధమైన మనసుతో మానవాతీతమైన వ్యక్తినో, శక్తినో పొగుడుతూ చేసే గానానికి ఎల్లలు లేవు.


  0 0
 • 12/22/18--05:36: పజిల్-705
 • అడ్డం

  1.తన రామాయణానికి విశ్వనాథ వారు పెట్టిన పేరు ‘రామాయణ...’ (5)
  5.‘స్వర్ణకమలం’లో భానుప్రియ పాత్ర పేరు, కుడి నించి ఎడమకి (3)
  6.ప్రభువు అధికార చిహ్నమైన ఉంగరము (5)
  8.వాగ్దానంతో మొదలయే సహాయం (3)
  10.మూడో అవతారం (3)
  13.మాట్లాడే ముందు ‘..., తూచి’ మాట్లాడాలి (2)
  14.పై పంచె (3)
  15.జల గమనంలో ప్రమాదం కలిగించే అల్ప ప్రాణి (3)
  16.‘సుమారు’ మూడింట రెండు వంతులు గ్రహించాలి ‘...’ (2)
  17.పేటిక (3)
  19.బుద్ధి, మతి, మనీష (3)
  21.శ్రీశ్రీ ప్రసిద్ధ రచన (5)
  23.వృద్ధుల నడకకు అవరోధం సాధారణంగా ఈ నొప్పే! (3)
  24.బలరాముడు (5)

  ఆధారాలు

  నిలువు

  1.గజేంద్రుడు (4)
  2.తోడేలు 93)
  3.తొలి ఏకకణ జీవి (3)
  4.సీతకు కాపలాగా వున్న రాక్షస స్ర్తిలలో మంచి రాక్షసి (3)
  7.‘ఊరక వచియించుట’లో శివుడున్నాడు, చూడగలిగితే (3)
  9.వృత్తాంతం (4)
  11.హడావిడి. పెద్ద ఎత్తున ఏర్పాట్లు (3)
  12.ముర జపం సరిగ్గా చేస్తే పెంపుడు పక్షుల గూడు (4)
  13.రాక (3)
  16.మిక్కిలి శోభ (3)
  18.అనం అంటూనే అనే మన్మథనామం (4)
  19.మిగిలినది (3)
  20.అవమానంతో తలక్రిందులు (3)
  22.అతిశయం (3)


  0 0

  బజాజ్ షోరూమ్ ముందు నిలబడున్నాడు భాస్కర్. అక్కడున్న రకరకాల మోడల్ల వాహనాలపై అతడి దృష్టి లేదు. డిస్‌ప్లేలో ఉంచిన ‘బ్లాక్ అండ్ రెడ్ పల్సర్’ మీదే స్థిరంగా ఉన్నాయి అతడి చూపులు. అతడు దాన్ని ఎంతో ఆసక్తిగా చూస్తున్నాడు. అది అందంగా, స్మార్ట్‌గా మనసును ఆకట్టుకునే విధంగా ఉంది. అది అతడికి ఎంతగానో నచ్చిన బండి.
  మూణ్ణెళ్ల క్రితం, ఒకరోజు అతడి క్లాస్‌మేట్ పవన్, కొత్తగా తాను కొన్న పల్సర్ బండిని కాలేజీకి తీసుకొచ్చాడు. అప్పుడే మొదటిసారిగా భాస్కర్ ఆ బండిని దగ్గనుండి చూశాడు. చూడముచ్చటగా ఉంది. నలుపూ ఎరుపూ రంగుల్లో మెరిసిపోతోంది. మిత్రులందరూ పవన్‌ను మెచ్చుకుని తమతమ అభినందనల్ని తెలిపారు. భాస్కర్ కూడా తన అభినందనల్ని తెలిపి, ఆ బండిని తానొకసారి నడుపుతానని అడిగితే కాదనకుండా వెంటనే ఇచ్చాడు పవన్. రోజు దాన్ని నడుపుతున్నప్పుడు భాస్కర్ పొందిన అనుభూతి వర్ణనాతీతం. దాన్ని నడుపుతుంటే మేఘాలలో తేలిపోతున్నట్టే అనిపించింది అతడికి. ఆ రోజు నుండి పల్సర్ బండి అంటే అతడికెంతో ఇష్టం ఏర్పడిపోయింది.
  ‘అబ్బా, ఎంత బాగుంటుంది బండి? బండి అంటే అదే! మిగతావన్నీ దాని ముందు దిగదుడుపే! కొంటే దానే్న కొనాలి. డ్రైవ్ చేస్తే దానే్న డ్రైవ్ చెయ్యాలి’. దాన్ని చూసిన ప్రతిసారీ అలా మనసులో అనుకోవటం అతడికి పరిపాటై పోయింది.
  రోజూ కాలేజీకి వెళ్తున్నప్పుడూ, వస్తున్నప్పుడూ ఆ బండిని అతడెంతో ఆశగా, ఆసక్తిగా గమనిస్తుంటాడు. ఆ షోరూమ్ ముందు నిలబడి దాన్ని కళ్ళారా చూసి వెళితేనే కానీ అతడికి తృప్తిగా అనిపించదు.
  కొంతసేపు అలా చూశాక నిట్టూరుస్తూ, నిరాశగా అక్కణ్ణించి కదిలి కాలేజీకి వెళతాడు. నిత్యం జరిగే తంతే ఇది!
  భాస్కర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బి.కాం. సెకండియర్ చదువుతున్నాడు. రోజూ అతడు కాలేజీకి ఆ దారిలోనే వెళతాడు. ఆ షోరూమ్ దగ్గరికొచ్చేసరికి అతడి కాళ్లు ఆటోమేటిగ్గా ఆగిపోతాయి. అతడి కళ్లు ఆ పల్సర్ బండి మీదే నిలిచిపోతాయి.
  మామూలుగా ఈ కాలపు యువకులు రకరకాల బండ్లను ఆసక్తిగా గమనించటం, తమకిష్టమైన బండిని డ్రైవ్ చేస్తున్నట్టుగా ఊహించుకోవటం పరిపాటే! కానీ భాస్కర్ ఆ పల్సర్ బండిని తప్ప ఇక దేని గురించీ ఆలోచించడు. దార్లో ఎక్కడైనా పల్సర్ బండి కనిపిస్తే చాలు.. అతడి కంట్లో మెరుపులు మెరుస్తాయి. బ్లాక్ అండ్ రెడ్ కలర్‌లో, జెంటిల్ హ్యాండిల్స్‌తో, డిస్క్ బ్రేకుల్తో, మంచి ఫినిషింగ్ టచ్‌తో, తుపాకీ గుండులా దూసుకెళ్లే ఆ బండి మీద వెళ్లే వాళ్లంతా ఎంతో అదృష్టవంతులని నిట్టూరుస్తూ ఉంటాడతడు.
  అతడి నిట్టూర్పుకు అతడి కుటుంబ ఆర్థిక పరిస్థితులే ప్రధానమైన కారణం.
  భాస్కర్ వాళ్ల నాన్న, ఖాదీ కాలనీలో, రోడ్డు పక్కన ఒక అంగట్లో సెలూన్ నడుపుతున్నాడు. అంగట్లో ఆయనొక్కడే ఉదయం నుండి సాయంత్రం వరకూ షేవింగులూ, కటింగ్‌లూ చేస్తూ తీరిక లేకుండా పని చేస్తుంటాడు. సెలూన్ బాగానే నడుస్తుంది. ఆదాయమూ బాగానే వస్తుంది. కానీ పని భారమంతా ఆయనొక్కడే మోయవలసి వస్తోంది. ‘తనతోపాటు తన కొడుకూ పనిలోకొస్తే నాలుగు కాసులు వెనకేసి కూతురి పెళ్లి చెయ్యొచ్చని’ ఆయన ఆశ. అందుకే తనతోపాటు భాస్కర్‌నూ పనిలోకి రమ్మని శత పోరుతుంటాడు.
  కానీ, చదువుకోవాలనే నెపంతో భాస్కర్ డిగ్రీలో చేరిపోయి కన్నతండ్రి కోరికను నీరుగారుస్తూ, తనకున్న బండి ఆశను పెంచుకుంటూ.. అది తీరే మార్గంలేక.. సతమతమై పోతున్నాడు.
  * * *
  ఓ ఆదివారం సాయంత్రం భాస్కర్ తన మిత్రుడింటికి వెళ్లి తిరిగొస్తున్నాడు. ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా నడుచుకుంటూ వస్తున్నాడు. ఇంతలో అతడు ఊహించని సంఘటన ఒకటి అక్కడ క్షణాలలో జరిగిపోయింది.
  రోడ్డుమీద నడుచుకుంటూ వస్తున్న అతణ్ణి తప్పించబోయి, ఎదురుగా వస్తున్న టూ వీలర్‌ను ఒక ఆటో గుద్దేసింది. ఢామ్.. అన్న శబ్దం వినిపించింది. ఏం జరిగిందో గ్రహించే లోపలే ఆటో డ్రైవర్ ఆగకుండా వేగంగా వెళ్లిపోయాడు.
  భాస్కర్ తేరుకుని చూసేసరికి బండి పక్కకు పడిపోయి ఉంది. దాన్ని నడుపుతున్న వ్యక్తి కాస్త పక్కగా క్రిందపడి ఉన్నాడు. పడిపోయిన బండికేసి చూసిన భాస్కర్‌కు కళ్లు జిగేల్‌మన్నాడు. కారణం, అది అతడికెంతో ఇష్టమైన పల్సర్ బండి! పడిన వేగం దాని అద్దం పగిలిపోయింది, బండి కూడా కాస్త నొక్కుకుపోయింది.
  అది అలా నడిరోడ్డు మీద ఒక అనాథలా క్రింద పడిపోయి ఉండటాన్ని చూసి అతడు తట్టుకోలేక పోయాడు.
  గబగబా వెళ్లి దాన్ని లేపి నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కానీ అంతకన్నా ముందు తనను పట్టించుకోమన్నట్లుగా ఆ వాహనదారుడి మూలుగు వినిపించింది. భాస్కర్ అప్పుడు అతణ్ణి గమనించాడు. ఆ వ్యక్తికి యాభై ఏళ్లకు పైగానే ఉంటుంది వయస్సు. కొద్దిగా లావుగా ఉన్నాడు. బిజినెస్‌మేన్‌లా ఉన్నాడు. నొప్పితో మూలుగుతున్నాడు. కుడికాలు వాచినట్టుంది. ఫ్రాక్చర్ అయినట్టుగా కూడా అనిపిస్తోంది.
  వెళ్లి ఆయన్ను లేపే ప్రయత్నం చేశాడు భాస్కర్. కానీ అతడి ఒక్కడి వల్లే అది వీలుకాకపోయింది. ఏం చెయ్యాలా అని ఆలోచించి అటుగా వెళుతున్న ఒక ఖాళీ ఆటోని ఆపి, డ్రైవర్ సాయంతో ఆయన్ను ఆటోలో కూర్చోబెట్టి, తనకు బాగా గుర్తున్న ఒక ఆర్థో హాస్పిటల్‌కి పదమన్నాడు. తర్వాత క్రిందపడున్న బైక్‌ను లేపి నిలబెట్టాడు. సీటు దుమ్ము దులిపి దాని మీద కూర్చున్నాడు. బండిని రయ్యిన ముందుకు నడుపుతూ ఆటోవాణ్ణి తన వెనకే రమ్మన్నట్టుగా సైగ చేశాడు.
  పది నిమిషాలు ప్రయాణించి తనకు బాగా గుర్తున్న ఓ ప్రముఖ ఆర్థో హాస్పిటల్ ముందు బండిని ఆపాడు భాస్కర్. వెనకే వచ్చిన ఆటోలో నుండి ఆయన్ను మెల్లగా దించి, స్ట్రెచర్ మీద పడుకోబెట్టి ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్లాడు.
  ప్రైవేట్ ఆస్పత్రి కనుక అడ్వాన్స్‌గా ఐదు వేల రూపాయలు కట్టమన్నారు వాళ్లు. భాస్కర్ దగ్గర అంత డబ్బెక్కడిది? ఆయన ప్యాంటు జేబులో డబ్బేమైనా ఉందేమోనని వెతికాడు. చేతికి పర్సు దొరికింది. తెరిచి చూస్తే అందులో చాలానే డబ్బుంది. అందులో నుంచి ఓ ఐదు వేలు తీసుకుని మిగతాదంతా పర్సులోనే పెట్టేసి మళ్లీ దాన్ని యథాస్థానంలో ఉంచాడు. ఆ తర్వాత చకచకా అన్ని టెస్టులూ వేగంగా జరిగిపోయాయి.
  బాగా చీకటి పడిపోయింది. అప్పటికే భాస్కర్ ఆస్పత్రికొచ్చి రెండుమూడు గంటలకు పైగానే అయ్యుంటుంది.
  ‘ఇంకా తాను ఇక్కడే ఉంటే ఇంట్లో వాళ్లు తన కోసం కంగారుపడతారు. పైగా - పనీపాటా లేకుండా ఊరు తిరుగుతున్నానని నాన్నకు ఇప్పటికే తన మీద పట్టరాని కోపముంది. దాన్ని నిజం చెయ్యకూడదు’ అనుకున్నాడు భాస్కర్.
  అంతే! ఇక ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా గబగబా ఆస్పత్రి బయటకొచ్చి, టౌన్ బస్సెక్కి ఇంటికి చేరుకున్నాడు.
  * * *
  మరుసటి రోజు ఉదయం భాస్కర్ స్నానం చేసి బట్టలు మార్చుకుని.. విప్పేసిన ప్యాంటు జేబులో నుండి తన కాలేజీ ఐడి కార్డ్ కోసం చెయ్యి పెట్టినప్పుడు తగిలిందది! వేగంగా దాన్ని బయటకి తీశాడు. అది పల్సర్ బండి తాళాలు!
  ‘అరెరే! నిన్న తనున్న టెన్షన్‌లో బండి తాళాల్ని జేబులో పెట్టుకొని మర్చిపోయి వచ్చేసినట్టున్నాడు. అయ్యో, వీటి కోసం ఆయన ఎంతగా వెతికుంటాడో? ఔనూ, ఇంతకీ ఆయనకు ఇప్పుడెలా ఉందో, ఏమిటో? నిన్న ఆయన్ను తను వదిలి వచ్చేశాడు. ఏం ఇబ్బందులు పడుంటాడో? పర్లేదులే, ఈసరికే ఆయన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుని ఉంటారు. అయినా బండి తాళాలు తన దగ్గరే ఉండిపోతే ఎలా? వెంటనే వెళ్లి దాన్ని ఆయనకు తిరిగిచ్చెయ్యాలి అనుకుంటూ గబగబా తయారై, టౌన్ బస్సెక్కి, ఆస్పత్రి ఉన్న బస్టాప్‌లో దిగి, వేగంగా అడుగులు ముందుకు వేశాడు భాస్కర్.
  దూరం నుండే కనిపెట్టేశాడు తనకెంతో ఇష్టమైన పల్సర్ బండిని.
  నిన్న తను నిలబెట్టిన చోట్లోనే ఉందది. పరుగెత్తి పరుగెత్తి బాగా అలసిపోయి సేద తీరుతున్నట్టుగా నిలబడి ఉంది.
  బండి దగ్గరికెళ్లాడు. ఆప్యాయంగా దాన్ని ఓసారి చేత్తో తడిమాడు. ఏదో తెలియని ఆనందం కలిగింది భాస్కర్‌కు.
  నిన్న సాయంత్రం తను దాన్ని డ్రైవ్ చేసినా తృప్తిగా అనిపించలేదు. ఏదో యాంత్రికంగా నడిపాడు. అంతే! సందర్భం అలాంటిది మరి! ఏం చేస్తాం?... నిట్టూరుస్తూ గబగబ రిసెప్షన్ దగ్గరికెళ్లి ఆయన ఏ వార్డులో వున్నాడో కనుక్కున్నాడు.
  ఆయనున్న వార్డులోకి అడుగుపెట్టాడు. బెడ్ మీద వెల్లకిలా పడుకొని ఉన్నాడాయన. కళ్లు మూతలు పడున్నాయి. ఆయన కుడికాలికి తెల్లటి పిండికట్టు వేయబడుంది. కాలికి ఆపరేషన్ అయినట్టుంది.
  ఆయన సమీపానికి వెళ్లాడు. అలికిడికి కళ్లు తెరిచి భాస్కర్ వైపు చూశాడాయన. ఆయన ముఖంలో బేలతనం, దీనత్వం దోబూచులాడుతున్నాయి. ప్రశ్నార్థకంగా భాస్కర్ వంక చూశాడు. ఆయన తనను గుర్తుపట్టలేదని భాస్కర్‌కు అర్థమైంది.
  ‘అంకుల్, నా పేరు భాస్కర్! నిన్న హడావిడిలో మీ బైక్ తాళాల్ని మర్చిపోయి నేను తీసుకెళ్లిపోయాను’ అంటూ ప్యాంటు జేబులో నుండి బండి తాళాల్ని బయటకి తీశాడు.
  అప్పటికి గానీ తనను ఈ ఆస్పత్రిలో చేర్పించింది భాస్కరేనని గ్రహించలేక పోయాడాయన.
  ‘ఓ.. ఆ వ్యక్తివి నువ్వేనా బాబూ? థాంక్స్! నీ సహాయాన్ని నేనెప్పటికీ మరచిపోలేను. నువ్వే కనక వెంటనే స్పందించకుండా ఉండుంటే నా గతి ఏమై ఉండేదో?’ అన్నాడు కృతజ్ఞతాపూర్వకంగా.
  ‘దానిదేముంది అంకుల్. నేను కాకపోయినా మరెవరో మీకు సహాయపడే ఉంటారు. సాటిమనిషి ప్రమాదంలో ఉన్నప్పుడు సాయపడ్డం మనిషి కనీస ధర్మం!’ అన్నాడు భాస్కర్.
  ఆ మాటలతో భాస్కర్ ముఖంలోకి అభిమానంగా చూశాడాయన. ‘బాబూ, అలా కూర్చో. నా పేరు వీరరాఘవులు. ఎలక్ట్రానిక్స్ గూడ్స్ బిజినెస్ చేస్తున్నాను...’ అంటూ తనను తాను పరిచయం చేసుకున్నాడాయన.
  ఆయన చూస్తూండగా బైక్ తాళాల్ని మంచం పక్కనున్న షెల్ఫ్‌లో పెట్టాడు భాస్కర్.
  భాస్కర్ ఏం చదువుతున్నాడూ, ఎక్కడుంటున్నాడూ మొదలైన విషయాలన్నీ అడిగి తెలుసుకున్నాడాయన.
  భాస్కర్ వచ్చి పదీ పదిహేను నిమిషాలవుతున్నా వీరరాఘవులు తాలూకూ మనుషులెవరూ అక్కడ కనిపించలేదు.
  ‘అంకుల్, ఆంటీకి మీ ఆక్సిడెంట్ విషయం తెలిపారా? ఎక్కడా కనిపించరేంటీ?’ అని అడిగాడు.
  ‘ఆంటీకి ఉదయమే ఫోన్ చేసి చెప్పాను. కానీ, మా ఆవిడ ఇక్కడికి రాలేనంత దూరంలో ఉంది!’ అన్నాడు వీరరాఘవులు.
  విషయం అర్థంకాక ఆయన ముఖంలోకి చూశాడు భాస్కర్. ‘తమ కోడలు ప్రసవ సమయం దగ్గరపడ్డంతో తన భార్య పది రోజుల క్రితమే డెట్రాయిట్ వెళ్లిందనీ, ఇంకో మూడు నెలల వరకూ ఆమె భారతదేశానికి వచ్చే అవకాశమే లేదనీ...’ వివరణ ఇచ్చాడు వీరరాఘవులు.
  ‘అయ్యో! ఇప్పుడెలా? మీ బంధువుల్లో ఇంకెవరికైనా మీ విషయం చెప్పమంటారా?’ అడిగాడు భాస్కర్.
  ‘ప్చ్! అవసరం లేదు బాబూ.. ఎవరికీ ఇబ్బంది కలిగించటం నాకిష్టం లేదు! ఆస్పత్రి వాళ్లకే కొంత డబ్బు కడితే కేర్‌టేకర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు’ నవ్వుతూ చెప్పారాయన. వౌనంగా ఉండిపోయాడు భాస్కర్.
  ఉన్నట్టుండి ఆయన, ‘బాబూ నాకొక సహాయం చేస్తావా?’ అని అడిగాడు.
  ‘చెప్పండంకుల్’ వినయంగా అడిగాడు భాస్కర్.
  ‘ప్యాంటు జేబులో నా ఏటిఎం కార్డుంది. దాన్ని పట్టుకెళ్లి కొంత డబ్బు తీసుకొస్తావా?’ అన్నాడాయన.
  డబ్బు ప్రసక్తి వచ్చేసరికి ఏమీ మాట్లాడకుండా వౌనం వహించాడు భాస్కర్.
  ఆయన తన పక్కన మడిచిపెట్టున్న ప్యాంటు జేబులో నుండి ఏటిఎం కార్డును బయటకి తీసి భాస్కర్‌కిస్తూ ‘ఈ హాస్పిటల్‌లో కార్డ్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారట. కానీ, వాళ్లకు దీని పిన్ నెంబర్ చెప్పటం నాకిష్టం లేదు’ అంటూ భాస్కర్‌ను నోట్ చేసుకొమ్మని కార్డ్ పిన్ నంబర్ చెప్పాడాయన.
  ‘హాస్పిటల్ వాళ్లను నమ్మని అంకుల్, తనను నమ్ముతున్నారు? తన మీద ఆయనకు ఎందుకంత నమ్మకం?’
  ‘ప్రస్తుతానికి ఓ యాభై వేలు దగ్గరుంటే మంచిదేమో! కానీ, అంత డబ్బు విత్‌డ్రా చేయలేమేమో? అందుకే ప్రస్తుతం ఓ ఇరవై వేలు మాత్రం పట్టుకురా బాబూ’ అన్నాడాయన.
  ఆయన వైపు పరీక్షగా చూశాడు భాస్కర్. ఆ కళ్లల్లో.. తన పట్ల సొంత మనిషి అన్న భావనా, అపారమైన నమ్మకమూ కనిపిస్తున్నాయే కానీ ఇసుమంతైనా అనుమానచ్ఛాయలేవీ కనిపించలేదు.
  దాంతో ఇంకేమీ ఆలోచించకుండా ఏటిఎం కార్డును తీసుకుని బయటకి వెళ్లబోయాడు భాస్కర్.
  ‘బాబూ బైక్ కీస్ తీసుకెళ్లు...’ గుర్తు చేశాడు వీరరాఘవులు.
  ఆ మాటతో అప్రయత్నంగా భాస్కర్ పెదాల మీద ఓ చిరునవ్వు మొలిచింది. కళ్లల్లో మెరుపూ కనిపించింది.
  చిన్నగా నవ్వుకున్నాడు వీరరాఘవులు.
  ఉత్సాహంగా బైక్ తాళాలు తీసుకుని బయటకి దారితీశాడు భాస్కర్. అతనిలోని ఉత్సాహాన్ని చూస్తూ బెడ్ మీద వెనక్కు వాలాడు వీరరాఘవులు.
  * * *
  విత్‌డ్రా చేసిన డబ్బుతో ఏటిఎం కార్డును కూడా జతకలిపి వీరరాఘవులు చేతికిచ్చాడు భాస్కర్.
  ‘్థంక్స్ బాబూ..’ అంటూ వాటిని బెడ్ కింద దాచాడు వీరరాఘవులు.
  ‘లెక్క పెట్టుకోండి అంకుల్...’ ఆశ్చర్యంగా అన్నాడు భాస్కర్.
  ‘కరెక్ట్‌గానే ఉంటుందిలే..’ అదేం పెద్ద విషయం కాదన్నట్టుగా అతని వైపు చూసి నవ్వాడాయన.
  బైక్ తాళాలు అక్కడ పెట్టేసి కాలేజీకి వెళ్లిపోయాడు భాస్కర్.
  మరుసటిరోజు కాలేజీకి వెళుతూ ఆయన్నొకసారి పలకరించి వెళదామని ఆస్పత్రికి వెళ్లాడు భాస్కర్.
  అతడు వెళ్లే సమయానికి కళ్లు మూసుకుని వెనక్కు వాలి పడుకుని ఉన్నాడాయన. జుత్తు చెదిరిపోయి ఉంది. గడ్డం బాగా పెరిగి ఉంది. కళ్లు లోతుకు పోయి ఉన్నాయి. బట్టలు నలిగిపోయి, మాసిపోయి ఉన్నాయి.
  అక్కడున్న కుర్చీలో శబ్దం కాకుండా కూర్చున్నాడు భాస్కర్.
  కానీ ఆ కాస్త అలికిడికే ఆయన కళ్లు తెరిచి భాస్కర్‌కేసి చూశాడు. చిన్నగా నవ్వుతూ ‘ఎప్పుడొచ్చావు బాబూ?’ అని అడిగాడు.
  ‘ఇప్పుడే అంకుల్! ఎలా ఉంది మీకు?’ అని ప్రశ్నించాడు భాస్కర్.
  ‘పర్వాలేదు!’ అని క్షణమాగి, ‘బాబూ... నీకు ఖాదీకాలనీ తెలుసుగా! ఆ కాలనీలోని మూడో లైన్‌లో 59వ ఇల్లే మాది. నువ్వు మా ఇంటికెళ్లి రెండు జతల బట్టలు పట్టుకొస్తావా? బెడ్‌రూమ్‌లో అల్మైరాలోనే ఉతికిన బట్టలు మడిచిపెట్టి ఉంటాయి. ఇవిగో ఇంటి తాళాలు?’ అంటూ తలగడ క్రింద పెట్టున్న ఇంటి తాళాల్ని తీసి భాస్కర్ చేతికి ఇవ్వబోయాడాయన.
  ‘అయ్యబాబోయ్, ఏమిటీయన ఉద్దేశం? ఏకంగా ఇంటి తాళాల్నే తన చేతికి ఇచ్చేస్తున్నాడు. ఒక అపరిచిత వ్యక్తిని నమ్మి ఎవరైనా ఇంటి తాళాల్ని ఇచ్చేస్తారా? తన మీద ఆయనకు ఎందుకింత గట్టి నమ్మకం? ఊహూ... తను వాటిని తీసుకుంటే తొందరపాటే అవుతుంది. అందుకని ఆయన బాగా ఆలోచించుకోవటానికీ, ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోవటానికీ కొంత సమయం ఇవ్వాలి? అనుకుని... భాస్కర్ వాటిని తీసుకునేందుకు వెనకాడాడు.
  అతని సంశయాన్ని పసిగట్టి.. ‘ఏం పర్వాలేదు తీసుకో బాబూ! నువ్వూ నాకిప్పుడు కావలసిన వాడివేగా..’ అన్నాడాయన.
  అప్పటికీ జంకుతూ.. ‘సాయంత్రం కాలేజీ నుండి వెళుతూ వచ్చి తీసుకుంటాలే అంకుల్...’ అన్నాడు భాస్కర్.
  ‘మళ్లీ ఇక్కడిదాకా ఎందుకూ అనవసరంగా? కాలేజీ నుండి అటే మా ఇంటికెళ్లి బట్టలు తీసేసుకో. రేపు ఉదయం కాలేజీకి వెళుతూ బట్టలు తెచ్చిస్తే చాలు!’ అని తమ ఇంటి తాళం చెవుల్ని బలవంతంగా అతని చేతిలో పెట్టాడు వీరరాఘవులు.
  తీసుకోక తప్పలేదు భాస్కర్‌కు. దాంతో సంతృప్తిగా నవ్వాడాయన.
  కాలేజీకి వెళ్లడానికి భాస్కర్ లేచి నిలబడగానే.. ‘బాబూ.. మా ఇంటికి ఎలా వెళతావ్? అదిగో, ఆ బైక్ తాళాల్ని తీసుకొని నీ దగ్గరే ఉంచు!’ అన్నాడాయన.
  ఆ మాటలతో భాస్కర్‌లో ఉత్సాహం ఉరకలు వేసింది. ఆనందంగా బయటకి దారితీశాడు.
  మొదటిసారి తనకిష్టమైన బైక్ మీద కాలేజీకి వెళుతుండటం అతనికెంతో హుషారునిచ్చింది.
  ఎవరూ గమనించలేదనుకొని స్టైల్‌గా తాళాల్ని ఒకసారి గాల్లోకి ఎగరేసి పట్టుకున్నాడు భాస్కర్.
  * * *
  మరుసటిరోజు వీరరాఘవులు ఇంటి నుండి ఉతికిన బట్టలతోపాటు మొబైల్ ఛార్జర్, పాటలు వినడానికి ఇయర్ ఫోన్స్ కూడా పట్టుకొచ్చాడు భాస్కర్.
  తనకు కావలసిన వస్తువుల్ని అతడు గుర్తుపెట్టుకొని తీసుకురావటం ఎంతో సంతోషాన్ని కలిగించిందాయనకు.
  * * *
  పదిరోజులు గడిచాయి. వీరరాఘవులు ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నాడు.
  ఇంటి దగ్గర ఆయన్ను వాకర్ సహాయంతో మెల్లగా నడిచే ప్రయత్నం చెయ్యమన్నాడు డాక్టర్.
  ఆస్పత్రి నుండి వస్తున్నప్పుడే వాకర్‌ను కూడా కొనుక్కొచ్చుకున్నాడు ఆయన. భాస్కర్ అప్పుడప్పుడూ వెళ్లి ఆయన్ను కలిసి వస్తున్నాడు.
  ఆ రోజు ఆదివారం కావటంతో పొద్దునే్న అంకుల్ ఇంటికెళ్లాడు భాస్కర్. అప్పటికే ఆయన నిద్ర లేచి మంచం మీద కూర్చుని దినపత్రిక చదువుతున్నాడు. ‘గుడ్‌మార్నింగ్ అంకుల్!’ నవ్వుతూ విష్ చేశాడు భాస్కర్.
  ‘వెరీ గుడ్‌మార్నింగ్ భాస్కర్. కూర్చో!’ అంటూ పేపర్ మడిచి పక్కన పెట్టాడాయన.
  ‘నేను కూర్చోవటం కాదు, మీరు వెంటనే పైకి లేవాలి’ అంటూ ఆయన్ను పట్టుకుని పైకి లేపి నిలబెట్టి వాకర్ సాయంతో మెల్లగా నడిపించుకుంటూ వెళ్లి కారిడార్‌లో ఉన్న కుర్చీలో కూర్చోబెట్టాడు.
  ఇక్కడెందుకు కూర్చోబెట్టాడా అని ఆలోచిస్తూ ఆయన భాస్కర్‌కేసి చూస్తుంటే ‘మీకు ఈ గడ్డం ఏమీ బాగోలేదు అంకుల్. ఏదో పోగొట్టుకున్న వ్యక్తిలా, విషాదంగా మీ ముఖం ఉండటం నేను చూడలేక పోతున్నాను. అందుకే ఇప్పుడు మిమ్మల్నేం చేస్తానో చూడండి’ అంటూ ఆయన మెడ చుట్టూ ఒక తువ్వాలు వేసి, తన జేబులో నుండి ఒక కవర్‌ను బయటికి తీశాడు. అందులో నుండి బయటపెట్టిన సరంజామాను చూసి ఆశ్చర్యపోయాడాయన.
  నవ్వుతూ ఆయన గడ్డానికి షేవింగ్ క్రీమ్‌ను పట్టించి జాగ్రత్తగా షేవింగ్ చేశాడు భాస్కర్. తృప్తిగా ఆయన్ను చూసి హాల్లోని చేతి అద్దం తెచ్చి ఆయన ముందు పెట్టి ఆయన ముఖం కనిపించేలా పట్టుకున్నాడు.
  ‘ఇప్పుడు చూడండి మీ ముఖాన్ని, ఎంత బావున్నారో!’ అంటూ కళ్లెగరేశాడు భాస్కర్.
  ఆయన అద్దంలోకి చూడకుండా భాస్కర్‌ను ఆశ్చర్యంగా చూస్తూ ‘్భస్కర్ నీకు షేవింగ్ చెయ్యటం వచ్చా?’ అన్నాడు.
  ‘వచ్చు సార్. మేము ఈ వృత్తివాళ్లమే! కానీ ఇన్నాళ్లూ మీకు ఆ విషయం చెప్పలేకపోయాను. తెలిస్తే మీరు నన్ను దూరం పెడతారేమోనని భయపడ్డాను. కానీ బాగా పెరిగిన గడ్డంతో ఉన్న మీ ముఖాన్ని చూడలేక ఏమైనా కానీ అనుకుని, ఈ నిర్ణయం తీసుకున్నాను’ ఆత్మన్యూనతా భావంతో ఆయన ముఖంలోకి చూడలేక తలదించుకున్నాడు భాస్కర్.
  ‘ఎంత పొరబడ్డావ్ భాస్కర్... నాది ఏ కులమో తెలిశా నువ్వు నాకు సాయం చేశావ్? కాదుగా! మానవత్వంతో చేశావ్! మనిషికి కావలసింది అదే! అదే మనిషిని ఉన్నతుడిగా తీర్చిదిద్దుతుంది. జాతి, మతం, కులం, వర్గం వీటిమీదంతా నాకు పట్టింపుల్లేవు. ఇవే ప్రస్తుతం మనుషుల్ని నాశనం చేస్తున్నాయి. చదువుకున్న వాళ్లు కూడా వీటిని పట్టించుక్కూర్చుంటే మనమెప్పటికీ ఎదగలేం! నాలో ఆ పట్టింపు లేదు కనకనే మనమిద్దరూ దగ్గర కాగలిగాం. ఔనా! అందుకే, ఇక మీద ఎప్పుడూ మన మధ్య ఈ కులాల ప్రసక్తి తీసుకురాకు భాస్కర్...’ స్థిరమైన కంఠంతో అన్నాడాయన. ‘అలాగే అంకుల్! మీతో ఇంకెప్పుడూ అలాంటి విషయాల గురించి మాట్లాడను!’ అన్నాడు.
  ‘వెరీగుడ్...’ నవ్వుతూ అద్దంలో తన నున్నటి గడ్డాన్ని తడుముకుంటూ తనను తాను చూసుకుంటూంటే ఏదో కొత్తగా అనిపించింది వీరరాఘవులుకు.
  ఇంతలో ఆయన స్మార్ట్ఫోన్ మోగింది. రోజూ నిద్ర లేవగానే భార్యతో మాట్లాడ్డానికి నెట్ ఆన్ చేసి పెడతారాయన. వీడియో కాల్ అది. ఆన్ చెయ్యగానే తెర మీద కనిపించిన ఆయన భార్య ‘ఏమండీ! ఇప్పుడెలా ఉంది మీకు? నొప్పి బాగా తగ్గిందా? నడవగలుగుతున్నారా?’ అంటూ ప్రశ్నించింది.
  ‘ఊ... నొప్పి బాగానే తగ్గింది. మెల్లగా నడవగలుగుతున్నాను. అదలా ఉంచు జానకీ... ఇప్పుడు నేనెలా ఉన్నానో నా ముఖం చూసి చెప్పవోయ్! హీరోలా లేనూ? నన్నిలా మార్చింది ఎవరో తెలుసా? మన భాస్కరే!...’ అంటూ భాస్కర్‌ను తన పక్కకు పిలిచి అతను స్క్రీన్‌లో పడేటట్టుగా నిలబెట్టి.. ‘నువ్వు భాస్కర్‌ను ఇప్పటిదాకా చూళ్లేదు కదూ, ఇదిగో ఇప్పుడు చూడు...!’ అన్నాడు సంతృప్తిగా.
  ‘బాబూ, నీకు మేమెంతో రుణపడి ఉన్నాం. నువ్వు చేసిన మేలు మా జీవితాంతం గుర్తుంచుకుంటాం!’ అంది మనస్ఫూర్తిగా. ఆమె మాటలకు భాస్కర్‌కు ఏం చెప్పాలో తెలియక వౌనం వహించాడు.
  ‘ఏమండీ, మీ పరిస్థితి చూశాక నేనిక్కడ ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. వెంటనే బయలుదేరి ఇండియాకు వచ్చేద్దామనుకుంటున్నాను’ అంది ఆతృతగా.
  ‘వొద్దొద్దు జానకీ! నువ్వక్కడే ఉండు. ఇప్పుడే కోడలికి నీ సాయం ఎంతో అవసరం. నాకిక్కడ ఏమీ ఇబ్బంది లేదు. నాకు భాస్కర్ తోడుగా ఉన్నాడు. నువ్విక్కడున్నా అతను చూసుకున్నంత బాగా నన్ను చూసుకోలేవేమో అనిపిస్తోంది నాకు...’ అంటున్న ఆయన వంక పరిశీలనగా చూశాడు భాస్కర్.
  ఆయన మాటల్లోని నిజాయితీకి భాస్కర్ మనసు ఉప్పొంగింది.
  ఆ రోజు ఆదివారం కావటంతో ఓ రెండు మూడు గంటలు అక్కడే గడిపాడు భాస్కర్.
  ఇక ఇంటికి వెళదామని ఆయన నుండి సెలవు తీసుకుంటుంటే... ‘్భస్కర్ బండి తాళాలు ఇచ్చి వెళ్లు! ఈ రోజు నువ్వు బస్సులో వెళ్లవలసిందే!’ భాస్కర్‌కేసి చూసి నవ్వుతూ అన్నాడు వీరరాఘవులు.
  చివ్వున తలతిప్పి ఆయన వంక చూశాడు భాస్కర్. ఆ మాటతో ఏదో తెలియని నిరుత్సాహం అతణ్ణి చుట్టుముట్టింది.
  ఏమీ మాట్లాడకుండా జేబులో నుండి బండి తాళాల్ని తీసి ఇస్తుంటే... తన ఒంట్లోని ముఖ్యమైన భాగమేదో తన నుండి దూరమవుతున్నట్టుగా బాధ కలిగింది అతనికి. అయినా బండిని ఇవ్వక తప్పదు. దాన్ని తన దగ్గరే ఉంచుకోవటానికి అది తన సొంత ఆస్తి కాదుగా! ఎప్పటికైనా అది అంకుల్‌కు తిరిగి ఇచ్చేయవలసిందే. తప్పదు! ఇంతకాలమూ తనకెంతో ఆనందాన్ని పంచిన బండి తన నుండి దూరమై పోతోంది. రేపటి నుండి తను కాలేజీకి మళ్లీ టౌన్ బస్సులో వెళ్లవలసిందే!
  గుండెను నిబ్బరం చేసుకుని బయటకి దారితీశాడు భాస్కర్. మనసు బాగోలేక ఎక్కడెక్కడో తిరిగి ఆలస్యంగా ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లోకి అడుగుపెట్టబోతూ వాకిట్లో నిలబెట్టున్న కొత్త బ్లాక్ అండ్ రెడ్ పల్సర్ బండిని చూసి ఆశ్చర్యపోతూ గబగబ ఇంట్లోపలికి వెళ్లి.. ‘అమ్మా.. బయట ఎవరిదీ కొత్త బండి?’ అంటూ ఆతృతగా అడిగాడు.
  ‘షోరూమ్ నుండి ఎవరో కుర్రాడొచ్చి నీకివ్వమని చెప్పి ఈ తాళాలిచ్చి వెళ్లాడ్రా!’ ఆమెకూ అర్థంకాక బదులిచ్చింది.
  ‘రసీదులో తన పేరే ఉంది. తమ ఇంటి చిరునామానే ఉంది. అయితే ఎవరు బుక్ చేసుంటారబ్బా? నాన్న అయ్యుంటాడా? ఊహూ... కానేకాదు. ఇంకెవరై ఉంటారు?’ వెంటనే ఊహించలేక పోయాడు భస్కార్.
  అనుమానం వచ్చి అంకుల్‌కు ఫోన్ చేశాడు భాస్కర్. అది ఎంగేజ్ శబ్దం వస్తోంది. బండిని స్టార్ట్ చేసి అంకుల్ ఇంటికి పోనిచ్చాడు. వెళ్లేసరికి ఏదో శుభకార్యానికి వెళ్లేవాడిలా శుభ్రంగా తయారై ఉన్నాడాయన. పక్కన పూజాసామాగ్రి ఉంది.
  భాస్కర్‌ను చూసి ‘ఏం భాస్కర్, బైక్ నచ్చిందా?’ అన్నాడు నవ్వుతూ.
  ‘అంకుల్, అది... నాకు.. కొత్త బైక్?’ అంటూ ఆ పైన ఏం చెప్పాలో తెలియక మాటలు తడబడ్డాయి భాస్కర్‌కు.
  ‘ఔను. నీకే.. దాన్ని నీ కోసమే కొన్నాను. బావుందా?’
  ‘అంకుల్, ఎందుకంత డబ్బు ఖర్చు పెట్టి...?’
  ‘నీకు పల్సర్ బైక్ మీదున్న అభిమానాన్ని చూశాను భాస్కర్. అదంటే నీకెంత ఇష్టమో కూడా గ్రహించాను. కానీ, నాకు ఆక్సిడెంట్ అయిన బైక్‌ను నువ్వు నడపటం నాకెంత మాత్రమూ ఇష్టం లేదు. అందుకే ఎక్స్‌చేంజ్ ఆఫర్‌లో పాతది మార్పించి కొత్తది కొన్నాను. బాగుందా, నీకు నచ్చిన బైకే, నువ్వు మెచ్చిన కలరే. నీకే సొంతం అది’
  ‘అది కాదంకుల్...’ అంటూ ఇంకేదో చెప్పబోయాడు భాస్కర్.
  ‘ఇంకేం మాట్లాడకు. వెంటనే బయలుదేరు. ఆంజనేయస్వామి గుడి దగ్గర బండికి పూజ చేసుకుని, అటు నుండి అటే మున్సిపల్ పార్కుకు వెళదాం. ఇవ్వాల్టి నుండి పార్క్‌లో కాసేపు వాకింగ్ మొదలెడదాం’ హుషారుగా అన్నాడు వీరరాఘవులు.
  చాలారోజుల తర్వాత మొదటిసారిగా ఆయన బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాడు.
  వాకర్ కోసం అటుఇటు చూశాడు. దూరంగా గోడ దగ్గర ఉందది. దాన్ని తెచ్చివ్వమన్నట్టుగా భాస్కర్‌కేసి చూశాడాయన.
  భాస్కర్ లేచి నిలబడి.. ఇక దాంతో అవసరం లేదన్నట్టుగా.. ఆయనకు ఆసరాగా తన చేతిని అందించాడు.
  మరో మూడు నిమిషాల్లో ఆయన్ను ఎక్కించుకొని బజాజ్ పల్సర్ రోడ్డు మీద.. రయ్యిమని ముందుకు దూసుకెళ్లింది.
  =================================================
  కథలకు ఆహ్వానం
  ‘ఆదివారం ఆంధ్రభూమి’కి కథలు పంపవలసిన చిరునామా:
  ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.
  పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.netకు మెయల్‌లో పంపాలి.


  0 0

  ‘ప్రజలందరికి మహా సంతోషకరమైన శుభవార్త.. దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టాడు. ఆయన ప్రభువైన క్రీస్తు.’
  సంతోష సమాధానములు లేక భయభ్రాంతులతో నిండిన హృదయాలు ఎటు నుండి ఏ కబురు వినాలో అన్నట్టు ఉన్న సమయంలో దూత తెచ్చిన శుభవార్త సంతోష వార్త సమాధాన వార్త రక్షకుడు పుట్టాడని. ఈయన ప్రభువైన క్రీస్తు.
  ప్రేమ గల దేవుడు ప్రేమతో మానవుని తన స్వహస్తాలతో తన స్వరూపములో చేశాడు. నివాసానికి కావలసిన మంచి లోకాన్ని సృష్టించాడు. మనతో సహవశించాలని, మనతో ఉండాలని మనలను సంతోషపెట్టాలని ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనముండాలని ప్రభువు ఆశ. అయితే మనిషి మాత్రం మన అవసరాల కోసం సృష్టించిన సృష్టిని ప్రేమించి దేవునికి దూరమై సాతాను మాయలో పడి పరిశుద్ధతను కోల్పోయి పాపి అయ్యాడు. ఈ పాపం చిన్నచిన్నగా పెరిగి లోకమంతా వ్యాపించింది. ప్రేమలు చల్లారినవి. దౌర్జన్యము దోపిడీ దొంగతనాలు మానభంగాలు నరహత్యలు దురాశలు అల్లర్లు కొట్లాటలు గొడవలు ఒకరినొకరు ఓర్వలేనితనము అసూయలు, యుద్ధాలు.. యుద్ధ సమాచారాలు జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును కరువులు ఉన్నప్పుడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశ పడినట్లు మనిషి మెస్సయ్య కొరకు ఎదురుచూపులు చూస్తున్నాడు. ఆదరణ కొరకు కాపుదల కొరకు విమోచన కొరకు బంధకాల నుండి విడుదల కొరకు వందల సంవత్సరాలకు ముందు నుండి ఎదురుచూస్తున్నారు. మెస్సయ్య వస్తాడని రక్షిస్తాడని పాప బంధకాల నుండి విడిపిస్తాడని అనేక మంది ప్రవచిస్తూ ఉన్నారు. ప్రవచనానుసారంగా ప్రభువు రెండు వేల సంవత్సరాల కిందట భూమిపై కన్యకయైన మరియ యందు జన్మించాడు. ఆయన దగ్గరకు వచ్చి చూచి సాగిలపడి పూజించి కానుకలివ్వడమే క్రిస్మస్.
  ప్రవచనాలు
  ఆదికాండము 49:10 - యూదా గోత్రము నుండి మెస్సయ్య జన్మిస్తాడని, షిలోహు వచ్చువరకు అనగా మెస్సయ్య వచ్చు వరకు యూదా యొద్ద నుండి రాజదండము తొలగదు.
  మత్తయి 1:1-3 - అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు యాకోబును కనెను. యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. ఆ యూదా గోత్రికుడైన యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యయైన మరియ యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను.
  బెత్లెహేములో జన్మిస్తాడని...
  మీకా 5:2 - బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము నుండి శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను.
  మత్తయి 2:1 - రాజైన హేరోదు దినములయందు, యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చిరి.
  యెరూషలేమునకు 9 కి.మీ. దక్షిణాన ఉన్న చిన్న పట్టణమే యేసు ప్రభువు జన్మస్థలమైన బెత్లెహేము. సముద్రము నుండి 2 వేల అడుగుల ఎత్తున ఈ గ్రామం ఉంది. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు అని అర్థము. ఎఫ్రాతా అనగా ఫలభరితము. దీనికి దావీదు పురమని కూడా పేరు కలదు. మిక్కిలి సమృద్ధి గల ఊరు గనుక రొట్టెల ఇల్లు అని పేరు వచ్చి ఉండవచ్చు. ఈ పేరు గలిలయలోని ఇంకొక ఊరుకు ఉంది కనుక దీనిని యూదయ బెత్లెహేము అని అంటారు. ఈ బెత్లెహేము రూతు విశ్వాసములో యాకోబు ప్రార్థనతో దావీదు స్తుతి ఆరాధనతో ప్రభువు రాక కొరకు సిద్ధపడి ఉంది.
  కన్యక గర్భమున జన్మించుట...
  యెషయా 7:14 - కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును.
  మత్తయి 1:22 - కన్యక గర్భవతియై కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను మాటకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము.
  క్రీస్తు జన్మ సమయములో పసిపిల్లలు చంపబడుట..
  యిర్మియా 31:15 - యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆలకించుడి. రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి. రాహేలు తన పిల్లలను గూర్చి యేడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోనందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది.
  మత్తయి 2:15-16 - ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగ తెలిసికొనిన కాలమునుబట్టి, బెత్లెహేములో దాని సకల ప్రాంతములలోను, రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలందరిని వధించెను. అందువలన రామాలో అంగలార్పు వినపడెను. ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లక యుండెను అని ప్రవక్తయైన యిర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను.
  రామాలో అంగలార్పు పసిపిల్లలు చంపబడుటకు కారణము - మత్తయి 2: 1 నుండి 17 వచనము వరకు జరిగిన సంగతిని బట్టి, రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు ప్రభువు పుట్టిన పిమ్మట తూర్పు నుండి జ్ఞానులు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ నున్నాడు? తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. వార్త విని కలవరపడిన హేరోదు ప్రధాన యాజకులను శాస్త్రులను పిలిపించి క్రీస్తు ఎక్కడ పుట్టునని అడిగినట్టుగా యూదయ బెత్లెహేములోనే అని ప్రవక్తల ప్రవచనాలు వినిపించిరి. సంగతి వినిన హేరోదు జ్ఞానులను రహస్యముగా పిలిచి పూజింతును, నాకు తెలుపుమని వారిని బెత్లెహేమునకు పంపెను. జ్ఞానులు ప్రభువును చూచి సాగిలపడి ఆయనను పూజించి బంగారు సాంబ్రాణిని బోళమును కానుకలుగా అర్పించి, దూత మాట ప్రకారము హేరోదు దగ్గరకు వెళ్లక వేరొక మార్గమున వెళ్లిపోయిరి. జ్ఞానులు ఎంతకు తిరిగి రాకపోవుట వల్ల హేరోదు కోపముతో జ్ఞానులు చెప్పిన వివరాన్నిబట్టి, రెండు సంవత్సరములలోపు ఉన్న మగ పిల్లలందరిని వధించెను. రామాలో అంగలార్పు మహారోదనమునకు కారణము ఇదే.
  సుమారు 580 సంవత్సరాలకు ముందు ప్రవక్త యిర్మియా వ్రాసిన ప్రవచనాల గురించి హేరోదు రాజుకు తెలియదు. జ్ఞానులకు తెలియదు. కాని క్రీస్తు పుట్టినప్పుడు రెండు సంవత్సరాలలోపు మగ పిల్లలు చంపబడుట రామాలో అంటే బెత్లెహేములో అంగలార్పు రోదన ఏడ్పు కలిగెను అను ప్రవచనము నెరవేరింది. ప్రవక్తకు తెలియదు ఎప్పుడు ఈ ప్రవచనము నెరవేరుతుందో, జ్ఞానులకు తెలియదు రామాలో అంగలార్పు ఉంటుందని. హేరోదుకు ప్రవచనానుసారంగా ఇది జరిగిన సంగతి తెలియదు. దీనినిబట్టి ప్రవచనములు పరిశుద్ధాత్మ ద్వారా తెలియబడితే, అవి కొన్ని వందల సంవత్సరాల తరువాతయైనా నెరవేరుతాయని అర్థమవుతోంది.
  ముందుగా ఒకరు మార్గము సిద్ధపరచుట
  యెషయా 40:3 - ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా - అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళము చేయుడి.
  మలాకి 3:1 - ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత, తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
  మత్తయి 3:3 - ఆ దినముల యందు బాప్తీస్మమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి యున్నది. మారుమనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను.
  ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేక వేయు నొకని శబ్దము అని ప్రవక్తయైన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే.
  మొద్దు నుండి చిగురు
  యెషయా 11:1 - యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును.
  ఇశ్రాయేలీయులు అవిధేయులై దేవునికి దూరమయ్యారు. నిత్యము వింటున్నారు గాని గ్రహింపులేదు. నిత్యము చూచుచున్నారు కాని తెలిసికోవటం లేదు. కనుక ప్రభఉవు కోపించి ఆ దేశమును నిర్జనముగా చేసినపుడు పదియవ భాగము మాత్రము విడువబడింది. సిందూర మస్తకీ వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలి యుండు మొద్దు వలె ఉన్నది. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టెను. దావీదు సామ్రాజ్యము పొరుగు దేశాల వల్ల పతనమై పోయింది. యెషయా దావీదు తండ్రి ఆ చెట్టు నరికివేయబడింది. దాని వేళ్లు మాత్రం ఉన్నాయి. ప్రేమ గల దేవుడు ఆ శేషించిన జనాంగాన్ని రక్షించేందుకు, మోడు బారిన జీవితాలను చిగురింప చేయటానికి వచ్చాడు. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టింది. మంచే లేని లోకములోనికి నీతి న్యాయములు లేని లోకములోనికి నీతి చిగురించింది.
  యిర్మియా 23:5 - యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును.
  యిర్మియా 33:15 - ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను. అతడు భూమి మీద నీతి న్యాయముల ననుసరించి జరిగించును.
  జకర్యా 3:8 - చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోవుచున్నాను.
  జకర్యా 6:13 - చిగురు అను ఒకడు కలడు. అతడు తన స్థలములో నుండి చిగుర్చును. అతడు యెహోవా ఆలయము కట్టును.
  యెష్షయా మొద్దు నుండి చిగురు రావటం అద్భుతం. ఇశ్రాయేలీయుల అవిధేయతను బట్టి వారిని శిక్షించి ఆయా దేశాలలో చెదరగొట్టెను. అయిన శేషించిన జనములో నుండి యెష్షయా కుమారుడైన దావీదు నుండి రాజవంశములో నుండి ఒక రాజుగా పుట్టించి నీతి న్యాయములు జరుగునట్లు చేసెను.
  ప్రవక్త
  (క్రీ.పూ.1400) ద్వితీయోపదేశ కాండము 18:18 - వారి మధ్యలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను. అతని నోటను నా మాటలను ఉంచెదను. నేను అతని కాజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాని గూర్చి విచారణ చేసెదను.
  మత్తయి 21:11 - జన సమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్తయైన యేసు అని చెప్పిరి.
  కన్యక గర్భవతియై కుమారుని కనుట..
  యెషయా 7:14 - కన్యక గర్భవతియై

  కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును.
  లూకా 1:26 - ఆరవ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్య యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము ప్రభువు నీకు తోడై యున్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభ వచనమేమోయని ఆలోచించుకొనుచుండగా దూత - మరియ భయపడకుము. దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను.
  గర్భము ధరించక మునుపే వచ్చి దూత తెల్పిన వార్త - నీవు గర్భము ధరించి కుమారుని కందువు అని. (2వేల సంవత్సరాల క్రితం ఎటువంటి అల్ట్రా సౌండ్ స్కాన్‌లు లేవు)
  మరియ
  విధేయత గల దైవ సేవకురాలు. దేవుని యందు నమ్మకముంచి ఇష్టపూర్వకముగా దేవదూత సందేశాన్ని అంగీకరించింది. యూదా గోత్రికురాలు స్ర్తిలలో ఆశీర్వదించబడినది. దయాప్రాప్తురాలు. నజరేతు వాస్తవ్యురాలు. చాలా పేద కుటుంబం. ఆమె సహోదరి సలోమి. యోహాను యాకోబుల తల్లి. ఎలిజబెత్ యొక్క బంధువు. ఎలిజబెత్ భర్త జకర్యా యాజకుడు. వారిరువురు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై యుండిరి. వారిరువురు బహుకాలము గడచిన వృద్ధులు. వారి ప్రార్థన ఆలకించి గొడ్రాలైన ఎలిజబెత్‌ను దేవుని దూత ఆశీర్వదించింది. గొడ్రాలైన ఎలిజబెత్ వృద్ధాప్యములో గర్భము ధరించినది. కన్యక గర్భము ధరించుట. వృద్ధురాలైన ఎలిజబెత్ గర్భము ధరించుట దేవుని అద్భుత కార్యాలు. దీనిని బట్టి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని అర్థవౌతోంది.
  యోసేపు
  యోసేపు దావీదు వంశస్థుడు. నీతిమంతుడు. పాతనిబంధన భక్తుడు అని తెలుస్తుంది. ఈయన తండ్రి యాకోబు.
  పుట్టుక సమయము
  దానియేలు 9:25 - యెరూషలేమును మీరు కట్టించవచ్చును అని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చువరకు ఏడు వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. అరువది రెండు వారములు తొందరగల సమయములందు పట్టణు రాచవీధులును కందకములును మరల కట్టబడును.
  లూకా 2:1,2 - ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనను కైసర ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయెను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతియై యున్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య.
  జ్ఞానులు
  తూర్పు దేశము నుండి నక్షత్రమును చూస్తూ ముందు యెరూషలేమునకు అక్కడ నుండి బెత్లెహేమునకు చేరుకున్నారు. అక్కడ తల్లియైన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా యేసు ప్రభువుకు సమర్పించిరి. రాజుల రాజని బంగారము, యాజకుడేయని సాంబ్రాణిని, మృత్యుంజయుడని బోళమును సమర్పించారు.
  జ్ఞానులను రాజులని యోగీ అని కూడా అనేవారు. వీరు పర్షియాలో భాగమైన మాదియ దేశస్థులు. వీరు పర్షియా రాజుకు గురువులుగా ఉండిరి. వీరు సత్ప్రవర్తన గల వారును జ్ఞానులు నగుదురు. వీరు

  జ్యోతిషశాస్త్రం ఎరిగినటువంటి వారు. తత్వ జ్ఞానము వైద్యము విజ్ఞానము వంటి వాటిలో వీరు ప్రవీణులు.
  వీరు ప్రాచీన బబులోను సమీపమున గల పార్తియా దేశము నుండి వచ్చినవారని మరొక అభిప్రాయము కలదు. ఆ కాలమందు అచటి ప్రజలు జ్యోతిషమునందు నమ్మిక కలిగియుండిరి.
  యెసారి అనగా ఒక రాజకుమారుని జననము అని అర్థము. యెసారి ఒక గొప్ప నక్షత్రము ఉదయించగా రాజు జన్మకు ఆనవాలుగా ఉన్నది. ఎట్లైనను ఒక నక్షత్రము ఉదయించితే అది ఒక నూతన రాజు పుట్టుకను గూర్చి చాటించుచున్నదని జ్ఞానులు పరిశోధించి తెలుసుకొనిరి.
  ఈ జ్ఞానులు పలు దేశములకు చెందినవారను అభిప్రాయము కలదు. అది నిజమైతే ప్రపంచములోని పలు స్థలముల నుండి జ్ఞానులు వచ్చి ప్రభువు ఆరాధించిరని చెప్పవచ్చును. ఇండియాలో కూడా తూర్పు దేశమే గనుక మన దేశము నుండి కూడా వెళ్లి ఉండవచ్చును. ఇశ్రాయేలీయులలోని ఏర్పరచబడిన ప్రజలు ప్రభువును స్వీకరించ పోవుటయు, ఇతర దేశస్థులు ఆయనను ఎరుగుటను బట్టి క్రీస్తు యూదుల రాజు మాత్రమే కాదు లోకమంతటికి రాజుగా జన్మించెనని దీని ద్వారా మత్తయి సువార్తికుడు నిరూపించెను. జ్ఞానులు ఇచ్చిన బహుమానములు బాలుడైన యేసును ఐగుప్తు దేశమునకు తీసుకువెళ్లినపుడు వారి అవసరాలకు దేవుని ఏర్పాటు వలె ఉంది.
  కేరెల్స్
  మొట్టమొదట 129 సం.లో కేరల్స్‌ను క్రిస్మస్ పండుగ సందర్భంగా రోమన్ బిషప్ ‘దూత పాట’ పాడించి ప్రారంభించారు. 760 సం.లో కామర్ ‘యెరూషలేములో కొత్త పాట’ వ్రాశాడు. మెల్లగా ఐరోపా అంతా కేరెల్స్ మొదలైనది. క్రీ.శ.1223లో సెయింట్ ఫ్రాన్సిస్ ఇటలీలో మొదలుపెట్టారు. అదొక నాటకం. ఆ నాటకంలో వారు పాటలు పాడి వాక్యాలు చెప్పేవారు. ఇలా లాటిన్ భాషలో మొదలై ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ.. ఇంకా ఐరోపాలో అనేక ప్రాంతాలకు వెళ్లింది. దాని తరువాత అధికారిక కేరెల్స్ ప్రారంభమయ్యాయి. వారిని ‘వెయిల్స్’ అనేవారు. వీరు మాత్రమే క్రిస్మస్ ఈవ్‌లో కేరెల్స్ పాడుతూండేవారు. రాన్రాను ఆర్కెస్ట్రా బృందం వారు, క్వైర్ వారు కేరెల్స్ మొదలుపెట్టారు. వాటిలో ‘ ళఒఆజ్ప్ఘ యచి శజశళ ళఒఒ్యశఒ ఘశజూ ష్ఘ్యూఒ బాగా ప్రాచుర్యం పొందింది.
  నేటివిటీ సీన్
  క్రీ.శ.1223లో సెయింట్ ఫ్రాన్సిస్ ఇటలీలో ‘నేటివిటీ సీన్’ని ప్రారంభించారు. క్రిస్మస్ దినాన గొల్లలు, జ్ఞానులు రావటం కానుకలు ఇవ్వటం, మరియ యోసేపు బాలుడైన యేసు పొత్తిగుడ్డలతో చుట్టబడి తొట్టెలో ఉండుట. పశువులు, పశువుల తొట్టెను చూయిస్తూ క్రిస్మస్‌లో జరిగిన సంఘటనను అందరికీ గుర్తు చేసేందుకు ఈ ‘సీన్’ని ఉంచుతారు.
  కేండీ కేన్స్
  ఈ కేండీ కేన్స్ ‘గొల్లలను’ గుర్తు చేస్తాయి. మొదట ప్రభువును చూసింది గొల్లలే. అసలు కాపరి యేసు అని గుర్తు కోసం ‘కేండీ కేన్స్’. దానకి చుట్టి ఉన్న తెల్లరంగు రిబ్బన్ కన్య మరియకు పుట్టిన క్రీస్తు పవిత్రతను సూచిస్తున్నది. ఎర్రరంగు రిబ్బన్ క్రీస్తు మానవాళి కొరకు చిందించిన రక్తాన్ని సూచిస్తుంది. *నక్షత్రము

  తూర్పు దిక్కున ప్రభువు నక్షత్రమును చూసిన జ్ఞానులు నక్షత్రమును వెంబడించి బెత్లెహేములో శిశువు ఉన్న చోటికి వచ్చి అత్యానందముతో సాగిలపడి ఆయనను పూజించారు.
  పాతనిబంధనలో కూడా అరణ్యలో చీకటిలో ఉన్న ఇశ్రాయేలీయులకు అగ్ని స్తంభము వెలుగిచ్చింది. మార్గము చూపింది. అలాగే జ్ఞానులను ఈ నక్షత్రము వెలుగు ప్రభువు ఉన్న చోటుకు జ్ఞానులను నడిపించింది. దానికి ముందు మండుచున్న పొద నుండి యెహోవా దేవుడు మోషేతో మాట్లాడి నీ తండ్రియైన దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని తెలిపాడు. ఇప్పుడు ఆయన వాక్యము మన పాదములకు దీపముగా త్రోవకు వెలుగుగా ఉండి నడిపిస్తుంది. నిజమైన వెలుగు ఉండెను. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆ వెలుగు క్రీస్తే.

  దేవదూతలు
  దేవుని యొద్ద నుండి వార్తలను తెచ్చేవారే దేవదూతలు. దేవుని ప్రజలను కాపాడుట ఉత్సాహపరచుట మార్గము చూపుట శిక్షను నెరవేర్చుట భూమి మీద తిరుగులాడుట దురాత్మలతో పోరాడుట దేవుని స్తుతించుట. వీరే క్రీస్తు జననాన్ని గొల్లలకు జకర్యాకు మరియ యోసేపులకు తెలియజేసింది. వీరిలో ఎక్కువగా వినపడే పేరు గబ్రియేలు, మిఖాయేలు.

  క్రిస్మస్ ట్రీ
  ‘సరివి’ చెట్టు ఆకులు ఎప్పుడూ పచ్చగా ఉంటాయి. ఏ కాలంలోనైనా పచ్చగా ఉండటం వాటి లక్షణం. గనుక ‘జీవితానికి’ గుర్తుగా ఈ చెట్టును ఇళ్లల్లో పెట్టుకొనేవారు. 16వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ క్రిస్మస్ ముందు అడవిలో నడుస్తూ చెట్ల సందులలోని చుక్కల వెలుగును చూస్తూ, నక్షత్రాల వెలుగును క్రీస్తు భూమి మీదనే ఉంచాడని అది ఆయన పుట్టినప్పటి దృశ్యాన్ని గుర్తు చేస్తుందని, ఇంటి లోపల ఆ ‘చెట్టు’ను పెట్టినట్లు తెలుస్తోంది. దాని చుట్టూ నక్షత్రానికి గుర్తుగా కొవ్వొత్తులలు వెలిగించడం, బహుమతులు పెట్టడం ఒక ఆచారమైంది. థామస్ ఎడిసన్ అల్వా ‘ఎలక్ట్రిక్ బల్బ్’ కనుగొన్నప్పటి నుండి కొవ్వొత్తులకు బదులుగా ఎలక్ట్రిక్ లైట్స్ అలంకరణ మొదలైంది. ప్రపంచంలో అతి పెద్ద క్రిస్మస్ చెట్టు ఎత్తు 52 మీటర్లు. దీనినే ‘పీస్ ట్రీ’ అంటారు. పచ్చని ఆకులు నిత్య జీవానికి గుర్తుగా వాడుతారు.

  గొల్లలు

  ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి.
  గలిలయ సముద్ర తీరమున చేపలు పట్టుచున్న పేతురును పిలిచిన దేవుడు ఇక్కడ రాత్రివేళ తమ గొర్రెలను కాయుచున్న కాపరులను ఎన్నుకొని వారికి ఒక శుభవర్తమానము చెప్పెను. దీనిని బట్టి అతి సామాన్యులైన వారిని కష్టపడి పని చేయువారిని దేవుడు ఎన్నుకొని వారికి ఈ శుభవార్తను తెలియజేసినట్టు తెలుస్తోంది. మత గురువులకు, పెద్దలకు, అధికారులకు, ఆస్తిపరులకు ఈ గొప్ప శుభవార్త తెలుపలేదు గాని సామాన్యులకు వినయ విధేయులకు దీనులకు తెలియజేయబడింది.

  * 336 సం.లో రోమా చక్రవర్తి కాన్‌స్టంటైన్ మొదటి క్రిస్మస్‌ను డిసెంబర్ 25న జరిగించినట్లు రికార్డయింది. ఆయన మొదటి క్రైస్తవుడు. రోమా చక్రవర్తులలో మొదటి క్రైస్తవుడు. కొన్ని సంవత్సరాల తర్వాత పోప్ జూలియస్-1 డిసెంబర్ 25న క్రిస్మస్ అని అధికారికంగా తెలియజేశాడు. అప్పటి నుంచి డిసెంబర్ 25న క్రిస్మస్‌గా లోకమంతా జరుపుకుంటున్నారు.

  ఒక అనాథ ఉత్తరం
  అయ్యా! నాది ఒక చిన్న కోరిక. ధనికుల పిల్లలు శాంటాక్లాజ్ గఒరించి చెప్పుకుంటారు. మంచిమంచి బహుమతులిస్తాడని. నన్ను కూడా ఒక్కసారి కలవమని చెప్పండి. నాకు పెద్దపెద్ద ఆట బొమ్మలు వద్దు కాని ప్రేమతో కౌగలించుకొనే చేతులు చాలు. కొత్త బట్టలు వద్దు గానీ ఈ బలహీన శరీరాన్ని కప్పుకోటానికి పాతబట్టలు చాలు. అది కూడా నాకంటె బలహీనులు అడగకపోతే. మిఠాయిలు వద్దు ఒకటి రెండు బ్రెడ్‌ముక్కలు చాలు. ఎండినవైనా పర్వాలేదు. చెప్పులు అవసరం లేదు అవి లేకున్నా నడవగలను. బలహీనమైన కాళ్లు ఉన్నవాళ్లకు వాటిని ఇవ్వండి. దేవా నన్ను ప్రేమించి ఈ చిన్న సహాయం చేయగల వారిని నా దగ్గరకు పంపటం ‘శాంటాక్లాజ్’కు కష్టమా? దేవా దయచేసి నీ ప్రేమ గలవారిని, ఫుట్‌పాత్ మీద అనాధగా ఉన్న నా యొద్దకు పంపండి.
  ఇట్లు - ఒక అనాథ


  0 0

  మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

  ఆదివారం సంప్రదింపులకు అనుకూలం. సౌకర్య లోపాలు ఇబ్బంది పెట్టవచ్చు. సౌఖ్యంపై దృష్టి. వ్యాపార వర్గ సహకారం లభిస్తుంది. గృహ వాహనాదుల వ్యవహారాల్లో జాగ్రత్తలు అవసరం. సోమవారం గౌరవ లోపాలు కలుగకుండా జాగ్రత్త పడాలి. సంతృప్తి లోపం. విశ్రాంతి ఉండదు. దగ్గరి ప్రయాణాలు. మంగళవారం ఆధ్యాత్మిక వ్యవహారాలపై దృష్టి వల్ల మేలు. ఆహార విహారాల్లో లోపాలు అధికవౌతాయి. విద్యపై దృష్టి. బుధవారం వ్యాపార లోపాలకు అవకాశం. సౌకర్యాలు శ్రమకు గురి చేస్తాయి. అనుకోని సమస్యలకు అవకాశం. గురువారం మనోభీష్టాలు నెరవేర్చుకునే ప్రయత్నం. వృత్తి ఉద్యోగాదుల్లో వత్తిడులు. అధికారులతో జాగ్రత్త అవసరం. శుక్రవారం లక్ష్యాలను సాధించే ప్రయత్నం. ఉన్నత వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి. సృజనాత్మకత.

  సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

  ఆదివారం లాభాలు సంతోషాన్నిస్తాయి. కాని అనుకోని ఖర్చులకు అవకాశం. విశ్రాంతి లోపం ఉంటుంది. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. వ్యర్థమైన ప్రయాణాలు, పరామర్శలకు అవకాశం. సోమవారం సౌకర్యాలపై దృష్టి. సుఖంగా గడిపే యత్నం. ఆహార విహారాలకు అనుకూలం. విద్యాత్మక కృషి. మంగళవారం ఆలోచనల్లో వత్తిడులుంటాయి. నిర్ణయాదుల్లో ఆలస్యం. సంతానవర్గ వ్యవహారాల్లో చికాకులు. బుధవారం వ్యాపారాదుల్లో శుభ పరిణామాలు. నిర్ణయాదులు సంతోషాన్నిస్తాయి. పోటీ తత్వంలో ఓడిపోయి బాధపడే సూచన. గురువారం సంప్రదింపుల్లో అనుకూలత. స్ర్తివర్గ సహకారం. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. నూతన బాధ్యతలు. శుక్రవారం మానసికమైన ఒత్తిడులు. నిర్ణయాదుల్లో కొంత జాగ్రత్త.

  ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

  ఆదివారం పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. కొంత జాగ్రత్త అవసరం. భాగస్వామ్యాల్లో ఇబ్బందులు కూడా ఉండవచ్చు. అనుకోని పరిణామాలుంటాయి. సోమవారం ఖర్చులు పెట్టుబడులు సంతోషాన్నిస్తాయి. ధార్మికమైన దానాలకు అవకాశం. ఆధ్యాత్మిక ప్రయాణాదుల వల్ల మేలు. మంగళవారం నిర్ణయాదుల్లో ఇబ్బందులు. ఆలస్య ధోరణి వల్ల చికాకు. అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలు. బుధవారం ఖర్చులు పెట్టుబడుల్లో జాగ్రత్త. వ్యాపార లోపాలకు అవకాశం. లక్ష్యాలను సాధిస్తారు. కొంత నిరాశాతత్వం. గురువారం లాభాలు సంతోషాన్నిస్తాయి. పెద్దల ఆశీస్సులు, అనుకూలత. వ్యవహారాల్లో శుభ పరిణామాలుంటాయి. శుక్రవారం నిర్ణయ లోపాలు. తొందరపాటు. వత్తిడి. శారీరక సమస్యలు. అనారోగ్యం.
  వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

  ఆదివారం కుటుంబ సంబంధాలపై దృష్టి. నిల్వధనం పెంచుకునే ప్రయత్నం. సంప్రదింపుల్లో కొంత ఒత్తిడులు. దగ్గరి ప్రయాణాలు తప్పకపోవచ్చు. కాలం వ్యర్థవౌతుంది. సోమవారం పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. పెద్దలతో అనుబంధాలు సంతోషాన్నిస్తాయి. మాట వల్ల గౌరవం. మంగళవారం సంప్రదింపుల్లో జాగ్రత్త. అనుకోని ఇబ్బందులు. అనారోగ్య భావనలు. ఊహించని సంఘటనలు. బుధవారం వ్యాపారానుబంధాలు విస్తరించే అవకాశం. సౌకర్యాలు సంతోషాన్నిస్తాయి. గురువారం ఆధ్యాత్మిక వ్యవహారాల వల్ల మేలు కలుగుతుంది. పోటీ రంగంలో అనుకూలత. వ్యతిరేకతలు తప్పవు. శుక్రవారం అధికారిక ఇబ్బందులుంటాయి. ఆరోగ్యం జాగ్రత్త. ఆహార విహారాల్లో ఆశించిన సంతృప్తి ఉండదు.

  కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

  ఆదివారం వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. పదోన్నతి. గౌరవం పెంచుకుంటారు. లాభాలున్నా ఆశించిన సంతృప్తి ఉండదు. ఆశలు అధికం. తొందరపాటు కూడదు. సోమవారం పెద్దలతో సంప్రదింపులుంటాయి. గురువుల సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక ప్రయాణాలకు అవకాశం. మంగళవారం సౌకర్య లోపాలుంటాయి. ఆహార విహారాల్లో జాగ్రత్త. సౌఖ్య లోపం. పెద్దలతో చికాకులకు అవకాశం. బుధవారం లాభాలు సంతోషాన్నిస్తాయి. వ్యాపారవర్గ సహకారం లభిస్తుంది. మానసిక వత్తిడులు. నిర్ణయాల్లో జాగ్రత్త. గురువారం కుటుంబంలో సంతోషం. మాటల్లో చమత్కారం. విందులు వినోదాల కోసం ఖర్చులు పెట్టుబడులు. శుక్రవారం ఆహార విహారాల్లో జాగ్రత్త. కార్యనిర్వహణలో ఒత్తిడులు. సౌఖ్య లోపం.

  మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

  ఆదివారం వ్యతిరేక ప్రభావాలుంటాయి. పోటీలున్నా విజయం సాధిస్తారు. గుర్తింపు లభిస్తుంది. పరిచయాలు, స్నేహానుబంధాల్లో అతి జాగ్రత్తగా మెలగాలి. చికాకులు. సోమవారం పెద్దల అనుకూలత. ధార్మిక కార్యక్రమాలపై దృష్టి. సంప్రదింపుల్లో శుభ పరిణామాలు. కొత్త వార్తలుంటాయి. మంగళవారం నిర్ణయాదుల నిర్వహణ కోసం ఖర్చులు చేయాలి. కుటుంబ ఆర్థికాంశాల్లో అప్రమత్తంగా మెలగాలి. బుధవారం లాభాలు సంతోషాన్నిస్తాయి. వ్యాపార వ్యవహారాల్లో గుర్తింపు లభిస్తుంది. నిర్ణయాదుల్లో జాగ్రత్త అవసరం. గురువారం ఆత్మవిశ్వాసం కొంత తగ్గే సూచనలు. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. అభీష్టాలు నెరవేరుతాయి. శుక్రవారం వ్యర్థమైన ఖర్చులు పెట్టుబడులుంటాయి. అనారోగ్య భావనలు. కొత్త పనులను వాయిదా వేయాలి.

  మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

  ఆదివారం కుటుంబ ఆర్థికాంశాల్లో కొంత జాగ్రత్త. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. బాధ్యతలున్నా సంతోషం. సంతృప్తి ఉంటుంది. మాట విలువ తగ్గే సూచనలు. సోమవారం పోటీలలో విజయం. గుర్తింపు లభిస్తుంది. పెద్దలతో వ్యతిరేకతలు కూడదు. ఆర్థిక నిల్వలు పెంచుకుంటారు. మంగళవారం భాగస్వామ్యాల్లో ఒత్తిడులు. పరిచయాలు అనుబంధాల్లో జాగ్రత్త. కుటుంబంలో సమస్యలుంటాయి. బుధవారం వ్యాపారాదుల్లో శుభ పరిణామాలు. లాభాలు, విజయ సాధన. అనుకోని ఒత్తిడులుంటాయి. గురువారం మనోభీష్టాలు నెరవేరుతాయి. కార్యనిర్వహణలో అనుకూలత. సంప్రదింపుల్లో సంతోషం. ప్రయాణాలు. శుక్రవారం అధికారులతో జాగ్రత్తగా మెలగాలి. పితృవర్గంతో సమస్యలుంటాయి. భాగస్వామితో ఒత్తిడులకు అవకాశం.

  తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

  ఆదివారం ఉన్నత వ్యవహారాలపై దృష్టి. లక్ష్యాలను సాధించే ప్రయత్నం. వృత్తి ఉద్యోగాదుల్లో సమస్యలు. అధికారిక వ్యవహారాల్లో జాగ్రత్త. బాధ్యతలు అధికం. సోమవారం కుటుంబ ఆర్థికాంశాల్లో శుభ పరిణామాలు. ఆర్థిక నిల్వలు పెంచుకుంటారు. మాట విలువ పెరుగుతుంది. మంగళవారం సేవకవర్గ సహకారం. సంప్రదింపుల్లో జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. బుధవారం కుటుంబంలో అనుకూలత. వ్యాపారాదుల్లో మంచి పెట్టుబడులు. సౌకర్య లోపాలకు అవకాశం. నైరాశ్యంగా ఉంటుంది. గురువారం లాభాలు సంతోషాన్నిస్తాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలు. శుక్రవారం అధికారుల సహకారం లభిస్తుంది. గుర్తింపు కోసం ప్రయత్నం. ఉద్యోగ సంబంధమైన ప్రయాణాలుంటాయి.

  కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

  ఆదివారం అభీష్టాలు నెరవేర్చుకునే ప్రయత్నం. వ్యతిరేక ప్రభావాలను అధిగమించాలి. పోటీలలో విజయం. నిర్ణయాదుల్లో జాగ్రత్త అవసరం. సృజనాత్మకత లోపం. సోమవారం కుటుంబ ఆర్థికాంశాల్లో శుభ పరిణామాలు. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. శ్రమతో లాభాలు. గౌరవం లభిస్తుంది. మంగళవారం నిర్ణయాదుల్లో అనుకూలత. ఆధ్యాత్మిక వ్యవహారాల వల్ల మేలు. ఖర్చులు పెట్టుబడుల్లో ఒత్తిడులు. బుధవారం అధికారిక వ్యవహారాల్లో జాగ్రత్త. పరిచయాలు స్నేహానుబంధాల్లో శుభ పరిణామాలు. కొంత నైరాశ్యం. గురువారం లక్ష్యాలను సాధిస్తారు. ఉన్నత వ్యవహారాలపై దృష్టి. భాగస్వామ్యాల్లో సంతోషం. సంతృప్తి. ప్రయాణాలు. శుక్రవారం లాభాలు సంతోషాన్నిస్తాయి. అధికారిక వ్యవహారాల్లో అనుకూలత. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి.

  కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

  ఆదివారం నిర్ణయాదుల్లో జాగ్రత్త. తొందరపాటు కూడదు. ఖర్చులు పెట్టుబడులుంటాయి. విశ్రాంతి కోసం ప్రయత్నం. సౌఖ్యంగా గడుపుతారు. కార్యనిర్వహణలో చికాకులు. సోమవారం అభీష్టసిద్ధి. అన్ని పనులకు అనుకూలం. సంతానవర్గ సంతోషం. సృజనాత్మకత. కొత్త పనులపై దృష్టి. మంగళవారం వ్యతిరేకతలు ఇబ్బంది పెట్టవచ్చు. పోటీదారులతో జాగ్రత్త. మానసికమైన ఒత్తిడులుంటాయి. బుధవారం కుటుంబ ఆర్థికాంశాల్లో అనుకూలత. భాగస్వామ్యాల్లో చికాకులుంటాయి. పరిచయాలు అనుబంధాల్లో నైరాశ్యం. గురువారం సౌకర్యాలు సంతోషాన్నిస్తాయి. ఆహార విహారాల్లో అనుకూలత. గృహ వాహనాదులపై ప్రత్యేక దృష్టి. శుక్రవారం పోటీల్లో విజయం. గుర్తింపు లభిస్తుంది. కార్యనిర్వహణలో అనుకూలత.

  వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

  ఆదివారం అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం. అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలుంటాయి. దూర ప్రయాణాదులపై దృష్టి. లక్ష్యాల సాధనలో ఇబ్బందులుంటాయి. సోమవారం బాధ్యతలున్నా జాగ్రత్తగా నెరవేర్చుతారు. గౌరవం పెంచుకునే ప్రయత్నం. వ్యవహారాల్లో ఒత్తిడులు అత్యధికం. మంగళవారం కుటుంబ ఆర్థికాంశాల్లో ఒత్తిడులు అధికం. మాటల్లో జాగ్రత్త. నిల్వధనం కోల్పోయే అవకాశం. బుధవారం వ్యాపార వ్యవహారాల్లో సంతోషం. నూతన నిర్ణయాదులుంటాయి. వృత్తి ఉద్యోగాదుల్లో గుర్తింపు. గౌరవం. గురువారం సంప్రదింపుల్లో కొంత జాగ్రత్త. విందులు వినోదాలు. ఆహార విహారాల కోసం అత్యధికంగా ఖర్చులు. శుక్రవారం కుటుంబంలో ఒత్తిడులు. మాటల్లో అధికారిక ధోరణి. నిల్వధనం కోల్పోవచ్చు.

  మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

  ఆదివారం సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం. మానసిక వత్తిడులు. సృజనాత్మకత పెంచుకుంటారు. ఆలోచనల్లో కొంత ఆశింపు తత్వం ఉంటుంది. ఆహార విహారాల్లో జాగ్రత్త. సోమవారం లక్ష్యాలను సాధిస్తారు. ఉన్నత వ్యవహారాలపై దృష్టి. కీర్తిప్రతిష్టలను పెంచుకుంటారు. విద్యాత్మక, ఆధ్యాత్మిక ప్రయాణాలు. మంగళవారం వృత్తి ఉద్యోగాదుల్లో ఘర్షణ. అధికారిక వ్యవహారాల్లో లోపాలు. మానసికమైన వత్తిడులుంటాయి. బుధవారం వ్యాపారాదుల్లో అనుకూలత. నూతన కార్యక్రమాలు చేపడతారు. లాభాలు ఆశించినంతగా ఉండవు. గురువారం వ్యతిరేక ప్రభావాలు అధికవౌతాయి. అనుకోని ఇబ్బందులు. సంప్రదింపుల్లో లోపాలు. ఒత్తిడి ఉంటుంది. శుక్రవారం వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. అధికారిక వ్యవహారాల్లో శుభ పరిణామాలు.


  0 0

  గ్రామాధికారి చలమయ్య గారింట్లో హఠాత్తుగా కిలో బరువు తూగే వెండి కంచం మాయమై పోయింది. ఈ విషయం అతనికి, అతని భార్య సీతమ్మకి మాత్రమే తెలుసు. తమ ఇంట్లో ఎంతోమంది నౌకర్లు పని చేస్తుండటం వల్ల ఆ వెండి కంచాన్ని ఎవరు దొంగిలించారనేది తెలుసుకోవడం కష్టమనుకున్నారు ఆ భార్యాభర్తలిద్దరూ. అలా అని బయటికి దొంగతనం జరిగిందంటే గ్రామాధికారి ఇంట్లో దొంగతనం జరగడమా అంటూ ముక్కున వేలేసుకుంటారు. ఏది ఏమైనా ఈ విషయం బయటకు పొక్కనివ్వకుండా వెండి కంచాన్ని దొంగిలించిన దొంగను ఎలా అయినా పట్టుకోవాలనుకున్నారు ఆ భార్యాభర్తలు.
  మరుసటి రోజు రాత్రి భోజనాలు అయ్యాక చలమయ్య గారు భార్యతో నౌకర్లకి వినిపించేలా ‘సీతా! అంగడిలో బంగారం ధర రోజురోజుకి తగ్గిపోతోంది. మన దగ్గరున్న డబ్బుతో బంగారం కొని దానితో బంగారం కంచం చేయించి దానికి వెండి పూత పూయిద్దాం. అందుకు వెండి కంచంలో తింటున్నామన్న తృప్తి కూడా మిగులుతుంది. మరో విషయం బంగారం రేటు పెరగగానే దాన్ని అమ్మేద్దాం. ఏమంటావ్?’ అన్నారు.
  ‘అయితే ఎప్పుడు చేయిస్తారు. ఆ బంగారానికి వెండితో పూత పూయించిన ఆ కంచాన్ని?’ సీతమ్మ భర్తను ప్రశ్నించింది.
  అందుకు సమాధానంగా చలమయ్య భార్య సీతతో ‘సీతా! రేపే నేను అంగడికి పోయి ఆ పని చేయించుకు వస్తాను. రేపు రాత్రయ్యేసరికి బంగారానికి వెండి పూత పూసిన ఆ కంచం అలమరాలో ఉంటుంది’ ఇతరులకు వినీ వినిపించనట్టుగా అన్నాడు.
  చాటుగా ఇదంతా ఒక నౌకరు చెవులు రిక్కించి మరీ వినడం భార్యాభర్తలిద్దరూ గమనించారు. కానీ ఆ నౌకరు ఎవరనేది గమనించినా అతన్ని చూసీ చూడనట్టుగా నటించారు. ఎందుకంటే అసలు వెండి కంచెం ఎలా అయినా తమకు చేరాలని.
  మరునాడు అంగడికి పోయి దొంగిలించబడిన వెండి కంచం లాంటి కంచు కంచాన్ని కొని దానికి వెండిపూత పూయించి వంట గది అలమరాలో పెట్టారు. అది చూడ్డానికి అచ్చు గుద్దినట్టుగా దొంగిలించబడిన వెండి కంచంలానే కన్పించింది.
  భార్యాభర్తలిద్దరూ అలమరాకి దగ్గర్లో ఎవరికీ కనిపించకుండా దాగున్నారు. అర్ధరాత్రయింది. ఇంతలో ఒక నౌకరు శబ్దం చేయకుండా అడుగులు వేసుకొంటూ అలమరా దగ్గరకు వచ్చి తను అంతకు ముందు దొంగిలించిన నిజమైన వెండి కంచాన్ని అక్కడ ఉంచి, కంచు కంచానికి వెండి పూత పూయబడిన కంచాన్ని బంగారం కంచంగా భావించి దానిని తీసుకువెళ్లడం గమనించారు.
  అలా తీసుకువెళ్లిన నౌకరు ఎవరో కాదు తాము నమ్మకస్థుడు అనుకున్న నౌకరు మల్లన్న.
  అసలు వెండి కంచం తమకు దక్కినందుకు భార్యాభర్తలిద్దరూ ఎంతో సంబరపడి దానిని తీసుకొని వెళ్లి రహస్య గదిలో దాచిపెట్టారు. మరెప్పుడూ దానిని బయటికి తీయలేదు.
  తమ దగ్గర నమ్మకం పోగొట్టుకున్న మల్లన్నను ఏదో వంకతో పని నుండి తీయించేశారు ఆ భార్యాభర్తలిద్దరూ.


  0 0

  జో తవ్వడం ఆపి ఆ గోతి వంక చూశాడు. తూర్పు నించి వచ్చే ఉదయ రేఖల్లో అది లోతుగా కనిపించింది. అతను ఆ గోతిని తవ్వడం అది రెండో రాత్రి. తను కోరుకున్న మేరకి గుంట ఏర్పడిందని అతను సంతోషించాడు. జో కొన్ని సంవత్సరాలుగా ఆ స్మశానంలో తవ్విన వందలాది సమాధుల్లాంటిదే అది కూడా. ఐతే వాటకీ, దీనికీ స్వల్ప తేడా ఉంది. అదే పరిమాణం. అన్ని గోతులూ మూడు అడుగుల వెడల్పు, ఆరు అడుగుల పొడవు, నాలుగు అడుగుల లోతు ఉంటాయి. ఇది మాత్రం ఆరడుగుల లోతుంది. మిగిలిన గోతులు తవ్వాక అతను ఎప్పుడూ తన సామాను తీసుకుని పికప్ వేన్‌లో స్మశానంలోని గేట్లోంచి వెంటనే బయటకి వెళ్లిపోతాడు. ఈ ఉదయం కానీ, క్రితం ఉదయం కానీ జో అలా వెళ్లలేదు.
  తమ ఆ అంతిమ విశ్రాంతి ప్రదేశంలోకి వచ్చే రిడ్జ్ సిటీలోని ప్రముఖుల్లో ఎవరైనా ఒకవేళ జో తవ్విన ఆ గోతిని చూసినా పట్టించుకునేవారు కారు. జోకి గోతులు తవ్వడం సాధారణ పని. తాపీ మేస్ర్తి పనిలా, లేదా గంటకి ఇంతని ఇచ్చే మరో ఇతర పనిలానే జో భావిస్తాడు. ఫారెస్ట్ వ్యూ సెమెట్రీలో పద్దెనిమిది సంవత్సరాల క్రితం జో ఆ పనిలో చేరాడు. అది సమాధికి ఇంత అని ఇచ్చే పనైనా ఆ ఆదాయంతో అతని కనీస అవసరాలన్నీ తీరుతున్నాయి. జో అవసరాలు తక్కువ.
  అతనికి శనివారం రాత్రి షార్కర్స్ బార్‌లో జరిగింది గుర్తొచ్చింది. హెలెన్ కూడా. చాలా మంది ఆడవాళ్లకి అతని వృత్తి గురించి తెలిసాక వాళ్లు అతనికి దూరమయ్యారు. హెలెన్ కాలేదు. ఆ రాత్రి అతనికి ఆమె టోస్ట్ చెప్పింది.
  గిల్రాయ్ కూడా. తామిద్దరూ ఎప్పుడు పది మంది ముందు కలిసినా గిల్రాయ్ సూటిగా కాకపోయినా పరోక్షంగా జో వృత్తి మీద వ్యంగ్య బాణాలని విసురుతూంటాడు. శనివారం రాత్రుళ్లు హోడియాక్ బార్‌లో, మిత్రుల ఇళ్లల్లో గిల్రాయ్ తరచు జోకి తారసపడుతూంటాడు.
  జో ఓ శనివారం రాత్రి బార్లో ఓ ఆకర్షణీయమైన విధవరాలితో కలిసి తాగుతూంటే గిల్రాయ్ వాళ్లని చూసి చేతిలోని మద్యం గ్లాస్‌తో వారి దగ్గరికి వచ్చి అడిగాడు.
  ‘జో! నీ కోట్ చాలా ఖరీదైంది. క్రితం వారం నువ్వు గోతిని తవ్వి పాతిపెట్టిన శవం మీది కోటా ఇది? దీన్ని దొంగిలించావా?’
  తక్షణం ఆ విధవరాలి కళ్లల్లోని షాక్‌ని జో గమనించాడు. ఆ తర్వాత మళ్లీ ఆమె అతనికి ఫోన్ చేయలేదు. జో చేస్తే ఏవో కుంటి సాకులు చెప్పి తన డేటింగ్‌ని ముగించింది. ఇలాంటి అనేక సందర్భాలలో జోలో గిల్రాయ్ మీద కోపం చెలరేగినా దాన్ని అతను అణచుకుంటూ వస్తున్నాడు. గిల్రాయ్ చెల్లెలు ఆ స్మశానం చైర్మన్ ఫాస్టర్ భార్య. గిల్రాయ్‌తో పోట్లాడితే తన ఉద్యోగం పోయే ప్రమాదం ఉందని జోకి తెలుసు.
  రిడ్జ్ సిటీకి పదహారు మైళ్ల దూరంలోని షార్కర్స్ బార్లో క్రితం శనివారం రాత్రి జో ఉన్నప్పుడు అక్కడికి గిల్రాయ్ వస్తాడని ఎదురుచూడలేదు.
  ‘హెలెన్. మనం చాలాసార్లు కలిశాం. నువ్వు నాకు నచ్చావు. మనం పెళ్లి చేసుకుందాం. ఏమంటావు?’ హెలెన్ చేతివేళ్లు, అతని చేతి వేళ్లు పెనవేసుకుని ఉండగా అడిగాడు.
  ఆమె సమాధానం చెప్పే లోగానే గిల్రాయ్ జో భుజం మీద గట్టిగా చరిచి చెప్పాడు.
  ‘జో. నువ్విక్కడా?’
  ఆ ఆహ్వానించబడని అతిథి వాళ్ల ముందు కుర్చీలో కూర్చున్నాడు. హెలెన్, జోల చేతివేళ్లని చూసి అడిగాడు.
  ‘ఇతని జీవితంలోకి నువ్వు వెళ్లాలనుకుంటున్నావా?’
  ‘ఏం?’
  ‘ఇతను ఏదో రోజు గొప్ప యురేనియం గని యజమాని అవుతాడు. అది బంగారంకన్నా ఖరీదైంది.’
  ‘యురేనియం?’
  ‘అవును. జో వారానికి రెండు, మూడుసార్లు దాని కోసం తవ్వుతూంటాడు. అవునా జో?’ గిల్రాయ్ ఎగతాళిగా నవ్వుతూ అడిగాడు.
  గిల్రాయ్‌ని చితకబాదాలన్న కోరికని జో అణచుకున్నాడు.
  ‘నీకు గనుల మీద ఆసక్తి ఉందని ఎప్పుడూ చెప్పనే లేదే?’ హెలెన్ జోని అడిగింది.
  ‘అది రహస్యంగా ఉంచడాన్ని నువ్వు తప్పు పట్టకూడదు హెలెన్. అతను తవ్విన గోతుల్లోకి వెళ్లాలని రిడ్జ్ సిటీ
  పౌరుల్లోని ప్రముఖులు చచ్చిపోతున్నారు. అవును. చచ్చిపోతున్నారు.’
  జో వెంటనే గ్లాస్ ఎత్తి అందులోని కాక్టెయిల్‌ని పూర్తి చేశాడు.
  ‘జోకి ఏదో రోజు తను వెదికేది దొరికాక ఆ పని మానేస్తాడు. కాని ఫారెస్ట్ వ్యూ సెమెట్రీ నాలుగు అడుగుల లోతులో ఎన్నిచోట్ల తవ్వినా నీకు యురేనియం దొరకదు జో’ గిల్రాయ్ పెద్దగా నవ్వుతూ అతన్ని అవహేళన చేశాడు.
  ‘నాకు అర్థం కాలేదు’ హెలెన్ చెప్పింది.
  ‘నిన్ను ఆశ పెట్టడం నా అభిమతం కాదు. కాని జో సమాధులు తవ్వుతూంటాడని నీకు ఇంకా తెలీదా?’
  ‘సమాధులు తవ్వుతాడా?’ ఆమె జో వంక చచ్చిన ఎలుక వంక చూసినట్లుగా చూస్తూ అడిగింది.
  గిల్రాయ్ ఫాస్టర్ బావమరిది అవడం అతన్ని ఎప్పటిలా దెబ్బల నించి కాపాడింది. హెలెన్‌ని మళ్లీ కలుద్దామని జో ఆ తర్వాత చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మూడోసారి ఇక తను కలవనని మర్యాదగా ఫోన్‌లో తిరస్కరించింది.
  జో మరోసారి ఆ గోతిలోకి చూశాడు. శవాన్ని దాచడానికి సమాధి గోతికన్నా మంచి ప్రదేశం ఇంకోటి ఏముంటుంది? అది అప్పటికే శవం ఉన్న సమాధి.
  అతని మనసు సంతోషంతో గంతులు వేసింది. తనకా ఆలోచన వచ్చినందుకు జో తనని తానే అభినందించుకుని, పరికరాలను వేన్‌లో వేసి, నలభై నిమిషాలలు డ్రైవ్ చేసి తన ఇంటికి చేరుకున్నాడు.
  మర్నాడు అతనికి గోతిని తవ్వమని ఫోన్ రాలేదు. ఐనా నిరాశ చెందలేదు. వారంలో ఒకటి, రెండు సార్లు ఆ పని చెప్పే ఫోన్ కాల్స్ తనకి వస్తూంటాయని అతనికి అనుభవపూర్వకంగా తెలుసు.
  మర్నాడు సాయంత్రం అతను ఓ రెస్ట్‌రెంట్‌లో భోజనం చేస్తూ ఈవెనింగ్ పేపర్‌లో లేడి బట్టర్‌ఫీల్డ్ మరణవార్తని చదివాడు. ఆ వింత ఐశ్వర్యవంతురాలైన ఆవిడ గురించి రెండు కాలాలు రాశారు. ఈజిప్ట్ నించి ఆవిడ అనేక పురాతన వస్తువులని తెచ్చిందని గతంలో జో చదివాడు. ఆవిడ తన శవాన్ని ఓ పిరమిడ్‌లో పాతించాలని ప్రయత్నించింది. కాని ఈజిప్షియన్ ప్రభుత్వం అందుకు అంగీకరించమని చెప్పింది. దాంతో ఆవిడ తన ఆఖరి విశ్రాంతి ప్రదేశంగా ఫారెస్ట్ వ్యూ సెమెట్రీనే ఎన్నుకుందని, ఆవిడ అక్కడ అందుకు స్థలం కొన్నదని చదివాడు.
  మర్నాడు జో బాస్ ఫ్రెడ్ ఫోన్ చేసి లేడి బట్టర్‌ఫీల్డ్ అంతిమ కార్యక్రమం ఆదివారం జరుగుతుందని, సమాధి గోతిని తవ్వి సిద్ధం చేయమని కోరాడు. జో రిసీవర్ని క్రేడిల్ మీద ఉంచుతూ చాలా రోజుల తర్వాత బయటకి
  నవ్వాడు.
  శనివారం రాత్రి గిల్రాయ్ ఎప్పటిలానే అనేక బార్లు తిరుగుతూ తలో చోట ఓ పెగ్ తాగాడు. తెల్లారుఝామున అతను పర్వత పాదంలోని తన ఇంటికి ఒంటరిగా తిరిగి వస్తాడని తెలిసిన జో, తన వేన్‌ని కొద్ది దూరంలో పార్క్ చేసి రాత్రి పనె్నండు నించి అతని ఇంటి బయట మెట్ల మీద కూర్చుని ఎదురుచూడసాగాడు.
  రాత్రి మూడున్నరకి దూరం నించి వచ్చే కారు హెడ్‌లైట్లు కనిపించాయి. వెంటనే అతను లేచాడు. కారు గేరేజ్ బయట ఆగింది. దాన్లోంచి గేరేజ్ తలుపు తెరవడానికి గిల్రాయ్ దిగాడు. కారు తలుపు తెరిచినప్పుడు వెలిగిన వెలుతురులో కార్లో ఇంకెవరూ లేరని జో గ్రహించాడు. ద్వేషంతో, బలంతో జో వేగంగా పరిగెత్తుకెళ్లి తన తలతో అతని వెనె్నముకని వెనక నించి కుమ్మాడు. దాంతో అతను కిందపడ్టాడు. అతని మెడని వెనక నించి చులాగ్గా పిసికాడు. ఆరడుగుల జో అతనికన్నా బలవంతుడు. కాబట్టి ఐదడుగులు అంగుళం పొడవుండే గిల్రాయ్‌ని ఆట్టే సేపు ఎదిరించలేక పోయాడు.
  వెంటనే తన వేన్‌ని తెచ్చి అతని శవాన్ని అందులో ఎక్కించుకుని సరాసరి లేక్‌వ్యూ సెమెట్రీకి చేరుకున్నాడు. దాన్ని గోతిలో వేసి పరికరాలతో గోతి బయట ఉన్న మట్టిని లోపల కప్పెట్టాడు. అతని శవం మీద అడుగు మేరకి మట్టి కప్పాక కొలిచాడు. ఇక సరిగ్గా నాలుగు అడుగుల లోతుంది. లేడీ బట్టర్‌ఫీల్డ్‌కి తెలీకపోయినా గిల్రాయ్ ఆవిడ కింద అడుగు దూరంలో ఆవిడకి శాశ్వత సన్నిహితుడు అవుతాడు.
  జో సెమెట్రీ గేట్లని మూసి తాళం వేసి బయటకి వచ్చేసరికి దాదాపు నాలుగు అవుతోంది. శవంతోపాటు తన ఐదేళ్ల అవమానాలని కూడా పాతిపెడుతున్నాను అనుకున్నాడు. ఒకవేళ పోలీసులు తనని అనుమానించినా వాళ్లకి శవం దొరకాలి. అది ఎవరూ ఊహించని ప్రదేశంలో తను దాచాడు.
  ఓ పోలీస్ పెట్రోల్ వేన్ అతని వేన్ పక్క నించి వెళ్లింది. స్థానిక పోలీసులు అందరికీ జో వేన్ అనేకసార్లు కనిపిస్తూంటుంది. అతను ఎండలో కాక రాత్రుళ్లు సమాధి గోతులని తవ్వుతాడని వారందరికీ తెలుసు. కాబట్టి అతన్ని వాళ్లు ఎప్పుడూ ఆపరు. అలాగే ఆ తెల్లవారుఝామున కూడా జోని వాళ్లు ఆపలేదు.
  ఇంటికి వెళ్లాక స్నానం చేసి, ఎప్పటిలా కాఫీ కలుపుకోలేదు. ఇందుకోసం దాచిన క్వార్టర్ స్కాచ్ బాటిల్‌ని తెరిచి రెండు పెగ్‌ల విస్కీని తాగి పడుకున్నాడు.
  * * *
  టెలీఫోన్ మోగే ధ్వనికి అతనికి అకస్మాత్తుగా మెలకువ వచ్చింది. రిసీవర్ అందుకున్నాడు.
  ‘ఎక్కడ చచ్చావు?’ అతని బాస్ కంఠం కోపంగా వినిపించింది.
  ‘ఇంట్లోనే ఉన్నా. కునుకు తీస్తున్నాను’ జో కళ్లు నులుముకుంటూ చెప్పాడు.
  ‘కునుకా? గంట నించి ఎన్నిసార్లు చేశానో తెలుసా?’
  ‘బట్టర్‌ఫీల్డ్ సమాధి సిద్ధం చేశాను’
  ‘అనుకున్నాను. గంట క్రితం ఆవిడ లాయర్ ఫోన్ చేసి పాతిపెట్టే సూచనలు తనకి ఆలస్యంగా అందాయని చెప్పాడు. నువ్వు తవ్విన గోతిలో మార్పులు చేయాలి జో’
  వెంటనే అతని మత్తు వదిలి కళ్లు విశాలమయ్యాయి.
  ‘మార్పులా? ఏం మార్పులు?’
  ‘ఈజిప్షియన్ రాణుల్లా ఆవిడ పరలోకానికి చేరుకున్నాక తనకి అవసరమయ్యే వస్తువులని ఈజిప్ట్ నించి కొని తెచ్చిందిట. వాటన్నిటినీ తన సమాధిలో పాతమని జాబితాని లాయర్‌కి ఇచ్చిందిట. వాటి సంగతి ఇప్పుడే తెలిసిందని, గంట క్రితం ఫోన్ చేసి చెప్పాడు. సరిగ్గా ఇంకో గంటలో ఆవిడ శవాన్ని పాతాలి. లేదా అంతా రసాభాస అవుతుంది. చాలామంది అతిథులు వస్తారు. శవపేటిక పైన ఆహార పదార్థాలని ఉంచాలిట.’
  ‘పైనా?’
  ‘అవును. అందుకే నీకు అనేకసార్లు ఫోన్ చేశాను. స్ట్ఫ్ చేసిన తొమ్మిది పెంపుడు పిల్లులు శవపేటిక కిందకి వెళ్లాలిట. ఇంకో మూడు అడుగులు ఎక్కువ లోతు తవ్వాలి’
  ‘సరే. వెంటనే వెళ్లి ఆ ఏర్పాటు చేస్తాను’ జో చెప్పాడు.
  ‘నువ్వు వెళ్లక్కర్లేదు. నేను ఆ పని చూడమని టోనీని పంపాను. నిన్న రాత్రంతా నువ్వు అలసిపోయావు కాని పడుకో. పది నిమిషాల్లో టోనీ తవ్వడం పూర్తి చేస్తాడు. స్వర్గానికి తొమ్మిది పిల్లులు, ఆహార పదార్థాలు, డ్రస్‌లతో ఆవిడ నిజంగా వెళ్లగలదేనా? పిచ్చికాకపోతే. అదీ సంవత్సరం అంతా నవ్వుకునే అతి పెద్ద జోక్ అవుతుంది’ ఫ్రెడ్ నవ్వు పెద్దగా వినిపించింది.
  ‘కాదు. దానికన్నా అంతా నవ్వుకునే ఇంకో జోక్ ఉంది. గిల్రాయ్ శవం బయటపడటం’ అంత భయంలో కూడా జోకి ఆ ఆలోచన స్ఫురించింది.
  (శామ్ ఎస్ టైలర్ కథకి స్వేచ్ఛానువాదం)


  0 0

  మీకో ప్రశ్న

  సగరుడు గర్భంలో ఉండగా అతని తల్లికి విషం పెట్టిన సవతి పేరేమిటి?
  ==================================================

  అక్కడ గుమిగూడిన మహర్షులంతా సాటిలేని తేజస్సు గల ఆ సోదరుల గగుర్పాటు కలిగించే సంగమాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. అక్కడ అంతర్థానంగా ఉండి చూసే మునిగణాలు, సిద్దులు, దేవర్షులు మహాత్ములైన ఆ రామభరతులని ప్రశంసించి ఇలా అనుకున్నారు.
  ‘్ధర్మవేత్తలు, ధర్మం మీద ఆసక్తిని చూపించే ఆ సోదరులని కొడుకులుగా కన్న దశరథుడు ధన్యుడు. వీరి మాటలని విని వీరి మీద మనకి ఇష్టం కలుగుతోంది కదా?’
  తర్వాత ఆ ఋషులంతా కలిసి వచ్చి భరతుడితో చెప్పారు.
  ‘ఓ భరతా! నువ్వు ఉత్తమ కులంలో పుట్టావు. గొప్ప బుద్ధిమంతుడివి. మంచి ఆచారాలు కలవాడివి. గొప్ప కీర్తి కలవాడివి. నీకు తండ్రి మీద గౌరవ భావం ఉంటే రాముడు చెప్పినట్లు చెయ్యి. రాముడు తండ్రి ఋణాన్ని తీర్చాలని మేం ఎల్లప్పుడూ కోరుకుంటాము. దశరథుడు కైకేయి ఋణాన్ని తీర్చబట్టే స్వర్గానికి వెళ్లాడు.’
  గంధర్వులు, మహర్షులు, రాజర్షులు అంతా ఇంత దాకానే చెప్పి తమ స్థానాలకి వెళ్లిపోయారు.
  చూసే వాళ్లకి శుభాలని ఇచ్చే రాముడు మంగళకరమైన ఆ మాటలని విని సంతోషించి, వికసిత ముఖంతో ఆ ఋషులని పూజించాడు. భరతుడు మాత్రం చాలా భయపడుతూ చేతులు జోడించి, తొట్రుపాటుతో రాముడితో మళ్లీ చెప్పాడు.
  ‘ఓ రామా! రాజధర్మం, కులధర్మం అవిచ్ఛిన్నంగా జరగడాన్ని దృష్టిలో ఉంచుకుని నా ప్రార్థనని, నా తల్లి ప్రార్థనని మన్నించు. ఈ విశాలమైన రాజ్యాన్ని రక్షించడానికి అనురాగం గల ఈ పౌరులని, జానపదులని సంతోషపెట్టడానికి నేను ఒక్కణ్ణే సమర్థుడిని కాను. మన బంధువులు, సైనికులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అంతా, భూమిని దునే్న వాళ్లు మేఘాల కోసం ఎదురు చూసినట్లుగా నువ్వే కావాలని ఎదురు చూస్తున్నారు. మహా బుద్ధిశాలివైన ఓ రామా! ఈ రాజ్యాన్ని స్వీకరించి నిలబెట్టు. ఈ లోకాన్ని పాలించడానికి నువ్వే సమర్థుడివి.’
  భరతుడు అలా ప్రేమగా మాట్లాడుతూ రాముడ్ని ప్రార్థిస్తూ అతని పాదాల మీద పడ్డాడు.
  నల్లనివాడు, కలువ రేకుల్లాంటి కళ్లు గల, మదించిన హంస స్వరం లాంటి స్వరం గల భరతుడ్ని రాము తన ఒళ్లో కూర్చోపెట్టుకుని చెప్పాడు.
  ‘నాయనా! నీకు సహజంగాను, గురుశిక్షణ వల్ల మంచి బుద్ధి ఉంది. దాంతో నువ్వు ఈ భూమిని పాలించడానికి సమర్థుడివి. బుద్ధిమంతులైన మంత్రులతోను, అమాత్యులతోను, మిత్రులతోను కలిసి ఆలోచించి, ఎంత పెద్ద పనులైనా చేయించు. చంద్రుడి కాంతి తొలగిపోవచ్చు. హిమవత్ పర్వతం మీద మంచు లేకుండా పోవచ్చు. సముద్రం తీరాన్ని దాటచ్చు. నేను మాత్రం తండ్రి ప్రతిజ్ఞని అతిక్రమించను. కోరిక వల్లో, ఆశ వల్లో నీ తల్లి కైక ఇదంతా చేసిందని నువ్వు మనసులో ఉంచుకోక తల్లిగా ఆమెని గౌరవించు.’
  తేజస్సులో సూర్యుడితో సమానమైన వాడు, ప్రతిపత్తులో ఉదయించిన చంద్రుడి దర్శనం వంటి దర్శనం కలవాడు, కౌసల్య కొడుకైన రాముడి మాటలు విని భరతుడు చెప్పాడు.
  ‘ఓ పూజ్యుడా! బంగారం తో అలంకరించిన ఈ పాదుకల పైన నీ పాదాలని ఉంచు. ఈ పాదుకలే సమస్త లోకానికి యోగ క్షేమాలు సమకూర్చగలవు’
  మహా తేజశ్శాలైన రాముడు ముందు అభ్యంతరం చెప్పినా చివరికి జనుల కోరిక మీద పాదుకలని తొడుక్కుని, విడిచి వాటిని మహాత్ముడైన భరతుడికి ఇచ్చాడు. భరతుడు వాటికి నమస్కరించి రాముడితో చెప్పాడు.
  ‘శతృసంహారకుడివి, వీరుడివైన ఓ రామా! నేను జటలని, నార చీరలని ధరించి, ఫల మూలాలనే తింటూ రాజ్య భారాన్నంతా నీ పాదుకల మీదే ఉంచి నగరం బయటే నీ రాకకై ఎదురుచూస్తూ పధ్నాలుగు సంవత్సరాలు నివసిస్తాను’
  రాముడు భరతుడి మాటలకి అంగీకరించి, అతన్ని, శతృఘు్నణ్ణి ప్రేమపూర్వకంగా కౌగిలించుకుని భరతుడితో చెప్పాడు.
  ‘ఓ భరతా! నా మీద, సీత మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను. నీ తల్లైన కైకేయిని భక్తిగా చూసుకో. ఆమె మీద కోపం చూపించకు.’
  రాముడు కళ్ల నించి నీళ్లు కారుతూండగా వెళ్లడానికి భరతుడికి అనుమతి ఇచ్చాడు. ప్రతాపవంతుడు, ధర్మవేతె్తైన భరతుడు చక్కగా అలంకరించబడ్డ ఆ పాదుకలని పూజించి, రాముడికి ప్రదక్షిణం చేసి వాటిని నెత్తిన ధరించి బయలుదేరాడు. స్వధర్మం పైన హిమవత్ పర్వతంలా స్థిరంగా నిలబడ్డ రాముడు అక్కడికి వచ్చిన అందరినీ, గురువులని, మంత్రులని, ప్రకృతులనీ భరత శతృఘు్నలని యథాక్రమంగా అభినందించి వాళ్లని పంపేశాడు. విచారంతో కంఠాల్లో కన్నీళ్లు అడ్డం పడటంతో తల్లులు రాముడికి వీడ్కోలు మాటలు చెప్పలేకపోయారు. రాముడే తల్లులు అందరికీ నమస్కరించి, అందర్నీ కౌగిలించుకుని వీడ్కోలు పలికాడు.

  (అయోధ్య కాండ సర్గ 112)
  హరిదాసు ముగించిన వెంటనే ఓ పాతికేళ్ల యువకుడు లేచి హరిదాసుతో చెప్పాడు.
  ‘నా పేరు రామదాసు. నేను రామాయణం మీద రీసెర్చ్ స్కాలర్‌ని. మీరు చెప్పిన కథంతా బావుంది కాని కొన్ని తప్పులు ఉన్నాయి. వాటిని చెప్తాను వినండి.’

  మీరా తప్పులని కనుక్కోగలరా?

  1.వశిష్ఠుడు రాజ పురోహితుడు. హరిదాసు మహామంత్రి అని మొదట్లోనే తప్పు చెప్పాడు.
  2.ప్రతీ పురుషుడికీ ఆచార్యుడు, తండ్రి, తల్లి అనే ముగ్గురు గురువులు ఉంటారు అని వాల్మీకి చెప్పాడు. కాని హరిదాసు తల్లిని వదిలేసి ఇద్దరు గురువులు అని చెప్పాడు.
  3.్భరతుడు దర్భలు పరవమని సుమంత్రుడితో చెప్పాడు. హరిదాసు వశిష్ఠుడితో చెప్పినట్లుగా తప్పు చెప్పాడు.
  4.హరిదాసు 111వ సర్గ ముగించి 112 ముగించినట్లుగా తప్పు చెప్పాడు.
  5.హరిదాసు చెప్పింది ఐదు కాదు. నాలుగు తప్పులే. + ఐదని చెప్పడం తప్పు.
  ---------------------------------------------------------------------------------------------------
  గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు

  గాయత్రి మంత్రంలోని తొమ్మిదవ బీజాక్షరం ‘గ’ ఏ కాండలో ఏ శ్లోకంలో వస్తుంది?
  కిష్కింధ కాండ 4-3లో తతః పరమ సంతుష్టో హనుమాన ప్లవ గర్షభః శ్లోకంలో.


  0 0

  ఫ్రశ్న: గోంగూర తినకూడని ఆహార పదార్థమా? ఏ జబ్బు వచ్చినా గోంగూరని మానేయమంటారెందుకని? గోంగూర వలన లాభ నష్టాలను వివరించగలరు.
  -జలసూత్రం రామాయణిం (ఒంగోలు)
  జ: గోంగూరని ఎంత ఇష్టపడతారో చాలామంది. దాన్ని తినడానికి అంత భయపడతారు కూడా! దానికి గల అతి పులుపే దాని ప్రతిష్ఠకీ, అప్రతిష్ఠకీ కూడా కారణం అవుతోంది.
  మనం రోజువారీ ఆహార పదార్థాలలో చింతపండు అధికంగా కలపటం వలన గోంగూర పులుపు అదనం అవుతుంది. కడుపులో యాసిడ్ మరింతగా పెరుగుతుంది. దాంతో ‘పెరుగన్నంలో నలకంత గోంగూర నంజుకున్నాను. అంతే.. కాళ్లూ చేతులూ పట్టేశాయి’ అంటుంటారు చాలామంది. ఇతర పులుపు పదార్థాల వాడకాన్ని పరిమితం చేసుకోగలిగితే గోంగూరని అప్పుడప్పుడూ తిన్నా పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చని దీని భావం.
  మన పూర్వీకులు గానీ, ఇతర రాష్ట్రాల వారు గానీ మనం తింటున్నంత వెర్రిపులుపు తినరు. అతిగా చింతపండు వాడకం వలన మనం మనకు తెలీకుండా చాలా అనర్థాలు తెచ్చిపెట్టుకుంటున్నాం. వైద్యశాస్త్రంలో అపాయకరమైన రసాయనాలు గోంగూరలో ఉన్నట్టుగా చెప్పలేదు. పడకపోవటం గోంగూరు జన్మతః వచ్చిన గుణమో లేక స్వభావమో ఎంత మాత్రమూ కాదు. దాన్ని వండే తీరులోనే మనం మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవలసి ఉంది. గోంగూర ఏ పాపం చేసుకునీ పుట్టలేదనీ, అది జబ్బు మొక్క అనే ముద్ర వేయటం తగదనీ గుర్తించాలి.
  గోంగూరకు 4వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఆఫ్రికా దీని పుట్టిల్లు. భారతదేశానికి ఎప్పుడు వచ్చిందో తెలియదు. ప్రాచీన ఆయుర్వేద గ్రంథాల్లో గోంగూర గురించి వివరాలు లేకపోవటాన, దీని సంస్కృత నామాలు జాతీయ ప్రసిద్ధి కాకపోవటాన ఇది భారతదేశంలో మరీ ప్రాచీన శాకం కాకపోవచ్చని భావిస్తున్నారు.
  అయితే, గోంగూరకు అమరకోశంలో కర్ణికారం, పరివ్యాధ అనే సంస్కృత పర్యాయ నామాలున్నాయి. కర్ణికార పుష్పము అంటే కొండగోంగూర పువ్వు. అభిమన్యుడి రథం మీద ఎగిరే జెండా ఈ గుర్తు కలిగి ఉంటుందట! మూలభారతం భీష్మ పర్వం (6.26,27)లో శివుడు కర్ణికార పుష్పమాలను ధరించాడని ఉంది. కర్ణికార వనంలో వేదవ్యాసుడు తపస్సు చేసినట్లు కూడా మూలభారతంలో ఉంది.
  పాల్కురికి సోమనాథుడు ‘కుంచంబు గొండగోగులఁ బూజసేసి’ అంటూ శివపూజ చేయనిదే ముద్ద ముట్టకూడదనే నియమం కలిగిన ఒక వర్తకుడు, బోర్లించిన కుంచాన్ని శివలింగంగా భావించి కొండగోగు పూలతో పూజ చేసిన కథలో వర్ణించాడు.
  పచ్చని కాంతులు చిమ్మే ఎర్రని సూర్యబింబం లాంటి పద్మంలో కేసరాలుండే కర్ణికలాగా ఉంటుంది గోంగూర పువ్వు. మందారం, బెండ, తుత్తురబెండ, గోంగూర ఇవన్నీ ఒకే కుటుంబానికి చెందిన మొక్కలు. గోగుపూలతో అందంగా గొబ్బెమ్మలను అలంకరించటం సంప్రదాయం. గోగులు పూచే గోగులు పూచే ఓ లచ్చీ గుమ్మడి - లాంటి జానపద గేయాలలో కూడా గోంగూర పూల గురించే ఉంది గానీ ఆకు గురించి కనిపించదు. అంటే, మొదట్లో తెలుగు ప్రజలకు గోంగూర మొక్క పూలమొక్కే గానీ, కూర మొక్క కాకపోవచ్చని దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. బ్రిటీషు యుగంలో మిరపకాయల రాక తరువాత పులుపు వాడకానికి తెలుగువారు ఎక్కువగా లోనుకావటం మొదలుపెట్టారు. అలా గోంగూర ఆకు కూడా వంటగదిలోకి చేరింది. ‘గోను మొక్క ఆకుని గోనుగూర, గోంగూర, గోఁగూర అంటారు. గోఁగు మొక్క, గోఁగాకు అనే పేర్లు కూడా వాడకంలో ఉన్నాయి. గోంగూరతో కూర, పప్పు, పులుసు, పచ్చడి, ఊరుగాయ పచ్చడి ఇంకా ఇతర వంటకాలు అనేకం చేస్తుంటారు. మాంసంతోపాటుగా గోంగూరనీ కలిపి వండుతుంటారు కూడా!
  గోంగూరను అమెరికన్లు, ఇతర యూరోపియన్లూ, కెనాఫ్ అని పిలుస్తారు. ళషర్ఘీశళళ దళౄఔ అనే పేరుతో కూడా కొన్ని దేశాల్లో పిలుస్తారు. తెలుగు ప్రజలతో ఈ మొక్కకు అనుబంధం ఉందన్న సంగతి ప్రపంచాని కంతటికీ తెలుసు. మనం గోంగూర పచ్చడి చేసుకుంటే యూరోపియన్లు ళశ్ఘచి ఔళఒఆ్య తయారుచేసుకుంటారు. ఇంచుమించు రెండూ ఒకటే!
  మొదటగా గోంగూరని నీళ్లలో ఉడికించి, ఆ నీటిని వార్చేయాలి. మిగిలిన గుజ్జులో సంబారాలు చేర్చి తయారుచేసిన పులుసు కూర లేదా పచ్చడి చాలా రుచిగా, నిరపాయకరంగా ఉంటుంది. వాతాన్ని, వేడినీ కలిగించని వాటితో మాత్రమే గోంగూరను తయారుచేసుకోవాలి. తగినంత మిరియాల పొడి, ధనియాల పొడి కలిపి వండితే ఎలాంటి ఇబ్బందీ పెట్టకుండా ఉంటుంది. రుచిని పెంచుతుంది. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. కానీ గోంగూరలో చింతపండు రసం పోసి, పులిహోర గోంగూర పేరుతో మరింత పుల్లగా గోంగూర ఊరుగాయలు వగైరా పెడుతుంటారు మనవాళ్లు. ఇదే ప్రధానంగా అపకారం చేయటానికి కారణం.
  శుద్ధ గోంగూరని ధనియాల పొడితో కలిపి వండుకుంటే, చక్కని ఆకలిని కలిగిస్తుంది. లివర్ వ్యాధుల్లో మేలు చేస్తుంది. రేచీకటితో బాధపడే వారికి చూపు పెంచుతుంది. మలబద్ధకం పోగొడుతుంది. వీర్యవృద్ధీ, లైంగిక శక్తీ, లైంగిక ఆసక్తీ పెంపొందింప చేస్తుంది. ఉడికించిన గోంగూరకు ముద్దని కడితే సెనగడ్డలు మెత్తపడి త్వరగా పక్వానికొస్తాయి. రక్తం గూడు కట్టిన కౌకు దెబ్బలు తగిలిన చోట దీనితో కట్టుగడితే వాపు అణిగిపోతుంది. దేశవాళీ గోంగూర ఆకుల్లో ఉండే ఇనుము రక్తహీనతకు జవాబునిస్తుంది. కొండగోగు మొక్కల్ని వ్రేళ్లతో సహా పీక్కొచ్చి అమ్ముతారు. మనం ఆకుల్ని వలుచుకొని మొక్కని అవతల పారేస్తాం. అలా పారేయకుండా దాని వేళ్లను దంచి, చిక్కని కషాయం కాచుకొని పంచదార కలుపుకొని తాగవచ్చు. కొత్తిమీర కట్ట కొన్నప్పుడు వేళ్లతో సహానే అమ్ముతుంటారు. ఆ వేళ్లు కూడా దీనితో కలిపి టీలాగా కాచుకుంటే వేసవి కాలంలో వడదెబ్బ కొట్టనీయని పానీయంగా ఉపయోగపడుతుంది.
  గోనుమొక్క నారని పురిపెట్టి పురికొస తీస్తారు. దానితో నేసిన పట్టాని ‘గోనుపట్టా’ అనీ, సంచీని ‘గోను సంచీ’ అనీ పిలుస్తారు. గోతాము పదం కూడా గోనుకు సంబంధించినదే కావచ్చు. గోను సంచుల్లో ధాన్యాదుల్ని నింపి, ఎద్దుల బండి మీద అడ్డంగా వేస్తారు కాబట్టి ‘గోతాము’ అనే పేరు వచ్చిందని కొందరు చెప్తారు. కానీ, వౌలికంగా ఇది గోను శబ్దానికి సంబంధించిన పదం. గోవు ఎంత ముఖ్యమో, గోను కూడా అంతే ముఖ్యం.. సద్వినియోగపరచుకొనే తెలివి ఉండాలి.


  0 0

  ఆ జీవులు తమకు క్రొత్తగా అనుభవానికి వస్తున్న ఈ దశ ఏమిటా-అని ఆలోచించుకునే లోపలే, వారి మనసులు వారి వశం తప్పిపోతున్నాయి.
  (i) కొందరు ఆ సమయానికి ఇంకా గొడ్లకు పాలు పితుకుతున్నారు.
  (ii) కొందరు పాలముంత పొయ్యి మీద పెట్టబోతున్నారు.
  (iii) కొందరు పొయ్యి మీద అన్నం కలియ బెట్టబోతున్నారు.
  (iv) కొందరు వడ్డిస్తున్నారు.
  v) కొందరు పిల్లలకు పాలిస్తున్నారు.
  vi) కొందరు భర్తలతో సరసాలాడుతున్నారు.
  (vii) కొందరు అన్నం తింటున్నారు.
  viii) కొందరు స్నానం చేస్తున్నారు.
  ix) కొందరు అలంకరించుకుంటున్నారు.
  (x కొందరు ఇళ్ళు సర్దుకుంటున్నారు.
  వేణునాదాల వెల్లువకు వారంతా ఎక్కడివారక్కడే నిశే్చష్టులైపోయారు. ఏ పనీ జరగడంలేదు. ఏ ఆలోచనా తోచడం లేదు. ఏమి జరుగుతోందో తెలియటం లేదు.
  అయితే చిత్రమేమంటే - పొయ్యిమీది పాలు పొంగిపోతున్నా, కుండలో అన్నం మాడిపోతున్నా, తల్లి పాలివ్వడం ఆపేసినా, సరసాలాడే భార్య మొద్దు నిద్దరలో పడిపోయినా, ఇళ్ళు చక్కదిద్దే కోడలు ఆవలించి గోడలకు వాలి, గుమ్మం దగ్గరే కునుకుదీసినా, భర్తలు గానీ, మామలు గానీ, పిల్లలు గానీ, ఏ ఒక్కరూ కోపగించుకోవడం లేదు. ఎవరికి వారు వినిపించే వేణుగాన మాధుర్యానికి మెత్తబడిపోయి, హృదయాలన్నీ సౌజన్యంతో నిండిపోయి, ఒక విధమైన ఆనందంలో తేలిపోయి, ‘‘అయ్యో! అలసిపోయారు పాపం’’ అని అనుకొంటూ సద్దుకు పోతున్నారు. ‘‘మన్యమానాః స్వ పార్శ్వస్థాన్ స్వాన్ స్వాన్ దారాన్ వ్రజౌకనః’’ (స్కం10- అధ్యా33-శ్లో39) (తమ తమ ఆడవారంతా తమ ప్రక్కనే వున్నారని భావిస్తూ) - అని మూలం.
  కొన్ని ఇళ్ళలో భర్తలో, సోదరులో, అత్తలో, కొడుకులో, వీరి పరిస్థితి చూసి, కంగారుపడి, వారెటూ కదలకుండా, మత్తులో పక్కకు జారిపోకుండా, కట్టుదిట్టాలు చేస్తున్నారు. అయినా సరే, ఆ గోపికల హృదయాలను గోవిందు డప్పటికే కొల్లగొట్టేశాడు. అందువల్ల వారి హృదయాలు వెనక్కు రాలేదు.
  వారీ స్థితిలో వుండగానే, వారి సూక్ష్మశరీరాలు వాళ్ళ స్థూల శరీరాలనుంచీ వెలువడి, మరొకరి కోసం చూడకుండా, తోటి గోపికలతో కూడా సంప్రదించకుండా, పరమాత్మ కోసం పరుగులు తీశాయి.
  కొందరు గోపికలకు తమ స్థూలశరీరాల్నుంచీ బయట కు వెళ్ళటం అంత సులభంగా సాధ్యం కాలేదు. ఈ దేహబంధాల్ని తెంచుకుని ఎలా బయటకు వెళ్ళాలో ఆ సమయంలో కంగారువల్ల వారికి అర్థం కాలేదు. అప్పుడు పూర్వజన్మ సంస్కారంవల్ల, వాళ్ళు కళ్ళు మూసుకుని, తీవ్రమైన ధ్యానంలో మునిగిపోయారు. ఆ దశలో ఉండగా దేహాలనుంచి ఎప్పుడు బయటపడ్డారో, ఎలా బయ టపడ్డారో, వారికి తెలియనే లేదు.
  ఇక్కడ భాగవతంలోని మూల శ్లోకాలను తీసుకుని పరిశీలిస్తే గానీ, తత్త్వం సరిగా అర్థం కాదు.
  అంతర్గృహగతాః కాశ్చిత్ గోప్యో-లబ్ధ వినిర్గమాః
  కృష్ణం తద్భావనాయుక్తా దధ్యుర్మీలిత లోచనాః ॥
  (్భగవతం-స్కంధం-10, అధ్యాయం-29, శ్లోకం-9)
  (్భవం : కొందరు గోపికలు ఇంట్లో వుండి పోయి (అంతర్గృహ గతాః) బయటకు వచ్చే విధానం తెలియక, కృష్ణ్భావనలో పడిపోయి, కళ్ళు మూసుకుని, ఆ కృష్ణుణ్ణే ధ్యానం చేశారు.)
  గమనిక : ఈ శ్లోకంలో అంతర్గృహగతాః అనే చోట అంతర్గృహం అనే పదానికి అంతరంగమనే అర్థం. దధ్యుః మీలితలోచనాః - అని ధ్యానాన్ని స్పష్టంగా చెబుతున్నారు.
  దీని వెనకాల శ్లోకంలో కొందరు గోపికలను వారి భర్తలూ, తండ్రులూ మొదలైనవారు నివారించారు అని వుంది. (వార్యామాణాః.) ఇక్కడ నివారణ అంటే ‘‘ఆ గోపికలు ఇల్లు వదిలి పారిపోబోతున్నట్టు, బంధువు లడ్డుపడి కట్టిపడేసినట్టూ’’ మనం భావిస్తే, అది పొరపాటే అవుతుంది. ఎందుకంటే-అదే శ్లోకంలో రెండవ భాగంలో ‘‘న న్యవర్తంత’’ (అడ్డం పెట్టినా ఆగలేదు) అని వుంది. ఇంట్లోని ఆడపిల్లలు పారిపోతుంటే, పెద్దవాళ్ళడ్డంపడ్డా కూడా ఆగకపోతే, ఈ సన్నివేశం ఒక ఇంట్లో గాక అనేక ఇండ్లలో జరిగితే, ఆ గ్రామమంతా అల్లకల్లోలమే అయి వుండాలి. కానీ, 33వ అధ్యాయం చివరలో, 39వ శ్లోకంలో, ఆ గ్రామాల్లోని మగవారెవరూ అసూయపడలేదనీ, వారి వారి ఆడవాళ్ళు వారి వారి ఇళ్ళలోనే వున్నట్టు భావించారనీ, వుంది. ఈ విషయాన్ని వెనుకటి చర్చలోనే చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ శ్లోకం చూద్దాం.
  నాసూయన్ ఖలు కృష్ణాయ
  మోహితా స్తస్య మాయయా ॥
  మన్యమానాః స్వపార్శ్వస్థాన్
  స్వాన్ స్వాన్ దారాన్ వ్రజౌకసః ॥
  (్భగవతం-స్కం10,అధ్యా-33,శ్లో-39)
  (ఇంకా వుంది)


  0 0

  కె.పరంజ్యోతి గారు ప్రఖ్యాత తబలా విద్వాంసులు. దాదాపు 75 సంవత్సరాలు సంగీతానికే అంకితమై, ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలిచ్చారు. అమెరికాలో నలభై ఏళ్లు నివసించి, ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. పండిట్ రవిశంకర్, హరిప్రసాద్ చౌరాసియా, సంతూర్ శివకుమార శర్మ, లక్ష్మీశంకర్, జి.ఎస్.సచ్‌దేవ్, వసంతరాయ్, నిఖిల్ బెనర్జీ వంటి ఎంతో గొప్ప కళాకారుల ప్రదర్శనలలో తబలా వాయించారు. మొహమ్మద్ రఫీ, తలత్ మెహమూద్, మహేంద్రకపూర్ వంటి సినీ గాయకుల ప్రదర్శనల్లో పాల్గొన్నారు. వీరికి ప్రపంచవ్యాప్తంగా వందల మంది శిష్యులు, ప్రశిష్యులు ఉన్నారు. వీరి జీవిత భాగస్వామి నిర్మల మంచి గాయని. వీరి అబ్బాయి ప్రశాంత్ తబలా విద్వాంసుడు, గాయకుడు, రంగస్థల నటుడు. కోడలు కూచిపూడి నర్తకి. మనవరాలు మాయాదేవి సంగీతంలో, నృత్యంలో, రచనలో నిష్ణాతురాలు. కుటుంబం మొత్తం కళాసేవకే అంకితమైనారు. పరంజ్యోతి అమెరికాలో ఫేర్‌వౌంట్ కెమికల్స్ వైస్‌ప్రెసిడెంట్‌గా రిటైరయ్యారు. మంచి గాయకులు కూడా.
  వారితో ముఖాముఖి ఇలా....
  * * *
  మా అమ్మానాన్నగార్లు కె.వి.రమణారావు, శ్రీమతి కృష్ణవేణి. నేను ఫిబ్రవరి 5, 1934న మద్రాస్‌లో జన్మించాను. భారత స్వాతంత్య్రం రాక మునుపు 1940 దాకా లాహోర్‌లో పెరిగాను. తరువాత నాగపూర్‌లో కొన్నాళ్లు ఉన్నాం. 1947లో వైజాగ్‌కు వచ్చాను. అప్పుడు నాన్నగారికి పరాలటిక్ స్ట్రోక్ వచ్చింది. మాది చాలా పెద్ద కుటుంబం. మేం అన్నదమ్ములం పెద్దక్కయ్య పిల్లలు అంతా కలిసి 11 మంది పిల్లలం కలిసి పెరిగాం. గాంధీగారు మరణించినప్పుడు నాన్నగారికి తీరని బాధ, వ్యధ కలిగింది. వారంలోనే ఫిబ్రవరి 7న నాన్నగారు ఆ బాధతోనే పోయారు. తరువాత కాకినాడ వెళ్లాం. అక్కడ తబలాతో పరిచయం ఏర్పడింది. మా అన్నయ్య స్నేహితుడు డా.ట్రాసీ మా ఇంటిలో తన తబలా ఉంచాడు. అప్పుడు అలా మొదలైన తబలాతో ప్రేమ ఇంతింతై వటుడింతై అని విశ్వరూపం దాల్చింది. తరవాత పెండ్యాల సూర్యనారాయణగారు, ఎ.ఎల్.ఎన్.శాస్ర్తీగారు, నిడమర్తి సత్యనారాయణ గారి వద్ద తబలా నేర్చుకున్నాను.
  ఎ.వి.ఎన్. కాలేజీ, వైజాగ్‌లో బిఎస్సీ చేశాను. ఆంధ్రా యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్. అప్పుడే కళాకుంజ్ కళాసంస్థతో పరిచయం. అక్కడ 48 ప్రదర్శనలు చేశాను. తలత్ మెహమూద్, పర్వీన్ సుల్తానాలతో పాటు కచేరీల్లో పాల్గొన్నాను. ఆ రోజుల్లోనే ఆర్.బి.కౌశల్ - శ్రీ దీప్‌చంద్ గారితో పరిచయం ఏర్పడింది. వారు నేవీలో పనిచేసేవారు. వారి శిష్యుడినయ్యాను. ఇద్దరం రోజూ ఐదారు గంటలపాటు తబలాతో కూర్చునేవాళ్లం. వారు తరువాత మా చెల్లెలు సుమతిని పెళ్లి చేసుకున్నారు. సుమతీ కౌశల్, ఉమా రామారావు ప్రఖ్యాత నర్తకీమణులు, నా చెల్లెళ్లు. ఉమా రామారావు శిష్యురాలినే మా అబ్బాయి వివాహం చేసుకున్నాడు. ఆంధ్రా యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్, ఎం.టెక్ ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాను. తరువాత ఐఐఎస్‌సి బెంగుళూరు యుజిసి స్కాలర్‌షిప్‌తో పిహెచ్.డి. మొదలుపెట్టాను. ఆ రోజుల్లో 450 రూపాయలు నెలకి వేతనం ఇచ్చేవారు. అప్పుడే ఖరక్‌పూర్‌లో ఉద్యోగం రావడంతో పిహెచ్.డి వదిలేశాను. తర్వాత బొంబాయి వెళ్లాను. అసలు బొంబాయి వెళ్లిందే, నేను ఉస్తాద్ అమీర్ హుస్సేన్ ఖాన్ గారి వద్ద తబలా నేర్చుకోవడం కోసం. వీరు దీప్‌చంద్ గారి గురువు కూడా. నేను కూడా ఆయన వద్ద తబలా నేర్చుకోవడం మొదలుపెట్టాను.
  1961-67 వారి వద్ద నేర్చుకున్నాను. నా వివాహం ఫిబ్రవరి 6, 1965లో జరిగింది. తరువాత హైదరాబాద్ వచ్చాం. ఐడిపిఎల్ సింథటిక్ డ్రగ్స్‌లో ఉద్యోగం మొదలుపెట్టాను. 1970లో యుఎస్‌ఏ వెళ్లాం. అక్కడ 40 ఏళ్లు ఉన్నాం. మొదట్లో ఉద్యోగం దొరకలేదు. వియత్నాం యుద్ధం నేపథ్యంలో, నిక్సన్ ఆ రోజుల్లో అమెరికా ప్రెసిడెంట్. చాలా బాధలు పడ్డాను. చిన్నచిన్న పనులు చేయాల్సి వచ్చింది. 1971లో తబలా ప్రదర్శనలివ్వడం, నేర్పించడం మొదలుపెట్టాను. అమ్మాయిలు కూడా నేర్చుకునేవారు. ముఖ్యంగా నాకు శిష్యులు అమెరికనే్ల. 1973లో ఫెయిర్‌వౌంట్ కెమికల్స్‌లో సూపర్‌వైజర్‌గా ఉద్యోగం మొదలుపెట్టాను. ఇది న్యూజెర్సీలో ఉంది. 1997లో వైస్‌ప్రెసిడెంట్ (మాన్యుఫాక్చరింగ్)గా రిటైరయ్యాను.
  ఇక పూర్తిగా కళాసేవకే అంకితమయ్యాను.
  2001లో ‘్థంకింగ్ తబలా’ సీడీ వెలువరించాను. ఇది తాళం, లయ, జ్ఞానంతో ఉన్న ఏకైక సీడీ. ప్రపంచంలో ఇలాంటిది మొట్టమొదటిసారిగా ఒక ఎన్‌సైక్లోపిడియా లాగా చేశాను. అందరూ మెచ్చుకున్నారు.
  యుఎస్‌ఏ, యూరోప్, లండన్, జర్మనీ, ఫ్రాన్స్, బెహమాస్.. ఇలా ఎన్నో దేశాలు పర్యటించాను. నా వయసు 85 ఏళ్లు. ఇప్పటికీ రోజూ తబలా అభ్యాసం చేస్తాను. వార్థక్యం వల్ల ప్రదర్శనలు తగ్గించాను. మా అబ్బాయి ప్రశాంత్ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో పది సంవత్సరాల పాటు తబలా నేర్పించాడు. ప్రశాంత్ కూడా మంచి గాయకుడు, రంగస్థల నటుడు.
  మన కళలు నేర్చుకోవాలి. కాపాడుకోవాలి. ప్రతిరోజూ అభ్యాసం చేయాలి. కళలను నేర్చుకొని, కాపాడుకోవడంతో మన భారతీయ సంస్కృతి ముడిపడి ఉంది.


  0 0

  క్రిస్‌మస్ అనగానే గుర్తొచ్చేది.. అందరికీ ఇష్టమైనది.. కమ్మనైన కేక్. కేక్.. పిల్లలకే కాదు, పెద్దలకు కూడా ఎంతో ఇష్టం. క్రిస్‌మస్ నెల మొదలవ్వగానే అందరూ కేకు తయారీలో నిమగ్నమైపోతారు. మునుపు.. అంటే పూర్వకాలం.. అందరూ పండుగల్లో ఎలాగైతే తీపి పదార్థాలు చేసుకుంటారో అలాగే క్రిస్‌మస్ రోజున 3పారిడ్జ్2 అనే పాయసాన్ని చేసుకునేవారట.. పదహారో శతాబ్దంలో కొందరు మహిళలు కొత్తవంటకం చేద్దామనుకుని పారిడ్జ్‌లో వాడే ఓట్స్ బదులు గోధుమపిండి, వెన్న, గుడ్లు కలిపి ప్లమ్ కేక్‌ను తయారుచేశారట.. క్రమక్రమంగా దానిలో ఎండు ద్రాక్ష, జీడిపప్పు, బాదాం వంటి దినుసులు జోడించడం మొదలైంది. అలా అలా క్రిస్‌మస్ కేక్ ఆవిర్భవించింది. ఇప్పుడు హోటళ్లలో క్రిస్‌మస్‌కి నెల ముందు నుండే కేక్ తయారీ మొదలవుతుంది. పిండి, ఇతర దినుసులు కలపడం అనే కార్యక్రమాన్ని కేక్ మిక్సింగ్ అనే పేరుతో జరుపు
  కుంటారు. ఇలా చేయడం పదిహేడో శతాబ్దం నుండి వస్తున్న ఆచారం. ఇప్పటికీ ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. ఆ కాలంలో విరివిగా లభించే పండ్లు, ఫలాలతో చేసిన కేక్ మళ్లీ వచ్చే ఏడాది వరకూ నిలువ ఉండేదట.. ఇలా కేక్ ఉంటే వచ్చే మరో సంవత్సరం కూడా మంచి ఫలాలను ఇస్తుందని వారి విశ్వాసమట.. ఎండిన ద్రాక్షతో పాటు చెర్రీలు, ఖర్జూరాలు, పిస్తా, బాదాం, జీడిపప్పు, నిమ్మ, నారింజ తొక్కలు, పంచదార పాకం, తేనె, చివరిగా విస్కీ కానీ బ్రాందీ కానీ కలిపి, అప్పుడప్పుడూ కలుపుతూ క్రిస్మస్‌కి రెండు, మూడు రోజుల ముందు వరకూ ఉంచుతారు. ఈలోగా ఫర్మెంటేషన్ కూడా పూర్తవుతుంది. తరువాత కేక్‌ను బేక్ చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో తయారైన కేక్‌ని బోర్లావేసి, కొద్దికొద్దిగా విస్కీని ప్రతీవారం దానిపై పోస్తారు. ఇలా చేస్తూ ఉంటే కొద్దిరోజులకు అతి రుచికరమైన క్రిస్‌మస్ కేక్ తయారవుతుంది.


older | 1 | .... | 1978 | 1979 | (Page 1980) | 1981 | 1982 | .... | 2069 | newer