Are you the publisher? Claim or contact us about this channel


Embed this content in your HTML

Search

Report adult content:

click to rate:

Account: (login)

More Channels


Showcase


Channel Catalog


Articles on this Page

(showing articles 39601 to 39620 of 41370)
(showing articles 39601 to 39620 of 41370)

older | 1 | .... | 1979 | 1980 | (Page 1981) | 1982 | 1983 | .... | 2069 | newer

  0 0

  డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...

  ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

  1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానిది?
  2. ఎన్టీఆర్, కృష్ణ మల్టీస్టారర్ ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్ర దర్శకుడు ఎవరు?
  3. ఖైదీ నెంబర్ 150 చిత్రంలో కత్తి శీను స్నేహితుడి పేరు?
  4. రాజేంద్రుడు -గజేంద్రుడు చిత్రంలో సౌందర్య పాత్ర పేరు?
  5. చదువుకోనివాళ్లంతా నటులవుతారంటూ -తనపైనే సెటైర్లు వేసుకునే హాస్య నటి?
  6. 1940, 75, 88ల్లో ...జ్యోతి పేరిట సినిమాలొచ్చాయి. మొదటి మూడక్షరాలు?
  7. జగ్గయ్య, జయంతిల ‘ఉత్తమురాలు’ చిత్ర సంగీత దర్శకుడు ఎవరు?
  8. నా పేరు బికారి -నా దారి ఏడారి.. గీత రచయిత ఎవరు?
  9. తొలిపొద్దు చిత్రంలో మాదాల రంగారవుకు జోడీగా పరిచయమైన నటి?
  10. ఒకప్పటి ఈ హీరోయిన్‌ను ఎవరు?

  సమాధానాలు- 108

  1. ఢమరుకం
  2. మేఘా ఆకాశ్
  3. జీతూ జోసెఫ్
  4. మన్యన్గత్ సుబ్రమణియన్
  5. జ్ఞానతెసికం
  6. నార్ల చిరంజీవి
  7. పీసీ శ్రీరామ్
  8. జై లవకుశ
  9. కోయి మిల్ గయా
  10. మేఘా ఆకాశ్

  సరైన సమాధానాలు రాసిన వారు

  ఎన్ స్వామి, బొబ్బిలి
  ఆర్‌విసిహెచ్‌ఎన్ రావు, శ్రీకాకుళం
  సిహెచ్ రమాదేవి, హైదరాబాద్
  ఎంవిబి రెడ్డి, కుతుకులూరు
  బలరామ్, తుని
  ఎల్ అహ్మద్, సుల్తానాబాద్
  జివిఎం మోహన్, ముచ్చుమిల్లి
  జి భలేరావు, గౌరీపట్నం
  బిఎస్ రాజు, కర్నూలు
  యన్ శ్రుతకీర్తి, బొబ్బిలి
  ఎస్ నాగశే్వత, బెంగళూరు
  ఆర్ వేదిక, విశాఖ
  కె అర్జున్, హైదరాబాద్
  కెఎస్ రావు, కర్నూలు
  బీర కృష్ణ, తెనాలి


  0 0

  ఎన్టీఆర్ బయోపిక్ తొలిభాగంలో సినీరంగ విశేషాలు, మలిభాగంలో రాజకీయ విశేషాలు చూపిస్తామని యూనిట్ చెబుతోంది. అయితే యన్‌టీఆర్ సినీరంగ జీవితంలో చెప్పుకోదగ్గ మలుపులు, వివాదాలు లేవు. ఆయన చెప్పుకోదగ్గ చిత్రాలన్నీ అందుబాటులోనే ఉన్నపుడు -ఆయా పాత్రలను మళ్లీ బాలకృష్ణ పోషిస్తే చూడాలా? అన్న డౌట్లూ ఉన్నాయ. అందుకే, యన్‌టిఆర్ సినీ జీవితంలో అలరించిన నాయికామణుల పాత్రల్లోకి స్టార్ హీరోయిన్లను పెట్టారన్న వాదన మొదలైంది. ఎనిమిదిమంది గ్లామర్ భామలతో రీమిక్స్ ప్రయోగంతో కథ నడిపించే ఆలోచన చేస్తున్నట్టు అర్థమవుతుంది. అంటే తొలిభాగం -్ఫక్తు పాటల కార్యక్రమంలా ఉంటుందేమో. రెండోభాగమైన యన్‌టిఆర్ రాజకీయ జీవితంలో అనేక మలుపులు, కుట్రలు, వెన్నుపోట్లులాంటి ఘట్టాలను యథాతథంగా చూపిస్తారా? అన్న సందేహాలు లేకపోలేదు. అన్నీవున్న మహానటుడి జీవితం మోదాంతాన్ని దాటి విషాదాంతానికి చేరడాన్ని ఎలా చూపిస్తారన్న ఆసక్తీ లేకపోలేదు. అనన్య సామాన్యమైన జీవితాన్ని నాలుగ్గంటల బయోపిక్‌లోకి ఎలా ఇరికిస్తారన్న డౌట్లూ ఉన్నాయ.
  -అయోధ్యరామ్, పెద్దాపురం
  మోక్షమెప్పుడో?
  జూనియర్ ఎన్టీఆర్, రాజవౌళి, రామ్‌చరణ్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్ మొదలైందని మీడియా ఊదరగొట్టింది. అయితే సినిమా విడుదల ఎప్పుడన్నది తేదీలమీద తేదీల అంచనాలు వెలువడుతున్నా -దర్శకుడు రాజవౌళి కూడా స్పష్టంగా చెప్పలేడేమో. 2020 సంక్రాంతికి ట్రిపుల్ ఆర్ థియేటర్లకు వస్తుందని చెబుతున్నా, రాజవౌళి తన చిత్రాలను వేగంగా ముగించడన్న అనుభవాలు ప్రేక్షకులకు లేకపోలేదు. ఆర్‌ఆర్‌ఆర్‌ను కథను అందమైన సినిమాగా జక్కన్న ఎప్పటికి చెక్కుతాడు, ఎప్పుడు ఎన్టీఆర్, రామ్‌చరణ్ అభిమానులు ముందుకు తెస్తాడోనన్న ఆసక్తి కనిపిస్తోంది. 2019 చివరికైనా సినిమాను విడుదల చేస్తే -్ఫ్యన్స్ ఆనందాలకు హద్దులుండవన్న చర్చ వినిపిస్తోంది.
  -బి కృష్ణ, హైదరాబాద్
  ఇమేజ్ నిలుపుకోవాలి
  గొప్ప గొప్ప తారలు చాలామంది కాలం నడిచేంతవరకూ పరిశ్రమలో కొనసాగి, ప్రభ తగ్గుతున్న దశలో తెరమరుగై ఇమేజ్‌ను నిలుపుకున్నారు. పేర్లు ప్రస్తావించకున్నా, ఈ కోవలో మనకు చాలామందే కనిపిస్తారు. కానీ, జయప్రద తనకున్న ఇమేజ్‌ను ఆమే పాడుచేసుకుంటోందా? అనిపిస్తుంది. పరిశ్రమలో పాత్రలు కరవై -రాజకీయాలకు వచ్చింది. తెదేపాలో చేరి, కొంతకాలానికి సరైన గుర్తింపు ఇవ్వలేదంటూ యూపీ సమాజ్‌వాది పార్టీలో చేరారు.
  కాలం కలిసొచ్చి రెండుసార్లు ఎంపీ పదవులు నిర్వహించినా ఆమెకు సంతృప్తి లేదు. అందుకే ఆంధ్రకు వచ్చి ప్రజాసేవ ప్రస్తావన చేసింది. ఆమె స్టేట్‌మెంట్లకు ఏ పార్టీ స్పందించకపోవడంతో, మళ్లీ చిత్రాలవైపు దృష్టిపెట్టారు. భైరవ సినిమాలో నటించిన ఆమె, తనకు పునర్జన్మ అని, ఇలాంటి చిత్రాన్ని తన కెరీర్‌లోనే చేయలేదంటూ చెప్పుకొచ్చారు. ఇక నుంచి వరుస చిత్రాలు చేస్తానంటూ ప్రకటించినా, భైరవ తుస్సుమనడంతో ఆమె మళ్లీ ప్రశ్నార్థకంగా నిలబడ్డారు. ఇప్పుడు ఏం ప్రకటన చేస్తారో చూడాలి.
  -కార్తికేయ, బొబ్బిలి
  అంతసీన్ లేదు
  ఇటీవల విడుదలైన రజనీ రోబో సీక్వెల్ 2.ఓ అద్భుత విజయం సాధించినట్టు చేస్తున్న ప్రకటనలపై అనుమానాలున్నాయి. హీరోతోపాటు అక్షయ్‌కుమార్, అమీజాక్సన్ పాత్రల సాంకేతికత సన్నివేశాలు తప్ప, దర్శకుడు శంకర్ కథను స్పష్టంగా నేరేట్ చేసిన వైనం కనిపించలేదు. హాలీవుడ్ మాయను అద్దంలో చూపించడం తప్ప, భిన్నకోణాల నుంచి పరిశీలిస్తే ఏమంత గొప్ప చిత్రం అనలేం. సినిమా వినోదం కాలక్షేపానికి అన్న కోణంలో చూడతగ్గ చిత్రమే తప్ప, పదికాలాలు మనసులో గుర్తుపెట్టుకోతగినంత చిత్రంగా అనిపించలేదు. సమీక్షకులు సైతం శంకర్ మాయలోపడి రేటింగులు ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఇదో చిన్నపిల్లలు ఎంజాయ్ చేసే చిత్రం. కొన్ని సాంకేతిక అద్భుత సన్నివేశ దృశ్యాలను పెద్దలూ అనుభూతించే సినిమాయే తప్ప, స్థాయికి మించి చిత్రాన్ని పైకి ఎత్తేయడం కరెక్ట్ కాదు.
  -శక్తి వేదాంత్, హైదరాబాద్
  కీర్తి నెత్తికెక్కితే..
  కీర్తి మత్తులోపడితే చిత్తం దారితప్పి వికృత ప్రవర్తనకు దారి తీస్తుందని పెద్దలంటారు. బహిరంగ వేదికపై చోటా కె నాయుడు చేసిన పనే ఇందుకు ఉదాహరణ. ‘కవచం’ ఆడియో ఫంక్షన్‌లో పబ్లిక్‌గా కాజల్‌ని ముద్దుపెట్టుకున్న ఘట్టం -ఎన్ని రకాలుగా చూసినా సమర్థనీయం కాదు. అకస్మాత్తుగా కంఠంపై ముద్దుపెట్టడంతో నటీమణి సైతం భయసంభ్రమానికి గురైంది. అనుభవజ్ఞురాలైన నటి కనుక ఆ ఘట్టం వివాదాస్పదం కాకుండా సర్దేసింది. అంతటితో ఆగని చోటా -ఎదురుగా ప్రేక్షక వరుసలో కూర్చున్న నిత్యమీనన్‌ను చూస్తూ ఐ లవ్ యూ చెప్పాడు. వ్యక్తిత్వమున్న అమ్మాయి కనుక సీరియస్‌గా తీసుకోకుండా నవ్వేసింది. సినిమాటోగ్రఫీలో సృజనాత్మకతను సాధించిన చోటా -బహిరంగ ప్రదేశంలో ప్రతిభకు తగిన వినయాన్ని ప్రదర్శించలేకపోవడం శోచనీయమే.
  -రమాగాయత్రి, సూళ్లూరుపేట
  అలాంటివాళ్లేరీ..
  ఒక నటినో, నటుడినో చూసి భవిష్యత్‌లో రాణిస్తావంటూ ప్రతిభను పసిగట్టి చెప్పే అనుభవజ్ఞులు ఒకప్పుడు పరిశ్రమలో కనిపించేవారు. కమల్‌హాసన్ డ్యాన్స్ అసిస్టెంట్‌గా వచ్చినా, ఆయనలోని ప్రతిభను గమనించి అనేకమంది అందించిన ఆశీర్వచనాలతోనే జాతీయస్థాయి నటుడయ్యాడు.
  హాలీవుడ్ మేటి నటుడు రాబర్ట్ డినీరోకు సాటి కమల్ అంటే అతిశయోక్తి కాదు. సావిత్రిలోని ప్రతిభను కెవి రెడ్డిలాంటి అనుభవజ్ఞులు ముందే గుర్తించి ప్రోత్సహించడం వల్లే ఆమె మహానటి అనిపించుకుంది. నిజానికీ ఇప్పుడూ పెద్ద తెరపైనే కాదు బుల్లితెరపైనా గొప్ప నటీనటులున్నారు. కాకపోతే వాళ్లను గుర్తించి ప్రతిభను వెలికితీసే గొప్ప అనుభవజ్ఞులే కరవయ్యారు. అలాంటి అనుభవజ్ఞులే మళ్లీ పుడితే -ఇప్పటికే మట్టిలో దొరికే మాణిక్యాలెన్నో.
  -సిహెచ్ సత్యవతి, అత్తిలి


  0 0

  1911లో బందరులో జన్మించిన కమలాకర కామేశ్వరరావు తొలుత జర్నలిస్ట్‌గా పనిచేశారు. నిర్మాత హెచ్‌ఎం రెడ్డి ద్వారా 1937లో దర్శకత్వ శాఖలోకి ప్రవేశించారు. వాహిని, విజయా సంస్థలతో, బిఎన్ రెడ్డి, కెవి రెడ్డిల సన్నిహితత్వంతో తొలిసారి చంద్రహారం (1954) చిత్రానికి దర్శకత్వం వహించారు. 1999 వరకూ 30 తెలుగు చిత్రాలు, ఆరు తమిళ చిత్రాలకు దర్శకత్వం నెరపారు. ఆయన తీసిన చిత్రాలతో పౌరాణిక బ్రహ్మ బిరుదు పొందారు. కమలాకర దర్శకత్వంలో విజయా అధినేత బి నాగిరెడ్డి, నందమూరి త్రివిక్రమరావులు స్వస్తిశ్రీ పతాకంపై 1959లో రూపొందించిన జానపద చిత్రం ‘రేచుక్క- పగటిచుక్క’. 1959 మే 14న విడుదలైంది.
  మాటలు- పాటలు: సముద్రాల జూనియర్
  నృత్యం: వెంపటి సత్యం
  కళ: తోట
  కెమెరా: ఎం రెహమాన్
  కూర్పు: జిడి జోషి
  స్టంట్స్: మాస్టర్ సోము
  పర్యవేక్షణ: పుండరీకాక్షయ్య
  దర్శకత్వం: కె కామేశ్వరరావు
  చిత్రానువాదం, నిర్మాత: త్రివిక్రమరావు.

  ఈ చిత్రానికి కొద్దిపాటి మార్పులు చేసి ఇదే టీముతో తమిళంలో ‘రాజా సై లేవా’గానూ రూపొందించారు.
  చక్రవర్తి వీరరాఘవులు (సీఎస్‌ఆర్) అసమర్ధుడు, పిరికివాడు. దీంతో అతని తమ్ముడు విక్రమసింహుడు అధికారం చెలాయిస్తుంటాడు. సామంత రాజు విజయరాయలు (ఎస్‌వి రంగారావు), భార్య సుమతి (కన్నాంబ) తనయుడి పుట్టిన రోజు వేడుకల్లో ఉండగా, సమావేశానికి హాజరుకావాలంటూ చక్రవర్తి నుంచి ఆహ్వానం వస్తుంది. ఆ సభలో విక్రమసింహుని వల్ల తాను గర్భవతినయ్యానని, తనను స్వీకరించమని ఆటవిక నాయకుడు పులిరాజు (మహంకాళి వెంకయ్య) కుమార్తె గౌరి (ఎస్ వరలక్ష్మి) వేడుకుంటుంది. అయితే విక్రమసింహుని తిరస్కారంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడుతుంది. దానికి ఆగ్రహించిన పులిరాజు, అతని అనుచరులను విక్రముడు దండించబోగా విజయరాయలు వారిస్తాడు. దాంతో విక్రమసింహుడు విజయరాయలను బంధించి అతని తోట తగలబెట్టిస్తాడు. ఆ ప్రమాదం నుంచి సుమతి, కొడుకు తప్పించుకుంటారు. పులిరాజు విజయరాయలను విడిపించి తనతో తీసుకెళ్తాడు. రాయలకోసం వెళ్లిన సేనాధిపతి ధర్మదేవుడు (నాగయ్య)కి బాలుడు, దాదిగా సుమతి లభిస్తారు. వారిని తన భవనానికి తెస్తాడు. విజయరాయలు రేచుక్కగా మారి విక్రమసింహుని అన్యాయాలు ఎదిరిస్తుంటాడు. చక్రవర్తి వీరరాఘవులుకు జన్మించిన ఆడపిల్లను విక్రమ్ అంతం చేయబోగా రేచుక్క ఆ పిల్లను రక్షించి పెంచి పెద్దచేస్తాడు. విజయ్‌కుమార్ (ఎన్టీఆర్)గా పెరిగిన రాయల కుమారుడు సకల విద్యలునేర్చి విజయదశమి వేడుకల్లో పోటీల్లో స్నేహితుడు అయోమయం (రేలంగి)తోపాటు పాల్గొంటాడు. అంతకుముందుగా విక్రమసింహుని కుమారుడు ఉత్తరకుమారుని (రాజనాల) రేచుక్క బంధిస్తాడు. పోటీల్లో విజయం సాధించిన విజయుని, తన కుమారుని విడిపించి రేచుక్కను బంధించి తెమ్మని విక్రమసింహుడు ఆదేశిస్తాడు. ఆరు నెలల గడువులో సాధించమన్న ఆ లక్ష్యం కోసం వెళ్లిన విజయుడు, యువరాణిని (జానకి) కలుసుకోవటం, ఆమెతో ప్రేమలో పడటం జరుగుతుంది. తొలుత ఉత్తర కుమారుని విడిపించి, ఆపైన రేచుక్కతో తలపడి అతన్ని బంధించి తెస్తాడు విజయుడు. సుమతి అతడు తన భర్తేనని గ్రహించి, ఈ నిజం విజయునికి తెలియచేయటం, వారందరినీ బంధించి హింసించబోయిన విక్రమసింహుని రేచుక్క, విజయుడు ఎదుర్కొని విజయం సాధించటం, యువరాణి, విజయుల వివాహంతో కథ సుఖాంతమవుతుంది.
  దర్శకులు కమలాకర కామేశ్వరరావు ఈ చిత్రంలో సన్నివేశాలు అద్భుతంగా తీర్చిదిద్దారు. చిత్రం పేరుకుతగ్గట్టు విజయరాయలు రేచుక్కగా మారటంతో, ఆ పాత్రకు ప్రాధాన్యం కల్పించారు. కొండ గుహలో భారీ సెట్టింగ్స్‌తో పెట్టిన విగ్రహం, స్తంభాలకు నాలుగు విగ్రహాలు, -్భళీ, భళీ భళ్లారి దేవా గీతం అద్భుతం అనిపిస్తాయి. తన జీవితం ముసుగులో గడపటానికి కారణాన్ని కళ్లకు, మొహానికి ముసుగుదీసి చివర వివరించటం, విక్రమసింహుని అరాచకాలు అడ్డుకోవటం, యుక్తితో రాకుమారిని రక్షించి ప్రేమతో పెంచటంలాంటి సన్నివేశాలు కమలాకరకే చెల్లాయి అనిపిస్తుంది. కొలువు వంకతో వచ్చిన విజయుని శక్తియుక్తులను విజయరాయులు అభినందించటం, విజయునితో పోరులో ‘తాను తన బిడ్డకిచ్చిన రక్ష గొలుసు’ చూచి నిరుత్తరుడై విజయుని దెబ్బకు లొంగిపోయిన సన్నివేశం దర్శకుని ప్రతిభకు తార్కాణం అనిపిస్తాయి. చెరలో భార్యను, కుమారుని కలుసుకొని ఆనందించటంతోపాటు యువరాణిని మహారాణిగా నిలబెట్టాలన్న వాంఛను వారికి వెల్లడించటం, విక్రమునిచే తిరిగి శిక్షించబడే సమయంలో పులిరాజు సాయంతో తిరగబడి యుద్ధం పలురకాలుగా విన్యాసాలతో తలపడి విక్రమసింహుని అంతంచేయటం ప్రధాన పాత్ర ప్రాధాన్యతను తేటతెల్లం చేస్తుంది. అలాగే పూటకూళ్లమ్మ ఛాయాదేవివద్ద, పులిరాజువద్ద తన మిత్రుడు పగటిచుక్క అని అయోమయం ప్రకటించగా, అయోమయం, జబ్బకున్న రక్షను పులిరాజు తెలివిగా తీయటం, దాన్ని విజయుడు చాకచక్యంతో తీసుకోవటం, మరోసారి ఆటవికుల బృంద నృత్యంలో పులిరాజు ఉంగరం సంపాదించి, దానిసాయంతో బందీగావున్న ఉత్తర కుమారుని, అయోమయంలను విడిపించటం, తండ్రిని కలుసుకున్నాక, వారు విక్రమసింహునితో పోరుచేయటం, తాను మిగిలిన సైన్యాన్ని ఎదిరించి విజయం చేకూర్చటం, పగటిచుక్క బిరుదుకు తగ్గట్టు వర్తించటం వంటి అంశాలతో ఎన్టీఆర్ పాత్రకు ప్రాధాన్యత కల్పించారు. చిత్రంలో ఎస్‌వి రంగారావు ధీరగంభీర సున్నిత శౌర్య విక్రమనేత నటన ప్రదర్శించారు. ధీటుగా దానికితగ్గ నటన, యువరాణితో సున్నిత ప్రణయం, ఓ చక్కని యుగళగీతం (కొండప్రక్కన జలపాతం, చంద్రుడు, వారి సంకేత స్థలంగా ఆహ్లాదకరమైన సెట్టింగ్‌లో) -ఔనాకాదా ఏదని మీరు (ఘంటసాల, పి సుశీల)లో ముచ్చట గొలిపేలా అభినయించి, -మనవి సేయవే (ఘంటసాల) మధుర గీతంతోనూ ఎన్టీఆర్ మెప్పించారు. యువరాణిగా షావుకారు జానకి సున్నితత్వం, గాంభీర్యం, కొద్దిపాటి ఉద్రేకం, విజయునిపట్ల అనురాగం, అతడు మోసం చేశాడేమోనని సంశయం, తండ్రి రేచుక్కపట్ల ఆప్యాయత.. ఇలా పలు భావాలను ఎంతో ఈజ్‌తో నటనలో చూపారు. కన్నాంబ తనదైన శైలిలో నిబ్బరంతో కూడిన నటన, క్లయిమాక్స్‌లో సైనికుల శూలాలను ఒక్కొకటి ఛేదిస్తూ ఆవేశంగా చక్రవర్తినుద్దేశించి విజయరాయలకు, ప్రజలకు జరుగుతుతున్న అన్యాయాలను వివరించే సన్నివేశంలో దర్శకుల అంచనాలకు దీటుగా ప్రదర్శించటం ఎన్నదగిన అంశం. అలాగే గౌరిగా అతిథి పాత్రను పోషించి ఎస్ వరలక్ష్మి ఆ పాత్ర ప్రవేశం, వేడుకోలు, ఆత్మత్యాగం వంటి సన్నివేశాలు దర్శకుని ప్రతిభకు, వరలక్ష్మి నటనకు ప్రతీకగా నిలిచాయి. టక్కుగా పద్మనాభం, టిక్కుగా బాలకృష్ణ, విక్రముని అనుచరుడుగా పేకేటి, ఇంకా వంగర నటించారు.
  చిత్రంలోని గీతాలు: రేలంగి, గిరిజలపై -కుచ్చుటోపి జాడ చూసి వచ్చావనుకొంటి (స్వర్ణలత, ఘంటసాల), కన్నాంబ, బాలునితో ప్రారంభంలో -‘వర్ధిల్లు రాకుమారా మా ఇంట (పి లీల), యువరాణిపై సాగే గీతం -మా ఆశ నీవేగా గారాల మా తల్లి (పి లీల బృందం), రేలంగి, ఎన్టీఆర్ రేచుక్క కోసం వెళ్తూ పాడే గీతం -పంతంపట్టి మేం పయనమయ్యాం (ఘంటసాల), విజయదశమి వేడుకల్లో -అన్నలారా, తమ్ములారా ఆరోగ్యమే భాగ్యం (ఘంటసాల బృందం) గీతాలు అలరిస్తాయి. అన్నలారా, తమ్ములారా పాటలో మల్లయోధులు ఆంధ్రా టైగర్ కాంతారావు, కర్రసాములో పొట్లూరి సత్యనారాయణ, పులి ఆట గర్రా అప్పారావువంటి ప్రముఖులు పాల్గొనటం, ఎన్టీఆర్ పాటకుతగ్గ విన్యాసాలు, పోరాటాలు చేయటం విశేషం. ఆటవికుల నృత్యంలో ఎన్టీఆర్, పులిరాజు ప్రధానంగా కనిపిస్తారు. రేచుక్క- పగట్టిచుక్క చిత్రం అలరించే జానపద చిత్రంగా నిలిచింది. చిత్రంలోని రెండు గీతాలు ‘ఔనా కాదా’, ‘మనవి సేయకే’ ఈ చిత్రాన్ని చిరస్మరణీయం చేశాయి.


  0 0

  తిథి: 
  బహుళ పాడ్యమి రా.10.10
  నక్షత్రం: 
  ఆర్ద్ర రా.11.17
  వర్జ్యం: 
  ఉ.8.28 నుండి 9.59 వరకు
  దుర్ముహూర్తం: 
  సా.04.24 నుండి 05.12 వరకు
  రాహు కాలం: 
  సా.4.30 నుండి 6.00 వరకు
  మేషం: 
  (అశ్విని, భరణి, కృత్తిక 1పా.) సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్యసాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభయోగముంటుంది.
  వృషభం: 
  (కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) ప్రయత్న కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. బంధు, మిత్రులతో జాగ్రత్తగా మెలగుట మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశముంటుంది. ధననష్టాన్ని అధిగమించుటకు ఋణప్రయత్నం చేస్తారు. కుటుంబ విషయాల్లో మార్పులు వుంటాయి.
  మిథునం: 
  (మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) సంతోషంగా కాలం గడుపుతారు. శుభవార్త వింటారు. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. తోటివారి ప్రశంసలందుకుందురు. విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆర్థికంగా బలపడతారు. స్ర్తిలు మనోల్లాసాన్ని పొందెదరు.
  కర్కాటకం: 
  (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్ర్తిల మూలకంగా లాభం వుంటుంది. మంచి ఆలోచనలను కలిగివుంటారు. బంధు, మిత్రులు గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తారు.
  సింహం: 
  (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. మానసిక చంచలంతో ఇబ్బంది పడతారు. సోమరితనం ఆవహిస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు. కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు. ఆర్థిక పరిస్థితిలో మార్పులుండవు.
  కన్య: 
  (ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్తపడుట మంచిది. ఆర్థిక ఇబ్బందులనెదుర్కొంటారు. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. వృత్తి, ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ప్రయత్న లోపం లేకున్నా పనులు పూర్తిచేసుకోలేకపోతారు.
  తుల: 
  (చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) కుటుంబ విషయాలపై ఆనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలున్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరతాయి. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు. స్ర్తిలతో జాగ్రత్తగా నుండుట మంచిది.
  వృశ్చికం: 
  (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) మనస్సు చంచలంగా ఉంటుంది. బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్తపడుట మంచిది. అకాల భోజనంవల్ల అనారోగ్య బాధలను అనుభవిస్తారు. ఆకస్మిక కలహాలకు అవకాశముంటుంది. చెడు సహవాసానికి దూరంగా నుండుటకు ప్రయత్నించాలి
  ధనుస్సు: 
  (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.,) మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గూర్చి జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులెదురవుతాయి. విదేశయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి.
  మకరం: 
  (ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) వ్యవసాయ రంగంలోనివారికి లాభదాయకంగా వుంటుంది. తొందరపాటువల్ల ప్రయత్న కార్యాలు చెడిపోతాయి. చెడును కోరేవారికి దూరంగా నుండుట మంచిది. ఆకస్మిక భయము, ఆందోళన ఆవహిస్తాయి. శారీరకంగా బలహీనమేర్పడుతుంది.
  కుంభం: 
  (్ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) ప్రయత్న కార్యాలందు దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభముంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు.
  మీనం: 
  (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) బంధు, మిత్రులతో జాగ్రత్తగా నుండుట మంచిది. చేసే పనులలో ఇబ్బందులుండును. క్రొత్త పనులను ప్రారంభించుట మంచిది కాదు. గృహంలో జరిగే మార్పులవల్ల ఆందోళన చెందుదురు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
  Date: 
  Sunday, December 23, 2018
  author: 
  గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి

  0 0

  పరీక్ష రాసేవాళ్లంతా -్ఫస్ట్‌మార్క్ తెచ్చుకుంటారని గట్టిగా చెప్పలేం. పరిగెత్తేవాళ్లంతా -్ఫనిషింగ్ పాయింట్ రీచవుతారనీ బలంగా అనలేం. ఈ థియరీ ఇండస్ట్రీకీ వర్తిస్తుంది. స్క్రీన్‌కెక్కిన గ్లామర్‌కు సక్సెస్ సులువని వాదించలేం. ఎందుకంటే -ఆడిషన్స్‌లో ఎంపికకు అందం చాలేమోగానీ, ఆడియన్స్ దగ్గర ఎంపికవ్వాలంటే అభినయమూ ఉండాలి. ఈ రెంటినీ బ్యాలెన్స్ చేసిన భామలు అడుగు ముందుకేస్తారు. లేనివాళ్లు -స్క్రీన్ వెనక మాయమవుతారు. నిజానికి ఈ ఏడాదీ తెలుగు వెండితెర -ఎందరో అందగత్తెలకు అవకాశమిచ్చింది. ఎనెన్నో అందాలు స్క్రీన్‌మీద సీతాకోక చిలుకలయ్యే చాన్సిచ్చింది. అయితే, కాలం కలిసొచ్చి ‘కెరీర్’ను అందిపుచ్చుకున్న అందమైన భామలు కొందరే. మిగిలిన లేతసొగసు తీగలన్నీ అదృష్టాన్ని తెచ్చే తరువాతి ప్రాజెక్టుల వెతుకులాటలో పడ్డాయి.

  నిజానికి తెలుగు సినీ పరిశ్రమ చాలాకాలంగా హీరోయిన్ల కొరత ఎదుర్కొంటోంది. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న నిర్మాతలు -చాలాకాలంగా ఈ ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. హీరోలను బ్యాలెన్స్ చేయగల సత్తావున్న కొత్త హీరోయిన్లు ఎక్కడున్నారో దుర్భిణి వేసినా కనిపించని పరిస్థితి. అయితే అనుష్క లేదంటే నయనతార, ఇటు సమంత అటు త్రిష, కాదంటే కాజల్, సరిపెట్టుకుంటే తమన్నా.. లేదూ ఇలియానా, అసిన్, హన్సిక, శృతిహాసన్.. ఇలా వీళ్లలో ఎవరో ఒకరిని ఓకే చేసుకోవాలి. లేదంటే బాలీవుడ్ సంతకెళ్లి హీరోయిన్ల జాబితాలో ఎవరో ఒకరికి టిక్కుపెట్టాలి. రకుల్‌ప్రీత్, రాశిఖన్నా, రెజీనా, సాయిపల్లవి, కీర్తిసురేష్.. ఇలా ఈ బ్యాచ్‌నుంచైనా కథానాయికను ఎంపిక చేయాలి. నాలుగైదేళ్ల క్రితం స్క్రీన్‌కు పరిచయమై నిలదొక్కుకున్న వాళ్ల సంఖ్యా పరిమితమే కావడంతో -మీడియం రేంజ్ సినిమాల కోసం కొత్తందాలను ఎప్పటికప్పుడు నిర్మాతలు వెతుకుతూనే ఉన్నారు. ఆ కోణంలో ఈ ఏడాది తెలుగు తెరపై మెరిసిన హీరోయిన్ల జాబితా మోస్తరును మించింది. ఒకటి రెండు ప్రాజెక్టులతో ఆడియన్స్‌కి అతుక్కుపోయిన కొత్త్భామల్లో పరాయి భాషా సొగసులు, బాలీవుడ్ బ్యూటీలతోపాటు తెలుగందాలూ లేకపోలేదు. అయితే వీళ్లంతా అందంతో ఆకట్టుకున్నారే తప్ప, అభినయంలో ‘ఆహా’ అనిపించడంలో విఫలమయ్యారు. ‘ఉన్నంతలో..’ అన్న పదాన్ని ప్రామాణికంగా తీసుకుంటే, ఆ జాబితాలో రష్మిక మండన్న, కైరా అద్వానీ, నిధి అగర్వాల్, ప్రియాంక జవాల్కర్, రుహానీ శర్మ, పాయల్ రాజ్‌పుత్, నభానటేష్‌లాంటి వాళ్ల పేర్లు చెప్పుకోవచ్చు.
  తెలుగు ఇండస్ట్రీని ఆహార్యం, అభినయంతో ఆకట్టుకున్న కొత్త తార -రష్మిక మండన్న. కన్నడలో కిరాక్ పార్టీ ట్రైలర్ కట్‌నుంచే ఆమెపై తెలుగు నిర్మాతలు దృష్టిపెట్టారు. మీడియం రేంజ్ హీరోలు సైతం ఆమెను ప్రిఫర్ చేశారు. రష్మికతో జోడీకట్టే చాన్స్ దక్కించుకున్న హీరో నాగశౌర్య. అలా ఛలోతో తెలుగు స్క్రీన్‌మీద అడుగుపెట్టింది. సినిమా గొప్ప ఫలితాన్ని తేకపోయినా, రష్మిక కెరీర్‌కు మాత్రం గొప్పగా ఉపయోగపడింది. తరువాత వరుస అవకాశాలు ఆమె సొంత మయ్యాయి. మొన్ననే వచ్చిన గీత గోవిందం ఆమెకు స్టార్ స్టేటస్ తీసుకొచ్చేసింది. ఆ తరవాత దేవదాస్‌లో నానితో జోడీ కట్టడం కూడా ఆమెకు కలిసొచ్చిన విషయమే. వరుస చాన్స్‌లతో తారల రేసులో దూసుకుపోయిన రష్మిక -తాజాగా విజయ్ దేవరకొండతో ‘డియర్ కామ్రేడ్’ చేస్తోంది. ఇవికాక ప్రకటించాల్సిన చిత్రాలూ ఆమె చేతిలో ఒకటి రెండున్నాయి. అంటే -డియర్ కామ్రేడ్ సహా వచ్చే ఏడాదిలోనూ ఆమె మూడు నాలుగు ప్రాజెక్టుల్లో స్క్రీన్‌మీద కనిపించనుంది. ఆ చిత్రాలు ఆమె కెరీర్‌ను ఏ రేంజ్‌కు తీసుకెళ్తాయో చూడాలి.
  ఏ భాషా చిత్రాల్లోనైనా అరంగేట్రంతోనే అదరగొట్టాలంటే సింపుల్ సూత్రం ఒక్కటే -స్టార్ హీరో సరసన చాన్స్ పట్టడం. తెలుగు తెరకు ఎగిరొచ్చిన కైరాకు అలాంటి అవకాశమే దక్కింది. అందంతోపాటు సినిమా విజయం కూడా దక్కడంతో -కైరా అద్వానీ స్టారై కూర్చుంది. బాలీవుడ్‌లో ఎంఎంస్ ధోనీ చిత్రంతో సాధించిన ఇమేజ్‌ను తెలుగు తెరపై పెట్టుబడిగా పెట్టి -సూపర్‌స్టార్ మహేష్‌బాబు సరసన చాన్స్ అందుకుంది కైరా. ‘్భరత్ అనే నేను’ చిత్రంలో మహేష్‌తో సరైన కెమిస్ట్రీ పండించిన కైరాకు తెలుగులో ఎన్నో అవకాశాలు తెచ్చిపెడుతున్నాయి. దానికితోడు సున్నితమైన భావోద్వేగాలు పలికించడంలోనూ ప్రతిభ కనబర్చిన కైరా -మరో స్టార్ హీరో సరసనా అవకాశాన్ని అందిపుచ్చుకుంది. వినయ విధేయ రామ చిత్రంలో రామ్‌చరణ్‌తో జోడీకట్టి మెగా కాంపౌండ్‌లోకి అడుగుపెట్టిన కైరాకూ ప్రకటించాల్సిన రెండుమూడు ప్రాజెక్టులు ఉన్నాయట. సంక్రాంతికి వస్తున్న వినయ విధేయ రామలో తన అందాచందాలతో ఆకట్టుకోగలిగితే -తెలుగు తెరపై మరో ఇద్దరు స్టార్ హీరోల సరసన ఛాన్స్‌లు అందడం ఖాయం.
  ఆర్‌ఎక్స్ 100తో నటనలో ఏమాత్రం మొహమాటం చూపేదిలేదంటూ స్క్రీన్‌కు వచ్చిన పాయల్ రాజ్‌పుత్ ఇప్పుడు తెలుగులో హాట్ హీరోయిన్. ఆర్‌ఎక్స్ -చిత్రంలో ఇందుగా పంజాబీ అందాలను పల్లపర్చిన తీరుకు నిర్మాతలు ఫిదా అవుతున్నారు. ముద్దు సన్నివేశాల్లో తనకు సాటివచ్చే హీరోయిన్లు లేరని ప్రకటించుకునే రేజ్ అప్పియరెన్స్ ప్రదర్శించిన పాయల్‌కు చాన్స్‌లు బాగానే వర్కవుటౌతున్నాయి. పైగా, రగ్గుడ్ హీరోల పాత్రలను సృష్టించి, పాయల్ కోసమే కథలు తయారు చేసుకుంటున్న కుర్ర దర్శకులూ లేకపోలేదు. గాఢమైన చుంబన దృశ్యాల్లో మొహమాటం ప్రదర్శించని పాయల్ కోసం అలాంటి పాత్రలనే సృష్టించాలంటూ నిర్మాతల నుంచీ డిమాండ్ వస్తోందన్నది ఇండస్ట్రీ టాక్. సో, వచ్చే ఏడాదీ బోల్డ్ పాత్రల్లో పాయల్ తళుక్కుమనడం ఖాయంగానే కనిపిస్తోంది. ఒకే ఒక్క చుంబన సన్నివేశంతో కుర్రకారుని కట్టిపారేసిన మరో బ్యూటీ -శోభితా ధూలిపాళ. గూఢచారి చిత్రంలో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌తో మెప్పించిన ఈ అచ్చమైన తెలుగందం తెనాలి ప్రాంతవాసి. తెలుగులో అవకాశాలకంటే ముందే బాలీవుడ్‌లో తనకంటూ ఓ ట్రాక్ సృష్టించుకున్న శోభిత -తెలుగు తెరపై దొరికిన అవకాశాన్నీ ‘హాట్ యాక్టింగ్’తో సద్వినియోగం చేసుకుంది. కమర్షియల్ కోణంలో సినిమాకు అవసరమైన ‘గ్లామర్’ను ప్రదర్శించడంలో ఏమాత్రం మొహమాటపడనని గూఢచారితో రుజవుచేసిన శోభితనూ, అలాంటి పాత్రల్లో చూపించేందుకు నిర్మాతలు సన్నద్ధమవుతున్నారు. ఒక్క చిత్రంతోనే తానేంటూ నిరూపించుకున్న శోభితకు తెలుగు స్క్రీన్‌పై చాన్స్‌లు బాగానే దక్కుతున్నాయి. ‘లిప్ లాక్’ సన్నివేశాలతో సినిమాను వేడెక్కిస్తున్న నిర్మాతలకు దొరికిన మరో అందం -రుహానీ శర్మ. హీరో సుశాంత్‌తో చి.ల.సౌ చిత్రంలో మెప్పించిన రుహానీ, పొందికైన ముద్దు సన్నివేశంతో యూత్ మనసులు దోచుకుంది. అటు సన్నితమైన హావభావాలు, ఇటు కుర్రకారును కిర్రెక్కించే హాట్ సన్నివేశాల్లోనూ తన ప్రతిభను చూపిస్తున్న రుహానీని తెలుగు పరిశ్రమ ఆదరించిందనే చెప్పాలి. ఒక మోస్తరుతోపాటు బడ్జెట్ చిత్రాల క్యాటగిరీలో పరిశ్రమను ఆకట్టుకున్న అందాల జాబితా కూడా తక్కువేమీ లేదు. నిధి అగర్వాల్, ప్రియాంక జవాల్కర్, నభానటేష్‌లాంటి తారలంతా ఈ క్యాటగిరీ కిందకే వస్తారు. చిన్న బడ్జెట్‌తో వచ్చిన చిత్రాల్లో మెరిసిన ఈ అందగత్తెలంతా అప్పుడే స్టార్ హీరోల సరసన చాన్స్‌లపై గురిపెడుతున్నారు కూడా. ఒక్క చాన్స్ దక్కితే, ఇక రేంజ్ మారిపోయినట్టే. నన్ను దోచుకుందువంటే, అదుగో చిత్రాల్లో తళుక్కుమన్న కన్నడ తార నభానటేశ్. ఈ ఏడాదే వచ్చిన రెండు చిత్రాలూ ఆమె వరకూ మంచి పేరునే తెచ్చిపెట్టాయి. దాంతో కొత్త అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వెళ్తున్నాయి. తాజాగా బడా నిర్మాత దిల్‌రాజునుంచి నభాకు చాన్స్ దక్కిందన్నది ఇండస్ట్రీ టాక్. పెద్ద నిర్మాణ సంస్థలో అగ్ర హీరోతో చేయబోతే సినిమాతో ఆమె దశ తిరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అచ్చమైన తెలుగమ్మాయి కాకున్నా, బాల్యం నుంచీ అనంతపురం వాతావరణంలో పెరిగిన మరో అందగత్తె -ప్రియాంక జవాల్కర్. క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో ‘టాక్సీవాలా’ చిత్రంలో మంచి కెమిస్ట్రీ పండించిన ప్రియాంక -ఆహార్యం, అభినయంలో మంచి మార్కులే సంపాదించింది. పెద్ద ప్రాజెక్టులో చాన్స్ దొరికితే ప్రూవ్ చేసుకోగల సమర్థత చూపించిన ప్రియాంకకు, తెలుగు స్క్రీన్ నుంచి ఖాయంగా అవకాశాలు అందుతాయని చెప్పొచ్చు. ఇక సవ్యసాచిలో చైతూ పక్కన, ఆ సినిమా విడుదల కాకముందే తమ్ముడు అఖిల్ రాబోయే చిత్రం మిస్టర్ మజ్నులోనూ చాన్స్‌లు అందుకున్న నిథి అగర్వాల్‌నూ తెలుగు తెర మర్చిపోదు. ‘సవ్యసాచి’ ఫ్లాపైనా, నిధికి మంచి మార్కులే పడటంతో తనకు మరిన్ని అవకాశాలు అందుతాయన్న నమ్మకాన్ని నిధి వ్యక్తం చేస్తోంది. మణిరత్నం సినిమా చెలియాలో అందచందాలతో ఆకట్టుకున్న ఆదితిరావు ఈ ఏడాదిలో సమ్మోహనం, అంతరిక్షం రెండు సినిమాలు చేసింది. పాత్రోచిత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు దక్కితే తనను తను నిరూపించుకోగలిగే సామర్థ్యం ఆదితిలో లేకపోలేదు. ఇక ఇర్రామోర్, మాళవిక శర్మ, నేహా శెట్టి, నటాషా దోషి, సిద్ది ఇద్నాని, సిమ్రన్ పరీన్జ, మైరా శరీన్, రిద్దికుమార్, హేమల్ ఇంగ్లే, కాశ్మీర పరదేశి, ప్రియా వడ్లమాని.. ఈ బ్యూటీలూ ఈ ఏడాది పరిచయమైన వాళ్లే. కాకపోతే చేసిన సినిమాలు సక్సెస్ కాకపోవడంతో రేస్‌లో వెనుకుండిపోయారు. అందచందాలనే నమ్ముకున్న ఈ బ్యూటీలూ అదృష్టాన్ని మోసుకొచ్చే అవకాశం దక్కకపోతుందా? అని ఎదురు చూస్తున్నారు.


  0 0

  కనీసం ప్రతి మనిషికి కూడు గుడ్డ నీడైనా ఉండాలా? ఒక కాణీ మిగలాలా?- ఇది 1950 ప్రాంతంలోని ఒక సినిమా పాట. రోటీ కపడా ఔర్ మకాన్ అని హిందీలో అంటారు. ఆధునికంగా మంచి రోడ్లు కరంట్, వాటర్, విద్య-ఉపాధి, ఉద్యోగావకాశాలు సమాజానికి లభించాలి. దీనినే శ్రేయోరాజ్యం అంటారు. (వెల్‌ఫేర్ స్టేట్).
  భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి డెబ్బది సంవత్సరాలు గడిచినప్పటికీ ఈ వౌలిక సదుపాయాల కల్పన సంతృప్తికరంగా లభించిందా? దేశ ప్రజలలో ఇంకా సగం మందికి రెండుపూటలా తిండి లేదు. విద్యాలయాలు అంటే నిరుద్యోగులను ఉత్పత్తిచేసే యంత్రాగారాలు. ఇట్లా ఎందుకు జరిగింది??
  ఈస్టిండియా కంపెనీ కాలంలో దేశ సంపదను బ్రిటన్‌కు తరలించారు. మరి స్వతంత్ర భారతంలో మన సంపదలు పెనామా, స్విస్, వర్జిన్ ఐలండ్స్‌కు ఎందుకు తరలించారు? న్యూఢిల్లీలో కాంగ్రెసు ప్రభుత్వం అధికారంలో ఉన్నదా? బిజెపి అధికారంలో ఉన్నదా? అనే విషయం సామాన్యుడు ఆలోచించడు. అతనికి ప్రతిరోజూ తిండి దొరుకుతున్నదా? లేదా? నిలకడగా ఉద్యోగం ఉందా? నల్లాలో నీళ్లు వస్తున్నాయా? లేదా? ఇవే ఆలోచిస్తాడు.
  హైదరాబాద్‌లోని అడ్డా కూలీలంతా ఎవరు? పాలమూరు జిల్లానుండి పొట్టకూటి కోసం వలస వచ్చినవారు. నల్గొండ జిల్లాలోని తండాల నుండి భారీగా బంజారాలు హైదరాబాద్ వచ్చి ఆటోరిక్షాలు నడుపుకోవటం గమనించారా? వీరంతా ఎందుకు నిరుపేదలైనారు? తెలంగాణాలో వేల సంఖ్యలో బ్రాహ్మణులు వంటలు చేసుకొని, అప్పడాలు అమ్ముకుంటూ బ్రతుకుతున్నారు. వీరి పిల్లలకు పెళ్లిళ్లు కావటంలేదు. కొడుకులకు విద్య, ఉద్యోగాలు లేవు. కారణం వీరికి రిజర్వేషన్లు లేవు. దీనిని సామాజిక న్యాయం అంటారా?? ‘నేను రాను బిడ్డో సరకారు దవాఖానకు’ ఇది తెలంగాణాలో ఒక పాట!! కార్పొరేటు వైద్యం-కార్పొరేటు విద్య-సామాన్యునికి అందుబాటులో ఉందా?
  ***
  డిసెంబరు 1వ తేదీ 2018నాడు హైదరాబాద్‌లో ఒక సర్వే జరిగింది. దాని ప్రకారం శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ 45 స్థానాలు, టిఆర్‌ఎస్ 45 స్థానాలు, బిజెపి 10, ఇండిపెండెంట్లు 10 స్థానాలు గెలుచుకోబోతున్నట్లు దాదాపు ఖాయమైంది. మరి వారంరోజుల్లో ఏం పరిణామాలు జరిగాయి? హైదరాబాద్ సమీపంలో మేడ్చల్‌లో కాంగ్రెస్ బహిరంగ సభ జరిగింది. అక్కడికి శ్రీమతి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ వచ్చారు. ఏ.పి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఇంకా ఎందరో ప్రముఖులు వచ్చారు. అక్కడ వేదికపైన సోనియాగాంధీ పాదాల దగ్గర ఎన్‌టిఆర్ చిత్రపటం ఉంది- ఇది సింబాలిక్- అంటే ప్రతీకాత్మకం. కాంగ్రెసు పార్టీకి తెలుగుదేశం అమ్ముడుపోయిందని అర్థం.
  హైదరాబాదులోని జూబిలీహిల్స్, కూకట్‌పల్లి, హైటెక్ సిటీ ప్రాంతాల్లో రాహుల్‌గాంధీ, చంద్రబాబునాయుడు కలిసి రోడ్‌షో నిర్వహించారు. ఈ సంఘటనలను తెలంగాణా సమాజం టి.వి.లల్లో చూచింది. ‘చంద్రబాబు వస్తే మన ప్రాజెక్టులకు నీళ్లురావు’ అని కెటిఆర్, హరీష్‌రావులు చెప్పిన మాటలు తెలంగాణా ప్రజలు నమ్మారు. కూటమి ఓటమికి చంద్రబాబు ఒక ప్రధాన కారణం. ఎవ్వరితోను పొత్తుపెట్టుకోకుండా కాంగ్రెసు ఒంటరిగా పోటీచేసి ఉంటే కనీసం యాభై సీట్లు గెలుచుకొని ఉండేది. పొత్తులవల్ల కాంగ్రెసు చిత్తుఅయింది. ఈ పంచకూళ్ల కషాయం వికటించటంవల్ల ఇక న్యూఢిల్లీలో చంద్రబాబు మళ్లీ ‘మోడీ వ్యతిరేక ఫ్రంట్’ అంటూ వ్యూహరచన చేయలేకపోవచ్చు. తెలంగాణాలో టిఆర్‌ఎస్ విజయం పరోక్షంగా బిజెపికి విజయం. వారు 119 స్థానాలల్లో పోటీ చేయడానికి కారణం అవన్నీ గెలుస్తారు అని కాదు. పార్టీ విస్తరణలో ఇదొక భాగం. చంద్రబాబు, కోదండరామ్‌లు వారు ఓడిపోయి కాంగ్రెసును కూడా ముంచారు.
  ***
  నల్గొండ, ఖమ్మం జిల్లాలు కమ్యూనిస్టులకు కంచుకోటలు. అలాంటిచోట్ల కమ్యూనిస్టుపార్టీ ఎందుకు తుడిచిపెట్టుకొని పోయింది? పైకి చూడడానికి ఇది కెసిఆర్ హవా వలన అని చెప్పుకున్నప్పటికీ అంతర్గతంగా వారి అనైకమత్యమే వారిని ఓడించింది. తమ్మినేని వీరభద్రం (సిపియం), చాడ వెంకటరెడ్డిని, కామ్రేడ్ కె.నారాయణను (సిపిఐ) పిలిచి మనం కలిసి పోటీ చేద్దాం అని చిలుకకు చెప్పినట్లు చెప్పాడు. ఐనా చాడవారు వినలేదు. వినాశకాలే విపరీతబుద్ధీ అన్నట్లు కాంగ్రెసు కూటమిలో ముష్టి మూడు సీట్లకోసం చేరారు. ఈ విధంగా ఉభయ కమ్యూనిస్టుపార్టీలు తమను తాము ఓడించుకున్నాయ. ఎన్ని ప్రజా ఉద్యమాలు జరిపినా ఇప్పట్లో తెలంగాణాలో మళ్లీ కమ్యూనిస్టు పార్టీలు కోలుకోలేవు. ఇది నిజంగా వారిని నమ్ముకున్న కార్మిక కర్షక రైతాంగానికి శ్రమజీవులకు అశనిపాతం వంటిది.
  ***
  తెలంగాణాలో చంద్రబాబునాయుడు పార్టీ 13 స్థానాలకు పోటీచేసి 2 స్థానాలు మాత్రమే గెలుచుకున్నది. దీనివల్ల అందరికన్నా ఎక్కువగా సంతోషించిన వ్యక్తి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి. 2019 మే నెలలో ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు సీమాంధ్రలో ఓడిపోతాడని ఖాయంగా చెప్పుతున్నాడు. ఇది చిలుక జోస్యం కాకపోవచ్చు. ఈ ముప్పును తప్పించుకోవటానికి చంద్రబాబునాయుడు ఏం చేయబోతున్నారు? ఇంకా ఎక్కువ సమయం లేదు. చెడెడి వానికి చెలులెవరుండరు- అన్నట్లు ఇవ్వాళ ఏ మమతాబెనర్జీ- ఏ దేవెగౌడ, ఏ రాహుల్‌గాంధీలు చంద్రబాబుకు అండగా ఉండలేరు.
  ***
  రాజస్థాన్‌లో బిజెపి ఓడిపోతున్నదని తెలిసినా ఆ పార్టీ అధినాయకులు పట్టించుకోలేదు. అందుకు ఒక కారణం ఉంది. బిజెపివారు కూడా వసుంధరా రాజే పాలనపై కోపంతో ఉన్నారు. పైగా ఓటర్లు ఇలా అన్నారు. ‘‘మా వ్యతిరేకత వసుంధరా రాజే మీదనేకాని మోడీ మీద కాదు. అంటే పార్లమెంటు ఎన్నికలలో మేము నరేంద్ర మోడీకే ఓటు వేయబోతున్నాము’’ అని ఖాయంగా హామీఇచ్చారు. ఆర్‌ఎస్‌ఎస్, విహెచ్‌పి వర్గాలు బిజెపిమీద కొంత అసంతృప్తి ఉన్నట్లు స్పష్టంగా సంకేతాలు అందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి ఐదేళ్ల పుణ్యకాలం ముగిసింది. కాశ్మీరులో ఆర్టికల్ 370 రద్దుకాలేదు. కాశ్మీరీ పండిట్‌లకు పునరావాసం లభించలేదు. అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుగలేదు. ఆక్రమిత కాశ్మీరులోని ఉగ్రవాద స్థావరాలు అలాగే ఉన్నాయి. బెలూచిస్థాన్‌ను స్వతంత్ర రాజ్యంగా గుర్తించలేదు. చైనా దిగుమతులను ఆపలేదు. కనీసం శశిధరూర్, మణిశంకర్ అయ్యర్, విజయమాల్య, లలిత్‌మోడీ, నీరవ్ మోడీ వంటి వారికి శిక్షలు పడలేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి విలువ పూర్తిగా పతనం అయింది. నిజం చెప్పాలంటే వంద రూపాయల నోటు తన కొనుగోలు శక్తిని కోల్పోయింది. నిరుద్యోగులు మాదకద్రవ్యాల వ్యాపారం చేసుకుంటూ గంజాయి అమ్ముకుంటూ బ్రతుకుతున్నారు. వెండి పళ్లెంలో పెట్టి తెలంగాణాను అసదుద్దీన్ ఒవైసీకి, చత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లను కాంగ్రెస్‌కు అప్పగించారు. దీనికి బిజెపి వ్యూహకర్తలు స్పష్టంగా సమాధానం చెప్పి తీరాలి.
  ***
  టిఆర్‌ఎస్ విజయానికి ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు మాత్రమే ఓటువేశారు అనుకోవటం పొరపాటు. హైదరాబాద్‌లో లోక్‌సత్తా, జనసేన, వైఎస్‌ఆర్‌సి వంటి పార్టీల అభిమానులంతా చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓటు వేశారు అనేది సుస్పష్టం. జిల్లాలల్లో కొన్నిచోట్ల పోలింగ్‌రోజున ఓటింగ్ సరళి మారింది. ‘‘మనం ఎటుతిరిగి గెలిచే అవకాశంలేదు ఓట్లుచీలితే కాంగ్రెస్ కూటమి గెలువవచ్చు’’అని బిజెపి సానుభూతిపరులు కూడా టిఆర్‌ఎస్‌కు ఓట్లువేసినట్లు సమాచారం. సాగర్ కంకణాల నివేదితారెడ్డి నామినేషన్ వేసిన రోజున ఆమె వెంట పాతికవేల మంది ఉన్నారు కాని ఆమెకు వచ్చిన ఓట్లు రెండు వేలు మాత్రమే. ఇందుకు కారణం కె.జానారెడ్డిని ఓడించాలి అని అందరూ ఏకమైనారు. ఇలాగే చాలా నియోజకవర్గాలల్లో జరిగింది అంతే. ఓటర్లు సోనియా, రాహుల్, చంద్రబాబుమీద కోపాన్ని స్థానిక ‘‘కూటమి’’ అభ్యర్థిమీద ప్రదర్శించారు.
  భారత ప్రజాస్వామ్యం పరిపక్వమైనదేనా? 80 లక్షల ఓట్లు గల్లంతు. చార్మినార్ నియోజకవర్గంలో నలభై శాతం మాత్రమే పోలింగ్. కొన్నిచోట్ల ఓటుకు పదివేల రూపాయలు ఇచ్చారు. చర్చిలకు, మసీదులకు ఉచిత విద్యుత్తు ఇస్తాం-అని మతపరమైన వాగ్దానాలు. హైదరాబాదీయులు ఎవరికి ఓటువేయాలో ఇస్లామాబాద్, బీజింగ్‌లు నిర్ణయించటం ఇదీ మన ప్రజాస్వామ్యం. 2014 ఎన్నికలలో కాంగ్రెస్‌పార్టీ ఒంటరిగా పోటీచేస్తే 57 లక్షల ఓట్లువచ్చాయి. ఇప్పుడు కూటమికి మొత్తం 59 లక్షలు మాత్రమే వచ్చాయి. అంటే కాంగ్రెస్ కూటమిలో ఓట్లు పరస్పరం బట్వాడా కాలేదని అర్థం.
  ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు 13-12-2018 నాడు మాట్లాడుతూ కోదండరాం పార్టీకి సిపిఐకి కేటాయించిన స్థానాలల్లో చేతి గుర్తులో మనం పోటీచేసి ఉంటే విజయం సాధించేవారం అని విశే్లషించాడు. అంటే గద్దర్- కోదండరాం- చాడ- నారా చంద్రబాబుల పొత్తువల్ల కాంగ్రెస్ పార్టీ భారీగా నష్టపోయిందని వారు వ్యాఖ్యానించారు. ఒకటి మాత్రం నిజం- 24 గంటల కరంట్, వాటర్ సప్లై కెసిఆర్ హయాంలో మెరుగుపడింది అనేది వాస్తవం. ‘మీరు సీట్లు పంచుకునే లోపల మేము స్వీట్లు పంచుకుంటాము’ అని కెటిఆర్ అన్న మాటలు నిజమైనాయి.
  కూటమి సీట్ల పంపిణీ ఫ్రెండ్లీ పోటీలు వారి కొంపముంచాయి. తెలంగాణాలో అనాదిగా కమ్యూనిస్టులు బలంగా ఉండేవారు. ఇప్పుడు ఇక్కడ కమ్యూనిజం అదృశ్యం కావటం ఒక చారిత్రక సత్యం.


  0 0

  (నేడు పీవీ వర్ధంతి)
  భా రత ప్రధాన మంత్రి పదవిని అధిష్ఠించిన తొలి దక్షిణాత్యుడు, ఒకేఒక తెలుగువాడు పాములపర్తి వెంకట నరసింహారావు. 1921 జూన్ 28న జన్మించి, 2004 డిసెంబర్ 23న మరణించారు. పివిగా లబ్దప్రతిష్ఠులైన ఆయన బహు భాషావేత్త, రచయిత. స్నాతకోత్తర న్యాయశాస్త్ర పారంగతుడు. అపరచాణుక్యునిగా పేరొందారు. భారత ఆర్థిక సంస్కరణలకు బీజం వేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనత సొంతం చేసుకుని భారత ఆర్థిక సంస్కరణల పితామహునిగా పేరొందిన మేధావి. నిజాం వ్యతిరేక పోరాట యుద్ధ తంత్ర నిపుణునిగా, చివరకు 1947 ఆగస్టు 15న కూడా అటవీ క్షేత్రంలో పోరాట క్రమంలోనే ఉన్నారు. 1957లో శాసనసభ్యునిగా రాజకీయ జీవితం ప్రారంభించిన పివి రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, చివరకు ప్రధానిగా తన మేధాశక్తితో క్రమానుగతంగా ఉన్నత పదవులను కైవసం చేసుకున్న రాజనీతిజ్ఞుడాయన. కాంగ్రెస్ హయాంలో పూర్తి సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని తన చాకచక్యంతో, చాణక్య నీతితో పూర్తికాలం నడిపించారు. 1957లో మంథని నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై, వరుసగా నాలుగుసార్లు గెలిచారు. 1962లో మొదటిసారి రాష్ట్ర మంత్రియై, 62 నుండి 64 వరకు న్యాయ, సమాచార మంత్రిగా, 64నుండి 67వరకు దేవాదాయ, న్యాయ; 67లో వైద్య, ఆరోగ్య, 68 నుండి 71 వరకు న్యాయ, సమాచార శాఖలను నిర్వహించారు. (71 సెప్టెంబర్ నుండి 73 జనవరి వరకు) ముఖ్యమంత్రిగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. పీఠం అధిష్ఠించగానే అసమ్మతి. ఈ విషయమై అధిష్ఠానంతో చర్చించేందుకు ఢిల్లీ - హైదరాబాద్‌ల మధ్య తిరిగేందుకే ఆయనకు సమయం సరిపోయింది. పట్టణ భూ గరిష్ఠ చట్టాన్ని తెచ్చిందీ ఆయనే. తర్వాత ఆయన కార్యక్షేత్రం ఢిల్లీకి మారింది. ఎఐసిసి ప్రధాన కార్యదర్శిగా, మొదటిసారి హన్మకొండనుండి లోకసభకు ఎన్నికైనారు. ఎనిమిది, తొమ్మదివ లోకసభలకు రాంటెక్ నుండి ఎన్నికైనారు. నంద్యాల ద్వారా ఉప ఎన్నికలో పోటీ లేకుండా 5లక్షల పైచిలుకు మెజార్టీతో గిన్నీస్ రికార్డు సృష్టించి, ఎన్నికై 10వ లోకసభలో అడుగిడి, 1980-81కాలంలో కేంద్ర హోం, విదేశీ వ్యవహారాలు, మానవవనరుల అభివృద్ధి శాఖలు చేపట్టారు. రాజీవ్ హత్య కారణంగా, 1991లో సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయకుండానే దేశ 10వ ప్రధాని పదవిని చేపట్టారు. ప్రధానిగా ఆయన హయాంలో ఎన్నో మలుపులు...అవినీతి ఆరోపణలూ ఎదుర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం కోసం చేపట్టిన సంస్కరణలు, రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా, ఆర్థిక శాస్తవ్రేత్తగా ఉన్న మన్మోహన్‌సింగ్‌ను పిలిచి దేశ ఆర్థిక మంత్రిని చేయడం ఆయనకే చెల్లింది. 1992లో నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ కంప్యూటర్ ఆధారిత వ్యాపార పద్ధతిని ప్రారంభించారు. పంజాబ్ తీవ్రవాదాన్ని అణచి వేసిందీ ఆయన ప్రభుత్వమే. కాశ్మీర్ తీవ్రవాదులు ప్రముఖులను అపహరించినపుడు, వారి డిమాండ్లను లెక్కపెట్టక బందీలను విడిపించిన ఘనతా ఆయనదే. ఇజ్రాయిల్‌తో దౌత్య సంబంధాలు, తీవ్రవాదానికి పాకిస్తాన్ ఇస్తున్న ప్రోత్సాహాన్ని బయట పెట్టి ఆగ్నేయాసియా దేశాలతో సత్సంబంధాలను కలిగి ఉండడం పివి ప్రభుత్వ సాధించిన విజయమే. బహుభాషా పండితులు, 17్భషలలో అలవోకగా, మాట్లాడ గలిగిన మేధావి. 1940లో తన సోదరులతో కలిసి కాకతీయ పత్రికలో ఎన్నో వ్యాసాలు రాసారు. 1948నుండి 51వరకు కాకతీయ పత్రిక సంపాదకునిగా పని చేశారు. విశ్వనాథ సత్యనారాయణ వేయి పడగలను సహస్రఫణ్ పేరుతో హిందీ అనువాదం చేసి జ్ఞానపీఠ అవార్డు పొందారు. 1968-74 మధ్య తెలుగు సాహిత్య అకాడమీ చైర్మన్‌గా ఉన్నారు. 1983లో స్పానిష్ భాషలో ప్రసంగించి, అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో క్యూబా అధ్యక్షులు ఫీడెల్‌ను అబ్బుర పరిచిన గొప్పతనం ఆయనది. నిరాడంబరుడు, తన పిల్లలను సైతం ప్రధాని కార్యాలయానికి దూరంగా ఉంచిన నిజాయితీ పరుడు, చివరి దశలో కోర్టులకు తిరగడానికి ఆస్తులను అమ్ముకున్న వ్యక్తి. 2004 డిసెంబర్ 23న తుది శ్వాస వదిలారు. తెలంగాణలో పివి జయంతిని కేసిఆర్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అభినందనీయం....


  0 0

  (నేడు బలిజేపల్లి లక్ష్మీకాంత కవి 137వ జయంతి)
  తెలుగునాట బలిజేపల్లి లక్ష్మీకాంతకవి గురించి తెలియని వారు ఉండరు. ముఖ్యంగా రంగస్థల కళాకారులు, పద్య, గద్య రచయితలు బలిజేపల్లి పేరును మరిచిపోలేరు. ఆంధ్ర దేశానికి ఆయన అందించిన హరిశ్చంద్ర నాటకం తెలుగు నేల నాలుగు చెరగులా నాటక సమాజాలకు ప్రేరణ. ఆధునిక ‘మాయా మేయ జగంబు’లో కూడా హరిశ్చంద్ర కళాకారులకు ‘స్థిరమై తోడు’ వస్తూనే ఉంది. హరిశ్చంద్రుడు కృతయుగం నాటి భారతదేశ చక్రవర్తి. మహా వీరుడు. సత్య వాక్కు పరిపాలకుడు. సర్వసులక్షణ శోభితుడు. ఆపదలు ఎన్ని వచ్చినా సత్యం వీడని నిత్య సత్యవంతుడు. హరిశ్చంద్రుని భార్య చంద్రమతి కూడా భర్త త్యాగనిరతికి అండగా ఉంటూ, ఆయన సత్యదీక్షకు భంగం కలుగకుండా, కోరితెచ్చుకున్న బాధల్ని మహా భాగ్యంగా స్వీకరించిన నారీ శిరోమణి. ఈ ఇరువురి జీవిత కథ ఆధారంగా బలిజేపల్లి 1912లో ‘హరిశ్చంద్రీయము’ నాటకం తన 31వ యేట రాశారు. ఈ నాటకంలో హరిశ్చంద్రుడు, నక్షత్రకుడు పాత్రలను కూడా లక్ష్మీకాంతం పోషించారు. ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో అరెస్టై రెండేళ్లు జైలులో ఉన్న సమయంలో హరిశ్చంద్ర లిఖించారు. ఇందలి పద్య రచన ఒక జలపాతం. అలవోకగా పండిత, పామరుల్ని అలరింప జేశాయి. పంట చేలల్లో పనులు చేసుకునే వారి నాలుకలపై కూడా నర్తించాయి. ఎందరో కవులు ఈ నాటకం రాసినా బలిజేపల్లి పద్యాలు మాత్రమే కట్టిపడేస్తాయి. కర్నాటక, గుజరాతీ, బెంగాలీ వంటి దేశీయ భాషల్లోనూ హరిశ్చంద్ర ప్రదర్శనలు లేకపోలేదు. గుజరాత్‌లో ‘రాజా సత్య హరిశ్చంద్ర ’ చూశాకే మహాత్మా గాంధీ జీవితంలోనూ కొత్త మార్పులొచ్చాయని అంటారు.
  బలిజేపల్లి 1881 డిశంబరు 23వ తేదీన గుంటూరు జిల్లా బాపట్ల తాలూకాలోని ఇటికలపాడు గ్రామంలో నరసింహ శాస్ర్తి, ఆది లక్ష్ముమ్మ దంపతులకు జన్మించారు. మేనమామ భాగవతుల చెన్న కృష్ణయ్య దగ్గర ఉంటూ మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. మేనత్త సరస్వతమ్మ రామాయణ, భాగవత కథల్ని బోధించారు. అవధానాలు చేయటంలో కూడా ప్రజ్ఞ సంపాదించారు. కొంతకాలం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో గుమస్తాగానూ, కొంతకాలం హిందూ కళాశాలలో అధ్యాపకునిగానూ పని చేశారు. చిత్తజల్లు పుల్లయ్య ప్రోత్సాహంతో చిత్ర సీమలోకీ అడుగు పెట్టారు. అనసూయ(1936), జరాసంధు (1938), వరవిక్రయం (1939), భూకైలాష్ (1941), బాల నాగమ్మ (1944) వంటి పదికి పైబడిన సినిమాలలో మాటలు, పాటలు, సంభాషణలు వంటివి రాశారు. కొన్ని సినిమాలల్లో పాత్రలు కూడా వేశారు. శివానందలహరి శతకం, స్వరాజ్య సమస్య పద్య కృతి, బ్రహ్మ రథం, మణి మంజూష నవలలు, బుద్ధిమతి విలాసం, ఉత్తర రాఘవీయం నాటకాలు రాశారు. 1923లో చల్లపల్లి రాజా వారి సహకారంతో గుంటూరులో చంద్రిక ముద్రణాలయాన్ని స్థాపిం చారు. 1926లో ఫస్ట్ కంపెనీ పేరిట బెస్ట్ నాటక సమాజాన్ని ఏర్పాటు చేశారు. 1930లో బర్మాలోని రంగూన్ ఆంధ్రులు ‘కవితా కళానిధి’ బిరుదుతో సత్కరించారు. 1942లో చలనచిత్ర రంగం ‘పుంభావ సరస్వతి’ బిరుదుతో అఖండ సన్మానం చేశారు. శేష జీవితాన్ని కాళహస్తిలో గడిపి 1953 జూన్ 30వ తేదీన నటరాజ స్వామిలో ఐక్యమయ్యారు.


  0 0

  ఛ త్తీస్‌గఢ్ అనగానే మావోయిస్టులు గుర్తుకొస్తారు. ఆ రాష్ట్రంలోని అబూజ్‌మాడీ అటవీ ప్రాంతాన్ని ‘‘విముక్తి ప్రాంతం’’గా చేసుకుని సమాంతరంగా జనతన సర్కారు నడుపుతున్నారని వినికిడి. సామ్రాజ్యవాదుల పెట్టుబడిదారుల, దళారి- బూర్జువా వర్గాలకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతోందని ఆదివాసీల చేత మావోయిస్టులు అసహజ రీతిలో చెప్పిస్తున్నారు.
  ఇది ఇలా ఉంటే ఇటీవల ఆ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో బిజెపి నాయకత్వంలోని రమణ్‌సింగ్ ప్రభుత్వం గద్దె దిగింది. కాంగ్రెసు నాయకత్వంలో భూపేశ్ బఘేల్ ప్రభుత్వం ఏర్పడింది. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రేసులో త్రిభువనేశ్వర్ శరణ్‌సింగ్ దేవ్ కూడా కొనసాగారు.
  టి.ఎస్.సింగ్ దేవ్ సాధారణ వ్యక్తికాదు, ఆయన సర్గుజా సంస్థానం రాజు. సర్గుజా సంస్థానానికి 118వ వారసుడు. అంబికాపూర్ రాజధానిగా తమ పూర్వీకులు రాజ్యమేలారు. ఇప్పటికీ వారి ప్యాలస్ చెక్కుచెదరకుండా హుందాగా కనిపిస్తోంది. వందల కోట్ల రూపాయల ఆస్తికి ఆయన వారసుడు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యంగా అంబికాపూర్ పరిసర ప్రాంత ప్రజల ప్రేమను, గౌరవాన్ని చూరగొన్న విద్యాధికుడు. మొన్నటివరకు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ప్రజల్లో సచ్ఛీలుడు మర్యాదస్తుడన్న పేరున్నది. వందల కోట్ల రూపాయల ఆస్థికి వారసుడైనా ఆయన వివాహం చేసుకోలేదు. తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేశారు. 1983లో ఆయన అంబికాపూర్ పురపాలక సంఘానికి అధ్యక్షునిగా ఎన్నికై ఆ పట్టణానికి సేవలందించారు. 2008 సంవత్సరంలో అంబికాపూర్ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 2013 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ అంబికాపూర్ నుంచి గెలిచారు.
  సింగ్‌దేవ్ ఛత్తీస్‌గఢ్ గూర్చి పూర్తిగా తెలిసిన వ్యక్తేగాక ఆయన అనేక దేశాల్లో పర్యటించి అక్కడి ప్రజల జీవన విధానాన్ని పాలనా పద్ధతులను అధ్యయనం చేశారు. అందులో భాగంగా ఇంగ్లండ్, ఫ్రాన్స్, స్లిట్జర్లాండ్, ఇటలీ తదితర దేశాల్లో పర్యటించారు. ఎంతో సుసంపన్నమైన జ్ఞానం- అనుభవం ఉన్నా అతి సాధారణ వ్యక్తిగా ప్రజల్లో ఒకనిగా వ్యవహరించడంవల్ల ఆయన అంటే ప్రజల్లో ఆరాధనా భావం ఏర్పడింది. అన్ని సెక్షన్ల ప్రజలు ఆయన ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టాలని కోరుకున్నారు. కాని తృటిలో ఆ అవకాశం చేజారింది. భూపేష్ బఘేల్‌కు ఆ అవకాశం దక్కింది. 67 సంవత్సరాల సింగ్‌దేవ్ సోషల్ మీడియాలోనూ చురుగ్గా కనిపిస్తారు. తన ఆలోచనలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటారు. కాంగ్రెసు పార్టీ కార్యకర్తల్లో, నాయకుల్లో ఆయన పట్ల గౌరవముంది. సచ్ఛీలుడన్న భావన కొనసాగుతోంది. రాజకీయాల్లోనేగాక ఆదివాసీ ప్రజల్లో ఒకనిగా ఒదిగిపోయి సంప్రదాయ డోలు వాయిస్తూ ఆయన నాట్యం చేస్తారు.
  సర్గుజా సంస్థానంలా ఛత్తీస్‌గఢ్‌లో ఇంకా అనేక సంస్థానాలున్నాయి. ఆయా సంస్థానాల రాజుల వారసులు ఇప్పటికీ ప్రజల అభివృద్ధి- సంక్షేమంకోసం కృషిచేస్తున్నారు. ప్రజలకు ఏ అవసరముందో తెలుసుకుని దాన్ని సమకూర్చే పనుల్లో ఉన్నారు. అలాంటి అనేకమంది రాజ వంశీయుల పట్ల అక్కడి ప్రజలు ఎంతో గౌరవం చూపుతున్నారు. వంశపారంపర్యంగా వస్తున్న ఆచార వ్యవహారాలను, సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు.
  ఇక్కడే మావోయిస్టులు చెప్పే ‘వైరుధ్యాలు’ చెల్లకుండాపోతున్నాయి. ఇప్పటికీ రాజు వంశాల వారులను ప్రజలు ప్రేమిస్తున్నారంటే, గౌరవిస్తున్నారంటే వారిపట్ల విధేయత కనబరుస్తున్నారంటే మావోయిస్టుల ‘వర్గ వైషమ్యాలు’, అంతస్థుల తేడాతో ఘర్షణ తలెత్తి పోరాటాల రూపం తీసుకుంటుందన్న విశే్లషణ- సిద్ధాంతీకరణ చెల్లుబాటుకాని నాణెం అని తేటతెల్లమవుతోంది. దీని ఆధారంగా గత ఎన్నికల్లో కాంగ్రెసు నాయకత్వాన్ని ఖతం చేసినా ఒరిగింది ఏమిటి? ఏమీలేదని స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మాడో, సుకుమా, బీజాపూర్ తదితర ప్రాంతాల్లో మావోలు ఆదివాసీలతో దళాలు నిర్మించి, సాయుధ దాడులు కొనసాగిస్తూ పాఠశాల భవనాలను, సెల్ టవర్లను ధ్వంసంచేస్తూ, రోడ్డు నిర్మాణాలను అడ్డుకుంటూ, ఆ పనులకు కాపలా ఉన్న సిఆర్‌పిఎఫ్ జవాన్లను పెద్దసంఖ్యలో హతమార్చడం, ఆదివాసీల పరిధిలోకి రాని బూర్జువా, సామ్రాజ్యవాద, పెట్టుబడిదారి- దళారి వర్గాలకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతోందని, కారల్‌మార్క్స్, లెనిన్, స్టాలిన్, మావో లాంటి నాయకులు చూపిన మార్గం తమకు శిరోధార్యమని చెప్పిస్తూ, ఆదివాసీల చేత ఎర్రజెండా పైకెత్తిస్తే అదెలా వర్తమాన పరిస్థితులకు అనుకూలమైన వైఖరి అనిపించుకుంటుంది? పెట్టుబడిదారి- దళారి- సామ్రాజ్యవాదంలోని సంక్లిష్టత, వాటి నిర్వచనాలు, వాటి ఉత్థాన పతనాల గూర్చి ఏ మాత్రం అవగాహన లేని ఆదివాసీల చేత ఈ మాటలను పలికించినంత మాత్రాన గొప్ప చైతన్యం విస్తరించినట్టవదు. కాని మావోయిస్టులు మాత్రం ఆ పదజాల విస్తరణ, ఉచ్ఛరణ గొప్ప విప్లవంతో సమానమని సంబరపడటం విడ్డూరంగాక ఏమవుతుంది? ఆదివాసీల సామాజిక- ఆర్థిక- సాంకేతిక, నైపుణ్యాల శక్తి ఎంత? వాటి ద్వారా ప్రపంచ చలనగీతిని ప్రభావితం చేసే అవకాశాలున్నాయా? ప్రస్తుతం ప్రచులితమవుతున్న భావజాలాన్ని, పనివిధానాన్ని దండకారణ్య ఆదివాసీల కార్యాచరణ, నడక మార్చగలదా? లేదన్న సంగతి ఛత్తీస్‌గఢ్ ప్రజలకు తెలుసు. అందుకే ఈసారి రమణ్‌సింగ్ సర్కారును గద్దెదింపి కొత్త ప్రభుత్వాన్ని గద్దె నెక్కించారు. ఈ విజ్ఞత ప్రదర్శించిన ఆ రాష్ట్ర ప్రజలు ప్రధాన స్రవంతిలో చేరి, ప్రపంచ పరిస్థితులను అర్థంచేసుకుని అడుగులువేసే క్రమం కనిపిస్తోంది. బస్తర్ ప్రాంతమంతా మావోయిస్టుల కంచుకోట అన్న వాదన పూర్తిగా నిరాధారమని ఆ ప్రాంతంనుంచి గెలిచిన కాంగ్రెసు శాసనసభ్యులే రుజువు చేశారు.
  మావోయిస్టులు ఏ ఆదివాసీలపై, బడుగు, బలహీన వర్గాలపై నమ్మకంతో దశాబ్దాలుగా సాయుధ బాట పట్టారో వారే ఇప్పుడు భూపేన్ బఘేల్‌ను గద్దెనెక్కించారు. బస్తర్ ప్రాంత ఆదివాసీలు కాంగ్రెసు అభ్యర్థులను గెలిపించారు. మెజార్టీ స్థానాలు గెలిచినవారు తమ నాయకుని ఎన్నుకున్నారు, కాంగ్రెసు అధిష్టానం ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర రైతులకు-పేదలకు, బలహీనులకు మేలు జరగ గలదని విశ్వసిస్తున్నారు. ఇచ్చిన అనేక హామీలను కాంగ్రెసు పార్టీ అమలుచేయగలదని నమ్ముతున్నారు. ఆ విధంగా ఎంతోకొంత మేలు జరగగలదని ఆశిస్తున్నారు.
  కాని మావోయిస్టులు మాత్రం తుపాకి గొట్టం ద్వారా, సాయుధ పోరాటం ద్వారా రాజ్యాధికారం దక్కుతుందని దశాబ్దాలుగా ఆశలు రేపుతూ అరణ్యాలను యుద్ధ్భూమిగా మార్చారు. అటు మావోయిస్టులు- ఇటు పోలీసుల మధ్య సామాన్య ఆదివాసీలు నలిగిపోతున్నారు. తమ జీవితాలు ఛిద్రమవుతున్నాయని వాపోయేవారి సంఖ్య గణనీయంగా ఉంది. అమాయకమైన ఆదివాసీలెందరో ఈ ఘర్షణలో కన్నుమూశారు. యువకులు తమతమ గ్రామాలను వదిలి పక్షుల్లా వలసబోతున్నారు. ముసలి-ముతక గూడాలలో జీవచ్ఛవాలుగా పడి ఉన్నారు. పేదల పట్ల ప్రేమ, అణగారిన ప్రజల పట్ల ఆర్తిగలవారు చేసే కార్యక్రమం ఇలాఉంటే వర్తమాన డిజిటల్ సమాజంలో ఆదివాసీలు, ప్రజలు ఎలా ఉజ్వల భవిష్యత్ వైపు పయనిస్తారు?
  కాలం చెల్లిన సిద్ధాంతాలకు ప్రాణప్రతిష్ట చేయాలని భావించి, సాయుధ పోరాటం ద్వారానే సోషలిజం సాధ్యమవుతుందన్న భ్రమల్లో ఉంటూ ప్రజలను ఇలా అనాలోచితులను చేయడం దారుణం. సంపద సృష్టితీరు మారింది. కేవలం భూమి ఆధారంగానే సంపద సృష్టిజరగడం లేదన్న సంగతి ప్రపంచమంతటా కనిపిస్తున్నా, టెక్నాలజీ అన్ని రంగాలలోకి చొరబడి ‘మేధ’కు పెద్దపీట వేస్తున్న తరుణంలో ఈ నగ్నసత్యాన్ని గమనంలోకి తీసుకోకుండా, మేధోశక్తికి వర్గంతో సంబంధంలేదని శతాబ్దాలుగా రుజువుతున్నా ఇంకా మావోయిస్టులు ‘రెండువర్గాల సిద్ధాంతాన్ని’ ఆధారం చేసుకుని ఆలోచించడం, వర్గరహిత సమాజంలోనే ప్రజలకు న్యాయం జరుగుతుందన్న అంధ విశ్వాసంతో మందుపాతరలతో చెలరేగి పోవడం వికృతచేష్ట తప్ప మరొకటి కాదు. మావోయిస్టులు పేర్కొనే ‘‘వర్గరహిత సమాజం’’ ఏర్పడటం అసంభవం. అది మానవుని ఆకాంక్షలకు- జ్ఞానానికి- సహజాతాలకు వ్యతిరేకం. సాధికారత సాధించగలరు తప్ప సోషలిజం ఎన్నటికీ సాధ్యంకాదు. అది ‘‘మానవుని ఆవరణం’’లో లేని అంశం. అలాంటి అంశాన్ని పట్టుకుని దశాబ్దాలుగా ఛత్తీస్‌గఢ్‌లో మానవ హననానికి పూనుకోవడం అజ్ఞానం తప్ప మరొకటి కాదు. ఛత్తీస్‌గఢ్‌లో సర్గుజారాజుసింగ్‌దేవ్ ప్రజాస్వామ్యంలో ఓ సాధారణ వ్యక్తిగా జీవిస్తుండగా ఇక రెండు వర్గాల సిద్ధాంతానికి ‘మాన్యత’ ఎక్కడిది?


  0 0

  శబరిమల, డిసెంబర్ 22: కేరళలో ప్రసిద్ధ శబరిమల అయప్పస్వామి ఆలయం శుక్రవారం భక్తులతో కిటకటిలాడింది. మండల వార్షిక పూజల నేపథ్యంలో ఒక్కరోజే లక్ష మంది యాత్రికులు తరలితరలి వచ్చారు. గత కొంతకాలంగా నిరసనలో హోరెత్తిపోయిన శబరిమల పరిసరాల్లో ఉత్సహపూరిత వాతావరణం కనిపించింది. శుక్రవారం ఒక్కరోజే 1.12,260 మంది భక్తులు ఆలయాన్ని దర్శించుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈఏడాది వార్షిక పూజలు ప్రారంభమైన తరువాత ఇంత ఎక్కువ మంది భక్తులు తరలిరావడం ఇదే మొదటిసారని వారన్నారు. రానున్న రోజుల్లో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది.


  0 0

  న్యూఢిల్లీ, డిసెంబర్ 22: రాజధాని ఢిల్లీలో సిక్కుల ఊచకోత కేసులో యావజ్జీవ శిక్ష పడ్డ కాంగ్రెస్ మాజీ నేత సజ్జన్‌కుమార్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 1984 కేసులో ఢిల్లీ హైకోర్టు కుమార్‌కు జీవించి ఉన్నంత కాలం కారాగార శిక్ష విధిస్తూ ఇటీవలే తీర్పునిచ్చింది. సజ్జన్‌కుమార్ సుప్రీం కోర్టును ఆశ్రయించినట్టు రిజిస్ట్రీనుంచి తనకు సమాచారం అందిందని బాధితుల తరఫున కోర్టులో వాదిస్తున్న సీనియర్ న్యాయవాది హెచ్‌ఎస్ ఫూల్కా వెల్లడించారు. కుమార్‌కు సంబంధించి ఏకపక్ష నిర్ణయం తీసుకోవద్దంటూ సిక్కు బాధిత కుటుంబాలు ఇంతకు ముందే సుప్రీం కోర్టు కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. 34 ఏళ్ల నాటి కేసులో కాంగ్రెస్ మాజీ నేత సజ్జన్‌కు ఢిల్లీ హైకోర్టు ఈనెల 17న యావజ్జీవ శిక్ష విధించింది. 1984లో ఢిల్లీ రాజ్‌నగర్‌లో జరిగిన సిక్కు కుటుంబ హత్య కేసులో అతడికి శిక్ష పడింది. రాజ్‌నగర్ ఫేజ్-1 ప్రాంతంలోని పాలం కాలనీలో 1984 నవంబర్ 1-2 తేదీల్లో ఐదుగురు సిక్కులు దారుణ హత్యకు గురయ్యారు.


  0 0

  న్యూఢిల్లీ, డిసెంబర్ 22: అగస్టావెస్ట్‌లాండ్ వీవీఐపీ హెలీకాప్టర్ల కేసులో అరెస్టయిన క్రిస్టియన్ మిచెల్ మరో ఏడు రోజుల ఈడీ కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశించింది. మిచెల్ బెయిల్ పిటిషన్‌ను ప్రత్యేక న్యాయమూర్తి అరవింద్ కుమార్ కొట్టివేశారు.
  మనీలాండరింగ్ కేసులో క్రిస్టియన్‌ను విచారించాల్సి ఉందని, 15 రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోర్టును అభ్యర్థించింది. యూనైటెడ్ అరబ్ ఏమిరేట్స్‌లో అరెస్టయిన క్రిస్టియన్‌ను ఈనెల 4న ఢిల్లీకి తీసుకొచ్చారు. మర్నాడే అతడిని కోర్టులో హాజరుపరచగా ఐదు రోజుల రిమాండ్ విధించారు.తరువాత రిమాండ్‌ను నాలుగురోజులకు పొడిగించారు. మిచెల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను విచారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. శనివారం నుంచి ఏడు రోజులు అంటే ఈనెల 28 వరకూ ఈడీ కస్టడీకి అప్పగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. క్రిస్టియన్ బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. వీవీఐపీ హెలీకాప్టర్ల ఒప్పందలో మిషెల్ మధ్యవర్తిగా ఉన్నారు. అతడితోపాటు గుడోహస్కే, కార్లో గెరోసాపై సీబీఐ కేసు నమోదు చేసింది. కాగా కోర్టు రిమాండ్ విధించిన వెంటనే మిచెల్‌ను ఈడీ పోలీసులు అరెస్టు చేశారు.


  0 0

  ఐక్యరాజ్యసమితి, డిసెంబర్ 22: పాకిస్తాన్ తన దుష్టబుద్ధిని పోనిచ్చుకోలేదు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గెటెరెస్‌కు ఫోన్‌చేసి కాశ్మీర్ అంశాన్నిప్రస్తావించినట్లు ఐరాస అధికార ప్రతినిధి స్టీఫెన్ దుజారిక్ చెప్పారు. ఇంతకంటే మించిన సమాచారం తన వద్ద లేదని ఆయన చెప్పారు. కాని చర్చల్లో కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారన్నారు. కాగా ఈ అంశంపై భారత్ ధీటుగా స్పందించింది. కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని , ఈ అంశంపై చర్చలకు తావులేదని పేర్కొంది. కాగా అధికార ప్రతినిధి విలేఖర్లతో మాట్లాడుతూ భద్రత మండలి ఆదేశం మేరకు ఒక పరిశీలన బృందం మాత్రం ఈ అంశాలను పరిశీలిస్తుంటుందని చెప్పారు. యుఎన్ మిలిటరీ అబ్జర్వర్ గ్రూప్ ఇండియా, పాకిస్తాన్ ఈ విధులు నిర్వహిస్తుందన్నారు. సాధారణంగా వివిధ దేశాల అధినేతలు ఐరాస సెక్రటరీ జనరల్‌తో మాట్లాడుతుంటారని చెప్పారు. ఈ సందర్భంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కాశ్మీర్ అంశంపై మాట్లాడారన్నారు. కాశ్మీరీలు తమ భవితను నిర్ణయించుకునే అవకాశం కల్పించాలని తాను కోరినట్లు ఇమ్రాన్ ట్వీట్ చేశారు. ఐరాస సమావేశంలో కాశ్మీర్‌లో భారత్ మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్న విషయాన్ని ప్రస్తావించనున్నట్లు ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. పాక్ దుష్టబుద్ధికి ఈ ట్వీట్లు నిదర్శనమని భారత్ విదేశాంగశాఖ ప్రతినిధి చెప్పారు. పాకిస్తాన్‌కు నిజాయితీ లేదన్నారు. నాటకాలు ఆడడంలో పాక్‌కు ఎవరూ సాటిరారన్నారు.


  0 0

  అహ్మదాబాద్, డిసెంబర్ 22: సమాజాన్ని కులాలు, మతాల పేరుతో విభజించి రాజకీయంగా లబ్ధిపొందాలనే శక్తులపై భద్రతా ఏజన్సీలు అప్రమత్తంగా ఉండాలని, దేశానికి ఈ శక్తుల వల్ల ప్రమాదం పొంచి ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. దేశాన్ని తీవ్రవాదంతో విచ్ఛిన్నం చేయాలనే చీకటి శక్తులు, సంస్థలపై నిఘా పెట్టాలని ఆయన పోలీసులను కోరారు. దేశమంతా ఒక్కటే అనే సమభావాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని ఆయన పోలీసులను కోరారు. గుజరాత్‌లోని కవాడియాలో జరిగిన డీజీపీ, ఐజీల వార్షిక సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ వివరాలను పోలీసు శాఖ ప్రకటనలో విడుదల చేసింది. దేశ సమగ్రత, ఐక్యత కోసం అవిశ్రాంతంగా పనిచేయాలని ఆయన కోరారు. దేశంలో అన్ని వర్గాల ప్రజలు సమిష్టిగా పని చేయాలనే సంకల్పంతో పోలీసుశాఖ పనిచేయాలని, ఈ ప్రయత్నాలను వమ్ము చేసేందుకు అన్ని రకాల దుష్టపన్నాగాలతో ఉండే శక్తులను ఒక కంట కనిపెట్టి ఉండాలన్నారు. ఈ శక్తులను గుర్తించి ఏకాకులను చేయాలన్నారు. ఉగ్రవాదం నడ్డివిరిచేందుకు పోలీసు శాఖ చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. జమ్ముకాశ్మీర్‌లోని పోలీసులు దేశ భద్రతకు ఎనలేని త్యాగాలు చేస్తున్నారన్నారు. ఉగ్రవాదంపై పోరులో ప్రజలను భాగస్వాములను చేస్తున్నారన్నారు. పోలీసులు ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిబద్ధతతో పనిచేస్తున్నారన్నారు. ప్రజల సంక్షేమం, భద్రత లక్ష్యంగా పనిచేస్తున్న పోలీసుల త్యాగాలను గుర్తించాలని ఆయన సీనియర్ పోలీసు అధికారులను కోరారు. ఒక్కోసారి పోలీసులకు వారు చేసిన కృషికి తగిన గుర్తింపు లభించదని, ఆ లోటు రానివ్వకుండా చూడాలన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా దేశ విచ్ఛిన్నకరశక్తులపై నిఘా పెట్టాలన్నారు. సైబర్ సెక్యూరిటీ గురించి ఆయన ప్రస్తావిస్తూ ఈ అంశాలపై పోలీసులకు శిక్షణ ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా ఆయన విశిష్టసేవలు అందించిన ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులకు రాష్టప్రతి పతకాలను అందచేశారు. జాతీయ పోలీసు స్మారకోత్సవ సందర్భంగా పోలీసుల సేవలను గుర్తిస్తూ ఒక తపాలా బిళ్లను ఆయన విడుదల చేశారు. పోలీసు స్మారక స్థూపం ప్రజలకు స్ఫూర్తినిస్తోందన్నారు. సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ పోర్టల్‌ను ఆయన ఆవిష్కరించారు.


  0 0

  ముంబయి, డిసెంబర్ 22: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ) ఈవారం మిశ్రమ ఫలితాలను నమోదు చేసింది. వరుసగా ఏడో రోజు లాభాలను ఆర్జించి, బుల్ పరుగు కొనసాగుతుందనే అభిప్రాయాన్ని కల్పించింది. కానీ, చివరి రెండు రోజుల్లో మార్కెట్ దూకుడుకు కళ్లెం పడింది. వారంతంలో సెనె్సక్స్ పతనంతో ముగిసింది. ఈనెల 14వ తేదీన 35,962.93 పాయింట్లుగా ఉన్న సెనె్సక్స్ ఆతర్వాత క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఈవారం మొదటి రోజైన సోమవారం 36,270.07 పాయింట్లుగా నమోదైంది. ఆతర్వాత కూడా వరుసగా రెండు రోజుల పాటు సెనె్సక్స్ లాభాల బాటలో నడిచింది. 36,347.08, 36,484.33 పాయింట్ల చొప్పున పెరిగింది. దీనితో వరుసగా ఏడు రోజుల పాటు సెనె్సక్స్ పరుగులు తీసింది. కానీ, గురువారం మార్కెట్‌లో ప్రతికూల వాతావరణం కనిపించింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడం, రూపాయి మారకపు రేటు బలపడడం వంటి అంశాలు స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపాయి. గురువారం ట్రేడింగ్‌లో తీవ్రమైన ఆటుపోట్లకు గురైన మార్కెట్ ఒకానొక దశలో 250 పాయింట్లకుపైగా నష్టపోయింది. కానీ, చివరిలో కోలుకోవడంతో, సుమారు 50 పాయింట్ల స్వల్ప నష్టంతో గట్టెక్కింది. అయితే, శుక్రవారం నాటికి ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల సవరణ మార్కెట్‌ను శాసించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర పెరగడం కూడా జత కలవడంతో, సెనె్సక్స్ పతనం ఖాయమైంది. సుమారు 680 పాయింట్లు పడిపోయి, 35,742.07 పాయింట్ల కనిష్టానికి చేరింది. ఈనెల 14న నమోదైన 35,962.93 పాయింట్ల కంటే కూడా ఈవారం లావాదేవీలకు చివరి రోజైన శుక్రవారం నాటి ముగింపు తక్కువ కావడం గమనార్హం.


  0 0

  వాషింగ్టన్, డిసెంబర్ 22: ఎంతోకాలంగా కొనసాగుతున్న అమెరికా వృద్ధి రేటుకు ఇటీవల కాలంలో గండిపడుతున్నది. ఒకవైపు చైనా శర వేగంగా ముందుకు దూసుకురావడం, మరోవైపు గల్ఫ్ దేశాల నుంచి ఎదురవుతున్న రాజకీయ పరమైన వ్యతిరేకతలు అమెరికాను దెబ్బతీస్తున్నాయ. గల్ఫ్ దేశాల నుంచి ముడి చమురును కొనుగోలు చేయడాన్ని పూర్తిగా విరమించుకోవాలని కొన్ని దేశాలను ఆదేశించిన అమెరికా, కనీసం దిగుమతుల మొత్తాన్ని తగ్గించుకోవాలని భారత్, జపాన్ వంటి దేశాలకు సూచించింది. అయతే, ఇరాన్ తదితర చమురు ఉద్పాదక దేశాలకు రష్యా అండగా నిలవడంతో, అమెరికా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చైనాతో కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఉత్తర కొరియా తర్వాత అమెరికా ప్రత్యేంగా దృష్టి సారించిన ప్రాంతంగా పర్షియన్ గల్ఫ్ దేశాలను పేర్కోవచ్చు. చమురు ఉత్పత్తులపై తన అధికారాన్ని చెలాయంచాలన్న ఉద్దేశంతోనే ఇరాన్ తదితర దేశాలపై అమెరికా ఆంక్షలు విధించిందన్న విమర్శలు లేకపోలేదు. ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేస్తున్న అతిపెద్ద దేశం ఇరాన్ అని అమెరికా పదేపదే చెప్తూ వస్తున్నది. ప్రత్యేకించి ఇరాన్ నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో సరళీకృత విధానాలను ట్రంప్ ప్రభుత్వం తగ్గించుకుంది. ఇరాన్ దిగుమతులను పూర్తిగా తగ్గించుకోవాలని లేదా ఆంక్షలకు సిద్ధంకావడం కావాలని చేయాలని అమెరికా హెచ్చరించింది కూడా. ఈ విషయంలో భారత్‌కు మినహాయింపునిచ్చింది. ఇరాన్ నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్న దేశాల్లో చైనా తర్వాత భారత్ రెండో అతిపెద్ద కొనుగోలుదారు. కాగా ఇరాన్ నుంచి ప్రస్తుతం కొనుగోలు చేస్తున్న ముడిచమురు రోజుకు 4,52,000 బ్యారల్స్ కాగా దీన్ని 3,00,000 బ్యారల్స్‌కు తగ్గించుకోవాలని నిర్ణయంచింది. ఇలావుంటే, అణ్వాయుధాల తయారీ అత్యంత ప్రమాదకర పరిణామంగా అభివర్ణించిన ట్రంప్ ప్రభుత్వం దాని నియంత్రణకు కోసం ‘సమగ్ర సంయుక్త కార్యాచరణ పథకం’ (జేసీపీఓఏ)ని ప్రకటించి సంగతి తెలిసిందే. అంతకుముందు ఒబామా హయాంలో అమెరికా భద్రతా మండలిలో ఐదు దేశాలకు సభ్యత్వం కల్పించగా అప్పట్లో జర్మనీ, ఇరాన్ తమ అణు పరిశోధనలను, ఆయుధ తయారీని నిలిపివేయడానికి అంగీకరించాయి. ఈ దేశాలకు వ్యాపారపరమైన పరస్పర ఆర్థిక మంజూర్లు అమెరికా అందించేందుకు ఒప్పందం కుదిరింది. అయతే తర్వాత ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దేశాలకు అమెరికా మంజూర్లపై సరికొత్త విధానాన్ని తెరపైకి తెచ్చింది. ప్రత్యేకించి ఇరాన్‌పై అంక్షలు విధిస్తూ అణ్వాయుధ తయారీలో టెహ్రాన్‌కు సహకరించడం మానుకోవాలని హెచ్చరించింది. అలాగే ప్రస్తుతం కేస్ బై కేస్ ప్రాతిపదికన వివిధ దేశాలకు ఆంక్షలను కఠినతరం చేస్తోంది. కానీ, అదే సమయంలో ఇరాన్ తదితర చమురు ఉద్పాదక కంపెనీలకు రష్యా మద్దతునివ్వడం అమెరికాను ఆందోళనకు గురి చేస్తున్నది. వివిధ దేశాలపై ఆంక్షలను విధించుకుంటూ పోతున్న ట్రంప్ సర్కారు ఎక్కడా రాజీ ధోరణిని అలంభించడం లేదన్నది వాస్తవం. ఆర్థిక పరమైన అంశాల్లోనూ ట్రంప్ సర్కారు ఇదే వైఖరిని అనుసరిస్తున్నది. ఫెడరల్ రిజర్వ్ తాజాగా వడ్డీ రేట్లను పెంచడం వెనుక ప్రభుత్వ నిర్ణయాలు కీలక పాత్ర పోషించాయన్నది వాస్తవం. 2008లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం తర్వాత అమెరికా స్టాక్ మార్కెట్ కేంద్రం వాల్ స్ట్రీట్ 400 పాయంట్లకుపైగా నష్టపోవడం ఇదే మొదటిసారి. అమెరికా వృద్ధి రేటుకు గండి పడుతున్నదని, ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న రాజకీయ, ఆర్థిక నిర్ణయాలే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని అంటున్నారు. ఈ వాదన సరైనదేనని ప్రస్తుతం అమెరికా ఎదుర్కొంటున్న ఆర్థిక ప్రకంపనలను బట్టి స్పష్టమవుతున్నది. ఇకనైనా సరైన చర్యలు తీసుకొని, ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టేందుకు ట్రంప్ సర్కారు ప్రయత్నిస్తుందో లేక మొండి వైఖరితో ముందుకు వెళుతుందో చూడాలి.


  0 0

  సూర్యాపేట, డిసెంబర్ 22: ఇచ్చిన హామీలను విస్మరించి నియంతృత్వ పాలనను కొనసాగిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీని గద్దె దింపడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు కేశవ చంద్ యాదవ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేఖ విధానాలను నిరసిస్తూ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టిన యువ క్రాంతి యాత్ర శనివారం సాయంత్రం జిల్లా కేంద్రానికి చేరుకుంది. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ శ్రేణులు ఈ యాత్రకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీ ఆర్ నివాసంలో నిర్వహించిన సమావేశంలో కేశవచంద్‌యాదవ్ మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలుచేయకుండా మోదీ దేశంలోని అన్ని వర్గాల ప్రజలను మోసగించారని మండిపడ్డారు.
  మోదీని గద్దె దింపితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. మోదీ పాలన పూర్తిగా అవినీతిమయంతా మారిందని దేశ భద్రతకు సంబంధించిన రాఫెల్ విమానాల కొనుగోలులో జరిగిన అవినీతే ఇందుకు నిదర్శనమని ధ్వజమెత్తారు. విదేశాల్లో ఉన్న నల్ల ధనాన్ని వెనక్కి తెప్పిస్తానన్న మోదీ హామీ ఏమైందని ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దు భారీ కుంభకోణమని ఈ నిర్ణయంతో దేశాభివృద్ధికి విఘాతం కలిగిందన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టేందుకు సిద్ధమవుతున్నారని, ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో అత్యధిక రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడమే ఇందుకు నిదర్శనమన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అధిక స్థానాలు సాధిస్తుందని, రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి యువజన కాంగ్రెస్ గుండె లాంటిదన్నారు.


  0 0

  హైదరాబాద్, డిసెంబర్ 22: క్రైస్తవుల సంక్షేమానికి, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు చేపట్టి, అమలు చేస్తున్నదని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బెన్హర్ ఎక్క తెలిపారు. శనివారం సచివాలయంతో తెలంగాణ క్రిస్టిన్ ఎంప్లాయిస్ ప్రేయర్ ఫెలోషిప్ అధ్వర్యంలో క్రిస్మస్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరైన బెన్హర్ ప్రసంగిస్తూ క్రిస్మస్ పండుగను రాష్ట్ర ప్రభుత్వం అధికారిక పండుగగా ప్రకటించిందని గుర్తు చేశారు. నియోజకవర్గాల్లో క్రైస్తవులకు క్రిస్మస్ గిఫ్ట్ ప్యాకెట్, ఫీస్ట్ ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా క్రైస్తవ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లకు రూ.20 లక్షలు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారని ఆయన చెప్పారు.
  క్రైస్తవులందరి తరపున తాను ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని బెన్హర్ అన్నారు. ముఖ్య వక్తగా హాజరైన దైవజనులు పి. ఉపేందర్ మాట్లాడుతూ మానవుల పాప విముక్తి కలిగించేందుకు యేసు ఈ లోకంలో జన్మించాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ పిజెడి కుమార్ పాటలు వినపించారు. ఇంకా తెలంగాణ మైనారిటీ కమిషన్ వైస్-చైర్మన్ శంకర్, తెలంగాణ క్రిస్టియన్ ఎంప్లాయిస్ ప్రేయర్ ఫెలోషిప్ అధ్యక్షుడు ఎ. ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఎం. శ్యామూల్ సచివాలయ ఉద్యోగులు హాజరైనట్లు అసిస్టెంట్ సెక్రటరీ ఎ. ప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


  0 0

  వరంగల్, డిసెంబర్ 22: రాఫెల్ కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీకీ ప్రధాని మోదీ ఎందుకు భయపడుతున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం వరంగల్ డీసీసీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంతో తెలంగాణ సీఎం కేసీఆర్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకునే ముందస్తు ఎన్నికలకు పోయాడన్నారు. రాఫెల్ కుంబ కోణంపై పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీలు ఎందుకు నోరు మొదపడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాము టీఆర్‌ఎస్ అభ్యర్ధులతో పోటీ పడలేదని ఈవీఎంలు, డబ్బు సంచులతోనే కోట్లాడామన్నారు. ఎన్నికల కమీషన్ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహారించడం వల్లె 22లక్షల ఓట్లు గల్లంతు అయ్యాయని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా స్వామ్యానికి వ్యతిరేకంగా పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలను టీఆర్‌ఎస్‌లో వీలనం చేయడం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని అన్నారు. ఇప్పటికి కేసీఆర్ మంత్రి వర్గ విస్తరణ చేయకుండా ఇంకా కాంగ్రెస్ నుండి వచ్చేవారు ఉన్నారంటూ జాప్యం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధికి కృతజ్ఞతగా కనీసం పార్లమెంట్ ఎన్నికల్లోనైన మెజార్టీ ఎంపీ సీట్లను గెలిపించాలని ఆయన కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను మాత్రం చేయవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటీవల జరిగిన మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయం అని అన్నారు. కేసీఆర్ నియంత పాలనకు చెక్ పెట్టాలంటే కేంద్రంలో మహాకూటమి అధికారంలో వచ్చిందంటే కేసీఆర్‌కు వనకు పుట్టినట్లేనని అన్నారు. టీఆర్‌ఎస్ 16 ఎంపీ సీట్లను గెలువాలని పగటి కలలు కంటుందని ఆయన అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు విషయాన్ని ఆలోచిస్తామని అన్నారు. ఎన్నికల్లో ఓటమికి కారణాలను లోతుగా విశే్లషిస్తున్నామని, సమగ్ర నివేదకను కేంద్ర పార్టీకి అందజేస్తామని చెప్పారు. ఎన్నికల ఫలితాల అనంతరం తమ పార్టీ క్యాడర్ అసంతృప్తిగా ఉందని, ఫలితాలను జీర్ణించుకోలేక పోతున్నారని, ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమేనని అన్నారు. కార్యకర్తలను వచ్చే ఎన్నికల నాటికి సుశిక్తులను చేసేందుకే తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తున్నాని అన్నారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్, ఈవీ శ్రీనివాస్, నమిండ్ల శ్రీనివాస్, గొట్టెముక్కుల రమాకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


  0 0

  మానవపాడు, డిసెంబర్ 22: దేశంలో తీవ్ర వ్యవసాయ సంక్షోభం నెలకొందని సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆవేధన వ్యక్తం చేశారు. శనివారం గద్వాల జోగుళాంబ జిల్లా ఉండవెల్లి మండల పరిధి కంచుపాడు గ్రామంలో సీపీఐ జాతీయ కార్యదర్శి సురవం సుధాకర్‌రెడ్డి విలేకరులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సురవరం మాట్లాడుతూ కొన్ని ప్రాంతాల్లో పంటలు భాగా పండుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో ఉత్పత్తులు చేతికి రాక రైతులు నష్టాలను చవిచూస్తున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. ప్రతి ఎకరాకు భూసార పరీక్షలు ప్రభుత్వమే చేపట్టాలన్నారు. క్రిమి సంహారక మందులు అధిక మోతాదులో వినియోగించటం వల్ల భూసారం తగ్గిపోతుందని వివరించారు. ప్రకృతి వ్యవసాయానికి ప్రభుత్వాలు సబ్సిడీలు ఇవ్వాలన్నారు. ప్రకృతి వ్యవసాయంతో రైతులు, వినియోగదారులు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఆర్డీఎస్ సాగునీరు అందక రైతుల పొలాలు గత 30 ఏళ్లుగా ఎండిపోయాయన్నారు. ప్రభుత్వాలు పట్టించుకోక పోవటంతో భూములు ఎడారిగా మారాయని ఆవేధన వ్యక్తం చేశారు. ప్రతి రెండు గ్రామాలకు ఒక గోదాము ఏర్పాటు చేసి రైతు ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించినప్పుడే వ్యవసాయరంగం గట్టెక్కుతుందని అభిప్రాయ పడ్డారు. దేశంలో ప్రతి అరగంటకు ఒక రైతు ఆత్మహత్యకు పాల్పడుతున్నాడన్నారు. స్వామినాథన్ ఆదేశాల మేరకు రైతు అప్పులను మాఫీ చేయాలన్నారు. 60ఏళ్లు నిండిన రైతులకు ఫించను అమలు చేయాలని కోరారు. భాజపా కార్పోరేట్ అనుకూల విధానాలతో మూడు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో ఓటమి చవిచూసిందన్నారు. రిజర్వ్‌బ్యాంకు ఛీఫ్ అకడమిక్ అడ్వయిజర్ సుబ్రమణ్యం నోట్ల రద్దు భూటకం అని పుస్తకం రాశారన్నారు. మహరాష్టల్రో ఒక ఎకరాలో ఉత్పత్తయిన పంటను విక్రయించగా వచ్చిన రూ.1700 లను నరేంద్రమోడికి పంపించటం రైతుల ధీనస్థితికి అద్దం పడుతుందన్నారు. నోట్ల రద్దుతో బ్లాక్ మనీ, దొంగనోట్లు వైట్ మనీగా మారాయన్నారు. రిజర్వ్ బ్యాంకులో 3 లక్షల కోట్ల నోషనల్ ఉంటుందని అది ప్రకృతి వైపరీత్యాలు, కరువు కాటకాలకు వినియోగిస్తారని తెలిపారు. అటువంటి నోషనల్‌లో నుంచి నరేంద్రమోడి లక్ష కోట్లు కావాలని ఆర్‌బీఐపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. దళితులపై గోరక్షణ దళాలు దాడులు అధికమయ్యాయని వివరించారు. సీబీఐని నిర్వీర్యం చేసిన ఘనత నరేంద్రమోడికే దక్కిందన్నారు. దేశంలో ఐక్యవేధిక ఏర్పాటు చేసి తద్వారా భాజపాపై పోరాటం సాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.


older | 1 | .... | 1979 | 1980 | (Page 1981) | 1982 | 1983 | .... | 2069 | newer