Are you the publisher? Claim or contact us about this channel


Embed this content in your HTML

Search

Report adult content:

click to rate:

Account: (login)

More Channels


Showcase


Channel Catalog


Articles on this Page

(showing articles 39721 to 39740 of 41370)
(showing articles 39721 to 39740 of 41370)

older | 1 | .... | 1985 | 1986 | (Page 1987) | 1988 | 1989 | .... | 2069 | newer

  0 0

  కర్నూలు, డిసెంబర్ 24:అన్ని వర్గాల సంక్షేమమే సీఎం చంద్రబాబు ఆశయమని డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సోమవారం డిప్యూటీ సీఎం కేఈ చంద్రన్న కిస్మస్, సంక్రాంతి కానుకలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేఈ మాట్లాడుతూ భారతదేశం మత సామరస్యానికి పేరుగాంచిందన్నారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పండుగలను ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశ్యంతోనే సీఎం చంద్రబాబు క్రైస్తవులకు క్రిస్మస్, ముస్లింలకు రంజాన్, హిందువులకు సంక్రాంతి కానుకలు అందిస్తున్నారని గుర్తుచేశారు. ముఖ్యంగా మైనారీటీల అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి గత నాలుగేళ్లుగా రూ. 3వేల కోట్లు ఖర్చు చేసిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కోల్స్ కాలేజీలో తాను, తన తమ్ముడు కేఈ ప్రభాకర్ చదివామని ఆ సమయంలో క్రైస్తవులతో ఉన్న తమ అనుబంధాన్ని కేఈ గుర్తు చేసుకున్నారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ కుల, మత, ధనిక, పేదలకు అతీతంగా పండుగలు సంతోషంగా జరుపుకోవాలని ప్రభుత్వం ఉచితంగా పండుగ సరుకులు అందజేస్తుందన్నారు. ఇవేకాక సీఎం చంద్రబాబు పేద ప్రజల సంక్షేమాభివృద్ధికి వందకు పైగా పథకాలు ప్రవేశపెట్టడంతో పాటు పేదవారి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ మాట్లాడుతూ అన్ని కులాలు, మతాల వారు ఆనందంగా పండుగను జరుపుకోవాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని 7 రకాల వస్తువులను ఒక బ్యాగులో ఉంచి ఉచితంగా ఇస్తున్నామన్నారు. దళిత క్రైస్తవులను దళితులుగా గుర్తించడానికి సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. కర్నూలు నగరంలో చర్జిల మరమ్మతులకు రూ. 8.5 కోట్లు మంజూరయ్యాయని, ఇందులో ఇప్పటికే రూ. 4.4 కోట్లు విడుదల చేసి అందించిందన్నారు. కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి నిరుపేద ఆనందంగా పండుగ జరుపుకోవాలని భావించి ప్రభుత్వం రూ. 208 విలువైన 7 రకాల వస్తువులను ఉచితంగా అందిస్తుందన్నారు. అందులో అర కిలో బెల్లం, కిలో గోధుమపిండి, అర కిలో శెనగలు, అరకిలో కందిపప్పు, అర లీటర్ పామాయిల్, నెయ్యితో కలిపి ఒక సంచిలో ఉంచి లబ్ధిదారులకు ఇస్తున్నామన్నారు. జిల్లాలో మొత్తం 11.82 లక్షల బీపీఎల్ కార్డుదారులు ఉండగా ఇందులో 1.41 లక్షల బీపీఎల్ కార్డులు కలిగిన ప్రైస్తవులకు కానుక అందిస్తున్నామన్నారు. వీటికి రూ. 28కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామన్నారు. అన్ని రేషన్ దుకాణాల్లో ప్రతి రోజూ ఉదయం 8 నుంచి రాత్రి వరకూ ఈ కిట్లు పంపిణీ చేస్తారన్నారు. నాణ్యత బాగా లేకపోతే వెనక్కి ఇచ్చి మంచి సరుకులు తీసుకోవచ్చు అన్నారు. అనంతరం లబ్ధిదారులకు సంచితో కూడిన ఏడు రకాల వస్తువులను అందజేశారు.


  0 0

  కర్నూలు, డిసెంబర్ 24:శిల్పారామం రాకతో కర్నూలు నగరం మరింత శోభాయమానంగా మారిందని డిప్యూటీ సీఎం, రెవెన్యూశాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం కేఈ సోమవారం నగర శివారులోని జగన్నాథగట్టు వద్ద మంత్రి అఖిలప్రియ, కలెక్టర్ సత్యనారాయణతో కలిసి శిల్పారామం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేఈ మాట్లాడుతూ ప్రజల అభివృద్ధి, సంక్షేమమే కాకుండా వారి ఆనందమే పరమావధిగా భావించి ప్రభుత్వం రాష్ట్రంలోనే అన్ని జిల్లాల్లో శిల్పారామాలు నిర్మిస్తోందన్నారు. నంద్యాల హైవే రోడ్డు నుంచి శిల్పారామం వరకూ అప్రోచ్ రోడ్డు నిర్మిస్తామన్నారు. శిల్పారామం పనులను 3 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పర్యాటక రంగాన్ని ప్రభుత్వం అన్నివిధాలుగా ముందుకు తీసుకుపోతుందన్నారు. కర్నూలు నుంచి అన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ మాట్లాడుతూ జగన్నాథగట్టు వద్ద 7.71 ఎకరాల్లో రూ. 3 కోట్ల అంచనా వ్యయంతో శిల్పారామం నిర్మిస్తున్నామని తెలిపారు. మొదటి దశలో కార్యాలయం, చేతి వృత్తి కళాకారుల దుకాణాల సముదాయం, సాంస్కృతిక కళా వేదిక, పిల్లల ఆటస్థలం, ఫలహారశాల, మరుగుదొడ్లు, రెండవ దశలో గ్రామీణ ప్రదర్శనశాలలు, కనె్వన్షన్ సెంటర్, 25 ఎకరాల్లో అమ్యూజ్‌మెంట్ పార్కు నిర్మిస్తామన్నారు. రూ. 3 కోట్లకు అదనంగా త్వరలో మరో రూ. 2 కోట్లు మంజూరు చేస్తామన్నారు. కలెక్టర్ సత్యనారాయణ, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ సెలవు దినాల్లో నగర ప్రజలు ఆనందంగా, ఆహ్లాదకరంగా గడపడానికి శిల్పారామం దోహదపడుతుందన్నారు.


  0 0

  కర్నూలు, డిసెంబర్ 24 : ‘‘కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోండి.. ప్రభుత్వం మీ ఖాతాలో రూ. 40వేలు జమ చేస్తుంది’’ అంటూ జరుగుతున్న ప్రచారంతో జిల్లా వ్యాప్తంగా భారీ సంఖ్యలో మహిళలు కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. వీరి రాకతో సోమవారం కలెక్టరేట్ ఆవరణం మహిళలతో నిండిపోయింది. సాధారణంగా ప్రజాదర్బార్ నిర్వహించే రోజు కావడంతో మొదట ఎవరూ పట్టించుకోలేదు. అయితే ప్రజాదర్బార్ నంద్యాల పట్టణంలో జరుగుతోందని కలెక్టర్ సహా ఉన్నతాధికారులు అక్కడికి వెళ్లారని తెలిసిన అనంతరం మహిళలు ఎందుకు వచ్చారని ఆరా తీయగా రూ. 40 వేలు బ్యాంకు ఖాతాలో వేస్తారని ప్రచారం ఉండడంతో మహిళలు కలెక్టరేట్‌కు వచ్చినట్లు స్పష్టం చేశారు. జాతీయ కుటుంబ భద్రతా పథకం(ఎన్‌ఎఫ్‌బీఎస్) కింద ఇస్తారని తమ గ్రామంలో చెప్పారని, దరఖాస్తులు కలెక్టర్ కార్యాలయంలో 31వ తేదీ లోపు ఇవ్వాలని ప్రచారం జరుగుతున్నట్లు మహిళలు తెలిపారు. దీంతో కలెక్టర్ కార్యాలయంలోని ఉద్యోగులు ఆశ్చర్యపోయి దరఖాస్తులు తీసుకోవడానికి నిరాకరించారు. అయితే మహిళలు ఒత్తిడి చేయడంతో వాటిని తీసుకుని పక్కన పెట్టారు. కర్నూలుకు వచ్చిన మహిళల్లో డోన్ నియోజకవర్గంలోని బేతంచెర్ల మండలానికి చెందిన వారు ఎక్కువగా ఉండటంతో పాత్రికేయులు ఈ విషయాన్ని అక్కడి అధికారుల దృష్టికి తీసుకుపోయారు. దీంతో స్పందించిన ఆ అధికారులు అలాంటి సమాచారం తామెవరికీ ఇవ్వలేదని ఇదో దుష్ప్రచారం మాత్రమేనని వారు తేల్చి చెప్పారు. అయితే మహిళలకు చెప్పిన వారు ఒక రాజకీయ పార్టీకి చెందిన కార్యకర్తలుగా తెలుస్తోంది. వారు ప్రభుత్వం ఇస్తుందని చెప్పి కలెక్టర్ కార్యాలయానికి పంపి దరఖాస్తులు ఇప్పించడం, ప్రభుత్వం వద్ద ఇలాంటి పథకమేమీ లేకపోవడంతో డబ్బులు రావని దాంతో ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా ప్రజలు ఓటేస్తారని వ్యూహం పన్ని ఉంటారని భావిస్తున్నారు. మహిళలు తెలిపిన వివరాల ప్రకారం ఒక క్రమ పద్ధతిలో ఇలాంటి ప్రచారం జరుగుతున్నట్లు వెల్లడవుతోంది. సాధారణంగా కుటుంబ భద్రతా పథకం కింద ఇంటి యజమాని ప్రమాద వశాత్తూ మరణిస్తే రూ. 50వేల వరకూ ప్రభుత్వం పరిహారంగా ఇచ్చేది. అయితే చంద్రన్న బీమా పథకం అమలులోకి వచ్చిన తరువాత కుటుంబ భద్రతా పథకం కింద పరిహారం ఇవ్వడం లేదని అధికారుల ద్వారా తెలుస్తోంది. అయితే ఇదే పథకం పేరుతో జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కోరారు. అలాంటిదేమైనా ఉంటే అధికారులు గ్రామాలకు వచ్చి పథకం వివరాలు వెల్లడిస్తారని వారన్నారు. ప్రజలెవరూ ఇలాంటి ప్రచారాన్ని నమ్మి అనవసర శ్రమకు గురై ఖర్చులు పెట్టుకోవద్దని వారు సూచించారు. మరో వైపు ఇలాంటి ప్రచారం ఆపని పక్షంలో సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.


  0 0

  కర్నూలు ఓల్డ్‌సిటీ, డిసెంబర్ 24:నగరంలోని 2వ బెటాలియన్ డీఐజీ జి.విజయకుమార్ బదిలీపై కాకినాడకు వెళ్తున్న సందర్భంగా సోమవారం స్థానిక ఏపీఎస్పీ 2వ బెటాలియన్‌లో వీడ్కోలు సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీఎస్పీ బెటాలియన్స్ రేంజ్-3 డీఐజీ వెంకటేశ్వర్లు బదిలీపై వెళ్తున్న డీఐజీ విజయకుమార్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు.
  బలహీన వర్గాల అభ్యున్నతే టీడీపీ లక్ష్యం
  * ఎమ్మెల్యే జయనాగేశ్వర్‌రెడ్డి
  ఎమ్మిగనూరు, డిసెంబర్ 24: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే టీడీపీ లక్ష్యమని ఎమ్మెల్యే జయనాగేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని 12వ వార్డలో క్రిస్మస్ పండుగ సందర్భంగా చంద్రన్న కానుకలను పంపిణీ చేశారు. ప్రతి పేదవాడు క్రిస్మస్ పండగ రోజు సంతోషంగా ఉండేందుకు రాష్ట్రప్రభుత్వం చంద్రన్న కానుకలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.


  0 0

  విశాఖపట్నం, (స్పోర్ట్స్) డిసెంబర్ 24: బెంగాల్ జట్టుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్-బి మ్యాచ్‌లో ఆంధ్రా జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత సాధించింది. రెండు వికెట్లకు 108 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్రా జట్టు మూడోరోజు సోమవారం ఆట ముగిసేసరికి తొమ్మిది వికెట్లు నష్టపోయి 321 పరుగులు చేసింది. అంతకు ముందు బెంగాల్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆంధ్రా జట్టులో జ్ఞానేశ్వర్ తన స్కోర్‌కు కేవలం రెండు పరుగులు జోడించి 66 పరుగుల వద్ద ఇసాన్ పావెల్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. జట్టులో కేఎస్ భరత్ 61, రికిబూయ్ 52, గిరినాథ్‌రెడ్డి 34 పరుగుల వంతున చేసి జట్టును ఆధిక్యం దిశగా నడిపించారు. బెంగాల్ బౌలర్లలో ముఖేశ్‌కుమార్, ప్రదీప్తప్రామానిక్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.


  0 0

  విజయవాడ, డిసెంబర్ 24: కడప జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నగర అధ్యక్షులైన బండి జక్రయ్య, జిల్లా అధ్యక్షులు నజీర్ అహ్మద్ మధ్య సోమవారం జరిగిన ఘర్షణపై పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తీవ్రంగా పరిగణించారు. ఆ మేరకు వారిద్దరికీ సోమవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు.


  0 0
 • 12/24/18--09:42: బులియన్
 • ముంబయిలో
  బంగారం (22 క్యారెట్స్)
  1 గ్రాము: రూ. 3,047.00
  8 గ్రాములు: రూ. 24,376.00
  10 గ్రాములు: రూ. 30,470.00
  100 గ్రాములు: రూ.3,04,700.00
  బంగారం (24 క్యారెట్స్)
  1 గ్రాము: రూ. 3,258.824
  8 గ్రాములు: రూ. 26,070.592
  10 గ్రాములు: రూ. 32,588.24
  100 గ్రాములు: రూ. 3,25,882.4
  వెండి
  8 గ్రాములు: రూ. 330.40
  10 గ్రాములు: రూ. 413.00
  100 గ్రాములు: రూ. 4,130.00
  ఒక కిలో: రూ. 41,300.00
  *
  హైదరాబాద్‌లో
  బంగారం (22 క్యారెట్స్)
  1 గ్రాము: రూ. 2,993.00
  8 గ్రాములు: రూ. 23,944.00
  10 గ్రాములు: రూ. 29,930.00
  100 గ్రాములు: రూ. 2,99,300.00
  బంగారం (24 క్యారెట్స్)
  1 గ్రాము: రూ. 3,201.07
  8 గ్రాములు: రూ. 25,608.56
  10 గ్రాములు: రూ. 32,010.7
  100 గ్రాములు: రూ. 3,20,107
  వెండి
  8 గ్రాములు: రూ. 330.40
  10 గ్రాములు: రూ. 413.00
  100 గ్రాములు: రూ. 4,130.00
  ఒక కిలో: రూ. 41,300.00


  0 0

  ముంబయి, డిసెంబర్ 24: రిజర్వుబ్యాంకు స్వతంత్రతను కాపాడేందుకు కొత్త గవర్నర్ శక్తికాంత దాస్ ధర్మనిరతితో వ్యవహరించాలని సెంట్రల్ బ్యాంకు మాజీ గవర్నర్ సి.రంగరాజన్ సూచించారు. ఈ విషయంలో ఇప్పటి వరకు పనిచేసిన గవర్నర్లలాగే దాస్ కూడా కర్తవ్య నిర్వహణ చేయాలని ఆయన సూచించారు. క్లిష్టతర అంశాల పరిష్కారం విషయంలో దాస్ ప్రభుత్వంతో సన్నిహితంగా వ్యవహరించాలని రంగరాజన్ సూచించారు. ఢిల్లీకి చెందిన ఎందరో బ్యూరోక్రాట్లు ఇప్పటి వరకు ఆర్బీఐ గవర్నర్ పదవిని నిర్వహించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘ఒకసారి ఈ గురుతర బాధ్యతను చేపట్టిన తర్వాత రిజర్వుబ్యాంకు స్వతంత్రను రక్షించే విషయంపై పూర్తి నిబద్ధతతో పనిచేయాల్సివుంటుంద’ని ఆయన హితవు పలికారు. ఇక్కడి ఐజీఐడీఆర్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో దిలీప్ నాచనే రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం రంగరాజన్ పీటీఐతో మాట్లాడారు. గతంలో తానూ, డీ. సుబ్బారావుఈ హోదాలో పనిచేసినపుడు పలుసందర్భాల్లో గవర్నర్ల ‘్ధర్మం’ గురించి ప్రస్తావించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రిజర్వు బ్యాంకు నుంచి ఎలాంటి త్యాగాలూ లేకుండా ఆ బ్యాంకు అస్థిత్వాన్ని రక్షంచేందుకు అటు బ్యాంకు ఇటు కేంద్ర ప్రభుత్వంతో కొత్త గవర్నర్ సమన్వయంతో పనిచేస్తారని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. జాతీయ స్థూలాదాయం (జీడీపీ) విషయంలో నెలకొన్న అయోమయాన్ని పారదోలేందుకు కేంద్ర గణాంక కార్యాలయం (సీఎస్‌ఓ) పూర్తి వివరాలను వెల్లడించాల్సివుందని రంగరాజన్ పేర్కొన్నారు. గతంలో రంగరాజన్ ప్రధాన మంత్రి ఆర్థిక సలహామండలికి నేతృత్వం వహించిన సంగతి తెలిసిందే. సీఎస్‌ఓ ఎంతో బాధ్యతాయుతమైన కార్యాలయమని గుర్తుచేస్తూ అన్ని విషయాల్లో ఆ కార్యాలయం స్పష్టతను పాటించాలని హితవుపలికారు. అసలు గతంలోని జీడీపీ గణాంకాలను మార్చేందుకు ఏ విధానాలను అనుసరించారో వివరించాలన్నారు. ‘మనం సంతృప్తికరంగా ఉంటేనే ఇతర అంశాలపైకి దృష్టి మళ్లుతుంది. లేదంటే అంతర్గత సమస్యలతో సతమతమవుతాం’ అని ఆయన వ్యాఖ్యానిస్తూ ఆర్బీఐని స్వేచ్ఛాయుత స్థానంలో ఉంచి తనపని తాను చేసుకునేలా చూడాలని రంగరాజన్ సూచించారు.


  0 0

  న్యూఢిల్లీ, డిసెంబర్ 24: త్వరలో వస్తుసేవల పన్ను (జీఎస్టీ)ని 12 నుంచి 18 శాతం శ్లాబ్‌లతో విలీనం చేయడం ద్వారా హేతుబద్ధీకరించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం నాడిక్కడ సంకేతాలు ఇచ్చారు. అలాగే గతంలో కాంగ్రెస్ పాలనలో 31శాతం ప్రత్యక్ష పన్నుబాదుడుతో దేశ ప్రజలు సతమతమయ్యారని ఆయన దుయ్యబట్టారు. పెరిగిన దేశ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని సాధారణంగా వినియోగించే వస్తువులపై జీఎస్టీ రేటును 12 నుంచి 18 శాతానికి పరిమి తం చేయాలని భావిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రస్తుత సున్నా శాతం నుంచి 5 శాతం వరకు ఉన్న పన్నుకు ఇది అదనమని ఆయన తెలిపారు. అలాగే లగ్జరీ, సిన్ అండ్ డీమెరిట్ వస్తువులపై మరింత అదనపు పన్ను విధించడం జరుగుతుందని ఫేస్‌బుక్‌లో ‘పద్దెనిమిది నెలల జీఎస్టీ’ పేరిట పెట్టిన పోస్టులో జైట్లీ పేర్కొన్నారు. ప్రస్తుతం వినియోగంలోవున్న సుమారు 1.216 వస్తువుల్లో 183 వస్తువులపై జీరో పన్నురేటు, 308 వస్తువులపై 5శాతం, 178 వస్తువులపై 12 శాతం, 517 వస్తువులపై 18 శాతం వంతున పన్ను ఉంటోందని, 28 శాతం శ్లాబ్ ప్రస్తుతం మృత స్లాబ్‌గా ఉందని ఆయన పేర్కొన్నారు. లగ్జరీ, సిన్ గూడ్స్, ఆటో విడిభాగాలు, డిష్ వాషర్లు, ఎయిర్ కండిషనర్లు, సిమెంటుకు 28 శా తం అత్యధిక పన్ను శ్లాబ్ రేటు ఉందని తెలిపారు. మొత్తం సమాచార సేకరణ పూర్తయిన తర్వాత కొత్త గా హేతుబద్ధీకరించిన జాబితా తొలిసెట్‌ను పూర్తి చేస్తామని తెలిపారు. లగ్జరీ, సిన్ గూడ్స్‌పై 28 శా తం పన్ను ఉండే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. తదుపరి సిమెంటును తక్కువ పన్ను శ్లాబ్ పరిధిలోకి తీసుకువస్తామని జైట్లీ తెలిపారు. ఇప్పటికే భవన నిర్మాణానికి వినియోగించే అన్ని మెటీరియల్స్‌పై పన్ను శాతాన్ని 28 నుంచి 18, 12 శాతాలకు తగ్గించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
  కాంగ్రెస్ వ్యాఖ్యలపై కనె్నర్ర
  జీఎస్టీ ద్వారా ప్రజలపై అదనపు భారాన్ని మోపుతున్నారని కాంగ్రెస్ నేతల విమర్శలపై జైట్లీ ఈ సం దర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త పన్ను జా బితాతో కూడిన ఇండెక్స్ పన్నుల భారాన్ని తగ్గిస్తుందని ఆయన పేర్కొన్నారు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు, పన్ను ఎగవేతను అరికట్టేందుకు ఇది దోహదం చేస్తుందని తెలిపారు. ఇలా సరళతరం చేయడం వల్ల పన్ను వసూళ్లు పెరిగడమేకాకుండా వాణిజ్య విస్తరణకు వీలవుతుందన్నారు. అలాగే దేశ స్థూల వృద్ధిరేటు సైతం రాబోయే సంవత్సరాల్లో బాగా పెరుగుతుందన్నారు. అనేక వస్తువులపై 31 శాతం పరోక్ష పన్నుల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం మోపిన భారాన్ని జీఎస్టీ తగ్గిస్తుందన్నారు.


  0 0
 • 12/24/18--09:47: సూచీల పతనం
 • ముంబయి, డిసెంబర్ 24: సెలవుదినాలతో ముగిసిన వారంలో బెంచ్ మార్కుకన్నా దిగువన ట్రేడైన ఈక్విటీలు వరుసగా మూడో సెషన్‌లోనూ నష్టాలను చవిచూశాయి. సోమవారం గృహనిర్మాణం, వినిమయ వస్తువులు, లోహ, ఆటోమొబైల్ కౌంటర్లలో షేర్ల అమ్మకాలు జోరుగా సాగాయి. గత వారం రోజుల నుంచి అంతర్జాతీయంగా మార్కెట్లలో చోటుచేసుకున్న పరిణామాలు ఇందుకు దారితీశాయంటున్నారు. ప్రధానంగా అమెరికాలో రాజకీయ అనిశ్చితి సెంటిమెంటును బాగాప్రభావితం చేసిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తొలుత కొంత సానుకూల పరిస్థితులతో స్వల్పంగా పెరిగి 35,910.67 కు చేరిన 30 షేర్ల సెనె్సక్స్ ఆ తర్వాత తలెత్తిన ప్రతికూలతలతో 35,432.24కు దిగువకుచేరి చివరినిమిషాల్లో 35,470.15 వద్ద ముగిసింది. ఈక్రమంలో సెనె్సక్స్ 271.92 పాయింట్లు నష్టపోయింది. అలాగే రోజు మొత్తం మీద 10,649.25 నుంచి 10,782.30 పాయింట్ల మధ్య ఊగిసలాడిన నిఫ్టీ చివరిగా 90.50 పాయింట్లు నష్టపోయి (0.84 శాతం నష్టంతో) 10,663.50 పాయింట్ల వద్ద ముగిసింది. మంగళవారం క్రిస్మస్ సందర్భంగా స్టాక్ ఎక్చేంజీలకు సెలవు. కాగా అంతర్జాతీయంగా మార్కెట్ల వ్యతిరేక సెంటిమెంటు, అమెరికాలో రాజకీయ అనిశ్చితి భారతీయ మార్కెట్లపై ప్రభావం చూపాయని ఎస్సెల్ మ్యూచువల్ ఫండ్ సీఐఓ విరాల్ బెరావాలా అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే మదుపర్లు లాభాల స్వీకరణపై దృష్టి నిలిపారని ఆయన తెలిపారు. అయితే డాలర్‌తో రూపాయి విలువ పెరగడంతోబాటు, ముడిచమురు ధరల్లో తరుగుల విదేశీ పెట్టుబడులకు ప్రోత్సాహవంతంగా మారే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. దేశీయంగా సంస్థాగత మదుపర్లు 488.55 కోట్ల రూపాయల విలువైన షేర్లను అమ్మకాలు జరపగా, విదేశీ ఇనె్వస్టర్లు 134.14 కోట్ల రూపాయలను గత శుక్రవారం భారత మార్కెట్లలో మదుపుచేశారు. పాక్షికంగా అమెరికన్ ప్రభుత్వం ఇబ్బందులను ఎదుర్కొనడం అంతర్జాతీయంగా ఈక్విటీలను ప్రభావితం చేయగా క్రిస్మస్ తర్వాత ఈ పరిస్థితులు సానుకూలంగా మారే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే శీతాకాల పార్లమెంటు సమావేశాల నిర్ణయాలపై కూడా మార్కెట్ భవితవ్యం ఆధారపడి ఉంటుందంటుందని ఆర్థిక సలహాదారు హేమాంగ్ జానీ పేర్కొన్నారు. కాగా సెనె్సక్స్‌లో హీరోమోటో కార్ప్ షేర్లు అత్యధికంగా 4.27 శాతం నష్టపోయాయి. తర్వాత స్థానంలో 3.11 శాతం నష్టంతో బజాజ్ ఆటో నిలిచింది. వీటి తర్వాత ఎన్‌టీపీసీ 2.55 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 2.44 శాతం, వేదాంత 2.15 శాతం, ఆసియన్ పెయింట్స్ 2.13 శాతం, టాటా మోటార్స్ 2.05 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 2.10 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 1.33 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.28 శాతం వంతున నష్టపోయాయి. అలాగే కోల్ ఇండియా 1.19 శాతం, పవర్ గ్రిడ్ 1.12 శాతం, టాటా స్టీల్ 1.10 శాతం. ఎల్ అండ్ టీ, ఇండస్ ఇండ్ బ్యాంకు, హెచ్‌యూఎల్, ఆర్‌ఐఎల్, ఓఎన్‌జీసీ, యెస్ బ్యాంకు, మారుతీ సుజుకీ, సన్ పార్మా, ఐసీఐసీ బ్యాంకు, ఐటీసీ సైతం 1.08 శాతం వరకు నష్టపోయాయి.
  స్వల్ప లాభాల్లో ..
  మార్కెట్ ప్రతికూల వాతావరణంలోనూ ఆరు సంస్థలు స్వల్ప లాభాలను ఆర్జించాయి. ఇందులో మహీంద్రా అండ్ మహీంద్రా, టీసీఎస్, కోటక్ బ్యాంకు, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్ టెల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుమారు 1.03 శాతం లాభాలతో రోజును మిగించగా, పెరిగిన ముడిచమురు ధరల నేపథ్యంలో చమురు కంపెనీలు 3.33 శాతం నష్టం పోయాయి. ఇందులో ఐఓసీ, బీపీసీఎల్ ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు సోమవారం 1.04 శాతం పెరిగి బ్యారల్ 54.66 డాలర్లకు అమ్ముడైంది. జీఎస్టీ మండలి సమావేశంలో 33 అంశాలపై పన్ను స్లాబ్‌ను మార్చడం వల్ల మధ్య తరహా రంగాలే అధికంగా నష్టపోయాయి.


  0 0

  అభినవ తిక్కన, తెలుగు లెంక, గాంధీకవి, తుమ్మల సీతారామమూర్తి
  119వ జయంతి సందర్భంగా...
  *
  ‘‘సర్వతంత్ర స్వతంత్రుడే సత్కవీంద్రు
  డెన్నడో కల్పమున కొక్కడే లభించు’’
  - అభినవ తిక్కన, తెలుగు లెంక, గాంధీకవి, యుగకవి, యుగకర్త అయిన శ్రీ తుమ్మల సీతారామమూర్తిగారు తెలుగుజాతికి తెలుగు సాహిత్యానికి 20వ శతాబ్దమున లభించిన అపూర్వమైన సరిక్రొత్త కానుక. ఆధునిక కవులలో వారు విలక్షణమైన మహాకవి. వారు ఆకారంలో ఆంధ్రుడు. ధర్మములో భారతీయుడు. భావనలో విశ్వమానవుడు. వారు కవనార్థముదయించిన నలువపడతి మగరూపు. ధర్మ సంరక్షణార్థము కవితలల్లిన ఋషితుల్యులు. వారు సంప్రదాయ కవితాభినివేశంతో సాహితీ లోకంలో అడుగుమోపి జాతీయభావ సోయగంతో నవయుగ హృదయ స్పందనతో సర్వస్వతంత్రాంధ్ర సర్వోదయ కవితా సృష్టిచేసిన కారణజన్ములు. హాలిక కుటుంబంలో పుట్టి, పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో జీవించి సహజ ప్రతిభతో సందేశాత్మక కావ్యాలను వెలయించిన నిరంతర కవితా హాలికుడు. మధురతా పూర్ణకావ్య నిర్మాణ చణుతగల కవితాతేజస్వి. ‘‘సాధుశీల మాభిజాత్యమ్ము చెలువమ్ము ననసి మెఱయువనిత నాదు కవిత’’అని ఎంతో విశ్వాసంతో చెప్పగలిగిన కళాప్రపూర్ణుడు. కాలంతోపాటు కాలంకంటె ముందు నడచి జగద్ధితమైన కవితను కళాన్వితంగా వెలయించిన కవితా తపస్వి. ‘‘కళకొఱకే కవిత్వమని గంతులు వేయక’’ మానవాభ్యుదయానికి కవితాగానమొనర్చిన అభ్యుదయ కవి. తమ కవిత్వానికి ఆంధ్రత్వాన్ని ఊపిరిగా, భారతీయత్వాన్ని జీవాత్మగా, గాంధీతత్త్వాన్ని వజ్రకవచంగా చేసుకొన్న జాతీయ కవి. స్వరాజ్య సాధనకు సురాజ్య నిర్మాణానికి తమ కవితను అంకితంచేసిన దేశభక్తికవి. స్వరాజ్య సిద్ధికి, అభ్యుదయానికి తమ కవితను ముడుపుగట్టిన రాష్ట్ర కవి. గాంధి దివ్యగాథను ఆధునిక ఇతిహాసంగా తెలుగు సారస్వత పీఠంపై సుప్రతిష్ఠించిన గాంధీకవి. గాంధీ కావ్యాలను ‘ఆంధ్ర మహాభారత ప్రతిబింబంగా తీర్చిదిద్దిన అభినవ తిక్కన. ‘ప్రజల బాధ తన బాధగా’్భవించి సామాజిక కల్యాణంకొరకు కవితాగానం చేసిన అసలుసిసలైన ప్రజాకవి. సమాజ సమస్యలకు చక్కని పరిష్కారాలను సూచించిన సాహితీప్రవక్త. సమధర్మం సహజ ధర్మమని నమ్మి, అందరి అభ్యుదయానికి సర్వోదయ కవితను సృష్టించిన నవ్య సంప్రదాయ సర్వోదయ కవితావైతాళికులు. రైతుగా జీవించటమేగాక రైతు జీవనానికి కావ్యగౌరవం చేకూర్చిన కాపుకవి. హలముపట్టిన చేతితో కలముపట్టి తెలుగు తీపి, తెలుగు పసగల మృదుమధుర సంశోభితములైన రచనలు చేసిన తెలుగు వస్తాదు. తెలుగు భాషార్చకుడై కవితాకళకు నూతన జవమును జీవమును కలిగించి ప్రకాశింపజేసిన తెలుగులెంక, భాషా విపర్యయముసైపని సంప్రదాయ కవితా సంరక్షణాభినివిష్టులు. కవితా పాకమునుమార్చి సరళ సుందరమైన, కవితను వెలయించిన నవ్యాతినవ్య కవి. అభ్యుదయ దృష్టిఉన్న కవికి ఛందస్సు ఇనుపసంకెలకాదని, మల్లెపూల మాలయని నిరూపించిన కవితాకళాశిల్పి. కాసునుకోరక తమ కావ్యకన్యలను వరణీయ కథాబాసురులకు కన్యాదానంచేసిన ఆదర్శకావ్య కన్యాదాత. మచ్చమసకలేని మనుగడను సాగించిన మానవోత్తముడు. తమ సారస్వతేయ జీవితమంతా గాంధేయ సాహిత్యానికే అంకితంచేసిన ‘మహాత్ముని ఆస్థానకవి’.. భావితరాలకు స్ఫూర్తిదాయకమైన సర్వోదయ విప్లవ కవితను వెలయించిన యుగకర్త. కవితలో యుగలక్షణమును గుబాళించి, జాతికుపకరించి సందేశమును కళాన్వితముగా వచించిన యుగకవి.
  ఆంగ్ల భాషాసాహిత్యాల ప్రభావంతో భావజాలంలో రూపనిర్మాణంలో వస్తుస్వీకరణలో ఆధునిక తెలుగు సాహిత్యంలో ఎన్నో మార్పులు వచ్చినవి. ఎందరో కవులు ఉద్భవించారు. ఎన్నో సాహిత్యోద్యోమాలు వెలుగుచూసినవి. ఏదో ఒక ఉద్యమం ఆధారంగా కవులు స్వేచ్ఛగా నవ్యరీతుల కవితాగానంచేశారు. ఆనాటి కవులలో తుమ్మలవారికి ఒక ప్రత్యేక స్థానం కలదు. గాంధీకి పూర్వం సాహిత్యం కళాప్రేరణచే వెలువడింది. తర్వాత అవతరించినది జీవన ప్రేరణ చేత. ఈ ప్రేరణయే తుమ్మలవారి కవితకు మూలకందమైంది. ఒక విధంగా వారు గాంధీ మానసపుత్రుడని చెప్పవచ్చును.
  ‘‘నైతిక పునరుజ్జీవన
  జాతీయ వికాస విశ్వజనతాశ్రేయః
  ప్రతము మచ్చేతము; నా
  కైతము తత్దర్పణమ్ముగానుదయించున్- ’’ అంటూ
  తమ కవితాతత్త్వ స్వరూపాన్ని వివరించారు.
  భావ కవిత్వం ఒక ఊపు ఊపుతున్న కాలమది. ప్రణయ కవులు ఊహాలోకంలో తమ ప్రణయ రూపిణులతో సరససల్లాపములలో తూగిపోతూ వున్న కాలమది. అభ్యుదయ కవితోద్యమాలు జాజ్జ్వల్యమాన మగుచున్న కాలమది. దీనికితోడు నూతన కవితాప్రక్రియలు వికసిస్తున్న కాలమది. అటువంటి కాలంలో-
  ‘‘గిఱిగీచుకొన్న కవి కృతి
  చిరకాలము నిల్వ; దెల్ల సిద్ధాంతములన్
  దరియించి విప్లవముదెస
  కరిగిన కృతి సత్యదర్శియై రాణించున్’’- అని ప్రకటించి సిద్ధాంత రాద్ధాంతాల కతీతంగా ప్రాతక్రొత్తల మేలుకలయికతో తమ సర్వోదయ కవితోద్యమాన్ని వారే సృష్టించుకొన్నారు. అదియును సంప్రదాయ కవితా శిల్పంలోనే. సమస్త లోక మంగళకరమైన సత్యమును కమ్మనివాక్కుల నిర్భయమ్ముగా పలుకుటయే కవిత్వమని భావించి-
  ‘‘కళకొఱకే కవిత్వమని గంతులు వేయక, రోత రోతగా
  వలపులు నింది కబ్బములు వ్రాయక, విశ్వజనీన బోద్ధృతా
  లలిత ముదారవృత్తము కలాకమనీయము సంస్కృత ప్రభా
  మిళియమునైన సృష్టినెదమెచ్చితి, జాతికి కాన్కలిచ్చితిన్’’
  అని జాతీయ భావస్ఫూర్తితో సామాజిక స్పృహతో నైతికో జ్జీవన దృష్టితో ధర్మబోధాత్మకమైన కవిత వెలయించారు. వారి ధర్మబోధకు శిల్పచాతుర్యమే కావ్యాత్మనిచ్చింది.
  ప్రాచీనుల పోకడల, ఆధునికుల క్రొత్తపోకడల మేలికలయికతో వారి రచనలు క్రొంగ్రొత్త చెలువమును సంతరించుకొన్నవి. అవి ఆంధ్రుల భారతీయుల హృదయ స్పందనలకు అపురూపమైన అక్షర రూపాలు. అవి ఆధునిక సామాజికోపనిషత్తులు. సత్యప్రియోక్తిఖనులు.
  ‘‘రాష్ట్ర సిద్ధికొఱకు రక్తమ్ముగార్చిన
  కవిని నేను గాంధి కవిని నేను
  బడలి బడలి తల్లి బాసకూడెము సేయు
  కవిని నేను దేశికవిని నేను’’-అంటూ
  తమనుతాము విశే్లషించుకొని చెప్పిన పద్యం. వారు జాతి నిత్యవైతాళికుడు. ఆంధ్రత్వము ముమ్మూర్తులా మూర్త్భీవించిన మూర్తి సీతారామమూర్తిగారు. ప్రత్యేకాంధ్ర రాష్ట్రావతరణకు తమ మహోద్రేక భావామృతాన్ని చిలికి జీవంపోసిన కవిబ్రహ్మ. ఆనాడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్రులకు జరిగిన అన్యాయాలకూ అవమానాలకూ వారు ఉడికిపోయారు. పరవళ్ళుత్రొక్కే ఆవేశంతో, తొణికిసలాడే భావుకతతో వారు వీర రసభరితమైన ‘రాష్టగ్రాన’కావ్యాన్ని రచించి ఉద్యమానికి దిశానిర్దేశం చేసి, ఆంధ్రులను కార్యోన్ముఖులను చేశారు. ‘‘తెలుగు జాతి నిరంకుశ వీరజాతిగానేలిన జాతిరా!’’అంటూ గత వైభవప్రాభవాలను గుర్తుచేసి జాతిని చైతన్యపరచారు. తెలుగురాజుల వీరగాథలను, వీరుల పౌరుషాన్ని, కవుల కవితా మాధుర్యాన్ని, గాయకుల గానామృతాన్ని, శిల్పుల కళానైపుణ్యాన్ని, వీర నారీమణుల శౌర్యసాహస సౌశీల్యాలను ‘‘చదవుడొకసారి కండలు కదలియాడ’’అంటూ రసభావావేశంలో వర్ణించి పాఠకుల మేను పులకరించే విధంగా వ్రాశారు.
  వేర్పాటు ధోరణిలోనున్న రాయలసీమ వాసులను పరమ మిత్రులుగా జేసి- ‘‘సైపలేమింక నుమ్మడి కాపురంబు’’ అంటూ-
  ‘‘ఆంధ్రుడవై జన్మించితి
  వాంధ్రుడవైయనుభవింపుమాయుర్విభావం
  బాంధ్రుడవై మరణింపుమి
  ఆంధ్రత్వములేని బ్రతుకు నాసింపకుమీ!’’-
  అంటూ జాతికి ఆత్మగౌరవ నినాదాన్నిచ్చిన తొలి జాతీయ కవి తుమ్మలవారు. ఈ పద్యం ఆంధ్రుల హృదయాలకు చబుకుదెబ్బయై వీర రసావతారులను చేసింది. దీనిని జాతి ఉన్నంతవరకు ప్రతి ఆంధ్రుడు చదివి స్ఫూర్తిని పొందదగింది. కవిగారి ఆకాంక్ష ఆరాటం ఉద్వేగం జాతిరక్తి ఆంధ్రులను ఒక త్రాటిపై నడిపించింది. ఆంధ్రులు అపూర్వమైన త్యాగాలు చేశారు. చివరకు శ్రీ పొట్టిశ్రీరాములుగారి ప్రాణత్యాగంతో ప్రత్యేకాంధ్ర రాష్ట్రం సిద్ధించింది. నూతన రాష్ట్రావతరణానంతరం జాతి అభ్యుదయానికి ‘ఉదయగానము’ అను కృతిని వ్రాశారు. దీనియందు ఆనాటి సమస్యలను చర్చించి, తగిన సూచనలను చేశారు. మాతృభాషను అధికార భాషగా చేయాలన్నారు. రాష్ట్ర నడిబొడ్డునగల బెజవాడను రాజధానిగా చేయాలన్నారు. కృష్ణాగోదావరి నదులను అనుసంధానంచేసి ప్రాజెక్టులను నిర్మించి వ్యవసాయాభివృద్ధి చేయాలన్నారు. పదవికొరకు పుట్టినది కులతత్త్వమని హెచ్చరించారు. ‘‘జాతి పెంపు నాకు చాలును- జాతీయ గౌరవంబ నాదు గౌరవంబు- జాతి సేవ నాదు జన్మంబునకు- ఫలంబని తలంచువాడె నాయకుండు’’-అని చెప్పారు. ఆనాటి కవులకంటె మూడు అడుగులు ముందుకువేసి దైవాన్ని దేశభక్తి దిశగా, మానవుని సంస్కరించే దిశగా మరలించిన మహర్షి. ‘‘దేవుడన మాతృదేశమ- దేవతలన ప్రజల, యజ్ఞదీక్షయనంగా- సేవావ్రతనిష్ఠయ, యివి- జీవన సూత్రములుగా ప్రసిద్ధింగనుమా!’’- అని సందేశమిచ్చారు. చివరకు ఆంధ్రుల రాష్ట్భ్రామానాన్ని జాతీయ సమగ్రత దిశగా, వసుధైక కుటుంబ వ్యవస్థదిశగా మరలించిన మహోన్నతవాణి విశ్వకవితామూర్తి సీతారామమూర్తిగారిది.
  ప్రతి యుగంలో ఉత్తమ కవులు కొందరే ఉంటారు. వారిలో ఉన్నత వ్యక్తిత్వం గలవారు అరుదు. ఆధునిక యుగమునందు ఉన్నతమైన సాహిత్యానికి, సమున్నతమైన వ్యక్తిత్వానికి కీర్తిగాంచిన ఉత్తమకవి తుమ్మలవారు. కవిత్వంలోనూ, జీవితంలోనూ ఉన్నతములైన నైతికములైన విలువల పరిరక్షణకు తమ కవిత్వాన్ని జీవితాన్ని ముడుపుగట్టిన ఋషితుల్యులు తుమ్మలవారు. ‘‘కవితలో స్వభావములో తుమ్మల వారిని పోలగల వారెప్పుడోగానీ జన్మింపరు’’ అన్న దివాకర్ల వేంకటావధానిగారి మాటలు అక్షర సత్యాలు.’’ అతడు నా గౌరవ పతాక, నా అమూల్య సంపద’’ అని జాతి గర్వింపదగిన ఉత్తమ కవి తుమ్మల సీతారామమూర్తిగారు.


  0 0

  మార్చి 21 ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా కవిసంధ్య సాహిత్య సాంస్కృతిక సంస్థ, జైనీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సహకారంతో కవితల పోటీ నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ దాట్ల దేవదానం రాజు ఒక ప్రకటనలో తెలిపారు. సమకాలీన వస్తువు, ఆధునిక భాష, అభివ్యక్తితో కూడిన వచన కవితలు మాత్రమే పోటీకి పరిశీలించబడతాయ. ఈ పోటీలో పాల్గొనదలచినవారు రూ.200 ఎంట్రీ ఫీజుగా చెల్లించాలి. పోటీలో బహుమతి పొందని వారి ఎంట్రీ ఫీజు కవిసంధ్య సంవత్సర చందాగా పరిగణించి ఆరు సంచికలు పంపబడతాయ. హామీ పత్రంలో మాత్రమే కవి పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, ఇ-మెయల్ వివరాలు పొందుపరచి కొరియర్ ద్వారా మాత్రమే పంపించాలి. ఈ పోటీలో మొదటి బహుమతి రూ.3000, రెండవ బహుమతి రూ.2000, మూడవ బహుమతి రూ.1000, పది మంచి కవితలకు రూ.500 చొప్పున ప్రోత్సాహక బహుమతులు ఉంటాయ. 21 మార్చి 2019న యానాంలో జరిగే ప్రపంచ కవితా దినోత్సవ సభలో ప్రదానం చేయడం జరుగుతుంది. కవితలు పంపడానికి చివరి తేదీ 30 జనవరి 2019. చిరునామా: దాట్ల దేవదానం రాజు, ఉపాధ్యక్షులు కవిసంధ్య, 8-1-048, జక్రియనగర్, యానాం - 533 464, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. వివరాలకు సెల్: 9440105987, 8555830789.


  0 0

  ఉదయం నుంచీ సాయంకాలం దాకా...
  అలసిపోయన ఒళ్ళును
  అక్కడ కూర్చోబెడతాను
  కొన్ని క్షణాల వౌనదీక్షలో
  శతకోటి స్పందనలు తచ్చాడుతాయ

  ఏ మాయ ఉందో అక్కడ
  బడలికంతా చిటికలో తుర్రుమంటుంది
  కొమ్మలు వింజామరలై విసురుతుంటాయ
  సమస్యల సంకెళ్లు ఒక్కొక్కటిగా తెగిపోతూ
  స్వేచ్ఛాగీతం రెక్కలు కట్టుకుంటుంది
  దేహమంతా తేలికై ఊయలూగుతుంది
  కళ్లు చూస్తుండగానే కలలు కవ్విస్తుంటాయ

  పైన ఏ జంట పక్షులు దోబూచులాడినా
  సన్నని పూల రెమ్మలు నా
  తలపై రాలుతూ దీవిస్తుంటాయ
  చెట్టుపై వాలిన బుల్‌బుల్ పిట్టలు
  తమ సంగీత ఝరిని నా చెవిలో ఒంపుతుంటాయ

  బాల్యంలో సోపతిగాళ్లతో సరదాగా
  నేనాడుకున్న దోస్తీ కటీఫ్ ఆటలు
  నా పక్కనే పూల పుప్పొడులై రాలుతుంటాయ

  ఆ మూల మలుపుకాడకు
  నే రాగానే అసంకల్పితంగా
  నా మనసక్కడ మజిలీ అవుతోంది
  కనురెప్పపాటులో మదిలో
  మధురమైన ఊసుల బాసలు కదుల్తాయ

  ఎండను నిండుగా కప్పేసిన
  గుల్‌మొహర్ కొమ్మలు పూలరెమ్మలు
  నా తలపై పట్టిన రంగుల ఛత్రంలా రమిస్తాను
  చెట్టుకింద నేకూర్చున్న సిమెంట్ కుర్చీ
  ఓ సామ్రాజ్యాన్ని ఏలుతున్న సింహాసనమైపోతుంది


  0 0

  నవలలే అయినప్పటికీ ఘోష్ రచనలు అన్ని సంస్కృతులలోనూ, జాతులలోను వ్యాపించి ఉన్న చారిత్రక అనిశ్చితికి, మానవ ఆందోళనలకు మధ్య ఉన్న సంబంధాన్ని, ఒకదానితో ఒకటి విడదీయలేని గట్టి పోలికలను చెప్పడంలో గొప్ప ఘనతను సాధించాయి. ఒక చారిత్రక అధ్యయన కారుడిగా, పరిశోధకుడిగా, సామాజిక ఆంత్రో పాలజిస్టుగా ఘోష్‌కున్న నేపధ్యం లోతులకు వెళ్ళి పరిశోధించడానికి ఉపయోగపడింది. బహుశ ఇది మొట్టమొదటిసారిగా ఆంగ్ల రచనలకు, ఆంగ్ల సాహిత్యంలో చేసిన కృషికి జ్ఞానపీఠ్ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. 54వ జ్ఞానపీఠ్ పురస్కారం అందుకోబోతున్న సందర్భంలో, అమితవ్ ఘోష్ నవలల్లోకి ఒక్కసారి పరికించి చూసే ఒక చిన్న ప్రయత్నమే ఈ అక్షరాల సంగాతం.

  His fiction is endowed with extraordinary depth and substance through his
  academic training as a historian and a social anthropologist.His major thematic concerns include migration and inter connection across places, cultures, and races and human distress and suffering caused by historical turbulences,
  especially at the level of girmitiyas, coolies and lascars.

  - అని జ్ఞానఫీఠ్ పురస్కార కమిటి కితాబు ఇచ్చిన తర్వాత అమితవ్‌ఘోష్ నవలా ప్రయాణాన్ని తలుచుకోవడం అవసరం. 1986లో అతని మొదటి నవల ‘ది సర్కిల్ ఆఫ్ రీజన్’ దగ్గర నుండి 2015లో వచ్చిన నవల ‘్ఫ్లడ్ ఆఫ్ ఫైర్’ వరకు ఆరు నవలలను పరిశీలిస్తే.. అమితవ్‌ఘోష్ ప్రయాణంలోని కొత్తదనం సృష్టమవుతుంది. 1986లో అతని మొదటి నవల ‘ది సర్కిల్ ఆఫ్ రీజన్’ ప్రచురితమవగానే రుకున్ అద్వాని, హరిష్ త్రివేదీ లాంటి వాళ్ళు ‘ఘోష్ జనరేషన్’ ప్రారంభమయ్యిందని వ్యాఖ్యానాలు చేశారు. Stephanine School అని భారతీయ ఆంగ్లనవలా సాహిత్యానికి కొత్త అద్భుతాలు అద్దే సమయానికి శ్రీకారం చుట్టిందని కితాబు ఇచ్చాయి. అంతకు ముందు ఆర్.కె. నారాయణన్, కుష్వంత్‌సింగ్, ఉపమన్యు చటర్జీ లాంటి ఎందరో నవలా రచయితలు చరిత్రను అక్షరబద్ధం చేసి ఫిక్షన్‌లైజ్ చేశారు. ‘‘వెయిటింగ్ ఫర్ మహాత్మా’’, ‘‘ట్రెయిన్ టు పాకిస్తాన్’’ లాంటి నవలలు సూక్ష్మ పరిశీలనలోంచి వచ్చినవి. సాల్మన్ రష్దీ ‘మిడ్‌నైట్ చిల్డ్రన్’ స్థూల పరిశీలనలోంచి వచ్చిన నవలగా మనకు తెలుసు.
  అయితే అమితవ్ ఘోష్ చారిత్రక అవగాహన, చరిత్రతో అతనికి గల సంబంధం వీటన్నింటికి పూర్తిగా భిన్నమైనది. అంతమాత్రాన చరిత్రను పలచపరచడం కాదు. చరిత్రను ఫిక్షనల్ ఫ్రేమ్ వర్క్‌లో పాఠకుడి చేత సులభంగానూ, ఆసక్తిగానూ చదివించడంలో అమితవ్‌ఘోష్ కృషి ప్రశంస నీయమైనది. ఘోష్ నవలలు ప్రత్యేకంగా రచయితకు గల చారిత్రక పరిశోధనను, అధ్యయనాన్ని తెలియచేస్తాయి. పాఠకుడిని రచన లోకి తీసుకువెళ్ళే ఒక మూడ్‌ను ఘోష్ తన మొదట నవల నుండే సృష్టించాడు. అది చారిత్రకమైన, సైన్స్ అయినా, ఆంత్రోపాలజీ అయినా పాఠకుడు అక్షరాన్ని పట్టుకుని చదువుకుంటూ... లీనమైపోవడమే ఘోష్ రచనల ప్రత్యేకత. అంతకుముందు వచ్చిన చారిత్రక నవలలకు, ఘోష్ రచనలకు తేడా ఎక్కడుందంటే రాజకీయ, చారిత్రక నేపథ్యాల మధ్య ఉన్న సంబంధాన్ని మనసులో నాటుకునేటట్లు చెప్పడమే ఘోష్ టాలెంట్. అనేక ఆసక్తికరమైన వాస్తవాలను వివిధ పార్శ్వాలలో అతను మనకు మొదటి రెండు నవలలు అయిన ‘ది సర్కిల్ ఆఫ్ రీజన్’, ‘ది షాడో లైవీన్స్’లో చెపుతాడు. మొదటి నవలలో కథానాయకుడు ‘ఆలూ’ మనకి రషీ ద‘మిడ్‌నైట్ చిల్డ్రన్’ నవలా నాయకుడిని గుర్తు చేస్తాడు. పెద్దతలకాయతో, ముందుకు పొడుచుకు వచ్చిన పెద్దపెద్ద బొడిపెతో ఉండడమే ఒక ఎత్తయతే, అతని వ్యక్తిగత జీవితంతోని విషయాలకు - అతని చుట్టూ ఉన్న రాజకీయ, సామాజిక సంఘటనలకు మధ్య అనేకమైన యాదృచ్ఛిక పోలికలు, సంబంధాలు ఉండడం మరో విశేషం. దానికి కారణం వెతకాలనే ఒక తాత్విక శోధన మొత్తం సౌత్ ఆసియాను, ఉత్తర ఆఫ్రికాను, మధ్య తూర్పు ప్రాంతాలని చుట్టేస్తుంది.
  రెండో నవల ‘‘ది షాడో లైన్స్’’ (1988) కూడా మనకి రష్దీని గుర్తుకు తెస్తుంది. అయితే, ఈ నవల పాఠకుడికి సరిగ్గా అర్థం కావడానికి ఘోష్ ఉపయోగించిన వచనం అక్కడక్కడ కవిత్వ పరిమళాలని అద్దుకుని ఈ నవలకు ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. గతాన్ని కనుక్కునే క్రమంలోనూ, నిరంకుశమైన-అకారణమైన విభజన సమయంలోనూ జరిగిన కదలికలను మనకు బ్రిటన్ - ఇండియాకి, కలకత్తా - లండన్‌కి, రెండో ప్రపంచయుద్ధానికి -ప్రస్తుతానికి మధ్య తిరుగుతూ మొత్తం చరిత్రని పాఠకుడిలోకి సునాయసంగా ట్రాన్స్‌ఫామ్ చేస్తాడు. రాజకీయ స్వేచ్ఛ, సామాజిక హింసలతో కూడిన ఆ కాలాన్ని చెప్పడం కోసం అమితవ్‌ఘోష్ ‘ది షాడో లైవీన్స్’ అనే శీర్షికను తీసుకున్నాడు. నిజానికి జోసఫ్ కోన్రాడ్ నవల పేరు ‘ది షాడో లైవీన్స్’. అతని రచన సూటిగా పోలేని వంకరతనానికి- వెలుగులేని నీడని చెపుతుంది. విభజన కాలాన్ని, ఎమర్జెన్సీలో జరిగిన హింసని, ఇందిరాగాంధీ హత్య తర్వాత జరిగిన హింసని, 1964లో కలకత్తాలో జరిగిన దారుణాలని చెప్పడానికి ఘోష్ ఈ శీర్షికను తన నవలకు పేరుగా పెట్టుకున్నాడు. ఈ రెండో నవలతోనే ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా యూరప్ దేశాలలోని పాఠకులను ఆకట్టుకోవడం మొదలు పెట్టాడు. వ్యక్తిగత జీవితాలను, సామాజిక సంఘటనలను, రాజకీయ దుర్మార్గాలను ఒక దానితో ఒకటి కలుపుకుంటూ చీకటిని ఎండేసే ప్రయత్నం చేశాడు ఘోష్. అతనే స్వయంగా ఒక చోట చెపుతూ ‘నా బాల్యంలో 1964లో కలకత్తాలో జరిగిన హింస, తర్వాత 1984లో ఢిల్లీ తదితర ప్రాంతాలలో జరిగిన హింస నా జ్ఞాపకాలలో ఉండి నన్ను కుదురుగా ఉండనీయని క్షణంలో పుట్టిందే ‘‘ది షాడో లైవీన్స్’’ అంటాడు ఘోష్. యాదృచ్ఛికంగా కొద్దిరోజుల ముందు 1984 సంఘటనలకు సంబంధించిన సూత్రధారికి యావజ్జీవ శిక్షపడడం గమనించవచ్చు.
  ఆత్మకథని, యాత్రా సాహిత్యాన్ని, ఫిక్షన్‌ని, చరిత్రని కలిపేస్తూ చెక్కిన అపురూప రచన ఘోష్ మూడవ నవల ‘ఇన్ యాన్ యాంటిక్ లేండ్’’ (1992). నిజానికి ఇది నవలలాకాకుండా ఒక చరిత్రలా, ఒక వ్యాసంలా రావాలి. అలాగే అనుకుంటాం కూడా. కాని, చరిత్రను చెప్పడంలో ఉన్న అనేక ఇబ్బందులను అధిగమించి, చరిత్ర మరిచిన మనుషులను చెప్పడానికి ఘోష్ ఎన్నుకున్న అయుధం ఈ నవల. హెగెల్ చరిత్రకు ఒక నిర్వచనం చెపుతాడు; చరిత్ర అంటేTravels from East to West : For Europeis the absolute end of history, Just as Asia is the begining -ధీనిమీద చాలా చర్చలు జరిగాయి. మహాత్మాగాంధీ ఒకసారి మాట్లాడుతూ ‘చరిత్ర అంటే రోజులు, యుద్ధాలు, తేదీలే కాదు... There are so many men still alive in the world అంటాడు ‘చీనాలో రిక్షావాలా, చెక్ దేశపు గని పనిమనిషి, ఐర్లాండున ఓడ కళాసి, అణగారిన ఆర్తులెందరో...’ అని శ్రీశ్రీ చెప్పినట్టు, ఘోష్ చరిత్రను పునర్ నిర్మించడం మొదలు పెట్టాడు... A history of merchant and his slave, two tiny dots in the vast ocean of people who are nobody in the canonical history of the world ను సరిగ్గా చెప్పడం కోసం ఘోష్ నవలలు భారతీయ ఆంగ్ల సాహిత్యాన్ని కొత్త మార్గాలు తొక్కించాయి. కేవలం అణగారిన వర్గాలను గురించి చెప్పడమే కాదు, ఒంటరి అయిపోతున్న మనుషులను, జాతులను, సంస్కృతులను చెప్పడానికి కూడా ఘోష్‌లోని ఆంత్రోపాలజిస్టు చేసిన తీవ్రమైన కృషికి, అధ్యయనానికి ఈ నవల పరాకాష్ట. విమర్శకుల మాటల్లో ఇది Supreme intellectual synthesis.
  నాలుగో నవలగా ఘోష్ మనకి ‘ది కలకత్తా క్రోమోజోమ్’ అనే ఒక సైన్స్‌ఫిక్షన్‌ను అందిస్తాడు. న్యూయార్క్‌లోని ఒక ఆఫీస్ వర్కర్ ఆంతార్ ఐడి కార్డును నిరాకరించడంతో మొదలయిన అనే్వషణ, పరిశోధనాత్మక ప్రయాణం కలకత్తా చేరడమే ఈ నవల. 19వ శతాబ్దం చివర, ఇరవయవ శతాబ్దపు ప్రారంభకాలాలు ఈ నవలలో మనకి కనపడతాయి. సర్ ఆర్ధర్ కాటన్ ‘డైల్ స్ట్లెల్’లో సాగే ఈ నవల డిటెక్టివ్‌లా కనపడే ఒక సైన్స్ ఫిక్షన్. మెడికల్ కేస్ హిస్టరీని కనుక్కోవడంలోని పరిశోధన ఈ నవలంతా పరచుకుని ఉంటుంది. 1996లో ఆర్ధర్ సి క్లార్క్ సైన్స్ ఫిక్షన్ అవార్డును ఈ నవల సొంతం చేసుకుని, ఈ అవార్డు దక్కించుకున్న తొలి భారతీయుడుగా అమితవ్‌ఘోష్‌కు అపరిమితమైన కీర్తిని తెచ్చిపెట్టింది. టోని మార్సన్ మిల్క్ మేన్ A Song of Soloman ¥× ÀDµÜ±vxе^Ò To we come to realize that only by knowing the past can (we) hope to have a future. ‘ది కలకత్తా క్రోమోజోమ్’ అచ్చంగా మనకి భారతీయ సాంస్కృతిక, సంప్రదాయ ఉన్నతిని చెప్పడమే కాకుండా, అటువంటి బలమైన భవిష్యత్తుని నిర్మించుకోవడానికి వీలైన బలాన్ని ఇస్తుంది.
  ఆ తరువాత వచ్చిన ఘోష్ ఐదవ నవల ‘ది గ్లాస్ ప్యాలస్ (2000)’’ నిజానికి ఒక గొప్పSaga of Family and Individual lives. పాఠకుడికి ఒక విలువైన, సరళమైన, అవసరమైన రచనను చదువుతున్నామనే ఫీలింగ్‌ను కలగచేసే నవల ఇది. రాజ్‌కుమార్ రాహ అనే ఓడ కలాశి బర్మా కుటుంబంతో కలిసి బర్మా నుండి మలేషియా, ఇండియా, అమెరికా దాకా చేసిన ఒక యాత్ర. మూడు తరాల తోనూ, వ్యక్తులతోను సాగిన ఈ యాత్రా నవల గురించి మిన్నా ప్రోక్టర అనే ఒక విమర్శకుడు చేసిన ప్రశంస ఒక్కటి చాలు. ‘ది గ్లాస్ ప్యాలస్’ చదువుతున్న పాఠకుడు తాను స్వయంగా వంద సంవత్సరాలు నడిచిన యాత్రగా ఫీలవుతాడు. మలేషియాలోని రబ్బరు చెట్లు, బర్మాలోని టేకు అడవులు, సందడిచేసే రంగూన్, సింగపూర్ వీధులు, పతనమవుతున్న బర్మా సామ్రాజ్యం, ఎత్తుపల్లాలకు లోనవుతున్న బ్రిటీష్ రాచరికం కళ్ళముందు కట్టినట్లు ఉంటుంది. ఇది అచ్చంగా A stately and vibrantly detailed family saga set in south central Asia against the tumultuous back drop of the 20th century.
  2004లో వచ్చిన ‘ది హంగ్రీ టైడ్’ భారతదేశంలోను, బంగ్లాదేశ్‌లోనూ కనపడుతున్న వేరుచేయబడిన జాతుల గురించి చెప్పిన నవల ఇది. సరిహద్దు రహితమైన, ప్రతికూలమైన, దేనికీ సంబంధంలేని భూభాగం కాని, నీరు కాని ఉన్న ఒక లాండ్‌స్కేప్‌లోని జనం గురించి చెపుతున్న నవల ఇది. దీనిలో నివసిస్తున్న ప్రతి ఒక్కరు తమదైన ప్లేస్‌ని ఈ ప్రపంచంలో కనుక్కోవడానికి పడుతున్న తపనని, చేస్తున్న పోరాటాన్ని, అనుభవిస్తున్న ఘర్షణని ఘోష్ తనదైన శైలిలో వినిపించి పాఠకుడిని కదిలిస్తారు. చరిత్రలు ఎన్నో వస్తాయి. పోతాయి. కాని చరిత్ర చెప్పిన వాస్తవాలను ఒడిసి పట్టుకుని చరిత్రను నిలబెట్టే ప్రయత్నానికి ఈ నవల చక్కటి ఉదాహరణ.
  ఆ తరువాత ‘సీ ఆఫ్ పప్పీస్’ (2008)’ , రివర్ ఆఫ్ స్మోక్ (2011)’, ఫ్లడ్ అఫ్ ఫైర్ (2015) అనే మూడు నవలల ద్వారా ఒక ళఔజష ట్రెఖియాలజిని పూర్తి చేసాడు. అమితవ్ ఘోష్ సంచార జాతులు, వలసలు, వారి కదలికలు మీద వచ్చిన మూడు నవలలు ఇరవయి ఒకటవ శతాబ్దపు మాస్టర్ పీస్‌గా నిలిచాయి.
  చాలామంది రచయితలు చరిత్రను క్రోనాలాజిగా ఇస్తూ వచ్చారు. ఇరవయ్యవ శతాబ్దం నుండి ఆ పద్ధతి మారింది. ఎక్కడ ప్రస్తుత అవసరం చరిత్రను కోరుకుంటుందో, అక్కడ గతం గురించిన ప్రస్తావన వస్తోంది. ఇది మనం అమితవ్ ఘోష్ నవలలో ఎక్కువ చూస్తాం. మూర్ అనే ఒక పరిశోధకుడు చరిత్ర అంటే ‘గతానికి వర్తమానానికి మధ్య జరిగే నిరంతర సంభాషణే’ అంటాడు. దీనిని సరిగ్గా అందిపుచ్చుకున్నవాడు అమితవ్‌ఘోష్.
  ప్రతిభారాయ్ మాట్లాడుతూ .. ..in his novels, treads through hitorical settings to the modern era and weaves a space where the past connects with the present in relevant ways -అంటారు.
  అంధుకేనేమో, ‘ఘోష్ జనరేషన్’ అంటూ తనదైన ఒక అధ్యాయాన్ని, వారసత్వాన్ని, వరసత్వాన్ని అందుకున్న ఘోష్‌కు అభినందనలు.
  *
  చిత్రం..అమితవ్‌ఘోష్


  0 0

  పోలవరం, డిసెంబర్ 24: ఎన్ని అవాంతరాలెదురైనా పోలవరం ప్రాజెక్టును 2019లో పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. 2019 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తిచేసి, ఇరువైపులా సమృద్ధిగా నీరందిస్తామన్నారు. 2019 మేలో గ్రావిటీ ద్వారా పోలవరం ప్రాజెక్టు నుండి జలాలను పరుగులు పెట్టిస్తామని ధీమా వ్యక్తంచేశారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వేలో గేట్ల ఏర్పాటు కార్యక్రమాన్ని సోమవారం ఆయన పూజచేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. రాష్ట్రంలోని నదుల అనుసంధానం ద్వారా రెండు కోట్ల ఎకరాలకు సాగునీరు అందించడమే తన లక్ష్యమని ప్రకటించారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా, వాటన్నిటినీ ఎదుర్కొంటూ ఇప్పటివరకు 63 శాతం పనులు పూర్తిచేయగలిగామన్నారు. మిగిలిన 37 శాతం పనులను కూడా అతివేగంగా పూర్తిచేసి, నిర్దేశించిన సమయానికన్నా ముందుగానే నీరు విడుదల చేస్తామన్నారు. ప్రస్తుతం స్పిల్‌వేలో నెలకొల్పుతున్న ఒక్కో గేటు 300 టన్నుల బరువు ఉంటుందని, ఇలాంటివి 48 గేట్లు ఏర్పాటుచేసి, 50 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి డబ్బులివ్వకుండా సహాయ నిరాకరణ చేస్తోందని ఆరోపించారు. ఇప్పటివరకు 83సార్లు పోలవరం ప్రాజెక్టుపై వారం వారం సమీక్షలు నిర్వహించానని, 29సార్లు పోలవరం ప్రాజెక్టును సందర్శించి పనుల వేగాన్ని పెంచగలిగానని ముఖ్యమంత్రి తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో ఇప్పటికే ప్రపంచ రికార్డు సృష్టించామని, 2019 జనవరి 6వ తేదీన కాంక్రీటు పనులు చేపట్టి 7వ తేదీ ఉదయం 9 గంటలకు 28 నుండి 30వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు వేసి, గిన్నిస్ రికార్డు సృష్టించామన్నారు. చైనా, అమెరికా దేశాలు చేపట్టిన భారీ ప్రాజెక్టుల్లో 24 గంటల్లో 23,500 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పని పూర్తిచేసి, రికార్డు సృష్టించాయన్నారు. 2019 జనవరి 6వ తేదీ ఉదయం 9 గంటలకు కాంక్రీటు పనిచేపట్టి 7వ తేదీ ఉదయం 9 గంటలకు 24 గంటల్లో 28 నుండి 30 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పని పూర్తిచేసి, పోలవరం ప్రాజెక్టు ప్రపంచ రికార్డు సృష్టించనుందన్నారు. ఇది అంధ్రప్రదేశ్‌కే గర్వకారణమన్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల తీరుకు ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ అవార్డు కూడా లభించిందన్నారు. 2019 జనవరి 4న ఢిల్లీలో ఈ అవార్డు అందుకుంటామన్నారు. పనుల వేగంగా చేసే నవయుగ కంపెనీకి నిర్మాణ బాధ్యతలు అప్పగించామని. ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీ సమర్థవంతంగా పనిచేయడంవల్ల పోలవరం పనులు వేగం పుంజుకున్నాయన్నారు.
  దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నదుల అనుసంధానంపై పెద్ద చర్చ జరిగిందని, అటల్‌బిహారీ వాజపేయి ప్రధానిగా ఉన్న కాలంలో ఒక కమిటీని కూడా ఏర్పాటుచేశారని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. అయినా దశాబ్దాలు గడుస్తున్నా నదుల అనుసంధానం జరగలేదన్నారు. తాను పట్టిసీమ ఎత్తిపోతల పథకం చేపట్టి, గోదావరి జలాలను కృష్ణాతో అనుసంధానం చేయగలిగానన్నారు. దేశచరిత్రలోనే నదుల అనుసంధానం జరిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కు ఖ్యాతి లభించిందన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడం ద్వారా మరికొన్ని నదుల అనుసంధానంచేసి, రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఎక్కడా నీటికి ఇబ్బంది లేకుండా చేయడమే తన ధ్యేయమన్నారు.
  గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంతో వ్యవసాయ రంగంలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దేశంలో వ్యవసాయంలో 2.4 శాతం వృద్ధి సాధిస్తే, ఆంధ్రప్రదేశ్‌లో 11 శాతం అభివృద్ధి సాధించగలిగామన్నారు. గత నాలుగేళ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశామని చంద్రబాబు పేర్కొన్నారు.మెట్ట ప్రాంతాలకు అవసరమైన నీటిని అందించడం ద్వారా భవిష్యత్తులో ఉద్యానవన తోటల పెంపకంపై ప్రత్యేదృష్టి కేంద్రీకరిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆక్వా రంగంలో కూడా అధునిక విధానాలు అనుసరించి అభివృద్ధి సాధిస్తామన్నారు. పాడి, కోళ్ళ పరిశ్రమలను ప్రోత్సహిస్తామన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా 42 శాతం జనాభా ఉన్న తెలంగాణకు 54 శాతం ఆస్తులు, 58 శాతం జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు 46 శాతం ఆస్తులు అప్పగించారదని, ఇటువంటి స్థితిలో పెన్షన్లు కూడా ఇస్తామా లేదా అనే అనుమానం కలగగా, నిరంతరం సమన్వయంతో పనిచేసి, దేశంలో రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
  రాష్ట్ర ప్రాజెక్టులపై ప్రధానికి చిన్న చూపు
  దేశంలోనే భారీ ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టును ప్రధాన మంత్రి మోదీ చూసే ప్రయత్నమే చేయలేదన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులపై ప్రధానికి చిన్న చూపని, అందుకే రాష్ట్రానికి సహకరించడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు.
  తాను రెండు తెలుగు రాష్ట్రాలూ అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నానని, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రం ఆంధ్రా అభివృద్ధి చెందకూడదని అనుకుంటున్నారని, అందుకే ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవడానికి చర్చలు జరిపారన్నారు. ప్రాజెక్టు పూర్తయితే ఒరిస్సా 5 టిఎంసీల నీటిని వాడుకోవచ్చని, ప్రాజెక్టు పూర్తవడానికి సహకరించాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను అభ్యర్ధిస్తున్నానని చంద్రబాబు అన్నారు.
  కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పితాని సత్యానారాయణ, కెఎస్ జవహర్, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఇరిగేషన్ కార్యదర్శి శశిభూషణ్, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు కె భాస్కర్, కార్తికేయ మిశ్రా, శాసనసభ్యులు మొడియం శ్రీనివాస్, గన్ని వీరాంజనేయులు, బూరుగుపల్లి శేషారావు, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పాలిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
  41వ గేటు ఏర్పాటుకు పూజలు
  పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వేకు గేట్లు ఏర్పాటుచేసే కార్యక్రమాన్ని 41వ గేటుకు పూజలు నిర్వహించడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ఈసందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కాఫర్ డ్యాం నిర్మాణ పనులు, స్పిల్‌వే పనుల తీరును స్వయంగా పరిశీలించారు. ఈసందర్భంగా పనులు పరుగులు పెట్టిస్తున్న జలవనరుల శాఖ అధికారులు, నవయుగ కాంట్రాక్టు ఏజెన్సీ ప్రతినిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు.
  చిత్రం..పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వేలో ఏర్పాటు చేయనున్న గేటుకు పూజలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు


  0 0

  అమరావతి, డిసెంబర్ 24: మోదీది అత్యంత సంపన్నుల పార్టీ.. టన్నుల కొద్దీ డబ్బు ఉంది.. అదంతా ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారు..అందుకే రెండువేల రూపాయల నోటు రద్దుచేయలేదు.. ప్రజాస్వామ్యాన్ని ఈవీఎం చిప్ మేనేజ్‌మెంట్ కు అప్పగిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. బ్యాలెట్ ఓటింగ్ వల్ల నష్టమేంటని ప్రశ్నించారు. అభివృద్ధిలో ఏపీ నమూనా గుజరాత్‌ను మించిపోతోందనే కసితోనే మోదీ అడుగడుగునా అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.. కేసీఆర్‌కు కావాల్సింది కూడా ఇదే.. ఏపీలో కీలుబొమ్మ ప్రభుత్వం ఉండి.. అస్థిరత నెలకొంటే జాతీయ స్థాయిలో ప్రయోజనం పొందాలనే టీడీపీ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని విమర్శించారు. ఉండవల్లి ప్రజావేదికలో ‘ప్రభుత్వ పాలన’ (గవర్నెన్స్)పై శే్వతపత్రం-2ను ముఖ్యమంత్రి సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాకు శే్వతపత్రంలో అంశాలను విశదీకరించారు. విభజన కష్టాల్లో ప్రభుత్వం ఏర్పడినప్పటికీ సమర్థత, టెక్నాలజీ వినియోగం, నూతన
  ఆవిష్కరణలు, నాయకత్వం పారదర్శకత లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగుతున్నామని తెలిపారు. నిరంతరం ప్రజలతో మమేకం అయ్యేలా వ్యవస్థలను రూపొందించామని చెప్పారు. ఆర్థిక అసమానతలు తగ్గించటం, పేదరిక నిర్మూలన, హామీలు నెరవేర్చేందుకు దీర్ఘకాలిక ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని వివరించారు. 2022 నాటికి దేశంలోని మూడు అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా, 2029కి నెంబర్ వన్‌గా, 2050కల్లా ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా పురోగమించాలనేది తమ లక్ష్యమన్నారు. రాజధాని కూడా లేకుండా అప్పులతో, కట్టుబట్టలతో ఏర్పాటైన రాష్ట్రాన్ని గత నాలుగున్నరేళ్లలో గాటన పెట్టామన్నారు. కేంద్ర ప్రభుత్వం నమ్మించి నట్టేట ముంచినా కష్టం, కఠోర శ్రమతో ప్రగతిబాటలో పయనిస్తున్నామని తెలిపారు. ప్రపంచంలోని అత్యుత్తమ సాంకేతిక పద్ధతులను అనుసరించడం ద్వారా ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల తీరుతెన్నులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ లోటుపాట్లను సవరించుకోగలిగామన్నారు. ఇందులో భాగంగానే దేశంలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్ స్టాండర్డ్స్‌లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపామన్నారు. కరవును అధిగమించేందుకు నదుల అనుసంధానం, జలవనరుల సంరక్షణను ప్రణాళికాబద్ధంగా అమలు చేశామన్నారు. రాష్ట్రానికి వరదాయిని అయిన పోలవరం ప్రాజెక్ట్‌కు కేంద్రం నిధులు మంజూరు చేయనప్పటికీ తొలిగేటు ఏర్పాటు చేశామని చెప్పారు. డబ్బులివ్వకపోయినా స్వల్పకాలంలో పూర్తిచేసిన భారీ ప్రాజెక్ట్‌గా దేశంలోనే చరిత్ర సృష్టించామని దీంతో అవార్డులు ఇవ్వక తప్పలేదన్నారు. నదుల అనుసంధానంతో రాయలసీమ కష్టాలు కొంత వరకు తీర్చగలిగామని పంట సంజీవని సత్ఫలితాలు ఇచ్చాయన్నారు. జలవనరుల సంరక్షణను సవాల్‌గా తీసుకుని ముందుకు సాగామన్నారు. వచ్చే ఏడాది మే కల్లా పోలవరానికి గ్రావిటీ ద్వారా నీళ్లిచ్చి డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ప్రకటించారు. కోటి ఎకరాల్లో సూక్ష్మ బిందు సేద్యం లక్ష్యంగా నిర్దేశించామని చెప్పారు. మరోవైపు సుపరిపాలన అందించే లక్ష్యంతో తాత్కాలిక సచివాలయం, రాజధాని ఏర్పాటుచేసి ప్రభుత్వ శాఖలను ప్రజలకు చేరువ చేశామన్నారు. మావన వనరులు, సహజ వనరుల వినియోగంతో పాటు సాంకేతికతతో రాష్ట్ర వృద్ధిరేటును గత నాలుగున్నరేళ్లలో రెండంకెలకు చేర్చగలిగిన ఏకైక ప్రభుత్వం తమదే అన్నారు. లక్ష్యాలను అథిగమించేందుకు 7 మిషన్‌లు, 5 గ్రిడ్‌లు, మరో 5 క్యాంపైనింగ్ మోడ్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఎకో సిస్టంను అభివృద్ధి చేస్తూ రియల్‌టైం గవర్నెన్స్ ద్వారా సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. పీపుల్స్ హబ్, నాలెడ్జి హబ్, హెల్త్‌హబ్‌లు ఏర్పాటు చేశామన్నారు. ఈ- ప్రగతి కింద అన్ని ప్రభుత్వ శాఖలను అనుసంధానం చేసి అవినీతి రహిత పారదర్శక పాలనను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఆర్టీజీఎస్, పరిష్కార వేదిక సత్ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు.
  ఆధార్‌తో ప్రతి ఒక్కరి జీవన స్థితిగతులను ఆధ్యయనం చేసి అవసరాలను తీర్చే దిశగా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. రానున్న కాలంలో ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ 10వేల ఆదాయం అందించాలనేది తమ లక్ష్యమన్నారు. భూధార్ ద్వారా భూ వివాదాలకు అడ్డుకట్ట వేశామన్నారు. కోటీ 50 లక్షల మంది వరకు రేషన్ కార్డులు, 43 లక్షల మందికి పింఛన్లు అందుతున్నాయని, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు జన్మభూమి- మావూరు నిర్వహిస్తున్నామని వివరించారు. ప్రతి గ్రామంలో వౌలిక వసతుల కల్పన, జీవన ప్రమాణాల మెరుగుదలకు కార్యాచరణ రూపొందించామని చెప్పారు. ఈ- ఆఫీస్, ఈ- కేబినెట్, సీఎఫ్‌ఎంఎస్ వయాడక్ట్‌ల ద్వారా ప్రభుత్వ పాలనా విధానాన్ని ఆవిష్కరించ గలిగామన్నారు. ప్రకృతి వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలు, ఉద్యానవన పంటలకు ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా జాతీయ స్థాయిలో వ్యవసాయరంగంలో 17.5 శాతం వృద్ధిరేటు సాధించామని తెలిపారు. నదుల అనుసంధానం ఇతర కార్యక్రమాల ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశామన్నారు. విభజన సమయంలో 23.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరతను అధిగమించి మిగులు రాష్ట్రంగా ఎదిగామని, లైన్ నష్టాల తగ్గింపు, ఇంధనవనరుల నిర్వహణలో 105 జాతీయ అవార్డులు లభించడం తమ పాలనకు నిదర్శనమన్నారు. విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలు తెచ్చామన్నారు. ప్రతి గ్రామంలో ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటుచేసి విద్యుత్ చార్జీలను పెంచబోమని ప్రకటించిన తొలి రాష్ట్రంగా ఏపీ నిలిచిందన్నారు. ప్రజా రాజధానిలో పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామని, వచ్చే మూడేళ్లలో ప్రతి కుటుంబానికి సొంతింటి కల నిజం చేస్తామని భరోసా ఇచ్చారు. జీఎస్‌డీపి జాతీయ స్థాయిలో 7.3 శాతం ఉంటే ఏపీకి 11.22 శాతంతో పురోగమిస్తోందని వివరించారు. తలసరి ఆదాయం ప్రస్తుతం లక్షా 42వేల రూపాయలు ఉందని రానున్న కాలంలో మరో 38వేలకు పెంచాలనేది లక్ష్యమన్నారు. గత నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో ఏర్పాటైన ఐటీ పరిశ్రమలు గుజరాత్‌లో కూడా లేవన్నారు. దూరదృష్టి.. లక్ష్యం ఉంటే ఏదైనా సాధించ గలమన్నారు. తలసరి ఆదాయంలో ధనిక రాష్ట్రం, జనాభా తక్కువ ఉన్న తెలంగాణ సైతం మన రాష్ట్రం కంటే వెనుకబడి ఉందన్నారు. ఈ కారణంగానే మోదీ, కేసీఆర్‌లు తమపై కక్షకట్టారని ఆరోపించారు. కీలుబొమ్మ ప్రభుత్వం ఉండి, ఏపీలో అస్థిరత ఉంటే తాము లబ్ధిపొందాలనుకోవటం మంచి పద్ధతి కాదన్నారు. గత నాలుగున్నరేళ్లలో మోదీ వ్యవస్థలను భ్రష్టు పట్టించారని దీనివల్ల ఓటమి పాలయ్యారని విమర్శించారు. గుజరాత్‌లో 12 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏం ఒరగబెట్టారని నిలదీశారు. అన్న క్యాంటీన్‌లు, చంద్రన్న బీమా, రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, మైక్రో న్యూట్రియంట్స్, పండుగ కానుకలు దేశంలో ఎక్కడా అమలు కావటం లేదని తెలిపారు. దేశానికి ఇప్పుడు ఏపీ లీడర్‌గా నిలిచే స్థాయికి చేరిందన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌పై తెలంగాణ అభ్యంతరం చెప్పటంలో అర్థం లేదన్నారు. ఎగువన కాళేశ్వరం నిర్మిస్తూ దిగువన కట్టే ప్రాజెక్ట్‌లకు అభ్యంతరం చెప్పటమేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్నా అధిగమిస్తున్నామని స్పష్టం చేశారు. వివిధ శాఖల పరిధిలో మొత్తం 615 అవార్డులు సాధించటం వెనుక అధికార యంత్రాంగం కష్టం ఉందన్నారు. ప్రజల ఆహార అలవాట్లలో మార్పుల కనుగుణంగా చెత్త, వ్యర్థాల నిర్వహణతో సంపద సృష్టించే స్థితికి చేరామన్నారు. అత్యుత్తమ సంస్థలు, జవాబుదారీతనం, ప్రభుత్వ విధానాలు, వినూత్న ఆలోచనలతో అభివృద్ధిపధంలో రాష్ట్రం దూసుకు పోతోందని వివరించారు. పోలవరానికి కేంద్రం డబ్బులు మాత్రం ఇవ్వదు.. తప్పకపోవటంతోనే అవార్డులు ఇస్తోందని వ్యాఖ్యానించారు. ఒడిశా ప్రభుత్వంతో సమావేశపరిచేందుకైనా ప్రయత్నించటం లేదని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో నష్టపరిహారాన్ని చెల్లించే దిశగా సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు. తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తే ఎన్టీఆర్‌కు ద్రోహం చేసినట్లు మోదీ విమర్శించటంలో అర్థం లేదన్నారు. జాతీయ స్థాయిలో తృతీయ ఫ్రంట్ అనేది చరిత్రలోలేదని, కాంగ్రెస్, బీజేపీలకు మద్దతివ్వక తప్పని పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు హాస్యాస్పదమన్నారు. బీజేపీ యేతర ఐక్య ఫ్రంట్‌కు తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

  చిత్రం..ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు*


  0 0

  న్యూఢిల్లీ, డిసెంబర్ 24: మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి చేసిన కృషి, త్యాగాల మూలంగానే బీజేపీ ఈ స్థాయికి చేరిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సోమవారం పార్లమెంటు ఆవరణలో ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమంలో వాజపేయి జ్ఞాపకార్థం రూ.100 నాణాన్ని విడుదల చేశారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, సీనియర్ నాయకుడు లాల్‌కృష్ణ అద్వానీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆనారోగ్యం మూలంగా వాజపేయి దాదాపు ఎనిమిదేళ్లపాటు రాజకీయాలు, ప్రజాజీవనానికి దూరంగా ఉన్నా ఆయన మరణించినప్పుడు ప్రజల నుండి వ్యక్తమైన ప్రేమాభిమానాలు ఆశ్చర్యం కలిగించాయని మోదీ చెప్పారు. దేశ ప్రజలకు వాజపేయి పట్ల ఉన్న ప్రేమాభిమానాలకు ఇది నిదర్శమని అన్నారు. వాజపేయి అధికారంకోసం పాకులాడకుండా మొదట జనసంఘ్, ఆ తరువాత భారతీయ జనతా పార్టీని ఇటుక మీట ఇటుక పెట్టుకుంటూ నిర్మించారని అన్నారు. వాజపేయి పలు సంవత్సరాలపాటు ప్రతిపక్షంలో కూర్చున్నారు తప్ప అధికారం, రాజకీయాల కోసం సిద్ధాంతాలతో రాజీపడలేదని మోదీ ప్రశంసలు కురిపించారు. ప్రజలు, పార్టీ కార్యకర్తలతో ప్రత్యక్ష సంబంధం ఏర్పాటు చేసుకోవటం ద్వారా ఆయన పార్టీని క్షేత్రస్థాయి నుండి నిర్మించారు.. అందుకే బీజేపీ ఈ రోజు కేంద్రంతోపాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నదని ఆయన చెప్పారు. వాజపేయి ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాధాన్యత ఇచ్చారు తప్ప రాజకీయాలకు కాదు.. అందుకే ఆయన ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా జనసంఘ్‌ను జనతా పార్టీలో విలీనం చేశారని అన్నారు. ఆయన పార్టీ, రాజకీయాల కంటే దేశం, ప్రజాస్వామ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని ప్రధాన మంత్రి తెలిపారు. తమ పార్టీలో చేరితే అధికారం ఇస్తాం.. నాయకత్వం ఇస్తామంటూ పలువురు ఆయనకు ఆశ చూపించారు.. అయితే వాజపేయి మాత్రం వీటికి లొంగకుండా ఏకాగ్రతతో బీజేపీ నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించారు.. అందుకే తామీస్థితిలో ఉన్నాం.. దేశంలోని ప్రతి ప్రాంతంలో కమలం వికసిస్తోందని మోదీ చెప్పారు. వాజపేయి పుట్టిన రోజు డిసెంబర్ 25ను సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నామని అమిత్ షా చెప్పారు.
  చిత్రం..పార్లమెంటు ఆవరణలో సోమవారం జరిగిన కార్యక్రమంలో వాజపేయి
  జ్ఞాపకార్థం రూ.100 నాణాన్ని విడుదల చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ


  0 0

  న్యూఢిల్లీ, డిసెంబర్ 24: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాన్-బీజేపీ, నాన్-కాంగ్రెస్ కూటమి పేరుతో ఫెడరల్ ఫ్రంట్ కోసం చేస్తున్న ప్రయత్నం కాంగ్రెస్ గుండెల్లో రైళ్లను పరిగెట్టిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రధాన పార్టీలైన ఎస్పీ, బీఎస్పీ, పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ ఆ ఫ్రంట్‌లో చేరితే తమ పరిస్థితి ఏమిటనే ఆందోళన కాంగ్రెస్‌లో వ్యక్తమవుతోంది. ఫెడరల్ ఫ్రంట్‌లో మాయావతి, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ చేరిపోతే కాంగ్రెస్ నాయకత్వంలో జాతీయ ప్రజాఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు గండి పడుతుందని వారు చెబుతున్నారు. ఇదే జరిగితే రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి పదవి
  చేపట్టటం కల్ల అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, మరాఠా నాయకుడు, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, నేషననల్ కాన్ఫరెన్స్ అధినాయకుడు ఫరూఖ్ అబ్దుల్లా కాంగ్రెస్ నాయకత్వంలో ప్రజా ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తుండటం తెలిసిందే. ప్రజాఫ్రంట్ ప్రధాన మంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీయేనని డీఎంకే అధినేత స్టాలిన్ ఇటీవల ప్రకటించటం తెలిసిందే. చంద్రశేఖరరావు ఆదివారం భువనేశ్వర్‌లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో చర్చలు జరిపిన అనంతరం సోమవారం కోల్‌కత్తాలో మమతా బెనర్జీతో నాన్-బీజేపీ, నాన్-కాంగ్రెస్ ఫ్రంట్ ఏర్పాటు గురించి చర్చలు జరిపారు. కాంగ్రెస్, బీజేపీని పక్కనబెట్టి ప్రాంతీయ పార్టీలతో కూడిన తృతీయ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి ఢిల్లీలో అధికారంలోకి రావాలన్నది చంద్రశేఖరరావు ఆలోచన. దీనివలన రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రజాఫ్రంట్‌ను ఏర్పాటు చేయటం ద్వారా కేంద్రంలో అధికారంలోకి రావాలన్న చంద్రబాబు నాయుడు వ్యూహం ఊహించని స్థాయిలో దెబ్బతింటుంది. చంద్రశేఖరరావు తాజాగా ప్రారంభించిన ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు ఎంతమాత్రం నచ్చటం లేదు. మాయావతి, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ చాలా జాగ్రత్తగా రాజకీయం నడిపిస్తున్నారు. చంద్రబాబు కోల్‌కతా వెళ్లి చర్చలు జరిపినప్పుడు.. ఆ తరువాత ఆమె ఢిల్లీకి వచ్చి జాతీయ ప్రజాకూటమి సమావేశానికి హాజరైనప్పుడు కూడా మమతా బెనర్జీ కాంగ్రెస్ నాయకత్వం లేదా రాహుల్ గాంధీ నాయకత్వం గురించి పల్లెత్తు మాట కూడా చెప్పలేదు. రాహుల్ గాంధీ నాయకత్వంలో పని చేసేందుకు మమతా బెనర్జీ సిద్ధంగా లేరనేది అందరికీ తెలిసిందే. మాయావతి, అఖిలేష్ యాదవ్ కూడా రాహుల్ గాంధీ నాయకత్వంలో పని చేసేందుకు ఇష్టపడటం లేదు. అందుకే వారిద్దరూ మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకాలేదు. రాజకీయ ఉద్దేశ్యంతోనే వారీ ప్రమాణ స్వీకారాలకు రాలేదు. ఉత్తరప్రదేశ్‌లోని 80 లోక్‌సభ సీట్ల విషయంలో ఎస్పీ, బీఎస్పీ ఒక అవగాహనకు రావటంతోపాటు ఆర్‌ఎల్‌డిని తమతో చేర్చుకున్నారు. వారీ ప్రక్రియలో కాంగ్రెస్‌కు ఎలాంటి స్థానం కల్పించకపోవటం గమనార్హం. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కోసం రాయబరేలీ, అమేథీ లోక్‌సభ నియోజకవర్గాలు మినహా మిగతా లోక్‌సభ సీట్ల విషయంలో ఎస్పీ, బీఎస్పీ ఒక అవగాహనకు రావటం ద్వారా కాంగ్రెస్‌తో కలిసి పోటీచేయటం తమకు ఎంతమాత్రం ఇష్టం లేదనే సంకేతాన్ని పంపించారు. ఈ నేపథ్యంలో అఖిలేష్ యాదవ్, మాయావతి కూడా చంద్రశేఖరరావుతో చేతుల కలిపి నాన్-కాంగ్రెస్, నాన్-బీజేపీ కూటమిలో చేరిపోతే కాంగ్రెస్ నాయకత్వంలోని జాతీయ ప్రజా కూటమి చతికిల పడటం ఖాయమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.


  0 0

  న్యూఢిల్లీ, డిసెంబర్ 24: బాబరీ మసీదు- రామజన్మభూమి స్థల వివాదానికి సంబంధించి దాఖలైన పిటిషన్లను జనవరి 4న సుప్రీం కోర్టు విచారించనుంది. ఈ ఆంశం ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, న్యాయమూర్తి ఎస్‌కె కౌల్ బెంచి ముందు ఉంది. 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన మొత్తం 14 పిటిషన్ల విచారణకు ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మొత్తం నాలుగు సివిల్ దావాలకు సంబంధించి అప్పట్లో అలహాబాద్ హైకోర్టు ఆ తీర్పును వెలువరించింది. వివాదాస్పదమైన 2.77 ఎకరాల భూమిని మూడు పక్షాలకు (సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖారా, రామ్‌లల్లా) సమానంగా పంచాలని ఆ తీర్పులో స్పష్టం చేసింది. దీనిపై దాఖలైన సవాలు పిటిషన్లను జనవరి మొదటి వారంలో సముచిత ధర్మాసనానికి నివేదిస్తామని, ఆ ధర్మాసనమే వీటిపై విచారణ షెడ్యూలును ప్రకటిస్తుందని అక్టోబర్ 29న సుప్రీం కోర్టు తెలిపింది. అయితే ఈ పిటిషన్ల విచారణ తేదీని ముందుకు తీసుకురావాలంటూ మధ్యలో అప్పీలు దాఖలైనప్పటికీ దాన్ని సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది.


  0 0

  న్యూఢిల్లీ, డిసెంబర్ 24: కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని దివంగత ఎన్టీ రామారావు స్థాపించలేదని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు పేర్కొన్నారు. ఆంధ్రభవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్‌తో కలిసి కంభంపాటి విలేఖరులతో మాట్లాడారు. తమిళనాడులో ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల తెలుగుదేశం పార్టీపై చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విమర్శలు సరైనవి కావని చెప్పారు. కేంద్ర పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా స్థాపించిన పార్టీయే టీడీపీ అని ఆయన స్పష్టం చేశారు. పధ్నాలుగేళ్లు ప్రతిపక్షం, 21 ఏళ్లుగా అధికారంలో ఉందంటే కారణం- తెలుగుదేశం పార్టీకి సంస్థగత, వ్యవస్థాగత బలం మాత్రమేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలు అమలుచేసిన తరువాతే నరేంద్ర మోదీ రాష్ట్రంలో అడుగుపెట్టాలని అన్నారు. విభజన హామీల వైఫల్యంవల్లే ఏన్డీయే నుంచి తాము బయటకు వచ్చామని పేర్కొన్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌తో పొత్తులపై ఎన్నికల సమయంలో నిర్ణయం తీసుకుంటామని కంభంపాటి చెప్పారు.

  చిత్రం..కంభంపాటి రామ్మోహన్‌రావు


older | 1 | .... | 1985 | 1986 | (Page 1987) | 1988 | 1989 | .... | 2069 | newer