Are you the publisher? Claim or contact us about this channel


Embed this content in your HTML

Search

Report adult content:

click to rate:

Account: (login)

More Channels


Showcase


Channel Catalog


older | 1 | .... | 1989 | 1990 | (Page 1991) | 1992 | 1993 | .... | 2069 | newer

  0 0

  ఓయస్‌యం విజన్, దివ్యాషిక క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘నేను లేను’. లాస్ట్ ఇన్ లవ్ అనేది ఉపశీర్షిక. హర్షిత్ హీరో. తాజాగా చిత్రం ట్రైలర్‌ను యూనిట్ విడుదల చేసింది. ఫిబ్రవరి 1న థియేటర్లకు వస్తున్న సినిమా గురించి దర్శకుడు రామ్‌కుమార్ మాట్లాడుతూ ‘అందమైన ప్రేమకథతో తెరకెక్కిన సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. ఇటీవలే విడుదలైన టీజర్‌కి అనూహ్య స్పందన వచ్చింది. ఇప్పటివరకు భారతదేశంలో రాని సరికొత్త కానె్సప్ట్‌తో వస్తున్న చిత్రమిది’ అన్నారు. హర్షిత్, వంశీకృష్ణ, పాండ్య, శ్రీపద్మ, మాధవి, బిశ్వజిత్‌నాధ్, రుద్రప్రకాశ్, వేల్పుల సూరి, యుగంధర్ తదితరులు నటిస్తున్న చిత్రానికి సంగీతం ఆశిత్, నిర్మాత సుక్రికుమార్, రచన, దర్శకత్వం రామ్‌కుమార్ ఎంఎస్‌కె.


  0 0

  ఎవిఆర్ మూవీ వండర్స్ పతాకంపై సంపత్ వి రుద్ర దర్శకత్వంలో అడ్డూరి వెంకటేశ్వరరావు నిర్మిస్తోన్న చిత్రం ‘ఇష్టంగా’. అర్జున్ మహి, తనిష్క్ రాజన్ హీరో హీరోయిన్లు. రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌లో స్టార్ కమెడియన్ ప్రియదర్శి ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. డిసెంబర్ 28న సినిమా విడుదలవుతున్న సందర్భంగా హీరో అర్జున్ మహి మీడియాతో మాట్లాడాడు. ఇంజనీరింగ్ చదివిన తాను సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చానన్నాడు. హీరోగా -ఎంజాయ్, నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్ సినిమా తరువాత చేస్తున్న మూడో చిత్రమే ఇష్టంగా అన్నాడు. సినిమాలో కృష్ణ అనే కొరియోగ్రాఫర్ పాత్రలో కనిపిస్తానని, సినిమా ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చిందన్నాడు. ప్రేమ, లివ్ ఇన్ రిలేషన్‌షిప్ మీద సినిమా నడుస్తుందన్నాడు. ప్రేమ కోసం అమ్మాయి ఎంతదూరమైనా వెళ్తుందనే ప్రాధాన్యత అంశాన్ని సినిమాలో చూస్తారన్నాడు. కథానుగుణంగా లిప్ లాక్స్ పెట్టారని, అయితే వాటిలో ఎక్కడా వల్గారిటీ ఉండదన్నాడు. సెకండాఫ్ చివరి 30నిమిషాలు ఓ కోర్ పాయింట్ మీద సినిమా రన్నవుతుందని, దాన్ని మిస్సవ్వద్దని సూచించాడు.


  0 0

  బయోపిక్ అన్నది ప్రత్యేక జోనర్‌గా స్థిరపడుతోంది ఇండస్ట్రీలో. గొప్ప వ్యక్తుల జీవితాలను తెరకెక్కించేందుకు నిర్మాతలు, దర్శకులు ఉత్సాహం చూపిస్తున్నారు. మహానుభావుల పాత్రలు పోషించేందుకు స్టార్లు సైతం పరుగులు తీస్తున్నారు. రాజకీయం, క్రీడలు, శాస్త్ర సాంకేతిక రంగం, ఉద్యమకారులు.. ఇలా ఒక్కటేమిటి? సమాజంపై ప్రభావం చూపిన వ్యక్తుల చిత్రాలు వరుసపెట్టి బయోపిక్‌లుగా మారుతున్నాయి. పైగా ఇప్పటి వరకూ వచ్చిన బయోపిక్‌లన్నీ వ్యాపారాత్మకంగా మంచి ఫలితాలే అందించటంతో -నిర్మాతలు సైతం ‘బయోపిక్’ కథ పట్టుకెళ్తే ‘నో’ అనడం లేదు. ఓపక్క జయలలిత బయోపిక్‌ను ముగ్గురు నిర్మాతలు, ముగ్గురు దర్శకులు తెరకెక్కిస్తుంటే, ఇటు తెలుగునాట పరిశ్రమపైన, రాజకీయంపైన తనదైన ముద్రవేసిన యన్‌టిఆర్ బయోపిక్‌ను రెండు భాగాలుగా హీరో బాలకృష్ణ తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఇస్రో శాస్తవ్రేత్త కథను మాధవన్ తెరకెక్కిస్తుంటే, ఇప్పటికే సుమధుర గాయకుడు ఘంటసాల బయోపిక్ తెరకెక్కింది. తాజా సమాచారం ఏంటంటే -్భరత మాజీ రాష్టప్రతి, శాస్తవ్రేత్త అబ్దుల్ కలాం బయోపిక్ కూడా బాలీవుడ్‌లో తెరకెక్కబోతోంది. స్క్రీన్‌పై కలాంగా బాలీవుడ్ వర్సటైల్ ఆర్టిస్ట్ అనిల్‌కపూర్ కనిపించనున్నాడని బి.టౌన్ టాక్. ‘గాంధీ’ మాదిరిగా హాలీవుడ్ రేంజ్‌లో ప్రాజెక్టును చేపట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. స్క్రిప్ట్‌విన్న అనిల్‌కపూర్, వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి కీలక సమాచారాన్ని బహిర్గతం చేసే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు త్వరతిగతిన పూర్తి చేసి, జనవరిలో ప్రాజెక్టును సెట్స్‌మీదకు తెచ్చే అవకాశం ఉందనీ అంటున్నారు. కలాం జీవితంపై రచయిత రాజ్ చెంగప్ప రాసిన పుస్తకమే ఈ ప్రాజెక్టుకు ఆధారమని తెలుస్తోంది. 1931లో రామేశ్వరంలో జన్మించిన కలాం, 2002నుంచి 2007 వరకు రాష్టప్రతిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2015 జూలైలో ఆయన కన్నుమూశారు.


  0 0
 • 12/26/18--06:15: ఆటగాడిగా....
 • సుధీర్‌బాబు హీరోగా చేసిన ‘నన్ను దోచుకుందువటే’ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ సినిమాతో సుధీర్ తెలుగు తెరకు ప్రొడ్యూసర్‌గాకూడా పరిచయం అయ్యారు. సుధీర్‌బాబు ఇప్పుడు మరో కొత్త సినమాని కూడా లైన్‌లో పెట్టారట. యాక్టర్‌గా సినీ ఎంట్రీ ఇచ్చి.. ఆ తరువాత డైలాగ్ రైటర్‌గా టర్న్ అయి.. నితిన్ ‘గుండె జారి గల్లంతయ్యిందే’ సినిమాతో రైటర్‌గా సక్సెస్ అయి.. మనం సినిమాతో రచయితగా ఇంకా మంచి పేరు తెచ్చుకున్నాడు హర్షవర్థన్. అయిత హర్షవర్థన్ ఇప్పటికే గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాకు డైరెక్షన్ చేశాడు. ఇపుడు తన రెండో సినిమా కోసం సుధీర్‌బాబుకు రీసెంట్‌గా ఓ కథ చెప్పారట. కథ నచ్చడంతో ఈ ప్రాజెక్టు చెయ్యడానికి సుధీర్‌బాబు అంగీకరించారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ యంగ్ హీరో బాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ బయోపిక్‌లో నటిస్తోన్న విషయం తెలిసిందే. సుధీర్‌బాబు సినిమాల్లోకి రాకముందు బాడ్మింటన్ ప్లేయర్ కావడం విశేషం.


  0 0

  యాక్షన్ హీరో గోపీచంద్ తమిళ దర్శకుడు తిరు కాంబినేషన్‌లో ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న సినిమా ఓపెనింగ్ అనీల్ సుంకర ఆఫీసులో జరిగింది. ఏషియన్ సినిమాస్ సునీల్ చిత్ర తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టారు. జనవరి 18నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. 2019 మేలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుంటే, వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.


  0 0

  క్రమంగా తెలుగు ప్రేక్షకుకలు దగ్గరవుతున్న కార్తి, పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ హీరో హీరోయిన్లుగా వస్తున్న చిత్రం -దేవ్. కార్తి రేసర్‌గా కనిపించనున్న చిత్రానికి సంబంధించి షూటింగ్ పూర్తవ్వడంతో, పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారు. రాజత్ రవిశంకర్ తెరకెక్కించిన యాక్షన్ ఫ్యామిలీ డ్రామా ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన రావడం తెలిసిందే. అన్నీ సజావుగానే సాగిపోతున్న నేపథ్యంలో -సినిమా సంక్రాంతి రేసులో ఉండొచ్చని తొలుత ఊహాగానాలు వినిపించాయి. అయితే సంక్రాంతికి ఆడియోను విడుదల చేసి, ఫిబ్రవరి తొలివారంలో చిత్రాన్ని థియేటర్లకు తెచ్చేందుకు యూనిట్ సన్నద్ధమవుతోందని తాజా సమాచారం. ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రలు చేస్తున్న చిత్రంలో కృష్ణాష్టమి, మలుపు చిత్రాల ఫేమ్ నిక్కీ గాల్రాని సెకెండ్ హీరోయిన్ పాత్ర పోషిస్తుంది. హరీష్ జైరాజ్ సంగీతం, లేల్రాజ్ సినిమాటోగ్రఫీ సమకూర్చిన చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ నిర్మిస్తుంటే, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పిస్తోంది.


  0 0

  మొదటి సినిమా ‘్ఛలో’తో సూపర్‌హిట్ కొట్టిన యువ దర్శకుడు వెంకీ కుడుముల తన నెక్స్ట్ సినిమాను యాంగ్ హీరో నితిన్‌తో చేయనున్నాడని తెలిసింది. అయితే డిసెంబర్ నెలలోనే ప్రారంభం కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. తాజాగా ఈచిత్రంపై వెంకీ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ ఫైనల్ స్టేజిలో వుందని, అలాగే నితిన్ ఇంజురీ నుండి కోలుకుని ఈసినిమా కోసం కొత్త లుక్‌లోకి రావడానికి కష్టపడుతున్నాడని, త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం కానుందని తన ట్విట్టర్‌ద్వారా తెలియజేశాడు. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ రష్మిక మండన్న హీరోయిన్‌గా నటిస్తుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.


  0 0

  పాతికేళ్ల క్రితం సంక్రాంతి సినిమాల రేసులో బాషాగా వచ్చిన రజనీ -వరుసగా ఆరు హిట్లు అందుకున్నాడు. మరో ఆరు వైఫల్యాల తరువాత సెంటిమెంట్‌ను తిరగరాసేందుకు ఈ సంక్రాంతికి -పేటగా వస్తున్నాడు. ఎలాంటి ప్రభావం చూపిస్తాడో చూడాలి.

  ఒకప్పుడు- రజనీ సినిమా వస్తుందంటే -స్టార్ హీరోలు సైతం సైడిచ్చే పరిస్థితి. తమ సినిమాలను పోటీగా థియేటర్లకు తేవాలా? వద్దా అని ఆలోచించుకోవాల్సిన దుస్థితి. సూపర్‌స్టార్ రజనీకాంత్ తెలుగు మార్కెట్‌ని శాసించడం ‘బాషా’తో మొదలైంది. ఆ ఇంపాక్ట్ రోబో వరకూ అప్రతిహతంగా సాగింది. మధ్యలో వచ్చిన అరుణాచలం, ముత్తు, నరసింహ, చంద్రముఖి.. ఇలా ప్రతి సినిమా కోట్లు కొల్లగొట్టిన చిత్రాలే. అలా -వరుస హిట్లు పడటంతో రజనీ చిత్రానికి ఎదురెళ్లాలనే ఆలోచననే తెలుగు హీరోలు పక్కన పెట్టేశారు.
  ఇప్పుడు- అన్ని రోజులూ రజనీవే కాదన్న విషయాన్ని కాలం చెప్పకనే చెప్పింది. కొచ్చాడయాన్ దగ్గరినుంచి రజనీ ప్రతి సినిమా తెలుగు మార్కెట్‌కు ఊపుమీదే వస్తున్నా -్ఫలితం మాత్రం బయ్యర్లకు ఊపిరాడనివ్వటం లేదు. కొచ్చాడయాన్ చిత్రం డిజాస్టర్ అనిపించుకున్న తరువాత -రజనీ హవా రుచి చూపించే చిత్రం ఒక్కటీ రాలేదంటే అతిశయోక్తి కాదు కూడా. విక్రమసింహా, లింగ, కబాలి, కాలా.. తాజాగా డైరెక్టర్ శంకర్ మార్క్‌తో వచ్చిన 2.ఓ వరకూ తెలుగు మార్కెట్‌ను దడదడలాడించిన సీన్ లేదు. అందుకే తెలుగులో తన రూట్‌ను తిరిగి సెట్ చేయడానికి రజనీ సెంటిమెంట్‌ను ఆశ్రయించినట్టే కనిపిస్తోంది. పాతికేళ్ల తరువాత తెలుగు సంక్రాంతి బరిలోకి తాజా చిత్రం ‘పేట’ను దించుతున్నాడు. తమిళంలో జనవరి 10న విడుదలవుతున్న ‘పెట్టా’, అటు కన్నడలోనూ అనువాద చిత్రంగా థియేటర్లకు వెళ్తోంది. ఇక పిజ్జాతో మంచి పేరు తెచ్చుకుని ‘జిగర్తాండ’తో సెనే్సషనల్ డైరెక్టర్ అనిపించుకున్న రజనీ వీరాభిమాని కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ‘పేట’ -తెలుగు మార్కెట్‌లో రజనీ రూట్ సెట్ చేస్తుందా? అన్న అంశంపై ఆసక్తి పెరుగుతోంది. పట్టుమని మూడువారాల పీరియడ్ లేకున్నా, -తెలుగులో ‘పేట’ ప్రమోషన్స్, పోస్టర్స్ కనిపించక పోవడం ఒకిన్ని సందేహాలనూ పెంచుతోంది.
  సర్కార్, నవాబ్ వంటి చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత వల్లభనేని అశోక్ ‘పేట’ చిత్రాన్నీ ప్రేక్షకుల ముందుకుతెచ్చి హ్యాట్రిక్ అనువాద చిత్ర నిర్మాత కానున్నాడు. ఇప్పటికే డబ్బింగ్ పనులు మొదలైన నేపథ్యంలో, విడుదల తేదీ ఖరారైన తరువాత పెద్దఎత్తున ప్రమోషన్స్ నిర్వహించాలన్న ఆలోచనతో నిర్మాత ఉన్నట్టు ఇండస్ట్రీ టాక్. మీడియాతో వల్లభనేని మాట్లాడుతూ రజనీ రోరింగ్ పెర్ఫార్మెన్స్‌తో తెరకెక్కిన ‘పేట’ విజువల్ ఫీస్ట్‌ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న విషయాన్నైతే ఖరారు చేశాడు. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు సూపర్‌స్టార్ రజనీని తెరపై చూపించిన విధానం మెస్మరైజ్ చేస్తుందని, అనిరుధ్ సంగీత సారథ్యం వహించిన చిత్రంలో ప్రతి ఒక్కరి పాత్రా వినోదాన్ని అందిస్తుందన్న ధీమాతో కనిపిస్తున్నాడు. రజనీ బాషా తరువాత మళ్లీ సంక్రాంతికి థియేటర్లలో హడావుడి చేయబోతున్న చిత్రం పేట అని, జనవరి మొదటివారంలో ప్రీ రిలీజ్ వేడుక పూర్తిచేసి సంక్రాంతి చిత్రంగా రెండోవారంలో సినిమా విడుదల చేయనున్నట్టు చెప్పారు. త్రిష, సిమ్రాన్, సేతుపతి, బాబీ సింహా, నవాజుద్దీన్ సిద్దిఖి, మాళవిక నాయర్, మేఘా ఆకాష్ తదితరులు నటించిన చిత్రం సంక్రాంతి రేసులోకి వచ్చినా తేదీ మాత్రం ఖరారు కాలేదు. ఈ సంక్రాంతికి యన్‌టిఆర్ బయోపిక్‌లో తొలిభాగమైన ‘కథానాయుకుడు’, రామ్‌చరణ్ ‘వినయ విధేయ రామ’, వెంకటేష్, వరుణ్‌తేజ్ కాంబోలో వస్తున్న ‘ఎఫ్ 2’ చిత్రాలు బరిలో ఉన్నాయి. సంక్రాంతి ఊపుతో బరిలోకి దిగుతున్న స్టార్ హీరోల చిత్రాలపై ‘పేట’ ఎలాంటి ప్రభావం చూపించగలదన్న ఆసక్తి ఇండస్ట్రీలో అంతకంతకూ పెరుగుతోంది. 1995లో సంక్రాంతి సినిమాగా వచ్చిన ‘బాషా’ నుంచి శంకర్ ‘రోబో’ వరకూ ఆరు హిట్లు అందుకున్న రజనీ -కొచ్చాడయాన్ నుంచి 2.ఓ వరకూ ఆరు చిత్రాలు నిరాదరణకే గురయ్యాయి. పాతికేళ్ల తరువాత మళ్లీ కొత్తగా ‘పేట’తో సంక్రాంతి హిట్టు సెంటిమెంట్‌ను మొదలుపెట్టి చరిత్ర తిరగరాస్తాడో లేదో చూడాలి.


  0 0

  రామ్‌చరణ్ హీరోగా రానున్న ‘వినయ విధేయ రామ’ ట్రైలర్‌ను తెలంగాణ మంత్రి కేటీఆర్ విడుదల చేయనున్నారన్న ఊహాగానాలు నిజమయ్యాయి. చాలాకాలంలో ఈ సమాచారం వినిపిస్తున్నదే. అయితే గురువారం యూసఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో అట్టహాసంగా వీవీఆర్ ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించనున్నారు. వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఇదే కార్యక్రమంలో ట్రైలర్‌ను మంత్రి కేటీఆర్ విడుదల చేయనున్నట్టు సమాచారం. వీవీఆర్ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకుడు. దేవిశ్రీ సంగీతం సమకూర్చిన చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తేనున్నారు. ఇప్పటికే ఎస్‌ఎస్ రాజవౌళి ప్రాజెక్టు ‘ట్రిపుల్ ఆర్’ మల్టీస్టారర్‌తో రామ్‌చరణ్ బిజీగా ఉండటం తెలిసిందే. ‘రామ రావణ రాజ్యం’ టైటిల్‌నే ఖరారు చేసే అవకాశముందని ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. ఈ చిత్రానికీ దానయ్యే నిర్మాత.


  0 0
 • 12/26/18--06:40: అనంతం-20
 • ‘‘ఇప్పుడిది మోత్తే పెద్దయినాంక పెద్ద మూటలు మొయ్యొచ్చు.’’
  ‘‘నీ ఇట్టఁవ్’’అన్నది. వాల్యా నెత్తిమీద పెడుతూ చాందినీ.
  నీటికొలను దాపుకు వెళ్ళారు.
  ‘‘నీలు దాగుదాఁవు’’అన్నాడు వాల్యా.
  పండ్లుమూట కొలను గట్టున పెట్టి, కొలను నీళ్ళు తాగారు.
  అంతలో-
  వాతావరణం అంతలోనే మారిపోయింది. ఆకాశం నిండా మబ్బులు క్రమ్మి చిమ్మచీకెట్లు అలముకున్నాయి.
  మెరుపులు మెరుస్తున్నాయి.
  ఉరుములు ఉరుముతున్నాయి.
  నాగుల్లాంటి సన్నటి చినుకులు కురుస్తున్నాయి.
  కొలను గట్టుమీది చెట్టుక్రింద నిలబడి కొలనువైపే వాళ్ళు చూస్తూ నిల్చున్నారు.
  చినుకులు రాల్తూన్న నీటికొలను చక్కిలిగింతలు పెట్టిన కనె్నపిల్లలా జల్దరించి పోతోంది!
  దృశ్యం హృద్యంగా వుంది.
  ‘నూగుల వాన’ ఆగిపోయింది.
  కారుమబ్బులు అదృశ్యమై అక్కడక్కెడా ఆకాశంలో తెలిమబ్బులు కనిపిస్తున్నాయి.
  ఇప్పుడు మసక చీకెట్లు తొలగిపోయి ప్రకృతి చిత్రాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి!
  జల్దరింపు ఆగిన కొలను నీటి అద్దంమీద సూర్యకాంతి పరావర్తనం చెందుతూ జిగేల్మని మెరుస్తోంది.
  ‘‘ఇంటికి బోదాఁవా’’ చాంద్‌నీ అడిగింది.
  ‘‘వొద్దు’’.
  ‘‘ఏంటి కొద్దు’’
  ‘‘నెమిళ్ళని సూడాలి.’’
  ‘‘నెమలి గుట్టకి బోవాల్నంటే నడవాలి.’’
  ‘‘నడుద్దాఁవు’’అన్నాడు వాల్యా.
  జాంపండ్లమూట చాంద్‌నీ పట్టుకోబోతే వాల్యా వొద్దన్నాడు. తానే నెత్తిమీద పెట్టుకొని బయల్దేరాడు.
  వేగంగా నడుస్తూ నెమలిగుట్ట వైపుకు వెళ్తున్నారు.
  ఈలలు వేస్తూ గాలి బలంగా వీచింది!
  వానలో తడిచిన మట్టి వాసన హాయిగా వుంది!
  కొంత దూరం నడిచారు. నెమలిగుట్ట చేరారు.
  ‘నూగుల వాన’ కురిసి వాతావరణం హాయి గొలుపుతూంటే పరవశింపుతో నర్తిస్తున్న పురివిప్పిన నెమళ్ళు వందల సంఖ్యలో కనిపించాయి.
  ఆత్మచక్షువులకు మాత్రమే కనిపించే ఏదో దివ్యదర్శనం అప్పుడే జరిగినట్టు, ప్రకృతిలో లీనమై దివ్యత్వంతో లయమై-ప్రపంచాన్ని ఖాతరుచెయ్యనంత నిబ్బరంగా నర్తిస్తున్నాయా నెమళ్ళు.
  కొంత సమయం గడిచింది.
  తనివితీరా నెమళ్ళను చూసిన ఆనందంలోవున్న వాల్యా ఉన్నట్టుండి ‘‘వరి బువ్వ’’అని పెద్దగా అరిచాడు.
  చాంద్‌నీ ఉలిక్కిపడింది!
  ముక్కుపుటాలు ఎగురవేస్తూ, గట్టిగా గాలి పీల్చివొదుల్తూ-
  ‘‘యాడ్నో బువ్వొండుతున్నారు... వరిబువ్వ’’అన్నాడు వాల్యా.
  చాంద్‌నీ కూడా బలంగా గాలిపీల్చింది. వాల్యా చెప్పినట్టు దూరంగా ఎక్కడ్నించో గాలివాటుకు వస్తున్నది వంటకాల వాసన!
  చాంద్‌నీకి వింతగా వుంది!
  అడవిలో అన్నాలు వొండుతున్నారంటేనే అడవి పుత్రులకు భయం!
  కొండదేవర జాతరప్పుడు, నాయకుల ఎలక్షనప్పుడూ తప్ప సాధారణంగా అది జరిగే పనికాదు. గతంలో రెండుమూడుసార్లు మాత్రం కూంబింగ్ పార్టీ పోలీసులు వచ్చి గుడారాలువేసికొని బసచేశారు.
  ఎవ్వరో వేటాడుతూ అడవి జల్లెడ పట్టారు.
  అప్పుడు మాత్రం వాళ్ళ గుడారాల్లో అన్నాలు వొండారు.
  మళ్ళీ ఏమొచ్చింది?
  మనుష్యుల్ని వేటాడే దళాలొచ్చి బసచేశాయా?
  చాంద్‌నీ హడావుడిగా ఓ ఎతె్తైన బండరాయి మీదికి ఎక్కి నిల్చుంది. చూపులు సారించి దూరంగా చూసింది!
  నల్లకొండ దగ్గర గుడారాలు కనిపించాయి!
  నాగరికుల కదలికలున్నాయి. వాహనాలున్నాయి. కాపలా పోలీసులున్నారు. చాలా గుడారాలున్నాయి.
  కూంబింగ్ పార్టీ పోలీసులైతే అన్ని గుడారాలుండవు. అంతమంది సాధారణ పౌరులు వెంట ఉండరు.
  అవ్వి పోలీసుపార్టీ గుడారాలు కావనుకుంది చాంద్‌నీ.
  మరి, అన్ని గుడారాలు ఎందుకు వేసినట్టు?
  అంతమంది ఎందుకు విడిచి చేసినట్టు?
  సందేహం లేదు!
  వంటకాల వాసన వస్తున్నది అక్కడ్నించే!
  ‘‘ఎవ్వరో పట్నపోళ్ళు బువ్వొండుతుండారు’’అన్నది చాంద్‌నీ పెద్దగా.
  ‘‘వరి బువ్వగావాలి’’అన్నాడు వాల్యా.
  బండరాయి మీదనుంచి క్రిందికి దిగింది. వాల్యా తలమీద ఆప్యాయంగా చేత్తో నిమిరింది.
  ఏంచెయ్యాలి?
  ‘‘వరిబువ్వ గావాల్నంటే గుడారాల కాడికి బోవాలి. వొండుతుంది. ఆడ్నే, వరి బువ్వ’’ అన్నది చాంద్‌నీ.
  ‘‘ఆడికి బోదాఁవు’’ అన్నాడు వాల్యా.
  ‘‘పట్నపోళ్ళు మనకి బువ్వెట్టరు.’’
  ‘‘బతిఁవాల్దాఁవు’’ అన్నాడు దీనంగా చూస్తూ.
  చాంద్‌నీకి ఏంచెయ్యాలో తోచలేదు. ఏంచెప్పినా వినే స్థితిలో లేడు వాల్యా.
  ఎందుకు వెనుకాడుతున్నదో గ్రహించే వయసు కాదు వాడికి!
  అరణ్యంలో వుండే రక్షణ అడవి పుత్రులకు నాగరిక ప్రపంచంలో ఉండదని ఏం చెప్పాలి వాడికి!
  పాముకు కోరల్లో మాత్రమే విషముంటే మనిషికి నిలువెల్లా విషమే అని చెప్పినా వాడికి అర్ధవౌతుందా!?
  రాగ్యా ఫారెస్టుగార్డు యాదయ్యతో కలిసి గుడారాల వైపుకు వెళ్ళటం చూసింది. పట్నం వాళ్ళతో రాగ్యాకి సంబంధాలున్నాయి. రాగ్యా తనకోసం మాటువేసిన పులిలా కాచుకొని ఉన్నాడు.
  అలాంటప్పుడు గుడారాల దగ్గరికి వెళ్ళటం ఎంత ప్రమాదం!
  వాల్యా చాంద్‌నీ చేతిమీద గిల్లుతున్నాడు గోళ్ళతో!
  వాడి భావం అర్ధమై జాలిగా చూసింది.
  సరిగ్గా అప్పుడే దాపులో ఏదో అలికిడి! ‘్ఠ’క్కున తలెత్తిచూసింది చాంద్‌నీ..
  (ఇంకా ఉంది)


  0 0

  ఒకసారి బ్రహ్మదేవుడు కృష్ణుడు పర మాత్మను అని చెబుతుంటే అది నిజమో కాదో తెలుసుకొందామనుకొని కృష్ణమాయ లో పడిపోయాడు. ఆ మాయ కమ్మిన బ్రహ్మదేవుడు కృష్ణుడిని కేవలం గోవులు కాచే నందుని కుమారుడుగా తలచాడు. అందుకే కృష్ణుడు గోపాలురతో కలసి వనాల్లో గోవులను మేపుతుండగా గోపకులను, గోవులను కూడా ఒక మాయాగుహలో దాచిపెట్టాడు. దీన్ని గమనించి పరమాత్మ అటు బ్రహ్మకు ఇటు తన్ను నమ్ముకున్న తల్లి దండ్రులకు హితాన్ని కూర్చాలని కృష్ణుడు తన్ను తాను ఆవులుగా, దూడలుగా, గోపాలురుగా సృజియంచుకున్నాడు. తానే అన్ని రూపాలతోను ఉండి ఎవరి ఇండ్లకు వారి పిల్లలవలె చనుదెంచాడు. ఆ కృష్ణయ్యను చూచి ఎవరికి వారు వారి పిల్లలు, వారి పశువులు వచ్చాయని సంతోషించారు. కాని అన్నింటా తాను మాత్రమే ఉన్నానని చెప్పే ఈ సంఘ టన అంతరార్థాన్ని కృష్ణబోధగా మానవులు గ్రహించాలని పెద్దలు చెబుతారు. అలా ఒక ఏడు గడిచిన పిమ్మట తిరిగి బ్రహ్మదేవుడు తాను దాచిన వారేమయ్యారో, అక్కడ శ్రీకృష్ణుల దగ్గర ఎంత అల్లకల్లోలం జరుగు తుందో చూద్దామని చూసేసరికి ఆశ్చర్యం ఇక్కడ అంటే తాను దాచిన స్థలంలోను, అక్కడ అంటే శ్రీకృష్ణుడు, ఇతర గోపాలురు ఉన్నచోట ఎక్కడి వారక్కడ ఉన్నారు. ఎవరు నిజమో ఎవరు అబద్ధమో తెలుసుకోలేక నానాఅవస్థలు పడి చివరకు పరమాత్మనే దిక్కు. ఈ స్వామిని పరిక్షించడం ఎవరికైనా తరమా అనుకొని శ్రీకృష్ణుని చెంతకు వెళ్లి తన్ను క్షమించమని కోరుకున్నాడు.
  అటువంటి పరమాత్మ రూపమైన గోవును సంరక్షించడం మన బాధ్యత అని అంటారు. సనాతనకాలం నుంచి మానవుని సంపద వృద్ధి పొందాలంటే గోవును పూజించమని ఋషులు పెద్దలు చెప్పేవారు. నేటి విజ్ఞాన వేత్తలు కూడా ఆరోగ్యాభివృద్ధి, ఐశ్వర్యాభివృద్ధి జరగాలంటే కేవలం గో సంపదను పెంచుకుంటే చాలు అంటున్నారు. గోసంపద ఉన్ననాళ్లు ఆయురారోగ్యాల తోను, అష్టైశ్వర్యాలతోను ఉంటాడనేది శాస్తర్రీత్యా కూడా యథార్థమే అని చెబుతున్నారు.
  శాస్త్రాలన్నీ శ్రీమాత, భూమాత, మాతృదేవత, గోమాతలు పూజనీయములైనవని ఘోషిస్తున్నాయ. ఇలలోని తల్లి వలన జీవితం లభిస్తుంది. ఆ లభించిన జీవితాన్ని ఉతృష్టమైన పథంలో నడిపించడానికి జగజ్జనని దయ అవసరం అవుతుంది. ఆ జగజ్జనని భూమాత రూపంలో మానవునికి సహాయకారిగా మారుతుంది. ఆ తరువాత గోమాత రూపంలో అతనికి అన్నిసంపదలని చ్చి ఉన్నతుడిని చేస్తుంది. ఈ తల్లుల వల్లే సంపూర్ణ ఆయుస్సును, ఆరోగ్యాన్ని మనిషి పొందుతున్నాడు. అంతేకాదు మానవుని మనసును భగవంతుని వైపు మళ్లించడానికి కూడా గోక్షీరం ఎంతో మేలు చేస్తాయ. గోక్షీరం తల్లి పాలకు ప్రత్యామ్నాయం. పూజాకార్యక్రమాల్లో ఆవు పాలు అత్యంత శ్రేష్ఠమైనవి. ఆవుపేడ, ఆవు పంచితము, పాలు, పెరుగు, నెయ్యి మొదలైనవి పంచగవ్యాలు అత్యంత పవిత్రమైనవే.
  గోదానం సర్వోత్కృష్టమైన దానం. గోవు శరీరంలో ఎన్నివేల రోమాలుంటాయో అన్నివేల సంవత్సరాలు దానం చేసిన వారు స్వర్గ లోకంలో నివాసం చేస్తారని పురాణాలు చెబుతున్నాయ. గృహప్రవేశ సమయంలో గోవును ముందుగా గృహంలోకి తీసుకెళ్లడం మన ఆచారం. ‘‘గోబ్రాహ్మణ్యేభ్యః శుభం భవతు’’ అని, ‘‘గోబ్రాహ్మణ్యేభ్యః శుభమస్తు నిత్యం’’ అని గోవుల మేలును సర్వదా కాంక్షించడం మన సంప్రదాయం.
  గోవును రక్షించడం అంటే పరమాత్మను పూజించ డమే. ప్రకృతి, మానవుడు పరస్పరపోషి తాలు కనుక ప్రకృతిలో భాగమైన గోవును సంరక్షిచడమూ మానవుని కర్తవ్యమే. గోవు మాలక్ష్మి అని గోవులను భక్త్భివంతో లక్ష్మీ స్వరూపంగా కూడా పూజిస్తారు.


  0 0

  ఈ చర్యతో ముంగండలోని అగ్రవర్ణాలవారి ఆగ్రహానికి గురి అయ్యాడు. దాంతో వారు అతన్ని బహిష్కరించారు. రామనాధం ఆ బహిష్కరణకు చలించలేదు. ఊరిబయట తన తోటలో నివాసం ఏర్పరచుకున్నాడు. ఈ విధంగా చాలా సందర్భాలలో రచయిత రెండు భిన్న భావజాలాల సంఘర్షణను దృశ్యీకరించాడు. తాను రామనాధం పక్షాన నిల్చాడు.
  రామనాధం, స్వరాజ్యంల పెళ్లి కూడా ఒక ఘర్షణకు లోనయినదే! స్వరాజ్యం భర్త నుండి విడిపోయిన ఇల్లాలు- రామనాధం భార్య నుండి విడాకులు పొందినవాడు-దీనికితోడు ఇద్దరి కులాలూ వేరు-వర్ణాతరమే కాకుండా, ద్వితీయం కూడానన్నమాట-స్వరాజ్యం తండ్రి అబ్బాయి నాయుడు బ్రహ్మసమాజం భావజాలం కలిగి వున్నప్పటికీ, కూతురు పెళ్లి విషయం దగ్గరకొచ్చేసరికి, సంఘర్షణకు గురి అవుతాడు.మరొక కులం వారికి ఇచ్చి పెళ్లి చెయ్యటంలో అతనికి అభ్యంతరం లేదు. అయితే పెళ్లి అయి, భార్య వున్నవాడికి వివాహాంతరం చెయ్యటంలో అభ్యంతరం -ఈ అభ్యంతరం వ్యక్తిగతమైనది కాదు, సామాజికమైనది- ఈఘర్షణను చాలా నేర్పుగా పరిష్కరించాడు రచయిత.
  ముంగండ మడిగట్టుకొన్నప్పటికీ, కాశీనాథుని నాగేశ్వరరావు అంతటివాడు, గాంధీ అంతటివాడూ, ఆ వూళ్లోకి అడుగుపెట్టేసరికి వాళ్లు తమ ఆధిపత్యాన్ని కొంతసేపు పక్కన తీసిపెట్టడం, ఒక విచిత్రమైన ఘర్షణగా రచయిత ఈ నవలలో భాసింపజేశాడు.
  కేవల వస్తు రీత్యా మాత్రమే కాదు ఈ నవల గొప్పతనం! నిర్మాణరీత్యా కూడా చాలా చక్కని పొందిక అమరిన నవల ఇది. మంచి నవలకుండాల్సిన మంచి లక్షణాలు. వాస్తవికత, దేశీయత, చారిత్రకత, కాల్పనికత, విశ్వసనీయత-ఇవన్నీ కూడా నిజానికి ఒకదానితో ఒకటి సంబంధం కలిగినవే! ఇవన్నీకూడా నిర్దిష్ట స్థల, కాలాలతో ముడిపడినవే. వాస్తవికత, దేశీయత అన్నవి స్థల, కాలాలతో ముడిపడి వున్నప్పుడూ విశ్వసనీయవౌతుంది. మంచి నవల నిర్దిష్ట, స్థల కాలాలను ప్రతిబింబిస్తూనే, స్థల కాలాలకు అతీతమైన సంస్కారాన్నీ, చైతన్యాన్నీ కూడా పాఠకులకు కలిగించగల్గాలి. కొల్లాయి గట్టితేనేమి నవల, దేశీయతా ముద్రగలది. కాబట్టే వాస్తవికమైనది- తూర్పుగోదావరి జిల్లాలోని ఒక చిన్న గ్రామం ముంగండ. ఈ నవలలోని స్థలం అయినప్పికీ ఆ పరిధికే ఈ నవల పరిమితమైనది కాదు. దేశం మొత్తం సామాజిక పరిణామాన్ని, సాంస్కృతిక పరిణామాన్ని చెప్పగలిగినది ఈ నవల. కథలోని కాలం 1920 ప్రాంతాలదైనప్పటికీ నవలలో ప్రతిఫలించిన ప్రగతిశీల భావజాలం ఇప్పటికి కూడా పాఠకుడి చైతన్యాన్ని, సంస్కారాన్ని ఉద్దీపితం చేయగలిగినదే. ఈ నవల ఏ ఆర్భాటమూ లేకుండా ప్రారంభవౌతుంది. ఏ ఆడంబరమూ, ఏ అలంకారమూ లేని శైలి. రచయిత నవలలోని కథను తానుగా ఎక్కడా నడపడు. పాత్రలూ, సన్నివేశాలూ, సంభాషణలూ ఇవే కథను నడుపుతాయి. నిజంగా ఇది గొప్ప శిల్పం. రచయిత ఏ పాత్రలోనూ పరకాయ ప్రవేశం చేయడు. ప్రతి పాత్రా, దేవ, కాల, భావజాల బద్ధమైన స్వభావంతోనే ప్రవర్తిస్తాయి. రామనాధం, స్వరాజ్యం, అబ్బాయి నాయుడు, శంకరశాస్ర్తీ, నారాయణమూర్తి-ఇలా అందరూ ప్రాణం పోసుకున్న పాత్రలే. కేవలం ఆదర్శీకరించిన పాత్రలూ, రచయిత చెప్పుచేతల్లోని పాత్రలూ ఈ నవలలో కనిపించవు. ఇలా వస్తువూ, రూపమూ, భావజాలమూ పడుగు పేకల్లా అల్లుకుపోయిన ఉదాత్తమైన నవల కొల్లాయిగట్టితేనేమి.

  -సమాప్తం

  రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..


  0 0

  సీ. గార్దంబున కేల కస్తూరి తిలకంబు
  మర్కటంబు నకేల మలయజంబు
  శార్దూలమునకేల శర్కరాపూపంబు
  సూకరంబునకేల చూత ఫలము
  మార్జాలమునకేల మల్లెపువ్వుల బంతి
  గుడ్లగూబకునేల కుండలములు
  మహిషంబునకు నేల మంచి వస్త్రంబులు
  బక సంతతికి నేల పంజరంబు
  తే॥ ద్రోహచింతన జేసెడు దుర్జనులకు
  మధురమైనట్టి నీనామ మంత్రమేల?
  భూషణ వికాస శ్రీధర్మపురనివాస!
  దుష్టసంహార ! నరసింహ! దురిత దూర!
  భావం: ఓ నరసింహా ప్రభూ! గాడిదకూ కస్తూరిబొట్టు, కోతికి గంధం, బెబ్బులికి తీపి అప్పములు, పందికి మామిడిపండు, పిల్లికి మల్లెదండ, గుడ్లగూబకు చెవి పోగులు, దున్నకు పట్టువస్త్రాలు, కొంగకు పంజరం, దుష్టులకు నీ నామస్మరణం దేనికి? ఇవన్నీ వ్యర్థం.


  0 0

  బద్వేలు, డిసెంబర్ 26: వామపక్షాలు ఈనెల 28న తలపెట్టిన రాయలసీమ బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలిపి జయప్రదం చేయాలని సీపీఐ, సీపీయం జిల్లా నాయకులు వీ.వీరశేఖర్, ఎస్.చంద్రశేఖర్, పీ.చాంద్‌బాషా విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన రాయలసీమలో కరువు పరిస్థితులు ఎదుర్కుంటూ రైతులు, వ్యవసాయ కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కూలీలు వలుసబాట పట్టారని రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. ఈ తరుణంలో కరువు నిధులు విడుదల చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. రైతాంగ సమస్యలపై అవగాహన లేని కేంద్ర మంత్రి భారత దేశంలో ఉండటం సిగ్గుచేటని అన్నారు. బద్వేలు నియోజకవర్గంలో బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ నీరు వస్తే పంటలు పండుతాయని ఆశ పడ్డ రైతులకు రెండు నెలల నీరు ఇచ్చి నిలిపివేయడంతో దాదాపు 40 వేల ఎకరాల పత్తి, వరి పంటలు ఎండిపోయాయని ప్రజా ప్రతినిధులకు ఏమాత్రం చిత్త శుద్ధి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై ఈ నెల 28వ తేదీన రాయలసీమ, ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాలలో తలపెట్టిన బంద్‌లో అందరూ పాల్గొనాలని, ఈ బంద్‌కు వైసీపీ మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు.

  వైవీయూను సందర్శించిన సంగీత దర్శకులు ఆర్‌పీ పట్నాయక్
  కడప కల్చరల్,డిసెంబర్ 26: ప్రఖ్యాత సినీ సంగీత దర్శకులు, గాయకులు ఆర్‌పీ పట్నాయక్ బుధవారం యోగివేమన క్యాంపస్‌ను సందర్శించారు. క్యాంపస్‌లోని రసాయనిక శాస్త్ర విభాగం, ఫైనార్ట్స్ విభాగం విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. నమ్మకం, పట్టుదల , ఆత్మవిశ్వాసం వల్లనే విద్యార్థులు జీవితంలోని సమస్యలను అధిగమించవచ్చని ఆయన బోధించారు. క్యాంపస్‌లోని ఫైనార్ట్స్ విభాగాన్ని సందర్శించి కళలు రూపొందించడంలో నేడు అనేక నూతన సాంకేతిక పద్ధతులైన మల్టీమీడియా వంటి వాటిని విద్యార్థులు నేర్చుకోవాలని ఆయన సూచించారు. అనంతరం బొటానికల్ గార్డన్‌ను సందర్శించి గుర్తుగా మొక్కను నాటారు. కార్యక్రమంలో వైవీయూ ఎన్‌ఎస్‌ఎస్ విభాగ సమన్వయకర్త డా.మధుసూదన్‌రెడ్డి, ఫైనార్ట్స్ విభాగ సమన్వయకర్త కె.మృత్యుంజయరావు, విభాగ అధ్యాపకులు మనోహర్‌రావు, సుజాత, వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్ దీపక్ తదితరులు పాల్గొన్నారు.


  0 0

  పుట్టపర్తి, డిసెంబర్ 26: రాష్ట్రానికి 2019లో జరగనున్న ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్‌కు కీలమని ఏపీ పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి పేర్కొన్నారు. బుధవారం పుట్టపర్తికి విచ్చేసిన ఆయన ముందుగా ఇటీవల మృతి చెందిన సత్యసాయి ట్రస్ట్ సభ్యులు ఆర్‌జె రత్నాకర్ మాతృమూర్తి, దివంగత ఆర్‌వి జానకిరామయ్య సతీమణి మీనాక్షమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. వారి స్వగృహంలో ఆర్‌జె రత్నాకర్‌ను కలసి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీతో దివంగత జానకి రామయ్యకు ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకొని మీనాక్షమ్మ మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం పుట్టపర్తిలోని కోట గార్డెన్స్‌లో జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్‌కు దశా, దిశా నిర్దేశాన్ని ఇవ్వగలవన్నారు. కాంగ్రెస్ పార్టీకి దేశంలో అనుకూల పవనాలు వీస్తున్నాయని ఇటీవల జరిగిన ఎన్నికల్లో 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ, అనుబంధ పార్టీలు గెలవడమే అందుకు నిదర్శనమన్నారు. రాహుల్‌గాంధీ నేతృత్వంలో ఆయన ప్రధాని అవ్వాలన్న దేశ ప్రజల ఆకాంక్ష త్వరలో నెరవేరబోతోందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనివార్యమని, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, ప్ర జాసంక్షేమ పథకాల అమలుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. నరేంద్రమోదీ ఇచ్చిన హామీలు, విభజన చట్టంలో పొందుపరచబడిన ప్రత్యేక హోదాను నాలుగేళ్ల క్రితమే ఇచ్చి ఉంటే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందేదన్నారు.


  0 0

  అనంతపురం సిటీ, డిసెంబర్ 26: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నగరంలో చేపట్టిన ధర్మ పోరాట దీక్షకాదని ఆధర్మ పోరాట దీక్ష అని బీజేపీ నాయకులు ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కేంద్రానికి వస్తున్న సందర్భంగా బీజేపీ నాయకులు నిరసన తెలియజేస్తారనే ఉద్దేశ్యంతో బుధవారం నగరంలోని బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఇందుకు బీజేపీ నాయకులు 2వ పట్టణ పోలీస్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ చంద్రబాబునాయుడు నిరంకుసత్వ పాలనను ప్రజాస్వామ్య వాదులు అందరూ ఖండిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో అమలవుతున్న ప్రతి పథకంకి కూడా బీజేపీ ప్రభుత్వం 80శాతం నిధులు విడుదల చేస్తుంటే తప్పుడు ఆరోపణులు చేస్తూ బీజేపీ మీద బురద చల్లే ప్రయత్నాన్ని ప్రజలు గమినిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ నిధులతో నరేంద్రమోదీని విమర్శించడానికి వేల కోట్ల ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారని తెలిపారు. కరువు జిల్లా అయిన అనంతపురం రైతుల రుణమాఫీ చేయకపోవడంతో రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, హంద్రీనీవా ద్వారా 100 టీఎంసీల నీళ్లు అన్ని చెరువులకు నింపుతామని మాట ఇచ్చి ఇంతవరకు రైతులను పట్టించుకోని చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష పేరుతో ప్రజల సొమ్ముతో దీక్షలకు ఏసీ టెంట్లులో కూర్చొని వృథా ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని అరెస్టులు చేసినా చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, తప్పుడు ప్రచారాల మీద మా పోరాటం ఆగదని తెలిపారు. అనంతరం నిరసన చేసిన నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌లో ఉంచారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు నరసింహారెడ్డి, జల్లి మధుసూదన్, సందిరెడ్డి శ్రీనివాసులు, లలిత్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి, అమర్‌నాథ్, పూల ప్రభాకర్, అల్లాడి రామచంద్రయ్య, సూర్యప్రకాష్‌రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.


  0 0

  అనంతపురం సిటీ, డిసెంబర్ 26: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన అనంతరం విభజన హామీల అమలుచేయడంలో కేంద్రం ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని రాష్ట్ర మంత్రులు కళా వెంకట్రావ్, ఉమామహేశ్వరరావు, కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, జవహార్‌లు పేర్కొన్నారు. బుధవారం నగర శివారులో ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్ర వైఖరికి నిరసనగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్మపోరాట దీక్షను నిర్వహించారు. ఈ దీక్షకు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ దీక్షకు మద్దతుగా తెలుగు సాంకేతిక విభాగం, యువత ఆధ్వర్యంలో వాక్ ఫర్ జస్టీస్ పేరుతో ర్యాలీ నిర్వహించారు. ఇందులో రాష్ట్ర మంత్రి కాలవ శ్రీనివాసులు, యువ నాయకులు పాల్గొన్నారు. అనంతరం ధర్మ దీక్షలో రాష్ట్ర మంత్రి కళావెంకట్రావ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు అమలుచేయకుండా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేలా రాష్ట్ర వ్యాప్తంగా ధర్మ పోరాట దీక్షను టీడీపీ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చేపడుతున్నారని తెలిపారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి రాష్ట్రానికి ప్రత్యేక, విభజన హామీలు నెరవేర్చుకుందామని పిలుపునిచ్చారు. అనంతరం మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ కేంద్రం రాష్ట్ర ప్రజలకు చేసిన అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు ధర్మ పోరాట దీక్షను చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పిన కేంద్రం ఇప్పటికీ ఎలాంటి సాయం చేయకపోవడం చాలా దారుణమన్నారు. కేంద్ర నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ దీక్షను చేసి నరేంద్రమోదీకి బుద్ధి చెబుతామన్నారు. అనంతరం మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని కేంద్రానికి తెలియజేసేందుకు ప్రజలు ఉత్సాహంతో ముందుకు వస్తున్నారని తెలిపారు. తిరుపతిలో నరేంద్రమోదీ ఇచ్చిన హామీల అమలులో కేంద్రంలోని నరేంద్రమోదీ విఫలమైందన్నారు. అనంతరం కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన హామీలు, ప్రత్యేక హోదా అమలుచేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. దీన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ప్రజలతో కలసి తెలుగుదేశం ధర్మ దీక్షతో నిరసన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. ఈ దీక్షలతోనైనా కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పై రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఎంపీలు జేసీ దివాకర్‌రెడ్డి, నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్యేలు బి.కె.పార్థసారథి, సూర్యనారాయణ, ప్రభాకర్‌చౌదరి, హనుమంతరాయచౌదరి, అత్తార్ చాంద్‌బ్రాషా, చీఫ్ విప్ పల్లె రఘునాథ్‌రెడ్డి, పయ్యావుల కేశవ్, విప్ యామినీ బాల, ఎమ్మెల్సీలు శమంతకమణి, జెడ్పీ ఛైర్మెన్ పూల నాగరాజు, మాసాంభివృద్ధి సంస్థ ఛైర్మెన్ ప్రకాష్‌నాయుడు, వడ్డెర్ల ఫెడరేషన్ మాజీ ఛైర్మెన్ దేవళ్ల మురళీ, ఇతర ప్రజా ప్రతినిధులు, ఇతర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
  చంద్రబాబుకు స్వాగతం పలికిన మంత్రులు, కలెక్టర్
  ధర్మ పోరాట దీక్షకు అనంతపురం చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ఘన స్వాగతం లభించింది. బుధవారం అనంతపురం శివార్లులోని శిల్పారామం సమీపంలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర మంత్రులు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు, కేఎస్ జవహార్, ఎమ్మెల్యేలు బీకే. పార్థసారథి, ప్రభాకర్‌చౌదరి, సూర్యనారాయణ, జేసీ ప్రభాకర్‌రెడ్డి, జితేంద్రగౌడ్, హనుమంతరాయచౌదరి, కలెక్టర్ జీ.వీరపాండ్యన్, డీఐజీ కాంతిరాణాఠాఠా, ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌లు పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. అంతకుముందు గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుని, అక్కడ నుండి ప్రత్యేక హెలిప్యాడ్‌లో అనంతపురం శిల్పారామం వద్ద ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ చేరుకుని అక్కడ నుండి రోడ్డు మార్గాన బళ్ళారి రోడ్డులోని ధర్మ పోరాట దీక్షను ఏర్పాటుచేసిన ఎంవైఆర్ ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకున్నారు. అనంతరం ధర్న పోరాట దీక్షలో పాల్గొని రోడ్డు మార్గాన శిల్పారామంకు వెళ్లి ప్రత్యేక హెలిప్యాడ్‌లో పుట్టపర్తికి వెళ్లారు. అక్కడ నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరి గన్నవరం వెళ్లారు. ముఖ్యమంత్రికి జిల్లా మంత్రులు, కలెక్టర్, ఎమ్మెల్యేలు శిల్పారామం వద్ద వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


  0 0

  అనంతపురం, డిసెంబర్ 26 : తన స్నేహితుడు, దివంగత సీఎం వైఎస్.రాజశేఖర్‌రెడ్డి తనయుడు, వైకాపా అధినేత వై ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి తిక్క అని అనంతపురం ఎంపీ జేసీ.దివాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం ధర్మపోరాట దీక్షలో ఆయన మాట్లాడుతూ జగన్‌పై విమర్శలు చేశారు. మా వాడు జగన్‌కు కాళ్ల చూపే తప్ప ముందు చూపు లేదని, ఒకడుగు ముందుకేసి ఆలోచించి ఉండి ఉంటే, అదృష్టం కలిసి వచ్చేదని, సీఎం అయ్యేవాడని అన్నారు. కులాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నాడని వ్యాఖ్యానించారు. కుల పిచ్చితో చాలా మంది అల్లాడుతున్నారని, ఒకాయన రెడ్డి అంటాడు, ఇంకో ఆయన ఇంకోటి అంటాడంటూ తూర్పారబట్టారు. మీదే కులం, ఎన్టీయార్‌దే కులం అని ఎవరైనా అడిగారా సార్? అంటూ వేదికపై ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు. అన్ని వర్గాల ప్రజలు ఓట్లు వేస్తే మీరు గెలిచారు. ఏదో ఒక కులమోళ్లు వేస్తే గెలువలేదు కదా? అంటూ కుల రాజకీయాలపై తనదైన స్టైల్‌లో విరుచుకు పడ్డారు. హిందూపురం వైకాపా నాయకుడు నవీన్ నిశ్చల్ గోడుమంటున్నాడని, పార్టీ టికెట్‌కు రూ.10 కోట్లు జగన్ అడిగాడని ఏడుస్తున్నాడంటూ విమర్శించారు. ఇలా అయితే రాష్ట్భ్రావృద్ధికి ఇంకెన్ని కోట్లు ఇవ్వాలి అంటూ ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ యల్లకాలం తానే పీ ఎంగా ఉండాలని కుట్ర పన్నారంటూ ఆరోపించారు. ఆయనను ఎదిరించిన మొనగాడు, మగోడు మన ముఖ్యమంత్రి అని, ఆయనను తిరిగి సీ ఎంను చేయాలని కోరారు. ఎన్టీయార్‌పై భాస్కర్‌రావు కుట్ర చేస్తే, దానిని భగ్నం చేసి తిరిగి ఎన్‌టీయార్‌ను సీ ఎం చేసిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. నందమూరి కుటుంబంలో సమస్యల్ని కూడా పరిష్కరించారన్నారు. అదే విధంగా ఈ రాష్ట్ర ఎపుడూ బీద రాష్ట్రంగా ఉండాలన్న ఉద్దేశంతో బీజేపీ కుట్ర చేస్తోందని, దానిని ఛేదించే సత్తా చంద్రబాబుకే ఉందని అన్నారు. పీ ఎంను ఎదిరించే సత్తా ఉండటంతోనే దేశ వ్యాప్తంగా తిరుగుతున్నాడని, అందరూ సహకరించి టీడీపీని అధికారంలోకి తేవాలని కోరారు.


  0 0

  అనంతపురం, డిసెంబర్ 26 : ‘తెలుగుదేశం పార్టీకి ఒక కులం.. మతం కాదు.. అందరూ కావాలి.. ఏ కులాన్నీ పార్టీ దూరం పెట్టలేదు.. ఓటు వేశారా? లేదా? అని ఆలోచించలేదు.. సంక్షేమ పథకాలు అట్టడుగు వర్గాల్లో అర్హులైన అందరికీ అందించాం.. టీడీపీని గెలిపించాలి.. ప్రజల్ని ఒప్పించే బాధ్యత మీరే తీసుకోవాలి’ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. జిల్లా కేంద్రంలోని బళ్లారి రోడ్డులో ఎంవైఆర్ ఫంక్షన్ హాలు పక్కనున్న మైదానంలో బుధవారం ఏర్పాటు చేసిన 11వ ధర్మ పోరాట దీక్ష బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. అనంతపురం జిల్లాకు తెలుగుదేశం పార్టీ, తాను రుణపడి ఉన్నామన్నారు. 1984లో ఎన్‌టీ రామారావును కుట్ర పన్ని తొలగిస్తే, తొలిసారిగా రోడ్డెక్కి ఉద్యమాలు చేసి తిరిగి ఆయనను సీఎం చేయడానికి దోహద పడింది ఈ జిల్లా ప్రజలేనన్నారు. అలాగే ఇపుడు కూడా కేంద్రంపై పోరాటం చేస్తున్నామని, జిల్లా ప్రజలు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని 14 నియోజకవర్గాలు, 2 పార్లమెంట్ స్థానాల్లో టీడీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నా కులం పేదల కులం.. నా కుటుంబం తెలుగుదేశం.. నా పెద్ద కుటుంబం రాష్ట్రంలోని 5 కోట్ల ప్రజానీకం అని సభాముఖంగా వెల్లడించారు. నాకూ కుటుంబం ఉంది.. మీ కోసం వారందరినీ వదిలి వచ్చాను.. రాష్ట్ర సంక్షేమమే నా ధ్యేయం.. ప్రయోజనాలే ముఖ్యం అని అన్నారు. ప్రజల కోసం పార్టీని గెలిపించేందుకు ఎన్నికలు వచ్చే వరకూ అందరూ కలిసి కట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. 2019 జనవరి 2 నుంచి నిర్వహించనున్న జన్మభూమి కార్యక్రమంలో వివిధ సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు అందేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు అందని అర్హులైన లబ్ధిదారుల్ని గుర్తించి అలాంటి వారికి సాయం చేయండన్నారు. తద్వారా టీడీపీని తిరుగులేని శక్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. 2019 నుంచి 2024 వరకు పార్టీలో వివిధ స్థాయిల్లో టీమ్ లీడర్లను ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. మనకు గ్రూపులు లేవు.. మనమంతా ఒక్కటేననిసీ సీ ఎం స్పష్టం చేశారు. ఇగో (అహంభావం)లకు పోతే నష్టపోతామని హెచ్చరించారు. బీజేపీ, వైకాపా, జనసేన చేస్తున్న లాలూచీ రాజకీయాలను ఎండగట్టాలని, కుమ్మక్కు, కుట్ర రాజకీయాలను తిప్పి కొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సీబీఐ, ఈడీ, ఇన్‌కంటాక్స్, కోర్టులు వంటి అన్ని వ్యవస్థల్ని బీజేపీ వాడుకుంటూ, నాశనం చేస్తోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సి ఉందన్నారు. రాగద్వేషాలకు అతీతంగా అభ్యర్థుల్ని నిలుతామని, టీడీపీ గెలుపు చారిత్రాత్మకమని, అందరినీ గెలిపించుకోవాలని కోరారు. ప్రసంగం ఆఖరులో ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, కాకినాడు పెట్రో కెమికల్స్, పోలవరం ప్రాజెక్టు, రాయలసీమ ఉక్కు ఫ్యాక్టరీ ఆంధ్రుల హక్కు అని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి, రాజ్యాంగాన్ని, లౌకిక వాదాన్ని, భారత దేశాన్ని కాపాడాలి అని, ఏపీ హక్కుల్ని సాధించుకోవాలని అని సభికులతో ముఖ్యమంత్రి నినదింపజేశారు.
  పంట నష్ట పరిహారం, రైతు రుణమాఫీ ఊసెత్తని సీఎం
  జిల్లా రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం నిర్వహించిన ధర్మ పోరాట దీక్షలో ప్రకటించారు. నీళ్లిస్తే జిల్లారైతులు బంగారం పండిస్తారని కితాబిచ్చారు. వ్యవసాయంలో అనంతపురం రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా మారిందన్నారు. అయితే రైతులకు ఇవ్వాల్సిన పంట నష్ట పరిహారం, 4, 5వ విడత రైతు రుణమాఫీ ఊసెత్తలేదు. సభలో సీ ఎం వీటిపై సానుకూల ప్రకటన చేస్తారని ఎదురు చూసిన జిల్లా రైతులకు నిరాశే మిగిలింది. ఎకరాకు రూ.25 వేలు నిర్దుష్టంగా పంట నష్ట పరిహారం ఇవ్వాలని, 4, 5 విడతల రుణమాఫీని ఒకేసారి ప్రకటించాలని ఉభయ కమ్యూనిస్టులు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 28న ఆ పార్టీలు రాయలసీమ బంద్‌కు పిలుపునిచ్చారు. అయితే సీఎం నుంచి సానుకూల ప్రకటన రాకపోవడంతో నేడు బంద్ అనివార్యం కానుంది. తొలుత సభా వేదికపై ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి, హారతి ఇచ్చి నివాళులర్పించారు.


  0 0

  అనంతపురం సిటీ, డిసెంబర్ 26: రాష్ట్రంలో జిల్లాను తలమానికంగా ఉండేలా అభివృద్ధి చేశామని, భవిష్యత్తులో చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. బుధవారం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చలేదని తెలుగుదేశం ఆధ్వర్యంలో నగర శివారులోని బళ్ళారి రోడ్డులో వున్న ఎంవైఆర్ ఫంక్షన్ హాల్‌లో ధర్మ పోరాట దీక్షను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి ధర్మ పోరాట దీక్షలో మాట్లాడుతూ అనంతపురం జిల్లా అంటే తనకు అమితమైన ప్రేమ అని, జిల్లాలో నాకు 14 నియోజక వర్గాల్లోను పార్టీని మోసి ఎమ్మెల్యేలుగా గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు. జిల్లాను గత 5 సంతవ్సరాల ముందుకన్నా ఇప్పుడు వ్యవసాయ, హార్టికల్చర్ రంగాలతోపాటు అనేక సంక్షేమాభివృద్ధి పథకాలతో అభివృద్ధి చేశామని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటైన నాలుగున్నర సంవత్సరాలలో వ్యవసాయరంగం, హార్టికల్చర్ రంగాలలో 14,755 కోట్ల ఆదాయాన్ని జిల్లాలో రైతులు తీసుకుని రాష్ట్రంలో మొదటిస్థానంలో నిలిచారని తెలిపారు. జిల్లాకు నీరు ఇస్తే బంగారు పంటలు పండిస్తారని పట్టిసీమ పూర్తి చేశామని, అలాగే కృష్ణా, గోదావరిల అనుసంధానం చేశామని, జిల్లాలోని హంద్రీనీవా కాలువను పూర్తి చేసి అన్ని చెరువులను నీటితో నింపామని తెలిపారు. కియా పరిశ్రమల ఏర్పాటు చేయడానికి అవసరమైన నీటిని హంద్రీనీవా ద్వారా గోళ్ళపల్లికి నీరిచ్చామని తెలిపారు. అలాగే మారాలకు నీరు తీసుకువచ్చామని తెలిపారు. జిల్లాలోని హిందూపురం, మడకశిర నియోజకవర్గాలకు కూడా నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలోని బైరావానితిప్ప, బీటీపీ ప్రాజెక్టులను పూర్తి చేసి నీటిని అందిస్తామని తెలిపారు. వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పింఛన్లు అందజేస్తున్నామని, బడుగు, బలహీన వర్గాల ప్రజలను ఆదుకునేందుకు అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నామని తెలిపారు. అన్న క్యాంటీన్లతో పేద కూలీలకు నాణ్యమైన భోజనం పెడుతున్నామని, ఎస్సీ, ఎస్టీలకు ఉచిత కరెంటను ఇస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో రైతులకు సోలార్ సెట్లు అందించనున్నామని తెలిపారు. జిల్లాలోని పేద కుటుంబాలకు తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. జిల్లాలో టీడీపీ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేరేలా టీడీపీ కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో రాబోయే 2019 ఎన్నికల్లో అందరికి ఆమోదయోగ్యమైన నాయకులు నిలుపుతామని, మీరందరు తెలుగుదేశాన్ని గెలిపించాలని పిలుపునిచ్చారు.


older | 1 | .... | 1989 | 1990 | (Page 1991) | 1992 | 1993 | .... | 2069 | newer