Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

కొత్త ఆసరా పెన్షన్ల కోసం.. జాబితా సిద్ధం చేయాలి

$
0
0

కరీంనగర్, డిసెంబర్ 27: కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరు చేసేందుకు 57 సంవత్సరాలు నిండిన అర్హులైన వారి జాబితాను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి అన్నారు. గురువారం హైదరాబాద్ నుండి అందరు జిల్లా కలెక్టర్లతో ఆసరా పెన్షన్ల మంజూరు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, పంచాయతీ ఎన్నికలు, జూనియర్ పంచాయతీ సెక్రెటరీల నియామకం, జాతీయ రహదారులు, రైల్వే లైన్ల భూసేకరణ, అటవీ భూముల సర్వేపై వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 1 నుండి కొత్త పెన్షన్లు మంజూరు చేయడానికి నవంబర్ 19న ప్రచురించిన ఓటరు జాబితాల నుండి గ్రామాల వారిగా 57 నుండి 64 సంవత్సరాల వయస్సు గల వారి వివరాలను పంపించాలని సూచించారు. ఆసరా పెన్షన్ల మంజూరుకు 57 సంవత్సరాలు నిండిన అర్హులైన డ్రాఫ్ట్ జాబితాను గ్రామ సభలలో పెట్టి ఫిర్యాదులు స్వీకరించాలని అన్నారు. జిల్లాకు ఎంత మంది ఆసరా పెన్షన్లకు అర్హులవుతారో తెలుపాలని సూచించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల కోసం జిల్లాలకు మంజూరు చేసిన నిధుల నుండి మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేసిన లబ్ధిదారులకు వెంటనే నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. ప్రపంచ బ్యాంక్‌కు సంబంధించిన స్వచ్ఛ సర్వేక్షన్ టీమును జిల్లాలలో పర్యటించనున్నారని, గ్రామ పంచాయతీలకు ప్రత్యేకంగా నిధులు వచ్చే అవకాశముందన్నారు. గ్రామాలలో అంగన్‌వాడీ, పాఠశాల, టాయిలెట్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసి ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాలన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్‌లు, వార్డు సభ్యుల వారీగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు సామాగ్రిని సిద్ధం చేసుకోవాలని సూచించారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి సంబంధించి ఎక్స్ సర్వీస్‌మెన్, క్రీడల కోటాలకు సంబంధించి సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా పరిశీలించాలన్నారు. ఎంపికైన ప్రతీ అభ్యర్థి మార్కులు, ర్యాంక్ కేటగిరీలను నోటీస్ బోర్డులపై ప్రకటించాలన్నారు. జాతీయ రహదారుల నిర్మాణం, రైల్వే లైన్ల నిర్మాణానికి జిల్లా కలెక్టర్లు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి గడువులోగా భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. అటవీ భూముల సర్వేకు సంబంధించి జిల్లాకు సర్వేలతో కూడిన ప్రత్యేక టాస్క్ఫోర్స్ టీములను పంపుతున్నామని తెలిపారు. అటవీ భూముల సర్వేకు సంబంధించి రెవెన్యూ శాఖ ద్వారా ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేశామన్నారు. 212 మంది నూతన సర్వేయర్లు శిక్షణలో ఉన్నారని, వీరందరు జనవరి మొదటి వారంలోగా అందుబాటులోకి వస్తారని తెలిపారు. ఇప్పటికే పనిచేస్తున్న సర్వేయర్లతో పాటు నూతన సర్వేయర్లతో కూడిన టీములను ప్రత్యేక టీములుగా ఏర్పాటు చేసి జిల్లాలకు పంపుతామన్నారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్‌లాల్, అసిస్టెంట్ కలెక్టర్ రాజర్షిషా, డిఆర్‌డిఓ వెంకటేశ్వర్ రావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వెంకటమాధవ రావు, ఇంచార్జి జిల్లా పంచాయతీ అధికారి మనోజ్ కుమార్, కరీంనగర్, హుజూరాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారులు ఆనంద్ కుమార్, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

పాస్ బుక్కుల కోసం
బైఠాయించిన రైతులు
ముస్తాబాద్, డిసెంబర్ 27: ముస్తాబాద్ తహశీల్ ఆఫీస్ ఎదుట గురువారం రైతులు బైఠాయించారు. భూమి రికార్డుల్ని సవరించి న్యాయం చేయాలని ఆందోళన వ్యక్తం చేశారు. నెలల తరబడి అధికారులకు మొర పెట్టుకొంటున్నట్లుగా ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రెవన్యూ యంత్రాంగం స్పందించి భూ రికార్డుల్ని సవరించి పట్టేదారు పాసు బుక్కులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. బాధితరైతులు కుంభాల యాదగిరిరెడ్డి, వైస్‌ఎంపీపీ చిట్నేని శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ఓటు.. ప్రజాస్వామ్య హక్కు
- ఎమ్మెల్యే సుంకె రవి శంకర్
చొప్పదండి, డిసెంబర్ 27: ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల ఏర్పాటుకు ఓటు హక్కు ఎంతో ప్రాధాన్యమైందని, అలాంటి ఓటు హక్కును ప్రతీ ఓక్కరు నమోదు చేసుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం చొప్పదండి తహశీల్దార్ కార్యాలయంలో పలువురు కొత్త ఓటర్లు ఓటు హక్కు నమోదు చేసుకోవడాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు కొత్త ఓటర్లు ఎమ్మెల్యే సమక్షంలో ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం పలువురు ఓటర్లు వారి ఓట్లను కోల్పోవటం జరిగిందని, వారు ఈ సారి తప్పకుండా తిరిగి నమోదు చేసుకొని ఓటరు లిస్టులో తమ పేరు వచ్చిందా? లేదా? చూసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. కొత్త ఓటర్లకు జనవరి 1, 2019 లోపు పుట్టిన వారికి కూడా అవకాశం ఉన్నందున అప్పటి వరకు 18 సంవత్సరాలు నిండేవారు కూడా ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీనివాస్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, ఎంపిపి గుర్రం భూమారెడ్డి, నాయకులు బందారపు అజయ్ కుమార్, గొల్లపల్లి శ్రవణ్ కుమార్, ఎం.డి.జహీర్, కొత్త గంగారెడ్డి, గాండ్ల లక్ష్మణ్, మంద నర్సయ్య, రాపెల్లి ఐలయ్య, సీపెల్లి గంగయ్య, దండె కృష్ణతో పాటు పలువురు పాల్గొన్నారు.

జనవరి 8, 9న
రవాణా రంగం బంద్
కరీంనగర్ టౌన్, డిసెంబర్ 27: జనవరి 8,9 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని ఆలిండియా రోడ్ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది. ఈ సమ్మె రవాణారంగ పరిరక్షణ అసంఘటిత రవాణా కార్మికులకు సామాజిక సంక్షేమచట్టంకై జరుగుతుందని, రవాణారంగ కార్మికులు ఇప్పటి నుంచే అన్ని పనులు పూర్తి చేసి, రెండు రోజులు బంద్ పాటించాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేశ్, కార్ డ్రైవర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పున్నం రవి,తదితరులు కోరారు. ఈసందర్భంగా ఎడ్ల రమేశ్ మాట్లాడుతూ, మోటార్ వెహికిల్ చట్ట సవరణ బిల్లుతోవాహన డ్రైవర్లు దిక్కులేని వారు కాబోతున్నారని, దీనిని ఓడించేందుకు రెండు రోజుల పాటు రోడ్లపై నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ బిల్లు అమోదం పొందితే డ్రైవర్లకు ఉరి, కార్పోరేట్ కంపనీలకు సిరి ఉంటుందని, ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం తీసుకోకుండా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించుకుని జీవనం గడిపే రవాణారంగ కార్మికులపై విపరీతంగా పన్నులు పెంచటం శోచనీయమన్నారు. ప్రమాద నివారణ చర్యలు తీసుకోకుండా ఈ బిల్లును ప్రవేశపెట్టడం పూర్తిగా కార్పోరేట్ వర్గాల కోసం తప్ప వేరే ఆలోచన లేదని స్పష్టమవుతోందన్నారు. దీనిని గమనించి డ్రైవర్లంతా సమ్మెలో పాల్గొనాలని కోరారు. ఈసందర్భంగా కరపత్రాలు విడుదల చేయగా, కార్యక్రమంలో యూనియన్ నాయకులు రవి, జనార్ధన్, సంజీవ్, హరి, రాజు, మధు,సంపత్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

బీసీలను దెబ్బతీస్తున్న తెరాస ప్రభుత్వం
- సీపీఎం జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి
కరీంనగర్ టౌన్, డిసెంబర్ 27: సమాజంలో మెజారిటీ స్థానంలో ఉన్న వెనుకబడిన వర్గాలను అణిచివేసే క్రమంలోనే ప్రభుత్వం రిజర్వేషన్లు తగ్గించిందని, యధాతధంగా కొనసాగించి వారిని రాజకీయంగా ఎదిగేలా ప్రోత్సహించాలని సీపీ ఎం జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్సు ఉపసంహరించుకోవాలంటూ, గురువారం కలెక్టరేట్ ఎదుట సీపీ ఎం జిల్లాశాఖ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో టీ ఆర్ ఎస్ బీసీలను నమ్మించి, గొంతు కోసిందని ఆరోపించారు. గ్రామపంచాయితీ ఎన్నికల్లో అధికార పార్టీ బలపర్చే అభ్యర్థులను చిత్తుగా ఓడించి, గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో బీసీల ఓట్లు అవసరమైన ఆపార్టీకి బీసీల రిజర్వేషన్లు తగ్గించటం శోచనీయమన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కొనసాగించాలని డిమాండ్ చేశారు. గత 20 ఏళ్ళుగా స్థానిక సంస్థల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్ల అమలవుతుండగా, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాల సాకుతోకోత విధించటం దారుణమన్నారు.

కుల వృత్తుల అభివృద్ధి కోసం..
చేయూత

- జిల్లా అభివృద్ధి అధికారి రంగారెడ్డి

కరీంనగర్, డిసెంబర్ 27: కుల వృత్తుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఆర్థికంగా అందిస్తున్న చేయూత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జె.రంగారెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో కుమ్మరుల కులవృత్తి శిక్షణను జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో డిఆర్‌ఓ భిక్షునాయక్, బి.వినోద్ కుమార్, డిడి, డిఆర్‌ఓ తదితర శాఖల అధికారులు కుల వృత్తులకు ప్రభుత్వం ద్వారా ఇస్తున్న శిక్షణను వినియోగించుకొని శాలివాహనులు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం ఇస్తున్న శిక్షణ ద్వారా శాలివాహనులు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చెందాలని సూచించారు. వేలి వృత్తులెన్ని ఉన్నా కుల వృత్తులకు సాటి రావని విషయాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం శాలివాహనుల ఆర్థికాభివృద్ధి కోసం బాటలు వేసేందుకే కుమ్మరులకు కుండల తయారీపై శిక్షణను అందిస్తుందని తెలిపారు. ప్రభుత్వ పథకాలు ఉపయోగించుకుంటూ ఆర్థికంగా అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలన్నారు. ప్రత్యేకంగా కుమ్మరి కుల వృత్తుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించి ఆర్థికంగా కావాల్సినంత సహకారాన్ని అందిస్తూ శాలివాహనులు ఆర్థికాభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తుందని వెల్లడించారు.


నిత్యావసర వస్తువుల పంపిణీ భేష్

$
0
0

హైదరాబాద్, డిసెంబర్ 27: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పౌరసరఫరాల విధానం చాలా బాగుందని, ఈ విధానాన్ని కేరళ రాష్ట్రంలో కూడా అమలు చేస్తామని కేరళ అధికారుల బృందం ప్రకటించింది. కేరళ పౌరసరఫరాల శాఖ అధికారులు విమ్మిడేవిస్ అక్కార, సతీష్‌బాబు, ఎల్. దీపక్, పి.హెచ్. హవినాష్ తదితరులు గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యాలయాన్ని సందర్శించారు. రేషన్ సరకులు తరలించే వాహనాలకు జీపీఎస్ యంత్రాలను అమర్చడం వల్ల ఈ వాహనాలు నేరుగా రేషన్ దుకాణాలకే వెళ్లేలా చూడటం, రేషన్ పక్కదారి పట్టేందుకు వీలులేకుండా చర్యలు తీసుకోవడం పట్ల కేరళ అధికారుల బృందం హర్షం వ్యక్తం చేసింది. ఈ విధానాన్ని తమ రాష్ట్రంలో కూడా అమలు చేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం పౌరసరఫరాలకు సంబంధించి తీసుకున్న చర్యలు బాగున్నాయని కేరళ అధికారులు పేర్కొన్నారు. కేరళలో 14,300 రేషన్ దుకాణాలు ఉన్నాయని, 86 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని గుర్తు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ పౌరసరఫరా శాఖ చేపట్టిన రేషన్ పోర్టబిలిటీ గురించి కమిషనర్ అకున్ సబర్వాల్ కేరళ బృందానికి వివరించారు.

దళం వీడిన ‘గణపతి’

$
0
0

ధర్మపురి, డిసెంబర్ 27: నాటి కమ్యూనిస్టు, రజాకారుల కార్యకలాపాలకు, అనంతర పీపుల్స్‌వార్ ఉద్యమానికి కేంద్రబిందువై జగిత్యాల జిల్లా దేశంలో ఒక ప్రత్యేకతను సంతరించుకోవడానికి కారణం మావోయిస్టు అగ్రనేత ముప్పాళ లక్ష్మణ్‌రావు అలియాస్ ‘గణపతి’కి పుట్టినిల్లు కావడం. రైతు కూలీ సంఘాల స్థాపనకు, అజ్ఞాత తీవ్రవాద ఉద్యమానికి ఊపిరులూదిన ధర్మపురి పరిసరాలు తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలుగా మారడానికి మూలం ఉద్యమ దళపతి గణపతి ఈ ప్రాంతీయుడే అయి ఉండడం. సమాంతర ప్రభుత్వాలను నడుపుతూ, దశాబ్దాల కాలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ముప్పాల లక్ష్మణ్‌రావు జగిత్యాల జిల్లాలోని ధర్మపురి సమీప మండల కేంద్రమైన బీర్‌పూర్ జన్మస్థలం. 1967లో జగిత్యాలలో ఇంటర్ చదివారు. 1970లో కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. 1971-74మధ్య కాలంలో ప్రస్తుత పెద్దపెల్లి జిల్లా రాగినేడు, జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రభుత్వ పాఠశాలలలో ఉపాధ్యాయునిగా పని చేశారు. 1974లో బీఈడీ సీటు రాగా, వరంగల్‌లోని ప్రభుత్వ బీఈడీ కళాశాలలో చేరి శిక్షణ పొందుతున్న సమయాన నాటి కమ్యూనిస్టు నేతలు కొండపెల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి తదితరుల భావజాల ప్రభావానికి లోనై పీపుల్స్‌వార్‌వైపు ఆకర్షితుడయ్యారు. 1976లో మొట్టమొదటిసారి నిజామాబాద్ జిల్లా బాల్కొండలో సహచరులు మల్లొజ్జల కోటేశ్వర్‌రావు, మల్లా రాజరెడ్డిలతో పాటు అరస్టయ్యారు. 1977 సెప్టెంబర్ 9న జగిత్యాలలో కొండపల్లి ఆధ్వర్యంలో, ముస్కు సుబ్బారెడ్డి, వరవరరావు లాంటి ముఖ్యులు పాల్గొన్న జగిత్యాల జైత్రయాత్ర ఏర్పాట్లలో కీలక పాత్ర వహించారు. కోరుట్ల మండలం చిన్నమెటుపెల్లి భూస్వామి జగన్‌మోహన్‌రావు హత్య జరగడం, ఆ కేసులో లక్ష్మణ్‌రావు అరెస్టు అయ్యారు. అప్పటికే మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాలాపూర్‌లో పీతాంబరరావు, ఆయన సోదరుడు సుభాస్‌రావు జంటహత్యల కేసులో ఆయనొక నిందితుడు. తరువాత జైలుకెళ్ళి, బెయిల్‌పై వచ్చి, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. తర్వాత ఈ ప్రాంతానికి కుటుంబీకులు మరణించినా, ఎన్నడూ తిరిగి రాలేదు. 1992 జూన్‌లో పీపుల్స్‌వార్ అగ్రనేతగా, ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై, ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించారు. 2003లో వామపక్ష తీవ్రవాద గ్రూపులను కలిపి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ మావోయిస్టు ఏర్పాటు చేయగా, కేంద్ర కమిటీ కార్యదర్శి అయ్యారు. 52ఏళ్ళ నక్సల్బరీ ఉద్యమంలో 68 సంవత్సరాల వయసు గల గణపతి, 44ఏళ్ళు ఉద్యమ బాటలోనే పయనించారు. వయసు పెరగడం, అనారోగ్య సమస్యలతో గణపతి కార్యదర్శిత్వ బాధ్యతల నుండి ఇటీవలే తప్పుకున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన నంబాల కేశవరావు ఆయన స్థానాన్ని భర్తీ చేస్తూ, మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు. జగిత్యాల జిల్లాలో 1988 జూన్ 29న సారంగాపూర్ ఎమ్మార్వో కార్యాలయం దగ్ధం, 1989 సెప్టెంబర్ 13న బీర్‌పూర్ ఘాట్‌రోడుపై నాటి జగిత్యాల డీఎస్పీ వేణు గోపాలకృష్ణ, సర్కిల్ ఇన్స్‌పెక్టర్ నర్సింగరావును హతమార్చే లక్ష్యంతో, మందుపాతరలు పేల్చి స్వయంగా గణపతి బంధువులతో సహా 13మంది అమాయకుల మృతికి కారణమై, రాష్టవ్య్రాప్త సంచలన సంఘటనలకు సాక్షీభూతమైన సంఘటనతో పాటు పలు కేసులు నమోదై ఉన్నాయి. తెలంగాణలో గణపతిపై 25లక్షలు, జాతీయ దర్యాప్తు సంస్థ పక్షాన 15లక్షలు, దేశంలోని వివిధ రాష్టల్రలో రివార్డులు ప్రకటితమై ఉన్నాయి. బీర్‌పూర్‌లోని గణపతి స్వగృహం జాతీయ దర్యాప్తు సంస్థ ఆధీనమై ఉంది.

ఓటర్ల జాబితా ఆధారంగా వృద్ధులకు పింఛన్లు

$
0
0

హైదరాబాద్, డిసెంబర్ 27: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2018 నవంబర్ 19 న ప్రకటించిన ఓటర్ల జాబితా ఆధారంగా 57 సంవత్సరాల నుండి 64 సంవత్సరాల మధ్య వయస్సున్న వారి పేర్లను మూడు రోజుల్లో ఈసేవ కమిషనర్‌కు పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సచివాలయం నుండి గురువారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ, 57 సంవత్సరాలను నిండిన వారికి 2019 ఏప్రిల్ 1 నుండి పింఛన్లు మంజూరు చేయాల్సి ఉందన్నారు. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు అదేశాల మేరకు కొత్తవారికి పింఛన్లు ఇవ్వాల్సి ఉందన్నారు. 57 సంవత్సరాలు నిండిన వారి జాబితాను సిద్ధం చేయాల్సి ఉందని, ఓటర్ల జాబితాను ఇందుకు ఆధారం చేసుకోవాలని సూచించారు. 57 ఏళ్లు నిండిన వారి పేర్లతో కూడిన జాబితాను గ్రామపంచాయతీ సభల్లో ప్రకటించి, ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించాలన్నారు. ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారి వివరాలను కుటుంబ సభ్యులు లేదా ప్రజల నుండి సేకరించాలని, ప్రతి నివాసంలో 57 ఏళ్లు నిండినవారి వివరాలను సేకరించాలని జోషి సూచించారు. జిల్లాకు ఎంత మంది అర్హులు అవుతారో దీని ద్వారా తేలుతుందన్నారు. వృద్ధుల పింఛన్లతో పాటు ఇతర అంశాలపై కూడా ఆయన కలెక్టర్లతో చర్చించారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకాలకు సంబంధించి క్రీడలు, మాజీ సైనికుల కోటా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని ఆదేశించారు. అటవీ భూముల సర్వే త్వరగా పూర్తి చేయాలని, వీటి సర్వే కోసం ప్రత్యేక టాస్క్ఫోర్స్ టీంలను పంపిస్తున్నామని జోషి తెలిపారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఈ సందర్భంగా పంచాయతీరాజ్ కమిషనర్ నీతూ ప్రసాద్ జిల్లా కలెక్టర్లను కోరారు. అంగన్‌వాడీ కేంద్రాలతో పాటు పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఖమ్మం, మహబూబ్‌నగర్, జగిత్యాల, సూర్యాపేట, కరీంనగర్, జోగులాంబ, గద్వాల, కామారెడ్డి, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, మంచిర్యాల జిల్లాల్లో జాతీయ రహదారులకోసం భూసేకరణను 2019 ఫిబ్రవరి లోగా పూర్తి చేయాలని రోడ్లు, భవనాల ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ కలెక్టర్లకు సూచించారు.
చిత్రం..సచివాలయంలో గురువారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ఎస్ కే జోషి

హైటెక్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు

$
0
0

హైదరాబాద్, డిసెంబర్ 27: గుట్టుచప్పుడు కాకుండా నగరంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న హైటెక్ బెట్టింగ్ ముఠాను నార్త్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు గుట్టురట్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్.. బషీర్‌బాగ్‌లోని పోలీస్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టాస్క్ఫోర్స్ డీసీపీ పీ.రాధకిషన్ రావుతో కలిసి వెల్లడించారు. ముగ్గురు క్రికెట్ బుకీస్‌ను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.41.20లక్షలు, ఒక టీవి, సెటాప్ బాక్స్, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్ ఇండోర్‌కు చెందిన అలోక్ జైన్(36) మ్యుచ్‌వల్ ఫండ్స్ ఇనె్వస్ట్‌మెంట్ అండ్ మార్కెటింగ్ నిర్వహిస్తున్న వ్యక్తి ఈ కేసులో ప్రధాన నిందితుడు. ప్రస్తుతం నగరంలోని రామ్‌కోఠీలోని తిలక్‌రోడ్డులోని మహావీర్ రెసిడెన్సీ హిమయత్‌నగర్‌లో నివాసం ఉంటూ ఈ బెట్టింక్ ముఠాకు లీడర్‌గా వ్యవహరిస్తున్నాడు. అలోక్ జైన్ ఇంట్లో నివాసం ఉంటున్న తమ్ముడు అభిషేక్ జైన్(32), గుజరాత్ సౌరాష్ట్ర జిల్లాకు చెందిన షేర్ మార్కెటింగ్ వ్యాపారం చేస్తున్న మేహుల్ కే.మోర్జారియా(35) ఆర్గనైజర్లుగా వ్యవహరిస్తున్నారు. అక్రమంగా డబ్బులు సంపాందించాలనే ఉద్దేశ్యంతో పేరుమోసిన కొంత మంది బుకీలతో పరిచయం చేసుకుని బెట్టింగ్‌కు పాల్పడుతున్నాడు. అలోక్ జైన్ చిక్కడపల్లిలోని వివేక్‌నగర్‌లోని ఓ ఇంట్లో ఆఫీసు ఓపెన్ చేసి అతని తమ్ముడు అభీషేక్, స్నేహితుడు మోర్జారీయాతో కలిసి ఆసక్తి గలవారిని పిలిపించి క్రికెట్ బెట్టింగ్ నిర్వహించేవారు. అలోక్ జైన్.. విదేశీయుడైన అమెరికాకు చెందిన సులేమాన్ సురాణి, రాజస్థాన్‌లోని సుభాష్‌తో 2017కి సంబంధించి బెట్టింగ్ నిర్వహించారు. అంతర్జాతీయ వనే్డ క్రికెట్ మ్యాచ్‌లతో పాటు టీ20 సీరిస్, ఐపీఎల్ మ్యాచ్‌లతో పాటు ఆస్ట్రేలియాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బీగ్ బాష్ లీగ్ మ్యాచ్‌లకు సంబంధించి యుఎస్‌ఏలోని ప్రస్తుత క్రికెట్ బెట్టింగ్ నిర్వహకుడు సులేమాన్‌తో కలిసి బెట్టింగ్‌కు పాల్పడ్డాడు. బెట్టింగ్‌లో వచ్చిన డబ్బుల లావాదేవీల కోసం ఒక ఆన్‌లైన్ వెబ్‌సైట్‌ను సృష్టించారు. టీ20 సీరిస్‌లకు సంబంధించిన మ్యాచ్‌లను నాలుగు సీజన్‌లుగా రూపొందించి రేట్ కుదిర్చి బెట్టింగ్‌లకు పాల్పడేవారని సీపీ తెలిపారు. బ్యాటింగ్‌లో పాల్గొన్న బ్యాట్స్‌మన్, బౌలింగ్‌లో పాల్గొన్న బౌలర్‌పై, ఆరు ఓవర్లు, 10, 15, 20 ఓవర్లకు సంబంధిం చి జట్టు చేసే టోటల్ స్కోరుపై బెట్టింగ్‌లకు ముఠా సభ్యులు పాల్పడ్డారని అంజనీ కుమార్ వివరించారు. సమాచారం అందుకున్న నార్త్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు చిక్కడపల్లిలోని అలోక్ జైన్ కార్యాలయంలో సోదాలు నిర్వహించిన నగదుతోపాటు సెల్‌ఫోన్, టీవిని స్వాధీనం చేసుకున్నారు. నార్త్‌జోన్ టాస్క్ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కే.నాగేశ్వర్ రావుతో పాటు సిబ్బందిని సీపీ అభినందించారు.
చిత్రం..క్రికెట్ బెట్టింగ్‌లో పట్టుబడిన నగదును చూపిస్తున్న సీపీ అంజనీ కుమార్

నన్ను తొలగించడం ధర్మవిరుద్ధం

$
0
0

హైదరాబాద్ : శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవస్థానంలో కృష్ణయజుర్వేద పండితుడిగా పనిచేస్తున్న తనను యజుర్వేద పండితుడి బాధ్యతల నుండి ఆలయ ఈఓ తొలిగించారని, ఈ విషయంలో తనను తిరిగి నియమించేలా చూడాలని రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ను గంటి రాధాకృష్ణ కోరారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడిగా మానవ హక్కుల కమిషన్ హైదరాబాద్‌లో పనిచేస్తోంది. ఈ కమిషన్ చైర్మన్‌కు కృష్ణయజుర్వేద పండితుడు గంటి రాధాకృష్ణ గురువారం ఒక వినతిపత్రం అందించారు. శ్రీశైలం దేవస్థానంలో ఆస్థాన వేదపండితుడిగా పనిచేస్తున్న తనపై ఆలయ ఈఓ తప్పుడు ఆరోపణలు చేస్తూ వేదపండితుడి బాధ్యతల నుండి ఈ నెల 25 న తొలిగించారని రాధాకృష్ణ తెలిపారు. తాను కఠోర నియమ నిష్టలతో నిత్యం త్రికాలాగ్ని, జపాలు, హోమాలు, పారయణం చేస్తున్నానని తెలిపారు. ఇటీవల పౌర్ణమి రోజున పూర్ణచంద్ర దర్శనం తర్వాత తమ ఇంటి ఆవరణలో చండీ పారాయణం, హోమం నిర్వహించానని, చాలా సంవత్సరాలనుండి ప్రతి పౌర్ణమిరోజున చండీపారాయణం, హోమం చేస్తున్నానని తెలిపారు. ఈ హోమాన్ని తప్పుగా అర్థం చేసుకున్న ఈఓ తనకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా యజుర్వేద పండితుడి బాధ్యల నుండి తొలిగించారన్నారు. తన హక్కులను కాపాడాలని, తనకు న్యాయం చేసేందుకు సంబంధిత ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇవ్వాలని రాధాకృష్ణ మానవహక్కుల కమిషన్‌ను కోరారు. రాధాకృష్ణను తొలిగంచడం నియమ, నిబంధనలకు విరుద్దమని ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య నేతలు అగ్నిహోత్రం ఆత్రేయబాబు, పెద్దింటి రాంబాబు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాధాకృష్ణను వెంటనే మళ్లీ కృష్ణయజుర్వేద పండితుడిగా నియమించాలని వారు కోరారు.

చిత్రం..మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసి వస్తున్న గంటి రాధాకృష్ణ

బీసీ సంఘాల పోరాటానికి పీసీసీ మద్దతు

$
0
0

హైదరాబాద్, డిసెంబర్ 27: పంచాయతీరాజ్ ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్ల శాతాన్ని తగ్గించడానికి వ్యతిరేకంగా జరుగుతోన్న ఆందోళనకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి (టీపీసీసీ) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బీసీలకు జనాభా దామాషా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని టీపీసీసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీసీలలో ఏబీసీడీ కులాల వారీగా గణన జరగాలని హైకోర్టు గతంలో జారీ చేసిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఎన్నికలకు వెళ్తుందని ఆయన విమర్శించారు. పంచాయతీరాజ్‌లో గతంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఉండగా వాటిని 22 శాతానికి తగ్గించడం వల్ల బీసీలు రాజకీయంగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. బీసీలకు అన్యాయం జరుగకుండా చర్యలు తీసుకోవాలని తాను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు స్వయంగా లేఖ రాసినట్టు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గుర్తు చేశారు. రిజర్వేషన్ల శాతాన్ని తగ్గించడం అంబేద్కర్ ఆలోచనలకు, రిజర్వేషన్ల స్ఫూర్తికి, రాజ్యాంగ విరుద్దమని ఆయన విమర్శించారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో తమకు రిజర్వేషన్లను కుదించడం వల్ల జరిగే అన్యాయంపై బీసీ సంఘాల ప్రతినిధులు టీపీసీసీకి వివరించారని ఆయన తెలిపారు. వారి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన ఆందోళనకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరిగే ఆందోళనా కార్యక్రమాల్లో సంఘీభావంగా ఎక్కడికక్కడా కాంగ్రెస్ నేతలు, శ్రేణులు పాల్గొని మద్దతు ఇవ్వాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు.

టీఎస్‌పీఎస్‌సీ వద్ద ఆందోళన

$
0
0

హైదరాబాద్, డిసెంబర్ 27: ఉపాధ్యాయ నియామకాల ఫలితాల విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యాలయానికి గురువారం ర్యాలీగా బయలుదేరిన ఉపాధ్యాయ అభ్యర్థులను పోలీసులు అడ్డుకుని ఆరెస్టు చేశారు. ఉపాధ్యాయ అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన పూర్తి అయినప్పటికీ ఫలితాల వెల్లడిలో టీఎస్‌పీఎస్‌సి తీవ్ర జాప్యం చేస్తోందని నిరసిస్తూ నిరుద్యోగులు గాంధీభవన్ నుంచి ర్యాలీగా బయలుదేరారు. అయితే వారిని టీఎస్‌పిఎస్‌సి కార్యాలయానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసుల వైఖరిని నిరసిస్తూ దోళనకారులు వినూత్న తరహాలో చొక్కాలు విప్పి అర్ధనగ్న ప్రదర్శనకు దిగారు. ఈ సందర్భంగా ఆందోళనకారులకు మద్దతుగా ర్యాలీలో బయలుదేరిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మానవతా రాయ్ మీడియాతో మాట్లాడుతూ, నాలుగున్నరేళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్క ఉపాధ్యాయ పోస్టును కూడా భర్తీ చేయాలేదని విమర్శించారు. కోర్టు కేసుల పేరిట కుంటిసాకులతో ప్రభుత్వం నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆయన మండిపడ్డారు. కోర్టు కేసులతో ఎలాంటి సంబంధం లేని ఎస్‌జిటీ, పీజీటీ అభ్యర్థుల ఫలితాలు టీఎస్‌పీఎస్‌సి ఎందుకు వెళ్లడించడం లేదని ఆయన ప్రశ్నించారు. కోర్టు కేసులు ఉన్నవాటిని వెంటనే పరిష్కరించి నియామకాలు చేపట్టాలని మానవతా రాయ్ డిమాండ్ చేశారు.
చిత్రం..చొక్కాలు విప్పి అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన చేస్తున్న ఉపాధ్యాయ అభ్యర్థులు

ఆంధ్రభూమి బ్యూరో


నీళ్లు తాగుతున్నారా?

$
0
0

చలికాలంలో ఎవరికీ నీళ్లు తాగాలనిపించదు. వేడివేడిగా కాఫీనో, టీనో తాగాలనిపిస్తుంది కానీ మంచినీళ్లు తాగరు. కానీ చలికాలంలో కూడా సరైన మోతాదులో మంచినీళ్లు తాగాలి. శరీరానికి తగినంత మంచినీరు అందకపోతే కడుపులో అంతా గందరగోళంగా ఉంటుంది. ఆహారం సరిగా అరగదు. ఈ సమయంలో ఒక గ్లాసు మంచినీళ్లు తాగితే తెలుస్తుంది.. అది ఆకలి వచ్చిన గందరగోళమో.. లేక శరీరానికి నీళ్లు అందక, డీహైడ్రేషన్ వచ్చిన గందరగోళమో అని.. అంతేకాక.. శరీరానికి తగినన్ని మంచినీళ్లు అందకపోతే మలబద్ధకం వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి చలికాలమైనా, నీళ్లు తాగాలనిపించకపోయినా మంచినీళ్లు తాగాల్సిందే అని చెబుతున్నారు పోషకాహార నిపుణులు..

రంగవల్లి

$
0
0

వి.చైతన్య స్రవంతి హైదరాబాద్

15 నుంచి మధ్య మధ్యలో 8 వచ్చే వరకు (సందు చుక్కలు)
================================================
ముగ్గులకు ఆహ్వానం

నింగిలోని హరివిల్లులను నేలపైన పేర్చి.. కనులకింపైన రంగుల్ని అందంగా అద్దితే అది రంగుల మాలికవుతుంది. ముంగిట్లో రంగవల్లిక అవుతుంది. ధనుర్మాసం సందర్భంగా తెలుగు ముంగిళ్లలో రంగవల్లులను తీర్చిదిద్దడం ఆనవాయితీ.. ఆ సందర్భంగా ముగ్గులకు ఆహ్వానం పలుకుతోంది మాతృభూమి. ఆసక్తి కలవారు కింది చిరునామాకు ముగ్గులను పంపగలరు.
సూచనలు
* ముగ్గులను పంపేవారు ఎ4 సైజు తెల్లకాగితంపై వేయాలి.
* ముందుగా నల్లని ఇంక్‌తో ఔట్ లైన్ గీసిన తరువాత అందులో రంగుల్ని నింపాలి.
* ఎన్ని చుక్కలను పెట్టి ముగ్గులు వేశారో.. అంటే సరిచుక్కలా, బేసి చుక్కలా, సందు చుక్కలా.. అనే విషయం స్పష్టంగా రాయాలి.
* ముగ్గుతో పాటు, మీ పాస్‌పోర్ట్ సైజు కలర్ ఫొటోని, చిరునామాని జతచేయాలి.
* డౌన్‌లోడ్ చేసిన ముగ్గులు కాక, స్వయంగా చేతితో వేసిన ముగ్గులనే పంపాలి. అదీ చుక్కల ముగ్గులకే ఆహ్వానం.

ముగ్గులు పంపాల్సిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్- 500 003.

తులసితో అందం, ఆరోగ్యం

$
0
0

దాదాపు ప్రతి ఇంట్లోనూ తులసి మొక్క ఉంటుంది. ప్రతిరోజూ తులసి పూజ జరుగుతుంది. ఇలా రోజూ పూజ చేయాలనే ఆలోచన వెనుక భక్తే కాదు, సైన్స్ కూడా దాగుంది. తులసితో అనేక వ్యాధులను నయం చేసే సంపూర్ణ ఆరోగ్యాన్ని నిలబెట్టే అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. అయితే తులసి కోసం ఎక్కడో వెతికే పని లేకుండా, ఇంట్లోనే పెంచడం ద్వారా ప్రతిరోజూ తులసి ఆకులను వినియోగించుకునే అవకాశం ఉంటుంది.
* తులసి ఆకు రసాన్ని ఒక చెంచా తేనెతో కలిపి సేవిస్తే కఫంతో వచ్చే దగ్గు తగ్గిపోతుంది.
* ప్రతిరోజూ ఉదయం నీళ్లలో తులసి ఆకులను వేసి మరిగించి ఆ నీటిని తాగడం వల్ల కఫ సమస్యలు తగ్గడమే కాకుండా శరీరంలోని రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
* తులసి ఆకులను, పసుపునూ కలిపి మెత్తగా నూరి గాయాలపై రాస్తే తగ్గిపోతాయి. కేవలం గాయాలపైనే కాదు ముఖంపై ఉన్న మొటిమలకు, మచ్చలకు ఇది చక్కటి మందుగా పనిచేస్తుంది.
* తులసి వేరును, శొంఠిని సమతూకంలో తీసుకుని రెంటినీ మెత్తగా నూరి, కుంకుడు గింజ పరిణామంలో మాత్రలను తయారుచేసుకోవాలి. ఈ మాత్రల్ని ప్రతిరోజూ ఒకటి చొప్పున ఉదయానే్న గోరువెచ్చని నీటితో సేవిస్తే, చాలా రకాల చర్మవ్యాధులు తగ్గిపోతాయి.
* తులసి ఆకులను, పుదీనా ఆకులను కలిపి మెత్తగా చేసి ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటే ముఖంపై ఉన్న మచ్చలు తొలగిపోయి చర్మం నునుపుతేలి నిగారిస్తుంది.
* తులసి, వెల్లుల్లిని నూరి వాటి రసాల్ని చెవిలో వేస్తే చెవిపోటు తగ్గిపోతుంది.
* ఒక చెంచా తులసి గింజలను ఒక కప్పు నీటిలో వేసి కాసేపు ఉంచి తాగితే మూత్ర సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి. మూత్రం సాఫీగా వస్తుంది. అలాగే మూత్రపిండ సమస్యలు తగ్గి కాళ్ల వాపులు తగ్గిపోతాయి.
* తులసి ఆకులను వేడి నీళ్లలో వేసి మరిగించి కొద్దిగా తేనెను కలిపి తాగడం వల్ల జీర్ణాశయం శుభ్రమవడంతో పాటు శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు సంఖ్య పెరుగుతుంది.
* ప్రతిరోజూ నాలుగైదు తులసి ఆకులు నమిలి మింగితే మానసిక ఆందోళన కూడా తగ్గుతుంది. అలాగే ప్రతి రోజూ తులసి చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల, తులసి చెట్టుపై నుండి వచ్చే గాలిని పీల్చడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది.
* రాత్రి పడుకునే ముందు తులసి ఆకులను రాగి చెంబు నీళ్లలో వేసి ఉదయం పరగడుపున తాగితే కడుపులోని క్రిములు నశించిపోతాయి.
* తులసి గింజలను నీళ్లలో వేసి మరిగించి పిల్లలకు తాపిస్తే కడుపులోని నులిపురుగులు నశిస్తాయి. అలాగే పిల్లల్లో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
* కాలిన గాయాలకు కూడా తులసి ఆకులు, పసుపు కలిపి నూరిన పేస్ట్ చక్కగా పనిచేస్తుంది.
* పిల్లలకు ప్రతిరోజూ ఉదయం రెండు తులసి ఆకులను తినిపించడం వల్ల జలుబు, కఫ సమస్యలు దరిచేరవు.

పుకార్లను కాదు.. సంతోషాన్ని పంచుకుందాం..!

$
0
0

ఓ మెసేజ్ మనకు దిశానిర్దేశం చేస్తుంది..
ఓ మెసేజ్ మనకు మంచి సందేశాన్ని అందిస్తుంది..
ఓ మెసేజ్ మనలోని మానవత్వాన్ని తట్టిలేపుతుంది..
ఓ మెసేజ్ చేరుూ చేరుూ కలిపి ఓ ప్రాణాన్ని నిలబెట్టమని కోరుతుంది..
ఇలాంటి మంచి పనులకు వేదికైన వాట్సాప్‌లలోనే..
ఓ మెసేజ్ భయాన్ని పంచుతోంది..
ఓ మెసేజ్ మతకల్లోలాన్ని రేపుతోంది..
ఓ మెసేజ్ అల్లర్లని పెంచుతోంది..
ఓ మెసేజ్ ప్రాణాలకు సంకటంగా మారుతోంది..
మంచి ఉన్నచోటే చెడు ఉంటుందనే మాట సహజమే.. కానీ ఒక మెసేజ్ ఇతరులకు సంకటంగా మారుతుంది అని తెలిసిన వెంటనే దాన్ని షేర్ చేయకుండా డెలిట్ చేయడం మంచిది. లేకపోతే ఆ చెడు ఎంతమంది జీవితాలతో ఆడుకుంటుందో.. తెలియదు.. నకిలీ సందేశాలు, ఫేక్‌న్యూస్‌లను అరికట్టేందుకు వాట్సాప్ ఎంచుకున్న నినాదం ఇది. దీనిలో భాగంగా యూజర్లకు అవగాహన కల్పించేలా పలు ప్రాంతీయ భాషల్లో పత్రిక, టీవీ ప్రకటనల్ని విడుదల చేసింది. ఎందుకంటే.. నకిలీ వార్తల కారణంగా దేశవ్యాప్తంగా పలు అల్లర్లు, దాడులు చోటు చేసుకుంటూ మనుషుల ప్రాణాలు పోయే పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇటువంటి ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రభుత్వాలు సోషల్ మీడియా సంస్థల్ని హెచ్చరించటంతో పాటు, నకిలీ వార్తల వ్యాప్తిని అరికట్టాలని సూచిస్తున్నాయి. నిజమేకానీ.. ఇది కేవలం వాట్సాప్ నిర్వాహకులు పూనుకుంటే సాధ్యమయ్యేది కాదు.. యూజర్లు.. అంటే మనం.. మన బాధ్యతని గుర్తెరిగినప్పుడే నకిలీ ఫార్వర్డ్‌లకు చెక్ పెట్టడం సాధ్యం అవుతుంది.
మంచి స్నేహితులందరూ కలిసి వాట్సాప్‌లో ఒక గ్రూపును క్రియేట్ చేసుకోవడం అందరికీ తెలిసిన విషయమే.. అలాగే కుటుంబ సభ్యులందరూ కలిసి కూడా వాట్సాప్ గ్రూపులను పంచుకుంటున్నారు. ఓ కుటుంబంలోని రమ్య అనే మహిళ తను రోజూ చేసే రుచికరమైన వంటల్ని గ్రూపులో పంచుకుంటూ సందడి చేసేది.. వంటలకు సంబంధించిన చిట్కాలు చెప్పేది. ఓ రోజు రమ్య స్నేహితురాలు షేర్ చేసిన వంటకానికి సంబంధించిన అదనపు సమాచారాన్ని కోరింది. దానికి రమ్య స్నేహితురాలు ఆ వంట గురించి తనకేమీ తెలియదని, ఎవరో పంపితే గ్రూపులో షేర్ చేశానని చెప్పింది. అధికారికంగా ధ్రువీకరించని సమాచారం ఏదైనా ఇతరులతో ఇలా పంచుకోవడం సరైనది కాదని.. ఎవరైనా ఆ వంటకాన్ని ప్రయత్నించి అనారోగ్యం పాలైతే ఎవరు జవాబుదారీ అని ప్రశ్నించింది రమ్య. ఇలా చెప్పడమే కాదు వెంటనే ఆ వంట మెసేజ్‌ని డెలిట్ చేసింది. మొదట రమ్య స్నేహితురాలు చిన్నబుచ్చుకున్నా.. చివరికి వాస్తవాన్ని అంగీకరించింది.
* షేర్ అవుతున్న డేటాకి రమ్య బాధ్యత వహించినట్టుగానే అందరూ ప్రవర్తిస్తే నకిలీ సమాచారం కచ్చితంగా ఫిల్టర్ అవుతుంది. ప్రభుత్వాలు కూడా నివారణకు తగిన చట్టాల్ని తీసుకొచ్చి కట్టుదిట్టంగా అమలుచేయాలి.
* ఉచితం అంటూ.. డిస్కౌంట్ ఆఫర్లనీ.. వచ్చే వాట్సాప్ మెసేజ్‌లకు స్పందించడం గానీ.. ఫార్వర్డ్ చేయడంగానీ చేయకూడదు. ఎందుకంటే.. అవన్నీ యూజర్లను బుట్టలో వేయడానికే..
* ఆన్‌లైన్ అంగళ్లలో ‘బిగ్ బిలియన్ సేల్’ అంటూ వేల ఖరీదైన వస్తువుల్ని రూ. 10, 20లకే అమ్ముతున్నట్టుగా మెసేజ్‌లు వస్తే స్పందించకూడదు. అవన్నీ ఫిషింగ్ ఎటాక్‌లే అని నమ్మండి.
* ప్రముఖ బట్టల కంపెనీలు, బూట్ల కంపెనీలు వార్షికోత్సవం సందర్భంగా అతి తక్కువకే విలువైన బూట్లు ఉచితం అంటూ మెసేజ్‌లు పెట్టి ఆ లింక్‌లను షేర్ చేస్తే.. అటువంటి ప్రమాదకరమైన ఫిషింగ్ లింక్‌లతో అవి హల్‌చల్ చేస్తున్నాయి.
* ఈమధ్య హోటల్స్, పిజ్జా కంపెనీల నుంచి కూడా ఇలాంటి ఆఫర్ల మెసేజ్‌లు వస్తున్నాయి. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే చాలు.. నాలుగు పిజ్జాలు ఉచితమనో, జంబో బిర్యానీ ఉచితమనో ఊరిస్తున్నాయి. ఇలాంటి మెసేజ్‌లను క్షణం ఆలస్యం చేయకుండా తొలగించాలి.
* కేవలం రూ. 999లకే ఐఫోన్ అంటూ వచ్చే మెసేజ్‌లను చూసి అస్సలు టెంప్ట్ అవ్వకూడదు. ఆయా లింక్‌లను చూసి క్లిక్ చేసే ప్రయత్నం అస్సలు చేయకూడదు.
* ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ‘ఈ-డొనేషన్’ లేదంటే ‘ఈ-దర్శన్’కి ప్రత్యేక రుసుము చెల్లించమంటూ వచ్చే వాటిని అస్సలు ముట్టుకోకూడదు. ఆయా లింక్‌లపై క్లిక్ చేసి చెల్లించే ప్రయత్నం చేస్తే చిక్కులు మాత్రం తప్పవు.
* న్యూ ఇయర్ కార్నివాల్ సేల్ అంటూ ఆన్‌లైన్ అంగళ్లలో డిస్కౌంట్ సేల్‌కు సంబంధించిన మెసేజ్‌లు వస్తే వాటిని అస్సలు తాకకూడదు. ఆయా లింక్‌లను తాకి అడిగిన వివరాల్ని ఇచ్చేందుకు ప్రయత్నిస్తే ఫిషింగ్ వలలో చిక్కినట్టే..
* వాట్సాప్ అధికరంగా ధ్రువీకరించిన ఉచిత మెసేజింగ్ ప్లాట్‌ఫామ్. ప్రీమియం వెర్షన్ లేదు. కానీ వాట్సాప్ ప్రీమియం వెర్షన్‌కి అప్‌డేట్ అవ్వొచ్చంటూ వచ్చే ఫేక్ మెసేజ్‌లను నమ్మి క్లిక్ చేసి వివరాల్ని ఎంటర్ చేయకూడదు.
* వాట్సాప్ రంగుని నీలం రంగుకో లేదంటే బంగారు వర్ణంలోకి మార్చేసుకోవచ్చంటూ వచ్చే నోటిఫికేషన్‌ను పట్టించుకోకూడదు. అధికారిక వాట్సాప్ వెర్షన్‌లో ఇలా రంగు మార్చే ఆప్షన్ అంటూ ఏదీ లేదు.
* గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే పిక్చర్ మెసేజ్, జిప్ ఫైల్స్, మల్టీమీడియా ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేయకూడదు. ఎందుకంటే.. ఆయా ఫైల్స్‌ని క్లిక్ చేస్తే వెంటనే క్లిక్ చేసిన వ్యక్తి లొకేషన్, ఇతర విషయాల్ని హ్యాకర్ ట్రాక్ చేయడం సులభం అవుతుంది.
* అనాలోచితంగా ఫార్వర్డ్ చేసే మెసేజ్‌తో డేటా ఒక్కటే ఖర్చు అనుకుంటే పొరబాటే.. దాంతో పాటు విలువైన సమయం కూడా వృథా అవుతుందన్న విషయాన్ని కూడా గ్రహించాలి.
* సిగరెట్ కాల్చే వారిదే కాదు.. వారు వదిలే పొగ పీల్చేవారి ఆరోగ్యము కూడా పాడైనట్లే.. ఒకరు పంపే ఫేక్‌న్యూస్‌ల వల్ల మన సమయంతో పాటు గ్రూపులోని ఇతరుల సమయం కూడా వృథా అవుతుంది.
* గ్రూపుని నియంత్రించాలంటే ఒక్కరే లీడర్ ఉండాలి. గ్రూపంతా లీడర్లు ఉంటే కంట్రోల్ ఉండదు. గ్రూపు అడ్మిన్‌గా ఓ వ్యక్తి మాత్రమే జవాబుదారుగా ఉండాలి. అప్పుడే పంచుకునే సమాచారంపై నిఘా పక్కాగా ఉంటుంది.
* వాస్తవ ప్రపంచంలో సమాజ హితాన్ని ఎలా కోరతామో.. నెట్టింట్లోని సోషల్ లైఫ్ హితాన్ని కోరడం విధిగా అలవాటు చేసుకోవాలి. నెటిజన్‌గా అది ప్రతి ఒక్కరి బాధ్యత.
* ‘నోరు జారితే మాటని ఎలా వెనక్కి తీసుకోలేమో.. అలాగే ఏ మెసేజ్‌ని పడితే ఆ మెసేజ్‌ని ఫార్వర్డ్ చేయకూడదు. ఎందుకంటే దాన్ని మనం వెనక్కి తీసుకోలేం. ఒకరి కాంటాక్ట్ నుంచి బయటికి వెళ్లినా ఆ సమాచారం మరెందరో కాంటాక్ట్‌లకు క్షణాల్లో చేరిపోతుంది. అది కేవలం పంపించిన వారి మాటగానే.. ఓ గ్రూపులో ఫార్వర్డ్ చేస్తే ఒకేసారి 256 మందికి చేరుతుంది. ఓ అవాస్తవం వైరల్ అవ్వడం అంటే ఇదేగా..
* సోషల్ మీడియా రాకతో వార్తాంశాల్ని ఎవరికి వారే జనరేట్ చేస్తున్నారు. వ్యక్తిగతమైన వెబ్‌సైట్‌లతో తోచిందేదో రాసేస్తూ వైరల్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వీటిల్లో ఎక్కువ శాతం పుకార్లే.. అలాంటివాటిని ఎక్కువమందికి చేరేలా చేసింది వాట్సాప్ లాంటి మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లే.. ఎవరికివారు తమ వంతు బాధ్యతగా వాస్తవాలేంటో తెలుసుకున్నాకే ఫార్వర్డ్ చేయాలి.
ఇలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా, మానవత్వంతో మంచి మాత్రమే ఒకరి నుంచి ఒకరికి చేరవేస్తూ పోతే ప్రపంచమంతా మంచితో, మానవత్వంతో నిండిపోతుంది. ఇప్పటిదాకా ఎలా పడితే అలా మెసేజ్‌లు ఫార్వర్డ్ చేసినా.. కనీసం ఈ నూతన సంవత్సరం నుంచైనా కేవలం మంచికి మాత్రమే సోషల్ మీడియాను వాడితే సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది.

మళ్లీ మళ్లీ చూశా..

$
0
0

అనురాగ్ కొణిదెన హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘మళ్లీ మళ్లీ చూశా’. క్రిషి క్రియేషన్స్ పతాకంపై సాయిదేవ రామన్ దర్శకత్వంలో కొణిదెన కోటేశ్వరరావు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శే్వత అవస్తి, కైరవి తక్కర్ హీరోయిన్లు. చిత్రం ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ను యూనిట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు సాయిదేవ్ మాట్లాడుతూ అందమైన కలను కథగా మార్చుకుని ప్రకృతి సృష్టించుకున్న అద్భుతమైన ప్రేమకావ్యం మళ్లీ మళ్లీ చూశా సినిమా అన్నాడు. ప్రేమకు ప్రకృతి తోడైతే ఎంతో అందంగా ఉంటుందోనని అంటూ, ఆ ప్రకృతే ప్రేమను సృష్టిస్తే ఇంకెంతో అద్భుతంగా ఉంటుందో మళ్లీ మళ్లీ చూశాలో చూడొచ్చన్నాడు. నిర్మాత కోటేశ్వరరావు కొణిదెన మాట్లాడుతూ చిత్రీకరణ పూర్తయిందని, హైదరాబాద్, వైజాగ్, అరకులోని అందమైన లొకేషన్లలో షూటింగ్ పూర్తిచేశామన్నాడు. మనస్సుకు హత్తుకునే ఆహ్లాదకరమైన చిత్రం మళ్లీ మళ్లీ చూశాను ఆదరించాలని కోరారు.

కాకినాడలో ముగించాడు

$
0
0

వరుస విజయాలతో దూసుకుపోతున్న సంచలన హీరో విజయ్ దేవరకొండ కొత్త సినిమా డియర్ కామ్రేడ్ కాకినాడ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. భరత్ కమ్మ తెరకెక్కిస్తున్న చిత్రంలో రష్మిక మండన్న హీరోయిన్. గీత గోవిందం తరువాత వీళ్లు నటిస్తున్న రెండో సినిమా. కాకినాడలో అందమైన లొకేషన్స్‌లో చిత్రం షూటింగ్ పూర్తి చేశారు. చాలామంది విద్యార్థులు షూటింగ్‌లో పాల్గొన్నారు. అతి పెద్ద షెడ్యూల్ ఇదే. ఇప్పటికే నాలుగు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది డియర్ కామ్రేడ్. మీరు ప్రేమించే దానికోసం యుద్ధం చేయండి. ఫైట్ ఫర్ వాట్ యు లవ్ అనే ట్యాగ్‌లైన్‌తో డియర్ కామ్రేడ్ సినిమా వస్తోంది. ఇందులో విజయ్ సామాజిక బాధ్యత కలిగిన యువకుడిగా పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుంటే, సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్లు చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మే ప్రథమార్థంలో చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

మాస్‌కు నచ్చే మసాలా

$
0
0

రామ్‌చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘వినయ విధేయ రామ’. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య డివివి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రంలో ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, స్నేహ, వివేక్ ఓబెరాయ్ తదితరులు ప్రధాన తారాగణం. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ మంత్రి, తెరాస వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ ఆడియో సీడీని విడుదల చేశారు. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ‘నువ్వేం సాధించావ్ అని ఎవరైనా అడిగితే రెండు అని చెప్తానని, ఒకటి రామ్‌చరణ్ అయితే, రెండు ఎప్పటికీ తరిగిపోని కోట్లాదిమంది అభిమానమని గుండె లోతులనుంచి చెబుతానంటూ’ ఫ్యాన్స్‌ను ఉత్సాహపర్చారు. రాజకీయాల్లోకి వెళ్లి మళ్లీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత మీ అభిమానం ఎలావుంటుందో ఖైదీ నెంబర్ 150తో నిరూపించారు. బిజీగా వున్నప్పటికీ ఫంక్షన్‌కు వచ్చిన కేటీఆర్‌ను చూస్తే సంతోషంగా ఉందని, వినయ విధేయ రాముడిగా కనిపించే కేటీఆర్ మాటల తూటాలతో ప్రత్యర్థుల నోళ్లు మూయించే డైనమిజంవున్న నాయకుడని ప్రశంసించారు.
సినిమా విషయానికి వస్తే రంగస్థలం షూటింగ్ సమయంలో రామ్‌చరణ్‌తో తదుపరి సినిమా ఏంచేస్తే బావుంటుందనే డిస్కషన్ వచ్చిందని, ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే మాస్ సినిమా చేయమని సూచించానన్నారు. అలాంటి లైన్ దర్శకుడు బోయపాటి దగ్గర విని సినిమా చేశామని, అందరూ శభాష్ అనిపించేలా సినిమా ఉంటుందన్నారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ స్వయంకృషితో తెలుగు పరిశ్రమలోనే కాదు భారత సినీ పరిశ్రమలో ఎదిగిన దిగ్గజం చిరంజీవి అని కొనియాడారు. సోదరుడు చరణ్ ధృవ సినిమా గురించి ఇదే వేదికపై మాట్లాడాను. అది పెద్ద హిట్టయ్యింది. రంగస్థలం హిట్టుకొట్టాడు. ఈ సినిమా కూడా మెగా భిమానులకు ఫీస్ట్ అవుతుందని ఆకాంక్షించారు. రామ్‌చరణ్ మాట్లాడుతూ యూత్‌కి ఇన్‌స్పిరేషన్ కేటీఆర్ తెలంగాణా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినందుకు అభినందనలు తెలుపుతూ, గొప్ప స్నేహితుడని చెప్పుకోవడానికి గర్వపడుతున్నానన్నారు. ఈ కథను బోయపాటి నాలుగేళ్ల క్రితమే చెప్పాడని, ఏ హీరో అయినా తన కెరీర్‌లో బోయపాటితో పని చేయాలని ఆశిస్తాడని ప్రశంసించారు. సినిమాలో మంచి మెమొరీస్ ఉన్నాయని గుర్తు చేసుకున్నాడు. దేవిశ్రీతో చేసిన సినిమాలన్నీ హిట్టయ్యానని, ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నామన్నారు. భారీ సినిమాలంటే నిర్మాత దానయ్యే గుర్తుకొస్తారని, హీరోయిన్ కైరాలోని హార్డ్‌వర్క్‌ని చూశామన్నారు. తనకో బెస్ట్ డాన్సింగ్ పార్ట్‌నర్ దొరకడం హ్యాపీగా ఉందన్నాడు. సినిమా ఔట్ అండ్ ఔట్ బ్యూటిఫుల్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశాడు.


..కన్ఫ్యూజ్డ్ దేశి

$
0
0

కంటెంట్‌వున్న కథలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఏబీసీడి. సంజీవ్‌రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. క్రేజీ ప్రాజెక్టును మధుర శ్రీ్ధర్‌రెడ్డి, యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డి సురేష్‌బాబు చిత్రాన్ని సమర్పిస్తున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది. మెగాబ్రదర్ నాగబాబు అల్లు శిరీష్‌కు తండ్రి పాత్రలో నటిస్తున్నారు. రుక్సార్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. మలయాళంలో సూపర్‌హిట్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తుండటంతో, సినిమాకు భారీ క్రేజ్ నెలకొంది. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ మలయాళంలో సూపర్ సక్సెస్ అందుకున్న ఎబిసిడి చిత్రాన్ని తెలుగులో అల్లు శిరీష్‌తో నిర్మిస్తున్నందుకు హ్యాపీగా ఉందన్నారు. చిత్రం ఫస్ట్‌లుక్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చిందని, తెలుగు ప్రేక్షకులంతా హ్యాపీగా ఎంజాయ్ చేసే కథ కావడంతో రీమేక్ చేస్తున్నామన్నారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా స్క్రిప్ట్‌ను దర్శకుడు సంజీవ్ రెడ్డి మార్చాడన్నారు. చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్‌లో ఉందని వివరించారు.

ట్రెండీ సాంగ్‌తో మజ్ను

$
0
0

అఖిల్ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మిస్టర్ మజ్ను. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జనవరి 25న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే చిత్రానికి సంబంధించిన ‘ఏమైనదో.. ఏమైనదో.. పలుకు మరచినట్టు పెదవికేమైనదో..’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఇక రెండో పాటను క్రిస్మస్ సందర్భంగా మిస్టర్ మజ్ను టైటిల్ సాంగ్ అందిస్తున్నారు. అఖిల్ అక్కినేని సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

తళుకులీనని తారలు

$
0
0

తెలుగు పరిశ్రమలో ఎప్పుడూవుండే -సీనే ఈసారీ రిపీటైంది. భారీ సినిమాలెన్నొచ్చినా -స్టార్ హీరోలు మాత్రం అరడజను మించడం కష్టం. కానీ, ఇండస్ట్రీలో టాప్ స్టార్‌డమ్ కోసం తాపత్రయపడే హీరోయిన్లు తక్కువేం కాదు. అటు ప్రేక్షకులు, ఇటు హీరోలు ఎప్పటికప్పుడు పక్కన కొత్తందాలను కోరుకోవడం పరిపాటి కనుక -హీరోయిన్ల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. కొత్త కొత్త అందాలను పరిచయం చేయడానికి దర్శక నిర్మాతలూ ఆసక్తి చూపడం తెలుగు పరిశ్రమలో కనిపించే రోటీన్ అంశం. భారీ సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ స్టార్ హోదాను ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్లు టాప్ స్టార్‌డమ్ కోసం ప్రయత్నాలూ చేస్తుంటారు. అలా కొందరు హిట్లు అందుకుంటే, ఇంకొందరు వెనకపడటమూ మామూలే. ఏటా సాగే రేసులో ఈ ఏడాది ఎవరెవరు ‘శెభాష్’ అనిపించుకున్నారో ఒకసారి చూద్దాం.

ఏడాది టాప్ హీరోయిన్లలో ముందుగా చెప్పుకోవాల్సింది కీర్తి సురేష్. తొలినాళ్లలో పవర్‌స్టార్ సరసన జోడీ కట్టి అజ్ఞాతవాసితో కనిపించింది. ఆ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైనా, ఫ్లాప్ నుంచి తప్పించుకోలేకపోయింది. అదే సమయంలో సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన ‘మహానటి’తో కీర్తి కీర్తిమారిపోయింది. ఈ బయోపిక్‌తో కీర్తి సురేష్ నటనకు టాలీవుడ్డే కాదు, జాతీయ సినిమా అభిమానులూ ఫిదా అయ్యారు. ఒక్క సినిమాతో తిరుగులేని ఇమేజ్ సాధించి స్టార్‌డమ్ కైవసం చేసుకుంది కీర్తి. ఈ ఏడాది కీర్తి కిరీటంలో మహానటి కలికితురాయి. తరువాత టాలీవుడ్‌లో అనూహ్యంగా స్టార్‌డమ్ సాధించిన బ్యూటీ రష్మిక. బ్లాక్‌బస్టర్ గీత గోవిందంతో వర్థమాన స్టార్ హీరోయిన్ పొజిషన్ దక్కించుకున్న రష్మిక, తరువాత స్టార్ హీరోలకు బెస్ట్ ఆప్షనైంది. దేవదాస్‌లో నానితోనూ జతకట్టి మంచి టాక్ తెచ్చుకుంది. అలా హ్యాట్రిక్ సక్సెస్‌లు ఆమె ఖాతాలో పడటంతో -స్టార్ రేంజ్‌కు వచ్చేసింది. సీనియర్ హీరోయిన్ అనుష్క ఈ ఏడాది తన సత్తా చాటలేకపోయింది. గత ఏడాది బాహుబలి 2తో వచ్చిన ఇమేజ్‌తోనే ఈ ఏడాదిని లాగించేసింది. ప్రస్తుతం మరో హారర్ సినిమాకు సిద్ధమవుతున్న అనుష్క, వచ్చే ఏడాది విజృంభిస్తుందేమో చూడాలి. టాప్ హీరోయిన్లలో క్రేజీనెస్ అంతా ఈ ఏడాది సమంత ఖాతాలో పడినట్టే. బిగ్గెస్ట్ హిట్ రంగస్థలం సినిమాతో ఇండస్ట్రీలో స్టానాన్ని పదిలపర్చుకుంది. అచ్చమైన పల్లెటూరి అమ్మాయి కట్టుతో విమర్శకుల ప్రశంసలందుకున్న సమంత, తరువాత థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ‘యూ-టర్న్’తోనూ తన సత్తా చాటుకుంది. ఇక వరుస పరాజయాలతో టెన్షన్‌మీదున్న రాశికన్నా ఈ ఏడాది వరుసగా మూడు ప్రాజెక్టులు చేసినప్పటికీ, ‘తొలిప్రేమ’తోనే మంచి హిట్టందుకుంది. అగ్ర నిర్మాత దిల్‌రాజు ఎన్నో ఆశలతో నిర్మించిన శ్రీనివాస కళ్యాణం బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. తరువాత మాస్‌రాజా రవితేజతో చేసిన టచ్‌చేసి చూడు అట్టర్ ఫ్లాప్‌గా నిలిచి రాశి కెరీర్‌కు పెద్ద బ్రేక్ వేసింది. ఇక ఈ ఏడాదిలో జయాపజయాలు సమానంగా అందుకుంది పూజాహెగ్దె. ఎన్టీఆర్‌తో చేసిన ‘అరవింద సమేత’ బ్లాక్‌బస్టర్ హిట్టయితే, ‘సాక్ష్యం’ టైటిల్‌తో బెల్లకొండ శ్రీనివాస్‌తో చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. గ్లామర్‌భామ అను ఇమ్మాన్యుయేల్ పరిస్థితీ ఇందుకు భిన్నంకాదు. పవన్ సరసన అజ్ఞాతవాసిలో ఫ్లాప్ అందుకున్నా, తదుపరి అల్లు అర్జున్ సినిమా ‘నా పేరు సూర్య’లో ఫరవాలేదనిపించుకుంది. తరువాత నాగచైతన్యతో చేసిన ‘శైలజారెడ్డి అల్లుడు’ ఆమె కెరీర్‌కు ఏమాత్రం ఉపయోగపడేది కాదు. ఇక ఫిదాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన సాయిపల్లవికీ ఈ ఏడాది నిరాశ తప్పలేదు. ‘కణం’ టైటిల్‌తో చేసిన ప్రయోగం వికటిస్తే, శర్వానంద్‌తో కలిసి చేసిన ‘పడి పడి లేచే మనసు’ యావరేజ్ తప్ప హిట్టివ్వలేకపోయింది. గ్లామర్ భామ కాజల్‌దీ ఇదే పరిస్థితి. ‘అ!’ ప్రయోగంతో మెప్పించినా, కుర్ర హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌తో చేసిన ‘కవచం’ ఆమె కెరీర్‌ను రక్షించలేకపోయింది. ఇక తమన్నా పరిస్థితి చెప్పక్కర్లేదు. కళ్యాణ్‌రామ్‌తో ‘నానువ్వే’ అంటూ చేసిన రొమాన్స్ కెరీర్‌కు కొత్త యాంగిల్ ఇవ్వలేకపోయింది. దాంతో తన కెరీర్‌లో ‘నెక్స్ట్ ఏంటి?’ అని ప్రశ్నించుకున్నా ఫలితం దక్కలేదు. కుర్ర హీరోలతో లవ్, సెక్స్ అంటూ చెప్పిన సుత్తి కబుర్లు ఆడియన్స్‌కి ఎక్కలేదు. అనుపమ పరమేశ్వరన్, ప్రజ్ఞా జైస్వాల్, మెహ్రీన్ కౌర్, లావణ్య త్రిపాఠి, శ్రీయలాంటి ముద్దుగుమ్మలూ ఈ ఏడాది ఆడియన్స్‌ని మురిపించలేకపోయారు. నయనతార బాలయ్య సరసన ‘జై సింహ’ అంటూ వచ్చినా, టాలీవుడ్‌లో ఆమె పరిస్థితిలో ఏమార్పు లేకుండాపోయింది. తమిళంలో మాత్రం లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో సత్తా చాటుతోంది. సో, ఈ ఏడాది స్టార్ హీరోయిన్లకు కలిసొచ్చిందేమీ లేదు. చాలా గ్యాప్ తరువాత రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీతో రీ ఎంట్రీ ప్రయత్నం చేసిన ఇలియానాకు అడ్రస్ లేకుండా పోవడం ఈ ఏడాది ముక్తాయింపు.

అనంతం-22

$
0
0

‘‘ప్రజల తిరస్కారాలనూ, ఆదేశాలనూ శిరసావహించి తీరాలి. ఆదర్శ రాజకీయవేత్తలకది కనీస ధర్మం! ప్రజలు నావాళ్లు. వాళ్లకి సేవలు చెయ్యటమే నా విధి’’ అని, ఎమ్మెల్యే వాళ్లవైపు చూశాడు.
వాళ్ళు వౌనంగా వింటున్నారు. పరధ్యానంగా నడుస్తున్నారు.
‘‘పాలకుడంటే ఎవ్వరో తెలుసా?’’
ఎమ్మెల్యే వైపు ప్రశ్నార్థకంగా చూశారు.
‘‘పాలకుడంటే పాలేరు’’
‘‘వా..ట్’’ అదిరి పడ్డారు వాళ్లు.
‘‘ప్రాచీనకాలంలో ఆస్తుల రక్షణ కోసం పాలేరు వ్యవస్థ ఏర్పడితే, ఆధునిక కాలంలో అదే ప్రజా ప్రతినిధుల వ్యవస్థగా రూపాంతరం చెందింది. ప్రజాప్రతినిధులు సేవకులే తప్ప ప్రజలకు యజమానులు కారు. వాల్లది దైవదత్త్ధాకారం కూడా కాదు’’ అని-
కీ.శే. పెద్దిరెడ్డి కొడుకు పెంటారెడ్డి పోలీసులకు జ్ఞానం చెప్పాడు!
‘‘మేం కూడానా’’ అని అగాడు పోలీసు ఉద్యోగి.
‘‘మేమేంటీ, మీరేంటీ- ప్రభుత్వ యంత్రాంగంలో వుండే అందరూ ప్రజలకు పాలేర్లే! పాలేరు పదం ప్రాచీనం కనుక గౌరవంగా ప్రభుత్వం అన్నారంతే’’
‘‘ఇది ప్రజలకెందుకు గుర్తులేదంటారు’’
‘‘గుర్తా! గుర్తు.. గుర్తులేక కాదు’’ అని తనలో తనే ఏదో గొణుగుతూ గబగబా నడిచాడు ఎమ్మెల్యే.
అంత అవమానం జరిగినా ఎమ్మెల్యే అలా మాట్లాడటం, కొంచెమైనా కోపం ప్రదర్శించకుండా చిర్నవ్వులు చిందిస్తూ శాంతిమూర్తిలా ఉండటం- పోలీసు సిబ్బందికి వింతగా వుంది!’’
గుడారాలకు చేరుకున్నారు.
ఎమ్మెల్యే తన గుడారంలోకి వెళ్తూ, అనుమతి లేకుండా ఎవర్నీ లోపలికి పంపించొద్దని చెప్పాడు కాపలా సిబ్బందితో.
ఒంటరిగా కూర్చొని తీవ్రంగా ఆలోచించ సాగాడు!
ఎంత తెలివిమీరిపోయారు, అడవి పుత్రులు! వాళ్ళని అమాయకులనటం అమాయకత్వం! రాజకీయాల్లో తలపండిన వాళ్ళకన్నా పోరాటాల్లో ఆరితేరినవాళ్లకన్నా తెలివిగా ప్రవర్తించారు!
ఆందోళన లేదు.
అలజడి లేదు.
విధ్వంసం లేదు.
ఎంతో శాంతియుతంగా తండా బాట కార్యక్రమాన్ని విఫలం చేశారు! అభాసుపాలు చేశారు!
అలా కాకుండా, నిరసనగా విధ్వంసం సృష్టిస్తే పోలీసు చర్యలు మొదలయ్యేవి. లాఠీఛార్జితో మొదలై కాల్పులదాకా వెళ్లినా ఆశ్చర్యం లేదు!
తర్వాత-
అరెస్టులు కోర్టులు విచారణలు జైళ్లు బెయిళ్లు ఖండన మండనలూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలూ...
స్వేచ్ఛగా తిరుగుతూ అడవి సంపద సేకరిస్తూ సంతలో అమ్ముతూ జీవనం గడిపే అవకాశం కోల్పోయే వాళ్ళు. దినచర్యలకు అంతరాయం కలిగేది. రోజులు గడవటం కష్టమయ్యేది.
కోర్టుల చుట్టూ తిరుగుతూ వకీళ్లకి ఫీజులిస్తూ గుమాస్తాల చేతులు తడుపుతూ- దినసరి ఆదాయం లేక, ఖర్చులు తప్పక ఉన్నదంతా వూడ్చిపెట్టుకొనిపోయి రిక్తహస్తాలతో మిగిలేవాళ్ళు.
రాబోయే అవాంతరాలను ముందుగా ఊహించే అలా శాంతియుతంగా అనుకున్నది సాధించారా, అడివిపుత్రులు.
శాంతి వెనుక కుట్ర వుందా?
శాంతి- పోరాటం ఒక్కటేనా?
కీ.శే. పెద్దిరెడ్డి కొడుకు ఎమ్మెల్యే పెంటారెడ్డి రగిలిపోతున్నాడు!
ఇందాకటిదాకా అతని మొహంలో చిందిన చిర్నవ్వులు ఇపుడు మటుమాయమయ్యాయి. కోపంతో ఎర్రబారిన మొహం, చింతనిప్పుల్లా మండుతోన్న కళ్ళూ..
అందరిముందు కనిపించిన ఎమ్మెల్యే పెంటారెడ్డి ఇతనేనా? అన్నంత అనుమానం కలుగుతుంది ఎవ్వరికైనా!
గుడారంలో పచార్లు చేస్తున్నాడు! పదే పదే అడవి పుత్రులే గురొస్తున్నారు! వాళ్ళింకా తనను చూసి హేళనగా నవ్వుతున్నట్టే వుంది!
లక్ష్మీబాయిని అంతగా పట్టించుకోవాల్సిన పనే్లదు!
వృద్ధురాలు. భర్తని పోలీసులు కొట్టారన్న బాధలో అలా మాట్లాడిందేమోకానీ, ధిక్కారం ఆమె నైజం కాదు! ఆమెని చూస్తేనే తెలుస్తుంది.
అమాయకంగా వున్న మొహం. మాటల్లో తడబాటు. కళ్ళల్లో భయం.. ఆవేశంలో, తాటాకు మంటలా మండిపడిందంతే!
అలాంటివాళ్ళ కోపంతో పెద్దగా ప్రమాదం ఉండదు.
అది లేదూ..! చాందినీ..!
కళ్ళల్లో భయం లేదు. మాటల్లో తడబాబు లేదు.
ధిక్కారమే ధ్యేయం అన్నట్టు ఎంత కఠినంగా మాట్లాడిందో!
తాటాకు మంటలా మండి చప్పున చల్లారిపోయేవాళ్ళ, ఉద్యమాలతో నినాదాలతో పోరాటాలతో మార్పులు సంభవించవుకానీ, అలా ఎండిన జిల్లేడుకాయల్లా రగిలిపోయేవాళ్ళతో చాలా ప్రమాదం!
చాందినీ క్షంతవ్యురాలు కాదు.
దానే్నం చెయ్యాలి? ఎలా చెయ్యాలి?
కీ.శే.పెద్దిరెడ్డికొడుకు పెంటారెడ్డి, కోపం పట్టలేక పళ్ళు పటపటా కొరికాడు.
సమయానికి గరుడాచలం కూడా లేడు. రాగ్యాతో కలిసి అడవికి వెళ్ళాడు. పక్షలు కనిపిస్తే విడిచిపెట్టడు.
ఏ పక్షి కనిపిస్తే ఆగాడో!
ఆంతరంగిక విషయాలు మనసు విప్పి మాట్లాడాలంటే వినేవాళ్లకొక స్థాయి, భావసారూప్యత వుండాలి. అవి లేనివాళ్ళతో మాట్లాడటంవల్ల మన స్థాయి దిగజారటం, పల్చన కావటంతప్ప ప్రయోజనం ఉండదు.
గరుడాచలం వచ్చేదాకా మనసు ఉగ్గపట్టి ఆగాలి. వచ్చిం తర్వాత అతనితో మాట్లాడి ఓ నిర్ణయానికి రావాలి!
రెడ్డియా నాయక్‌తండాలో జరిగిన పరాభవం, అడవి పుత్రులు ప్రవర్తించిన తీరు, ముఖ్యంగా చాంద్‌నీ విషయం అతనితో మాట్లాడాలి.
ప్రతీకారం తీర్చుకొందుకు మనసులోనే రచించుకున్న తన వ్యూహం గురించి చెప్తే ఏమంటాడో గరుడాచలం..
కొంత శాంతించిన మనసులో మళ్లీ తుపాను చెలరేగింది!
(ఇంకా ఉంది)

తాపసి రమణ మహర్షి

$
0
0

శివుని పంచమూర్తులలో నటరాజ ఆనందమూర్తి ఆవిర్భావాన్ని పురస్కరించుకుని, జరుపుకున్న ‘‘ఆరుద్ర దర్శనం’’ అనే ఉత్సవ సందర్భం అది. అది శ్రీ్భమినాథేశ్వర ఆలయ సంబంధ అలంకృత ఉత్సవ మూర్తులను రథంపై వీధులగుండా ఊరేగించిన ఉత్సవ సమయం. కొనసాగుతున్న ఉత్సవ క్రమంలో అర్ధరాత్రి దాటాక డిసెంబర్ 30నాటి తొలి గంటలో కోవెలను ఆనుకుని ఉన్న ఇంటిలో ఒక మగ శిశువు జన్మించాడు. సుందరం అయ్యర్, అళగమ్మ దంపతులకు కలిగిన ఆ బాలునికి ‘‘వేంకటేశ్వరన్’’ అని పేరు పెట్టారు. ఆ బాలుడే తర్వాతి కాలాన ‘‘్భగవాన్ రమణ మహర్షి’’ అని ఖ్యాతి గడించాడు. బాలుని బాల్యం సాధారణంగా సాగింది. తండ్రి మందలింపుతో ఒకమారు పక్క గుడిలో జగన్మాత విగ్రహం వెనుక దాగి ఉన్నాడు. తెలియని వయసులో ప్రాపంచిక సంకటాల నుండి ఉపశమన లక్ష్యంతో దైవసన్నిధిని ఆశ్రయించడం భవిష్యత్ జీవితానికి సంకేతం. అద్భుత జ్ఞాపక శక్తి కారణంగా పాఠశాలలో విన్నవన్ని వెంటనే అప్పచెప్పేవారు. యువకునిగా పెరియ పురాణం (శివభక్త విలాసం) గ్రంథాన్ని పఠించారు. శివునికి ధనప్రాణమానాలను సమర్పించిన 63నాయనార్ల గాథల పట్ల దివ్యావేశానికి లోనై, త్యాగభరితమై, సాయుజ్యానికి దారితీసే గాధలకు పరవశుడై, సాధుమార్గ అనే్వషియైనారు. నాటినుండి ఆయనలో దివ్య ప్రేరణ కలిగింది. రామస్వామి అనే వ్యక్తిని ఎక్కడనుండి వస్తున్నారని ప్రశ్నించి, ‘‘అరుణాచలం’’ నుండి అని సమాధానం పొందగా, ఆయన ఏదో తెలియని అనుభూతికి లోనైనారు. నాటి నుండి ప్రాపంచిక విషయాల పట్ల విముఖులు కావడం ప్రారంభమైంది. 1896 ఆగస్టు 29న చదువుల పట్ల నిరాసక్తత కలిగి, ఇల్లు వదిలి, స్కూల్ ఫీజుకు 5రూపాయలు అన్న వద్ద తీసుకుని, ఉదాత్తమైన ఆశయ సాధనకోసం వెళుతున్నానని 3రూపాయలు మాత్రమే వెంట ఉంచుకుని, లేఖ వదిలి వెళ్ళి, దైవ మార్గనిర్దేశత్వంతో, కష్టనష్టాలకు ఓర్చి, సుదీర్ఘ ప్రయాణానంతరం సెప్టెంబర్ 1న అరుణోదయ వేళలో...అరుణాచలంలో మంగళప్రద మంగళవారం మంచి ఘడియల్లో పాదం మోపి, ప్రాకార ద్వారాలు, గర్భాలయం సహా బార్ల తెరిచి ఉన్న శ్రీఅరుణాచలేశ్వర ఆలయ ప్రవేశం చేశారు. మహాలింగాలింగనం ద్వారా ఆత్మ సమర్పణం చేసుకున్నారు. నాటి అరుణాచల ఆగమనం నుండి నేటి రమణాశ్రమంగా రూపుదిద్దుకున్న గిరి దక్షిణపాదంలో స్థిరపడి, 1950, ఏప్రిల్ 14 మహా నిర్యాణం వరకు 54ఏళ్ళు, బ్రాహ్మణ స్వామిగా చిరపరిచితులై, తమకు ప్రియమైన అరుణగిరి పొలిమేర దాటనే లేదు. స్వామి ఉనికిని గురించి తెలుసుకున్న తల్లి అళగమ్మ ఇంటికి వెళదామని అర్థించగా ‘‘కర్త వారివారి ప్రారబ్ధానుసారం జీవులనాడించును. జరుగనిది ఎంత ప్రయత్నించినను జరుగదు. జరుగునది ఎవరెంత యడ్డుకున్నను జరుగనే జరుగును. ఇది సత్యము. కనుక వౌనముగ ఉండుటయే ఉత్తమము’’ అని కాగితంపై రాయగా, ఆమె ఖిన్నవదనయై వెనుతిరుగారు. రమణులు గిరిపై విరూపాక్ష గుహలోనే 17ఏళ్ళ వాసాన్ని గడిపారు. 1916లో రమణులు విరూపాక్ష నుండి స్కందాశ్రమానికి మారారు. తల్లి అక్కడున్న అందరికీ వండి పెట్టగా, ఆమెకు అనుక్షణం వైరాగ్యాన్ని బోధించారు. 1920లో తల్లి ఆరోగ్యం క్షీణించగా, ఆమెను కంటికి రెప్పలా కాపాడుతూ, 22లో రమణుల హస్తమస్తక సంయోగ దీక్ష ద్వారా అళగమ్మకు దేహవిముక్తి కలిగించారు. ఆమెకు స్పృహ ఉన్నంత వరకు వేదాంత బోధ చేస్తూ, చివరగా తమ కుడి చేతిని ఆమె హృదయం పైన, ఎడమచేతిని శిరస్సుపైన ఉంచి, తదేక దృష్టితో వీక్షిస్తూ, మోక్షాన్ని ప్రసాదించారు. ఆమె పార్థివ శరీరాన్ని దహనం చేయకుండా, గిరి దక్షిణపాదంలో సమాధి చేశారు. ఆ సమాధి చుట్టూ నిర్మాణాల సమాహారమే నేటి శ్రీరమణాశ్రమం. 1949లో మహర్షుల ఎడమ మోచేతిపై సార్కొమా (క్యాన్సర్) రాగా, 1950, ఏప్రిల్ 14 న స్వామి అంతిమ ఘడియలు సమీపించాయని గ్రహించిన భక్తులు ‘‘అరుణాచల శివ’’ అంటూ రమణ మహర్షి విరచితాలను నినదించగా, రాత్రి 8.47గంటల సమయాన దక్షిణాకాశంలో ఒకపెద్ద కాంతిగోళం మెరసి, ఈశాన్యం వైపు పయనించి, అరుణాచల శిఖరాన అంతర్హితమైంది. రమణుల ఆధ్యాత్మిక శక్తివిలాసం ఆయన దేహయాత్ర అనంతరం నానాటికీ మహోజ్జ్వలంగా భాసిస్తునే ఉన్నది.

Viewing all 69482 articles
Browse latest View live