Are you the publisher? Claim or contact us about this channel


Embed this content in your HTML

Search

Report adult content:

click to rate:

Account: (login)

More Channels


Showcase


Channel Catalog


older | 1 | .... | 1995 | 1996 | (Page 1997) | 1998 | 1999 | .... | 2067 | newer

  0 0

  అమ్మా నాన్నల చాటున అల్లారు ముద్దుగా పెరిగిన జానకి ప్రపంచంలోని స్ర్తి పురుషులంతా తన అన్నలా, తండ్రిలా, తల్లిలా, స్నేహితురాళ్లలా స్వచ్ఛంగా, ప్రేమగా, స్నేహంగా ఉంటారనుకుంటుంది.
  అందరు మధ్య తరగతి తల్లిదండ్రుల్లాగానే పిల్ల సుఖపడుతుందనే ఆశతో, ఎర్రగా బుర్రగా ఎంఎస్సీ చదివి, ఉద్యోగం వెలగబడుతున్న వెంకట్రావుకి జానకినిచ్చి కట్టబెడతారు ఆమె తల్లిదండ్రులు.
  లోకంలోని కల్మషాన్ని గురించి తెలియని ఎంతోమంది ఆడపిల్లల్లాగానే వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన జానకి, ఆ జీవితంలోని కష్టాల్ని చూచి బెంబేలెత్తిపోతుంది. భర్తా, అత్తా పెట్టే మానసిక శారీరక హింసలకు తల్లడిల్లిపోతుంది. భర్త వెంకట్రావు సంస్కారంలేనివాడనీ, మూర్ఖుడనీ, దుర్మార్గుడనీ, శీలం లేని వ్యక్తనీ జానకి చాలా త్వరగా అర్థం చేసుకుంటుంది.
  యంఎస్సీలు, యంబిబియస్‌లూ ఫ్యూడల్ సంస్కతీ సంప్రదాయాలకు అతీతంగా, స్ర్తి పురుషులకు ఉన్నత విలువలు నేర్పే చదువులు కావని వెంకట్రావు పాత్ర స్పష్టం చేస్తుంది. పురుష అహంకారానికి నిలువెత్తు ఉదాహరణ వెంకట్రావు పాత్ర. ఎంతో నీచంగా, సంస్కార రహితంగా జీవితానికి కనీస ధ్యేయం లేకుండా, జంతువులాగా, చైతన్యరహితంగా రోజుల్ని దొర్లిస్తుంటాడు అతను.
  అలాంటి వెంకట్రావు సహజంగానే జానకి బేల హృదయాన్ని తల్లడిల్లజేస్తాడు. జానకి ముగ్ధ మనోహర రూప లావణ్యాలను కనీసంగా గుర్తించలేని అతను, భర్త పాత్రలో మునిగిపోయి ఆ మురికిలోనే ఈదులాడుతుంటాడు.
  అలా జానకి ఆ సంసారంలో నరకం అనుభవిస్తున్న తరుణంలో ఆమె అన్నయ్య సత్యం చెల్లిలి సంసారంలోని వాస్తవాలను గమనిస్తాడు. తోబుట్టువు మేలుకోసం తపన పడతాడు. జానకి భర్త ఏమీ మారడని అర్థం చేసుకున్నాక, జానకిని ఆ నరకం నుండి రక్షించే భాగంలో ఆమెను ధైర్యవంతురాలిని చెయ్యటానికి పూనుకుంటాడు. ఎన్నో విషయాలు జీవితానికి చెందినవి వివరిస్తాడు. జానకికి ఉపయోగపడే పుస్తకాలిచ్చి వాటిని ఆమె చదివేలాగా ప్రోత్సహిస్తాడు.
  సత్యం అండదండలూ, ఆ పుస్తకాల ప్రోత్సాహం, చైతన్యం, జానకికి తన భవిష్యత్ జీవితం గురించి లీలగా ఒక అవగాహన కలిగిస్తాయి. అవి నూతన జీవితాన్ని ఆమె మనోపథంలో ఆవిష్కరింపజేస్తాయి.
  జీవితాన్ని గురించి, ప్రపంచాన్ని గురించి, వ్యవస్థను గురించి, స్నేహాల్ని గురించి, స్ర్తి పురుషుల మధ్య వుండాల్సిన ప్రేమానురాగాల్ని గురించీ మానవులు నిజంగా ఆచరించవలసిన విలువల్ని గురించీ, ఆ పుస్తకాలు ఆమెకు విప్పి చెప్పి ఆమె జ్ఞానేత్రాన్ని తెరిపిస్తాయి.
  జానకిని ఇలాంటి విజ్ఞానకరమైన ఆలోచనలవైపు నడిపించిన కథల్నీ, నవలల్నీ రంగనాయకమ్మగారు ఈ నవలలో వివిధ పాత్రల ద్వారా విశే్లషించిన నేపథ్యం ఈ నవల చదివే పాఠకుల్ని ముగ్థుల్ని చేస్తుంది.
  ఆమె ఈ నవలలో ప్రస్తావించిన చలం మైదానం, గోర్కీ కథలు, మపాసా రాసిన కన్నీరు నవల, టాల్‌స్టాయ్ కథలు విందు తర్వాత, అనుమానం, ప్రేమ్‌చంద్ గబన్, కార్ల్ మార్క్స్‌గారి వివరణలకి- పాఠకుణ్ణి వాటిని చదివేలా చేస్తాయి.
  -సశేషం

  రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..


  0 0

  సీ. కోతికి జలతారు కుళ్ళాయి యేటికి?
  విరజాజి పూదండ విధవకేల?
  ముక్కిడి తొత్తుకు ముత్తెంపు నత్తేల?
  అద్దమేమిటికి జాత్యంధునకును !
  మాచకమ్మకు నేల వౌక్తిక హారముల్?
  క్రూర చిత్తునకు సద్గోష్టులేల?
  ఱంకుబోతుకునేల బింకంపు నిష్ఠలు
  వాని యేటికి దుష్టవర్తనునకు?
  తే॥ మాట నిలకడ సుంకరి మోటుకేల?
  చెవిటివానికి సత్క్థా శ్రవణ మేల?
  భూషణ వికాస శ్రీధర్మపురనివాస
  దుష్టసంహార! నరసింహ! దురిత దూర!

  భావం: ఓ స్వామీ కోతికి జలతారుటోపి, విధవికి పూమాల, చప్పడి ముక్కకు నత్తు, గుడ్డివానికి అద్దం, మాచకమ్మకి ముత్యాల హారం, దుర్మార్గునికి మంచి వారితో కలయిక, వ్యభిచారికి నియమ నిష్ఠలు, చెడ్డవారికి వావివరసలు జూదరికి మాటపట్టింపు , చెవిటికి మంచి కథలు వినిపించటం ఎందుకు ? నిరర్థకమని భావం.


  0 0
 • 12/28/18--06:32: maatata
 • Cross Image: 
  Date: 
  Saturday, December 29, 2018

  0 0

  సరస్వతీనది తీర్థాలన్నింటిలోను శ్రేష్ఠమైనది సప్తసారస్వత తీర్థం. ఈ తీర్థంలో ఎన్నో బ్రాహ్మణ గణాలు నివసిస్తూ ఉంటాయి. రేగు, ఇంగుడి, జువ్వి, రావి, మోదుగ, పారిజాతం, మామిడి, వెదురు, బిల్వం మొదలైన వృక్షాలు ఈ తీరంలో కన్పిస్తాయి. ఎంతోమంది మునులు అక్కడ నివసిస్తూ ఉంటారు. వారిలో వాయుభుక్తులు, జలభక్షకులు, ఫలభక్షులు, పర్ణ్భక్షులు, వానప్రస్థులు ఉన్నారు. స్వాధ్యాయఘోష అక్కడ ఎప్పుడూ విన్పిస్తూ ఉంటుంది. అక్కడ మంకణకుడు అనే ఋషి తపస్సు చేశాడు.
  సరస్వతి పేరుతో ఏడు నదులు ఉన్నాయి. ఇవి విశ్వమంతా వ్యాపించి ఉన్నాయి. బలవంతులు ఆ నదులను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తాయి. ఆ నదులు సుప్రభ, కాంచనాక్షి, విశాల, మనోరమ, సరస్వతి, ఓఘవతి, సురేణువు, విమలోదక.
  పితామహుడు ఒకమారు ఒక మహాయాగాన్ని చేస్తున్నాడు. ఆ యజ్ఞవాటిక బ్రాహ్మణుల వేదఘోషతో ధ్వనిస్తోంది. దేవతలు కూడా ఆ యాగకార్యంలో నిమగ్నులై ఉన్నారు. పితామహుడు యాగదీక్షలో ఉండి యాగం చేస్తూ ఉంటే అందరి కోర్కెలు నెరవేరుతాయి. అక్కడ గంధర్వులు గానం చేయగా అప్సరసలు నాట్యం చేస్తున్నారు. దేవతలు కూడా ఈ వైభవానికి ఆశ్చర్యపోయారు.
  పితామహుడు పుష్కరంలో నిలబడి యజ్ఞాన్ని చేస్తూ ఉండగా ఋషులు ‘‘ఈ యజ్ఞం అంత గొప్పదేమీ కాదు. ఇక్కడ సరస్వతీ నది లేదు కదా!’’ అన్నారు. అది విని పితామహుడు సరస్వతీ నదిని స్మరించాడు. ఆ నదిని ఆవాహన చేశాడు. అప్పుడు అక్కడ సరస్వతీనది సుప్రభ పేరుతో కనిపించింది. ఎంతో వేగంతో వచ్చి పితామహుని సంస్కరిస్తున్న సరస్వతీనదిని చూచి మునులు ఆనందించారు. యాగం గొప్పగా జరుగుతున్నదని భావించారు. ఈ విధంగా సరస్వతీనది బ్రహ్మకోసం, మునుల కోసం పుష్కర తీర్థంలో ప్రకటమైనది. ఇంకొకసారి మునులంతా నైమిశారణ్యంలో సమావేశమై వివిధ వేదాంత విషయాలపై చర్చిస్తున్నారు. వారు అప్పుడు సరస్వతిని స్మరించారు. అక్కడ సత్రయాగంలో ఉన్న మునులు ఆమెను ధ్యానించగా సరస్వతి అక్కడ ప్రత్యక్షమైంది. ఆమె వారి దగ్గరకు కాంచనాక్షి పేరుతో వచ్చి సత్కరించబడింది.
  గయుడి గయలో ఒక మహాయజ్ఞాన్ని నిర్వహిస్తూ సరస్వతిని ఆహ్వానించాడు. హిమాలయాల నుంచి సరస్వతి శీఘ్రంగా ప్రవహించి యజ్ఞం దగ్గరకు వచ్చింది. తర్వాత ఉత్తరకోసలలో మునులందరు సమావేశమైనప్పుడు యాగం చేస్తున్న ఉద్దాలకుడు సరస్వతీనదిని ధ్యానించగా, ఆ నది అక్కడకు వచ్చి వారిచేత మనోరమగా వ్యవహరింపబడింది.
  కురుక్షేత్రంలో కురువు మహాయాగం చేస్తున్నప్పుడు వారంతా ధ్యానించగా ఆమె సురేణువుగా వచ్చింది.
  గంగాద్వారంలో యాగం చేస్తున్న దక్షప్రజాపతి ప్రార్థించగా వచ్చిన సరస్వతికి సురేణువని పేరు. కురుక్షేత్రంలో వచ్చిన సరస్వతికి ఓషువతి అని పేరు. హిమగిరిపై బ్రహ్మ యాగం చేస్తూ సరస్వతిని ఆహ్వానించాడు. అప్పుడు ఆ పూజ్యనది అక్కడికి వచ్చి విమలోద పేరుతో వ్యవహరింప బడింది.
  ఇప్పుడు అక్కడ తీర్థంలో బ్రహ్మచారిగా ఉంటూ సరస్వదీనదిలో స్నానమాచరించిన మంకణకుని గురించి తెలుసుకుందాము.
  ఒకమారు మహాతపస్వి మంకణకుడు సరస్వతీనదిలో దిగంబరంగా స్నానం చేస్తున్న ఒక స్ర్తిని చూశాడు. ఆమె అసమాన సౌందర్యవతి. అతనికి వీర్యస్ఖలనమై నీటిలో పడింది. ఆ తపస్వి దానిని తన కలశంలోకి తీసుకున్నాడు. అది కలశంలోనే ఏడు ముక్కలైంది. దాని నుండి ఏడుగురు ఋషులు పుట్టారు. వారు మరుద్గణాలకు మూలపురుషులు.
  వారికి చెందినవారు. వారి పేర్లు వాయువేగుడు, వాయుహుడు, వాయుబలుడు, వాయుమండలుడు, వాయుజ్వాలుడు, వాయురేతసుడు, వాయుచక్రుడు. ఈ మహర్షి చరిత్ర అద్భుతమైనది. ఒకసారి ఆయన చేతికి దర్భ మొన తగిలి గాయమైంది. ఆ గాయం నుండి రక్తానికి బదులు శాకరసం స్రవించింది. ఆ శాకరసాన్ని చూసి ఆ మహాముని ఆనందంతో నాట్యం చేశాడు. ఆయన అలా నాట్యం చేస్తూ ఉంటే ఈ లోకం అంతా ఆయన తేజస్సుకు పరవశించి నాట్యం చేయసాగింది. అప్పుడు ఋషులంతా ‘‘ఆయన నాట్యాన్ని ఆపాలి’’ అని మహాదేవునికి విజ్ఞప్తి చేశారు. శంకరుడు వారి హితవు కోరుతూ మునికి ఇలా అడిగాడు. ‘‘ఓ మహర్షీ! ఎందుకు ఇంత ఆనందంతో నాట్యమాడుతున్నావు? నీకు ఇంత ఆనందం ఎందుకు కలిగింది?’’
  అప్పుడు మహర్షి దేవదేవుని విప్రునిగా భావించి ఇలా అన్నాడు. ‘‘విప్రోత్తమా! కన్పించడం లేదా నా చేతి నుండి శాకరసం కారుతున్నది. అందుకని ఆనందంతో నాట్యం చేస్తున్నాను.’’
  దానికి మహాదేవుడు ఇలా అన్నాడు ‘‘నాకేమీ ఆశ్చర్యం లేదు. ఇలా చూడు’’ అని తన వ్రేలికొనతో బొటనవ్రేలిని నొక్కగా ఆ గాయం నుండి మంచు వంటి బూడిద బయటికి వచ్చింది. అది చూసి ముని సిగ్గుపడి మహేశ్వరుని పాదాలపై బడి అతను శంకరుడని తెలుసుకొని, ఇలా స్తుతించాడు. ‘‘మహాదేవుని తప్ప వేరెవరినీ నేను పరాత్పరునిగా భావించను. స్థావర జంగమ ప్రకృతికి మూలాధారమైన నీవే గతి. నీవే ఈ జగత్తుని సృష్టిస్తావు. మరల ప్రళయ సమయంలో నీ లోకే ఈ జగత్తును తీసుకుంటావు. దేవతలకు సర్వస్వమూ నీవే. నా పరమ అదృష్టం వలన నీవు నాతో మాట్లాడుతున్నావు. అన్ని సమయాలలో అంతటా ఉండే శంభుని నేను శరణు కోరుతున్నాను’’.
  మరల ముని తలవంచుకొని ఇలా అన్నాడు ‘‘శంకరా! నేను అహంకారంతో అజ్ఞానంతో ఈ పని చేశాను. అందువల్ల నామీద దయచూపి నన్ను క్షమించు. నా తపస్సు నశించకుండా చూడు’’.
  ఇంకావుంది...


  0 0

  ఏలయనగా మనకు శిశువు పుట్టెను. మనకు కుమారుడనుగ్రహించబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.
  ఎంతటి ఆశ్చర్యమంటే ‘ఆది అంతము లేనివాడు నిన్న నేడు ఏక రీతిగా ఉన్నవాడు ఆయన ఆలోచనలు భూమి కంటె ఆకాశము ఎంత ఉన్నతమో అంత ఉన్నతమైన ఆలోచనలు గలవాడు. తన మహాబలముతో మన పాపాలన్నిటిని సిలువ మీద మోసిన నిత్యుడగు తండ్రి. హళ జఒ ఆ్దళ ఒ్యఖూషళ యచి ఉఆళూశజఆక. మనలను కూడ నిత్యత్వానికి నడిపిస్తాడు. నిత్యము దేవాది దేవునితో ఉండే భాగ్యము కలుగజేస్తాడు. ఎల్లకాలము అంటే యుగయుగములు తరతరములు ఉండే భాగ్యము అనుగ్రహిస్తాడు.
  దేవుడు మనకు నిత్యజీవము అనుగ్రహించెను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. పునరుత్థానము జీవము యేసే. ఆయనే మార్గము సత్యము జీవము. ఈయన ద్వారానే నిత్యత్వములోనికి తండ్రి యొద్దకు చేరగలము. నిత్య రాజ్యములో సదాకాలము ఉండగలము.
  ఈ లోకము దాని ఆశలు గతించిపోవును. మన కన్నులకు కనిపించే ఈ అందమైన ప్రకృతి, అంతరిక్షము అన్నీ గతించిపోయేవే. అల్పమైన ఈ లోకాన్ని ప్రేమించి అనంతమైన ప్రభువుకు దూరంగా ఉంటూ, అసలు సృష్టికర్తనే మరచిపోయేటట్టు చేశాడు సాతానుడు. సాతానుని మోసాలలో కుయుక్తిలో మాయలో పడి ఈ జీవితకాలము సంతోషంగా ఉంటే చాలు. తరువాత ఏమైతే ఏం అన్న ధోరణిలో ఉన్నారు మనుషులు. ఈ దినం సంతోషంగా ఉంటే చాలు, ఈ గంట సంతోషంగా ఉంటే చాలు అనేట్టు మానవుని మభ్యపెట్టాడు సాతానుడు. మంచి మంచి ఎరలతో ఉరులు వేస్తుంటాడు జాగ్రత్త.
  చదువులు మంచిగా చదివి తల్లిదండ్రులను సంతోషపెట్టుచు మంచి ఉద్యోగాలలో స్థిరపడితే జీవితాంతము సుఖ సంతోషాలతో ఎటువంటి కొదువ లేకుండా ఉండవచ్చు. కానీ కాలేజీ చదువుకునే సమయంలో ఎంజాయ్‌మెంట్ అని క్లాసులు ఎగ్గొట్టి ఆ రోజు సంతోషంగా ఉంటే చాలు అనుకుంటారు. చాలీచాలని మార్కులతో చాలీచాలని జీతాలతో జీవితాంతం బాధపడుతూ వుంటారు. అలాంటిదే ఈ జీవితం క్షణభంగురం. ఆవిరి వంటిది ఇంతలో కనపడి అంతలో మాయమై పోతుంది. నిన్న చక్కగానే ఉంటారు. ఈ రోజు ఏవౌతారో తెలియదు. రేపు ఉంటారో లేదో తెలియదు. ఈ జీవితానికి గ్యారంటీ లేదు. ఈ గ్యారంటీ లేని జీవితం గడ్డిపువ్వు లాంటి జీవితం. ఎంజాయ్ చెయ్యి. నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అనుకునే స్థితి లోనికి సాతానుడు మానవుని భ్రమింపచేశాడు. మానవుని కళ్లకు గంతలు కట్టి దేవుని రాజ్యాన్ని ఆయన మహిమను ఆయన ద్వారా మనము పొందబోయే మహిమను చూడనివ్వటము లేదు. నిత్యత్వములోనికి ప్రవేశించకుండ ఈ లోక అందాలతో అల్పకాల సుఖ భోగాలతో సంతోషాలతో హోదాలతో పరువు ప్రతిష్ఠలతో అల్లరితో కూడిన ఆటపాటలతో త్రాగుడు జూదం వ్యభిచారం లాంటి అనేక విషయాలతో ముడివేశాడు. నిజ జీవితాన్ని తెలుసుకోకుండా జీవాధిపతిని తెలుసుకోకుండా నిత్యత్వాన్ని చేరుకోకుండా సాతానుడు అనేక రకాలుగా మోసపరుస్తున్నాడు.
  దేవుని ప్రణాళిక మానవుని పట్ల ఎంతో గొప్పది. ఆయన తన స్వహస్తాల తో ఆయన రూపులో మనలను చేసి నిత్యము ఆయనతోనే ఉండాలని, సహవాసము చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. ఈ గొప్ప కార్యాన్ని గ్రహించకుండా సాతానుడు మనిషిని అంధకారంలో ఉంచాడు. మానవుని కళ్లకు గంతలు కట్టి దేవుని మహిమను దేవుని రాజ్యాన్ని ఆయన ద్వారా మనము పొందబోయే మహిమను చూడనివ్వటం లేదు. ఆయన నిజమైన ప్రేమను పొందనీయటం లేదు.
  ఇటువంటి అంధకార స్థితిలో ఉన్న మనము సత్యవంతుడైన దానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు మనకు వివేకమనుగ్రహించి మన మనోనేత్రాలను వెలిగించటానికి ఒక సామాన్య మానవునిగా, శిశువుగా ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్వరూపియై యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము సాతానుడు అవిశ్వాసులైన వారికి గ్రుడ్డితనము కలుగజేశాడు.
  అంధకారము లో అలమటిస్తున్న ప్రజలను ఎంతో ప్రేమించి దేవుడు తన ఏకైక కుమారుని, జీవమై యున్న క్రీస్తును, నిత్యుడగు తండ్రిని ఈ లోకానికి పంపాడు. ఆయన యందు విశ్వాసముంచు వారు నశింపక నిత్యజీవము పొందుకునే టట్లు చేశాడు. యేసుని యందు విశ్వాసముంచు వారు నశింపక నిత్య జీవము పొందుకోవటమే కాదు, వారి కడుపులో నుండి జీవజల నదులు పారును గనుక అనేకులను నిత్య జీవానికి వారసులుగా చేయగలుగుదురు. ఈయన నిత్యుడు గనుక మనలను కూడ నిత్యత్వము లోనికి నడిపిస్తాడు. పాపులు పరిశుద్ధుని చేరలేరు కనుక కుమారుడైన యేసు గాయపరచబడి ఆయన శరీరమనే తెర ద్వారా మనకు నిత్యత్వము లోనికి మార్గము కలుగజేశాడు. ప్రభువు నిత్యుడు గనుక ఆయనను వెంబడించే వారు నిత్య రాజ్యానికి వారసులౌతారు.
  తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమిచ్చును. - యోహాను 1:12.
  ఆయనను రక్షకుడని నమ్ముట ఆయన మాటలు పాటించటం ఆయనను ప్రేమించటము ద్వారా నిత్యత్వములోనికి ప్రవేశిస్తాము. యేసుక్రీస్తు నందు విశ్వాసముంచువాడు జీవము గలవాడు. ఆయనను వెంబడించిన వారికి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానని ప్రభువు వాగ్దానం చేశాడు.
  ఈయన అన్నింటికంటె ముందుగా ఉన్నవాడును సమస్తమునకు ఆధారభూతుడునై యున్నాడు. ఈయన సిలువలో మన కొరకు మరణించి పునరుత్థానుడై మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మ్రింగివేయును. ఆయనను నమ్మిన యెడల ఈ క్షయమైన శరీరము అక్షయతను ధరించుకొనును. జీవ గ్రంథములో మన పేర్లు వ్రాయబడి యుండును.
  ఈయనను నమ్మక, ఆయన మాటలను నిర్లక్ష్యము చేసినవాడు జీవమును చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలచి యుండును.
  సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవము అనుగ్రహించును. ఆ నిత్యత్వములో శాపము లేదు దుఃఖము లేదు ఏడ్పు లేదు రాత్రి ఉండదు. ఆ నిత్యత్వములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగు నందు సంచరింతురు. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు.
  ప్రభువు వర్తమాన భూత భవిష్కత్కాలములలో ఉన్నవాడు. అల్ఫయు ఓమెగాయును అయినవాడు. ఆది అంతమై యున్నవాడు. ఆయనే జీవము ఆ జీవము ప్రత్యక్షమాయెను. తండ్రి యొద్ద నుండి ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును రెండు వేల సంవత్సరముల క్రితము ప్రభువు శిష్యులు కన్నులారా చూశారు. తాకి చూశారు. నిదానించి కనుగొన్నారు. తిరిగి మనకందరికి తెలియజేశారు.
  నిత్యుడగు తండ్రి యందు విశ్వాసముంచి ఆయన ఆజ్ఞానుసారంగా జీవించి నిత్య జీవము పొందుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మన కందరికి సహాయము చేయునుగాక.


  0 0
 • 12/28/18--06:54: సుందరకాండ
 • అయోధ్యాపుర వర్ణనలో మనుష్యులు కనిపిస్తారు. వారి స్వభావ వైవిధ్యం చెప్పబడుతుంది. సంస్కృతులు సంప్రదాయాలు వర్ణింపబడతాయి. స్వామి లంకాపుర దర్శనం చేస్తున్నాడు. గంధర్వ నగరంలా ఉందిట.
  సప్త భౌమష్ఠ భౌమైశ్చ సదదర్శ మహాపురీం
  తలై స్పృటిక సంకీర్ణైః కార్తస్వర విభూషితైః
  అది మహాపురిట. దానికి పదిహేను ప్రాకారాలున్నాయట.
  పదిహేను పదిహేనుగా లేవట. ఏడు ఎనిమిదిగా విడివడి ఉన్నాయట. స్ఫటిక తలములతో పుటంపెట్టిన బంగారు అలంకారాలతో ఉన్నాయట.
  ఇది బాహ్య దృష్టి. మరి ఆంతర్యమిది కాదు. సీత అధిష్ఠించిన లంకను స్వామి దర్శిస్తున్నాడు. ఆమెను చేరటంకొరకు మహాయోగి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు ఈ భూమికల స్థితివేరు. వాటిని అతిక్రమించే క్రమం వేరు.
  వీటిలో మొదటి ఏడు అజ్ఞాన భూమికలు. వీటిని మోహభూమికలు అంటారు.
  బీజ జాగ్రత్త్థా జాగ్రన్మహా జాగ్రతె్తై్థవచ
  జాగ్రస్వప్న స్త్థాస్వప్నః స్వప్న జాగ్రత్సుషుప్తికం
  ఇతి సప్త విధోమోహః పునరేష పరస్పరమ్.
  అలాగే జ్ఞాన భూమికలు ఏడు. జ్ఞాన భూమిక అంటే జ్ఞాన స్థితి కారణ భూమికలని మాత్రమే అర్థం.

  జ్ఞాన భూమి, సుఖేచ్ఛాఖ్యా
  ప్రథమా సముదాహృతా
  విచారణా ద్వితీయాతు తృతీయా తనుమానసీ
  సత్వాపత్తి శ్చతుర్థీ స్యాత్తతో సంసక్తి నామికా
  పదార్థ భావనా షష్ఠీ సప్తమీ
  తుర్యగా స్మృతా.- అయితే
  యావై భూమా తత్సుఖం
  నాల్పే సుఖమస్తి భూమైన సుఖం
  భూమత్వేన విజిజ్ఞాసితవ్య ఇతి.
  భూమానం భగవో విజిజ్ఞాస ఇతి (్ఛందోగ్యం)
  అని బ్రహ్మ వస్తువునుకూడా భూమస్వరూపంగా నిర్దేశించేరు కనుక అది ఎనిమిదవ భూమిక.
  అంతేకాదు-
  స్వామి లంకా పట్టణాన్ని చూసేడనలేదు మహర్షి. మరేమన్నారు-
  ‘‘మహాపురీం’’అన్నారు. అంటే శ్రీమన్నగరం అని అర్థం. శ్రీమన్నగరం అంటే-
  శషన, ల నుండి హ వరకు అంటే మూలాధారంనుండి ఆజ్ఞా కమలం వరకుకల స్వరూపం. ఆజ్ఞా కమలంలో శక్తిఉంటుంది. ఆ పైది సహస్రారం. ఈ ఆజ్ఞా కమలంవరకూ కల స్వరూపంలోనివి. ఈ పదిహేను ప్రాకారాలు- ఇదీ స్వామి చూస్తూన్న ఆ తల్లి ఉన్న లంకా స్వరూపం. అందుకనే-
  అచింత్యా మద్భుతా కారం దృష్ట్యా లంకాం మహాకపిః
  ఆ సీద్విషణ్ణో హృష్ణశ్చ వైదేహ్యా దర్శనోత్సుకః
  అచింత్యము అద్భుతాకారము అయిన లంకనుచూసి విషణ్ణుడయ్యేడట. వైదేహి దర్శనోత్సుకుడై హృష్టుడయ్యేడట.
  ఎంత మాట-
  సాధకుడు సాధ్యాన్ని పొందితేనే హృష్టుడవుతాడు. కాకుంటే భువన సౌందర్యం అతణ్ణి ఆనందింప చేయలేదు.
  అందుకని స్వామి ఆరవదైన ఆజ్ఞాబలంలో వైదేహీ దర్శనంకోసం ఉత్సుకపడి విషణ్ణుడవుతాడు. ఎందుకని-
  తాను చూడదలచినది కామేశ్వరీదేవిని. శ్రీ విద్యా సంప్రదాయంలో ఆమెనే వైదేహి అని వ్యవహరిస్తారు.

  ఇంకావుంది...


  0 0

  పృథివికి ఆంతరంగా ఉండి నియమిస్తున్నవాడే నీలో అంతర్యామిగా ఉన్న అమృతమయమైన ఆత్మ’’. ఇలా ఆత్మను సూత్రీకరించి యాజ్ఞవల్క్యుడు అగ్ని, అంతరిక్షం, వాయువు, దివి, ఆదిత్య, చంద్ర, తారలు, ఆకాశం, అంధకారం, తేజస్సు, సర్వభూతాలు, ప్రాణం, వాక్కు, చక్షువులు, శ్రోతలు, మనస్సు, చర్మం, విజ్ఞానం మరియు రేతస్సులలో ఉంటున్న ఆ భగవానుడు వానికంటే భిన్నుడే అని దీర్ఘమైన వివరణ ఇచ్చాడు. విశేషమేమంటే ఆ పరమాత్మ సమస్తంలో వ్యాపించి ఉంటూనే వానికి బహిరంగంగా కూడ ప్రకాశిస్తున్నాడని యజుర్వేదం ఈ ఋగ్వేదభావానే్న యిలా సమర్థించింది. ‘తదంతరస్య సర్వస్వ తదు సర్వస్యాస్య బాహ్యత.’ (శు.య.వే.40-5)
  ‘‘దైవం సమస్తమందు మాత్రమేగాక బహిరంగంగా కూడ ఉన్నాడు. ‘‘ఆ విధంగా సర్వాంతర్యామిగా ఉన్న పరమేశ్వరుడు సృజించిన విశాల సృష్టిరచన అల్పీయసమైన మానవ మేధస్సునకు అందకపోతే అది భగవానుని సర్వవ్యాపకత్వానికి లోటు కాదుకదా. సామవేదం ‘తావానస్య మహిమా తతో జ్యాయాంశ్చ పూరుషః’ (సా.వే.620) ‘‘దృశ్యమానమైన ఈ చరాచర జగత్తు భగవానుని మహిమను మహిమాన్వితంగా ప్రకాశింపచేస్తున్నదే’’అని పేర్కొన్నా దృశ్యమానం కాని చరాచర జగత్తు అంతకుమించిన భగవన్మహిమను ఎంత బహుగుణోపేతంగా ప్రకాశింపచేస్తున్నదో!!
  **
  వ్యాపారి సంపాదనను దొంగలు దోచేసారు
  సమీం పణేరజతి భోజనం ముషే వి దాశుషే భజతి
  సూనరం వసు దుర్గే చన ధ్రియతే విశ్వ ఆ పురు
  జనో యో అస్య తవిషీమచుక్రుధత్‌॥ ఋ.5-34-7.
  భావం:- సత్కార్యాచరణ యందు వ్యాపార దృష్టిగల వ్యాపారి ఆహారం అంటే అనుభవయోగ్యమైన సమస్త ద్రవ్యాలు చివరకు దొంగిలింపబడేందుకో లేదా దొంగల పాలో అవుతాయి. దానశీలుడికి ఉత్తమమైన ధనం విశేషంగా ఈయబడుతుంది. ఏ వ్యక్తి అట్టి దానశీలిని మాటిమాటికి అవమానపరుస్తాడో అతడు కష్టాలలో ఉన్నప్పుడు సమస్త జనుల చేత చాల హీనంగా బాధింపబడతాడు.
  వివరణ:- పరమేశ్వరుడు నీకు పుష్కలమైన మంచి ఆహారాన్ని అనుగ్రహించాడు. దానిని నీవు నీ పొట్టనుమాత్రం నింపుకొనేందుకు గాక తోడి వారందరితో కలిసి పంచుకొని స్వీకరించు. అలా నీ ఆహారాన్ని ఎటువంటి వారికి పంచాలో కూడ వేదం వివరిస్తూంది. అన్నార్తుడైనవాడే అన్నప్రదానానికి అర్హుడు. ఈ అన్నార్తుడినే ఋగ్వేదం రమణీయంగా-
  ‘స ఇద్భోజో యో గృహవే దదాత్యన్నకామాయ చరతే కృశాయ’ ఋ.10-117-3.
  ‘‘అన్నార్తుడై తిరుగుతూ ఉండేవాడే భోజుడు. అట్టి దుర్బలుడికే అన్నదానం చేయబడాలి’’అని నిర్వచించింది. ఈ విషయానే్న ఋగ్వేదం (10-117-5) ‘పృణీయాదిన్నాధమానాయ తవ్యాన్ ద్రాఘీయాంసమను పశే్యత పంథామ్’ ‘‘బలీయుడైనవాడు యాచకుణ్ణి సంతృప్తిపరచాలి. సుదీర్ఘమైన సన్మార్గాన్ని దర్శించాలి’’అని స్పష్టపరచింది. వేద మే విషయాన్నీ రహస్యంగా ఉంచదు. అన్నింటిని స్పష్టంగానే వివరిస్తుంది. పై మంత్రంలోని సుదీర్ఘమైన మార్గమేదో వివరిస్తూ ఋగ్వేదం (10-117-5) ‘ఓ హి వర్తంతే రథ్యేవ చఖ్రాన్యమన్యముప తిష్ఠంప రాయ.’ ‘‘్ధనం రథచక్రాలవలె ఒకరివద్దనుండి మరియొకరి వద్దకు పోతూ ఉంటుంది’’ అని సోపమానంగా చెప్పింది. అంటే ధనపయనమార్గం రథచక్ర సుదీర్ఘమార్గ ప్రయాణం వంటిది. ఆ ప్రయాణంలో ధనమొకచోటనే నిలువక సదా మరొక చోటకు పోతుందని భావం.
  వీరికి నేనెందుకు ఆహారం పెట్టాలి? దీనివల్ల నాకేమి లాభం? అని ఆలోచించేవాడే వ్యాపారి. అట్టివాడు తినే ఆహారానికేమి గతిపడుతుందో ఈ మంత్రంలో వివరింపబడింది. ‘సమీం పణే రజతి భోజనం మృషే’ ‘‘వ్యాపారి ఆహారం లేదా భోజనానికి పట్టే గతి దొంగతనమే. అట్టి మూర్ఖజన వ్యాపారికి జరిగే శిక్ష ఏమిటో ‘మోఘమన్నం విందతే అప్రచేతాః సత్యం బ్రవీమి వధ ఇత్స తస్య’(ఋ.10-117-6) ‘‘ఆ మూఢుడు వ్యర్థమూ లేదా నిష్ప్రయోజనమైన ఆహారానే్న లేదా భోజనానే్న పొందుతాడు’’ అది వాడి పాలిటి మరణప్రాయమే అవుతుంది. ఇది సర్వధా సత్యం’’అని ఋగ్వేదం శపథంచేసిమరీ చెప్పింది. నిజమే. తనవద్దనున్న ధనం తాను అనుభవించక దాచిపెట్టి దాచిపెట్టి ఏ దొంగ చేతిలోనో ధనానే్న కాదు ప్రాణాలను కూడ పోగొట్టుకొనడం మనమందరం చూస్తున్నదేకదా! భగవంతుడు జీవులకు సర్వమూ దానం చేసే మహాదాత. లోభి ఆ మహాదాత అయిన పరమాత్మ తనకింకా ఏదో ఈయలేదని దైవంమీద ఆగ్రహిస్తూ ఉంటాడు. ఆ కారణంచేత అతడు ‘దుర్గే చన ధ్రియతే విశ్వ ఆ పురు’ ‘‘మహా సంకటాలలో పడిపోతాడు’’ ఆ సమయంలో ఆతడికేవిధంగాను ఇతరులు సహాయపడరు.
  ఇంకావుంది...


  0 0

  సూర్యాపేట, డిసెంబర్ 28: ప్రజల సహకారం, పోలీస్ సిబ్బంది సమిష్టి కృషితో పాటు సమర్ధవంతమైన పనివిధానంతో ఈ ఏడాది జిల్లాలో నేరాల సంఖ్యను గణనీయంగా తగ్గించగలిగామని, ఇదే పనితీరుతో వచ్చే ఏడాదిలో కూడ ముందుకు సాగుతామని జిల్లా ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లాకేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో 2018లో జిల్లాలో పోలీస్‌శాఖ పనితీరును గూర్చి వార్షిక నివేధికను వెల్లడించారు. గతేడాది జిల్లాలో 5,823నేరాలు నమోదు కాగా ఈ ఏడాది 5,789 నేరాలు మాత్రమే నమోదైనట్లు వివరించారు. నేరాల సంఖ్య 5వేలకు పైగానే ఉన్నప్పటికీ వీటిలో 1,443బైండవర్ కేసులు ఉన్నందున, ఈ ఏడాది నేరాల సంఖ్య గణనీయంగా తగ్గించగలిగామన్నారు. అదేవిధంగా జిల్లాలో ఈ ఏడాది జరిగిన చోరీల్లో 69శాతం మేరా సోత్తును రికవరీ చేసి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచినట్లు తెలిపారు. జిల్లాలో ఈ ఏడాది మొత్తం 238 చోరీ కేసులు నమోదు కాగా మొత్తంగా 2.19కోట్ల సోత్తుకు గాను 69శాతం మేరా 1.51కోట్ల విలువైన సొత్తును రికవరీ చేసినట్లు వివరించారు. హైవేలపై గూడ్స్ వాహనాలే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర టార్పాలిన్ ముఠాను జిల్లాకేంద్రంలో అరెస్ట్‌చేసి వారి వద్ద నుండి 1.15కోట్ల విలువైన సోత్తుతో పాటు రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. స్నేహపూర్వక పోలీస్ విధానాన్ని అమలుచేస్తూ సమర్ధవంతంగా, జవాబుదారితనంతో పారదర్శకంగా పనిచేస్తూ శాంతిభద్రతలను పరిరక్షించామన్నారు. ఫిర్యాదులపై తక్షణమే స్పందించి చర్యలు చేపట్టేందుకు గాను ప్రతి ఠాణాలో ప్రత్యేకంగా రిస్పెషన్ కేంద్రాలను ఏర్పాటుచేశామన్నారు. 100 నెంబర్‌కు ఇప్పటి వరకు 7,939 ఫిర్యాదులు రాగా సరాసరిగా తమ సిబ్బంది కేవలం 12నిమిషాల వ్యవధిలోనే స్పందించి సేవలు అందించినట్లు తెలిపారు. ప్రజలకు వేగవంతంగా సేవలు అందించేందుకు నూతన వాహనాలను అందించడం జరిగిందని, అదేవిధంగా నేను సైతం కార్యక్రమం ద్వారా ప్రజల భాగస్వామ్యంతో 550సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేసి నిఘాను పెంచామని, వచ్చే ఏడాది 100శాతం గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. జిల్లాలో శాసనసభ ఎన్నికలను శాంతియుత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించామన్నారు. ఎన్నికల సందర్భంగా 3810మంది పాత నేరస్తులను బైండోవర్ చేశామని, 16 చెక్ పోస్టులను ఏర్పాటుచేసి నగదు, మద్యం అక్రమ రవాణాను అడ్డుకున్నామన్నారు. అక్రమ వ్యాపారాలు, వైట్ కాలర్ నేరాలపై ఉక్కుపాదం మోపామని, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, ఆహార పదార్ధాల కల్తీలను ఆరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో ఈ ఏడాది ముగ్గురిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేశామన్నారు. జిల్లాలో ఈఏడాది 36కార్డన్‌సెర్చ్ ఆపరేషన్‌లను నిర్వహించి 12,900గృహాలను తనిఖీచేశామన్నారు. ఈ తనిఖీల్లో 1,284బైకులు, 109 ఆటోలు, 15్భరీ వాహనాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు 43మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. మహిళలు, విద్యార్ధినీల రక్షణకు జిల్లాలో నాలుగు షీటీమ్‌లను ఏర్పాటుచేసి సేవలు అందిస్తున్నామని, నాలుగు కేసులు నమోదుచేసి 121మందికి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో 485రోడ్డుప్రమాదాలు సంభవించి 208మంది మృత్యువాత పడగా 592మంది క్షతగాత్రులయ్యారని, గత ఏడాది 554 ప్రమాదాల్లో 230మంది మృతిచెందగా 616మంది గాయపడ్డారని, 2018లో ప్రమాదాల సంఖ్య తగ్గడంతో పాటు మృతులు, క్షతగ్రాతుల సంఖ్యను కూడ తగ్గినట్లు తెలిపారు. అదేవిధంగా జిల్లాలో ఎస్సీ, ఎస్టీ యాక్టు కింద 71కేసులు ఈ ఏడాది నమోదు కాబడినట్లు వివరించారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సామాజిక అంశాలపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో 1210 గ్రామసభలు, 1005 పల్లె నిద్ర కార్యక్రమాలు, 172పోలీస్ కళాజాత ప్రదర్శనలిచ్చినట్లు వివరించారు. యువత పెడదారి పట్టకుండా మాదకద్రవ్యలకు బానిసలు కాకుండా చూసేందుకు గాను పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సూర్యాపేట, కోదాడ డీఎస్పీలు ఎం.నాగేశ్వరరావు, రమణారెడ్డిలతో పాటు పలువురు సీఐలు పాల్గొన్నారు.


  0 0

  నల్లగొండ, డిసెంబర్ 28: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం పనులు గ్రామాలు, పట్టణాల్లో మళ్లీ వేగవంతమవుతున్నాయి. ఎన్నికల వేళ పనుల్లో స్తబ్ధత నెలకొనగా తిరిగి రాష్ట్రంలో మరోసారి టీఆర్‌ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి రావడంతో మిషన్ భగీరథ పనుల కొనసాగింపులో మళ్లీ వేగం పెరిగింది. ఆర్‌డబ్ల్యూఎస్ శాఖను మిషన్ భగీరథగా మార్చడంతో ఆ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టనున్నారు. వచ్చే మార్చి 31నాటికి మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి రక్షిత తాగునీరందించేందుకు పనులు పూర్తి చేయాలని, జనవరి 5వతేదికల్లా బల్క్‌వాటర్ సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఈ దిశగా భగీరథ పయనం జోరందుకుంది. గ్రామ పంచాయతీల్లో ప్రతి ఒక్కరికి 100 లీటర్లు, పట్టణాల్లో 135 లీటర్ల రక్షిత తాగునీటిని అందించే లక్ష్యంతో సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకం చేపట్టారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో రూ.3880 కోట్లతో మూడు సెగ్మెంట్‌లు ఏకెబీఆర్, సాగర్ టెయిల్ పాండ్, ఉదయ సముద్రం యూనిట్‌ల పనులను ఇప్పటికే రూ.25,011 కోట్ల మేరకు ఖర్చు చేశారు. మిషన్ భగీరథలో నిర్మించాల్సిన ఐదు జలశుద్ధి కేంద్రాల నిర్మాణ పనులు పూర్తవ్వగా, 204 జల భాండాగారాలకుగాను 198 పూర్తయ్యాయి. ప్రధాన పైప్‌లైన్ల నిర్మాణం 6670 కిలోమీటర్లకు 6వేలకు పైగా పైప్‌లైన్ల నిర్మాణం పూర్తయ్యింది. ఇంట్రావిలేజ్ పైప్‌లైన్ల అనుసంధాన పనులు సగానికి పైగా చేరుకున్నాయి. 3360 గ్రామాల పరిధిలోని 3లక్షల 84వేల 715 గృహాలకు ఇప్పటిదాకా 3లక్షల 61వేల 149 గృహాల్లో నల్లాలు బిగించినట్లుగా అధికారి లెక్కలు వెల్లడిస్తున్నాయి. మిగిలిన 23566 ఇళ్లకు సైతం భగీరథ స్కీమ్ నల్లాల ఏర్పాటును జనవరి 10లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం భగీరథ అధికార యంత్రాంగాన్ని నిర్ధేశించింది. 1991 ఓహెచ్‌ఎస్‌ఆర్‌లలో అధిక శాతం పూర్తయ్యినట్లుగా అధికారులు చెబుతున్నా పురోగతిలో ఉన్నవాటిని మినహాయించాల్సివుంది. 3007 ఆవాసాలకు, ఏకేబీఆర్ సెగ్మెంట్‌లో 1726 జనావాసాలకు, భువనగిరి, దేవరకొండ మున్సిపాల్టీలకు రూ.2107 కోట్లతో చేపట్టిన పనులు 90శాతం పూర్తవ్వగా 1720 అవాసాలకు పైప్‌లైన్లను అనుసంధానించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని 16 మండలాల్లో 565 ఆవాసాల్లో 10,79,579 ఇళ్లకు నల్లా కనెక్షన్ల అనుసంధాన పనులు పూర్తయ్యినట్లుగా భగీరథ అధికారులు చెబుతున్నారు. సూర్యాపేట జిల్లాలో రూ.246 కోట్లతో 2,41,395 గ్రామాల్లో ఇంటింటికి రక్షిత మంచినీటి సరఫరా పనులు తుది దశలో ఉన్నాయి. ఈ జిల్లాలో తిరుమలగిరి మండలానికి గోదావరి తాగుజలాలు సరఫరాకు రూ.16.23 కోట్లతో చేపట్టిన పనులు కొనసాగుతున్నాయి. అయితే మిషన్ భగీరథలోని వివిధ సెగ్మెంట్‌లలో ఉన్న శుద్ధి కేంద్రాలను, ప్రధాన పైప్‌లైన్లకు ఇంట్రావిలేజ్ పైప్‌లైన్లను, వీటికి ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంకులను అనుసంధానించడం వంటి పనులు అసంపూర్తిగా ఉండటం సమస్యగా మారింది. ఈ పనులు మార్చినెలాఖరుకల్లా పూర్తయితే భగీరథ పథకం పనులు ముగింపు దశకు వస్తాయని భావిస్తున్నారు.


  0 0

  అనకాపల్లి, డిసెంబర్ 28: జిల్లాలోని తూర్పుకాపులందరికీ విధిగా బీసీ సర్ట్ఫికెట్లు అందజేయాలని తగు ఆదేశాలు జారీచేస్తానని సీఎం చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారు. మెగా గ్రౌండింగ్ మేళా కార్యక్రమంలో భాగంగా స్థానిక మున్సిపల్ మైదానంలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఈ ప్రాంత అభివృద్ధి పరంగా పలు సమస్యలను సభాముఖంగా సీఎం దృష్టికి తీసుకురాగా అందుకు ఆయన సానుకూలంగా స్పందించి వరాల వెల్లువ కురిపించారు. ప్రతీ ఒక్కరికీ స్వయం ఉపాధిని కల్పించే లక్ష్యంతో ఎంఎస్‌ఎంఇ పార్కును ఏర్పాటు చేస్తున్నామన్నారు. చేతివృత్తుల వారు ఈ పార్కులో తయారుచేసిన వస్తువులకు తగు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తామన్నారు. నూకాంబిక ఆలయ అభివృద్ధికి ఐదుకోట్ల సిజెఎఫ్ గ్రాంట్‌ను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ముస్లీంల కోసం నియోజకవర్గంలో ఎకరం భూమిలోప్రత్యేకమైన సామాజిక భవనం, ముస్లీం స్కూల్ వంటి సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన సదుపాయాలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈసభలో స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పై సమస్యలన్నింటిని సీఎం దృష్టికి తీసుకురాగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఇంతవరకు అనకాపల్లి అసెంబ్లీలో 98వేల 724 పనులను 1985కోట్ల వ్యయంతో చేపట్టినట్లు పీలా స్పష్టం చేయగా సీఎం ఆనందంతో తబ్బిబ్బయ్యారు. అనకాపల్లిలో ఇంతపెద్దమొత్తంలో నిధులు కేటాయించి అభివృద్ధి చేసామని, రాష్టవ్య్రాప్తంగా అదేతరహా అభివృద్ధి జరుగుతుందన్నారు. అనకాపల్లిలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ పక్కాగృహ సదుపాయాలు మంజూరుచేస్తున్నట్లు ప్రకటించారు. కశింకోట, వెదురుపర్తి వెళ్లే ఐదుకిలోమీటర్ల రోడ్డు విస్తరణకు అవసరమైన నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. గోదావరి జలాలు పోలవరం ఎడమ కాలువ ద్వారా విశాఖజిల్లాకు సాధ్యమైనంత త్వరలో అందనున్నాయన్నారు. ఈ సాగునీటి ద్వారా పదివేల ఎకరాల భూముల్లో పంటలు పుష్కలంగా పండుతాయన్నారు. 24కోట్ల వ్యయంతో తుమ్మపాల వద్ద ఆనకట్ట నిర్మాణం ఈ అభివృద్ధిలో భాగమేనని సీఎం చంద్రబాబు ప్రకటించారు. జిల్లాలో 32వేల ఎకరాల్లో ఒంటికన్ను ముచ్చువిత్తనాలను సమకూర్చాలని పరిశోధనా కేంద్రాలకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు ప్రకటించారు. స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ అనకాపల్లి అసెంబ్లీ పరిధిలో గతంలో ఎన్నడూ లేని అభివృద్ధి చంద్రబాబు కరుణతో గడచిన నాలుగేళ్ల కాలంలో సాధించడం వెనుక కార్యకర్తల ప్రోత్సాహం ఎంతగానో ఉన్నాయన్నారు. స్థానిక ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావుమాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాల్లో తూర్పుకాపులందరికీ బీసీ సర్ట్ఫికెట్లు ఇప్పించాలని, అనకాపల్లిలో వెటర్నరీ పరిశోధనా శాలను మంజూరు చేయాలని ఎంపీ ముత్తంశెట్టి కోరగా సీఎం సానుకూలంగా స్పందించారు. జిల్లామంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, హోంమంత్రి చినరాజప్ప, కార్మిక శాఖామంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేష్‌బాబు, వంగలపూడి అనిత, కాపుకార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, యలమంచిలి మున్సిపల్ చైర్మన్ పిళ్లా రమాకుమారి తదితరులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ఈసభను ప్రారంభించి జాతీయ నేతల విగ్రహాల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు.

  అనూహ్యంగా తరలివచ్చిన జనవాహిని
  పట్టు నిరూపించుకున్న ఎమ్మెల్యే పీలా
  అనకాపల్లి, డిసెంబర్ 28: మెగా గ్రౌండింగ్ మేళా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక జీవీఎంసి స్టేడియంలో జరిగిన చంద్రబాబునాయుడు బహిరంగ సభకు అనూహ్య రీతిలో ప్రజలు, పార్టీశ్రేణులు తరలివచ్చారు. ఈ సభ దిగ్విజయం ద్వారా స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అటు ప్రజల్లోను, ఇటు పార్టీశ్రేణుల్లోను తన పట్టు సడలిపోకపోగా మరింత బలపడిందని నిరూపించుకునేందుకు ఈసభను వేదికగా మలుచుకోవడంలో సఫలీకృతులయ్యారు. మధ్యాహ్నం 12గంటల నుండే నియోజకవర్గం నలుమూలల నుండి బస్సుల్లోను ఇతర వాహనాల్లోను ప్రజలు, పార్టీశ్రేణులు తండోపతండాలుగా తరలివచ్చారు. పట్టణంలోని వివిధ వార్డుల్లో ప్రాంతాలవారీగాను, బృందాలుగాను తెలుగుదేశం పార్టీ జెండాలు చేతబూని కార్యకర్తలు ప్రజలను సభాప్రాంగణానికి అత్యంత ఉత్సాహభరితంగా తీసుకువచ్చారు. సీఎం రాక సందర్భంగా అడుగడుగునా డిజిటల్ హోర్డింగ్‌లు, ప్రధాన కూడళ్లలో పసుపురంగు తోరణాలతో పెద్ద సందడి వాతావరణం నెలకొంది. ఈ బహిరంగ సభవేదికగా నియోజకవర్గంలోని పలు కీలక సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి సానుకూలంగా హామీలు గుప్పించడంతో స్థానిక ఎమ్మెల్యే పీలా తన ప్రయత్నాలను, నియోజకవర్గ అభివృద్ధికి చేస్తున్న కృషిని సఫలీకృతం చేసుకోగలిగారు.

  జనం అనూహ్యంగా వచ్చారు... స్పందనే కొరవడింది
  చప్పగా సాగిన బాబు ప్రసంగం
  అర్ధాంతరంగా జారుకున్న ప్రజలు
  అనకాపల్లి, డిసెంబర్ 28: గ్రామీణ జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో మెగా గ్రాండ్ మేళా పేరిట శుక్రవారం జరిగిన సీఎం చంద్రబాబునాయుడు బహిరంగ సభకు అనూహ్య రీతిలో ప్రజలు, పార్టీశ్రేణులు తరలివచ్చారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రధానంగా డ్వాక్రా మహిళలు, డ్వాక్రా సంఘాల లీడర్లు, ఐసిడిఎస్ అధికారులు ప్రజలను బృందాలు, బృందాలుగా ప్రత్యేక బస్సుల్లో సభాప్రాంగణానికి తీసుకువచ్చారు. దీంతో స్థానిక మున్సిపల్ స్టేడియం జనవాహినితో మధ్యాహ్నం రెండుగంటలకే కిక్కిరిసిపోయింది. అయితే సీఎం ప్రసంగం ఆద్యంతం చప్పగా సాగింది. ఆదరణ పథకం కింద లబ్ధిపొందిన లబ్ధిదారులతో సభావేదికపై సీఎం చంద్రబాబు మాట్లాడిన తీరు ప్రజలకు విసుగు కలిగించింది. మధ్యాహ్నం 3.15గంటలకు ప్రారంభమైన సీఎం ప్రసంగం ఐదుగంటల వరకు ఏకధాటిగా సాగింది. సీఎం ప్రసంగంలో ఆద్యంతం గడచిన నాలుగున్నరేళ్ల కాలంలో తాను ప్రభుత్వంలో సాధించిన ప్రగతిని చెప్పుకోవడానికే అత్యంత ప్రాముఖ్యతనిచ్చేదిశగా ప్రసంగం సాగింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీపైనా, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పైనా కేవలం రెండుమూడు వ్యాఖ్యలకే విమర్శలను పరిమితం చేసారు. ప్రత్యేక హోదా ప్రస్తావన గానీ, ఆంధ్రప్రదేశ్‌కు మోడీ ప్రభుత్వం చేసిన ద్రోహపూరిత చర్యలను అంతగా ప్రస్తావించిన దాఖలాలు కానరాలేదు. మరలా చంద్రబాబే సీఎం కావాలని ఆదరణ పథకం కింద లబ్ధిపొందిన వారిచే పదేపదే చెప్పించి చంద్రబాబు సంతృప్తి పొందారు. చంద్రబాబు ప్రసంగం గడచిన సభల మాదిరిగా హుషారుగా లేకపోవడంతో సభ ప్రారంభమైన అరగంట నుండే సభా ప్రాంగణం నుండి మహిళలు, ఇతర ప్రజలు జారుకున్నారు. సభ పూర్తయ్యే సమయానికి కేవలం కొంతమంది మాత్రమే మిగిలే పరిస్థితి ఏర్పడింది.
  వణికిస్తున్న చలిపులి - అధికంగా కురుస్తున్న మంచు
  చోడవరం, డిసెంబర్ 28: ఏజెన్సీ ప్రాంతానికే పరిమితమైన పొగమంచు శీతాకాలం ప్రభావంతో మైదాన ప్రాంతమైన చోడవరాన్ని కూడా కమ్మేసింది. శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలు దాటినప్పటికీ సూర్యభగవానుని దర్శనం కలగలేదు. మైదాన ప్రాంతమైన చోడవరం మంచు ముసుగులో ఏజెన్సీని తలపించింది. దట్టంగా మంచు కురుస్తుండంతో పగటిపూట కూడా వాహన చోదకులు లైట్లు వేసుకుని మరీ ప్రయాణాలు సాగించారు. గత రెండురోజులుగా చలి తీవ్రత అధికం కావడంతో మండలంలోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అందుచే చలితీవ్రత నుండి ఉపశమనం పొందడానికి వీలుగా వీదుల్లోను, ఇళ్లవద్ద మంటలను వేసుకుని మరీ రక్షణ పొందుతున్నారు. సాయంత్రం ఐదుగంటలయ్యేసరికి వృద్ధులు, పిల్లలు ఉన్నిదుస్తులు దరించి ఇళ్లకే పరిమితమవుతున్నారు. చలితీవ్రతతోపాటు పొగమంచు కూడా దట్టంగా కురుస్తుండటం వలన ఉదయం ఎనిమిది గంటలు దాటితేగాని సూర్యోదయం కావడం లేదు.

  ఘనంగా కాంగ్రెస్‌పార్టీ ఆవిర్భావ దినోత్సవం
  కశింకోట, డిసెంబర్ 28: జాతీయ కాంగ్రెస్‌పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మండల కేంద్రమైన కశింకోటలో అత్యంత వైభవంగా శుక్రవారం జరిగాయి. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు మల్లపురెడ్డి కోటేశ్వరరావు, జిల్లాయువజన కాంగ్రెస్‌పార్టీ నాయకులు కత్తిర శ్రీ్ధర్ ఆధ్వర్యంలో రాజీవ్‌గాంధీ, ఇందిరమ్మ విగ్రహాలకు పూలమాలవేసి నివాళ్లు అర్పించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, రొట్టెలు పంపిణీ చేసారు. ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్‌పార్టీకి పూర్వవైభవం తీసుకురావల్సిన అవసరం ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. బడుగుబలహీన వర్గాల ఆశాజ్యోతి ఇందిరమ్మ అని ఆమె ఆశయాలకు అనుగుణంగా ప్రతిఒక్కరూ పనిచేయాలన్నారు. కాంగ్రెస్‌పార్టీతోనే దేశ భవిష్యత్తు బాగుంటుందన్నారు. కాంగ్రెస్‌పార్టీ హాయాంలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతుకిసాన్ వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా భారీస్థాయిలో బాణాసంచా వెలిగించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నాయకులు సూరిశెట్టి ఆదిబాబు, వేగి భాస్కరగోవిందరావు, సత్యం, తగరంపూడి నూకరాజు, కొంతం నాగు తదితరులు పాల్గొన్నారు.


  0 0

  నర్సీపట్నం(రూరల్), డిసెంబర్ 28: సీలింగ్ భూమిని ఆక్రమించిన స్థానికేతరుడైన వ్యాపారి నుండి తమను రక్షించి తమ భూములను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ దళిత గిరిజనులు శుక్రవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా చేసారు. సీపీ ఎం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రావికమతం మండలం బాదంపాడు రెవెన్యూ పరిధిలో సీలింగ్ భూమికి గతంలో 24 మందికి పట్టాలు ఇచ్చారన్నారు. ఈ భూమిని ఇటీవల కాలంలో చోడవరంకు చెందిన ఎరువుల వ్యాపారి వసుమర్తి కామేశ్వరరావు గిరిజనులను తొలగించి భూమిని ఆక్రమించాడన్నారు. దీనిపై రావికమతం రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా చేపట్టామన్నారు. ఎరువుల వ్యాపారి చోడవరం నుండి కొందరు వ్యక్తులను తీసుకువచ్చి తమపై దాడులకు పూనుకుంటున్నాడని గిరిజనులు ఆరోపించారు. తక్షణం ఎరువుల వ్యాపారి కామేశ్వరరావు నుండి తమకు రక్షణ కల్పించాలని తమ భూములను తమకు అప్పగించాలని గిరిజనులు డిమాండ్ చేసారు. ఈకార్యక్రమంలో సీపీ ఎం నాయకుడు కె.గోవిందరావు, సీ ఐటీయు నాయకుడు సత్తిబాబు, సీపీ ఎం నాయకులు దుర్గమ్మ, నల్లమట్టి సత్తిబాబు, కెవీపీ ఎస్ నాయకుడు వై కళ్యాణం, అర్ల ఎంపీటీసీ కె.పోతురాజు, మహిళా సంఘం నాయకులు నూకరత్నం, సాయిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

  రాష్ట్రంలో 10 వేల కోట్లతో అభివృద్ధి పనులు
  * పంచాయతీరాజ్ ఛీప్ సెక్రటరీ వెంకటేశ్వరావు
  నర్సీపట్నం(రూరల్), డిసెంబర్ 28: రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో 10 వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నామని పంచాయతీరాజ్ రాష్ట్ర ఛీప్ ఇంజనీర్ ఆర్. వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఆయన నర్సీపట్నంలోని ఉత్తరవాహిని వద్ద నిర్మిస్తున్న కళ్యాణ మండపాన్ని , ఉత్తర వాహినిలో నిర్మించిన స్నాన ఘాట్‌లను ఆయన జిల్లా పంచాయతీరాజ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ 10 వేల కోట్లతో చేపట్టే పనుల్లో ఇప్పటికే 95 శాతం పనులకు టెండర్లు పిలిచామన్నారు. మిగతా ఐదు శాతం పనులకు జనవరిలో టెండర్లు పిలిచి పనులు చేపడతామన్నారు. ఈసందర్భంగా విలేకరులు ఇంత పెద్ద ఎత్తున చేపట్టే పనులకు రానున్న ఎన్నికల నేపధ్యంలో ఎన్నికల కోడ్ వస్తే పనులు నిలిచిపోయే అవకాశం ఉందా అని ప్రశ్నించగా అటువంటి పరిస్థితి లేదని టెండర్లు పిలిచిన తరువాత ఎన్నికల కోడ్ వర్తించదని ఆయన తెలిపారు. పదివేల కోట్లలో నాలుగువేల కోట్లు ఎస్సీ , ఎస్టీ సబ్ ఫ్లాన్ కింద రోడ్లు, డ్రైనేజీల అభివృద్దికి ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం ఆయన నర్సీపట్నం డివిజన్‌లో జరిగే అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈకార్యక్రమంలో జిల్లా పంచాయతీరాజ్ అధికారులు ,డివిజన్ పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు.

  అగ్ని ప్రమాదంలో ఐదు షాపులు దగ్ధం
  మాకవరపాలెం, డిసెంబర్ 28: ప్రమాదవశాత్తు నిప్పంటుకున్న సంఘటనలో మూడు బార్బర్ షాపులు, రెండు దుకాణాలు దగ్ధమయ్యాయి. మండలంలోని జి. వెంకటాపురం గ్రామానికి చెందిన కోడూరు అప్పారావు, రాజుబాబు, దొంగబాబులకు చెందిన బార్బర్ షాపులు, జోగా నాగన్న టిఫిన్ సెంటర్, సబ్బవరపు నూకరాజు కొబ్బరికాయల దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ఇవి గురువారం అర్థరాత్రి ఆకస్మాత్తుగా నిప్పంటుకుని పూర్తి కాలిబూడిదయ్యాయి. దీంతో ఈ షాపుల్లో ఉన్న సామగ్రి కాలిబూడిదైంది. ఉదయం వచి వారు చూసుకునే సరికి షాపులు అగ్నికి ఆహుతి కావడంతో వారంతా బోరున విలపించారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలియడం లేదని బాధితులు చెబుతున్నారు. ప్రభుత్వంను తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఈవిషయం తెలుసుకున్న వైసీపీ నాయకుడు రుత్తల యర్రాపాత్రుడు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఓదార్చారు. వీరికి ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేసి ఆదుకోవాలని వారు కోరారు.

  బాల్యవివాహాలపై ప్రతీ ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి
  మాకవరపాలెం, డిసెంబర్ 28: బాల్యవివాహాలను అరికట్టేందుకు సమాజంలో ప్రతీ ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని అవంతి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ సి.మోహన్‌రావు అన్నారు. కళాశాలలో ఐసీడీ ఎస్ ఆధ్వర్యంలో కిశోర వికాసంపై విద్యార్థులకు రెండు రోజుల పాటు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడుతూ బాల్యవివాహాలను అరికట్టేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు . సమాజంలో బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, బాల్యవివాహాలు, లైంగిక వేధింపులను అరికట్టాలని అయన కోరారు. ఎంపీపీ రుత్తల చిన్నయ్యమ్మ మాట్లాడుతూ బాల్యవివాహాలు వలన కలిగే అనర్థాలను ప్రతీ ఒక్క తల్లిదండ్రులు అవగాహన చేసుకోవాలన్నారు. పిల్లల భవిష్యత్‌ను నాశనం చేసే పెళ్ళిళ్ళులకు స్వస్తి పలకాలన్నారు. కోటవుటర్ల అసిస్టెంట్ సీడీపీ ఓ శాంతి ప్రియ మాట్లాడుతూ కిశోర వికాసం పథకంలో బాలికల రక్షణకు అవసరమైన పథకాలను వివరించారు. ఈకార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ కో ఆర్డినేటర్ రవితేజ, కళాశాల ఎ ఓ డానియేల్ రాజు పాల్గొన్నారు.

  తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే గ్రామాల్లో అబివృద్థి
  * ఎమ్మెల్యే కే ఎస్ ఎన్ రాజు
  రోలుగుంట, డిసెంబర్ 28: తెలుగుదేశం పార్టీ హయాంలోనే గ్రామాల్లో అభివృద్ది జరుగుతుందని చోడవరం ఎమ్మెల్యే కే ఎస్ ఎన్ రాజు పేర్కొన్నారు. తాము చేసిన అభివృద్దిని చూసి ప్రజలంతా ఓటు వేయాలంటూ ఆయన విజ్ఞప్తి చేసారు. మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రచార ర్యాలీని నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతూ గత 50 ఏళ్ళలో జరగని అభివృద్ది ప్రస్తుత దేశం పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిందన్నారు.సీసీ రోడ్లు, ప్రభుత్వ భవనాలు , తారు రోడ్డు తదితర సౌకర్యాలను కల్పించామన్నారు. రైతులకు రాయితీపై వ్యవసాయ పరికరాలను , డ్వాక్రా గ్రూప్‌లకు రుణాలు అందజేసామని ఆమె పేర్కొన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ సీసీ రోడ్లు , ఎన్టీ ఆర్ గృహ కల్ప పథకం కింద పక్కా గృహాలను నిర్మించామని ఆయన పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతీ పేదవాడికి సంక్షేమ పథకాలను అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని ఆమె వివరించారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్ధానాలన్నింటినీ శతశాతం పూర్తి చేసామని ఆయన వివరించారు. నిరుపేదలకు , శ్రామికులకు కోట్లాది రూపాయల వ్యయంతో చంద్రన్న బీమా పథకాన్ని అమలు చేస్తుందని, అలాగే ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానం మేరకు రైతులను రుణ విముక్తులను చేస్తోందని ఆయన వివరించారు. త్వరలో పూర్తి కానున్న ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా మండలంలో వేలాది ఎకరాలకు సాగునీరు అందించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని, తద్వారా ఈప్రాంతం సస్యశ్యామలం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేసారు. మండలంలోని జేపీ అగ్రహారం, కుసర్లపూడి, జానకిరాంపురం, ఎల్.కొత్తూరు, కొండపాలెం, రోలుగుంట, నిండుగొండ, కొవ్వూరు, కె.నాయుడు, బుచ్చింపేట, బుర్రంపేట గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేసి బహిరంగ సభలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుములూరు చంద్రవౌళి, పార్టీ సీనియర్ నేత గండి సింహాద్రి, పరుశం లోవరాజు, కోరుపల్లి ఈశ్వరరావు, బంటు చిరంజీవి, దాలినాయుడు, సుర్ల రామకృష్ణ, ఉలబాల పోతురాజునాయుడు తదితరులు పాల్గొన్నారు.

  గరిష్ట స్థాయికి పడిపోయిన ఉష్ణోగ్రతలు
  * విస్తారంగా కురుస్తున్న మంచు
  సీలేరు, డిసెంబర్ 28: జీకేవీధి మండలం సీలేరు మేజర్ పంచాయతీ పరిధిలో మంచు విస్తారంగా కురియడంతో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఉదయం ఆరు గంటల నుంచి 10 గంటల వరకు మంచు తెరలు గ్రామాన్ని కమ్ముకుని చల్లటి గాలులు వీస్తుండడంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి నుంచి వచ్చిన పలువురు ఇంజనీరింగ్ విద్యార్థులు, పర్యాటకులు మంచు అందాలను తిలకించేందుకు ఉదయం ఆరు గంటల నుంచే స్థానిక రిజర్వాయర్ , జల విద్యుత్ కేంద్రం వద్ద సందడి చేసారు. ప్రకృతి ప్రేమికులు మంచు అందాలను ఆస్వాదించారు. 10 గంటల వరకు సూర్యకిరణాలు గ్రామాన్ని చేరకపోవడంతో రోజువారీ పనులు వెళ్ళేవారు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

  మానవాళికి రక్షకుడు ఏసుక్రీస్తు
  పాయకరావుపేట, డిసెంబర్ 28: ఏసుక్రీస్తు ప్రపంచ మానవళికి రక్షకుడిగా నిలిచారని ఐ ఓపెనర్స్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆర్‌కే కుమార్ అన్నారు. క్రిస్మస్ సందర్భంగా పట్టణంలో ఐ ఓపెనర్స్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆర్‌కే కుమార్ క్రిస్మస్ కేక్ కట్ చేసి దైవ సందేశాన్ని వివరించారు. క్రీస్తు బోధించిన ప్రేమ, దయ, క్షమాగుణాలను అలవర్చుకుని సన్మార్గంలో నడవాలన్నారు. క్రీస్తును ఆరాధించడంతో పాటు నిత్యం క్రీస్తును హృదయంలో నిలిపి ఉంచుకుంటే ఆయన రక్షణ ఉంటుందన్నారు. అనంతరం చిన్నారులు చెప్పిన దైవ్యవాఖ్యాలు, గీతాలు , సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈకార్యక్రమం అనంతరం పెద్ద ఎత్తున బాణా సంచా కాల్చారు. ఈకార్యక్రమంలో ఫాస్టర్ జాన్ డేవిడ్, చిన్ని, కె.సుధాకర్‌రాజు, నిర్మల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

  అయ్యన్న లీగ్ ఫైనల్‌లో నాతవరం జట్టు
  నాతవరం, డిసెంబర్ 28: అయ్యన్న టీ 15 లీగ్ ఫైనల్స్‌లో నాతవరం ( ఓల్డ్‌మంక్) జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. శుక్రవారం అయ్యన్నయువసేన అధ్యక్షుడు చింతకాయల విజయ్ జిల్లెడిపూడి, నాతవరం మధ్య జరిగే క్రికెట్ పోటీలను తిలకించి విజేతలకు బహుమతులు అందించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ మండలంలోని 24 క్రికెట్ టీమ్‌లు పాల్గొన్నాయన్నారు. 20 రోజుల నుంచి జరుగుతున్న ఈ అయ్యన్న టీ 15 పోటీల్లో చివరికి జిల్లెడిపూడి, నాతవరం జట్లు మధ్య హోరాహోరీ పోటీ జరిగిందన్నారు. గెలుపొందిన నాతవరం టీమ్ నర్సీపట్నంలో జరిగే డై అండ్ నైట్ మ్యాచ్‌లో పాల్గొంటారన్నారు. ఈపోటీలకు ఎంపైర్స్‌గా హైదరాబాద్ నుంచి ప్రత్యేక కోచ్‌లు హాజరవుతారన్నారు. ఇక్కడ విజయవంతంగా జరిగినట్లే నర్సీపట్నంలో అందరి సహకారం కావాలన్నారు. ఈకార్యక్రమంలో మండల దేశం పార్టీ అధ్యక్షుడు రమణ, చైర్మెన్ కొండబాబు, మాజీ మార్కెట్ చైర్మెన్ అబ్బారావు, మండల సోషల్ మీడియా ప్రతినిది గోపీ, క్రికెట్ ఆర్గనైజర్ లోవ, రాజులు పాల్గొన్నారు.
  సబ్ స్టేషన్లకు ఫోన్ నెంబర్లు కేటాయింపు
  నాతవరం, డిసెంబర్ 28: మండలంలో మూడు సబ్ స్టేషన్లకు ప్రభుత్వం ఫోన్ నెంబర్లు కేటాయించినట్లు ఎ ఇ దాసరి చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నాతవరం సబ్ స్టేషన్‌కు 949061422, గన్నవరం సబ్ స్టేషన్‌కు 9493178524, చిన్నగొలుగొండపేటకు 9493178485 నెంబర్లకు వినియోగదారులు తమ సమస్యలపై సంప్రదించాలని ఎ ఇ తెలిపారు.


  0 0

  అరకులోయ, డిసెంబర్ 28: గిరిజన సమస్యల పరిష్కారం, నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం వచ్చే నెల 7వ తేదిన అరకులోయలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు సి.పి.ఎం. జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు వి.ఉమామహేశ్వరరావు తెలిపారు. స్థానిక గిరిజన సంఘం భవనంలో శుక్రవారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర అధి నాయకులు హాజరయ్యే ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ఏజెన్సీ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేస్తామని ఆయన అన్నారు. గిరిజనుల సమస్యలపై తెలుగుదేశం, వైసీపీలు దృష్టి సారించడం లేదని, ఈ ప్రాంతంలో లభ్యమయ్యే ఖనిజ సంపదను దోచుకునేందుకు ఈ పార్టీలు కాలాన్ని వెచ్చిస్తున్నాయని ఆయన విమర్శించారు. గత కొంతకాలంగా గిరిజనుల సమస్యలపై తమ పార్టీ పోరాటాలు చేసి అనేక సమస్యలను పరిష్కరించినట్టు ఆయన చెప్పారు. సమస్యల పరిష్కారంపై శ్రద్ధ చూపని దేశం, వైసీపీలకు రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పి సి.పి.ఎం.ను ఆదరించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో సి.పి.ఎం. నాయకులు పొద్దు బాలదేవ్, కె.రామారావు, జి.చినబాబు తదితరులు పాల్గొన్నారు.
  రహదారి నిర్మించాలి
  అరకులోయ, డిసెంబర్ 28: మండలంలోని బొండాం పంచాయతీ జయంతివలస నుంచి కొత్తవలస గ్రామం వరకు రహదారి నిర్మాణం చేపట్టాలని సి.పి.ఎం. నాయకుడు పొద్దు బాలదేవ్ కోరారు. ఈ గ్రామాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో గిరిజనులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు పేర్కొంటూ స్థానిక ఎం.పి.డి.ఒ.కు వినతిపత్రం సమర్పించారు. గతంలో అనేకసార్లు రోడ్డు నిర్మించాలని అధికారులను కోరినా ఫలితం లేకపోవడంతో గిరిజనులు రవాణా సౌకర్యానికి నోచుకోక అవస్థలు పడుతున్న విషయాన్ని అధికారుల దృష్టికి ఆయన తీసుకువెళ్లారు. ఈ గ్రామాలకు రహదారి నిర్మాణంలో జాప్యం చేస్తే ఆందోళన చేపడతామని ఆయన చెప్పారు.

  నడింపాలెం నుండి గింజర్తికి తారు రోడ్డు నిర్మించాలి
  కోటవుటర్ల, డిసెంబర్ 28: నడింపాలెం నుండి ఎం.మాకవరం మీదుగా గింజర్తికి తారు రోడ్డు నిర్మించాలని మాకవరం వాసులు కేంద్ర కాఫీ కాఫీ బోర్డు సభ్యులు , బీజేపీ నేత లోకుల గాంధీకి విజ్ఞప్తి చేసారు. మండలంలోని ఎం.మాకవరంలో శుక్రవారం ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా అక్కడి ప్రజలు, స్థానిక సమస్యలను గాంధీకి వివరించారు. ఐ ఎ వై పథకంలో మంజూరైన గృహాలకు చెల్లింపులు జరగడం లేదని లబ్దిదారులు వాపోయారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతీ పేదవాడికి కేంద్ర ప్రభుత్వం ఉచిత గ్యాస్ కనెక్షన్ మంజూరు చేస్తే వాటికి రాష్ట్ర ప్రభుత్వం 1,500 వసూలు చేస్తుందని ఆరోపించారు. గిరిజన నిరుద్యోగులకు ఉపాధి కల్పనకై కేంద్ర ప్రభుత్వం బొలోరా, ఇన్నోవా వాహనాలకు నిధులు మంజూరు చేస్తుండగా వాటిపై ధ్యాంక్యూ సీ ఎం ఆసార్ అంటూ ముద్రించుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈకార్యక్రమంలో పార్టీ నేతలు అబ్బాయిదొర, శరభయ్య, అరిమెల రాజు, దేముడు, నాని తదితర పలువురు పాల్గొన్నారు.

  విస్తారంగా పొగ మంచు
  కొయ్యూరు, డిసెంబర్ 28: మన్యంలో భిన్న వాతావరణం చోటు చేసుకుంటోంది. ఒక పక్క చలి వణికిస్తుండగా ఉదయం పూట కురుస్తున్న పొగ మంచు ప్రజానీకాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మన్యంలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గి చలితీవ్రత పెరిగింది. శుక్రవారం మండలంలో భిన్న వాతావరణం చోటు చేసుకుంది. ఉదయం 8 గంటల వరకు సూర్యకిరణాలు ప్రసరించి ఎండ కాస్తూ ఒక్కసారిగా మబ్బులు కమ్ముకుని పొగ మంచు విస్తారంగా కురిసింది. కాకరపాడు నుంచి చింతాలమ్మ ఘాట్ వరకకు తొమ్మిది గంటల సమయంలో సుమారు గంట పాటు కురిసిన దట్టమైన పొగ మంచు వాహన చోదకులు కొంత ఇబ్బంది పడ్డారు. మంచుతో పాటు వీచిన చలిగాలులకు వృద్ధులు, చిన్నారులు ఒక్కింత ఇబ్బందికి గురయ్యారు. ప్రస్తుతం మామిడి, జీడిమామిడి తోటల సమయం కావడంతో పొగ, తేనె మంచుల వలన పూతమాడిపోయే ప్రమాదం ఉందని రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన్యంలో ఉదయం పూట కమ్ముకుంటున్న మంచు తెరలు పలువురిని ఆహ్లాదరపరుస్తుండగా కొందరికి ఇబ్బంది కరంగా మారుతున్నాయి.

  సంపద తయారీ కేంద్రాన్ని అడ్డుకుంటాం
  కోటవుటర్ల, డిసెంబర్ 28: స్థానిక గొల్లపేట వద్ద చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం వద్దంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం సంపద తయారీ కేంద్రం వద్ద గ్రామస్తులు వంటా వార్పు కార్యక్రమాలు చేపట్టి భోజనాలు కూడా అక్కడే చేసారు. ఈసందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ సంపద తయారీ కేంద్రాన్ని అడ్డుకుంటామని స్పష్టం చేసారు. ఈ కేంద్రాన్ని ఇక్కడి నుంచి వేరొక చోటకి తరలించాలన్నారు. సంపద తయారీ కేంద్రం వలన దుర్గంధం వెలువడుతుందన్నారు. దీని వలన ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. పరిసరాలు కలుషితం అవుతాయన్నారు. అధికారులు మాత్రం నిర్మాణ పనులకు ఏర్పాటు చేస్తున్నారు. సంపద తయారీ కేంద్రం వలన ఎటువంటి దుర్గంధం రాదని ఎడీవో కళ్యాణి తెలిపారు. ఈకేంద్రం వలన గ్రామంలో పరిశుభ్ర వాతావరణం నెలకొంటుందన్నారు. ఈకేంద్రంలో సేంద్రీయ ఎరువులు తయారవుతాయన్నారు. దీని విక్రయం ద్వారా పంచాయతీకి ఆదాయం వస్తుందన్నారు.


  0 0

  పాడేరు, డిసెంబర్ 28: ప్రధాని నరేంద్రమోడి రాష్ట్ర పర్యటనను నిరసిస్తూ వచ్చే నెల ఒకటో తేదిన నిర్వహించే నిరసన ర్యాలీలో తెలుగు తమ్ముళ్లంతా పాల్గొని విజయవంతం చేయాలని పాడేరు శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరి కోరారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన నియోజకవర్గం స్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన ప్రధాని రాష్ట్ర పర్యటనకు వస్తుండడం సిగ్గుచేటని అన్నారు. ప్రధాని రాష్ట్ర పర్యటనను ప్రతి ఆంధ్రుడు వ్యతిరేకించాల్సి ఉందని, తమ నిరసనల ద్వారా ప్రధానికి తగిన బుద్ధి చెప్పి, ఆంధ్రుల సత్తాను చూపించాలని ఆమె కోరారు. నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వ నమోదును నాయకులు వేగవంతం చేయాలని ఆమె చెప్పారు. సభ్యత్వ నమోదులో అలసత్వం జరుగుతుండడం సరికాదని, పార్టీ యంత్రాంగమంతా దీనిపై ప్రధానంగా దృష్టి సారించాలని ఆమె అన్నారు. నియోజకవర్గంలో నిర్ధేశించిన సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని పూర్తి చేయాల్సి ఉందని ఆమె చెప్పారు. వచ్చే నెల 2వ తేది నుంచి ప్రారంభం కానున్న జన్మభూమి కార్యక్రమాలలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని ఆమె కోరారు. ప్రభుత్వ పథకాల విస్తృత ప్రచారానికి జన్మభూమి చక్కని వేదికని. దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఈశ్వరి చెప్పారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ అరకులోయ పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకుడు వేణుగోపాలరాయుడు, దేశం నాయకులు కవడం మచ్చమ్మ, సత్యనారాయణ, రొబ్బి రాము, చల్లంగి లక్ష్మణరావు, బేతాళుడు, రామ్మూర్తి, బలరాం, చిట్టిబాబు, అల్లంగి సుబ్బలక్ష్మి, బొర్రా నాగరాజు, బొజ్జమ్మ, నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

  కాఫీ ధర పెంపు
  పాడేరు, డిసెంబర్ 28: గిరిజనులు పండిస్తున్న కాఫీకి గణనీయంగా ధరను పెంచినట్టు గిరిజన సహకార సంస్థ (జి.సి.సి.) పాడేరు డివిజనల్ మేనేజర్ పి.మోహనరావు శుక్రవారం విలేఖరులకు తెలిపారు. గత సంవత్సరం తమ సంస్థ రైతుల నుంచి సేకరించిన కాఫీకి మొదటి విడతగా చెల్లించిన మొత్తంలో 50 నుంచి 80 శాతం ధరను పెంచుతూ అపెక్స్ కమిటీ నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. దీంతో ఈ సంవత్సరం పాచిమెంట్ కాఫీకి కిలో 120, చెర్రీ కాఫీకి 62 రూపాయల వంతున చెల్లించనున్నామని ఆయన తెలిపారు. కాఫీ సేకరణ ధరను పెంచడంతో గిరిజన రైతులు దళారీల బెడద నుంచి రక్షణ పొంది, తాము పండిస్తున్న కాఫీని జి.సి.సి.కి విక్రయించాలని ఆయన కోరారు. కాఫీతో పాటు పలు గిరిజనులు పండిస్తున్న పలు పంటలకు కూడా ధరలు పెంచినట్టు ఆయన తెలిపారు. గిరిజనులు పండించే తెలుపు రాజ్‌మాను 70, ఎరుపు రాజ్‌మా 48, రాగులు 19, కందులు 39, పసుపు 90, వైట్ బీన్స్ 25 రూపాయల వంతున కొనుగోలు చేయనున్నట్టు ఆయన చెప్పారు. ఈ విషయమై గిరిజన రైతులు గమనించి తమ ఫలసాయాలను జి.సి.సి.కి విక్రయించి ఆర్థిక ప్రయోజనం పొందాలని మోహనరావు కోరారు.

  టీడీపీ విజయం తథ్యం
  అరకులోయ, డిసెంబర్ 28: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం తధ్యమని అరకులోయ పార్లమెంట్ నియోజకవర్గం పార్టీ ఇన్‌చార్జి యర్రా వేణుగోపాలరాయుడు అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ దేశం పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడాలంటే నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని అన్నారు. తమ ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై విస్తృతంగా ప్రచారం చేసి పార్టీని బలోపేతం చేయాలని ఆయన కోరారు. నియోజకవర్గంలో సంస్థాగతంగా తమ పార్టీ బలోపేతం కావలసి ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకుని పార్టీ యంత్రాంగం నిరంతరం పనిచేయాలని ఆయన సూచించారు. పార్టీ సభ్వత్వాల నమోదులో, బూత్ కన్వీనర్లు, ఏరియా కో-ఆర్డినేటర్ల నియామకాలలో బాగా వెనుకబడి ఉన్నట్టు గుర్తించామని ఆయన చెప్పారు. దీనిని అదిగమించాలంటే ఇప్పటి నుంచే కన్వీనర్లు, కో-ఆర్డినేటర్ల నియామకాలు చేపట్టి భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి సారించాలని ఆయన అన్నారు. నియోజకవర్గం పరిధిలో 259 పోలింగ్ బూత్‌లు ఉండగా ఈ బూత్‌లలో కన్వీనర్లను నియమించి వారి బాధ్యతను గుర్తు చేయాల్సి ఉందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏ నాయకుడు వలన జరుగుతాయన్న విషయాన్ని గమనించి ఆ పార్టీ నేతలను ఎన్నికల్లో గెలిపించాల్సిన అవసరం ఉందంటూ ప్రచారం చేయాలని ఆయన అన్నారు. వచ్చే నెలలో కీలకమైన నాయకులతో పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించి పార్టీ బలోపేతంపై వ్యూహాన్ని రూపొందించాలని ఆయన సూచించారు. గతంతో పోల్చకుండా పార్టీ సభ్యత్వాల నమోదును అత్యధిక సంఖ్యలో చేపట్టాలని, రెన్యూవల్ తప్పనిసరిగా చేయాలని వేణుగోపాలరాయుడు కోరారు. ఈ సమావేశంలో దేశం నాయకులు శెట్టి లక్ష్మణుడు, కె.అరుణకుమారి, బాబురావు, అప్పాలు, పద్మ, పొద్దు అమ్మన్న, కంబిడి సుబ్బారావు, సిరిగాం గోపాల్, మోస్యా జోగారావు, సాయిరాం, తుడుం సుబ్బారావు, పాండురంగస్వామి తదితరులు పాల్గొన్నారు.


  0 0

  విశాఖపట్నం,డిసెంబర్ 28: విశాఖ ఉత్సవ్‌లో భాగంగా సీటీ సెంట్రల్ పార్కులో ఏర్పాటు చేసిన పుష్పప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. రంగుల పూలతో రూపుదిద్దుకున్న సొగసరి బొమ్మలు, పక్షుల ఆకారంతో ఆకట్టుకున్న పూలు, విదేశీ పూల గుబాళింపులు తన్మయత్మానికి గురిచేశాయి. వివిధ రకాల జాతులకు సంబంధించిన పూలతో ఏర్పాటు చేసిన డిజైన్లు ఆదరహో అనిపించింది. ప్రదర్శనను విక్షీంచేందుకు లోపలకు వచ్చే మార్గంలో కప్,సాసర్, పక్షుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విదేశాల నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన కొన్ని రకాల ఆకులతో తయారు చేసిన సింబల్స్ ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే లవ్ సింబల్స్‌తో స్వాగతద్వారాలు కూడా అందరిని ఆలరిస్తున్నాయి. ఈ పుష్పప్రదర్శనలో పలువురు నగర ప్రజలు, పర్యాటకులు, యువతీ, యువకులు సెల్పీలతో సందడి చేశారు. అంతేకాకుండా విశాఖ బోన్సాయ్ వెల్పెర్ సోసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ కూడా ఆకట్టుకుంది. వంద జాతులకు చెందిన పలు మొక్కల్ని స్టాల్స్‌లో ఏర్పాటు చేశారు.
  * పుష్పప్రదర్శనను తిలకించిన సీ ఎం
  నగరంలోని అందరికీ వీలుగా ఉండే విధంగా ఖాళీ ప్రాంతంలో పుష్పప్రదర్శన ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పలు జాతి పుష్పాలతో రూపొందిన ప్లవర్‌షోను ముఖ్యమంత్రి చంద్రబాబు తిలకించారు. ఈ సందర్భంగా విఎంఆర్‌డీఎ కమిషనర్ బసంత్‌కుమార్ పలు దేశాల నుంచి వచ్చిన పూల వివరాలు, తదితర వాటిని సీఎంకు వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు, అచ్చెంనాయుడు, కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్, జెసీ సృజన, సీపీ మహేష్ చంద్ర లడ్డా, ఇతర పర్యాటక శాఖ అధికారులు పాల్గొన్నారు.

  సార్వత్రిక సమ్మెకు కార్మిక లోకం సమాయత్తం
  గాజువాక, డిసెంబర్ 28: జనవరి 8,9 తేదీల్లో జరగనున్న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం పాల్గొనే ఉక్కు కార్మిక సంఘాలు కార్మికులను చైతన్య పరుస్తున్నాయి. శుక్రవారం ఆఖిల పక్ష కార్మిక సంఘాల నాయకులు ఉక్కులోని పలు విభాగాల్లో సమావేశాలు నిర్వహించాయి. ఆయా విభాగాల కార్మికులతో చర్చించి కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు రెండు రోజుల పాటు జరగనున్న సమ్మెలో ఉక్కు కార్మికులు సైతం పాల్గొని జయప్రధం చేయాలని అన్నారు. సమ్మె చేయడం వలన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వస్తాయని అన్నారు. కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కారం కావాలంటే కార్మికులు సమ్మె చేయక తప్పదన్నారు. కార్మికుల సమ్మెతో ప్రభుత్వాల మెడలు వంచాలన్నారు. కార్మికుల హక్కులను, ఆర్ధిక ప్రయోజనాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడా పారిశ్రామిక వేత్తలకు తాకట్టు పెట్టేయడానికి యత్నిస్తున్నాయని అన్నారు. పరిశ్రబలు బడాబాబుల చేతుల్లోకి వెళితే కార్మికుల బతుకులు ప్రశ్నార్ధకంగా మారనున్నాయన్నారు. నిరుద్యోగ యువతకు శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు లభించే అవకాశం ఉండదన్నారు. విశాఖ ఉక్కు ఉత్పత్తి, ఉత్పాదకతల్లో సంస్ధ 3.3నుండి 6.3 మిలియన్ టన్నులకు చేరుకున్నందున సొంత గనులు కేటాయించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపడం లేదన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం నిర్మాణం జరిగి సంవత్సరాలు గడిచి పోతున్నా ప్రభుత్వం సొంత గనులు కేటాయించేందుకు చొరవ చూపడం లేదన్నారు. ఉక్కు కర్మాగారం ఎపుడు ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొంటుందోనని కార్మిక వర్గంలో ఆందోళన వ్యక్తమవుతుందని అన్నారు. సంస్ధకు ఎదురు కానున్న గండాన్ని గట్టెక్కించాలంటే కార్మికులు సమ్మెలో పాల్గొని ఆయా ప్రభుత్వాలకు కనువిపుకల్పించాలన్నారు. ఉక్కు పరిరక్షణకు, సొంత గనులు కేటాయింపునకు ప్రభుత్వం ముందుకు రాకపోగా షేర్ల విక్రయం పేరుతో కార్మిక వర్గంలో గుబులు పుట్టిస్తుందన్నారు. టిఎంసి విధానం అమల్లోకి తీసుకు రావడం ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చునని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తు జనవరి 8,9తేదీల్లో జాతీయ కార్మిక సమ్మె జరగనుందన్నారు. ఈ సమావేశంలో యూనియన్‌ల నాయకులు పాల్గొన్నారు.
  దేశ ప్రగతి ఘనత కాంగ్రెస్‌దే
  గాజువాక, డిసెంబర్ 29: భారత దేశం అన్నిరంగాల్లో ప్రగతి పథంలో పయనింపచేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ గాజువాక నియోజక వర్గం ఇన్‌చార్జి మంత్రి రాజశేఖర్ అన్నారు. పారిశ్రామిక ప్రాంతమైన గాజువాక, పెదగంట్యాడలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఆయా ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో మంత్రి రాజశేఖర్, తెప్పల సాంబశివరావు, మంత్రి శంకర నారాయణ, ఉరుకూటి అప్పలనాయుడు, మంత్రి మూర్తి, గుడివాడ అమ్మన్న, సంపూర్ణం, ఈటి శ్రీరాములు, అప్పారావు, అచ్చిబాబు, సత్యనారాయణ తదితరులు పాల్గొని ముందుగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు అన్ని వర్గాల ప్రజలకు చేదోడు వాదోడుగా నిలిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు దేశానికి శ్రీ


  0 0

  విశాఖపట్నం, డిసెంబర్ 28: ఆర్టీసీ విశాఖ రీజియన్ ఇక మారదు...ఒక్కరోజు కోసం రోజూ తిరిగే ప్రయాణికులను ఇబ్బందులు పెట్టడం సాధారణంగా మారింది. వందలు, వేలు, లక్షలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విశాఖ జిల్లాలోనే కాదు...ఉత్తరాంధ్రలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడైనా సిఎం సభ అంటే చాలు...అక్కడకు విశాఖ నగరంలో సిటీ సర్వీసుల్లో సగానికి పైగా వెళ్ళిపోతూనే ఉంటాయి. శ్రీకాకుళం జిల్లా సిక్కోలులో ఈ మధ్య జరిగిన సిఎం సభకు ఏకంగా 500 బస్సులు విశాఖ నగరంలోని సిటీ సర్వీసులు వెళ్ళిపోయాయి. ఇవన్నీ రోజంతా అభిమానులు, కార్యకర్తలను తరలిస్తూనే ఉన్నాయి. తగరపువలసలో జరిగిన సిఎం సభకు 300కు పైగానే బస్సుల ద్వారా జనాన్ని తరలించడం జరిగింది. ఈ విధంగా రెండు వేర్వేరు రోజుల్లో జరిగిన సభలకు సిటీల్లో సగానికి పైగా వెళ్ళిపోవడంతో నగరవాసులు నరకం చూశారు. ముఖ్యంగా ఉదయం నుంచి కాలేజీలకు వెళ్ళే విద్యార్ధినీ, విద్యార్థులు, దుకాణాలు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, నిర్మాణ రంగాల్లో పనిచేస్తున్న వలస కూలీలు, షాపింగ్‌మాల్స్‌లో పనిచేసే మహిళలు ఇలా వేలాది మంది ప్రయాణికులకు రోజంతా ఇబ్బందులు తప్పలేదు. దీనిపై ఆర్టీసీ అధికారులను ప్రయాణికులు నిలదీశారు కూడా. వీరి నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీని గురించి ఇంకా మరువక ముందే శుక్రవారం అనకాపల్లిలో జరిగిన సిఎం సభకు దాదాపు 300 ప్రత్యేక బస్సులు విశాఖ రీజియన్ నుంచి వెళ్ళిపోయాయి. ఇవన్నీ జనాన్ని తరలించడంతోపాటు మరికొన్నింటినీ విశాఖ ఉత్సవ్‌కు నడుపుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఆర్‌కె బీచ్ ఉత్సవ్ వద్దకు 50కి పైగానే బస్సులు నడుస్తున్నాయి. దీనివల్ల శుక్రవారం ఉదయం నుంచి ఉన్న కొన్ని బస్సులపైనే ఆధారపడటంతో వీరి సహనానికి పరీక్షగా మారింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆటోలను ఆశ్రయించడంతో ఇష్టానుసారంగా చార్జీలు పెరిగిపోయాయి. ఒకవైపు ప్రయాణికుల అవసరాలను ఆటోలు సొమ్ము చేసుకుంటుండగా, మరోపక్క సిటీ సర్వీసుల ద్వారా వెళ్ళే సీజన్ టికెట్ హోల్డర్లు నష్టపోవాల్సి వస్తోంది. బస్సు పాస్ కోసం ఒకేసారి సొమ్ము చెల్లిస్తున్నా, సిఎం సభల సందర్భాల్లో ఆటోల దోపిడికీ గురవుతున్నామంటూ ప్రయాణికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కాగా అనకాపల్లి సిఎం సభకు బస్సులు తరలించడం, మరోపక్క శుక్రవారం నుంచి ప్రారంభమైన విశాఖ ఉత్సవ్‌కు మరికొన్నింటినీ నిర్వహిస్తున్నందున తప్పనిసరి పరిస్థితుల్లో తూర్పు గోదావరి జిల్లా నుంచి 30 బస్సులను ఇక్కడి అధికారులు రప్పించారు. మొత్తంమీద శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఎక్కడి జనం అక్కడే అన్న పద్ధతిలో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురికాక తప్పలేదు.
  వేతన సవరణ చేయాల్సిందే...
  * సమస్యలు తీర్చకపోతే ఉద్యమం ఉధృతం
  * ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ హెచ్చరిక
  ఆంధ్రభూమి బ్యూరో
  విశాఖపట్నం, డిసెంబర్ 28: ఆర్టీసీ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేనిపక్షంలో కార్మికుల ఉద్యమాన్ని మరింతగా తీవ్రతరం చేస్తామని ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి ప్రభాకరయాదవ్ హెచ్చరించారు. యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రిలే నిరాహారదీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులనుద్దేశించి ఆర్టీసీ కార్మికులకు వేతన సవరణను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కారుణ్య నియామకాలు, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడం, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలన్నారు. ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించిన రూ.500 కోట్ల నిధులు విడుదల చేయాలన్నారు. ఆర్టీసీ యాజమాన్యం సమస్యలపై స్పందించి వీటిని పరిష్కరించే క్రమంలో ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. లేనిపక్షంలో ఈ నెల 31వ తేదీన సమ్మె నోటీసు జారీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్వి జేవీ సత్యనారాయణమూర్తి, ఏఐటీయూసీ నాయకుల పడాల రమణ, రాష్ట్ర కార్యదర్శి రామారావు, యుఎస్ నారాయణ, ఏ.సురేష్ అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

  జనసేన ఉత్తరాంధ్ర పార్టీ కార్యాలయం ప్రారంభం
  * జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్
  విశాఖపట్నం, డిసెంబర్ 28: జనసేన పార్టీకి కేటాయించిన గాజుగ్లాస్ గుర్తుపై ప్రజలల్లో విస్తృత ప్రచారం కల్పించాలని జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. విశాఖలోని అక్కయ్యపాలెంలో శుక్రవారం జనసేన పార్టీ ఉత్తరాంధ్ర కార్యాలయాన్ని మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆయన మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో సంక్రాంతి పండగ తరువాత 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ఎంపిక చేసే ప్రక్రియను చేపడతామన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన ప్రతీ సమావేశం ఇక్కడే నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని, రాజకీయ లబ్ధికోసం కాకుండా ప్రజా సమస్యలపై అధ్యయనం చేసి వాటిని పరిష్కరించేందుకు దిశగా పరిష్కరించే దిశగా జనసేన అడుగులు వేస్తుందన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జనవరి ఒకటో తేదిన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జనసేన వంద రోజుల ప్రయాణంపై కార్యాచరణ విడుదల చేయనున్నారని వెల్లడించారు. ఇటీవల కాలంలో పార్టీ తరుపన నిర్వహించిన జనబాట, జన తరంగం కార్యక్రమాల్లో చాలా మంది జనసైనికులు చురుగ్గా పాల్గొనడం జరిగిందని, జనసైనికులు వాళ్ల అనుభవాలు తెలియజేశారన్నారు. ఐదు రోజల పాటు నిర్వహించిన కార్యక్రమంలో కోటికిపైగా ఓటర్లును జనసైనికులు కలవడం చాలా పెద్ద విజయమన్నారు.ఈ సమావేశంలో పార్టీ నాయకులు పసుపులేటి బాలరాజు, కన్వీనర్ పార్థసారధి, జిల్లా నాయకులు అశోక్‌కుమార్, మండవ రవికుమార్, కొన తాతారావు, చింతలపూడి వెంకటరమయ్య తదితరులు పాల్గొన్నారు.
  విశాఖ ఉత్సవ్ కళకళ
  * సీటీ సెంట్రల్ పార్కులో ఆకట్టుకున్న పుష్పప్రదర్శన
  * ఆర్కేబీచ్, జాతరలో ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
  * ఉల్లాసంగా... ఉత్సాహంగా కార్నివాల్
  విశాఖపట్నం,డిసెంబర్ 28: విశాఖ నగర వైభవాన్ని తెలయజేస్తూ మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన విశాఖ ఉత్సవ్ పండగ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఉత్సవాల్లో భాగంగా ఏయూ కన్వికేషన్ సెంటర్ నుంచి భారీ జనంతో ఉత్స్‌వ్ కార్నివాల్ నిర్వహించారు. అనంతరం ఆర్కేబీచ్‌లోని ప్రధాన వేదికపై తూర్పు నౌకదళ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్యాండ్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. అనంతరం డప్ప,డ్యాన్స్‌లు, వాయిద్యాలతో నిర్వహించిన గిరిజన నృత్యాల్లో ముఖ్యమంత్రి నగరా మోగించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో విశాఖ ఉత్సవ్ వైభవాన్ని, భవిష్యత్‌లో ఏ తరహాలో ఏ విధంగా అభివృద్ధి చేస్తామనే అంశాలపై ప్రసంగించారు. అలాగే సీటీ సెంట్రల్ పార్కులో ఎంతో ప్రతిష్టాత్మాకంగా 126 రకాలతో ఏర్పాటు చేసిన పుష్పప్రదర్శనను సీ ఎం తిలకించారు. అలాగే మధురవాడలోని జాతర కళా వేదికలో కూడా విశాఖ ఉత్సవ్ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అయితే గతేడాది కంటే ఈ ఏడాది ఉత్సవాలకు జనం అధిక సంఖ్యలో తరలివచ్చారు. జిల్లా అధికార యాంత్రాంగం, పర్యాటక శాఖాధికారుల సమన్వయంతో నిర్వహించిన విశాఖ ఉత్సవ్‌లో స్థానిక కళాకారులతో పాటు, దేశ, విదేశీ కళాకారులు ప్రదర్శించిన పలు కార్యక్రమాలు అందరినీ ఆలరించాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, అచ్చెంనాయుడు, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్‌బాబు, బండారు సత్యనారాయణ,వెలగపూడి రామకృష్ణ, విష్ణుకుమార్ రాజు, కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, జెసీ సృజన, జీవీ ఎంసీ కమిషనర్ హరినారాయణన్, వి ఎం ఆర్‌డీ ఏ కమిషనర్ బసంత్‌కుమార్, పర్యాటకశాఖాధికారిణి పూర్ణిమాదేవి, డీ ఆర్‌డీ ఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

  ఉత్సవాలను రాజకీయం చేస్తారా
  * ఎయిర్ షో నిర్వహాణలో కేంద్రం కావాలనే కుట్ర
  * విశాఖ ఉత్సవ్ ప్రజల పండగ, చంద్రబాబుది కాదు
  * కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డ మంత్రి గంటా
  విశాఖపట్నం,డిసెంబర్ 28: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మాకంగా నిర్వహిస్తున్న విశాఖ ఉత్సవ్‌లో పర్యాటకులను ఆకర్షించే విధంగా ఎయిర్‌షో నిర్వహించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం కుట్రలో భాగంగానే ఆఖరి నిమిషంలో రద్దు చేసిందని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. విశాఖ ఉత్సవ్‌లో భాగంగా సీటీ సెంట్రల్ పార్కులో ఏర్పాటు చేసిన 126 రకాల పుష్పప్రదర్శనను మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం మంత్రి గంటా మాట్లాడుతూ విశాఖ ఉత్సవ్ పండగ చంద్రబాబుది కాదుని, ప్రజల పండగని గుర్తించాలన్నారు. విశాఖలో ఎయిర్‌షో నిర్వహించేందుకు తూర్పు నౌకదళ అధికారులతో పాటు,్ఛప్ సెక్రటరీ కూడా కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడారని ఏర్పాటుకు సంబంధించి ప్రత్యేకంగా ఓ వాహనాన్ని విశాఖకు పంపించేందుకు కేంద్ర అధికారులు అంగీకరించే ఆయా వాహనాన్ని విశాఖకు పంపారని, మార్గమధ్యలోనే తిరిగి మళ్లీ వెనక్కి తీసుకువెళ్లారని, ఎయిర్‌షోలో పాల్గొనేందుకు విమానాలు కూడా విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చాయని, కేవలం కావలనే ఏపీపై కుట్రతోనే ఎయిర్‌షోను రద్దు చేయడం సరికాదున్నారు. దేశంలో ఏపీ రాష్ట్రం అంతర్భగం అవునా?కాదాని ప్రశ్నించారు. ఇప్పటికే ఎయిర్‌షో రద్దు తదితర విషయాలను సీ ఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లామని, దీనికి సంబంధించి వుడా తరుపున కేంద్ర ప్రభుత్వానికి రద్దు గల కారణాల కోసం లేఖ రాయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉత్సవ్‌ల విషయంలో కూడా రాజకీయం చేస్తూ బురుదజల్లె ప్రయత్నం మంచి పద్దతికాదుని మండిపడ్డారు.


  0 0

  విశాఖపట్నం,డిసెంబర్ 28: ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక,్ఫంచన్‌దార్లు పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ స్థానిక ఏపీ ఎన్జీవో సంఘం కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు కె. ఈశ్వరరావు మాట్లాడుతూ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్‌సీ-2018ని తక్షణమే అందించాలని, లేని పక్షంలో మధ్యంతర భృతిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్‌లో ఉన్న కరువుభత్యం(డిఎ)లను ప్రకటించాలని, ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోని డీఎ బకాయిలను చెల్లించిందన్నారు. చాలా కాలంగా పోరాటాలు చేస్తున్న సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత ఫించన్ విధానానే్న అమలు చేసే విధంగా చర్యలు తీసుకొవాలన్నారు. ఈ విషయంపై ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేయాలని అనేక సార్లు కోరుతున్నా కనీసం పట్టించుకొకపోవడం దారుణమన్నారు. సీపీఎస్ రద్దు విషయంలో కేవలం కాలయాపన చేయడానికే కమిటీలను నియమించిందన్నారు. ఢిల్లీ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా తీసుకున్న సాహోసపేత నిర్ణయం మాదిరిగానే ఏపీ ప్రభుత్వం సీపీ ఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంపు,క్రమబద్ధీకరణ విషయంలో కోర్టు వివాదాలను సాకుగా చూపి నేటికి ఆయా ఉద్యోగులను రెగ్యులర్ చేయడం లేదున్నారు. గురుకులాలు, ఎయిడెడ్ పాఠశాల్లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందికి 11పీఆర్‌సీ అమలు చేయాలని, రాష్ట్రంలోనే అత్యంత ఖరీదైన నగరంగా ఉన్న విశాఖ నగరంలోని పనిచేసే ఉద్యోగులకు హెచ్ ఆర్ ఏ శాతాన్ని 20 నుంచి 30కి పెంచాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోని వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ఎటువంటి ఉద్యోగ భద్రత లేని కారణంగా వారికి కూడా చంద్రన్నబీమా పథకాన్ని వర్తింప చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లాలోని అన్ని శాఖల ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.రవిశంకర్, అసోసియేట్ ప్రెసిడింట్ పీఎం జవహర్‌లాల్, నగర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు,కార్యదర్శి వివివి ఆర్‌వి సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శి ఇంటి ఈశ్వరరావు,కోశాధికారి డి.వెంకటేశ్వరరావు, ఏపీ నర్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు మద్దిరాల ఇందిరా,శాంతిమ్మ, ఉపాధ్యాయ సంఘం నాయకుడు వెంకటపతిరాజు, నాయకులు నియోగి, కృష్ణమూర్తి,సుబ్రహ్మణ్యం ఇతర సభ్యులు పాల్గొన్నారు.

  బాలల దండనలపై ఉక్కుపాదం మోపండి
  వివాఖనట్నం,డిసెంబర్ 28: ఇటీవల కాలంలో రాష్ట్రంలో వరుసుగా ఏదో ఒక చోట బాలలపై శారీరక, మానసిక చిత్రవదలకు పాల్పడుతున్న ప్రభుత్వ,ప్రైవేట్,కార్పొరేట్ పాఠశాలలపై ప్రభుత్వం పోలీసులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చైల్డ్‌రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు జి.సీతారామ్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. చిత్తురు జిల్లా పుగనూర్ రామ్‌నగర్ కాలనీలోని ఓ పాఠశాలలో గురువారం మూడో తరగతి చదవుతున్న ఆరుగురు విద్యార్థులు తరగతులకు ఆలస్యంగా వచ్చారన్న కారణంగా అర్థనగ్నంగా నిలిబెట్టి యాజమాన్యం బాలల మానసిక స్థైర్యంపై కోలుకోలేని దెబ్బకోట్టడం బాలల హక్కుల పరిరక్షణకు విఘాతమన్నారు. త్వరలోనే చైల్డ్‌రైట్స్ ప్రొటెక్షన్ ఫొరం నిజనిర్థారణ కమిటీ సభ్యులు పాఠశాలను సందర్శించినపుడు బాలలు బయటకు చెప్పుకొలేని నగ్నసత్యాలు కన్నీటిపర్యంతంతో చెప్పడం విచారకరమన్నారు. ఇప్పటికే ఫోరం సభ్యులు జిల్లా పోలీస్ అధికారులను కలసి ఆయా ఉపాధ్యాయలు, పాఠశాల యాజమాన్యంపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారన్నారు. తక్షణమే పాఠశాల రద్దుకు విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకొవాలని కొరారు.
  30న మీ-సేవా కేంద్రాలు పనిచేస్తాయి
  విశాఖపట్నం,డిసెంబర్ 28: జీవీ ఎంసీకి చెల్లించాల్సిన ఆస్తిపన్ను, ఖాళీ స్థలాల పన్ను వడ్డీ లేకుండా ఈ నెల 31వ తేది వరకూ చెల్లించాలని కమిషనర్ హరినారాయణన్ పేర్కోన్నారు. అయితే ఈ నెల 30వ తేది ఆదివారం నాడు కూడా నగరంలోని అన్ని మీ-సేవా కేంద్రాలు తెరచి ఉంటాయని, పన్ను చెల్లింపుదారులంతా జోనల్ కార్యాలయాలు, ఆన్‌లైన్ ద్వారా,పురసేవా యాప్ ద్వారా పన్నులు చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని కోరారు.

  దక్షిణ నియోజకవర్గాన్ని మత్స్యకారులకే కేటాయించాలి
  * మత్స్యకార ఐక్యవేదిక అధ్యక్షుడు శాంతారాం
  విశాఖపట్నం,డిసెంబర్ 28: రానున్న ఎన్నికల్లో మత్స్యకారులకు అన్ని రాజకీయ పార్టీల నేతలు తగిన ప్రాధాన్యతను కల్పిస్తూ, విశాఖ దక్షిణ నియోజకవర్గానికి సంబంధించి అన్ని పార్టీలు మత్స్యకారుల వర్గానికి చెందిన వారికే సీటు కేటాయించాలని మత్స్యకార ఐక్యవేదిక అధ్యక్షుడు శాంతారాం అన్నారు. నగరంలోని విజె ఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 40లక్షల మంది ఉన్న తమకు జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించడం లేదున్నారు. సముద్రం, నదులు, చెరువుల్లో మత్య్సవేట ఆధారంగా జీవనం సాగిస్తున్న తమను కేవలం ఓటు బ్యాంక్‌గా రాజకీయ పార్టీలు వాడకుంటున్నారని, ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేస్తూ తర్వాత విస్మరిస్తూన్నాయన్నారు.విశాఖ జిల్లాలోని మత్య్సకారులకు పుటినిల్లుగా ఉన్న దక్షిణ నియోజకవర్గంలో50 వేల మంది మత్స్యకారులు ఉన్నారని, వారికి కాకుండా ఇతర కులస్థులకు ఏ రాజకీయ పార్టీయినా సీట్లు కేటాయింపులు చేస్తే వారికి ఐక్యవేదిక తరుపున తగిన గుణపాఠం చెబుతామన్నారు. త్వరలోనే మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి సంబంధించి 13జిల్లాల ప్రతినిధులతో విశాఖలోని భారీ బహిరంగ సభను నిర్వహించనున్నామని, ఇటీవల కాలంలో మత్స్యకారుల సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశామని, ప్రభుత్వం వాటి పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, ఎన్నికల హామీల్లో ఇచ్చిన హామీలను పరిష్కరించకపోతే ప్రభుత్వానికి తమ ఓటు బ్యాంక్ ద్వారా తగిన విధంగా బుద్ది చెబుతామన్నారు. ఈ సమావేశంలో మత్స్యకార సంఘం నేతలు సిహెచ్ వెంకటరావు,సింగిటి సూరిబాబు, కదిరి అప్పారావు, సురాడ ధనరాజ్, అప్పలరాజు, నాగరాజు, వంకా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

  నేడు ప్రజాశాంతి పార్టీ కార్యకర్తల సమావేశం
  విశాఖపట్నం,డిసెంబర్ 28: పేదలకు సేవ చేయడానికే ఏర్పాటైన ప్రజాశాంతి పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 29న నగరంలోని శ్రీకన్యా థియోటర్ వెనుకు ఉన్న ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నామని పార్టీ కార్యదర్శి రెవరెండ్ బి.రవిప్రసాద్ తెలిపారు. శుక్రవారం నగరంలోని విజె ఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాన పార్టీల్లో అసెంబ్లీ సీట్లు ఆశించి భంగపడే ఆశావాహులంతా ప్రజాశాంతి పార్టీలో చేరేందుకు అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ అధ్యక్షడు కే ఏ పాల్ ఆధ్వర్యంలోని ప్రాంతీయ కార్యాలయ విభాగం ప్రారంభోత్సవంతో పాటు, ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నామన్నారు. ఉత్సాహమున్న రాజకీయ నేతలు, ప్రజలు, విశే్లషకులు తరలిరావాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకుడు సత్యశీలన్ పాల్గొన్నారు.

  బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి
  * వెనుకబడిన కులాలకు రుణాలు అందించాలి
  * రాష్ట్ర బీసీ సంఘాల అధ్యక్షుడు రామారావు
  విశాఖపట్నం,డిసెంబర్ 28: సమాజంలో ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్న బీసీలకు వచ్చే ఎన్నికల్లో తగిన రాజకీయ ప్రాధాన్యతను కల్పించాలని రాష్ట్ర బీసీ సంఘాల అధ్యక్షుడు దువ్వారపు రామారావు అన్నారు. నగరంలోని విజె ఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నూతనంగా ఏర్పాటైన కార్యవర్గన్ని అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా, వారికి సకాలంలో అందడం లేదుని, దీనికి ముఖ్య కారణం బ్యాంక్ అధికారులు రుణాలు మంజూరు విషయంలో చేస్తున్న ఆలసత్వమేనన్నారు. బీసీల్లో అత్యంత వెనుకబడి ఉన్న వారిని ప్రోత్సహించేందుకు బ్యాంక్‌లతో సంబంధం లేకుండా ప్రభుత్వమే స్పందించి రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. బీసీలకు ఆదరణ పథకం ద్వారా అందిస్తున్న ఏదో ఒక యూనిట్ ధరను నిర్ణయించి వారికి అందించాలన్నారు. ముఖ్యంగా రాజకీయ ప్రాతినిధ్య విషయంలో బీసీలకు గ్రామ సర్ప్‌ంచ్ నుంచి ఎంపీ సీట్లు కేటాయింపు వరకూ ఎప్పుడూ అన్యాయమే జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల్లో 139 కులాలు వారు ఉండగా కేవలం 11 కులాల వారే లబ్ధి పోందుతున్నారన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బీసీల్లో వెనుకబడి ఉన్న వారికి తగిన న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా సంఘం అధ్యక్షుడిగా గోవిందరావు, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జనార్థనరావు, అధికార ప్రతినిధిగా ఎంఎస్‌ఆర్ ప్రసాద్, కార్యదర్శిగా భానుకుమార్ తదితరులు ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో పద్మశాలీ సంఘం నాయకులు ఇమంది రమణ, నాయకులు పీవీ వెంకటరమణ, మోహన్‌రావు, నూకరాజు,కనకమహాలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.


  0 0

  విశాఖపట్నం, డిసెంబర్ 28: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ ఒక రాజకీయ విశ్వవిద్యాలయమని పీసీసీ ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్ అన్నారు. ద్రోణంరాజు సత్యనారాయణ 13వ వర్ధంతిని పురస్కరించుకుని సిరిపురం కూడలిలోని ద్రోణంరాజు విగ్రహానికి శుక్రవారం ఉదయం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి జీవం పోసి, ఎంతోమంది కార్యకర్తలను నాయకులుగా కేంద్ర, రాష్ట్ర స్థాయిలో పదవుల్లో నిలిపారన్నారు. కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నానంటూ టీడీపీపై న్యాయ పోరాటం ద్వారా తిరిగి అధికారంలోకి తీసుకువచ్చారన్నారు. కష్టకాలంలో కార్యకర్తలకు దన్నుగా నిలిచారన్నారు. విశాఖ నగరం నుంచి ఢిల్లీ వరకూ ఎదిగిన సీనియర్ నేత ద్రోణంరాజు నిరంతరం పార్టీకోసం శ్రమించారన్నారు. దివంగత ద్రోణంరాజు సత్యనారాయణ స్ఫూర్తితో కార్యకర్తలు కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, సేవాదళ్ చైర్మన్ పెంటపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు కే గోపాల్ రెడ్డి, జగ్గుబిల్లి అప్పలరాజు, తోట దుర్గారావు, వేగి వెంకటేష్, గుత్తుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

  పోరాటం నుంచి పుట్టిందే కాంగ్రెస్
  * ఆవిర్భావ సభలో ద్రోణంరాజు శ్రీనివాస్

  విశాఖపట్నం, డిసెంబర్ 28: పోరాటాల నుంచి పుట్టిందే కాంగ్రెస్ అని కాంగ్రెస్‌కు రాజకీయ పోరాటాలు కొత్త కాదని పీసీసీ ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్ అన్నారు. కాంగ్రెస్ 133వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ కార్యాలయంలో సేవాదళ్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన వేడుకల్లో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పాలనల దేశం సర్వతోముఖాభివృద్ధి సాధించిందన్నారు. కాంగ్రెస్ ప్రధాన మంత్రులు దేశాన్ని సుభిక్షంగా పాలించారని, భిన్నత్వంలో ఏకత్వం మాదిరి అంతా ఒక్కటై జీవించారన్నారు. అయితే నేటి పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయన్నారు. బీజేపీ పాలనలో అందకు పూర్తి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని, అరాచక పాలనతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా స్వామ్య వ్యవస్థలను మట్టుపెట్టే విధంగా బీజేపీ సాగిస్తున్న పాలనను ప్రతిఘటించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు. త్వరలోనే కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని, రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావడం తథ్యమన్నారు. కార్యక్రమంలో సేవాదళ్ అధ్యక్షుడు పెంటపల్లి సత్యనారాయణ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రమణికుమారి, కే గోపాల్‌రెడ్డి, గుత్తుల రామారావు, పర్వీన్ బాబీ, కొణతాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

  ప్రపంచాన్ని ఆకర్షించేలా విశాఖ ఉత్సవాలు
  * ఆడుతూ పాడుతూ పనిచేసుకోవచ్చు
  * చక్కటి వాతావరణం, మంచి ప్రజానీకం
  * విశాఖ ఉత్సవా ప్రారంభంలో సీఎం చంద్రబాబు
  ఆంధ్రభూమి బ్యూరో
  విశాఖపట్నం, డిసెంబర్ 28: ఉత్సవాలతో ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా వ విశాఖ నగరం పర్యాటక ప్రాధాన్యతను సంతరించుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆర్కే బీచ్ వేదికగా మూడు రోజుల పాటు జరిగే విశాఖ ఉత్సవాలను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ఎంతో ప్రశాంతమైన చక్కడి వాతావరణంతో కూడుకున్న నగరమని, ఇక్కడ ప్రజలు కూడా అంతే మంచి మనసు కలిగి ఉంటారన్నారు. మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ శాంతి భద్రతల పరిస్థితి కూడా అదుపులో ఉంటుందన్నారు. హుదూద్ తాకిడితో తల్లడిల్లినప్పుడు కూడా ఇక్కడి ప్రజానీకం సంయమనం కోల్పోకుండా, ఉక్కు సంకల్పంతో ముందుకు నడిచారన్నారు. విశాఖ తీరం సుందరమైన బీచ్‌లకు నిలయమని, ఇక్కడకు వచ్చే సందర్శకులు విశాఖ వాతావరణాన్ని ఆస్వాదించి, మంచి అనుభూతిని పొందుతారన్నారు. పర్యాటకాభివృద్ధికి విస్తృత అవకాశాలున్న విశాఖలో మరిన్ని వౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఆర్కే బీచ్ సమీపంలోనే అంతర్జాతీయ స్థాయిలో కనె్వన్షన్ సెంటర్‌ను నిర్మిస్తున్నామని, దీంతో ఈ ప్రాంతం మరింతగా పర్యాకప్రాధాన్యతను సంతరించుకుంటుందన్నారు. పర్యాటక ఆకర్షణలో భాగంగా ఇప్పటికే పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రతి నెలా ఒక కార్యక్రమం నిర్వహించేలా యంత్రాంగం చర్యలు తీసుకుంటోందన్నారు. సంవత్సరంలో మూడు నాలుగు మెగా ఈవెంట్లు ప్రభుత్వం తరపున నిర్వహిస్తామన్నారు. కాకినాడ, గండికోట ఉత్సవాలకు ధీటుగా విశాఖ ఉత్సవాలు ప్రాధాన్యత ఖ్యాతినార్జించాయన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ స్వాగతోపన్యాసం చేయగా, ఈఎన్‌సీ చీఫ్ వైస్ అడ్మిరల్ కరమ్‌బీర్ సింగ్, మంత్రులు గంటా శ్రీనివాసరావు, కే అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ మూర్తి, వెలగపూడి రామకృష్ణ బాబు, పంచకర్ల రమేష్ బాబు, పీ విష్ణుకుమార్ రాజు, వీఎంఆర్‌డీఏ కమిషనర్ బసంత్‌కుమార్, జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్, సీపీ మహేష్ చంద్రలడ్డా, జీసీసీ ఎండీ బాబూరావు నాయుడు, జేసీ సృజన తదితరులు పాల్గొన్నారు.
  ఉత్సవాల సందర్భంగా ప్రధాన వేదికపై 11 జిల్లాల జానపద, సంప్రదాయ కళల ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. కార్యక్రమాల్లో భాగంగా గ్రామీ అవార్డు గ్రహీత రిక్కీ కేజ్ సంగీత విభావరి అద్యంతం ఆకట్టుకుంది. సుమారు గంటన్నర పాటు రిక్కీకేజ్ బృందం తన సంగీత విభావరితో ప్రేక్షకులను కట్టిపడేసింది. వన్యప్రాణుల సంరక్షణ, సేంద్రీయ వ్యవసాయం, పర్యావరణ పరిరణక్షణ లక్ష్యంగా పాటలు పాడి మెప్పించారు. అంతకు ముందు నౌకాదళ వాద్య బృందం సినీ గీతాలతో వీనుల విందైన సంగీతాన్ని అందించారు. ప్రధాన వేదిక నుంచి అతిధుల సమక్షంలో బాణసంచా మెరుపులు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని నగరంలోని ప్రధాన రహదార్లను విద్యుత్ దీపాలతో అలంకరించారు. బీచ్ ప్రాంతాన్ని రంగురంగుల దీపాలతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రఖ్యాత వ్యాఖ్యాత ఝాన్సీ తన వాఖ్యానంతో ఆకట్టుకున్నారు.

  కనకమహాలక్ష్మీ అమ్మవారి దర్శనానికి భక్తుల తాకిడి
  * క్యూలైన్లలో వేచి ఉన్న వందలాది భక్తులు
  * వైభవంగా అమ్మవారికి క్షీరాభిషేకం
  విశాఖపట్నం,డిసెంబర్ 28: పాత నగరంలోని శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో మార్గశిరమాసోత్సవాల సందర్భంగా అమ్మవారి ఆలయానికి శుక్రవారం భక్తుల తాకిడి పెరిగింది. ఉదయం నుంచి అమ్మవారికి వేద పండితులు శ్రీ చక్రనవర్నార్చన, లక్ష్మీహోమం,వేద పారాయణ, సప్తశతీ పారాయణ, మహా విద్యాపారాయణం నిర్వహించారు. మార్గశిర మాసోత్సవంలో శుక్రవారం అమ్మవారికి ప్రీతికరంగా భావించే భక్తులంతా అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే ప్రతీ శుక్రవారం నిర్వహించే క్షీరాభిషేకంలో ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకూ నిర్వహించారు. ఈ పూజలో 40 మంది ఉభయదాతలు పాల్గొని పూజలు చేశారు. ఆలయంలో సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నాటకం భక్తులను ఎంతగానో అలరించింది.


  0 0

  ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో తమ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం చోటుచేసుకొంది. ఈ ఊపుతో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో జయకేతనం ఎగురవేసి, రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని కాంగ్రెస్ కార్యకర్తలు ఊహల్లో తేలియాడుతున్నారు. అయితే, ఈ గెలుపును ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు ‘వాపు’గా భావించాలే తప్ప బలుపుగా పరిగణించరాదు. 1998లో వాజపేయి నాయకత్వంలో భాజపా కూటమి (ఎన్డీయే) అధికారంలోకి వచ్చింది. అదే సమయంలో సీతారామ్ కేసరి నాయకత్వంలో ‘కోమా’లో ఉన్న కాంగ్రెస్ పార్టీ పగ్గాలు సోనియా గాంధీ చేతికి వచ్చాయి. ఆమె రాకతో కొంత ప్రభావం కనిపించింది. అప్పుడు కొన్ని ఉత్తరాది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో చాలామంది- సోనియా ప్రభంజనం దేశవ్యాప్తంగా వ్యాపించబోతున్నదని, ఆమె త్వరలో ప్రధానమంత్రి అవుతారని అంచనా వేశారు. ఆ తర్వాత ఏడాది కాలానికి 1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మళ్లీ ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక మరోసారి వాజపేయి ప్రధానమంత్రి పీఠంపై ఆసీనులయ్యారు.
  2003లో జరిగిన ఉత్తరాది అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ చేతిలో వున్న రాష్ట్రాలను భాజపా దక్కించుకుంది. దీంతో తర్వాతి లోక్‌సభ ఎన్నికల్లో తమకే ప్రజలు పట్టం కడతారని ‘కమలనాథులు’ కలలు కన్నారు. 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అనూహ్యంగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. మన్మోహన్ సింగ్ ప్రధానిగా పదేళ్లు పాలించారు.
  ఇటీవలి ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకొన్న కాంగ్రెస్‌కు 2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు గ్యారంటీ అని చెప్పే పరిస్థితి లేదు. రాజస్థాన్‌లో భాజపా, కాంగ్రెస్ పార్టీల మధ్య ఓట్ల తేడా చాలా స్వల్పంగానే వుంది. మధ్యప్రదేశ్‌లో భాజపా కంటే కాంగ్రెస్‌కు ఐదారు సీట్లు ఎక్కువ వచ్చినప్పటికీ ఓట్ల పరంగా ‘కమలం’ పార్టీదే పైచేయి అయింది. ఇక, కాంగ్రెస్ ఖాతాలో ఉన్న మిజోరంలో అధికారాన్ని స్థానిక ప్రాంతీయ పార్టీ మిజో నేషనల్ ఫ్రంట్ దక్కించుకుంది. కానీ, ఛత్తీస్‌గఢ్‌లో గెలిచిన స్థానాల పరంగా కాంగ్రెస్, భాజపాల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉంది. అక్కడ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కొత్తగా పెట్టిన పార్టీ వల్ల భాజపాకు ఎక్కువ నష్టం జరిగింది. 15 సంవత్సరాలుగా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో భాజపా అధికారంలో ఉన్నందున సహజంగా ఏర్పడే ‘ప్రభుత్వ వ్యతిరేకత’ కాంగ్రెస్ పార్టీకి వరంలా మారింది. తెలంగాణలో కాంగ్రెస్‌కు కొంత బలం ఉన్నప్పటికీ కొన్ని తప్పిదాల వల్ల ఆ పార్టీకి చేదు అనుభవం మిగిలింది. కాంగ్రెస్ నాయకులు ‘పోల్ మేనేజ్‌మెంట్’లో వెనుకబడడంతో ఆశించిన ఫలితాలు రాలేదు. తక్కువ సీట్లను సాధించినప్పటికీ, రాష్ట్ర వ్యాప్తంగా తమకు కొంత బలమైన ఓటు బ్యాంకు వుందని కాంగ్రెస్ నేతలు నిరూపించుకున్నారు. తెరాస అధినేత కేసీఆర్ వ్యూహాత్మకంగా ఎన్నికలకు ముందు పలు సంక్షేమ పథకాలను తీసుకురావడంతో కాంగ్రెస్‌కు గడ్డు పరిస్థితి ఎదురైంది.
  ఆరునెలల క్రితం కర్నాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అతి పెద్ద పార్టీగా భాజపా అవతరించింది. కానీ స్పష్టమైన మెజారిటీ లేనందున అధికారానికి దూరమైంది. తక్కువ సీట్లను గెలుచుకున్నప్పటికీ కాంగ్రెస్ అండతో కుమారస్వామి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించగలిగారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కర్నాటకలో మంచి ఫలితాలను రాబట్టగలమని భాజపా నాయకులు ధీమాగా ఉన్నారు. ఇక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన భాజపా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తన పరిస్థితిని మెరుగుపరచుకునేందుకు ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. 2014 లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో పోల్చితే- 2019 ఎన్నికల్లో భాజపాకు 40 నుంచి 50 సీట్ల వరకూ నష్టం జరగవచ్చనే అంచనాలున్నాయి. సీట్ల తగ్గుదల అనేది ఉత్తరప్రదేశ్‌తో పాటు మరికొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో కనిపించవచ్చు. ఉత్తరాదిలో గెలిచే సీట్ల సంఖ్య తగ్గినా, ఆ నష్టాన్ని బెంగాల్, ఒడిశా వంటి రాష్ట్రాలలో భర్తీ చేసుకొనే అవకాశం ఉందని భాజపా నేతలు భావిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ‘ప్రభుత్వ వ్యతిరేకత’ తమకు అనుకూలిస్తుందని ‘కమలనాథులు’ విశే్లషిస్తున్నారు. ఎన్డీయే కూటమి నుంచి కొన్ని పార్టీలు బయటకు వెళ్లినా, ఇంకొన్ని పార్టీలు తమతో జతకట్టే అవకాశాలున్నాయని భాజపా నేతలు లెక్కలు వేస్తున్నారు. ఈ లెక్కన చూస్తే స్వల్ప మెజారిటీతోనైనా నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాని కావడం తథ్యమని వారు వాదిస్తున్నారు.
  కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల కొంత పరిణతి చెందిన నాయకునిగా మారి వుండవచ్చు. అయితే- మోదీ వ్యూహాల ముందు, వాగ్ధాటి ముందు, ప్రజాకర్షణ ముందు రాహుల్ నిలవగలరా? అన్నది అనుమానమే! రాహుల్‌కు మార్గదర్శనం చేసేందుకు జాతీయ స్థాయిలో పేరుప్రతిష్టలున్న నాయకులు కాంగ్రెస్‌లో లేకపోవడం గమనార్హం.


  0 0

  ‘కొత్త ఆలోచనలను చేయకపోవటం కంటే పాత ఆలోచనల నుండి బయటపడకపోవటమే నష్టదాయకం’ అని ప్రఖ్యాత ఆర్థిక శాస్తవ్రేత్త జాన్ మీనార్డ్ కీన్స్ అంటాడు. ఆర్థిక విధానాల వల్ల సుదీర్ఘకాలంలో ఒనగూరే ప్రయోజనాల కంటే స్వల్పకాలంలో జరిగే లాభనష్టాలను జాగ్రత్తగా అంచనా వేసి, సమీప భవిష్యత్‌కు అనుగుణమైన విధానాలకే ప్రాధాన్యతను ఇవ్వాలన్నది కీన్స్ అభిప్రాయం. ఇటీవల పార్లమెంటులో మాజీ ప్రధాని మన్‌మోహన్ సింగ్ మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాలను ప్రస్తావిస్తూ కీన్స్ వ్యాఖ్యలను ఉటంకించారు.
  స్థూల జాతీయోత్పత్తిలో 20 నుండి 30 శాతం ప్రభుత్వ లెక్కలలోకి రావటం లేదని, దాన్ని బయటకు తీసుకొనిరావటానికే పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని మోదీ ప్రభుత్వం తీసుకొంది. మన్‌మోహన్‌తోపాటు పెద్దనోట్ల రద్దును విమర్శించే అనేకమంది- కీన్స్ పెద్దనోట్ల రద్దుకు అనుకూలమన్న విషయాన్ని మర్చిపోతున్నారు. సమష్టి డిమాండ్‌ను పెంచేందుకు ప్రభుత్వం పూనుకొని తన వ్యయాన్ని పెంచకపోతే, కేవలం ప్రైవేటువ్యక్తుల, సంస్థల వ్యయంతో అభివృద్ధి కానీ, ఉపాధి కల్పన కానీ పెరగదని కీన్స్ సూత్రీకరించారు. పన్నురేట్లు ఆకర్షణీయంగా ఉండాలని, ప్రభుత్వ పెట్టుబడి వ్యయం ఎక్కువగా ఉండాలని కీన్స్ ప్రతిపాదించాడు. ద్రవ్య విధానం కంటే కోశ విధానానికే కీన్స్ ఎక్కువ విలువనిచ్చాడు. పెద్ద నోట్లరద్దు ద్రవ్య, కోశ లోట్లను తగ్గిస్తుంది. పకడ్బందీగా అమలు చేస్తే ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తుంది. అసంఘటిత రంగాన్ని ప్రధాన స్రవంతిలోకి తీసుకొని రావటానికి వున్న మార్గాలలో ఇదొకటి.
  కీన్స్ సిద్ధాంతం రెండు ప్రధాన అంశాలపై ఆధారపడి ఉంది. మొదటిది పెట్టుబడి గుణకం (ఇనె్వస్ట్‌మెంట్ మల్టిప్లయర్). రెండవది ద్రవ్యత్త్వ బోను (లిక్విడిటీ ట్రాప్). ప్రభుత్వ వ్యయం- ముఖ్యంగా పెట్టుబడుల వ్యయం 100 కోట్లు పెరిగితే గుణక పరిమాణం బట్టి ఆదాయం, ఉత్పత్తి, ఉపాధి కొన్ని రెట్లు ఎక్కువగా పెరుగుతుంది. ఉపాంత వినియోగ ప్రవృత్తి (మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్) ఎక్కువగా ఉంటే గుణకం పరిమాణం కూడా ఎక్కువగా ఉంటుంది. కనుక పెట్టుబడి వ్యయం పెరుగుదలకు కొన్ని రెట్లు ఎక్కువగా స్థూల జాతీయోత్పత్తి పెరుగుతుంది. ద్రవ్యత్త్వ బోను అంటే వడ్డీ రేట్లు పడిపోయినా, పెట్టుబడులకు నిధులు సమకూరుతున్నా, పెట్టుబడులు చేయటానికి ఔత్సాహికులు ముందుకురాని ఒకానొక స్థితి. ఎందుకంటే ద్రవ్యం వేగంగా చేతులు మారకపోవటమే కాక, ప్రజలు వ్యయం చేయటానికంటే దాచుకోటానికే ఇష్టపడినపుడు, సమిష్టి డిమాండ్‌లో లోటు ఏర్పడుతుంది. 1930 దశకంలో ఏర్పడిన ఆర్థిక మాంద్యానికి ప్రధాన కారణం ఈ ద్రవ్యత్త్వ బోను స్థితి. దీని నుండి బయటపడటం అంతతేలిక కాదు. ఆర్థిక వ్యవస్థలు ఈ ద్రవ్యత్త్వ బోను బారిన పడకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. 2008లో ఏర్పడిన ఆర్థిక సంక్షోభానికి అనేక ఇతర కారణాలతోపాటు ఈ ద్రవ్యత్త్వ బోను కూడా కారణం. అమెరికా సహా పలు అభివృద్ధి చెందిన దేశాలలో వడ్డీ రేట్లు శూన్యస్థాయికి పడిపోయినా సమీప భవిష్యత్తు ఆశాజనకంగా కనిపించకపోవటంతో పెట్టుబడులు పెరగలేదు.
  పెద్దనోట్ల రద్దు ద్వారా మోదీ ప్రభుత్వం ఈ ద్రవ్యత్త్వ బోనుబారి పడకుండా ఆర్థిక వ్యవస్థను కాపాడింది. పెద్దనోట్ల రద్దుతో ద్రవ్య చెలామణి రేటు పెరిగింది. తద్వారా డిమాండ్ పెరిగింది. ఉత్పత్తి ఉపాధి రెండూ పెరగటానికి అవసరమైన కార్యరంగం సిద్ధమైంది. నోట్ల రద్దుతో స్వల్పకాలంలో అభివృద్ధికి అంతరాయం తప్పనిసరి. నోట్ల రద్దుతో నష్టపోయిన వర్గాలు అస్తవ్యస్థ పరిస్థితిని మరింత జటిలం చేశాయి. కానీ 5-10 ఏళ్ళలో పరిస్థితి చాలా సానుకూలంగా మారుతుంది. పెద్దనోట్ల రద్దు ‘చేదుమాత్ర’ వంటిది. అభివృద్ధి రేటును సుస్థిరం చేయటమే కాక వృద్ధి రేటును 8 శాతం కంటే ఎక్కువగా తీసుకెళ్లగలిగిన సత్తా దానికి ఉంది. అమెరికా రిజర్వు బ్యాంకు ఫెడరల్ రిజర్వు దగ్గర నాలుగు ట్రిలియన్ డాలర్ల మేర నిధులు పెరిగినా దాని స్థూల జాతీయోత్పత్తిలో పెరుగుదల రేటు 2014, 2015లలో 2.4శాతానికి మించలేదు. అమెరికాలో నిరుద్యోగితా శాతం 5 కంటే తక్కువే. 48 మిలియన్లమంది నిరుద్యోగ భృతిని తీసుకోవటానికి ఇష్టపడటమే అందుకు కారణం.
  127 కోట్లమంది జనాభా ఉన్న మనదేశంలో కేవలం 5 కోట్ల మందే మొన్నటివరకూ వ్యక్తిగత ఆదాయపు పన్ను కట్టేవారు. అంత తక్కువమంది ఆదాయపు పన్ను కట్టటం అంటే ఎక్కడో లోపం ఉన్నట్టే. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆ లోపాన్ని సవరించలేకపోయాయి. నోట్ల రద్దు ద్వారా, ఆధార్, పాన్‌లతో అనుసంధానం ద్వారా అదనంగా అనేక కోట్లమందిని ఆదాయపు పన్ను పరిధిలోకి తీసుకువచ్చారు. డాలర్ విలువ నవంబర్‌లో బాగా పెరిగింది కానీ, రూపాయి తన విలువను 2.5శాతం మాత్రమే కోల్పోయింది. అదే సమయంలో చైనా కరెన్సీ విలువ కనిష్టాస్థాయికి పడిపోయింది. 2013 ఆగస్టులో రూపాయి విలువ ఒక్క నెలలోనే 8.1 శాతం పడిపోయిందన్న విషయం చాలామంది మర్చిపోయారు. అప్పుడు అధికారంలో ఉన్న మన్‌మోహన్‌సింగ్ రూపాయి విలువ ఎందుకు పడిపోయిందో కూడా చెప్పలేదు. 2013లో మన విదేశీ మారకద్రవ్య విలువలు 289 బిలియన్ డాలర్లుగా వుంటే మొన్న నవంబర్ నాటికి 367 బిలియన్ డాలర్ల స్థాయికి అవి చేరాయి. ద్రవ్యోల్బణం ఇటీవల బాగా పడిపోయింది. వినియోగదారుల ధరల సూచీ నవంబరు 2013లో 11.6 శాతంగా వుంటే ఈ ఏడాది అక్టోబరు నాటికి 4.2శాతానికి పడిపోయింది. ఆహార ధరల సూచీ అదే సమయంలో 14.72 శాతం నుండి 3.32కు పడిపోయింది.
  ద్రవ్యోల్బణం అనేది పెద్ద తిరోగమన పన్ను. దాని వల్ల పేదలు నష్టపోతారు. అల్పాదాయ వర్గాల నుండి ధనిక వర్గాలకు ఆదాయం బదిలీ అవుతుంది. ద్రవ్యోల్బణాన్ని మోదీ ప్రభుత్వం సమర్థవంతంగా అరికట్టగలిగింది. మన్‌మోహన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకొనిపోయి అసలు సమస్యలను గాలికి వదిలేసింది. దాన్ని సరిచేసే బాధ్యతను మోదీ ప్రభుత్వం తన భుజాలకు ఎత్తుకొన్నది. విదేశీ వాణిజ్యానికి సంబంధించి కూడా మోదీ ప్రభుత్వం విశేషమైన ప్రగతిని సాధించింది. 2013 డిసెంబరు 3వ త్రైమాసికానికి కరెంటు ఖాతాలోటు ప్రమాదకర స్థాయికి 6.7 శాతానికి చేరి, 2012-13లో 4.8 శాతానికి పడిపోయింది. కోశ లోటు 2011-12లో 5.7శాతంగా నమోదై, ఆ తరువాతి సంవత్సరంలో 4.9 శాతమైంది. కోశలోటు, కరెంటు ఖాతా లోటు అధికంగా వున్న కారణం చేత మన దేశపు ఋణ అర్హత రేటింగు ఆ సంవత్సరాలలో బాగా పడిపోయింది. మోదీ ప్రభుత్వ విధానాలతో 300 బిలియన్ డాలర్ల మేర విదేశీ పెట్టుబడులు వచ్చాయి. 2016-17లో కరెంటు ఖాతా లోటు 0.5శాతంగా నమోదైంది. కోశ లోటు 2105-16లో 3.9శాతమై 2016-17లో 3.5శాతానికి పడిపోయింది. విదేశీ రుణాలు 2013లో 409 బిలియన్ డాలర్లుగా ఉంది. రుణసేవా కవరేజ్ నిష్పత్తి 5.9 శాతం నుండి 8.8 శాతానికి పెరగటం విదేశీ రుణాలమీద తక్కువ ఆధారపడటాన్ని సూచిస్తుంది. స్వల్పకాలిక విదేశీ రుణాల శాతం 23.6 శాతంనుండి 17.2 శాతానికి పడిపోయింది.
  అనేక పరోక్ష పన్నుల స్థానే ప్రవేశపెట్టిన వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ)తో దేశమంతా ఒకే పెద్ద ఉమ్మడి మార్కెట్ అయింది. రాష్ట్రాల మధ్య వున్న ఆర్థిక అడ్డుగోడలను తొలగించి దేశమంతా ఒకే మార్కెట్‌ను చేయటంలో మోదీ ప్రభుత్వం విజయం సాధించింది. ‘ఒకే దేశం-ఒకే పన్ను’ నినాదంగా మిగిలిపోక కార్యరూపం దాల్చింది. ‘ఆధార్’తో అనుసంధానం ద్వారా రాయితీలు పక్కదారి పట్టకుండా వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రజలకే నేరుగా బదిలీ చేశారు. కొత్తగా తీసుకొని వచ్చిన దివాలా స్మృతి, అందులో భాగంగా నెలకొల్పిన ప్రత్యేక న్యాయస్థానాల ద్వారా పెద్ద పెద్ద ఋణగ్రహీతలను దారికితెచ్చే పనికి పూనుకొన్నారు. కావాలని రుణాలు ఎగగొట్టడం ఇప్పుడు అంత తేలిక కాదు. ఇపుడు పారిశ్రామిక, వాణిజ్య సంస్థలు బకాయలను చెల్లించటానికి ముందుకు వస్తున్నాయి. బినామీ ఆస్తుల స్వాధీన చట్టంతో వేరొకరి పేర్లతో ఆస్తులు సమకూర్చుకోవటం ఇప్పుడంత తేలిక కాదు. పన్నుల ఎగవేతకు చట్టబద్ధ మార్గాన్ని సుగమం చేసిన ద్వంద్వ పన్నుల రద్దు ఒప్పందాలను గత ప్రభుత్వాలు చేసుకొన్నాయి. సైప్రస్, లక్సెంబర్గ్, మారిషస్‌కు నిధులు అక్రమ మార్గాలలో తరలించి, అక్కడి నుండి విదేశీ పెట్టుబడుల రూపంలో చట్టబద్ధంగా నిధులను మన దేశంలోకి ఇంతవరకూ తరలిస్తూ వచ్చారు. ఈ ద్వంద్వ పన్నుల రద్దు ఒప్పందాలకు సవరణలు తీసుకొని వచ్చి మన దేశం నుండి ఆ దేశాలకు నిధుల వెల్లువకు అడ్డుకట్ట వేయగలిగారు. రాజకీయంగా దమ్మున్న మోదీ వంటి నాయకుడే ఇటువంటి పనులు చేయగలడు.
  దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరస్తులను తిరిగి రప్పించటానికి చాలా ప్రతిబంధకాలు ఉన్నాయి. పెట్టుబడిదారీ దేశాలు తమ దేశస్థులు ఆర్థికంగా నిజాయితీతో ఉండాలని కఠిన చట్టాలను సమర్థవంతంగా అమలు చేస్తుంటాయి. అదే సమయంలో ఇతర దేశాల నుండి వచ్చే ఆర్థిక నేరస్థులకు ఆశ్రయం ఇస్తున్నాయి. అక్రమంగా కూడపెట్టిన నల్లధనాన్ని తమ దేశాలలో దాచుకోవటానికి వీలు కల్పిస్తున్నాయి. ఆ దేశాల దంద్వ నీతివలన మన దేశం తీవ్రంగా నష్టపోతున్నది. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ వంటి ఆర్థిక నేరస్థులను తిరిగి రప్పించడానికి- వారికి ఆశ్రయం ఇచ్చిన దేశాలలో సుదీర్ఘ న్యాయ పోరాటం చేయవలసి వస్తున్నది. ఈ పోరాటాల్లోనూ మోదీ ప్రభుత్వం విజయం సాధిస్తున్నది. ఆయుష్మాన్‌భవ, పోషణ అభ్యాన్, ఆవాస్ యోజన మొదలైన పథకాలతో లక్షలాదిమంది లబ్దిపొందుతున్నారు. అయితే- తన ఆర్థిక విజయాలను చెప్పుకోవలసినంతగా చెప్పవలసిన రీతిలో చెప్పకపోవటమే మోదీ సర్కారు వైఫల్యం.


  0 0

  దేశ రక్షణ, భద్రత వంటి అంశాలకు సంబంధిం చి ప్రజలలో, రాజకీయ పక్షాలలో ఏకాభి ప్రాయం అత్యవసరం. అలా లేని పక్షంలో దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ప్రస్తుతం రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి జరుగుతున్న రభసను మొన్నటి వరకు రాజకీయ ప్రయోజనాల కోసం చెలరేగుతున్న వివాదంగా భావిం చాము. ఈ విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం లేదన్న వాదనలతో పలు అనుమానాలకు అవకాశం ఏర్పడింది, దాంతో రాజకీయ లబ్ది కోసం ప్రతిపక్షాలు వివాదం రేపుతున్నాయని భావించాము. గతంలో బోఫోర్స్ వివాదం రాజీవ్ గాంధీకి ఏ విధంగా ఉపయోగ పడింది, ఇప్పుడు కాంగ్రెస్ కూడా రాఫెల్ నుండి ప్రయోజనం పొందాలని చూడటంలో తప్పు పట్టలేము. అయితే, సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత, ఇందులో అంతా సక్రమంగా జరిగిందని స్పష్టం చేసిన తర్వాత, తాము లోతుగా పరిశీలించా మని-అనుమానించదగిన అంశాలను ఏవీ లేవని చెప్పిన తర్వాత కూడా ఇంకా వివాదం సద్దుమణగక పోవడం గమనిస్తే- ఈ వివాదం వెనుక లోతైన కుట్ర ఉన్నట్లు కనిపిస్తున్నది. ఈ కుట్రలో రాజకీయ పార్టీలు పావులుగా మాత్రమే ఉన్నాయని భావించవచ్చు.
  మన దేశం సైనికపరంగా బలపడటం ఇష్టం లేని అంతర్జాతీయ శక్తులు ఇటువంటి అనుమానాల వ్యాప్తికి ప్రయత్నం చేస్తున్నట్లు భావించవలసి వస్తున్నది. మరోవంక రక్షణ వ్యవస్థలో ప్రైవేట్ రంగం ప్రవేశిస్తే ఏడు దశాబ్దాలుగా తమ అసమర్ధతతో దేశానికి ఎంత నష్టం కలిగించామో వెల్లడి అవుతుందనే ఆందోళనతో ప్రభు త్వరంగ సంస్థలు భయానక పరిస్థితులు సృష్టిస్తున్నాయని చెప్పవలసి ఉంటుంది. రెండు దేశాల మధ్య జరిగే ప్రధానమైన రక్షణ సంబంధ ఒప్పందాలు ఆయా దేశాల విదేశాంగ విధాన లక్ష్యాలకు లోబడి ఉంటాయన్నది అందరికీ తెలిసిందే. కేవలం ఒక అంశానికి పరిమితం కాకుండా విస్తృతమైన ప్యాకేజీని ఆమోదిస్తూ ఒప్పందాలు చేసుకొంటూ ఉంటాయి. అటువంటి ఒప్పందాలను సాధారణ వాణిజ్య ఒప్పందాల వలే చూడడం తగదు. అందుచేత ఇటువంటి ఒప్పందాలలో అంగీకరించే అనేక అంశాలు పరస్పరం ఇచ్చిపుచ్చుకునే విధంగా ఉంటాయి. వాటిని ఎప్పటికీ బహిరంగ పరచరు.
  భారతదేశం రాఫెల్ విమానాలను కేవలం విమా నాలుగా కాకుండా సమగ్ర పోరాట వ్యవస్థను సమ కూర్చుకొనే వ్యూహంలో భాగంగా కొనుగోలు చేస్తున్నది. వాటి ద్వారా చేరవేసే ఆయుధాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, రాడార్లు అత్యంత ముఖ్యమైనవి అవుతాయి. వాటిని సమకూర్చుకోవడాన్ని బట్టి వ్యూహాత్మకంగా వాటి పనితీరు ఆధారపడి ఉంటుంది. అవి ఏ విధంగా పనిచేస్తాయన్నది చాలా రహస్యంగా ఉంచదగిన అంశం. ఏ దేశం కూడా అటువంటి అంశాలను బహిరంగ పరచదు. ఎందుకంటే వాటిని ఉపయోగించినప్పుడు ఆశ్చర్యకర అంశం ఇమిడి ఉండవలసిందే. ముందుగా తెలిస్తే శత్రు దేశాలు వాటిని ఢీకొట్టగల ఆయుధాలను సమకూర్చుకొనే అవకాశం ఉంటుంది. ఇటువంటి రక్షణ సంబంధ అంశాలలో పరిజ్ఞానం గల కొందరు నిపుణులు ఈ యుద్ధ విమా నాలకు సంబంధించిన ఒకొక్క అంశంపై వివరాలు బహిర్గత పరచమని ప్రభుత్వంపై వత్తిడి తెచ్చే విధంగా కుట్ర పూరితంగా ప్రయత్నం చేస్తున్నట్లు అనుమానం కలుగుతున్నది.
  రాఫెల్ యుద్ధ విమానాలను అమ్ముతున్న ఫ్రాన్స్ అం దుకు సంబంధించి ఈ ఒప్పందంలో వాణజ్యపరమైన అంశాల గురించి బహిరంగ పరచడానికి విముఖత వ్యక్తం చేస్తున్నది. ఇతర దేశాలకు కూడా ఇటువంటి విమానాలను అమ్ముతున్న దృష్ట్యా వాణిజ్య పరమైన వివరాలను బహిరంగ పరచడం ఆ దేశానికి సహజంగానే ఇష్టం ఉండదు. ప్రభుత్వాల మధ్య ఇటువంటి కొనుగోలు ఒప్పందాలు జరిగినప్పుడు వాణిజ్యపరమైన అంశాలను గోప్యంగా ఉంచుతూ ఉండటం అంతర్జాతీయంగా జరిగే సాధారణ ప్రకియ. రక్షణ పరికరాల కొనుగోలు ఇతర వస్తువులకు వలే గరిష్ట అమ్మకపు ధర అంటూ ఏదీ ఉండదని గమనించాలి.
  యూపీఏ ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న ధర కన్నా చాలా ఎక్కువ మొత్తం నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పుడు ఇవ్వజూపుతున్నదని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఒప్పందం కుదరని, ఖరారు కాని ధరను ఒప్పదం కుదుర్చుకున్న ధరతో ఏ విధంగా పోలుస్తారు ? యూపీఏ హయాంలో జరిగిన సంప్ర దింపులలో ప్రాథమిక అంశాలలో ముందుకు వెళ్ళక పోవడంతో ధరల విషయంలో బేరసారాలకు అవకాశమే లేకుండా పోయింది. పైగా, మొదట్లో జరిగిన సంప్ర దింపులన్నీ విమాన స్వరూపానికి సంబంధించినవి. అందులో అదనంగా కావలసిన సదుపాయాలు, సాయుధ సంపత్తిని గురించిన ప్రస్తావనలు చోటు చేసుకోలేదని గమనించాలి. ప్రస్తుతం కుదుర్చుకున్న ఒప్పందం భారతదేశ సామర్ధ్యానికి అవసరమైన పలు అదనపు సాంకేతిక సముదాయాలను చేర్చి కుదు ర్చుకున్నదని గమనించాలి. మరే యుద్ధ విమానానికీ లేని అదనపు సదుపాయాలను ఇందులో సమకూర్చుకొనే ప్రయత్నం జరిగింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రభుత్వ రంగంలోని హెచ్‌ఏఎల్‌ను పక్కకు త్రోసివేసి, ప్రైవేట్ రంగంలోని అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్‌కు ప్రయోజనం చేకూర్చుతున్నట్లు కాంగ్రెస్ వారు ప్రధానంగా మరో ఆరోపణ చేస్తున్నారు. కేవలం వాస్తవాలు తెలి యకుండా అమాయకంగా ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారా? లేదా ఉద్దేశ పూర్వకంగా బురద చల్లడం కోసం చేస్తున్నారా? అన్నది తెలియవలసి ఉంది. ప్రస్తుతం కుదుర్చుకున్న రాఫెల్ ఒప్పందంలో యుద్ధ విమానాలను భారత దేశంలో తయారు చేయడానికి గాని లేదా విడి భాగాలను ఇక్కడ సమకూర్చు కోవడానికి గాని ఉద్దేశించినది కాదని మనం గమనించాలి. మొత్తం 36 యుద్ధ విమానాలను కూడా ఫ్రాన్స్ లోనే తయారు చేసి, అక్కడే విడి భాగాలను జత చేసి మన దేశానికి పంపించవలసి ఉంటుంది. అందుచేత ఈ మొత్తం ప్రక్రియలో భారత్‌లో తయారు చేయడం కోసం భాగస్వామిని ఏర్పాటు చేసుకొనే ప్రసక్తి ఏర్పడదు. ఆఫ్ సెట్ హామీలను నెరవేర్చడం కోసం దస్సాల్ట్ కంపెనీ భారత దేశంలో అనేకమంది ఆఫ్ సెట్ భాగస్వాములను ఏర్పర్చుకొంది. వారిలో ఒకరు రిలయన్స్ కావడం గమనార్హం. భారీ మొత్తం విలువ గల అంశాలలో ప్రభుత్వాల మధ్య ఒప్పందాలు జరగడం, ప్రభుత్వ పరమైన హామీలతో ఖర్చు కూడా తక్కువగా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. అదనంగా లాజిస్టిక్, శిక్షణ, నష్టపోవడం వంటి అంశాలలో కంపెనీ మద్దతు అందిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈ ఒప్పందంలో దళారీ గాని, ముడుపులు గాని లేవు. ఇలాంటి ప్రయోజనాలన్నింటికీ రాఫెల్ ఒప్పందం ఎటువంటి మినహాయింపు కాదు. అయితే మన రక్షణ సామర్ధ్యాన్ని అనూహ్యమైన ప్రయత్నాల ద్వారా పెంపొందింపచేసుకొనే ప్రతి ప్రయత్నాన్ని అసహనానికి గురయ్యే కొన్ని శక్తులు- లేనిపోని వివాదాలను సృష్టించే ప్రయత్నం చేస్తూనే ఉంటాయి.
  ఇలాంటి ఒప్పందాలకు సంబంధించి పోటీలో నష్టపోయే శక్తులు ఉద్దేశ పూర్వకంగా వివాదాలను సృష్టించి, ప్రతికూల కథనాలను వ్యాపింప చేసి, కీలక నిర్ణయాలు తీసుకొనే వారిని నిరుత్సాహ పరచి ఒప్పందాలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తుం టాయ. మీడియా కథనాల ప్రకారం అదనంగా రాఫెల్ యుద్ధ విమానాలను, ముఖ్యంగా నావికాదళంలో ఉపయోగించే వాటిని కూడా సమకూర్చు కోవాలని ప్రభుత్వం పరిశీలిస్తున్నది. ఈ విషయంలో ముందుకు వెళ్లకుండా ప్రభుత్వాన్ని అడ్డుకొనే ప్రయత్నాలు జరుగుతున్నట్లు భావించవలసి వస్తుంది. అటువంటి ప్రయత్నాల ఫలితంగానే ప్రస్తుత వివాదాలు మి న్నంటున్నట్టు కనిపిస్తున్నది. ఎన్నికల సమయంలో భారీగా నిధులను సమకూర్చుకోవడం కోసం కొన్ని పారిశ్రామిక సంస్థలను రాజకీయ నాయకులు లక్ష్యంగా చేసుకొని వ్యవహరిస్తున్నట్లు కూడా ఈ సందర్భంగా ఆరోపణలు వెలువడుతున్నాయి.
  రక్షణ రంగంలో ప్రైవేట్ రంగం పాల్గొనేటట్లు చేసే ప్రతి చర్యను ప్రభుత్వ రంగ సంస్థలు పూర్తిగా ప్రతిఘటించే ప్రయత్నం చేస్తుంటాయి. హెచ్‌ఏఎల్ గత అనుభవాలు నిరాశాజనకంగా ఉన్నాయి. ఏరోస్పేస్ ఉత్పత్తిలో ప్రత్యా మ్నాయ సదుపాయాలను ప్రైవేట్ రంగంలో అభివృద్ధి చేయడం కోసం యూపీఏ ప్రభుత్వం ఒక విదేశీ సంస్థతో కలసి ప్రైవేట్ రంగ సంస్థ రవాణా విమానాలను ఉత్పత్తి చేసే ప్రతిపాదనను చేపట్టింది. చివరకు టాటా ఎయిర్ బస్సును ఎంపిక చేసింది. గుత్త్ధాపత్యం గల రక్షణ రంగంలో ప్రైవేట్ పార్టీలు ప్రవేశిస్తే తన ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందనే భయంతో హెచ్‌ఏఎల్ తెలివిగా ఈ ప్రతి పాదనను ప్రైవేట్ రంగం, ప్రభుత్వ రంగంల మధ్య పోరాటంగా మార్చింది. అప్పటి నుండి ఇది అధికారుల మధ్య చక్కర్లు కొడుతూ కార్యరూపం దాల్చనే లేదు. ప్రభుత్వ పరిధిలో ప్రైవేట్ రంగాన్ని అనుసంధానం చేసే ప్రతి ప్రయత్నాన్ని ప్రభుత్వ రంగం తిరస్కరిస్తూ వస్తున్నది. అదే తరహాలో కొందరు మీడియా ప్రతినిధులు సైతం హెచ్‌ఏఎల్ స్థానంలో రిలయన్స్‌ను ప్రభుత్వం తీసుకు వచ్చిందంటూ కథనాలను వ్యాప్తి చేస్తున్నారు. ఆరోపణలను సమర్ధించే విధంగా వాస్తవాలు లభిం చినట్లయితే ప్రభుత్వాన్ని విపక్షాలు, మీడియా సంస్థలు విమర్శించడాన్ని పూర్తిగా సమర్ధించవచ్చు. వారి వాదన న్యాయబద్ధం అని చెప్పవచ్చు.
  అయితే, దారుణమైన ఆరోపణలను వ్యాపింప చేయడం, వాటిలో ఏదో ఒక ఆరోపణ నిలబడక పోతుందా? అని ఎదురు చూడటం దారుణమని చెప్పవలసిందే. తప్పుడు ఆరోపణలు దేశంలో వాతావరణాన్ని కలుషితం కావించి, భారత రక్షణ వ్యవస్థను ఆధునీకరణ చేసే పక్రియను కుంటు పడే విధంగా చేస్తుంది. ఎంతో ధైర్యం, నిజాయతీ గల నేతలు, అధికారులు కూడా తర్వాత ఇటువంటి వాటిని చేపట్టడానికి వెనుకాడే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వ వ్యతిరేక ధోరణులు జాతి వ్యతిరేక చర్యలుగా దిగజారడం ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుందని గమనించాలి.


older | 1 | .... | 1995 | 1996 | (Page 1997) | 1998 | 1999 | .... | 2067 | newer