Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

మహోన్నతుడు మాలవీయ

0
0

1. పండిట్ మదన్ మోహన్ మాలవీయ డిసెంబర్ 25, 1861న అలహాబాదులో జన్మించారు. స్వాతంత్రోద్యమ సమయంలో ఆయన ఏ నినాదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు?
ఎ) కరో యా మరో
బి) ఇన్క్విలాబ్ జిందాబాద్
సి) సత్యమేవ జయతే
డి) సారే జహాస అచ్చా హిందూస్థాన్ హమారా
2. రాత్రింబవళ్ళు కష్టపడి, జీవితకాల పొదుపును పెట్టి, దేశయాటన చేసి నిధులని ప్రోగుచేసి వచ్చిన సొమ్ముతో తన విశ్వవిద్యాలయ స్థాపన కలను సాకారం చేశారు. పండిట్ మదన్ మోహన్ మాలవీయ ఏ విశ్వ విద్యాలయాన్ని స్థాపించారు?
ఎ) అలహాబాద్ విశ్వవిద్యాలయం
బి) బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం
సి) ఇంద్రప్రస్థ విశ్వవిద్యాలయం
డి) లక్నో యూనివర్శిటీ
3. పండిట్ మదన్ మోహన్ మాలవీయకు భారతదేశ అత్యంత పౌరపురస్కారం 3్భరత రత్న2 ఏ మహోన్న తమైన వ్యక్తితో పాటు ఒకేసారి లభించింది?
ఎ) దీన దయాళ్ ఉపాధ్యాయ
బి) బాలగంగాధర్ తిలక్
సి) అటల్ బిహారీ వాజ్‌పేయ్
డి) భీంరావ్ రాంజీ అంబేడ్కర్
4. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చే సంవత్సరం ముందు 1964లో మదన్ మోహన్ మాలవీయ కాలం చేశారు. మాలవీయ ఏ వృత్తిలో ఉండేవారు?
ఎ) పాఠశాల ఉపాధ్యాయుడు
బి) వార్తాపత్రిక సంపాదకుడు
సి) న్యాయవాది
డి) పైవన్నియు
5. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా పాఠశాలలను బహిష్కరించాలని విద్యార్థులకు గాంధీ పిలుపిచ్చినప్పుడు- మాలవీయ బహిరంగంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. విద్యార్థులు బడి ఎగ్గొడితే అది దేశ ప్రయోజనాలకు వ్యతిరేకమని, చదువు సంధ్యలు లేకపోయి స్వాతంత్య్రం సాధించేక పిల్లలు ఏమి చేస్తారని ముక్కుసూటిగా అడిగిన మహాత్ముడు మాలవీయ. మాలవీయకు ఉన్న బిరుదు ఏది?
ఎ) మహానాయక్
బి) మహామానా
సి) పుణ్యపురుష్
డి) యుగపురుష్
6. సహాయ నిరాకరణోద్యమం అపుడు గోరఖ్‌పూర్‌లో చౌరీ చౌరా పోలీస్‌స్టేషన్‌ని కాల్చివేసిన స్వాతంత్య్ర ఉద్య మకారుల తరఫున వాదించి 153 మందిని నిర్దోషులుగా ఉరిశిక్ష నుంచి తప్పించారు పండిట్ మాలవీయ. ఎవరి మరణశిక్షను ఆపడానికి మాలవీయ- వైస్రాయికి పదే పదే విజ్ఞప్తి చేశాడు?
ఎ) కర్తార్ సింగ్
బి) దినేష్ గుప్త
సి) ఖుదీరాం బోస్
డి) భగత్ సింగ్
7. విశ్వవిద్యాలయం ఏర్పాటు నిధుల కోసం మాలవీయ ఏ వ్యక్తి వద్దకు వెళ్లగా ఆ వ్యక్తి చెప్పు విసిరారు? ఆ చెప్పును మాలవీయ వేలం వేయగా ఆ వ్యక్తే అత్యధిక వేలంపాటకు కొనుక్కోవాల్సి వచ్చింది?
ఎ) రాజ్‌పుటానా మహారాజు
బి) బరోడా మహారాజు
సి) పాటియాలా మహారాజు
డి) హైద్రాబాద్ నిజాం
8. స్వాతంత్య్ర సమరయోధుడు మాలవీయ ఎన్నో ఉద్యమాలలో పాల్గొన్నారు. జైలుకెళ్లారు. ఏ ఉద్యమంలో కాంగ్రెస్ పాల్గొనడం గూర్చి ఆయన మండిపడ్డారు?
ఎ) సహాయ నిరాకరణోద్యమం
బి) సైమన్ కమిషన్
సి) ఖిలాఫత్ ఉద్యమం
డి) శాసనోల్లంఘన ఉద్యమం
9. పండిట్ మదన్ మోహన్ మాలవీయ ఏ పత్రికలో పనిచేశారు?
ఎ) ద లీడర్
బి) హిందూస్థాన్ టైమ్స్
సి) ఇండియన్ ఒపీనియన్, అభ్యుదయ
డి) పైవన్నియు
10. మదన్ మోహన్ మాలవీయ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ ఎక్కడ ఉంది?
ఎ) ముంబయి
బి) జైపూర్
సి) అలహాబాద్
డి) గోరఖ్‌పూర్
=========================================================
గత వారం క్విజ్ సమాధానాలు
1. ఎ, 2. డి, 3. డి, 4. బి, 5. సి, 6. సి, 7. సి, 8. బి, 9. డి, 10. ఎ.


‘లుముంబా’ వర్సిటీకి పోదామని...

0
0

ఆంధ్రప్రభ బెజవాడ గాంధీనగర్ నుం చి ప్రచురింపబడటంతో ఊళ్లో ఒక సంచలనం. గాంధీనగరం అది వరకూ కేవలం సినిమా పంపిణీ కేంద్రమే గానీ, ఆ తర్వాత ఎక్స్‌ప్రెస్, ప్రభ వెలువడుతూ స్పెషల్ ఏరియా అయింది (1960). నవయుగ ఫిలిమ్స్ మేనేజర్ కాట్రగడ్డ నరసయ్య - అయిడియాల పుట్ట. మా తమ్ముడు ప్రభలో ప్రూఫ్ రీడర్‌గా పని చేస్తూనే - కార్టూన్లు కూడా వేస్తూ - ఫిలిం పబ్లిసిటీ రంగంలో కూడా - నర్సయ్య ప్రోత్సాహంతో పబ్లిసిటీ ఫీల్డులోకి దిగాడు.
‘మిడ్‌వీక్’ ప్రకటనలు అంటూ క్రొత్తగా సినిమా రిలీజ్ అయినాకా, వారం మధ్యలో చిన్నసైజు ప్రకటనలు వచ్చాయి. వారం వారం వచ్చే పెద్ద ప్రకటనలు మద్రాసు నుంచే వచ్చేవి. నాకు, మా తమ్ముడికి అయిడియాలిచ్చే పని తగులుకుంది. సినిమాలు, పత్రికలు - అంతే. రోజంతా రేడియో ప్రోగ్రామ్స్ కూడా వుండేవి కావు. అంచేత రచయితలకు కాలరెత్తుకు తిరిగే అవకాశం వుండేది. అలాగే నాటకాల నటులకీ డిమాండు. తాలూకా ఆఫీస్ ఎదురుగ్గా ఉన్న దుకాణ సముదాయం మేడ మీద నటుల రిహార్సల్సుతో పరిసరాల్లో జనాల చెవుల తుప్పు వొదలగొడుతూ వుండేవారు. రెగ్యులర్‌గా హనుమంతరాయ గ్రంథాలయంలో నాటకాలుండేవి. ‘ఇన్‌స్పెక్టర్ జనరల్’ నాటకం ఫేమ్ - వేంకటేశ్వర్రావు ‘టాప్‌ర్యాంకర్’ అయినాడు. ఇతనికే ఆనక యూనివర్సిటీలో - నాటక కళా విభాగంలో ఉద్యోగం వచ్చింది. ఈ వెంకటేశ్వర్రావు మేనల్లుడు మా రెండో తమ్ముడికి ఫ్రెండు - లక్ష్మణరావు. అందంగా, ఎర్రగా, చురుగ్గా వుండి, నాటకాలలో ఛాన్స్ దొరికితే, చిన్నదో పెద్దదో - వేషం వేసేస్తూ - మాకు అభిమాని అయ్యాడు. అతని దస్తూరీ ముత్యాలకోవ. చిన్నచిన్న అక్షరాలు రాసేవాడు.
ఇట్లా ఒక పేజీలో నాలుగు పేజీల మేటర్ ఎక్కించే మరో రచయిత కొమ్మూరి వేణుగోపాలరావు. నాలుగు పేజీల కథ పేజీన్నరలో రాసేసేవాడు. ఈ లక్ష్మణరావుకి మా తమ్ముడు- నా ‘విడీవిడని చిక్కులు’ నవలని ఫెయిర్ కాపీ చేస్తే నగదు బహుమతి ఇస్తానన్నాడు. ఎందుకంటే వాడు అటు ప్రభ, ఇటు విశాలాంధ్ర - నవయుగ పబ్లిసిటీలతో బిజీ. ఈ అబ్బాయి ఎక్సర్‌సైజ్ బుక్‌లో ‘విడీవిడని చిక్కులు’ నవల మొత్తం - కందిబద్దలంత అక్షరాల్లో రాసేశాడు. అప్పటికే ఆంధ్రపత్రిక వీక్లీ నవలల పోటీ ప్రకటించింది. ప్రభ వీక్లీ కూడా కథల పోటీ ప్రకటించింది.
ప్రభ దీపావళి సంచికలో నా ‘గెలుపూ ఓటమీ’ అనే కథ (పెద్దది) పడింది. తిరుమల రామచంద్రగారు డైలీలో వుండేవారు. ఆయనతో పరిచయమయింది. గానీ, ఆంధ్రప్రభ గేటులో కృష్ణమూర్తి అనే టైమ్ కీపర్ - లోపలికి వెళ్తానంటే అడ్డుపడిపోయేవాడు. అతనంటే వర్కర్లకి గుర్రు. పాపం.. ఓసారి దేహశుద్ధి కూడా చేశారు. ఓ కన్ను పోయిందిట కూడాను. చిత్రమేమిటీ అంటే - అటు తర్వాత, ఐదేళ్లకి ఇదే కృష్ణమూర్తి మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చిన మా డైలీలో టైమ్ కీపర్‌గా చేరాడు. రోజుకోసారయినా ‘సారీ బాస్!’ అంటూ నాకు ఎంతో సన్నిహితుడయినాడు. అపాలజీ చెప్పేవాడు పదే పదే.
అద్సరే. ఒకసారి శేషయ్యగారితో (ఎడిటర్) మాట్లాడుతూ లోపలికి, ఆయన ప్రక్కనే నడుస్తూ దూరిపోయాను. కానీ ఎడిటోరియల్ హాలులో - శార్వరి గారి దగ్గర, రావూరి గారి దగ్గర, తిరుమల రామచంద్ర గారి దగ్గర కబుర్లు చెబుతూ, గడిపేసేవాణ్ణి. ఈ టైమ్‌కీపర్ వచ్చి ఓసారి గొడవ పెట్టాడు. ‘వాడంతే. తెలుగురాని అరవ్వాడు. అరవడం వాడి పని..’ అన్నారంతా.
నేను కూడా పోవడం తగ్గించేశాను. ఈలోగా, ‘దేశ కవిత’ నుంచి, ఓ సైన్సు పుస్తకం - రాకెట్‌లు, రోదసికి సంబంధించినది - అనువాదం చేస్తాడేమో, అన్నయ్యా, కనుక్కో’ అని, దేశి కవిత ప్రచురణల ‘శి.రా.కృ’గారు కబురెట్టాడు. అప్పుడు, అందులో అడుసుమిల్లి పూర్ణచంద్రరావు - ప్రూఫులు చూసేవాడు. ‘హంస’ అని, ఒక చిన్నపత్రిక తెచ్చేవాళ్లు వాళ్లు. ‘హంస’కి రాయాల్సి వచ్చింది. తమ్ముడి ద్వారా ‘రాకెట్ - మిస్సైల్స్’ బుక్ తీసుకుని ‘రాకెట్‌లు - మిసిలీలు’ అంటూ అనువాదం చేశాను. దానికి మా వాడు అరవై రూపాయలు తెచ్చిచ్చాడు. నాకు పి.ఆర్.వో, అడ్వయిజర్ అన్నీ తమ్ముడు సుబ్బారావు మాత్రమే.
‘మునగచెట్టు’ నవల శివరామకృష్ణ గారు వేస్తాను అన్నాడు. కానీ, అది ఇంకో ముప్పై పేజీలు ఉండాలి. నూట ఇరవై పేజీల దాకా లాగమన్నాడు. ‘ససేమిరా’ అన్నానే్నను. దానికి విజయసాహితీ సమితి వారి సలహా మీద ‘నవలిక’ చేశాను. అసలది ఆంధ్రపత్రికలో కథానికగానే వచ్చింది. ‘అందులోని పాత్రలకు ‘పెద్ద పెద్ద డైలాగులు రావు’ అన్నాను - సరే, మరో మూడు కథలు చేర్చారు. బుక్ - ప్రూఫ్‌లు తమ్ముడు తెచ్చి, వాడి నైట్‌షిఫ్ట్‌లో దిద్దుతూ వుంటే - ‘తిరుమల’గారి కంటపడ్డది. మర్నాడు దాన్ని తీసుకు చదివారాయన. ఎంతో నచ్చేసిందాయనకి.
‘మీవాడు తొలి మలుపు రాయడం గొప్పేం కాదు. అందులో ఆశ్చర్యం లేదు. కానీ, ఇది రాయడం, అతని ప్రతిభకి గీటురాయి’ అన్నారుట.
‘మీరు ముందు మాటలు రాస్తారా, మరి? అన్నయ్యకి చెబుతాను. హ్యాపీగా ఫీలవుతాడు’ అన్నాడట మా వాడు. తిరుమల రామచంద్రగారి లాంటి స్కాలర్, బహుభాషా కోవిదుడు, జర్నలిస్టు - ముందు మాటలు రాసిన, ఆ ‘మునగచెట్టు’ - దేశీవారు ఎన్నో అచ్చుతప్పులతో వేసినా నాకు పేరు తెచ్చిన కల్పవృక్షం అయింది.
ఇదంతా ఎందుకు చెబుతున్నానూ - అంటే - అటు విశాలాంధ్ర, ఆకాశవాణీ - ఇటు ప్రభలో పెద్దల పరిచయం ఇవన్నీ కలిపి - వేరే ఉద్యోగం మీదికి నా దృష్టి మరలకుండా చేశాయి. అప్పట్లో నవలలకి గవర్నమెంటు లైబ్రరీల ఆర్డర్స్ తెచ్చుకుంటే- అది పబ్లిషర్స్‌కి బంగారు పంటే! కానీ, ముఖచిత్రాలు వేసేవారు తక్కువ. నా ‘రాతిమేడ’ తొలి ఎడిషన్‌కి ‘వెంబు’ కూడా వెయ్యలేదు. ‘ఏఎన్నార్’ అనే ఆర్టిస్టు వేశాడు. కానీ, ఇతను ఆర్టిస్ట్ కాదు. ప్రచురణకర్త. నాగేశ్వర్రావుగా - విక్రమ్ పబ్లిషర్స్ పార్ట్‌నర్‌గా, నేను మద్రాసు నుంచి వచ్చేసరికి - టాప్‌స్పీడ్‌లో - ఎడ్యుకేషనల్ బుక్స్‌ని పబ్లిష్ చేస్తున్నవాడైనాడు. ‘విక్రమ్ గైడ్స్’దో పేరు. తొంభైలో నాకు కూడా కొంత వర్క్ ఇచ్చి, ఇంటికి పంపించి మరీ, చేయించారు విక్రమ్ పబ్లిషర్స్.
‘మునగచెట్టు’కి మా తమ్ముణ్నే ముఖచిత్ర రచన చెయ్యమన్నాను. ‘మద్రాసు మీద మనం ఆధారపడకూడదు’ అన్నది మా నర్సయ్యగారి నినాదం. ‘కట్ కలర్స్’లో ఆ విధంగా మా వాడి మొట్టమొదటి కవర్‌పేజీ వాడికి అన్నయ్య నవలే నాంది పలికింది.
అంతలో బందరు రోడ్డు మీదికి ‘ఆంధ్రజ్యోతి’ అనే డైలీ - కె.ఎల్.ఎన్. ప్రసాద్ - నార్లగారిని ఎడిటర్‌గా - తెస్తున్నారన్నదో సంచలన వార్త అయింది. మద్రాసు ‘ప్రభ’లో వున్న విద్వాన్ విశ్వంగారు - నార్లగారితోపాటూ వచ్చేశారుట!
చెప్పానుగా.. నేను ఫిజిక్సు వాణ్ణి - నా తొలి మలుపు హీరో - శేఖరం ‘కెమిస్ట్రీ’ వాడనీ. అంచేత తొలి మలుపు నా కథే కానక్కరలేదని అంటూ వుండేవాణ్ని. కానీ ‘తొలిమలుపు వీరాజీ’ అన్న పేరు స్థిరమై పోయింది.
మా ఆనర్సు బ్యాచ్‌లో నేనూ, నా రూమ్‌మేటు గోపాలం తప్ప మిగతా పదిహేను మందీ పై చదువులకి వెళ్లిపోయారు. గోపాలం, నేనూ డ్యూటీ ఆఫీసర్‌లు, ‘ప్రొగ్రామ్ టెక్’ల పరీక్ష రాశాం - సరదాకి. వాడు సెలెక్టయ్యాడు. నేను ‘డ్రాప్’ అయిపోయాను. మాకు యూనివర్సిటీలో డబుల్ సీనియర్ - కథలు రాసే కొండముది హనుమంతరావుగారప్పుడే రేడియో స్టేషన్‌లో జాయినయి పోయాడు. దీంతో కంట్రోల్ రూమ్ (ఆకాశవాణి) మాదే అయింది. ‘బ్రాడ్‌కాస్టింగ్ టెక్’లుంటారు. ఫిజిక్స్‌లో సెలెక్ట్ అయితే లేదా ఆర్ట్స్ అయితే డ్యూటీ ఆఫీసర్లంటారు. మేం కంట్రోల్ రూమ్‌కి సరదాగా వెళ్లేవాళ్లం. హనుమంతరావుగారు, ప్రసాదరావుగారు మాకు సీనియర్లుగా చనువు. ఈ ‘టెక్నికల్ వింగు నుంచి రికార్డింగు స్టూడియోలోకి వెళ్లేవాళ్లం. అలా అక్కడ ‘శ్రీవాత్సవ’ శ్రీమతి ‘లత’ (అప్పుడు అనౌన్సర్ అనుకుంటాను) వోలేటి గారు, జరుక్ శాస్ర్తీగారు - ప్రయాగ నరసింహశాస్ర్తీ గారూ లాంటి పెద్దలు పరిచయమై పోయారు. ఒక చిన్న పాత బిల్డింగ్‌లో వుండేది స్టూడియో నాడు. ట్రాన్స్‌మిషన్ టవర్ నంబూరు (గుంటూరు దారిలో)వద్ద వుండేది.
ఓసారి, సరదాగా మా వాడు ‘గోపాలం’ నన్ను స్టూడియోలోకి తీసుకుపోయి- ఆనాటి ఎక్స్‌ప్రెస్‌లో ఒక అయిటమ్ చదవమన్నాడు. తను దాన్ని టెక్నికల్ రూమ్‌లో నుంచి ‘రికార్డ్’ చేశాడు. అది మేము వింటూంటే ప్రొగ్రామ్ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాసన్ గారు అటుగా వస్తూ విన్నాడు.
‘నేనూ, శారదా శ్రీనివాసన్ కలిసి కొత్తగా యూత్ ప్రొగ్రామ్ ఒకటి పెడుతున్నాం. దానికి మీరు ‘టాక్స్’ రాసి, తెచ్చి చదవండి. బాగుంది మీ స్పీడు’ అన్నాడు. ఆకాశవాణి స్టూడియో కలియ తిరిగే ఛాన్సు ఇప్పుడు మరింత ఎక్కువయింది. కొన్ని ‘టాక్స్’ చేశాను గానీ - నాన్నగారు మద్రాసులో వున్నారు కనుక అక్కడికి పోయి - ‘కనె్నమెర లైబ్రరీ’లో బుక్స్ చదువుకోవాలన్న కోరిక కలిగింది. దీనికీ కారణం వుంది. విశాలాంధ్ర ఆఫీసు మిత్రులు పెద్దలూ ఆత్మీయతా - ఇవన్నీ కలిపి నన్ను అటు వేపు లాగడం మొదలుపెట్టాయి. ‘లుముంబా’ యూనివర్సిటీకి పోయి రష్యన్ నేర్చుకుందామనుకున్నాను. సీనియర్‌గారు నన్ను పిల్చి, కూర్చోబెట్టుకున్నారు.
‘వినండి’ అన్నారు.
ఆయన ఎన్నడూ, ఎంత వాదించినా, ఏకవచన ప్రయోగంలో మాట్లాడేవారు కాదు. ‘మీరు తొందరపడొద్దు. సిద్ధాంతం, మోజు వేరు. పార్టీ వేరు. బాగా అధ్యయనం చెయ్యండి. మద్రాసులో ‘్ఫదర్’ వున్నారు, అక్కడికిపోయి. కనె్నమెర లైబ్రరీలో అన్ని బుక్స్ దొరుకుతాయి. మార్క్స్ ఏంగిల్స్‌లతో పాటు, ఇంకా శాస్తవ్రేత్త లెందరో వున్నారు. సైంటిస్టులున్నారు. వాళ్ల గ్రంథాలూ చదవండి. కేవలం ఈ రాహుల్ సాంకృత్యాయన్ నవలలు, టాల్‌స్టాయ్ అనువాదాలే కాదు - స్టడీ ఇండియన్ ఫిలాసఫీ, వివేకానందా బుక్స్ దాకా వదలొద్దు - మీ అంతట మీరు ఒక నిర్ణయానికి రాండి. మీకు ఫ్యామిలీ రెస్పాంసిబిలిటీస్ వున్నాయి.. మైండిట్. యూ ఆర్ ది ఎల్డెస్ట్‌సన్’ అన్నారు.
నాకు ‘వివేకోదయం’ అయింది. కానీ, రుూలోగా అనుభవజ్ఞులు పరకాల, నిడమర్తి, బొమ్మారెడ్డి, ఏటుకూరిగారు, రామ్మోహన్ గారు సరేసరి. వీరి సాంగత్యం, వాత్సల్యాల వల్ల - పత్రిక ఎడిటోరియల్ డిపార్ట్‌మెంట్, డాక్ ఎడిషన్సూ, మార్నింగ్ ఎడిషన్ వగైరాలు అవగతమయినాయి. ‘రేడియో పిల్లల కార్యక్రమం - వీరాజీ అన్నయ్య వచ్చాడర్రా’ లాంటి ఆకర్షణలు తగిలాయి. వెనుకబడ్డాయి అవీ - ఓ రకంగా పత్రికా రంగంలో డ్రెస్ రిహార్సల్స్ అయిపోయాయి.
మద్రాసు నుంచి తమాషాగా - వో ఆహ్వానం - వో పిలుపు వెతుక్కుంటూ వచ్చింది. మహానుభావుడు. ఆనందవాణి ఉప్పులూరి కాళిదాసు గారు వెతుక్కుంటూ వచ్చారు. కానీ, నేనా టైములో ఇంట్లో లేను...

(ఇంకా బోలెడుంది)

ఏం చేశాను..?

0
0

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో కొన్ని పత్రికల వారు మామూలుగా సంవత్సరం చివరలో కొంతమంది పెద్ద వాళ్లను సంప్రదించి వారు ఆ సంవత్సరం చదివిన మంచి పుస్తకాలను గురించి రాయిస్తారు. నిజానికి పెద్దవారు మంచి పుస్తకాలను మాత్రమే చదువుతారు. అటువంటి చర్చలో కనిపించిన పుస్తకాలకు మరింత మార్కెట్ పెరుగుతుంది. ప్రచారం కూడా కలుగుతుంది. మన దగ్గర ఆ పద్ధతి పెద్దగా ఉన్నట్టు కనిపించదు. ఎవరో ఏదో చేయలేదని నిరాశ పడేకన్నా ఆ పని లేని పద్ధతిలో నేను చేస్తే పోతుందని ఈ నాలుగు ముక్కలు రాస్తున్నాను.
2018 అనే ఈ సంవత్సరంలో నేను ఏం చేశాను? చాలానే చేసినట్టు ఉన్నాను. నిజానికి ఈ సంవత్సరం నేను రాసిన చిన్నా చితకా నుంచి పెద్ద పుస్తకాలు పది దాకా బయటకు వచ్చాయి. రచయితగా అది నాకు చాలా గొప్ప సంతృప్తినిచ్చిన విషయం. నూర్‌మహల్ అంటే మనకు తెలిసిన నూర్జహాన్ గురించి నేను ఒక నవల రాశాను. అది చాలామందిని ఆకర్షించినట్టు ఉంది. ఈ మధ్యనే అగాధా క్రిస్టీ రచన పార్టీలో పదముగ్గురు అనే నవలను తెలుగులో ప్రచురించాను. గతంలో నేను షెర్లాక్ హోమ్స్ నవలలు వేసినప్పుడు వచ్చినింత రియాక్షన్ క్రిస్టీ నవలకు వస్తుందని నేను అనుకోవడం లేదు. ఈ రచయిత్రి అంతగా పాఠకులకు పరిచయం ఉన్నట్టు లేదని నా అనుమానం.
ఇంతకు నేను చెప్పాలనుకున్నది నేను చదివిన పుస్తకాల గురించి. సైన్స్ గురించి చదవడం, అందుకు సంబంధించిన పుస్తకాలను సేకరించడం నాకు ఇంచుమించు ఒక బలహీనత. అమెరికా నుంచి వచ్చేటప్పుడు ప్రతి వ్యక్తికి 100 పౌండ్లు అంటే నలభై ఆరు కిలోల వస్తువులను తెచ్చుకోవడానికి అనుమతి ఉంటుంది. నా రెండు సూట్‌కేస్‌లో కలిపి 16 కిలోల పుస్తకాలు తెచ్చుకున్నాను. అందులో ఇంచుమించు అన్ని సైన్సుకి సంబంధించినవే. ఈ సంవత్సరం నేను ఇప్పటికే చదివిన సైన్సు పుస్తకాలలో నైజేల్ కాల్డర్ వ్యాసాల సంకలనం నన్ను చాలా కదిలించింది. ఇతను సైంటిస్ట్ అనే పత్రికకు సంపాదకుడుగా ఉండేవాడు. ఒక ప్రత్యేకమైన పద్ధతిలో వ్యాసాలను రాస్తాడు. ఒక్క రంగంలోని రకరకాల విషయాలను గురించి వేరువేరు వ్యాసాలు రాయడం ఒక పద్ధతి. వాటన్నింటినీ గుర్తుంచుకుని, వాటి మధ్య సంబంధాలను అర్థం చేసుకుని, సమీక్ష లాంటి ఒక విస్తృతమైన వ్యాసం రాయడం అందరికీ వీలు కాదు. ఆయా రంగాలను గురించి ఎంతో లోతైన పరిచయం ఉంటే కానీ ఈ రకంగా రాయడం కుదరదు. నైజేల్ ఇటువంటి వ్యాసాలను అలవోకగా రాస్తాడు. ఎన్నో రంగాలను గురించి రాస్తాడు. కనుక చదువుతూ ఉంటే గొప్ప ఆనందం కలుగుతుంది.
నేను మనిషి తీరుతెన్నులను గురించి విస్తృతంగా చదివి ఒక మంచి పుస్తకం రాయాలన్న ప్రయత్నంలో ఉన్నాను. ఆ దిశగా ఎన్నో పుస్తకాలు సేకరించాను. చదువుతున్నాను. వాటిని గురించి ఎక్కువగా చెప్పను. సైన్సును సరదా కోసం చదివే పద్ధతి మాత్రం నాకు లేదు. ప్రతి నిత్యం ప్రపంచంలో వస్తున్న పత్రికలను, పుస్తకాలను గురించి వెతికి వాటి గురించి పరిచయం కలుగజేసుకోవటం అలవాటుగా మారింది. అక్కడ చదువుతున్న, చూస్తున్న పుస్తకాలను గురించి చెప్పడం కొంచెం కష్టమే. అయితే ఈ సంవత్సరం నేను రిచర్డ్ డాక్సిన్ అనే రచయిత పుస్తకాలతో పరిచయం ఏర్పరచుకున్నాను. అవి నన్ను ఇంచుమించు కదిలించాయి. అయితే నేను ఇంకా వాటిని చదవవలసి ఉంది.
నేను కథా సాహిత్యాన్ని గురించి ప్రత్యేకంగా కృషి చేస్తున్నాను. పెద్ద సంఖ్యలో దేశదేశాల నుంచి కథా సంకలనాలను సేకరించాను. వచ్చిన ప్రతి సంకలనంలోని కనీసం ఒకటి రెండు కథలను చదివి, రచయిత గురించి ఒక అభిప్రాయం ఏర్పరచుకుని పక్కన పెడుతున్నాను. వాటిని గురించి సమగ్రమైన కృషి చేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాను. ఏడాది క్రితమే అమెరికా కొడుకు- అనే పేరున ఒక అనువాద కథల సంకలనాన్ని ప్రచురించాను. కానీ దాన్ని పాఠకులు గుర్తించినట్టు కనిపించలేదు. కనుక ఆ తరువాత తయారుచేసిన మరో రెండు సంకలనాలను నిలిపివేశాను.
ఇక కేవలం నా ఆనందం కోసం చదివిన పుస్తకాలు కూడా ఈ సంవత్సరం పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. వాటన్నింటినీ చదివే ముందు నాకు ఒక ఆలోచన పుడుతుంది. బాగుంటే ఈ పుస్తకాన్ని తెలుగు పాఠకులకు అందించాలి అనిపిస్తుంది. కనీసం ఆ పుస్తకం గురించి అయినా చెప్పాలి అనిపిస్తుంది. అన్నిసార్లు అటువంటి అవకాశం దొరకదు. రాబర్ట్ హారిస్ అనే రచయిత వెలువరించిన మూడు పుస్తకాల సంకలనం ఒకటి చదివాను. గ్రీకు చరిత్రకు సంబంధించిన నవలలు అవి. సిసిరో అని ఒక లాయర్ ఉంటాడు. అతను నిజానికి చాలా మామూలు మనిషి. కానీ చివరికి దేశాన్ని మొత్తాన్ని నడిపించే నాయకుడు అవుతాడు. ఆ విషయాన్ని రచయిత అందించిన తీరు అద్భుతంగా ఉంటుంది. మూడు నవలలు దేనికదే వేరువేరుగా చదివిన వారికి ఎలా అర్థం అవుతుందో తెలియదు కానీ, నేను మాత్రం క్రమంగా మూడింటిని చదివాను. చారిత్రక నవలల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి చదువుతున్నాను. కనుక నాకు ఇది మరీ నచ్చింది. బైజాంటైన్, ఇరానియన్, మంగోలియన్, జపనీస్, చైనీస్ చారిత్రక నవలలను గురించి ప్రత్యేకంగా కృషి చేస్తున్నాను. టోంగ్వాన్ సిటీ అనే ఒక చైనా నవల చదివాను. అందులో బౌద్ధ భిక్షువు గురించి కూడా ఉంటుంది. భారతదేశం నుంచి వెళ్లిన ఆ భిక్షువు చైనా దేశంలో చిత్రమైన పరిస్థితిలో బతుకుతాడు. దేశమంతా తిరుగుతాడు. ప్రభువులతో తలపడతాడు. ప్రభువు విచిత్రమైన మనిషి. గొప్ప నగరాన్ని నిర్మిస్తాడు. కానీ అటువంటి నవలను బహుశా తెలుగు పాఠకులు ఆదరించలేక పోతారన్న అనుమానం నాకు కలిగింది.
వు చెంగెన్ అనే రచయిత రాసిన చారిత్రక నవల నన్ను ప్రత్యేకంగా ఆకర్షించింది. నవల పేరు మంకీ. అంటే కోతి. యువన్ చువాంగ్ లేదా హుయాన్ సాంగ్ లాంటి పేర్లతో మన దేశపు చరిత్ర పుస్తకాలలో పరిచయమైన బౌద్ధ భిక్షువు ఒకతను భారతదేశానికి బయలుదేరుతాడు. వాళ్ల చక్రవర్తి తమ దేశంలో ప్రచారంలో ఉన్న హీనయాన బౌద్ధానికి బదులు మహాయాన బౌద్ధం తేవాలని, అందుకు సంబంధించిన పుస్తకాలు దేశంలో ఉన్నాయని, వాటిని తేవడానికి ఈ భిక్షువును భారతదేశానికి పంపిస్తాడు. ప్రయాణంలో అతనికి ఒక కోతి, ఒక పంది సాయం చేసినట్టు చెబుతారు. ఇదే అసలు సిసలైన పురాణ గాథ అనిపిస్తుంది. ఈ కథలోని కోతి రాతిలోనుంచి పుట్టినవాడు. వాళ్ల స్వర్గ్ధాపతిని కూడా ఎదిరిస్తాడు. అతనికి ఎన్నో మంత్రశక్తులు ఉంటాయి. కొంత వరకు మన హనుమంతుని పోలికలు ఉన్నప్పటికీ ఈ కోతి చాలా విలక్షణమైన వ్యక్తి. నానా కష్టాలు పడి వాళ్లు భారతదేశం వస్తారు. ఈ నవల చదువుతున్నప్పుడు మన పురాణాలన్నీ ఒక్కసారి మెదడులో మెదిలాయి. ప్రపంచంలో అంతటా ఒకే రకమైన ఆలోచనలు ఉన్నట్టు భావన కలిగింది. మనకు తెలిసిన బౌద్ధ భిక్షువు కేవలం ప్రయాణికుడుగా వచ్చాడు అన్నారు కానీ, ఈ కథలో అతని తీరు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. బహుశా ఈ పుస్తకాన్ని కొంచెం కుదించి తెలుగులో చెబితే మన వాళ్లు తప్పకుండా ఆదరిస్తారని నాకు తోచింది. సరైన సమయం చూసి ఆ ప్రయత్నం చేస్తాను.గిల్గమేష్ అనే పేరు మన వాళ్లు చాలామంది విని ఉండకపోవచ్చు. మెసొపొటేమియాలో రాత మొదలైన కాలంలో మట్టి బిళ్లలలో రాసి పెట్టిన కవితాత్మక నవల ఒక దానిలో ఈ రాజు చరిత్ర ఉంది. చాలాకాలం వరకు ఆ భాష ఎవరికీ అర్థం కాలేదు. ఈ మధ్యనే దాన్ని అర్థం చేసుకున్నారు. కథను యథాతథంగా రాసుకోగలిగారు. ఇంగ్లీషులోకి అనువదించారు కూడా. నేను ఆ పుస్తకాన్ని సేకరించి చదివాను. మళ్లీ పురాణాల పద్ధతి కనిపించింది. కథ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. అందులోని పాత్రలు వాటి పేర్లలో భారతీయ ధోరణులు కనిపిస్తాయి. ఇది కవితాత్మక రచన. దీన్ని వచనంలాగా మార్చాలి. నిజానికి ప్రపంచంలోనే ఇది మొట్టమొదటి నవల అంటున్నారు. ఇటువంటి పుస్తకాన్ని గనుక మన పాఠకులకు అందించగలిగితే అంతకన్నా కావలసింది ఉండదు. నేను చదివిన ప్రతి పుస్తకాన్ని అనువదించి అందించాలని అనిపిస్తుంది. కానీ అది కుదిరే పని కాదని తెలుసు.
ఉన్నట్టుండి నాకు ఎం.టి.వాసుదేవన్ నాయర్ నవలల మీదకు దృష్టి మళ్లింది. ఇప్పటికే ఆయన రచనల ఆధారంగా ఆయన రూపొందించిన సినిమాలు చూశాను. గొప్ప రచయిత మాత్రమే కాదు. ఆయన గొప్ప సినిమా నిపుణుడు కూడా. దేవుని గురించి ఒక చిత్రమైన నవల రాశాడు. అది చదువుతుంటే వింత ఆలోచనలు కలుగుతున్నాయి. ఇటువంటి నవలలు తెలుగులో ఎందుకు రావడం లేదు అని అనుమానం కూడా కలుగుతుంది. ఇక కన్నడ రచయిత అనంతమూర్తి నవల భావ కూడా చదివాను. చిత్రమైన రచన. ఆయన పోకడ అంతకు ముందు కూడా తెలిసిందే. ఆయన రచనల ఆధారంగా కూడా సినిమాలు వచ్చాయి.
ఇంతకాలం తరువాత నాకు రవీంద్రనాథ్ ఠాగూర్‌లోని భావుకతను సందర్శించే అవకాశం కలిగింది. ఎపిక్ అనే టీవీ చానల్ వాళ్లు రవీంద్రుని కథలను ఎంచుకుని ఎపిసోడ్లుగా చూపించారు. కొన్ని కథలు రెండు మూడు ఎపిసోడ్లుగా కూడా వచ్చాయి. అనుకోకుండా నెట్‌ఫ్లిక్స్‌లో నేను వాటిలో నుంచి ఒక ఎపిసోడ్ చూశాను. మిగతావి చూడకుండా ఉండలేక పోయాను. ముఖ్యంగా మొట్టమొదటిలోనే ఉన్న చోఖేర్ బాలీ అనే కథ నన్ను కుదిపివేసింది. రవీంద్రుడు మాత్రం ఈ కథ నేను రాయకుండా ఉంటే బాగుండేది అన్నాడు. మిగతా కథలన్నీ కూడా బాగున్నాయి. వాటిని దృశ్యమానం చేసిన తీరు మరింత బాగుంది. అయితే ఆనాటి కాలంలో వేషభాషలు ఈ రకంగా ఉండేవా? అని అనుమానం కలిగిన మాట వాస్తవం. మొత్తానికి రవీంద్రుని రచనల మీదకు మళ్లింది. చోఖేర్ బాలీ పుస్తకం కోసం తెగ వెతికాను. కంటి మెరమెర అనే పేరున అది ఎప్పుడో తెలుగులో కూడా వచ్చింది. చదివే ఉంటాను. కానీ అది నాకు ఇప్పుడు దొరకలేదు. కనీసం ఇంగ్లీష్‌లో కూడా దొరకలేదు. నిరాశ చెంది ఊరుకున్నాను. కానీ తెలుగు రోజుల తరువాత నా పుస్తకాలను తిరగ వేస్తుంటే అందులో నాకు ఈ నవల హిందీ రూపాంతరం కనిపించింది. నా ఆనందం అంబరాన్ని తాకింది. రవీంద్రునిలోని లోతును నేను అంతకు ముందు కనుగొనలేక పోయాను. గోరా లాంటి నవలలు కనిపించే రవీంద్రుడు వేరు. చిన్న కథలలో రవీంద్రుడు వేరు. నాకు చదవడం ఒక వ్యసనం. జో నెస్బో అనే ఒక స్కాండినేవియన్ రచయిత గురించి విని అతని నవలల అనువాదాలు వెతికి సంపాదించాను. అవి అపరాధ పరిశోధక రచనలు. ఒకటి రెండు బాగున్నాయి. కానీ అన్నీ నాకు నచ్చలేదు.
పుస్తక సేకరణ అన్నది నాకు నిత్య కార్యక్రమం. రోజు కనీసం అంతకు ముందు చూడని ఒక పుస్తకాన్ని అయినా నేను చూడాలి. అలా సేకరించిన వాటిలో చాలా పుస్తకాలను చదువుతాను కూడా. చదవని పుస్తకాలు మిగిలి ఉన్నాయి. వాటి గురించి చెప్పినా లాభం లేదు. సరేగాని, ఈ సంవత్సరం మీరు చదివిన పుస్తకాల గురించి నాకు ఎవరు చెప్పాలి?

ఆలోచన తోడైతే..

0
0

ఓ సినిమాలో మధ్యవయసులో ఉన్న హాస్యనటుడు బ్రహ్మానందాన్ని మీరేం చేస్తుంటారు? అని ప్రశ్నిస్తే- కలం స్నేహం, సినిమాలు చూడడం. అంటూ వరుసగా తన హాబీలు చెబుతుంటాడు. అలానే చాలా మంది ఇంట్లో టీవీ సీరియల్స్ చూడడం, మగాళ్లయితే క్రికెట్, మందు పార్టీలు, కాలక్షేపం కబుర్లతో జీవితం గడుపుతుంటారు. ఆఫీసుల్లో పని కన్నా కబుర్లు ఎక్కువ కొందరికి. గంటల తరబడి రాజకీయ చర్చలు కొందరికి జీవితంలో అత్యంత ముఖ్యమైనవి.
హాబీలేమీ తప్పు కాదు. జీవితం అన్నాక యంత్రంలా ఉండలేం. ఏవో అభిరుచులు ఉంటాయి. టీవీ చూడడం, సినిమాలు చూడడం, రాజకీయాలు, సినిమాలపై చర్చలు తప్పేమీ కాదు. ఇవేవీ లేకుండా కేవలం సంపాదన కోసమే బతికితే జీవితం నిస్సారంగా మారుతుంది. అయితే జీవితంలో దేనికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి? దేనికి ఎంత సమయం కేటాయించాలి? అనే జ్ఞానం వీటన్నిటి కన్నా ముఖ్యం. రోజంతా టీవీలో సీరియల్స్ చూస్తూ గడపడం వేరు. సీరియల్స్ చూసి మనం ఎందుకు రాయలేం? అని రాయడం, దాని ద్వారా పేరుతో పాటు డబ్బు సంపాదించడం వేరు.
మన అలవాట్లు, మన ఆలోచనలు, మన నిర్ణయాలే మనం.. మనం ఎలాంటి ఆలోచనలు చేస్తామో మనం అలానే మారుతాం.
ఆఫీసు నుంచి ఇంటికి రాగానే టీవీలో సినిమాలు, సీరియల్స్‌తో జీవితం గడిపే వారి జీవితం దానికి తగ్గట్టుగానే ఉంటుంది. కానీ చివరకు ఆఫీసుకు వెళ్లే సమయం, ఆఫీసు నుంచి వచ్చే సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటే ఒక సామాన్య ఉద్యోగి కూడా వందల కోట్ల రూపాయల ఆస్తిపరుడు అవుతాడు. వేల కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీకి యజమాని అవుతాడు. ఇదేమీ సినిమా కథ కాదు. మన కళ్ల ముందు జరిగిన కథ. ప్రతి ఒక్కరూ ఇలా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే వేల కోట్ల రూపాయలకు అధిపతి అవుతారని కాదు. కానీ కచ్చితంగా ఉన్న స్థితి కన్నా ఎంతో కొంత మెరుగు పడడం ఖాయం.
కర్సన్ బాయ్ పటేల్ ఒక సాధారణ ఉద్యోగి. గుజరాత్ ప్రభుత్వ రంగ సంస్థలో కెమిస్ట్. తన ఇంటి నుంచి ఆఫీసు పదిహేను కిలో మీటర్ల దూరం. ఈ పదిహేను కిలోమీటర్లు సైకిల్‌పైనే ఆఫీసుకు వెళ్లే వారు. తిరిగి అదే సైకిల్‌పై ఇంటికి వచ్చేవారు. సైకిల్‌పై ఆఫీసుకు వెళ్లే సాధారణ ఉద్యోగి జీవితం ఎలా ఉంటుందో కర్సన్‌బాయ్ జీవితం కూడా అలానే ఉంది. ఐతే అతని మెదడు అందరిలా ఆఫీసు ఐపోగానే ఇంటికి వచ్చి కాలక్షేపం కబుర్లు చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే జీవితంలో ఎంతో కొంత ఎదిగేందుకు ఏం చేయాలా? అని ఆలోచించాడు. తాను కెమిస్ట్ కాబట్టి దానికి తగ్గట్టుగానే ఆలోచన వచ్చింది. 1985లో నిర్మా వాషింగ్ పౌడర్ తయారు చేసి సైకిల్‌పైన పెట్టుకుని ఆఫీసుకు వెళ్లే సమయంలో దారిలో అమ్మేవాడు. ఆఫీసు నుంచి తిరిగి వచ్చేప్పుడు అమ్మేవాడు. మూడున్నరకు రూపాయలకు కిలో నిర్మా ప్యాకెట్ అమ్మేవాడు. 1985నుంచి 2000 వరకు నిర్మా వాషింగ్ పౌడర్ దేశంలో ఒక ఊపు ఊపేసింది. అప్పటికే ఉన్న బట్టల సబ్బులు, ఖరీదైన పౌడర్ల మార్కెట్‌ను ఒక్కసారిగా నిర్మా హస్తగతం చేసుకుంది. బహుళ జాతి కంపెనీలు నిర్మా ముందు కుదేలయ్యాయి. 1990 ప్రాంతంలో సంగారెడ్డిలో జరిగిన ఒక సభలో బిజెపి నేత బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, గతంలో యువకులు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించమని మమ్మల్ని కలిసేవారు, ఇప్పుడు ఉద్యోగం కోసం కాకుండా నిర్మా డీలర్ షిప్ ఇప్పించాలని కోరుతున్నారని చెప్పారు.
నిజంగా ఆ కాలంలో నిర్మా పౌడర్ హట్ కేకుల్లా మార్కెట్‌ను ముంచెత్తింది. అప్పటి వరకు మార్కెట్‌లో ఉన్న సబ్బుల పౌడర్ కన్నా చాలా తక్కువ ధర, నాణ్యత ఎక్కువ దీంతో నిర్మాకు ఎదురు లేకుండా పోయింది. నిర్మాకు దేశవ్యాప్తంగా నాలుగు వందల మంది డిస్ట్రిబ్యూటర్లు, 20వేల ఔట్‌లెట్‌లు ఉండేవి. దీంతో మారుమూల గ్రామాలకు కూడా నిర్మా చేరువైంది.
వేలకోట్ల రూపాయల టర్నోవర్‌కు చేరుకున్న నిర్మా ఎక్కడ మొదలైందో తెలుసా? కేవలం వంద చదరపు అడుగులు, అంటే ఒక్క చిన్న గదిలో ప్రారంభం ఐంది. ఆ గదిలో నిర్మా పౌడర్‌ను తయారు చేసి ఉద్యోగానికి వెళ్లేప్పుడు సైకిల్‌పై కొన్ని ప్యాకెట్లు తీసుకువెళ్లి అమ్మేవారు కర్సన్ బాయ్.
అతను కూడా అందరి మాదిరిగానే ఆఫీసు అయ పోగానే క్యాంటిన్‌లో రాజకీయ కబుర్లు, సినిమా ముచ్చట్లతో గడిపేస్తే ఈ రోజు అతని గురించి చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. కోట్లాది మంది అప్పారావు, సుబ్బారావుల్లో ఒకడిగా మిగిలిపోయేవారు. సమయం లేదు, పెట్టుబడి లేదు, ఎవరూ సహకరించడం లేదు, మా బంధువులు సహకరించరు, ఇంట్లో సహకరించరు. అనే కుంటి సాకులు లక్ష ఉండొచ్చు. కానీ ఏదన్నా చేద్దాం, బాగుపడదాం.. అనే ఒక్క ఆలోచన ఉంటే చాలు- ఏదో ఒక మార్గం లభిస్తుంది. కర్సన్ బాయ్ పెట్టుబడి ఒక సైకిల్, ఇంట్లో ఒక గది అంతే. దాంతోనే ప్రపంచం దృష్టిలో పడ్డారు. విజేతగా నిలిచారు. అంబికా దర్బార్ బత్తి, క్రేన్ వక్కపొడి వంటి లెక్కలేనన్ని కంపెనీలు ఇలా సైకిల్‌పై మొదలైనవే. చందన, బొమ్మనలే కాదు ఇప్పుడు మార్కెట్‌ను ఏలుతున్న ఎంతో మంది వస్త్ర వ్యాపారులు ఒకప్పుడు బట్టల దుకాణాల్లో పని చేసి స్వయం శక్తితో ఎదిగిన వారే. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి ప్రపంచ దిగ్గజాలు సైతం చిన్న గదుల్లోనే పురుడుపోసుకున్నాయి. బాహుబలి సినిమా సెట్టింగ్‌ల్లో ప్రారంభం కాలేదు. బాహుబలి కేవలం గ్రాఫిక్ మాయాజాలం మాత్రమే. ఇరుకు గదిలో పుట్టిన మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి.
సైకిల్‌పై ప్రారంభం అయన ప్రతి వ్యాపారం వేల కోట్ల రూపాయలకు ఎదుగుతుందని కాదు.. కానీ ఊబుసుపోక కబుర్లతో కాలం గడపడం కన్నా- ఏదో ఒకటి చేయడం ద్వారా కచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితి కన్నా మెరుగ్గానే ఉంటాయి.
కూలి పని చేసుకునే కొందరు మహిళలు ఇటీవల హైదరాబాద్ నగరంలో సాయంత్రం సమయంలో జొన్నరొట్టెలు చేసి అమ్ముతున్నారు. కొందరు మహిళలు కర్రీ పాయింట్స్ నిర్వహిస్తున్నారు. టీవీ సీరియల్స్‌తో కాలక్షేపం కన్నా ఇవి కచ్చితంగా ముందుకు తీసుకు వెళతాయి. ఏదో ఒకటి చేద్దాం అనే ఆలోచనకు శ్రీకారం చుడితో ఏం చేయాలో ఆలోచన అదే వస్తుంది.

సునాద వినోదులు - సుస్వర బేహారులు

0
0

జీవనది ఎప్పుడూ ఎండిపోదు. సంగీత ప్రవాహం ఎప్పుడూ నిండుకోదు. అందులో ఎవరు మునిగినా ధన్యులే. స్నానం చేసే ఓపిక లేనివారు చెంబుతో కాసిన్ని నీళ్లు చల్లుకున్నా సంగీత గంగ అనుగ్రహిస్తుంది. ఈదడం తెలిసినవారు నది మధ్యకు వెళ్లి పరమ తృప్తిగా స్నానం చేసినట్లుగా, సంగీతపు లోతుల్ని చూసి పరవశించి గానం చేస్తూ నాదమయ లోకాల్లో విహరించగలిగిన గాన గంధర్వులెందరో ఈ భూమీద పుట్టారు. పాడేశారు, వెళ్లిపోయారు. సిరిసంపదలతో మూట కట్టుకుని కాదు. శ్రోతల హృదయాల్లో శాశ్వతులై తలుచుకున్నప్పుడల్లా గుర్తుకొచ్చేలా సార్థక జీవులై, కీర్తి శరీరంతోనే ఉండిపోయారు. సంగీతానికదే సార్థకత.
కాలానికి మించిన ఉత్తమ బోధకుడు, జీవితానికి మించిన ధ్యాన మందిరం ఉండదు. కొత్తగా ఏదీ తెచ్చిపెట్టకుండా మనిషిలోని ప్రజ్ఞకు ప్రకాశాన్నిచ్చేది దేవుడే. సంగీత జ్ఞానం విధాత ఇవ్వవలసినదే. ఒకప్పుడు మన ఇళ్లల్లో సంగీతం నేర్చుకునే పిల్లలకు హార్మోనియం పెట్టె కొనిచ్చేవారు. ఆ పెట్టెలో మెట్లుపై వ్రాసిన 12 అంకెలూ, ఒక స్థాయిలోని 12 స్వర స్థానాలూ వుంటాయి. క్రింద రాసిన అంకెలు 1 నుంచి 7 వరకూ, మన గాయకులు సాధారణంగా మాట్లాడుకునే ఒకటి శృతి, రెండు శృతీ అని తెల్ల మెట్లు శృతులూ, ఆధార శృత్తిగా పాడేప్పుడు, ఒకటీ, ఒకటిన్నర, రెండున్నర అంటూంటారు. ఈ శృతుల్ని సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఎఫ్, ఎఫ్ షార్ప్‌గా, పాశ్చాత్య సంగీత పరిభాషలోని మాటల్ని వాడతారు.
శృతికీ, అపశృతికీ తేడా తెలుసుకున్న వారికి సంగీతం తొందరగా వస్తుంది. మిగిలిన వారు తపస్సుగా భావిస్తేనే సిద్ధిస్తుంది. సంగీతం నేర్చుకునే పిల్లలకు నిజానికి ‘హార్మోనియమ్’ పెద్ద దిక్కు. షడ్జ పంచమాలు గొంతులో పలికించినంత తేలికగా, మిగిలిన స్వరాలు, పిల్లలు పలికించటం కష్టం. హార్మోనియం శృతిలో పాడితే స్వరాల ఉనికి ఇట్టే తెలిసిపోతుంది. కానీ, ఒక స్వరానికి, మరో స్వరాన్ని కలిపి పాడటంలోని రహస్యం మాత్రం ఎదురుగా గురువు చెప్పాలి. లేదంటే అస్సలు తెలియదు. గమక సౌందర్యం తెలిసేది అది తెలిసి పాడే సద్గురువుకే. హార్మోనియంలో గమకాలు పలికించటం చాలా కషటం. కాబట్టి, దాన్ని క్రమంగా వెనక్కు నెట్టేశారు. కానీ ఉత్తరాది సంగీతజ్ఞులకు పెన్నిథి లాంటిది హార్మోనియం.
హిందూస్థానీ గాయకులకు, ముఖ్యంగా ఘజల్ ప్రియులను, ఆనంద లోకాల్లో విహరింపచేస్తూ, మనోధర్మానికి మార్గాన్ని చూపించే సుస్వర వాద్యం హార్మోనియం ఒక్కటే.
దీని స్థానంలో కామధేనువు, కల్పతరు వృక్షంలా ఈ వేళ ‘కీబోర్డ్’ వచ్చి కూర్చుంది. కానీ హార్మోనియంలోని సహజ మాధుర్యం కీబోర్డు ఇవ్వలేదు. ఈ హార్మోనియంలో వినిపించే సునాదం ముందు, అత్యంత ఆధునికమైన ఏ కీ బోర్డైనా దిగతుడుపే.
హార్మోనియం పేరు చెప్పగానే నేను తలుచుకునే సినీ సంగీత దర్శకుడు మాస్టర్ వేణుగా ప్రసిద్ధుడైన మద్దూరి వేణుగోపాల్.
నేను విజయవాడ రేడియో కేంద్రంలో పనిచేసే రోజుల్లో కల్పలత, శ్రోతలు కోరిన సినిమా పాటలైనా చిత్రతరంగిణి కార్యక్రమమైనా ప్రారంభించేది మాస్టర్ వేణు పాటతోనే. కారణం ఏ పాటైనా ఆయన పాట పియానోతో మొదలౌతుంది. పాటకు మెలొడీ ఎలా వస్తుందో తెలిసిన అతి తక్కువ మందిలో వేణు ముందు వరుసలో వుంటాడు. మెలొడీ అంటే సునాదం. ఏయే స్వరాలు కలిపితే నాదం ఏర్పడుతుంది? ఏయే వాద్యాలు కలిపి వాయిస్తే సుస్వరంతో కూడిన నాదం ఏర్పడుతుందో అనుభవంతో నేర్చుకున్న వేణు పాటలే దీనికి నిదర్శనం.
ఏ రాగంలో ఏ స్వరాలకు ఆ మాటలు నప్పుతాయో తెలిసేది సంగీత దర్శకులకే. యజమాని కంటే ఇంటి నిర్మాణం కోసం ప్లాన్ వేసే ఇంజనీర్‌కు ఆ ఇంటి రూపం కనిపించేస్తుంది.
అలాగే సినీ సంగీత దర్శకుల సంగీతానుభవం అద్భుతమైన పాటలకు కారణవౌతుంది. మాస్టర్ వేణుది కృష్ణా జిల్లా మచిలీపట్నం. గుంటూరు, కృష్ణా జిల్లాలోనే కవులు, రచయితలు, నటీనటులు, సంగీత విద్వాంసులు పుట్టారనిపిస్తుంది. పుట్టిన ఊరుని వాళ్లు వదిలేసి పొట్టచేత్తో పట్టుకుని ఎక్కడెక్కడికో వెళ్లిపోయినా, వాళ్లను పట్టుకుని, మా వాడు, మా జిల్లా వాడని చెప్పుకోవటంలో ఆనందాన్ని పొందుతాం. సహజమేగా?
పియానో, గిటార్, దిల్‌రుబా, మాండొలిన్, ఎకార్డియన్, ఫ్లూట్, సెల్లో, వుడోఫోన్, జలతరంగిణి, హేమండ్ ఆర్గన్ మొదలైన పది పదిహేను వాద్యాలు అలవోకగా వాయించగల సమర్థుడు వేణు. పాటల్లోని మాటలు, అందులోని ప్రతి అక్షరం, చక్కని జిలుగులతో రవ్వ జాతి పలుకులతో పాడించటంలో హార్మోనియమే ఆయనకు ఆధారం. ఈయన హార్మోనియం వాద్యం గమక శుద్ధంగా కనిపించడమే విశేషం. క్లారియొనెట్, వేణువు కలిపితే వెన్నముద్దలా మధురంగా ఉంటుందనే వారు. వాద్య ధర్మం తెలియటం వల్ల ఆయన పాటల్లో, నిండుతనం కనిపించి షడ్రసోపేతమైన భోజనం తిన్నంత హాయిగా ఉంటుంది.
ఏ గురువు సహాయం లేకుండా అద్వితీయంగా హార్మోనియంపై పట్టు సాధించిన వేణు వాద్యం, చెన్నైలో ‘గిరీస్ మ్యూజియం’ నడిపే ఓ సంగీతాభిమాని, ఓ రోజు వేణు వాద్యం విని పరవశించిపోయి ఆ రోజుల్లో ప్రసిద్ధుడైన బిఎన్‌ఆర్ (్భమవరపు నరసింహారావు)కు పరిచయం చేయటంతో సంగీతరంగ ప్రవేశం చేశారు.
సంప్రదాయ సంగీత వాద్యాలతో చేసే వాద్య బృందంలోని మాధుర్యం తెలియాలంటే అలనాటి సంగీత దర్శకులైన ఎస్. ఎం.సుబ్బయ్య నాయుడు, సిఆర్ సుబ్బరామన్, పామర్తి, ఘంటసాల, పెండ్యాల, దక్షిణామూర్తి, రాజేశ్వర్రావు, అశ్వత్థామ, కె.వి. మహదేవన్ వంటి వారి పాటల్ని పరిశీలిస్తే తెలుస్తుంది. పాతికేళ్ల క్రితం వేణుని విజయవాడ రేడియో కోసం ఇంటర్వ్యూ చేశాను. ఆ జ్ఞాపకాలింకా నా మనస్సులో వున్నాయి.
సంగీతం కంపోజ్ చేసే వారందరూ పాడలేరు. గాయకులందరూ పాటలను ట్యూన్ చేయలేరు. పాడగలిగే ప్రజ్ఞ కలిగిన సంగీత దర్శకుల పాటల్లో సహజత్వం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఆ రోజుల్లో బాగా పేరున్న వసంత్ దేశాయ్, నౌషద్, ఎస్.డి. బర్మన్ వంటి అగ్రశ్రేణి సంగీత దర్శకులతో బాగా సాన్నిహిత్యాన్ని పెంచుకున్న మాస్టర్ వేణు హెచ్‌ఎంవి రికార్డింగ్ కంపెనీలో, సంగీత దర్శకుడుగా కొనే్నళ్లు పని చేశారు.
ఘంటసాల వెంకటేశ్వర్రావు పాడిన ‘కుంతీకుమారి’, ‘పుష్పవిలాపం’ జాషువాగారి పాపాయి పద్యాల రికార్డింగ్‌లో ప్రతి పద్యానికీ మధ్యమధ్య వాద్య బృందం సృష్టించినది వేణూయే.
ఆ పద్యాలకు లభించిన ఖ్యాతి వల్ల స్వయంగా ఘంటసాల మాటతో వేణుని విజయా సంస్థకు ఆర్కెస్ట్రా కండక్టర్‌గా తీసుకున్నారు. పివిపి రాజారాం అని ఆ రోజుల్లో విజయవాడలో ఒకే ఒక హార్మోనియం ప్లేయర్ వుండేవాడు. ఆయన తరచూ రికార్డింగులకు వస్తూ మాస్టర్ వేణు తనకు శిష్య వాత్సల్యంతో బహూకరించిన జర్మన్ హార్మోనియంని చూపిస్తూ మురిసిపోయేవాడు.
సింధుభైరవిలో ‘రావోయి రావోయి రా చందమామ’ అనే ఒక లలిత గీతం, మిశ్రమోహన రాగంలో ‘ఓహో! సుందరీ’ అనే పాటలతో వున్న 78 ఆర్‌పిఎం రికార్డు మాత్రం విజయవాడ రేడియో కేంద్రంలో పదిలంగా ఉంది.
సహజమైన సంగీత వాద్యాల మాధుర్యానికి దూరమై పోయాం. తలుపు చెక్కల మీద బాదినట్లు డబ్బాల్లో గులకరాళ్లతో, కీచురాయి శబ్దాలతో చేసే వింతవింత ధ్వనులకు చెవులు అలవాటు పడిపోయి, సుస్వరం, సునాదాల జాడ కాస్తా ఆమడ దూరంలో ఉండిపోయింది. గ్రామఫోన్ రికార్డుల పుణ్యమాని వినగలిగే సంస్కారం కలిగిన శ్రోతలింకా ఉన్నారు. ఎప్పుడు విన్నా నిత్య నూతనంగా భాసిల్లే ఆ పాటలు వింటున్నారు.

పజిల్-706

0
0

ఆధారాలు
---------------------------------------------------

1.బంగారం నగగా మారాలంటే ఇది వుండాలి (5)
5.చివరి సంవత్సరం (3)
6.‘హోలీ’ నాడు మన్మథుడికి సంబంధించిన తంతు (5)
8.జటాయువు అన్న (3)
10.పల్లు, దంతం (3)
13.అడవి (2)
14.ఈ ఆస్థానం అంటే గుర్తొచ్చేది ఈ రాగమే! (3)
15.వీటిలో కొన్నిటికి ‘గోరు’ వుంటుంది. కాని దీనికి లేదు (3)
16.వ్యావహారికంలో వినము (2)
17.సహాయము. సీనియర్ పౌరుల కోసం ప్రభుత్వం పెట్టిన పథకం (3)
19.బ్రహ్మ (3)
21.సాధారణంగా రాముడు ఇలాంటి వాడని నానుడి (5)
23.యజ్ఞం (3)
24.పల్చని కాగితంలా వుండి, పొరలు పొరలుగా లభించే ఆత్రేయపురం స్వీట్లు (5)

నిలువు

1.హేళన (4)
2.మగాడి దగాలో ఒక జంతువు దాగి వుంది (3)
3.పరమాన్నం (3)
4.నారదుని వీణ (3)
7.కూతురు (3)
9.‘మరులు’ కలిగిన అజ్ఞానులు (4)
11.ఇంద్రుడి తోట (3)
12.అల్లరి చిల్లర (4)
13.వెనుదిరిగి ఆడుకో! (3)
16.పని మధ్య విశ్రాంతి (3)
18.వినాయకుడికి ఇష్టమైన వంటకం (4)
19.మొసలి (3)
20.వస్త్రం (3)
22.తెలుగులోనీ, బెంగాల్‌లోనీ క్లాస్ డైరెక్టర్లు కలిస్తే ఆశ్చర్యమే! (3)

తొలి ఉచ్ఛ్వాసను, తుది నిశ్వాసను

0
0

నేను
ప్రాణ అపాన ఉదాన వాయు చలనాన్ని
ఇడ పింగళ సుషుమ్మ నాడీ చాలనాన్ని
జనన మరణ ప్రాణ ప్రభంజనాన్ని.
* * *
నేను
మాతృగర్భానికి చతుర్థ మాసాన చేరి, ప్రాణమయ కోశంగా స్థిరపడుతూ, అవయవ నిర్మితికి ప్రాణప్రద మవుతుంటాను. అమ్మలో భాగంగా ఉన్నప్పటికీ స్వతంత్ర, వైయక్తిక ప్రతిపత్తినే. ఇలా వైయక్తిక స్వతంత్రతతో తొలి శ్వాసక్రియ అంటే ఉచ్ఛ్వాసం నుండి తుది శ్వాస క్రియ అంటే నిశ్వాసం వరకు బ్రతుకుతుంటాను.
* * *
అవును, ‘నేను’కు బ్రతుకు అయినా, చావు అయినా ప్రాణకోశంలోనే! మొదటి ఉచ్ఛ్వాస క్రియతో జీవితం ప్రారంభమై ఉచ్ఛ్వాస నిశ్వాసలు ప్రాణక్రియలుగా శక్తిసంపన్నమవుతూ తుది నిశ్వాస క్రియతో బ్రతుకు ముగుస్తుంది. అందుకే ప్రాణాన్ని ‘వైటల్ లైఫ్ ఫోర్స్ ఎనర్జీ’ అంటుంటాం.
భూగోళం, వాయుగోళం, సూర్యగోళం ‘నేను’కు ప్రాణ ప్రదాతలు. సూర్య మండలం నుండి సౌరశక్తి, వాయు మండలం నుండి ప్రాణశక్తి, భూమండలం నుండి జీవశక్తి వైటల్ లైఫ్ సోర్స్ ఎనర్జీగా మన దైనందిన జీవితాన్ని శక్తిసంపన్నం చేస్తుంటాయి. మనలోని ఎపిథీలియల్ సెల్స్ భూమండల ప్రభావితాల, మెర్క్యురిసెల్స్ వాయు మండల ప్రభావితాలు, ఫైర్లీ సెల్స్ సూర్యమండల ప్రభావితాలు. ఇవి ప్లానెటరీ ఫోర్సెస్ అయినప్పటికీ వైటల్ లైఫ్ ఫోర్స్ ఎనర్జీగా మన చైతన్యంలో భాగస్థమవుతుంటాయి. అందుకే ఖగోళ చైతన్యాన్ని మన ప్రాణ చైతన్యంగా పరిగణిస్తుంటాం.
ళ్యశఒషజ్యఖఒ ఇళ్ఘఆ్దజశ ష్ఘౄఒ ఆ్దళ ౄజశజూ ఘశజూ ళ్ఘనళఒ ఆ్దళ ఇ్యజూక. ఒక గిక సాధనతో వన శ్వాసక్రియ సాగుతుండాలి. శబ్దం నిశ్శబ్దమై ప్రాణక్రియలే యోగసాధనలో వైబ్రేషన్స్ అవుతుంటాయి. ఈ వైబ్రేషనే్స పనె్నండు వేల ఎడ్జెస్ట్‌మెంట్స్‌గా మన పంచకోశాలలో తమ వ్యాపారాన్ని కొనసాగిస్తుంటాయి. ఈ ‘ట్వల్వ్ థౌజండ్ ఎడ్జెస్ట్‌మెంట్స్’ మనలోని డెబ్బై రెండువేల నాడులను స్పందింప చేస్తుంటాయి. ఇడ - పింగళ - సుషుమ్న నాడుల ఫోర్స్‌తో ఈ పనె్నండువేల నాడులు ఇంద్రియ కార్యశీలతకు దోహదపడుతుంటాయి. ఇక - పింగళ - సుషుమ్న నాడులలోను సుషుమ్న నాడీ ఫోర్స్‌ను ‘మెర్రిజోనా ఫోర్స్’గా పరిగణించవచ్చు. పదిహేను వందల లక్షల ఫోర్సెస్ సుషుమ్న నాడి గుండా ఇడ పింగళ నాడులను చేరి దేహ వ్యవస్థలోని డెబ్బై రెండు వేల నాడులను స్పందింప చేస్తుంటాయి. అందుకే నిశ చిళళఆ ఇజశజూజశ జశ ‘ని’ ఛ్యి ‘-నిదిజ’ ఆ్య ‘డశ్రీడ్హశ్రీ’ చ్యి యూజూళూ ళ్పళ్ఘఒ గా యోగసాధన సాగుతుండాలి. ఇటువంటి యోగసాధనతో మనకు మన ప్రపంచానికి, మన భూగోళానికి, మన ఖగోళానికి, మన సృష్టికి న్యూమోడల్ డెవలప్‌మెంట్ ఎడ్జెస్ట్‌మెంట్స్ జరుగుతుంటాయి.
మనిషి నుండి విశ్వం వరకు ఎడ్జెస్ట్‌మెంట్స్ జరగటం అంటే ‘ట్రీట్‌మెంట్’ అనే కదా! ఇదంతా గిక శిక్షణతో సాధ్యవయ్యే ప్రాణ చికిత్స. మనపరంగా చూసుకుంటే సాధనా సమయంలో మందంగా, గాఢంగా, నెమ్మదిగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు సాగటం వల్ల ‘కార్టిసాల్’ మన నాడీ వ్యవస్థను సక్రమపరుస్తూ గుండెను పదిలపరుస్తుంటుంది. జీర్ణ వ్యవస్థను కుంటుపడకుండా చేస్తుంటుంది. ‘కార్టిసాల్’ అమినో ఆమ్లాలను ఉత్పత్తి చేస్తూ టిష్యూలు క్షీణ దశకు చేరుకోకుండా దోహదపడుతుంటుంది.
‘కార్టిసాల్’ లెవల్స్ సరిగ్గా లేకపోతే సెల్యులర్ డామేజ్ సంభవించి ‘అనారోగ్య’ పాలవుతుంటాం. అంటే, ఉచ్ఛ్వాస నిశ్వాసల నిడివిని పెంచటం వల్ల, వాటి గాఢతతో భౌతిక శరీర వ్యవస్థ పరిశుద్ధమూ, పరిశుభ్రమూ కావటమే! అందుకే, గికంగా వనం లెక్కించాల్సింది ఎన్ని సంవత్సరాలు బ్రతికామని కాదు.. యోగ సాధనతో దైనందిన కార్యకలాపాలను ఎన్ని తక్కువ సంఖ్యల శ్వాసక్రియలతో సమర్థవంతంగా నిర్వహించగలిగామని. అంటే, తక్కువ శ్వాసక్రియలు ఎక్కువ జీవిత కాలానికి సాధనలు.
దైహికంగా మనది జీవశక్తే అయినప్పటికీ అన్నమయ కోశ వ్యవస్థలో అది పదార్థశక్తి అవుతోంది.. ప్రాణమయ కోశ వ్యవస్థలో ప్రాణశక్తి అవుతోంది. ఇహంగా ఈ ప్రాణశక్తే పరంగా ఖగోళ శక్తి అంటే మానవ శక్తికీ ఖగోళ శక్తికీ డైరెక్ట్ లింక్ ఉందన్నమాట.
ఖగోళం లేనిదే భూగోళం లేదు.. మానవ అవతారం లేదు.. సృష్టీ లేదు. అంతెందుకు - మూవ్‌మెంట్స్, మో షన్స్, వైబ్రేషన్స్ - ఇవన్నీ ప్రాణ ప్రతీకలే! అందుకే అణువులో సైతం ప్రాణం ఉందంటుంటాం. ఇంకా బౌన్సింగ్, మైగ్రేటింగ్, రీ ఇంటిగ్రేటింగ్ అని మనం తరచూ ఉపయోగించే పదాల పరమార్థం సుబోధకం కావాలంటే ప్రాణం ఖరీదు యోగ జీవనంలో తెలిసి రావాల్సిందే!
* * *
అన్నమయ, ప్రాణమయ కోశాలతోపాటు సమప్రాధాన్యత కలది మనోమయ కోశం. ఆలోచనలే ఈ కోశ బలాలు, బలహీనతలు. మనస్సు బలంగా ఉంటే అన్నమయ కోశమూ బలంగా ఉంటుంది. మనస్సు బలహీనపడితే అన్నమయ కోశమూ అనారోగ్య పాలవుతుంది. మన దైనందిన కార్యకలాపాలకు, ఆహార పానీయాలకు ఈ మానసిక స్పృహ ఎంతో అవసరం. నిజానికి, మన మానవతత్వంలోనే అంతర్గతంగా ఒక ఆటోమాటిక్ వర్కింగ్ స్టైల్ ఉంది. విడిగా మన ప్రయత్నం అవసరం లేకపోయినప్పటికీ మనం ప్రకృతి విరుద్ధంగా జీవిస్తుండటం వల్ల మన ప్రయత్నమూ అవసరమవుతోంది.
అన్నమయ కోశం తన వ్యవస్థకు కావలసిన పురమాయింపులను అందుకోవలసింది మనోమయ కోశం నుండే. అయితే, మనోమయ కోశం నుండి అన్నమయ కోశానికి కావలసిన ‘సిగ్నల్స్’ అందటానికి ‘బ్రెయిన్’ ఒక ఉపకరణమే అయినప్పటికీ అవి చేరటానికి కావలసింది నెర్వ్స్ సిస్టమ్. కోమాలో ఉన్న వ్యక్తిని పరిశీలిస్తే ప్రాణమయ, మనోమయ కోశాల పనితీరు సులభంగా అర్థమవుతుంది. కోమాలో ఉన్న మనిషి బ్రతికి ఉండటం అంటే ప్రాణమయ కోశం పని చేస్తున్నట్లే. శ్వాసకోశాలు, గుండె సమర్థవంతంగా తమ విధులు నిర్వహిస్తున్నట్లే. స్పృహ లేకపోవటం అంటే మనోమయ కోశం చచ్చుబడినట్లే.. మనోమయ కోశానికి చెందిన కణాలు తమ సామర్థ్యాన్ని కోల్పోయినట్లే! వాటి సంఖ్య ఇబ్బడిముబ్బడిగా తగ్గినట్లే! ఇటువంటి అవస్థ నుండి బయటపడటానికి అంటే ఆలోచనలను నియంత్రించుకోవడానికి, మానసికంగా బలపడటానికి మెడిటేషన్ మెడికేషన్ అవుతుంటుంది.
* * *
మనోమయ కోశం అంటే ఒక విధంగా చైతన్య కోశమే! మనస్సంటేనే ఒక స్వయంప్రతిపత్తి గల వ్యవస్థ. అయితే వచ్చిన చిక్కల్లా ప్రాణమయ కోశానిది నిరంతరం పాజిటివ్ ఎనర్జీ అవుతుంటే, మనోమయ కోశం మాత్రం అధికంగా నెగెటివ్ అవుతుంటుంది. అంటే, మనోమయ కోశంలోని శక్తి చైతన్యంలో అధికపాలు నెగెటివిటీ అయితే అల్పపాలు పాజిటివిటీ. అందుకే అంటుం టాం మనసుకు మూడు ముఖాలు, పది తలలు అని.
చేతన, ఉపచేతన, అచేతనలు మూడు ముఖాలయితే దశ పరిణామాలు పది తలలు. నిన్న - నేడు - రేపులు కూడా మానసిక కొలమానాలే! టైమ్ అండ్ స్పేస్‌లు కూడా మానసికోద్భవాలే! మనోమయ కోశానికి చెందిన ఇన్ని అరలను, ఇన్ని పొరలను తీసేయగలది యోగసాధన ఒక్కటే. అందుకే మెడిటేషన్ అనేది మైండ్‌కి సంబంధించింది అవుతోందే తప్ప శరీర సంబంధి కాదు.
* * *
నిన్ను - నన్ను విడదీసేది మనోమయ కోశమే! అందుకే మనస్సును ‘ఇన్‌స్టింక్చుయల్ కాన్షియస్‌నెస్’ అని అంటుంటాం. ఈ చైతన్యంలో భౌతిక ఆలోచనలు, భౌతిక భావనల సాంద్రత ఎక్కువ. గికంగా ‘నిన్న - నన్ను’ కలిపేది కూడా ఈ మనోమయ కోశమే! అయితే ఈ కలయికకు యోగసాధన పరంగా కావలసింది ‘హయ్యర్ మైండ్’... హయ్యర్ కాన్షియస్‌నెస్. ఈ ఊర్థ్వ చైతన్యం నుండి పుట్టుకొచ్చేదే గిక అహం, గిక వ్యక్తిత్వం.
దేహపరంగా, వనోమయ కోశం సేఫ్టీ - సెక్యూరిటీ - ప్రొటెక్షన్ అనే ‘అవసరత్రయం’గా పని చేస్తుంటుంది. మనసు అన్ని విధాల ప్రభావవంతమైంది కాబట్టి మనోమయ కోశ ప్రభావం అటు ప్రాణమయ కోశంపైన, ఇటు అన్నమయ కోశంపైన ఉంటుంది.
మనసుది అధికంగా నెగెటివ్ ఎనర్జీ. ఈ నెగెటివిటీ పాజిటివ్ కావాలంటే - వేగిరపడే మనసుతో సంఘర్షణ పడకుండా దానిని మందగింప చేయటానికి కొంతసేపు మిన్నకుండాలి; ఆ తర్వాత కొద్దిగా మనసుతో స్నేహం చేయటం ప్రారంభించాలి. అంటే దాన్ని చెప్పనివ్వాలి - మనం జోక్యం చేసుకోకుండా వింటుండాలి. తర్వాత విచక్షణతో ఆచరణకు దిగాలి; అది ఇది సాధ్యం కానపుడు మనసును ధ్యానమగ్నం చేయాలి. మెడిటేషన్ వల్ల మన మొండివైఖరీ తగ్గుముఖం పడుతుంది, మనసూ తన మొండితనాన్ని వీడుతుంది.
అసలే, మనసుది కోతి చేష్టలు.. కోతికొమ్మచ్చి ఆటలు. ఈ కొమ్మ నుండి ఆ కొమ్మకు గెంతటమే కోతి ఆట. మనసు కూడా ఇంతే! ఒక ఆలోచన నుండి మరొక ఆలోచనలోకి దొర్లుకుంటూ పోతుంటుంది. రోజుకి కొన్ని వందల సార్లు ఇలా గెంతుతుంటుంది. గెంతే మనసును స్థిమితపరచాలంటే కనీసం మన దేహం స్థిరాసనంలోకి వెళ్లాలి. అంటే, దేహాన్ని ముందు ధ్యానానికి సమాయత్తపరచాలి. ఆ ధ్యాన స్థితిలో ధారణ అంది వస్తుంది. ఇదే కాన్‌సెన్‌ట్రేషన్‌కు దారితీస్తుంది. ఇలా ధారణ అంటే ఆలోచనలను నియంత్రించటం కాదు.. లోచనకు శిక్షణ నివ్వటం. ఈ క్రమశిక్షణతో మన మైండ్ పాజిటివ్ ఎనర్జీకి కేంద్రమవుతుంది.
మొత్తానికి, పంచకోశాలలో మనోమయ కోశానిది మధ్యమ స్థానం... పైగా ఇహ - పరాల సంయోగస్థలి. అన్నమయ, ప్రాణమయ కోశాలు భౌతిక పరిభాషలో క్రింది కోశాలుగా ఇహానివి అయితే గిక పరిభాషలో విజ్ఞానవయ, ఆనందమయ కోశాలు పై కోశాలుగా పరానివి. మనస్సుది అధికపాలు నెగెటివ్ ఎనర్జీ. కాబట్టి మనస్సును సాధ్యమైనంత వరకు హయ్యర్ ఇంటెలిజెన్స్‌కు, హయ్యర్ కాన్షియస్‌నెస్‌కు ఆవాసం చేయాలి. అప్పుడే మైండ్ అనేది హయ్యర్ మైండ్ అవుతుంది. ఇలా మనోమయ కోశానివి హయ్యర్ ఫన్‌క్షన్స్ అవుతాయి.
నిజానికి, మనస్సు అంటేనే గత చరిత్ర.. అనుభవాల అహం.. జ్ఞాపకాల పొత్తం.. అనవసరాల ఖజానా.. హైకోర్ట్‌లు, సుప్రీంకోర్ట్‌లు అవసరం లేని న్యాయనిర్ణేత.

అఖండ భారతం

0
0

రామశర్మ ఆయుర్వేద వైద్యుడు. ఎంతటి మొండి వ్యాధినైనా ఇట్టే తగ్గించగల మంచి నైపుణ్యం, హస్తవాసి గల వ్యక్తి. పట్నానికి దూరంగా ఉన్న చిన్న పల్లెటూరులో అతని నివాసం. ఆ ఊరులోని ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా చాలామంది వచ్చి తమ అనారోగ్యాలకు మం దులు తీసుకొనేవారు.
తన ఊరికి సమీపంలో ఉన్న అడవిలోకి పోయి అక్కడ నుంచి వనమూలికలు సేకరించి తీసుకొని వచ్చి పుటం పెట్టి గుళికలు, ద్రవాలు తయారుచేసి వాటితో వైద్యం చేస్తూంటాడు. ఒకరోజు రామశర్మ అడవికి బయలుదేరుతుంటే భార్య దమయంతి ఇలా అన్నది.
‘ఏమండీ! మన అబ్బాయి సుబ్రహ్మణ్య శర్మకు కాలేజీ ఫీజు కట్టాలి. మన కూతురు గాయత్రికి ఏలూరు సంబంధం వారు తమ ఇష్టం తెలియపరిచారట. నిన్ననే నెట్‌లో చూసి మన సుబ్బు చెప్పాడు.’
‘నిన్న రాత్రి కోమటి బాపిశెట్టి గారి దగ్గర నుంచి కావలసిన పైకం మొత్తం తెచ్చి బీరువాలో పెట్టాను. వనమూలికలు తీసుకొని సాయంత్రానికి ఇంటికి వస్తాను. రేపు ఉదయమే మన కొడుకు కాలేజీ ఫీజు కట్టి, మధ్యాహ్నం ఏలూరు పోయి పెళ్లిచూపులకు వారిని ఆహ్వానించి వస్తాను. సరేనా! నువ్వు అనవసరంగా ఆందోళన చెందకు’ అని భార్యతో చెప్పి పెద్ద చేతిసంచీ తీసుకొని అడవికి బయలుదేరాడు రామశర్మ.
* * *
తనకు అలవాటైన అడవి దారి కనుక త్వరత్వరగా రామశర్మ నడవసాగాడు. కొండలు, కోనలు, లోయలు, గుహలలో తిరుగుతూ కావలసిన మూలికలు, కాయలు, వృక్షాల వేళ్లు, చెట్ల బెరడులు, ఆకులు సేకరించుకొని సంచీలో వేసుకొన్నాడు. మధ్యాహ్నం తను తెచ్చుకొన్న అన్నం తిన్నాడు. క్రూరమృగాలు తిరిగే అటవీ ప్రాంతం. అందుకని ఎతె్తైన పెద్ద చెట్టు ఎక్కి మంచెలా చేసుకొని నడుం వాల్చాడు. బాగా అలసిపోయి ఉన్నందున కొద్దిసేపటికే గాఢనిద్రలోకి జారుకున్నాడు రామశర్మ.
చెట్టు కింద నుంచి ఏవో శబ్దాలు వినపడుతుంటే హఠాత్తుగా రామశర్మకు మెలకువ వచ్చింది. శబ్దం చేయకుండా లేత ఆకుల సందుల నుంచి కిందకు తొంగి చూశాడు. ఎవరో ఇద్దరు వ్యక్తులు విచిత్రమైన వేషధారణలో ఉన్నారు. అచ్చం తన తాతగారి వైద్య పుస్తకాలలో వర్ణించిన గ్రహాంతర వాసుల వలె ఉన్నారు. వారి మధ్య చిన్న జాడీ లాంటిది ఉన్నది. వారి భాష అర్థం కాకపోయినా వారి హావభావాలను పట్టి ఆ జాడీ గురించి గొడవ పడుతున్నారు అని అర్థమయింది రామశర్మకు.
అంతలో ఒక పులి గాండ్రించుకుంటూ అక్కడికి వచ్చింది. ఈ హఠాత్ పరిణామానికి ఆ వ్యక్తులు ఇద్దరూ ఆ జాడీని అక్కడే వదిలేసి పక్కనే ఉన్న పొదలలోకి పారిపోయారు. కొద్దిసేపు ఆ పులి చెట్టు కింద తచ్చాడి తిరిగి అడవిలోకి వెళ్లిపోయింది.
రామశర్మ నిదానంగా చెట్టు దిగి కిందకు వచ్చి జాడీని పరిశీలించి చూశాడు. వింతైన రంగులో ఆకర్షణీయమైన మూత బిగించి ఉంది.
రామశర్మ బలవంతంగా దాని మూత తీసి జాడీలోకి చూశాడు. వింతైన రంగులో కొద్దిగా ద్రవం ఉన్నది. ఎటువంటి వాసన రావడం లేదు. స్వతహాగా వైద్యుడు కనుక ఆ ద్రవం యొక్క రుచి పరీక్షించడానికి కొద్దిగా తాగాడు. కొద్దిగా పుల్లగా అనిపించింది. అంతేగానీ దేహంలో ఎటువంటి ప్రకోపము కలగలేదు. ఇంటికి పోయి తరువాత దీన్ని పరీక్ష చేద్దాము అని నిశ్చయించుకొని ఆ జాడీని తన సంచిలో వేసుకొని నడక ప్రారంభించాడు.
సూర్యుడు పడమటి కొండల్లోకి దిగిపోతున్నాడు. ఆ రోజు తన దినచర్యను ముగించుకొన్నాడు. అయిదు నిమిషాల తర్వాత రామశర్మకు మెదడు మొద్దుబారుతున్నట్టు అనిపించింది. శరీరం తూలుతూ అడుగులు తడబడసాగాయి. ఎతె్తైన రాయిపై కూర్చోబోయి స్వాధీనం తప్పి పక్కనే ఉన్న లోయలోకి పడి దొర్లుకుంటూ పోయి ఒక చీకటి గుహ లోపల గుబురుగా ఉన్న చెట్ల మధ్యలో ఇరుక్కొని విగత జీవుడిగా పడిపోయాడు.
* * *
రామశర్మ కళ్లు తెరిచేటప్పటికి బారెడు పొద్దెక్కింది. ‘రాత్రంతా తను ఒళ్లు తెలియకుండా పడి నిద్రపోయాడా? బహుశ ఇది ద్రవం యొక్క ప్రభావం అయి ఉంటుంది’ అని మనసులో అనుకొన్నాడు. గుహ లోపల నుంచి జాగ్రత్తగా కొండ మీదకు వచ్చాడు. తన వనమూలికలు సంచి కనపడలేదు. రాత్రి జరిగిన ప్రమాదంలో ఎక్కడో పడిపోయినట్లుంది. తను ధరించిన వస్త్రాలు పూర్తి జీర్ణావస్థ దశలో ఉన్నాయి. ఈ అవతారంలో ఊళ్లో ఎవరు చూసినా తనను ఎగతాళి చెయ్యటం ఖాయం. దయమంతి తన కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. త్వరగా ఇంటికి పోయి సుబ్రహ్మణ్య శర్మ కాలేజీ ఫీజు చెల్లించాలి. కూతురు గాయత్రి పెళ్లి సంబంధం విషయం మాట్లాడాలి అని ఆలోచిస్తూ పరుగులాంటి నడకతో తన ఊరికి బయలుదేరాడు రామశర్మ.
* * *
తన పెంకుటిల్లు స్థానంలో రెండంతస్థుల భవనం కట్టి ఉంది. ఇంటి ముందు మురికి కాలువ జీవనదిగా ప్రవహిస్తూ ఉండేది. అలాంటిది బ్రహ్మాండమైన సిమెంటు రోడ్డు వేసి శుభ్రంగా ఉన్నది. ఆ వీధి అంతా పూర్తిగా మారిపోయింది. అన్నీ పెద్ద పెద్ద భవంతులు వాటి ముందు పెద్ద కార్లు నిలిపి ఉన్నాయి. అసలు తను దారితప్పి వేరే ఊరికి వచ్చానా అని అనుమానం వచ్చింది రామశర్మకు.
వీధిగేటు తీసుకొని ఇంటి లోపలికి పోయాడు. వరండాలో గోడపై తన ఫొటో పెట్టి గంధపు చెక్కలతో చేసిన మాల వేసి ఉన్నది. ఈ తెలివితక్కువ వెధవలు తను బ్రతికి ఉండగానే ఫొటోకు దండ వేశారు. బుద్ధిలేకపోతే సరి అని మనసులో తిట్టుకుంటూ ‘దమయంతీ ఇలా బయటకు రా’ అని పిలుస్తూ అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నాడు.
ఒక అమ్మాయి మూడు సంవత్సరాల చిన్నబాబును ఎత్తుకొని అక్కడకు వచ్చి ‘ఎవరండీ మీరు?’ అని రామశర్మను అడిగింది.
‘నా ఇంటిలో నుండి వస్తూ నువ్వు నన్ను పట్టుకొని ఎవరు నువ్వు అని అడుగుతావా? ఎంత ధైర్యం? ఒక్కరోజు ఇంట్లో లేకపోతే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి. అసలు దమయంతి ఎక్కడ ఉంది? ఈ సుబ్బుగాడు ఎక్కడ చచ్చాడు. ఇంట్లోకి అడ్డమైన వారినందరినీ రానిస్తారు’ అని విసుక్కొన్నాడు.
‘ఏమండీ! ఏదో పెద్దవారు.. ఎండనపడి ఇంటికి వచ్చారు అని లోపలికి రానిస్తే మంచీ మర్యాద లేకుండా మా నాన్నమ్మను, మా నాన్నను అనరాని మాటలు అంటున్నారు. మర్యాదగా బయటకు నడవండి. లేకపోతే మా అమ్మను పిలుస్తాను’ అని బెదిరించి ‘అమ్మా ఇలా రా’ అని గట్టిగా పిలిచింది ఆ అమ్మాయి.
‘పిలవమ్మా పిలువ్. నీ సంగతి, మీ అమ్మ సంగతి ఇప్పుడే తేలుస్తాను’ అని మొండిగా అన్నాడు రామశర్మ.
‘ఏమిటే నీ అరుపులు. సాయంత్రం నీ ప్రయాణంలో హడావిడిగా ఉంటే’ అంటూ వంట గదిలో నుంచి ఆమె చీర కొంగుకు, తడి చేతిని తుడుచుకుంటూ వరండాలోకి వచ్చింది.
‘అమ్మా! ఈయనెవరో? నువ్వు ఎవరు, ఇక్కడ ఎందుకు ఉన్నావ్. మీ నాన్నకు బుద్ధి లేదు. నాన్నమ్మ ఎక్కడికి పోయింది?’ అని బెదిరిస్తున్నాడు అని ఫిర్యాదు చేసింది ఆ అమ్మాయి వచ్చిన ఆమెతో.
‘మీకు ఏమైనా మర్యాదగా ఉందాండీ. చూస్తే పైకి పెద్దమనిషిలా ఉన్నారు. మా ఇంటికి వచ్చి మా వారిని, మా అత్తగారిని దూషించే అధికారం మీకు ఎవరిచ్చారు?’ అని కోపంగా అందామె.
‘అసలు నువ్వు ఎవరవమ్మా ముందు చెప్పు?’ అని కోపంగా అడిగాడు రామశర్మ.
‘నా పేరు భారతమ్మ. నా భర్త పేరు సుబ్రహ్మణ్య శర్మ. ఇది మా కూతురు. పేరు మీనాక్షి దాని మగడు బంగ్లాదేశ్‌లో ఢాకా పట్నంలో చెన్నకేశవస్వామి వారి ఆలయ ప్రధాన పూజారిగా పనిచేస్తున్నాడు. ఇవి చాలా ఇంతకన్నా వివరాలు ఏమైనా కావాలా?’ అని వ్యంగ్యంగా అన్నది భారతమ్మ.
‘నువ్వు చెప్పేది వింటుంటే అదేదో విఠలాచార్య జానపద సినిమా చూస్తున్నట్లుగా ఉన్నది. నా కొడుకు వయసు నీ వయసులో సగం కూడా లేదు. అలాంటిది వాడు నీకు మొగుడు. ఈ పిల్ల మీ సంతానమా? మన దేశం యొక్క బద్ధశత్రువైన దేశంలో ఈ అమ్మాయి భర్త ఉంటున్నాడు. నాకు అంతా అయోమయంగా ఉంది. అసలు నాది బుద్ధితక్కువ. ఆ వెధవకు నా వైద్యవృత్తి నేర్పించక ఇంగ్లీషు చదువులు చదివించితే ఇలాంటి నిర్వాకాలు వెలగబెడుతున్నాడు. అసలు నా భార్య దమయంతికి బుద్ధి లేదు’ అని గట్టిగా విసుక్కోసాగాడు రామశర్మ.
‘మా అత్తయ్యగారు మీకు భార్య ఏమిటండీ? మీరేమైనా పిచ్చాస్పత్రి నించి పారిపోయి వచ్చారా? మా మామగారు పోయి 50 సంవత్సరాలు దాటింది. అదిగో ఆయనగారి ఫొటో’ అని చెప్పి గోడవైపు చెయ్యి చూపిస్తూ అన్నది భారతమ్మ.
‘నాకు పిచ్చి ఎక్కిందా? మీరంతా కలిసి ఏదో నాటకం ఆడుతున్నారు. నేను బ్రతికి, మీ ఎదురుగా ఉంటే చనిపోయాను అని అబద్ధాలు ఆడుతున్నారు. అసలు మా సుబ్రహ్మణ్య శర్మను రానివ్వండి. మీ అందరి పని చెబుతాను’ అని అన్నాడు రామశర్మ.
‘అడుగో! మా నాన్నగారు వస్తున్నారు. మీ సంగతి ఆయనే తేలుస్తారు’ అంటూ గేటు తీసుకొని లోపలికి వస్తున్న డెబ్భై సంవత్సరాల ముసలి వ్యక్తిని చూపిస్తూ అన్నది మీనాక్షి.
* * *
‘ఎవరండీ ఈ పెద్ద మనిషి. వచ్చిన దగ్గర నుంచీ ఒకటే గోల. మీరు అతని కొడుకట. అత్తయ్యగారు ఈయనగారి భార్య అట అని ఏవేవో అవాకులు, చెవాకులు పేలుతున్నాడు. ఇతగాడి సంగతి చూడండి’ అని భర్తతో అన్నది భారతమ్మ.
సుబ్రహ్మణ్య శర్మ దగ్గరకు వచ్చి రామశర్మను చూసి గుర్తు పట్టి ఆనందంతో గట్టిగా అరుస్తూ ‘నాన్నగారూ! ఇన్ని రోజులు మీరు ఎక్కడికి పోయారు?’ అని తండ్రిని కౌగిలించుకుని ఏడవసాగాడు.
ఈ దృశ్యాన్ని వింతగా ఆశ్చర్యంగా చూడసాగారు తల్లీ కూతుళ్లు.
‘ఇదేమిట్రా ఇలా ముసలివాడివైపోయావ్? జుట్టు అంతా తెల్లగా నెరిసిపోయింది. అమ్మ ఎక్కడికి పోయింది? చెల్లెలు గాయత్రి ఏది? వీళ్లు ఎవరు మన ఇంట్లో ఉన్నారు? ఒక్క రోజులోనే ఇన్ని మార్పులు జరిగాయా’ అని ఆదుర్దాగా అడిగాడు రామశర్మ.
‘ఒకరోజు కాదు నాన్నగారు మీరు మన ఇంటి నుంచి వెళ్లి 50 సంవత్సరాలు గడిచింది. ఆ రోజు వనమూలికల కోసం అడవికి పోయి ఇదిగో ఇప్పుడు వచ్చారు. మీ కొరకు ఎన్నోచోట్ల వెదికాము కానీ మీ ఆచూకీ మాత్రం దొరకలేదు. ఇక లాభం లేదు అని మా ప్రయత్నాలు మానుకొన్నాం. ఇప్పుడు క్రీ.శ. 2068వ సంవత్సరం నడుస్తున్నది’ అని చెప్పాడు సుబ్రహ్మణ్యశర్మ.
‘అలా అయితే ఆ గుహలో నేను 50 సంవత్సరాలు నిద్రపోయానన్న మాట’ అని ఆశ్చర్యపోతూ అన్నాడు రామశర్మ.
‘ఏం జరిగిందో వివరంగా చెప్పండి నాన్నగారూ’ ఆదుర్దాగా అడిగాడు సుబ్రహ్మణ్య శర్మ.
ఆ రోజు తను అడవిలో చూసిన వింత ఆకారాల మనుషులు, తాగిన విచిత్రమైన ద్రవం గురించి అన్నీ పూసగుచ్చినట్లు వివరంగా చెప్పాడు రామశర్మ.
‘మీరు త్రాగిన ఆ ద్రవ ప్రభావం వలన శారీరక పెరుగుదల, మానసిక స్థితి ఏ మాత్రం మారకుండా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే యోగ నిద్రలో ఉన్నారు. దీని మూలంగా మీ శరీరంలోనూ, ఆలోచనలలోను ఎటువంటి మార్పులు లేకుండా ఇన్ని సంవత్సరాలు గడిచినా ఆనాటి స్థితిలోనే ఉన్నారు. ఇది నిజంగా గొప్ప ఆశ్చర్యకరమైన విషయం. నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి కూడా అంతుపట్టని గొప్ప రహస్యం. మన పూర్వీకులు కనుగొన్న ఇలాంటి ఎన్నో గొప్పగొప్ప ఔషధాలు సరియైన ఆదరణ, పోషణ, శ్రద్ధ లేక మరుగున పడిపోయాయి’ అని ఉద్వేగంగా అన్నాడు సుబ్రహ్మణ్య శర్మ.
‘అది సరే కాని అసలు విషయం చెప్పు. అమ్మా చెల్లెలు ఎక్కడ ఉన్నారు?’ అని అడిగారు రామశర్మ.
‘అమ్మ పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్ వెళ్లింది. చెల్లెలు గాయత్రి కూతురు ప్రసవిస్తే సహాయం చేయడానికి వెళ్లింది’ అని అన్నాడు.
‘ఓరి అప్రాచ్యపు వెధవా. నేను ఇంటలేనని నీ చెల్లెలి కూతురును ఒక తురకవానికి ఇచ్చి పెళ్లి చేసి మన వంశం పరువు తీశావు కదరా?’ అని కోపంగా అన్నాడు రామశర్మ.
‘నాన్నగారూ! మీరు అనవసరంగా ఆవేశపడకండి. గాయత్రి భర్త పేరు చతుర్వేదుల జగన్నాథశాస్ర్తీ. ఆయన ఇస్లామాబాద్‌లోని పశుపతినాథ ఆలయంలో ప్రధాన అర్చకులు. మీ వియ్యంకుల వారు కోటేశ్వర శాస్ర్తీగారు గొప్ప పండితులు. ఘనాపాఠి. అక్కడ వేద పాఠశాలలు గోశాలలు నడుపుతున్నారు. ఇక నా భార్య పుట్టింటివారు భాగవతుల వారు. మా మామ్మగారు నరసింహ శాస్ర్తీగారు పంచకావ్యాలు చదువుకున్న సంస్కృత తెలుగు పండితులు. లాహోర్‌లో ఉన్న

మహమ్మద్ అలీ జిన్నా యూనివర్సిటీలోని తెలుగు భాషా విభాగానికి అధిపతి. వారికి పాకిస్తాన్‌లోని సింధూ రాష్ట్రాలలో హిందూ ధర్మాల ప్రవచనాల వక్తగా గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అంతేకాదు మన ఊరిలోని వెంకయ్య చౌదరిగారు, సుబ్బారెడ్డిగారు, జాన్ పీటర్, సయ్యద్ హుస్సేన్, యశ్వంత్‌సింగ్‌గారు ఆ దేశంలో ఉన్న తమ బంధువర్గంతో వియ్యమందారు’ అని చెప్పాడు సుబ్రహ్మణ్య శర్మ.
‘ఈ విషయాలు అన్నీ నమ్మలేకపోతున్నాను. మన దేశానికి పక్కన ఉన్న పొరుగు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది కదరా? ఇది అంతా ఎలా సంభవించింది? చెప్పు’ అని ఆశ్చర్యం ఆనందం కలగలసిన ముఖంతో అడిగాడు రామశర్మ.
సుబ్రహ్మణ్య శర్మ ఇలా చెప్పసాగాడు. ‘గత 50 సంవత్సరాలలో ప్రపంచ దేశాలలో ఎన్నో మార్పులు, చేర్పులు సంభవించాయి. అక్కడ ఉన్న మతాధిపతుల కులపెద్దల స్వార్థపూరిత దురాలోచనలకు, దురాగతాలకు అడ్డూ ఆపు లేకుండా పోయింది. ఇతర మతాల మీద ద్వేషంతో జరిపే మారణహోమాలకు, ఆత్మాహుతి దాడులకు అక్కడ ప్రజల జీవన విధానాలు అస్తవ్యస్థమై పోయాయి. తెల్లవారితే ఎవరు నిద్రలేస్తారో, సాయంత్రానికి ఎవరు మిగులుతారో తెలియనటువంటి భయంకర పరిస్థితులలో జీవించసాగారు.
ఆ దేశాలు అప్పుల ఊబుల్లో కూరుకుపోయి ఆర్థిక సంక్షోభాల్లో కొట్టుమిట్టాడి పోయాయి. ప్రజలు దుర్భర దారిద్య్రాన్ని అనుభవిస్తూ వారి దేశాలలో నివసించలేక శరణార్థులై వలసపోసాగారు. ఇతర దేశాల వారు వారిని ఆదరించక నిర్దాక్షిణ్యంగా వెనుకకు పంపనారంభించారు. తినటానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక నివసించటానికి నివాసం లేక పుట్టకొకరు చెట్టుకొకరుగా దిక్కులేనివారై పశువుల వలె దయనీయమైన జీవితాలను గడపసాగారు.
ఈ తరుణంలో మన దేశంలోని ప్రజలందరూ ఆనందకరమైన జీవితాలను గడుపుతూ అన్ని మతాలు, కులాల వారు కలసిమెలసి జీవిస్తూ అభివృద్ధి పథంలో ముందుకు పోతున్నారు. దీనికి మూల కారణం మన సనాతన భారతీయ సంప్రదాయాలు. ఋషులు, ఆచార్యులు పరంపరానుగతంగా అందించిన వేదాలు, భాష్యాల సూత్రాలు, అహంబ్రహ్మాస్మి అని మానవసేవే మాధవసేవ అనే ధర్మంతో సర్వేజనా సుఖినోభవంతు అనే గురు వాక్యంతో నడిచే జాతి మనది. నిబద్ధత, నిజాయితీ, జాతీయ సమైక్యత, పరమత సహనంతో కలసి సహజీవనం సాగిస్తూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచాం. మన రాజ్యాంగ వ్యవస్థ కూడా ఆ మహా పురుషుల ప్రవచనాలపై సెక్యులర్ వ్యవస్థ మీదనే ఆధారపడి నడుస్తున్నది.
ఇప్పుడు మన దేశం సాంకేతికంగానూ, ఆర్థికంగానూ ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలకన్నా ముందు ఉన్నది. మన రూపాయి విలువ డాలర్‌తో, యూరోతోను సమానంగా ఉన్నది.
రామకృష్ణ మఠం, ఇస్కాన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, పతంజలి యోగ, స్వామి వివేకానంద మిషన్ లాంటి ఎన్నో స్వచ్ఛంద సంస్థలు రాజ్యాధికారం కోరకుండా సమాజానికి సేవలు చేస్తూ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచాయి.
ఈ విషయాలన్నీ గ్రహించిన మన ఇరుగు పొరుగు దేశాలు మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను అవలంబించటానికి ముందుకు వచ్చాయి. ఇతర మతాలలోకి మారిపోయిన వారు తమ పూర్వ మతమైన హిందుత్వానికి మళ్లారు. షేక్‌లుగా మారిన బ్రాహ్మణులు, హింసాత్మక చర్యలకు పావులుగా ఉపయోగపడే తక్కువ కులస్థులైన అజ్లాఫ్‌లు, గుజ్జర్‌లు, హాంజీలు, దోఖీలు, గిల్కర్‌లు ఇలా అన్ని తెగల వారు హిందూ మతాన్ని స్వీకరించి ఋజు మార్గంలోకి మళ్లి జీవించసాగారు.
ఇందుమూలంగా అక్కడ ఉన్న పాలకులు, అధికార దాహానికి అలవాటు పడిన రాజకీయ నాయకులు గత్యంతరం లేక ఓట్ల కోసం, సీట్ల కోసం, పదవుల కోసం సెక్యులర్ వ్యవస్థకు జైకొట్టి అక్కడి ప్రజల అభీష్టాల మేరకు పరిపాలన చెయ్యసాగారు. ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే, ఇప్పుడు ఆ దేశాలలోని ప్రధానమంత్రులు కూడా హిందూ మతస్థులే.
మన పొరుగు దేశాలకు మనం యధేచ్ఛగా వెళ్లి రావచ్చు. నిబంధనలు ఏమీ లేవు. మన దేశంలోని వారితో అక్కడి వారు వివాహ సంబంధాలు జరుపుకుంటూ అన్యోన్యంగా కలసిమెలసి జీవిస్తున్నారు. త్వరలో అఖండ భారతంగా కలసిపోవాలని మన దేశాల మధ్య చర్చలు కూడా జరుగుతున్నాయి’ అని ఆవేశంగా చెప్పాడు.
‘నేను అడవికి వెళ్లే ముందు రోజు పేపర్‌లో ఒక వార్త చూశాను. మన పొరుగు దేశంలో మొదటిసారి ఒక హిందూ మతస్థుడు ప్రజలచే ఎన్నుకొనబడి పార్లమెంటులోకి ప్రవేశించాడట. మన అఖండ భారతం యొక్క ప్రతిభ ఆసియా ఖండంలో మరలా వెలిగిపోతుంది అని ఆనాడే ఊహించాను. ఇదిగో ఇప్పటికి నా కల నిజమైన రోజు వచ్చింది’ అని ఆనందంతో అన్నాడు రామశర్మ.
‘మామయ్యగారూ! మీరు కూడా మాతోపాటు ఇస్లామాబాద్ రండి. అత్తయ్యగారు మిమ్మల్ని చూసి ఎంతో సంతోషిస్తారు. త్వరగా స్నానం చెయ్యండి. బయలుదేరుదాం’ అని అన్నది కోడలు భారతమ్మ.
‘ఎందరో మహానుభావులు, మన తాతముత్తాతలు నడయాడిన ఆ పుణ్యభూమిని చూడాలనే నా కోరిక ఈనాటికి నెరవేరబోతున్నది. అంతా ఆ దేవి అనుగ్రహం’ అని గోడపై ఉన్న భరతమాత ఫొటోకు భక్తితో నమస్కరించి స్నానం చెయ్యడానికి ఇంటిలోకి వెళ్లాడు రామశర్మ.
============================================================
కథలకు ఆహ్వానం
‘ఆదివారం ఆంధ్రభూమి’కి కథలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.
పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.netకు మెయల్‌లో పంపాలి.


వారం వారం గోచారం (30-12-2018 నుంచి 4-1-2019 వరకు)

0
0

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఆదివారం ఖర్చులు పెట్టుబడులపై దృష్టి. వ్యర్థంగా ప్రయాణాలుంటాయి. పరామర్శలకు, ఆసుపత్రి ఖర్చులకు అవకాశం. వ్యతిరేక భావనలు అధికం. పోటీ రంగంలో ఒత్తిడులు. సోమవారం సౌకర్యాలు శ్రమకు గురిచేస్తాయి. ఆహార విహారాల్లో జాగ్రత్త. సౌఖ్యం కోసం ఆరాటపడతారు. విద్యారంగంలో శ్రమ. భాగస్వామ్యాల్లో సమస్యలు. అసంతృప్తి. కీర్తి ప్రతిష్ఠలు దెబ్బతినవచ్చు. దానధర్మాలు, ఆధ్యాత్మిక యాత్రలవల్ల మేలు. వృత్తి ఉద్యోగాదుల్లో ఉన్నతి. గురువారం లక్ష్యాలను సాధించే ప్రయత్నం. వ్యతిరేకతలపై విజ యం. శుక్రవారం లక్ష్యాలను సాధించే ప్రయత్నం. వృత్తి ఉద్యోగాదుల్లో జాగ్రత్త. సంప్రదింపుల్లో అనుకూలత. శనివారం అధికారిక వ్యవహారాల్లో జాగ్రత్త. కీర్తిప్రతిష్ఠలపై దృష్టి. ఉన్నత విద్య, కీర్తి ప్రతిష్టల విషయంలో జాగ్రత్త.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఆదివారం అనుకోని సమస్యలు, ప్రమాదాలకు అవకాశం. తొందరపాటుకూడదు. సోమవారం వ్యర్థమైన ఖర్చులుంటాయి. ఆశింపునకు సమమైన ఫలితాలు ఉండకపోవచ్చు. జాగ్రత్త అవసరం. మంగళవారాలు సౌకర్యాలు పెంచుకుంటారు. ఆహార విహారాల్లో అనుకూలత. విద్యాత్మక రంగంలో శుభ పరిణామాలు. బుధవారం సంతానవర్గంతో సమస్యలు. వ్యతిరేకతలపై విజయం. గురువారం అభీష్టాలు నెరవేరుతాయి. సంతానవర్గ శుభ పరిణామాలు. వ్యాపారాదుల్లో లాభాలు, సంతృప్తి. శుక్రవారం సృజనాత్మకత విస్తరిస్తుంది. నూతన కార్యక్రమాలపై దృష్టి. నూతన వ్యవహారాల్లో కొంత జాగ్రత్త అవసరం. శనివారం వ్యతిరేకతలు ఇబ్బంది పెడతాయి. పోటీలు ఒత్తిడులను అధిగమించే ప్రయత్నం. పనులు ముందుకు జరగక నిరాశ.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఆదివారం సౌకర్యాలు. గృహవాహనాదులు, ఆహార విహారాల్లో జాగ్రత్తగా మెలగాలి. సోమవారం అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలు. లాభాలున్నా అసంతృప్తి. మంగళవారం ధార్మికమైన ఖర్చులుంటాయి. కార్య నిర్వహణపై దృష్టి. ఆహార విహారాల కోసం వెచ్చిస్తారు. బుధవారం ఆలస్య నిర్ణయాలు. అన్ని పనులు ఇబ్బందులకు గురిచేస్తాయి. వ్యర్థమైన ఖర్చులు, పెట్టుబడులుంటాయి. గురువారం భాగస్వామ్యాల్లో అనుకూలత. వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో బాధ్యతలు అధికం. శ్రమతో శుభ ఫలితాలు. శుక్రవారం ఆత్మవిశ్వాసం పెంచుకునే ప్రయత్నం. నూతన కార్యక్రమాలపై దృష్టి. నిర్ణయాదుల్లో శుభ పరిణామాలు. శనివారం కుటుంబ ఆర్థికాంశాల్లో నైరాశ్యం. నిల్వధనం కోల్పోవచ్చు. మాటల్లో తీవ్ర అసంతృప్తి. విశ్వాస లోపాలు.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఆదివారం లాభాలపై దృష్టి. అతి ప్రయోజనాలను ఆశించకూడదు. సంతాన వ్యవహారాల్లో ఒత్తిడులుంటాయి. భాగస్వామ్యాల నుండి ఆశిస్తారు. ఖర్చులు తీవ్రం. సోమవారం సంప్రదింపులకు అనుకూలం. సహకారం లభిస్తుంది. తొందరపాటుకూడదు. వ్యతిరేక ప్రభావాలను అధిగమించాలి. మంగళవారం భాగస్వామ్యాలలో అనుకూలత. పెద్దలతో పరిచయాలు విస్తరిస్తాయి. పోటీరంగంలో శుభపరిణామాలు. బుధవారం ఆరోగ్యం జాగ్రత్త. అనుకోని సమస్యలు. గురువారం వ్యాపారాదుల్లో ఇబ్బందులు. సంతానవర్గ సమస్యలు. నిర్ణయాదుల్లో జాగ్రత్త. శుక్రవారం అనుకోని సమస్యలు. నూతన కార్యక్రమాలను వాయిదా వేసుకోవడం మంచిది. శనివారం అసంతృప్తి. ఆధ్యాత్మిక యాత్రలవల్ల మేలు. కొంత నైరాశ్య భావన. ఊహించని సంఘటనలు. అప్రమత్తం.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఆదివారం పరిచయాలు, స్నేహానుబంధాల్లో జాగ్రత్త. తొందరపాటు కూడదు. భాగస్వామితో వివాదాలకు, ఇబ్బందులకు, ఘర్షణలకు అవకాశం. ప్రశాంతంగా మెలగాలి. సోమవారం లాభాలుంటాయి. అత్యధిక లాభాలపై మనసు ఉంటుంది. ఆశించిన వ్యవహారాలు అందక అసంతృప్తి ఏర్పడుతుంది. మంగళవారం పెద్దల సహకారం లభిస్తుంది. బుధవారం సౌకర్యలోపాలుంటాయి. వ్యతిరేకతలుంటాయి. గురువారం ఆహార విహారాలకు అనుకూలం. వృత్తి ఉద్యోగాదుల్లో కొంత గుర్తింపు. నిర్ణయాదులు శ్రమకు గురిచేస్తాయి. శుక్రవారం నూతన వాహనాదులు, గృహాదులపై దృష్టి కేంద్రీకరిస్తారు. శనివారం సంతానవర్గ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. నిర్ణయాదుల్లో నిరాశ తప్పదు. నూతన వ్యవహారాల్లో ఒత్తిడులు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఆదివారం సంప్రదింపుల్లో చికాకులు. సోదర వర్గంతో జాగ్రత్త. వార్తలు చికాకు పెట్టిస్తాయి. సోమవారం పరిచయాలు స్నేహానుబంధాల్లో తొందరపాటు కూడదు. భాగస్వామ్యాల్లో అనుకూలత. కొత్త పరిచయాలవల్ల సమస్యలు. మంగళవారం లాభాలు సంతోషాన్నిస్తాయి. సంప్రదింపుల్లో శుభపరిణామాలు. ఖర్చులు, పెట్టుబడులవల్ల ప్రయోజనాలు. బుధవారం వ్యర్థమైన పెట్టుబడులు. ప్రయాణాదుల్లో జాగ్రత్త. గురువారం వ్యాపారాదులపై ప్రత్యేక దృష్టి. లక్ష్యాలను సాధిస్తారు. ప్రయాణాలకు అవకాశం. శుక్రవారం విశ్రాంతికోసం ప్రయత్నం. సౌఖ్యంగా గడుపుతారు. ఆహార విహారాలుంటాయి. ఖర్చులు అధికం. శనివారం నిర్ణయాదుల్లో జాగ్రత్త. ఆత్మవిశ్వాసం తగ్గిపోవచ్చు. అనుకోని సంఘటనలుంటాయి. పరామర్శలుంటాయి.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఆదివారం వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులు. బాధ్యతలు బాధిస్తాయి. వ్యతిరేక ప్రభావాలను శ్రమతో అధిగమించాలి. శ్రమసహిత ప్రయోజనాలుంటాయి. సోమవారం కుటుంబ ఆర్థికాంశాల్లో కొంత జాగ్రత్త. నిల్వ ధనం కోల్పోయే అవకాశం. మాటవల్ల సమస్యలుంటాయి. మంగళవారం పోటీ రంగంలో గుర్తింపు. కార్యనిర్వహణలో అనుకూలత. శ్రమానంతర ఫలితాలు. బుధవారం పరిచయాలు, స్నేహానుబంధాల్లో సమస్యలుంటాయి. భాగస్వాములతో జాగ్రత్తగా మెలగాలి. గురువారం వ్యాపారాదుల్లో అనుకూలత. నిర్ణయాదులకు అనుకూలం. గృహ వాహనాది సౌకర్యాదులుంటాయి. శుక్రవారం కొత్త పరిచయాల విషయంలో జాగ్రత్త. నూతన కార్యక్రమాలపై దృష్టి. శనివారం అనుకోని సమస్యలుంటాయి. వ్యవహారాల్లో అప్రమత్తంగా మెలగాలి.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఆదివారం పోటీల్లో విజయం. గుర్తింపు కోసం శక్తిమేరకు ప్రయత్నిస్తారు. భాగస్వామ్యాల్లో ఘర్షణ. నిల్వధనం కోల్పోయే అవకాశం. సోమవారం వృత్తి ఉద్యోగాదుల్లో బాధ్యతలు అధికం. నిర్ణయాదుల్లో ఒత్తిడులుంటాయి. మంగళవారం కుటుంబంలో శుభ పరిణామాలు. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత. మాటతీరువల్ల గౌరవం పెరుగుతుంది. బుధవారం సంప్రదింపుల్లో జాగ్రత్త. సోదర వర్గంతో విభేదాలు. గురువారం కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. వినోద విహార విజ్ఞాన యాత్రలకు మంచి అవకాశం. శుక్రవారం దగ్గరి ప్రయాణాలకు అవకాశం. సోదరవర్గ వ్యవహారాల్లో శుభ పరిణామాలు. వ్యాపారాదుల్లో అనుకూలత. శనివారం సౌకర్యాలు శ్రమకు గురిచేస్తాయి. ఆహార విహారాల విషయంలో అప్రమత్తంగా మెలగాలి.

కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఆదివారం కుటుంబ సంబంధాల్లో తొందరపాటు కూడదు. మాటతీరులో జాగ్రత్తలు చాలా అవసరం. సోమవారం వ్యతిరేక ప్రభావాలుంటాయి. విజయసాధన. కార్యనిర్వహణలో అనుకూలత. మంగళవారం వృత్తి ఉద్యోగాదుల్లో గుర్తింపు. అధికారిక వ్యవహారాల్లో అనుకూలత. బుధవారం లాభాలు శ్రమకు గురిచేస్తాయి. ఆశించిన ఫలితాలు అందకపోవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలవల్ల మేలు. గురువారం వ్యాపారాదుల్లో కొంత అనుకూలత. ఊహించని ఫలితాలున్నా అప్రమత్తంగా మెలగాలి. సృజనాత్మకత. శుక్రవారం అన్ని పనుల్లో ప్రయోజనాలపై దృష్టి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కార్యనిర్వహణలో సంతృప్తి. శనివారం వ్యర్థమైన ఖర్చులు పెట్టుబడులకు అవకాశం. అన్ని పనుల్లో జాగ్రత్తగా మెలగాలి. వ్యర్థమైన ప్రయాణాలుంటాయి.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఆదివారం ఉన్నత విద్య, కీర్తిప్రతిష్ఠల విషయంలో జాగ్రత్త. సంప్రదింపుల్లో అనుకూలత. కార్యనిర్వహణ సంతృప్తినిస్తుంది. కొంత ఒత్తిడి తప్పకపోవచ్చు. సోమవారం నిర్ణయాదులు శ్రమకు గురిచేస్తాయి. అన్ని పనుల్లోనూ తొందరపాటు కూడదు. మంగళవారం నిర్ణయాదుల్లో అనుకూలత. సంతానవర్గ సంతృప్తి. సృజనాత్మకత. వ్యతిరేకతలపై విజయం. బుధవారం వ్యతిరేక ప్రభావాలను అధిగమిస్తారు. పోటీ రంగంలో గుర్తింపు. శ్రమ తప్పదు. కార్యనిర్వహణలో విజయం. గురువారం వ్యాపారాదుల్లో అనుకూలత. సంప్రదింపుల్లో కొంత ఒత్తిడి వుంటుంది. శుక్రవారం నూతన కార్యక్రమాల నిర్వహణపై ఆసక్తి. కార్యనిర్వహణ కోసం పూనుకొంటారు. శనివారం భాగస్వామ్య సమస్యలుంటాయి. కార్యనిర్వహణ లోపాలు.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఆదివారం నిర్ణయాదులకు అనుకూలం. లాభాలపై దృష్టి. సంతానవర్గ వ్యవహారాల్లో జాగ్రత్త. అతి ప్రయోజనాలను ఆశించడం మంచిది కాదు. సోమవారం లక్ష్యాలను సాధించడంలో శ్రమ. ఉన్నత విద్యలు, సాంకేతిక విద్యలకోసం ప్రయాణాదులపై దృష్టి. మంగళవారం నిర్ణయాదుల్లో అనుకూలత. కుటుంబంలో అనుకూలత. ప్రయాణావకాశాలు. సృజనాత్మకత. బుధవారం మాట విలువ తగ్గవచ్చు. కుటుంబ ఆర్థికాంశాల్లో అప్రమత్తంగా మెలగాలి. నిల్వధనం కోల్పోయే అవకాశాలుంటాయి. గురువారం కుటుంబంలో శుభ పరిణామాలు. ఆర్థిక నిల్వలు పెంచుకుంటారు. కుటుంబ సభ్యులతో సమావేశం. శనివారం సంప్రదింపులకు అనుకూలం. వార్తలవల్ల కొంత నిరాశ పెరుగుతుంది. ఆధ్యాత్మిక యాత్రలవల్ల మేలు.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఆదివారం అన్ని పనుల్లో అప్రమత్తంగా మెలగాలి. ఘర్షణలకు దూరంగా మెలగాలి. సోమవారం ఆలోచనల్లో జాగ్రత్తగా మెలగాలి. సృజనాత్మకత అధికం. ఒఒఒఒఒఒఒమంగళవారం లక్ష్యాలను సాధిస్తారు. ఉన్నత వ్యవహారాలపై దృష్టి. కీర్తి ప్రతిష్ఠలు పెరిగే అవకాశం. గౌరవం. బుధవారం వృత్తి ఉద్యోగాదుల్లో ఘర్షణ. అధికారిక లోపాలు. సామాజిక గౌరవం తగ్గే సూచనలు. శ్రమాధిక్యం. గురువారం వ్యాపారాదుల్లో శుభ పరిణామాలు. శ్రమ వున్నా ఫలితాలు అధికం. భాగస్వామ్యాలు, సౌఖ్యంపై దృష్టి. శుక్రవారం కార్యనిర్వహణలో సంతోషం, సంతృప్తి. అధికారిక వ్యవహారాల్లో అనుకూలత. పదోన్నతులపై దృష్టి. శనివారం లాభాలున్నా ఆశించిన సంతృప్తి ఉండకపోవచ్చు. అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. కొంత నిరాశాజనకం.

కొత్త నిర్ణయం (కథ)

0
0

అది ఒక జిల్లా పరిషత్ హైస్కూల్. సుమారు మూడు వందల మంది విద్యార్థులు చదివే ఆ పాఠశాలలో పది మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. పిల్లలందరికీ సైన్స్ టీచర్ సతీష్ అంటే చాలా ఇష్టం. అతను యువకుడు కావడం చేత విద్యార్థులతో చాలా స్నేహంగా ఉంటాడు. విద్యార్థులందరికీ అర్థమయ్యేలాగా పాఠాలను ప్రయోగాత్మకంగా చెబుతాడు.
సతీష్ ఎనిమిదవ తరగతికి క్లాస్ టీచర్. ఎప్పటిలాగే మొదటి పీరియడ్‌లో ఎనిమిదవ తరగతికి వెళ్లి పిల్లలకు హాజరు వేసి పాఠం చెప్పడం మొదలుపెట్టాడు. పిల్లలందరూ చాలా ఉత్సాహంగా కనపడ్డారు కానీ, వారి ధ్యాస పాఠం మీద ఉన్నట్టు కనపడలేదు. అందుకు గల కారణాన్ని ఆరా తీశాడు. మరి కొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం మొదలు కాబోతోంది. కనుక పిల్లలందరూ కొత్త సంవత్సర వేడుకల మీద దృష్టి పెట్టారని, గ్రీటింగ్ కార్డులు తయారుచెయ్యడం గురించి, కొత్త బట్టలు కుట్టించుకోవడం గురించి, జనవరి మొదటి తారీఖున కుటుంబ సభ్యులతో, స్నేహితులతో షికారుకు వెళ్ల డం గురించి ఆలోచిస్తున్నారని తెలుసుకొన్నాడు. తన మనసులోని ఆలోచనలను అమలు చేయడానికి ఇదే సరియైన సమయం అని భావించాడు.
‘చూడండి పిల్లలూ! కొత్త సంవత్సరం వస్తోంది కదా! కొత్త సంవత్సరం మొదటి రోజున మనమందరం కొత్త బట్టలు వేసుకొని, అందరికీ శుభాకాంక్షలు చెప్పుకొని, బంధువులతో, కుటుంబ సభ్యులతో సరదాగా గడపాలని కోరుకొంటాం. అలాగే గడుపుతాం కూడా. ఇది ప్రతి సంవత్సరం జరిగే తంతే. కాకపోతే ఈసారి కొత్త సంవత్సరం సందర్భంగా మీరందరూ వ్యక్తిగతంగా కొత్త నిర్ణయాలు తీసుకోవాలి. కొత్త లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. మీరు తీసుకొనే నిర్ణయం మీలోని చెడ్డ అలవాట్లని తొలగించేదిగానూ, మీ భవిష్యత్తుకు ఉపయుక్తంగానూ ఉండాలి. దాన్ని సాధించడం కోసం మీరు ఈ ఏడాదంతా కష్టపడాలి. మీరు ఈ రోజంతా బాగా ఆలోచించి ప్రతి ఒక్కరూ ఒక కొత్త లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. రేపటి క్లాస్‌లో మీరు తీసుకొన్న నిర్ణయాలను, ఏర్పరచుకొన్న లక్ష్యాలను నాకు చెప్పాలి’ అని ముగించాడు.
* * *
మరుసటి రోజు క్లాస్‌లో పిల్లలందరూ మరింత ఉత్సాహంగా కనపడ్డారు. సతీష్ ఒక్కొక్కరినీ నిల్చోబెట్టి వారు తీసుకొన్న కొత్త నిర్ణయం గురించి, ఏర్పరచుకున్న కొత్త లక్ష్యం గురించి అడిగాడు.
‘నాకు ప్రతిరోజూ ఆలస్యంగా నిద్రలేచే అలవాటు ఉంది. కనుక కొత్త సంవత్సరం సందర్భంగా ప్రతిరోజు సూర్యోదయానికన్నా ముందే నిద్రలేచి చదువుకోవాలని నిర్ణయించుకొన్నాను’ చెప్పాడు హరి.
‘నేను చిన్నప్పటి నుండి లెక్కల్లో వెనకబడి ఉన్నాను. లెక్కల మాస్టారి సహాయంతో ఈ ఏడాది ఎలాగైనా లెక్కల్లో పురోగతి సాధించాలని నిర్ణయించుకొన్నాను’ చెప్పాడు వేణు.
‘నాకు ఈత రాదు. ఎలాగైనా ఈత నేర్చుకోవాలని నిర్ణయం తీసుకొన్నాను’ చెప్పింది లత.
‘డబ్బులు వృథాగా ఖర్చు చేస్తానని మా నాన్న నన్ను తిడుతూ ఉంటారు. కనుక డబ్బులు పొదుపు చెయ్యడం అలవాటు చేసుకొంటాను’ చెప్పాడు ఫరూఖ్.
‘ఇంటి పనుల్లో మా అమ్మకు సహాయం చెయ్యాలని నిర్ణయించుకొన్నాను’ చెప్పింది వాణి.
‘మంచిమంచి పుస్తకాలు సేకరించి చదవాలని నిర్ణయించుకొన్నాను’ చెప్పింది రేఖ.
‘నేను లావుగా ఉన్నానని స్నేహితులు ఆటపట్టిస్తూ ఉంటారు. కనుక చక్కటి వ్యాయామాలు చేసి బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాను’ చెప్పాడు శేఖర్.
‘గత ఏడాది జిల్లా స్థాయి క్రికెట్ జట్టుకు ఎంపిక కాలేకపోయాను. ఈ ఏడాది మరింత సాధన చేసి జిల్లా స్థాయి జట్టులో చోటు సంపాదిస్తాను’ చెప్పాడు సూరి.
పిల్లలందరూ తాము తీసుకొన్న నిర్ణయాలు చెప్పారు. టీచర్ పిల్లల పేర్లు, వారు తీసుకొన్న నిర్ణయాలను వారి ముందే తన డైరీలో రాసుకొన్నాడు.
‘మీరు తీసుకొన్న నిర్ణయాలు చాలా బాగున్నాయి. వీటిని మీరు ఆచరణలోకి తీసుకొని వస్తే నేను మరింత సంతోషపడుతాను. ప్రతి నెలా ఒకటవ తారీఖున మీరు తీసుకొన్న నిర్ణయాల మీద నేను సమీక్ష నిర్వహిస్తాను. మీరు సాధించిన పురోగతి గురించి చర్చిస్తాను. ఈ సంవత్సరం మీలాగే నేను కూడా ఒక నిర్ణయం తీసుకొన్నాను. మన పాఠశాల ఆవరణలో మొక్కలు పెంచాలని నిర్ణయించుకొన్నాను. అందుకు కావలసిన మొక్కలను నేను సేకరిస్తాను. వాటిని నాటడంలో, పాదులు తీయడంలో, నీళ్లు పట్టడంలో మీరందరూ నాకు సహాయం చెయ్యాలి’ చెప్పాడు మాస్టారు.
‘అలాగే మాస్టర్’ పిల్లలందరూ ముక్త కంఠంతో తమ అంగీకారాన్ని తెలిపారు.
పిల్లలూ! మీరు కూడా కొత్త సంవత్సరం సందర్భంగా కొత్త నిర్ణయాలు తీసుకోండి. మీరు తీసుకొనే నిర్ణయాలు మీలోని చెడ్డ అలవాట్లని తొలగించేవిగాను, మీ భవిష్యత్తుకు ఉపయోగపడేవిగానూ ఉండాలి. కేవలం నిర్ణయాలు తీసుకోవడం మాత్రమే కాదు, వాటిని ఆచరించడంలో శక్తివంచన లేకుండా కృషి చెయ్యాలి.

సాక్షి

0
0

కోర్టు హాల్లో కూర్చుని ఉన్న నవోమీ తన లాయర్ భర్త కోసం ఆందోళనగా వేచి ఉంది. ఆ కేసులో అతని వాదన పూర్తయ్యాక సమీపంలోని రెస్టారెంట్‌కు లంచ్‌కి తీసుకెళ్తానని చెప్పాడు. అక్కడ తమ భవిష్యత్ గురించి చర్చించుకోవాలి.
క్రితం రాత్రి అతను తనతో అన్న మాటలు నవోమీకి గుర్తొచ్చాయి.
‘నా జీవితంలోకి మరొకామె ప్రవేశించింది. ఆమెని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను.’
నివ్వెరపోయిన నవోమీ ఏదో చెప్పబోతూంటే ఆమెకి అడ్డుపడి చెప్పాడు.
‘విడాకుల విషయంలో నేనో నిర్ణయానికి వచ్చాను. షరతుల గురించి ఈ కేసు పూర్తి అయ్యాక మాట్లాడుకుందాం’
‘నాకు విడాకులు ఇష్టం లేదు’
‘రేపు లంచ్ అవర్లో పదకొండున్నరకి కోర్టుకి రా’
ఓసారి అతను ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఇక వెనక్కి వెళ్లడని ఆమెకి తెలుసు. అందుకే ఆమె మనసంతా ఆందోళనగా ఉంది.
నవోమీ నిందితుడు జెరోమ్ వంక చూసింది. పంతొమ్మిదేళ్ల అతను ధైర్యంగా కనపడే ప్రయత్నం చేస్తున్నాడు.
కోర్ట్ క్లర్క్ హెన్రీని బోనెక్కించాడు. నవోమి భర్త అర్నాల్డ్ ప్రధాన సాక్షి హెన్రీని క్రాస్ ఎగ్జామ్ చేయసాగాడు.
‘నా క్లైంట్ జెరోమ్ కారు ఎర్ర లైటు వెలుగుతున్నా ముందుకి వెళ్లి ఏగ్నెస్ అనే ఆమెని ఢీకొట్టడం నువ్వు చూసానని సాక్ష్యం చెప్పావు. నువ్వు పోలీసులకి ఆ మాటే చెప్పావా?’
‘అవును... అదే’
‘అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయా?’
‘ఉన్నాయి..’
‘నా క్లైంట్ జెరోమ్ ఆకుపచ్చ లైట్ వెలుగుతూండగా తన కారుని పోనించానని చెప్తున్నాడు. మరి నువ్వు ఎర్ర లైటు వెలుగుతూండగా కారు వెళ్లిందని ఎలా చెప్పగలవు?’
‘నేను చూసాను కాబట్టి’
‘అంటే నా క్లైంట్ అబద్ధం ఆడాడని ఆరోపిస్తున్నావా?’ అర్నాల్డ్ ప్రశ్నించాడు.
‘సాక్షిగా నేను అబద్ధం చెప్పడం లేదు..’
నవోమీకి తన భర్త ఉదయం బ్రేక్‌ఫాస్ట్ దగ్గర చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.
‘ఇప్పుడు నేను నిన్ను ప్రేమించడం లేదు. కాబట్టి ఒకప్పటి మాటలు కట్టిపెట్టు. నేను ఇప్పుడు ప్రేమించేది నిన్ను కాదు’
అర్నాల్డ్ మళ్లీ సాక్షిని ప్రశ్నించాడు.
‘మీరా చౌరస్తాలో ప్రమాదం జరిగిన సమయంలో నిలబడి ఉన్నావు. అవునా?’
‘కాదు. అక్కడి బస్‌స్టాప్‌లోని బెంచీ మీద బస్ కోసం ఎదురుచూస్తూ కూర్చుని ఉన్నాను’
‘ఆ సమయంలో హతురాలు ఏగ్నెస్ రోడ్ మీద నడిచి రావడం నువ్వు చూసావా?’
‘చూశాను’
‘ఎటు వైపు నించి వస్తోంది?’
‘తూర్పు నించి. ఆవిడ తన మనవడ్ని చూసి ఇంటికి వెళ్లాలంటే తూర్పు వైపు నించే రావాలి’
‘ఆ సంగతి నీకు ఆవిడ ఎప్పుడు చెప్పింది? మరణానికి మునుపా? తర్వాతా?’
‘ఎప్పుడూ చెప్పలేదు. తర్వాత ఇది పోలీసులు చెప్పారు.’
‘ఇతరులు చెప్పింది కాక సాక్షిగా నువ్వు చూసింది మాత్రమే ఇక్కడ చెప్పాలి. లేదా జూరీ సభ్యులు పొరబడే అవకాశం ఉంది. అర్థమైందా?’ అర్నాల్డ్ అడిగాడు.
‘అయంది..’ హెన్రీ చెప్పాడు.
‘నువ్వు కూర్చున్న బెంచికి, ట్రాఫిక్ లైట్స్‌కి మధ్య ఎంత దూరం ఉంది?’
‘సుమారు ఏభై గజాలు’
‘అంటే ఇక్కడ నించి ముద్దాయి జెరోమ్ కూర్చున్నంత దూరమా?’
‘సుమారుగా అంతే..’
‘నాకు నువ్వు ఓసారి ఇది వివరించాలి. ప్రమాదానికి మునుపు నువ్వు ఏగ్నెస్‌ని చూడలేదని చెప్పావు. నువ్వు బెంచీ మీద కూర్చుని బస్ కోసం వేచి ఉన్నావు. ఏగ్నెస్ చౌరస్తాకి తూర్పు వైపు నించి వస్తోంది..’
కోర్టు సిబ్బంది ఒకరు జడ్జికి, జూరీ సభ్యులకి కనపడేలా బ్లాక్ బోర్డ్‌ని అమర్చారు. దాని మీద చౌరస్తా, అతను కూర్చున్న బెంచ్, ప్రమాదం జరిగిన ప్రదేశం బొమ్మలు గీసి ఉన్నాయి. అర్నాల్డ్ సూచన మీద ఏగ్నెస్ ఎట్నించి వస్తోందో అక్కడ ఇంటూ గుర్తు పెట్టారు.
‘ఆవిడ అడుగుల చప్పుడు నీకు వినిపించిందా?’
‘విన్నానో లేదో నాకు గుర్తు లేదు. నేను సెంచరీ క్లబ్‌లో రాత్రి రెండు దాకా పని చేసి, ఇంటికి వెళ్తున్నాను’
‘అప్పుడు టైం...?’
‘తెల్లారి రెండు గంటలకి’
నవోమీకి భర్త ఫోన్‌లో మాట్లాడిన సంభాషణ గుర్తుకు వచ్చింది.
‘నేను అర్నాల్డ్‌ని.. ఇంత రాత్రి ఫోన్ చేస్తున్నందుకు సారీ... జెరోమ్ కేసులో ఓ సాక్షి పేరు హెన్రీ. అతని గురించి మొత్తం తెలుసుకోవాలి. సెంచురీ క్లబ్‌లో అతను జానెటర్‌గా పని చేస్తున్నాడు.. అలాగే, రేపు అక్కడే కలుద్దాం ఫ్రాన్’
‘ఈ రాత్రి మీరు ఆలస్యంగా రావడానికి కారణం మీ సెక్రటరీ ఫ్రానేనా?’ నవోమీ అడిగింది.
‘దాని గురించి త్వరలోనే మాట్లాడదాం. ఇప్పుడు కాదు’
అతని కంఠధ్వని చిన్నపిల్లలు ఏదైనా కోరితే, ‘ఇప్పుడు కాదు. తర్వాత..’ అని చెప్పినట్లుగా ఉంది.
‘రాత్రి నా క్లైంట్ డ్రైవ్ చేసిన కారు హెడ్ లైట్స్‌ని గమనించావా? అవి వెలుగుతున్నాయా?’
‘వెలుగుతున్నాయి’
‘నువ్వు చూసిన హెడ్‌లైట్ల కాంతిని ఏగ్నెస్ చూసి ఉంటుందా?
‘చూసే ఉంటుంది’
‘నీకు ట్రాఫిక్ లైట్లు ఎటు వైపు ఉన్నాయి?’
‘కుడి వైపు’
‘ఏగ్నెస్ నీకు ఎటు వైపు నుంచి వచ్చింది?’
‘ఎడమ వైపు నుంచి’
‘కారు?’
‘కుడి వైపు నుంచి’
‘నువ్వు ట్రాఫిక్ లైట్లని చూడాలంటే తలని ఎటువైపు తిప్పాలి?’
‘కుడి వైపునకు’
‘ఆవిడని చూడాలంటే...’
‘ఎడమ వైపునకు’
‘ట్రాఫిక్ లైట్ ఎరుపు నించి ఆకుపచ్చకి మారడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది?’
‘నిమిషాలు కాదు... క్షణాల్లో మారుతుంది..’
‘ఇంత సమయం చాలా?’ అర్నాల్డ్ చిటికె వేసి అడిగాడు.
‘చాలనుకుంటాను’
‘నువ్వు కుడివైపు ఎర్ర లైట్‌ని చూసి ఆవిడ అడుగుల చప్పుడు విని తల తిప్పి ఎడమ వైపు చూశావు. ఆ క్షణంలో లైట్స్ మారి ఉండచ్చా?’
‘మారి ఉండచ్చు. కానీ మారలేదు. ఎందుకంటే నేను మళ్లీ కుడి వైపు చూశాను’ హెన్రీ చెప్పాడు.
‘ఏగ్నెస్ కారు హెడ్‌లైట్లని చూసి కూడా ఎందుకు ఆగలేదు?’ అర్నాల్డ్ ప్రశ్నించాడు.
‘నాకు తెలీదు’
‘ఆవిడ ఎర్రలైటు పచ్చలైటుగా మారుతుందని గ్రహించక ఆగకపోయి ఉండచ్చుగా’
‘అవును. ఎర్రలైట్ పచ్చలైట్‌గా మారలేదు’
‘కాని ఆ సమయంలో నువ్వు ఎటు చూసావు? కుడి వైపా? లేక ఎడమ వైపా? లైటు మారిందో లేదో గమనించే అవకాశం నీకు లేదు. కారణం ఆ సమయంలో నువ్వు ఏగ్నెస్‌ని చూస్తున్నావు హెన్రీ. నిన్ను సెంచురీ క్లబ్‌తో ఉదయం షిఫ్ట్ నించి రాత్రి షిఫ్ట్‌కి ఎందుకు మార్చారు?’
హెన్రీ జవాబు చెప్పలేదు.
‘పగలు ఉద్యోగంలో ఉన్నప్పుడు లేడీస్ బాత్‌రూంలోకి వెళ్తూండే వాడివి కదా?’
‘అవును’ హెన్రీ తలవంచుకుని చెప్పాడు.
‘కారణం నీకు కలర్ బ్లైండ్‌నెస్ ఉంది. జెంట్స్ బాత్‌రూం తలుపునకు ఎర్రరంగు, లేడీస్ బాత్‌రూం తలుపునకు ఆకుపచ్చ రంగు వేశారు. నీకా రంగుల మధ్య తేడా తెలీక లేడీస్ బాత్‌రూంలోకి వెళ్తూండటంతో రాత్రి పది తర్వాత క్లబ్ సభ్యులంతా వెళ్లిపోయాక డ్యూటీ వేశారు కదా? నీకు కలర్ బ్లైండ్‌నెస్ ఉంది కదా?’
‘అవును’
అర్నాల్డ్ జడ్జ్ వైపు తిరిగి చెప్పాడు.
‘కలర్ బ్లైండ్‌నెస్ ఉన్న ఇతను సరైన సాక్షి కాదు కాబట్టి ఇతని సాక్ష్యాన్ని కొట్టేయవలసిందిగా కోరుతున్నాను’
ప్రాసిక్యూషన్ వాళ్లు అందుకు అభ్యంతరం చెప్పకపోవడంతో కేసు కొట్టేశారు.
* * *
‘పద’ అర్నాల్డ్ విజయగర్వంతో భార్యతో చెప్పాడు.
నవోమీ పార్క్ చేసిన తన కారుని రివర్స్‌లో బయటకి తీసి రోడ్ మీదకి తీసుకురాగానే ఎదురుగా రోడ్‌ని క్రాస్ చేసే అర్నాల్డ్ కనిపించాడు. కొన్ని క్షణాలు సంశయించినా ఆమె కారు వేగంగా వెళ్లి అతన్ని గుద్దింది. వెంటనే అరుపులు. కారు దిగి నవోమీ ఏడుస్తూ చెప్పింది.
‘అయ్యో! అర్నాల్డ్. నా కారు బ్రేక్‌మీంచి ఏక్సిలెటర్ మీదకి స్లిప్పైంది...’
పోలీస్ ఆఫీసర్ ఓ బెంచి మీద కూర్చున్న వ్యక్తి దగ్గరికి వెళ్లి అడిగాడు.
‘ఇప్పుడు జరిగింది నువ్వు చూసావా?’
‘చూశాను. ఆమెకి ఆ లాయర్ ఏమవుతాడు?’ అతను అడిగాడు.
‘ఆమె భర్త’
వెంటనే అతను చిన్నగా నవ్వి చెప్పాడు.
‘నా పేరు హెన్రీ. ఇప్పుడే ఆ లాయర్ నేను కోర్టులో సాక్షిగా పనికి రానని తీర్మానం చేశాడు. కాబట్టి నా సాక్ష్యం పనికిరాదు.’
అతను తప్ప అక్కడ మరో సాక్షి లేడు. నవోమీ హెన్రీ వంక చూసింది. ఆమె కళ్లల్లో కృతజ్ఞత కనిపించింది. *

రామాయణం.. 111 -మీరే డిటెక్టివ్

0
0

మీకో ప్రశ్న

భారతంలోని శంతనుడికి, రామాయణంలోని రాముడికి గల పోలిక ఏమిటి?
=========================================================
రామాయణం (అయోధ్యకాండ 11వ సర్గ)
ఆ తర్వాత భరతుడు సంతోషిస్తూ శతృఘు్నడితో కలిసి రథం ఎక్కాడు.
వశిష్ఠుడు, వామదేవుడు దృఢమైన వ్రతాలు గల జాబాలి, ఉత్తమమైన ఆలోచనా శక్తిగల మంత్రులు అంతా అతనికన్నా ముందే బయల్దేరారు. వారంతా చిత్రకూట పర్వతానికి ప్రదక్షిణంగా దక్షిణ దిక్కువైపు తిరిగి మందాకినీ నది వైపు వెళ్ళారు. అపుడు భరతుడు సైన్యంతో కలిసి ప్రయాణిస్తూ, వేలకొద్దీ అనేక రకాల సుందరమైన ధాతువులని చూసాడు.
బుద్ధిమంతుడైన భరతుడు చిత్ర కూట సమీపంలోని భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్లి, రథం దిగి ఆ మహాముని పాదాలకి నమస్కరించాడు. అతన్ని చూసి సంతోషించిన భరద్వాజుడు అడిగాడు.
‘‘నాయినా! నీ పని పూరె్తై రాముడ్ని కలిసావా?’’
సోదరులమీద ప్రేమగల భరతుడు ఇలా చెప్పాడు.
‘‘దృఢపరాక్రమం గల రాముడి గురువైన వశిష్ఠుడు, నేను ప్రార్థించగా అతను సంతోషించి వశిష్ఠుడితో చెప్పాడు. ‘పధ్నాలుగు సంవత్సరాలు నేను అరణ్యంలో ఉండాలని నా తండ్రి చేసిన ప్రతిజ్ఞని పాలిస్తన్నాను’. మహాబుద్ధిశాలి, మాటల్లో సమర్థుడైన వశిష్ఠుడు అది విని బదులు చెప్పాడు. ‘గొప్ప బుద్ధిగల ఓ రామా! నువ్వు బంగారంతో అలంకరించబడ్డ పాదుకలని సంతోషంగా ఇవ్వు. ఇవి అయోధ్యలో ప్రజల యోగక్షేమాలని చూస్తాయి’. వశిష్ఠుడి మాటలు విని రాముడు ఉత్తర దిక్కుకి తిరిగి ఈ పాదుకలని తొడుక్కుని రాజ్యాన్ని పాలించడానికి వీటిని నాకు ఇచ్చాడు. మహాత్ముడైన రాముడి అనుమతి పొంది నేను మంగళకరమైన ఈ పాదుకలతో మళ్లీ అయోధ్యకి వెళ్తున్నాను’’.
భరతుడి శుభకరమైన ఆ మాటలు విని భరద్వాజుడు కూడా శుభకరమైన మాటలే చెప్పాడు.
‘‘మానవుల్లో శ్రేష్ఠుడా! విడిచిన నీరు పల్లంలో నిలిచినట్లు పూజనీయమైన లక్షణాలన్నీ నీలోనే ఉండటంలో నాకు ఆశ్చర్యం లేదు. ధర్మజ్ఞుడు, ధర్మంమీద ఆసక్తిగల నీ వంటి వాడిని కొడుకుగా పొందిన నీ తండ్రి దశరధుడు మరణించినా మరణించనివాడే’’.
మహాత్ముడైన ఆ భరద్వాజముని మాటలు విని భరతుడు నమస్కరించి, ఆయన పాదాలని స్పృశించి ప్రయాణానికి అనుమతి కోరాడు. శ్రీమంతుడైన భరతుడు భరద్వాజుడికి మాటిమాటికీ ప్రదక్షిణ పూర్వకంగా నమస్కరించి మంత్రులతో అయోధ్యకి వెళ్లాడు. విశాలమైన భరతుడి సేన అతని వెంటే వాహనాలు, బళ్ళు, గుర్రాలు, ఒంటెలు, ఏనుగులతో తిరిగి అయోధ్యవైపు మళ్లింది. తర్వాత వారంతా అలల వరసలతో నిండిన శ్రేష్ఠమైన యమునా నదిని దాటి పవిత్రమైన నీరుగల గంగానదిని మళ్లీ చూసారు. అందులో స్నానం చేసాక భరతుడు బంధువులతో, సైనికులతోకలిసి అందమైన నీటితో నిండిన ఆ గంగానదిని దాటి సుందరమైన శృంగబేరపురంలోకి ప్రవేశించాడు.
అక్కడనించి అయోధ్యకి వెళ్లాడు. తండ్రి, అన్న లేని అయోధ్యని చూడగానే దుఖంతో సారధితో చెప్పాడు.
‘‘ఓ సారధీ! అయోధ్యా నగరం పూర్తిగా చెడిపోయి, మంచి ఆకారం లేకుండా అందవిహీనమై, మంచి శబ్దాలన్నీ నశించి ఏ మాత్రం ప్రకాశించడం లేదు’’ (అయోధ్యకాండ సర్గ 114)
గొప్ప కీర్తివంతుడు, ప్రభువైన భరతుడు చెవులకి ఇంపైన, గంభీరమైన శబ్దం చేసే రథంమీద అయోధ్యలోకి చేరుకున్నాడు. అక్కడ పిల్లలు, గుడ్లగూబలు తిరుగుతున్నాయి. మనుషులు, ఏనుగులు బయట తిరగడంలేదు. దాంతో అయోధ్య చీకటి ఆవరించి, వెలుగులేని నల్లని రాత్రిలా ఉంది. ప్రకాశించే కాంతిగల, ఎదురుగా వున్న క్రూర మృగం చేత బాధించబడ్డ చంద్రుడి ప్రియభార్య రోహిణిలా అయోధ్య కాంతివిహీనంగా ఉంది. వెడెక్కి తరిగిపోయిన స్వల్ప జలాలతో పక్షులన్నీ ఎండి బాధపడుతూండగా, చిన్న, పెద్ద చేపలు, మొసళ్ళు, అడుగున అణగి కృశించిన పర్వత నదిలా అయోధ్య శోభావిహీనమై ఉంది. మొదట పైకి ఎగురుతూ, పొగ లేక బంగారంలా ప్రకాశిస్తూ, తర్వాత హవిస్సు వేయగానే ఆరిపోయిన యజ్ఞంలోని అగ్నిశిఖలా అయోధ్య అందవిహీనంగా ఉంది. ఘోర యుద్ధంలో కవచాలన్నీ బద్ధలై, ఏనుగులు, గుర్రాలు, రధాలు, జండాలు కిందపడి ఉత్తమ వీరులంతా మరణించగా, గొప్ప ఆపదలో వున్న సైన్యంలా అయోధ్య భయంకరంగా కనపడుతోంది.
ఎక్కువ నురుగుతోను, ధ్వనితోను లేచి ఇంతలో ప్రశాంతమైన గాలి చెదరకొట్టడంతో, చప్పుడు లేకుండాపోయిన సముద్ర తరంగంలా అయోధ్య ఎలాంటి ధ్వనులూ లేకుండా ఉంది. యాగ సమప్త దినం గడిచాక చుట్టుప్రక్కల యజ్ఞాలకి సంబంధించిన ఉపకరణాలు, ఉత్తములైన ఋత్విక్కులు లేకపోవడంతో అయోధ్య నిశ్శబ్దంగా ఉన్న వేదికలా ఉంది.
ఎద్దు దూరంగా వెళ్లిపోగా దానిమీద అధికమైన ఆసక్తితో ఆర్తురాలై చావిడి మధ్యలో నిలిచి గడ్డిమేయని గోవులా ఆ అయోధ్య ఉంది. మంచి జాతికి చెందినవైన పద్మరాగాది మణులు లేని కొత్త ముత్యాలహారంలా ఆ అయోధ్య ఉంది. పుణ్యం క్షీణించడంవల్ల స్థానం నించి కదిలి, కాంతి అంతా నశించగా ఆకాశం నించి జారి తటాలున భూమిమీద పడ్డ నక్షత్రంలా ఆ అయోధ్య ఉంది. పువ్వులతో నిండిన మదించిన తుమ్మెదల రొదతో కూడిన వనలత వసంతం చివర్లో దావాగ్నితో వేడెక్కి ఏ విధంగా వాడిపోతుందో అయోధ్య అలా ఉంది.
అయోధ్యలోని కార్యాలన్నీ ఏ పనులూ లేకుండా ఉన్నాయి. దుకాణాలు, వాటి వీధులు మూసి వేయబడ్డాయి. ఇలా స్తబ్దంగా ఉన్న అయోధ్య మేఘాలు ఆవరించి చంద్రుడు, నక్షత్రాలు కనపడకుండాపోయిన ఆకాశంలా ఉంది. చుట్టూ బద్ధలైన ఉత్తమ పానపాత్రులు పడుతూండగా, పానశాలాధ్యక్షుడు మరణించి, సంస్కారం లేని పానభూమిలా అయోధ్య కాంతిహీనంగా ఉంది. నేల పగిలి పల్లమైపోయి బద్ధలైన పాత్రలు అటు, ఇటు పడి ఉండగా, తాగడానికి నీళ్ళు లేక విరిగి నేలమీద పడ్డ చలివేంద్రంలా అయోధ్య కనపడుతోంది.
తగిన పొడవుగల విశాలమైన నారి బలవంతుల బాణాలతో ఛేదించబడి, ధనుస్సునించి నేలమీదికి జారిపడితే ఎలా వుంటుందో అయోధ్య అలా ఉంది. యుద్ధంలో శూరుడైన రౌతు తటాలున ఎక్కి యుద్ధ రంగానికి వెళ్ళగా అక్కడ శతృవుల చేతపడి నేలమీద పడ్డ ఆడగుర్రంలా అయోధ్య కనపడింది. నీరు ఎండిపోయి అనేకానేక పెద్ద పెద్ద చేపలు, తాబేళ్ళు బయటపడి ఉండగా చుట్టుప్రక్కలవున్న తీర ప్రాంతం బీటలై, కలువలు లేని దిగుడు బావిలా అయోధ్య కాంతివిహీనంగా ఉంది. పైన పూసుకునే చందనాలు మొదలైనవి పూసుకోక, ఆభరణాలు ధరించక శోకంతో బాధపడే పురుషుడి శరీరంలా అయోధ్య ఉంది. మంచి వర్షాకాలంలో సూర్యుడు మేఘ మండలంలో ప్రవేశించగా, నల్లటి మేఘాలతో కప్పబడ్డ సూర్యుడి కాంతిలా ఆ అయోధ్య ఉంది.
శ్రీమంతుడు, దశరధుడి కొడుకైన భరతుడు రథంమీద కూర్చుని దాని సారధితో చెప్పాడు.
‘‘అయోధ్యలో ఇపుడు పూర్వంలా గంభీరమైన గీతా వాద్యాల ధ్వని సర్వత్రా వ్యాపించి వినపడటంలేదు. కారణం ఏమిటో? మద్యం వాసన, పూలమాలల సుగంధం, అగరుధూపాల సువాసన అంతటా వ్యాపించి గుబాళించడం లేదు.

1.్భరతుడు రాముడి పాదుకలని తలపైన ఉంచుకుని రథం ఎక్కాడు. ఈ విషయాన్ని హరిదాసు చెప్పలేదు.
2.వారంతా చిత్రకూట పర్వతానికి ప్రదక్షిణంగా తూర్పు దిక్కువైపు తిరిగారు. హరిదాసు దాన్ని దక్షిణదిక్కు అని తప్పుగా చెప్పాడు.
3.రాముడు పాదుకలని తూర్పు దిక్కువైపు తిరిగి తొడుక్కున్నాడు. హరిదాసు ఉత్తర దిక్కు అని తప్పుగా చెప్పాడు.
4.్భరతుడి సేనలో ఒంటెల ప్రస్తావన వాల్మీకి ఈ కాండలో చేయలేదు. కాని అవి ఉన్నట్లుగా హరిదాసు చెప్పాడు.
5.్భరతుడు గంగానదిలో స్నానం చేయలేదు. హరిదాసు ఇది తప్పుగా చెప్పాడు.
==========================================================
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు

సగరుడు గర్భంలో ఉండగా అతని తల్లికి విషం పెట్టిన సవతి పేరేమిటి? జవాబు: కాళింది

అపకారం ఎరగని కాకర

0
0

స్వామి జె.వి.వి.ఎల్.ఎన్, భద్రాచలం
ప్ర: కాకరకాయల వాడకం నానాటికీ తగ్గిపోతోంది. వాటికి వైద్య ప్రయోజనాలను వివరించగలరు. కాకరను తినవలసిన అవసరం గురించి సమాచారం ఇవ్వండి.

జ: కొన్ని వ్యాధులు పుట్టకుండానే ఆయా రోగాలకు ప్రకృతి, మందుల్ని సృష్టిస్తుందేమోననిపిస్తుంది. మనకు చాలా విషయాలు తెలియవు. తెలియకపోవటం వలన అందులో ఏమీ లేదనుకుంటాం. కాకర గురించి కూడా సామాన్యులు ఆలోచించింది చాలా తక్కువ. విందు భోజనాల్లో వడ్డించాలన్నా, హోటల్ భోజనాల్లో వడ్డించాలన్నా ఎవరూ తినరేమోననే భయంతో కాకరను వండరు. ‘చేదు పుట్ట’ అని పిల్లలు ఈసడిస్తారని తల్లిదండ్రులు వండిపెట్టరు. ఈ వయసులో అలాంటివి తింటే సరిపడవేమోననే భయంతో పెద్దలూ తినటంలేదు. వెరసి కాకర దారుణమైన నిరాదరణకు గురౌతున్న అమృతఫలం. ఒక బిట్టర్ టానిక్.
కాకరకాయలను తరచూ తింటూంటే శరీరానికి రోగాన్ని జయించే శక్తి కలుగుతుంది. విషజ్వరాలు, షుగరు వ్యాధి, కేన్సర్ వ్యాధులకు ఔషధంగా పనిచేసే గుణం వీటికుంది. కాకరను వండుకునే విధానంవలన వేడి, వాతాలు చేయవచ్చేమో కానీ, మామూలుగా కాకర అపకారం చెయ్యదని అర్థం చేసుకోవాలి.
ఆయుర్వేదం దీన్ని ప్రముఖంగా చర్మవ్యాధుల్లో ఎక్కువగా పనిచేసే ద్రవ్యంగా పేర్కొన్నారు. శరీరంలో విష లక్షణాల్ని తగ్గించే గుణం దీనికుంది. అందువలన కలిగే వివిధ చర్మవ్యాధులను తగ్గించేందుకు కాకరకాయలు మంచి ఫలితాలిస్తాయి, భీకరమైన వ్రణాలు తగ్గిస్తుంది. ఔషధంలా పనిచేస్తుంది. భీకర వ్రణాలమీద దీనికి గుణాలు చెప్తూ, వ్రణశోధన (పుండు లోపలి దోషాలను వెళ్లగొట్టడం), వ్రణరోపణ (పుండును మాడేలా చేయటం), దాహప్రశమనం (పుండుమీద మంట పుట్టడాన్ని తగ్గించడం), వేదనాస్థాపనం (నొప్పిని అక్కడికక్కడే తగ్గించడం) అనే ప్రయోజనాలను కాకరకాయలు నెరవేరుస్తాయని ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి. ఆధునిక వైద్య శాస్త్రం, హీలింగ్ ఫుడ్స్‌లో కాకరను ప్రముఖంగా పేర్కొన్నారు. ఆపరేషన్లు అయినవారికి, గాయాలబారిన పడ్డవారికి, భయంకరమైన రాచపుళ్లు, మధుమేహ వ్యాధిలో కలిగే కార్బంకుల్స్ లాంటి భీకర వ్రణాలతో తినే అలవాటు వలనే తమకు ఆయుఃప్రమాదం ఎక్కువని నమ్ముతారు.
సుష్ఠుగా భోజనం చేశామని చెప్పుకోవటానికి షడ్రసోపేతమైన భోజనం చేశాం అని చెప్తాం. షడ్రసాలంటే తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు చేదు ఈ ఆరు రుచులూ వున్న భోజనం కాబట్టి షడ్రసోపేతమయ్యింది. ఆహారంలో ఈ ఆరు రుచులూ ఉండేలా మన పూర్వులు జాగ్రత్తపడేవారు. ఆహారపు పోషక వివలులనూ విటమిన్లూ, ప్రొటీన్లలో కాకుండా ఇలా రుచుల్ని బట్టి కొలవటం ఆయుర్వేద విధానం. రాను రానూ సలపు, ఉప్పు కారాలాకు ప్రాధాన్యతనిస్తూ వగరు, చేదూ లేకుండా భోజనం చేయటం అంట, ఎంత ధనికుడైనా షడ్రసోపేతమైన భోజనం చేయటం లేదనేఅర్థం. చల్లకవ్వాన్ని వాడటం మానేసి, వగరు రుచి కలిగిన మజ్జిగని మరచిపోయాం. ఫ్రిజ్‌లో గడ్డకట్టిన పెరుగు మాత్రమే తింటున్నాం. చేదు రుచి కలిగిన కాకరను ఛీకొడుతున్నాం. షుగరు వ్యాధి రావటానికి చిలికిన మజ్జిగను త్రాగకపోవటం, వండిన కాకర కూర తినకపోవటం ఈ రెండూ ముఖ్యమైన కారణాలేనన్నది వైద్యశాస్త్రం చేస్తున్న హెచ్చరిక.
కాకరకాయల్లో మొమోర్డిసిన్ అనే రసాయన పదార్థం ఉంటుంది. అది పేగులను బలసంపన్నం చేసి, నులిపురుగుల్ని పోగొడుతుంది. మలేరియా జ్వరాన్నీ, వైరస్ వ్యాధుల్నీ తగ్గించటంలో దీని పాత్ర అమోఘమైందని ఆధునిక పరిశోధనలు నిరూపిస్తున్నాయి. కాకరను తరచూ తింటూ వుంటే, కేన్సర్ లక్షణాలు నెమ్మదిస్తాయనికూడా తేలింది.
రక్తంలో షుగరు స్థాయిని నియంత్రించే గుణం కలిగిన లెక్టిన్ లాంటి ఇతర రసాయనాలు కూడా కాకరలో ఉన్నాయని, అవి షురు వ్యాధిని అదుపు చేస్తాయనీ చెప్తున్నారు. రక్తంలో వచ్చే కేన్సర్ వ్యాధి మీద, అలాగే స్ర్తిలలో కలిగే రొమ్ము కేన్సర్ వ్యాధిమీద పనిచేసే రసాయనాలు కూడా కాకరలో ఉన్నాయని కనుగొన్నారు. 1962లో లొలిత్‌కార్ మరియు రావు అనే ఇద్దరు భారతీయ పరిశోధకులు కాకరకాయలోంచి చారంటీన్ రసాయనాన్ని వేరుచేసి, రక్తంలో షుగరు వ్యాధిని తగ్గించే గుణం కలిగిన ఔషధంగా దీనిని కనుగొన్నారు. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని కాకర మెరుగుపరుస్తుందని వారు నిరూపించారు. కాకరకాయ రసంతో టాబ్లెట్లు తయారుచేసి అమ్ముతున్నారు.
కాకరతో తగ్గించగలిగిన వ్యాధుల్లో మలేరియా కూడా ఒకటి. కాకరకాయలతో సమానంగా, కాకర ఆకులకు కూడా మలేరియాని తగ్గించే గుణం వుంది. పనామా, కొలంబియా తదితర అమెరికన్ దేశాలలో మలేరియా జ్వరం వచ్చిన రోగికి కాకర ఆకులతో టీ కాచి ఇస్తారు. కాకరకాయతో చేసుకొనే వంటకాలన్నీ కాకర ఆకులతో కూడా చేసుకోవచ్చు.
గర్భస్రావాన్ని కలిగించే రసాయనాలు కూడా ఉండడంతో కాకరను సంతాన నిరోధక ఔషధంగా ప్రచారం చేయాలని శాస్తవ్రేత్తలు భావిస్తున్నారు. అందుకని గర్భవతులు మాత్రం కాకరను తినకుండా ఉండటమే మంచిది.
కాకరకాయల కూరని ఉల్లికారంతోనూ, చింతపండు రసంతోనూ వండటంవలన పులుపు, కారాలు కడుపులో మంటను తీసుకురావచ్చు. బంగాళా దుంపలతో కాకరను కలిపి వండుకొని తింటారు. కొబ్బరి తురుము, మషాలాలు, నూనె బాగా వేసిన కాకర వేపుడు కూరని దక్షిణాసియా దేశాలలో ఇష్టంగా తింటారు. కాకరకాయ ముక్కలు వేసి తయారుచేసిన కిచిడీని చాలా దేశాల్లో తింటారు.
కాకరకాయని సన్నని చక్రాలుగా తరగి, ఉప్పు వేసి పిసికి నీరు పిండేసి, పసుపు కలిపి కూరని వండేవాళ్లు మన పూర్వులు. ఇపుడు ఎక్కువమందికి ఈ పద్ధతి తెలియదు. నీటిని పిండేస్తే, చెడు తగ్గుతుంది. ఇలా పిండిన ముక్కల్ని పసుపుతో కలిపి ఎండించి కాకర ఒరుగులు విడిగా తినటానికి వీలుగా వుంటాయి. ఇది మంచి ఫలితాలిస్తుంది. ముదురుకాకర గింజలు అపకారం చేస్తాయి. అందుకని గింజలు తీసేసి తినాలి.
అమీబియాసిస్ వ్యాధికి కూడా కాకరే మంచి మందు. కంటి వ్యాధులు, మూత్ర వ్యాధులు, గుండెజబ్బులూ అన్నింటిలోనూ కాకర మంచి చేస్తుంది. మంచానపడి లేచినవారికి కాకరకాయల కూరని వండిపెట్టండి. సందేహించకండి, ఏ అపకారం చెయ్యదు. రుచి తెలియకపోవటం, అజీర్తి, పైత్యం, లివర్ వ్యాధులు, ఉబ్బసం విష దోషాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవటం, విరేచన బద్ధత, వాపులు, గడ్డలు, రక్తదోషాలు, మూత్రపిండాలలో రాళ్ళు, అన్ని రకాల చర్మవ్యాధుల్లో దీని ఫలితం కనిపిస్తుంది. కాకరకాయలను వండుకొని తినటం ఒక అలవాటుగా చేసుకోండి. ఔషధాల వాడకం చాలా వరకూ తగ్గుతుంది.

ధ్యానంతో పరమాత్మ సన్నిధికి.. (రాస క్రీడాతత్త్వము-8)

0
0

భావం: వ్రజ గ్రామాలలో వుండే పురుషులంతా కృష్ణమాయలో పడి, తమ తమ ఆడవారంతా తమ ఇళ్ళలోనే ఉన్నారని భావించారు. అందువల్ల బాలకృష్ణుడు తమ ఆడవారిని ఆకర్షిస్తున్నాడని ఎవరూ భావించలేదు. అందుకే ఆయన మీద అసూయపడలేదు.)
ఈ శ్లోకంవల్ల వ్రజగ్రామాలలో ఏ రకమైన కల్లోలమూ జరగలేదని స్పష్టమవుతోంది. కనుక, వెనుకాల చెప్పుకున్న శ్లోకంలో ఇంటి పెద్దలు నివారించినా ఆడవారు ఆగలేదు అన్న చోట, ఆగకుండా లేచిపోయారని అర్థం చెప్పే వీలు లేదు. కనుక, ఆ యా బంధువులు పరవశ స్థితిలో వున్న ఆడవారి శరీరాలను దయతో జాగ్రత్త చేసుకోగా, గోపికలు సూక్ష్మశరీరాలతో స్వామి దగ్గరకు పరుగులు తీశారు-అని చెప్పక తప్పదు.
గోపికల ఆధ్యాత్మిక స్థాయి :-
అంతే గాకుండా, పైన చెప్పిన అంతర్గృహ గతాః కాశ్చిత్ గోప్యో - అనే శ్లోకం తరువాత భాగవతంలో మరో రెండు శ్లోకాలున్నాయి.
దుస్సహప్రేష్ఠవిరహ తీవ్ర తాపధుతాశుభాః
ధ్యాన ప్రాప్తాచ్యుతాశే్లష నిర్వృత్యా క్షీణమంగళాః ॥
తమేవ పరమాత్మానం జారబుద్ధ్యాపి సంగతాః
జహు ర్గుణమయం దేహం సద్యః ప్రక్షీణబంధనాః ॥
(శ్రీమద్భాగవతం, స్కం-10, అ-29, శ్లో-10,11)
అప్పటి దాకా సంసారులుగా వుంటూ, ఏదో కొంత కొంత కృష్ణ్ధ్యానం చేసినంత మాత్రాన, ఆ గోపికలకు సరాసరి స్థూలదేహాల్ని వదిలిపెట్టి, సూక్ష్మశరీరాలతో ప్రయాణం గలిగేటంతటి శక్తి ఎలా వచ్చింది? - ఈ సందేహం మనకు కలుగక మానదు. దీనికి సమాధానంగానే శుకహర్షి పై రెండు శ్లోకాలనూ చెప్పాడు.
జీవులు తమ స్థూలశరీరాలను పట్టుకుని వ్రేళ్ళాడేటట్టు చేసేవి రెండే రెండు. ఒకటి పాపం, మరొకటి పుణ్యం. కష్టాలనుభవిస్తే పాపాలు పోతాయి. సుఖాలనుభవిస్తే పుణ్యాలు పోతాయి. సామాన్య జీవులెవరికీ కూడా అవి ఒకే సమయంలో సున్నా స్థాయికి సామాన్యగా చేరవు. పరమాత్మ కృపకు నోచుకున్న ఈ గోపికల విషయంలో ఏమి జరిగిందంటే-
వారు ఎన్నో జన్మలనుంచీ విరహభక్తి మార్గంలో స్వామిని ఉపాసిస్తున్నారు. కనుక, ఇప్పుడు స్వామి ప్రస రింపజేస్తున్న వేణునాదాల ద్వారా, ‘‘ఈ నాదాలను ప్రసరింపజేసేవాడు మా స్వామే’’ -అని గుర్తుపట్టగలిగారు. అలా గుర్తుపట్టడంవల్ల, వారికి జన్మజన్మలనుంచీ అత్యంతప్రియుడైన ఆ స్వామితో ఏర్పడిన విరహమంతా ఒకే సారి గుర్తుకు వచ్చి, నరకయాతనలను మించిన దుఃఖం పొందారు. ఇలా పూర్వ దుఃఖాన్ని ఒకే సారి అనుభవించడంవల్ల, వారికి గల పాపాలన్నీ ఒకే సారి ఖర్చయిపోయాయి. ఈ భావానే్న ‘‘దుస్సహ ప్రేష్ఠవిరహ తీవ్రతాపధుతాశుభాః’’ అనే వాక్యం వివరిస్తోంది.
ఇక వారి పుణ్యాలు మిగిలి వున్నాయి. పైన చెప్పుకున్న బాధవల్ల వారి మనసులు ఒక్క సారిగా శ్రీకృష్ణ్ధ్యానంలోకి ప్రవేశించాయి. ఆ ధ్యానంలో వారికి తమ ప్రియతముడైన పరమాత్మ యొక్క ఆలింగనం దొరికింది. దానివల్ల కలిగిన ఆనందం ఎంత తీవ్రమైనదంటే, ఆ ఆనందానుభవంవల్ల వారికి గల పుణ్యాలన్నీ పూర్తిగా ఖర్చయిపోయాయి. ఈ భావానే్న ‘‘్ధ్యనప్రాప్తాచ్యుతాశే్లష నిర్వృత్యా క్షీణ మంగళాః’’ అనే వాక్యం చెపుతోంది.
ఆ విధంగా ఆ గోపికల పుణ్యాలూ, పాపాలూ, రెండూ కూడా సున్నా స్థాయికి వచ్చేసరికి, వారి మనస్సులో శ్రీకృష్ణుడి మీద పరమాత్మ అనే భావన సాక్షాత్తుగా లేకపోయినా, జారత్వబుద్ధితో ఆయన దగ్గరకు చేరి నప్పటికీ కూడానూ, పుణ్య పాపాలు రెండూ క్షీణించిపోవటం వల్ల, వారి బంధాలన్నీ వెంటనే తెగిపోయి (సద్యః ప్రక్షీణబంధనాః), తమోగుణమయమైన దేహాన్ని, అంటే స్థూలదేహాన్ని వదిలివేశారు (జహుర్గుణమయం దేహం).
ఈ విధంగా వారికి గల పాపపుణ్యాలన్నీ దుఃఖ సుఖ అనుభవాల ద్వారా తీరిపోయాయనీ, వారు ధ్యాన విధానంతో పరమాత్మను చేరుకున్నారనీ ఎంత చెప్పినా, జారభావంతోనే అలా చేశారని చెప్పారు కనుక, ‘‘జా రత్వం అనేది అధర్మం కనుక, అధర్మం ద్వారా ఉపాసన చేయడం మంచిదా?’’ - అని కొందరు సందేహిస్తూ వుంటారు. ఈ సందేహాన్ని వివరించడం కోసమే శుకమహర్షి పై శ్లోకంలో అచ్యుత అనే పదాన్ని వేశాడు. (అచ్యుతాశే్లష నిర్వ ృత్యా). అచ్యుతుడు అంటే ఒక వ్యక్తి కాదు. సర్వవ్యాపి అయిన పరమాత్మ. ఒకడు ఇదేదో మామూలు మజ్జిగ అనుకుని అమృతం తాగాడు అనుకోండి. వాడికి అమృతం పనిచేయడం మానేస్తుందా? వస్తువులో స్వతస్సిద్ధమైన శక్తి వుంటే, అవతలవాడి భావన ఎలా వున్నా, దానితో నిమిత్తం లేకుండానే ఆ వస్తువు తన శక్తిని చూపించి తీరుతుంది. అలాగే, గోపకాంతలు జారబుద్ధితో చేరినా, పరమాత్మనే చేరారు. అందుకే, వారికి దేహబంధం వదిలిపోయంది- అని అచ్యుత పదం చేత... శుకమహర్షి సూచన చేస్తున్నాడు.
(ఇంకా వుంది)

వస్త్రాలకు వనె్నలద్దిన నాగయ్య

0
0

ఏ భారతీయ నృత్యానికైనా ఆంగికం, వాచికం, సాత్త్వికం, ఆహార్యం అని నాలుగు అభినయాలు ఉంటాయి. నర్తకీమణులు, నర్తక రత్నాలు ఎంతో బాగా నృత్యం చేసి, హావభావాలతో ప్రేక్షకులను అలరించినా, ఆహార్యం అంటే మంచి వస్తధ్రారణ చాలా ముఖ్యం. ఆ విధంగా జీవితాన్ని నృత్య ఆహార్యానికి అంకితం చేసిన గొప్ప కళాకారుడు శ్రీ నాగయ్యగారు. 1949 ఫిబ్రవరి నాలుగున నెల్లూరు జిల్లా మైపాడు గ్రామంలో పుట్టి, బాల్యంలోనే దుస్తులు కుట్టడం నేర్చుకున్నారు. శ్రీ బొద్దుకూరు సీతారామయ్య, తస్కాని కృష్ణయ్యగార్ల వద్ద శిష్యరికం చేసి, తరువాత 1972లో చెన్నైలో నాటి సినీ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్న శ్రీ ఎం.జి. నాయుడుగారి వద్ద అనేక చలన చిత్రాలకు వస్త్రాలంకరణలో అసిస్టంటుగా ప్రతిభ చూపారు. తరువాత పద్మభూషణ్ డా. వెంపటి చినసత్యంగారి వద్ద ఎన్నో సంవత్సరాలు పని చేశారు.
తరువాత శ్రీమతి బాలా కొండలరావుగారి ప్రోత్సాహంతో నర్తకీమణులకు వస్త్రాలు కుట్టేవారు. తరువాత హైదరాబాద్‌కు వచ్చారు. పద్మశ్రీ డా. శోభానాయుడుగారి ప్రోత్సాహంతో వారి కూచిపూడి ఆర్ట్ అకాడమీలో స్థిరపడి, వారు రూపొందించిన శ్రీ కృష్ణపారిజాతం, కళ్యాణ శ్రీనివాసం, మేనకా విశ్వామిత్ర, ఛండాలిక, విప్రనారాయణ, విజయోస్తు తేనారి, స్వామి వివేకానంద, సర్వం సాయిమయం, సంభవామి యుగేయుగే, జగదానంద కారకా, శ్రీకృష్ణశరణం మమ, క్షీరసాగర మథనం, నవరస నటభామిని.. మొదలైన ఎన్నో నృత్య రూపకాలకు ఇంద్రధనుస్సులోని రంగులన్నీ తీసుకుని కన్నుల పండువగా వస్త్రాలను కుట్టి సమకూర్చారు. ప్రదర్శనలు విజయవంతం కావడానికి, నాగయ్యగారి చేతితో కుట్టిన దుస్తులు ఎంతో ముఖ్యం. రంగస్థలంపై ప్రదర్శన చప్పట్లతో మోగాలంటే, శ్రీనాగయ్యగారే డాన్స్ కాస్ట్యూమ్ కుట్టాలి!
శ్రీనాగయ్యగారు ఎంతోమంది గొప్ప కళాకారులకు నృత్యానికి సంబంధించిన వస్త్రాలకు అలంకరణ చేశారు. అందులో కొంతమంది.. డాక్టర్ పద్మశ్రీ శోభానాయుడు, పద్మభూషణ్ స్వప్నసుందరి, పద్మభూషణ్ రాజా-రాధారెడ్డి, పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ, డా. పద్మజారెడ్డి, శ్రీకళాకృష్ణ.. ఇలా ఎంతోమంది నర్తకీమణులకు, నర్తకులకు, వారి శిష్యులకు శ్రీ నాగయ్యగారు డాన్స్ కాస్ట్యూమ్స్ కుట్టారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వీరిచే ఎం.ఎ. విద్యార్థులకు ఆహార్య రూపకల్పన అంశంపై సోదాహరణ ప్రసంగాన్ని ఏర్పాటుచేశారు. ఒక ఫొటో చూసి అంచనాతో కూడా చక్కగా కుట్టగలరు వీరు. ‘శ్రీ శివమానస సరోవరం’ అనే కళాసంస్థను ఊపిరి పోశారు శ్రీ నాగయ్యగారు. కపటం లేని మంచి మనస్సు, కృషి, పరోపకారం, నిరాడంబరత, ఉదార స్వభావం, అజాత శత్రుత్వం.. ఇలా వీరికి ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి. శ్రీ నాగయ్యగారికి ఎన్నో దేశాల్లో క్లయింట్లు, కస్టమర్లు ఉన్నారు. వీరిచే నృత్యానికి వస్త్రాలను కుట్టించుకున్నవారు యు.ఎస్.ఎ., లండన్, ఆస్ట్రేలియా, రష్యా, జపాన్, మారిషస్ మొదలగు ఎన్నో దేశాల్లో ఉన్నారు. అట్లాంటాలోని శశికళగారికి ఇంగ్లీషు బాలేకి అవసరమైన వస్త్రాలు కుట్టారు నాగయ్యగారు. తెరపై, రంగస్థలంపై కళాకారులకి ఎంతో గుర్తింపు వస్తుంది.. తెర వెనుక కళాకారులని కూడా ప్రభుత్వం గుర్తిస్తే బాగుంటుంది అంటారు వీరు. తెర వెనుక కళాసేవ చేసేవారికి కూడా ప్రభుత్వ పురస్కారాలు, సంగీత, నాటక అకాడమీ అవార్డులు వస్తే బాగుంటుంది అంటారు నాగయ్యగారు. వీరికి ముగ్గురు అమ్మాయిలు.. శోభారాణి, శోభాదేవి, సాయి మానస.. నాగయ్యగారు అన్ని దేవీ దేవతల పాత్రలకు వస్త్రాలు సమకూరుస్తారు. శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, శివుడు, రాక్షసులు, బ్రహ్మ, పార్వతి, ఆండాళ్, లక్ష్మీదేవి, సీత.. ఇలా అన్ని పాత్రలు వీరి చేతిలో జీవం పొందుతాయి. తన జీవితాన్ని కళాసేవకి అంకితం చేశారు నాగయ్యగారు. అలా చేస్తేనే కళ రాణిస్తుంది అంటారు వీరు. ప్రతిభ, వ్యుత్పత్తి, క్రమశిక్షణ, అన్నింటికంటే సహృదయత ఉండాలి అన్నారు నాగయ్యగారు. ఎందుకంటే ఆహార్యం ఇతర కళాకారులతో పనిచేసి, వారిపై ఆధారమైనది. అందరితో కలిసిపోయి టీం వర్కు ఉంటేనే రాణిస్తామని అంటారు ఆయన.


నేచురల్ వయాగ్రా..

0
0

హిమాలయాల్లో ఓ అరుదైన ఔషధం దొరుకుతుంది. అదే ‘హిమాలయన్ వయాగ్రా’. ఇది కేవలం నపుంసకత్వానికి మాత్రమే మందు కాదు.. క్యాన్సర్, ఆస్తమా చికిత్సలకు కూడా ఉపయోగపడుతుందని నాటువైద్యులు చెబుతున్నారు. ఈ హిమాలయన్ వయాగ్రాను ‘యర్సగుంబా’ అంటారు. భారత్ సహా నేపాల్, భూటాన్, టిబెట్‌లోని హిమాలయా ప్రాంతాల్లో ఇది దొరుకుతుంది. గొంగళి పురుగుకు నేలలో ఉండే ఒక రకమైన ఫంగస్ సోకుతుంది. ఫంగస్ సోకిన గొంగళి పురుగు మరణించాక అది యర్సగుంబాగా మారుతుంది. ఈ ఫంగస్ మూడు వేల నుండి ఐదు వేల మీటర్ల ఎత్తులో పెరుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ కిలో రూ. 70 లక్షలు ఉంటుంది. యర్సగుంబాను అమెరికా, ఇంగ్లండ్, చైనా, సింగపూర్, జపాన్, కొరియా, మయన్మార్, థాయ్‌లాండ్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తారు. అక్కడ ఒక్క గ్రాము యర్సగుంబా విలువ దాదాపు రూ. ఏడు వేలు ఉంటుంది. జపాన్, చైనా వంటి దేశాల్లో యర్సగుంబాను సంప్రదాయ చికిత్సల్లో వాడుతున్నారు. అంతేకాదు, దీన్ని ఉపయోగించి రోగనిరోధక శక్తినిచ్చే బూస్టర్స్‌ను తయారుచేస్తున్నారు. యర్సగుంబా ఇమ్యూనిటీ పవర్‌ను ఇవ్వడమే కాకుండా కిడ్నీలకు, ఊపిరితిత్తులకు బలాన్ని చేకూరుస్తుంది. ఇది క్యాన్సర్, ఆస్తమా చికిత్సల్లో ఉపయోగపడుతుంది. ఇలా యర్సగుంబా పెద్ద పెద్ద జబ్బులకు ఔషధంగా పనిచేయడమే కాదు.. శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, తలనొప్పి.. ఆఖరికి పంటినొప్పి చికిత్సకు కూడా యర్సగుంబా పనిచేస్తుంది. నపుంసకత్వానికి దీనిని మించిన ఔషధం మరొకటి లేదని నమ్ముతారు కొందరు వైద్యులు..
మే, జూన్ నెలల్లో ఈ ఔషధాన్ని సేకరించడానికి వేలాదిమంది ప్రజలు పర్వతాలపైకి వెళతారు. ఆ సమయంలో కింద ఉన్న గ్రామాలన్నీ ఖాళీగా కనిపిస్తాయి. భూతాపం, డిమాండ్ పెరగడం.. వంటి కారణాలతో వీటి లభ్యత గణనీయంగా పడిపోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో యర్సగుంబా విరివిగా లభించేదట. కొన్నిసార్లు రోజుకు వంద కూడా దొరికేవట. ఇప్పుడు రోజుకు రెండు నుంచి ఇరవై మాత్రమే దొరుకుతున్నాయట.. కొన్నిసార్లు ఒక్కటీ దొరకదు అని అక్కడి ప్రజలు వాపోతున్నారు. వీటిని సేకరించడానికి వీరు చాలా ఎత్తుకు వెళతారు. అంత ఎత్తులో పనిచేయడం చాలా ప్రమాదకరం. ఒక్కోసారి మంచు చరియలు విరిగి పడుతుంటాయి. ఆ మంచు ప్రవాహం చాలా భయంకరంగా ఉంటుందని అక్కడి వారు చెబుతారు. ఒక్కో యర్సగుంబాను కేవలం రూ. 250 నుంచి 300కు అమ్ముతారు. వీరి వార్షిక ఆదాయంలో దాదాపు 56 శాతం వీటి ద్వారానే వస్తుంది.

ఫిలిం క్విజ్-111

0
0

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...

ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానిది?
2. ఇంద్రజ తెలుగు స్క్రీన్‌మీద కనిపించిన మొదటి చిత్రం?
3. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన ‘ఒక చిన్నమాట’ చిత్రానికి మాతృక?
4. ‘ఐరన్‌లెగ్’గా ప్రాచుర్యం పొందిన కమెడియన్ అసలుపేరు?
5. మోహన్‌బాబు, శిల్పాశెట్టి అద్భుతమైన కెమిస్ట్రీ పండించిన చిత్రం?
6. గోరింట పూచింది కొమ్మా లేకుండ.. అన్న గొప్ప సినీ గీతాన్ని రచించిన రచయిత?
7. ‘కలసి పాడుదాం/ తెలుగు పాట’ అన్న స్ఫూర్తిదాయక గీతానికి బాణీ కట్టిందెవరు?
8. తొలితరం నటుడు, సంగీత విద్వాంసుడు చిత్తూరు నాగయ్య ఇంటిపేరు?
9. నితిన్ చల్‌మోహన్‌రంగ చిత్రంలో హీరోయిన్ తల్లిగా కనిపించిన పాత హీరోయిన్?
10. పక్క చిత్రంలోని నటి ఎవరో చెప్పండి?

సమాధానాలు- 109

1. జవాన్
2. ఎన్‌ఆర్ నంది
3. ఎల్‌ఆర్ ఈశ్వరి
4. పల్లక్ లల్వానీ
5. వెంపటి సదాశివబ్రహ్మం
6. బోళ్ల సుబ్బారావు
7. ఎస్పీ బాలు
8. కృష్ణవేణి పాటి
9. 1970లో
10. నిక్కీ గాల్రాని

సరైన సమాధానాలు రాసిన వారు

ఎంవిబి రెడ్డి, కుతుకులూరు
టీఆర్ దీప్తి, సత్తెనపల్లి
సీహెచ్‌ఆర్ దేవి, హైదరాబాద్
జీవీఎం మోహన్, మచ్చుమిల్లి
డాక్టర్ కె రాధ, అల్లవరం
ఆర్‌ఎస్ కార్తికేయ, తుని
బి గోపాల్, నల్గొండ
సీహెచ్‌ఎన్ రావు, మధిర
ఎస్ సంజీవి, బెంగళూరు
కె ఉమా ఆనంద్, తడ
ఆర్వీసీహెచ్‌ఎన్ రావు, శ్రీకాకుళం
కేసీ రావు, కర్నూలు
జి ప్రభావతి, కడప
ఎన్‌ఎస్ స్వామి, బొబ్బిలి
ఆర్‌వి సుజాత, సికింద్రాబాద్

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

ముద్దుల గోల

0
0

కథ డిమాండ్ చేసింది కనుక లిప్‌లాక్‌కు ఓకే చెప్పానంటుంది ఓ హీరోయిన్. పాత్రోచితంగా లిప్‌లాక్ అవసరం కనుకే -యస్ చెప్పానంటుంది మరో హీరోయిన్. అధర చుంబనాలకు ‘డిమాండ్- సప్లయ్’ సిస్టమేమిటో ఆడియన్స్‌కి మాత్రం అర్థంకాదు. పాత్రో, కథో ముద్దు సన్నివేశాన్ని డిమాండ్ చేయడమేంటి? నాన్‌సెన్స్ కాకపోతే. సినిమా వ్యాపారం సాగాలన్న కమర్షియల్ ఐడియాలజీతో -రచయితో, దర్శకుడో కావాలనే ‘ముద్దు’ను చొప్పిస్తాడు. ముద్దు ముసుగులో మార్కెట్ చేసుకుంటాడు. ఇందులో డౌట్లే అక్కర్లేదు. అందుకే గతంలో హఠాత్తుగా పాటొచ్చినట్టే -ఇప్పుడు ముద్దొచ్చిపడుతుంది. ఇదిలావుంటే లిప్‌లాక్ సీన్లు కోసం తనను ఎవరూ సంప్రదించలేదని తమన్నా ఓ స్టేట్‌మెంట్ పడేసింది. లిప్‌లాక్‌కు ముట్టజెప్పే భారీ పారితోషికాన్ని మిస్సవుతున్న నిట్టూర్పే ఆమె స్టేట్‌మెంట్‌లో కనిపిస్తోంది. లిప్‌లాక్ తనకు ఎంతో థ్రిల్లింగ్‌గా అనిపించిందని భైరవగీత ఫేమ్ ఐరామోర్ అంటుంది. ముద్దుల మీద ఆడియన్స్‌కి రోత పుట్టేవరకూ లిప్‌లాక్ స్టేట్‌మెంట్లు తప్పవేమో.
-శివపార్వతి, తుని
మన దురదృష్టం
సావిత్రిపైన అభిమానంతో నిర్మాతలు బయోపిక్ నిర్మించి విడుదల చేశారు. అలాగే యన్‌టిఆర్ బయోపిక్ బాలయ్య ఆధ్వర్యంలో దాదాపుగా పూరె్తై జనవరిలో విడుదలకానుంది. ఎవరెవరో ఎవేవో బయోపిక్‌లు ప్రకటిస్తున్నా, అవి వెలుగులోకి వస్తాయో? రావో? తెలీని పరిస్థితి. యన్టీఆర్ సమకాలీకుడు నాగేశ్వర రావు బయోపిక్‌ను ఆయన కుటుంబీకులు సహా ఎవ్వరూ ఆలోచిస్తున్నట్టు లేదు. అమర గాయకుడు ఘంటసాల బయోపిక్ తయారై టీజరు విడుదలైనా సినిమా ఎప్పుడో సమాచారం లేదు. ఘంటసాల దగ్గరివాళ్లే అనేక కారణాలు చూపిస్తూ సినిమా విడుదలను అడ్డుకుంటున్నారన్న కథనాలు మాత్రం అప్పుడప్పుడూ వినిపిస్తున్నాయి. ఇందులో నిజానిజాల మాటలావున్నా, విడుదలకు అడ్డుపడుతున్న వారెవరైనాగాని క్షమార్హులు కారు. ఆయన ఉండీ మూడు దశాబ్దాలు, లేకున్నా తను పాడిన పాటలతో నాలుగు దశాబ్దాలుగా శ్రోతలను మైమరిపింప చేస్తున్న అమర గాయకుడి బయోపిక్ విడుదల కాకపోవడం తెలుగువారు చేసుకున్న దురదృష్టమేమో.
-చంద్రశేఖరం, వక్కలంక
వ్యాసం బావుంది
మహిళాభిమానులు మాయమయ్యారంటూ వెనె్నల సంచికలో ప్రచురించిన వ్యాసం బావుంది. ఒకప్పటి మహిళ టెన్త్ తరువాత ఇంటికే పరిమితమయ్యేది. అప్పట్లో సినిమాలే పెద్ద వినోదం. అందువల్ల సినిమాభిమానులు ఎక్కువ ఉండేవారు. విద్యావకాశాలు విస్తృతమైన తరువాత ఆధునిక మహిళ అన్ని రంగాల్లోనూ పోటీ పడుతుంది. సో, వాళ్లకు సినిమాలు ఒక్కటే వినోదం కాదు. ఫేస్‌బుక్‌లు, వాట్సాప్‌లు అందుబాటులోకి వచ్చిన తరువాత అభిమానమన్నదే మాయమైంది. ఎంటర్‌టైన్‌మెంట్ రూపంలో ఎన్నో కొత్త అంశాలు అందుబాటులోకి వస్తుండటంతో -సినిమాకంటూ అభిమానులు ఉండటం సహజంగానే కష్టం. బాగుంటే ఓకే, లేదంటే నాటోకే. అంతే, అభిమానం అన్న పదాలు ఇప్పటివాళ్ల డిక్షనరీల్లో ఉండవు. ఇంతవరకూ మంచిదే అయినా, అభిమానం అన్న పదం కుటుంబ వ్యవస్థలోనూ చెరిగిపోతుందే. ఆధునికత ఇక్కడే ప్రమాదమవుతుంది. ఇదే బాధ.
-పూర్ణారావు, కాకినాడ
శుభపరిణామం
సునామీలా ఉప్పొంగిన మీటూ ఇప్పుడు చల్లారినట్టే కనిపిస్తోంది. కొన్ని సంఘటనలు జరిగి ఉండొచ్చుకానీ, అన్నీ అవేనని చెప్పలేమన్న విజ్ఞతను ప్రదర్శిస్తున్నారు ఆలస్యంగా గొంతువిప్పుతున్న సెలబ్రిటీలు. ‘సినిమా రంగంలో కొన్ని వత్తిళ్లు లేవనను. కాకపోతే బలవంతంగా సాధ్యం కాదు. ఇష్టం లేనపుడు ఆ సంగతి ముఖంమీదే చెప్పేసి తప్పుకుంటే ఏ గొడవా ఉండదు. అవసరం కొద్దీ సర్దుకుపోయి, ఆనక అన్యాయం జరిగిందనడాన్ని సమర్థించలేం’ అంటోంది అంజుకురియన్. ‘ఒకరిని నిందించే ముందు మనమెలా ఉంటున్నాం, ఏం చేస్తున్నాం అన్న విషయాన్ని సమీక్షించుకోవాలి’ అన్నది అనుపమా పరమేశ్వరన్ మాట. ఇంచుమించు ఇదేవిధంగా నిత్యమీనన్ ప్రకటించింది. ‘మన ప్రవర్తన తీరును ఎదుటివాళ్లకు ముందే తెలియచేస్తే -కొన్ని సమస్యలకు దూరంగా ఉన్నవాళ్లం అవుతాం’ అంటోందామె. మీటూ అనగానే వీరావేశం ప్రదర్శించకుండా -విజ్ఞతతో కాస్త లోతుగా ఆలోచిస్తున్న వాళ్ల సంఖ్య పెరుగుతుంది. మంచిదే.
-వి రామకృష్ణ, హైదరాబాద్
అదీ సంగతి
డిసెంబర్ 9న వచ్చిన వెనె్నల అనుబంధం మీవ్యూస్ శీర్షికన కందుకూరు నుంచి కెవి ప్రసాదరావు రాసిన ‘విధిపరిణామం’ ఉత్తరం నన్ను ఆశ్చర్యపర్చింది. 1958లోని ‘చెంచులక్ష్మి’ పౌరాణిక చిత్రంలో ‘చెట్టులెక్కగలవా ఓ నరహరి’; ‘చిలకా గోరింక’లోని ‘కులికే పకపక’ పాటలను ఎస్ రాజేశ్వర రావు మొదట పీబీ శ్రీనివాస్, సుశీలమ్మతో పాడించారు. కాని నాగేశ్వర రావు తనకు ఘంటసాల గాత్రమే సూటవుతుందని, ఆయనతోనే పాడించాలని పట్టుపట్టారు. అప్పటికే కొలంబియా రికార్డులు విడుదలైపోయాయి. అందుకే హీరో కోరికపై మళ్లీ ఘంటసాల, జిక్కిలతో రెండు పాటలు పాడించి సినిమాలో వేశారు. అదీ కథ. తర్వాత వాకలపూడి నుంచి శాంతిసమీర రాసిన లేఖలో ‘చంద్రహారం’ చిత్రంలో అంజలీ దేవి నెగెటివ్ పాత్ర పోషించినందువల్లే ఆ చిత్రం సరిగా ఆడలేదన్నారు. అసలు విజయావారి చిత్రాల్లో అంజలీదేవి నటించలేదు. ‘చంద్రహారం’లో నెగెటివ్ రోల్‌లో సావిత్రి నటించింది. కొనే్నళ్ల తరువాత చందమామ-విజయా ప్రొడక్షన్‌లో మొట్టమొదటిసారిగా అంజలీదేవి ‘బృందావనం’ చిత్రంలో నటించారు.
ఎస్ శ్రీనివాసరావు, ఎమ్మిగనూరు
సమీక్షలు బావున్నాయి
డిసెంబర్ 9న వచ్చిన వెనె్నల అనుబంధంలో తెలుగు సినిమా సమీక్షలు నిప్షాక్షికంగా ఉన్నాయ. కవచం, సుబ్రహ్మణ్యపురం, నెక్స్ట్ ఏంటి? చిత్రాలకు సంబంధించి వెనె్నల బృందం ఇచ్చిన సార్ రేటింగే ఆడియన్స్ మైండ్‌లోవున్నదన్నది నిజం. సమీక్షకులు త్రివేది, అనే్వషి వివరాణాత్మకంగా ఇస్తున్న రివ్యూలు చిత్రంయొక్క వాస్తవ స్థితిని తేటతెల్లం చేస్తున్నాయి. ఫ్లాష్‌బ్యాక్ అట్ 50 పేరిట మాణిక్యేశ్వరి అందిస్తున్న వ్యాసాలు చాలా చాలా బావుంటున్నాయి.
-పీఎస్ నారాయణ, రాజమండ్రి

శ్రీరామకథ

0
0

శ్రీ రేఖా అండ్ మురళీ ఆర్ట్స్ పతాకంపై ప్రముఖ హాస్య నటుడు, నిర్మాత బి పద్మనాభం తొలిసారిగా దర్శకత్వం వహించి, తన తమ్ముడు బి పురుషోత్తం నిర్మాతగా రూపొందించిన చిత్రం -శ్రీరామకథ. తెలుగు చిత్ర పరిశ్రమలో శ్రీరామునిగాథ పలు అంశాలతో వైవిధ్యభరితంగా పలు చిత్రాలు రూపొంది ప్రజాదరణ పొందాయి. ఒకే అంశంతో కూడిన ఈ చిత్రాలన్నీ దాదాపుగా విజయం సాధించాయి. ఈ శ్రీ రామకథ చిత్రంలో సీతారాములకు ఎందుకు వియోగం సంభవించిందన్న అంశం ప్రాథమికంగా పరిగణించి, దానికి కల్యాణం అంశం జోడింపుతో ప్రముఖ రచయిత వీటూరి కథ, మాటలు, పద్యాలు సమకూర్చారు. 1969 జనవరి 1న ఈ చిత్రం విడుదలైంది.

సంగీతం: ఎస్‌పి కోదండపాణి
కళ: మాధవపెద్ది గోఖలే
ఛాయాగ్రహణం: సత్యనారాయణ
నృత్యం: వెంపటి సత్యం, పసుమర్తి, కెఎస్ రెడ్డి
ఎడిటింగ్: హరినారాయణ
నిర్మాత: బి పురుషోత్తం
దర్శకత్వం: బి పద్మనాభం

నారదుడు (పద్మనాభం) శ్రీరామ కథా గానంలో శ్రీరామ జననం మొదలు సీతావియోగంతో తల్లడిల్లుతున్న రామునికి గతం గుర్తు చేయటంతో సినిమా మొదలవుతుంది. ఒకనాడు వైకుంఠం చేరిన నారదుడు, అక్కడ శ్రీహరిసహా బ్రహ్మాది దేవతలు రతీ మన్మథులను ఆరాధించటం గమనిస్తాడు. రక్తి గొప్పదా? భక్తి గొప్పదా? అని శ్రీహరిని ప్రశ్నించి వారిని, వారి ఆరాధనను విమర్శిస్తాడు. దీంతో మన్మథుడు నారదునిపై ఆగ్రహిస్తాడు. శ్రీహరి అనునయిస్తాడు. నారదుని ప్రోత్సాహంతో వైకుంఠం వచ్చిన భూదేవి, శ్రీహరి అనురాగం పొందిన శ్రీలక్ష్మిని (శారద) నిందిస్తుంది. దీంతో భూదేవి, శ్రీలక్ష్మిలు పరస్పరం ఆగ్రహానికి గురై ఒకరినొకరు శపించుకుంటారు. భూదేవిని రాక్షస కులంలో జన్మించమని శ్రీలక్ష్మి శపిస్తే, శ్రీలక్ష్మిని మానవకాంతగా జన్మించి రాక్షసులచే బాధలు పడమని భూదేవి (జయలలిత) శపిస్తుంది. వారిద్దరినీ శ్రీహరి అనునయించి భూదేవి భూలోకంలో తనకు శ్రీమతిగా జన్మించి తన అనురాగం పొందగలదని, శ్రీలక్ష్మి రామావతారంలో సీతగా తన అర్ధాంగి కాగలదని వరమిస్తాడు. ఆ ప్రకారం భూలోకంలో రాక్షసరాజు, విష్ణ్భుక్తుడైన మకరధ్వజుడు (గుమ్మడి) భవాని (అంజలి దేవి) దంపతులకు భూదేవి కుమార్తెగా జన్మిస్తుంది. భార్య గర్భవతిగా ఉన్నపుడు విష్ణు సాక్షాత్కారం కోసం తపస్సుకు వెళ్లిన మకరధ్వజుడు, కుమార్తె శ్రీమతికి (జయలలిత) 18 ఏళ్లు వచ్చిన తరువాత నిరాశతో తిరిగొస్తాడు. విష్ణుదర్శనం కాకపోవడంతో విష్ణుద్వేషిగా మారతాడు. తన భార్య, కుమార్తెల విష్ణు పూజను, రాజ్యంలోని దేవాలయాలు, ఋషుల పూజలను నిషేధిస్తాడు. శ్రీహరి ఆరాధకురాలైన తన కుమార్తెను ఆ ధ్యాసనుంచి మరల్చాలని గురువు ప్రగల్భాచార్యులు (రేలంగి), నాట్య గురువుగా వచ్చిన వల్లభాచార్యుల (హరనాథ్)ను నియమిస్తాడు. వల్లభాచార్యులుగా వచ్చిన శ్రీహరినే శ్రీమతి ఆరాధించటం, మకరధ్వజుని మేనల్లుడు ధూమ్రాక్షుని (ప్రభాకర్‌రెడ్డి) తిరస్కరించటం జరుగుతుంది. నారదుని మేనల్లుడు పర్వతుడు రాజేంద్రుడు (రామకృష్ణ), నారదుడు కూడా శ్రీమతిచే వరించాలనుకుంటారు. అందుకోసం -నారదుడు కోతిలా కనిపించాలని పర్వతుడు, పర్వతుడు గాడిదలా కనిపించాలని నారదుడు ఒకరికి తెలియకుండా మరొకరు శ్రీహరిని వేడుకుంటారు. అయితే స్వయంవరంలో శ్రీమతి శ్రీహరిని మాలవేసి వరిస్తుంది. అలా ఆకసానికెగిసిన శ్రీమతీ శ్రీహరిలను వెంబడించిన మకరధ్వజుడు విష్ణుస్తుతి చేస్తాడు. నారదుడు మాత్రం ఆగ్రహంతో శ్రీహరిని శపిస్తాడు. ఆ శాప ఫలం రామావతారంలో దక్కుతుందని శ్రీహరి శెలవివ్వడంతో చిత్రం ముగుస్తుంది. చిత్రంలో రతీదేవి, లహరిగా గీతాంజలి, ఇంద్రునిగా చలపతిరావు, ప్రగల్భాచార్యుని భార్య చారుశీలగా సూర్యకాంతం, రాజగురువు శలభాచార్యునిగా పెరుమాళ్లు, రావణాసురునిగా సత్యనారాయణ నటించారు.
నాటకరంగంలో విశేషానుభవం, సినీరంగంలో హాస్యనటుడు, అభిరుచి కలిగిన నిర్మాతగా రాణించిన పద్మనాభం తొలిసారి దర్శకుడిగా మారిన చిత్రమిది. సీతావియోగానికి ముందు శ్రీమతి కల్యాణం అనే ఇతివృత్తంతో ‘శ్రీరామకథ’ను చిత్రీకరించారు. చక్కని సన్నివేశాలు, రూపకల్పనతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు.
తొలుత శ్రీ రామకథను రాముడి జననం నుంచి అడవిలో పర్ణశాల వరకూ కొంత భాగం, మరలా కొన్ని సన్నివేశాలతో సీతాపహరణం, కొంత చిత్రం జరిగాక హనుమంతుడి కథను పాటగా చూపిస్తూ చిత్రం పూర్తి చేయటం జరిగింది. ప్రతి చరణాన్నీ దృశ్యంగా చిత్రీకరించటం; దశరధుడు, కౌశల్య, సుమిత్ర, కైకేయిగా నాగయ్య, హేమలత, నిర్మల, మాలతి, మందరగా లక్ష్మీకాంతమ్మ, మరికొన్ని పాత్రల్లో మిక్కిలినేని, ముక్కామల కనిపిస్తారు. దేవతల మన్మధ పూజను నారదుడు విమర్శించటం, భూదేవిని శ్రీలక్ష్మితో పోల్చి రెచ్చగొట్టడం, శ్రీహరి అనురాగానికై ఆమె వేదన, విష్ణ్భుక్తుడైన మకరధ్వజుడు అహంకారంతో తపమొనర్చి విష్ణు సాక్షాత్కారం లభించక విష్ణుద్వేషిగా మారటంలాంటి సన్నివేశాలు దర్శకుడి ప్రతిభకు అద్దంపడతాయి. పర్వతరాజు రామకృష్ణ కన్యానే్వషణకు శ్రీహరి ‘మానిని మనోదర్శిని’ అద్దం (దర్పణం) ద్వారా యోగ్యురాలైన కన్యకై అనే్వషణ; మన్మధబాణ ప్రయోగంలో నారదుడు శ్రీమతిపై మోహం పెంచుకోవటం; మామా అల్లుళ్ళిద్దరూ శ్రీమతికై వెంపర్లాట; ప్రగల్భాచార్యుడు పేరుకు తగ్గ ప్రగల్భాలు వల్లించటం, అవి విఫలమవటాన్ని హాస్యంగానూ; శ్రీమతిని వశం చేసుకోబోయిన ధూమ్రాక్షుని పరాభవంవంటి చిన్న అంశాలను ఎంతో వివరంగా చిత్రీకరించి మెప్పించాడు దర్శకుడు పద్మనాభం. మకరధ్వజునిగా గుమ్మడి, నారదునిగా పద్మనాభం పాత్రోచితమైన, నిండుదనంతో కూడిన నటనతో మెప్పించారు.
చిత్రంలోని గీతాలు, పద్యాలు:
-ఒద్దికతో ఉన్నది చాలక (రచన వీటూరి, గానం: ఘంటసాల), -ఓం మదనాయ శృంగార (శ్లోకం గానం: ఎస్‌పి బాలు, ఎల్‌ఆర్ ఈశ్వరి బృందం), -చక్కనివాడు మాధవుడు (పద్యం గానం: పి సుశీల, జయలలిత, పద్మనాభం, రామకృష్ణలపై చిత్రీకరించిన గీతం -టింగురంగా, నామోహనరంగా (గానం: పి సుశీల, పిఠాపురం, మాధవపెద్ది), అంజలిదేవీపై గీతం -రావేల కరుణాలవాలా (గానం: పి సుశీల, జయలలితపై చిత్రీకరించిన పద్యం -శౌరిపైగల నా ప్రేమ సత్యమేని (గానం: పి సుశీల), -యతోహస్తస్తతో దృష్టి, యతో దృష్టిస్తతో (శ్లోకం గానం: ఎస్‌పి బాలు, పి సుశీల), -శృంగార రస సందోహం (శ్లోకం గానం: ఎస్‌పి బాలు, పి సుశీల), గీతాంజలి, జయలలితపై చిత్రీకరించిన నృత్య గీతం -సర్వకళాసారము నాట్యము (గానం: పి సుశీల, ఎస్ జానకి), లహరి, రేలంగి, సూర్యాకాంతంపై గీతం -చారూ చారు నా బంగారు చారు (రచన: అప్పలాచార్య, గానం: రేలంగి, తిలకం), హరనాథ్, జయలలితపై చిత్రీకరించిన హిట్టు సాంగ్ -మాధవా, మాధవా నను లాలించరా, నీ లీలాకేళి (రచన: వీటూరి, గానం: పి సుశీల, ఘంటసాల). ఈ చిత్రంలో శ్రీ రామకథ భక్తిగీతాన్ని సీనియర్ సముద్రాల రచిస్తే, ఎస్‌పి బాలు బృందం ఆలపించింది. -రామకథ శ్రీరామకథ ఎన్నిసార్లు (చిత్రంలో రెండుసార్లు వస్తుంది).
కాగా తొలుత ‘కనకతార’ చిత్రంలో భక్తిగీతం (దేవుని మహిమ తెలియవశమా)తో మొదలుపెట్టి చివరి పాటను రాముని కథను వివరిస్తూ
సీనియర్ సముద్రాల ముగించారు. చివరిగా రాముని కథను వివరిస్తూ రాసిన పాటను నిర్మాత పద్మనాభానికి వినిపించమని చెప్పి, నిద్రకోసం గదిలోకి వెళ్లిన సముద్రాలవారు శాశ్వత నిద్రలోకి వెళ్లిపోవటం విశేషమైన విషాదాంతం.
జయాపజయాలను లెక్కించక, శ్రీరామకథ చిత్రాన్ని ఓ చక్కని ప్రయత్నం, సంగీత, సాహిత్య విలువలకు పట్టంగట్టిన భక్తిరస చిత్రంగా పరిగణించాలి.

బేర్‌మన్న బాలీవుడ్-2018

0
0

ప్రపంచంలోనే ఎక్కువ సినిమాలు రూపొందించేది మనమే. అందులో ఎలాంటి సందేహం లేదు. తెలుగు, తమిళ, హిందీ.. ఇలా దేశంలోని భాషల్లో కలుపుకుని భారీ సినిమాలు తెరకెక్కిస్తూ అటు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతూ రికార్డులు క్రియేట్ చేస్తుండటం ఏటా సహజంగా జరిగేదే. అయితే ఈమధ్య బాలీవుడ్‌లో సినిమా మేకింగ్ విషయంలో మాత్రం ఎక్కడా వెనుకడుగు వేయడంలేదు. కథను నమ్మారంటే చాలు.. కోట్లకు కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసేస్తున్నారు. ఈ విషయంలో నిర్మాణ సంస్థలు, నిర్మాతలు ఏమాత్రం ఆలోచించడం లేదు. కారణం హిందీ సినిమాకు ప్రపంచస్థాయి మార్కెట్ వుంది కాబట్టి దర్శక నిర్మాతలు ఆ మాత్రం ధైర్యం చేస్తున్నారు. అయితే భారీ బడ్జెట్‌తో తీసే సినిమాలన్నీ సూపర్‌హిట్సేనని చెప్పడానికి ఆస్కారం ఉండదు. యావరేజ్‌గా నిలబడితే ఫరవాలేదని అనుకోవచ్చు. కానీ, ఈ ఏడాది కొన్ని సినిమాలు భారీ బడ్జెట్, అంతకంటే భారీ అంచనాలతో విడుదలై అట్టర్ ఫ్లాప్ మార్క్‌తో వెనక్కి వెళ్లిపోయాయి. భారీ అంచనాలతో వచ్చిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లాపడ్డాయి. భారీ బడ్జెట్ సినిమాలు ఫ్లాపైతే, నష్టాలు ఎంత దారుణంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు మళ్లీ కోలుకోడానికి ఎంత సమయం పడుతుందో అంచనా వేయడం కష్టం. ఈ ఏడాది బాలీవుడ్‌లో ఈ పరిణామాలే ఎక్కువ చోటుచేసుకున్నాయి. బాలీవుడ్ సినిమాలు ఎక్కువ శాతం -నిర్మాతలకు కోట్లలోనే నష్టాలు మిగిల్చాయి.
ఇక్కడో విషయం ప్రస్తావించుకోవాలి. వర్సటైల్ యాక్టర్ అమీర్‌ఖాన్ గురించి. అమీర్‌కు చిత్రమైన క్యారెక్టర్ చేయాలన్న ఆలోచన వచ్చింది. ఆ క్యారెక్టర్‌పై ఆసక్తితో హాలీవుడ్ స్థాయి సినిమా తీయాలనుకున్నాడు. అమీర్ తలచుకుంటే -నిర్మాతలకు కొదువా. సో, భారీ బడ్జెట్ సిద్ధమైపోయింది. బాహుబలి రికార్డులను క్రాస్ చేయాలన్న ఆలోచన వరకూ సినిమా సాగింది. విడుదలైన తరువాత తేలిన విషయమేంటంటే -ఆ సినిమా డిజాస్టర్. అదే -్థగ్స్ ఆఫ్ హిందూస్తాన్. 300 కోట్లకుపైగా బడ్జెట్‌తో రూపొందిన చిత్రం కనీసం ప్రమోషన్ కోసం పెట్టిన ఖర్చులనూ రాబట్టలేకపోయిందని సోషల్ మీడియాలో సాగిన ప్రచారంలో కొంతైనా వాస్తవం లేకపోలేదు. గత కొనే్నళ్లలో అమీర్‌ఖాన్ నటించిన సినిమాల్లో ఇదే అతి పెద్ద డిజాస్టర్. ఇండియన్ సినీ చరిత్రలోనూ ఇదే పెద్ద ఫ్లాప్ అనుకోవాలి. హాలీవుడ్‌లో రూపొందిన కరేబియన్ నైట్స్ తరహా సినిమాలో నటించాలన్న అమీర్‌ఖాన్ ఆశ ఖరీదు 300 కోట్లు!?
దీని తరువాత బాలీవుడ్‌లో భారీ నష్టాన్ని మిగిల్చిన చిత్రం -రేస్ 3. గతంలో వచ్చిన రేస్ సిరీస్ సినిమాలు సంచలన విజయాలు అందుకోవడంతో భారీ అంచనాలతో రేస్-3ని తెరకెక్కించారు. దాదాపు 185 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. కాని ఈ సినిమా కనీసం 100 కోట్ల షేర్‌ను కూడా రాబట్టలేకపోయింది. ఈ సినిమాతో రేస్ సీక్వెల్‌ను తెరపడినట్టే అనుకోవాలి. తరువాత అర్జున్‌కపూర్, పరిణితి చోప్రా జంటగా తెరకెక్కిన ‘నమస్తే ఇంగ్లాండ్’ సైతం భారీ అంచనాలతోనే రూపొందింది. ఏకంగా 54 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన చిత్రం, విడుదలైన తరువాత 10 కోట్ల షేర్ కూడా తేలేకపోయింది. భారీ డిజాస్టర్స్‌లో ఇదొకటి అని చెప్పాలి. తరువాత షాహిద్‌కపూర్- శ్రద్ధాకపూర్ జంటగా నటించిన ‘బట్టి గుల్ మీటర్ చాలు’ చిత్రం దాదాపు 50 కోట్లతో నిర్మించారు. ఇదీ అట్టర్‌ఫ్లాప్‌గా నిలిచి కనీసం 20 కోట్లను కూడా రాబట్టలేదు. సిద్ధార్థ్ మల్హోత్రా కీలక పాత్రలో నటించిన అయ్యారీ చిత్రం 65 కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కేవలం 15 కోట్లను మాత్రమే రాబట్టింది. ఈ లిస్ట్‌లో చేరిన మరో సినిమా ఫనే్నఖాన్. సీనియర్ నటుడు అనిల్‌కఫూర్ -ఐశ్వర్యరాయ్ కలిసి నటించిన చిత్రం 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. ఐశ్వర్యారాయ్ లాంటి అందాలరాశి వున్నా సినిమా మాత్రం కనీసం 10 కోట్లను కూడా రాబట్టలేదు. జాకీష్రాఫ్- అర్జున్ రాంఫాల్ నటించిన పల్టాన్ చిత్రం కేవలం 15 కోట్లతోనే రూపొందింది. టైటిల్‌కి తగ్గట్టే సినిమా పల్టీ కొట్టేసింది. కనీసం సినిమాలో ఐదు శాతం వసూళ్లు కూడా రాబట్టలేకపోయింది. సోనాక్షిసిన్హా నటించిన చిత్రం హ్యాపీ ఫిర్ బాగ్ జాయేది. ఫిమేల్ లీడ్ రోల్‌లో సోనాక్షి మెరిపించిన మెరుపులు జనాలకు నచ్చలేదు. దాదాపు 30 కోట్లతో తెరకెక్కిన సినిమా కేవలం 10 కోట్లను మాత్రమే వసూలు చేసి అట్టర్‌ఫ్లాప్‌గా నిలిచింది.
ఇక బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ హీరోగా నటించిన జీరో సినిమా బాక్సాఫీస్ వద్ద నిజంగానే జీరో అయిపోయింది. దాదాపు 50 కోట్లకుపైగా బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక అట్టర్‌ఫ్లాప్ లిస్ట్‌లో నిలిచింది కాలాకండి. సైఫ్ అలీఖాన్ వంటి స్టార్ నటించిన చిత్రం 20కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. భారీ అంచనాలమధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ సినిమాగా నిలిచింది. లిస్ట్‌లో చేరిన మరో సినిమా ఒమెర్టా- టెర్రరిజం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం 12 కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. కానీ కేవలం 3 కోట్లు మాత్రమే రాబట్టింది. మొత్తానికి ఈ ఏడాది బాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమాలు ఇలా అట్టర్‌ఫ్లాప్‌లుగా నిలిచి దర్శక నిర్మాతల ఆశలను అడియాశలు చేశాయి.

Viewing all 69482 articles
Browse latest View live