Are you the publisher? Claim or contact us about this channel


Embed this content in your HTML

Search

Report adult content:

click to rate:

Account: (login)

More Channels


Showcase


Channel Catalog


older | 1 | .... | 1998 | 1999 | (Page 2000) | 2001 | 2002 | .... | 2067 | newer

  0 0

  భాగమతి తర్వాత అనుష్క ఏ సినిమాలో నటిస్తోందనే విషయం ఇప్పటికే రకరకాల వార్తలు ప్రచారంలో వున్నాయి గానీ ఒక ప్రాజెక్టు మాత్రం కన్‌ఫర్మ్. అదే రచయిత కోన వెంకట్ -దర్శకుడు హేమంత్ మధుకర్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ జోరుగా సాగుతోందట. ఈమధ్యే సినిమా గురించి కోన వెంకట్ వెల్లడించాడు. సినిమా అమెరికా నేథ్యంలో తెరకెక్కే ఒక హారర్ ఫిలిం అని టాక్. అలాగే హాలీవుడ్ నటులు కూడా నటిస్తారని తెలిసింది. భారీ స్థాయిలో నిర్మిస్తామని, బాహుబలి సినిమానే తమకు ఇన్‌స్పిరేషన్ అని కోన తెలిపాడు. ఈ సినిమాలో హీరో మాధవన్.. సుబ్బరాజు కీలక పాత్రల్లో నటిస్తారు. ఇదిలా వుంటే సైజ్ జీరో సినిమా కోసం వెయిట్ పెరిగిన అనుష్క అప్పటినుండి బరువు తగ్గించుకునేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. రెండు రోజుల క్రితం కోన వెంకట్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అనుష్క కొత్త ఫొటోను పోస్ట్ చేసి -మా సినిమాలో అనుష్క లుక్‌ను చూసి ఎగ్జైట్ అవుతున్నాను. ఇది అనుష్కకు ఇప్పటివరకు బెస్ట్‌లుక్‌అని అనుకుంటున్నాను అని ట్వీట్‌చేశాడు. అనుష్క నటించిన హారర్ ఫిలింస్ అరుంధతి, భాగమతి సినిమాలు ప్రేక్షకులను ఎంతో మెప్పించాయి.


  0 0

  సందేశాత్మక చిత్రాలు తెలుగుకు కొత్తకాదు. ఆ బాటలో 2004లో జూ.ఎన్టీఆర్, భూమిక, జెనీలియా హీరో హీరోయిన్లుగా దర్శకుడు వివి వినాయక్ తెరకెక్కించిన చిత్రం -సాంబ. విద్య గొప్పతనం, విలువను వినాయక్ బాగా చూపించాడు. కథగా.. రాయలసీమలో అభ్యుదయ భావాలు కలిగిన మోతుబరి ధర్మయ్యనాయుడు. కానీ నిరక్షరాస్యుడు. పురుటినొప్పులతో బాధ పడుతున్న భార్యను రక్షించుకునే ప్రయత్నంలో, అంబులెన్స్ కోసం ఏ నెంబర్‌కు ఫోన్ చేయాలో తెలీక ఆమెను కోల్పోతాడు. దాంతో సీమలోని తన క్వారీనుంచి వచ్చే గ్రానైట్ సంపాదనతో నిరక్ష్యరాస్యులకు చదువు చెప్పించాలనుకుంటాడు. ధర్మయ్యనాయుడు కూతురి భర్తకు అన్న ప్రకాష్‌రాజ్. సీమలో రౌడీ. తమ్ముడికి కట్నంకింద క్వారీ రాసివ్వమని ధర్మయ్యనాయుడిని డిమాండ్ చేస్తాడు. కూతురు బాధ చూడలేక క్వారీ రాసిచ్చేస్తాడు ధర్మయ్యనాయుడు. అయినా ఆ కుటుంబంపై పగ పెంచుకున్న ప్రకాష్‌రాజ్, ధర్మయ్యనాయుడు కుటుంబాన్ని చంపుతాడు. శత్రువునుంచి తప్పించుకుని పెరిగి పెద్దవాడైన సాంబశివనాయుడు, శత్రుశేషం, ప్యాక్షనిజాన్ని ఎలా రూపుమాపాడన్నది మిగతా కథ. తాత ఆస్తి అయిన క్వారీని తిరిగి సంపాదించి, తల్లిదండ్రుల ఆకాంక్ష నెరవేర్చడానికి (పిల్లలకు విద్యను అందించాలన్న సదుద్దేశంతో) సీమకు యువ నాయకుడవుతాడు సాంబ.
  చిత్రంలో సాంబశివనాయుడిగా జూ.ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్, డైలాగుల డిక్షన్ మాటల్లో చెప్పలేం. తారక్ మరదలుగా భూమిక, తల్లిదండ్రులుగా ప్రగతి, విజయ్‌కుమార్‌లు మంచి పాత్రలతో మెప్పించారు. దర్శకుడిగా వినాయక్‌కు, హీరోగా ఎన్టీఆర్‌కు మాస్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టిన చిత్రమిది. ‘డబ్బున్నవాడు మరో డబ్బున్నవాడ్ని తయారు చేయలేడు. కానీ, చదువుకున్నోడు వందమంది విద్యావంతులను తయారు చేయగలడు’. ‘పంచేకొద్దీ తరుగుతుంది డుబ్బు.. పంచే కొద్దీ పెరుగుతుంది చదువు’, ‘పూట ఆకలితీర్చే అన్నదానం కన్నా, అన్ని పూటలా కడుపునింపే విద్యాదానం గొప్పది’ వంటి అద్భుతమైన సంభాషణలు సినిమాకు మరో హైలెట్. మణిశర్మ సంగీతం సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లింది. విలన్‌గా ప్రకాష్‌రాజ్ సహా అన్ని పాత్రధారులూ పరిధిమేరకు చక్కగా నటించిన చిత్రమిది. దర్శకుడు వినాయక్ నవరసాలు కలిసి ప్రేక్షకులకు రుచికరమైన, సందేశాత్మక మాస్ చిత్రాన్ని అందించాడు. అదే -సాంబ.


  0 0

  సిరిమల్లె పూవే/ విరిజల్లు కావే/ వరదల్లె రావే/ వలపంటే నీవే/ ఎనె్నల్లు తేవే/ ఎదమీటి పోవే -అంటూ సాగే ‘పంతులమ్మ’ చిత్రంలో పాటంటే నాకెంతో ఇష్టం. ఈ చిత్రంలో నటీనటుల పాత్రపోషణ పరిధులు దాటకుండా సహజ భావన కలుగుతుంది. అలతిలలతి పదాలు, హృద్యమైన భావనతో వేటూరి కలంనుంచి జాలువారిన గీతానికి రాజన్- నాగేంద్ర అంతే లలితంగా, సుమధురంగా బాణీ కట్టారు. ప్రతిభద్వయానికి తావి అద్దినట్టు -రంగనాథ్, లక్ష్మిల అభినయం గీతాన్ని చిరస్మరణీయం చేయడమే కాదు, చిత్రానికి వనె్న తెచ్చింది. విశేషమేమంటే -ఈ ముగ్గురినీ నంది అవార్డులు వరించటం. బెస్ట్ మ్యూజిక్‌గా రాజన్ -నాగేంద్ర, బెస్ట్ లిరిసిస్ట్‌గా వేటూరి, బెస్ట్ యాక్ట్రెస్‌గా లక్ష్మిని నంది అవార్డులు వరించాయి.
  సింపుల్‌గా కథను గుర్తు చేసుకుంటే -్భర్య సీత (దీప) మరణించటంతో కొడుకును సాకుతుంటాడు యాక్టర్ రాజేష్ (రంగనాథ్). ఫ్యామిలీ డాక్టర్ (శరత్‌బాబు) సాయంతో రంగనాథ్ చెల్లెలు (గిరిజ) ఇంటి పెత్తనం సాగిస్తుంటుంది. అలాంటి టైంలో రంగనాథ్ స్నేహితుడి చెల్లెలు శారద (లక్ష్మి) కొడుకుకు ట్యూషన్ చెప్పడానికి కుదురుతుంది. ఆమె మంచితనంతో రంగనాథ్, కొడుకుకు దగ్గరవ్వడాన్ని గిరిజ జీర్ణించుకోలేక పోతుంది. ఇంటినుంచి వెళ్లగొట్టే ప్రయత్నాలు ఫలించకపోవడంతో, డాక్టర్ సాయం కోరుతుంది గిరిజ. అలా బలవంతంగా శారదను వెళ్లగొట్టే ప్రయత్నం రంగనాథ్‌కు తెలియడంతో, డాక్టర్‌ను అడ్డుకుని వెళ్లగొడతాడు. అయితే, సీతతో డాక్టర్‌కు అక్రమ సంబంధం ఉందన్న కథనం పత్రికల్లో చూసి -నిజమని నమ్ముతాడు రాజేష్. అయితే, చెల్లెలు గిరిజ ప్రోద్బలంతో ఆస్పత్రిలో ఆమెకు మత్తుఇచ్చి అసభ్య ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడం వల్లే సీత ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని శారద బయటపెడుతుంది. నిజాన్ని గ్రహించిన రాజేష్, డాక్టర్‌ను జైలుకు పంపించి శారదకు ప్రపోజ్ చేస్తాడు. సినిమా శుభమవుతుంది. దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు, సినిమాటోగ్రాఫర్ బాలు మహేంద్ర ఓ దృశ్యకావ్యాన్ని మనకు ఇలా అందించారు. అదే పంతులమ్మ.


  0 0

  ఇదం జగత్ * బాగోలేదు

  నటీనటులు:సుమంత్, అంజు కురియన్, సత్యం, ఆదిత్యమీనన్, శివాజీరాజా, రామ్ తదితరులు
  సంగీతం:శ్రీచరణ్ పాకాల
  ఛాయాగ్రహణం:బాల్‌రెడ్డి
  నిర్మాత:గంగపట్నం శ్రీ్ధర్
  స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:అనిల్ శ్రీకాంతం
  ==================================================================
  ఈమధ్యే కాస్త భిన్నమైన సినిమాలతో మళ్లీ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తరువాత థ్రిల్లింగ్ కథలతో వస్తున్న ఆయన తాజాగా సుబ్రమణ్యపురం అంటూ కొత్త ప్రయోగం చేశాడు. ఇప్పుడు ‘ఇదం జగత్’ అనే మరో థ్రిల్లింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కొత్త దర్శకుడు అనిల్ శ్రీకాంతం రూపొందించిన ఈ చిత్రం కథేమిటో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
  కథ:
  నిషిత్ (సుమంత్) చదువు పూర్తిచేసి సరైన ఉద్యోగం కోసం ట్రై చేసి విసిగిపోయిన కుర్రాడు. ఎలాగైనాసరే డబ్బు సంపాదించడం కోసం సంపాదించాలని నైట్ రిపోర్టర్‌గా మారతాడు. రాత్రిళ్ళు జరిగే సంఘటనలను షూట్ చేసి ఆ ఫుటేజ్‌ను చానెల్‌కు అమ్ముకుని డబ్బు సంపాదిస్తాడు. ఈ క్రమంలో హీరోయిన్ మహతి (అంజు కురియన్) నాన్న హత్యకు గురవుతాడు. ఈ హత్యను సుమంత్ రికార్డు చేస్తాడు. దాన్ని భారీ మొత్తంలో క్యాష్ చేసుకోవాలనుకుంటాడు. మరి సుమంత్ ప్లాన్ వర్కవుట్ అయిందా? ఆ హత్యను ఎవరు చేశారు? ఈ పని వల్లే అతను చిక్కుల్లో పడ్డాడా? ఆ చిక్కులేంటి.. వాటిని అతను ఎలా ఛేదించాడు? అన్న ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా.
  సవాలుతో కూడుకున్న పాత్ర కాకపోవడంతో హీరో సుమంత్ ఉన్నంతలో బాగానే నటించాడు. అయతే, ఆ పాత్రకు ఆశించినంత ప్రత్యేకత, ప్రాధాన్యత లేకపోవడం ఒకింత నిరుత్సాహపరుస్తుంది. ఇక హీరోయిన్ అంజు కురియన్ తన పాత్ర పరిధి మేర నటించింది. కాకపోతే గ్లామర్ పరంగా మెప్పించలేకపోయింది. ఇక హీరో ఫ్రెండ్ పాత్రలో నటించిన సత్య, అలాగే పోలీస్ ఆఫీసర్‌గా శివాజీరాజా తమ పాత్రలకు న్యాయం చేశారు. నెగెటివ్ రోల్‌లో నటించిన అర్జున్‌రెడ్డి ఫేమ్ కళ్యాణ్ మంచి నటన కనబరిచాడు. తన ఆటిట్యూడ్ ఈ సినిమాకు ప్లస్ అయింది. షఫి పాత్ర వ్యర్థంగా సాగుతుంది.
  సాంకేతివర్గం గురించి పెద్దగా చెప్పుకోవలసిన అవసరం ఉండదు. శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం ఫర్వాలేదు. థ్రిల్లర్ చిత్రాలకు పనిచేసిన అనుభవాన్ని చూపించాడు. పాటలు ఒకట్రెండే ఉన్నా అవి కూడా అనవసరం అనిపిస్తుంది. బాల్‌రెడ్డి ఛాయాగ్రహణం వృధా. జానర్‌కు తగ్గ కలర్ థీమ్ ఎంచుకున్నప్పటికీ.. విజువల్ పరంగా ఏ ప్రత్యేకతా లేదు. నిర్మాణ విలువలు పేలవంగా వున్నాయి. దర్శకుడు అనిల్ శ్రీకాంతం ఏ రకంగానూ మెప్పించలేకపోయాడు. దర్శకుడు ఇంట్రెస్టింగ్ సబ్జెక్టును తెరమీదకు తీసుకురావడంలో కొన్నిచోట్ల తడబడ్డాడు. క్రైమ్ థ్రిల్లర్ అంటేనే ఆసక్తికర మలుపులు, ఉత్కంఠతో కూడిన స్క్రీన్‌ప్లే ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కానీ ఈ సినిమాలో అవి మిస్ అయ్యాయి. దాంతో సినిమా కొన్నిచోట్ల సాగతీతగా అనిపిస్తుంది. ఫస్ట్‌హాఫ్ స్లోగా సాగుతూ ప్రేక్షకుడికి నీరసం తెప్పిస్తుంది. ఇక హీరో హీరోయిన్లమధ్య వచ్చే లవ్‌ట్రాక్ అలాగే క్లైమాక్స్ సన్నివేశాలు సినిమాటిక్‌గా అనిపిస్తాయి. వీటితోపాటు బడ్జెట్ కూడా ఈ చిత్ర ఫలితాన్ని దెబ్బతీసింది. ఇంట్రెస్టింగ్ పాయింట్ వున్న కథకు సరైన కథనం తోడైతే సినిమా ఫలితం ఊహించినదానికంటే ఎక్కువగానే ఉంటుంది. కానీ ఈ చిత్ర కథనం నిరాశపరచడంతో ఆ ప్రభావం సినిమా ఫలితంపై పడింది.
  ఒక సీరియస్ పాయింట్‌తో తెరకెక్కిన సినిమానే కానీ ప్రేక్షకుడిని సీరియస్‌గా ఇన్‌వాల్వ్ చేసేలా ఏ అంశాలూ ఇందులో లేవు. అసలే వనరులు లేకపోగా.. కొత్త దర్శకుడు అనిల్ శ్రీకాంత్ అనుభవలేమి కూడా తోడై.. ఒక బి గ్రేడ్ సినిమా చూస్తున్న భావన కలిగింది. దర్శకుడు లీడ్ పాయింట్‌నే సరిగా డీల్ చేయకపోగా.. ఇక అతను తీర్చిదిద్దిన ప్రేమకథ.. ఇతర అంశాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఒక మంచి పాయింట్‌ను ఎంత పేలవంగా ఎగ్జిక్యూట్ చేయవచ్చో చెప్పడానికి ‘ఇదం జగత్’ రుజువు. ఏదైనా ప్లస్ పాయింట్ ఉందా అని వెతికినా కనిపించని ఈ చిత్రం సుమంత్ కెరీర్‌కు ఏ రకంగానూ ఉపయోగపడే అవకాశం లేనట్టే. హాలీవుడ్‌లో వచ్చే సినిమాల్లో ఏదైనా ఎగ్జైటింగ్ పాయింట్ కనిపిస్తే.. దాని కాపీ చేసేయడం.. దాని చుట్టూ మన నేటివిటీతో కథ అల్లేసి సినిమా తీసేయడం.. చాలామంది చేసే పనే ఇది.


  0 0

  బ్లఫ్‌మాస్టర్ ** ఫర్వాలేదు

  తారాగణం: సత్యదేవ్, నందినీ శే్వత, పృధ్వీ, బ్రహ్మాజీ, ఆదిత్యమీనన్, టెంపర్ వంశీ, జబర్దస్త్ వంశీ, చైతన్య, సిజ్జు, అశోక్‌కుమార్ తదితరులు
  సంగీతం: సునీల్ కాశ్యప్
  నిర్మాత: రమేష్ పిళ్ళై
  స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం: గోపీగణేష్, పట్ట్భా
  =====================================================
  ఈమధ్యనో సందర్భంలో ప్రముఖ దర్శకుడు కమ్ రచయిత మాట్లాడుతూ రామాయణానికి మూడొందల వర్షన్లు ఉంటాయి, అయినా అది బోర్ కొట్టదన్నాడు. అలాగే మానవుడు డబ్బు- అత్యాశ- ఈ అంశాలపై తెలుగు చిత్రసీమలో మూడు వేల సినిమాలో అంతకంటే ఎక్కువో వచ్చేసినా, పాయంట్ అంతగా బోర్‌కొట్టదు. కాకపోతే, చూపే తీరులో దర్శకుడు ఆకర్షణీయ పద్ధతిని అనుసరించాలి. అదే ఆకర్షణీయత అంశాన్ని అదునుగా చూసుకొని, దానికి సమకాలీన సంఘటనల సారాన్ని అద్దుతూ ‘బ్లఫ్‌మాస్టర్’ మన ముందుకు గోపీ గణేష్ (చిత్ర దర్శకుడు) తేవడంతో చివరిదాకా చూడగలిగేలా చేసింది. అదేమిటో చూద్దాం.
  ‘డబ్బే మనిషి అంతిమ పరమావధి’ అన్న లక్ష్యంలో ముందుకు సాగిన ఉత్తమకుమార్ (సత్యదేవ్) అందుకోసం వేసిన వేషాలూ, చేసిన గారడీలు, వాటి వికటింపులు వల్ల సంభవించిన పరిస్థితులూ, వీటన్నిటి దృష్ట్యా అతను తెలుసుకున్న సత్యం తదితరాలలో ఉన్నదే ఈ సినిమా కథ. ఇందులో ప్రత్యేకత మనకు స్థూలంగా కన్పడకపోయినా మానవ బలహీనతలాధారం చేసుకొని కొంతమంది ఎలా వారిని టోకరా వేస్తున్నారో అన్నది పాయింట్‌ని చిత్రీకరించిన విధానం ఎన్నదగింది. ఉదాహరణకు తనని చంపేస్తానన్న కొమ్ములు తిరిగిన గూండా (ఆదిత్యమీనన్)ని సైతం ఉత్తమ్‌కుమార్ చెప్పిన వందకోట్లస్కామ్‌కి, అదీ ఒకసారి మోసపోయినా పడిపోవడం చూపారు. దీన్నిబట్టే అధిక సంపాదన అదీ అనాయాసంగా... అన్న ఆలోచనే, వాటి సాధ్యాసాధ్యాల గురించి మరేరకమైన ఆలోచనా చెయ్యనివ్వదు. ఇది సమాజంలో అనేకచోట్ల చూస్తున్నాం. అలాగే చెవులే లేని పాముకు రెండొందల భాషలు తెలుసు, వింటుంది.. అన్న మాటను, పేరొందిన వడ్డీ వ్యాపారి ధనశెట్టి (పృధ్వీ) నమ్మేస్తాడు. అదేవిధంగా ‘సగం ధరకే తులం బంగారం’ ప్రకటననీ మారు మాట్లాడకుండా నమ్మేస్తారు లక్షలాదిమంది ప్రజానీకం. ఎలా నమ్ముతారు? అని మనం ప్రశ్నించడానికి వీల్లేకుండా కళ్లెదుట అలాంటి మోసపూరిత వాతావరణాన్ని చూస్తూనే ఉన్నాం. అందుకే ఈ సినిమాలోనే వాడిన ఓ సంభాషణలాగా ‘బట్టలున్నవి మాసిపోడానికి -మనిషన్నది మోసపోవడానికి’ అన్నది నిజమేమోనన్న భావన బలంగా వచ్చేసింది. అయితే దీంతోపాటు పోలీసధికారి (సిజ్జు) పాత్ర ద్వారా ‘ఎంత గజ ఈతగాడైనా మురికి కాలువలో ఎక్కువకాలం ఈతకొట్టలేడు’ అన్న డైలాగ్‌ద్వారా ఈ తరహా ‘బ్లఫ్ మాస్టర్ల’ ఆటలు ‘బంద్’ అయి తీరుతాయి అన్న విశ్వాసాన్నీ కల్పించిందీ చిత్రం. మరింతగా సహజత్వానికి దగ్గరగా సీన్స్ చూపినా, అంత పెద్ద బ్లఫ్ మాస్టరూ తాను వేసిన వ్యూహంవల్ల తప్పుడు సాక్ష్యాల ఆధారంగా శిక్ష తప్పించుకుని బయటకొచ్చేసినా, ఇట్టే వెంటనే గుండాల చేతిలో దెబ్బలు తినేయడం ఎలా సాధ్యం? తన జాగ్రత్తలు తాను తీసుకోడా? అన్న అనుమానం ప్రేక్షకులకు కలిగింది. ఇంకో పెద్ద అసహజత్వం-హీరోయిన్ చర్య. అవని (నందితాశే్వత)ని ఎంతో తెలివైన యువతిగా ప్రారంభ సన్నివేశం నుంచీ తీర్చిదిద్దారు. మరి అదే అవని బ్లఫ్‌మాస్టర్ చెపుతున్న స్కీమ్ వివరాల అంశాలను చూసి, కనీసం అందులోని ఉచితానుచితాలు పరిశీలించదా? పైగా బ్లఫ్ మాస్టర్‌ని మించిన అతిశయోక్తులు మాట్లాడేస్తుంది. పోనీ అది కథ నడవడానికి అనుకున్నా, తర్వాతైనా తెలివిగా ప్రవర్తించదా? అన్న సాధారణ సహజ సూత్రానికీ విరుద్ధంగా ఆమె, ఉత్తమ్ ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అంటే మారుమాట్లాడకుండా పెళ్లిచేసుకుంటుంది. ఇది కూడా సినిమాటిక్ సూత్రం అని సరిపెట్టుకున్నా, తిరిగి ఉత్తమ్, అవాంఛిత మిత్రులతో బయటికెళ్తున్నపుడైనా ఇసుమంత అనుమానాన్ని, వ్యతిరేకతనూ వ్యక్తపరచకుండా ఉంటుంది. ఇది అసలు ఆ పాత్రకిచ్చిన స్వభావానికే సరిపడనిది. ఇదే సందర్భంలో ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు అన్న అందరికీ తెలిసిన మాటకు నిదర్శనంగా ఉత్తమ్‌చేత అతని ప్రత్యర్థి ‘నీ గొయ్యి నువ్వే తవ్వుకో’ అనడం అక్కడి పరిస్థితికి చక్కగా సరిపోయింది. కానీ చిత్రాంతంలో బ్లఫ్‌మాస్టర్ చట్టానికి లోబడి లొంగినట్లు చూపితే బాగుండేది. పోనీ అది సుఖాంతం కాకపోతే ఎలా అని అనుకుంటే శిక్షననుభవించినట్లు చూపినా స్ఫూర్తిదాయకంగా ఉండేది. అపుడు సినిమాలోని ఒక పాట (సత్కర్మనిచ్చు..) లోని మాట యిచ్చోటి కర్మ యిచ్చోటే.. అన్న వాక్యాలకీ బలం కలిగేది. ఇదే పాటలో ఒక చోట పాడిన పదాలు ‘ఎంత బ్రతుకు నీదెంత బ్రతుకు.. ఓ గుప్పెడు మెతుకుల కడుపు కోసం ఈవేషాలూ, మోసాలూ అవసరమా’ అన్నవి సూటిగా మనసుకి తాకాయి. ‘బ్లఫ్‌మాస్టర్’ పాత్రలో సత్యదేవ్ సరిగ్గా సరిపోయాడనంకంటే ఈ పాత్రే తనకోసం ఆవిర్భవించిందా అన్నరీతి ప్రతిభావంతమైన సునాయాస నటనని ఇందులో చూపారనవచ్చు. అవనిగా నందితా శే్వత నటనలో కృతిమత్వాన్ని మినహాయిస్తే బావుండేది. మిగిలినవారూ పాత్రోచితంగా నటించారు. బసవగా టెంపర్‌వంశీ ఎన్నదగిన నటనని చూపారు. అతని పాత్రకో చెప్పుకోతగ్గ క్లోజప్ షాట్ లేకపోయినా తన ఉనికిని చాటుకున్నాడు. సంభాషణల పరంగా కొన్నిటి పంచ్ డైలాగులనడంకన్నా ‘మంచి’ డైలాగులు అనడం సమంజసం. ‘ఒక అబద్ధాన్ని నమ్మించడానికి అందులో కొంత నిజముండి తీరాలి’, ‘మన నిర్ణయాలే మన జీవితం అవుతుంది’, ‘మనం మోసపోయాం అనుకోవడంకన్నా, దానివల్ల మనకో తంత్రం తెలిసింది అనుకోవాలి’, ‘మీ బ్యాంక్ అకౌంట్, అకౌంట్ నెంబర్‌ను మించిపోతుంది’ లాంటి ఇందుకు కొన్ని ‘మెచ్చు’తునకలు. అయితే ఈ సంభాషణలు క్రెడిట్‌కొంత చిత్రానికి మూలమైన చిత్రానికీ (ఈసినిమా 2014లో విడుదలైన శతురంగవెట్టై అన్న తమిళ చిత్రానికి రీమేక్) కొద్దిగా దక్కుతుందేమో! మొత్తానికి ‘ఏ కన్నూ చూడదగిన ఈ విచ్చలవిడి మిడిసిపాటు’ అన్న పంథాలో సాగిపోయే బ్లఫ్ మాస్టర్లకి అదృశ్యశక్తి చూసి అన్ని లెక్కలూ తేలుస్తుందన్న భయాన్నీ ‘బ్లఫ్‌మాస్టర్’ కలగజేయడం ద్వారా పర్వాలేదు స్థాయికి చేరుకుంది. అయితే లాజిక్‌కి స్థానం ఇంకా కల్పించి వుంటే మరీ బాగుండేది.


  0 0

  వరసగా టాప్ హీరోలతో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్‌గా మారిన రకుల్‌కు ‘స్పైడర్’ ఇచ్చిన షాక్ తర్వాత ఎందుకో తెలుగు సినిమాలు సైన్ చేయడం తగ్గించింది. తమిళం, హిందీపై ఎక్కువ ఫోకస్ చేస్తోంది. రకుల్ ప్రస్తుతం మూడు తమిళ సినిమాలు.. రెండు హిందీ చిత్రాలు చేస్తోంది. తాజాగా తెలుగులో ఒక సినిమాకు పచ్చజెండా ఊపిందని వార్తలు వస్తున్నాయి. హీరో నితిన్ ప్రస్తుతం రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. ఒకటి వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రష్మిక మండన్న హీరోయిన్. ఈ సినిమా కాకుండా నితిన్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడట. సినిమాలో హీరోయిన్ పాత్రకు నిర్మాతలు రకుల్‌ను సంప్రదించారని.. పాత్ర నచ్చడంతో రకుల్ కూడా ఓకె చెప్పిందని టాక్ వినిపిస్తోంది. వరుసగా స్టార్ హీరోలతో కలిసి నటిస్తున్న రకుల్ ఇపుడు కుర్ర హీరోలతో జోడీకట్టడం మాత్రం సర్‌ప్రైజ్. ఇదిలా వుంటే రకుల్ మరో తెలుగు సినిమా ‘వెంకీ మామ’లో కూడా నటించేందుకు చాలా నెలల క్రితమే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

  చిత్రం..రకుల్‌ప్రీత్ సింగ్


  0 0

  ఎవరెవర్ని ఓడించారు? ఎవరు స్టార్‌హీరోగా నిలబడ్డారు? ఏ నటి ఎక్కువ సినిమాలు చేసింది. ఏ బ్యూటీ కనుమరుగైపోయింది? ఏ దర్శకుడు దుమ్ము దులిపాడు? ఏ దర్శకుడు ఫ్లాపులిచ్చాడు? లాంటి లెక్కలు ఒకప్పుడు. ఇప్పటి చిత్ర పరిశ్రమ తీరు వేరు. హీరోలు, హీరోయిన్లు, దర్శకులే కాదు.. ట్వెంటీఫోర్ క్రాఫ్ట్స్‌లో ఎవరి పనితనాన్ని వాళ్లు చూపించే సాహసాలు చేస్తున్నారు. వైవిధ్యాన్ని వెతుకుతున్నారు. ప్రయోగాలకు పదును పెడుతున్నారు. వినోదాన్ని వెతుక్కుంటూ థియేటర్లకు వెళ్తున్న ఆడియన్స్‌కి ఏదోక కొత్త విందు అందించాలన్న తాపత్రయం చూపిస్తున్నారు. అది ఈ ఏడాది ఒకింత ఎక్కువే కనిపించింది. ఎప్పటిలాగానే ఈ ఏడాదీ సుమారుగా 150 సినిమాలొచ్చి పదిహేను సినిమాల వరకే గుర్తుండిపోయే స్థాయిని సంపాదించాయి. కాకపోతే, ఫ్లాపైన సినిమాలు, మోస్తరు దగ్గరే ఆగిన సినిమాలను తీసిపారేయలేం. ఆడియన్స్ ఆదరణకు నోచుకోనంత మాత్రాన -ఆ సినిమాలోని ఆలోచన గొప్పది కాదనలేం. ఈ ఏడాదిలో బాక్సాఫీస్ దగ్గర నిలబడలేని సినిమాలు ఎక్కువే అయినా, వాటిని తెరకెక్కించిన టీం ప్రయత్నం చెప్పుకోదగ్గదిగానే ఉండటం విశేషం. హిట్టందుకున్న వాళ్లు సరే.. ఫ్లాపులిచ్చిన వాళ్లూ నిరుత్సాహానికి గురికాకుండా కొత్త ఏడాది మరింత ఉత్సాహంతో ‘వైవిధ్యమైన విందు’ ఆడియన్స్‌కి అందిస్తారని ఆశిద్దాం. అయితే, ఈ ఏడాదిలో సినిమా జమా లెక్కల్ని ఒక్కసారి సమీక్షించుకుంటే..
  *
  కొంతకాలంగా ప్రిన్స్ సక్సెస్ రేట్ చిత్రంగా నడుస్తోంది. సీతమ్మవాకిట్లో.. తరువాత నేనొక్కడినే, ఆగడు చిత్రాల వైఫల్యాన్ని రుచి చూసిన మహేష్ మళ్లీ శ్రీమంతుడుతో ఫాంలోకి వచ్చేశాడు. తరువాత వచ్చిన బ్రహ్మోత్సవం, స్పైడర్ చిత్రాలు పరాజయాలు రుచి చూపిస్తే -కొరటాల శివతో చేసిన భరత్ అను నేను.. చిత్రం మళ్లీ ఫాంలోకి తీసుకొచ్చింది.
  *
  బృందావనం నుంచి రభస వరకూ బ్లాక్‌బస్టర్ హిట్టుని రుచిచూడని జూ.ఎన్టీఆర్ ఫేట్ టెంపర్ నుంచి మారిపోయంది. మధ్యలో జై లవకుశ చిత్రం కాస్త నిరాశపర్చినా -నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ చిత్రాలతో బ్లాక్‌బస్టర్లే అందుకున్నాడు. ఈ ఏడాది ట్రెండ్‌ను రిపీట్ చేస్తూ త్రివిక్రమ్‌తో చేసిన అరవింద సమేత.. ఎన్టీఆర్ స్థానాన్ని పదిలం చేసింది.
  *
  సినిమా ఫలితాన్ని కాసేపు పక్కన పెడితే -దర్శకుడు సంకల్ప్ అంతరిక్ష ప్రయోగాన్ని ఈ ఏడాది వైవిధ్య ప్రయత్నంగా గుర్తు పెట్టుకోక తప్పదు. తెలుగు స్క్రీన్‌పై ఊహకు కూడా అందని అంతరిక్ష సన్నివేశాలను ఆడియన్స్‌కు అందించటంలో విజయం సాధించాడు. ఆ పాత్రలో వరుణ్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ మెచ్చదగ్గదే.
  *
  ఈ ఏడాది బ్యూటీ ఆఫ్ ది స్టార్ అంటే కీర్తిసురేష్‌నే చూపించాలి. దర్శకుడు నాగ్ అశ్విన్‌తో ఆమె చేసిన సావిత్రి పోట్రెయట్ -కెరీర్‌లో ఓ అద్భుతం. మహానటిని మరోసారి చూస్తున్నామన్న భావన కలిగించింది.
  తెలుగు సినిమాకు కొత్త ఫార్మాట్ క్రియేట్ చేశాడు కుర్ర దర్శకుడు వెంకటేష్ మహా. పడిగటు సినిమాను పక్కనపెట్టి మదికి తోచింది మనసుకు హత్తకునేలా చూపించడమే సినిమా అనే కొత్త నిర్వచనాన్ని కేరాఫ్ కంచరపాలెంతో రుచి చూపించాడు. ఈ ఏడాదిలో ట్రెండ్ సెట్ చేసిన సినిమా అంటే ఇదే. వెంకటేష్‌ను స్ఫూర్తిగా తీసుకుని వచ్చే ఏడాది కోసం ఎన్నో ఇలాంటి సినిమాలు తయారవుతున్నాయంటే అతిశయోక్తి కాదు.
  *
  ఈ ఏడాది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ వీళ్లిద్దరే. పెళ్లి చూపులు చిత్రంలో చాలా అమాయకంగా కనిపించిన విజయ్ దేవరకొండ సెలెక్టెడ్ చిత్రాలతో స్టార్ హీరోల రేంజ్‌కు చేరిపోయాడు. గతేడాది అర్జున్‌రెడ్డితో సెనే్సషన్ క్రియేట్ చేస్తే, ఈ ఏడాది గీత గోవిందం చిత్రంతో దాన్ని నిలబెట్టుకున్నాడు. వర్సటైల్ ఆర్టిస్ టగా యూత్‌లో పిచ్చి క్రేజ్ తెచ్చుకున్న విజయ్ ఇమేజ్‌ను చిన్నాచితకా ఫ్లాపులు ఏమీ చేయలేకపోయాయ. ఇక రష్మిక మండన యూత్‌కు ఓ ఫాంటసీ ఫాన్. ఒకట్రెండ్ చిత్రాలతోనే తనకంటూ ట్రెండ్ సెట్ చేసుకున్న రష్మిక కొత్త ఏడాదిలో చేసే సినిమాలతో స్టార్ హీరోయన్ రేంజ్‌కు చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
  *
  ఏప్రిల్ నెల వస్తే ఫైనాన్షియల్ ఇయర్. జూన్ మాసమొస్తే అకాడమిక్ ఇయర్. మరి జనవరి నెలవస్తే -చలన చిత్ర పరిశ్రమలో పందెంకోళ్లు బరిలోకి దిగుతాయి. భారీ బడ్జెట్‌తో తీసిన సినిమాలతోపాటు తక్కువలో తక్కువ బడ్జెట్‌తో సినిమాలూ భారీ భారీ అంచనాలతోనే సంక్రాంతి బరిలో నిలుస్తాయి. ఒకవిధంగా చెప్పాలంటే విడుదల చేయ్యడానికి థియేటర్లు కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో దొరకవు. వందల కోట్లతో పెద్ద పెద్ద నిర్మాతలు, పేరున్న దర్శకులు, మల్టీస్టారర్ సినిమాలు నిర్మించిన వారు ముందుగానే కావలసినన్ని థియేటర్లు తమ చేతిలో పెట్టుకుంటారు. చిన్న సినిమాలు తీసిన నిర్మాతలు కనీసం తమ సినిమాలోని కథేంటో, మెసేజేంటో ప్రేక్షకులకు తెలియాలని, అందులోని విషయం అర్ధంకావాలని ఎంతో తాపత్రయంతో కనీసం పదుల సంఖ్యలోనైనా విడుదల చేయాలని భావించడం తప్పు కాదుకదా. అయినప్పటికీ అన్ని థియేటర్లు కూడా దొరకని పరస్థితి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. మల్టీస్టారర్ సినిమాలు ప్రపంచమంతటా విడదలై కోట్లు వసూలు చేస్తుంటే, చిన్ని సినిమాలు పెట్టిన పెట్టుబడి కూడా వసూలు చేయలేక పోవడం విధితమే. ప్రతి ఏటా కొత్త సంవత్సరం వస్తుందే చాలు హడావిడిగా సినిమాలను విడుదల చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క దర్శక నిర్మాత సమయానికి మించి కష్టపడుతుంటాడు. నటీనటులు కఃడా అందుకు తగినట్టే సహకరిస్తారు. ఎందుకంటే వాళ్లకు కూడా తాము నటించిన చిత్రం సంక్రాంతి బరిలో నిలవాలని, గెలవాలని ఉంటుంది కదా. అయితే ఇక 2018 సంవత్సరం విషయానికొస్తే ఏడాది మొత్తంమీద విడుదలైన చిత్రాలు దాదాపు నూటికి పైమాటే. కానీ అందులో సక్సెస్ సాధించినవి మాత్రం పదుల్లోనే ఉన్నాయి. సినిమాలంటేనే జయాపజయాలుంటాయి. కానీ ఈ 2018లో మాదిరిగా ఎన్నడూ జరగలేదని చెప్పవచ్చు. దాదాపు ఒకే నెలలో పది సినిమాలు విడుదలైతే, అందులో ఒకటో రెండో ప్రేక్షకులకు దగ్గరయ్యాయని చెప్పవచ్చు. అంతకుమించి అన్నీ సంతృప్తినిచ్చాయని చెబితే కనుక తప్పులో కాలేసినట్టే.
  జనవరిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం ‘అజ్ఞాతవాసి’ ఘోర పరాజయం పాలైతే, బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘జై సింహా’ అదే బాట పట్టింది. ఇదే వరుసలో చిలుకూరు బాలాజీ, రంగుల రాట్నం, 3ముఖి, ఇగోలాంటి చిత్రాలు ప్రేక్షకులకు తెలియకుండానే వెళ్లిపోయాయి. నెల చివర్లో వచ్చిన అనుష్క ‘భాగమతి’, నాగశౌర్య ‘చలో’ చిత్రాలు మాత్రమే ఒకింత ఫలితాన్ని అందించి ప్రేక్షకులతో ఓకే అనిపించుకున్నాయి.
  ఫిబ్రవరిలో పదిహేను వరకూ చిత్రాలు విడుదలైనా, వరుణ్ తేజ్ హీరోగా చేసిన ‘తొలిప్రేమ’ తప్ప -పధ్నాలుగు చిత్రాలూ పరాజయాల బాటపట్టాయి. రవితేజ ‘టచ్ చేసి చూడు’, మోహన్‌బాబు ‘గాయత్రి’, సాయిధరమ్ తేజ్ ‘ఇంటిలిజెంట్’.. అదే క్రమంలో హౌరాబ్రిడ్జి, ఇదే నా లవ్ స్టోరీ,
  మనసుకు నచ్చింది, రచయిత, సోడా గోలీసోడా, చల్తే చల్తే, హైదరాబాద్ లవ్ స్టోరీ, జువ్వ, రారా చిత్రాలన్నీ తుస్సుమన్నాయి.
  మార్చిలోనూ 13 చిత్రాల వరకూ థియేటర్లలో సందడి చేసేందుకు ప్రయత్నించినా ఫలం దక్కలేదు. సుకుమార్ -రామ్‌చరణ్ క్రేజీ ప్రాజెక్టుగా వచ్చిన రంగస్థలం ఈ ఏడాది బ్లాక్‌బస్టర్‌గా నిలిస్తే -మిగిలిన పనె్నండూ (ఏం మంత్రం వేశావే, ఐతే 2.0, కిర్రాక్ పార్టీ, నెల్లూరి పెద్దారెడ్డి, వదిన, మనసైనోడు, అనగనగా ఒక ఊళ్లో, ఎమ్మెల్యే, నీదీ నాదీ ఒకే కథ, రాజరథమ్) సోదిలో లేకుండా పోయాయి.
  ఏప్రిల్ నెలలోనూ ఇబ్బదిముబ్బడిగానే చిత్రాలొచ్చాయి. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో మహేష్‌ను చూపిస్తూ కొరటాల తెరకెక్కించిన ‘భరత్ అను నేను..’ చిత్రం తప్ప, మిగిలినవన్నీ తీవ్ర నిరాశ మిగిల్చాయి. వీటిలో త్రివిక్రమ్, పవన్‌కళ్యాణ్ నిర్మాణ సారథ్యంలో కృష్ణచైతన్య దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన ‘చల్‌మోహన్ రంగ’ నుంచి, సత్యగ్యాంగ్, అమీర్‌పేట 2 అమెరికా, నాని హీరోగా కృష్ణార్జున యుద్ధం, ప్రభుదేవా ‘మెర్క్యురీ’, మంచు విష్ణు ‘ఆచారి అమెరికా యాత్ర’, సాయిపల్లవి ‘కణం’, ఎందరో మహానుభావులు, జంక్షన్‌లో జయమాలిని చిత్రాలు ఆడియన్స్‌ను ఏమాత్రం మెప్పించలేక చతికిలపడ్డాయి.
  సమ్మర్ వెకేషన్ సీజన్ మేనెలలో తెలుగు సినీ పరిశ్రమ చాలా విశేషాలే చూసింది. మాటల రచయిత వక్కంతం వంశీ తొలిసారి దర్శకత్వం చేపట్టి అల్లు అర్జున్‌తో నిర్మించిన ‘నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ను ఆడియన్స్ తిప్పికొడితే, కీర్తి సురేష్ లీడ్‌రోల్‌లో తొలిసారి నాగ్‌అశ్విన్ తెరకెక్కించిన సావిత్రి జీవిత ఘట్టం ‘మహానటి’ అద్భుతాలు సృష్టించింది. ఇక ఎన్నో హిట్టు చిత్రాలను తీసిన అనుభవజ్ఞుడు పూరి జగన్నాథ్ కొడుకును హీరోగా నిలబెట్టేందుకు చేసిన ‘మెహబూబా’ డిజాస్టర్‌గా మిగిలింది. రవితేజ ‘నేలటిక్కెట్టు’, నాగశౌర్య ‘అమ్మమ్మగారిల్లు’ చిత్రాలనూ ఆడియన్స్ తిప్పికొట్టడం ఇంకో విశేషం. ఇక అన్నదాతా సుఖీభవ, శీనుగాడి ప్రేమకథలాంటి చిత్రాలూ ఎప్పుడొచ్చాయో, ఎప్పుడు వెళ్లాయో తెలీకుండా పోయింది.
  జూన్ ఆరంభంలోనే ‘ఆఫీసర్’తో ఇండస్ట్రీకి బౌన్సర్ పడిది. రామ్‌గోపాల్‌వర్మ -నాగార్జున కాంబోగా వచ్చిన చిత్రం దారుణ పరజయాన్ని చవిచూస్తే, రాజ్‌తరుణ్ ‘రాజుగాడు’, కళ్యాణ్‌రామ్ ‘నానువ్వే’ కమెడియన్ శ్రీనివాసరెడ్డి ‘జంబలకిడిపంబ’, బెస్ట్‌లవర్స్, సంజీవిని, శంభోశంకర చిత్రాలు ఠపాకట్టేశాయి. తరుణ్‌భాస్కర్ ‘ఈనగరానికేమైంది’ ఒకింత ఆలోచించాల్సిన చిత్రంగా నిలిస్తే, ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్‌బాబు, ఆదితీరావ్ హైదరి జంటగా వచ్చిన ‘సమ్మోహనం’ ఓకే అనిపించుకుంది.
  ఆరు నెలల కాలంలో అరవై సినిమాలు థియేటర్లకు వస్తే -హిట్టనిపించుకున్నవి మాడో నాలుగో. ఫరవాలేదనిపించుకున్న చిత్రాలూ ఐదో ఆరో. అంటే 85శాతం సినిమాల కష్టం బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది.
  జూలై మాసం మొత్తంమీద కార్తికేయ హీరోగా అజయ్ భూపతి తెరకెక్కించిన ఆర్‌ఎక్స్ 100 బ్లాక్‌బస్టర్ చిత్రంగా నిలిస్తే -గోపీచంద్ ‘పంతం’, సాయిధరమ్ ‘తేజ్ ఐ లవ్ యూ’, చిరంజీవి అల్లుడు కళ్యాణ్‌దేవ్ ‘విజేత’ సహా అఘోరా, దివ్యమణి, ఆటగదరా శివ, లవర్, వైఫ్ ఆఫ్ రామ్, బెల్లంకొండ ‘సాక్ష్యం’, హ్యాపీవెడ్డింగ్ చిత్రాలన్నీ పులుసులో కలిసిపోయాయి.
  ఆగస్టు మాసంలో తక్కువ చిత్రాలే థియేటర్లకు వచ్చినా -కథ అందించిన అడవి శేష్ హీరోగా శశికిరణ్ తెరకెక్కించిన ‘గూఢచారి’ మాత్రమే డిటెక్టివ్ చిత్రంగా మంచి ఫలితం రాబట్టింది. బ్రాండ్‌బాబు, దేవీ విగ్రహం, శివకాశీపురం, తరువత ఎవరు? చిత్రాలు ఢమాల్‌మంటే, హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి తెరకెక్కించిన చి.ల.సౌ ఓకే అనిపించుకుంది.
  ఆగస్టు మాసంలో నితిన్ రాశిఖన్నా హీరోహీరోయిన్లుగా భారీ నిర్మాత దిల్‌రాజు తెరకెక్కించిన ‘శ్రీనివాస కళ్యాణం’ అనూహ్య పరాజయం అందిస్తే, విజయ్ దేవరకొండ -రష్మిక మండన్న జోడీగా పరిశురామ్ తెరకెక్కించిన ‘గీత గోవిందం’ సెనే్సషనల్ హిట్టయ్యింది. ఇక ఆటగాళ్లు, అంతకుముందు, నీవెవరో, సూపర్ స్కెచ్, అట్ నర్తనశాల, పేపర్‌బోయ్, సమీరంలాంటి చిత్రాలు థియేటర్ల వద్ద బొక్కబోర్లాపడ్డాయి.
  సెప్టెంబర్‌లో తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ అద్భుతానికి బీజం పడింది. కంచరపాలెం అనే ఊరిని తీసుకుని, జనానే్న ఆర్టిస్టులను చేసి యధార్థ ప్రేమ కథలకు ఒకింత డ్రామా మేళవించి కొత్త దర్శకుడు వెంకటేష్ మహా చేసిన ప్రయోగం ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఆ సినిమాయే కేరాఫ్ కంచరపాలెం. ఈ ఏడాది ఈ ప్రయోగం హిట్టవ్వడంతో, కొత్త దర్శకులు అతి తక్కువ బడ్జెట్‌తో మరిన్ని ప్రయోగాలకు సాహసం చేయడానికి ఉపక్రమించారు. ఈనెల్లోనూ పదిహేను వరకూ చిత్రాలు థియేటర్లకు వచ్చినా -చప్పుడు చేయకుండా తిరిగి వెళ్లిపోయిన చిత్రాలే ఎక్కువ. అనువంశికత, మను, ప్రేమకు రెయిన్‌చెక్, సిల్లీఫెలోస్, ఎందుకో ఏమో, మసక్కలి, శైలజారెడ్డి అల్లుడు, యు-టర్న్, ఈ మాయ పేరేమిటో, అంతర్వేదం, నన్నుదోచుకుందువటె, దేవదాస్, నాటకం చిత్రాలు సెప్టెంబర్‌లో వచ్చినవే. అయితే ఒకటి రెండు చిత్రాలు ఫరవాలేదనిపిస్తే, ఒకటి రెండు చిత్రాలు ఆలోచింపచేసే చిత్రాలుగా పేరు తెచ్చుకున్నాయి. మిగిలిన చిత్రాలు మాత్రం ఊసే లేకుండా పోయాయి.
  అక్టోబర్‌లో విజయ్ దేవరకొండ నటించిన ‘నోటా’ వసూళ్లు రాబట్టినా ప్రేక్షకాదరణ దక్కలేదు. దసరాను టార్గెట్ చేస్తూ జూ.ఎన్టీఆర్, పూజాహెగ్దె హీరో హీరోయిన్లుగా త్రివిక్రమ్ చేసిన ఫ్యాక్షన్ మాయ ‘అరవింద సమేత వీర రాఘవ’ బ్లాక్‌బస్టర్ అయ్యింది. తమన్ సంగీతం సినిమాను ఓ రేంజ్‌కి తీసుకెళ్లి కలెక్షన్లు కురిపించింది. త్రినాథరావు నక్కిన డైరెక్షన్‌లో హీరో రామ్‌తో దిల్‌రాజు నిర్మించిన ‘హలో గురూ ప్రేమకోసమే’ చిత్రం కూడా బాగానే వసూలు చేసింది. దేశంలో దొంగలుపడ్డారు, భలేమంచి చౌకబేరమ్, మూడుపువ్వులు ఆరుకాయలు, 2ఫ్రెండ్స్, బంగారి బాలరాజు, రథమ్, వీరభోగ వసంతరాయులు చిత్రాలు తేలిపోయాయి.
  నవంబర్‌లో మైత్రీమూవీస్ నిర్మించిన ‘సవ్యసాచి’తో నాగచైతన్య ఓ ఫ్లాప్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. రవిబాబు ‘పందిపిల్ల’తో ఎవరికీ అర్థంకాని ప్రయోగం చేసి చేతులు కాల్చుకున్నాడు. ఫ్లాపుల కసినుంచి కొత్త ఎనర్జీతో రవితేజ చేసిన అమర్-అక్బర్-ఆంటోనీ చిత్రాన్నీ ప్రేక్షకులు తిప్పికొట్టారు. ఈ చిత్రంతో సెకెండ్ ఇన్నింగ్స్ మొదలెట్టాలని చూసిన ఇలియానాకు ఆదరణ దక్కలేదు. విజయ్ దేవరకొండను సక్సెస్‌ఫుల్ హీరోగా ‘టాక్సీవాలా’ నిలిబెడితే -దేశదిమ్మరి, కథానాయకులు, కర్త కర్మ క్రియ, శరభ, 24 కిసెస్, లా, రంగు, రూల్‌లాంటి చిత్రాలు ఆడియన్స్ వెక్కిరింతకు గురికాక తప్పలేదు.
  ఏడాది పూర్తవుతుండటంతో డిసెంబర్ మాసంలోనూ ఎన్నో చిత్రాలు థియేటర్ల వద్ద క్యూగట్టాయి కానీ ఫలితాన్ని కూడబెట్టలేకపోయాయి. ప్రయోగాత్మక చిత్రాలు, సైంటిఫిక్ చిత్రాలు, చిత్రమైన సినిమాలుగా వచ్చినా ఆడియన్స్ మెప్పు వాటికి దక్కలేదు. ఈ మాసంలో ఆపరేషన్ 2019, కవచం, నెక్ట్స్ ఏంటి?, శుభలేఖ+లు, భైరవగీత, హుషారు, బ్లఫ్‌మాస్టర్, మంచుకురిసే వేళలో చిత్రాలకు ఆడియన్స్ మెప్పు లభించలేదు. ఘాజీ ఫేమ్ సంకల్ప్ తీసిన రోదసి బ్యాక్‌డ్రాప్ చిత్రం అంతరిక్షం ఫరవాలేదనిపించుకుంటే, సుమంత్ చేసిన థ్రిల్లర్ సుబ్రహ్మణ్యపురం పెదవి విరుపులకు గురైంది. లవ్ స్టోరీస్ స్పెషలిస్టు అనిపించుకున్న హను రాఘవపూడి హీరో శర్వానంద్‌తో తెరకెక్కించిన పడిపడి లేచె మనసు కూడా అసంతృప్తినే మిగిల్చింది. ఇక అనువాద చిత్రాలుగా వచ్చిన మారి-2, కెజీఎఫ్ చిత్రాలకూ ఆదరణ దక్కలేదు. కొత్త ఏడాదిలోనైనా ఆడియన్స్ ఆదరణ చూరగొనే చిత్రాలు ఎక్కువ వస్తాయని ఆశిద్దాం. *


  0 0

  న్యూఢిల్లీ, డిసెంబర్ 29: ఈ ఏడాది భారీగా నష్టపోయిన రంగాల్లో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ (ఎన్‌బీఎఫ్) కంపెనీలను ప్రధానంగా ప్రస్తావించాలి. ఒకవైపు బ్యాంకింగ్ రంగం మోసాలు.. పరారీలు.. నిష్క్రమణలతో బ్యాంకింగ్ వ్యవస్థ చావు దెబ్బతింటే, ద్రవ్య లభ్యత సక్రమంగా లేకపోవడం వల్ల ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. బ్యాకింగ్ రంగాన్ని చక్కదిద్దడంతోపాటు ఎన్‌బీఎఫ్ కంపెనీలకు ఊరట కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ ఏడాది పలు బ్యాంకుల అత్యున్నత అధికారులు వివిధ కారణాల వల్ల తమతమ ఉద్యోగాల నుంచి వైదొలగడం ఒక రకంగా బ్యాంకింగ్ రంగాన్ని బలంగా దెబ్బతీసింది. ఫలితంగా రుణదాతలకు ఏ విధంగానూ ఉపయోగపడని ఆస్తులు (నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్) పేరుకుపోతుండగా, కోర్టులు, ట్రిబ్యూనల్స్‌లో వ్యాజ్యాలు పెరిగాయి. మరోవైపు ఎన్‌బీఎఫ్ కంపెనీలు ద్రవ్య లభ్యత సక్రమంగా లేకపోవడంతో, స్టాక్ మార్కెట్‌లో దారుణంగా దెబ్బతింటున్నాయి. పేరొందిన కంపెనీలు, సంస్థలు కూడా సరిపడినంత ద్రవ్యం అందుబాటులో లేకపోవడంతో తమతమ లావాదేవీలను సక్రమంగా నిర్వహించుకోలేక పోతున్నాయి. పేరు పొందిన ఎంతో మంది భారీ రుణగ్రస్తుల నుంచి సొమ్మును సకాలంలో రాబట్టడంలో బ్యాంకులు విఫలమయ్యాయి. బోర్డులు తిప్పేసి, బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తాలను ఎగ్గొట్టిన పలు కార్పొరేట్ కంపెనీలు పరోక్షంగా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయి. కుంభకోణాల కారణంగా నష్టపోయిన బ్యాంకుల్లో ప్రభుత్వ రంగంలోనివే ఎక్కువ. నిజానికి ఏడాది ప్రారంభలోనే, దేశంలోనే అతి పెద్ద కుంభకోణం బయటపడింది. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, అతని మామ మెహుల్ చోక్సీ భారీ మొత్తాల్లో బ్యాంకులను నిలువునా ముంచేసి, విదేశాలకు ఉడాయించారు. ముంబయిలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) శాఖ నుంచి వందల సంఖ్యలో లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్ (ఎల్‌ఓయూ)లను తీసుకొని, అవినీతికి పాల్పడ్డారు. వీరు సుమారు 14,000 కోట్ల రూపాయల మేర బ్యాంకులకు ఎగ్గొట్టి, దేశం విడిచి పారిపోయారు. ఈ భారీ షాక్ నుంచి బయటపడేందుకు పీఎన్‌బీ ఇంకా ప్రయత్నిస్తునే ఉంది. ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ఈ బ్యాంక్ దివాలా పిటిషన్ పెట్టలేదు. లేకపోతే, పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేదో ఊహించడం కష్టం కాదు. ఈ విషయంలో ఎన్‌బీఎఫ్ కంపెనీలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయని చెప్పవచ్చు. ఒకటిరెండు సంఘటనలను మినహాయిస్తే, ప్రైవేటు రంగంలోని బ్యాంకులుగానీ, ఆర్థిక సేవలను అందిస్తున్న కంపెనీలు లేదా సంస్థలుగానీ ఈ స్థాయిలో మోసపోలేదు. ద్రవ్య లభ్యత అనుకున్న స్థాయిలో అందితే, ప్రభుత్వ రంగం బ్యాంకుల కంటే ఎన్‌బీఎఫ్ కంపెనీలే మె రుగ్గా పని చేస్తాయన్న వాదన కూడా బలంగా వినిపిస్తున్నది. నీరవ్ మోదీ కుంభకోణానికి సంబంధించిన వివరాలు పూర్తిగా వెలుగు చూడకముందే, ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ చందా కొచ్చర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఆమె అధికార దుర్వినియోగానికి పా ల్పడిందని, పరస్పర ప్రయోజనాలను ఆశించి రుణాలను మంజూరు చేసిందని ఆమెపై అభియోగాలు ఉన్నాయి. ప్రత్యేకించి, తర్వాతి కాలంలో దివాలా తీసిన వీడియోకాన్ ఇండస్ట్రీస్‌కు కోట్లాది రూపాయల రుణాలను అందించి, తద్వారా సొంత ప్రయోజనాలను పొం దారని 56 ఏళ్ల కొచ్చర్‌పై విమర్శలు ఉన్నాయి. 1984లో ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజ్‌మెంట్ విభాగంలో ట్రైనీగా చేరిన కొచ్చర్ తన అసమాన ప్రతిభతో అంచెలంచెలుగా ఎదిగింది. బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ స్థాయికి ఎదిగింది. కానీ, క్విడ్ ప్రోకో విమర్శలతో ప్రతిష్ట కోల్పోయింది. ప్రైవేటు రంగ బ్యాంకుల్లో లబ్ధప్రతిష్ట పొందిన ఐసీఐసీఐలో నే ఇలాంటి పరిస్థితి తలెత్తడం విచిత్రం. కొచ్చర్ కారణంగా ఎలాంటి నష్టం జరగలేదని, ఆమె కుంభకోణానికి పాల్పడలేదని ప్రపంచానికి తెలియపరచాలన్న ఉద్దేశంతో ఐసీఐసీఐ పాలక మండలి ఆమె సేవలను 2021 మే వరకూ కొనసాగించాలని తీర్మానించింది. కానీ, ఆర్‌బీఐ అందుకు సమ్మతించలేదు. ఫలితంగా ఆమె ఈనెల 31న పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోటీపడుతూ ప్రైవేటు బ్యాంకుల్లోనూ భారీ మోసాలు చోటు చేసుకుంటున్నాయని కొచ్చర్ సంఘటన చెప్పకనే చెప్పింది. కాగా, యస్ బ్యాంక్ సీఈవోగా రాణా కపూర్‌ను కొనసాగేందుకు పాలకమండలి అంగీకరించినప్పటికీ రిజర్వ్ బ్యాంక్ ససేమిరా అన్నది. అతను జనవరి 31వ తేదీన పదవీ విరమణ చేస్తాడు. యస్ బ్యాంక్ చైర్మన్ పదవికి అశోక్ చావ్లా ఇంతకు ముందే రాజీనామా చేశాడు. ఆ బ్యాంక్‌లో నెలకొన్న అవాంఛనీయ ధోరణులకు ఈ పరిణామాలు అద్దం పడుతున్నాయి. ఇక బ్యాంకింగ్ రంగానికి తగిలిన పెద్ద దెబ్బగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పదవికి ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయడాన్ని పేర్కోవాలి. వ్యక్తిగత కారణాలతోనే తాను వైదొలగుతున్నట్టు ప్రకటించినప్పటికీ, కేంద్రం నుంచి వస్తున్న ఒత్తిళ్లే ప్రధాన కారణమన్నది జగమెరిగిన సత్యం. ఈ పరిణామం ఎన్‌బీఎఫ్ కంపెనీలపై ఏ విధంగా ఉంటుందని రాబోయే కాలమే చెప్పాలి. ఆర్‌బీఐకి స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలని, ప్రభుత్వాల పెత్తనం ఉండకూడదని ఉర్జిత్ వాదిస్తుంటే, కేంద్ర వ్యవహార శైలి అందుకు భిన్నంగా ఉందని పరిశీలకులు సైతం అంటున్నారు. ఉర్జిత్ వైదొలగిన మరుసటి రోజే శక్తికాంత దాస్‌ను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంత హడావుడిగా మోదీ సర్కారు నిర్ణయం తీసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో, ఎన్‌బీఎఫ్ కంపెనీలను ప్రోత్సహిస్తే, ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందని నిపుణుల అభిప్రాయం. ఇప్పటికే సుమారు 24,000 కోట్ల రూపాయలను ఎన్‌బీఎఫ్ కంపెనీలకు కేంద్రం వివిధ రూపాల్లో అందుబాటులోకి తెచ్చింది. వచ్చే ఏడాది మే మాసాంతంలోగా మరో 25,000 కోట్ల రూపాయలను మార్కెట్‌లోకి రానుంది. అదే సమయంలో సెక్యూరిటీల మినిమన్ హోల్డింగ్ కాలాన్ని ఏడాది నుంచి ఆరు నెలలకు కుదించడం ద్వారా ఆర్‌బీఐ కొన్ని దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రయత్నాల ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తప్పక ఉంటుందని, త్వరలోనే వృద్ధిరేటు ఆశాజనకంగా మారుతుందని ఆర్థిక వేత్తలు అంటున్నారు. అది ఎంత వరకూ నెరవేరుతుందో చూడాలి.


  0 0

  ముంబయి, డిసెంబర్ 29: గత వారం నష్టాలను ఎదుర్కొన్న స్టాక్ మార్కెట్ ఈవారం ఆరంభంలో ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ ఆతర్వాత క్రమంగా బలపడి, లాభాలతో ముగిసింది. గతవారం మార్కెట్‌కు చివరి రోజైన శుక్రవారం లావాదేవీలు ముగిసే సమయానికి సెనె్సక్స్ 35,742.07 పాయింట్లను నమోదు చేసింది. అయితే, 24వ తేదీన ట్రేడింగ్‌లో భారీగా నష్టపోయిన సెనె్సక్స్ 35,470.15 పాయింట్ల వద్ద ముగిసింది. మరుసటి రోజు క్రిస్మస్ సందర్భంగా మార్కెట్‌కు సెలవుకాగా, బుధవారం సెనె్సక్స్ కొంత బలాన్ని పుంజుకొని, 35,649.94 పాయింట్లకు చేరింది. అంతర్జాతీయ సెంటిమెంట్లు సానుకూలంగా పని చేయడంతో, గురువారం మరింత బలపడిన స్టాక్ మార్కెట్ 32,370.04 పాయింట్లకు ఎగబాకింది. ఈవారం లావాదేవీలకు చివరి రోజైన శుక్రవారం మళ్లీ 36,000 పాయింట్లను అధిగమించింది. గత వారం కంటే మరింత మెరుగుపడి, 36,076.72 పాయింట్ల వద్ద ముగిసింది. రాబోయే కొత్త వారానికి దీనిని శ్రీకారంగా ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. మూడో త్రైమాసికంగా ఈనెల 31వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో, వచ్చే వారం స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉంటుందోనన్న ఆసక్తి అందరిలోనూ కనిపిస్తున్నది.


  0 0

  మెల్‌బోర్న్, డిసెంబర్ 29: టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఆస్ట్రేలియా కెప్టెన్ టీమ్ పైన్ పై స్లెడ్జింగ్‌కు దిగాడు. మూడో టెస్టులో తను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పైన్ ‘్ధని జట్టులోకి వచ్చేశాడు. ఇక బోలెడంతా ఖాళీ. నీకు పిల్లల్ని చూసుకోవడం వచ్చా? నేను ఒక రాత్రి నా భార్యను తీసుకొని సినిమాకు వెళ్తాను. నువు మా పిల్లల్ని చూసుకోగలవా?’ అంటూ రెచ్చగొట్టిన విషయం తెలిసిందే. అయతే అవకాశం కోసం ఎదురుచూసిన రిషభ్ పంత్‌కు ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో ఆ అవకాశం దక్కింది. పైన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మాటల యుద్ధానికి దిగాడు. పక్కనే ఉన్న మయాంక్‌తో ‘మనకు ఈరోజు ప్రత్యేక అతిథి వచ్చాడు. మయాంక్.. నువ్వెప్పుడైనా తాత్కాలిక కెప్టెన్ గురించి విన్నావా?’అని అన్నాడు. అక్కడితో ఆగకుండా స్పిన్నర్ రవీంద్ర జడేజాతో ‘అతడిని అవుట్ చేయడానికి నువ్వు ప్రత్యేకంగా బౌలింగ్ చేయాల్సిన అవసరం లేదు. అతడికి కేవలం మాట్లాడడమే ఇష్టం. అదొక్కటే చేయగలడు.’ అంటూ స్లెడ్జింగ్‌కు దిగాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా బౌలింగ్‌లోనే రిషభ్ పంత్ క్యాచ్ అవుట్ రూపంలో పైన్‌ను పెవిలియన్‌కు పంపారు. ఇదిలాఉంటే ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్‌కు రిషభ్ తిరిగి సమాధానం ఇవ్వడంపై అభిమానులు ట్విట్టర్‌లో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
  పైన్ మంచి అవకాశాన్ని కోల్పోయాడు..
  ముంబై: ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ మంచి అవకాశాన్ని కోల్పోయాడని ఐపీఎల్‌లోని ముంబై ఇండియన్స్ జట్టు పేర్కొంది. మూడో టెస్టులో భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మను సిక్స్ కొడితే తను ఐపీఎల్‌లో ముంబై జట్టుకు ఆడతానని పైన్ రెచ్చగొట్టాడు. ఇవేవీ పట్టించుకోని రోహిత్ బ్యాటింగ్‌పైనే దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ ఘటనపై మీడియాతో మాట్లాడుతూ పైన్ సెంచరీ కొడితే ముంబై ఇండియన్స్ జట్టులోకి తీసుకుంటానంటూ చెప్పాడు. కాగా, పైన్ రెండో ఇన్నింగ్స్‌లో 26 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. దీనిపై ముంబై ఇండియన్స్ జట్టు ‘ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ మంచి అవకాశాన్ని కోల్పోయాడు’ అని స్పందించింది.


  0 0

  పాట్ కమిన్స్, లియాన్ పోరాటంతో నాలుగో రోజు ఆసీస్ ఓటమి నుంచి తప్పించుకుంది. చివరికీ 30 నిమిషాలు ఆట గడువు పొడిగించినా వారు స్కోరు బోర్డును నెమ్మదిగా పరుగెత్తించడంతో భారత్ విజయం కోసం చివరిరోజు వర కు వేచి చూడాల్సి వస్తోంది. భారత్ విజయానికి రెండు వికెట్ల దూరంలో ఉండగా, ఆసీస్ ఓటమి తప్పించుకోవాలంటే మ రో 141 పరుగులు చేయాల్సి ఉంది. లేదా డ్రా కోసమైతే రోజంతా ఆడాల్సి ఉంటుంది. రెండు వికెట్లు మాత్రమే చేతి లో ఉన్న కారణంగా, ఆసీస్‌కు రెండు కష్టమనే చెప్పాలి.


  0 0

  భారత్ తొలి ఇన్నింగ్స్: 443/7 డిక్లెర్డ్.
  ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 151 ఆలౌట్
  భారత్ రెండో ఇన్నింగ్స్: హనుమ విహారి (సీ) ఖాజా (బీ) కమిన్స్ 13; మయాంక్ అగర్వాల్ (బ్యాటింగ్) 28; చతేశ్వర్ పుజారా (సీ) మార్కస్ హర్రిస్ (బీ) కమిన్స్ 0; విరాట్ కోహ్లీ (సీ) మార్కస్ హర్రిస్ (బీ) కమిన్స్ 0; అంజిక్యా రహానె (సీ) పైన్ (బీ) కమిన్స్ 1; రోహిత్ శర్మ (సీ) షాన్ మార్ష్ (బీ) హజెల్‌వుడ్ 5; రిషభ్ పంత్ (సీ) పైన్ (బీ) హజెల్‌వుడ్ 33; రవీంద్ర జడేజా (సీ) ఖాజా (బీ) కమ్మిన్స్ 5; మహమ్మద్ షమీ 0 (నాటౌట్).
  పాట్ కమిన్స్ 3 వికెట్లు
  మొత్తం: 106/8 డిక్లెర్డ్.
  ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: మార్కస్ హారిస్ (సీ) మయాంక్ (బీ) రవీంద్ర జడేజా 13; ఆరోన్ ఫించ్ (సీ) కోహ్లీ (బీ) బుమ్రా 3; ఉస్మాన్ ఖాజా ఎల్‌బీ (బీ) షమీ 33; షాన్ మార్ష్ ఎల్‌బీ (బీ) బుమ్రా 44; ట్రావిస్ హెడ్ (బీ) ఇషాంత్ 34; మిచెల్ మార్ష్ (సీ) కోహ్లీ (బీ) రవీంద్ర జడేజా 10; టీమ్ పైన్ (సీ) పంత్ (బీ) రవీంద్ర జడేజా 26; పాట్ కమ్మిన్స్ (బ్యాటింగ్) 61; మిచెల్ స్టార్క్ (బీ) షమీ 18; నాథన్ లియాన్ (బ్యాటింగ్) 6;
  మొత్తం: 258/8
  *
  చిత్రం..పాట్ కమిన్స్ (61)


  0 0

  మెల్‌బోర్న్, డిసెంబర్ 29: మొదటి రెండు రోజులు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌కు సహకరించిన పిచ్ మూడో రోజు పూర్తిగా బౌలింగ్‌కే సహకరించింది. ఇక మ్యాచ్‌కి కీలకమైన నాలుగో రోజు అట బ్యాటింగ్ కంటే బౌలింగ్‌కే ఎక్కువగా అనుకూలించింది. దీంతో ఇరు జట్లు వెంట వెంటనే వికెట్లు కోల్పోయాయ. కాగా, ఓవర్ నైట్ స్కోరు ఐదు వికెట్లకు 54 పరుగులతో నాలుగో రోజు ఉదయం బ్యాటింగ్ కొనసాగించిన భారత్ త్వరగా వికెట్లు కోల్పోయంది. మయాంక్ అగర్వాల్ (42), రవీంద్ర జడేజా (5) ఔటయ్యారు. 33 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిషభ్ పంత్ పెవిలియన్ చేరాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 292 పరుగులతో కలుపుకొని అప్పటికే మొత్తం 398 పరుగుల ఆధిక్యంలో నిలవడంతో, పంత్ ఔటైన వెంటనే, ఎనిమిది వికెట్లకు 106 పరుగుల వద్ద టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను డికేర్ చేశాడు. ఆసీస్ ముందు 399 పరుగుల లక్ష్యాన్ని ఉంచాడు. కాగా, ఆస్ట్రేలియా బౌలర్లలో పాట్ కమిన్స్‌కు 3, మిచెల్ స్టార్క్ 2, జోష్ హజెల్‌వుడ్, నాథన్ లియాన్‌కు చెరో వికెట్ దక్కింది.
  భారత్ నిర్దేశించిన 399 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఆసీస్‌కు రెండో ఓవర్‌లోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ ఆరోన్ పింఛ్ (3) పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి మొదటి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఉస్మాన్ ఖాజాతో కలిసి మార్కస్ హారిస్ (13) కొద్దిసేపు భారత బౌలర్లను ప్రతిఘటించినా ఫలితం లేకపోయంది. అతను 10వ ఓవర్‌లో రవీంద్ర జడేజా బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్ చేతికి చిక్కాడు. అప్పటికి ఆసీస్ స్కోరు రెండు వికెట్లకు 33 పరుగులు. ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన షాన్ మార్ష్ మరో ఆటగాడు ఉస్మాన్ ఖాజాతో కలిసి అచితూచి ఆడాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 30 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. వీరి భాగస్వామ్యాన్ని షమీ విడదీశాడు. 21వ ఓవర్‌లో చివరి బంతికి ఉస్మాన్ ఖాజా (33) ఎల్‌బీగా పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన ట్రావిస్ హెడ్‌తో కలిసి షాన్ మార్ష్ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 51 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని అందించారు. అయతే, బుమ్రా బౌలింగ్‌లో ఎల్‌బీగా అవుటవడంతో షాన్ మార్ష్ (44) త్రుటిలో అర్ధ సెంచరీని చేజార్చుకున్నాడు. ఇక ట్రావిస్ హెడ్ (34)ను ఇషాంత్ శర్మ బౌల్డ్ చేయడంతో ఆసీస్ ఐదో వికెట్‌ను కోల్పోయంది. తర్వాత క్రీజులోకి వచ్చిన మిచెల్ మార్ష్ (10), కెప్టెన్ టిమ్ పైన్ (27)ను రవీంద్ర జడేజా అవుట్ చేశాడు. ఓవైపు వరుస వికెట్లు పడుతున్నా మరోవైపు పాట్ కమిన్స్ చెలరేగి ఆడాడు. టెయలండర్స్‌తో కలిసి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 70వ ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన షమీ చివరి బంతికి మిచెల్ స్టార్క్ (18)ను బౌల్డ్ చేయడంతో నాథన్ లియాన్ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇన్నింగ్స్ ముగింపు దశకు ముగుస్తుందనగా భారత బౌలర్లను పాట్ కమిన్స్ (61), లియాన్ (6) కొంత సేపు ప్రతిఘటించారు. ఎక్కడా అవకాశమివ్వకుండా నెమ్మదిగా స్కోరు బోర్డును నడిపించి, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి జట్టు స్కోరును 8 వికెట్ల నష్టానికి 258 పరుగులకు చేర్చారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 3, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీకి రెండేసి వికెట్లు దక్కగా, ఇషాంత్ శర్మ ఒక వికెట్ తీసుకున్నాడు.
  చిత్రం..వికెట్ తీసిన ఆనందంలో భారత ఆటగాళ్లు


  0 0

  అమరావతి, డిసెంబర్ 29: ఆంధ్రప్రదేశ్ జెన్‌కోకు తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిపై అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. శనివారం ఉండవల్లి ప్రజా వేదిక సమావేశ మందిరంలో శే్వతపత్రం విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణ సర్కార్ కావాలనే 4వేల కోట్ల పైగా బకాయిలు ఎగ్గొడుతోందని ఆరోపించారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. బకాయిల వసూళ్లకై ఒత్తిడి తేవాలని జెన్‌కో అధికారులను ఆదేశించారు. కోర్టుకు వెళ్లే అంశాన్ని కూడా పరిశీలించాలని సూచించారు. ఇదిలా ఉండగా తుంగభద్ర జలాలపై కర్ణాటక ప్రభుత్వంతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి విలేఖర్లడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జల వివాదాలు మంచివి కావన్నారు. అసలు నదుల అనుసంధానం ప్రక్రియను చేపట్టాల్సింది కేంద్ర ప్రభుత్వమని చెప్తూ వాళ్లు చెయ్యరు..మనల్ని చెయ్యనివ్వరని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తే ఆ నిధులు పోలవరం హైడల్ విద్యుత్ ప్రాజెక్ట్‌కు ఖర్చు పెట్టుకోవచ్చన్నారు. కేంద్రం ప్రాజెక్ట్‌కు నిధులివ్వకపోగా ఏపీకి చెల్లించాల్సిన బకాయిలపై తెలంగాణతో సంప్రతింపులైనా జరపకపోవటంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. రాజధానిలో భూములిచ్చిన రైతులకు అన్నిరకాల చేయూత నందిస్తున్నామని దీనిపై వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. 25 శాతం భూమిని పూలింగ్ రైతులకు అప్పగించి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.


  0 0

  విజయవాడ(సిటీ), డిసెంబర్ 29: టీడీపీలోనే ఎదిగి.. చంద్రబాబు క్యాబినెట్‌లో పని చేసి.. ఎన్నోసార్లు బాబును పొగడ్తలతో ముంచెత్తిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబును విమర్శించే అర్హత లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద శనివారం రాత్రి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడుతూ మాయమాటలతో గెలిచినంత మాత్రాన ఎవరూ గొప్ప వాళ్లు కాలేరన్నారు. కేసీఆర్ ఏం రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడో మేమూ చూస్తామన్నారు. చేసిన అభివృద్ధిపై శే్వతపత్రం విడుదల చేసే ధైర్యం, దమ్ము కేసీఆర్‌కు ఉందా అని ప్రశ్నించారు. సాటి ముఖ్యమంత్రిపై కేసీఆర్ వాడిన భాష దేశంలో ఎవరూ వాడరన్నారు. వృద్ధిరేటులో ఏపీ మొదటి స్థానంలో ఉందనే అక్కసుతో బాబును విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. రెండవ సారి ముఖ్యమంత్రి అయిన తరువాత ఇంత దరిద్రపు భాష ఎవరూ మాట్లాడరని, అలా మాట్లాడే హక్కు కేసీఆర్‌కు ఎవరిచ్చారన్నారు. ఏపీకి హోదా ఇస్తే తెలంగాణకు ఎందుకు నష్టమో, నష్టం అని చెప్పిన హరీష్‌రావు చెప్పాలన్నారు. చంద్రబాబు ఎం తో అభివృద్ధి చేసిన హైదరాబాద్‌ను పోగొట్టుకున్న మాపై ఎందుకింత కక్షన్నారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్‌ను విలీనం చేస్తానని కేసీఆర్ చెప్పలేదా అన్నా రు. తెలంగాణకు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న హామీ ఏమైందన్నారు. కేసీఆర్‌లా మాయమాటలు చేప్పే నాయకుడు దేశంలో మరెవ్వరూ లేరని విమర్శించారు. ఫెడరల్ ఫ్రంట్ పెట్టి ఆర్థిక విధానాలపై మీరు మాకు చెప్పాలా అన్నారు. విభజన గాయంతో, లోటు బడ్జెట్ ఉన్నా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నెంబర్ వన్‌గా ఉంచుతున్నామని గుర్తు చేశారు. వ్యవసాయంలో ఏపీ వృద్ధి రేటు తెలంగాణ కంటే ఎక్కువగా ఉందన్నారు. కేసీఆర్ ఇప్పటి వరకు సాధించిన ప్రగతి, తన రాజకీయ జీవితం ఎంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకరోజు సోనియా కాళ్లు, మరొక రోజు మోదీ కాళ్లు పట్టుకోలేదా అని ప్రశ్నించారు. అమరావతిలో హైకోర్టు కోసం మంచి భవనం కడుతున్న సందర్భంలో నెల రోజుల సమయం కావాలని అడగటంలో తప్పేమందున్నారు. తెలంగాణలో గెలిచిన బలుపుతో ఉన్న కేసీఆర్‌కు అంతకంటే ఎక్కువ మెజారిటీతో ఏపీలో గెలిచి తగిన బదులిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
  కేంద్రాన్ని నిలదీయలేని జగన్ ఒక నాయకుడా?
  కడప ఉక్కు ఫ్యాక్టరీ, ప్రత్యేక హోదాతో పాట విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేని జగన్ ఒక నాయకుడా అని సోమిరెడ్డి ప్రశ్నించారు. గాల్లో తిరుగుతూ జగన్ గాలి మాటలు మాట్లాడుతున్నారని, మేము చేసిన అభివృద్ధిని మాత్రం శే్వతప్రతాల రూపంలో ధైర్యంగా చెబుతున్నట్లు స్పష్టం చేశారు. శే్వతప్రతాలపై వైసీపీ అసత్య ప్రచారం చేస్తున్న వైకాపా తప్పులు నిరూపించే దమ్ము, ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు. మూడేళ్లలో మూడు పార్టీలు మారిన ఆనం రామనారాయణరెడ్డి బ్లాక్ పేపర్లు విడుదల చేస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. మంత్రిగా ఉన్న సమయంలో కమీషన్ల కోసం తన అనుచరులకు కాంట్రాక్టులు ఇప్పించుకున్న ఘనత ఆనందన్నారు. ఆర్థిక మంత్రిగా ఆనం చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలన్నారు. కేంద్ర విధానలతో విసిగే ఉక్కు సంకల్పంతో కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశామన్నారు. రాష్ట్రం ఎన్ని విజ్ఞప్తులు చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. మిగులు రాష్టమ్రని చెబుతున్న తెలంగాణాలో రైతులకు లక్ష రూపాయలు మత్రమే రుణమాఫీ చేశారని, అదే ఏపీలో అప్పుల్లో ఉన్న టీడీపీ ప్రభుత్వం లక్షన్నర మాఫీ చేసిందని గుర్తు చేశారు.


  0 0

  తిరుపతి, డిసెంబర్ 29: నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభాన్ని పురస్కరించుకుని శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈనెల 31, జనవరి 1వ తేదీల్లో శ్రీవారి ఆలయంలో నిర్వహించే వివిధ రకాల ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ పి ఆర్వో డాక్టర్ తలారి రవి శనివారం తెలిపారు. జనవరి 2వ తేదీ నుంచి ఆర్జిత సేవలు యధావిధిగా నిర్వహిస్తామన్నారు. అయితే ప్రోటోకాల్ విఐపీలకు మాత్రమే విఐపీ బ్రేక్ దర్శనాలను పరిమిత సంఖ్యలో అనుమతిస్తామన్నారు. కాగా 31, జనవరి 1 తేదీల్లో రెండు రోజులపాటు కాలినడక వెళ్లే భక్తులకు అందిస్తున్న దివ్యదర్శనం టోకన్లు కూడా నిలిపివేస్తామన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు, చంటి పిల్లల తల్లితండ్రులకు, దాతలకు అందిస్తున్న ప్రత్యేక దర్శన సౌకర్యం కూడా రద్దు చేశామన్నారు. భక్తులు ఈవిషయాన్ని గమనించి టీటీడీతో సహకరించాలని కోరారు.


  0 0

  అమరావతి, డిసెంబర్ 29: గత మూడేళ్లలో ఎన్టీఆర్ గృహ నిర్మాణం కింద మంజూరైన ఆరు లక్షల ఇళ్లలో ఇంకా 60వేల ఇళ్లు ప్రారంభం కాలేదని, వాటిని వెంటనే ప్రారంభించేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఉండవల్లి ప్రజావేదికలో శనివారం కలెక్టర్ల సదస్సులో రెండో సెషన్‌లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇళ్లులేని పేదలు 10లక్షల మందికి పైగా ఉన్నట్లు ఆథార్ లింకేజీని అనుసరించి తెలుస్తోందని, వారందరికీ ఇళ్లు నిర్మించాలనేది ప్రభుత్వ ధ్యేయమని, జన్మభూమిలోగా ఎంతమందికి ఇళ్లులేవో అంచనా వేసి వారందరికీ కార్యక్రమం పూర్తయిన తరువాత గృహమంజూరు పత్రాలు అందించాలని సూచించారు. జనవరిలో మరో 4 లక్షల ఇళ్ల నిర్మాణ పనులకు పునాదులు వేసేలా అధికారులు శ్రద్ధ వహించాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో ఇళ్ల నిర్మాణ పర్యవేక్షణకు గృహమిత్రలను నియమించుకోవాలని సూచించారు. ఒంగోలు, కడప, ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలుగా మారాయని ఈ మూడింటిలో ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. ఇప్పటి వరకు 19,57,429 ఇళ్లు మంజూరు కాగా 7లక్షల 45వేల 430 ఇళ్లు పూర్తయ్యాయి..మరో 11లక్షల 61వేల 812 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి.. ఎన్టీఆర్ గ్రామీణ గృహనిర్మాణం కింద 10,00,086 ఇళ్లు మంజూరు కాగా, 4,06,142 ఇళ్లు పూర్తయ్యాయి. పీఎంఏవై, ఎన్టీఆర్ గ్రామీణ గృహనిర్మాణం కింద 1,20,943 మంజూరు కాగా 43071 పూర్తయ్యాయి. పీఎంఏవై, ఎన్టీఆర్ అర్బన్ కింద 3,86,804కు గాను 69,963 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, హుదూద్ బాధితులకు 9170 ఇళ్లకు గాను 8788 ఇళ్లు పూర్తయినట్లు అధికారులు వివరించారు. కొత్తగా 2.65లక్షల దరఖాస్తులు అందాయని, అర్హులను గుర్తించాలని ము ఖ్యమంత్రి ఆదేశించారు. పాఠశాలల్లో నిర్మించిన మరుగుదొడ్ల నిర్మాణాలకు బకాయి ఉన్న రూ. 100 కోట్లు వెంటనే చెల్లించాలన్నారు. చంద్రన్న బీమా కింద కొత్తగా 56,783 దరఖాస్తులు అందాయని, గత నాలుగేళ్లలో రూ. 2400 కోట్లు అందజేశామని వివరించారు. చంద్రన్న పెళ్లికానుక పంపిణీలో జాప్యం, లోటుపాట్లు, అవకతవకలు జరక్కుండా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు. ముఖ్యమంత్రి యువనేస్తం కింద ఇప్పటి వరకు 3లక్షల 31వేల మందికి రూ.80.77 కోట్లు నిరుద్యోగ భృతి చెల్లించామని తెలిపారు. యువత నైపుణ్యాభివృద్ధికి అన్ని జిల్లాల్లో ప్రాధాన్యత కల్పించాలన్నారు.
  ఫిబ్రవరి నాటికి 352 అన్న క్యాంటీన్లు
  వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి రాష్టవ్య్రాప్తంగా 352 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒకటైనా ఉండేలా చూడాలన్నారు. ఉదయం 350 మందికి అల్పాహారం, 450 మందికి మధ్యాహ్న భోజనంతో పాటు రాత్రిపూట 300 మందికి ఐదు రూపాయలకే భోజనం లభిస్తోందని చెప్పారు.
  ఎన్టీఆర్ వైద్యసేవ పరిధిలోకి ప్రసూతి సేవలు
  తమ ప్రభుత్వం ఇప్పటి వరకు వైద్యంపై తలసరి వ్యయాన్ని తగ్గించ గలిగిందని ఎన్టీఆర్ వైద్యసేవ పరిధిలోకి తొలిసారిగా కాన్పులు చేర్చామన్నారు. ప్రైవేటు ఆసుపత్రులలో కాన్పులకు కూడా ఇది వర్తిస్తుందని తెలిపారు. గత ఏడాది కంటే స్వైన్‌ఫ్లూ 18 శాతం తగ్గిందని చెప్తూ అంటువ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాలన్నింటిలో నూరు శాతం వౌలిక సదుపాయాలు కల్పించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. గతేడాది 1456 అంగన్‌వాడీ కేంద్రాలకు భవనాలు నిర్మించామని అధికారులు తెలిపారు. బాలామృతం, అన్న అమృతహస్తం, మధ్యాహ్న భోజనంపై 90శాతం సంతృప్తి స్థాయి ఉందని దీన్ని కొనసాగించాలని సూచించారు. అనంతరం ఖరీఫ్‌లో కరవు మండలాల్లో చర్యలపై కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం చర్చించారు.


  0 0

  తిథి: 
  బహుళ అష్టమి ఉ.6.56, తదుపరి నవమి రా.తె.5.24, కలియుగం - 5120 శాలివాహన శకం - 1940
  నక్షత్రం: 
  హస్త మ.12.56
  వర్జ్యం: 
  రా.8.40 నుండి 10.12 వరకు
  దుర్ముహూర్తం: 
  సా.04.24 నుండి 05.12 వరకు
  రాహు కాలం: 
  సా.4.30 నుండి 6.00 వరకు
  మేషం: 
  (అశ్విని, భరణి, కృత్తిక 1పా.) ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశముంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించేవారి మాటలు వినరాదు. క్రీడాకారులకు, రాజకీయ రంగాల్లోనివారికి మానసికాందోళన తప్పదు. నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది.
  వృషభం: 
  (కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా నుంటారు. ఇతరులకు ఉపకరించు పనులు చేపడతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు.
  మిథునం: 
  (మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయుట మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలున్నవి. ఆర్థిక పరిస్థితిలో మార్పులుంటాయి. ఋణప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.
  కర్కాటకం: 
  (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) అనారోగ్య బాధలు అధికమవుతాయి. అకారణంగా కలహాలేర్పడే అవకాశాలుంటాయి. అనవసర భయానికి లోనవుతారు. విద్యార్థులు చంచలంగా ప్రవర్తిస్తారు. వ్యాపార రంగంలోనివారు జాగ్రత్తగా నుండుట మంచిది. స్ర్తిలు పిల్లలపట్ల మిక్కిలి శ్రద్ధ వహిస్తారు.
  సింహం: 
  (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలున్నాయి. సన్నిహితులతో విరోధమేర్పడకుండా మెలగుట మంచిది.
  కన్య: 
  (ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) అనుకోకుండా కుటుంబంలో కలహాలేర్పడే అవకాశముంటుంది. అశుభవార్తలు వినాల్సి వస్తుంది. ఆకస్మిక ధననష్టం జరుగకుండా జాగ్రత్త పడుట మంచిది. మనస్తాపానికి గురి అవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు.
  తుల: 
  (చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) కుటుంబానికి సంతోషం. గతంలో వాయిదా వేసిన పనులన్నీ పూర్తిచేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యమేర్పడుతుంది. స్థిర నివాసముంటుంది. వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు.
  వృశ్చికం: 
  (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) నూతన కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధనలాభముంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది, బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొంది, ఆనందంగా కాలక్షేపం చేస్తారు.
  ధనుస్సు: 
  (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.,) శుభకార్యప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభంలో ఆనందంగా ఉంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతులవుతారు. కీర్తి, ప్రతిష్ఠలు అధికమవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
  మకరం: 
  (ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా డబ్బు ఖర్చగుటచే ఆందోళన చెందుదురు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించక తప్పదు.
  కుంభం: 
  (ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంటుంది. వృధా ప్రయాణాలెక్కువ చేస్తారు. బంధు, మిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా నుండుట మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు.
  మీనం: 
  (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తి అవుతాయి.
  Date: 
  Sunday, December 30, 2018
  author: 
  గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి

  0 0

  జిగేల్‌మనే విద్యుత్ వెలుగులు..
  అబ్బురపరిచే సెట్టింగులు..
  కాక్‌టెయిల్ విందులు..
  స్టార్ డీజేల జోష్..
  రాక్‌బ్యాండ్, మ్యూజిక్ నడుమ.. ఉరకలేసే ఉత్సాహంతో యువత నూతన సంవత్సర సంబరాలు జరుపుకుంటుంది. పబ్బులు, హోటల్స్, రిసార్ట్స్ డిసెంబర్ 31 రాత్రి నుంచే మ్యూజిక్‌తో హోరెత్తుతుంటాయి. ‘నయాసాల్’కి ఘన స్వాగతం పలికేందుకు ఖర్చుకు కూడా వెనుకాడరు. సంబరాలు అంబరాన్నంటేలా యువత ఉత్సాహంతో కేరింతలు కొడుతూ గడుపుతుంటారు. కేకులు, బొకేలు, గిఫ్ట్‌లు, నావెల్టీస్ కోసం ఎగబడుతుంటారు. ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలిపి తమ అభిమానాన్ని చాటుకోవడానికి ఎంతకైనా సరే అనే స్థితి అది.. కానీ వెనక్కి తిరిగి చూడాలి. కొత్త సంవత్సరం వేడుకలు చేసుకుంటూనే ఒక్కసారి- గతంలోకి తొంగి చూడాలి. ఎందుకంటే వర్తమానానికి పునాది గతమే కదా..! పాత సంవత్సరం మొదలైనప్పుడు మనం కొత్తగా అప్పుడే ఏవో నిర్ణయాలు చేసుకునే ఉంటాం. తప్పకుండా కొత్త సంవత్సరం నుంచి మన అలవాట్లు, అభిరుచులు మార్చుకుంటామని ఎవరికి చెప్పినా చెప్పకపోయినా మన మనఃసాక్షికి ప్రామిస్ చేసుకునే ఉంటాం. వాటిని మనం ఆ ఏడాది పొడుగునా ఏ మేరకు అమలు చేశామని అవలోకనం చేసుకోవాలి.. మన సంతోషాలు 2019లో మరింత రెట్టింపు కావాలంటే 2018 సంవత్సరపు నిర్ణయాలను మరొకసారి స్మృతిపథంలోకి తెచ్చుకోవాల్సిందే.. చేసిన తప్పొప్పులను నిజాయితీగా అంగీకరిస్తూనే సరికొత్త ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలి. అప్పుడు ఆనందం మరింత రెట్టింపవుతుంది. కాదంటారా?
  కొత్త ఏడాది వేడుకల వెనుక బోలెడు ఆసక్తికర విషయాలు, ఆశ్చర్యపోయే విషయాలు ఉన్నాయి. అవేంటో ఒకసారి చదివేద్దామా..!
  ప్రపంచ చరిత్రలో తొలిసారిగా జనవరి ఒకటిన నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం రోమ్ పట్టణంలో మొదలైనట్లు చరిత్రకారులు చెబుతారు. క్రీస్తు కంటే ముందు 700 సంవత్సరంలో రోమ్ చక్రవర్తి న్యూమా పాంటీలియస్ జనవరి, ఫిబ్రవరి నెలలను కొత్తగా కేలండర్‌లో చేర్చినట్లు చెబుతారు. అంతకుముందు వరకు నూతన సంవత్సరం మార్చిలో మొదలై డిసెంబరుతో ముగిసేది. కేవలం పదినెలల పాటే రోమన్ కేలండర్ కొనసాగేది. ఏడాదిలో ఉండే రోజులన్నీ ఆ పదినెలల్లోనే సర్దుబాటు చేశారు. పాంటీలియస్ చక్రవర్తి జనవరి, ఫిబ్రవరిలను జత చేయడంతో జనవరి ఒకటవ తేదీ నూతన సంవత్సరం తొలిరోజుగా మారింది.
  నెలల పేర్లు..
  * ప్రారంభానికి ఆదిదేవత అయిన రోమ్ దేవత ‘జానూస్’ పేరిట తొలినెలకు ‘జనవరి’ అని నామకరణం చేశారు. జానూస్ దేవుడికి రెండు ముఖాలు ఉంటాయి. అందులో ఒకటి గతం వైపు చూస్తుంటే.. మరోటి భవిష్యత్తు వైపు చూస్తుంటుంది.
  * ‘ఫెరు’ అనే రోమన్ పండుగ పేరు నుంచి ‘్ఫబ్రవరి’ నెల పేరు ఏర్పడింది.
  * రోమన్‌ల యుద్ధ దేవత పేరును అనుసరించి ‘మార్చి’నెల ఏర్పడింది.
  * ‘ఎపెరిర్’ అనే లాటిన్ భాషా శబ్దం నుండి ‘ఏప్రిల్’ నెల పేరు ఏర్పడింది.
  * రోమన్‌ల దేవి పేరు ‘మయిమా’.. ఈ పదం నుండి ‘మే’ నెల ఏర్పడింది.
  * స్వర్గానికి రాణి- ‘జానో’.. ఈ పదం నుండి ‘జూన్’ నెల ఏర్పడింది. * ‘జూలియస్ సీజర్’ పేరు నుంచి ‘జులై’ నెల పేరు వచ్చింది.
  * రోమ్ చక్రవర్తి పేరు ‘అగస్టన్’. ఈ పేరు ఆధారంగా ‘ఆగస్ట్’ నెల పేరు ఏర్పడింది.
  * లాటిన్ భాషలోని ఆధారంగా ‘సెప్టెంబర్’ నెల పేరు వచ్చింది.
  * ‘అకో’ అనే లాటిన్ శబ్దం నుండి ‘అక్టోబర్’ నెల పేరు ఏర్పడింది.
  * ‘నవమ్’ అనే లాటిన్ భాషా శబ్దం నుండి ‘నవంబర్’ నెల పేరు వచ్చింది.
  * ‘డసమ్’ అనే లాటిన్ భాషా శబ్దం నుండి ‘డిసెంబర్’ నెల పేరు వచ్చింది.
  క్రిస్టియన్ శకంలోని మధ్యకాలంలో యూరోప్ ప్రాంతంలో జీసస్ జన్మదినమైన డిసెంబర్ 25న, అలాగే మార్చి 25న నూతన సంవత్సరం జరుపుకునేవారు. 1582లో మరింత కచ్చితత్వంతో గ్రెగేరియన్ కేలండర్ అందుబాటులోకి వచ్చినా కూడా 1752 వరకు బ్రిటీష్ రాజ్యం, అమెరికన్ కాలనీలు మాత్రం మార్చిలోనే నూతన సంవత్సరాన్ని జరుపుకున్నాయి. ఆ తర్వాత క్రమంగా అమెరికా దేశాలు జనవరి ఒకటిన నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం ప్రారంభించాయి. ఫలితంగా ఈ సంప్రదాయం ప్రపంచ దేశాలకు వ్యాపించింది.
  ఆసక్తికర అంశాలు...
  * నూతన సంవత్సరం మొదలయ్యే క్షణంలో ప్రియురాలిని ముద్దుపెట్టుకుంటూ గడపాలని నలభై నాలుగు శాతం మంది అమెరికా యువతీ యువకులు భావిస్తున్నారట.
  * దాదాపు అరవై ఆరు శాతం మంది ఒకటో తేదీన దైవప్రార్థన తప్పనిసరి అంటున్నారు.
  * అమెరికాలో డిసెంబర్ 31 అర్ధరాత్రి గడియారం పనె్నండు కొట్టిన తరువాత ముద్దుతో పవిత్రతను చేకూర్చుకుని, దుష్ట ఆత్మలను తరిమి కొట్టడానికి పెద్దపెద్దగా శబ్దాలు చేస్తారు.
  * ఇంగ్లండులో కూడా నూతన సంవత్సర ప్రారంభ సమయంలో వచ్చే తొలి అతిథి తమకు కానుకలను తెచ్చివ్వాలని కోరుకుంటారు. కానుకలు తెచ్చే వ్యక్తి ముందు ద్వారం నుంచి లోపలికి వచ్చి వెనుక ద్వారం నుంచి నిష్క్రమించడాన్ని సాంప్రదాయంగా పాటిస్తున్నారు. ఆ సమయంలో ఖాళీ చేతులతో వచ్చే అతిథిని లేదా తమంటే ఇష్టపడని వారిని ముందుగా ఇంటి లోపలికి ప్రవేశించకుండా చేస్తారు.
  * నూతన సంవత్సరం వచ్చే క్షణంలో సంబరాల ప్రస్తావనేమీ లేకుండానే నిద్రకే ప్రాధాన్యం ఇస్తున్న వారి శాతం దాదాపు అరవై పైనేనట.
  * నూతన సంవత్సర సంబరాల్లో అత్యధిక ‘వైన్’ను వినియోగించేది అమెరికనే్లనట.
  * మెక్సికన్లు అర్ధరాత్రి 12 గంటలకు 12 ద్రాక్షపండ్లను తింటారు. ఆ వెంటనే ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు.
  * పెరూలో కూడా ఇదేవిధంగా పనె్నండు ద్రాక్షలను తినడంతో పాటు అదనంగా 13వ ద్రాక్షను కూడా తింటారట. కాకపోతే ఆ ద్రాక్ష తమ అదృష్టాన్ని బీమా చేయిస్తుందని వారి నమ్మకం.
  * జపాన్‌లో అయితే నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ తమ ఇంటి ప్రాంగణాన్ని వెదురు బద్దలతో అలంకరించుకుంటారు. వెదురు ఉదాత్తమైన భావాలకు, ఆశయాలకు చిహ్నాలుగా భావిస్తారు.
  * గ్రీస్‌లో అయితే నూతన సంవత్సర ప్రారంభం రోజున బ్రెడ్ పీస్‌లో కాయిన్ ఉంచి.. అందరికీ బ్రెడ్‌ను అందిస్తారు. ఎవరికైతే కాయిన్ ఉన్న బ్రెడ్ ముక్క వస్తుందో వారిని దేవుడు అనుగ్రహించినట్లు భావిస్తారు. అలాగే కొంతమంది ముగిసిపోయిన సంవత్సరంలో తమను బాధపెట్టిన విషయాలను, తప్పులను ఒక పేపర్‌పై రాసి దాన్ని మంటల్లో వేస్తారు. ఈ చర్య ద్వారా తమలోంచి ఆ ప్రతికూలత తొలగించుకున్నట్లు వారు భావిస్తారు.
  * నార్వేలో కూడా కొత్తసంవత్సర ప్రారంభం రోజున రైస్ పుడ్డింగ్‌లో ఆల్మండ్ పెట్టి వండుతారు. ఆ పదార్థాన్ని వడ్డించినప్పుడు ఎవరికైతే ఆల్మండ్ వస్తుందో వారికి ఆ సంవత్సరం సంపద వస్తుందని నమ్ముతారు.
  * సిసిలీలో కొత్తసంవత్సరం రోజున ‘లసగ్న’ను వడ్డిస్తారు. ఇతర నూడిల్స్‌ను వారు ఆ రోజు చేయరు. అది దురదృష్టాన్ని తెస్తాయని వారి నమ్మకం.
  * 2008, 2002, 1991,1980, 1973, 1963, 1952, 1946, 1935, 1924.. ఇలా వీటిలో ఏ సంవత్సరపు కేలెండర్‌నైనా 2019 సంవత్సరపు కేలండర్‌గా వాడుకోవచ్చు. అంటే ఆ రోజుల్లో వచ్చే వారాలు, తేదీలూ అన్నీ ఒకటే..!
  * ప్రపంచమంతా 2019లోకి అడుగుపెడుతుంటే ఇథియోపియాలో మాత్రం ప్రస్తుతం 2011వ సంవత్సరం నడుస్తోంది. ఇథియోపియా వాళ్ల కాలెండర్లో మొత్తం పదమూడు నెలలు ఉంటాయి. పనె్నండు నెలలు.. ఒక్కోటి ముప్ఫై రోజులు ఉండగా.. పదమూడో నెలలో మామూలు సంవత్సరం ఐదు రోజులు, లీపు సంవత్సరంలో ఆరు రోజులూ ఉంటాయట. ఈ నెలను వారు ‘ఇంటర్ కాలరీ నెల’ అంటారు. వాళ్లు నవంబర్ 11న (లీపు సంవత్సరం ముందు ఏడాదైతే 12న) నూతన సంవత్సరాన్ని జరుపుకుంటారు. 2018 అక్టోబరులో వాళ్లు 2011వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. క్రీస్తు జనన సంవత్సరం గురించిన విషయంలో అక్కడ చర్చిలు అనుసరించే లెక్కలకూ, మిగతా దేశాల చర్చిల్లో లెక్కలకూ తేడావల్లే ఇలా జరుగుతోంది.
  * రష్యాలో నూతన సంవత్సర వేడుకల్ని రెండుసార్లు జరుపుకుంటారు. జనవరి ఒకటిన కొత్త కేలండర్ ప్రకారం, రెండోది జనవరి 14న పాత కేలండర్ ప్రకారం.
  * నూతన సంవత్సరాన్ని జనవరి ఒకటిన జరుపుకోని దేశాల్లో చైనా, కొరియా, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, వియత్నాం ఉన్నాయి. ఆయాదేశాల కేలండర్ల ప్రకారం అక్కడ వేడుకలు జరుపుకుంటారు.
  * న్యూయార్క్ టైమ్‌స్క్వేర్ గార్డెన్‌లో నూతన సంవత్సర వేడుకలను జరుపునేందుకు దాదాపు పది లక్షల మంది చేరతారట. అందులో ఐదో వంతు వివిధ దేశాల నుంచి వేడుకలను చూసేందుకు వచ్చేవారేనట. ఇక్కడ దాదాపు 900 కిలోల రంగు కాగితపు ముక్కలను జనంపైకి చల్లుతారట.
  * కొత్త ఏడాది వచ్చిన వెంటనే మనం చూసే వ్యక్తిని బట్టి మంచి లేదా చెడు జరుగుతుందని చాలామంది నమ్ముతారు. అందుకే చాలా దేశాల్లో ఆ సమయంలో కుటుంబ సభ్యులు, ఆత్మీయులతో కలిసి ఉండేందుకు ఇష్టపడతారట.
  * ప్లాండర్స్ (బెల్జియం), నెదర్లాండ్స్‌లో ఏడో శతాబ్దంలో సంవత్సరం మొదటిరోజున బహుమతులు ఇచ్చుకునే సంప్రదాయం మొదలైంది.
  ఎవరు ముందు..?
  ఇక ఒక్కరోజు ఆగితే మనం 2019లోకి ప్రవేశించబోతున్నాం. కానీ కొన్ని దేశాలు మాత్రం మనం 2019లోకి ప్రవేశించినా ఇంకా 2018లోనే ఉంటాయి. అది ఎలాగో.., కొత్త ఏడాది సంబరాలు అందరికంటే ముందు ఎవరు చేసుకుంటారో చూద్దాం..
  * మనకి డిసెంబర్ 31 మధ్యాహ్నం 3:30 నిముషాలు అవుతుండగానే పసిఫిక్ మహాసముద్రంలోని ‘సమోవా’ దేశం 2019లోకి అడుగు పెట్టేస్తుంది. అక్కడ సంప్రదాయ నృత్యాలతో కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతారు స్థానికులు. సమోవాతో పాటు కిరిబాటి దేశ పరిధిలోని క్రిస్‌మస్ ద్వీపంలోనూ ఇదే సమయంలో నూతన సంవత్సర వేడుకలు మొదలవుతాయి.
  * కొత్త ఏడాదిని ఆహ్వానించడంలో మనకంటే అయిదున్నర గంటలు ముందుంటుంది ఆస్ట్రేలియా. తూర్పునున్న దేశాల్లో కొత్త ఏడాది కోలాహలం ఎక్కువ కనిపించేది ఇక్కడే! ‘సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్’ దగ్గర లక్షలమంది వేడుకల్లో పాల్గొంటారు. హార్బర్ పొడవునా అరవై ఐదు కిలోమీటర్ల మేర రాత్రి తొమ్మిదింటి నుంచి 80 వేల రకాల బాణసంచా పేలుస్తూ పండుగ చేసుకుంటారు.
  * సూర్యోదయ భూమి(నిప్సన్)గా పేరున్న జపాన్ మనకంటే మూడున్నర గంటలు ముందే కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతుంది. ఇదే సమయానికి దక్షిణ కొరియాలో కొత్త సంవత్సర సంబరాలు జరుపుతారు. మనకంటే చైనా రెండున్నర గంటల ముందు, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్‌లు ముప్ఫై నిముషాల ముందు కొత్త సంవత్సరంలోకి అడుగుపెడతాయి.
  * కొత్త సంవత్సరంలోకి ‘సమోవా’ తర్వాత ఎనిమిదిన్నర గంటలకు మనం అడుగుపెడతాం. శ్రీలంక కూడా మనతోపాటే అడుగుపెడుతుంది.
  * ఒకటో తేదీ తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు ఒకేసారి 43 దేశాలు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతాయి. వాటిలో జర్మనీ, నార్వే, ఫ్రాన్స్, ఇటరీ, ఐరోపాలతో పాటు కాంగో, అంగోలా, ఆఫ్రికా దేశాలూ ఉన్నాయి.
  * మన తర్వాత అయిదున్నర గంటలకు ఇంగ్లండ్‌లో వేడుకలు మొదలవుతాయి.
  * మనకు ఉదయం 10:30 అయినప్పుడు అమెరికాలోని న్యూయార్క్‌లో కొత్త సంవత్సరం వేడుకలు మొదలవుతాయి. అక్కడ ‘టైమ్ స్క్వేర్’లో జరిగే బాల్ డ్రాపింగ్ సంబరం ఈ వేడుకలకు ప్రధాన ఆకర్షణ. ఆరడుగుల చుట్టుకొలతతో 1070 పౌండ్ల బరువుండే ‘వాటర్‌ఫోర్డ్ క్రిస్టల్ బాల్’ను స్తంభంపై ఉంచుతారు. 11:59 నిముషాలకు ఆ బాల్ కిందకు జారడం మొదలై సరిగ్గా పనె్నండింటికి నేలను తాకుతుంది. అంతే.. ఆ క్షణంలో శుభాకాంక్షల హోరు మిన్నంటుతుంది.
  * చివరిగా అమెరికాలోని ‘సమోవా’తో కొత్త సంవత్సరం వేడుకలు ముగుస్తాయి. ఈ ప్రాంతం అమెరికా పరిధిలోకి వస్తుంది. అప్పటికి భారత్‌లో సాయంత్రం నాలుగున్నర అయ్యుంటుంది. నూతన సంవత్సరం ఆఖరిగా వచ్చేది అమెరికా పరిధిలోని బేకర్, హోవార్డ్ దీవులు. అమెరికా సమోవాకు ఇక్కడికీ గంట తేడా. ఇక్కడ జనావాసాలు ఉండవు. ఒకవేళ ఎవరైనా అక్కడుంటే చివరిగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టేది వారే.. కన్‌ఫ్యూజ్ కాకండి.. పసిఫిక్ మహాసముద్రంలోని ‘సమోవా’లో మొదట నూతన సంవత్సరం ఆరంభమవుతే.. అమెరికాలోని ‘సమోవా’లో ఒకరోజు తర్వాత నూతన సంవత్సరం ఆరంభమవుతుంది. పేర్లు ఒక్కటే కానీ ప్రాంతాలు వేరు..
  * స్వీడన్, ఫిన్లాండ్‌లను ‘మ్యూనియో’ నది విభజిస్తుంది. ఫిన్లాండ్ సమయం, స్వీడన్ కంటే గంట ముందు. ఫిన్లాండ్‌లో నూతన సంవత్సరానికి స్వాగతం పలికిన తరువాత పదిహేను నిముషాలు నడిచి వంతెన దాటితే స్వీడన్లోకి వెళ్లచ్చు. అక్కడ మళ్లీ 2019కి స్వాగతం పలకవచ్చు. ఈ రెండు నగరాల్లోకి యువతకు ఇది భలే సరదా.. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకోడానికి కేవలం పదిహేను నిముషాలు సమయం పట్టడంతో వారు మొదట ఫిన్లాండ్‌లో నూతన సంవత్సర వేడుకలు చేసుకుని తర్వాత స్వీడన్లోకి వెళతారు.
  ‘టాప్ టెన్’ సెలబ్రేషన్స్..
  గడిచిన సంవత్సరానికి ‘గుడ్ బై’ చెప్పి, నూతన సంవత్సరానికి ‘వెల్‌కమ్’ చెబుతూ యావత్ ప్రపంచమంతటా వేడుకలు జరుపుకుంటుంది. మారే ప్రతిరోజూ కొందరిలో అదనపు మార్పును తెస్తే ఇంకొందరిలో ఏ మార్పూ లేకుండా మారుతూనే ఉంటుంది. కొత్త సంవత్సర వేడుకలు, పద్ధతులు పాశ్చాత్యీకరణ అయినప్పటికీ మనిషి వేగంగా పరిణామం చెందుతుండంతో ఇప్పుడు ఈ వేడుకల్లో అందరూ పాల్గొంటున్నారు. చరిత్రలోకి వెళితే గ్రెగేరియన్ కేలండర్ ప్రకారం జనవరి ఒకటి కొత్తసంవత్సరంగా పరిగణించబడుతుంది. దీంతో చెక్ రిపబ్లిక్, ఇటలీ, స్పెయిన్, ఇంగ్లండ్, అమెరికా వంటి చాలా దేశాల్లో జనవరి ఒకటి సెలవుదినంగా జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకల్ని ఘనంగా జరుపుకునే టాప్ టెన్ సిటీస్ ఇవే..
  లండన్
  లండన్ వాసులు థేమ్స్ నదీతీరాన ట్రాఫల్గర్ స్వేర్‌లో బాణసంచా, రంగురంగుల బెలూన్లతో కొత్తసంవత్సరానికి స్వాగతం చెబుతారు.
  పారిస్
  నిత్యం వీధి దీపాల వెలుగుల్లో మురిసిపోయే పారిస్ నగరం నూతన సంవత్సరం నాడు మిరుమిట్లు గొలిపే బాణసంచా వెలుగుల్లో మెరిసిపోతుంది. ఈఫిల్ టవర్ సాక్షిగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి ప్రజలు చాంప్స్ ఎలిసే వీధుల్లో బారులు తీరుతారు.
  మాడ్రిడ్
  యాత్రికుల స్వర్గ్ధామం అయిన స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో ప్రజలు నూతన సంవత్సరాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. తమదైన ప్రత్యేక ఒరవడితో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడం మనల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతుంది. వారు ప్యూర్ డెల్ సోల్ స్వేర్ గడియారం ముందు చేరి ప్రతి ఒక గంట చప్పుడుకు ఒక ద్రాక్ష పండ్లు తింటూ పనె్నండు ద్రాక్షలను సరిగ్గా అర్ధరాత్రి పనె్నండు గంటలకు ముగించి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతారు.
  సిడ్నీ
  కొత్త సంవత్సర వేడుకలకి ప్రసిద్ధిగాంచిన నగరం సిడ్నీ. ఇక్కడ ప్రజలు నదీ తీరాలకు చేరుకుని బాణసంచా కాంతుల్లో వెలిగిపోతూ కొత్త సంవత్సరానికి ఘనంగా ఆహ్వానం పలుకుతారు.
  న్యూ యార్క్
  న్యూ యార్క్ టైం స్కేర్ కొత్త సంవత్సరపు వేడుకలకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ ప్రాంతం అంతా మామూలు రోజుల్లోనే నియాన్ లైట్లతో వెలుగొందుతుంది. ఇక కొత్త సంవత్సరం అంటే చెప్పనక్కరలేదు. ఈ నగరంలో ప్రసిద్ధిగాంచిన బ్రాడ్‌వే, సెవెన్త్ అవెన్యూ ఈ రెండూ ఒకచోట కలిసే టైం స్వేర్‌లోని లక్షల మంది ప్రజలు చేరి పాతకు వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకడం కన్నుల పండుగగా ఉంటుంది.
  లాస్‌వేగాస్
  బాణసంచా వెలుగులతో మిరుమిట్లు గొలిపే లాస్‌వేగాస్‌లోని యంజియం గ్రాండ్, ది బెల్లాగియోలో ప్రజలు ఆనంద పరవశాలతో కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతారు.
  రియో డి జెనిరో
  నూతన సంవత్సర వేడుకలు అత్యంత ఘనంగా జరిగే నగరాల్లో ఒకటి బ్రెజిల్లోని రియో డి జెనిరో. విభిన్న వేషధారణలతో ప్రజలు బీచ్‌లలో, సముద్ర తీరాల్లో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటారు. అర్ధరాత్రి దాటాక నీటి అలల్లోకి పూలను విసురుతూ సముద్ర దేవతల మెప్పును పొందడం చూడటానికి వేడుకలా ఉంటుంది.
  బీరుట్
  బీరుట్ నగరానికి కేంద్ర బిందువైన నెజెమే స్వేర్‌లో ప్రజలు గుంపులుగా చేరి సందడిగా నూతన సంవత్సరాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా 1933 నాటి ఆర్డ్ డెక్ క్లాక్ టవర్‌లో లైట్ షో చూపరులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది.
  టోక్యో
  సూర్యుడు ఉదయించే జపాన్‌లోని టోక్యో నగరం గుడిగంటల చప్పుడుతో కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతుంది.
  క్రిస్‌మస్ ఐలాండ్
  పరిణామ క్రమంలో భాగంగా మొట్టమొదటిసారి జనసంచారం కనిపించిన ప్రాంతాల్లో ఒకటిగా చెప్పుకునే క్రిస్‌మస్ ఐలాండ్‌లో కొత్త సంవత్సరం వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఇక్కడి జనాభా కేవలం ఐదు వేలు మాత్రమే. అందుకే అందరూ కలిసి ఘనంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటారు.
  *
  ఆలోచన.. ఆచరణ..
  కొత్త ఏడాది సందర్భాన్ని ఆరోగ్యానికో, డబ్బుకో, అలవాట్లకో సంబంధించి తీర్మానాలు చేసుకోవడం అమెరికా దేశస్థుల్లో ఎక్కువ. దాదాపు యాభైశాతం మంది ఇలా తీర్మానాలు చేసుకుంటే అందులో సుమారు సగంమంది జనవరి రెండో వారంలోనే వదిలేస్తారట. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ముప్ఫై శాతం మంది నూతన సంవత్సరం సందర్భంగా తమ జీవితంలో మార్పును ఆహ్వానించాలని తాపత్రయపడుతూ న్యూ ఇయర్ రెజల్యూషన్‌ను పెట్టుకొంటున్నారట. ఇలాంటివారిలో ఎక్కువమందికి ‘బరువు తగ్గడం’ అనేదే లక్ష్యం. డబ్బును పొదుపుచేయాలి.. ధూమపానం మానేయాలి.. జిమ్‌కు వెళ్లాలి.. అనేవి రెజల్యూషన్స్‌లో ప్రధాన అంశాలు. ఇలాంటివి మనదేశంలో కూడా మొదలయ్యాయి.
  * కొత్త సంవత్సరం వచ్చిందంటే జిమ్‌లకు పండగే పండగ. మరోపక్క వైన్‌షాపులు, పాన్‌షాపులూ వెలవెలబోతాయి. ఆరోగ్యానికి మేలుచేసే ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుంది. తెల్లారి ఎనిమిదైనా నిద్రలేవని కుర్రాళ్లు, వణికించే చలిని కూడా లెక్కచేయకుండా జనవరి ఒకటిన ఉదయానే్న టంచనుగా జిమ్‌లో వాలిపోతుంటారు. అందుకే మొదటిరోజు ఇలాంటి కేంద్రాలన్నీ సామర్థ్యానికి మించి కిటకిటలాడతాయి. పదిహేను రోజులయ్యేసరికి జనాల సంఖ్య పలచపడుతుంది. ఇక నలభై ఐదు రోజులు గడిచేసరికి ఒకటో తారీఖున జిమ్‌లలో చేరిన వాళ్లలో అరవై శాతం రావడం మానేస్తుంటారని సర్వే చెబుతోంది. మరో నలభై ఐదు రోజులకు ఆ సంఖ్య ఎనభై శాతానికి పడిపోతుంది. ఈ పరిణామానికి అన్నిచోట్లా ప్రధానంగా కనిపించే ఒకే ఒక్క కారణం.. బద్ధకం.
  * ‘ఇదే నా జీవితంలో ఆఖరి సిగరెట్టు..’- డిసెంబరు 31 అర్ధరాత్రి చాలామంది పొగరాయుళ్ల నుంచి వినిపించే మాట ఇది.. ఎక్కువమంది ఒట్టేసి, గట్టున పెట్టేసే జాబితాలో దీనిది రెండో స్థానం. సంవత్సరం మధ్యలోకి వచ్చేసరికి ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండేది పదిహేను శాతం మందే.. ఈ కోవలోకే వస్తుంది ‘మద్యం మానేయాలి’ అనే నిర్ణయం కూడా..
  * ఆరోగ్యానికి విలువిచ్చే వాళ్లంతా జంక్ ఫుడ్‌కీ, నూనె పదార్థాలకూ దూరంగా ఉండాలనీ ఈ రోజే ఒట్టు పెట్టుకుంటారు. నాలుగు రోజులు కాగానే అప్పుడప్పుడూ ఫర్వాలేదని నియమాలను సవరించుకుంటారు. ఇక సెలవులు, పండుగలూ వచ్చినప్పుడు కష్టపడేదే తినడానికైనప్పుడు రాజీపడటం ఎందుకని ఆహార సూత్రాలను పక్కన పెడతారట. దాంతో ఏడాది చివరికి కనీసం పదిశాతం మంది కూడా లక్ష్యాన్ని చేరుకోవట్లేదు. మిగిలిన తొంభై శాతం మంది.. మళ్లీ కొత్తసంవత్సరం వస్తుందిగా అని సర్దిచెప్పుకుంటున్నారు.
  * కేలండర్ మారగానే ఖర్చులు తగ్గించుకుని, పొదుపు మొదలుపెట్టాలన్నది భారతదేశం వంటి దేశాల్లో ఎక్కువమంది తీసుకునే నిర్ణయాల్లో ఒకటి. ఏడాది చివరికల్లా ఇల్లో, కారో కొనాలని కొత్త సంవత్సరం ప్రారంభంలోనే లెక్కలు వేసుకుంటారు. కానీ ఏడాది ముగిసేసరికి అనుకున్న లక్ష్యాన్ని అందుకునేవాళ్ల సంఖ్య ఐదు శాతంలోపే ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి.
  సర్వేలన్నీ ఏం చెప్పినా, మారాలనుకునేవాళ్లకు జీవనశైలి నిపుణులు రెండే విషయాలను సూచిస్తున్నారు.
  ఒకటి.. మంచిపని చేయడానికి సరైన సమయం అంటూ ఏదీ ఉండదని..
  రెండు.. అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోవడానికి సాకులు కాదు, చేరుకోవడానికి కారణాలూ, దారులూ వెతుక్కోవాలని.. *
  జ్ఞాపకాల్లో ఆనందం
  ఇవి పాతవే అయినా గొప్పవి. గత సంవత్సరం జ్ఞాపకాలను పదిల పర్చుకోవచ్చు. అప్పుడప్పుడూ గతాన్ని తిరగేసి ఆనందాన్నీ పొందవచ్చు. కాబట్టి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనుకుంటూ పాత సంప్రదాయాలకు మళ్లీ కొత్తగా తెరతీయండి..
  డైరీలు: న్యూ ఇయర్ అనగానే డైరీలకు బాగా డిమాండ్. తమ జ్ఞాపకాలను పదిల పరచుకునేందుకు ఇవి చక్కటి సాధనాలు. స్నేహితులకు ప్రెజెంట్ చేయడానికి డైరీ కూడా మంచి కానుక. పాకెట్ డైరీల నుంచి పెద్ద డైరీల వరకు వివిధ డిజైన్లలో మార్కెట్లో అందుబాటులో ఉన్న డైరీలు చూడండి. వాటిని చూడగానే ఈ సంవత్సరం నుంచైనా డైరీ రాయాలన్న బుద్ధి పుడుతుంది. మరి అలాంటి డైరీలను ఆత్మీయులకు కానుకలుగా ఇచ్చి తమ జ్ఞాపకాలను పదిల పర్చుకునేలా చేయండి.
  గ్రీటింగ్ కార్డ్స్: శుభాకాంక్షలు చెప్పడానికి రకరకాల గ్రీటింగ్ కార్డ్స్ మార్కెట్లో ఉండనే ఉంటాయి. స్నేహితుల అభిరుచిని అనుసరించి దానికి మీ అభిరుచిని కూడా జతచేసి పంపే గ్రీటింగ్స్ ఒక ఆత్మీయమైన కరచాలనం వంటిది.
  బహుమతులు: ఎదుటివాళ్ళతో మన అనుబంధాన్ని పదేపదే జ్ఞప్తికి తెచ్చేలా చేయడంలో బహుమతులు ప్రముఖ పాత్ర వహిస్తాయి. కలర్‌ఫుల్ గ్రీటింగ్స్‌తో పాటు మీరు కోరిన విధంగా కానుకలను అందించే షాపులు నేడు అంతటా ఉన్నాయి. ఒక్క కానుక ఇస్తే అది చెరగిపోని జ్ఞాపకమై వచ్చే ఏడాదంతా వారి హృదయంలో మీ చోటు పదిలం చేస్తాయి.
  *
  గడచిన ఏడాది కొందరి జీవితాల్లో ఆనందానికి చోటిస్తే మరికొందరిలో అంతులేని వేదనని, రోదనని మిగిల్చి ఉంటుంది. వచ్చే సంవత్సరం అయినా ఆ వేదనలు తొలగిపోయి అంతులేని సంతోషాలు దరిచేరాలని 2018కి ప్రేమ గా వీడ్కోలు పలుకుతూ ఆనందంగా 2019కి ఆహ్వానం పలుకుదాం.


  0 0

  మహబూబాబాద్, డిసెంబర్ 29: మానుకోట రైల్వేస్టేషన్ సమీపంలో నిరంతరం జనసంచారం ఉండే ప్రాంతంలోని గాంధీపార్కులో గల చారిత్రాత్మక బాపూజీ విగ్రహానికి శుక్రవారం రాత్రి ఘోర అవమానం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు అశుద్ధం తలపై వేసి విగ్రహం మోహానికి పులిమారు. శనివారం ఉదయం ఈ జుగుప్సకరమైన చర్యను గుర్తించిన ప్రజలు ఒక్కసారిగా ఆందోళన చెందారు. మహాత్ముని విగ్రహం పట్ల ఇంతటి అసహ్య ప్రవర్తన ఎమిటని ఆగ్రహించారు. వెంటనే బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలంటూ నిరసనకు దిగారు. నేనుసైతం స్వచ్ఛంద సేవాసంస్థ కార్యదర్శి మహ్మాద్ సలీమ బాపూజీ విగ్రహం వద్ద నిరసన దీక్ష ప్రారంభించారు. సలీమ దీక్షకు పలు సంఘాలు, రాజకీయ పక్షాలు మద్దతు నిలవడం ఈ సంఘటన దావానలంలా పట్టణం అంతా వ్యాపించడంతో పెద్దసంఖ్యలో ప్రజలు గాంధీపార్కుకు చేరుకున్నారు. నిరసన విషయం తెలుసుకున్న మహబూబాబాద్ డీఎస్పీ నరేష్‌కుమార్ తన సిబ్బందితో గాంధీపార్కుకు చేరుకున్నారు. విగ్రహాన్ని శుభ్రపరిచి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయగా నిరసనకారులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సలీమ మాట్లాడుతూ.. హైకోర్టు ఆదేశానుసారం గాంధీపార్కును పచ్చటి పార్కుగా తీర్చిదిద్దాలని తమ సంస్థ ఆధ్వర్యంలో 8సంవత్సరాలుగా పోరాడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం వల్లనే ఈ రోజు ఇంతటి దారుణమైన సంఘటనను చూడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాత్కాలిక చర్యలతో దాటవేసే వైఖరి సరైంది కాదని, మహాత్మునికి దేశంలోనే ఎక్కడా ఇంతటి ఘోర అవమానం జరిగి ఉండదని దీనికి నిర్లక్ష్యం వహించిన ప్రభుత్వం యంత్రాంగం బాధ్యత వహించాలంటూ ఆగ్రహించారు. దీంతో స్పందించిన డీఎస్పీ నరేష్‌కుమార్ పార్కు స్థలాన్ని మహబూబాబాద్ పోలీస్‌శాఖ దత్తత తీసుకుంటుందని వచ్చే సంక్రాంతి పండుగ వరకు అందమైన పార్కుగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని, కావాల్సిన అన్ని రకాల రక్షణ చర్యలు చేపడుతామని అన్నారు. మహాత్ముని విగ్రహం ఆ దారుణ పరిస్థితిలో ఎక్కువసేపు ఉండడం సముచితం కాదని అర్ధంచేసుకొని సహకరించాలని ఆందోళనకారులకు సర్దిచెప్పడంతో నిరసనకారులు దిగివచ్చారు. అనంతరం డీఎస్పీ నరేష్‌కుమార్ మున్సిపల్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది సహకారంతో గాంధీజీ విగ్రహాన్ని శుభ్రం చేయించి బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.


older | 1 | .... | 1998 | 1999 | (Page 2000) | 2001 | 2002 | .... | 2067 | newer