Are you the publisher? Claim or contact us about this channel


Embed this content in your HTML

Search

Report adult content:

click to rate:

Account: (login)

More Channels


Showcase


Channel Catalog


older | 1 | .... | 1999 | 2000 | (Page 2001) | 2002 | 2003 | .... | 2069 | newer

  0 0

  కరీంనగర్ టౌన్, ఆగస్టు 29: ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమి ప్రకటించిన ఎజెండాను హైజాక్ చేసి, ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోసారి తన పార్టీని గెలిపించుకున్నాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. శనివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల మేనిఫెస్టోలో తాము పొందుపర్చిన సంక్షేమ పథకాలను కాపీ కొట్టి, టీఆర్‌ఎస్ మేనిఫెస్టో ప్రకటించుకున్నాడని మండిపడ్డారు. కూటమిలోని భాగస్వామ్య పార్టీలకు సీట్లుసర్ధుబాటు చేయటంలోనెలకొన్న జాప్యమే, ఓటమికి కారణమైందని స్పష్టం చేశారు. ప్రజాకూటమి ప్రకటించిన ఎజెండాను 12రోజుల్లో ప్రజల్లోకి భాగస్వామ్య పార్టీలు తీసుకెళ్ళలేకపోయాయని అన్నారు. కూటమిలో కొనసాగే అంశంపై తమ పార్టీలో చర్చ జరుపననున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటై పక్షం రోజులు కావస్తున్నా, ఇప్పటివరకు కేబినేట్ ప్రకటించకపోవటం శోచనీయమని అన్నారు. ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం కూడా చేయకపోవటంతో నిమిత్తమాత్రులుగా మారారని విమర్శించారు. ఇన్నిరోజులు మంత్రివర్గం లేకుండా ప్రభుత్వం కొనసాగటం దేశంలోనే మొదటిసారని, సామాజిక న్యాయంతోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని పదే పదే ప్రకటించిన సీఎం కేసీఆర్, బీసీల రిజర్వేషన్లు తగ్గించి సామాజిక ద్రోహానికి ఒడిగట్టాడని ద్వజమెత్తారు. రాష్ట్రంలో53శాతం ఉన్న బీసీలకు ఇన్నాళ్ళు 34శాతం రిజర్వేషన్లు అమలు చేయగా, తాజాగా సుప్రీంకోర్టు ఉత్తర్వుల పేర 23శాతానికి తగ్గించటం అన్యాయమన్నారు. రిజర్వేషన్లపై స్పష్టత తెచ్చిన అనంతరమే పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కృష్ణా జలాల వినియోగంపై బ్రిజేష్‌కుమార్ కమీషన్ సూచన కనుగుణంగా నడవాలని, ఆలమట్టి ఎత్తు పెంచితే కృష్ణాబేసిన్ పరిధిలోని ప్రాజెక్టులన్నీ ఎండుముఖం పట్టడం తథ్యమన్నారు. దీనిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, అన్ని పార్టీలతో కలిసి కేంద్ర జలవనరుల సంఘాన్ని కలిసి, ఎత్తు పెంచుకుండా అడ్డుకునే యత్నాలు చేయాలని సూచించారు.
  ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి రాంగోపాల్‌రెడ్డి, సహాయ కార్యదర్శి కేదారి, రాష్టక్రార్యదర్శివర్గ సభ్యుడు నర్సయ్యయాదవ్, గూడెపులక్ష్మి, అందెస్వామి, మణికంఠరెడ్డి, కడారు అయిలయ్య, కటికిరెడ్డి బుచ్చన్న, తదితరులు పాల్గొన్నారు.


  0 0

  సూర్యాపేట, డిసెంబర్ 29: జిల్లా కలెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన దుగ్యాల అమోయ్‌కుమార్ ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలపై ప్రత్యేక దృష్టి సారించారు. మిషన్ భగీరథ పనుల పురోగతిపై బాధ్యతలు చేపట్టిన మరునాడే తొలుత శనివారం స్థానిక కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో పనులు నత్తనడకన సాగుతున్న తీరును గుర్తించి సంబంధిత అధికారులపై కొరడా ఝుళిపిస్తూ షోకాజ్ నోటీసులు జారీచేశారు. తద్వారా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్న సంకేతాలిచ్చారు. జాడ్యం వీడి పనులను పరుగులు పెట్టించి ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తిచేసి ప్రతి ఇంటికి నల్లాల ద్వారా స్వచ్ఛమైన మంచినీటిని అందించేలా పనిచేయాలని ఆదేశించారు. పనులపై మండలాల వారిగా పురోగతిని సమీక్షించారు. సూర్యాపేట, చివ్వెంల, తుంగతుర్తి, మద్దిరాల, తిరుమలగిరి, గరిడేపల్లి, పెన్‌పహాడ్, జాజిరెడ్డిగూడెం, నాగారం, హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల్లో పలుచోట్ల అనుకున్న స్థాయిలో పనులు ముందుకు సాగడం లేదన్న విషయాన్ని గుర్తించి అందుకు గల కారణాలను తెలపాలని అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ మార్చి 31 నాటికి ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని ఆదేశించినందున అందుకనుగుణంగా ఇంజినీరింగ్ అధికారులు ముందుకు సాగాలని సూచించారు. ఓవర్‌హెడ్ ట్యాంకులు, పైప్‌లైన్ల నిర్మాణాలపై నిర్లక్ష్యం వహిస్తున్న మద్దిరాల, నడిగూడెం, మునగాల, తుంగతుర్తి ఏఈలకు చార్జ్ మెమోలు జారీ చేయాల్సిందిగా డీఆర్వో చంద్రయ్యను ఆదేశించారు. ట్యాంకుల నిర్మాణ పనులను వేగవంతం చేయడంతోపాటు మిగిలిపోయిన పైప్‌లైన్ పనులను వెంటనే పూర్తిచేసి జనవరి 31లోగా తాగునీటిని సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉంచాలని కోరారు. విధుల పట్ల అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పైప్‌లైన్లలో లీకేజీల సమస్యలు తలెత్తకుండా సక్రమంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. లీకేజీ ఏర్పడిన సందర్భంలో నీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భగీరథ నిర్మాణాల కోసం నియమించిన ప్రత్యేక అధికారులు మండలాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రత్యేక అధికారి ఉదయ్‌కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి పీ.చంద్రయ్య, పరిశ్రమల జీఎం బాబురావు, సీపీవో అశోక్, పౌర సరఫరాల జీఎం రాంపతినాయక్, డీపీవో రామ్మోహనరాజు తదితరులు పాల్గొన్నారు.
  చిత్రం..సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్


  0 0

  వేంసూరు, డిసెంబర్ 29: అసెంబ్లీ ఎన్నికల్లో విజయాన్ని అందుకున్న ప్రజాకూటమి అంతే ఉత్సాహంతో పంచాయతీ ఎన్నికల్లో కూడా ఘనవిజయం సాధించాలన్న ప్రజాకూటమి ఆనందం నీరుగారింది. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పార్టీ మారుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం కావటంతో పార్టీ బలాబలాలను లెక్కించే పనిలో కాంగ్రెస్ పార్టీ కసరత్తుచేస్తోంది. టీఆర్‌ఎస్ పార్టీలో మండల నాయకత్వం చేస్తున్న ఒకరిద్దరి గ్రామాల్లో మినహా, అన్ని గ్రామాల్లో ప్రజాకూటమి తన ఆధిపత్యం సాటింది.గ్రామస్థాయి నాయకులు లేని గ్రామాల్లో సైతం ప్రజాకూటమి ఓట్లు మెజార్టీ రాబట్టింది. ఇప్పటి వరకు సండ్ర ప్రక్కనే ఉంటూ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేయాలని ఆశించిన పలువురు నేతలు సైలెంట్ కావటం అక్కడక్కడ కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీల మధ్య ఒక అవగాహనతో ఎక్కువ పంచాయతీల్లో ఏకగ్రీవం చేసుకొనే ఆలోచన ఉందని కొందరు నేతలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. గతం కంటే పంచాయితీలకు నిధులు తగ్గటం, ఎన్నికల ఖర్చులు పెరగటంతో అన్ని పార్టీల నాయకులు ఏకగ్రీవం వైపుమొగ్గు చూపుతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో మర్లపాడు, వెంకటాపురం, కందుకూరు, లింగపాలెం, పల్లెవాడ తదితర గ్రామాల్లో ఇరవై లక్షలకు పైగా ఖర్చు చేసి గెలిచిన సర్పంచులు మూడు నాలుగు ఎకరాలు అమ్ముకోవటం తప్ప సాధించింది ఏమిలేదని ప్రచారం జరుగుతుంది. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం పది లక్షలు అందిస్తుండగా, వాటికి ఏకగ్రీవంగా ఎన్నుకొనే సర్పంచ్ ఐదు నుంచి పది లక్షలు గ్రామానికి అందించే రీతిలో ప్రతి పాదనలు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. సర్పంచగా పోటీ పడితే గ్రామాభివృద్ధికి అధిక మొత్తంలో ప్రకటించేవారికే పట్టం కట్టాలని కూడా ఓ వర్గం వాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా మండలంలోని 26 గ్రామ పంచాయతీల్లో ఎక్కువగా ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాల సమాచారం. జనరల్ సీట్లు కేటాయించిన గ్రామాల్లో కూడా పోటీలను నివారించేందుకు అవసరమైతే మాజీ మంత్రులు జలగం ప్రసాదరావు, తుమ్మల నాగేశ్వరరావులతో పాటు సంభాని చంద్రశేఖరరావులు కూడా రాజీ చేసేందుకు రంగ ప్రవేశం చేయవచ్చని ప్రచారం ఉంది.

  జనాభా దామాషా ప్రకారం దళితులకు రిజర్వేషన్లు కల్పించాలి
  * దళిత సంఘ నాయకుల డిమాండ్
  జూలూరుపాడు, డిసెంబర్ 29: త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం దళితులకు రిజర్వేషన్లు కల్పించాలని దళిత సంఘ నాయకులు మోదుగు ప్రభాకర్, వేల్పుల నర్శింహారావులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక ఎంపిడివో కార్యాలయంలో ఎంపిడివో విద్యాచందనకు శనివారం వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏజన్సీ ప్రాంతంలో నివసిస్తున్న దళితులకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన రిజర్వేషన్‌లకు ప్రభుత్వం మంగళం పాడిందనాన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దళితులకు 20శాతం రిజర్వేషన్‌లను అమలు చేయాలనే నిబంధనలు ఉన్నా ఎన్నికల కమీషన్ ఏజన్సీ ప్రాంతమైన ఉమ్మడి ఖమ్మం, హైద్రాబాద్, వరంగల్ జిల్లాల్లో 100శాతం పంచాయతీలను రిజర్వేషన్ చేయటం సరైందికాదన్నారు. గ్రామ పంచాయతీ వార్డుల్లో గిరిజన చట్టాలు అమలులోకి వచ్చిన నాటి నుంచి దళితుల జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ అమలవుతున్నా ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో వార్డుల్లో 50శాతం రిజర్వేషన్ మించకుండా కేటాయించటం జరిగిందన్నారు. దళితులకు ఓపెన్ కేటగిరిలో కేటాయించే 50శాతం రిజర్వేషన్‌లలోనే దళితులు పోటీ చేయాలనే నిబంధన విధించటం వలన దళితులకు పోటీ చేసే అవకాశాన్ని కోల్పోతున్నారని అన్నారు. దళితుల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన పోటీ చేసే హక్కును హరించటం రాజ్యాంగాన్ని అవహానించటమేనని అన్నారు. ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లోని సుమారు 80 మండలాల్లో ఏజన్సీ చట్టం అమలులో ఉండటం, వాటి పరిధిలోని వందలాది గ్రామ పంచాయతీలు కలిగి గ్రామాల్లో వార్డు సభ్యులుగా ఎస్సీలు పోటీకి దూరంగా ఉండటం బాధాకరమని అన్నారు. ఎస్సీలకు జరిగిన అన్యాయంపై ఎలక్షన్ కమీషన్, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.


  0 0

  కొత్తగూడెం రూరల్, డిసెంబర్ 29: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని, లేనిపక్షంలో ప్రజలే ప్రభుత్వాన్ని మారుస్తారని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం సాయిబాబు హెచ్చరించారు. శనివారం మంచికంటి భవన్‌లో జరిగిన జిల్లా స్థాయి జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కార్మిక చట్టాలను సవరిస్తూ వారి హక్కులను కాలరాసిందని అన్నారు. కనీసం కార్మికుని ప్రాథమిక హక్కు అయిన సంఘం ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ కూడా లేకుండా చేసిందని ఆరోపించారు. కార్మికులకు కనీస వేతనాలు అమలుచేయటానికి ప్రధాని మోదీకి చేతులు రావటం లేదు కానీ కార్పొరేట్ శక్తులకు వేల కోట్ల రూపాయిల రుణమాఫీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని విమర్శించారు. కార్పొరేట్లకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి తిరిగి వాటిని రికవరీ చేయకపోవటం వలన ప్రభుత్వ రంగ బ్యాంకులు దివాళా తీసాయని, బ్యాంకులను లాభాల బాటలో నడిపించాల్సింది పోయి విలీనం పేరుతో జాతీయ బ్యాంకులను ప్రైవేటు శక్తులకు దాసోహం చేస్తున్నారని దుయ్యబట్టారు. నోట్ల రద్దు, జిఎస్టీ వలన సామాన్యుల బతుకులు వీధినపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ హయాంలో కార్మికులు మూడోసారి సమ్మెకు దిగుతున్నారంటే ప్రభుత్వ దివాళాకోరు విధానాలే కారణమని స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వానికి దిమ్మ తిరిగే విధంగా జనవరి 8,9వ తేదీల్లో జరిగే సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎజె రమేష్, అన్నవరపు సత్యనారాయణ, నాయకులు కొండపల్లి శ్రీ్ధర్, అప్పారావు, బ్రహ్మాచారి, వెంకటమ్మ, అర్జున్, శ్రీను, లిక్కి బాలరాజు, తాటిపర్తి అనిల్, గూడెపుడి రాజు, రమేష్, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.


  0 0

  ఖమ్మం(మామిళ్ళగూడెం), డిసెంబర్ 29: ఆరోగ్యవంతమైన సమాజానికి కృషి చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకురావాలని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. తానా, రోటరిక్లబ్‌లో ఆధ్వర్యంలో శనివారం హెల్దీక్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పెవిలియన్‌గ్రౌండ్ నుండి లకారం ట్యాంక్‌బండ్ వరకు సైకిల్‌మారధాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యంగ ఉంటేనే దేనినైనా సాధించవచ్చునన్నారు. పర్యవరణ పరిరక్షణతో ఆరోగ్యం మమేకమై ఉంటుందన్నారు. లకారం ట్యాంక్‌బండ్ వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతి కార్యాక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మానుకొండూరు ఎమ్మెల్యే రసమయ బాలకిషన్, తాన చైర్మన్ తాళ్ళూరి జయశంకర్, కరువెళ్ళ ప్రవీణ్‌కుమార్, భూషన్‌రావు, రవి, సినినటులు శివ, బాలజి, జ్యోతి, సమీర్, తదితరులు పాల్గొన్నారు.


  0 0

  ఖమ్మం రూరల్, డిసెంబర్ 29: మండలంలోని తనగంపాడు, కస్నాతండా గ్రామాలలో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి శనివారం పర్యటించారు. తనగంపాడు వద్ద ఆకేరుపై నిర్మించనున్న చెక్ డ్యామ్, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని నిర్మించనున్న ప్రదేశాన్ని కందాళ స్థానిక రైతులు, అధికారులతో కలిసి పరిశీలించారు. నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే పంపించాలని ఐబి అధికారి అర్జున్‌ను ఆదేశించారు. అనంతరం కస్నాతండాలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మట్లాడారు. పాలేరు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమి పార్టీలు తన గెలుపుకు చేసిన కృషిని కొనియాడుతూ కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో జరుగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పార్టీ విజయానికి తోడ్పాటునందించాలని కోరారు. మండలంలో అత్యధిక గ్రామపంచాయతీలను గెల్చుకునేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కళ్లెం వెంకటరెడ్డి, కనే్నటి వెంకటేశ్వర్లు, సిపిఐ నాయకులు పుచ్చకాయల కమలాకర్, రామ్మూర్తి, టిడిపి నాయకులు ఉసికల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

  పల్లెపోరుకు రంగం సిద్ధం
  పెనుబల్లి, డిసెంబర్ 29: మండలంలో రానున్న నెలలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో గ్రామాలలో సందడి మొదలైంది. అధికారులు ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి విడుదల చేయటంతో గ్రామాలలో పోటీ చేసే అభ్యర్థులు రిజర్వేషన్ల వారీగా ఎవరి ప్రయత్నాలను వారు ప్రారంభించారు. అధినాయకుల ఆశీస్సుల కోసం ఎవరికివారు పాకులాడుతున్నారు. మండలంలో ఏజెన్సీ ప్రాంతమైన 8 గ్రామ పంచాయతీలు ఎస్టీలకే కేటాయించటంతో ఈ ఏజెన్సీ పరిధిలోని పంచాయతీలను ఏకగ్రీవం చేసుకునేందుకు మండలస్థాయి నాయకత్వం రంగంలోకి దిగి గ్రామస్థాయి నాయకులతో మంతనాలను సాగిస్తున్నారు. మిగిలిన గ్రామపంచాయతీలలో ఎక్కువ స్థానాలలో పంచాయతీలను ఏకగ్రీవం చేసే దిశగా నాయకులు ప్రయత్నిస్తున్నప్పటికి స్థానిక నాయకులు ఇందుకు వ్యతిరేఖంగా ఉంటున్నారు. ఎవరికి వారే తమతమ ప్రాభల్యాలను చాటుకునేందుకు పంచాయతీ ఎన్నికలే ప్రధాన వేధిక కానుండటంతో ఎవ్వరూ ఏక గ్రీవాలకు సుముఖంగా ఉన్నట్లు కన్పించటం లేదు. జనరల్‌కు కేటాయించిన స్థానాలలో ఈ అభిప్రాయం ఎక్కువగా కన్పిస్తుంది. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వైన స్థానాల పట్ల పోటీకి ఎవరూ అంత ఆశక్తి చూపటం లేదు. మండలకేంద్రంలోని నూతనంగా ఏర్పాటైన వీఎం బంజర్ గ్రామపంచాయతీ ఎస్టీకి రిజర్వైనప్పటికి ఇక్కడ ప్రధాన కూడలి కావటంతో ఈ పంచాయతీలో ఏకగ్రీవం అయ్యే సూచనలు కన్పించటం లేదు. కేఎం బంజర్, మర్లకుంట, గణేష్‌పాడు, టేకులపల్లి, భవన్నపాలెం, పార్థసారధిపురం, యడ్లబంజరు, మండాలపాడు, లంకపల్లి లోని మూడు గ్రామపంచాయతీలు రామచంద్రాపురం, ఏరుగట్ల తదితర గ్రామపంచాయతీలు ఏకగ్రీవం చేసేందుకు టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఇతరపార్టీ నాయకులతో మంతనాల సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా ఏజెన్సీ ప్రాంతమైన ఉప్పలచలక గ్రామపంచాయతీని ఎస్టీలకు కేటాయించటంతో అక్కడ విచిత్ర పరిస్థితి నెలకొంది. ఈ గ్రామపంచాయతీలో ఎస్టీ వర్గానికి చెందని ఓటర్లు ముగ్గురే ఉన్నారు. వీరిలో తల్లీ, కొడుకు, కూతురు ఉండగా తల్లి అంగన్‌వాడీ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తుండగా ఆమె కొడుకు చదువుకుంటున్నాడు. ఆమె కూతురు ఒక్కతే పోటీకి సంసిద్ధంగా ఉండటంతో ఉప్పలచలక గ్రామపంచాయతీ ఏకగ్రీవం కావటం తప్పటం లేదు.


  0 0

  గార్ల, డిసెంబర్ 29: బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై మెకాన్ ఇండియా బృందం గార్ల మండలంలో శనివారం రెండోవ రోజు విస్త్రృతంగా పర్యటించారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో పరిశ్రమ నిర్మాణానికి అనువైన స్థలం కోసం రికార్డులు, నీటి వసతికై గార్ల పెద్ద చెరువును పరిశీలించంటంతో పాటు మండలం పరిధిలోని పుల్లూరులో 1200ఏకరాల స్థలాన్ని నిర్ధారించారు. దశాబ్దాలుగా సర్వేలతో కాలయాపన జరుగుతున్న బయ్యారం ఉక్కు పరిశ్రమపై అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వం గత ఎన్నికల్లో హామీనిచ్చింది. పరిశ్రమ ఏర్పాటు చేయాలని మహబూబాబాద్ జిల్లాలో అయా రాజకీయ పక్షాలు, స్వచ్ఛంద సంస్థలు గతంలో పలుమార్లు ఆందోళన కార్యక్రమాలు సహితం నిర్వహించాయి. పరిశ్రమ ఏర్పాటు చేస్తే లభించే ముడి సరుకు, నీటి వసతి, నిల్వ ఉంచేందుకు అనువైన స్థలంపై బృందం సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలన చేశారు. ఈ బృందంలో గనుల శాఖాధికారులు బాలదాస్ నర్సింహారెడ్డి, రవీందర్, నరేష్, ఆర్డీఓ కోమరయ్య, పరిశ్రమల శాఖాధికారి వీరేశం, ఇరిగేషన్ ఏఇ శ్రీకాంత్, రెవిన్యూ సర్వేయర్లు ఉన్నారు.


  0 0

  ఖమ్మం(ఖిల్లా), డిసెంబర్ 29: విజ్ఞానంతోనే దేశాభివృద్ది జరుగుతుందని అందుకు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని నగర ఏసీపీ జి వెంకటరావు అన్నారు. స్థానిక శ్రీనగర్‌కాలనీలోని రెజొనెన్స్ పాఠశాలలో శనివారం ఫినసీడేను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన నమూనాలను, ప్రాజెక్టులను పరిశీలించి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజాభివృద్ధికి విద్యార్థులు ఎంతో దోహదపడతారన్నారు. తమలో దాగిఉన్న విజ్ఞాన నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకురావాలన్నారు. మంచి విజ్ఞాన్ని సాధించాలంటే చిన్ననాటి నుండే ప్రయత్నం అవసరమన్నారు. విద్యార్థులు ఆటపాటలతో విద్యాసముపార్జన చేయాలన్నారు. విద్యార్థులలో సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈలాంటి కార్యక్రమాలు నిర్వహించిన రెజొనెన్స్ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. పాఠశాల డైరెక్టర్ కొండ శ్రీ్ధర్ర్రావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలో దాగిఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి తద్వారా విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌ను అందించడమే తమ పాఠశాల లక్ష్యమన్నారు. అందు కోసం మ్యూజికల్ ఇన్‌స్ట్రామెంట్స్‌తో మ్యూజిక్‌జోన్, ఆర్ట్స్, క్రాఫ్ట్ జోన్, క్రీడా ప్రాంగణ సౌకర్యాలను కల్పిస్తున్నామని తెలిపారు. ఫినసీడేలో విద్యార్థులు రూపొందిని వివిధ ఆకృతులు ఎంతగానో అబ్బురపరచాయి. ఈ కార్యక్రమంలో డైరెకటర్లు ఆర్‌వి నాగేంద్రకుమార్, నీలిమ, కృష్ణవేణి, ప్రిన్సిపాల్ ఎం ప్రసన్నరావు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.


  0 0

  ఖమ్మం(మామిళ్ళగూడెం), డిసెంబర్ 29: జిల్లాలో సమగ్ర ఆరోగ్య సమాచార ప్లాట్‌ఫాం నందు ఆన్‌లైన్ ద్వారా వ్యాధుల సమాచారాన్ని పొందుపరచాలని ఐడిఎస్‌పి డిఎస్‌ఓ డాక్టర్ కోటిరత్నం అన్నారు. శనివారం డిఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయంలో ఆన్‌లైన్ ద్వారా పొందుపరచనున్న ఆరోగ్య సమాచారంపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆన్‌లైన్ ద్వారా సమగ్ర వ్యాది పరిరక్షణ కార్యక్రమంలో వ్యాదుల సమాచారాన్ని ఫాం-ఎస్ సబ్‌సెంటర్లల్లో ఫాం-పిని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో ఫాం-ఎల్‌ను ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో గల ల్యాబ్ ద్వారా ఆన్‌లైన్ చేసే విధానాన్ని వైద్యాధికారులకు శిక్షణ ఇచ్చారు. సబ్‌సెంటర్, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, యు ల్యాబ్‌లకు వారికి కేటాయించిన పాస్‌వర్డు, ఐడిలను వెబ్‌సైట్ ద్వారా ఎలా ఒపెన్ చేయాలి, డేటాను పొందుపరచే విధానాలను ఫవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం డాక్టర్ కోటి రత్నం మాట్లాడుతూ ప్రతిరోజు వ్యాదుల వివరాలన్నింటిని ఆన్‌లైన్ ద్వారా అఫ్‌లోడ్ చేయాలన్నారు. ప్రతిరోజు వైద్యాధికారులు ల్యాబ్‌టెక్నిషియన్లు, ఎఎన్‌ఎంలు తప్పనిసరిగా వ్యాదుల సమాచారాన్ని పొందుపరచాలన్నారు. శిక్షణకు హాజరైన వైద్యాధికారులు మాట్లాడుతూ వైద్యానికి సంబందించిన జాతీయ స్థాయి కార్యక్రమాలు ఉండటంవలన డేటా ఎంట్రీ చేయలేకపోతున్నామని ప్రతి పిఎస్‌ఇ కేంద్రానికి ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ జిల్లా ఎలక్ట్రానిక్ మేనేజర్ దుర్గాప్రసాద్, డిఎంఒ డాక్టర్ సైదులు, డెమో జి సాంబశివారెడ్డి, ఐడిఎస్సీ డేటా మేనేజర్ కృష్ణమోహన్, మైక్రో బయాలాజస్ట్ అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


  0 0

  తల అజిత్ నటించిన ‘విశ్వాసం’పై కోలీవుడ్‌లో భారీ అంచనాలు వున్నాయి. ఇక ఈ చిత్రం టీజర్ వచ్చే ఏడాది న్యూ ఇయర్ జనవరి 1న విడుదల కానున్నట్టు సమాచారం. యాక్షన్ చిత్రాల దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న చిత్రంలో లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్. యాక్షన్ ఎంటర్‌టైనర్ నేపథ్యంలో వస్తున్న చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇప్పటికే చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్‌ను పూర్తి చేసుకుంది. ఒక్క తమిళనాడులోనే 48 కోట్ల బిజినెస్ చేసిందని సమాచారం.
  అయితే చిత్రం అదే డేట్‌కు తెలుగులో విడుదలవుతుందన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు. సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తున్న చిత్రానికి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు.


  0 0

  అజయ్ కతువార్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘మాయం’. ఇషితా షా కథానాయిక. నిషాంత్ దర్శకుడు. ధీమాహి ప్రొడక్షన్స్ పతాకంపై డిఏ రాజు నిర్మిస్తున్నారు. సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ దర్శకుడు పూరి జగన్నాథ్ ట్రైలర్‌ను ఆవిష్కరించి కొత్త హీరోకి అభినందనలు తెలిపారు. పూరి మాట్లాడుతూ మెహబూబా చిత్రంతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన అజయ్ హీరోగా పెద్దస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. దర్శక నిర్మాతలు సినిమాను ప్యాషనేట్‌గా తెరకెక్కిస్తున్నట్టు వాతావరణం చూస్తే అర్థమవుతుందన్నారు. టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. హీరో అజయ్ కతువార్ మాట్లాడుతూ పూరి ప్రోత్సాహంతో మెహబూబాలో నటించానని, స్టార్ డైరెక్టర్ బ్లెస్సింగ్స్, సపోర్టు దక్కడం హ్యాపీగా ఉందన్నాడు. హాలీవుడ్‌లో పనిచేసిన అనుభవంతో తనను తను ప్రజెంట్ చేసుకోడానికి ప్రయత్నించినట్టు చెప్పాడు. మాయం చిత్రం విడుదలకు సిద్ధమవుతోందని, తాను నటించిన ప్రేమదేశం త్వరలోనే విడుదల కానుందన్నాడు. దర్శకుడు మాట్లాడుతూ పూరి చేతులమీదుగా ట్రైలర్ విడుదల కావడం హ్యాపీగా ఉందన్నాడు. వైవిధ్యంతో తెరకెక్కించిన చిత్రం పోస్ట్ ప్రొడక్షన్స్‌లో ఉందని, త్వరలోనే విడుదల చేస్తామని వివరించాడు.


  0 0

  రాశిఖన్నా


  0 0

  సోనమ్‌కపూర్, నేహా ధూపియా, దీపికా పదుకొనె, ప్రియాంక చోప్రాల వివాహం ఈ ఏడాది బాలీవుడ్ సందడిగా సాగింది. ఇదిలా వుంటే మిగిలిన ఎలిజిబుల్ బ్యాచిలర్లను.. బ్యూటీలను వివాహం ఎప్పుడని అడగడం కామనే. ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో ముంబై బ్యూటీ యామీ గౌతమ్‌కు ఇలాంటి ప్రశే్న ఎదురైతే చిర్రుబుర్రులాడింది. పలు హిందీ సినమాలతోపాటుగా తెలుగు సినిమాల్లో కూడా నటించిన యామీ గౌతమ్ స్టార్ హీరోయిన్ ఇమేజ్ సంపాదించుకోలేదు గానీ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపే ఉంది. కెరీర్ కాస్త సో కావడంతో త్వరలో పెళ్లి చేసుకుంటుందనే రూమర్లు కూడా వినిపించాయి. అదే విషయం అడిగితే-నాకు పెళ్లి చేసుకోవాలనే తొందర లేదు.. నన్నొదిలేయండి ప్లీజ్.. అంటూ సమాధానమిచ్చింది. యామి గతంలో బాలీవుడ్ యాక్టరఓ పుల్కిత్ సామ్రాట్‌తో లవ్ ఎఫైర్ నడిపిందని వార్తలు వచ్చాయి. ఈ ఎఫైర్ కారణంగా అప్పటికే పెళ్లయిన పుల్కిత్ తన భార్య శే్వత రోహిర నుండి 2015లో విడాకులు తీసుకోవాల్సి వచ్చిందట. శే్వత అప్పట్లో తమ విడాకులకు యామీనే కారణం అని ఓపెన్‌గా ఘాటు విమర్శలు చేసింది. అప్పటినుండి యామి పెళ్లి మాట ఎత్తడం లేదు.


  0 0

  డి క్రియేషన్స్ పతాకంపై సునీల్ కుమార్ దేశాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉద్ఘర్ష చిత్రం ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఆర్ దేవరాజ్ నిర్మిస్తున్న చిత్రానికి డి మంజునాధ్, రాజేంద్రకుమార్ సహ నిర్మాతలు. ఠాకూర్ అనూప్‌సింగ్, ధన్సిక, కబీర్ దుహనసింగ్, శ్రద్ధాదాస్, తాన్యాహొప్, బాహుబలి ప్రభాకర్, వంశీకృష్ణ తారాగణం. తెలుగు, తమిళం మరియు కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కార్యక్రమంలో హీరోయిన్ ధన్సిక మాట్లాడుతూ సినిమా ద్వారా మళ్లీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వటం సంతోషంగా ఉందని, ఒకేసారి మూడు భాషల్లో నటించడాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకుంటున్నట్టు చెప్పింది. తెలుగు భాష అంటే ఇష్టపడే తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని చెప్పింది. విలన్ దగ్గరనుంచి హీరో తనను ఎలా కాపాడతాడన్న చిన్న ధ్రెడ్‌తో సాగే చిత్ర కథ అందరికీ నచ్చుతుందన్న ఆశాభావం వ్యక్తం చేసింది. ఠాకూర్ అనూప్‌సింగ్ మాట్లాడుతూ తనకు తెలుగులో నాల్గవ సినిమా అని, హీరోగా ఆదరణ దక్కుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశాడు. జాతీయ అవార్డు సాధించిన సునీల్ కుమార్ దేశాయ్‌లాంటి ప్రతిభ కలిగిన దర్శకుడి వద్ద పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పాడు. థ్రిల్లర్ జోనర్‌లో నడిచే సినిమా అందరికీ నచ్చుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశాడు. దర్శకుడు సునీల్ కుమార్ దేశాయ్ మాట్లాడుతూ తెలుగులో తనకు తొలి చిత్రమని, యాక్షన్‌తో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ కథ అన్నారు. పాటల్లేని సినిమాకు త్వరలోనే ట్రైలర్ విడుదల చేస్తామన్నారు.


  0 0
 • 12/30/18--08:02: 10న పేట
 • తెలుగు హక్కులను సొంతం చేసుకున్న అశోక్ వల్లభనేని ‘పేట’ చిత్రాన్ని జనవరి 10న తెస్తున్నట్టు వెల్లడించారు. సర్కార్, నవాబ్‌లాంటి భారీ చిత్రాలకు తెలుగు ప్రేక్షకులకు అందించిన అశోక్, ఇప్పుడు పేటతో హ్యాట్రిక్ అనువాద నిర్మాతగా రికార్డు సృష్టిస్తున్నారు. పేట చిత్రాన్ని తెలుగులో భారీగా విడుదల చేయాలని ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. రజనీకాంత్, కార్తిక్ సుబ్బరాజ్ కాంబోలో వస్తున్న చిత్రానికి, తెలుగులో సూపర్‌స్టార్ ఫాలోయింగ్ హెల్ప్ కానుందన్నారు. సిమ్రాన్, త్రిష, విజయ్ సేతుపతి, బాబీ సింహా, శశికుమార్, మేఘా ఆకాష్‌లాంటి తారాగణంతో తెరకెక్కిన చిత్రానికి అనిరుధ్ సంగీతం సమకూర్చాడు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రం జనవరి 10న సంక్రాంతి చిత్రంగా థియేటర్లకు వస్తోంది.


  0 0

  ఎవరెస్ట్ అంత ఆశలతో పరిశ్రమలోకి అడుగుపెట్టిన కుర్ర హీరోలే బంగారు భవిష్యత్ కోసం తపన పడుతున్నారు. హీరోగా కెరీర్‌ను కొనసాగించే ఆలోచనలతో ఈ ఏడాది అరంగేట్రం చేసిన కుర్రాళ్లకు - వ్యతిరేఖ ఫలితాలే లభించాయి. కాలం కలిసొచ్చి విజయాన్ని అందుకున్న కొందరు -భవిష్యత్‌పై భరోసాతో ఉంటే, బ్యాక్‌గ్రౌండ్‌తో వచ్చిన హీరోల మరో ప్రాజెక్టు పట్టుకోవడం కష్టం కాదులేనన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక అనూహ్యంగా హీరో అయపోయ, చేసిన ప్రాజెక్టుకు సరైన ఫలితాలందనివారే కొత్త ఏడాదిలోనైనా చాన్స్ దక్కకపోతుందా? దశ తిరక్కపోతుందా? అని ఆశగా చూస్తున్నారు.
  ఇండస్ట్రీలో ఏటా సాగే తంతే ఈసారీ కంటిన్యూ అయింది. 2018లో కొత్త టాలెంట్ పరిశ్రమకు బాగానే పరిచయమైంది. పాత నీరు దారిచ్చేయాల్సినంత ఉధృతంగా ఇండస్ట్రీలోకి కొత్తనీరు ఎలాగూ రాదు, రాలేదు కనుక -ఎస్టాబ్లిష్‌డ్ హీరోలకు ఎలాంటి ఇబ్బందీ లేదు. ఇక స్టార్లను చూసి -ఏదోక రోజు అలాంటి అదృష్టం మనకీ పట్టకపోతుందా? అన్న ఆశతో కొత్త హీరోలు వెండితెరవైపు పరుగులు తీస్తూనే ఉన్నారు. గత నాలుగైదేళ్లలో తెలుగు ఇండస్ట్రీలో చిన్న బడ్జెట్ చిత్రాల జోరు పెరిగిన తరువాత -కొత్త కుర్రాళ్లు హీరోలైపోవడం చాలా సులువైపోయింది. అవకాశం వచ్చింది కదా ఓసారి ట్రై చేద్దామని వచ్చేవాళ్లు కొందరైతే, వచ్చిన అవకాశమే ఇండస్ట్రీలో స్టార్‌ని చేసేస్తుందన్న ఆశలతో వచ్చేవాళ్లు ఇంకొందరు. మొత్తానికి స్క్రీన్‌పై కనిపించే చాన్స్‌లు పుష్కలం కావడంతో-ఈ ఏడాదీ కొత్త హీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ నిలదొక్కుకున్నది బహుతక్కువ. ఫ్యాషనేట్‌గా చేసే ప్రాజెక్టుల్లో కొందరికి చాన్స్‌లొస్తే, కాలక్షేపానికి వచ్చే టైపు సినిమాలతో మరికొందరు హీరోలయ్యారు. ఎంచుకున్న కథలు, విడుదలైన సమయాలూ, ప్రమోషన్ తీరు.. ఇలా భిన్న కోణాలు ఆయా ప్రాజెక్టుల భవితవ్యాన్ని నిర్దేశించాయి. ఓపెనింగులను ప్రభావితం చేశాయి.
  హీరోకి ఇమేజ్ లేనపుడు కథే హీరో కావాలి. ఇది తెలుగు సినిమాకు అచ్చొచ్చిన సూత్రం. బలమైన కథను అందిస్తే తప్ప ఆడియన్స్ థియేటర్‌కి వచ్చే పరిస్థితి ఉండదు. ఆడియన్స్‌కి హీరో ముఖం అలవాటయ్యే అవకాశమూ ఉండదు. కథ ఒకింత బలహీనంగావున్నా, స్టార్ హీరో అయితే ఆ బరువును తన భుజాలపై మోసేసిన సినిమాలు అనేక చూశాం. కొత్త హీరోకి అంత సీన్ ఉండదు కనుక -కథతో జిమ్మిక్స్ చేయక తప్పదు. అలాంటి జిమ్మిక్స్‌తో ఈ ఏడాది కొత్త కుర్రాళ్లు కొందరు నిలబడితే, కొంతమంది హీరోలు అలాంటి అవకాశం లేక కూలబడ్డారు. ఆ వివరాలు ఒక్కసారి చూద్దాం.
  ఈ ఏడాది పరిశ్రమకు దాదాపు డజనుకు పైగా హీరోలు పరిచయమయ్యారు. ఆకట్టుకున్న హీరోల్లో మొదటిస్థానం కార్తికేయ సంపాదించుకున్నాడు. ఆర్‌ఎక్స్ 100తో సంచలన విజయాన్ని అందుకుని ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. నిజానికి కార్తికేయ మొదటి సినిమా -ప్రేమతో మీ కార్తీక్. ఆ సినిమా ఉందని ప్రేక్షకులకే తెలీని పరిస్థితి. సో, మొదటి సినిమాగా ఆర్‌ఎక్స్ 100నే చెప్పుకోవాలి. నిజ జీవిత కథ అంటూ బోల్డ్ కంటెంట్‌తో అజయ్ భూపతి తెరకెక్కించిన సినిమాలో ప్రేమకోసం ప్రాణాలు వదిలేసే శివ పాత్రలో కార్తికేయ మెప్పించగలిగాడు. ఇక ఈ ఏడాది ఇండస్ట్రీకి గ్రాండ్‌గా పరిచయమైన మరో హీరో కళ్యాణ్‌దేవ్. మెగాస్టార్ రెండో అల్లుడిగా వెండితెరకు పరిచయమైన కళ్యాణ్ మొదటి సినిమా -విజేత. మామ చిరంజీవి కెరీర్‌కు అనూహ్య బలాన్నిచ్చిన చిత్రం విజేతే. అదే టైటిల్‌తో అల్లుడు కళ్యాణ్‌దేవ్ చిత్రం చేశాడు కానీ, టైటిల్ మిగిలింది తప్ప హిట్టుపడలేదు. ఓవర్ సెంటిమెంట్, కళ్యాణ్‌దేవ్ స్టామినాకు మించిన మెలో డ్రామా వెరసి.. ఫ్యామిలీ ఆడియెన్స్‌ని విజేత ఏమాత్రం మెప్పించలేకపోయింది. దర్శకుడు రాకేశ్ శశి ప్రయత్నలోపం లేనప్పటికీ, ఫాదర్ సన్ సెంటిమెంట్ వర్కవుట్ కాలేదు. మెగా అండదండలు ఉన్నాయి కాబట్టి హీరో కళ్యాణ్‌కు నెక్స్ట్ సినిమా విషయంలో ఢోకా లేదు. ఇక మరో అరంగేట్రం హీరో సుమంత్ శైలేంద్ర. బ్రాండ్‌బాబు సినిమాతో హీరోగా ఎంట్రీఇచ్చిన సుమంత్ ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాడు. అతన్ని హీరోగా పరిచయం చేస్తూ, మారుతి సమర్పణలో ఈటీవీ ప్రభాకర్ దర్శకత్వం వహించిన చిత్రం బ్రాండ్‌బాబు. చెప్పుకోదగిన డిజాస్టర్‌గా మిగిలింది సినిమా. హీరోలకు ఏదోక చిన్న లోపాన్ని కట్టబెట్టి సినిమాలు తీసే మారుతి, ఈసారి హీరోకు బ్రాండ్ పిచ్చి పెట్టి సినిమా చేశాడు. కానీ జనాలకు నచ్చలేదు. అందుకే సుమంత్ శైలేంద్రకు మంచి రిజల్ట్ అందలేదు. కన్నడ రంగానికి చెందిన కనుక, తెలుగులో కాకున్నా కన్నడలో ప్రాజెక్టులు వెతుక్కునే అవకాశం ఉంది. అరంగేట్రం లిస్టులో మరో హీరో అభినయ్. బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ‘హుషారు’తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అభినయ్, ఆకట్టుకునే ప్రయత్నమే చేశాడు. పరిచయమైన నలుగురు కుర్రాళ్లలో లీడ్ రోల్‌లో కనిపించిన అభినయ్ అమాయకత్వం కలబోసిన పాత్రతో మెప్పించాడు. ఈ సినిమాతో ఆఫర్లూ బాగానే వస్తున్నా, నిలదొక్కుకోడానికి చాలా కష్టపడాల్సే ఉంది. మిగిలిన ముగ్గురూ ఓకే అనిపించుకోవడంతో, చిన్న బడ్జెట్ చిత్రాల్లో హీరో పాత్రలు అందుకునే అవకాశం లేకపోలేదు. ఇక శరభ చిత్రంతో పరిచయమైన హీరో ఆకాష్‌కుమార్. ముంబైకి చెందిన ఆకాష్ టాలీవుడ్‌లో సెటిలయ్యేందుకు చేసిన ప్రయత్నం కలిసిరాలేదు. గ్రాఫిక్స్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయానే్న అందుకుంది. డెబ్యూ హీరోగా ఆకాష్‌కు టైం కలిసిరాలేదు. కథ, కథనాలు కాసేపు పక్కనపెట్టినా, పూర్ పర్ఫార్మెన్స్ కూడా అపజయానికి కారణమైంది. కెరీర్‌ను ముందుకు సాగించాలంటే చాలా కష్టపడక తప్పదు. మోహన్ భగత్ -కార్తీక్త్న్రం అంటూ ఇండస్ట్రీకి సింపుల్‌గా వచ్చిన మరో ఇద్దరు కేరాఫ్ కంచరపాలెంలో కనిపించారు. సహజమైన నటనతో ప్రేమలో విఫలమై ప్రేమికులను దూరం చేసుకున్న పాత్రల్లో ఇద్దరూ మెప్పించి విజయాన్ని అందుకున్నారు. వెంకటేష్ మహా డైరెక్షన్‌లో వచ్చిన వైవిధ్యమైన చిత్రంగానూ పేరు రావడంతో, వీళ్లిద్దరే సినిమాకు సెంటర్ అట్రాక్షన్ అయ్యారు. ఈ నగరానికి ఏమైంది చిత్రంతో పరిచయమైన కుర్రాళ్ళు, ఈమాయ పేరేమిటో ద్వారా డెబ్యూ ఇచ్చిన ఫైట్ మాస్టర్ విజయ్ కొడుకు రాహుల్ విజయ్‌లతోపాటు మీడియం, లోబడ్జెట్ చిత్రాల ద్వారా తెలుగు తెరకు వచ్చిన హీరోల సంఖ్య తక్కువేం లేదు. కాని ఎవరూ హీరో అనిపించుకోలేకపోవడం గమనార్హం. క్లుప్తంగా చెప్పాలంటే -ఇంటెన్స్ ఇంపాక్ట్ చూపించిన డెబ్యూ హీరో ఈ ఏడాది లేడనే చెప్పాలి.


  0 0

  భగవంతుని మన చర్మచక్షువులతో సగుణరూపంలో చూడడానికి ఈలోకంలో సనాతన కాలంనుంచి ఋషులు, మహర్షులు ఏర్పాటు చేసిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. ఈ దేవాలయాల్లో కొన్ని మనుష్యులు ప్రతిష్ఠించినవి మరికొన్ని దేవతలు ప్రతిష్ఠించినవిగా చెప్పేవి ఉన్నాయి. ఇవేకాక స్వయంభూ దేవాలయాలుగా కూడా ప్రసిద్ధిచెంది ఉన్నాయి. దేవాదిదేవుడే భక్తుల కోరిక మేరకు వారు కోరుకున్న రూపంలో ప్రత్యక్షం అయి నేడు అర్చామూర్తిగా దర్శనం ఇస్తున్నారు. కోరిన కోర్కెలు నెరవేరుస్తారని కూడా ప్రతీతి ఉంది. దేవాలయాలు శక్తికేంద్రాలు అని కూడా అంటారు. మానసిక ప్రశాంతినిచ్చేవి, బుద్ధి ప్రచోదనం చేసేవి, సమబుద్ధిని ప్రసాదించేవి, సమాజోన్నతికి పాటుపడేలా మనసును మార్చేవి ఈ దేవాలయాలని కొందరు అంటారు.
  ఈ దేవాలయాల్లో ఎందరో భక్తులు భగవంతుడిని పూజించి తరించినవారున్నారు.్భక్తులుగా ఎంతోమంది చరితార్థులైనవారూ ఉన్నారు.
  అసలు భగవంతునికి తరిచి చూస్తే రూపమే లేదు. అవ్యక్తుడాయన.కానీ భక్తుల కోరిక మేరకు వ్యక్తమవుతాడనే పురాణ కథలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ చూస్తే అసలు నిజంగా భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అనే తలంపు వస్తుంది. వెంటనే భగవంతుని లేని ప్రదేశమేముంది అనీ మనకే అనిపిస్తుంది. చరాచర జగత్తునంతా తానే అయి కూడా ప్రాణులను తన మాయతో బంధీలనే చేసే ఆ భగవంతుని ఉనికి తెలుసుకోవాలని ఎంతోమంది ప్రయాసపడ్డారు. అందులో సఫలమయిన వారే ఎక్కువ అనీ చెప్పవచ్చు.
  కానీ సాధారణంగా భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని అనుకొంటే మనకు భాగవతంలోని కొన్ని ఘట్టాలు తలపుకు వస్తాయి.
  భాగవతంలో ప్రహ్లాదుడు ఆయన తండ్రితో ‘ఇందుకలడందు లేడని సందేహము వలదు .’ అంటూ సర్వములోని సర్వేశ్వరుని గూర్చి చెబుతాడు. అట్లానే పురుషసూక్తంలో భగవంతుని గూర్చి ‘పాదోస్యవిశ్వాభూతాని త్రిపాద స్యాంమృతందివి’ ఉంది. అంటే భగవంతుని ఒక్క అంశ జగత్తులోను మిగతా మూడు పాదాలు స్వర్గలోకాదులను ఆక్రమించి ఉన్నాయి.
  కానీ భాగవతంలోని గజేంద్రమోక్షంలో గజరూపంలో ఉన్న ప్రాణి కలడనెండువాడు కలడో లేడో అని సందేహం వెలిబుచ్చి తిరిగి అంతలోనే అఖిలరూపుల్ దన రూపమైనవాడు... ఆదిమధ్యాంతాలు లేని వాడు, దిక్కులేనివారికి తానే దిక్కైన వాడు భక్తుల మొరను ఆలకించేవాడు ఉన్నవాడు ‘అలవైకుంఠ పురంబులో ఆ మూల సౌందబుదాపల... ఉన్నట్టుగానే నా దగ్గరకు వచ్చి నా సంరక్షించాలి అని వేడుకుంటాడు. వేడుకోవడమేకాదు సంరక్షించబడుతాడు అని మనకూ తెలుసు.
  అట్లానే ఈ భగవంతుని ఉనికి గూర్చి బ్రహ్మసూత్ర భాష్యం - పరమాత్మ నిర్గుణ నిరాకారంలో కారణ బ్రహ్మలుగాను, సాకా రం, సగుణరూపంలో కార్య బ్రహ్మలుగాను ఉంటారని చెబుతుంది.
  ఈ సగుణరూపంలో ఉన్న భగవంతుడు పార్వతీ పరమేశ్వరుల రూపాల్లో కైలాసంలోను, రాధాకృష్ణులుగా గోలోకంలోను, శక్తిస్థానంగా మణిద్వీపంలోను ఉంటారని చెబుతుంది. ఇంతమంది ఇన్ని చెప్పినా జగత్తంతా పరివ్యాప్తమై ఉన్న భగవంతుని ప్రతి ప్రాణిలోను చూస్తూ ప్రాణి సేవనే పరమాత్మసేవగా చేయాలనేది నిత్యసత్యం.
  భాగవతాన్ని మనకు అందించిన పోతన గారు ‘లోకంబులు లోకేశులు.... కవ్వలనెవ్వండేకాకృతి వెలుంగు నతనినే సేవింతున్ ’అన్నాడు
  కనుక మనమూ ఆ నిరంజ్యోతికి, పరంజ్యోతికి జోతిలిచ్చి జగత్తంతా జగన్నాథుడే కనుక ప్రతి ప్రాణిని పరమాత్వస్వరూపగా భావించి సేవిద్దాం.


  0 0

  ఆ పుస్తకాల జ్ఞాన ప్రభావంతో, జానకి తన జీవితంలోని దౌర్భాగాన్ని స్పష్టంగా గ్రహించగలుగుతుంది. తనకు మేలు చేసే ఆ చైతన్యాన్ని అందిపుచ్చుకుంటుంది.
  ఎవరి జీవితం వాళ్లకి అమూల్యమయినదనీ, ఆ అమూల్యమైన జీవితాన్ని నీచుల చేతికి అప్పగించకూడదనీ, వ్యక్తి తన భావాల్ని ఎంత ఉన్నతం చేసుకుంటే జీవితాన్ని అంత ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చనీ, అంతటి ఉన్నతమైన వ్యక్తినే జీవితంలోకి ఆహ్వానించాలనీ, కనుక ముందుగా తననితాను అభివృద్ధిపరచుకోకపోతే ఉన్నతంగా బ్రతకలేరనీ జానకి గ్రహిస్తుంది.
  జానకిలో అంతటి అభివృద్ధి కలిగించిన అంశాల్ని చాలా సహజమైన సంఘటనల ద్వారా రచయిత్రి చిత్రీకరించారు.
  స్వతస్సిద్ధంగానే జ్ఞానం వైపు, మంచి వైపు మొగ్గే స్వభావమున్న జానకిని ఈ చైతన్యం, అభివృద్ధి నిరోధకుడూ, నీచుడూ అయిన భర్త అని పిలువబడే వెంకట్రావు నుండి విడిపోయేలా చేస్తుంది.
  రెండు మాసాల గర్భవతిగా, అర్థరాత్రి కట్టుబట్టలతో శారీరకమైన అవస్థతో భర్తనుండి శాశ్వతంగా తెగతెంపులు చేసుకుని పుట్టింటికి వచ్చేస్తుంది జానకి.
  పుట్టింటిదగ్గర అన్నయ్య ప్రేమానురాగాలూ, చైతన్యపూరితమైన చర్యలు, శాంత ఆదర్శమైన ప్రవర్తనలు, మిగిలిన కమ్యూనిస్టు మిత్రుల భావాలూ, స్నేహాలూ, జానకి నూతన జీవితాన్ని ప్రారంభించటానికీ, గత జీవితపు ఆలోచనలనుండి పూర్తిగా బయటపడటానికి ఎంతో తోడ్పడతాయి. ఆ ఆసరాలతో జానకి తనను తాను పూర్తిగా అభివృద్ధి చేసుకుంటుంది అన్ని రకాలుగా. తనను తాను పోషించుకోగల్గిన చిన్న ఉపాధిని ఏర్పాటు చేసుకుంటుంది.
  పెళ్లికి పూర్వం ఆగిపోయిన చదువుని కొనసాగిస్తుంది. పుస్తక పఠనం ఒక నిత్యకృత్యం అవుతుంది ఇంటిలో. ఇటలీ దేశపు ఖగోళ శాస్తవ్రేత్త బ్రూనో జీవితానికి చెందిన పుస్తకం ఆమెకెంతో నచ్చింది. బ్రూనో కనిపెట్టిన సైన్సు విషయాలు మతాధికారులకు కోపం తెప్పిస్తాయి. తను కనిపెట్టిన అంశాలు తప్పని ఒప్పుకుంటే సరేసరి, లేకుంటే మరణశిక్ష విధిస్తామని హెచ్చరిస్తారు వాళ్లు ఆయన్ని. చావుకయినా బ్రూనో సిద్ధపడతాడు గాని అసత్యాలని సత్యాలుగా తను అంగీకరించనంటాడు. అందుకాయన్ని మత ఛాందసవాదులు దారుణంగా తగలబెట్టి చంపేస్తారు. ఆయన జీవితం జానకికి ఎంతో ఆదర్శమనిపిస్తుంది. అందుకే జానకి తన కొడుక్కి బ్రూనో అని పేరు పెట్టుకుంటుంది.
  ఆమె భావాలను గౌరవించే ప్రభాకర్ ఆమె జీవిత భాగస్వామి అవుతాడు. రాజకీయాలంటే ఏమిటో అర్థం చేసుకుంటుంది. రాజకీయ పరిజ్ఞానం ప్రతి వ్యక్తికీ చాలా అవసరమని ఆమె గ్రహిస్తుంది. వ్యక్తిగత అభివృద్ధితో ఒకరో ఇద్దరో అభివృద్ధి కావాల్సిందే గానీ, మొత్తం స్ర్తిల సమస్యలకు పరిష్కారం వ్యవస్థను మార్చటంలో వుందని జానకి గ్రహిస్తుంది. ఆ మార్పు దిశగా తన బాధ్యతను నెరవేరుస్తూ అడుగులు వేస్తుంది. అంతటితో నవల పూర్తవుతుంది.
  నవలంతా సాదాసీదాగా, హుందాగా, నూరు శాతం వాస్తవ సంఘటనలతో, నిజ జీవితంలో తారసపడే పాత్రలతో పూర్తిగా నేలమీద నడుస్తుంది.
  -సశేషం

  రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన
  శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..


  0 0
 • 12/30/18--10:59: అనంతం-23
 • విడతలవారీగా హోరుగాలులు వీస్తున్నట్టు అంతరంగాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి ఆలోచనలు!
  చాంద్‌నీకి అదే శిక్షవెయ్యాలి! అది నికృష్టంగా బ్రతకాలి! నికృష్టంగా చావాలి!
  అడవిన కాచే వెనె్నల్ని, పూచే పువ్వునూ, వీచే గాలినీ ‘నాది’ అని ప్రకటించకుండా ‘మనది’ అని అందరూ అనుభవించినట్టే చాంద్‌నీని అంగడి బొమ్మని చేసి అందరూ అనుభవించాలి!
  దాన్ని ఊరుమ్మడి ఆస్తిగా మార్చాలి.
  గొప్పవాళ్ళని ధిక్కరించిన నేరానికి జోగినిని చెయ్యాలి!
  అపుడు దాని శరీరంమీద అందరికీ హక్కు ఏర్పడుతుంది.
  అలా అది- రసికుల కోర్కెలు తీర్చే యంత్రమై కాముకుల కౌగిళ్ళలో నలుగుతూ మనసు చంపుకొని విటుల కోర్కెలు తీరుస్తూ దంత, నఖక్షతాలకు రక్తం వోడుతూ కూడా,
  అర్థరాత్రీ, అపరాత్రీ తలుపు తట్టే కాముకులను ఆహ్వానించాలి.
  ఎంత ధైర్యం దానికి!
  బాధల్ని దాచుకోవటానికే దానికి చెరువంత గుండె వుంది!
  అనుభవిస్తుంది!
  విచ్చలవిడి శృంగారం లజ్జారహిత సంభోగం ఊరుమ్మడి వ్యభిచారం- జోగిని ఆధ్యాత్మిక విధి అని దైవ కార్యమనీ చెప్పి-
  ఆ పవిత్ర దైవకార్యాన్ని నిష్టగా నిర్వర్తిస్తూ- కామ దహన హోమంలో శరీరాన్ని సమిధగా మారుస్తూ, సుఖ రోగాలతో పుచ్చిపోతూ కూడా-
  ఆధ్యాత్మిక విధిని నిర్వర్తించే ఓర్పు, ఓపిక చాంద్‌నీకిక ఆ దేవుడే ఇవ్వాలి!
  గరుడాచలం ఏమంటాడో?
  చాంద్‌నీని రాగ్యా కోరుకొంటున్నపుడు, దాన్ని జోగినిగా మార్చటానికి ఒప్పుకుంటాడా?
  ఒకవేళ ఒప్పుకోకపోయినా, అనుకున్నది అమలు చేసే శక్తి తనకుంది. ఎమ్మెల్యే హోదా వుంది. సమాజంలో పలుకుబడి వుంది.
  ఆ విషయం తెలిసిన గరుడాచలం ఆఫ్ట్రాల్ ఒక అనాగరిక అడవి పుత్రుడికోసం వ్యతిరేకిస్తాడా తనను?
  వ్యతిరేకించడు.. అవకాశం లేదు!
  నాగరిక-అనాగరిక విభజనలో గరుడాచలం నాగరికుల ప్రయోజనాలే కాపాడుతాడు తప్ప, రాగ్యా పక్షం వహించడు!
  అడవి వాతావరణం ఆనుపానులూ తెలుసు కనుక-
  పక్షి జాతులమీద పరిశోధనలో రాగ్యా అవసరం గరుడాచలానికి వుంది. మందుకూ విందుకూ సాదరు ఖర్చులకూ గరుడాచలం అవసరం రాగ్యాకుంది.
  అది- కార్యకారణ సంబంధం తప్ప ఆ అనుబంధం పరీక్షకు నిల్చేది కాదు!
  పేచీ అల్లా ఇక రాగ్యాతోనే!
  వాడు చాంద్‌నీని కోరుకుంటున్నాడు. మనసా వాచా కర్మణా ఆరాధిస్తున్నాడు. దానితోడితే జీవితంగా భావిస్తున్నాడు. కలువరిస్తూ పలువరిస్తూ పరితపిస్తూ చాంద్‌నీ ధ్యానంలోనే కాలాన్ని వెళ్లదీస్తున్నాడు.
  దాన్ని జోగిన్ని చెయ్యటానికి ఒప్పుకోడు!
  ఒప్పుకోక చెయ్యగలిగిందేమీ లేదు గానీ, రాగ్యాతో వివాదం పెట్టుకుంటే అసలు పని కుంటుపడొచ్చు!
  ఓ అడవి పిల్లమీద ప్రతీకారం తీర్చుకొందుకు కీ.శే.పెద్దిరెడ్డి కొడుకు ఎమ్మెల్యే పెంటారెడ్డి, ప్రభుత్వ పథకాన్ని వమ్ముచేశాడంటే-ఎంత నామర్దా!?
  నయానో భయానో బుజ్జగించో మభ్యపెట్టో రాగ్యా దూరం కాకుండా లౌక్యంగా కార్యం సాధించాలి.
  అందుకు సమర్థుడు గరుడాచలం.
  అతనికోసం ఎదురుచూస్తూ ఒంటరిగా కూర్చొని, ఊసుపోక ‘ప్రగతి పథంలో ఆంధ్రప్రదేశ్’ చదువుతున్నాడు. కీ.శే.పెద్దిరెడ్డికొడుకు ఎమ్మెల్యే పెంటారెడ్డి!
  కొంత సమయం గడిచింది.
  అనుమతితో గరుడాచలం లోపలికొచ్చాడు. ఎమ్మెల్యే ఎదరగాకుర్చీలో కూర్చున్నాడు.
  ‘‘అభవృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్’’ అవతల పెట్టి సొంత విషయంలో కొస్తూ-
  ‘‘రాగ్యా రాలేదా?’’ అని అడిగాడు.
  గరుడాచలం పరధ్యానంగా వున్నాడు. మాట్లాడలేదు.
  ఎమ్మెల్యే అతని వైపు చూశాడు!
  గరుడాచలం వాలకం ఏదోలా వుంది! నీరసించాడు. ఏదో బాధతో వున్నట్టు చెప్పకనే చెప్తోంది అతని మొహం!
  ‘‘అలా ఉన్నావేం?’’ ఎమ్మెల్యే అడిగాడు.
  గరుడాచలం తేరుకొని రుూ లోకంలోకొచ్చాడు. జీవంలేని నవ్వు నవ్వూరుకున్నాడు.
  ‘‘నీకోసమే ఎదురుచూస్తున్నాను. నువ్వూ రాగ్యా కలిసి అడవికి వెళ్లారని తెలిసింది..’’ ఎమ్మెల్యేనే అన్నాడు.
  ‘‘తండా బాట ఎలా జరిగింది’’ గురుడాచలమే అడిగాడు.
  ‘‘ఏదో అలా జరిగిందిలే!’’
  ‘‘నీ మాటల్లో ఏదో గూడార్థం వున్నట్టుంది’’
  ‘‘అలాంటిదేమీ లేదు.. హైదరాబాద్ నుంచి కబురొచ్చింది. ఎంత త్వరగా రెడ్డియా నాయక్ తండా ఖాళీ చేయిస్తే అంత మంచిది..’’
  ‘‘అనుకున్నదే కదా! నొప్పించకుండా చేయించాలని’’
  ‘‘పరిస్థితి యిప్పుడలా లేదు. తండా వాళ్ళు తీవ్రవాదులతో సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఆలస్యం చేస్తే అనర్థాలు జరగొచ్చు!’’
  ‘‘గరుడాచలం ఆలోచనలో పడిపోయాడు!
  ‘‘ఏమిటలా ఆలోచిస్తున్నావ్?’’ ఎమ్మెల్యే అడిగాడు.
  ‘‘నిజమే! త్వరగా ఖాళీ చేయించటమే మంచిదని నాకూ అనిపిస్తున్నది. ఒక్క రాగ్యా తప్ప ఆ తండాలో అందరూ అందరే! ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా బలిసిపోయారు..’’
  ‘‘అలాగా?’’ అంటూ ఆశ్చర్యం ప్రకటించాడు ఎమ్మెల్యే.
  ‘‘మీరన్నట్టు వాళ్ళకి తీవ్రవాదులతో సంబంధాలుంటే అవ్వి ఖచ్చితంగా చాంద్‌నీ ద్వారా ఏర్పడి ఉండాలి’’
  గరుడాచలం వైపు అదోలా చూశాడు ఎమ్మెల్యే!
  అతనలా అన్నాడంటే, చాంద్‌నీ మీద ఎందుకో కోపంతో ఉన్నట్టే! లేకపోతే ఆమెకు తీవ్రవాదులతో సంబంధాలున్నాయనడు.
  మొత్తానికి ఏదో జరిగింది! అదేంటో తెలుసుకొంటేనేగానీ గరుడాచలంతో ఏం మాట్లాడాలో? ఎలా మాట్లాడాలో అర్థం కాదు!
  (ఇంకా ఉంది)


  0 0

  కె.కోటపాడు, డిసెంబర్ 30: పొట్టకూటి కోసం వలస వచ్చిన కుటుంబం అనుమానాస్పద స్థితిలో మరణించడం స్థానికంగా సంచలం సృష్టించింది. ఈ సంఘటనలో భర్త, కుమారుడు, కుమార్తె మృతి చెందగా, భార్య విశాఖ కెజిహెచ్‌లో చికిత్స పొందుతోంది. విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం కె.సంతపాలెం శివారు చంద్రయ్యపేట వద్ద అదే గ్రామానికి చెందిన సబ్బవరపు కన్నంనాయుడు ఐదు నెలల నుండి కోళ్లఫారం నిర్వహిస్తున్నాడు. అనంతగిరి మండలం కివర్ల పంచాయతీ శివారు బుడ్డిగరువు గ్రామానికి చెందిన పాంగి చిన్నారావు తన భార్య ఇద్దరు పిల్లలతో కోళ్లఫారంలో పనిచేస్తూ అక్కడే జీవిస్తున్నారు. యజమాని ఆదివారం ఉదయం కోళ్లఫారానికి వచ్చి చిన్నారావును పిలిచినా పలకకపోవడంతో కిటికీలోనుండి చూడగా చిన్నారావు, భార్య, ఇద్దరు పిల్లలు కిందపడి ఉన్నట్లు కనిపించారు. గ్రామస్థులను వెంటబెట్టుకొని వచ్చి తలుపులు తెరిచి భర్త, పిల్లలు మరణించినట్లు గుర్తించి, చావుబ్రతుకుల్లో ఉన్న పాంగి లక్ష్మిని విశాఖ కెజిహెచ్‌కు తరలించారు. సిపిఎం నాయకులు కేతా దేముడు, సిహెచ్.రాజు మృతుల బంధువులకు న్యాయం చేసే వరకు మృతదేహాలు తరలించరాదని, పోలీసులకు ఫిర్యాదు చేయరాదని భీష్మించుకోవడంతో మధ్యాహ్నం 4 గంటల వరకు మృతదేహాలను తరలించలేదు. దీంతో సిఐ శ్రీనివాసరావు జోక్యం చేసుకొని బంధువులకు నచ్చజెప్పి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చోడవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎ.కోడూరు ఎస్.ఐ. ఎన్.నారాయణరావు, ట్రైనీ ఎస్.ఐ. మహమ్మద్ ఆలీ, చోడవరం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం.శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సమాచారం అందుకున్న మృతుని తల్లి పాంగి వరాలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చోడవరం సిఐ తెలిపారు.

  చిత్రం..మృతి చెందిన పాంగి చిన్నారావు, ఇద్దరు పిల్లలు


older | 1 | .... | 1999 | 2000 | (Page 2001) | 2002 | 2003 | .... | 2069 | newer