Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

రెచ్చిపోయిన మట్కా ముఠా

$
0
0

తాడిపత్రి, డిసెంబర్ 30: అనంతపురం జిల్లా తాడిపత్రిలో నివాసం ఉంటున్న మట్కా డాన్‌ను అరెస్టు చేయడానికి వచ్చిన కడప జిల్లా పోలీసులపై ఆదివారం దుండగులు మూకుమ్మడి దాడి చేశారు. పోలీసుల జీపుపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ ఘటనలో కడప అర్బన్ సీఐ హమీద్ ఖాన్‌తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. తాడిపత్రిలోని విజయ్‌నగర్‌కాలనీలో నివాసం ఉంటున్న రషీద్ స్థానిక ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు. మట్కా కార్యకలాపాలు నిర్వహిస్తూ మట్కా డాన్‌గా పేరుపొందాడు. రషీద్ ఇంటిపై ఆదివారం కడప అర్బన్ సీఐ హమీద్‌ఖాన్, కానిస్టేబుళ్లు నరేంద్రరెడ్డి, ప్రదీప్, ప్రవీణ్‌కుమార్ సాధారణ దుస్తుల్లో దాడి చేశారు. విషయం పసిగట్టిన దుండగులు సీఐ, కానిస్టేబుళ్లపై రాడ్లు, కర్రలతో దాడి చేయగా సీఐ హమీద్‌ఖాన్, కానిస్టేబుళ్లు నరేంద్రరెడ్డి, ప్రదీప్ గాయపడ్డారు. దుండగులు పోలీసులు వచ్చిన బొలెరో వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ఆ వాహనం పూర్తిగా దహనమైంది. తాడిపత్రి పట్టణ సీఐ సురేంద్రనాథ్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులపై దాడులకు పాల్పడిన రషీద్‌ను వెంటనే అరెస్టు చేసి, పోలీసులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ తాడిపత్రి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు స్థానిక గాంధీ సర్కిలో రాస్తారోకో చేపట్టారు. అలాగే స్థానిక ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

చిత్రాలు.. దుండగుల దాడిలో దహనమవుతున్న పోలీసుల వాహనం
*తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఐ హమీద్‌ఖాన్


కేసీఆర్ ..నోరు పారేసుకోకు

$
0
0

అమరావతి, డిసెంబర్ 30: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై చేసిన ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఆదివారం ఉండవల్లి ప్రజావేదికలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తీరుపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలని, అది కోల్పోయి అసభ్యంగా ప్రవర్తిస్తే నాగరిక సమాజం క్షమించదని హితవు పలికారు. ‘ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నావు.. నోరు పారేసుకోవద్దు’ అని కేసీఆర్‌ను హెచ్చరించారు. రాజకీయాల్లో విలువలు ఉంటాయని, అధికారంలో ఉన్న వ్యక్తులకు హద్దులుంటాయన్నారు. ప్రత్యర్థి పార్టీల విధానాలను విమర్శించటంలో తప్పులేదని, అయితే ఇష్టానుసారం వ్యక్తిగత ఆరోపణలు చేయటం మంచిపద్ధతి కాదన్నారు. ‘ప్రధాని మోదీని గాడు అన్నా, సన్నాసి అన్నా కౌగిలించుకుంటారు. నాజోలికి మాత్రం రావద్దు. నేను దేనికీ భయపడను. బెదిరింపులు, బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు లొంగే ప్రసక్తే లేదు’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. కేసీఆర్ దారుణంగా మాట్లాడుతుంటే వైసీపీ నాయకులు వారికి ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. బానిసత్వానికి, ఊడిగానికీ హద్దులు ఉంటాయన్నారు. ‘నా రాజకీయ జీవితం అంతా విలువలతో కూడినది. ఎవరు చులకనగా మాట్లాడినా హుందాగా సంయమనం పాటించా. సహనం కోల్పోలేదు, సమస్యలపై ఎక్కడా రాజీపడలేదు’ అని చెప్పారు. ‘నువ్వెక్కడి నుంచి ఊడిపడ్డావు? నీకు రాజకీయ జీవితం ప్రసాదించింది తెలుగుదేశం పార్టీ కాదా?’ అని కేసీఆర్‌ను నిలదీశారు. ‘ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంతో 2004లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తే ప్రజలు తిరస్కరించారు. 2009లో నా దగ్గరకే వచ్చి ఎన్ని సీట్లిచ్చినా సర్దుకుంటామని చెప్పావు. 40 సీట్లిస్తే 10 సీట్లలో మాత్రమే గెలిచావు గుర్తులేదా?’ అని ప్రశ్నించారు. తెలంగాణ ఇస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని ఢిల్లీలో ప్రకటించి ఆపై ఎన్నికల్లో
ఆ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేయటం, ఇప్పుడు మోదీని మోయటం అవకాశవాద రాజకీయం కాదా? అని విమర్శించారు. ‘ఏపీలో వైసీపీ తరపున ప్రచారం చేస్తానంటున్నావు. మోదీ, నువ్వు, వైసీపీ కలిసి ప్రచారం చేసుకోండి. మాకేం అభ్యంతరం లేదు’ అని తేల్చిచెప్పారు. ఇక ముసుగు తొలగిస్తే మంచిదని సలహా ఇచ్చారు.
* మోదీని నమ్మితే మోసగించారు
కాంగ్రెస్ పార్టీ అశాస్ర్తియ విభజన చేసిందని తాము వ్యతిరేకించామని, మోదీని నమ్మితే మోసగించారన్నారు. కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకుని ఏపీకి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కలుస్తున్నామని, ఇందులో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోదీ తీరు వల్ల కేంద్రంలో వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టాయని, ప్రజాస్వామ్య మనుగడకు ముప్పొచ్చిన నేపథ్యంలో బీజేపీయేతర పార్టీలను ఏకం చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనే తహతహతో ఒడిశా వెళ్లి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ మానసిక ఆందోళనలో ఉన్నారని విమర్శించారు. విభజన తరువాత కేంద్రం ఏమిచ్చిందో తెలుసా? అని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్ సహా 11 ఈశాన్య రాష్ట్రాలకు ఎక్కువ నిధులిచ్చి రాజధాని కూడాలేని ఏపీకి న్యాయం చేయాల్సిన బాధ్యత లేదా? అన్నారు. సచివాలయాన్ని డయాగ్రిడ్ టెక్నాలజీతో మేం నిర్మిస్తుంటే దానిపై విమర్శలు చేయటం ఏమిటని నిలదీశారు. ‘మీ సొంతింటికి మాత్రం 300 కోట్లు కావాలి. మా రాజధాని నిధుల్లో లెక్కలా? మోదీని మీరు మోస్తే మోయండి. మేం చివరివరకు రాజీపడబోం’ అని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినకుండా ప్రపంచ స్థాయిలో రాజధాని నిర్మాణాన్ని చేపట్టటం తప్పెలా అవుతుందన్నారు. తనపై ఉంచిన విశ్వాసంతో స్వచ్ఛందంగా 35వేల ఎకరాల భూమిని ప్రజలు అందించారని, కేసీఆర్ సొంత నియోజకవర్గంలో ఓ రిజర్వాయర్ నిర్మాణానికి ఎకరం భూమి సేకరించలేకపోయారన్నారు. కేంద్రం, తెలంగాణ సహకరించకపోయినా మేం పోలవరంతో సహా ప్రాజెక్ట్‌లు పూర్తి చేస్తున్నామన్నారు. నువ్వు లక్ష కోట్లు పెట్టి ఏ ప్రాజెక్ట్ పూర్తిచేశావో వివరించాలని డిమాండ్ చేశారు. ఐటీని ప్రోత్సహించింది రాజీవ్ గాంధీ అని, అయితే హైదరాబాద్‌లో ఈ రంగానికి పునాది వేసింది మాత్రం తెలుగుదేశం హయాంలోనే అని చెప్పారు. అప్పుడు కేసీఆర్ తనవెంటే ఉన్నారని గుర్తుచేశారు. అయితే ఫౌండేషన్ వేసింది జనార్దనరెడ్డి కాదన్నారు. శే్వతపత్రాలు ఇప్పుడు కొత్తేమీ కాదని, 1995లోనే విడుదల చేశామన్నారు. అప్పుడు కూడా కేసీఆర్ తమ ప్రభుత్వంలోనే ఉన్నాడని, జన్మభూమి కమిటీలపై పొగడ్తలు చేశారని వ్యాఖ్యానించారు. తెలుగువారి కోసం సంపద సృష్టించి నాడు హైదరాబాద్, నేడు అమరావతిని అభివృద్ధి చేస్తున్నామని, మోదీ 12ఏళ్లలో గుజరాత్‌కు ఏంచేశారో అక్కడి ప్రజలకు తెలుసన్నారు. తిడుతున్నందుకే కేసీఆర్‌ను పరిణతి చెందిన వ్యక్తిగా మోదీ అభినందించి ఉంటారని ఎద్దేవా చేశారు. ఏపీ అభివృద్ధి చెందితే ఉనికికే ప్రమాదం వస్తుందని మోదీ, కేసీఆర్, జగన్ కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. నందమూరి హరికృష్ణ మృతిచెందిన సమయంలో ప్రభుత్వపరంగా సహకరించాలని కేసీఆర్‌ను కోరామని, అదే సందర్భంలో కలిసుంటే తెలుగు రాష్ట్రాలు మరింత అభివృద్ధి సాధిస్తాయనే అభిప్రాయం వ్యక్తం చేస్తే దానికీ వక్రభాష్యం చెపుతున్నారని ఆక్షేపించారు.
ప్రత్యేక హోదా వద్దనలేదు
ప్రత్యేక హోదా వద్దని తాను అనలేదని, అందుకు సమానంగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పి అదికూడా ఇవ్వకుండా కేంద్రం వంచించిందని చంద్రబాబు గుర్తుచేశారు. అసలు హక్కుపరంగా రావాల్సిన వాటిని కూడా మంజూరు చేయటం లేదని, ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకే ఎన్డీఏ నుంచి వైదొలగామని పునరుద్ఘాటించారు. ‘విశాఖలో ఎయిర్‌షోను చివరి క్షణంలో రద్దు చేయటం అవమానం కాదా? మాది ఏమైనా శత్రుదేశమా? మేం పన్నులు కట్టటం లేదా? కుట్రలు, కుతంత్రాలకు భయపడేది లేదు’ అని స్పష్టం చేశారు. అదేమంటే ఓటుకు నోటు కేసు తెరపైకి తెస్తున్నారని, మీరు ఒక కేసు పెడితే.. మేం నాలుగు కేసులు పెడతామని హెచ్చరించారు. ఎలుగబంటి సూర్యనారాయణ కేసు నుంచి తప్పించుకునేందుకు కేసీఆర్, అక్రమాస్తుల కేసు నుంచి గట్టెక్కేందుకు జగన్ మోదీకి మొక్కుతున్నారని ఆరోపించారు. మోదీ కోసం కేసీఆర్, జగన్ కలిసి పని చేస్తున్నారని విమర్శించారు. బంగారు గుడ్డుపెట్టే తెలంగాణను తాము వదిలి వచ్చినా ఎందుకంత అక్కసని ప్రశ్నించారు. ఎన్నికలు పూర్తయినా కేబినెట్ ఏర్పాటు చేసుకోలేని కేసీఆర్ తనని విమర్శించటం చేతకానితనమన్నారు. తెలంగాణ అభివృద్ధిపై దృష్టి పెట్టని కేసీఆర్, దేశాభివృద్ధి పట్టని మోదీ ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. రాజధాని శంకుస్థాపన సమయంలో మట్టి, నీరు విదిల్చి మోసగించిన మోదీని వైసీపీ ఎందుకు ప్రశ్నించదని నిలదీశారు. రిటర్న్ గిఫ్ట్ ఎంత బలంగా ఉంటే అంతే స్థాయిలో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. వివాదాలు ఎందుకని వౌనంగా ఉంటే అలుసుగా తీసుకుంటున్నారని, కేసులు చూపించి బెదిరించటం అలవాటుగా మారిందన్నారు. ఇకపై ఇలాంటి వ్యవహారాలకు స్వస్తి పలుకుతామన్నారు. మోదీతో పాటు మిడిల్ మోదీగా కేసీఆర్, జూనియర్ మోదీగా జగన్ ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.
చిత్రం..ఉండవల్లి ప్రజావేదికలో విలేఖరుల సమావేశంలో
మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

ఆర్థిక ఫలాలు అందరికీ

$
0
0

అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. శరవేగంతో జరుగుతున్న అభివృద్ధి పనులపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి రాజధానితో భావోద్వేగ సంబంధం ఉండేలా చూడాలన్నారు. రాష్ట్ర ప్రజలు, ప్రత్యేకించి గ్రామీణులు రాజధాని అమరావతిని సందర్శించాలని, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని తెలుసుకునేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఆదివారం సీఆర్డీఎ అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో రాజధాని నిర్మాణ పనులపై ఆయన దిశానిర్దేశం చేశారు. అమరావతితో ప్రజలకు భావోద్వేగ బంధం ఉందన్నారు. రాజధాని లేకుండా రాష్ట్రాన్ని విభజించినా, ప్రపంచ స్థాయిలో ప్రజా రాజధాని నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రజలంతా అమరావతిలో తమ పిల్లల బంగారు భవిష్యత్‌ను ఊహించుకుంటున్నారని, ప్రభుత్వం అమరావతిని ప్రపంచంలోనే ఐదు నగరాల్లో ఒకటిగా నిలిపి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలనే కృతనిశ్చయంతో ఉందన్నారు. ప్రభుత్వంపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. రాష్టవ్య్రాప్తంగా వేలాదిమంది ప్రజలు పోలవరాన్ని సందర్శించి నిర్మాణ పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. అదేవిధంగా గ్రామాల నుంచి అమరావతికి సందర్శకులను తీసుకురావటం, వారు సంతోషం వ్యక్తం చేయటం తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. అమరావతిలో శరవేగంగా జరుగుతున్న వివిధ నిర్మాణాలకు సంబంధించి ప్రజల్లో అవగాహన
కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. 2019లో అమరావతిలో అద్భుత అభివృద్ధిని చూస్తారని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిందని గుర్తుచేశారు. రోడ్లు, భవనాలు నిర్మిస్తే సరిపోదని, ఆర్థికాభివృద్ధిపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. అమరావతి కేవలం ఆంధ్రులకు మాత్రమే గర్వకారణం కాదని చెపుతూ రాష్ట్భ్రావృద్ధికి ఇంజన్ లాంటిదని ఆయన అభివర్ణించారు. రాజధానిలో 9 ఆర్థిక నగరాల ఏర్పాటుతో పాటు వచ్చే 25ఏళ్లలో 20లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు ప్రణాళిక సిద్ధంగా ఉందన్నారు. దీంతో 15.2 జీడీపీ వృద్ధి చెందుతుందని తెలిపారు. ప్రస్తుతం వివిధ సంస్థలకు భూకేటాయింపు ద్వారా 60వేల మందికి ఉద్యోగావకాశాలు లభించాయని, స్టార్టప్ ప్రాంత అభివృద్ధి ద్వారా స్థానికులు సహా 2.5 లక్షల మందికి ఉపాధి లభించనుందని భరోసా ఇచ్చారు. తమ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్దిష్ట విధానాలు, సమర్థ పనితీరుతో అమరావతికి నిధుల సమీకరణలోనూ సమస్యలు ఉత్పన్నం కావని స్పష్టం చేశారు. రాజధానిలో 300 ఎకరాల్లో చేపట్టిన సమీకృత బహుళ ఉత్పత్తుల పారిశ్రామిక పార్క్ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పార్కు ఏర్పాటుతో 20వేల మంది వరకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పారు. అమరావతిలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు నీరు, విద్యుత్, వౌలిక సదుపాయాలతో పాటు మానవ వనరులను కూడా అందుబాటులో ఉంచుతామని చంద్రబాబు వివరించారు.
హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌కు చేరువలో ఐటీ టవర్ ఏర్పాటుకు చర్యలు చేపట్టామని ఏపీ సీఆర్డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ ముఖ్యమంత్రికి తెలిపారు. ఐటీ కంపెనీలకు లీజు లేదా అద్దెకు ఇచ్చేందుకు 5లక్షల చదరపు అడుగులతో ఈ టవర్ నిర్మాణం చేపట్టాలనే యోచనతో ఉన్నట్లు సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ తెలిపారు. 2050 నాటికి అంతర్జాతీయ గమ్యస్థానంగా అమరావతిని నిలపాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా రాజధానిలో అభివృద్ధి పనులపై సీఆర్డీఏ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. మీటింగ్‌లు, ఇనె్సంటివ్‌లు, కనె్వన్షన్లు, ఎగ్జిబిషన్లు (ఎంఐసీఈ) సౌకర్యాలతో పాటు పర్యాటక, వినోద సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని వివరించారు. ఎంఐసీని డిజైన్, నిర్మాణం, ఫైనాన్స్, నిర్వహణ (డీవోబీటీ) ద్ధద్దతిలో అభివృద్ధి చేయాలని ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. అమరావతి నగరంలో ఆర్థికంగా బలహీనవర్గాల వారికి అందుబాటు ధరల్లో ఇళ్లు అందించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. అమరావతి అన్నివర్గాల ప్రజలదని, హ్యాపీనెస్ట్ సహా అన్ని గృహనిర్మాణ ప్రాజెక్ట్‌లలో బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. మొత్తంగా అమరావతి ఆర్థిక ఫలాలు ప్రతిఒక్కరికీ అందాలనేదే తన ఆకాంక్ష అని చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. టెలీకాన్ఫరెన్స్‌లో పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, సీఎంఓ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, ముఖ్య కార్యదర్శి జీ సాయిప్రసాద్, ఏడీసీ చైర్‌పర్సన్ లక్ష్మీపార్థసారథి, సీఆర్డీఏ స్పెషల్ కమిషనర్ రామ్మోహన్‌రావు, అదనపు కమిషనర్ షణ్మోహన్, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

దళారుల కెప్టెన్

$
0
0

పలాస, డిసెంబర్ 30: పట్టణాలు, గ్రామాల స్థాయిల్లో అన్ని విధాలుగా దోచుకుంటున్న దళారులకు కెప్టెన్‌గా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మారారని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆదివారం జరిగిన భారీ బహిరంగసభలో ఆయన మాట్లాడారు.
తన తండ్రి, దివంగత వైఎస్‌రాజశేఖరరెడ్డి పేద, బడుగుల కోసం ప్రవేశపెట్టిన పథకాలన్నీ సర్వనాశనం చేసి వారి జీవితాలతో ఆడుకోవడమే బాబు పని అని విమర్శించారు. మత్స్యకారులకు అనేక పథకాలు ప్రవేశపెట్టినా వాటి అమలు దిక్కులేదన్నారు. ఉద్దానాన్ని పట్టిపీడిస్తున్న కిడ్నీ సమస్యపై తాను శాసనసభలో లెవనెత్తిన తర్వాత మేల్కొన్న బాబు తూతూమంత్రంగా చర్యలు చేపట్టారని అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ప్రధానికి లేఖ రాస్తానంటే బాబుకు ఉలుకెందుకో అర్థం కావడం లేదని, దానికి మద్దతు ఇవ్వాల్సింది పోయి తిరిగి కేసీఆర్‌పై మండిపడడం బాబు అజ్ఞానానికి నిదర్శనమని అన్నారు. పలాస నియోజకవర్గంలో జీఎస్‌టీతోపాటు తెలుగుదేశం ట్యాక్స్ కట్టాలని, ఆ ట్యాక్స్ ఎమ్మెల్యే అల్లుడుకు వెళ్తుందని విమర్శించారు. పలాస నియోజకవర్గంలో పనులు కావాలంటే హుండీలో ముడుపులు చెల్లించుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. తిత్లీ తుపాను బాధితులకు చేసింది గోరంత, బాబు చెప్పుకుంటున్నది కొండంత అని ధ్వజమెత్తారు. ఎన్నికల సమీపిస్తుండడంతో అన్ని వర్గాలకు తృప్తి చేయడానికి బాబు నానా ఆగచాట్లు పడుతున్నారని, దీనికి ఆ రెండు పత్రికలు వత్తాసు పలుకుతున్నాయన్నారు.

చిత్రం..పలాసలో ఆదివారం నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడుతున్న వైఎస్ జగన్

150వ విక్టరీ

$
0
0

మెల్‌బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో భారత్ ఆస్ట్రేలియాపై చారిత్రాత్మక విజయం సాధించింది. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో మొదటిరోజు నుంచే ప్రత్యర్థిపై టీమిండియా పైచేయ సాధించింది. చివరి రోజు విజయానికి రెండు వికెట్లు మాత్రమే అడ్డుగా ఉండడంతో బౌలర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా, మూడు పరుగులు మాత్రమే ఇచ్చి జట్టును విజయ తీరాలకు చేర్చారు. దీంతో మెల్‌బోర్న్‌లో 37 ఏళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ నెగ్గినట్లయంది. మరోవైపు టీమిండియాకు ఇది 150వ టెస్టు విజయం. బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

బంగ్లాదేశ్ ఎన్నికలు రక్తసిక్తం

$
0
0

1971లో పాకిస్తాన్ నుంచి విడిపోయి, స్వతంత్య్ర దేశంగా అవతరించిన తర్వాత బంగ్లాదేశ్ పార్లమెంటుకు 11వ సారి సార్వత్రక ఎన్నికలు జరిగాయి. అయితే, గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికలు రక్తసిక్తంగా మారడంతో, ఫలితం ఎలా ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హసీనా నాలుగోసారి అధికారం కోసం పోటీపడుతున్నారు. బంగ్లాదేశ్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న హసీనాకే ప్రజలు పట్టం కడతారని విశే్లషకుల అభిప్రాయం.

1న ఆర్జిత సేవలు రద్దు

$
0
0

తిరుపతి, డిసెంబర్ 30: తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 1వ తేదీన అన్ని ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ తిరుమల ఇన్‌చార్జ్ జేఈఓ పోల భాస్కర్ తెలిపారు. ఉదయం 4.30 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఆదివారం ఆయన తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ను తనిఖీ చేశారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జనవరి 1న తిరుమలకు విశేషంగా వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలను, ప్రత్యేక దర్శనాలను రద్దు చేశామన్నారు. బ్రేక్ దర్శనాలను ప్రొటోకాల్ ప్రముఖులకు పరిమితం చేశామని, సిఫార్సు లేఖలు స్వీకరించడం జరగదన్నారు. టీటీడీ అధికారులు, సిబ్బంది సమన్వయం చేసుకుని భక్తులకు మెరుగైన సేవలను అందించాలని ఆయన కోరారు.

ముగిసిన విశాఖ ఉత్సవ్

$
0
0

విశాఖపట్నం (కల్చరల్), డిసెంబర్ 30: విశాఖ నగర ప్రజలను, పర్యాటకులను మూడు రోజుల పాటు ఉర్రూతలూగించిన విశాఖ ఉత్సవ్ ఆదివారం ముగిసింది. తొలిరోజు ఉత్సవాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించగా, ముగింపు సందర్భంగా సినీనటులు దగ్గుబాటి వెంకటేష్, వరుణ్‌తేజ్ ప్రత్యేక ఆకర్షణగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా విశాఖ ఉత్సవ్‌ను అద్భుతంగా నిర్వహిస్తున్నామన్నారు. గతేడాది విశాఖ ఉత్సవాలను తిలకించేందుకు 10 లక్షల మంది సందర్శకులు రాగా, ఈ ఏడాది 12 లక్షల మంది ఉత్సవాలను తిలకించారన్నారు. పర్యాటక ప్రాంతంగా విశాఖ ఖ్యాతి ప్రపంచానికి చాటేలా ప్రభుత్వం యేటా విశాఖ ఉత్సవాలను నిర్వహిస్తోందన్నారు.
ఈ సందర్భంగా వెంకటేష్, వరుణ్‌తేజ్ నటించిన ఎఫ్-2 చిత్రం ఆడియోను మంత్రి గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించారు. దిల్‌రాజు సమర్పణలో అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా, శిరీష్, లక్ష్మణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ చక్కటి కుటుంబ కథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నామన్నారు. దంపతులు మధ్య చోటు చేసుకునే హాస్యం, ఉద్వేగం వంటి అంశాలు ప్రధానంగా చిత్రంలో కన్పిస్తాయన్నారు. వెంకటేష్ నటించిన మల్లీశ్వరి వంటి హాస్య ప్రధాన చిత్రాలతోపాటు వరుణ్‌తేజ్ నటించిన ఘాజీ వంటి చిత్రాల్లో నటనను ప్రస్తావించారు. చివరగా వెంకటేష్, వరుణ్‌తేజ్ పాటలకు స్టెప్పులేసి ఆహుతులను ఉర్రూతలూగించారు.

చిత్రం..ఎఫ్-2 ఆడియో రిలీజ్ చేస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు


వెలుగు ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం

$
0
0

విజయవాడ (సిటీ), డిసెంబర్ 30: రాష్టవ్య్రాప్తంగా ఉన్న వెలుగు ఉద్యోగుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో ఆదివారం 13 జిల్లాల వెలుగు జేఏసీ నాయకులు మంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో చంద్రబాబును కలిశారు. ఈసందర్భంగా ఆయన వారితో మట్లాడుతూ మీపై నాకు ప్రత్యేక మైన అభిమానం ఉందని, మీ విషయాల పట్ల సానుకూలంగా స్పందిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే మంత్రుల కమిటీ వేసి వెలుగు ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో వెలుగు డ్వాక్రాలను చంద్రబాబే ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. వెలుగు ఉద్యోగులకు అడగకుండానే ఉద్యోగ విరమణ వయస్సును 60 సంవత్సరాలకు పెంచినట్లు తెలిపారు. వెలుగు ఉద్యోగులు సమ్మెలో ఉన్న కాలానికి వేతనం ఇస్తామన్నారు. వెలుగు ఉద్యోగుల డిమాండ్లను పరిశీలించి తప్పకుండా వారికి సంపూర్ణ న్యాయం చేస్తామన్నారు. వెలుగు సిబ్బంది ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. ప్రతిపక్ష నాయకుల మాటలు విని మోసపోవద్దన్నారు. ప్రతిపక్ష నేతలు అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు. మళ్లీ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో చంద్రబాబే ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు.
సమ్మె విరమణకు ఆమోదించిన అంశాలు
వెలుగు ఉద్యోగులు చేసిన సమ్మె కాలాన్ని సెలవుగా పరిగణించి వారికి జీతం అందించాలని నిర్ణయంచారు. ప్రభుత్వ అనుమతితో నవంబర్ 6న జరిగిన సర్ప్ ఈసీ తీర్మానం ప్రకారం రూ. 30.71 కోట్ల అదనపు లబ్ధి ఇవ్వడానికి కేడర్‌ను బట్టి రూ. 6వేల నుండి 23వేల వరకు జీతం ఇచ్చేందుకు అంగీకరించారు. వెలుగు సిబ్బందికి వ్యక్తిగత బీమా రూ. 5 నుండి రూ. 10లక్షలకు పెంచారు. సంవత్సరానికి 10 రోజులు జీతంతో కూడిన మెడికల్ లీవులకు అవకాశం కల్పించారు. వెలుగు సిబ్బందికి ఎన్టీఆర్ హెల్త్‌కార్డు మంజూరుకు నిర్ణయించారు. సిబ్బంది వ్యక్తిగత సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు, సిబ్బంది టైంస్కేల్, కేడర్ ఫిక్స్, క్రమబద్ధీకరణ, పదోన్నతుల కోసం సెర్ప్ ఈసీ తీర్మానం చేయించి మంత్రుల ఉప సంఘానికి నివేదించాలని నిర్ణయించారు. సమస్యలపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించడంతో సమ్మె విరమించి విధుల్లో చేరాలని ఉద్యోగులు నిర్ణయించారు. విధుల్లో చేరుతున్నట్లు జేఏసీ నాయకులు ప్రకటించారు. కార్యక్రమంలో సెర్ప్ సీఈవో డాక్టర్ పి కృష్ణమోహన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
చిత్రం..మంత్రి సునీతతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన వెలుగు జేఏసీ నాయకులు

విజృంభించిన చలిపులి!

$
0
0

ఆదిలాబాద్, డిసెంబర్ 30: మంచుగడ్డకట్టే రీతిలో చలి పులి వణికిస్తుండడంతో జిల్లా ప్రజలు దైన్యస్థితిని ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలతో పాటు మారుమూల పల్లెల్లో పగటి ఉష్ణోగ్రతలు ఆమాంతం పడిపోయి చలి విజృంభిస్తుండడంతో సామాన్య జనజీవనం అల్లాడిపోతోంది. ఆదివారం భీంపూర్ మండలంలో 3.0 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదుకాగా ఆదిలాబాద్‌లో 4.4 డిగ్రీల సెల్సియస్ రికార్డయింది. గత రెండు మూడు రోజులుగా అతి శీతల గాలులు జిల్లా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుండడంతో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు పాక్షికంగా పనిచేస్తున్నాయి. ఉత్తరాది నుండి వీస్తున్న చలి గాలుల ప్రభావంగానే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో రికార్డుస్థాయిలోకనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, మరో పది రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఉదయం 5 గంటల నుంచే ఆదిలాబాద్ పట్టణంతో పాటు పరిసరాల్లో మంచు దుప్పటి కమ్మేయడంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాత్రి వేళల్లో విపరీతమైన మంచు కురుస్తుండడంతో పట్టణాలు, పల్లెలు మరో కశ్మీరాన్ని తలపిస్తున్నాయి. ప్రభుత్వ వసతి గృహాల్లో అరకొర సౌకర్యాలతో నిద్రిస్తున్న విద్యార్థుల పరిస్థితి కడుదయనీయంగా మారింది. సుమారు 70కిపైగా వసతి గృహాల్లో సోలార్ విద్యుత్ పనిచేయకపోవడంతో చిన్నారులు చన్నీటి స్నానాలు ఆచరిస్తూ అస్వస్థతకు గురవుతున్నారు. ఉట్నూరు, ఆసిఫాబాద్, బోథ్, ఇంద్రవెల్లి ప్రాంతాల్లో విద్యార్థులు, వృద్దులు, మహిళలు శ్వాసకోశ సంబంధ వ్యాధులతో ఆసుపత్రుల పాలవుతున్నారు. చర్మవ్యాధులు కూడా చలి పంజాకు వెంటాడుతుండడంతో ప్రజలు పాలుపోని పరిస్థితిని ఎదుర్కోవల్సి వస్తోంది. శనివారం అత్యల్పంగా అర్లిటిలో 3.0డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదుకాగా ఆదివారం సైతం భీంపూర్ మండలంలో 3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదుకాగా ఆదిలాబాద్‌లో 4.4 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. మంచిర్యాల జిల్లాలో 5.3 డిగ్రీలు, నిర్మల్‌లో 5.6 డిగ్రీలు నమోదు కావడం గమనార్హం.
పాఠశాలల వేళల్లో మార్పులు
గతంలో ఎప్పుడు లేని విధంగా ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పని వేళలను కుదించడం జరిగిందని ఆదిలాబాద్ కలెక్టర్ దివ్య తెలిపారు. ఈమేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ సోమవారం నుండి జనవరి 9వ తేదీ వరకు పాఠశాలల పనివేళల్లో మార్పులు కొనసాగుతాయని, విద్యాశాఖ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు సమయపాలన పాటించాలని సూచించారు.

ఊరిస్తున్న అమాత్య పదవి

$
0
0

నిజామాబాద్, డిసెంబర్ 30: అమాత్య పదవిపై గంపెడాశలు పెట్టుకున్న నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నేతలు మంత్రివర్గ విస్తరణపై గంపెడాశలు పెట్టుకుని ఎదురుతెన్నులు చూస్తున్నారు. ఢిల్లీ పర్యటన నుండి తిరిగివచ్చిన అనంతరం మంత్రివర్గ కూర్పుపై దృష్టిసారిస్తానని భావించినప్పటికీ, కీడు దినాలు తొలగిన మీదట సంక్రాంతి తరువాతే విస్తరణ ఉంటుందనే సంకేతాలు వెలువరించడంతో ఉత్కంఠ దూరం కాలేకపోతోంది. వరుసగా రెండవ పర్యాయం తెరాస అధికారం చేపట్టిన తరువాత సీఎం కేసీఆర్‌తో కలిసి ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన మహమూద్‌అలీ ఒక్కరే రాష్ట్ర హోంమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం విదితమే. తొలివిడతగా మరో ఎనిమిది మందికి కేబినెట్‌లో స్థానం కల్పించే అవకాశం ఉందని భావిస్తుండడంతో, మొదటి విడతలోనే మంత్రి వర్గంలో బెర్తు దక్కించుకోవాలని ఎమ్మెల్యేలు ఎవరికివారు ఉవ్విళ్లూరుతున్నారు. పలువురు ఆశావహ ఎమ్మెల్యేలు అధినేత కేసీఆర్‌తో పాటు ఇటీవలే టీఆర్‌ఎస్ కార్యనిర్వహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన యువనేత కేటీఆర్‌ను సైతం కలిసి తమకు కేబినెట్‌లో అవకాశం దక్కేలా చూడాలని కోరుతున్నారు. ఎన్నికల్లో తెరాసకు మెజార్టీ సీట్లు దక్కిన వెంటనే కేబినెట్‌లో స్థానం దక్కించుకునేందుకు పలువురు హైదరాబాద్‌లోనే మకాం వేసి పావులు కదుపుతున్నారు. ఇదివరకటి తరహాలోనే ఈసారి కూడా ఉమ్మడి జిల్లా నుండి ఎల్లారెడ్డి మినహా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల నుండి టీఆర్‌ఎస్‌కు చెందిన సిట్టింగ్‌లే మరోమారు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. దీంతో అమాత్య పదవి యోగం ఎవరికి వరిస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. 2014 ఎన్నికల్లో తెరాస తొలిసారి అధికారం చేపట్టిన సమయంలోనే బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డికి మంత్రి పదవి వరించింది. ఇప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే పోచారంనకు స్పీకర్ పదవిని కట్టబెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ యోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ పదవిని చేపట్టేందుకు పోచారం అంతగా సుముఖత వ్యక్తపర్చనప్పటికీ, తప్పనిసరిగా ఈ బాధ్యతలు నిర్వర్తించాలంటూ కేసీఆర్ కరాఖండీగా తేల్చి చెబితే పోచారం సభాపతి పదవితోనే సంతృప్తి చెందాల్సి ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా నుండి కనీసం మరొకరికి మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశాలు ఉన్నాయని ఆశావహ ఎమ్మెల్యేలు గట్టి ధీమాతో ఉన్నారు. ఈ కోవలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అమాత్య పదవి రేసులో ముందు వరుసలో కొనసాగుతున్నారు. మాజీ మంత్రి పోచారంనకు స్పీకర్ పదవి ఖరారైతే, వేముల ప్రశాంత్‌రెడ్డికి కేబినెట్‌లో బెర్తు దక్కేందుకు దాదాపుగా లైన్ క్లియర్ అయినట్టేనని ఆయన అనుచరులు ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు. తొలిసారిగా 2014ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలోనే వేముల ప్రశాంత్‌రెడ్డికి కేబినెట్ హోదాతో కూడిన మిషన్ భగీరథ వైస్ చైర్మెన్ పదవిని కట్టబెట్టారు. ప్రస్తుతం వరుసగా రెండవ పర్యాయం ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికవడం, సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా చెలామణి అవుతుండడంతో మంత్రివర్గంలో స్థానం కల్పించడం ఖాయమని భావిస్తున్నారు. ఇటీవలే కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి వైజాగ్, కోల్‌కతా, ఢిల్లీ పర్యటనకు వెళ్లగా, వారి వెంట వేముల ప్రశాంత్‌రెడ్డి కూడా ఉన్నారు. మరోవైపు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌లు కూడా సీనియర్ ఎమ్మెల్యేల జాబితాలో తమకు కేబినెట్‌లో బెర్తు కేటాయించే అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశ్యంతో ఎవరికి వారు తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎస్సీ రిజర్వ్‌డ్ సెగ్మెంట్ నుంచి వరుసగా మూడు పర్యాయాలు ఎన్నికై హ్యాట్రిక్ సాధించిన హన్మంత్‌సింధే కూడా సామాజిక సమీకరణలు కలిసివస్తే తనకు అమాత్య పదవి వరించవచ్చని భావిస్తున్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి కూడా యువనేత కేటీఆర్ ద్వారా తనవంతు ప్రయత్నాలు చేస్తూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సామాజిక సమీకరణాలను బట్టి అమాత్య పదవిని దక్కించుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా కూడా తనవంతు ప్రయత్నాల్లో నిమగ్నమైనట్టు తెలుస్తోంది. ఆర్యవైశ్య కులానికి చెందిన ఏకైక ఎమ్మెల్యేగా ఆయన ప్రాతినిథ్యం వహిస్తుండడంతో కేబినెట్‌లో స్థానం కల్పించి తన సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తారనే ఆశాభావంతో ఉన్నారు. ఇలా ఎవరికివారు ఆశలపల్లకిలో ఊరేగుతున్నప్పటికీ, అమాత్య పదవీ యోగం ఎవరిని వరిస్తుందనే దానిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరి వైపు మొగ్గు చూపుతారు? అసలు మంత్రివర్గ విస్తరణలో ఇందూరుకు అమాత్య పదవి దక్కుతుందా? లేక మొండిచేయి చూపడంతోనే సరిపెడతారా? అనేది వేచి చూడాల్సిందే.

యాదగిరీశుడికి ఘనంగా నిత్యారాధనలు

$
0
0

యాదగిరిగుట్ట, డిసెంబర్ 30: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం నిత్యారాధనలు, ఆర్జిత సేవలు శాస్తయ్రక్తంగా సాగాయి. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల రద్ధీ పెరుగగా, క్యూలైన్లలో భక్తులు గంటల తరబడి వేచివున్నారు. పెరిగిన భక్తుల రద్దీతో కొండపైకి వాహనాలను అనుమతించలేదు. స్వామివారి నిత్యారాధనల్లో భాగంగా వేకువ జామున సుప్రభాతంతో స్వామిఅమ్మవార్లను మేల్కోలిపి ఆరతి నివేధన చేశారు. బిందే తీర్ధం, బాలబోగంతో ఆలయ పూజాధికాలు ప్రారంభించారు. ముందుగా ప్రతిష్టామూర్తులను ఆరాధించిన పూజారులు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పంచామృతాలతో అభిషేకించి తులసీదళాలతో కొలిచారు. వివిధ సుగంథ పూలమాలలతో పట్టు వస్త్రాలతో, ఆభరణాలతో సుందరంగా తీర్చిదిద్ధారు. కవఛ మూర్తులను స్వర్ణ పుష్పాలతో ఆరాధించి అర్చించారు. ఆలయ కల్యాణ మండపంలో అర్చక బృందం వేదమంత్రోఛ్చరణల మధ్య స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవం పాంఛరాత్రాగమశాస్త్రానుసారం వైభవంగా నిర్వహించారు. స్వామి వారి కల్యాణానికి ముందు విశ్వక్సేనారాధన, పుణ్యహావఛనం, శ్రీ సుదర్శన నారసింహహోమం, గజవాహన సేవోత్సవం ఘనంగా నిర్సహించారు. స్వామివారి అష్టోత్తర పూజల్లో, సహస్రనామార్చనల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం ఆలయంలో స్వామిఅమ్మవార్లకు వెండి జోడి సేవోత్సవం నిర్వహించారు.
నూతన సంవత్సరం వేడుకల వేళ యాదాద్రి లక్ష్మీనరసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో రానున్నందునా అందుకు తగ్గట్లుగా కొండపైన బాల ఆలయంలో, పాతగుట్టలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఈవో గీత తెలిపారు. నూతన సంవత్సర వేళ ఉదయం 3గంటల నుండే స్వామివారి నిత్య కైంకర్యాలు ఆరంభమవుతాయని తెలిపారు. ఈ నెల 31వ తేది సాయంత్రం నుండి భక్తుల కోసం 60వేల 100గ్రాముల లడ్డూలు, మరియు 15000అభిషేక లడ్డూలు సిద్ధం చేయనున్నట్లుగా తెలిపారు.
భక్తులకు నిత్య పులిహోర ప్రసాద వితరణతో పాటు అదనంగా 40కిలలో లడ్డూ ప్రసాదాలను బాల ఆలయం నందు, పాతగుట్ట ఆలయంలో 10కిలోల లడ్డూ ప్రసాదాలను దర్శనాంతరం భక్తులకు ఉచితంగా ఉదయం నుండి రాత్రి వరకు పంపిణీ చేస్తాన్నారు. అలాగే శ్రీ స్వామివారి నిత్యన్నదాన సత్రం నందు 500మంది అన్నప్రసాదం వసతిని నూతన సంవత్సరం సందర్భంగా మరో 500మందికి అదనంగా అందించనన్నుట్లుగా తెలిపారు.

దేవరకొండ జిల్లా ఏర్పడే వరకూ పోరు

$
0
0

దేవరకొండ, డిసెంబర్ 30: దేవరకొండను జిల్లాగా ఏర్పాటు చేసేంత వరకు పోరాడాలని జడ్పీ చైర్మెన్ బాలూనాయక్ పిలుపునిచ్చారు. దేవరకొండ జిల్లా ఏర్పాటు కో సం చేపట్టాల్సిన ఉద్యమం పై ఆదివారం స్ధానిక ఐబీలో అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
దేవరకొండను జిల్లాగా ప్రకటించాలని కోరుతూ విద్యార్ధి సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో గత ఎనిమిది రోజులుగా విద్యార్ధులు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నా ప్రభుత్వం ఏ మాత్రం స్పందించక పోవడం దారుణమన్నారు. జిల్లా సాధన కోసం సాగుతున్న ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, మేధావులు, విద్యావంతులు చురుకులుగా పాల్గొనాలని జడ్పీ చైర్మెన్ బాలూనాయక్ కోరారు. ఈ సమావేశంలో సీపీ ఐ జిల్లా కార్యదర్శి పల్లా నర్సింహ్మారెడ్డి, వైస్ ఎంపీపీ దూధిపాళ వేణూధర్‌రెడ్డి, సీపీ ఎం నాయకుడు కంబాలపల్లి ఆనంద్, గాజుల మురళి, జిల్లా సాధన కన్వీనర్ కేతావత్ లాలూనాయక్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు వనం జగదీశ్వర్, పోలిశెట్టి భిక్షపతి, నర్సింహ్మ తదితరులు పాల్గొన్నారు.

కుప్పకూలిన జారాల ఎడమ కాలువ గట్టు

$
0
0

అమరచింత, డిసెంబర్ 30: మండల పరిధిలోని నందిమల్ల శివారులో ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎన్టీఆర్ ఎడమ కాలువ గట్టు శిథిలావస్థకు చేరి ఉన్న ఫలంగా కులిపోతుండంతో రైతులు అందోళన చెందుతున్నారు. రబీ పంటకు రైతులకు సాగు నీరు అందించే సమయంలో ఈ విధంగా జరగడంతో తమ పంటలు ఏమవుతాయోనని చింతిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఎన్టీఆర్ ఎడమ కాలువ ద్వారా 35 వేల ఎకరాలకు భూములకు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుండి ఎడుమ కాలువ ద్వారా సాగు నీరు పారుతుండగా ఇప్పుడు రబీ పంటకు నారుమళ్లు పోసుకునేందుకు నీటి కోసం రైతులు ఎదురుచూస్తుండగా ఆదివారం దిగువకు నీరు పారుతుండగా ఒక్కసారిగా కాలువ గట్టు కూలిపోయింది. నందిమల్ల గ్రామస్థులు, ప్రాజెక్టును తిలకించేదుకు వచ్చిన సందర్శకులు అందోళన పడ్డారు. పీజేపీ అధికారులు తక్షణమే స్పందించి కాలువకు మరమ్మతు పనులు చేపట్టాలని గ్రామస్తులు, రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ట్యాంపరింగ్‌తోనే ఆధికారంలోకి టీఆర్‌ఎస్

$
0
0

భువనగిరి, డిసెంబర్ 30: తెలంగాణాలో జరిగిన ఎన్నికలలో ఈవీఎంల ట్యాంపరింగ్‌కు పాల్పడి అనైతికంగా అధికారంలోకి వచ్చిందని మాజి ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ ఆరోపించారు. ఆదివారం భువనగిరి విలేఖరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ మహాకూటమి ఎదుగుదలను చూసి భయపడ్డ టీఆర్‌ఎస్ పార్టీ సాంకేతిక పరిజానాన్ని ఉపయోగించి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసిందని అన్నారు. అందుకు ఓట్ల లెక్కింపులో వివిపాట్లకు, ఈవీఎంలు చూపుతున్న ఓట్లకు తేడాయేనని స్పష్టంచేశారు. ఈవీఎంల ట్యాపరింగ్‌పై అధికారులకు పలుమార్లు విజ్ఞప్తిచేసినా సమాధానం లేదన్నారు. కుట్రపూరితంగా జరిగిన ఎన్నికలలో అనైతిక విజయం సాధించిన టీఆర్‌ఎస్ పార్టీకి రానున్న గ్రామపంచాయతి ఎన్నికలలో తగిన బుద్దిచెప్పాలని పిలుపునిచ్చారు. అసెంబ్లి ఎన్నికల్లో ప్రదర్శించిన ఐకమత్యాన్ని స్థానిక సంస్థల ఎన్నికలలోకూడా ప్రదర్శించి అత్యధికంగా సీట్లు గెలుచుకునేందుకు సిద్దంకావాలన్నారు. రాహుల్‌గాంధి నాయకత్వంలో దేశంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. నాయకులు కార్యకర్తలు నిరుత్సాహానికి గురికావద్దని అన్నారు.
ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారాన్ని మరిచిన కేసీఆర్..
ఎన్నికలు జరిగి 18రోజులు కావస్తున్నా ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయకపోవడం కేసిఆర్ నియంతృత్వ దోరణికి నిదర్శనమని కాంగ్రెస్‌పార్టీ భువనగిరి నియోజకవర్గ ఇంచార్జి కుంభం అనీల్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. కొడుకుకు పార్టీ వర్కింగ్‌ప్రెసిడెంట్‌గా భాద్యతలనప్పగించి ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారాన్ని మరిచిపోయారని ఎద్దేవాచేశారు. ఈసమావేశంలో కాంగ్రెస్ నాయకులు పోతంశెట్టి వెంకటేశ్వర్లు, తంగళ్లపల్లిరవికుమార్, బర్రె జహాంగీర్, ఎడమ బాలక్రిష్ణ, డిఎన్ చారి, పిట్టల బాలరాజు, బబ్లు, బెండ శ్రీకాంత్, గ్యాస్ చిన్న, ఎండి మజహర్, కొల్లోజు సతీష్ పాల్గొన్నారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న సంపత్‌కుమార్


కంటి ‘వెలుగు’ కోసం ఎదురుచూపు

$
0
0

కరీంనగర్, డిసెంబర్ 30: దృష్టిలోపంతో చీకట్లు కమ్ముతున్నవారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతామంటూ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆర్భాటంగా ప్రకటించిన కంటి వెలుగు పథకం జిల్లాలో ఆరంభ శూరత్వంగానే మిగులుతోందనే విమర్శలు వస్తున్నాయి. ఉచితంగా కంటి వైద్యం పేర లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్య యంత్రాంగం రోగులను గుర్తించినా, వారికి అవసరమైన శస్తచ్రికిత్సలు, పరికరాలు అందించటంలో నిర్లక్ష్యం వహిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు నిర్ధేశించిన గడువు ముగిసినా, ఇప్పటివరకు కంటి అద్దాలు అందజేయటంలోవైఫల్యం స్పష్టంగా గోచరిస్తోంది. నిత్యం ఆస్పత్రుల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోతున్న కంటి రోగులు, ఇక మాకు దర్శన భాగ్యం గగనమేనంటూ ఆశలొదులుకుంటున్నారు. రోగ నిర్ధారణ చేసినా అవసరమైన చికిత్సలు అందించటంపై కనీస స్పందన లేకపోవటంతో, ఈపథకం కొనసాగింపుపై నీలినీడలు అలుముకుంటున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈపథకం గత ఆగస్టు 15న జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ ప్రారంభించింది. 24 బృందాలు నిర్విరామంగా రెండు మాసాల పాటు పని చేయగా, 4,21,563 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో 58,189 మందికి అద్దాలు అవసరమని, 30,043 మందికి శస్తచ్రికిత్సలు చేయాల్సి ఉందంటూ గుర్తించారు. వీరిలో అద్దాలు అవసరమైన వారికి ముప్ఫై రోజుల్లో, శస్తచ్రికిత్సలు అవసరమైన వారికి 30 రోజుల్లో ఏర్పాట్లు చేస్తామంటూ ప్రకటించారు. అయితే, దగ్గరి చూపుకు అవసరమైన అద్దాలు 8,537 మందికి అందజేసి, మిగతా 20 వేల పైచిలుకు మందికి అవసరమైన దూరపుచూపు అద్దాల పంపిణీకి గడువు విధించారు. ఇది ముగిసి రెండు మాసాలు గడుస్తున్నా అవసరమైన వారికి ఇప్పటివరకు అద్దాలు అందజేయలేదు. కేవలం 325 మందికి మాత్రమే శస్తచ్రికిత్సలు నిర్వహించగా, ఇంకా 29,718 మంది తమకెప్పుడు అవకాశం కల్పిస్తారోనని కళ్ళలో వత్తులేసుకున్నారు. కాగా, ఇతర జిల్లాల్లో శస్తచ్రికిత్సలు చేపట్టగా పదు ల సంఖ్యలో వికటించటంతోనే, ఎన్నికల ముందు తమకు మైనస్‌గా మారుతుందనే భావనతో నిలిపివేయగా, జనవరి మాసంలో తిరిగి చేపట్టనున్నట్లు, ఫిబ్రవరి 26 వరకు గుర్తించిన మేరకు అందరికీ శస్తచ్రికిత్సలు నిర్వహించి, అద్దాలు అందజేయనున్నట్లు వైద్యవర్గాలు పేర్కొంటుండటం గమనార్హం.

తలాక్ బిల్లును అడ్డుకుంటాం

$
0
0

న్యూఢిల్లీ:ముమ్మారు తలాక్‌ను చెబితే విడాకులు ఇవ్వటాన్ని నేరంగా పరిగణిస్తూ ప్రవేశపెట్టే బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ పాస్ కానివ్వకుండా అడ్డుకుంటామని టీడీపీ ఎంపీ సుజనాచౌదరి అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముమ్మారు తలాక్ చెప్పటాన్ని ఎలా నేరంగా పరిగణిస్తామో అలాగే ఈ బిల్లులో కొన్ని సవరణలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. స్ర్తి, పురుషులకు సమాన న్యాయం ఉండాలని అన్నారు. లోకసభ ఆమోదం పొందిన ఈ బిల్లు నేడు రాజ్యసభకు రానున్నది. ఇప్పటికే అన్ని పార్టీలు తమ ఎంపీలకు విప్‌లు జారీ చేశాయి.

రాజ్యసభలో గందరగోళం

$
0
0

న్యూఢిల్లీ: రాజ్యసభ ప్రారంభమైన వెంటనే గందరగోళం నెలకొన్నది. ప్రతిపక్ష సభ్యులు మూకుమ్మడిగా పోడియంను చుట్టుముట్టి తమకు న్యాయం కావాలంటూ నినాదాలు చేశారు. దీంతో ఛైర్మన్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. సభా కార్యక్రమాలు పట్టుమని పది నిమిషాలు కూడా సాగలేదు. మధ్యాహ్నాం రెండు గంటలకు త్రిపుల్ తలాక్ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది.

హసీనాకే మళ్లీ అధికారం

$
0
0

ఢాకా: బంగ్లాదేశ్ ఎన్నికల్లో ప్రధాని షేక్ హసీనాకే మళ్లీ అధికారం దక్కింది. హసీనాకు చెందిన అవామీలీగ్ పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. మొత్తం 299 స్థానాలకుగాను అవామీలీగ్ కూటమి 287 చోట్ల విజయం సాధించింది. హసీనా నాలుగోసారి అధికారంలోకి వచ్చి రికార్డు నెలకొల్పటం విశేషం. ఇదిలావుండగా ప్రతిపక్ష ఎన్‌యూఎఫ్ కూటమి ఈ ఎన్నికల ఫలితాలు తిరస్కరించింది. అన్ని చోట్ల అవకతవకలు జరిగాయని, మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసింది.

భివండిలో భారీ అగ్నిప్రమాదం

$
0
0

థానె: మహారాష్టల్రోని భివండి దుస్తుల కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. మూడు అగ్నిమాపక దళాలు మంటలను అదుపులోనికి తెచ్చాయి. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.

Viewing all 69482 articles
Browse latest View live