Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

తలాక్ బిల్లును అడ్డుకోవాలని చంద్రబాబు ఫోన్

0
0

అమరావతి:రాజ్యసభలో తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే బిల్లును అడ్డుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతాబెనర్జీకి ఫోన్ చేసి విజ్ఞప్తి చేశారు.ఈ బిల్లు ముస్లీంలను అణిచివేసే విధంగా ఉందని అన్నారు. బీజేపీయేతర పక్షాలు ఏకంకావాలని అన్నారు.


సరిహద్దుల్లో కాల్పులు

0
0

జమ్మూకాశ్మీర్: జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో కాల్పులు జరిగాయి. పాకిస్తాన్ సైనిక దుస్తులు ధరించిన కొందరు నాగౌమ్ సెక్టార్‌లోని ఎల్‌ఓసీ వద్ద చొరబడేందుకు ప్రయత్నించగా భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. రాత్రంతా ఈ కాల్పులు జరిగాయని, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో కొందరు అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సైనిక అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతంలో చొరబాటుదారుల మృతదేహాలు పడివున్నాయి.

విశాఖ మన్యంలో చలి పంజా

0
0

విశాఖపట్నం: విశాఖ మన్యంలో చలి పంజా విసిరింది. గత పదేళ్లలో ఎన్నడూ నమోదుకాని ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. దీనికితోడు పొగమంచు కమ్ముకోవటంతో వాహనాల రాకపోకలకు సైతం ఇబ్బందికరంగా మారింది. చింతపల్లి, లంబసంగిలో 1.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కొన్నిప్రాంతాల్లో మంచు జల్లులు సైతం కురుస్తున్నాయి.

సీఎం కేసీఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు

0
0

హైదరాబాద్:తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు మరింత ముందుకు వెళ్లాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

అభివృద్ధిలో మరింత ముందుకు సాగాలి:చంద్రబాబు

0
0

అమరావతి: అభివృద్ధిలో ఏపీ మరింత ముందుకు సాగాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆయన సోమవారం నీరు-ప్రగతిపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అభివృద్ధిలో ప్రపంచం ఏపీ వైపు చూసేలా అధికారులు కృషిచేయాలని అన్నారు.

కోర్టులో లొంగిపోయిన సజ్జన్ కుమార్

0
0

న్యూఢిల్లీ: 1984 సిక్కు అల్లర్ల కేసులో శిక్షపడిన కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్ నేడు ఢిల్లీ కోర్టు ఎదుట లొంగిపోయారు. అనంతరం ఆయనను తూర్పు ఢిల్లీలోని మండోలి జైలుకు తరలించారు. తనకు పిల్లలు, మనమలు, మనుమరాండ్లు ఉన్నారని, వారికి సంబంధించిన ఆస్తి పంపకాలు, ఇతర విషయాలు చూసుకునేందుకు జనవరి 31వరకు గడువు ఇవ్వాలని కోరగా కోర్టు తిరస్కరించిన విషయం విదితమే.

షేక్ హసీనాకు మోదీ అభినందనలు

0
0

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు అభినందనలు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆమె ఘనవిజయం సాధించటం ఆయన అభినందిస్తూ ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగవ్వాలని ఆకాంక్షించారు. ఆమె పాలన విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు.

డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు అరెస్టు

0
0

హైదరాబాద్: డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు అంతర్ రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 10 లక్షల రూపాయలు విలువ చేసే కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.


రాజ్యసభ వాయిదా

0
0

న్యూఢిల్లీ: ప్రతిపక్షాల ఆందోళన మధ్య రాజ్యసభ రెండవ తేదీకి వాయిదా పడింది. ముమ్మారు తలాక్ వ్యతిరేక బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. దాదాపు 10 ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశాయి. రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాబ్ నబీ అజాద్ మాట్లాడుతూ ఈ బిల్లు చాలా ముఖ్యమైందని, కాబట్టి సెలెక్షన్ కమిటీకి పంపాలని అన్ని ప్రతిపక్ష పార్టీలు కోరుతున్నట్లు వెల్లడించారు. తృణమూల్ కాంగ్రెస్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సభ్యుల నిరసనల మధ్య రాజ్యసభ రెండవ తేదీకి వాయిదా పడింది.

రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు దుర్మరణం

0
0

గుంటూరు: గుంటూరు లాలాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గుంటూరు-చిలకలూరిపేట జాతీయ రహదారిపై 160 కి.మీ వేగంతో వచ్చిన కారు డివైడర్‌ను ఢీకొని తరువాత లారీని ఢీకొన్నది. కారులో ఉన్న నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే చనిపోయారు. వీరు ఆర్‌వీఆర్ ఆండ్ జేసీ ఇంజనీరింగ్ విద్యార్థులు. కారు ఢీకొనటంతో లారీ సైతం బోల్తా పడింది. మృతులు ధనుష్, కోటేశ్వరరావు, సాయిరామ్, కపూర్‌గా గుర్తించారు. లారీ డ్రైవర్, క్లీనర్‌కు సైతం గాయాలు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అమరావతికి తరలిన హైకోర్టు ఉద్యోగులు

0
0

హైదరాబాద్: రేపటి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులు వేర్వేరుగా పనిచేస్తుండటంతో ఏపీ హైకోర్టు ఉద్యోగులకు తెలంగాణ హైకోర్టు ఉద్యోగులు ఆత్మీయ వీడ్కోలు నిర్వహించారు. దాదాపు 900 మంది ఉద్యోగులు, న్యాయవాదులు, సిబ్బంది అమరావతికి తరలివెళ్లారు. అమరావతి పరిధిలో నిర్మిస్తున్న హైకోర్టు భవనం నిర్మించే వరకు హైదరాబాద్ నుంచి హైకోర్టు తరలింపు నిర్ణయాన్ని వాయిదా వేయాలని ఏపీ న్యాయవాదుల సంఘం వేసిన రిట్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు సాదారణ విచారణగా పరిగణించి జనవరి 2న విచారణ చేపట్టనుండటంతో సిబ్బంది తరలి వెళ్లారు.

నూతన సంవత్సర వేడుకలు

0
0

ఆర్మూర్, డిసెంబర్ 31: ఆర్మూర్ మండలం మామిడిపల్లి గ్రామ శివారులోని మానస హైస్కూల్‌లో సోమవారం నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు కేక్ కట్ చేశారు. ఒకరికొకరు కేక్‌ను తినిపించుకున్నారు. ఆట, పాటలతో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ మానస గణేష్, పాఠశాల పరిపాలన అధికారిణి పద్మ, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ట్రాఫిక్ జామ్.. నిలిచిన వాహనాలు
ఆర్మూర్, డిసెంబర్ 31: ఆర్మూర్ మండలం మామిడిపల్లి గ్రామ చౌరస్తా వద్ద సోమవారం ఉదయం ట్రాఫిక్ జామ్ అయ్యింది. సుమారు గంటకు పైగా ట్రాఫిక్ జామ్ కావడంతో రోడ్డుకు ఇరువైపులా వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ కానిస్టేబుల్ లేకపోవడంతో వాహనదారులు ట్రాఫిక్ నియమ, నిబంధనలు పాటించడం లేదని, తద్వారా తరచూ ట్రాఫిక్ జామ్ అవుతోందని ప్రజలు చెప్తున్నారు. నిబంధనలను అతిక్రమించి వాహనాలు అడ్డదిడ్డంగా దూసుకురావడంతో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సిద్ధులగుట్టపై ప్రత్యేక పూజలు
ఆర్మూర్, డిసెంబర్ 31: ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధ నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుట్టపై గల శివాలయంలో, రామాలయంలో పూజలు చేశారు. శివాలయంలో పూజారి కుమార్ సమక్షంలో అభిషేకాలు జరిగాయి. అనంతరం నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో పల్లకి సేవ నిర్వహించారు. రామాలయం నుంచి ప్రారంభమైన పల్లకి సేవ మెట్ల మార్గంలో గల పాదాల వద్దకు వెళ్లి అక్కడి నుంచి తిరిగి రామాలయానికి చేరుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఏనుగు శేఖర్‌రెడ్డి, భారత్‌గ్యాస్ సుమన్, పీసీ గంగారెడ్డి, బోండ్ల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

నూతన సంవత్సర స్వాగతానికి రంగులు సిద్ధం
కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిన మహిళలు
ఎల్లారెడ్డి, డిసెంబర్ 31: నూతన సంవత్సర వేడుకలకు రంగురంగుల రంగవళ్లులతో మహిళలు స్వాగతం పలికేందుకోసం, చిరువ్యాపారులు రంగులను తోపుడు బండ్లపై సిద్ధంగా ఉంచారు. సోమవారం నాడు డివిజన్ కేంద్రంలోని స్థానిక గాంధీ చౌక్ ప్రాంతంలో చిరువ్యాపారులు, విక్రయానికి తోపుడు బండ్లపై రంగులను సిద్ధంగా ఉంచడంతో, మహిళలు ఇంటి ముందర వేసే రంగవల్లులకోసం కావల్సిన రంగులను కొనుగోలు చేసుకునేందుకు మహిళలు ఆసక్తి కనబర్చారు. స్థానిక మహిళలు, విద్యార్థినీలు, చుట్టుప్రక్కల గ్రామాల మహిళలు రంగవల్లులతోనూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకోసం రంగులను కొనుగోలు చేశారు. అర్ధరాత్రి వరకు ఇంటి ముందు కల్లాపి చల్లి మంగళవారం నాడు నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు రంగు రంగుల ముగ్గులు వేసేందుకోసం, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు అని రాసేందుకోసం రంగులను కొనుగోలు చేశారు. మహిళలు రంగులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబర్చడంతో తమ వ్యాపారం మంచిగా సాగుతోందని రంగులు విక్రయించే చిరువ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పెరుగుతున్న సమస్యాత్మక ప్రాంతాల జాబితా

0
0

నిజామాబాద్, డిసెంబర్ 31: మావోయిస్టుల ప్రాబల్యం సన్నగిల్లిన తరువాత గడిచిన దశాబ్దన్నర కాలం నుండి ప్రశాంతతకు మారుపేరుగా నిలుస్తూ వస్తున్న నిజామాబాద్ జిల్లాలో ఇటీవల గత కొంతకాలం నుండి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటూ ప్రశాంతత చెదిరిపోతోంది. అత్యంత సున్నితమైన అంశాలుగా పరిగణించబడే మత ఘర్షణలు, ఇరు వర్గాల పరస్పర దాడులు వంటి ఉదంతాలు తరుచూ చోటుచేసుకుంటుండడంతో సమస్యాత్మక ప్రాంతాల జాబితా క్రమేణా పెరిగిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో శాంతిభద్రతలు అదుపు తప్పకుండా పోలీసులు అపసోపాలు పడాల్సి వస్తోంది. అసలే ఎన్నికల సీజన్ కొనసాగుతుండడంతో పోలీసులు ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాల్సి వస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎంతో ప్రణాళికాబద్ధంగా చెమటోడ్చిన ఫలితంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా శాసన సభ ఎన్నికల పర్వాన్ని పూర్తి చేయగలిగారు. ప్రస్తుతం వరుసబెట్టి ఒకదాని తరువాత ఒకటిగా గ్రామ పంచాయతీ, వ్యవసాయ సహకార సంఘాలు, మండల ప్రాదేశిక, జిల్లా ప్రాదేశిక, మున్సిపల్, పార్లమెంటు ఎన్నికలు వచ్చే ఆరు మాసాల వ్యవధిలోనే చేపట్టాల్సి ఉండడంతో మరింత అప్రమత్తంగా విధులు నిర్వర్తించాల్సిన ఆవశ్యకత నెలకొంది. సమస్యాత్మక ప్రాంతాల్లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలతో ఫ్లాగ్‌మార్చ్‌లు (కవాతు) నిర్వహించడం ఫలితాన్ని అందిస్తోంది. మునపెన్నడూ లేనివిధంగా కార్డన్ సెర్చ్ చేపట్టి కట్టడిముట్టడితో నిర్బంధ తనిఖీలు జరుపుతున్నారు. నిజామాబాద్ నగరంలో పక్షం రోజుల వ్యవధిలోనే రెండు పర్యాయాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌లు నిర్వహించారంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. పోలీస్ కమిషనర్ కార్తికేయ, అదనపు డీసీపీ శ్రీ్ధర్‌రెడ్డి తదితర ఉన్నతాధికారులు స్వయంగా కార్డెన్ సెర్చ్‌కు నేతృత్వం వహిస్తున్నారు. నిజామాబాద్‌తో పాటు నందిపేట, మోర్తాడ్, రెంజల్, బోధన్, నవీపేట తదితర ప్రాంతాల్లో ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని సాయుధ పోలీసు బలగాలు కవాతు జరిపాయి. ఇక ఏదైనా పండుగ వస్తుందంటే చాలు పోలీసులు ఎనలేని హడావుడి చేస్తూ తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. సమస్యాత్మక ప్రాంతాల జాబితాలో ముందు వరుసలో ఉండే బోధన్ డివిజన్‌లోని రెంజల్, బోధన్, నిజామాబాద్ డివిజన్‌లోని నవీపేట తదితర ప్రాంతాల్లో వేడుకలు ముగిసేంత వరకు కూడా పరిస్థితులను ఉన్నతాధికారులే స్వయంగా పర్యవేక్షించాల్సి వస్తోంది. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని పలువురు అనుచిత పోస్టింగ్‌లు పెడుతుండడం ఉద్రిక్తతలను రాజేస్తూ ఘర్షణలకు దారితీస్తోంది. ఇదివరకు నందిపేటలో ఇదే తరహా ఉదంతం చిలికిచిలికి గాలివానగా మారి ఇరువర్గాలు పోలీసుల సమక్షంలోనే పరస్పరం రాళ్ల దాడికి దిగడం జరిగింది. రెంజల్ మండలంలోనూ మతపరమైన వివాదం చెలరేగడం, బీజేపీ నాయకులు ఆందోళనలకు దిగడంతో పోలీసులు వారిని సర్ది చెప్పేందుకు నానాతంటాలు పడాల్సి వచ్చింది. ఇలాంటి సందర్భాల్లో ఏమాత్రం ఏమరుపాటును ప్రదర్శించినా పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పే ప్రమాదం ఉండడంతో స్వయంగా ఉన్నతాధికారులే రంగంలోకి దిగి ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాల్సి వస్తోంది. మారిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తును ఉన్నతాధికారులే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇదివరకు రంజాన్, బక్రీద్, వినాయక చవితి, గణేష్ నిమజ్జన శోభాయాత్ర వంటి సమయాల్లోనే ప్రధానంగా బందోబస్తుపై దృష్టిని సారించేవారు. ప్రస్తుతం మిలాద్-ఉన్-నబీ, దేవీమాత శోభాయాత్ర, హనుమాన్ దీక్షాపరులు చేపట్టే శోభాయాత్ర వంటి సమయాల్లోనూ అసాధారణ రీతిలో బందోబస్తును ఏర్పాటు చేస్తూ, ముందస్తుగానే ప్రార్థనా స్థలాల వద్ద పికెటింగ్‌లను నెలకొల్పుతున్నారు. నిజానికి ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకుని వారికి మరింతగా చేరువయ్యేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్న క్రమంలో సమస్యాత్మక ప్రాంతాల సంఖ్య తగ్గాల్సి ఉన్నప్పటికీ, జిల్లాలో మాత్రం అందుకు భిన్నంగా వాటి సంఖ్య మరింతగా పెరుగుతుండడంతో ప్రస్తుత ఎన్నికల సీజన్‌లో పోలీసు అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

జనవరి మొదటి వారంలోగా ఇంటింటికీ ‘భగీరథ’ నీరు

0
0

కామారెడ్డి, డిసెంబర్ 31: జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో మిషన్ భగీరథ పాత ఓహెచ్‌ఎస్‌ఆర్ మరమ్మతుల పనులు పూర్తి చేసి అసిస్టెంట్ ఇంజనీర్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి పనలను జనవరి మొదటి వారంలోగా పూర్తి చేసి, ఇంటింటికి తాగునీటిని ప్రతి రోజు అందించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్. సత్యనారాయణ మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ చాంబర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, పాత ఓహెచ్‌ఎస్‌ఆర్ మరమ్మతులకు కావాల్సిన నిధులను రూపొందించి వెంటనే పనులు ప్రారంభించాలని అన్నారు. మరమ్మతులకు కింద మెట్ల మరమ్మతులను, ఓహెచ్‌ఎస్‌ఆర్ వెంటిలేషన్, వాల్వ్‌స్, వాటర్ లేవల్ ఇండికేటర్, లైటనింగ్, ఇన్‌సైడ్‌ల్యాడర్, మ్యాన్‌హోల్ కవర్స్, టాప్‌లేవల్ రేలింగ్, వాల్ రిపేర్లు, పెయింటింగ్‌లను తదితర పనులను అన్ని గ్రామ పంచాయతీల్లో ఆచరణలోకి తేవాలని అన్నారు. కొత్త ఓహెచ్‌ఎస్‌ఆర్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. అన్ని నివాసిత ప్రదేశాలకు నల్లాకనెక్షన్‌లను వందశాతం అందించాలని అన్నారు. గ్రామాల్లో మరమ్మతుల పురోగతిపై క్షేత్రస్థాయిలో పర్యటించి ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తేవాలని సూచించారు. జనవరి 10వ తేదీలోగా నల్లా కనెక్షన్లు ఇంటింటికీ ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఈఈ లక్ష్మీనారాయణ, ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు పాల్గొన్నారు.

రైతుల సమస్యలపై కలెక్టర్‌కు వినతి

0
0

కంఠేశ్వర్, డిసెంబర్ 31: జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని అఖిల భారత రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ప్రగతిభవన్‌లో కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావును కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బాకారం గంగారెడ్డి మాట్లాడుతూ, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో అన్ని ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రాక రైతులు అల్లాడుతున్నారని అన్నారు. పెట్టుబడి వ్యయం పెరిగి అప్పుల ఊబిలో కూరుకుపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను రుణ విముక్తులను చేయాల్సిన ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. ఉపాధి లేక పట్టణాలకు వలసలు పోతున్నారని, పాలకులు మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రైతుల సమస్యలను, పెండింగ్‌లో ఉన్న సాగు, తాగునీటి పథకాలను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతన చట్టాన్ని సవరించి వ్యవసాయ కూలీలకు కూలీ రేటును పెంచాలన్నారు. అభివృద్ధి పేరుతో నిర్బంధ భూసేకరణను నిలిపివేసి ఆ భూములను తిరిగి రైతులకు అందివ్వాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ఎరువులు, పురుగుల మందుల ధరలను తగ్గించి సబ్సిడీపై రైతులకు అందివ్వాలన్నారు. అలాగే కౌలు రైతులకు రుణ సౌకర్యం కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన పథకాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు, కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడకుండా రైతాంగానికి ఉపయోగపడే విధంగా నిబంధనలు సవరించాలన్నారు. సెజ్‌ల పేరుతో రైతుల నుండి స్వాధీనం చేసుకున్న భూములలో పరిశ్రమలు స్థాపించకుండా ఉన్న భూములను సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రైతులకు పంపిణీ చేయాలన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టులో పేరుకుపోయిన పూడికను తీసి నీటి నిల్వ సామర్థ్యం పెంచి ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు. బోధన్‌లో గల నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించి ప్రభుత్వ రంగంలో నడపాలని డిమాండ్ చేశారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ఏఐకేఎంఎస్ నాయకులు గుమ్మల గంగాధర్, భాస్కర్, నారాయణ, బాగిరెడ్డి తదితరులు ఉన్నారు.
విద్యుద్దీపాలను అమర్చాలి
ఇదిలా వుండగా నగరంలోని 38వ డివిజన్ పరిధిలోని ముజాహిద్‌నగర్‌కు చెందిన యువకులు ప్రగతిభవన్‌లో కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ముజాహిద్ కాలనీకి చెందిన అబ్దుల్ రషీద్ మాట్లాడుతూ, కాలనీలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, విద్యుత్ దీపాలు వెలగడం లేదని వీటిని వెంటనే పునరుద్ధరించాలని ఆయన కోరారు.


కలెక్టరేట్ ఎదుట వైద్యుల ధర్నా

0
0

కంఠేశ్వర్, డిసెంబర్ 31: రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులపై జరుగుతున్న దాడులకు నిరసనగా సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ కవితారెడ్డి మాట్లాడుతూ, ఎంతో కష్టపడి డాక్టర్ వృత్తిలో ప్రవేశించడం జరుగుతుందని, తమకు చేతనైన మేరకు రోగులకు న్యాయం చేయడానికే ప్రయత్నిస్తున్నామని, కానీ ఇటీవలి కాలంలో జరుగుతున్న ఘటనలు చూస్తే వైద్య వృత్తిలో ఎందుకు ప్రవేశించామా అని భయపడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లోని గ్లోబల్ హాస్పిటల్‌లో జరిగిన దౌర్జన్యం కానీ, రెండు రోజుల క్రితం ఓ పిల్లల వైద్య నిపుణుడిని కొట్టిన తీరు వైద్యులను తీవ్ర మనస్థాపానికి గురి చేసిందన్నారు. ఇదేరకంగా దాడులు కొనసాగితే, అన్ని ప్రైవేటు ఆసుపత్రులను మూసుకోవాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వైద్యులకు రక్షణ కల్పించి, 2002యాక్ట్-11ను ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. ఆసుపత్రులపై దాడులు చేస్తే కఠినంగా శిక్షించాలన్నారు. ఆసుపత్రుల ఆస్తులను ధ్వంసం చేస్తే నిందితుల వద్ద నుండి పరిహారం కట్టించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఒకవేళ రోగులకు అన్యాయం జరిగితే న్యాయపరంగా పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు. అనంతరం ప్రగతిభవన్‌లో కలెక్టర్ ఎంఆర్‌ఎం.రావును కలిసి వినతిపత్రం అందించారు. ఈ ధర్నాలో ఐఎంఏ ప్రతినిధులు, ప్రైవేట్ వైద్యులు పాల్గొన్నారు.

అందరి సహకారంతో అభివృద్ధి పథంలో జిల్లా

0
0

నిజామాబాద్, డిసెంబర్ 31: అందరి సహకారంతో 2018లో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో పయనింపజేశామని, 2019నూతన సంవత్సరంలోనూ ఇదే తరహాలో తోడ్పాటును అందిస్తూ జిల్లా ప్రగతికి దోహదపడాలని కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు అభిలషించారు. సోమవారం స్థానిక ప్రగతిభవన్‌లో ప్రజావాణి అనంతరం కలెక్టర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు ప్రకటించారు. అన్ని శాఖల అధికారులు, ఉద్యోగుల సహకారంతోనే జిల్లాలో మెరుగైన పాలన అందించగలిగామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి కృషి, భాగస్వామ్యంతోనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో నిజామాబాద్ జిల్లా సత్ఫలితాలు సాధించేందుకు వీలు కలిగిందన్నారు. ప్రత్యేకించి రైతుబంధు, రైతు బీమా వంటి ప్రతిష్టాత్మకమైన, ప్రాధాన్యతతో కూడిన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించగలిగామని కలెక్టర్ సంతృప్తి వెలిబుచ్చారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, ఇతర సదుపాయాలను సకాలంలో అందించడంలో జిల్లా యంత్రాంగం సఫలీకృతమైందని, తద్వారా రికార్డు స్థాయిలో 4.84లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుండి సేకరించగలిగామని వివరించారు. రైతులకు ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా అందించిన పెట్టుబడి సబ్సిడీతో పాటు రైతుల కృషి, ప్రకృతి సహకారం వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. జిల్లాలో పశు, మత్స్య, గొర్రెల సంపను గణనీయంగా పెంచుకోగలిగామని అన్నారు. గత విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో రాష్ట్ర స్థాయిలో నాల్గవ ర్యాంకులో నిలిచామని, ఈసారి కూడా అదే తరహాలో మరింత పట్టుదలతో కృషి చేసి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎక్కడ కూడా ఎలాంటి అపశృతులకు తావులేకుండా ఎన్నికలను సజావుగా పూర్తి చేయడంలో ఉద్యోగులు అందించిన తోడ్పాటు మరువలేనిదని అన్నారు. రానున్న పంచాయతీ, సహకార, పార్లమెంటు, ప్రాదేశిక, మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇదే తరహా స్ఫూర్తిని ప్రదర్శించాలని సూచించారు. కొత్త సంవత్సరంలో అధికారులు మరింతగా కష్టపడి జిల్లా అభివృద్ధి, సంక్షేమంలో పాలు పంచుకుంటారనే పూర్తి నమ్మకం ఉందన్నారు.
ఆపరేషన్ స్మైల్ ద్వారా తప్పిపోయిన చిన్నారులను గుర్తించండి
కాగా, పలు కారణాల వల్ల తప్పిపోయి ఆయా సంస్థల్లో పని చేస్తున్న పిల్లలను గుర్తించి వారికి అవసరమైన పునరావాసం కల్పించాలని కలెక్టర్ ఎంఆర్‌ఎం.రావు అధికారులను ఆదేశించారు. ఇదివరకటి తరహాలోనే ఈ ఏడాది కూడా తప్పిపోయిన పిల్లలను గుర్తించేందుకు ఆపరేషన్ స్మైల్-5 కార్యక్రమాన్ని జనవరి నెల అంతా చేపట్టాలని సూచించారు. రెస్టారెంట్లు, ధాబాలు, చిన్నతరహా పరిశ్రమలు, సంస్థలు, రియల్ ఎస్టేట్ నిర్మాణ స్థలాలు, సినిమా థియేటర్లు తదితర ప్రాంతాల్లో బాలలను పనిలో పెట్టుకునే అవకాశం ఉంటుందని, సంబంధిత లైన్ డిపార్ట్‌మెంట్లు అయిన పోలీస్, స్ర్తిశిశు సంక్షేమం, కార్మిక, విద్య, ఆరోగ్య, రెవెన్యూ తదితర శాఖలతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థలు పాల్గొని తప్పిపోయిన పిల్లలను గుర్తించి వారికి అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. నెల రోజుల పాటు చేపట్టే ఈ కార్యక్రమానికి పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకుని, అన్ని శాఖలు సమన్వయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాలని హితవు పలికారు. బాలలను పనులను కొనసాగిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెస్క్యూ చేసిన బాలలను కేజీబీల్లో, వసతి గృహాల్లో ఆశ్రయం కల్పించి విద్యనందించేందుకు చొరవ చూపాలన్నారు. 2017లో 135మంది బాలలను, 2018లో 93మంది చిన్నారులను గుర్తించి పనుల నుండి వారికి విముక్తి కల్పించి పలు సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఆర్‌ఓ అంజయ్య, స్ర్తి శిశు సంక్షేమ శాఖ అధికారిణి స్రవంతి, కార్మిక శాఖ అధికారి చతుర్వేది, నగర పాలక సంస్థ కమిషనర్ జాన్‌శాంసన్ తదితరులు పాల్గొన్నారు.

నేటి నుండి ఈ-చలాన్ విధానం
- ఎస్పీ శే్వతారెడ్డి
కామారెడ్డి, డిసెంబర్ 31: కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని అన్ని మండలాల్లో జనవరి ఒకటవ తేదీ నుండి ఇ-చలాన్ విధానం అమలులోకి వస్తుందని జిల్లా ఎస్పీ శే్వతారెడ్డి తెలిపారు. సోమవారం ఎస్పీ మాట్లాడుతూ, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులు తమ చాలన్ ఏలా చెల్లించాలన్న విషయమై వివరించారు. తీతీతీ.ళష్ద్ఘ్ఘశ.్య, అంఢ్రాయిడ్ తెలంగాణ ఈ-చలాన్ యాప్ ద్వారా, పేటియమ్ అప్లికేషన్ ద్వారా, ఎపిటిఎస్ ఆన్‌లైన్ ద్వారా, మీ-సేవా ద్వారా చెల్లించవచ్చని తెలిపారు. మీ- సేవ ద్వారా చెల్లించే వారు, వారికి మీ- సేవలో ఇచ్చే రశీదుపై ఉన్న డబ్బులు మాత్రమే చెల్లించాలని, నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూళ్లు చేసే మీ- సేవ కేంద్రాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై ప్రత్యేక నిఘా ఉంటుందని, కాబట్టి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రోడ్డుపై వాహనాలు నడపాలని కోరారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారు ఎంతటి వారైన సరే వదిలే ప్రసక్తి లేదని అన్నారు. నిత్యం రద్దిగా ఉంటే ప్రాంతాలపై సీసీ నిఘా ఉంటుందన్నారు. కామారెడ్డిలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉలంఘనకు పాల్పడిన వారికి జరిమానాలు పడ్తాయని, కాబట్టి వచ్చే జనవరి నుండి ప్రతి ఒక్కరు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందిగా కోరారు. బైక్ నడిపే వారు విధిగా హెల్మెట్‌ను ఉపయోగించాల్సిందిగా కోరారు. ప్రతి వాహనదారులు విధిగా డ్రైవింగ్ లైసెన్స్, వాహనం గుర్తింపు పత్రాలు, పొల్యూషన్ టోకేన్‌తో పాటు ఇన్సూరెన్స్ పత్రాలు, వాహనాలపై నంబర్‌ప్లేట్‌ను ట్రాఫిక్ రూల్స్ ప్రకారం ఉండాలని తెలిపారు.

2019నూతన సంవత్సర వేడుకలు

0
0

వేడుకలు

బులియన్

0
0

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,066.00
8 గ్రాములు: రూ. 24,528.00
10 గ్రాములు: రూ. 30,660.00
100 గ్రాములు: రూ. 3,06,600.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,279.144
8 గ్రాములు: రూ. 26,233.152
10 గ్రాములు: రూ. 32,791.440
100 గ్రాములు: రూ. 3,27,914.40
వెండి
8 గ్రాములు: రూ. 332.20
10 గ్రాములు: రూ. 415.00
100 గ్రాములు: రూ. 4.150.00
ఒక కిలో: రూ. 41,500.00
*
హైదరాబాద్‌లో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,017.00
8 గ్రాములు: రూ. 24,136.00
10 గ్రాములు: రూ. 30.170.00
100 గ్రాములు: రూ. 3,01,700.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,226.738
8 గ్రాములు: రూ. 25,813.904
10 గ్రాములు: రూ. 32,247.35
100 గ్రాములు: రూ. 3,22,673.30
వెండి
8 గ్రాములు: రూ. 332.20
10 గ్రాములు: రూ. 415.00
100 గ్రాములు: రూ. 4.150.00
ఒక కిలో: రూ. 41,500.00.

ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ ఆస్తులు అమ్మకానికి..

0
0

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: అప్పుల్లో కూరుకుపోయిన ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్) గ్రూప్ సంస్థ ఆస్తుల అమ్మకం ద్వారా నిధులు సమీకరించుకోవాలని నిర్ణయించింది. తద్వారా రుణాలను తీర్చాలని తీర్మానించింది. ఈ క్రమంలో ఈ సంస్థ ముంబయి, కేరళలో గల వాణిజ్య, నివాస ఆస్తుల విక్రయానికి టెండర్లు ఆహ్వానించింది. ముంబయిలోని మలబార్ హిల్స్ ప్రాంతంలో 1,376 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న మూడు వాణిజ్య స్థలాలను, అలాగే కోల్‌కతాలోని మరో వాణిజ్య పరమైన స్థలాన్ని ఈ సంస్థ విక్రయానికి పెట్టింది. జనవరి 15లోపు ఇందుకు సంబంధించిన బిడ్లు సమర్పించాల్సివుంది. ఇలావుండగా ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ సంస్థ మొత్తం 91 వేల కోట్ల రూపాయల మేర బ్యాంకుల నుంచి రుణాలుగా పొందడం జరిగింది. ఈ అప్పులు మరోవిధంగా మార్పుచేసేందుకు సైతం వీలులేనివిగా మారడంతో ఇక తప్పని సరిగా తీర్చేందుకు ఆస్తుల అమ్మకమే శరణ్యమని యాజమాన్యం నిర్ణయించింది. ఇదివరకే ఈ సంస్థ అనేక రోడ్డు, సౌరశక్తి విభాగాలు, విద్యా సంస్థల ఆస్తులను విక్రయానికి పెట్టింది. అలాగే లగ్జరీ కార్లు, కార్యాలయ ఫర్నిచర్ తదితరాలను సైతం అమ్మకానికి పెట్టింది. కాగా తాజాగా ఈ కంపెనీ అమ్మజూపిన ఆస్తుల ద్వారా రూ.200 కోట్లు సమీకరించేందుకు వీలుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Viewing all 69482 articles
Browse latest View live