Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

పుడ్డింగ్‌ల ప్రత్యేకం

$
0
0

పిల్లలకు కానీ, పెద్దలకు కానీ కేకుల కంటే ఇష్టమైనవి ఏవైనా ఉన్నాయంటే అవి పుడ్డింగ్సే.. పండ్లు, వాటి ఎసెన్స్‌తో తయారుచేసే పుడ్డింగ్‌లు ఆరోగ్యానికి మంచివి.. వేడుకలకు కేవలం కేకులే కాకుండా పుడ్డింగులను కూడా ఇంట్లో ట్రై చేస్తే చాలా రుచిగా కుదురుతాయి. మరి ఒకసారి ప్రయత్నిద్దామా..

చాక్లెట్ ఆల్మండ్ పుడ్డింగ్

కావలసిన పదార్థాలు

క్యాస్టర్ షుగర్: 150 గ్రాములు
ఉప్పులేని వెన్న: 150 గ్రాములు
కోడిగుడ్లు: మూడు
బాదం పొడి: 100 గ్రాములు
మైదా: 70 గ్రాములు
చాక్లెట్ పొడి: 40 గ్రాములు
బేకింగ్ పొడి: 15 గ్రాములు
పాలు: 60 ఎం.ఎల్.
డార్క్ చాక్లెట్ చిప్స్: 70 గ్రాములు
బటర్ కాగితం: ఒకటి

తయారుచేసే విధానం

ఓవెన్‌ను నూట అరవై అయిదు డిగ్రీల ఉష్ణోగ్రతలో ముందుగా వేడిచేసి పెట్టుకోవాలి. మిశ్రమం ఉంచే పాత్రలోపల బటర్ పేపర్‌ను రాయాలి. ఇప్పుడు మైదా, చాక్లెట్ పొడిని జల్లించి పెట్టుకోవాలి క్యాస్టర్ షుగర్, వెన్నను ఓ పాత్రలోకి తీసుకుని చెక్క చెంచాతో బాగా గిలక్కొట్టినట్లు చేయాలి.
ఇందులో కోడిగుడ్ల సొనను ఒకేసారి వేసేయాలి. మైదా, చాక్లెట్ చిప్స్, బేకింగ్ పొడి, చాక్లెట్ పొడి, బాదాం పొడి వేస్తూ ఉండలు కట్టకుండా కలపాలి. చివరగా పాలు చేర్చాలి. దీన్ని కేక్ టిన్‌లోకి తీసుకుని నీళ్లు పోసిన బేకింగ్ ట్రేలో ఉంచి నలభై నుంచి యాభై నిముషాల దాకా బేక్ చేయాల్సి ఉంటుంది. దీన్ని వెనిల్లా ఐస్‌క్రీంతో కలిపి తింటే సూపర్‌గా ఉంటుంది.

మొకా ఫడ్జ్ పుడ్డింగ్

కావలసిన పదార్థాలు
చాక్లెట్ క్రీం బిస్కెట్లు: పది
క్రీం చీజ్: కప్పు
పంచదార: పావు కప్పు
పాలు: రెండు కప్పులు
ఇన్‌స్టంట్ కాఫీ పొడి: రెండు స్పూన్లు
చాక్లెట్ పుడ్డింగ్ మిక్స్: ఒక ప్యాకెట్

తయారుచేసే విధానం

చాక్లెట్ క్రీం బిస్కెట్లను మరీ మెత్తగా కాకుండా పొడి చేసుకోవాలి. క్రీం చీజ్‌ని బాగా గిలక్కొట్టి పంచదార వేసి కలపాలి. కాఫీపొడిని రెండు టేబుల్ స్పూన్ల పాలల్లో నానబెట్టుకోవాలి. మిగిలిన పాలలో పుడింగ్ మిశ్రమాన్ని వేసి బాగా కలిపి పదినిముషాలు ఫ్రిజ్‌లో ఉంచేయాలి. ఇప్పుడు బిస్కెట్ల పొడిని ఓ గ్లాసులో పావు వంతు వరకూ తీసుకోవాలి. దానిపై క్రీం చీజ్ వేయాలి. దానిపై కొద్దిగా పాలల్లో నానబెట్టిన కాఫీపొడి, పుడింగ్ మిశ్రమాన్ని వేయాలి. ఇలా మూడు వరుసల్లో వచ్చేలా ఒక్కో పదార్థాన్ని వేసుకుని ఫ్రిజ్‌లో ఉంచాలి. చల్లగా అయ్యాక తినాలి. పిల్లలు ఎంతగానో ఇష్టపడే మొకా ఫడ్జ్ పుడ్డింగ్ తయారు.

ఆపిల్ పుడ్డింగ్

కావలసిన పదార్థాలు

ఆపిల్స్: నాలుగు
పంచదార: అరకప్పు
గుడ్లు: నాలుగు
మైదా: రెండు టేబుల్ స్పూన్లు
కస్టర్డ్ పౌడర్: రెండు టేబుల్ స్పూన్లు
ఐసింగ్ షుగర్: కొద్దిగా

తయారుచేసే విధానం

ముందుగా ఓవెన్‌ని 180 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడిచేసుకుని పెట్టుకోవాలి. ఆపిల్ ముక్కలు, పావుకప్పు పంచదార, రెండు టేబుల్ స్పూన్ల చల్లని నీళ్లు ఓ గినె్నలో తీసుకుని స్టవ్‌పైన ఉంచాలి. పంచదార కరిగి ఆపిల్ ముక్కలు మెత్తగా అయ్యాక దింపేయాలి. గుడ్లను గిలక్కొట్టి మిగిలిన పంచదారను వేసి మరోసారి కలపాలి. ఇందులో మైదా, కస్టర్డ్ పౌడర్ వేసి మరోసారి కలిపి ఆపిల్ మిశ్రమంపై వేసి ఇరవై నిముషాలు బేక్ చేసుకుని తీసుకోవాలి. దీనిపై ఐసింగ్ షుగర్ వేస్తే చాలు.. టేస్టీ టేస్టీ ఆపిల్ పుడ్డింగ్ రెడీ..

ఫ్లోర్‌లెస్ కేక్ పుడ్డింగ్

కావలసిన పదార్థాలు

చాక్లెట్ ముక్కలు: రెండున్నర కప్పులు
ఉప్పు కలపని వెన్న: ఒక కప్పు
గుడ్లు: ఐదు
పంచదార: కప్పు
వెనిల్లా ఎసెన్స్: రెండు స్పూన్లు
ఉప్పు: పావు చెంచా
చాక్లెట్ పొడి: అరకప్పు

తయారుచేసే విధానం

ముందుగా ఓవెన్‌ని 300 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడి చేసుకోవాలి. కేక్‌పాన్ అడుగున కొద్దిగా వెన్న రాయాలి. దానిపై కొద్దిగా చాక్లెట్ పొడిని చల్లాలి. ఇప్పుడు చాక్లెట్ ముక్కలు, వెన్నను ఓ గినె్నలో తీసుకుని ఓవెన్‌లో కాసేపు ఉంచి కరిగించాలి. తరువాత తీసేసి చల్లారనిచ్చి అందులో గుడ్లసొన, పంచదార, వెనిల్లా, ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ల నీళ్లూ కలపాలి. ఇది మెత్తగా అయ్యేవరకు మిక్సీలో వేసి తిప్పాలి.

ఇందులో చాక్లెట్‌పొడి కలిపి మరోసారి గిలక్కొట్టాలి. ఈ మిశ్రమాన్ని పాన్‌లో ఉంచి నలభై అయిదు నిముషాలసేపు బేక్ చేసి తీసేయాలి. తరువాత కూడా అరగంట సేపు పూర్తిగా చల్లారేవరకు బయట ఉంచి కేక్‌ను బయటకు తీసి ఫ్రిజ్‌లో ఉంచాలి. చల్లారిన తరువాత తినాలి.

ఆరెంజ్ పుడ్డింగ్

కావలసిన పదార్థాలు

కమలా(ఆరెంజ్)తొక్కల పొడి: రెండు స్పూన్లు
వెన్న: 200 గ్రాములు
పంచదార పొడి: ఒకటిన్నర కప్పులు
గుడ్లు: మూడు
మైదా: ఒకటిన్నర కప్పులు
పాలు: అరకప్పు
ఆరెంజ్ జ్యూస్: పావు కప్పు
కమలాలు: రెండు

తయారుచేసే విధానం

ముందుగా కమలాలను తొనలను ఒలిచి పెట్టుకోవాలి. వెన్న, ఒక కప్పు పంచదార పొడి, కమలాతొక్కల పొడిని వేసి గిలక్కొట్టాలి. ఇందులో కోడిగుడ్లను వేసి బాగా గిలక్కొట్టాలి. అలాగే మైదాపిండిని కూడా వేసి బీట్ చేయాలి. తరువాత దీనిలో పాలు పోసి కలపాలి. పుడ్డింగ్ వండే గినె్నలో అడుగున బేకింగ్ పేపర్ పరిచి, నెమ్మదిగా పుడ్డింగ్ మిశ్రమాన్ని పోసి వెడల్పాటి పాన్‌లో పెట్టి మూతపెట్టాలి. పుడ్డింగ్ గినె్న సగం మునిగే వరకూ పాన్‌లో వేడినీళ్లు పోసి మూతపెట్టి స్టవ్‌పై పెట్టాలి. నీళ్లు మరిగాక సిమ్‌లో పెట్టి ఒకటిన్నర గంటల పాటు దీన్ని ఉడికించాలి. ఓ గినె్నలో మిగిలిన పంచదార, ఆరెంజ్ జ్యూస్ వేసి రెండు, మూడు నిముషాల పాటు మరిగించి సిమ్‌లో ఐదునిముషాలు ఉంచి తీసి ఒలిచిన కమలా తొనలు వేయాలి. స్టవ్ ఆఫ్ చేశాక పది నిముషాలు చల్లారనిచ్చి పుడ్డింగ్ బయటకు తీసి ప్లేటులో పెట్టి ఆరెంజ్ జ్యూస్ మిశ్రమం దానిమీదుగా పోసి వడ్డించాలి.


ధనుర్మాస వైభవం

$
0
0

వేకువ జామునే ప్రతి ఇంటి ముంగిట కల్లాపి జిల్లి రంగు రంగుల రంగవల్లికలు దిద్ది ఆపై పేడతో రూపొందించిన గొబ్బెమ్మలు పెట్టి పసుపుపచ్చని తంగేడుపూలు అలంకరించి కనె్నపిల్లలు గొబ్బి పాటలతో, తప్పెటలతో చుట్టూ తిరుగుతూంటే ధనుర్మాసం ప్రవేశించిందని అర్థం. ఆ సమయంలో జియ్యరులు తలపై అక్షయపాత్రతో చిందులు వేస్తూ ప్రతి ఇంటి ముందర సందడిచెయ్యడం, జంగమయ్యలు గంటం తిప్పుతూ పాటలు పల్లవించడం ధనుర్మాసానికి స్వాగతించినట్లు సంకేతంగా నిలుస్తాయి.
ఈ దృశ్యాలు దశాబ్దలకుముందు పల్లెలలో, పట్టణాల్లో కనువిందు చేసే కమ్మని దృశ్యాలు. మన సంస్కృతికి నిలువుటద్దాలు. భారతీయ సంస్కృతిలో ఒకవైపు ఆధ్యాత్మిక జ్ఞాన సంపత్తి, మరొకవైపు భౌతిక జీవన మాధుర్యాన్ని అందించే అద్భుతాలు సమ్మిళితమై ఉంటాయి. అన్నివర్గాలవారి అభిరుచులు, ఆప్యాయతలు పెనవేసుకుని ఉల్లాస, ఉత్సాహాలకు వెల్లివిరుస్తాయి..
ఈ పర్వాలు, పండుగలు జ్యోతిష శాస్తప్రరంగా, తిథి, నక్షత్ర, ఋతువులను, గ్రహసంచారాన్ని ఆధారంచేసుకుని మన ప్రాచీన ఋషులు నిర్ణయించారు. ఏసమయంలో ఏఏ పర్వాలు, పండుగలు నిర్వహించాలో సవివరంగా చెప్పారు. అటువంటి పర్వాలలో ‘్ధనుర్మాసం’ ముఖ్యమైనది.
ఆధునిక కాలంలో పట్టణాలు, నగరాలలోని ప్రజలు అపార్టుమెంట్ సంస్కృతికి, పాశ్చాత్య నాగరికతకు అలవడ్డం చేత ఈ చక్కని సమైక్య జీవన మాధుర్యాన్నిఅనుభవించలేని దుర్గతి ప్రాప్తమైంది. ఇప్పటికీ పల్లె ప్రాంతాల్లో ఈ సంస్కృతి సంప్రదాయాలు మసకబారిపోకుండా ఉండడం మన అదృష్టం. పండుగలు, వాటి వైభవాలు, వాటి వెనుకగల ఆధ్యాత్మిక విలువలు తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉంటే ఈ మాసంలో గ్రామాలను దర్శించాలి.
‘మాసానాం మార్గశీర్షోహం’ అన్నాడు గీతాచార్యుడు. శ్రీకృష్ణపరమాత్మ మార్గశీర్షమాసం స్వరూపాన్ని తానే అనడంలోనే ఎంతో విశేషముంది. ఈ మాసం ఎంతో పవిత్రమైనదని, ఎంతో మహిమాన్వితమైనదని ఆ మాటల్లో నిక్షిప్తపమయ్యాయి. జ్యోతిషశాస్త్ర రీత్యా రవి సంచారంతో ఈ మాసం ముడిపడి ఉంది. రవి మేషాది ద్వాదశ రాశుల్లో ఒక్కొక్క మాసం ఒక్కొక్క రాశిలో నివాసం ఉంటాడు. రవి ధనుస్సురాశిలో ప్రవేశించినప్పటినుండి తిరిగి మకరరాశిలో (మకర సంక్రాంతి ముందురోజు భోగి పండుగనాడు) ప్రవేశించేవరకు ధనుర్మాసంగా పరిగణనను పొందింది.
కార్తికమాసం ప్రధానంగా శివపరంగా ఖ్యాతినార్జించుకుంది. మార్గశిర పుష్యమాసాలలో ఉండే ధనుర్మాసం శ్రీమహావిష్ణువుకు, అతని అనపాయినియైన లక్ష్మీదేవికి ఎంతో ప్రియం. విష్ణు సంబంధిత పర్వాలన్నీ ధనుర్మాసంలో సంభవించడం విశేషం. మార్గశిర గురు (లక్ష్మీ) వారాలలో ముతె్తైదువలు లక్ష్మీపూజలు చేస్తారు. విశాఖపట్నంలోని శ్రీ కనకమహాలక్ష్మికి మార్గశిర మాసోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
ఇవి ఒక ఎతె్తైతే ధనుర్మాసం వైష్ణవ సంప్రదాయంలో ప్రత్యేకమైనది. ధనుర్మాసవ్రతం పలు వైష్ణవ కుటుంబాల్లో ఆచరిస్తారు. శ్రీమహావిష్ణువును ‘మధుసూదనుడు’ అను పేర నెల రోజులపాటు షోడశోపచారాలతో అర్చిస్తారు. ఈ వ్రతం ఆచరించడంవల్ల శ్రీమహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం.
ధనుర్మాసంలోనే గోదాదేవి శ్రీరంగనాధుని భర్తగా పొందగోరి మార్గళి వ్రతాన్ని ఆచరించింది. స్నాన వ్రతమని, శ్రీవ్రతమని వ్యవహరించే ఈవ్రతాన్ని, ద్వాపరయుగంలో గోపికలు ఆచరించిన కాత్యాయినీ వ్రతంవలె వేకువనే లేచి తనను తాను గొల్లపడుచుగా భావించుకుని, తానున్న విల్లిపుత్తూరును వ్రేపల్లెగా, గొల్లకట్టుతో, గొల్లకొప్పుతో రంగనాథుని రోజుకొక పాశురము రచించి, దానిని మధురంగా గానం చేస్తూ, వాఙ్మవికగా శ్రీరంగనాథునికి అర్పించింది. మాసంపాటు ప్రతిరోజు పాడిన పాశురాలు తమిళ వాఙ్మయంలో అత్యంత ప్రసిద్ధి పొందడమేకాక, తమిళుల ‘నాలాయిరం’ గ్రంథంలో చోటుచేసుకున్నాయి. ఈ ముప్పది పాశురాల గ్రంథం ‘తిరుప్పావై’ అన్న పేరును సంతరించుకుంది. ఇది దివ్య ప్రబంధమని పండితులు పేర్కొంటారు. ధనుర్మాసం కడపటిరోజున (్భగినాడు) గోదా రంగనాథుల కల్యాణం వైష్ణవాలయాల్లో దివ్యంగా జరుగుతుంది.
అదేవిధంగా ధనుర్మాసంలో ‘తిరుప్పావై’ వలె, మాణిక్యవాచకులు పాడిన ‘తిరువెంచావై’ పాటలు పరమశివుని నాయకునిగా భావించి భక్తి శృంగారములు మేళవించినవి అని కంచి మహాస్వామి వారన్నారు.
‘తిరుప్పావై’ పాశురాలను వైష్ణవ దేవాలయాలలో సుప్రభాత సమయంలో గానం చేస్తే, ‘తిరువెంచావై’ పాటలను శివాలయాల్లో సుప్రభాత సమయంలో గానం చేయడం ధనుర్మాసంలోని ప్రత్యేకత.
శైవ, వైష్ణవ దేవాలయాల్లో ‘తిరువెంచావై’, ‘తిరుప్పావై’ పాటలను ఉషఃకాలంలో ధనుర్మాసమంతా అందరూ గానం చేయాలని కంచి మహాస్వామివారు పలు సభల్లో ప్రజలకు విజ్ఞప్తి చేసేవారు.
ధనుర్మాసవ్రతమును ముతె్తైదువులు ‘మార్గళి’వ్రతాన్ని కనె్నపిల్లలు, తెలుగు ప్రాంతాల్లో మార్గశిర లక్ష్మీవారపు నోములు ఆచరిస్తూ ధన్యత పొందుతున్నారు. ఆరోగ్యరీత్యా వేకువన స్నానం చేయడం, ఆయా వ్రతాల్లో చెప్పినవిధంగా చేసిన నివేదనలు మంచి ఆరోగ్యాన్ని ప్రస్తావిస్తాయని ఆయుర్వేద శాస్త్రం అంటున్నది.
అత్యంత పవిత్రమైన, భక్తిదాయకమైన ధనుర్మాసంలో శివకేశవుల ఆరాధన శ్రేయోదాయకం, మోక్షదాయకం.

అనంతం-25

$
0
0

ఏది ఏమైనా తనిప్పుడు ఇంటికి వెళ్లాలి. వెళ్లి తీరాలి. పెట్టె బేడ సర్దుకొని వెళ్లి ఇకపై తన ‘ఆల్మకాం’ గరుడాచలం దగ్గర పెట్టాలి. గరుడాచలమే రమ్మన్నాడు.
సుఖంగా బ్రతికే మార్గం అతను చూపిస్తున్నపుడు గూడెం గుడిసెలో హీనంగా వుండటం ఎందుకూ?
గరుడాచలంతోనే వుండాలన్న నిర్ణయానికి అప్పటికే వచ్చాడు రాగ్యా.
త్వరత్వరగా నడుస్తూ ఇంటికి చేరాడు.
కాళీచరణ్ ఇంట్లో లేడు.
తలమీది గాయం నెప్పి పుడుతున్నది. వొళ్ళు సలుపు తీస్తున్నది. జ్వరం వచ్చేట్టుంది. నీరసంగా వుంది.
కొంచెంసేపు విశ్రాంతి తీసుకొని ఓపిక రాగానే గరుడాచలం దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు.
క్రింద చాప పరచుకొని పడుకున్నాడు రాగ్యా.
తీవ్రంగా మానసిక ఒత్తిడికి గురౌతూ, తల వంచుకొని ఇంట్లోకి వెళ్లాడు కానీ పరిసరాలను రాగ్యా గమనించలేదు.
జరిగిందంతా వాల్యా ఇంట్లో చెప్పాడు. అది తండా అంతా తెలిసిపోయింది.
రాగ్యాని ఇక ఉపేక్షించకూడదనుకున్నాడు నగ్గూరాం. మళ్లీ మళ్లీ తప్పు చేసే అవకాశం ఇచ్చినట్టవుతుందని, పంచాయితీకి పట్టుపట్టాడు.
అందుకు చేరారు వాళ్ళంతా!
పంచాయితీ మొదలు కావడమే ఆలస్యం ఇక! పెద్దలు, తండావాళ్ళు అక్కడే ఉన్నారు.
వాల్యాని, చాంద్‌నీని అడగటం, ఏం జరిగిందో తెలుసుకొని రాగ్యాని వివరణ కోరటం, అపుడు శిక్షించటం జరుగుతుంది.
తండా పెద్దలనుంచి కబురంది కాళీచరణ్ చెట్టుదగ్గరికి వెళ్లిన సమయానికి రాగ్యా ఇంట్లో లేడు. ఒక్కడే వెళ్ళాడు.
‘‘రాగ్యాగాడు రాలేదా’’ పెద్దలు అడిగారు.
‘‘యాడికిబోయిండో ఇంట్లో లేడు’’ అన్నాడు కాళీచరణ్, నేల మీద కూర్చుంటూ.
ఎవ్వరెవ్వరో మాట్లాడుతున్నారు.
కాళీచరణ్‌కి అన్నీ వినిపిస్తున్నాయి.
‘‘ఏంటిదంట మాయరోగవ్! అడవికి బోడు. అయ్యకి సేదోడుగుండడు. శాకిర్జెయ్యడు. సీపు మందు దాగి సిందులెయ్యటవ్ దప్ప మరేంటికీ పనికిరాడు. రాగ్యాగాడ్ని సావగొట్టాలంతే’’
‘‘కాలీశరన్ కడుపున సెడబుట్టిండు! ఆడార్నాయాలు శాందినీ సెయ్యట్టుకుంటాడా! మదవెక్కింది. దించాల..’
‘‘తొలీగా మంచోడే! పట్నంబోతా సెడిపోయిండు. కాళ్ళిరగనూకి పండుకోబెడితే, ఇంకబోడు పట్నానికి..’’
కాళీచరణ్ వాళ్ళ మాటలిక వినలేకపోయాడు!
చివాల్నలేచి నిలబడ్డాడు.
అందరికీ రెండు చేతులూఎత్తి దణ్ణం పెడుతూ-
‘‘శాందినీ యిసయంలో రాగ్యా శబ్బరపనే సేసింది. నే జేసిన గారాబవ్ అసువంటిది. సిన్నప్పట్నించి సావగొడతా శాకిరి జెయ్యటవ్ నేర్పిత్తే అట్టా తయారయ్యేవోడుగాడు. తల్లిలేని పిలగాడిని ఆలోచిస్తి ఇట్లా తయారయ్యిండు. నేనేం జెయ్యాలి?
నా సేతుల్తో కొడుక్కింత యిసవిచ్చి సంపలేను. వాడి కోసరవ్ బతగాలి గాన సావలేను.
మీరు గొట్టండి. సంపదండి! వాడు సచ్చినాకనే నేను సచ్చేది. ముందుగా సత్తే ఆడికి బువ్వెట్టే దిక్కుండదు.
ఇసువంటి ముదనట్టపు నాకొడుకు బుడతాడని ముందుగాల్నే తెలిస్తే కడుపు పోనూక్కుండేది, నా పెండ్లాం! అది తెలవక, కడుపున రుూడు బడంగానే సంతోసిచ్చింది. మొగపిల్లోడే బుడతాడని తాండాకి పేరుదెచ్చే గొప్పోడగుతాడనీ భ్రవపడ్డది.
(ఇంకా ఉంది)

బతుకు దృశ్యాల్ని బొమ్మకట్టించిన ‘మట్టిరంగు బొమ్మలు’

$
0
0

పల్లె పదాల గుండె చప్పుళ్ళతో అక్షరం మొలకెత్తి, ప్రాంతీయ యాసతో గుభాళించినపుడు ఆ కవిత్వ స్పర్శే వేరు. తారసపడిన ప్రతి సందర్భాన్నీ అనుభవ లోతులతో ఒడిసి పట్టుకుంటుంది. అలా రాటుదేలిన అక్షరశ్వాసే ఈ ‘మట్టిరంగు బొమ్మలు’ కవితా సంపుటి. దీని కవి ఉత్తరాంధ్ర పోరాట బతుకు ముఖచిత్రం సిరికి స్వామినాయుడు. డెబ్భై కవితలతో ఊపిరి పోసుకున్న ఈ మాండలిక ప్రాంతీయ అస్తిత్వ ఆర్తి జనజీవాలను పోషించడంలో తనదైన ప్రత్యేక ముద్రను వేసుకుంది. గతంలో ‘మంటి దివ్య’తో సుపరిచితమైన ఈ అక్షరకారుడికి వచనప్రాయమైన కవిత్వనిర్మాణ శైలి సహజంగానే ఒంటపట్టింది. స్థానిక సమస్యలను లోతైన చూపుతో పరిశీలించి, సరళ భాషలో వ్యక్తీకరించడంలో అందెవేసినచెయ్యి ఇతనిది. దీనికి కేంద్రంగా మట్టిరంగు జన జీవన ఘోషనే ప్రతిబింబించడం మొదలుపెట్టాడు.
‘‘పచ్చని యింటిలోకి/ గుడ్లగూబలు దూరినట్టు / నాగరితా ముగేసుకొని / మాది కాని తనదేమో మాగూడల్లోకి చొరబడినప్పటినుండే/ మా ఆదివాసీ బతుకులు మరింత అల్లకల్లోలమైపోయాయి’’ అంటాడు ‘దుర్ల’ అనే కవితలో. ‘సమూహం’ అర్థం వచ్చే ఈ భావజాల తిరుగుబాటు కవిత్వంలో.. తుడుంకొట్టి, సన్నాయి ఊపి, థింసాలాడే.. ఆకుపచ్చని ఆదివాసీ బతుకుల్లో, నవనాగరికతా ముసుగులో విధ్వంసం తొంగిచూసి, దురాక్రమణ జరిపే పెత్తందారులపై.. ఒక సుదీర్ఘ యుద్ధ నిరసనను ప్రకటిస్తాడు కవి స్వామినాయుడు. ‘ఆది నుండీ అడవి ఒక యుద్ధ క్షేత్రం’ అని నొక్కి చెప్పడంలో ఒక జీవన విషాద వాస్తవికత నిలువెత్తు దోపిడీగా తొంగిచూస్తుంది.
‘‘జాలరి వాడ మీద నీలిజెండా’’ అన్న కవితలో వర్తమాన సంక్షోభిత కల్లోల బతుకుల్ని చాలా ఆవేశపూరితంగా చిత్రిస్తాడు కవి.
‘‘మీరు కొల్లగొట్టిన సముద్రం ఒట్టిపోయి/ మా కళ్లలోంచి కురుస్తోంది/ కనిపించని హోరు కెరటాల అలజడై/ మా గుండెల్లో ధ్వనిస్తోంది/ సముద్రం మా సామూహిక స్వప్నం
సముద్రం మా జాలరివాడమీద ఎగిరే నీలి జెండా’’ అని అంటున్నపుడు.. మత్స్యకారుల జీవితాల్లో తొంగిచూస్తున్న అభద్రతాభావం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ‘‘పంట పొలాల మీద/ ఏ మిడతల దండు దాడి జేసిందో/ తన పచ్చని బతుకును/ యే పెట్టుబడి కొల్లగొట్టిందో/ అతని ముఖంమీద చీకటి రెక్క విప్పింది’’ అంటాడు ‘బందీ’ కవితలో ఒకచోట. పెట్టుబడిదారీ సమాజం వేళ్ళూనికొని జడలు విప్పినంత కాలమూ రాజకీయ వ్యవస్థలో మార్పు రానంతవరకూ.. నేల చూపులు చూస్తున్న రైతన్న నాగేటి కర్ర ఎప్పటికీ విషాదగీతానే్న ఆలపిస్తుంది. ‘‘యుద్ధం సోకని నేల కోసం’’ శీర్షికలో ఒక చోట ఇలా అంటాడు-
‘‘కన్నీళ్లు కళ్లాపి చల్లి/ తూరుపు ముగ్గు బుట్టలోంచి/ కాసింత వెలుగు పిండితో ముగ్గేసి/ పూలదీపాలు వెలిగించి/ యుద్ధం సోకని నేలకోసం/ కళ్లను కాగడాలను జేసి కాలం ఎదురుచూస్తోంది’’ అని చెబుతున్నపుడు ఎడతెగని దుఃఖమే గుండెలోతుల్లోంచి పొంగుకొస్తుంది. నేల నలుచెరుగులా గుత్త్ధాపత్యం నీడలు నిఘా నేత్రాలతో సంకెళ్లు వేసి, నిషేధాజ్ఞలను పరుస్తుంటే.. అస్తిత్వం ఉనికికే ముప్పు వాటిల్లి భవిష్యత్తును భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఈ దృశ్యానే్న ఆర్ద్రపూరితంగా చెబుతాడు కవి.
‘రుతువుల కొమ్మలమీద /రాగాలు పాడే మట్టిగువ్వలు’ అన్నపుడూ.. ‘‘ప్రాణాలు రెండూ ఫలమాడే నాగుల్లా /ఒకే దేహమై ముచ్చట్లాడుకుంటాయి’’ అని పలికినపుడూ..‘‘నేల కొమ్మకు మెతుకు పూయదు కానీ’’ చెప్పినపుడూ.. ‘‘రైతులేని రాజధాని / మీకు భూతల స్వర్గమేమో గానీ /మాకు మాత్రం భూతాల స్వర్గమే’’ అంటూ నిర్వచించినపుడు కానీ.. స్వరం ఒకటే. ఆలోచనలు వేర్వేరు. ‘‘శతృ శిబిరాల్లా యుద్ధ మేఘాలు’’, ‘‘వాళ్ళ కళ్ళలోయల్లోంచి /వాగు పొంగుతూనే ఉంది’’, ‘‘ఒక ఎడబాటు / ఎడారి మీద ఒంటరితనాన్ని మోస్తూ’’, ‘‘బతుకు తీరం పొడుగునా / మనం కలిసి నడిచిన /జ్ఞాపకాల పాదముద్రలు’, కవిలో దాగిన పల్లె వాసనల పవరింపులు బాధలుగా గాధలుగా కళ్ళముందు మెదులుతుంటాయి. శీర్షికల్లో నల్లకలువల నెత్తుటిదారుల్లో, అడవుల్ని అరుణపతాకాలు జేసీ, నేల ఒక అద్దె గర్భం, వెదుర పొదల యుద్ధ రహస్యం, దేహం ఓ కల్లోలిత ప్రాంతమై, నిత్యగాయాల నెలవంక, కూలిపిట్టల కన్నీటి పాట, గోడకు ఆవల సముద్రం వైవిధ్యపూరితమైనవి. ‘మట్టిరంగుల బొమ్మలు’ని బొమ్మ కట్టించిన కవి సిరికి స్వామినాయుడు కృషి ఎప్పటికీ అభినందనీయమే.

జానకి విముక్తి - ముప్పాళ్ళరంగనాయకమ్మ

$
0
0

చలం స్ర్తి గురించి చేసిన ఈ వ్యాఖ్యలకు అక్షర రూపమే రంగనాయకమ్మగారి ఈ విప్లవ రచన జానకి విముక్తి. ఈ రచన ఇప్పటి ఛాందసవాదుల్ని మూర్ఛపోయేలా చేసింది.
జానకి విముక్తిని చదివిన పాఠకులు తమని తాము అర్థం చేసుకోవగలుగుతారు. ఆర్థిక రాజకీయాంశాలను గురించిన కనీస అవగాహనకు వస్తారు. ఆత్మవిశ్వాసాలకూ, ఆత్మగౌరవాలకూ సంబంధించిన స్పష్టమైన నిర్వచనాలూ, మానవ సహజాతాలైన దయ, స్నేహం, ప్రేమ, శారీరక, మానసిక స్పందనలూ, పునరుత్పత్తి క్రియలలోని మాధుర్యాలను గురించి పునరాలోచిస్తారు.
ప్రకృతి విరుద్ధమైన వివాహపద్ధతులూ, వికృత చేష్టలయిన అలంకరణలూ, బలిసిన వ్యక్తుల ఆడంబరాలూ, బ్రతుకుల ఎడల కనీసపు ఆలోచనలు లేకుండా యాంత్రిక జీవనానికి అలవాటుపడిపోయిన వ్యక్తుల డొల్లతనాలూ స్పష్టంగా కళ్లకు కనపడతాయి ఈ నవల్లో. పశుపక్ష్యాదుల మీదా, పసిబిడ్డలమీదా, వృద్ధులమీదా, చెట్లుచేమల మీదా మనం పోగొట్టుకున్న మానవీయ భావాలు మళ్లీ మన కళ్లబడతాయి.
ఇలా ఎన్నో అంశాలపై పాఠకుడి జ్ఞానం వృద్ధి చెందుతుంది. ఎంతో మానసిక, శారీరక ఆనందాలూ, ఆరోగ్యాలూ పాఠకుడిలో చోటుచేసుకుంటాయి.
ఇక మళ్లీ మనం పాత్రల దగ్గరకొస్తే ఈ నవలలోని ఇంకో ప్రధానమైన పాత్ర శాంత. ఈమె లాయరు. ఈమె, సత్యం ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ప్రేమించుకుని పెళ్లితతంగం లేకుండా కలిసివుంటారు. సంస్కారవంతమైన చేష్టలతో, విప్లవాత్మక భావాలతో తనేమిటో, తన వర్గమేమిటో తెలుసుకొని, తమ ఉమ్మడి సమస్యల పరిష్కారానికి తన సహకారాన్ని అందించటమే తన జీవితాదర్శంగా జీవితాన్ని ప్రారంభించిన పాత్ర శాంత పాత్ర.
చదువు సంధ్యలు పెద్దగా లేని, ప్రపంచ జ్ఞానం అసలే లేని స్థాయి నుండి, శాంత ఆలోచనలతో సమానమైన స్థాయికి ఎదిగి, రాజకీయాలను అర్థం చేసుకుని విముక్తి ప్రస్తానం వైపు అడుగులు వేసే పాత్ర జానకి పాత్ర. అయితే బాగా చదువుకొని, జీవితానికవసరమైన అన్ని అంశాలలోనూ కనీస పరిజ్ఞానం పొందాక స్ర్తి విమోచనవైపు నడక సాగించిన పాత్ర శాంత పాత్ర.
ఈ రెండు పాత్రలూ పాఠకుల మనస్సుల్లో నుండి చెరిగిపోవు. ఈ ఇద్దర్నీ వెనక వుండి, ఆ స్థాయికి తీసుకువచ్చినవాళ్లు సత్యం, డాక్టర్ మూర్తి.
ఇంకోరకంగా చెప్పుకోవాలంటే, ఈ పాత్రలన్నీ ఎప్పుడూ అధ్యయనం ద్వారా, అనుభవాల ద్వారా తమని తాము వున్నతీకరించుకుంటాయనటం సబబుగా వుంటుంది.
ఇప్పుడిక సత్యం పాత్ర గురించి చెప్పుకొందాం!
ఇప్పటివరకూ తెలుగులో ఏ అభ్యుదయ, విప్లవ రచయితా ఏ నవలలోనూ పరిచయం చేయని పాత్ర ఇది సంప్రదాయ తెలుగు నవలా సాహిత్యంలో కనబడే అసహజమైన కల్పిత, కృత్రిమ హీరో పాత్రలకు విరుద్ధమయిన, విలక్షణమైన పాత్ర ఇది.
సత్యం సాదా సీదా మనిషి. ఆకారంలో, ఆలోచనలలో వున్నతమైన భావాలున్నవాడు. చిన్నపాటి ఉద్యోగంతో కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు. పుస్తక పఠనం ద్వారా, తనకన్నా తెలివైనవాళ్ల ద్వారా తనని తాను అనునిత్యం జ్ఞానవంతుణ్ణి చేసుకుంటూ శ్రమిస్తుంటాడు. సరియైన జ్ఞానంలోంచి ఎదిగిన అతను మానవ శరీర ధర్మాలను గురించి, సమాజ నిర్మాణం గురించి, వ్యక్తులమధ్య సంబంధాల్ని గురించి, ఆర్థిక, రాజకీయ, సాంఘిక అంశాల్నిగురించి స్పష్టమైన అవగాహనతో వుంటాడు. అతని మనస్సులోని స్వచ్ఛత, మాటల్లోని స్పష్టత పాఠకుడికెంతో నచ్చుతాయి.
సత్యం శుభ్రంగా వంట చేస్తాడు. ఇంటిని శుభ్రపరుస్తాడు. ఆడవాళ్లతోపాటు అన్ని పనులూ సమానంగా చేస్తాడు. తను చెప్పేదాన్ని నూరుశాతం చేతల్లో ప్రదర్శిస్తాడు. ప్రేమించవలసినవాళ్లని మనస్ఫూర్తిగా ప్రేమిస్తాడు. ద్వేషించవలసినవాళ్లని ధైర్యంగా ద్వేషిస్తాడు.
సాధారణ పాఠకుడికి ఈ సత్యం పాత్ర ఎంతో విస్మయం కలిగిస్తుంది. ఆనందం కలిగిస్తుంది.
పురుష పాఠకలోకానికి మింగుడుపడని స్ర్తిని చలం సృష్టిస్తే, మహిళా పాఠక లోకానికి ప్రీతిపాత్రమైన పురుషుణ్ణి ఈ నవల్లో రంగనాయకమ్మగారు సృష్టించారు.
నవలంతా సున్నిత హాస్యంతో, హేతుబద్ధ తర్కంతో, సహజమైన వాక్య నిర్మాణంతో హాయిగొలిపే సన్నివేశాలతో నిండిపోయి జీవనంతో నిండి పొంగిపొర్లుతుంటుంది. చాలా చాలా సుందరమైన కొత్త పదాలు. అంతకుముందెప్పుడూ పరిచయం లేని కొత్త వ్యాఖ్యానాలు అడుగుగడుగునా మనకు కనిపిస్తాయి. ఇలాంటి కొత్తదనానికి కారణం బహుశా జానకి విముక్తి నవలాంశం కొత్తది కావటమే.
ఇన్ని విభిన్న సాంప్రదాయేతర అంశాల మేలుకలయిక జానకి విముక్తి. వెయ్యిన్నొక్క కొత్త విషయాల్ని ఈ నవల ద్వారా పాఠకుడు నేర్చుకుంటాడు.
ఇంతటి గొప్ప రచనను అందించిన రంగనాయకమ్మగారు మన సమకాలీనులు కావటం మనకు సంతోషం.
మంచి సాహిత్యానికుండాల్సిన లక్షణాలను గురించి మనం కొత్తగా ఇపుడు నిర్వచనం చెప్పుకోవాల్సన అవసరం ఏమీ లేదు. మంచి సాహిత్యం ఎలా వుండాలో ఈ నవలలోనే మూడవ భాగంలోని 190-191 పేజీల్లో రంగనాయమ్మగారు చెప్పారు. ఆ వాక్యాల్నే ఇక్కడ గుర్తుచేసుకోవటం సందర్భోచితంగా వుంటుంది.
మంచి సాహిత్యంలో మానవ జీవితం వుంటుంది. మానవ హృదయాలలో వుండే న్యాయమూ, ఔన్నత్యమూ వుంటుంది. మార్గదర్శకత్వాన్నిచ్చే పాత్ర చిత్రణ వుంటుంది. దానిని చదివిన పాఠకుడికి తనని తాను సంస్కరించుకోవాలని ఆరాటం కలిగించే కళాత్మకత వుంటుంది. అందుకే వున్నత సాహిత్యం ఒక శాస్తమ్రే. శాస్త్రంగా కనిపించని శాస్త్రం. శాస్త్రంకన్నా శక్తివంతమయిన శాస్త్రం. చక్కని రంగుతో, రుచితో, సువాసనలీనే ఔషధం లాంటిది మంచి సాహిత్యం.
జానకి విముక్తి నవల విషయంలోనూ ఈ నిర్వచనం అక్షరసత్యం.
-సమాప్తం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

శ్రీనరసింహ శతకము

$
0
0

సీ. లోకమందెవఁడైన లోభి మానవుఁడున్న
భిక్షమర్థికి ఁజేతఁ బెట్టఁ లేడు
తాను బెట్టక యున్న దగవు పుట్టదు గాని
యొరులుపెట్టఁగఁ జూచి యోర్వలేఁడు
దాత దగ్గఱఁ జేరి తనముల్లె చెడునట్లు
చిహ్వతోఁ జాడీలు చెప్పుచుండు
ఫలము విఘ్నంబైన బలుసంతసంబంధి
మేలు గల్గినఁ జాల మిడుకుచుండు
తే. శ్రీరమానాథ! యిటువంటి క్రూరునకును
భిక్షుకుల శత్రునని పేరు పెట్టవచ్చు
భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార ! నరసింహ!దురితదూర!

భావం: ఓ నరసింహప్రభూ! ఈ లోకంలో పిసినారి యాచకులకేమీ ఇవ్వరు. తానుపెట్టకపోతే విచారించపనిలేదు. కానీ ఇతరులు దానం చేస్తే చూచి సహించలేక దాత పంచచేరి లేనిపోనివి చెప్పి ఇవ్వబోయే దానాన్ని చెడగొట్టుతారు. యాచకులపై చాడీలు చెబుతారు. ఇవ్వబోయేవారు ఇవ్వకుండా ఉంటే ఎంతోసంతోషపడుతారు. ఇతరులకు మంచి జరిగితే ఎంతో బాధపడుతారు.

అసురన్‌పై ఫోకస్?

$
0
0

తమిళ స్టార్ హీరో ధనుష్ చేసిన మారి 2 ఒకింత అసంతృప్తిని మిగల్చటంతో, వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అసురన్’పై ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడట. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ స్టోరీగా తెరకెక్కనున్న చిత్రాన్ని వి క్రియేషన్స్ పతాకంపై నిర్మాత కలైపులి ఎస్ థాను నిర్మించనున్నారు. త్వరలోనే చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనుంది. మారి -2 బాక్సాఫీస్ దగ్గర బలంగా నిలబడలేకపోవడంతో, ప్రస్తుతానికి తాను దర్శకత్వం వహించాల్సిన మల్టీస్టారర్ చిత్రాన్ని హోల్డ్‌లో పెట్టాడట. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తిచేసినా, అసురన్ పూర్తిచేసిన తరువాత మళ్లీ సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నాడని ఇండస్ట్రీ టాక్. ఈ చిత్రంలో కింగ్ నాగార్జున ఒక ముఖ్యమైన పాత్రలో నటించనుండటం తెలిసిందే.

సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘మిరాకిల్’

$
0
0

హరి గిల్స్ హీరోగా సుమన్ రాణా హీరోయిన్‌గా వామన చలనచిత్ర స్టూడియోస్, చిగాస్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ బ్యానర్స్‌పై రుద్రపట్ల వేణుగోపాల్ (ఆర్‌విజి) దర్శకత్వంలో హరి, విష్ణు నిర్మిస్తోన్న చిత్రం మిరాకిల్. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మూడో షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. కాగా చిత్రం పోస్టర్ లాంచ్‌ను మాదాపూర్ ఆర్ట్ గ్యాలరీలో నిర్వహించారు. హీరో హరి గిల్స్, హీరోయిన్ సుమన్ రాణా, దర్శకుడు రుద్రపట్ల వేణుగోపాల్ (ఆర్‌విజి), ప్రముఖ నటులు విజయ్ కుమార్, జీవా, సందీప్ భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు. దర్శకుడు రుద్రపట్ల వేణుగోపాల్ మాట్లాడుతూ వాస్తవ సంఘటనలకు నిజ జీవిత పాత్రలకు కల్పన జోడిస్తూ సస్పెన్స్ థ్రిల్లర్‌గా మిరాకిల్ చిత్రాన్ని రూపొందిస్తున్నామన్నారు. గోవా, హైదరాబాద్, బెంగుళూరులో రెండు షెడ్యూల్స్ జరిపామని, మూడో షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోందన్నారు. మారిషస్‌లో పాతాళ చిత్రీకరణ మార్చిలో పూర్తిచేసి, మే 24న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల చేస్తామన్నారు. హీరో హరి గిల్స్ మాట్లాడుతూ హీరోగా తొలి చిత్రమే నాలుగు భాషల్లో నిర్మిస్తుండటం ఆనందంగా ఉందన్నారు. కచ్ఛితంగా సినిమా మిరాకిల్ అవుతుందన్నారు. హీరోయిన్ సుమన్ రాణా మాట్లాడుతూ ఇదొక డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమని, మోడల్‌గా వున్న తాను మిరాకిల్ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం కావడం హ్యాపీగా ఉందన్నారు.


బ్లఫ్ మాస్టర్ గెలిచాడు

$
0
0

శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో, అభిషేక్ ఫిలిమ్స్ అధినేత రమేష్ పిళ్లై నిర్మాతగా తమిళంలో ఘన విజయం సాధించిన ‘చతురంగ వేట్టై’ని ఆధారంగా చేసుకుని గోపీ గణేష్ పట్ట్భా దర్శకత్వంలో.. తెలుగులో రూపొందిన చిత్రం ‘బ్లఫ్ మాస్టర్’. ‘జ్యోతిలక్ష్మీ’, ‘ఘాజి’ చిత్రాలఫేమ్ సత్యదేవ్ హీరోగా నటించారు. ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నందితాశే్వత ఇందులో నాయిక. ‘బ్లఫ్ మాస్టర్’ సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ.. ‘గోపీగణేష్ నాకు ఎప్పటినుంచో తెలుసు. సినిమాను బాగా తీశాడు. సత్యదేవ్‌ని చూస్తే జెన్యూన్ ఆర్టిస్టును చూసిన ఫీలింగ్ వచ్చింది. తను పాత్రకు న్యాయం చేశాడు. తమిళ సినిమాను తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా తీశారు. ప్రతి పాత్రకూ డీటైలింగ్‌గా పనిచేశారు. ఇలాంటి చిన్న సినిమాలను ఆదరిస్తే వీళ్ల దగ్గరనుంచి మరిన్ని మంచి సినిమాలు వస్తాయి. వీళ్ల కష్టానికి మనం ఇచ్చే ఎనర్జీ థియేటర్‌కు వెళ్లి సినిమా చూడటమే’’ అని అన్నారు. శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ‘తమిళ సినిమాను చూడగానే తెలుగులో రీమేక్ చేయాలనుకున్నా. రైట్స్‌కోసం తీవ్రంగా ప్రయత్నించాక రమేష్ పిళ్లై దగ్గర ఉన్నాయని తెలిసింది. ఆయన్ని అడిగితే ఇద్దరం కలిసి చేద్దామని అన్నారు. ఇది చిన్న సినిమాల్లో పెద్ద సినిమా. గీతా ఆర్ట్స్, సురేష్ ప్రొడక్షన్స్.. చూసిన ప్రతివాళ్లూ ఎగ్జయిట్ అయ్యారు. అదే ఎగ్జయిట్‌మెంట్ జనాల్లో కనిపిస్తుంది. నిర్మాతగా మాకు సంతృప్తిని ఇస్తుందని నమ్ముతున్నాం’’ అని చెప్పారు. నందిత శే్వత మాట్లాడుతూ.. ‘‘అవని పాత్రలో నటించలేదు. జీవించాను. ఆ పాత్రనుంచి బయటకు రావడానికి చాలా రోజులు పట్టింది. సత్యదేవ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యాడు అని చెప్పారు. సత్యదేవ్ మాట్లాడుతూ.. ‘‘మా సినిమాకు పనిచేసిన యూనిట్ సభ్యులు, నా స్నేహితులు, కుటుంబ సభ్యులు సినిమా బావుందన్నప్పుడు నామీద ప్రేమతో చెప్పారనుకున్నా. మూడురోజులుగా థియేటర్ల రెస్పాన్స్ చూసి, విని గర్వంగా అనిపించింది. ఆనందంగా ఉన్నాను’’ అని అన్నారు.

కాపాన్‌గా వస్తున్నాడు..

$
0
0

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న 37వ చిత్రం టైటిల్ ప్రకటించేశారు. చిత్ర దర్శకుడు మూడు టైటిల్స్‌ను ప్రకటించి అందులో ఒకదాన్ని ఎంచుకోవచ్చంటూ పోల్ పెట్టడం తెలిసిందే. మీట్పాన్, కాపాన్, ఉఇర్కా టైటిల్స్‌లో ఉఇర్కాకు ఎక్కువ ఓట్లు పడ్డాయి. అదే టైటిల్‌ను ప్రకటించే అవకాశం ఉందని అంతా భావించారు. అయతే చిత్ర టైటిల్ న్యూఇయర్ రోజున అధికారికంగా ప్రకటిస్తామన్న చిత్ర బృందం, అనూహ్యంగా కాపాన్‌ను ఎంచుకుంది. కె.వి.ఆనంద్ తెరకెక్కిస్తున్న చిత్రంలో మోహన్‌లాల్, బోమన్ ఇరానీ, ఆర్య, చిరాక్ జానీ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న చిత్రానికి హారిస్ జైరాజ్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ చిత్రంలో సూర్య ఎన్‌జి కమాండర్‌గా కనిపిస్తాడు. ఇటీవల ఈ చిత్రం రెండు షెడ్యూల్స్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం సూర్య ఎన్‌జికె చివరి షెడ్యూల్ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. సెల్వరాఘవన్ తెరకెక్కిస్తున్న చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుదల చేయనున్నారు.

ఒమంగ్+ఒబెరాయ్= మోదీ

$
0
0

గత కొంతకాలంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ తెరకెక్కనుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. పలువురు దర్శకులు సంచలనాల మోదీజీ జీవితాన్ని వెండి తెరకెక్కించాలని ఉవ్విళ్లూరుతున్నారని కథనాలు వచ్చాయి. అయితే ఇదీ క్లియర్ కట్ మ్యాటర్ అంటూ ఇప్పటికీ సమాచారం లేదు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఒమంగ్ కుమార్ పూర్తి క్లారిటీతో ఈ బయోపిక్‌కోసం రెడీ అవుతున్నారట. గత కొంతకాలంగా నరేంద్ర మోదీ బయోపిక్‌కి సంబంధించిన స్క్రిప్టును ఒమంగ్ రెడీ చేస్తున్నారట. ప్రస్తుతం స్క్రిప్టు సిద్ధమై ప్రీప్రొడక్షన్ వర్క్ సాగుతోంది. ఈ జనవరిలో కొత్త సంవత్సర కానుకగా ఈ చిత్రాన్ని ప్రారంభిస్తారని తెలుస్తోంది. అయితే మోదీ పాత్రలో ఎవరు నటిస్తారు? అంటే గ్రేట్ యాక్టర్ రక్తచరిత్ర ఫేం వివేక్ ఒబేరాయ్ మోదీగా నటిస్తారని చెబుతున్నారు. ఒక సామాన్యుడు అసామాన్యుడిగా ఎదిగిన చరిత్ర ఇది. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఎదురే లేనివాడిగా పరిపాలన సాగించి అటుపై భారతదేశానికే ప్రధాని అయ్యారు. అలాంటి గొప్ప నాయకుని పాత్రలో నటించడం అంటే సవాల్ అనే చెప్పాలి. ఒబేరాయ్‌తో ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయి. ఒమంగ్ కుమార్ అందుకు సంబంధించిన మంతనాలు సాగిస్తున్నారట. అధికారికంగా ప్రాజెక్టును కన్ఫామ్ చేయాల్సి ఉంది.

కల్కి.. ఇలా

$
0
0

ఇంపాక్ట్ రోల్స్‌తో స్పెషల్ క్రేజ్ క్రియేట్ చేసుకున్న హీరో రాజశేఖర్. కొత్త హీరోలు, కుర్ర హీరోల దూకుడు మొదలైన తరువాత పోటీలో క్రమంగా వెనకపడటం తెలిసిందే. వరుస ఫ్లాపులు సైతం రాజశేఖర్‌ను వెంటాడటంతో క్రమంగా ఇమేజ్ కరిగిపోయింది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో పిఎస్‌వి గరుడవేగతో బ్లాక్ బస్టర్ అందుకున్న రాజశేఖర్ మళ్లీ ఫాంలోకి వచ్చేశాడు. సెలెక్టెడ్ స్టోరీలపైనే దృష్టిపెట్టడంతో కొంచెం గ్యాప్ తీసుకుని ‘కల్కి’ అవతారాన్ని చూపించేందుకు సిద్ధమయ్యాడు. ‘అ’ వంటి విలక్షణ చిత్రాన్ని తెరకెక్కించి ఔరా అనిపించుకున్న యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమే కల్కి. హ్యాపీ మూవీస్, శివానీ శివాత్మిక బ్యానర్లపై సి కళ్యాణ్, శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. ఆదాశర్మ, నందితాశే్వత, స్కార్లెట్ విల్సన్ హీరోయిన్లు. అశుతోష్ రాణా, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 1983 బ్యాక్‌డ్రాప్ కథతో తెరకెక్కుతున్న చిత్రానికి సంబంధించి న్యూ ఇయర్ సందర్భంగా కల్కి ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

సంక్రాంతికి వస్తున్న పెద్ద చిత్రాలు

$
0
0

సంక్రాంతికి వస్తున్న పెద్ద చిత్రాలు రెండూ కొత్త ఏడాది తొలి రోజునుంచే ఆడియన్స్‌ని ఊరించటం మొదలుపెట్టాయ. యన్‌టిఆర్ బయోపిక్‌లోని తొలిభాగం కథానాయకుడు జనవరి 9న, రామ్‌చరణ్ వినయ విధేయ రామ చిత్రం జనవరి 11న థియేటర్లకు వస్తుండటం తెలిసిందే. విడుదల సమయం దగ్గర పడుతుండటంతో ప్రతి అకేషన్‌నూ ప్రమోషన్‌కు ఉపయోగిస్తున్నాయ చిత్ర బృందాలు. కొత్త ఏడాది శుభాకాంక్షలు చెబుతూ రామారావు-బసవతారకంగా బాలయ్య -విద్యాబాలన్ ఇలా పలకరిస్తే, దేవాలయం సన్నివేశంలో కైరా అద్వానీని ఇలా ఎత్తుకుంటూ వినయ విధేయ రామ.. శుభాకాంక్షలు చెప్పాడు.

అలాంటివాడు కీర్తికి కావాలట!

$
0
0

కీర్తిసురేష్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్న విషయం తెల్సిందే. తెలుగులో కాస్త స్లోగా ఈమె జర్నీ సాగుతున్నా కూడా తమిళంలో మాత్రం ఈమె జోరు మామూలుగా లేదు. ఇప్పటికే అక్కడ దాదాపుగా స్టార్ హీరోలందరితో నటించేసింది. ఈమె తక్కువ సమయంలోనే అతి ఎక్కువమంది స్టార్ హీరోలకు జోడీగా నటించిన అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. త్వరలోనే రజినీకాంత్‌తో ఈమె కనిపించబోతుంది. మురుగదాస్ దర్శకత్వంలో ఇప్పటికే ఈమె సర్కార్ చిత్రంలో విజయ్‌కి జోడీగా నటించింది. ఆ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో కీర్తిసురేష్‌ను మరోసారి తన సినిమాకు మురుగదాస్ ఎంపిక చేసుకున్నాడు. అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్న రజినీకాంత్ మూవీతోపాటు ఇంకా రెండు మూడు సినిమాలకు కూడా ఈమె కమిట్ అయ్యింది. ఒక మలయాళి చిత్రంలో కూడా నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. చాలా బిజీగా గడుపుతున్న కీర్తిసురేష్ తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక అంశాలపై స్పందించింది. కీర్తిసురేష్‌ను ఆ ఇంటర్వ్యూలో పెళ్లి గురించిన ప్రశ్నించిన సమయంలో ఇప్పుడు తనకు పెళ్లి ఆలోచన లేదని చెప్పింది. ప్రేమ పెళ్లా లేదంటే పెద్దలు కుదిర్చిన పెళ్లా అనే విషయంలో తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పుకొచ్చింది. పెళ్లిచేసుకునే సమయం తనకు ఇంకా రాలేదని చెప్పింది. అయితే ఎలాంటి వారిని పెళ్లిచేసుకోవాలని అనుకుంటున్నారని ప్రశ్నించిన సమయంలో మాత్రం తమిళ స్టార్ హీరోలు విజయ్, విక్రమ్‌ల మాదిరిగా ఉండే కుర్రాడిని పెళ్లిచేసుకోవాలనుకుంటున్నట్లుగా చెప్పింది.

మహాభారతంలో ఉపాఖ్యానాలు -89

$
0
0

ఆ నది ముని శాపంతో రక్తంతో ప్రవహించసాగింది. అప్పుడు రాక్షసులు అక్కడకు వచ్చి ఆ రక్తాన్ని త్రాగుతూ సుఖంగా ఉండసాగారు. వారు స్వర్గాన్ని గెలిచినంత ఆనందాన్ని పొందేవారు. కొంతకాలానికి ఆ నదిలో మునగాలని కొందరు మహర్షులు అక్కడికి వచ్చారు. వారు సరస్వతీ తీర్థాలన్నింటిలో మునిగి ఆనందం పొంది చివరకు నెత్తురు ప్రవహిస్తున్న ఈ తీర్థానికి వచ్చారు. ఆ నీటిని చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు అక్కడ రాక్షసులు ఆ రక్తపు నీటిని త్రాగుతూ ఆ మునులను చంపి వారి రక్తాన్ని ఆ ప్రవాహంలో కలిపేయాలని ప్రయత్నించారు. కాని ఆ మునులు నదీమతల్లిని రక్షించాలనుకున్నారు. వారు ఆ నదికి నమస్కరించి ఇలా అడిగారు. ‘‘కల్యాణీ! నీ ప్రవాహం ఎందుకు రక్తమయమైందో ఆ కారణం చెప్పు. మేమేదైనా ఉపాయం ఆలోచిస్తాము’’.
అప్పుడు నది వారికి జరిగిన విషయం, ముని శాపం గురించి వివరించింది. అప్పుడు మునులు ఆ నదితో ఇలా అన్నారు. ‘‘అనఘా! కారణం తెలిసింది. కనుక మునులందరు చేయగలగింది చేస్తారు’’ అని మునులు ‘‘మనం అందరం కలిసి సరస్వతిని శాపం నుండి విడిపిద్దాము’’ అని నిశ్చయించుకొన్నారు.
ఆ మునులంతా తపస్సులతో, నియమాలో, ఉపవాసాలతో, వ్రతాలతో పరమేశ్వరుని అర్చించి సరస్వతి నదికి విముక్తి కలిగించారు. అప్పుడు ఆ నది పూర్వంలాగ స్వచ్ఛనమైన నీటితో ప్రవహించ సాగింది. మునులు నదీజాలలని ప్రక్షాళన చేసి నిర్మల జలాలుగా మార్చటం చూసి రాక్షసులు భయపడి వారిని శరణు వేడారు. వారు మునులతో ఇల ప్రార్థించారు. ‘‘మేము ఆకలితో ఉన్నాం. ధర్మానికి దూరంగా ఉన్నాము. మేము అనేక పాపాలు చేశాము. మాకు మంచి మార్గదర్శనం చేయడానికి మీవంటి ధర్మాత్ములు, పుణ్యాత్ములు దొరుకలేదు. అందువల్ల ఇలాంటి పాపాలు చేస్తున్నాము. ఈ పాపాలు పెరిగితే మేము స్ర్తీహ్మరాక్షసులమవుతాము. క్షత్రియ, వైశ్య, శూద్రులను, బ్రాహ్మణులను ద్వేషించేవారు రాక్షసులు అవుతారు. గురువును, వృద్ధులను, ఋత్విక్కులను అవమానించినవారు కూడా రాక్షసులౌతారు. కనుక మమ్మల్ని తరింపజేయండి. మా మీద దయ చూపండి.’’
వారి మాటలు విన్న మునులు రాక్షసుల ముక్తికై నదిని ప్రార్థిస్తూ ఇలా అన్నారు. ‘‘ఉమ్మివేసిన అన్నం, పురుగులు పడిన అన్నం, ఎంగిలి కూడు, కన్నీరులో తడిసిన అన్నం, కుక్కలు ముట్టిన అన్నం ... ఇవి లోకంలో రాక్షసుల భాగం కనుక పండితుడు వాటిని విసర్జించాలి.’’ తర్వాత ఆ మునులు ఆ తీర్థాన్ని శుద్ధి చేసి రాక్షసవిముక్తికై నదిమీద ఒత్తిడి తెచ్చాడు. వారి అభిప్రాయం తెలుసుకొని నది తన స్వరూపం అయిన అరుణను రప్పించింది. రాక్షసులు ఆ అరుణలో స్నానం చేసి తమ శరీరాలను విడిచిపెట్టారు. అరుణి వారి పాతకాలను బ్రహ్మహత్యాపాపాన్ని పోగొట్టింది. ఇది తెలిసి దేవరాజు ఇంద్రుడు కూడా ఆ తీర్థంలో స్నానం చేసి తన బ్రహ్మహత్యాపాపాన్ని పోగొట్టుకున్నాడు. ఎందుకంటే అతను నముచి దగ్గర తాను చేసిన ప్రతిజ్ఞను భంగపరిచాడు.
పూర్వం ఇంద్రునికి భయపడి నముచి సూర్యరశ్మిలో దాగాడు. ఇంద్రుడు అతనితో స్నేహం చేసి ఇలా అన్నాడు. ‘‘పగలుకాని, రాత్రి కాని, తడి ఆయుధంతో కాని పొడి ఆయుధంతో కాని నిన్ను చంపను’’. ఇలా ప్రతిజ్ఞ చేసి అంతటా మంచు కప్పి ఉండటం చూసి నీటి నురుగుతో నముచి తలను ఖండించాడు. అలా తెగిన నముచి తల ఇంద్రుని వెంటపడింది. ఇంకా ఇలా అనసాగింది. ‘‘ఓరీ పాపాత్ముడా! మిత్రద్రోహి!’’
దానితో భయపడి ఇంద్రుడు బ్రహ్మతో నివేదించాడు.
అప్పుడు బ్రహ్మ ఇలా అన్నాడు. ‘‘పాపభయాన్ని పోగొట్టే అరుణతీర్థంలో స్నానం చేసి యాగం చెయ్యి. మునులు తమ తపశ్శక్తితో ఆ తీర్థ జలాన్ని పవిత్రం చేశారు. అక్కడ అరుణ గుప్తంగా ఉంది. ‘‘సరస్వతీనది అరుణను తన జలంతో ముంచింది. ఆ అరుణా సరస్వతుల సంగమ స్థానం అత్యంత పవిత్రమైనది.’’
ఇంద్రుడు బ్రహ్మ చెప్పినట్లే చేశాడు. యాగం చేసి స్నానం చేశాడు. నముచి శిరస్సు కూడా ఆ తీర్థంలో తడిసి ఉత్తమ లోకాలకు చేరింది.
ఈ విధంగా సరస్వతీ నదీ తీరంలో ఉన్న తీర్థాలు మానవులకు, దేవతలకు, ఋషులకు ఎన్నో విధాల ఉపయోగపడ్డాయి.
కాలకవృక్షీయోపాఖ్యానము
పూర్వం క్షేమదర్శి అనే రాకుమారుడు యుద్ధంలో తన సైన్యాన్ని అంతా పోగొట్టుకొని దిక్కుతోచక తిరుగుతూ కాలకవృక్షీయుడు అనే మునిని కలిశాడు. అతను మునికి నమస్కరించి తన పరిస్థితి వివరించి ఈ కష్టం నుండి విముక్తి పొందే మార్గాన్ని చూపుమన్నాడు. అతను మునితో ఇలా అన్నాడు - ‘‘మహాత్మా! ధనంపైన ఆధిపత్యం కోరుకొనేవాడు నాలా రాజ్యాన్ని పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం? దీని కోసం ఇతరులను ఆశ్రయించడంలాంటి నీచమైన పనులు కాక ఇంకేదైనా ఉపాయం దయచేసి చెప్పండి. శారీరిక, మానసిక వ్యాధులతో బాధపడేవారికి నీవంటి ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు శరణ్యుడు అగును. అప్పుడు అతను కోరికల పట్ల విరక్తి చెంది జ్ఞానమనే ధనాన్ని పొంది ప్రీతిని, శోకాన్ని విడిచి పెట్టి సుఖాన్ని పొందుతాడు. కాని అర్థసంపాదనకు ప్రాధాన్యత ఇచ్చే నాలాంటి వారి సంగతేమిటి? నేను ఆ భోగాలమీద, ధనం మీద మోహాన్ని వదలుకోలేక పోతున్నాను. కనుక నాలాంటి వాడు పొందే ఇంకేదైనా సుఖం ఉంటే చెప్పండి’’ అని తన దీనస్థితిని చెప్తూ బాధపడుతున్న ఆ రాకుమారుని చూసి మహాత్ముడైన ఆ ఋషి ఇలా అన్నాడు. ‘‘నీకు అన్నీ తెలుసు. నేను - నాది అనేది అంతా అనిత్యమే. ఏదీ శాశ్వతం కాదు. నీ కళ్లముందు ఏది ఉందని అనుకుంటున్నావో అది అంతా లేదన్న నిజాన్ని గ్రహించు. అప్పుడు నీకు కష్టం వచ్చినా నీవు భరించగలవు. జరిగినది, జరుగబోయేది సమస్తమూ జరిగేది కాదు. ఇది తెలుసుకుంటే నీవు అధర్మాల నుండి బయటపడతావు. పూర్వం రాజ్యం, సంపద వంశపారంపర్యంగా వచ్చేవి. ఇక మీదట అలా ఉండకపోవచ్చు. ఇది తెలిస్తే ఏ బాధా ఉండదు. కనుక శోకించడం తగదు. పూర్వం ఉన్న నీ పితృ పితామహులు యిప్పుడు ఎచ్చట ఉన్నారు? నీవు వారిని చూడటం లేదు కదా! వారు నిన్ను చూడలేదు. శరీరం అనిత్యం. అలాంటి శరీరం ద్వారా పొందే వాటికోసం ఎందుకు దుఃఖిస్తావు? కొంతకాలానికి నీవు కూడా ఉండవు. నీవే కాదు నీ శతృవులు కూడా నశించిపోతారు. అందువల్ల మన దగ్గర సంపదలు ఉన్నప్పటికీ ‘ఇవి నావి కావు’ అన్న భావనతో ఉండాలి.’’ అతని మాటలు విని రాజు ఇలా అన్నాడు.
‘‘మహాత్మా! ఈ రాజ్యం అంతా యాదృచ్ఛికమే అని తలుస్తాను. అన్నిటికంటే శక్తిమంతమైనది కాలం మాత్రమే.
ఇంకావుంది...


స్వాధ్యాయ సందోహం-184

$
0
0

విశ్వసంపద అంతా చేత చిక్కినా ఒక్క దైవానుగ్రహం లభించకుంటే అంతా వ్యర్థమే. దీనిని గ్రహించి ఓ మానవుడా నీకున్నదంతా ఈ లోకంమీదే విసిరివేసిపో. కాని ఆ దైవాన్ని మాత్రం విడువకు అన్న ఈ మంత్రోపదేశం సర్వమానవులకు శిరోధార్యమే.
172. నీ భక్తుణ్ణి ఎవరు ప్రతిఘటించగలరు?
కస్తమింద్ర త్వావసుమా మర్త్యో దధర్షతి
శ్రద్ధా ఇత్తే మఘవన్‌పార్యే దివి వాజీ వాజం నిషాసతి॥
భావం:- ఓ ఇంద్రా! ఎవరికైతే నీవే ధనమో అట్టి వానిని ఎవడు అణచివేయగలడు?
పూజ్యార్హమైన ధనంగల ఓ ప్రభూ! సంసార సాగరాన్ని తరింపజేయగల నీ జ్ఞాన ప్రకాశంమీద శ్రద్ధగల జ్ఞాని జ్ఞానాన్ని, ఆహారాన్ని, ఆధ్యాత్మిక శక్తిని అందరకు పంచాలని కోరుకొంటాడు.
వివరణ:- ధనమదం చాల చెడ్డది. అది గల ధనవంతుడు నిర్ధనుణ్ణి అణచివేస్తాడు. రాజ్యాధికారం కూడ ధనబలం మీదనే ఆధారపడియుంది. కాబట్టి ధనంలో చాల బలముంది. ధనాధిక్యం చేత మనిషి గర్వోన్మత్తుడు కావడం చాల సహజం. అట్టివాడు తనకంటె తక్కువవారిని చాల హీనులుగా పరిగణిస్తాడు. కాని భగవంతుడే ఎవరికి ధనమో అట్టి వానిని ఎవడు అణచివేయగలడు? సకల బలసమేతుడు కేవలం భగవంతుడే. ఆయనే ధనంగా ఉండి ఎవనిని నిర్ధనుడుగా ఉండేలా శాసించాడో అట్టివానిని తిరస్కారభావంతో చూడాలని మనసులోనైనా తలంచగలడా? భగవంతునకు గల సంసార సాగర తారణశక్తిమీద పూర్తివిశ్వాసంతో మనిషి దానశీలుడవుతాడు. అలా భగవద్విశ్వాస బుద్ధితో ‘తవ ప్రణీతీ హర్యశ్వ సూరిభిర్విశ్వా తరేమ దురితా’ ‘‘ఓ మహాదేవా! నీ ఆశ్రయంలో మా పూర్తి పాపాలను, దురవస్థలను అధిగమించెదము’’అని తమ సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటిస్తాడు. కాబట్టి అందరు అదే విశ్వాసంతో సంసార సుఖాలకు, సంసార జలధి దాటేందుకు భగవదాశ్రయాన్ని పొందాలి. అలా పొందేది ఎవరో కొద్దిమంది మాత్రమే.
‘తవాయం విశ్వః పురుహూత పార్థివో- వస్యుర్నామ భిక్షతే’ ‘‘ఓ మహద్యశా! సమస్త చరాతర జగత్తు తన రక్షణకోసం నీ పవిత్ర నామాన్ని భిక్షగా అర్థిస్తున్నది’’ నీ తారక నామమే గనుక లభ్యమయితే ఇక కావలసినదేముంటుంది?? సమస్త విశ్వమూ ఎవని ద్వారం వద్ద వినయంగా నిలిచి అర్చిస్తూ ఉందో అతడే మనిషికి సర్వస్వధనమే అయినపుడు అతడు ఎవడికి భయపడాలి? దాత మంచి యాచకుని ఎందుకు భయపెడతాడు? అతడిని చూచి ఎందుకు భయపడతాడు? దీనినిబట్టి యోగుల మరియు మహాత్ముల ఓజస్సునకు తేజస్సునకు గల కారణమేమిటో స్పష్టపడుతూంది. మహాఓజోవంతులు - తేజోవంతులు కావాలని కోరుకొనేవారు భగవంతుణ్ణి తమవాడిగా చేసుకోవాలి. ఆయననే తమ ధనంగా చేసుకోవాలి.
* * *
173. దేవుడెక్కడున్నాడు? ఎవడు చూసాడు?
ప్ర సు స్తోమం భరత వాజయంత ఇంద్రాయ సత్యం యది సత్యమస్తి
నేంద్రో అస్తీతి నేను ఉత్వ ఆహ క ఈం దదర్శ కమభి ష్టవామ॥
అయమస్మి జరితః పశ్య మేహ విశ్వా జాతిన్యభ్యస్మి మహ్నా
ఋతస్య మా ప్రదిశో వర్ధయంత్యాదర్దిరో భువనా దర్దరీమి॥
భావం:- ఒక నాస్తికుడు ఇలా నాస్తిక వాదం చేస్తున్నాడు. ఒకవేళ భగవంతుడే ఉంటే జ్ఞానాన్ని, సర్వబల సంపన్నతను కోరుతూ మనోవాక్కాయ కర్మలతో సశాస్ర్తియంగా ప్రార్థన చేయి. కాని భగవంతుడనే వాడే లేడు. అసలు ఆయనను ఎవడు చూచాడు? ఎవనిని గురించి మేము స్తోత్రంచేయాలి?
ఈ నాస్తిక వాదానికి ఆస్తికుడు ప్రభావితుడు కాకుండా భగవంతుడే ఇలా సమాధానమిస్తున్నాడు:-
ఓ స్తోత్రకర్తా! నేనిక్కడే ఉన్నాను. నన్ను ఇక్కడే చూడు. పుట్టిన చరాచర సృష్టినంతా నేను నా మాహాత్మ్యంతో నియంత్రించి ఉంచుతున్నాను ఋతం అనగా సృష్టి శాసనాలను, ధర్మాలను, నియమాలను బాగా తెలిసినవారు నన్ను సమున్నతునిగా కీర్తిస్తున్నారు. నేనే ప్రళయకారుడను. సమస్త భువనాలకు మరల మరల ప్రళయాన్ని నేనే కల్పిస్తున్నాను.
వివరణ:- నీకు నిజంగా భగవంతుని ఎడల విశ్వాసమే ఉంటే ఆయనను తలంచి నీ హృదయాంతరంగం నుండి వెలువడే స్తోత్రంతో సన్నుతించు. అలా స్తోత్రం చేయడంవలన నీకే తప్ప ఆయనకేమీ లాభంలేదు అని భగవత్ స్తోత్ర విధానాన్ని ప్రబోధించిన ఋషి వాదానికి భిన్నంగా ఒక నాస్తికుడిలా ప్రత్యాఖ్యానం వినిపిస్తున్నాడు- దేవుడు దేవుడు అని అరచి గగ్గోలు పెడుతున్నావు అతడసలు లేనే లేడు. ఆయనే లేనప్పుడు ‘కమభిష్ఠవామ = స్తోత్రం ఎవరిని గురించిచేయాలి? అసలు ఆయనను ‘క ఈం దదర్శ’ ఎవడు చూచాడు అని యోగశాస్త్రంలో సంశయమూ ఒక పెద్ద విఘ్నకారి యని చెప్పబడింది.

పంచాయతీ రిజర్వేషన్లు సిద్ధం

$
0
0

మెదక్, డిసెంబర్ 31: ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ముందుగా ఎస్టీ రిజర్వేషన్, ఎస్సీ, బీసీ రిజర్వేషన్ల, జనరల్ సీక్వెన్స్ ప్రకారం రిజర్వేషన్లు గ్రామపంచాయితీ ఎన్నికల్లో పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. సోమవారం మెదక్ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మెదక్ జిల్లాలో 469 గ్రామపంచాయితీలు ఉన్నట్లుగా ఆయన తెలిపారు. వంద శాతం 63 గిరిజన తండాల్లో 32 శాతం మహిళలకు రిజర్వేషన్, మరో 31 శాతం జనరల్ కోటాలో రిజర్వేషన్ కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు. వంద శాతం గిరిపుత్రులు ఉన్న ప్రాంతంలో 17 ఎస్టీ గ్రామాల్లో తొమ్మిది ఎస్టీ మహిళ, ఎనిమిది ఎస్టీ జనరల్‌గా రిజర్వేషన్ కెటాయించినట్లు తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్‌లో భాగంగా 66కుగాను 33 శాతం మహిళలకు, మరో 33 శాతం జనరల్ కోటా క్రింద విభజించడం జరిగిందని ఆయన తెలిపారు. జిల్లాలో బీసీలకు 120 సీట్లు రిజర్వేషన్ కల్పించడం జరిగిందన్నారు. అందులో 60 మంది మహిళలకు 60 జనరల్ కోటా క్రింద రిజర్వేషన్ కల్పించినట్లు తెలిపారు. అన్ రిజర్వుడ్ కోటా క్రింద 203లో 102 మంది మహిళలకు, 101 జనరల్‌గా రిజర్వేషన్ కెటాయించడం జరిగిందన్నారు. ఎస్టీని మొదటి స్థానంలో జనాభ ప్రతిపాదికన ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రిజర్వేషన్లు సమతుల్యంగా కల్పించడం జరిగిందన్నారు. 2011 జనాభ ప్రకారం వీరందరికి 50 శాతం బీసీలకు, మిగిలిన 50 శాతం జనరల్ రిజర్వేషన్ క్రింద సీట్లు కెటాయించడం జరిగిందన్నారు. సర్పంచ్‌లు రిజర్వేషన్ల కెటాయింపులో కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓలు రిజర్వేషన్లు కెటాయిస్తున్నట్లు తెలిపారు. పురుషులు, మహిళలు లాటరీ పద్దతిలో ఎంపిక జరుగుతుందన్నారు. పురుషులు 50 శాతం, మహిళలకు 50 శాతం వంతున సర్పంచ్‌ల కెటాయింపులు జరుగుతాయని తెలిపారు. గ్రామపంచాయితీలు 469 ఉండగా అందులో వార్డులు 4086 ఉన్నట్లు ఆయన తెలిపారు. అందులో ఎస్టీ వంద శాతం మహిళలు 240, జనరల్ 240 వార్డులలో మొత్తం 480 వార్డులలో వార్డు సభ్యులు పోటి చేస్తారని తెలిపారు. 17 గ్రామపంచాయితీల్లో ఎస్టీలలో 181 వార్డులు ఉన్నాయని ఆయన తెలిపారు. అందులో 103 వార్డులు మహిళలు, 73 వార్డులు జనరల్ కోటా క్రింద రిజర్వేషన్ కల్పించడం జరిగిందన్నారు. ఎస్సీ కోటా క్రింద 66 గ్రామపంచాయితీలు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. అందులో 643 వార్డులు ఉన్నాయని, 351 మంది మహిళలు, మిగిలినవి జనరల్ కోటా క్రింది పోటి చేయనున్నట్లు తెలిపారు. బీసీ రిజర్వేషన్‌లో 497 వార్డు సభ్యులు ఉండగా 487 వార్డు సభ్యులు జనరల్ కోటా క్రింద పోటి చేస్తారని మిగిలినవి బీసీ రిజర్వేషన్ క్రింద పోటి చేయనున్నట్లు తెలిపారు. అన్ రిజర్వుడ్ క్రింద 852 మంది మహిళలు, జనరల్ 951 మంది పోటి చేస్తారని తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్‌లో 351 మంది మహిళలు, జనరల్ కోటా క్రింద 291 మంది పోటి చేయనున్నట్లు తెలిపారు. సర్పంచ్‌లు రాష్ట్ర స్థాయిలో నిర్ణయించిన రిజర్వేషన్‌లో పోటి చేస్తారన్నారు. త్వరలో గ్రామపంచాయితీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. గ్రామపంచాయితీ వార్డుల రిజర్వేషన్లను ఎన్నికల కమీషనర్‌కు పంపినట్లు తెలిపారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ సీక్వెన్స్ ప్రకారం రిజర్వేషన్లు తయారు చేయడం జరిగిందన్నారు. మెదక్ జిల్లాలో 4.80 లక్షల ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇందులో మహిళలు అధికంగా ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో అధనంగా 54 వేల మంది ఓటర్లు కొత్తగా నమోదు అయినట్లు తెలిపారు. నర్సాపూర్, అందోల్, దుబ్బాక, నారాయణఖేడ్, గజ్వెల్, మెదక్ నియోజకవర్గాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ ఎన్నికలు మూడు విడతలు జరగనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మొదటి విడతలో అల్లాదుర్గం, రేగోడ్, పెద్దశంకరంపేట, టేక్మాల్, హావేళి ఘణాపూర్, పాపన్నపేట మండలాలు ఉన్నట్లు తెలిపారు. ఇందులో 154 గ్రామపంచాయితీలు, 1400 వార్డులు ఉన్నట్లు తెలిపారు. రెండవ విడత నర్సాపూర్, చిలిపిచెడ్, కౌడిపల్లి, కొల్చారం, శివ్వంపేట, వెల్దుర్తి మండలాలు ఉన్నట్లు తెలిపారు. ఇందులో 1444 వార్డులు, 170 గ్రామపంచాయితీలు ఉన్నట్లు తెలిపారు. మూడవ విడతలో తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, నార్సింగి, రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట, మెదక్ ఉన్నట్లు, ఇందులో 1278 వార్డులు, 170 గ్రామపంచాయితీలు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతాయని తెలిపారు. ఎన్నికలు జరిగిన వెంటనే సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. మొదటి విడత రిటర్నింగ్ ఆఫీసర్ నామినేషన్లు స్వీకరించి స్క్రూటింగ్ చేస్తారని తెలిపారు. ప్రతి గ్రామంలో ఎన్నికల అధికారి ఎన్నికలు నిర్వహిస్తారని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీపీఓ హనూక్, డీఆర్‌ఓ సీతారామరావు, డీపీఆర్‌ఓ శైలేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

- మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు

సిద్దిపేట టౌన్, డిసెంబర్ 31: జిల్లా ప్రజలకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పూర్తిస్థాయిలో ప్రజలకు అంది, వారు సుఖంగా సంతోషంగా ఉండాలని..నూతన సంవత్సరం ఎన్నో అశయాలు లక్ష్యాలను సాధించి..సరి కొత్త ఆలోచనలతో ముందుకు పోవాలని ఆకాంక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కోటి ఎకరాల మాగాణి రాష్ట్రంగా సస్యశ్యామలం కావాలన్నారు. నూతన సంవత్సరం వేడుకలు ప్రజలందరు సంతోషంగా జరుపుకోవాలన్నారు.

ఖేడ్ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

$
0
0

పెద్దశంకరంపేట, డిసెంబర్ 31: మండల పరిధిలోని సంగారెడ్డిపేట గ్రామంలో నూతనంగా ప్రతిష్టించిన హనుమాన్ దేవాలయంలో నారాయఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంగారెడ్డిపేట గ్రామానికి చెందిన ప్రజలు తమ గ్రామంలో హనుమాన్ దేవాలయం నిర్మించుకొని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని గత మూడు రోజులుగా నిర్వహిస్తున్నారు. సోమవారం ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డితో పాటు మండల పరిధిలోని తెరాస నాయకులు, భక్తులు ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే వెంట మండల తెరాస అధ్యక్షులు విజయరామరాజు, రైతు సమన్వయ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి సురేష్‌గౌడ్, మురళీపంతులు, పేట తాజా మాజీ సర్పంచ్ జంగం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి హరీష్‌రావు
సిద్దిపేట ,డిసెంబర్ 31 : టీఆర్‌ఎస్ యువజన నాయకుడు మరుపల్లి శ్రీనివాస్ గౌడ్ కూతురి వివాహానికి మాజీ మంత్రి , సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావుహాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. సోమవారం సిద్దిపేట పట్టణంలోని తాడూరి తాడూరి బాలాగౌడ్ కళ్యాణ మండపంలో జరిగిన వివాహా శుభకార్యంలో పాల్గొని ఆశీస్సులు అందించారు.
హుండీ దొంగకు 15నెలల జైలు శిక్ష
దుబ్బాక, డిసెంబర్ 31: గుడిలో హుండీని పగలగొట్టి డబ్బులు దొంగిలించిన కేసులో దొంగకు 15 నెలల జైలు శిక్షను దుబ్బాక జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ గోపి కృష్ణ విధించారు. వివరాలు ఇలా ఉన్నాయి. దుబ్బాక మండలం రేకుల కుంట మల్లికార్జున స్వామి దేవాలయంలోని ఎల్లమ్మ దేవాలయంలో 27-09-2017 రాత్రి యండి. రఫి అనే దొంగ హుండీని పగలగొట్టి రూ.5000ల రూపాయాలను దొంగలించారు.
దేవాలయ సిబ్బంది ఫిర్యాదు మేరకు దుబ్బాక ఎస్ ఐ సుభాష్ గౌడ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చుశారు. నేరస్తుని అరెస్ట్ చేసి జుడిషియల్ రిమాండ్‌కు తరలించారు. కేసు పరిశోధన విన్న దుబ్బాక జడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ నేరం రుజువు కావడంతో 1నెలల శిక్ష విధించారు. ఇట్టి కేసులో పిపిగా దుబ్బాక సీ ఐ పరుశురామ్ వాదనలు వినిపించారు. నేరం రుజువు చేసి నేరస్తునికి శిక్ష పడేలా చేసిన దుబ్బాక సీఐ, ఎస్ ఐలతో పాటు సిబ్బందిని అడిషనల్ డిసిపి నర్సింహారెడ్డి అభినందించారు.

అమ్మవార్లను దర్శించుకున్న
ఎమ్మెల్యే మదన్‌రెడ్డి
శివ్వంపేట, డిసెంబర్ 31: మండలంలోని తిమ్మాపూర్ గ్రామ సమీపంలో దట్టమైన అటవి ప్రాంతంలో వెలసిన బంగారమ్మ, నెల్లూరు పోచమ్మ, పెద్దమ్మ దేవతల మూడు రోజుల జాతర ఉత్సవాల సందర్భంగా సోమవారం నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు చంద్రాగౌడ్, ఎంపీపీ కల్లూరి హరికృష్ణలు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. వారి వెంట నర్సాపూర్ ఎంపీపీ శ్రీనవాస్‌గౌడ్, తెరాస నాయకులు అర్జున్, వేణుగోపాల్‌రెడ్డి, లింగం యాదవ్, బిక్షపతిగౌడ్, రాములు, అశోక్‌గౌడ్, రాములుయాదవ్, వెంకటస్వామి తదితరులు ఉన్నారు.
* అంజాగౌడ్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే
అదే విధంగా మండలంలోని తిమ్మాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ కొడకంచి అంజాగౌడ్ బైక్‌పై నుండి తీవ్ర గాయాలు కావడంతో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ అధ్యక్షులు చంద్రాగౌడ్, ఎంపీపీ హరికృష్ణ, శ్రీనివాస్‌గౌడ్‌లు అంజాగౌడ్‌ను పరమార్శించి సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు.

శ్రీ లక్షీ మ వెంకటేశ్వర క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు ఆరంభం
గజ్వేల్, డిసెంబర్ 31: గజ్వేల్ పట్టణంలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్షేత్రంలో ఆదివారం రాత్రి ధనుర్మాస ఉత్సవాలను ఆలయ వేద పండితులు శేషం శ్రీనివాసాచార్యుల నేతృత్వంలో శాస్త్రోక్తంగా ఆరంభమయ్యాయి. ఈ సందర్బంగా శ్రీ లక్ష్మి, శ్రీ పద్మావతి, శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూల విరాట్‌లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చణలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు చేయగా, ఈ కార్యక్రమాల్లో ఆలయ వ్యవస్థాపక చైర్మెన్ బుక్కా వెంకటేశంగుప్త, నిర్వాహకులు బుక్కా రమేశ్‌గుప్త, రఘురాం, సంతోష్, శంకరయ్య, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

అందరికీ మంచి జరగాలి

$
0
0

మెదక్ రూరల్, డిసెంబర్ 31: కొత్త సంవత్సరమంతా మంచి జరగాలి... అందరికి మేలు జరగాలి...మెదక్ మరింత అభివృద్ది జరగాలని ఎమ్మెల్యే ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మరోసారి తనను గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేస్తానన్నారు. గత సంవత్సరం స్ఫూర్తితో ముందుకువెళుతూ జిల్లా కేంద్రం మెదక్ సమగ్రాభివృద్దికి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, ప్రజాప్రతినిధులు, స్వచ్చంధ సంస్థలు తమవంతు సహకారం అందించాలని కోరారు. ఈ యేడాదిలో మెదక్ జిల్లాలో జాతీయ రహదారులతోపాటు రైల్వేలైన్ నిర్మాణం పూర్తిచేసుని రైలు కూత వినబోతున్నామన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంపూర్ణ సహకారంతో అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యేలా చూస్తానన్నారు.

* యువతకు ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ పిలుపు

$
0
0

తుంగతుర్తి, డిసెంబర్ 31: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుపొంది నియోజక అభివృద్ధిని మరింత ముందుకు తీసుకుపోదామని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ యువతకు పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని రావులపల్లి క్రాస్‌రోడ్డు తండా పంచాయతీ నుండి వివిధ పార్టీలకు చెందిన వంద మంది ఆయన సమక్షంలో పార్టీలో చేరగా వారందరికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఏర్పాటైన సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వ హయాం నుండే తుంగతుర్తి ప్రాంతం అభివృద్ధి చెందుతోందనే గట్టి నమ్మకంతో ప్రజలు తనని మళ్ళీ రెండోమారు ఎమ్మెల్యేగా గెలిపించారని గుర్తుచేశారు. ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని హామీఇచ్చారు. కాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ గ్రామాలన్నీ గెలుచుకుంటే అభివృద్ధి పథకాలు మరింత వేగవంతం కాగలవన్నారు. ఈమేరకు ప్రతీ ఒక్కరు ఒక బాధ్యతతో పనిచేయాలని కోరారు. కష్టపడి పనిచేసే వారిని ఖచ్చితంగా గుర్తిస్తానన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కల్లెట్లపల్లి శోభన్‌బాబు, మండల పార్టీ అధ్యక్షులు గుడిపాటి సైదులు, మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు యుగేంధర్‌రావు, ఉమ్మడి జిల్లా టెలికాం బోర్డు సభ్యుడు రాములు, నాయకులు విక్రంరెడ్డి, బబ్బీసింగ్, సాయిలు, క్రిష్ణారావు, దామ్లా, ఠాకూర్, నరేష్, రమేష్ పాల్గొన్నారు.

Viewing all 69482 articles
Browse latest View live