Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

ఫ్రెండ్లీ పోలీసింగ్ దిశగా జిల్లా పోలీస్

$
0
0

నల్లగొండ రూరల్, డిసెంబర్ 31: పోలీస్ అధికారులు, సిబ్బంది తమ పనితీరు మరింత మెరుగుపర్చుకుంటూ ప్రజలకు సమర్థవంతంగా సేవలందించాలని జిల్లా ఎస్పీ ఏవీ. రంగనాథ్ తెలిపారు. సోమవారం ఏఎస్పీ పద్మనాభరెడ్డితో కలిసి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన వార్షిక సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో నేరాలను తగ్గిస్తూ ఫ్రెండ్లీ పోలీస్ దిశగా ముందుకు సాగుతున్నామనీ, కోర్టు కేసుల విషయంలో మంచి పురోగతి సాధించడం జరిగిందన్నారు. గడిచిన 6నెలల కాలంలో 661 కేసులు పరిష్కరించామని 167 కోర్టు కేసుల్లో 110 కేసులకు నిందుతులకు శిక్షలు పడ్డాయన్నారు. వీటితోపాటు పెండింగ్‌లోని 494 కేసులను సైతం పూర్తిస్థాయిలో పరిష్కరించామన్నారు. శాసనసభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని బైండోవర్లు, పీడీ యాక్టులు నమోదు చేశామన్నారు. రాబోయే పార్లమెంట్, సహకార, పంచాయతీ ఎన్నికలను సైతం ఎదుర్కోవాలన్నారు. అదేవిధంగా జనవరి 1 నుండి ఈ-చలాన్ విధానం అమలులోకి తెస్తున్నామన్నారు.
నియోజకవర్గ అభివృద్ధికి కృషి
* దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్
చింతపల్లి, డిసెంబర్ 31: దేవరకొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేయడమే తన లక్ష్యమని స్థానిక ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం, గ్యారిం షరీఫ్ దర్గా వద్ద సోమవారం ఆయన ప్రత్యేక పూజలు ప్రార్థనలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు, ముస్లిం సోదరులు శాలువాతో సత్కరించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో మండలోని అన్ని గ్రామాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించే విధంగా కార్యకర్తలు చిత్తశుద్ధితో పని చేయాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా నియోజవకవర్గంలోని ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు నట్వ గిరిధర్, సత్యనారాయణ శర్మ, ఖాలేద్, సర్వర్, యాదయ్య, సీహెచ్. అంజయ్య, యాసింబాబా, అన్వర్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి
* నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
రామన్నపేట, డిసెంబర్ 31: నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మత్స్య పారిశ్రామిక సహకార సంఘం భవనానికి జడ్పీటీసీ నిధులతో నిర్మించిన ప్రహరీని ఆయన సోమవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే ధర్మారెడ్డి కాలువ పనులు నత్తనడకన నడుస్తున్నాయన్నారు. ఆరునెలలలో కాలువ పనులు పూర్తిచేసి రైతులకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జినుకల వసంత, మత్స్యశాఖ డైరెక్టర్ జినుకల ప్రభాకర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బందెల రాములు, తహశీల్దార్ బ్రహ్మయ్య, ఎంపీడీవో శిరీష, సూపరింటెండెంట్ లలిత, సంఘం అద్యక్షుడు కందుల అంజయ్య, కోశాధికారి బచ్చ రాములు, డైరెక్టర్లు పిట్టల మత్స్యగిరి, కందుల బిక్షం, సాదుల యాదగిరి, కందుల శ్రీను, పీఆర్ ఏఈ కొండయ్య పాల్గొన్నారు.
ఐక్యంతో పంచాయతీలు గెలుద్దాం


అవకాశవాద రాజకీయాలకు కేరాఫ్ బాబు

$
0
0

నల్లగొండ, డిసెంబర్ 31: ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబునాయుడు అవకాశవాద రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అని, మాట మార్చడం, కుట్రలు చేయడం ఆయన నైజమని రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిలతో కలిసి నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించిన చంద్రబాబు మరోసారి తెలుగు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే కుట్రలు చేస్తు రాజకీయ లబ్ధికోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ చేసిన విమర్శలపై చంద్రబాబు స్పందిస్తు చేసిన వ్యాఖ్యలన్ని అబద్ధాలేనన్నారు. చంద్రబాబుపై కేసీఆర్ మాట్లాడిన ప్రతీమాట నిజమన్నారు. గతంలో రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చానని ప్రకటించి పార్లమెంటు విభజన చట్టానికి చంద్రబాబు అడ్డుపడ్డారని, మళ్లీ తాజాగా తెలంగాణ ఎన్నికల్లో తాను రాష్ట్ర ఏర్పాటుకు సహకరించానని ప్రచారం చేసుకుని, నిన్నటి మీడియా సమావేశంలో రాష్ట్ర విభజనను వ్యతిరేకించానని నిస్సిగ్గుగా చెప్పుకున్నారని గుత్తా దుయ్యబట్టారు. అలాగే హైకోర్టు విభజనకు అంగీకరించి నోటిఫికేషన్ వచ్చాక వ్యతిరేకించడం, ఏపీకి ప్రత్యేక హోదా సంజీవని కాదని, ప్యాకేజీ ముద్దని చెప్పి మళ్లీ ఎన్నికల వేళ హోదా కావాలని మాట మార్చిన చంద్రబాబు అవకాశవాద, మాటతప్పే రాజకీయాలకు నిదర్శనాలుగా నిలుస్తాయన్నారు. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్‌ను కేసీఆర్ విలీనం చేసేందుకు సిద్ధమైనప్పటికి ఆనాటి కాంగ్రెస్ సీఎం, సీనియర్‌నేతలు అందుకు అడ్డుపడిన సంగతి అందరికి తెలిసిందేనని దీనిపై కేసీఆర్ మాటమార్చారని చంద్రబాబు చెప్పడం అవగాహన రాహిత్యమేనన్నారు. 1999లో, 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని, ప్రధాని నరేంద్రమోదీతో కలిసి, ఇప్పుడు ఏపీలో వైఎస్ జగన్ పార్టీకి విజయవకాశాలు పెరిగిపోవడంతో రాజకీయ అవసరాల కోసం బీజేపీని, మోదీని, కేసీఆర్‌ను తిడుతూ, కాంగ్రెస్‌తో కలిసిపోయిన నిర్వాకం చంద్రబాబుకే చెల్లిందన్నారు. టీఆర్‌ఎస్ ఎప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోలేదని ఆ చరిత్ర చంద్రబాబు టీడీపీకే ఉన్న సంగతి మరువరాదన్నారు. ఏపీ రాజధాని నిర్మాణానికి అమరావతి భూములు పనికిరావని చెప్పినా వినిపించుకోకుండా సొంత ఆర్థిక ప్రయోజనాల కోసం రూపాయికి పది రూపాయలు పెడుతూ అమరావతిలో రాజధాని నిర్మించతలపెట్టిన ఘనుడు చంద్రబాబు అంటు గుత్తా విమర్శించారు. చంద్రబాబు చెప్పినట్లుగా ఏపీ వృద్ధిరేటు అగ్రస్థానంలో ఉంటే ప్రత్యేక హోదా ఎందుకు అడుగుతున్నారో ఆయనకే తెలియాలన్నారు. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు రూ.500 కోట్లు పంచినా ప్రజలంతా కులాలకు అతీతంగా సీఎం కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేశారన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం ఇంకా కుల రాజకీయాలు, కుట్ర రాజకీయాలు, అవకాశావాద రాజకీయాలనే అనుసరిస్తున్నారని ఈ దఫా ఏపీ ప్రజలు ఆయనకు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని గుత్తా జోస్యం చెప్పారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 16 ఎంపీ స్థానాల్లో టీఆర్‌ఎస్ విజయం తధ్యమన్నారు. బీసీ రిజర్వేషన్లపై ప్రతిపక్షాలదంతా రాజకీయ రాద్ధాంతమేనని గుత్తా కొట్టిపారేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నాయకులంతా ఉనికి కోసం బీసీ రిజర్వేషన్లపై గగ్గోలు పెడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఆర్.కృష్ణయ్య వంటి నాయకులు కాంగ్రెస్ నాయకుల బుట్టలో పడి మిర్యాలగూడలో ఓడి ఆగమయ్యారన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు మరో గత్యంతరం లేకనే రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తెచ్చిందన్నారు. బీసీల నిజమైన పక్షపాతి సీఎం కేసీఆర్ అని, ఆరింటిలో నాలుగు రాజ్యసభ స్థానాలను బీసీలకు ఇచ్చారని, నామినేటెడ్ పదవుల భర్తీలో రిజర్వేషన్లు కల్పించారని, వృత్తిదారులకు వేలకోట్ల సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు.

అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య
నల్లగొండ జిల్లా కేంద్రంలో ఘటన
నల్లగొండ రూరల్, డిసెంబర్ 31: నల్లగొండ పట్టణంలో అప్పుల బాధతో పురుగుల మందు తాగి దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ వన్ టౌన్ ఎస్‌ఐ సతీష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని అబ్బాసియా కాలనీకి చెందిన కిరాణా వ్యాపారి జగిని చంద్రశేఖర్ (45), అతని భార్య స్వాతి(38)లు సోమవారం ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధతో ఎలుకల మందు తాగారు. చంద్ర శేఖర్ తను నివసించే అబ్బాసియా కాలనీలో కిరాణ దుకాణం నడుపుతూ ఉండేవాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో తన ఇద్దరు కుమారులను పాఠశాలకు పంపించిన చంద్ర శేఖర్ తన భార్య స్వాతితో కలిసి ఎలుకల మందు తాగాడు. కొద్ది సేపటికి మందు తాగిన విషయం తన తండ్రి రంగయ్యకు సమాచారం అందించగా వారిని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్‌ఐ సతీష్‌కుమార్ వెల్లడించారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.

కేంద్రంలో కాంగ్రెస్‌కు అధికారం ఖాయం
కార్యకర్తలు అధైర్యపడొద్దు
డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్య గౌడ్
ఆలేరు, డిసెంబర్ 31: కాంగ్రెస్ పార్టి కార్యకర్తలు అధైర్య పడకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించేలా పనిచేయాలని డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్య గౌడ్ అన్నా రు. సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన మండల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి గెలుపు.. ఓటములు సహజమని, పార్టీ కార్యకర్తలకు నాయకులు అండగా ఉండి ముందుకు వెళ్తానని తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి స్థానిక సంస్థల్లో అత్యధిక స్థానాలు గెలిచేలా కృషి చేయాలన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికలో గెలిచి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని జోస్యం చెప్పారు. పనిచేసే కార్యకర్తలకు, నాయకులకు గుర్తింపు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు జనగాం ఉపేందర్‌రెడ్డి, కొలుపుల హరినాథ్, వస్తరి శంకరయ్య, జంపాల దశరధ, దూసరి విజయ, జూకంటి ఉప్పలయ్య, విజయ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.

కొత్త ఏడాదిలో మరింత ప్రగతి
* ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి
* మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట, డిసెంబర్ 31: 2019 నూతన సంవత్సరంలో రాష్ట్రం మరింత ప్రగతి సాధించి ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆకాంక్షించారు. జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. కొత్త సంవత్సరంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో ప్రజలకు అందించేలా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. నూతన సంవత్సరం ఎన్నో ఆశయాలు, లక్ష్యాలను సాధించి సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగాలన్నారు. 24 గంటల నిరంతర విద్యుత్‌తో పాటు అన్నిరంగాల్లో గత ఏడాదిలో అద్బుతమైన ప్రగతి సాధించుకున్నామని, ఇందుకు టీఆర్‌ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రావడమే నిదర్శనమన్నారు. ఈ ఏడాది కూడా సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాలు ప్రగతి సాధిస్తాయని, కాళేశ్వరం ప్రాజెక్టుతో కోటి ఎకరాల మాగాణి రాష్ట్రంగా తెలంగాణ సస్యశ్యామలం కావాలన్నారు. నూతన సంవత్సర వేడుకలను ప్రజలంతా ఆనందోత్సవాల మధ్య ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

నూతన సంవత్సరానికి ఘన స్వాగతాలు
సంబురాలు
నల్లగొండ రూరల్, డిసెంబర్ 31: నూతన సంవత్సరం 2019 స్వాగత వేడుకులను నల్లగొండ పట్టణ, మండల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పెద్ద ఎత్తున రంగులు కొనుగోలు చేసి ఇళ్ల ముందు రకరకాల ముగ్గులతో మహిళలు నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. కేక్‌లు, స్వీట్లు కొనుగోలుతో దుకాణాలు సందడిగా కనిపించాయి. అర్ధరాత్రి వరకు ప్రజలు, యువత కేరింతలు కొడుతు, నృత్యాలు చేస్తు నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. పోలీస్ శాఖ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రత్యేకంగా పెట్రోలింగ్ నిర్వహించారు.

యాదాద్రి నూతన ఆలయం ప్రపంచ అద్భుతం
* గవర్నర్ నరసింహన్
* స్వామివారిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు
యాదగిరిగుట్ట, డిసెంబర్ 31: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి నూతన ఆలయం నిర్మాణం అద్భుత శిల్పకళావైభవంతో ప్రపంచ అద్భుత దివ్య క్షేత్రంగా నిర్మితమవుతుందంటూ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కొనియాడారు. సోమవారం గవర్నర్ నరసింహన్ దంపతులు శ్రీ లక్ష్మీనరసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సందర్శనకు వచ్చిన గవర్నర్ దంపతులకు ఆలయ ఈవో గీతా, అనువంశిక ధర్మకర్త బీ.నరసింహమూర్తి, ప్రధానార్చకులు నందీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నరసింహాచార్యుల బృందం వేద మంత్రోచ్ఛారణల మధ్య పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారికి గవర్నర్ దంపతుల ప్రత్యేక పూజల అనంతరం మహామండపంలో వారికి అర్చక బృందం ఆశీర్వచనాలు పలికారు. ఈవో గీత, ధర్మకర్త నరసింహమూర్తిలు వారికి స్వామివారి లడ్డూ ప్రసాదాలను అందించారు.
అనంతరం నూతన ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన గవర్నర్ నరసింహన్ ఆలయ నిర్మాణం తీరుతెన్నులను అభినందించారు. ఆలయ నిర్మాణ పనుల పురోగతిని గవర్నర్‌కు స్థపతి వేలును, ఈవో గీతలు వివరించారు. కొండపై ప్రధానాలయం పనులను పరిశీలించిన పిదప గవర్నర్ నరసింహన్ విలేఖరులతో మాట్లాడుతూ యాదాద్రి ఆలయ నిర్మాణంలో శిల్పాలను మలిచి ప్రతిష్ఠిస్తున్న క్రమం అద్భుతంగా ఉందన్నారు. శిల్పుల నైపుణ్యానికి ఆలయ నిర్మాణం అద్దం పడుతుందన్నారు. ఆలయ నిర్మాణం పూర్తయిన పక్షంలో ప్రపంఛ చరిత్రలోనే అద్భుత ఆలయంగా యాదాద్రి విలసిల్లుతుందన్నారు. లక్ష్మీనరసింహస్వామి మహిమగలవారని, స్వామివారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అనితారామచంద్రన్, వివిధ శాఖల అధికారులు, అర్చకులు ఉన్నారు.
అర్చకులపై గవర్నర్ చెణుకులు!
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం దర్శనానికి సోమవారం సాయంత్రం విచ్చేసిన గవర్నర్ నరసింహన్ దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చక బృందం వారికి ఆశీర్వచనాలు పలికిన సందర్భంగా గవర్నర్ స్పందిస్తు ఆశీర్వచన ప్రక్రియ సరిగా నిర్వహించలేదని, ఛతుర్వేద పఠనంతో ఆశీర్వచనం చేయాలని అర్చకులకు సూచించారు. గవర్నర్ సూచనలతో అర్చక బృందం అవాక్కయి ఎవరు కూడా తిరిగి మారుమాట్లడలేకపోయారు. ఆశీర్వచనం అనంతరం ఈవో గీత, ధర్మకర్త నరసింహమూర్తిలకు గవర్నర్ దంపతులకు లడ్డూ ప్రసాదాలు అందించారు.

యాదాద్రిలో శివకేశవుల ఆరాధన

$
0
0

యాదగిరిగుట్ట, డిసెంబర్ 31: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం శివ కేశవుల నిత్యారాధనలు, అభిషేకాలు, ఆర్జిత సేవలు శాస్తయ్రుక్తంగా సాగాయి. లక్ష్మీనరసింహుల ఆలయంలో వేకువ జామున సుప్రభాతంతో స్వామి అమ్మవార్లను మేల్కొలిపి హారతి నివేదన చేశారు. బిందె తీర్థం, బాలభోగంతో ఆలయ పూజాధికాలు ప్రారంభించారు. ముందుగా స్వయంభూవులను ఆరాధించిన పూజారులు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పంచామృతాలతో అభిషేకించి తులసీదళాలతో కొలిచారు. వివిధ సుగంధ పూలమాలలతో పట్టు వస్త్రాలతో, ఆభరణాలతో సుందరంగా తీర్చిదిద్దారు. కవచమూర్తులను స్వర్ణ పుష్పాలతో ఆరాధించి అర్చించారు. ఆలయ కల్యాణ మండపంలో అర్చక బృందం వేదమంత్రోచ్ఛరణల మధ్య స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామి వారి కల్యాణానికి ముందు విశ్వక్సేనారాధన, పుణ్యహావచనం, శ్రీ సుదర్శన నారసింహహోమం, గజవాహన సేవోత్సవాలు నిర్వహించారు. బాలాలయంలో ఉదయ నుండి సాయత్రం వరకు కొనసాగిన సహస్రనామార్చన, అష్టోత్తర పూజల్లో, సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లకు వెండిజోడి సేవ నిర్వహించారు.
ముక్కంటికి రుద్రాభిషేకం
యాదాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఉప శివాలయంలో సోమవారం పురస్కరించుకుని రామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు, మహాన్యాసక పూర్వ రుద్రాభిషేకం, బిల్వార్చన, పార్వతి రామలింగేశ్వరుల కల్యాణోత్సం, సేవోత్సవాలు సాంప్రదాయంగా నిర్వహించారు. అభిషేక పూజలతో పాటు శివార్చనలు, అష్టోత్తర పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచాం

$
0
0

మహబూబ్‌నగర్, డిసెంబర్ 31: 2018 సంవత్సరం అందరి సహకారంతో అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచామని నూతన సంవత్సరం 2019లోకి అడుగుపెడుతున్నామని ఈ ఏడాదిలో మహబూబ్‌నగర్ జిల్లాను మరింత అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్దామని జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ పిలుపునిచ్చారు. సోమవారం రెవెన్యూ సమావేశమందిరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కలెక్టర్ రోనాల్డ్‌రోస్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి 2018 సంవత్సరాన్ని అభివృద్ధి సంవత్సరంగా తీసుకుని పయణించడంతోనే గత ఏడాదిలో అభివృద్ధి సాధ్యమైందన్నారు. అన్ని శాఖల పనితీరు భేష్‌గా ఉందని జిల్లాలో జరిగిన అభివృద్ధిపై వివిధ శాఖలకు జాతీయ రాష్ట్ర స్థాయి అవార్డులు దక్కాయన్నారు. అందులో ప్రధానంగా ఆరోగ్యశాఖలో ప్రజలకు వైద్యసేవలు అందించడంలో మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అయిన జానంపేట, మరికల్, మిడ్జిల్ ఆసుపత్రులకు జాతీయ అవార్డులు రావడం గొప్ప విషయం అన్నారు. అంతేకాకుండా 6.90లక్షల మందికి కంటివెలుగు పథకంలో పరీక్షలు చేయడం జరిగిందని అందులో 86వేలమందికి అద్దాలు ఇవ్వగా మరో రండుమూడు వేల మందికి కంటి ఆపరేషన్లు చేసి చూపు తీసుకురావడంలో వైద్యులు చేసిన కృషి ఆమోఘం అన్నారు. మీషన్‌భగీరథ ద్వారా 1095అవాసాలకు ఇంటింటికి మంచినీరు అందిస్తున్నామని మరో నెలరోజుల్లో జిల్లాలోని ప్రతి ఇంటికి శుద్దజలాలు అందించడం జరుగుతుందన్నారు.

నయా జోష్..!
* కోటి ఆశలతో కొత్త ఏడాదిలోకి..
* న్యూయర్ వేడుకల్లో విద్యార్థులు, యువకులు
కోస్గి, డిసెంబర్ 31: గడిచిన ఏడాదికి గుడ్ భై చెప్పి నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టేందుకు చిన్నా, పెద్దా, యువతీ, యువకులు అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారు న్యూయర్ వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మంగళవారం నేడు కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టిన సందర్భంగా మార్కెట్లో నయా జోష్.. నెలకొంది. బేకరి నిర్వహకులు వివిధ రకాల కేక్స్‌ను తయారు చేసి వినియోగదారులను ఆకర్షించారు. ముందస్తు ఆర్డర్స్ కూడా సరసమైన ధరలకే ఆఫర్స్ గుప్పించారు. మండల కేంద్రంతో పాటు ఈడాది గ్రామాల్లో సైతం వేడుకల సందర్భంగా చిన్నా, పెద్ద హోటళ్లు బిర్యానీతో పాటు నోరూరించే తినుబండారాల పాయింట్స్ ఏర్పాటు చేశాయి.

ఐటీ కారిడార్‌తో మహబూబ్‌నగర్‌కు కొత్త శోభ

$
0
0

మహబూబ్‌నగర్, డిసెంబర్ 31: మహబూబ్‌నగర్‌కు త్వరలోనే ఐటీ కారిడార్ రాబోతుందని ఇప్పటికే కారిడార్ పనులు కొనసాగుతున్నాయని దింతో మహబూబ్‌నగర్ మున్సిపాలిటీకి కొత్త శోభ రానుందని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్ మున్సిపల్ సమావేశం చైర్మన్ రాధ ఆమర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి మున్సిపల్ సమావేశానికి హజరైన ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ను చైర్‌పర్సన్ రాధ ఆమర్‌తో పాటు కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ మరోసారి తనకు మున్సిపాలిటీలోని ప్రజలంతా ఓట్లు వేసి అఖండ విజయాన్ని ఇచ్చారని దాంతో తమపై మరింత భారం పెరిగిందన్నారు. అందరి సహకారంతో గత నాలుగున్నర ఏళ్ల పాటు మహబూబ్‌నగర్ పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేశామని మరో ఐదేళ్లలో దేశంలోనే మహబూబ్‌నగర్ పట్టణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామన్నారు. జడ్చర్ల నుండి మహబూబ్‌నగర్ వరకు రోడ్డు వెడల్పు కార్యక్రమం జరగనుందని ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తి అయిందని తెలిపారు. కొనసాగుతున్న పనులను పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోరారు. అందరి సహకారం ఉండాలని దాంతో మహబూబ్‌నగర్ పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ రాములు, కౌన్సిలర్లు కృష్ణమోహన్, వనజ, జ్యోతి, విఠల్‌రెడ్డి, హది, పద్మ తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో శాంతిభద్రతలు భేష్

$
0
0

మహబూబ్‌నగర్, డిసెంబర్ 31: జిల్లాలో శాంతిభద్రతలు భేష్‌గా ఉన్నాయని అందుకు నిదర్శనం శాసనసభ ఎన్నికల్లో ఎలాంటి గొడవలకు తావు ఇవ్వకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లడం జరిగిందనిమహబూబ్‌నగర్ ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎస్పీ రెమా రాజేశ్వరి మాట్లాడుతూ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారుల సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుని జిల్లాలో 2018 సంవత్సరంలో శాంతిభధ్రతల విషయంలో రాజీ లేకుండా జిల్లా పోలీసు యంత్రాంగం పనిచేసిందన్నారు. దాంతో జిల్లాలో నేరాల సంఖ్య తగ్గిందన్నారు. రోడ్డు ప్రమాదాలను గతంలో కన్నా 50శాతం తగ్గాయని వెల్లడించారు. ముఖ్యంగా జిల్లాలో షీటీంల పనితీరు భేష్‌గా ఉందని తెలిపారు. 2019 సంవత్సరంలో కూడా ప్రెండ్లీ పోలిసింగ్ విధానంతో ముందుకెళ్లడం జరుగుతుందని గ్రామగ్రామాన ప్రత్యేకంగా పోలీసు కళాబృందాలతో చట్టాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే జిల్లాలో ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ముఖ్యంగా యువత తమ భవిష్యత్తుపై దృష్టి సారించుకునేలా పోలీసులు కార్యక్రమాలు చేపట్టనున్నారని పోలీస్‌స్టేషన్ల వారిగా ప్రెండ్లీ పోలిసింగ్ విధానాన్ని ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. డిజిపి మహేందర్‌రెడ్డి నేతృత్వంలో నూతన ప్రణాళికలు ఆమలు చేయడం వల్ల 2018 సంవత్సరంలో సత్ఫలితాలను అందుకున్నామని జిల్లా పోలీసులకు రాష్ట్ర, జాతీయస్థాయిలో ఎన్నో అవార్డులు వచ్చాయన్నారు. నూతన సంవత్సర వేడుకలను జిల్లా ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని మధ్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె హెచ్చరించారు. పోలీసులకు ప్రజలు సహకరించాలన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను అదుపులో పెట్టుకుని పలు సూచనలు ఇవ్వాలని నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి విషాదాలు చోటు చేసుకోకుండా ఉండాలని ఆమె కోరారు. పోలీసులు అంటే ప్రజల్లో ఒకరని ఆమె అన్నారు. విలేఖరుల సమావేశంలో ఎఎస్పీ వెంకటేశ్వర్లు, డిఎస్పీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

బులియన్

$
0
0

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,066.00
8 గ్రాములు: రూ. 24,528.00
10 గ్రాములు: రూ. 30,660.00
100 గ్రాములు: రూ. 3,06,600.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,279.144
8 గ్రాములు: రూ. 26,233.152
10 గ్రాములు: రూ. 32,791.440
100 గ్రాములు: రూ. 3,27,914.40
వెండి
8 గ్రాములు: రూ. 332.20
10 గ్రాములు: రూ. 415.00
100 గ్రాములు: రూ. 4.150.00
ఒక కిలో: రూ. 41,500.00
*
హైదరాబాద్‌లో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,017.00
8 గ్రాములు: రూ. 24,136.00
10 గ్రాములు: రూ. 30.170.00
100 గ్రాములు: రూ. 3,01,700.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,226.738
8 గ్రాములు: రూ. 25,813.904
10 గ్రాములు: రూ. 32,247.35
100 గ్రాములు: రూ. 3,22,673.30
వెండి
8 గ్రాములు: రూ. 332.20
10 గ్రాములు: రూ. 415.00
100 గ్రాములు: రూ. 4.150.00
ఒక కిలో: రూ. 41,500.00.

సూచీల్లో నయాసాల్ జోష్

$
0
0

ముంబయి, జనవరి 1: భారతీయ ఈక్విటీ మార్కెట్లు మంగళవారం ఆంగ్ల కొత్త సంవత్సరాదిని సానుకూల వాతావరణంలోనే ఆరంభించాయి. సెనె్సక్స్ బీఎస్సీ బెంచ్ మార్కును దాటి 186 పాయింట్లు లాభపడింది. బ్యాంకింగ్ రంగాన్ని పునరుద్ధరించేందుకు రిజర్వు బ్యాంకు చర్యలు చేపట్టిందన్న వార్తల నేపథ్యంలో బ్యాంకింగ్ స్టాక్స్ లాభాల బాట పట్టాయి. 30 షేర్ల బీఎస్‌ఈ సెనె్సక్స్ మంగళవారం 36,254.57 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 47.55 పాయింట్లు లాభపడి 0.44 లాభాలతో 10,910.10 పాయింట్ల ముగిసింది. ఈక్రమంలో ఆర్థిక, టెలికాం, ఐటీ, ఆటో, పార్మా రంగ షేర్లకు డిమాండ్ పెరిగింది. కాగా సెనె్సక్స్ చార్టులో భారతీ ఎయిర్‌టెల్ షేర్లు 2.76 శాతం లాభపడి అగ్రభాగాన నిలిచాయి. తర్వాతి స్థానాల్లో 2.01 లాభాలతో హెచ్‌డీఎఫ్‌సీ, 1.38 శాతం లాభాలతో యెస్ బ్యాంకు నిలిచాయి. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఎస్‌బీఐ, ఆక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకులతోబాటు, ఇన్ఫోసిస్, హీరోమోటోకార్ప్, టాటా మోటార్స్, సన్‌పార్మా, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, పవర్‌గ్రిడ్, ఐటీసీ, బజాజ్ ఆటో, మారుతీ, కోల్ ఇండియా, లార్సన్ అండ్ టర్బో, రిలయన్స్ ఇండియా లిమిటెడ్‌లు 1.3 శాతం మేర లాభాలను ఆర్జించాయి. కాగా నష్టాలను చవిచూసిన సంస్థలో మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, ఓఎన్‌జీసీ, హెచ్‌యూఎల్, ఇండస్ ఇండ్ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకు, ఎన్టీపీసీ, ఆసియన్ పెయింట్స్, వేదాంత, హెచ్‌సీఎల్ టెక్ ఉన్నాయి. దాదాపు 3.75 శాతంమేర ఈ సంస్థలు నష్టపోయాయి. కాగా బ్యాంకింగ్ రంగంలో నిరర్ధక ఆస్తులను తగ్గించి నష్టాల బాటలో ఉన్న బ్యాంకుల ఆర్థిక స్థితిని పునరుద్ధరించనున్నామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించడం బ్యాంకింగ్ రంగ షేర్లకు ఊతమిచ్చిందని ఆర్థిక రంగ నిపుణులు విశే్లషిస్తున్నారు.


జీఎస్టీ వసూళ్లు తగ్గాయ్

$
0
0

న్యూఢిల్లీ, జనవరి 1: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు గత నెలలో తగ్గాయి. గడచిన యేడాది డిసెంబర్‌లో మొత్తం 94,726 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. గడచిన యేడాది ఇదే కాలంలో రూ.97,637 కోట్లు వసూలైట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా జీఎస్‌టీఆర్-3బి ద్వారా మొత్తం 72.44 లక్షల సేల్స్ రిటర్స్ ఫైళ్లు గత నెలలో దాఖలయ్యాయి. నవంబర్‌లో దాఖలైన 69.6 లక్షల ఫైళ్లకంటే ఇది అధికం. కాగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శా ఖ గణాంకాల మేరకు గత నెలలో వసూలైన రూ. 94,726 కోట్లలో సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్‌టీ) ద్వారా 16,442 కోట్లు, స్టేట్ జీఎస్టీ (ఎస్‌జీఎస్‌టీ) ద్వారా 22,459 కోట్లు, ఇంటిగ్రేటెట్ జీఎస్టీ (ఐజీఎస్‌టీ) ద్వారా రూ.47.936 కోట్ల వంతున వసూలయ్యా యి. అలాగే సెస్ రూపేణా రూ.7,888 కోట్లు వసూలయ్యాయి. ప్రభుత్వ నిరంతర సెటిల్మెంట్లు విభా గం ఐజీఎస్‌టీ ద్వారా రూ.18,409 కోట్లమేర సీజీఎస్‌టీ, 14,793 కోట్లమేర ఎస్‌జీఎస్‌టీని కేంద్ర ప్రభు త్వం చెల్లించింది. అలాగే ఎస్‌జీఎస్‌టీగా రూ. 46.252 కోట్లు చెల్లించినట్టు సంబంధిత మంత్రి త్వ శాఖ మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గడచిన ఏప్రిల్ నుంచి తొమ్మిది నెలల కాలానికి జీఎస్టీ ద్వారా నెలవారీ లక్ష్యం 1.12 కోట్లతో ప్రభుత్వం మొత్తం రూ.8.71 లక్షల కోట్లు ఆర్జించిందని మంత్రి త్వ శాఖ వివరించింది. కాగా 2018-19 బడ్జెట్‌లో మొత్తం రూ. 13.48 లక్షల కోట్ల జీఎస్టీ రూపేణా వసూలు చేయాలని అంచనా వేయడం జరిగిందని తెలిపింది. 2017 జూలై నుంచి మార్చి 2018 వరకు రూ. 89.885 కోట్లు వసూలయ్యాయని తెలిపింది.
కొనసాగనున్న తగ్గుదల
ఇలావుండగా 23 వస్తువులపై జీఎస్టీ పన్ను రేట్లను తగ్గిస్తూ జీఎస్టీ మండలి తీసుకున్న నిర్ణయం మేరకు కొత్త సంవత్సరం ఆరంభం నుంచే జీఎస్టీ వసూళ్లలో తగ్గుదల కొనసాగుతుందని ఆర్థిక నిపుణులు అంచనావేస్తున్నారు. ప్రస్తుతం 28 వస్తువులు మాత్రమే 28 శాతం అత్యున్నత పన్ను స్లాబ్ రేటుకింద మిగిలాయి. పన్ను సవరణతో ప్రతియేటా జీఎస్టీ వసూళ్ల మొత్తంలో రూ. 5,500 కోట్లు తగ్గుతుంది. అంటే ఈ యేడాది జనవరి నుంచి మార్చి వరకు జీఎస్టీ ఆదాయంలో రూ. 1,375 కోట్ల మేర తగ్గుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేసిం ది. వచ్చే మూడు నెలల కాలానికి జీఎస్టీ వసూళ్లు తగ్గవచ్చని, అలాగే ఎన్‌ఫోర్స్‌మెంట్ చట్టం, దర్యాప్తు కేసులు కూడా పెరుగుతాయని జాతీయ పరోక్ష టాక్స్ లీడర్ పీడబ్ల్యుసీకి చెందిన ప్రతీక్ జైన్ అంచనా వేశారు. ప్రభుత్వం కూడా దాపరికాల్లేని విధానాన్ని జీఎస్టీ విషయంలో వచ్చే యేడాది అనుసరించే అవకాశాలున్నాయని ఆయన అభిప్రాయడ్డారు. కాగా గడచిన యేడాది ఏప్రిల్‌లో రూ.1.03 లక్ష కోట్లు జీఎస్టీ వసూళ్లు జరిగాయి. అలాగే మేలో 94,016 కోట్లు, జూన్‌లో 95,610 కోట్లు, జూలైలో 96,483 కోట్లు, ఆగస్టులో 93,960 కోట్లు, సెప్టెంబర్‌లో 1,00,710 కోట్లు, అక్టోబర్‌లో 97,637 కోట్లు, నవంబర్‌లో 97,637 కోట్ల వంతున జీఎస్టీ వసూళ్లు జరిగినట్టు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

రికార్డు స్థాయి ఆదాయం

$
0
0

న్యూఢిల్లీ, జనవరి 1: ప్రభుత్వ రంగ సంస్థల్లోని వాటాలను విక్రయించడం ద్వారా గడచిన యేడాది కేంద్ర ప్రభుత్వం 77.417 కోట్ల రూపాయల నిధులను సమీకరించింది. ఇదే రకమైన పెట్టుబడులను వెనక్కు తీసుకునే (డిసినె్వస్ట్‌మెంట్) కార్యక్రమం కొత్త సంవత్సరంలోనూ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ విమాన యాన సంస్థ ఎయిర్ ఇండియాను ప్రణాళికాబద్ధంగా ప్రైవేటీకరించడం ద్వారా పెట్టుబడి డిసినె్వస్ట్‌మెంట్ ప్రణాళికను ప్రభుత్వం కొనసాగిస్తుందని భావిస్తున్నారు. గతంలో పాలించిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నడూలేనంతగా అత్యధిక సంఖ్యలో ప్రభుత్వ రంగ సంస్ధలను ప్రైవేటీకరించింది. అలాగే ప్రస్తుత ప్రభుత్వం సైతం ప్రభుత్వానికి భారంగా మారిన మరికొన్ని సంస్థలను ప్రైవేటుపరం చేసే ప్రణాళికలతో ముందుకెళుతోంది. ఐతే ఇందులోప్రస్తుత మోదీ ప్రభుత్వం ఈ విధానంలో సరికొత్త పంథాను అనుసరిస్తోంది. ఇందులోప్రధానమైంది కంపెనీలు లేదా సంస్ధలను విలీనం చేయడం ద్వారా ఆదాయ లక్ష్యాలు సాధించడం. ఇందులో అతిపెద్ద పెట్టుబడులు కలిగిన ఓఎన్‌జీసీలో హెచ్‌పీసీఎల్‌కు భాగస్వామ్యం కల్పించడం, సీపీఎస్‌ఈ ఈటీఎఫ్, భారత్-22 ఈటీఎఫ్‌ల కలయిక, కోల్ ఇండియా వాటాల విక్రయంతోబాటు ఆరు పబ్లిక్ ఇనిషియల్ ఆఫరింగ్స్ (ఐపీఓ) ద్వారా 77,417 కోట్ల రూపాయల ఆదాయాన్ని గత యేడాది ప్రభుత్వం సమీకరించింది. అలాగే ఎయిర్ ఇండియాలోని 74 శాతం వాటాలను విక్రయించాలన్న అతిపెద్ద నిర్ణయాన్ని అమలు చేయడం ఆరంభించింది. ఈక్రమంలో ఎయిరిండియా వాటాల విక్రయానికి సరికొత్త ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఆ సంస్థకు చెందిన ఎయిరిండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్టు లిమిటెడ్ (ఏఐఏటీఎస్‌ఎల్), ఎయిరిండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఈఎస్‌ఎల్) వంటి అనుబంధ విభాగాలతోబాటు, ఎయిర్ ఇండియాకు చెందిన భూములు, ఇతర ఆస్తులను సైతం ప్రత్యేకంగా అమ్మకాలు జరపాలని నిర్ణయించింది. తద్వారా 29 వేల కోట్ల రూపాయల అప్పుల భారాన్ని ఎయిర్ ఇండియాకు తగ్గించాలన్న సదాశయంతోప్రభుత్వం ముందుకెళుతోంది. అప్పటి వరకు ప్రభుత్వం ఎయిరిండియాకు నిధులు సమకూరుస్తూ ఈ సంస్థ నిలదొక్కుకునేందుకు దోహదం చేయాలని నిర్ణయించింది. నిరర్ధక ఆస్తులను విక్రయించి రాబాడికి అనువుగా ఉండే విభాగాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా సంస్థ ఆర్థిక దృఢత్వానికి తోడ్పడవచ్చన్నది ప్రభుత్వ వ్యూహం. ఎయిర్ ఇండియా అనుబంధ ఆస్తులు, ఇతరత్రా భూములు, భవనాల విక్రయాల ద్వారా తొమ్మిది వేల కోట్లు సమకూరుతాయని ఆ సంస్థ అంచనావేస్తోంది. ఈక్రమంలో నూతన సంవత్సరంలో ఈ సంస్థకు చెందిన విక్రయ ప్రణాళికల్లో తొలుత ప్రభుత్వం 51 శాతం వాటాలు కలిగివున్న హెలికాప్టర్ సేవా విభాగం ‘పవన్ హాన్స్’ విక్రయ ప్రక్రియ ఆరంభమైంది. అలాగే ఓఎన్‌జీసీలో కూడా ప్రభుత్వం అధిక వాటాలు కలిగివుంది. పవన్ హాన్స్ విక్రయ ప్రక్రియ ఈ యేడాది మార్చి నాటికి పూర్తి చేయాల్సివుంది. అలాగే సుమారు 10 సీపీఎస్‌ఈల వాటాల బైబ్యాక్‌కు కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఓన్‌జీసీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఆయిల్ ఇండియా, ఎన్‌సీఎల్, బీహెచ్‌ఈఎల్, ఎన్‌ఏఎల్‌సీఓ ఉన్నాయి. ఈ బైబ్యాక్ ద్వారా సుమారు 12వేల కోట్ల రూపాయలు సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ (సీపీఎస్‌ఈ) విలీనం, సమీకరణ కార్యక్రమాలు ఈ యేడాది ప్రాధాన్యతను సంతరించుకునే అవకాశాలున్నాయి. అలాగే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ)లో సైతం ప్రభుత్వ వాటాలను రూరల్ ఎలక్ట్ఫ్రికేషన్ కార్పొరేషన్ నుంచి సుమారు 15 వేల కోట్ల మేర ఉపసంహరించుకోనుంది. అలాగే ‘విలీనం, సమీకరణ’ (ఎం అండ్ ఏ) కార్యక్రమం డీల్ సైతం ఎన్‌టీపీసీలో అమలు చేయాలని, ఎస్‌జేవీఎన్‌లోని ఆరు వేల కోట్ల వాటాలను తిరిగి కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రణాళికలను గత యేడాది జనవరిలో జరిగిన ఓఎన్‌జీసీ-హెచ్‌పీసీఎల్ డీల్ తరహాలోనే అమలు చేసేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది. హెచ్‌పీసీఎల్‌లోని మొత్తం 15.11 శాతం వాటాలు 36,915 కోట్లను ఓఎన్‌జీసీ అప్పట్లో కొనుగోలు చేసింది. ఈ క్రమంలో వచ్చే ఏప్రిల్ నుంచి ఆరంభం కానున్న ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేసే ‘డిసినె్వస్ట్‌మెంట్ ప్లాన్’కు సంబంధించిన బడ్జెట్ లక్ష్యాలను ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఓన్‌జీసీ-హెచ్‌పీఎల్ డీల్ అనుభవాలతో పెట్టులను వెనక్కు తీసుకునే ప్రణాళిక ద్వారా నిధుల సమీకరణల్లో లక్ష కోట్ల రూపాయల మ్యాజిక్ ఫిగర్ సాధించేందుకు మార్గం సుగమమైంది. ఇప్పటి వరకు ఇలా 72,500 కోట్ల రూపాయలు సమీకరించగా కొత్త సంవత్సరం 2019 మార్చి నాటికి ఈ మొత్తం 80 వేల కోట్లకు చేరాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్ధేశించుకుంది. రైల్వే శాఖలోని రెండు సీపీఎస్‌ఈలు ఆర్‌ఐటీఈఎస్, ఐఆర్‌సీఓఎన్ విభాగాల ఐపీఓల ద్వారా గడచిన యేడాది స్టాక్ మార్కెట్లోకి చేరగా, హిందూస్థాన్ ఏరోనాటిక్స్, భారత్ డైనమిక్స్, మిశ్రాధాతు నిగమ్, గార్డన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థలు సైతం ఇప్పటికే స్టాక్ ఎక్చేజీల్లోకి అడుగుపెట్టాయి. అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో మార్కెట్లకు అంత ఆశాజనకంగా లేదు.

సిడ్నీలో ఆస్ట్రేలియా ప్రాక్టీస్

$
0
0

సిడ్నీ, జనవరి 1: భారత్‌తో మూడో టెస్టులో ఘోర పరాజ యం చవిచూసిన ఆస్ట్రేలియా నాలుగో టెస్టులో గెలిచి సిరీస్ సమం చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. జనవరి 3 నుంచి జరిగే టెస్టు కోసం కొత్త సంవత్సరం కూడా మైదానంలో ప్రాక్టీస్‌కు దిగింది. సిడ్నీ మైదానం లో మంగళవారం ఉదయమే కెప్టెన్ టిమ్ పైన్‌తో పాటు నాథన్ లియాన్, ఉస్మాన్ ఖాజా, ఆరోన్ ఫించ్, మార్కస్ హారిస్, పీటర్ హాండ్స్‌కాంబ్, మార్నస్ లాబుసా చాగ్నే ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు. లెగ్ స్పిన్నర్ మార్నస్ లాబుసాచాగ్నేను ఈ టెస్ట్‌లో ఆడించాలని క్రికెట్ ఆస్ట్రేలి యా భావిస్తోంది. ఓపెనర్ ఆరోన్ ఫించ్ స్థానంలో దిం పాలని యోచిస్తోంది. లాబుసా చాగ్నే, ఉస్మాన్ ఖాజా క్వీన్స్‌లాండ్ తరఫున ఆడారు. మరోవైపు ఆరోన్ ఫించ్ నెట్స్‌కు హాజరైన ప్రాక్టీస్ చేయలేదు.

ఏఎఫ్‌సీ ఆసియా కప్; భారత్‌కు 50-50 ఛాన్స్

$
0
0

న్యూఢిల్లీ, జనవరి 1: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఈనెల 5 నుంచి వచ్చే నెల 2వరకు జరిగే ఏఎఫ్‌సీ ఆసియా కప్ టోర్నమెంట్‌లో భారత్ విజయావకాశాలకు 50-50 ఛాన్స్ ఉందని మాజీ కెప్టెన్ భాయ్‌చుంగ్ భూటియా అభిప్రాయపడ్డాడు. ఖండాంతర టోర్నమెంట్‌లో ‘్థయ్‌లాండ్, యూఏఈ, బెహ్రెయిన్‌తో జరిగే గ్రూప్ పోటీల్లో భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి నాయకత్వంలో మెరుగైన ప్రదర్శన అందించగలదనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. భారత్ రెండో రౌండ్‌లో చోటుదక్కించుకునేందుకు 50-50 అవకాశాలు ఉన్నాయని అన్నాడు. జట్టులోని యువకులంతా సమష్టి కృషితో గట్టి పోరాట పటిమను ప్రదర్శిస్తే విజయావకాశాలు దరిచేరవచ్చునని పేర్కొన్నాడు.

టీ-20 వరల్డ్ కప్ సూపర్ 12లో శ్రీలంక, బంగ్లాకు దక్కని చోటు

$
0
0

దుబాయ్, జనవరి 1: మాజీ చాంపియన్లు శ్రీలంక, బంగ్లాదేశ్ టీ-20 వరల్డ్ కప్ సూపర్ 12లో చోటు దక్కించుకోలేకపోయాయి. ఇటీవల కాలంలో జరిగిన వివిధ పో టీల్లో తక్కువ ర్యాంకింగ్‌తో నిలవడం వల్లే 2020లో జరిగే వరల్డ్ కప్‌లో స్థానం కోల్పోయాయి. అయితే, గ్రూప్ దశ లో పోటీ పడే ఆరు జట్లతో ఆ రెండు జట్లు పోటీపడతా యి. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం ఇక్కడ వెల్లడించింది. సూపర్ 12లో చోటుదక్కించుకున్న టీమ్‌లలో భారత్, పాకిస్తాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్గనిస్తాన్ అగ్రస్థానాల్లో కొనసాగుతున్నాయి. మాజీ చాంపియ న్, మూడుసార్లు ఫైనల్‌లో చోటుదక్కించుకున్న శ్రీలంక, బంగ్లాదేశ్ టోర్నమెంట్‌లో జరిగే గ్రూపు స్టేజీల్లో తొలి నాలుగు స్థానాల కోసం పోటీపడతాయి. వరల్డ్ కప్ టీ-20 పోటీలు 2020 అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15వరకు జ రుగుతాయి. ఐసీసీ నిబంధనల ప్రకారం టాప్‌లో 8 జట్లు సూపర్ 12లో పోటీపడేందుకు అర్హత సాధించాయి. మిగిలిన జట్లు గ్రూప్ స్టేజీల్లో క్వాలిఫయర్ కోసం తలపడతా యి. గ్రూప్ స్టేజీల్లో మెరుగైన ప్రదర్శన సాధించే నాలుగు జట్లు సూపర్ 12లో చోటు దక్కించుకుంటాయి. ఇదిలావుండగా, టీ-20 వరల్డ్ కప్ సూపర్ 12లో తమకు చోటు దక్కపోవడం పట్ల శ్రీలంక కెప్టెన్ మలింగ నిరాశ వ్యక్తం చే స్తూ గ్రూప్ స్టేజీల్లో జరిగే పోరులో రాణిస్తామన్నాడు. అదేవిధంగా బం గ్లా కెప్టెన్ షాకీబ్ అల్ హసన్ సైతం టీ-20 వరల్డ్ చాంపియన్స్ వెస్టిండీస్‌ను టీ-20 వరల్డ్ కప్‌లో ఇటీవల ఓడించామని, ఇపుడు కూడా గ్రూప్ దశలో మెరుగైన ప్రదర్శనతో తొలి నాలుగు స్థానాల్లో చోటు దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు.

మెల్‌బోర్న్ పిచ్‌కు యావరేజ్ రేటింగ్

$
0
0

మెల్‌బోర్న్, జనవరి 1: ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) మెల్ బోర్న్ పిచ్‌కు మంగళవారం యావ రేజ్ రేటింగ్ ఇచ్చింది. సిడ్నీ మార్నిం గ్ హెరాల్డ్ నివేదిక ప్రకారం పెర్త్ టె స్టు తర్వాత మెల్‌బోర్న్ పిచ్‌కు యా వరేజ్ రేటింగ్‌ను ఇవ్వడం విశేషం. మెల్‌బోర్న్‌లో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్‌ను భారత్ 137 పరుగుల తేడా తో భారీ విజయాన్ని సాధించిన విష యం తెలిసిందే. గతేడాది యాషెస్ తర్వాత ఇక్కడి పిచ్‌కు 3 డీమెరిట్ పాయంట్లు ఇచ్చింది. గతంతో పోలిస్తే మెల్‌బోర్న్ పిచ్ మెరుగ్గా మారిందని ఐసీసీ పేర్కొంది.

టిమ్ పైన్ పిల్లల్ని ఎత్తుకున్న పంత్!

$
0
0

మెల్‌బోర్న్, జనవరి 1: ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ భార్య బోనీ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ అ యంది. పైన్ పిల్లలతో ఒకరిని రిషభ్ పంత్ ఎత్తుకున్న ఫొటోను బోని పోస్టు చేసింది. దానికి ‘బెస్ట్ బేబీ సిట్టర్’ అని క్యాప్షన్ తగి లించింది. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మొ ర్రిసన్ అధికారిక నివా సంలో ఈ ఫొటోను తీశారు. భారత్- ఆస్ట్రేలియా జట్టు సభ్యు లు ఇక్కడే కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భం గా టిమ్-బోనీ దంపతుల పిల్లల్ని రిషభ్ ఎత్తుకొని ఆడించాడు. మూడో టెస్టు తర్వాత ఇది అందరినీ ఆశ్చర్య పరిచింది. మూడో టెస్టులో రిషభ్ బ్యాటింగ్ చేస్తు న్న సమయంలో పైన్ ‘నీకు పిల్లల్ని ఆడిం చడం వచ్చా? నా భార్యతో కలిసి సినిమా కు వెళ్తా.’ అంటూ టీజ్ చేయ గా, ‘పైన్ తాత్కాలిక కెప్టెన్. అతడికి మా ట్లాడటమే తెలుసు’ అంటూ రిషభ్ బదు లు తీర్చుకు న్న విషయం తెలిసిందే. అయతే స్లెడ్జింగ్ అనేది మైదానం వరకే పరిమితమంటూ పైన్ పిల్లల్ని ఎత్తుకొని రిషభ్ నిరూపిం చాడు.


రాశిఫలం 01/02/2019

$
0
0
తిథి: 
బహుళ ద్వాదశి రా.తె.3.16, కలియుగం - 5120 శాలివాహన శకం - 1940
నక్షత్రం: 
విశాఖ ఉ.11.51
వర్జ్యం: 
మ.3.56నుండి 5.34 వరకు
దుర్ముహూర్తం: 
ఉ.11.36 నుండి 12.24 వరకు
రాహు కాలం: 
మ.12.00 నుండి 1.30 వరకు
మేషం: 
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్ర్తిలతో తగాదాలేర్పడే అవకాశాలుంటాయి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి.
వృషభం: 
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభయోగముంటుంది.
మిథునం: 
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) విదేశయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. మనోవిచారాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా వుంటాయి. ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త వహించుట మంచిది. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు.
కర్కాటకం: 
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది. అనారోగ్య బాధలు స్వల్పంగా వున్నాయి. వేళ ప్రకారం భుజించుటకు ప్రాధాన్యమిస్తారు. చంచలంవల్ల కొన్ని ఇబ్బందులెదురవుతాయి. మనోనిగ్రహానికి ప్రయత్నించాలి.
సింహం: 
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్ర్తిల మూలకంగా లాభం వుంటుంది. మంచి ఆలోచనలను కలిగివుంటారు. బంధు, మిత్రులు గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తారు.
కన్య: 
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోండి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆర్థిక ఇబ్బందులను అధిగమించుటకు ఋణప్రయత్నాలు చేస్తారు.
తుల: 
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) దర్మకార్యాలు చేయుటయందు ఆసక్తి పెరుగుతుంది. దైవదర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యముంటుంది. మానసికానందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభముంటుంది. శుభవార్తలు వింటారు.
వృశ్చికం: 
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) నూతన వ్యక్తులను నమ్మి మోసపోరాదు. సంఘంలో అప్రతిష్ఠ రాకుండా జాగ్రత్తపడుట మంచిది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలెదురవడంతో ఇబ్బంది పడతారు. దైవదర్శనానికి ప్రయత్నిస్తారు. ఋణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. సోదర వైరం కలిగే అవకాశముంటుంది.
ధనుస్సు: 
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) మనస్సు చంచలంగా వుంటుంది. బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్తపడుట మంచిది. అకాల భోజనంవల్ల అనారోగ్య బాధలనుభవిస్తారు. ఆకస్మిక కలహాలకు అవకాశముంటుంది. చెడు సహవాసానికి దూరంగానుండుటకు ప్రయత్నించాలి.
మకరం: 
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) ప్రయత్నం మేరకు స్వల్ప లాభముంటుంది. వృథా ప్రయాణాలెక్కువ చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలుంటాయి. ఋణప్రయత్నాలు చేయవలసి వస్తుంది.
కుంభం: 
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) వ్యవసాయ రంగంలోని వారికి లాభదాయకంగా వుంటుంది. తొందరపాటువల్ల ప్రయత్న కార్యాలు చెడిపోతాయి. చెడును కోరేవారికి దూరంగా నుండుట మంచిది. ఆకస్మిక భయము, ఆందోళన ఆవహిస్తాయి. శారీరకంగా బలహీనమేర్పడుతుంది.
మీనం: 
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందుల అధిగమిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలుగకుండా జాగ్రత్త అవసరం. నూతన కార్యాలు ప్రారంభించకుండా వుంటే మంచిది.
Date: 
Wednesday, January 2, 2019
author: 
గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి

గణతంత్రదినోత్సవానికి ఆటంకం వద్దు

$
0
0

హైదరాబాద్ , జనవరి 1: పంచాయతీ ఎన్నికల రెండో విడత ఎన్నికలను ఈ నెల 25న నిర్వహించనున్నట్టు ఎన్నికల ప్రధాన అధికారి ప్రకటించారని, ఆ రోజున ఎన్నికల కారణంగా గణతంత్ర దినోత్సవ నిర్వహణకు ఆటంకం కలిగే అవకాశం ఉందని, తేదీలను మార్చాలని టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఇ రఘునందన్, ప్రధానకార్యదర్శి కే రమణ కోరారు. మొత్తం ఎన్నికల ప్రక్రియలో పాఠశాలలేదే కీలక భాగస్వామ్యం ఉంటుందని, కనుక రెండో విడత ఎన్నికలను జనవరి 24 లేదా జనవరి 28న నిర్వహిస్తే స్కూళ్లలో గణతంత్ర దినోత్సవ నిర్వహణకు ఇబ్బంది ఉండబోదని వారు అభిప్రాయపడ్డారు. ఎన్నికల తేదీలను ప్రకటించే ముందు కనీస అవగాహన లేకుండా ప్రకటించడం దారుణమని అభిప్రాయపడ్డారు.

స్కూళ్లలో కళల ప్రోత్సాహానికి జాతీయ స్థాయిలో కళా ఉత్సవం

$
0
0

హైదరాబాద్, జనవరి 1: కళల పట్ల విద్యార్థుల్లో ఆసక్తిని పెంచడంతో పాటు వారిని ప్రోత్సహించేందుకు పాఠశాలల్లో కళా ఉత్సవాలను నిర్వహించాలని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ నిర్ణయించింది.
జాతీయ స్థాయిలో ఇందుకు కార్యాచరణ రూపొందించింది. 2015లో తొలి సారి ప్రయోగాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో దానిని 2016, 2017లోనూ నిర్వహించారు. 2018లో దీనిని డిసెంబర్ 12 నుండి 15 వరకూ నిర్వహించగా, అందులో 34 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 281 మంది విద్యార్ధులు పాల్గొన్నారు. ప్రధానంగా నృత్యం, సంగీతం, రంగస్థలం, దృశ్యరూపాలలో ప్రావీణ్యం ప్రదర్ళించే వారిని పాఠశాలలు, జిల్లాలు రాష్ట్రాల వారీ ఎంపిక చేసి వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి జాతీయ స్థాయిలో ప్రత్యేక క్యాంప్ నిర్వహిస్తున్నారు. రేఖా చిత్రాలు, చిత్రలేఖనం, శిల్పం, హస్తకళలుతో పాటు గాత్రం, వాయిద్య సంగీతం, నృత్యంలో కూడా వేర్వేరుగా పరీక్షించి ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తున్న వారిని ఎంపిక చేసి వారికి అవసరమైన తర్ఫీదును అందిస్తున్నారు. దీనివల్ల విద్యార్థుల్లో కళానైపుణ్యాలు పెరగడాన్ని గమనించారు. పోటీల కోసం విద్యార్థులు సిద్ధమవుతున్నపుడు వారు తమ కళలకు మరింత నైపుణ్యాన్ని మేళవించుకునే వీలుగుతోందని అధికారులు చెబుతున్నారు.

అభివృద్ధిలో ముందుకు సాగాలి

$
0
0

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ప్రజలు శాంతి, అభివృద్ధిలో ముందుకు సాగాలని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ పిలుపు ఇచ్చారు. మంగళవారం కొత్త సంవత్సరం సందర్భంగా రాజ్‌భవన్‌లో జంటనగాలకు చెందిన వివిధ రంగాలకు చెందిన ముఖ్యులు గవర్నర్ కలసి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్‌ను కలసిన వారిలో ఐఎఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు విశ్రాంత అధికారులు, రాజకీయ నేతలు ఉన్నారు. తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ గవర్నర్‌ను కలిసి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ హరితహర కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న మామిడి హరికృష్ణ, ఖమ్మం జల్లా సీనియర్ కాంగ్రెస్ నేత సుధాకర్‌రెడ్డి గవర్నర్‌ను కలిశారు.
చిత్రం..గవర్నర్‌కు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్న హోంమంత్రి మహమూద్ అలీ

ఆన్‌లైన్‌లో నేర్చుకునేందుకు వందలాది కోర్సులు

$
0
0

హైదరాబాద్: క్లాసు రూమ్ చదువులు, పరీక్షలు పాసవ్వగానే చేతికి వచ్చే సర్ట్ఫికేట్లు, దీనికి అదనపు హంగులను అద్దుతూ కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ స్వయం ప్లాట్‌ఫాంను అందుబాటులోకి తెచ్చింది.
ఈ డిజిటల్ ప్లాట్‌ఫాంపై విద్యార్థులు తమకు నచ్చిన బోధనాభ్యసన అంశాలపై తర్ఫీదు పొందవచ్చు, అవసరమైన కౌశలాలను పొందవచ్చు, చివరిగా జరిగే పరీక్ష ఉత్తీర్ణులైతే అందుకు ఒక గుర్తింపు పొందిన సర్ట్ఫికేట్‌ను కూడా జారీ చేస్తుంది. ఇప్పటికే స్వయం ప్లాట్‌ఫాంపై 1600 కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. 92 విశ్వవిద్యాలయాలు ఈ కోర్సులను గుర్తింపునిచ్చాయి. ఇప్పటికే కేంద్రీయ విశ్వవిద్యాలయాలు అన్నీ స్వయం ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేసుకున్నాయి. స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్‌నే క్లుప్తంగా స్వయం అని వ్యవహరిస్తున్నారు. ఐసీటీ వినియోగించుకుని మూక్స్‌ను అందిస్తున్న స్వయం ప్లాట్ ఫాంలో ఒక్కో యూనివర్శిటీ ఒక్కో కోర్సును రూపొందించాయి. చాలా విశ్వవిద్యాలయాలు 20 నుండి సగటున వంద కోర్సులకు కంటెంట్‌ను సమకూర్చాయి. వీడియో పాఠ్యాంశాలు, ఆడియో క్లిప్‌లు, గ్రాఫిక్స్‌ను వినియోగించుకుంటూ పాఠ్యాంశాలను డిజిటల్ రూపంలో రూపొందించాయి. ఇప్పటికే ఈ కోర్సుల్లో చేరి 60వేల మంది చదువు పూర్తి చేశారు. ఇందులో నేర్చుకున్నవారికి ఆయా కోర్సులకు గానూ 20 శాతం వెయిటేజీ ఇచ్చేందుకు కూడా మానవ వనరుల మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు యూజీసీ యూనివర్శిటీలకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ కోర్సులు అన్నీ ఉచితంగా లభ్యమవడం విశేషం. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన వెయ్యి మంది అధ్యాపకులతో వీటిని రూపొందించారు. కోర్సులను పూర్తి ప్రమాణాలతో రూపొందించేందుకు పర్యవేక్షణ సంస్థలను నియమించారు. యూజీసీ , సీఈసీ, ఎన్‌పీటీఈఎల్ సహా ఏడు ఐఐటీలు, ఎన్‌సీఈఆర్‌టీ, ఎన్‌ఐఓఎస్, ఇగ్నో, ఐఐఎం, ఎన్‌ఐటీటీటీఆర్, ఎఐసీటీఈ తదితర సంస్థలు కంటెంట్‌ను పర్యవేక్షిస్తున్నాయి. అలాగే పాఠ్యాంశాలను రూపొందించదల్చిన అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ ఏర్పాట్లు కూడా చేశారు. ఏఆర్‌పీఐటీ పేరిట వారికి ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. ఇంత వరకూ 25,57,118 మంది రిజిస్టర్ చేసుకోగా, ప్రస్తుత విద్యాసంవత్సరంలో 4,36,431 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

Viewing all 69482 articles
Browse latest View live