Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

టీఆర్‌ఎస్ పోరాట ఫలితమే ప్రత్యేక హైకోర్టు

$
0
0

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సాధన స్ఫూర్తితోనే హైకోర్టును కూ డా సాధించుకున్నామని టీఆర్‌ఎస్ లోక్‌సభ సభ్యుడు వినోద్‌కుమార్ వెల్లడించారు. మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఉమ్మ డి హైకోర్టు విభజనకోసం పార్లమెంట్ లోపల, వెలుపల తమ పార్టీ చేసిన పోరాటానికి ఫలితం దక్కిందన్నారు. తెలంగాణలో హైకోర్టు ఏర్పాటు వల్ల రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ మరింత పటిష్టపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో హైకోర్టు ఏర్పాటు మూలంగా జిల్లాల్లోనూ కోర్టులు ఏర్పాటుకానున్నాయని చెప్పారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా మంగళవారం ప్రమాణ స్వీకారం చేసిన న్యాయమూర్తులకు వినోద్‌కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు కావడంతో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావుతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా సంతోషపడుతున్నారని ఆయన అన్నారు.
రైల్వే బోర్డు చైర్మన్‌తో భేటీ
తెలంగాణలో పెండింగ్ అంశాలను సత్వరమే పరిష్కరించాలని రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ యాదవ్‌కు టీఆర్‌ఎస్ లోక్‌సభ సభ్యుడు వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. రైల్వే బోర్డు చైర్మన్‌గా మంగళవారం బాధ్యతలు స్వీకరించిన వినోద్ యాదవ్‌ను వినోద్ కుమార్ రైల్వే భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వినోద్ కుమార్ మాట్లాడుతూ దక్షిణ మధ్య రైల్వే జోన్ జీఎంగా బాధ్యతలు నిర్వహించిన వినోద్ యాదవ్‌కు పెండింగ్ అంశాలపై అవగాహన ఉన్నదని తెలిపారు. ప్రస్తుతం సెంట్రల్ రైల్వే బోర్టు చైర్మన్‌గా నియమితులయ్యారని, తెలంగాణలో పెండింగ్ అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు వినోద్ తెలిపారు.
వర్గీకరణకు చట్టబద్ధత కల్పించండి
ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కేంద్ర సమాజిక న్యాయ శాఖ మంత్రి తావర్‌చంద్ గెహ్లాట్‌కు తెలంగాణ దళిత సంఘాలు విజ్ఞప్తి చేశాయి. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు కె.రాములు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకట రమణీ, తెలంగాణ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటుక రాజు మాదిగ, టీ.ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నిర్వాహక అధ్యక్షుడు గడ్డం యాదయ్య మాదిగ తదితరులు మంగళవారం తావర్ చంద్ గెహ్లట్‌ను కలిశారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ ఒక వినతి పత్రాన్ని సమర్పించారు.

చిత్రం.. ఎంపీ వినోద్


సంక్షేమంలో తెలంగాణ ఆదర్శం

$
0
0

సూర్యాపేట, జనవరి 1: అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి అమలుచేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ దుగ్యాల అమయ్‌కుమార్‌తో కలిసి నియోజకవర్గపరిధిలోని 101మందికి కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల కింద మంజూరైన కోటి రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ఈ ఏడాది కొత్త సంవత్సరంలో ప్రభుత్వం ద్వారా సంక్షేమ ఫలాలను అందుకోవడం శుభసూచికమన్నారు. పేదరికం కారణంగా ఆడపిల్లలంటేనే భయపడి చెత్తకుప్పల పాలు చేసే దీనస్థితిని గుర్తించి పేద వర్గాల వారు ఆడపిల్లల పెళ్లిలు చేయడం భారం కాకుడదనే భావనతో ఎన్నికల్లో ఎలాంటి హమీ ఇవ్వకున్నప్పటికీ సీఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. తొలుత ఈ పథకం కింద రూ.51వేలు అందించగా ఆతర్వాత రూ.75వేలు అందించి ప్రస్తుతం లక్ష రూపాయల చొప్పున అందించడం జరిగిందన్నారు. ప్రారంభంలో కొన్ని వర్గాలకే పరిమితం చేయగా ఆతర్వాత పేదరికమే అర్హతగా అన్ని వర్గాల వారికి మంజూరీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తుండటం వల్ల నేడు పేదలు ఆడపిల్లల పెళ్లిలంటే నెలకొన్న భయాన్ని తొలగించి భరోసానిచ్చామన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలను అమలుచేస్తున్నామని, ఎలాంటి రాజకీయ వివక్షత చూపకుండా అర్హతనే ప్రతిపాదికగా తీసుకొని పథకాలను మంజూరు చేస్తుండటం గొప్ప విషయమన్నారు. మహిళా సాధారికత కోసం ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల ద్వారా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ తెలంగాణ ప్రజలంతా ఆత్మగౌరవంతో గొప్పగా బతకాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ డి.సంజీవరెడ్డి, జిల్లా గ్రంథాలయసంస్ధ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..సూర్యాపేటలో షాదీముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేస్తున్న మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి

ప్రాజెక్టులు పూర్తయితేనే బంగారు తెలంగాణ

$
0
0

కొల్లాపూర్, జనవరి 1: రాష్ట్రంలోని నిర్మాణంలో ఉన్న పలు ప్రాజెక్టులు పూర్తయితేనే బంగారు తెలంగాణ అవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడుతున్నారని విశ్రాంత ఇంజనీర్లు తెలిపారు. మంగళవారం మండలంలోని ఎల్లూరు గ్రామపంచాయతీ పరిధిలో మిషన్ భగీరథ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. ఎల్లూరు మొదటి రిజర్వాయర్ దగ్గర సొరంగ పనులను పరిశీలించారు. నార్లాపూర్‌లోని 8.5 టీఎంసీలు నిల్వ ఉండే రిజర్వాయర్ పనులను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా విశ్రాంత ఇంజనీర్ల ఆసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రవౌళి, శ్యాంప్రసాద్‌రెడ్డి, జగదీశ్వర్, ముత్యంరెడ్డి, చంద్రవౌళి, వెంకటేశ్ తదితరులు మాట్లాడుతూ రిజర్వాయర్ పనులలో 44 ఎకరాల భూమి అవసరంకాగా ప్రస్తుతం 10 ఎకరాలు కొని మట్టిని తరలిస్తున్నామని, అదేవిధంగా మరో 34 ఎకరాలలో భూమిని తీసుకొని మట్టిని తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు సంబంధిత ఇంజనీయర్లు, ఏజెన్సీ ప్రతినిధులు తెలిపినట్లు తెలిపారు. బంగారు తెలంగాణ కావాలంటే ముందుగా ప్రాజక్టులు పూర్తి కావాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయా ప్రాజెక్టుల పనుల పురోగతిని స్వయంగా పరిశీలించి తగిన నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతోనే తాము కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి తదితర ప్రాజెక్టులను పర్యటించి పరిశీలిస్తామన్నారు. తాము ఇచ్చే నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 4 తరువాత ప్రాజెక్టులను సందర్శించి స్వయంగా పరిశీలించి నిధులను కేటాయించి, పనులు సత్వర పూర్తికి చర్యలు తీసుకుంటారని తెలిపారు.

నూతన సంవత్సర వేడుకల్లో విషాదం

$
0
0

బాన్సువాడ/వనపర్తి, జనవరి 1: నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నప్పటికీ అపశ్రుతులు దొర్లక తప్పలేదు. కామారెడ్డి, వనపర్తి జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం చెందారు.
బాధిత కుటుంబాల్లో తీరని విషాదం మిగిల్చిన ఘటనలకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయ. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో వేడుకలు ముగిసిన అనంతరం తమ ఇళ్లకు చేరుకునే క్రమంలో రోడ్డు ప్రమాదం బారినపడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ (20), దిగంబర్ (18) అనే యువకులు నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు సోమవారం సాయంత్రం తన స్నేహితుల వద్దకు బైక్‌పై వెళ్లారు. అర్ధరాత్రి దాటిన అనంతరం వేడుకలు ముగించుకుని వారు కోనాపూర్‌కు తిరిగి వస్తుండగా, ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు కిందకు జారిపోయింది. దీంతో శ్రీకాంత్, దిగంబర్‌లు కిందపడిపోయి వారి తల, ఇతర శరీర భాగాలకు తీవ్ర గాయాలవడంతో ఇరువురూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటనలో వీరితో పాటు బైక్‌పై ఉన్న మరో యువకుడికి కూడా తీవ్ర గాయాలు కాగా, బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేసి నిజామాబాద్ జనరల్ ఆసుపత్రికి తరలించినట్లు బాన్సువాడ సీఐ మహేష్‌గౌడ్ తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే, వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయానికి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున యువకుల మద్య ఘర్షణ జరిగి ఒకరు మృతిచెందారు. ఎస్‌ఐ వివరాల ప్రకారం.. నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపడానికి ఉత్తరప్రదేశ్‌కు చెందిన పుష్ఫేందర్ (27) అతని మిత్రుల వద్దకు సంతబజార్‌కు చెరుకున్నారు. సంబరాలు జరుపుకున్న అనంతరం సుమారు మంగళవారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపే సందర్బంలో మిత్రుల మద్య ఘర్షణ జరిగింది. దాంతో యువకులు పుష్పేందర్‌పై దాడి చేయడంతో కింద పడి తలకు గాయమై తీవ్ర రక్త స్రావం జరిగింది. దాంతో ఆ యువకులు అక్కడి నుండి పరారు కాగా పోలీసులు పెట్రోల్ వాహనంలో అక్కడికి చెరుకొని విషయాన్ని గమనించి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందాడు.
చిత్రం..వనపర్తిలో జరిగిన ఘర్షణలో మృతి చెందిన పుష్పేందర్

ఊటజలానికి అడ్డుకట్ట

$
0
0

యాదగిరిగుట్ట, జనవరి 1: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం విస్తరణ పనుల తవ్వకాల్లో ఉబికి వచ్చిన ఊట జలానికి ఆలయ అధికారులు అడ్డుకట్ట వేయించారు. కొండపై ఊట జలం లేదన్న తమవాదనకు భిన్నంగా నడికొండపై ఆలయ పనుల తవ్వకాల్లో రాతిచెరిక కింద అనుహ్యంగా సోమవారం ఉబికి వచ్చిన ఊట జలంతో తాము భక్తులకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఎదురవుతుందని ఆలయ అధికారులు ఆందోళన చెందినట్లుగా కనబడుతోంది. ఊట జలం వచ్చిన రాతి చెరిక నీటిని అధికారులు ఆదరబాదరాగా మోటార్లు పెట్టి నీటిని తోడించి సోమవారం రాత్రికి రాత్రే రాతి చెరికకు సిమెంట్, కాంక్రీట్ బెడ్‌తో ఫ్లోరింగ్ చేయించి మూసివేయించారు. అధికారుల తీరు కొండపైన ఊట జలాల లభ్యత విషయమై తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే రీతిలో ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

చిత్రాలు.. యాదాద్రిపై ఊటజలాలు ఉబికివచ్చిన రాతి చెరియ * సిమెంట్, కాంక్రీట్‌తో మూసివేసిన దృశ్యం

బీసీ రిజర్వేషన్లపై న్యాయ పోరాటం

$
0
0

మేళ్లచెర్వు, జనవరి 1: రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ల పెంపుకోసం న్యాయపోరాటం చేస్తామని టీపీసీసీ అధ్యక్షులు, హుజూర్‌నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వులో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని కేక్ కట్‌చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో ప్రజలు సుఖశాంతులతో ఉండాలని భగవంతున్ని వేడుకుంటున్నట్లు తెలిపారు. గత కాంగ్రెస్ ప్రభుత్వహాయంలో బీసీలకు 34శాతం రిజర్వేన్లు కల్పించగా ప్రస్తుత టీఆర్‌ఎస్ ప్రభుత్వం 22 శాతం మాత్రమే బీసీలలకు కేటాయించడం చాలా విచారకరమని అన్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గాన్ని వేలకోట్ల రూపాయలతో అభివృద్ది చేశానని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఆయన చెప్పారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలల్లో కాంగ్రెస్‌పార్టీ విజయం సాధిస్తుందని, రాహుల్‌గాంధీ ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం ఖాయం అని అన్నారు. సింగిల్‌విండో, గ్రామపంచాయితీ ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్దులను ఎంపిక చేసేందుకు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. పులిచింతల ప్రాజెక్టు ముంపు గ్రామాలకు కేటాయించిన పునరావాస కేంద్రాలలో పూర్తిస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానని అన్నారు.
ఈకార్యక్రమంలో నాయకులు శివారెడ్డి, కర్నె ప్రతాపరెడ్డి, గోవిందరెడ్డి, భద్రారెడ్డి, రామచంద్రారావు, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీల ఆందోళన

$
0
0

న్యూఢిల్లీ: పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం దగ్గర టీడీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను అశాస్త్రీయంగా విభజించారని ఎంపీ అశోక్‌గజపతిరాజు మండిపడ్డారు.

పోలీసుల అదుపులో ఇద్దరు దొంగలు

$
0
0

హైదరాబాద్: నగరంలోని సంచలనం సృష్టించిన వరుస చైన్‌ స్నాచింగ్‌ల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఢిల్లీలో ఇద్దరు దొంగలను సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారం రోజుల క్రితం ఎల్బీనగర్‌ పరిధిలో తొమ్మిది చోట్ల వరుస చోరీలు జరిగిన విషయం తెలిసిందే.


త్వరలో రైతులతో ర్యాలీ: అశోక్ గహ్లోత్

$
0
0

జయపుర (రాజస్థాన్): ఎన్డీఏ ప్రభుత్వ చర్యలకు నిరసనగా త్వరలో రైతులతో ర్యాలీ నిర్వహిస్తామని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచిన వెంటనే రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో రైతుల రుణాలను మాఫీ చేశామని, ఈ పక్రియ వేగవంతంగా జరుగుతుందని అన్నారు. రాబోయే ఎన్నికల తరువాత నరేంద్ర మోదీ ప్రధానిగా ఉండరని, దేశాన్ని మోదీ, అమిత్‌షా అనే ఇద్దరు మాత్రమే పాలిస్తున్నారని, ఈ విషయాన్ని ఆర్‌ఎస్‌ఎస్ సైతం గుర్తించిందని అన్నారు.

అలహాబాద్ పేరు మార్పునకు కేంద్రం ఆమోదం

$
0
0

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ తీర్థయాత్ర స్థలం అలహాబాద్ పేరును ప్రయాగ్ రాజ్‌గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేంద్రం ఆమోదం తెలిపింది. కుంభమేళా ప్రారంభమవ్వటానికి 15 రోజుల ముందుగానే ఈ పేరు మార్పు జరగటం విశేషం.

శ‌బ‌రిమ‌ల శుద్ధి.. మ‌ళ్లీ తెరుచుకున్న ఆల‌యం

$
0
0

కేరళ: శ‌బ‌రిమ‌ల అయ్యప్పస్వామి ఆల‌యం మ‌ళ్లీ తెరుచుకున్నది. 50 ఏళ్ల లోపు వ‌య‌సు ఉన్న ఇద్దరు మ‌హిళ‌లు ఉద‌యం తెల్లవారుజామున ద‌ర్శనం చేసుకున్నారు. ఆ త‌ర్వాత ఆల‌యాన్ని శుద్ధి కోసం గంట సేపు మూసివేశారు. గంట త‌ర్వాత ఆల‌యాన్ని తెరిచారు. దీంతో మ‌ళ్లీ భ‌క్తులు అయ్యప్పను ద‌ర్శించుంటున్నారు. ఉద‌యం 10.30 గంట‌ల‌కు పూజారులు ఆల‌యాన్ని మూసివేశారు.

రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి

$
0
0

ఒంగోలు: ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఆగివున్న లారీని కారు ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు పెరుమాళ్ల శివ, గ్రంధిశిల సుబ్బారావుగా గుర్తించారు. నర్సరావుపేట నుంచి మార్కాపురం వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

అయ్యప్ప భక్తులు దిగ్భ్రాంతి

$
0
0

కేరళ: శబరిమల ఆలయంలోకి 50 సంవత్సరాలలోపు మహిళలు ఇరువురు నిన్న తెల్లవారు జామున ప్రవేశించి స్వామిని దర్శించుకున్నారు. దీంతో ఆలయాన్ని పూజరులు మూసివేసి ఆలయ సంప్రోక్షణ చేపట్టారు. కోజికోడె జిల్లాకు చెందిన బిందు, కనకదుర్గ అనే మహిళలు తాము స్వామిని దర్శించుకున్నామని వీడియో బహిర్గతం చేయటంతో సాంప్రదాయవాదులు, భక్తులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మరోవైపు మహిళలు స్వామిని దర్శించుకున్న విషయం నిజమేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ధృవీకరించారు.

రఫేల్‌పై ప్రధానీయే జవాబుదారి:కాంగ్రెస్

$
0
0

న్యూఢిల్లీ: రఫేల్ ఒప్పంద పత్రాలు గోవా ముఖ్యమంత్రి పారికర్ వద్ద ఉన్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నేత రణదీప్ సూర్జేవాలా మీడియాతో మాట్లాడుతూ ఈ వాస్తవాన్ని వెల్లడించే గోవా మంత్రి చేసిన వ్యాఖ్యల ఆడియో క్లిప్పింగ్‌ను ఆయన విడుదల చేశారు. పారికర్ వద్ద ఉన్న రఫేల్ పత్రాలు ఎప్పుడైతే బయటపడతాయో అపుడే నిజాలు బయటకు వస్తాయని, ఈ పత్రాలను పారికర్ ప్రజల ముందుకు తీసుకురావాలని అన్నారు.

కాంగ్రెస్ ఆరోపణలను ఖండించిన విశ్వజిత్

$
0
0

న్యూఢిల్లీ: రఫేల్ ఒప్పంద పత్రాలు పారికర్ వద్ద ఉన్నట్లు తాను మాట్లాడిన మాటల ఆడియో క్లిప్పింగ్‌లో నిజం కాదని గోవా మంత్రి విశ్వజిత్ ప్రతాప్ సింగ్ రాణే ఖండించారు. క్యాబినెట్‌కి, ముఖ్యమంత్రికి విభేదాలు సృష్టించేందుకు ఆడియో క్లిప్పింగ్‌ను ఎడిట్ చేసి కాంగ్రెస్ ఇలాంటి నీచమైన రాజకీయాలకు పాల్పడుతుందని అన్నారు.


సభ్యుల తీరుపై ఛైర్మన్ అసంతృప్తి

$
0
0

న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి సభ్యులు సమావేశాలు జరగనీయకుండా ప్రవర్తిస్తున్న తీరుపై ఛైర్మన్ వెంకయ్యనాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ ప్రజలు మనల్ని చూసి నవ్వుతున్నారని, సమావేశాలు ఇంకా ఐదు రోజులు మాత్రమే జరుగుతాయని, ముమ్మారు తలాక్, రఫేల్ ఒప్పందాలపై చర్చ జరగాల్సి ఉందని, దయచేసి సహకరించాలని కోరారు. బుధవారంనాడు సభ పలుసార్లు వాయిదా పడింది.

అందుకే కేంద్రంపై పోరాటం:చంద్రబాబు

$
0
0

కుప్పం: కేంద్రం నమ్మించి మోసం చేసిందని, అందుకే తాము కేంద్రంపై పోరాటం చేస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన కుప్పంలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో మాట్లాడారు. తెలంగాణలో మహాకూటమి ఓడిపోవటంతో తాను ఆక్రోశంలో ఉన్నానని మోదీ అనటంపై ఆయన మండిపడ్డారు. దేశానికి మోదీ ఏం చేశారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఎలాంటి సంస్థలను ఇవ్వలేదని అన్నారు.

కాళేశ్వరం పనులను పరిశీలించిన కేసీఆర్

$
0
0

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోరోజు కూడా పరిశీలించారు. కరీంనగర్‌లో బసచేసిన ఆయన రెండోరోజు రోడ్డు మార్గంగుండా కనె్నపల్లి చేరుకుని గ్రావిటి కాలువ పనులను పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని సూచించారు. అలాగే అన్నారం బ్యారేజీ పనులను కూడా ఆయన పరిశీలించారు.

రఫేల్ ఒప్పందంపై లోకసభలో చర్చ

$
0
0

న్యూఢిల్లీ: రఫేల్ ఒప్పందంపై లోకసభలో ఈరోజు చర్చ జరిగింది. సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ దేశ రక్షణలో ఎంతో కీలకమైన రఫేల్ విమానాల తయారీని అనిల్ అంబానీకి ఎందుకు కట్టబెట్టారని రాహుల్ ప్రశ్నించారు. దీనిపై స్పీకర్ సుమిత్రా మహాజన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో లేని వ్యక్తులను ప్రస్తావించరాదని సూచించారు. రాహుల్ గాంధీ ప్రసంగంపై బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో సభలో కొంతసేపు గందరగోళం నెలకొన్నది. అలాగే గోవామంత్రి విశ్వజిత్ మాట్లాడిన ఆడియో టేపును సైతం తాను బయటపెట్టడం లేదని, ఎందుకంటే దీన్నిచూసి మీరు భయపడుతున్నారని రాహుల్ అన్నారు.

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

$
0
0

యడ్లపాడు: గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం వంకాయపాడు వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. చిత్తూరు జిల్లా ములకలచెరువు గ్రామానికి చెందిన ఏడుగురు తూర్పుగోదావరి జిల్లా యర్రవరంలో ఓ శుభకార్యానికి హాజరై తిరిగి వస్తుండగా ముందు వెళుతున్న కంటెనైర్‌ను కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది.

Viewing all 69482 articles
Browse latest View live