Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

యాత్రికులం అంతే..!

$
0
0

సంవత్సరం పేజీలు తిప్పుకుంటున్న తీరులో మన ప్రయాణాలు అని
అనుకుంటుంటాము..
పేజీలు తిప్పడంలో సాయపడుతూ
మనతోనే అందరూ ఉన్నారని భావిస్తుంటాము..

అదేమిటోగానీ
ఎప్పటికప్పుడు ఏది చివరి రోజో తెలియక
ఎవరితోనూ ఒక్కమాటైనా చెప్పకుండా
ఒక్కొక్కరిగా సంవత్సరం మాయమవుతున్నట్లు
మనమూ మాయమైపోతుంటాం..!
రెండూ వేర్వేరే అయినా
ఇద్దరినీ అపహరించడంలో
సమయానిదే ప్రముఖ పాత్ర!

మాకు బతకడమే తెలుసు అనుకుంటూ
సమయపు మెలకువలో మనం నిత్యం ఓడిపోతుంటాం!
ఎప్పుడు ఏ జోలపాట వినిపిస్తుందో
ఎవరిని ఏ నిద్రలోకి తోసేస్తుందో తెలియక
సమయాన్ని చేతికి కట్టుకుని మరీ
మాటిమాటికీ మరొకరు చూసేలా
చూసేస్తుంటాం...

ఏం చేస్తాం..?
మనం యాత్రికులం అంతే
నీవిచ్చిన వేళల్లోనే కదా ఉభయ సంధ్యల్ని చూసేది..
నీవెప్పుడు అలారం మోగిస్తావో
నీవెప్పుడు బ్యాటరీ లేదని కాలాన్ని ఆపేస్తావో..
దేనికీ ఆకారం, వికారం కారణం కాదు
విలయతాండవం చేస్తున్న నీవు తప్ప!


రంగవల్లి

$
0
0

శ్వేత సంబరాజు అమీర్‌పేట, హైదరాబాద్

17 చుక్కలు, 5 వరుసలు, 5 వరకు..
====================================================
ముగ్గులకు ఆహ్వానం

నింగిలోని హరివిల్లులను నేలపైన పేర్చి.. కనులకింపైన రంగుల్ని అందంగా అద్దితే అది రంగుల మాలికవుతుంది. ముంగిట్లో రంగవల్లిక అవుతుంది. ధనుర్మాసం సందర్భంగా తెలుగు ముంగిళ్లలో రంగవల్లులను తీర్చిదిద్దడం ఆనవాయితీ.. ఆ సందర్భంగా ముగ్గులకు ఆహ్వానం పలుకుతోంది మాతృభూమి. ఆసక్తి కలవారు కింది చిరునామాకు ముగ్గులను పంపగలరు.
సూచనలు
* ముగ్గులను పంపేవారు ఎ4 సైజు తెల్లకాగితంపై వేయాలి.
* ముందుగా నల్లని ఇంక్‌తో ఔట్ లైన్ గీసిన తరువాత అందులో రంగుల్ని నింపాలి.
* ఎన్ని చుక్కలను పెట్టి ముగ్గులు వేశారో.. అంటే సరిచుక్కలా, బేసి చుక్కలా, సందు చుక్కలా.. అనే విషయం స్పష్టంగా రాయాలి.
* ముగ్గుతో పాటు, మీ పాస్‌పోర్ట్ సైజు కలర్ ఫొటోని, చిరునామాని జతచేయాలి.
* డౌన్‌లోడ్ చేసిన ముగ్గులు కాక, స్వయంగా చేతితో వేసిన ముగ్గులనే పంపాలి. అదీ చుక్కల ముగ్గులకే ఆహ్వానం.

ముగ్గులు పంపాల్సిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్- 500 003.

నీడ‘పట్టు’న ఆరేస్తే మేలు..

$
0
0

శుభకార్యాల వేళ పట్టు బట్టలు ధరించడం మన సంప్రదాయం. అయితే.. సాధారణంగా పట్టుబట్టలపై మరకలు పడితే ఓ పట్టాన వదిలిపోవు.. నూలు దుస్తుల్లా ఎడాపెడా ఉతకనూ లేము.. అందుకే ఎంతో డబ్బుపోసి కొన్న పట్టుబట్టలు ఉతికేటప్పుడు, ఆరేసేటప్పుడు, లోపల దాచే విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే అవి పదికాలాల పాటు మన్నికగా ఉంటాయి.

జాగ్రత్తలు

* పట్టుచీరలను ఎప్పుడూ చెరువు, నది నీటితోనే ఉతకాలి.
* బోరు నీటితో ఉతికేవారు ఆ నీటిలో చిటికెడు బొరాక్స్ కలపాలి.
* వీటిని ఉతికేందుకు నాణ్యమైన, తేలికపాటి సబ్బును ద్రవ లేదా పొడి రూపంలోదే వాడాలి.
* బోరునీరైతే తేలికపాటి డిటర్జెంట్ వాడాలి.
* పట్టుబట్టలు ఉతికిన తరువాత చేతితో సున్నితంగా పిండి నీడపట్టున ఆరేయాలి.

మరకలు పడితే..

* పట్టుబట్టలపై కాఫీ లేదా టీ మరకలు పడితే కార్బన్ టెట్రాక్లోరైడ్‌ను పూస్తే మరకలు పోతాయి. అప్పటికీ పోకపోతే వేడినీటిలో కొద్దిగా హైడ్రొజన్ పెరాక్సైడ్ వేసి ఆ నీటితో ఉతకాలి.
* పట్టుబట్టలపై చాక్‌లెట్ మరకలు పడితే వేడినీటిలో జాడించి ఉతికితే పోతాయి. అదే.. పెరుగు, వెన్న వంటి మరకలు పడితే ఆ భాగంలో ఒక చుక్క కార్బన్ టెట్రా క్లోరైడ్‌ని ఉపయోగించాలి.
* పట్టుబట్టలపై ఇంక్ లేదా లిప్‌స్టిక్ మరకలు పడితే ఆ భాగంలో పేపర్ టవల్‌ను ఉంచి వెనుకనుంచి డ్రైక్లీనింగ్ ద్రావణం లేదా ఆల్కహాల్ పూయాలి. మరక పూర్తిగా పోయేవరకు నీటిని వాడరాదు. అదే నెయిల్ పాలిష్ పడితే ఆ భాగం వరకు అసిటోన్‌లో ముంచితే సరిపోతుంది.
* బురద, మట్టి మరకలు పడితే పట్టు వస్త్రాన్ని ఆరనిచ్చి కార్బన్ టెట్రాక్లోరైడ్‌తో తుడిచి ఉతికితే సరిపోతుంది.
* షూ పాలిష్ మరకలు పడితే కొద్దిగా లిక్విడ్ డిటర్జెంట్ వేసి రుద్ది ఆ తర్వాత ఆల్కహాల్ పూయాలి.

జాగ్రత్త చేయండిలా..

* పట్టుబట్టలను ప్లాస్టిక్ సంచుల్లో కాక పేపర్ లేదా కాటన్ సంచుల్లోనే ఉంచాలి.
* పట్టుబట్టలున్న చోట ఎక్కువ గాలి, కాంతి లేకుండా చూడాలి.
* పట్టుబట్టలనను చెక్క లేదా కలపతో చేసిన పెట్టె లేదా బీరువాలో నేరుగా తాకేలా కాక కవరులో పెట్టి పెట్టాలి.
* పట్టుబట్టలను అప్పుడప్పుడూ బయటకు తీసి గాలి సోకనీయాలి. లేకుంటే మడతలు పడిన చోట చిరుగులు పడే అవకాశం ఉంది.

ఈమె వార్షిక జీతం కోటిరూపాయల పైనే..

$
0
0

ఈమె వయస్సు పాతిక సంవత్సరాలు..
జీతం నెలకు తొమ్మిది లక్షలు..
అంటే.. ఏడాదికి కోటి పైమాటే..
నమ్మట్లేదా.. కానీ ఇది నిజం..
ఆమే బీహార్‌కు చెందిన మధుమిత కుమార్ రూ. కోటికి పైగా వేతన ప్యాకేజీతో ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్లో ఉద్యోగం దక్కించుకుంది. మునుపు మధుమిత బెంగళూరులోని ఏపీజీ కంపెనీలో పనిచేసింది. అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెర్సిడెస్ కంపెనీలు కూడా మధుమితకు ఉద్యోగావకాశాన్ని ఇవ్వాలనుకున్నాయి. ఈలోగా గూగుల్ ఉద్యోగం మధుమితను వరించింది.
మధుమిత ప్లస్ టూ వరకు పట్నాలో వాల్మీలోని డీఏవీ స్కూల్లో చదివింది. తరువాత జైపూర్‌లోని ఆర్యా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి 2014లో మధుమిత కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది మధుమిత. ఆమె వంశంలోనే విదేశాలకు వెళ్లిన మొదటి వ్యక్తి మధుమితే.. తను 2018 ఫిబ్రవరిలో మొదటిసారి అమెరికాకు వెళ్లింది. మధుమితకు భారత మాజీ రాష్టప్రతి, క్షిపణి శాస్తవ్రేత్త అబ్దుల్ కలాం అంటే మధుమితకు చాలా ఇష్టం. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని మధుమిత ఇంజనీరింగ్ వైపు వెళ్లిందట. అబ్దుల్ కలాంను స్ఫూర్తిగా తీసుకున్న మధుమిత కలాం పుస్తకాలు, ఆయన జీవితచరిత్రను చాలా ఇష్టంగా చదువుతుందట. హైస్కూలు చదివేటప్పుడు మధుమితకు లెక్కలు, భౌతిక శాస్త్రం అంటే ఇష్టమట. స్కూల్ రోజుల్లో మధుమిత చాలా ధైర్యంగా డిబేట్ కాంపిటీషన్లలోనూ పాల్గొనేదట. చిన్నప్పుడు ఐ ఏ ఎస్ ఆఫీసర్ కావాలనుకుందట మధుమిత. అయితే ప్లస్ టూ పూర్తిచేశాక ఇంజనీరింగ్‌లో చేరింది మధుమిత.
మధుమిత తండ్రి అయిన సురేంద్ర శర్మ తన కూతురిని ఇంజనీరింగ్ చేయించాలనుకోలేదట. కారణం ఇంజనీరింగ్ అనేది అమ్మాయిలకు పెద్దగా నప్పదని అతని అభిప్రాయం. అయితే.. అమ్మాయిలు ఇంజనీరింగ్ రంగంలో రాణించడం చూసి అతను తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. కూతురి ఇష్టం మేరకు ఆమెను ఇంజనీరింగ్‌లో చేర్పించారు. సురేంద్ర శర్మ సోన్‌పూర్‌లోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో అసిస్టెంట్ సెక్యూరిటీ కమీషనర్‌గా పనిచేస్తున్నారు. వీరి కుటుంబం మాత్రం పట్నాకు సమీపంలోని కహుగల్‌లో ఉంటోంది. మధుమిత పనె్నండో తరగతిలో 86 శాతం మార్కులను తెచ్చుకుందట. దేశంలోని మంచి కాలేజీల్లో చేర్పించడానికి ఇన్ని మార్కులను యావరేజిగానే భావిస్తారు. అయితే బోర్డు పరీక్షల్లో మంచి మార్కులు రాకపోయినా జీవితంలో ఉన్నతస్థాయికి వెళ్లవచ్చని ఆమె విజయం మరోసారి నిరూపించింది.

విద్యాప్రదాయిని సావిత్రిబాయి పూలే

$
0
0

శ్రమించి పనిచేయండి. శ్రద్ధగా అధ్యయనం చేయండి. మంచి మార్గంలో నడవండి- సావిత్రిబాయి పూలే
వెయ్యి మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. నేడు భారతదేశంలో ఏ మూలకు వెళ్లినా పుస్తకాలతో కళకళలాడుతూ ఆడబిడ్డలు బడికిపోతూ కన్పిస్తారు. కొన్నివేల సంవత్సరాల నుండి వైదిక బ్రాహ్మణీయ సమాజం స్ర్తిలకు, శూద్రులకు చదువును నిరాకరించింది. జ్ఞానానికి వారిని దూరంగా ఉంచింది. కానీ నేడు ఇంతమంది స్ర్తిలు, శూద్రులు చదువుకుంటున్నారంటే, ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా, పరిపాలకులుగా అన్ని రంగాలలో సమాన అవకాశాలు పొందుతున్నారంటే దానికి మూల బీజం వేసింది పూలే దంపతులు. వారి త్యాగం, ధైర్యం, పట్టుదలవల్ల స్ర్తిలకు, శూద్రులకు చదువు సాధ్యమయింది. ఆధునిక భారతదేశంలో శూద్రులకు, అతి శూద్రులకు, స్ర్తిలకు విద్యను అందించేందుకు తన జీవితాన్ని త్యాగం చేసి కోట్లమందికి విద్యాప్రదాయిని అయింది మన చదువుల తల్లి క్రాంతి జ్యోతి సావిత్రి బాయి పూలే.
జనవరి 1831వ సంవత్సరం జనవరి 3న మహారాష్టల్రోని సతారా జిల్లా ఖండాలా ప్రాంతంలో శిఖాల గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలోగల నాయిగావ్ అనే గ్రామంలో జన్మించింది. తల్లి లక్ష్మిబాయి, తండ్రి ఖండోజీ. చిన్నప్పటినుంచే ఆకట్టుకునే మాట తీరు, ధైర్యసాహసాలు, చలాకీతనం, తెలివితేటలు, చురుకుదనం ఆమె సొంతం.
వివాహం
తొమ్మిదేళ్ల వయసులో పనె్నండేళ్ల జ్యోతిరావుకిచ్చి ఆమె తండ్రి వివాహం జరిపించాడు. ఆడదిక్కులేని ఆ కుటుంబ బాధ్యత చిన్న వయసులోనే సావిత్రిబాయి అందుకుంది. తన భార్య సావిత్రిబాయి ఎందుకు చదువుకోకూడదు అని ఆలోచించిన జ్యోతిరావు పూలే తానే స్వయంగా సావిత్రికి చదువు నేర్పాడు. ఈ విధంగా సావిత్రి మరాఠీ, ఆంగ్లంలో రాయడం నేర్చుకుంది. సావిత్రిబాయి చదువు నేర్చుకోవడం ఆమె జీవితానికి గొప్ప మలుపు. అంతేకాక భావి భారతానికి సరైన మార్గం చూపిస్తూ చరిత్రకెక్కింది. అది ఆమె వేసిన తొలి అడుగు అని చెప్పవచ్చు. 20 ఏళ్ల వయసులో మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులైన పూలే తన మిత్రుల సహాయంతో 1848 జనవరి 1న పూనాలోని, బుధవారపేట నివాసి భిడే గృహంలో బాలికా పాఠశాలను ప్రారంభించారు. బాలికా విద్యకోసం భారతదేశంలోనే తొలిసారిగా స్థాపించిన ఈ పాఠశాలనందు ముఖ్య ఉపాధ్యాయినిగా సావిత్రిబాయి నియమింపబడింది. ఈ విధంగా సావిత్రిబాయి భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయినిగా చరిత్రకెక్కింది.
ఆడపిల్లలు చదువుకోవడం చెడిపోవడానికి తొలిమెట్టుగా భావించి, తమ ఆడబిడ్డలను పాఠశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు నిరాకరించేవారు. బ్రాహ్మణవాదుల, సంప్రదాయవాదుల అవహేళనలు ప్రతికూల పరిస్థితుల మధ్య సావిత్రిబాయి ముందుకు సాగింది. వారిని ఒప్పిస్తూ, బాలికల అభిమానాన్ని, ప్రేమను సంపాదించి, వారిని పైకి తీసుకురావాలని దృఢ సంకల్పంతో బాలికల మానసిక వికాసానికి తన శక్తియుక్తులను వెచ్చించింది.
ఇదేవిధంగా బాలికల పాఠశాలలను ఒకవైపు విస్తృతపరుస్తూనే, మరోవైపు 1852 మార్చి 3వ తేదీన అస్పృశ్యుల కోసం (దళితులకోసం) బేతాళపేటలో ఒక పాఠశాలను ప్రారంభించారు. ఇది భారతదేశంలో అస్పృశ్యుల కోసం ప్రారంభించిన తొలి పాఠశాల. అలా ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా సావిత్రిబాయి నియమింపబడ్డారు. అస్పృశ్యత అనే దుర్మార్గ విధానాన్ని ఎదిరించి సమానత్వం కోసం కృషిచేయాలన్న సద్బుద్ధితో మహాత్మా జ్యోతిరావు పూలే ఈ పాఠశాలను స్థాపించాడు.
సావిత్రిబాయి పూలే 1852 జనవరి 14న 3తిలగుండ్ సమారోహ్2 అనే సంస్థను ఏర్పాటుచేశారు. ఇది భారతదేశంలోనే స్థాపించిన తొలి మహిళా సంస్థ. పూలే స్థాపించిన పాఠశాలలన్నింటినీ తీర్చిదిద్ది, వాటిని విజయపథంలో నడిపించడంలో సావిత్రి కృషి అనన్య సామాన్యమైంది.
భర్త చేసే సామాజిక కార్యక్రమాలలో అత్యధిక భారం సావిత్రిబాయి మోసింది. సమాజ సంస్కరణ, సామాజికసేవలను ఎంచుకున్న పూలే దంపతులు ఎదుర్కొన్న కష్టాలు, వారికి ఎదురైన దుర్భర పరిస్థితులు ఎంతో భయంకరమైనవి. స్ర్తివిద్య, సమాజ సేవ ఉన్నత లక్ష్యాలను తలకెత్తుకున్న సావిత్రిబాయి తను ఎటువంటి కష్టనష్టాలు ఎదురైనా తన లక్ష్యాన్ని వదులుకోలేదు. తన బుద్ధి, తన జ్ఞానం బహుజనులకు, ప్రజలకు ఉపయోగపడాలనే లక్ష్యంతో తన జీవిత ప్రయాణం కొనసాగింది.
1876-77 సంవత్సరకాలంలో మహారాష్టల్రో భయంకరమైన కరవు వచ్చింది. మహాత్మా పూలే ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడికక్కడ భోజన కేంద్రాలు ప్రారంభించి అన్నదానం కొనసాగించారు. వారి పాఠశాలల్లో చదివే రెండువేల విద్యార్థులకు ఆహారం ఉచితంగా అందించే బాధ్యత సావిత్రి బాయి తీసుకుంది. కరవు కాలంలో సావిత్రిబాయి కొన్ని వందలమందికి ప్రాణదానం చేసిందంటే అతిశయోక్తి కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆనాటి మహారాష్ట్ర సమాజానికి సావిత్రిబాయి తల్లిలా మాతృత్వం పంచింది.
1953 జనవరి 28 బాల హత్య ప్రతిబంధక్ గృహాన్ని స్థాపించింది. ఒక్క సంవత్సరంలోనే 32 మంది గర్భవతులకు పురుడుపోసింది. 56 మంది వితంతువులు తమ బిడ్డలను తమ ఇంటి ఆవరణలోని ఊయల తొట్టిలో వేసి వెళ్లారు. ఆనాటి సామాజిక కట్టుబాట్లకు విరుద్ధంగా గర్భయతియై భయంతో ఆత్మహత్య చేసుకోబోతున్న బ్రాహ్మణ వితంతువును రక్షించి తమ ఇంట్లో ఆశ్రయం కల్పించారు. ఆ బ్రాహ్మణ వితంతువు ఖాసీబాయి కన్నబిడ్డ యశ్వంతరావును దత్తత తీసుకొని చదివించి డాక్టర్ను చేసి, జ్యోతిబా మరణానంతరం సత్యశోధక్ సమాజ్‌ను నడిపిన ధీశాలి సావిత్రిబాయి పూలే. మహాత్ముడు జ్యోతిబా పూలే అంత్యక్రియలను తానే నిర్వహించిన సంఘ సంస్కర్త.
1896లో వచ్చిన కరువులోనూ తాను ముందుండి సహాయ కార్యక్రమాలను నిర్వహించిన మానవతామూర్తి. కరువు తరువాత 1879లో పూణే ప్రాంతాన్ని ప్లేగు మహమ్మారి చుట్టుముట్టింది. ప్రాణాంతక వ్యాధి అది తెలిసినా సాటి మనుషులకు సహాయం చేయకుండా ఉండలేనితనం వల్లనే ప్లేగు సోకిన బాలుడిని భుజాన వేసుకుని ఆసుపత్రిలో చేర్చింది. ఆ బాలుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మాతృమూర్తి సావిత్రిబాయి ప్లేగు బారినపడి మరునాడు ఉదయం తుదిశ్వాస విడిచింది. ఒక ఊపిరి ఆగిపోయింది. భౌతికంగా విశ్వంలో కలిసిపోయింది. ప్రజల ఉన్నతిని కాంక్షించిన పూలే దంపతులు కృషి కోట్లమంది విద్యావంతులను ప్రజ్వలింపజేస్తూనే ఉంది.
శూద్రులైన మగవాళ్ళు చదువుకోవడమే తప్పైన కాలంలో స్ర్తిగా సావిత్రిబాయి చదువుకుంది. బ్రాహ్మణ వితంతువులకు ఆసరగా ఉండడమే కాకుండా వారికి గుండు గీయించటానికి వ్యతిరేంగా మంగలి పనివారి సమ్మెకు నాయకత్వం వహించింది. భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయిని, ఆపన్నులను అక్కున చేర్చుకున్న కరుణామయి సావిత్రిబాయి. మరాఠా సాహిత్యంలో తొలితరం రచయిత్రి ఆమే కావడం విశేషం. నేడు మనమందరం నిజమైన చదువుల తల్లి సావిత్రిబాయి పూలేని స్మరించుకోవాలి. ఆమెను అవగాహన చేసుకోవాలి. సావిత్రిబాయి పూలే జయంతిని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలి. ఆమె ఆశయ సాధనకోసం కృషిచేయాలి.

మహాభారతంలో ఉపాఖ్యానాలు -90

$
0
0

ఆ కాలమహిమ వల్లనే వరదల్లో వస్తువులు నదిలో కొట్టుకొని పోయినట్లుగా కాలప్రవాహంలో అన్నీ కొట్టుకుపోతాయి. నా రాజ్యం కూడా అలాగే పోయింది. ఆ ఫలాన్ని అనుభవిస్తున్నాను. కనుక దొరికిన దానితోనే జీవిస్తాను’’.
రాజు చెప్పినది విని ముని ఇలా అన్నాడు ‘‘యదార్థం జ్ఞానం యందు స్థిరత్వం కలిగితే జరిగిపోయిన దాని గురించి కాని, జరుగబోయే దానిగురించి కాని విచారించనక్కరలేదు. కనుక నీవు పొందదగిన వస్తువులను పొందు. పొందలేని వాటి గురించి దుఃఖించకు. దైవకృప వలన దొరికిన రాజ్యాన్ని పొంది ఎలా ఉన్నావో, రాజ్యం పోయినప్పుడు కూడా అలాగే ఉండు. అప్పుడు నిర్భాగ్యం వలన దైవాన్ని నిందించకూడదు. నీ దగ్గర ధనం లేకున్నా ఇతరుల దగ్గర ఉన్న ధనాన్ని చూసి ఈర్ష్యపడకు. ఎందుకంటే సంపద ఏ రూపంలో ఉన్నా ఎప్పుడో ఒకప్పుడు దాన్ని విడిచిపెట్టాలి. ధర్మపరులు యోగధర్మవర్తనులు కూడా పుత్రులు పౌత్రులను, సంపదను విడిచిపెట్టిపోతున్నారు. ఎంతో శ్రమపడితే లభించే ఈ ధనం చాలా చంచలమైనది. నీవు ప్రాజ్ఞుడవు అయినప్పటికీ కోరకూడనివి కోరుతూ అస్థిరమైనవాటి కోసం తపిస్తున్నావు. కాని అర్థాలన్నీ అనర్థాలే కనుక నీవే వాటిని పరిత్యజించు’’.
ధనం యొక్క అనిత్యత్వాన్ని తెలుసుకున్న ఎవరూ ధనాన్ని కోరుకోరు. పుణ్యాత్ముల వంశంలో పుట్టిన వారు అందుకే పరలోక సుఖాలను కోరుకొని దానికోసం ఇహలోక వ్యవహారాలలో విరక్తులుగా ఉంటారు. ధనాన్ని పురుషుడు విడిచిపెట్టకపోతే ఆ ధనమే అతన్ని విడిచిపెడ్తుంది. నీలాగే ఇతరులు నీ మిత్రులనూ, ధనాన్నీ పోగొట్టుకుంటారు. వారి కష్టం కూడా నీకష్టం లాంటిదే. కనుక మనస్సును నియంత్రించు. బ్రహ్మచర్యాన్ని పాటించు. సర్వభూతాల యందు దయకలిగి ఉండు.
ఓ రాజా! నీకు ప్రస్తుతం రాజ్యం లేదు. మంత్రులు లేరు. నీకుప్రస్తుతం దైవం అనుకూలంగా లేదు. నీలో ఏమాత్రమైనా పౌరుషముంటే నేను చెప్పే నీతిని గుర్తుంచుకో. నేను చెప్పినట్లు చేస్తే నీవు మరల రాజ్యాన్ని, సంపదను పొందగలవు. నీకు ఇష్టమైతే చెప్తాను’’.
ముని చెప్పిన మాటలను ఎంతో భక్తి శ్రద్ధలతో విన్న రాజు ఇలా అన్నాడు. ‘‘మహాత్మా! తమరు ఉపదేశించండి. నేను తప్పక ఆచరిస్తాను’’.
అపుడు ముని ఇలా చెప్పాడు ‘‘గర్వాన్ని, హర్ష భయాలను, క్రోధాన్ని విడిచిపెట్టి శత్రువును కూడా సేవించు. విదేహరాజు సత్యప్రతిజ్ఞుడు. మంచి కర్మల ద్వారా అతనికి విశ్వాసం కలిగించు. అతను నీకు ధన సహాయం చేస్తాడు. అప్పుడు నీవు అందరికీ విశ్వాసపాత్రుడివి, రాజుకి కుడిభుజానివి అవుతావు. అప్పుడు నీకు మంచి గుణములున్న ఉత్సాహవంతుల సహాయం లభిస్తుంది. శాస్త్రప్రకారం నడుచుకొనేవాడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు తన్ను తాను ఉద్ధరించుకుంటాడు. ప్రజలను ఉద్ధరిస్తాడు. ధైర్యవంతుడు, సంపన్నుడు అయిన జనకమహారాజు తప్పక నిన్ను ఆదుకుంటాడు. తర్వాత నీవు మిత్రుల సైన్యాన్ని సమకూర్చుకొని, మంచి మిత్రులతో చేరి మంత్రాంగం చేసి, ఆంతరంగికుల ద్వారా శత్రువులలో విభేదాలను సృష్టించి శత్రువుల సహాయంతోనే శత్రువులను నాశనం చేయించు.
ప్రాజ్ఞుల విశ్వాసాన్ని పొంది శత్రువుల రాజ్యం లేకుండా హాయిగా ఉండు. కాని నిరంతరం జాగరూకుడవై విదేహరాజు పట్ల మిత్రధర్మాన్ని నిర్వర్తించు. బలవంతులైనవారితో శత్రువులకు విరోధం కలిగించు. శయనాలు, భోగాలు మొదలైన సుఖాలతో శత్రువు యొక్క కోశాగారం నిండుకొనేలా చేయి. ఉత్తమ వేదపండితుల గురించి విదేహరాజు దగ్గర ప్రశంసించి అతని చేత వారికి యజ్ఞదానాలు ఇప్పించు. వారు నీకు ఉపకారం చేస్తారు. విదేహరాజుని వారు పీక్కుతింటారు. ఆ పుణ్యశీలి పరమగతిని పొందుతాడు. ఏ కార్యం అందైనా మునిగి పోయిన రాజుయొక్క కోశాగారం వట్టిపోతుంది. రాజ్యం శత్రువుల వశవౌతుంది. పంటలు మొదలైనవి నాశనం చేయించాలి. అది దైవ ఘటనగా రాజు వద్ద చెప్పాలి. అతనిచేత విశ్వజిత్ యాగం చేయిస్తే అతను నిర్ధనుడు అవుతాడు. దానితో నీ పని సిద్ధిస్తుంది. యోగధర్మాలు తెలసినవారి గురించి ఆ శతృరాజు దగ్గర ప్రశంసించు. దానితో అతనికి రాజ్యాన్ని త్యజించాలనే కోరిక కలుగుతుంది. అలా కలగక పోతే నీ మనుష్యుల ద్వారా సిద్ధౌషధ ప్రయోగం ద్వారా అతని ఏనుగులను, గుర్రాలను, మనుషులను చంపించు. ఇలాంటి పనుల వల్ల శత్రువు బలహీనుడౌతాడు. రాజ్యం నీ చేతికి వస్తుంది’’.
ముని మాటలు విన్న రాజు ఇలా అన్నాడు. ‘‘బ్రహ్మజ్ఞుడా! నేను మోసంతో కాని, దంభంతో కాని జీవించాలని అనుకోవడం లేదు. అలాగే అధర్మ మార్గంలో సంపాదించే సంపాదన కూడా నాకు అక్కరలేదు. నేను ధర్మాన్ని ఆశ్రయించి బ్రతకాలని కోరుకుంటున్నాను. కనుక ఈ పని చేయలేను. ఇలాంటి సలహా ఇవ్వడం మీకూ తగదు’’.
అతని మాటలు విన్న మహర్షి ఇలా జవాబు చెప్పాడు. ‘‘రాజా! నీ గుణాలు, నీ మాటలకు అనుగుణంగానే ఉన్నాయి. నీకూ, విదేహరాజుకీ ప్రయోజనం కలిగేలా ప్రయత్నిస్తాను. నీవు ఉత్తమ కులంలో జన్మించావు. సకల శాస్త్రాలు చదివావు. నిన్ను ఎవరు ఆమాత్యునిగా నియమించరు? విదేహరాజు నా ఆశ్రమానికి వస్తాడు. అప్పుడు అతనిని ఆజ్ఞాపిస్తాను. అతను తప్పక చేస్తాడు’’.
తర్వాత ముని విదేహ రాజుని పిలిపించి క్షేమదర్శిని చూపించి ఇలా అన్నాడు. ‘‘ఇతను రాజవంశంలో పుట్టినవాడు. ఇతని గురించి నాకు అంతా తెలుసు. నీవు నన్ను ఎలా నమ్ముతావో అదేవిధంగా ఇతన్నీ నమ్మవచ్చు. ఇతన్ని అమాత్యుని చేసికో. ఇతనికి పరాక్రమం, బుద్ధికుశలత రెండూ ఉన్నాయి. రాజ్యప్రయోజనం కోసం ఇవి చాలా ముఖ్యం.
ధర్మాత్ముతలైన రాజులకు ఇటువంటి అమాత్యులు చాలా అవసరం. తండ్రి తాతల నుండి సంక్రమించిన రాజ్యాన్ని పొందాలన్న కోరికతో అతను నీతో యుద్ధం చేసినా అది క్షత్రియ ధర్మమే అవుతుంది. నీకు కూడా జయించాలనే కోర్కెతో యుద్ధం చేస్తావు. కనుక నా ఆదేశాన్ని పాటించి యుద్ధం చేయకుండానే అతన్ని వశపర్చుకో. లోభాన్ని వదలి ధర్మాన్ని ఆచరించు. అందరికీ ఎప్పుడూ విజయమే లభించదు. ఒక్కోసారి అపజయం కూడా కలుగుతుంది. శత్రువుల సంపదను ఇన్న రోజులు నీవు అనుభవించినట్లుగా నీ సంపదను వారు కూడా అనుభవించాలి. ఇతరుల సంపదలను నిర్మూలిస్తే దాని వలన పాపం కలుగుతుంది’’.
మహర్షి మాటలు విన్న విదేహరాజు అతని ఆదేశాన్ని పాటించి ఇలా అన్నాడు. ‘‘మహర్షీ! మీరు ప్రాజ్ఞులు, తాపసులు, మహాపండితులు, మా శ్రేయోభిలాషులు. మీరు చెప్పిన విధంగానే చేస్తాను. అదే నాకు పరమశ్రేయస్సు. ఇక నేను ఏమీ ఆలోచించను’’.
ఇంకావుంది...

స్వాధ్యాయ సందోహం-185

$
0
0

వ్యాధిస్త్యాన సంశయ ప్రమాదాలస్యావిరతి భ్రాంతి దర్శనాలబ్ధ భూమికత్వా నవస్థితత్వాన్ని చిత్త విక్షేపాస్తే న్తరాయాః. అన్న సూత్రానుసారం వ్యాధి, స్త్వాన= భారకత్వం, సందేహం అజాగ్రత్త, సోమరితనం, అవిరతి= యోగసాధనాల ఆచరణలో అనాసక్తి, భ్రాంతికారక వస్తు దర్శనం, చిత్తచాంచల్యం, యోగ భూమికను పొందకపోవడం, ఇవన్ని యోగసిద్ధికి విఘ్నకారకాలు. వీనిలో ముఖ్యమైన సంశయమనే దానిలో చిక్కుకొని భగవదారాధననే విడిచేందుకు సిద్ధపడిన సంశయగ్రస్తు హృదయంలో ఉన్న పరమాత్మ దయాళువై ఇలా ప్రబోధిస్తున్నాడు. ‘అయమస్మి జరితః’=‘‘ఓ భక్తుడా! నేనిక్కడే ఉన్నాను’’కాని నీవు నాకోసం వెతుకుతున్నావు. నాకోసం అటుఇటు పరుగుపెట్టకు. పశ్యమేహ=‘‘నువ్విక్కడే చూడు. మరెక్కడకు వెళ్లవలసిన పని లేదు. నీలో అంతర్యామిగా ఉన్న ఆత్మను నేనే’’. విశ్వాజాతా న్యభ్యస్మి మహ్నా= ‘‘నా మహత్వశక్తితో ఈ సమస్త విశ్వాన్ని నా నియంత్రణ (అదుపు)లో ఉంచుకొన్నాను’’ సమస్తజగత్తు నా ఆజ్ఞానుసారమే నడుచుకొంటున్నది. ఇష్టపడితే నీవు నా పూజ చేయి. లేకుంటే మాను. ఋతస్య మా ప్రదిశో వర్ధయంతి= ఋతాన్ని అంటే అనుల్లంఘనీయమైన సృష్టినియమాలను- శాసనాలను జ్ఞానులు నన్ను సమున్నతంగా ఆరాధిస్తున్నారు.
మూర్ఖ శిరోమణులు భగవానుని స్మరణ, ధ్యానాలను చేయరు. కాని కార్య కారణవేత్తలైన ఋత ప్రచారకులు కారణం లేకుండా కార్యం పుట్టదు. కారణానికి ఆలంబనుడయిన కర్తలేకపోతే కార్యమెలా సంభవమవుతుంది. చిన్న పదార్థమైనా చైతన్యరహితమై ఉండనప్పుడు ఈ అఖండ విశ్వం చైతన్యరహితంగా ఎలా జనిస్తుంది అని గ్రహించినవారై భగవానుడనైన నన్నారాధిస్తూ ‘ప్ర వ ఇంద్రాయ బృహతే మరుతో బ్రహ్మార్చత’ నీవు మహేంద్రుణ్ణి వేదోక్తంగా ఆరాధించు’’మని ఇతరులకు ప్రబోధిస్తూ ఉంటారు. భగవచ్ఛక్తి అనుమాన ప్రమాణంచేత గ్రహించుకోవాలే గాని ప్రత్యక్షమై ఉండదు. కాని ఆయన వినాశనశక్తిని చూడగానే అందరు ఆయన ఎడల భక్తితత్పరులైపోతారు. అట్టి తన ప్రళయకార శక్తిని వివరిస్తూ ‘ఆ దర్ధిరో భువనా దర్దరీమి’= ‘‘నేను ప్రళయకారుడనై లోకాలను పలుమారులు వినాశనం చేస్తున్నా’’నని ప్రకటించాడు. చిత్రమేమంటే ఆయన సంహారశక్తికి భయపడి దగ్గరకు వచ్చి ఆశ్రీతుడైన వానికి రక్షకునిగా దర్శనమిస్తాడు. లౌకికంగా సంహారకుడైన క్రూరుడైనవానికి సంహారక శక్తిసంపన్నుడైన భగవంతునకు ఏమీ పోలిక లేదు. నదులు ఉప్పొంగి గ్రామాలను ముంచి నాశనం చేసినట్లు, కార్చిచ్చు అడవులనేకాక జనులనుకూడ దహింపజేసినట్లుగా పరమేశ్వర సంహారకశక్తి సృష్టినాశనాన్నిగాక పునఃసృష్టికారకమవుతుంది. కాబట్టి జనులకు దైవసంహారక శక్తికూడ ప్రియాతిప్రియమే అవుతుంది. అందుకే సృష్టినిర్మాణంలో సంహారకశక్తి కూడ దైవశక్తిగా ఆరిధింపబడింది.
***
174. దేవాధిదేవ! నీ నామానే్న జపిస్తాను
భావం:- ఓ దేవా! నీ మాటలనే నెన్నడు తిరస్కరింపను. నిన్ను నమ్మి జీవిస్తూ ఇతరులకు నిరంతరం శీఘ్రంగా మేలుచేసే జీవనాధారుడవైన నిన్ను గురించి చేసే సన్నుతులను కూడ విడువను. అంతేగాక అపూర్వ కీర్తివంతమైన నీ నామాన్ని సదా స్మరిస్తూ ఉంటాను.
వివరణ:- ఓ మహాదేవా! నీ ఎడల నాకు బహుప్రీతి ఉంది. ఈ మాటను నేను నిజంగానే చెబుతున్నాను. మాతాపితలు. దారాపుత్రులు, మిత్ర- బాంధవులను మాటలను వినీ వినక పెడచెవిని పెడతాను. కాని నీ మాటలను చెవులార వినే సౌభాగ్యాన్ని నేను చేతులార ఎందుకు వదులుకొంటాను? ఓ పరమాత్మా! నీతో నేనేమని చెప్పను? నీకు తెలియనీయక దేనిని దాచిపెట్టగలను? నీకు సర్వమూ తెలుసు. కాని నే నొక్కమాట చెప్పగలను. అదేమంటే- ‘న తే గిరో అపి మృష్యే’ ‘‘నీ మాటలనెన్నడు తిరస్కరించను అని. నీ మాటలను ప్రేమిస్తాను. సంపూర్ణంగా గౌరవిస్తాను. నీ మాటలనే చింతిస్తూ అనుసరిస్తూ, ఆ ప్రకారంగా ఆచరిస్తూ, ప్రచారం చేస్తాను. ఓ జగన్నాథా! నీవు సృష్టికార్యాలను అతి శీఘ్రంగా చేసేవాడవు. క్షణకాలంలో సృష్టికి ప్రళయాన్ని కల్పించగలవాడవు జగజ్జీవనమంతా నీపై ఆధారపడి ఉంది. నీ గుణగణాలను లెక్కింప సామర్థ్యమెవరికుంది. అది నాకు మాత్రం సాధ్యమా? అయితే నాకు చేతనయినంతగా నిన్ను సన్నుతిని చేస్తాను నీవే పాలకుడవు. నీవే సృష్టికర్తవు. ఓ దేవాధిదేవా! అజ్ఞానకారణంగానో, అజాగ్రత్త కారణంగానో నీ ఆదేశాన్ని వినకపోవచ్చు. విన్నా సరిగా అర్థం చేసికొనలేకపోవచ్చు. ఎప్పుడైనా నీ సంస్తుతిలో పొరపాటు దొర్లవచ్చు! అదంతా నా అల్పజ్ఞత్వమే. దానివల్ల అనేక కష్టాలు సంభవిస్తాయి. ఇదివరకే నేను దానివల్ల ఎదురుదెబ్బలు కూడ తిన్నాను. నాకు బుద్ధివచ్చింది. నీ మాటలనే విని ఆచరించేందుకు తహతహలాడుతున్నాను. ‘సదా తే నామ స్వ యశో వివక్మి’ ‘‘కీర్తివంతమైన నీ నామానే్న జపిస్తాను’’ కాని నీ మహిమ నెరుంగని మూఢుడను. ‘మనీషీ హవతే త్వామిత్’ ‘‘మహాబుద్ధిమంతుడైనవాడు కూడ నినే్న పిలిచి ప్రార్థిస్తాడు’’ ఇక నేనెంత వాడను?
ఇంకావుంది...

పరమహంస బోధామృతము

$
0
0

36.మూడు బొమ్మలున్నవి- ఓకటి ఉప్పుతో జేసినది, రెండవది గుడ్డతో జేసినది, మూవడది రాతితో జేసినది, ఈ బొమ్మలను నీటిలో ముంచినయెడల మొదటిది కరిగిపోయి రూపనాశనము నొందును;రెండవది చాలనీటిని పీల్చుకొనును, కాని ఆకృతి పోగొట్టుకొనదు;మూడవది నీటడిని తనలో చొరనీయదు. ఆత్మను పరమాత్మలో లయించి ఐక్యమొందిన జీవుడే ఇందు మొదటిబొమ్మ. బ్రహ్మజ్ఞానానందమయుడగుభక్తుడే ఇందలి రెండవ బొమ్మ. తనహృదయమున తత్త్వజ్ఞానమునకు అణుమాత్రమైన అవకాశమీయని శుద్ధ లౌకికుడు ఇందలి మూడవ బొమ్మ.
37.మానవులు తలగడదిండ్ల గలేములవంటివారు.ఒక గలేబు ఎర్రగా నుండవచ్చును. మరియొకటి నీలముగా నుండవచ్చును, వేరొకటి నల్లగా నుండవచ్చును; కాని అన్నింటిలో నుండునది దూదియే కదా! మానవుల విషయము కూడా నిట్టిదే. ఒకడు చక్కనివాడు, మరియొకడునల్లనివాడు, ఇంకొకడు పావనుడు, వేరొకడు పాపాత్ముడు. ఐనను అందరియందును ఒకే పరమాత్ముడు నెలకొని యున్నాడు.
38.మోదకములపై పూత వరిపిండియే, కాని లోపలి పూర్ణము పలు విధములుగా నుండును. మోదకముల బాగోగులు అందలి పూర్ణము ననుసరించి యుండును. అటులనే నరులందరిశరీరమును పంచభూములచేతనే నిర్మాణమై యున్నను చిత్తశుద్ధిని బట్టి వారు వేర్వేరు గుణములు గలవారుగా నుందురు.
39.బ్రాహ్మణ కుమారుడు జన్మముచే బ్రాహ్మణుడే. కాని యిట్లు బ్రాహ్మణులై పుటిటనవారిలో గొందరు పండితులగుచున్నారు. కొందరు పురోహితులగుచున్నారు. మరికొందరు వంట బ్రాహ్మణులగుచున్నారు. ఇంక గొందరు భోగకాంతల యింటిముంగిట ధూళిలో బడి పొరలాడుచున్నారు.
40.పులిలో సైతము దేవుడు ఉండుట నిజమే, కాని అందుచే మనము ఆ జంతువునకెదురుగా బోయి నిలువవచ్చునా? పరమ దుర్మార్గులందును భగవంతుడుండుట నిజమేయైనను మనము వారి సహవాసము చేయుట పాడిగాదు.
41.నీరు అంతయు నారాయణస్వరూపమే. కాని అన్నిరకముల నీళ్లును త్రాగుటకు నికిరావు. అటులనే భగవంతుడు సర్వాంతర్యామియై యుంట నిజమే. అయినను సర్వప్రదేశములును మనము దర్శింపదగినవి కావు. ఒకరకము నీరు కాళ్ళు కడుగుకొనుటకు మాత్రము ఉపయోగించును. వేరొకరీతి నీరు స్నానమును పనికివచ్చును, మరొక రీతి నీరు త్రాగుటకు వినియోగించును. కొన్ని రకముల నీరు తాకుటకుకూడా పనికిరాకుండును. అట్లే స్థలములను బహవిధములుగానున్నవి. కొన్నిటి సమీపమునకు బోదగును. కొన్నిటిని దర్శింపనగును; కొన్నిటిని దూరమునుండియే ‘సలాము చేసి’ పోదగినవిగా నున్నవి.
42.ఈ దిగువ చెప్పబడినవారి విషయమున మెలకువ గలిగి వర్తింపుడు. 1.హద్దుపద్దు లేకుండా సదా వాగుచుండువాడు 2.కపట హృదయుడు 3.చెవులకు తులసిదళమును తగిలించుకొని తన భక్తి నెల్లరకును బ్రదర్శించువాడు. 4.పెద్ద మేలిముసుగు వేసికొను స్ర్తి, 5.మిగుల ననారోగ్యకరమగు పాచితో నిండియున్న మఱుగుగుంటలోని చల్లని నీరు.
మరణము :పునర్జన్మము
43.బద్ధజీవులు అవసానకాలమున గూడా సంసారపు గొడవలను గూర్చియే మాటలాడుదురు. నరుడు తీర్థయాత్రలు చేసియుండుగాక, గంగాస్నానము గావించియుండుగాక, తావళము బూని జపించి యుండుగాక, హృదయమున రాగద్వేషములున్నంతవరకు మరణకాలమున అవి వెలువడక మానవు. ఆ సమయమున సంధిలో లౌకిక ప్రలాపములనే సాగింతురు (బద్ధజీవులు). (పెంపుడు) చిలుక సాధారణమగు రాధాకృష్ణనామమును గానము చేయవచ్చును; కాని పిల్లి నోట చిక్కినప్పుడు కీచుకీచుమనుచు స్వాభావికవు గూతతోడనే ఏడ్చునుగదా!
44.దైవభక్తి లేకపోవుటయే మానవుని అపరమిత బాధలన్నింటికిని కారణము. కావున నరుడు అవసాన కాలమున నారాయణ స్మరణకు తోడ్పడునట్టి సాధన చేయవలయును.
ఇంకావుంది...

శ్రీ రామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదకుడు: శ్రీ చిరంతనానందస్వామి


సుందరకాండ

$
0
0

బాహ్యదృష్టితో చూస్తే శబ్దాడంబరాది అలంకారాలు కనబడతాయి. ఇది సుందరకాండలో ఎక్కువ. ఈ లక్షణం రావణ ప్రకృతిని లంకా బాహ్య సౌందర్యాన్ని కవి స్థూలంగా చూసెట్టే విధానమని మనం భావించుకోవాలి.
ఆ వెనె్నట్లో స్వామి పిల్లిమొగ్గలు వేస్తూన్నట్లే ఈ వర్ణన బాహ్య స్వరూపం కూడా కనబడుతుంది. ఇక్కడినుండి పురస్థలయిన స్ర్తిలను చూస్తూ బయలుదేరేడు.
అయితే వారెలా ఉన్నారు.
భర్తలతో కలిసి మాదకద్రవ్యాల్ని సేవిస్తూన్నవాళ్లు, సంగీత సాధనలు చేస్తూన్నవాళ్లు, అధిక్షేపించుకొంటూన్నవాళ్ళు, మాటా మాటా వచ్చి విరహాన్ని అనుభవిస్తున్నవాళ్ళూ-తిరిగి కలుస్తూన్నవాళ్ళు-ఇటువంటి వారి ముఖాలను చూస్తూ వారి ఆభరణాల్నిచూస్తూ స్వామి ముందుకు వెళుతున్నాడు.
ఆ తల్లి సీతాముఖ లక్షణాల్ని తానెరుగును. ఆ తల్లి ఆభరణాలు తనకు పరిచయమున్నాయి. ఆ రెండూ కాని మూడవ గుర్తు తన వద్ద లేదు. ఈరెండూ కాని మూడవ విషయం స్ర్తి విషయంలో తనకు లేదు.
కనుక స్వామి కనబడిన స్ర్తి ముఖాన్ని చూస్తున్నాడు. ఆభరణాల్ని చూస్తున్నాడు. కాని రామపత్ని తనకు కనబటంలేదు. ఎటువంటి రామపత్నిని తాను చూడాలి.
ఉష్ణార్దితాం సాను స్రుతార్ద్ర కంఠీం
పురావరార్సోత్తమ నిష్కంఠీం
సుజాత పక్ష్మామభిరక్త కంఠీం
వనే ప్రవృత్తామివ నీల కంఠీమ్
అవ్యక్త రేఖామివ చన్ద్ర రేఖాం
పాంశుప్రదిగ్థామివ హేమరేఖాం
క్షతప్రరూఢా మివ బాణ రేఖాం
వాయుప్రభిన్నామివ మేఖ రేఖామ్
ఇటువంటి రామపత్నిని తాను చూడాలట.
వెచ్చని కన్నీటితో తడుపబడుతూన్న కంఠం కలది.
కంఠం నుండి వక్షస్థలం వరకు ఉత్తమమైన హారం కలది.చక్కని కనుబొమలు స్నిగ్ధమైన కంఠమూ కలది.
అడవిలో నటించే నెమలి వంటిది.
కనబడీ కనబడనట్టి చంద్రరేఖ వంటిది.
బురదలో దిగబడ్డ బంగారు కణికి వంటిది.
గాయాన్ని నరేపిన బాంవు గుర్తుగలది.
గాలిరేపని మేఘరేఖ వంటిది-ఇటువంటి రామపత్నిని తాను చూడాలట-ఇదీ కోరిక- ఇదొక విచిత్రమైన కోరిక.
ఆంజనేయస్వామి సీతా స్వరూపాన్ని సుందరకాండలో మూడు స్థాయిలో ధ్యానిస్తాడు. మొదట సగుణ స్వరూపంగా ఆ తరువాత సగుణ నిర్గుణ స్వరూపంగా ఆపై నిర్గుణ స్వరూపంగా దర్శిస్తాడు. వానిలో మొదటి స్థితి ఇది.
ఇపుడు స్వామి ధ్యాన స్థితి యొక్క ఆంతర్యాన్నిగమనిస్తే, కనిపించీకనిపించని చంద్రరేఖ శుక్ల విదియనాటిది. ఇది చూడాలనిప్రయత్నిస్తే కనబడుతుంది. తనంతట తనా కనబడదు.అలాగే ఆతల్లిని ఉపాసిస్తే కనబడుతుంది.కనుక ఉపాసకులకు మాత్రమే కనబడేదని భావం.
బురద అంటిన హేమరేఖ. హేమమంటే తేజస్సు. పరబ్రహ్మ స్వరూపిణి అయి నిర్గుణ నిరాకార స్థితియందున్న ఆమెకు సృష్టి లక్షణం సంసార స్థితి వస్తుంది.అది బురద. అది బంగారు కణికకు అంటినట్లుంటుంది. అంటదు. అట్టిలక్షణమున్న తల్లిని చూడాలని స్వామి కోరిక.
గాయాన్ని రేపిన బాణపు గుర్తు.ఆమె వీరారాధ్య.
వీరులంటేవేదాంతులు. శోక తాపాలు రాగద్వేషాలు లేనివారు.
అట్టివారికి మాత్రమేఆరాధ్య.
గాలి రేపిన మేఘ పంక్తి అంటే ప్రాణాయామాదుల చేత మాత్రమే చిక్కేది. అనగా యోగ లభ్య. అట్టి తల్లిని చూడాలి.
ఇంకావుంది...

శ్రీకాళహస్తీశ్వరా!

$
0
0

నిను సేవింపగ నాపదల్పొడమనీ, నిత్యోత్సవం బబ్బనీ
జనమాత్రుండననీ, మహాత్ముడననీ, సంసార మోహంబుపై
కొననీ, జ్ఞానము గల్గనీ, గ్రహగతుల్ కుందింపనీ, మేలు వ
చ్చిన రానీ, యవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వరా!
భావం: ఈశ్వరా! నేను నిన్ను సేవిస్తుండగా, నాకు కష్టాలు రానీ, సుఖాలు రానీ, నన్ను లోకము సామాన్యుడననీ, గొప్పవాడననీ, సంసార వ్యామోహము కలుగనీ, జ్ఞానమే కలుగనీ, గ్రహచారము నన్ను క్రుంగదీయనీ లేక మంచి చేయనీ, అవి అన్నీ నాకు ఆభరణములు వంటివే అవుతాయి. నీ పాదసేవ చేస్తున్న నాకు నీ అనుగ్రహములుగానే కనిపిస్తాయి.
ఏ వేదంబు బఠించె లూత? భుజగం బే శాస్తమ్రుల్సూచెఁ దా
నే విద్యాభ్యసనం బొనర్చెఁగరి; చెం చే మంత్ర మూహించె? బో
ధా విర్భావ నిదానముల్ చదువులయ్యా? కావు; నీ పాదసం
సేవాసక్తియె కాక జంతు తతికిన్ శ్రీ కాళహస్తీశ్వరా!
భావం: ప్రాణికోటికి మోక్షము కలుగుటకు నీ పాదాలు సేవించు భక్తి ఒక్కటే కారణంగానీ, చదువులెన్ని చదివినా జ్ఞానమును, మోక్షమును కలిగించునా? ఎంతమంది చదివినవారు లేరు? వారందరికీ జ్ఞానము కలిగిందా? మోక్షము కలిగిందా? నీ దయతో మోక్షము పొందిన సాలెపురుగు ఏ వేదము చదివింది? పాము ఏ శాస్తమ్రులు పఠించినది? ఏనుగు ఏ విద్యలు నేర్చుకొంది? ఎరుకలవాడు ఏ మంత్రజపము చేశాడు. ముక్తి పొందటానికి చదువులే కారణమైనవా?
కాయల్గాచె వధూ నఖాగ్రములచేఁ గాయంబు, వక్షోజముల్
రాయన్రాపడె ఱొమ్ము, మన్మధ విహరక్లేశ విభ్రాంతిచే,
ప్రాయంబాయెను, బట్టగట్టెఁదల, చెప్పన్ రోత సంసారమేఁ
జేయంజాల విరక్తుఁ చేయఁగదవే శ్రీకాళహస్తీశ్వరా!
భావం: ఈశ్వరా! స్ర్తిల గోళ్ళాగాట్లతో నా శరీరము కాయలు కాచింది. వారి స్తనముల రాపిడితో నా రొమ్మురాయిలా గట్టిపడిపోయింది. మన్మధ క్రీడల మీద వ్యామోహంలో పడి వయసు గడిచిపోయింది. తల బట్టతలై వెంట్రుకలు రాలిపోయినవి. ఇలా చెప్పుకొంటూ పోతే చాలా ఉన్నాయి. ఇపుడు ఈ సంసారం అంటే అసహ్యం కలుగుతుంది. ఇక నాకు పరిపూర్ణ వైరాగ్యము కలిగించి భవబంధ విముక్తున్ని చేయి.
నినే్న రూపముగా భజింతు మదిలో, నీ రూపు మోకాలో? స్ర్తి
చన్నో? కుంచమొ? మేక పెంటికయొ? రుూ సందేహాముల్మాన్పి, నా
కన్ను లన్ఖవదీయమూర్తి సగుణాకారంబుగాఁ జూపవే
చిన్నీ రేజ విహారమత్త మధుపా! శ్రీకాళహస్తీశ్వరా!
భావం: ఈశ్వరా! మోకాలో, స్ర్తి స్తన్యమో, కుంచమో, మేకపెంటియో నీ రూపము ఏదని నమ్మి భావించి సేవింతును? నా రుూ అనుమానాలన్నీ పోగొట్టి నీ సుగుణమూర్తిని నాకు చూపించి ధన్యుడిని చేయుము.

హితవాక్యం

అనంత శాస్త్రం బహు వేదితవ్యం
అల్పశ్చ కాలో బహవశ్చ విఘ్నాః
యత్సారభూతం తదుపాసితవ్యం
హంసో యథా క్షీ రమిహాంబుమిశ్రమ్
అది విష్ణుశర్మ మూటగట్టిన వరహాల మూట...
అనగనగా దక్షిణాదిన ఒక జనపదం ఉండేది. దాని పేరు మహిలారోప్యం. దానికి ‘అమరశక్తి’ రాజు. ఆయనకు ముగ్గురు కొడుకులు. వారు వెంపలి చెట్టుకు నిచ్చెన వేసేటంతటి పరమ మూర్ఖులు. కాని కాలం ఆగదు కదా! వారికి యుక్త వయస్సు వచ్చింది. ‘‘విద్యాగంధం లేని తన కుమారులు తన తర్వాత వారసులెలా కాగలరు?’’ అని రాజుకొక సమస్య అయింది. వివేకహీనులై తన పుత్రులను తలచుకొని తలచుకొని వ్యథాభరిత హృదయంతో అమరశక్తి తనకు ఆప్తుడైన మంత్రి ‘సుమతి’ని ఒక ఉపాయం చెప్పమని అడిగాడు. అప్పుడు సుమతి సకల శాస్తప్రారంగతుడైన విష్ణుశర్మ ఒక్కడే రాజకుమారుల్ని వివేకవంతులుగా తీర్చిదిద్దగలడని తెలిపారు. ఆ అభ్యాసానికి సులువైన మార్గాన్ని కూడా యిలా సూచించాడు.‘‘ఏ శాస్తమ్రైనా అనంతమైనది. లోకంలో తెలుసుకొనవలసినది చాలా ఉంది. కాని మనకున్న కాలం అంటే వయస్సు చాలా తక్కువ. అందునా అనేక విఘ్నాలు. కాబట్టి నీటితో కూడిన పాలను గ్రహించు హంసలాగా శాస్త్రాల సారాన్ని మాత్రం గ్రహించాలి. వివేకవంతుడు కావాలి’’. ఈ మార్గంలోనే విష్ణుశర్మ సకల శాస్త్రాల సారాన్ని కథల రూపంలో రాజకుమారులకు అందించాడు.ఆ ‘పంచతంత్ర’ కథలే ప్రపంచ సారస్వతాకాశంలో విమలతారకలై వెలుగుల్ని వెలారుస్తున్నాయి. -వ్యాఖ్యాత: డి.ఎన్.దీక్షిత్

భారతీయమార్గము మాసప్రతిక (1987 జనవరి) నందు ప్రచురితమైన హితవాక్యాలు - వ్యాఖ్యాత - డి.ఎన్.దీక్షిత్
ప్రచురణ - శ్రీ శంకర సేవాసమితి (రిజి), శ్యామలానగర్, గుంటూరు - 522 066.

అనంతం-26

$
0
0

అది అనుకుండట్టే మొగపిల్లోడే బుట్టిండుగానీ, పేర్దెచ్చే గొప్పోడు గాదు! యదవనాకొడుకు బుట్టిండు.. ఏం శాత్తావూ!
దేవతసువంటిది నా పెండ్లాం! ఇసువంటి కొడుకునిగని తండాకి సెడ్డ పేరుతెత్తాడంటే రుూడ్నదే సావనూకేది. దేవతగాని కొడుకునిట్టా సూళ్ళేక ముందుగాల్నే సచ్చింది. సూత్తా అవమానాలు భరిత్తా నేను మాత్తరవ్ సచ్చి బతుకుండాను.
రాగ్యా శండాలపోడని నేనే సెప్తున్నా నింకా యిసారణలూ, సాచ్చీకాలూ ఏంటికి! ఆడేడుండాడో సూచి యత్తకరండి. సావగొట్టండి అని కాళీచరణ్ వలవలా ఏడ్చాడు.
అందరూ కొద్ది క్షణాలు నిర్విణ్ణులయ్యారు!
సూర్యోదయంతోనే అడవికి వెళ్ళటం, సంపద సేకరించి సాయంత్రానికి ఇల్లు చేరటం, కొడుక్కింత వండిపెట్టి తాను తినటం, నిద్రపోవటం తప్ప ఏ విషయాలూ పట్టించుకోడు కాశీచరణ్.
వౌనంగా వుంటాడు. నిర్వికారంగా తన పని తాను చేసుకొని పోతుంటాడు. యాంత్రికంగా బ్రతుకుతుంటాడు. మిన్నువిరిగి మీద పడుతుందన్నా చలించడు.
అలాంటివాడు కొడుకుచేసిన పనికి కుమిలిపోతూ అలా గుండె పగిలేలా ఏడవటం అందరికీ బాధనిపించింది.
‘‘ఇందులో నీ తప్పేంటిదుంది.. యాడవగాకు..’’ అన్నాడు బాణావతు.
‘‘గాచారవ్ అట్టాగుంది. నువ్వేటి జాస్తావ్‌వే’’ అన్నాడు నగ్గూరాం.
సానుభూతి భరించలేకపోతున్నాడు కాళీచరణ్!
‘‘గాచారవ్ గాదూ, వల్లకాడుకాడు! రాగ్యాగాడ్ని సావగొట్టండి. వాడి గాచారవని అప్పుడనండి’’ అన్నాడు కన్నీళ్ళు తుడుచుకుంటూ.
నిశ్శబ్దం ఆవరించిందక్కడ!
రాగ్యా కోసం వెతుకుతూ వెళ్లి కొంతమంది హడావిడిగా తిరిగొచ్చారు.
‘‘రాగ్యా కనిపిచ్చలేదా?’’ బాణావతు అడిగాడు.
‘‘కనిపిచ్చిండు’’
‘‘పట్టరాలేదేంటిది’’
‘‘పారిపోయిండు’’ అని చెప్పారు వాళ్ళు.
‘‘యాడ కనిపిచ్చిండు’’ బాణావతు మళ్లీ అడిగాడు.
‘‘ఇంట్లోనే వుండాడు. మమ్మల్ని సూసి కంచె దుమికి పారిపోయిండు’’
అందరూ అనుమానంగా కాళీచరణ్‌ని చూశారు!
కాళీచరణ్ అబద్ధం చెప్పాడా?
వాళ్ళంతా తన వైపు ఎందుకలా అనుమానంగా చూస్తున్నారో కాళీచరణ్‌కి అర్థమయ్యింది!
మళ్లీ అందరికీ దణ్ణం పెట్టాడు. ఏడుపు దిగమింగుతూ-
‘‘నన్నట్టా సూడగాకండి! సెట్టు తల్లి సాచ్చిగా అడవి తల్లి సాచ్చిగా సెప్తుండాను! సెట్టుకాడికినేనొచ్చేప్పుడు రాగ్యా ఇంటో లేడు. ప్రెవాణకవే జెయ్యవంటే శాత్తాగూడా!
తరువాత వొచ్చుంటాడు. అది నాకు తెలవదుగదా!
అడవి తల్లినీ, ఆశారాల్నీ నమ్మినోడ్ని.. కొడుకుని ఇంటో దాపెట్టి లేడని సెప్తానా?
ఆడుసేసింది తప్పు.. నాకూ తెలుసు.. తప్పు సేసినోడ్ని రచ్చిచ్చటానికి నేనేవీ యదవనుగాను.. కొడుకయితే ఏంటిదంట! తప్పుజేసినాక ఎవుడ్నయినా శిచ్చిచ్చాలంతే!
యాడికిబోయిండో యతకండి. సెట్టుకు కట్టేసి బాగా సావగొట్టండి. వల్లగాకుంటే సింతబరికె నాకియ్యండి. మీకాడికి నేనే బాగా గొడతాను’’ అన్నాడు కాళీచరణ్.
‘‘రాగ్యాగాడు దొరికినాకనే పంశాయితీ! ఇందులో కాళీచరణ్ తప్పేటీ లేదని తీరువానమయ్యింది’’ అని, తండా వాళ్ళతో బాణావతు అన్నాడు.
ఎవరి పనులకు వాళ్ళు వెళ్లిపోయారు.
వాళ్ళు గమనించలేదు కానీ,
ఇంట్లోనుంచి పారిపోయిన రాగ్యా, గరుడాచలం దగ్గరికి వెంటనే వెళ్ళలేదు. పంచాయితీ చెట్టుకు కొంచెం దూరంగా పొదల్లో నక్కి కూర్చుని, అక్కడ జరిగిందంతా చూసాడు!
రాగ్యా వొళ్ళు మండింది!
కోపంతో రగిలిపోయాడు.
చివరికి కన్న తండ్రి కూడా వాళ్ళవైపలే ఉన్నపుడు తండాతో ఇకనాకేమిటి సంబంధం అనుకున్నాడు.
తనకోసం వెదకుతున్న కుర్రవాళ్ళ కంట పడితే చాలా ప్రమాదం!
రాగ్యా ఇక ఆలస్యం చెయ్యలేదు. పొద్లో నుంచి నిశ్శబ్దంగా పైకి లేచాడు. చుట్టూ చూసాడు.
ఎవ్వరూ గమనించటంలేదు!
అక్కడ్నించి పరుగు లంకించుకున్నాడు.
అసలికే వొళ్ళంతా నెప్పులతో సలుపు తీస్తున్నది తలమీది గాయం బాధిస్తున్నది. జ్వరం వచ్చినట్టుంది.
అలాంటి పరిస్థితిలో విశ్రాంతిగా పడుకుంటే కొంత సేపటికి శక్తి పుంజుకొనేవాడు. అలాంటి అవకాశం లేకుండా పోయింది. పరిగెత్తటం అనివార్యమైంది కానీ, నిజానికి రాగ్యాకిప్పుడు అంత శక్తి లేదు.
అతని శరీరం నుండి చెమట ధారలు కడుతోంది. పరుగెత్తీ, పరుగెత్తీ అలసటగా, ఆయాసంగా వుంది. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి.
మరో వైపు ఆలోచనల వడ్రంగి పిట్టలు ముక్కులతో పొడుస్తున్నాయి!
కన్నకొడుకు రక్షణకు రానివాడూ ఒక తండ్రేనా? సాంప్రదాయాలు.. ఆచారాలు, కట్టుబాట్లే ముఖ్యమని తండ్రి భావించినపుడు అలాంటి తండ్రితో ఇక అనుబంధం ఏమిటి?
కన్నతండ్రికన్నా గరుడాచలమే నయమనిపించాడు!
అతని ఆశయంలో వుండి అద్భుతాలు సాధించాలి. జీవితాన్ని సుఖమయం చేసుకొని గొప్పవాడై అప్పుడు కనిపించాలి- అనాగరికులైన తండావాళ్ళకి.
చాంద్‌నీ తిరస్కరిస్తున్నది కూడా తను గొప్పవాడుకానందుకే కదా!
ధనం, పలుకుబడి, నాగరికత, పట్నంవాసం, విలాసవంతమైన జీవితం సాధిస్తే -తను వెంటపట్టంకాదు, చాందినీయే తన వెంటపడి వస్తుంది!
(ఇంకా ఉంది)

శ్రీ వేంకటేశ్వర సహస్ర నామావళి

$
0
0

శ్రీవేంకటేశ సహస్రనామావళి (వరివస్యా వ్యాఖ్యాసమేతము)
- వ్యాఖ్యాత: డా. కె.వి.రాఘవాచార్య, పేజీలు:374, వెల:రూ.432/-
ప్రతులకు:డా. కె.వి.రాఘవాచార్య, 106, శ్రీపాద కేశవ టవర్సు, 11-35, ఎస్.వి.నగరు,
తిరుపతి- 617502. ఫోన్: 9704342668.
-------------------------------------------------------------------------------------------------------------------
నిరంతర సాహిత్య కృషీవలులు, శ్రీ వేంకటేశ్వర సాహిత్య సేవకుడు అయిన శ్రీ కె.వి.రాఘవాచార్యులవారు శ్రీ వేంకటేశ్వర సహస్రనామాలకు చేసిన అద్భుత వరివస్యావ్యాఖ్యాన గ్రంథమే ఇది.
ఈ వేంకటేశ్వర సహస్రనామాలలోని ఒక్కొక్క నామం ఒక మంత్రమని సంప్రదాయజ్ఞుల విశ్వాసం. అందువలన మొత్తం నామాలన్నీ కలిసి మంత్రశాస్త్ర విధానంలో ఇది ఒక మహామాలామంత్రమవుతుంది. ఈ స్తోత్రం బ్రహ్మాండ పురాణంలో 12వ అధ్యాయంలో వసిష్ట నారద సంవాదతాత్మకంగా ఉన్నది.
రచయిత ఈ గ్రంథానికి ముందుగా వ్రాసిన ‘ప్రరోచన’లో ఈ నామాల చరిత్ర, ఎవరెవరు ఎలా పూజించారో, వాటికి ఆ రాజులచే కేటాయించబడిన ఖర్చులు- వీటి వివరాలు తిరుమల ఆలయానికి గల వివిధ ప్రాకారాలలోని గోడలపైన చెక్కబడిన శాసనాలలో వివరించబడినది ఇచ్చారు. అలాగే ఈ నామాలు కొన్ని విష్ణుసహస్రనామాలలో సుమారు 130 ఉన్నవని చెప్పారు. ఇంకా వేంకటేశుని చరిత్రను, వేంకటాచలమునకు సంబంధించినవి 56 నామాలు మాత్రమే ఉన్నవని అన్నారు. శ్రీ వరాహస్వామికి సంబంధించిన నామాలు ఏడు, మిగిలిన నామాలు భగవంతుని వివిధ అవతారాలకు, గుణాదులకు సంబంధించినవని చెప్పారు.
శ్రీ ఈ.ఏ.శింగరాచార్యులవారు తమ ముందుమాటలో (వరివస్యావైభవం) వ్రాస్తూ శ్రీ వేంకటేశ్వర సహస్రనామాలను తెలుగులో ఇంత విశదమైన వ్యాఖ్య రాలేదన్నారు. ఇంకా మొదటి 67 నామాలు స్వరూప విశేషాలు, తరువాత సుమారు 400 నామాలు పలు అవతారాల వైభవాన్ని తెలుపుతున్నాయి. మత్స్యావతారం, అమృతమథన, కూర్మ, ధన్వంతరి, మోహినీ అవతారాలు, వరాహావతారం, నృసింహావతారం, పరశురామావతారం, రామావతారం, కృష్ణావతారం, బుద్ధావతారం, కల్కి అవతారం, అంతరాదిత్యరూపం, హయగ్రీవ అవుతారం, గజేంద్ర మోక్షం ప్రస్తావించబడ్డాయని చెప్పారు. ‘శ్రీవేంకటేశాయనమః’ అనే మొట్టమొదటి నామానానికి రచయిత ఇచ్చిన సమగ్రమైన వ్యాఖ్యాన వివరణ వ్యాఖ్యాత యొక్క సమర్థతకు, బహుముఖమైన ప్రతిభకు, విషయ పరిజ్ఞానానికి, విషయ ప్రతిపాదన కౌశలానికి నిదర్శనం. ‘వేం’ ‘కట’ అనే రెండు పదాలకు వివరణ పురాణాలను ప్రమాణంగా చెప్పుతూ వివరించారు. అలాగే ‘సేతుకృతే నమః’ వ్యాఖ్యకు రచయిత ఎన్నో సాక్ష్యాలు తంజావూరు గ్రంథాలయం నుంచి సంపాదించి దీనిలో వేసిన చిత్రపటం, వీరి నవీన పరిశోధనా నైపుణ్యాన్ని వ్యక్తపరుస్తున్నది.
అలాగే ‘సర్వభక్త సముత్సుకాయ నమః’ నామాన్ని వ్యాఖ్యానించేటప్పుడు, కాకినాడ కోర్టులో 15-10-1888న శ్రీ వేంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రత్యక్షమై తన భక్తుని రక్షించటానికై సాక్ష్యమిచ్చాడు (పే.185). తన భక్తుడైన నల్లప్ప శెట్టి రెండు వేల రూపాయలు అతడి మిత్రుడైన ఖాసిం సాహెబు నుంచి అప్పుగా తీసుకుని తరువాత తీర్చేసినా, ఖాసిం తన అప్పు తీర్చలేదని శెట్టిమీద దావా వేస్తే స్వామి సాక్షిగా కోర్టుకు వచ్చి సాక్ష్యమిచ్చాడట. ఆస్తికులు ఇది నమ్మినా అప్పు తీసుకున్న రూపాయలు అనగా రెండువేలు - ఇది కొంత అనౌచిత్యముగా ఉన్నది. ఎందుకంటే అప్పుడు రెండు వేలు అంటే చాలా పెద్ద మొత్తము. ఇంకొక నామం ‘బ్రహ్మోత్సవ సముత్సుకాయ నమః’ నామానికి వ్యాఖ్యత సుదీర్ఘ వ్యాఖ్యానం చేశారు (పు.330). బ్రహోత్సవ ఆవిర్భావం, దాని వైశిష్ట్యము, ఆంగ్లంలో ఇచ్చిన ఎక్స్‌ట్రాక్ట్- ఇలా అన్నీ ఇవ్వటం వ్యాఖ్యాత యొక్క విషయ పరిజ్ఞానానికి నిదర్శనం. గ్రంథం చివరలో అకారాది క్రమంలో నామాలు, పుట సంఖ్య, అలాగే స్తోత్రం, విడిగా నామాలు ఇవ్వటం పాఠకులకు ఎంతో ఉపయోగిస్తుంది. ఇటువంటి అద్భుతమైన వ్యాఖ్యాన గ్రంథాన్ని సరళంగా తెలుగులో అందించి ఇచ్చిన వ్యాఖ్యాత పాండిత్యాన్ని విషయ కౌశీలతను, విషయ పరిజ్ఞానాన్ని- అంతటికీ మించి శ్రీ వేంకటేశ్వరుని సేవలను మరియొకసారి అభినందిస్తున్నాను. ప్రతి ఆస్తికుడు పఠించి తెలుసుకొనవలసిన గ్రంథమిది.

మరీచిక -వాసిరెడ్డి సీతాదేవిరంగనాయకమ్మ

$
0
0

చెదపట్టిన నిత్య జీవిత పుస్తకం పుట లక్షణాలనుంచీ కట్టుకొయ్యక్కట్టిన పశువుల్లాటి విసుగెత్తించే రోజుల్నుంచీ, రూపాయిల వాసన వేసే మనుషులనుంచీ, బిగుసుకుపోయిన పొడిబారిన ముఖాలనుంచీ తప్పించుకొని కాసేపు సంతోషంగా గడపాలంటే సాహిత్యమే శరణ్యం.
ఏ దేశ సంస్కృతిని తెలుసుకోవాలన్నా ఆ దేశ సాహిత్యం గురించి తెలుసుకోవడం తప్పనిసరి. నిజమైన సాహిత్యం ఆనాటి సమాజాన్ని ప్రతిబింబిస్తూనే వుంటుంది. ఆనాటి భారతం, రామాయణం ఈనాటికీ నిలిచి వున్నాయంటే సమాజ చిత్రణను అద్దంలా ప్రతిఫలించడమే ముఖ్య కారణం. సమాజంలోనైనా, సాహిత్యంలోనైనా పురుషాధిక్యత అనూచానంగా వస్తూనే వుంది. 18వ శతాబ్దం వరకు పుంఖానుపుంఖాలుగా వున్న రచయితలలో ఏ మొల్లో, ముద్దుపళనో తప్ప మరొక రచయిత్రి లేదు. ఒకప్పుడు స్ర్తికి ‘‘విద్య అవసరమా! అనవసరమా!’’ అనే విషయం చర్చనీయాంశం అయిందంటే మనిషికి తప్పనిసరయిన ప్రాథమికావసరాలు కూడా స్ర్తివిషయం వచ్చేసరికి పోరాడితేగాని సాధ్యపడని పరిస్థితి సంఘంలో ఉన్నదని తెలుస్తూనే వుంది. కందుకూరి వీరేశలింగం, రాజారామ మోహనరాయ్ మొదలగువారు స్ర్తి విద్య ఆవశ్యకతను గూర్చినొక్కి చెప్పినాక స్ర్తిలు విద్యావంతులైనారు. ఉద్యోగస్థులైనారు. స్వేచ్ఛ రెక్కలు తొడుక్కున్నారు.
అరవయ్యవ దశకంలో రచయిత్రుల యుగం వచ్చినట్లే అనిపిస్తుంది. యద్దనపూడి సులోచనారాణి, కోడూరి కౌసల్యాదేవి, వాసిరెడ్డి సీతాదేవి మొదలగువారందరు ఆనాటి వారపత్రికల్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలారు. ఆనాడు కొందరు పురుష రచయితలు కూడా స్ర్తిల పేర్లు పెట్టి పత్రికలకు రచనలు పంపించారంటే ఆనాటి రచయిత్రుల వైభవాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.
కానీ అప్పటి స్ర్తిల సాహిత్యాన్ని వంటింటి సాహిత్యమని ఎద్దేవా చేశారు. ఆడవాళ్ల సాహిత్యమని వంకరగా పలికారు. ఇవన్నీ పట్టించుకోకుండా ఆలోచిస్తే ఆనాటి రచయిత్రులు వాళ్లకు పరిమతమైన ప్రపంచాన్ని గురించే సహజంగా వర్ణించారు. పాఠకులు వాళ్లకు నీరాజనాలిచ్చారు.
అలాటి రచయిత్రుల యుగంలో విభిన్నమైన వస్తువుల్ని తీసుకొని ఆనాటి సమాజాన్ని తన రచనలలో ఆవిష్కరించిన వ్యక్తి డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి.
వీరు గుంటూరు జిల్లాలోని చేబ్రోలులో 1932లో జన్మించారు. 39 నవలలు, 9 కథా సంపుటాలు, 3 వ్యాస సంపుటాలు ప్రచురించారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయం, మద్రాసు తెలుగు అకాడమీ మొదలగు ఇరవై సంస్థల నుండి అవార్డులు అందుకొన్నారు.
ఈమె పరదా పద్ధతి పాటించే అతి సాంప్రదాయ కుటుంబంలో పుట్టి పెళ్లి చేస్తామంటే తిరస్కరించి, బయటకు వచ్చి స్వయంకృషితో ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ రంగంలో ఎన్నో ఉన్నతోద్యోగాలు చేశారు.
సీతాదేవి లెక్కకు మించి ఎన్ని రచనలు చేసిన ఆవిడకు ప్రధానంగా కీర్తి తెచ్చిపెట్టినవి నవలలే. ఈవిడ రచించిన మట్టిమనిషి 14 భాషల్లో అనువాదమైతే, మరీచిక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిషేధానికి గురైంది.
తోటి రచయిత్రులు కుటుంబ వృత్తాంతాన్ని, ప్రేమకథల్ని ఇతివృత్తంగా తీసికొంటే సీతాదేవిగారు మాత్రం సంక్షుభితమైన సమస్యలతో అల్లకల్లోలమైన సంఘాన్ని తన రచనలకు ఇతివృత్తంగా ఎన్నుకొన్నారు.
పితృస్వామ్య వ్యవస్థను, పెట్టుబడిదారీ సమాజంలోని లోపాలను తన కలంకత్తితో చీల్చి చెండాడుతూ, సజీవమైన పాత్రల్ని సృష్టించి, సంఘం వీపుపై చెర్నాకోల దెబ్బలవంటి నవలల్ని రాశారు. అలాటి నవలే మరీచిక.
ఈ నవల 89లో మొదటి ముద్రణ పొందింది. తర్వాత 82, 83, 85, 95, 2000లలో మలి ముద్రణలు పొందింది. పుస్తకంగా రాకముందు ఈ నవల 1978లో ఆంధ్రభూమి వారపత్రికలో ధారావాహికంగా ప్రచురించబడింది. ప్రభుత్వానికి అభ్యంతకర విషయాలున్నాయని 82లో దీన్ని నిషేధించారు. ఈ నిషేధానికి వ్యతిరేకంగా అందరూ పోరాడిన తరువాత ఈ నిషేధాన్ని ఎత్తేశారు.రెండు దశాబ్దాల కిందట యువతరాన్ని పట్టి పీడించిన హిప్పీయిజం, నక్సలిజం సమస్యల గురించి, విద్యార్థులపై వాటి దుష్ప్రభావం గురించీ, దీనికంతటికీ కారణమైన అస్తవ్యస్తమైన సంఘం గురించీ ఎక్కుపెట్టిన బాణమే మరీచిక నవల.ఏ సమాజానికైనా యువతరం జీవగర్ర వంటివారు. దేశాన్నిగానీ, సంఘాన్ని గానీ ఉన్నత పథాలవైపు తీసుకువెళ్లాలన్నా అధోగతిలో పడేయాలన్నా వారే ముఖ్యకారకులు. ఆనాడు భారతదేశ స్వాతంత్య్రోద్యమంలో ఎంతోమంది యువకులు చదువులు వదిలేసి ఉద్యోగాలు తృణీకరించి జీవితాలను దేశం కోసం అర్పించారు.
-సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

శ్రీనరసింహ శతకము

$
0
0

సీ తనువులో ప్రాణముల్ -తరలిపోయెడి వేళ
నీ స్వరూపమును ధ్యా నింపవచ్చు
నిమిష మాత్రములోన నిన్నుఁజేరునుగాని
యముని చేతికిఁజిక్కి శ్రమలఁబడడు
పరమ సంతోషాన - భజన చేసెడివారి
పుణ్యమేమనవచ్చు-్భగిశనయ!
మోక్షము నీదాస- ముఖ్యుల కుఁగాని
నరక మెక్కడిదయ్య - నళిననేత్ర
తే కమలనాభ!నీ మహిమను గానలేని
తుచ్ఛులకు ముక్తి దొరుకుట దుర్లభంబు
భూషణ వికాస! శ్రీ ధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర
భావం: ఓ నరసింహస్వామి! ప్రాణం విడిచి వెళ్ళేవాడు చిట్టచివర నిన్ను ధ్యానిస్తే, వెంటనే మోక్షాన్ని అందుకుంటాడు. అతనికి నరకబాధ తప్పుతుంది. మహానందంతో నీ భజన చేసేవారు పుణ్యాత్ములు. నీ భక్తులకే మోక్షమబ్బుతుంది. నరక బాధలు వారినంటవు. నీ గొప్పదనం తెలీని అజ్ఞానులకు సంసార బంధ విముక్తి అబ్బదు.

maatata

$
0
0
Cross Image: 
Date: 
Thursday, January 3, 2019

‘పంచాయతీ’ ఎన్నికలకు మోగిన నగారా

$
0
0

ఆదిలాబాద్, జనవరి 1: పంచాయతీ ఎన్నికలకు నగారా మోగింది. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ మంగళవారం ఎట్టకేలకు నోటిఫికేషన్ జారీ చేసింది. శాసన సభ ఎన్నికలు పూర్తికావడంతో ఇక స్థానిక సమరానికి రాజకీయ నేతలు సన్నాహలు సాగిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని 467 గ్రామపంచాయతీలు, 3822 వార్డులు, నిర్మల్ జిల్లాలో 396 పంచాయతీలు, 3338 వార్డులు, మంచిర్యాల జిల్లాలో 325 పంచాయతీలు, 2730 వార్డులు, కుమురంభీం జిల్లాలో 334 పంచాయతీలు, 2864 వార్డులకు మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించేలా నోటిఫికేషన్ జారీ అయింది. జనవరి 21న మొదటి విడత పోలింగ్ నిర్వహిస్తుండగా జనవరి 25న రెండో విడత పోలింగ్, అదే విధంగా 3వ విడత పోలింగ్ జనవరి 30న నిర్వహించేందుకు ఎన్నికల సంఘం గజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. నవంబర్ 19 వరకు ఓటరు జాబితాలో ఓటు హక్కు కలిగి ఉన్నవారికి మాత్రమే పంచాయతీ ఎన్నికల్లో ఓటు వినియోగించుకునేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు నిర్వహిస్తుండగా ఈసారి బ్యాలెట్ పత్రంలోనే నోటా గుర్తు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు ఫలితాలు వెలువడి కానున్నాయి. సర్పంచ్ అభ్యర్థిగా పోటీచేసే జనరల్ అభ్యర్థికి రూ.2వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.వెయ్యి డిపాసిట్ చేయాల్సి ఉంటుంది. వార్డు సభ్యులుగా పోటీచేసే వారు జనరల్ కేటాగిరిలో రూ.500, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 250 డిపాసిట్ చేయాల్సి ఉంటుంది. ఈసారి 500 జనాభా దాటిన తాండాలు, గిరిజన గూడేల్లో సైతం పోలింగ్ నిర్వహించడంతో రాజకీయ కొలాహలం నెలకొంది.
పోలింగ్ జరిగే డివిజన్లు ఇవే..
తొలి విడతగా జనవరి 21న జరిగే పోలింగ్‌కు సంబంధించి నోటిఫికేషన్ జారీ కాగా ఆదిలాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 30 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడతగా ఆదిలాబాద్ డివిజన్ పరిధిలో గల బోథ్ నియోజకవర్గంలోని 30 గ్రామపంచాయతీల్లో, మూడో విడతగా ఉట్నూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఇంద్రవెల్లి, ఉట్నూరు మండలాలకు సంబంధించి 28 గ్రామపంచాయతీల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. అదే విధంగా ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో సైతం మూడు విడతల్లో పోలింగ్ నిర్వహించేలా నోటిఫికేషన్ జారీ అయింది. ఈనెల 21 తొలివిడతగా జరిగే పోలింగ్ కోసం 7వ తేదీన షెడ్యూల్ జారీ కానుంది. 25న జరిగే పోలింగ్ కోసం 11న షెడ్యూల్ విడుదలకానుండగా 30న జరిగే మూడో విడత పోలింగ్ కోసం 16వ తేదీన షెడ్యూల్ జారీ చేయనున్నారు. తొలి విడత పోలింగ్‌కు జనవరి 7 నుండి నామినేషన్ల స్వీకరించనుండగా రెండోదశ 25న జరిగే పోలింగ్ కోసం జనవరి 11 నుండి నామినేషన్లు స్వీకరించనున్నారు. మూడో విడత 30న జరిగే పోలింగ్ కోసం 16 నుంచి నామినేషన్ పత్రాలను స్వీకరించనున్నారు.

ఆధునిక సాంకేతిక
పరిజ్ఞానంతో నేరాల అదుపు
* ఎస్పీ శశిధర్‌రాజు
నిర్మల్, జనవరి 1: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను అదుపు చేస్తామని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్‌రాజు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో 2019 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కేక్‌కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గడిచిన సంవత్సరం పోలీసుశాఖలో ఎన్నో నూతన ఒరవడులు, ఆధునిక సాంకేతికతను అందించడమే కాకుండ సిబ్బంది పూర్తిస్థాయి కార్య నిబద్దతను ప్రదర్శించడానికి దోహదపడిందని తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో సహితం జిల్లా పోలీసులు అదేశైలీలో వారి వారి విధులను నిర్వర్తిస్తూ జిల్లాలో నేర శాతాన్ని నియంత్రించి ప్రజలకు మరింత చేరువ అవ్వాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నిర్మల్, భైంసా డీ ఎస్పీలు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్‌స్పెక్టర్, సీఐలు, ఎస్సైలు, క్యాంప్ సీసీ, సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీకి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం నూతన సంవత్సర శుభాకాంక్షలను ప్రముఖ వ్యాపారవేత్త అల్లోల మురళిధర్‌రెడ్డి, పాకాల రాంచందర్, ముత్యంరెడ్డి, వినోద్ మల్లికార్జున్ తెలిపారు. ఎస్పీ శశిధర్‌రాజును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఘనంగా అయ్యప్ప
దేవాలయ వార్షికోత్సవం
ఉట్నూరు, జనవరి 1: స్థానిక మండల కేంద్రంలోని హరిహరసుత అయ్యప్ప స్వామి దేవాలయ 3వ వార్షికోత్సవ వేడుకలను మంగళవారం అయ్యప్ప సేవా సమితి సభ్యులు, అయ్యప్ప భక్తులు ఘనంగా జరుపుకున్నారు. వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా గణపతి, మృత్యుంజయ హోమాలు, నవగ్రహ పూజలు, అయ్యప్పస్వామి మూలవిరాట్‌కు అభిషేకం, అష్టదిక్కుల శాంతి కార్యక్రమాలు చేపట్టారు. ఈకార్యక్రమాలు చెన్నూరుకు చెందిన వేద పం డితులు రజని అధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం భజన, అయ్యప్ప పడిపూజ, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి దీపక్‌దూబె, సేవా సమితి సభ్యులు కృష్ణస్వామి, సంజీవ్‌రెడ్డి, దయాకర్, తిరుపతి రెడ్డి, వీరాలాల్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

నూతన లక్ష్యాలతో ముందుకు సాగాలి

$
0
0

మంచిర్యాల, జనవరి 1: నూతన సంవత్సరంలో నూతన లక్ష్యాలతో పోలీస్ శాఖ ముందుకు సాగాలని రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ అధికారులకు సూ చించారు. కమిషనరేట్ కార్యాలయంలో ఆవరణంలో పోలీస్ అధికారులతో కలిసి నూతన సంవత్సర సందర్బంగా ఆయన కేక్ కట్‌చేసి, కమిషనరేట్ పరిధిలోని
ప్రజలకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా రామగుండం సిపి సత్యనారాయణ మాట్లాడుతూ కమీషనరేట్ పరిధిలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా పోలీసింగ్ నిర్వహించాలన్నారు. సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ముందుకు సాగాలని తెలిపారు. గతేడాది జరిగిన రోడ్లు ప్రమాదాల్లో చాలా మంది మృత్యువాత పడ్డారని ఇలాంటి పరిస్థితి ఈ ఏడాది ఉండకూడదని గంజాయ్, పిడి ఎస్ రైస్ అక్రమ రవాణా పూర్తి స్థాయిలో నిర్ములిస్తామన్నారు. మహిళ వేధింపులు సహించబోమని తెలిపారు. వేధింపుల నివారణ కోసం షీ టీమ్‌లను కమీషనరేట్ పరిధిలో మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. రౌడీ యిజం ఏ రూపంలో ఉన్నా ఉక్కుపాదం తో అణిచి వేస్తామని హెచ్చరించారు. తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి 2019 ప్లాన్ ప్రకారం ఫ్రెండ్లీ పోలీస్ గా ప్రజలతో ఉండాలని, కానీ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారి పట్ల ప్రజలు శాంతి యుత , స్వేచ్చ వాతావరణంకి భంగం కలిగించకుండా వాటి పట్ల కఠినంగా ఉండాలన్నారు. రామగుండం కమీషనరేట్ పోలీస్ అధికారులు హోం గార్డు నుండి ఉన్నత అధికారుల వరకు ప్రజలతో మంచి సత్సబంధాలు కలిగి ఉండాలని తెలిపారు. స్నేహా పూర్వక పోలీస్ విధానాన్ని అవలంభిస్తు కమీషనరేట్ పోలీస్ బాధ్యతయుతంగా, జవాబు దారితనంతో పారదర్శకంగా పని చేస్తు ప్రజల ధన, మాన , ప్రాణాల రక్షణ కోసం అనుక్షణం పని చేయాలన్నారు. ప్రజల భద్రతే ముఖ్య లక్ష్యంగా రామగుండం కమీషనరేట్ పని చేస్తుందని తెలిపారు. ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ ప్రజలు శాంతియుత వాతావరణంలో ఎలాంటి ఆభద్రత భావం లేకుండా పోలీస్ మన కోసం ఉ న్నారనే నమ్మకంతో ఉండేలాగా పోలీసులు కృషి చేయాలని అన్నారు. శాంతి భద్రతలకు, స్వేచ్చకు భంగం కలిగేలా ప్రవర్తించ కూడదని శాంతిభద్రతల విషయంలో రాజీ పడేది లేదని, ఎలాంటి గొడవలు, అల్లర్లు, అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదని, చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నేరాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. ప్రజల భద్రత, శాంతియుత వాతావరణం నెలకొల్పి , నేరాల నియంత్రణే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం కమీషనరేట్ ఉన్నతాధికారులు, అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
కోలాహలంగా న్యూ ఇయర్ జోష్..
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, జనవరి 1: గతించిన కాలానికి వీడ్కోలు పలుకుతూ, కొత్త సంవత్సర ఆరంభానికి స్వాగతం పలుకుతూ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్నంటాయి. మంగళవారం ఉదయం నుండే ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రాల్లో పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందోత్సవాలతో ప్రజలు వేడుకల్లో పాలుపంచుకున్నారు. దేవాలయాలు, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు, పూజ కార్యక్రమాలతో కిటకిటలాడాయి. కొత్తగా ఎన్నికైన శాసన సభ్యుల నివాస గృహాల్లో అభినందనల వెల్లువతో సందడి చేశాయి. జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో కలెక్టర్, ఎస్పీలను కలుసుకునేందుకు వివిధ శాఖల అధికారులు, ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు బారులు తీరారు. ఆదిలాబాద్‌లోని మాజీమంత్రి, ఎమ్మెల్యే జోగురామన్న నివాసం వద్ద కార్యకర్తలు హంగామా సృష్టించి అభినందనలతో ముంచెత్తారు. ఇదిలా ఉంటే ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు ఆమాంతం పడిపోయి 3 డిగ్రీలకు చేరుకున్న నేపథ్యంలో ఆదిలాబాద్ కలెక్టర్ దివ్యదేవరాజన్ వినూత్న నిర్ణయం తీసుకొని అందరి మన్ననలు పొందారు. తన వద్దకు పుష్పగుచ్చాలు, శాలువాలతో రావద్దని, కొత్త సంవత్సరం వేళ నిరుపేదలకు అత్యవసరంగా భావించే రగ్గులు, బ్లాంకెట్లను వెంట తీసుకరావాలని సూచించారు. ఇందుకు స్పందించిన అధికారగణం, ప్రజా ప్రతినిధులు, వ్యాపారవర్గాలు భారీ ఎత్తున రగ్గులు తీసుకవచ్చి కలెక్టర్‌కు అందించడంతో వాటిని అప్యాయంగా స్వీకరించిన కలెక్టర్ అందరికి ధన్యవాదాలు తెలిపారు. ఒక్కరోజే కలెక్టర్‌ను కలిసి రగ్గులు పంపిణీ చేయడంలో కలెక్టర్ నివాసగృహంలోని ఓ గది నిండా నూలు దుస్తువులు, రగ్గులతో నిండిపోయింది. జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్, డి ఎస్పీ నర్సింహారెడ్డి అధ్వర్యంలో పోలీసు అధికారులు ఉదయమే కలెక్టర్ దివ్యను కలిసి అభినందనలతో ముంచెత్తారు. అనంతరం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, పట్టణ ప్రముఖులతో పాటు కాంగ్రెస్ నాయకులు సుజాత, సోయం బాపురావుప్రత్యేకంగా కలెక్టర్‌ను కలిసి కొత్త సంవత్సరం వేళ శుభాకాంక్షలు తెలిపారు. టీయూడబ్ల్యుజె అధ్వర్యంలో చలి తీవ్రత నేపథ్యంలో సామాజిక బాధ్యతగా జర్నలిస్టులు సైతం భారీ ఎత్తున దుప్పట్లు, రగ్గులు కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీకి శ్రీకారం చుట్టారు.

కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలి

$
0
0

వినాయక్‌నగర్, జనవరి 1: నూతన సంవత్సరంలో సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని జిల్లా జడ్జి సుజన ఆకాంక్షించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీహరిఆచార్య, ప్రధాన కార్యదర్శి జగన్‌మోహన్‌గౌడ్‌ల ఆధ్వర్యంలో న్యాయవాదుల బృందం ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి సుజన మాట్లాడుతూ, జనవరి 1వ తేదీన తెలంగాణ రాష్ట్రానికి హైకోర్టు ఏర్పడడం చారిత్రకఘట్టంగా మిగిలిపోతుందని అన్నారు. తెలంగాణ న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరింతగా పెంపొందింపజేస్తూ, న్యాయ సేవలను విస్తృతం చేయాలని కోరారు. కొత్త సంవత్సరంలో మంచి నిర్ణయాలతో అందరి మంచిని కోరుకుంటూ ముందుకెళ్లాలని అభిలషించారు. జిల్లా జడ్జిని కలిసిన వారిలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు దేవిదాస్, న్యాయవాదులు బీ.మానిక్‌రాజ్, ఆశ నారాయణ, శ్రీనివాస్, కేశవరావు, కృష్ణానంద్, రామకృష్ణ ఉన్నారు.

సైన్స్‌ఫేర్‌లో సత్తాచాటిన విద్యార్థి
భీమ్‌గల్, జనవరి 1: మండలంలోని పల్లికొండ జడ్పీహెచ్‌ఎస్ ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న ఎస్.నితిన్ అనే విద్యార్థి రాష్ట్ర స్థాయి సైన్స్‌ఫేర్‌లో సత్తా చాటినట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు హరినాథ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల కామారెడ్డి పట్టణంలో అగస్త్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి సైన్స్‌ఫేర్ కార్యక్రమంలో నితిన్ అత్యుత్తమ ప్రతిభను కనబర్చాడని ఆయన పేర్కొన్నారు. నితిన్ సైన్స్‌ఫేర్‌లో ప్రదర్శించిన మ్యాజిక్ ట్రయాంగిల్ అనే నమూనాకు ద్వితీయ స్థానం లభించిందని వివరించారు. నితిన్‌కు 1500రూపాయల నగదు పారితోషికంతో పాటు సర్ట్ఫికేట్, మెమోంటోలను అగస్త్య ఫౌండేషన్ వారు అందజేశారని తెలిపారు. రాష్ట్ర స్థాయి సైన్స్‌ఫేర్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ద్వితీయ స్థానంలో నిలిచిన నితిన్‌ను పాఠశాల ఉపాధ్యాయ బృందం, ఎంపీటీసీ సభ్యుడు సుమన్, ఎస్‌ఎంసీ చైర్మెన్ కిషన్, తోటి విద్యార్థులు అభినందించారు.

భీమ్‌గల్‌లో నూతన సంవత్సర వేడుకలు
భీమ్‌గల్, జనవరి 1: భీమ్‌గల్ పట్టణంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో మంగళవారం నూతన సంవత్సర వేడుకలను యువకులు ఘనంగా నిర్వహించారు. సోమవారం రాత్రి 12గంటలకు భీమ్‌గల్ పట్టణంలో పలు యువజన సంఘాలకు చెందిన యువకులు, విద్యార్థులు టపాసులు పేలుస్తూ నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఉదయం పలు యువజన సంఘాల వారు ఆయా సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నూతన సంవత్సర కేకులను కట్ చేసి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని చర్చిల్లో కూడా క్రైస్తవులు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు.
కిటకిటలాడిన దేవాలయాలు
భీమ్‌గల్ మండలంలోని లింబాద్రి గుట్ట వద్ద గల శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి ఆలయంతో పాటు పట్టణంలోని వివిధ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నూతన సంవత్సరం సందర్భంగా మంగళవారం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేదబ్రాహ్మణులు శ్రీ లక్ష్మీనర్సింహస్వామికి ప్రత్యేక పూజలు జరిపారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భీమ్‌గల్ పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుండే మహిళలు దేవాలయాలకు తరలిరావడంతో ఆయా దేవాలయాలు భక్తులతో సందడిగా కనిపించాయి.

దేవన్‌పల్లిలో మల్లన్న ఉత్సవాలు
* అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
* ఆకట్టుకున్న ఎడ్ల బండ్ల ప్రదర్శన
కామారెడ్డి, రూరల్, జనవరి 1: మండలంలోని దేవన్‌పల్లిగ్రామంలోమల్లన్న ఉత్సవాలను, మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఆలయంలోఉదయం నుంచి సాయంత్రం వరకు మల్లన్న స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు ప్రతి ఇంటి నుంచి బోనాలను భాజాభజంత్రీలతో ఘనంగా ఊరేగింపుగా, వచ్చి స్వామి వారికి నైవేద్యాన్ని సమర్పించారు. అనంతరం అమ్మవారికి ఒడి బియ్యం పోసి, టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం ఎడ్ల బండ్ల ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. ఎడ్ల బండ్లను రంగు, రంగులతోసుందరంగా అలంకరించి, మల్లన్న ఆలయం చుట్టు ఐదుమార్లు ప్రదక్షిణ చేశారు. ఈఉత్సవాలలో చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు, భారీ సంఖ్యలోహాజరు కావడంతో, ఆలయం భక్తులతోక్రిక్కిరిసి పోయింది. ఈకార్యక్రమంలోఎంపీపీ లద్దూరి మంగమ్మ లక్ష్మిపతి యాదవ్, వైస్ ఎంపీపీ పోలీస్ కృష్ణాజీరావు, మాజీ సర్పంచ్ నిట్టు వెంకట్‌రావు, శివాజీ గణేష్‌యాదవ్, ఉర్దోండ రాజయ్య, గ్రామ అభివృద్ది కమిటి అధ్యక్షులు నిట్టు నారాయణ్‌రావు, నాగండ్ల రాజేంధర్, ఊరుగొండ నరేష్, నీలం సుధాకర్, కుర్ర శంకర్, ఎండ్రాల రాజలింగం, నీలం పెద్ద రాజులు, శ్రీకాంత్‌చారి,సత్యనారాయణ, బాలాస్వామి తిదితరులు పాల్గొన్నారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
నవచైతన్య యూత్ క్లబ్ ఆధ్వర్యంలోవెలికట్టవారి బృందం చే అభి కల్చరల్‌అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు పలువురిని అలరించాయి. ఈసందర్భంగా తమప్రదర్శనలు ప్రజలకు ఎంతగానో ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈకార్యక్రమంలో నవచైతన్య యూత్ క్లబ్ ప్రతినిధులు నవీన్, ప్రవీణ్, రాజేంధర్, రమేష్, శ్రీనివాస్, కృష్ణ, రాజు, సురేష్, మల్లేష్, స్వామి, నలేష్, రాజేష్, అంజి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు కోసం ఉద్యమిస్తాం
పీఆర్‌టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమాలాకర్‌రావు
నిజాంసాగర్, జనవరి 1: ఉపాద్యాయులు ఏకీకృత సర్వీస్ రూల్ అమలుకోసం ఉద్యమిస్తామని, పీఆర్‌టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమలాకర్ రావు అన్నారు. మంగళవారం నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ నీటిపారుదల శాఖ అతిథిగృహంలోనూతన సంవత్సరం సందర్భంగా కేక్‌ను పీఆర్‌టీయు రాష్ట్ర ప్రథాన కార్యదర్శితొపాటు టీఆర్‌ఎస్ నాయకులు రాంకిషన్‌రావులతోకలిసి కట్‌చేశారు. అనంతరం కమలాకర్‌రావు విలేఖరులతోమాట్లాడారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో, ఎమ్మెల్సీలు పూలరవీంధర్, కాటెపల్లిజనార్థన్‌రెడ్డిల సహాకారంతో, కేంద్రప్రభుత్వం పై ఒత్తిడి తీసుకు వచ్చి ఏకీకృత సర్వీస్ రూల్స్ సాధించుకునేంత వరకు ఉద్యమిస్తామన్నారు. ఉపాద్యాయ, ఉద్యోగులకు ఐఆర్ అండ్ పీఆర్‌సీ కల్పించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరిస్తామన్నారు. త్వరలోనే నూతన మంత్రి వర్గ విస్తరణ జరుగనుందని, విస్తరణ అనంతరం ఐఆర్ అండ్ పీఆర్‌సీ అమలు చేసేలా తన వంతు కృషి చేస్తానన్నారు. ఉపాద్యాయులకు 398 నోషనల్ ఇంక్రిమెంట్ అమలైయ్యేలా కృషిచేస్తామన్నారు. ఈవిలేఖరుల సమావేశంలోపీఆర్‌టీయు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భాస్కర్‌గౌడ్, సంతోష్‌కుమార్‌లు,నిజామాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ చైర్మైన్ ప్రభాకర్‌రెడ్డి, పీఆర్‌టీయు నాయకులు జనార్థన్, సురేందర్, వెంకట్‌రాంరెడ్డి, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

కోటి ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం

$
0
0

నిజామాబాద్, జనవరి 1: ఆంగ్ల నామాది నూతన సంవత్సరానికి కోటి ఆశలతో ఇందూరు ప్రజలు స్వాగతం పలికారు. విభిన్న అనుభూతులతో ముగిసిపోయిన 2018 పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ, కొత్త సంవత్సరంలో అన్నీ శుభాలే జరగాలని ఆకాంక్షిస్తూ ‘2019’ని సాదరంగా ఆహ్వానించారు. సోమవారం సాయంత్రం నుండి మొదలుకుని అర్ధరాత్రి రెండు గంటల వరకు కూడా జిల్లా అంతటా ఎటుచూసినా న్యూ ఇయర్ సంబరాలు కొనసాగాయి. 10డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతతో వణికిస్తున్న చలిని సైతం లెక్క చేయకుండా నూతన సంవత్సర వేడుకలతో సందడి చేశారు. పట్టణ ప్రాంతాల్లోనైతే యువత హడావుడికి అంతే లేకుండాపోయింది. కొత్త సంవత్సరం వేడుకలకు ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేసుకున్న యువతీ, యువకులు సరిగ్గా రాత్రి 12గంటలు కాగానే రోడ్లపైకి చేరుకుని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఎక్కడికక్కడ బాణాసంచా పేలుళ్లతో వీధులన్నీ దద్దరిల్లాయి. యువకులు బృందాలుగా ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ సందడి చేశారు. ఈ క్రమంలో కొంతమంది విచ్చలవిడిగా మద్యం సేవించి, ఆ మత్తులోనే వాహనాలు నడుపుతూ బైక్‌లు అదుపుతప్పి చిన్నచిన్న ప్రమాదాలకు లోనయ్యారు. హాస్టళ్లు, ఇతర విద్యా సంస్థల్లోనూ నూతన సంవత్సర వేడుకలను అట్టహాసంగా జరుపుకున్నారు. యువతీ, యువకులు ఎవరికి వారు తమ స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులను ఆహ్వానించి బృందాలుగా ఏర్పడి ఎంతో ఉత్సాహంగా సంబరాల్లో మునిగితేలారు. డీజేలు, సౌండ్ సిస్టమ్‌లను ఏర్పాటు చేసుకుని సినీ గేయాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ న్యూ ఇయర్ వేడుకను ఆస్వాదించారు. నిజామాబాద్ నగరంలోని ప్రముఖ హోటళ్లు కొత్త సంవత్సరం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశాయి. తమతమ హోటళ్ల ముందు స్టేజీలను ఏర్పాటు చేసి, వాటిని రంగురంగుల విద్యుద్దీపాలతో ఎంతో సుందరంగా అలంకరించి ఆర్కెస్ట్రా బృందాలతో యువతను ఆకర్షించారు. మరికొంత మంది 2019వ సంవత్సరానికి నాంది పలుకుతూ పెద్దఎత్తున బాణాసంచా పేలుస్తూ సంబరాలకు ఊపు తెచ్చారు. ధాబాలు మొదలుకుని హోటళ్లు, స్వీట్‌షాపులు, బేకరీలు, పూల బొకేల దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడాయి. అనేక మంది కేకులు, మిఠాయిలు కొని కుటుంబ సభ్యులు, బంధువుల సందడి నడుమ వేడుక నిర్వహించుకున్నారు. కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజకీయ ప్రముఖులు, పలువురు వ్యాపార వర్గాల వారు ముఖ్య కూడళ్లలో హోర్డింగ్‌లు, బ్యానర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే కొత్త సంవత్సరం ప్రారంభం రోజున మంచి పనులను తలపెడితే, ఏడాది కాలమంతా మంచే జరుగుతుందనే నమ్మకంతో పలువురు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మరికొంత మంది ప్రతీఏటా వస్తున్న ఆనవాయితీని పాటిస్తూ, తమ స్నేహితులు, శ్రేయోభిలాషులతో కలిసి షిరిడీ, వేములవాడ వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు వెళ్లారు. జిల్లాలోని ప్రముఖ దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. కొత్త సంవత్సరం వేడుక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు రాత్రంతా పెట్రోలింగ్ నిర్వహిస్తూ గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా స్పెషల్ పార్టీ బృందాలను నియమించి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. కాగా, కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు సతీసమేతంగా బాలసదన్‌లో అనాథ బాలల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వివిధ శాఖల అధికారులు ఆయనను చాంబర్‌లో కలుసుకుని పుష్పగుచ్ఛాలు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో అదనపు డీసీపీ శ్రీ్ధర్‌రెడ్డి పోలీసు అధికారులతో కలిసి కేక్ కట్ చేసి న్యూఇయర్ వేడుకలు జరుపుకున్నారు. జిల్లా జడ్జి సుజనను న్యాయవాదులు, వివిధ శాఖల అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మారుతినగర్‌లో గల స్నేహా సొసైటీలో మానసిక, వికలాంగ బాలల మధ్య పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు నూతన సంవత్సర వేడుకలు నిర్వహించి వారికి ఆహ్లాదాన్ని పంచిపెట్టారు.

మోగిన పంచాయతీ ఎన్నికల నగారా
పల్లెల్లో మరింతగా వేడెక్కనున్న కోలాహలం
ఆంధ్రభూమి బ్యూరో
నిజామాబాద్, జనవరి 1: ఎట్టకేలకు స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. ముందుగా గ్రామ పంచాయతీల ఎన్నికలతో స్థానిక సమరానికి శ్రీకారం చుడుతున్నారు. పంచాయతీ పోరుకు ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్‌ను ప్రకటించిన నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ (ప్రవర్తనా నియమావళి) అమల్లోకి వచ్చింది. కాగా, ఈ.సీ వెలువరించిన ఎన్నికల ప్రకటనతో పల్లెల్లో ఎన్నికల కోలాహలం మరింతగా వేడెక్కనుంది. నిజానికి అసెంబ్లీ ఎన్నికలకు ముందే పంచాయతీ ఎన్నికలకు నూతన కార్యవర్గాలను ఎన్నుకోవాల్సి ఉన్నప్పటికీ, పలు కారణాల వల్ల వాయిదాపడింది. ప్రస్తుతం అవరోధాలను అధిగమిస్తూ పల్లె సమరానికి ముహూర్తం ఖరారైన దరిమిలా, ఆశావహులంతా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తాము కోరుకున్నట్టుగానే అనుకూలంగా రిజర్వేషన్లు వచ్చిన చోట అభ్యర్థులు గత కొన్ని రోజుల నుండే ఒకింత హడావుడి చేస్తుండగా, రిజర్వేషన్లు అనుకూలించని అభ్యర్థులు మహిళలకు కేటాయించబడిన స్థానాల్లో తమ కుటుంబ సభ్యులను బరిలోకి దించాలనే సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. జిల్లాలో మొత్తం 530గ్రామ పంచాయితీలు, 4932 వార్డు స్థానాలు ఉండగా, మొదటి విడతలో ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 177సర్పంచ్‌లు, 1746వార్డు స్థానాలకు ఈ నెల 7వ తేదీన నోటిఫికేషన్ వెలువడనుంది. నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ అనంతరం 21వ తేదీన పోలింగ్ జరుపనున్నారు. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్‌ను నిర్వహించిన మీదట, అదే రోజున ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. ఎన్నికైన వార్డు సభ్యులలో ఒకరిని చేతులెత్తే పద్ధతి ద్వారా ఉప సర్పంచ్‌ను ఎన్నుకుంటారు. రెండవ విడతగా బోధన్ డివిజన్‌లోని 142గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, 1296 వార్డు స్థానాలకు ఈ నెల 11న నోటిఫికేషన్ జారీ కానుంది. 25వ తేదీన పోలింగ్ నిర్వహించి ఫలితాలను తేటతెల్లం చేయనున్నారు. చివరి విడతగా నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 211 గ్రామ పంచాయతీలు, 1890 వార్డు స్థానాలకు 16న నోటిఫికేషన్ వెలువడనుండగా, 30వ తేదీన పోలింగ్, కౌంటింగ్‌ల పర్వంతో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు ముగింపు పలుకనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ పోరుకు సంబంధించి రిటర్నింగ్ అధికారుల నియామకం, బ్యాలెట్ పెట్టెలను సిద్ధం చేసుకోవడం, ఓటరు జాబితా పరిశీలన, దాని ఆధారంగా సర్పంచ్, వార్డు స్థానాల రిజర్వేషన్లను ప్రకటించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలుగా సన్నద్ధమై ఉంది. జిల్లా వ్యాప్తంగా 7424 వార్డు స్థానాలుండగా, 7444 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు ఈ నెల 3వ తేదీన శిక్షణా తరగతులను ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేసుకోవడం తదితర ఏర్పాట్లన్నీ పూర్తయినట్టు జిల్లా యంత్రాంగం పేర్కొంది. మరోవైపు ఎన్నికలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణం నడుమ నిర్వహించేందుకు వీలుగా పోలీసు యంత్రాంగం బందోబస్తు చర్యలపై దృష్టిని కేంద్రీకరిస్తోంది. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తిస్తూ పోలింగ్ కేంద్రాల వద్ద భారీ స్థాయిలో పోలీసులను మోహరించనున్నారు. ఇదిలాఉండగా, పంచాయితీ ఎన్నికలు పార్టీలకతీతంగా నిర్వహిస్తున్నప్పటికీ, ప్రధాన రాజకీయ పక్షాలన్నీ ప్రతిష్టాత్మకంగా భావిస్తూ పకడ్బందీగా పావులు కదుపుతున్నాయి. తమతమ పార్టీల మద్దతుదారులను బరిలోకి దించి అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలనే ఆరాటాన్ని ప్రదర్శిస్తున్నాయి. స్థానిక సంస్థల్లో అనుకూల వర్గానికి చెందిన వారు పదవుల్లో ఉంటే, పార్లమెంటు ఎన్నికల్లోనూ వారి తోడ్పాటుతో పరిస్థితులను అనుకూలంగా మల్చుకోవచ్చనే ఉద్దేశ్యంతో ప్రధాన పార్టీలకు చెందిన నేతలంతా సర్పంచ్ అభ్యర్థుల ఎంపిక విషయమై కసరత్తులను ముమ్మరం చేయనున్నారు.

విదేశీ వలస పక్షిని కాపాడిన యువకులు
ఎల్లారెడ్డి, జనవరి 1: గగన తలంలో స్వేచ్ఛగా విహరిస్తూ...ఎతె్తైన నీలగిరి చెట్టుకు చుట్టుకుని ఉన్న గాలిపటం దారంకు చిక్కుకుని గాయపడిన విదేశ వలసపక్షిని (కొంగజాతికి చెందిన) రక్షించిన సంఘటన ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోచోటు చేసుకుంది. విదేశ వలస పక్షిని రక్షించిన యువకులు అనిల్, మణికంఠల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం ఉదయం స్థానిక పోస్ట్ఫాస్ ఆవరణంలోగల ఎతె్తైన నీలగిరి వృక్షంపై ఎదోపక్షి వేళాడుతన్నట్లు గుర్తించిన ఈ ఇద్దరు యువకులు పక్షిని రక్షించేందుకోసం దాదాపుగా గంటన్నర పాటు ప్రయత్నించారు. ఈలోగా ఫైర్, మున్సిపల్, అటవీశాఖ వారికి సమాచారం అందించగా. అంత ఎతె్తైన నిచ్చెన అందుబాటులో లేక పోవడంతోయువకులు యుక్తిగా దారానికి రాయిని కట్టి పక్షిరెక్కల్లో దారం ఇరుక్కుని వేళాడుతున్న పైబాగంలోరాయిని కట్టిన దారంతోపైకి విసిరి చివరకు పక్షిని సురక్షితంగా కిందికి దించారు. ఈలోగా పక్షి రెక్కల బాగంలో స్వల్పంగాగాయం కాగా యువకులు పక్షిని అటవీశాఖాధికారులకు అప్పగించగా, ఫారెస్ట్ డీఎఫ్‌ఆర్‌ఓ కృష్ణం రాజు, సిబ్బందితోకలిసి పక్షికి ప్రాథమిక చికిత్సలు అందజేసిన అనంతరం పక్షిని స్థానిక పెద్ద చెరువుప్రాంతంలోవదిలి వేయడం జరిగిందన్నారు. కొంగజాతికి చెందిన విదేశ వలస పక్షి (రెడ్‌నాప్‌డ్ ఐబీస్, సెడిబీస్ పాపిల్లోసా) ఐ ఉంటుందని డీఎఫ్‌ఆర్‌ఓ పేర్కొన్నారు. విదేశ వలస పక్షిని సమయస్ఫూర్థితోరక్షించిన యుకులకు అటవీ సిబ్బందితోపాటు స్థానికులు అభినందించారు.

కలెక్టరేట్‌లో నూతన సంవత్సర వేడుకలు
కామారెడ్డి, జనవరి 1: కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం నూతన సంవత్సర వేడుకలను లకలెక్టర్ డాక్టర్. సత్యనారాయణ దంపతులు, జిల్లా ఎస్పీ శే్వతారెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డితో పాటు జిల్లా కలెక్టరేట్‌లోని అధికారులు, ఉద్యోగ సిబ్బందితో పాటు చిన్నారి పిల్లల నడుమ ఘనంగా జరుపుకున్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన పెద్దకేక్‌ను కలెక్టర్, ఎస్పీలు కలిసి కట్ చేశారు. అనంతరం అక్కడే ఉన్న చిన్నారి పిల్లలకు కలెక్టర్, ఎస్పీలు కలిసి కేక్ తినిపించడంతో పాటు తోటి ఉద్యోగులకు, అధికారులకు వారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, కలెక్టరేట్‌లోని అధికారులు, పట్టణంలోని పలుసంఘాల నేతలు, ఉద్యోగ సంఘాల నేతలు, కలెక్టర్‌కు పూలచెట్లతో పాటు జ్ఞాపికలను అందచేస్తూ శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీలు మాట్లాడుతూ, నూతన 2019 సంవత్సరం అందరికీ శుభాలు కలుగజేయాలని, జిల్లాలో అనుకున్న అభివృద్ధిని సమష్టి కృషితో సాదిద్ధామని అన్నారు. నేరరహిత జిల్లాగా కామారెడ్డి జిల్లాను నిలుపుదామని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్‌లోని పలు శాఖల అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొన్నారు.

కరీంను అభినందించిన కేంద్ర మంత్రి

$
0
0

ముకరంపుర, జనవరి 1: దేశంలోని నైపుణ్యం గల క్రీడాకారుల్ని గుర్తించటంతో పాటు, అంతర్జాతీయ క్రీడావేదికపై త్రివర్ణపతాకం రెపరెపలాడించేలా సూచించిన క్రీడా విశే్లషకుడు మహ్మద్ కరీంను కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ప్రత్యేకంగా అభినందించారు. కొత్త ఏడాదిని పురష్కరించుకుని దేశంలోని ప్రముఖ క్రీడా సంబంధీకులతోమంగళవారం చిట్ చాట్ నిర్వహించగా, ఈసందర్భంగా మాట్లాడుతూ, ఖేలో ఇండియా, ప్రపంచ హాకీ పోటీలు, క్విజ్‌లో ఆలిండియా స్థాయిలో విజేతగా నిలిచిన పలువురిని తొలుత మంత్రి అభినందించినట్లు కరీం తెలిపారు. ఈసందర్భంగా మంత్రి రాథోడ్ మాట్లాడుతూ, తాను ఆలస్యంగా క్రీడల్లో ప్రవేశించి, ఒలింపిక్ పథకం సాధించినట్లు తెలిపాడని, బాల్యం నుంచి క్రీడల్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారని, అనంతరం క్రీడల అభివృద్ధిపై సూచనలు ఆహ్వానించినట్లు వెల్లడించారు. ఖేలో ఇండియా ఓ విప్లవాత్మక క్రీడా పథకమని, పాఠశాల దశే క్రీడారంగానికి ఆయువుపట్టని తాను పేర్కొన్నట్లు కరీం వెల్లడించారు. ఒలింపిక్స్‌లో పథకాల సాధనే లక్ష్యంగా శిక్షణాశిబిరాలు నెలకొల్పుతూ, ఆటగాళ్ళను ప్రోత్సహించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలు, క్రీడాకారుల సంక్షేమానికి చేపడుతున్న ప్రోత్సాహాలు మరింత పెంచాల్సిన అవసరముందని, దేశవ్యాప్తంగా పలు క్రీడల్లో అకాడమీలు నెలకొల్పాలని సూచించగా, తెలంగాణలో రెజ్లింగ్ అకాడమీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, ఆదిశగా సత్వర చర్యలు చేపడుతామని హామీ ఇచ్చినట్లు కరీం తెలిపారు. ఈసందర్బంగా ప్రశంసలు పొందిన కరీంను జిల్లాక్రీడాభివృద్ధి అధికారి అశోక్, క్రీడాసంఘాల బాధ్యులు రమేశ్‌రెడ్డి, ఎస్.శ్రీకాంత్, సిద్ధారెడ్డి, జాడి శ్రవన్, జనార్థన్‌రెడ్డి, విజయభాస్కర్, కె.శ్రీనివాస్‌రావు, వి.రమేశ్, సరోత్తంరెడ్డి, షఫీమొయినొద్దిన్, మహేందర్,తదితరులు అభినందించారు.
ప్రజలు మాకు శత్రువులు కాదు.. మిత్రులే..!

కరీంనగర్, జనవరి 1: పోలీసులు ప్రజారక్షణ కోసమే పనిచేస్తున్నారని, ప్రజలుమాకేం శత్రువులు కారు మిత్రులేనని ప్రమాదాల నివారణకే డ్రంక్‌అండ్ డ్రైవ్ కొనసాగిస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ వీ.బీ .కమలాసన్ రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి నుండి మంగళవారం తెల్లవారి కూడా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టి 266 మంది మందు బాబులను పట్టుకొని వారికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా కమిషనర్ కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడుపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు సంభవించి అనేక మంది ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయని, దీంతో వారిపై ఆధారపడ్డ కుటుంబాలు రోడ్డున పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా ప్రజారక్షణ, ప్రమాదాల నివారణ కోసమే డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని పోలీస్ యంత్రాంగం నిరంతరం కొనసాగిస్తుందన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహణతో కొంత మేరకు రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గిందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపడం వల్ల మన శరీరం మన ఆధీనంలో లేకుండా ఏదేదో జరిగిపోయి ప్రమాదాలకు దారితీస్తుందని, ప్రజల రక్షణ కోసమే ప్రమాదాల నివారణకై డ్రంక్ అండ్ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడిన వారికి జైలుశిక్ష, జరిమానాలు విధించబడుతున్నాయని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లతో తమ కుటుంబాలు ఆనందంగా ఉన్నాయని, తొందరగా ఇంటికి వస్తుండడంతో మహిళలు సంతోషంగా ఉన్నారన్నారు. మద్యం సేవించి పట్టుబడ్డ వారిని లైసెన్స్ రద్దుకోసం రవాణా శాఖ అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి విధి విధానాలను రూపొందించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ తరహాలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లు కొనసాగించి ప్రమాదాల నివారణకు పకడ్బంధీగా పనిచేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న పోలీస్ యంత్రాంగానికి ప్రజల సహకారం కూడా అవసరమేనన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపడాన్ని పూర్తిగా నియంత్రించేవరకు ప్రజల ప్రాణాలను పరిరక్షించేందుకు ప్రమాదాల నివారణ కోసం డ్రంక్ అండ్ డ్రైవ్‌లు కొనసాగిస్తామని చెప్పారు. అన్ని వర్గాలు తమవంతు సహకారాన్ని అందించాలని నగర పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి కోరారు.
ఇదిలా ఉండగా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తూ పట్టుబడిన 13 మంది మందుబాబులపై సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఈ-పెట్టి కేసులను నమోదు చేశామని పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి వెల్లడించారు.
అభివృద్ధే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం
కరీంనగర్ టౌన్, జనవరి 1: కొత్త ఏడాదిలో సరికొత్త లక్ష్యాలు నిర్ధేశించుకుని, ఆచరణే ధ్యేయంగా అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగేందుకు జిల్లాయంత్రాంగం సన్నద్ధమవుతోంది. గత ఆర్ధిక సంవత్సర ప్రణాళికలు పూర్తి చేస్తూ, శాఖల పరంగా తిరిగి కొత్త ప్రణాళికలు రూపొందించుకుని, వాటి లక్ష్య సాధనకు కలిసికట్టుగా కృషి చేసేందుకు నిర్ణయించుకున్నట్లు అధికారులు తెలిపారు. తమ తమ శాఖల్లోని కిందిస్థాయి సిబ్బంది సహాయ, సహాకారాలతో, ప్రభుత్వ పథకాలు చిత్తశుద్ధితో ముందుకు తీసుకెళ్ళేందుకు సమాయత్తమవుతున్నారు. నూతన సంవత్సరంలో అన్ని వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ, చేయూతనందిస్తామన్నారు. బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ, సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి అందేలా చొరవ చూపుతామంటూ భరోసా ఇచ్చారు. కొత్త వత్సరం ఆవిష్కృతమైన నేపథ్యంలోతమ విధుల పట్ల జిల్లా ఉన్నతాధికారుల లక్ష్య నిర్ధేశాలు ప్రకటిస్తూ, జిల్లాప్రజలకు మరింత చిత్తశుద్ధితో సేవలందించేందుకు కార్యచరణ రూపొందించుకుంటున్నట్లు వెల్లడించారు. కొత్త ఏడాదిలో అన్ని వర్గాలు అభివృద్ధిపథంలో పయనించేలా కృషి చేస్తూ, అన్ని రంగాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలిపి, ఇతర జిల్లాలకు ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కంకణ బద్ధులమవుతున్నట్లు కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ప్రకటించారు.పారదర్శక సేవలందిస్తూ, సామాన్య పౌరులు సైతం గుర్తించేలా విధులు నిర్వహించేలా ప్రణాళికబద్ధంగా ముందుకు సాగేందుకుజిల్లాపోలీసు యం త్రాంగం సమాయత్తమవుతున్నట్లు పోలీస్ కమిషనర్ వీబీ కమలాసన్‌రెడ్డి తెలిపారు.ప్రభుత్వ సంక్షే మపథకాలుక్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అందేలా సరైన పర్యవేక్షణ చేస్తూ, కొత్తగా అర్హులైన వారికి కూడా సముచిత న్యాయం చేస్తామని జాయింట్ కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్‌లాల్ అన్నారు. వైద్యరంగంలో గతేడాదికన్నా మరింత మెరుగైన సేవలందించేందుకు అలుపెరుగకుండా యత్నిస్తామని, ప్రభుత్వ వైద్యంపై అన్ని వర్గాల్లో మరింత భరోసా పెంచుతూ, అత్యాధునిక వైద్యసదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. విద్యారంగంలో గత ఫలితాలు పునరావృతం చేసేందుకు జిల్లా విద్యాశాఖ నిబద్ధతతో విధులు నిర్వహిస్తోందని, ఎస్సెస్సీ ఫలితాల్లో జిల్లాను రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిపేందుకు ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

వేడుకల వేళ విషాదం
* లారీ - కారు ఢీకొని ఇద్దరు యువకుల దుర్మరణం
హుజూరాబాద్, జనవరి 1: ఒకవైపు నూతన సంవత్సర వేడుకలు ఆనందోత్సాహాలతో జరుగుతుండగా మరో వైపు రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. హుజూరాబాద్ మండలం మాందాడిపల్లి వద్ద వరంగల్ - కరీంనగర్ రహదారిపై సోమవారం రాత్రి 2 గంటలకు లారీ - కారు ఢీ కొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు.
పోలీసుల కథనం ప్రకారం శంకరపట్నం మండలం లింగాపూర్ గ్రామం నుండి కోడూరు వెంకటేశ్, కె ఎస్ చప్రారెడ్డి, సందెల రంజిత్‌లు కారులో హుజూరాబాద్‌కు వెళ్తుండగా హుజూరాబాద్ మండలం మాందాడిపల్లి వద్ద కరీంనగర్ వైపు వెళ్తున్న లారీ అతివేగంగా, అజాగ్రత్తగా వచ్చి ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న లింగాపూర్ గ్రామానికి చెందిన కోడూరు వెంకటేశ్ (25) తో పాటు కే ఎస్ చప్రారెడ్డి (31) అక్కడికక్కడే మరణించారు. వీరి మృతదేహాలు కారులో ఇరుక్కుపోగా పోలీసులు, గ్రామస్తులు శ్రమించి బయటకు తీసారు. వీరితో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో యువకుడు రంజిత్, లారీ డ్రైవర్ మోనూ రాథోడ్ తీవ్రంగా గాయపడగా వీరిని చికిత్స నిమిత్తం వరంగల్‌కు తరలించారు. కారులో ప్రయాణిస్తున్న కె ఎస్ చప్రారెడ్డి పయోనీర్ సీడ్స్ కంపెనీలో పీపీఎల్ గా పనిచేస్తుండగా, మృతుడు వెంకటేశ్‌తో పాటు గాయపడిన రంజిత్‌లు అదే కంపెనీలో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. ఒకవైపు నూతన సంవత్సర వేడుకల్లో అందరు నిమగ్నమవగా మరో వైపు జరిగిన రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. మరో మృతుడు చప్రారెడ్డి స్వస్థలం కర్ణాటక లోని వెనగలూరు. లారీ డ్రైవర్ అతివేగంగా వెళ్తూ అదపుతప్పడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలకు హుజూరాబాద్ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి చేసారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యంతోనే యువకుడి మృతి
* బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్ కుమార్
చందుర్తి, జనవరి 1: చందుర్తి మండలం కట్టలింగంపేట గ్రామంలో గత పది రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో లింగంపేట గ్రామానికి చెందిన గుంటి సునీల్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా, ప్రథమ చికిత్స నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు ఆసుపత్రి గేటుకు తాళం వేసి క్రిస్మస్ సంబరాలు జరుపుకోవడంతో సరియైన సమయంలో వైద్యం అందక సునీల్ మృతి చెందాడని ఆయన అన్నారు.
ప్రభుత్వం, ప్రభుత్వ వైద్య సిబ్బంది యువకుడి మృతికి బాధ్యత వహించాలన్నారు. సునీల్ మృతిపై అధికార పార్టీ నాయకులు మాట్లాడకపోవడం ఎంతవరకు సమంజసమన్నారు. ఈ సందర్భంగా స్థానిక భజరంగ్‌దళ్, విశ్వహిందూపరిషత్ కార్యకర్తలు సేకరించిన రూ.25 వేలను మృతుని కుటుంబానికి బండి సంజయ్ అందజేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రుద్రంగి మండల శాఖ అధ్యక్షులు నందాడపు వెంకటేష్, నాయకులు గోపాల్ రెడ్డి, రంజిత్, తిరుపతి, రమేష్, వెంకటేష్, కె.శేఖర్, కొత్తపల్లి శేఖర్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు సామాజిక సేవలో ముందుండాలి
* ఎమ్మెల్యే రవిశంకర్
రామడుగు, జనవరి 1: కేవలం తరగతి గదుల్లో చదువు, రాయడమే కాకుండా విద్యార్థులు సామాజిక సేవలో సైతం ముందుండాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మంగళవారం సూచించారు. మండలంలోని వెలిచాల సరస్వతి పాఠశాల విద్యార్థులు సమకూర్చిన రూ.12 వేల విలువ గల టవల్స్‌తో పాటు గ్రామానికి చెందిన గాదె నర్సయ్య 50 కిలోల బియ్యం, పూదరి తిరుపతి ఇచ్చిన రూ.5 వేలను ఎమ్మెల్యే చేతుల మీదుగా మండలంలోని ప్రశాంత్ భవన్‌లోని విద్యార్థులకు అందించారు. ప్రతీ సంవత్సరం జనవరి 1న కేక్ కట్ చేసి సరస్వతి విద్యార్థులు ఇక్కడి అనాధ పిల్లలకు తోచిన విధంగా సహాయం చేయడం ఆనవాయితీగా రావడం అభినందనీయమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులను అభినందించారు. విద్యార్థులను సమాజానికి ఉపయోగపడేవిధంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైననే ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వీర్ల కవిత, ఎంపిపి మార్కొండ కిష్టారెడ్డి, గంగాధర, బోయినిపల్లి జడ్పీటీసీలు ఆకుల శ్రీలత, మదుసూధన్, సరస్వతి పాఠశాల కరస్పాండెంట్ ఉప్పుల శ్రీనివాస్, వెలిచాల ఎంపిటిసి దండెపల్లి యాదగిరి, రామడుగు మాజీ సర్పంచ్ పంజాల జగన్ మోహన్ గౌడ్ తదితరులు ఉన్నారు.
ఆర్జీ-2లో 101శాతం బొగ్గు ఉత్పత్తి
- ప్రైవేట్‌కు దీటుగా ఓబీ వెలికితీత
- ఆర్జీ-2 జీఎం విజయబాబు వెల్లడి
యైటింక్లయిన్‌కాలనీ, జనవరి 1: సింగరేణి ఆర్జీ-2 పరిధిలో డిసెంబర్ మాసానికి 101శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిన్నట్లు జి ఎం విజయబాబు తెలిపారు. మంగళవారం ఆయన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బొగ్గు ఉత్పత్తి వివరాలు వెల్లడించారు. గనుల వారిగా వికెపి గని ద్వారా 17,310 టన్నులతో 67శాతం, 7 ఎల్ ఇపి 17,293 టన్నులతో 86శాతం, ఓసిపి-3 3,58,833 టన్నులతో 82శాతం, ఫేజ్-2 2,61,664 టన్నులతో 131 శాతం బొగ్గు ఉత్పత్తి చేసిన్నట్లు వివరించారు. ఆఫ్ లోడింగ్‌లో ప్రైవేట్‌కు ధీటుగా సింగరేణి 119 శాతం ఓబి మట్టిని వెలికి తీయడం జరిగిందని అన్నారు.
అదేవిధంగా ఎస్ ఎల్‌పి పదోన్నత్తులు 150 మందికి ఉత్తర్వులు ఇచ్చామని, 2017-18లో ఓసిపి-3 ఉత్తమ ఓసిపిగా నిలవడం గర్వకారణమని, 2019లో కూడా ఆర్జీ-2 రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వనున్నామని అన్నారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. పలు గనుల్లో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమాల్లో డిజి ఎం ఎన్‌వి.రావు, అధికారులు రామక్రిష్ణ, పద్మా రావు, మురళీ క్రిష్ణ, రాజేంద్ర ప్రసాద్, జానకి రాం తదితరులున్నారు.

Viewing all 69482 articles
Browse latest View live