Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

రికార్డుపై కాదు..ఆటపైనే దృష్టి

$
0
0

సిడ్నీ, జనవరి 2: స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా గురువారం నుంచి ప్రారంభం కానున్న నాలుగో టెస్టులో ఉత్తమ ప్రదర్శన కనబరిచేందుకు తమ జట్టు ప్రయత్నిస్తుంది తప్ప ప్రత్యర్థిపై రికార్డు కోసం కాదని ఆసిస్ కెప్టెన్ టిమ్ పైన్ అన్నాడు. నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే 1-2తో వెనుకబడిన ఆతిధ్య జట్టు ఇపుడు సిరీస్‌ను డ్రాగా ముగించేందుకు యోచిస్తోంది. ‘ఇపుడు మా దృష్టి అంతా ఆఖరి టెస్టులో అద్భుతంగా రాణించడంపైనే ఉంది. ఇప్పటివరకు ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ గెలుపే ధ్యేయంగా పోరాడాం. కానీ సిరీస్ గెలుచుకునేందుకు మాకు కాలం కలసిరాలేదు. అయినా ఉత్తమ టెస్టు టీమ్‌గా నిలదొక్కుకునేందుకు అందివచ్చిన క్షణాలను ఆస్వాదిస్తాం’ అని కెప్టెన్ అన్నాడు.


ఆసియా కప్‌లో గెలుపు సులువు కాదు

$
0
0

అబూదాబి, జనవరి 2: ఈనెల 5నుంచి జరిగే ఆసి యా కప్ టోర్నమెంట్‌లో గెలుపు అంత సులువు కాదని భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి అన్నాడు. ఇటీవల చైనా, ఒమన్ జట్లతో జరిగిన మ్యాచ్‌లు డ్రాగా ముగిసిన నేపథ్యంలో కెప్టెన్ మీడియాతో మాట్లాడుతూ ఆసియా కప్‌లో పాల్గొనే అగ్రశ్రేణి జట్లతో పోరు కష్టమేనని అభిప్రాయపడ్డాడు. ఈనెల 5 నుంచి ఫిబ్రవరి 1వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఆసియా కప్ టోర్నమెంట్ జరుగనుంది. గ్రూప్-ఏలో భారత్, థాయిలాండ్, బెహ్రెయిన్‌తోపాటు ఆతిధ్య యూఏఈతో తలపడుతుంది. ఈ గ్రూపుల మధ్య తొలి మ్యాచ్‌లో భారత్ జట్టు థాయిలాండ్‌తో ఈనెల 6న తలపడుతుంది. ఆ తర్వాత జనవరి 10న అబూదాబీలో యూఏఈతో, 14న షార్జాలో బెహ్రెయిన్ టీమ్‌తో తలపడుతుంది. తమ ప్రణాళిక ప్రకారం మెరుగైన ప్రదర్శన కోసం పోటీపడతామని సునీల్ ఛెత్రి అన్నాడు.

చిత్రం..భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి

దేశవాళీ క్రికెట్‌తో ఎంతో మేలు

$
0
0

కరాచీ, జనవరి 2: దేశవాళీ క్రికెట్‌తో ఆటగాళ్లకు ఎంతో మేలు జరుగుతుందని పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ అభిప్రాయపడ్డాడు. ఇందుకు ఉదాహరణగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సహా లెక్కకుమించిన రంజీ మ్యాచ్‌లలో భారత క్రికెటర్లు ప్రాతినిధ్యం వహిస్తుండడం వల్లే అద్భుతంగా రాణిస్తున్నారని అన్నాడు. గత నెలలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టు సిరీస్‌లలో ఓటమి చెందిన పాక్ ఆ తర్వాత గత వారం సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఆతిధ్య జట్టుతో జరుగుతున్న టెస్టుల్లో ఇప్పటికే 2-1తో ఆధిక్యంతో ఉన్న విషయాన్ని ప్రస్తావించాడు. దేశవాళీ క్రికెట్‌లో అపార అనుభవం కలిగిన భారత ఆటగాళ్లు అన్ని ఫార్మాట్లలోనూ అద్భుతంగా రాణిస్తున్నారని పేర్కొన్నాడు. అయితే, పాక్ క్రికెటర్లు కనీసం 50 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు కూడా ఆడడం లేదని, నాలుగు రోజుల దేశవాళీ క్రికెట్‌లో సైతం ఆడేందుకు ముందుకు రావడం లేదని విచారం వ్యక్తం చేశాడు.

సిడ్నీలో గెలిస్తే అద్భుతమే

$
0
0

సిడ్నీ, జనవరి 2: ఆస్ట్రేలియాతో గురువారం సిడ్నీ క్రికెట్ మైదానంలో జరిగే ఆఖరి టెస్టులో భారత్ గెలిస్తే అద్భుతమేనని, సరికొత్త మలుపు అవుతుందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఇదే మైదానంపై నాలుగేళ్ల క్రితం అప్పటి భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి సంచలనం సృష్టించాడు. అప్పుడు భారత్ టెస్టు ర్యాంకింగ్స్‌లో 7వ స్థానంలో ఉంది. ఇపుడు కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ప్రపంచంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇపుడు ఇదే మైదానంలో ఆతిధ్య ఆసిస్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో ఆఖరి టెస్టును ఆడబోతున్న కోహ్లీ సేనకు ఇది ఎంతో విలువైనదిగా నిలువనుంది. ‘టీమిండియాకు గత నాలుగేళ్లుగా కెప్టెన్‌గా ఉంటున్నాను. ఆసిస్ గడ్డపై ఇప్పటికే నేను మూడుసార్లు టెస్టు మ్యాచ్‌లు ఆడాను. ఇక్కడ గెలుపు ఎంత కష్టమో నాకు తెలియంది కాదు. అయినా ఆద్యంతం అద్భుత ప్రదర్శనతో చాలెంజ్‌గా తీసుకుని విజయం సాధిస్తాం’ అని కోహ్లీ దీమా వ్యక్తం చేశాడు.
జట్టు పరంగా ఇప్పుడే పరివర్తన మొదలైంది. నిజాయితీగా గెలిచి అతి పెద్ద సిరీస్‌ను గెలుచుకోవడం వల్ల కేవలం తనకే కాకుండా జట్టు మొత్తానికి గొప్ప మలుపు అవుతుందని అని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ఇదిలావుండగా, అడెలైడ్ టెస్టుకు తప్ప మిగిలిన పెర్త్, మెల్‌బోర్న్ టెస్టుల్లో సీనియర్ ఆటగాడు, ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ లేని లోటు విచారకరమని, ఇపుడు కూడా ఆఖరి టెస్టుకు మిస్సవుతుండడం వల్ల అందుకు ప్రత్యామ్నాయ చర్యలకు జట్టు మేనేజిమెంట్ ఉపక్రమించిందని కోహ్లీ అన్నాడు.
గతంలో ఇంగ్లాండ్ టూర్‌తోపాటు ఇపుడు ఆసిస్ టూర్‌లో సైతం అశ్విన్ ఆడలేకపోయాడని, పూర్తి ఫిట్నెస్ ఉంటే తప్ప ఆడని పరిస్థితిలో ఉన్నాడని అన్నాడు. తాను కూడా 2011 నుంచి ఫిట్నెస్ సమస్యతో బాధపడుతున్నానని, గత వారం మెల్‌బోర్న్‌లో జరిగిన టెస్టులో సైతం ఇదే సమస్య ఎదురైనపుడు ఫిజియోథెరఫిస్టు సూచనలకు అనుగుణంగా ట్రీట్‌మెంట్ తీసుకున్నానని కోహ్లీ అన్నాడు. గత ఏడాది ఇంగ్లాండ్ టూర్‌లో సైతం తాను వెన్ను నొప్పితో బాధపడిన సందర్భంగా సరైన సమయంలో చికిత్స తీసుకోవడం ద్వారా ఫిట్నెస్ సమస్య నుంచి బయటపడ్డానని అన్నాడు. ఫిట్నెస్ సమస్య వచ్చినపుడు దానికోసం తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని, తగిన విశ్రాంతి, ఫిజియోథెరఫీ సూచనలు ఎప్పటికప్పుడు పాటించడం వల్ల త్వరితగతిన కోలుకునేందుకు ఆస్కారం ఉంటుందని అభిప్రాయపడ్డాడు.

చిత్రం..విరాట్ కోహ్లీ

సరికొత్త చరిత్ర దిశగా టీమిండియా!

$
0
0

సిడ్నీ: ఆతిధ్య ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టు సిరీస్‌లలో భాగంగా ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా టెస్టుల్లో ఆఖరిది, నాలుగోది గురువారం సిడ్నీలో జరిగే టెస్టులో పైచేయి సాధించడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించాలని ఉవ్విళ్లూరుతోంది. ఉరకలెత్తే ఆత్మవిశ్వాసంతో నాలుగో టెస్టుకు కోహ్లీ సేన సిద్ధమతుండగా, సిరీస్‌ను డ్రాగా ముగించాలని టిమ్ సేన్ యోచిస్తోంది. సిడ్నీలో జరిగే ఆఖరి టెస్టులో గెలిస్తే గొప్ప ఘనత సాధించినవారం అవుతామని టీమిండియా కెప్టెన్ కోహ్లీ వ్యాఖ్యానించగా, ప్రత్యర్థిపై రికార్డు కాదు..అత్యుత్తమ ప్రదర్శనపైనే తాము దృష్టి సారిస్తామని ఆసిస్ కెప్టెన్ టిమ్ పైన్ చెబుతున్నాడు. ఆరు జట్ల మధ్య అడెలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్ 31 పరుగులతో విజయం సాధించగా, పెర్త్ మైదానంలో జరిగిన రెండో టెస్టులో ఆతిధ్య జట్టు 148 భారీ ఆధిక్యంతో గెలిచింది. మెల్‌బోర్న్‌లో జరిగిన మూడో టెస్టులో టీమిండియా 137 భారీ పరుగులతో విజయం సాధించి టెస్టు సిరీస్‌లలో 2-1తో పైచేయిలో ఉంది. గురువారం జరిగే ఆఖరి టెస్టులో మరో విజయం సాధించడం ద్వారా సిరీస్‌ను కైవశం చేసుకోవాలని కోహ్లీ సేన ఉబలాటపడుతుండగా, అత్యుత్తమ ఆటతీరును కనబరచడం ద్వారా సిరీస్‌ను డ్రాగా ముగించాలని ఆతిధ్య ఆసిస్ కెప్టెన్ టిమ్ పైన్ సేన యోచిస్తోంది. ఆసిస్ గడ్డపై భారత్ ఇప్పటివరకు ఆడిన టెస్టు సిరీస్‌లలో మూడు డ్రాగా (1980-81, 1985-86, 2003-04) ముగియగా, ఏడు టెస్టుల్లో పరాజయం (1967-68, 1977-78, 1991-92, 1999-2000, 2007-08, 2011-12, 2014-15) చవిచూసింది. ఆస్ట్రేలియా మైదానంలో ఇంతవరకు టీమిండియాకు నాయకత్వం వహించిన ఏ ఒక్క కెప్టెన్ కూడా టెస్టు సిరీస్‌లో విజయంతో స్వదేశానికి రాలేకపోయారు. అయితే, ఇపుడు విరాట్ కోహ్లీ నాయత్వంలోని టీమిండియా ఇదే మైదానంపై సరికొత్త చరిత్రను లిఖించాలని తహతహలాడుతోంది. ఈ గడ్డపై భారత్ టెస్టు సిరీస్‌ను గెలిస్తే కోహ్లీ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇదిలావుండగా టీమిండియా యాజమాన్యం బుధవారం 13 మంది గల జట్టు సభ్యుల పేర్లను ప్రకటించింది. అడెలైడ్‌లో జరిగిన తొలి టెస్టు సందర్భంగా కడుపునొప్పితో బాధపడుతున్న ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ ఆశ్విన్ మెల్‌బోర్న్, పెర్త్‌లో జరిగిన రెండు టెస్టుల్లో ఆడలేకపోయాడు. ఇపుడు కూడా ఫిట్నెస్ పరంగా ఇంకా పూర్తిగా కోలుకోలేని పరిస్థితుల నేపథ్యలం సిడ్నీ టెస్టులో ఆడేందుకు అవకాశం లేదు. అదేవిధంగా సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ సైతం గాయాల బారిన పడడంతో ఆఖరి టెస్టులో ఆడే అవకాశం లేదని తెలుస్తోంది. అశ్విన్ రెండు టెస్టుల్లో ఆడలేకపోయిన విషయాన్ని కోహ్లీ ప్రస్తావిస్తూ టెస్టు క్రికెట్‌లో అశ్విన్ అవసరం ఎంతో ఉందని, కానీ దురదృష్టవశాత్తూ అనారోగ్యం వెంటాడడం విచారకరమని అన్నాడు. నాలుగో టెస్టులో ఆఫ్‌స్పిన్నర్ అశ్విన్ లేని లోటును భర్తీ చేసేందుకు ఎడమచేతివాటం స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇషాంత్ శర్మ స్థానంలో ఉమేష్ యాదవ్‌ను తీసుకున్నారు. పేసర్లు మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రాతోపాటు ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నట్టు కోహ్లీ వెల్లడించాడు. ఇటీవలే పాపకు తండ్రి అయిన సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ నాలుగో టెస్టులో అందుబాటులో ఉండడంలేదు. మూడో టెస్టులో ఓపెనర్‌గా దిగిన హనుమ విహారి ఈసారి ఆరో నెంబర్ ఆటగాడిగా బరిలోకి దిగే అవకాశం ఉంది. మరోపక్క ఆతిధ్య ఆసిస్‌లో తుది జట్టును గురువారం జరిగే టాస్‌కు ముందు ప్రకటిస్తామని కెప్టెన్ టిమ్ పైన్ వెల్లడించాడు. టెస్టు సిరీస్‌ను గెలిచేందుకు ఎలాగూ అవకాశం లేకపోయినా కనీసం సిరీస్‌ను డ్రాగా ముగించాలని టిమ్ పైన్ సేన యోచిస్తోంది.

చిత్రం..అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇస్తున్న టీమిండియా క్రికెటర్ చటేశ్వర్ పుజారా

నెత్తురోడిన రహదారులు

$
0
0

గుంటూరు, జనవరి 2: గుంటూరు జిల్లాలో రహదారులు నెత్తురోడాయి. బుధవారం జరిగిన రెండు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు. కంటైనర్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతిచెందగా. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం యడ్లపాడు - వంకాయలపాడు గ్రామాల నడుమ జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండేళ్ల పాపతో సహా నలుగురు మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రోడ్డుపై ఆగివున్న కంటైనర్‌ను కారు బలంగా ఢీకొట్టడంతో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. కారు ఢీకొన్న వేగానికి కారు ముందు భాగం
నుజ్జునుజ్జు కాగా, లారీ వెనుక ప్రాంతం ధ్వంసమైంది. చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం ములకలచెరువు గ్రామానికి చెందిన ఏడుగురు తూర్పు గోదావరి జిల్లా యర్రవరంలో ఒక వివాహ వేడుకలకు హాజరై తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదానికి గురయ్యారు. కారులో ప్రయాణిస్తున్న సుందరరామరాజు (33), భారతి (54), కశ్విని (2)లతో పాటు పేరు తెలియని మరో మహిళ కూడా మృతిచెందారు. క్షతగాత్రులు కాటూరి మెడికల్ కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చిలకలూరిపేట రూరల్ సీఐ శోభన్‌బాబు, యడ్లపాడు ఎస్‌ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విజయపురిసౌత్ పోలీసు స్టేషన్ పరిధిలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న మరో ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నాగార్జునసాగర్ నుండి మాచర్ల వైపు వస్తున్న ద్విచక్ర వాహనం, మాచర్ల నుండి నల్గొండకు వెళుతున్న మరో ద్విచక్ర వాహనం ఎన్టీపీసీ-తాళ్లపల్లి మధ్య ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ద్విచక్రవాహనంపై శ్రీరామదాసు నాగబ్రహ్మాచారి, వెంకటసాయి (11), నాగలక్ష్మీ, ఝాన్సీ, మణిదీప్తి (8)లు ఐదుగురు ప్రయాణిస్తుండటం గమనార్హం. ఈ ప్రమాదంలో సురేష్ (35), వెంకటసాయి తలలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. గాయపడ్డ బాలిక మణిదీప్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది.

చిత్రం..కంటైనర్‌ను ఢీకొని నుజ్జయిన కారు

రాఫెల్‌పై దద్దరిల్లిన లోక్‌సభ

$
0
0

న్యూఢిల్లీ, జనవరి 2: రాఫెల్ ఫైటర్ జెట్స్ కొనుగోళ్లపై అధికార, విపక్ష సభ్యుల వాగ్వాదంతో లోక్‌సభ దద్దరిల్లింది. పలు దఫాలు వాయిదాల మధ్య ఈ అంశంపై సభలో మూడు గంటలసేపు చర్చ జరిగింది. కాగా బీజేపీ నమ్మకమైన కూటమిలోని పార్టీ శివసేన కూడా రాఫెల్‌పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ చేత విచారణ జరిపించాలని ప్రతిపక్ష కాంగ్రెస్‌తో గొంతు కలిపింది. రాఫెల్ అంశంపై అట్టుడికింది. జేపీసీ చేత విచారణ జరిపించాలన్న డిమాండ్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తిరస్కరించారు. ప్రతిపక్ష సభ్యులు చేసిన ఆరోపణలకు జైట్లీ ఘాటుగా స్పందించారు. తన బెడ్‌రూంలో రాఫెల్ ఫైళ్లు ఉన్నాయని గోవా సీఎం పారికర్ తనతో అన్నట్లు ఆ రాష్ట్ర మంత్రి విశ్వజిత్ రాణే పేర్కొన్నట్లుగా ఆడియో క్లిప్‌ను ప్రదర్శించేందుకు అనుమతి ఇవ్వాలని, అవినీతికి తిరుగులేని రుజువులు ఉన్నాయని ఎఐసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ సభ్యుడు రాహుల్ గాంధీ తీవ్రమైన అభియోగం మోపారు. పరస్పర ఆరోపణలతో సభలో తీవ్రమైన గందరగోళం ఏర్పడింది. కేంద్రమంత్రి జైట్లీ ప్రసంగాన్ని కాంగ్రెస్ సభ్యులు అడ్డుకున్నారు.
అరుణ్ జైట్లీ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఈ అంశంపై సంతృప్తి వ్యక్తం చేసినందున, జేపీసీ విచారణ అవసరం లేదన్నారు. కాంగ్రెస్ సభ్యులు పేపర్‌తో తయారు చేసిన విమానాలను గాలిలోకి వదలడంపై మండిపడ్డారు. అవినీతితో నిండిపోయిన కాంగ్రెస్ అబద్ధాల ఫ్యాక్టరీతో నిరాధారమైన ఆరోపణలను చేస్తోందన్నారు. నీతికి మారుపేరు మోదీ ప్రభుత్వమన్నారు. జేపీసీ విచారణ అర్థం లేదన్నారు. ఒకప్పుడు చాలా గొప్పవాళ్లు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా పని చేశారని, ఈ రోజు కనీస అవగాహన లేని వ్యక్తి ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉండడం విచారకరమన్నారు. గతంలో రక్షణ రంగం స్కాంలకు
అలవాటుపడిన వారే మచ్చలేని ప్రధాని మోదీపై బురద జల్లుతున్నారన్నారు. సుప్రీంకోర్టు తీర్పును సవాలు చేసే శక్తి ఎవరికీ లేదన్నారు. అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ కేసులో నిందితుడు మిచిల్ గాంధీ కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావించిన విషయాన్ని జైట్లీ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ సభలో చూపించిన టేపులు, క్లిప్పింగ్‌లు కల్పితమని తోసిపుచ్చారు. ఈ క్లిప్పింగ్‌లు దురుద్దేశంగా తయారుచేసినవని, ఇదిరుజువైతే సభా హక్కుల ఉల్లంఘన కిందవస్తుందని, పైగా సభ నుంచి బహిష్కరణ వేటును ఎదుర్కొనాల్సి వస్తుందని జైట్లీ హెచ్చరించారు.
అంతకుముందు రాహుల్ గాంధీ మాట్లాడుతూ గోవా సీఎం పారికర్ రాఫెల్ అంశంపై చేసిన వ్యాఖ్యల క్లిప్‌ను ప్రదర్శించేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా, స్పీకర్ నిరాకరించారు. మోదీ ఈ అంశంపై మాట్లాడకుండా ఎందుకు వౌనంగా ఉన్నారన్నారు. పార్లమెంటును ఎదుర్కొనే సత్తా లేదన్నారు. మోదీ రాఫెల్ స్కాంపై భయపడుతున్నారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ హెచ్‌ఏఎల్‌కు కాంట్రాక్టును ఇవ్వకుండా అనిల్ అంబానీ కుటుంబానికి ప్రజాధనాన్ని దోచి పెట్టారన్నారు. తన బెడ్‌రూంలో రాఫెల్ ఫైళ్లు ఉన్నాయని పారికర్ అన్నారంటే మోదీ నిజంగా దోషి అని రాహుల్ అన్నారు.
చిత్రాలు.. బుధవారం లోక్‌సభలో మాట్లాడుతున్న అరుణ్ జైట్లీ, రాహుల్ గాంధీ

కొత్తగా ఏర్పడింది.. ఇబ్బందులు తప్పవు!

$
0
0

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజనను తాత్కాలికంగా వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో హైకోర్టు భవనాలు, వౌలిక సాదుపాయలు, జడ్జీల నివాస సముదాయాలు పూర్తయ్యేవరకు హైకోర్టు విభజనపై విడుదలైన గెజిట్ నోటిఫికేషన్‌పై స్టే ఇవ్వాలంటూ ఏపీ న్యాయవాదుల సంఘం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ న్యాయవాదులు సంఘం తరపున కె.సీతారాం, కె.జగన్మోహన్‌రెడ్డి సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. న్యాయమూర్తులు ఏకే సిక్రీ, అబ్దుల్ నజీర్‌తో కూడిన ధర్మాసనం ముందుకు బుధవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. రెండు హైకోర్టులకు సంబంధించి వేర్వేరుగా ప్రమాణ స్వీకారాలు కూడా పూర్తయినందున ఈ పిటిషన్‌పై జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. కొత్తగా ఏర్పాటయినప్పుడు చిన్న చిన్న అటంకాలు మామూలేనని ధర్మాసనం అభిప్రాయపడింది.


3 బ్యాంకుల విలీనానికి కేంద్రం ఆమోదం

$
0
0

న్యూఢిల్లీ, జనవరి 2: విజయా బ్యాంక్, దేనా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా విలీనానికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోద ముద్ర వేసింది. దీనితో బ్యాంక్ ఆఫ్ బరోడా దేశంలోనే మూడో అతి పెద్ద బ్యాంక్‌గా ఆవిర్భవించేందుకు మార్గం సుగమమైంది. ఈ విలీనం తర్వాత, విజయా బ్యాంక్, దేనా బ్యాంక్‌కు ఉన్న వ్యాపార లావాదేవీలన్నీ బ్యాంక్ ఆఫ్ బరోడాకు బదిలీ అవుతాయి. ఆస్తులు, అప్పులు, ఇతరత్రా ఖాతాలు కూడా బ్యాంక్ ఆఫ్ బరోడాతో కలిసిపోతాయి. విలీనంలో భాగంగా, విజయా బ్యాంక్‌కు సంబంధించిన రూ.10 విలువైన ప్రతి 1000 షేర్లకుగాను రూ.2 విలువైన 402 షేర్లను బ్యాంక్ ఆఫ్ బరోడా విడుదల చేస్తుంది. అదే విధంగా రూ.10 విలువైన ప్రతి 1000 దేనా బ్యాంక్ షేర్లకు బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.2 విలువైన 110 షేర్లను అందిస్తుంది.

చిత్రం..కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను పత్రికల వారికి వివరిస్తున్న రవిశంకర్ ప్రసాద్, రాజ్‌నాథ్ సింగ్

వేగం పెంచాలి

$
0
0

కరీంనగర్, జనవరి 2: తెలంగాణ రైతుల కల్పవల్లి కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుబంధంగానిర్మిస్తున్న పలు బ్యారేజీలు, పంపుహౌజ్‌ల పనుల్లో మరింత వేగం పెంచి, మరోసారి ప్రాజెక్టుల పరిశీలనకు వచ్చేలోపు పూర్తిచేసి, ట్రయల్ రన్ నిర్వహించాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఈ ఖరీఫ్ నాటికి రైతాంగానికి సాగు నీరందించటమే లక్ష్యంగా పనులు కొనసాగించాలని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పరిశీలనలో భాగంగా రెండోరోజు గురువారం ఉమ్మడి జిల్లాలోని కనె్నపల్లిపంపుహౌజ్, అన్నారం పంపుహౌజ్, సుందిల్ల బ్యారేజీ, గోలివాడ పంపుహౌజ్ పనులతోపాటు ఎస్సారెస్పీ పునరుజ్జీవ పనుల్లో భాగంగా ఇబ్రహీంపట్నం మండలంలోని రాజేశ్వర్‌రావుపేటలోకొనసాగుతున్న రివర్స్‌పంపింగ్ నిర్మాణ పనులు పరిశీలించారు. ఆయా పనుల పురోగతిపై అధికారులు, ఇంజనీర్లను అడిగి తెల్సుకున్నారు. ముందుగా ప్రకటించిన మేరకు పనుల వేగం కొనసాగటం లేదని, ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహాయ, సహాకారాలందిస్తున్నా మంద కొడిగా జరుగుతుండటం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గుత్తేదారుల తీరుపై మండిపడుతూ, నిర్ధేశించిన గడువులోపు పనులు పూర్తి చేసేలా వారికి దిశా, నిర్ధేశం చేశారు. వచ్చే మార్చి నాటికి కాళేశ్వరంలో కాపర్‌డ్యాం నిర్మాణం పూర్తి చేసి, నీటి నిల్వ చేయనున్న దృష్ట్యా, అందుకనుగుణంగా యుద్ధప్రాతిపదికన అధికారులు ఇతర పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈసందర్భంగా కనె్నపల్లి నుంచి అన్నారం వరకు నిర్మిస్తున్న కాలువ లైనింగ్ పనులు వాహనం ద్వారా ప్రయాణిస్తూ, పరిశీలించారు. పలుచోట్ల వాహనం దిగి లైనింగ్ పనుల నాణ్యతను గమనించారు. షెడ్యూలు ప్రకారం చేపట్టాల్సిన పనుల్లో తాత్సారం చేయటంపట్ల సంబంధిత అధికారులు, గుత్తేదారులపై మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో గడువు మీరకుండా, నిర్మాణ
పనులు పూర్తిచేయాల్సిందేనని ఆదేశించారు. రాజేశ్వర్‌రావుపేటలోని రివర్స్ పంపింగ్ నిర్మాణ పనులు పరిశీలించిన ఆయన కాళేశ్వరం నుంచి వెనుకకు వరద కాలువ ద్వారా నీటిని తరలిస్తూ ఎస్సారెస్పీ కింద ఆయకట్టుకు జూన్ మాసం నుంచి నీరందించేలా పనులు పూర్తిచేయాలన్నారు. మార్చి నాటికి పనులు పూర్తి చేసి, ఏప్రిల్, మే మాసాల్లో ట్రయల్ రన్ నిర్వహించి, ఖరీఫ్‌లో ఉత్తర తెలంగాణ భూములన్నీ గోదావరి నీటితో తడిపేందుకు అధికారులు సహకరించాలన్నారు. కాగా, ముఖ్యమంత్రి వెంట మాజీ స్పీకర్ కె ఆర్ సురేశ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జి.వివేక్, తదితరులతో పాటు పలువురు అధికారులున్నారు.
చిత్రం..సుందిల్ల బ్యారేజీ పనులు పరిశీలించి, అనంతరం అధికారులతో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్

పనిచేసేవారికే పదవులు

$
0
0

హైదరాబాద్, జనవరి 2: ‘ఎన్నికల్లో కష్టపడి పని చేసిన వారికి తగిన గుర్తింపునిస్తాం, నామినేటెడ్ పదవులూ ఇస్తాం’ అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు నాయకులు, కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించామన్న అహంకారం వద్దనీ, ప్రజలకు మరింత చేరువ కావాలని ఆయన పిలుపునిచ్చారు. బుధవారం సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన ఆ నియోజకవర్గం విజయోత్సవ సభ జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేటీఆర్ ప్రసంగిస్తూ ‘అసెంబ్లీ ఎన్నికల స్పూర్తితోనే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లోనూ పని చేయండి. 16 లోక్‌సభ స్థానాలను టీఆర్‌ఎస్సే గెలుచుకోవాలి’అని అన్నారు. గతంలో
ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన వారికి చేదు అనుభవాలు ఎదురయ్యాయన్న కేటీఆర్ ‘ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుఏదీ చేసినా అదొక చరిత్ర అవుతుంది’ అని ప్రకటించారు. అసెంబ్లీని రద్దు చేయడం, వెంటనే కొన్ని గంటల్లోనే 105 మంది అభ్యర్థులను ప్రకటించడాన్ని ఆయన ఉదహరించారు. తెలంగాణ కోసం పార్టీని స్థాపించి రాష్ట్రాన్ని సాధించిన అరుదైన నాయకుడు కేసీఆర్ అని ఆయన చెప్పగానే కార్యకర్తలు కరతాళధ్వనులు చేశారు. రెండోసారి టీఆర్‌ఎస్ సాధించిన విజయం దేశంలోనే రికార్డు అని ఆయన తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలోనే బంగారు తెలంగాణ సాధ్యమని ప్రజలు విశ్వసించారని, అందుకే బ్రహ్మండమైన మెజారిటీతో పట్టం కట్టారని ఆయన చెప్పారు. ఈ విజయంతో పొంగిపోవద్దని, అహంకారం రాకూడదని, ప్రజలకు సేవ చేస్తూ వారి మన్ననలు పొందాలని ఆయన నాయకులకు, కార్యకర్తలకు సూచించారు.
పెరిగిన ఓట్ల శాతం
టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐ నాయకులు ఏకమైనా ఏమీ చేయలేకపోయారని విమర్శించారు. మరోవైపు బీజేపీ అగ్ర నాయకులు, ప్రధాని, పలువురు కేంద్ర మంత్రులూ ప్రచారానికి వచ్చినా ఆ పార్టీని ప్రజలు విశ్వసించలేదని ఆయన చెప్పారు. ఇంత మంది వచ్చినా టీఆర్‌ఎస్‌కు 14 శాతం ఓట్లు పెరిగాయని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 75 శాతం సీట్లు సాధించామని, గతం కంటే 14 శాతం ఓట్లూ పెరిగాయని ఆయన వివరించారు. కుల, మతాలకు అతీతంగా ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేశారని ఆయన తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల లాంటి ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల్లో పునరావృత్తం అవుతాయని తాము ఎన్నికలకు ముందు చెప్పిన దానినే ప్రజలు నిజం చేసినందుకు కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. ఫలితాల తర్వాత ప్రజా కూటమి నేతల బుర్రలు చెడిపోయాయని, చంద్రబాబు తిట్లు మనకు దీవెనలు అనుకుందామని కేటీఆర్ చెప్పారు.
16 సీట్లు గెలవాలి
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లోనూ కార్యకర్తలు కష్టపడి పని చేసి 16 లోక్‌సభ సీట్లను కైవసం చేసుకోవాలని అన్నారు. 16 సీట్లు గెలిపస్తే కేంద్రాన్ని శాసించే స్థితి ఉంటుందని ఆయన తెలాపారు.
చిత్రం..సనత్‌నగర్ నియోజక వర్గ టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో విల్లు ఎక్కుపెడుతున్న కేటీఆర్

సిరా చుక్క వేలు మారింది

$
0
0

హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లు ఓటు వేసిందీ లేనిది తెలుసుకునేందుకు ఎడమచేతి మధ్యవేలుపై సిరా (ఇండెలిబిల్ ఇంక్) చుక్క వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కమిషన్ కార్యదర్శి ఎం. అశోక్ కుమార్ పేరుతో ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులను జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ
అధికారులకు, కలెక్టర్ల ద్వారా రిటర్నింగ్ అధికారులకు, ప్రిసైడింగ్ అధికారులకు, పోలింగ్ సిబ్బందికి తెలియచేశారు. 2018 డిసెంబర్ 7 న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓటు వేసిన ఓటర్లను గుర్తించేందుకు వారి ఎడమ చేతి చూపుడువేలుపై పోలింగ్ సిబ్బంది సిరా చుక్క వేశారు. ఈ నెల చివరన జరగబోయే పంచాయతీ ఎన్నికల వరకు ఈగుర్తు చెదిరిపోయే అవకాశాలు లేకపోవడంతో, సిరా చుక్క వేసే వేలును మారుస్తున్నట్టు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఎడమచేతి చూపుడువేలుపైనే సిరా గుర్తు వేయాలని నిర్ణయిస్తే, పాత సిరాగుర్తు వల్ల సమస్యలు ఎదురవుతాయని భావించారు. అందుకే ఎలాంటి సమస్యలు ఎదురుకాకూడదన్న ఉద్దేశంతో ఓటువేసేందుకు వచ్చే ఓటర్ల ఎడమచేతి మధ్యవేలుపై సిరా చుక్క గుర్తు వేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను తు.చ తప్పకుండా పాటించాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, ఎలాంటి గందరగోళానికి అవకాశం ఇవ్వవద్దని సూచించారు. జిల్లా కలెక్టర్లు వెంటనే రిటర్నింగ్ అధికారులకు, ప్రిసైడింగ్ అధికారులకు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అదికారులకు, ఇతర పోలింగ్ సిబ్బందికి సిరా వేసే వేలు మారిన అంశం గురించి తెలియచేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.

‘పంచాయతీ’ కోలాహలం

$
0
0

హైదరాబాద్: తెలంగాణలోని గ్రామీణ ప్రజలు గత ఆరు నెలల నుండి ఎదురు చూస్తున్న పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో గ్రామాల్లో కోలాహలం మొదలైంది. నిన్నటి నుండి గ్రామాల్లో ఏ ఇద్దరు కలిసినా సర్పంచ్ స్థానానికి, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల గురించే చర్చించుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికలు జనవరిలో జరుగుతాయని గత నెల రోజుల నుండి ప్రచారం జరుగుతుండటంతో ఇప్పటికే సర్పంచ్ పోస్టుకు, వార్డు సభ్యుల పోస్టుకు పోటీ చేయాలని భావిస్తున్న వారు నామినేషన్లు వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వాస్తవంగా ఇప్పుడే గ్రామాల్లో ‘పంచాయితీ’ ప్రారంభం అయిందనిపిస్తోంది. ఎస్‌సీ, ఎస్‌టీ రిజర్వేషన్ ఉన్న గ్రామాల్లో పోటీ పెద్దగా ఉండకపోవచ్చని, బీసీ రిజర్వేషన్లు, జనరల్ స్థానాలుగా ప్రకటించిన గ్రామ పంచాయతీలకు మాత్రం పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. వాస్తవంగా పంచాయతీ ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నప్పటికీ, పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న ప్రతి వ్యక్తి ఏదో ఒక రాజకీయ పార్టీకి చెందినవారే అయి
ఉన్నారు. ప్రతి గ్రామంలో టీఆర్‌ఎస్‌కు చెందిన నేతలు చాలా మంది సర్పంచ్‌స్థానానికి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. సర్పంచ్‌స్థానానికి ఏ గ్రామంలో ఎవరు పోటీ చేయాలన్న అంశం సంబంధిత టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఉన్నచోట ఎమ్మెల్యేనే నిర్ణయిస్తారని తెలుస్తోంది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లేనిచోట టీఆర్‌ఎస్‌కు చెందిన నియోజకవర్గం ఇంచార్జీ కానీ, మాజీ ఎమ్మెల్యేలు ఉంటే వారు కానీ, ఎంపీటీసీలు, జడ్‌పీటీసీల సలహాల మేరకు సర్పంచ్ అభ్యర్థులను ఎంపిక చేస్తారని తెలుస్తోంది. ఆ యా గ్రామాల్లో ప్రజల్లో మంచి అభిమానం ఉన్నవారు, గ్రామం కోసం ఇప్పటికే పాటుపడుతున్న వారు, ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్ధతుగా నిలిచిన నేతల్లో ఒకరిని సర్పంచ్ స్థానానికి ఎంపిక చేస్తారని తెలుస్తోంది. ఎస్‌సీ, ఎస్‌టీలకు రిజర్వ్ అయిన స్థానాల్లో సామర్థ్యం ఉన్నవారు ఉంటే వారిని పోటీకి నిలపాలని టీఆర్‌ఎస్ మండల, నియోజకవర్గం నేతలు భావిస్తున్నారు. జనరల్ స్థానం నుండి వార్డుసభ్యుల స్థానాలకు పోటీ చేసే ఇతరులకు ఉపసర్పంచ్ స్థానం కట్టబెట్టాలని భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే చాలా గ్రామాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం, బీజేపి పార్టీల నుండి సర్పంచ్‌లుగా గెలిచిన వారు కూడా ఉన్నారు. అలాంటి చోట గట్టిపోటీ ఉంటుందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ఇలా ఉండగా, హైదరాబాద్ చుట్టుపక్కల, మరీ చెప్పాలంటే రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, నల్లగొండ, మెదక్, వికారాబాద్ జిల్లాల పరిధిలో ఉండే గ్రామాల్లో పోటీ రసవత్తరంగా ఉంటుందని తెలుస్తోంది. హైదరాబాద్ నుండి 50 కిలోమీటర్ల పరిధిలో ఉండే ప్రాంతాల్లో రియల్‌ఎస్టేట్ వ్యాపారం భారీగా కొనసాగుతోంది. అనధికారిక సమచారం ప్రకారం రియల్ ఎస్టేట్ వ్యాపారుల గుప్పిట్లో దాదాపు పదిలక్షల ఎకరాలపైగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో సర్పంచ్ స్థానానికి చాలా విలువ ఉంది. లేఅవుట్లు ఇవ్వడం, వౌలిక సదుపాయాలు కల్పించడం తదితర అంశాల్లో గ్రామ పంచాయతీ సర్పంచ్‌లదే పైచేయిగా ఉంటుంది. అలాంటి గ్రామాల్లో సర్పంచ్ స్థానం కోసం ఐదుకోట్ల రూపాయల వరకు ఖర్చు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాంటి చోట రియల్టర్ల ప్రాబల్యం ఉంటుందని భావిస్తున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు సర్పంచ్ స్థానానికి పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల వ్యయ పరిమితి రెండున్నర లక్షల రూపాయలే. హైదరాబాద్ చుట్టుపక్కల యాభై రెట్ల వరకు ఎక్కువ పెట్టుబడి పెట్టేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ తరహా గ్రామాల్లో వార్డు సభ్యుల స్థానాలకు కూడా డిమాండ్ బాగా ఉంది. మొత్తంమీద పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత గ్రామాల్లో కోలాహలం, హడావుడి మొదలైంది.

గవర్నర్‌ను కలిసిన కేటీఆర్

$
0
0

హైదరాబాద్, జనవరి 2: టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు బుధవారం రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా వారు కొంత సేపు తాజా పరిస్థితులపై చర్చించారు.

ఆర్డినెన్స్‌తో అన్యాయం చేస్తారా?

$
0
0

బీసీ నేత కృష్ణయ్య
ఆగ్రహం


ఆయేషా కేసు విచారణలో కీలక మలుపు

$
0
0

విజయవాడ (క్రైం), జనవరి 2: దాదాపు పదేళ్ళ క్రితం రాష్టవ్య్రాప్తంగా తీవ్ర సంచలనం కలిగించిన బి ఫార్మసీ విద్యార్థిని ఆయేషామీరా హత్య కేసుకు సంబంధించి కీలక మలుపు చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో నందిగామ అనాసాగరంకు చెందిన పిడతల సత్యంబాబును దోషికి తేల్చి విజయవాడ కోర్టు 2010 శిక్ష వేసింది. అయితే ఆ తర్వాత అతడిని నిర్దోషిగా నిర్ధారిస్తూ రాష్ట్ర హైకోర్టు విడుదల చేసింది. హైకోర్టు ఆదేశాలతో కేసు విచారణకు ఇటీవల సీబీఐ రంగంలోకి దిగింది. ఈక్రమంలో కేసుకు సంబంధించి రికార్డులు విజయవాడ కోర్టులో ధ్వంసం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇదే అంశాన్ని హైకోర్టుకు నివేదించారు.
దీంతో రికార్డుల ధ్వంసానికి సంబంధించి సీబీఐ విశాఖ కేంద్రంగా మరో కేసు నమోదు చేసింది. ప్రస్తుతం ఆయేషా కేసుకు సంబంధించి రికార్డుల ధ్వంసంలో విజయవాడలోని నాలుగో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు సిబ్బందిని నిందితులుగా చేర్చుతూ సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ వ్యవహారంలో విజయవాడ కోర్టు సిబ్బంది ప్రమేయాన్ని గుర్తించిన సీబీఐ.. ప్రాపర్టీ క్లర్క్ కుమారి, సీనియర్ అసిస్టెంట్ సుబ్బారెడ్డి, జూనియర్ అసిస్టెంట్ పి వెంకటకుమార్‌లను ఏ వన్, ఏ టు, ఏ త్రి నిందితులుగా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంటూ కేసులు నమోదు చేశారు.

రాష్ట్రాన్ని దోచేస్తున్న టీడీపీ నేతలు

$
0
0

అనంతపురం సిటీ, జనవరి 2: తెలుగుదేశం నేతలు రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకుంటున్నారని, వారి అవినీతి, అక్రమాలకు అడ్డులేకుండా పోయిందని నెహ్రూ యువ కేంద్ర జాతీయ ఉపాధ్యక్షులు ఎస్.విష్ణువర్థన్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం అనంతపురం నగరంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి నెలకొందన్నారు. ఏ విభాగం చూసినా అవినీతి పెరిగిపోయిందన్నారు. ఇందుకు సాక్షం విజయవాడ మేయర్ వ్యాఖ్యలేనన్నారు. విజయవాడలో ప్రభుత్వ భూములకు రాత్రికి రాత్రే జీవోలు పుట్టిస్తూ అక్రమిస్తున్నారని, ఎప్పుడూ జైలుకు వెళ్తామోనని భయంగా ఉందని, తనలాంటి నాయకులు టీడీపీలో ఉండలేరని బాధపడటం అందరూ గమనించాలన్నారు. రాష్ట్భ్రావృద్ధికి అనేక సంక్షేమ పథకాలను ప్రకటిస్తూ దేశ ప్రధాని నరేంద్రమోదీ నిధులు విడుదల చేస్తేంటే వాటితో రాష్ట్భ్రావృద్ధి చేయకుండా సొంత ఖాతాల్లోకి మార్చుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్భ్రావృద్ధిపై ప్రధాని మోదీని చర్చకు రమ్మని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలవడం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దేశ ప్రధానిని చర్చకు పిలవడం వింత అన్నారు. ఇది బాబు అవివేకానికి అద్దం పడుతోందన్నారు. ముగ్గురు మోదీలతో నా పోరాటం అంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మరి నాల్గవ మోదీ పవన్ కల్యాణ్ గురించి వ్యాఖ్యానించమంటే ఆయన మా వాడే అంటున్నాడన్నారు. టీడీపీ అతి పెద్ద దొంగల ముఠా పార్టీ అని పవన్ ఆరోపించారని, అయినా పవన్‌తో కలుస్తున్నారంటే దీనికి మీరే సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రానికి ప్రధాని వస్తున్నారంటే టీడీపీ వారికి వెన్నులో వణుకు పుడుతోందన్నారు. ప్రధాని ఎక్కడ తమ బండారం బయటపెడతారన్న భయం టీడీపీ నేతలకు పట్టుకుందన్నారు. అందుకే మోదీని అడ్డుకుంటామని ప్రకటనలిస్తున్నారన్నారు. ఈ నెలలోపు రాయలసీమ జిల్లాల్లో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా పర్యటన ఉంటుందన్నారు. టీడీపీ వారికి దమ్ముంటే షా పర్యటనను అడ్డుకోవాలని ఛాలెంజ్ విసిరారు.
రాష్ట్రంలో ప్రజలు కట్టిన పన్నులతో టీడీపీ ప్రభుత్వం సిగ్గులేకుండా పత్రికా ప్రకటనలిచ్చుకుంటూ మోదీని తిడుతోందన్నారు. ఇదేనా మీ స్థాయి అని నిలదీశారు. మీరు చెప్పిన మాటలు ఎవరూ నమ్మరు కాబట్టే ఇలా ప్రకటనలు, పత్రికల్లో డప్పుకొట్టుకుంటున్నారని ఆరోపించారు. జన్మభూమి కార్యక్రమం ద్వారా నాలుగు సంవత్సరాల్లో ఏం సాధించారని విష్ణు నిలదీశారు. ఐదు విడతలుగా జన్మభూమి కార్యక్రమం నిర్వహిస్తే లక్షల కొద్దీ వినతులు వచ్చాయని, అవన్నీ ఆయా జిల్లాల కలెక్టరేట్లలో మూలుగుతున్నాయన్నారు. అవినీతికి పాల్పడుతున్న టీడీపీ నాయకులు జేబులు నింపుకోవడానికే జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు తప్ప ప్రజల కోసం కాదన్నారు. అవినీతికి పాల్పడుతున్న టీడీపీ నేతలను అరెస్టు చేస్తే దేశంలోని జైళ్లు చాలవని అన్నారు. ప్రజాసామ్య వ్యవస్థను నాశం చేయడంలో టీడీపీ ప్రభుత్వం ముందుందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, టీడీపీ నాయకుల దౌర్జన్యాలు, అక్రమాలు పెరిగిపోయాయన్నారు. సామాన్య ప్రజల ఇబ్బందులు, సమస్యలు తీర్చడానికి ప్రయత్నించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విష్ణు కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎంఎస్.పార్థసారథి, జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

గృహ నిర్మాణ ప్రాజెక్టులు గడువులోగా పూర్తి

$
0
0

విజయవాడ, జనవరి 2: రాష్ట్రంలోని గృహ నిర్మాణ ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఏపీటిడ్కో (ఏపీ టౌన్‌షిప్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అనిల్ చంద్ర పుణేఠా ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో ఏపీటిడ్కోకు సంబంధించి రాష్ట్ర స్థాయి మంజూరు, పర్యవేక్షణ కమిటీ సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహ నిర్మాణ ప్రాజెక్టులు అన్నిటినీ సకాలంలో పూర్తి చేసేందుకు వీలుగా పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. గృహ నిర్మాణానికి సంబంధించి రెండు దశల ప్రాజెక్టుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొదటి దశ పనులను రానున్న నాలుగు నెలల్లో పూర్తి చేయాలన్నారు. ఈ గృహాలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సకాలంలో విడుదల అయ్యేలా చూడాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ఏపీటిడ్కో ఎండీ బిఎం దివాన్ మాట్లాడుతూ వివిధ పట్టణాల్లో 5.79 లక్షల ఇళ్లు మంజూరు కాగా, వాటిలో 4.60 లక్షల ఇళ్లకు టెండర్లు ఖరారు చేశామన్నారు. వాటిలో 3.6 లక్షల ఇళ్లు ప్రారంభమైనాయన్నారు. ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ కింద 4.28 లక్షల ఇళ్లు మంజారు కాగా, 1.69 ఇళ్లకు పాలనా ఆమోదం మంజూరైందన్నారు. వీటిలో 71 వేల ఇళ్లు పూర్తి అయ్యాయన్నారు. మొదటి దశ పనులను మార్చిలోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 11 అర్బన్ లోకల్ బాడీస్, 5 అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల నుంచి 41 డీపీఆర్‌లు వచ్చాయన్నారు. వాటి ద్వారా 57 వేల ఇళ్లను నిర్మించాల్సి ఉంటుందన్నారు. ఈ ఇళ్ల నిర్మాణానికి 3,183 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని, ఇందులో కేంద్రం నుంచి 861 కోట్ల రూపాయలు సమకూర్చుకుంటున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం 676 కోట్ల రూపాయలు, లబ్ధిదారులు 1191 కోట్ల రూపాయలు భరించాల్సి ఉంటుందని వివరించారు.
చిత్రం..గృహ నిర్మాణంపై సమీక్షిస్తున్న దృశ్యం

మోదీజీ.. మా సీఎం సవాల్ స్వీకరించండి

$
0
0

శ్రీకాకుళం, జనవరి 2: ఎవరూ చేయనంతగా ఏపీకి ఎన్నో అభివృద్ధి-సంక్షేమ పథకాలు అందించామంటున్న ప్రధాని మంత్రి నరేంద్రమోదీ ప్రసంగంపై చర్చకు రావాలన్న ముఖ్యమంత్రి సవాల్‌ను స్వీకరించాలంటూ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు డిమాండ్ చేసారు. ఐదు కోట్ల ఆంధ్రుల హక్కుల కోసం బాబు చేస్తున్న ధర్మపోరాటానికి విజ్ఞతతో ఆలోచించి ప్రజలంతా సహకరించాలని కోరారు. బుధవారం శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన ఆరోవిడత జన్మభూమి-మా వార్డు మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాలుగున్నరేళ్ళుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆర్థికంగా ఎన్ని ఆటుపోట్లున్నా మంచి పాలన అందించారన్నారు. కేంద్రాన్ని గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని, విభజన చట్టం, రాజ్యసభలో ఇచ్చిన హామీలనే నెరవేర్చమంటున్నామన్నారు.ఏపీకి రూ. 16,000 కోట్లు లోటు బడ్జెట్ అంటూ చెప్పిన కేంద్రప్రభుత్వమే రూ. 3,900 కోట్లు ఇచ్చిందన్నారు. రాజధాని లేక, ఎక్కడ కట్టాలో తెలియక ఆర్థిక నగరంగా తయారు చేయాలంటూనే ఢిల్లీని తలదనే్నలా నిర్మించాలన్న మోదీయే అందుకు కావల్సిన నిధులు రూ. 4,900 కోట్లకు కేవలం రూ. 1500 కోట్లు ఇచ్చారన్నారు. రాజధాని నిర్మాణ పనుల్లో అండర్‌గ్రౌండ్ కేబుల్ పనులకే ఆ మొత్తం సరిపోదని అచ్చెన్న అన్నారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం నీతి ఆయోగ్ సూచనల మేరకు రాష్ట్రానికే ఆ ప్రాజెక్టు పనులు అప్పగించి నిధులు ఇవ్వకుండా ఇప్పటికీ అష్టకష్టాలు పెడుతోందన్నారు. ఇప్పటి వరకూ జరిగిన 75 శాతం పనులకు రూ. 5000 కోట్లు కేంద్రం ఇంకా ఇవ్వాల్సివుందన్నారు. ఎంతో ఖనిజసంపద ఉందని చెప్పి కడపలో స్టీల్ ప్లాంటు నిర్మాణానికి అంగీకరించిన కేంద్రం మాటమార్చడంతో అక్కడ స్టీల్ ప్లాంటు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు రావల్సివచ్చిందన్నారు. విశాఖ రైల్వే జోన్ ఇస్తామంటూ ఒకరోజు, ఇవ్వలేమంటూ మరోరోజు మాటలు చెప్పే కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి 11 సంస్థలు కేటాయించాలంటూ విభజన చట్టంలో ఉన్నప్పటికీ వాటిని అమలుచేయకపోవడం వల్లే ధర్మ పోరాటానికి ముఖ్యమంత్రి దిగాల్సి వచ్చిందన్నారు. నాలుగున్నరేళ్ళుగా రాష్ట్రంలో పేదోడి స్వగృహం కల నెరవేర్చడానికి 30 లక్షల మందికి గృహాలు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షపార్టీలు అడుగడుగునా అడ్డుపడుతున్నా, ఆర్థికంగా ఈ రాష్ట్రానికి అనేక సమస్యలు ఉన్నా, ఎక్కడా సంక్షేమ పథకాలను అమలు చేయడమన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. కేంద్ర ప్రభుత్వం కుట్రలు, కుతంత్రాలపై చర్చ జరగాలని, సీఎం విడుదల చేసిన శే్వతపత్రాలపై గ్రామస్థాయిల్లో కూడా చర్చ జరిగినప్పుడే కేంద్రం చేసిన దగా ప్రతీ పౌరుడికీ అర్థమవుతుందన్నారు. 2014 ముందు మనకు ఇష్టం లేకపోయినా, మనం కోరుకోపోయినా రాష్ట్రాన్ని రెండుగా విభజించారని, విభజన జరిగినప్పటికీ, ఆంధ్రాకు జరిగిన అన్యాయాన్ని కేంద్రప్రభుత్వం సరిచేస్తుందన్న నమ్మకంతోనే వారితో జతకట్టి ఎన్నికల్లోకి వెళ్ళి ప్రభుత్వాలను ఏర్పాటు చేసామన్నారు. కానీ, వారే మోసం చేయడంతో ధర్మపోరాటం చేస్తున్నామన్నారు. ఐదుకోట్లు ఆంధ్రుల హక్కులను అడిగేందుకు మరో అవకాశం లేకపోగా మరో పార్టీతో జతకట్టి ప్రాంతీయ పార్టీలను ఒక తాటిమీదకు తీసుకువస్తున్న ముఖ్యమంత్రిపై కేంద్రం కనె్నర్ర చేస్తే భయపడేది లేదంటూ హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, కలెక్టర్ కె.ధనంజయరెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

చిత్రం..జన్మభూమి సభలో మాట్లాడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు

మతంతో లబ్ధికి బీజేపీ కుట్రలు

$
0
0

అమరావతి, జనవరి 2: జన్మభూమి- మా వూరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. మతసంబంధమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకుని లబ్ధి పొందేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందన్నారు. టీడీపీకి సంబంధించి ఇదే కీలకమైన సమయం.. ఈ పదిరోజులు గ్రామాలు, వార్డులలోనే ఉండాలని నిర్దేశించారు. భావితరాల భవిష్యత్తు వచ్చే ఎన్నికలపై ఆధారపడి ఉందన్నారు. ఎన్నికల్లో గెలుపే ప్రధానంగా పార్టీశ్రేణులు పనిచేయాలన్నారు. బుధవారం పార్టీ నాయకులతో ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. దుష్టశక్తులు పార్టీ, రాష్ట్రంపై కక్ష కట్టాయి..ఏపీకి విద్యుత్ బకాయిలు చెల్లించరు కానీ, పొరుగు రాష్ట్రాల్లో ప్రచారానికి కోట్లు వెచ్చిస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మండిపడ్డారు. నేనేదో ఆక్రోశంలో ఉన్నానని మోదీ అంటున్నారు.. గుజరాత్‌ను ఏపీ మించిపోతుందనే ఆక్రోశం ఆయనకే ఉందని వ్యాఖ్యానించారు. అందుకే ఏపీకి నిధులివ్వకుండా అక్కసు వెళ్లగక్కుతున్నారని ధ్వజమెత్తారు. అడుగడుగునా ఏపీ అభివృద్ధికి అడ్డుపడుతున్నారు..ఇద్దరం ముఖ్యమంత్రులుగా పనిచేశాం.. మోదీ అహ్మదాబాద్‌కు చేసిందేమీలేదు.. హైదరాబాద్‌ను మాత్రం తాను అభివృద్ధి చేశానని గుర్తుచేశారు. అహ్మదాబాద్‌కు, హైదరాబాద్‌కు పొంతన లేదన్నారు. ఏపీకి సహకరిస్తే అభివృద్ధిలో మించిపోతుందని మోదీ భయమన్నారు. హుందాతనం లేకుండా మోదీ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడ నిలదీస్తారో అని ఏపీ పర్యటన రద్దు చేసుకున్నారని, దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ జీరో.. మోదీ, షా, ముగ్గురు సీఎంలు, 13 మంది కేంద్రమంత్రులు ప్రచారం చేసినా తెలంగాణలో ఒక్క సీటు మాత్రమే గెలిచారని విమర్శించారు. తెలంగాణలో కూటమి విఫలమయిందని బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు..బీజేపీ యేతర కూటమికి బీటలు పడ్డాయని అరుణ్‌జైట్లీ చేస్తున్న వ్యాఖ్యానాలన్నీ హాస్యాస్పదమన్నారు. టీడీపీని జీరోచేస్తే బీజేపీ గెలుపుగా భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. నాలుగు రోజులు కూడ గడువు ఇవ్వకుండా హైకోర్టును తరలించారని ఆక్షేపించారు. కరవు, తుపాన్లకు మోదీ డబ్బులు ఇవ్వరు.. విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధులు మంజూరు చేయరు.. హామీలు నెరవేర్చరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో టీడీపీ గెలిస్తే తన అసమర్థత బయటపడుతుందని కేసీఆర్ భయపడుతున్నారని విమర్శించారు. కేసుల మాఫీ కోసం, అధికార దాహంతోనే మోదీతో ప్రతిపక్షనేత జగన్ జతకట్టారని ఆరోపించారు. ఎవరైతే మనకు అన్యాయం చేశారో వారిపై మనం పోరాడుతున్నాం.. రాష్ట్రానికి అన్యాయం చేసిన వారితో జగన్ మిలాఖత్ అయ్యారు. ముగ్గురు మోదీలతో మనం పోరాటం చేస్తున్నాం.. ప్రజల్లో పట్టుదల పెరగాలి.. కసితో పనిచేయాలని స్పష్టం చేశారు. రాష్ట్భ్రావృద్ధికి చేయూతనివ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆశయం కోసం ఉద్యమ స్ఫూర్తితో పోరాడాలన్నారు. ప్రతిపక్షానికి ఎక్కడా అవకాశం ఇవ్వరాదన్నారు. మంచి పనులు చేయటమే కాదు.. చేసిన మంచిని ప్రజలు గుర్తించేలా ప్రచారం చేయాలని పార్టీ కార్యకర్తలను కోరారు. మళ్లీ టీడీపీయే అధికారంలోకి రావాలి.. లేకపోతే రాష్ట్రం దెబ్బతింటుందనే భయం ఉంది.. ప్రజల ఆశలు..ఆకాంక్షల మేరకు పనిచేయాలన్నారు. 25 ఎంపీ సీట్లు, 150 అసెంబ్లీ సీట్లలో గెలుపే లక్ష్యమన్నారు. పరిపాలనలో పారదర్శకత కోసమే శే్వతపత్రాలు విడుదల చేశామని నాలుగున్నరేళ్లలో అనేక సమస్యలు పరిష్కరించామన్నారు. గ్రామాలు, వార్టుల్లో వసతులు పెంచామని తెలిపారు. సిమెంట్ రహదారులు, ఎల్‌ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఎన్టీఆర్ వైద్యసేవ ఖర్చులు రూ. 5 లక్షలకు పెంచామని, చంద్రన్న బీమా కింద రూ. 5 లక్షలు అందిస్తున్నట్లు వివరించారు. ఆపదల్లో అందరికీ అండగా ప్రభుత్వం ఉందన్నారు. ఎన్నో అవార్డులు సాధించాం.. రాష్ట్రాన్ని తిరుగులేని శక్తిగా మార్చామన్నారు. కేంద్ర సహకారం లేకపోయినా ఇన్ని పనులు చేశాం.. అదే కేంద్రం తోడ్పాటు ఉంటే మరెన్నో చేసేవాళ్లమని స్పష్టం చేశారు.
దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని నిర్దేశించారు. ఏపీ చేయని కేసీఆర్ అన్ని సీట్లలో గెలిచారు.. అన్నీ చేసిన మనం ఎన్ని సీట్లలో గెలవాలి.. ఆ కసి టీడీపీ నేతలు, కార్యకర్తల్లో రావాలన్నారు. మత వ్యవహారాల్లో బీజేపీ జోక్యం చేసుకుంటోందన్నారు. ట్రిపుల్ తలాక్ వ్యవహారంలో ఓ రకంగా, శబరిమల విషయంలో మరో రకంగా కుట్రలు చేస్తోందని ఆరోపించారు. విభజించి పాలించాలనే దురుద్దేశంతో ఉందన్నారు. ముస్లిం కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. వీటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పార్టీ సభ్యత్వ నమోదును సంక్రాంతి వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు 60,09,408 సభ్యులు నమోదు కాగా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని కోరారు. జయహో బీసీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. ఆదరణ పరికరాలపై 90 శాతం సబ్సిడీ ఇస్తున్నాం.. దీన్ని బీసీలకు వివరించాలి.. బీసీలలో పార్టీ పట్టును పటిష్టం చేయాలి.. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనారిటీలకు అండగా నిలవాలని దిశానిర్దేశం చేశారు.

Viewing all 69482 articles
Browse latest View live