Are you the publisher? Claim or contact us about this channel


Embed this content in your HTML

Search

Report adult content:

click to rate:

Account: (login)

More Channels


Showcase


Channel Catalog


older | 1 | .... | 2011 | 2012 | (Page 2013) | 2014 | 2015 | .... | 2069 | newer

  0 0
 • 01/03/19--05:11: రంగవల్లి
 • దారబోయన పార్వతి, విమలానగర్, సికింద్రాబాద్

  15 చుక్కలు, 8 వచ్చేవరకు, సందు చుక్కలు
  ===================================
  ముగ్గులకు ఆహ్వానం

  నింగిలోని హరివిల్లులను నేలపైన పేర్చి.. కనులకింపైన రంగుల్ని అందంగా అద్దితే అది రంగుల మాలికవుతుంది. ముంగిట్లో రంగవల్లిక అవుతుంది. ధనుర్మాసం సందర్భంగా తెలుగు ముంగిళ్లలో రంగవల్లులను తీర్చిదిద్దడం ఆనవాయితీ.. ఆ సందర్భంగా ముగ్గులకు ఆహ్వానం పలుకుతోంది మాతృభూమి. ఆసక్తి కలవారు కింది చిరునామాకు ముగ్గులను పంపగలరు.
  సూచనలు
  * ముగ్గులను పంపేవారు ఎ4 సైజు తెల్లకాగితంపై వేయాలి.
  * ముందుగా నల్లని ఇంక్‌తో ఔట్ లైన్ గీసిన తరువాత అందులో రంగుల్ని నింపాలి.
  * ఎన్ని చుక్కలను పెట్టి ముగ్గులు వేశారో.. అంటే సరిచుక్కలా, బేసి చుక్కలా, సందు చుక్కలా.. అనే విషయం స్పష్టంగా రాయాలి.
  * ముగ్గుతో పాటు, మీ పాస్‌పోర్ట్ సైజు కలర్ ఫొటోని, చిరునామాని జతచేయాలి.
  * డౌన్‌లోడ్ చేసిన ముగ్గులు కాక, స్వయంగా చేతితో వేసిన ముగ్గులనే పంపాలి. అదీ చుక్కల ముగ్గులకే ఆహ్వానం.

  ముగ్గులు పంపాల్సిన చిరునామా:
  ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్- 500 003.


  0 0

  కొత్త సంవత్సరం వచ్చేటప్పటికి చాలామంది ఆరోగ్యపరంగానో, కెరీర్‌పరంగానో, లేదంటే ఇప్పటికే ఉన్న కొన్ని అలవాట్లను మార్చుకోవాలనో తీర్మానాలు చేసుకుంటారు. తీర్మానం ఏదైనా ప్రేరణ లేకుండా దాన్ని ఆచరణలో పెట్టడం అసాధ్యం. ఆ విషయం మనలో చాలామందికి అనుభవపూర్వకంగా అర్థమయ్యే ఉంటుంది. యూనివర్శిటీ ఆఫ్ స్క్రాన్‌టన్ నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం కొత్త సంవత్సరం తీర్మానాలు చేసుకునేవారిలో కేవలం ఎనిమిది శాతం మంది మాత్రమే అనుకున్న లక్ష్యాలను చేరుకున్నారు. మిగిలిన 92 శాతం మందిలో మీరు ఉండకూడదు అనుకుంటే, లక్ష్య సాధనలో విఫలం కాకుండా ఉండాలంటే ఐదు సులభమైన మార్గాలను తప్పక అనుసరించాలి.
  మొదలు నెమ్మదిగా..
  వాస్తవ లక్ష్యాలను పెట్టుకుంటే విజయవంతమయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సమస్య ఏమిటంటే.. చాలాసార్లు మనం అసాధారణమైన లక్ష్యాలను ఎంచుకుంటుంటాం. ఈ ఏడాదిలో నేను పూర్తి భిన్నమైన వ్యక్తిగా మారిపోవాలి అనే తప్పుడు ఊహలతో అలా చేస్తాం అంటున్నారు మానసిక నిపుణులు. చిన్నపాటి లక్ష్యంతో పని మొదలు పెట్టడం ద్వారా ఉన్నత లక్ష్యానికి దారులు సులువుగా వేసుకోవచ్చని వారు సూచిస్తున్నారు. ఉదాహరణకు నేరుగా వెళ్లి కిలోమీటర్ల దూరం సాగే మారథాన్‌లో పాల్గొంటానని అనుకోకుండా ముందు రన్నింగ్ షూ కొనుక్కొని కొద్దికొద్దిగా పరుగెత్తడం మొదలుపెట్టాలి. దీని ఉద్దేశ్యం ఏంటంటే.. లక్ష్యాలను తగ్గించుకోవడం కాదు.. నెమ్మది నెమ్మదిగా ముందుకు వెళ్లడం వల్ల దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకోవడం సులువవుతుంది.
  లక్ష్యం
  కొత్త ఏడాది వచ్చింది కదా అని సరైన ప్రణాలిక లేకుండానే తీర్మానాలు చేసుకుంటారు. కానీ సాధించాలనుకున్న లక్ష్యం గురించే పక్కాగా ఆలోచించాలి. ఎలా పడితే అలా కాకుండా ఓ నిర్దిష్టమైన ప్రణాళిక వేసుకోవడం మంచిదని చెబుతున్నారు ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు. ఇలా చేయడం వల్ల ఆచరణ సులభతరమవుతుంది. అంతేకాకుండా ఇతరులతో కలిసి ఒక లక్ష్యం కోసం పనిచేయడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది.
  తోడు
  మనకు తోడుగా ప్రయాణించేందుకు కొందరిని వెతికి పట్టుకోగలిగితే లక్ష్యసాధన మరింత సుగమమం అవుతుంది. ఇలా ఒకసారి చేయడం మొదలుపెడితే రానురాను ఆ నిబద్ధత మరింత మెరుగుపడుతుంది. దాంతో అనుకున్న శిఖరాన్ని చేరుకోవడం చాలా సులభమవుతుంది. కలిసికట్టుగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం ద్వారా వెనుకంజ వేయడానికి వీలు పడదు అంటారు వార్విక్ విశ్వవిద్యాలయానికి చెందిన తత్త్వవేత్త డా. జాన్ మైకేల్ చెబుతున్నారు. కాబట్టి లక్ష్యసాధన కోసం వీలైతే ఇతరులను కలుపుకోవడం మరింత సహాయపడుతుందన్న విషయాన్ని మరువకూడదు.
  ఓటమిని జయించడం
  ప్రయాణంలో కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పుడు చేస్తున్న పనిని మరోసారి సమీక్షించుకోవాలి. ఆటంకాలు ఏమిటి? ఇప్పటివరకు ఏ వ్యూహం బాగా పనిచేసింది? ఏది సరిగా పనిచేయలేదు? అనే విషయాన్ని పరిశీలించుకోవాలి. చిన్నపాటి విజయానికైనా సరే సంబరాలు చేసుకోవాలి. అది మనలోని పట్టుదలను మరింత పెంచుతుంది. ఆత్మస్థైర్యాన్ని మరింత పెంచే మరో మార్గం ఏదైనా ఉంటే దాన్ని కూడా ప్రయత్నించవచ్చు. రోజువారీ జీవితంలో కొన్ని మార్పులు చేసుకోగలిగినా అనుకున్న లక్ష్యంవైపు వెళ్లేందుకు అవి సాయపడతాయి.
  దీర్ఘకాలిక లక్ష్యాల వైపు..
  ఇలా ఒకదానికి ఒకటి కలుపుకుంటూ పోతే, నిబద్ధతను అలవాటు చేసుకుంటే దీర్ఘకాలిక లక్ష్యాలవైపు గురి పెట్టవచ్చు. చెదరని పట్టుదలతో, దీక్షతో అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చు.


  0 0

  ఓ అమ్మాయిని పొగడాలంటే బంగారు బొమ్మలా ఉంటుందని పొగుడుతారు. అలాగే ఓ అమ్మాయి శరీర ఛాయ గురించి చెప్పాలంటే పసిడి ఛాయలో మెరిసిపోతోంది అని చెబుతారు. కారణం స్వచ్ఛమైన బంగారం పసుపుపచ్చని రంగులో మెరుస్తుందని అందరూ ఇలాంటి విశేషణాలను వాడతారు. కానీ భవిష్యత్తులో ఇలాంటి విశేషణాలు వాడాలంటే ఆలోచించాల్సిందే.. ఎందుకంటే బంగారం పసుపు ఛాయతో పాటు తెలుపు, గులాబీ రంగులతో పాటు ఆకుపచ్చ, ఎరుపు, ఊదా, నీలం, నలుపు రంగుల్లోనూ లభించబోతోంది. ఇలా లభిస్తే చాలు నేటి యువత రోజుకో డ్రెస్ వేసుకున్నట్లే బంగారాన్ని కూడా రోజుకో రంగులో, డ్రెస్‌కి మ్యాచింగ్‌గా ధరిస్తారేమో.. ఒకప్పుడు ఆడవారు బంగారం కూడా రంగురంగుల్లో లభించవచ్చు కదా అనుకునేవారు. ఇప్పటికి వారి కోరిక పూర్తిస్థాయిలో నెరవేరిందనే చెప్పాలి. పాశ్చాత్యదేశాల్లో రోజ్, వైట్‌గోల్డ్ నగల్ని ధరించడం ఎప్పటినుంచో ఉంది. ముఖ్యంగా రష్యన్లకి రోజ్‌గోల్డ్ అంటే చాలా ఇష్టం. వాళ్ల పెళ్లి ఉంగరాలు, వాచీలు తెల్లగానో, గులాబీ రంగులోనో మెరుస్తుంటాయి. గులాబీ, తెలుపు, పసుపూ మూడు రంగుల్ని కలగలిపి చేసినవన్నా వాళ్లకెంతో మోజు. ఈమధ్య వాటితో పాటు ఆకుపచ్చ నగల్నీ ధరించడం నేడు సరికొత్త ట్రెండుగా మారింది. బంగారంలో ఆ రంగు చూశాక జువెలరీ సంస్థలకు మరిన్ని రెక్కలొచ్చాయి. ఫలితంగా బంగారం ఎరుపు, నలుపు, ఊదా, నీలం రంగుల్లోనూ మెరుస్తోంది. స్వచ్ఛమైన బంగారం పసుపుపచ్చగానే ఉంటుంది. కానీ దాన్ని ఆభరణాల రూపంలో వాడలేం. అందుకే అందులో కాడ్మియం లేదా రాగి లేదా ఇండియం వంటి లోహాలను కొద్దిపాళ్లలో వెండినీ కలిపి నగలు చేస్తుంటారు. అలాకాకుండా రాగిశాతాన్ని 20 నుంచి 65 శాతం వరకూ పెంచి చేసేదే రోజ్‌గోల్డ్.. ఆ రాగి శాతాన్ని బట్టి అది గులాబీ, ముదురు గులాబీ, ఎరుపు, నారింజ, ఎరుపు రంగుల్లోకి మారుతుంది. దీనే్న పింక్ లేదా రెడ్ గోల్డ్ అని అంటారు. అదే వైట్‌గోల్డ్ కోసం అయితే రాగి, జింక్‌లతో పాటు నికెల్ లేదా పల్లాడియం, వెండి లోహాల్ని కలుపుతారు. ఇక బంగారాన్ని ఆకుపచ్చని బంగారంగా మలచి ధరించడం మనకు తెలిసిందే.. క్రీస్తుపూర్వమే ఆకుపచ్చని బంగారం వాడుకలో ఉంది. క్రమంగా ఇది మరుగున పడిపోయినా నేడు మళ్లీ ప్రాచుర్యంలోకి రావడంతో ఆకుపచ్చని నగలు తళుక్కుమంటున్నాయి. 75 శాతం బంగారానికి 23 శాతం వెండి, రెండు శాతం కాడ్మియం కలిపి చేసేదే ఆకుపచ్చని బంగారం. ముదురాకుపచ్చలోకి బంగారం మారాలంటే మాత్రం 15 శాతం వెండి, ఆరు శాతం కాపర్, నాలుగు శాతం కాడ్మియం కలుపుతారట. ఇక నీలి బంగారం కోసం తగుపాళ్లలో ఐరన్ లేదా ఇండియం కలిపితే, వంకాయ లేదా ఊదా రంగు బంగారం కోసం అల్యూమినియం కలుపుతున్నారు. ఇన్ని రంగు బంగారం వచ్చాక నలుపురంగు బంగారం రాకపోతే ఎలా? పైగా చాలామంది ఫ్యాషన్ ప్రియులకు నలుపురంగు అంటే చాలా ఇష్టం. అందుకే 75 శాతం బంగారానికి 25 శాతం కోబాల్ట్ కలిపి బ్లాక్ గోల్డ్‌ను చేసేస్తున్నారు. లేదంటే వైట్ గోల్డ్‌కి రోడియం ప్లేటింగ్ ద్వారా నలుపురంగును అద్దేస్తున్నారు. ఇది నిజంగానే ఫ్యాషన్ ప్రియుల మనసులను దోచుకుంటోంది. ముఖ్యంగా బ్లాక్ రింగ్స్ పశ్చిమ దేశాల్లో యువత హాట్ ఫేవరేట్‌గా మారాయి.. మరి మీరు కూడా ట్రై చేస్తారా.. రంగురంగుల బంగారు ఆభరణాలు..


  0 0

  కన్నడ సినీ పరిశ్రమ ప్రముఖులపై ఐటీ కనే్నసింది. పలువురు నటీనటులు, నిర్మాతలు, టెక్నీషియన్ల ఇళ్లపై ఐటీ బృందాలు అనూహ్య సోదాలకు దిగాయి. బెంగళూరు సదాశివనగర్‌లోని కన్నడ టాప్ హీరో పునీత్ రాజ్‌కుమార్ నివాసంలోనూ గురువారం ఐటీ సోదాలు నిర్వహించటం సంచలనమైంది. పునీత్ సోదరుడు శివరాజ్‌కుమార్ నివాసం ఉంటున్న మాన్యతా టెక్ పార్క్‌లోనూ ఐటీ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా భారీ బడ్జెట్‌తో సినిమాలు నిర్మించే రాక్‌లైన్ వెంకటేశ్, స్టార్ యాక్టర్ సుదీప్, ఇటీవలే వచ్చిన కేజీఎఫ్ చిత్రం హీరో యశ్ ఇళ్లలనూ ఐటీ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఇప్పటి వరకూ అందిన సమాచారం నటులు, నిర్మాతలకు సంబంధించిన 25చోట్ల సోదాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఏటా ఐటీ బృందాలు నిర్వహించే ప్రక్రియలో భాగమేనని ఐటీ వర్గాలు చెప్పడం గమనార్హం.


  0 0

  ‘లండన్‌బాబులు’ ఫేం రక్షిత్ హీరోగా, నక్షత్రను హీరోయిన్‌గా పరిచయం చేస్తూ తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో బిక్రమ్ కృష్ణ ఫిలింస్ పతాకంపై తెరకెక్కుతోన్న చిత్రం ‘పలాస 1978’. కరుణకుమార్ దర్శకత్వంలో అప్పారావు బెల్లన, అట్లూరి వరప్రసాద్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు కరుణకుమార్ మాట్లాడుతూ యదార్ధ సంఘటనల ఆధారంగా ‘పలాస 1978’ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఎన్నో చిత్రాలకు రచన, దర్శకత్వ విభాగంలో పనిచేసిన నేను ఈ సినిమా ద్వారా దర్శకుడినయ్యాను అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ఫిబ్రవరి 9న చిత్రీకరణ ప్రారంభిస్తామని, పూర్తిగా ఆంధ్రలోనే చిత్రీకరణ, నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న తొలి చిత్రమిదని అన్నారు. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. బెస్ట్ టీమ్ సినిమాకు వర్క్ చేస్తున్నారని, రియలిస్టిక్ మూవీగా చిత్రం ఉంటదని అన్నారు.


  0 0

  యాక్టివ్ స్టూడియోస్ పతాకంపై ఎజిఆర్ కౌశిక్ సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘వైదేహి’. ఎ జననీ ప్రదీప్ నిర్మాత. ఎ రాఘవేంద్ర ప్రదీప్ దర్శకుడు. దివంగత నటుడు ఏవీయస్ జయంతి పురస్కరించుకుని హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో సినిమా ట్రైలర్‌ను ఎన్ శంకర్ విడుదల చేశారు. ఏవీయస్ జయంతి సందర్భంగా జర్నలిస్ట్ పసుపులేటి రామారావు కేక్ కట్ చేశారు. దర్శకుడు ఎ రాఘవేంద్ర ప్రదీప్ మాట్లాడుతూ ‘మా నాన్నను గుర్తు చేసుకోవడానికి మంచి అకేషన్ ఉంటే బావుంటుందని అనిపించింది. ఆయన జయంతి రోజున సినిమా ట్రైలర్ విడుదల నిర్వహించడం ఆనందంగా ఉంది. నన్ను ప్రోత్సహించిన వారు చాలామందే ఉన్నారు. రేయింబవళ్లు షూటింగ్ జరిపి నటీనటులు, టెక్నీషియన్లను ఒకింత ఇబ్బంది పెట్టాను. అయినా చిరునవ్వుతో వారు పని చేయడం గుర్తుకొస్తే హ్యాపీగా అనిపిస్తోంది. మా కుటుంబ సభ్యులకన్నా ఎన్ శంకర్ నాకు ఆత్మీయులు. ఆయన చేతులమీదుగా ట్రైలర్ విడుదలవ్వడం ఆనందంగా ఉంది. మా బావ సపోర్ట్ మర్చిపోలేనని, అనేక సదర్భాల్లో తండ్రిలా ఆయన ప్రోత్సహించారని అన్నారు. ఎన్ శంకర్ మాట్లాడుతూ ‘ఏవీయస్ మంచి మిత్రుడు. అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వ్యక్తి. సినిమాలను, సాహిత్యాన్ని ఔపాసన పట్టాడు. ఆయన లేని లోటు ఇండస్ట్రీ ఎదుర్కొంటోంది. తుత్తి, రంగుపడుద్ది మేనరిజమ్స్ మరువలేం. ఆయన తనయుడు రాఘవేంద్ర ప్రదీప్ తెరకెక్కించిన సినిమా ట్రైలర్ బావుంది. ఇప్పుడు ఇలాంటి జోనర్‌లో తెరకెక్కిన సినిమాలు 90శాతం హిట్టవుతున్నాయి. ప్రతి ఫ్రేమ్‌లోనూ నెక్స్ట్ ఏంటి? అని ఆసక్తికలిగేలా సినిమాను తెరకెక్కించడం మెచ్చదగింది’ అన్నారు.


  0 0

  రజనీకాంత్, కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్‌లో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం పేట్ట. ఈ చిత్రాన్ని తెలుగులో అశోక్ వల్లభనేని జనవరి 10న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బస్ కండెక్టర్ నుంచి సినిమా స్టార్ అయిన రజనీ, ఇప్పుడు దక్షిణాదిన సూపర్‌స్టార్‌గా వెలుగుతున్నారు. రాజకీయంపైనా దృష్టిపెట్టిన రజనీ నాకెప్పుడూ స్ఫూర్తి. ఆయన సేవాగుణంతో తమిళ ప్రజలకు ఎన్నో చేసిన ఆయన తెలుగువారికి ఏం చేశారన్న ప్రశ్న ఉదయిస్తుంది. అందుకే 6న నిర్వహించనున్న పేట ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో రెండు మూడు ఆర్ఫాన్స్ సెంటర్లకు చెక్‌రూపంలో నగదు సాయం అందించబోతున్నాం. రజనీ సూపర్ ఫ్యాన్ అయిన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ‘పేట’ చిత్రంతో హిట్టుకొడతాడన్న ఆశాభావం వ్యక్తం చేశారు. పాతికేళ్లు వెనక్కెళ్లిన రజనీ వేగం, అనిరుధ్ వెర్సటైల్ సంగీతం.. సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయని అన్నారు. ‘పేట’ రజనీ నెక్స్ట్‌లెవెల్ చిత్రమన్నారు. మంచి సినిమాపై నమ్మకంతో సంక్రాంతికి విడుదల చేస్తున్నామని, ఇప్పటికే 50శాతం బిజినెస్ పూరె్తైందన్నారు. మిగిలిన బిజినెస్ ప్రాసెస్‌లో ఉందని, తెలుగులో స్ట్రయిట్ సినిమా నిర్మాణానికి ఈ ఏడాది ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రస్తుతం కథలు వింటున్నామని, మంచి కథ, హీరో దొరకితే వెంటనే ప్రకటిస్తామన్నారు.


  0 0

  ‘అల్లుడు శీను’ చిత్రంతో సెనే్సషనల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో టాలీవుడ్‌లోకి హీరోగా అడుగుపెట్టి సూపర్‌హిట్ అందుకున్న యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తరువాత ‘స్పీడున్నోడు’, ‘జయజానకి నాయక’, ‘సాక్ష్యం’, ‘కవచం’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో ఆకట్టుకున్నారు. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా గురువారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో పెద్దఎత్తున వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో డైరెక్టర్ వివి వినాయక్, అజయ్‌భూపతి, ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, అభిషేక్ అగర్వాల్, అభిషేక్ నామ, బెక్కం వేణుగోపాల్, అనీల్ సుంకర, మల్టీ డైమన్షన్ వాసు, మహేంద్ర, బిఎ రాజు తదితరులు పాల్గొన్నారు. డైరెక్టర్ వివి వినాయక్ మాట్లాడుతూ ‘అల్లుడు శీను’ షూటింగ్ టైంలో కొత్త హీరోతో చేసిన ఫీలింగ్ ఎప్పుడూ కలగలేదు. అనుభవమున్న హీరోలానే చేసేశాడు. బోయపాటితో చేసిన సినిమాతో స్టార్ అయ్యాడు. ఆర్టిస్ట్‌గా ప్రతి సినిమాకూ ఎదుగుతున్న శీనుకు జన్మదిన శుభాకాంక్షలు అన్నారు. ఈ ఏడాది చేసే చిత్రాలతో మరింత స్టార్‌గా ఎదగాలని, ఒకటి రెండు చిత్రాలు విఫలమైనా అది హీరోని రాటుదేలుస్తుందని అన్నారు. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ సాయి నా కుటుంబ సభ్యుడు. సినిమా సినిమాకూ పెర్ఫార్మెన్స్‌కు పదును పెట్టుకుంటున్న తీరును అభినందించాలి. సెలెక్టెడ్ స్టోరీస్‌తో సినిమాలు చేస్తున్న శ్రీను మరింత ఎదగాలని ఆకాంక్షించారు.


  0 0

  ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్‌మినిస్టర్’ చిత్రం విడుదల సమయం దగ్గర పడుతున్నకొద్దీ దుమారం తీవ్రమవుతోంది. అటు మధ్యప్రదేశ్, ఇటు పంజాబ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ వర్గాలనుంచి వివాదం చెలరేగితే, తాజాగా బీహార్‌లోనూ అడ్వొకేట్ ఒకరు చిత్రబృందంపై కేసు ఫైల్ చేయడం గమనార్హం. ఈ చిత్రం ద్వారా జాతీయ నేతల రాజకీయ ప్రతిష్టను మసకబర్చి, తప్పుడు కథనాలను ప్రచారం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ న్యాయవాది సుధీర్ కుమార్ ఓజా పిటీషన్ దాఖలు చేశారు. పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం, తదుపరి విచారణకు 8వ తేదీకి వాయిదా వేసింది. ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్‌మినిస్టర్’ చిత్రంలో మన్మోహన్ పాత్రలో అనుపమ్ ఖేర్, ఆయన సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు (ఈయన రాసిన పుస్తకం ఆధారంగానే సినిమా నిర్మిస్తున్నారు) పాత్రలో అక్షయ్ ఖన్నా నటించడం తెలిసిందే. అంతేకాదు, మన్మోహన్ కథలో ముఖ్యంగా నెహ్రూ కుటుంబానికి చెందిన సోనియా, రాహుల్‌గాంధీ, ప్రయాంక వాద్రా పాత్రలనూ చిత్రీకరించారు. ప్రతిష్టను దిగజార్చే లక్ష్యంతో జాతీయ నేతల పాత్రలను తప్పుగా చూపించటం దేశ ప్రజల మనోభావాలు దెబ్బతీసేదిగా ఉందని, ఆయా పాత్రల్లో నటించిన వారిపైనా కేసులు నమోదు చేయాలంటూ న్యాయవాది ఓజా చేసిన ఫిర్యాదుతో కేసులు నమోదు అవుతున్నాయి. విజయ్ రత్నాకర్ దర్శకత్వం వహించిన సినిమా ట్రైలర్ విడుదలైన దగ్గర్నుంచీ ‘మన్మోహన్’ సినిమా ఒడిదుడుకులు ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. సినిమాలో మార్పులు చేసేంతవరకూ చిత్రం విడుదలకు అనుమతి ఇవ్వొద్దంటూ కాంగ్రెస్ శ్రేణులు గట్టిగా పట్టుబడుతున్న విషయం తెలిసిందే.


  0 0

  అందుచేత ‘శ్రుధీ హవం విపిపానస్య’ (ఋ.7-22-4) ‘‘అత్యంత దాహార్తుని (నీ నామామృతపాన దాహార్తుని) హృదయవేదనారావాన్ని విను.’’ నీవు వినకుంటె ఓ జనార్ధనా! ఇంకెవరు వింటారు?
  నీవు విను, వినకపో. నేను మాత్రం ‘సదా తే నామ స్వయశో వినక్మి’ అనుపమానమైన కీర్తిశాలివగు నీ నామానే్న స్మరిస్తూ నినే్న పిలుస్తూ ఉంటాను.’’
  **
  175. దేశ కల్యాణానికి కలిసి భగవదారాధన చేయండి
  సహస్రం సాకమర్చత పరి ష్ట్భోత వింశతిః
  శతైన మన్వనోనవురింద్రాయ బ్రహ్మోద్యతమర్చన్నను స్వరాజ్యమ్‌॥
  భావం:- వేలకొలది కలిసి ఒకే కంఠంతో భగవదారాధన చేయండి. ఇరువది మంది కూడి నలువైపుల వినబడేలా భగవన్నుతిని గానం చేయండి. బ్రహ్మచర్యయుక్తులై స్వదేశ కల్యాణానికి వందలకొలది సంపదలకోసం ఆ దైవాన్ని నమస్కరించి ప్రార్థించండి.
  వివరణ:- భగవదారాధన రెండు విధాలు. 1.వైయక్తికం 2.సామూహికం. సాధారణంగా పూజ లేదా ధ్యానం ఏకాంత ప్రదేశంలో చేయవలసియుంది. మనస్సులోని సమస్త చింతనలను పారద్రోలి ఉదయం సూర్యారాధన చేయడం, ఆ తరువాత నిష్కపటంగా స్వీయదోషాలను- బలహీనతలను దైవానికి విన్నవించుకోవడం, వానిని తొలగించుకొనే ఆత్మబలాన్ని ఈయమని ప్రార్థించడం, తదుపరి ధ్యాన, సమాధి, ఈశ్వర ప్రణిధానాదులను సశాస్ర్తియంగా ఆచరించడం మొదలయిన విధానాలన్ని వైయక్తిక దైవారాధన కోవలోనికి వస్తాయి. ఈ ఆరాధన వలన వ్యక్తి వ్యక్తిగతంగా సంస్కారవంతుడవుతాడు. దానివలన మనస్సు, ఆత్మ పరిశుద్ధమవుతాయి.
  ఈ రీతిగా వైయక్తిక ఆరాధనారీతి ద్వారా వ్యక్తి వైయక్తికంగా ఉద్ధరణ పొందిన రీతిగా వ్యక్తుల సంఘాత స్వరూపమైన సమాజమంతకు ఉద్ధరణ- సంస్కారం సిద్ధించేందుకు సామూహిక పూజ కూడ ఉంటే అవసరం. ఈ సామూహిక భగవదారాధన ద్వారా సమాజంలో సమతా-సమైక్యతా వైభవం పరిఢవిల్లుతుంది. దానితోబాటు సమాజంలోని విభిన్న మనస్తత్వాలుగల మనుషుల మధ్య ఏకమనస్కత- ఏకసదాలోచనలనే సర్వోత్కృష్ట్భావాలు వెల్లివిరుస్తాయి. తద్వారా సమాజం సంఘటిత శక్తివంతమై పురోభివృద్ధిని సాధిస్తుంది.
  వైయక్తికారాధనలో ప్రతి వ్యక్తి శారీరక, మానసిక శుచిత్వాన్ని పాటించే రీతిగా సామూహిక ప్రార్థనకు కూడ ముఖ్యమని వేదం బ్రహ్మోద్యతమ్= బ్రహ్మచర్యయుక్తులు కావాలని సూచించింది. అంతేకాదు. ఈ సామూహిక దైవారాధనా లక్ష్యం వైయక్తికంగాకాక అర్చన్నను స్వరాజ్యమ్= స్వదేశానికి తగినట్టి కల్యాణ వైభవం సిద్ధించేదిగా మనుషులు సంకల్పించాలని వేదం స్పష్టంగా శాసించింది. వందలు-వేలమంది కలిసివచ్చి ముక్తకంఠంతో విన్నవిస్తే ఆ విన్నపాన్ని ప్రభుత్వం విధిగా మన్నిస్తూ ఉంది. ఇది అందరకు అనుభవంలోనిదే. అదే విధంగా జగత్ప్రభువును అందరు ప్రార్థిస్తే వారి ప్రార్థనను మన్నింపకుంటాడా? ఈ మార్మికతనే వేదం ‘సహస్రం సాక మర్చత’= ‘‘వేలమంది కలిసి ప్రార్థించండి’’అని మంత్రారంభంలోనే సంకేతించింది. అంటే సంఘటన శక్తికెంతటి బలముందో వేదమెప్పుడో మానవాళికి ప్రబోధించిందన్నమాట.
  176. ఓ ఐశ్వర్యవంతుడా! హింస చేయకు
  మా స్రేధత సోమినో దక్షతా మహే కృణుధ్వం రాయ ఆతుజే
  తరణిరిజ్జయతి క్షేతి పుష్యతి న దేవాసః కవత్నవే॥
  భావం:- ఓ ఐశ్వర్యవంతులారా! జీవితంలో మీరు హింసకు పాల్పడకండి. నిరంతరం ఉత్సాహవంతులై యుండండి. జీవితంలో సర్వవిధాలుగా శక్తిమంతులు కావడానికి మరియు ధనాన్ని సంపాదించేందుకు నిరంతరం ప్రయత్నపరులుకండి. పరులను హింసించక సంరక్షణ చేసేవాడే జీవితంలో వృద్ధిపొందుతాడు. చిరకాలం జీవించి సర్వసమృద్ధులతో తులతూగుతాడు. దైవీశక్తులు హింసాపరుల ఎడల సుముఖంగా ఉండవు.
  వివరణ:- దుర్మార్గులకు- అత్యాచారాలకు మృత్యుదండన విధించి శిక్షించమని వేదం రాజును శాసిస్తూనే మా స్రేధత= ‘‘హింస చేయవద్దు’’ అని ప్రధానంగా అహింసనే ప్రబోధించింది. మరి ఆ అహింస ఘనత ఏమిటో వివరంగా మంత్రంలో విస్తరించి చెప్పింది. అందులో మొదటి అంశం ‘తరణిరిజ్జయతి’= ‘‘రక్షకుడైనవాడే అభివృద్ధి పొందుతాడు’’అన్నది. మనిషి విజయాన్ని పొందేందుకు సాధారణంగా హింసే చేస్తాడు. యుద్ధాలు చేస్తాడు. కాని దానివలన ఏ కాలంలోనూ ఎవరికి శాశ్వత విజయం సిద్ధించనే లేదు. వారి చరిత్ర చరిత్రపుటలలో రక్తపు మరకలతో మసకబారిపోయింది. కాని ఎవరు అహింసనే బోధిస్తూ జీవులను రక్షించారో వారినే తరతరాలుగా సమాజం ప్రాతఃస్మరణీయులుగా ఆరాధించింది.
  వారి చరిత్రను చరిత్ర పుటలలో సువర్ణాక్షరాలతో లిఖించుకొని తరతరాలకు ఆదర్శచరితులుగా అందించింది.
  ఇంకావుంది...


  0 0

  45.సరిగా అవసాన కాలమున నరుడేమి చింతించుచుండునో దానిననుసరించియే వానికి ముందు జన్మము గలగుచుండును. కావున భక్తిసాధనలు అత్యావశ్యకమైయున్నవి. నిరంతర సాధనవలన సాంసారిక చింతలు పూర్తిగా పోయి భగవచ్ఛింత మనస్సు నాక్రమించును. అపుడు మరణకాలమున సైతము అది మనస్సును విడువదు.
  46.కాల్పనికుండ విచ్చిపోయిన యెడల దాని మట్టి కుమ్మరి క్రొత్త కుండ చేయుటకుపయోగించును. కాని కాల్చినకుండ పగిలెనేని అటుల జేయజాలడుకదా? మనుష్యుడు అజ్ఞాన దశలో మరణించనేని, పునర్జన్మము నెత్తును; కాని బ్రహ్మ జ్ఞానాగ్నిలో తప్తుడై, ముక్తుడై తనువు చాలించెనేని మరల జన్మింపడు.
  47.వేగించిన (్ధన్యపు) గింజలను జల్లినచో మొలకెత్తవు. వేగింపని వడ్లు మాత్రమే మొలచును. అటులనే నరుడు సిద్ధుడై, లేక బ్రహ్మజ్ఞానాగ్ని యందు తప్తుడై మరణించెనేని అతడు మరల జన్మింప నగత్యము లేదు; అసిద్ధ దశలో మరణించెనేని సిద్ధుడగువరకు మరల మరల జన్మింపవలసి వచ్చును.
  రెండవ ప్రకరణము
  మాయ
  పరమేశ్వరుని సృజనాదిశక్తిరూపమగు మాయ- సంసార బంధ హేతువగు నవిద్యామాయ- మోక్షహేతువగు విద్యామాయ-
  పరమేశ్వరుని సృజనాదిశక్తి రూపమగు మాయ
  48.మాయకును బ్రహ్మమునకుగల సంబంధము ప్రాకుచున్న పామునకును పరుండియున్న పామునకునుగల సంబంధము వంటిది. క్రియారూపమై వ్యక్తమైయున్న శక్తియే మాయ, అవ్యక్తమైయున్న శక్తియే బ్రహ్మము.
  49.సముద్రజలము ఇపుడు నిశ్చలముగనుండి ఇంతలో తరంగ కల్లోలమగును. ఇట్టివే బ్రహ్మము మాయయును. బ్రహ్మమే నిశ్చలమగు సాగరము. మాయయే చలించుసాగరము.
  50.బ్రహ్మమునకు శక్తికిని గల సంబంధము అగ్నికిని దహనశక్తికిని గల సంబంధము వంటిది.
  51.శివుడును శక్తియును గూడ సృష్టికి ఆవశ్యముకలే. పొడిమట్టితో కుమ్మరి కుండలను జేయజాలడు. అందులకు నీరు కూడా కావలసియున్నది. శక్తి యొక్క సాయము లేకుండా శివుడొక్కడే సృష్టింపజాలడు.
  52.మాయను జూడ నభిలషించి యొక దినము నేనొక దృశ్యమును గాంచితిని. చిన్న బిందువొకటి మెల్లగా పెద్దదై యొక బాలికగా నేర్పడినది. ఆ బాలిక పెరిగి యువతియై ఒక బిడ్డను గనినది; మరి బిడ్డ పుట్టినంతనే ఆమె దానిని బట్టి మ్రింగివేసినది. ఇట్టులామె ఎందరో బిడ్డలను గని వారినందరిని మ్రింగివేసినది. ఆమెయే మాయయని గ్రహించితిని.
  53.పాముకోరలయందలి విషము పామును బాధింపకున్నను అది కరచిన జంతువును బాధించి చంపును. అటులనే ఈశ్వరునియందు గల మాయ ఈశ్వరుని బాధింపజాలదు. ఐనను ఆ మాయ ప్రపంచంమునంతయు భ్రమింపజేయుచున్నది.
  సంసారబంధ హేతువగు నవిద్యామాయ
  54.దక్షిణేశ్వరాలయమందలి యొకగదిలో ఒక సాధువు ఉండెడివాడు. అతడెవ్వరితోడను మాటలాడక తన కాలమునంతయు భగవద్ధ్యానమున వినియోగించువాడు. ఆకసమున హఠాత్తుగా ఒకనాడు కారుమబ్బు లావరింప, ఉత్తరక్షణముననే పెనుగాలి వచ్చి మబ్బులను చెదరగొట్టుట గాంచి, సాధువు తన గది నుండి రుూవలకువచ్చి, ఆనంద పరవశుడై నృత్యము చేయ నారంభించెను. అది చూచి శ్రీరామకృష్ణుడాతనినిట్లు ప్రశ్నించెను: ‘‘నిశ్శబ్దముగా మీ గదిలో కాలము గడుపు మీరు నేడేల ఇంత మహోల్లాసముగా నృత్యము చేయుచున్నారు?’’-ఆ మహనీయుడిట్లు ప్రత్యుత్తరమొసగెను. ‘‘ఇట్టిది గదా ఈ జీవితమును ఆవరించు మాయ! ఇంతకుమునుపు లేశమైనను మాయ లేదే! కాని హఠాత్తుగా వినిర్మల బ్రహ్మాకాశమున మాయ కానబడి విశ్వమునంతయు సృష్టి చేయుచున్నది.మరల నంతలో ఆ బ్రహ్మముయొక్క నిశ్వాసముచేతనే అదృశ్యమైపోవుచున్నది’’.
  ఇంకావుంది...

  శ్రీ రామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
  సంగ్రహ జీవిత సహితము - అనువాదకుడు: శ్రీ చిరంతనానందస్వామి


  0 0

  శ్రీచక్రము-మానవశరీరము
  ప్రతులకు:
  H.No. 7-8-51, Plot No. 18, నాగార్జున సాగర్‌రోడ్, సెంట్రల్ కాలనీ ఫేజ్ -2, హస్తినాపురం, హైదరాబాద్- 500079
  =============================================================
  సాధకుడిలో అహంభావం (నేను అనే భావం) కొద్దిగా మిగిలే ఉంటుంది. అందువల్ల అనిర్వచనీయమైన దివ్యదర్శనం లభిస్తున్నప్పటికీ, ఆ దివ్యాత్మతో తాదాప్యత పొందలేడు.
  ఇక అన్నిటికంటే పైనున్న, 7వ దైన సహస్రార చక్రం, బ్రహ్మరంధ్రంపైన మనసు తదేకంగా ధ్యాననిమగ్నమైనపుడు, అంటే కుండలిని శక్తి సహస్రారానికి చేరినపుడు, సమాధి స్థితి కలుగుతుంది. అపుడు బ్రహ్మజ్ఞానంతో బ్రహ్మమును పొందగలుగుతాడు సాధకుడు.
  ఎక్కడైనా, ఎప్పుడైనా ఒక వ్యక్తికి, విశేషమైన ప్రజ్ఞ లేక జ్ఞానం కలిగిందంటే, తత్సంబంధమైన చక్రాలలోనికి సుషుమ్న నాడి ద్వారా కుండలిని శక్తి కొద్దిగా ప్రవేశించిందని తెలుసుకోవచ్చు. కుండలిని యోగానికి చెందిన శ్రీవిద్య ఉపాసన చాలా నియనిష్ఠలతో, శుచి శుభ్రతలతో, రహస్యంగా అభ్యసించవలసి వుంటుంది. అందుచే దీనిని గుప్తవిద్య అని కూడా అంటారు. ఇది మిగతా ప్రాపంచిక విద్యలవంటిది కాదు. ఈ విద్యను గురించి కులార్ణవ తంత్రము అను గ్రంథమునందు ఈ క్రింది విధంగా చెప్పబడింది.
  కుండలిని వర్ణములు (అక్షరములు)
  మన శరీరమందలి కుండలిని శక్తి 50 వర్ణములు లేక శబ్దములుగా వ్యక్తమగుచున్నది. మనిషి అక్షరములను ఉచ్ఛరించగలడు కాని జంతువులు పశుపక్ష్యాదులు అక్షరములను పలుకలేవు. భాష ద్వారా భావాన్ని వ్యక్తీకరించడము సృష్టిలో ఒక్క మనిషికి మాత్రమే సాధ్యం. ఇది మనిషికి ఆ భగవంతుడిచ్చిన వరం. ఆ విధముగా 50 వర్ణములు ఒక కూటమిగా అర్ధవృత్తి కుండలినిగా భావిస్తే, అట్టి రెండు అర్ధ వృత్తములు ఒక వృత్తముగా నేర్పడును. అట్టివి 10 చుట్లు (వృత్తములు) ఒక సమాహార ప్రజ్ఞగా (అంటే వెయ్యి అక్షరములు (10తి2తి50) లేక శబ్దములు) శిరస్సునందలి, సహస్రారమునందు ఏర్పడుచున్నది. ఈ పదియు పరమాత్మయొక్క విభూతులు లేక అవతారములుగా అంటే మత్స్యావతారము నుండి, కల్కి అవతారము వరకు పరిపూర్ణ, అంతర్యామి ప్రజ్ఞావికాసముగా భావించవచ్చును. ఇంకొక విధంగా చెప్పాలంటే ఏకకణజీవి అగు ‘అమీబా’నుండి మొదలైన పరిణామక్రమం, అంతర్యామి స్థితివరకు ఎదిగిన 10 స్థితులకు సూచిక.
  మన పూర్వీకులు అక్షరమాలను కేవలము భాషాపరమైన పదముల కూర్పుగానేకాక, వాటి ఉత్పత్తి స్థానములను, వాని వెనుకనున్న శక్తులను, అధి దేవతలను కూడా ఎంతో పరిశోధన చేసి తెలుసుకున్నారు. అట్టి క్రమాన్కొకసారి పరిశీలిద్దాము. పైన చెప్పిన 50 వర్ణములు 3 భాగాలుగా విభజించారు. 1. చంద్రఖండము, ఇందు ‘అ’నుండి ‘అః’వరకు గల 16 అక్షరములు కలవు. 2. సౌర ఖండము, ఇందు ‘క’నుండి ‘్భ’వరకు గల 24 అక్షరములు కలవు. 3. అగ్నిఖండము ఇందు ‘మ’నుండి ‘క్ష’వరకు గల 10 అక్షరములు. వీనిలో అచ్చులను స్వరములుగా, హల్లులను వర్ణములుగను చేసిరి. వీనిలో ఒక్కొక్క వర్గమునకు అధి దేవతలను కూడా తెలిపారు.
  1. స్వరములు (16) ‘అ’నుండి ‘అః’వరకు గల అక్షర సముదాయమునకు అధిదేవత ‘‘వసిని’’. ఈమె మనయందు వశ పరచుకొను శక్తిగా పనిచేయును.
  ఈ అక్షరములను ఒక పద్ధతిలో బీజాక్షరములుగా న్యాసముచేసి ‘‘వశిని’’శక్తిని మేల్కొలప వలెనని తెలిపిరి.
  2. ‘‘క వర్గము’’‘‘క’’నుండి జ’’వరకు గల 5 అక్షరములకు అధిదేవత ‘‘కామేశ్వరి’’ ఈమె మనయందు కోరికగా మేల్కొనును.
  3. ‘‘చ వర్గము’’ ఇందు ‘‘చ’’నుండి ‘ఞ’వరకు గల అయిదు అక్షరములు అధిదేవత ‘‘మోదిని’’ ఈమె జీవునియందు సంతోషమును వ్యక్తముచేయు దేవతాశక్తి.
  4. ‘‘ట వర్గము’’ ఇందు ‘‘ట’’నుండి ‘‘ణ’’వరకు గల అయిదు అక్షరముల సముదాయము. అధిదేవత పేరు ‘‘విమల’’ఈమె మనయందు మలినములను తొలగించు శక్తి.
  5. ‘‘త వర్గము’’ ఇందు ‘‘త’’నుండి ‘‘న’’వరకు గల అక్షర సమూహమునకు అధిదేవత ‘‘ఆరుణ’’ఈమె మనయందు ‘‘కరుణ’’ను మేల్కొలుపు శక్తి.
  6. ‘‘ప’’వర్గము ఇందు ‘‘ప’’నుండి ‘‘మ’’వరకు గల అయిదు అక్షరములకు అధిదేవత ‘‘జయిని’’ ఈమె వాక్కుద్వారా యితరులను శాసించి జయమును చేకూర్చు శక్తి.
  7. ‘‘య,ర,ల,వ’’ అను నాలుగు అక్షరముల సముదాయమునకు అధిష్టాన దేవత ‘‘సర్వేశ్వరి’’ ఈమె స్వరమునకు అధిష్టాత్రియై శాసించు శక్తి.
  8. ‘‘శ’’నుండి ‘‘క్ష’’వరకు గల అయిదు అక్షరముల సమూహమునకు అధిదేవతను ‘‘కాళి’’ అంటారు ఈమె కాల (కాలము) శక్తి.


  0 0

  నిను నా వాకిలిఁగావుమంటినొ? మరున్నీ లాలకభ్రాంతిఁ గుం
  టెన పొమ్మంటినొ? యెంగిలిచ్చి తిను, తింటేగాని కాదంటినో?
  నిను నెమ్మిం దగ విశ్వసించు సుజనానీకంబు రక్షింపఁ చే
  సిన నా విన్నపమేల చే కొనవయా? శ్రీకాళహస్తీశ్వరా?
  భావం: ఈశ్వరా! బాణాసురునిలాగా నిన్ను నా గుమ్మము వద్ద కాపలా కాయమన్నానా? దేవతా స్ర్తిలపై మోహపడి, వారి వద్దకు రాయబారిగా వెళ్ళమన్నానా? తిన్నడు లాగా ఎంగిలి మాంసం పెట్టి, తింటేగానీ వీల్లేదన్నానా? ఏ తప్పు చేశాను. సజ్జనులను రక్షించమన్నాను. అంతేకదా! నా ప్రార్ధన వినిపించుకోవేమి?

  ఱాలన్ రువ్వఁగ చేతులాడవు, కుమారా! రమ్ము రమ్మంచునే
  చాలన్ చంపగ, నేత్రముల్దివియగా శక్తుండనేఁగాను, నా
  శీలంబేమని చెప్పనున్న దిగ నీ చిత్తంబు, నా భాగ్యమో
  శ్రీ లక్ష్మీపతి సేవితాంఘ్రియుగళా! శ్రీ కాళహస్తీశ్వరా!
  భావం:అజ్ఞానియైన ఒక కిరాతకుడు పూలు లేవని రాళ్ళతో పూజించినట్లు నేను చేయలేను. సిరాయళునిలాగా కుమారుని పిలిచి చంపి వంట చేసి జంగమదేవులకు పెట్టలేను. తిన్నడులాగా కన్నులు పీకి నీకు సమర్పించలేను. ఇంక నా భక్తి గాడమైనదని ఎలా చెప్పగలనుర? ఈ మాత్రము భక్తికి నీవు హృదయములో సంతోషపడినచో అదే నాకు మహాభాగ్యము

  రాజుల్మత్తులు, వారి సేవ నరకప్రాయంబు, వారిచ్చు సం
  బోజాక్షీ చతురంత యాన తురగీ భూషాదులాత్మ వ్యధా
  బీజంబుల్, తదపేక్ష చాలుఁ, పరితృప్తింబొందితిన్, జ్ఞానల
  క్ష్మీ జాగ్రత్పరిణామ మిమ్ము, దయతోశ్రీకాళహస్తీశ్వరా!
  భావం: ఈశ్వరా! రాజులు ఐశ్వర్యముతో మదించినవారు. వారి సేవ నరకము వంటిది. వారు దయతో ఇచ్చిన పరిచారికలు, పల్లకీలు, గుర్రాలు, భూషణములు మొదలగునవి సంసార బంధముల పెంచి దుఃఖమును కలిగిస్తాయి. వీటన్నింటినీ అనుభవించి సంతృప్తిపడ్డాను. ఇంక వాటిపై వ్యామోవహము చాలు. జ్ఞాన సంపదను, దానివల్ల కలిగే మోక్షమును నాకు ప్రసాదించుము.

  నీ రూపంబు దలంపగాఁ తుదమొదల్నేగాన, నీవై నచో
  రా రా రమ్మని యంచుఁ చెప్పవు, వృధారంభంబు లింకేటికిన్
  నీరన్ముంపుము పాలముంపు మిక నినే్న నమ్మినవాడం జుమీ
  శ్రీరామార్చిత పాదపద్మయుగళా! శ్రీకాళహస్తీశ్వరా!
  భావం: ఈశ్వరా! నీ రూపము ఊహించాలంటే, దాని మొదలు, చివర నాకు తెలియవు. పోనీ, నీవైనా నన్ను రమ్మని పిలుస్తావా? పిలవవు. ఇంక దయకై ఎన్ని పాట్లుపడినా ఏమి ప్రయోజనం?

  హితవాక్యం

  ఆరంభగుర్వీ క్షయిణీ క్రమేణ
  లఘ్వీ పురా వృద్ధి ముపైతి పశ్చాత్!
  దినస్య పూర్వార్థ భిన్నా
  ఛాయేయ మైత్రీ ఖలసజ్జనానమ్!!
  ‘‘సృష్టిలో తియ్యనిది స్నేహమేనోయ్’’! ఎందువలన? మనిషి మనసు నెరిగి మసలుకోవడాన్ని నేర్పే విద్య స్నేహకళ. అంతరాలు లేని ఆనందరసధుని స్నేహమయ జీవనం. అట్టి స్నేహాన్ని చిరకాలం రక్షించుకోవటం సంస్కారవంతుల లక్షణం. ఆ భావాన్ని భర్తృహరి యిలా వివరించాడు.
  ‘‘దుష్టుల స్నేహం పగటి పూర్వార్థంలో ప్రసరించు నీడ వంటిది’’. అంటే ఉదయాన పెద్దదిగా ప్రారంభమైన నీడ మధ్యాహ్నవేళకు క్రమక్రమంగా క్షీణించిపోతుంది. అలాగే దుష్టుల స్నేహం కూడా మొదట ఘనంగా ఉంటుంది. రోజులు గడుస్తున్నకొద్దీ విభేదాలతో, ఈర్ష్యాద్వేషాలతో వారి స్నేహ సౌధం బీటలు వారిపోతుంది.కాని సత్ఫురుషుల మైత్రి అలా కాదు. అది పగటి ఉత్తరార్థంలో ప్రసరించు నీడ వంటిది. అంటే మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు గల సమయంలో నీడ క్రమంగా వృద్ధి చెందుతుంది. అలాగే సజ్జనుల స్నేహం కూడా మొదట అల్పమై పిమ్మట దినదినాభివృద్ధి చెందుతూ పవిత్ర భావనలతో, శుభ కామనలతో సుదృఢమై సుందరమై అలరారుతుంది. ఆదర్శవౌతుంది.
  కాబట్టి నీటి బుడగ వంటి స్నేహం వద్దు. చిరకాల మైత్రి కావాలి. ప్రతి హృదయం స్నేహారుణమైనప్పుడు విశ్వశాంతి శతపత్ర పద్మమై పరిమళిస్తుంది.


  0 0
 • 01/03/19--06:14: అనంతం-27
 • అది సాధించాలంటే గురుడాచలంతో కలిసి వుండాలి. తండావాళ్ళతో సంబంధాలు త్రెంచుకోవాలి. తండాలో గడుపుతున్న నిరుపేద నికృష్ట జీవితం నుంచి బైటపడి పట్నం వెళ్లిపోవాలి.
  నోరూ వారుూ లేని పక్షులకూ జంతువులకూ ఆశ్రయం కల్పిస్తున్నవాడు తననెంతగా ఆదరిస్తాడో! తన పట్ల అతనికి చాలా ప్రేమ వుంది. అభిమానం వుంది!
  ఆశించినట్టే గొప్ప జీవితం చేతికంది, చాంద్‌నీ తనదైతే ఎంత బాగుంటుంది. స్వర్గంలో జీవిస్తూ అమర సుఖాలు పొందుతూ..
  కొత్త శక్తి పుంజుకున్నట్టుంది!
  రాగ్యా యింకా వేగంగా పరిగెత్తుతున్నాడు..
  ముళ్ళూ కోసురాళ్ళూ నాగజెముడు మట్టలు తగిలి వొళ్ళంతా చీరుకొనిపోతున్నది. దాహం వేస్తున్నది. ఐనా పట్టించుకోవటం లేదు రాగ్యా.
  త్వరగా గుడారాలకు వెళ్లాలి. గరుడాచలంతో జరిగిందంతా చెప్పాలి. తన బాధ్యతనంతా అతనిమీద పెట్టాలి.
  పొదలు గుట్టలు దాటాడు. కొంచెం దూరంలో వున్న నీటికొలన్ను చూశాడు.
  దాహం గుర్తొచ్చింది.
  గబగబా కొలను దగ్గరికివెళ్లాడు. దోసిళ్ళతో వొళ్ళంతా నీళ్ళు చల్లుకున్నాడు. కడుపునిండా కొలను నీళ్ళు తాగాడు.
  నీటి అద్దం మీద చాంద్‌నీ..
  ‘‘అడవి నాకేటిచ్చిందా? కొలను నీలిచ్చింది’’ అంటున్నట్టే వుందా చిత్రం!
  చేతులు చాపాడు. చాంద్‌నీ చిత్రం చేతికి అందలేదు.
  నీళ్ళన్నీ చిందర వందర చేశాడు.
  చాంద్‌నీ చెరిగిపోయింది!
  విషాదం, కోపం కలగలిసిన ఓ నవ్వు నవ్వాడు. మళ్లీ అక్కడ్నించి బయల్దేరాడు రాగ్యా.
  ఒకే పరుగు..
  చిన్నపాటి మైదానం దాటాడు. ఓ మలుపు తిరిగి ముందుకు సాగాడు. దట్టంగావున్న పొదలు దాటి నెమలిగుట్ట చేరుకున్నాడు. అలుపు తీర్చుకొంటూ కొంచెం సేపు ఆగాడు!
  అల్లంత దూరంలో మైమరిచి నర్తిస్తున్న నెమళ్ళ గుంపుకనిపించింది!
  ఎంత స్వేచ్ఛగా ఆనందంతో పరవశిస్తూ అవి నృత్యాలు చేస్తున్నాయో!
  రాగ్యామొహం అసూయతో చిటపట్లాడింది!
  అదే స్వేచ్ఛ మనుషులకెందుకు లేదు?
  ఉంటే తనూ చాంద్‌నీతో జతకలిసి ఆడేవాడు, పాడేవాడు, నృత్యాలు చేసేవాడు.
  ప్రపంచాన్ని ఖాతరు చెయ్యకుండా ఆమెతో పెనవేసుకొని పోయేవాడు!
  చాంద్‌నీ భయం, తండావాళ్ళ భయం, కట్టుబాట్ల భయం, చెట్టుక్రింద జరిగే పంచాయితీ భయం..
  బ్రతుకంతా భయమైతే ఇక స్వేచ్ఛ ఎక్కడున్నట్టు?
  ఏదో ఆలోచన తట్టింది!
  గురుడాచలం నెమలి మాంసం అంటే చెవి కోసుకుంటాడు! ఫారిన్ విస్కీ చప్పరిస్తూ, నెమలి మాంసం ముక్కలు తింటూ మైమరచిపోతాడు.. వాటికోసం జాతీయ పక్షుల్ని చంపటమే కాదు, యావద్భారత జాతినే అమ్మేసినా అదేమని అనడు!
  నెమళ్ళవైపు అదోలా చూశాడు రాగ్యా!
  నాకు లేని స్వేచ్ఛ మీకుంటే ఎలా సహిస్తాను? ఇంకెంతసేపులే మీ స్వేచ్ఛ అనుకొంటూ వాటి దగ్గరికి వెళ్లాడు.
  నెమళ్లు రాగ్యాని గమనించలేదు.
  అడవి పుత్రుడు కనుక అతన్నించి ప్రమాదం శంకించలేదేమో! అవ్వి రాగ్యాని ఖాతరు చెయ్యలేదు. పరవశంతో నర్తిస్తూనే వున్నాయి.
  అవ్వి తనను ఖాతరు చెయ్యనందుకు మరింత కోపం వచ్చింది.
  రాగ్యా ముందుకు వంగి నేలమీద నుంచి రాళ్ళు అందుకున్నాడు. గురిచూసి బలంగా నెమళ్ళమీదకి విసిరేశాడు.
  ‘కీచు’మని అరుస్తూ రెండు నెమళ్ళు నేలకొరిగాయి. గిలగిలా కొట్టుకుని ప్రాణాలు వొదిలాయి.
  మిగిలిన నెమళ్ళన్నీ భయంతో పరుగులు పెడుతూంటే పగలబడి నవ్వాడు రాగ్యా!
  చచ్చిపడున్న నెమళ్ళ దగ్గరికి వెళ్ళాడు.
  చెట్టుతీగతో రెండు నెమళ్ళనూ కలిపి కట్టి, భుజానికి తగిలించుకొని, గుడారాల వైపునకు నడవసాగాడు..
  భయంతో పారిపోయిన నెమళ్ళు దూరంగా నిలబడి రాగ్యా వెళ్తోంటే జాలిగా చూస్తున్నాయి.
  ***
  అప్పుడే చీకట్లు ముసుర్తున్నాయి.
  లోతట్టు అడవిలోనుంచి క్రూరమృగాల గర్జనలు భీకరంగా వినిపిస్తున్నాయి. వేటకోసం వాటి సంచారం మొదలయ్యింది!
  గుడారాల దగ్గర భారీ జనరేటర్ దడ దడా శబ్దిస్తూ విద్యుత్ సరఫరా చేస్తున్నది.
  గుడారాల్లో దేదీప్యమానంగా లైట్లు వెలుగుతున్నాయి. వాటి కాంతి పరిసరాల్లో వ్యాపిస్తూ పట్టపగల్లా వుంది!
  కీ.శే.పెద్దిరెడ్డి కొడుకు ఎమ్మెల్యే పెంటారెడ్డి ఇంకా గుడారానికి చేర్లేదు. కలెక్టర్‌తో మాట్లాడాలని పొద్దునే్న పట్నం వెళ్ళాడు. ఇంకా రాలేదు.
  అధికారులతో గుడారంలో కొలుపు తీరి కూర్చున్నాడు గరుడాచలం. రెవిన్యూ వాళ్ళు, పోలీసువాళ్ళు, ఫారెస్టు అధికారులు అక్కడ చేరారు. గుడారం చాలా సందడిగా వుంది.
  కాల్చేసిన సిగరెట్టు పీకలు, సోడా సీసాలమూతలు చెల్లాచెదురుగా గుడారంలో పడి వున్నాయి.
  అల్లుకున్న సిగరెట్టు పొగలు, మాంసం తినగా మిగిలిన ఎముకలూ.. గుడారం మదపు కంపు కొడుతున్నది. అడవి జంతువులు వేటకు బయలువెళ్ళే వేళయ్యింది.
  నరవాసన పసిగట్టి, అవి గుడారాలమీద దాడి చేస్తే ఎంత ప్రమాదం!
  విద్యుద్దీప కాంతిలోనే పరిసరాలను సూదికళ్ళతో గమనిస్తూ సాయుధ పోలీసులు అప్రమత్తంగా కాపలా కాస్తున్నారు!
  అప్పటికి ఎన్ని రౌండ్లయ్యాయో! ఇంకా తాగుతూ, తింటూ వాళ్ళంతా సరదాగా మాటల్లో పడ్డారు!
  (ఇంకా ఉంది)


  0 0

  కమాను వీధి కతలు
  రచన:రామదుర్గం మధుసూదనరావు, వెల: రూ.120/-, ప్రతులకు: ఆర్.జయలక్ష్మి, 304, కౌస్త్భు టవర్స్, కొత్తపేట, హైదరాబాద్ విశాలాంధ్ర నవచేతనా బుక్ హౌస్‌లు
  ------------------------------------------------------------------------------------------------------------
  ఒకే ‘కథావస్తువు’(Theme) కధలు రాయటం ఒక పద్ధతి. వివిధ వస్తువుల్ని ఎన్నుకుంటూ కధలల్లటం మరో పద్ధతి. మొదటి పద్ధతిలో ఒక సౌలభ్యం వుంటుంది. కధ రాసే ప్రతిసారీ ‘వస్తువు’ను వెదుక్కోనవసరం లేదు. వైవిధ్య కోణాల్లోంచి వస్తువును ఫోకస్ చేస్తూ రాసుకుపోవచ్చును. అయితే ఈ ఏక వస్తు ప్రాధాన్యతగల కధల్లో ఒక రిస్క్ ఉంటుంది. సరైన శిల్పాన్ని మెయిన్‌టెయిన్ చెయ్యకపోతే పాఠకుడికి విసుగుపుట్టి ప్రక్కకు పెట్టవచ్చును.
  కర్నూలు జిల్లా ‘ఆదోని’ అనే ఊరిలో ‘కమాను వీధి’ అనే ప్రాంతం వుంది. కమాను (ఆర్చి) దాటి ఆ ప్రాంతంలో ప్రవేశిస్తే పదమూడు ఇళ్లు కనబడతాయి. పదమూడు ఇళ్ళున్న ఈ వీధిని తన కధా వస్తువును చేసుకున్నాడు ఈ రచయిత రామదుర్గం మధుసూదనరావు. తన బాల్యాన్నీ, ఆ వీధిని, వీధిలో వున్న పదమూడు కుటుంబాల వ్యక్తులను, ఆ కుటుంబాలతో పెనవేసుకుపోయిన దైనందిత జీవితాలను 25 కధలుగా మలచి ఈ సంకలనం ద్వారా పాఠకులకు రచయిత రామదుర్గం మధుసూదనరావు పరిచయం చేస్తున్నాడు.
  ప్రధమ పురుషలో సాగే ఈ కథలన్నింటిలోనూ, బాలుడైన కధకుడే ప్రముఖ పాత్రధారి.
  అయితే, ఈ కథలన్నీ, ఎంతో సహజంగా నడిపించబడ్డాయి. ఈ కధలు చదువుతోన్న ప్రతి పాఠకుడూ తన బాల్యాన్ని వెద్కుంటాడు. తన బాల్యాంలో తాను ఎదుర్కొన్న సంఘటనలను, ఈ కథల్లో చదువుతూ కధలతో మమేకవౌతాడు.
  విద్యార్థి దశలో నాటకాలు వేయటం, ఆటలు ఆడటం, పెన్నులు పోగొట్టుకోవడం, తండ్రి మందలింపులు, తల్లి అనునయాలు- అతి సహజంగా ఆ ప్రాంతపు భాషతో, యాసతో, వివరించబడ్డాయి. మార్క్ ట్వెయిన్, ఆర్కే నారాయణ, రవీంద్రనాధ్ టాగోర్‌లాంటి ప్రఖ్యాత రచయితలు సృష్టించిన టాంసామర్, స్వామి, పథిక్ చక్రవర్తులను గుర్తుకు తెప్పిస్తాడీ రచయిత.
  కధ అన్నాక ‘కల్పన’ తప్పదు. కాని ఇందులో మనకు కనిపించే- సెలబ్రిటీ శరభణ్ణ, కోమలమ్మ, తల్లి శాంతమ్మ, కమాను వనజమ్మ, విశాలాక్షమ్మ; స్నేహితులు చంద్ర రఘు, వేణు, నగేష్‌గాడు, పొట్టి డాక్టరు అనబడే గాయత్రి డాక్టరు, వంటలమ్మ పద్దమ్మ; సామిబాబా కానె్వంటు స్కూలు అర్ధగేరి బసవన గౌడ మున్సిపల్ స్కూలు, హాసన్నపేట స్కూలు; దీపావళి మందుగుండు సామాను- కేపులు, పాంబిళ్ళలు, మతాబు పెట్టెలు, వంకయ బాణాలు, లక్ష్మీ బాణాలు; గోళీలాట, బచ్చాలాట, బొగిరి (బొంగరం), గాలిపటాలు- ఇవన్నీ గ్లోరిఫై చేయబడుతాయి. ఈ సంఘటనలలో పాఠకులు తమను తాము మళ్లీ ఓసారి వెదుక్కునేలా చేస్తారుూ కథలు.
  చిన్నపిల్లాడిగా పద్దమ్మ (పే 125)ను వివరించిన తీరు, గాయత్రి డాక్టరు దగ్గరి కాంపౌండర్ గీర, కర్ఫ్యూలో హైద్రాబాద్ నుంచి వచ్చిన పోలీసుల వీరవిహారం, పుకార్లు (పే.89), నాటకాలు (పే.132), కౌన్సిలర్ పోటీకి గోడలమీది రాతలు (పే.138)- ఇవన్నీ బాల్య ప్రపంచాన్ని ఆవిష్కరించిన ఘనత ఈ రచయితకు దక్కుతుంది. నోటాల్జియా (బాల్యస్మృతులు) ఎప్పుడూ మధురంగానే ఉంటాయి. ఆ బాల్య స్మృతుల మాధుర్యాన్ని మరోమారు ఆస్వాదించాలనుకుంటే ఈ కమాను వీధి కతలు తప్పక చదవాలి.


  0 0

  అలాగే ఏ ఉద్యమం పట్లగానీ, పోరాటంవైపుగానీ తొందరగా ఆకర్షితులయ్యేది యువతరమే. సంఘంలో మార్పు కోరుకుంటూ కొత్త బాటలు వేసుకొంటూ ముందుకుపోయేది వారే.
  ఈ మరీచిక నవల యువతరానికి చెందిన నవల. దీనిలో ముఖ్యమైన పాత్రలు శబరి, జ్యోతి (లేదా ప్రతిభ) వీరిద్దరు కాలేజీ విద్యార్థులు. తాను నివశిస్తున్న సంఘంలో ఇమడలేక నవ సమాజ స్థాపన కోసం జ్యోతి కలలు కంటుంది.
  జీవితంలోని మొనాటనీని అంతమొందించేలేక, నిత్య నూతన జీవితాన్ని, ప్రేమమయమైన జీవితాన్ని, ఆనందమయమైన జీవితాన్ని అనే్వషిస్తూ ఇంట్లోంచి వెళ్లిపోయి తిరుగుబాటులోని థ్రిల్‌ను అనుభవించాలనుకొంటుంది శబరి.
  ఆ ప్రయత్నంలో తనను ఆకర్షించిన హిప్పీ ఉద్యమంలోకి దూసుకువెడుతుంది. కానీ ఎంత తొందరగా వెళుతుందో అంతే వేగంగా అక్కడివారిని, ఆ వాతావరణాన్ని అసహ్యించుకొంటుంది. వాళ్ల మురికిబట్టలు, వారి విశృంఖల విహారం ఆమెకు వెగటు కలిగిస్తాయి. శబ్దాలను చూసి రంగుల్ని వినాలనుకొని తాను పుట్టి పెరిగిన ఇంటిని వదలి వెళ్లి అక్కడ మరో యాంత్రికమైన మత్తుమందుల ప్రపంచంలోకి వెళ్లి అక్కడ ఇమడలేక, ఆ ఊబిలోనుంచి బయటపడలేక తన జీవితాన్ని నాశనం చేసికొంటుంది.
  శబరి తండ్రి ధనవంతుడు. మేడ, కారు, డ్రైవరు మొదలగు ధనవంతులకుండవలసిన లక్షణాలున్నవాడు. బీదవాళ్లకు వడ్డీలకు డబ్బులిస్తూ, ఆ డబ్బులతో బొజ్జ పెంచినవాడు. తల్లి రుక్మిణి గొప్పవాళ్ల అలవాట్లకు బానిస. పార్టీలు చీరలు, నగలు ఇవే జీవితమనుకొనే స్ర్తి. కూతురి కోరికలను, మనసును చూడలేని అహంభావి.
  భార్యాభర్తలిద్దరికీ పడదు. కానీ పైకి భర్త భార్య అన్నమాటలకు తాన అంటే తందాన అంటాడు. భార్య లేని టైములో వంటమనిషితో సరసలాడతాడు. భార్య కూడా భర్త వున్నపుడు పోట్లాడుతూ, లేనపుడు ‘‘మా యింట్లో అంతా మావారి పెత్తనమే’’ అని గొప్పలు చెప్పుకొంటుంది.
  శబరి ఈ కృత్రిమతను సహించలేదు. ఒక తీరని అసంతృప్తి కెరటం ఆమె. అసహనం అగ్నిజ్వాల ఆమె జీవితం. జీవితంలో ప్రతి విషయం బోరు కొడుతుంది ఆమెకు. అంతులేని హిపోక్రసీ అంటే జుగుప్స. వీటన్నింటినీ భరించలేక కొత్త జీవితంవైపు ఎగిరిపోతుందామె.
  ఈ నవలలో మరో ముఖ్యమైన పాత్ర జ్యోతి లేదా ప్రతిభ. చెప్పాలంటే ఈ నవలా నాయిక ఈమె. కాలేజీ విద్యార్థిని ఐన జ్యోతికి అన్నీ అభ్యుదయ భావాలే. ఈ సమాజంలోని ధనికులు, బీదలు ఈ అన్యాయాలు, ఈ దారిద్య్రం ఆమెను అశాంతి పాల్జేస్తాయి. ధనిక, బీద తారతమ్యం లేకుండా అందరూ స్వేచ్ఛగా హాయిగా వుండాలనుకునే సమాజం కావాలనుకొంటుంది. ఆ నవ సమాజ స్థాపనకు విప్లవ మార్గమే శరణ్యమనుకొని ఆ ఉద్యమంవైపు అడుగులు వేస్తుంది.
  ఉద్యమంలోకి వెళ్లాక వర్గ శత్రువును అంతమొందించాలని పోరాడుతుంది. ఈ పోరాటం మూడుసార్లు జరుగుతుంది. రెండుసార్లు కలలోనే పోరాటాలు. మూడోసారి మాత్రం వాస్తవ పోరాటం. కానీ అది విఫలవౌతుంది.
  నవల అంతంలో జ్యోతి గ్రామ పొలిమేరలలో కాలుపెడుతుంది. కామ్రేడ్ సత్యం ప్రబోధం మేరకు గ్రామ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడానికి ఉద్యమిస్తుంది. ఎక్కడా ఆగదు.
  నవల అంతా చదివాక అవివేకంతో, మూర్ఖత్వంతో తన జీవితాన్ని నాశనం చేసికొన్నందుకు శబరిపై జాలి కలుగుతుంది. కానీ ఒక పక్కన అలాంటి సంఘం వున్నందుకు కోపం వస్తుంది. శబరి పతనానికి కారణం విలువు లేని మాజం. ఎలా సంపాదించినా ఫరవాలేదు కానీ డబ్బు కావాలి. ధనవంతుడే ఈ సమాజంపై ఆధిపత్యం సంపాదించే వ్యవస్థ ఇది. ఎన్ని అవమానాలకు గురైనా, ఎన్ని అణచివేతలకు బలయినా మళ్లీ ఆ ధనవంతుల మోచేతికింద బతక్క తప్పని పేదల జీవితాలు.
  నిత్యనూతన జీవితాన్ని సరికొత్త సమసమాజాన్ని ఆశించిన శబరి, జ్యోతులు కోరుకొన్నది పొందలేకపోయారు. ఎవరి కారణాలు వారికుంటాయి. ఆ కారణాలను సందర్భానుకూలంగా నవలలో ఇమిడిపోయేటట్లు చక్కగా వర్ణిస్తారు రచయిత్రి.
  ఒకచోట సత్యం ‘‘పట్టుబడినవారిని పోలీసులు చిత్రహింసలకు గురిచేస్తారు. ఆ దారుణాలను, చిత్రహింసల్ని తట్టుకోలేక కొంతమంది ఇన్‌ఫార్మర్‌లౌతారు’’ అంటాడు.
  ‘‘వ్యక్తిగత బలహీనలు, సరయిన రాజకీయ అవగాహన లేకపోవడమే మన ఉద్యమానికి అవరోధంగా వుంటాయి’’ అని చెప్తాడు.
  మరొకచోట జ్యోతి వర్గశత్రువును చంపితే ఆ తల ‘‘నన్ను చంపావ్! బాగానే వుంది.
  -సశేషం
  రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..


  0 0

  సీ నీలమేఘశ్యామ! నీవె తండ్రివి మాకు
  కమలవాసిని మమ్ము-కన్నతల్లి
  నీ భక్తవరులంత నిజమైన బాంధవుల్
  నీ కటాక్షము మా కనేక ధనము
  నీ కీర్తనల్ మాకు లోక ప్రపంచంబు
  నీ సహాయము మాకు నిత్యసుఖము
  నీ మంత్రమే మాకు నిష్కళంకపు విద్య
  నీ పదధ్యానంబు నిత్యజపము
  తే తోయజాతాక్ష! నీ పాద తులసిదళము
  భోగముల కౌషధము బ్రహ్మ రుద్ర వినుత!
  భూషణ వికాస! శ్రీ్ధర్మపుర నివాస!
  దుష్టసంహార! నరసింహా! దురితదూర!

  భావం: నరసింహస్వామి! మాకు తండ్రివి నీవే. లక్ష్మీదేవియే మా కన్నతల్లి. నీ భక్తులే మా బంధువులు. నీ దయయే మా సొమ్ము. నీ పాటలే మా లోకం. నీ నామజపమే మా విద్య. నీ పాద ధ్యానమే నిత్య జపం. నీ పాదాలమీద పూజ చేసిన తులసిదళం రోగాలన్నింటిని రూపుమాపే మందు. బ్రహ్మరుద్రులచే పొగడబడుచున్న ఓ స్వామీ! నీవే మాకు అన్నియూ


  0 0
 • 01/03/19--06:20: maatata
 • Cross Image: 
  Date: 
  Friday, January 4, 2019

  0 0

  గుడిహత్నూర్, జనవరి 2: గ్రామ పంచాయతీ ఎన్నికల విధులను రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం సక్రమంగా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపిడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ప్రెసైడింగ్ అధికారులతో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పలు సూచనలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలతో ఓటింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఒకే రోజు ఓటింగ్, కౌంటింగ్ ఉంటుందని, ఎన్నికల విధులను బాధ్యతయుతంగా నిర్వర్తించాలన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు ఏలాంటి ఇబ్బందులు కల్గకుండా చూసుకోవాలన్నారు. ఎన్నికల్లో ఎవైనా అనుమానాలు ఉంటే స్థానిక ఎడీవోకుగాని, జిల్లా పంచాయతీ అధికారికి గాని, లేనట్లయితే తనను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఈసారి ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఒకవేళ ఆన్‌లైన్ సేవలు అందుబాటులో లేకపోతే వాట్సాప్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవచ్చన్నా రు. ఈ సందర్భంగా ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి బ్యాలెట్ పేపర్ వినియోగం, వాటి పనితీరుపై పలు సూచనలు చేశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ దివ్య ఎంపిడీవో కార్యాలయ సిబ్బందికి దుప్పట్లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎడీవో పుష్పలత, ఈవోపీఆర్‌డి లింగయ్య, సూపరింటెండెంట్ అరుణ, సిబ్బంది కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

  ఆపరేషన్ స్మైల్‌ను పకడ్బందీగా చేపట్టాలి
  * పిల్లలను పనిలో పెట్టుకుంటే కేసు
  * విద్యార్థినులు వారం రోజులు స్కూళ్లకు రాకుంటే ఇళ్లకు వెళ్లి తీసుకురండి
  * కలెక్టర్ ప్రశాంతి
  నిర్మల్, జనవరి 2: ఈనెలా ఖరు వరకు చేపట్టిన ఆపరేషన్ స్మైల్-5 కార్యక్రమాన్ని పకడ్భందీగా చేపట్టాలని కలెక్టర్ ఎం.ప్రశాంతి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో మహిళాశిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ బాలల పరిరక్షణవిభాగం ఆధ్వర్యంలో పోలీస్, కార్మిక, విద్యాశాఖ, క్రీడలు, వైద్య, స్వచ్ఛంద సంస్థలతో నిర్వహించిన ఆపరేషన్ స్మైల్ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ బాల కార్మికులుగా పెట్టుకున్న యజమానులపై కేసులు నమోదు చేయాలని జిల్లా కార్మికశాఖ అధికారిని ఆదేశించారు. ఆపరేషన్ స్మైల్‌లో రెస్క్యూ చేసిన వారిని ప్రభుత్వ వసతి గృహంలో ప్రవేశం కల్పించి వారి విద్యాభివృద్ధిని పరిశీలించి ప్రతినెలా నివేదికలు ఇవ్వాలన్నారు బడిమానేసిన పిల్లలను గుర్తించి వసతి గృహాల్లో ప్రవేశం కల్పించాలని, ముఖ్యంగా 8,9,10వ తరగతి చదివే విద్యార్థినిలు వారం రోజులు పాఠశాలలకు రాకుంటే వారి ఇళ్లకువెళ్లి బడికితీసుకుని రావాలని, డ్రాపౌట్‌లు లేకుండా చూడాలన్నారు. పిల్లలకు మెడికల్ చెకప్, హెల్త్ ఎడ్యుకేషన్ తెలియజేయాలన్నారు. బాల్య వివాహాలు జరగకుండా చూడాలన్నారు. బాధిత కార్మికులు (బాండెడ్) గుర్తించి వారిని ఆశ్రమ పాఠశాలల్లో ప్రవేశం కల్పించాలన్నారు. ఆపరేషన్ స్మైల్-5లో భాగంగా రెస్క్యూ అయిన పిల్లలను అదేరోజు సిడబ్ల్యుసి ముందు ప్రవేశపెట్టి వారి అనుమతితో వసతి గృహాల్లో ప్రవేశం కల్పించాలన్నారు. సమావేశంలో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ అధికారి ఎ.విజయలక్ష్మీ, డీఎస్పీ ఉపేంధర్‌రెడ్డి, డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ జలపతి నాయక్, జిల్లా కార్మికశాఖ అధికారి శ్రావణి, కో-ఆర్డినేటర్ సునీల్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధి మంజుల, ఇన్‌చార్జి డీసీపివో సగ్గం రాజు తదితరులు పాల్గొన్నారు.

  కొత్త పంచాయతీ చట్టం అమలుపై ఎన్నికల సంఘం నజర్
  * క్రిమినల్ కేసుల్లో దోషిగా తేలితే పోటీకి అనర్హత
  ఆంధ్రభూమి బ్యూరో
  ఆదిలాబాద్, జనవరి 2: స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలో నిలిచి గెలవాలని ఆరాటపడుతున్న నేతల ఆశలకు నూతన పంచాయతీ రాజ్ చట్టం నిబంధనలు అడ్డంకిగా మారనున్నాయి. అధిక సంతానం వద్దు.. ఇద్దరే ముద్దు, మేమిద్దరం.. మాకిద్దరూ అన్న సర్కారు నినాదాలు త్వరలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో ఆచరణాత్మకంగా అమలుకు నోచుకోనున్నాయి. రిజర్వేషన్లు అనుకూలించి సంబరపడుతున్న ఆయా పార్టీల ద్వితీయ శ్రేణి నేతలకు మూడో సంతానం అడ్డురావడం పలుచోట్ల అందోళన కల్గిస్తున్నాయి. తాజాగా 2018లో ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి ఎన్నికల్లో పోటీకి పలు నిబంధనలు తెరపైకి తీసుకరావడంతో బరిలో నిలిచే వారి అర్హతలు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 19, ఉప సెక్షన్ 6 ప్రకారం 1995 మే 30తర్వాత మూడో సంతానం కలిగిన వారికి స్థానిక సంస్థలకు సంబంధించి సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపిటీసీ, జడ్పీటీసీలుగా పోటీచేయడానికి అనర్హులని నిబంధన విధించడం గమనార్హం. 1994లో అమలుచేసిన పంచాయతీరాజ్ చట్టం ప్రకారమే కొత్త చట్టం సవరణలోనూ మూడో సంతానం నిబంధనలను పకడ్బందీగా అమలుచేసేందుకు ఎన్నికల సంఘం నిర్ణయించింది. రెండో కాన్పులో కవలలు పుడితే మాత్రం ఈ నిబంధన వర్తించదు. తెలంగాణ పంచాయతీరాజ్ నూతన చట్టం ప్రకారం 21 ఉప సెక్షన్ నిబంధన మేరకు ఒక వ్యక్తికి ఇద్దరు పిల్లలకన్నా అధిక సంతానం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించనున్నారు. 1995 మే 31కి ముందే ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉంటే మాత్రం ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులే. 1995 జూన్ 1 తర్వాత మూడో సంతానం కలిగిన వారు మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ పోటీ చేయడానికి అనర్హులని ఎన్నికల సంఘం స్పష్టం చేస్తోంది. 1995కు ముందు ఒకే సంతానంలో కవలలు పుట్టి, ఆ తర్వాత కవలలు జన్మించినా పోటీకి అర్హులేనని తేల్చిచెప్పింది. ఇక ఎన్నికల్లో పోటీ చేసేందుకు దత్తత విషయంలోనూ చిక్కు ముడులపై సష్టతనిస్తూ 2006లో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పిల్లలను దత్తత ఇచ్చినా, దత్తత తీసుకున్నా తల్లిదండ్రులను కన్నవారిగానే గుర్తించి పరిగణలోకి తీసుకోనున్నారు. ఒక వ్యక్తి మొదటి భార్యకు ఇద్దరు సంతానం ఉంటే, భార్య చనిపోయి రెండో వివాహం చేసుకొని మరో సంతానానికి జన్మనిచ్చినా పోటీకి అనర్హుడేనని ఎన్నికల సంఘం పేర్కొంటోంది. అయితే ఈ నిబంధనల సవరణలో భాగంగా రెండో భార్యకు అంతకు ముందు పిల్లలు లేకుండా ఒక్కరే సంతానం కలిగి ఉంటే మాత్రం పోటీ చేయడానికి అర్హత కల్పించారు. నామినేషన్ల పరిశీలన రోజు వరకు ప్రసవం కాకుంటే పోటీలో కొనసాగేందుకు అవకాశం ఇవ్వడం గమనార్హం.
  క్రిమినల్ కేసుల్లో దోషిగా తేలితే అనర్హత వేటు
  సర్పంచ్, వార్డు స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులు క్రిమినల్ న్యాయస్థానంలో దోషిగా తేలి శిక్షపడితే ఐదేళ్ళవరకు పోటీలో నిలిచేందుకు అనర్హులే. విచారణ అనంతరం న్యాయస్థానం దోషిగా నిర్దారించినా సదరు వ్యక్తి కోర్టు నుండి స్టే లేదా బెయిల్ పొందినా పోటీచేయడానికి అనర్హుడేనని పంచాయతీరాజ్ చట్టం స్పష్టం చేస్తోంది. ఇదిలా ఉంటే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రకారం చౌక ధరల దుకాణాల డీలర్లు పోటీకి అర్హత కల్పించారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, సింగరేణి, అంగన్వాడీ సిబ్బంది, నీటి వినియోగదారుల సంఘం సభ్యులు, మత సంస్థల పాలకవర్గాలు ఎన్నికల్లో పోటీచేయడానికి అనర్హత విధించారు.

  శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విద్యార్థులు రాణించాలి
  * ఎమ్మెల్యే జోగు రామన్న
  ఆదిలాబాద్ రూరల్, జనవరి 2: విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకొని సాంకేతిక శాస్త్ర రంగాల్లో రాణించాలని ఆదిలాబాద్ శాసన సభ్యులు జోగు రామన్న పిలుపునిచ్చారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని కలెక్టరేట్ చౌక్‌లో జీనియస్ ఐఐటీ శిక్షణ సంస్థను నూతనంగా స్థాపించగా ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈసందర్భంగా రామన్న మాట్లాడుతూ విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్ది ఉపాధి రంగాల్లో స్థిరపడేలా సాంకేతిక విలువలతో శిక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విద్యారంగంలో వినూత్న ఒరవడి సృష్టించి పలు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్న నిర్వాహకులు షోయబ్‌అల్తాప్‌ను అభినందించారు. సందర్భంగా షోయబ్ అల్తాప్ మాట్లాడుతూ తమ ఇనిస్ట్యూట్‌లో ప్రత్యేకంగా అబాకస్, వేదిక్‌మ్యాథ్స్, స్పోకెన్ ఇంగ్లీష్ తదితర శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగినేని మనీషా, వైస్ చైర్మెన్ ఫారుక్ ఆహ్మాద్, జడ్పీటీసీ విజ్జగిరి అశోక్, టీఆర్‌ఎస్ టౌన్ ప్రెసిడెంట్ సాజిదొద్దిన్, ఎంపిపి శుక్లాల్, టీయూడబ్ల్యూజె నాయకులు రమేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

  త్వరలో పీహెచ్‌సీల్లో ఖాళీల భర్తీ
  * ప్రాజెక్టు అధికారి కృష్ణ ఆదిత్య
  ఉట్నూరు, జనవరి 2: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా భర్తీచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి కృష్ణ ఆదిత్య అన్నారు. శుక్రవారం ఏజెన్సీ పరిధిలోని 31 పీహెచ్‌సీ వైద్యాధికారులు, సూపర్‌వైజర్లతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 31 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 186 ఉపకేంద్రాల్లో అందుతున్న వైద్యసేవల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల వైద్య ఆరోగ్య పరీక్షలు ముఖ్యంగా హిమోగ్లోబిన్, బీపీ, షుగర్, ఎత్త, బరువు తదితర ఆరు రకాల పరీక్షలు చేయాలన్నారు. టీబీ వ్యాధిపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. గర్భవ్రతులకు నెలసరి ఇచ్చే టీకాల వివరాలు ఎప్పటికప్పుడు పొందుపర్చాలన్నారు. పీహెచ్‌సీలకు కావాల్సిన లాబొరేటరీ పరికరాలు సైతం సమకూరుస్తామన్నారు. ఆసుపత్రి అభివృద్ధికోసం వచ్చే నిధుల ఖర్చుల వివరాలు తెలుపాలని వైద్యాధికారులను ఆదేశించారు. వైద్యాధికారులు సెలవుపై వెళ్ళినట్లయితే తనకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్ప వన్నారు. ఏఎన్‌ఎంల పనితీరు బాగాలేదని, తనకు అనేక ఫిర్యాదులు వస్తున్నందున వారితీరు మార్చుకోవాలని, లేనట్లయితే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ జిల్లా సహాయ వైద్యాధికారి వసంతరావును ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ డీఎంఆండ్‌హెచ్‌వో డాక్టర్ చందు, వైద్యులు సాధన, సునీల్, సుధాకర్, సరిత తదితరులు పాల్గొన్నారు.

  బర్ధన్ ఆశయ సాధన కోసం పనిచేయాలి
  మంచిర్యాల, జనవరి 2: భారత కమ్యూనిస్టు పార్టీ జనరల్ సెక్రటరీగా పని చేసిన ఏబీ వర్థన్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు పనిచేయాలని జిల్లా కార్యదర్శి కలవేన శంకర్ కోరారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో వర్థంతి సభను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయ న మాట్లాడుతూ భారతదేశంలోనే ప్రాచీన రాజకీయ పార్టీ అయిన సీపీఐలో సుభిక్షిత సంకీర్ణ రాజకీయ శకంలో పార్టీనిలో సమర్థవంతంగా నడిపించిన మహా నాయకుడని అన్నారు. కార్మిక నేతగా పలు ఉద్యమాలు చేపట్టారని నాలుగేళ్లకు పైగా జైలు జీవితం గడిపారన్నారు.

  స్థానిక ఎన్నికల బరిలో సీపీఐ
  * సీపీఐ జిల్లా కార్యదర్శి కలవేన శంకర్
  మంచిర్యాల, జనవరి 2: స్థానిక సంస్థల ఎన్నికలలో సీపీఐ బరిలో నిలుస్తుందని జిల్లా కార్యదర్శి కలవేన శంకర్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో బీజేపీయేతర పార్టీలతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టే విధంగా ఈ ఎన్నికలలో ప్రచారం చేపడుతామని అన్నారు. పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలు, స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయబోయే స్థానాలపై జిల్లా కార్యవర్గ సమావేశంలో చర్చించనున్నట్లుగా తెలిపారు. సమావేశంలో ఏఐటీయూసి నాయకులు మేకల దాసు, జోగుల మల్లయ్య, పౌలు, లక్ష్మణ్, చంద్రశేఖర్, కిషన్ రావు, పోచన్న, శంకరయ్య, నర్సింగ్, లచ్చిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

  అర్హులైన వారికి ఓటు హక్కు కల్పించాలి
  * కలెక్టర్ దివ్యదేవరాజన్
  గుడిహత్నూర్, జనవరి 2: 18సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని కలెక్టర్ దివ్యదేవరాజన్ అన్నారు. బుధవారం గుడిహత్నూర్ మండల తహశీల్‌ను సందర్శించారు. కార్యాలయ భవనాలను పరిశీలించారు. అనంతరం రెవెన్యూ సిబ్బందితో సమావేశమై మండలంలో ఉన్న పోలింగ్ కేంద్రాల గురించి అడిగి తెలుసుకున్నారు. కొత్త ఓటర్ల పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేయాలన్నారు. అలాగే ఓటరు జాబితాలో ఎవైన తప్పులు ఉంటే సరిచేయాలని సూచించారు. పార్ట్‌బికి సంబంధించిన రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటికి సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని తహసీల్దార్ సుజాతకు సూచించారు. రెవెన్యూ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ అరీఫా, ఆర్ ఐలు నరేష్, అమ్రపాలి, సీనియర్ అసిస్టెంట్ నాగోరావు తదితరులు పాల్గొన్నారు.

  5,6 తేదీల్లో రాష్టస్థ్రాయి ఫుట్‌బాల్ పోటీలు
  బెల్లంపల్లి, జనవరి 2: ఈనెల 5,6 తేదీల్లో పట్టణంలోని ఏఎంసీ క్రీడామైదానంలో మాస్టర్స్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్టస్థ్రాయి ఫుట్‌బాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు పి రవికుమార్ తెలిపారు. బుధవారం ఇక్కడ ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్టస్థ్రాయి ఫుట్ బాల్ పోటీలకు రాష్ట్రంలోని 31 జిల్లాలకు చెందిన 200 మంది క్రీడాకారులు పోటీలకు హాజరు అవుతారని తెలిపారు. 35 సంవత్సరాలు పై బడినవారికి ఫుట్‌బాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీలు 5వ తేదీన ప్రారంభమవుతాయన్నారు. ఎంపికైనా రాష్ట్ర జట్టు క్రీడాకారులు ఫిబ్రవరి 26 నుండి మార్చి 3 వరకు ఉత్తరఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌లో జరిగే జాతీయ మాస్టర్స్ గేమ్స్ పోటీల్లో పాల్గొంటారన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుల సాయిబాబా, జిల్లా నాయకులు యాదండ్ల బలరాం, టి అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

  ఎంఈవోకు కార్మికుల సమ్మె నోటీసు
  తాండూర్, జనవరి 2: మండల విద్యాధికారి వాసాల ప్రభాకర్‌కు బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చారు. ఈసందర్భంగా సీఐటీయూ జల్లా కార్యదర్శి దాగం రాజారాం మాట్లాడుతూ కేంద్ర కార్మిక కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 8,9 తేదిల్లో నిర్వహించనునన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మండలంలోని మధ్యాహ్న భోజనం కార్మికులు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటారనీ ఆయన పేర్కొన్నారు. కార్మికులకు కనీస వేతనం రూ.18వేలు, పింఛన్ రూ.3వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమ్మెలో మధ్యాహ్న భోజనం కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కార్మికులు సరోజ, అన్నక్క, మల్లక్క, లక్ష్మీ, అనసూర్య, సీతాబాయి, జంగుబాయి తదితరులు పాల్గొన్నారు.

  ఎన్నికల్లో పొరపాట్లు జరగకుండా చూడాలి
  * డీపీవో సాయిబాబా
  తలమడుగు, జనవరి 2: త్వరలో జరగబోయే పంచాయతీ గ్రామ సర్పంచ్‌ల ఎన్నికల్లో ఏలాంటి పొరపాట్లు జరగకుండా అధికారులు జాగ్రత్త వహించాలని డీపీవో సాయిబాబా అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపిడీవో కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల శిక్షణ తరగతులలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పీవో, ఏపివో స్థాయి అధికారులు ప్రత్యేక శ్రద్ధవహించాలన్నారు. నియోజకవర్గంలో ఎన్నికలు రెండో విడతగా జరగనున్నాయని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. రెండో విడతలో బోథ్, బజార్‌హత్నూర్, తలమడుగు, గుడిహత్నూర్ మండలంలోని 149 గ్రామపంచాయతీలతో పాటు 1200 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంవోటి సంజీవరావు, ఎంపిడీవో సునీత, తహశీల్దార్ ఇమ్రాన్‌ఖాన్, మండల విద్యాధికారి కౌసల్య, ఈవోపిఆర్‌డి దిలీప్ కుమార్, పీవో, ఏపీవోలు పాల్గొన్నారు.


  0 0

  నిజామాబాద్, జనవరి 2: రాష్ట్రంలో న్యాక్ గుర్తింపు సాధించిన యూనివర్శిటీగా ఘనతను దక్కించుకున్నప్పటికీ, నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయానికి నిధుల లేమి సమస్య దూరం కాలేకపోతోంది. గత మూడేళ్ల క్రితమే న్యాక్ గ్రేడింగ్ దక్కడంతో నిధుల వరద పారుతుందని అంతా భావించగా, ఆ ఆశలన్నీ నీరుగారిపోయాయి. ఇప్పటివరకు న్యాక్ గుర్తింపు ద్వారా ప్రత్యేకంగా సమకూరిన నిధులేవీ లేవని వర్శిటీ అధికార వర్గాలు ఉసూరుమంటున్నాయి. నిజానికి న్యాక్ గుర్తింపు కోసం అప్పట్లో ఇన్‌చార్జ్ వైస్ ఛాన్స్‌లర్‌గా వ్యవహరించిన సీనియర్ ఐఏఎస్ అధికారి పార్థసారథి విశ్వవిద్యాలయంలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బందిని సమన్వయపరుస్తూ అహరహం శ్రమించారు. న్యాక్ ప్రతినిధి బృందాలను ఆకట్టుకునే రీతిలో ప్రత్యేకంగా పలు కార్యక్రమాలను అమలు చేశారు. అప్పటికే యూనివర్శిటీ నిధుల కొరతతో సతమతం అవుతున్నప్పటికీ, ఎలాగైనా న్యాక్ గుర్తింపు దక్కించుకోవాలనే తాపత్రయంతో లక్షలాది రూపాయలను వివిధ కార్యక్రమాల కోసం ఖర్చు చేశారు. ఈ ప్రయత్నాలు ఫలించి తెలంగాణ యూనివర్శిటీకి న్యాక్ గ్రేడింగ్ దక్కడంతో, ఇక నిధులు వెల్లువెత్తుతాయని, తద్వారా వర్శిటీకి మహర్దశ పడుతుందని అంతా ఆశించారు. అయితే ఇప్పటివరకు న్యాక్ గుర్తింపు వల్ల నిధుల పరంగా ప్రత్యేకంగా ఒనగూరిన ప్రయోజనమంటూ ఏదీ లేకుండాపోయింది. నిజానికి ఇక్కడ వర్శిటీ ఏర్పాటైన నాటి నుండి కూడా తెలంగాణ విశ్వవిద్యాలయం నిధుల లేమితో సతమతం కావాల్సి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సైతం బడ్జెట్‌లో అరకొర నిధులనే కేటాయిస్తోంది. దీంతో వౌలిక సదుపాయాల లేమి వెంటాడుతోంది. సమైక్య రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు తెలంగాణ వర్శిటీకి నిధుల మంజూరీలో వివక్షను ప్రదర్శించారంటూ ఆక్షేపిస్తూ వచ్చిన తెరాస పార్టీ, ప్రస్తుతం ప్రత్యేక రాష్ట్రంలో రెండవ పర్యాయం అధికారంలోకి వచ్చినప్పటికీ గడిచిన ఐదేళ్లుగా నిధుల కేటాయింపుల్లో అదే వైఖరిని అవలంభించడాన్ని విద్యార్థులు, విద్యావేత్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. గతేడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనూ తె.యుకు అరకొర నిధులతోనే సరిపెట్టుకున్నారు. వౌలిక వసతుల కల్పనకు కనీసం వంద కోట్ల రూపాయల నిధులు అవసరం అవుతాయని ప్రతిపాదనలు పంపగా, కేవలం పాతిక శాతం నిధులను మాత్రమే విదిల్చడం నిరాశపర్చింది.
  అత్తెసరు నిధుల్లో సింహభాగం అధ్యాపకులు, సిబ్బంది వేతనాలకే సరిపోతున్నాయి. 2006వ సంవత్సరంలో ప్రారంభమైన తెలంగాణ వర్శిటీ నిధుల లేమి వల్ల మొదటి మూడు సంవత్సరాల పాటు తాత్కాలికంగా జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వర్శిటీ తరగతులను నిర్వహించారు. అనంతరం డిచ్‌పల్లి మండలం నడిపల్లి శివారులో కేటాయించిన స్థలంలో కొన్ని గదుల నిర్మాణాలను చేపట్టి 2009లో ఆదరాబాదరగా వర్శిటీని అక్కడికి తరలించారు. మొత్తం 18కోర్సులలో దాదాపు 3వేల మంది వరకు విద్యార్థిని, విద్యార్థులు చదువుకుంటుండగా, ఏ ఒక్క విభాగంలోనూ పూర్తిస్థాయి సౌకర్యాలు సమకూరిన దాఖలాలు కనిపించడం లేదు. పుష్కర కాలం గడిచినా, వివిధ విభాగాల తరగతి గదుల కొరత దూరం కాలేకపోతోంది. సమీకృత భవన సముదాయం, ఎగ్జామినేషన్ బ్రాంచ్ బిల్డింగ్‌లతో వివిధ కోర్సులకు సంబంధించిన ప్రత్యేక భవనాలు, ప్రయోగశాలల నిర్మాణాలు జరగాల్సి ఉంది. 400పైచిలుకు ఎకరాల సువిశాల విస్తీర్ణం కలిగిఉన్నప్పటికీ, వివిధ కోర్సులకు సంబంధించి భవన నిర్మాణాలు చేపట్టేందుకు నిధుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ ఇక్కట్లు దూరం కావాలంటే కనీసం వంద కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయని అంచనా వేయగా, కనీసం సగభాగమైనా నిధులు కేటాయించడం లేదు. కనీసం న్యాక్ గుర్తింపు దక్కించుకున్నందున యూజీసీతో పాటు ఇతర సంస్థల ద్వారా నిధులు సమకూరుతాయని ఆశించినప్పటికీ, అవి కూడా మంజూరైన జాడ కానరావడం లేదు.

  అయిలాపూర్‌లో ‘కంటి వెలుగు’
  వైద్య శిబిరం ప్రారంభం

  నందిపేట్, జనవరి 2: నందిపేట మండలం అయిలాపూర్ గ్రామంలో బుధవారం కంటి వెలుగు వైద్య శిబిరాన్ని స్థానిక మాజీ సర్పంచ్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మీసాల సుదర్శన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ సంతోష్‌కుమార్ మాట్లాడుతూ, అయిలాపూర్‌లో గ్రామంలో ప్రారంభించిన ‘కంటి వెలుగు’ శిబిరం ఈ నెల 11వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. గ్రామంలో 6వేల మంది జనాభా ఉందని, రోజుకు 300మందికి కంటి పరీక్షలు జరుపుతామని ఆయన తెలిపారు. తమ పరీక్షల్లో మోతిబిందు, కార్నియాగ్లాకోమా సమస్యలు ఉన్నవారిని గుర్తించి చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తామని తెలిపారు. స్థానికులు తమ విధిగా శిబిరానికి వచ్చి కంటి పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ సంతోష్‌కుమార్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆప్తామాలోజిస్టు వనిత, ఏఎన్‌ఎం రేణుక, సిబ్బంది రమణ, సురేందర్, రోషమ్మ, శైలజ, లావణ్య, అర్చన, ఆశ కార్యకర్తలు, స్థానిక నాయకులు గంగాధర్, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.
  జాతీయ స్థాయి పోటీలకు తిమ్మాపూర్ విద్యార్థుల ఎంపిక
  మోర్తాడ్, జనవరి 2: మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ ఉన్నత పాఠశాలకు చెందిన శివాని, రవళిలు జాతీయస్థాయి బాల్‌బ్యాట్మింటన్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం.రాజేందర్, పీఇటీ శ్యామ్‌లు తెలిపారు. డిసెంబర్ 24నుండి మూడు రోజుల పాటు ఖమ్మంలో జరిగిన అండర్-17 విభాగంలో తమ పాఠశాలకు చెందిన శివాని, డిసెంబర్ 25నుండి వరంగల్‌లో జరిగిన అండర్-14 విభాగంలో మోహని రవళిలు జాతీయ స్థాయికి ఎంపికయ్యారని వారు తెలిపారు. ఈ నెల 7నుండి 9వరకు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూర్‌లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణ రాష్ట్ర జట్టు తరఫున వీరిద్దరు ప్రాతినిధ్యం వహిస్తారని వారన్నారు. ఎంపికైన ఇద్దరు క్రీడాకారులను గ్రామాభివృద్ధితో పాటు ఉపాధ్యాయులు పురుషోత్తం, చరణ్, సయ్యద్‌బాబు, శ్యామలత, సోనియా, స్వర్ణలత తదితరులు అభినందించారు.

  మోర్తాడ్ ఎంఈఓగా ఆంధ్రయ్య
  మోర్తాడ్, జనవరి 2: మోర్తాడ్ మండల విద్యాధికారిగా ఆంధ్రయ్య బుధవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఇన్నాళ్ల పాటు ఈ బాధ్యతలు నిర్వహించిన పాలెం ప్రధానోపాధ్యాయుడు రాజేశ్వర్ పదవి విరమణ చెందడంతో కమ్మర్‌పల్లి ఎంఈఓగా విధులు నిర్వర్తిస్తున్న ఆంధ్రయ్యకు మోర్తాడ్ మండల విద్యాశాఖాధిరిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. పదవి విరమణ పొందిన ఎంఈఓ రాజేశ్వర్ పూర్తి బాధ్యతలను, రికార్డులను నూతన ఎంఈఓ ఆంధ్రయ్యకు అందజేశారు. పదవి విరమణ పొందిన రాజేశ్వర్‌తో పాటు నూ తన ఎంఈఓ ఆంధ్రయ్యలను రెండు మండలాల వివిధ ఉపాధ్యాయ సం ఘాల బాధ్యులు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మో ర్తాడ్, ఏర్గట్ల, కమ్మర్‌పల్లి మండలాలకు చెందిన వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
  ప్రత్యేక శిక్షణా తరగతులు ప్రారంభం
  డిచ్‌పల్లి రూరల్, జనవరి 2: తెలంగాణ విశ్వవిద్యాలయం న్యాయశాస్త్ర శాఖలో బుధవారం రోజున న్యాయశాస్త్ర పరిశోధక విద్యార్థులకు, వారి పాఠ్యాంశాలకు అనుగుణంగా ప్రత్యేక శిక్షణ తరగతులను న్యాయశాస్త్ర శాఖాధిపతి డాక్టర్ జట్లింగ్ ఎల్లోసా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎల్లోసా మాట్లాడుతూ, దేశ, విదేశాలలో పిహెచ్.డి న్యాయశాస్త్ర పరిశోధక విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని, ఈ శాస్త్రం దేశం మొత్తంలో కొన్ని విశ్వవిద్యాలయాలలో మాత్రమే న్యాయశాస్త్రంలో పరిశోధనలు జరుగుతున్నాయని, అటువంటి జాబితాలో తెలంగాణ విశ్వవిద్యాలయం ఉండటం ఈ ప్రాంతవాసుల అదృష్టమని ఆయన పేర్కొన్నారు. న్యాయశాస్త్ర పరిశోధనల ఆధారంగా చట్టాలు, రూల్స్, ఆర్డర్ల రూపకల్పన చేయడం జరుగుతుందన్నారు. 2013-14బ్యాచ్‌కు చెందిన 17మంది న్యాయ పరిశోధక విద్యార్థులు, న్యాయశాస్త్ర విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ అలీయుద్దీన్, జి.నవీన్, బీ.రమేష్, బీ.సవిత, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.
  పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి
  కమ్మర్‌పల్లి, జనవరి 2: ఈ నెల 21వ తేదీన నిర్వహించే గ్రామ పంచాయతి ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని ఎంపీడీవో శ్రీనివాస్ చెప్పారు. బుధవారం కమ్మర్‌పల్లిలోని స్ర్తిశక్తి భవన్‌లో పీఓ, ఏపీఓలకు ఎన్నికల నిర్వహణపై ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. 21న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఉంటుందని అన్నారు. గ్రామ పంచాయతి ఎన్నికలు ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ బాక్సులను వినియోగించడం జరుగుతుందని చెప్పారు. బ్యాలెట్ బాక్సుల నిర్వహణ, పేర్ ఎలా వేయాలని, కౌంటింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సమన్వయకర్త రాజేశ్వర్‌గౌడ్ వివరించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఇఓ ఆంధ్రయ్య, ఈఓపీఆర్‌డీ శ్రీనివాస్‌రెడ్డి, సూపరింటెండెంట్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
  వంద అడుగుల రోడ్డును రద్దు చేయాలి

  కంఠేశ్వర్, జనవరి 2: నగరంలోని వినాయక్‌నగర్ హౌసింగ్ బోర్డు గుండా భీంరాయ్‌గుడి వాగు మీదుగా గాయిత్రీనగర్, రేడియో స్టేషన్ ఎదురుగా ఉన్న ఆనంద్‌నగర్, నాగారం రోడ్డు వరకు నగర మాస్టర్ ప్లాన్-2018లో ప్రతిపాదించిన 100్ఫట్ల రోడ్డును రద్దు చేయాలని రింగ్‌రోడ్డు బాధితుల కమిటీ కన్వీనర్ రామ్మోహన్‌రావు డిమాండ్ చేశారు. బుధవారం నగరంలోని స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 45సంవత్సరాల తర్వాత నగరంలో కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు ప్రభుత్వం ప్రజల ముందు కొన్ని ప్రతిపాదనలను ఉంచడం జరిగిందన్నారు. ముఖ్యంగా 100్ఫట్ల రోడ్డుకు సంబంధించిన అభ్యంతరాలు ఏమైనా ఉన్నట్లయితే సలహాలు, సూచనలు చేయాలని చెప్పడం జరిగిందన్నారు. అలాగే అభ్యంతరాలుంటే మున్సిపల్ అధికారులకు, ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించడం జరిగిందన్నారు. దీనికి సంబంధించి మాస్టర్ ప్లాన్‌లో వినాయక్‌నగర్-2, హౌసింగ్ బోర్డుల మధ్యలో ఉన్న 100్ఫట్ల రోడ్డు గుండా భీంరాయ్‌గుడి దగ్గర ఉన్న వాగు మీదుగా గాయత్రీనగర్ శివారు ప్రాంతం గుండా రేడియోస్టేషన్ ఎదురుగా ఉన్న ప్రాంతం నుండి, అలాగే పీఎఫ్ కార్యాలయం ప్రక్క నుండి ఆనంద్‌నగర్, నాగారం రోడ్డును కలుపుతూ 100్ఫట్ల రోడ్డును ప్రతిపాదించడం జరిగిందన్నారు. ఈ ప్రతిపాదన ప్రాంతంలో వాగు నుండి ఇలాంటి రోడ్డు ఇప్పటి వరకు లేదన్నారు. ఆ ప్రాంతమంతా ప్రైవేట్ వ్యక్తులు అంటే పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు రూపాయి, రూపాయి కూడ బెట్టుకొని ప్లాట్లు, ఇళ్లు నిర్మించుకున్నారని అన్నారు. ఇందులో అనేక మంది బీఆర్‌ఎస్, ఎల్‌ఆర్‌ఎస్ స్కీంల ద్వారా రెగ్యులరైజేషన్ కూడా చేయించుకున్నారని అన్నారు. ఇప్పుడు 100్ఫట్ల రోడ్డులో కొంత భాగం బహుళ ప్రయోజనకారి పేరున వినియోగించడమంటే ఇప్పుడు ఉన్న ఇళ్లను కూలగొట్టి కోట్లాది రూపాయల విలువైన భూమిని తీసుకొని ప్రజలను మానసికంగా కృంగదీయడమేనన్నారు. అందుకని మాస్టర్ ప్లాన్‌లోని 100్ఫట్ల రోడ్డు ప్రతిపాదనను తక్షణమే రద్దు చేయాలని ఈ ప్రాంత ప్రజలందరూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారని అన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో వినాయక్‌నగర్ హౌసింగ్‌బోర్డు కమిటీ సభ్యులు ప్రభాకర్, రాజు, పండరీ, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

  పంచాయతీ ఎన్నికలకు
  ఏర్పాట్లలో అధికారులు బిజీ
  నందిపేట్, జనవరి 2: గ్రామ పంచాయతీ తొలిదశ ఎన్నికల నిర్వాహణకు నందిపేట మండలంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మండలంలో 33 గ్రామాలలో పంచాయతీ ఎన్నికలు ఈ నెల 21న జరుగనున్నాయి. ప్రభుత్వ ప్రకటన మేరకు ఎన్నికల షెడ్యూల్ ప్రకారంగా జనవరి 7, 8, 9 తేదీలలో నామినేషన్ల స్వీకరణ, 10న స్కృట్నీ, 11న అప్పీల్, 13న నామినేషన్ల ఉపసంహరణ, అదే రోజు సాయంత్రం 5గంటలకు బరిలో ఉన్న అభ్యర్థులను ప్రకటించడం జరుగుతుందని ఎంపీడీఓ నాగవర్ధన్, ఈఓపీఆర్డీ లక్ష్మణ్‌లు తెలిపారు. మండలంలో 33గ్రామ పంచాయతీలలో సర్పంచ్, 312వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. అందుకు 312 పోలింగ్ స్టేషన్లకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ మెటీరియల్, నామినేషన్ పత్రాలు సి ద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.

  పంచాయతీ ఎన్నికలను పటిష్టంగా నిర్వహించాలి
  మోర్తాడ్, జనవరి 2: గ్రామ పంచాయతీ ఎన్నికలను అత్యంత పటీష్టంగా నిర్వహించాలని మోర్తాడ్ ఎంపీడీఓ శ్రీనివాస్ అన్నారు. మోర్తాడ్, ఏర్గట్ల మండలాల్లో ఎంపిక చేయబడిన ఎన్నికల సిబ్బందికి బుధవారం మండల కార్యాలయంలో ఒక్కరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. గ్రామాల్లోని పాఠశాలల్లో ఉదయం 7గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ నిర్వహించబడుతుందని, బ్యాలెట్ పద్దతిలో నిర్వహించే పోటీల్లో సర్పంచ్‌కు గులాబీ రంగులోనూ, వార్డు సభ్యుడికి తెలుపు రంగులోనూ బ్యాలెట్ పేపర్ ఉంటుందని ఆయన తెలిపారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి పర్యవేక్షణలో ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించాలని అన్నారు. సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు నియామక పత్రాలను అందజేయాలని, ఆ కాపీలను కూడా అదనంగా ఒక్కో దానిని రాసి మండల కార్యాలయానికి పంపించాలని ఆయన కోరారు. ఎన్నికల విధులను నిస్పక్షపాతంగా నిర్వహించాలని ఆయన కోరారు. అనంతరం పీఓ, ఏపీఓలకు ఎన్నికల విధానాలను తెలిపే సమాచారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల సిబ్బంది, అధికారులు, రెండు మండలాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

  ఇంకుడు గుంతల అడ్రస్ ఎక్కడ?
  ఆరంభశూరత్వంగానే మిగిలిపోయిన అధికారుల ప్రయత్నాలు

  కంఠేశ్వర్, జనవరి 2: నగరంలో నీటి ఇక్కట్లను నివారించాలనే ఉద్దేశ్యంతో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులు ఇంకుడు గుంతల ఆవశ్యకతపై ఇదివరకు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. దీంతో నగరంలో ఎక్కడపడితే గుంతలను తవ్వించినప్పటికీ, వాటి నిర్మాణాలు మాత్రం చేపట్టలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి. ఈసారి కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు కురియకపోవడంతో వేసవిలో దాహార్తి సమస్య తెరపైకి వచ్చే ఆస్కారం లేకపోలేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ, ఇంకుడు గుంతల ఆవశ్యకతపై ప్రజాప్రతినిధులు, అధికారులు నోరు మెదపకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వర్షాలు కురిస్తే ఒకలాగా, వర్షాలు కురియకపోతే మరోలా వ్యవహరించడం ప్రజాప్రతినిధులకు ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిజానికి గత రెండు సంవత్సరాల క్రితం వర్షాలు కురియకపోవడంతో భూగర్భ జలమట్టం ప్రమాదకర స్థాయికి పడిపోయింది. తాగనీటి కోసం వందలాది మీటర్లు బోరుబావులు తవ్వించినా, దుమ్ము, ధూళి తప్ప చుక్క నీరు పైకి వచ్చిన దాఖలాలు కనిపించలేదు. వర్షాకాలం చివరిలో ఒక మోస్తారుగా వానలు కురిసినప్పటికీ, నగరంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల కారణంగా వర్షపు జలాలు భూమిలోకి ఇంకలేకపోయాయి. దీంతో నగర ప్రజలకు తాగునీటి తిప్పలు తప్పలేదు. ఈసారి కూడా దాదాపుగా అలాంటి పరిస్థితే పునరావృతం అయ్యే ప్రమాదం కనిపిస్తోందని పలువురు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు ఆశించిన స్థాయిలో కురియని సమయంలోనూ బోరుబావులు ఎత్తిపోకుండా ఉండేందుకు ప్రతి ఇంటికి కనీసం ఒక ఇంకుడు గుంతతో పాటు జలాలు ఎక్కువగా వృధా అయ్యే ప్రాంతాల్లో ఇంకుడు గుంతలను నిర్మించాల్సిన అధికారులు, చోద్యం చూస్తున్నారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. గత వేసవిలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా, నగర మేయర్ ఆకుల సుజాత తదితరులు పాఠశాలల్లో, ఆయా సమావేశాల్లో ఇంకుడు గుంతలను ప్రతి ఇంటి యజమాని నిర్మించుకోవాలని, నీటిని పొదుపుగా వాడుకోవాలంటూ ఉద్బోధించడం జరిగింది. అంతేకాకుండా కొత్తగా ఇంటిని నిర్మించుకునే వారు ఇంకుడు గుంతను నిర్మించుకుంటేనే గృహ నిర్మాణానికి అనుమతి ఇస్తామంటూ నిబంధనలు కూడా విధించారు. కానీ, ప్రస్తుతం ఇంకుడు గుంతల ఆవశ్యకతను మరిచిన అధికారులు, ప్రజాప్రతినిధులు, భూగర్భ జలమట్టం క్రమంగా పడిపోతున్నా, ఆ సమస్యను అధిగమించేందుకు సరైన చర్యలు తీసుకోకపోవడం నగర ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. నగరంలోని ఖలీల్‌వాడి, వినాయక్‌నగర్, కంఠేశ్వర్, గాజుల్‌పేట్, పెద్దబజార్ తదితర డివిజన్లలో తాగునీటి సమస్య రోజురోజుకీ తీవ్రరూపం దాల్చుతోంది. ఇక నగర శివార్లలోని ధర్మపురి హిల్స్, వెంగళ్‌రావుకాలనీ, నాగారం తదితర డివిజన్లలో ఇప్పటికీ కనీసం కుళాయిలు ఏర్పాటు చేయకపోగా, బోరుబావులు కూడా కనిపించవు. దీంతో ఇక్కడి ప్రజలు ప్రతిరోజు నీటి ట్యాంకర్లపైనే ఆధారపడి జీవనం వెళ్లదీయాల్సిన దుస్థితి నెలకొంది. ఈ ప్రాంతంలో ఇంకుడు గుంతలు అసలే కనిపించవు. ఈ విషయమై కార్పొరేషన్ అధికారులను వివరణ కోరగా, ఇంకుడు గుంతల ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ, ప్రజల నుండి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదని సమాధానం ఇస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇకనైనా అలసత్వం వీడి, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇంకుడు గుంతల నిర్మాణాలపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


older | 1 | .... | 2011 | 2012 | (Page 2013) | 2014 | 2015 | .... | 2069 | newer