Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మాకెన్ రాజీనామా

$
0
0

న్యూఢిల్లీ: ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి అజయ్ మాకెన్ (54) రాజీనామా చేశారు. నాలుగేళ్ల నుంచి అధ్యక్షుడిగా పనిచేస్తున్న ఆయన అనారోగ్య కారణాలతో రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఈ మేరకు రాహుల్ గాంధీకి తన రాజీనామా లేఖను పంపారు.


చంద్రబాబువి చిల్లర రాజకీయాలు:జీవీఎల్

$
0
0

న్యూఢిల్లీ: చంద్రబాబు చేసేవన్నీ చిల్లర రాజకీయాలని బీజేపీ ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆయన శుక్రవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ నలభై ఏళ్ల అనుభవం ఉన్న నేత ఇలాంటి రాజకీయాలకు పాల్పడతారంటే నమ్మబుద్ధి కావటంలేదని అన్నారు. ఈ ఐదేళ్లలో ఏపీలో ఏమీ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ నామ జపం చేస్తున్నారని విమర్శించారు.

పోలవరం నీళ్లు ఇవ్వటం అసాధ్యం:ఉండవల్లి

$
0
0

విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విడుదల చేసిన శే్వతపత్రాలపై తమకు కొన్ని అనుమానాలు ఉన్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. ఆయన శుక్రవారంనాడు మీడియాతో మాట్లాడుతూ డ్యామ్, రిజర్వాయర్ లేకుండా పోలవరం నీళ్లు మేకల్లా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. బిజినెస్ సమ్మిట్‌తో 18 లక్షల పెట్టుబడులు వచ్చాయని చెప్పిన చంద్రబాబు నేడు శే్వతపత్రంలో రూ.1.45 కోట్లు వచ్చాయని చెప్పారని అన్నారు.

రఫెల్‌పై వాడీవేడీ చర్చ

$
0
0

న్యూఢిల్లీ: రఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై ఈరోజు లోకసభలో వాడీవేడీ చర్చ జరిగింది. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్‌కు ధీటుగా సమాధానం ఇచ్చారు. రఫెల్ తొలి యుద్ధ విమానం సెప్టెంబర్‌కు వస్తుందని ఆమె చెప్పారు.యూపీఏ ఒప్పందం చేసుకున్న 18 విమానాల నుంచి 36కు పెంచిన ఘనత తమదేనని ఆమె అన్నారు. యూపీఏ హయాంలోనే ఈ ఒప్పందం జరిగినా ఎందుకు విమానాలు తీసుకురాలేకపోయారని ఆమె కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. యూపీఏ వల్లే పదేళ్ల కాలం పట్టలేదని, తమకు కేవలం 18 నెలల కాలం పట్టిందని అన్నారు. పొరుగు దేశాలు యుద్ధ విమానాలు సమకూర్చుకుంటుంటే ఎందుకు చూస్తు ఊరుకున్నారని ఆమె ప్రశ్నించారు. తమకు జాతీయ భద్రతే ప్రధానమని ఆమె నొక్కివక్కాణించారు. ‘‘ఏఏ (అనిల్ అంబానీ) కోసమే యుద్ధ విమానాలు కొనుగోలు చేశామని మీరు భావిస్తే.. ప్రతి ఏఏ వెనుక క్యూ (ఖత్రోవి) ఆర్‌వి (రాబర్ట్ వాద్రా) ఉన్నారంటూ నిర్మలా సీతారామన్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి చురకలు అంటించారు. రఫెల్ వ్యవహారంలో కాంగ్రెస్ దేశ భద్రతను గాలికొదిలేసిందని, ఆ పార్టీ మాట్లాడేవన్నీ అబద్ధాలేనని అన్నారు. ప్రధాని మంత్రి పట్ల సైతం అసభ్యకర పదజాలం వాడుతున్నారని విమర్శించారు. హెచ్‌ఏఎల్ విషయంలోనూ కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తుందని నిర్మలా సీతారామన్ అన్నారు.

రామాలయం అంశంపై కాంగ్రెస్ రాజకీయం

$
0
0

న్యూఢిల్లీ: రామాలయం వివాదాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. ఆమె విలేకర్లతో మాట్లాడుతూ రామాలయ వివాదాన్ని న్యాయప్రక్రియ ద్వారా రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆమె ఆరోపించారు. ఈ విషయంలో రామభక్తులు కాంగ్రెస్‌ను నిలదీయాలని ఆమె పిలుపునిచ్చారు. కేసు విచారణలో లాయర్ల ద్వారా ఆటంకాలు కల్పిస్తుందని ఆమె అన్నారు.

రఫెల్‌పై నేర విచారణ: రాహుల్

$
0
0

న్యూఢిల్లీ: రఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై తాము 2019 ఎన్నికల్లో అధికారంలోకి వస్తే నేర విచారణ జరుపుతామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఆయన పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడుతూ వేలకోట్ల ఈ ఒప్పందంపై తాము లేవనెత్తిన ప్రశ్నలపై ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వలేకపోయిందని అన్నారు.

కన్నడ చిత్ర పరిశ్రమపై ఐటీ దాడులు

$
0
0

బెంగళూరు:కన్నడ చిత్ర పరిశ్రమపై ఐటీ దాడులు జరిగాయి. స్టార్ హీరోలు, నిర్మాతల ఇళ్లపై ఐటీ అధికారులు బృందాలుగా విడిపోయి ఒక్కసారిగా దాడులు నిర్వహించి బంగారు ఆభరణాలు, ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 200 మంది అధికారులు 25 బృందాలుగా విడిపోయి ఏకకాలంలో దాడులు నిర్వహించటం గమనార్హం. స్టార్ హీరోలు యశ్, పునీత్ రాజ్‌కుమార్, సుదీప్, శివరాజ్‌కుమార్ నివాసాలపై ఐటీ దాడులు జరిగాయి. అలాగే నిర్మాతలైన రాక్‌లైన్ వెంకటేష్, కిరగందూరు విజయ్, సి.ఆర్. మనోహర్, జయణ్ణ ఇళ్లపై ఐటీ దాడులు జరిగినట్లు సమాచారం. అధికారులు ప్రైవేటు క్యాబ్‌లలో వచ్చారు. అభిమానుల దాడులు జరగకుండా ముందుజాగ్రత్త చర్యగా పోలీసు బందోబస్తు ఏర్పాటుచేసుకున్నారు.

సీఎం కాన్వాయ్‌ను అడ్డుకున్న బీజేపీ నేతలు

$
0
0

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నాగమల్లితోట జంక్షన్ వద్ద సీఎం కాన్వాయ్‌ను బీజేపీ నేతలు అడ్డుకున్నారు. సీఎం, సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సీఎం చంద్రబాబు ‘జన్మభూమి-మావూరు కార్యక్రమానికి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ నేతలపై చంద్రబాబు ఆగ్రహాం వ్యక్తంచేశారు. మోదీ రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు.


కమల్ రెడీ అయ్యాడు

$
0
0

‘2.ఓ’ సక్సెస్ శంకర్‌కి బిగ్ బూస్ట్. ఈ విజయం ‘్భరతీయుడు 2’ కిక్ స్టార్ట్‌కి పెద్ద సాయమవుతోందనే చెప్పాలి. ఇప్పటికే కథ రెడీ చేసిన శంకర్ సినిమా లొకేషన్లపై కసరత్తు చేస్తున్నాడు. ఇండియా సహా ఉక్రెయిన్- తైవాన్ ఎగ్జోటిక్ లొకేషన్లను శంకర్ బృందం ఫైనల్ చేసిందట. హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీ- చెన్నయ్- పొలాచ్చి లాంటిచోట్ల కీలకంగా షూటింగ్ జరగనుంది. అయితే ఈపాటికే రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కావాల్సిఉన్నా, రకరకాల కారణాలతో ఇప్పటికే పలుమార్లు వాయిదాపడిన సంగతి తెలిసిందే. ఓవైపు విశ్వనటుడు కమల్‌హాసన్ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండటంతో ప్రాజెక్టు ఆలస్యమైంది. అయితే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని శంకర్ భావిస్తున్నారట. దాదాపుగా స్క్రిప్టు, లొకేషన్స్‌పరంగా క్లారిటీ వచ్చేసింది. అనిరుధ్ సంగీత దర్శకుడిగా ఇప్పటికే బాణీల కసరత్తులో ఉన్నాడు. కథానాయికగా చందమామ కాజల్‌ని ఫైనల్ చేసేశారు. ఇతర పాత్రలకు ఎంపికలు సాగుతున్నాయి. ఆ క్రమంలోనే హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో వేసిన భారీ సెట్స్‌లో నెలాఖరునుంచి షూటింగ్ ప్రారంభించాలని భావిస్తున్నారట. 2.ఓ చిత్రాన్ని నిర్మించిన ప్రతిష్ఠాత్మక లైకా ప్రొడక్షన్స్ సంస్థే ఈ చిత్రాన్నీ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. ఇక భారతీయుడు కథతో పోలికలేని కొత్త కథతో సినిమాని శంకర్ తెరకెక్కించనున్నాడు. లంచగొండితనం అవినీతి కామన్ బ్యాక్‌డ్రాప్ అయినా ఇప్పటి రాజకీయాలు- సామాజిక పరిస్థితులకు అనుగుణంగానే కథను మలిచారని తెలుస్తోంది.

‘షకీలా’ ఇలా..

$
0
0

మలయాళంలో 80-90 దశకంలో ‘షకీలా’ సినిమా విడుదల అవుతుందంటే చాలు యువత ఎగబడేవారు. ఆమె చిత్రాలను పోటీపడి మరీ చూసేవారు. అలాంటి ‘షకీలా’ జీవిత కథ త్వరలో సినిమాగా రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ ముగింపులో ఉంది. ఈ ఏడాది సమ్మర్‌లో చిత్రం విడుదలవుతుందని చిత్ర బృందం స్పష్టం చేసింది. కాగా, ‘షకీలా’ పాత్రలో బాలీవుడ్ బ్యూటీ రిచా చద్దా నటిస్తోంది. ఇప్పటి వరకూ విడుదల చేసిన చిత్రం లుక్‌లు ఆకట్టుకుంటే -తాజాగా మందు గ్లాసులో నిలబడిన రిచా చద్దా మరో లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. షకీలా కథలోని మెటీరియర్ అర్థమయ్యే రీతిలో విడుదల చేసిన లుక్ ఆకట్టుకుంటోంది. చిత్రానికి మలయాళ దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వం వహించారు. చిత్రంలో షకీలా అతిథి పాత్రలో కనిపించనుంది. తన బయోపిక్ గురించి ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో షకీలా మాట్లాడుతూ తన జీవితంలోని అతి ముఖ్యమైన తప్పులు, ఒప్పులు ఉంటాయని ప్రకటించటం తెలిసిందే.

హిందీలోకి గీత గోవిందం

$
0
0

సెనే్సషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘గీత గోవిందం’ గత ఏడాది విడుదలై బ్లాక్‌బ్లాస్టర్ అనిపించుకుంది. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సుమారు 100 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. అలాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇప్పుడు హిందీలో రీమేక్‌కానుంది. ఇప్పటికే విజయ్ నటించిన ‘అర్జున్‌రెడ్డి’ అక్కడ రీమేక్ అవుతుండగా, ఈ చిత్రాన్నీ రీమేక్ చేయనున్నారు.
రీమేక్‌లో యువ హీరో ఇషాన్ కట్టర్ నటించనున్నట్టు బాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే ఇంకా ఈ చిత్రానికి దర్శకుడు ఖరారుకాలేదు. ఇక ‘బియాండ్ ది క్లౌడ్స్’తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ గత ఏడాది ‘దఢక్’ చిత్రంతో మెప్పించాడు. దఢక్ మరాఠి చిత్రం సైరాట్‌కు రీమేక్‌గా తెరకెక్కింది.

లైఫే మారిపోయింది

$
0
0

తొలి సినిమానే సూపర్‌స్టార్ మహేష్‌బాబు సరసన జోడీ కట్టేసి భరత్ అనే నేనుతో కమర్షియల్ విజయాన్ని అందుకుని అందరినీ తన వైపునకు తిప్పుకుంది బాలీవుడ్ భామ కైరా అద్వానీ. ఆ సినిమా హిట్‌తో టాలీవుడ్‌లో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. తన రెండో చిత్రంగా రామ్‌చరణ్-బోయపాటిల క్రేజీ కాంబినేషన్‌లో ‘వినయ విధేయ రామ’లో సీత పాత్రలో మెరవనుంది. ఈనెల 11న సినిమా విడుదల కానున్న సందర్భంగా మీడియాతో ముద్దుగుమ్మ ముచ్చట్లు.

సరికొత్త అనుభూతి..
నిజంగా నా కెరియర్‌లో ఇంత పెద్ద సినిమా ఎప్పుడూ చేయలేదు. పక్కా కమర్షియల్ మాస్ యాక్షన్ సినిమా. పైగా పదిహేనుమంది భారీ తారాగణంతో కలిసి నటించడమనేది అమేజింగ్ ఎక్స్‌పీరియెన్స్. ఈ సినిమా చేస్తున్నంతసేపు ఓ పెద్ద కుటుంబంలా ఫీలయ్యాను. చాలా గొప్ప అనుభూతి అని చెప్పాలి.
అందుకే ఓకె చెప్పా..
దర్శకుడు బోయపాటి కథ చెప్పినపుడు చాలా కొత్తగా అనిపించింది. ఆయన కథ చెబుతున్నపుడే పూర్తి సినిమా చూసేసా. నేను చేస్తున్న మంచి ఫ్యామిలీ స్టోరీ విన్నాననిపించింది. అందుకే ఇమ్మిడియెట్‌గా ఓకె చెప్పేశా. దానికి తగ్గట్టే ఆయన అద్భుతంగా తెరకెక్కించారు. నాచురల్ ఎలిమెంట్స్‌ని ప్రెజెంట్ చేయడం వేరు, ఏదైతే నమ్మడానికి వీల్లేకుండా ఉంటాయో, వాటిని నమ్మేంతగా, ఫీలయ్యేంతగా మెస్మరైజ్ చేస్తూ స్క్రీన్‌పై ఎలివేట్ చేయడం వేరు. రెండో ప్రక్రియ చాలా కష్టం. అది బోయపాటి లాంటి ఫిల్మ్ మేకర్స్‌కే సాధ్యమవుతుంది.
టైం కాదు పాత్రే ముఖ్యం..
ఈ సినిమాలో నేను ఎంతసేపు స్క్రీన్‌పై కనిపిస్తాను అనేకన్నా, కనిపించినంతేపు నేను ప్లే చేసిన క్యారెక్టర్‌కి ప్రాముఖ్యత, క్వాలిటీ ఉందా లేదా? నా ప్రెజెన్స్‌ని ఆడియెన్స్ ఫీల్ అయ్యారా లేదా అని ఆలోచిస్తా. అంతే తప్పా సినిమా మొత్తంగా నేనే ఉండాలని అనుకోను.
అందుకే నటిగా..
సినిమా అంటే నాకు చాలా ఇష్టం. పాషన్ కూడా. అలాగే నాకు డాన్స్ అన్నా ఇష్టం. అందుకే నటినయ్యా. కంప్లీట్‌గా అటు డాన్స్, కామెడీ పెర్ఫామ్ చేయడానికి మంచి స్కోప్ వున్న సినిమాలో పనిచేసే అవకాశం దొరికినపుడు చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ సినిమా చేసినందుకు అదే ఫీలింగ్. బేసిగ్గా డాన్స్ అంటే ఇష్టం కాబట్టి చరణ్‌లాంటి డ్యాన్సర్‌తో స్టెప్స్ వేస్తూ చాలా ఎంజాయ్ చేశా. నాకు ‘రామా లవ్స్ సీత’ ఇప్పటివరకు నేను చేసిన సాంగ్స్‌లో మోస్ట్ ఫేవరేట్. 800మంది డాన్సర్స్‌తో చాలా గ్రాండ్‌గా పిక్చరైజ్ చేశారు ఆ పాటని.
కెమిస్ట్రీ కుదిరింది..
సినిమాలో రామ్‌చరణ్‌తో నా కెమిస్ట్రీ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. నా క్యారెక్టర్ వచ్చేసి ‘సీత’. ఫ్యామిలీలో అందరిముందు చాలా వినయంగా ఉంటూ, రామ్ ఏది చెప్తే అదీ అన్నట్టుగా ఉంటాను. బయటమాత్రం చాలా డామినేటింగ్‌గా ఉంటాను. మా కాంబినేషన్‌లో వుండే సీన్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి.
ఒక్క భాషలోనే కాదు..
నాకైతే ఒకే భాషలోనే సినిమా చేయాలని లేదు. గ్లోబల్ ఆడియెన్స్‌ని ఎంటర్‌టైన్ చేయాలి. లాంగ్వేజ్ ఏదైనా, స్క్రిప్ట్ బావుంటే అది డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ అయినా ‘నో’ చెప్పను.
భరత్ కంటే ముందు..
‘్భరత్ అనే నేను’కి ముందు నమ్రతా నన్ను వేరే సినిమాల కోసం అప్రోచ్ అయ్యారు. కానీ అపుడు డేట్స్ అడ్జెస్ట్ అవ్వకపోవడంవల్ల కుదరలేదు. ఎప్పుడైతే భరత్ అనే నేను ఆఫర్ వచ్చిందో.. ఎలాగైనా చేసేయాలనుకున్నాను. ఆ సినిమాతో నా లైఫ్ మారిపోయింది.
అర్జున్‌రెడ్డి రీమేక్‌లో..
అర్జున్‌రెడ్డి రీమేక్‌లో నటిస్తున్నందుకు చాలా ఎగ్జైటెట్‌గా ఉన్నాను. సినిమాలో లాస్ట్ సీన్ నుండి షూటింగ్ స్టార్ట్ చేశారు. సినిమాలో నేటివిటీకి తగ్గట్టు ఛేంజెస్ చేశారు. సినిమా ఢిల్లీ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. నాకు ఆ సినిమా చాలా నచ్చింది. దాంతోపాటు విజయ్ దేవరకొండ నటన అద్భుతం. నేను అతనికి ఫ్యాన్ అయ్యాను.
నెక్స్ట్ సినిమాలు..
ప్రస్తుతం హిందీలో కబీర్‌సింగ్‌తోపాటు లవ్‌స్టోరీ చేస్తున్నా. తెలుగులోనూ రెండు మూడు చర్చల్లో వున్నాయి. త్వరలో వివరాలు తెలియజేస్తా.

రత్తాలు.. కేక

$
0
0

ఎంఎస్ ధోని ప్రేయసిగా కలకలం రేపిన తర్వాతనే రాయ్‌లక్ష్మీ పాపులారిటీ స్క్రైని టచ్ చేసింది. తర్వాత వరుసగా సినిమా ఆఫర్లువచ్చాయి. తలా అజిత్ అంతటివాడు గ్యాంబ్లర్ సినిమాలో ఛాన్సిచ్చాడు. లారెన్స్ కాంచన చిత్రంలోనూ రాయ్‌లక్ష్మీ నటన అబ్బురపర్చింది. తర్వాత మెగా బాస్ చిరంజీవి రాయ్‌లక్ష్మీని పిలిచి రత్తాలుగా మార్చేశాడు. అయితే ఇటీవల ఈ అమ్మడు మరీ నల్లపూస అయిపోతోంది. ఇటు టాలీవుడ్‌లో అమ్మడి జోరు ఏమంత కనిపించలేదు. కానీ స్పెషల్ నంబర్లు, స్పెషల్ క్యారెక్టర్లతో మాత్రం సౌత్‌లో ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. 2017లో బాలీవుడ్‌లో జూలీగా నటించిన లక్ష్మీరాయ్‌కి ఆ సినిమా పరాజయానే్న మిగిల్చడంతో బాలీవుడ్ ఊసే ఎత్తలేదు. 2018లో మాత్రం ఈ అమ్మడు పలు ఆసక్తికరమైన చిత్రాల్లో నటిస్తోంది. తన బ్రాండ్‌లో గ్లామర్ ఎలివేషన్‌తోపాటు హారర్ టెర్రర్ కానె్సప్టు చిత్రాల్లోనూ రాయ్‌లక్ష్మీ నటిస్తోంది. ప్రస్తుతం తమిళంలో నీయ 2 సెట్స్‌పై ఉంది. అలానే మమ్ముట్టి నటిస్తున్న ‘ఒరు కూట్టందాన్‌బ్లాగ్’ అనే చిత్రంలోనూ నటిస్తోంది. ఈ హ్యాపీతో అభిమానులకు సామాజిక మాధ్యమాల్లో స్పెషల్ ట్రీట్ ప్లాన్ చేసింది. కొత్త ఏడాదిలో కొత్త ఫొటో షూట్‌తో టచ్‌లోకి వచ్చింది. రాక్ సాలిడ్ భవంతిలో లక్ష్మీరాయ్ ఇచ్చిన ఫోజు కుర్రకారు కంటిపై కునుకు పట్టనీయడం లేదట. అదే ఇది.

ఇస్మార్ట్ పూరీ

$
0
0

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబినేషన్‌లో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ వస్తుంది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ విడుదలైంది. దీనికి ఇస్మార్ట్ శంకర్ అనే టైటిల్ కన్‌ఫర్మ్ చేసారు. రామ్ ఇస్మార్ట్ శంకర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ చాలా ఆసక్తికరంగా ఉంది. రామ్ ఇందులో తలకిందులుగా సిగరెట్ తాగుతూ అద్భుతంగా ఉన్నాడు. ఈ చిత్రంకోసం పూర్తిగా మేకోవర్ అయ్యారు రామ్. జనవరిలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. వీలైనంత త్వరలో సినిమాకు సంబంధించిన కాస్ట్ అండ్ క్య్రూ వివరాలు తెలపనున్నారు దర్శక నిర్మాతలు. ఇస్మార్ట్ శంకర్ సినిమాను పూరీ కనెక్ట్స్ సహకారంతో పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మికౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మహాభారతంలో ఉపాఖ్యానాలు -92

$
0
0

అప్పుడు ‘తనువు’ ఆ ఋషుల మధ్య కూర్చుని ధర్మార్థాలతో కూడిన కదను చెప్పసాగాడు. అతను కదలు అలా చెప్తూ ఉండగా ఒక రాజు తన సైన్యంతో అంతఃపుర స్తల్రతో సహా అక్కడికి వచ్చాడు. అతనే భూరిద్యుమ్నుని తండ్రి. అతని పేరు వీరద్యుమ్నుడు. అతను అరణ్యంలో తన పుత్రుని కోల్పోయి చాలా దుఃఖంతో ఉన్నాడు. అతను ఆ కుమారుని కోసం ఆ వనంలో తిరుగసాగాడు. ‘పరమధార్మికుడు, ఒక్కడే కొడుకు ఇక అతనిని చూడడం నాకు దుర్లభం’ అని రాజు చింతించసాగాడు. అయినా అతనికి ఇంకా ఆశ పోలేదు. ఆ ఆశ అతని శరీరమంతా నిండి ఉంది. అప్పుడు ఆ మునులలో ఉత్తముడు అయిన తను మహర్షి ధ్యానంలో కొంతసేపు నిశ్చలంగా ఉండిపోయాడు. అతను అలా ధ్యానించడం చూసి రాజు మెల్లగా ఇలా అన్నాడు.
‘దేవర్షీ! అన్నింటిలోకి దుర్లభమైనదేది? ఆశకంటే గొప్పది ఏది? నాకు దాచకుండా సత్యం చెప్పండి’.
అతని మాటలకు ముని ఇలా అన్నాడు. ‘‘రాజా! నీ పుత్రుని పూర్వం ఒక ముని తనకు బంగారు కలశాన్ని వల్కలాలను అడిగితే బుద్ధితక్కువగా ఆ మునిని నీ కుమారుడు వాటిని ఇవ్వకపోగా అవమానించి పంపాడు. దానితో ఆ ముని చాలా బాధపడ్డాడు. దాని ఫలితమే ఇది’’.
ముని అలా చెప్పగానే రాజు కూలబడిపోయాడు. మునులు తపోవన మర్యాదను పాటించి రాజుకు అర్ఘ్యపాద్యాలు ఇచ్చాడు. తరువాత వారందరూ కూర్చుని తపోవనానికి రాజు రాకకు కారణం అడిగారు.
అప్పుడు రాజు వారితో ఇలా చెప్పాడు. ‘‘నేను వీరద్యుమ్నుడనే రాజును. నా కుమారుని కోసం వెదుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. నాకు అతను ఒక్కడే పుత్రుడు. చాలా చిన్న పిల్లవాడు. అందుకని ఇలా వెతుకుతూ తిరుగుతున్నాను’’.
రాజు ఇలా చెప్పగానే ముని ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు. అతను రాజుతో ఏమీ అనలేదు. పూర్వం ఒక సారి ఈ రాజే ఆ ఋషిని గౌరవించలేదు. అప్పుడు ఋషి ‘రాజుల నుండి ఏమీ గ్రహించకూడదు’ అని నిశ్చయించుకున్నాడు. ఎవరి నుండీ ఏమీ తీసుకోను అని కూడా తలచాడు. ‘ఆశయే మూర్ఖుడైన వానిని నడిపిస్తుంది. దానిని తొలగిస్తాను’ అని అనుకున్నాడు. రాజు మరల మునిని ప్రశ్నించాడు. ‘ఈ భూమి మీద దుర్లభమైనదేది? ఆశ కంటే దుర్బలమైనది ఏది? దయచేసి ఈ తత్త్వాన్ని నాకు తెలియజేయండి’’.
రాజు మాటలు విన్న ఋషి ఇలా అన్నాడు ‘రాజా! ఆశను మించిన బలహీనత ఇంకొకటి లేదు. ఆ బలహీనత వల్లనే నేను రాజులను యాచించాను’’.
రాజు మరల అడిగాడు. ‘‘మహాత్మా! ఆశవలన దుర్బలత్వం కలుగుతుందని తెలిసింది. అలాగే ఆశించిన వస్తువు దుర్లభమని కూడా అర్థమైంది. ఇంకొక్కటి అడుగుతాను. దయచేసి వివరించండి. మీకంటే మించిన బలహీనమైనది ఏది?’’
మిక్కిలి కృశించి యున్న ‘తను’ మహర్షి రాజు ప్రశ్నకు ఇలా సమాధానం చెప్పాడు. ‘‘ఎవరినైనా అవసరపడి యాచించినవాడు దుర్బలుడు. అలాంటి యాచకుని అవమానించినవాడు దుర్బలతరుడు. ఎవరినైనా వచ్చి యాచిస్తే యథోచితంగా తన శక్తిని అనుసరించి ఉపకారం చేయకపోతే అప్పుడు సమస్త ప్రాణులకు ఉండే ఆశ నా కంటే దుర్బలతరంగా ఉంటుంది. సోమరులు, కృతఘు్నలు, కౄరులు - వీరిలో ఉండే ఆశ తీరదు కనక చింత వలన దుర్బలం అవుతుంది. నాకంటే కూడా దుర్బలంగా ఉంటుంది. అలాగే ఒక్క కొడుకు ఉండి అతను లేకపోతే మనసులో కలిగే ఆశ కూడా అతి దుర్బలమైనది. వృద్ధవనితలకు పుత్రుడు కావాలనే ఆశ, ధనవంతులకు మరింత ధనం సంపాదించాలనే ఆశ, ఇవన్నీ నాకంటే కూడా దుర్బలమైనవి’’.
రాజు ముని మాటలు విని, తన స్తల్రతో కలిసి అతని పాదాలను శిరస్సుతో తాకి నమస్కరించాడు. మునితో ఇలా అన్నాడు ‘‘మహాత్మా! నన్ను అనుగ్రహించండి. నా కొడుకును చూడాలని కోరికగా ఉంది. ఇప్పుడు మీరు చెప్పినదంతా సత్యమే’’. రాజు అలా ప్రార్థించగా అతనిపై దయతలచి తను మహర్షి తన తపశ్శక్తితో ఆ రాజకుమారుని తండ్రి ముందు నిలబెట్టాడు. తర్వాత ముని రాజును తన ధర్మస్వరూపాన్ని చూపాడు. రాజు ఆ దివ్యరూపాన్ని చూసి పరవశించి పోయాడు. తర్వాత మహర్షి అరణ్యంలోకి వెళ్లిపోయాడు’’. ఋషభమహర్షి ఇదంతా చెప్పి ఇలా అన్నాడు ‘‘నేను ముని చెప్పినవన్నీ స్వయంగా విన్నాను. కనుక శరీరాన్ని బాగా కృశింపజేసేది ఆశ కనుక ఆ లేడి గురించి ఆశ తొలగించుకో’’ ఋషభముని మాటలు విన్న సుమిత్రుడు మృగం గురించిన ఆశ వదలుకొని తన నగరానికి వెళ్లిపోయాడు.
జాపకోపాఖ్యానము
పూర్వమొ హిమాలయ పర్వతాల సమీపంక్ష్మిఊ మహాయశస్వి, ధర్మవర్తనుడు అ్ఠన ఒక బ్రాహ్మణుడు నివసించేవాడు. అతను పిప్పలాదుని పుత్రుడు. అతను గొప్ప జాపకుడు, ప్రాజ్ఞుడు, వేదపండితుడు. ఆయన ఆరు వేదాంగాలక్ష్మిఊ కూడా నిష్ణాతుడు. అతను వేదాన్ని అధ్యయనం చేస్తూ జపం చేయసాగాడు. అలా వ్ఠొ సంవత్సరాలు చేసిన తర్వాత అతనికి సావిత్రీ దేవి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నది. కాని అతను మాట్లాడక జపం చేస్తూనే ఉన్నాడు. సావిత్రిని పట్టించుకోలేదు. గాయత్రికి అతనిపై దయ కలిగింది. అతని జపంతో సంతృప్తి చెందింది. బ్రాహ్మణుడు తన జపం ముగించుకొని ఆమె పాదాలపై తలపెట్టి ఇలా అన్నాడు ‘‘దేవీ! నా భాగ్యం వలన నాకు దర్శనమిచ్చావు. నీవు నా జపంతో సంతృప్తి చెందితే నాకు జపంపై మనస్సు నిలిచేటట్లు అనుగ్రహించు’’
సావిత్రి ఇలా అంది - ‘‘బ్రహ్మర్షీ నీకేం కావాలి? నీకు ఇష్టమైనది ఏమిటి?’’ చెప్పు నేను అనుగ్రహిస్తాను.
అప్పుడు ఆ ద్విజుడు మళ్ళీ ఇలా అన్నాడు - ‘‘తల్లీ! నాకు జపం మీద మనసు నిలిచేటట్లు చ్ఠొ. జపం అంటే నాకు ఆసక్తి ఉండాలి. నా మనస్సమాధి వర్థిల్లేటట్లు అనుగ్రహించు’’
ఇంకావుంది...


స్వాధ్యాయ సందోహం-187

$
0
0

దుర్మార్గుల చరిత్ర ఆ ఆదర్శపురుషుల చరిత్రలతోబాటు ఇతిహాసపుటలలో వ్రాయబడినా వారు ప్రజల హృదయాలలో మాత్రం సజీవులైయుండలేదు. కాబట్టి మానవజాతి చరిత్రలో హింసకు అహింసకున్న గౌరవం, పూజ్యభావం లేనే లేదు.
అహింస పరమధర్మమని చెప్పిన మనిషిని ఎవరేమి చేసినా మిన్నకుండి స్తబ్ధుడిగా ఉండమని వేదం చెప్పలేదు. అహింసాధర్మాన్ని చెప్పిన వెంటనే జీవితంలో ‘దక్షితామహే’’ ‘‘ఘనమైన నీ మహత్వాన్ని ప్రకటించుకొనేందుకు నిత్యం ఉత్సాహంగా ఉండు’’అని ఆదేశించింది వేదం. లోకంలో సాధారణంగా మనుషులు తమ దక్షతను చాటుకొనేందుకు హింసామార్గాన్ని ఎన్నుకొంటారు. హింస చేయకు ‘మాస్రేధత’అని చెప్పిన వేదం ‘దక్షతామహే’అని చెప్పడంలోని ప్రధానోద్దేశ్యం హింసామార్గంలో కాక అహింసామార్గంలో నీ దక్షతను ప్రకటించుకొమ్మని (తెలియజేమని) యే. మరి దానికి మార్గాలను కూడ వేదమే నిర్ణయించింది. 1. సర్వవిధ శక్తియుక్తులు 2. పరిపూర్ణ ధనసంపద. ఈ రెండింటిని ‘కృణుధ్వం రాయ ఆతుజే’; రాయ= ధనంకొఱకు ఆతుజే= శక్తియుక్తుల కొఱకు కృణుధ్వం= ప్రయత్నంచేయి అని కంఠోక్తంగా చెప్పింది నిజమే మరి. ‘ఉద్యోగేనైవ సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః’ ‘‘కార్యసిద్ధి ప్రయత్నం చేతనే గాని కోరికలు కలిగియుండటం వలన సిద్ధింపదు’’ అన్న ఆర్యోక్తి కదా. అలా ఉత్సాహంతో ఉద్యమించి సంపాదించిన ధనం గాని బలం గాని దేనికి వినియోగించాలి? ఈ విషయం గూడ ఈ మంత్రంలో కాకున్నా మరొక సందర్భంలో ఋగ్వేదమే (ఋ.7-32-20) ‘తరణి రిత్సిషాసతి వాజం పురంధ్యా యుజా’ ‘‘దుర్బలులైన వారిపై దర్పం చూపక వారిని సంరక్షించే సద్బుద్ధి గలవాడు తమ బలాన్ని జ్ఞానాన్ని వారి సంరక్షణ కొఱకై వెచ్చిస్తారు’’ అని స్పష్టపరచింది. అట్టి వాడెన్నడు చెడిపోడు. ‘క్షేతి పుష్యతి’ ‘‘మూడు పూవులు ఆరుకాయలుగా వర్ధిల్లుతూ ఉంటాడు. అతడిని చూచి దేవతలు సహితం సంతుష్టులై ఆశీర్వదిస్తారని న దేవాసః కవత్నవే ‘‘నీచమైన ఆచార వ్యవహారాలకు పాల్పడేవాని ఎడల దేవతలు సుముఖులై యుండరు’’అని ఋగ్వేదం నిర్ద్వంద్వంగా చెప్పింది. కాబట్టి సర్వదేవతా సుముఖతకై మానవులు హింసామార్గాన్ని వీడుదురుగాక!
**
ఆ మహద్భూతమే మహాసృష్టిని చేసింది
యః పుష్పిణీశ్చ ప్రస్వచ్ఛ ధర్మణా- ధి దానే వ్యవనీరధారయః
యశ్చాసమా అజనో దిద్యుతో దివ ఉరురూర్వాన్ అభితః సాస్యుక్థ్యః॥
భావం:- ఎవడు స్వసామర్థ్యం చేత పుష్ప- ఫలసంభరితమైన భూమండలాలను జీవుల సుఖసంతోషాల కొఱకై సృష్టించాడో, ఏ మహిమాన్వితుడు సృష్ట్యాదిలోని హిరణ్మయాండం నుండి ప్రకాశమానమైన బృహత్తమ లోకాలను దశదిశల సృజించాడో అట్టి నీవు మాకు సర్వదా ప్రశంసనీయుడవయి యుంటివి.
వివరణ:- ఎవనిని స్తుతించాలి? ఎవనిని ప్రార్థించాలి? ఎందుకు ప్రార్థించాలి? ఈ ప్రశ్నలు సాధారణంగా అందరి మనస్సులలో కలుగుతూనే ఉంటాయి. అది చాల సహజం. ఈ మంత్రంలో దీనికి సమాధానం సయుక్తికంగా చెప్పబడింది. కార్యం అందరికి ప్రత్యక్షంగా కనబడుతుంది. కారణం కనిపించదు. కాని కారణం తప్పక ఉంటుంది. ఈ రెండింటిగల విడదీయరాని సంబంధానే్న శాస్త్రం కార్యకారణ సంబంధంగా పేర్కొంటుంది. ఈ సంబంధం నిత్యమైనది. ఉదాహరణకు ఒక చిన్న సూది ఉంది. దానిని తయారుచేసినవాడు (ఇతడే కారణం) మనకెదురుగా లేకపోయినా ఎక్కడో అక్కడ తప్పక ఉన్నాడు కదా. అలాగే మనకు ప్రత్యక్షంగా ఈ ప్రపంచం కనిపిస్తూంది కదా. మరి దీనికి కర్త ఒకడు ఉండాలి కదా. కనబడడే? దీనికి సమాధానంగా వేద సోదాహరణంగా ఇలా చెబుతూంది. ఓ మానవుడా! సూక్ష్మంగా పరిశీలించు. నీ కళ్ళముందు పుష్పించి ఫలించిన విశాల భూమండలముంది. దీని నెవరు నిర్మించారు? వనాలు, పర్వతాలు, నదులు, సముద్రాలు ఇలా ఎనె్నన్నో ఈ భూమి మీద ఉన్నాయి. మరి ఈ భూమంతా ఎక్కడుంది? దీని భారాన్నంతా ఎవర భరిస్తున్నారు?
అది సరే. ఇక ఆకాశంవైపుకు చూడు. మిలామిలా ప్రకాశిస్తూ ఎనె్నన్నో నక్షత్రాలు, జ్యోతిర్మండలాలు ప్రకాశిస్తూ ఉన్నాయి. వానిలో కొన్ని చిన్నవి. కొన్ని పెద్దవి. కాని చిన్నగా ప్రకాశించే ఆ నక్షత్రాలు గాని జ్యోతిర్మండలాలు కంటికి కనబడుతున్నంత చిన్నవి మాత్రం కావు. వానిలోని ఒక్కొక్క దానిలోనే ఏబది లక్షల సూర్య గోళాలు సులభంగా అమరిపోగలిగినంత మహావిశాలమైనట్టివి. అయితే సూర్యుడు మాత్రం ఒక చిన్న గోళమా? అందులో మనమంతా నివసించే భూమండలం పదమూడు లక్షలు కూడినా అవలీలగా ఆ సౌరమండల మొక్కదానిలోనే ఇమిడిపోగల మహత్తరమైన మండలమట. అన్ని తేజో మండలాలను ఎవడు ఆ విధంగా నిర్మించాడు? అతడనేవాడు కార్యకారణ సంబంధ రూపంగా ఉండి ఉంటే అతడు ఎంతో మహా తేజః స్వరూపుడై ఉండాలి కదా. ఎవడూ తయారుచేయని వస్తువు ఈ లోకంలో కనబడదు కదా.
ఇంకావుంది...

శ్రీకాళహస్తీశ్వరా!

$
0
0

నీకున్, మాంసము వాంఛయేని కరవా? నీ చేత లేడుండగా
జోకైనట్టిగా కుఠారముండ, ననలజ్యోతుండ, నీరుండగా
పాకరంబొప్ప ఘటించి, చేతిపునుకన్ భక్షింప కా బోయచేఁ
చేకొం టెంగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వరా!
భావం:ఈశ్వరా! నీకు మాంసాహారముపై కోరిక కలిగినచో, నీ చేతిలో లేడి ఉంది. గండ్రగొడ్డలి ఉన్నది. నీ మూడవ కంటిలో నిప్పున్నది. తలమీద నీరున్నది. కొంచెము శ్రమపడి వంట చేసుకుని శుచిగా రుచిగా తినలేకపోయావా? ఆ తిన్నడు ఎంగిలి చేసి పెట్టిన మాంసమే కావలసి వచ్చినదా? నీవంటివాడు ఇట్లు చేయవచ్చునా?

రాజైదుష్కృతిఁ చెందెఁ చందురుడు, రారాజై కుబేరుండు దృ
గ్రాజీవంబునఁ గాంచె దుఃఖము; కురుక్ష్మాపాలుఁ డామాటనే
యాజిం గూలె సమస్త బంధువులతో; నా రాజ శబ్దంబు ఛీ!
ఛీ! జన్మాంతరమందు నొల్లనుజుమీ! శ్రీకాళహస్తీశ్వరా!
భావం:చంద్రుడు తాను రాజై గురుపత్నిని అపహరించి పాపమును మూటగట్టుకొనెను. కుబేరుడు పిశాచముల వంటి యక్షులకు రాజై దుఃఖము పొందెను. దుర్యోధనుడు కూడా పాండవులను సమూలముగా నాశనము చేసి రారాజు కావలెనన్న ఆశతో యుద్ధమునకు దిగి సమస్త బంధు మిత్రులతో నాశనమయ్యెను. ఈ రాజశబ్దములో ఇంత దోషమున్నది. కాబట్టి మరొక జన్మలో కూడా రాజు కావలెను అని కోరను. నీ దయారస వీక్షమున్నచో చాలు!

రాజర్ధాతురుడైనచో నెచట ధర్మంబుండు? నేరీతి నా
నా జాతి క్రియ లేర్పడున్? సుఖము మాన్యశ్రేణి కెట్లబ్బు? రూ
పాజీవాళికి నేది దిక్కు? ధృతి నీ భక్తుల్ భవత్పాద నీ
రేజంబుల్ భజియంతురే తెరగునన్? శ్రీకాళహస్తీశ్వరా!
భావం:పరిపాలకుడైన రాజు ధనమునందు ఆశ కలిగి పరిపాలన సరిగా చేయకపోతే రాజ్యములో ధర్మము ఎక్కడ ఉంటుంది? వర్ణాశ్రమ ధర్మములు ఎలా సక్రమంగా నడుస్తాయి? మంచివారికి సుఖం ఎలా కలుగుతుంది? వేశ్యలు మొదలైన వివిధ వృత్తులవారికి జీవనం ఎలా గడుస్తుంది? నీ భక్తులు స్వేచ్ఛగా నినె్నలా సేవింపగలుగుతారు?

తరగల్, పిప్పల పత్రముల్ మెఱగుటద్దంబుల్ మరుద్దీపముల్
కరికర్ణాంతము లెండమావుల తతుల్ ఖద్యోత కీటప్రభల్
సురవీధి లిఖితాక్షరంబు లసువుల్ జ్యోత్స్నా పయః పిండముల్
సిరులందేల మదాంధు లౌదురో జనుల్ శ్రీకాళహస్తీశ్వరా!
భావం: శంకరా! సంపదలు, నీటి కెరటాలలాగా, రావి ఆకులలాగా, మెరపుటద్దాలలాగా, గాలిలోని దీపాలలాగా, ఏనుగు చెవులులాగా, ఎండమావులలాగా, మిణుగురు పురుగులులాగా, ఆకాశంలోని అక్షరాలలాగా, జీవులలోని ప్రాణాలలాగా, వెనె్నల ముద్దలలాగా చాలా చంచలములు, అశాశ్వతములు కదా! మనుషులు అటువంటి సంపదలతో గర్వించి తిరుగుతారేమి?

హితవాక్యం

దుర్జన వదన వినిర్గత వచన భుజంగేవ సజ్జనో దష్టః
ఔషధశతైః అసాధ్యః చికిత్స్యతే క్షాంతిమంత్రేణ!!
అది రాజకవియైన సుందరపాండ్యుని రమ్యోక్తి. క్రీ.శ. 6వ శతాబ్దికి పూర్వుడైన సుందరపాండ్యుడు మధురా నగరాధీశుడు. వివిధ శాస్తన్రిష్ణాతుడు. బహుగ్రంథ నిర్మాత. ఆయన గ్రంథాలలో ప్రసిద్ధ్భమైన ‘నీతి ద్విషష్టికా’ జీవన మూల్యాన్ని వివరించే మధురవాక్యాల మంజూషిక. అందులోని ఒక మణి యిది.
‘‘దుష్టుని నోటినుండి వెలువడు దుర్వచనాల విషసర్పాలకు సజ్జనుడు బలిఔతున్నాడు. ఆ పాము కాటుకు మందులేవీ లేవు. కాని సహనమే సరియైన మంత్రం. అదే తిరుగులేని చికిత్స’’. నిజమే... ‘‘లోకమా! భుజంగానీక వల్మీకమా!’’’ అని ఒక కవి అన్నట్లు విష సర్పాలవలె దుష్టులెప్పుడూ బుసకొడుతూ సజ్జనుల మానస సరోవరాలలో విషం క్రక్కి కలుషితం చెయ్యలని ప్రయత్నిస్తూనే ఉంటారు. కాని సజ్జనుని సహనం దివ్యౌషధంలాగా పనిచేస్తుంది. అంతటి కృష్ణుడు కూడా శిశుపాలుని ఆగడాలను సహించి సహించి తుదముట్టించాడు. ఓర్పు సాత్త్వికతకు సంకేతం. అది సామర్థ్యానికి నెచ్చెలి.
‘‘ఓర్పు నేర్పుకు నెయ్యం’’.

సమాధానకర్త

$
0
0

‘ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడెను ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.’
అసమాధానము అల్లకల్లోలము గొడవలు కొట్లాటలు గందరగోళంగా ఉన్న ఈ లోకాన్ని ప్రభువు చూసిచూసి, సమాధానకర్తయగు అధిపతి ఈ లోకానికి శిశువుగా వచ్చాడు. ఈయన సమాధానమునకే కర్తగాని అసమాధానానికి అల్లర్లకు కర్త కాదు.
దేవుడు మానవునికి ఇచ్చిన ఏదేను తోట ఎంతో హాయిగా ఆహ్లాదంగా సంతోషంగా సమాధానముగా ఉండేది. సమాధానకర్త మాటలు వినక అసమాధానకర్తయైన సాతాను మాటలు విని సమాధానము పోగొట్టుకున్న లోకం, ఎలాగైనా మునుపటి సంతోష సమాధానాలు కావాలని తపన కలిగి ఉన్నది. అందుకు అనేక స్థలాలకు వెళ్తున్నారు. అనేక దేశాలకు వెళ్తున్నారు. అనేకమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయినా ఎక్కడ, మనసు కోరుకుంటున్న సమాధానము లేదు. వాస్తవానికి అది ఎక్కడ నుండో వచ్చేది కాదు ఎవరో ఇచ్చేది కాదు. సమాధానకర్తయైన యేసుక్రీస్తు మాత్రమే ఇవ్వగలడు. ఈయనే సమాధానకర్తయగు అధిపతి. హళ జఒ ఆ్దళ -జశషళ యచి -ళ్ఘషళ. ఈయనే షాలేము రాజు (జశ యఛి -ళ్ఘషళ) హెబ్రీ 7:2. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు. ఈయనే మనకు సమాధానము. మనిషికి మనిషికి మధ్య ఉన్న ద్వేషాన్ని తన శరీరమందు సిలువలో కొట్టివేశాడు. ఆయన రాజ్యము నీతి సమాధానములు పరిశుద్ధాత్మ యందలి ఆనందముతో నిండి యున్నది. ఆయన మాట వింటే అసమాధానానికి కర్తయైన సాతానును మీ కాళ్ల కింద చితుక తొక్కిస్తాడు.
ప్రశాంతంగా సమాధానముగా సాగుతున్న లోకమును సాతానుడు మాయమాటలు అబద్ధాలు లేనిపోని కల్పితాలు అబద్ధ సాక్ష్యాలు చెప్పి మనుషులను ప్రేరేపించి నెమ్మది సమాధానము లేని ఇళ్లు సమాజము రాష్ట్రాలు దేశాలుగా చేశాడు. లోకంలో ఎక్కడా ప్రశాంతత లేదు. సమాధానము కొరకు అనేక మిలియన్లు ఖర్చుచేసి ఇంకా అసమాధానములో పడిపోతున్నాడు.
ఎవరికి ఉన్నదానితో వారు తృప్తి పడలేక పోతున్నారు. ఇతరులవి చూసి ఆశపడుతున్నారు. నిరాశ అసంతృప్తితో సమాధానము కోల్పోతున్నారు. ప్రభువు మాట ‘నీ పొరుగు వానిది ఏది ఆశించకు’ వింటే ఎంత మేలు ఎంత సమాధానంగా ఉంటుందో గదా! మనిషి చిన్నప్పటి నుండి ఏదో ఒక ఆరాటం తపనతో ఉంటున్నాడు. స్కూల్లో ఉన్నప్పుడు హైస్కూల్‌కి ఎప్పుడు వెళ్లాలా అని, కాలేజీ చదువులు హాయిగా ఉంటాయనీ, చదువుకునే రోజుల్లో ఎప్పుడు ఉద్యోగం వస్తుందాని, తరువాత వివాహము తర్వాత ఎప్పుడు రిటైర్ అవుతామా? అప్పుడు ప్రశాంతంగా ఉండవచ్చునని అనుకుంటారు కాని, రిటైర్మెంట్ తర్వాత తాను కోరుకున్న ప్రశాంతత లేక అసలు ఈ జీవితం నుంచే రిటైర్ కావాలని కోరుకుంటారు. జాగ్రత్త! ఎంతో విలువైనది ఈ జీవితం. పోతే మళ్లీ వచ్చేది కాదు. ఒక్క క్షణం కూడా వెనుకకు రాదు. దీనినిబట్టి ఒక్క క్షణ జీవితం ఎంత విలువైనదిగా ఆలోచించి సమయాన్ని విలువైన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒక్క క్షణ జీవితాన్ని ఎవరూ అమ్మలేరు. కొనలేరు. కాలాలు సమయాలు అన్నీ ప్రభువు చేతిలో ఉన్నాయి. సమాధానకర్తయగు దేవుడు మనకు తోడుగా ఉంటే ఏ రోజు జీవితం ఆ రోజు సమాధానంగా సంతోషంగా జీవించగలము. ఏ పని చేస్తుంటే ఆ పనిని సంతోషంగా చేయగలము. మనకున్నంతలో సంతోషంగా ఉండగలము. మంచి ఉద్యోగం మంచి కుటుంబంతో సమాధానముగా ఉండగలవు. ఈ సంతోష సమాధానము ఇవ్వటానికే ప్రభువు సిలువలో గాయపడింది. ఘోర హింస అనుభవించింది. అస్తవ్యస్థమైన జీవితాలు సరిచేయటానికే ప్రభువు ఈ లోకానికి వచ్చింది.
ఒక్క క్షణ జీవితాన్ని సంపాదించుకోలేని మనకు నిత్య జీవితాన్ని సంపాదించి పెట్టాడు. క్రీస్తునందు నిత్య జీవము ఉచితంగా దొరుకుతుంది. సమాధానము సంతోషము అన్నీ ఉచితమే. కాని ఒక్క చిన్న నిబంధన. ఆయన మాటకు విధేయించాలి.
చాలామంది శాంతి సమాధానము సంతోషము నిత్య జీవము కోరుకొని ఏదేదో చేసి ఉన్న కాస్త సమాధానాన్ని పోగొట్టుకుంటారు. త్రాగుడుతో సమాధానమున్నదని కొందరు, ఆటపాటలతో సమాధానముంటుందని కొందరు, తిరిగితే సమాధానము ఉంటుందని ఇంకొందరు.. ఇలా అనేక రకాలుగా సమాధానము కొరకు వెతికి చివరకు సమయాన్ని ఆరోగ్యాన్ని ఆస్తిపాస్తులను పోగొట్టుకొని మతి స్థిమితము లేకుండా జీవిస్తున్నారు.
అయితే యెషయా ప్రవక్త చెప్పినట్లు - ఎవని మనసు ప్రభువు మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతిగలవానిగా కాపాడతాడని తెలుస్తుంది. మన పని క్రీస్తు నందు విశ్వాసముతో ఆయన మీద ఆధారపడటము మాత్రమే. ఈ విశ్వాసము కొరకు ప్రభువును ప్రార్థించాలి. ప్రభువు మనకు అచంచలమైన విశ్వాసాన్ని ఇస్తాడు.
పోయిన సంతోషము సమాధానము తిరిగి ఎలా పొందుకోగలము? ప్రభువే తన దూతను పంపి ప్రజలందరికి సంతోషకరమైన శుభ వర్తమానము తెలియజేశాడు. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. ఆయనకు ఇష్టులైన వారికి భూమి మీద సమాధానము. ఇవి లోకమిచ్చే తాత్కాలికమైన సమాధానము శాంతి కాదు. ఇది క్రీస్తులో మనకు దొరికే నిత్య సంతోషము సమాధానము. ప్రభువే సమాధానము గనుక ఆయనను చేర్చుకొనటమే సమాధానము.
శాంతి మీకనుగ్రహించి వెళ్లుచున్నాను. నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను. లోకమిచ్చునట్లుగా మీ కనుగ్రహించుట లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి. వెరవనియ్యకుడి - యోహాను 14:27. సమాధానకర్తయగు దేవుడు తన సమాధానాన్ని మనకు పంచి ఇస్తున్నాడు. దేవునితో సమాధానపడి ఆయన ప్రేమను శక్తిని పొందుకుని సమాధానపరుస్తుంది. క్రీస్తు ద్వారా పొందుకున్న సమాధానమును మన హృదయములను ఏలుచుండనియ్యాలి. ఈ సమాధానము దేవుని నమ్మిన వారికి, నమ్మి ఆత్మీయంగా జీవించేవారికి దేవుడిచ్చిన ఫలం- ఆత్మఫలములో ఉంటుంది. ఈ ఆత్మ ఫలము, ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము.
రక్షకుడైన యేసుక్రీస్తును నమ్మి దేనిని గూర్చియు చింతపడకుండా ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా ప్రభువును ప్రార్థించుచు ఉంటే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయములకు తలంపులకు కావలి యుండును.
ఆశ అసంతృప్తి అసమాధానము పుట్టేది హృదయాలలోనే గనుక ఆ హృదయములకు దేవుని కాపుదల ఉంటే పరిస్థితులు ఎలా ఉన్నా - నీ ప్రక్క వేయిమంది పడినను నీ కుడిప్రక్క పదివేల మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు అనే ధైర్యముతో సమాధానముగా ఉండగలవు. దేవుని సమాధానము మనకు విశ్రాంతినిస్తుంది. ఈ లోకము మనలను అవిశ్రాంతం చేస్తుంది. అవిశ్రాంతంగా అసమాధానంగా ఉందా? ఒక్కసారి సమాధాన కర్తయగు అధిపతిని అడుగు అర్థించు. అడుగుడి మీకియ్యబడును అని వాగ్దానమిచ్చిన ప్రభువు వెంటనే నీకు సమాధానము దయచేస్తాడు.
రోమా 14:19 - కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధి కలుగచేయు వాటినే ఆసక్తితో అనుసరింతము. మనము సమాధానముగా ఉండి అందరితో సమాధానమును పరిశుద్ధతయును కలిగి యుండుటకు ప్రయత్నిద్దాం.
మనము సమాధానముగా ఉండి ఇతరులను కూడా సమాధానపరచుచు దేవుని కుమారులముగా కుమార్తెలముగా ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి సహాయము చేయునుగాక.
నీవు కోరుకుంటున్న ప్రశాంత సమాధానము శాంతి క్రీస్తును బట్టి నీలోనే ఉంది.

అనంతం-28

$
0
0

‘‘ప్రోగ్రెస్ ఎలా వుంది’’ మత్తు కళ్ళతో గరుడాచలాన్ని చూస్తూ ఎవ్వరో అధికారి అడిగాడు.
‘‘మూడు పువ్వులు ఆరు కాయలు’’ అన్నాడు గరుడాచలం.
‘‘నేనడిగింది కలివికోడి ప్రాజెక్టు విషయం’’
‘‘అదా! ప్రగతి ధపంలో ముందుకు పోతోంది’’
‘‘ప్రగతిపథం’’ అనుకుంటానూ?’’
అందరూ గలగలా నవ్వారు. నవ్వులు కూడా మత్తుగా ఉన్నాయి.
‘‘ఆపరేషన్ విషయం అలా వుంచి-నెమళ్ళకొచ్చాయి తిప్పలు’’
‘‘ఏం? ఏమైంది? గరుడాచలం అడిగాడు.
‘‘పొయ్యిలోకి పోతున్నాయి’’
‘‘బాధగా వుందా’’
‘‘నాకెందుకు బాధ’’
‘‘మరెందుకలా అన్నావు?’’
‘‘జాతి అంతరించిపోతుందని’’
‘‘జీవకారుణ్యమా’’ పోలీసు అధికారిని గరుడాచలం అడిగాడు.
‘‘మరోసారి వస్తే దొరకవన్న భయం’’
మళ్లీ అందరూ పగలబడి నవ్వారు.
మరో రౌండు తర్వాత-
‘‘తండా ఖాళీ చెయ్యమని నోటీసులివ్వాలా?’’ అన్నాడు గరుడాచలం.
‘‘నోటీసులా! ఎందుకూ?’’ అడిగాడు పోలీసు అధికారి.
‘‘నోటీసులివ్వకుండానే ఖాళీ చేయిస్తారా’’
‘‘అంతే’’
‘‘చట్టం అనుమతించదు’’
‘‘ప్రభుత్వం అనుమతిస్తే చాలు’’
‘‘అన్యాయం’’ అన్నాడు గరుడాచలం.
‘‘ఇప్పటి న్యాయం అదే’’
‘‘గవర్నమెంట్ ఫర్ ది పీపుల్- అన్నారు కదా.’’
‘‘వల్లకాడు కాదూ.’’
‘‘ఏఁవంటారేం?’’
‘‘గవర్నమెంట్ ఫర్ ది గవర్నమెంట్- టు ది గవర్నమెంట్- బై ది గవర్నమెంట్’’
‘‘మనది ప్రజాస్వామ్యం కదూ?’’
‘‘అనుకోండి... ఎవరొద్దన్నారూ.’’
‘‘అడివి పుత్రులు ఎదురుతిరిగితే?’’
‘‘లాఠీలున్నాయి. తుపాకులున్నాయి.’’
‘‘బలవంతంగా ఖాళీ చేయిస్తారా.’’
‘‘అవును.’’
‘‘అడవి పుత్రుల రక్షణక్కూడా చట్టాలున్నాయి.’’
‘‘తయారుచేసింది ప్రభుత్వమే.’’
‘‘ఐతే?’’
‘‘ఉల్లంఘించే అధికారమూ ఉంటుంది.’’
అంతలో రాగ్యా లోపలికొచ్చాడు.
మాటలు కనిపెట్టి వాళ్ళు వౌనంగా కూర్చున్నారు.
‘‘రొండు నెమళ్ళని సంపి తెచ్చారు. పొయ్యి కాడ బెట్టి వత్తన్నారు.’’అని, గరుడాచలం వైపు గర్వంగా చూసాడు రాగ్యా.
‘‘రాగ్యా అంటే ఇతనే’’ గరుడాచలం అతన్ని అధికారులకు పరిచయం చేసాడు.
రాగ్యా ఛాతీ ఉబ్బింది!
‘‘నిలబట్టం దేనికీ! కూర్చో రాగ్యా’’అని కుర్చీ చూపించాడు గరుడాచలం.
కొంచెం తటపటాయించి, తర్వాత కూర్చున్నాడు.
రాగ్యాకి కూడా మందు గ్లాసు అందింది.
వాళ్ళ అభిమానానికి పొంగిపోతూ-
‘‘ఇంక నాకు అయ్యయినా, అడివైనా గరుడాచలఁవ్ సారే.’’ అన్నాడు వినయంగా రాగ్యా.
గుంభనంగా నవ్వుకున్నారు వాళ్ళంతా!
* * *
రాత్రి బాగా ప్రొద్దుపోయాక వచ్చాడు ఎమ్మెల్లే... పట్నంలోనే భోజనం గట్రా. అన్నీ అయ్యాయి. గుడారానికొచ్చి, ఓ గ్లాసు మజ్జిగ తాగి అలాగే పడుకున్నాడు.
బాగా మత్తులోవున్న స్థితిలోకూడా గరుడాచలం నిద్రపోకుండా ఎమ్మెల్లేకోసం ఎదురుచూసాడు.
రాగ్యా విషయం, చాంద్‌నీ విషయం మాట్లాడి ప్రాజెక్టు విషయంకూడా చర్చించాలనుకున్నాడు.
ప్రొద్దుపోయాక వచ్చాడు ఎమ్మెల్లే.
అలాంటి సమయంలో మాట్లాడటం మంచిదికాదని భావించి మాట్లాడలేదు.
తెల్లవారింది.
అడవి చెట్లమీద నుంచి పక్షుల కలకలా రావాలు, విప్పారే రెక్కల చప్పుళ్ళూ, గూటి పిట్టల కువకువలూ వినిపిస్తున్నాయి.
సూర్యుడు పైకి పాకేకొద్దీ చెట్ల నీడలు పొడవుగా సాగుతూ గుడారాల మీద పడుతున్నాయి.
ఇంకా ఎమ్మెల్లే నిద్రలేవలేదు.
రాగ్యా కాలకృత్యాలు తీర్చుకొని, స్నానం చేసి తయారయ్యాడు!
గరుడాచలం ఇచ్చిన పాత చొక్కా లాగూ ధరించి, తలగుడ్డ అవతల పారేసి తల దువుకొని- రాగ్యా ఇప్పుడు ఎంతగా మారిపోయి కనిపిస్తున్నాడో!
అచ్చం కొత్తగా రియలెస్టేట్ వ్యాపారంలో దిగిన వాడిలా వున్నాడు!
రాగ్యాని చూసి ఫక్కున నవ్వాడు గరుడాచలం.
‘‘ఏంటికట్టా నగుతుండారూ’’ రాగ్యా అతన్ని అడిగాడు.
‘‘్భషకూడా మారిపోతే నాగరికుడి నౌతావు! రెడ్డియానాయక్ తండా రాగ్యా ఇతనే’ అన్నా ఎవ్వరూ నమ్మరు. ఈ డ్రెస్‌లో అంత బాగున్నావు’’ అన్నాడు గరుడాచలం.
రాగ్యా ఆనందం పట్టలేకపోయాడు.
‘‘అంతా తఁవరి దయ’’అన్నాడు వినయంగా.
ఎమ్మెల్లే నిద్రలేచాడని కబురొచ్చింది.
రాగ్యాని అక్కడే వుండమని చెప్పి ఎమ్మెల్లే దగ్గరికి వెళ్ళాడు గరుడాచలం.
ఎందుకోగానీ ఎమ్మెల్లే చాలా హడావుడి చేస్తున్నాడు!
‘‘ఏమిటి కథ?’’ గరుడాచలం అడిగాడు.
‘‘కథ విషయం తర్వాతగానీ ముందు నీ విషయం చెప్పు.’’
‘‘నా విషయమా?’’ ఆశ్చర్యపోయాడు గరుడాచలం.
‘‘అదే! కోడి ప్రాజెక్టు విషయం...’’
(ఇంకా ఉంది)

దుఃఖం నదిలో ఈదే చేపలు

$
0
0

నీళ్ళల్లోని చేప (పొయిట్రీ)
రచన: బాల సుధాకర్ వౌళి, ఎస్‌బిఐ దగ్గర, బోయ స్ట్రీట్, నెల్లిమర్ల, విజయ నగరం-535217. వెల:రూ.120/-,
ప్రతులకు: విశాలాంధ్ర, ప్రజాశక్తి, అనేకా. ఫోన్:9676493680, 9505646046.
--------------------------------------------------------------------------------------------------------------
కన్నతల్లిని, జన్మభూమిని వర్ణించడానికి కవులకు కూడా శక్తి చాలదు. ఊరంటే కొన్ని కట్టడాల సమూహం కాదు. ఊళ్ళో పుట్టిన ప్రతివారికీ అక్కడి మట్టితో, అక్కడి నీటితో, అక్కడి గాలితో విడదీయలేని అనుబంధం వుంటుంది. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా ఊరొదిలి వెళ్లడానికి మనిషి ఇష్టపడడు. గత్యంతరం లేని పరిస్థితిలో ఊరిని వదిలిపెట్టినా ఆ దుఃఖం ఆజన్మాంతం మానవుణ్ణి వదిలిపెట్టదు. మానని గాయం గుండెల్లో సలపరిస్తూనే వుంటుంది.
అలాంటి వలస జీవుల వ్యధలకు చిత్రిక పట్టిన కవితా సంపుటి ‘నీళ్లలోని చేప’. స్వాతంత్య్రం వచ్చి ఎనే్నళ్లైనా సమాజంలో ధనిక బీద తారతమ్యాలు తగ్గపోవడం, ప్రపంచీకరణ ప్రభావం, ఎండిపోతున్న నదులు, ఎన్‌కౌంటర్ల పేరిట హత్యలు, ప్రజాస్వామ్యం ముసుగులో కాషాయం క్రీనీడలు, చిన్నారి పిల్లలపై అత్యాచారాలు, అన్నదాతలపై అఘాయిత్యాలు, నానాటికీ మానవత్వం కోల్పోతున్న మనిషి ఇవన్నీ కవి మనసును కలవరపరచాయి.
తనలో రగులుతున్న అసంతృప్త లావాగ్నిని అక్షర రూపంలో ఆవిష్కరించిన బాలసుధాకర వౌళి కవిత్వ ప్రేమికులకు అపరిచితుడేమీ కాదు. అంతకుముందే ప్రచురించిన ‘ఎగరాల్సిన సమయం’, ‘ఆకు కదలని చోట’ కవితా సంపుటాలతో పాఠక హృదయాలలో చిరస్థానం సంపాదించినవాడే. ఇప్పుడు ‘నీళ్లలోని చేప’తో మన ముందుకు వచ్చాడు.
అతడికి తన లక్ష్యమేమిటో తెలుసు. దానికి సూటిగా గురిపెట్టడమూ తెలుసు. ఊరొదిలి వచ్చిన దుఃఖం తన గుండెను పట్టి పల్లారుస్తుంటే ‘ఒక వానాకాలం కథ’లో ‘ఊరు దాటొచ్చారా /చీకటి వుంది ఆకలి వుంది వర్షమూ వుంది / నిశ్శబ్దం గొంతు వానలో కూరిపోతుంది’ అని ఆ దుఃఖ తీవ్రతను అక్షరీకరిస్తాడు. కురుస్తున్న వాన నుంచి ఇంట్లో వాళ్లని కాపాడలేని పూరి గుడిసె, ఆ పాకలో వలస వచ్చిన కుటుంబం. పిల్లల ఆకలిని తీర్చడానికి, తన ఆకలిని తీర్చుకోలేని అమ్మ. మొత్తం విషాదాన్నంతా చూరునుంచి కురిసే వర్షంలా పాఠకుల గుండెల్లో కురిపిస్తాడు. ఇపుడు అనేక కారణాలవలన గలగలా ప్రవహించే జీవనదులు నీళ్లింకిన మృతనదులుగా మారిపోతున్నాయి. అలాంటి వాటిలో చంపావతి నది ఒకటి. ‘చంపావతి నుంచి’లో ‘మృతశరీరంలా వుంది నది / చంపావతిలో నీళ్లేవి / పంట పొలాల్లో పున్నమేది / వలసెళ్లిపోతున్న వూళ్లల్లో మనుషులేరి’ అని నిగ్గదీస్తున్నాడు కవి.
ఏలిన వారికి వ్యతిరేకంగా గొంతెత్తినా, రాసినా వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం. ఒక్కొక్క సందర్భంలో దేశద్రోహచర్యలకు పాల్పడుతున్నారని అమాయకులను చెరసాలలో పట్టి బంధిస్తుంది. ‘నజీబ్ తల్లి’లో ‘ఆచూకీ లేని కుమారుడు / ఏ చెరలో ఉన్నాడో/ బతికున్నాడో లేదో’ అని బాధపడుతుంది తల్లి.
‘నిర్భయ’ చట్టం వచ్చినా మూడేళ్ల పసిమొగ్గులనుంచి ముడుతలు పడిన ముదివగ్గులపైనా అత్యాచారాలు నిర్భయంగా జరిగిపోతూనే వున్నాయి. ఇటీవలి ఆసిఫా వృత్తింతంమీద రాయని కవి లేడు. కానీ ‘ఇప్పుడు’లో ఆ సంఘటనకు చలించిపోయిన కవి ‘పువ్వులాంటి / ఎనిమిదేళ్ల పిల్లని / చిదిమిన చేతుల్లో / ఎక్కడ / నా చెయ్యుందేమోనని భయం’ అని అంటూ ‘నాకు చేతులున్నందుకు తొలిసారిగా సిగ్గుపడుతున్నాను’ అని చిదిమేసిన పురుషులలో తానూ ఒకడైనందుకు బాధపడతాడు.
నోట్ల రద్దు చేసినపుడు ధనవంతులు బాగానే ఉన్నారు కానీ నిరుపేదలు చాలామంది సమయానికి డబ్బులు దొరక్క మరణించారు. దీనిపై స్పందిస్తూ ‘ఏం మారలేదు’లో ‘శీతల గదులలో / తెల్లని దూది పరుపుపై /బోరవిరుస్తూ రూపాయి / చెమటల ఉక్కపోతల్లో నడిరోడ్డుపై /బోర్లాపడుతూ రూపాయి /ఒకటి దేహానిది /రెండు దేశానిది’ అని వాస్తవ స్థితిని బొమ్మకట్టిస్తాడు కవి.
వౌళి వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. తరగతి గది అన్నా, విద్యార్థులన్నా పంచప్రాణాలు. పిల్లలు రాసిన కవితలతో ‘స్వప్నసాధకులు’ ప్రచురించాడు. పిల్లల గురించి ‘పిల్లలు’ అనే కవితలో ‘పిల్లల్లో /ఒక లౌకిక దేశం / ఒక అలౌకిక స్వప్నం /మళ్లీ మళ్లీ పుడుతూ వుంటుంది’ అని పిల్లలు ఒక లౌకిక దేశాన్ని నిర్మిస్తారని, ఒక అలౌకిక స్వప్నాన్ని నిజం చేస్తారని అంటాడు.
ఈ సంపుటిలో ‘తూత్తుకుడి’, ‘నేను లేని తరగతి గది’, ‘శివారెడ్డి’, ‘అనగనగా ఒక ఆవు’, ‘మాయావృక్షం’, ‘పొలంయాత్ర’, ‘నాన్నొచ్చే సందర్భం’ కవితలు ప్రభావశీలమైన కవితలు. ముఖపత్ర కవిత ‘నీళ్లలోని చేప’లో చేపల వేటగాడు.. ‘గాయలతో చేపలు /విలవిలలాడుతుంటే / కనువిందు చేసుకున్నాడు / మరణించిన చేపలపై / మాయాప్రకటన చేస్తున్నాడు / ఎప్పుడైనా /ఎక్కడైనా /ఏటికి ఎదురీదడమే చేపలకు తెలుసు’ అని అన్యాయాలను ఎదిరించే వారిని గూర్చి చెప్తాడు.వౌళికి కవిత్వ నిర్మాణ రహస్యం తెలుసు. ఎలా మొదలుపెట్టాలో ఎక్కడ పూర్తిచేయాలో తెలుసు. పిల్లలు, కవిత్వం రెండు కళ్ళైన వౌళికి కవిత్వం కాలక్షేపం కోసం కాదు. ప్రపంచ కవుల కవితలను అధ్యయనం చేసి ఈ కవి మరింత వస్తు వైవిధ్యంతో, పదునెక్కిన సరళమైన భాషతో ఎన్నో సంపుటాలు రచించాలి.

Viewing all 69482 articles
Browse latest View live