Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తా:కన్నా

$
0
0

గుంటూరు: టీడీపీ కార్యకర్తలు తన ఇంటి ముందు ఆందోళన చేయటంపై బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఆదేశాల మేరకు తనను చంపటానికి టీడీపీ కార్యకర్తలు వచ్చారని ఆరోపించారు. తనపై హత్యాయత్నానికి పాల్పడిన టీడీపీ కార్యకర్తలపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తానని, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని అన్నారు.


కన్నా ఇంటి ముందు టీడీపీ శ్రేణుల ధర్నా

$
0
0

గుంటూరు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటి ముందు టీడీపీ శ్రేణులు ధర్నా చేశారు. నిన్న కాకినాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకున్నందుకు నిరసనగా నేడు టీడీపీ కార్యకర్తలు, నేతలు కన్నా ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ఇరుపార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. పోలీసులు రావటంతో పరిస్థితి సద్దుమణిగింది.

లోయలోపడ్డ పాఠశాల బస్సు

$
0
0

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని అర్మౌరాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పాఠశాల బస్సు లోయలో పడటంతో 12 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు, బస్సు డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయారు. మృతులంతా సంగ్రహ పట్టణంలోని డీఏవీ పబ్లిక్ స్కూలు విద్యార్థులు.

ఊపిరాడక ఐదుగురు మృత్యువాత

$
0
0

జమ్మూకాశ్మీర్: శ్రీనగర్‌లోని బెమినా ఏరియాలో ఊపిరాడక ఐదుగురు చనిపోయారు. వీరంతా కుప్వారా జిల్లా తంగ్‌ధర్ ప్రాంతానికి చెందినవారు. గ్యాస్ లీక్ కావటం వల్ల ఊపిరాడక ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు, ఇద్దరు చిన్నారులు చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లాస్ ఏంజిల్స్‌లో కాల్పులు

$
0
0

వాషింగ్టన్: అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరిగిన కాల్పులు కలకలం సృష్టించింది. టొర్రాన్‌లోని గబ్లే హౌజ్ బాల్ వద్ద ఈ ఘటన జరిగింది. బాథితులు సమీపంలోని బార్‌లోకి వెళ్లి ప్రాణాలు రక్షించుకున్నారు. ఈ ఘటనలో ఇరువురు చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు.

ఐఏఎస్ అధికారి చంద్రకళ ఇంట్లో సీబీఐ సోదాలు

$
0
0

లక్నో: తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారిణి చంద్రకళ నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అధికారులు 12 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇసుక తవ్వకాలలో అక్రమాలకు పాల్పడినట్లు ఆమెపై కేసులు నమోదు చేశారు. ఇసుక, మైనింగ్ మాఫియా కుమ్మక్కై ఈ కేసులు వేశారని అధికారులు ఆరోపిస్తున్నారు. ఆమె అవినీతికి పాల్పడ్డారని కేసులు వేయటంతో సీబీఐ ఈ సోదాలు నిర్వహిస్తోంది. నిజాయితీ గల అధికారిణిగా చంద్రకళకు యూపీలో మంచి పేరు ఉంది.

రైతుల సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నం:మోదీ

$
0
0

పాలము: రైతులు సామర్ధ్యాన్ని పెంచే దిశగా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రధానమంత్రి మోదీ అన్నారు. ఆయన ఝర్ఖండ్ రాష్ట్రంలో డ్యాం, ఆరు ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి గృహ అవాస్ యోజన పథకం కింది ఐదుగురు లబ్ధిదారులకు ఇంటి తాళాలను అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వలే రైతురుణ మాఫీ పేరుతో రాజకీయం లేదని అన్నారు. లక్షరూపాయల రుణం మాఫీ చేస్తే ఒక్క సంవత్సరం మాత్రమే రైతుకు లబ్ధి చేకూరుతుందని, అదే రైతు సామర్ధ్యాన్ని పెంచేందుకు లక్ష ఎకరాలకు నీరు అందిస్తే ఎంతో మంది రైతులు లబ్ధిపొందుతారని అన్నారు.

విద్యా విధానంలో సమూల మార్పులు:ఉప రాష్టప్రతి

$
0
0

కాకినాడ: విద్యావిధానంలో సమూల మార్పులు తేవాలని కేంద్రం భావిస్తుందని ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు అన్నారు. ఆయన రంగరాయల వైద్య కళాశాల 60వ వార్షికోత్సవంతో పాటు పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ్భారత్ మోదీ కోసం కాదని భారతదేశం కోసమని అన్నారు. వైద్యులు వైద్య సేవలకే పరిమితం కాకుండా యువతలో మార్పు తీసుకు వచ్చేందుకు దోహదం చేయాలని కోరారు.


పరారైన నేరస్థుడిగా మాల్యా

$
0
0

ముంబయి: బ్యాంకు రుణాల ఎగవేతదారు విజయ్ మాల్యాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పరారైన నేరస్థుడిగా కోర్టు పేర్కొంది. కోర్టు ఇలా పేర్కొన్న మొట్టమొదటి నేరస్థుడు మాల్యానే.

శక్తి సామర్థ్యాలు

$
0
0

న్యాయశాస్త్రానికి సంబంధించి తెలుగులో చాలా పుస్తకాలు రాశాను. వ్యాసాల సంగతి చెప్పాల్సిన పనిలేదు. లెక్కలేనన్ని రాస్తూనే వున్నాను.
కథలూ, కవిత్వం వాటికి అదనం. అవి ఓ పది పుస్తకాలు వచ్చాయి.
వారంలో మూడు కాలమ్స్ రాసిన సందర్భాలు కూడా వున్నాయి. తీర్పులు చెబుతూ, న్యాయమూర్తి విధులను నిర్వహిస్తూ ఇన్ని పుస్తకాలూ, కాలమ్స్ రాయడం చాలామందికి ఆశ్చర్యం కలిగించేది. అప్పుడప్పుడు నాకు ఆశ్చర్యం కలిగేది.
నేను మేజిస్ట్రేట్‌గా పని చేస్తున్నప్పుడు న్యాయమూర్తి ఉద్యోగం కోసం పోటీ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకి కొన్ని క్లాసులను తీసుకున్నాను. అక్కడ నా పుస్తకాల ప్రస్తావన కూడా వచ్చేది.
అందరూ ఆశ్చర్యపోయేవారు.
చాలామంది అభ్యర్థులు తరచూ నన్ను ఒక ప్రశ్న అడిగేవాళ్లు - ‘ఇంత సమయం మీకు ఎలా లభిస్తుంది?’
సమయం లభించడం అంటూ ఏమీ ఉండదు.
ఎవరికైనా వుండేది 24 గంటలే.
మన ప్రాధాన్యతలు మన పురోగతిని ఏర్పరుస్తాయి.
జీవితంలో ఎన్నో సంఘటనలు వుంటాయి. ఎన్నో ఇష్టాలు ఉంటాయి.
సినీమాలు, షికార్లు, టీవీలు, ఆటలు, మిత్రులతో బాతాఖానీలు ఇట్లా ఎన్నో వుంటాయి. అన్నీ ముఖ్యమని అనుకుంటే కుదరదు. అట్లా అని అవి వదులుకోవాలని నేను అనడం లేదు.
మనం ఒక వాలుకుర్చీలో కూర్చొని ఆలోచిస్తుంటేనో, రిక్లైనర్‌లో కూర్చొని టీవీ చూస్తుంటేనో ఫలితం వుండదు.
మనం నిరంతరం పని చేస్తూ వుండాలి. అభివృద్ధి కోసం పాటుపడుతూ వుండాలి. మార్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి.
తమ శక్తి సామర్థ్యాలను సంపూర్ణంగా ఏ విజేత కూడా ఉపయోగించడం లేదు. ఇది వాస్తవం.
ఇదే మాట నేను వాళ్లతో చెప్పేవాన్ని.

రావణుడిని నిందించిన శూర్పణఖ ( అరణ్యకాండ)

$
0
0

రావణుడిని నిందిస్తూ శూర్పణఖ ఇంకా ఇలా అంది. ‘ఇంత వయసు వచ్చినా అవివేకం పోలేదు నీకు. వివేకం రాలేదు. ఏమేమి తెలుసుకోవాలో అది నీకు తెలియదు. ఇలాంటి వాడివి రాజై ఎలా బాగుపడుతావు? తనకు స్వంత వేగుల వాళ్లు లేకుండా, ఇతరులు ఏర్పాటు చేసిన వేగుల వాళ్ల మాటలు నమ్మి ప్రవర్తించేవాడు, కోశాగారానికి ఇతరులకు పెత్తనమిచ్చేవాడు, ఇతరులు చెప్పిన నీతులు అనుసరించేవాడు, వాడెంత గొప్పవాడైనా పామరుడితో సమానమే. దూర దేశాల్లో జరిగే సంగతులు వేగుల వాళ్ల ద్వారా తెలుసుకుంటే, అది తన సమక్షంలోనే చూసినట్లు ఉంటుంది. కాబట్టే రాజుకు దీర్ఘ చక్షువు అని పేరు. నీకు వేగులు లేరు కాబట్టి నీకా పేరు లేదు.. నీకా చూపూ లేదు. ఇలా నువ్వుండడం వల్లే, నీ మంత్రుల గుంపు సేవిస్తుంటే వారి మాటలు వింటూ వుండడం వల్లే, అలా సుఖానికి అలవాటు పడడం వల్లే, నీ జనస్థానంలో నీ బంధువులందరూ చచ్చిన వార్త నీకెలా తెలుస్తుంది? ఖర దూషణాది బంధువులతో సహా పద్నాలుగు వేల మంది రాక్షసులను రామచంద్రమూర్తి ఒక్కడే తన విల్లు బలంతో యుద్ధ్భూమిలో నాశనం చేశాడు. నీ తమ్ములను, బంధువులను, అందరినీ ఒక్కడు కూడా లేకుండా చంపాడు. నీకు విరోధులై, నీ కీడు కోరే రాక్షసులకు ఇక రావణుడి భయం లేదు. తాను రక్షిస్తానని చెప్పాడు. దండకారణ్యంలో నీ వాళ్ల భయం లేకుండా చేశాడు. ఇవన్నీ అతి బలవంతుడైన రామచంద్రుడు ఒక్కడే చేశాడు.’
‘నువ్వు లోభివి కాబట్టి వేగుల వాళ్లకు జీతాలు ఇవ్వవు కనుక వారంతా జరిగే విషయాలు నీకు తక్షణమే చెప్పరు. నువ్వేమో ఇతరులకు స్వాధీనపడి స్వతంత్ర శక్తి లేక, ఆ మంత్రి, ఈ మంత్రి చెప్పినట్లు వింటున్నావు. రాగల కీడు తెలుసుకోలేక పోతున్నావు. నీ దేశంలోనే భయం కలగడం నీకింతవరకూ తెలియదు కదా? రావణా నినే్నమనాలి? కష్టానికి తగ్గట్లు సేవకులకు జీతాలివ్వవు. ఇలాంటి క్రూరుడికి, మదం పట్టిన వాడికి, పొగరుబోతుకు, ద్రోహికి ఆపదలు కలిగినప్పుడు సేవకుల్లో ఒక్కడైనా సహాయం చేయడానికి ముందుకు రాడు. కారణం లేకుండా కోప్పడే రాజును, ఇతరులు భయపడేట్లు ప్రవర్తించే రాజును, గర్వంతో తనను తానే పొగడుకునే రాజును, వాడి బంధువులు, వాడి సేవకులే చంపుతారు. తన తప్పులు తెలుసుకుంటూ చక్కటి ఆలోచనతో పనులు చక్కదిద్దకుండా వుండే రాజుకు ఐశ్వర్యమంతా నాశనమై పోయి, వాడు సన్నగడ్డితో సమానమై దుఃఖపడుతుంటే, వాడిని అందరూ అలక్ష్యంగా చూస్తారు కాని, అయ్యో పాపం! వాడికి ఇలాంటి గతి పట్టిందే అని ఒక్కరైనా బాధపడరు’
‘లోకంలో దేనికీ పనికిరానివైనా ఏదో ఒక సమయంలో పనికొస్తాయేమో కాని, రాజుగా వుండి రాజ్యాన్ని పోగొట్టుకున్న వాడు గవ్వకైనా కొరగాడు. రాజుగా ఉండి భ్రష్టుడైన వాడు ఎంత గొప్పగా బతికినా, కొరకానివాడే. ఇవన్నీ తెలుసుకొని పరులు తనకు చేసిన మేలు మరవకుండా, ధర్మస్వభావుడైన రాజు దీర్ఘకాలం సంపదతో సుఖపడతాడు. దుర్మార్గులు తామెంత అధర్మంగా ఉన్నా, పరులకు హితోపదేశం చేసేటప్పుడు ధర్మానే్న చెప్తారు. దోషుల మీద కోపం, సాధువుల మీద దయ కనబరుస్తూ నీతిమార్గంలో నడిచే రాజును సర్వసేవకులు భయభక్తులతో కొలుస్తారు. అవివేకీ నీలో ఎంత వెతికి చూసినా రాజులకుండాల్సిన గుణాలు ఒక్కటైనా లేవు. అకాలంలో పడ్డ పిడుగులాగా దండకారణ్యంలో నువ్వు కాపుగా వుంచిన వారంతా యుద్ధంలో చావడం వేగులు లేనందున నీకు తెలియదు. సుఖంలో మునిగి నిన్ను చంపనున్న శత్రువులను ఉపేక్షిస్తున్నావు. అన్నీ మనకనుకూలమైన దేశాలే అనుకుంటున్నావు. అన్ని కాలాలు మనకు అనుకూలమైనవే అనుకుంటున్నావు. కానీ, భిన్న దేశాలలో, భిన్న కాలాలలో జరిగే విషయాలు కామలోలుడవైన నువ్వు తెలుసుకోలేక పోతున్నావు. ఎవరిలో ఎక్కడ ఏ మంచి కలదో, ఏ చెడ్డ కలదో తెలుసుకునే శక్తి నీకు లేదు. కాబట్టి, ఓ రాక్షసరాజా! శీఘ్రకాలంలోనే నీ సంపదను పోగొట్టుకుంటావు.
(తన వికార స్వరూపంతో, నిండు కొలువులో రాజు మంత్రులతో ఉన్న సమయంలో, ఒక ఆడది, రాజు చెల్లెలు, అంతఃపురంలో వుండాల్సింది, బజారు మనిషిలాగా ఇంత మందిలోకి వచ్చి, ఎవరికేమి కోపం వస్తుందో అని ఏ మాత్రం ఆలోచించకుండా, మాట్లాడినపుడే శూర్పణఖ సిగ్గు, బిడియం విడిచిందని స్పష్టమైంది. ఇంతవరకు శూర్పణఖ తన పరాభవ కారణం కానీ, పరాభవించిన వాడి పేరు కానీ చెప్పలేదు. ఎందుకు? ఆ విషయం ముందే చెప్తే, ఆమెను అవమానించిన కారణాన తనను దూషిస్తున్నదని అభిప్రాయ పడతాడేమో! అలాంటి అభిప్రాయం కలిగితే, తాను చెప్పినట్లు చేయకపోవచ్చేమో అన్న అనుమానం. చేయకపోతే రాముడిని పరాభవించాలన్న తన కోరిక తీరదు కదా! దశరథుడి విషయంలో కైక ఎలాంటి ఉపాయం చేసిందో అలాగే శూర్పణఖ కూడా ఇక్కడ చేసింది. అక్కడ కామం.. ఇక్కడ కోపం.)
-సశేషం

పుస్తకం దొరుకు స్థలం: శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, అంగలకుదురు, తెనాలి మండలం,
గుంటూరు జిల్లా 7036558799 08644-230690

దిశానిర్దేశం-‘ఆనందవాణి’ పిలుపు!

$
0
0

మా ఇంట్లో; మేం 1963లో వింఛిపేట నుంచి సూర్యారావుపేటకి మారిపోయేదాకా, పనమ్మాయి నైజాం నుంచి ఏ నాడో వచ్చిన బుచ్చమ్మే. మరాఠీ స్టయిల్లో కచ్చబోసి, మోకాళ్ల దాకా మాత్రం వచ్చే గళ్ల చీరలు కట్టుకునేది. మోచేతుల దాకా వున్న జాకెట్లు వేసుకునేది. భాష కానీ - యిష్టానిష్టాలు గానీ ఇంత పిసరు మార్చుకోలేదు. ఆమె కూతురు మా చెల్లి ఈడుదే - యశోద. మాకు ఒక రకంగా బుచ్చమ్మ ‘కేర్‌టేకర్’ అన్న మాట. నన్నూ పెద్ద తమ్ముణ్ణీ తప్ప మిగతా అందర్నీ ‘ఖరోడా’ చేసేది. అల్లరి చేస్తే ‘పిర్ర’ మీద, రెండు పీకేది కూడా. అంత బాధ్యత, అంత చనువు. 1960 జూన్‌లో అనుకుంటాను ఓ సాయంకాలం వేళ, నాలుగింటప్పుడు, ముందు వసారాలో కూర్చొని బియ్యం చేటతో చెరుగుతూ, రాళ్లు ఏరుతున్నది. మా ముందు వసారాకి ప్యాకేజీ చెక్కలతో ‘ఫెన్స్’ వేయించాం. దానే్న ‘జ్యాఫ్రీ గది’ అనేవాళ్లం.
ఓ పెద్ద మనిషి - ఎర్రగా, సన్నగా, పొడుగ్గా, హుందాగా వచ్చాడు. డోర్ నెంబరు కోసం చూస్తూంటే - ‘ఎవరు కావాలయ్యా?’ అన్నది బుచ్చెమ్మ చేట ‘లయ’ను ఆపి.
‘వీరాజీ అనీ... అతను కావాలమ్మా. నేను మద్రాసు నుంచి వస్తున్నాను’
‘వీరాజయ్యా! రుూడ ఆ పేరుగలోళ్లు లేరయ్యా...’ అతని చేత ఓ డజను అరటిపళ్లూ, రెండు ఆపిల్ పండ్ల వుండటం గమనించి కూడా - మళ్లీ చేటందుకుని చెరుగుతోందిట. అంతలో మా అమ్మ లోపలి నుంచి వచ్చింది ‘ఆగు బుచ్చెమ్మా’ అంటూ, ‘నమస్కారమమ్మా! వీరాజీ అని కథలు రాసే...’
అమ్మ ప్రసన్నంగా ‘ఔనండీ. మా పెద్దబ్బాయే... రాండి లోపలికి’ అంటూ బుచ్చెమ్మని వారించి, అదే జాఫ్రీగదిలో మూల మీద వున్న కుర్చీని చూపెట్టింది.
‘ఆనందవాణి కాళిదాసు’గా అందరూ రిఫర్ చేసే ఉప్పులూరి కాళిదాసుగారు - వివరంగా అన్నీ మాట్లాడుతూ ‘నేను, మీ వారూ - అవును తను మద్రాసులోనే వున్నాడు. నాకు తెలుసు. కలిశాను. బాల్య స్నేహితులం మాడమ్’ అన్నాడు.
‘ఆనందవాణి కాళిదాసు వచ్చాడు నీ కోసం, వీరాజీ’ అని చెప్పండి. చాలు. ‘్ఫదర్’ అక్కడే ఉంటున్నాడు కనుక తనని పంపించండి - అదే. మీ వారుంటున్న తంబుచెట్టి స్ట్రీట్ వీధిలో, పనె్నండో నెంబర్ ఇల్లు - ఆనందవాణి అంటూ చెప్పండి’ అన్నారుట. పోతూ, మళ్లీ వెనక్కి వచ్చి ‘ఒక్కమాట చెప్పమ్మా, మీవాడికి.. ఆనందవాణి పిలిచిందీ అంటే ఒక భవిష్యవాణి పిలిచిందీ అనే అర్థం అని చెప్పండి. ఇవాళ కాళిదాసు తలుపు తట్టాడూ (నాక్స్ ద డోర్) అంటే, రేపు పెద్ద పెద్ద పత్రికలు ఏరీ, కోరీ వచ్చి ఆహ్వానిస్తాయ్’ అన్నారుట.
అమ్మకి సంభ్రమాశ్చర్యాలు రెండూ కలిగాయిట. ఆడపిల్లగల తండ్రి ఒకరు ఎవరో వచ్చారనుకుందిట (అమాయకురాలు) తిరిగి అంత పెద్దాయన కాళ్చీడ్చుకుంటూ వెళ్లిపోతూ వుంటే - ‘శాస్ర్తీ’ బాబేనా లేడు, స్టేషన్ దాకా వెళ్లి దింపడానికి’ అనుకుందిట వీధికొసకంటా చూస్తూ...
అంతటి అచ్చెరువుతోనూ, మా బుచ్చెమ్మ ‘కిష్టబాబు పేరెట్టి అడిగారేగాదు మళ్ల. అదేదో వీరాజయ్య పేరు సెప్పిండు... గీడ మా కిష్టబాబు, శాత్తరిబాబూ వున్నారయ్యా’ అని సెప్పినా’ - అని వెండి కడియాల చేతులూపుతూ చెప్పింది.
మహీధర నాకు హైదరాబాదు సభల నుండి తెచ్చిన నా ‘విడీవిడని చిక్కులు, వగైరా రాతప్రతులు తెచ్చుకుని తిరిగి వచ్చిన మాకు కూడా చిన్న ‘షాకు’ తగిలింది. ఆనందవాణి పత్రిక తెల్సు కానీ, కథాంజలి, వినోదిని, ఆంధ్ర మహిళ, గృహలక్ష్మి, స్నేహలత, ఢంకా, జమీన్ రైతు వగైరాలలాగా అది రెగ్యులర్ కాదు.
నేను ‘ఆనందవాణి’కి ఏమీ రాయలేదు. కానీ చిన్నప్పుడే విన్నాను. విశాఖపట్నంలో మా పినతండ్రి (బాబాయి) శివప్రసాదరావుగారు (కన్నబాబు) పెళ్లైంది - మా చిన్నప్పుడు. పెళ్లికి ఆరుద్ర(గారు) వచ్చాడు. శ్రీరంగం రమణయ్యగారనే సైకిల్ షాపు రమణయ్యగారి అమ్మాయి మాకు, ‘చిన్నకక్కి’ (చిన్నపిన్ని) అయ్యింది. ఆరుద్ర మా నాయనమ్మ - పిళ్లా సుబ్బమ్మగారికి కూడా చుట్టం. శ్రీశ్రీ కబురెడితే మద్రాసు చేరుకుని, ఆనందవాణి పత్రికను ఎడిట్ చేశాడుట. కానీ సినిమా పిలుపు (ప్రేమలేఖలు హిందీ సినిమా డబ్బింగ్ ఆఫర్) రాగా, అటు దారి మార్చి వెళ్లిపోయాడుట. ‘ఆరుద్ర’కి ఆరుద్ర పురుగులాగా ఎఱ్ఱగా వుంటాడు అంటూ వాత్సల్యంగా అంటారు మా వాళ్లంతా. గానీ, మా బంధుకోటిలో, చాలా గ్లామరుంది. నాకు కూడా అప్పుడు అతని ‘బాల’ పత్రికలో సీరియల్ తెల్సు. ‘చీమల రాజ్యంలో సీత’ అన్నది నాకు చాలా గుర్తు.
బాగా చిన్నప్పుడు మాకు అమ్మతో వైజాగ్ (విశా’పట్నం అంటారు) ట్రిప్పులు బాగా తగిలేవి. నాన్నగారెప్పుడూ వచ్చేవారు కాదు. ఆరుద్ర వాళ్ల పెంకుటిల్లు చెమిటి జమీందారు తోట - వున్న వీధిలో వుండేది. సమీపంలో గోళీలసందా? అదీ?.. అక్కడ వో వాటాల యింట్లో మా బామ్మ అండ్ అంకుల్స్ వుండేవారు. ఆరుద్ర వాళ్ల నాన్నగారు భాగవతుల నరసింహరావుగారు ‘మా’ ఇంటికి వచ్చి మా మామ్మతో కబుర్లు చెప్పేవారు. ‘ఆయన ఆంధ్రపత్రిక వీక్లీలో ‘వారఫలాలు’ రాసేవారు’ అని, అరవైల్లో మా ‘రాధాకృష్ణ’గారు చెబితే తెల్సింది - కానీ, ఆయన ఓసారి నన్ను పిల్చి ‘నీకో అయిడియా యిస్తారు రారా అబ్బారుూ’ అంటూ యిచ్చిన సలహా జ్ఞాపకం వుంది. గొప్ప సలహా అది. ‘నువ్వు ఏ పాఠమైనా పదిసార్లు చదివి, భట్టీయం వెయ్యి. అది వేస్టు. ఒక్కసారి చూసి రాయి. చాలు అది. చూడకుండా నీకు జ్ఞాపకం వుండిపోతుంది. ఇలా చేసి చూడు’ అని. అద్భుతం.
బైది బై, ‘ఆనందవాణి’ పిలుపు కదా నేను నెమరువేసుకుంటున్నాను - కదూ.
ఈలోగా మద్రాసు (అది చెన్నై కాదప్పుడు) నుంచి నాన్నగారు వచ్చారు. అమ్మా, నేనూ ఈ సంగతులు చెప్పాము. అస్సలు కమ్యూనికేషన్స్ లేని రోజులవి. కానీ, మద్రాసులో నాన్నగారి ఆఫీసు - ఆంధ్రా సిమెంట్స్ వారి రిజిస్టర్డ్ ఆఫీస్ వున్న రూమ్ నెంబర్ 19 బై 337 (19/337) బిల్డింగ్ టాప్ ఫ్లోర్‌లో వుంది. దాన్ని మవుంట్ రోడ్‌లోకి షిఫ్టు చేస్తూ రుూ పందొమ్మిది రూమ్ ఆఫీసుని నాన్నగారికి ‘రెసిడెన్స్’గా వుంచేశారు. అందులో ఫోన్, నాన్నగారి బల్ల, కొన్ని లెడ్జర్స్ వున్న బీరువాలు వగైర వున్నాయి. అదో ప్లస్ పాయింట్ అయింది నాకు. అలాగే ఆనందవాణి కార్యాలయం, అదే రోడ్డు మీద ఎదుటి వరుసలో నెం.12గా ఉంది. సరే, మా బిల్డింగ్‌కి ఎదురే ఆంధ్రపత్రిక...
నేను ఆనందవాణిలో ‘ఎడిటింగ్’తో కాలక్షేపం చేస్తున్నప్పుడు అక్కడో ఫోన్ ఉండేది. కాళిదాసుగారు దొడ్డ మనిషి. ‘తాళం వేసి ఉంచు’ అని ఫోన్ ‘కీ’ ఇచ్చారు నాకు. పగలు అక్కడ ఎక్కువగా వుండేవాణ్ని. ఎందుకంటే, నాన్నగారి ఆఫీసు షిఫ్ట్ అవుతూ, అవుతూ వున్నందువల్ల పగలు ఆయనకు, ఒకరు ఇద్దరు స్ట్ఫాకీ పని వుండేది. రూములో ఆనందవాణి కార్యాలయం వున్న ఫ్లోర్‌లోనే - వరండాలో ఎదురుగా వున్న తలుపు తెరిస్తే, అది - నీలంరాజు వెంకట శేషయ్యగారుండే ఇల్లుట. ఆనందవాణి వర్కర్స్ చెప్పేవారు. అది అట్లుండనిండు -
ఆనందవాణికి వెళ్లాలనే అనుకున్నాను. పై కారణాల వల్ల దినపత్రిక ఎలా తయారవుతుందీ? కొంత తెలిసింది - విశాలాంధ్ర చూశానుగా.. అక్కడొక పద్ధతి ఉంది. క్రమశిక్షణ ఉంది. ఒక ఎడిటోరియల్ రాశారూ అంటే దాన్ని సీనియర్లు అంతా కూర్చుని అర్జెంట్‌గా సమీక్ష చేసేవారు. ఈ పద్ధతి మిగతా చోట్ల లేదేమో? ప్రభ దినపత్రిక, ఇండియన్ ఎక్స్‌ప్రెస్సు విడరాని జంట కనుక దాని కార్యాలయం గాంధీనగర్‌లోని - న్యూ ఇండియా హోటల్ జంక్షన్‌గా పేర్గాంచిన సెంటర్‌ని - ప్రభ సెంటర్‌గా మార్చేసింది. స్ట్ఫా ధర్నాలు గట్రా జరిగేవి...
చిత్రం ఏమిటీ అంటే ఈ ప్రభ ఆఫీసుకు ముందు, అదే కార్యాలయ భవనంలో ‘జార్జ్‌ఓక్స్’ కంపెనీ వారి మోటారు శకటాల ‘షోరూమ్’ ఉండేది. నేను మా వించిపేట నుంచి నైజాం రైల్వేగేటు ప్రక్కగా నడుచుకుంటూ - రామగోపాల్ చౌల్ట్రీ ‘కమాన్’ క్రింద నుంచి రైలు బ్రిడ్జి దాటి, అవతలి తట్టుకి వచ్చి - అక్కడ మూడణాలు (పందొమ్మిది నయాపైసలు) ఇచ్చి - రుూ గాంధీనగరం ఎర్నేనిమాన్షన్ దాకా రిక్షాలో వచ్చేవాణ్ని. అక్కడ సరిగ్గా అద్దాల కార్ల షోరూమ్ దగ్గర, ఆరో నెంబరు బస్సు ఎక్కేవాణ్ని. ‘ఎస్సారార్’ కాలలేజీ ఒక్కటే అప్పుడు. లయోలా మరి రెండేళ్లకి కాబోలు వచ్చింది.
ఈ షోరూమ్ ఇవాళ (నాలుగు సంవత్సరాల తర్వాత) ఆంధ్రప్రభయింది! అంతలేసి అద్దాల గోడల వెనుక ఎడిటోరియల్ సిబ్బంది కూర్చొని, పని చేసుకోడం బయటకి కనబడేది.
చిత్రం ఏమిటంటే, ఇవాళ అది ఐలాపురం హోటలయ్యింది. విశాలాంధ్ర బిల్డింగ్ కృష్ణా రెసిడెన్సీ హోటలయ్యింది. వార్తాపత్రికల కార్యాలయాలు - కళ్యాణ మండపాలు, హోటల్సూ అవడం డెవలప్‌మెంటేనా?
ఈలోగా, నా మునగచెట్టు నవలకి - తిరుమల రామచంద్రగారు ముందు మాటలు రాశారు. అందులో ఆయన నాకు మంచి ‘కితాబు’ ఇచ్చారు.
‘జీవితపు తొలి మలుపులోనే ‘కనువిప్పు’ (నా నవలల పేర్లు)తో ‘పగా ప్రేమా’ కనుక్కొని రాతిమేడలు కట్టిన వీరాజీ కలానికి - అనుక్షణం ఆకులు రాలుస్తూ చీకాకు కలిగించే మునగచెట్టు తగలకపోవడమే ఆశ్చర్యం!’ అన్నారు. నిజమే! మా వించిపేటలో - సాయిబుల ఇండ్లల్లో చదరంత మేర నేల వున్నా మునగచెట్టు, గోరింటాకు చెట్టూ వేసి తీరుతారు. అంచేత అది నన్నాకర్షించలేదూ అంటే నాదే తప్పు. చివరగా తిరుమల సారు, ముక్తాయింపులో ఇలా అన్నారు.
‘వీరాజీ కల్పనా వౌళికతకూ మనస్తత్వ వివేచనా, వివేకానికీ రుూ చిన్ని నవల చాలునంటే - తక్కిన నవలలు, కథలు, కవితలు తార్కాణాలే! ఇలాంటివి యింకా ఎన్నో ఈయన కలం సృష్టిస్తూ పోతుంది’ ముక్తాయింపు ఇచ్చారు.
అట్లా ఆశీర్వదిస్తూ పాఠకులు ‘వీరాజీ వదనంపై మునగపూగుత్తులు లాంటి ముసిముసి నవ్వులు కంటూ మురిసిపోండి’ అన్నారు. మునగపూల గుత్తులను ఇలా ముసిముసి నవ్వులతో పోల్చడం - మహానుభావుడు, బహుభాషా కోవిదుడూ అయిన, ఆయనకే చెల్లింది. అట్లాగా, నాకు నూతనోత్సాహం, ధైర్యం, జీవితం మీద లాలస పెరిగాయి.
* * *
బెజవాడలో కొన్ని చిత్రవిచిత్ర మధుర స్మృతులకు దారి తీసిన సంఘటనలు జరిగేయి. సినిమాలలో - రింగురింగులు వేసి - ఫ్లాష్‌బ్యాక్ చూపిస్తూ - గత సంఘటనలూ, సన్నివేశాలనూ ‘మాంటేజ్’ చేస్తూంటారు. అట్లా 1961లో సెప్టెంబర్ నెల, 18వ తేదీనాడు నేను - ‘వర్కింగ్ జర్నలిస్ట్’ అన్న ముద్రతో - ఆంధ్రపత్రిక దినపత్రిక హాలులో అడుగుపెట్టేదాకా - విధి విన్యాసాలు నన్నొక ఆట (‘విడుపు’ అనొచ్చు) ఆడించాయి. ఎందుకంటే ‘అగాధమగు జలనిధిలోన ఆణిముత్యమున్నటులే’ - అని ఓ సినిమా పాటలో అన్నట్లు -నాకు ‘పత్రికా రచన’ అనే ‘ఆలంబనా’ ఆయుధం దొరికాయి. ఇవాళ జ్ఞాపకాల్ని నెమరువేసుకునేదాకా ‘నీ కష్టాలు నువ్వే వుంచుకో - నీ సంతోషాన్ని పదిమందితో పంచుకో’ అన్న సూత్రాన్ని సాధ్యమయినంత పాటించాను.
(ఇంకా బోలెడుంది)

ఒత్తిళ్లను జయిస్తే... మంచి ఫలితం’

$
0
0

విద్యార్థులు ఏటా పరీక్షలు ఎదుర్కోవడం సహజం. ఈ క్రమంలో కొందరు ఒత్తిడికి గురవుతుంటారు. మంచి మార్కులు సాధించగలనా? ఎలాంటి ప్రశ్నలు వస్తాయో? సరైన సమాధానాలు రాయగలనా? ఆశించిన మార్కులు రాకపోయినట్లయితే పరిస్థితి ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు మెదళ్లలో కదలాడుతుంటాయి. ప్రణాళిక ప్రకారం చదవడంతోపాటుగా చిన్నచిన్న చిట్కాలను పాటిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు.
సమాధానాలు రాయడం ఒక కళ
ఎంత బాగా చదివినా, ఎంత గుర్తున్నా, వ్రాసే విధానం తెలియకపోతే మంచి మార్కులు సాధించడం కష్టం.
1.చేతివ్రాత బాగుండాలి
2.నిర్వచనం ఉంటే యథాతథంగా రాసే ప్రయత్నం చేయాలి.
3.చిన్న ప్రశ్నలకు వ్రాసే సమాధానాలలో ముఖ్యమైన విషయాలు వదలకుండా రాయాలి.
4.జవాబులో నిర్వచనం ఉంటే ముందుగా రాయాలి.
5.సైడ్ హెడ్డింగ్స్ ముఖ్యమైన వాటికి అండర్‌లైన్ చేయాలి.
6.అవసరమైన చోట చిత్రపటాలను గీచి, భాగాలు గుర్తించాలి.
7.పరీక్షల సమయంలో ప్రశాంతంగా ఉండాలి.
పరీక్షలకు ఎలా చదవాలి?
1.సబ్జెక్టులన్నింటికి సమయం కేటాయించి ప్రణాళికతో చదవాలి.
2.ప్రణాళిక ప్రకారం చదువుకోవాలి. ఉదయం 4 గంటల నుండి 6 గంటల మధ్య చదివితే మంచి ఫలితం ఉంటుంది.
3.కష్టమైన, ఇష్టం లేని సమ్జెక్టులకు ఎక్కువ సమయం కేటాయించాలి.
4.ప్రతిరోజు అవసరమైనంత నిద్ర పోవాలి.
5.ఆహారం విషయంలో శ్రద్ధ వహించాలి.
6.చల్లని పదార్థాలు తినడం, త్రాగడం చేయకండి.

పరీక్షలకు రెండు రోజుల ముందు

1.మొదటి పరీక్ష కోసమే చదవాలి.
2.గతంలో చదివినంత వరకు మాత్రమే రివిజన్ చేయాలి. కొత్తవి నేర్చుకోవాలని ప్రయత్నించకండి.
3.సరిపడా నిద్ర పోవాలి. కష్టపడి చదవడం వరకు మాత్రమే, కాని ఫలితం మన చేతుల్లో ఉండదని గుర్తించాలి.
4.ఎప్పుడూ సంతోషంగా ఉండే ప్రయత్నం చేయాలి.

పరీక్ష రోజున

1.పరీక్ష సమయానికి కనీసం గంట ముందు చదవడం ఆపండి.
2.పరీక్ష వ్రాయడానికి కావలసినవి సిద్ధం చేసుకోవాలి.
3.స్నేహితులతో సరదాగా మాటలు తప్పించి పరీక్ష గురించి చర్చించకూడదు.
4.పరీక్ష కేంద్రానికి అరగంట ముందుగా చేరాలి.

పరీక్ష హాలులో

1.2 నుండి 5 నిమిషాలు కళ్లు మూసుకొని ప్రశాంతంగా కూచోవాలి.
2.ఇన్విజిలేటర్ ఇచ్చే సూచనలు శ్రద్ధగా విని పాటించాలి.
3.పరీక్షకు సంబంధించిన సబ్జెక్ట్ మెటీరియల్ ఇతరములు చిన్న ముక్క కూడా దగ్గర ఉంచుకోకూడదు.
4.ప్రశ్నపత్రంపై గాని, బెంచ్‌పై గాని, పాడ్‌లపై గాని ఏమీ వ్రాయకూడదు. తనిఖీ బృందాలు డిబార్ చేస్తారు.
5.ప్రశ్నపత్రం శ్రద్ధగా చదవాలి.
6.తేలికగా ఉన్న ప్రశ్నకు సమాధానం మొదటగా వ్రాయాలి.
7.మొదటి పేజీ అందంగా వ్రాసే ప్రయత్నం చేయాలి.
8.ప్రశ్నలు కష్టంగా అనిపిస్తే కంగారుపడొద్దు. మీకే కాదు, అందరికీ అలాగే అనిపిస్తాయి.
9.సమాధానాలు వ్రాయడం పూరె్తైన తర్వాత ప్రశ్నల నంబర్లు సరిచూసుకోండి.
10.సమయం మిగిలితే వ్రాసిన సమాధానాలు పునః పరిశీలించుకోవాలి.

పరీక్ష హాలు నుండి బయటకు వచ్చాక

1.స్నేహితులతో తప్పొప్పుల గురించి చర్చించకూడదు.
2.ఆహారం తీసుకొని, కొంత సమయం విశ్రాంతి తీసుకొని తరువాతి పరీక్షకు ప్రిపరేషన్ కావాలి.

అన్ని పరీక్షలు అయినాక

1.నా బాధ్యత నేను నిర్వర్తించాను. ఫలితం నా చేతుల్లో లేదనుకోవాలి.
ఫలితాలు విడుదలయిన తర్వాత
1.వచ్చిన మార్కులను బట్టి లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి.
2.ఫెయిలయిన విద్యార్థులు, చదువు జీవితంలో ఒక భాగమని, మంచిగా బ్రతకడానికి చాలా మార్గాలున్నాయని అర్థం చేసుకోవాలి. చావడం అనేది మూర్ఖులు మాత్రమే చేస్తారు. తెలివిగలవారు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు.
లక్ష్య సాధనలో ఎన్నో రకాల అడ్డంకులు వస్తూ వుంటాయి. వాటికి ఎదురీదుతూ వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లినవారే ప్రపంచ విజేతలు అవుతారు.

చీకటి వెలుగులు

$
0
0

రాత్రి అంటే పగలు అనే తల్లికి అప్పుడే పుట్టిన నల్లని బిడ్డ. ఆ పాప నిద్రలేస్తుంది అన్న భయంతో లక్షలాది నక్షత్రాలు చుట్టూ చేరి నిశ్చలంగా నిలబడి చూస్తూ ఉన్నాయి, అన్నాడు రవీంద్ర కవీంద్రుడు. ఆయన మరీ భావుకుడు అని మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఒక రాత్రి పుట్టింది. మధ్యరాత్రి కొత్త సంవత్సరం వచ్చింది అన్నారు కానీ మామూలుగానే తెల్లవారినట్టు ఉంది. అంతా మామూలుగానే జరుగుతుంది. మనిషికి మాత్రమే ఎక్కడలేని ఉత్సాహం. పట్టరాని ఆనందంతో పండుగ చేసుకోవడానికి మనిషికి ఏదో ఒక కారణం కావాలి. కనుక ఇది కూడా ఒక కారణం. ఏది కూడా కొత్తగా జరగనప్పుడు మరి కొత్తదనం ఎందులో వెతుక్కోవాలి? ప్రశ్న!
ఎవరో కాలాన్ని లెక్క వేసే పద్ధతి మొదలుపెట్టారు. చాలామంది అటువంటి పద్ధతులు మొదలుపెట్టారు. కానీ ఒకరి పద్ధతిని ఎక్కువమంది వాడుతున్నట్టు ఉన్నారు. ఇది మామూలుగా ప్రతిసారి వచ్చే చర్చ. కానీ కొంచెం ఎత్తుకు ఎగిసి, కాలాన్ని మరింత విస్తృతిలో చూడగలిగి, మరొక రకంగా పరిశీలన చేయవచ్చు. వెనుకకు తిరిగి చూడడాన్ని సింహావలోకనం అన్నారు. ఎందుకో? ఈ రకంగా వెనుకకు తిరిగి చూస్తే, అసలు ఏమీ కనిపించడం లేదు, అంటూ ఒక కవిత రాసినట్టు గుర్తు. కానీ సూత్రప్రాయంగా విషయాలు కనిపిస్తూనే ఉన్నాయి. వాటిని గురించి నెమరు వేసుకోవడానికి, సమీక్షించడానికి కొత్త సంవత్సరం తగిన సమయం.
ఒక సంవత్సరాన్ని కాక వంద సంవత్సరాల కాలాన్ని ఒకసారి పరిశీలించితే ఇక్కడ కొన్ని విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత శతాబ్ది అంటే 20వ శతాబ్ది మొదటి ఇరవై సంవత్సరాలలో ఈ ప్రపంచంలో చాలా అద్భుతాలు జరిగాయి. చాలామంది వ్యక్తులు గొప్ప పనులు చేశారు. అంతకు ముందు లేనివి కొన్ని రంగాలు మొదలయ్యాయి. కొన్ని రంగాలు అనుకోని మలుపులు తిరిగి కొత్త దారులకు అవకాశాన్ని ఇచ్చాయి. ఇక ప్రస్తుతం నడుస్తున్న అంటే 21వ శతాబ్దపు తొలి రెండు దశకాల తీరుతెన్నులను గమనించిన వారికి బహుశా కొన్ని విషయాలు తోస్తాయి. వ్యక్తుల కృషికి గుర్తింపు బాగా తగ్గినట్టు ఉంది. ఇప్పుడంతా సామూహిక కృషి ఏ ఒక్కరికి గొప్పతనం మిగలకూడదు. చాలా మంది గొప్పవాళ్లు ఉంటారు. ఇది ఇప్పటి పరిస్థితి. నిజానికి తెలివి విలువ ఒక రకంగా తగ్గుతున్నదేమో అన్న భావం కూడా మిగలకపోదు. ముఖ్యంగా వ్యక్తుల తెలివి విలువకు అంతగా గుర్తింపు లేకపోవడం ఇప్పటి కాలపు పద్ధతి. ఏ విషయంలోనైనా వివరాలు పట్టని పరిస్థితి కూడా మొదలైంది. అది సాంకేతిక జ్ఞానం గాని, మరొక రంగం గాని వాడుకోవడమే కానీ అందులోని మెళకువలు, వెనుకనున్న యదార్థాలు ఎవరికీ పట్టనట్టు అనిపిస్తుంది. అన్నింటినీ వాడుకుంటే చాలు. అది పనిచేసే పద్ధతి గురించి పట్టించుకో నవసరం లేదు. అలాగని మరి ఇప్పటి చదువు మాత్రం అదే మార్గంలో సాగక, అంటే వాడుకోవడం గురించి కాక, ఇంకా పాతకాలం పద్ధతిలోనే, మూల విషయాలను చదవడం దగ్గరే ఆగిపోయి ఉంది.
గత శతాబ్ది మొదటి కాలాన్ని ఒక్కసారి పరిశీలించి చూస్తే ఒక ఐన్‌స్టైన్, డార్విన్, ఫ్రాయిడ్, కార్ల్‌మార్క్స్ లాంటి వారంతా ఆకాశమంత ఎత్తున నిలబడి కనబడతారు. వాళ్లు ఈ ప్రపంచాన్ని మార్చిన తీరు గురించి ఇవాళ ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. వైజ్ఞానిక రంగంలో అప్పుడే లోపలికి తొంగి చూసే పద్ధతి మొదలైంది. సరిగ్గా ఆ సమయంలోనే మొదలయ్యి మూడు తరాల పాటు అణువులు చీల్చుతూ లోపలికి తొంగి చూసిన వాళ్లు కనబడతారు. ఒక్క సైన్స్‌లోనే కాక అన్ని రంగాలలోనూ గత శతాబ్ది మొదటి రోజులలో ఉత్తుంగ శృంగాలు అనదగిన కొందరు వ్యక్తులు అంత ఎత్తున నిలిచి కనపడతారు. ఒక పికాసో గురించి చెబితే చాలు. చిత్రకళారంగంలో అప్పట్లో వచ్చిన కొత్త పోకడలను గురించి సులభంగా అర్థమవుతుంది.
సరిగ్గా ఆ సమయంలోనే ప్రపంచంలో రేడియో మొదలైంది. టెలిఫోన్ కూడా మొదలైంది. ఇవి రెండూ కలిసి సమాచార ప్రసారాన్ని మార్చిన తీరు మనందరికీ తెలిసిందే. అప్పట్లో రేడియో కనుగొన్న మనిషిని ఆకాశానికి ఎత్తారు. చరిత్రను మలుపులు తిప్పిన శాస్తజ్ఞ్రులు అంటూ పుస్తకాలు రాసుకున్నారు. నేషనల్ బుక్ ట్రస్ట్ వారు ప్రచురించిన ఇటువంటి ఒకానొక పుస్తకాన్ని నేను సంవత్సరం క్రితమే తెనుగీకరించి ఇచ్చాను. వాళ్లు ఇంకా అచ్చు వేయలేదు. అందులో ప్రసక్తికి వచ్చిన శాస్తజ్ఞ్రులంతా గత శతాబ్ది తొలి కాలంలో పనిచేసిన వారే. డీజిల్‌ను కనుగొన్న వ్యక్తి మొదలు మరెందరో ఆ పుస్తకంలో మనకు కనబడతారు. నిజానికి డీజిల్ అన్నది ఒక వ్యక్తి పేరు అని ఇప్పుడు చాలామందికి గుర్తులేదు. సరిగ్గా అదే పద్ధతిలో ఒక సెల్‌ఫోన్‌ను, ఒక రంగుల టెలివిజన్‌ను, ఇంటర్నెట్‌ను, వాట్సాప్ అనే ప్రసార పద్ధతిని కనుగొన్న మనిషి గురించి ఇప్పుడు ఎవరికీ తెలియదు. గత శతాబ్దిలో ఒక్క డీజిల్ విషయంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఇప్పుడు మాత్రం అంతా సామూహిక విజ్ఞానమే. ఏ ఒక్క వ్యక్తికి గొప్పతనం లేదు. మొన్న మొన్నటి వరకు సినిమా రంగంలో కూడా పెద్ద పేర్లు అంటూ వినిపించేవి. హిందీ సినిమాల పేరు ఎత్తగానే దేవానంద్, దిలీప్‌కుమార్, రాజ్‌కపూర్‌లను గురించి చెప్పిన తరువాత మాత్రమే మిగతా వారి ప్రసక్తి వచ్చేది. మన సినిమాలో కూడా మొన్న మొన్నటి వరకు ఒక ఎన్టీఆర్, ఒక ఏఎన్నార్ రాజ్యమేలారు. ఇప్పుడు చాలామంది కుర్ర నటులు బాగా నటిస్తున్నారు. వాళ్ల అందరి పేర్లు గుర్తు ఉండే అవకాశం కూడా లేదు. సంగీతం రంగంలో కూడా ఇటువంటి పరిస్థితి గతంలో కనిపించింది. హిందీ సినిమాలో పాట పాడాలంటే ఒక మహమ్మద్ రఫీ, ఒక లతామంగేష్కర్, ఆ తర్వాతే మిగతా వారంతా. తెలుగులో ఒక ఘంటసాల, ఒక సుశీలమ్మల తరువాత మిగతా వారు ఎవరైనా! ఇప్పుడు అటువంటి పరిస్థితి ఉందా? ప్రపంచం మొత్తంలోనే ఇటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ఇందులో తప్పేమీ లేదు. అందరూ ఉన్నత శిఖరాలను ఇదే ఉంటున్నారు. ఇది ఒక ట్రెండ్ అంటున్నాను. అంతేకాని తప్పు పట్టడానికి నేను ప్రయత్నించడం లేదు.
గత శతాబ్ది మొదట్లో ప్రపంచ యుద్ధం జరిగింది. దాని ప్రభావంగా విశాల వర్గీకరణ మొదలైంది. రాజకీయంలో కొత్త పోకడలు కనిపించాయి. ప్రపంచ దేశాలు సమూహాలుగా విడిపోయాయి. అప్పటి సమూహాలకు ఇప్పటి తీరుకు ఎక్కడా పోలిక కనిపించదు. ఇక శతాబ్ది మొదట్లో చూస్తే ప్రపంచ దేశాలన్నింటిలోనూ పెద్ద మాటతో చెప్పాలంటే ఒక రకమైన ప్రతిష్టంభన, మామూలుగా చెప్పాలంటే ఒక రకమైన గజిబిజి కనబడుతున్నాయి. మన దేశంలో, మన రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారాయి. కానీ ఎవరు ఎంత సుఖంగా ఉన్నారు, ఎవరు ఎంత సౌకర్యంగా ఉన్నారు, అన్న ప్రశ్నలకు మాత్రం సులభంగా జవాబులు దొరకడం లేదు. అటు అమెరికాలో అధ్యక్షుడు ఉన్నాడు కానీ, అతనికి మంచి పేరు లేదు. రష్యాలో ఏమవుతున్నదో ఎవరికీ అర్థం కాదు. ప్రపంచం మొత్తం మీద చిత్రమైన అర్థంకాని పరిస్థితి కనబడుతుంది.
గత శతాబ్ది మొదటి కాలంలో సామ్రాజ్యవాదపు పద్ధతులు వెనుకకు తగ్గాయి. విక్టోరియనిజం వెనుకకు తగ్గింది. అప్పుడు వచ్చిన కొత్త ఆలోచనా విధానాన్ని మోడర్నిజం, నవీన వాదం అన్నారు. ఆ తరువాత పోస్ట్ మోడర్నిజం వచ్చింది. అంటే కొత్తదనం ఏమంత కొత్తగా లేదన్న భావన అందరికీ కలిగింది. మామూలు ప్రజలకు కూడా తమ గురించి తమకు అర్థం అవుతున్నట్టు స్ఫుటంగా కనబడుతున్నది.
గ్లోబలైజేషన్ అని శత్రువు ఏదో వచ్చినట్టు అందరూ భావించారు. కానీ ఆ విధానం కొంత మంచి కూడా చేసిందని అంటున్న వారు ఉన్నారు.
దేశానికి నాయకత్వం వహించడానికి గాని, కళా సాహిత్య రంగాలలో గాని, ఒకరిద్దరు పేరు చెప్పి అందరూ వాళ్ల వెనుక నడుస్తామంటే ఎవరికీ నచ్చడంలేదు. మళ్లీ మొదటికి వస్తే ఇప్పుడంతా సామూహిక వాదానికి, పద్ధతికి గౌరవం మెండు. ఒక ప్రశ్నకు జవాబు చెప్పాలంటే, ఒక వ్యక్తితో అవసరం లేదు. గూగులమ్మకు అన్ని సంగతులు తెలుసు. ఇది బాగుంది కానీ, గూగుల్ తెలివి ఎవరి సొంతం? వందలాది వేలాది మంది చెప్పిన సంగతులు అన్నింటిని ఒకచోట చేర్చి, జల్లెడ పట్టి, ఒక క్రమంలో పేర్చి ఉంచుకుంటుంది గూగుల్. ప్రశ్న అడిగిన మరుక్షణం తనకు తెలిసిన జవాబు ఏదో చెబుతుంది. తెలియకపోతే నాకు తెలియదు అని కూడా అంటుంది. ఎంత గొప్ప వ్యక్తి అయినా తనకు తెలియని విషయం గురించి ఇంత సులభంగా ఒప్పుకునే పద్ధతి ఏనాడూ లేదు. తెలివి విషయంలో, ఇతర చాకచక్యం విషయంలో, ఏ ఒక్కరికి ఇద్దరికి మాత్రమే ప్రాముఖ్యత కాక, ఎక్కువమంది గొప్ప వాళ్లు ఉండడం అన్నది ఇప్పటి పద్ధతిగా మారిందని కనీసం నాకు తోచింది. కొత్త సంవత్సరంలో ఆలోచన మొదలుపెడితే, ఈ సంగతి మీకు చెప్పాలి అనిపించింది. నా పని నేను చేశాను. ఇక తరువాతి వంతు మీది. ఆలోచించండి! నా మాటను ఖండించండి! లేదా అంగీకరించండి! అంతేగాని చదివి పక్కన పెట్టకండి!

పిల్లలు - మనీ మ్యాటర్

$
0
0

పత్రికలో ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించి ఆకర్శిణీయమైన ప్రకటన చూడగానే పిల్లలు తండ్రి వద్దకు పరిగెత్తుకొచ్చి. నాన్నా ఇప్పుడు కొంటే పది శాతం రాయితీ నట అని ఉత్సాహంగా చెప్పారు. ఆ తండ్రి నవ్వి నిజమే కొంటే పది శాతం ఆదా అవుతుంది. కొనక పోతే వంద శాతం ఆదా అవుతుంది. ఏది బెటర్ అని తిరిగి ప్రశ్నించారు. ఒక వస్తువు మనకు అవసరమా? కాదా? అనేది ముఖ్యం కానీ రాయితీ ఇస్తున్నాడు కదా? అని అవసరం లేనివి కొంటే నష్టమే. డబ్బుకు సంబంధించిన ఈ అవగాహన పిల్లలకు కలిగించాలా? వద్దా? కచ్చితంగా బాల్యం నుంచే పిల్లలకు డబ్బుకు సంబంధించిన అవగాహన ఉండాలి. అది తల్లిదండ్రుల బాధ్యత.
తల్లిదండ్రులు ఉద్యోగులు, సంపాదన పరులు అయినప్పుడు ఆ సంపాదన ఎలా వస్తుంది? ఎలా ఖర్చు చేయాలి. ఎలా పొదుపు చేయాలి. రేపటి కోసం పొదుపు ఎందుకు అవసరం అని డబ్బుకు సంబంధించి పిల్లలకు మొదటి నుంచి అవగాహన కలిగించడం తల్లిదండ్రుల బాధ్యత.
మనకు కొన్ని చిత్రమైన అలవాట్లు, నమ్మకాలు ఉంటాయి. పిల్లలు ప్రతిభ కనబరిచినా తల్లిదండ్రులు మెచ్చుకోవద్దు అనేది కొందరి భావన. దీనికి సంబంధించి మనకు పురాణ కథలు కూడా ఉన్నాయి. అలానే పిల్లలకు డబ్బు గురించి చెప్పవద్దు, డబ్బుల వ్యవహారాలు పెద్దలకు సంబంధించినవి అని కొందరు అంటారు.
పిల్లలకు డబ్బులకు సంబంధించి పెద్దలు చెప్పకపోతే ఇక వారికి ఎవరు చెబుతారు. జీవితంలో ఎదురు దెబ్బలు తిన్న తరువాత, నిండా అప్పుల్లో మునిగిపోయాక, నమ్మి మోసపోయిన తరువాత డబ్బు గురించి వారే తెలుసుకుంటారా?
నిప్పు ముట్టుకుంటే కాలుతుంది అని చెప్పడం నిప్పు గురించి తెలిసిన వారి బాధ్యత. అంతే తప్ప నిప్పు ముట్టుకుంటే కాలిన తరువాత వారికే అనుభవంతో తెలుస్తుంది అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది.
ఇంజనీరింగ్ చదివే యువత సైతం డబ్బులు ఇవ్వడం లేదు కదా? కార్డే ఇస్తున్నాం కదా? అనడం చాలా మందికి అనుభవమే. కార్డు ఉపయోగించినా, కరెన్సీ లెక్కపెట్టి ఇచ్చినా డబ్బు ఖర్చు చేస్తున్నాం అని డబ్బుకు సంబంధించి వారికి అవగాహన ఉండాలి. ఒక్కసారి డబ్బు చేయిదాటి పోయాక ఏడ్చి మొత్తుకున్నా తిరిగి రాదనే సంగతి తెలిసే సరికి వారి జీవితం అయిపోతుంది.
దాదాపు దశాబ్ద కాలం క్రితం సికిందరాబాద్ ఏర్పడి రెండువందల సంవత్సరాలు అయిన సందర్భంగా ధర్మవరపు సీతారాం సికిందరాబాద్ ప్రాంతానికి చెందిన పలువురు వ్యాపార ప్రముఖుల జీవితాల గురించి పత్రికల్లో వ్యాసాలు రాశారు. బ్రిటీష్ వారి పాలనా కాలంలోనే పెద్ద వ్యాపార కుటుంబాలుగా వెలుగొందిన వారి ఇంటి పేర్లతో సహా ప్రస్తావిస్తూ రాశారు. ఆ కుటుంబాలు ఇప్పటికీ సికిందరాబాద్‌లో ఉన్నాయి. ఐతే చాలా కుటుంబాలకు ఆనాటి వైభవం గత చరిత్రనే. ఎంతో గొప్పగా వెలిగిన ఆ కుటుంబాలు తరువాత తరం వారికి డబ్బుకు సంబంధించి సరైన అవగాహన లేకపోవడం, విలాసవంతమైన జీవితం, నమ్మి మోసపోవడం వంటి అనేక కారణాలతో ఆర్థికంగా దెబ్బతిన్నారు. కొన్ని కుటుంబాలు మాత్రం డబ్బుకు సంబంధించిన అవగాహనతో ఎదిగారు. డబ్బుకు విలువ ఇచ్చిన కుటుంబాలు, డబ్బుకు సంబంధించి అవగాహన ఉన్న కుటుంబాలు సరైన దారిలో వెళ్లి ఎదిగితే, అవగాహన లేని కుటుంబాలు చితికి పోయాయి. ఆ కుటుంబాలు తమ పిల్లలకు డబ్బుకు సంబంధించిన సరైన అవగాహన కలిగిస్తే వారి పరిస్థితి తలక్రిందులు అయ్యేది కాదు.
సంపన్నులు, మధ్యతరగతి, పేద, వ్యాపారలు, ఉద్యోగులు అనే తేడా లేదు. ప్రతి వారు పిల్లలకు డబ్బుకు సంబంధించి అవగాహన కలిగించాలి. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే దాన్ని పిల్లల వద్ద దాచిపెట్టాల్సిన అవసరం లేదు. కుటుంబ ఆదాయం ఎంత ఖర్చు ఎంతో పిల్లలకు చెప్పాలి. వారూ అవగాహన చేసుకుంటారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే పిల్లలకు అదే విషయం చెప్పాలి. దానికి తగ్గట్టు ఖర్చులు తగ్గించుకుంటారు. అదే విధంగా ఆర్థికంగా బాగుంటే అదే విషయం చెప్పాలి. సంపాదించిన దాని కన్నా తక్కువ ఖర్చు చేయడం వల్లనే సంపద మిగిలిందని, మిగిలిన ఈ సంపదను ఇనె్వస్ట్ చేసుకుంటేనే మరింతగా ఎదుగుతాం, రేపటి అవసరాలు తీరుతాయి, అలా కాకుండా సంపాదన బాగుందని, ఎప్పటికప్పుడు ఖర్చు చేస్తే అప్పుల్లో కూరుకుపోతామనే అవగాహన కలిగించాలి.
పిల్లలకు డబ్బు గురించి చెప్పడం ఎప్పటి నుంచి ప్రారంభించాలి అంటే, దానికో వయసు లేదు. స్కూల్‌కు వెళ్లే చిన్న పిల్లలు కావచ్చు, కాలేజికి వెళ్లే వాళ్లు కావచ్చు, ఇప్పుడే కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు కావచ్చు. ఎంత త్వరగా డబ్బు గురించి వారికి అవగాహన కలిగిస్తే అంత మంచింది.
డబ్బు ఎలా వస్తుంది, ఎలా వ్యయం చేయాలి, డబ్బు ఏ విధంగా డబ్బును సంపాదిస్తుంది, మనీ మేనేజ్‌మెంట్ ఎలా ఉండాలో నేర్పించాలి.
అంతా ఆన్‌లైన్ జీవితాలు ఐపోయాయి. అయినా పరవా లేదు. చిన్నప్పటి నుంచే పిల్లలకు కరెంట్ బిల్లు, నీటి బిల్లు, ఫోన్ బిల్లు వంటివి చెల్లించే పని అప్పగిస్తే వారికి కొంత అవగాన కలుగుతుంది.
చిన్న వయసులోనే బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయించాలి. స్నేహితులతో పార్టీ చేసుకుంటే రెండు మూడు గంటల ఆనందం. అదే డబ్బు మ్యాచువల్ ఫండ్స్‌లో ఇనె్వస్ట్ చేస్తే జీవిత కాలమంతా ఏ విధంగా ఆనందం కలిగిస్తుందో చూపించాలి. పిల్లల పేరుతో మ్యూచువల్ ఫండ్స్‌లో చిన్నప్పటి నుంచే ఎంతో కొంత ఇనె్వస్ట్ చేయడం వల్ల ఆ డబ్బు ఏ విధంగా పెరుగుతుందో వారికి అసక్తి కలుగుతుంది. దీని వల్ల స్టాక్ మార్కెట్ పెట్టుబడుల గురించి తెలుస్తుంది. డబ్బు విలువ తెలుస్తుంది. మార్కెట్ గురించి చిన్న వయసులోనే అవగాహన కలగడం భవిష్యత్తు జీవితానికి ఉపయోగపడుతుంది.
కుటుంబ సంపాదన ఏ విధంగా ఉంది. భవిష్యత్తు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు. దాని కోసం నిర్ణయించుకున్న లక్ష్యాలు, వాటిని సాధించే మార్గాల గురించి పిల్లలతో ఎప్పటికప్పుడు చర్చించాలి. పిల్లలకేం తెలుసులే అనుకుంటే వారికి నిజంగానే ఏమీ తెలియకుండా పోతుంది. అలా అనుకోవడం వల్లనే ఎంసెట్‌లో టాప్ ర్యాంకులు పొంది. ఐటి కంపెనీల్లో ఉద్యోగాలు పొందిన వారిని కూడా ఇంటర్ ఫేయిల్ ఐన వారు మోసగించగలుతున్నారు. వెయ్యి రూపాయలతో లక్ష అవుతుంది అని చెబితే ఇనె్వస్ట్ చేసి నష్టపోతున్న వారిలో ఎక్కువ మంది విద్యావంతులే ఉంటున్నారు. ఏ వయసైనే కావచ్చు పిల్లలకు డబ్బు గురించి అన్నీ చెప్పాలి. అలా చెప్పాలి అంటే ముందు పెద్దలకు తెలియాలి.


గతం నాస్తి కాదు.. అనుభవాల ఆస్తి

$
0
0

‘ఎంచగ భూమియొక్కటే ఏలిన రాజులెందరో’ అంటాడు అన్నమయ్య.
పంచభూతాలకేలాటి మార్పూ వుండదు. ఈ భూమ్యాకాశాలకు లేదు మార్పు - వున్న తేడా అంతా మనిషికే. ‘శరీరమాద్యం ఖలు ధర్మసాధన’ అన్నారు.
గొప్పగొప్ప వాళ్లంతా కూడా ఉత్క్రమణానికి బాధపడలలేదు. దానికి బదులు ధర్మసాధనమైన శరీరం లేకుండా పోతోందే అని తపించారట. కాలస్య కుటిలా గతిః అంటాడు వాల్మీకి. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కాలం మారిపోతుంది.
ఒక స్థలం ఒక కాలంలో మహాస్వర్గంలా కనిపిస్తుంది.
అదే ఇంకో సమయంలో నరకమై పోతోంది. నరకం అంటే అశాంతి. స్వర్గం అంటే ప్రశాంతి. నిద్రబోతూ కలలు కనేవాడికీ, మతిపోయి పిచ్చిగా తిరిగేవారికీ వైరాగ్య నైరాశ్యాల మధ్య నలిగిపోయే వారికీ కాలం ఒకలా గడవదు. కాలాన్ని నియంత్రించే శక్తి ఎవరికీ లేదు. కానీ మనసును నిరోధించి, నిగ్రహిస్తే చాలు. కాలం స్వరూపం దాని అర్థం తెలుస్తుంది. అప్పుడు మనిషి చేయలేనిది, సాధించలేనిదంటూ ఏదీ వుండదు. సంగీత త్రిమూర్తులలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితులు ఓసారి తన తమ్ముడు ఇంట్లో వివాహం నిమిత్తం ఎట్టయాపురం సంస్థానానికి బయలుదేరారు. సరిగ్గా ఆ సమయంలో కరువు కాటకాలతో వుంది. ఎటు చూసినా ఎండిపోయిన పొలాలు, ఆకలికి మాడుతున్న ప్రజలు దర్శనమిచ్చారు. ఆయన హృదయం ద్రవించింది. చెట్టు క్రింద కాస్సేపు కూర్చుని తన ఇష్టదైవమైన పరమశివుణ్ణి ధ్యానించి ‘అమృతవర్షిణి’ రాగంలో, ఆనందామృతవర్షిణి, అమృతవర్షిణి అనే కీర్తన గానం చేయటం ఆరంభించారు. అప్పటివరకూ ఒక్క మబ్బు కూడా లేని ఆకాశం కాస్తా కారుమేఘాలతో నిండిపోయింది. కుండపోతగా వర్షం కురవడం ఆరంభమైంది. ఆ నాదామృతంలో చుట్టూ ప్రకృతి పరవశించిపోయింది.
అంతే ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇప్పుడు చెప్పండి. కాలం ఎవరి చేతిలో వుంది? ‘ఉపాసన’ అంటే దగ్గరగా వెళ్లి కూర్చోవడం. ఉప అంటే సమీపంలో, అస అంటే కూర్చోవడం. ఉపాసన అంటే తాను పొందతలచిన వ్యక్తి, వస్తువు లేదా శక్తికి సమీపంలో కూర్చుని చూడటమే. క్రమంగా దానితో సామీప్యత వల్ల ప్రేమ పెరుగుతుంది. ఆ ప్రేమలో అహంకారం కరిగిపోతుంది. అహంకారమనే గోడ పడిపోతే, కళ స్వయంగా మనలో ప్రవేశిస్తుంది.
అంతేగానీ, తర్కం వల్ల విశే్లషించటం వల్ల గానీ కాదు.
మహత్వ కాంక్ష, సన్మాన దృష్టి, కీర్తికండూతి లాంటివి లేనివాడు సాధించే విజయాలన్నీ అలాగే వుంటాయి.
కళోపాసన చేసేవాడి దృష్టి ఎప్పుడూ కళాసృజనత్వం మీదే ఉంటుంది. ఆనంద రసాస్వాదనంలో భగవంతుడితో ఏకమై పోతాడు - అంతే. తను కోరుకున్నది, భగవత్సంకల్పమై కలుగుతుంటుంది.
నిజానికి సంగీతానికున్న అద్భుతమైన శక్తి అదీ. అటువంటి మహత్తరమైన దాన్ని ఒక కాలక్షేప వస్తువుగా భావించి తృప్తి పడుతున్నాం. 15వ శతాబ్దంలో గిరినార్ ప్రక్కనే వున్న జూనాగఢ్ (పాతకోట) గ్రామంలో సంత్ నర్నీ మెహతా జన్మించాడు. ఆయన గుజరాతీ.
మహాత్మాగాంధీకి బాగా ఇష్టమైన భజన్ ‘వైష్ణవ జనతో తేనే కహియే’ ఆయన రచనే!
కాలయవనుడి గుహలో దహించిన ముచికుందుడే (మాంధార పుత్రుడు) ఈ కలికాలంలో సంత్ నర్నీ మెహతాగా పుట్టాడంటారు. యిప్పటికీ గిరినార్ ప్రాంతంలో దత్తాత్రేయుడు తపస్సు చేసిన ప్రాంతం ముచికుంద గుహ ఉంది. సంగీతం వల్ల సాధ్యం కానిదేమీ లేదు. సంగీత శాస్త్ర జ్ఞానం సంపాదించుకోవడమంటే ఆనందసాగరాన్ని ఈదడమే. దానివల్ల లభించే బ్రహ్మానందాన్ని పొందలేని జన్మ నిరర్థకం. భూమికి భారమంటాడు త్యాగయ్య.
ఉపాధి కోసమో, కడుపు కోసమో అరవై నాలుగు కళలూ నేర్చినంత మాత్రాన స్థాయి పెరగదు. సింగరి అనే మునీశ్వరుడు పెద్ద నువ్వుల గుట్టను కోరి సంపాదించుకున్నాడు. అయితే దాన్నంతా తినగలిగాడా? విభీషణుడు అన్న చేత అవమానం పొంది రాముడి శరణు కోరాడు. గానీ, హనుమంతుడిలా శరణాగతి బుద్ధితో కాదుగా? లంకానగరం మీద ఆశతోనే.
శ్రీరాముడి రూపాంతరమైన రంగనాథుణ్ణి లంక వరకూ తీసుకుపోగలిగాడా? ఉభయ కావేరీల మధ్య అతుక్కుపోయి కదల్లేదు. అందుకు కారణం భక్తిలోపమే. శరణాగతి లేనప్పుడు కళలన్నీ వ్యర్థమే. సంగీత విద్వాంసులు చేసే సంగీత కచేరీలన్నీ నాదోపాసనే ధ్యేయంగా ఉండవు.
వారి దృష్టి శ్రోతలు విని ఆనందించి కరతాళ ధ్వనులు చేస్తారా లేదా అనే దాని మీదే ఉంటుంది. వారు ఒక్కరే ఇంట్లో కూర్చుని పాడుతూ వుంటేనే ఈ నాదానుభూతి తెలుసుకునే అవకాశముంది.
ఏది రాగమో, ఏ తాళమో తెలియకపోయినా ఆనందించటంలో ప్రవృత్తి ఉంటుంది. తెలిసి ఆనందించటంలో మేథ వుంది. అంటే ‘ఇంటెలెక్ట్’. మొదటిది సంశే్లషణ. రెండోది విశే్లషణ. కళను ఆస్వాదించడానికి దాన్ని తెలుసుకోగల బుద్ధి, జ్ఞానం అవసరం లేదు. స్పందించగల హృదయ సంస్కారమే కావాలి. తలకాయలూపేస్తూ వినేవారందరికీ సంగీత జ్ఞానముండకపోవచ్చు. సంస్కారమూ లేకపోవచ్చు. వౌనంగా వినే కొందరికే అది సాధ్యం. నిత్యమూ పోతన భాగవత పారాయణం చేసే త్యాగయ్యకు కనిపించిన మహానుభావులు ఎందరో వున్నారు. పరమ భాగవతులైన దేవతలు, మునులు, కిన్నరులు, కింపురుషులు, విజ్ఞానధనులు.
వీరంతా ఆనందానుభవంతో విజ్ఞానమయ కోశాన్ని సంపూర్ణం చేసుకున్న మహానుభావులు. వారందరికీ భక్త్భివం స్థిరమై అనుభవంగా మారింది. త్యాగయ్య గానం చేసినప్పుడల్లా ఈ మహానుభావులంతా ఆయనకు దర్శనమిచ్చారు.
అటువంటి తెలివిగల మహానుభావులకు ఎవరితోనూ శతృత్వముండదు.
అటువంటి వారి తపోబలం వల్లనే ఈ భూమి ఆధారపడి నడుస్తోంది. వారికి మన, తన అనే తేడా లేదు. అందరూ వారికి స్వజనులే.

పజిల్-707

$
0
0

అడ్డం ( ఆధారాలు)

1.డమరుకం మోగిస్తూ, విచిత్ర వేషంతో యాచన చేసేవారిని... ధారులు అంటారు (5)
4.ఈశేష్ ‘గూఢచారి’ హీరో (3)
6.పొలము (2)
7.‘ఓరి మిత్రుడా!’ దీనిలో ఓర్పు వుండాలి (3)
10.సరిసమానము (2)
11.కొందరు దీన్ని ‘బెమ్మి’ చేయగలరు (2)
12.గ్రాంథికంలో గద్ద (2)
15.‘...మాతరం’ (2)
16.ఒక తాళము (2)
19.ఆయుర్వేద మందులు దీని మీదే నూరుతారు (2)
21.పోక (3)
23.అతి చిన్న గరిట. నెయ్యి వంటివి వడ్డించుటకు వాడేది (2)
25.వండిన రాగి పిండి మొదలగునది (3)
26.పౌరాణిక పాత్రల వేషాలు వేసుకుని పగలే యాచన చేసేవాళ్లని ‘...’గాళ్లు అంటారు (5)

నిలువు (ఆధారాలు)

2.కపోలము (2)
3.‘బిలహరి’లో తరంగం (3)
4.‘మతి’గల ఆమోదము (4)
5.అంత అందంగా వుండని వచ్చే సంవత్సరం (3)
7.పద్దెనిమిదేళ్లు నిండిన వారికి మన దేశంలో ఉండేది (4)
8.ఆకాశము (2)
9.‘శనిగ్రహం’లో మనం గ్రహించవలసిన మంచి గురించి (3)
13.నిజం ‘...’ మీద తెలుస్తుందని నానుడి (4)
14.ఏ దేశం? అని అడక్కండి. ఆజ్ఞ గ్రహించండి (3)
17.్భర్త (4)
18.బస్సులు రూట్‌లో తిరగనప్పుడు నిలబడే స్థలం (2)
20.పెట్టె (3)
22.ఈ వూరి పేరు చెబితే బాంబే గుర్తొస్తుంది (3)
24.మాటల్లో ‘పోటీ’ వుండొచ్చు గాని ఇలాటి ‘పోటి’ బాధిస్తుంది (2)

నేను.. సంభవాన్ని

$
0
0

నేను-
పలికితే పరవశించే నమ్మకాన్ని
తడిమితే పులకరించే విశ్వాసాన్ని
మాటను అందలమెక్కించే అధికారాన్ని
సమాలోచనల సిద్ధాంతాన్ని
సంఘర్షణల రాద్ధాంతాన్ని
నచ్చిన బాటన ప్రణాళికను
మెచ్చిన మార్గాన ప్రబోధాన్ని
పరంపరల ఉపదేశాన్ని
గాయపడ్డ చేతను
పట్టు తప్పిన ఉద్విగ్నతను
నొచ్చుకున్న మానసికతను.
నేను
చేతనాచేతన కలశాన్ని
ఆత్మవిద్యా కౌశలాన్ని
మూడు మెట్లెక్కిన నాడీమండలాన్ని
నాలుగో మెట్టున నిలబడ్డవాణ్ణి
ఏడోమెట్టున నవ అవతారాన్ని
ధ్యానమే అహమయిన ప్రజ్ఞానాన్ని.
ఇక్కడి నేను
సప్తాగ్ని శిఖల జీవ ప్రజ్ఞను
స్వరపేటిక అధిభౌతిక మంత్రాన్ని
అదృశ్యనేత్ర దృశ్య తంత్రాన్ని
సప్తశోభిత సుప్త ప్రాంగణాన్ని.
* * *
నేను-
సామూహిక చేతనను
ఖగోళ చేతనను
గిక చేతనన
అయినా, నేను
వైయక్తిక చేతననే!
అహంజనిత చేతననే!
తురీయాస్థిత చేతననే!
అవును, నేను
భయపూరిత జాగ్రత్ చేతనను కాను.
భయకంపిత స్వప్న చేతనను కాను.
భౌతికాతీత, మానసాతీత కేతన చేతనను.
నేను
ప్రవిమల సత్య దర్శనను
సప్త విశ్వ అణుసృజనను
సప్త సూత్ర కణ విచికిత్సను
సప్త చేతనల అంతరాగ్నిని
సుప్త చేతనల అంతర్లయను
సృష్టి సృజనా అంతఃకరణను.
* * *
నేను-
అస్తిత్వ తొలి ప్రాంగణంలో
అంధకారం సంధించిన అస్త్ర కిరణాన్ని
కిరణ సంయోగ అణు అల్లికను
అణువణువుల మట్టి ముద్దను
పాంచభౌతిక ఆవాహనను
ప్రకృతి ప్రసవించిన శక్తి విలసనాన్ని
మానవావతార మూలతనాన్ని..
కణ కదలికల చైతన్యాన్ని
చేతనను తొడుక్కుంటున్న పార్థివతను
పార్థివతత్వ పదార్థ ఆవిష్కరణను
సాంద్రతను తొలగించుకుంటున్న మాయను
సృష్టి సృజనకు బ్రాహ్మీ ముహూర్తాన్ని.
అస్తిత్వ మలి ప్రాంగణంలో
తపస్సు ప్రయోగించిన తేజస్సును
ఓజస్సంపన్న గిక భామికను
సృష్టికి ప్రతిసృష్టిగా నిలిచిన పుడమితల్లిని
ఉచ్ఛ్వాస నిశ్వాసల ప్రాణ స్పందనను
ప్రకృతి పరిష్వంగనా అయోనిజను
విశ్వవీక్షణా బీజాంకురాన్ని
ప్రసవానంతర ప్రాణ స్పందనను
మట్టిని తాకిన మహిమాన్వితాన్ని.
అస్తిత్వ తృతీయ ప్రాంగణంలో
మాయను పొదువుకున్న వాస్తవాన్ని
భ్రమాన్విత మానవ అవతారాన్ని
జగన్నాటక పాత్రల పల్లవిని
వికల్పతల ఉద్విగ్న చరణాన్ని
సంకల్ప సంజనిత సంయోగాన్ని
కారణజన్ముణ్ని.. కర్మయోగిని.
అస్తిత్వ చతుర్థ ప్రాంగణంలో
వంశ ప్రతిష్ఠతో నడుస్తున్న చరిత్రను
అపవిశ్వాసాలను విడుస్తున్న నిఘంటువును
భౌతిక అధిభౌతికతల విజ్ఞాన సర్వస్వాన్ని
బొడ్డూడిన నాడే పాతను వదిలిన వాణ్ని
కొత్త అడుగులకు మడుగులొత్తుతున్నవాణ్ని
భాషా మాధ్యమ వ్యక్తీకరణ కేతనాన్ని
శాబ్దిక నిశ్శబ్దతల వౌనధ్యానిని
మాట, చూపు, వినికిడిల నియంత్రణాశీలిని
బ్రతుకుతూ మృత్యువుతో చరిస్తున్నవాణ్ని
నేలను తన్నుకుని నింగికి ఎగసినవాణ్ని
అస్తిత్వ అయిదవ ప్రాంగణంలో
అందీఅందని భూమికల నిర్వచనాన్ని
ధూప దీపాల అతీత తత్వాన్ని
నీ-నా మత్తు వదులుతున్నవాణ్ని
నాతో నేనే పోరాడుతున్నవాణ్ని
నాలో నేనే సంఘటితమవుతున్న వాణ్ని
నేనే సంయోగాన్ని.. సంభవాన్ని
అస్తిత్వ ఆరవ ప్రాంగణంలో
రంగు - రుచి - వాసనలను
కర్త - కర్మ - క్రియలను
ప్రకృతి - వికృతులను
విద్వత్తును - విద్యుత్తును
అహంకారాన్ని - నిరహంకారాన్ని
ఆకర్షణను - నిరాకర్షణను
కాలాతీత ఆకాశిక ప్రమాణాన్ని.
అస్తిత్వ ఏడవ ప్రాంగణంలో
జాగ్రత్ - స్వప్న- సుషుప్తుల తురీయతను
సత్వ రజ స్తమో గుణాతీత వ్యాప్తిని
శుద్ధ ఆజ్ఞను- విశుద్ద ప్రజ్ఞను
సత్యవాహినిని - నిత్య చైతన్యాన్ని
సృష్టి సృజనను... విశ్వంభరను.

వానపాము

$
0
0

ఉలిక్కిపడ్డారంతా!
‘నేనన్నది, మీరు విన్నది.. అక్షరాలా నిజం..’ ముసిముసిగా నవ్వుతూ అయ్యగారు చెప్పిన మాటలకు.
అయ్యగారంటే జిల్లా స్థాయిలో కీలకమైన శాఖకు అధికారి. అయ్యగారు ఈ జిల్లాకు వచ్చిన ఉద్యోగ కాలం పూర్తి కావచ్చింది. నేడో రేపో బదిలీపై తప్పనిసరిగా వెళ్లాలి.
‘వెళ్లే ముందు ఘన సన్మానం చేసి నా కోరిక తీర్చండి’ అక్కడి వారి ఉలికిపాటుకి కారణమైన మాటల్ని మరోసారి వాళ్లకు వీనులవిందు చేశాడు.
‘నాకు సన్మానం చేయండి మొర్రో!’ అని సిగ్గు విడిచి నోరు తెరిచి అడిగిన ఉద్యోగి వాళ్లకి తెలిసి చరిత్ర పుటల్లో ఎక్కడా దాగిలేరు.
ఆయన గదిలో చాలా వినయంగా చేతులు కట్టుకొని మరీ వీలైనంత వొదిగిపోతూ నిలబడి ఉన్నారతడి సహచర గణం.
‘ఏం జరిగినా బదిలీ ఉత్తర్వులు చేతిలో పడక ముందే.. వీడ్కోలు సన్మానం బహు పసందుగా జరిగిపోవాలి..’ హిహి అంటూ థర్టీటు స్టార్స్ బయటపెట్టాడు.
బాస్ ఆజ్ఞకి భక్తిపూర్వకంగా తలలూపుతూ ‘తమకి ఆమ్యామ్యాలలో వాటా కల్పించిన సదరు అయ్యగారికి ఇలా కృతజ్ఞత చూపకపోతే ఎట్లా? సంసిద్ధమయ్యిందా విధేయ గణం.
‘వీలైనంత ఘనంగా జరపాలి’ బట్టగుండుని ఆప్యాయంగా నిమురుకుంటూ ఘనం పదాన్ని ఒత్తి పలికాడు.
ఏకకంఠంతో, ‘అలాగలాగే’ అంటూ భజన చేశారు.
బదిలీ అవుతూ కూడా వీలైనంత వెనకేసుకోవాలన్న మురికి ఆలోచన ఆ అధికారి శంకరయ్యది. గిట్టని వాళ్లు ‘వంకరయ్య’ అంటారు. నేమ్‌ప్లేట్‌లో అధికారి బదులు ‘అవినీతి’ ఉంటే బాగుండునని వ్యవహారం నచ్చని వాళ్ల అభియోగం.
‘సార్! చిన్న విషయం...’ గొణిగాడు అరుణ్.
‘పర్లేదు చెప్పు’
‘మీరు గమనించినట్టు లేదు. ‘మూడు కొంటే ఒకటి ఉచితం’ ఆఫర్ లాగ మా ముగ్గురితోపాటు ఈ గోపాలం కూడా ప్లస్సయ్యాడు’ కట్టుకున్న చేతుల్ని విడవకుండా మోచేత్తోనే గోపాలాన్ని బాస్‌కి చూపాడు అరుణ్.
గినె్నలు తోనే ప్లాస్టిక్ పీచులాగ ఫేసు పెట్టి బాస్ వంక చూశాడు గోపాలం.
‘దివ్యాంగుల స్థారుూ నిర్ధారణ శిబిరాల్లో అక్రమాలు జరిగాయని.. గతంలో నాపై అధికారులకు కంప్లయింటిచ్చావు. ఏం జరిగిందయ్యా గోపాలం? నన్ను ఉతికేసారా? నీకు శాలువా కప్పేశారా?’ అయ్యగారు ఆ ప్రస్తావన తెస్తాడని ఊహించని గోపాలం డిపాజిట్టు గల్లంతయిన నాయకుడిలా విలవిల్లాడాడు.
‘పైగా ద్విచక్ర వాహన మొకటి నాకు బహుమతిగా ముట్టిందని తెగ టాంటాం చేశావు? ఏవీ అవలేదు కదా!’ అడుగుతూంటే పిల్లి కంటపడిన ఎలుకలా బిర్రబిగుసుకు పోయాడు.
‘అధికారులకు ‘అడ్డం’ పడతారుటయ్యా ఎవరైనా? ‘అండ’గా వుండాలి గానీ! ఆ రోజు అలా ఎదురు తిరగకపోతే.. నీ వాటాగా మీ చంటాడికో సైకిల్ దక్కేది కదా!..’ అంటూ ఆయన మీసాలు తిప్పుకుంటూంటే.. పిల్లి తమాషాగా మీసాలు తిప్పుకున్నట్లనిపించింది సదరు గోపాలానికి.
కిసుక్కున నవ్వాడు.
‘మన పక్షాన నిలిచాడు కదా! గతం గతః వదిలేయండి సార్!’ ఈసారి సంపత్ సపోర్ట్ చేశాడు గోపాలానికి.
అయ్యగారు వదిలిపెట్టలేదు.
‘ఎవరికైనా అవసరాలుంటాయ్! జీతం రాళ్లతో పొయ్యి వెలిగించుకోవాలంటే ఉద్యోగులకు కుదిరే పనేనా? అయినా పిల్లి ఎలుకల్ని వేటాడ్డం సహజమే! కానీ, ఎలుకే పిల్లిని భయపెట్టాలనుకుంటే ఎలాగోయ్!’ అంటూ వెట‘కారం’ జల్లాడు.
‘ఏటికి ఎదురీదకూడదని ఇప్పటికైనా తెలిసినట్టుంది. నొక్కిన అతడి ప్రమోషన్ కాగితానికి మీరు వెళ్లేలోగానైనా రెక్కలు కట్టండి సార్!’ గోపాలం ఈ శిబిరంలో చేరడానికి వెనకున్న అసలు కారణం బయటపెట్టాడు మహేష్.
అరుణ్, సంపత్, మహేష్‌లు మురికి శంకరయ్యతో కూడి ‘అవినీతి చతుష్టయం’గా పేరొందారు.
గోపాలం ‘ఆంటీ వైరస్’గా మారడంతో అందరిలో సీనియర్ అయిన గోపాలం ప్రమోషన్ ఫైల్ నొక్కేశాడు శంకరయ్య.
‘గోపాలం ‘పంచ’ముడి’గా వచ్చాడుగా! చూద్దాంలే..’ నాయకులు అయిదేళ్లకొకసారి ఇచ్చే వాగ్దానంలా భరోసా ఇచ్చాడు వంకరగా నవ్వుతూ శంకరయ్య.
‘చిత్తం చిత్తం!’ వంత పాడుతూ రంగం సిద్ధం చేసుకోవడానికి గది నుండి గభాల్న బయటపడ్డారు.
* * *
అయ్యగారికి నజరానా సమర్పించుకోవడానికి అనుచర గణం తక్షణం వసూళ్ల పర్వానికి తెరలేపారు.
శంకరయ్య ఆఫీసులో పలు అవకతవకలు జరుగుతున్నట్లు సిబ్బందిపై పలు ఆరోపణలున్నాయి. (ఇవి శంకరయ్య ముందస్తు జాగ్రత్తగా సృష్టించినవే.)
ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిని.. వేటు నుండి తప్పించేస్తానని శంకరయ్య గారి నుండి అనుచర గణం ద్వారా సంకేతాలందాయి. దాంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
అనుచర గణమేమో వాళ్ల నుండి వీడ్కోలు కానుకల పేరిట డబ్బు గుంజేశారు. అయ్యగారి పేర బ్యాంకులో చేరవేశారు.
అన్నీ అనుకున్నట్టు సజావుగా జరిగితే.. అందులో మజా ఏముంటుంది?
సొమ్మంతా భారీ ఎత్తున బ్యాంకులో జమ అయ్యాక, అయ్యగారు ఓ ఆటంబాంబు పేల్చాడు! ఆయన పెట్టిన ఫిట్టింగ్‌కి అనుచర గణం అదిరిపడ్డారు!
ఆ వైనమేమంటే...
* * *
శంకరయ్యకి ఈ త్రయం ఎనలేని సహకార మందించింది. అక్షయ పాత్రకే బాపు లాంటి ఈ జిల్లాను వదిలి వెళ్లాలనిపించడం లేదా ఆఫీసర్‌కు. అందుకే ఓ నిర్ణయం తీసుకున్నాడు.
శంకరయ్య వెలిబుచ్చిన గొంతెమ్మ కోరికకు అవినీతి త్రయంతో పాటుగా గోపాలానికి కళ్లు బైర్లు కమ్మినయ్.
అదేమిటంటే-
* * *
‘మిమ్మల్ని వదిలి బదిలీ కావాలన్పించడం లేదు’ అంటూ పాలుతాగే పిల్లోడిలా బుంగమూతి పెట్టాడు.
మొదట వెర్రిపప్పల బుర్రలకు ఎక్కలేదా మేటర్.
‘నన్ను ట్రాన్స్‌ఫర్ చేయకుండా ఆపేయమని కలెక్టర్‌గారికి విన్నపం చేసుకోవాలి..’ అంటూ ఆ గరంగరం గుండెలపై ఓ ఎగ్ ఆమ్లెట్ వేశాడు.
బిక్కచచ్చిపోయారు పాపం పసివాళ్లు!
‘నా ప్రమేయం లేకుండానే ఇదంతా జరిగిపోవాలి’
కలుగులోకి వచ్చిన ఎలుక కదలక మానదు.. అన్నట్టు, అందరూ సరేనన్నట్టు తలలూపారు.
* * *
అనుచర గణం సుదీర్ఘంగా.. పంచవర్ష ప్రణాళికలంత సుదీర్ఘంగా.. త్రివర్ష ప్రణాళికలు తయారుచేశారు.
ఆపరేషన్ నెంబర్‌వన్...
తమ నలుగురి సంతకాలతో జిల్లా కలెక్టర్ గారికి అభ్యర్థన పూర్వకంగా ఒక వినతిపత్రం సమర్పించడం.
మరి ఇది వికటిస్తే?
ప్లాన్ టూ-
తమ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన అందరు ఉద్యోగస్థులతో సామూహికంగా సంతకాలు చేయించి.. విన్నవించడం.
మరి ఈ మందు పనే్జయకపోతే?
ప్లాన్ త్రీ-
ప్రస్తుతానికి ఏమీ అనుకోకుండానే.. వాయిదా వేశారు.
ఎటొచ్చి అయ్యగారి అనుజ్ఞానుసారం.. బదిలీ ప్రక్రియ ఆపాలన్నదే ఆ నమ్మకబంటుల సంకల్పం.
* * *
అనుకున్నట్టుగానే శంకరయ్యగారి బదిలీని ఆపాలన్న వినతిపత్రాన్ని.. నలుగురూ తమతమ సంతకాలతో.. జిల్లా కలెక్టర్‌కి సమర్పించారు.
అచ్చూసిన శంకరయ్యగారు ‘మీ వేడుకోలు తప్పక నా వీడుకోలుని ఆపే ఆయుధమవుతుందని’ తెగ మురిసిపోయాడు.
కథ అన్నాక మలుపులుండాలి.
అప్పుడే యమ పసందుగా ఉంటుంది!!
అందుకే...
ఇక్కడో ఊహించని చిన్న కుదుపు-
* * *
నెంబర్ వన్-
వారి వింత అభ్యర్థనను మన్నిస్తూ.. అయ్యగారు మరి కొంతకాలం విధుల్లో కొనసాగాలనే తీపి కబురు అందాలి.
లేదా..
నెంబర్ టూ-
ఏకంగా బదిలీ చేస్తున్నట్టేనా ఆర్డర్స్ వెలువడాలి.
ఈ రెండింటిలో ఏదైనా ఒకటి జరగాలన్నది అనుచర గణం ఊహ.
అనూహ్యంగా.. తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్టు.. గేరు తారుమారయ్యింది.
ఫలితం పల్టీ కొట్టింది. పథకం పక్కా బొక్కబోర్లా పడింది.
శంకరయ్య షాకయ్యాడు!
‘విషయం’ కాస్తా ‘విషం’ అయ్యింది శంకరయ్యకు. కక్కలేక మింగలేక నోట్లో గుడ్డ కుక్కుకొని కూలబడ్డాడు ఛెయిర్‌లో.
అసలు విషయమేమిటంటే...
అయ్యగారికి ఏకంగా ఉద్యోగం నుండి ఊడే ఆర్డర్స్ వచ్చాయి! సస్పెండ్ అయ్యాడు.
శంకరయ్య విషయం తెలిసినప్పటి నుండి నిలువెల్లా వణికిపోతున్నాడు. రిటైర్మెంట్ టైంలో ఈ రిమార్క్ ఏంటని!
పరపతి పాయె.. ఉద్యోగానికి ఎసరాయె.
హతోస్మి!
* * *
ఈ కథకి ఇంతటితో శుభం కార్డ్ పడలేదు.
మరో మాంఛి కుదుపుందండోయ్!
అవినీతికి పాల్పడే వాడెవడైనా ఇతరులను గుడ్డిగా నమ్మనట్టే.. ఇక్కడ శంకరయ్య అంతే...! కీడెంచి మేలెంచే రకం.
గోపాలం ఇప్పుడొచ్చి ఈ అవినీతి మూకతో కలిశాడు గానీ.. అయ్యగారు తన అనుచర మూషిక త్రయం మీద ఎప్పుడో మార్జాలపు కన్నువేశాడు.
అందుకే పరిస్థితులు చెడి.. తన కాలికి తాడుకట్టి వాళ్లులాగే సమయాన, తనతోపాటు వాళ్లు కూడా గోతిలో పడాలన్న తలంపుతో.. తాడు రెండో చివరిని త్రయానికి బిగించేసి ఉంచాడు.
అందుకే ఇప్పుడొచ్చిన ఊస్టింగ్ ఆర్డర్స్ ఒక్క శంకరయ్యకే కాదు.. వీళ్ల ముగ్గురికి కూడా అందాయి. అదన్న మాట కొసమెరుపు.
కుడితిలో పడ్డ ఎలుకల్లా గింజుకున్నారు!
ఇది సరే... ప్రతి కథకు ఓ కథానాయకుడుండటం రివాజు.
మరి ఈ కథలోని పలు మలుపుల నాటకానికి.. అసలు సూత్రధారి మన గోపాలం అన్నమాట...!
* * *
కథానాయకుడు గోపాలం తన చేతులకు మట్టి అంటకుండా ఇక్కడో సేఫ్ గేమ్ ప్లే చేశాడు.
ఆ గేమ్ ఏంటంటే-
ఎవరెవరి దగ్గర ఈ త్రయం (ప్లస్ తను) ఎంతెంత రొక్కం వసూలు చేసింది.. నయాపైసల్తో సహా చిట్టా తయారుచేశాడు.
‘మేం అయ్యగారికి లెక్కలు చూపాలి. పైగా మీరెంతెంత ఇచ్చారో.. వివరాలు తన దగ్గర ఉండాలన్నారు’ అంటూ ఒంటరిగా వెళ్లి అందరి దగ్గరా డబ్బిచ్చినట్టు సంతకాలు తీసుకున్నాడు. రసీదులిచ్చి మరీ సంతకాలు తీసుకొని డూప్లికేట్స్ తన దగ్గర ఉంచుకున్నాడు. ఈ అవకాశం కోసమే ప్రత్యర్థుల జట్టులో దూరాడు మరి!
శంకరయ్యపై బోలెడు ఆరోపణలు ఉండడం.. ఈయనని సమర్థిస్తూ ‘మా అయ్యగారిని బదిలీ చేయకండి’ అని విచిత్రంగా విన్నపం రావడం.. జిల్లా కలెక్టర్ ఇందులో ఏదో తిరకాసుందని గ్రహించాడు.
పైగా గోపాలం సేకరించిన రసీదులకి, శంకరయ్య అకౌంట్‌లో పడిన ఎవౌంట్‌కి లెక్క సరిపోయింది!
ఉద్యోగులందర్ని విడివిడిగా విచారించిన పిదప... ఆ కమిటీ జిల్లా కలెక్టర్‌కు అందించిన రిపోర్టు ఫలితమే...
ఆ నలుగురి ఉద్యోగాల ఊస్టింగ్!
వానపాము తాను పైకి కనపడకుండా మట్టిలో దాగి ఉంటూ.. నేలను సారవంతం చేయడానికి నడుం బిగించినట్టు...
గోపాలం కొత్త పంథాలో అవినీతి పరులతోనే కలిసిపోయినట్టు నటించి.. ఆ అవినీతినే అంతం చేయడానికి పూనుకున్నాడు...!
* * *
లంచగొండిగా తిమింగలమంత పరిమాణానికి పెరిగిన ఆఫీసర్ని ప్లస్ అనుచర గణాన్ని పట్టివ్వడానికి.. తానొక ఎరగా వానపామై ఉపయోగపడినందుకు గోపాలం చాలా హ్యాపీగా ఫీలవుతున్నాడు.
‘వీడుకోలు’కు ఘనంగా ఆశపడ్డ లంచగొండి అధికారికి.. ఏకంగా ఉద్యోగం నుండే ఉద్వాసన పలికిన విషాదమిది.
‘ఉపకారికి ఉపకారమే జరుగుతుంది’ అనే ఓల్డ్ ఈజ్ గోల్డ్ నానుడికి ప్రతీకగా.. మన కథానాయకుడు గోపాలం పదోన్నతి పొందడంతో,, కథ ఇలా భలేగా సుఖాంతమైంది సుమా!
==================================================================
*కథలకు ఆహ్వానం
‘ఆదివారం ఆంధ్రభూమి’కి కథలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.
పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.netకు మెయల్‌లో పంపాలి.

అరుదైన చారిత్రక నవల.. ‘మాలిక్ కాఫిర్’

$
0
0

క్రీ.శ.1290 ప్రాంతంలో భారతదేశ చరిత్రను మార్చిన వీరుడు మాలిక్ కాఫిర్. ఇతడు ఢిల్లీని పాలించిన అల్లావుద్దీన్ ఖిల్జీకి బానిస. వెయ్యి దీనారాలకు అమ్ముడుపోయి, నపుంసకుడిగా మార్చబడిన ‘హజార్ దీనారీ’ మాలిక్ కాఫిర్. ఇతను వీరుడు. కానీ నాయకుడు, ప్రతినాయకుడు కాదు. అంటే ఇతను హీరో కాదు, విలన్ కాదు. వేటాడి, వేటాడబడి, తన క్రోధాగ్నిలో తనే ఆహుతి అయిపోయిన అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రియుడు.
మాలిక్ కాఫిర్ ముఖ్య పాత్రలో ఈ మధ్యనే దీపికా పదుకొనె, రణ్‌వీర్‌సింగ్, షాహిద్ కపూర్ తారలుగా పద్మావత్ (పద్మావతీ) సినిమా వచ్చింది. మాలిక్ కాఫిర్ అనే నవల ప్రొ. ముదిగొండ శివప్రసాద్ గారు రాశారు. ఢిల్లీ నుండి వచ్చి మన తలమానికమైన కోహినూర్ వజ్రాన్ని, మన వైభవాన్ని కొల్లగొట్టిన బానిస సేనాని మాలిక్ కాఫిర్.
ఈ నవల పేరు అతని మీదే. కథ మాలిక్ కాఫిర్ చుట్టూ తిరిగినా, ఈ నవల నాయకుడు మాలిక్ కాఫిర్ కాదు. ఈ నవల ఆత్మ అజరామరమైన హిందూ ధర్మం. గంగలా అనంతంగా, చిరాయువుగా హిందూ సంస్కృతి మన దేశంలో సాగుతోంది. గంగానది ఎన్ని మలుపులు తిరిగినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఒక జీవనదిగా ఎన్నో నదులను కలుపుకుంటూ, యుగయుగాలుగా సాగుతోంది. అలాగే హిందూ ధర్మం కూడా మన దేశంలో ఒక జీవనదిగా జీవశైలిగా సాగుతోంది. భారతదేశం వెనె్నముక శ్రీరాముడు. ఆత్మ శ్రీకృష్ణుడు. ఎక్కడ రామనామం జపిస్తారో అది భారతదేశం. శ్రీకృష్ణుడి కథలు ఆడిపాడి యుగయుగాలుగా తరించారు. భారతదేశ సంస్కృతి రామనామంలో దాగి ఉంది. ఈ ధర్మం కుల మతాలకు అతీతంగా, ఈ దేశ ప్రజల్లో జీవనాడిగా, సజీవ నదిగా ఉంది. ఇదే మన జవమూ, జీవమూ!
అలెగ్జాండర్, గజనీ, ఘోరీ, తైమూర్, ఛెంగిజ్‌ఖాన్‌లు బందిపోటు దొంగలుగా వచ్చారు. మాలిక్ కాఫిర్, బాబర్, ఔరంగజేబు ఇక్కడే ఢిల్లీలో వుంటూ మన గుళ్లూ గోపురాలూ కొల్లగొట్టారు. ఎందుకంటే గుడి ఒక బడి. గుడిలో భక్తి, ముక్తి, రక్తి లభిస్తాయి (్భక్తి కూడా!) కాకతీయుల నాటికి గుడి సమాజం కేంద్ర బిందువు. ఇక్కడ పెళ్లిళ్లు జరుగుతాయి. ఉపనయనం, సామాజిక ధార్మిక సంఘటనలు అన్నీ గుడిలోనే జరిగేవి. గుడికి అనుబంధంగా బడి, వైద్యాలయం, ప్రసూతి ఆస్పత్రి, యుద్ధ రంగానికి కావలసిన శిక్షణాలయం ఉండేవి. గుడిలో తక్కువ వడ్డీకి అప్పులు ఇచ్చేవారు. అంటే గుడి - ఆర్థిక, సామాజిక, ధార్మిక, వైద్య, విద్య, కళ, సైనిక, యుద్ధాలకు కేంద్ర బిందువు. గుడిని కొల్లగొడితే మన సమాజం నిర్వీర్యమై పోయేది. అందుకే ఆ రోజుల్లో ధనాన్ని లూటీ చేయడంతో పాటు, దేవదాసీలను చెరిచి, శిల్పాలను, మన దేవతా విగ్రహాలను కొల్లగొట్టి సంస్కృతిని తుడిపేయడానికి ప్రయత్నం చేసి, సమాజాన్ని నిర్వీర్యం చేసేవారు ఈ దోపిడీదారులు. అయితే గుడిని కొల్లగొడితే మన హిందూ ధర్మం కుంటుపడుతుందనేది ఈ వెర్రివాళ్ల భ్రమ. హిందూ ధర్మం మన రక్తంలో ఇమిడి ఉంది. పుణ్య పవిత్ర గంగానది ప్రవహించినన్నాళ్లూ హిందూ ధర్మం సాగుతూనే ఉంటుంది.
ఇక మాలిక్ కాఫిర్ మొదటి పంక్తి ‘ఓం నమస్తే రుద్రమన్య వఉతోత ఇషవే నమః’ ఔను! ఇది రుద్ర మహారాజు కథ, ప్రతాపరుద్ర మహారాజు గాథ! కథలో నాగయ్యగన్న సేనాని ఆహార్యం వేసుకుంటూ గడ్డం పెట్టుకుంటాడు - ఇది అలంకార భాషలో ‘గండం’. రాబోయే ప్రమాదానికి సూచన. మాలిక్ కాఫిర్ యుద్ధంలో దొరికిన బానిస, బలవంతంగా నపుంసకుడిగా మార్చబడి, మతం మార్పిడికి లోనవుతాడు. అతడు వేటగాడు! తన మనస్సులో క్రోధానికి, బీభత్సానికి తనే వేటాడబడ్డాడు. తన హృదయంలో అతడే నరరక్తం మరిగిన పులి, తనే మేక, తనే కసాయి.
ఏ గుడి నుండి బయటకు వెళ్లగొట్టబడ్డాడో అదే గుడి మీద దండయాత్ర చేశాడు. పురుషత్వం కోల్పోయిన మాలిక్ కాఫిర్‌కు సంసార సుఖం లేదు. ఈ నేపథ్యంలో అతి వైభవోపేతమైన కాకతీయ సామ్రాజ్యం పతనమైంది. వారి (మన) నిజమైన సంపద కావ్యాలు, శిల్పాలు, గుళ్లల్లో దేవదాసీల నృత్యాలు. ఎంత వైభవం కోల్పోయాం. ‘మాలిక్ కాఫిర్’ నవలకు అంగీరసం అంటే ప్రధాన రసం కరుణ. భవభూతి ఉత్తరామ చరిత్రలో ఇలా అన్నాడు.. ‘ఏకోరసః కరుణ ఏవ నిమిత్త భేదాద్భిన్నః పృథక్పృథ గివాశ్రయతే వివర్తాన్‌॥ ఆవర్త బుద్బుధ తరంగ ఘయాన్వి కారా సంభో యథా సలిలమేవ హి తత్సమస్తమ్‌॥
అంటే కరుణ రసమొక్కటే ప్రకృతి రసం అని అర్థం. ధర్మ నాశం, అర్థనాశం, ఇష్టజన బాంధవనాశం, వధ, ఉరి, దారిద్య్రం, పద భ్రంశం, అవమానం, ధిక్కారం, వ్యాధి మొ. వినటం, చదవటం, చూడటం కరుణరస విభావాలు. దీని స్థారుూ భావం శోకం, రంగుకపోతము, దేవత యముడు. రౌద్రము యొక్క ఫలమే కరుణ (జన్య జనకత్వం)
నర్మదానదిలో ప్రతి రాయి ఒక సాలగ్రామం. ప్రతాపరుద్రుడు లింగోద్భవ సమయంలో నర్మదలో మునిగి లింగైక్యం అయ్యాడు. చారిత్రక నవలా రచన కత్తిమీద సాము. ప్రామాణికత వదిలి గాలిలో గారడీ చేయడానికి వీల్లేదు.
అలాగని మరీ హిస్టరీ పాఠ్య గ్రంథంలా రాస్తే పాఠకుడికి విసుగు వస్తుంది. అందుకే తెలుగులో చారిత్రక నవలలకు నోరి, విశ్వనాథ, అడివి బాపిరాజుతో నాల్గవ మూలస్తంభం ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్.
ప్రతి వ్యక్తి విజయం, పరాజయం వెనుక ఒక స్ర్తి ఉంటుంది. ఖిల్జీ భార్య మల్లికాబేగం వల్ల ప్రతాపరుద్రుడు మాచల్దేవి వల్ల విజయులు కాలేకపోయారు. మాలిక్ కాఫిర్ చనిపోయినా అతని ద్వేషం, పగ కొనసాగి అతని ఆత్మను సజీవంగా ఉంచాయి.
భారతీయ సంస్కృతి మళ్లీ కాకతీయ రుద్రమదేవి నాటి వైభవం చేరుకుంటుందని ఆశిద్దాం.

Viewing all 69482 articles
Browse latest View live