Are you the publisher? Claim or contact us about this channel


Embed this content in your HTML

Search

Report adult content:

click to rate:

Account: (login)

More Channels


Showcase


Channel Catalog


older | 1 | .... | 2018 | 2019 | (Page 2020) | 2021 | 2022 | .... | 2069 | newer

  0 0

  డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...

  ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

  1. పక్కనున్న వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానిది?
  2. ఏ ఆంగ్ల చిత్రం ఆధారంగా చిరంజీవి ‘లంకేశ్వరుడు’ క్లైమాక్స్ రూపొందించారు?
  3. విలన్ పాత్రలతో ఆకట్టుకున్న దివంగత రఘువరన్ పూర్తి పేరు?
  4. శంకరాభరణం చిత్రంలోని బ్రోచేవారెవరురా? కీర్తన రచయత?
  5. 1060లో రేలంగి వెంకట రామయ్య నిర్మించిన చిత్రమేది?
  6. జ్యో అచ్యుతానంద చిత్రంలో రెజీనా కాసాండ్రా ముద్దు పేరు?
  7. భలేమంచిరోజు చిత్రంలో సుధీర్‌బాబుతో జోడీకట్టిన హీరోయిన్?
  8. అసలు పేరు మంగభామ. ఆ నటి ఏ స్క్రీన్ నేమ్‌తో పాపులరైంది?
  9. కమలాకర కామేశ్వర రావు ‘గుణసుందరి కథ’ చిత్రానికి సినిమాటోగ్రాఫర్?
  10. ఈ హీరోయిన్‌ను కనిపెట్టండి?

  సమాధానాలు- 110

  1. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్
  2. వి రామచంద్రరావు
  3. మల్లి
  4. అలక
  5. రమాప్రభ
  6. జీవన
  7. జెవి రాఘవులు
  8. దేవులపల్లి కృష్ణశాస్ర్తీ
  9. రేణుక
  10. ఇంద్రజ

  సరైన సమాధానాలు రాసిన వారు

  సిహెచ్‌ఎన్ రావు, తణుకు
  కె శివానంద, బొబ్బిలి
  కె నాగిశెట్టి, కర్నూలు
  బీఏ రాజు, కందుకూరు
  బి రామయ్య, అయనవిల్లి
  కృష్ణారెడ్డి జి, సికింద్రాబాద్
  కెడి మోహన్, హైదరాబాద్
  టి రమ్యదీప్తి, సత్తెనపల్లి
  జివిఎం మోహన్, ముచ్చుమిల్లి
  ఎల్ మోక్షజ్ఞ, శ్రీకాకుళం
  ఎల్ అహమద్, సుల్తానాబాద్
  ఎం శంకర్రావ్, డి గన్నవరం
  బీర రాజేంద్ర, కర్నూలు
  పీవీ శివప్రసాదరావు, అద్దంకి
  సీ సత్యలక్ష్మి, నల్గొండ

  పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36,
  సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03


  0 0

  సెకెండ్ ఇన్నింగ్స్‌లో కాస్త భిన్నమైన సినిమాలతో హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాలు సుమంత్ చేస్తున్నా, ఫలితమే దక్కడం లేదు. నాలుగేళ్ల గ్యాప్ తరువాత -వద్దవద్దనుకుంటూనే హారర్, థ్రిల్లర్ కథలపై పడిన సుమంత్, ఈమధ్యే చేసిన సుబ్రమణ్యపురం, ఇదం జగత్ చిత్రాలు కెరీర్‌కు కొత్త టర్న్ ఇవ్వలేకపోయాయ. నిజానికి సవాలుతో కూడుకున్న పాత్రలను సైతం అలవోకగా చేయగలిగే సుమంత్, తనవరకూ చిత్రాలకు న్యాయం చేస్తున్నా, మొత్తంగా ప్రాజెక్టులే నిరుత్సాహపరుస్తున్నాయ. కొత్త కొత్త హీరోయిన్‌లతో ప్రయోగాలు చేస్తున్నా -ఫలితమే కనిపించటం లేదు. సుమంత్ తన పాత స్టయల్లో సినిమాలు చేస్తేనైనా కెరీర్‌కు ఉపయోగపడే టర్న్ వస్తుందేమో. ఆలోచించాలి.
  -సీఆర్ బొల్లిముంత, ఒంగోలు
  ఆయన అదోటైపు
  గతంలో రామ్‌గోపాల్‌వర్మను ఎందుకు ఎక్కువగా దెయ్యాల చిత్రాల్లో భయంకరమైన సన్నివేశాలు పెడతారని మీడియా అడిగినపుడు జవాబుగా -జనాన్ని భయపెట్టడం ఇష్టమని చెప్పాడు. ఇటీవల తెలంగాణ ఎన్నికల సమయంలో ఎన్నికలపై మీ అభిప్రాయమేంటి? అన్న ప్రశ్నకు -ఓటువేసే ప్రతీ ఒక్కరు బకరా అంటూ సమాధానమిచ్చాడు. అసలు రాంగోపాల్‌వర్మకు సొసైటీపై గాని, రాజకీయాలపై గాని ఏమాత్రం సదభిప్రాయం లేదు. అందుకేనేమో మీడియా ఎప్పుడూ అతన్ని హైలెట్ చేస్తూ ఉంటుంది. సైకియాట్రిస్టులు చొరవతీసుకుని వర్మకు కౌనె్సలింగ్ చేస్తే బాగుంటుందనిపిస్తుంది. మీడియా కూడా వర్మకు దూరంగా ఉండటం ఎంతైనా సమాజానికి శ్రేయస్కరం.
  -బి కృష్ణ, హైదరాబాద్
  ఆనాటి సినిమాలు
  ఆదివారం వెనె్నల ఎప్పటిలాగే అలంకరించబడ్డ పుష్పమాలలా సుగంధం విరజిమ్మే వ్యాసాలతో అలరించింది. మాయమైనారమ్మా మహిళాభిమానులు, శంకర్ సీక్వెల్స్, ఎనె్నన్నో అందాలు -వ్యాసాలు పొద్దనే్న కమ్మని పెరుగన్నం తిన్న భావన కలిగించాయ. .. మహిళాభిమానుల కథనంలో వ్యాసకర్త నుడివినట్టు పాత సినిమాలు తెరమీద చూస్తున్నా, నిత్యజీవిత సంఘటనలేనన్న భావన కలిగిస్తాయ. అందుకే ఆ సినిమాలు, నవ్వించాయి. ఏడిపించాయి, ఈనాటికి నిత్యనూతనంగా వెలసిల్లుతున్నాయి. మాణిక్యేశ్వరి సారంగధర చిత్రం ఫ్లాష్‌బ్యాక్ చదువుతుంటే మరోసారి సినిమా చూస్తున్నట్లునిపించింది.
  -ఎన్నారెల్, సికిందరాబాద్
  ప్రియాంక ముందుచూపు
  సల్మాన్‌ఖాన్ చిత్రం ‘్భరత్’ దర్శకుడు అలీ అబ్బాస్‌కి చాలాసార్లు ప్రియాంకాచోప్రా ఫోన్ చేసి తనకు సల్మాన్‌తో నటించాలని ఉంది అని చెప్పిందట. సల్మాన్ స్నేహితులకూ చెప్పింది. దుబాయ్‌లో నేరుగా సల్మాన్‌కే చెప్పడంతో ఆ చిత్రంలో ఆమెను తీసుకున్నారు. కొన్ని వారాలు గడిచాక ఆమె ఆ చిత్రంనుంచి తప్పుకుంది. అందుకు కారణం ఆమెకు పెళ్లి ఫిక్స్ కావడమేనన్న టాక్ వినిపించింది. అయతే, అసలు కారణం ఇప్పుడు బయటపడింది. ఆ చిత్రంలో తబు, దిశాపటానినీ తీసుకున్నారట. తన స్థాయికి తగినట్టు బాగా ప్రాముఖ్యంవున్న పాత్ర ఇస్తారని ప్రియాంక భావించిందిగాని ముగ్గురు హీరోయిన్లలో ఒక సాధారణ పాత్ర అని తెలిసి తప్పుకుందట.
  -ప్రసన్న, పేర్రాజుపేట
  అదంతే..
  పాత పేరుతో కొత్త సినిమాలు రావడం తెలిసిందే. ఇది చిత్రసీమ కదా. చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. పాత సినిమా కథకు రంగులు, మెరుగులుదిద్ది కొత్త సినిమా అని భ్రమింపజేయడం కమర్షియల్ సూత్రమే. ఇటీవలి బహిరంగ ఉదాహరణ పాత మీనా చిత్రం ‘అఆ’గా మారడం! అలాగే ‘బంగారుపిచుక’ చిత్రం ‘పెళ్లికొడుకు’గా మారింది. ఆ రెండు చిత్రాలకూ దర్శకుడు బాపూనే. అంతేకాదు ఆయనే ముత్యాలముగ్గును సుందరకాండగా తీర్చిదిద్దాడు. దశాబ్దాల క్రితం బ్రతుకుతెరువు చిత్రం సూపర్‌హిట్ అయింది. దానినే కొడుకు కోడలుగా పునర్నిర్మించారు. రెండింటిలోనూ నాగేశ్వరరావే హీరో! అలాగే సన్నాఫ్ ఇండియా హిందీ చిత్రం మన బాలనాగమ్మకు రీమేక్! అయితే అవి రీమేక్‌లని చెప్పరు!
  -సుధీర్, శ్రీనగర్
  అక్కడే ఎక్కువ
  మన దేశంలో ఆడవారిపై జరుగుతున్న దాడులపై తీవ్రంగా స్పందిస్తూ అమ్మాయిలు దేశం విడిచివెళ్లిపోతే మంచిది అంది ప్రియమణి. అందుకు ఆమె విమర్శలు ఎదుర్కొంటున్నది. కొంతకాలం క్రితం అమీర్‌ఖాన్ కూడా దేశంలో అసహనం పెరిగిపోతున్నది. నా భార్య మరో దేశానికి పోదాం అంటున్నది అని చెప్పగానే ‘అలాగే వెళ్లిపొండి’అని విమర్శలు వెల్లువెత్తాయి. నేను భారతీయుడిని. నేనెందుకు వెళ్లిపోతాను అని సర్దుకున్నాడు అమీర్. మన దేశ జనాభా 120కోట్లు దాటేసింది కనుకనే వార్తలు ఎక్కువ సంఖ్యాపరంగా. విదేశాలు స్వర్గ్ధామాలేమీకావు. అక్కడా అత్యాచారాలు, రేప్‌లు, హత్యలు జరుగుతున్నాయి. జనాభాతో నేరసంఖ్యని పోల్చితే అమెరికాలోనే నేరాల శాతం మనకంటే ఎక్కువ. ఆ విషయం తెలిసినా మనకు మోజు తగ్గదు.
  -సుభాష్, శ్రీనగర్
  అదీ తొలి బయోపిక్
  ఒక భారతీయుని జీవితంపై చిత్రం తీసి ప్రపంచానే్న ఊపేసి ఆస్కార్ అవార్డుల్ని కొల్లగొట్టిన ‘గాంధీ’ చిత్రాన్ని భారతీయ తొలి బయోపిక్‌గా భావించవచ్చు. అందులోనూ అసత్యాలు, అర్థసత్యాలూ ఉన్నాయి. స్క్రిప్ట్‌ని ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీకి చూపించి ఆమె సూచనలను పాటించి తీసిన చిత్రం ఇది. స్వార్థం, దురాశ, నిప్పురగిలించి తమాషా చూసే నైజం, విభజించి పాలించే ఎత్తుగడ, బహుక్రూరంగా వ్యతిరేకతను అణచివేయడం లాంటి ఆంగ్లేయుల గుణాలను వైట్‌వాష్ చేసి వారిని పక్కా జంటిల్మన్‌లు లాగ చూపించారు. వంటింటి కుందేలు లాగ బతికిన కస్తూర్బాను చకచకా అందరితో మాట్లాడే మాడర్న్ ఉమన్‌గా చూపించడం మరో లోపం.
  -లంబకర్ల, రాజేంద్రనగర్


  0 0

  కృష్ణా జిల్లా ఊడ్పుగల్లులోని సామాన్య కుటుంబంలో 1922 జూన్ 14న జన్మించారు వీరమాచినేని మధుసూధనరావు (వి మధుసూధనరావు). పునాదిపాడులో హైస్కూలు చదువు, గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. యల్‌వి ప్రసాద్, కెయస్ ప్రకాశరావు, టి ప్రకాశ్‌రావు, ఆదుర్తి సుబ్బారావు వద్ద ఫిల్మ్ క్రాఫ్ట్‌లోని అంశాలు బాగా అధ్యయనం చేశారు. సతీ తులసి (1959) పౌరాణిక చిత్రంతో దర్శకత్వ బాధ్యతలు స్వీకరించి, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 70 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు. అనేక చిత్రాల విజయాలు సాధించి విక్టరీ మధుసూధనరావుగా ప్రశంసలు అందుకున్నారు. జగపతి సంస్థ తొలి చిత్రం ‘అన్నపూర్ణ’కు వీరే దర్శకత్వం వహించారు. తరువాత వారు రూపొందించిన చిత్రాలకు వీరే సారథ్యం వహించటం.. జగపతి, మధుసూధనరావు మైత్రీబంధానికి నిదర్శనం. ‘అదృష్టవంతులు’ చిత్రానికి మధుసూధనరావు దర్శకత్వం వహించారు.
  వీరమాచినేని బాబు రాజేంద్రప్రసాద్ (విబి రాజేంద్రప్రసాద్) కాలేజీ చదువుకునే రోజుల్లో పలు నాటకాల్లో నటించేవారు. అక్కినేనికి వీరాభిమాని. వారి ప్రోత్సాహం, చిత్ర రంగంపట్ల మక్కువతో మద్రాసు వెళ్లి ‘జగపతి’ నిర్మాణ సంస్థ ప్రారంభించారు. విజయవంతమైన కుటుంబ కథా చిత్రాల నిర్మాతగా, ‘దసరాబుల్లోడు’ చిత్రం నుంచి దర్శకునిగానూ పేరు పొందిన వ్యక్తి. అ, ఆల క్రమంలో టైటిల్‌తో చిత్రాలు నిర్మించటం ఆనవాయితీగా పెట్టుకున్నారు. అన్నపూర్ణ, ఆరాధన, ఆత్మబలం, అంతస్తులు, ఆస్తిపరులు తరువాత రూపొందించిన చిత్రం అదృష్టవంతులు. 1969 జనవరి 3న ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రానికి కెమెరా: ఎస్ వెంకటరత్నం, ఎడిటింగ్: ఎన్‌ఎస్ ప్రకాశం, స్టంట్స్: రాఘవులు, నృత్యం: చిన్న, సంపత్, సంగీతం: కెవి మహదేవన్, కళ: జివి సుబ్బారావు, మాటలు: ఆచార్య ఆత్రేయ, నిర్మాత: విబి రాజేంద్రప్రసాద్, దర్శకత్వం: వి మధుసూధనరావు
  అదృష్టవంతులు చిత్రాన్ని ‘వన్స్ ఏ థీఫ్’ అనే ఆంగ్ల చిత్ర కథ ఆధారంగా రూపొందించటం గమనార్హం.
  రఘు (మాస్టర్ ఆదినారాయణ) చిన్నతనంలో జబ్బుతోవున్న తల్లికి మందులు తెస్తుండగా, ఓ దొంగ అతని సంచిలో నగలువేసి పారిపోతాడు. పోలీసులు రఘును అరెస్ట్ చేయడంతో, అతని తల్లి (ఝాన్సీ) ఆవేదనతో మరణిస్తుంది. పోలీసుల నుంచి తప్పించుకున్న రఘు (ఏఎన్నార్) దొంగల గుంపులో చేరి ఆరితేరిన దొంగగా మారతాడు. వారి నాయకుడు దొర (జగ్గయ్య), సహచరులు రాజు (ప్రభాకర్‌రెడ్డి), రజాక్ (ఆనందమోహన్)లతో పలు దోపిడీలు సాగిస్తుంటాడు. ఓరోజు ఓ బిడ్డను తల్లినుంచి దూరం చేసే చోరీలో, తన తల్లి, గతం గుర్తుకొచ్చి బిడ్డను ఆమెకు అందచేసే ప్రయత్నంలో పోలీసులకు దొరికిపోయి ఐదేళ్ల శిక్షను అనుభవిస్తాడు. మంచివాడిగా జీవించాలని నిర్ణయించుకొని, అదే విషయాన్ని ఇన్‌స్పెక్టర్‌కు చెబుతాడు. దొర తిరిగి తనవద్దకు రమ్మని కోరినా తిరస్కరిస్తాడు. జాకీ (పద్మనాభం)తో కలిసి లారీ నడుపుతూ, జయ (జయలలిత)ను పెళ్లి చేసుకుంటాడు. వారికొక పాప బేబి (బేబిరాణి) పుడుతుంది. ప్రశాంతంగా జీవిస్తున్న రఘును పోలీస్ అధికారి మూర్తి (గుమ్మడి) ఒకవైపు, తిరిగి తన దారిలోకి మళ్లించేందుకు దొర మరోవైపు సాగించిన ప్రయత్నాల ఫలితంగా ఏ నేరమూ చేయకనే దొంగగా సమాజం ముద్రవేస్తుంది. రాజు లారీని తగలబెట్టడం, రఘుకు పని లేకపోవటం, జయ క్లబ్ డ్యాన్సర్‌గా కుటుంబాన్ని గడుపుతుంది. తిరిగి పాత జీవితంలోకి వెళ్లాలనుకున్న తన నిర్ణయాన్ని రఘు పోలీసు అధికారికి తెలియజేస్తాడు. ఏమాత్రం అనుమానం రాకుండా ముఠాలోకి వెళ్లి, దొర చెప్పిన దోపిడిని అరికట్టి, నేరస్తులను పోలీసులకు పట్టిచ్చి తన నిజాయితి నిరూపించుకుంటాడు రఘు.
  చిత్రంలో పద్మనాభం జంటగా గీతాంజలి, జాకీ తల్లి పెసరట్ల పేరమ్మగా సూర్యాకాంతం, గీతాంజలి తల్లి పుల్లట్ల పుల్లమ్మగా ఛాయాదేవి, వైవి రావు, అతిధి పాత్రలో రేలంగి, లారీ కంపెనీ ఓనరుగా సాక్షి రంగారావు, డబ్బింగ్ జానకి, రామచంద్రరావు నటించారు.
  ఒకసారి నేరానికి పాల్పడి శిక్ష అనుభవించిన వ్యక్తిలో పరివర్తన కలిగి మంచివాడుగా మారినా.. సమాజం, పోలీసు వ్యవస్థ అతన్ని ఇంకా నేరస్తుడిగానే భావించి తరిమికొట్టడం, అలాంటి పరిస్థితుల్లో ఏర్పడే మానసిక సంఘర్షణలను తట్టుకొని నిలవటం అన్న విషయాలను ప్రధానాంశంగా ఈ చిత్రంలో రూపొందించారు. కొన్ని సన్నివేశాల రూపకల్పన దర్శకుని ప్రతిభకు అద్దంపట్టినట్టు ఉంటాయి. రఘు తన సహచరులతో కలిసి సినిమా షూటింగ్ ప్లానుతో పబ్లిక్‌గా ధనవంతుని దోచుకోవటం (ఈ సన్నివేశ ఆలోచనను కొద్దిగా అటూ ఇటూ మార్చి చాలా చిత్రాల్లో చూపించారు. కొన్నిచోట్ల నిజంగానూ ఇలాంటి దోపిడీలు జరిగాయి); అలాగే రేలంగిని ఎక్కిళ్లు ఆపొద్దని చెప్పి అతనిచేతే ఇనప్పెట్టె తెరిపించటం; పసివాడిని అపహరించే ప్రయత్నంలో హీరోకి అతని తల్లి గుర్తుకురావటం; హీరోయిన్ జయ మగవేషంతో ప్రవేశించటం, ఒక రాత్రి ఆమె జుట్టు కనపడి రఘుకు నిజం తెలియటంలాంటి సన్నివేశాలు అప్పట్లో క్రియేటివిటీ అనిపించుకున్నాయి. ఈ సన్నివేశంలోనే హీరో సాంగ్ -అయ్యయ్యో బ్రహ్మయ్యా (రచన: సినారె, గానం: ఘంటసాల)లో తొలిసారి అక్కినేనితో వెరైటీ స్టెప్పులు వేయించారు. తరువాత ఏఎన్నార్ అనేక చిత్రాలు ఇలాంటి స్టెప్స్‌తోనే కొనసాగడం గమనార్హం. రెండో దొంగతనం ముగించిన రఘుకు మందు ఇమ్మని దొర సూచించగా విజయలలిత తన బృందంతో, అక్కినేని తమాషా స్టెప్పులతో చిత్రీకరించిన గీతం -ము ము ముద్దంటే చేదా’ (రచన: ఆరుద్ర, గానం- ఘంటసాల, పి సుశీల). ఓ హత్య కేసులో నిందితుడు రఘు అని అనుమానించిన పోలీసు అధికారి మూర్తి, అతన్ని పలు గెటప్‌లు, కోటుతో పరీక్షించి విఫలమవటం; దీని కారణంగా రఘును జనం అనుమానించటం లాంటి సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో చిత్రీకరించే సన్నివేశాల మాదిరే -50ఏళ్ల కిందటే దొర (జగ్గయ్య) తన స్థావరంలోకి వస్తున్నదెవరో ఎదురుగావున్న టీవీ స్క్రీన్‌పై చూడటంలాంటి సన్నివేశాన్ని రూపొందించటం దర్శకుడు ముందుచూపునకు తార్కాణం. పోలీసులకు రఘు ఫోను చేసే విషయం గ్రహించటం, దాన్ని హీరోకు తెలియచేసి దోపిడి ప్లాను మార్చటం, అలాగే పరుగెడుతున్న రైలుమీద తొలిసారి హీరో, విలన్ ఆనందమోహన్‌ల ఫైట్లు చిత్రీకరణ, ఎత్తయిన టవర్‌పై వివిధ భాగాల్లో ప్రభాకర్‌రెడ్డి, ఆనందమోహన్‌లతో ఫైట్ ఎంతో వివరంగా, విపులంగా చిత్రీకరించి, ఉత్సుకత కలిగించారు. చిత్రంలో రఘుగా అక్కినేని నాగేశ్వరరావు ప్రశంసనీయమైన నటన చూపటం, జయలలిత దానికి తగ్గట్టు.. చివరి సన్నివేశంలో భర్త మానసిక స్థితి అర్థం చేసుకుని పాత జీవితానికి వెళ్తాడేమోనని ఆవేదనపడటం లాంటి సన్నివేశాలను నిండుతనంతో చూపించారు. క్లబ్‌లో ‘మొక్కజొన్నతోటలో’ పాట
  చిత్రీకరణలో దర్శకుడు ఎంతో థ్రిల్లింగ్‌గా చివర చరణానికి -రఘు, దొర, రాజు రావటం, రఘు జయను లాకెళ్లటం, చిత్రీకరణకు తగినట్టు మహదేవన్ మ్యూజిక్ అందించటం ఆకట్టుకుంటుంది. సూర్యాకాంతం, ఛాయాదేవీల హాస్యం ఇబ్బందికరంగా అనిపించినా, మిగిలిన చిత్రంయొక్క జిగిబిగిలో అది పెద్దగా పట్టించుకోరాదు.
  గీతాలు: చిత్రంలోని గీతాలన్నీ ఘంటసాల, సుశీలే ఆలపించారు. పద్మనాభం, గీతాంజలిలపై చిత్రీకరించిన (హిందీ చిత్రం సంగంలోని ‘చోర్ రాధా చోర్’) చరణం పేరడీ -నా మనసే గోదారి/ నీ వయసే కావేరి (రచన: ఆరుద్ర). విజయలలిత, ఏఎన్నార్ బృందంపై డెన్‌లో చిత్రీకరించిన గీతం -పడిన ముద్ర చెరిగిపోదు రోయి (రచన: ఆరుద్ర). అక్కినేని, జయలలితలపై చిత్రీకరించిన తొలిరేయి గీతం (చల్లని వెనె్నలలో ఆహ్లాదకరంగా సున్నితంగా చిత్రీకరించారు) -కోడి కూసే ఝాముదాకా (రచన: ఆత్రేయ). వీరిరువురిపై ఆరుబయట స్టెప్పులతో సాగే గీతం -చింత చెట్టు చిగురు చూడు (ఆరుద్ర). జయలలిత డాన్స్‌తో చిత్రీకరించిన గీతం -మొక్కజొన్న తోటలో (రచన: కొనకళ్ళ వెంకటరత్నం. ఒరిజినల్ పాటను సినిమా కోసం కొంతమార్చారు). ఈ చిత్ర కథాంశాన్ని తెలియచేస్తూ అక్కినేనిపై చిత్రీకరించిన మరో గీతం ‘నమ్మరే, నేను మారానంటే నమ్మరే’ (ఆత్రేయ).
  చిత్ర గీతాలు, పటిష్టమైన కథ, చిత్రీకరణ, సంగీతం, నటీనటుల అభినయం, అదృష్టవంతులు చిత్రాన్ని విజయపథంవైపు నడిపాయి. సూపర్ హిట్ సాధించిన చిత్రాన్ని హిందీలో ‘హిమ్మత్’ (1970)గా నిర్మాత పి మల్లిఖార్జునరావు, రవికాంత్ నగాయిచ్ దర్శకత్వంలో నిర్మించారు. 15 ఏప్రిల్ 1970న విడుదలైన హిందీ చిత్రంలో హీరోగా జితేంద్ర, హీరోయిన్‌గా ముంతాజ్ నటించారు. విలన్ దొరగా అనంత్‌నాగ్, అనురులుగా ప్రభాకర్‌రెడ్డి, ఆనంద్‌మోహన్ హిందీలోనూ నటించారు.
  ఈ చిత్రాన్ని తమిళంలో ‘తిరుడన్’గా శివాజీ గణేషన్, కెఆర్ విజయ, జయలలిత, కె బాలాజీ, మేజర్ సౌందర్‌రాజన్, ఎస్‌వి రామదాసు, నగేష్, కాంబినేషన్‌లో ఏసీ త్రిలోకచందర్ దర్శకత్వంలో ఎంఎస్ విశ్వనాథం సంగీతంతో నిర్మించారు. 1969 అక్టోబర్ 17న సినిమా విడుదలై విజయవంతమైంది. ఈ చిత్రాన్ని సింహళంలో ‘ఎదత్ సూర్య, అదత్ సూర్యగా’ 1972లో రూపొందించారు. ‘అదృష్టవంతులు’ చిత్ర గీతాలు, చిత్రం నేటికీ వీక్షకులకు, శ్రోతలకు ఆనందాన్ని కలిగిస్తున్నాయంటే ఆ చిత్రం దర్శకుడు, యూనిట్ కృషే.


  0 0

  ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేయాలంటే సినిమాకు ప్రచారమెంత ముఖ్యమో పాటంత ముఖ్యం -అంటాడో నవతరం దర్శకుడు.

  హిట్టయిన సినిమాలో ఫ్లాపు పాటలున్నట్టే, ఫ్లాపు సినిమాల్లోనూ హిట్టు పాటలుంటాయి. ఒక్కోసారి అవే బతికిస్తాయి. అందుకే సినిమాతో సమాంతరంగా పాట ప్రాముఖ్యత పెరిగింది, పెరుగుతోంది కూడా -అంటాడో సీనియర్ దర్శకుడు.

  కొన్ని పొడి పదాలు వింటే -బాణీ గుర్తుకొస్తుంది. కొన్ని కూనిరాగాలు తీస్తుంటే -పాట పదాలు మెదడు పొరల్లోంచి తన్నుకురావొచ్చు. ఈ రెండూ ఒద్దికగా అల్లుకుంటే -అదే గొప్ప పాట కావొచ్చు. ఒక సినిమా పదికాలాలు గుర్తుండాలంటే -సందర్భోచిత సాంగొకటి చాలన్న విషయాన్ని అనేక సినిమాలు రుజువు చేశాయి, చేస్తూన్నాయి.

  ఓకే ఒక్క పాట-
  లాల పోయొచ్చు. జోల పాడొచ్చు. కదిలించొచ్చు. కరిగించొచ్చు. రగిలించొచ్చు. ఎగిరించొచ్చు. నిలబెట్టొచ్చు. పడగొట్టొచ్చు. కన్నీరు పెట్టించొచ్చు. కల్మషాన్ని తుడిచేయొచ్చు... ఒక్కటేమిటి వేన వేల భావాలను పలికించొచ్చు. మసకబారిన ఆలోచనలను తట్టిలేపడం, ఒంటరితనానికి దూరంగా చిటికెన వేలుపట్టి నడిపించడం.. ఇలాంటివన్నీ పాటకూ సాధ్యమే. అందుకే -సన్నివేశానికి తగిన పద కూర్పుకోసం కవులు కసరత్తు చేస్తే -పదాలకు తగిన స్వరాల కోసం కర్తలు కృషి చేస్తూనే ఉంటారు.
  **
  స్వర్ణయుగం కాలంనాటి చిత్రాల్లో పది పనె్నండు పాటలుండేవి. కృష్ణ, శోభన్‌బాబుల కాలంలో వాటి సంఖ్య తగ్గింది. చిరంజీవి జనరేషన్ మొదలయ్యేసరికి -ప్రతి సినిమాలో పాటల ఫిగర్‌ను ఫైవ్‌కు ఫిక్స్ చేశారు. సంగీత ప్రాధాన్యత కలిగినవి, కొన్ని ప్రత్యక కథా వస్తువుకు సంబంధించిన సినిమాల్లో తప్ప -ఎక్కువశాతం ఇదే లెక్క కొనసాగింది. చాలకాలంగా ఈ సంఖ్య మరింత తగ్గుతోంది. పాటల్లేని సినిమా అంటూ ప్రచారం చేసుకోదగ్గ సిత్రాలూ వస్తున్నాయి, అది వేరే విషయం. నిజానికి ఎందరో మహానుభావుల (దర్శకులు, నిర్మాతలు, నటులు, సాంకేతిక నిపుణులు.. ) కృషి ఫలితంగా తెలుగు సినిమా పాట పట్టుబట్టకట్టే స్థాయికి వచ్చింది. అలా సినిమాకంటే సినిమా పాటే జనరంజకమైన స్థితికి చేరింది కూడా. అయితే ఇప్పుడొచ్చే సినిమాల్లో పాటలు తగ్గుతుండటానికి కారణం -ఓ పాటను షూట్ చేయాలంటే మొత్తం బడ్జెట్‌లో ఏడు నుంచి పదిశాతం ఖర్చుపెట్టాల్సిన పరిస్థితి రావడం కూడా కారణం. అది వేరే విషయం. ఈ చర్చను కాసేపు పక్కన పెడితే -తెలుగు సినిమాల్లో పాటల రాశి తగ్గుతున్నా వాసి మాత్రం పదునుదేరుతోందనే చెప్పాలి. ఒకప్పటి ఉద్దండ రచయితల స్థాయిని సాహిత్యపరంగా లెక్కిస్తే, మిక్కిలి మించి ఇప్పటి రచయితలు వినోదాన్ని అందించగలుగుతున్నారు. ఇదీ గొప్పగా చెప్పుకోవాల్సిన విషయమే.
  కొంతగ్యాప్ తరువాత -గడచిన ఏడాది పాట ప్రజలకు మరింత దగ్గరైందని అనిపిస్తుంది. చిన్న పెద్ద అన్న సినిమా బడ్జెట్ వ్యత్యాసాలు కాసేపు పక్కనపెడితే -అన్ని చిత్రాల్లోని పాటలు ఆడియన్స్‌ని రంజింప చేయడానికి ప్రయత్నించిన పాటల్లాగే తోస్తాయి. 2018లో సుమారుగా 150 తెలుగు స్ట్రెయిట్ చిత్రాలు వచ్చాయనుకుంటే -సుమారుగా 450 వరకూ పాటలు పురుడుపోసుకున్నాయనే చెప్పాలి. కలం తిరిగిన సీనియర్, జూనియర్ రచయితలు తమ సృజనాత్మక ఆలోచనా పరిధిని సన్నివేశానికి అనుగుణంగా మలిచి అద్భుతమైన పాటలే అందించారు. ఆ సవాల్‌కు సంగీత దర్శకులూ తక్కువేం చేయలేదు. అద్భుతమైన బాణీలను అందించి పాట సూటిగా జనంలోకి వెళ్లగలిగేలా చేయడంలో కృతకృత్యులయ్యారు. అయితే, అన్ని పాటలనూ ప్రస్తావించలేం కనుక -జనరంజక గీతాల్లో ‘స్థాయి పులాక న్యాయం’ ప్రకారం ఎన్నదగిన పాటల్ని గుర్తు చేసుకుందాం. విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్ జోడీగా రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కించిన ‘టాక్సీవాలా’ చిత్రంలోని ‘మాటె వినదుగా’ పాట జనాల్లోకి సూటిగా వెళ్లిపోయింది. కృష్ణకాంత్ రాసిన ఈ పాటను సిద్ శ్రీరాం ఆలపించిన తీరు ఒక ఎత్తయితే, జేక్స్ బిజోయ్ కట్టిన బాణీ మనసు పొరల్లో నిక్షప్తమైపోయింది. ఇక సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో శంకర్ తెరకెక్కించిన రోబో సీక్వెల్ 2.ఓ కోసం అనంత శ్రీరాం కలం అద్భుతాన్ని సృష్టించింది. ‘యంతరలోకపు సుందరివే’ అంటూ సాగిన పాటకు సిద్ శ్రీరామ్, షాషా తిరుపతి తమ గాత్రంతో ప్రాణంపొస్తే, ఏఆర్ రెహమాన్ క్రియేటివ్ ట్యూన్‌తో పాటను మరో లోపకంలోకి తీసుకుపోయాడు. ఇక పడిపడి లేచె మనసు చిత్రం కోసం విశాల్ చంద్రశేఖర్ డిజైన్ చేసిన టైటిల్ సాంగ్‌ను అర్మన్ మాలిక్, సింధూరి విశాల్ పాడిన తీరును మర్చిపోలేం. తాజాగా సంక్రాంతికి విడుదలవుతున్న ఎన్టీఆర్ బయోపిక్ తొలి భాగం ‘కథానాయకుడు’ టైటిల్ సాంగ్ కోసం ఖైలాష్‌కేర్ గొంతు ఖంగుమంది. కె శివదత్తా, డాక్టర్ కె రామకృష్ణ రచించిన పాటకు ఎంఎం కీరవాణి చేసిన ట్యూన్ -మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఇక ‘హుషారు’గా వచ్చిన కుర్రాళ్ల చిత్రంలో కిట్టూ విస్సాప్రగడ ‘ఉండిపోరాదే’ అంటూ గుండెను మెలితిప్పే గీతాన్ని అందించాడు. రథన్ అందించిన అద్భుత బాణీని అంతే చక్కగా ఆలపించి సిద్ శ్రీరాం తన ఊపు ప్రదర్శించాడు. హలో గురూ ప్రేమకోసమే చిత్రం కోసం ‘మై వరల్డ్ ఈజ్ ఫ్లయింగ్’ అంటూ దేవీశ్రీ ప్రసాద్, శ్రీమణి చేసిన సృజన -ప్రతి క్షణం గాళ్‌ఫ్రెండ్‌లా గుర్తుకొస్తూనే ఉంటుంది. యు టర్న్ చిత్రం కోసం అనురుథ్ రవిచందర్ బాణీలో శ్రీ సాయికిరణ్ రాసిన ‘ది కర్మ థీమ్’, అంతరిక్షం చిత్రం కోసం అనంత్ శ్రీరామ్ అందించిన సమయమా పాటను ప్రశాంత్ ఆర్ విహారి అద్భుతంగా బాణీకడితే హరిని, యాజిన్ నజీర్ ఆకట్టుకునేలా ఆలపించారు. గీత గోవిందం చిత్రం కోసం -ఇంకేం ఇంకేం ఇంకేంకావాలే అంటూ అనంత్ శ్రీరామ్ ఒకింత హాయిని పాటగా మలిస్తే, గోపీసుందర్ బాణీని సిద్ శ్రీరామ్ తన ప్రత్యేక గాత్రంతో పీక్స్‌కి తీసుకెళ్లాడు. అంతేకాదు గాలివాలుగా (అజ్ఞాతవాసి), చూసీ చూడంగానే (చలో), నిన్నిలా (తొలి ప్రేమ) ఇలా చెప్పుకుంటూపోతే -ఎన్నో గొప్ప పాటలు. చివరిగా ఈ ఏడాది సెనే్సషనల్ హిట్లుగా చెప్పుకోదగ్గ పాటల్నీ ఇక్కడ ప్రస్తావించాలి. మంచి పాట, గొప్ప పాట, హిట్టు పాటలాంటి విశేషణాలను ఏమీ చేర్చకుండా, వీటిని ‘పాట’ అనాలంతే. ఆనందం, ఆదరణలాంటి కోణాల్లో ఈ పాటలకు ఎవరికి వారే పట్టంగట్టాలంతే. అందులో మొదటిది రామ్‌చరణ్, సమంత జోడీగా వచ్చిన రంగస్థలం చిత్రంలోని -యెంత సక్కగున్నావే. అన్నీ కలిసొచ్చిన అద్భుతమైన పాటిది.
  యేరుశనగ కోసం మట్టిని తవ్వితే/ ఏకంగా తగిలిన లంకె బిందెలాగ -ఎంత సక్కగున్నావే.. లచ్చిమి ఎంత సక్కగున్నావే.
  సింత సెట్టుయెక్కి సిగురు కోయబోతే/ చేతికి అందిన సందమామలాగ -ఎంత సక్కంగున్నావే.. లచ్చిమి ఎంత సక్కగున్నావే... /మల్లెపూల మద్దె ముద్ద బంతిలాగ -ఎంత సక్కగున్నావే.. /ముతె్తైదువ మెళ్లొ పసుపు కొమ్ములాగ -ఎంత సక్కగున్నావే../ సుక్కలసీర కట్టు-కున్న యెనె్నల్లాగ ఎంత సక్కాగున్నావే..
  అచ్చమైన పల్లెభావాన్ని పదాల్లోకి ఒలికించి చంద్రబోస్ పాట రాస్తే -బాణీకట్టిన దేవీశ్రీ ప్రసాదే మార్ధవంతో కూడిన జీర గొంతుతో పాటకు ప్రాణం పోశాడు. ఇక హీరో నాని చిత్రం శ్రీకృష్ణార్జున యుద్ధంలో పెంచల్‌దాస్ రాసి పాడిన ‘దారి చూడు దుమ్ము చూడు మామ/ దున్నపోతుల బైరే చూడు’ అన్న పాట ఒక ఊపు ఊపేసింది. కొద్దికాలం పాటు ఏనోటనైనా, ఏచోటనైనా ఇదే పాట వినిపించిందంటే -అది ఎంతటి ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ కోవలో మరికొన్ని పాటలూ లేకపోలేదు. సో, గడచిన ఏడాదిలో సినిమా పాట కొత్త పంథాను అందుకుంది. ఈ ఏడాదీ అలాంటి పాటలు మరిన్నిగా ఆడియన్స్‌ని రంజింప చేస్తాయని ఆశిద్దాం.


  0 0

  బాలీవుడ్‌లో క్వీన్ చిత్రంతో సెనే్సషన్ సృష్టించిన కంగనా రనౌత్.. ఆకారంలో పెద్ద ఎత్తులేకున్నా ప్రతిభలో ఆకాశమంత ఎత్తుకెదిగి మణికర్ణికతో మరోసారి క్వీన్ అయ్యందంటూ ప్రశంసలు అందుకుంది. కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘మణికర్ణిక’. జీ స్టూడియోస్, కమల్‌జైన్ నిర్మాణంలో జాగర్లమూడి క్రిష్, కంగనా రనౌత్ దర్శకత్వం వహించారు. జనవరి 25న విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించా. కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ‘్భరతదేశమే కాదు.. ప్రపంచమంతా ప్రశంసించిన బాహుబలి సినిమాకు కథ అందించిన విజయేంద్రప్రసాద్ ఎప్పటికప్పుడూ రికార్డులు బద్దలుకొట్టే కథలను అందిస్తున్నాడన్నారు. అదే ఒరవడిలో ఇప్పుడు మణికర్ణికకు ఆయన ప్రాణం పోశారన్నారు. లీడ్ రోల్ పోషించిన కంగనా రనౌత్ పెద్దఎత్తు లేకపోయినా.. నటనపరంగా ఆకాశమంతా ఎత్తుకెదిగిందని ప్రశంసించారు. ప్రతి సినిమాకూ ఫ్రెష్‌గా కనిపించటం ఆమెలోని ప్రతిభకు తార్కాణమన్నారు. నెల రోజుల వ్యవధిలో దర్శకుడు క్రిష్‌నుంచి మూడు సినిమాలు వస్తున్నాయని, అందులో మణికర్ణిక ఒకటన్నారు. అయతే క్రిష్ వదిలిన బాణాన్ని కంగనా పూర్తిచేసిందని అంటూ, ప్రాజెక్టు పెద్ద విజయం అందుకోవాలని ఆకాంక్షించి, యూనిట్‌కు అభినందనలు తెలిపారు.
  కంగనా రనౌత్ మాట్లాడుతూ తెలుగులో ట్రైలర్ ఇంతకుముందే చూశానని, సౌండింగ్ డిఫరెంట్‌గా అనిపించిందన్నారు. అలాగే పాత్రలకు గాత్రదానం చేసిన ఆర్టిస్టులంతా న్యాయం చేశారన్నారు. ట్రైలర్ వర్క్‌లో కథకుడు విజయేంద్రప్రసాద్ సహకారం కూడా తీసుకున్నామన్నారు. తెలుగులో ఓ పవర్ ఉంటుంది. అందుకే నేను బాహుబలిని తెలుగు, హిందీలోనూ చూశానన్నారు. ఈ సినిమాను డైరెక్ట్ చేయడమనేది ప్లానింగ్ ప్రకారం జరగలేదని, యాక్సిడెంటల్‌గా జరిగిందన్నారు. ఆగస్ట్‌లో రావాల్సిన సినిమాను అనుకున్న సమయంలో పూర్తిచేయలేకపోయామని, ఆ టైంలో క్రిష్‌కు మరో ప్రాజెక్ట్ ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. సినిమాను జనవరిలో పూర్తి చేయాలన్న సంకల్పంతో మిగిలిన భాగానికి తాను దర్శకత్వం వహించినట్టు చెప్పుకొచ్చారు. క్రిష్ సినిమాను గొప్పగా తెరకెక్కించారని, డైరెక్షన్‌లో ఆయన్ని ఫాలో అయ్యానంతేనన్నారు. టీం సహకారంతో సినిమాను పూర్తిచేశాను. తదుపరి కూడా నేను డైరెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఆ సినిమాకూ విజయేంద్ర ప్రసాద్‌నే కథ అందించమని అడిగానని, తప్పకుండా మేం కలిసి పనిచేస్తామన్నారు. రెండు నెలలు సినిమాకోసం చాలా కష్టపడ్డామని, మనంకోసం రక్తం ధారపోసిన వారి గురించి పట్టించుకోవడం లేదు. వారు మన చరిత్ర. అలాంటి వారికి గౌరవమివ్వాలి. అలా చరిత్ర మరుగున పడిపోయిన ఎందరో వీరులున్నారు. ఆ స్ఫూర్తితోనే ఝాన్సీ కథను సినిమాగా చేయాలనుకున్నట్టు చెప్పారు. మేకింగ్‌లో చాలా సమస్యలను ఫేస్ చేశానని, షూటింగ్ ప్రారంభంలోనే నుదుటికి గాయమైన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

  అదీ సంగతి
  బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ అందంతోపాటు ప్రతిభ ఉన్న నటి. అయతే కంగనాతో సినిమా అంటే దర్శకుడికి పెద్ద టాస్క్ అట. కారణం.. దర్శకత్వంలో వేలు పెట్టడం. ‘క్వీన్’ నుండి తాజా ‘మణికర్ణిక’ వరకు ఈమె దర్శకత్వంలో వేలుపెడుతూనే వచ్చింది. మణికర్ణిక విషయంలో ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువవ్వడంతో క్రిష్ తప్పుకున్నాడన్న టాక్ లేకపోలేదు. తాజాగా మణికర్ణిక విడుదల నేపథ్యంలో కంగనా హైదరాబాద్‌లో ప్రమోషన్స్‌కు హాజరైంది. భవిష్యత్‌లో తన సినిమాల దర్శకత్వ శాఖల్లో ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుందన్న విషయాన్నీ ఇక్కడ ప్రకటించింది. సొంతంగా దర్శకత్వంపై ఆసక్తి లేదని చెప్పుకురావడం విశేషం. గతంలో షార్ట్ఫిల్మ్‌లకు దర్శకత్వం చేసిన అనుభవంతోనే క్రియేటివ్ విషయాల్లో జోక్యం చేసుకుంటానని, తనకున్న అవగాహనతోనే సినిమా మేకింగ్‌లో జోక్యం చేసుకుంటానని కూడా చెబుతోంది. నా సినిమా విషయంలో నేను జోక్యం చేసుకోకుంటే ఎలా? అంటూ కంగనా ముక్తాయంపు నివ్వడం కొసమెరుపు.


  0 0

  సినిమాలో నేను ఎంతసేపు స్క్రీన్‌పై కనిపిస్తాను అనేకన్నా, కనిపించినంతేపు నేను పోషించిన పాత్రకి ప్రాముఖ్యత, నాణ్యత ఉందా లేదా? నా ప్రెజెన్స్‌ని ఆడియెన్స్ ఫీలయ్యారా లేదా అనే ఆలోచిస్తా. అంతే తప్ప సినిమా మొత్తం నేనే ఉండాలనుకోను -ఇదీ ఓ హీరోయన్ స్టేట్‌మెంట్. నిజానికి ఇప్పటి హీరోయన్లకు ఇంత సీన్ ఉందా? ఉంటుందా? అన్నదే పెద్దడౌటు. ఈ సినిమాలో కథకు కీలకం, మలుపునకు కారణం నేనేనంటూ ప్రమోషన్స్ టైంలో హీరోయన్ల చేత చెప్పించినా -సినిమా చూశాక ఆడియన్‌కే అర్థమవుతుంది గ్లామర్ డాల్ మాత్రమేనన్న విషయం. అప్పటి హీరోయన్లతో పోల్చకపోయనా, కనీస ప్రాధాన్యత ఇప్పటి బ్యూటీలకు దక్కుతుందా? అన్నది మిలియన్ డాలర్స్ క్వొశ్చన్. కాదంటారా?

  సినిమాలలో కథాపరంగా హీరోలకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో హీరోయిన్లకు అంతే ప్రాధాన్యత ఉంటుంది. అవసరాలు అలాగే ఉంటాయి. టాకీల తొలి దశలో చిత్ర నిర్మాణాలన్నీ పౌరాణికాలే కాబట్టి స్ర్తిపురుష పాత్రలు కథలో అవసరాన్నిబట్టి సమాన ప్రాధాన్యత కలిగి ఉంటాయి. అదీకాక అప్పటి నటీనటులకు స్టార్ వేల్యూ, ఇమేజ్‌లాంటివి ఉండేవికావు. సాంఘిక చిత్రాల నిర్మాణం, జోరుపెరగటం మొదలైన దగ్గర్నుంచి సినిమాలలో హీరోలతోపాటు హీరోయిన్లకూ స్టార్ వాల్యూ, ఇమేజ్ పెరుగుతూ వచ్చింది. హీరోయిన్‌లకు నటనా సామర్థ్యంతోపాటు అంద చందాలు, మేని వంపుసొంపు, లావణ్యం సమాన స్థాయిలో కావాలి. అంతకుముందైతే గ్లామర్‌కన్నా సమర్థతకే ప్రాముఖ్యతనిస్తే -సాంఘిక చిత్రాల నిర్మాణాలు 1950 దశకం ప్రారంభంనుంచి జోరందుకోవడం ప్రారంభమైననుండి నాటి చిత్రాలలో హీరోలకు, హీరోయిన్లకు నటన, టాలెంట్‌తోపాటు కాస్త ఎక్కువగా గ్లామర్ అవసరమైంది.
  మొదటినుండి సినిమా రంగంలో హీరోలే ఎక్కువ కాలం అంటే పాతిక, ముప్ఫై యేళ్లు కొనసాగుతుంటారు. ఇప్పటికీ ఇదే పద్ధతి. తొలి దశలో ఆనాటి హీరోయిన్లు దాదాపుగా అందరూ ఇంచుమించు ఇరవై ఏళ్లు కొనసాగుతూ వచ్చారు. ఇప్పటి హీరోయిన్లు ఎవ్వరైనా ఐదారేళ్లకే కనుమరుగవుతున్నారు. పట్టుమని పాతిక సినిమాలుచేస్తే గొప్ప. ఒక హిట్‌వస్తే టాలెంట్ లేకున్నా గ్లామర్‌కు భారీ పారితోషికం డిమాండ్ చేయటం, ఆంక్షలు పెట్టడం మామూలే. మార్కెట్‌కోసం ఆరంభంలో తీసుకొంటారు. భరించలేనివారు కొత్తవారిని వెతుక్కొంటారు. అదీకాక ఇప్పుడు వస్తున్నవారు స్టార్ వాల్యూ రాగానే సీనియర్స్‌ని ఒప్పుకోవటం లేదు. యువ హీరోలే కావాలంటారు. అందుకే స్టార్ హీరోలకు హీరోయన్ల ఎంపిక కత్తిమీద సాములా మారింది.
  1950 ఆరంభంలో అంతకుముందు చిత్తూరు నాగయ్య లాంటి ముప్పై అయిదు దాటిన హీరోలు, కొత్తగా వచ్చిన ఎన్టీఆర్, కొంత సీనియారిటీ వున్న అక్కినేని నాగేశ్వరరావు లాంటి పాతిక దాటిన హీరోల ధాటికి క్యారెక్టర్ పాత్రలకు పరిమితమయ్యారు. ఇంకా జగ్గయ్య, కాంతారావు, హరనాధ్, రామశర్మ లాంటి కొత్తవారి రాక ఒరవడిగా సాగుతుంటే హీరోయిన్లు కూడ శ్రీరంజని, కన్నాంబ, మాలతి, శాంతకుమారి, భానుమతి లాంటి మూడుపదులు దాటినవారిని దాటుకుంటూ కొత్త అందాలు, నటన మేళవించిన యువ హీరోయిన్లు రాకమొదలైంది. అలా అంజలీదేవి, సావిత్రి, షావుకారు జానకి, కృష్ణకుమారి, జి.వరలక్ష్మి, యస్.వరలక్ష్మి, జమున, దేవిక, గిరిజ తొలి తరం వారుకాగా బి.సరోజాదేవి, ఇ.వి.సరోజ, రాజసులోచన, వాసంతి, రాజశ్రీ లాంటివారు యాభై దశకం చివరలో వచ్చినవారు, 60 దశకం ఆరంభంలో శారద, జయంతి, ఎల్.వి.విజయలక్ష్మి, వహీదారెహ్మాన్, అమ్మాజీ, పద్మిని, జయశ్రీ, 65-70 ప్రాంతాలలో వచ్చిన విజయనిర్మల, జయలలిత, విజయలలిత, చంద్రకళ, వాణిశ్రీ, లక్ష్మి, కె.ఆర్.విజయ, షీలా, భారతి, కాంచన, శుభ, శ్రీవిద్య, మంజుల, గీతాంజలి, జ్యోతిలక్ష్మి, జయమాలిని, హలం, రమాప్రభ, 75 తర్వాత వచ్చినవారు జయసుధ, జయప్రద, జయచిత్ర, సంగీత, సరిత, మాధవి, లత, కె.విజయ, కవిత, వై.విజయ, శ్రీదేవి 1980లో వచ్చిన విజయశాంతి, రాధ, సుహాసిని, రాధిక, సుమలత, భానుప్రియ, రమ్యకృష్ణ, 1990 దశకంలో వచ్చినవారు సౌందర్య, ఆమని, రోజా, రవళి, రంభ, మీనా, నగ్మా, రజని, శోభన, శ్రీప్రియ, దివ్యభారతి, సిమ్రాన్, రేవతి, గౌతమి, 2000నుండి ఇప్పటివరకు సంఘవి, చార్మి, కాజల్, రచన, ఇంద్రజ, ఆమని, టబూ, రవీనాటాండన్, ప్రియమణి, ఇలియానా, హాన్సికా, శృతిహాసన్, అశ్విని, నయనతార, త్రిష, రాశి, రాశీప్రియ, మెహ్రీన్‌కౌర్, పూజాహెగ్డే, జెనీలియా, ఆర్తి అగర్వాల్, కల్యాణి ఇలా చెప్పుకుంటూపోతే చాంతాడంత లిస్టు. వీళ్ళంతా ఎంతోకొంత ఇమేజ్ సంపాదించి సినీ ప్రేక్షకుల్ని అలరించి రెండుమూడేళ్లు పేరులోవుండి మెల్లగా తెరమరుగైన వారే! వీళ్ళలో పదేళ్లువరకు పరిశ్రమలో వెలిగిన, మెలిగినవారిని వేళ్లపై లెక్కించొచ్చు
  1950 దశకంలో సంపాదనకన్నా నటనపై అభిరుచితో పరిశ్రమలోకి మహిళలు వచ్చేవారు. నటించటానికి తపన పడేవారు. ఆరోజులలో నటీమణిగా ప్రవేశించినవారు ఏకంగా హీరోయిన్‌గా రాలేదు. రెండుమూడు చిత్రాలలో చిన్నచిన్న పాత్రలతో తమ టాలెంట్ నిరూపించుకొంటేగానీ దర్శక నిర్మాతలు హీరోయిన్‌గా అవకాశం యిచ్చేవారుకాదు. అలా వచ్చిన అంజలీదేవి, సావిత్రి, కృష్ణకమారి, జమున.. 1970వరకు నిరాటంకంగా హీరోయిన్లుగా కొనసాగారు. వీరు అప్పటి టాప్ హీరోలు అక్కినేని, నందమూరిలతోపాటు జగ్గయ్య, కాంతారావు లాంటి హీరోలతో చిన్న తేడా లేకుండా అందరితో హీరోయిన్‌గా చేసేవారు. 30 ఏళ్లపైగా అగ్ర హీరోలుగా వెలిగిన ఎన్టీఆర్, ఎఎన్‌ఆర్‌లతో ఒక్కోరు యిరవై పాతిక చిత్రాల వరకు హీరోయిన్‌గా నటించారు. అదే స్థాయిలో వారిని ప్రేక్షకులు అధిక విజయాలతో ఆదరించారు. రెండో తరంలో వచ్చిన రాజసులోచన, బి.సరోజాదేవి, రాజశ్రీలు కూడా ఎన్టీఆర్, ఎన్నార్‌లతో పది చిత్రాలకు పైగా చేశారు. అగ్రనటి వాణిశ్రీ అయితే హాస్య నటి, క్యారెక్టర్ నటిగా ఐదారేళ్లు చేసిన తరువాత 1967లో హీరోయిన్ స్థాయికి ఎదిగారు. ఆ సమయంలో వచ్చిన రెండోతరం అగ్ర హీరోలు కృష్ణ, శోభన్‌బాబు, హరనాథ్, కృష్ణంరాజులతోపాటు ఎన్టీఆర్, ఎన్నాఆర్‌లతో కూడ యిరవై చిత్రాలకుపైగా హీరోయిన్‌గా నటించారు. వాణిశ్రీ కూడ 25 యేళ్లు హీరోయిన్‌గా కొనసాగి పునఃప్రవేశంతో క్యారెక్టర్ పాత్రలలో కొన్నాళ్లు సాగి రిలాక్స్ అవుతున్నారు.
  వాణిశ్రీ కంటే ముందుగా కాంచన, సుకన్య, జయంతి, శారద, చంద్రకళ, గీతాంజలి, ఎల్.విజయలక్ష్మి తదితరులు హీరోయిన్లుగా, ఓవైపు చెల్లెలు, హాస్య, క్యారెక్టర్ పాత్రలలో రాణించారు. 75 దశకంలో వచ్చిన జయసుధ, జయప్రద, శ్రీదేవి ఆ టైంలో స్టార్ ఇమేజ్‌తో రాకెట్‌లా దూసుకుపోయారు.
  తర్వాత వచ్చిన రాధ, విజయశాంతి, సుహాసిని, కృష్ణ, శోభన్‌బాబులతో అప్పుడే కొత్తగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవితో వీరు ఒక్కొక్కరు 20 చిత్రాలవరకు జోడిగా నటించారు. శ్రీదేవి కూడ 5 చిత్రాలు చేసింది. రాధ, విజయశాంతి, సుహాసిని కూడ బాలకృష్ణతో 10 చిత్రాలవరకు చేశారు. రమ్యకృష్ణ కూడ వీరితోపాటు మోహన్‌బాబు, రాజశేఖర్, రాజేంద్రప్రసాద్ లాంటి వారితో చేస్తూ పదేళ్ళుపైగా హీరోయిన్‌గా కొనసాగారు. 1960లో వచ్చిన హరనాథ్‌తో జమున దాదాపు 10 చిత్రాలలో నటించింది. 1995 ప్రాంతాలలో వచ్చిన సౌందర్య కూడ 2003 మరణించేవరకు జగపతిబాబు, రాజశేఖర్, మోహన్‌బాబు, వెంకటేష్, శ్రీకాంత్, కృష్ణ, రాజేంద్రప్రసాద్ లాంటి హీరోలతో ఎక్కువగా నటించారు.
  ఆమని, శోభన, అశ్వని, కవిత, మీనా, నగ్మా, అమల, వాణివిశ్వనాథ్, భానుప్రియ, రోజా, రతి, కుష్బు లాంటివారు నాలుగైదు ఏళ్లు హీరోయిన్లుగా ఆనాటి హీరోలతో ఓ వెలుగు వెలిగారు. ‘చంద్రముఖి’తో పరిచయమైన నయనతార, శృతిహాసన్, కాజల్, సమంత, త్రిష, జెనిలియా, శ్రీయా లాంటివారు ఓ పదేళ్ళనుండి హీరోయిన్స్‌గా చేస్తూ సీనియర్స్‌గా మారిపోయారు. ఇప్పటి మెహ్రాన్‌కౌర్, పూజాహెగ్డే, తమన్నా, అనుపమా పరమేశ్వరన్, అనూ ఇమ్మాన్యుయల్, రాశీఖన్నా, రకుల్‌ప్రీత్‌సింగ్, హన్సికలాంటి ఎందరో నవ యువ తారలు నటనకన్నా గ్లామర్ పాత్రలతో నేటి యువతరాన్ని ఆకర్షించేందుకు రాణించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఆఖర్ను అనుష్క టాలెంట్ ఉన్న నటిగా గ్లామర్ హీరోయిన్‌గా ఈనాటి అగ్రహీరోలతో జతగాచేసి అరుంధతి, బాహుబలి, భాగమతి లాంటి చిత్రాలలో లేడీ హీరోయిజంతో నేడు టాప్‌స్టార్‌గా ఉన్నారు. అనుష్క కంటే ముందు విజయశాంతి గ్లామర్ రోల్స్‌తో కర్తవ్యం, ఆశయం, పోలీస్‌లాకప్, ఒసే రాములమ్మ లాంటి చిత్రాలలో డైనమిక్, పోలీస్ పాత్రలతో ఒక టైంలో చరిత్ర సృష్టించారు.
  ఇప్పుడు వస్తే హీరోయిన్స్ గ్లామర్ పాత్రలకే తప్ప నటనకు పదునుపెట్టే పాత్రలు చేయలేకపోతున్నారు. ప్రస్తుతం వున్నవారంతా ఉత్తరాది భామలే! నయనతార, సమంత, కీర్తిసురేష్ లాంటి హీరోయన్లు నటనకు అవకాశముండే పాత్రలు అడపాదడపా చేస్తున్నారు. ఆనాటి హీరోయిన్లు మాదిరిగా ఈనాటి హీరోయన్ల నుంచి అలాంటి చిత్రాలు ఆశించగలమా. ఒకవేళ అవకాశం వస్తే చేయగలరా! అనే్నళ్లు మనగలరా? డౌటే.


  0 0

  బెల్లంకొండ శ్రీనివాస్ కాజల్ జంటగా ‘కవచం’ తర్వాత మరోసారి వీరిద్దరు కలిసి నటిస్తున్నారు. తేజ దర్శకత్వంలో తెరకెక్కడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రానికి మొదటినుండి కూడా సీత అనే టైటిల్ ప్రచారం జరుగుతుంది. కాని ఇప్పటివరకు చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం ఆ విషయమై క్లారిటీ ఇవ్వలేదు. తేజ శ్రీనివాస్‌ల కాంబో మూవీ ‘సీత’ అంటూ వార్తల్లో వస్తున్న విషయాన్ని తాజాగా కాజల్ పొరపాటున కన్ఫర్మ్ చేసింది. గతంలో హీరోలు మరియు ఇతర టెక్నీషియన్స్ సినిమాల పేర్లు పొరపాటున రివీల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అదే విధంగా తాజాగా కాజల్ కూడా తన తదుపరి చిత్రం టైటిల్ విషయంలో క్లారిటీ ఇచ్చింది. తిరుపతిలో జరిగిన ఒక కార్యక్రమంలో కాజల్ పాల్గొంది. ఆ సందర్భంగా ప్రస్తుతం తాను తేజ దర్శకత్వంలో శ్రీనివాస్‌తో కలిసి ‘సీత’ చిత్రంలో నటిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. అది విషయం.


  0 0

  ప్రముఖ దర్శకుడు కె.హేమంబరధరరావు స్వీయ నిర్మాణ, దర్శకత్వంలో నిర్మించిన చక్కని ప్రభోధాత్మక రాజకీయ చైతన్య చిత్రం -కథానాయకుడు. ఎన్టీఆర్, జయలలిత హీరో హీరోయన్లు. తొమ్మిది కేంద్రాల్లో ఘన విజయం సాధించిన చిత్రమిది. సంఘంలో పెద్దమనుషులుగా వ్యవహరించే ముగ్గురి వ్యక్తుల అవినీతి జీవితాల్ని బట్టబయలుచేసే సామాన్య మధ్యతరగతి యువకుడి సాహస కథ. వాహినీవారి ‘పెద్దమనుషులు’ స్ఫూర్తితో ఆ కథాంశానే్న మార్పులుచేసి నిర్మించారు.
  చిత్రంలో పెద్దమనుషులు ముగ్గురిగా నాగభూషణం, మిక్కిలినేని, అల్లు రామలింగయ్యలు సమర్ధవంతంగా నటించారు. ఇక ‘కథానాయకుడు’ సారథిగా ఎన్.టి.ఆర్, జోడిగా జయలలిత జామపండ్లు అమ్మే సామాన్య పేదరాలి యువతిగా నటించారు. ఆమె అన్నగా ప్రభాకర్‌రెడ్డి, ఎన్టీఆర్ అన్నగా ధూళిపాళ, నాగయ్య, పద్మనాభం, రాజబాబు, కాకరాల, రావికొండలరావు, రమాప్రభ, రాధాకుమారి, సంధ్యారాణి తదితరులు పాత్రోచితంగా నటించారు. టీవీ రాజు సంగీత సారథ్యంలో పాటలన్నీ (మచ్చుకు -కొసరాజు రాసిన ‘వినవయ్యా రామయ్యా ఏమయ్య భీమయ్యా’ దాశరథి ఇచ్చిన ‘ఇంతేనయా తెలుసుకోవయా ఈలోకం ఇంతేనయా) ప్రజాదరణ పొందాయి. చిత్రమంతా చురుకైన కథనం, చక్కని సన్నివేశాలతో సాగుతూ, ముగ్గురి విలన్లు నాగభూషణం, అల్లు, మిక్కిలినేనిల మధ్య కామెడీ సంభాషణలతో, యింకా రాజబాబు, పద్మనాభం, రమాప్రభ వారి కుటుంబాలమధ్య వచ్చే కామెడీ సన్నివేశాలతో విసుగులేకుండా సాగుతుంది. అందరి మెప్పుపొంది చిత్రం ఆర్థిక విజయం కూడా సాధించింది. ఎన్.టి.ఆర్., జయలలితల జంట చిత్రమంతా అలరిస్తుంది. వారు బాగా ప్రజాదరణ పొంది దాదాపు పది చిత్రాలపైగా నటించారు. ఈ చిత్రంలో వీరికి ‘డ్యూయెట్ సాంగ్’ లేకపోయినా ఈ జంట చక్కని అభినయం ప్రదర్శించారు. ‘కథానాయకుడు’ టైటిల్ ఎంతో ఆదరణ పొందింది. ఈ టైటిల్‌తోనే ఎన్.టి.ఆర్ తనయుడు బాలకృష్ణ నటించిన చిత్రం విజయవంతమైనది. రజనీకాంత్ ద్విభాషా చిత్రం ఒకటి ‘కథానాయకుడు’ పేరుతోనే చిత్రం వచ్చి ఏవరేజ్‌గా నిలిచింది. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ జీవిత చరిత్రను బయోపిక్‌గా మొదటి భాగంగా ‘కథానాయకుడు’ పేరుతో జనవరిలో రిలీజయ్యే విధంగా నిర్మాణం చేస్తున్నారు. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈతరం ప్రేక్షకులూ ఈ చిత్రం ఎప్పుడైనా టీ.విలో వస్తుంటే, ఎక్కడైనా ఆడుతుంటే చూడండి.


  0 0

  ఆప్యాయత అందుకోలేనివాడు, అభిమానం పొందలేనివాడు అనురాగం దక్కనివాడు, చాలా దురదృష్టవంతుడు. మనసు చంపుకు బ్రతుకుతాడు. మనసును బుజ్జగించి ఓదార్చుతాడు. మత్తును మింగి మైకంలో ఉండిపోతాడు. ఆలోచనల్ని నిద్రపుచ్చుతాడు. ప్రేమను పొందలేని జీవి ఎలా బ్రతుకుతాడో, పాడతాడో అలాంటి పలుకులు కూర్చి నేను పుట్టాను రాసాడు ఆత్రేయ. ఆత్రేయ పాటలు రాసినా, మాటలు రాసినా వాటిలో క్లుప్తత, ఆప్తత, ఆర్ద్రత కనిపిస్తాయి. నేను పుట్టాను లోకం మెచ్చింది/ నేను ఏడ్చాను లోకం నవ్వింది/ నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది/ నాకింకా లోకంతో పని ఏముంది.. డోన్ట్‌కేర్... -వ్యతిరేక లోకాన్ని లెక్కచేయనంటారు హీరో.
  నేను తాగితే కొందరి కళ్ళూ గిరగిర తిరిగాయి/ నేను పాడితే అందరి నోళ్ళు వంతలు పాడాయి/ నేను ఆడితే అందరి కాళ్ళు నాతో కలిసాయి/ తెల్లవారితే వెనకన చేరి నవ్వుకుంటాయి.
  లోకం తీరుపై ఆత్రేయ సెటైర్. ఇంతకంటే గొప్పగా ఏముంటుంది? ఆత్రేయ మాటలే పాటలు. పాత్ర చిత్రణే ముఖ్యం ఆయన రచనకు.
  మనసును దాచేటందుకె పైపై నవ్వులు ఉన్నాయి/ మనిషికి లేని అందంకోసమే రంగులు ఉన్నాయి/ ఎరుగక నమ్మిన వాళ్ల నెత్తికె చేతులు వస్తాయి/ ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి.. డోన్ట్ కేర్...
  తన అనుభవాలను పాత్ర పేరుతో మనకు ఇలా పంచాడు ఆత్రేయ.
  ఈ పాట ‘ప్రేమనగర్’ చిత్రంలోది. ఘంటసాల పాడారు. అక్కినేని నాగేశ్వరరావు నటించారు. ఆత్రేయ రాసారు. చిత్రంలో పాట సందర్భం, దానికి తగ్గట్టుగా కెవి మహదేవన్ సంగీతం కుదర్చటం, భావార్ధాలు అన్నీ సమపాళ్లలో కుదరటంతో చిరకాలం గుర్తుండిపోయే పాట అయ్యంది. ఈ పాట నాకు నచ్చిన పాట. ప్రేమనగర్ చిత్రానికి ఈ పాట ఓ హైలెట్. 1971లో ఈ సినిమా విడుదలైంది. ఇప్పటికీ ఈ పాట, ఆనోట ఆచోట వినపడుతూనే వుంటుంది. దర్శకత్వం కె సూర్యప్రకాశరావు, నిర్మాత డి రామానాయుడు, కథ, కోడూరి కౌసల్యాదేవి.


  0 0
 • 01/05/19--08:50: ఈ వారం తార
 • కైరా అద్వానీ


  0 0

  న్యూఢిల్లీ, జనవరి 5: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగిస్తే తెలుగుదేశం నాయకులు ఎందుకు భయపడుతున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు. ఢిల్లీలో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఎన్‌ఐఏ దర్యాప్తులో వాస్తవాలు బయటకు వస్తే కొందరి జాతకాలు తారుమారవుతాయాని ముఖ్యమంత్రి చంద్రబాబు భయపడుతున్నారని ఆరోపించారు. చట్టం ప్రకారం దేశంలోని కేసులను తమంతట తాము తీసుకునే అధికారం ఎన్‌ఐఏకి ఉన్నదని అన్నారు. తెలుగుదేశం పార్టీ డ్రామాలు రాష్ట్ర ప్రజలకు అర్థమవువుతున్నాయని, అందుకే కేంద్ర-రాష్ట్రాల సంబంధాలపై అర్థ పర్థం లేకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
  తెలంగాణలో ఓటమి తర్వాత చంద్రబాబుకు అసహనం పెరిగిపోయిందని, తెలంగాణ ఎన్నికల్లో వచ్చిన రెండు ఎమ్మెల్యే సీట్లు మాదిరిగానే ఏపీలోనూ రెండు స్థానాలే వస్తాయని ఎద్దేవా చేశారు. కాకినాడలో బీజేపీ మహిళా నాయకురాలి పట్ల చంద్రబాబు దారుణంగా వ్యవహరించారని ఆరోపించారు. శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించడం ద్వారా భక్తుల మనోభావాలను దెబ్బతిసేలా కేరళలోని వామపక్ష ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం భక్తులపై వామపక్ష ప్రభుత్వం దాడులకు పాల్పడుతోందని మండిపడ్డారు.


  0 0

  న్యూఢిల్లీ, జనవరి 5: శబరిమల ఆలయం విషయంలో బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తొందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఢిల్లీలో శనివారం విలేఖరులతో మాట్లాడుతూ కేరళలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కలిసి విధ్వంసం సృష్టించాలని చూస్తున్నాయని ఆరోపించారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ మహిళల హక్కులకోసం పోరాడుతున్న వారిపై బీజేపీ దాడులకు దిగుతుందని ఆరోపించారు. మహారాష్టల్రోని శని సింగ్నాపూర్ ఆలయం విషయంలో కోర్టు తీర్పును అమలుచేస్తున్న బీజేపీ ప్రభుత్వం, కేరళలో శబరిమల అంశాన్ని ఎందుకు వ్యతిరేకిస్తోందని నిలదీశారు. బీజేపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ దేశస్థాయిలో కూటమి ఏర్పాటు జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం విషయంలో జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయడానికి కేంద్రానికి ఉన్న అభ్యంతరం ఏమిటిని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిది రిటైల్ అవినీతి అయితే.. బీజేపీ ప్రభుత్వానిది హోల్‌సేల్ అవినీతి అని నారాయణ దుయ్యబట్టారు. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తున్నప్పటికీ తెలంగాణలో మాత్రం ఆ పార్టీతో కలిసి పోరాటం కొనసాగిస్తామని నారాయణ స్పష్టం చేశారు.


  0 0

  న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు మరోసారి సమ్మె బాట పట్టనున్నారు. ఈనెల 8, 9 తేదీల్లో సమ్మెకు సన్నాహాలు పూర్తి చేస్తున్నారు. వేతన సవరణ, ఉద్యోగ భద్రత, పెన్షన్ ప్లాన్ వంటి పలు డిమాండ్ల సాధన కోసం విధులను బహిష్కరించాల్సిందిగా అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ), భారత బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్య (బీఈఎఫ్‌ఐ) పిలుపునిచ్చాయి. 10 కార్మిక సంఘాలు సానుకూలంగా స్పందించి, రెండు రోజుల సమ్మెకు దిగుతున్నట్టు భారత బ్యాంకుల సంఘం (ఐబీఏ)కు నోటీసు ఇచ్చాయి. బాంబే స్టాక్ ఏక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)కి అంద చేసిన ఫైలింగ్‌లో ఐడీబీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా ధ్రువీకరించాయి. కాగా, రెండు రోజుల సమ్మెతో బ్యాంకింగ్ సేవలు స్తంభించనున్నాయి. ప్రైవేటు బ్యాంకులు పని చేసినా, దేశంలో ఎక్కువ మంది ఖాతాదారులను కలిగి ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సమ్మె అనేకానేక లావాదేవీలపై తీవ్ర ప్రభావం చూపనుంది. కాగా, డిమాండ్ల సాధనకు ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు లేదా అధికారులు సమ్మెబాట బాటపట్టడం రెండు నెల వ్యవధిలో ఇది మూడోసారి. తమ పట్ల కేంద్రం నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తున్నదని ఆరోపిస్తూ, భారత బ్యాంక్ అధికారుల సంఘం (ఏఐబీఓసీ) గత నెల 21న ఒక రోజు సమ్మె చేసింది. కాగా, బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయా బ్యాంక్, దేనా బ్యాంక్‌ల విలీనాన్ని వ్యతిరేకిస్తూ 26న ఉద్యోగులు, అధికారులు తమతమ విధలను బహిష్కరించారు. విలీనాల వల్ల ఉద్యోగాలు ఎక్కడికీ పోవని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విస్పష్టంగా ప్రకటించిన తర్వాత, ఉద్యోగ భద్రతపై అనుమానాలు తొలగినప్పటికీ, మిగతా డిమాండ్లపై ఉద్యోగులు పట్టుదలతో ఉన్నారు. తాజాగా ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, ఎఐసీసీటీయూ, యూటీయూసీ, టీయూసీసీ, ఎల్‌పీఎఫ్, సెవా సంఘాలు తాజాగా సమ్మెకు పిలుపునిచ్చాయి. రెండు రోజులపాటు పెద్ద ఎత్తున సమ్మె జరగనున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవహారాలు ఎక్కడివక్కడ స్తంభించడం ఖాయంగా కనిపిస్తున్నది.


  0 0

  హైదరాబాద్, జనవరి 5: దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ కేంద్రాల్లో ఎంబిబిఎస్ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశపరీక్ష ప్రాథమిక దరఖాస్తు గడువును జనవరి 14 వరకూ పొడిగించారు. ఎయిమ్స్‌కు రెండంచెల దరఖాస్తు విధానాన్ని అమలుచేస్తున్నారు. అందులో మొదటి దశ ప్రాధమిక రిజిస్ట్రేషన్, ఆసక్తి ఉన్న అభ్యర్ధుల జాబితా రూపొందించడం, రెండో దశలో తుది రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్ధుల జాబితాను జనవరి 16న విడుదల చేస్తారు. అభ్యర్ధులు ఏమైనా సవరణలు ఉంటే వాటిని జనవరి 22లోగా చేసుకోవల్సి ఉంటుంది. అనంతరం తుది రిజిస్ట్రేషన్‌కు గడువు ఇస్తుంది. ఆ గడువు మార్చి 12తో ముగుస్తుంది అనంతరం అడ్మిట్ కార్డులను జారీ చేస్తుంది. ఇతర వివరాలకు ఎయిమ్స్ ఎగ్జామ్స్ డాట్ ఆర్గ్ అనే వెబ్ పోర్టల్‌ను సందర్శించాలని సూచించింది.
  క్యాట్ టాపర్ మజుందార్
  ఐఐఎంలు, జాతీయ స్థాయి మేనేజిమెంట్ విద్యాసంస్థల్లో మేనేజిమెంట్ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే క్యాట్ ఫలితాలను ఐఐఎం కలకత్తా ప్రకటించింది. జాతీయ స్థాయిలో రానక్ మజుందార్ టాపర్‌గా నిలిచాడు. మంచి స్కోర్‌లు సాధించిన వారిలో వరంగల్ నిట్ విద్యార్థులు నిపుణ్ అగర్వాల్ (99.92), తరుణ కే (99.85), సమీర్ అహ్మద్ (97.04), గౌరవ్ మాలిక్ (96), తపస్ దాస్ (95.9), సుజన్ కే (95.17) ఉన్నారు. విద్యార్థులను నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ రమణారావు అభినందించారు.
  దేశవ్యాప్తంగా వంద పర్సంటైల్‌ను 11 మంది సాధించగా అందులో ఏడుగురు ఐఐటీలకు చెందిన వారే, మరో ఇద్దరు జాదవ్‌పూర్ యూనివర్శిటీ విద్యార్థులు, 99.99 పర్సంటైల్‌ను 21 మంది సాధించగా, అందులో 19 మంది ఇంజనీరింగ్ విద్యార్థులే ఉన్నారు. టాపర్లలో ఏడుగురు మహారాష్ట్ర నుండి ఇద్దరు బెంగల్ నుండి, కర్నాటక, బీహార్‌ల నుండి ఒకొక్కరు వంద శాతం పర్సంటైల్ సాధించారు. గత నవంబర్‌లో నిర్వహించిన క్యాట్‌కు 2,09,405 మంది హాజరుకాగా వారిలో 73,326 మంది అమ్మాయిలు, 1,36,075 మంది అబ్బాయిలు, నలుగురు థర్టు జండర్ ఉన్నారు. ఇద్దరు కవలలు అనుభవ్ గార్గ్, అభిషేక్ గార్గ్‌లు 99.99 పర్సంటైల్, 99.67 పర్సంటైల్ సాధించారు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షను 147 పట్టణాల్లో 374 కేంద్రాల్లో నిర్వహించారు. టాపర్ల జాబితాలో అమిత్ భిక్రం, జగదీష్ గోల్‌వాలా, రిషబ్ గుప్త, కరణ్, మయూర్ అరోరా, ఉత్‌కర్ష్ గుప్త, కుషాగర్ పాన్‌వార్, ప్రతీక్ మిశ్రా, మసాల్ అవినాష్‌లున్నారు. ఐఐఎంల వారీ చూస్తే బెంగలూరులో 412, అహ్మదాబాద్‌లో 385, కలకత్తాలో 462, లక్నోలో 436, కోజికోడ్‌లో 353, ఇండోర్‌లో 550 సీట్లున్నాయి.
  సీ టెట్ ఫలితాలు
  దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టేందుకు వీలుగా అర్హత కల్పించే పరీక్ష సీటెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షకు 17 లక్షల మంది హాజరయ్యారు. వీరిలో 58 శాతం మంది మహిళలు, 33,107 దివ్యాంగులు, 199 మంది ట్రాన్స్‌జండర్లున్నారు.
  6 నుండి ఐఐటీ జేఈఈ
  ఆరో తేదీ నుండి 20వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న ఐఐటీ జేఈఈకి నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. రీజనల్ కేంద్రాల వారీ పర్యవేక్షకులను నియమించింది. ఈసారి నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ రెండు విడతలుగా జేఈఈని నిర్వహిస్తోంది. రెండోవిడత ఏప్రిల్‌లో నిర్వహించనుంది. జనవరి పరీక్షకు 9.65 లక్షల మంది దరఖాస్తు చేశారు. అందులో 6.85 లక్షల మంది అబ్బాయిలు, 2.8 లక్షల మంది అమ్మాయిలు, 38 మంది ట్రాన్స్ జండర్లున్నారు. మొత్తం అభ్యర్ధుల్లో 4.72 లక్షల మంది జనరల్, 3.67 లక్షల మంది ఓబీసీ, 0.89 లక్షల మంది ఎస్సీలు, 0.36 లక్షల మంది ఎస్టీలున్నారు.


  0 0

  అమరావతి, జనవరి 5: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సరఫరా సంస్థ (ఏపీ ట్రాన్స్‌కో)కు మరో ప్రతిష్టాత్మకమైన అవార్డు దక్కింది. అత్యల్ప నష్టాలు, అత్యధిక సమర్థవంతమైన ట్రాన్స్‌మిషన్ నిర్వహణతో దేశం మొత్తంలోనే అత్యధిక పనితీరు కనబరచిన సరఫరా సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సాగునీరు, విద్యుత్ కేంద్రీయ మండలి (సీబీఐపీ) ఈ అవార్డును అందజేసింది. సీబీఐపీ 91వ వార్షికోత్సవాల సందర్భంగా ఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్రమంత్రి ఆర్‌కే సింగ్ చేతుల మీదుగా ట్రాన్స్‌కో సీఎండీ కే విజయానంద్ తరుపున జేఎండీ దినేష్ పరుచూరి ఈ అవార్డును అందుకున్నారు. 1927 నుంచి దేశంలోని సాంకేతిక సంస్థలకు గొప్ప తోడ్పాటునందిస్తున్న సీబీఐపీ అధునాతన, సాంకేతికత, నవకల్పనలను వినియోగించుకుంటూ విద్యుత్ సరఫరాలో అత్యున్నత ప్రమాణాలను సృష్టించటంతో పాటు దేశంలోనే స్థిరమైన పనితీరును ప్రదర్శిస్తున్నందుకు గాను ఏపీ ట్రాన్స్‌కోకు తాజాగా ఈ అవార్డును అందజేసింది.
  సరఫరా, పంపిణీ నష్టాలను తగ్గించడం ద్వారా ఏపీ ట్రాన్స్‌కో డిస్కంలు రూ 1000 కోట్ల వరకు ఆదా చేశాయని ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి, ట్రాన్స్‌కో సీఎండీ కే విజయానంద్ తెలిపారు. ట్రాన్స్‌కో అవార్డును అందుకున్న సందర్భంగా ఆయన స్పందిస్తూ రానున్న రోజుల్లో పంపిణీ, సరఫరా నష్టాలను 4-5 శాతానికి తగ్గించడం ద్వారా అంతర్జాతీయ గుర్తింపు సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని వివరించారు. నాణ్యమైన విద్యుత్‌ను అందుబాటు ధరల్లో నిరంతరం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారని, విద్యుత్ సంస్థలన్నీ ఆయన ఆదేశానుసారం పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఏపీ ట్రాన్స్‌కో అనేక చర్యలు చేపడుతోందని తెలిపారు. వ్యయ నియంత్రణకు, నష్టాలను తగ్గించుకునేందుకు అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నామని వివరించారు. ఇంధన సామర్థ్య, ట్రాన్స్‌ఫార్మర్లు, అత్యున్నత ప్రమాణాలు కలిగిన సరఫరా లైన్లు, హెవీ, క్రిటికల్ లోడ్ సెంటర్లలో రింగ్-మెయిన్ నెట్‌వర్క్‌ల ఏర్పాటు, క్రమం తప్పకుండా లైన్ల నిర్వహణ, సబ్‌స్టేషన్లు, మరమ్మతు పనుల్లో అత్యాధునిక హాట్‌లైన్ టెక్నాలజీ వినియోగం వంటి చర్యలు చేపట్టామన్నారు. ఫలితంగా సరఫరా నష్టాలు అత్యల్పంగా 2.83 శాతం అత్యధిక ట్రాన్స్‌మిషన్ (99.892)శాతం అందుబాటుతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినట్లు తెలిపారు.
  విద్యుత్ సంస్థలు అద్భుత పనితీరుతో గడచిన నాలుగేళ్లలో 137 జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకోవటం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇంధనవనరులశాఖ మంత్రి కిమిడి కళా వెంకట్రావు అభినందించారని ఇంధన, ఐ అండ్ ఐ, సీఆర్డీఏ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్ వివరించారు. ప్రస్తుతం 9.72 శాతంగా ఉన్న సరఫరా, పంపిణీ నష్టాలను 4-5 శాతానికి తగ్గించడమే లక్ష్యంగా డిస్కంలు పనిచేస్తున్నాయని ఇందులో భాగంగా నెట్‌వర్క్ బలోపేతానికి రూ 10వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించారు. ఏపీ ట్రాన్స్‌కోకు అవార్డు అందించటం పట్ల ట్రాన్స్‌కో జేఎండీ దినేష్ పరుచూరి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల కృషి, ముఖ్యమంత్రి చంద్రబాబు సంపూర్ణ మద్దతుతోనే తమ సంస్థకు అనేక పురస్కారాలు దక్కుతున్నాయని చెప్పారు. ట్రాన్స్‌కో ఇప్పటికే ఉత్తమ ఆర్థిక నిర్వహణకు గాను గోల్డెన్ పీకాక్ అవార్డు -2018, గోల్డెన్ పీకాక్ హెచ్‌ఆర్ ఎక్స్‌లెన్స్-2016 అవార్డు, గోల్డెన్ పీకాక్ సెక్రటేరియట్, స్కోచ్ -2018 అవార్డు, ఐపీపీఏఐ-2016 అవార్డు, ఇలా అనేక పురస్కారాలను ట్రాన్స్‌కో సొంతం చేసుకుందని గుర్తుచేశారు. విద్యుత్‌శాఖకు అవార్డులు దక్కడం నిర్వహణ, పర్యవేక్షణలో అధికారులు, సిబ్బంది, ఉద్యోగుల పనితీరుకు నిదర్శనమని విద్యుత్‌రంగ సలహాదారు కే రంగనాథం హర్షం వ్యక్తం చేశారు. విద్యుత్ రంగంలో ప్రభుత్వ విధానాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. ట్రాన్స్‌కోకు అవార్డులు లభించడం పట్ల జేఎండీ ఉమాపతి, డిస్కంల సీఎండీలు ఎంఎం నాయక్, హెచ్‌వై దొర హర్షం వ్యక్తం చేశారు.
  చిత్రం..ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్ తరఫున సీబీఐపీ అవార్డు అందుకుంటున్న జేఎండీ దినేష్


  0 0

  హైదరాబాద్, జనవరి 5: తెలంగాణలో పండించే తాజా కాయగూరలు, పళ్లను విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి తెలిపారు. ‘ప్యాక్ హౌజ్‌ల ఆధునీకరణ’ అంశంపై రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంలో శనివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం నేతృత్వంలో జరుగుతున్న ఉద్యాన పంటలకు ప్రభుత్వం తరఫున అవసరమైన చేయూత అందిస్తామన్నారు.
  విదేశాలకు కాయగూరలు, పళ్లు, పూలు ఎగుమతి చేసేందుకు వేపర్ హీట్ ట్రీట్‌మెంట్ విధానం ఉపయోగపడుతోందని ఉద్యాన శాఖ డైరెక్టర్ ఎల్. వెంకటరామిరెడ్డి తెలిపారు. 2019 ఏప్రిల్ నుండి విదేశాలకు మామిడి పళ్లను ఎగుమతి చేసేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. ఈ సమావేశంలో పట్టుపరిశ్రమ శాఖ డైరెక్టర్ నీరజ్ కుమార్ సింగ్, శంషాబాద్ విమానాశ్రయం సస్యరక్షణ అధికారి యు.్ధర్మారావు,ఉద్యాన విశ్వవిద్యాలయం పరిశోధనావిభాగం డైరెక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


  0 0

  హైదరాబాద్, జనవరి 5: చంద్రబాబు ఇంతకాలం చేసిన దోపిడీ బయట పడుతుందనే భయపడుతున్నారని, బీజేపీ నేతలపై ఆ పార్టీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు.
  శనివారం నాడు ఆయన హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ నెల 18న పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాయలసీమ పర్యటనకు వస్తున్నారని, దమ్ముంటే ఆయనను ఆపాలని విష్ణువర్థన్‌రెడ్డి హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌లో సింగపూర్ తరహా జైలు కట్టుకోవాలని, 90 రోజుల తర్వాత చంద్రబాబు అడ్రస్ అక్కడే ఉంటుందని పేర్కొన్నారు. చంద్రబాబును నిలదీసినందుకు నెలల బిడ్డ ఉన్న కాకినాడ బీజేపీ కార్పొరేటర్ ప్రసన్నను రాత్రంతా పోలీసు స్టేషన్‌లో ఉంచారని , ఇదేం దౌర్జన్యమని ఆయన నిలదీశారు. భూముల కుంభకోణంపై హైకోర్టు పిల్‌ను స్వీకరించిందని, తనపై కేసులు విచారణకు రాకుండా హైకోర్టు అమరావతికి రాకూడదనేది చంద్రబాబు భావన అని ఎద్దేవా చేశారు. మీ సంగతి చూస్తా అంటూ చంద్రబాబు హెచ్చరికలు జారీ చేసి 24 గంటలు తిరగకముందే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై దాడులు జరిగాయని, దాడులు చేస్తూ రౌడీ రాజకీయాలు చేసిన వారు కాలగర్భంలో కలిసిపోతారని పేర్కొన్నారు. సీఎం పదే పదే అంతు చూస్తా, ఫినిష్ అయిపోతారు అనే మాటలు వాడుతున్నారని, టీడీపీ నేతలు అంతా దాడులకు పాల్పడటం ఒక కార్యక్రమంగా పెట్టుకున్నారని అన్నారు. పోలీసులు మీద దాడి చేసిన జేసీ అనుచరులను చంద్రబాబు ఆదర్శంగా తీసుకుంటున్నారా అని నిలదీశారు.


  0 0

  హైదరాబాద్, జనవరి 5: గురుకుల ఉర్దూ ఉపాధ్యాయ పోస్టులకు ఈ నెల 9వ తేదీన సర్ట్ఫికేట్ల పరిశీలన జరుగుతుందని రిక్రూట్‌మెంట్ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. సర్ట్ఫికేట్ల పరిశీలనకు ఎంపికైన అభ్యర్ధులకు ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఎస్‌ఎంఎస్ ద్వారా పంపించడం జరిగిందని ఆ ప్రకటనలో బోర్డు పేర్కొంది. ఇతర వివరాలకు బోర్డు పోర్టల్‌ను సందర్శించాలని సూచించారు.


  0 0

  హైదరాబాద్, జనవరి 5: తెలంగాణ శాసనమండలికి గ్రాడ్యుయేట్/టీచర్స్ నియోజకవర్గాల్లో ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతోందని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి డాక్టర్ రజత్ కుమార్ తెలిపారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించామని, ఇందులో పేర్లులేని గ్రాడ్యుయేట్లు తమపేర్లను ఈ నెల 31 లోగా నమోదు చేసుకోవచ్చన్నారు. అలాగే ముసాయిదా ఓటర్ల జాబితాలో ఏవైనా పొరపాట్లు ఉంటే ఫిర్యాదు చేయవచ్చన్నారు. గ్రాడ్యుయేట్ల నుండి వచ్చే ఫిర్యాదులను, దరఖాస్తులను 2019 ఫిబ్రవరి 15 వరకు పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.


  0 0

  హైదరాబాద్, జనవరి 5: శబరిమలలో మతోన్మాద శక్తులు అరాచకాలు సృష్టిస్తున్నాయని, సుప్రీం కోర్టు తీర్పునిచ్చినా మహిళా భక్తులను అడ్డుకోవడం సిగ్గుచేటని భారత జాతీయ మహిళా సమాఖ్య తీవ్రంగా ఖండించింది.
  త్వరలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు శబరిమలకు తరలివెళ్తారని సమాఖ్య అధ్యక్షురాలు పీ కళావతి స్పష్టం చేశారు. శనివారం ఇక్కడ జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ మహిళా సంఘాలకు చెందిన నాయకురాళ్లు పాల్గొన్నారు. ‘చట్టాలను గౌరవిద్దాం- మహిళ హక్కులు గుర్తిద్దాం’ అన్న అంశంపై చర్చ జరిగింది. కళావతి మాట్లాడుతూ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ మూకలు కావాలని శబరిమల విషయంలో రాద్దాంతం చేయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. సుప్రీం కోర్టు శబరిమలలో మహిళలు ప్రవేశానికి అనుమతి ఇచ్చినా మతోన్మాదులు అడ్డుకోవడం దారుణమన్నారు. మహిళల పట్ల బీజేపీకి ఎంత ప్రేమ ఉందో తెలుస్తోందని ఆమె ధ్వజమెత్తారు. గతంలో ఆర్‌ఎస్‌ఎస్ శబరిమలలో మహిళలను అనుమతించాలని పాదయాత్ర చేసిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. ఇప్పుడు అదే ఆర్‌ఎస్‌ఎస్ వ్యతిరేకిస్తోందని ఆమె నిప్పులు చెరిగారు. కేరళ బీజేపీ అధ్యక్షుడు శ్రీ్ధరన్ మహిళల ప్రవేశాన్ని స్వాగతించారని, అయితే కేంద్రంలోని బీజేపీ నేతలు మాత్రం మహిళల ప్రవేశానికి అడ్డంకులు సృష్టిండం ఏమిటని ఆమె నిలదీశారు.
  మహారాష్టల్రో మహిళలకు ఆలయ ప్రవేశం కల్పిస్తూ, కేరళలో మరోవిధంగా వ్యవహరించడం సిగ్గుచేటని కళావతి మండిపడ్డారు. ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉస్తేల సృజన, వర్కింగ్ ప్రెసిడెంట్ జ్యోతి, సామాజిక కార్యకర్తలు దేవి, విజయ, ఐద్వా ఉపాధ్యక్షురాలు కృష్ణకుమారి, ఆశాశ్రామిక మహిళా ఫోరం కన్వీనర్ ప్రేం పావని పాల్గొన్నారు.


older | 1 | .... | 2018 | 2019 | (Page 2020) | 2021 | 2022 | .... | 2069 | newer