Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

థ్రిల్లర్ కథతో యమ్6

$
0
0

విశ్వనాథ్ ఫిలిం ఫ్యాక్టరీ, శ్రీలక్ష్మి వెంకటాద్రి క్రియేషన్స్ బ్యానర్స్‌పై విశ్వనాథ్ తన్నీరు నిర్మిస్తున్న చిత్రం ‘యమ్6’. ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ ఆవిష్కరించి యూనిట్‌ను అభినందించారు. కార్యక్రమంలో హీరో ధ్రువ, నిర్మాత విశ్వనాథ్ తన్నీరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత విశ్వనాథ్ మాట్లాడుతూ ‘యమ్6’ ట్రైలర్‌ను వినాయక్ ఆవిష్కరించటం హ్యాపీగా ఉందన్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రాన్ని ఖర్చులో రాజీపడకుండా క్వాలిటీగా తెరకెక్కించామన్నారు. దర్శకుడు జైరాం పనితనం స్క్రీన్‌మీద కనిపిస్తుందని, హీరో ధ్రువ కొత్తవాడైనా చక్కటి నటన ప్రదర్శించాడన్నారు. ధ్రువ సరసన మిస్ బెంగళూరు అశ్విని తొలిసారి లీడ్ రోల్ పోషించింది. మంచి కంటెంట్‌తో రూపొందిన సినిమా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందన్నారు. సినిమాటోగ్రఫీ, సంగీతం, సస్పెన్స్, కామెడీ, యాక్షన్ సన్నివేశాలు సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయని, ప్రేక్షకులు ప్రతి సన్నివేశాన్నీ ఎంజాయ్ చేస్తారన్నారు. ‘యమ్6’కి అర్థం సినిమా చూస్తే తెలుస్తుందన్నారు. ‘ఈ క్షణం...’ అనే మెలోడీ సాంగ్‌ను మంగుళూరు, అరకులోని అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించామని, పాటకు మంచి స్పందన వస్తోందన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.
ధ్రువ మాట్లాడుతూ హీరోగా ఇది తొలి చిత్రమని చెబుతూ, వైవిధ్యమైన పాత్రలతో మంచి నటుడిగా స్థానం సాధించాలన్నది కోరిక అన్నాడు. దర్శక, నిర్మాత ప్రోత్సాహంతో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చానన్నాడు. మంచి సినిమా ద్వారా హీరోగా పరిచయమవ్వడం హ్యాపీగా ఉందన్నాడు.


హన్సిక ది గ్రేట్...?

$
0
0

తెలుగులో ‘దేశముదురు’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమై
పుష్కర కాలంగా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ వస్తోంది ముద్దుగుమ్మ హన్సిక. తమిళంలోనూ ఈమె హవా తక్కువేం లేదు. స్టార్ హీరోలకు జోడీగా నటించి స్టార్ హీరోయిన్ అయ్యంది. తెలుగులో మాత్రం హన్సికకు ఆశించిన స్థాయిలో స్టార్‌డం దక్కలేదు. అందుకే ఈమె తమిళానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. ఇది ఒక కోణం. రెండో కోణంలో హన్సిక అందగత్తే కాదు, అందమైన మనసున్నది కూడా. పెద్ద మనసున్నది కనుకే -చిన్న వయస్సులోనే ఏకంగా 34మంది పిల్లలకు తల్లయ్యంది. ప్రస్తుతం ముంబయికి చెందిన 34 మంది పిల్లలను చేరదీసి, వాళ్లకు సంబంధించిన అన్ని విషయాలూ హన్సికే చూస్తోందట. ఆ పిల్లల అవసరాలన్నీ తల్లిలా తీరుస్తోందట. నాణ్యమైన ఆహారం, వాళ్ల చదువు, ఆరోగ్యం అన్ని బాధ్యతలనూ ఆమె భుజాలపై వేసుకుందట. ఆమె పెంపకం ఎంత గొప్పగా ఉందంటే, ఈ ఏడాది ఒక పిల్లాడు టెన్త్ పరీక్షలకు అటెండ్ అవుతున్నాడు. న్యూఇయర్ సందర్భంగా ఈ విషయాన్ని హన్సికే వెల్లడిస్తూ, ఆ పిల్లాడు స్టేట్ ర్యాంకు సాధించేలా శిక్షణ ఇప్పించడంతోపాటు, ఉన్నతంగా మార్కులు సాధించేందుకు తన వంతు కృషి చేస్తానంటోంది. అతడిని టాప్ స్టూడెంట్‌గా నిలపడమే ఈ ఏడాది తన ముందున్న లక్ష్యమనీ ప్రకటించింది. చాలామంది హీరోయన్లు ఫేమ్ సంపాదించొచ్చు. కానీ, హన్సిక మాత్రం ప్రేమను సంపాదించుకుంటుంది. సెలబ్రిటీగా తన బాధ్యతను
నిర్వర్తిస్తూ పదిమందికి ఆదర్శమవుతుంది. హన్సిక.. ది గ్రేట్.

మిస్టేక్..

$
0
0

నేపాలీ ముద్దుగుమ్మ మనీషా కోయిరాలా జీవితంలో ఎన్నో ఒడుదొకుడులు. ముఖ్యంగా మనీషా క్యాన్సర్ బారిన పడి మరణం అంచులవరకు వెళ్లింది. క్యాన్సర్‌తో పోరాడి జీవితాన్ని గెలిచిన మనీషా జీవితంలో ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయట. క్యాన్సర్‌కు ముందు తాను చెడు అలవాట్లకు బానిసైనట్లుగా మనీషా బయోగ్రఫీలో పేర్కొంది. ఇటీవలే మనీషా కోయిరాలా తన ఆటోబయోగ్రఫీ హేడెల్ ను విడుదల చేసింది. ఆ పుస్తకంలో తన జీవితంలోని చీకటి కోణాన్ని ఆవిష్కరించింది. హీరోయిన్‌గా బిజీగా ఉన్న సమయంలో ప్రపంచం మొత్తం తన కాళ్లవద్ద ఉందన్నట్లుగా ఫీల్‌అయ్యానని, ఒంటరితనం భరించలేక బాగా తిరిగేదాన్నని, పార్టీలకు ఎక్కువగా వెళ్తూ జీవితాన్ని ఎంజాయ్ చేసేదాన్నని పేర్కొంది. తక్కువ సమయంలోనే మద్యానికి బానిసైనట్టు వెల్లడించింది. ఆ కారణంవల్లే క్యాన్సర్ పట్టి పీడిచ్చినట్లుగా భావిస్తున్నాను. క్యాన్సర్‌తో పోరాడిన తర్వాత ఆ తప్పులన్నీ నాకు తెలిసి వచ్చాయి. అందుకే క్యాన్సర్ వ్యాధి నా జీవితానికి ఒక బహుమతిగానే భావిస్తున్నట్లుగా మనీషా పేర్కొంది. జీవితంలోని కొన్ని సంఘటనలు తను పూర్తిగా మారిపోయేలా చేశాయని మనీషా హేడెల్ పుస్తకంలో పేర్కొంది.

బాబీ చేతుల మీదుగా ధీవర ఫస్ట్‌లుక్

$
0
0

తెలుగులో వైవిధ్యమైన సినిమాల హవా పెరుగుతోంది. కొత్తగా వస్తోన్న దర్శకులే కాదు, నిర్మాతలూ ఈ తరహా కథలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈక్రమంలో మరో డిఫరెంట్ మూవీ రాబోతోంది. అదే - ధీవర. నాగసాయి, విద్యాచైతన్య హీరో హీరోయిన్లు. టైటిల్‌కు తగ్గట్టే డైనమిక్ స్క్రిప్ట్, డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో సాగే సస్పెన్స్ థ్రిల్లర్. చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను దర్శకుడు బాబీ విడుదల చేశారు. ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ.. ‘ ధీవర’ కానె్సప్ట్ బాగుంది. యూత్‌కి కనెక్టయ్యే కథ. పోస్టర్ బాగా నచ్చిందని, ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. దర్శకుడు విజయ్ జిక్కి మాట్లాడుతూ ‘ ధీవర’ సినిమాలో స్క్రీన్‌ప్లే హైలెట్ అన్నారు. లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగే సినిమా ఒకేసారి రెండు జోనర్స్‌లో సాగుతుందన్నారు. నిర్మాత హరనాథ్‌బాబు మాట్లాడుతూ -కమర్షియల్ అంశాలకూ పెద్దపీట వేశామని, అన్నివర్గానూ ఆకట్టుకునేలా యూత్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతోందన్నారు. త్వరలోనే ఆడియో సహా ట్రైలర్ విడుదల చేస్తామన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని వచ్చే నెలాఖరుకి ప్రేక్షకుల ముందుకు తెస్తామన్నారు. భగీరథ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రానికి సంగీతం అద్దంకి వెంకటేష్, సినిమాటోగ్రఫీ సాగర్ గొళ్లా.

పరమహంస బోధామృతము

$
0
0

55.శ్రీరాముడు, సీత, లక్ష్మణుడును వనములబడి పోవుచుండిరి. రాముడు ముందును సీత నడుమన లక్ష్మణుడు వెనుకను నడచుచుండిరి. శ్రీరామచంద్రుడు నెల్లప్పుడును చక్కగా నవలోకింపవలయునని లక్ష్మణుని యభిలాష. కాని తనకును శ్రీరామునకును నడుమ సీత యుండుటచే లక్ష్మణుడు అటుల అవలోకింపజాలడయ్యెను. అప్పుడతడు కొంచెం ప్రక్కకు తొలగుమని యామెను ప్రార్థించెను. ఆమె యటుల తొలగినంతనే లక్ష్మణుడు తన కోర్కె ఫలింప శ్రీరామచంద్రుని కన్నులార గాంచగల్గెను. ప్రపంచమున బ్రహ్మము, మాయ, జీవుడు ననువాని స్థితి యిట్టిది. మాయచే గలిగిన భ్రాంతి తొలగని జీవుడు దేవుని గనజాలడు, నరునకు నారాయణుని దర్శనము కాదు.
56.ఒక మహాత్ముడు చిత్రవర్ణ ప్రదర్శనియగు గాజు కడ్డీని గాంచి చిరునవ్వు నవ్వుచుండెడివాడు, కారణమేమనగా, అందుండి ఎరుపు, పసుపు, నీలము మొదలగు వివిధ వర్ణములు అతనికి గానవచ్చుచుండెడివి. ఈ రంగులు వట్టి బూటకములని గ్రహించిన యాతడు ఈదృశ్య ప్రపంచము సైతము అటులనే బూటకమని గ్రహించి తనలో తాను నవ్వుకొనెడివాడు.
57.హరి (యను బాలుడు) సింగపుదలను తగిలించుకొనునప్పుడు నిజముగా భయంకరముగా గాన్పించును. తన చెల్లెలు ఆడుకొను తావును బోయి యాతడు పెడబొబ్బ పెట్టును. కాని చెల్లెలు అదిరిపడి యా భయంకర మృగము బారినుండి తప్పించుకొనిపోవు యత్నమున కెవ్వుమనును. కాని భయకంపితయైయున్న ఆబాలిక, హరి తన వేషమును తీసి వేయగనే ఆతడు తన ప్రియసోదరుడే అని గుర్తించి ‘‘ఓహో! మా అన్నయ్యయే!’’ అని వాని చెంతకు పరుగెత్తును. మానవులందరి విషయము కూడా నిట్టిదే. అచింత్యమైన మాయాశక్తి మఱగున నున్నది బ్రహ్మము. ఐనను ఈ మాయచే భ్రాంతికి లోనై లోకులు సర్వ విధమైన చేష్టలను చేయుచుందురు. కాని బ్రహ్మమునుండి మాయ యను తెర తొలగింపబడినపుడు నరునకు అతడు చండశాసనుడగు ఈశ్వరుడుగా గాన్పింపడు, అత్యంత ప్రియుడగు అంతరాత్మయై పరగును.
58.భగవంతుడు సర్వవ్యాపియగునేనిమనకేల కాన్పింపడు? పాచిపట్టిన కోనేటి యోక్క గట్టుననుండి చూచితివేని నీకు అందు నీరు ఉన్నట్లే కాన్పింపదు. నీటిని జూడదలతువేని పాచిని తొలగింపవలయును. మాయావృతమైన కన్నులతో జూచుచు, భగవంతుడు కాన్పించుటలేదని మొఱలిడుచున్నావు. భగవంతుని జూడ గోరుదువేనినీ కన్నులనుండి మాయ అను పొరను తొలగించుకొనుము
59.మబ్బు సూర్యునావరించు రీతిని మాయ బ్రహ్మము నావరించియున్నది. ఈ మాయామేఘము తొలగినంతనే బ్రహ్మను సూర్యుడు మరల కాన్పించును.
60.రాజహంస నీరు కలిగియున్న పాలనుండి నీటిని వేరు చేసి పాలను మాత్రమే గ్రహించును. ఇతర పక్షులిటుల చేయజాలవు. భగవంతుడు మాయతో సమ్మిశ్రీతుడై యున్నాడు. సామాన్య మానవులు మాయను వేరుపరిచి భగవంతుని గనజాలరు. పరమహంసలు మాత్రము మాయను విసర్జించి శుద్ధబ్రహ్మమును గ్రహింపజాలుదురు.
61.తననుగని పట్టినంతనే దొంగ పారిపోవు రీతిని మాయాతత్త్వమును నీవు గ్రహించినంతనే మాయ నివర్తించును.
మోక్షహేతువగు విద్యామాయ
62.భగవంతునియందు విద్యామాయయు అవిద్యా మాయయు కూడా కలవు. విద్యా మాయ నరుని భగవంతుని వైపునకు మరల్చును. అవిద్యామాయ నరుని బ్రహ్మమార్గమునుండి విముఖుని జేయును. కారుణ్యము, జ్ఞానము, భక్తి, వైరాగ్యము- ఇవన్నియు విద్యమాయా స్వరూపములు. వీని మూలమున మాత్రమే నరుడు నారాయణుని బొందగలుగును.
63.బ్రహ్మసాక్షాత్కారమును గలిగించునది మాయయే. మాయ యొక్క తోడ్పాటు లేనిపక్షమున ఎవ్వరు బ్రహ్మ సాక్షాత్కారమును బొందగలరు? శక్తిని (అనగా భగవంతునియొక్క సృజనాది రూపమగు మాయాశక్తిని) దర్శింపకుండ భగవంతుని గనజాలము.
శ్రీ రామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదకుడు: శ్రీ చిరంతనానందస్వామి

ముగ్గులకు ఆహ్వానం

$
0
0

నింగిలోని హరివిల్లులను నేలపైన పేర్చి.. కనులకింపైన రంగుల్ని అందంగా అద్దితే అది రంగుల మాలికవుతుంది. ముంగిట్లో రంగవల్లిక అవుతుంది. ధనుర్మాసం సందర్భంగా తెలుగు ముంగిళ్లలో రంగవల్లులను తీర్చిదిద్దడం ఆనవాయితీ.. ఆ సందర్భంగా ముగ్గులకు ఆహ్వానం పలుకుతోంది మాతృభూమి. ఆసక్తి కలవారు కింది చిరునామాకు ముగ్గులను పంపగలరు.
సూచనలు
* ముగ్గులను పంపేవారు ఎ4 సైజు తెల్లకాగితంపై వేయాలి.
* ముందుగా నల్లని ఇంక్‌తో ఔట్ లైన్ గీసిన తరువాత అందులో రంగుల్ని నింపాలి.
* ఎన్ని చుక్కలను పెట్టి ముగ్గులు వేశారో.. అంటే సరిచుక్కలా, బేసి చుక్కలా, సందు చుక్కలా.. అనే విషయం స్పష్టంగా రాయాలి.
* ముగ్గుతో పాటు, మీ పాస్‌పోర్ట్ సైజు కలర్ ఫొటోని, చిరునామాని జతచేయాలి.
* డౌన్‌లోడ్ చేసిన ముగ్గులు కాక, స్వయంగా చేతితో వేసిన ముగ్గులనే పంపాలి. అదీ చుక్కల ముగ్గులకే ఆహ్వానం.
*
ముగ్గులు పంపాల్సిన చిరునామా:
ఎడిటర్,
ఆంధ్రభూమి దినపత్రిక, సరోజినీదేవి రోడ్,
సికింద్రాబాద్- 500 003.

ఆలివ్ ఆయిల్‌తో అందం

$
0
0

ఆలివ్ ఆయిల్‌తో చాలా ప్రయోజనాలున్నాయి. ఆరోగ్యంతో పాటు అందాన్నిచ్చే ఆలివ్ ఆయిల్‌ని తరచూ ఉపయోగిస్తే చాలా మంచిది. దీనివల్ల చర్మం నిగారింపు మరింత పెరుగుతుంది. అలాగే గుండెకు సంబంధించిన జబ్బులు రావు. ఆలివ్ ఆయిల్‌తో బరువు కూడా అదుపులో ఉంటుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ మొత్తం పోతుంది. అయితే ఆలివ్ ఆయిల్‌ను స్నానం చేసే ముందు శరీరానికి పూసుకుంటే చర్మానికి చాలా మంచిది.
* చలికాలంలో చర్మం పగిలిపోతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో ఆలివ్ ఆయిల్ పూసుకుంటే పగుళ్లు ఏర్పడవు. ప్రతిరోజూ స్నానానికి ముందు ఆలివ్ ఆయిల్‌ను శరీరానికి పట్టించి మసాజ్ చేసుకోవాలి. ఓ అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. ఇలా తరచుగా చేస్తే చర్మం అస్సలు పగలదు.
* కొంతమందికి చర్మం గరుకుగా ఉంటుంది. అలాంటివారు ఆలివ్ ఆయిన్‌ను కాస్త వెచ్చజేయాలి. ఇందులో కొద్దిగా పంచదార వేసి కరిగిపోయిన తరువాత ఈ నూనెతో శరీరాన్ని మసాజ్ చేసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది.
* ఆలివ్ ఆయిల్‌ను చాలామంది జుట్టుకు కూడా ఉపయోగిస్తుంటారు. వెంట్రుకలు నిగనిగలాడాలంటే ఆలివ్ ఆయిల్లో కాస్త కోడిగుడ్డు సొన వేసి బాగా కలిపి వెంట్రుకలకు పట్టించాలి. ఇలా తరచూ చేస్తుంటే జుట్టు మెత్తగా, పట్టుకుచ్చులా మారుతుంది.
* చాలామంది తలస్నానానికి షాంపూలను వాడుతుంటారు. అలాంటివారు కాస్త ఆలివ్ ఆయిల్‌ను ఒక పాత్రలో పోసుకుని అందులో షాంపూ కలుపుకుని దాంతో తలస్నానం చేస్తే జుట్టు రాలడం తగ్గిపోతుంది. షాంపూ ప్రభావం కూడా నేరుగా వెంట్రుకులపై పడదు. అలాగే చుండ్రు కూడా తగ్గిపోతుంది.
* నిమ్మరసంలో కాస్త ఆలివ్ ఆయిల్‌ను కలుపుకుని జుట్టుకు పూసుకోవాలి. తరువాత తలస్నానం చేయాలి. ఇలా తరచుగా చేస్తుంటే జుట్టు నిగనిగలాడుతుంది.
* చిన్నపిల్లలకు రోజూ ఆలివ్ ఆయిల్‌తో మసాజ్ చేస్తే చాలామంచిది. ఇలా చేయడం వల్ల వారు ఆరోగ్యంగా, చలాకీగా ఉంటారు.
* ఆలివ్ ఆయిల్లో కాస్త తేనె కలుపుకుని ముఖానికి రాసుకుంటే చాలా మంచిది. ఇలా తరచుగా చేస్తే ముఖం
మృదువుగా మారుతుంది.
* ఆలివ్ ఆయిల్‌ను గోళ్లకు పూసుకుంటే వాటి అందం పెరుగుతుంది. గోళ్లు పెలుసుబారకుండా ఉంటాయి. గట్టిగా మారతాయి.
* ఆలివ్ నూనెను పెదవులకు పూసుకుంటే నలుపురంగు పోయి గులాబీ రంగులోకి మారతాయి.
* కొందరికి కాళ్ల వేలి మధ్యలో పగుళ్లు ఏర్పడుతుంటాయి. ఆలివ్ నూనెలో పసుపును కలుపుకుని దాన్ని పూసుకుంటూ ఉంటే పగుళ్లు తగ్గిపోతాయి.
* వెల్లుల్లి పొట్టును కాల్చి దాన్ని పొడిలా చేయాలి. దీన్ని ఆలివ్ నూనెలో కలిపి జుట్టుకు పట్టిస్తే జుట్టు నల్లగా మారుతుంది.

ఆదర్శ ఉపాధ్యాయిని

$
0
0

తరగతి గది ఒక ప్రసూతి గది, జ్ఞానానికి జన్మనిచ్చేందుకు..
తరగతి గది ఒక స్మశానవాటిక, అజ్ఞానాన్ని ఖననం చేసేందుకు..
తరగతి గది ఒక కర్మాగారం, జాతి భవితను నిర్మించేందుకు..
తరగతి గది ఒక న్యాయ స్థానం, సరైన నిర్ణయాలు తీసుకునేందుకు..
- సర్వేపల్లి రాధాకృష్ణ
*
నిరంతరం నేర్చుకునే ఉపాధ్యాయుడే..
మంచి విద్యావంతుల్ని తయారు చేయగలడు..
- రవీంద్రనాథ్ ఠాగూర్
నైతిక విలువలను కాపాడే బాధ్యత ఉపాధ్యాయులదే..
ఉపాధ్యాయుడు ఉద్యోగి మాత్రమే కాదు నవ సమాజ నిర్మాత..
మంచి ఉపాధ్యాయుడు ఒక సామాజిక వైద్యుడు..
- ఐఐటీ రామయ్య
*
‘‘ఆప్యాయతను పంచి ఆడించు అమ్మ.. పాఠాలు నేర్పేటి తొలి పంతులమ్మ.. అటువంటి అమ్మ ఒడిలో ఆడుతూ పాడుతూ పెరిగిన బిడ్డ ఒక్కసారిగా పాఠశాల వాతావరణంలో ఇమడాలంటే అమ్మను మించిన ప్రేమ, ఆప్యాయత ఆ బిడ్డకు ఉపాధ్యాయులు అందించాలి. చిన్న పిల్లలలాగే ఉపాధ్యాయుల ప్రపంచం ఎంతో చిన్నది. వాళ్ళ ఆనందం, ఆసక్తి, ఆకాంక్షలు కూడా చిన్నవే.. ఎంత చిన్నదైతేనేమీ ఆ ప్రపంచం వాళ్ళకి అద్భుతమైనది.. ఆ అనుభూతులు మరువలేనివి.. పెద్దలు తమ పిల్లలను బాగా చదివించాలన్న ఆలోచనతో వాళ్ళను ఆ ప్రపంచం నుంచి దూరం చేస్తుంటారు. ప్రపంచ భవిష్యత్తు ఆ చిన్నారుల మీదనే ఆధారపడి ఉందని మరిచిపోతుంటాం. ఉపాధ్యాయుడు చిన్నారుల ప్రపంచంలోకి అడుగుపెట్టి వారితో కలిసిపోయి సహానుభూతి పొందడంలోనే అసలైన ఆనందం వుంటుంది. అందుకే గురుశిష్యుల సంబంధం గురించి రవీంద్రనాథ్ ఠాగూర్ మాటల్లో..గురుశిష్యుల మధ్య కావలసింది సాన్నిహిత్యమేనా? కాదు.. ఆంతరంగిక అభేదం. అది లేకుండా గురువు ఇచ్చేది లేదు.. శిష్యుడు తీసుకునేదీ లేదు. ఉపాధ్యాయులు అత్యంత సున్నితమైన, సుకుమారమైన పిల్లల మనసుతోటి వ్యవహరిస్తున్నామనే విషయం సర్వదా గుర్తుంచుకోవాలి. పిల్లల మనసు గురించి అనుకునేటప్పుడు మంచు ముత్యాలు తొణికిసలాడే మృదువైన గులాబీ పువ్వును గురించి ఊహించుకోవాలి. మంచు బిందువులు చెదిరిపోకుండా ఆ పువ్వును చేరాలంటే ఎంతో జాగ్రత్త అవసరం. అలాగే విద్యార్థుల విషయంలో ఉపాధ్యాయులు కూడానూ..’’ ఆహా.. ఎంతమంచి మాటలు అనుకుంటున్నారు కదూ.. ఈ మాటలు ఎవరో గొప్ప వ్యక్తులు చెప్పినవి కావు. సావిత్రీబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన అవార్డును పొందిన ఉపాధ్యాయురాలు అరుణకుమారి.
నిజమే...తల్లి ఒడి నుంచి ఒక్కసారిగా బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టి.. పాఠశాలలో అక్షరాలు నేర్చుకునే చంటి పిల్లలకు చదువు చెప్పాల్సిన తీరు అదే.. ప్రాథమిక విద్యా స్థాయి విద్యార్థులు భవిష్యత్తులో రాణించేందుకు ఓ పునాది వంటిది. ప్రభుత్వ విద్యావిధానం అట్టడుగుకు చేరుతోందని ప్రస్తుతం వస్తున్న ఆరోపణలు చాలానే వున్నాయి. ఈ నేపథ్యంలో నైతిక విలువలను కాపాడుకుంటూ, ఉపాధ్యాయుల వ్యవహార శైలిపై ఎందరో మహానుభావులు చెప్పి విధంగా నడుచుకుంటూ, విధి నిర్వహణలో రాజీపడకుండా బాధ్యతగా పాఠాలు బోధించే పంతుళ్ళు, పంతులమ్మలు ఇంకా కొద్దిమందైనా మిగిలి వున్నారని అరుణకుమారి లాంటి ఉపాధ్యాయనిని చూసినప్పుడనిపిస్తుంది. ప్రభుత్వం ప్రతి నెలా జీతమిస్తుంది. నిర్దేశించిన సమయంలో విధులకు హాజరై తిరిగి వెళ్ళిపోవడమే వారి పని.. అని అనుకునే ఉపాధ్యాయులున్న ఈ రోజుల్లో భావిభారత పౌర నిర్మాణం ప్రాథమిక విద్యా దశ నుంచే తయారు చేయాలన్న సంకల్పం వుండాలంటారు అరుణకుమారి. ఆ ఆలోచనతోనే కేవలం పాఠ్యాంశాల బోధన మాత్రమే కాదు.. సామాజిక, ఆర్థిక, రాజకీయ తదితర అంశాలపై కూడా ప్రాథమిక స్థాయి విద్యార్థుల్లో అవగాహన పెంచడంలో ముందుంటున్నారు. విద్యాశాఖలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు కార్యక్రమాలను విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే పద్ధతిలో బోధన చేస్తున్నారు. ఆటలు, పాటలు, చిత్రాలు.. పిల్లల బలహీనతలు. వాటినే బలంగా మార్చుకుని పాఠ్య పుస్తకాల్లోని బొమ్మలు గీయించడం, గేయాలు రాయించడం, చదవడం, రాయడం అనే ప్రక్రియలతో పాటు విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసే వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వాటితోపాటు మనిషి జీవన విధానానికి అవసరమయ్యే విషయాలను కథల రూపంలో విద్యార్థులకు చెప్తూ పలు అంశాలపై అవగాహన కల్పించడం కూడా తన పనేనంటూ విధులు నిర్వహిస్తూ ఆదర్శ ఉపాధ్యాయినిగా పేరు తెచ్చుకున్నారు.
పిల్లలు గీసిన బొమ్మలు, రాసిన రచనలను తీసుకుని వాటిని సంకలనం చేసి తాను బోధించే విద్యార్థులో దాగివున్న ప్రతిభను పదిమందికీ తెలియజేసి ఇతర పాఠశాలల్లోని విద్యార్థులకు స్ఫూర్తిగా నిలవాలన్న సదుద్దేశ్యంతో బాలసాహితి పేరుతో పాఠశాల విద్యావికాస సంచికను తయారుచేసి సుమారు 600ల ప్రతులను ఉచితంగా ఇతర పాఠశాలలకు అందజేశారు. దాంతో చాలా పాఠశాలల్లో విద్యాబోధన విధానంలో అరుణకుమారి అనుసరిస్తున్న విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇతర కొన్ని పాఠశాలల్లో కూడా అమలుపరచడం గమనార్హం. కేవలం ఒక ఉపాధ్యాయినిగా మాత్రమే కాకుండా ఆమె విధులు నిర్వహించే గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రత, మహిళల వ్యక్తిగత శుభ్రత, మహిళలు రక్తహీనతకు గురికాకుండా తీసుకోవాల్సిన పౌష్టికాహారం, చిన్నారులకు వేసే పల్స్‌పోలియో కార్యక్రమాలు, మహిళా విద్య-ఆవశ్యకత, ఇలాంటి అనేక సామాజిక సేవా కార్యక్రమాలను బాధ్యతగా నిర్వహిస్తూ ఆమె విధులు నిర్వహించే గ్రామాల్లోని మహిళలకు తలలో నాలుకలా నిలుస్తున్నారు.
‘ఉపాధ్యాయుడంటే ఒక ఉద్యోగి మాత్రమే కాదు.. నవ సమాజ నిర్మాత, ఒక సామాజిక వైద్యుడు’ అని ఐఐటీటి రామయ్య చెప్పిన మాటలను నిజం చేస్తూ, రచయిత్రిగా రాణిస్తూ ఉపాధ్యాయ వృత్తికే వనె్న తెస్తున్న ఉపాధ్యాయిని అప్పిరెడ్డి అరుణకుమారికి మన తొలి మహిళా ఉపాధ్యాయిని ‘సావిత్రీబాయి పూలే’ స్మారకంగా అందజేస్తున్న అవార్డు అభించింది. ఎం.ఏ., బి.ఈడీ వరకు చదివిన అరుణకుమారి ప్రస్తుతం అనంతపురం జిల్లా నల్లమాడ మండలంలోని బొగ్గిటివారిపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. 16జనవరి 1999లో ఉపాధ్యాయినిగా విధుల్లో చేరిన ఈమె తన 19 సంవత్సరాల సర్వీసులో వృత్తి ధర్మాన్ని బాధ్యతగా కొనసాగిస్తూనే రచయితగా, సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆమె వృత్తి పరంగా, సామాజికంగా చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి 2017లో నేషనల్ బిల్డర్ అవార్డు, 2005-06వ సంవత్సరంలో ప్రాథమిక స్థాయి పిల్లల భాషాభివృద్ధికి కృషి చేయడంతో ప్రశంసాపత్రాన్ని కూడా అందుకున్నారు. ఇలాంటి సేవలు అందజేస్తున్న ఉపాధ్యాయిని అప్పిరెడ్డి అరుణకుమారికి ఉత్తమ ఉపాధ్యాయినిగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం సావిత్రీబాయి పూలే స్మారక అవార్డు అందజేయడం అభినందనీయం.. ఆనందదాయకం..

చిత్రాలు.. సావిత్రీబాయిపూలే స్మారక అవార్డు తీసుకుంటున్న ఉపాధ్యాయిని అరుణకుమారి
సహోపాధ్యాయుల సన్మానంలో అరుణకుమారి


బరువును తగ్గించే తోటకూర

$
0
0

అవును.. తోటకూరను తింటే బరువు ఇట్టే తగ్గిపోతారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారు రోజూ ఓ కప్పు తోటకూర వండుకుని తింటే మంచి ఫలితం ఉంటుంది. ఇందులోని పీచుపదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది. దీనికి తోడు కొవ్వును తగ్గిస్తుంది. తోటకూర తక్షణశక్తిని ఇస్తుంది. అయితే తోటకూరను వేపుడు కన్నా కూరలా చేసుకుని తింటే బాగుంటుంది. అప్పుడే అధిక ప్రొటీన్లు శరీరానికి అందుతాయి. తోటకూర అధిక రక్తపోటును కూడా నియంత్రిస్తుంది. తోటకూరలోని విటమిన్ సి రోగనిరోధకశక్తిని పెంచుతుంది. కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, పాస్ఫరస్, జింక్, కాపర్, మాంగనీస్, సెలీనియం వంటి ఖనిజాలన్నీ తోటకూరలో లభిస్తాయి. తోటకూర రక్తనాళాల్ని చురుగ్గా ఉంచి, గుండెకు మేలుచేసే సోడియం, పొటాషియం వంటివి సమకూరుస్తుంది. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, పీచు వంటివన్నీ తోటకూర తీసుకోవడం ద్వారా పొందవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

రంగవల్లి

$
0
0

14 చుక్కలు, 14 వరుసలు, సరిచుక్కలు
*
సి. రాజ్యలక్ష్మి, ఎ.ఎస్.రావ్‌నగర్

శ్రీనరసింహ శతకము

$
0
0

సీ పాంచభౌతికము దుర్భరమైన కాయం బి
దెప్పుడో విడుచుట -యెఱుకలేదు
శతవర్షముల దాక -మితముఁ జెప్పిరి గాని
నమ్మరాదామాట -నెమ్మనమున
బాల్యమందో మంచి -ప్రాయమందో, లేక
ముదిమియందో లేక -ముసలియందొ
యూరనో, యడవినో- యుదక మధ్యముననో
యెప్పుడో విడుచుట యే క్షణం బొ
తే మరణమే నిశ్చయము; బుద్ధి - మంతుఁడైన
దేహమున్నంతలో మిమ్ముఁ- దెలియ వలయు
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
*
భావం:ఓ తండ్రీ! పంచభూతాలతో నేర్పడ్డ ఈ శరీరం ఎప్పుడు రాలిపోతుందో తెలీదు. బ్రతుకు దెరువు నూఱేండ్లు అంటారు కాని ఆ మాట నమ్మదగ్గది కాదు. బాల్యంలోనో, వనంలోనో, మసలితనంలోనో, ఊరిలోనో, అడవిలోనో, నీటిలోనో ఎప్పుడో ఎక్కడో ఒకచోట ఈ శరీరాన్ని వదలటం ఖాయం. చావు తప్పనిసరి. బుద్ధిమంతుడు శరీరాన్ని పరిత్యజించకముందే మీ స్వరూపాన్ని తెలిసికోవాలి.

అనంతం-29

$
0
0

‘‘తొందరేమొచ్చింది’’
‘‘వచ్చింది’’ అన్నాడు ఎమ్మెల్లే.
‘‘రాగ్యా ఇక నాతోనే వుంటాడు. అడవికి కలిసి వెళ్తాం. కోడి జాడలకోసం అనే్వషించి, సమగ్రమైన రిపోర్టు తయారుచేస్తాను.’’
‘‘ఏ ఏ బౌండరీల్లో రక్షిత ప్రాంతం నిర్మించాలో బాగా ఆలోచించి నిర్ణయించండి’’అని, అదోలా నవ్వాడు ఎమ్మెల్లే.
అతని భావం గరుడాచలానికి అర్ధమైంది!
‘‘స్వామి కార్యం స్వకార్యం రెండూ అవుతాయి! నాకెటూ కలివికోడి మీద పరిశోధన చెయ్యాల్సిన అవసరం వుంది. దాని పేరుతో అడివిని ఆక్రమించే అవసరం మీకుంది.’’
‘‘ముఖ్యమంత్రిగారు ఫోన్‌చేసారు’’ చెప్పాడు ఎమ్మెల్లే.
‘‘ఏమిటట?’’
‘‘త్వరగా అడవి భూములు కావాలని బహుళజాతి కంపెనీలవాళ్ళు వత్తిడి తెస్తున్నారుట.’’
‘‘మరో విషయం’’ అన్నాడు గరుడాచలం.
‘‘ఏమిటది?’’ ఎమ్మెల్లే అడిగాడు.
‘‘చాంద్‌దీ విషయం ఏం చేద్దాం? ఎప్పుడు చేద్దాం?’’
‘‘పథకం తయారైంది’’ అన్నాడు ఎమ్మెల్లే.
‘‘కొద్దిరోజుల్లో కొండదేవర జాతర జరగబోతున్నది.’’
‘‘తెలుసు.’’
‘‘ఈలోగా దాన్ని జోగ్గిన్నిచేస్తే?’’
‘‘కుదరదు! జాతరప్పుడే అవకాశం వుంటుంది. తొందరపడితే బెడిసి కొడుతుంది.’’
‘‘పథకం ఏమిటి’’ గరుడాచలం అడిగాడు.
‘‘ముందుగా మన ఒప్పందం గుర్తుందా చెప్పు.’’
‘‘చాలా జరిగాయి... ఏ ఒప్పందం.’’
‘‘జోగిన్ని చేసే బాధ్యత నాది- రాగ్యాని ఒప్పించే బాధ్యత నీది అన్నాను కదా.’’
‘‘గుర్తుంది.’’
‘‘రాగ్యాతో మాట్లాడావా.’’
‘‘మాట్లాడను! చెప్పింది చేసే మరబొమ్మలా వాడ్ని మారుస్తాను.’’
‘‘ఇక, పథకం ఏమిటోచెప్తా- విను’’అన్నాడు ఎమ్మెల్లే. గరుడాచలం చెవిలో ఏదో చెప్పాడు.
ఐదు నిమిషాల్లో చెప్పటం పూర్తయ్యింది.
గరుడాచలం మొహం సంతోషంతో విప్పారింది.
‘‘ఇక నువ్వు వెళ్ళి. ప్రాజెక్టు విషయం చూడు’’అని చెప్పి గరుడాచలాన్ని పంపించివేశాడు ఎమ్మెల్లే.
గరుడాచలం చాలా హుషారుగా గుడారంలోకి వెళ్ళాడు.
రాగ్యాని దగ్గర కూర్చోపెట్టుకొని-
‘‘శిష్యా! జ్ఞానానికీ, అజ్ఞానానికీ తేడా ఏమిటి’’అని అడిగాడు.
‘‘తెలవదు’’ అన్నాడు రాగ్యా.
‘‘నెమలి వాహనంమీద ముల్లోకాలు చుట్టొచ్చిన కుమారస్వామి కుదేలైపోయి- అమ్మా, నాన్నలచుట్టూ తిరిగి దణ్ణంపెట్టిన వినాయకుడు నాయకుడయ్యాడెందుచేత.’’
‘‘తెలవదు.’’
‘‘ఎంత పెద్ద సమస్యకైనా పరిష్కారానికి శూక్ష్మంగా ఓ సూత్రముంటుంది! దాన్ని పట్టుకోగలగాలి. అప్పుడు పరిష్కారవౌతుంది.
ఆ శూక్ష్మాన్ని గ్రహించినవాడు జ్ఞాని... గ్రహించనివాడు అజ్ఞాని! జ్ఞానికీ అజ్ఞానికీ తేడాకూడా శూక్ష్మంగానే ఉంటుంది!
ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నువ్వు నా శిష్యరికంలో గొప్ప జ్ఞానివి కావాలంతే’’ అన్నాడు గరుడాచలం.
‘‘గేనిగా మారాల్నంటే ఏంసెయ్యాలి?’’అని, చాలా వినయంగా రాగ్యా అడిగాడు.
‘‘జ్ఞానబోధ చెయ్యనా.’’
‘‘తఁవరిట్టఁవ్’’అన్నాడు రాగ్యా.
‘‘చాంద్‌నీదే నీకు పెద్ద సమస్య, అవునా?’’
‘‘అవున్సారూ... అదే!’’
‘‘పెళ్ళి అనే శూక్ష్మసూత్రంతో నీ పెద్ద సమస్య పరిష్కారవౌతుంది- అవునా?’’
‘‘అవున్సారూ.’’
‘‘పెళ్ళి చేసుకొని ఏం చేస్తావ్.’’
రాగ్యా వౌనంగా తలదించుకున్నాడు.
‘‘ఇల్లు అనే పంజరంలో బంధిస్తావు- అవునా’’
‘‘అవున్సారూ.’’
‘‘దాని శరీరంతో సుఖిస్తావు- అవునా’’
‘‘అవున్సారూ’’
‘‘పిల్లల్ని కంటావు. వాళ్ళ బరువు బాధ్యతలు మోస్తావు...’’
‘‘అవున్సారూ.’’
‘‘పెళ్ళిచేసుకోకుండా శరీరాన్ని వాడుకోమని చాందినీ అంటే ఏమంటావు? వొద్దంటావా?’’
‘‘అనను.’’
‘‘బాధ్యతలు లేకుండా- అంటే, పెళ్ళిచేసుకోకుండా దాన్తోనే సుఖించటం అనేదే శూక్ష్మసూత్రం! పెళ్ళి, సంసారం, పిల్లలు, వాళ్ళ బరువు బాధ్యతలతో బ్రతికినంతకాలం బాధలు పడకుండా నీకో మార్గం చెప్తాను...’’
‘‘శాందినీ నాకు దక్కుద్దాసారూ?’’
‘‘అవును.’’.
‘‘తఁవరిట్టఁవే నా ఇట్టవ్ సారూ’’ అన్నాడు రాగ్యా.
గరుడాచలం కొంతసేపు వౌనంగా కూర్చున్నాడు!
‘‘ముందుగా చెయ్యాల్సిన పని వుంది! దాని తర్వాతనే చాంద్‌నీ విషయం పరిష్కారవౌతుంది’’ అన్నాడు రాగ్యావైపు చూస్తూ.
‘‘ఏంటిదది సారూ?’’ రాగ్యా అడిగాడు.
‘‘నల్లకొండ దగ్గర్లో వుంది మీ తండా ఒక్కటే కదూ.’’
‘‘అవును.’’
‘‘అంటే- ఈ ప్రాంతంలో జన సంచారం తక్కువ...’’
‘‘అవును’’
‘‘నల్లకొండ నిండా గుహలున్నాయి కదూ.’’
‘‘ఉండయ్యి’’
‘‘కొండ సమీపంలో నీటి కొలనుంది....’’
‘‘ఉంది.’’
‘‘ఈ ప్రాంతాల్లోనే కలివి కోళ్ళు ఉండి తీరాలి.’’
‘‘ఎట్టాగంటున్నారూ?’’ రాగ్యా అడిగాడు.
(ఇంకా ఉంది)

పుష్యమాస విశిష్టత

$
0
0

జ్యోతిష శాస్త్ర ప్రకారం ప్రతి మాస నిర్ణయము ఆ మాసంలో పౌర్ణిమ రోజున వచ్చే నక్షత్రం ఆధారంగా చేయబడుతుంది. చైత్ర పౌర్ణిమ రోజున చంద్ర సంచారము చిత్తా నక్షత్రమున అవుతుంది కనుక ఆ మాసానికి చైత్ర మాసమని, విశాఖ నక్షత్రమందు సంచరించుట వలన వైశాఖ మాసమని, ఇలా పనె్నండు మాసాల పౌర్ణమిలలో చంద్రుని సంచారం ఆధారంగా పేర్లను నిర్ణయించారు. చంద్రుడు పూర్ణిమ రోజున పుష్యమి నక్షత్రములో సంచరించే మాసం పుష్యమాసం. పుష్య అంటే పోషణ శక్తి కలిగినది అని అర్థం. పుష్యం శీతకాలంలో వస్తుంది. శూన్యమాసమై, గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు, వివాహాది శుభశోభనాలకు వీలు లేకున్నా, జపతప ధ్యానాదులకు, పితృ దేవతలను పూజించడానికి ఉద్దిష్టమైన మాసమిది. శ్రావణ పౌర్ణమి నుండి పుష్య పౌర్ణమి వరకు వేదాధ్యయయానికి, మంత్రాలు నేర్వడానికి పూర్వకాలం నుండి అనువైన సమయంగా చెప్పబడింది. రైతులకు పంట చేతికి అందేకాలం కనుక ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి రూపేణ విష్ణుమూర్తి సమేత మహాలక్ష్మిని పూజించడం సనాతన సాంప్రదాయాచరణగా ఉంది. పుష్య మాసాధిపతియైన శని మరియు నక్షత్రాధిపతియైన గురును పూజించడం వల్ల విశేష ఫలితాలు వస్తాయని విశ్వాసం. పుష్య అమావాస్య దినాన శనికి తైలాభిషేకం నిర్వహించడం ద్వారా శనిబాధ నివృత్తి కలుగుతుంది. వస్త్ర, తిల, అన్నదానాల వల్ల కూడా శని దోషాలు తొలగిపోయి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. పుష్య పౌర్ణమి స్నానాలు సకల శ్రేయోదాయకాలు. ఉత్తరాయణ పుణ్యకాలం, తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి వచ్చేదీ ఈ మాసంలోనే. సూర్యుడు ధనురాశి నుండి మకరరాశిలో ప్రవేశించేదే మకర సంక్రాంతి. ఉత్తరాయణ కాలంలో తిలధేనుధానాలు, తిల తైలాదులతో శివాలయాలలో దీప దానం, శివారాధనం, శివుని ఘృతముచే అభిషేకించడం మహాఫలం. నల్ల నువ్వులచే అభ్యంగన స్నానం, తిలహోమం, తిలభక్ష్యం, తెల్ల నువ్వులచే దేవ తర్పణం, నల్ల నువ్వులచే పితృ తర్పణం చేయాలని ధర్మసింధు వివరిస్తున్నది. పౌర్ణమి తిథియందు పుష్యమి నక్షత్రంతో చంద్రుని కలయిక పౌషీ పౌర్ణమి. గ్రహాధిపతి సూర్యుడు మకరరాశిలో ప్రవేశించడంచేత మకర సంక్రమణ అవుతుంది. ఉత్తరాయణంలో సూర్య దేవ, సూర్య కిరణ ఆరాధన చేస్తారు. ఈ పుణ్య కాలాన సూర్యోదయం నుండి ఐదు ఘడియలు (రెండుగంటలు) వరకు విశిష్ట తేజస్సును ప్రసరింపచేసే సూర్య కిరణాలు జీవ చైతన్యాన్ని ఊర్ధ్వముఖంగా ప్రసరింప చేయుటకు తోడ్పడతాయి. మానవ శరీరంలోని వెనె్నముక యందలి విశుద్ధి చక్రము, కంఠ స్థానమునందున్న షోడశ దళ పద్మమునకు, హృదయ స్థానమందున్న అనాహత చక్రమునకు మధ్యన ప్రకాశించే ప్రజ్ఞాకేంద్రము మకర రాశిని సూచిస్తుంది. ఇది మహా విష్ణువు నివాస స్థానం. అనాహత చక్రానికి నారాయణుడు అధిదేవత. అందువల్ల పుష్య పూర్ణిమ నాడు ‘‘ఓం నమో భగవతే వాసుదేవాయ’’ అని ఉపాసించుటచేత సిద్ధిత్వం కలుగుతుంది. మనుస్మృతి, గోభిల మునిచే విరచితమైన ధర్మస్మృతి ప్రకారం శ్రావణ పౌర్ణమి నుండి పుష్య పౌర్ణమి వరకు అభ్యసించిన వేద మంత్రాధ్యయనానికి ముగింపు పలికి, ఇతర విద్యలను మళ్ళీ శ్రావణం వచ్చే వరకు అభ్యసించాలి. పుష్య పూర్ణిమ నాడు వేద మంత్ర ఉత్సర్జనము విధిగా చేసే ఆచారం ఉండేది. తమిళ నాట పుష్యపూర్ణిమను పూసమ్ అంటారు. తైపూసమ్ ఉత్సవాన్ని జరుపుకుంటారు. తంజావూరునందు ఉత్సవాన్ని వైభవంగా ఆచరిస్తారు. కుజదోషము, కాలసర్ప దోషము, సర్పదోషము, వివాహ అలస్యము, నిస్సంతానత్వం మున్నగు వాటికి స్ర్తి పురుషులు శ్రీసుబ్రహ్మణ్య, అంగారక గ్రహారాధనలు సత్ఫలితాలను అందిస్తాయి.

maatata

$
0
0
Cross Image: 
Date: 
Monday, January 7, 2019

సత్తా చూపాల్సిందే!

$
0
0

న్యూఢిల్లీ, జనవరి 6: లోక్‌సభ ఎన్నికలు మరో నాలుగు నెలల్లో జరగనుండగా దేశంలోని అతి పెద్దరాష్టమ్రైన ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ (ఎస్పీ), బహుజన సమాజ్‌వాదీ (బీఎస్పీ) కలిసి పోటీచేసే బదులు సంకుల సమరానికి సిద్ధమవుతున్నాయి. యువనాయకుడు అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని ఎస్పీ, ప్రధాన మంత్రి పదవిపై కనే్నసిన బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి కలిసి పోటీ చేయాలనుకోవటంతోపాటు కాంగ్రెస్‌ను దూరంగా ఉంచాలనే వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నాయి. దీంతో స్వతంత్రంగా రంగంలోకి దిగాలని కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచిస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ మాదిరిగా 80 లోక్‌సభ సీట్లున్న దేశంలోని అతిపెద్ద రాష్టమ్రైన ఉత్తరప్రదేశ్‌లో స్వతంత్రంగా పోటీ చేయటం ద్వారా తమ సత్తాను నిరూపించుకోవాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంతోపాటు కేంద్ర నాయకత్వం కూడా భావిస్తున్నట్లు చెబుతున్నారు. అఖిలేష్ యాదవ్, మాయావతి, ఆర్‌ఎల్‌డీ అధ్యక్షుడు అజిత్ సింగ్ లక్నోలో సమావేశమై 80 లోక్‌సభ సీట్ల నుండి ఎవరెన్ని సీట్లలో పోటీ చేయాలనే అంశంపై ఒక అవగాహనకు వచ్చారు. ఎస్పీ 37, బీఎస్పీ 38 సీట్లలో పోటీ చేసి ఆర్‌ఎల్‌డికి మూడు సీట్లు ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలోని ఒకటి, రెండు చిన్న పార్టీలను కూడా తమ కూటమిలో చేర్చుకుని వారికి ఒక్కొక్క సీటు కేటాయించటం ద్వారా బీజేపీని ఎదుర్కొనేందుకు పటిష్టమైన కూటమిని తయారు చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోకున్నా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ అధ్యక్షురాలు, యుపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ పోటీచేసే అమేథీ, రాయబరేలీ లోక్‌సభ సీట్లలో తమ అభ్యర్థులను పోటీకి దించకూడదనే వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌తో సీట్ల పంపకం గురించి ఎలాంటి చర్చలు జరపకూడదనే నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలిసింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో తమతో పొత్తు పెట్టుకునేందుకు నిరాకరించిన కాంగ్రెస్‌తో లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోకూడదని మాయావతి గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలిసింది. దీనికితోడు మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌తో ఉత్తరప్రదేశ్‌లో పొత్తు పెట్టుకుంటే తమ ఉనికికే ప్రమాదమని అఖిలేష్ యాదవ్, మాయావతి భావిస్తున్నట్లు తెలిసింది. ఈ అభిప్రాయంతో అజీత్‌సింగ్ కూడా ఏకీభవిస్తున్నట్లు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ ఏమాత్రం పుంజుకున్నా తమ పార్టీలకు రాజకీయంగా తీరని నష్టం వాటిల్లుతుందని ఈ మూడు ప్రాంతీయ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. ఇదిలాఉంటే కాంగ్రెస్ కూడా ఈసారి ఉత్తరప్రదేశ్‌లో అటో ఇటో తేల్చుకోవడం మంచిదని ఆలోచిస్తున్నట్లు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన తమకు ఉత్తరప్రదేశ్‌లోనూ బాగానే సీట్లు వస్తాయి.. రాష్ట్ర ప్రజలు మనవైపు చూస్తున్నారు అని యూపీ కాంగ్రెస్ నాయకులు జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి నివేదిక పంపినట్లు తెలిసింది. బీజేపీ విధానాలతో విసిగిపోయిన రాష్ట్రంలోని ఉన్నత వర్గాలు, ముస్లిం మైనారిటీలు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్‌బబ్బర్ భావిస్తున్నారు. ఎస్పీ, బీఎస్పీ ఒక కూటమిగా ఏర్పడుతున్నందున మనం ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలని రాహుల్ గాంధీ ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్ నాయకులను అడిగారు. దీనికి రాష్ట్ర నాయకత్వంతో పాటు జిల్లా నాయకులు కూడా స్వతంత్రంగా ఎన్నికల బరిలోకి దిగితేనే బాగుంటుందంటూ నివేదకలు పంపించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ మాదిరిగానే యుపీలోనూ కాంగ్రెస్ పరిస్థితి బాగా మెరుగవుతోంది.. జిల్లా స్థాయిలో కార్యకర్తలు కాంగ్రెస్‌లోకి రావటంతోపాటు ఉత్సాహంగా పని చేస్తున్నారు.. మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు యుపీలో కూడా ప్రజల నుండి మంచి మద్దతు లభిస్తోంది.. ఈ తరుణంలో మనం పొత్తులు పెట్టుకుని కొన్ని సీట్లలో మాత్రమే పోటీ చేయటం వలన నష్టం తప్ప లాభం ఉండదని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంతోపాటు ఏఐసీసీకి చెందిన కొందరు సీనియర్ నాయకులు భావిస్తున్నారు. అతిపెద్ద రాష్ట్రంలో ప్రతిపక్షం విడివిడిగా పోటీచేస్తే బీజేపీకి కలిసి వస్తుందనే ఆందోళన కూడా కాంగ్రెస్‌లో వ్యక్తమవుతున్నా పార్టీ ప్రయోజనాల గురించి ఆలోచించక తప్పదని నాయకులు స్పష్టం చేస్తున్నారు. బీజేపీని ఓడించే ఆలోచనతో కాంగ్రెస్ మనుగడను దెబ్బతీసుకోవటం ఎంతమాత్రం అభిలషణీయం కాదన్నది వారి వాదన.


బీజేపీ మునుగుతున్న నావ

$
0
0

న్యూఢిల్లీ, జనవరి 6: కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ పెత్తనం పెరగడంతో సంకీర్ణ ప్రభుత్వంలోని పార్టీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయని సీనియర్ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ధ్వజమెత్తారు. ఎన్డీఏ కూటమిలోని కొన్ని పార్టీలు బీజేపీతో తెగతెంపులు చేసుకుని బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. చివరకు బీజేపీతో మొదటి నుంచి స్నేహంగా ఉన్న పార్టీలు కూడా అసంతృప్తిగా ఉన్నాయంటే ,మోదీ పని తీరు ఎంత అధ్వాన్నంగా ఉందో తెలుస్తుందన్నారు. ఎన్డీఏ కూటమిలోని పార్టీల నేతలు మోదీ ఏకపక్ష వైఖరి, నియంతృత్వ ధోరణి పట్ల అసహనంతో ఉన్నారన్నారు. బీజేపీ మునిగిపోతున్న నావ అన్నారు. ఎన్డీఏ కూటమిలో లుకలుకలు బయలుదేరుతాయన్నారు. యుపీఏ కూటమిలో ఈ పరిస్థితి ఎప్పుడూ తలెత్తలేదన్నారు. ఒకే గొంతు, ఒకే నాయకత్వం కింద ప్రజలకు యూపీఏ మంచి పాలన అందించిందన్నారు. కేంద్రంలో ఒన్ మ్యాన్ షో నడుస్తోందన్నారు. బీజేపీ వైఖరికి విసుగుచెంది టీడీపీ, ఆర్‌ఎల్‌ఎస్‌పీ పార్టీలు బయటకు వచ్చాయన్నారు. ఇంకా అప్నాదళ్, ఎస్‌బీఎస్‌ఫీ పార్టీలు దూరంకావడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ చిత్తుగా ఓడిపోతుందన్నారు. చివరకు శివసేన కూడా బీజేపీపై ధ్వజమెత్తుతోందన్నారు. బీజేపీ పనితీరుపై మిత్ర పక్షాల్లో నమ్మకం పోయిందన్నారు. ఆ పార్టీకి విశ్వసనీయత పోవడంతో పార్టీలు, ప్రజలు దూరమవుతున్నారన్నారు. ఒక ప్రశ్నకు బదులిస్తూ రుణమాఫీ వ్యవసాయ రంగానికి పరిష్కారం కాదని, కాని ఇది కచ్చితంగా ఉపశమనం కలిగించే చర్య అన్నారు.

అఫ్గాన్‌లో కూలిన గని

$
0
0

కుందుజ్, జనవరి 6: అఫ్గానిస్తాన్‌లో ఒక బంగారు గని కూలిపోవడంతో దాదాపు 30 మంది మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. ఉగ్రవాదుల దాడులతో అతలాకుతలం అవుతున్న అఫ్గాన్‌లో ఇది మరో విషాదకర సంఘటనగా అధికారులు అభివర్ణిచారు. ఈశాన్య అఫ్గాన్ కోహిస్తాన్ జిల్లా బదక్షాన్ ప్రావిన్స్ గవర్నర్ మొహమ్మద్ రుస్తాం రాగి వివరాల మేరకు- స్థానిక నదీ పరీవాహక ప్రాంతంలో బంగారంకోసం గాలించేందుకు 200 అడుగుల గోతిని తవ్వి అందులోకి గ్రామస్థులు దిగారు. అకస్మాత్తుగా గోయి పూడుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు. ఈ ప్రమాదంలో 30 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన వివరించారు. అయితే మరణించినవారిలో పిల్లలు ఎవరూ లేరని గవర్నర్ ప్రతినిధి నిక్ మొహమ్మద్ నజారి తెలిపారు. తరతరాలుగా ఇక్కడి ప్రజలకు ఇదే వృత్తి. ఇక్కడ బంగారం కోసం అనే్వషిస్తుంటారని ఆయన వివరించారు. పర్వతాలతో నిండి ఈ ప్రాంతం చాలా వెనుకబడి వుంటుంది. తజకిస్తాన్, చైనా, పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతంలో శీతాకాలంలో విపరీతమైన మంచు కూడా కురుస్తుంటుంది. అక్రమ తవ్వకాలు ఇక్కడ మామూలేనని ఆయన చెప్పారు.

ఆధార్‌తో అంతా ఆదాయే

$
0
0

న్యూఢిల్లీ, జనవరి 6: ఆధార్ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడం వల్ల మన దేశ ఆర్థిక రంగంపై పెనుమార్పును చూపిందని, ఈ పథకం ద్వారా ఆదా చేసిన డబ్బుతో ఇప్పుడు దేశంలో అమలవుతున్న ఆయుష్మాన్‌భారత్ లాంటి మూడు పెద్ద సంక్షేమ పథకాలకు నిధులను సమకూర్చుకోవచ్చునని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. ఈ పథకం యూపీఏ హయాంలో ప్రవేశపెట్టినా సొంత వారి నుంచి ఎదురైన అడ్డంకులు, నిలకడలేని వైఖరి కారణంగా దానిని పూర్తి చిత్తశుద్ధితో అమలు చేయలేకపోయిందని, కాని ప్రధాని నరేంద్రమోదీ దృఢ చిత్తంతో నిర్నయాత్మకంగా దానిని అమలు చేయడంతో దేశంలో పూర్తిగా అమలవుతూ విజయవంతం అయిందని ఆయన ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యానించారు. ‘ఆధార్‌తో లాభాలు-నేడు ఎలా అమలవుతోంది’ పేరుతో రాసిన పోస్టులో మనదేశంలో ఆధార్‌ను అమలు చేయడం వల్ల గత ఏడాది మార్చి 31వరకు 90 వేల కోట్లను ఆదా జేయగలిగామని అన్నారు. పలు సంక్షేమ పథకాల్లో నకిలీ లబ్ధిదారులను అరికట్టడం, రెండుసార్లు అంతకన్నా ఎక్కువసార్లు లబ్ధి పొందడం తదితరమైనవి తొలగించడం వల్ల భారత్‌కు ప్రతిఏటా 77 వేల కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయని వరల్డ్ బ్యాంక్ తన నివేదికలో పేర్కొందని ఆయన చెప్పారు. ఈ ఆదా చేసిన మొత్తంతో భారత్‌లో ఇప్పుడు అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ లాంటి పథకాలు మూడు అమలు చేయవచ్చునని అన్నారు. ఇప్పటికే తాము ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌భవ పథకం పేదలకు ఎంతో లబ్ధి చేకూర్చుతోందని ఆయన చెప్పారు. పేదలకు ఖరీదైన వైద్యం కూడా అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో తాము ప్రవేశపెట్టిన ఈ పథకంలో 10.74 కోట్ల మందికి ఆరోగ్య బీమా లభిస్తుందని ఆయన తెలిపారు. దీని ద్వారా పేదలకు ఐదు లక్షల రూపాయల వరకు ఆరోగ్య సేవలు కార్పొరేట్ సహా అన్ని అసుపత్రులలో అందుతుందన్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు సుమారు ఏడు లక్షల మంది పేద రోగులు ఉచితంగా ఆసుపత్రులలో చికిత్స పొందారని ఆయన వివరించారు.
వాస్తవానికి ఆధార్‌ను ప్రవేశపెట్టిన యూపీఏ ప్రభుత్వం ఆ వ్యవస్థను పూర్తి చిత్తశుద్ధితో అమలు చేయలేకపోవడం వల్ల దానికి సంబంధించిన క్రెడిట్‌ను పొందలేకపోయిందని జైట్లీ వ్యాఖ్యానించారు. ఆధార్ సాంకేతిక పరిజ్ఞానంలో లోపాలున్నాయని, దాని అమలుతో అనేక ఇబ్బందులు వస్తాయని కాంగ్రెస్ పార్టీకి చెందిన న్యాయవాదులే దీనిపై పలు కేసులు వేశారని ఆయన ఈ సందర్భగా గుర్తు చేశారు. కాని మోదీ చిత్తశుద్ధితో, కృతనిశ్చయంతో దీనిని అమలు చేయడం వల్ల పూర్తిగా విజయవంతమైందని, సుప్రీం కోర్టు తీర్పు కూడా తమకు అనుకూలంగా వచ్చిందని ఆయన చెప్పారు. ఆధార్ విధానం ద్వారా ఇప్పుడు బదిలీ అవుతున్న సబ్సిడీ మొత్తాల విలువ 1,69,868 కోట్ల రూపాయలని, ఎలాంటి దళారులు లేకుండా పలు పథకాలకు సంబంధించిన సబ్సిడీ మొత్తం లబ్ధిదారుల ఖాతాలోకి నేరుగా జమ అవుతోందని మంత్రి జైట్లీ తెలిపారు. ఇలాంటి విధానం ప్రపంచంలోని కేవలం భారత్‌దేశంలో మాత్రమే ఉందని ఆయన అన్నారు. 2016లో ప్రవేశపెట్టిన ఆధార్ వ్యవస్థలో ఇప్పటివరకు 122 కోట్ల మంది నమోదయ్యారన్నారు. 18 ఏళ్లుదాటిన వారిలో 99 శాతం మందికి పైగా దీనిలో నమోదై ఉన్నారని చెప్పారు. 22.80 కోట్ల పహల్, ఉజ్వల లబ్ధిదారులకు గ్యాస్ సబ్సిడీ నేరుగా వారి ఖాతాల్లోకే జమవుతోందని అన్నారు. అలాగే 58.24 కోట్ల రేషన్‌కార్డుదారులను ఆధార్‌తో లింక్ అయ్యాయని, 10.33 ఎంజిఎన్‌ఆర్‌ఇజిఏ కార్డుదారులను, 63.52 కోట్ల బ్యాంక్ ఖాతాలను కూడా ఆధార్‌తో అనుసంధానం చేశామన్నారు. ఆదాయపు పన్ను శాఖ వారు ఇప్పటికే 21 కోట్ల పాన్‌కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేశారన్నారు. ఆధార్ ప్రాధికార సంస్థ యుఐడిఏఐ రోజుకు పది కోట్ల లావాదేవీలు జరిపే సామర్థ్యం కలిగి ఉన్నా, దానిద్వారా ప్రస్తుతం రోజుకు 2.7 కోట్లు మాత్రమే జరుగుతున్నాయని కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు.

పౌరసత్వం బిల్లుపై భిన్నస్వరాలు

$
0
0

న్యూఢిల్లీ, జనవరి 6: అస్సాంలో వివిధ వర్గాల ప్రజలకు సంబంధించి పౌరసత్వం సవరణ బిల్లుపై పార్లమెంటరీ కమిటీ సంయుక్త కమిటీ రూపొందించిన తుది నివేదికపై అసమ్మతి గళం విప్పేందుకు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, సమాజవాది పార్టీలు సన్నద్ధమవ్వుతున్నాయి. సోమవారం ఈ సవరణ బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కనీసం నాలుగు ప్రధాన పార్టీల మద్దతు ఉండాలి. బిల్లుపై రూపొందించిన సంయుక్త పార్లమెంటరీ పార్టీలోని సభ్యులైన నాలుగు ప్రతిపక్ష పార్టీలు నిరశన తెలిపేందుకు సిద్ధమవుతున్నాయని ఆయా పార్టీల వర్గాలు తెలిపాయి. ‘పౌరసత్వంపై రూపొందించిన 2016 సవరణ తుది బిల్లుపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీనిని వ్యతిరేకిస్తూ లోక్‌సభలో గళమెత్తనున్నాయి’ అని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈమేరకు లెఫ్ట్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులతో కూడిన కమిటీ ఇటీవల గుజరాత్, రాజస్తాన్, అస్సాం రాష్ట్రాల్లో పర్యటించిన సందర్భంగా పౌరసత్వంపై సవరణ బిల్లుపై ఆయా ప్రాంతాల్లో వ్యతిరేకత కనిపించిన విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యంగా అస్సాంలో ఈ సవరణ బిల్లుపై మరింత తీవ్ర వ్యతిరేకతను చవిచూశామని, దీంతో సున్నితమైన ఈ అంశంపై తుది నివేదిక వచ్చేలోగా మరోసారి రాష్ట్రంలో పర్యటిస్తామని ఆయా పార్టీల నాయకులు తెలిపారు. ప్రస్తుతం పౌరసత్వం సవరణపై తుది నివేదిక తయారు కావడం చాలా ఇబ్బందికరంగా ఉందని లెఫ్ట్ పార్టీకి చెందిన ఒక సభ్యుడు విచారం వ్యక్తం చేశారు. మతానికి అనుసంధానం చేస్తూ రూపొందించిన పౌరసత్వం బిల్లుపై ప్రతిపక్ష పార్టీలన్నీ అభ్యంతరంతో కూడిన ప్రతిపాదనలను కేంద్రం ముందుకు దృష్టికి తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు. ‘మతంలో లింకు పెట్టి పౌరసత్వంపై బిల్లు రూపొందించడం ఆమోదయోగ్యం కాదు. వెంటనే దానిని తొలగించాలి. ఇది దేశ నాగరికత, సంస్కృతితోపాటు రాజ్యాంగ వ్యతిరేకం. కులం, మతాన్ని లింకుపెట్టి పౌరసత్వ బిల్లును రూపొందించడం సమంజసం కాదు. ఇది సార్వత్రికంగా ఉండాలి’ అని ఈ బిల్లుపై అసమ్మతి గళం విప్పిన మరో సభ్యుడు పేర్కొన్నారు. ఆరు మైనారిటీ మతాలను ప్రస్తావిస్తూ ఉన్న అంశాన్ని తొలగించాలని కోరుతూ క్లాజ్-2కు సవరణలు ప్రతిపాదించామని, ఈ బిల్లును లౌకికవాద దృష్టితో చూడాలని తాము ఆకాంక్షించినట్టు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యుడు ఒకరు తెలిపారు.

జౌళి రంగం నివేదిక

$
0
0

చిత్రం..‘జౌళి రంగం విజయాలు తదుపరి కార్యాచరణ’ అన్న అంశంపై ఆదివారం ఢిల్లీలో జరిగిన జాతీయ సదస్సు సందర్భంగా నివేదికను విడుదల చేస్తున్న కేంద్ర జౌళి మంత్రి స్మృతీ ఇరానీ, సహాయ మంత్రి అజయ్ తమ్తాలు

Viewing all 69482 articles
Browse latest View live