Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

గణతంత్ర వేడుకల రిహార్సల్స్

0
0

భారతదేశం గణతంత్ర వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు సమాయత్తమవుతుంది.
ఇందులో భాగంగా ఆదివారం ఉదయం ఓ పక్క మంచు, మరో పక్క వర్షం ముంచెత్తుతున్నా రిహార్సల్స్ చేస్తున్న జవానులు


రాహుల్, నిర్మలా ట్వీట్ల యుద్ధం

0
0

న్యూఢిల్లీ: హెచ్‌ఏఎల్‌ను పటిష్టం చేసేందుకు ఆ సంస్థకు యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల తయారీకి సంబంధించిన లక్ష కోట్ల రూపాయల విలువ చేసే ఆర్డర్లు ఇస్తున్నామంటూ రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్‌సభలో చేసిన ప్రకటన వివాదాస్పమైంది. నిర్మలా సీతారామన్ అబద్ధం చెప్పారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపిస్తే, రాహుల్ గాంధీ పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తున్నారని రక్షణ శాఖ మంత్రి దుయ్యబట్టారు. హెచ్‌ఏఎల్‌కు లక్ష కోట్ల విలువ చేసే ఆర్డర్లు ఇచ్చామనటం ద్వారా నిర్మలా సీతారామన్ లోక్‌సభను తప్పుదోవ పట్టించారు.. ఆమె అబద్ధాలు చెప్పారంటూ రాహుల్ ఆదివారం ట్వీట్ చేశారు. లోక్‌సభను తప్పుదోవ పట్టించిన నిర్మలా సీతారామన్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఒక అబద్ధం చెబితే దానిని కప్పిపుచ్చుకునేందుకు మరిన్ని అబద్ధాలు చెప్పక తప్పదు.. నిర్మలా సీతారామన్ హెచ్‌ఏఎల్ విషయంలో అబద్ధాల మీద అబద్ధాలు చెబుతున్నారని ట్వీట్ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందాన్ని సమర్థించే తొందరలో నిర్మలా సీతారామన్ పార్లమెంటును తప్పుదోవ పట్టించారని రాహుల్ ఆరోపించారు. రక్షణ శాఖ మంత్రి పార్లమెంటులో హెచ్‌ఏఎల్‌కు ఇచ్చిన లక్ష కోట్ల విలువైన ఆర్డర్లకు సంబంధించిన వివరాలను వెల్లడించాలని రాహుల్ డిమాండ్ చేశారు. హెచ్‌ఏఎల్‌కు యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు తయారీచేసే ఆదేశాలు ఇవ్వనున్నట్లు చెప్పాను తప్ప.. ఆర్డర్లు ఇచ్చినట్లు తాను పార్లమెంటులో చెప్పలేదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ఇచ్చిన ట్వీట్‌కు ప్రతి ట్వీట్ ఇస్తూ.. తాను పార్లమెంటులో ఏం చెప్పాననేది ఆయన పూర్తిగా చదివితే బాగుంటుందని హితవు చెప్పారు. హెచ్‌ఏఎల్‌కు ఆదేశాలు ఇవ్వనున్నట్లు చెప్పాను తప్ప ఆదేశాలపై సంతకం చేశానని ఎక్కడా చెప్పలేదని ఆమె స్పష్టం చేశారు. రాహుల్ వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేశాన్ని తప్పుదోవ పట్టించటం సిగ్గుచేటని ఆమె విమర్శించారు. 2014-18 మధ్య హెచ్‌ఏఎల్ రూ.26,570 కోట్ల ఒప్పందాలపై సంతకాలు చేసింది.. మరో రూ.73వేల కోట్ల విలువైన కాంట్రాక్టులు తయారవుతున్నాయని మాత్ర మే తాను లోక్‌సభలో చెప్పానని ఆమె వివరణ ఇచ్చారు. రాహుల్ పార్లమెంటు వేదికగా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని నిర్మలా సీతారామన్ డిమాండ్ చేశారు.

వైసీపీ అధినేత జగన్‌కు అపూర్వ ఆదరణ

0
0

సోంపేట/కంచిలి, జనవరి 6: ప్రతిపక్ష నాయకుడు,వైసీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి పాదయాత్రకు సోంపేటలో ఆదివారం అపూర్వ ఆదరణ లభించింది. పలాసపురం నుంచి ఉదయం 9.30 గంటలకు ప్రారంభించిన ప్రజాసంకల్పయాత్ర ముగింపు దశకు చేరడంతో పలాసపురం, జింకిభద్ర జంక్షన్‌ల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఘనస్వాగతం పలికారు. అక్కడ నుంచి సోంపేటకు జగన్ వస్తున్నారనే విషయాన్ని తెలుసుకున్న పట్టణ ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు, జగన్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని సన్నాయిమేళాలు, బిందెల నృత్యం, డప్పువాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. పలాసపురం నుంచి సోంపేట కిలోమీటరు దూరం చేరడానికి సుమారుగా 2 గంటలకాలం పట్టిందంటే ఆయన వెంట జనం ఎంతగానో పాల్గొన్నారో అంచనా వేయవచ్చును. అడుగడుగునా తమ సమస్యలను జగన్‌కు వివరించారు. తిత్లీ తుపాన్ బాధితులు కూడా తమ జరిగిన నష్టాలకు తగిన పరిహారాలను ప్రభుత్వం అందివ్వలేదంటూ జగన్ వద్ద వాపోయారు. ప్రజాసంకల్పయాత్రలో జగన్ పాదయాత్రకు పలువురు నేతలు అడుగులు వేస్తూ సంఘీభావం ప్రకటించారు. సోంపేట గాంధీ మండపం వద్దకు చేరుకున్నప్పటికి ప్రజలు, పట్టణవ్యాపారులు, పలు వర్గాలు చేరుకొని జగన్‌కు స్వాగతం పలికారు. అక్కడ నుంచి శివథియేటర్ మీదుగా గౌతు లచ్చన్న ఘాట్ ప్రాంతం గుండా కంచిలి మండలం, తలతంపర మీదుగా మాణిక్యపురానికి చేరుకొని అక్కడ విడిది చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు భూమా కరుణాకరరెడ్డి, ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యే కళావతి, తమ్మినేని సీతారాం, దువ్వాడ శ్రీనివాస్, నర్తు రామారావు, పిరియా సాయిరాజ్, నరేష్‌కుమార్‌అగర్వాల్, పొడుగు కామేషులతోపాటు జిల్లా నలుమూలలు నుంచి అనేక మంది ముఖ్యనాయకులు పాల్గొన్నారు.
చిత్రం.. సోంపేటలో జగన్‌కు అపూర్వ స్వాగతం పలుకుతున్న జనం

బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

0
0

బనగానపల్లె, జనవరి 6 : ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో ముగ్గురు మృతిచెందిన సంఘటన ఆదివారం కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం యాగంటి పుణ్యక్షేత్రం సమీపంలో చోటుచేసుకుంది. కర్నూలు ఒమేగా వైద్యశాలలో పనిచేస్తున్న తాండ్రపాడుకు చెందిన సుమన్(23), కర్నూలుకు చెందిన కుమారి(20), శిరీష(21) పల్సర్ బైక్‌పై యాగంటికి వచ్చారు. వారు స్వామివారి దర్శనం అనంతరం తిరిగి కర్నూలుకు వెళ్తుండగా యాగంటి-పాతపాడు మార్గమధ్యంలో ఎదురుగా వస్తున్న తెలంగాణలోని గద్వాల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ సంఘటనలో సుమన్, కుమారి అక్కడికక్కడే మృతి చెందగా, శిరీష తీవ్రంగా గాయపడడంతో బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

ఫిర్యాదుల కోసం ఎస్‌ఈసీలో ప్రత్యేక సెల్

0
0

హైదరాబాద్, జనవరి 6: పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఎవరికైనా ఏదైనా అనుమానం ఉన్నా, ఎన్నికల నిర్వహణకు సంబంధించి సమస్యలు ఏవైనా ఎదురైనా, అభ్యర్థులపై ఏవైనా కంప్లైంట్ చేయాలనుకున్నా అధికారికంగా ఫిర్యాదు చేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో గ్రీవెన్స్/్ఫర్యాదుల సెల్‌ను ఏర్పాటు చేశామని ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం. అశోక్ కుమార్ తెలిపారు. పగటివేళ ఆఫీసు సమయంతో పాటు రాత్రి తొమ్మిది గంటల నుండి ఉదయం తొమ్మిది గంటల వరకు కూడా ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించామని వివరించారు. వీరు నిర్ణీత సమయంలో ఫోన్‌లో అందుబాటులో ఉంటారన్నారు. ఫిర్యాదులను ఫోన్ (040-2980 2895) ద్వారా చేయవచ్చని అశోక్ కుమార్ సూచించారు. ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత అధికారులు చర్య తీసుకుంటారని, ఫిర్యాదు చేసిన వారికి ఆ విషయం తెలియచేస్తారని స్పష్టం చేశారు.

ప్రమాణం చేయను

0
0

హైదరాబాద్, జనవరి 6: మజ్లిస్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రొటెం స్పీకర్‌గా ఉంటే ప్రమాణం చేయవద్దని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా స్పీకర్‌ను ఎన్నుకున్న తర్వాతే ప్రమాణం చేయవచ్చని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ నెల 17న అసెంబ్లీ కొలువుదీరనున్న సంగతి తెలిసిందే. అయితే కొత్త ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించేందుకు, అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక నిర్వహణకు గవర్నర్ నరసింహన్ రాజ్‌భవన్‌లో ఈ నెల 16న ముంతాజ్ ఖాన్‌తతో ప్రమాణం చేయించనున్నారు. 17న ఉదయం 11.30 గంటలకు ప్రొటెం స్పీకర్ కొత్త ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు. ఆ రోజున తాను హాజరుకాకుండా, కొత్తగా స్పీకర్‌ను ఎన్నుకున్న తర్వాత ప్రమాణం తీసుకోవచ్చని రాజాసింగ్ నిర్ణయం తీసుకున్నారు.

దురదృష్టవశాత్తు సుహాసిని ఓటమి చెందింది

0
0

హైదరాబాద్, జనవరి 6: గడచిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దురదృష్టవశాత్తు నందమూరి సుహాసిని ఓటమి చెందారని సినిమా నటుడు బాలకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. మా ఇంటి అమ్మాయి ఇంట్లో నుంచి బయటకు వచ్చి పోటీ చేయడం ఇదే మొదటిసారి అన్నారు. ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితుల కారణంగా సుహాసిన ఓటమి చెందారని చెప్పారు. 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఏన్నికల్లో కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన నందమూరి సుహాసినీ ఓటమిపై సినీ నటుడు బాలకృష్ణ పై విధంగా స్పందించారు. ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమేనని చెబుతూ నందమూరి ఆడపడచు తొలి సారిగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడం పట్ల కుటుంబ సభ్యులు కొంత ఆవేదనకు గురయ్యారని ఆయన చెప్పారు.

సర్పంచ్‌కు, వార్డుకు ఒకే వ్యక్తి పోటీ చేయొచ్చు

0
0

హైదరాబాద్, జనవరి 6: సర్పంచ్ స్థానానికి, వార్డు సభ్యుడి స్థానానికి ఒకే వ్యక్తి ఏకకాలంలో పోటీ చేయవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం. అశోక్ కుమార్ ఆదివారం ఒక లేఖ జారీ చేశారు. వివిధ జిల్లాల నుండి వచ్చిన లేఖలకు సమాధానంగా ఆయన ఈ లేఖను జారీ చేశారు. ఈ లేఖను హైదరాబాద్ మినహా మిగతా అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపించారు. సర్పంచ్ స్థానానికి, వార్డ్ సభ్యుడి స్థానానికి ఎవరైనా పోటీ చేసి రెండు చోట్ల గెలిస్తే, ఎన్నికల తర్వాత ఏదైనా ఒక పోస్టుకు రాజీనామా చేసి, మరొక పోస్టులో కొనసాగాల్సి ఉంటుందని వివరించారు. ఎంపీటీసీ లేదా జడ్‌పీటీసీ సభ్యులు కూడా సర్పంచ్ స్థానానికి, వార్డు సభ్యుడి స్థానానికి పోటీ చేసేందుకు అవకాశం ఉందన్నారు. ఆ విధంగా పోటీ చేసే వారు విజయం సాధిస్తే ఏదైనా ఒక పోస్టులో కొనసాగుతూ, మరొక పోస్టుకు రాజీనామా చేయాల్సి ఉంటుందని అశోక్ కుమార్ వివరించారు. అయితే ఒకే వ్యక్తి గ్రామంలోని ఒకే వార్డు సభ్యుడిగా పోటీ చేసేందుకు అవకాశం ఉందని, రెండు లేదా అంతకు మించి వార్డుసభ్యుల స్థానాలకు పోటీ చేసేందుకు వీలులేదని వివరించారు.


కేటీఆర్ ఆరోపణల్లో వాస్తవం లేదు

0
0

హైదరాబాద్, జనవరి 6: ప్రధాని నరేంద్ర మోదీ టీం ఇండియా స్పూర్తితో దేశంలోని అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తున్నారని బీజేపీ జాతీయ నాయకుడు, లోక్‌సభ సభ్యుడు బండారు దత్తాత్రేయ తెలిపారు. బీజేపియేతర రాష్ట్ర ప్రభుత్వాల పట్ల కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు చేసిన విమర్శల్లో ఏ మాత్రం వాస్తవం లేదని దత్తాత్రేయ ఆదివారం విలేఖరుల సమావేశంలో అన్నారు. నాలుగున్నర సంవత్సరాల్లో తెలంగాణకు కేంద్రం పైసా ఇవ్వలేదని కేటీఆర్ ఆరోపణ చేసి ఓటర్లను టీఆర్‌ఎస్ వైపు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు. రెండు లక్షల కోట్ల రూపాయలను అనేక గ్రాంట్ల రూపంలో ఇవ్వడం జరిగిందన్నారు. 11 సాగు నీటి ప్రాజెక్టులు, 24 గంటల విద్యుత్తు సరఫరా చేసేందుకు వీలుగా ఉత్తర, దక్షిణ పవర్ గ్రిడ్లను అనుసంధానం చేయడానికి యాదాద్రి పువర్ ప్రాజెక్టుకు రూ.50 వేల కోట్లు కేటాయించిందని ఆయన వివరించారు.
రాష్ట్రంలో 2400 కిమీ జాతీయ రహదారులు ఉండగా, 5600 కిమీలకు కేంద్రం పెంచిందని ఆయన చెప్పారు. దీనికి రూ.60 వేల కోట్లను కేంద్రం ఖర్చు చేస్తున్నదని ఆయన వివరించారు. వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్కు, కరీంనగర్-నిజామాబాద్ రైల్వే లైన్లను పూర్తి చేసింది కేంద్రం కాదా?, రామగుండంలో ఎరువుల పరిశ్రమను తెరిపించేందుకు చర్యలు చేపట్టింది కేంద్రం కాదా? అని దత్తాత్రేయ ప్రశ్నించారు.

ఎన్నికల ఖర్చుకు బ్యాంక్ అకౌంట్‌

0
0

హైదరాబాద్, జనవరి 6: గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ప్రత్యేకంగా ఒక బ్యాంక్ అకౌంట్ ప్రారంభించాల్సిన అవసరం లేదని, ఇప్పటికే అభ్యర్థులు ఉపయోగిస్తున్న బ్యాంక్ అకౌంట్‌నే ఉపయోగించవచ్చని రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఎన్నికల కమిషన్ ఇంతకు ముందు జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఎన్నికల ఖర్చుకు అభ్యర్థులు ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉండేది. అయితే బ్యాంక్ అకౌంట్ ప్రారంభించేందుకు వారం, పదిరోజుల సమయం పడుతుందంటూ మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ శనివారం ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. దాంతో ఎన్నికల కమిషన్ స్పందించింది. అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చుకోసం ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ ప్రారంభించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అంటే గతంలో జారీ చేసిన ఆదేశాల్లో స్వల్ప మార్పు చేశామని అశోక్ కుమార్ వివరించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సమర్పించే సమయంలోనే బ్యాంకు అకౌంట్ నెంబర్, బ్యాంకు బ్రాంచీ నెంబర్ ఇవ్వాలని సూచించారు. ఎన్నికలకు సంబంధించిన ఖర్చును మాత్రమే ఈ అకౌంట్ ద్వారా ఎన్నికల సమయంలో కొనసాగించాలని, అభ్యర్థి ఎన్నికల కోసం చేసే ప్రతి రూపాయి ఖర్చు బ్యాంకు ద్వారానే చేయాలని కమిషన్ కార్యదర్శి వివరించారు.

20 నిమిషాల ముందు రావాల్సిందే

0
0

న్యూఢిల్లీ: ప్రయాణ వేళకంటే ముందుగా రావాలని విమానాశ్రయాల్లో ఉన్న నిబంధన ఇప్పుడు రైల్వేస్టేషన్లలో కూడా ప్రవేశపెట్టనున్నారు. అయితే విమానాశ్రయాల్లోలా రెండు గంటల ముందు కాకుండా సెక్యూరిటీ చెక్ లాంటి వాటికోసం 15-20 నిముషాల ముందు ప్రయాణికులను రైల్వేస్టేషన్లకు రప్పించాలని రైల్వే శాఖ యోచిస్తోంది.
ఇప్పటికే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అలహాబాద్‌లో దీనిని ప్రవేశపెట్టడమే కాకుండా ఈనెలలో రాబోయే కుంభమేళాను పురస్కరించుకుని కర్నాటకలోని హుబ్లీ, మరో 202 రైల్వేస్టేషన్లలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టడానికి రైల్వే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోందని రైల్వేరక్షణ దళం డీజీపీ అరుణ్ కుమార్ తెలిపారు. దీనిప్రకారం రైల్వేస్టేషన్‌లోకి ప్రవేశానికి ఇప్పుడున్న ద్వారాలను మూసివేస్తారు. అవసరమైతే పలుచోట్ల గోడలు సైతం కట్టేస్తారు. మిగిలిన ప్రవేశాల చోట ఆర్‌పీఎఫ్ సిబ్బందిని ఉంచుతారు. ప్రతి ప్రవేశద్వారం వద్ద తనిఖీలు నిర్వహిస్తారు. అయితే ప్రయాణికులు నిర్ణీత సమయం కన్నా విమానాశ్రయాల్లోలా రెండు గంటల ముందు కాకుండా 15-20 నిముషాల ముందు వస్తే సరిపోతుందని ఆయన తెలిపారు. రైల్వేస్టేషన్లలో మరింత భద్రతా చర్యలు చేపట్టాలని గతంలో తీసుకున్న చర్యల్లో భాగంగా వీటిని అమలు చేస్తామని ఆయన చెప్పారు. ప్రయాణికులను తనిఖీ, భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు, బాంబ్ తనిఖీ బృందాలు వంటివి ఏర్పాటు చేస్తామన్నారు.

బీసీ రిజర్వేషన్లపై మహా ధర్నా

0
0

హైదరాబాద్, జనవరి 6: జరగబోవు పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు కేటాయించిన రిజర్వేషన్లను కొనసాగించాలని ప్రతిపక్షాలతో కలసి బీసీ సంఘాలు ఆదివారం భారీ ఎత్తున ధర్నా చౌక్ వద్ద మహా ధర్నా చేపట్టింది. బీసీలకు రిజర్వేషన్లను కుదించడం కేసీఆర్ రాజకీయ తప్పిదమని బీసీ సంఘాలు విరుచుకుపడ్డాయి. ఆదివారం ఇందిరా పార్క్ వద్ద ఏర్పాటు చేసిన మహా ధర్నాలో నేతలు కేసీఆర్ వ్యవహార శైలిని ఘాటుగా విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను అమలు చేయకపోవడం పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల్లో బీసీల గురించి గొప్పగా చెప్పిన కేసీఆర్ ఎన్నికల అనంతరం బీసీలను వదిలేశారని వారు ధ్వజమెత్తారు. సుప్రీం కోర్టు కొత్తగా ఇచ్చిన ఆదేశాలు కాదని చెప్పారు. అయితే సుప్రీం కోర్టు పేరు చెప్పి కేసీఆర్ బీసీలకు అన్యాయం చేయడం ఏమిటని వారు నిలదీశారు. 2010 సంవత్సరంలో సుప్రీం కోర్టు 50 శాతం రిజర్వేషన్లు దాటవద్దని సూచించినప్పటికీ 2013, 2014 జరిగిన స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన సంఘటనలు కేసీఆర్ గుర్తు చేసుకోవాలని వారు చెప్పారు. కేసీఆర్‌కు బీసీల పట్ల శ్రద్ధ ఉంటే తక్షణం 34 శాతం రిజర్వేషన్ల అమలకు సుప్రీం కోర్టును ఆశ్రయించాలని వారు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా బీసీల రిజర్వేషన్లను తగ్గించి జారీ చేసిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్దమన్నారు. మంత్రి వర్గ నిర్ణయం లేకుండా ఆర్డినెన్స్ ఎలా తెస్తారని వారు నిలదీశారు. బీసీ రిజర్వేషన్ల తగ్గించడంతో 1400 గ్రామ పంచాయతీలు, 18వేల వార్డులు బీసీలకు దక్కకుండా పోయాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ గెలిచిన ఊపులో ఉన్నారని అందకు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే అహంకార ధోరణిలో ఉన్నారని వారు నిప్పులు చెరిగారు. ఈ ధర్నాలో జాతీయ బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య, గుజ్జ కృష్ణ, నీలా వెంకటేష్, కోలా జనార్ధన్, అనంతయ్య, రాజేందర్, సురేష్, జైపాల్ ముదిరాజ్‌తో పాటు ప్రతిపక్షాల నేతలు పాల్గొన్నారు.

చిత్రం..ఇందిరా పార్క్ వద్ద ఏర్పాటు చేసిన మహా ధర్నాలో పాల్గొన్న నేతలు

త్వరలో ‘బ్రాహ్మణ సదన్’ ప్రారంభం

0
0

హైదరాబాద్, జనవరి 6: బ్రాహ్మణ సంక్షేమం కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆరు ఎకరాల్లో ‘బ్రాహ్మణ సదన్’ను త్వరలోనే ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం పరిషత్ వైస్ చైర్మన్, సీఎం సీపీఆర్‌వో జ్వాలా నరసింహారావు అన్నారు. ఆదివారం చిక్కడపల్లిలో ఆరువేల నియోగి బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ముద్రించిన క్యాలెండర్, డైరీ, మొబైల్ యాప్‌ను ఆవిష్కరించి ప్రసంగించారు.
ఆరువేల నియోగులు చాల గొప్పవాళ్లు, పాలనాధక్షులని, వీరందరూ పాలనా వ్యవస్థల్లో భాగస్వాములు కావాలని ఆకాక్షించారు. బ్రాహ్మణ వైదికులతో పాటు నియోగులది కూడా కులవృత్తేనని, కులవృత్తులను ఆదరించి గౌరవించుకోవాలని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే ఎంతో వైభవాన్ని సంతరించుకున్న కులవృత్తులకు ప్రజస్వామ్యం ఏర్పడిన తర్వాతే ప్రాబల్యం తగ్గడంతోపాటు పోటీ పెరిగిందని అన్నారు. గ్రామాలలో ఏదైనా సంఘటన జరిగితే దానికి బ్రాహ్మణులనే నిందించడం సరికాదని, అటువంటి సంఘటనలు పునరావృతం రాకుండా ఉండే రోజులు వస్తాయని అశిస్తున్నట్లు తెలిపారు. దేశ ప్రథమ ప్రధాన మంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ మంత్రివర్గంలో 60 నుంచి 70 శాతం మంది బ్రాహ్మణులే ఉండేవారని గుర్తుచేశారు. దేశంలో ఉన్న న్యాయమూర్తులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నారని, ప్రస్తుతం అటువంటి స్థానాల్లో లేకపోవడానికి గల కారణం మనలో చర్చించాల్సిన అవసరం ఉంతైనా ఉందని తెలిపారు. బ్రాహ్మణులు అన్ని రంగాల్లో ముందు కు సాగే విధంగా కృషి చేయాలని సూచించారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా తెలంగాణ బ్రాహ్మణ పరిషత్‌ను ఏర్పాటు చేసి వారి సంక్షేమం కోసం కేసీఆర్ పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. త్వరలోనే ఆరు ఎకరాల స్థలంలో బ్రాహ్మణ సదన్‌ను గోపన్‌పల్లిలో ప్రారంభించబోతున్నట్లు వివరించారు. సదన్‌లో తెలంగాణ రాష్ట్రంవారే కాకుండా వివిధ రాష్ట్రాల బ్రాహ్మణులతో పాటు పీఠాధిపతులు, ఆధ్యాత్మికవేత్తలు కూడా కార్యక్రమాలను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. ఉభయ రాష్ట్రాలను కలిసి ఆరువేల నియోగుల బ్రాహ్మణ సంఘం ఏర్పాటు కావడం విశేషమని అన్నారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పీ.మాధవరావు, సుంకరణ సూర్య ప్రకాష్, తణుకు రామసుబ్బారావు, కోశాధికారి డాక్టర్ ఫణీంద్ర, ఉపాధ్యక్షుడు పెండ్యాల ప్రసాద్, డా.శ్రీనివాస్, ప్రతినిధులు పుట్రేవు సత్యనారాయణ, సుందర కృష్ణ, మల్లికార్జున్ రావు, పల్లం రాజు, ఉషశ్రీ పాల్గొన్నారు.
చిత్రం..మొబైల్ యాప్‌ను ప్రారంభిస్తున్న బ్రాహ్మణ సంక్షేమ సంఘం పరిషత్ వైస్ చైర్మన్ జ్వాలా నరసింహారావు

రైతు ఖాతాల్లోకి ధాన్యం డబ్బులు

0
0

హైదరాబాద్, జనవరి 6: ఖరీఫ్ సీజన్‌లో రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సంబంధించిన రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు చెల్లించామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ తెలిపారు. ఆదివారం పౌర సరఫరా శాఖలో ఏర్పా టు చేసిన సమావేశానికి జిల్లా మేనేజర్‌లతో కమిషనర్ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. మిల్లర్లకు చెల్లించే బకాయిలు, ముఖ్యంగా మిల్లింగ్ చార్జీల విషయంలో జాగ్రతలు తీసుకోవాలని సూచించారు. ఇదే సమయంలో బియ్యం (సీఎంఆర్) ఎగవేతదారులపై కటినంగా వ్యవహరించాలన్నారు. ఉద్దేశ పూర్వకంగా అధికారులు ఎవరైనా తప్పుచేస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. గోదాముల్లో నిరుపయోగంగా ఉన్న సరుకులను తక్షణమే టెండర్ ద్వారా విక్రయించాలన్నారు. అలాగే బియ్యం నిల్వ కోసం తీసుకునే గోదాములు లీజ్ ధరల విషయంలో పారదర్శకంగా అధికారులు వ్యవహరించాలని కమిషనర్ సూచించారు. రైతుల నుంచి 37 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించామని, అందుకు దాదాపు 7.25 లక్షల మంది రైతులకు నేరుగా బ్యాంకుల్లో రూ. 6291 కోట్ల రూపాయలు చెల్లించామని కమిషనర్ తెలిపారు. ఈ యేడాది కూడా ఖరీఫ్ సీజన్‌లో భారీగా ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ముందుగా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.

చిత్రం..జిల్లా మేనేజర్‌లతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న పౌరసరఫరాల శాఖ కమిషనర్

కూకట్‌పల్లి అపార్ట్‌మెంట్‌లో చోరీ

0
0

హైదరాబాద్: కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలలోని ఓ అపార్ట్‌మెంట్‌లో చోరీ జరిగింది. ఎన్‌ఆర్‌ఎస్‌ఎ కాలనీలోని వెంకటేశ్వర అపార్ట్‌మెంట్‌లో తాళాలు వేసి ఉన్న ఇంట్లో దొంగలు చోరీ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

0
0

ఒడిశా: కేంద్రపడ జిల్లా డెరాస్ వద్ద జరిగిన ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. కారును గుర్తుతెలియని వాహనం ఢీకొనటంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతులంతా డ్యాన్స్ గ్రూపు సభ్యులుగా గుర్తించారు. వీరంతా డ్యాన్స్ ప్రోగ్రామ్ ముగించుకుని వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు.

తెలంగాణ అంగన్వాడీ కార్యకర్తలకు పురస్కారాలు

0
0

న్యూఢిల్లీ: ప్రవాసీ భారతీయ కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తలకు పురస్కారాలు అందచేశారు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఈ అవార్డులు అందజేసింది. తెలంగాణలోని వికారాబాద్, ఖమ్మం అంగాన్వాడీ కేంద్రాల కార్యకర్తలు పురస్కారాలను అందుకున్నారు.

అన్నాడీఎంకేతో కలిసి పనిచేస్తాం:దీప

0
0

చెన్నై: అన్నాడీఎంకేతో కలిసి పని చేసేందుకు తమ పార్టీ కార్యకర్తలు ఆసక్తి చూపుతున్నారని ‘జె దీప’ పెరవై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జయలలిత మేనకోడలు దీప తెలిపారు. ఆమె సేలంలో పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నాడీఎంకేలో శశికళ గ్రూపును చేర్చుకోబోమని మంత్రులు చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని అన్నారు. అలాగే తమ పెరవైనీ అన్నాడీఎంకేలో విలీనం చేసేందుకు అభిప్రాయాలు సేకరించామని, అధికశాతం కార్యకర్తలు అంగీకారం తెలిపారని వెల్లడించారు.

బీజేపీ కక్ష సాధింపునకు ఇది పరాకాష్ట:చంద్రబాబు

0
0

అమరావతి: కేంద్రంలో బీజేపీ కక్ష సాధింపునకు ఇది పరాకాష్ట అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ రిపబ్లిక్‌డే ప్రదర్శనలో ఏపీ శకటానికి అనుమతినివ్వకపోవటంపై మండిపడ్డారు. అభివృద్ధిలో ఏపీతో పోటీపడలేక ప్రధాని మోదీ రాష్ట్రంపై కక్ష పెంచుకున్నారని అన్నారు. పోలవరం రికార్డు ప్రతి తెలుగువాడికి గర్వకారణమని, ఇదే స్ఫూర్తితో ప్రాజెక్టు పూర్తిచేసేందుకు సిబ్బంది, ఇంజినీర్లు, కార్మికులు కృషి చేయాలని అన్నారు.

పవన్‌తో సినీ నటుడు అలీ భేటీ

0
0

విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సినీ నటుడు అలీ భేటీ అయ్యారు. ఈ నెల 9న అలీ వైకాపాలో చేరతారని సామాజిక మాధ్యమాలలో విస్తత్ర ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆయన పవన్ కల్యాణ్‌తో భేటీ కావటం ఆశ్చర్యం కలిగించింది. అలీకి, పవన్‌కు సినీ పరిశ్రమలో మంచి అనుబంధం ఉంది. ఇదిలా ఉండగా అలీ సినీ నిర్మాత అశ్వనీదత్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ్ని సైతం కలవటం గమనార్హం.

Viewing all 69482 articles
Browse latest View live