Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

విజయాన్ని ఎంజాయ్ చేస్తాం:కోహ్లీ

$
0
0

సిడ్నీ: టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియాపై తొలి విజయాన్ని అందుకున్న టీం ఇండియా చారిత్రక రికార్డును నెలకొల్పింది. ఈ విజయాన్ని తమ టీమ్ ఎంజాయ్ చేస్తుందని కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నారు. ఇది తన జీవితంలో బెస్ట్ ఎచీవ్‌మెంట్ అని పేర్కొన్నారు. టీం ఇండియాను లీడ్ చేస్తూ ఇలాంటి విజయాన్ని అందుకోవటం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.


మంచుదుప్పటిలో ఉత్తర భారతం

$
0
0

న్యూఢిల్లీ: ఉత్తర భారతం మంచు దుప్పటి కప్పుకుంది. ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లలో విపరీతంగా మంచు కురుస్తోంది. సిమ్లాలోని కుఫ్రీలో మైనస్ 3 డిగ్రీలు నమోదు అవుతున్నాయి. కేదార్‌నాథ్ పూర్తిగా మంచుతో కప్పబడింది. సరస్వతీ, మందాకనీ నదులు మంచుతో నిండిపోయాయి. ఈనెల 9వ తేదీ వరకు పరిస్థితులు ఇలానే ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

రక్షణ మంత్రిపై సభాహక్కుల తీర్మానం

$
0
0

న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌పై కాంగ్రెస్ ఎంపీ వేణుగోపాల్ లోకసభలో సభాహక్కుల తీర్మానం ప్రవేశపెట్టారు. రఫేల్ ఒప్పందంపై రక్షణ మంత్రి సభను తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రఫెల్‌పై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌కి, రక్షణ మంత్రి సీతారామన్‌కు మాటల యుద్ధం జరుగుతున్న విషయం విదితమే.

తెలంగాణ మంత్రివర్గ సమావేశం

$
0
0

హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నామినేటెడ్ సభ్యుడి నియామకంపై చర్చ జరిపారు. ఆంగ్లో ఇండియన్ సభ్యుడిగా స్టీఫెన్‌సన్‌ను నియమించాలని, ఈ మేరకు ఆయన పేరును సిఫార్స్ చేస్తూ గవర్నర్‌కు ప్రతిపాదన పంపనున్నారు. ఎమ్మెల్యేలతో పాటు నామినేటెడ్ సభ్యుల ప్రమాణ స్వీకారం జరపాలని నిర్ణయించారు.

మాట మార్చిన టీడీపీ :గోయల్

$
0
0

న్యూఢిల్లీ: ప్రత్యేక హోదాకు సమానంగా ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెప్పినపుడు ఆనందంగా అంగీకరించిన టీడీపీ ఇపుడు మాట మార్చి ఆందోళనలు చేస్తుందని కేంద్ర మంత్రి గోయల్ అన్నారు. ఆయన పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేస్తున్న టీడీపీ ఎంపీల వద్దకు బీజేపీ ఎంపీ జీవీఎల్‌తో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఏపీలో జరుగుతున్న అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ ఇలాంటి ఆందోళన చేస్తుందని అన్నారు. తెలంగాణలో తిరస్కరించినట్లే ఏపీలో కూడా తిరస్కరిస్తారని అన్నారు. ఇదిలావుండగా టీడీపీ ఎంపీ శివప్రసాద్ ఎంజీఆర్ వేషధారణలో వచ్చి ఆందోళనలో పాల్గొన్నారు.

బీజేపీ నేతలకు రక్షణ కల్పించాలని కోరాం

$
0
0

హైదరాబాద్: ఏపీలో అరాచక పాలన సాగుతుందని బీజేపీ నేత సుధీర్ రాంభొట్ల అన్నారు. సోమవారం బీజేపీ నేతలు గవర్నర్ నరసింహాన్ కలిశారు. బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేయటం, బీజేపీ మహిళా కార్యకర్తను ముఖ్యమంత్రి ఫినిష్ అయిపోతావంటూ బెదిరంచటం తదితర విషయాలను వారు గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా సుధీర్ రాంభొట్ల మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవటం ఖాయమని అన్నారు.

నలుగురు టీడీపీ, అన్నాడీఎంకే ఎంపీలపై వేటు

$
0
0

న్యూఢిల్లీ: లోక్‌సభ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. సభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారంటూ నలుగురు టీడీపీ, అన్నాడీఎంకే ఎంపీలను స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సస్పెండ్‌ చేశారు. చిత్తూరు ఎంపీ ఎన్‌.శివప్రసాద్‌తో పాటు ముగ్గురు అన్నాడీఎంకే ఎంపీలు పి.వేణుగోపాల్‌, కె.ఎన్‌. రామచంద్రన్‌, కె.గోపాల్‌పై సస్పెన్షన్‌ విధించారు. రెండురోజుల పాటు సభాకార్యక్రమాలకు హాజరుకాకుండా స్పీకర్‌ వారిపై వేటు వేశారు.

అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు

$
0
0

న్యూఢిల్లీ: ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకురానున్నది. విద్య, ఉద్యోగాల్లో 10శాతం కోటా కల్పించనున్నారు. ఈ బిల్లు కోసం రేపటితో ముగియనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలను మరో రెండు రోజులు పొడిగించనున్నారు. అగ్రవర్ణ పేదల వార్షికాదాయం రూ.8 లక్షల లోపు ఉన్నవారు ఈ రిజర్వేషన్లు పొందటానికి అర్హులు.


హాల్ ఆర్డర్లపై పార్లమెంట్‌లో మాటల యుద్ధం

$
0
0

న్యూఢిల్లీ: హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)పై నేడు పార్లమెంట్‌లో మాటల యుద్ధం జరిగింది. రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మధ్య మాటల యుద్ధం జరిగింది. హెచ్‌ఏఎల్‌కు లక్షకోట్ల రూపాయల ఆర్డర్లు ఇచ్చినట్లు నిర్మలా సీతారామన్ పునరుద్ఘాటించారు. దీనిపై రాహుల్ మాట్లాడుతూ ఓ జాతీయ మీడియాలో వచ్చిన వార్తా కథనాన్ని ఉటంకిస్తూ వివరణ ఇవ్వాలని లేదా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అబద్ధాలతో పార్లమెంటును పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.

అగ్రవర్ణాల రిజర్వేషన్లను స్వాగతించిన కేరళ సీఎం

$
0
0

తిరువనంతపురం: అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వాగతించారు. తమ పార్టీ ఎప్పటి నుంచో ఇది కోరుతుందని అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు అమ్ముకున్నారు.

$
0
0

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు అమ్ముకున్నారని, కేసీఆర్‌తో కుమ్మక్కై అభ్యర్థులను ప్రకటించటంలో ఆలస్యం చేశారని కాంగ్రెస్ నేత సర్వే సత్యనారాయణ ఆరోపించారు. అధిష్టానం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసిన తరువాత సోమవారంనాడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో తనను కావాలనే ఓడించారని, ఉత్తమ్ పెంచి పోషించిన వాళ్లే తనపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఉత్తమ్, కుంతియా పార్టీ నుంచి తప్పుకునే వరకు ఆందోళన చేస్తానని అన్నారు.

రంగవల్లి

$
0
0

సందు చుక్క - 15 చుక్కలు 8 వరకు

ఎం.శంతన (ఇందుకూరుపేట, నెల్లూరు జిల్లా)
---------------------------------------------------------------------------------------------------------
ముగ్గులకు ఆహ్వానం

నింగిలోని హరివిల్లులను నేలపైన పేర్చి.. కనులకింపైన రంగుల్ని అందంగా అద్దితే అది రంగుల మాలికవుతుంది. ముంగిట్లో రంగవల్లిక అవుతుంది. ధనుర్మాసం సందర్భంగా తెలుగు ముంగిళ్లలో రంగవల్లులను తీర్చిదిద్దడం ఆనవాయితీ.. ఆ సందర్భంగా ముగ్గులకు ఆహ్వానం పలుకుతోంది మాతృభూమి. ఆసక్తి కలవారు కింది చిరునామాకు ముగ్గులను పంపగలరు.
సూచనలు
* ముగ్గులను పంపేవారు ఎ4 సైజు తెల్లకాగితంపై వేయాలి.
* ముందుగా నల్లని ఇంక్‌తో ఔట్ లైన్ గీసిన తరువాత అందులో రంగుల్ని నింపాలి.
* ఎన్ని చుక్కలను పెట్టి ముగ్గులు వేశారో.. అంటే సరిచుక్కలా, బేసి చుక్కలా, సందు చుక్కలా.. అనే విషయం స్పష్టంగా రాయాలి.
* ముగ్గుతో పాటు, మీ పాస్‌పోర్ట్ సైజు కలర్ ఫొటోని, చిరునామాని జతచేయాలి.
* డౌన్‌లోడ్ చేసిన ముగ్గులు కాక, స్వయంగా చేతితో వేసిన ముగ్గులనే పంపాలి. అదీ చుక్కల ముగ్గులకే ఆహ్వానం.

ముగ్గులు పంపాల్సిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్- 500 003.

షేర్ చేసే ముందు ఆలోచించండి!

$
0
0

భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, సైనిక దుస్తుల్లో ఉన్న ఒక యువతితో తీసుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో ఆమెతో పాటు ఉన్న ఒక మహిళా సైనికాధికారిని నిర్మలా సీతారామన్ కుమార్తె అనీ, ఆమె ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నారనీ సోషల్ మీడియాలో ఓ న్యూస్ వచ్చింది. కానీ ఓ న్యూస్ చానెల్ చేసిన పరిశోధనలో ఈ ఫొటోతో జరుగుతున్న ప్రచారం తప్పని తేలింది. రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌తో ఈ ఫొటోలో ఉన్న యువతి పేరు నికితా వీరయ్య.
* * *
రక్షణ మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం.. వైరల్ అవుతున్న ఫొటోలో కనిపిస్తున్న మహిళా ఆఫీసర్ నికితా వీరయ్యను రక్షణ మంత్రికి అధికారిగా నియమించారు. ఫేస్‌బుక్‌లో ఉన్న ఆమె పబ్లిక్ ప్రొఫైల్ ద్వారా ఫొటోలో రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌తో ఉన్నది నికితనే అని ధ్రువీకరించుకున్నారు. ఫేస్‌బుక్ ప్రొఫైల్ ప్రకారం నికిత కర్ణాటకలోని మంగుళూరుకు చెందినది. 2016లో ఆమె ఇండియన్ ఆర్మీలో చేరింది. సైన్యంలో చేరడానికి ముందు నికిత ఇంగ్లీషు టీచరుగా పనిచేసిందట. రక్షణ మంత్రిత్వశాఖ ప్రతినిధి కూడా ట్విట్టర్ ద్వారా ఈ వైరల్ ఫొటోపై స్పష్టతనిచ్చారు. ‘ఇటీవల ఒక అధికారిక పర్యటనకు వెళ్లిన సమయంలో ఒక మహిళా అధికారి కోరికపై ఈ ఫొటోను తీశారట. కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్లు ఈ మహిళా అధికారి రక్షణమంత్రి కుమార్తె కాదు’ అని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. డిసెంబర్ 27న ఈ ఫొటో మొదటిసారి సోషల్ మీడియాలో షేర్ అయింది. ఆ తర్వాత ఈ ఫొటో ఇప్పటికీ అంటే ఈ రోజుకీ వాట్సాప్‌లో షేర్ అవుతూనే ఉంది. ఇదో ఫేక్ న్యూసండీ బాబూ.. అని ఎంతమంది చెబుతున్నా, ఎన్ని వెబ్‌సైట్లు, పత్రికలు తూర్పారబట్టినా సరే.. ఇలాంటి ఫేక్‌న్యూస్‌లు, ఫొటోలు వేలాదిగా షేర్ అవుతూనే ఉన్నాయి.. లైకుల వరద ముంచెత్తుతూనే ఉంది.. వాట్సాప్ గ్రూపులు మారుమోగుతూనే ఉంటున్నాయి.. ఎవడో, పనీపాటా లేనివాడో, అభిమానో.. అజ్ఞానంతోనో, ఉద్దేశపూర్వకంగానో ఓ తప్పుడు వార్తను ప్రచారంలోకి తీసుకొచ్చాడనే అనుకుందాం.. కానీ అన్నీ తెలిసిన జనాలకు ఏమైందో తెలియదు.. వేలంవెర్రిగా అందరూ దాన్ని ఎందుకు షేర్ చేస్తారో అర్థం కాదు. ఇదీ అలాంటిదే.. సాక్షాత్తూ రక్షణ మంత్రిత్వ శాఖాధికారి అధికారికంగా ప్రకటించినా సరే.. ఈ ఫొటో వైరల్ అవుతూనే ఉంది.
అప్పటినుంచి నిర్మలా సీతారామన్ పిల్లలు ఎవరు? ఎంతమంది? అని సెర్చ్ ఇంజిన్స్‌లో ఒకటే సెర్చింగ్.. ఎంపీగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన వివరాల ప్రకారం ఆమె కుమార్తె పేరు వాఙ్మయి పరకాల. ఢిల్లీలో తల్లితో ఉంటూ ఉన్నత చదువులు చదువుకుంటోంది.. మరింతగా చదువుకోవాలన్నది ఆమె లక్ష్యం.
చదివారుగా.. ఇలాంటి ఫేక్‌న్యూస్‌లను తయారుచేస్తున్నవారు, వాటిని షేర్ చేస్తున్నవారు కూడా నేరస్తులేగా.. కాదంటారా?

తీపి, కారాల సంక్రాంతి

$
0
0

అతి పెద్ద పండుగల్లో మొదటిగా చెప్పుకునేది సంక్రాంతి పండుగనే.. కొత్త పంటలు ఇంటికి వచ్చి ప్రతి ఇల్లూ ధనధాన్యాలతో, భోగభాగ్యాలతో కళకళలాడుతుంటుంది. మరి అలాంటి ఆనందకరమైన రోజుల్లో పిండి వంటలు లేకపోతే ఎలా? అందుకే సంక్రాంతి రోజు రకరకాల పిండివంటలను తప్పనిసరిగా చేసుకుంటారు తెలుగువారు. అందులో ముఖ్యమైనవి అరిసెలు, సకినాలు, జంతికలు.. ఇవి లేకుండా సంక్రాంతి పండుగ జరగదంటే అతిశయోక్తి కాదు. మరి అవి ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామా..

కారం సకినాలు

కావలసిన పదార్థాలు
బియ్యం: నాలుగు కప్పులు
నువ్వులు: అరకప్పు
వాము: మూడు చెంచాలు
ఉప్పు: తగినంత
నూనె: వేయించడానికి సరిపడా
కారం: రెండు చెంచాలు
జీలకర్రపొడి: రెండు చెంచాలు
వెల్లుల్లి ముద్ద: పావు కప్పు

తయారుచేసే విధానం

బియ్యాన్ని కడిగి నీళ్లలో నాలుగైదు గంటలు నానబెట్టాలి. తరువాత నీళ్లు వంపేసి బియ్యాన్ని బట్టపై ఆరబెట్టాలి. బియ్యంలోని నీరంతా పోయి బియ్యం కాస్త తడిగా ఉన్నప్పుడే పిండి పట్టించుకోవాలి. లేదా మిక్సీలో వేసి మెత్తని పిండిలా చేసుకోవాలి. తరువాత బాణలిలో నూనె వెయ్యకుండా నువ్వుల్ని వేయించుకుని బియ్యప్పిండిలో వేయాలి. ఇందులోనే వాము, తగినంత ఉప్పు, వెల్లుల్లి ముద్ద, కారం, జీలకర్ర పొడి వేసి నీళ్లు పోసుకుంటూ మురుకుల పిండిలా కలిపి పెట్టుకోవాలి. నిమ్మకాయంత సైజులో పిండిని తీసుకుని వేళ్లతో తడిబట్టపై గుండ్రంగా మూడు, నాలుగు చుట్లు వచ్చేలా చుట్టుకోవాలి. ఇలా మిగిలిన పిండినీ చేసుకుని నూనెలో ఒకటి రెండు చొప్పున వేసి వేయించుకుని తీసుకోవాలి. చల్లారాక ఎయిర్‌టైట్ కంటైనర్‌లో వేసుకుంటే వారం, పదిరోజుల వరకు నిల్వ ఉంటాయి.

సగ్గుబియ్యం చెక్కలు

కావలసిన పదార్థాలు

బియ్యం: మూడు కప్పులు
పెసరపప్పు: కప్పు
సగ్గుబియ్యం: అరకప్పు
నువ్వులు: రెండు చెంచాలు
జీలకర్ర: చెంచా
వెన్న: చెంచా
కారం: తగినంత
ఉప్పు: తగినంత
నూనె: వేయించడానికి సరిపడా

తయారుచేసే విధానం

బియ్యం, పెసరపప్పు, సగ్గుబియ్యాన్ని కలిపి మెత్తగా పిండిలా చేసుకోవాలి. ఈ పిండిలో నువ్వులు, జీలకర్ర, తగినంత ఉప్పు, కారం, వెన్న వేసుకుని బాగా కలపాలి. ఇందులో తగిననన్ని నీళ్లు పోసుకుని చపాతీ పిండిలా కలపాలి. ఐదు నిముషాల తర్వాత ఈ పిండిని చిన్న చిన్న చెక్కల్లా ఒత్తుకుని కాగిన నూనెలో వేసి, కాస్త రంగు మారాక తీసేసుకుంటే కరకరలాడే సగ్గుబియ్యం చెక్కలు రెడీ.

పుట్నాల జంతికలు

కావలసిన పదార్థాలు

పుట్నాల పిండి: కప్పు
సెనగపిండి: కప్పు
కారం: తగినంత
ఉప్పు: సరిపడా
వాము: ఒక చెంచా
నూనె: వేయించడానికి సరిపడా

తయారుచేసే విధానం

ఒక గినె్నలో పుట్నాల పిండి, సెనగపిండి, తగినంత ఉప్పు, కారం, వాము, రెండు చెంచాల నూనె వేసి బాగా కలిపి సరిపడా నీళ్లతో జంతికల పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని కొంచెం కొంచెంగా జంతికల గొట్టంలో పెట్టి కాగిన నూనెలో జంతికల్లా వత్తుకుని వేగాక తీసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన, కరకరలాడే పుట్నాల జంతికలు రెడీ.

కోవా కజ్జికాయలు

కావలసిన పదార్థాలు

మైదాపిండి: నాలుగు కప్పులు
నెయ్యి: నాలుగు చెంచాలు
కోవా: రెండున్నర కప్పులు
కొబ్బరి తురుము: కప్పు
యాలకులపొడి: చెంచా
బాదం ముక్కలు: నాలుగు చెంచాలు
జీడిపప్పు ముక్కలు: నాలుగు చెంచాలు
ఎండుద్రాక్ష: నాలుగు చెంచాలు
పంచదార: ఒకటింపావు కప్పు

తయారుచేసే విధానం

ముందుగా ఒక గినె్నలోకి మైదాను తీసుకుని అందులో నెయ్యివేసి కలపాలి. తరువాత కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని మృదువుగా, చపాతీపిండిలా కలపాలి. పిండికి పైన కొద్దిగా నెయ్యిరాసి, పిండిపై తడిబట్ట వేసి కప్పి పక్కన ఉంచాలి. మరో గినె్నలోకి కోవాను తీసుకుని మెత్తగా చిదమాలి. స్టవ్‌పై పాన్ ఉంచి అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. కాగాక ఇందులో కోవాను వేసి అది గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి. ఇందులో పంచదారపొడి, యాలకులపొడి వేసి కలపాలి. తరువాత దీనిలో బాదం, జీడిపప్పుముక్కలు, కొబ్బరి తురుము, ఎండుద్రాక్ష వేసి రెండు నిముషాలు వేయించి, దించి చల్లారనివ్వాలి. ముందుగా కలిపి ఉంచుకున్న మైదాపిండిని చిన్న చిన్న ముద్దలు చేసుకుని చిన్న చిన్న పూరీల్లా వత్తుకోవాలి. ఒక్కోదాంట్లో కాస్త కోవా మిశ్రమాన్ని వేసి కజ్జికాయల మాదిరిగానే వేళ్లతో కాస్త మెలిపెట్టినట్లుగా అంచుల్ని నొక్కాలి. అన్నింటినీ ఇలాగే చేసుకుని నెయ్యి లేదా నూనెలో వేయించి తీసి సర్వ్ చేసుకోవచ్చు.

మినప్పప్పు జంతికలుమినప్పప్పు జంతికలుమినప్పప్పు జంతికలు

కావలసిన పదార్థాలు

బియ్యప్పిండి: నాలుగు కప్పులు
మినప్పప్పు: కప్పు
వాము: ఒక చెంచా
వెన్న: పావు కప్పు
ఉప్పు: తగినంత
కారం: అరచెంచా
నూనె: వేయించడానికి సరిపడా

తయారుచేసే విధానం

మినప్పప్పును రెండు గ్లాసులు నీళ్లు పోసి కుక్కర్‌లో మూడుకూతలు వచ్చేవరకు ఉడికించుకుని తీసుకోవాలి. తరువాత నీటిని వంపేసి అందులో బియ్యప్పిండి, మిగిలిన పదార్థాలన్నీ వేసుకుని జంతికల పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని జంతికల గొట్టంలో కొద్దిగా తీసుకుని కాగుతున్న నూనెలో జంతికల్లా వేసుకుని దోరగా వేగాక తీసేస్తే కరకరలాడే మినప్పప్పు జంతికలు రెడీ.

నేతి అరిసెలు

కావలసిన పదార్థాలు

బియ్యం: అరకిలో
బెల్లం: అరకిలో
నూనె: వేయించడానికి
నెయ్యి: వేయించడానికి
తెల్ల నువ్వులు: 100 గ్రాములు

తయారుచేసే విధానం

ముందుగా బియ్యాన్ని నాన బెట్టుకోవాలి. తరువాత నానిన బియ్యాన్ని పిండి కొట్టించుకోవాలి. బెల్లాని మెత్తగా తురుముకుని ఒక గినె్నలో వేసి కొద్దిగా నీళ్లను పోసి స్టవ్‌పై ఉంచాలి. నెమ్మదిగా కలుపుతూ ఉండ పాకాన్ని రానివ్వాలి. తరువాత ఈ పాకంలో నెమ్మదిగా బియ్యప్పిండిని వేస్తూ బాగా కలపాలి. దీనిలో నువ్వులను కూడా వేసి ముద్దగా తయారుచేయాలి. ఇలా తయారైన ముద్దను చలిమిడి అంటారు. ఈ చలిమిడిని చిన్న చిన్న ఉండలుగా చేసి చేతితో గుండ్రంగా వత్తుకోవాలి. తరువాత స్టవ్‌పై బాణలిని ఉంచి సగం నూనె, సగం నెయ్యిని వేసి వేడి చేసుకోవాలి. చేసుకున్న అరిసెలను ఇందులో వేసి బంగారు రంగు వచ్చేంతవరకు వేయించి తీసేసుకోవాలి. ఇలా బయటకు తీసిన వాటిని అరిసెల గరిటెతో గట్టిగా వత్తి ఒక గంట ఆరబెట్టాలి. తరువాత గాలి చొరబడని డబ్బాల్లో నిల్వచేయాలి. ఇవి చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. వేడివేడిగా అరిసెలు చేసుకుని అప్పటికప్పుడు తినాలనుకునేవారు పాకం పట్టిన చలిమిడిని ఫ్రిజ్‌లో నిల్వ ఉంచుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. అరిసెలను నేతితోనే కాల్చుకోవాలనుకునేవారు నూనెను వాడాల్సిన అవసరం లేదు.

ఈమే.. విజయమ్మ

$
0
0

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఘట్టం ‘యాత్ర’గా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. మహి వి రాఘవన్ తెరకెక్కిస్తున్న చిత్రంలో వైఎస్సార్ పాత్రను మమ్ముట్టి పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్‌కు అనూహ్య స్పందన వస్తోంది. అయితే వైఎస్ సతీమణి విజయమ్మ పాత్రను పోషిస్తున్న ఆశ్రీత వేముగంటి లుక్‌ను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది. అచ్చంగా విజయమ్మను పోలిన ఆహార్యంతో ఆకట్టుకున్న ఆశ్రీత, పాత్ర పోషణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారట. మమ్ముటిలాంటి దిగ్గజ నటుడి సరసన పోషించనున్న విజయమ్మ పాత్ర కోసం చాలానే కసరత్తులు చేశారట. ఫిబ్రవరి 8న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో సోమవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణంలో రాజకీయ నేపథ్యంతో వస్తున్న వైఎస్ ‘యాత్ర’ ఆసక్తి రేకెత్తిస్తోంది.


‘..ప్రైమ్ మినిస్టర్’కు ఊరట

$
0
0

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజకీయ జీవితంలోని ముఖ్య ఘట్టాలతో తెరకెక్కిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’కు ఊరట లభించింది. వివాదాస్పదమైన ట్రైలర్‌ను నిషేధించాలంటూ ఢిల్లీ ఫ్యాషన్ డిజైనర్ పూజా మహాజన్ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ప్రతిష్టాత్మక వ్యక్తి జీవితంలోని అవాస్తవాలను తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుందంటూ కాంగ్రెస్ శ్రేణులు కొద్దికాలంగా వివాదం రేపుతోన్న విషయం తెలిసిందే. మరో రెండు రోజుల్లో సినిమా విడుదలకానున్న తరుణంలో న్యాయస్థానంలో పిటీషన్ పడటంతో -సినిమా విడుదల కష్టమేనన్న ప్రచారం జరిగిపోయింది. ఒక వ్యక్తి జీవితం ఆధారంగా సినిమా తీసినపుడు సెక్షన్ 416 ప్రకారం ఆ వ్యక్తినుంచి ‘అభ్యంతరం లేదన్న’ అనుమతిని తీసుకోవాలని, అటువంటిదేమీ చేయకుండానే చిత్రబృందం అతిక్రమణకు పాల్పడుతోందని డిజైనర్ పూజ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, పిటిషన్ తరఫు వాదనలు విన్న హైకోర్టు మాత్రం ఈ అంశాన్ని తోసిపుచ్చింది. సినిమాకు ఫ్యాషన్ డిజైనర్‌కు ఎలాంటి సంబంధం లేదని, ఏ ఆసక్తితో ఆమె పిటిషన్ వేశారంటూ కోర్టు నిలదీసింది. ట్రైలర్‌ను నిషేధించే ఉత్తర్వులు ఏమాత్రం ఇవ్వలేమంటూ కోర్టు స్పష్టం చేసింది. విజయ్ రత్నాకర్ తెరకెక్కించిన ‘ది యాక్సిడెంటల్ ప్రేమ్‌మినిస్టర్’ చిత్రం 11న విడుదల కానుండటం తెలిసిందే. మాజీ ప్రధాని మన్మోహన్ వద్ద జాతీయ భద్రతా సలహాదారుగా పని చేసిన సంజయ్ బారూ రాసిన పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మన్మోహన్ పాత్రలో అనుపమ్ ఖేర్, సంజయ్ బారూ పాత్రలో అక్షయ్ ఖన్నా నటించారు. మన్మోహన్ రాజకీయ నేపథ్యాన్ని చిత్రంలో ఎలా చూపించారోనన్న ఆసక్తి కనిపిస్తోంది.

నిన్ను తలచి..

$
0
0

ఎస్‌ఎల్‌ఎం, నేదురుమల్లి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం -నిన్ను తలచి. అనిల్ తోట దర్శకత్వంలో నేదురుమల్లి అజిత్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రంలో వంశీ, స్ట్ఫె పాటిల్ హీరో హీరోయిన్లు. చిత్రానికి సంబంధించి ప్రసాద్ ల్యాబ్‌లో ఫస్ట్‌లుక్‌ను లాంచ్ చేశారు. అనంతరం మీడియా సమావేశంలో నిర్మాత అజిత్ మాట్లాడుతూ కొత్త బ్యానర్‌తోపాటు కొత్త హీరో హీరోయిన్లతో కలిసి చేస్తున్న సినిమా నిన్ను తలచి. ఈ ప్రాజెక్టుతో అందరికీ మంచి పేరు రావాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు. హీరోయిన్ స్ట్ఫె పాటిల్ మాట్లాడుతూ టాలీవుడ్‌లో అవకాశమిచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు అన్నారు. దర్శకుడు అనిల్ మాట్లాడుతూ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాం. ప్రాజెక్టులో అవకాశమిచ్చిన నిర్మాతలకు థాంక్స్. వైవిధ్యమైన కథను అద్భుతంగా తెరకెక్కించాం. పోస్ట్‌ప్రొడక్షన్స్ జరుపుకుంటున్న చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. పూర్ణచారి మాట్లాడుతూ టైటిల్‌పెట్టిన దగ్గరినుంచీ మంచి సినిమా చేస్తున్నామనే కాన్ఫిడెన్స్ పెరిగింది. మంచి సినిమాలో తనను భాగం చేసినందుకు దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. హీరోహీరోయిన్ బాగా చేశారు. మంచి సంగీతం కుదిరింది. సినిమాలో అన్ని క్రాఫ్టులు కష్టపడ్డాయి. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు. హీరో వంశీ మాట్లాడుతూ అవకాశమిచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కష్టపడి చేసిన సినిమాను ఆడియన్స్ ఆదరించాలని కోరుకున్నారు.

పేట.. కోట దాటేదే..

$
0
0

రజనీకాంత్ లీడ్‌రోడ్ చేసిన చిత్రం ‘పేట’. సిమ్రన్, త్రిష హీరోయిన్లు. కార్తిక్ సుబ్బరాజ్ దర్శకుడు. అశోక్ వల్లభనేని నిర్మాత. సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న అంబికా కృష్ణ, జెమిని కిరణ్, వైవీయస్ చౌదరి, ప్రసన్నకుమార్ ఫస్ట్ టికెట్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో నిర్మాత అశోక్ వల్లభనేని మాట్లాడుతూ ‘పేటను సొంతంగా విడుదల చేయడానికి తీసుకున్నా. ఫస్ట్‌డేకి వచ్చిన టాక్‌తోనైనా సినిమాకు ఎక్కువ థియేటర్లు ఇస్తారని ఆశిస్తున్నా. కార్యక్రమానికి హాజరైన శ్రీకాంత్, వైవీయస్ చౌదరి, జెమిని కిరణ్, ఎఫ్‌డీసీ చైర్మన్ అంబికా కృష్ణ, అనిరుథ్, హీరోయిన్లకు కృతజ్ఞతలు. యువీ క్రియేషన్స్, దిల్‌రాజు, అల్లు అరవింద్ వంటి నిర్మాతలు థియేటర్లతోనే పుట్టినట్టు ప్రవర్తిస్తున్నారు. థియేటర్లు ఇవ్వడానికి చాలామందిని ఇబ్బంది పెడుతున్నారు. అలాంటి వారికి బుద్ధిచెప్పి ప్రభుత్వాలు అందరికీ థియేటర్లు దక్కేలా చేయకపోతే, పరిశ్రమ కుదేలైపోవడం ఖాయం. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు ఆలోచించాలి’ అని కోరారు. శ్రీకాంత్ మాట్లాడుతూ ‘అశోక్ వల్లభనేని నా స్నేహితుడు. ధైర్యం ఎక్కువ. ఇటీవలే సర్కార్ విడుదల చేశారు. ఈ సంక్రాంతి బరిలో పేటను విడుదల చేస్తున్నారు. పోటీ పడగలదన్న నమ్మకం కలుగుతుంది’ అన్నారు. చిరంజీవి, రజనీలాంటి ఆర్టిస్టులు చిన్న ఆర్టిస్టులకు స్ఫూర్తి అన్నారు. అంబికాకృష్ణ మాట్లాడుతూ జపాన్‌లో తొలిసారి ఫ్యాన్ బేస్ సాధించిన దక్షిణాది హీరో రజనీ. ఆయన సినిమాలు, స్టైల్ చూస్తూ పెరిగాం. వల్లభనేని విడుదల చేస్తున్న పేట, పండుగ సీజన్‌లో తన సత్తా చాటుతుందన్న భావన కలుగుతోంది. దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ మంచి దర్శకుడు. కాలక్షేపానికి కాకుండా, హాంటింగ్ చేసే సినిమాలను తీస్తాడు. దమ్మున్న చిత్రానికి కార్తీక్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ తొలి సినిమా పిజ్జాను తెలుగులోనూ ఆదరించారని గుర్తు చేసుకున్నాడు. తలైవా సినిమా కోసం హైదరాబాద్‌కు వచ్చానని, ఇది అందరికీ డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నారు. సన్ పిక్చర్స్‌కి ధన్యవాదాలు చబుతూ, అశోక్ సినిమాను తెలుగులో విడుదల చేయడం హ్యాపీగా ఉందన్నారు. స్ట్రాంగ్ స్టోరీ, పైగా ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎంటర్‌టైనర్ అన్నారు. రజనీ సరికొత్త మొమెంట్స్ ఇందులో ఉంటాయని, హెవీ కాంపిటీషన్ మధ్య ఫెస్టివల్ సినిమాగా నిలుస్తుందన్న నమ్మకం ఉందన్నారు.

కోచ్‌గా.. విజయ్

$
0
0

‘సర్కార్’ తరువాత ఇళయదళపతి విజయ్ నటించనున్న 63వ చిత్రం ఇటీవలే లాంచ్ అయ్యింది. విజయ్‌కి ‘తెరి, మెర్సల్’ రూపంలో రెండు బ్లాక్‌బ్లాస్టర్ విజయాలు అందించిన యువ దర్శకుడు అట్లీ ఈ చిత్రాన్నీ తెరకెక్కించనున్నాడు. జనవరి 21నుంచి షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. మొదటి షెడ్యూల్ కోసం ఆర్ట్ డైరెక్టర్ ముత్తురాజ్ భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు.
స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రంలో విజయ్ కోచ్ పాత్రలో కొత్తలుక్‌లో కనిపిస్తాడట. భారీ బడ్జెట్‌తో ఏజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న చిత్రంలో నయనతార హీరోయిన్. ఎఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇక దీపావళికి విజయ్ నటించిన సినిమాలు విడుదలై మంచి విజయం సాధించడంతో, ఈ చిత్రాన్నీ అదే సమయానికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు టీం చెబుతోంది.

ఈ జంట.. జంటగా

$
0
0

అటు జాతీయ, ఇటు ప్రాంతీయ పరిశ్రమల్లో దొంతరలు దొంతరలుగా బయోపిక్‌లు తెరకెక్కుతున్నాయి. ఒక్క ఈ ఏడాదిలోనే కనీసం పదిహేను ప్రముఖుల జీవిత కథలు ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే కోవలో లెజండరీ క్రికెటర్ కపిల్‌దేవ్ లైఫ్ ఇన్సిడెంట్స్‌ని కబీర్ ఖాన్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కపిల్ సారథ్యంలో భారత్ ప్రపంచ కప్ సాధించిన 1983లోని ‘83’ని సినిమాకు టైటిల్‌గా గతంలోనే ఫిక్స్ చేశారు. కపిల్ పాత్రను బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ పోషిస్తున్నాడు. తాజా సమాచారం ఏటంటే -రియల్ లైఫ్‌లో కపిల్ భార్య రోమీ పాత్రను రీల్‌లైఫ్‌లో దీపిక పోషించనుందట. రియల్ లైఫ్‌లో ఈమధ్యనే ఒక్కటైన జంట దీప్‌వీర్ -రీల్‌లైఫ్‌లోనూ జంటగా నటించబోతోందన్న మాట. రోమీ భాటియా పాత్ర విషయంలో చిత్రబృందం ఇప్పటికే దీపికతో చర్చలు జరిపిందని, ఆమె కూడా ఈ పాత్ర పోషించేందుకు అంగీకరించినట్టు బాలీవుడ్‌లో టాక్. 1983లో ప్రపంచ కప్ ఫైనల్ ఆడుతున్నపుడు -ఆట చివరిక్షణంలో తలెత్తిన అనేక భావోద్వేగాలను రోమీ (దీపిక) పాత్రలో చూపించేందుకు కబీర్‌ఖాన్ స్కెచ్ ప్రిపేర్ చేసినట్టు తెలుస్తోంది. ఆటుపోట్లు మధ్య సాగిన ఆటలో చివరకు తన భర్త కపిల్ సాధించిన కప్‌ను ముద్దాడుతున్న టైంలో కంటతడి పెట్టిన రోమీ సన్నివేశాన్ని దీపిక అద్భుతంగా పలికించగలదని చిత్రబృందం ఆశిస్తోంది.

Viewing all 69482 articles
Browse latest View live