Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

కేంద్రానికి ఎదురుదెబ్బ:అలోక్ వర్మకు తిరిగి బాధ్యతలు

$
0
0

న్యూఢిల్లీ: సీబీఐ చీఫ్ అలోక్ వర్మ కేసులో కేంద్రానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అలోక్ వర్మను సెలవుపై పంపటాన్ని సుప్రీం కోర్టు తప్పు పట్టింది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ సెలవులో ఉండటంతో ఆ తీర్పును జస్టిస్ సంజన్ కౌల్ చదివి వినిపించారు. ఈ అంశంపై ప్రధాని, ప్రతిపక్షనేత, ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ వారం రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని సూచించింది. తాత్కాలిక డైరక్టర్‌గా నాగేశ్వరరావు నియామకాన్ని ధర్మాసనం పక్కన పెట్టింది. ఈనెల 31వ తేదీతో పదవీకాలం ముగియనున్న అలోక్ వర్మ కమిటీ నిర్ణయం తీసుకునే వరకు ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోరాదని కోర్టు ఆంక్షలు విధించింది. ఇదిలావుండగా అవినీతి ఆరోపణలు రావటంతో అలోక్‌వర్మను కేంద్ర ప్రభుత్వం సెలవుపై పంపింది. దీన్ని సవాల్ చేస్తూ అలోక్ వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం విదితమే.


దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మె

$
0
0

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కార్మికలు సమ్మె జరుగుతుంది. కార్మికులకు సంబంధించిన 12 డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సమ్మె చేపట్టారు. కనీస వేతనం, సమాన పనికి సమాన వేతనం, ధరలు నియంత్రించాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా కార్మికుల సమ్మెతో ముంబయి స్తంభించిపోయింది. విద్యుత్, ట్రాన్స్‌పోర్టు రంగాల కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. సమ్మెలో 33 వేల మంది కార్మికులు పాల్గొన్నారు. 25 డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. అసోం, మేఘాలయ, మణిపూర్, బీహార్, రాజస్థాన్, గోవా, పంజాబ్, జార్ఖండ్, చత్తీస్‌ఘడ్, హర్యానా రాష్ట్రాలలో సమ్మె ప్రభావం అధికంగా ఉంది.

రఫెల్‌పై సీబీఐ దర్యాప్తు జరపాలి:రాహుల్

$
0
0

న్యూఢిల్లీ: రఫెల్‌పై తనతో చర్చ జరిపేందుకు నరేంద్ర మోదీ సిద్ధంగా లేరని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రఫెల్‌ను దర్యాప్తు చేస్తున్నందుకే సీబీఐ చీఫ్‌ను తొలగించారని అన్నారు. రఫెల్ ఒప్పందం వల్ల రూ. 30 వేల కోట్లను తన స్నేహితులకు మోదీ పంచిపెట్టారని అన్నారు. రఫెల్‌పై సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని అన్నారు.

కేరళలో ఆగని ఆందోళనలు

$
0
0

తిరువనంతపురం: కేరళలో హింసాత్మక సంఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నాయకుల ఇళ్లపై బాంబు దాడులు సైతం జరుగుతున్నాయి. కోజికోడ్ జిల్లాలో సీపీఎం, బీజేపీ నాయకుల ఇళ్లపై బాంబు దాడులు జరిగాయి. కాన్నూర్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టగా 18 నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నారు. గత కొద్ది రోజులు రాష్ట్రంలో చోటుచేసుకున్న సంఘటన నేపథ్యంలో ఇప్పటి వరకు 2,187 కేసులు నమోదు కాగా 6,914 మందిని అరెస్టు చేశారు.

పౌరసత్వ బిల్లుపై అసత్య ప్రచారం:రాజనాథ్

$
0
0

న్యూఢిల్లీ: పౌరసత్వ బిల్లుపై తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఆయన లోకసభలో మాట్లాడుతూ ఈ పౌరసత్వ బిల్లుతో ఎవ్వరూ వివక్షకు గురికారని అన్నారు. పౌరసత్వ బిల్లును సవరించేందుకు దేశవ్యాప్తంగా ఎన్జీఓలు, ఇతర సంస్థలు సర్వేలు నిర్వహించినట్లు వెల్లడించారు. కాగా ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని కాంగ్రెస్ నేత ఖర్గే డిమాండ్ చేశారు.

రిజర్వేషన్ల బిల్లులో సవరణలు కోరండి

$
0
0

న్యూఢిల్లీ: రిజర్వేషన్ల బిల్లులో సవరణలకు ప్రతిపాదనలు చేయాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ముస్లింలకు 12శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. తెలంగాణ రాష్ట్ర డిమాండ్లు నెరవేరేలా బిల్లులో సవరణలను కోరాలని సూచించారు.

కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన

$
0
0

కర్నూలు: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఆయన ఒర్వకల్లు వద్ద కొత్తగా నిర్మించిన విమానాశ్రయాన్ని ప్రారంభించారు. అలాగే ఓర్వకల్లు, గడివేములలో నిర్మించిన ఆల్ట్రా మెగా సోలార్ పార్క్‌ను జాతికి అంకితం చేశారు. రాష్ట్ర క్యాన్సర్ పరిశోధనా కేంద్రానికి శంకుస్థాపన చేశారు.

ముఖాకృతిని బట్టి కనుబొమ్మలు

$
0
0

ముఖానికి అందం కళ్లు. అందం అంతా కళ్లలోనే ఉంటుంది. ముఖానికి ఒక తీరైన అందాన్ని ఇచ్చేవి కనుబొమ్మలు. అందానికి చాలా ప్రాధాన్యతనిచ్చే మహిళలు కనుబొమ్మల విషయంలో అంతగా పట్టించుకోరు. ఏదో ఒక షేప్ చేయించుకుంటుంటారు. కానీ ఎలా చేస్తే తమ ముఖానికి నప్పుతాయో ఆలోచించరు. ముఖాకృతి తీరు కనుబొమ్మలను ఏ షేప్ చేయించుకుంటే బావుంటుందో చూద్దాం. నుదురు చిన్నగా ఉన్నవారు కనుబొమ్మలు కొంచెం వంపు తిరిగి ఉంటే బాగుంటుంది. నుదురు విశాలంగా ఉన్నవారికి కనుబొమ్మలు బాగా వంపు తిరిగి ఉండాలి. గుండ్రటి ముఖం ఉన్నవారికి కొద్దిపాటి కోణంతో వంపు తిరిగిన కనుబొమ్మలు నప్పుతాయి. చతురస్రాకారపు ముఖం కలవారు మాంగ్యులర్ ఐబ్రోస్ ఉంటే బాగుంటుంది. కోలముఖం ఉంటే కనుబొమ్మలు స్ట్రెయిట్‌గా ఉండాలి. త్రికోణాకారపు ముఖానికి కనుబొమ్మలు వంపు తిరిగి ఉంటే బాగుంటుంది.


రంగవల్లి

$
0
0

16 చుక్కలు, ఎనిమిది వరుసలు ఎనిమిది వరకు నిలుపు..

చుండూరు తన్మయి ఎ.ఎస్. రావునగర్, హైదరాబాద్

=============================================

రంగవల్లి

$
0
0

రేవతి, హైదరాబాద్

21 చుక్కలు, ఐదు వరుసలు ఐదు వరకు నిలుపు..
పిట్టలకు విడిగా ఐదు చుక్కలు నాలుగు వరుసలు
===================================================

ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్‌గా తొలి మహిళ

$
0
0

అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థలో చీఫ్ ఎకనమిస్ట్‌గా తొలి మహిళ నియమితులయ్యారు. అదీ ఒక భారతీయ మహిళ.. భారతదేశంలోని కర్ణాటకకు చెందిన గీతా గోపీనాథ్‌కు ఆ పదవి దక్కింది. ఐఎంఎఫ్‌లో అత్యున్నత పదవి పొందిన తొలి మహిళగా గీత ఘనత సాధించారు. గీత కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో డిసెంబర్ 8, 1971లో పుట్టారు. ఆమె తల్లిదండ్రులు టి.వి. గోపీనాథ్, విజయలక్ష్మి. వారిది కేరళ రాష్ట్రం. గీతా గోపీనాథ్ భర్త ఇక్బాల్ సింగ్ దలివాల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనమిక్స్‌కు చెందిన సంస్థలకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆమెకు ఒక కొడుకు.. పేరు రోహిల్. గీత స్కూలు విద్య మైసూరులోని నిర్మలా కానె్వంట్‌లో చదివారు. యూనివర్శిటీ ఆఫ్ ఢిల్లీలో డిగ్రీ, యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్‌లో ఎంఏ చదివాక ప్రిన్స్‌టన్ యూనివర్శిటీలో పీహెచ్‌డీ చేశారు. గీత హార్వర్డ్ యూనివర్శిటీలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఐఎంఎఫ్ పరిశోధన విభాగంలో డైరెక్టర్‌గా పనిచేసిన వౌరీ ఆస్టెఫెల్డ్ గత నెల 31న పదవీ విరమణ చేశాక గీతకు చీఫ్ ఎకనమిస్ట్ పదవి దక్కింది. గత ఏడాది అక్టోబర్ ఒకటో తేదీనే గీతా గోపీనాథ్‌ను ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్‌గా నియమించుకుంటున్నట్లు ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టీన్ లగార్డే వెల్లడించారు. ఆమె ప్రపంచంలోని అత్యుత్తమ ఆర్థికవేత్తల్లో ఒకరని ఆయన ప్రశంసించారు. గీతాగోపీనాథ్ ఐఎంఎఫ్‌కు 11వ చీఫ్ ఎకనమిస్ట్. తనకు ఈ పదవి దక్కడం చాలా అరుదైన గౌరవంగా గీత ఆనందిస్తున్నారు. అలాగే ప్రస్తుత ప్రపంచీకరణ నుంచి వెనక్కి తగ్గడం, సుంకాలు పెంపు వంటివి నేడు పెద్ద సవాళ్లుగా మారాయని, ఫలితంగా బహుళ జాతి సంస్థలకు ఇబ్బందులు పెరిగాయని గీత వెల్లడించారు.

స్వాధ్యాయ సందోహం-190

$
0
0

మనసా, వాచా, కర్మణా త్రికరణశుద్ధిగా ఆచరించినవాడే సుప్రావియై పరమాత్మకు ప్రీతిపాత్రుడు కాగలడు.
సోమీ:- తాను శాంతుడై తన తోడివారిని ప్రశాంతులుగాచేసే సచ్ఛీలియే సోమి. వెనుక చెప్పబడిన సుకృత్తు, మనాయు, సుప్రావి అయినవాడే సోమి కాగలడు. తాను ప్రశాంతంగా ఉండి ఇతరులను ప్రశాంతంగా ఉంచాలంటే ముందుగా ఇతరుల ఎడల సహజంగా కలిగే వైరభావాన్ని తొలగించుకోవాలి. ఈ భావాన్ని అలవరచుకొనేందుకు ‘ఆత్మనః ప్రతికూలాని పరేషాం న సమాచరేత్’ ‘‘ఇతరులు తన ఎడల ఏ పనులుచేస్తే తనకు అప్రియంగా ఉంటుందో ఆ పనులను తాను స్వయంగా ఇతరుల ఎడల ఆచరించరాదు’’అని మహాభారతం ఒక చిన్న ఉపాయాన్ని చెప్పింది. ఇది చిన్నదే అయినా సులభోపాయం మాత్రంకాదు. కాని ప్రయత్న పూర్వకంగా ఆచరిస్తే ఆతడు తప్పక వేదం చెప్పిన సోమి అయి భగవత్ప్రీతి పాత్రుడవుతాడు.
విశ్వాత్ముడికి ఆత్మీయుడై ప్రీతిపాత్రుడు కావడానికి ఎనె్నన్నో లక్షణాలున్నాయి. కాని వేదం వానిలో ఎంచి ఎంచి ప్రధానమైన వాటిని నాల్గింటిని ఈ మంత్రంలో పేర్కొంది. కనీస మా నాల్గు లక్షణాలున్నా ఉర్వస్మా అదితిః శర్మ యంసత్ ‘‘జగన్మాత (అదితి)వారికి ఇహలోకంలో సుదీర్ఘమైన సుఖజీవనం తోడి దీర్ఘాయువు నిస్తుంది’’అని ఋగ్వేదం మానవ సమాజానికి సందేశమిస్తూంది.
***
దేవా! నీకు దూరంగానే ఉండి మొరపెడుతున్నాం.
ఉత త్వా బధిరం వయం శ్రుత్కర్ణం సంతమూతయే
దూరాదిహ హవామహే॥ ఋ.8-45-17॥
భావం:- మేము మా రక్షణకోసం బాగా వినగల శక్తివంతమైన చెవులుగల నిన్ను దూరంగా ఉన్న మేము మొరపెడుతూ పిలుస్తున్నాం.
వివరణ:- సర్వభూతాంతరాత్మా! నేను దుఃఖార్తుడను. ఎందరికో నా ఆర్తిని విన్నవించుకొన్నా. ఇతరులకు మనసులోని దుఃఖాన్ని చెప్పుకొంటే ఆ భారం తగ్గుతుందని విన్నాను. కాని దానికి భిన్నంగా విపరీతమైన అనుభవమేర్పడింది. నా దుఃఖం తరుగలేదు సరికదా మరింతగా పెరిగింది. బహుశా నా దీనగాథ ఎవరూ వినలేదేమోననిపిస్తూంది. లేదా విన్నవారికి చెవులేవేవో! ఉన్నా అవి చెవిటి చెవులో ఏమో. లేకపోతే వారు నా దీనగాధకు ఎందుకు స్పందించలేదు?
సర్వ దుఃఖ భంజనా! నీవు చెవిటివాడవు కాదని, నీకు చెవులు బాగా వినబడతాయని చాలామంది చెప్పగా విన్నాను. నేను నీకు చాలా దూరంలో ఉన్నాను. ‘వి మే పురుత్రా పతయంతి కామాః’ (ఋ.3-55-3) నా కోరికలన్నీ ఎన్నో విషయాల మీద నిక్షిప్తం చేయబడ్డాయి. అలా నన్నవి నీకు దూరం చేసివేసాయి. అందువలన నేను వ్యాకుల చిత్తుడనై ఉన్నాను. రేపు నిన్ను పొంది అనుభవించాలనుకొన్న మధుర ఊహలన్నీ ఆవిరైపోయాయి. సంసార చక్రమనే జ్వాలా చక్రబంధంలో చిక్కుకొని పోయాను. కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్య, మోహమనే శత్రువులు నన్ను చుట్టుముట్టి హింసిస్తున్నాను. నాకు వానినుండి విముక్తి కనబడటం లేదు. ఎక్కడికి పోగలను? విముక్తినెలా పొందగలను? అనన్య శరణుడనై నీకు శరణాగతుడ నగుచున్నాను. నీకెంతో దూరంలో ఉన్నాను. ‘దూరాదిహ హవామహే’ ‘‘దూరంగా ఉన్న ఈ ప్రదేశం నుండియే నిన్ను పిలుస్తున్నాను.’’
సంసార పీడ నాకొక్కడికే కాదు. ఎందరికో ఉంది. నా వొక్కడి మీదనే అయితే నీవు వినకు. ఇది మా అందరి పీడ. ఓ ప్రభూ! ‘ఉత త్వం మఘవన్ శ్రుణు యస్తే వష్టి వవక్షి తత్’ (ఋ.8-45-6) ‘‘ఓ విశ్వయోనీ! ఓ పూజ్యధనశాలీ! నినే్న కోరి నినే్న మొరపెట్టుకో దలచినవాని పిలుపునైనా విను.’’ ఓ సత్య పరాక్రమా! అసలు నినె్నందుకు పిలుస్తారు? ‘ఊతయే’ ‘‘రక్షిస్తావని కదా!’’ నీకంటె రక్షకుడు, సుఖప్రదాయకుడు ఎవరున్నారు? ఓ దేవా! మేము రక్షణహీనులం. నానావిధ రాక్షస జనమూ మరియు నానా ప్రవృత్తుల చేత చుట్టుముట్టబడిన వారం. నీవో వృత్తాసుర సంహారకుడవు. మోహరాక్షస సంహారకుడవు. అన్నింటిని మించి ‘్భవేరాపిర్నో అంతమః’ (ఋ.8-45-18) ‘‘అంతిమ సర్వోత్కృష్ట బంధుడవు నీవే.’’ లోకంలో ఉండే బంధువుల స్వార్థబంధం వంటిది కాదు నీ బంధుత్వం. నీ ప్రేమ, బంధుత నిస్వార్థ పరిపూర్ణం. సర్వభూతాంతరాత్మా! మా మాట నమ్ము. మేమంతా ఉశ్శసి త్వా సధస్ఠ ఆ (ఋ.8-45-20) ‘‘నీ వొక్కడితో మాత్రమే ఉండేందుకిష్టపడుతున్నాం’’ మా మొరను విన్నావా? మమ్ము నీ వెంటే ఉంచుకో. నీదిమాత్రం ఏదీ చెడిపోదు. కాని మేము మాత్రం ధన్యులమవుతాం.
**
భగవంతుని రక్షణ
తమిన్నరో వి హ్వయంతే సమీకే రిరిక్వాంసస్తన్వః కృణ్వత త్రామ్‌
మిథో యత్త్వాగముభయాసో అగ్మన్నరస్తోకస్య తనయస్య సాతౌ॥ ॥
భావం:- మానవులు తమ శరీరేంద్రియ బలీయమైన శక్తులను వశం చేసుకుంటూ జీవన సంగ్రామంలో ఆ దైవాన్ని అత్యంత ఆర్తితో పిలుస్తారు. ఆ భగవంతుని తమ రక్షకునిగా చేసుకొంటారు. వీరూ మరియు పిల్లాపాపలను పొందాలనుకొనేవారు ఈ యిరువురు త్యాగానే్న ఆశ్రయిస్తున్నారు.
వివరణ:- ప్రపంచంలో మనిషి ఎప్పుడైనా ఎక్కడైనా నిరాశచేత హతాశుడయితే అప్పుడు దీన జన శరణ్యుడు- దుఃఖనివారకుడయిన భగవంతుని స్మరించి ఆయనకు శరణాగతుడవుతాడు. లోకంలో జగడాలు- విరోధాలు లేకుంటే ఎవరూ ఎవరిని సహాయమర్థించరు.
ఇంకావుంది...

మహాభారతంలో ఉపాఖ్యానాలు -95

$
0
0

అతని మాటలు విన్న రాజు ఇలా తలచాడు. - ‘‘ఈ ఇద్దరి వివాదం ఇప్పుడే వచ్చి పడింది. బ్రాహ్మణుడు కూడా దానం స్వీకరించమని వత్తిడి తెస్తున్నాడు. ఏం చేయాలి?’’
రాజు వికృత, విరూపులతో ఇలా అన్నాడు. ‘‘మీ వివాదం తీరిన తర్వాతే వెళ్ళండి. నా రాజధర్మం అబద్ధం కాకూడదు. రాజులు స్వధర్మ పరిపాలన చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయ. ఇప్పుడు ఈ కఠినమైన బ్రాహ్మణ ధర్మం కూడా నన్ను ఆవేశించింది.’’
విప్రుడు ఇలా అన్నాడు - ‘‘రాజా! నీవు అడిగినది నేను ఇస్తానని అన్నాను. ఇప్పుడు అది నీవు నా దగ్గర దాచిన వస్తువులాగ ఉంది. వెంటనే తీసుకో!’’
రాజు - ‘‘రాజ ధర్మం చాలా క్లిష్టమైనవి. ఇప్పటి వరకు నేనెవరి ముందు చేయ జాచలేదు. ఇప్పుడు నీ ముందు చాపుతున్నాను. నీ దగ్గరున్న నా సొమ్ము నాకు ఇచ్చివేయ’’.
అప్పుడు బ్రాహ్మణుడు ఇలా అన్నాడు - ‘‘సంహితను జపిస్తూ నేను కూడబెట్టిన పుణ్యం మొత్తం స్వీకరించు. ఇది కాక ఇంకేదైనా పుణ్యం నా దగ్గర ఉంటే దాన్ని కూడా తీసుకో’’.
అప్పుడు రాజర్షి ఇలా అన్నాడు ‘‘నీ దానాన్ని నేను స్వీకరించాను. నీవు కూడా నా దానాన్ని స్వీకరించు. మొత్తం దాన పుణ్యం చెరి సగం ఇద్దరం అనుభవిద్దాము.’’
అప్పుడు విరూపుడు ఇలా అన్నాడు - ‘‘రాజా! మేమిద్దరం కామక్రోధులం. మేమే నీ చేత ఈ పని చేయంచాము. తపః, దాన ఫలం చెరిసగం చేసుకొని అనుభవిస్తే ఇద్దరికీ ఒకే లోకం లభిస్తుంది. మేమిద్దరం ఒకరికొకరు ఏ బాకీ పడలేదు. మేమిద్దరమూ కాలుడూ, యముడూ అందరం మిమ్ము పరీక్షించడానికే వచ్చాము. నీ కర్మఫలంగా నీకు నచ్చిన లోనికి నీవు వెళ్ళవచ్చు.’’
బ్రాహ్మణుడు కూడా దీనికి అంగీకరించి వారిని అందరినీ పూజించి రాజుతో ఇలా అన్నాడు.
‘‘రాజర్షీ! ఈ తప్ఫఃలంతో నీవు ఉత్తమ లోకాలకు వెళ్ళు. నేను మరల తపస్సు చేస్తాను. నాకు జపం మీద శ్రద్ధ ఉంటుందని సావిత్రీదేవి వరమిచ్చింది.’’
అపుడు రాజు ఇలా అన్నాడు - ‘‘ద్విజోత్తమా! జప దాన ఫలితం ఇద్దరం కలిసి అనుభవిద్దాము’’. దానికి బ్రాహ్మణుడు అంగీకరించాడు. ఎక్కడికి వెళ్ళాలో చెప్పుమన్నాడు.
అప్పుడు దేవేంద్రుడు దిక్పాలకులతో కలిసి అక్కడికి వచ్చాడు. అప్పుడు గొప్ప వాద్యాలు మ్రోగాయ. గంధర్వులు గానం చేశారు. వారిద్దరిపై పుష్పవృష్టి కురిసింది. వారిద్దరూ కలిసి తమ మనసులను విషయాల నుండి ఉపసంహరించు కొన్నారు. తర్వాత పంచ ప్రాణాలను మనస్సులో నిలిపారు. కనుబొమ్మల మధ్య నాసిక మీద దృష్టి నిలిపి, ప్రాణయమాలను సుషుమ్న ద్వారా హృదయస్థానంలో నిలిపి సమాధి స్థితికి చేరుకున్నారు. వారి శరీరాలు నిశ్చలంగా ఉన్నాయ. అప్పుడు ఆ బ్రాహ్మణుని బ్రహ్మరంధ్రం ఛేదించుకొని ఒక తేజోమయమైన జ్యోతి బయటకు వచ్చి స్వర్గం వైపు వెళ్ళింది. ఆ తేజః పుంజం చిన్న పురుషునిగా మారి బ్రహ్మ సన్నిధికి చేరింది. బ్రహ్మ ఆ పురుషునికి స్వాగతం పలికాడు. బ్రహ్మ ఇలా అన్నాడు - ‘బ్రాహ్మణా యోగులతో సమానమైన ఫలితాన్ని జాపకులు కూడా పొందుతారు. నీవు నాలోనే నిలిచిపో’. అప్పుడు బ్రాహ్మణుడు బ్రహ్మవదనంలోకి ప్రవేశించాడు.
అక్కడ ఉన్న దేవతలంతా ఇలా అన్నారు - ‘‘జాపకుడు, యోగులతో సమానంగా పొందే స్థానాన్ని చూడడానికీ మేమంతా వచ్చాము.’’
అప్పుడు బ్రహ్మ ఇలా అన్నాడు - ‘‘ఒక్కటిగా వచ్చిన ఈ ఇద్దరూ కూడా సమాన ఫలాన్ని పొందారు. ఇద్దరూ అన్ని లోకాలను దాటి వారికిష్టమైన ప్రదేశానికి వెళ్ళవచ్చు’’.
అప్పుడు దేవతలు బ్రహ్మ దగ్గర వీడ్కోలు తీసుకొని తమ తమ నివాసాలకు వెళ్ళారు.
ఇంకావుంది...

పరమహంస బోధామృతము

$
0
0

సరిగా నడుమ, ముల్లుదగ్గర నిలువక త్రాసుదండి ఎప్పుడు ఒరగిపోవును. ఒకవైపున నున్న సిబ్బి రెండవ దానికంట బరువైనప్పుడేకదా? అటులనే కామినీ కాంచనముల భారము తనపై బడినప్పుడు -వానిచే లాగబడినప్పుడు- మనస్సు భగవంతునినుండి తొలగిపోవుచున్నది.
78.అడుగున సూది బెజ్జమంత చిల్లియున్నను కుండలోనున్న నీరంతయు క్రమముగా కారిపోవును. అటులనే సాధకునియందు ఏ మాత్రపు లోలత యున్నను వాని సాధనలన్నియు బూడిదెలో పోసిన పన్నీరగును.
79.కామమును పూర్తిగా వశమొనర్చుకొన యత్నింపుము. ఇందు కృతార్థుడవైన యెడల ఇంతవరకు బీజావస్థలోనున్న మేధానాడి బలపడుటచే శరీరములో నొక విధమైన మార్పు కలుగును. ఈ నాడి శరీరమునందలి క్షుద్రశక్తులను ఉత్తమశక్తులుగా మార్చు స్వభావము కలది. ఈ మేధానాడి బలపడినంతనే ఆత్మజ్ఞానము అలవడును.
80.కామినీ కాంచన వ్యామోహములో మునిగియున్న మనస్సు లేత పోక కాయవంటిది. పోక పచ్చగా నుండునంతవరకు పై బెరడునకు గట్టిగ నంటిపట్టుకొనియె యుండును. కాని యది పండి యెండినప్పుడు వక్కయు డొల్లయు వేరు పడి కదలించునప్పుడు వక్క లొటలొటలాడును. అటులనే కామినీ కాంచన వ్యామోహము ఇగిరిపోయినప్పుడు ఆత్మ శరీరముకంటె భిన్నమని బాగుగా గోచరించును.
81.మనస్సు భోగములపై ఆశ వీడి, నిర్మలమైనంతనే భగవానునిపై లగ్నము కాగలదు. బద్ధుడు ఈవిధముగా ముక్తుడగుచున్నాడు. భగవంతుని వీడి పెడత్రోవను బోవువాడే బద్ధుడు.
82.కామినీ కాంచన మోహము మనస్సు నుండి నిర్మూలనమైనప్పుడు మిగులునదేమి? కేవలము బ్రహ్మానందము.
కామమును జయించుటెట్లు?
83.పాములకు నిలయమైన ఇంటిలో నివసించువారు వాని వలన ఎప్పుడు ఏ కీడు మూడునో అని జాగ్రత్తగా నుందురు కదా? అటులనే సంసారులగు నరులు కామినీ కాంచనములు తమ్ము లోబరచుకొనకుండా మెలకువ గలిగి మెలగవలయును.
84.పాము కంటబడినప్పుడు ఇటులను నాచారము కలదు. ‘‘తల్లీ! మానసా! నీ తోకను మాత్రము అగపరచుచు, తలను దాచుకొని దూరముగా తొలగిపొమ్ము’’. అటులనే కామోద్రేకమును వురికొల్పు విషయ భోగములనుండి దూరముగా తొలగి వర్తించుటయే తెలివిగలపని. పతితులై తెలివి తెచ్చుకొనుటకంటె వాని సంసర్గము పొందకుండుటయే మేలు.
85.ఒక శిష్యుడు భగవద్ధ్యానము చేయుచు కాలము గడుపుచున్నను దుష్ట సంకల్పములు అపుడపుడు మనస్సులో బుట్టుచునే యున్నవని చెప్పి కామమును జయించుటెట్లని శ్రీరామకృష్ణునడిగెను. అందులకు శ్రీగురుదేవుడిట్లు బోధించెను: ‘‘ఒకని యొద్ద నొక కుక్క యుండెడిది. దాని నెత్తుకొని ముద్దాడుచు, దానితో ఆటలాడుచు, ఆ కుక్కను అతడు చాలా మక్కువతో బెంచుచుండెడివాడు. అది చూచి యొక జ్ఞాని కుక్కపై నంతటి మక్కువ కూడదని యాతని మందలించెను. ఏలన, కుక్క కేవలము జ్ఞానహీనమగు జంతువు గదా?
ఎపుడైనను ఆతని గరచినను కరవవచ్చును. దాని యజమానుడీబోధల నాలకించి యొడిలోనున్న కుక్కను ఆవలికి త్రోసివేసి, దాని నిక చేరదీయుటగాని, బుజ్జగించుటగాని కూడదని నిశ్చయించుకొనెను. కాని యా కుక్క యజమానునకు తనయందు దృష్టి మారినదని తెలియజాలక ఎప్పటివలెనే ఎత్తుకొని ముద్దులాడునను నాశతో తరచు వానియొద్దకు పరుగెత్తుచుండెడిది. ఎన్నియోసార్లు దెబ్బలు తినిన పిమ్మట తుదకు అది తన్ను లాలింపుమని యజమానునిక బాధించుట మానివేసెను. నీ స్థితియు అటులనే యున్నది. నీ యంతరంగమున నీవింతవరకు బుజ్జగించిన కుక్కను నీవు వదలించుకోదలచినను సులభముగా నిన్నది విడువదు. అయినను భయములేదు లెమ్ము. ఆ కుక్క నిక బుజ్జగింపక నీదరి జేరినపుడెల్ల చీకొట్టుచుండుము, కొట్టుచుండుము, నీచే లాలనపొందుటకై నిన్ను పీడించుచున్న యా కుక్క (కామము) కొంతకాలమునకు నిన్ను విడిచివేయుము.
86.కామినియ కాంచనమును లోకమునందతయు సంసార సాగరమున -పాపపంకిలమున- ముంచివేసినవి సుమీ! స్ర్తిని నీవు సాక్షాజ్జగజ్జనని యను భావముతో జూచినయెడల ఆమె వలన నీకెట్టి ప్రమాదమునుండదు.
ఇంకావుంది...
శ్రీ రామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదకుడు: శ్రీ చిరంతనానందస్వామి

సుందరకాండ

$
0
0

ఇంద్రియాణీంద్రియార్తెస్తు పంచపంచభిరుత్తమైః
తర్పయామాస మాతేవ తదా రావణ పాలితా
స్వర్గో యం దేవలో కోయం ఇంద్రస్యేయం పురీభవేత్
సిద్ధి ర్వేయం వరాహిస్యాదిత్య మన్యత మారుతిః
అన్ని ఇంద్రియాలు ఇంద్రియార్థములన్నిటిచేత ఏక కాలంలో తృప్తిని పొందుతున్నాయట. తల్లి తన సంతానమునకు తృప్తిని కలిగించినట్లు తృప్తిని కలిగిస్తున్నదట.
ఇదీ అనుభవంలో స్వామికి రావణునికి ఉన్న భేదం.
రావణుడనుభవించే తృప్తి ప్రియురాలి వలన లభించినది.
ఆంజనేయస్వామి తృప్తి తల్లివలన లభించినది.
అందుకనే- స్వామి అంతటి వానికి-
ఇది స్వర్గమా! దేవలోకమా! అమరావతా!
ఇది భోగానుభవ సిద్ధికి పరాకాష్టగా ఉంది.- అని అనిపించింది.
ఇలా అనిపించిన దాని బాహ్య సౌందర్యంతోబాటు మరి కొంచెం ముందుకు వెడితే దాని అంతర సౌందర్యమూ కనబడతాయి.
ఇక్కడ బాహ్య అంతర ప్రకృతులు భిన్నంకావు.
నిద్రావలైన అంతఃపుర స్ర్తిలు
వారినోటినుండి వెలువడుతూన్న భోగ ద్రవ్య వాసనలూ మాటి మాటికి ఎగురుతూన్న ముంగురులనే తుమ్మెదలచేత ప్రార్థింపబడుతూన్న ముఖ పద్మాలు. అలాగే-
గాఢ నిద్రలో ఉండి- సపత్నీ ముఖాన్ని రావణ ముఖమే అనుకొని ముద్దు పెట్టుకొంటూన్న స్ర్తి
ముద్దు పెట్టుకుంటూన్నది రావణుడే అనుకొని తత్కాలంలో సపత్నీ వైరాన్ని మరచిపోయిన స్ర్తి కాలు తొడ పిక్క పాదం పెనవేసికొని ఒకరినొకరు అల్లుకుపోయి నిద్రపోతూన్న స్ర్తిలు-
ఇంకావుంది...


హితవాక్యం

$
0
0

ప్రాణహాని వచ్చు పట్టున సర్వధ
నాపహార వేళయందు నడపు
సత్యమనృతమండ్రసత్యంబు నూనృత
మని పరిగ్రహింతు రార్యజనులు
అది దీయందనాల తిక్కన భారతి

కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఒకరోజు ధర్మరాజు కర్ణునిచేతిలో పరాభూతుడయ్యాడు. అవమానభారంతో కుమిలిపోతున్నాడు. కర్ణుని విజృంభణాన్ని చూసి జంకి రాజు మరింత వ్యథతో ముందు వెనుకలాలోచించక ‘‘తమ్ముడా!్భయపడి పారివచ్చావా?నీ గాండీవాన్ని కృష్ణునికి ఎరువుగా ఇచ్చినా బాగుండేది! అతనే శత్రువుల్ని తుదముట్టించేవాడు. ’’అని పరుషంగా పలికాడు. పార్ధుడు తోకపై తొక్కిన తాచులా ఉగ్రుడై అన్నపైకి కత్తిదూయబోతుండగా కృష్ణుడతన్ని నివారించాడు. కానీ అర్జునుడు తన ధనస్సును పరులకిమ్మనే వాని శిరస్సును ఛేదిస్తానని ప్రతిజ్ఞచేశానని, అది నెరవేర్చక పోతే అసత్యదోషం వచ్చిపడుతుందని చెప్పి దాన్ని పరిష్కరించుమని వేడుకున్నాడు. అప్పుడు జగత్కృత్యసాకల్యవేది శ్రీకృష్ణుడిలా ఉపదేశించాడు.
‘‘ఓరుూ!పార్థా! ధర్మము యొక్క సూక్ష్మస్వరూపం చాలాచిత్రమైంది. ప్రాణాలకే హాని సంభవించే సమయంలో సమస్త సంపదలు అపహరించబడే తరుణంలో అసత్యం పలికినా అది సత్యమే ఔతుం.ది అట్టివేళలలో సత్యం పలికినా అది అబద్ధం గానే పరిగణింపబడింది. కనుక ధర్మరక్షణకోసం ఏ మార్గాన్ని అనుసరించినా అది ఆమోదించదగిందిదే. ధర్మం తప్పకుండా, నీతి తప్పకుండా ఉంటే మేలు కానీ కావాలని పరులను హింసించడానికి అబద్ధం చెప్పినా, పరహింస చేసినా అది తప్పు అవుతుంది.

అనంతం-31

$
0
0

వాళ్ళంతా స్థాణువుల్లా నిల్చుండిపోయారు.
‘‘బుస్ బుస్’’మంటోన్న శబ్దం లీలగా వినిపించింది.
అపుడు గమనించారు వాళ్ళు-
ప్రక్కనేవున్న గుబురు పొద వెనుక రెండు పెనుబాములు కలుస్తూ, విడిపోతూ- మళ్లీ మళ్లీ కలిసి విడిపోతూ, తోకమీద లేచి క్రింద పడుతూ, మళ్లీ లేస్తూ తుళ్ళింతలు పడుతూ ఆడుకొంటున్నాయి!
రాగ్యా దారి చూపిస్తే, వాళ్ళు పాములకు దూరంగా వెళ్ళారు. హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.
గురుడాచలం గుండెవేగంగా కొట్టుకుంటున్నది!
భయంనుంచి తేరుకొందుకు జేబులో నుంచి ఓ విస్కీ బాటిల్ బైటికి తీశాడు. గటగటాకొంత తాగి, రాగ్యాకిచ్చాడు.
రాగ్యా కూడా తాగాడు. కొంచెం మత్తుగా వుంది.
ఆ మత్తులో రాగ్యాగి పెనుబాములతోపాటు చాంద్‌నీ గుర్తొచ్చింది!
గరుడాచలం పరిస్థితి కూడా అలాగే వుంది! అతని మనసు తెరమీద చాంద్‌నీ రూపం కనిపించింది!
ఎంత అందగత్తె చాంద్‌నీ!
దాన్ని అనుభవించందే జీవితం వృధా!
కామకేళిలో నిమగ్నమై స్వేచ్ఛగా ఆనందాలు జుర్రుకున్న ఆ పెనుబాముల్ని వరించిన అదృష్టం తననూ వరిస్తే ఎంత బాగుంటుంది! తనూ చాంద్‌నీ ఆ పెనుబాములకు మల్లేనే పెనవేసుకుపోతే ఎంత హాయిగా వుంటుంది!
అడవి సుమ సౌరభాల్ని మోసుకొచ్చే గాలి తరంగాల్లో, అడవి వెనె్నల్లో, పచ్చిక బయళ్ళమీద కోర్కెల పరాకాష్టలో తుళ్ళింతలు పడుతూ, అలసిపోయేదాకా, అమర సుఖాలు జుర్రుకుంటే ఎంత ఆనందగా ఉంటుందో!
‘‘యల్దావా సారూ’’ అన్నాడు రాగ్యా.
ఆలోచనలకు అంతరాయం కలిగింది.
మనసు తెరమీద నుంచి చాంద్‌నీ చిత్రం చెరిగిపోయింది.
‘‘వెళ్దాం’’ అన్నాడు గరుడాచలం.
అంతలో-
వింత పక్షి అరుపు దూరం నుంచి వినిపించింది!
‘‘అదే కలివికోడి’ అని పెద్దగా అరిచాడు గరుడాచలం.
అందరూ అటువైపు చూశారు.
‘‘అదేనా’’ అనుమానంగా చూస్తూ రాగ్యా అన్నాడు.
‘‘అదే! సందేహం లేదు’’ అన్నాడు గరుడాచలం.
‘‘యట్టా సెప్తుంటారు’’
‘‘గతంలోనే దాని అరుపులు రికార్డయ్యాయి. చాలాసార్లువిన్నాను’’
‘‘అదేనంటారా సారూ’’
‘‘అనుమానం లేదు’’ అన్నాడు గరుడాచలం.
‘‘ఇప్పుడేవి సెయ్యాలి’’
‘‘నా వెంట నడవండి! నేలమీద జాడలు చూస్తూ ముందుకు వెళ్దాం’’ అని గరుడాచలం పరీక్షగా నేలవైపు చూస్తూ నడువసాగాడు.
వాళ్ళు అతన్ని అనుసరించి వెళ్తున్నారు.
గరుడాచలం ఒకచోట ఆగాడు.
నేలమీద కొంత పరిధిలో గుండ్రంగా తిరుగుతూ అణువణువూ పరీక్షగా చూశాడు.
‘‘కలివికోడి జాడలు దొరికాయ్’’ అని పెద్దగా అరిచాడు.
రాగ్యా, సెక్యూరిటీ సిబ్బంది ఆసక్తి అణచుకోలేక, వాళ్ళూ ముందుకు వంగి నేలను చూసారు.
నిజమే!
అన్నిపక్షుల పాదముద్రలకు భిన్నంగా అక్కడి నేలమీద పాద ముద్రలు కనిపించాయి. గరుడాచలం చెప్పింది నిజమన్న నిర్థారణకొచ్చారు.
***
కలివికోడి అడుగుజాడల్ని బట్టి, అవ్వి సంచరిస్తున్న ప్రాంతాల్ని గుర్తించాడు. ఏఏ ప్రాంతాల్ని కలుపుతూ ముళ్ళ కంచె వేసి రక్షిత ప్రాంతాలుగా ప్రకటించాలో నిర్ణయమైంది.
ప్రాజెక్టు రిపోర్టు జిల్లా కలెక్టరుకు అందించటానికి ప్రొద్దునే్న ఎమ్మెల్యే వెళ్లాడు.
గుడారాల దగ్గర పండగ వాతావరణం కనిపిస్తోంది!
గరుడాచలం ఆనందం అంతా యింతా కాదు..
రెండు చేతులతో రాగ్యా భుజాలు పట్టుకొని కదుపుతూ ‘‘రాగ్యా! నీ సహకారంతోనే సాధించగల్గాను! రాబోయే కీర్తిప్రతిష్ఠలకు కారణం నువ్వే! ఏం చేసి నీ రుణం తీర్చుకోగలనూ’’ అని అని అభినందిస్తూ ఆనందాతిరేకంతో పొంగిపోయాడు గరుడాచలం!
రాగ్యా ఆనందం కూడా వర్ణనాతీతంగా వుంది!
‘‘సారూ! కోడి యవ్వారవ్ తెగింది! ఇంక నా యిసయవ్ ఆలోసిచ్చండి’’ అని అడిగాడు రాగ్యా.
గరుడాచలంఏదో మాట్లాడబోయాడు.. ఆగాడు.
అంతలో కొంతమంది ప్రభుత్వ అధికారులు అభినందించేందుకు వచ్చారు. బొకేలిచ్చారు. దండలు వేశారు. కరతాళ ధ్వనులు చేశారు.
అభినందనల జల్లులు కురిసాక అందరూ సుఖాసీనులయ్యారు.
విందు ఏర్పాట్లు జరిగాయి!
నెమలి మాంసం ఆ రోజు కూడా స్పెషల్!
గ్లాసుల గలగలలతోపాటు విడతలవారి అభినందనలు, జోకులు, నవ్వులూ, సిగరెట్ల దహనాలు, మాంసం తిని ఎముకలు విసరటాలు, నంగిమాటలు, అరమోడ్పు కళ్లూ..
షరా మామూలే!
‘‘కలివికోడి గురించి వివరిస్తారా’’ ఎవ్వరో గరుడాచలాన్ని ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధిలా అభినయిస్తూ అడిగాడు.
‘‘కలివికోళ్ళతో భారతదేశం సుసంపన్నవౌతుంది’’
‘‘విదేశాల వైఖరి ఎలా ఉంటుందంటారూ’’
‘‘అసూయతో రగిలిపోతారు’’ అన్నాడు గరుడాచలం.
(ఇంకా ఉంది)

ఎరుకతోసుఖదుఃఖాలు దూరం

$
0
0

ఎనభై నాలుగులక్షల జీవరాశుల్లో పూర్తిగా జన్మపరంపరల గూర్చి ఎవరికీ తెలియదు. గత జన్మలో తనది ఏ జన్మో, ఇంకా రాబోయేది ఏ జన్మ అనేది కూడా అసలు తెలియదు.
ఇంకా చెప్పాలంటే ఒక్క మనిషి అనేకానేక ఊహాగానాలతో, అనుకుంటారే తప్ప, ఇతర జీవులకు, తమ జన్మ ఇదని, పుట్టుక, మరణం, గూర్చి ఏమితెలియదు. అందుకే జీవులన్నిటిలో ఉత్కృష్టమైన జన్మ మనిషి జన్మగా పేర్కొనడం జరిగింది అది యదార్థము.
ఏదో గత జన్మల మంచి ఫలమనో, పుణ్యఫలమనే కారణంగా మనుష్య జన్మ దొరుకుతుంది. మనిషి జన్మలో గొప్ప సువర్ణావకాశం కూడా ఉంది. జన్మ రాబోయేది మంచిగా దొరికే అవకాశం కూడా మనిషి జన్మలోనే సాధ్యం.
‘‘మనుష్యులు అనేకనేక స్థితిగతులతో జీవించడం కూడా ఆ ఫలమే. అందుకే పరమాత్మ గీతలో ఎన్నో సుద్దులు, బుద్ధులు చెప్పారు. ఉత్తమగతులు పొందడంకోసమే. ‘‘మనిషికి మనస్సు, దేహం, ఇతర జీవుల ద్వారా దైనికముగా ఎన్నో కష్టాలలో ఎక్కువ భాగం. తన మనసు ద్వారా ఎక్కువగా బాధల్ని తెచ్చుకోవడం జరుగుతుంది.
‘‘్భగవద్గీతలో 15వ అధ్యాయంలో 8వ శ్లోకంలో శ్రీకృష్ణపరమాత్మ ఈ విధంగా చెప్పారు.
శ్లో॥ శరీరం యద వా ప్నోతి.... వాశయాత్!
గాలి వాసనలను ఒకచోటనుండి మరొకచోటుకి తీసుకుని పోయినట్లుగా శరీరంలో జీవాత్మ ఒక శరీరం విడిచిపెట్టేటప్పుడు ఆ శరీరంనుండి మనసు ఇంద్రియాలను - అనుగ్రహించి వాటితోగూడా మరొక శరీరమును పొందుతుంది.
శ్లో॥ మనః ఏమనుష్యాణాం కారణం
బంధ మోక్షయాః! ఈ జీవాత్మ అలాగే పంచేంద్రియాలతో మనసును ఆశ్రయించి ఆ ఇంద్రియాలవలన వచ్చే విషయాలను అనుభవిస్తుంది. శరీరంలో ఇంద్రియాలు బలీయము, శ్రేష్టము, సూక్ష్మము అని అనిపిస్తుంది. ‘‘ఇంద్రియాలకంటె మనస్సు బలమైనది. మనసుకంటె బుద్ధి శ్రేష్టమైనది, ఆ బుద్ధికంటె, అత్యంత శ్రేష్టమైనది, సూక్ష్మమైనది ఆత్మ అనికూడా చెప్పడం జరిగింది.
‘‘మనసు బుద్ధి మాట వినకుండా, అంతెందుకు మనసుకు, బుద్ధికి కూడా అనేకానేక ఆకర్షణ పరిస్థితులను మాయచే ఆవరించబడి ఉంటాయి. సూక్ష్మమైన ఆత్మను పట్టకోవడం సామాన్యులకు అందని విషయం.
‘‘సాధారణంగా పరమాత్మ అంశగా, ఆత్మ తనలో ఉందని విషయం సాధారంగా అవగాహన పడడం జరగదు. పరమాత్మను విడిచి తన మనసును ఆవరించి ఉన్న రాగద్వేషాలకు లోబడి తాము ఉన్న విషయం ఏంటని తెలుసుకోలేకపోవడమే. ‘‘మనిషి శరీరాన్ని అంటిపెట్టుకునే అంతర్ధార్ధంగా ఉన్న ఆత్మవేరు శరీరం వేరనేది వ్యవహారంలో మనిషి గ్రహించలేని విషయం. ఎంతసేపు మాయాజనితములైన రాగద్వేషాలను మనసు వశమవడం, ఎలాగంటే అలా తమ మనసువశమైన విషయం కూడా గ్రహించలేనంతగా, మమేకమవడం.
‘‘మనసు ఎంతసేపూ తనను అందరూ గుర్తించాలని తన మాట జరగాలని, ఇంటాబయటా వ్యవహారాలన్నీ జరగాలని ఎంతగా కోరుకుంటుందంటే ఏమాత్రం దీనికి భిన్నంగా ఎక్కడ జరిగినా విపరీతంగా బాధపడటం ఇంకా పట్టింపులు-పంతాలు పర్యవసానం, ద్వేషాగ్నిలో తాను కాలుతూ ఇతరులను కాల్చడం.
‘‘మనిషి తన మనసును అదుపుచేయగలిగితే అంతా తనకు సానుకూలమే. వ్యతిరేకత ఎక్కడా కనపడదు. విషయం, పరిస్థితి అర్ధంచేసుకోవడం జరుగుతుంది. అవగాహనా రాహిత్యం ఏదో ఒకటి మాట్లాడడం, తద్వారా మనసు గాయపడడం అనుకోవడం.
‘‘ఏదైనా పరిస్థితి సామ, దాన, బేధ, దండోపాయంతో చక్కపరచాలంటారు కదా! అలాగే మనసును కూడా, అలాగే అదుపు చేసుకోవాలి. రాగద్వేషాల మాయాజాలం, అరిషడ్వార్గాల ఉచ్చులోనుండి మనసు బయటపడ కలుగుతుంది.
‘‘మనసు నిర్మోహంగా మారితే బుద్ధివికాసానికి తద్వారా ఆత్మ జాగృతమునకు అవకాశం. ఇవి జరిగిననాడు పరమాత్మకు చేరువ కావడానికి మార్గం సుగమం అవుతుంది. మాయాజాలంనుండి బయటపడిన మనసు ‘నకారాత్మకత’అంటే ‘నేను’నాది ‘నా మాట’వీటన్నిటిని పట్టించుకోవడం తగ్గుతుంది. క్రమేణా అహంకారం, మమకారాలు ప్రాధాన్యత తగ్గుతుంది.
‘‘రాగద్వేషాల ఉచ్చులోపడి చరిత్ర హీనులుగా మారిపోయిన వారెందరో చరిత్రలో కలరు. కామానికి కీచకుడు క్రోధానికి ‘హిరణ్యకశిపుడు’ లోభానికి ‘దుర్యోధనుడు’, మోహానికి ‘్ధృతరాష్ట్రుడు’రావణాసురుడు’, మాత్సర్యానికి ‘విశ్వామిత్రుడు’గా చెప్తూంటారు. ‘మాత్సర్యపడినా తన తప్పు తెలుసుకుని ‘‘రాజర్షి’’గా మారారు. తన పేరు ‘విశ్వామిత్రుడు’ అనేది నిలుపుకున్నారు.
‘పురాణాలు చరిత్ర చెప్పుకోవడం ఎందుకంటే ఆ అరిషడ్వార్గాలతోనే రాగద్వేషాలు పుట్టేది, మనసును అతలాకుతలం చేస్తాయి. దానివలన మనిషి అసుర ప్రవృత్తికిలోనవడం, పతనమవడం జరుగుతుంది.
‘‘్భగవంతుడు’’ జ్ఞాన, ఐశ్వర్య, శక్తి, బల, వీర్య తేజో, మహితమైన ఆరువిధములైన అంశలతో ప్రకాశించే శక్తి ఎవరిలోనైనా ఈ ఆరు సంపదలు భగవంతుని దయా, ప్రసాదములే అగును. ‘‘ఆ షడ్గుణైశ్వర్య సంపన్న రూపంగల భగవంతుని గాంచాలన్న షడ్గుణ, దుర్గుణాలు లేకుండా మనసును ప్రక్షాళనము చేసుకోవాలి.

ప్రజల మనిషి -వట్టికోట ఆళ్వారుస్వామి

$
0
0

ఇక్కడ విచిత్రమేమంటే సిద్ధాంతం లాగా ప్రతి పాత్రలో కూడా అనేక అంశాలు వున్న విషయాన్ని వారు ప్రస్తావిస్తారు.
ఉదాహరణకు రాంభూపాలరావు తానునిజాం పాలనకి సానుకూలుడైనప్పటికీ, హైదరాలీ వైపున జరిగినటువంటి మతాంతీకరణను వ్యతిరేకిస్తాడు. తనకు కుడిభుజంగా వున్నహైదరాలీ రైతుల్ని మోసగించటంలోనూ, అలాగేతనకి ఎంతో పట్టుగా వున్నప్పటికీ ఈ విషయంలో రాంభూపాలరావుకి నచ్చనివిషయాలున్నాయి.
పైగా అందుకు ప్రతిగా తను హైదరాబాద్ వెళ్లి ఆర్య సమాజీయుడైనటువంటి విజయదేవుని తీసుకురావటం ఆ విజయదేవుడు ఇస్లాం మతాంతీకరణకు ప్రతిగా హిందూ మతంలోకి మళ్లీ తిరిగి వారిని తీసుకురావటానికి ప్రయత్నించటం, ఇవన్నీ కూడా ఒక పార్శ్వం.
అలాగే ఇంకొక విషయమేమిటంటే, ఇందులో కొన్ని పాత్రలు సజీవంగా మనకు కనబడేటటువంటి అంశంగా ఉంది. ఉదాహరణకిఆండాళమ్మ వెంకటాచార్యుల ధోరణిని, కంఠీరవం ధోరణిని సమన్వయ పరచుకోలేక సతమతమవుతుంటుంది. అన్నిటికీ తనకర్మ ప్రారబ్దమనుకుంటుంది. అలాగేకంఠీరవాన్నిప్రజా జీవనంవైపు ఆర్పించినటువంటి కొమరయ్య అమ్మ అన్నమ్మ. ఆమెదొక విశిష్టమైనటువంటి పాత్ర.
కంఠీరవం పట్లసానుభూతి చూపుతూనే ఆయన సనాతన ధర్మపథం నుండి విడివడ్డందుకు బాధపడుతుంటుంది. ఇలా ఎనె్నన్నో పాత్రలు మనకి క్రమంగా వికాసం చెందుతూ అందులో కనిపిస్తాయి.
ఉదాహరణకిచివరిలో చాలా కీలకమైన పాత్ర నిర్వహించినటువంటి పురుషోత్తమాచార్లు, వెంకటేశ్వరరావు- వీళ్లిద్దరూ కూడా వకీళ్లు. వారు నిజాం పాలనలో ఆ విద్యావిధానం నండి వచ్చిన ఆ పాలన యొక్క లోతుపాతులు తెలిసినవారు. వారు చివరికి శ్రమజీవుల ఉద్యమంతో మమేకమై వారితో కలిసి ప్రయాణించటానికి నిర్ణయించుకోవటంతో ఈ నవల పరాకాష్టకు చేరుకుంటుంది.
ముఖ్యంగా ఆళ్వారుస్వామిగారిందులో ప్రయత్నించినటువంటి శిల్పమేమిటంటే? ఏ ఉద్యమమైనా ప్రారంభదశలో అది మనం ఆదర్శంగా చెబుతున్నట్టుగా వుండదు. అది క్రమంగా అనుభవం ద్వారా వివిధ వ్యక్తుల సమాహారమైనటువంటి ఆ కలయిక ద్వారా, సంఘర్షణ ద్వారా ఎలా ఆ ఇతివృత్తం రూపుదిద్దుకుంటుంది-ఆళ్వారుస్వామి గారు ఇందులో చక్కగా చూపించారు.
ముఖ్యంగా ఇందులో భూసమస్యకు కేంద్రంగా దానిని ఆలంబనచేసుకుని అనేక విషయాలొస్తాయి. ఉదాహరణకి ఎన్నడో వూరు విడిచి వెళ్లిపోయినటువంటి ఒక బ్రాహ్మణ కుటుంబ భూమిని తన భూమిగా చెప్పుకుని రాంభూపాలరావు కొన్ని ఏళ్లు దాన్ననుభవిస్తూ వచ్చాడు.
దానిని కౌలుకు చేస్తున్నటువంటి కొమరయ్యను బేదఖల్ చేసి ఆయనపైన దొంగ సాక్ష్యాలు సృష్టించి, ఆ దొంగ సాక్ష్యం వెంకటచారితోను చెప్పించి తాను మేజిస్ట్రేట్ కోర్టులో తన పట్టా పొందుతాడు. ఈ విషయాన్ని చివరకువకీలు వెంకటేశ్వరరావలుగారి ద్వారా అలాగే గ్రంథాలయోద్యమంతోపాటు ఆంధ్ర మహాసభ కార్యకర్త అయినటువంటి పరంధామయ్య, అలాగే రాంభూపాలరావు యొక్క ఈ భూస్వామ్య అనుకూల, నిజాం అనుకూల వ్యతిరేకత నచ్చని విజయదేవ్ కూడా మారి వీరందరూ చివరికి అతని మోసాన్ని బయటపెట్టడం జరుగుతుంది.
ఆఖరికి రాంభూపాలరావు ఎక్కడైతే, ఏ వూళ్లో అయితే మకుటం లేని మహారాజుగా ఎదిడో అక్కడే అతనిని జైలుకు పంపించేటువంటి కార్యక్రమం ఒకటి ఉంటుంది.
కోర్టులో అబద్ధపు సాక్ష్యం చెప్పించినందుకు, ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించినందుకు రాంభూపాలరావుని, వెంకటాచారిని పోలీసలు తీసుకెళుతున్నదశలో ఈ నవల ముగుస్తుంది.
ఒక విధంగా చెప్పాలంటే తెంలగాణ రైతాంగ పోరాటం తరువాత ఉధృతరూపం దాల్చటానికి ముందు ఒక గ్రామాన్ని కేంద్రంగా తీసుకుని అందులో వివిధ శక్తుల సమ్మేళనం ఎలా జరిగింది-
-సశేషం
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

శ్రీనరసింహ శతకము

$
0
0

సీ. ఇభరాజ వరద ! నినె్నంత పిల్చినఁగాని
మారుపల్కవదేమి- వౌనితనము
మునిజనార్చిత! నిన్ను మ్రొక్కి వేడినఁ గాని
కనులఁబడవదేమి గడుసుఁ దనము?
చాల దైన్యము నొంది చాటు చొచ్చిన ఁగాని
భాగ్యమియ్యవదేమి ప్రౌఢితనము
స్థిరముగా నీ పాద సేవఁ జేసెదనన్న
దొరకఁ జాలవదేమి -్ధర్తతనము
తే: మోక్షదాయక! ఇటువంటి మూర్ఖజనుని
కష్టపెట్టిన నీకేమి కడుపు నిండు
భూషణ వికాస!శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురిత దూర!
భావం: గజేంద్రుని రక్షించిన ఓ స్వామీ, నోరారా నిన్ను పిల్చినా మారు పల్కకున్నావు నీకెన్ని దండాలు పెట్టినా కండ్లకగుపించవు ఏమా గడసుదనము? ఎంతో దైన్యంతో నీ మరువు జొచ్చినా భోగభాగ్యాలొసంగవు - ఏమా గొప్పదనము? తెగబడి నీ పాదసేవ చేస్తానన్నా దొరకవు. ఏమా దుర్మార్గం. మోక్షదాతవైన ఓ నరసింహా నావంటి అమాయకున్ని కష్టపడితే నీకు కడుపు నిండుతుందా?

Viewing all 69482 articles
Browse latest View live