Are you the publisher? Claim or contact us about this channel


Embed this content in your HTML

Search

Report adult content:

click to rate:

Account: (login)

More Channels


Showcase


Channel Catalog


older | 1 | .... | 2026 | 2027 | (Page 2028) | 2029 | 2030 | .... | 2069 | newer

  0 0
 • 01/08/19--06:39: maatata
 • Cross Image: 
  Date: 
  Wednesday, January 9, 2019

  0 0

  నెల్లూరు, జనవరి 8: గత కొంత కాలంగా పోలీసులకు కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న 10 మంది అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లను నెల్లూరు పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ.1.70కోట్ల విలువ చేసే 1.66టన్నుల ఎర్రచందనం దుంగలను, ఇతర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి తెలియచేసిన వివరాల మేరకు అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ మహ్మద్ షఫీవుల్లాతో పాటు మరో తొమ్మిది మంది నిందితులు ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారనే సమచారం మేరకు నెల్లూరు టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో వారు పోలీసులపై రాళ్లు రువ్వుతూ దాడికి పాల్పడ్డారు. చాకచక్యంగా ఎదుర్కొన్న పోలీసులు ఎట్టకేలకు వారిని పట్టుకొని వారి నుండి ఎర్రచందనం దుంగలు, 192కిలోల ఎర్రచందనం వేరుముద్ద, తరలించేందుకు సిద్ధం చేసిన వాహనాలు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వేరుముద్దను వృక్ష శాస్తవ్రేత్తలు పరిశీలించి సుమారు వందేళ్ల వయస్సు కలిగినదిగా గుర్తించారు. ఈ దాడుల్లో ప్రతిభ కనబర్చిన ఇన్స్‌పెక్టర్ వెంకట్రావుతో పాటు ఇతర టాస్క్ఫోర్స్ సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులు అందచేశారు.


  0 0

  అమరావతి, జనవరి 8: తెలుగుదేశం పార్టీ నేతలు అవినీతికి పాల్పడ్డారంటూ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన పుస్తకంలో వాస్తవాలు తేల్చుకునేందుకు బహిరంగ చర్చకు సిద్ధం కావాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సవాల్ విసిరారు. మంగళవారం సచివాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ డైరెక్షన్‌లో ఈ పుస్తక రచన సాగిందని ఆరోపించారు. అందులోవన్నీ నిరాధారమైన ఆరోపణలేనని కొట్టిపారేశారు. ఆరు లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారని, అసలు రాష్ట్ర బడ్జెట్ ఎంతో జగన్ తెలుసుకోవాలన్నారు. మంత్రి నారాయణ 3129 ఎకరాలు కొనుగోలు చేశారనే ఆరోపణ అవాస్తవమన్నారు. ఇప్పటి వరకు రాజధాని పరిధిలో రెండువేల ఎకరాల మేరకే అమ్మకాలు, కొనుగోళ్లు జరిగాయని వివరించారు. ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మరన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన కుటుంబంతో సహా ఆస్తులు ప్రకటిస్తున్నారని ఆ దమ్ము, ధైర్యం జగన్‌కు ఉందాఅని నిలదీశారు. బెంగుళూరులో ప్యాలెస్, హైదరాబాద్‌లో లోటస్‌పాండ్ ఇల్లు సహా ఆయన ఆస్తులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. జగన్ అక్రమాస్తులు రూ 43 వేల కోట్లు ఉన్నాయని సీబీఐ తేల్చిందని వాటిని ప్రజలకు పంచాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎనే్నళ్లు పాదయాత్ర చేసినా జగన్‌ను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. రాజధానిలో ఎస్‌ఆర్‌ఎం, విట్ వంటి విశ్వ విద్యాలయాలు వచ్చాయని, సీఆర్డీఏ ప్రాంతంలో పలు సంస్థలు ఉత్పత్తిని కూడా ప్రారంభించాయని తెలిపారు. ఇప్పటి వరకు నాలుగు లక్షల కోట్ల పెట్టుబడితో ఐదు లక్షల మందికి ఉపాధి కల్పించేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. వైఎస్ హయాంలో ఎన్నివేల ఎకరాల భూములిచ్చారు? ఎంతమందికి ఉపాధి కల్పించారో తేల్చాలన్నారు. నీటిపారుదలశాఖలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తూ మరో వైపు 62వేల కోట్లతో పనులు జరిగాయని పొంతనలేని ఆరోపణలు చేయటం హాస్యాస్పదమన్నారు. జగన్ తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ఇలా విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మోదీతో లాలూచీపడి కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజధాని, పోలవరానికి నిధులు మంజూరు చేయకుండా వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే ఆర్థిక ప్యాకేజీని వెనక్కు మళ్లించుకుని రాష్ట్రానికి ప్రత్యేకహోదా, రైల్వేజోన్, జగన్ సొంత జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటులో కేంద్రం చేస్తున్న మోసాన్ని ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు. కేంద్రప్రభుత్వం ఆర్థిక, రక్షణ, రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యంచేసి సెక్యులరిజానికి వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. 16 నెలలు జైలుజీవితం అనుభవించిన దోపిడీ దొంగకు పుస్తకం రాసే అర్హత ఉందా అని ప్రశ్నించారు. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యే ప్రతిపక్షనేత దేశంలో ఎక్కడా లేరన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై గతంలో కూడా 24 కేసులు మోపారని ఏ ఒక్కటీ రుజువుచేయలేకపోయారని గుర్తుచేశారు. చంద్రబాబు ఏమిటో జగన్ నైజం ఏమిటో ప్రజలకు తెలుసన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా రాష్ట్రాన్ని చంద్రబాబు అభివృద్ధిపథంలో నడిపిస్తున్నారని తెలిపారు. రాజధానితో సహా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటూ కేంద్రానికి లేఖలు రాయటంలో జగన్ ఘనాపాటి అని అభివర్ణించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 150 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల విజయం ఖాయమని జగన్‌కు ఉన్న సీట్లు ఊడగొట్టి ఇంటికి పంపుతారని వ్యాఖ్యానించారు. తప్పుడు ప్రచారంతో ఓట్లు రాలవన్నారు.


  0 0

  పెనుకొండ, జనవరి 8: ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏకి అప్పగించడం సరికాదని హోం మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప అన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలోని కియా ఫ్యాక్టరీ ఆవరణలో నూతన పోలీసుస్టేషన్‌ను మంగళవారం ప్రారంభించిన చిన రాజప్ప విలేఖరులతో మాట్లాడుతూ ఎన్‌ఐఏ వంటి కేంద్ర సం స్థలు దర్యాప్తు చేయాల్సినంత తీవ్రత జగన్‌పై దాడి కేసుకు లేదని అభిప్రాయపడ్డారు. జగన్‌పై దాడి కేసును కేంద్ర ప్రభుత్వం అనవసరంగా ఎన్‌ఐఏ వంటి సంస్థలకు అప్పగి స్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృ ష్టించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. రాష్ట్రంలో శాం తిభద్రతలు పటిష్టంగా ఉన్నాయన్నారు.


  0 0

  అమరావతి, జనవరి 8: సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మను వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి చెంపపెట్టని, రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేయాలని చూసేవారికి ఇదో గుణపాఠమని రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. సీబీఐలో అధికార బీజేపీ నేతల జోక్యానికి ఇది అడ్డుకట్ట కాగలదన్నారు. మోదీ పాలనలో ఆర్బీఐ, సీబీఐ స్వయంప్రతిపత్తిని దెబ్బతీశారని మంగళవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ఈడీ, ఐటీ దర్యాప్తు సంస్థలను సొంతానికి వాడుకుంటున్నారని, రాజ్యాంగ సంస్థల అధికారాలను కాలరాసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలకు వీటిని వినియోగిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ పెడధోరణులకు సుప్రీం తీర్పు కొరడా దెబ్బలాంటిదని అభివర్ణించారు. వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగించాలని చూశారని ఆరోపించారు. కంప్యూటర్లలో సమాచారాన్ని చూసేందుకు 10 సంస్థలకు అధికారాలు ఇవ్వటంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తే ప్రజలు క్షమించరన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తే సుప్రీంకోర్టు సహించదన్నారు. అగ్రకుల పేదలకు రిజర్వేషన్లు ఆహ్వానించ దగిందన్నారు. అయితే కేంద్రం నిర్ణయం వెనుక రాజకీయ రహస్యం ఉందని విమర్శించారు. పేదలకు రిజర్వేషన్లు ఇవ్వటాన్ని ప్రాథమికంగా అంతా స్వాగతిస్తారని అమలులో అడ్డంకుల కల్పనపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయనే సందేహా న్ని వెలిబుచ్చారు. ఇది ఎన్నికల స్టంట్‌గా ప్రజలు భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈబీసీల రిజర్వేషన్ల వెనుక బీజేపీ చిత్తశుద్ధి ప్రశ్నార్థకంగా ఉందన్నారు. ప్రాథమికంగానే బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెప్తూ కల, మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకించిన చరిత్ర ఆ పార్టీకే ఉందన్నారు. వీపీ సింగ్ హయాంలో మండల్ కమిషన్ సిఫార్సులను ణలు చేశారని, అప్పుడు దేశంలో ఆందోళనలను రెచ్చకొట్టింది కూడా బీజేపీయే అన్నారు. కుల, మతపరమైన రిజర్వేషన్లు ఉండరాదని వాదించటంతో పాటు తెలంగాణలో ముస్లింల రిజర్వేషన్లను వ్యతిరేకించి ఇప్పుడు ఈబీసీలపై కపటప్రేమ కురిపిస్తోందని దుయ్యబట్టారు. ఐదు రాష్ట్రాల్లో చిత్తుగా ఓడిపోవటం వల్లే ఈ బిల్లు ను ముందుకు తెచ్చారని విమర్శించారు. ఆ రాష్ట్రాల్లో బీజేపీ గెలిస్తే ఈ బిల్లు వచ్చేదా అని ప్రశ్నించారు. రాఫెల్ కుంభకోణం నుంచి దృష్టి మళ్లించేందుకే ఈబీసీ రిజర్వేషన్లను తెరపైకి తెచ్చారన్నారు. తప్పుడు హామీల బీజేపీని ప్రజలు విశ్వసించరన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు మోదీని నమ్మే పరిస్థితులు లేవన్నారు.


  0 0

  ఖైరతాబాద్, జనవరి 8: భూ వివాదాలను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ సమగ్ర భూ సర్వే నిర్వహించాలని నటుడు శివాజీ కోరారు. మంగళవారం హైదరాబాద్‌లోని సోమజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు భూ పత్రాల కోసం తీవ్ర మనోవేదనకు గురి అవుతున్నారని చెప్పారు. చుక్కల భూములు, అసైన్డ్, అన్ రిజిస్ట్రర్ భూముల సమస్య అక్కడి రైతులను పట్టిపీడిస్తోందన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందకు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసినా అధికారులు పాటించడం లేదన్నారు. 1916 ఆర్‌ఎస్‌ఆర్‌ను సాకుగా చూపుతూ రైతులను నరకయాతనకు గురిచేస్తున్నారని, కార్యాలయాలకు వెళ్లిన రైతులను అవమానపరుస్తున్నారని అన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆదేశాలను సైతం కొందరు రెవెన్యూ అధికారులు బేఖాతరు చేయడం విస్మయాన్ని కలిగిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో చేసిన విధంగా సమగ్ర భూ సర్వే నిర్వహించాలని కోరారు. నెల రోజుల్లో సమస్యను పరిష్కరించక పోతే ప్రత్యక్ష పోరాటానికి సిద్దవౌతానని చెప్పారు.


  0 0
 • 01/08/19--09:11: బులియన్
 • ముంబయిలో
  బంగారం (22 క్యారెట్స్)
  1 గ్రాము: రూ. 3,128.00
  8 గ్రాములు: రూ.25,024.00
  10 గ్రాములు: రూ. 31,280.00
  100 గ్రాములు: రూ.3,12,800.00
  బంగారం (24 క్యారెట్స్)
  1 గ్రాము: రూ. 3,345.455
  8 గ్రాములు: రూ. 26,763.64
  10 గ్రాములు: రూ. 33,454.55
  100 గ్రాములు: రూ. 3,34,545.5
  వెండి
  8 గ్రాములు: రూ. 331.60
  10 గ్రాములు: రూ. 414.50
  100 గ్రాములు: రూ. 4,145.00
  ఒక కిలో: రూ. 41,450.00
  *
  హైదరాబాద్‌లో
  బంగారం (22 క్యారెట్స్)
  1 గ్రాము: రూ. 3,037.00
  8 గ్రాములు: రూ. 24,296.00
  10 గ్రాములు: రూ. 30,370.00
  100 గ్రాములు: రూ. 3,03,700.00
  బంగారం (24 క్యారెట్స్)
  1 గ్రాము: రూ. 3,248.128
  8 గ్రాములు: రూ. 25,985.024
  10 గ్రాములు: రూ. 32,481.28
  100 గ్రాములు: రూ. 3,24,812.8
  వెండి
  8 గ్రాములు: రూ. 331.60
  10 గ్రాములు: రూ. 414.50
  100 గ్రాములు: రూ. 4,145.00
  ఒక కిలో: రూ. 41,450.00


  0 0

  న్యూఢిల్లీ, జనవరి 8: భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసుకోవడంలో భాగంగా యూరియా, పెట్రోకెమిక ల్స్ పరిశ్రమల్లో పెట్టుబడులను ఇరాన్ ఆహ్వానించింది. ఎరువులను తమ దేశ ప్రజలకు న్యాయమైన ధరలకు అందించేందుకు ఇరాన్ కృషి చేస్తోందని, ఇందులో భాగంగా భారతీయ పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలను ఆ దేశం ఆహ్వానించిందని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి మొహమ్మద్ జావేద్ జారిఫ్ తెలిపారు. మంగళవారం నాడిక్కడ ఆయన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై చర్చలు జరిపిన అరంతరం విలేఖరులతో మాట్లాడారు. తమ దేశంలోని చాబహార్ ప్రాంతంలో ఎరువులు, పెట్రోకెమికల్స్ పరిశ్రమల్లో పెట్టుబడులకు భారత్ పెట్టవచ్చని జారిఫ్ తెలిపారు. దీర్ఘకాలంగా భారత్ ఇరానియన్ యూరియా ఎరువులకు వినియోగదారుగా ఉంటున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అమెరికా అనుచిత ఆంక్షల కారణంగా భారత వినియూగదారులు, రైతులు 38 శాతం అదనంగా ధరలు పెట్టి ఎరువులు కొనుగోలు చేయాల్సివస్తోందని, ఈ సమస్యను అధిగమించి న్యాయమైన ధరలకు భారతీయ రైతులకు ఎరువులు అందించాలని భావిస్తున్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి తెలిపారు. యూరోపియన్ యూనియన్‌తో వాణిజ్య కార్యక్రమాలు నెమ్మదించాయని, ఈ క్రమంలోనే భారత్, చైనా, రష్యాలాంటి సాంస్కృతిక భాగస్వాములతో బంధం బలోపేతం చేసుకునేందుకు ఇరాన్ కృషి చేస్తోందని ఆయన చెప్పారు. ఇందులో తమదేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. టెహ్రాన్‌కు మంజూర్ల విషయంలో అమెరికా ఆంక్షలు కొనసాగుతున్న క్రమంలో యూరోపియన్‌తో బంధాల విషయంలో వేచిచూడ కూడదని నిర్ణయించామన్నారు. 2015లో టెహ్రోన్‌తో జరిగిన అణు చర్చల నేపథ్యంలో అమెరికా యూరోపియన్ దేశాలపై ఆంక్షలు విధించిన విషయాన్ని జారిఫ్ గుర్తు చేస్తూ ప్రస్తుతం తిరిగి తమ దేశంతో వాణిజ్య సంబంధాలపై యూరోపియన్ దేశాలు చెల్లింపుల విషయంలో సరికొత్త ప్రణాళికలు రూపొందించుకునే విషయంలో నిర్లిప్తంగా వ్వవహరిస్తున్నాయని ఆయన చెప్పారు. అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీల్లో ఇరాన్ బ్యాంకులకు కోత విధించాలని, చమురు ఎగుమతులు తగ్గించి వేయాలని అమెరికా భావిస్తోందని ఆయన చెప్పారు. కాగా భారత్-ఇరాన్ దేశాలు అవసరాల అనుగుణంగా పరస్పర సహకారం కొనసాగిస్తాయని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.


  0 0

  వాషిగ్టన్, జనవరి 8: అంతర్జాతీయ మానిటరీ ఫండ్ చీఫ్ ఎకానమిస్ట్‌గా ప్రఖ్యాత భారత-అమెరికన్ ఆర్థిక శాస్తవ్రేత్త గీతా గోపీనాథ్ బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రతిష్టాత్మక ఆర్థిక సంస్థలో ఈ అత్యున్నత స్థానాన్ని చేపట్టిన తొలి మహిళ ఈమే కావడం గమనార్హం. ఈ నలభై ఏడేళ్ల ఇండో అమెరికన్ గత వారం బాధ్యతలు స్వీకరించారు. ప్రపంచీకరణ వల్ల తలెత్తిన సమస్యలను పరిష్కరించే విషయంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె భావిస్తున్నారు. బహుళార్థ సాధక సంస్థలకు ప్రపంచీకరణ కారణంగా కొన్ని సవాళ్లు ఎదురయ్యాయని ఆమె భావిస్తున్నారు. హార్వర్డ్ యూనివర్శిటీ ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ ఎకనామిక్స్ విభాగం ప్రొఫెసర్, అమెరికా పౌరుడు జాన్ జ్వాన్‌స్ట్రా గతంలో ఈ పదవిలో ఉండి గత డిసెంబర్ 31న పదవీ విరమణ చేశారు. కాగా ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టైన్ లాగ్రేడ్ మంగళవారం గీతా గోపీనాథ్ నియామకాన్ని ప్రకటిస్తూ అత్యున్నత విద్యార్హతలతోబాటు, విశిష్ట ఆర్థిక శాస్త్ర నిపుణత కలిగిన వ్యక్తిగా అభివర్ణించారు. కాగా ఐఎంఎఫ్ 11వ చీఫ్ ఎకానమిస్ట్‌గా గీతా గోపీనాథ్ బాధ్యతలు చేపట్టారు. ఆమె కర్నాటక రాష్ట్ర మైసూరులో జన్మించారు. ఆమె నియామకం ఓ అద్భుతమని హార్వర్డ్ విశ్వవిద్యాలయ గెజిట్ ప్రశంసల వర్షం కురిపించింది.


  0 0

  ముంబయి, జనవరి 8: ఈక్విటీలు వరుసగా మూడోరోజూ లాభాల బాట పట్టాయి. బ్యాంకింగ్ రంగంలో మంగళవారం చివరి గంటల్లో పెద్ద యెత్తున వాటాల కొనుగోళ్లు జరగడంతోబాటు, అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూలత నేపథ్యంలో సరికొత్త విదేశీ పెట్టుబడుల వెల్లువ కొనసాగింది. ఈ క్రమంలో బీఎస్‌ఈ సెనె్సక్స్ 130 పాయింట్లు ఎగబాకి 35,980 వద్ద ముగిసింది. అలాగే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 30.35 పాయింట్లు లాభపడి 10,802.15 వద్ద ముగిసింది. ఐతే రోజులో చాలాభాగం రెండు సూచీలూ వ్యతిరేకత వాతావరణంలోనే సాగాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతోబాటు, అమెరికన్ డాలర్‌తో రూపాయి విలువ బలహీన పడటం, అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు పెరగడంతో తొలుత భారత మార్కెట్లపై ఈ ప్రభావం పడింది. దీంతో నష్టాలను చవిచూసిన సూచీలు ఆ తర్వాత కోలుకున్నాయి. ఒక దశలో సెనె్సక్స్ 36,037.35 అత్యధిక పాయింట్ల మార్కును అందుకుంది. తర్వాత 0.36 శాతం లాభాలతో 35,980.93 వద్ద స్థిరపడింది. కాగా గత రెండు నేరు సెషన్లలో సూచీలు పరుగులు పెట్టి 336.45 పాయింట్లు లాభపడ్డాయి. యాభై షేర్ల నిఫ్టీ సైతం 0.28 శాతం లాభాలను సంతరించుకుంది. ఇంట్రాడేలో 10,733.25కు తగ్గినప్పటికీ తర్వాత కోలుకుని 10,818.45 వద్ద లాభాలతోనే ముగిసింది. ఇలావుండగా బ్యాంకింగ్ రంగం పనితీరుపై సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆర్బీఐ గవర్నర్ సోమవారం చేసిన వ్యాఖ్యలు మార్కెట్లో బ్యాంకింగ్ వాటాలకు ఊతమిచ్చాయని బీఎన్‌పీ ప్రభాస్ నేతృత్వంలోని షరేఖాన్ సంస్థ సలహా విభాగం అధిపతి హేమాంగ్ జానీ విశే్లషించారు. బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిలు తగ్గించేందుకు నిర్ధిష్టమైన చర్యలు చేపడుతున్నట్టు ఆర్బీఐ గవర్నర్ ప్రకటించడం సైతం సానుకూలతలకు దోహదం చేసిందని ఆయన చెప్పారు. బాండ్లకు సంబంధించిన రాబడులపై సైతం సంస్కరణలు చేపట్టడం బ్యాంకు మూల నిధికి ఊతం ఇచ్చేదిగా ఉందన్నారు. మూలధన నిల్వలు పెరిగేలా నిధులు సమకూర్చే చర్యలు, నిరర్థక ఆస్తులపై నిర్ధిష్టమైన చర్యలు తదితర అంశాలు ప్రభుత్వ రంగ బ్యాంకులకు సానుకూల అంశాలుగా మారాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం అధిపతి వినోద్ నాయర్ తెలిపారు. ఐతే ప్రస్తుతం చైనా- అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్యపరమైన చర్చలు, కార్పొరేట్ రంగంలో లాభాల నేపథ్యంలో మదుపర్లు కొంత ఆచితూచి అడుగులు వేస్తున్నారని ఆయన చెప్పారు. ఇలావుండగా గడచిన త్రైమాసికంలో బ్లూచిప్ కంపెనీల నుంచి వచ్చిన లాభాలను మంగళవారం మదుపర్లు వెనక్కు తీసుకున్నారు. ప్రత్యేకించి టీసీఎస్, ఇన్ఫోసిస్‌ల నుంచి వచ్చే వారం రోజుల తర్వాత పెట్టుబడులు వెనక్కు తీసుకునే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రూపాయి విలువ గణనీయంగా తగ్గడం (డాలర్‌తో రూ.70కు) ఇందుకు దోహదం చేయవచ్చని అంటున్నారు. 2018-19 జాతీయ ఆదాయంపై కేంద్ర గణాంకాల కార్యాలయం ముందస్తు అంచనాలు మాత్రం సానుకూలంగా ఉన్నాయి. దేశీయ ఆర్థిక వృద్ధి 7.2 శాతం ఉంటుందని ఆ గణాంకాలు పేర్కొంటున్నాయి. వ్యవసాయం, తయారీ రంగాల్లో జరిగిన ప్రగతి కారణంగా ఈ సంవత్సరం ఇప్పటి వరకు 6.7 శాతం ఆర్థికాభివృద్ధి జరిగిందని కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) వెల్లడించింది.
  అధిక లాభాల్లో సన్‌పార్మా
  కాగా మంగళవారం సెనె్సక్స్‌లో అధిక లాభాలు సంతరించుకున్న సంస్థగా సన్ పార్మా నిలిచింది. మొత్తం 3.98 శాతం లాభాలను ఈ సంస్థ ఆర్జించింది. తర్వాతి స్థానంలో 3.46 శాతం లాభాలతోప్రైవేటు బ్యాంకు ఐసీఐసీఐ నిలిచింది. కాగా జెఎల్‌ఆర్ ఇంగ్లాండ్ అమ్మకాలు గణనీయంగా జరగాయన్న వార్తల నేపథ్యంలో టాటా మోటార్స్ షేర్లు సైతం 2.34శాతం లాభాలను సంతరించుకున్నాయి. అలాగే ఎస్‌బీఐ, యెస్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, బజాజ్ ఆటో, ఇండస్ ఇండ్ బ్యాంకు సైతం 3.18 శాతం లాభాలను కూడగట్టాయి. ఇక కోటక్ బ్యాంకు, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌యూఎల్, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీల షేర్లు మాత్రం 1.41 శాతం నష్టాలను చవిచూశాయి. కాగా విలీన ప్రతిపాదనల నేపథ్యంలో గృహ ఫైనాన్స్, బంధన్ బ్యాంకు షేర్లు నష్టాలు చవిచూశాయి. ఇప్పటికే నష్టాలను మూటగట్టుకున్న ఈ సంస్థలు తాజాగా 16.39 శాతం నష్టాలు చవిచూశాయి.
  రూ.736.18 కోట్ల విదేశీ పెట్టుబడులు
  కాగా దేశీయ మదుపర్లు 141.97 కోట్ల రూపాయల విలువైన షేర్లను మంగళవారం విక్రయించినప్పటికీ విదేశీ ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) మాత్రం 736.18 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశారు.


  0 0

  న్యూఢిల్లీ, జనవరి 8: పది కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు మంగళవారం జరిగిన సార్వత్రిక సమ్మె కారణంగా బ్యాంకుల లావాదేవీలకు పాక్షికంగా ఆటంకం ఏర్పడింది. రెండు రోజుల సమ్మెకు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ), భారత బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య (బీఈఎఫ్‌ఐ) మద్దతు ప్రకటించాయి. బ్యాంకుల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఈ సంఘాల ప్రభావం రోజువారీ విధులపై పడింది. ఐతే మిగతా సంఘాలు ఈ సమ్మెలో పాల్గొనకపోవడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)తోబాటు ప్రైవేటు రంగ బ్యాంకులు మాత్రం యథావిధిగా పనిచేశాయి. కాగా సార్వత్రిక సమ్మె కారణంగా బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు, విత్‌డ్రా, చెక్ క్లియరెన్స్ వంటి కౌంటర్ లావాదేవీలకు అనేక బ్యాంకుల్లో ఆటంకం కలిగింది. ఐతే అధికారులు మాత్రం అన్ని బ్యాంకుల్లో విధుల్లో పాల్గొన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడాతో విజయా, దేనా బ్యాంకులను విలీనం చేయాలన్న కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గత డిసెంబర్ 26న తొమ్మిది బ్యాంకు ఉద్యోగ సంఘాల నేతృత్వంలో ఒక రోజు సమ్మె జరిగిన సంగతి తెలిసిందే.
  అలాగే అఖిల భాతర బ్యాంకు అధికారుల కాన్ఫిడరేషన్ (ఏఐబీఓసీ) సైతం డిసెంబర్ 21న ఒక రోజు సమ్మె చేపట్టడం జరిగింది. ఇలావుండగా ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఇందువల్ల ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు ఉపాధి కోల్పోవడంతోబాటు, భవిష్యత్తులో కూడా ఉద్యోగావశాలు తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఐడీబీఐ వంటి వాటిని ప్రైవేటీకరించాలన్న ఆలోచన సరైందికాదని అన్నారు. కాగా బుధవారం కూడా సమ్మె కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో జరిగే అసౌకర్యంపై ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ తమ ఖాతాదారులకు ఇప్పటికే అవగాహన కల్పించడం జరిగిందన్నారు.


  0 0

  బొండపల్లి, జనవరి 8: మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయని స్ధానిక తహశీల్ధార్ డి.రాజశేఖర్ అన్నారు. మంగళవారం స్ధానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న మండలస్ధాయి క్రీడాపోటీలను తహశీల్ధార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్ధులు చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. గెలుపు ఓటమిలు సమానంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బొండపల్లి హైస్కూల్ హెచ్ ఎం టి.సన్యాసిరాజు, ఇన్‌చార్జి ఎం ఇవొ జి.నరిసింగరావు, జిల్లా వ్యాయామ విద్య ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు ఎల్.వి.రమణ, పి ఇటిలు జగన్మోహనరావు, సూర్యనారాయణ, సతీష్, భారతి, అప్పన్న, ఆనంద్‌తోపాటు మండలంలోని వివిధ పాఠశాలల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు.

  చంద్రబాబువి అబద్దాలు అసత్య ఆరోపణలు
  * బీజేపీ జిల్లా అధ్యక్షుడు పెద్దింటి జగన్మోహనరావు
  బొండపల్లి, జనవరి 8: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అదేపనిగా ప్రధానిమంత్రి నరేంద్రమోదీపై అబద్దాలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పెద్దింటి జగన్మోహనరావు అన్నారు. మంగళవారం స్ధానిక మండల కేంద్రంలో విలేఖరులతో ఆయన మాట్లాడుతూ నిరంతరం చంద్రబాబు మోదీపై విమర్శలు చేసి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణంలో కాగ్ అభ్యంతరం చెప్పడం నిజం కాదా అని ప్రశ్నించారు. పూర్తిగా అవినీతిలో చిక్కునున్న బాబుకు ప్రజలు బుద్ధిచెప్పే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. రాష్ట్భ్రావృద్ది కోసం మోదీ సమాలోచనలు చేస్తున్నారని చెప్పారు. ప్రజల మేలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. పేద ప్రజల అభివృద్ధికి, పారిశ్రామిక రంగానికి, యువతకు ఉద్యోగావకాశాలకు త్వరలో వరాల జల్లులు కురిపిస్తారని చెప్పారు. సమావేశంలో గజపతినగరం అసెంబ్లీ కన్వీనర్ దేవర ఈశ్వరరావు, బీజేపీ మండల నాయకులు ఎం ఎస్ ఎన్ రాజు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

  ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్ధులకు ఆటలపోటీలు
  గజపతినగరం, జనవరి 8: గజపతినగరంలోని జాతీయ సేవా పధకం విద్యార్ధులకు ఆటలపోటీలు నిర్వహించారు. మంగళవారం గజపతినగరంలోని ఎస్సీకాలనీలో నిర్వహిస్తున్న జాతీయ సేవా పధకం క్యాంపులో బాగంగా ఆరవరోజు విద్యార్ధులకు పలు రకాలపోటీలు నిర్వహించారు. అదేవిధంగా పలు సాంస్కతిక కార్యక్రమాలు జరిపారు. తెలుగు అధ్యాపకులు ఎం.సూరపునాయుడు వ్యక్తిత్వ వికాసంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎన్ ఎస్ ఎస్ సేవా పధకం ప్రోగ్రామ్ అధికారి ఎస్.వి.సన్యాసిరావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరిపారు.
  11న రంగవల్లి ముత్యాల ముగ్గుల పోటీలు
  గజపతినగరం, జనవరి 8: గజపతినగరంలోని శ్రీకృష్ణాపీఠ్‌లో ఈనెల 11వతేదిన రంగవల్లి ముత్యాల ముగ్గులపోటీలు నిర్వహిస్తామని మన పంచాయతీ గ్రూప్(వాట్సాప్ గ్రూపు) ఆధర్యంలో జరుగుతుందని గ్రూపు అడ్మిన్ తామాడ రమేష్‌బాబు మంగళవారం విలేఖరులకు తెలిపారు. 20 ఏళ్లు నిండిన సోదరీమణులు అర్హులని, ప్రధమ, దిత్వీయ,తృతీయ, బహుమతులతోపాటు ఐదుగురికి కన్స్‌లేషన్ బహుమతులు అందిస్తామని చెప్పారు. సురేష్ ఎంటర్‌ప్రైజెస్, విప్రో సౌజన్యంతో ఈ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈపోటీలో పాల్గొనేవారు సాయిబాబా మెడికల్స్, సరేష్ ఎంటర్ ప్రెజెస్, గాయత్రీ డిజిటల్ స్టూడియో, సుందరం మెడికల్స్‌లో సంప్రదించాలని కోరారు.

  పాడిరైతులకు విశాఖడైయిరీ బోనస్
  కొత్తవలస, జనవరి 8: మండలంలోని విశాఖ డెయిరీ రైతులకు పండగ సందర్భంగా నగదు బోనస్‌ను పంపిణీ చేశారు. మండలంలోని కొత్తసుంకరిపాలెంలో గొరపల్లి రాము చేతుల మీదుగా పాడిరైతులకు నగదు పంపిణీ చేశారు. సుమారు 3.29లక్షలను బోనస్‌గా అందజేశారు. మండల సూపర్‌వైజర్ చంద్రినాయుడు మాట్లాడుతూ విశాఖడెయిరీ రైతులను ఆదుకొనేందుకు అన్ని విదాలా సహాయ పడుతుందని తెలిపారు. పండగ నగదు, ఏరువాక బోనస్, ఉగాదికానుక, రైతులకు మంచినీటి బోర్లు వంటి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతూ రైతులను ఆదుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో రైతులతో పాటు తదితరులు పాల్గొన్నారు.

  కోదుల గుంపకు కాలనీకి రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వాలి
  పార్వతీపురం, జనవరి 8: పార్వతీపురం డివిజన్‌లోని కొమరాడ మండలంలోని కోదుల గుంప గ్రామంలోని పలు వర్గాల వారు నివస్తున్న కాలనీలకు రహదారి సౌకర్యం లేక అవస్థలు పడుతున్నామని ఆగ్రామస్థులు సబ్‌కలెక్టర్ టి ఎస్ చేతన్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆ గ్రామస్థులు సబ్‌కలెక్టర్ చేతన్‌ను కలసి తమ గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారు నివస్తున్న కాలనీకి రహదారి లేక అవస్థలు పడుతున్నందున రహదారి నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరారు. రహదారికి ప్రభుత్వ స్థలం లేకపోవడం వల్ల స్థలం కొనుగోలు చేసైనా తమకు రహదారి మార్గం కల్పించడానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈవిషయమై పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని సబ్‌కలెక్టర్ తెలిపారు.


  0 0

  గజపతినగరం, జనవరి 8: ప్రజలకు మంచి చేసినవారిని మరువరాదని గజపతినగరం ఎమ్మెల్యే డాక్టర్ కె. ఎ.నాయుడు అన్నారు. మంగళవారం మండలంలోని జె.గుమడాం, కొత్తపాలెం గ్రామాలలో జన్మభూమి-మా ఊరు గ్రామసభలలో ఎమ్మెల్యే నాయుడు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చడమే కాకుండా అదనంగా పలు సంక్షేమ పధకాలు అమలు చేస్తున్న ప్రభుత్వానికి ప్రజల ఆశ్వీరాదాలు కావాలని కోరారు. కేంద్రం ఎన్ని వేధింపులకు గురిచేస్నున్నా చంద్రబాబు బెదరకుండా పధకాలు అమలు చేసి ప్రజల మన్ననలు పొందుతున్నారని తెలిపారు. నియోజకవర్గంలో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించానని చెప్పారు. రాష్ట్భ్రావృద్ధి కోసం చంద్రబాబుకు మరోసారి అవకాశం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు చంద్రన్న సరుకులు అందజేశారు. అంతకు ముందు జన్మభూమిపై ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు బొడ్డు రాము, ఎఎంసి చైర్మన్ బుద్దరాజు నరసింహవర్మ, జెడ్పీటీసీ బండారు బాలాజీ, మండల ప్రత్యేక అధికారి ఎస్.వెంకటరావు, ఎంపిడివొ ఎం.ప్రకాశరావు,
  శ్రీనివాసునికి భక్తులచే హారతి నీరాజనం
  గజపతినగరం, జనవరి 8: గజపతినగరంలోని బజారుజంక్షన్‌లో గల శ్రీరామక్షేత్రం ఆవరణలోని శ్రీనివాసునికి భక్తులచే హారతి నీరాజనం జరిగింది. మంగళవారం ఆలయ అర్చకులు పీసపాటి శ్రీనివాసాచార్యులు తెల్లవారుజామున సుప్రభాతసేవ, చేశారు. ధనుర్మాసం మహోత్సవములో బాగంగా స్వామివారికి 24వ పాశురముతోపాటు ప్రత్యేకంగా పొన్న ఆకులపై పచ్చ కర్పూరంతో స్వామికి స్వయంగా అర్పించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణగావించారు.

  ఆన్‌లైన్‌లో మందుల విక్రయాలు ఆపాలి
  గజపతినగరం, జనవరి 8: ఆన్‌లైన్‌లో మందులు విక్రయాలు ఆపాలని గజపతినగరం మందుల దుకాణంల సంఘం గజపతినగరం నియోజవర్గ అధ్యక్షు, ప్రధానకార్యదర్శులు కందుల నరసింహస్వామి, పొట్టా వెంకటరమణారావులు కోరారు. రాష్ట్ర మందుల దుకాణాల సంఘం పిలుపుమేరకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని గజపతినగరం తహశీల్ధార్ బి.శేషగిరిరావుకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆన్‌లైనులో మందులు విక్రయాలు అమ్మకం నిషేధం అని కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టంలోనే ఉందని తెలిపారు. అయితే కేంద్రం జీవో 817 ద్వారా ఆన్‌లైన్ మందుల విక్రయాలపై అభ్యంతరాలను 45రోజుల గడువు ఇవ్వగా జిల్లా, రాష్ట్ర, జాతీయ సంఘాల ద్వారా నష్టాలను వివరించామని అన్నారు. చట్టవ్యతిరేకమైన వ్యాపారం చేస్తున్న వ్యక్తులు, సంస్ధలు, వివిధ మాంద్యమలలో ఇస్తున్న ప్రకటనలపైతోపాటు ప్రకటనలలో పాల్గొంటున్న కళాకారులు, క్రీడాకారులు, హోర్డింగ్‌ల ద్వారా ప్రకటనలు ఇచ్చేవారిపైన మందులను సరఫరా చేసే కొరియర్ సంస్ధలపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం కలిగించే ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యలను, ప్రచారాలకు వెంటనే అడ్డుకట్టవేయాలని వారు కోరారు. కార్యక్రమంలో మందుల షాపుల యజమానులు పూసర్ల ఉమామహేశ్వరరావు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

  సమస్యల్లేని సమాజం చంద్రబాబు ధ్యేయం
  *మాజీ మంత్రి పడాల అరుణ
  గజపతినగరం, జనవరి 8: సమస్యలు లేని సమాజానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని మాజీ మంత్రి పడాల అరుణ అన్నారు. మంగళవారం మండలంలోని దావాలపేట గ్రామంలో జరిగిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో అరుణ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించాలన్న ధ్యేయంతో జన్మభూమి కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రవేశపెట్టారని అన్నారు. ఆషామాసీగా కాకుండా సమస్యలన్నీ ఆన్‌లైన్‌లో పొందుపరిచి ప్రజలకు జవాబుదారీతనంగా ఉండేవిధంగా చర్యలు చేపడుతున్నారని అన్నారు. అధికార యంత్రాంగం అంతా ప్రజల ముందుకు వస్తున్నందున సమస్యలను విన్నవించుకొని పరిష్కరించుకోవాలని కోరారు. నిరంతరం రాష్ట్భ్రావృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నారని చెప్పారు. అన్నివర్గాల ప్రజల ఆనందం కోసం పలు సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారని అన్నారు. జెడ్పీటీసీ మక్కువ శ్రీధర్ మాట్లాడుతూ ప్రభుత్వ పధకాలను సద్వినియోగం చేసుకొని ఆర్ధికంగా ఎదగాలని కోరారు. నియోజకవర్గంలో దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించడం జరిగిందని అన్నారు. అంతకు ముందు జన్మభూమిపై ప్రతిజ్ఞగావించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి బి.మోహనరావు, ఇవొపి ఆర్‌డి జి.జనార్ధనరావు, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. అదే విధంగా లింగాలవలసలో జరిగిన జన్మభూమి సభలో ఎంపిపి గంట్యాడ శ్రీదేవి పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో తహశీల్ధార్ బి.శేషగిరిరావు, మండల విద్యాశాఖ అధికారి ఎస్.విమలమ్మ, ఐసిడిఎస్ సూపర్‌వైజర్ కె.రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.


  0 0

  విజయనగరం, జనవరి 8: రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కోసం వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర బుధవారంతో ముగియనుందని వైసీపీ జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు చెప్పారు. మంగళవారం తన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 14 నెలలపాటు సుమారు 3650 కిమీ పాదయాత్ర చేపట్టడం ఓ చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు. ప్రజాసంకల్పయాత్ర ముగింపు సందర్భంగా ఈ నెల 9న ఇచ్చాపురంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని ఆయన వివరించారు. ఇదిలా ఉండగా జిల్లాలో నిర్వహించిన ప్రజాసంకల్ప యాత్రకు కూడా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. జిల్లాలో మూతపడిన పరిశ్రమలు, కరవు పరిస్ధితులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, నిరుద్యోగ సమస్య, వివిధ శాఖల్లో టిడిపిలో జరుగుతున్న అన్యాయాల గురించి తమ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డికి వివరించారని ఆయన గుర్తు చేశారు. 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారని ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత ఆయా సమస్యలను పరిష్కరించారని వివరించారు. కాగా, 2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా సమస్యలు పరిష్కరిస్తారని వివరించారు. ఇదిలా ఉండగా జగన్ తన పాదయాత్రలో అనేక కుట్రలు, కుతంత్రాలు, హత్యాయత్న ఆరోపణలు ఎదుర్కొన్నారని, ప్రజా సంక్షేమమే తన లక్ష్యంగా జగన్ ముందుకు నడిచారని వివరించారు. కాగా, జగనపై హత్యాయత్న సంఘటనపై విచారణ చేస్తున్న ఎన్‌ఐఎను కూడా అడ్డుకోడానికి తెలుగుదేశం ప్రభుత్వం పూనుకోవడం దుర్మార్గమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు పిల్లా విజయ్‌కుమార్, చనుమల్లు వెంకటరమణ, కెవి సూర్యనారాయణ రాజు, ఎ.శ్రీరాములనాయుడు, బి.సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.


  0 0

  కొమరాడ, జనవరి 8: మండలంలోని ఓ ప్రైవేటు స్కూల్ బస్సు ఢీకొన్న సంఘటనలో వృద్ధుడు మృతిచెందాడని ఎస్‌ఐ రాజేష్ తెలిపారు. ఈమేరకు ఆయన అందించిన వివరాల ప్రకారం కల్లికోట గ్రామానికి చెందిన ఎం వ్యాపారనాయుడు(66)ను స్కూల్ పిల్లలను తీసుకువెళ్లేందుకు వచ్చిన బస్సు బ్యాక్ చేస్తుండగా ఢీకొనడంతో తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
  రెండు లక్షలు విలువైన ఖైనీ గుట్కాలు పట్టివేత
  కొత్తవలస, జనవరి 8: మండలంలోని మంగళపాలెం జంక్షన్ వద్ద స్పెసల్ బ్రాంచి పోలీసులు దాడిచేసిన ఘటనలో రెండు లక్షల విలువైన ఖైనీ గుట్కాలు పట్టుబడినట్లు కొత్తవలస పోలీసులు తెలిపారు. విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం మేడిచర్ల అలమండ గ్రామానికి చెందిన పెంటకోట శివ టాటా ఏసీ వ్యాన్‌లో గుట్కాలు తరలిస్తుండగా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. 22బస్తాలు, రెండు అట్టపెట్టెలతో ఖైనీ, గుట్కాలు తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో దాడిచేసి పట్టుకొన్నామని తెలిపారు. శివపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సి ఐ రెడ్డి శ్రీనివాసరావు తెలిపారు.


  0 0

  విజయనగరం, జనవరి 8: దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా పట్టణంలోని కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మంగళవారం కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చి అక్కడ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నానుద్దేశించి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ మాట్లాడుతూ సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికుల జీవన ప్రమాణాలు పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, బీజేపీ మతోన్మాద శక్తులను బలపరచి దాడులకు పాల్పడుతున్నారన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేటి వరకు ఎక్కడా అమలు కావడం లేదన్నారు. కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. నేడు దేశంలో రైతన్నల దుస్ధితి ఆగమ్యగోచరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తామని ప్రకటించినప్పటికీ నేటికి పూర్తి స్ధాయిలో రుణమాఫీ చేయలేదని విమర్శించారు. కార్మిక వర్గం అంగన్‌వాడీలు, ఆశావర్కర్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కనీస వేతనాలు చెల్లించాలని రోడ్డెక్కుతున్నారు.
  దేశంలో సంపద పుష్కలంగా ఉందన్నారు. రూ.70 లక్షల కోట్ల సంపద ఉందన్నారు. దేశంలో సంపదను బలవంతులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. దోపిడీ వర్గాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో ఎఐటియుసి ఉపాధ్యక్షులు వి.కృష్ణం రాజు, సిటూ నేత శ్రీనివాసా, సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, సర్వశిక్ష అభియాన్ జెఎసి చైర్మన్ డి.కాంతారావు, కాంట్రాక్ట్ ఎంప్లారుూస్ అసోసియేషన్ అధ్యక్షులు జి.అప్పలసూరి, సిటు పట్టణ అధ్యక్షులు రెడ్డి శంకరరావు, ఆర్టీసీ ఉద్యోగుల సంఘం నేత వి.రాము, సిపిఐ నేత బుగత సూరిబాబు, బుగత అశోక్ తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, వైద్య ఆరోగ్యశాఖ, సర్వశిక్ష అభియాన్, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలు, కార్మిక సంఘాల నేతలు, యుటిఎఫ్ నేత జెఆర్ పట్నాయిక్, ఇతర సంఘాల నేతలు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

  సమ్మె విజయవంతం
  సాలూరు, జనవరి 8: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా మంగళవారం జరిగిన సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. పట్టణంలోని ప్రభుత్వ బ్యాంకులన్నీ మూతపడ్డాయి. బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. సీఐటీయు, ఏఐటీయుసీ, అంగన్వాడీ, ఆశా, మున్సిపల్ కార్మికులు తహశీల్దార్ కార్యాలయం నుంచి ర్యాలీ చేశారు. అనంతరం బోసుబొమ్మ జంక్షన్‌లో మానవహారం నిర్వహించారు.
  సార్వత్రిక సమ్మె విజయవంతం
  సీతానగరం, జనవరి 8: మండలంలో నిర్వహించిన సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. ఈమేరకు సీటు ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ సంక్షేమపథకాల్లో పనిచేస్తున్న కార్మికులు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను విస్మరిస్తు కనీస న్యాయం చేయకుండా వెట్టిచాకిరి చేయించుకుంటున్నారన్నారు. మధ్యాహ్న భోజనపథకం, అంగన్వాడీ, ఇతర ప్రభుత్వ పథకాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న కార్మికులకు కనీస న్యాయం చేయడంలో ప్రభుత్వాలు విఫలమవ్వడంతోనే ధర్నాకు పిలుపునిచ్చామన్నారు. ఇప్పటికైన ప్రభుత్వాలు కళ్లుతెరవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీటు మండల కార్యదర్శి జివి రమణ, అంగన్వాడీల సంఘం అధ్యక్షురాలు జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.
  కార్మికులకు కనీస వేతనాలు అమలుచేయాలి
  పాచిపెంట, జనవరి 8: దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మంగళవారం పాచిపెంటలో సీఐటీయు ఆధ్వర్యంలో కార్మికులు బారీ ర్యాలీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వహణ జరగకుండా వంటలను నిలుపుదల చేయించారు. ఈ సందర్భంగా సీఐటీయు నాయకులు త్యాడ ప్రభావతి, ఈశ్వరరావులు మాట్లాడుతూ బిజెపీ నేతృత్వంలో ఎన్‌డీఏ ప్రభుత్వం కార్మికులను చిన్నచూపుచూస్తుందన్నారు. ఆశ, మధ్యాహ్న భోజనం పథకం నిర్వాహకులు, అంగన్వాడీలతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నారే తప్ప వారికి శ్రమకు తగ్గవేతనాలు చెల్లించడం లేదన్నారు. కార్మికులందరికీ నెలకు 18వేల రూపాయలు వేతనాలు నిర్ణయించాలని, పీఎఫ్, ఇఎస్‌ఐ సౌకర్యం, కనీస పెన్షన్ 9వేల రూపాయలకు పెంచాలని, యూనియన్లను ఆపికేషన్ పెట్టుకున్న 45రోజులలో రిజిస్ట్రేషన్ చేయాలని, సమానపనికి సమానవేతనం ఇవ్వాలని, స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించి కనీస వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు.
  కార్మికులకు న్యాయం చేయాలి
  బాడంగి, జనవరి 8: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరి వలన అహర్నిశలు కష్టపడుతున్న కార్మికులకు అన్యాయం జరుగుతుందని, వారికి న్యాయం జరగాలని సీఐటీయు మండల కార్యదర్శి శంకరరావు అన్నారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులు, ఆశావర్కర్లు, అంగన్వాడీలతోపాటు పలువురు కార్మికులు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న నిత్యవసర ధరలకు అనుగుణంగా ఆశావర్కర్ల, అంగన్వాడీ సిబ్బందికి గౌరవవేతనాలుగా 18వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పలు కంపెనీలలో పనిచేస్తున్న కార్మికులకు మేలుజరిగే విధంగా ప్రభుత్వ విధానాలను ఉండాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం దనికులకు మేలుచేసేవిధంగా చట్టాలను రూపొందిస్తుందే తప్ప సామాన్యులకు న్యాయం చేసే చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. ఇప్పటికైన పలుశాఖలలో పనిచేస్తున్న కార్మికులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
  విజయవంతమైన సార్వత్రిక సమ్మె
  తెర్లాం, జనవరి 8: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తు నిర్వహించిన సార్వత్రిక సమ్మె మంగళవారం విజయవంతమైంది. ఈమేరకు మండలంలో ఉన్న బ్యాంకులు, పోస్ట్ఫాసులు, ఆశా, అంగన్వాడీ, కళాసీలు సమ్మెలో పాల్గొనడంతో కొంతమేర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా సీఐటీయు కార్యాలయం నుంచి కిలోమీటర్ల దూరం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీఐటీయు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఎస్ గోపాలం, మున్నాలు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సమ్మె చేస్తున్నామే తప్ప అదనంగా ఎటువంటి కోర్కెలు కోరడం లేదన్నారు. కార్మికులకు కనీస వేతనాలతోపాటు ఉద్యోగ భద్రత, ముఖ్యమంత్రి ప్రకటించిన 8,600 నుంచి 20వేల రూపాయల మేర ఆశావర్కర్లకు పారితోషకం చెల్లించాలన్నారు. అలాగే పనిభద్రత, పీఎఫ్, ఇఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలని, అర్హులైన వారందరినీ ఏఎన్‌ఎంలుగా తీసుకోవాలని, వైద్యారోగ్యరంగం ప్రైవేటీకరణను ఆపాలని, కార్మిక చట్టాల మార్పును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం మండల అధ్యక్ష, కార్యదర్శులు సత్యవతి, చంద్రావతి, అంగన్వాడీ, ఆశావర్కర్లు గీత, చిన్నమ్మి, వెలుగు, డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
  కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ర్యాలీ
  పార్వతీపురం, జనవరి 8: మోడి,బాబుల కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా మంగళవారం పార్వతీపురంలోని బెలగాంలోగల సిపియం పార్టీ సుందరయ్య భవనం నుండి కార్మికులు ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిటూ నాయకులు గొర్లి వెంకటరమణ, బి వి రమణ తదితరులు మాట్లాడుతూ కనీస వేతనం రూ.18వేలుగా నిర్ణయించాలని, కార్మిక చట్టాలు సవరణ నిలుపుదల చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని, ప్రభుత రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని, నిత్యవసర ధరల పెరుగుదలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘనాయకుడు రెడ్డి శ్రీరామ్మూర్తి, ఎ ఐ టియు సి నాయకుడు ఆర్‌వి ఎస్ కుమార్, ఐఫ్టూనాయకుడు సర్వేశ్వరరావు, శ్రామిక కమిటీ కన్వీనర్ బొత్స లక్ష్మి,ఐద్వా నాయకులు శ్రీదేవి, ఎన్ జివో నాయకుడు జి వి ఆర్ ఎస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

  సుదీర్ఘపోరాటాలతోనే సమస్యల పరిష్కారం
  గజపతినగరం, జనవరి 8: సుదీర్ఘపోరాటాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని ఎ ఐటియుసి జిల్లా అధ్యక్షుడు ఆల్తి అప్పలనాయుడు అన్నారు. మంగళవారం దేశవ్యాప్త సమ్మెలోబాగంగా తొలిరోజు స్కీం వర్కర్లు, ఆశా కార్యకర్తలు, కార్మికులతో కలసి తహశీల్ధార్ కార్యాలయం నుంచి నినాదాలు చేస్తూ భారీ ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలోని పురవీధులలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించి పారిశ్రామికవేత్తలకు ఊడిగం చేస్తున్నారని ఆరోపించారు. వేలాదికోట్లాది రూపాయలు బకాయిలు పెట్టి పరారైన వ్యక్తులపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, చిన్నసన్నకారు రైతులపై తమ ప్రతాపాన్ని చూపుతున్నారని అన్నారు. కార్మికులు సదీర్ఘ పోరాటాల చేయడం ద్వారా సమస్యలు పరిష్కరించవచ్చనని తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గొర్లె శ్రీనివాసరావు మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించి అదుపులో పెట్టాలని కోరారు. కనీస వేతనం 18వేలకు తక్కువ కాకుండా ఇవ్వాలని అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీం కోర్టు తీర్పును తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ స్కీమ్‌లలో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని తెలిపారు. కార్మిక చట్టాల సవరణలను తక్షణమే ఆపాలని కోరారు. రక్షణ, రైల్వే, బ్యాంకురంగాలలో ఎఫ్‌డి ఇలను అనుమతించరాదని అన్నారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి వి.లక్ష్మి, సి ఐటియు నాయకులు పురం అప్పారావు, జనసేన నియోజకవర్గ నాయకులు ఎం.జగన్, ఆశాకార్యకర్తల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు పి.వి.రత్నం, ఐద్వా జిల్లా నాయకురాలు రాకోటి హరికృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.


  0 0

  తిథి: 
  శుద్ధ తదియ ఉ.11.42, కలియుగం - 5120 శాలివాహన శకం - 1940
  నక్షత్రం: 
  ధనిష్ఠ రా.12.55
  వర్జ్యం: 
  లేదు
  దుర్ముహూర్తం: 
  ఉ.11.36 నుండి 12.24 వరకు
  రాహు కాలం: 
  మ.12.00 నుండి 1.30 వరకు
  మేషం: 
  (అశ్విని, భరణి, కృత్తిక 1పా.) తలచిన కార్యాలన్నియు విజయవంతంగా పూర్తిచేసుకోగలుగుతారు. బంధు, మిత్రుల మర్యాద మన్ననలను పొందుతారు. అనారోగ్య బాధలుండవు. సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది. అనుకూల పరిస్థితులేర్పడతాయి.
  వృషభం: 
  (కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) కోపాన్ని అదుపులో నుంచుకొనుట మంచిది. మానసికాందోళనను తొలగించుటకు దైవధ్యానం అవసరం. శారీరక అనారోగ్యంతో బాధపడతారు. ధనవ్యయం తప్పదు.
  మిథునం: 
  (మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) ఋణప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధలుండును. బంధు, మిత్రులతో వైరమేర్పడకుండా జాగ్రత్తపడుట మంచిది. వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం వుంది. కొన్ని ఇబ్బందులు వస్తాయి.
  కర్కాటకం: 
  (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) వృత్తి, ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి వుంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి.
  సింహం: 
  (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. దూర బంధువులతో కలుస్తారు. విదేశయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభయోగముంటుంది.
  కన్య: 
  (ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) కుటుంబంలో సుఖ, సంతోషాలుంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యములు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధు, మిత్రులతో కలుస్తారు.
  తుల: 
  (చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) మానసికానందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుంటాయి.
  వృశ్చికం: 
  (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) పిల్లలపట్ల పట్టుదలతో నుండుట అంత మంచిది కాదు. చెడు పనులకు దూరంగా నుండాలి. మనోద్వేగానికి గురి అవుతారు. కోపాన్ని తగ్గించుకోవడం అన్నివిధాలా శ్రేయస్కరం.
  ధనుస్సు: 
  (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) బంధు, మిత్ర విరోధమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. మానసికాందోళన అధికమగును. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు.
  మకరం: 
  (ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) సంతోషంగా కాలం గడుపుతారు. శుభవార్త వింటారు. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. తోటివారి ప్రశంసలందుకుందురు. వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది.
  కుంభం: 
  (ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసికాందోళనతో కాలం గడుపుతారు. స్ర్తిలు చేసే వ్యవహారాల్లో సమస్యలెదురవుతాయి. రహస్య శత్రువులపట్ల జాగ్రత్తగా నుండుట మంచిది.
  మీనం: 
  (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఆకస్మిక ధనలాభముంది. అద్భుతమైన అవకాశాలు లభించును. అన్నింటా విజయానే్న సాధిస్తారు. బంధు, మిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగ రంగాల్లోనివారికి అభివృద్ధి వుంటుంది.
  Date: 
  Wednesday, January 9, 2019
  author: 
  గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి

  0 0

  న్యూఢిల్లీ, జనవరి 8: అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును దాదాపు నాలుగు గంటల సుదీర్ఘ చర్చ అనంతరం మంగళవారం లోక్‌సభ ఆమోదించింది. ఈ బిల్లు ద్వారా హిందు, సిక్కు, ముస్లిం, బౌద్ధ, జైన మతాలకు చెందిన ఉన్నత వర్గాలలోని పేద ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత విద్యా సంస్థల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. ప్రభుత్వం ప్రతిపాదించిన 124 రాజ్యాంగ సవరణ బిల్లుకు అనుకూలంగా 323 ఓట్లు, వ్యతిరేకంగా మూడు ఓట్లు వచ్చాయి. ఈ బిల్లు బుధవారం రాజ్యసభ పరిశీలనకు వెళుతుంది. రాజ్యసభ ఆమోదం లభించగానే రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయగానే చట్ట రూపం ధరిస్తుంది. రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించిన అనంతరం లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడింది. సవరణ బిల్లుపై వివిధ పార్టీలకు చెందిన ముప్పై మంది సభ్యులు మాట్లాడారు. ‘ఇదొక చరిత్రాత్మిక బిల్లు.దేశంలోని కోట్లాది మంది ఉన్నత వర్గాలకు చెందిన పేదలకు ఇదో వరం’అని అభివర్ణించారు. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించిన మోదీ దేశ చరిత్రలో దృవ తారగా మిగిలిపోతారని బీజేపీ సభ్యులు ప్రశంసలు కురిపించారు. లోక్‌సభలోని మెజారిటీ పార్టీలు బిల్లును హృదయపూర్వకంగా సమర్థించాయి. అయితే లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని ఆర్జేడీ, అసదుద్దీన్ నాయకత్వంలోని ఎమ్‌ఐఎమ్ మాత్రం బిల్లును వ్యతిరేకించాయి. తమిళనాడు ప్రభుత్వం ఇస్తున్న 69 శాతం రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూలులో పెట్టడంపై హామీ ఇవ్వనందుకు అన్నా డిఎంకె సభ్యుడు, డిప్యూటీ స్పీకర్ తంబిదురై వాకౌట్ చేశారు. కులాల వారీగా జనాభా వివరాలు సేకరించి రిజర్వేషన్లు ఇవ్వాలని ఆరేజడీ సభ్యుడు జయప్రకాశ్ నారాయణ్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ బిల్లు
  రాజ్యాంగ విరుద్ధమని అసదుద్దీర్ ఒవైసీ ఆరోపించారు.
  కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి తావర్ చంద్ గెహ్లోట్ మంగళవారం సాయంత్రం 124వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపాదించారు. లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ లబ్ది కోసమే ఉన్నత వర్గాల బీదవారికి రిజర్వేషన్లు కల్పిస్తోందని బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ తదితర ప్రతిపక్షాలు ఆలోపించాయి. బిల్లును ఇంత అకస్మాత్తుగా ప్రతిపాదించవలసిన అవసరం ఏమిటి, ఎందుకీ తొందరపాటు అంటూ ప్రభుత్వాన్ని నిలదీశాయి. ప్రభుత్వం వ్యవహరించిన తీరు మూలంగా తాము బిల్లుకు సవరణలు ప్రతిపాదించలేకపోయామని తెలిపాయి. న్యాయ వ్యవస్థలో కూడా రిజర్వేషన్లు కల్పించాలని కొందరు మంత్రులు, అధికార, ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. తమకు అన్యాయం జరుగుతోందంటూ ఆవేదన చెందుతున్న ఉన్నత వర్గాల వారి కోప తాపాలు ఇక మీదట హరించిపోతాయని పలువురు సభ్యులు అభిప్రాయపడ్డారు.
  అందరి అభ్యున్నతే లక్ష్యం
  నరేంద్ర మోదీ సబ్‌కా సాథ్ సబ్ కా వికాస్ (అందరితో అందరి అభివృద్ధి) నినాదాన్ని అమలు చేసే కార్యక్రమంలో భాగంగా ఉన్నత వర్గాలలోని బీద ప్రజలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని గెహ్లోట్ ప్రకటించారు. బీసీ,ఎస్‌సి,ఎస్‌టిలకు ఇస్తున్న యాభై శాతం రిజర్వేషన్ల పరిధిలోకి రానివారంతా ఈ పది శాతం పరిధిలోకి వస్తారని, ఉన్నత వర్గాలకు చెందిన పేదలను గుర్తించే బాధ్యతను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలివేస్తున్నట్లు ఆయన తెలిపారు. వెనుకబడిన కులాలు,ఎస్‌సీ,ఎస్‌టీలకు కల్పిస్తున్న రిజర్వేషన్లకు ఎలాంటి భంగం వాటిల్లకుండా ఉన్నత వర్గాలలోని బీదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని గెహ్లోట్ తెలిపారు. ఈ బిల్లును సుప్రీం కోర్టు కొట్టివేయకుండా చూసేందుకు రాజ్యాంగంలోని 15,16 అధికరణలను సవరిస్తున్నామని అన్నారు. గతంలో ఉన్నత వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించినా దీనికి రాజ్యాంగపరమైన ఆమోదం లేదంటూ తిరస్కరించడం జరిగిందని, అయితే ఇప్పుడలాంటి పరిస్థితి రాకుండా చూసేందుకే రాజ్యాంగంలోని 15,16 ఆర్టికల్స్‌ను సవరిస్తున్నామని ఆయన చెప్పారు.
  బీసీ,ఎస్‌టి,ఎస్‌సీలకు కల్పిస్తున్న రిజర్వేషన్లకు అదనంగా పది శాతం రిజర్వేషన్లను ఉన్నత వర్గాలకు చెందిన బీద ప్రజలకు కల్పిస్తున్నామని తెలిపారు. దీని వల్ల వీరికి ఎలాంటి నష్టం ఉండదని తెలిపారు. పది శాతం రిజర్వేషన్ల వలన ప్రయోజనాల గురించి అతి తక్కువ వివరణ ఉన్నా ఉన్నత వర్గాలలోని బీద ప్రజలకు కలిగే ప్రయోజనాలు మాత్రం ఎంతో అధికమని ఆయన తెలిపారు. వివిధ మతాలోని అన్ని ఉన్నత వర్గాలు, కులాలకు దీని వలన ప్రయోజనం కలుగుతందన్నారు.
  ఇది ఎన్నికల జిమిక్కు:కాంగ్రెస్
  ఉన్నత వర్గాలకు చెందిన పేదలకు పదిశాతం రిజర్వేషన్ కల్పన ఎన్‌డిఏ ప్రభుత్వ ఎన్నికల జిమ్మిక్కు అని కాంగ్రెస్ సభ్యుడు కె.వి.్థమస్ విమర్శించారు. ఈ రిజర్వేషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేస్తుందని ఆయన చెప్పారు. ఎయిడెడ్ విద్యా సంస్థలతో పాటు అన్ ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఈ రిజర్వేషన్లు ఎలా కల్పిస్తారని ఆయన ప్రశ్నించారు. ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ దీనికి వివరణ ఇస్తూ గతంలో మాజీ ప్రధాన మంత్రి పి.వి.నరసింహారావు ఒక నోటిఫికేషన్ ద్వారా ఉన్నత వర్గాల బీద వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర చట్టం ద్వారా ఈ పని చేయగా సుప్రీం కోర్టు కొట్టివేసిందని, అందుకు కారణం రాజ్యాంగ పరమైన సవరణ చేయకపోవటమేనని తెలిపారు. బీసీ, ఎస్.సి, ఎస్.టి రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగంలోని 15,16 ఆర్టికల్ వీలు కల్పిస్తున్నాయని, వీటిని సవరించకుండా ఉన్నత వర్గాలలోని బీద వారికి రిజర్వేషన్లు కల్పిస్తే కోర్టు కొట్టివేస్తుంది కాబట్టే ఆర్టికల్ 15,16ను సవరిస్తున్నామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ తదితర అన్ని రాజకీయ పార్టీలు కూడా 201 ఎన్నికల ప్రణాళికలో ఉన్నత వర్గాలకు చెందిన బీద వారికి రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చాయనేది మరిచిపోరాదన్నారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా పది శాతం రిజర్వేషన్లకు హృదయపూర్వకంగా మద్దతు ఇవ్వాలని జైట్లీ సూచించారు.
  ఎస్‌సి,ఎస్‌టి,బీసీలకు కల్పిస్తున్న రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయనందుకే ఈ వర్గాలకు చెందిన వారిప్పుడు కూడా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నారని అన్నా డి.ఎం.కె నాయకుడు, డిప్యూటీ స్పీకర్ తంబిదురై చెప్పారు. తమిళనాడు అమలు చేస్తున్న రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్‌డిఏకు ఇది ఎన్నికల్లో ప్రయోజనం కలిగించవచ్చు కానీ సుప్రీం కోర్టు మాత్రం తప్పకుండా కొట్టివేస్తుందని తంబిదురై చెప్పారు. బి.సి, ఎస్.సి, ఎస్.టి రిజర్వేషన్లను 50 నుండి 69 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ పక్షం నాయకుడు సుదీప్ బందోపాద్యాయ మాట్లాడుతూ చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు సంబంధించిన బిల్లును ఆమోదించడం గురించి ప్రభుత్వం ఎందుకు ఆలోచించటం లేదని ప్రశ్నించారు. దేశంలోని ఉపాధి ఆవకాశాలపై ఒక శే్వత పత్రాన్నిప్రభుత్వం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బిల్లుకు మద్దతు ఇస్తున్నామని సుదీప్ బందోపాధ్యాయ ప్రకటించారు. శివసేన కూడా ఈ బిల్లుకు పూర్తి మద్దతు ప్రకటించింది.


  0 0

  న్యూఢిల్లీ, జనవరి 8: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ఈ నెల 19న కోల్‌కతాలో ఏర్పాటు చేసిన ర్యాలీకి హాజరైన అనంతరం తమ భవిష్యత్ రాజకీయ ప్రణాళికను సిద్ధం చేసుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తెలిపారు. ఇరువురు నాయకులు మంగళవారం రాత్రి చర్చలు జరిపిన అనంతరం విలేఖరులతో మాట్లాడారు. మంగళవారం రాత్రి ఢిల్లీకి వచ్చిన చంద్రబాబు మొదట కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆయన నివాసంలో కలిసి చర్చలు జరిపారు. ఆ తరువాత మరాఠా నాయకుడు శరద్ పవార్, ఎన్‌సీ అధినాయకుడు ఫరూక్ అబ్దుల్లాతో సమావేశమై మహాకూటమి ఏర్పాటు గురించి సంప్రదింపులు జరిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఏపీ భవన్‌కు వచ్చి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ చర్చల అనంతరం చంద్రబాబు, శరద్ పవార్ విలేఖరులతో మాట్లాడారు. కోల్‌కతాలో ఈ నెల 19న టీఎంసీ ఏర్పాటు చేసిన ర్యాలీకి రావలసిందిగా తమను ఆహ్వానించారని వారు
  తెలిపారు. ఈ ర్యాలీ అనంతరం నాన్ బీజేపీ నాయకులంతా అక్కడే సమావేశమై తమ భవిష్యత్ వ్యూహాన్ని ఖరారు చేసుకుంటామని చెప్పారు. కోల్‌కతా ర్యాలీకి రాహుల్ గాంధీ హాజరవుతున్నారా అని ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు చంద్రబాబు స్పష్టమైన సమాధానం చెప్పకుండా దాటవేశారు. రాహుల్‌తో జరిపిన చర్చల వివరాలు వెల్లడించేందుకు కూడా చంద్రబాబు అంగీకరించలేదు. కోల్‌కతా ర్యాలీకి నాన్ బీజేపీ పార్టీ నాయకులంతా వస్తారని ఆశిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఉన్నత వర్గాల్లోని పేదవారికి పది శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును స్వాగతిస్తున్నామని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపాదించిన రిజర్వేషన్లను కూడా కేంద్రం ఆమోదించాలని ఆయన సూచించారు. దేశం, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు నాన్ బీజేపీ పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉన్నదని ఆయన చెప్పారు.

  చిత్రం..ఢిల్లీలో మంగళవారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి
  జ్ఞాపికను అందజేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు


  0 0

  న్యూఢిల్లీ, జనవరి 8: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు, అతని అనుచరులు అమరావతి నుంచి పోలవరం నిర్మాణం వరకు ఆరు లక్షల కోట్ల రూపాయల మేర అవినీతికి పాల్పడ్డారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఆరోపించింది. ఢిల్లీలో మంగళవారం ‘చంద్రబాబు ఎంపరర్ ఆఫ్ కరప్షన్’ (అవినీతి చక్రవర్తి) పేరుతో పుస్తకాన్ని ఆ పార్టీ ఎంపీలు, నేతలు ఆవిష్కరించారు. అనంతరం మేకపాటి మాట్లాడుతూ- చంద్రబాబు నిజ స్వరూపం ప్రజలకు తెలియజేయడానికే ఈ పుస్తకాన్ని విడుదల చేసినట్టు చెప్పారు. ఈ పుస్తకాన్ని పార్లమెంట్ సభ్యులందరికీ పంచుతామని అన్నారు. మాజీ ఎంపీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ- చంద్రబాబు, అతని అనుచరులు అమరావతి నుంచి పోలవరం వరకు ఆరు లక్షల కోట్ల రూపాయల మేర అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. నాలుగున్నర ఏళ్ల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం పాల్పడిన అవినీతిపై కేంద్రం సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. విజయ సాయిరెడ్డి మాట్లాడుతూ- అవినీతి కార్యకలాపాల కోసమే చంద్రబాబు ప్రతిసారీ ఢిల్లీకి వస్తున్నారని ఆరోపించారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ- పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరుగుతోందని ‘కాగ్’ స్పష్టం చేసిందన్నారు. రాఫెల్ ఒప్పందంలో జరిగిన అవినీతి కంటే అమరావతి నిర్మాణంలో అతిపెద్ద అవినీతి జరుగుతోందని ఆరోపించారు. అవినితి చక్రవర్తి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో వి.ప్రభాకర్‌రెడ్డి, వరప్రసాద్, మిథున్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి పాల్గొన్నారు. ఇలావుండగా ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని ఆ పార్టీ ఎంపీలు మంగళవారం కూడా పార్లమెంట్ అవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు.

  చిత్రం..పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ‘అవినీతి చక్రవర్తి’
  పుస్తకాన్ని ప్రదర్శిస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ నేతలు


older | 1 | .... | 2026 | 2027 | (Page 2028) | 2029 | 2030 | .... | 2069 | newer