Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

రాం..రాం?

0
0

తెలుగులో డీజే చిత్రంతో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చి, అందాల ప్రదర్శనతోపాటు ఫుల్ ఎనర్జిటిక్ నటనతో ముద్దుగుమ్మ పూజా హెగ్డే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ చిత్రం తర్వాత తెలుగులో పూజా హెగ్డే లక్కీ బ్యూటీగా పేరు దక్కించుకుంది. ఎన్టీఆర్‌తోఅరవింద సమేత చిత్రంతోపాటుబెల్లకండ హీరోతో కూడా సినిమా చేసింది. ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తోంది. ఇటీవలే తాను ఒక పెద్ద సినిమాలో ఎంపిక అయ్యానంది. అయితే ఆ సినిమా వివరాలను మాత్రం వెల్లడి చేసేందుకు ఆమె ఒప్పుకోలేదు. దాంతో ఈమె అల్లు అర్జున్- త్రివిక్రమ్ మూవీకి ఓకె అయ్యిందనే పుకార్లు షికార్లు చేశాయి. ఆ విషయంపై క్లారిటీ రావాల్సి వుంది. తెలుగులో స్టార్ హీరోయిన్స్ జాబితాలో వున్న పూజా హెగ్డే బాలీవుడ్‌కు పరిమితం అయ్యేనా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పూజాహెగ్డే చేసిన మొదటి హిందీ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. దాంతో అక్కడ పూజకు పెద్దగా స్కోప్ లేదని అంతా భావించారు. అయినా కూడా అక్కడ చిన్నా చితకా పాత్రల్లో ఆఫర్లు దక్కించుకుని నటిస్తూ వస్తోంది. ఆ సినిమాలో పూజా బాలీవుడ్‌లో నిలదొక్కుకోవటం కష్టమే అనుకున్నారు. కానీ తాజాగా ఆమెకు వచ్చిన ఆఫర్‌తో బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మారిపోయి అక్కడ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా లక్కీ బ్యూటీగామారిపోవడం ఖాయం అంటున్నారు. బాలీవుడ్‌లో కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రోహిత్ శెట్టి ఇటీవలే ‘సింబా’ సినిమాతో భారీ విజయాన్ని దక్కించుకున్నాడు. సింబా సక్సెస్ జోష్‌లో వున్న రోహిత్ శెట్టి తన తదుపరి చిత్రాన్ని అక్షయ్‌కుమార్‌తో చేయబోతున్నాడు. అక్షయ్‌కు జోడీగా పూజా హెగ్డేను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.


‘కాంచన-3’ వస్తోంది

0
0

ముని, కాంచన, కాంచన-2తో హర్రర్ కామెడీ చిత్రాల్లో సౌత్ ఇండియాలోనే హ్యూజ్ సక్సెస్‌ని సాధించిన రాఘవ లారెన్స్ హీరోగా, దర్శకుడిగా ముని ప్రాంచాయిస్ నుండి వస్తున్న హర్రర్ కామెడీ చిత్రం కాంచన-3. రాఘవ లారెన్స్ అందించిన హర్రర్ చిత్రాలన్ని బ్లాక్‌బస్టర్ చిత్రాలుగా బాక్సాఫీస్‌ని షేక్ చేసినవే. ఈ కాంచన-3 చిత్రం మాత్రం లారెన్స్‌కి స్పెషల్ చిత్రంగా తెరకెక్కుతుంది. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తికావస్తోంది. రాఘవ లారెన్స్ ఏమి చేసినా స్పెషల్‌గా ఉంటుంది. ఇప్పుడు కాంచన-3 కోసం ఆయన ఒక మోషన్ పోస్టర్‌ని తెలుగు వెర్షన్‌కోసం రిలీజ్‌చేశారు. అయితే ఒక శ్లోకంలో స్టార్టయ్యి స్లమ్ ఏరియాని చూపిస్తూ క్లాత్‌నుండి యాక్షన్ సీన్ అక్కడినుండి రుద్రాక్షలు ధరించి, తెల్లటి పంచె కట్టుకుని, వైట్ హెయిర్ స్టైయిల్‌తో దర్జాగా కూర్చునివున్న హీరో పోస్టర్‌ని తెలుగులో మొట్టమొదటిసారిగా డాల్బి అట్మాస్ సౌండ్‌లో విడుదల చేశారు. ఈ చిత్రాన్ని తెలుగులో లైట్‌హౌస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై బి.మధు సమర్పణలో రాఘవేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రాఘవ నిర్మాణంలో తెరకెక్కించారు. ఏప్రిల్ 18న విడుదలకానున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ని పాత్రికేయ మిత్రులకోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా బి.మధు మాట్లాడుతూ.. రాఘవ లారెన్స్ స్వయంగా అందించిన హర్రర్ సినిమాలు అన్నీ సూపర్ హిట్లే. అందులో ముని సీక్వెల్స్ మరీ స్పెషల్. కాంచన పేరుతో స్టార్టయిన తరువాత ఇప్పుడు కాంచన-3గా ప్రేక్షకుల ముందుకు ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నాము. రాఘవ లారెన్స్‌కి ఈ చిత్రం చాలా ప్రత్యేకం అనే చెప్పాలి. ఈ సిరీస్‌లో ఇది నాలుగో చిత్రం. ఆయన ప్రతి చిత్రంలో తన గెటప్‌ని సామాన్య ప్రేక్షకుడికి దగ్గరగా వుండేలా చూసుకున్నారు. ఇప్పుడు ఈ చిత్రంలో వైట్ హెయిర్‌తో న్యూస్టైల్‌కి నాంది పలికారు. మేము విడుదలచేసిన కాంచన-3 మోషన్ పోస్టర్ విత్ సౌండ్‌కి ఇప్పటికే స్పందన చాలా బాగుంది. ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా మా బ్యానర్ లైట్‌హౌస్ మూవీ మేకర్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌లో రాఘవ నిర్మాణంలో తెరకెక్కించాము. ఆడియన్స్ కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూడటం విశేషం. గత మూడు చిత్రాలని మించి కాంచన-3 వుండబోతుందని నమ్ముతున్నాము అని అన్నారు.

కొత్తగా.. శర్వా

0
0

వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ ట్యాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు యంగ్ హీరో శర్వాదంద్. ఇటీవల రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘పడి పడి లేచె మనసు’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన శర్వాకి, అది అనుకున్నంత విజయాన్ని అందించలేక పోయింది. నిజానికి ఈ సినిమాపై శర్వా భారీ ఆశలే పెట్టుకున్నాడు. కానీ అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పుడు తన తదుపరి చిత్రంపై పూర్తిగా దృష్టి పెట్టాడట. ‘స్వామి రారా’ ఫేమ్ సుధీర్‌వర్మ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు శర్వా. 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగే గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రంలో, శర్వా ద్విపాత్రాభినయం చేయనున్నాడట. అందులో ఒకటి యువకుడి పాత్ర అయితే, మరొకటి వృద్ధుడి పాత్ర అని సమాచారం. ప్రస్తుతం చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ‘హలో’ ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తుంది.

మణిశర్మ ‘ఆరే’స్తాడా?

0
0

రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఇస్మార్ట్ శంకర్ సినిమాకు మణిశర్మ సంగీతం అందించనున్నారు. ఆరోసారి వీళ్లిద్దరితో కలిసి పనిచేయబోతున్నారు. గతంలో పూరి జగన్నాథ్, మణిశర్మ కలిసి పనిచేసిన ఐదు సినిమాలు మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. ఈ ఇద్దరూ చివరిగా టెంపర్ సినిమాకు పనిచేశారు. ఇపుడు రామ్ హీరోగా నటిస్తున్న ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు మణిశర్మ. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న తొలి సినిమా ఇదే. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రానికి రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రెగ్యులర్ షూటింగ్ జనవరి చివర్లో మొదలు కానుంది. పూరీజగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ నిర్మాణ సంస్థలపై దర్శకుడు పూరి జగన్నాథ్, ఛార్మికౌర్ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు.

ఇమేజ్ గురించి ఆలోచించను

0
0

జీవితంలో ఎప్పుడూ ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించాలి. అంతేకానీ అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి మైండ్ పాడుచేసుకోకూడదని అంటున్నాడు ప్రముఖ నటుడు వెంకటేష్. ఆయన మెగాహీరో వరుణ్‌తేజ్‌తో కలిసి నటించిన చిత్రం ‘ఎఫ్2’. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి అనీల్ రావిపూడి దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా ఈనెల 12న విడుదలవుతున్న సందర్భంగా
వెంకటేష్‌తో ఇంటర్వ్యూ...
* ఫన్ ఎవరికి? ఫ్రస్టేషన్ ఎవరికి?
- ఇందులో ఉండే ఫన్, ఫ్రస్టేషన్ ప్రేక్షకులను నవ్వించేందుకే. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. సరిగ్గా సంక్రాంతి పండగకు కావలసిన సినిమా.
* ఇంతకీ కథ ఏమిటి?
- పెళ్లికి ముందు పెళ్లి తరువాత మగవాడి జీవితం ఎలా వుంటుందన్న పాయింట్‌తో పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన కథ. ప్రతీ మనిషికి కనెక్ట్ అవుతుంది. ఇందులో చూసే సన్నివేశాలు ప్రేక్షకుల్ని నవ్విస్తాయి.
* గురు తరువాత గ్యాప్‌కు కారణం?
- ఆ సినిమా తరువాత చాలా కథలు విన్నాను. ఏదో కొత్తగా చేద్దామని ట్రై చేశాను కానీ కుదరలేదు. మళ్లీ రెగ్యులర్ ఫార్మెట్‌లో ఈ కథనే ఎంచుకున్నాను.
* వరుణ్‌తేజ్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్?
- వరుణ్ మంచి నటుడు. తను ఇప్పటివరకూ ఇలాంటి జోనర్‌లో సినిమా చేయలేదు. తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి భిన్నమైన కథల్ని ఎంచుకుంటున్నాడు. కొత్త జోనరైనా చక్కగా నటించాడు. తనతో పనిచేస్తూ ఎంజాయ్ చేశాను.
* ఇప్పటివరకూ పెళ్లికాని ప్రసాదుగా చూశారు. ఇపుడు పెళ్లైన ప్రసాదు సమస్యలు చూపిస్తారా?
- మల్లీశ్వరిలో పెళ్లికాని ప్రసాదు పాత్ర బాగా గుర్తుండిపోయింది జనాలకు. ఈ సినిమాలో కూడా నా పాత్రకు మంచి ఇంపాక్ట్ వుంటుంది. పెళ్లైన తరువాత మగవాడి జీవితం ఎలా వుంటుందనేదాన్ని కామెడీగా చూపించాము.
* దర్శకుడు అనీల్ గురించి?

- అనీల్ క్లారిటీ వున్న దర్శకుడు. ఈ కథను చెప్పినపుడు అందులో వున్న ఫన్‌ను బాగా ఎలివేట్ చేశాడు. తను సెట్స్‌లో కూడా అంతమంది ఆర్టిస్టులను డీల్ చేయడంలో ఎక్కడా తడబడలేదు.
* మీ కెరీర్‌లో ఇమేజ్ కోసం చేసిన సినిమాలున్నాయా?
- ఇమేజ్ అనేదాన్ని నేను నమ్మను. నేను ఇలాంటి పాత్రలే చేస్తాను, ఇలాగే వుంటానంటే ఇక్కడ కుదరదు. అన్నిరకాల పాత్రల్లో మెప్పించినపుడే నటుడిగా పూర్తిస్థాయి గుర్తింపు దక్కుతుంది.
* ఎక్కువగా మల్టీస్టారర్లే చేయడానికి కారణం?
- అలా అని కాదు. మల్టీస్టారరా, సోలో సినిమానా అనేది ఆ కథల్ని బట్టి వస్తాయి. నా దగ్గరకు వచ్చిన బెస్ట్ కథలను చేస్తున్నాను.
* ఫ్యామిలీ చిత్రాల్లో మిమ్మల్ని ఎక్కువగా చూస్తున్నాం. దానికోసం ప్రత్యేక కేర్ తీసుకుంటారా?
- నాకన్నీ అలాంటి కథలే వచ్చాయి. నిజానికి రోజా సినిమా సమయంలో నాకు గాయం అవ్వడంవల్ల ఆ సినిమా మిస్ అయ్యాను. ఆ తరువాత అన్ని ఫ్యామిలీ కథలు రావడంతో అలాగే కంటిన్యూ అయ్యాను. లేదంటే రోజా చేసి వుంటే హిందీలో సెటిల్ అయ్యేవాడినేమో.
* డ్రీమ్ పాత్రలు ఏమైనా ఉన్నాయా?
- అలాంటివి ఏమీ లేవు. మంచి పాత్రలకోసం చూస్తున్నా.
* వెంకీ మామ గురించి...
- చైతుతో కలిసి చేస్తున్న సినిమా ఇది. ఇప్పటికే కొంత షూటింగ్ జరిగింది. తప్పకుండా మంచి సినిమా అవుతుంది.
* తదుపరి చిత్రాలు..?
- వెంకీమామతోపాటు త్రివిక్రమ్‌తో ఓ సినిమా ఉంటుంది. అలాగే అనీల్ రావిపూడితో మరో చిత్రం ప్లాన్ చేస్తున్నా. మరిన్ని కథలు కూడా వింటున్నా.

బుల్లితెరపై శ్రద్ధ..!

0
0

తెలుగులో పలు సినిమాల్లో నటించినా కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా ఈమెకు పెద్దగా గుర్తింపును తెచ్చిపెట్టలేకపోయాయి. హీరోయిన్‌గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసినా విలన్‌గా చేసినా కూడా ఈమెకు కాలం కలిసి రాలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇక మనుగడ సాధ్యంకాదని భావించిన శ్రద్ధాదాస్ బాలీవుడ్ వెళ్లి అక్కడ ప్రయత్నాలు చేసింది. హిందీలో చేసిన సినిమాలు కూడా శ్రద్ధాకు గుర్తింపును తెచ్చి పెట్టలేకపోయాయి. వచ్చిన ప్రతి అవకాశంను సద్వినియోగం చేసుకుని విచ్చలవిడిగా అందాల ప్రదర్శన చేసి గ్లామర్‌తో రెచ్చిపోయేందుకు విపరీతంగా ప్రయత్నించింది. కాని అందాల ప్రదర్శనను ఆస్వాదించిన ప్రేక్షకులు ఆమెపై అంతగా ఆసక్తి చూపలేరు. వెండి తెరపై దాదాపు పదేళ్లు ప్రయత్నించినా కూడా సక్సెస్ దక్కకున్నా కూడా ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. వెండి తెరను వదిలేసి ఈసారి బుల్లితెరను ఎంపిక చేసుకుంది. ఈమధ్య కాలంలో వెబ్ సిరీస్‌లకు మంచి గిరాకీ ఉంది. అందుకే ఈమె తాజాగా ‘శింగార్‌దాన్’అనే వెబ్ సిరీస్‌లో నటించింది. సినిమాల్లో అందాల ప్రదర్శన చేసినట్లుగా వెబ్ సిరీస్‌కోసం కూడా అడ్డుఅదుపులేకుండా ఈమె స్కిన్‌షో చేసినట్లుగా తెలుస్తోంది.

బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ. 200 కోట్లు కేటాయించాలి

0
0

విజయనగరం (్ఫర్టు), జనవరి 9: ఆర్టీసీని ఆదుకునేందుకు రాష్టబ్రడ్టెట్‌లో 200 కోట్ల రూపాయలు కేటాయించాలని ఆర్టీసీ ఎంప్లాయిస్‌యూనియన్ (ఇయు) రాష్ట్ర అధ్యక్షుడు వైవి రాజు కోరారు. పట్టణంలో ఆర్‌ఎం కార్యాలయం వద్ద బుధవారం జరిగిన విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల డిపోకమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు, ఇతర ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వైవి రావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల ఆర్టీసీ నష్టాల బారిన పడుతుందని చెప్పారు. అందువల్ల ఆర్టీసీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించడంతోపాటు ఆర్టీసీకి వాహనాల పన్నును మినహాయించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుని ఉద్యోగులకు మెరుగైన వేతనాల సవరణ చేయకపోతే సమ్మె తప్పదని హెచ్చరించారు. ఇంతవరకు ఆర్టీసీకి ఉన్న నష్టాలను ప్రభుత్వమే భరించి ఉద్యోగులు కోరుకుంటున్న శ్రమకు తగినవిధంగా 50శాతం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ యాజమాన్యానికి 2018 డిసెంబర్ 31న సమ్మె నోటీసు ఇచ్చామని తెలిపారు. సమ్మె నోటీసులో ఉన్న డిమాండ్ల పరిష్కారంపై యాజమాన్యం నిర్లక్ష్యదోరణి అవలంభిస్తే సమ్మె చేయకతప్పదని ఆయన స్పష్టం చేశారు. ఇయు గుర్తింపుసంఘంగా గెలిచిన వెంటనే 91 డిమాండ్లతో యాజమాన్యానికి వేతనాల సవరణపై ప్రతిపాదనలు ఇచ్చామని, దీనిపై వేతనాల సవరణ కమిటీతో ఆరుసార్లు సమావేశాలు జరిపినా స్పష్టమైన హామీలు రాలేదని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల కంటే 25శాతం జీతాలు తక్కువ పొందుతున్న ఆర్టీసీ ఉద్యోగులు 50 శాతం పిట్‌మెంట్ డిమాండ్ చేస్తుంటే, 15శాతం మాత్రమే పిట్‌మెంట్ ఇస్తామని యాజమాన్యం ప్రతిపాదనలు పెడుతుందని, దీనిని ఒప్పుకునే ప్రసక్తి లేదని తెలిపారు. ఈ సమావేశంలో ఇయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెదమజ్జి సత్యనారాయణ, జోనల్ అధ్యక్షడు చింతాడ వెంకట్రావు, పెంట భానుమూర్తి, రీజనల్ అధ్యక్షుడు బాసూరు కృష్ణమూర్తి, కార్యదర్శి గొల్లపల్లి రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజాసమస్యల పరిష్కారం కోసమే జన్మభూమి

0
0

విజయనగరం (్ఫర్టు), జనవరి 9: క్షేత్రస్థాయిలో ప్రజాసమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం జన్మభూమి-మాఊరు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే మీసాల గీత అన్నారు. పట్టణంలో 7,14,23,31 వార్డుల్లో బుధవారం జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీసాల గీత మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం జన్మభూమి-మాఊరు కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు అధికారులు ప్రజల ముందుకు వచ్చారని చెప్పారు. గతంలో ఎన్నడూలేనివిధంగా తమ ప్రభుత్వ హాయాంలో నియోజకవర్గ అభివృద్ధి జరిగిందని అన్నారు. మారుతున్న పరిస్థితులను బట్టి ప్రజలకు కల్పించవలసిన పథకాలు, వనరులు వంటి విషయాలపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమపథకాలను అందిస్తున్నామని తెలిపారు. మున్సిపల్‌చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ మాట్లాడుతూ పట్టణంలో అన్నివార్డుల్నో అభివృద్ధిపనులు చేపడుతున్నామని చెప్పారు. అపోహలకు తావులేకుండా తాము చేస్తున్న కార్యక్రమాలను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు లేనిపోని విమర్శలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి.వేణుగోపాల్, అసిస్టెంట్‌కమిషనర్ కె.కనకమహాలక్ష్మి, టిడిపి పట్టణ అధ్యక్షుడు, జన్మభూమి కమిటీసభ్యుడు డాక్టర్ విఎస్ ప్రసాద్, జన్మభూమి టీమ్‌లీడర్లు వి.శోభన్‌బాబు, హరిదాసు, మత్స్యరాజు, రెహ్మన్, పశువైద్యాధికారి డాక్టర్ శ్రీలక్ష్మి, మున్సిపల్‌కౌన్సిలర్లు సుంకరి విజయలక్ష్మి, మేకాఅనంతలక్ష్మి, కొర్నాన రాజ్యలక్ష్మి, కెల్ల వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి,సంక్షేమమే టిడిపి లక్ష్యం
* ఎమ్మెల్యే గీత
విజయనగరం (్ఫర్టు), జనవరి 9: రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారని ఎమ్మెల్యే మీసాల గీత అన్నారు. అభివృద్ధి, సంక్షేమమే టిడిపి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పట్టణంలో 14వ వార్డులో బుధవారం వార్డుదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నవ్యాంధ్రలో ప్రభుత్వం ఏర్పడి 1500 రోజులను పురస్కరించుకుని రాష్ట్రంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించేందుకు వార్డుదర్శిని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఒకవైపుప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తూనే మరోవైపు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్‌చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని చెప్పారు. టిడిపి పట్టణ అధ్యక్షుడు డాక్టర్ విఎస్ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ, ముఖ్యమంత్రిగా చంద్రబాబు తన అనుభవంతో, ప్రతిష్టతో, కఠోర కష్టంతో రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమమార్గంలో నిలబెట్టారని తెలిపారు. నెత్తిన అప్పులు పెట్టి కాంగ్రెస్, బిజెపీ కలిపి రాష్ట్ర విభజన చేశాయని, హేతుబద్ధత లేకుండా అశాస్ర్తియంగా చేపట్టిన రాష్టవ్రిభజన వల్ల ఆర్థికపరిస్థితి దారుణంగా దిగజారిందని ఆందోళన చేశారు. అయినప్పటికీ అపారమైన రాజకీయ అనుభవంతో చంద్రబాబు ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటూనే రాష్ట్ర అభివృద్ధికి శక్తిలేకుండా కృషి చేస్తున్నారని తెలిపారు. అందువల్ల రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు అడ్డంగా ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు.


ప్రజాసంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయం

0
0

రామభద్రపురం, జనవరి 9: రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ప్రజలకు పాలన అందిస్తుందని రాష్ట్ర గనులశాఖామంత్రి ఆర్‌వి సుజయ్‌కృష్ణరంగారావు అన్నారు. 6వ విడత జన్మభూమి కార్యక్రమంలో భాగంగా బుధవారం రామభద్రపురం గ్రామసభలో మాట్లాడారు. ప్రజాసమస్యలను పరిష్కరించాలన్న ఉద్ధేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం జన్మభూమి కార్యక్రమాన్ని అమలుచేస్తుందని, వీటిలో సామాజిక సమస్యలతోపాటు వ్యక్తిగత సమస్యలను పరిష్కరించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వౌళిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేస్తున్నామని, ఇందులో భాగంగానే గ్రామపంచాయతీలలో కోట్లాది రూపాయలతో రోడ్లు, కాలువల నిర్మాణాలు చేపట్టామన్నారు. అలాగే కోట్లాది రూపాయలతో ప్రతీ పాఠశాలలకు ప్రహారీగోడల నిర్మాణాలు చేపట్టామన్నారు. రాష్ట్ర విభజనతో ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పటికీ సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు. ఆంద్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలే చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని, ఈమేరకు ప్రజలంతా మద్ధతు తెలపాలన్నారు. అలాగే ప్రతీ గ్రామంలోని పూరిగుడిసెలు లేకుండా తీర్చిదిద్దేందుకు లక్షలాది పక్కా గృహాలు మంజూరుచేస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి జిల్లా, మండల, గ్రామస్థాయిలలో ప్రనాళికలు రూపొందిస్తున్నామన్నారు. ముఖ్యంగా రామభద్రపురంలో నెలకొన్న మంచినీరు, రహదారుల సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. ఈమేరకు సభ నిర్వహిస్తుండగా ఓ రైతు కిరోసిన్‌ను సరఫరా చేయాలని కోరడంతో ఇందుకు స్పందించిన మంత్రి మాట్లాడుతూ ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అనంతరం టీడీపీ నాయకులు చింతల రామకృష్ణ రామభద్రపురంలో నెలకొన్న సమస్యలను మంత్రికి వివరించారు. ఇందులో భాగంగా కూరగాయల రైతులకు మోపెడ్లు, 108వాహనం నడపాలని, రెల్లి, ముస్లిం కులాలకు ప్రత్యేక శ్మశానవాటికలను నిర్మించాలని కోరారు. అలాగే ఆశావర్కర్ల సమస్యలను ఐద్వా నాయకురాలు ఇందిర మంత్రికి తెలియజేశారు. ఆశావర్కర్లకు కనీస వేతనాలు అందించాలని, మధ్యాహ్న భోజనపథకాన్ని ప్రైవేటీకరణ చేయరాదని, ఉద్యోగభద్రత కల్పించాలని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో జన్మభూమి డివిజన్ ప్రత్యేక అధికారి కమలాకరరావు, జడ్పిటీసీ సభ్యురాలు లూర్థమ్మ, ఎంపీపీ చింతల వసుంధర, టీడీపీ నాయకులు ఎం తిరుపతిరావు, కె తిరుపతిరావు, పి లక్ష్మునాయుడు, ఎం తిరుపతిరావు, ఎంపీడీఓ మురళీకృష్ణ, తహశీల్దార్ రత్నకుమార్, తదితరులు పాల్గొన్నారు.

రెండవ రోజు బంద్ విజయవంతం
రామభద్రపురం, జనవరి 9: కార్మిక వ్యతిరేకవిధానాలకు నిరసనగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యితిరేక విధానాలకు నిరసనగా రామభద్రపురంలో సీపీఎం కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా బైపాస్ రోడ్డు జంక్షన్‌లో బలస శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నాయకులు రాస్తారోకో నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఇప్పటికైన ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు.

మెట్టవలస జన్మభూమిలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

0
0

బొబ్బిలి(రూరల్), జనవరి 9: ఇరువర్గాల మధ్య నెలకొన్న వివాదం తారాస్థాయికి చేరడంతో పోలీసులు రంగప్రవేశం చేసి సద్దుమణిగించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలం మెట్టవలస గ్రామంలో జన్మభూమి- మా ఊరు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఇందులో భాగంగా మాజీ సర్పంచ్ పువ్వల మాదవరావు గ్రామాభివృద్ధిని చదివి వినిపిస్తుండగా వైకాపా నాయకులు అడ్డుతగిలి సమస్యలను తెలియజేస్తామని ప్రశ్నించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. దీంతో ఎవరికి వారే ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి నెలకొనడంతో ఒక్కసారిగా అధికారుల్లో ఆందోళనలు మొదలైంది. ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయాందోళనలతో వణికిపోయారు. దీంతో గ్రామంలో ఇరువర్గాల నాయకులు, కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చి ఒకరికొకరు తోపులాటలు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ట్రాఫిక్ ఎస్‌ఐ అబ్రహం హుటాహుటిన మెట్టవలస గ్రామానికి చేరుకుని ఇరువర్గాలతో చర్చించి సమస్యను సద్దుమణిగించారు. అర్థాంతరంగా గ్రామసభను ముగించి గొర్లె సీతారాంపురం గ్రామంలో ఎంపీడీఓ చంద్రమ్మ గ్రామసభను నిర్వహించారు. ఏదీ ఏమైన జన్మభూమి ముగింపు రోజున ఊహించని పరిణామాలు చోటుచేసుకోవడంతో అధికారులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు.

సమ్మెతో మూతపడిన అంగన్వాడీ, బ్యాంకులు
* పాఠశాలలో వంటలు చేస్తున్న ఉపాధ్యాయులు
బొబ్బిలి(రూరల్), జనవరి 9: దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెతో అంగన్వాడీ కేంద్రాలు, బ్యాంకులు మూతపడగా పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు సమ్మె బాట పట్టడంతో ఉపాధ్యాయులు వంటలు చేసి విద్యార్థులకు ఆహారాన్ని అందించారు. ఈమేరకు నారాయణప్పవలస, పారాది, మెట్టవలస, తదితర పాఠశాలలో హెచ్‌ఎంలు జెసి రాజు, జోగారావు, రామకృష్ణతోపాటు ఉపాధ్యాయులు వంటలు చేసి విద్యార్థులకు వడ్డించారు. రెండు రోజులపాటు కార్మికులు, నిర్వాహకులు సమ్మె చేయడంతో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వంటలు చేశామన్నారు. అయితే బ్యాంకు అధికారులు గత రెండు రోజులుగా సమ్మె చేయడంతో ఇబ్బందులు తప్పడం లేదని చెబుతున్నారు. అంగన్వాడీ కేంద్రాల వర్కర్లు, హెల్పర్లు రెండు రోజులుగా సమ్మె చేయడంతో కేంద్రాలు వెలవెలబోయాయి. ఏదీ ఏమైన రెండు రోజులుగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెతో పలువురు ఇబ్బందులకు గురయ్యారు.
ఆకట్టుకున్న విద్యార్థినుల నృత్యాలు
బొబ్బిలి(రూరల్), జనవరి 9: విద్యార్థులు విద్యతోపాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా పాల్గొనేవిధంగా కృషి చేయాలని మండల టీడీపీ అధ్యక్షులు అల్లాడ భాస్కరరావు అన్నారు. మండలం పారాది గ్రామంలో నిర్వహించిన జన్మభూమి- మా ఊరు కార్యక్రమంలో బుధవారం విద్యార్థినులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పూర్తిస్థాయిలో విద్యపైనే దృష్టిసారించకుండా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా పాల్గొంటే ప్రభుత్వం వారికి అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ఉపాధ్యాయులు వీటిపై ప్రత్యేక శ్రద్ధతీసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి పలువురు ఆకట్టుకున్నారు. భవిష్యత్‌లో కూడా మరిన్ని కార్యక్రమాలలో పాల్గొనాలని పలువురు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చంద్రమ్మ, హెచ్‌డీటీ సాయికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

పదవ తరగతిలో శతశాతం ఉత్తీర్ణత సాధించాలి

0
0

నెల్లిమర్ల, జనవరి 9: పదవ తరగతి పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించాలని డిప్యూటీ డిఇవొ ఎ.వి.సత్యనారాయణ అన్నారు. బుధవారం మొయిద ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ డి ఇవొ మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పరుచుకుని దాన్ని సాధించాలని అన్నారు. విద్యార్థులు మెళకువలు పాటించి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చు అని చెప్పారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రాజశేఖర్ పరీక్షలకు సంసిద్ధతపై మెళకువలు చెప్పారు. అలాగే వై.రజిని, ఎం. అప్పలనాయుడు, జి.వి.వి. ఎస్. ఎన్.రాజు, జి.వి.ప్రశాంత్‌కుమార్, వివిధ సబ్జెకుట్లపై విద్యార్థులకు మెళకువలు నేర్పించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ ఎం ఎం. శ్రీనివాసరావు, పిడి తవిటియ్య, పి ఇటి ఎం. సూర్యనారాయణ, డి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఆరుబయట మద్యం సేవించిన వారిపై కఠిన చర్యలు తప్పవు
బొబ్బిలి, జనవరి 9: ఆరుబయట మద్యం సేవించిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఏఎస్పీ గౌతమిశాలి అన్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పట్టణ పరిధిలో పలు ప్రాంతాల్లో ఆరుబయటే మద్యం సేవించడంతోపాటు అక్కడే వ్యర్థపదార్ధాలను విడిచిపెడుతున్న సమాచారం అందిందన్నారు. ఈ మేరకు వీటిపై పటిష్టమైన నిఘా పెడుతున్నామని, ఇటువంటివారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే షాపుల యజమానులపై కూడా చర్యలుంటాయన్నారు. పండగ సందర్భంగా నిఘా విభాగాన్ని మరింత ముమ్మరం చేస్తున్నామన్నారు. ప్రధాన కూడలిలో పోలీస్‌బందోబస్తును ఎక్కువగా చేస్తున్నామన్నారు. ప్రధాన రహదారిలో బందోబస్తును ఏర్పాటుచేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చేస్తున్నామన్నారు. తోపుడుబళ్లు ఒకే దగ్గర ఉంచకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. ఎవరైన పై ప్రాంతాలకు వెళ్లేటప్పుడు పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందిస్తే ఆ ఇంటిపై ప్రత్యేక దృష్టిసారిస్తామని పేర్కొన్నారు. రాత్రి సమయంలో గస్తీని మరింత పెంచుతున్నామన్నారు. అలాగే మహిళలు, పిల్లలను వేధింపులకు గురిచేసినవారిపై కూడా కఠిన చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా మహిళారక్షక్ కో- ఆర్ఢినేటర్లు కళాశాలలు, పాఠశాలలకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నారన్నారు. కుటుంబ కలహాలు, ఎటువంటి ఇబ్బందులు ఇచ్చిన మహిళారక్షక్‌కు ఫిర్యాదుచేస్తే సాధ్యమైనంతవరకు వారి సమస్యను పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రతీ పోలీస్‌స్టేషన్‌లోను మహిళా కో- ఆర్ఢినేటర్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ మోహనరావు పాల్గొన్నారు.

కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న మోడీ ప్రభుత్వానికి పతనం తప్పదు
బొబ్బిలి, జనవరి 9: మోడీ ప్రభుత్వానికి పతనం తప్పదని ఐద్వా జిల్లాకార్యదర్శి ఇందిర జోష్యం చెప్పారు. కార్మిక వ్యితిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్ర ప్రభుత్వం పనితీరు పట్ల బుధవారం వివిధ కార్మిక సంఘాలు ఆర్టీసి కాంప్లెక్స్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా కార్యదర్శి ఇందిర మాట్లాడుతూ కార్మికులకు నష్టం చేకూర్చేసంస్కరణలను ప్రభుత్వం అమలుచేస్తుందన్నారు. దీంతోపాటు ఆశ, అంగన్వాడీ తదితర కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తుందన్నారు. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రతలు కల్పించలేని ప్రభుత్వాలు వీటిని ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు. ఈమేరకు సీపీఎం నాయకులు శంకరరావు, సీపీఐ నాయకులు కోట అప్పన్నలు మాట్లాడుతూ కార్మికుల హక్కులను హరించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని, వీటిని తిప్పికొట్టాలన్నారు. కార్మికులంతా ఐక్యమత్యంతో పోరాటాలుచేసి మోడీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీటు, ఏఐటీయుసీ, సీపీఎం, సీపీఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు.

విద్యార్థులు అరాచకాలు, అన్యాయాలను ఎదురించే స్వభావాన్ని పెంపొందించుకోవాలి
బొబ్బిలి, జనవరి 9: విద్యార్థులు, యువకులు అరాచకాలు, అన్యాయాలను ఎదురించే స్వభావాన్ని పెంపొందించుకుని తద్వారా మంచి పౌరులుగా గుర్తింపు పొందాలని ఏఎస్పీ గౌతమిశాలి అన్నారు. రాష్ట్రీయ గరిమ అభియాన్(న్యూఢిల్లీ) ఆధ్వర్యంలో చిన్నపిల్లలు, మహిళలపై జరుగుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న డిగ్నిటీ మార్చ్ కార్యక్రమాన్ని స్థానిక రాజా కళాశాలలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎటువంటి కష్టనష్టాలు, ఇబ్బందులు వచ్చిన ఎదుర్కొనే స్వభావాన్ని కలిగి ఉండాలన్నారు. అలాగే ఈవ్‌టీజింగ్‌తోపాటు ఎటువంటి వేధింపులకు గురిచేసిన మహిళారక్షక్ విభాగాన్ని సంప్రదించాలని కోరారు. మహిళారక్షక్ విభాగానికి సంబందించిన ఫోన్‌నెంబర్లను దగ్గర ఉంచుకోవాలన్నారు. ఈసందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ మాట్లాడుతూ పిల్లలు విద్యతోపాటు అన్నిరకాల శిక్షణలు పొంది ఉండాలన్నారు. సమాజంలో పెరుగుతున్న అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ముందుకురావాలన్నారు. మానసిక ధైర్యాన్ని పెంపొందించుకోవల్సిన అవసరం ఉందన్నారు. ఈమేరకు రాష్ట్రీయ గరిమ అభియాన్ కో- ఆర్ఢినేటర్లు సంగీత, అంకిత, రీనాలు మాట్లాడుతూ వివిధ ప్రాంతాల్లో డిగ్నిటీ మార్చ్ ఏర్పాటుచేస్తున్నామని, తద్వారా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. అలాగే బాధితులతో కూడా తమ అనుభవాలను వివరింపచేస్తున్నామని స్పష్టం చేశారు. వివిధ ప్రాంతాల్లో వేధింపులకు గురైన బాధితుల యొక్క అనుభవాలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కో- ఆర్ఢినేటర్ వీరంద్రకుమార్, ఎన్‌ఎస్‌ఎస్ పీఓ రవి, చిరంజీవులు, ఈశ్వరరావు, ఉమామహేశ్వరరావు, రామారావు, శైలజ, తదితరులు పాల్గొన్నారు.

దొంగల పార్టీని ఆదరిస్తే రాష్ట్రం అధోగతే!

0
0

గజపతినగరం, జనవరి 9: దొంగలపార్టీ అయిన వైసీపీ అధినేతలను ఆదరిస్తే రాష్ట్రం పరిస్ధితి అధోగతి పాలవుతుందని రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. బుధవారం మెంటాడ మండలం గుర్లతమ్మిరాజుపేటలో సుమారు 6.73కోట్ల అభివృద్ది పనులకు మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రారంభోత్సవం చేశారు. వంతెన, సిసిరోడ్లు, అంగన్వాడీ భవనం జాతికి అంకితం చేశారు. అనంతరం జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. 28 రాష్ట్రాలలో 12వేల కిలోమీటర్లు సిసి రోడ్లు నిర్మాణం జరిగితే ఒక ఆంధ్ర రాష్ట్రంలో 25వేల కిలోమీటర్లు సిసి రోడ్లు వేయడం జరిగిందన్నారు. రాష్రంలో 90శాతం సిసి రోడ్లు నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. 36 ఏళ్ల కిందట పక్కా ఇళ్ళు, సామాజిక ఫించన్లు తొలిసారి ప్రవేశపెట్టిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదని అన్నారు. రెండు లక్షల ఒంటరి మహిళలకు ఫించన్లు అందిస్తున్నట్లు చెప్పారు. 54లక్షల సామాజిక ఫించన్లు రాష్ట్ర వ్యాప్తంగా అందించి బడుగులకు ఆపన్నహస్తం అందించారని అన్నారు. నాలుగున్నరేళ్లలో 20లక్షల ఇళ్ళు మంజూరు చేసినట్లు చెప్పారు. 18వేల కోట్లు లోటు బడ్జెట్ ఉన్నా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు దృష్ట్యా రాష్ట్రాన్ని అభివృద్ధిపధంలో నడిపిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగ అభివృద్దికి రాయితీ యంత్రాలు అందిస్తున్నామని తెలిపారు. ప్రతికుటుంబానికి నెలసరి ఆదాయం పదివేలు వచ్చేవిధంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. ఇందులో భాగంగా పాడి పశువులు పంపిణీ, కులవృత్తులవారికి ఆదరణ పధకం ద్వారా పనిముట్లు అందిస్తున్నట్లు చెప్పారు. పదిలక్షల మంది యువతకు నిరుద్యోగ భృతి అందించనున్నట్లు తెలిపారు. పోలవరం నిర్మామణానికి ప్రతిపైసా ఇస్తానని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెట్టిన ఖర్చుకు నిధులు విడుదల చేయకపోవడం బాధాకారమని చెప్పారు. పోలవరం పూర్తయితే కోటి ఎకరాలకు సాగునీరు, 24గంటలూ విద్యుతోపాటు ఎన్నో ప్రాజెక్టులు వస్తాయని ఆ ద్వారా నిరుద్యోగ సమస్య తీరడమే కాకుండా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. 28రాష్ట్రాలలో ప్రజలకు భీమా సౌకర్యం లేకపోయినా ఏపీలో మాత్రం చంద్రన్నభీమా పధకం అమలు చేస్తూ బాధిత కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు అందించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధిపధంలో నడుపుతుంటే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో దొంగలపార్టీ (వైసీపీ) నాయకులు రాష్ట్రాన్ని దోచే ప్రయత్నం చేస్తున్నారన్నారు. జగన్ గజదొంగ అని దొంగకాకపోతే 14నెలలు జైలు శిక్ష ఎందుకు అనుభవించారని ప్రశ్నించారు. నిన్ను నమ్మం బాబూ అంటూ ప్రజలలోకి వెళుతున్న వైసీపీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబును నమ్మవలసి లేదని అన్నారు. ప్రజలు నమ్మకం విశ్వసనీయత బాబుపై ఉందని అన్నారు. మెంటాడ నుంచి ఆండ్రవరకు బిటి రోడ్లు విస్తరణకు 8కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు హామీ ఇచ్చారు. అలాగే జిల్లా పరిషత్ చైర్ పర్సన్ డాక్టర్ శోభా స్వాతిరాణి మాట్లాడుతూ గుర్ల గెడ్డ ప్రాజెక్టు, ఆండ్ర హైలెవిల్ కెనాల్ పనులను పూర్తి చేయడానికి సి ఎం చంద్రబాబు దృష్టికి తీసుకెవెళ్లి నిధులు మంజూరు చేయిస్తామని అన్నారు. అనంతరం సిపి ఎం జిల్లా సహాయ కార్యదర్శి రాకోటి రాములు ప్రాజెక్టు పనులు పూర్తి చేయుటకు నిధులు మంజూరు చేయాలని, ఔట్ సోర్సింగ్ పోస్టులను రెగ్యులర్ చేయాలని జిల్లా ఎస్ ఎఫ్ ఐ నేత కాంతారావుమంత్రికి వినతులు అందజేశారు. కార్యక్రమంలో ఎమెల్శీలు గుమ్మడి సంధ్యారాణి, ద్వారపురెడ్డి జగదీష్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడు, జెసి వెంకటరమణారెడ్డి, ఏజేసీ-2 శీతా రామారావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కరణం శివరామకృష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు చలుమూరి వెంకటరావు, గొర్లె ముసలినాయుడు, సీనియర్ నేత కొల్లా రామలింగేశ్వరరావు, ఎంపిడివొ గంటా వెంటరావు, తహశీల్ధార్ ఎర్నానాయుడు వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.

వచ్చేది రాజన్న రాజ్యం
గజపతినగరం, జనవరి 9: ప్రజలు ఎదురు చూస్తున్న రాజన్న రాజ్యం తొందరలోనే వస్తుందని మాజీ జెడ్పీటీసీ గార తవుడు, మండల పార్టీ అధ్యక్షుడు బూడి వెంకటరావులు అన్నారు. బుధవారం ఇచ్చాపురానికి వెళుతున్న యాత్ర బస్సును తవుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యలను తెలుసుకోనేందుకు నాలుగు నెలల కిందట ఈ సుదీర్ఘ పాదయాత్రను జగన్ ప్రారంబించారని తెలిపారు. చంద్రబాబు పాలనతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. నవరత్నాల పధకాలు ప్రజలకు వరంటాంటివని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొని జగన్‌కు అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు బెల్లాన త్రినాధరావు, పొట్నూరు పుష్పనాధం, లెంక గణేష్ తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమం అభివృద్ది చంద్రబాబు ధ్యేయం
గజపతినగరం, జనవరి 9: సంక్షేమం అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్యేయమని స్ధానిక ఎంపిపి గంట్యాడ శ్రీదేవి అన్నారు. బుధవారం మండలంలోని మధుపాడ, గంగచోళ్లపెంట గ్రామాలలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమం జరిగింది. మధుపాడలో జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ సంక్షేమ పధకాల కోసం అర్హులు జన్మభూమిలో అధికారులకు ధరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. రేషన్‌కార్డులు, ఫించన్లు, ఎన్టీ ఆర్ ఇళ్లు కోసం ధరఖాస్తులు చేసుకోవాలని కోరారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నా సంక్షేమ పధకాలను ఆత్మస్ధర్యంతో ప్రభుత్వం ముందుకు తీసుకెళుతుందన్నారు. అధికారులు కూడా చిత్తశుద్ధితో పనిచేస్తూ అభివృద్దికి తోడ్పాటును అందిస్తున్నారని చెప్పారు. ఎన్టీ ఆర్ వైద్యసేవ ఖర్చును ఐదు లక్షలకు పెంచడంతోపాటు గృహనిర్మాణాలకు లక్షన్నర నుండి రెండున్నర లక్షలకు గృహవ్యయాన్ని పెంచడం జరిగిందన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి రావి శ్రీధర్, సిహెచ్ సి చైర్మన్ మిత్తిరెడ్డి వెంకటరమణ, ఎ ఎంసి వైస్ చైర్మన్ లెంక బంగారునాయుడు, తహశీల్ధార్ బి.శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా మండలంలోని గంగచోళ్లపెంట గ్రామంలో జరిగిన జన్మభూమి- మా ఊరు కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి బి. మోహనరావుపాల్గొని ప్రసంగించారు. సమస్యలు ప్రజలు వివరించి పరిష్కరించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవొ ఎం.ప్రకాశరావు, ఇవొ పీ ఆర్డీ జనార్థనరావు, వైస్ ఎంపీపీ కనకల పోలినాయుడు తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా శ్రీనివాసుని ఆలయం వద్ద గోపూజ
గజపతినగరం, జనవరి 9: గజపతినగరంలోని బజారు జంక్షన్‌లో గల శ్రీరామక్షేత్రం ఆవరణలో బుధవారం గోపూజ వైభవంగా నిర్వహించారు. ధనర్మాస ఉత్సవాలలో భాగంగా ఆలయ అర్చకులు పీసపాటి శ్రీనివాసాచార్యులు తెల్లవారు జామున సుప్రభాత సేవ, సేవా కాలం తదితర కార్యక్రమాలు జరిపారు. ఉదయం ఏడుగంటలకు గోపూజ జరిపారు. పరిసర ప్రాంతాలలోని భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

జిల్లా కేంద్రంలో కేన్సర్ ఆసుపత్రి
గజపతినగరం, జనవరి 9: జిల్లా కేంద్రానికి కేన్సర్ ఆసుపత్రి మంజూరు అయిందని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయ అధికారిణి డాక్టర్ ఉషశ్రీ అన్నారు. బుధవారం మండలంలోని గంగచోళ్లపెంట, మధుపాడ గ్రామాలలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఏర్పాటు చేసిన వైద్యశిభిరాలను పరిశీలించిన ఆమె మాట్లాడుతూ కేన్సర్ రోగులు రోజురోజుకు పెరుగుతున్న నేపధ్యంలో అవసరం రీత్యా ఇక్కడ ఆసుపత్రి ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అలాగే అందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపించగా మంజూరు చేయడం జరిగిందన్నారు. గజపతినగరం ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిలో రక్తనిధి నిల్వ కేంద్రం మంజూరు అయిందన్నారు. ఇప్పటికీ రక్తనిధి నిల్వకేంద్రంకు సంబందించిన పరికరాలు అన్ని ఆసుపత్రిలో ఏర్పాటు చేయడానికి సిద్దంగా ఉన్నాయని తెలిపారు. ఈ నెలాఖరులోగా వాటిని ఏర్పాటు చేసి కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. గ్రామాలలో ఇంకా మిగిలి ఉన్న దివ్యాంగులును గుర్తించి వారికి సదరం సర్ధిపికేట్లును జారీ చేయడం ద్వారా ఎన్టీ ఆర్ భరోసా పించన్లు మంజూరు చేసే అవకాశం ఉందన్నారు. ఇందుకోసం గ్రామాలలో గల ఆరోగ్యకార్యకర్తలు ద్వారా సర్వే చేపట్టి ఆ వివారాలను సేకరించాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

కార్మికవ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి
గజపతినగరం, జనవరి 9: కార్మిక విధానాలను ప్రతిఘటించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గొర్లె శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా రెండువ రోజు గజపతినగరంలోని నాలుగురోడ్లు జంక్షన్‌లో రాస్తారోకో నిర్వహించారు. సుమారు అర్ధగంటపాటు రాస్తారోకో నిర్వహించి నినాదాలు చేస్తూ బైఠాయించారు. దీంతో భారీగా వాహనాలు నిలిపోయాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనీస వేతనం చట్టం ప్రకారం 18వేల రూపాయల వేతనం ఇవ్వాలని అన్నారు. అలాగే సమానపనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీమ్‌కోర్టు తీర్పును అమలు చేయాలని తెలిపారు. రైల్వే టెలికం, పోస్టల్, భీమారంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అరికట్టాలని అన్నారు. కార్మిక, రైతులకు సామాజిక భద్రత కల్పించేవిధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి వి.లక్ష్మి, ఎం. చంద్రయ్య, సి ఐటియు డివిజన్ నాయకులు పురం అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి
గజపతినగరం, జనవరి 9: విద్యార్ధులు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని గజపతినగరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సింహ ప్రసాద్ కోరారు. బుధవారం గజపతినగరం ఎస్సీ కాలనీలోగల ప్రాధమిక పాఠశాల ఆవరణలో వారం రోజులపాటు ఎన్ ఎస్ ఎస్ క్యాంపు నిర్వహించి వివిద రకాల కార్యక్రమాలు జరిపారు. ముగింపుసభలో ఆయన మాట్లాడుతూ విద్యార్ధి దశనుంచే సేవాకార్యక్రమాలతోపాటు నైతిక విద్యను అవలంబించాలని తెలిపారు. అంతకు ముందు పాలవెల్లి కంటి ఆసుపత్రివారి ఆధ్వర్యంలో ఉచిత టెస్టింగ్ చేపట్లారు. వందమంది విద్యార్ధులతోపాటు 30మంది కాలనీవాసులకు పరీక్షలను నిర్వహించారు. ఐదుగురు రోగులను ఆపరేషన్‌కు గుర్తించారు. కార్యక్రమంలో అధ్యాపకులు ఎం.మధుసూదనరావు, తదితరులు పాల్గొన్నారు.

నాణ్యమైన భోజనం అందించాలి
* ఎపి ఫుడ్ కమిషన్ వెంకటరావు
నెల్లిమర్ల, జనవరి 9: నవప్రయాస్ ఏజెన్సీ ద్వారా నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందించాలని లేకుంటే ఏజెన్సీని రద్దు చేస్తామని ఎపి ఫుడ్ కమిషన్ మెంబర్ ఎల్.బి. వెంకటరావు హెచ్చరించారు. బుధవారం ఆయన నగర పంచాయతీ పరిధి కొండపేట జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనడంతోపాటు నవప్రయాస్ ఏజెన్సీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవప్రయాస్ ఏజెన్సీ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించకుంటే ఏజెన్సీలను రద్దు చేస్తామని హెచ్చరించారు. బియ్యం కూడా నాశిరకంగా ఉన్నాయని, అలాగే ఫుడ్ పరిమాణం కూడా తక్కువగా ఉందని అన్నారు. 48మిల్లీ గ్రాములు ఫుడ్ పరిమాణం ఉండాలని తెలిపారు. అలాగే నాణ్యమైన బియ్యం ఉపయోగించాలని అన్నారు. విద్యార్థులకు మెనూ విధిగా పాటించి రుచికరమైన భోజనం అందించాలని చెప్పారు. ఆహారభద్రత చట్టప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించకుంటే ఏజెన్సీని రద్దు చేస్తామని అన్నారు. విశాఖలో నిర్వహిస్తున్న అక్షయపాత్ర, ఇస్కాన్ ఏజెన్సీల్లాగ రుచికరమైన భోజనాన్ని అందించాలని అన్నారు. 2013లో జాతీయ ఆహారభద్రతా చట్టం చేశారని, దీని ప్రకారం రేషన్ షాపులు, అంగన్‌వాడీ కేంద్రాల్లో, అలాగే మధ్యాహ్న భోజనం సక్రమంగా అందకుంటే కమిషన్‌కు ఫిర్యాదు చేస్తేచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నవప్రయాస్ ఏజెన్సీ ప్రతినిధి దినేష్ మాట్లాడుతూ పాఠశాలల నుంచి బియ్యం తెచ్చి వంట చేయడం వలన పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రభుత్వం ఒకే రకం బియ్యం అందిస్తే బాగుంటుందని అన్నారు. ఏజెన్సీల్లో జరుగుతున్న తప్పులను సరిచేసుకుంటామని చెప్పారు. అలాగే 48గ్రాముల పరిమాణంగల గుడ్లును విద్యార్థులకు అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో ఏ ఎస్‌వొ రాజు, తహశీల్దార్ శర్మ, ఎం ఇవొ కృష్ణారావు, సి ఎస్ డిటి జగన్ తదితరులు పాల్గొన్నారు.

పారిశుద్ధ్య మహిళా కార్మికులను నియమించాలని ధర్నా

0
0

అనకాపల్లి టౌన్, జనవరి 9: పట్టణ జనాభాకు అనుగుణంగా మహిళా పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు అధ్వర్యంలో బుధవారం మహిళా కార్మికులు దీక్షలు నిర్వహించారు.సిఐటియు నాయుకులు పిఎన్‌వి పరమేశ్వరరావు, సిపిఎం నియోజకవర్గ కన్వీనర్ ఎ బాలకృష్ణలు దీక్షాశిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పట్టణంలో జనాభాకు అనుగుణంగా మహిళా పారిశుద్ధ్య కార్మికులు అవసరం ఉందని గతంలోఈ సమస్యను ఎమ్మెల్యేకు విన్నవించినా ఇప్పటి వరకు స్పందించలేదన్నారు. పలితంగాప్రస్తుతం ఉన్న మహిళాకార్మికులపై పని వత్తిడి పెరిగి పూర్తిస్థాయిలో పారిశుద్ధ్య పనులు నిర్వహించలేని పరిస్థితి ఉందన్నారు. గతంలో 250మంది పర్మినెంట్ కార్మికులు నేడు 125మంది ఉన్నారన్నారు. పూర్తిస్థాయిలో కార్మికులను నియమించాలని డిమాండ్ చేసారు. ఈ దీక్షలో ఎన్ ప్రేమజ్యోతి, ఎస్ సుగుణ, బి దేవి, సిహెచ్ తులసీ, ఎస్ రామలక్ష్మి, బి కృష్ణవేణి, జె జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకే పాదయాత్ర
కోటవురట్ల, జనవరి 9: మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలను స్వయంగా తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు పాదయాత్ర చేపట్టినట్లు పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత తెలిపారు. పాదయాత్రలో భాగంగా బుధవారం ఎమ్మెల్యే పి.కొత్తపల్లి, బోడపాలెం, కొత్తూరు, పాములవాక, నీలికుంట గ్రామాల్లో పర్యటించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా తన హయాంలో నియోజకవర్గాన్ని అభివృద్ది చేసామన్నారు. ప్రజల కష్టా సుఖాలను తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో ఈకార్యక్రమం చేపట్టానన్నారు. సుమారు 250 కిలో మీటర్ల పాదయాత్ర ఈనెల 10తో ముగుస్తుందన్నారు. జల్లూరులో జరిగే ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి చినరాజప్ప, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి అయ్యన్నపాత్రుడు పాల్గొంటారని తెలిపారు. ఈకార్యక్రమంలో మండల దేశం పార్టీ అధ్యక్షులు లాలం కాశీనాయుడు, టీడీపీ నాయకులు వేచలపు జనార్ధన్, జీరెడ్డి నానిబాబు, చిటికెల సత్యనారాయణ పాల్గొన్నారు.

అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
కోటవురట్ల, జనవరి 9: మండలంలో పాములవాకలో బుధవారం నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో విద్యార్థినీవిద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. గ్రామీణ వాతావరణంను ప్రతిబింబిచే బించే నృత్య గీతాలు, నాటికలు, ఆకట్టుకున్నాయి. అనంతరం నిర్వహించిన గ్రామసభలో మాజీ సర్పంచ్ కిల్లాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ అర్హులకు కార్పొరేషన్ రుణాలు ఎందుకు మంజూరు చేయలేదంటూ అధికారులను నిలదీసారు. దీనిపై శ్రీనివాసరావు, టీడీపీ నాయకుడు జనార్ధన్ మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఈకార్యక్రమంలో పాల్గొన్న పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ దరఖాస్తులు అధిక సంఖ్యలో రావడం వలన అర్హులరందరికీ మంజూరయ్యే అవకాశం తక్కువగా ఉంటాయన్నారు. మంజూరు కాని వారు మరలా దరఖాస్తు చేసుకుంటే మంజూరుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈకార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి డాక్టర్ వి.శ్రీ్ధర్, ఎడీవో కళ్యాణి, ఎం ఆర్ ఓ లక్ష్మి, ఇ ఓ ఆర్‌డీ ప్రభాకర్‌రావు, వెలుగు ఎపీ ఎం కరుణానిధి, ఇ ఓ సోమశేఖర్ పాల్గొన్నారు.

గ్రామాలే అభివృద్దికి పట్టు కొమ్మలు
కొయ్యూరు, జనవరి 9: గ్రామాలే దేశాభివృద్దికి పట్టుకొమ్మలనే నినాదాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు గ్రామాల ప్రాంతాల అభివృద్దికి ఎనలేని కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే ఈశ్వరి పేర్కొన్నారు. మండలంలోని నల్లగొండ, రావణాపల్లి, ఎం.మాకవరం గ్రామాల్లో బుధవారం జరిగిన జన్మభూమి మావూరు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలను టీడీపీ ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ఏజన్సీ ప్రాంతంలోని అత్యంత మారుమూల గ్రామాలైన ఎం. భీమవరం, యు.చీడిపాలెం, బూదరాళ్ళ, బలపం తదితర మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలకు సైతం రహదారులను నిర్మిస్తూ ఆయా గ్రామాల్లో వీధుల్లో సీసీ రోడ్లు, తాగునీటి పథకాలను నిర్మించడం జరిగిందన్నారు. ఒక పక్క లబ్దిపొందుతూనే ప్రభుత్వాన్ని, పార్టీని విమర్శించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రతీ ఒక్కరూ ఆనందంగా ఉండాలనే తలంపుతో అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం రూపొందించి అమలు చేస్తుందన్నారు. వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆర్.డబ్ల్యు ఎస్ ఎస్ ఇ రవికుమార్ మాట్లాడుతూ ఇళ్ళను, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులు దరి చేరవన్నారు. ఈకార్యక్రమాల్లో మాజీ జెడ్పీటీ చైర్మెన్ వి. కాంతమ్మ, ఎంపీపీ సత్యనారాయణ, జెడ్పీటీసీ శ్రీరామ్మూర్తి, పాడేరు, చింతపల్లి ఎ ఎంసీ చైర్మెన్లు విజయరాణి, చిట్టిబాబు, ప్రత్యేకాధికారి పార్వతమ్మ, ఆర్.డబ్ల్యు ఎస్ డీ ఇ వై.వి.రమణ పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.

చట్ట విరుద్ద టెంట్లపై చర్యలు తీసుకోవాలి

0
0

అరకులోయ, జనవరి 9: అరకులోయ పరిసర ప్రాంతాలలో చట్టవిరుద్ధంగా టెంట్లు ఏర్పాటు చేసి పర్యాటకులను అడ్డంగా దోచుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని సి.పి.ఎం. నాయకుడు కిల్లో సురేంద్ర కోరారు. బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఆర్.డుంబ్రిగుడ, పాణిరంగిని, సుంకరమెట్ట జంక్షన్, పద్మాపురం తదితర ప్రాంతాలలో మైదాన ప్రాంతాలకు చెందిన కొందరు అనధికారికంగా టెంట్లు ఏర్పాటుచేసి పర్యాటకులకు అద్దెకు ఇస్తూ సొమ్ము చేసుకుంటున్నారని చెప్పారు. స్థానికుల సహకారంతో మైదాన ప్రాంతవాసులు టెంట్‌లను ఏర్పాటు చేసి పర్యాటకులను దోచుకుంటున్నా అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండడం తగదని ఆయన అన్నారు. బహిరంగ ప్రదేశాలలో సాగు భూములలో వీటిని ఏర్పాటు చేస్తుండడం వలన ఇందులో బస చేసేవారికి ఎటువంటి రక్షణ కూడా లేకుండా పోతుందని ఆయన చెప్పారు. టెంట్లను అద్దెకు తీసుకుని బస చేసే పర్యాటకులు రాత్రిళ్లు మత్తుపానీయాలు సేవించి వినోద కార్యక్రమాలతో అలజడి సృష్టిస్తున్నారని, దీంతో చుట్టుపక్కల వారి ప్రశాంతతకు భంగం కలుగుతుందని ఆయన అన్నారు. అరకులోయలో లక్షలాది రూపాయలు వెచ్చించి లాడ్జింగ్‌లు, రిసార్ట్స్‌లు నిర్మించుకుని వ్యాపారాలు సాగింగే వ్యాపారస్తులకు కూడా ఈ టెంట్ల వలన నష్టపోవలసి వస్తోందని ఆయన చెప్పారు. చట్టవిరుద్ధంగా, అనధికారికంగా నిర్వహిస్తున్న టెంట్ల వ్యవహారంపై ఇటీవల లాడ్జింగ్‌లు, రిసార్ట్స్‌ల నిర్వాహకులు అధికారులకు పిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం సరికాదని ఆయన అన్నారు. అనధికారికంగా నిర్వహిస్తున్న టెంట్లపై చర్యలు తీసుకుని పర్యాటకులకు రక్షణ కల్పించాలని సురేంద్ర కోరారు.
ఖజానా అధికారుల ఆంక్షలపై నేడు ధర్నా
పాడేరు, జనవరి 9: గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల జీతాలను మంజూరు చేయడంలో అర్థరహితమైన ఆంక్షలు విధిస్తున్న ఖజానా అధికారుల తీరును నిరసిస్తూ ఈనెల 10న మధ్యాహ్నాం పాడేరు, అరకులోయ, చింతపల్లి ఉప ఖజానా కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్టు గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయ సంఘం నాయకులు రేగం సూర్యనారాయణ, కె.రామారావు, టి.లింగమూర్తి తెలిపారు. బుధవారం వారు విలేఖరులతో మాట్లాడుతూ జి.ఒ.నెంబరు 132 ప్రకారం ఆశ్రమ పాఠశాలల ప్రదానోపాధ్యాయుల అధికారాలను ప్రభుత్వం తొలగించి గిరిజన సంక్షేమ శాఖ సహాయ అధికారులకు బదలాయించిందని చెప్పారు. దీంతో ఏజెన్సీ వ్యాప్తంగా ఆశ్రమాల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి గత రెండు నెలలుగా జీతాలు నిలిచిపోయినట్టు వారు పేర్కొన్నారు. అయితే తమ సంఘం నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలతో ప్రభుత్వం జి.ఒ.నెంబరు 132 అమలును నిలిపివేసి ఆశ్రమాల ప్రదానోపాధ్యాయులకు అధికారాలను అప్పగించినట్టు వారు తెలిపారు. దీంతో ఆశ్రమాల ప్రదానోపాధ్యాయులు తమ సిబ్బంది జీతాల బిల్లులను ఖజనా కార్యాలయాలకు సమర్పించినా ఖజానా అధికారులు వీటిని మంజూరు చేయకుండా అర్థరహితమైన ఆంక్షలతో నిలిపివేసినట్టు వారు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయులు, సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్నా విశాఖ జిల్లాలో మాత్రమే నిలిపివేయడం పట్ల వారు నిరసన వ్యక్తం చేసారు. ఖజానా అధికారుల తీరును నిరసిస్తూ పాడేరు, అరకులోయ, చింతపల్లి ఉప ఖజానా కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహిస్తున్నామని, ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.

రెండోవ రోజు కేంద్ర రాష్ట్రాలుపై నిరసన హోరు
*కనీస వేతనం 18వేలు అమలుచేయాలి *అర్డీవో కార్యాలయం ముట్టడి
అనకాపల్లిటౌన్, జనవరి 9: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల కష్టాన్ని దోచుకుంటూ కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి కె లోకనాధం, సిఐటియు డివిజన్ అధ్యక్షులు పిఎన్ పరమేశ్వరరావులు ఆరోపించారు.కార్మికుల సమస్యలు పరిష్కరించాలని దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా రెండోవ రోజు బుధవారం సిఐటియు అధ్వర్యంలోనిర్వహించిన భారీ ర్యాలీలో వేలాధి సంఖ్యలో కార్మికులు పాల్గొని కేంద్ర రాష్ట్రప్రభుత్వాలుపై నిరసన తెలుపుతూ పట్టణప్రధాన మార్గాల్లో ర్యాలీ నిర్వహించారు. స్థానిక నెహ్రూచౌక్ కూడలిలో మానవహారం నిర్వహించి అర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు.ఈ సందర్బంగా సిపిఎం జిల్లా కార్యదర్శి కె లోకనాధం మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను ఆమలుచేయకుండా వారి జీవితాలతో ఆడుకుంటున్నాయన్నారు. సమాన పనికి సమాన వేతనంపై కేంద్రం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో కార్మికులే తగిన గుణపాఠం చెప్పడానికి సిద్దంగా ఉన్నారని హెచ్చరించారు. సిఐటియు అనకాపల్లి డివిజన్ అధ్యక్షులు పిఎన్ పరమేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కార్మికులను, యువతను దారుణంగా మోసగించిందన్నారు.అంగన్‌వాడీ యూనియన్ నాయుకులు జి కుమారి, ఎం నాగశేషు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేయవేయడంలో కీలకపాత్ర వహిస్తున్న అంగన్‌వాడీ, ఆశ, మిడ్డేమీల్స్, వివోఏ తదితర స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌చేసారు.ఆశ యూనియన్ నాయుకులు మరిడమ్మ, ఆర్‌ఎఆర్‌ఎస్ నాయుకులు నందేశ్వరరావు, ఐకెపి వివోఎ యూనియన్ నాయుకులు లక్ష్మిప్రసన్న, విఆర్‌ఎ నాయుకులు కె నాగేశ్వరరావు, సిపిఎం నాయుకులు ఎ బాలకృష్ణ తదితరులు కార్మికుల చట్టాల అమలుపై కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు తీరును విమర్శించారు. సమ్మెలో భాగంగానే పట్టణంలోకొన్ని బ్యాంకుల సంబందించి ఉద్యోగులు మద్దతు తెలిపారు.పారిశ్ధ్యు

పెదబయలులో అధునాతన అతిధి గృహాం

0
0

పాడేరు, జనవరి 9: పెదబయలులో కోటి రూపాయల వ్యయంతో అధునాతనమైన అతిధి గృహాన్ని నిర్మించనున్నట్టు రాష్ట్ర గిరిజన సంక్షేమం, ప్రాధమిక వైద్య ఆరోగ్య శాఖల మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్ తెలిపారు. ఇందుకు సంబంధించిన అంచనాలను తయారు చేయాలని ఆయన ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పెదబయలులో పది లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన గిరిజన ఉద్యోగుల భవనాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతానికి తన తండ్రి చేసిన అభివృద్ధిని కొనసాగించి మరిన్ని కార్యక్రమాలను చేపడతామని చెప్పారు. గిరిజనాభివృద్ధికి ప్రతి ఒక్కరూ ఐక్యతతో సహకరించాలని ఆయన కోరారు. అంతకుముందు పాడేరులో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ దంపతులు లాలం భవాని, భాస్కరరావులను మంత్రి ఘనంగా సత్కరించారు. పెదబయలు మండలంలో నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వారు స్థానిక క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసారు. దీంతో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ దంపతులను దుస్సాలువాతో సత్కరించి గిరిజన ఆరాద్యదైవం మోదకొండమ్మ అమ్మవారి చిత్ర పటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో పెదబయలు ఎం.పి.పి. ఉమామహేశ్వరరావు, జెడ్పీటీసీ గంగాభవాని, మాజీ మంత్రి మత్స్యరాస మణికుమారి, గిరిజన ఉద్యోగుల సంఘం నాయకులు కుడుమల కాంతారావు, చిట్టపులి శ్రీనివాస్ పడాల్, మర్రిచెట్టు అప్పారావు, పలువురు అధికారులు, దేశం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా ముగిసిన కార్మిక సమ్మె
అరకులోయ, జనవరి 9: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారం ప్రశాంతంగా ముగిసింది. మండల వ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, కార్మికులు రెండు రోజులుగా విధులను బహిష్కరించి సమ్మె చేపట్టి నిరసన వ్యక్తం చేసారు. సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్రమోడి, ముఖ్యమంత్రి చంద్రబాబు శవయాత్రలను నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. పట్టణంలో రాస్తారోకో, ర్యాలీ చేపట్టారు. కార్మికుల సమ్మె కారణంగా రెండో రోజు కూడా పర్యాటక కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పద్మాపురం, కొత్తవలస ఉద్యానవన కేంద్రాలు, గిరిజన సంస్కృతి మ్యూజియం మూతపడ్డాయి. సమ్మెలో భాగంగా మ్యూజియం ఎదుట కార్మికులంతా బైఠాయించి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసారు. కార్యక్రమంలో సి.పి.ఎం. నాయకుడు కిల్లో సురేంద్ర, సి.ఐ.టి.యు. కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు, అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు, మధ్యాహ్నా భోజన పథకం నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

కార్మిక అవతారంలో కార్యదర్శి
అరకులోయ, జనవరి 9: మండలంలోని పెదలబుడు పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో ఈ పంచాయతీ కార్యదర్శి అచ్యుతరావు బుధవారం కార్మిక అవతారం ఎత్తారు. గత రెండు రోజులుగా కార్మికులు విధులు బహిష్కరించి సమ్మె చేస్తుండడంతో అరకులోయ పట్టణంలో చెత్త చెదారాలు పేరుకుపోయి అపారిశుధ్యం నెలకొంది. దీంతో పారిశుధ్యం అధ్వాన్నంగా ఉందని గుర్తించిన కార్యదర్శి తానే స్వయంగా పంచాయతీ కార్యాలయం, ప్రధాన రహదారులలో పేరుకుపోయిన చెత్తను తొలగించారు. సమ్మెలో పాల్గొంటున్న పారిశుధ్యం సిబ్బంది రెండో రోజు విధులకు హాజరవుతారని భావించిన ఆయన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా కార్మికుల రాకకోసం ఎదురుచూసారు. అయితే రెండో రోజు కూడా కార్మికులు విధులకు హాజరుకావడం లేదని తెలుసుకున్న కార్యదర్శి తప్పనిసరి పరిస్థితులలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చెత్తను తొలగించాల్సి వచ్చింది.

చలికి తట్టుకోలేక వృద్ధురాలు మృతి
అరకులోయ, జనవరి 9: ఎముకలు కొరికే చలిగాలులకు తట్టుకోలేని గిరిజన వృద్ధ మహిళ బుధవారం మృతి చెందింది. మండలంలోని మాడగడ పంచాయతీ బోసుబెడ గ్రామానికి చెందిన సుంక్రి (62) చలికి తట్టుకోలేక తన ఇంటిలోనే బుధవారం మృతి చెందింది. నిద్ర నుంచి మేల్కొన్న వృద్దురాలు చలికి తట్టుకోలేక చలి మంటను వేసుకునేందుకు ప్రయత్నిస్తూ ప్రాణాలు విడిచింది.


రెడ్‌క్రాస్ సేవలను మరింత విస్తృతం చేయాలి

0
0

విశాఖపట్నం,జనవరి 9: మానవసేవే పరమావదిగా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సేవలను అందిస్తుందని, వీటి సేవలను మరింత విస్తృతం చేయాలని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈ ఎస్ ఎల్ నరసింహన్ అన్నారు. నగరంలోని ఏయూ కనె్వక్షన్ సెంటర్‌లో బుధవారం మధ్యాహ్నం రెడ్‌క్రాస్ సొసైటీలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులం,మతం,ప్రాంతీయ, భాషా, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరికీ సేవలు అందజేయడమే రెడ్‌కాస్ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ప్రతి జిల్లాలో నెలకోసారి ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి ప్రజల్లో రహదారులను శుభ్రపర్చడం, ఇంటిని శుభ్రపర్చడం వంటి కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ముఖ్యంగా రక్తదానం చేయడంతో ఎటువంటి అనారోగ్య సమస్యలు రావనే విషయంపై ప్రజల్లో ఉన్న అపోహపై అవగాహన కల్పించాలన్నారు. ఆపదలో ఉన్న పేద,మధ్య తరగతి ప్రజలను రక్షించడంలో రెడ్‌క్రాస్ కీలకపాత్ర పోషిస్తుందని, పోలీస్‌శాఖలో పనిచేస్తున్న ప్రతీ ఉద్యోగి రెడ్‌క్రాస్‌లో సభ్యునిగా చేరే విధంగా ప్రోత్సహించాలని డీజీపీకి సూచించారు. నెల్లూరులో రెడ్‌క్రాస్ క్యాన్సర్ ఆసుపత్రి అద్భుతమైన సేవలను అందిస్తోందని, పచ్చదనాన్ని పెంపొందించే కార్యక్రమాలను విరివిగా చేపట్టాలని, పచ్చదనంతో సంపూర్ణ ఆరోగ్య సాధ్యమన్న విషయాన్ని గుర్తించాలని సూచించారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ రేచల్ చటర్జీ మాట్లాడుతూ రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా రాష్ట్రంలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, రక్తదానం,సభ్యుల నమోదు,విపత్తుల సమయంలో అందించిన సేవలను పరిగణలోనికి తీసుకోని అవార్డులను అందించామన్నారు.
అదే విధంగా యువశక్తిని నిర్విర్యీం చేస్తున్న మత్తు పదార్ధాలు వద్దు అనే అంశంపై విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతలును గవర్నర్ చేతుల మీదుగా అందించారు. అలాగే రెడ్‌క్రాస్ సంస్థ అభివృద్ధికి సహకరిస్తున్న సీనియర్ ఐ ఎ ఎస్ అధికారులు, ఎల్వీ సుబ్రహ్మణ్యం,పోర్టు ట్రస్ట్ చైర్మన్ ఎంటి కృష్ణబాబు, కలెక్టర్లు కార్తికేయమిశ్రా,లక్ష్మీకాంతం,పలు స్వచ్చంద సంస్థల ప్రతినిధులకు అవార్డులతో పాటు, అత్యవసర పరిస్ధితుల్లో ప్రాణాలను సైతం కూడా పట్టించుకొకుండా సాహసాలను చేసిన ఇద్దరు యువకులకు ప్రాణ రక్ష అవార్డులను అందించారు. అనంతరం కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ వేణుగోపాల్ శాలువతో గవర్నర్‌ను ఘనంగా సత్కరించారు. ఈకార్యక్రమంలో విమాలా నరసింహన్‌తో పాటు, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల ఉన్నతాధికారులు, ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పీవీ సుధాకర్, కేజీహెచ్ సూపరిండింటెంట్ డాక్టర్ అర్జున్, ఎన్టీ ఆర్ హెల్త్ వర్శిటీ మాజీ వీసీ డాక్టర్ రవిరాజు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ముందుగా హస్యబ్రహ్మ కొరుకొండ రంగారావు అందించిన కామెడీ అందరినీ ఆకట్టుకుంది.

తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలి
* గవర్నర్ నరసింహన్
సింహాచలం, జనవరి 9: ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్.నరసింహన్ దంపతులు బుధవారం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈవో రామచంద్రమోహన్ అర్చక పరివారంతో కలిసి పూర్ణకుంభంతో గవర్నర్ దంపతులకు స్వాగతం పలికారు. కప్పస్తంభం అలింగనం చేసుకున్న గవర్నర్ దంపతులు మనసులోని కోర్కెలను స్వామివారికి నివేదించుకున్నారు. అంతరాలయంలో గవర్నర్ పేరున అర్చకులు అష్టోత్తర శతనామార్చన చేసారు. గోదాదేవి సన్నిధిలో మంగళ హారతులిచ్చారు. ఆస్థాన మండపంలో నాదస్వర వాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ అర్చకులు గవర్నర్ దంపతులను ఆశీర్వదించారు. ఈవో రామచంద్రమోహన్ గవర్నర్‌కి స్వామివారి చిత్ర పటాన్ని,ప్రసాదాలను అందించారు. ఈసందర్భంగా కలిసిన విలేఖరులతో గవర్నర్ మాట్లాడారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. భగవంతుడి కరుణతో ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్థిల్లాలని అన్నారు.

30 కిలోమీటర్లు పాదయాత్రగా వచ్చి అప్పన్న దర్శనం
సింహాచలం, జనవరి 9: సబ్బవరం మండలం లింగాలతిరుగుడు గ్రామం నుండి సుమారు 300 మంది నృసింహదీక్షలు ఆచరించిన భక్తులు 30 కిలోమీటర్లు పాదయాత్రగా వచ్చి బుధవారం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారిని దర్శించుకున్నారు. భజన సంకీర్తనలతో హరినామస్మరణ చేసుకుంటూ తొలిపావంచా చేరుకున్న దీక్షాపరులు మెట్లమార్గం ద్వారా కొండకు చేరుకున్నారు. దేవస్థానం ప్రత్యేక ప్రవేశ మార్గంలో భక్తులను దర్శనానికి పంపించారు. దీక్షాపరులంతా స్వామివారిని దర్శిచుకుని తరించారు.

కదంతొక్కిన కార్మిక లోకం

0
0

విశాఖపట్నం,జనవరి 9: కార్మిక సంఘం నాయకులంతా కదం తొక్కారు. కార్పొరేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చుతున్న మోడీ సర్కార్‌ను గద్దెదించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దేశ వ్యాప్తంగా నిర్వహించిన సార్వత్రిక సమ్మెలో భాగంగా విశాఖలో వేలాది మంది ఉద్యోగులు,కార్మికులు, కనీసవేతన సిబ్బందితో భారీ ర్యాలీ చేపట్టారు. నగరంలోని బుధవారం రెండో రోజు సమ్మెలో భాగంగా సరస్వతీ పార్కు నుంచి వుడా సెంట్రల్ పార్కు వరకూ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయుసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు మాట్లాడుతూ సంపదను సృష్టించిన కార్మికుల కడపుకొట్టి కార్పొరేట్ జేబులు నింపుతున్న ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబును వచ్చే ఎన్నికల్లో ఇంటికి పంపాలన్నారు. కార్మిక సంఘాల జోలికి వస్తే మోడీని అణిచివేయాలని పిలుపునిచ్చారు. దేశంలో25కోట్ల మంది కార్మికులు తమ హక్కుల కోసం పోరాడుతున్నారని, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టి ప్రైవేటీకరణకు పూనుకుంటున్నారన్నారు. రెండు రోజుల పాటు సమ్మె చేస్తుంటే మోడీ,బాబు చీమకుట్టిన దొంగల్లా ఉన్నారని, కార్మికుల కష్టాలపై శ్రద్దలేదున్నారు. సంపదను సృష్టించిన కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని, బుద్దిలేని వారంతా గద్దెనెక్కి వేలాది రూపాయాలు ఫించన్లు తీసుకుంటున్నారని, 60 ఏళ్లు శ్రమించిన కార్మికులకు కనీస ఫించన్ రూ.7వేలు ఇచ్చేందుకు ఈ ప్రభుత్వాలకు చేతులురావడం లేదున్నారు. బీజేపీ,టీడీపీ ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని, కనీసవేతనం రూ.18వేలు అమలు చేయాలని, కనీస పెన్షన్ ఆరువేలు చెల్లించాలని, కార్మిక చట్టాలు అమలు,ప్రైవేటీకరణ విధానాలను ఆపాలని డిమాండ్ చేశారు. సిటూ రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నర్శింగరావు మాట్లాడుతూ దేశంలో 94శాతంగా ఉన్న ఆటో,ముఠా,బిల్డింగ్, ఇంటిపనివారు, చిల్లరవర్తకుల తదితర అసంఘటితరంగ కార్మికులకు ఇ ఎస్ ఐ,్ఫ ఎఫ్, పెన్షన్‌తో కూడిన సమగ్రచట్టం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.పెట్టుబడిదారులకు దేశ సంపదను దోచిపెడుతున్నారని, కార్మికుల శ్రమకు తగిన ఫలితం ఇవ్వడం లేదని,బ్రిటిషా పాలనను తలపించే విధంగా దేశ ప్రజలను దోచుకుంటున్నారని విమర్శించారు. కేంద్ర పరిధిలో ఖాళీగా ఉన్న 14లక్షల ఉద్యోగాలను, రాష్ట్ర పరిధిలో రెండు లక్షల ఉద్యోగాలను తక్షణం భర్తీ చేయాలని,దేశంలో 21కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్న రోడ్డు రవాణ రంగాన్ని స్వదేశీ, విదేశీ బహుమతి సంస్థలకు కట్టబెట్దేదాని కోసం మోడీ ప్రభుత్వం తీసుకువస్తున్న ఎంవీ యాక్ట్ సవరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెట్రోల్,డీజీల్ ధరలను జీ ఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, చిన్న పరిశ్రమల్లో కనీస వేతనాలు అమలు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఐటీయుసీ జాతీయ ఉపాధ్యక్షుడు డి. ఆదినారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో విదేశీ పెట్టుబడులు, ప్రమాదకరమన్నారు. స్టీల్ ప్లాంట్‌కు సొంతగనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏ ఐటీయుసీ అధ్యక్షుడు పడాల రమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి బీసీహెచ్ మేసేన్, నాయకులు బేబీ, ప్రభాకర్, వెంకటరావు, అల్లుబాబురావు, ఎస్కే రెహమాన్,వామనమూర్తి, మన్మధరావు, తెడ్డు వెంకటేశ్వరరావు, సీటూ నాయకులు జగ్గునాయుడు, కుమార్,మణి,పధ్మనాభరాజు, జగన్ ఇతర అనుబంధ సంస్థల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగం కాదు ఉద్యోగాలిచ్చేలా ఎదగాలి

0
0

విశాఖపట్నం, జనవరి 9: పట్ట్భద్రులైన విద్యార్థులు ఉద్యోగాల కోసం కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగేలా కృషి చేయాలని ఢిల్లీ ఐఐటీ సంచాలకులు ప్రొఫెసర్ వీ రామ్ గోపాలరావు అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం 85,86వ సంయుక్త స్నాతకోత్సవంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ చదువుకున్న విద్యకు సార్ధకత చేకూర్చేలా విద్యార్ధులు తమ బాధ్యతను నిర్వర్తించాలన్నారు. ఐదేళ్ల పాటు చదువుకున్నారు. ఇక కళ్లు తెరిచి ప్రపంచాన్ని చూస్తూ చెవులతో ప్రపంచం తీరు వినాలని సూచించారు. ఇటీవల కాలంలో విద్యార్థులు అనూహ్యంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఒత్తిడి వారిని ఆదిశగా నడిపిస్తోందని పిస్తోందన్నారు. విశ్వవిద్యాలయాలు కూడా విద్యార్థులను ఔత్సాహికులుగా తీర్చిదిద్దేందుకు అనువుగా ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉందన్నారు. ప్రతి యూనివర్శిటీ ఒక ఇంక్యుబేషన్‌గా మారాలని సూచించారు. ప్రతి ఐదుగురిలో ఒకరు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తగా ఎదిగేందుకు కృషి చేయాలన్నారు. వికాసం కోసం వ్యక్తిత్వాన్ని చక్కగా మలచుకుంటే విజయం మీ వెంటే ఉంటుందన్నారు.
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ మాట్లాడుతూ పట్ట్భద్రులు దేశ అత్యుత్తమ మేథో సంపదలో భాగమన్నారు. దేశ అభివృద్ధి, భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనడంలో మీ వంతు భూమిక పోషించాలన్నారు. మన విద్యా సంస్ధలు విద్యను అందించడంతో పాటు మరెన్నో బాధ్యతలను సమాజం కోసం నిర్వహించాలన్నారు. వర్శిటీ విద్యార్థులు నూతన లక్ష్యాలను సాధించేందుకు, ప్రపంచ అవసరాలను తీర్చేలా సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవాలన్నారు. విద్యార్థులు పుస్తకాలను చదవడంతో పాటు నూతన చరిత్రను సృష్టించి పుస్తకాల్లో చేర్చే స్థాయికి ఎదగాలన్నారు. మీ శక్తి, జ్ఞానం, అభిరుచి దేశం కోసం వినియోగించాలని, భవిష్యత్ మీ చేతుల్లో ఉందన్న బాధ్యతను విస్మరించవద్దని హితవు పలికారు. మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వ యూనివర్శిటీల్లో పోటీ తత్వాన్ని పెంచేలా ప్రైవేటు యూనివర్శిటీలను ప్రోత్సహిస్తున్నామని, అదే సందర్భంలో ప్రభుత్వ యూనివర్శిటీల్లో వౌలిక వసతుల కల్పన, బోధన సిబ్బంది నియామకం వంటి అంశాలను మెరుగుపరుస్తున్నామన్నారు. వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ జీ నాగేశ్వర రావు మాట్లాడుతూ విశ్వవిద్యాలయం ప్రగతి మార్గంలో నడుస్తోందని, అందుకు వర్శిటీ ఆచార్యులు, పరిశోధకులు 821 పరిశోధన పత్రాలను జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురించారన్నారు. ఆంధ్రా యూనివర్శిటీ తన భాగస్వామ్యాన్ని పెంచుకుంటోందని, రక్షణ రంగంతో వర్శిటీ ఉమ్మడి కోర్సుల నిర్వహణలో ముందుందన్నారు. ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్‌లో ఏయూ 22వ స్థానాన్ని దక్కించుకుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డాక్టరేట్‌లు, మెడల్స్, డిగ్రీలు అందజేశారు. కార్యక్రమంలో వర్శిటీ రిజిస్ట్రార్ కే నిరంజన్, రెక్టార్ ప్రసాదరావు, సెంచూరియన్ యూనివర్శిటీ వీసీ జీఎస్‌ఎన్ రాజు, తదితరులు పాల్గొన్నారు.

పట్ట్భద్రులయ్యారు
* అట్టహాసంగా ఏయూ స్నాతకోత్సవం
* ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్ రామ్ గోపాలరావుకు గౌరవ డాక్టరేట్

విశాఖపట్నం, జనవరి 9: కల సాకారమైంది. కృషి, పట్టుదలతో కష్టపడి చదువుకుని, అతిధుల చేతుల మీదుగా పట్టాలందుకుంటున్న తరుణంలో విద్యార్థులు, తల్లిదండ్రుల వదనంలో అంతులేని ఆనందం. ఈ అద్భుత ఘట్టాలను ఆంధ్ర విశ్వవిద్యాలయం 85,86 స్నాతకోత్సవంలో సాక్షాత్కారమైంది. రెండేళ్ల కాలానికి గాను కట్టమంచి రామలింగారెడ్డి ఉత్సవరంగంలో బుధవారం జరిగిన స్నాతకోత్సవంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ చేతుల మీదుగా పలువురు డాక్టరేట్‌లు, మెడల్స్, ఎంఫిల్ డిగ్రీలు అందుకున్నారు. స్నాతకోత్సవం సందర్భంగా 546 మందికి డాక్టరేట్‌లు, 573 మందికి మెడల్స్, మరో ఆరుగురికి ఎంఫిల్ డిగ్రీలు ప్రదానం చేశారు. రీసెర్చ్ మెడల్స్ పొందిన వారిలో వాణి సింగర, వెలిచేటి వెంకటేశ్వరరావులకు త్రిపురనేని గోపీచంద్ మెమోరియల్ గోల్డ్ మెడల్, షేక్ మొహమ్మద్, థెహరున్సీసా బేగంలకు హిందీలో బెస్ట్ థీసెస్ గోల్డ్ మెడల్, జీ లక్ష్మి, కాంతికిరణ్ నాయుడులకు కొత్తపల్లి యామినీదేవి అవార్డురు, శే్వత కుమారి, జీపీ రామకృష్ణలకు ఆర్ వెంకటేశ్వరం రీసెర్చ్ మెడల్, అబీజ్ తెఫేర్, పులిదిండి సురేష్‌లకు వల్లభనేని రామచంద్రరావు మెమోరియల్ అవార్డులు అందుకున్నారు.
ఈ సందర్భంగా పట్టాలు, మెడల్స్ అందుకున్న విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఉల్లాసంగా ఫోటోలు తీసుకుని మురిసిపోయారు.
లేడీ గవర్నర్‌ను ఆకట్టుకున్న సెంట్రల్ పార్కు
* సాదరంగా స్వాగతం పలికిన వీఎంఆర్‌డీఏ కమిషనర్

విశాఖపట్నం, జనవరి 9: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ భార్య విమలా నరసింహన్ వీఎంఆర్‌డీఏ ప్రాజెక్టులను బుధవారం సందర్శించారు. వీఎంఆర్‌డీఏ కమిషనర్ పీ బసంత్ కుమార్ లేడీ గవర్నర్‌కు సాదర స్వాగతం పలికారు. తొలత సెంట్రల్ పార్కును సందర్శించిన ఆమెకు పార్కు విశిష్టతలను బసంత్ కుమార్ వివరించారు. సెంట్రల్ పార్కులో మ్యూజికల్ ఫౌంటెన్, సైకిల్ ట్రాక్, యోగా కేంద్రాలను సందర్శించారు. సెంట్రల్ పార్కు అందాలను చూసి మైమరచిపోయారు. అనంతరం వుడా బాలల ప్రాంగణం, గురజాడ కళాక్షేత్రం సందర్శించారు. చివరగా బీచ్‌రోడ్డులోని టీయూ-142 విమాన మ్యూజియం, కురుసుర సబ్‌మెరైన్ మ్యూజియంలను సందర్శించారు. వీటి ప్రాధాన్యతను వీసీ వివరించారు.

నగరంలో ఎన్టీఆర్ బయోపిక్ విడుదల సందడి
విశాఖపట్నం (కల్చరల్), జనవరి 9: ఆంధ్రుల అభిమాన నటుడు, నటసార్వభౌమ నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) జీవిత కథ ఆధారంగా యువరత్న బాలకృష్ణ నటించి, నిర్మించిన ఎన్‌టీఆర్ కథానాయకుడు బయోపిక్ చలనచిత్రం విడుదల సందర్భంగా నగరంలోని మెలోడీ థియేటర్ వద్ద సందడి చేశారు. తూర్పునియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఆధ్వర్యంలో అభిమానులు తమ అభిమాన నటుని చిత్రం విజయం కోరుతూ పూజలు చేశారు. అనంతరం వెలగపూడి మాట్లాడుతూ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఎన్‌టీఆర్ జీవిత కథ చిత్రంగా చూసేందుకు ఉత్సాహం చూపారన్నారు. ప్రపంచ సినీ చరిత్రలో తండ్రి జీవిత చరిత్రను తెరకెక్కించడమే కాక తానే స్వయంగా నటించి మెప్పించిన బాలకృష్ణ నట విశ్వరూపాన్ని వివరించారు. అమెరికాలో కూడా ఈ చిత్రానికి పెద్ద ఎత్తున ప్రేక్షకులు రావడం చారిత్రాత్మకంగా పేర్కొన్నారు. ఎన్‌టీఆర్ సినీ జీవితంలోని అంశాలతో విడుదలైన కథానాయకుడు, రెండో భాగం ఆయన రాజకీయ జీవితాన్ని తెరపై ఆవిష్కరించనున్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి చోడే పట్ట్భా, బైరెడ్డి పోతనరెడ్డి, కాళ్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు.

సార్వత్రిక సమ్మెకు పెన్షనర్ల సంఘం సంఘీభావం
విశాఖపట్నం (కల్చరల్), జనవరి 9: ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బుధవారం సార్వత్రిక సమ్మెకు సంఘీభావంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎల్‌ఐసీ, సెయిల్, ఆర్టీసీ, షిప్‌యార్డు తదితర ప్రభుత్వ రంగ సంస్థల్లోని విశ్రాంత ఉద్యోగులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దమనకాండను నిరసిస్తూ సత్వరం తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఉద్యమించారు. కార్యక్రమంలో ఏపీఆర్‌పీఐ ప్రతినిధులు ఎన్ రామలింగేశ్వర రావు, ఏ నారాయణ రావు, దండు నాగేశ్వర రావు, బీటీ మూర్తి, జే కోటేశ్వర రావు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

నినదించిన కార్మిక లోకం

0
0

శ్రీకాకుళం (టౌన్), జనవరి 9: కార్మిక ఉద్యోగ వర్గాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ బుధవారం కలెక్టరేట్ ఎదుట కార్మిక, ఉద్యోగ, బ్యాంక్, అంగన్వాడీ, పారిశ్రామిక వర్గాలకు చెందిన కార్మికులు పెద్ద ఎత్తున దర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసి అధ్యక్షులు హనుమంతు సాయిరాం మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా 44 కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి నాలుగు లేబర్ కోడ్‌లుగా మారుస్తుందని, ఈపి ఎప్ కనీస పెన్షన్ పెంచకపోగా ఉన్న సౌకర్యాలన తగ్గిస్తూ నిబంధనలను అమలు చేస్తుందన్నారు. పెరుగుతున్న ధరలకు అనుకూలంగా కనీస వేతనాలు పెంచడం లేదని తమ ఉద్యోగులకు రూ.18వేలు కనీస వేతనాలు ఆమోదించిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇతర కార్మిక వర్గానికి అంతటికి అదే వేతనాన్ని ప్రకటించాలన్న కోరికను తిరస్కరించడం ఎంతవరకు సమంజసమన్నారు. అదేవిధంగా స్కీం వర్కర్‌లకు కనీస వేతనాలు అమలు చేయడం లేదని ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌లకు దారాదత్తం చేస్తుందన్నారు. సిపి ఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నా కేంద్ర, రాష్ర ప్రభుత్వాల ఉద్యోగులు, టీచర్ల కోర్కెలను బీజేపీ, టీడీపి ప్రభుత్వాలు పెడచెవినపెట్టాయన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంక్‌లను కార్పొరేట్ కంపెనీలు లూటీ చేస్తుంటే కేంద్రం చూసి చూడనట్లుగా వ్యవహారిస్తుందన్నారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉపాధి కల్పిస్తామన్న ప్రధాని మోదీ జి ఎస్టీ, పెద్దనోట్ల రద్దుతో 70లక్షల మంది ఉపాధిని పోగొట్టారన్నారు. కార్మికుల హక్కులు, వేతనాల సవరణ, సిపి ఎస్ రద్దు అమలు జరిగేంతవరకు తాము పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిటూ నాయకులు శ్రీనివాసరావు, గోవిందరావు, కె.నాగమణి, ఉపాధ్యాయ సంఘనాయకులు కొప్పల భానుమూర్తి, అంగన్వాడీలు, మధ్యాహ్న భోజన పథక కార్మికులు, ఆల్ ఇండియా బ్యాంక్ యూనియన్ నాయకులు, అనుబంద సంస్థ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
గిరిజన ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వాలి
* యుటి ఎఫ్ డిమాండ్
శ్రీకాకుళం (టౌన్), జనవరి 9: గిరిజన సంక్షేమ శాఖ సీతంపేటలో పనిచేస్తున్న ఉపాధ్యాయ, బోధనేతర సిబ్బందికి వెంటనే జీతాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ శ్రీకాకుళం జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పొందూరు అప్పారావు, రెడ్డి మోహనరావు డిమాండ్ చేశారు. గత నవంబర్ నెల నుండి ఇప్పటివరకు వారికి జీతాలు అందకపోవడంతో ఆ ఉపాధ్యాయులంతా పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దీనికి ప్రధాన కారణం జీవో నెంబర్ 40ని రద్దు చేసి జీవో నెంబర్ 132ను ప్రభుత్వం తీసుకురావడమే కారణమన్నారు. డిడీవోలకు ఇప్పటివరకు తమ లాగిన్‌లో బిల్లులు తయారుచేయు ఆప్షన్ డిడివో రిక్వెస్ట్‌నందు ఇవ్పకపోవడం వలన వారికి జీతాలు అందలేదన్నారు. దీనిపై ఈనెల 10వ తేదీన జిల్లా ఖజానాధికారి కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ధర్నా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ ధర్నాకు గిరిజన సంక్షేమ శాఖ, ఉపాధ్యాయ వర్గాలు హాజరుకావాలని యుటి ఎప్ రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ కోరారు.
ప్రభుత్వ పథకాలు వినియోగించుకొండి
* కమీషనర్ శ్రీరాములునాయుడు
శ్రీకాకుళం (టౌన్), జనవరి 9: బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి, నగరాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను, నిధులను సక్రమంగా వినియోగించుకోవాలని నగర పాలక సంస్థ కమీషనర్ ఆర్.శ్రీరాములునాయుడు అన్నారు. స్థానిక దమ్మలవీధిలో నిర్వహించిన ఆరవ విడత జన్మభూమి- మా ఊరు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అందరి అభివృద్ధి కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతుందని, వాటి గురించి తెలుసుకోవల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. పథకాలను గురించి తెలుసుకున్నప్పుడే వాటిని మనం సక్రమంగా వినియోగించుకోవడం జరుగుతుందన్నారు.

జన్మభూమిని సద్వినియోగం చేసుకొండి

0
0

జలుమూరు, జనవరి 9: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఉన్నతాశయంతో ఏర్పాటుచేసిన జన్మభూమి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మండల ప్రత్యేకాధికారి, జిల్లా విద్యాశాఖాధికారి బి.విజయభాస్కర్ అన్నారు. మండలం సుబ్రహ్మణ్యపురం గ్రామంలో బుధవారం జరిగిన ఆరవ విడత జన్మభూమిలో పాల్గొని మాట్లాడారు. ప్రజల కోసం ఎంతో ఉన్నతాశయంతో ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలు నేరుగా సమస్యలు తెలుసుకోవచ్చని అన్నారు. అనంతరం ప్రభుత్వం అందజేసిన సంక్రాంతి సరుకులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడీవో పడాల వాసుదేవరావు, పంచాయతీ విస్తరణాధికారి కొమరాపు అప్పలనాయుడు, పలు శాఖాధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా తిమడాం, హుస్సేన్‌పురం, సురవరం గ్రామాల్లో బుధవారం జన్మభూమి కార్యక్రమం జరిగింది. ఆయాగ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటుచేశారు.

ఊపిరి ఉన్నంతవరకు నేను కాంగ్రెస్‌పార్టీయే
* మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి
ఆమదాలవలస, జనవరి 9: పదవీ వ్యామోహం కోసం ఎన్నో రాజకీయపార్టీలు పుట్టుకొస్తున్నప్పటికి తాను మరో పార్టీ వైపు చూసే ప్రసక్తేలేదని స్థానిక మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి అన్నారు. బుధవారం ఆమె నివాసగృహం వద్ద ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మాజీ మున్సిపల్ చైర్మన్, తన కుమారుడైన బొడ్డేపల్లి రమేష్ వైసీపీ లో చేరిన సంఘటనపై తనకెటువంటి సంబంధం లేదని, అది ఆయన వ్యక్తిగత నిర్ణయమని ఆమె అన్నారు. ఒకే కుటుంబంలోరెండు పార్టీల వ్యక్తులు ఉండడం సహజమే అని, ఎవరి వ్యక్తిగతం వారిదేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీతోతమ కుటుంబానికి 70 ఏళ్ల చరిత్ర అనుభవం ఉందని ఆమె అన్నారు. మామగారైన దివంగత బొడ్డేపల్లి రాజగోపాలరావుజిల్లాలో ఏడుసార్లు ఎంపిగా గెలుపొంది 32 ఏళ్లు జిల్లాను ఏకధాటిగా పరిపాలించారని, ఆయన వారసురాలిగా తను పదేళ్లు కాంగ్రెస్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా, మరో పదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేశానని ఆమె వివరించారు. నేను పూర్తిగా కాంగ్రెస్ వ్యక్తినని, నా అభిమానులు, కార్యకర్తలు, నాయకులుకు ఎటువంటి అపోహాలు వద్దని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్‌పార్టీ అధిష్టానం నిర్ణయం ప్రకారం తాను పనిచేస్తానని ఆమె చెప్పారు.

సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
* జిల్లా కలెక్టర్ ధనంజయరెడ్డి
ఆమదాలవలస, జనవరి 9: ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె.్ధనంజయరెడ్డి అన్నారు. బుధవారం మండలంలో బొబ్బిలిపేట గ్రామంలో నిర్వహించిన జన్మభూమి- మా ఊరు కార్యక్రమంలో మాట్లాడుతూ పేదలను ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తున్నామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని ఆయన కోరారు. సంక్షేమ పథకాలు కావల్సిన వ్యక్తులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదని, తమ గ్రామాల్లో ఉన్న మీ-సేవా కేంద్రాల వద్ద దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచించారు. గ్రామంలో శతశాతం అక్షరాస్యత సాధించి మరుగుదొడ్ల వినియోగం ద్వారా వ్యాధులకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. జిల్లాలోని అన్ని పంచాయతీలకు పక్కరోడ్లు, తాగునీరు, వీధి లైట్లు, పెన్షన్‌లు, రేషన్‌కార్డులు, ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాలు వంటివి మంజూరు చేశానని, వీటిని ఆయా ప్రజలు చక్కగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో స్పెషలాఫీసర్ పంచాది రాధ, ఎంపీడీవో హబీబ్, దేశం నాయకులు అమర్‌నాద్, గొండు రమణ, అనె్నపు భాస్కర్, సనపల ఢిల్లీ, నూకరాజు తదితరులు పాల్గొన్నారు.

Viewing all 69482 articles
Browse latest View live