Are you the publisher? Claim or contact us about this channel


Embed this content in your HTML

Search

Report adult content:

click to rate:

Account: (login)

More Channels


Showcase


Channel Catalog


older | 1 | .... | 2034 | 2035 | (Page 2036) | 2037 | 2038 | .... | 2067 | newer

  0 0

  న్యూఢిల్లీ: ఓ వ్యక్తి చేసిన నిరాధారమైన ఆరోపణలతో కమిటీ తనను బదిలీ చేయటం విచారకరమని సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్‌వర్మ అన్నారు. ఆయనను ప్రధాని మోదీ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ అలోక్ వర్మను కోర్టు ఆదేశాల మేరకు బాధ్యతలు స్వీకరించిన రెండురోజులకే ప్రధాని నేతృత్వంలోని కమిటీ అగ్నిమాపక, సివిల్ డిఫెన్స్, హోంగార్డు విభాగం డీఐజీగా బదిలీ చేయటం జరిగింది. దీనిపై అలోక్ వర్మ విలేకరులతో మాట్లాడుతూ సీబీఐ సంస్థ సమగ్రతను కాపాడేందుకు ప్రయత్నించానని చెప్పారు. సంస్థ సమర్థవంతంగా పనిచేసేందుకు కృషిచేసినట్లు వెల్లడించారు.


  0 0

  న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. అందులో భాగంగా ఢిల్లీ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలిగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను పార్టీ అధిష్టానం నియమించింది.


  0 0

  న్యూఢిల్లీ : సీబీఐ చీఫ్ పదవి నుంచి తొలగింపుకు గురైన అలోక్ వర్మ ఏకంగా తన సర్వీసుకు రాజీనామా చేశారు. ఆయనను ప్రభుత్వం అగ్ని మాపక శాఖ డైరెక్టర్ జనరల్‌గా నియమించింది. కానీ ఆ పదవిని చేపట్టేందుకు ఆయన నిరాకరించారు.


  0 0

  న్యూఢిల్లీ: సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ చేసిన బదిలీలను రద్దు చేస్తూ తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావు శుక్రవారంనాడు ఉత్తర్వులు ఇచ్చారు. సుప్రీం ఆదేశాల మేరకు 77 రోజుల నిర్బంధ సెలవుతరువాత విధుల్లో చేరిన అలోక్ వర్మ ఈ మధ్యకాలంలో చోటుచేసుకున్న బదిలీలను రద్దు చేశారు. కాగా ప్రధాని కమిటీ నేతృత్వంలోని కమిటీ అలోక్ వర్మను అగ్నిమాపక శాఖకు బదిలీ చేసింది. తాత్కాలిక డైరక్టర్‌గా నాగేశ్వరరావు శుక్రవారంనాడు బాధ్యతలు చేపట్టిన తరువాత అలోక్ వర్మ చేసిన బదిలీలను రద్దు చేశారు. గతంలో ఉన్న స్థానాల్లోనే వారిని కొనసాగించాల్సిందిగా సూచించారు.


  0 0

  చెన్నై: బీజేపీతో ఎలాంటి పొత్తు పెట్టుకోబోమని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ చెప్పారు. నిన్న ప్రధాని మోదీ తమిళనాడు బీజేపీ కార్యకర్తలు, నాయకులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ డీఎంకే, అన్నాడీఎంకే మిత్రులకు బీజేపీ ఎపుడూ తలుపులు తెరిచే ఉంటుందని చేసిన వ్యాఖ్యలపై స్టాలిన్ స్పందించారు. మోదీ నేతృత్వంలోని బీజీపీతో పొత్తు అంత ఆరోగ్యకరం కాదని ఆయన అన్నారు. రాష్ట్రాల హక్కులను మోదీ ప్రభుత్వం హరించివేస్తుందని అన్నారు.


  0 0

  న్యూఢిల్లీ: ఓ హత్య కేసులో డేరా బాబా దోషేనని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పింది. రామచందర్ ఛత్రపతి అనే జర్నలస్ట్ హత్య కేసులో డేరా బాబాతో పాటు మరో ముగ్గురు దోషులను కోర్టు నిర్థారించింది. వీరికి ఈనెల 17న శిక్ష ఖరారు చేయనున్నట్లు కోర్టు తన తీర్పులో వెల్లడించింది.


  0 0

  న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను బదిలీ చేయటం వల్ల రాహుల్ గాంధీనే ఎక్కువగా బాధపడుతుంటారని బీజేపీ ప్రతినిధి జీవీఎల్ అన్నారు. ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ అగస్టా హెలికాఫ్టర్ల కుంభకోణం, కాంగ్రెస్ హయాంలో జరిగిన ఇతర డిఫెన్స్ డీల్స్ గురించి సీబీఐ దర్యాప్తు చేస్తున్నదని అన్నారు. కాబట్టే అలోక్ వర్మ కంటే రాహుల్ గాంధీ ఎక్కువగా బాధపడతారని ఎద్దేవా చేశారు.


  0 0

  కోల్‌కతా: ప్రధాని మోదీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె శుక్రవారంనాడు బారాసాత్‌లో గ్రామీణ రంగస్థల నాటకోత్సవాల సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ముందు నాటకాలు ఆడుతున్న వారు త్వరలో మరో సినిమా చూడాల్సి వస్తుంది. అదే డిజాస్ట్రస్ పీఎం అని పేర్కొన్నారు.


  0 0

  యువతా! ఓ నవతా!
  నవభారత ఘనభవితా!
  స్వామివివేకానందుడా..
  వ్రాస్తున్నా ఈ లేఖను..

  కాలమందు మరో ఏడు
  కరిగిపోయెనది చూడు
  అయినవిగా విలాసాలు
  ఆపుమింక కులాసాలు

  ప్రభాతాన ప్రతిరోజూ
  వ్యాయామం నీ సాధన
  ఫుట్‌బాల్ మైదానమిచ్చు
  పూర్ణశక్తి ప్రదర్శన!

  ఇనుప కండలున్నవాడు
  ఉక్కు నరాలున్నవాడు
  జాతి సమస్యలు చీల్చే
  జగజ్జెట్టి అర్జునుడు!

  నిదుర వదిలి లే నిలబడు!
  బెదురు విడిచి నువ్వు బలపడు!
  భవిష్యత్తు నీకోసం
  చూస్తున్నది నీ దేశం!

  ధైర్యమాత్మ విశ్వాసం
  భీమబలం దేశభక్తి
  శ్రమజీవన సౌందర్యం
  క్రమశిక్షణ సహజగుణం

  ఆరు లక్షణాలుంటే
  ఆయుధాలు మనకేల
  అవనీతల జాతులన్నీ
  తలదించవ- మనమ్రోల!

  బలమే జాతికి జీవం
  బలమే నీతికి ప్రాణం
  బలవంతుడు కాని నరుడు
  శిలరూపున మృగరాజం!

  అన్యాయం గుండెల్లో
  అదురుపాటు నీ ధైర్యం
  అవినీతిని చీల్చిచెండు
  రవికిరణం నీ తెగింపు

  కృషితోనే దుర్భిక్షం
  కృశిస్తుంది నశిస్తుంది
  3కష్ట్ఫేలి2 సూక్తి మీకు
  ఇష్టచెలిగ మారుతుంది

  ప్రాణమున్న వరకు మీరు
  శ్రమించాలి తపించాలి
  దేశధర్మ రక్షణకై
  దేహముందని గ్రహించాలి!

  జీవితాన్ని తెరచి తరచి
  భావి తరం కొరకు పరచి
  నే చెప్పిన ఈ మాటలు
  మీ ప్రగతికి సుమబాటలు


  0 0
 • 01/11/19--05:13: రంగవల్లి
 • వాణీ ప్రభాకరి, తణుకు


  0 0
 • 01/11/19--05:16: రంగవల్లి
 • కె.అమ్మాజీ విజయవాడ

  23 మధ్యచుక్కలు 12 వచ్చేవరకు

  -------------------------------------------------------------------------------------


  0 0

  శుచిత్వం, ఆచారం, అలంకార ప్రియత్వం, కళా ప్రదర్శనం, ఆరాధనా విధానానికి సంకేతాలు రంగవల్లులు. శుభ్రంగా ఊడ్చి, కళ్ళాపు చల్లి, ముంగులతో అలంకృతాలయ్యే తెలుగునాట ముంగిళ్ళు తరతరాల వారసత్వ సంస్కృతులకు ప్రతిబింబాలు. తెలుగు సీమల్లో ప్రతి ఇంటి లోగిళ్లలో ముగ్గులు వేయడం అనాదిగా వస్తున్న సాంప్రదాయాలు. అయితే ధనుర్మాస యుక్త సంక్రాంతి సంబంధిత పర్వదినాలలో వేసే ముగ్గులు పలువిధ ప్రత్యేకాలు. చుక్కలు పెట్టి, హద్దులు ఏర్పరచి, గీతలను సున్నితంగా కలపడంలో, మెలికలు తిప్పడంలో కళానైపుణ్యాలు ప్రదర్శితాలవుతాయి. సర్వ సంపదలకూ అధిష్ఠాన దేవతయైన అష్టలక్ష్మికి ఇంటి తల వాకిట పీఠం వేయబడుతుంది. కనుమనాడు వాకిళ్ళను మూసేసే ముగ్గు కూడా వేసి, లక్ష్మీదేవిని బయటకు వెళ్ళనీయకుండా వాకిళ్ళను మూసివేసే ముగ్గులు పెడతారు. నెమళ్ళు, హంసలు, రామచిలుకలు, గరుత్మంతులు, మత్స్య కూర్మాది అవతారాలు అందానికి ప్రయోజకత్వానికి, మెలికలు తిప్పడంలో కళాభిజ్ఞతను తెలియ జేస్తాయి. స్వర్గ ద్వారాలు తెరిచి ఉంచే ముగ్గు, గుమ్మడి పండు ముగ్గు, సూర్య రథాల ముగ్గు, చుక్కల రథాల ముగ్గు ఉత్తరాయణంలో ప్రత్యక్ష దైవమైన సూర్య గమనాన్ని సూచించే ముగ్గులు. ముగ్గులలో గణిత శాస్త్ర సంబంధిత కోణాలు, త్రిభుజాలు, చతుర్భుజాలు, త్రికోణాలు, దీర్ఘ చతురస్రాలు, అష్ట కోణాలు, సమాంతర రేఖలు చోటు చేసుకుంటాయి. రాళ్లు రప్పలూ లేకుండా ముంగిట అలంక బడిన నేల...మేఘాలు లేని గగనతలం. అందలి చుక్కలు రాత్రి వేళల కానవచ్చే నక్షత్రాలు. చుక్కల చుట్టూ తిరుగుతూ గళ్ళల్లో చుక్కలను పదిలపరిచే ముగ్గులు ఆకాశంలో కనిపించే మార్పులకు సంకేతాలు. ముగ్గు మధ్యలో చుక్క అనాదిగా సూర్య కేంద్రక సిద్దాంతానికి ఆధార భూతమైన సూర్య స్థానానికి సంకేతం. గీతలు స్థిత శక్తికి, చుక్కలు గతి శక్తికి సంకేతాలని, ముగ్గులు శ్రీచక్ర సమర్పణా సంకేతాలని తత్వవేత్తల భావన. విల్లు ధనుర్రాశికి, ప్రతీక అయినట్లు మేక, ఎద్దు, సింహం, పీత, చేప లాంటివి నవగ్రహాలకు గుర్తులుగా ముగ్గులు వేస్తారు. భూమికి ఉన్న దక్షిణ దిక్కులో దక్షిణ ధృవం ఉంటుంది. దానినుండి వచ్చే అయస్కాంత శక్తులనే పిశాచాలు, రాక్షసులు అని ప్రాచీనులు చెప్పేవారు. పాములు కూడా దక్షిణ దిశనే ఎక్కువగా సంచరిస్తుంటాయి. అవి ఇళ్ళల్లోకి ప్రవేశించనీయ కుండా వాకిలి ముందు ముగ్గులు వేయడం, అవి బియ్యపు పిండితో వేయడం అత్యంత ప్రాచీన కాలం నుండి ఉంది. ఇంటి ముందున్న పిండి తిని సూక్ష్యజీవులు ఇళ్ళల్లోకి రాకూడదనే భావన ఇందు ఇమిడి ఉంది. మూడు రోజులు బంధుగణ సమేతులై అనందోత్సాహాలను పంచుకున్న అనంతరం పండగను సాగనంపేందుకే రథం ముగ్గు వేస్తారు. అందరూ ఒకరికొకరు తోడుగా, కలసి మెలసి సహజీవనం గడపాలనేదే ఒక రథం తాడును, పక్క ఇంటి రథం ముగ్గుతో కలిపే రథం ముగ్గు వెనక ఉండే భావం.


  0 0

  యుగద్రష్ట వివేకానందుని155వ జయంతి సందర్భంగా

  అధిక సంఖ్యాకులైన బడుగు, బలహీన జనులను దీర్ఘకాలంగా నిర్లక్ష్యం చేయడమే ఈ దేశ పతనానికి ముఖ్య కారణం. అత్యంత నిరుపేదలుగా మిగిలిపోయిన ఈ దేశ శ్రమజీవుల హృదయాలనుంచి స్రవించే రక్తంతో పెరిగి, విద్యాబుద్ధులు గడించి, తదనంతరం వారి బాగోగులను పట్టించుకోని ప్రతి ఒక్కరూ దేశద్రోహులే2అని తొట్టతొలిగా సామాజిక పరివర్తనకు నాంది పలికిన హిందూ ధార్మిక నాయకుడు స్వామి వివేకానంద.

  దేశంలోని కోట్లాది అన్నార్తుల కనీస అవసరాలు తీర్చడమే ప్రథమ కర్తవ్యం కావాలని గుర్తుచేసిన సాహసి, మానవతామూర్తి స్వామి వివేకానందుడు. దానికి సరైన మార్గం శిక్షణతో కూడిన విద్య ప్రధానమైనదని స్ర్తిలు కూడా విద్యాబుద్ధులు నేర్పి, సమాజంలో నేర్పి, సమాజంలో సమానావకాశాలను పొందినప్పుడే జాతి సంపూర్ణంగా వికసిస్తుందని ఆకాంక్షించిన క్రాంతదర్శి. ‘లెండి మేల్కొనండి! గమ్యం చేరేవరకూ విశ్రమించకండి. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్రతుల్యమైన మనసుతో లక్ష్యాన్ని చేధించండి’2అంటూ యువతకు ఉద్బోధించి ‘నాయకుడివి కాదలచుకుంటే ముందు సేవకుడిగా మారు’2అని సగర్వంగా ప్రకటించిన ధీరోదాత్తుడు స్వామి వివేకానందుడు.
  1863 జనవరి 12న కలకత్తాలో భువనేశ్వరీదేవి, విశ్వనాథ దత్తులకు జన్మించాడు. తల్లిదండ్రులు పెట్టిన పేరు నరేంద్రనాథ దత్తు. అందరూ నరేన్ అని పిలిచేవారు. నరేన్ బాల్యంనుంచే ఆటపాటలు, అల్లరితోపాటు ధ్యానంలో మునిగిపోతుండేవాడు. తల్లి భువనేశ్వరి ద్వారా రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలను ఔపాసన పట్టారు. చిన్నవయసులోనే వివిధ మతాల సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడై కొంతకాలం బ్రహ్మసమాజం ప్రభావంతో గడిపాడు. సంస్కృతం, బెంగాలీ, ఆంగ్ల భాషలు నేర్చుకోవడంతోపాటు ఈత, కర్రసాము, కుస్తీలు, మల్లయుద్ధం, వ్యాయామం వంటి ఇతర వ్యాపకాలలోనూ నిష్ణాతుడయ్యాడు. చిన్న వయసులోనే వాక్చాతుర్యంలో దిట్టగా నిలిచాడు.
  భగవాన్ రామకృష్ణ పరమహంస సన్నిధిలో తన ప్రశ్నలకు సమాధానం లభించడంతో, ఆంతరంగిక సంఘర్షణ తొలగి ప్రశాంతత చేకూరి శిష్యునిగా మారిపోయాడు. శ్రీరామకృష్ణుని శిక్షణలో నరేంద్రుడు నిర్వికల్ప సమాధి స్థితితో సహా అనేకమైన మహోన్నత ఆధ్యాత్మిక అనుభూతులను పొందాడు.
  గురుదేవులు రామకృష్ణ పరమహంస మరణానంతరం సన్యాసం స్వీకరించిన నరేంద్రుడు వివేకానందుడైనాడు. గతంలో శ్రీరామకృష్ణులువారు చెప్పిన అమృతవాక్కులు 3జీవారాధనయే శివారాధనని మార్గదర్శకంగా తీసికొని, భారతదేశ స్థితిగతులను ఆకళింపు చేసుకోవడానికి హిమాలయాలనుంచి కన్యాకుమారి వరకూ పర్యటించారు. కన్యాకుమారి సముద్రగర్భంలోగల శ్రీపాద శిలపై ఆశీనులై మూడురోజులపాటు ఎడతెగని ధ్యానంలో లీనమయ్యారు. అక్కడే ఆయన భవిష్యత్ ప్రణాళికను రూపొందించుకున్నారు. రామకృష్ణ పరమహంస శిష్యునిగా గడించిన సేవానుభూతులే రామకృష్ణమిషన్ సేవాకేంద్రాన్ని స్థాపించడానికి పునాదిగా మారాయి.
  నవభారత నిర్మాణానికి సంబంధించిన ఆలోచనలు వివేకానందుడి మనసులో మెదులుతున్న సమయంలోనే 1893న చికాగోలో జరుగుతున్న 3విశ్వమత మహాసభలు2 జరగనున్నాయన్న వార్త వివేకానందుడిని ఉత్తేజితుణ్ణి చేసింది. మిత్రులు, సన్నిహితుల ప్రోత్సాహంతో భారతీయతలో దాగిన విశిష్టతను, సనాతన హిందూధర్మ మూలసూత్రాలను ప్రపంచానికి చాటడానికి చికాగో ‘సర్వమత సమ్మేళనాన్ని’2చక్కని వేదికగా భావించిన వివేకానందుడు అమెరికాకు ప్రయాణమయ్యారు.
  1893 సెప్టెంబర్ 11న చికాగో నగరంలో జరిగిన విశ్వమత మహాసభలో పాల్గొని, అమెరికా సోదరసోదరీమణులారా!2అని సంబోధిస్తూ వివేకానందుడు సాగించిన మహోపన్యాసం వివిధ దేశాలనుంచి వచ్చిన శ్రోతలను సమ్మోహనంతో పరవశులనుగావించింది. ఆ మహాసభలలో వివేకానందుడు విశ్వగురువుగా, 3‘ఈశ్వర ప్రేరేపిత మహావక్త’గా కీర్తిపొంది, విశ్వవిఖ్యాతి నొందారు. అప్పటివరకు హిందూ మతంపై పాశ్చాత్యులలో పేరుకుపోయిన అపోహలు పటాపంచలు కావడం ప్రారంభమైందనుటలో అతిశయోక్తి కాదు.
  ఇంగ్లండు, స్విట్జర్లాండు మొదలైన పాశ్చాత్య దేశాలతోపాటు శ్రీలంక వంటి దేశాల్లోనూ పర్యటించి, అన్ని మతాలకూ మూలమైన వేదాంతాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. మూడు సంవత్సరాలు పర్యటించిన అనంతరం 1897లో భారతదేశానికి తిరిగి వచ్చారు. తదనంతర కాలంలో దేశవ్యాప్తంగా తన ప్రసంగాలతో మూఢాచారాలను, జాతి బలహీనతలను, పాశ్చాత్య వ్యామోహాన్ని, కుల దురభిమానాలను బలంగా విమర్శించారు. భారత జాతికి పునాది మతమే అయినప్పటికీ, దాని సారాంశం ఆధ్యాత్మిక ఏకత్వమని ప్రబోధించారు. ఆ లక్ష్యసాధనకే రామకృష్ణ సేవాసంఘాన్ని స్థాపించారు. 1898లో కలకత్తాలోని బేలూరులో రామకృష్ణమఠం నిర్మాణానికి పూనుకున్నారు. రామకృష్ణ మిషన్‌లు నాటినుంచి నేటివరకూ వివిధ ఆధ్యాత్మిక, విద్యా, సేవా కార్యక్రమాలను నలుమూలలా విజయవంతంగా నిర్వహిస్తుండటం గమనార్హం.
  ఇంగ్లాండులో స్వామి వివేకానందుని బోధనలకు ముగ్ధురాలైన మార్గరెట్ శిష్యురాలిగా భారతదేశానికి వచ్చి ‘సిస్టర్ నివేదిత’గా మారింది. రామకృష్ణ పరమహంస పేర ప్రారంభించిన మఠాలు, మిషన్ కార్యకలాపాలు, పర్యవేక్షణలు, శిక్షణలతో నిరంతరం శ్రమలో లీనంకావడంతో వివేకానందుడి ఆరోగ్యం క్రమంగా క్షీణించసాగింది. 1902 జూలై 3న బేలూరులో వివేకానందుడు పరమపదించారు.
  అభాగ్యులు, అన్నార్తుల కష్టాలను రూపుమాపి సుసంపన్నమైన, సుదృఢమైన భారత జాతి నిర్మాణానికి యువత పట్టువీడని దీక్షతో కొనసాగించాలన్న వివేకానందుని సందేశం నేటి విద్యార్థులు, యువతకు, యువతరం నేతలకు స్ఫూర్తి కావాలి. ‘పేదలకోసం ఎవరి హృదయం తపిస్తుందో, వారినే నేను మహాత్ములు’గా భావిస్తాను అన్న వివేకుని లోకోక్తిగా సదా నిలిచిపోవాలి. వారు ప్రాతఃస్మరణీయులు.

  విశిష్టతల కలబోత భారతనారి

  * మహిళల స్థితిగతులు మెరుగుపరచకపోతే ప్రపంచ సంక్షేమానికి ఆస్కారం ఉండదు. ఒంటి రెక్కమీద ఎగరడం పక్షికి అసాధ్యం కదా!
  * హైందవ స్ర్తిలు ఎంతో ధర్మపరాయణులు; బహుశా ప్రపంచంలోని ఏ ఇతర స్ర్తిలకంటే కూడా వారు అధిక ధర్మపరాయణులై విరాజిల్లుతున్నారు. పరిపూర్ణ స్ర్తిత్వభావమే పరిపూర్ణ స్వాతంత్య్రం.
  * తండ్రి అనుగ్రహం కంటే తల్లి అనుగ్రహం లక్ష రెట్లు విలువైనదని నా అభిప్రాయం, తల్లి ఆశీస్సులే నాకు శిరోధార్యం.
  * మంచికి గాని, పవిత్రతకు గాని, పాతివ్రత్యానికి గాని, భారతీయ మహిళా ధర్మానికి సీత పెట్టింది పేరు. సీత అపకారానికి, ప్రత్యపకారానికి ఎన్నటికీ తలపడదు. సీతలా ఉండడానికి ప్రయత్నించండి.
  * ఓ భారతదేశమా! నీ సతీత్వ ఆదర్శం సీత, సావిత్రి, దమయంతి అని మరువద్దు.
  * మన మహిళలకు విద్య తక్కువేగాని, పవిత్రత ఎక్కువ. తన భర్తను తప్ప, తక్కిన పురుషులనందరినీ ప్రతి మహిళా తన కొడుకులుగా భావిస్తుంది. తన భార్యను తప్ప తక్కిన మహిళలనందరినీ పురుషుడు తన తల్లులుగా భావిస్తాడు.
  * పురుషులకు కేంద్రాలను నెలకొల్పినట్లే, స్ర్తిలకు కూడా బోధనా కేంద్రాలు ప్రారంభించాలి. స్ర్తి జనోద్ధరణ, జనబాహుళ్య జాగృతం ముందుగా జరగాలి. అది జరిగిన తరువాత మాత్రమే భారతదేశానికి నిజమైన శ్రేయస్సు ఒనగూరుతుంది.
  * స్ర్తిలను, తమ సమస్యలను తమ మార్గాలతోనే పరిష్కరించుకొనే స్థితికి తీసుకుపోవాలి. వారి తరఫున దీనిని ఎవరూ చేయగూడదు. భారతీయ మహిళ తన సమస్యలను పరిష్కరించడంలో ఏ స్ర్తిలకూ తీసిపోదు.
  * ఇతర విషయాలతోపాటు మన మహిళల ధైర్యసాహసాలు సంతరించుకోవాలి. నేటి కాలంలో ఆత్మరక్షణ నేర్వడం వారికి ఎంతో ఆవశ్యకమైపోయింది. ఝాన్సీరాణి ఎటువంటి పరాక్రమవంతురాలో చూడండి.
  * స్ర్తిలు అత్యున్నత సత్యాలను బోధించేవారనీ, పురుషులకు సాటిగా ఆదరణ పొందారనీ, వేదాలూ ఉపనిషత్తులూ చాటిచెబుతున్నాయి.
  * స్ర్తిలకు మొదట విద్యను గరపండి. తరువాత వారికి స్వేచ్ఛను ఒసగండి. అప్పుడు తమకు ఏ సంస్కారాలు ఆవశ్యకాలో వారే మీకు తెలుపుతారు. వారి విషయాలకు మీరెవరు?
  * మాతృదేవి (శారదామాత) భారతదేశంలో ఒక అద్భుతశక్తిని పునరుద్ధరించడానికి జన్మించింది. ఆమెను మూలకేంద్రంగా చేసుకునే మళ్ళీ గార్గులు, మైత్రేయిలు ఈ ప్రపంచంలో జనిస్తారు. ఆ మహిళా శక్తి అనుగ్రహం లేకుండా ఏవీ సాధింపబడవు.


  0 0

  జహ్నుమహర్షి కుమారుడు అజుడు. అతని కొడుకు బలా కౌశవుడు. అతని కుమారుడు కుశికుడు. అతను ధర్మాత్ముడు. ముల్లోకాలను జయించే పుత్రుడు కలగాలని కుశికుడు గొప్ప తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి ఇంద్రుడు అతనికి పుత్రునిగా జన్మించాడు. అతని పేరు గాధి. అతనికి సత్యవతి అనే పుత్రిక కలిగింది. గాధి ఆమెను భృగుమహర్షి పుత్రుడైన ఋచీకునకు ఇచ్చి వివాహం చేశాడు. ఆమె సత్ప్రవర్తన, ధర్మనిరతికి, శుచిత్వానికి సంతృప్తి చెంది ఋచీకుడు ఆమెకూ, ఆమె తల్లికీ కూడా పుత్రులు కలగాలని రెండు చరువులు పండించి భార్యతో ఇలా అన్నాడు. ‘‘ఈ చరువును నీవు ఉపయోగించు, రెండవది మీ అమ్మ భుజించాలి. ఈ లోకంలో ఎవ్వరు గెలవలేని క్షత్రియుడు ఆమెకు పుడ్తాడు. అతను క్షత్రియ శ్రేష్ఠుడు కూడా. ధైర్యం, శమం కల సద్బ్రాహ్మణుడు నీకు పుడతాడు’’ అని భార్యతో ఇలా చెప్పి అతను తపస్సు చేసికొనేందుకు అరణ్యానికి వెళ్ళిపోయాడు.
  అదే సమయంలో తీర్థయాత్రలు చేస్తున్న గాధి మహారాజు భార్యతో కలసి ఋచీకుని ఆశ్రమానికి వచ్చాడు. సత్యవతి తల్లి తండ్రులను చూసిన ఆనందంతో రెండు చరువుల గురించి భర్త అన్న మాటలు తల్లికి చెప్పి ఒక చరువు ఇచ్చింది. కాని పొరపాటున తన చరువు తల్లికి ఇచ్చి తల్లి చరవుతాను తీసుకొంది. అందు వలన క్షత్రియులను అంతం చేసే గర్భాన్ని సత్యవతి ధరించింది. ఆమె గర్భం విపరీతమైన తేజస్సుతో ప్రకాశించ సాగింది. ఋచీకుడు తిరిగి వచ్చి ఆమె గర్భంలో ఉన్న బ్రాహ్మణ తేజాన్ని చూసి భార్యతో ఇలా అన్నాడు ‘‘చరువులు తారమారు అవటంవలన నీపుత్రుడు్ర కోధి, క్రూర కర్ముడూ అవుతాడు. నీ తమ్ముడు బ్రాహ్మణుడు, తపస్వీ అవుతాడు. నీ చరువులో మహిమాన్వితమైన బ్రహ్మజ్ఞానాని పెట్టాను. నీ తల్లి చరువులో క్షత్రియ వీరుని పెట్టాను. కాని అవి తారుమారు అయ్యాయి. నీకు క్షత్రియుడు నీతల్లికి బ్రాహ్మణుడు పుడతారు’’ భర్త ఇలా చెప్పగానే సత్యవతి దుఃఖించి శోకంతో భర్త కాళ్ళపై పడి ఇలా ప్రార్థించింది.
  ‘‘స్వామీ! బ్రాహ్మణాధముని పుత్రునిగా పొందుతావు అని నాతో ఇప్పుడు చెప్పటం సముచితం కాదు’’. ఋచీకుడు భార్యతో ఇలా అన్నాడు. ‘‘సౌభాగ్యవతీ! నీ యందు నేను ఇటువంటి పుత్రుని సంకల్పించలేదు. చరువు మారటం వలన అతన తీవ్రమైన కోపం, ఉగ్ర కర్మలు చేసేవాడు అవుతాడు’’.
  సత్యవతి మరల ఇలా ప్రార్థించింది ‘‘స్వామీ! నాకు శాంత స్వరూపుడు సరళ స్వభావకలవాడు తపస్వి అయిన పుత్రుని అను గ్రహించండి’’.
  ఋచీకుడు ఇలా సమాధానం చెప్పాడు ‘‘నేను ఎన్నడూ పరిహాసానికైనా అసత్యం ఆడలేదు. మంత్ర పూర్వకంగా అగ్నిని నిలిపి చరువును సాధించాను. కల్యాణీ! ముందే నాకు తపస్సులో అంతా తెలిసింది. నీ తండ్రి వంశమంతా బ్రహ్మభూతవౌతుంది’’.
  అప్పుడు సత్యవతి భర్తను ఇలాకోరింది. ‘‘స్వామీ ! మీకు ఇదే ఇష్టమయితే నా మనుమడు అలాంటి వాడు అవనివండి, కాని నాకు మాత్రం తపోధనుడు ప్రశాంత చిత్తుడు అయిన పుత్రుడే కావాలి’’. అప్పుడు ఋచీకుడు భార్యతో ఇలా అన్నాడు ‘‘పుత్రునికీ, పౌత్రునికీ పెద్ద భేదం లేదు, నీకు నీవు కోరుకున్న పుత్రుడే జన్మిస్తాడు’’.
  తర్వాత కొంత కాలానికి సత్యవతికి తపస్సంపన్నుడైన పుత్రుడు కలిగాడు. అతనే జమదగ్ని. సత్యవతి తల్లికి కూడా విశ్వామిత్రుడు జన్మించాడు. జమదగ్ని శాంతిస్వభావుడూ, వినయశీలుడూ, బ్రహ్మగుణాలు కలిగిన వాడు. తర్వాత అతడు బ్రహ్మర్షి అయినాడు.
  అతనికి భయం కరుడైన పుత్రుడు కలిగాడు. అతను ధనుర్విద్యా పాంర గతుడు, సకల విద్యలూ నేర్చినవాడు. అగ్నిలాగ ప్రకాశించాడు.
  ఇంకావుంది...


  0 0

  స్వేచ్ఛ చిన్న చిన్న ముక్కలుగా రాదు. అలాగే, బానిసత్వం చిన్న చిన్న ముక్కలుగా పోదు. గదిలో ఉన్న చీకటి దీపం వెలిగించిన వెంటనే పోతుంది. అంతేకానీ, కొద్దికొద్దిగా చీకటిపోవడం, కొద్దికొద్దిగా వెలుగు రావడం జరగదు.
  స్వేచ్ఛ అంటే మీరు అన్ని బంధనాల నుంచి పూర్తిగా బయటపడినట్లు. అంతేకానీ, అది కాలానికో, నిదానానికో సంబంధించిన విషయం కాదు.
  బంధనాలన్నింటినీ తెంచుకోవడం తప్ప మీకు మరొక దారి లేదు. వాటిని మీరే మీ చిన్నప్పటినుంచి ‘‘పెద్దల పట్ల అణకువ, తల్లిదండ్రల పట్ల ప్రేమ, పూజారుల పట్ల నమ్మకం, గురువుల పట్ల గౌరవం’’ లాంటి మంచి మంచి పేర్లతో మీ చుట్టూ సృష్టించుకోవడం మొదలుపెట్టారు. మీరు బాగా లోతుగా పరిశీలించి చూస్తే అందమైన పేర్లతో బానిసత్వాన్ని మీకు బాగా అంటగట్టినట్లు తెలుసుకుని ఆశ్చర్యపోతారు.
  మా నాన్నతో నాకు ఎప్పుడూ గొడవే. ఆయన చాలా అవగాహన కలిగిన ప్రేమికుడే అయినా ‘‘నువ్వు ఆ పని చెయ్యాల్సిందే’’ అని నన్ను ఆజ్ఞాపించేవారు. అది నాకు నచ్చేది కాదు. అందుకే నేను ఆయనతో ‘‘అలా ఆజ్ఞాపించకండి. అది బానిసత్వ దుర్గంధం కొడుతోంది. ఆ కంపు నేను భరించలేను. కావాలంటే ‘‘నీకు నచ్చితే చెయ్యి, లేకపోతే చెయ్యకు’’ అనండి. ఆ పని చెయ్యాలా, వద్దా అనేది నా ఇష్టం కానీ, మీ ఇష్టం కాదు.
  మీరు చెప్పిన పని చెయ్యాలో, వద్దో నన్ను ఆలోచించుకోనివ్వండి. నాకు నచ్చితే చేస్తాను, నచ్చకపోతే చెయ్యను. ఒకవేళ, ఆ పని నేను చెయ్యకపోతే మీరు కోపగించుకోకండి. నేను ‘‘మీ మాట పాటించను అనట్లేదు. అలా ఆజ్ఞాపించకండి, అంటున్నాను. నేను సత్యానికి, స్వేచ్ఛకు, ప్రేమకే తల వంచుతాను. వాటికోసం నేను అన్నింటినీ త్యాగం చేస్తాను. అంతేకానీ, బానిసత్వానికి నేను ఏమాత్రం తల వంచను. ఈ జీవితం నాది. నా బతుకు నన్ను బతకనివ్వండి. నన్ను ఆజ్ఞాపించకండి. ఎలాంటి పరిస్థితిలోనూ నేను ఎవరి నుంచి ఎలాంటి ఆజ్ఞలను స్వీకరించలేను, వాటిని పాటించలేను’’ అనేవాడిని. నేను ఎవరికీ తలవంచనని ఆయన త్వరగానే అర్థం చేసుకున్నారు. దాంతో ఆయన నన్ను ఆజ్ఞాపించడం మానుకుని ‘‘ఈ పని చెయ్యాలి. నీకు నచ్చితే చెయ్యి. లేకపోతే, నీ ఇష్టం’’ అనేవారు నాతో. వెంటనే నేను ‘‘అసలైన ప్రేమ ఇలా ఉండాలి’’ అనేవాడిని ఆయనతో. చాలావరకు ..మనిషి జీవితం చాలా చిన్నది. కాబట్టి, దాని పట్ల చాలా నిర్ణయాత్మకంగా ఉండండి. మీరు మీ ఆత్మలో స్వేచ్ఛగా ఉండాలి. అదే అసలైన స్వేచ్ఛ. మనిషి ఆత్మతో జన్మించాడు కానీ, వ్యక్తిత్వంతో జన్మించలేదు. ఆత్మకు (సోల్), వ్యక్తిత్వానికి (సెల్ఫ్) నిఘంటువులలో ఒకే అర్థం చెప్పడం జరిగింది. కానీ, అది నిజం కాదు. ఆత్మానే్వషణకు అనేక సంవత్సరాల తీర్థయాత్ర చెయ్యాల్సివస్తుంది. అంతవరకు మీరు ‘‘ఒక ఊరు, పేరు లేని, ఎవరో ఏమిటో తెలియని బికారిలా, ఏమీ లేకుండా ఉండడాన్ని’’ ఏమాత్రం భరించలేరు.
  కేవలం ప్రేమ వల్లనే వ్యక్తిత్వాన్ని సృష్టించడం జరిగింది. అందుకే ఆది నుంచి మీరొక వ్యక్తిగా భావించడం ప్రారంభించారు. లేకపోతే, మీరెలా జీవిస్తారు? మిమ్మల్ని ఎలా సంబోధించాలి? వ్యక్తిత్వ భావనను సృష్టించిన వారందరూ సదభిప్రాయాలున్నవారే. ఎందుకంటే, వారి ఆత్మల గురించి వారికి ఏమాత్రం తెలియదు. అందుకే వారు అవాస్తవ వ్యక్తిత్వాన్ని సృష్టించి అలాంటి వ్యక్తిత్వంతోనే మరణించారు. అందుకే ఈ అస్తిత్వం వారిని ఎందుకు అలా తయారుచేసిందో వారు ఎప్పటికీ తెలుసుకోలేకపోయారు. మీ ఆత్మ ఈ అస్తిత్వంలో ఒక భాగం. మీ వ్యక్తిత్వం ఒక సామాజిక వ్యవస్థ.
  కాబట్టి వాటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎఫ్పటికీ పూడ్చలేమని ముందుగా మీరు గుర్తుంచుకోవాలి. మీరెవరో నిజంగా తెలుసుకోవాలనుకుంటే మీ వ్యక్తిత్వాన్ని మీరు సమూలంగా నాశనం చెయ్యాల్సిందే. మీరు ఒక్కొక్కప్పుడు ఆత్మగానూ, ఒక్కొక్కప్పుడు వ్యక్తిత్వంగానూ ప్రవర్తిస్తారు. అలా విభజించబడడంవల్ల మీరు నిరంతర ఒత్తిడిలో ఉంటారు. అందువల్ల మీ జీవితం చాలా ఆదుర్దాగా, బాధాకరంగా తయారవుతుంది. అలాంటి జీవితాన్ని మీరు ఎప్పటికీ జీవించలేరు, భరించలేరు. అందుకే తల్లిదండ్రులు, విద్యావిధానం, పూజారులు- సమాజం- ఇలా మీ చుట్టూ ఉన్నవన్నీ మీరు మీ లోపల దాగిఉన్న ఆత్మను ఎఫ్పటికీ తెలుసుకోకుండా ఉండేందుకు కావలసిన దృఢమైన వ్యక్తిత్వాన్ని సృష్టించేందుకు అన్ని రకాల మార్గాలలో ప్రయత్నిస్తారు.
  ఆ ప్రయాణం ఏమంత దూరం కాకపోయినా, అది కచ్చితంగా చాలా ప్రయాసతో కూడుకున్న ప్రయాణమే. వ్యక్తిత్వమనేది చిన్న విషయం కాదు. అది చాలా క్లిష్టమైనది. వ్యక్తిత్వం అధిక ధనాన్ని, అధికారాన్ని, పరువు, ప్రతిష్టలను పోగుచేస్తూనే ఉంటుంది. దాని ఆశలకు అంతుండదు. అలా మీరు మీ వ్యక్తిత్వానికి అనేక హంగులు తగిలిస్తూనే ఉంటారు. మనిషిని ముఖ్యంగా బాధపెట్టేది అదే.
  ‘‘తాను ఇది, తాను అది’’ అని మనిషి నమ్ముతూనే ఉంటాడు. మీరు అనుకొన్నవేవీ నిజాలు కావు అవి మీరు చేసే పనులే తప్ప మీ వాస్తవాలు కాదు. మీరు పుట్టిన మరుక్షణం నుంచే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని వారికి కావలసినట్లుగా తయారుచేయడం ప్రారంభిస్తారు.
  ఉదాహరణకు, మీరొక వైద్యుడు, ప్రధానమంత్రి, చివరికి రాష్టప్రతి అయినా ఎవరు ఎవరైనప్పటికీ వారికి వారి వాస్తవ స్వరూపాలు తెలియవు. అలా అవాస్తవ అహం, అవాస్తవ వ్యక్తిత్వాలు మీలో ప్రవేశించి మిమ్మల్ని అలాగే తయారుచేస్తాయి. అందువల్ల మీరు మీ వాస్తవాన్ని మరచిపోవడం జరుగుతుంది.


  0 0

  శిత్తమ్ శిఱుకాలే వన్దున్నై చ్చే విత్తు ఉన్
  పొత్తామరై యడియే పోత్తుమ్ పొరుళ్ కేళాయ్
  ......... వెలుగురేఖలు విచ్చుకోకముందే కోడికూతలు రాకపూర్వమే, అలనాడు మాలదాసరి నిన్ను కొలవడానికి వచ్చినపుడు నీవేవిధంగా ఆదుకొన్నావో అటులనే నేడు నా స్నేహితులతో కలసి నిన్ను సేవించడానికి తూర్పున భానుడు మేలుకొనక ముందే... వడివడిగా నిన్ను చేరి నీ దర్శనమునకై వేయి కనులతో ఎదురుచూస్తున్నాం స్వామీ మా మొర ఆలకించి మమ్మాదుకో గోపాల బాల అంటూ ప్రతిరోజు ప్రతివైష్ణవాలయంలో అనుసంధానించే పాశురాల వెనుక ఓ పరమాద్భు తమైన కథ ఉంది. పన్నిద్దరు ఆళ్వారులలో ప్రముఖ స్థానంలో ఉన్నఆళ్వారు గోదాదేవి. గోదాదేవి ఆ విల్లిపుత్తూరు లో వెలసిన వటపత్ర శాయికి పరమభక్తుడైన విష్ణుచిత్తులకు తులసీవనంలోతోటపని చేస్తుండగా చిన్నారి శిశువుగా లభించింది. శ్రీహరి వాహనమైన గరుడుడు, తన స్వామిని అల్లునిగా చూడాలని , భూదేవి తన పతికి ఇష్టమైన పుష్పకైంకర్యం చేసి తరించాలని కోరుకున్నారు. వారిద్దరి కోరికను ఈ యుగంలో శ్రీవిల్లిపుత్తూరులో ఫలింపచేశాడా శ్రీహరి.
  విష్ణుచిత్తుడు తనకు లభించిన ఆ చిన్నారికి కోదై అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచుకోసాగాడు. తండ్రిలాగానే హరిభక్తిని పెంచుకున్న కోదై గోదాగా మారి ప్రతిరోజు తన తండ్రి చేత తులసి, పూమాలలను తానే తయారు చేసి తానుధరించి చూసి మురిసి తన నాథుడుగా ఇంకెంతగా ఆనందిస్తాడో అని భావిస్తూ స్వామి కైంకర్యానికి పంపేది. ఒకనాడు విష్ణుచిత్తుడుస్వామికి మాలాకైంకర్యం చేస్తుండగా పొడవాటి కేశం కనిపించింది. దానితో మాల అపవిత్రం అయిందని ఎంతో బాధపడ్డాడు. ఇంత అపచారం చేశానని భావించి దుఃఖించే ఆ విష్ణుచిత్తునికి స్వామి మాలను ధరించి బావిలో నీడను చూసుకొని మురిసే గోదా దేవి కనిపించింది.
  వేదన చెంది ఇలా చేయడంతప్పు అని చిరు కోపంతో తన తనయకు చెప్పాడు. తన తనయ తెలియక తప్పు చేసింది మన్నించమని శ్రీహరిని పదేపదే వేడుకున్నాడు. ఆ బాధలో ఆయనకు నిద్ర పట్టింది. విష్ణుచిత్తులకు కలలో పెరుమాళ్ దర్శనమిచ్చి గోదా ధరించిన మాలనే తనకెంతో ఇష్టమని చెప్పడంతోనే నిద్రలోనే గోదాను, ‘‘శ్రీదేవియో, భూదేవియో, నీళాదేవియో ఈ ఇంట అవతరించిందని’’అంటూ పరవశించాడు విష్ణుచిత్తులు. తన్మయ త్వంతో శూడికొడుత్తనాచియార్ అని అమ్మను కీర్తిస్తూ పాటలు పాడాడు. ద్వాపరంలో గోపికలు చేసిన కాత్యాయనీ వ్రతం విశేషాలను తన తండ్రినుండి ఆండాళ్ తెలుసుకొంది. గోపాలదేవుని పొందడానికి అనువైన కాత్యాయినీ వ్రత విధానాన్ని తెలుసుకొన్న గోదాదేవి మార్గశిరమాసంలో ధనుస్సంక్రమణ దినాన కాత్యాయినీ వ్రతానికి సమాన ప్రతి పత్తిగల ‘మార్గళి’ వ్రతాన్ని గోదాదేవి చేపట్టింది. విల్లిపుత్తూరునే రేపల్లెగా భావించింది. వటపత్రశాయిని నందగోపునిగా, గోపభామలను తన చెలికత్తెలను గా వారిలో తానొకతెగా ఊహించుకొని వ్రతమాచరించింది. ఆ వ్రతమే శ్రీ వ్రతం. ముప్పదిరోజులు సాగే ఈ వ్రతంలో నాడు గోపికల చిత్తవృత్తులను వారి హాస, హాస్య, లాస్యాలను ప్రకృతి సౌందర్యాలను, చివరగా శ్రీకృష్ణుని యందు తమకు గల ప్రేమానురక్తిని, శరణాగతిని వర్ణిస్తూ రోజుకొక పాశురంగా పాడింది. ఈ ముప్పైరోజుల పాశురాలే నేడు మనం అనుసంధానించుకునే తిరుప్పావై. కాత్యాయనీ వ్రతసమాప్తిరోజు స్వామినే తన కోరిక మేరకు వివాహం చేసుకొంది ఆ తల్లి. ఆ స్వామిలోనే తాను ఐక్యమైంది.
  ఆమె రచించి పాడిన పాశురాలే దివ్యప్రబోధాలు, బ్రహ్మానంద సాగర తరంగాలు, మోక్షసౌధాన్ని చేరడానికి సోపానాలు అని ఎంచిన కోమాండూరి అరుంధతి కొత్తపేటలోని శ్రీ పద్మావతి గోదాసమేత శ్రీవేంకటేశ్వ ఠాలయంలో నిత్యమూ సాయంసంధ్యా సమయంలో గోదాదేవి పాడిన పాశురాలను అనుసంధానిస్తూ వాటి అర్థతాత్పర్యాలను వివరిస్తూ ఆ కృష్ణుని లీలావిలాస వైభోగాలను చెవులకు ఇంపుగా చెపుతున్నారు. ఈ అరుంధతీయే గోదాగా మారి వేంకటేశ్వరుని సన్నిధి లో తిరుప్పావైను అనుసంధానిస్తుంటే ఇతర భక్తులం తా రేపల్లెలోని గోపభామలై వింటూ తమ జన్మ తన్మయమైనట్టుగాను, తామూ గోదాదేవివలె చెలులవలె మార్గళీ వ్రతాచరణను చేస్తున్నట్టు భావిస్తున్నారు.


  0 0

  సాధకుడు భ్రమించి అట్టువైపునకు వెళితే కనబడదు. నిలిస్తే తానే కనబడుతుందది. ఇదీ మాయ- ఇదీ పరీక్ష.
  ఎందుకూ ఉంటే- ఆ తల్లి నదసద్రూపధారిణి. కనుక అసత్తును సత్తుగా చూపిస్తూ ఉంటుంది. అసత్తునందు సత్తు అనే భ్రాంతి కలగడానికొంత కారణం ఊహింపబడుతూ ఉంటుంది. కాని అది అసత్యం అని తెలియడానికి కొంతకాలం పడుతుంది. ఈలోపు ఈ జీవి చాలా చేష్టల్ని చేస్తుంది. అంతేకాదు. ఆమె సర్వమోహిని.
  సర్వాన్ ప్రకృతి జనాన్ భేదభానే సత్యత్వం మన్యమానాన్ మోహయతి. అద్వైత జ్ఞాన విధురాన్ కురుతే. ఇతి. అంటారు భాష్యకర్తలు.
  భేద భావమూహింపబడుతుంది. అసత్తునందు సల్లక్షణమున్నట్లుగా మూర్ఖులను మోహింపచేస్తుంది. అద్వైత స్థితికి దూరంచేస్తుంది. అందుకే ‘గౌరీం’అని వాల్మీకి మహర్షి శ్లోకాన్ని ప్రారంభించేరు. గౌరి అంటే
  భువనేశ్వర్యాః మన్త్రాత్మకం సూక్ష్మరూపం అందుకని గౌర్వైనమః అని పరా శక్తిని కీర్తించే మనం బాహ్య లక్షణ జ్ఞానముఖ్యులం కాకూడదు. అలా భావించిన స్వామి అసత్యాన్ని సత్యమనుకొని మండోదరిని సీతగా భావించి పట్టరాని ఆనందాన్ని పొందేడు. వెంటనే-
  ఇంకావుంది...


  0 0

  తిథి: 
  శుద్ధ షష్ఠి సా.5.28
  నక్షత్రం: 
  ఉత్తరాభాద్ర పూర్తి
  వర్జ్యం: 
  మ.3.40 నుండి 5.23 వరకు
  దుర్ముహూర్తం: 
  ఉ.06.00 నుండి 07.36 వరకు
  రాహు కాలం: 
  ఉ.9.00 నుండి 10.30 వరకు
  మేషం: 
  (అశ్విని, భరణి, కృత్తిక 1పా.) చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్ర్తిలతో తగాదాలేర్పడే అవకాశాలుంటాయి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలుంటాయి.
  వృషభం: 
  (కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) సంపూర్ణ ఆరోగ్యంగా వుంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు.
  మిథునం: 
  (మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) విదేశయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. మనోవిచారాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా వుంటాయి. ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త వహించుట మంచిది. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు.
  కర్కాటకం: 
  (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) విదేశయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయరాదు. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంది. పిల్లలతో జాగ్రత్త వహించుట మంచిది. వృత్తి, ఉద్యోగ రంగంలోనివారికి ఆటంకాలెదురగును. ఆరోగ్యం గూర్చి ప్రత్యేక శ్రద్ధ అవసరం.
  సింహం: 
  (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్ర్తిల మూలకంగా లాభం వుంటుంది. మంచి ఆలోచనలను కలిగివుంటారు. బంధు, మిత్రులు గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తారు.
  కన్య: 
  (ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం వుంది. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోండి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆర్థిక ఇబ్బందులను అధిగమించుటకు ఋణప్రయత్నాలు చేస్తారు. బంధు, మిత్రుల సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి.
  తుల: 
  (చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) ధర్మకార్యాలు చేయుటయందు ఆసక్తి పెరుగుతుంది. దైవదర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యముంటుంది. మానసికానందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభముంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.
  వృశ్చికం: 
  (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) నూతన వ్యక్తులను నమ్మి మోసపోరాదు. ప్రయత్న కార్యాలకు ఆటంకాలెదురవడంతో ఇబ్బంది పడతారు. దైవదర్శనానికి ప్రయత్నిస్తారు. ఋణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. సోదర వైరం కలిగే అవకాశముంటుంది.
  ధనుస్సు: 
  (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) మనస్సు చంచలంగా ఉంటుంది. బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్తపడుట మంచిది. అనారోగ్య బాధలనుభవిస్తారు. చెడు సహవాసానికి దూరంగా నుండుటకు ప్రయత్నించాలి.
  మకరం: 
  (ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) ప్రయత్నం మేరకు స్వల్పలాభముంటుంది. వృధా ప్రయాణాలెక్కువ చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలుంటాయి. ఋణప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధు, మిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.
  కుంభం: 
  (్ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) వ్యవసాయ రంగంలోనివారికి లాభదాయకంగా వుంటుంది. తొందరపాటువల్ల ప్రయత్న కార్యాలు చెడిపోతాయి. చెడును కోరేవారికి దూరంగా నుండుట మంచిది. ఆకస్మిక భయము, ఆందోళన ఆవహిస్తాయి. శారీరకంగా బలహీనమేర్పడుతుంది.
  మీనం: 
  (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందుల అధిగమిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలుగకుండా జాగ్రత్త అవసరం. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ధైర్యసాహసాలతో నూతన కార్యాలు ప్రారంభిస్తారు.
  Date: 
  Saturday, January 12, 2019
  author: 
  - గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి

  0 0

  నాచురల్ స్టార్ నాని నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘జెర్సీ’ చిత్ర టీజర్ త్వరలోనే రానుంది. నాని మొదటిసారిగా క్రికెటర్‌గా నటిస్తుండడంతో ఆ లుక్‌లో ఎలా వుంటాడో చూడాలనుకుంటున్నారు. ఇక ఈ చిత్ర టీజర్‌ను సంక్రాంతి కానుకగా రేపు విడుదల చేయనున్నారు. ‘మళ్లీ రావా’ ఫేం గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నాని సరసన కన్నడ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తోంది. క్రికెట్ నేపథ్యంలో వస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. రంజీ క్రికెటర్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకొని తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ 19న విడుదల కానుంది.


  0 0

  కార్తి హీరోగా నటిస్తున్న దేవ్ సినిమా విడుదల తేదీ ఖరారైంది. వాలెంటైన్స్ డే కనుకగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది దేవ్. ఈ సందర్భంగా చిత్ర ఆడియో విడుదల జనవరి 14వ తేదీన కన్‌ఫర్మ్ చేశారు దర్శక నిర్మాతలు. హారిస్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలకు అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ యాక్షన్ ఫ్యామిలీ డ్రామాను రజత్ రవిశంకర్ తెరకెక్కిస్తున్నారు. ఖాకి లాంటి సూపర్‌హిట్ సినిమా తర్వాత కార్తి సరసన రెండోసారి రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రెండో హీరోయిన్‌గా నిక్కీ గర్లానీ నటిస్తున్నారు. ఆర్ వేల్రాజ్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు.


older | 1 | .... | 2034 | 2035 | (Page 2036) | 2037 | 2038 | .... | 2067 | newer