Are you the publisher? Claim or contact us about this channel


Embed this content in your HTML

Search

Report adult content:

click to rate:

Account: (login)

More Channels


Showcase


Channel Catalog


older | 1 | .... | 2035 | 2036 | (Page 2037) | 2038 | 2039 | .... | 2067 | newer

  0 0

  సూర్యచంద్ర ప్రొడక్షన్‌లో నెమలి సురేశ్ సమర్పణలో నెమలి అనీల్, నెమలి శ్రవణ్ నిర్మాతలుగా నెమలి అనిల్, సుబాంగి పంథ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘రావే నా చెలియ’. ఎన్.మహేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్ర లోగో ఆవిష్కరణ కార్యక్రమ వేడుక శుక్రవారం జరుపుకుంది. ఈ లోగోను ప్రముఖ నిర్మాత రాజ్‌కందుకూరి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చిన్న సినిమాల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సినిమా కూడా చేరింది. రావే నా చెలియ అనే టైటిలే అట్ట్రాక్టివ్‌గా ఉంది. కంటెంట్ కూడా బాగుంటుందనే అనుకుంటున్నా.. కథలో కంటెంట్ ఉంటే తప్పకుండా విజయం సాధిస్తుంది. ఎంటైర్ టీమ్‌కు నా బెస్ట్‌విషస్ తెలియచేస్తున్నా అన్నారు. హీరో నెమలి అనిల్ మాట్లాడుతూ.. ఇది నా మొదటి సినిమా. మా బ్యానర్ కూడా మొదటిదే. మా నాన్న, బాబాయి ఇద్దరూ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించి ఎంతో నమ్మకంతో సపోర్ట్‌చేశారు. టీమ్ అందరంకూడా కష్టపడి ప్రాణంపెట్టి సినిమా చేసాము. చిన్న సినిమా అయినా మంచి సినిమా కనుక ఆదరిస్తారని ఆశిస్తున్నా అన్నారు.
  నిర్వాహకుడు నెమలి సురేశ్ మాట్లాడుతూ సబ్జెక్ట్ బాగుంటే ఆడియన్స్ తప్పకుండా ఆదరిస్తారని తెలుసు.. అందుకే మంచి కథతో వస్తున్నాం.. నచ్చి తీరుతుందని భావిస్తున్నాం అన్నారు. దర్శకుడు మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ విరాజ్ వలనే ఈ సినిమా మొదలైంది. నిర్మాతలు మరియు హీరో అనిల్ కూడా నన్ను చాలా నమ్మి సపోర్ట్‌చేశారు. వాళ్ల నమ్మకాన్ని వమ్ము చేయనని ఈ సందర్భంగా తెలియచేస్తున్నా.. ఈ సినిమాకు కెమెరా వర్క్ చాలా బాగావచ్చింది. డిఫరెంట్ లవ్ స్టోరీతో వస్తున్నాం ఆదరించండి అని తెలిపారు. శ్రవణ్, రవి ఎన్, విరాజ్, సుబాంగి, విజయ్ దగ్గుబాటి, ఎమ్.ఎమ్.కుమార్, కృష్ణమూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెమలి అనిల్, సుబాంగి, విరాజ్, కవిత, రచ్చరవి, రోలర్ రఘు తదితరులు నటించిన చిత్రానికి సంగీతం ఎమ్.ఎమ్.కుమార్, కెమెరా విజయ్ దగ్గుబాటి, ఎడిటర్ రవి మాన్ల, నిర్మాతలు: నెమలి అనిల్, నెమలి శ్రవణ్, కథ-స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: ఎన్.మహ్వేశరరెడ్డి.


  0 0

  గత ఏడాది ఒక్క సినిమా కూడా చేయని వెంకీ.. ఆ గ్యాప్‌ను కవర్ చేసేందుకు వెంకీ వరుసగా సినిమాలు చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నాడు. అందులో భాగంగా ‘జై లవకుశ’ ఫేమ్ బాబీ దర్శకత్వంలో యువ హీరో నాగచైతన్యతో కలిసి మల్టీస్టారర్ చిత్రంలో నటించనున్నాడు వెంకీ. ‘వెంకీ మామ’ అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌మీదకు వెళ్లనుంది. ఇక ఈ చిత్రం తరువాత వెంకీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో సినిమా చేయనున్నాడు. ఇక ఇదిలా ఉంటే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకీ, వరుణ్‌తేజ్ కలిసి నటించిన తాజా చిత్రం ‘ఎఫ్-2’ ఈనెల 12న విడుదల కానుంది. ఔట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక నిర్మాత దిల్‌రాజుకి కూడా ఈ చిత్ర విజయం చాలా కీలకం కానుంది.


  0 0
 • 01/11/19--06:17: మార్చి 1న 118
 • నా నువ్వే తర్వాత కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం 118. టీజర్ ఇటీవల విడుదలై సినిమాపై అంచనాలను తీసుకురాగలిగింది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మార్చి 1న విడుదల కానుంది. అర్జున్‌రెడ్డి ఫేం శాలిని పాండే, నివేద థామస్ కథానాయికలుగా నటిస్తున్న చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గుహన్ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్.ఎస్ కోనేరు నిర్మిస్తున్నారు. కళ్యాణ్‌రామ్ ఈ చిత్రంలో ఒక కొత్త సైల్‌లో కనిపించనున్నారు.


  0 0

  విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్స్‌గా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మాణంలో రూపొందుతోన్న చిత్రం ‘ఎఫ్ 2’, ఫన్ అండ్ ప్రస్టేషన్ ట్యాగ్‌లైన్. అనీల్ రావిపూడి దర్శకుడు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ సాధారణంగా పండగలకు వచ్చే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ సంక్రాంతికి ఎఫ్2.. సంక్రాంతి అల్లుళ్ళుగా వస్తున్నాం. కథ, దర్శకుడిని నమ్మి సినిమా చేశాను. దృశ్యం, గురు సినిమాల తర్వాత చేసిన సినిమా ఇది. దిల్‌రాజుతో మంచి అనుబంధం ఉంది. వరుణ్‌తేజ్, రాజేంద్రప్రసాద్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది అన్నారు.
  వరుణ్‌తేజ్ మాట్లాడుతూ ఫస్ట్‌టైమ్ ఓ మాస్ క్యారెక్టర్ చేశాను. కామెడీ క్యారెక్టర్. ఎంటైర్ టీమ్ కారణంగా సినిమా చాలా త్వరగా పూర్తయ్యింది. ఈ సినిమాతో అనీల్ లాంటి మంచి ఫ్రెండ్ దొరికినందుకు ఆనందంగా ఉంది. దిల్‌రాజు, లక్ష్మణ్‌తో ఈ బ్యానర్‌లో పనిచేయడం ఆనందంగా ఉంది. రాజేంద్రప్రసాద్‌గారితో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. వెంకటేష్‌గారితో సినిమా చేయాలంటే ఎక్కడో చిన్న భయం ఉండేది. కానీ ఆయన మాతో చాలా కంఫర్ట్‌గా ఉన్నారు. ఈ సినిమాలో మా ఇద్దరి బ్రోమాన్స్ అద్భుతంగా ఉండబోతోంది. ప్రేక్షకులు సీట్లో కుదురుగా కూర్చొని సినిమా చూడలేకుండా నవ్వుతూనే ఉంటారు అన్నారు.
  తమన్నా మాట్లాడుతూ- కొన్ని సినిమాలు మైలురాళ్లలా అలా నిలిచిపోతాయి. నాకు ఈ సినిమా అలాంటిది. ఊపిరి తర్వాత నేను డబ్బింగ్ చెప్పుకున్నాను. చాలా షేడ్స్ ఉండే పాత్ర. ఎఫ్3 చేస్తే బావుంటుంది అనుకుంటున్నాను.
  అనీల్ రావిపూడి మాట్లాడుతూ- ఎఫ్2 సినిమా రేపు ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తుతుంది. సినిమాని 80 శాతం కామెడీతోనే నింపేశాం. టైమింగ్ వున్న గొప్ప నటులు ఈ సినిమాలో చేశారు. వెంకటేష్-తమన్నా మధ్య వుండే కెమిస్ట్రీ, కామెడీని ప్రేక్షకులు బాగా ఆస్వాదిస్తారు. వరుణ్ తెంలగాణ యాసతో ఆకట్టుకుంటాడు అన్నారు. నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ- ఓ సినిమా సిద్ధం అవ్వడానికి 24 క్రాఫ్ట్స్ కష్టం ఉండాల్సిందే. ఈ సినిమాకి మేమంతా అలానే కష్టపడ్డాం. ఆయనతో రెండోసారి పనిచేసే అవకాశం దక్కింది. కథ విన్న వెంటనే నా పాత్ర ఏంటి అని అడక్కుండా ఒప్పుకున్నాడు వరుణ్.
  పూర్తి స్క్రిప్టు లేకుండా సినిమా తీయడానికి నేను ఒప్పుకోను. అలాంటి నన్ను అనీల్ కేవలం సన్నివేశాలు చెప్పి ఒప్పించేస్తాడు అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మెహరీన్, రాజేంద్రప్రసాద్, శిరీష్ తదితరులు పాల్గొన్నారు.


  0 0

  మూడుపదుల వయసు దాటి నలభయ్యో పడిలో కూడా తరగని గ్లామర్‌ని మెయింటెయిన్ చేస్తున్న ఏకైక కథానాయిక శ్రీయ. ప్రస్తుతం కెరీర్‌పరంగా స్పీడ్ లేకపోయినా పర్సనల్ లైఫ్‌ని ప్రశాంతంగా ఆస్వాదిస్తోంది. విదేశీ క్రీడాకారుడు ఆండ్రూ కోశ్చీవ్‌ని శ్రీయ గత ఏడాది పెళ్లాడిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఈ అమ్మడు స్టైల్ కంటెంట్ ఇంకా పెంచేసింది. గ్లామర్ ఎలివేషన్‌లోనూ ఏమాత్రం తగ్గడంలేదని తాజా ఫొటోషూట్లు చెబుతున్నాయి. శ్రీయ కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్‌ని సుదూరంగా ఒంటరి దీవుల్లోని సాగరంలో సెలబ్రేట్ చేసుకుందని అర్థమవుతోంది. సముద్రంలో పడవ షికార్ చేస్తున్న దృశ్యాన్ని అందమైన ఫొటోల రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్‌చేసింది. శ్రీయ యథావిధిగా అంతే హాట్గా కనిపిస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్‌లో మొదటి పార్ట్ కథానాయకుడులో అతిథి పాత్రలో మెరిసిన శ్రీయ తదుపరి విక్టరీ వెంకటేష్ సరసన వెంకీ మామ చిత్రంలో కథానాయికగా నటించనుంది. మరోవైపు హిందీలో ‘తడ్కా’ చిత్రంలో నటిస్తోంది. అరవిందస్వామి- సందీప్‌కిషన్ కథానాయకులుగా నటిస్తున్న ‘నరగసూరన్’ చిత్రంలోనూ ఆడి పాడనుంది.


  0 0

  లేడీ సూపర్‌స్టార్ నయనతార క్రేజ్ ఇంకా కొనసాగుతోంది. హీరోల కాంబినేషన్‌లోనే కాకుండా ఆమె లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తోంది. ఈ రెండింటిలో తన ఆధిక్యతను కొనసాగిస్తోంది. అత్యధిక పారితోషికం తీసుకునే లేడీ స్టార్‌గా తన స్థానాన్ని పదిలపరుచుకుంటోంది. నయనతార ప్రధాన పాత్రధారిణిగా నటించిన సినిమాలు తెలుగులోకూడా వచ్చాయి. ఇవన్నీ మంచి విజయాన్ని నమోదుచేశాయి. దాంతో ఆమె సినిమాలకు మంచి బిజినెస్ జరుగుతోంది. తాజాగా ఐరా అనే తమిళ సినిమాచేస్తోంది. ఇప్పటికే తెలుగు హక్కులను అమ్మేశారని తెలిసింది. ఇది హారర్ చిత్రమని ఇటీవల విడుదల చేసిన టీజర్ ద్వారా వెల్లడైంది. నయనతార రెండు పాత్రల్లో కనిపిస్తుందని సమాచారం. అమాయకురాలు, చలాకీతనం ఉండే యువతిగా ఆమె నటిస్తోందని అంటున్నారు. ఈ చిత్రానికి కె.ఎం.సర్జున్ దర్శకత్వం వహిస్తున్నారు.


  0 0

  ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘సాహో’. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్
  రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధకపూర్
  కథానాయికగా నటిస్తుంది. భారీ విజువల్
  ఎఫెక్ట్స్ సన్నివేశాలతో సినిమా
  రూపొందుతుందట. అంతేకాకుండా
  ఇంతవరకు ఇండియాలో ఏ సినిమాలో కూడా
  ఇన్ని విజువల్ ఎఫెక్ట్స్ సన్నివేశాలతో
  సినిమా రూపొందుతుందట.
  అంతేకాకుండా ఇంతవరకు ఇండియాలో
  ఏ సినిమాలో కూడా ఇన్ని విజువల్స్
  ఎఫెక్ట్స్ సన్నివేశాలు లేవని
  చెబుతున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్
  నేపథ్యంలో హాలీవుడ్ రేంజ్‌లో సుజీత్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాడు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం
  అందిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది.
  ఇక ప్రభాస్ ఈ చిత్రంతోపాటు
  జిల్-ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తన 20వ చిత్రంలో నటిస్తున్నాడు. లవ్ స్టోరీ నేపథ్యంలో
  తెరకెక్కుతున్న ఈ చిత్రం కూడా
  ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


  0 0

  ఆదిలాబాద్, జనవరి 11: తొలి విడత నామినేషన్ల ఘట్టం పరిసమాప్తం కావడంతో అధికార యంత్రాంగం ఈనెల 25న జరిగే రెండో విడత ఎన్నికల కోసం పకడ్బందీ ఏర్పాట్లు గావిస్తున్నారు. ఆసిఫాబాద్ కుమురంభీం, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను ఇది వరకే పోలీసు శాఖ గుర్తించి బందోబస్తుకు ఏర్పాట్లు గావిస్తుండగా ఎన్నికల యంత్రాంగం సైతం ప్రశాంతంగా పంచాయతీలు, తాండాలు, గూడేల్లో పోలింగ్ జరిగేలా కసరత్తుసాగిస్తోంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ కుమురంభీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో రెండో విడతగా 489 గ్రామపంచాయతీలు, 4174 వార్డులకు ఎన్నికలు నిర్వహించేలా శుక్రవారం నుండి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. రెండో విడత నామినేషన్ల ఘట్టంతో పల్లెల్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఇది వరకే తొలివిడత నామినేషన్ల ఘట్టం అనంతరం ఒకే ఒక్క నామినేషన్ దాఖలైన 80 గ్రామపంచాయతీల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవం కానున్నారు. కొన్ని చోట్ల బరిలో దిగిన అభ్యర్థులను రంగం నుండి తప్పించేందుకు బడా నేతలు, పలుకుబడి ఉన్న నాయకులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. గూడేల్లో, తాండాల్లో ఏకగ్రీవాల కోసం ఆయా పార్టీల నాయకులు మంతనాలు సాగిస్తుండడం గమనార్హం. సర్పంచ్ కొలవులపై మోజు పెంచుకున్న యువతరం పోటాపోటీగా నామినేషన్లకు సిద్దమవుతుండగా పల్లెపోరులో పట్టు నిలుపుకునేందుకు రాజకీయ పార్టీలు సైతం పావులు కదుపుతున్నాయి. సామాజిక వర్గాలను బేరీజు వేసుకుంటూనే గ్రామాల్లో పట్టున్న నేతలను ఎన్నికల బరిలో దించేలా వ్యూహాలు రూపొందించుకుంటున్నారు. టీ ఆర్ ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీల నేతలు ఇప్పటికే జాబితాలను తమ వద్ద ఉంచుకొని వర్గ సమీకరణతో ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ రంగం సిద్దం చేశారు. జనరల్, బీసీ స్థానాల్లో పోటీ అధికంగా ఉండడంతో ఓట్ల చీలిక ప్రభావంతో ఓటమి పాలవుతామన్న భయం కూడా నేతలను పట్టిపీడిస్తోంది. దీంతో సర్పంచ్ అభ్యర్థితో పాటు ఆయన శిబిరానికి చెందిన వార్డు స్థానాల అభ్యర్థుల ఎంపికపై పార్టీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. రాజకీయాలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో సంస్థాగతంగా పట్టునిలుపుకునేలా రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటిస్తూ ప్రచారానికి తెరలేపుతున్నాయి.
  ఆదిలాబాద్ జిల్లాలో 149 పంచాయతీల్లో నామినేషన్ల జోరు
  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1503 గ్రామపంచాయతీల్లో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లు గావిస్తుండగా వీటిలో రెండో విడతలోనే 489 గ్రామపంచాయతీల్లో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడతగా జరిగే ఎన్నికల్లో భాగంగా బజార్‌హత్నూర్, బోథ్, గుడిహత్నూర్, నేరడిగొండ, తలమడుగు మండలాల్లో 33 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ 149 పంచాయతీలు, 1208 వార్డులకు ఎన్నికలు జరగనుండగా, మంచిర్యాల జిల్లాలోని బీమారం, జైపూర్, చెన్నూరు, కోటపల్లి, మందమర్రి మండలాల్లోని 102 పంచాయతీలు, 868 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. అదే విధంగా నిర్మల్ జిల్లాలోని మామడ, కడెం, దస్తూరాబాద్, లక్ష్మణాచాంద, ఖానాపూర్, పెంబి మండలాల్లోని 39 క్లస్టర్ల పరిధిలో 131 పంచాయతీలు, 1170 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక ఆసిఫాబాద్ కుమురంభీం జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, రెబ్బెన, తిర్యాణి మండలాల్లో 107 పంచాయతీలు, 928 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. కీలకమైన, సమస్యాత్మకమైన పల్లెలు కావడంతో ఇక్కడ పోలీసు యంత్రాంగం పకడ్బందీ బందోబస్తుకు సన్నాహాలు సాగిస్తోంది. రెండో విడత ఎన్నికల కోసం ఇప్పటికే ఎన్నికల సామాగ్రిని క్లస్టర్లకు తరలించగా శుక్రవారం నుండి 13వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 14వ తేదీన నామినేషన్ల పరిశీలన, 15న అభ్యంతరాలకు అవకాశం కల్పించి, 17న మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణ గడవు ఇచ్చి అదే రోజు అభ్యర్థుల తుది జాబితా ప్రకటించనున్నారు.

  అంగరంగ వైభవంగా కుడారై మహోత్సవం
  దివ్యనగర్,జనవరి 11: నిర్మల్ పట్టణంలోని హరిహర క్షేత్రంలో గల మల్లన్నగుట్టపై గల రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో హైదరాబాద్ రమణచార్యుల వేద మంత్రాలతో గోదారంగనాథుల కుడారై ఉత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా 108 వెండి, ఇత్తడి గంగాళాలతో నైవేద్యం నివేదించారు. ఇందులో భాగంగా స్వామివారికి నివేదించిన వెండి గంగాళాన్ని వేలం వేయగా రూ.16500కు పద్మజా రామారావులు కొనుగోలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులతోపాటు ఆలయ ధర్మకర్తలు అల్లోల వినోద, మురళీధర్‌రెడ్డి, ఆలయ గురుస్వామి, టీ ఎన్ మూర్తి, కోశాధికారి వేణుగోపాల్‌రెడ్డి, గురు స్వాములు శంకర్, సతీష్‌రెడ్డి, ఎమ్మెల్యే అల్లోల సతీమణి విజయమ్మ, విమలమ్మ, మాధవమ్మ, శ్యామలమ్మ, అయ్యప్ప స్వాములు, మహిళా భక్తులు పాల్గొన్నారు.

  జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలి-
  5 సంవత్సరాల లోపు ప్రతి ఒక్కరికి పోలియో చుక్కలు పడేలా చూడాలి-
  డబ్ల్యు హెచ్ ఓ ప్రతినిధి అతుల్ పండరినాథ్-
  ఆసిఫాబాద్ టౌన్, జనవరి 11: జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి 3 న నిర్వహించే పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డబ్ల్యుహెచ్ ఓ ప్రతినిధి అతుల్ పండరినాథ్ అన్నారు. శుక్రవారం జిల్లా వైధ్యాధికారి కార్యాలయం లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని పిహెచ్‌సి వైద్యులు , సూపర్‌వైజర్లకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో రహిత సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక పల్స్ పోలియో కార్యక్రమాన్ని పురస్కరించుకొని 5సంత్సరాలలోపు పిల్లలందరకి పోలియో చుక్కలు వేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి డి ఎం హెచ్ ఓ డాక్టర్ సుధాకర్ నాయక్, డాక్టర్ సీతారాం , జిల్లాలోని పిహెచ్‌సి వైద్యాధికారులు , సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

  చలి చలి....
  దహెగాం, జనవరి 11: శుక్రవారం ఉదయం నుండి మబ్బులు కమ్ముకొని ఉండటంతో పాటు కొంత మేర చలి కూడా ఉంది. చలి కూడా ఉండటంతో కళాశాలకు చేరుకున్న విద్యార్థులు చలి మంటలు వేసుకొని మంటల నుండి వెచ్చదనం పోందారు. వివధ గ్రామాల నుండి దహెగాం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సమయానికి చేరుకున్నారు. ఉదయం నుండి సూరీడు బయటకు రాక పోగా మబ్బులు ఉండటంతో 9 డిగ్రీల చలి తీవ్రత ఉంది. దీనితో 10:30 అయిన తరగతులకు వెళ్లలేక చలి మంటల నుండి విద్యార్థులు ఉపశమనం పోందారు.

  కేఆర్‌కే కాలనీలో కో ఆపరేటివ్ బ్యాంకు ప్రారంభం
  ఆదిలాబాద్ మున్సిపాలిటీ, జనవరి 11: ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గల కెఆర్‌కె కాలనీలో శుక్రవారం కో-ఆపరేటీవ్ బ్యాంక్ నూతన శాఖను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి డీసీసీబీ చైర్మన్ దామోదర్ రెడ్డి, ఆదిలాబాద్ జడ్పీటీసీ విజ్జగిరి అశోక్, మావల మాజీ సర్పంచ్ ఉష్కం రఘుపతి ప్రారంభించారు. అనంతరం బ్యాంకులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్యాంకును ఏర్పాటు చేసినందుకు గాను డిసిసిబి చైర్మెన్ దామోదర్‌ను శాలువ, పుష్పగుచ్చాలతో సత్కరించారు. ఈ సంధర్భంగా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ పట్టణానికి దూరంగా ఉన్న కెఆర్‌కె కాలనీ వాసుల సౌకర్యార్థం ఈ బ్యాంకు సేవలు ఎంతగానో ఉపయోగపడుతాయని అన్నారు. బ్యాంకు సేవలను కాలనీవాసులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

  11 ఎన్ ఆర్ ఎంపి 5: నామినేషన్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ ప్రశాంతి
  నామినేషన్ ప్రక్రియ పకడ్భందీగా నిర్వహించాలి
  * జిల్లా కలెక్టర్ ప్రశాంతి
  నిర్మల్, జనవరి 11: గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం.ప్రశాంతి అన్నారు. శుక్రవారం నిర్మల్ మండలలోని చిట్యాల్ గ్రామంలోని నామినేషన్ కేంద్రంను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నామినేషన్ల ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని, ప్రతీరోజు ఆన్‌లైన్‌లో నామినేషన్ల వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

  పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి
  జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్
  ఆదిలాబాద్ మున్సిపాలిటీ, జనవరి 11: జిల్లాలో మూడు విడతలుగా జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విష్ణు ఎస్ వారియర్‌తో పాటు జిల్లా అధికారులు, ఎంపిడీవోలు, రవాణా శాఖ అధికారులతో కలిసి ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. మండలాల వారీగా సమస్యాత్మక మారుమూల పంచాయతీల్లో ఎన్నికల సందర్భంగా ఏలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యలను ముందుగానే గుర్తించి వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. రూట్లవారీగా వాహనాలను సమకూర్చుకోవాలని, ఎన్నికల సిబ్బందికి ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఏదైన సమస్య ఎదురైతే వెంటనే జిల్లా అధికారుల దృష్టికి తీసుకరావాలన్నారు. అధికారులు వెనువెంటనే సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటారని సూచించారు. ఈ ఎన్నికలు సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత ఎంపిడీవోలు, అధికారులపై ఉందన్నారు. ఈ సమావేశంలో జిల్లా జడ్పీ సిఈవో జితెందర్ రెడ్డి, డిఎస్పీ నర్సింహారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

  పోలీసులు ప్రజలకు సేవకులుగా పని చేయాలి
  * సీపీ సత్యనారాయణ
  మందమర్రి, జనవరి 11: పోలీసులు విధి నిర్వహాణలో ప్రజలకు సేవకులుగా పని చేయాలని రామగుండం సీపీ సత్యనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం మందమర్రి పోలీస్ స్టేషన్‌లో పోలీస్ సంస్కరణలకు సంబంధించి పోలీసింగ్ నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఒకే ప్రాంతం ఒకే సేవ అనే నినాదంతో రాష్ట్రం అంతటా పోలీసులు విధులు నిర్వహించాలని డిజిపి ఆదేశాలు జారీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. విధి నిర్వహాణలో ప్రజలతో మమ్మేకం అయి దళిత, కుల ఖేధం లేకుండా ప్రజలకు సేవ చేయాలని ఆయన సూచించారు. ప్రజలనుండి ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం పోలీసులకు అన్ని విదాల సహాకారం అందిస్తుందని దానికి ప్రతిఫలంగా పోలీసులు విజయవంతం విధులు నిర్వహిస్తూ ప్రజల మన్ననలను పోందుతున్నారని ఆయన కొనియాడారు. ముఖ్యంగా పోలీసులు సాంకేతిక సేవలు వినియోగించుకోవాలని దాని వల్లనే నేరాలను అదుపు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. 2018 సంవత్సరంలో సాంకేతిక సేవలు వినియోగించుకొని అనేక నేరాలను అదుపు చేయడం జరిగిందని ముఖ్యంగా మర్డర్, చైన్ స్నాచీంగ్ లాంటి కేసులను సిసి కెమెరాల ద్వారా కనిపెట్టి వెంటనే కేసులు చేధించి నిందితులను పట్టుకోవడం జరిగిందన్నారు. రామగుండం కమీషనరేట్‌ను తెలంగాణ రాష్ట్రంలోనే అత్యుత్తమ కమీషనరేట్ గా రూపు దిద్దేందుకు పోలీసులు సహాకరించాలని ఆయన కోరారు. రామగుండంలో తాను విధులు నిర్వహించడం ఆనందంగా ఉందని, ఇక్కడి ప్రజలు అమాయకులు అని ఆయన కొనియాడారు. రామగుండం కమీషనరేట్ పరిధిలో గంజాయ్ వాడకం పెరిగి చాలా మంది గంజాయ్‌కు బానిసలు అవుతున్నారని, ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్టు చేయడంజ రిగిందని ఇంకా 17 మందిని గుర్తించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. గంజాయ్ వాడిన, సరఫరా చేసిన , మొక్కలు పెంచిన వారిపై పిడి యాక్ట్ ప్రయోగించి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. పోలీసులు ఎలాంటి బేషజాలకు పోకుండా నిర్బయంగా ప్రజలకు సేవలు అందించేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డిసిపి వేణుగోపాల్ రావు, బెల్లంపల్లి ఏసిపి బాలు జాదవ్, మందమర్రి సి ఐ రాం చందర్ రావు, ఎస్సై శివకుమార్‌తో పాటు ఆర్కేపి, దేవాపూర్, కాసిపేట ఎస్సై లు , కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.

  పెర్కపల్లి సర్పంచ్ పదవికి రూ.6.35 లక్షలకు వేలం?
  * వేలంపాటకు సహకరించని వ్యక్తికి గ్రామ బహిష్కరణకు తీర్మాణం
  * గ్రామపెద్దల నిర్ణయంపై అభ్యర్థి భూమన్న అధికారులకు ఫిర్యాదు
  కడెం, జనవరి 11: దస్తురాబాద్ మండలంలోని పెరుకపల్లి గ్రామంలో ఈనెల 10న కొందరు గ్రామ పెద్దలు, గ్రామస్థులు కలిసి పెరుకపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి వేలం వేశారని, ఈవేలంలో గ్రామానికి చెందిన ఎ.ప్రభాకర్ అనే వ్యక్తి రూ.6లక్షల 35 వేలకు వేలం పాడారని పాండ్వాపూర్ సింగిల్ విండో చైర్మెన్, పెరుకపల్లి పంచాయతీ సర్పంచ్ పదవికి బరిలో ఉన్న అభ్యర్థి చుంచు భూమన్న ఆరోపించారు. శుక్రవార మండల కేంద్రమైన కడెంలో విలేఖర్ల సమావేశంలో భూమన్న మాట్లాడుతూ దస్తురాబాద్ మండలంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో పెరుకపల్లి సర్పంచ్ పదవికి పోటీలో గ్రామానికి చెందిన సి.హెచ్ భూమన్న, అప్పని ప్రభాకర్, గడికొప్పుల శంకరయ్య, అప్పని రాజు ఉండి నామినేషన్లు వేశారు. కాగా. ఈనెల 10వ తేదిన పోటీలో ముగ్గురు అభ్యర్థులు గ్రామపెద్దలు, గ్రామస్థులు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సర్పంచ్ పదవిని వేలంపాటను నిర్వహించి ఎ.ప్రభాకర్ అనే వ్యక్తికి రూ.6.35 లక్షలకు సర్పంచ్ పదవినీ కట్టబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. వేలం పాటలో తాము లేమన్నారు. అలాగే తమకు ప్రతిపాదించిన వ్యక్తులను ఉపసంహరించుకోవాలని వారికి బెదిరిస్తున్నారన్నారు. వేలానికి వ్యతిరేకంగా కొంతమంది తమను బెదిరింపులకు గురిచేస్తున్నా తాము పోటీలోనే ఉన్నామన్నారు. ప్రజల ఓట్లతో గెలవాలికానీ వేలం ద్వారా కాదని అంటూ తాము పోటీలో ఉన్నామని, తమవెంట ఎవరు ప్రచారం చేయవద్దని, ఇంటికి ఎవరు కూడా పోవద్దని ఎన్నికల్లో తమకు సహరించవద్దని గ్రామపెద్దలు, మరికొంత మంది నాయకులు తమపై తీర్మాణం చేశారన్నారు. తమను గ్రామం నుండి వేలివేస్తున్నట్లు గ్రామ పెద్దలు ప్రకటించారన్నారు. ఎన్నికల బరిలో తమదే గెలుపు అంటూ తాము విస్తృత ప్రచారం చేసుకుంటున్నామని అభ్యర్థిగా తమకు రక్షణ కల్పించాలని అధికారులకు ఫిర్యాదుచేయనున్నట్లు భూమన్న పేర్కొన్నారు.


  0 0

  చౌటుప్పల్, జనవరి 11: కార్యకర్తలకు అందుబాటులో ఉంటూనే ఐదేళ్లలో మునుగోడును అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మున్సిపాల్టీ పరిధిలోని శుక్రవారం పంచాయతీ ఎన్నికల గురించి చర్చించేందుకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలను ఎప్పటికీ దూరం చేసుకోనన్నారు. అందుబాటులో ఉండటంలేదన్న అపోహలను దూరం చేస్తానన్నారు. ఎన్నిసార్లు వచ్చామని కాదన్నారు. పని అయ్యిందా లేదా అనేది ముఖ్యమన్నారు. నేను ఎక్కడ ఉన్న తన దృష్టి మునుగోడు అభివృద్ధిపైనే ఉంటుందన్నారు. ఐదేళ్లలో మునుగోడును రాష్ట్రానికి మోడల్‌గా తీర్చిదిద్దుతానన్నారు. కార్యకర్తలకు ఎలాంటి సమస్య వచ్చినా ముందుంటానని భరోసా ఇచ్చారు. మునుగోడులో క్యాంపు కార్యాలయం, అంబర్‌పేట్‌లో మరో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అర్ధరాత్రి వచ్చి తలుపుతట్టినా లేచి పనిచేసిపెడుతానని చెప్పారు. క్యాంపు కార్యాలయాలతో పాటు మండలాల వారిగా పీఏలను నియామకం చేసినట్లు చెప్పారు. పార్టీ అభివృద్ధిపై కార్యకర్తలు దృష్టి పెడితే అభివృద్ధిపై తాను బాధ్యత తీసుకుంటానన్నారు. మండలంలోని అన్ని గ్రామపంచాయతీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలన్నారు. అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించుకోని ప్రచారం నిర్వహించాలన్నారు. ఎలాంటి గ్రూప్‌లకు అవకాశం ఇవ్వకుండా అసెంబ్లీ ఎన్నికలను స్ఫూర్తిగా తీసుకోని ముందుకు సాగాలన్నారు. గ్రామపంచాయతీలు కైవసం చేసుకుంటేనే పల్లెల అభివృద్ధి సులభమవుతుందన్నారు. అందరికీ ఆమోదయోగ్యుడైన వ్యక్తులను పంచాయతీ బరిలోకి దించి గెలుపు తలుపులు తట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎంపీపీ చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు పాశం సంజయ్‌బాబు, బ్లాక్ అధ్యక్షుడు గుండు మల్లయ్యగౌడ్, మండల కమిటీ అధ్యక్షుడు చింతల వెంకట్‌రెడ్డి, నాయకులు చిక్కా నరసింహా, ఉబ్బు వెంకటయ్య, బి.పి.రాములు, బడుగు మాణిక్యం, సుర్వి నరసింహాగౌడ్, వెన్‌రెడ్డి రాజు, తాడూరి వెంకట్‌రెడ్డి, దైద జగన్మోహన్‌రెడ్డి, మల్కాపురం నరసింహా, కాసర్ల శ్రీనివాస్‌రెడ్డి, కంది భూపాల్‌రెడ్డి, ఆకుల శ్రీకాంత్, రావుల స్వామి, తిరుపతి రవీందర్, చింతల సాయిలు పాల్గొన్నారు.

  అధిక వడ్డీ వ్యాపారం చేసే
  14 మందిపై కేసులు
  * రూ.26లక్షలు, ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్కులు స్వాధీనం
  * డీఎస్పీ శ్రీనివాస్
  మిర్యాలగూడ టౌన్, జనవరి 11: మిర్యాలగూడ పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలో అధిక వడ్డీలకు వ్యాపారం చేస్తున్న 14 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి 26 లక్షల రూపాయలు స్వాధీనం చేసినట్టు స్థానిక డిఎస్‌పి పద్మనాధుల శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం స్థానిక టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణంలోని ఆయా వ్యాపారుల సంస్థలపై దాడులు నిర్వహించామన్నారు. దాడుల్లో 14 మందిపై కేసు నమోదు చేసి 720 సంతకాలు ఖాళీ ప్రామిసరి నోట్లు, సంతకాలు చేసిన ఖాళీ చెక్కులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ప్రజలను అధిక వడ్డీపై పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు పోలీసులకు సమాచారం ఇస్తే వ్యాపారులపై చర్య చేపడ్తామన్నారు. పట్టణంలో బారా, బీస్ కటింగ్ నిర్వహిస్తున్న పట్టణంలోని షాబునగర్‌లోని బంటు రాంచంద్రు, గొట్టెకనకయ్య, పూల యాదయ్య, ఇస్లాంపురకు చెందిన ఎండి.జావెద్ అలీలపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. రాంచంద్రు కార్యాలయంలో 1.93 లక్షల రూపాయల నగదు, 7 పాకెట్ పుస్తకాలు, 2 ప్రామిసరి నోట్లు, 3 అకౌంట్ రిజిస్టర్ పుస్తకాలు, 3 ప్రామిసరి నోట్ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. గొట్టె కనకయ్య రోజువారి ఫైనాన్స్ పుస్తకాలు, 7 పాకెట్ పుస్తకాలు 58,000 రూపాయలు నగదు స్వాధీనం, ఎండి.జావెద్‌అలి వద్ద 2.45 లక్షల నగదు, 40 ప్రామిసరి నోట్లు, 9 చెక్కులు, 2 అప్పు పత్రాలు, పూల యాదయ్య వద్ద 3 చెక్కులు, 33 వేల నగదు, అరతులం బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు.

  స్థానిక సంస్థ ఎన్నికల్లో
  గులాబీ జెండా ఎగురడం ఖాయం
  తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్‌కుమార్
  అడ్డగూడూరు, జనవరి 11: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను చూసి టీఆర్‌ఎస్ పార్టీలోకి రావడం జరుగుతుందని తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్‌కుమార్ అన్నారు. మండల పరిధిలోని అజింపేట గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరై కాంగ్రెస్ పార్టీకి చెందిన 150కుటుంబాలతో పాటు కాంగ్రెస్ ప్రముఖ నాయకులు స్వామి, మొగులయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు అశోక్ గౌడ్, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు సంతోష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్‌లను కూడా గులాబి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. అనంతరం చేరినవారిలో కొంతమంది మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో పార్టీలోకి చేరుతున్నామని అదేవిధంగా గ్రామాన్ని ఆభివృద్ధి పధంలోకి తీసుకురావడానికి అందరం కలిసి పార్టీలోకి చేరడం జరిగిందన్నారు. జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అన్ని గ్రామాల్లో గులాబి జెండా ఎగురవేయాలని, దాని కొరకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలన్నారు. అనంతరం మానాయికుంట గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ నాయకుడు ఉప్పల రవి కుమార్తె పట్టు వస్త్ర అలకరణ మహోత్సవానికి హజరై ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ మహేందర్‌నాధ్, ఎంపీపీ ఓర్లు లక్ష్మి, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ మేఘారెడ్డి, ఎంపీటీసీ కనె్నబోయిన ఏలేందర్ అండాలు, అడ్డగూడూరు ఎంపీటీసీ జనార్ధన్‌రెడ్డి, మండల యూత్ అధ్యక్షులు అంథోని, తుంగతుర్తి విద్యార్థి విభాగం కార్యదర్శి అరవింద్ మరియు వివిధ గ్రామాల టీఆర్‌ఎస్ నాయకులు, గ్రామాశాఖ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

  నకిలీ రిజిస్ట్రేషన్‌తో భూకబ్జా
  * ఐదుగురి అరెస్టు * డీఎస్పీ శ్రీనివాస్
  మిర్యాలగూడ టౌన్, జనవరి 11: పట్టణంలోని హనుమాన్‌పేట వెంపటి సుశీలకు చెందిన భూమిని నకిలీ రిజిస్ట్రేషన్ చేసి భూకబ్జాకు పాల్పడ్డ ఐదుగురిని శుక్రవారం అరెస్టు చేసినట్టు స్థానిక డీఎస్పీ పద్మనాధుల శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం స్థానిక టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలోని సీతారాంపురానికి చెందిన వెంపటి సుశీల తన భూమిని కొందరు కబ్జా చేశారని టూటౌన్‌లో ఫిర్యాదు చేయగా, దర్యాప్తు జరిపామన్నారు. వెంపటి సుశీల పేర జీపీఏ ఉన్న సర్వే నంబర్ 837లో సుమారు 726 చదరపు గజాల భూమిని ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు తెలియకుండా మరినేని వినె్సంట్, మోర నరేందర్‌లు సేల్ డీడ్ డాక్యుమెంట్ నంబర్ 5635 ఆఫ్ 2018, 5636/2018 తేదీ 25-6-2018 ద్వారా వారి పేర్ల మీద రెండు భాగాలుగా 363 చదరపు గజాల ప్లాట్లను మిర్యాలగూడ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్టర్ చేయించారు. వాటిలో అక్రమంగా ఒక ఇంటికి పిల్లర్స్ వేసి, మరొక ఇంటిని గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తు వరకు నిర్మిస్తుండగా ఈనెల 4న సుశీల ఫిర్యాదు చేసిందన్నారు. దర్యాప్తు జరపగా అంతా మోసం అని తేలిందన్నారు. ఇందుకు డాక్యుమెంట్ రైటర్ ననె్నబోయిన చక్రవర్తి అలియాస్ చక్రి రూ.4.25 లక్షలు తీసుకున్నాడని, అందులో నుండి 4 లక్షలు స్వాధీనం చేసుకున్నామన్నారు. చిగుర్ల సుధీర్ అనే వ్యక్తి కొప్పుల నర్సమ్మ అనే పేరుపై వెంపటి సుశీల మాదిరిగా నకిలీ ఆధార్ కార్డు సృష్టించి సహకరించిందన్నారు. ఇదే విధంగా నల్లగొండ జిల్లాలో 3 చోట్ల ఇలాంటి రిజిస్ట్రేషన్ చేశారని తెలిపారు. నిందితులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరినేని వినె్సంట్, మోర నరేందర్, నకిలీ ఆధార్ సృష్టికర్త చిగుర్ల సుధీర్, డాక్యుమెంట్ రైటర్ చక్రవర్తి, రియల్ ఎస్టేట్ వ్యాపారి రాచమల్ల వీరయ్యలపై కేసులు నమోదు చేసి అరెస్టు చేసి స్థానిక జూడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పర్చామన్నారు. సమావేశంలో టూటౌన్ ఇన్స్‌పెక్టర్ డి.శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.

  తెలంగాణలో మిగిలేది టీఆర్‌ఎస్ ఒక్కటే..
  పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి
  * మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి

  11ఎస్‌యుఆర్ 2: పార్టీల్లో చేరికల కార్యక్రమంలో ప్రసంగిస్తున్న మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
  సూర్యాపేట, జనవరి 11: గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఇందుకు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో సూర్యాపేట రూరల్, ఆత్మకూర్(ఎస్) మండలాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు భారీ సంఖ్యలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి జగదీశ్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పి స్వాగతించారు. రాజకీయాలు, పార్టీలకు అతీతంగా గ్రామాల్లో సర్పంచ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకొని అభివృద్ధికి పునరంకితం కావాలన్నారు. ప్రజాసేవా చేయాలన్న ఆకాంక్ష కలిగిన వారికి పట్టం కడితేనే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తారన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూపొందించిన నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సర్పంచ్ పదవీ ఇక నుండి కత్తిమీద సాములాంటిదని, సక్రమంగా పనిచేయని పక్షంలో వేటు తప్పదన్నారు. అదేవిధంగా పదవీ చేపట్టిన మూడేళ్లలో సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని, అంతేకాకుండా పారిశుద్య లోపం వంటి ఎలాంటి పొరపాట్లు చేసిన వేటు తప్పని విధంగా చట్టం చేయడం జరిగిందన్నారు. తెలంగాణలో మిగిలే రాజకీయ పార్టీ టీఆర్‌ఎస్ ఒక్కటేనన్నారు. దేశ రాజకీయ చరిత్రలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హమీలను అమలుచేయడంతో పాటు హమీలివ్వకుండా అనేక పథకాలను అమలుచేసి యావత్ భారతవనీకి ఆదర్శంగా నిలిచామన్నారు. రైతులు, వృత్తిదారులు, అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సు కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలుచేస్తున్నందు వల్ల రాష్ట్ర ప్రజలు టీఆర్‌ఎస్‌నే తెలంగాణ ఇంటి పార్టీగా భావించి అఖండ మెజార్టీతో రెండవసారి అధికారం కట్టబెట్టారన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో టీడీపీ, కమ్యూనిస్టులు కనుమరగైపోయాయని, కాంగ్రెస్, బీజేపీలు సైతం అదే బాటలో ఉన్నాయన్నారు. రైతాంగ శ్రేయస్సు కోసం కేసీఆర్ అమలుచేసిన రైతు బంధు,రైతు భీమా పథకాలను కేంద్ర ప్రభుత్వంతో పాటు అనేక రాష్ట్రాలు అమలుచేసేందుకు సిద్దమవుతుండటం కేసీఆర్ సమర్ధతకు నిదర్శనమన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికే పట్టం కడుతారన్నారు. ప్రజల నాడిని గమినించి వివిధ పార్టీల్లో ఉన్న వారు స్వచ్చంధంగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట ఎంపీపీ వట్టె జానయ్యయాదవ్, జిల్లా గ్రంథాలయసంస్ధ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, టీఆర్‌ఎస్ రైతు విభాగం రాష్ట్ర నాయకుడు కాకి కృపాకర్‌రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ కాకి దయాకర్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

  చేనేత పరిశ్రమ అభివృద్ధికి పెద్దపీట
  భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్

  చౌటుప్పల్, జనవరి 11: చేనేత పరిశ్రమ అభివృద్ధి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని భువనగిరి పార్లమెంటు సభ్యుడు బూర నర్సయ్యగౌడ్ అన్నారు. చౌటుప్పల్ చేనేత సహకార సంఘంలో చేనేత డిజైనింగ్ కంప్యూర్ శిక్షణ శిబిరాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. చేనేత రంగంలో వృత్తి నైపుణ్య శిక్షణ పొందిన 250 మంది చేనేత కార్మికులకు సర్ట్ఫీకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బూర మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకునేందుకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న చేనేతను ఒడ్డున వేసి కార్మికులకు ఉపాధి అవకాశాలను మెరుగు పర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధితో శ్రమిస్తున్నారని చెప్పారు. చేనేత వస్త్రాలను ఉపయోగించే విధంగా చర్యలు చేపట్టిందన్నారు. చేనేతకు మార్కెట్ మంచి గుర్తింపు ఉందని గుర్తుచేశారు. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేనేతకు అనేక రాయితీలు ఇస్తుందని గుర్తుచేశారు. చేనేత డిజైనింగ్ కంప్యూటర్ శిక్షణను చేనేత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజల అభిరుచికి అనుగుణంగా చేనేత వస్త్రాలను ఉత్పత్తి చేయాలన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తూ కొత్త డిజైన్‌లను రూపొందిస్తూ ప్రజలను ఆకర్షించే విధంగా చేనేత ఉత్పత్తులు ఉండాలని సూచించారు. దీంతో చేనేత కార్మికులకు ఉపాధి మెరుగు కావడంతో పాటు ఆదాయం పెరిగి జీవనోపాధి వృద్ధి చెందుతుందన్నారు. చేనేత వస్త్రాలకు అవసరమైన మార్కెటింగ్ సౌకర్యం ప్రభుత్వం కల్పిస్తుందని హామీ ఇచ్చారు. చేనేతను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. సంఘం అధ్యక్షుడు కందగట్ల బిక్షపతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాలలో జెడ్పీటీసీ సభ్యుడు పెద్దిటి బుచ్చిరెడ్డి, తడక యాదగిరి, ఎర్రమాద వెంకన్న, విద్యాసాగర్, చింతల దామోదర్‌రెడ్డి, బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, ముత్యాల భూపాల్‌రెడ్డి, ఎం.డి.బాబాషరీఫ్, ఊడుగు శ్రీనివాస్‌గౌడ్, గోశిక స్వామి, తడక కిరణ్, గోశిక కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.


  0 0
 • 01/11/19--07:21: బులియన్
 • ముంబయిలో
  బంగారం (22 క్యారెట్స్)
  1 గ్రాము: రూ. 3,128.00
  8 గ్రాములు: రూ. 25,024.00
  10 గ్రాములు: రూ. 31,280.00
  100 గ్రాములు: రూ. 3,12,800.00
  బంగారం (24 క్యారెట్స్)
  1 గ్రాము: రూ. 3,345.455
  8 గ్రాములు: రూ. 26,763.640
  10 గ్రాములు: రూ. 33,454.550
  100 గ్రాములు: రూ. 3,34,545.50
  వెండి
  8 గ్రాములు: రూ. 331.20
  10 గ్రాములు: రూ. 441.00
  100 గ్రాములు: రూ. 4,140.00
  ఒక కిలో: రూ. 41,400.00
  హైదరాబాద్‌లో
  బంగారం (22 క్యారెట్స్)
  1 గ్రాము: రూ. 3,072.00
  8 గ్రాములు: రూ. 24,576.00
  10 గ్రాములు: రూ. 30,720.00
  100 గ్రాములు: రూ. 3,07,200.00
  బంగారం (24 క్యారెట్స్)
  1 గ్రాము: రూ. 3,285.561
  8 గ్రాములు: రూ. 26,284.488
  10 గ్రాములు: రూ. 32,855.610
  100 గ్రాములు: రూ. 3,28,556.10
  వెండి
  8 గ్రాములు: రూ. 331.20
  10 గ్రాములు: రూ. 441.00
  100 గ్రాములు: రూ. 4,140.00
  ఒక కిలో: రూ. 41,400.00


  0 0

  న్యూఢిల్లీ, జనవరి 11: కంపెనీకి ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించే అవకాశం కిరణ్ మజుందార్ షాకు ఇన్ఫోసిస్ రెండోసారి కల్పించింది. ఏప్రిల్ ఒకటి నుంచి అమె అధికారికంగా బాధ్యతలు తీసుకుంటారు. సుమారు మూడు సంవత్సరాలు పాటు ఆమె ఈ పదవిలో ఉంటారు. ఆమెకు ఉన్న అపారమైన అనుభవం, వివిధ అంశాలపట్ల అవగాహన కంపెనీకి ఎంతగానో ఉపయోగపడతాయని ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలెకనీ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. బోర్డులో ఆమె పాత్ర కీలకమని, అందులో మరోసారి ఆమెకు అవకాశం కల్పించామని వివరించారు.


  0 0

  హైదరాబాద్, జనవరి 11: జీఎస్‌టీ మినహాయింపును రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షలుగా రెట్టింపు చేయడం పట్ల ‘్ఫక్కీ’ హర్షం వ్యక్తం చేసింది. దీంతో సింప్లిఫైడ్ కంపోజిషన్ స్కీంతో పాటు తన పరిథిలోకి సర్వీస్ ప్రొవైడ్లను తీసుకుని రావడం ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ఎంటర్‌ప్రైజ్‌లకు గొప్ప ప్రయోజనం చేకూరుతుందని ‘్ఫక్కీ’ ప్రెసిడెంట్ సందీప్ సోమాని అన్నారు. కౌన్సిల్ నిర్ణయాలలో ఇది అత్యంత కలీకమైందని, దీనిని మరింత పెంచుతుందని ఆశిస్తున్నానని ఆమె చెప్పారు. కంపోజిషన్ స్కీమ్‌కు వార్షిక టర్నోవర్ పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.1 కోటి నుంచి రూ.1.5 కోట్లకు పెంచాలన్న నిర్ణయంతో పాటు వార్షిక రిటర్స్ ఫైలింగ్‌తో పాటు త్రైమాసిక పన్ను చెల్లింపు సౌకర్యం కల్పించడం వల్ల వ్యాపారులకు ఊరట అని ఆమె తెలిపారు.
  మంజీరా మాల్‌లో స్టోర్‌ను ప్రారంభించిన లైఫ్ స్టయిల్
  హైదరాబాద్‌లోని మంజీరా మాల్‌లో లైఫ్ స్టయిల్ నూతనంగా స్టోర్‌ను ప్రారంభించింది. సుమారు 48 వేల చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణంలో 2 అంతస్థులలో స్టోర్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా లైఫ్ స్టయిల్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వసంత్ కుమార్ మాట్లాడుతూ లైఫ్ స్టయిల్‌కు హైదరాబాద్‌లో నాలుగవదని, దేశంలో 76వ స్టోర్ అని తెలిపారు. క్లిక్ అండ్ కలెక్టర్, ఇంకా రిటర్న్ టు స్టోర్ వంటి సౌకర్యాలతో తమ కస్టమర్లకు అన్ని రకాలైన షాపింగ్ అనభవాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. ఈ స్టోర్‌ను లైఫ్ స్టయిల్ ‘సేల్‌‘తో ప్రారంభించి ప్రముఖ బ్రాండ్లపై 50 శాతం వరకు తగ్గింపు ధరలతో అందిస్తున్నట్లు చెప్పారు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, స్టాండర్స్ ఛార్టర్డ్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డును కలిగిన వారు రూ.8 వేలు లేదా ఆపై కొనుగోలు చేస్తే 5 శాతం వరకు అదనపు క్యాష్ బ్యాక్ సదుపాయాన్ని (షరతులు వర్తిస్తాయి) పొందవచ్చని ఆయన వివరించారు.


  0 0

  ముంబయి, జనవరి 11: లావాదేవీలకు ఈవారం చివరి రోజైన శుక్రవారం స్వల్ప నష్టంతో స్టాక్ మార్కెట్ ముగిసింది. నాలుగు రోజుల వరుస లాభాలకు గురువారం గండిపడిన విషయం తెలిసిందే. అయితే, అంతర్జాతీయ మార్కెట్ సూచీలు సానుకూల ధోరణులను ప్రదర్శిస్తున్న నేపథ్యంలో, బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లోనూ లాభాలు నమోదవుతాయన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, అందుకు భిన్నంగా సెనె్సక్స్ 36,214.26 నుంచి 35,840.60 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. చివరికి అత్యధికంగానీ, అత్యల్పంగానీ కాకుండా మధ్యస్తంగా 96.66 పాయింట్లు (0.27 శాతం) పతనమై 36,191.87 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 26.65 పతనమై 10,794.95 పాయింట్లుగా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లు బలపడుతున్న తరుణంలో బీఎస్‌ఈలో అందుకు ప్రతికూలమైన వాతావరణం కనిపించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే, సంక్రాంతి పండుగ సీజన్ కావడంతో, ఇతరత్రా వ్యాపకాల్లో మునిగి, స్టాక్ మార్కెట్‌పై మదుపరులు పెద్దగా ఆసక్తి చూపలేదన్న వాదన వినిపిస్తున్నది. కాగా, శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, టీసీఎస్, ఎస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ కంపెనీల షేర్లు నష్టాలను ఎదుర్కొన్నాయి. లాభాలను ఆర్జించిన కంపెనీల్లో ఐటీసీ, ఓఎన్‌జీసీ, వేదాంతా లిమిటెడ్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ ఉన్నాయి. ఫోరెక్స్‌లో డాలర్ 70.55 రూపాయలుగా ట్రేడ్ అయింది. అంటే, డాలర్‌కు రూపాయి విలువ 21 పైసలు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర 1.10 శాతం పెరిగి, బ్యారెల్ ధర 62.36 డాలర్లకు చేరింది.
  మూడు శాతం పతనమైన టీసీఎస్ షేర్లు
  టీసీఎస్ షేర్లు 3 శాతం పతనమైంది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఆదాయం 24.1 శాతం పెరిగినట్టు టీసీఎస్ ప్రకటించింది. అయినప్పటికీ, ఆ కంపెనీ షేర్ల అమ్మకాలు నష్టాలతో ముగిశాయి. బీఎస్‌ఈలో టీసీఎస్ షేర్ 1,840 రూపాయలకు పడిపోయింది. నేషనల్ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లోనూ ఈ పతనం స్పష్టంగా కనిపించింది. 2.71 శాతం నష్టపోయిన టీసీఎస్ షేర్ ధర 1,837.15 రూపాయలకు చేరింది. సాఫ్ట్‌వేర్ రంగంలో దేశంలోనే అగ్రస్థానాన్ని ఆక్రమించిన టీసీఎస్ మూడో త్రైమసాకంగా నికర లాభంలో 24.1 శాతం పెరిగినట్టు ప్రకటించింది. గత ఏడాది డిసెంబర్ చివరి నాటికి ఈ కంపెనీ త్రైమాసికంగాలో 8,105 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించింది. రెండో త్రైమాసికంలో 6,531 కోట్ల రూపాయల లాభాన్ని ప్రకటించిన టీసీఎస్ మూడో త్రైమాసికంలో అంతకంటే మెరుగైన వృద్ధిరేటును నమోదు చేసింది. మొత్తం మీద ఈ కంపెనీ రెవెన్యూ వృద్ధి సగటున 20.8 శాతానికి చేరి, 37,338 కోట్ల రూపాయలుగా నివేదికలో కనిపిస్తున్నది. గత ఏడాది ఇదే సమయానికి టీసీఎస్ మొత్తం లాభం 30,904 కోట్ల రూపాయలు.


  0 0

  న్యూఢిల్లీ, జనవరి 11: వాటాల బై బ్యాక్‌కు ఇన్ఫోసిస్ సిద్ధమైంది. 8,260 కోట్ల రూపాయల విలువైన వాటాలను తిరిగి కొనాలని పాలక మండలి నిర్ణయించినట్టు ఇన్ఫోసిస్ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. 13,000 కోట్ల రూపాయల పెట్టుబడుల కేటాయింపులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. షేర్లను అమ్మేందుకు వాటాదారులను ఆకర్షించే దిశగా ఒక్కో వాటాకు నాలుగు రూపయల చొప్పున ప్రత్యేక డివిడెంట్ ఇవ్వాలని తీర్మానించినట్టు ఇన్ఫోసిస్ వివరించింది. కంపెనీకి లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా కిరణ్ మజుందార్ షాను మళ్లీ నియమించాలని కూడా నిర్ణయించినట్టు పేర్కొంది. ఈ నియామకం ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 2023 మార్చి 22వ తేదీ వరకు అమల్లో ఉంటుందని తెలిపింది. ఇన్ఫోసిస్ ప్రకటన ప్రకారం, ఆ కంపెనీ 10,32,50,000 ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేయనుంది. గత ఏడాది డిసెంబర్ చివరి నాటికి చెల్లించిన మూల ధనంలో ఇది 2.36 శాతం. ఈ వాటాలు కొనేందుకు 8,260 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. గతంలో భారత స్టాక్ ఎక్ఛ్సేంజ్ ద్వారా ఇన్ఫోసిస్ షేర్లను అమ్మింది. ఇప్పుడు ఒక్కో వాటాను 800 రూపాయలకు మించకుండా తిగిరి కొనడానికి తీర్మానించింది. అమెరికన్ డిపాజిటరీ షేర్ (ఏడీఎస్)ను షేర్ల రూపంలోకి మార్చుకోవడానికి కూడా ఇన్ఫోసిస్ అనుమతించింది. ఫలితంగా ఏడీఎస్‌లో ఉన్న వాటాలు ఈక్విటీ కిందకు మారిపోతాయి. అప్పుడు వాటిని ‘బై బ్యాక్’లో కొనుగోలు చేసే వీలుంటుంది. ఇన్ఫోసిస్ ఈ విధంగా గతంలో అమ్మిన ఈక్విటీ వాటాలను తిరిగి కొనడం ఇది రెండోసారి. 2017 డిసెంబర్‌లో, మొదటిసారి 13,000 కోట్ల రూపాయలతో, 11.3 శాతం షేర్లను ఒక్కొక్కటీ 1,150 రూపాయలు చెల్లించి కొనింది. సుమారు మూడు దశాబ్దాల కంపెనీ చరిత్రలో ఇన్ఫోసిస్ వాటాలను తిరిగి కొనడం అమే మొదటిసారి. సుధా గోపాలకృష్ణన్, రోహన్ మూర్తి, ఎల్‌ఐసీ కీలకంగా వ్యవహరించడంతో అప్పుడు ‘బై బ్యాక్’ విజయవంతమైంది. కాగా, శుక్రవారం సెబీకి సమర్పించిన ఫైలింగ్‌లో మరోసారి ‘బై బ్యాక్’ నిర్ణయాన్ని ఇన్ఫోసిస్ ప్రకటించింది. ఈసారి 2.36 శాతం వాటలను కొనాలని తీర్మానించింది.
  త్రైమాసిక లాభాలు రూ. 3,609
  గడచిన డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి ఇన్ఫోసిస్ ఆదాయం రూ.21.400 కోట్ల రూపాయలుకాగా అంతకు ముందు యేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 3.8 శాతం అధికం, ఆ త్రైమాసికంలో ఈ కంపెనీ కోట్లు 20,607 ఆర్జించింది. జనవరి 11 నాటికి గడచిన త్రైమాసికంలో ఇన్ఫోసిస్ రూ.3,609 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించింది. అయితే లాభాల్లో మాత్రం ఈ త్రైమాసికంలో 12.2 శాతం తగ్గుదల దమోదైంది. గడచిన త్రైమాసికంలో రూ.4,110 కోట్ల లాభాలు ఈ కంపెనీకి రాగా ప్రస్తుత త్రైమాసికంలో సుమారు 500 కోట్లమేర తగ్గడం గమనార్హం. కంపెనీ మార్కెట్ నియంత్రణ విభాగానికి సమర్పించిన గణాంకాల మేరకు దాదాపు 25 విశే్లషణల మేరకు ఈ ఐటీ రంగ దిగ్గజ కంపెనీ త్రైమాసిక అంచనాలు రూపొందించారు.
  అందులో ప్రధానమైన అంశాలివే..
  ద్రవ్య లభ్యతను అనుసరించి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కంపెనీ ఆదాయాభివృద్ధి 2.7 శాతం, ఇదే త్రైమాసికంలో అంతకు క్రితం యేడాది 10.1 శాతం ఆదాయభివృద్ధి జరిగింది. పెరుగుతున్న క్లెయింట్ రిలవెన్స్‌తో తాము వృద్ధిలో ఏ యేటికాయేడు స్థిరమైన కరెన్సీ ప్రాతిపదికన డబుల్ డిజిట్ వృద్ధి రేటును అందుకోగలుగుతున్నామని ఆ కంపెనీ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ సలీల్ ప్రకాష్ పేర్కొన్నారు. అదే క్రమంలో డిజిటల్ ఆదాయంలో సైతం గడచిన సెప్టెంబర్ మాసంతో ముగిసిన త్రైమాసికంలో 5 శాతం వృద్ధిని చూస్తున్నామని అన్నారు. ఈ ఆదాయంలో సైతం యేడాదికి 33.1 శాతం వృద్ధి జరుగుతోందన్నారు. 2019వ సంవత్సరంలోకి మంచి ఫలితాలతోనే అడుగిడుతున్నందున ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు.


  0 0

  ధర్మపురి, జనవరి 11: ధర్మపురి క్షేత్రంలోని శ్రీలక్ష్మీ నరసింహ దేవస్థానంలోని శేషప్ప కళావేదికపై గోదా రంగనాథ స్వాముల కళ్యాణం ఈనెల 13న ఆదివారం ఉదయం 11గంటల సుముహూర్తంలో నిర్వహించనున్నందున దేవస్థానం పక్షాన విస్తృత ఏర్పాటు చేస్తున్నారు. వటపత్రశాయి అయిన శ్రీమహా విష్ణువును గూర్చి రోజుకొక్క పాశురం గానం చేసి, శ్రీనివాసునికై కాత్యాయనీ వ్రతమాచరించి, శ్రీరంగ నాథుడిని పరిణయ మాడిన ఆండాళ్ కోదై, గోదాదేవి, ఆముక్త మాల్యద, చోడిక్కొడుత్త నాచ్చియార్ అనే పేర్లతో ప్రసిద్ధ నొందినది. మధురకు యాభై మైళ్ళ దూరాన శ్రీవిల్లిపుత్తరు అనే చిన్ని నగరంలో నిత్యం, రంగానాథుడిని సేవించే విష్ణుచిత్తుడనే పరమ భక్తుడుండేవాడు. గోదాదేవి విష్ణుచిత్తునకు తులసి వనంలో లభించింది. ఆమెకు ‘‘కోదై’’ (పూలమాల) అనే పేరు పెట్టాడు. తన చుట్టూ ఉన్న ఆధ్యాత్మిక ప్రభావ కారణాన శ్రీరంగ నాథుడినే ఆమె భర్తగా పొందాలనుకుంది. స్వామికి సమర్పించే మాలలలన్నీ ముందుగా తాను ధరించి, దేవదేవునికి సమర్పింప చేస్తూ, ‘‘ఆముక్త మాల్యద’’ అయింది. విషయాన్ని గమనించిన విష్ణుచిత్తుడు వేరే మాలలు సమర్పిస్తే, ఆ స్వామి గోదాదేవి ధరించి విడిచిన మాలలే కావాలన్నాడు. రంగనాథుని భర్తగా పొందేందుకు ఆమె ధనుర్మాస వ్రతం ఆచరించింది. ‘‘ఆండాళ్’’ అని ఆమెను విష్ణుచిత్తుడు సంబోధించాడు. అంటే రక్షకురాలు అని అర్థం. సర్వం త్యజించి స్వామిపైనే మనసు లగ్నం చేయడానికి గోదాదేవి కాత్యాయనీ వ్రతం చేసింది. స్వామిని పాశురాలతో నెల రోజులు పూజించింది. వేకువ జామునే గోపికలను నిద్ర లేపుతూ, స్వామి కైంకర్యానికి సమాయత్తం చేసింది. స్వామి అనుగ్రహించి ఆమెను తనలో ఐక్యం చేసుకుంటాడు. అలా ఆమె ‘‘రంగనాయకి’’ అయింది. ధర్మపురి క్షేత్రానికి చెందిన అపర వేదవ్యాసులు, అష్టాదశ పురాణాలను ఔపోసనం పట్టి లబ్దప్రతిష్ఠులైన శ్రీగుండి రాజర్షి, శ్రీరంగం క్షేత్ర దర్శనం చేసుకుని వచ్చి, ధర్మపురి క్షేత్రంలో వైకుంఠ ద్వార దర్శనం, గోదా రంగనాథుల కళ్యాణాది కార్యక్రమాలను దేవస్థానంలో ప్రారంభింప చేశారు. నాటి నుండి ఈ పరంపర సాంప్రదాయ రీతిలో కొనసాగుతున్నది. ఈనేపథ్యంలో దేవస్థానం ఎడి, ఇఓ అమరేందర్, చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, ధర్మకర్తలు, సిబ్బంది ఆదివారం ఉదయం 11గంటలకు నిర్వహించనున్న గోదా కళ్యాణ ఘట్టానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
  భక్తులతో పోటెత్తిన ధర్మపురి క్షేత్రం
  పుణ్య తీర్థమైన ధర్మపురి క్షేత్రం శుక్రవారం భక్తజనంతో పోటెత్తింది. పుష్య మాస శుక్ల పంచమీ యుత శుక్రవారం పిల్లలకు సంక్రాంతి సెలవులు ప్రారంభమైన క్రమంలో రాష్ట్రంలోని నలుమూలల నుండి ఆర్టీసీ, ప్రత్యేక వాహనాలలో ఏతెంచిన అశేష భక్తజనుల దైవ నామ స్మరణలు, జయజయధ్వనాలు, భక్తిసంగీతాలు, వేద మంత్రాలతో సనాతన క్షేత్రంలో భక్తి పారవశ్యం పొంగి పొర్లింది. ఉదయాత్పూర్వంనుండే ప్రత్యేక ప్రయివేటు వాహనాల ద్వారా వివిధ జిల్లాలనుండి క్షేత్రానికి చేరుకున్న భక్తులు, గోదావరి నదిలో స్నానాలను ఆచరించి, దైవ దర్శనాలకోసం దేవస్థానానికి చేరుకుని, బారులు తీరి వేచి ఉన్నారు. రద్దీ అధికం కాగా దైవ దర్శనార్థం వచ్చిన వందలాది భక్తులు దేవస్థానంలో సేదతీరారు. దేవస్థాన ఆస్థాన వేద పండితులు బొజ్జా రమేశ శర్మ, ముత్యాల శర్మ, సంతోష్ శర్మ, సంపత్ కుమార శర్మ, వివిధ ఆలయాల అర్చకులు పర్వదిన అభిషేకాలు, అర్చనలు, పూజలు నిర్వహించారు. పంచోపనిషత్ యుక్త అభిషేకాలు, అష్టోత్తరశతి నామార్చనలు, సప్త హారతులు, మంత్రపుష్పాది కార్యక్రమాలను నిర్వహించారు. వందలాదిమంది భక్తులు కార్యక్రమాలలో భాగస్వాములైనారు. భక్తులు దేవస్థానంలో ప్రసాదాలను కొని, పరమాన్నాలుగా ఆరగించారు. పర్వదిన ప్రత్యేక పూజలను, నిత్య కళ్యాణాదులను గావించారు.
  గోదావరిలో అశేష భక్తజన స్నానాలు
  సనాతన సాంప్రదాయాల వారసత్వ నేపథ్యం కలిగిన ప్రాచీన పుణ్య క్షేత్రమైన ధర్మపురి క్షేత్రానికి శుక్రవారం సందర్భంగా అత్యధిక సంఖ్యాకులైన భక్తులు, యాత్రికులు గోదావరి స్నానాలకై తండోప తండాలుగా తరలి వచ్చారు. ఇటీవలి కాలంలో భక్తుల రద్దీ పెరుగుతున్న క్రమంలో, పుష్యమాస శుక్రవారం పర్వదినంనాడు ఉదయాత్పూర్వంనుండే పిల్లాపాపలతో, గోదావరి నదిలో మంగళ స్నానాలు ఆచరించి, మహా సంకల్పాది పూజలొనరించి, గోదావరి మాతను అర్చించారు. మహిళలు పెద్దసంఖ్యలో ముత్తయిదువులకు వాయినాలను సమర్పించుకున్నారు. మహా సంకల్పాలు, దాన ధర్మాది సత్కర్మలను ఆచరించారు. ఆధిక సంఖ్యలో భక్తులు సనాతన ఆచారంలో భాగంగా గోదావరి తీరంలో, కోడి, మేకలలాంటి జంతుబలులతో, మొక్కులు తీర్చుకున్నారు. నదివద్దే వంటలు చేసుకుని మాతకు నైవేద్యాలు సమర్పించి భుజించారు. గోదావరి పౌరోహితుల ఆధ్వర్యంలో తమ గోత్రనామాదులతో ప్రత్యేక పూజలు, మహా సంకల్పాదులను వేదోక్త సాంప్రదాయాచరణ ప్రకారం ఆచరించారు. అనంతరం దైవ దర్శనాల కొరకు ప్రధానాలయాలకు వెళ్ళి దైవ దర్శనాలు చేసుకుని ప్రత్యేక గోత్రనామయుక్త పూజలను గావించుకున్నారు. శుక్రవారం సంబరాలలో అంబర చుంబిత భక్తి భావంతో భాగస్వాములై, గోదావరి స్నానాదులతో పునీతులు కావడానికి క్షేత్రానికి రాష్ట్రేతర ప్రాంతాలనుండి సైతం శ్రమకోర్చి అరుదెంచిన భక్తులు వివిధ ఆలయాలముందు బారులుతీరి దర్శనాలను చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈసందర్భంగా దేవస్థానంలోని ప్రధానాలయాలలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు గావించారు. వివిధ ఆలయాల అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక సాంప్రదాయక కార్యక్రమాలను నిర్వహించారు. రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సులను క్రమబద్దీకరించారు.
  వైభవంగా వేంకటేశ్వర మహా క్షీరాభిషేకం
  సనాతన సాంప్రదాయాల వారసత్వ నేపథ్యం కలిగిన ప్రాచీన పుణ్య క్షేత్రమైన ధర్మపురిలో పుష్యమాస మాస యుక్త శుక్రవారం నేపథ్యంలో, గోదావరి స్నానాలకై తరలి వచ్చిన భక్తజనం దైవ దర్శనాల కొరకు ప్రధానాలయాలకు అరుదెంచి క్యూలైన్ల ద్వారా దైవ దర్శనాలు చేసుకుని ప్రత్యేక గోత్రనామయుక్త పూజలను గావించుకున్నారు. ఈసందర్భంగా దేవస్థానంలోని ప్రధానాలయాలలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు గావించగా, శ్రీవేంకటేశ్వర ఆలయంలో నేరేళ్ళ శ్రీనివాసా చార్య, శ్రీ్ధరాచార్య, కిరణ్, మోహనాచార్య, గ్రహ, గృహ, సమస్త బాధల నివారణకై లక్ష్మీ హోమాలను, లక్ష్మీసూక్త హవనాలను గావించారు. దేవస్థానం పక్షాన మహా క్షీరాభిషేకం కన్నుల పండువగా నిర్వహించారు. దేవస్థానం డిసి,ఇఓ అమరేందర్, చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ధర్మకర్తలు, అర్చక పౌరోహితులు, అర్చకులు ప్రత్యేక సాంప్రదాయక కార్యక్రమాలను నిర్వహించారు.

  స్వచ్ఛ్ పెద్దపల్లి సాధనే లక్ష్యం

  -కలెక్టర్ శ్రీదేవసేన
  గోదావరిఖని, జనవరి 11: జిల్లాలో స్వచ్ఛతను పెంపొందించి స్వచ్ఛ్ పెద్దపల్లి సాధనే లక్ష్యంగా అధికారులు చిత్తశుద్ధితో పని చేస్తున్నారని, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి స్వచ్ఛ్ జిల్లాగా తీర్చిదిద్ధుదామని జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన అన్నారు. జిల్లాలో స్వచ్ఛ్ భారత్ కింద నిర్వహించిన కార్యక్రమాలపై ప్రపం బ్యాంక్ ప్రతినిధులకు కలెక్టర్ శుక్రవారం ఎన్టీపీసీ జ్యోతి భవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... స్వచ్చ్ భారత్ కార్యక్రమం కింద అధికారుల కృషితో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా వంద శాతం మరుగుదొడ్లను నిర్మించి జిల్లాను ఓడి ఎఫ్‌గా ప్రకటించుకున్మాని, అనంతరం ఓడి ఎఫ్‌ను సుస్థిరపరిచే దిశగా మరుగుదొడ్లను వినియోగించుకోవాలని స్వచ్ఛ్‌త అంశాలపై ప్రజలకు అవగాహన కలిపంచేందుకు ఓడి ఎఫ్ ఫ్లస్ కార్యక్రమాన్ని నిర్వహించామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో స్వచ్ఛ్ సర్వేక్షన్ కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తామని, ప్రతి శుక్రవారం డ్రై డేగా పరిగణించి ప్రతి అధికారి ఒక గ్రామంలో స్వచ్ఛ్‌త కార్యక్రమంలో పాల్గొంటూ ప్రజలను చైతన్య పరుస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని కొంత మేర వాయిదా వేసామని ప్రతినిధులకు ఆమె తెలిపారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో డ్రైయిన్ల అవసరం లేకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో ప్రతి ఇంటికో సోప్ కిట్ నిర్మాణం చేపట్టామని, 98శాతం మేర పూర్తి చేసామని, మరో 10 రోజుల్లో మిగిలిన పనులు పూర్తవుతాయని కలెక్టర్ తెలిపారు. కాగా ప్రపంచ బ్యాంకు బృందాలు శనివారం ఎలిగేడు మండలంలోని సుల్తాన్‌పూర్, జూలపల్లి మండలంలోని జూలపల్లి, కాటాపూర్, ధర్మారం మండలంలోని బొట్లవనపర్తి, బొమ్మిరెడ్డిపల్లి, రామగుండం మండలంలోని ఇసాలతక్కల్లపల్లిలో పర్యటించనున్నారు.
  కన్నుల పండువగా కుడారై ఉత్సవాలు
  సుల్తానాబాద్, జనవరి 11: ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా స్థానిక శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో శుక్రవారం తిరుప్పావై కార్యక్రమాలు కన్నుల పండువగా, వైభవంగా జరిగాయి. ప్రతీ రోజు తిరుప్పావైకి సంబంధించిన 30 పాశురాలను అందరు కలిసి పాడారు. 26,27వ పాశురాలు పరమమంగళకరమైన విశేషమైనవి. అనృ ఇవ్వగలమంటూ స్వామికి మంగళహారతులతో శుభవ్యపార్థత్యాన్ని సమర్పించారు. కుడారై వెళ్లుం షీరు గోవిందా..అనే పాశురం అనుసంధానం చేశారు. 108 గంగాళతో పాయసాన్ని నింపి స్వామివారికి నివేదించారు. అనంతరం ఆ భక్తి పాయసాన్ని భక్తులందరు స్వీకరించారు. ఈ కుడారై కార్యక్రమం దేవాలయంలో ఒక గొప్ప దృశ్యంగా అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. తెల్లవారుజామున యదాతథంగా పాశురాలను అనుసరించారు. ఉదయం ఆలయ ప్రాంగణంలో కుడారై వ్రతం నోచుకున్నారు. మహిళలు, దంపతులు ఇందులో పాల్గొని ప్రతీ ఒక్కరు 108 గంగాళాలలో పాయసాన్ని నింపి పూజలు, నోములు నిర్వహించారు. అర్చకులు సౌమిత్రి వేణుమాధవాచార్యులు, వీణ, శ్రావణ్ కుమారాచార్యులు, హరిణి, వెంకటాచార్యులు, వసుధ దంపతులు, పూజాధికారులు పూజలు నిర్వహించగా, వికాసతరంగిణి బాధ్యులు వెంకటేష్, శరణాగతి దీక్షాస్వాములు సాదుల భాస్కర్, సాదుల సుగుణాకర్, పల్లా సదాలక్ష్మి, రవి, గట్టయ్య, నారాయణ, శ్రీను, స్వరూప, శ్రీలత, దీప, మమత, గుణ, పెద్దఎత్తున మహిళలు కుడారై ఉత్సవాల్లో పాల్గొన్నారు.

  టెన్ తలో ప్రథమ స్థానం రావాలి

  సిరిసిల్ల, జనవరి 11: పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాను ప్రధమ స్థానంలో నిలిపేందుకు ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా అన్నారు. శుక్రవారం స్థానిక స్వశక్తి పొదుపు భవన్‌లో ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులతో పదవ తరగతి పరీక్షలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జేసీ మాట్లాడుతూ పరీక్షలు దగ్గర పడుతుండడంతో ఉపాధ్యాయులు విద్యార్థులకు అందుబాటులో ఉంటూ చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. సబ్జెక్టుల వారిగా వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో గొప్ప నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని, ప్రతి పాఠశాలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ దిశగా వారిలో ప్రేరణ, ఆత్మ విశ్వాసం కలిగించి మానసికంగా సంసిద్దులను చేయాలన్నారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చి దిద్దే బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందన్నారు. షెడ్యూల్ ప్రకారం పాఠశాలలో సన్నాహక పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థుల పురోగతిని పరీక్షించాలన్నారు. విద్యార్థులు అన్ని సబ్జెక్టులలో ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తక్కువ ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు గత పొరపాట్లను సమీక్షించుకుంటూ..రానున్న రోజుల్లో అలాంటి మంచి ఫలితాలు వచ్చేలా చూడాలన్నారు. ప్రభుత్వం పక్షాన అన్ని సదుపాయాలు కల్పిస్తామని, ఉత్తమ ఫలితాలు సాధించిన పాఠశాలలు, ఉపాధ్యాయులకు బహుమతులు అందచేస్తామన్నారు. హాస్టల్ విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. హాస్టల్‌లో ఉండని వార్డెన్‌లను సస్పెండ్ చేస్తామని జేసీ హెచ్చరించారు.
  బాల్య వివాహాలకు అనుత్తీర్ణత ఒక కారణం
  పదవ తరగతిలోఅనుత్తీర్ణత బాల్య వివాహాలకు ఒక కారణమని జేసీ పేర్కొన్నారు. పదవ తరగతిలో పబ్లిక్ పరీక్షలలో ఫెయిల్యూర్ కావడం వల్ల అమ్మాయిలకు పెళ్ళి చేస్తున్నారని, దీని వలన అనేక సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితిని దూరం చేసేందుకు ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు బాధ్యతలు గుర్తెరిగి పని చేయాలన్నారు.
  సివిల్ వర్క్‌లపై ప్రత్యేక దృష్టి సారించాలి
  ప్రభుత్వ పాఠశాలలో నిర్మాణంలో ఉన్న పాఠశాల భవనాలు, మరుగుదొడ్లు, వంట గదులు, ప్రహరీల వల్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని జేసీ తెలిపారు. పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు తమ పూర్తి సహకారం ఉంటుందన్నారు. అలాగే ప్రతి పాఠశాలకు మిషన్ భగీరథ ద్వారా తాగు నీటి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. నల్లా కనెక్షన్లు ఇవ్వని పాఠశాలలు ఉంటే వాటి వివరాలు తమకు అందిస్తే, సంబంధిత అధికారులను ఆదేశిస్తామన్నారు.
  గోరు ముద్దను అందించాలి
  పదవ తరగతి విద్యార్థులకు సాయంత్రం అల్పాహారం అంచే గోరుముద్ద కార్యక్రమంను ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకుని ప్రారంభించాలని జేసీ సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా విద్యాధికారి డి.రాధాకిషన్, సాధారణ పరీక్షల సహాయ కమిషనర్ బి.శ్రీనివాస్, సెక్టోరియల్ అధికారి వీఎం.శ్రీనివాస్, అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.


  0 0

  పొందూరు, జనవరి 11: రాష్ట్రంలో పేద, సాదా కూలి వృద్ధుల జీవితాలలో ఓ బిడ్డగా నిలిచి వారి జీవితాల్లో ఆనందవెలుగులు చూడాలని చంద్రన్న లక్ష్మంగా పెట్టుకొని వచ్చేనెల నుండి వృద్ధాప్య పింఛనులను రూ. 2వేలు అందించి ఆదుకుంటున్నారని ఆమదాలవలస ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కూనరవికుమార్ అన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో శుక్రవారం ఆరవ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా ప్రజలకు సేవలందించి ఘనత చంద్రబాబుకే ఉందన్నారు. రాష్ట్రంలో పేదరికంలేని పాలన చేసేందుకు చంద్రబాబు కంకణం కట్టారని, అందుకు నిరంతరం ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా సంక్షేమ పథకాలు ప్రజల చెంతకు చేర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. చంద్రన్న సర్కార్ మాటలతో చెప్పేది కాకుండా నాలుగన్నర ఏళ్లలో ఏ ప్రభుత్వం అందించలేని పథకాలు ప్రజలకు అందించామన్నారు. ప్రజల కష్టాల సమయంలో అనేక పథకాలు అందించి ఆదుకునే ప్రభుత్వం మనదే అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హమీలను నెరవేర్చే ఘనత చంద్రన్నకే దక్కిందన్నారు. రైతులకు రుణమాఫీ, కులవృత్తులకు ప్రోత్సాహమిచ్చి ఆదుకోవడమే కాకుండా అర్హులైన వారందరికి గృహనిర్మాణం మంజూరు, రైతులుకు కొత్త రుణాలు, కౌలు రైతులకు సహకారం, విద్యార్థులకు ఫీజ్ రీ ఎంబర్స్‌మెంట్, రైతులకు భూ ఆధార్ పత్రాలు, అర్హులందరికి రేషన్‌కార్డులు, ప్రతీ గ్రామానికి సిసి రోడ్లు, ప్రతీ ఇంటికి తాగునీరు, మండలంలో లిఫ్ట ఇరిగేషన్ పద్దతిలో భూములను సస్యశ్యామలం చేయబోతున్నారన్నారు. కులవృత్తుల జీవితాలు మెరుగుపర్చాలనే ఉద్దేశ్యంతో చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, కళ్లుగీత కార్మికులందరికి ఆదరణ పథకం ద్వారా ఉపాధి మెరుగుపర్చేందుకు సహకారం అందిస్తున్నామన్నారు. ఆదరించే ప్రభుత్వానికి చేయూతనిస్తే రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. ముందుగా రూ. 35.9లక్షలతోమంజూరైన పశువుల ఆసుపత్రిని విప్ రవికుమార్ ప్రారంభించారు. అలాగే రూ40లక్షలతో మంజూరైన శ్రీశక్తి భవన నిర్మాణానికి విప్ శంకుస్థాపన చేశారు. అనంతరం జన్మభూమి కార్యక్రమంలో ఎన్టీ ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా రోగులకు చెక్‌లు పంపిణీ చేశారు. కొత్తగా మంజూరైన పెన్షన్‌లు అందించారు. మండలంలో పలు రైతులకు ట్రాక్టర్లను అందించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ దిలీప్ చక్రవర్తి, ఎంపీడీవో లక్ష్మీభాయి, మండల స్పెషలాఫీసరు మెట్ట వెంకటేశ్వర్లు ఏవో రేణుకాసాయి, మండల పార్టీ అధ్యక్షులు చిగిలిపల్లి రామ్మోహనరావు, ఏ ఎంసి చైర్మన్ అనె్నపురాము, గుడ్ల మోహనరావు, వండాన సత్యం, ఏ ఈ శ్రీరాములు, ఈవో కింతలి మోహన్‌బాబు, హౌసింగ్ ఏ ఈ పైడితల్లి తదితరులు పాల్గొన్నారు.

  ముగిసిన జన్మభూమి
  * జలుమూరులో ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు
  జలుమూరు, జనవరి 11: ఈనెల 2వ తారీఖునుండి శుక్రవారం 11వ తారీఖు వరకు పది రోజుల పాటు జరిగిన జన్మభూమి కార్యక్రమాలు శుక్రవారంతో ముగిసాయి. మండల కేంద్రం జలుమూరులో తహశీల్దార్ కె.ప్రవళ్లిక ప్రియ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో జలుమూరు ప్రభుత్వ బాలుర హైస్కూల్, బాలికల హైస్కూల్, కస్తూరిబా విద్యాలయ సంస్థ విదార్థులచే అమరావతి, మాతెలుగుతల్లికి మల్లెపూదండ, జానపద గీతాల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పోటాపోటీగా ఈ బాలికలు చేసిన ప్రదర్శన చూపరులతో పాటు జన్మభూమి అధికార బృందానికి ఆశ్చర్యపర్చింది. అదే విధంగా ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలను పలు శాఖాధికారులు సభలో వివరించారు. ఇదిలావుండగా మండలం సవరిగాం గ్రామంలో ఎంపీడీవో పడాల వాసుదేవరావు ఆధ్వర్యంలో జన్మభూమి కార్యక్రమం జరిగింది. పై రెండు గ్రామాల్లో జరిగిన కార్యక్రమాలలో మండల విద్యాశాఖాధికారి బమ్మిడి మాధవరావు, పంచాయతీ విస్తరణాధికారి కొమరాపు అప్పలనాయుడు, వైద్యాధికారులు మాతల ఆనందరావు, శృతి, విక్రమ్‌దేవ్, లీలావతితో పాటు పలు శాఖల అధికారులు, స్థానిక మాజీ సర్పంచ్ ప్రతినిధి ముద్దాడ శ్రీనివాసరావు, పలువురు పాల్గొన్నారు.

  సంక్రాంతి సమయాల్లో ప్రయాణీకుల అవస్థలు
  * తిలారు ఆర్ ఎస్ దుస్థితి
  జలుమూరు, జనవరి 11: సంక్రాంతి పర్వదినాన్ని పురష్కరించుకొని పలు గ్రామాలనుండి సొంత గ్రామాలకు చేరే ప్రయాణీకులు మండలం తిలారు రైల్వే స్టేషన్‌లో రైలు దిగే సమయాల్లో పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. విశాఖ నుండి పలాస వైపు వెళ్లే ఇక్కడ ఆగే రైళ్లు రెండవ ప్లాట్‌ఫారంపై నిలుపుదల చేయడం అనేక అవస్థలు పడుతున్నారు. లగేజీలు, చంటిపిల్లలు, వృద్ధులుతో వచ్చేవారు ఫుట్‌పాత్‌పై నుండి రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. రెండవ ప్లాట్‌ఫారం నుండి 1వ ప్లాట్‌ఫారం చేరుటకు పట్టాలు మీదనుండి దాటుట వలన ఏ క్షణాన ఏప్రమాదం జరిగి ప్రాణాలు పోతాయేమోనని పలువురు ప్రయాణీకులు వాపోతున్నారు.
  సంక్రాంతి మహోత్సవాలకు ఇంద్రాక్షమ్మ సిద్ధం
  జలుమూరు, జనవరి 11: ప్రతీ ఏట జరిగే ఇంద్రాక్షి సహిత సంక్రాంతి మహోత్సవములు సనాతన ధర్మ సంరక్షణ కొరకు ఏర్పడిన బాలత్రిపుర సుందరి సేవా సదన్ (విశాఖ), వారి సమక్షంలో పలు కార్యక్రమాలు జరుపుటకు సేవాసదన్ కార్యనిర్వాహక అధికారి అక్కాజ్యోష్యుల రమేష్‌బాబు తెలిపారు. ఇంద్రాక్షి అమ్మవారికి ఉత్తరాయణ పుణ్యకాలం, తదుపరి విశేష అభిషేకములు, మహాచండి హోమం ఏర్పాట్లకు సిద్ధం చేశారు. సర్వదేవతా స్వరూపిణైన గోమాతలకు సామూహిక గో మహాలక్ష్మీ పూజ నిర్వహించినట్లు, 12,13 తేదీలలో భజన పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. 13వ తేదీ 9గంటల నుండి ప్రత్యేకపూజలు, సాయంత్రం పలువురి విశ్రాంత ఉపాధ్యాయులకు సన్మానం, భజనలో విజేతలకు బహుమతుల ప్రధానాలు అందజేయడం జరుగుతుందని రమేష్‌శర్మ తెలిపారు.
  సంక్రాంతి సంబరాల్లో మార్పు
  జలుమూరు,జనవరి 11: ప్రభుత్వ పరంగా ప్రతీ ఏట జన్మభూమి అనంతరం సంక్రాంతి పర్వదినాన మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో జరిగే సంక్రాంతి సంబరాలను శనివారం జరుపుటకు ప్రభుత్వం నిర్ణయించిందని ఎంపీడీవో పడాల వాసుదేవరావు తెలిపారు. ప్రతీ శాఖాధికారులు, ముగ్గుల్లో పాల్గొనే మహిళలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనే పలు కళా బృందాలు శనివారం ఉదయం మండల పరిషత్ కార్యాలయానికి నేరుగా చేరుకోవాలని ఎంపీడీవో పడాల వాసుదేవరావు కోరారు.
  ముగిసిన జన్మభూమి- మా ఊరు గ్రామ సభలు
  జి.సిగడాం, జనవరి 11: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన్మభూమి- మా ఊరు గ్రామ సభలు ముగిసాయి. శుక్రవారం మండలం గొబ్బూరు గ్రామంలో పంచాయతీ ప్రత్యేకాధికారి ఎస్. ఆశాకుమారి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల యొక్క సమస్యల పరిష్కారానికి జన్మభూమి- మా ఊరు ఒక చక్కని వేదికవంటిదని ఆమె అన్నారు. అనంతరం మండల ప్రత్యేక అధికారి రత్నకుమార్ మాట్లాడుతూ గ్రామంలో ఇంకా నెలకొని వున్న సమస్యలను ప్రణాళికలు రూపొందించి వాటి పరిష్కారానికి తగిన మార్గదర్శకాలను సూచించారు. వైస్ ఎంపిపి ప్రతినిధి బి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అమలుచేస్తున్న పింఛన్లు, చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లికానుకలు, రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఒంటరి మహిళలకు పింఛన్ పథకం, డ్వాక్రా మహిళలకు పసుపుకుంకుమ పథకం, ఆదరణ-2 పథకం కింద చేతి వృత్తుల వారికి 90శాతం రాయితీపై పనిముట్లు పంపిణీ, గ్రామాల్లో ఎల్ ఈడి వీధి దీపాల పల్లెవెలుగు, దీపం పథకం కింద మహిళలకు గ్యాస్ కనెక్షన్‌లు మొదలగా పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామంలో వ్యవసాయ భూములకు తోటపల్లి కాలువ ద్వారా సాగునీరు అందించాలని ఆ గ్రామ రైతులు కోరారు. అనంతరం చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బి.హెచ్ శంకరరావు, ఎలక్ట్రికల్ ఏ ఈ కుమార్, ఏపివో జి.పురుషోత్తం, మాజీ సర్పంచ్ ఎమ్.నాగేశ్వరరావు, టిడీపి నాయకులు ఎమ్.చిన్నారావు, వ్యవసాయశాఖ ఏవో బి. ఇందుమతి, సీనియర్ సహాయకులు ఉంగరాల శ్రీనివాసరావు, వీ ఆర్వో భూపతి నర్శింగరావు, సంతోష్‌తో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
  అలరించిన సంక్రాంతి సంబరాలు
  జి.సిగడాం, జనవరి 11: మండలంలో గల ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలల్లో ఆయా పాఠశాలల ప్రథానోపాధ్యాయులు అధ్యక్షతన సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల ప్రాంగణంలో బాలికలచే రంగవళ్లులు, బాలురచే విదిగా క్రీడాపోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలకు ప్రథమ, ద్వితీయ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖాధికారి అరసాడ రవి మాట్లాడుతూ విద్యార్థుల్లో విద్యతోపాటు ఆరోగ్యం, మానసిక ఉల్లాసం, పాఠశాల పట్ల అనురక్తి, ఐకమత్యం, సమాభావన మొదలగు భావాలు పెంపొందుతాయని ఆయన పేర్కొన్నారు. మండల ప్రత్యేకాధికారి రత్నకుమార్, ఎంపీడీవో బి.హెచ్ శంకరరావు ఈ పాఠశాలను సందర్శించి పదవతరగతి చదువుతున్న 63 మంది బాలికలుకు శానిటరీ నేప్‌కీన్స్ అందించారు. బాలికలు వేసిన రంగవళ్లులను పరిశీలించి విజేతలకు అభినందనలు తెలియజేశారు. ఈ సంబరాలలో ప్రధానోపాధ్యాయులు తురక బలరాం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
  కాంగ్రెస్ పథకాలు జగన్ ప్రచారం చేసుకుంటున్నారు
  శ్రీకాకుళం(రూరల్),జనవరి 11: వైసీపీ అధ్యక్షులు జగన్మోహనరెడ్డి కాంగ్రెస్ పార్టీ పథకాలను నవరత్నాలలో ప్రకటించి ప్రచారం చేసుకుంటున్నారని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ముస్తాక్ మహ్మద్ పేర్కొన్నారు. ఇందిరావిజ్ఞాన్ భవన్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ, ఫిజ్‌రీ ఎంబర్స్‌మెంట్ తదితర కార్యక్రమాలు దివంగత నేత వైఎస్ హాయంలో కాంగ్రెస్‌పార్టీ ప్రవేశపెట్టిందని, దీనిని జగన్మోహనరెడ్డి ప్రచారం చేసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో ఇటువంటి ప్రతిపక్షనాయకుడ్ని ఎన్నడూ చూడలేదన్నారు. పాదయాత్ర విజయవంతం అయిందని చెప్పుకుంటున్నారని, ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారన్నారు. జనం వచ్చినంత మాత్రాన ఓట్లు పడవని అన్నారు. వై ఎస్ కాంగ్రెస్‌పార్టీ అస్థి అని, తండ్రి పరువుతీసి పార్టీని ఏర్పాటుచేశారన్నారు. రత్నాల నర్శింహమూర్తి మాట్లాడుతూ రాష్ట్రం విభజించబడ్డాక స్వంత రాజధాని లేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ముక్తకంఠంతో పోరాడాల్సిన అవసరం అన్ని పార్టీలకు ఉందన్నారు. విభజన హామీలు అమలైతే తెలంగాణతో పోటీ పడడమే కాకుండా ఉభయ తెలుగురాష్ట్రాలు దేశంలో నెంబర్ 1గా ఉండేవన్నారు. వై. ఎస్ జగన్ కూడా కాంగ్రెస్‌నుండి బయటకు వచ్చిన వారేనని పేర్కొన్నారు. స్థాయిని మించి విమర్శలు చేస్తున్నారన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో కొంక్యాన మురళీధర్, ఎమ్ ఏ బేగ్, అల్లిబిల్లి రాధ, రెల్ల సురేష్, గోవింద మల్లిబాబు, కె. ఎల్ ఎన్ ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు.
  నేడు సంక్రాంతి సంబరాలు
  * జేసి -2 రజనీకాంతారావు
  శ్రీకాకుళం(టౌన్), జనవరి 11: జిల్లా కేంద్రంలో సంక్రాంతి సంబరాలను శనివారం నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ -2 పి.రజనీకాంతారావు తెలిపారు. శుక్రవారం జేసి-2 తన ఛాంబర్‌లో సంక్రాంతి సంబరాల నిర్వహణపై అధికారులు, కళాకారుల సమాఖ్యలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ సంక్రాంతి సంబరాలను శనివారం స్థానిక ఎన్టీ ఆర్ నగర పాలక సంస్థ మైదానంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆరోజు ఉదయం ఆర్ట్స్ కాలేజి నుండి ఎన్టీ ఆర్ నగరపాలక సంస్థ హైస్కూల్ మైదానం వరకు వివిధ కళారూపాలతో శోభాయాత్ర నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మహిళలకు రంగవళ్లులు, వంటలు, వ్యాసరచన మొదలగు పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే సాంప్రదాయ క్రీడా ప్రదర్శనలు, పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం నృత్య ప్రదర్శనలు, వివిధ కళారూపాలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు, తెలుగుదనం ఉట్టిపడేలా గొబ్బెమ్మలు, హరిదాసులు, డూడూ బసవన్నలతో తెలుగుసాంప్రదాయాలు ఉట్టిపడేలా సంక్రాంతి వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పోటీల్లో ఉత్సాహవంతులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. అనంతరం సంక్రాంతి సంబరాల విజయవంత నిర్వాహణకై అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి బి.నగేష్, జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ చీఫ్‌కోచ్ శ్రీనివాసకుమార్, సెట్‌శ్రీ సి ఈవో బివి ప్రసాదరావు, ఐసిడి ఎస్ ఇన్‌ఛార్జ్ పిడి ఎమ్.రోజారాణి, జిల్లా పర్యాటక శాఖాధికారి ఎన్.నారాయణరావు, జిల్లా రంగస్థల కళాకారుల సమాఖ్య అధ్యక్షులు ఎల్.రామలింగస్వామి, డి. ఏ మోహనరావు, కోరాడ హరగోపాల్, నల్లి ఆశాదీపిక, స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
  ఘనంగా సంక్రాంతి సంబరాలు
  ఇచ్ఛాపురం, జనవరి 11 : పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో శుక్రవారం ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ బాలికోన్నత పాఠశాలలో హెచ్‌ఎం పద్మవల్లి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థినులు రంగవల్లుల మధ్య భోగి మంటలు వేశారు. మున్సిపల్ కమిషనర్ ఎల్.రామలక్ష్మి, ఎంఈఓ కె.అప్పారావు భోగి, సంక్రాంతి, కనుమ పండుగల విశిష్టతలను వివరించారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు పండుగలు ప్రతీకలని అన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థినులు భోగి మంటల చుట్టూ తిరుగుతూ పాటలకు అనుగుణంగా నృత్యాలు చేసి అలరించారు. ముగ్గుల పోటీ విజేతలకు పాఠశాల గుమస్తా తిప్పన జనార్దనరెడ్డి సౌజన్యంతో బహమతులు ప్రదానం చేశారు. స్వర్ణ్భారతి పాఠశాలలో చైర్మన్ చాట్ల తులసీదాస్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. 20 మంది పేదలకు దుప్పట్లు, చీరలు, నగదు అందజేశారు. చాట్ల రాము, చాట్ల లోహిదాస్, ఎ.బైరాగి పాల్గొన్నారు.

  కిడ్నీ వ్యాధితో యువకుడు మృతి
  వజ్రపుకొత్తూరు, జనవరి 11: మండలంలోని బైపల్లి గ్రామానికి చెందిన తామాడ రాజు(30) అనే యువకుడు కిడ్నీ వ్యాధితో బాధపడుతూ శుక్రవారం వేకువజామున మృతి చెందారు. ఏడాది కాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ పలాస ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ చేయించుకుంటూ వస్తున్నారు. మృతుడుకు భార్య అన్నపూర్ణ, కుమారుడు ఉన్నారు.

  ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా పోర్టును నిర్మిస్తాం: మంత్రి అచ్చెన్న
  * ఫిషింగ్ హార్బర్ నిర్మాణం తర్వాత పోర్టు నిర్మాణం
  సంతబొమ్మాళి, జనవరి 11: భావనపాడు పోర్టును నిర్మించే ముందు భావనపాడు బాధిత కుటుంబానికి న్యాయం జరిగిన తర్వాత పోర్టును నిర్మిస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం భావనపాడు గ్రామంలో జిల్లా కలెక్టర్ ధనుంజయరెడ్డి ఆధ్వర్యంలో ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2013లో జరిగిన భూసేకరణకు సంబంధించి పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసి నూతనంగా భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. ప్రస్తుతం వున్న భావనపాడు మాదిరిగానే ఆర్ ఆర్ చట్టం ప్రకారం ఆధునాతనమైన హంగులతో ప్రజలందరికి ఆమోదయోగ్యమైన విధంగా వేరే చోట నూతనంగా భావనపాడును నిర్మించే చర్యలు చేపడతామన్నారు. భావనపాడు గ్రామంతో పాటు మర్రిపాడు, అల్తాడ గ్రామాలు పోర్టు నిర్మాణం కోసం ఖాళీ చేయాల్సి ఉంటుందని, ప్రజలందరూ సహకరిస్తే త్వరలో పనులు చేపడతామన్నారు. గంగవరం, రామయ్యపట్నం మాదిరిగానే పోర్టు నిర్మాణం జరుగుతుందన్నారు. పోర్టు నిర్మాణ విషయమై ప్రజలు నుంచి వస్తున్న విన్నపాలను, డిమాండ్‌లను, కోర్కెలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునే కార్యక్రమాన్ని నిర్వహించగా, భావనపాడు గ్రామానికి చెందిన కె.నీలకంఠం భావనపాడు గ్రామాన్ని తరలించే ముందు ఇళ్లు నిర్మాణానికి పంట పొలాలు కోల్పోయిన రైతులకు 5 రేట్లు అదనంగా చెల్లించాలని, గ్రామంలో వున్న అన్ని ఆలయాలను నిర్మించేందుకు స్థలం ఇవ్వాలని, సముద్రానికి దగ్గరలో నూతన భావనపాడు నిర్మించాలన్న నాలుగు పేజీల డిమాండ్‌లను మంత్రి ముందు చదివి వినిపించారు. మండల పి ఎసి ఎస్ అధ్యక్షుడు ఎ.రాంప్రసాదరావు మాట్లాడుతూ మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌నాయుడు తమకు న్యాయం చేస్తారని, ఇంతవరకు ప్రజలకు నచ్చజెప్పి తమ భూములను సైతం సర్వేలకు అప్పగించామని, ఆర్డీవో వెంకటేశ్వరరావు ఆర్ అండ్ ఆర్ చట్టం ప్రకారం ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందని కరపత్రాలు ప్రజలకు ఇవ్వడంతో మర్రిపాడుకు చెందిన రైతులందరూ తిరిగి వెళ్లిపోయారన్నారు. ఎకరాకు 12 లక్షల రూపాయలు ఎక్కడా లేదని, కనీసం 40 లక్షల రూపాయలు ఉంటుందన్నారు. భావనపాడు పోర్టుకు సంబంధించి సీతానగరం, మర్రిపాడు, సెలగపేటలకు చెందిన రైతులు అధికంగా నష్టపోతున్నారని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. భావనపాడుకు చెందిన ఉప్పు రైతు చౌదరి మాట్లాడుతూ ప్రజలు గొంతెమ్మకోర్కెలు కోరకూడదని, తమ ఉప్పుపండించే స్థలాలను ఇస్తామనడంతో ప్రజలు నుంచి తీవ్రమైన వ్యతిరేకత వినిపించింది. ఎంపీ రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ జిల్లాకు చెందిన చాలా మంది మత్స్యకారులు, నిరుద్యోగులు ఇతర ప్రాంతాలకు వెళ్లి అన్ని రకాల ఇబ్బందులకు గురవుతున్నారని, భావనపాడు ఫిషింగ్ హార్బర్ నిర్మాణం జరిగితే ఇతర ప్రాంతాలు నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ ఉపాధి పొందే కార్యక్రమం జరుగుతుందన్నారు. జెసీ భాస్కరరావు, ఆర్డీవో వెంకటేశ్వరరావు, మత్స్యశాఖ డెప్యూటీ డైరెక్టర్ కృష్ణమూర్తి, రాష్టట్రీడీపీ కార్యదర్శి ఎల్ ఎల్ నాయుడు, మండల టీడీపీ అధ్యక్షుడు జి.బీమారావు, ఎంపీపీ కృష్ణవేణి, జడ్‌పీటీసీ లక్ష్మిదేవి, పోర్టు డైరెక్టర్‌తోపాటు స్థానిక మాజీ సర్పంచ్‌లు పోతయ్య, కె.పోతయ్య, గురువులు, ఎంపీటీసీ వెంకటరమణ, బాధిత గ్రామాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు.
  సవాళ్లు విసరడం కాదు, ప్రజల పక్షాన చర్చకు సిద్దం కావాలి
  మందస, జనవరి 11: తిత్లీ తుపాన్ ప్రభావంతో నష్టపోయిన బాధితులకు పరిహారం చెల్లింపులో వివక్షతను చూపించి నేటికి పరిహారం అందించకుండా తెలుగు తమ్ముళ్లు సవాళ్లు విసరడం విజ్ఞత కాదని వైసీపీ పలాస సమన్వయకర్త సీదిరి అప్పలరాజు అన్నారు. శుక్రవారం నల్లబొడ్లూరు గ్రామంలో తెలుగుతమ్ముళ్లు సవాళ్లుకు చర్చావేదికను నిర్వహించారు. ఈ బహిరంగచర్చావేదికకు తెలుగుతమ్ముళ్లు హాజరుకాకపోవడంపై ప్రజల పక్షాన ప్రతిపక్ష పార్టీ ప్రజలకు జరిగిన అన్యాయాలపై నిలదీయడం తమ బాధ్యత అని, అధికార పక్షంలో తెలుగు తమ్ముళ్లుకు సవాల్ విసరడమే తప్ప దమ్ము,్ధర్యం లేకపోవడం చర్చను స్వీకరించకపోవడం సత్తా లేదన్నారు. బాధితుల వివరాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి తిత్లీ బాధితుల పక్షాన మరో పోరాటం చేయడానికి వైసీపీ శ్రేణులంతా సిద్దంగా ఉన్నామన్నారు. స్థలం, సమయం ప్రకటించినప్పటికి తెలుగుతమ్ముళ్లు బహిరంగచర్చకు హాజరుకాకపోవడం వారి విజ్ఞతకే విడిచిపెడుతున్నామన్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై ఎప్పుడైనా, ఎక్కడైనా బహిరంగచర్చకు సిద్దమేనన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వరిశ హరిప్రసాద్, బాలచంద్రుడు, ఎం.కృష్ణారావు, మెట్ట కుమారస్వామి, ఎ.సూర్యారావు,డి.వీరాస్వామి, డి.దానయ్య, బి. ఉమాపతి పాల్గొన్నారు.

  తెలుగువారికి అతి పెద్ద పండుగ సంక్రాంతి
  పలాస, జనవరి 11: తెలుగువారికి అతి పెద్ద పండుగ సంక్రాంతి అని బోర శిరీషా అన్నారు. సంక్రాంతిని పురస్కరించుకొని కిడ్స్ ప్రాంగణంలో పల్లె వాతావరణం తలపించే విధంగా ఏర్పాటు చేసి చిన్నారులకు సంక్రాంతి సంబరాలు విశిష్టతను కన్నులకు కట్టినట్లు చూపించారు. గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి సమయాల్లో చేసే నాటుబళ్లు విన్యాసాలు, డూడూ బసవన్నలు, హరిదాస్ కీర్తనలు, పిండి వంటలు, భోగీ మంటలు నిర్వహించారు. ఈ సందర్భంగా కిడ్స్ పాఠశాల డైరెక్టర్ బోర శిరీషా మాట్లాడుతూ తరతరాలుగా ఆచార్యసంప్రదాయాలకు విలువలు ఇస్తూ సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం నేటికి తెలుగువారి లోగిళ్లుల్లో కనిపిస్తుందన్నారు. హిందువులకు అన్ని పండుగల్లో కన్నా సంక్రాంతి పండుగ చాలా ప్రత్యేకమైందన్నారు. గతంలో పల్లెల్లో సంక్రాంతి సంబరాలు ఐదు రోజులు పాటు నిర్వహించేవారు, నేటికి గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి సంబరాలు కనిపిస్తున్నాయన్నారు. చిన్నారులకు సంక్రాంతి విశిష్టతను తెలియజేసేందుకు ప్రత్యేకంగా గ్రామీణ వాతావరణాన్ని రూపకల్పన చేసి సంక్రాంతి సంబరాలను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాల్లో బోర కృష్ణారావు, రోజా తదితరులు పాల్గొన్నారు.
  జన్మభూమికి స్పందన కరువు
  * ముగిసిన జన్మభూమి
  పలాస, జనవరి 11: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన్మభూమి కార్యక్రమానికి స్పందన అంతంతమాత్రంగా ఉండడంతో అధికారులు సైతం తూతూ మంత్రంగా మమ అనిపించారు. జన్మభూమి కార్యక్రమానికి ప్రజలు హాజరయ్యేందుకు మక్కువ చూపకపోవడంతో అధికారులతోనే జన్మభూమి కార్యక్రమం ముగిసిపోవడం విశేషం. గతంలో జరిగిన జన్మభూమిలో ఇచ్చిన అర్జీలకు నేటికి మోక్షం లభించకపోవడం ప్రజలు ఈ జన్మభూమిపై ఆసక్తి చూపడం లేదు. అధికారులు సైతం మొక్కుబడిగా జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వం చేపడుతున్న పథకాలను వివరించడం తప్పితే కొత్త పింఛన్లు, రేషన్‌కార్డులు అందజేయకపోవడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేసారు. ఎన్నికలకు మరో మూడు నెలలు ఉండడంతో ఈ జన్మభూమి చివరిది కావడంతో అధికార పార్టీకి చెందిన నాయకులు జన్మభూమిని వేదికగా చేసుకొని తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వేదికగా మార్చుకోవడం పట్ల కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేసారు. అధికారికంగా ప్రభుత్వ కార్యక్రమం అయినప్పటికి అధికార పార్టీ నాయకులు పెత్తనం పట్ల కొంతమంది అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే వారిచ్చిన ఆదేశాలు మేరకు పనిచేయడం కొన్ని చోట్లు విమర్శలకు తావు ఇచ్చింది. జన్మభూమి కన్నా అధికార పార్టీ ప్రచార సభగా మార్చేసారని కొంతమంది గుసుగుసలాడుకోవడం కనిపించింది. శుక్రవారం పలాస మున్సిపాలిటీలో 24,25వ వార్డుల్లో, పలాస మండలం పరిధిలో బొడ్డపాడుల్లో జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రమేష్‌నాయుడు, ఎంపీడీవో సూర్యనారాయణ, తహసీల్థార్ కల్యాణచక్రవర్తి, దేశం నాయకులు లోడగల కామేశ్వరరావు, వజ్జ బాబురావు, టంకాల రవిశంకర్‌గుప్తా, గాలి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
  కబడ్డీ పోటీల్లో రాణించిన విద్యార్థులు
  వజ్రపుకొత్తూరు, జనవరి 11: 64వ రాష్టస్థ్రాయి స్కూల్‌గేమ్స్ అండర్-19 బాలికల కబడ్డీ పోటీల్లో వజ్రపుకొత్తూరు ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు బి.శిల్ప, బి.యశోదలు రాష్టస్థ్రాయిలో ద్వితీయస్థానంలో నిలిచారు. శుక్రవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో హెచ్ ఎం ఎస్.సారధినాయుడు, పిడి గజేంద్రరావు, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ నెల 8వ తేది నుంచి 10వ తేది వరకు భీమిలి ఎజి ఎం పాఠశాలలో రాష్టస్థ్రాయి కబడ్డీ పోటీలు జరిగాయి.
  ముగిసిన జన్మభూమి గ్రామసభలు
  సరుబుజ్జిలి, జనవరి 11: మండలంలోని ఈ నెల 2వ తేదీ నుంచి నిర్వహించిన జన్మభూమి మా ఊరు గ్రామసభలు శుక్రవారంతో ముగిశాయి. తహశీల్దార్ ప్రభాకర్ జేమ్స్, ఎంపీడీవో పావని, మండల ప్రత్యేకాధికారి దామోదరరావు, ఇ ఓ పీ ఆర్‌డీ ఎం.విజయభాస్కర్ ఆధ్వర్యంలో 21 గ్రామ పంచాయతీల్లో నిర్వహించిన ఈ జన్మభూమి కార్యక్రమం చివరి రోజు సరుబుజ్జిలి గ్రామ పంచాయతీలో అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ గ్రామసభలో సరుబుజ్జిలి గ్రామ పంచాయతీలో టీడీపీ అభిమానులతో ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని, అర్హులకు అధికారులు మంజూరు చేయడం లేదని వైకాపాకు చెందిన పలువురు నాయకులు అధికారులను ప్రశ్నించారు. దీనిపై ప్రత్యేకాధికారి దామోదరరావు మాట్లాడుతూ సంక్షేమ పథకాలకు దరఖాస్తులు చేసుకుంటే వాటిపై విచారణ జరిపి రాజకీయాలకతీతంగా పథకాలు మంజూరు చేస్తామని హామీనిచ్చారు. అనంతరం మండల కేంద్రంలో జన్మభూమి ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని 21 పంచాయతీల విద్యార్థులకు నిర్వహించిన ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించారు. అలాగే షలంత్రి, రొట్టవలస గ్రామ పంచాయతీ కార్యదర్శులు విజయలక్ష్మీ, రుద్రవేణిలను అధికారులు శాలువలతో సత్కరించారు. వెనె్నలవలస జవహర్ నవోదయ విద్యార్థులు, సరుబుజ్జిలి ఉన్నత పాఠశాల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
  వివేకానందుని స్ఫూర్తి ఆదర్శనీయం
  సరుబుజ్జిలి, జనవరి 11: ప్రపంచ వ్యాప్తంగా యువతకు మార్గనిర్దేశం చేసిన ప్రవక్త వివేకానందుడు అందరికీ ఆదర్శనీయుడని వక్తలు అభిప్రాయపడ్డారు. యువజనోత్సవాల్లో భాగంగా శుక్రవారం సరుబుజ్జిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో వివేకానందుని జన్మదిన వేడుకలు నిర్వహించారు. షలంత్రి గ్రామానికి చెందిన కె. ఈశ్వరరావువిగ్రహ ప్రతిష్టకు ఆర్థిక సాయం చేయగా, అతని తండ్రి సూర్యనారాయణ ప్రతిష్ట చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రవికుమార్ మాట్లాడుతూ వివిధ మతల సారాన్ని ప్రపంచ వ్యాప్తంగా వివేకానందుడు చాటిచెప్పాడన్నారు. మానవత్వాన్ని చాటిన వివేకానందస్వామి యువతకు ఆదర్శమన్నారు. ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రంథాలయాధికారి కామేశ్వర పాట్రీన్, ఎన్ ఎస్ ఎస్ పీవో దుగ్గిరాల రాంప్రసాద్, అధ్యాపకులు కృష్ణమూర్తి, ధర్మారావు, రమేష్‌సాహు, శ్రీనివాసరావు, రామారావు, విజయ, సాగరిక, సంగీత, వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.
  కొండంపేటలో జన్మభూమి
  రాజాం, జనవరి 11: రాజాం నగర పంచాయతీ కొండంపేటలో చివరి రోజు జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని కమిషనర్ సత్యనారాయణ సారధ్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2వ తేదీ నుంచి నేటివరకు కొనసాగిన జన్మభూమి కార్యక్రమాల్లో భాగంగా 20 వార్డుల నుంచి ప్రజలు అనేక వినతిపత్రాలు అందించారని, అందులో అర్హత కలిగిన దరఖాస్తులను పరిశీలించి వారికి రాయితీలు అందజేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. అలాగే పచ్చదనం పరిశుభ్రత, స్వచ్ఛ్భారత్ వంటి అంశాలపై కూడా ప్రజలను చైతన్యం తేవడం జరిగిందన్నారు. సంక్రాంతి సంబరాలను ఈ సందర్భంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏ ఈ సురేష్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని మారేడుబాక, ఎం.జె.వలస పంచాయతీల్లో కూడా జన్మభూమి కార్యక్రమాన్ని ఎంపీడీవో వెంకటేశ్వరరావు సారధ్యంలో నిర్వహించారు. ఆ గ్రామాల్లో కూడా సంక్రాంతి సంబరాలు జరిపారు.
  అతిసార వదంతులతో బెంబేలెత్తిన అధికారులు
  రాజాం, జనవరి 11: రాజాం నగర పంచాయతీ కొండంపేట, పొనుగుటివలస ప్రాంతాల్లో అతిసార వ్యాధి లక్షణాలు సోకి వందలాది మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వదంతలు రావడంతో అధికారులు పరుగులు తీశారు. నాగావళి పైపులైన్ ద్వారా నీరు కలుషితమైతే ఇటువంటి వ్యాధులు సంభవిస్తాయని, అటువంటి లీకేజీలు ఎక్కడైనా ఉన్నాయా అన్న అంశాన్ని పరిశీలించేందుకు అధికారులు అన్ని ప్రాంతాలను పర్యటించారు. ఎక్కడా లీకేజీలు లేకపోవడంతో, ఒకరిద్దరికి అతిసార వ్యాధి లక్షణాలు సోకాయని తెలియడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఆయా గ్రామాల్లో కూడా పర్యటించి ఈ వదంతలపై విచారణ నిర్వహించారు. ఏది ఏమైనా రాజాం ఆసుపత్రికి అధికారులు చేరుకోవడంతో గందరగోళం ఏర్పడింది.

  సమస్యలపై జన్మభూమిలో నిలదీత
  ఎల్ ఎన్‌పేట, జనవరి 11: మండలంలోని లక్ష్మీనర్సుపేట గ్రామంలో శుక్రవారం నిర్వహించిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ప్రజలు సమస్యలపై అధికారులను నిలదీసిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. జగన్నాథస్వామి ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో అధికారులను పలు సమస్యలపై ప్రజలు నిలదీశారు. వరదలు సమయంలో గ్రామ ప్రజలకు రక్షణ లేకుండా ఉందని, కరకట్టల నిర్మాణం కార్యరూపం దాల్చలేదన్నారు. ప్రభుత్వం ప్రచార్భాటం కోసమే పాకులాడుతుందన్నారు. గ్రామానికి గతంలో ఆర్టీసీ బస్సులు నడిచేవని, ప్రస్తుతం నిలుపుదల చేశారు. ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుందన్నారు. విద్యుత్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ఎల్ ఎన్‌పేట జంక్షన్‌లో విద్యుత్‌శాఖాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. వైశ్యరాజు పాండురంగ రాజు మాట్లాడుతూ సరైన చర్యలు చేపట్టి సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సి.హెచ్.మోహన్‌ప్రసాద్, తహశీల్దార్ వెంకటరావు ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
  * హిరమండలంలో...
  మండలంలోని హిరమండలం మేజర్ గ్రామ పంచాయతీలో శుక్రవారం జన్మభూమి మా ఊరు కార్యక్రమం నిర్వహించారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన గ్రామసభలో పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అర్హులైన వారికి పింఛన్లు మంజూరు కావడం లేదన్నారు. అధికారుల దృష్టికి పరిష్కారం లేదని ఆవేదన చెందారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి కె. ఎన్.రెడ్డి, ఎంపీడీవో కాశీవిశ్వనాధం, తహశీల్దార్ ఐ.టి.కుమార్, ఈవో అప్పలరాజు, లోకేష్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
  ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
  రేగిడి, జనవరి 11: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డీ ఆర్ డీ ఏ పీడీ కిషోర్‌కుమార్ అన్నారు. శుక్రవారం తునివాడ గ్రామంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలకు, మహిళలకు, చేనేత కార్మికులకు, కులవృత్తుల వారికి అమలు చేస్తున్న పథకాలు వినియోగించుకోవాలన్నారు. అంతేకాకుండా గ్రామాల్లో అభివృద్ధి పథకాలు చేపట్టినప్పుడు అధికారులకు తోట్పాటు అందించాలన్నారు. మహిళలు ఇందిరాక్రాంతి పథకం ద్వారా లబ్ధిపొందిన రుణాలను తిరిగి చెల్లించేలా సహకారమందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శంకరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

  చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందాం
  జెడ్పీ చైర్మన్ చౌదరి ధనలక్ష్మీ
  పాలకొండ (టౌన్), జనవరి 11: రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును 2019లో జరిగే ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని జిల్లా పరిషత్ చైర్మన్ చౌదరి ధనలక్ష్మీ అన్నారు. నగర పంచాయతీ పరిధిలోని అన్ని వార్డుల్లో ఈ నెల 2 నుంచి జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం పదో వార్డు పరిధిలో ఉన్న ఏలాం జంక్షన్‌లో జన్మభూమి చివరి రోజు కార్యక్రమాన్ని నగర పంచాయతీ చైర్మన్ పల్లా విజయలక్ష్మీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన చౌదరి ధనలక్ష్మీ మాట్లాడుతూ అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న రాష్ట్రంలో అభివృద్ధి ఆగకుండా పూర్తిస్థాయిలో జరగడా


  0 0

  పులివెందుల, జనవరి 11: ఏపీ ప్రతిపక్షనేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పూర్తిచేసుకొని తిరుమల నుంచి బయలుదేరి శుక్రవారం కడప జిల్లాకు చేరుకోవడంతో పులివెందులలోని వైఎస్సార్‌సీపీ నాయకులైన మున్సిపల్ ఛైర్మన్ చిన్నప్ప, కౌన్సిలర్లు కోడి రమణ, చెన్నారెడ్డి, కోళ్ల భాస్కర తదితరులు పులివెందులలో సాయంత్రం పెద్దఎత్తున బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా జగన్‌మోహన్‌రెడ్డి మూడువేల కిలోమీటర్లకుపైగా పాదయాత్రచేసి ప్రజల సమస్యలను తెలుసుకుని, విజయవంతంగా పూర్తిచేసుకుని తిరిగి కడప జిల్లాకు చేరుకోవడంతో తాము సంబరాలు చేసుకుంటున్నామని తెలిపారు. శనివారం ఉదయం 7:30గంటలకు ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్.అవినాష్‌రెడ్డిలు వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారని, చర్చిలో ప్రార్థనలు చేయనున్నట్లు వారు తెలిపారు. జగన్ రాకతో పూల అంగళ్ల సర్కిల్, కొత్త బస్టాండ్, మెయిన్‌రోడ్డుకు ఇరువైపులా జగన్‌కు సంబంధించిన ఫ్లెక్సీలను వైసీపీ నేతలు భారీగా ఏర్పాటుచేశారు.

  ఓ వైపు దోపిడీ...మరో వైపు రద్దీ
  * ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల దందా
  * సంక్రాంతి సంబరాలకు పల్లెబాట పట్టిన జనం
  కడప అర్బన్,జనవరి 11: వరుస సెలవులు శనివారం నుంచే మొదలుకావడంతో శుక్రవారం నుంచే నగరాల నుంచి పల్లెబాట పట్టేందుకు సమాయత్తం అవుతున్నారు. జిల్లా నుండి శుక్రవారం రాత్రి 51సూపర్ లగ్జరీ బస్సులను హైదరాబాద్‌కు ఖాళీగా అక్కడికి పంపుతున్నట్లు చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ కిశోర్ తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఉన్న కడప జిల్లా ప్రజలను తీసుకురావడానికి ఈప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే బెంగళూరుకు 35బస్సులు, విజయవాడకు 9బస్సులు, చెన్నైకు 12 బస్సులు శుక్రవారం ప్రత్యేక బస్సులుగా పంపుతున్నట్లు ఆయన తెలిపారు. సాధారణంగా హైదరాబాద్ టిక్కెట్ సూపర్ లగ్జరీకి రూ.509లు ఉండగా, పండుగ సందర్భంగా ఆధరను రూ.714లకు పెంచినట్లు పేర్కొన్నారు. విజయవాడ నుంచి కడపకు రూ.540లు ఉండగా, రూ.775లకు పెంచినట్లు తెలిపారు. కడప నుంచి బెంగళూరుకు రూ.380లు ఉండగా రూ.570లు పెంచినట్లు తెలిపారు. కడప నుంచి చెన్నైకు రూ.360లు ఉండగా, రూ.530లు అదనంగా పెంచినట్లు ఆయన చెప్పారు. అయితే ఇది కేవలం ఆయా పట్టణాల్లో ఉన్న జిల్లావాసులను మన జిల్లాకు తీసుకురావడానికి వారి సౌకర్యార్థం, రవాణా సంరక్షణ కోసం ఆర్టీసీ యాజమాన్యం రాష్టవ్య్రాప్తంగా ఈ నిర్ణయం తీసుకుందని కిశోర్ వివరించారు. ప్రయాణికుల మీద టిక్కెట్ల భారం మోపాలని ఆర్టీసీకి ఎప్పుడూ లేదన్నారు. అయితే పండుగ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరికీ ఇబ్బంది కలగకూడదని ఆర్టీసీ యాజమాన్యం ప్రైవేట్ ట్రావెల్స్‌కన్నా తక్కువ ధర తీసుకుంటూ రవాణా సౌలభ్యాన్ని చేకూర్చిందన్నారు. ఇలా ఉంటే శనివారం అదనంగా తిరుపతికి 20బస్సులను మామూలు చార్జీలతో తిప్పుతున్నట్లు తెలిపారు. అలాగే విజయవాడకు శనివారం ప్రత్యేకంగా 34 బస్సులను, విజయవాడకు 25 బస్సులను, బెంగళూరుకు 25, చెన్నైకు 7బస్సులు తిప్పుతున్నామన్నారు. సంక్రాంతి సంబరాలు తమ స్వగ్రామంలోనే జరుపుకునే ఆనందం ప్రయాణికుల్లో ముందుగానే తొంగిచూస్తుంది. అది కూడా గ్రామీణ ప్రాంతంలో అంగరంగ వైభవంగా సంక్రాంతి తెలుగువాకిట తాకనున్నాయి. ఈనేపధ్యంలో తమ సొంత గ్రామాలకు వెళ్లే ప్రయాణికుల నుంచి ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్, రైల్వే నిలువుదోపిడీ చేస్తున్నాయి. ఆ దిశంగా అధిక చార్జీలు వసూళ్లు చేస్తూ ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు దోచుకుంటున్నాయి. కడప నగరంలో ఏ బస్టాండులో చూసినా జనం కిక్కిరిసి ఉన్నారు. చంటి బిడ్డల నుంచి వయోవృద్ధుల వరకు ప్రయాణికుల తాకిడి మొదలైంది. రోడ్డు రవాణా సంస్థలు రెట్టింపు చార్జీలు వసూళ్లు చేస్తూ ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నాయి. సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులను ప్రైవేట్ ట్రావెల్స్, ఆర్టీసీ సంస్థలు నడుపుతుండగా, టిక్కెట్ల ధరలు ఆకాశాన్నంటడంతో పండుగ పూట సొంత ఊరికి వెళ్లే ప్రయాణికులు ఎంతో ఖర్చుతో కూడుకున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  వైసీపీ నేతల్లో ఉత్సాహ కెరటాలు
  * జిల్లాలో అడుగడుగునా ఘనస్వాగతం
  * తరలివస్తున్న రాష్టస్థ్రాయి నేతలు
  ఆంధ్రభూమి బ్యూరో
  కడప,జనవరి 11: 14నెలల తర్వాత, 3,648కిలోమీటర్ల పాదయాత్ర తర్వాత జిల్లాలో అడుగుపెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత,ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి జిల్లాలో అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. తమ నేతకోసం ఎదురుచూస్తున్న ఆ పార్టీ ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు వైఎస్ జగన్‌ను చూసేందుకు అడుగడుగునా పట్టణాల్లో బారులు తీరారు. తిరుపతి నుండి జిల్లా సరిహద్దుకు చేరుకోగానే కుక్కల దొడ్డి వద్ద కోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో, రాజంపేట పట్టణంలో మాజీ ఎమ్మెల్యే అమరనాధరెడ్డి ఆధ్వర్యంలో, కడప నగరంలో ఎమ్మెల్యేలు అంజద్‌బాషా, రవీంద్రనాథరెడ్డి, మేయర్ సురేష్‌బాబు తదితరుల ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. కార్యకర్తలు ఆయన్ను చూసేందుకు, పలకరించేందుకు పోటీలు పడ్డారు. జగన్మోహన్‌రెడ్డి 12,13వ తేదీల్లో పులివెందులలోనే మకాం వేయబోతున్నందున, రాష్టవ్య్రాప్తంగా ఆపార్టీ నేతలందరూ జిల్లాకు తరలివస్తున్నారు. శుక్రవారమే చాలా మంది జిల్లాకు చేరుకున్నారు. ఎన్నికల ఏడాది కావడంతోనూ, రాష్ట్రంలో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలు రెండూ ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటిస్తామని చెబుతుండటంతోనూ వైఎస్ జగన్‌ను కలిసేందుకు రాష్టవ్య్రాప్తంగా టిక్కెట్ ఆశావహులందరూ జిల్లాకు చేరుతున్నారు. వైఎస్సార్ కడప జిల్లాలో కొత్తగా ఆపార్టీ టిక్కెట్ ఆశించేవారు లేనప్పటికీ, రాష్టవ్య్రాప్తంగా అనేక నియోజకవర్గాల్లో పోటీ వుంది. అటువంటి పోటీ వున్న నియోజకవర్గాల నేతలందరూ జిల్లాకు వస్తున్నట్లు సమాచారం. శని, ఆదివారాల్లో పులివెందులలో వైఎస్ జగన్‌ను కలిసి రాజకీయాలు చర్చించేందుకు సమాయత్తమవుతున్నారు. ఫిబ్రవరిలో 150 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని ఆపార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ ప్రకటన వెలువకడముందే తమ అభ్యర్థిత్వాలను ఖారారు చేసుకునేందుకు పోటీలో ఉన్నవారంతా పులివెందులలోనే మకాం వేయబోతున్నారు. అలాగే జిల్లాలో ఒకటి రెండు నియోజకవర్గాల్లో వైసీపీ నేతల నడుమ సఖ్యత కొరవడింది. అటువంటి నేతల మద్య సయోధ్య చేయడం, రాయచోటి, జమ్మలమడుగు నియోజకవర్గాల నుండి కొంతమంది ముఖ్యనేతలు వైసీపీలోకి చేర్చుకోవడం వంటి రాజకీయ కార్యక్రమాలతో వైఎస్ జగన్ శని, ఆదివారాల్లో బిజీగా గడపనున్నారు.

  ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి
  * కలెక్టర్ హరికిరణ్
  వేంపల్లె, జనవరి 11: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హరికిరణ్, శాసనమండలి మాజీ ఉపాధ్యక్షులు ఎస్‌వి సతీష్‌కుమార్‌రెడ్డిలు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో జన్మభూమి-మా ఊరు ముగింపు కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జన్మభూమి సభకు మాజీ సర్పంచ్ విష్ణువర్ధన్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఒకవైపు అభివృద్ధిని మరోవైపు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారన్నారు. వీటిని ఆయా వర్గాల అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకొని ఆర్థిక పురోగతి సాధించాలన్నారు. టీడీపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, బ్రాహ్మణ, ముస్లిం, మైనార్టీ సంక్షేమ శాఖల ద్వారా ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేసి బ్యాంకు లింకేజీలతో సబ్సిడీ రుణాలను అందిస్తున్నారన్నారు. చేతివృత్తుల వారికి కార్పొరేషన్ల ద్వారా అధునాతన పనిముట్లు అందిస్తూ వృత్తినైపుణ్యాన్ని ప్రోత్సహించేలా కృషి చేయడం జరుగుతోందన్నారు. కరువు కాటకాలకు నిలయమైన పులివెందుల ప్రాంతానికి కృష్ణా జలాలను అందించిన ఘనత తమదేనన్నారు. చంద్రన్న సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుకలతో పాటు పింఛన్లు, రేషన్‌కార్డులు, పక్కాగృహాలు అందిస్తున్నారన్నారు. సభలో పలువురు లబ్ధిదారులకు ఆయా పథకాలకు మంజూరైన పత్రాలను పంపిణీ చేశారు. సభలో ఏర్పాటు చేసిన డ్వాక్రా సంఘాల స్టాళ్లను పరిశీలించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలను వారు తిలకించారు. ప్రభుత్వ పథకాలపై పదో తరగతి చదువుతున్న విద్యశ్రీ చేసిన ప్రసంగం ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా రామకృష్ణ మఠం ప్రతినిధులు విద్యార్థినికి ఈ యేడాది రూ.10 వేలు చొప్పున విద్య అభ్యసించినంత కాలం ఆర్థిక ప్రోత్సాహాన్ని ప్రకటించారు.

  అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
  * డబుల్‌రోడ్డు, ఝరికోన జలాలపై హామీ
  * విప్ మేడా, జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీవాణి
  సుండుపల్లె, జనవరి 11: రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తోందని రాజంపేట ఎమ్మెల్యే, విప్ మేడా మల్లిఖార్జునరెడ్డి, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు మల్లెల శ్రీవాణిలు పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని శివాలయంలో నిర్వహించిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో వారు ప్రసంగించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు ప్రాధాన్యమిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే దక్కుతుందన్నారు. కేంద్ర సహకారం లేకపోయినా రాష్ట్రం లోటుబడ్జెట్‌లో ఉన్నా అభివృద్ధి సంక్షేమ ఫలాలను విజయవంతంగా ప్రజలకు చేరవేశారన్నారు. కేంద్రం ఏపీపై కక్షసాధింపుతో ఇబ్బందులు పెడుతున్నారన్నారు. రాష్ట్రం లోటుబడ్జెట్‌లో ఉన్నా చంద్రన్న కానుకల పేరిట సంక్రాంతి పర్వదినాన్ని పురష్కరించుకొని రూ.16.44 కోట్ల విలువైన సరుకులు పంపిణీ జరుగుతున్నదన్నారు. సుండుపల్లె ప్రజల చిరకాల కాంక్ష అయిన రాయచోటి, రాయవరం, సుండుపల్లె డబుల్‌రోడ్డు పనులకు అలాగే ఝరికోన కాలువల ఏర్పాటుకు రెండు నెలల్లో శంకుస్థాపన చేసి తిరిగి ఓట్ల కోసం వస్తానన్నారు. ఉండుపల్లెకు రూ.58 కోట్లతో తాగునీరు అందించే ప్రయత్నం కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలందరూ ఆశీర్వదించాలన్నారు. రూ.5.38 కోట్లతో ఎన్‌టిఆర్ సుజల స్రవంతి వాటర్‌ప్లాంటును అగ్రహారంలో శంకుస్థాపన చేశారు. అనేక మందికి చంద్రన్నబీమా ధీమాను ఇస్తోందన్నారు.

  16కేసులతో 30 ఏళ్లు ఎలా పరిపాలిస్తారు
  * ఎంపీ సిఎం రమేష్‌నాయుడు
  కడప సిటీ,జనవరి 11: జగన్మోహన్‌రెడ్డి తన పాదయాత్రలో పదేపదే 30 ఏళ్ళుపాలిస్తానని చెబుతున్నాడని 16 కేసులతో ఆయన ఎలా పాలిస్తారో చెప్పాలని శుక్రవారం ఎంపీ సిఎం రమేష్‌నాయుడు అన్నారు. నగరంలోని 50వ డివిజన్‌లో ఎంపీ ల్యాడ్స్ రూ.5లక్షలతో కాలువకు పెన్సింగ్ వేయించినందున ఆ ప్రాంతవాసులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ ఆ ప్రాంత టీడీపీ నేత వెంకటసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున యువత ఈకార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబునాయుడు లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రాన్ని ఐదేళ్లకాలంలో 70సంవత్సరాల అభివృద్ధిని చూపారన్నారు. గర్భస్తశ్రిశువు నుండి మనిషి పోయే వరకు ఉపయోగపడే అనేక సంక్షేమ పథకాలు ఆయన ప్రవేశపెట్టారన్నారు. ఈయన పథకాలు ప్రపంచంలో ఎక్కడా కనపడవన్నారు. నిరుద్యోగ భృతి లాంటి నూతన పథకాలతోపాటు రాష్ట్భ్రావృద్ధిని కూడా వేగంతోచేశారన్నారు. జగన్మోహన్‌రెడ్డి పాదయాత్ర పేరుతో రాష్టమ్రంతా తిరుగుతూ కడప ప్రజలను మరిచిపోయారన్నారు. కడపలో ఉక్కుకోసం చేస్తున్న దీక్షలను కానీ, జిల్లాకు కృష్ణాజలాలు తెచ్చిన అంశాలు ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. జిల్లాకోసం తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న కృషిని ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. గతంలో ఈ డివిజన్‌లో ఉన్న మురికికాలువలో ఒక బాలుడు పడి చనిపోవడంతో ఆ ప్రాంతవాసులు ఎంపీ ల్యాడ్స్ నుంచి నిధులు కేటాయించి పెన్సిన్‌కోసం అడిగారని వారి కోరిక మేరకు పెన్సింగ్ వేయించడం జరిగిందన్నారు. డివిజన్ నాయకులు రూకా రవీంద్రారెడ్డి, యూత్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  చంద్రబాబు హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి
  * మంత్రి ఆది
  కడప సిటీ,జనవరి 11: కడప నగరంలోని పలు డివిజన్లలో జన్మభూమి కార్యక్రమం కొనసాగుతున్న నేపధ్యంలో శుక్రవారం అలంఖాన్‌పల్లెలోని 49వ డివిజన్‌లో జన్మభూమి -మా ఊరు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఆదినారాయణరెడ్డి పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కృషితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసమే ఈ జన్మభూమి నిర్వహిస్తున్నారని, ఈ కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలన్నారు. రేషన్‌కార్డులు, ఇళ్లస్థలాలు, వృద్ధాప్య పెన్షన్లు లాంటి సమస్యలను వెంటనే పరిష్కారం చేస్తున్నామన్నారు. 2019లో రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు పట్టం కట్టాలని ఆయన పిలుపునిచ్చారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుతోనే రాష్ట్రప్రగతి అని రాష్ట్రం లోటుబడ్జెట్‌లో ఉన్నా పేదలు ఇబ్బంది పడకూడదని, సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారన్నారు. ప్రస్తుతం అమలవుతున్న 18 సంక్షేమ పథకాలను చంద్రబాబు రెట్టింపు చేశారన్నారు.


  0 0

  విజయనగరం, జనవరి 11: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరో విడత 3జన్మభూమి-మావూరు2 కార్యక్రమం జిల్లాలో విజయవంతమైంది. చివరి రోజైన శుక్రవారం జామిలో మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు, ఎంపీ అశోక్‌గజపతిరాజు, జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి, ఎమ్మెల్యే లలితకుమారి తదితరులు పాల్గొన్నారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ఎన్నికల ప్రచార కార్యక్రమం మాదిరిలా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకే పెద్ద పీట వేశారు. ఈ నెల 2న మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావుల చేతుల మీదుగా జన్మభూమి-మావూరు కార్యక్రమం ప్రారంభించారు. ఈ దఫా జన్మభూమిలో సామాజిక సమస్యలు అధికంగా అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. గతంలో వ్యక్తిగత సమస్యలపై అర్జీలు అధికంగా రాగా, ఈ దఫా సామాజిక సమస్యలు అధికంగా వచ్చాయని జిల్లా కలెక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ తెలిపారు. జిల్లాలో మొత్తం 920 గ్రామ పంచారుూలు, 149 పురపాలక వార్లులో పది రోజులపాటు జన్మభూమి కార్యక్రమం చేపట్టారు. మొత్తం 1069 గ్రామ సభలు నిర్వహించారు. ప్రతి రోజు రోజుకో అంశంపై గ్రామ సభలు జరిపారు. ఈ నెల 6న అన్ని చోట్ల 5కె రన్ నిర్వహించారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా పోటీలు, వంటల పోటీలను నిర్వహించారు. ఈ సభల్లో లబ్ధిదారులకు పరికరాలు, రేషన్‌కార్డులు, ఇళ్ల పట్టాలు తదితర వాటిని పంపిణీ చేశారు. ఈ సభలకు అధికారులు గ్రామాలబాట పట్టారు. వారితోపాటు ప్రజాప్రతినిధులు, ఆయా నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యేలు మీసాల గీత, కెఎ నాయుడు, మృణాళిని, లలితకుమారి, చిరంజీవులు, ఎంపీలు అశోక్‌గజపతిరాజు, హరిబాబు, జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి, ఎమ్మెల్సీలు గాదె శ్రీనివాసులనాయుడు, జగదీష్, సంధ్యారాణి, ఎపిఇపిడిసిఎల్ డైరెక్టర్ శోభా హైమవతి, నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు, జిల్లా కలెక్టర్ హరి జవహర్‌లాల్, జెసిలు కెవి రమణారెడ్డి, సీతారామారావు, ఆర్డీవో జెవి మురళీ తదితరులు వివిధ చోట్ల జరిగే గ్రామ సభల్లో పాల్గొన్నారు. చివరి రోజైన శుక్రవారం జామిలో మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు, ఎంపీ అశోక్‌గజపతిరాజు, జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి, ఎమ్మెల్యే లలితకుమారి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
  అక్కడక్కడ అపశ్రుతులు
  జన్మభూమి-మావూరు కార్యక్రమంలో కొన్ని చోట్ల గ్రామస్తులు గ్రామసభలను అడ్డుకోగా, మరికొన్ని చోట్ల ఘర్షణలకు దిగారు. వైసీపీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో గ్రామ సభలు అడ్డుకోవడం కన్పించింది. జిల్లాలో గుమ్మలక్ష్మిపురం, కురుపాం, కొమరాడ, మెంటాడ తదితర మండలాల్లో జన్మభూమి సభలలో నిరసనలతోపాటు సభలను బహిష్కరించారు. పార్వతీపురం డివిజన్‌లో అక్కడ సబ్ కలెక్టర్ చేతన్, ఐటిడిఎ పివో లక్ష్మిషా జోక్యం చేసుకొని గ్రామస్తులకు నచ్చజెప్పడంతో కొన్ని చోట్ల గ్రామసభలను కొనసాగించారు. ఏది ఏమైనప్పటికీ ఆరో విడత జన్మభూమి-మావూరు చివరి కార్యక్రమం కావడంతో అధికార పార్టీకి చెందిన నేతలు దీనిని ప్రచారంగా మార్చుకున్నారన్న విమర్శలు కూడా విన్పిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ జిల్లాలో జన్మభూమి-మావూరు కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
  వీడియోకానె్ఫరెన్స్ హాలు ప్రారంభం
  ఆంధ్రభూమి బ్యూరో
  విజయనగరం, జనవరి 11: కలెక్టరేట్‌లో ఆధునీకరించిన వీడియో కానె్ఫరెన్స్ హాలును శుక్రవారం జిల్లా కలెక్టర్ హరి జవహర్‌లాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతొ దీనిని ఏర్పాటు చేశామని, అధికారులు వీడియో కానె్ఫరెన్స్‌కు ఇది చాలా ఉపయోగపడుతుందన్నారు. ఇదిలా ఉండగా దీంతోపాటు ఆర్టీజిఎస్ భవనం కూడా రాబోతుందని తెలిపారు. ఆర్టీజిఎస్‌కు సంబంధించిన కార్యక్రమాలు ఇక్కడ నుంచే నిర్వహించుకునే వీలుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జెసి సీతారామారవు, డిఆర్వో వెంకటరావు, జెడ్పీ సిఇఒ వేంకటేశ్వరరావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
  విద్యార్ధులకు మంచి నడవడిక అవసరం
  ఆంధ్రభూమి బ్యూరో
  విజయనగరం, జనవరి 11: విద్యార్థులు విద్యతోపాటు ఇతర మంచి అలవాట్లను అలవర్చుకోవాలని రామకృష్ణమిషన్ ప్రతినిధి గుణేశానంద అన్నారు. వివేకానందుని 156 జయంతిని పురస్కరించుకొని శుక్రవారం స్ధానిక ఎంవిజిఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా వివేకానందుని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్ధులు ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే మంచి నడవడిక ఎంతొ అవసరమన్నారు. కాలం విలువ తెలుసుకోవడంతోపాటు మంచి అలవాట్లు ఉన్నప్పుడే వృద్ధిలోకి రాణించగలరని ఆయన అభిప్రాయపడ్డారు. విలువలు లేనపుడు విద్య ఉన్న ఫలితం ఉండదన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరు మంచి ఉన్నత స్ధానాలకు చేరేందుకు మంచి అలవాట్లతోపాటు క్రమశిక్షణ పెంపొందించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా వ్యాసరచన పోటీల్లో విజేతలకు ఆయన చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ కెవిఎల్ రాజు, కళాశాల విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.
  స్వచ్ఛ విజయనగరంలో భాగస్వాములం
  ఆంధ్రభూమి బ్యూరో
  విజయనగరం, జనవరి 11: మేము కూడా స్వచ్ఛ విజయనగరంలో భాగస్వాములమవుతామని పోలీసు శిక్షణ కళాశాల ప్రిన్సిపల్ మెహర్‌బాబు అన్నారు. శుక్రవారం పట్టణంలోని విటి అగ్రహారం రోడ్డు పరిసరాలను పరిశుభ్రం చేశారు. పిచ్చి మొక్కలను తొలగించారు. ఇక నుంచి ప్రతి వారం పిచ్చి మొక్కలను తొలగించి స్వచ్ఛ విజయనగరంనకు తమ వంతు సాయం అందిస్తామని వారు తెలిపారు. పిటీసీలో ప్రస్తుతం హెడ్ కానిస్టేబుళ్లుగా శిక్షణ పొందుతున్న వారు వంద మంది వరకు ఉన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్, మున్సిపల్ సిబ్బంది, రైల్వే డిజిఎం దీక్షితులు, ఆర్‌ఐ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

  చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం
  *టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కరణం శివరామకృష్ణ
  గజపతినగరం, జనవరి 11: ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కరణం శివరామకృష్ణ అన్నారు. శుక్రవారం మండలంలోని పురిటిపెంట గ్రామంలో జరిగిన జన్మభూమి-మా ఊరు గ్రామసభలో ఆయన ప్రసంగించారు. అన్నివర్గాల ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న చంద్రబాబుకు ప్రజలు అండగా నిలవాలని కోరారు. రైతులు, మహిళలకు రుణమాఫీలతోపాటు నిరుపేదల ఆకలి తీర్చేందుకు అన్నక్యాంటీన్లు ఏర్పాటు చేసి తక్కువ ధరలతో వారి ఆకలి తీర్చుతున్నారని తెలిపారు. చేతివృత్తులవారిని ఆదుకోనేందుకు ఆదరణ పధకం ప్రవేశపెట్టి వారి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారని చెప్పారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరంను శరవేగంగా నిర్మించి పలుసార్లు గిన్నీస్‌బుక్ రికార్డుల సాధించారని అన్నారు. అభివృద్ధి కొనసాగాలంటే చంద్రబాబు మళ్లీ ప్రజలు ఆదరించాలని చెప్పారు. నాళంవారి భూములకు పట్టాలు ఎపుడు ఇస్తారో ఖచ్చితంగా చెప్పిన తరువాతే సభ నిర్వహించాలని సిపి ఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు గొర్లె శ్రీనివాసరావు అధికారులు, టీడీపీ నేతలను ప్రశ్నించి నిలదీసారు. గ్రామానికి ఆనుకొని రిలయెన్స్ జియో టవర్‌ను నిర్మిస్తున్నారని దీనివలన ప్రజలకు తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నందున తక్షణమే నిర్మాణ పనులు ఆపాలని డిమాండ్ చేశారు. దీంతో అధికార పార్టీ నాయకుల రావి శ్రీధర్, గండ్రేటి అప్పలనాయుడు, అట్టాడ లక్ష్మునాయుడు, సిపి ఎం నాయకుల మధ్యన వాగ్వివాదం చోటుచేసుకొన్నది. కార్యక్రమంలో ఎంపిపి గంట్యాడ శ్రీదేవి, ఇవొపి ఆర్ డి జి.జనార్ధనరావు, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.

  ప్రగతి పాఠశాలలో సంక్రాంతి సంబరాలు
  గజపతినగరం, జనవరి 11: గజపతినగరంలోని ప్రగతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శుక్రవారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ బూడి వెంకటరావు ఆధ్వర్యంలో ఈ వేడకలు అత్యంత వైభవంగా జరుపుకొన్నారు. హరిదాస్, సంప్రదాయ దుస్తులలో బాలికలు, తదితర వేషదారణలతో అలరించారు. ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ కనబరిచి అంగరంగ వైభవంగా జరిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్.అప్పలనాయుడు, బూర్లి రామునాయుడు, ఈదుబిల్లి సత్యనారాయణ, లత, లక్ష్మి, అనిత, నాగమణి , ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
  వైభవంగాశ్రీవారికి ప్రసాద నివేదన
  గజపతినగరం, జనవరి 11: గజపతినగరం బజారుజంక్షన్‌లో గల శ్రీరామక్షేత్రంలో శ్రీనివాసునికి ప్రసాద నివేదన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ధనుర్మాష ఉత్సవాలలో భాగంగా శుక్రవారం ఆలయ అర్చకులు పీసపాటి శ్రీనివాసాచార్యులు ఆలయంలో తెల్లవారు జామునే సుప్రభాతసేవ, సేవాకాలం తదితర కార్యక్రమాలు జరిపారు. పరిసర ప్రాంతాలలోనివారు స్వామివారిని తిలకించేందుకు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
  ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికే జనసేన ఆవిర్భాం
  * ఉత్తరాంధ్ర జనసేన నాయకులు ఆదాడ మోహనరావు
  బొండపల్లి, జనవరి 11: ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికే జనసేన పార్టీ ఆవిర్భవించిందని జనసేన పార్టీ ఉత్తరాంధ్ర నాయకులు ఆదాడ మోహనరావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన బొండపల్లి మండల భవన సముదాయంలో జనసేన పార్టీ క్యాలెండర్లును ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలువలు కాపాడటంతోపాటు ప్రజలను ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయాలలో చేయూతనిస్తుందని తెలిపారు. రాజ్యాంగ విలువలతోపాటు మహనీయులు డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్, జ్యోతిరావుపూలేలు ఆశించిన సమసమాజ నిర్మాణానికి జనసేన కార్యకర్తలు సైనికుల వలే పనిచేయాలని చెప్పారు. నీచరాజకీయాన్ని ప్రక్షాళన చేయడానికి నడుం బిగించాలని అన్నారు. ఓటు ద్వారానే అవినీతి నేతలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. జస్టిస్ జిల్లా కన్వీనర్ డోల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ జనసేన పార్టీతోనే ప్రజల జీవితాలలో మార్పతధ్యమని అన్నారు. రాజకీయాలలో అవినీతిపాలన అంతమొందించడానికి కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు అడబాల వెంకటేష్, రొంగలి రమణ, మిడతాన రవి, నాయుడు తదితరులు పాల్గొన్నారు.

  రోగులకు ఇబ్బందులు లేకుండా వైద్యసేవలు
  * జాయింట్ కలెక్టర్-2 సీతారామారావు
  గజపతినగరం, జనవరి 11: రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా వైద్యులు సేవలు అందించాలని జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ జె.సీతారామారావు అన్నారు. శుక్రవారం స్ధానిక ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిలోని రికార్డులు, హాజరుపట్టికలను పరిశీలించడంతోపాటు వైద్యసేవలు అందించే గదులను, రోగుల గదులను పరిశీలించి రోగులను అందుతున్న వైద్యసేవలపై వివరాలు అడిగి తెలుసుకొన్నారు. వైద్యులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని సూచించారు. రోగులకు 24 గంటలు అందుబాటులో ఉంటూ మైరుగైన వైద్యసేవలు అందించి ఆసుపత్రికి మంచిపేరు తీసుకురావాలన్నారు. ఆసుపత్రి ఆవరణ చుట్టూ మట్టిరోడ్లు ఉన్నాయని సిసి రహదారులు వేయాల్శి ఉందని తెలిపారు. అలాగే 30పడకల ఆసుపత్రి కొత్త భవనం నిర్మాణం పూర్తయినా ఇంకా ప్రారంభానికి నోచుకోలేదని, ప్రారంభిస్తే రోగులకు మరింత సేవలు అందే అవకాశం ఉందని చెప్పారు. ఈ సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళతామని అన్నారు. ముఖ్యమంత్రి ఐవిజన్ కేంద్రంలో రోగులకు అందిస్తున్న సేవలు పట్ల సంతృప్తివ్యక్తం చేశారు. వైద్యులు మరింత బాధ్యతగా పనిచేసి రోగులకు సేవలు అందించాలన్నారు. వైద్యులు, వైద్యేతర సిబ్బంది తప్పనిసరిగా స్ధానికంగానే నివాసం ఉండేలా చూడాలన్నారు. రోగులు నుండి ఎటువంటి పిర్యాదులు రాకుండా వైద్యసేవలు అందించాలన్నారు. ఆసుపత్రిలో మందులు కొరత, ఇతర పరికరాలకు కొరత రాకుండా చూసుకోవడంతోపాటు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఇక్కడ జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయ అధికారిణి డాక్టర్ జి. ఉషశ్రీ, ఆసుపత్రి సూపరిండెంటెంట్ కె.వెంకటరావు, వైద్యులు డాక్టర్ ఎ.అజయ్‌కుమార్, డాక్టర్ టి.అరుణాదేవి తదితరులు పాల్గొన్నారు.

  జన్మభూమి సభలో భగ్గుమన్న టీడీపీ వర్గ రాజకీయం
  గజపతినగరం, జనవరి 11: మీకు దమ్ముంటే రండి సభలోనే తేల్చుకుందామని జెడ్పీటీసీ మక్కువ శ్రీధర్ సవాల్ విసిరారు. దీంతో తెలుగుదేశం పార్టీలో గల వర్గ రాజకీయాలు మరోమారు సవాళ్లు ప్రతిసవాళ్లతో జన్మభూమి సభ మారు మ్రోగింది. ఎన్నో ఏళ్లుగా నివురు గప్పిన నిప్పులా కొనసాగుతున్న వర్గ రాజకీయాలు వీధినపడ్డాయి. జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గజపతినగరం గ్రామసభ పంచాయతీ కార్యాలయం వద్ద బహిరంగసభ జరిగింది. ఈ సందర్భంగా స్ధానిక ఎంపిటిసి సభ్యురాలు కర్రి శ్రీదేవి మాట్లాడుతూ గజపతినగరంలో ఇద్దరు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపిటిసిలు తాజా మాజీ సర్పంచ్ ఉండగా తమకు తెలియకుండా అధికార పార్టీలో ఒక వ్యక్తి గ్రూపులు ప్రోత్సహిస్తున్నాడని వాడి సంగతి తేల్చాలంటూ ఎంపిపి గంట్యాడ శ్రీదేవిని కోరారు. ఇంతలో గ్రామానికి చెందిన చందక కృష్ణంరాజు సభలోకొచ్చి అసభ్యంగా మాట్లాడవద్దని వారెవరో చెప్పవచ్చుకదా అని నిలదీయడంతో ఆ వెధవ స్టేజీమీదే ఉన్నాడని అసభ్య పదజాలం వాడడంతో ఒక్కసారిగా పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది. జెడ్పీటీసీ శ్రీధర్ ఆగ్రహంతో ఊగిపోతూ వాటర్‌బాటిల్‌ను టేబుల్‌కేసి కొట్టి దమ్ముంటే తేల్చుకుందాం రండి అని సవాల్ విసిరారు. ఇంతలో రామన్నపేట గ్రామానికి చెందిన అరునలేచి జెడ్పీటీసీని తిడతావా అంటూ ముందుకురకడంతొ తోపులాట ప్రారంభమైంది. పరిస్ధితి చేయిదాటిపోతోందని గ్రహించిన పోలీసులు తహశీల్ధార్ శేషగిరిరావు దేశం నేతలు ఇరువర్గాలను శాంత పరచడానికి శాయశక్తులా కృషి చేశారు. అయినా శాంతింకపోగా మరింత ఉద్రిక్త పరిస్దితి నెలకొనడంతో తహశీల్ధార్ శేషగిరిరావు జోక్యం చేసుకొని మైకు చేత పట్టుకొని సభ ఇంతటితో ముగిస్తున్నామని ప్రకటించారు.

  గాయత్రి టెక్నో స్కూల్‌లో సంక్రాంతి సంబరాలు
  బొండపల్లి, జనవరి 11: మండలంలోని గొట్లాం గ్రామం పరిధిలో గల గాయత్రి టెక్నో స్కూల్‌లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ముందుస్తుగా మూడు రోజులపాటు నిర్వహించే ఈ పండగ పాఠశాలలో ప్రత్యేకత సంతరించుకుంది. భోగిమంటతో కళాశాల కరస్పాండెంట్ జి.జగదీశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్ధులకు వ్యాసరచన, రంగవల్లులు, తెలుగు సంప్రదాయ పద్దతిలో వేషధారణ, పతంగుల పోటీలు నిర్వహించారు. చిన్నారులు వివిధ వేషధారణలో చేపట్టిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. అనంతరం విద్యార్ధులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల పరిపాలనాధికారి రాఘవకుమార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

  క్రీడాపోటీలలో మరుపల్లి విద్యార్ధులు ప్రతిభ

  గజపతినగరం, జనవరి 11: మండలంలోని మరుపల్లి హైస్కూల్‌కు చెందిన విద్యార్ధులు వివిధ క్రీడాపోటీలలో గెలుపొంది పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చారని పాఠశాల హెచ్ ఎం యశోధ అన్నారు. శుక్రవారం మండలంలోని మరుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజేతలను హెచ్ ఎం యశోధ అభినందించారు. జన్మభూమి ఆరు కార్యక్రమంలో భాగంగా గజపతినగరంలో నిర్వహించిన మూడు రకాల క్రీడాలలో ఖోఖో, వాలీబాల్‌లో మరుపల్లి హైస్కూల్ విద్యార్ధులు ప్రధమస్ధానంలో నిలిచారు. కబడ్డీలో ద్వితీయస్ధానం లభించింది. పాఠశాల పరిధిలో నిర్వహించిన పలు రకాల పోటీలలో వ్యాసరచన, వక్తృత్వం , రంగవల్లిక, చిత్రలేఖనం విజేతలక బహుమతులు అందజేశారు. విద్యతోపాటు అన్ని అంశాలలో ప్రతిభ కనబరిచిన తొమ్మిదివ తరగతి విద్యార్ధిని మంత్రి త్రివేణికి సైకిల్ అందజేశారు.

  చిన్నవ్యాపారులలో మనోధైర్యం నింపిన మోదీ
  గజపతినగరం, జనవరి 11: చిన్నవ్యాపారులలో ప్రధాని నరేంద్రమోదీ మనోధైర్యం నింపారని బీజేపీ మండల నాయకులు ఆరిశెట్టి రామకృష్ణ, ఎం ఎస్ ఎన్ రాజులు అన్నారు. శుక్రవారం స్ధానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రధాని మోదీ, ఆర్ధికమంత్రి అరుణ్‌జెట్లీ జి ఎస్‌టీపై చేసిన ప్రకటనతో చిన్న వ్యాపారులకు వార్షిక టర్నోవర్ 20లక్షల నుండి 40లక్షలకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చిన్న వ్యాపారులలో ఆనందోత్సాహాలు పెరగడమే కాకుండా మనోధైర్యం ఆర్ధిక భరోసా కలిగిందని అన్నారు. ఈ ప్రకటనతో వ్యాపార పారిశ్రామిక, వ్యవసాయ, రవాణా రంగాలు అభివృద్ధి చెందుతుందని, వ్యాపారులకు మేలు చేకూరే ప్రకటన చేసిన ప్రధాని మోదీకి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో మండల నాయకులు గెద్ద సత్యం పాల్గొన్నారు.
  ఐటిడిఎలో ఘనంగా సక్రాంతి సంబరాలు
  పార్వతీపురం, జనవరి 11: పార్వతీపురం ఐటిడి ఎ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా సక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఐటిడి ఎ ప్రాజెక్టు అధికారి డాక్టర్ జి.లక్ష్మీశ ఆధ్వర్యంలో తెలుగు ప్రజలు అత్యంత పవిత్రంగా నిర్వహించే సక్రాంతి వేడుకలు నిర్వహించడంలో భాగంగా గిరిజన విద్యార్థులకు ముగ్గులు పోటీలు నిర్వహించారు. ఇన్ని రోజులు పడిన శ్రమను మరచిపోయి ఆనందంగా పండగ జరుపుకోవాలని పీవో ఆకాంక్షించారు.అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రలో సక్రాంతి ఎలా సంబరంగా నిర్వహిస్తారో కర్నాటకలో ఉగాది వేడుకలు అంత ఘనంగానే చేస్తారన్నారు. కష్టపడిన రైతులను, ఎద్దులకు గౌరవిస్తామన్నారు. సంక్రాంతి సంబరాలలో ముందుగా గోమాతకు పూజలు చేసి భోగి మంటలు వేసి దాని చుట్టూ ఐటిడి ఎ పీవో ఆద్వర్యంలో ప్రదర్శనలు చేశారు. అనంతరం గిరిజన విద్యార్థులు, మహిళలు వేసిన రంగవళ్లులు తిలకించారు. అలాగే గిరిమిత్ర సమావేశం హాలులో మహిళలకు పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు పంపిణీ చేశారు. సంబరాల్లో గంగిరెద్దులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తొలుత అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు పీవో డాక్టర్ జి.లక్ష్మీశతో పాటు ఆయన శ్రీమతి జ్ఞానేశ్వరి సక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో ఎపివో సురేష్‌కుమార్, జిల్లా గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరక్టర్ పి.కిరణ్‌కుమార్, స్షెషల్ డిప్యూటీ కలెక్టర్ మనోరమ, గిరిజన సంక్షేమశాఖ ఇ ఇ కెవి ఎన్ ఎస్ కుమార్, మేనేజర్ హేమలతతో పాటు పలువురు ఐటిడి ఎ ఉద్యోగులు సంక్రాంతి సంబరాల్లో పాల్గొని తమ సంతోషాన్ని పంచుకున్నారు. పీవో డాక్టర్ జి.లక్ష్మీశతో పాటు ఆయన శ్రీమతి జ్ఞానేశ్వరి కూడా వేడుకల్లో పాల్గొన్నారు.
  ఉపాధి పనుల చెల్లింపులపై అలసత్వాన్ని ఉపేక్షించేది లేదు
  ఐటిడిఎ పీవో డాక్టర్ జి.లక్ష్మీశ వెల్లడి
  పార్వతీపురం, జనవరి 11: ఉపాధి హామీ పనుల చెల్లింపుల విషయంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించినా సహించబోనని పార్వతీపురం ఐటిడి ఎ ప్రాజెక్టు అధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక ఐటిడిఎ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో బ్యాంకు అధికారులు, ఇతరశాఖల అధికారులు పాల్గొన్నారు. ఈసందర్భంగా పార్వతీపురం పోస్టల్ సూపరింటెండెంట్‌కు సమావేశానికి సంబంధించిన సమాచారం అందించినా హాజరు కాకపోవడం పట్ల పీవో ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధిహామీపనులకు సంబంధించిన బిల్లులు చెల్లింపులపై జిల్లా లీగల్ సెల్ అధారిటీ వారి ద్వారా నోటీసు జారీ చేశారు. పార్వతీపురం డివిజన్‌లోని 63,472మంది ఉపాధి కూలీలకు జూలై 2018 నుండి రూ.14కోట్ల 89లక్షల చెల్లింపులు చేయాల్సి ఉన్నందున ఈవిషయమై పీవో బ్యాంకర్లను ప్రశ్నించగా, బ్యాంకర్లు తమ వద్ద నగదు ఉందని పీవోకు తెలిపారు. అయితే నగదు చెల్లింపునకు నేటికి పోస్టల్ సూపరింటెండెంట్ ఎటువంటి ఇండెంట్ పెట్టలేదన్నారు. దీంతో సబ్‌ప్లాన్ పరిధిలోని 8మండలాలల్లోని 188 పోస్టల్ బ్రాంచ్‌లలో ఉపాధి హామీపనులకు చెల్లింపులు జరగడం లేదన్నారు. ఈసమావేశంలో లీడ్ బ్యాంకు మేనేజర్ ఎం.గురవయ్య, ఎస్ బి ఐ అకౌంటెంట్ ఆదయ్య, టి.టిపి మేనేజర్ ఇ.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

  జన్మభూమి పథకం ప్రజల అభివృద్ధికే
  కురుపాం, జనవరి 11: ప్రజలు అభివృద్ధి చెందడానికే జన్మభూమిపథకం విజయవంతంగా అమలవుతుందని పార్వతీపురం ఐటీడీఏ పీఓ లక్ష్మీషా అన్నారు. శుక్రవారం కురుపాం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో జన్మభూమి గ్రామసభను నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారిగా మన రాష్ట్రంలో జన్మభూమి కార్యక్రమం అమలవుతుందన్నారు. ప్రజల వద్దకే అధికారులు వచ్చి వారి సమస్యలను పరిష్కరించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. గ్రామసభలను బహిష్కరించడం, జరగనివ్వకపోవడం విచారకరమన్నారు. సమస్యలను లిఖితపూర్వకంగా జన్మభూమిలో అందిస్తే తప్పనిసరిగా పరిష్కారం జరుగుతుందన్నారు. ప్రజలు ఇటువంటి వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముందుగా పలుశాఖల ద్వారా జరిగిన అభివృద్ధిని అధికారులు వివరించారు. ప్రజలు పెద్ద ఎత్తున పింఛన్లు, ఇళ్లు, రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు అందజేశారు. అనంతరం సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగిమంటలు వేసి పలు పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు శతృచర్ల చంద్రశేఖరరాజు, విటి జనార్థన థాట్రాజ్, టీడీపీ మండల కన్వీనర్ కోటేశ్వరరావు, ఏఎంసీ ఛైర్మన్ రంజిత్‌కుమార్, ప్రత్యేక అధికారి కిరణ్‌కుమార్, తహశీల్దార్ సూర్యకళ, ఎంపీడీఓ చంద్రరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

  వ్యవసాయ యంత్రపరికరాల పంపిణీ
  కురుపాం, జనవరి 11: పార్వతీపురం ఐటీడీఏ, వ్యవసాయశాఖ ద్వారా మంజూరైన వ్యవసాయ యంత్రపరికరాలను ఐటీడీఏ పీఓ లక్ష్మీషా రైతులకు అందజేశారు. శుక్రవారం కురుపాంలో జరిగిన కార్యక్రమంలో వీటిని ఆయన పంపిణీ చేశారు. సబ్సీడిపై అందించిన ట్రాక్టర్లు, ఆయిల్ ఇంజన్లు, విద్యార్థులకు సైకిళ్లు, వికలాంగులకు ట్రై సైకిళ్లు, తదితర వాటిని పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా సబ్సీడీపై అందించే పరికరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. యంత్ర పరికరాల సహాయంతో వ్యవసాయ పంటలలో అధిక దిగుబడి సాధించి పూర్తిస్థాయిలో ఆదాయాన్ని పొందాలన్నారు. అవసరమైన పరికరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం ద్వారా రప్పించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

  జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరుచేయాలి
  కురుపాం నియోజకవర్గంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు, ఇళ్లు మంజూరుచేయాలని ఐటీడీఏ పీఓ లక్ష్మీషాను జర్నలిస్టులు కోరారు. ఈ మేరకు వినతిపత్రాన్ని అందించారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ప్రత్యేకంగా ఇళ్లు మంజూరుచేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు అమలుచేయలేదన్నారు. వీటిని వెంటనే మంజూరుచేయాలని కోరారు. అలాగే ఇళ్లస్థలాలు లేనివారికి స్థలాలు ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు విభూషణ్, శ్రీనివాసరావు, వెంకటరావు, పృద్వి, శేషు, తదితరులు పాల్గొన్నారు.

  కుదమ పంచాయతీ కార్యదర్శి విదులకు గైర్హజరు
  జియ్యమ్మవలస, జనవరి 11: మండలంలో గల కుదమ పంచాయతీ కార్యదర్శి ఏ అశిరివాడు గత మూడు నెలలుగా విదులకు గైర్హజరవుతున్నాడని ఫిర్యాదులు రావడంతో జిల్లాకలెక్టర్, డీపీఓ, ఐటీడీఏ పీఓలకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు ఎంపీడీఓ కృష్ణారావు తెలిపారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కుదమ పంచాయతీలో స్థానికంగా నివాసం ఉంటున్న జడ్పిటీసీ డొంకాడ మంగమ్మ, మాజీ సర్పంచ్ దొరతోపాటు ప్రజలు పంచాయతీ కార్యదర్శి 3నెలలుగా విదులకు హాజరుకావడం లేదని, పనులు జరగక ఇబ్బందులు పడుతున్నామని పిర్యాదు చేశారన్నారు. ఈమేరకు జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించామని ఎంపీడీఓ తెలిపారు. అంతేకాకుండా కుదమ పంచాయతీకి వృద్ధాప్య, వితంతు, వికలాంగులు, మత్స్యకార పెన్షన్లు 387 వస్తున్నాయన్నారు. నవంబర్ నెలలో 4లక్షల 44వేల రూపాయల చెక్కును అతనికి అందించామని, పింఛన్లు పంపిణీ చేయగా 66,500 రూపాయలు మిగిలాయన్నారు. ఈ నగదు ఎంపీడీఓ అకౌంట్‌కు కట్టవల్సి ఉన్నప్పటికీ ఆ కార్యదర్శి ఇంతవరకు బ్యాంకు చలాణ ద్వారా అందజేయలేదన్నారు. అలాగే డిసెంబర్ నెలలో పంచాయతీ కార్యదర్శి పేరున చెక్కు రాసినప్పటికీ కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా పంపిణీ చేశారు. ఆ నెలలో కూడా మిగిలిన డబ్బులు ఇంతవరకు ఎంపీడీఓ అకౌంట్‌కు చేరలేదు. ఈ విషయంపై ఎంపీడీఓ కృష్ణారావును వివరణ కోరగా కుదమ పంచాయతీ కార్యదర్శి అసిరివాడు విదులకు గైర్హజరవ్వడం వాస్తవేనని, అనేకమార్లు వౌకికంగా హెచ్చరికలు చేశామని, అయినప్పటికీ అతనిలోమార్పు రాలేదన్నారు. రెండు సార్లు మెమోలు, సోకాజ్ నోటీసులు కూడా ఇచ్చామన్నారు. ఇంతవరకు అతని నుంచి ఎటువంటి సమాచారం రాలేదన్నారు. సామాజిక పింఛన్లలో మిగిలిన నగదు ఇంతవరకు కట్టలేదన్నారు.

  అక్రమ కుళాయి కనెక్షన్లను వెంటనే తొలగించాలి
  జియ్యమ్మవలస, జనవరి 11: మండలంలో గల చినమేరంగి గ్రామంలో పంచాయతీ అధికారుల అనుమతి లేకుండా అక్రమ కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేసుకున్నవారు వెంటనే తొలగించాలని లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని పంచాయతీ ప్రత్యేక అధికారి జివి రఘు హెచ్చరించారు. శుక్రవారం పంచాయతీ కార్యదర్శి అల్లు రమేష్‌తో కలిసి గ్రామంలో పరిశీలించారు. పంచాయతీ అనుమతులు లేకుండా అక్రమ కుళాయి కనెక్షన్లు ఏర్పాటు వలన పబ్లిక్ కుళాయిల ద్వారా పూర్తిస్థాయిలో నీటి సరఫరా జరగడం లేదని, వెంటనే వాటిని తొలగించాలని, లేనిపక్షంలో తామే తొలగిస్తామన్నారు. రానున్న వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగానే అక్రమ కుళాయి కనెక్షన్లు తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈమేరకు వారికి నోటీసులు జారీచేశామన్నారు.

  గోమాతలను పూజించడం వలన సకలపాపాలు తొలిగిపోతాయి
  సీతానగరం, జనవరి 11: హిందూ ధర్మశాస్త్రంప్రకారం గోవులను పూజించడం వలన సకలపాపాలు తొలిగిపోతాయని హిందూ ధర్మపరిషత్ ప్రచార కమిటీ సభ్యులు టి రామ్మోహన్ శర్మ అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మప్రచార్ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనగుడి కార్యక్రమంలో భాగంగా సుభద్ర సీతారాంపురం గ్రామంలో శుక్రవారం గోమాత పూజలను నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గోవులకు సేవ చేయడం వలన జన్మజన్మల పాపాలు హరించిపోతాయన్నారు. మన సాంస్కృతి, సాంప్రదాయాలలో గోవులను పూజించడమనేది సాంప్రదాయంగా వస్తుందన్నారు. ప్రతీ ఒక్కరూ గోవులను పూజించాలన్నారు.

  బాలయోగీ గురుకులంలో సంక్రాంతి సంబరాలు
  సీతానగరం, జనవరి 11: మండలంలోని జోగింపేట సాంఘిక సంక్షేమశాఖ బాలయోగీ గురుకుల పాఠశాలలో సంక్రాంతి సంబరాలను అట్టహాసంగా నిర్వహించారు. ఈమేరకు శుక్రవారం స్థానిక గురుకులంలో ప్రిన్సిపల్ ఆశీర్వాదం ఆధ్వర్యంలో విద్యార్థులకు సంక్రాంతి పండగ ఆవస్యకతను తెలియజేస్తు పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువులు పూర్వకాలంగా సాంస్కృతి, సాంప్రదాయాలతో నిర్వహిస్తున్న పండగ సంక్రాంతి పండగ అన్నారు. విద్యార్థులకు పలు పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

  ముగిసిన జన్మభూమి కార్యక్రమం
  సీతానగరం, జనవరి 11: మండలంలో జన్మభూమి- మా ఊరు కార్యక్రమాలు శుక్రవారంతో ముగిశాయి. ఈమేరకు మండలంలోని పెదబోగిలి, తామరఖండి గ్రామాల్లో జన్మభూమి కార్యక్రమం జరిగింది. జిల్లాకలెక్టర్ మండలంలో జన్మభూమి కార్యక్రమం నిర్వహణలో అధికారుల వైఫల్యాలను సరిచేసుకోవాలని సూచించడంతో అధికారులు కార్యక్రమాన్ని తప్పులను సరిచూసుకుంటూ అన్నివర్గాలను మమేకం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహిస్తుందో తెలియజేస్తు పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. అన్నిశాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల నుంచి వినతులను కూడా స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ బాపిరాజు, ఎంపీడీఓ పైడితల్లి, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.

  భవనాల క్రమబద్దీకరణ చేసుకోవాలి
  సాలూరు, జనవరి 11: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు 14 ప్రకారం 4.1.2019 సాలూరు మున్సిపాల్టీ పరిధిలో ఉన్న 1985వ సంవత్సరం నుంచి 31.8.2018 వరకు అనధికారికంగా నిర్మించిన ఆసుపత్రులు, స్కూల్స్, ఇతర వ్యాపారాలకు సంబంధించిన భవనాలకు అనుమతి పొందిన ప్లాన్‌లకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను బిల్డింగ్ ప్లీనలైజేషన్(బిపీ ఎస్) పథకం కింద క్రమబద్దీకరణ చేసుకోవాలని కమిషనర్ ఎంఎం నాయుడు కోరారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని, లేనిపక్షంలో ఆంధ్రప్రదేశ్ పురపాలక చట్టం ప్రకారం చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

  ఖైనీ, గుట్కా ప్యాకెట్లు పట్టివేత
  సాలూరు, జనవరి 11: పట్టణ పరిధిలోని దుగ్దసాగరం రోడ్డులో అక్రమంగా తరలిస్తున్న ఖైనీ, గుట్కా ప్యాకెట్లును పట్టణ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. పాచిపెంట మండలం పాంచాలి గ్రామానికి చెందిన పి వెంకటేష్ సుమారు 45వేల రూపాయలు విలువ చేసే ఖైనీ, గుట్కా ప్యాకెట్లును పాంచాలి నుంచి సాలూరుకు మోటార్ సైకిల్‌పై అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఈమేరకు కేసు నమోదు చేశారు.
  సోలార్ వినియోగంలో రాష్ట్రం ప్రథమం
  బలిజిపేట, జనవరి 11: సోలార్ విద్యుత్ వినియోగంలో దేశంలోనే మన రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని రాష్ట్ర జన్మభూమి మేనేజింగ్ డైరెక్టర్ కమలాకరబాబు అన్నారు. శుక్రవారం బలిజిపేటలో జరిగిన జన్మభూమి- మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా పురవీధుల్లో పర్యటించి అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక పాఠశాలలను పరిశీలించి విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. అనంతరం మండలంలోని వివిధశాఖాధికారులు నాలుగున్నరేళ్లలో జరిగిన అభివృద్ధి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోలార్ విద్యుత్ వినియోగంలో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని, ఇందులో ప్రకాష్ జిల్లా మొదటి స్థానం, విజయనగరం రెండవ స్థానంలో ఉందన్నారు. సోలార్ వినియోగం వలన రాష్ట్రాన్ని కాలుష్యరహితంగా తీర్చిదిద్దవచ్చున్నారు. రాష్టవ్రిభజన అనంతరం 1000 మెగావాట్ల విద్యుత్ ఉందని, ప్రస్తుతం 7,500 మోగావాట్ల విద్యుత్ ఉండి ఛత్తీష్‌గడ్, రాజస్థాన్ రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్నామన్నారు. ఎన్‌టిఆర్ జలసిరి పథకం ద్వారా పంపుసెట్‌కు ప్రతీ రైతు 55వేల రూపాయలు చెల్లిస్తే 2లక్షల 42వేల రూపాయల రాయితీపై 5హెచ్‌పి మోటార్‌ను పంపిణీ చేస్తున్నామన్నారు. ఇప్పటికే 40పంపుసెట్లును పంపిణీ చేశామన్నారు. దీని కోసం 4వేల కోట్లును ప్రభుత్వం భరిస్తుందని, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి ప్రభుత్వం ఉచితంగా వీటిని పంపిణీ చేస్తుందన్నారు. 2030నాటికి రాష్ట్రంలో ఉన్న వాహనాలన్నీ విద్యుత్‌చార్జింగ్ నడిచేలా చర్యలు చేపడుతుందని, ఇప్పటికే విశాఖ, కాకినాడ, తిరుపతి, విజయవాడ నగరాల్లో 300 వాహనాలను పంపిణీ చేశామని, వీటిని ఎంపీడీఓ, తహశీల్దార్, మేయర్ పంచాయతీ అధికారులు వినియోగిస్తున్నారన్నారు. త్వరలో ఆటోలన్నీ విద్యుత్‌తోనే నడపడం జరుగుతుందని, 2030 నాటికి కాలుష్యరహిత రాష్ట్రంగా తీరి


  0 0

  విశాఖపట్నం, జనవరి 11: ఎళ్ల తరబడి ఎన్నికలకు నోచుకోని మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం సాధించేందుకు 3పౌర సమితి2 ఏర్పాటు చేయనున్నట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పీ మధు వెల్లడించారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించే విషయంలో అధికార టీడీపీ తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం లేకుండా అధికారుల పాలనలో సమస్యలు పరిష్కారం కావన్నారు. జనసేన, వామపక్ష పార్టీల ప్రతినిధులతో పాటు మేథావులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పౌర సమితిలో భాగమిగా ఉంటారన్నారు. గత నాలుగేళ్లుగా విశాఖలో ప్రభుత్వరంగ సంస్థల కోసం వామపక్షాలు ఉద్యమిస్తున్నాయన్నారు. ముఖ్యంగా తమ పోరాటం వల్లే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ)ను ప్రభుత్వరంగంలో కొనసాగిస్తున్నారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం ద్వారా కార్మిక, ఉద్యోగులకు మేలు చేకూరుతుందన్నారు. కోట్లాది రూపాయలు పన్నుల రూపంలో చెల్లిస్తున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనుల కోసం ఎన్నో ఏళ్లుగా ఉద్యమిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు స్పందించలేదన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకునేందుకు ప్రతి కార్మికుడూ నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. ప్రతి కుటుంబంలోనూ తమ ప్రతినిధి భాగస్వామ్యం అవుతున్నారన్నారు. విశాఖలో విలువైన ప్రభుత్వ భూముల కబ్జాకు సంబందించి తాము చేసిన పోరాటాలతో ప్రభుత్వం సిట్‌ను నియమించిందన్నారు. దాదాపు రూ.20వేల కోట్ల ప్రభుత్వ భూములు కబ్జాకు గురైతే, సిట్ తన దర్యాప్తులో కేవలం రూ.2వేల కోట్లుగా తేల్చిందన్నారు. సిట్ నివేదిక ఇచ్చినప్పటికీ ప్రభుత్వం ఇప్పటికీ బహిర్గత పరచకపోవడం సరికాదన్నారు. భూ కుంభకోణంలో దోషులను కాపాడేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. అలాగే వెనుక బడిన ఉత్తరాంధ్రకు ఆర్థిక ప్యాకేజీ, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ వంటి విభజన హామీల కోసం వామపక్షాలు విస్తృత పోరాటాలు చేశాయని గుర్తు చేశారు. ఏజెన్సీలో బాక్సైట్ సహా గనుల తవ్వకాలకు తాము పూర్తి వ్యతిరేకమని ఉద్ఘాటించారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్ నర్శింగరావు, జిల్లా అధ్యక్షుడు గంగారావు పాల్గొన్నారు.
  మాది సంక్షేమ ప్రభుత్వం
  * 111 సంక్షేమ పథకాల అమలు
  * మంత్రి గంటా శ్రీనివాసరావు
  ఆంధ్రభూమి బ్యూరో
  విశాఖపట్నం, జనవరి 11: రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారధ్యంలో సంక్షేమ ప్రభుత్వం పనిచేస్తోందని మానవ వనరులు శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. జన్మభూమి-మావూరు కార్యక్రమంలో భాగంగా జీవీఎంసీ 6వ వార్డు సాగర్‌నగర్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుపేదలు, వివిధ వర్గాల కోసం 111 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనన్నారు. వీటితో పాటు చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లి కానుక, యువనేస్తం, చంద్రన్న సంక్రాంతి కానుకల రూపంలో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నామన్నారు. పట్టణాలు, వార్డుల్లో పలు అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. నిరుపేదలకు ఇళ్లు, గ్రామాల్లో సీసీ రోడ్లు, తారు రోడ్ల నిర్మాణం, ఎల్‌ఈడీ వీధి దీపాలు, మరుగుదొడ్ల నిర్మాణం వంటి పథకాలు నిరంతరం కొనసాగుతున్నాయన్నారు. గ్రామాల్లో అంగన్‌వాడీ భవనాలు, పంచాయితీ భవనాలు, పాఠశాలలకు ప్రహారీ నిర్మాణం, ఆటస్థలాల ఏర్పాటు వంటి వౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్నారు. పట్టణ ప్రాంతాల్లో నిరుపేదలకు ఇళ్లు, ప్రతి ఇంటికీ తాగునీరు, రహదారులు, కాలువలు, మురుగునీటి పారుదల వ్యవస్థ అందుబాటులోకి తెచ్చామన్నారు. నగరాల్లో పచ్చదనాన్ని పెంచడంతో పాటు సబ్సిడీలో రూ.5కే నాణ్యమైన అల్పాహారం, భోజనం అన్న కేంటీన్ల ద్వారా అందుబాటులోకి తెచ్చామన్నారు. నాలుగేళ్ల కాలంలో జీవీఎంసీ పరిధిలోని 4,5,6 వార్డుల్లో రూ.122 కోట్ల విలువైన 781 పనులు చేపట్టామన్నారు. మరో రూ.400 కోట్లతో పనులు చేపడుతున్నామన్నారు. ఈ సందర్భంగా రాబోయే ఐదేళ్లకు సంబందించి చేపట్టబోయే అభివృద్ధి పనులు కార్యాచరణను మంత్రి గంటా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన వార్డులో రూ.3.3 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మహిళలకు పసుపు,కుంకుమ కింద 299 స్వయం సహాయక సంఘాలకు రూ.2.31 కోట్ల బ్యాంకు లింకేజీ చెక్కులను, 30 ఎస్‌హెచ్‌జీలకు రూ.1.1 కోట్ల చెక్కును అందజేశారు. చంద్రన్న బీమా కింద రూ.5 లక్షల చెక్కును వాకాడ మణి అనే మహిళకు అందజేశారు. కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్, వీఎంఆర్‌డీఏ కార్యదర్శి శ్రీనివాస్, జెడ్‌పీ సీఈఓ రమణమూర్తి, జోనల్ కమిషనర్ సన్యాసి నాయుడు తదితరులు పాల్గొన్నారు.
  ముగిసిన జన్మభూమి-మావూరు
  పది రోజుల పాటు జరిగిన 6వ విడత జన్మభూమి-మావూరు కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 925 గ్రామ పంచాయతీలు, 198 మున్సిపల్ వార్డుల్లో గ్రామ సభలు నిర్వహించారు. పది రోజుల పాటు జరిగిన జన్మభూమి గ్రామ సభల సందర్భంగా దాదాపు 33వేల దరఖాస్తులు అందాయి. వీటిలో అత్యధికంగా పింఛన్లు, రేషన్ కార్డుల కోసమే ఉండటం గమనార్హం. జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలు కలిపి 10,500 దరఖాస్తులు పింఛను కోసం అందగా, 8000 దరఖాస్తులు రేషన్ కార్డులు మంజూరు చేయాలంటూ వినతులు ఇచ్చారు. అలాగే పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల మంజూరు కోరుతూ 9500 దరఖాస్తులు అందాయి.

  వణికించే చలిలో బాలల అగచాట్లు
  * మంచు ముసుగులో పాఠశాలలకు పయనం
  పాడేరు, జనవరి 11: విశాఖ మన్యాన్ని వణికిస్తున్న చలి పులి పాఠశాలలకు వెళ్లే బాలలకు తీవ్ర సమస్యగా మారింది. ఈ ప్రాంతంలో వర్షంలా కురుస్తున్న మంచులోనే చలికి వణుకుతూ బాల బాలికలు పాఠశాలలకు వెళుతున్న దృశ్యాలు పలువుర్ని ఆశ్చర్యచకితులను చేస్తోంది. గజగజ వణికిస్తున్న చలికి పెద్దలు సైతం ఇళ్లకు పరిమితవౌతుండగా విద్యాభ్యాసం కోసం బాలలు పడుతున్న పాట్లు ఔరా అనిపించక మానదు. ఏజెన్సీ డివిజనల్ కేంద్రమైన పాడేరులో శుక్రవారం ఉదయం పదకొండు గంటల వరకు కూడా సూర్యభగవానుడి దర్శనం కానరాకపోవడమే కాకుండా రోడ్లన్నీ మంచుతో కప్పబడి చలి వణికించింది. అయితే ఉదయం ఏడున్నర గంటల నుంచే బాలలు పాఠశాలలకు వెళ్లేందుకు సిద్ధమై వాహనాలలో పయనమయ్యారు. పాడేరులోని ప్రముఖ పాఠశాలలైన సెంట్ ఆన్స్ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో దాదాపు పదిహేను వందల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తుండగా వీరంతా చలి బారి నుంచి రక్షణ పొందేందుకు ఉన్ని వస్త్రాలను ధరించి పాఠశాలలకు చేరుకున్నారు. చిన్నారులైన వీరు చలిలో వణుకుతూ పాఠశాలకు వెళుతున్న దృశ్యాలు స్థానికులను అబ్బురపరిచింది. ఇదిలాఉండగా శుక్రవారం ఉదయం పదకొండు గంటల వరకు భానుడి దర్శనం కరువవ్వడంతో పాడేరు పట్టణ ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి.

  నిధులు స్వాహా చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి
  జన్మభూమి సభలో ఎమ్మెల్యే ఈశ్వరి ఆదేశం
  పాడేరు, జనవరి 11: వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో నిధులను స్వాహా చేసిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పాడేరు శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరి ఆదేశించారు. స్థానిక మోదకొండమ్మ అమ్మవారి కల్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన జన్మభూమి ముగింపు సభలో ఆమె మాట్లాడుతూ పాడేరు మండలంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేసుకున్న లబ్ధిదారులకు బిల్లులు చెల్లించకుండా అధికారులు స్వాహా చేసారని చెప్పారు. వ్యక్తిగత మరుగుదొడ్ల బిల్లుల కైంకర్యంలో స్థానిక ఎం.పి.డి.ఒ. హస్తం ఉందని, లబ్ధిదారులకు చెల్లించాల్సిన నిధులను ఆయన తన ఖాతాకు బదలాయించుకుని స్వాహా చేసారని ఆరోపించారు. మండలానికి చెందిన అనేక మంది లబ్ధిదారులకు చెందిన దాదాపు కోటి 50 లక్షల రూపాయలను స్వాహా చేసిన ఎం.పి.డి.ఒ. ఇతర అధికారులపై తాను గతంలోనే పిర్యాదు చేసినా ఇంతవరకు ఎందుకు పట్టించుకోలేదని ఆమె నిలదీసారు. మరుగుదొడ్ల లబ్ధిదారులు నిత్యం తన వద్దకు వస్తూ తమకు న్యాయం చేయాలని కోరుతున్నట్టు ఆమె చెప్పారు. లబ్ధిదారులకు ఇవ్వాల్సిన నిధులను పక్కదారి పట్టించిన ఎం.పి.డి.ఒ. అవినీతి వ్యవహారం వలన ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ఆమె అన్నారు. ఈ విషయమై ఉన్నత అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని స్వాహా చేసిన నిధులను రాబట్టి లబ్ధిదారులకు చెల్లించాలని ఆమె డిమాండ్ చేసారు. అంతేకాకుండా అవినీతి అక్రమాలకు పాల్పడిన పాడేరు ఎం.పి.డి.ఒ.ను జిల్లా పరిషత్‌కు సరెండర్ చేయాలని ఆమె ఆదేశించారు. దీంతో స్పందించిన పాడేరు సబ్ కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ మరుగుదొడ్ల బిల్లుల అవినీతిపై విచారణ జరుగుతుందని, విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలను, గిరిజన గ్రామాలకు చేపట్టిన అభివృద్ధిని వివరించారు. ముఖ్యమంత్రి గత సంవత్సరం ఆగస్టు నెలలో పాడేరు పర్యటనకు వచ్చినప్పుడు గిరిజనులకు అనేక వరాలు ప్రకటించి వాటిని అమలు చేస్తున్నారని ఆమె చెప్పారు. పాడేరు మేజర్ పంచాయతీ ఒక్కటికే 90 కోట్ల రూపాయల నిధులను ముఖ్యమంత్రి మంజూరు చేసినట్టు ఆమె తెలిపారు. పాడేరు పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు మేజర్ పంచాయతీకి 20 కోట్ల రూపాయలను మంజూరు చేయడమే కాకుండా పట్టణ వాసులు ఎదుర్కొంటున్న మంచినీటి ఎద్దడిని నివారించేందుకు, రోడ్ల నిర్మాణానికి కోట్లాది రూపాయల నిధులు విడుదల చేసినట్టు ఆమె వివరించారు. ఈనెల 6వ తేదిన పాడేరులో నిర్వహించిన 5కె రన్‌లో గెలుపొందిన విజేతలకు ఈశ్వరి బహుమతులు ప్రధానం చేసి, గర్భిణీలకు సీమంతాలు చేసారు. కార్యక్రమంలో పాడేరు ఎం.పి.పి. వర్తన ముత్యాలమ్మ, దేశం నాయకులు వంజంగి కాంతమ్మ, అల్లంగి సుబ్బలక్ష్మి, డిప్పల కుమారి, జి.కుమారి, చంద్రమోహన్, నాగరాజు, విజయరాణి, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

  ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూలం
  పాడేరు, జనవరి 11: ప్రభుత్వ ఉద్యోగుల పట్ల తమ ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తుందని స్థానిక ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. స్థానిక అంబేద్కర్ కూడలిలో పది లక్షల రూపాయలతో నిర్మించనున్న ఎన్.జి.ఒ.ల సంఘం భవనానికి ఆమె శుక్రవారం శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ఉద్యోగులు గుర్తించి రానున్న ఎన్నికల్లో ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆమె కోరారు. గిరిజన ప్రాంతంలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్టు ఆమె చెప్పారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి త్వరలోనే చర్యలు తీసుకుంటారని ఈశ్వరి అన్నారు. అనంతరం ఉద్యోగులు ఎమ్మెల్యేను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్.జి.ఒ.ల సంఘం నాయకులు బుక్కా చిట్టిబాబు, సంజీవరావు, కుడుముల కాంతారావు, పలువురు దేశం నాయకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

  సాంప్రదాయ వంటకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి
  కోటవుటర్ల, జనవరి 11: సాంప్రదాయ వంటకాలపై అంగన్‌వాడీ కార్యకర్తలు ప్రజల్లో అవగాహన కల్పించాలని మండల ప్రత్యేకాధికారి డాక్టర్ వి.శ్రీ్ధర్ సూచించారు. స్థానిక ఐసీడీ ఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో మన వూరు మన వంటలు కార్యక్రమాన్ని అంగన్‌వాడీ కార్యకర్తలు నిర్వహించారు . దీనిలో భాగంగా స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సాంప్రదాయ వంటకాల స్టాల్ ఆకట్టుకుంది. ఈస్టాల్‌ను పరిశీలించిన మండల ప్రత్యేకాధికారి, మండల జన్మభూమి కమిటీ కన్వీనర్ లాలం కాశీనాయుడు, ఎడీవో కళ్యాణి, తహశీల్దార్ లక్ష్మి, ఇ ఓ ఆర్‌డీ ప్రభాకర్‌రావులు అంగన్‌వాడీ కార్యకర్తలను ప్రశంసించారు. మండల ప్రత్యేకాధికారి మాట్లాడుతూ మరుగున పడిపోతున్న సాంప్రదాయ వంటకాల ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలన్నారు. మండల జన్మభూమికమిటీ కన్వీనర్ కాశీనాయుడు మాట్లాడుతూ సాంప్రదాయ వంటకాలు వలన ఆరోగ్యానికి హాని ఉండదన్నారు. వంటకాలు తయారు చేసిన అంగన్‌వాడీ కార్యకర్తలకు బహుమతులు అందజేసారు. ఈకార్యక్రమంలో స్థానిక ఐసీడీ ఎస్ పీ ఓ శాంతి ప్రియ, సూపర్‌వైజర్ సత్యశ్రీ, పలువురు అధికారులు పాల్గొన్నారు.

  ప్రయాణీకులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చాలి
  కోటవురట్ల, జనవరి 11: ప్రయాణీకులను సురక్షితంగా గమ్య స్థానానికి చేర్చే బాధ్యత ఆటో డ్రైవర్లపై ఉందని ట్రైనీ ఎస్సై రమేష్ అన్నారు. మండల కేంద్రమైన కోటవురట్లలో శుక్రవారం ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పరిమితి వేగంతో ఆటోలు నడపాలన్నారు. ఆటోల ముందు సీటులో ప్రయాణీకులను ఎక్కించవద్దన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించాలన్నారు.

  విశాఖ డెయిరీని ప్రోత్సహించాలి
  కోటవురట్ల, జనవరి 11: పాడి రైతుల సంక్షేమానికి పాటు పడుతున్న విశాఖ డెయిరీని ప్రోత్సహించాలని మాజీ ఎమ్మెల్సీ డీవీ ఎస్ రాజు విజ్ఞప్తి చేసారు. మండలంలో కైలాసపట్నంలో పాలసొసైటీ పరిధిలో రైతులకు 6.77 లక్షల బోనస్‌ను శుక్రవారం డీవీ ఎస్ రాజు పంపిణీ చేసారు. విశాఖ డెయిరీ పాడి రైతులను కష్టకాలంలో ఆదుకుంటుందన్నారు. లాభాపేక్ష లేకుండా రైతు సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పని చేస్తుందన్నారు. సూపర్‌వైజర్ మూర్తి మాట్లాడుతూ మండలంలో 430 మంది పాడి రైతులకు 68 లక్షల బోనస్‌ను అందించడం జరిగిందన్నారు.

  పోలీసుల విష ప్రచారాన్ని తిప్పికొట్టండి
  కొయ్యూరు, జనవరి 11: పోలీసులు మావోయిస్టు పార్టీపై విష పూరిత ప్రచారాలకు పూనుకుంటున్నారని, వాటిని ప్రజలే తిప్పికొట్టాలంటూ సీపీ ఐ మావోయిస్టు గాలికొండ ఏరియా కమిటీ పేరిట కరపత్రాలు వెలిసాయి. యు.చీడిపాలెం పంచాయతీ మారుమూల పలకజీడి వారపు సంత పరిసరాల్లో శుక్రవారం ఉదయానికి మావోయిస్టుల కరపత్రాలు దర్శనం ఇచ్చాయి. వీటిలో ప్రజలను పోలీసులు బెదిరిస్తూ కొంత మంది కిరాయి గూండాలతో మావోయిస్టులకు వ్యతిరేకంగా ర్యాలీలు చేయిస్తున్నారని ఆరోపించారు. తమపై పోలీసుల విష ప్రచారాన్ని మానుకోవాలని హితవు పలికారు. ఈవిషయమై మంప ఎస్సై శ్రీనివాసరావు స్పందిస్తూ ఇటీవల కాలంలో మావోలకు వ్యతిరేకంగా మండలంలో ఎక్కడా ర్యాలీలు, నిరసనలు చేసిన దాఖాలు లేవన్నారు. తాము కిరాయి గూండాలో ర్యాలీలు చేయించడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజల ఆదరణ కోల్పోతున్న మావోలు కావాలనే పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారన్నారు.

  రెండువేల ఫించన్లుతో పేదల జీవితాల్లో వెలుగులు
  కొయ్యూరు, జనవరి 11: వెయ్యి రూపాయల నుండి రెండువేలకు ఫించన్లును పెంచుతూ పేదల జీవితాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు వెలుగులు నింపారని ఎంపీపీ సత్యనారాయణ పేర్కొన్నారు. మండలంలోని మర్రివాడ, బూదరాళ్ళ, రావణాపల్లిలో జన్మభూమి మావూరు కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజేంద్రపాలెం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఫించన్లు రెండువేలకు పెంచడం చారిత్రాత్మక నిర్ణయం అన్నారు. అన్ని వర్గాల శ్రేయస్సుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అర్హులందరికీ ఫించన్లు , గృహాలు, రుణాలను మంజూరు చేస్తున్న ఘనత చంద్రబాబుదేనని ఎ ఎం సీ చైర్మెన్ చిట్టిబాబు కొనియాడారు. ఈసందర్భంగా నర్సీపట్నం కళాజాత బృందం ప్రభుత్వ పథకాలు అమలు తీరుపై ఆలపించిన గీతాలు వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినీవిద్యార్థులు చేసిన నృత్యాలు అమితంగా ఆకట్టుకున్నాయి. ఈకార్యక్రమాల్లో ఎంపీడీ ఓ రెహమాన్, తహశీల్దార్ రమాదేవి, సీ ఐ ఉదయ్‌కుమార్, ఎంపీటీసీ శివరామరాజు, నేతలు శ్రీరామ్మూర్తి, రామ్మూర్తి, కొయ్యూరు, మంప , కృష్ణాదేవిపేట ఎస్సైలు రుక్మంగధరరావు, శ్రీనివాసరావు, రమేష్, తాజామాజీ సర్పంచ్‌లు కుమారి, ఎం ఇ ఓ బోడంనాయుడు, ఇ ఓ ఆర్‌డీ వరలక్ష్మి పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

  * అలరించిన సంక్రాంతి సంబరాలు
  మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో శుక్రవారం నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అలరించాయి. వివిధ శాఖల సిబ్బంది ,విద్యార్ధినీవిద్యార్థులు వేసిన ముగ్గులు, ఐసీడీ ఎస్ ఆధ్వర్యంలో వండిన వంటలు విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి. గెలుపొందిన వారికి నేతలు బహుమతులు అందజేసారు. రాజేంద్రపాలెం బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మీనాక్షి చేసిన భరతనాట్యం చూపరులను అమితంగా ఆకట్టుకుంది.

  మారుమూల గ్రామాలపై అధికారులు నిర్లక్ష్యం
  కొయ్యూరు, జనవరి 11: బూదరాళ్ళ పంచాయతీ మారుమూల గ్రామాల్లో అభివృద్ది పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని మంప ఎస్సై శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం బూదరాళ్ళ సమావేశంలో స్థానిక మాజీ సర్పంచ్ సూరిబాబు సహా పలు గ్రామాల ప్రజలు సమస్యలపై అధికారులను నిలదీసారు. వాటికి అధికారులు సర్ది చెబుతుండగా ఎస్సై కలుగజేసుకుంటూ తాము పంచాయతీలో అన్ని గ్రామాల్లో తిరిగి అక్కడి పరిస్థితులను పరిశీలించామన్నారు. ఒకరిద్దరు మినహా ఉపాధ్యాయులెవ్వరూ పాఠశాలలకు సక్రమంగా వెళ్ళడం లేదని, ఏ శాఖ అధికారులు పంచాయతీల్లో పర్యటించకపోవడంతో అబివృద్ది పూర్తిగా కుంటుపడుతున్నట్లు గుర్తించామన్నారు. మండల స్థాయి అధికారులు స్పందించి ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందుబాటులో తేవాలని ఆయన కోరారు.
  హిందూ సంప్రదాయానికి ప్రతిక సంక్రాంతి పండుగ
  అందరూ సంతోషంగా పండుగను జరుపుకోవాలి
  ఎమ్మెల్యే పీలా గోవిందు
  అనకాపల్లి టౌన్, జనవరి 11: సంక్రాంతి పండుగను ప్రతీ కుటుంబం సంతోషంగా జరుపుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తుందని స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అన్నారు. స్థానిక జివిఎంసి జోనల్ కార్యాలయంలోప్రభుత్వం అధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను శుక్రవారం నిర్వహిచారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదితులుగా ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, ట్రైనీ కలెక్టర్ దినేష్‌కుమార్‌లు విచ్చేసారు.సంబరాల్లోభాగంగా ఏర్పాటుచేసిన రంగవల్లిక పోటీలను, మహిళలు తయారుచేసిన వివిధ పిండివంటలను తిలకించారు. అక్కడ ఏర్పాటు చేసిన బోగిమంటను ఎమ్మెల్యే పీలా వెలిగించారు. ఈ సందర్బంగాట్రైనీ కలెక్టర్ దినేష్‌కుమార్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అంటే భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతుందన్నారు. ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ పేద ప్రజలు సంతోషంగా పండుగ జరుపుకోవాలని సంక్రాంతి చంద్రన్న కానుకలు అందజేస్తుందన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకొని అభివృద్ది చెందాలన్న లక్ష్యంగాప్రభుత్వం పనిచేస్తుందన్నారు. విశాఖ దీటుగా అనకాపల్లిపట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేయడానికి ఇప్పటికే కోట్లాది రూపాయలు మంజూరుచేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలోవివిధ శాఖల అధికారులు, దేశం పార్టీ నాయుకులు పాల్గొన్నారు.

  వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయానికి కార్యకర్తలు కృషి చేయాలి
  పట్టణ అధ్యక్షులు మందపాటి జానకిరామరాజు
  అనకాపల్లిటౌన్, జనవరి 11: వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిర్వహించిన ప్రజాసంకల్పయాత్ర రాష్టవ్య్రాప్తంగా నిర్వహించి విజయవంతంగా పూర్తిచేసిన నేపధ్యంలో వచ్చేఎన్నికల్లో వైసీపీ విజయానికి శుభ సూచికమని వైసీపీ పట్టణ అధ్యక్షులు మందపాటి జానకిరామరాజు అన్నారు. ఇక్కడి రింగురోడ్డులో గల పార్టీ కార్యాలయంలో శుక్రవారం పట్టణ పరిధిలో ఉన్న కార్యాకర్తలు, నాయుకులుతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సుమారుగా 14నెలలుపాటు 3680కిలో మీటర్లు వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర పెరిట పాదయాత్ర నిర్వహించి ప్రజలు సమస్యలు తెలుసుకున్నారన్నారు. జగన్ రూపోందించిన నవరత్నాలు ప్రజలు వద్దకు వివరించి ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టి వచ్చే ఎన్నికల్లో వైసీపీని బలోపేతం చేయాలన్నారు. ఈనెల 22న వైసీపీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్‌నాధ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్టీ కార్యాలయం వద్ద భారీ రక్తదాన శిబిరంతోపాటు వృద్దులకు చీరలు తదితర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో పట్టణ ప్రధాన కార్యదర్శి సూరిశెట్టి రమణ అప్పారావు, మాజీ కౌన్సిలర్ కొణతాల మొరళీకృష్ణ, పట్టణ విభాగ అధ్యక్షులు జాజుల రమేష్, మహిళా విభాగ అధ్యక్షురాలు ఏవి రత్నకుమారి, కుండల రామకృష్ణ, పి మొరళీ, బి శివ, అధిక సంఖ్యలోకార్యకర్తలు పాల్గొన్నారు.
  పెన్షన్లు అందుకుంటున్న తల్లులకు పెద్దకొడుకుగా చంద్రబాబు
  కశింకోట, జనవరి 11: పెన్షన్లు అందుకుంటున్న ప్రతి తల్లి తనపెద్ద కొడుకుగా చంద్రబాబునాయుడును చూసుకుంటున్నారని స్థానిక ఎమ్మెల్యే పీలాగోవిందసత్యనారాయణ పేర్కొన్నారు. మండలంలోని కొత్తపల్లి, చింతలపాలెం గ్రామాల్లో జన్మభూమి కార్యక్రమాలు శుక్రవారం జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పీలా కొత్తపల్లి గ్రామంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతిఇంటిలో ఒక్కరైనా ఏదో ఒక లబ్దిపొందినవారే ఉన్నారన్నారు. వృద్దులు, వికలాంగులకు, ఒంటరి మహిళకు ప్రతిఒక్కరికీ పెన్షన్లు మంజూరు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ప్రతిగ్రామంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన థ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఇసిఎస్ చైర్మన్ మలసాల రమణారావు, ఎంపిపి పంచదార్ల లక్ష్మీ, కొత్తపల్లి, చింతపల్లి మాజీ సర్పంచ్‌లు బుదిరెడ్డి గంగునాయుడు, కర్రి దుర్గునాయుడు అనకాపల్లి మార్కెట్‌కమిటి చైర్మన్ కాయల మురళీధర్, కరకారాజు, వివిధశాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

  ప్రభుత్వ పాఠశాలల్లో సంక్రాంతి సంబరాలు
  కశింకోట, జనవరి 11: స్థానిక జిల్లాపరిషత్ హైస్కూల్‌లో ఉపాధ్యాయులు, విద్యార్థులు సంక్రాంతి సంబరాలను శుక్రవారం ప్రారంభించారు. సంక్రాంతి నమూనాగా విద్యార్థులను ఏర్పాటు చేసి, బోగిపండగను నిర్వహించారు. సంక్రాంతి సంబరాలను పురష్కరించుకుని హరిదాసు వేషధారణ, కొమ్మదాసరి వేషాలు, గాలిపటాలు ఎగురవేత, భోగిమంటలు, జానపదపాటలు, విచిత్ర వేషధారణ కార్యక్రమాలు నిర్వహించారు. వ్యాయమ ఉపాధ్యాయులు టి గోపినాధ్ ఆధ్వర్యంలో సంక్రాంతికి విద్యార్థులు అక్షర రూపాన్ని ఇచ్చారు. జన్మభూమిని పురష్కరించుకుని డ్రాయింగ్, వ్యాసరచన పోటీల విజేతలకు ప్రధానోపాధ్యాయులు శ్రీ్ధర్‌రెడ్డి బహుమహుతులు అందజేసారు. సంక్రాంతి పేరును విద్యార్థులు చైన్‌లింక్‌తో ఏర్పడిన విన్యాసంను గ్రామప్రజలు, పాఠశాల ఉపాధ్యాయులు ప్రత్యేక అభినందనలు తెలియజేసారు.
  చంద్రబాబు పథకాలను అనర్గళంగా వల్లివేసిన బాలికను అభినందించిన కలెక్టర్ ప్రవీణ్‌కుమార్
  * ముఖ్య మంత్రి విశాఖ వస్తేఆయనకు అనితను పరిచయం చేస్తానన్న కలెక్టర్ *
  సబ్బవరం, జనవరి 11 : 2014 తర్వాత అధికారంలోకి వచ్చిన నాటి నుండి తెలుగుదేశం పార్టీ ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన ప్రజాసంక్షేమ పథకాలను పూసగుచ్చినట్లు సభలోమాట్లాడి స్వయంగా జిల్లాకలెక్టరు ప్రవీణ్‌కుమార్ ప్రశంసలు పొందింది బోదువలసకు చెందిన 3వ తరగతి బాలిక అనిత (7). దీంతో సభకు హాజరయిన పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి వేదిక పై ఉన్న ప్రభుత్వ అధికారులు,ప్రజలు అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళ్తే సబ్బవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన జన్మభూమి- మా ఊరు కార్యక్రమానికి జిల్లాకలెక్టరు ప్రవీణ్‌కుమార్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అయితే ఆలస్యంగా వచ్చిన కలెక్టరుకు ఎమ్మెల్యే బండారు సిఫార్సు చేస్తూ బోదువలసకు చెందిన ప్రభుత్వ స్కూలు విద్యార్థి అనిత (7) ప్రభుత్వ పథకాలను సవివరంగా చెబుతుందని వినాలని అన్నారు. దీంతో కలెక్టరు ఎంతో ఆసక్తిగా ఆమె ప్రసంగాన్ని విన్నారు. ఆ బాలిక ఎక్కడా తడబాటు లేకుండా ప్రభుత్వ పథకాలు,సీఎం చంద్రబాబు హయాంలో విశాఖకు వచ్చిన ప్రాజెక్ట్‌లు వాటి విలువ, ప్రపంచ దేశాలతోకుదిరిన ఒప్పందాలతోసహా అభివృద్థిని పూస గుచ్చినట్లు తన ప్రసంగంలో ప్రజెంట్ చేసింది. దీంతో ఆశ్చర్యపోయిన కలెక్టరు,ఎమ్మెల్యేలు ఆ బాలిక తల్లిదండ్రులతో సహా వేదిక పైకి పిలిచి ఘనంగా సత్కరించారు. ఈసందర్భంగా జిల్లాకలెక్టర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ ఇంత విపులంగా పథకాలు చెప్పలేకపోతున్నారని ప్రశంసించారు. అంతేకాకుండా ఈ బాలిక ప్రసంగం తనకు ఎంతో ఆసక్తిరేకెత్తించిందని త్వరలో సీఎం చంద్రబాబు విశాఖకు వస్తే తప్పని సరిగా బాలికను పరిచయం చేసి ఆయన సమక్షంలో ప్రసంగించే చర్యలు తీసుకుంటానన్నారు. ఆ పాఠశాల ఉపాధ్యాయులను ఆయన అభినందించారు.
  జిల్లాలో రూ.1000 కోట్లతోజలధార పథకం పనులు ప్రారంభం
  *సబ్బవరం జన్మభూమి- మా ఊరు సభలోకలెక్టర్ ప్రవీణ్‌కుమార్ స్పష్టం *
  సబ్బవరం, జనవరి 11 : విశాఖ జిల్లాలో వెయ్యికోట్లరూపాయల నిధులతో జలధార పథకం మొదటి దశ పనులు ప్రారంభిస్తున్నామని జిల్లాకలెక్టరు ప్రవీణ్‌కుమార్ అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో శుక్రవారం ఏర్పాటు చేసిన జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దశల వారీగా ఈ పథకాన్ని గ్రామీణ జిల్లాకు విస్తరిస్తామన్నారు. అలాగే విశాఖ సిటీకి అనుబంధంగాఉన్న సబ్బవరం,పెందుర్తి,లంకెలపాలెం ప్రాంతాలను భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఎపి టిట్కోనిధులతో అధునాతన గృహాలు నిర్మిస్తామన్నారు. జీ-్ఫ్లస్ త్రీ గానిర్మించే పక్కాగృహాలు అవసరం ఎంతో ఉందన్నారు. ఈ గృహాల నిర్మాణాల కోసం అవసరమైన ప్రభుత్వ భూమిని ఎవరు ఆక్రమించుకున్నా ఖాళీ చేయించి నిర్మాణాలు చేపడతామన్నారు. ఇళ్ళ స్థలాలు లేని వారికోసం స్థలాలు సేకరించి మరీ పక్కాగృహాలు నిర్మించాలనేది సీఎం చంద్రబాబు ఆలోచనగా ఉందన్నారు. జర్నలిస్టులకు జిల్లాలో 2000 టిట్కోగృహాలను నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించామని ఆయన ప్రకటించారు. 2014 తర్వాత జరిగిన రాష్ట్రప్రభుత్వ అభివృద్థిపథకాలపై వివరాలను ఫ్లెక్సీల రూపంలో ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు. జాతీయ రహదారి కి ఆనుకుని ఉన్న సబ్బవరం మండలం భవిష్యత్‌లో ఎంతో కీలకంగా మారుతుందన్నారు. సాధికార సర్వేలో కొన్ని తప్పులు దొర్లాయని కొందరి పేర్లు మాయం కావటంపై మళ్ళీ మీ-సేవా కేంద్రాల ద్వారా ఆ సర్వేకు అవకాశం కల్పించటం జరిగిందన్నారు. జిల్లాలో 1115 పంచాయతీల్లో జన్మభూమి కార్యక్రమం చివరిరోజున పండగ వాతావరణంలో జరుపుకోవటం అభినందనీయమన్నారు. ప్రజలకు సమస్యలు దాదాపు పరిష్కారమయినట్లేనని సర్వేలు చెబుతున్నాయన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ జిల్లాతోపాటు తన నియోజకవర్గం అభివృద్థికి ఎంతో సహకరించిన కలెక్టర్ మరో 46 కోట్లరూపాయల నిధులు మంజూరు చేస్తే రైవాడ జలాశయం నీటిని సబ్బవరం తాగునీటి అవసరాలకు తరలిస్తామన్నారు. 17వేల జనాభాకలిగిన సబ్బవరం మేజరు పంచాయతీలో 24.60కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజి నిర్మిస్తున్నామని, ఎపి టిట్కో నిధులు మంజూరు చేస్తే పక్కాగృహాల సమస్య శతశాతం పూర్తవుతుందన్నారు. పలుపాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను కలెక్టరు ఎమ్మెల్యేలు ఓపిగ్గాతిలకించారు. డ్వాక్రా సంఘాలకు స్ర్తినిధి రుణాలు, రైతురథాలు,కొత్తపింఛన్లను పంపిణీ చేశారు. సభలోపెందుర్తి అసెంబ్లీప్రత్యేక అధికారి దయానిధి, మండల ప్రత్యేక అధికారి కెఎస్ శాస్ర్తీ, తహశీల్దారు పైల రామారావు,ఎంపీడీవో బి.రమేష్‌నాయుడు,టీడీపీ నేతలు గండి దేముడు,ఎస్‌వివి శంకరరావు,గండి ముత్యాలనాయుడు,మిడితాడ మహలక్ష్మినాయుడు, కొటాన అప్పారావు, అక్కిరెడ్డిదుర్గినాయుడు, భరిణికాన సాయినాధరావు,కోరాడ శ్రీను,పల్లాతాతారావులు పాల్గొన్నారు.
  పేదల బతుకుల్లో పండగ వాతావరణం కల్పించిన ఘనత చంద్రబాబుదే
  సబ్బవరం, జనవరి 11 : రాష్ట్రంలో పేదల బతుకుల్లో పండగ వాతావరణం కల్పించిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. శుక్రవారం మండలంలోని పైడివాడ అగ్రహారం లోనిర్వహించిన జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుపేదలనే వారే లేకుండా చేయాలనే లక్ష్యంతో అర్హులకు రేషన్ కార్డులు,పింఛన్లు, పక్కాగృహాలు,ఒంటరి మహిళలకు ప్రోత్సాహాక పింఛన్ల అమలు, చంద్రన్న బీమా,పెళ్ళికానుక,సంక్రాంతి కానుక,రంజాన్ తోఫాలాంటి అనేక పథకాలు అమలు చేస్తున్న విషయాలను ఆయన గుర్తుచేసుకున్నారు. తన నియోజకవర్గం పరిధిలో నిరుపేదలకు పక్కాగృహాలు నిర్మించటం జరుగుతుందన్నారు. తాను గత సారి ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో పంచగ్రామాల సమస్య తప్ప అన్ని నెరవేర్చానన్నారు. మట్టిరోడ్లులేని మండలాలు, జీవీఎంసీ వార్డులను అభివృద్థి చేశానన్నారు. ఇదే పంచాయతీ పరిధిలో ఎన్టీఆర్ పక్కాగృహాల కాలనీలను సకాలంలో నిర్మించి మండలంలోనే మొదటి స్థానంలో నిలిచారని ఎంపీటీసీ అక్కిరెడ్డిరామలక్ష్మిదుర్గినాయుడు,మాజీ సర్పంచు దాసరి వెంకట రమణలను అభినందించారు. ఈకార్యక్రమంలో టీడీపీ నేతలు భరిణికాన సాయినాధరావు, గండి దేముడు,కొటాన అప్పారావు, కరణం రామనాయుడు ,ఎస్ వివి శంకరరావు,తహశీల్దారు పైల రామారావు,ఈవోపీఆర్డీసూర్యనారాయణ, ఎవో శ్రీ దేవిలు పాల్గొన్నారు.
  సంక్రాంతి సంప్రదాయాల్ని ప్రతిబింభించిన విద్యార్థులు
  సబ్బవరం, జనవరి 11 : స్థానిక చలపతి పబ్లిక్ స్కూలు విద్యార్థులు సంక్రాంతి సంబరాలను శుక్రవారం ఆ పాఠశాల ఆవరణంలోనే వైభవంగా జరుపుకున్నారు. ఈసందర్భంగా సంక్రాంతి సంప్రదాయం ఉట్టిపడేలాగ హరిధాసు,కొమ్మదాసరులు,గంగిరెద్దులవాళ్ళు ,బొమ్మల కొలువులు లాంటివి ఏర్పాటు చేసి విచిత్ర వేషధారణలతో ఆకట్టుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్న ఆకార్యక్రమంలో ప్రిన్సిపాల్ బి.కుమారస్వామి, ఉదయభాస్కర్,తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

  పేదోడికి పట్టెడన్నం పెట్టేందుకే అన్న క్యాంటీన్లు
  * గ్రామీణ ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు
  * మంత్రి అయ్యన్నపాత్రుడు
  నర్సీపట్నం, జనవరి 11: పేదవాడికి పట్టెడన్నం పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ప్రారంభించారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. నియోజకవర్గ కేంద్రానికే పరిమితమైన అన్న క్యాంటీన్లను గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. శుక్రవారం స్థానిక ఏరియా ఆసుపత్రికి సమీపంలో అన్న క్యాంటీన్‌ను మంత్రి అయ్యన్న ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 24 అన్న క్యాంటీన్లను ప్రారంభించామన్నారు. అన్న క్యాంటీన్ల వలన ఆసుపత్రికి, ప్రభుత్వ కార్యాలయ పనులపై వచ్చే పేదవారికి అల్పాహారం, భోజనం అందు


  0 0

  కొవ్వూరు, జనవరి 11: కొవ్వూరు నియోజకవర్గంలో కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల వారికి కార్పొరేషన్లు ఏర్పాటుచేసి నిరుపేద ప్రజలను ఆర్థికంగా ఆదుకుంటున్నట్టు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక 23వ వార్డులో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. కొవ్వూరు పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 16వేల గ్రామాల్లో జన్మభూమి కార్యక్రమాలు, గ్రామ సభలు నిర్వహించినట్టు తెలిపారు. గోదావరి ఉత్సవాలను ఈ నెల 19, 20 తేదీల్లో కొవ్వూరులో నిర్వహించనున్నట్టు చెప్పారు. కొవ్వూరు నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న నియోజకవర్గ సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ఈ నెల 12వ తేదీ శనివారం స్థానిక సంస్కృతోన్నత పాఠశాలలో మధ్యాహ్నం 2నుంచి 6 గంటల వరకూ ఈ సంబరాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో వై సత్యనారాయణరావు, మున్సిపల్ ఛైర్‌పర్సన్ జె రాధారాణి, వైస్ ఛైర్మన్ జి రాజారమేష్, కమిషనర్ టి నాగేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.

  జన్మభూమిలో వైసీపీ, సీపీఎం నేతల ఆందోళన
  ఆకివీడు, జనవరి 11: ఆకివీడులో శుక్రవారం జరిగిన జన్మభూమి సభలో వైసీపీ, సీపీఎం నాయకులు ఇళ్లస్థలాల పంపిణీ తదితర సమస్యలపై ఆందోళన నిర్వహించారు. సభలో తొలుత అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్న ఎంపీడీవో ప్రభాకర్‌రావుపై వైసీపీ, సీపీఎం నాయకులు విరుచుకుపడ్డారు. తెలుగుదేశం కార్యకర్త మాదిరి అభివృద్ది కార్యక్రమాలు చెబుతారా అంటూ మండిపడ్డారు. ఆందోళనకారుల విమర్శలతో సభాస్థలి ప్రాంతం మార్మోగింది. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శివరామరాజును సమస్యలపై నిలదీసే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే తన ప్రసంగమైన తరువాత మళ్లీ నాయకులు తమ ఆందోళన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అయితే ఎమ్మెల్యే శివరామరాజు మాట్లాడుతూ ప్రసంగాలు వద్దు సమస్యలు ఉంటే వినతిపత్రం ఇవ్వండని సూచించారు. సమస్యలకోసం జన్మభూమి కార్యక్రమానికి వస్తే సమస్యలు వినరా అంటూ వైసీపీ, సీపీఎం నాయకులు ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. నాయకులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ముగించుకుని వెళ్లిపోయారు.
  టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట
  టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య శుక్రవారం జరిగిన జన్మభూమి కార్యక్రమం అనంతరం తోపులాట జరిగింది. టీడీపీ నాయకులుపై వైసీపీ కార్యకర్తలు చేసిన వ్యాఖ్యలతో కొద్దిసేపు గందరగోళం జరిగింది. టీడీపీ నాయకులు, వైసీపీ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలవారిని వారించి పంపించి వేశారు.

  జన్మభూమి విజయవంతం
  వీరవాసరం, జనవరి 11: సంక్రాంతి సంబరాల్లో భాగమే కోడి పందాలని నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. జన్మభూమి ఆరవ విడత కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వీరవాసరం మండలం నందమూరి గరువు గ్రామంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సంక్రాంతి ఉత్సవాలు ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కొనసాగుతాయన్నారు. ప్రజలు ఎంతో ఉత్సాహంగా చేసుకునే పండుగల్లో ప్రభుత్వం కానీ, ఇతరుల జోక్యం కానీ ఎప్పుడూ ఉండదన్నారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తోందన్నారు. సంక్రాంతి సందర్భంగా సాంప్రదాయకంగా నిర్వహించుకునే భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల నృత్యాలు, కోడి పందాలు తదితర వాటితో ప్రజలంతా సంతోషంగా ఉంటారన్నారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ ఈ నెల 2నుంచి ప్రారంభమైన జన్మభూమి కార్యక్రమం విజయవంతమైందన్నారు. ప్రత్యేక శ్రద్ధ వహించి జన్మభూమి కార్యక్రమాలను విజయవంతం చేసిన అధికారులను ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశంసించారు. ప్రజలంతా గత అయిదు సంవత్సరాలుగా టీడీపీ ఆధ్వర్యంలో చేసిన అభివృద్ధి పనులను చూసి తిరిగి తమ పార్టీని గెలిపించాల్సిందిగా ఆయన కోరారు. అనంతరం నందమూరి గరువు గ్రామస్థులు ఎమ్మెల్యే రామాంజనేయులను, రఘురామకృష్ణంరాజులను ఘనంగా సత్కరించారు. తొలుత ఎమ్మెల్యే రామాంజనేయులు, రఘురామకృష్ణంరాజులు భోగి మంటను వెలిగించారు. కార్యక్రమాల్లో తహసీల్దార్ ఎం ముక్కంటి, ఎంపీడీవో స్వాతి, టీడీపీ నేతలు పోలిశెట్టి దాసు, పంజా రామచంద్రయ్య, ఆకుల బాలరాజు, గొలగాని సత్యనారాయణ, నూకల అప్పాజీ, గెడ్డం భాస్కరరావు, పంజా సురేష్, పాలా వెంకటేశ్వరరావు, వీరవల్లి చంద్రశేఖర్, మేకల కొండలరావు, ఎ చిరంజీవిరావు, రొంగల కృష్ణవేణి, నక్కెళ్ల అప్పారావు, ఆదిరెడ్డి గంగారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

  కోడి పందాలు సంక్రాంతి సంబరాల్లో భాగమే
  వీరవాసరం, జనవరి 11: తెలుగువారి సంస్కృతీ, సంప్రదాయాల్లో భాగమే కోడి పందాలని నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. శుక్రవారం నందమూరి గరువు గ్రామంలో జన్మభూమి కార్యక్రమానికి విచ్చేసిన ఆయన కోడి పందాలను లాంఛనంగా ప్రారంభించారు. రఘురామకృష్ణంరాజు ఈ పోటీలను ప్రారంభించటంతో అక్కడకు చేరుకున్న టీడీపీ నేతలు, అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ కోడి పుంజులకు కత్తులు కట్టకుండా పందాలు నిర్వహించుకోవచ్చునన్నారు. ఇది తెలుగువారి సాంప్రదాయంలో ఒక భాగమేనని అన్నారు. రఘురామకృష్ణంరాజు పందాలు ప్రారంభించే సమయానికి భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పెర్కిపాలెం గ్రామంలో నిర్వహించిన జన్మభూమి గ్రామ సభలో ఉన్నారు. పందాలు నిర్వహిస్తున్నట్టు మండలంలోని ప్రజలకు తెలియటంతో సభ వద్దకు భారీగా తరలివచ్చారు.

  కోడిపందాల నిర్వాహణకు ముమ్మర యత్నం
  తాళ్లపూడి, జనవరి 11: సంక్రాంతి నేపథ్యంలో కోడి పందాలు, జూదాలపై నిషేధం ప్రకటిస్తూ హైకోర్టు ఉత్తర్వులను అమలు చేసేందుకు పోలీసు శాఖ ఒక వైపు ప్రచారం నిర్వహిస్తుంటే..కోడి పందాల్లేని సంక్రాంతి పండుగే ఉండదంటూ నిర్వాహకులు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే గత సంవత్సర సమాచారంతో కోడి పందాల బరులు వద్ద వివిధ గ్రామాల్లోను, అటు రెవెన్యూ ఇటు పోలీసు శాఖలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తాజాగా శుక్రవారం తాళ్లపూడి పోలీసు శాఖ ఆటో ద్వారా కోడి పందాలపై నిషేధం ఉందంటూ ప్రచారం చేసింది. ఇదిలా ఉంటే..అధికారుల దృష్టి మళ్లించేందుకు నిర్వాహకులు కోడి పందాల స్థానే ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామంటూ ఫ్లెక్సీలను కోడి పందాల బరుల వద్దే ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా తాళ్లపూడి మండలంలో సుమారు ఏడు ప్రాంతాల్లో కోడి పందాలు నిర్వహించే పరిస్థితి ఉండగా, ఆయా ఏర్పాట్లలో నిర్వాహకులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసు అధికారులను, ఇతర అధికారులను కలిసి ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన ప్రయత్నాలు చేస్తున్నారు.

  ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి
  - ఐటీడీఏ పీవో హరీంద్రియ ప్రసాద్
  వేలేరుపాడు, జనవరి 11: ప్రజా శ్రేయస్సుకై ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలను అర్హులైన వారంతా సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ పీవో హరీంద్రియ ప్రసాద్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జన్మభూమి- మా ఊరు, సంక్రాంతి సంబరాలు, ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో పీవో ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. వేలేరుపాడు మండలంలోని తొమ్మిది గ్రామ పంచాయతీల్లో జన్మభూమి కార్యక్రమం శుక్రవారంతో ముగిశాయి. దీంతో స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా పీవో హరీంద్రియ ప్రసాద్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు వారి వారి జీవనోపాధికి అనుగుణంగా చేయూత పథకాలు అందిస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగానే అర్హులైన వారికి వివిధ రకాల పెన్షన్లు, రేషన్ కార్డులు తదితర వాటిని తక్షణమే మంజూరు చేయటమే జన్మభూమి ప్రధాన ఉద్దేశ్యమన్నారు. జన్మభూమి కార్యక్రమాల్లో నిర్వహించిన పలు రకాల ఆట పాట పోటీల్లో విజేతలైన విద్యార్థినీ విద్యార్థులకు, ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు. అర్జీలు పెట్టుకుని అర్హులుగా గుర్తింపబడిన వారికి మంజూరు అర్హత పత్రాలను ఈ కార్యక్రమంలో అందజేశారు. ఇంకా ఎవరైనా సమయానికి హాజరు కాలేకపోయిన వారు తమ వినతులను స్థానిక మండల అధికారులకు అందజేయవచ్చునన్నారు.

  చెత్త రహిత పట్టణంగా ‘్భమవరం’
  * కౌన్సిల్ సమావేశంలో కమిషనర్ నాగనరసింహారావు ప్రకటన
  భీమవరం, జనవరి 11: చెత్త రహిత పట్టణంగా భీమవరం రూపాంతరం చెందిందని మున్సిపల్ కమిషనర్ సీహెచ్ నాగనరసింహారావు ప్రకటించారు. స్వచ్ఛ సర్వేక్షణ్-2019లో భాగంగా స్టార్ రేటింగ్ పద్ధతిని అనుసరించి చేసిన పని ఆధారంగా గార్బెన్ ఫ్రీ సిటీగా నోటిఫై చేయడం జరిగిందన్నారు. శుక్రవారం భీమవరం మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశాన్ని కౌన్సిల్ హాల్లో చైర్మన్ కొటికలపూడి గోవిందరావు అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కౌన్సిల్ సభ్యులు యధావిధిగా సమస్యలను విన్నవించారు. వాటికి చైర్మన్ వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ సీహెచ్ నాగనరసింహారావు మాట్లాడుతూ పురపాలక సంఘం పరిధిలో ఉత్పత్తి అవుతున్న చెత్తను ఇంటింటికీ వెళ్లి సేకరించడం నుంచి పని ప్రారంభించడం జరిగిందన్నారు. ఆ తరువాత తడిచెత్త, పొడిచెత్తను వేరు చేసి సేకరించామని, పబ్లిక్, కమర్షియల్, రెసిడెన్షియల్ ఏరియాలుగా విభజన చేసి రోజువారి స్వీపింగ్ నిర్వహించామన్నారు. వీటితోపాటు పట్టణంలో చెత్తను ఎక్కువగా ఉత్పత్తిచేసే ఇళ్ల సముదాయాలను, వ్యాపార సంస్థలను గుర్తించి వారికి యూజర్ ఛార్జీలను కూడా వసూలు చేసినట్లు కమిషనర్ నాగనరసింహారావు కౌన్సిల్ సభ్యులకు వివరించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్తవేసే వారి నుంచి 40 మైక్రాన్లుల కన్నా తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్‌ను వినియోగించే వారి నుంచి స్పాట్ ఫైన్స్ వసూలు చేసినట్లు చెప్పారు. పురపాలక సంఘానికి వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందించి వాటిని పరిష్కరించడం, సిటిజన్ ఫీడ్ బ్యాక్ సిస్టం ద్వారా మంచి ఫలితాలు రాబట్టామన్నారు. డ్రైయిన్లలోని సిల్టు తొలగించడం తదితర కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం జరిగిందని, ఇప్పుడు పట్టణంలో చెత్తను వేయాలనుకుంటే మున్సిపాల్టీ ఏర్పాటుచేసిన డస్ట్‌బిన్లలో మాత్రమే వేయడం జరుగుతోందని, రహదారులపై చెత్తవేసే సాహసం ఎవరూ చేయడం లేదన్నారు. దీనికి మున్సిపల్ కౌన్సిలర్లు కమిషనర్ నాగనరసింహారావును అభినందించారు. కష్టపడి పనిచేసిన వారికి ప్రజల్లో ఎప్పుడూ మంచి గుర్తింపు ఉంటుందని ఛైర్మన్ వ్యాఖ్యానించారు.

  కోడి పందేలు నిర్వహిస్తే చర్యలు తప్పవు
  * వెంప గ్రామసభలో డీఎస్పీ
  భీమవరం, జనవరి 11: సంప్రదాయంగా జరుపుకునే సంక్రాంతి పండుగ ముసుగులో కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని నరసాపురం డీఎస్పీ టి ప్రభాకర్‌బాబు, భీమవరం తహసీల్దార్ చవాకుల ప్రసాద్ పందాల రాయుళ్లను హెచ్చరించారు. భీమవరం మండలం వెంప గ్రామంలోని గ్రామప్రజలతో కలిసి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేశారు. గ్రామంలోని అభివృద్ధి కమిటీతోపాటు గ్రామ ప్రజలు, పెద్దలు తదితరులు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి డీఎస్పీ మాట్లాడుతూ వెంప గ్రామం పేరు భారతదేశం అంతటా చాలా ఎక్కువగా వినపడుతుందన్నారు. ఇందుకు కారణం ఇక్కడ కోడిపందేలు జరపడమేనన్నారు. దీంతో ఈ పందేల పేరుతో జూదం జరుగుతోందని అనేక విమర్శలు వినపడుతున్నాయన్నారు. చివరకు ఈ విషయంలో కొందరు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించడం జరిగిందని వివరించారు. ఈ నేపధ్యంలో గ్రామంలో స్నేహ పూరిత వాతావరణం రావాలని, ఇందుకోసం పదేపదే గ్రామంలో సమావేశాలు ఏర్పాటుచేస్తున్నట్లు వెల్లడించారు. తహసీల్దార్ చవాకుల ప్రసాద్ మాట్లాడుతూ పండుగను చేసుకోవద్దని మేమెవ్వరూ చెప్పడం లేదని, సంక్రాంతి పండుగను కన్నుల పండువగా జరుపుకోవాలని, కాని ఆ పండుగ మాటున జూదం ఆడవద్దని హితవుపలికారు. భీమవరం రూరల్, నరసాపురం రూరల్ పోలీసు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి చేత జూదానికి దూరంగ ఉంటామని తహసీల్దార్ ప్రసాద్ ప్రతిజ్ఞ చేయించారు.

  వచ్చే నెల నుండి పేదలకు రెట్టింపు పెన్షన్
  జన్మభూమిలో ఎమ్మెల్యే పీతల సుజాత
  జంగారెడ్డిగూడెం, జనవరి 11: వచ్చే నెల నుండి పేదలకు ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లను రెట్టింపు చేసి రూ.2వేలు ఇవ్వనున్నట్టు మాజీ మంత్రి, ఎమ్మెల్యే పీతల సుజాత వెల్లడించారు. పట్టణంలోని 19వ వార్డు జన్మభూమి-మావూరు కార్యక్రమం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే సుజాత మాట్లాడుతూ ఫిబ్రవరి నెల నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెయ్యి రూపాయల పెన్షన్‌ను రూ.2వేలకు పెంచి ఇవ్వనున్నట్టు తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మొదటి నెల మూడు వేలు ఇవ్వనున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతూనే ప్రజలకు ఇంకా ఏమేమి చేస్తే సంతోషంగా ఉంటారో అవన్నీ చేయడానికి చిత్తశుద్ధితో పని చేస్తున్నారని చెప్పారు. రూ.2వేల పింఛన్లతో పాటు ప్రతి ఇంటికి స్మార్ట్ ఫోన్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి తగిన ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. ఎన్ని కష్టాలొచ్చినా ఇచ్చిన మాట తప్పని నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజలు మాకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నామని ఎమ్మెల్యే సంతోషంగా చెప్పారు. పట్టణంలో నాలుగున్నరేళ్లల్లో వందల కోట్ల నిధులతో అభివృద్ధి చేసినట్టు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్టు చెప్పారు. 19వ వార్డులో రూ.5.10 కోట్ల నిధులతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేసినట్టు తెలిపారు. ఇంకా ఎవరికైనా అర్హత ఉండి ఏదైనా సంక్షేమ పథకం అందకపోతే స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాలని కోరారు. పట్టణ ప్రాంతంలో మెప్మా ద్వారా మహిళలకు అందించే సంక్షేమ పథకాలను మెప్మా అధికారులు ప్రజల్లోకి సరిగా తీసుకువెళ్ళడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వెలుగు అధికారుల్లో ఉన్న చురుకుతనం మెప్మా అధికారుల్లో లేదని, ఇకనుంచైనా వారి పద్ధతి మార్చుకోవాలని సూచించారు. పది రోజుల పాటు నిర్వహించిన జన్మభూమి-మావూరు కార్యక్రమంలో అనేకమంది ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించారని, వాటన్నిటినీ పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులను జన్మభూమి-మావూరు సక్రమంగా నిర్వహించినందుకు అభినందించారు. వారికి ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు ఈ కార్యక్రమంలో అందజేసారు. పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని గెలుపొందిన విద్యార్థులకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు ఎమ్మెల్యే అందజేశారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సీమంతాలు కార్యక్రమంలో గర్భిణులను ఆశీర్వదించి నూతన వస్త్రాలు, పౌష్టికాహారం అందించారు. చిన్నారులకు అన్నప్రాశనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ బంగారు శివలక్ష్మి, కమిషనర్ ఎజె మాథ్యూ, టౌన్ ప్లానింగ్ అధికారి ఎ లక్ష్మీనారాయణ, టీడీపీ పట్టణ కార్యదర్శి చెరుకూరి శ్రీ్ధర్, కౌన్సిలర్లు బొబ్బర రాజ్‌పాల్‌కుమార్, తూటికుంట దుర్గారావు, టీఎన్‌ఎస్‌ఎఫ్ జాతీయ సమన్వయ కమిటీ సభ్యులు దాసరి శ్యామ్‌చంద్రశేషు, టీడీపీ నేతలు గుమ్మడి వెంకటేశ్వరరావు, చేను ప్రసాద్, పలువురు అధికారులు పాల్గొన్నారు.

  ఆరుపదుల వయస్సులో డిగ్రీ
  ఆదర్శంగా నిలిచిన యింటి దంపతులు
  నరసాపురం, జనవరి 11: చదువుకు వయస్సుతో నిమిత్తం లేదని నిరూపించారు 60 ఏళ్ల యింటి రామలింగం దంపతులు. విద్యపై మక్కువతో ఆరు పదుల వయస్సులో డిగ్రీ పట్టా సాధించి అందరితో ఔరా అనిపించి నేటి తరానికి అదర్శంగా నిలిచారు. పాలకొల్లు మండలం తిల్లపూడి పాలెం గ్రామానికి చెందిన యింటి రామలింగం ఇంటర్ వరకు చదివి పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేసి 2012లో ఏఎస్సైగా పదవీ విరమణ చేశారు. రామలింగం భార్య పుష్పావతి 6వ తరగతి వరకు చదువుకుని గృహిణిగా స్థిరపడ్డారు. వీరి నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడిని ఉన్నత విద్యావంతులను చేసి జీవితంలో స్థిరపడేలా తీర్చిదిద్దిన సంతృప్తి ఈ దంపతుల్లో నెలకొంది. అయితే తాము డిగ్రీ చదవలేదనే వెలితి మాత్రం వారిలో మిగిలిపోయింది. దీంతో డిగ్రీ చదవాలనే పట్టుదలతో 2015లో పట్టణంలోని వైఎన్ కళాశాల దూర విద్యా కేంద్రం ద్వారా బీఏ హిస్టరీ, పాలిటిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగాన్ని ఎంచుకున్నారు. కళాశాలలో అడ్మిషన్ తీసుకోవడమే కాకుండా ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా తరగతులకు హాజరయ్యారు. నిత్య జీవితంలో తమ కార్యక్రమాలు, కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూనే రోజుకు రెండు, మూడు గంటల పాటు చదువుపై దృష్టిసారించి పాఠ్యాంశాలపై పట్టు సాధించారు. ఫలితంగా 2015-18 విద్యా సంవత్సరానికిగాను ఆంధ్రా విశ్వ విద్యాలయం నుంచి వారు బీఏ డిగ్రీ సొంతం చేసుకున్నారు. 60 ఏళ్ల వయస్సులో విద్యనభ్యసించడం ఒకెత్తయితే అన్ని సబ్జెక్టుల్లోనూ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడం మరొక ఎత్తు. ఈ సందర్భంగా ఆరు పదుల వయస్సులో డిగ్రీ సాధించిన యింటి రామలింగ దంపతులను వైఎన్ కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. చదువుపై మక్కువతో 60 ఏళ్ల వయస్సులో డిగ్రీ సాధించడం కళాశాల చరిత్రలోనే ప్రథమంగా నిలుస్తుందని కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ చినిమిల్లి సత్యనారాయణరావు పేర్కొన్నారు.

  తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాలు
  ఏలూరు, జనవరి 11: జిల్లాలో సంక్రాంతి సంబరాలను తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాలరెడ్డి అధికారులను ఆదేశించారు. సంక్రాంతి సంబరాల ఏర్పాట్లపై స్థానిక కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జెసి వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయివరకు సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా స్థాయిలో ఈ నెల 13వ తేదీన ఉదయం 10 గంటల నుండి స్థానిక ఇండోర్ స్టేడియంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. సంక్రాంతి సంబరాలు ప్రతిబింబించేలా సంక్రాంతి ముగ్గులు, బొమ్మల కొలువులు, కోలాటాలు, గంగిరెద్దులు, బోగి మంటలు, నృత్యాలతో అంబరాన్నంటేలా సంక్రాంతి సంబరాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించాలని, మన సంస్కృతీ సాంప్రదాయాలపై విద్యార్థినీ విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయాలన్నారు. పాఠశాలల పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలునిర్వహించాలన్నారు. జిల్లాలో ఉత్తమ వ్యవసాయదారులను ఎంపిక చేసి అవార్డులను అందించాలన్నారు. పంటలుఇంటిక ఇవచ్చి రైతులు చేసుకునే పండుగ కాబట్టి అటువంటి సన్నివేశాలు ప్రతిబింబించే విధంగా వ్యవసాయ అధికారులు స్టాల్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఏలూరు ఆర్డీవో జి చక్రధర్, జిల్లా విద్యాశాఖాధికారి రేణుక, సర్వశిక్షా అభియాన్ పివో బ్రహ్మానందరెడ్డి, సెట్‌వెల్ సీఈవో సుబ్బిరెడ్డి, ఐసిడిఎస్ ఏడివిజయకుమారి, జిల్లా క్రీడల అభివృద్ధి అదికారి అజీజ్, సహాయ పర్యాటక శాఖాధికారి పట్ట్భా రామయ్య, సెట్‌వెల్ మేనేజర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

  సంక్రాంతి సంబరాల ఏర్పాట్లు పరిశీలన
  ఏలూరు, జనవరి 11: ఈ నెల 12న జిల్లా స్థాయిలో నిర్వహించనున్న సంక్రాంతి సంబరాలు కార్యక్రమ ఏర్పాట్లను అధికారులతో కలిసి ఏలూరు ఆర్డీవో జి చక్రధర్ శుక్రవారం పరిశీలించారు. స్థానిక ఇండోర్ స్టేడియంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు జరుగుతున్న స్టేజి ఏర్పాట్లను పరిశీలించారు. వ్యవసాయ శాఖచే సంక్రాంతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా స్టాల్స్ ఏర్పాటుకు, ముగ్గుల పోటీలు నిర్వహించేందుకు ప్రత్యేక ప్రదేశాలను పరిశీలించారు. వివిధ శాఖలచే ఏర్పాటు చేయనున్న స్టాల్స్, భోగిమంటలు, కోలాటాలు, హరిదాసులు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్డీవో వెంట ఐసీడిఎస్ పీడి విజయకుమారి తదితరులు ఉన్నారు.

  గుండుగొలనులో కోడిపందాల బరి ధ్వంసం
  భీమడోలు, జనవరి 11: భీమడోలు మండలం గుండుగొలను గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు వేసేందుకు ఏర్పాటు చేసిన బరిని శుక్రవారం రాత్రి భీమడోలు పోలీసులు ధ్వంసం చేశారు. గుండుగొలను గ్రామ పరిధిలోని ఎస్‌ఎఎఫ్‌ఎన్ గోల్డెన్ సిటీ ఆవరణలో ప్రతి సంవత్సరం పెద్దయెత్తున కోడి పందాలు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా కోడిపందాలు నిర్వహించేందుకు బరిని ఏర్పాటు చేశారు. సమాచారం అందుకున్న భీమడోలు సిఐ కొండలరావు పర్యవేక్షణలో ఎస్‌ఐ శ్రీరామ గంగాధర్ సంఘటనా స్థలానికి వెళ్లి బరిని తొలగించారు. మండల పరిధిలో కోడిపందాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగితే తమకు సమాచారం తెలియజేయాలని సిఐ కొండలరావు ఈ సందర్భంగా ప్రజలను కోరారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలే గాకుండా అనుబంధంగా ఇతర అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించినట్టయితే వారిపై కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. ధ్వంసం చేసిన బరి వద్ద కోడిపందాలు వేయడం నేరమంటూ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.

  కోడి పందాల బరులపై పోలీసు యాక్షన్
  కొనసాగుతున్న బరుల ధ్వంసం
  జంగారెడ్డిగూడెం, జనవరి 11: సంక్రాంతి పేరుతో లక్షలు దండుకునేందుకు తహతహలాడిపోతున్న కోడిపందాల నిర్వాహకుల ఏర్పాట్లపై పోలీసు యాక్షన్ ప్రతిబంధకమైంది. ఒకపక్క రాజకీయ పలుకుబడితో కోడిపందాలు నిర్వహించి లబ్ధిపొందాలని ఉరకలు వేస్తున్న నిర్వాహకుల ఉత్సాహంపై పోలీసులు నీళ్లు చల్లుతున్నారు. కోడిపందాల జాతరపై ప్రతి ఏటా జరిగే తంతే ఈ ఏడాదీ కొనసాగక తప్పదని తెలిసినప్పటికీ పోలీసు అధికారులు చివరి వరకు నిలిపివేసేందుకు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే జంగారెడ్డిగూడెం పోలీస్ సబ్ డివిజన్‌లోని అన్ని పోలీస్‌స్టేషన్ల ఎస్సైలు యాక్షన్‌లోకి దిగిపోయారు. బరులు ధ్వంసం చేసే పనిలో నిమగ్నమయ్యారు. బరుల వద్ద పోలీసు నిఘా ఏర్పాటు చేసారు. బరులు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉన్న ప్రదేశాల్లో కోడిపందాలు చట్టరీత్యా నేరమని, జూదాలు, పేకాటలు, గుండాటలు ఆడినా చర్యలు తప్పవంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. శుక్రవారం స్థానిక బైసాస్ రోడ్డుకు సమీపంలో శ్రీనివాసపురం రోడ్డు వద్ద డాక్టర్ కె చిరంజీవికి చెందిన మామిడి తోటలో కోడిపందాలు నిర్వహించేందుకు శ్రీనివాసపురానికి చెందిన ఒక రాజకీయ నాయకుడు, ఆయన అనుచరులు బరులు ఏర్పాటు చేస్తుండటంతో ఎస్సై అల్లు దుర్గారావు జెసిబి, ట్రాక్టర్లతో వెళ్ళి బరుల ప్రదేశాన్ని దున్నిచి వేసారు. అక్కడ హెచ్చరిక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పోలీసులు ఎంత యాక్షన్ చేసినా 14వ తేదీన పోలీస్ బాస్‌ల నుండి వచ్చే వౌఖిక ఆదేశాల మేరకు బరుల నుండి తప్పుకోక తప్పదని నిర్వాహకులు బాహాటంగా చెబుతున్నారు. ఎన్నికల సంవత్సరం కావడంతో కోడిపందాల జూదాల జాతర ఇంకా యథేచ్ఛగా జరుగుతుందని చెబుతున్నారు. ఇప్పటి వరకు పోలీసు అధికారులు చేసిన కృషికి పోలీసు బాస్‌లు, ప్రజా ప్రతినిధులు సహకరిస్తే కోడి పందాలు, జూదక్రీడలు అరికట్టవచ్చని ప్రజలు భావిస్తున్నారు.


older | 1 | .... | 2035 | 2036 | (Page 2037) | 2038 | 2039 | .... | 2067 | newer