Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

ఏకగ్రీవం కోసం సమావేశాలు

$
0
0

ఖమ్మం, జనవరి 11: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులను ఏకగ్రీవం చేసుకునేందుకు అనేక గ్రామాల్లో పెద్ద మనుషుల ఒప్పందాలు కుదురుతున్నాయి. ఇప్పటికే నామినేషన్ దాఖలైన 13మండలాలతో పాటు ప్రస్తుతం నామినేషన్ ప్రక్రియ జరుగుతున్న 13మండలాల్లోని పలు గ్రామాల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఇప్పటికే నామినేషన్ దాఖలైన గ్రామాల్లో గ్రామపెద్దలు పలు పార్టీల నేతలు ఒక్కటై గ్రామాభివృద్ధికి అధిక నిధులు ఇచ్చేవారికి మిగిలిన వారు మద్దతు పలకాలని, అందుకు అనుగుణంగా ఈ నెల 13వ తేదీలోగా నామినేషన్లు ఉపసంహరించుకోవాలని స్పష్టం చేస్తున్నారు. ఆయా గ్రామానికి చెందిన వ్యాపారులు, కాంట్రాక్టర్లు గ్రామ సర్పంచ్ పదవిని తమకు కట్టబెడితే అభివృద్ధికి నిధులిస్తామని బాహటంగానే చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలో పార్టీలకతీతంగా ఆయా గ్రామాల్లోని నేతలు ఒక్కటవుతున్నారు. అయితే ఎక్కువ ప్రాంతాల్లో మాత్రం టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన నేతలు తమ ప్రభుత్వం ద్వారా మరిన్ని నిధులు తీసుకొస్తామని, సర్పంచ్ పదవిని తమ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థికి ఇవ్వాలని సూచిస్తుండటం గమనార్హం. అవసరమైతే పోటీకైనా సిద్ధమని ప్రకటించిన గ్రామాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పాలేరు నియోజకవర్గ పరిధిలోని కొన్ని గ్రామాల్లో గ్రామాభివృద్ధి పేరుతో నిధుల సేకరణకు ఎన్నికలను ఉపయోగించుకుంటుండటం గమనార్హం. ఇదే విధమైన పరిస్థితి ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ జరుగుతున్న సత్తుపల్లి నియోజకవర్గంలో కూడా కనిపిస్తున్నది. ఆయా గ్రామాలకు చెందిన పలువురు ఇతర ప్రాంతాల్లో నివసిస్తూ ఆర్థికంగా బలంగా ఉండటంతో తమ బంధువులను అక్కడ నిలబెట్టి వారిని ఏకగ్రీవం చేయాలని కోరుతున్నారు. ఇందుకోసం గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తామని చెప్పుకొస్తున్నారు. ఈ కోవలోకి కొందరు వైద్యులు కూడా చేరడం గమనార్హం.
ఇదిలా ఉండగా అభివృద్ధి పేరుతో జరుగుతున్న ఈ తరహా ప్రక్రియను అడ్డుకునేందుకు కొన్ని సంఘాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఈ తరహా ప్రక్రియను ఒప్పుకోమని చెబుతుండగా ఆయా గ్రామాల్లోని పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉండటం గమనార్హం. ఇప్పటికే వీటిపై పోలీస్ ఇంటిలిజెన్స్ శాఖాధికారులు కూడా నివేదిక ఇచ్చినట్లు తెలిసింది.

త్వరలోనే ఖమ్మంలో ఓపెన్ జైల్
* డీఐజీ మురళి
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, జనవరి 11: ఖమ్మం జిల్లాలో త్వరలో ఓపెన్ జైల్‌ను ఏర్పాటు చేస్తామని డీఐజీ మురళి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఖమ్మం జిల్లా జైల్‌ను పరిశీలించి అన్ని విభాగాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జీవితశిక్ష పడిన ఖైదీలు ఓపెన్‌జైల్ గురించి అడగగా త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పారు. జైలులోని లైబ్రరీ, బ్యారెక్స్, వంటశాల, మహిళా ఖైదీలు, వృద్దుల బ్యారెక్స్, ఖైదీల నర్సరీలను తనిఖీ చేశారు. అనంతరం ఖైదీలో భోజనాన్ని తిని చూశారు. ఖైదీలకు భోజనం కోసం ఉన్న సామాగ్రిని అన్నింటిని పరిశీలించారు. వారికి కల్పించే సౌకర్యాలు, తరగతి గదులను తనిఖీ చేశారు. ఇదే సమయంలో జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి జస్టిస్ వినోద్‌కుమార్ రావడంతో ఇద్దరూ కలిసి ఈ మిలాఖత్ రూమ్‌ను పరిశీలించారు. అనంతరం జైలు నిర్వహణ బాగుందంటూ పర్యవేక్షణ అధికారి రామచంద్రంను అభినందించారు.

కొత్తగూడెం జిల్లాలో కోటి మొక్కల పెంపకం లక్ష్యం
* జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి జగత్‌కుమార్‌రెడ్డి
జూలూరుపాడు, జనవరి 11: హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా డిఆర్‌డిఓ ఆధ్వర్యంలో 398నర్సరీలను ఏర్పాటు చేసి కోటి మొక్కలను పెంచటం లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి జగత్‌కుమార్ రెడ్డి తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో మొక్కలను పెంచేందుకు నర్సరీలను ఏర్పాటు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని ఉపాధిహామీ పథకం ఉద్యోగులను ఆయన ఆదేశించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి ఉద్యోగులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 24 గ్రామ పంచాయతీలు ఉండగా ఇప్పటి వరకు 22 పంచాయతీల్లో నర్సరీలను ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. ఇందులో భాగంగా ప్రభుత్వ స్థలాలను గుర్తించటం, లేదా ప్రైవేటు భూములను లీజుకు తీసుకోవటం జరిగిందని అన్నారు. మొత్తం 5.2లక్షల మొక్కల పెంపకం లక్ష్యం కాగా ఇప్పటి వరకు 12 గ్రామ పంచాయతీల్లోని నర్సరీల్లో 1.22 లక్షల బ్యాగుల్లో మట్టిని నింపటం పనులు పూర్తయినట్లు తెలిపారు. ఈనెల 20వ తేదీ నాటికి బ్యాగుల్లో మట్టిని నింపటం 25వ తేదీ వరకు విత్తనాలు నాటించి పనులు వేగం చేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అనంతరం పడమట నర్సాపురంలోని నర్సరీని సందర్శించి మొక్కల పెంపకం పనులపై ఉద్యోగులకు తగు సూచనలు ఇచ్చారు. ఈ సమావేశంలో ఎంపిడివో విద్యాచందన, ఎపివో జమీర్‌పాషా, టెక్నికల్ అసిస్టెంట్‌లు, ఫీల్డ్ అసిస్టెంట్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రముఖ కళాకారుడు మృతి
వేంసూరు, జనవరి 11: ప్రముఖ కళాకారుడు వెల్లంకి బస్వాచారి (85) శుక్రవారం మరణించారు. ఖమ్మం, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అనేక జానపద, పౌరాణిక, సాంఘిక నాటకాలను ప్రదర్శించారు. అనేక మంది ప్రముఖలతో సన్మానాలు, సత్కారాలు అందుకున్నారు. వేంసూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన బస్వాచారి పేరు ఈ ప్రాంతంలో తెలియని వారుండరు. వృత్తిరీత్య మెకానిక్ అయినప్పటికీ కళల పట్ల అపార ప్రేమతో జీవితంలో ఎక్కువ భాగం కళారంగంలోనే గడిపారు. ఆయన మరణం కళారంగానికి తీరని లోటు అని పలువురు పేర్కొంటున్నారు. వృద్ధాప్యం వచ్చినప్పటికీ కళలపట్ల ప్రేమతో చుట్టుప్రక్కల జరిగే పలు సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరై, వారిని ప్రోత్సహించేవారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. బస్వాచారి మృతదేహాన్ని పలువురు సందర్శించి నివాళులు అర్పించారు.

విద్యుత్ కేంద్రాల అవసరాలకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి
* సంస్థ అభివృద్ధి, కార్మికుల సంక్షేమమే లక్ష్యం
* రానున్న ఐదేళ్లలో 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి చర్యలు
* సింగరేణి డైరక్టర్ (పా) చంద్రశేఖర్
కొత్తగూడెం, జనవరి 11: దేశంలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల అవసరాలకు అనుగుణంగా బొగ్గును ఉత్పత్తి చేసేందుకు సింగరేణి యాజమాన్యం నిరంతరం శ్రమిస్తుందని సింగరేణి కాలరీస్ డైరెక్టర్ (పా) చంద్రశేఖర్ తెలిపారు. రానున్న ఐదేళ్లలో 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించాలనే లక్ష్యంతో నూతన ప్రాజెక్టుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. శుక్రవారం స్థానిక సింగరేణి ఇల్లందు క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థ అభివృద్ధి, కార్మికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. సింగరేణి సంస్థకు వచ్చిన లాభాల నుంచి సమీప ప్రాంతాల అభివృద్ధి కోసం డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ కింద కోల్‌బెల్ట్ ఏరియాలో రూ 1600 కోట్లు మంజూరు చేయగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రూ 300 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలేనే కాకుండా సింగరేణి సంస్థ ఒరిస్సా, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో కొత్త బ్లాకులను ఏర్పాటు చేసి బొగ్గును ఉత్పత్తి చేసేందుకు అవసరమైన అనుమతులను సాధించిందన్నారు. నూతన ప్రాజెక్టు ఏర్పాటుకు భూ సేకరణకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వరకు రైల్వేలైన్ నిర్మాణ పనులను నిర్వహించేందుకు సింగరేణి నిధులను మంజూరీ చేసిందన్నారు. ఇప్పటికే పనులను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాలుగున్నరేళ్లలో సంస్థలో నూతన ఉద్యోగ నియామకాలకు అవసరమైన చర్యలు చేపట్టి, ఇప్పటికే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. మార్కెట్‌లో సింగరేణి బొగ్గుకు డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తిపై దృష్టి సారించి ఉత్పత్తి లక్ష్యాలను ప్రతి ఏడాది పెంచుతున్నట్లు ప్రకటించారు. సోలార్ విద్యుత్ నిర్మాణం కోసం రూ 1163కోట్లతో 300మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని సాధించేందుకు పనులు చేపట్టినట్లు తెలిపారు. రానున్న దీపావళి నాటికి సోలార్ విద్యుత్‌ను అందిస్తామని అన్నారు. కారుణ్య నియామకాల పనులను వేగవంతం చేసేందుకు ప్రతి నెలా మెడికల్ బోర్డును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విశ్రాంతి కార్మికులకు సైతం మెరుగైన వైద్యం అందించేందుకు సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో అవసరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సింగరేణి ఇ అండ్ ఎం డైరెక్టర్ శంకర్, ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ డైరక్టర్ భాస్కర్‌రావు, డైరక్టర్ ఫైనాన్స్ బలరాంలు మాట్లాడుతూ సింగరేణి సంస్థను అగ్రగామిగా నిలిపేందుకు సమష్టి కృషి జరుపుతున్నట్లు తెలిపారు. సాంకేతికంగా, సామాజికంగా సింరగేణి సంస్థ అన్ని రంగాల్లో ఉన్నత ప్రమాణాలతో ముందుకు సాగుతుందన్నారు. సమావేశంలో సింగరేణి జనరల్ మేనేజర్‌లు ఆనందరావు, బసవయ్య, రుష్యేంద్రుడు, డీజీఎం సాల్మోన్, పర్సనల్ మేనేజర్‌లు బేతిరాజు, రమేష్‌లు పాల్గొన్నారు.

పంచాయతీ ఎన్నికల్లో ప్రజాకూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలి
* ఏకగ్రీవాలకు ప్రాధాన్యతనివ్వండి
* టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టివిక్రమార్క
కామేపల్లి, జనవరి 11: గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమి అభ్యర్థులను గెలిపించుకున్న విధంగా జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ప్రజాకూటమి అభ్యర్థులను గెలిపించాలని టిపిసిసి వర్కింగ్ ప్రసిడెంట్ భట్టివిక్రమార్క కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం మండల పరిధిలోని తాళ్ళగూడెం గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన సర్పంచ్ రాకావత్ సునీత ఇంటిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో ప్రజాకూటమి అభ్యర్థులను అధిక సంఖ్యలో గెలిపించుకోవాలని, గ్రాప స్వరాజ్యం కాంగ్రెస్ పాలనలోనే జరుగుతుందని స్పష్టం చేశారు. అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఏకగ్రీవం చేసుకునేందుకు ప్రయత్నించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో అలజడులు, అల్లర్లు జరిగే సమ్యసాత్మక గ్రామాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మండలంలో పాతలింగాల, తాళ్ళగూడెం, లాల్యాతండ గ్రామపంచాయతీలు ఏకగ్రీవంగా ఎంపిక చేయడం పట్ల స్థానిక నాయకులు రాంరెడ్డి గోపాల్‌రెడ్డిని అభినందించారు. అనంతరం ఇటీవల మరణించిన జిల్లా కాంగ్రెస్ నాయకులు నల్లమోతు కోటయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శించి బాదిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు రాంరెడ్డి గోపాల్‌రెడ్డి, కృష్ణారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంతోటి అచ్చయ్య, జిల్లా బిసి సెల్ నాయకులు పుచ్చకాయల వీరభధ్రం, మండల నాయకులు సుందరం, రమేష్‌చౌదరి, నర్సింహరావు, రామకృష్ణ, పుండరీ, గంటి నర్సయ్య, రాందాస్ తదితరులు పాల్గొన్నారు.


రాజకీయ లబ్ధికోసమే అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు

$
0
0

గుంటూరు, జనవరి 11: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం రాజకీయ లబ్ధికోసమే అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు దుయ్యబట్టారు. శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శంకరరావు మాట్లాడుతూ రాజ్యాంగంలో వెనుకబాటు తనానికి గురైన వారికి మాత్రమే రిజర్వేషన్లు కల్పించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పొందుపర్చారన్నారు. అందుకు విరుద్ధంగా మోదీ ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమన్నారు. వారికి సహాయం చేయాలంటే కార్పొరేషన్లను ఏర్పాటుచేసి ఆదుకోవాలే తప్ప ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు. ఆర్థిక వెనుకబాటు తనానికి రిజర్వేషన్లు ప్రాతిపదిక కాదన్నారు. దేశంలో 80 శాతం సంపద 20 శాతం ధనికుల చేతుల్లోనే ఉందన్నారు. రాష్ట్రంలో కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అనేక పోరాటాలు చేశామన్నారు. బిల్లును ఆమోదిస్తూ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు నిర్ణయాన్ని తెలపడం దుర్మార్గమన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల జీవనం మరింత దుర్భరమవుతుందన్నారు. బీసీ సంక్షేమ సంఘం యువజన రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మర క్రాంతికుమార్, సీనియర్ న్యాయవాది వైకె మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని తాము ఎన్నో పోరాటాలు చేసినాస్పందించని ప్రభుత్వాలు అగ్రవర్ణ పేదలు అడగకుండానే రిజర్వేషన్లు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. ఎస్సీలకు అంటరానితనం ప్రాతిపదికగా, ఎస్టీలు సమాజానికి దూరంగా ఉన్న కారణంగా, బీసీలకు సాంఘికంగా, విద్యాపరంగా వెనుకబడినందున రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించబడ్డాయన్నారు. అగ్రకులాలకు ఈ మూడు అర్హతల్లో ఏ ఒక్కటీ లేదన్నారు. ఆర్థిక వెనుకబాటుతనం ఒక్కటే రిజర్వేషన్లకు అర్హత కాదని ఉన్నత న్యాయస్థానాలతో పాటు సుప్రీంకోర్టు కూడా తీర్పులు చెప్పిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయన్నారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు ఆందోళన చేపడతూనే ఉంటామని హెచ్చరించారు. తొలుత హిందూ కాలేజీ సెంటర్‌లోని పూలే విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి భారీ ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ధర్నా అనంతరం జేసీ ఎండి ఇంతియాజ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు కన్న మాస్టారు, బాదన్నల శ్రీను, ధూళిపాళ్ల ఏసుబాబు, పరసా రంగనాధ్ తదితరులు పాల్గొన్నారు.

‘స్వచ్ఛ్ధార’తో సాంకేతిక విప్లవం
* కలెక్టర్ కోన శశిధర్
గుంటూరు, జనవరి 11: సురక్షిత తాగునీటి సరఫరాలో స్వచ్ఛ్ధార కార్యక్రమం సరికొత్త సాంకేతిక విప్లవమని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో జిల్లాలోని ఓవర్‌హెడ్ ట్యాంకుల పరిశుభ్రత చేసేందుకు సంబంధించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన 33 వాహనాలను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా వచ్చే వ్యాధుల నియంత్రణ, బ్యాక్టీరియా రహిత రక్షిత మంచినీటి సరఫరా లక్ష్యంతో దేశంలోనే ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో స్వచ్ఛ్ధార కార్యక్రమం జరుగుతుందన్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 1800 ఓవర్‌హెడ్ ట్యాంకులు ఉన్నాయని, వీటిని పూర్తిగా శుభ్రపర్చడం జరుగుతుందన్నారు. కార్యక్రమ అమలుకు ఎంపికైన టీమ్ మెంబర్‌లు అత్యాధునిక పనిముట్లతో ప్రతి ఆరు నెలలకొకసారి శుభ్రపరుస్తారన్నారు. దీంతో పట్టణ ప్రాంతాలతో సమానంగా గ్రామీణ ప్రాంతాలకు కూడా స్వచ్ఛమైన తాగునీరు అందించవచ్చన్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓవర్‌హెడ్ ట్యాంకులు శుభ్రపరిచే ముందు అక్కడి గ్రామపెద్దలు, ప్రత్యేక అధికారి, పంచాయతీ అధికారులతో మాట్లాడి సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్, సిఇఒ సూర్యప్రకాష్‌లు మాట్లాడుతూ స్వచ్ఛ్ధార ఆరు దశల కార్యక్రమమని, దీంతో గ్రామీణ ప్రజలకు బ్యాక్టీరియా రహిత తాగునీరు అందించడం సాధ్యపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్, పంచాయతీ రాజ్ సిబ్బంది పాల్గొన్నారు.

అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తాం
* సమస్యల పరిష్కారానికే జన్మభూమి
* ముగింపు సభలో ప్రజాప్రతినిధులు
గుంటూరు, జనవరి 11: ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు సమర్ధవంతంగా అమలుచేస్తూ, అర్హులందరికీ న్యాయం జరిగేలా చూస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు పేర్కొన్నారు. పేదల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిర్దేశించి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జన్మభూమి సభలో తమ సమస్యలపై అర్జీలు అందజేసి పరిష్కరించుకోవాలని వారు సూచించారు. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6వ విడత జన్మభూమి కార్యక్రమం ముగింపు సభలు శుక్రవారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 49,46,11,52 వార్డుల్లోనూ, పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 35,36 వార్డుల్లో నిర్వహించారు. జన్మభూమి కార్యక్రమాలకు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి, తూర్పు నియోజకవర్గ జన్మభూమి ప్రొటోకాల్ ఇన్‌ఛార్జి, ఎమ్మెల్సీ ఎంఎ షరీఫ్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ దాసరి రాజామాస్టారు, టీడీపీ తూర్పు ఇన్‌ఛార్జి మద్దాళి గిరిధర్‌లు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ షరీఫ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం జన్మభూమి సభలు నిర్వహిస్తోందన్నారు. అర్హత కలిగి ప్రభుత్వ పథకాలు అందని వారు దరఖాస్తు చేసుకుంటే త్వరితగతిన లబ్ధిచేకూరేలా జన్మభూమి వేదికగా దోహదపడుతుందన్నారు. రాష్ట్రం లోటుబడ్జెట్‌లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థతతో సంక్షేమ పథకాలకు ఎటువంటి లోటు లేకుండా అమలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే చంద్రబాబు నాయుడును మరోమారు ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, వారికి ఉపాధి కల్పించేందుకు రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు వచ్చేలా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ముందుచూపున్న ముఖ్యమంత్రితోనే రాష్ట్ర భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని తెలిపారు. కమిషనర్ శ్రీకేష్ బి లత్కర్ మాట్లాడుతూ జన్మభూమి సభల ద్వారా సంక్షేమ పథకాలు, ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం జరుగుతుందన్నారు. గుంటూరు నగరం రాజధాని ప్రాంతంలో ఉండటంతో ప్రాధాన్యత పెరిగిందని, జనాభాకు తగ్గట్టుగా రోడ్ల విస్తరణ చేపడతామన్నారు. హౌస్ ఫర్ ఆల్ పథకం కింద అడవి తక్కెళ్లపాడులో 4 వేల గృహాలు నిర్మించామని, వెంగళాయపాలెంలో మరో 6 వేల గృహాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ జన్మభూమి సభలను సద్వినియోగం చేసుకోవాలని మద్దాళి గిరిధర్ ప్రజలను కోరారు. సభలో భాగంగా డ్వాక్రా మహిళలకు చెక్కుల పంపిణీ, పెన్షన్లు, మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. జన్మభూమికి హాజరైన ప్రజలచే ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమాల్లో నగరపాలక సంస్థ ఏసి కె రామచంద్రారెడ్డి, డిసిలు ఎం ఏసుదాసు, శ్రీనివాసరావు, సిటీప్లానర్ చక్రపాణి, ఇఇ రామ్‌నాయక్‌తో పాటు షేక్ షౌకత్, టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం
గుంటూరు (స్పోర్ట్స్), జనవరి 11: జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక పోలీసు పెరెడ్‌గ్రౌండ్స్‌లో రాష్టస్థ్రాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి శాప్ చైర్మన్ అంకమ్మచౌదరి, ఎమ్మెల్యే ఫిలిప్ సి తోచర్, రాష్ట్ర హ్యాండ్‌లూమ్స్ డైరెక్టర్ వట్టికూటి హర్షవర్ధన్ ముఖ్యఅతిథులుగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. వివిధ వయస్సు విభాగాల్లో తొలిరోజు జరిగిన 100 మీటర్ల పరుగులో 35 సంవత్సరాలపై విభాగంలో ధర్మేంద్రసింగ్, పి జగదీష్, బి అబ్దుల్ లతీఫ్ వరుస స్థానాల్లో నిలిచారు. అలాగే 40 సంవత్సరాల విభాగంలో ఎ రవి ప్రతాప్, ఎం ఆనందబాబు, కె లక్ష్మణరావు, 45 సంవత్సరాల్లో ఎస్ రాజశేఖర్, పి సూరిబాబు, పి వెంకట రమణ, 50 సంవత్సరాలలో ఎంఎఎన్ రెడ్డి, సి నారాయణస్వామి, జి వెంకటేశ్వర్లు, 55 సంవత్సరాల్లో ఎస్ శివనాగేశ్వరరావు, ఎం ఆనందరావు, జి అప్పారావు, 60 సంవత్సరాల విభాగంలో పి ప్రభుదాసు, ఎ కనకరాజు, జి రామస్వామి వరుస స్థానాల్లో నిలిచారు. తొలిరోజు పోటీల అనంతరం సాయంత్రం జరిగిన క్యాంప్‌ఫైర్‌కు క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుండి వచ్చిన దాదాపు 400 మంది క్రీడాకారులు ఆనందం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో షేక్ లాల్‌వజీర్, విశ్రాంత ఎస్‌పిలు చక్రపాణి, రవి, నజీర్ తదితరులు పాల్గొన్నారు.

పేదలకు చంద్రన్న చేయూత హర్షణీయం
గుంటూరు, జనవరి 11: రాష్ట్రంలో పేదలకు పెన్షన్లను మరో మారు పెంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేయూత అందించారని తెలుగునాడు విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మంచౌదరి హర్షం వ్యక్తంచేశారు. శుక్రవారం స్థానిక లాడ్జిసెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నిలువెత్తు కటౌట్‌కు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మంచౌదరి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్న 200 రూపాయల పెన్షన్‌లను ఐదు రెట్లు పెంచి 1000 రూపాయలు చేసిందని, నేడు దాన్ని 2 వేల రూపాయలకు పెంచి పేదలకు ఆర్థిక భరోసా కల్పించారన్నారు. రాష్ట్ర జనాభాలో 11 వర్గాలకు చెందిన 55 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు నెలకు 1300 కోట్లు, ఏడాదికి 15,600 కోట్లు వెచ్చిస్తుందన్నారు. ఐదు సంవత్సరాలకు 78 వేల కోట్లు చంద్రబాబు తెలుగువారికి సంక్రాంతి పండుగకు ముందే కేటాయించడంతో రాష్ట్రంలో పండుగ వాతావరణం ముందుగానే నెలకొందన్నారు. దేశంలో సంక్షేమానికి మారుపేరుగా తెలుగుదేశం నిలిస్తుందని మరోమారు రుజువైందన్నారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు మన్నవ వంశీ, సమన్వయకర్త సుఖవాసి శ్రీనివాసరావు, నాయకులు బిక్కూనాయక్, రాయపాటి అమృతరావు, రామబ్రహ్మం, శ్రీకాంత్, అశోక్ ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
పెన్షన్ల పెంచు చారిత్రాత్మకం : గోనుగుంట్ల కోటేశ్వరరావు
పేదల బతుకుల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు మరో మారు పెన్షన్లను పెంచుతూ శ్రీకారం చుట్టారని, దేశంలోనే ఇదో చారిత్రాత్మక నిర్ణయం అని దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, శాప్ మాజీ చైర్మన్ పిఆర్ మోహన్‌లు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు. ఎన్‌టిఆర్ భరోసా కింద వృద్ధుల పెన్షన్‌ను 2 వేలు, దివ్యాంగులకు 3 వేలకు పెంచడంతో వారి జీవితాలకు మరింత భరోసా కల్పించినట్లైందన్నారు. ప్రతి కుటుంబం సురక్షితమైన, గౌరవ ప్రదమైన జీవితం గడిపేందుకు ఈ పెన్షన్లు దోహద పడతాయన్నారు.

రైతుల పక్షపాతి చంద్రబాబు
కాకుమాను, జనవరి 11: రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడని, అన్నదాతల సంక్షేమం కోసం ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుందని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్ అన్నారు. మండల కేంద్రమైన కాకుమానులో శుక్రవారం జరిగిన జన్మభూమిలో ఆమె మాట్లాడారు. ప్రజల వద్దకే పాలన సాగిస్తూ అధికారుల సమక్షంలోనే సమస్యలను పరిష్కరించుకుంటూ, ప్రజాభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ కార్యాచరణ సాగిస్తుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు తమ సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై అందజేసిన ట్రాక్టర్‌లతో పాటు, అర్హులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఇఒ పిఎస్ సూర్యప్రకాష్, ఎంపీపీ నక్కల శైలజ, డీసీఎంఎస్ చైర్మన్ ఇక్కుర్తి సాంబశివరావు, తహశీల్దార్ కె సాయిప్రసాద్, టీడీపీ నాయకులు మామిళ్లపల్లి రామగోపాల్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు
అచ్చంపేట, జనవరి 11: మండల కేంద్రమైన అచ్చంపేటలో గల ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో సాగిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు, చిన్నారులతో కార్యాలయ ప్రాంగణమంతా పండుగ వాతావరణం సంతరించుకుంది. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటం, పాటల పోటీలు అలరించాయి. గంగిరెద్దుల కోలాహలం, గొబ్బెమ్మలు, ఆటల పోటీలు, భోగిమంటలు, అధికారులు, ప్రజాప్రతినిధులు సాంప్రదాయ వస్తధ్రారణలతో ఇలా సంక్రాంతి శోభ మొత్తం ఎండీవో కార్యాలయ ఆవరణలో తారసపడింది. పంచాయతీ కార్యాలయం ఆధ్వర్యాన కొటారు సెంటర్‌లో ముగ్గుల పోటీలు జరిగాయి. పోటీలకు ఎండీవో అనూరాధ, వైద్యులు మధుసూధనరావు సతీమణి మామిళ్లపల్లి విజయలక్ష్మి ముఖ్యఅతిథులుగా హాజరై విజేతలను ప్రకటించారు. కోట అనూష, జి నాగవర్ధని, ఎస్ పూర్ణిమ వరుస బహుమతులు కైవసం చేసుకున్నారు.

బూత్ కమిటీ కన్వీనర్లు సైనికుల్లా పనిచేయాలి
క్రోసూరు, జనవరి 11: మండల కేంద్రమైన వైసీపీ నియోజకవర్గ కార్యాలయంలో బూత్ కమిటీ కన్వీనర్ల సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నంబూరి శంకరరావు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి బూత్ కమిటీ కన్వీనర్‌లు సైనికుల్లా కృషిచేయాలని కోరారు. అధికార తెలుగుదేశం అవినీతి, అరాచకాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. జన్మభూమి కమిటీ పేరుతో పచ్చచొక్కా వారు పబ్బం గడుపుకోవడం తప్ప పేదలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన నవరత్నాలు, వాటి ప్రయోజనాలకు ప్రజలకు వివరించాలన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయఢంకా మోగించడం ఖాయమని, ఇందుకు కార్యకర్తలు, నాయకులు కార్యోన్ముఖులు కావాలని కోరారు. ఈ సమావేశంలో మండల కన్వీనర్ సయ్యద్ కరీమ్, షేక్ మస్తాన్, అచ్చంపేట మండల కన్వీనర్ సిహెచ్‌ఆర్‌కె సాయిరెడ్డి, బూత్ కన్వీనర్‌లు అనుముల కోటిరెడ్డి, పోతురాజు గురుస్వామి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

70 ఏళ్లు గడచినా మహిళలకు పూర్తి స్వాతంత్య్రం రాలేదు
* స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు
సత్తెనపల్లి, జనవరి 11: భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నా మహిళలకు పూర్తి స్వాతంత్య్రం ఇంకా రాలేదని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. స్థానిక హోలీఫ్యామిలీ పాఠశాలలో శుక్రవారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శక్తి అతివల ఆత్మస్థైర్యం మేలుకొలుపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. జనాభాలో మహిళలు 50 శాతం ఉన్నప్పటికీ సమానత్వం మాత్రం రాలేదని అన్నారు. ఈ వివక్షను తొలగించేందుకు ప్రతి ఒక్కరు సమాజంలో ముందుకు రావాలని తెలిపారు. ఇప్పటికీ కొంతమంది తల్లిదండ్రులు మహిళలను భారంగానే చూస్తున్నారని అన్నారు. మహిళ ధైర్యంగా పోలీస్టేషన్‌కు వెళ్లి జరిగిన అన్యాయాన్ని చెప్పి న్యాయం పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి, జిల్లా కలెక్టర్ శశిధర్, రూరల్ ఎస్పీ రాజశేఖర్, సత్తెనపల్లి డిఎస్పీ కాలేషావలి తదితరులు పాల్గొన్నారు.

వర్సిటీ ఇమేజ్‌ని డ్యామేజ్ చెయ్యొద్దు
* వీసీ ఆచార్య రాజేంద్రప్రసాద్
నాగార్జున యూనివర్సిటీ, జనవరి 11: తల్లిలాంటి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇమేజ్‌ని డ్యామేజ్ చేసే పని ఎవ్వరూ చెయ్యొద్దని ఆచార్య నాగార్జున వర్సిటీ ఆచార్య రాజేంద్రప్రసాద్ సిబ్బంది, విద్యార్థులను కోరారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్‌గా శనివారం పదవీకాలం ముగియనుండటంతో వర్సిటీలోని అన్ని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు సంయుక్తంగా నిర్వహించిన అభినందనలో సభలో పాల్గొన్న వీసీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ వేలాదిమంది విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే వర్సిటీ ప్రతిష్టను ఇనుమడింప చెయ్యాల్సిన బాధ్యత వర్సిటీలోని అందరి పైనా ఉందని అన్నారు. వీసీలు ఎంతోమంది వస్తారు.. వెళతారని, కానీ వర్సిటీలో పదవీ విరమణ వరకు కొనసాగే సిబ్బంది భుజస్కంధాలపైనే వర్సిటీ ప్రగతి ఆధారపడి ఉందని అన్నారు. తన హాయాంలో వర్సిటీలోని అన్ని వర్గాల ఉన్నతికి కావాల్సిన చర్యలు చేపట్టామని, అందరి సహాకారంతో నాక్ ఎ గ్రేడ్ గుర్తింపుతోపాటు అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సాధించగలిగామని తెలిపారు. రానున్న రోజులలో దేశంలోనే అత్యుత్తమ వర్సిటీగా నిలవగలిగే సత్తా నాగార్జున వర్సిటికీ ఉందని, ఆ స్థాయికి వర్సిటీని తీసుకువెళ్లడానికి వర్సిటీలోని అందరూ సమిష్టిగా పాటుపడాలని ఆయన కోరారు. అందరి సహకారంతోనే వర్సిటీని ప్రగతి పథంలో నడిపించగలిగామని, ఇదే ఒరవడిని రానున్న రోజులలో కూడా కొనసాగించాలని ఆయన కోరారు.

సార్.. మళ్లీ మీరే వీసీగా రావాలి
- వీసీ సత్కారసభలో ముక్తకంఠంతో నినదించిన ఉద్యోగ, ఉపాధ్య సంఘాలు
* నేటితో ముగియనున్న వీసీ పదవీకాలం
నాగార్జున యూనివర్సిటీ, జనవరి 11: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్ ఆచార్య ఎ రాజేంద్రప్రసాద్ పదవీకాలం శనివారంతో ముగియనుండటంతో వర్సిటీలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు వీసీని ఘనంగా సత్కరించాయి. శుక్రవారం వర్సిటీలోని డైక్‌మెన్ ఆడిటోరియంలో జరిగిన వీసీ అభినందన సభలో నాగార్జున యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్‌గా ఆచార్య రాజేంద్రప్రసాద్‌ని తిరిగి నియమించాలని వర్సిటీలోని పలు ఉద్యోగ, ఉపాధ్య సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య జి రోశయ్య అధ్యక్షతన జరిగిన వీసీ అభినందన సభలో ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ మాట్లాడుతూ ఆచార్య నాగార్జున యూనివర్సిటీని అన్ని రంగాలలోను ముందుకు నడిపించటంతోపాటు, రాష్ట్రంలో మిగిలిన యూనివర్సిటీలకు నాగార్జున వర్సిటీని ఆదర్శంగా నిలపటంలో రాజేంద్రప్రసాద్ విజయవంతమయ్యారని అన్నారు. వర్సిటీ సిబ్బందిని రెట్టించిన ఉత్సాహంతో పనిచేయించి ప్రైవేట్ వర్సిటీలకు దీటుగా నిలపాల్సిన అవసరముందని అన్నారు. రాష్ట్ర ఉన్నతవిద్యా మండలి ఛైర్మన్ ఆచార్య పి నరసింహరావు మాట్లాడుతూ ఎన్నో విప్లవాత్మకమైన సంస్కరణలతో నాగార్జున యూనివర్సిటీని ఆచార్య రాజేంద్రప్రసాద్ మిగిలిన యూనివర్సిటీలకు ఆదర్శంగా నిలిపారని, ఆయన స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. రాజేంద్ర ప్రసాద్‌కు బెస్ట్ పెర్ఫార్మెన్స్ వైస్‌ఛాన్సలర్‌గా గుర్తింపు ఇవ్వనున్నట్లు తెలిపారు. వర్సిటీ టీచర్స్ ఆసోసియేషన్ కార్యదర్శి ఆచార్య జి సింహాచలం మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉపాధ్యాయుల న్యాయమైన హక్కులను రక్షించారన్నారు. వర్సిటీ ఫెన్షనర్స్ ఆసోసియేషన్ అధ్యక్షుడు ఆచార్య జెడ్ విష్ణువర్ధన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు 2 లక్షల రూపాయలు మెడికల్ సహకారాన్ని వీసీ అమలు చేశారన్నారు. విశ్వవిద్యాలయ కార్మిక సమాఖ్య అధ్యక్షుడు బి రాజశేఖర్ మాట్లాడుతూ ప్రస్తుత వీసీ రాజేంద్రప్రసాద్ పదవీకాలాన్ని పొడిగించాలని తాము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. వర్సిటీ పాలకమండలి సభ్యుడు ఆచార్య కోడెల వెంకట్రావు మాట్లాడుతూ సిబ్బంది సంక్షేమానికి రాజేంద్రప్రసాద్ ఎప్పుడూ ముందుండే వారని అన్నారు. అనంతరం వర్సిటీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు వీసీ ఆచార్య రాజేంద్రప్రసాద్‌ని ఘనంగా సత్కరించాయి. ఈ కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ఆచార్య కె జాన్‌పాల్, వీసీ సతీమణి డాక్టర్ శకుంతల, పాలకమండలి సభ్యులు ఆచార్య ఎం కోటేశ్వరరావు, డాక్టర్ ఆఖ్తర్, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య చందన్, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సిద్ధయ్య, ఫార్మశీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ప్రమీలారాణి తదితరులు పాల్గొన్నారు.

కంచుకోటలో మళ్లీ మనదే గెలుపు

$
0
0

పిఠాపురం, జనవరి 11: టీడీపీకి కంచుకోటగా ఉన్న తూర్పుగోదావరిలో మళ్లీ టీడీపీయే అన్ని స్థానాలను స్వీప్ చేస్తుందని చంద బాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ జోశ్యం చెప్పారు. శుక్రవారం పిఠాపురం పట్టణంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి భారీగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. పిఠాపురం ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో పిఠాపురంలో వేలాది మంది కార్యకర్తలతో జరిగిన భారీ ర్యాలీలో పాల్గొన్న మంత్రి, అనంతరం పిఠాపురం పట్టణానికి శాశ్వత మంచినీటి పథకం కింద రూ.35 కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దీంతోపాటు రూ.79 కోట్లతో ఇంటింటికి కుళాయి పథకం జలధారను లోకేష్ ఎమ్మెల్యే వర్మతో కలిసి ప్రారంభించారు. అనంతరం సభలో ప్రజలనుద్ధేశించి లోకేష్ మాట్లాడుతూ 2014 ఎన్నికలకు ముందు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తుందన్నారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్‌శాఖ నిధులతో 24 వేల కిలోమీటర్లు సీసీ రోడ్లు నిర్మిస్తే అందులో, తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 2,200 కిలోమీటర్లు రోడ్లు నిర్మించడం జరిగిందన్నారు. చంద్రబాబు అమరావతి నిర్మాణం కోసం అహార్నిశలు కృషిచేస్తున్నారని, రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు తీసుకురావడానికి నిరంతరం కృషిచేస్తున్నట్లు తెలిపారు. రైతు రుణమాఫీ పథకం కింద ఇప్పటి వరకూ రూ.24 వేల కోట్లు ఖర్చు చేయడం జరిగిందని, డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి రూ.15 వేలు వారి ఖాతాల్లో వేస్తున్నట్లు తెలిపారు. మొత్తం మీద ప్రభుత్వం ద్వారా 150 వరకూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. కాపు, బీసీ, మైనార్టీలకు పూర్తిగా న్యాయం చేస్తున్నామని, కాపులకు రిజర్వేషన్ విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పిఠాపురం విషయానికొస్తే ఇక్కడ ఎమ్మెల్యే వర్మ ఎంతో కష్టించే వ్యక్తని, నిత్యం ప్రజలకు ఏదోకటి చేయాలనే తపనలో ఆయనలో కనిపిస్తుందన్నారు. నెల్లూరు శ్రీ సిటీలో ఏర్పాటు చేసిన ఫోక్స్‌కాన్ కంపెనీకి పిఠాపురం నుండే 900 మంది ఉద్యోగాలు పొందారంటే వర్మ గొప్పతనం తెలుస్తుందన్నారు. అంతకముందు మాట్లాడిన ఎమ్మెల్యే వర్మ పిఠాపురం నియోజకవర్గంలో రైతులు గుండెల్లో చంద్రబాబు చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా పరిషత్ ఛైర్మన్ జ్యోతుల నవీన్, ఎమ్మెల్సీలు చిక్కాల రామచంద్రరావు, ఆదిరెడ్డి అప్పారావు, శాసనమండలి ఉపాధ్యక్షులు రెడ్డి సుబ్రహ్మణ్యం, టీడీపీ జిల్లా అధ్యక్షుడు నామన రాంబాబు, పిఠాపురం మున్సిపల్ ఛైర్మన్ కరణం చిన్నారావు, గుడా డైరక్టర్ పిల్లి రవికుమార్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు రెడ్డెం భాస్కరరావు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. పిఠాపురంలో జరిగిన బహిరంగ సభకు భారీగా అభిమానులు, టీడీపీ కార్యకర్తలు తరలిరావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. మంత్రి నారా లోకేష్‌ను పట్టణంలో టీడీపీ కార్యాలయం నుండి భారీ మోటారుసైకిల్ ర్యాలీగా తీసుకెళ్లారు. దీంతో టీడీపీ కార్యాలయ నుండి సుమారు రెండు కిలోమీటర్లమేర వరకూ అభిమానులతో రోడ్లన్ని కిక్కిరిసిపోయాయి. ప్రజలకు అభివాదం చేస్తూ లోకేష్ ముందుకు సాగారు.
మోదీ-జగన్ ఒక్కటే..
ప్రధాని మోదీ-వైసీపీ నేత జగన్మోహన్‌రెడ్డి ఒక్కటేనని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. జగన్ దొంగనాటకాలాడుతూ దొంగబ్బాయిగా పేరు తెచ్చుకున్నారన్నారు. మోడీ చంద్రబాబును విమర్శించి ఏపీ అంటే చులకనగా చూస్తున్నారన్నారు. ప్రజల సమస్యలు పట్టని మోడీ ఎప్పుడూ విదేశాలలో తిరుగుతూ ఉంటారని, ఆయనకు 2019 ఎన్నికలో తెలుగు ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు. బీజేపీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబుపై అతీ దారుణమైన భాషతో విమర్శలు చేయడం సరికాదని, వారు పద్ధతి మార్చుకోవాలని సూచించారు. యూపీలో అఖిలేష్‌పై సీబీఐ విచారణ చేయడం చూస్తుంటే మోదీ పూర్తిగా నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. జగన్ తనపై ఉన్న కేసులను మాఫీ చేసుకునేందుకు మోడీని కనీసం ఒక్క మాట కూడా అనడం లేదని, ఎంపీల రాజీనామా, కోడి కత్తి దాడి వంటి డ్రామాలతో పబ్బం గడపాలని చూస్తున్నాడన్నారు.

ఈబీసీ బిల్లు అమలుచేసేవిధానాన్ని పార్లమెంట్‌లో వివరించలేదు
ఎస్సీ, ఎస్టీ కమిషనర్ ఛైర్మన్ కారెం శివాజీ
అమలాపురం,జనవరి 11: కేంద్ర ప్రభుత్వం అత్యవసరంగా ప్రవేశపెట్టిన ఈబీసీ బిల్లును స్వాగతిస్తున్నానని అయితే ఆబిల్లు రోష్టర్ పాయింట్ విధానాన్ని ఎలా అమలు చేస్తారో పార్లమెంటులో వివరించలేదని దీని ప్రభావం ఎస్సీ,ఎస్టీ,ఓబీసిల రిజర్వేషన్లకు తీవ్ర నష్టం కలుగుతుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ పేర్కొన్నారు. శనివారం ఆయన అయినవిల్లి మండలం మాగాం గ్రామం ఆయన స్వగృహంలో విలేఖర్లతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల కులాల్లో పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించిన బిల్లులో ఉన్న లోపాలు సవరిస్తే నిరుపేదలకు రిజర్వేషన్ ఫలాలు పూర్తిస్థాయిలో అందుతాయని శివాజీ అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల కులాల్లో వార్షికాదాయం 8లక్షలు మించకుండా ఉండాలనే నిబంధనను తొలగించి అగ్రవర్ణాల కులాల్లో ఇల్లు, సొంత భూమిలేకుండా వార్షికాదాయం రెండున్నర లక్షలులోపు ఉన్న నిరుపేదలకు ఈ రిజర్వేషన్లు వర్తించే విధంగా ముసాయిదా తయారు చేస్తే మరింత ప్రయోజనం ఉంటుందని శివాజీ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాపు,ముస్లీం మైనార్టీల రిజర్వేషన్లు పట్టించుకోకుండా ఈబీసీ 10శాతం రిజర్వేషన్లు పెట్టడంతో కాపు, ముస్లీం వర్గాలు ఆందోళన చెందుతున్నారన్నారు. దేశవ్యాప్తంగా ఈబీసీ రిజర్వేషన్లపై అగ్రవర్ణాల నిరుపేదలు ఉద్యమాలు చేసే అవకాశం ఉందని శివాజీ ఆందోళన వ్యక్తం చేసారు. భారత రాజ్యాంగాన్ని అవమాన పరస్తూ పార్లమెంటు సాక్షిగా ప్రకటించిన రాష్ట్ర విభజన హామీని పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఈబీసీ బిల్లు అత్యవసరంగా పెట్టడం వెనుక రాజకీయ ఎత్తుగడలు ఉన్నాయని శివాజీ అన్నారు. నేటికీ పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ప్రమోషన్ బిల్లు పక్కన పెట్టారని, మహిళలకు 33శాతం రిజర్వేషన్లు బిల్లును ఊసెత్తకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ ధోరణీ మహిళలను కించ పరచడమేనని శివాజీ ఆవేశం వ్యక్తం చేశారు.

అన్నక్యాంటీన్‌లలో హుండీలు పెట్టండి
కలెక్టర్‌కు నారాలోకేష్ సూచన
పిఠాపురం, జనవరి 11: జిల్లాలో ప్రారంభమైన అన్న క్యాంటీన్‌లన్నింటి వద్ద హుండీలను ఏర్పాటు చేయాలని మంత్రి నారా లోకేష్ కలెక్టర్ కార్తీకేయ మిశ్రాకు సూచించారు. పిఠాపురంలో శుక్రవారం లోకేష్ పర్యటన సందర్భంగా పిఠాపురం సినిమా సెంటర్ వద్ద నూతనంగా నిర్మించిన అన్న క్యాంటీన్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వర్మ, కలెక్టర్ కార్తీకేయ మిశ్రాలతో మాట్లాడుతూ అన్నక్యాంటీన్‌ల వద్ద హుండీలు ఏర్పాటు చేస్తే అక్కడ ఎంతో కొంత చందాలు వస్తాయి..దాంతో ఇంకా బాగా భోజనాలు పెట్టొచ్చని మంత్రి సూచించడంతో కలెక్టర్ దీనిపై పరిశీలిస్తామని చెప్పుకొచ్చారు. ఆతరువాత సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న మంత్రి ఆర్‌ఆర్‌బిహెచ్‌ఆర్ క్రీడా ప్రాంగణంలో బాస్కెట్ బాల్ కోర్టుకు ప్రారంరంభించారు. అనంతరం విద్యార్థులు, మహిళలతో ముచ్చటించిన మంత్రి సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. జన్మభూమి వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి డ్వాక్రా మహిళలు, వైద్య, వ్యవసాయశాఖ, ఉపాధి హామీ పథకం సిబ్బందితోనూ మాట్లాడి, ఆయా పథకాల అభివృద్ధిని తెలుసుకున్నారు. అంతకముందు చినరాజప్ప, ఎమ్మెల్యే వర్మతో కలిసి ట్రాక్టర్లను రైతులకు అందించారు. పిఠాపురంలో సభలో ఎమ్మెల్యే వర్మ మంత్రికి ఏలేరు-గోదావరి అనుసంధానమైన పురుషోత్తపట్నం పథకం ద్వారా వచ్చిన నీటితో పండిన పంట ధాన్యాన్ని మంత్రికి బహూకరించారు. పిఠాపురం పట్టణానికి, గొల్లప్రోలు, చేబ్రోలు, విరవాడ గ్రామాలకు అండర్ గ్రౌండ్ డ్రెయినేజీకి నిధులు ఇవ్వాలని మంత్రిని ఎమ్మెల్యే కోరారు. స్పందించిన లోకేష్ తప్పనిసరిగా నెరవేరుస్తామన్నారు. కాకినాడ ఆర్డీవో రాజకుమారి, సెట్రాజ్ సీఈవో మల్లిబాబు, పిఠాపురం,కొత్తపల్లి, గొల్లప్రోలు ఎంపీడీవోలు కెఎస్‌ఎస్ సుబ్బారావు, పి నారాయణమూర్తి, విజయథామస్, పిఠాపురం తహసీల్దారు సుగుణ, ఏడీఏ పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.
హోప్ ఐలాండ్ ప్రాంతంలో ఇసుక అక్రమ తవ్వకాలు అరికట్టాలి
జనసేన డిమాండ్
కాకినాడ సిటీ, జనవరి 11: కాకినాడ నగరానికి రక్షణ కవచంగా ఉన్న హోప్ ఐలాండ్ ప్రాంతంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలను అరికట్టాలని జనసేన పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాలతో ఆపార్టీ జనబాట ఇన్‌ఛార్జి పంతం నానాజీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట శుక్రవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ హోప్ ఐలాండ్ ప్రాంతంలో అక్రమంగా ఇసుకను తవ్వడంతో పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందని ఆరోపించారు. హోప్ ఐలాండ్‌కు నష్టం జరిగితే కాకినాడ నగరం కనుమరుగు అవుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు. భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాల కారణంగా మత్స్య సంపదకు నష్టం జరుగుతోందన్నారు. ఈ కారణంగా మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెల్లిన వారికి మత్స్య సంపద లక్ష్యంకాక ఉపాధిని కోల్పోతున్నారని ఆరోపించారు. హోప్ ఐలాండ్ ఇసుక అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని, కోరంగి అభయారణ్యాన్ని రక్షించాలని, సేవ్ కాకినాడ అనే నినాదంతో ప్రజలను జాగృతం చేసే కార్యక్రమాన్ని జనసేన పార్టీ నిర్వహిస్తుందన్నారు. కాకినాడలో నెలకొన్న నాగార్జున ఎరువుల కర్మాగారం వ్యర్ధాలతో సుముద్రంలో మత్స్య సంపదకు నష్టం జరుగుతోందని నానాజీ తెలియజేశారు. కర్మాగారం నుండి వెలువడే రసాయనాలు సముద్రంలో నేరుగా కలవకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మికుల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన సబ్సిడీ బకాయిలు రాకపోవడంతో పరిశ్రమ మూతపడే పరిస్థితులు నెలకొన్నాయని, దీనిపై పాలకులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి కార్మికులకు మేలుచేయాలని చెప్పారు. ఈ సందర్భంగా డీఆర్వోను కలసి ఓ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బుల్లబ్బాయిరెడ్డి, కార్పొరేటర్ మాకినీడి శేషుకుమారి, కడలి ఈశ్వరి, పెంకే రాధా మనోహర్, మచ్చ అప్పాజీ, సానా శ్రీనివాస్, మేడిశెట్టి శివ, తోటకూర సుబ్బారావు, టి బుజ్జి, ఆర్ కిషోర్, సతీష్, కె శ్రీను, వెంకటరమణ, టి సతీష్, శ్రీనివాస్, బూరయ్య, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కనీస వేతనాలను చెల్పించాలని డిమాండ్ చేస్తు దీక్ష చేపట్టిన మీసేవా కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను పంతం నానాజీ కలసి వారికి సంఘీభావం తెలియజేశారు. మీసేవ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అమలుచేయలేని హామీలతో ప్రజలను మోసగించలేరు
జగన్‌పై పంచాయతీ శాఖ మంత్రి నారా లోకేష్ విమర్శలు
పెద్దాపురం, జనవరి 11: వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అధికారమే పరమావధిగా అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చి తెలుగు జాతిని మోసగించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అటువంటి హామీలకు, మోసపూరిత ప్రచారాలకు ప్రజలు మోస పోరన్నారు.పట్టణంలో రూ.1.20 కోట్లలో నిర్మించిన మండల పరిషత్ కార్యాలయాన్ని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప, శాసన మండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యంతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్మన్ రాజా సూరిబాబు రాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో లోకేష్ మంత్రి మాట్లాడుతూ వైసీపీ పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. ఇప్పుడు కొత్తగా ఆవు, అంబులెన్స్ డ్రామా ఆడుతున్నారన్నారు. అంబులెన్స్‌లు రావడం లేదంటూ ఆయన అసత్య ప్రచారం చేస్తున్నారని, ఆయన సభకు మధ్యలో ఒక ఆవు అడ్డుగా వస్తే, అది తెలుగుదేశం ఆవుఅని, సీఎం చంద్రబాబు పంపిన ఆవు అంటూ విమర్శిస్తూ, మరో డ్రామ ఆడుతున్నారని విమిర్శించారు. 28 కేసుల్లో ఏ-1 ముద్దాయిగా ఉండి, 16 నెలల పాటు జైల్‌లో ఉండి వచ్చారన్నారు. తెలుగుజాతితో పెట్టుకుంటే మాడి మసి కాక తప్పదని ఆయన జగన్, మోదీలను హెచ్చరించారు. రాష్ట్రానికి హోదా ఇవ్వకుండా మోసం చేసిన ప్రధాని మోదీని విమర్శించకుండా, 68 ఏళ్ల వయస్సులో కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించడం ఎంత వరకూ సమంజసమన్నారు. 2019 ఎన్నికల్లో జగన్,మోదీ జోడీని ప్రజలు చిత్తుగా ఓడిస్తారన్నారు. తెలుగు దేశం పార్టీని రెండవసారీ గెలిపించుకోవడం ద్వారా ప్రభుత్వాన్ని మళ్లీ తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 25 ఎంపీ సీట్లను తెలుగు దేశం తరుపున గెలిసిస్తే రాబోయే రోజుల్లో కేంద్రంలో కీలక పాత్ర పోషించి, ప్రధాని ఎంపికలో, జాతీయ రాజకీయాల్లో ప్రధాన పాత్ర వహిస్తామన్నారు. అర్ధాంతరంగా హైకోర్టును విభజించిన కేంద్రం జగన్‌పై ఉన్న కేసులను నీరుగార్చే ప్రయత్నం చేస్తుందన్నారు. అభివృద్ధిని కాంక్షించే వ్యిక్తిని, రాష్ట్రాన్ని దేశంలో బలమైన శక్తిగా మార్చిన ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రజలు అండగా నిలవాలన్నారు. రాష్ట్రానికి పలు ఐటీ కంపెనీలు తీసుకు వచ్చి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. యువత భవిష్యత్ కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలంతా కలిసి రావాలన్నారు.
అనంతరం హోం మంత్రి చిన రాజప్ప మాట్లాడుతూ, నియోజకవర్గాన్ని అభివృద్ధి పధంలో నడిపించడానికి మంత్రి లోకేష్ అందించిన సహకారం మరువలేనిదన్నారు.పంచాయితీ రాజ్ శాఖ ద్వారా అడిగినన్ని నిధులు కేటాయించిన తనకు ప్రోత్సాహాన్ని అందించారని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా నియోజక వర్గంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఒకే గొడుగు కిందకు తీసుకు వస్తున్నామన్నారు. శాసన మండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, కేంధ్ర ప్రభుత్వంలో నాలుగున్నరేళ్లుపాటు కలిసి పని చేసినా రాష్ట్రానికి ఉపయోగం లేకుండా పోయిందన్నారు.అందుకే కేంధ్రంతో విభేదించి,పోరు బాట పట్టాన్నారు. ధర్మపోరాట దీక్షలతో కేంధ్రంపై యుద్ధం ప్రకటించామన్నారు. జగన్‌పార్టీ కేంద్రంతో లోపాయికారి ఒప్పందం చేసుకుని, రాష్ట్రాన్ని అగణదొక్కాలని చూస్తుందని విమర్శించారు. జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలులో జిల్లా ప్రధమ స్థానంలో నిలిచిందన్నారు. హోం మంత్రి చిన రాజప్ప, మంత్రి లోకేష్, ఇతర ప్రభుత్వ పెద్దల సహకారంతో జిల్లాకు అన్ని సంక్షేమ పథకాలను అధికంగా మంజూరు చేయించుకోగలిగామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వసంతరాయుడు, శాసన సభ్యులు పిల్లి అనంత లక్ష్మి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ జ్యోతుల నవీన్‌కుమార్, జిల్లా తెలుగు దేశం పార్టీ అద్యక్షుడు నామన రాంబాబు, ఎమ్మెల్సీలు చిక్కాల రామచంద్రరావు, అదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, ఎంపీడీవో పల్లాబత్తుల వసంతమాధవి, సమాచార ప్రచార శాఖ జిల్లా డైరెక్టర్ ఎం ఫ్రాన్సిస్, ఆర్ డబ్ల్యూఎస్ డీఈ కుమార్, పంచాయితీరాజ్ డీఈ హరినాధ్‌రావు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కౌన్సిలర్లు, జిల్లా పరిషత్ సభ్యుడు శివనాగరాజు, ఎంపీపీ గుడాల రమేష్, అన్నవరం దేవస్థానం పాలక మండలి సభ్యుడు కందుల విశే్వశ్వరరావు, గుడా డైరెక్టర్ ఎలిశెట్టి నాని, మార్కెట్ కమిటీ చైర్మన్లు ముత్యాల రాజబ్బాయి, శ్రీనివాసాచార్యులు,తదితరులు పాల్గొన్నారు.

రూ.2.45 కోట్లతో బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియం
రాజమహేంద్రవరంలో రూ.20 కోట్ల శాప్ నిధులు
ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేష్
ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, జనవరి 11: రాజమహేంద్రవరం నగరంలో రూ.20 కోట్ల శాప్ నిధులను క్రీడాభివృద్ధికి కేటాయించడం జరిగిందని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. స్థానిక రెండో డివిజన్ నారాయణపురంలో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ రూ.2.45 కోట్ల సాధారణ నిధులతో నిర్మించిన బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియాన్ని మంత్రి లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్‌కు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. డ్వాక్రా మహిళలు మంత్రి లోకేష్‌పై పూల వర్షం కురిపించారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఆరోగ్యాంధ్రప్రదేశ్‌కు స్టేడియాలు చాలా ఆధారమన్నారు. స్థానిక నగరపాలక సంస్థను మంత్రి లోకేష్ అభినందించారు. మేయర్ పంతం రజనీశేషసాయి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. ఈ ఇండోర్ స్టేడియం వల్ల జాతీయ స్థాయి క్రీడా ప్రమాణాలు లభించాయన్నారు. ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి మాట్లాడారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రగతిని మరో మలుపు తిప్పిన మంత్రి లోకేష్ క్రీడా వికాసానికి పంచాయతీరాజ్ శాఖ ద్వారా విశేష కృషి చేస్తున్నారన్నారు. తాను ఐదు సార్లు ఎమ్మెల్యే అయ్యాయని, ఇందులో ఈ సారి రూరల్ నుంచి ఎమ్మెల్యే అయ్యానని, ఈ నాలుగున్నరేళ్ళ కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎపుడూ లేని విధంగా వౌలిక సదుపాయాలు కల్పించడం మంత్రి లోకేష్ కృషి వల్లే సాధ్యమైందన్నారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరంలో రూ. కోట్లాది నిధులతో అభివృద్ధి జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం వద్ద లోటు బడ్జెట్ వున్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమం ఆగలేదంటే అది చంద్రబాబునాయుడు సామర్ధ్యమేనన్నారు.

స్వచ్ఛ భారత్‌పై ప్రజలు అవగాహన పెంచుకోవాలి
మేయర్ పావని పిలుపు
కాకినాడ సిటీ, జనవరి 11: స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై ప్రజలు అవగాహనను పెంపొందించుకోవాలని కాకినాడ మేయర్ సుంకర పావని పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ఫీల్డ్ అవుట్‌రీచ్ బ్యూరో ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఎఎస్‌డి ప్రభుత్వ మహిళా కళాశాల ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ యాక్షన్‌పై ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా మేయర్ పావని పాల్గొని మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై ప్రజలు అవగాహనను పెంపొందించుకుని ఆచరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంపై కేంద్ర ప్రభుత్వం కాకినాడ స్మార్ట్‌సిటీ చేపడుతున్న సదస్సులో అందరూ పాల్గొని సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్వచ్ఛ భారత్‌ను అందరూ ఆచరించడంద్వారా దేశాన్ని పరిశుభ్రమైన దేశంగా మార్చడంతోపాటు ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలతో సరిసమానంగా మార్చగలమని అభిప్రాయం వ్యక్తపరిచారు. ఫీల్డ్ పబ్లిసిటీ అధికారి షఫి మహ్మద్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద పారిశుద్ధ్య కార్యక్రమం స్వచ్ఛ భారత్ అని, ప్రజలు అందరూ పారిశుద్ధ్యాన్ని పాటిస్తే ప్రభుత్వం ఖర్చును తగ్గించడంతోపాటు, ప్రజలు ఆరోగ్యంగా, సుఖంగా జీవించవచ్చనన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వివిధ పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు. ఈసదస్సులో కళాశాల ప్రిన్సిపాల్ రత్నగిరి ఉష, అధ్యాపకులు, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం స్వచ్ఛ భారత్ ప్రాధాన్యతను తెలియజేస్తు విద్యార్ధులు ర్యాలీని నిర్వహించారు.

వెయ్యి నుండి రెండు వేలకు పింఛన్లు పెంపు
కాకినాడ రూరల్, జనవరి 11: వచ్చే నెల నుండి రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి రూపాయల పింఛను రెండు వేలుకు పెంచడంతో లబ్ధిదారుల్లో ఆనందం పెరిగిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి అన్నారు. జన్మభూమి-మా ఊరు ముగింపు కార్యక్రమాన్ని రమణయ్యపేట స్పందన ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంతలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక ప్రణాళికతో సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రజాభిమానాన్ని రెట్టింపు చేసుకుంటున్నారని అదేవిధంగా తమ నియోజకవర్గ అభివృద్ధిలో కూడా తాము ముందున్నామని అన్నారు. అనంతరం చంద్రన్న కానుకలు అందజేశారు. బాలబాలికలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. విద్యార్ధులు ప్రభుత్వ పధకాలను ప్రకార్లులతో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి, మండల ప్రత్యేకాధికారి, బిసి కార్పోరేషన్ ఇడి జ్యోతి, ఎంపిడిఓ సుభాషిణి, ఎంఇఓ గణేష్‌బాబు, తహశీల్దార్ సుబ్రమణ్యం, ఎఎంసి ఛైర్మన్ కర్రి వెంకట్రాజు, రాయుడు అనీల్ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ నేతల నిర్బంధం
పిఠాపురం, జనవరి 11: పిఠాపురం పట్టణంలో శుక్రవారం మంత్రి లోకేష్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడా అల్లర్లు జరగకుండా ముందస్తు అరెస్టు, గృహనిర్బంధాలు చేశారు. బీజేపీ కార్యాలయం వద్ద నేతలను అదుపుచేసి అక్కడే రోజంతా ఉంచారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు పసుపులేటి సత్యనారాయణ, సీనియర్ నాయకులు దాట్ల సూర్యనారాయణరాజు, అల్లుబోయిన సూరిబాబు, తోట ఏడుకొండలు తదితరులను పార్టీ కార్యాలయం వద్ద నుండి బయటకు వెళ్లకుండా నిర్బంధం చేశారు. దీనిపై బీజేపీ కార్యకర్తలు ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రకటన విడుదల చేశారు.

ధర పెరిగినా.. ఫలితం శూన్యం..!

$
0
0

ఉరవకొండ, జనవరి 11 : అరుగాలం శ్రమించి పండించిన టమోటా పంటకు మార్కెట్‌లో ధర పెరిగినా రైతుకు మాత్రం ఫలితం శూన్యం. టమోటాకు మార్కెట్‌లో రోజురోజుకూ ధర పెరుగుతోంది.
టమోటా రైతులకు మార్కెట్‌లో ధర పెరిగినా టమెట రైతుకు గిట్టుబాటు ధర కల్పించక పోవడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకుంది. కాని మార్కెట్‌లో మాత్రం రోజు రోజుకు ఆకశాన్ని అంటుకుంటుంది. దీంతో వ్యాపారస్థులు టమెట పండుగను జరుపుకుంటున్నారు. మూడు రోజుల క్రితం వ్యాపారులు కిలో టమోటాను రూ.1, రూ.2కు కొనుగోలు చేశారు. ఖరీఫ్ సీజన్‌లో వర్షాభావ పరిస్థితుల వల్ల వేరుశెనగ పంట దెబ్బతినడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటగా టమోటాను సాగు చేశారు. ఉరవకొండ వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో దాదాపు 5 వేల ఎకరాల్లో పంటను సాగు చేశారు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగు చేస్తే కనీసం రైతులకు మద్దతు ధర లభించకపోవడంతో ఆందోళన చెందారు. ఈనేపథ్యంలో పది రోజుల క్రితం 15 కిలోల టమోటా బాక్కును రైతుల నుంచి కేవలం రూ.15కే కొనుగోలు చేస్తున్నారు. దీంతో కనీసం కూలీలకు డబ్బులు రాని పరిస్థితి. చేలో పంటను కోసుకుని మార్కెట్‌కు తరలిస్తే అక్కడ వ్యాపారుల పలకరింపు కరువైంది. దీంతో వేరేచోటుకు వెళ్లలేక వారు చెప్పినంతకు అమ్మి వచ్చారు. కొంతమంది పొలాల్లోనే పంటను వదిలేశారు. అయితే ఉన్నఫలంగా మార్కెట్‌లో ధర పెరగడంతో వ్యాపారులే గ్రామాలకు వచ్చి మరీ టమోటాలను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం రైతు వద్ద 15 కిలో బాక్స్‌ను రూ.200 వరకు కొనుగోలు చేస్తున్నారు. అయితే మార్కెట్‌లో మాత్రం రూ.30 కిలో విక్రయిస్తున్నారు. రెండు రోజుల్లో సంక్రాంతి పండుగ ఉండటంతో ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉంది. అయినా రైతుల వద్ద మాత్రం అనుకున్న స్థాయిలో ధర పెరగడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి టమోటాకు మద్దతు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.

సంక్రాంతికి... సొంతూరికి ..
* ప్రయాణీకులతో కిక్కిరిసిన ఆర్టీసీ బస్టాండ్
అనంతపురం, జనవరి 11: నేటి నుండి పాఠశాలలకు, కళాశాలలకు సంక్రాంతి సెలవులు కావడంతో విద్యార్థులు శుక్రవారం ఉదయం నుండే తమ తమ సొంత ఊర్లకి బయలు దేరారు. విద్యార్థులతో పాటు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు కూడా సంక్రాంతి సెలవులకు తమ తమ ఊర్లకి తరలివెళ్లడంతో ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణీకులతో కిక్కిరిసింది. ఆర్టీసీ వారు దూరప్రాంతాలకు ప్రత్యేక బస్సులు వేసినప్పటికీ ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరిమితికి మించిన ప్రయాణీకులతో బస్సులు కిక్కిరిసాయి. ఈ రద్దీ నేడుకూడా కొనసాగనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

దారుణం!
* భార్యను గొడ్డలితో నరికి తానూ ఆత్మహత్య చేసుకున్న భర్త
ఉరవకొండ, జనవరి 11 : కట్టుకున్న భార్యను దారుణంగా గొడ్డలితో నరికి హత్య చేసి చెట్టుకు ఉరేసుకుని భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని వ్యాసాపురం గ్రామంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వ్యాసాపురం గ్రామానికి చెందిన మారెన్న (28) అర్ధరాత్రి గాఢనిద్రలో ఉన్న భార్య విశాలాక్షి (24)ని అతిదారుణంగా గొంత కోశాడు. అయినా కసి తీరకపోవడంతో గొడ్డలితో నరికాడు. అనంతరం తానూ ఊరి చివరకు వెళ్లి కత్తితో కోసుకున్నాడు. తర్వాత చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు వ్యాసాపురానికి చెందిన బోయ మారెన్న, అదే గ్రామానికి చెందిన విశాలక్షమ్మను 8 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఐదేళ్ల కుమారుడు వంశీ, ఏడాదిన్నర పాప హేమాంజలి ఉన్నారు. అయితే కొద్ది రోజుల నుంచి మారెన్నకు విశాలక్షమ్మపై అనుమానం రావడంతో రోజూ గొడవ పడేవారన్నారు. ఈనేపథ్యంలో గురువారం మద్యం తాగి వచ్చిన మారెన్న విశాలాక్షితో గొడవకు దిగాడు. కొంతసేపటి అనంతరం ఇద్దరూ నిద్రపోయారు. అయితే అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మారెన్న కత్తితో విశాలాక్షి గొంతు కోశాడు. అనంతరం ఇంట్లో ఉన్న గొడ్డలితో చేయి, మెడపైన అతి దారుణంగా నరికి హత్య చేశాడు. అనంతరం ఉరి చివరకు వెళ్లి తానూ కత్తితో పొడుచుకున్నాడు. తర్వాత చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం గమనించిన స్థానికులు ఉరవకొండ పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి సీఐ చిన్నగౌస్, ఎస్సై సుధాకర్ యాదవ్ చేరుకుని పరిస్థితిని సమీక్షించి స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శవాలను పోస్టుమార్టం నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అండగా ఉంటే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా..
* మంత్రి కాలవ శ్రీనివాసులు
డీ.హీరేహాల్, జనవరి 11 : మీ అండదండలు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీస్సులు ఉన్నంతవరకు అమరావతి నుంచి నిధులు తెచ్చి నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం మండలంలోని జాజురకల్లు గ్రామంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కొత్తలో ఈప్రాంతవాసులు తనను ఆదరించి పట్టం కట్టారని, మీ నమ్మకాన్ని వమ్ముచేయకుండా 40 ఏళ్లలో జరగని అభివృద్ధి చేసి చూపించానన్నారు. నాప్రాణంగా, ప్రజలే నా ఊపిరిగా ధృడ సంకల్పంతో అభివృద్ధికి బాట వేశానన్నారు. అందుకు ప్రజల సహకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు అండదండలు ఉండడం వల్లే సాధ్యమైందన్నారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని సస్యశ్యామలం చేయడమే తన సంకల్పమన్నారు. ఇదే స్ఫూర్తితో వచ్చే ఎన్నికల్లో చంద్రన్న పాలనను దృష్టిలో ఉంచుకుని టీడీపీకి మళ్లి పట్టం కడితే ఆనందరాష్ట్రంగా, అభివృద్ధి రాష్ట్రంగా తయారు చేస్తామన్నారు. అనంతరం యాపిల్ ఉక్కు పరిశ్రమ యాజమాన్యం పంట నష్ట పరిహారం కింద రూ. 14.39 లక్షల చెక్కులను 293 మంది రైతులకు పంపిణీ చేశారు. అలాగే మడనేహళ్లిలో ఆడపడచులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. గ్రామంలో రూ.9 లక్షలతో నిర్మిస్తున్న కమ్యూనిటీ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. అలాగే బళ్లారి-బెంగుళూరు రాష్ట్ర రహదారి నుండి కర్నాటక సరిహద్దు వరకు రూ.4 కోట్లతో 7.8 కిలోమీటర్ల వరకు బీటీ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు.

భారతీయ సంస్కృతి మేళవింపు
* అద్భుతం సత్యసాయి క్రీడా సమ్మేళనం
పుట్టపర్తి, జనవరి 11 : భారతీయ సంస్కృతిని మేళవిస్తూ సత్యసాయి సాంస్కృతిక క్రీడా సమ్మేళనం అద్భుతంగా జరిగింది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం భగవాన్ సత్యసాయి చిత్రపటాన్ని ఉంచిన ప్రత్యేక కారును హిల్‌వ్యూ స్టేడియంలో బ్రాస్‌బాండ్ పతంగుల రెపరెపల నడుమ సత్యసాయి డీమ్డ్ యూనివర్శిటీ పరివారం, సాయి విద్యార్థి ఘనం ఊరేగింపు క్రీడా వేదిక వద్దకు చేరుకుంది. వేద పఠనం, మంత్రోచ్ఛరణల నడుమ వైస్ ఛాన్స్‌లర్ కేబీ ఆర్ వర్మ జ్యోతి ప్రజ్వలన చేసి ఛాన్స్‌లర్ చక్రవర్తి ట్రస్టు సభ్యులు ఆర్ జే రత్నాకర్, ప్రసాద్‌రావు, నాగానంద, రిజిష్టర్ సాయిగిరిధర్ తదితరులు క్రీడా సమ్మేళనాన్ని ప్రారంభించారు. పుట్టపర్తి, అనంతపురం వైట్ ఫీల్డ్ బృందావనం, ముద్దనహళ్ళి క్యాంపస్ విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. అనంతరం బృందావన్ క్యాంపస్ విద్యార్థులు వివిధ క్రీడలు ప్రదర్శించారు. ఒల్లు గగుల్పొడిచే బైక్ విన్యాసాలు అగ్ని కీలలను జంపింగ్, జిమ్నాస్టిక్స్, బాగ్రా నృత్యం, చైనీ, డ్రాగెన్ నృత్యాలు, శ్రీకృష్ణ గోపిక ఆలాపనలు మార్షల్ ఆర్ట్స్, కర్రస్వామి, కత్తిసాము, పంజాబీ, సాంస్కృతిక నృత్యాలు, సాంకేతిక విప్లవాత్మక , సందేశాత్మక ప్రదర్శనలు, సాంస్కృతిక కళలు, వేలాదిమంది సాయి భక్తులు, విద్యార్థుల తల్లిదండ్రులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రతియేటా నిర్వహించబడే సాంస్కృతిక క్రీడలకు భిన్నంగా కాస్ట్యూమ్స్, ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. భగవాన్ సత్యసాయి బాబా విలువలతో కూడిన విద్యతోపాటు విద్యార్థులలో మానసికోల్లాసాన్ని నింపేందుకు ప్రసాదించిన క్రీడా సమ్మేళనం హిల్ వ్యూ స్టేడియంలో సాయి విద్యార్థుల ప్రదర్శనలు రంగరించాయి. శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ఈశ్వరమ్మ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ప్రైమరీ పాఠశాల విద్యార్థులు, నర్సింగ్ కళాశాల విద్యార్థుల ప్రదర్శనలు ఆహుతులను మిరిమిట్లు గొలిపేలా ఆనంద పరవశులను చేశాయి.

‘రక్ష’తో మహిళలకు రక్షణ
* మంత్రి పరిటాల సునీత
చెనే్నకొత్తపల్లి, జనవరి 11: ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన రక్ష పథకాన్ని రాష్ట్రంలోని మహిళలంతా వినియోగించుకోవాలని మంత్రి పరిటాల సునీత విజ్ఞప్తి చేశారు. రూ.125 కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని మహిళలందరికి నేప్కిన్స్‌ను పంపిణీ చేయనున్నామని ఆమె తెలిపారు. శుక్రవారం ఇక్కడ జరిగిన జన్మభూమి ముగింపు కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆమెమాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుంచడమే కాకుండా, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ ప్రజలందరి సంక్షేమమే ధ్యేయంగా పథకాలను ప్రవేశపెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కిందని అన్నారు. అలాగే వృద్ధులు, వితంతువులు, చేనేతలు, ఒంటరి మహిళలకు పించన్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పాలన పారదర్శకంగా జరగాలన్న ఉద్దేశ్యంతో జన్మభూమిమా ఊరు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని మంత్రి సునీత వెల్లడించారు. అధికారులే ప్రజల వద్దకు వచ్చి, సమస్యను పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆమె చెప్పారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందించాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందని మంత్రి పేర్కొన్నారు. నాలుగున్నర సంవత్సరాల కాలంలో రాప్తాడు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు, కమ్యూనిటీ భవనాలు నిర్మించామని చెప్పారు. ప్రజా సంక్షేమం కోరుకునే టీడీపీకే ప్రజలు మద్దతు పలకాలని మంత్రి ప్రజలకు తెలియజేశారు. చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కాబోతున్నారని మంత్రి సునీత సభలో ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె పించన్లు, గృహలు, ట్రాక్టర్లు మంజూరు పత్రాలను మంత్రి లబ్దిదారులకు అందచేశారు.

క్యాన్సర్ నిర్ధారణపై ఏకో టీం సభ్యుల ఆరా
* మండలంలో 12 మంది రోగుల గుర్తింపు
లేపాక్షి, జనవరి 11 : దేశంలోనే క్యాన్సర్ పరీక్షల గుర్తింపులో ఒకటైన ఏకో ట్రస్టు సభ్యులు గ్లోరియా నిషా లేపాక్షి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా డీఎంఅండ్‌హెచ్‌ఓ కేవీఎన్‌ఎస్ అనిల్‌కుమార్, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ దివాకర్ ఏకో సభ్యులతో పలు విషయాలపై చర్చించారు. ఏకో ట్రస్ట్ క్యాన్సర్ నిర్ధారణలో శిక్షణ కోసం దేశ వ్యాప్తంగా 37 మంది డాక్టర్లను ఎంపిక చేయగా అందులో లేపాక్షి పీహెచ్‌సీ వైద్యాధికారిణి శ్రీదేవి ఒకరు. డాక్టర్ శ్రీదేవి ఏకో ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో మూడు నెలలుగా శిక్షణ పొందుతున్నారు. ఇందులో భాగంగా ఆమె మండల వ్యాప్తంగా పలువురికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించి 12 మందికి క్యాన్సర్ ఉన్నట్లు నిర్థారించి ఆ విషయాలను ఏకో ట్రస్ట్‌కు ఎప్పటికప్పుడు అందజేస్తున్నారు. దీంతో ఏకో ట్రస్టు సభ్యులు గ్లోరియా నిషా లేపాక్షి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎంఅండ్‌హెచ్‌ఓ అనిల్‌కుమార్ గ్లోరియాతో పలు విషయాలపై చర్చించారు. క్యాన్సర్ వ్యాధిని గుర్తించేందుకు అత్యాధునిక పరికరాలను అందచేయాలని ఆమెను కోరారు. అదేవిధంగా శాఖాపరంగా లేపాక్షి పీహెచ్‌సీకి అవసరమైన సదుపాయాలను కల్పిస్తామన్నారు. డాక్టర్ శ్రీదేవి క్యాన్సర్ వ్యాధి నిర్థారణ కోసం చేస్తున్న కృషిని నిషా ప్రశంసించారు. దేశ ఏకో క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ముఖ్యాధికారి డాక్టర్ సంజయ్ అరోరా డాక్టర్ శ్రీదేవి అందిస్తున్న వైద్య సేవలపై ప్రధానమంత్రి కార్యాలయానికి తెలియజేసినట్లు తెలిపారు. అదేవిధంగా బిసలమానేపల్లి సబ్ సెంటర్‌ను పరిశీలించారు. తర్వాత లేపాక్షి ఆలయాన్ని సందర్శించారు.

ఏదైనా జరిగితే మీరే భరించాలి..
* క్వార్ట్జ్ లీజుదారులతో గ్రామస్థులు
గుంతకల్లు, జనవరి 11 : కాలుష్య రహిత తవ్వకాలు, వాతావరణ కాలుష్యంతోపాటు ప్రజలు, పంటలకు నష్టం వాటిల్లితే క్వార్ట్జ్ లీజుదారులే భరించాలని గ్రామస్థులు తెలిపారు. మండలంలోని అమీన్‌పల్లి, ములకలపెంట గ్రామాల మధ్య ఉన్న తెల్లకొండ క్వార్ట్జ్ లీజు విషయంగా శుక్రవారం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయి ఉపాధి, ఉద్యోగాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో క్వార్ట్జ్ లీజుకు ఇవ్వడం వల్ల గ్రామంలోని కొంతమందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. ఇందుకు రైతులు స్పందిస్తూ క్వార్ట్జ్ తవ్వకాల సమయంలో భారీ పేలుళ్లు నిర్వహించరాదన్నారు. ఒకవేళ తవ్వకాల కారణంగా కాలుష్యం ఏర్పడి పంటలు నష్టపోతే నష్టాన్ని లీజుదారులు భరించాలని సూచించారు. అదేవిధంగా మైనింగ్ తరలించే క్రమంలో వాహనాల దుమ్మూధూళి రాకుండా లారీలకు పూర్తిగా ప్యాక్ చేసుకుని వెళ్లాలన్నారు. అదేవిధంగా ప్రమాదాలు సంభవిస్తే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు గ్రామంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా పాతకొత్తచెరువు నుంచి రైల్వే స్టేషన్‌కు రోడ్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు క్వార్ట్జ్ లీజుదారులు, అధికారులు అంగీకరించారు. దీంతో ప్రజాభిప్రాయ సేకరణతోపాటు మైనింగ్ తవ్వకాలపై కాలుష్య నియంత్రణ బోర్డుకు నివేదికలు సమర్పిస్తామన్నారు.
అండగా ఉంటే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా..
* మంత్రి కాలవ శ్రీనివాసులు
డీ.హీరేహాల్, జనవరి 11 : మీ అండదండలు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీస్సులు ఉన్నంతవరకు అమరావతి నుంచి నిధులు తెచ్చి నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం మండలంలోని జాజురకల్లు గ్రామంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కొత్తలో ఈప్రాంతవాసులు తనను ఆదరించి పట్టం కట్టారని, మీ నమ్మకాన్ని వమ్ముచేయకుండా 40 ఏళ్లలో జరగని అభివృద్ధి చేసి చూపించానన్నారు. నాప్రాణంగా, ప్రజలే నా ఊపిరిగా ధృడ సంకల్పంతో అభివృద్ధికి బాట వేశానన్నారు. అందుకు ప్రజల సహకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు అండదండలు ఉండడం వల్లే సాధ్యమైందన్నారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని సస్యశ్యామలం చేయడమే తన సంకల్పమన్నారు. ఇదే స్ఫూర్తితో వచ్చే ఎన్నికల్లో చంద్రన్న పాలనను దృష్టిలో ఉంచుకుని టీడీపీకి మళ్లి పట్టం కడితే ఆనందరాష్ట్రంగా, అభివృద్ధి రాష్ట్రంగా తయారు చేస్తామన్నారు. అనంతరం యాపిల్ ఉక్కు పరిశ్రమ యాజమాన్యం పంట నష్ట పరిహారం కింద రూ. 14.39 లక్షల చెక్కులను 293 మంది రైతులకు పంపిణీ చేశారు. అలాగే మడనేహళ్లిలో ఆడపడచులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. గ్రామంలో రూ.9 లక్షలతో నిర్మిస్తున్న కమ్యూనిటీ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. అలాగే బళ్లారి-బెంగుళూరు రాష్ట్ర రహదారి నుండి కర్నాటక సరిహద్దు వరకు రూ.4 కోట్లతో 7.8 కిలోమీటర్ల వరకు బీటీ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు.

హత్యకేసులో వ్యక్తికి యావజ్జీవ శిక్ష
అనంతపురం, జనవరి 11 : బత్తలపల్లి మండలం మాల్యవంతం గ్రామంలో మూడేళ్ల కిందట జరిగిన హత్యకేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ.20వేలు జరిమానా విధిస్తూ ఫస్ట్ ఏడీజే కోర్టు జడ్జి మేరీ గ్రేస్ కుమారి శుక్రవారం తీర్పు వెలువరించారు. కేసు వివరాల్లోకి వెళ్తే 2015 సంవత్సరం 25వ తేదీన మాల్యవంతం గ్రామానికి చెందిన గజ్జల కుళ్లాయప్పను అదే గ్రామానికి చెందిన బాల కుళ్లాయప్ప కట్టెతో దాడి చేసి చంపాడు. ఈకేసులో బాలకుళ్లాయప్పకు యావజ్జవ శిక్ష, రూ.20వేలు జరిమానా విధించారు. బాలకుళ్లాయప్ప భార్యతో గజ్జల కుళ్లాయప్ప అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈవిషయంలో బాలకుళ్లాయప్ప పలుమార్లు హెచ్చరించినా అతనిలో మార్పు రాలేదు. దీనితో బాలకుళ్లాయప్ప తన ఇంటిలో ఒంటరిగా ఉన్న కుళ్లాయప్పను హతమార్చాడు. దీంతో బత్తలపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని సమగ్ర దర్యాప్తు చేపట్టి నివేదికను కోర్టుకు సమర్పించారు. అన్ని కోణాల్లో విచారణ చేపట్టిన జడ్జి శిక్ష, జరిమానా విధించారు.

భయం గుప్పెట్లో అభంగాపూర్!

$
0
0

నారాయణపేటటౌన్, జనవరి 11: పగలు, ప్రతీకారాలు, హత్యలతో గత పాతిక సంవత్సరాలుగా అట్టుడుకుతున్న అభంగాపూర్ గ్రామం తాజాగా ఆశప్ప అలియాస్ అశోక్‌పై ఎన్నికల వేళ జరిగిన దాడి నేపథ్యంలో అట్టుడుకి పోతోంది. పాతికేళ్లుగా రెండు కుటుంబాల మధ్య వైరం నేటికి చల్లారకపోవడం విశేషం. గత కొంతకాలంగా గ్రామంలో ఎలాంటి విభేధాలు లేకుండా ఉన్నా ఆశప్పపై గత రెండు రోజుల క్రితం మరికల్ మండల కేంద్రం సమీపంలో మారణాయుధాలు, వేటకొడవళ్లతో దాడి చేయడంతో గ్రామం అట్టుడుకిపోతోంది. ఎప్పుడు ఏమి జరుగుతుందో అంతుచిక్కక గ్రామస్థులు ఇళ్ల నుండి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఇతర ప్రాంతాల నుండి గ్రామంలోని తమ బంధువుల వద్దకు వచ్చేందుకు సైతం గ్రామానికి చెందిన వారి బంధువులు వెనకంజ వేస్తున్నారు. అయితే గ్రామంలో గత మూడు రోజులుగా పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేసి బందోబస్తును పర్యవేక్షిస్తున్నా గ్రామస్థులు మాత్రం భయం నీడన కాలంగడుపుతున్నారు. గ్రామానికి చెందిన అనేక మంది తమ సెల్‌ఫోన్లను సైతం స్విచాఫ్ చేసుకుని ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. అభంగాపూర్ ఘటకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. భూతగాదాల నేపథ్యంలో 1996లో చెన్నప్ప వర్గం, ఆశప్ప అలియాస్ అశోక్ వర్గాల మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుండి ఆశప్ప వర్గం పైచేయిగా ఉండగా తాజాగా మరికల్ వద్ద జరిగిన హత్యాయత్నం ఘటన గ్రామస్థులను ఉక్కిరిబిక్కిరి చేసింది. 1996లో ఆశప్ప అలియాస్ అశోక్ తన ఇంటికి రోడ్డు వేయించుకోగా అది గిట్టని మాజీ సర్పంచ్ చెన్నప్ప అడ్డుకున్నట్లు అప్పట్లో ఆరోపణలు రేగాయి. ఈ విషయమై ప్రశ్నించేందుకు ఆశప్ప వెళ్లగా చెన్నప్ప అతడిపై దాడి చేసినట్లు గ్రామస్థులు చెబుతారు. సిపిఐ(ఎంఎల్) నేతలు జోక్యం చేసుకుని ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చారు. తదనంతరం 1996లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో చెన్నప్ప మరోమారు సర్పంచ్‌గా గెలవడంతో రెండు వర్గాల మధ్య విభేధాలు తీవ్రమయ్యాయి. ఈ సమయంలోనే చెన్నప్ప ఇంటిపై బాంబుదాడి జరిగింది. ఈ కేసులో ఆశప్ప పాత్ర ఉందని అప్పట్లో కేసు నమోదైంది. ఎలాగైనా ఆశప్పను హతమార్చాలనే ఉద్దేశ్యంతో చెన్నప్ప వర్గం వారు దాడి చేయాలని ప్రయత్నించగా ఆశప్ప తప్పించుకున్నారు. 2001జూన్ 10న కోయిల్‌కొండ మండలం వింజమూరు గ్రామ సమీపంలో అభంగాపూర్‌కు వెళుతున్న బస్సులో ప్రయాణిస్తున్న గుండప్ప, వెంకటప్ప అనే యువకులు చెర్లపల్లి స్టేజ్ సమీపంలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఆశప్ప వర్గీయులపై కేసు నమోదైంది. అప్పటి నుండి ఆ వర్గం గ్రామాన్ని వదిలారు. అయితే ఎలాగైనా సరే ఆశప్ప వర్గాన్ని అంతమొందించాలని చెన్నప్ప వర్గీయులు 2002 ఏప్రిల్ 3న నారాయణపేట కోర్టు దగ్గర మాటు వేసి హత్య చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. అయితే చెన్నప్ప వర్గానికి చెందిన రాములు, దస్తప్ప, దేవప్ప, వెంకటప్ప, నారాయణ, నర్సిములు కోర్టు ప్రాంగణంలోనే తిష్టవేశారు. కోర్టుకు హాజరైన జక్కన్నగారి రాములు వీరి కదలికలను పసిగట్టి అప్పటి కోర్టు కానిస్టేబుల్ భీంరెడ్డికి సమాచారం అందించగా అప్పటి డిఎస్పీ సత్యనారాయణ, సిఐ పాండునాయక్, ఎస్‌ఐలు భాస్కర్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ రాములు, కానిస్టేబుల్ బాలయ్య, అంజిలయ్య, ముస్తాక్‌లు జాగ్రత్తపడి వారిని పట్టుకుని కోర్టు ప్రాంగణంలో దాచిపెట్టిన వేటకొడవళ్లు, బాంబులు, నాటు తపంచాను స్వాధీనం చేసుకుని ఈ ఘటన నుండి ఆశప్ప వర్గీయులను రక్షించారు. అయితే 2004 మార్చి 18న నారాయణపేట కోర్టుకు హాజరవుతున్న నారాయణ, పెద్ద దస్తప్ప, చిన్న దస్తప్ప తదితరులు వస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఆశప్ప వర్గీయులు అప్పక్‌పల్లి గ్రామ సమీపంలో మాటు వేసి మారణాయుధాలతో దాడి చేయగా నారాయణ, పెద్ద దస్తప్పలు మృతి చెందారు. ఈ ఘటనతో రెండు వర్గాల మధ్య మళ్లీ కక్షలు పెరిగాయి. తాజాగా మరికల్ సమీపంలో చెన్నప్ప వర్గీయుడైన విజయ్‌కుమార్ తన అనుచరులతో కలసి ఆశప్పపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయమై ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టిన పోలీసులు పూర్తి వివరాలు సేకరించిన అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరచే ఏర్పాట్లు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కాగా గ్రామ ప్రజలు గ్రామంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో అంటూ భయాందోళనల మధ్య బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు.

ఆవుకు కవల దూడల జననం
బిజినేపల్లి, జనవరి 11: మండలంలోని మంగనూరు గ్రామానికి చెందిన చిన్నగల్ల రాజు అనే రైతుకు చెందిన పాడి ఆవు కవల లేగదూడలకు జన్మనిచ్చిన అరుదైన సంఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. ఆవుకు ఒక మగ, ఒక ఆడ దూడలు పుట్టడం పట్ల రైతు రాజు ఆనందం వ్యక్తం చేశారు. కవల దూడలను చూడడానికి చుట్టుపక్కల ప్రజలు వచ్చి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఘనంగా గోపూజ కార్యక్రమం
ధన్వాడ, జనవరి 11: మరికల్ మండల కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర దేవాలయంలో శుక్రవారం తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వర దేవాలయం వారి అధ్వర్యంలో గోపూజ కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. ఈపూజ కార్యక్రమాన్నికి గ్రామస్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం ప్రజలు గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ప్రజలు మొక్కలను తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి వేంకటేశ్వర , హిందూ ధర్మ ప్రచార కమిటిసభ్యులు నాగ శివలక్ష్మీ, మరికల్ గ్రామస్తులు సీమరాములు, తిరుపతయ్య, శ్రీనివాసులు, ఆనంద్‌కుమార్, సాయప్ప, శివ, రాయుడు తదితరులు పాల్గొన్నారు.

నామినేషన్లు షూరూ

మహబూబ్‌నగర్, జనవరి 11: పల్లెల్లో గ్రామపంచాయతీ ఎన్నికల కోలహలం కొనసాగుతుంది. మొదటి విడతలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం పూర్తికాగా నామినేషన్ల పరిశీలన సైతం ముగిసింది. ఇక శుక్రవారం రెండవ విడత నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రెండవ విడతలో 22 మండలాల పరిధిలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. 546 గ్రామపంచాయతీలకు, 4838 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 13 వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 14వ తేదీన నామినేషన్ల పరిశీలన జరగనుంది. 15వ తేదీన అభ్యంతరాల స్వీకరణ, 16న అభ్యంతరాలపై విచారణ 17న అభ్యర్థుల తుది జాబితా ఎన్నికల అధికారులు విడుదల చేయనున్నారు. 25వ తేదీన రెండవ విడతలోని గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా శుక్రవారం కావడంతో మంచి మహుర్తంగా భావించిన నాయకులు గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానాలకు, వార్డు సభ్యులకు పోటీ చేసే ఆశవాహులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. రెండవ విడతలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలు మహబూబ్‌నగర్ జిల్లాలోని 7 మండలాల పరిధిలోని 243 గ్రామపంచాయతీలు, 2068 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని 8 మండలాల్లోని 141 గ్రామపంచాయతీలకు, 1240 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో 4 మండలాల పరిధిలోని 74 గ్రామపంచాయతీలకు, 716 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. వనపర్తి జిల్లాలో 5 మండలాల పరిధిలోని 88 గ్రామపంచాయతీలకు, 814 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు జిల్లాలో రెండవ విడతలోజరగనున్న పంచాయతీ ఎన్నికలు 22 మండలాల పరిధిలోని 546 మండలాలు, 4838 వార్డులకు ఈ నెల 25న పోలింగ్ జరగనుంది. మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో జడ్చర్ల, రాజాపూర్, బాలానగర్, మిడ్జిల్, నవాబుపేట, మహబూబ్‌నగర్, హన్వాడ మండలాలకు రెండవ విడత ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో కల్వకుర్తి, వెల్దండ, ఊర్కొండ, చారకొండ, తాడూరు, తెలకపల్లి, వనపర్తి జిల్లాలోని ఆత్మకూరు, అమరచింత, కొత్తకోట, మదనాపురం, పెద్దమందడి, జోగులాంబ గద్వాల జిల్లాలో మల్దకల్, అయిజ, వడ్డేపల్లి, రాజోలి మండలాల్లో రెండవ విడత ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. రెండవ విడతలో మొదటి రోజు నామినేషన్లు దాదాపు 846 దాఖలు అయ్యాయి. 1846 నామినేషన్లు ఉమ్మడి జిల్లాలో వార్డు సభ్యులకు నామినేషన్లు వేశారు. కాగా నామి
నేషన్ల స్వీకరణ కేంద్రాల దగ్గర ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. అయా పోలీస్‌స్టేషన్ల ఎస్సైలు ఎప్పటికప్పుడు క్లస్టర్ల దగ్గరకు వెళ్లి బందోబస్తును నిర్వహించారు.

నేటి నుంచి శ్రీశైలంలో
మకర సంక్రమణోత్సవాలు

శ్రీశైలంప్రాజెక్టు, జనవరి 11: మకర సంక్రాంతిని పురస్కరించుకొని ఈనెల 12నుంచి 18 వరకు శ్రీశైలం మహాక్షేత్రంలో బ్రహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి రామచంద్రమూర్తి తెలిపారు. ఈ భ్రమరాంభ మల్లికార్జునస్వామి ఆలయంలో పంచాహానిత, దీక్షాయుత పుశ్యశుద్ద షష్టి జనవరి 12 ఉదయం 8 గంటలకు యాగశాల ప్రవేశంతో ప్రారంభించి శివ సంకల్పం, గణపతి, చండీశ్వరుని పూజలు, కంకణధారణ, అఖండ దీపారాధన, పూజాహోమము, సాయంత్రం అంకురార్పణ, ధ్వజారోహణ నిర్వహించనున్నట్లు తెలిపారు. 18 వరకు ప్రతిరోజు స్వామి, అమ్మవార్లకు విశేషపూజలు జరుగుతాయని, 17 ఉదయం రుద్రయాగం, తీర్థోత్సవం, 18న పుష్పోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. 15న మకర సంక్రాంతి రోజున స్వామి, అమ్మవారి కళ్యాణోత్సవం జరుపనున్నట్లు తెలిపారు. ఈ వారం రోజులు ప్రతి రోజు స్వామి, అమ్మవార్లకు వాహనసేవలు నిర్వహిస్తామన్నారు. 13న భృంగివాహన సేవ, 14న రావణవాహన సేవ, 15న నందీవాహన సేవ, 16న పుష్పపల్లకి సేవ, 17న పూర్ణాహుతి, ధ్వజారోహణ, 18న అశ్వవాహన సేవలు జరగనున్నట్లు తెలిపారు. బ్రహోత్సవాల సందర్భంగా స్వామి, అమ్మవార్లకు జరిగే శాశ్వత ఆర్జీతసేవలు నిలిపివేసినట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

టెస్టు సిరీస్‌లో ఘన విజయంతో వనే్డ సిరీస్‌పై కనే్నసిన టీమిండియా

$
0
0

సిడ్నీ, జనవరి 11: ఆతిధ్య ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో 2-1తో అద్భుత విజయాన్ని అందుకున్న విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఇపుడు శనివారం నుంచి ప్రారంభం కానున్న మూడు వనే్డ సిరీస్‌లోనూ మరో విజయాన్ని అందుకునేందుకు సిద్ధమైంది. ఆసిస్‌లో ఏడు దశాబ్దాల తర్వాత తొలిసారి టెస్టు సిరీస్‌లో ఘన విజయాన్ని నమోదు చేసిన కోహ్లీ సేన రానున్న వరల్డ్ కప్‌కు పూర్తి సన్నద్ధతగా ఉన్నామని తెలిపేందుకు శనివారం నుంచి ప్రారంభం కానున్న తొలి వనే్డ ద్వారా ప్రపంచానికి చాటిచెప్పాలని ఉవ్విళ్లూరుతోంది. మహిళలపై టీమిండియా ఆటగాళ్లు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన జట్టు సారధి కోహ్లీ దాని ప్రభావం వనే్డ సిరీస్‌పై ఎంతమాత్రం లేదని అందుకు తగ్గట్టు జట్టు ఎంపిక జరుగనుందని స్పష్టం చేశాడు. తొలి వనే్డలో చోటు దక్కించుకున్న రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌తోపాటు బౌలింగ్‌తో దాడి చేసేందుకు వీలుగా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, ఖలీల్ అహమ్మద్, ఎడమచేతి వాటం స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, కేదార్ జాదవ్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కేదార్ జాదవ్, మహేంద్ర సింగ్ ధోనీ, అంబటి రాయుడు మిడిలార్డర్‌లో బరిలోకి దిగొచ్చు.

టాప్-3 బ్యాట్స్‌మెన్‌పైనే దృష్టి : ఫించ్

$
0
0

సిడ్నీ, జనవరి 11: పర్యాటక భారత్‌తో శనివారం జరిగే తొలి వనే్డలో ప్రత్యర్థి జట్టులోని తొలి ముగ్గురు ఆటగాళ్లను పడగొట్టడంపైనే తాము దృష్టిని కేంద్రీకరిస్తామని ఆతిధ్య ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ అన్నాడు. టెస్టు సిరీస్‌లో ఓటమిని చవిచూసిన ఆసిస్ శనివారం నుంచి ప్రారంభం కానున్న మూడు వనే్డల సిరీస్‌లో తన సత్తా చూపేందుకు సిద్ధమైంది. ప్రత్యర్థి టీమ్‌లోని టాప్-3 ఆటగాళ్లను ఆదిలోనే దెబ్బతీయడం ద్వారా వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తామని ఆసిస్ కెప్టెన్ స్పష్టం చేశాడు. ముఖ్యంగా శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని త్వరితగతిన పెవిలియన్ పంపేందుకు తాము ప్రణాళికను రచిస్తున్నామని అన్నాడు. గడిచిన 12 నెలల కాలంలో విరాట్ కోహ్లీ సగటు పరుగులు 133, శిఖర్ ధావన్ 75, రోహిత్ శర్మ 50. కనుక పరుగుల వరద సృషించగల అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌లను దెబ్బతీయడమే తమ ముందున్న కర్తవ్యమని పేర్కొన్నాడు. టాప్ ఆర్డర్‌ను దెబ్బతీయడం వల్ల మిడిలార్డర్‌లో రానున్న ధోనీ, దినేష్ కార్తీక్, కేదార్ జాదవ్‌ను పంపించడం సులువు అవుతుందని అన్నాడు.

విరాట్ కోహ్లీ, రవి శాస్ర్తీకి సిడ్నీ గౌండ్‌లో గౌరవ సభ్యత్వం

$
0
0

సిడ్నీ, జనవరి 11: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, జట్టు ప్రధాన కోచ్ రవి శాస్ర్తీకి అరుదైన గౌరవం దక్కింది. వీరిద్దరూ క్రికెట్‌కు అందించిన అపార సేవలకుగాను ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్‌సీజీ)లో శుక్రవారం గౌరవ సభ్యత్వాన్ని దక్కించుకున్నారు. 71 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై ఆతిధ్య జట్టును నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో ఓడించి భారత్ ఘన విజయాన్ని నమోదు చేసింది. ‘ఆసిస్ మైదానంపై తొలిసారిగా టెస్టు సిరీస్‌ను చేజిక్కించుకున్నందుకు ఎస్‌సీజీ అభినందనలు తెలుపుతోంది. ఇది అత్యద్భుతం. అతి పెద్ద క్రికెట్ దేశంగా వెలుగొందుతున్న భారత్ ఇంతటి ఘనత సాధించి క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేసింది’ అంటూ ఎస్‌సీజీ చైర్మన్ టోనీ షెపెర్డ్ తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్నాడు. కోహ్లీతోపాటు తనకు ఎస్‌సీజీలో గౌరవ సభ్యత్వం దక్కడం గొప్ప ఘనతగా అభివర్ణించాడు టీమిండియా కోచ్ రవి శాస్ర్తీ. ఈ సిడ్నీ మైదానంలో గౌరవ సభ్యత్వం పొందినవారిలో క్రికెట్ దిగ్గజాలు సచిన్ తెండూల్కర్, బ్రియాన్ లారా ఉన్నారు.


రాహుల్, పాండ్యపై నిషేధం

$
0
0

సిడ్నీ, జనవరి 11: ఆస్ట్రేలియా గడ్డపై 71 ఏళ్ల తర్వాత తొలిసారిగా టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్నామన్న విజయగర్వంతో ఉన్న టీమిండియాకు కాఫీ విత్ కరణ్ టీవీ షోలో మహిళలపై అనుచితంగా, అసభ్యకరంగా యువ క్రికెటర్లు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఈ ఏడాది ఇంగ్లాండ్‌లో ప్రారంభమయ్యే వరల్డ్ కప్‌కు ఇప్పటినుంచే సన్నాహాలు మొదలుపెట్టిన నేపథ్యంలో వారిద్దర్నీ శనివారం ఆతిధ్య ఆస్ట్రేలియాతో జరుగనున్న తొలి వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో ఆడకుండా బీసీసీఐ తాజాగా నిర్ణయం తీసుకుంది. అయితే, రాహుల్, పాండ్య మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఒక మ్యాచ్‌లో ఆడకుండా సస్పెండ్ చేసిన నేపథ్యంలో వారిపై తదుపరి చర్యలు తీసుకునేందుకు వీలుగా సమగ్ర దర్యాప్తు చేపడతామని పాలక వర్గ కమిటీ (సీఓఏ) చైర్మన్ వినోద్ రాయ్ స్పష్టం చేశాడు. అయితే, యువ క్రికెటర్లు మహిళలపై చేసిన వ్యాఖ్యలు అసభ్యకరంగా, నిస్సిగ్గుగా ఉన్నాయని, తమ వ్యాఖ్యలపై వారిద్దరూ క్షమాపణలు కోరినా సరిపోవని, వారిని సస్పెండ్ చేయాలని సీఓఏ సభ్యురాలు డయానా ఎడుల్జీ డిమాండ్ చేశారు. సీఓఏ చైర్మన్ వినోద్ రాయ్ పాండ్య, రాహుల్‌పై రెండు వనే్డల్లో నిషేధం విధించాలని అభిప్రాయపడగా, ఈ అంశాన్ని బీసీసీఐ లీగల్ సెల్‌కు పంపాలని డయానా కోరారు. అయతే, క్రికెటఠ్ల వ్యాఖ్యలు బీసీసీఐ నిబంధనల ఉల్లంఘన కిందకు రాదని చెప్పడంతో వారిని సస్పెండ్ చేశారు. కాగా, పాండ్య, రాహుల్ వ్యాఖ్యలు ఎంతమాత్రం సమర్థనీయం కావని, వీటిని టీమిండియా ఎంతమాత్రం సహించబోదని కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. మహిళలపై ఆ యువ ఆటగాళ్ల వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కావని, ఆ వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమైనవని, వాటి ప్రభావం జట్టుపై ఏమాత్రం పడదని అంటూ వారి వ్యాఖ్యలు వారి విచక్షణకే వదిలేస్తున్నానని అన్నాడు. వీరిద్దరూ తదుపరి మ్యాచ్‌లలో ఆడేది లేనిదీ అనే విషయమై బీసీసీఐ తుది తీర్పు కోసం ఎదురు చూస్తున్నామని అన్నాడు. ఏడాది వరల్డ్ కప్ సన్నద్ధమవుతున్న తరుణంలో అత్యుత్సాహంతో ఆ ఇద్దరు క్రికెటర్లు చేసిన వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నాడు. అయినా, ఇవేమీ తమ జట్టుపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపబోవమని తాము బలంగా నమ్ముతున్నామని అన్నాడు. ఒక మ్యాచ్‌లో సస్పెన్షన్ నేపథ్యంలో శనివారం ఆస్ట్రేలియా-్భరత్ మధ్య జరిగే తొలి వనే్డలో పాండ్య, రాహుల్ ఆడేందుకు అవకాశం లేదని బీసీసీఐ అధికార వర్గాలు పీటీఐ ప్రతినిధికి తెలిపాయి. ఈ యువ బ్యాట్స్‌మెన్‌లపై ఒక మ్యాచ్‌కు సస్పెండ్ చేయడంతో వారు చేసిన వ్యాఖ్యలపై సమగ్ర విచారణ చేపడతామని సీఓఏ చైర్మన్ వినోద్ రాయ్ పీటీఐ ప్రతినిధికి తెలిపాడు.
బీసీసీఐ అంతర్గత కమిటీ లేదా అడ్‌హాక్ అంబుడ్స్‌మన్ కమిటీ దీనిపై విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఇద్దరు ఆటగాళ్లు చేసిన వ్యాఖ్యలు క్రికెట్ క్రీడా నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తాయా లేదా అన్న విషయమై వ్యాఖ్యానించేందుకు బీసీసీఐ లీగల్ టీమ్ నిరాకరించింది. ఇప్పటికే టీమిండియా జట్టుతో ఆస్ట్రేలియాలో ఉన్న రాహుల్, పాండ్యను స్వదేశానికి రప్పించేందుకు, వారి స్థానంలో రిషబ్ పంత్, మనీష్ పాండ్యను తీసుకునే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి. అదేవిధంగా విజయ్ శంకర్, శ్రేయాస్ అయ్యర్‌ను జట్టులోకి తీసుకున్నా ఆశ్చర్యపడాల్సిన పని లేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
పాండ్య స్థానే జడేజా: కోహ్లీ
ఆస్ట్రేలియాతో శనివారం జరిగే తొలి వనే్డలో తొలుత చోటుదక్కించుకుని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సస్పెండైన యువ బ్యాట్స్‌మన్ హార్దిక్ పాండ్య స్థానంలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు చోటుదక్కింది. పాండ్య, రాహుల్ చేసిన వ్యాఖ్యలతో తాను ఎలాంటి ఒత్తిడి గురికాలేదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఇద్దరు యువ ఆటగాళ్లపై తొలి వనే్డకు నిషేధం విధించిన నేపథ్యంలో దాని ప్రభావం మ్యాచ్‌లపై ఎంతమాత్రం పడబోదని కోహ్లీ అన్నాడు. ‘ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన ఫింగర్ స్పిన్నర్, రిస్ట్ స్పిన్నర్‌తో బరిలోకి దిగాం, ఇపుడు తొలి వనే్డలో పాండ్య స్థానే జట్టులోకి తీసుకుంటున్న రవీంద్ర జడేజా కీలక భూమిక పోషించగలడని నమ్ముతాం’ అని కోహ్లీ అన్నాడు. కొన్ని సందర్భాల్లో అక్కరకు వచ్చేందుకు కొంతమంది ఆటగాళ్లను తామెప్పుడూ సిద్ధంగా ఉంచుతామని, కనుక ఆసిస్‌తో జరిగే తొలి వనే్డలో సమతూకం పాటించడం ద్వారా తాము ఎలాంటి ఒత్తిడికి గురికాబోమని స్పష్టం చేశాడు. ఇద్దరు కీలక ఆటగాళ్లను తప్పించినంతమాత్రాన దాని ప్రభావం మారిన జట్టుపై ఎలాంటి ప్రతికూల వాతావరణం చూపబోదని అన్నాడు. రానున్న వరల్డ్ కప్ కంటే ముందు ఆడేందుకు మరీ ఎక్కువ మ్యాచ్‌లు లేనందువల్ల తాము ఆటగాళ్లపై ఒత్తిడి పెంచకుండా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నాడు. ఇందులో భాగంగానే జస్ప్రీత్ బుమ్రాపై ఒత్తిడి పెరగకుండా టెస్టు సిరీస్ తర్వాత విశ్రాంతి కల్పించామని అన్నాడు. వరల్డ్ కప్‌లో పూర్తిగా అటాక్ చేసేందుకు వీలుగా పలువురు పేసర్ల సేవలను వినియోగించుకునే ఆలోచన కూడా ఉందని అన్నాడు.
రిటైర్మెంట్ అయితే బ్యాట్ పట్టను :
విరాట్ కోహ్లీ
క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించే రోజు వస్తే ఆ తర్వాత బ్యాట్ పట్టే అవకాశం లేదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. కొంతమంది ఆటగాళ్లు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత టీ-20 వంటి లీగ్ మ్యాచ్‌లలో ఆడుతున్న నేపథ్యంలో సంచలన ప్రకటన చేశాడు. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాక ఆస్ట్రేలియా బిగ్ బాష్‌తోపాటు పలు లీగ్ మ్యాచ్‌లలో ఆడే అవకాశం ఉందా అన్న మీడియా ప్రశ్నలకు కోహ్లీ తన వైఖరిని మరోసారి స్పష్టం చేస్తూ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తే బ్యాట్ పట్టేది లేదని అన్నాడు. క్రికెట్‌లోనే ఎక్కువ కాలం కొనసాగాలని అభిలషిస్తున్నానని స్పష్టం చేశాడు. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఏబీ డివిలియర్స్, బ్రెండన్ మెక్‌కల్లమ్ వంటివారు రెగ్యులర్‌గా టీ-20, ఐపీఎల్, బిగ్ బాష్ వంటి లీగ్‌లలో ఆడుతున్న నేపథ్యంలో తాను మాత్రం వారి జాబితాలో చేరేందుకు ఆసక్తి కనబరచడం లేదని పేర్కొన్నాడు. ‘గత ఐదేళ్ల కాలంగా నేను ఎన్నో మ్యాచ్‌లలో ఆడాను. రిటైర్మెంట్‌పై ప్రకటించే ఆలోచన ఎంతమాత్రం లేదు. ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే ఆ తర్వాత బ్యాట్‌ను ముట్టను. మైదానంలో అడుగుపెట్టను’ అని కోహ్లీ మరోసారి స్పష్టం చేశాడు.

యావత్ ప్రపంచం చూపు.. నవ్యాంధ్ర వైపే!

$
0
0

అమరావతి, జనవరి 11: నాలుగేళ్లలో రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశామని, స్వయం కృషి, పట్టుదలతో ఇది సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విభజన రోజు నాటి దిక్కుతోచని పరిస్థితి నుంచి ఇపుడు అద్భుత ప్రగతి దిశగా దూసుకెళుతున్నామని ఉద్ఘాటించారు. జన్మభూమి - మావూరు కార్యక్రమంపై శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి కలెక్టర్లు, నోడల్ అధికారులు, ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నాలుగు దశాబ్దాలుగా ఎన్నడూలేని సంతృప్తి సాధించామన్నారు. అధికార యంత్రాంగం ప్రజలతో మమేకమై ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవటంలో కృతకృత్యులయ్యారని ప్రశంసించారు. ఇదే నిజమైన సంక్రాంతి అని, ఇది అభివృద్ధి, పేదల సంక్రాంతిగా అభివర్ణించారు. యావత్ ప్రపంచం ఏపీ వైపు చూస్తోందని, మన వినూత్న ఆవిష్కరణలను అంతా ఆసక్తిగా తిలకిస్తున్నారని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు మన నమూనాలు మార్గదర్శకాలన్నారు. 2014లో కొందరు రాష్ట్రానికి వచ్చేందుకు ఆసక్తి చూపలేదని, కొంతమంది మాత్రమే వచ్చారని, ఏపీని బలహీన బృందమని విమర్శించారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ బృందంతోనే అద్భుతాలు సృష్టించామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను అత్యున్నత రాష్ట్రంగా తీర్చిదిద్దామన్నారు. నాలుగేళ్లలో 670 అవార్డులు రావటం మన కృషికి నిదర్శనమన్నారు. ‘మీ త్యాగఫలితం వల్లే రాష్ట్రం ఈ దశకు చేరుకుంది. మీ కష్టార్జితం, సమష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యపడింది. అధికార, ఉద్యోగ బృందాన్ని చూసి నేను గర్విస్తున్నాను’ అని చంద్రబాబు ప్రశంసలతో ముంచెత్తారు. ‘గతంలో తొమ్మిదేళ్లు నేను ఒంటరిగా పరుగెత్తా. ఇప్పుడు కలసి పయనిస్తున్నాం. అందుకే ఉత్తమ ఫలితాలు సాధించాం’ అని ఆయనన్నారు. 16వేల గ్రామసభలు నిర్వహించటం ఓ చరిత్ర అన్నారు. 16వేల గ్రామాభివృద్ధి ప్రణాళికలను అప్‌లోడ్ చేయటం మరో రికార్డు అని, పోలవరం పనుల్లో గిన్నిస్ బుక్ రికార్డు సాధించామని ఉదహరించారు. ఎల్‌ఈడీ బల్బులు, నరేగా నిధులు, ప్రకృతి వ్యవసాయంతో నూతన ఒరవడి సృష్టించామన్నారు. ఏపీ ఆర్టీజీఎస్‌ను బ్రిటన్ మాజీ ప్రధాని టోనీబ్లెయిర్, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్రశంసించారంటూ, సింగపూర్‌లో కూడా ఇలాంటి వ్యవస్థ అందుబాటులో లేదన్నారు. 1100 పరిష్కార వేదిక ప్రపంచానికే ఓ నమూనాగా నిలుస్తోందని, పేదల సమస్యల సత్వర పరిష్కారానికి కేంద్రంగా మారిందన్నారు.
మనకంటే ఇతర రాష్ట్రాలు ముందుకుపోతే అసూయ కలిగినా దాన్ని కసిగా మార్చుకుంటానని, మరింత పట్టుదలతో పనిచేస్తానని, అనుకున్నది సాధించేందుకే అసూయ దోహదపడాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అది మన ప్రగతికి ఉపయోగపడాలి తప్ప ఇతరులకు హాని కలిగించేదిగా ఉండకూడదని స్పష్టం చేశారు. ఒక్కరోజు లక్ష కోట్ల పెట్టుబడులు, 30వేల మందికి ఉపాధి లభించనుండటం ఓ చరిత్రగా పునరుద్ఘాటించారు. అదాని గ్రూపు రూ. 30వేల కోట్లతో ఐటీ పార్క్‌లు, రూ. 40 వేల కోట్లతో సోలార్ పార్క్‌లు విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతోందని తెలిపారు. ప్రకాశం జిల్లాలో కాగితం గుజ్జు పరిశ్రమ ద్వారా 50వేల మంది రైతు కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. వయాడక్ట్ మన తారకమంత్రమని, సులభతర వాణిజ్యంలో రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. భవిష్యత్‌లో మన డేటా సేవలపై ప్రపంచం దృష్టి సారించే అవకాశాలున్నాయని అభిలషించారు. 7 మిషన్లు, ఐదు గ్రిడ్లు, మరో ఐదు ఉద్యమ అంశాలతో ప్రయాణం ప్రారంభమైందని, పట్టుదల పెంచేందుకే నవనిర్మాణ దీక్ష, మహా సంకల్పం కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రజల భాగస్వామ్యం కోసం జన్మభూమి, జలసిరికి హారతి, గ్రామ వికాసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కేంద్రం దేనికీ సహకరించలేదని, అయినా కష్టంతో ముందుకు వెళుతున్నామని స్పష్టం చేశారు. శనివారం నుంచి సంక్రాంతి సంబరాలు నిర్వహించాలని నిర్దేశించారు.
ఆరో విడత జన్మభూమి కార్యక్రమంలో ఇప్పటివరకు 4,57,007 వినతులు అందాయని ముఖ్యమంత్రి తెలిపారు. అందులో 3,10,000 అర్జీలు పరిశీలించామని, 35వేల వినతులు మాత్రమే తిరస్కరించామన్నారు. తొలి విడత జన్మభూమిలో 40లక్షల వినతులు రాగా, ఈసారి 4లక్షలు మాత్రమే అందాయన్నారు. ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరిగిందని, అందుకే ఫిర్యాదులు తగ్గాయన్నారు. ప్రభుత్వ పనితీరుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు. ఇదే స్ఫూర్తితో దేశం, ప్రపంచంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దాలనేది తమ సంకల్పమని చెప్పారు.
ఎన్టీఆర్ బయోపిక్ అద్భుతం
ఎన్టీఆర్ కథానాయకుడు చలనచిత్రం ద్వారా మూడు దశాబ్దాల చరిత్రను మూడు గంటల్లో ప్రదర్శించటం అద్భుతమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. చుట్టూ జరిగే సంఘటనలతో రాజీపడలేకే ఎన్టీఆర్ ఉద్యోగాన్ని వదిలేశారని, మద్రాస్‌లో అష్టకష్టాలు పడినా మనోధైర్యం కోల్పోలేదన్నారు. అచంచలమైన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అనుకున్న లక్ష్యాలను చేరుకున్నారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ బయోపిక్ సంతోషాన్ని కలిగించిందన్నారు. దివిసీమ ఉప్పెన బీభత్స నష్టాలను ఎన్టీఆర్ కళ్లారా చూశారని, తుపానులో ఇల్లు కూలకుండా నిట్టాడుకి తన భుజం మోపి అడ్డుపెట్టారని, బాధలను ప్రత్యక్షంగా ఆనాడే అనుభవించారని తెలిపారు. రైతులు, పేదల విపత్తు కష్టాలపై చిన్ననాటి నుంచే స్పందించారన్నారు. తుపాను బాధితులను ఆదుకునేందుకు విరాళం ప్రకటించటంతో పాటు తానే స్వయంగా జోలెపట్టి స్ఫూర్తి నింపారని తెలిపారు. లాంతర్ వెలుగులో చదువుకున్న ఆయన ఏ విద్యార్థికీ ఇలాంటి కష్టం రాకూడదని ప్రతి గ్రామానికి విద్యుత్ సరఫరా జరగాలని ఆకాంక్షించారని చెప్పారు. పేదల గుడిసెల్లో జీవనం సాగించటం ఆయన్ను కలచివేసిందని, అందుకే పక్కా ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారన్నారు. ఎన్టీఆర్ జీవితం అందరికీ ఆదర్శప్రాయమన్నారు.. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అద్భుతంగా నటించారంటూ చిత్ర బృందాన్ని చంద్రబాబు అభినందించారు.

ఉద్యోగానికి సీబీఐ మాజీ డైరెక్టర్ వర్మ గుడ్ బై

$
0
0

న్యూఢిల్లీ, జనవరి 11: సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి తొలగించబడిన అలోక్ వర్మ అగ్నిమాపక సర్వీసులు, సివిల్ డిఫెన్స్ విభాగం డైరెక్టర్ జనరల్ పోస్టులో చేరకుండా ఉద్యోగానికి రాజీనామా చేశారు. తనను పదవీ విరమణ చేసినట్లుగా భావించి ఆ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర సిబ్బంది సేవలు, శిక్షణ మంత్రిత్వశాఖకు లేఖ రాశారు. తనపై వచ్చిన అభియోగాలపై సమాధానం చెప్పేందుకు ఉన్నతస్థాయి కమిటీ అవకాశం ఇవ్వలేదని ఆయన లేఖలో ప్రస్తావించారు. 1979 ఐపీఎస్ బ్యాచికి చెందిన సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సిక్రీ, ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలోని కమిటీ వేటు వేసిన సంగతి విదితమే. ఈ నెల 31వ తేదీతో అలోక్‌వర్మ సీబీఐ డైరెక్టర్‌గా కాలపరిమితి ముగుస్తుంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక అధికారి ఇచ్చిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని సీవీసీ విచారించిందన్నారు. తన వాదనలను పట్టించుకోలేదన్నారు. ఈ సందర్భంగా సెలవుపై వెళ్లిన స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా పేరును ఆయన ప్రస్తావించకుండానే ఆరోపణలు చేశారు. ఆస్థానా ఇచ్చిన ఫిర్యాదును ఉన్నత స్థాయి కమిటీ పరిశీలించి పరిగణనలోకి తీసుకున్నట్లు అర్థమవుతోందన్నారు. తనపై రాకేష్ ఆస్థానా చేసిన ఆరోపణల పత్రాన్ని కూడా జస్టిస్ ఏకే పట్నాయక్‌కు సీవీసీ ఇవ్వలేదన్నారు. సీబీఐ దేశంలో ప్రతిష్టాకరమైన సంస్థ అని చెప్పారు. సీవీసీని అడ్డుపెట్టుకుని సీబీఐను కేంద్రం నిర్వీర్యం చేస్తున్నట్లుగా ఉందన్నారు. ఈ వ్యవహారంపై పునసమీక్ష చేసుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. తాను ఢిల్లీ పోలీసు కమిషనర్‌గా పనిచేశానని, 40 సంవత్సరాలు సేవలు అందించానన్నారు.

సొంత జిల్లాకు చేరుకున్న జగన్

$
0
0

కడప సిటీ, జనవరి 11: ప్రజా సంకల్పయాత్ర ముగించిన వైకాపా అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం సొంత జిల్లా కడపకు చేరుకున్నారు. తిరుమల నుంచి రోడ్డుమార్గంలో కడపకు చేరుకున్న జగన్‌కు అడుగడుగుగా జనం, పార్టీ కార్యకర్తలు నీరాజనం పలికారు. కడప పెద్దదర్గాలో ప్రార్థనలు జరిపిన జగన్ అక్కడ చాదర్ సమర్పించారు. అనంతరం సొంత నియోజకవర్గం పులివెందుల చేరుకున్నారు. జగన్ పులివెందులకు రాగానే కార్యకర్తలు, నాయకులు పెద్దసంఖ్యలో తరలివచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. శనివారం పులివెందుల చర్చిలో ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ వైఎస్ సమాధి వద్ద నివాళులర్పిస్తారు.

సీబీఐ వ్యవహారంలో సీవీసీ బలిపశువు

$
0
0

న్యూఢిల్లీ, జనవరి 11: సీబీఐ ప్రతిష్ట మసకబారేందుకు బీజేపీ ప్రభుత్వం అనుసరించిన విధానాలేనని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) భుజాలమీద తుపాకీ పెట్టి ప్రత్యర్థి పార్టీనేతలను లక్ష్యంగా చేసుకుని అనైతిక విధానాలకు పాల్పడుతోందని ఆ పార్టీ పేర్కొంది. రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కేందుకు సీవీసీ కూడా కారణమవుతోందన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ సీవీసీ ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోందన్నారు. సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మను తొలగించడం అప్రజాస్వామిక చర్యన్నారు. సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మను తొలగించేందుకు సీవీసీ అధికారాలను దుర్వినియోగం చేసిందన్నారు. సీవీసీ కూడా ఈ విషయంలో దాగుడు మూతలాడుతోందన్నారు. రాఫెల్ ఫైటర్ జెట్స్ కొనుగోళ్ల బండారం బయపడుతుందనే భయం మోదీ ప్రభుత్వాన్ని వెంటాడుతోందన్నారు. కేంద్రానికీ సీవీసీ గులాంగా మారడం నిజంగా శోచనీయమన్నారు. బీజేపీ హయాంలో ప్రతిష్టాకరమైన సంస్థల గౌరవం మంటగలిసిందన్నారు. సీబీఐ పరిణామంతో మోదీ పతనం ఆరంభమైందన్నారు. సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా అవినీతికి పాల్పడ్డారని చెప్పేందుకు బలమైన ఆధారాలున్నా, సీవీసీ మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. రాజ్యాంగపదవులు, చట్టబద్ధమైన పదవుల్లో ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని నిరాధారమైన ఆరోపణలతో తొలగించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.

తొలి దక్షిణాది గిరిజన వర్శిటీ విద్యాసంవత్సరం మొదలు

$
0
0

హైదరాబాద్, జనవరి 11: వరంగల్ జిల్లా ములుగులో ఏర్పాటవుతున్న దక్షిణాది రాష్ట్రాల్లో మొట్టమొదటి గిరిజన వర్శిటీ అనుమతి రాగానే విద్యాసంవత్సరాన్ని ప్రారంభించింది. జూలై నుండి ఆరు కోర్సులను ఈ యూనివర్శిటీలో ఆఫర్ చేయనున్నారు. ప్రతి కోర్సులో 30 మంది విద్యార్థులను చేర్చుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం యూనివర్శిటీ కోసం భూ సేకరణకు 10 కోట్ల రూపాయిలను విడుదల చేసింది. పూర్తిస్థాయి యూనివర్శిటీ పని ప్రారంభించిన తర్వాత బీఏ, బీసీఏ , ఎంసీఎ , ఎంబిఏ మార్కెటింగ్, ప్యాకేజింగ్ , ఫారెస్టు ప్రొడ్యూస్, బీబీఏ , మాస్టర్ ఇన్ ట్రైబల్ కల్చరల్ ఫోక్‌లూర్ కోర్సులను నిర్వహించనుంది. ఈ మేరకు తగిన చర్యలను చేపట్టాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌కే జోషి ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం నాడు సచివాలయంలో సీఎస్ డాక్టర్ ఎస్‌కే జోషి , గిరిజన సంక్షేమ శాఖ, విద్యాశాఖ, అటవీ శాఖ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ అధికారులతో ఆయన గిరిజన యూనివర్శిటీపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ గిరిజన వర్శిటీ ద్వారా జాకారం వద్ద ఉన్న యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో తరగతులను నిర్వహించాలని, అందుకు అనుగుణంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ అధికారులు తాత్కాలిక నిర్మాణాలను చేపట్టాలని అన్నారు. యూనివర్శిటీలో స్థానిక గిరిజన యువత కోసం 30 శాతం సూపర్ న్యూమరీ సీట్లను కేటాయించాలని చెప్పారు. కాంపౌండ్ హాల్ నిర్మాణాన్ని గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం చేపట్టాలని, గిరిజన యూనివర్శిటీ ద్వారా స్థానిక గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధికి, గిరిజనుల ఆర్థికాభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని అన్నారు. భూ సేకరణకు సంబంధించి 10 కోట్ల రూపాయిలను గిరిజన సంక్షేమ శాఖ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌కు ఇవ్వాలని అన్నారు.అటవీ శాఖకు సంబంధించిన భూమిలో అటవీ చట్ట నిబంధనల్లో అనుమతించిన మేరకు గిరిజన సంస్కృతికి సంబంధించిన కార్యక్రమాలను చేపట్టాలని అన్నారు. గిరిజన వర్శిటీ కమిటీలో ఉన్నత విద్య, గిరిజన సంక్షేమం, అటవీ శాఖ ముఖ్యకార్యదర్శులను సభ్యులుగా నియమించాలని అన్నారు. తరగతుల నిర్వహణకు అవసరమైన పనులను వెంటనే ప్రారంభించాలని అన్నారు. తగిన యాక్షన్ ప్లాన్ రూపొందించుకుని ముందుకు సాగాలని సూచించారు. సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి అజయ్ మిశ్రా, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి బెన్‌హర్ మహేష్ దత్ ఎక్కా, కమిషనర్ క్రిస్టినా చౌంగ్తు, జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ రాసం వెంకటేశ్వర్లు, అదనపు పీసీసీఎఫ్ రఘువీర్, చక్రధర్ రావు , సెంట్రల్ యూనివర్శిటీ నుండి ప్రొఫెసర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదం

$
0
0

విజయవాడ (ఎడ్యుకేషన్), జనవరి 11: విద్యార్థులు చదువులోనే కాకుండా ఆటల్లో కూడా రాణించే విధంగా ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తోందని, ఆ అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిన అవశ్యకత విద్యార్థులపై ఉందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు. శుక్రవారం నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో సాంఘిక, గిరిజన సంక్షేమ హాస్టల్స్, గురుకుల విద్యార్థుల బాల బాలికల క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి నక్కా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా పోటీల్లో 1400 మంది విద్యార్థులు పాల్గొన్నారని, మొదటిసారి గురుకుల సొసైటీ విద్యాలయాల క్రీడా పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. చదువులోనే కాకుండా అన్ని రంగాల్లో విద్యార్థులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. కార్పొరేట్ విద్యకు దీటుగా ప్రభుత్వ స్కూల్స్‌లో చదువుకుంటున్న విద్యార్థులకు విద్యా సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. శాసనమండలి సభ్యుడు ఎఎస్ రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులకు ఆటల పోటీలతో నైపుణ్యం పెరుగుతుందన్నారు. విద్యార్థులు చిన్నతనం నుంచే అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. విద్యతోనే ఏదైనా సాధించవచ్చని పేర్కొన్నారు. అనంతరం విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల కార్యదర్శి రాములు, సోషల్ వెల్పేర్ డైరెక్టర్ రామారావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.


నేతలకు దిశానిర్దేశం..యువతకు భరోసా

$
0
0

విజయవాడ(సిటీ), జనవరి 11: రానున్న రోజుల్లో సమష్టి పోరాటంతో లక్ష్య సాధనకు కృషి చేయాలని జనసేన పార్టీ అధ్యక్షుడు కె పవన్‌కళ్యాణ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశించారు. నాయకుల్లో చిత్తశుద్ధి ఉంటే వారి వెంట యువత నడుస్తారన్నారు. నాయకులకు ఓర్పు, సహనం ఎంతో ముఖ్యమన్నారు. వచ్చే ఎన్నికలకు రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాల వారీ సమీక్షలో భాగంగా జనవరి 3వ తేదీ నుండి ప్రారంభించిన 13 జిల్లాల పార్టీ నేతలతో సమీక్షలు శుక్రవారంతో ముగిశాయి. 13 జిల్లాలకు చెందిన పార్టీ నేతలు, శ్రేణులు, కార్యకర్తలతో విడివిడిగా భేటీ అయిన ఆయన సుమారు 100 గంటల పాటు మాట్లాడారు. ప్రతి జిల్లాకు సంబంధించి మూడు దశల్లో సమీక్షలు నిర్వహించారు. ఇందుకోసం ప్రతీ రోజు 6 గంటల పాటు నిలబడే పవన్ కళ్యాణ్ జిల్లా నాయకుడి నుండి క్షేత్ర స్థాయిలో కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ చెప్పింది సాంతం వినడమే కాకుండా, ముఖ్యమైన సూచనలు, సలహాలు, విషయాలను స్వయంగా నోట్ చేసుకున్నారు. ఎంతో ఓపికగా నాయకులు, జనసైనికులు చెప్పిన విషయాలను విన్నారు. ఏ జనసైనికుడు ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించి ముందుకు వెళ్లాలో స్పష్టం చేశారు. ప్రతీ జిల్లాకు సంబంధించి అక్కడి రాజకీయ పరిస్థితులను సమీక్షించడం, బాలబలాలలేమిటో తెలుసుకొంటూ పార్టీ గమనంపై ఒక స్పష్టత ఇచ్చారు. ప్రతీ జిల్లాకు సంబంధించి జిల్లా సమన్వయ, సహ సమన్వయకర్తలు, మాజీ ఎమ్మెల్యేలతో సమావేశమై సమీక్షించారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా ఉన్న నాయకులతో భేటీ అయి సమీక్షించారు. ఆ జిల్లా నుండి వచ్చిన కార్యకర్తలతో మాట్లాడారు. ఇలా మూడు దశల్లో జిల్లా సమీక్షలు సాగాయి. ఈ సమావేశాల్లో పార్టీ బలోపేతం విషయంలో తాను అనుసరిస్తున్న పంథాను వివరించారు. రోజు రోజుకు పార్టీపై అభిమానం ఎలా పెరుగుతుందో చెప్పారు. జనసేన పార్టీని సిద్దాంతాలను ముందుకు తీసుకువెళ్లడంలో యువత, మహిళలు పోషించిన బలమైన పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించి వారిపై తను ఉంచిన విశ్వాసాన్ని వెల్లడించారు. పార్టీకి విశేషంగా ఉన్న యువశక్తిని రాజకీయ శక్తిగా మార్చాల్సిన ఆవశ్యకతను స్పష్టంగా చెప్పారు. పార్టీకి కేటాయించిన గాజు గ్లాసు గుర్తును ప్రజల్లోకి తీసుకు వెళ్లడం, విజన్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల గురించి గడప గడపకీ వివరించాలన్నారు.
కమిటీల ఏర్పాటుకు శ్రీకారం
గత నాలుగేళ్లుగా పార్టీ నిర్మాణం, సిద్దాంతం రూపకల్పన అనుసరించిన విధానాలను పవన్ సమీక్షించారు. మొదటిగా పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదికన కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. సంక్రాంతి తరువాత ప్రకటిస్తామని చెప్పారు. కమిటీల ఎంపిక కోసం స్టీరింగ్ కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. యువజన కమిటీలు ప్రత్యేకంగా ఉంటాయన్నారు. ఈ కమిటీలను నేరుగా తానే పర్యవేక్షించనున్నట్లు పవన్ ఈ సమావేశాల్లో తెలిపారు. ఎన్నకల సమయం ఆసన్నమవుతున్నందున పార్టీ వర్కింగ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, కమిటీలు దాన్ని సమర్థంగా అమలు చేయాల్సి ఉంటుందని ఆదేశించారు. వ్యక్తిగత అజెండా కాకుండా పార్టీ అజెండాతో ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. పార్టీలోనికి రాగానే ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిపోదాం అంటే సాధ్యమయ్యే పని కాదన్నారు. కష్టపడి పని చేసిన వారికి తప్పకుండా గుర్తింపు వస్తుందని భరోసా కల్పించారు. పార్టీ కోసం పని చేసే వారికి తప్పక గుర్తింపు వస్తుందనీ, గుర్తింపు వస్తే పదవులు వాటంతట అవే వస్తాయన్నారు. పార్టీ అధికారంలోనికి వస్తే నామినేటడ్ పదవులు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. ఈవరుస సమావేశాల్లో విద్యార్థులు, స్థానిక సంస్తదల ప్రతినిధులు, వివిధ వర్గాల వారు వచ్చి పవన్‌ను కలిసి వారి సమస్యలను వివరించారు.

సీఆర్‌డీఏపై నమ్మకం, ఉద్యోగులపై గౌరవంతోనే ఘన విజయాలు

$
0
0

విజయవాడ (కార్పొరేషన్), జనవరి 11: ఏపీ సీఆర్‌డీఏపై నమ్మకం, ఉద్యోగులపై గౌరవంతోనే సంస్థ ఘన విజయాలు సాధిస్తోందని సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ పేర్కొన్నారు. సీఆర్‌డీఏ ఎంప్లారుూస్ అసోసియేషన్ రూపొందించిన 2019 డైరీని ఆవిష్కరించిన కమిషనర్ శ్రీ్ధర్ గత సంవత్సరం సాధించిన రెండు విజయాలు చరిత్ర సృష్టించిన వైనం ఉద్యోగుల కృషికి అద్దం పడుతున్నాయన్నారు. భారత దేశంలో ప్రభుత్వ సంస్థలలో ఇప్పటివరకూ సాధ్యంకాని రీతిలో అమరావతి బాండ్లు 2018 బిడ్డింగ్ ప్రారంభించిన గంటన్నరలోనే 2వేల కోట్ల రూపాయల నిధులను సమకూర్చడం సంస్థపై ఉన్న నమ్మకానికి నిదర్శనం కాగా హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టు తొలివిడత బుకింగ్ రెండు దశల్లో 1200 ప్లాట్లు కొన్ని గంటల్లోనే బుక్ కావడం ప్రపంచ రికార్డు అని, ఇది సంస్థ పనితీరుకు ప్రజలకు సంస్థపై ఉన్న నమ్మకానికి అద్దం పడుతుందన్నారు. ఆంధ్రుల కలల రాజధాని నగర నిర్మాణంలో మన సంస్థలోని 500 మంది ఉద్యోగులు సెలవు, సమయం చూసుకోకుండా ఎంతో కష్టపడుతున్నారని ప్రశంసించిన శ్రీ్ధర్ ప్రజల కలల్నీ నిజం చేసేందుకు ముండుగు వేస్తున్నారన్నారు. మన లక్ష్యాలు కష్టమైనా నాణ్యతతో వాటిని అధిగమించేందుకు అంతా శ్రమించాలని పిలుపునిచ్చిన ఆయన ఉద్యోగులందరికీ అభినందనలు తెలిపారు. ప్రతి ఉద్యోగిపైనా ప్రజలకున్న గౌరవంతోనే ప్రశ్నించేందుకు అవకాశం లేకుండా డిమాలిషన్స్ చేపడుతున్నారని, చట్టపరంగా వ్యవహరిస్తున్న కారణంతోనే ప్రజలు అక్రమ నిర్మాణాల తొలగింపును అడ్డుకోవడం లేదన్నారు. అన్ని జీవోలతో ఎంతో సమగ్ర సమాచారంతో ఎంప్లారుూస్ అసోసియేషన్ డైరీని అందుబాటులోకి తీసుకురావడం హర్షనీయమన్నారు. సీఆర్‌డీఏ స్పెషల్ కమిషనర్ వీ రామమనోహరరావు మాట్లాడుతూ ఉద్యోగి పనితీరుతోనే సంస్థ ఈ స్థాయికి వచ్చిందన్నారు. ఏపీ ఎన్జీవోల సంఘం పశ్చిమ కృష్ణా అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ మాట్లాడుతూ సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ మార్గదర్శకత్వంలో ఉద్యోగులు ముందుకు సాగడం అభినందనీయమన్నారు. సీఆర్‌డీఏ ఎంప్లారుూస్ అసోసియేషన్ అధ్యక్షుడు బీ ప్రభాకరరావు, జనరల్ సెక్రటరీ ఎం నాగేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

మరింత అభివృద్ధికి జన్మభూమి సభలు దోహదం

$
0
0

విజయవాడ (కార్పొరేషన్), జనవరి 11: ప్రజల సమక్షంలో చర్చించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం వల్ల మరింత అభివృద్ధి సాధ్యపడుతుందని కలెక్టర్ బీ లక్ష్మీకాంతం పేర్కొన్నారు. నగర పాలక సంస్థ పరిధిలోని 21వ డివిజన్‌లో శుక్రవారం జరిగిన జన్మభూమి - మా ఊరు గ్రామసభలో పాల్గొన్న కలెక్టర్ లక్ష్మీకాంతం మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంతోపాటు స్థానికంగా అవసరమైన అభివృద్ధి పనులపై చర్చించి తగు నిర్ణయం తీసుకునే విధంగా జన్మభూమి గ్రామ సభలు దోహదపడుతున్నాయన్నారు. గత 4 ఏళ్ల 9 నెలల కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై చర్చ జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన గ్రామ సభల్లో ప్రజలు విశేషంగా పాల్గొని తమ సమస్యలను పరిష్కరించుకున్నారన్నారు. సామాజిక, కుటుంబ వికాసం, స్టార్ రేటింగ్ ఆధారంగా జిల్లాలో అభివృద్ధిని లెక్కించడం జరుగుతుందన్నారు. 2022 నాటికి జిల్లాలోని అన్ని పాఠశాలలు, నగర పాలక సంస్థ స్కూల్స్ పరిధిలో డిజిటల్ క్లాస్ రూమ్‌లుగా రూపొందించడం జరుగుతుందన్నారు. 21వ డివిజన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా డివిజన్‌లో ఇప్పటివరకూ జరిగిన అభివృద్ధిని చర్చించిన నేపథ్యంలో మొత్తం 1224 మందికి పెన్షన్లు అందిస్తుండగా మరో 39 పెన్షన్లను నూతంగా అందించాల్సి ఉందన్నారు. గృహాల సమస్యను పరిష్కరించేందుకు జక్కంపూడిలో టౌన్‌షిప్ నిర్మిస్తున్నట్టు తెలిపిన కలెక్టర్ లక్ష్మీకాంతం ఇబ్రహీంపట్నంలో కృష్ణానదికి రక్షణ గోడ నిర్మించి గృహాలను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. సదా మీ సేవలో రెవెన్యూ శాఖ ద్వారా కుల, నివాస, ఆదాయ ధృవీకరణ పత్రాలను విద్యా సంవత్సరం ముందుగానే అందిస్తున్నామన్నారు. వీఎంసీ పరిధిలో 450 మందికి 388 ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగా క్రమబద్ధీకరణ నిర్వహిస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని పొందాలని కోరారు. 21వ డివిజన్ కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సభలో సెంట్రల్ ఎమ్మెల్యే బొండ ఉమమహేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వాల కంటే మెరుగైన పథకాలను అమలు చేస్తున్న కారణంగా స్థానిక ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయన్నారు. ఎన్‌టీఆర్ వైద్య సేవ ద్వారా 5లక్షల వరకూ ఉచిత వైద్యాన్ని అందించడమే కాకుండా డ్వాక్రా మహిళలకు లక్ష రూపాయల వరకూ రుణమాఫీ చేశామన్నారు. పుట్టిన నాటి నుంచి మరణించే వరకూ అవసరమైన అన్ని సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. డెప్యూటీ మేయర్ గోగుల రమణారావు, నోడల్ ఆఫీసర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధికి అడ్డం పడే శక్తులను ఉపేక్షించం

$
0
0

అవనిగడ్డ, : మంచి పనులు, అభివృద్ధి పనులకు అడ్డుపడే శక్తులను క్షమించేది లేదని, వారికి తగిన విధంగా బుద్ధి చెబుతామని ఉపసభాపతి బుద్ధప్రసాద్ హెచ్చరించారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో శుక్రవారం నిర్వహించిన జన్మభూమి గ్రామసభలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. సామాజిక కుటుంబ వికాసానికి జన్మభూమి గ్రామసభలు దోహద పడుతున్నాయని, ఈ కారణంగా పలు రహదారుల నిర్మాణం చేసుకోవటం జరుగుతుందన్నారు. ఒక్క అవనిగడ్డలోనే 110 సిమెంటు రహదారుల పనులను రూ.15కోట్లతో నిర్మించటం జరిగిందని, మరో 126 పనులు రూ.10కోట్లతో నిర్మిస్తారని తెలిపారు. ఇంటింటికి కుళాయి పథకం కింద రూ.4.95 కోట్లతో పనులు చేపట్టటం జరుగుతుందన్నారు. అలాగే బందలాయిచెరువు నుండి గుడుమోటు వరకు రూ.6కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రహదారి పనులకు బుద్ధప్రసాద్ శంకుస్థాపన చేశారు. రూ.కోటి 35లక్షలతో నిర్మించిన నియోజకవర్గ సమావేశ మందిరాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. నీరు-చెట్టు కింద పలు అభివృద్ధి పనులు చేపట్టామని, కోటి రూపాయల వ్యయంతో మోడల్ పోలీసు స్టేషన్‌ను ప్రారంభిస్తామన్నారు.

జిల్లాలో ముగ్గురు సీఐల బదిలీ

మచిలీపట్నం, జనవరి 11: జిల్లాలో ముగ్గురు సర్కిల్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఏలూరు రేంజ్ డీఐజీ రవి కుమార్ మూర్తి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏలూరు రేంజ్ పరిధిలో మొత్తం 13 మంది సీఐలు బదిలీ కాగా జిల్లాకు సంబంధించి ముగ్గురు ఉన్నారు. పెనుగంచిప్రోలు సీఐగా పని చేస్తున్న ఐ అవినాష్‌ను పశ్చిమ గోదావరి జిల్లాకు బదిలీ చేశారు. వీఆర్‌లో ఉన్న ఇరువురు సీఐలకు పోస్టింగ్‌లు ఇచ్చారు. పివిఎస్‌ఎస్‌ఎస్‌ఎన్ సురేష్, ఎం నాగ దుర్గారావులకు రాజమహేంద్రవరం అర్బన్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఎడ్ల బండ లాగుడు పోటీలు ప్రారంభం

$
0
0

గుడివాడ, : గుడివాడలోని లింగవరం రోడ్డులో ఉన్న కే కనె్వన్షన్‌లో ఎన్టీఆర్ టూ వైఎస్సార్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు జరిగే జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు పోటీలను ఎమ్మెల్యే కొడాలి నాని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రెండు పళ్ళ విభాగంలో పోటీలను నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల నుండి 20 జతల ఎడ్లు ఈ పోటీల్లో హోరాహోరీగా తలపడ్డాయి. విజేతలకు వరుసగా రూ.30వేలు, రూ.25వేలు, రూ.22వేలు, రూ.18వేలు, రూ.15వేలు, రూ.13వేలు, రూ.10వేలు, రూ.8వేలు, రూ.5వేల నగదు బహుమతులను అందజేశారు. పోటీల్లో పాల్గొన్న వారందరినీ మెమెంటోలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ రెండు పళ్లు, నాలుగు పళ్ళు, ఆరు పళ్ళు, సేద్య విభాగం, సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. విజేతలకు దాదాపు రూ.18లక్షల నగదు బహుమతులను అందజేస్తామన్నారు. కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, మున్సిపల్ వైస్‌చైర్మన్ అడపా బాబ్జి, పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

యువత ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

బంటుమిల్లి, జనవరి 11: విద్యార్థులు లక్ష్యాలను అధిగమించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని న్యూఢిల్లీ ఏపీ భవన్ కమిషనర్ అర్జా శ్రీకాంత్ అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నేడు టెక్నాలజీ అభివృద్ధి చెందినా మొబైల్ ఫోన్‌లు విద్యార్థులకు ఒక రకంగా ఆటంకంగా ఉందన్నారు. బంటుమిల్లి డిగ్రీ కళాశాల అభివృద్ధికి సహకరించాలని రైతు సంఘం నాయకులు గౌరిశెట్టి నాగేశ్వరరావు ఆయన దృష్టికి తెచ్చారు. కళాశాల ప్రిన్సిపాల్ బట్టు వేదాంతం ఆహ్వానం మేరకు శ్రీకాంత్ బంటుమిల్లి కళాశాలను సందర్శించారు. విద్యుత్ లేని రోజుల్లో మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాం, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రపంచం తమవైపు చూసేలా ఎదిగారన్నారు. డిగ్రీ కళాశాల అభివృద్ధికి త్వరలో రూ.2కోట్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తానన్నారు. పాఠశాల పూర్వ విద్యార్థులు అర్జా శ్రీకాంత్, గౌరిశెట్టి నాగేశ్వరరావును ఘనంగా సన్మానించారు.

Viewing all 69482 articles
Browse latest View live