Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

చౌక డిపో డీలర్ల జీవితాల్లో ముందస్తు సంక్రాంతి వెలుగులు!

$
0
0

విజయవాడ, జనవరి 12: రాష్ట్రంలోని 28,500 మంది చౌకడిపో డీలర్ల జీవితాల్లో ముందుగానే సంక్రాంతి వెలుగులు నిండాయి. క్వింటాల్ బియ్యంకు ప్రభుత్వం ఇస్తున్న కమీషన్ రూ. 70లను ఒక్కసారిగా రూ. 100లకు పెంచుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం నిర్ణయం తీసుకున్నారు. 2016లో తొలిసారిగా అప్పటివరకు ఉన్న రూ. 20ల కమీషన్ రూ. 70లకు పెరగ్గా, మూడేళ్లలోనే మరో రూ. 30లు పెరిగింది. సమర్థవంతంగా పనిచేసే డీలర్లకు సంతృప్తి స్థాయిని 85శాతం పెంచడానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రోత్సాహం కింద రూ. 2వేలు నజరానా ప్రకటించింది. దీనిపై చౌకడిపో డీలర్ల జేఏసీ సమన్వయకర్తలు దివి లీలామాధవరావు, బుగత వెంకటేశ్వరరావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావులకు కృతజ్ఞతలు తెలిపారు. తామంతా బాబుకు రుణపడి ఉన్నామన్నారు. ఇటీవలే ఆఖరి క్షణంలో వాయిదాపడ్డ డీలర్ల రాష్ట్ర మహాసభను త్వరలో నిర్వహించి ముఖ్యమంత్రిని సత్కరిస్తామని వారు వెల్లడించారు.


ఏనుగు దాడిలో వృద్ధుడి మృతి

$
0
0

కొమరాడ, జనవరి 12: విజయనగరం జిల్లా కొమరాడ మండలం కెమిశిల పంచాయతీ నాయుడువలస గ్రామానికి చెందిన నిమ్మక పకీరు(66) శనివారం ఉదయం ఏనుగుల దాడిలో మృతిచెందాడని గుణదశీలేసు ఎంపీటీసీ బలరాం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం కెమిశిల, నాయుడువలస గ్రామాల మధ్యలో ఏనుగుల సంచారాన్ని గమనించకపోవడంతో నాయుడువలసకు చెందిన పకీరు పొలానికి వెళ్తుండగా ఒక ఏనుగు తొండంతో విసిరికొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఈ విషయం గమనించిన గ్రామస్థులు వెంటనే పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించినప్పటికీ మృతి చెందాడన్నారు. సంఘటన గురించి తెలుసుకున్న డీఎఫ్‌వో లక్ష్మణ్ ఆసుపత్రికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

విరిగిన విశాఖ ప్యాసింజర్ స్ప్రింగ్

$
0
0

రాజమహేంద్రవరం, జనవరి 12: విశాఖపట్నం నుంచి విజయవాడ వెళుతున్న ప్యాసింజర్ రైలు స్ప్రింగ్ విరిగిపోవడంతో ఆ రైలు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సుమారు గంటకు పైగా నిలిచిపోయింది. విశాఖపట్నం నుంచి బయలుదేరిన ప్యాసింజర్ రైలుకు సంబంధించిన బోగి కింద ఉండే యాక్సిల్ స్ప్రింగ్ విరిగిపోవడంతో దానిని రాజమహేంద్రవరం తీసుకువచ్చి సుమారు గంటసేపు మరమ్మతులు చేసి రైలును తిరిగి గమ్యస్థానానికి పంపారు. ఈ సంఘటనతో రైలు సుమారు మూడుగంటల పాటు ఆలస్యంగా రాజమహేంద్రవరం నుంచి బయలుదేరి వెళ్లింది. ఈ రైలు ఆలస్యంగా నడవడంతో అసలే పండుగ రద్దీతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణి కులు తీవ్ర అసహనానికి, ఇబ్బందులకు గురయ్యారు.

ఎస్పీకి 38 ,బీఎస్పీకి 38

$
0
0

లక్నో: దేశంలోనే అత్యధిక పార్లమెంట్ నియోజకవర్గాలున్న ఉత్తరప్రదేశ్‌లో బద్ధవిరోధులైన అఖిలేష్ యాదవ్, మాయావతి జతకట్టారు. కేంద్రంలో బీజేపీని ఓడించడమే ఏకైక అజెండాగా అఖిలేష్ నాయకత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ, మాయావతి సారధ్యంలోని బహుజన సమాజ్‌వాదీ పార్టీ కూటమిగా ఏర్పడ్డాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని చెప్పడానికి ఉదో ఉదాహరణగా చెప్పవచ్చు. కేంద్రం, రాష్ట్రంలో బీజేపీనే అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. యూపీ సంగతి అటుంచితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని సాగనంపడమే ప్రధాన లక్ష్యంగా ఇరువురు నేతలూ పొత్తుకు అంగీకరించారు. ఎప్పటి నుంచో ఎస్పీ, బీఎస్పీ ఎన్నికల పొత్తుపై ఊహాగానాలు వచ్చాయి. పలుదఫాలుగా ఇరుపార్టీల అధినేతల చర్చలు తరువాత కూటమిపై సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చారు. ఎస్పీ వర్గాలు గత వారమే దీనిపై ఓ ప్రకటన చేసింది. శనివారం అఖిలేష్ యాదవ్, మాయావతి సంయుక్త విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి కూటమి విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. రాష్ట్రంలో మొత్తం పార్లమెంట్ స్థానాలు 80. అమేధీ, రాయ్‌బరేలీ స్థానాల్లో అభ్యర్థులను పోటీలో పెట్టకూడదని కూటమి నేతలు నిర్ణయించారు. ఆ రెండు చోట్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యుపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎస్పీ 38-బీస్పీ 38 స్థానాల్లో పోటీకి నిర్ణయించాయి. అమేధీ, రాయ్‌బరేలీ పోను మిగతా రెండుచోట్ల కూటమి మిత్రపక్షాలు పోటీ చేస్తాయని అఖిలేష్, మాయావతి ప్రకటించారు. ఇరుపార్టీల మధ్య రెండు దశాబ్దాలుగా ఉన్న విభేదాలను పక్కన బెట్టి బీజేపీని ఓడించడమే ప్రధాన అజెండాగా పొత్తు పెట్టుకున్నాయి. ‘బీజేపీ ప్రజాకంటక పాలన చేస్తోంది. కమలనాథుల విధానాలు అప్రజాస్వామికంగా ఉన్నాయి. అందుకే దేశ ప్రయోజనాలను దృష్టిలోపెట్టుకుని ఎస్పీతో పొత్తుకు ముందుకొచ్చాం’అని బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. అఖిలేష్ సమక్షంలోనే ఆమె మీడియాతో మాట్లాడుతూ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ సత్తాచాటుతామని ప్రకటించారు. ఎస్పీ, బీఎస్పీ పొత్తును రాజకీయ విప్లవంగా ఆమె అభివర్ణించారు. 1993 ఎన్నికల్లో రామమందిరం నినాదంతో బీజేపీ ఎన్నికల్లో గెలిచినా దాన్ని అధికారంలోకి రాకుండా ఎస్పీ,బీఎస్పీ అడ్డుకున్నాయని ఆమె గుర్తుచేశారు. ఆనాడు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైందని మాయ చెప్పారు. 167 అసెంబ్లీ సీట్లను గెలుచుకుని ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్, బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం చేతులు కలిపారని ఆమె పేర్కొన్నారు. బీఎస్పీకి 67, ఎస్పీకి 109 సీట్లు వచ్చాయని ఆమె చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడలేదు. మీరాబాయ్ మార్గ్ గెస్ట్‌హౌస్ ఘటన ఇరుపార్టీల్లోనూ చిచ్చుపెట్టింది. ఎస్పీ కార్యకర్తలు మాయవతిపై దాడి చేసి ఆమె ఉంటున్న గదిని ధ్వంసం చేశారు. బీఎస్పీ ఎమ్మెల్యేలు ఎవరూ ఆమెను కాపడలేకపోయారు. బీజేపీ ఎమ్మెల్యే బ్రహ్మదత్త ద్వివేది బీఎస్పీ అధినేత్రి మాయావతిని గెస్ట్‌హౌస్ నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. తరువాత మాయావతి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఎస్పీ, బీఎస్పీ మధ్య సంబంధాలు లేవు.
ఇప్పుడు మళ్లీ 23 ఏళ్ల తరువాత బీఎస్పీ, ఎస్పీ ఎన్నికల్లో కలిసిపోటీ చేస్తున్నాయి. బీజేపీ తిరుగులేని రాజకీయ శక్తిగా ఆవిర్భవించడంతో ప్రాంతీయపార్టీలైన ఎస్పీ, బీఎస్పీ మనుగడ ప్రశ్నార్థకమైంది. గోరఖ్‌పూర్ ఫూల్‌పూర్ లోక్‌సభ ఉప ఎన్నికలు రెండు పార్టీల సఖ్యతకు దారిచూపాయని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ వౌర్య ప్రాతినిధ్యం వహిస్తున్న ఈరెండు చోట్లా బీఎస్పీ మద్దతుతో సమాజ్‌వాదీ పార్టీ ఘన విజయం సాధించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అఖిలేష్ నాయకత్వంలోని ఎస్పీ ఐదు ఎంపీ సీట్లు దక్కించుకోగా బీఎస్పీకి ఒక్కచోటా గెలవలేదు. తరువాత 2107 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలకు చెరో 22 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడిక రెండు పార్టీలు కూటమిగా ఏర్పడినందున ముస్లీం ఓట్లు, బీజేపీ వ్యతిరేక ఓట్లు కచ్చితంగా తమకే పడతాయని ఎస్పీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ పెత్తనాన్ని ఆపడానికే తాము కూటమిగా ఏర్పడ్డామని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ వెల్లడించారు. దళిత, బహుజన ఓట్లు తమకే పడతాయని బీజేపీకి ఓటమి ఖాయమైపోయిందని ఆయన జోస్యం చెప్పారు. ఇలా ఉండగా సమాజ్‌వాదీ పార్టీ నుంచి విడిపోయి సొంత పార్టీ పెట్టుకున్న అఖిలేష్ యాదవ్ చిన్నాన్న శివపాల్ యాదవ్‌పై బీఎస్పీ అధినేత్రి నిప్పులు చెరిగారు. ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ(లోహియా) పేరుతో శివపాల్ పార్టీ స్థాపించారు. బీజేపీ అండదండలు, నిధులు శివపాల్‌పార్టీకి అందుతున్నాయని మాయవతి విమర్శించారు. అయితే శివపాల్‌పై అఖిలేష్ ఎలాంటి విమర్శలు చేయలేదు.

చిత్రాలు.. ఇరు పార్టీల పొత్తు ప్రకటన తర్వాత అలహాబాద్‌లో సంబరాలు చేసుకుంటున్న బీఎస్పీ, ఎస్పీ శ్రేణులు,
*వారణాసి వీధుల్లోకి వచ్చి ర్యాలీ నిర్వహిస్తున్న ఉభయ పార్టీల నాయకులు, కార్యకర్తలు

విశాఖ జిల్లాలో జోరుగా భూ సమీకరణ

$
0
0

విశాఖపట్నం, జనవరి 12: విశాఖ జిల్లాలో విశాఖ మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) భూ సమీకరణను పరుగులెత్తిస్తోంది. గృహ నిర్మాణంతో పాటు ఇతర అవసరాల నిమిత్తం భూ సమీకరణకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడంతో వీఎంఆర్‌డీఏ యంత్రాంగం భూ సమీకరణను వేగవంతం చేస్తోంది. పెందుర్తి మండలం ముదపాకలో భూ సమీకరణ అంశం వివాదస్పదం కావడంతో కొన్ని నెలల పాటు స్తబ్దతగా ఉన్న ప్రభుత్వం తాజా ఉత్తర్వులతో ముందుకెళ్లాలన్న నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం అవుతోంది. ఇక్కడ భూములను ముందుగా ప్రైవేటు వ్యక్తులు సమీకరించే ప్రయత్నం చేయగా విపక్షాలు అడ్డుకున్నాయి. అప్పటికి ప్రభుత్వంలో భాగసామ్యంగా ఉన్న బీజేపీ సైతం ముదపాక భూముల సేకరణను అడ్డుకుంది. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ముదపాక భూ సమీకరణకు సంబంధించిన ప్రభుత్వం అప్పట్లో జారీ చేసిన జీఓను సైతం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇక వైసీపీ, వామపక్ష పార్టీలు ముదపాక భూములను సేకరించే విషయంలో పోరాటాలే చేశాయి. ఇక ట్రైజంక్షన్ భూ సమీకరణకు వామపక్షాలు తీవ్ర అభ్యంతరం తెస్తున్నాయి. ఇన్ని అభ్యంతరాల నడుమ ప్రభుత్వం పెందుర్తి, భీమునిపట్నం నియోజకవర్గాల్లో భూ సమీకరణకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వీఎంఆర్‌డీఏ భీమిలి, పెందుర్తి నియోజకవర్గాల్లో భూ సమీకరణను వేగవంతం చేస్తోంది. పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని ముదపాకలో 560.66 ఎకరాలు, ఎస్‌ఆర్ పురంలో 95 ఎకరాలు భూ సమీకరణకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణకు ముందుకు వెళ్తోంది. ఇప్పటికే ఎస్‌ఆర్ పురంలో భూ సమీకరణపై వీఎంఆర్‌డీఏ కమిషనర్ బసంత్ కుమార్ గ్రామసభ నిర్వహించి అభిప్రాయ సేకరణ పూర్తి చేశారు. భీమిలి నియోజకవర్గం, భీమునిపట్నం మండలం కొత్తవలసలో 95 ఎకరాల భూ సమీకరణకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేశారు. ఇదిలా ఉండగా ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్ కాంప్లెక్స్, సమీకృత హౌసింగ్ తదితర ప్రాజెక్టుల కోసం గాజువాక, పరవాడ, సబ్బవరం మండలాల పరిధిలోని ఐదు గ్రామాల్లో 900 ఎకరాల భూ సమీకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఒక్క అడుగు ముందుకు వేయలేని పరిస్థితులు ఉన్నాయి.
ఇక్కడ వామపక్ష పార్టీలు రైతుల నుంచి భూ సమీకరణకు అభ్యంతరం తెలుపుతున్నారు. 2013 భూ సేకరణ చట్టం అనుసరించి పరిహారం చెల్లించి భూములు తీసుకోవాల్సిందిగా రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఒకటి, రెండు సార్లు కలెక్టర్, వీఎంఆర్‌డీఏ కమిషనర్ ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి రైతులను ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో ట్రై జంక్షన్ భూ సమీకరణ కంటే ముందే భీమిలి, పెందుర్తి ప్రాంతాల్లో భూములు సేకరించాలని వీఎంఆర్‌డీఏ భావిస్తోంది.

పిడుగురాళ్లలో స్వల్ప భూప్రకంపనలు

$
0
0

పిడుగురాళ్ల, జనవరి 12: గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో శనివారం సాయంత్రం భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
పట్టణంలో శనివారం సాయంత్రం సుమారు 3.25 నుండి 6 గంటల మధ్య భూమి నాలుగుసార్లు కంపించింది. ఆరేళ్ల క్రితం ఒకసారి, మూడేళ్ల క్రితం ఒకసారి ఇలా భూమి కంపించినట్లు ఈసందర్భంగా స్థానికులు గుర్తుచేశారు. తరచూ ఇక్కడ భూప్రకంపనలు ఎందుకు వస్తున్నాయో అధికారులు, శాస్తవ్రేత్తలు వెల్లడించాలని పట్టణవాసులు కోరుతున్నారు. భూప్రకంపనలతో పట్టణంలోని పాటిగుంతలు, లెనిన్ నగర్, స్వర్ణపిచ్చయ్య కాలనీ వాసులు ఇళ్లలో నుండి బయటకు పరుగులు తీశారు.

కాంగ్రెస్‌ది గాంధీ..బీజేపీది గాడ్సే సిద్ధాంతం

$
0
0

విజయవాడ, జనవరి 12: కాంగ్రెస్ పార్టీది మహాత్మా గాంధీ సిద్ధాంతం అయితే, బీజేపీది హంతకుడు గాడ్సే సిద్ధాంతమని ప్రదేశ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు ఎన్ తులసిరెడ్డి శనివారం ఓ ప్రకటనలో విమర్శించారు. వచ్చే ఎన్నికలు గాంధీ వారసులు, గాడ్సే వారసుల మధ్య జరగబోతున్నాయన్నారు. మోదీ శకం ముగిసి, రాహుల్ శకం ఆరంభం కాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి నాయకులకు సిద్ధాంతం లేదని బీజేపీ నేతలు వ్యాఖ్యానించడం హాస్యాస్పదమన్నారు. గతంలో వాజపేయి ప్రభుత్వం వెలిగిపోతోందంటూ జరిగిన ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టిన తీరును గుర్తించాలన్నారు. వాజపేయి కంటే మోదీ గొప్పవాడా? అని తులసిరెడ్డి ప్రశ్నించారు.

యువత శక్తియుక్తులు అభివృద్ధికి ఉపయోగపడాలి

$
0
0

విజయవాడ, జనవరి 12: యువత భాగస్వామ్యంతో, వారి శక్తియుక్తులతో రాష్ట్భ్రావృద్ధి జరగాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని రాష్ట్ర యువజన సర్వీసులు, న్యాయశాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అనేక సమస్యలతో సతమతమవుతున్న నవ్యాంధ్ర పునర్నిర్మాణంలో రాష్ట్రంలోని యువతీ, యువకులు పాలుపంచుకునేలా చేయాలన్న లక్ష్యంతోనే పని చేస్తున్నామని స్పష్టం చేశారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పథకం ద్వారా యువతకు భవిష్యత్‌పై భరోసా కల్పించేలా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. యువశక్తిని అద్భుత శక్తిగా మార్చాలన్న లక్ష్యంతో పథకంలో భాగంగా 4.36 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పంచేలా శిక్షణ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని తన అనుభవం, దూరదృష్టి, దృఢ సంకల్పంతో ఆదుకోవనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో 12రకాల పింఛన్లు అమలవుతున్నాయని మంత్రి రవీంద్ర వివరించారు. సమావేశంలో జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ కొత్త నాగేంద్రకుమార్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి గనె్న వెంకట నారాయణ ప్రసాద్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కర్రి వేణుమాధవ్ పాల్గొన్నారు.


పంచాయతీ ఎన్నికలకై 23 తర్వాత ప్రత్యక్ష పోరు

$
0
0

విజయవాడ, జనవరి 12: హైకోర్టు ఆదేశాలకనుగుణంగా ఈనెల 23వ తేదీ లోపుగా గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను చేపట్టని పక్షంలో ఓ వైపు కోర్టు ధిక్కారం కింద హైకోర్టును ఆశ్రయించడంతోపాటు మరో వైపు ప్రత్యక్ష పోరుకు సన్నద్ధమవుతామని లోకల్ గవర్నమెంట్స్ చాంబర్ జాతీయ అధ్యక్షులు మామిడి అప్పల నాయుడు హెచ్చరించారు. ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి సతీష్‌చంద్రను కలిసి తర్వాత ఆయన శనివారం నాడిక్కడ మీడియాతో మాట్లాడారు. హైకోర్టు ఇచ్చిన 90 రోజుల గడువు ఈ నెల 23వ తేదీతో ముగియనున్నదన్నారు. అసలు ప్రత్యేకాధికారి పాలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 90 రాజ్యాంగ విరుద్ధమని, ఆ జీవో చెల్లదని కూడా హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 23వ తేదీ నుంచి మాజీ సర్పంచ్‌లనే పర్సన్ ఇన్‌చార్జీలుగా కొనసాగించాలని అప్పలనాయుడు డిమాండ్ చేశారు. తీర్పును ప్రభుత్వం గౌరవించని పక్షంలో ఈ నెల 23వ తేదీన ప్రత్యక్ష పోరుకు, న్యాయ పోరాటానికి దిగుతామంటూ హెచ్చరించారు.

పాలకుల హామీలను ప్రజలు నమ్మరు

$
0
0

మడకశిర, జనవరి 12: రానున్న ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి పాలకులు అప్పుడే హామీలు ప్రకటిస్తున్నారని, అయితే వాటిని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి పేర్కొన్నారు. శనివారం అనంతపురం జిల్లా మడకశిరలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చిన్న వర్తకులకు రూ.40 లక్షల వరకు జీఎస్టీ ఉండదని చెప్పడం వారి ఓట్లు దండుకోవడానికేనన్నారు. అదే విధంగా ఈనెల నుంచే రూ.2 వేల పెన్షన్ అమలు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పడం ఓట్ల కోసమేనన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు ఎంపీ స్థానాలకు పోటీ చేయకుండా కేవలం అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పోటీ చేయాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలు చేసే ధైర్యం కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి బీజేపీ మోసం చేసిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్‌గాంధీ ఇతర దేశాల పర్యటనలో చెప్పడం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రానికి హోదా తెచ్చేంత వరకు ఆంధ్రప్రదేశ్, తన స్వంత గ్రామం నీలకంఠాపురంలో అడుగుపెట్టేది లేదన్నారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం అనేక హామీలు ఇస్తున్నాయని, వాటిని అమలు చేయడానికి నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కనీసం ఆ నిధులు విడుదల కావాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్ పాల్గొన్నారు.

కోటప్పకొండ పెయింటింగ్స్ అద్భుతం

$
0
0

విజయవాడ, జనవరి 12: ప్రకృతి ప్రేమికులు, కళారాధకులను కోటప్పకొండ పెయింటింగ్స్ ఎంతగానో ఆకట్టుకుంటాయని రాష్ట్ర శాసనసభాపతి కోడెల శివప్రసాద్ కొనియాడారు. శనివారం విజయవాడ బాపూ మ్యూజియంలో ప్రముఖ చిత్రకారుడు, టూరిజం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ మల్లిఖార్జున్ చిత్రీకరించిన కోటప్పకొండ కళాఖండాలను ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా కోడెల మాట్లాడుతూ విశిష్ట స్థానం ఉన్న కోటప్పకొండ ప్రాశస్థ్యాన్ని చిత్రీకరించి ప్రజల ముంగిటకు తీసుకురావడం చిత్రకారుడు, టూరిజం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మల్లిఖార్జున్ సానుకూల దృక్పథానికి నిదర్శనమని కితాబిచ్చారు. ఈ నెల 19, 20 తేదీల్లో రెండు రోజులు కోటప్పకొండ వద్ద కొండ ఉత్సవాలు భారీగా నిర్వహించనున్నామన్నారు. 130 ఎకరాల పరిధిలో ఎకో టూరిజం పెంపొందించేలా ఉత్సవాలు జరుగుతాయన్నారు. కోటప్పకొండకు వచ్చిన ప్రతిఒక్కరికీ దట్టమైన అడవుల్లో సంచరించిన అనుభూతి కలుగుతుందని, దీనికి తగినట్లు కొండ దిగువ భాగంలో చిన్న పిల్లలు నుండి పెద్దల వరకు ఆనందించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ రెండు రోజులూ ఫుడ్ ఫెస్టివల్, గుర్రపు స్వారీ, ఏనుగు అంబారీతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తాయని కోడెల వివరించారు. పెయింటింగ్ బ్రోచర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పురావస్తు శాఖ డైరెక్టర్ ఈమని శివనాగిరెడ్డి, ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ కార్యదర్శి గోళ్ల నారాయణరావు, విశ్రాంత అధ్యాపకులు వెన్నా వల్లభరావు, జీ సాంబశివరావు పాల్గొన్నారు.

వైద్య ఆరోగ్య శాఖలో 3,400 పోస్టుల భర్తీకి 15 రోజుల్లో నోటిఫికేషన్

$
0
0

ఏలూరు, జనవరి 12: రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో త్వరలో 3,400 ఉద్యోగాలను భర్తీ చేయటానికి 15 రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించే క్యాన్సర్, కార్డియాలజిస్టు భవన నిర్మాణ పనులకు శనివారం సాయంత్రం ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాలకొండయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలతోపాటు ప్రాథమికంగా ఆధునిక వైద్యం అందించటానికి 1200 పీహెచ్‌సీల్లో వైద్యులను నియమిస్తామని, 300 మంది వివిధ విభాగాల్లో స్పెషలిస్టు వైద్యులను నియమిస్తామని, 1900 ఏఎన్‌ఎం పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించటానికి త్వరలోనే మెంటల్ హెల్త్‌పై కూడా దృష్టి సారిస్తామని చెప్పారు. ఎటువంటి అనారోగ్యం లేకపోయినా శరీరంలో ఏ విధమైన వ్యాధి లక్షణాలు ఉన్నాయో ప్రాథమిక దశలోనే గుర్తించటానికి ప్రతి పీహెచ్‌సీలో మాస్టర్ హెల్త్ చెకప్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని, బీపీ, షుగర్, ఇతర వ్యాధులకు సంబంధించి అవసరమైన వైద్య పరీక్షలను చేయటానికి క్షేత్ర స్థాయిలో సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందించామని మాలకొండయ్య చెప్పారు. అన్ని పీహెచ్‌సీలను టీచింగ్ ఆసుపత్రులుగా తీర్చిదిద్ది, మంచి ఆరోగ్యంతోపాటు వైద్య సేవలు అందిస్తామని, గతంతో పోలిస్తే రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులలో పరిశుభ్రత పెరిగిందని, ఆసుపత్రులలో మరుగుదొడ్లను కూడా ఆధునిక వసతులు కూడా తీర్చిదిద్దామని ఆమె చెప్పారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని, వారం వారం కలెక్టర్ తనను కలిసి కోరుతున్నారని, ఈ విషయంపై ప్రభుత్వం కళాశాల ఏర్పాటుకు అనుమతి మంజూరు చేసిందని, త్వరలో జరిగే క్యాబినెక్ సమావేశానికి ఏలూరుకు మెడికల్ కళాశాల ప్రతిపాదనలను తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని మాలకొండయ్య తెలిపారు. పశ్చిమ గోదావరికి సంక్రాంతి కానుకగా మెడికల్ కళాశాలకు అనుమతి లభించినట్లేనని ఆమె పేర్కొన్నారు.

కలెక్టర్ సంప్రదాయ థింసా నృత్యం, కోలాటం

$
0
0

విశాఖపట్నం, జనవరి 12: రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబురాలు వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అందుకు జిల్లాకు రూ. కోటి కేటాయించింది. ప్రభుత్వం తరపున ఈ వేడుకలు ఘనంగా జరగాలని, అధికారులంతా ఈ వేడుకల్లో పాల్గొనడమే కాకుండా ప్రజలను భాగస్వామ్యం చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆ దేశాల మేరకు విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ నగరంలో వీఎంఆర్‌డీఏ బాలల ప్రాంగణంలో అధికారిక సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. తెలుగువారి సంప్రదాయ దుస్తులతో వేడుకలకు హాజరైన కలెక్టర్ ఉల్లాసంగా ఆడారు, పాడారు. సంప్రదాయ నృత్యాలకు పాదం, పాటకు పదం కలిపారు. గంగిరెడ్లు, హరిదాసులతో ముచ్చటించారు.
చిత్రాలు.. గిరిజనులతో కోలాటమాడుతున్న విశాఖ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్,
*సంక్రాంతి సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా గిరిజనులతో కలసి థింసా నృత్యం చేస్తున్న కలెక్టర్

క్రీడలకు అధిక ప్రాధాన్యత

$
0
0

సిద్దిపేట/ సిద్దిపేట అర్బన్ : తెలంగాణ సర్కార్ క్రీడలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని.. జాతీయ క్రీడల్లో రాణించి, అంతర్జాతీయ క్రీడకారులుగా ఎదగాలని మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. భవిష్యత్‌లో ఏసియన్ గేమ్స్, ఓలింపిక్ గేమ్స్‌లో పథకాలను సాధించి దేశప్రతిష్టను ఇనుమడింప చేయాలని ఆకాంక్షించారు. హ్యాండ్ బాల్ జాతీయ స్థాయి పోటీలకు సిద్దిపేట వేదిక కావటం ఏంతో సంతోషం కల్గిస్తుందన్నారు. సిద్దిపేట జిల్లాకేంద్రంలో మినీస్టేడీయంలో ఎస్‌జీఎఫ్ హ్యాండ్‌బాల్ జాతీయ స్థాయి క్రీడలను ఎమ్మెల్సీలు ఫారూక్‌హుస్సేన్, సుధాకర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ కృష్ణ్భాస్కర్‌తో కలసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హరీష్‌రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన్పటికి.. అభివృద్ధిలో దేశంలోనే నెంబర్‌వన్‌గా దూసుకపోతుందన్నారు. సీఎం కేసీఆర్ 14 ఏండ్లు పోరాడీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినట్లు పేర్కొన్నారు. ఏన్నో రాష్ట్రాల నుండి క్రీడకారులు తెలంగాణకు వచ్చారని, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని పరిశీలించాలన్నారు. అదేవిధంగా సిద్దిపేట ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని పరిశీలించాలన్నారు. దేశంలో వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన క్రీడకారులకు అన్ని వసతులు కల్పించినట్లు తెలిపారు. క్రీడకారులకు వారి రాష్ట్రాలకు చెందిన భోజనాలతో పాటు, తెలంగాణ ప్రాంతానికి చెందిన నాణ్యమైన భోజనం అందుబాటులో ఉంచామని రుచి చూడాలని సూచించారు. సిద్దిపేటలో ఐదురోజుల పాటు జరిగే జాతీయ క్రీడల్లో క్రీడ ప్రతిభను ప్రదర్శించి విజేతలుగా నిలువాలన్నారు. క్రీడల్లో క్రీడకారులు ఉత్తమ ప్రతిభ కనబర్చి ఆసియన్ గెమ్స్, ఓలింపిక్ గేమ్స్‌లో భారత తరుపున ప్రాతినిథ్యం వహించి భారత కీర్తి పతాకాన్ని ఎగురవేయాలని క్రీడకారులను ఉత్తేజ పర్చారు. ఎమ్మెల్సీ ఫారూక్‌హుస్సేన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఐదేండ్లలో ఏంతో గణనీయమైన అభివృద్ధి చెందిందని సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమైందన్నారు. సిద్దిపేట పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగుతుందన్నారు. సిద్దిపేటకు జమ్ముకాశ్మీర్ నుండి క్రీడకారులు రావటం ఎంతో గొప్ప విషయమన్నారు. హ్యాండ్‌బాల్ అసోసియేషన్ జాతీయ కోశాధికారి ఆనందీశ్వర్‌పాండే మాట్లాడుతూ సిద్దిపేటలో హ్యాండ్‌బాల్ జాతీయ పోటీలు నిర్వహించటం అభినందనీయమన్నారు. సిద్దిపేట గతంలో కంటే ఇప్పుడు ఏంతో అభివృద్ధి చెందిందన్నారు. సిద్దిపేటలో మంచి క్రీడ వసతులు కల్పించటం అభినందనీయమన్నారు. ఈకార్యక్రమంలో తెలంగాణ స్పోర్ట్స్ ఆథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, జేసీ పద్మాకర్, డీఈఓ రవికాంత్‌రావు,ఎస్‌జీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాంరెడ్డి, జిల్లా కార్యదర్శి కార్యదర్శి సుజాత, హ్యాండ్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జగన్‌మోహన్‌రావు పాల్గొన్నారు.
చిత్రం..జాతీయ హ్యాండ్‌బాల్ పోటీల క్రీడా జ్యోతిని వెలిగిస్తున్న మాజీ మంత్రి హరీష్‌రావు

జిల్లా ఏర్పాటుకు ముందే జాక్‌పాట్

$
0
0

వరంగల్, జనవరి 12: ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు నియోజకవర్గానికి విద్యాకళ సంతరించుకోనుంది. ప్రతిష్టాత్మకమైన జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం ములుగులో ఏర్పాటు కాబోతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో మొట్టమొదటి గిరిజన వర్సీటీ ములుగు కావడం ప్రాధన్యత సంతరించుకుంది. మొన్నటి వరకు ములుగు నియోజవర్గానికి ప్రాతినిధ్యం వహించి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న ఆజ్మీర చందూలాల్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికి ములుగులోనే గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కాబోతుంది. గిరిజన యూనవర్సిటీ ఏర్పాటుకు కేంద్రం కోరినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ములుగు శివారులోని గట్టమ్మ గుట్ట ప్రాంతంలో 483 ఎకరాల స్థలాన్ని సేకరించింది. ఇందులో 173 ఎకరాలు ప్రభుత్వానికి సంబంధించినది కాగా, 213 ఎకరాలు అటవీశాఖకు, మరో 100 ఎకరాలు అసైండ్ భూమి సిద్ధం చేశారు. ఇందు కోసం భూసేకరణ కింద 10 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం విడుదల చేసింది. అంతే కాకుండా ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ ములుగు బహిరంగ సభలో తిరిగి అధికారంలోకి రాగానే ములుగును జిల్లా కేంద్రంగా చేస్తానని హామి ఇచ్చిన్నట్లుగానే జిల్లా ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇటీవలే ములుగు జిల్లా కేంద్రంగా చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల అయ్యింది. ములుగు జిల్లాకు ఒక వైపు అడుగులు పడుతుండగానే ములుగులోనే జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కావడానికి చర్యలు తీసుకుంటున్నారు. దీంతో కొత్తగా ఏర్పాటు కానున్న ములుగు జిల్లాకు ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే జులై మాసం నుండే ఆరు కోర్సులతో వర్సిటీ తరగతులు ప్రారంభించేందుకు ముహుర్తం ఖరారు అయ్యింది. ములుగు మండలం జాకారం గ్రామం వద్ద ఉన్న యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో తాత్కాలికంగా తరగతులు నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా అడ్మిషన్ నోటిఫికేషన్ జారీ చేసి మెరిట్ ప్రకారం సీట్లు భర్తి చేయనున్నారు. ముందుగా గిరిజన విద్యార్ధులకు ఉపాధి లభించేలా కోర్సులు ప్రారంభిస్తారు. ఒక్కోకో కోర్సులో 30 మంది విద్యార్ధులకు ప్రవేశం కల్పించనున్నారు. హోటల్ మేనేజ్‌మెంట్, బీసీఏ, ఎంసీఏ, ఎంబీఏ తరగతులు ప్రారంభిస్తారు. తెలంగాణ గిరిజన యూనివర్సిటీలో సానిక గిరిజన విద్యార్ధులకు 30శాతం సూపర్ న్యూమరిక్ సీట్లు కేటాయించారు. కాంపౌండ్ హాల్ నిర్మాణాన్ని గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం చేపట్టాలని, గిరిజన యూనివర్సిటీ ద్వారా స్ధానిక గిరిజన విద్యార్ధుల విద్యాభివృద్దికి, గిరిజనుల ఆర్ధికాభివృద్ధికి ఎంతో తోడ్పాటుకానుంది. ములుగు జిల్లా కేంద్రంగా కావడం, ఇక్కడే జాతీయ స్ధాయి గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కావడం పట్ల స్ధానికుల్లో సంతోషం వ్యక్తం అవుతుంది.
చిత్రం..ములుగు మండలం జాకారం వద్ద నున్న యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో
తాత్కాలికంగా ప్రారంభం కానున్న గిరిజన వర్శిటీ భవనం ఇదే


ఎన్నికల నిర్వహణపై సంపూర్ణ అవగాహన ఉండాలి

$
0
0

ధర్మపురి, జనవరి 12: రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత పంచాయతి ఎన్నికల నిర్వహణపై నిర్వాహకులకు సంపూర్ణ అవగాహన ఉండి తీరాలని, లేకుంటే సమస్యలు తలెత్తగలవని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి సూచించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో నిర్వహించిన పోలింగ్ అధికారులు, అసిస్టెంట్ పోలింగ్ అధికారుల శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ, ఎన్నికలలో పోలింగ్ అధికారులు ప్రముఖ పాత్ర వహించాల్సి ఉంటుందని, చట్టం, కార్యవిధానం, ఎన్నికల సంఘం సూచనలు, సందేశాలు, ఆదేశాలు పాటించాలని వివరించారు. తాజావిధానాలపై, నియమాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. బ్యాలెట్ బాక్సులను తెరవడం, మూయడం, సీలింగ్ వేయడం, లెక్కింపు, చెల్లని, చెల్లిన ఓట్లపై శ్రద్ధ వహించి, పోటీదారుల సందేహాలను నివృత్తి చేయాలన్నారు. అనంతరం పాత్రికేయులతో నాగిరెడ్డి మాట్లాడుతూ, సెలవుదినమైనా పోలింగ్‌కై నియుక్తులైన అధికారులు మొత్తం హాజరయ్యారని, శిక్షణార్థులలో సగానికి పైగా గతంలో బ్యాలెట్ విధానంపై అవగాహన ఉన్నవారేనని, ఎన్నికలు విజయవంతంగా నిర్వహించగలరనే సంపూర్ణ విశ్వాసం తమకు కలిగిందన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ మాట్లాడుతూ, ఇప్పటికి రిటర్నింగ్ అధికారులు శిక్షణలు పూర్తి చేసుకుని, విధులు నిర్వహిస్తున్నారని, పీఓలు, ఏపీఓలకు శిక్షణ ఇప్పించడం జరుగుతున్నదని, ఎమ్మెల్యే ఎన్నికలలో పనిచేసిన అనుభవం ఉన్నా, ఈసారి ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్లు ఉంటాయని వివరించారు. తర్వాత లెక్కింపుపై మరో విడత శిక్షణ నిర్వహిస్తామన్నారు. ఎస్పీ సింధు శర్మ, ఆర్డీఓ నరేందర్, డీపీఓ లక్ష్మీనారాయణ, డీఎస్పీ వెంకటరమణ, తహశీల్‌దార్ వెంకట్‌రెడ్డి, ఎంపీడీఓలు సంధ్యారాణి, నవీన్, మదన్‌మోహన్, సిఐ లక్ష్మీబాబు, ఈఓ పీఆర్‌డీ శ్రీ్ధర్, డిటి సుమన్, ఎస్‌ఐ శ్రీకాంత్, శిక్షణార్థులు పాల్గొన్నారు.
చిత్రం..పోలింగ్ అధికారుల శిక్షణా శిబిరంలో మాట్లాడుతున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి

ఫిబ్రవరి 17న టీఎస్సార్ అవార్డులు

$
0
0

టిఎస్‌ఆర్ -టీవీ 9 సంయుక్తంగా నిర్వహించే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌కు విశాఖపట్నం మరోసారి వేదిక కాబోతోంది. 2010నుంచి రెండేళ్ళకోసారి కళాబంధు టి సుబ్బరామిరెడ్డి ఈ అవార్డులను జాతీయస్థాయిలో అందిస్తున్నారు. ఫిబ్రవరి 17న విశాఖపట్నం పోర్ట్‌గ్రౌండ్‌లో వేలాది మంది సమక్షంలో ఘనంగా 2017-18 ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవాన్ని జరుపబోతున్నట్లు టి.సుబ్బరామిరెడ్డి వెల్లడించారు. మీడియా సమావేశంలో జ్యూరీ ఛైర్మన్ సుబ్బరామిరెడ్డితోపాటు సభ్యులు డా శోభనా కామినేని, పింకీరెడ్డి, నగ్మా, మీనా, పరుచూరి గోపాలకృష్ణ, నరేశ్, కెఎస్ రామారావు పాల్గొన్నారు. వీరితోపాటుగా జీవిత, కె రఘురామ కృష్ణంరాజు సైతం జ్యూరీ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు.
కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన అనంతరం టిఎస్‌ఆర్ మాట్లాడుతూ 2010లో మొదలుపెట్టిన అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం ఆనందంగా ఉందన్నారు. ఈసారి ప్రవేశపెట్టిన శ్రీదేవి మెమోరియల్ అవార్డును విద్యాబాలన్‌కు అందిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమానికి రజనీకాంత్, సూర్య, విక్రమ్‌తోపాటు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ తదితర తారలు హాజరవుతారన్నారు. నెల్లూరులో పుట్టిన సుబ్బరామిరెడ్డికి హైదరాబాద్, విశాఖపట్నంతో విడదీయరాని అనుబంధం ఉందని, ఆయన ఆరాధించే శివుడి ఆజ్ఞతోనే కళాసేవ అపూర్వంగా సాగుతోందని పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు. తమ జ్యూరీ గౌరవప్రదంగా, అందరికీ ఆమోదయోగ్యమైన నటీనటులను అవార్డులకు ఎంపిక చేస్తుందని నరేశ్ తెలిపారు. తెలుగు చిత్రసీమకు చెందిన అనేకమంది జాతీయస్థాయిలో గుర్తింపు పొందడానికి టి సుబ్బరామిరెడ్డి కారకులని కెయస్ రామారావు చెప్పారు. భారతీయ కళలు, సంస్కృతికి సేవ చేస్తున్న గొప్ప వ్యక్తి సుబ్బరామిరెడ్డి అని నగ్మా అన్నారు. గతంలో అవార్డుల కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యానని, తర్వాత ‘దృశ్యం’చిత్రానికిగానూ ఉత్తమ నటిగా అవార్డును అందుకున్నానని, ఇప్పుడు జ్యూరీలో ఉండటం ఆనందంగా ఉందని మీనా తెలిపారు. రాజకీయ, పారిశ్రామిక, కళారంగాల్లో తనదైన ముద్రవేసిన టి సుబ్బరామిరెడ్డి జీవితాన్ని బయోపిక్‌గా రూపొందించాల్సిన ఆవశ్యకత ఉందని శోభనా కామినేని అన్నారు. తన తండ్రికి వేరెవ్వరూ సాటిరారని, త్వరలోనే ఆయన ఆటోబయోగ్రఫీ విడుదల చేయబోతున్నామని పింకీరెడ్డి చెప్పారు.

మార్చినుంచే..

$
0
0

స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ తన తరువాత చిత్రాన్ని అల్లు అర్జున్‌తో చేయబోతున్న విషయం తెలిసిందే. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల విజయాల తరువాత వీరిద్దరూ కలిసి మూడోసారి చేస్తున్న సినిమా ఇది. కాగా ఈ సినిమా మార్చినుండి షూట్‌కి వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. బన్నీ సరసన నటించే హీరోయిన్‌ని కూడా ఫైనల్ చేసే ఆలోచనలో వున్నారట దర్శక నిర్మాతలు. బన్నీకి జోడీగా కైరా అద్వానీని హీరోయిన్‌గా తీసుకోబోతున్నారు. కైరా అద్వానీ మహేష్‌బాబుతో ‘భరత్ అనే నేను’ సినిమాలో, ఈమధ్యే సంక్రాంతి పండుగకు రిలీజైన వినయ విధేయ రామలో రామ్‌చరణ్ సరసన నటించింది.

నెగిటివ్ వద్దు బాసూ!

$
0
0

ఆనాటి కాలంలో మన తెలుగు చిత్ర పరిశ్రమలో శ్రీకృష్ణతులాభారం, పచ్చని సంసారం, గుండమ్మకథ, అడవి రాముడు, మూగమనసులు, చిక్కడు-దొరకడు, కలిసుంటే కలదు సుఖం, మంచి మనసులు, కొడుకు దిద్దిన కాపురం వంటి ఎన్నో అచ్చ తెలుగులో ఉండే పేర్లను సినిమాలకు పెట్టేవారు. ఎన్టీఆర్, ఎస్‌వి రంగారావు, అక్కినేనిలాంటి మహానటుల కాలంలో సినిమా కథ, కథనాలకు సరిపోయే విధంగా ఉండేవి టైటిల్స్. ఆనాటి దర్శకులు మొత్తం కథ, కథనాలకు సరిపోయే విధంగా సినిమాలకు పేర్లు పెట్టేవారు. కొంతకాలం గడిచాక, మరో ట్రెండ్‌లో అసెంబ్లీరౌడీ, రౌడీ అల్లుడు, దొంగ దొంగ, రంగూన్ రౌడీ, స్టేట్‌రౌడీ లాంటి చాలా నెగెటివ్ పేర్లు పుట్టుకొచ్చాయి. మన తెలుగు చిత్ర పరిశ్రమలో నెగెటివ్ పేర్లు ఇప్పుడు కొత్తగా వచ్చినవేం కాదు, గతంలోనూ ఇలాంటి నెగెటివ్ పేర్లతో చాలా సినిమాలే వచ్చాయి. కాని అవి తక్కువ సంఖ్యలో ఉండేవి.
నేడు మన దర్శక, నిర్మాతల, హీరోల ఆలోచనా ధోరణి మారింది. నేడు ఒక స్టార్ దర్శకుడు, మరొక స్టార్ హీరోతో సినిమా చేస్తున్నాడంటే టైటిల్ పవర్‌ఫుల్‌గా ఉండాలని మాత్రమే ఆలోచిస్తున్నాడు తప్ప కథకు టైటిల్ సూటవుతుందా లేదా అని ఆలోచించట్లేదు. పైగా అవి నెగెటివ్, ఇతర భాషా టైటిల్స్ వైపే మొగ్గుచూపుతున్నారు. నేటి ఆధునిక యుగంలో మన తెలుగు చిత్రాలకు తెలుగు పేర్లు పెడితేనే అదొక గొప్ప ఘనకార్యంగా భావించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక నెగెటివ్ టైటిల్ పెట్టడంలో దర్శక, నిర్మాతలు, హీరోలు పోటీపడుతున్నారు. ఇడియట్, పోకిరి, టెంపర్, లోఫర్, కంత్రి, బిల్లా, షాడో ఇవన్నీ ఇలా పుట్టుకొస్తున్నవే. బాద్షా, బలుపు.. ఇలా చెప్పుకుంటూపోతే లెక్కలేనన్ని. సినిమాకి సూటయ్యే టైటిల్స్ వదిలేసి, దర్శక, నిర్మాతలు, హీరోలు పిచ్చిపేర్లు, నెగెటివ్ టైటిల్స్ వెనుక పడటం బాధాకరం. ఇవి చాలవన్నట్లు డబ్బింగ్ చిత్రాలు సైతం ఎక్కువగా నెగెటివ్ టైటిల్స్‌తోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఆవారా, విలన్, ఉత్తమ విలన్, యముడు వంటి వాటిని ఉదహరించొచ్చు? వినడానికే ఇబ్బందిగా ఉన్న టైటిల్స్‌ను బలవంతంగా రుద్దుతూ క్రమంగా అలవాటు చేస్తున్న పరిస్థితి దారుణం. అసలు మన ప్రేక్షకుల్లో సగం మంది సినిమాలకు దూరంగా ఉండటానికి మొదటి కారణం ఆయా చిత్రాల టైటిల్సే. సినిమా పేరే సరిగ్గాలేదు, ఇక సినిమాలో విషయం ఏముంటుందని సగంమంది తెలుగు భాషాభిమానులు చిత్రాలను చూడటంలేదనే అనుకోవాలి. ఈ విషయంలో స్టార్ హీరోలు సైతం జోక్యంచేసుకొని మంచి తెలుగుపేర్లు పెడితే ఇండస్ట్రీ కళకళలాడుతుందేమో.
అలా అని మన తెలుగు చిత్రాలకు తెలుగు పేర్లు పెట్టడం లేదా అంటే పెడుతున్నారు, కాని వాళ్లు చాలాకొంతమంది మాత్రమే. అందులోముందు వరసలో సురేందర్‌రెడ్డి, శ్రీకాంత్ అడ్డాల, రాజవౌళిలాంటి వాళ్లను వేళ్లపై లెక్కపెట్టుకొనే పరిస్థితి. ప్రస్తుత ట్రెండ్‌లో కూడా కొన్ని మంచి టైటిల్స్ -సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, సాహసం, అతనొక్కడే, విక్రమార్కుడు వంటి పవర్‌ఫుల్ తెలుగు పేర్లు పెట్టారు. ఈ దిశగా మన దర్శక, నిర్మాత, హీరోలు టైటిల్స్ విషయంలో చొరవతో వ్యవహరిస్తే తెలుగు భాషాభిమానులు సంతోషిస్తారు. గత ఏడాది మంచి టైటిల్స్‌తో వచ్చి హిట్టందుకున్న కొన్నింటిని గమనిస్తే -్భరత్ అను నేను, రంగస్థలం, అరవింద సమేత వీరరాఘవ, గీతగోవిందం, నాపేరుసూర్య, మహానటి, భాగమతి, తొలిప్రేమలను చెప్పుకోవచ్చు. ఈ ఏడాది మొదలైన చిత్రాల్లోనూ ఇప్పటికే రామ్‌చరణ్ -వినయవిధేయ రామ అంటూ వస్తే, బాలకృష్ణ కథానాయకుడిగా వచ్చాడు. మిగిలిన హీరోల చిత్రాలు సైతం మంచి పేర్లే ప్రకటిస్తున్నారు. ఈ సంస్కృతి కొనసాగాలని ఆశిద్దాం..

ప్రయత్నిస్తే ఓడినోళ్లు లేరు

$
0
0

నేచురల్ స్టార్ నాని తాజాగా నటిస్తున్న మూవీ జెర్సీ. మళ్లీ రావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సంక్రాంతి శుభాకాంక్షలతో చిత్ర బృందం టీజర్ విడుదల చేసింది. ఇందులో నాని క్రికెటర్‌గా అదరగొట్టాడు. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న జెర్సీలో అర్జున్ పాత్రలో నాని క్రికెటర్ అవతారం ఎత్తనున్నాడు. లేటు వయసులో క్రికెటర్‌గా రాణించినట్లుగా టీజర్‌లో చూపారు. శ్రద్ధా శ్రీనాథ్ కధానాయికగా నటిస్తున్న చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.
అటు నిర్మాణంలో..
ఇదిలావుంటే, ‘అ!’ సినిమాతో ప్రొడ్యూసర్‌గా మారాడు నాని. కానీ హీరోగా వరస సినిమాలతో బిజీగా వుండటం వల్ల తరువాత మళ్లీ ప్రొడక్షన్ సైడ్ పెద్దగా ఫోకస్ పెట్టలేదు. ఎట్టకేలకు మళ్లీ ఓ సినిమాకి నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు. స్టార్‌రైటర్ విజయేంద్రప్రసాద్ చెప్పిన లేడీ ఓరియెంటెడ్ కథ ఒకటి నానికి బాగా నచ్చిందట. దాంతో ఆ సినిమాని తనే నిర్మించాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఆ కథలో సమంత మెయిన్ లీడ్‌గా నటించనుందట. అయితే ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనే విషయం తెలియల్సి వుంది. నాని- సమంత గతంలో హీరో హీరోయిన్లుగా నటించారు. వీరి మధ్య మంచి స్నేహం ఉంది. ప్రస్తుతం నాని ‘జెర్సీ’ షూటింగ్‌లో ఉండగా, సమంత ‘మజిలీ’ షూటింగ్‌లో బిజీగా వుంది.

Viewing all 69482 articles
Browse latest View live