Are you the publisher? Claim or contact us about this channel


Embed this content in your HTML

Search

Report adult content:

click to rate:

Account: (login)

More Channels


Showcase


Channel Catalog


Articles on this Page

(showing articles 40841 to 40860 of 41331)
(showing articles 40841 to 40860 of 41331)

older | 1 | .... | 2041 | 2042 | (Page 2043) | 2044 | 2045 | .... | 2067 | newer

  0 0

  చుల్ బుల్ పాండేగా మరోసారి చెలరేగిపోనున్నాడు బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్‌ఖాన్. ఖాకీ యూనిఫామ్‌లో తెరపై సందడి చేస్తూ తన స్టైల్‌లో పంచ్‌లు, ఫైట్లతో అభిమానులను ఖుషీ చేయనున్నాడు. సల్మాన్ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిన ‘దబాంగ్’ సిరీస్‌లో మూడో చిత్రానికి రంగం సిద్ధమైంది. అందరూ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న దబాంగ్ 3 ఏప్రిల్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ విషయాన్ని సల్మాన్ సోదరుడు, దబాంగ్ నిర్మాత అర్బాజ్‌ఖాన్ వెల్లడించాడు. మూడో దబాంగ్‌లోనూ చుల్‌బుల్ పాండేకు జోడీగా సోనాక్షి సిన్హా అలరించనుంది. సల్మాన్‌తో వాంటెడ్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రభుదేవా దీనికి దర్శకత్వం వహించబోతున్నాడు.


  0 0

  తరుణ్‌తేజ్, లావణ్యలు హీరో హీరోయిన్లుగా పరిచయమవుతూ శ్రీమతి సత్య ప్రమీల కర్లపూడి సమర్పణలో గోల్డ్ టైమిన్ పిక్చర్స్ బ్యానర్‌పై లింగేశ్వర్ నిర్మాతగా రానున్న చిత్రానికి ‘ఉండిపోరాదే’ టైటిల్‌ని ఖరారు చేశారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు బ్యానర్‌లో అసోసియేట్ దర్శకుడిగా పనిచేసిన నవీన్ నాయని దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే రాజమండ్రి, ఆత్రేయపురం పరిసర ప్రాంతాల్లో మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకుంది. సంక్రాంతి సందర్భంగా చిత్ర టైటిల్‌ని, మొదటి లుక్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత లింగేశ్వర్ మాట్లాడుతూ బలమైన కథ, అందుకుతగ్గ తారాగణం, సత్తావున్న దర్శకుడు వుంటే కొత్త పాత తేడా చూపకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇదే బేస్ చేసుకుని చక్కటి కథని మా బ్యానర్‌లో తెరకెక్కిస్తున్నాం. నవీన్ నాయని దర్శకుడు. తరుణ్ తేజ్, లావణ్యలు హీరో హీరోయన్లు. తదుపరి షెడ్యూల్‌ని ఈనెల 28 నుంచి బెంగుళూరు, మైసూరు, కరీంనగర్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తాము. సినిమా అన్ని వర్గాలనూ అలరిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.


  0 0

  నటిగా తానిప్పుడు పరిణతి సాధించానంటోంది కాజల్. ఇకపై చేసే సినిమాలను మరింత జాగ్రత్తగా ఎంచుకుంటానంటోంది. గతంలో చేసిన కొన్ని చిత్రాలు చూస్తే ఇలా నటించానేంటి అనిపిస్తోందని, కాలంతోపాటు ఎదిగానన్న విషయం తనకు అర్థమవుతోందని అంటోంది. -మనుషులుగా మనం కాలంతోపాటే ఎదుగుతుంటాం. నటిగా నేనిప్పుడు ఒక స్థాయికి వచ్చాను. నటనలో పరిపక్వత సాధించాను. నా తొలినాళ్ల చిత్రాలు చూస్తుంటే నేనేనా ఇలా నటించింది అనిపిస్తుంటుంది. నాకొచ్చిన అవకాశాల్లో మంచిని ఎంచుకున్నాను. వాటిలో కొన్ని హిందీ సినిమాలూ ఉన్నాయి. అయితే హిందీ సినిమా చేయాలని అక్కడి చిత్రాలు అంగీకరించను. నిజంగా బాగుంటే తప్పకుండా నటిస్తా. తెలుగు, తమిళంలోనే నచ్చిన చిత్రాలు వచ్చాయి. వాటితోనే తీరిక లేకుండా నా ప్రయాణం కొనసాగింది. ఎప్పటికప్పుడు నటనలో, అందంలో కొత్తగా కనిపించాలని శ్రమిస్తుంటాను అని చెప్పుకొచ్చింది.


  0 0

  దుబాయ, జనవరి 13: భారత బ్యాట్స్‌మన్, పార్ట్ టైం ఆఫ్ స్పిన్నర్ అంబటి రాయుడు బౌలింగ్ శైలిపై ఐసీసీ ఫిర్యాదు అందింది. ఆస్ట్రేలియా- భారత్ మధ్య శనివారం జరిగిన మొదటి మ్యాచ్‌లో రాయుడు రెండు ఓవర్లు బౌలింగ్ చేసి 13 పరుగులు సమర్పించుకున్నాడు. అయతే 33 ఏళ్ల రాయుడు బౌలింగ్ శైలి ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా ఉందని మ్యాచ్ రిఫరీ ఫిర్యాదు చేశాడు. దీనిని స్వీకరించిన ఐసీసీ 14 రోజుల్లో బౌలింగ్ యాక్షన్ నిరూపించుకోవాలని సూచించింది.


  0 0

  ముంబయ, జనవరి 13: భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు మరో షాక్ తగిలింది. సహచర ఆటగాడు కేఎల్ రాహుల్‌తో కలిసి ఓ టీవీ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వీరిని బీసీసీఐ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయతే వీరిని ప్రచారకర్తలుగా నియమించుకున్న పలు ప్రముఖ బ్రాండ్లు, సంస్థలు వారి ఒప్పందాలను రద్దు చేసుకోవాలని భావిస్తున్నాయ. ఈ క్రమంలో జిల్లెట్ సంస్థ హార్దిక్ పాండ్యతో కొన్ని నెలల క్రితం ఒప్పందం చేసుకుంది. తాజాగా పాండ్య వివాదంలో చిక్కుకోవడంతో అతనితో భాగస్వామ్యాన్ని తెంచుకున్నట్లు జిల్లెట్ ప్రకటించింది. జిల్లెట్ ప్రచారం నుంచి పాండ్యను తప్పిస్తూ సంస్థ ఆ నిర్ణయం తీసుకుంది.


  0 0

  న్యూఢిల్లీ, జనవరి 13: తమిళనా డు ఆల్ రౌండర్ విజయ్ శంకర్, అం డర్ 19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు సభ్యుడు శుభ్‌మన్ గిల్‌కు ఆస్ట్రేలియా నుంచి పిలుపొచ్చింది. వెంటనే జట్టులో చేరాలంటూ బీసీసీఐ నుంచి సమాచారం అందడంతో వీరిద్దరూ ఆస్ట్రేలియాకు బయల్దేరారు. ఈ నెల 15న అడిలైడ్‌లో జరగనున్న రెండో వనే్డలో తలపడనున్న భారత జట్టులో వీరికి చోటు లభించే అవకా శాలున్నాయ. మరోవైపు టీవీ షోలో మహిళలను కించపరుస్తూ మాట్లాడి న హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్ సస్పెండ్ అయన విషయం తెలిసిందే. వీరి స్థానాల్లో విజయ్ శంకర్, శుభ్ మన్ గిల్‌తో భర్తీ చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.

  చిత్రాలు.. శుభ్‌మన్ గిల్, విజయ్ శంకర్


  0 0

  ఇంగ్లాండ్ టెన్నిస్ స్టార్ దిగ్గజ ఆటగాడు ఆండీ ముర్రే అనారోగ్య పరిస్థితుల కారణంగా మొత్తం టెన్నిస్ రంగం నుంచే రిటైరవుతున్నట్టు ప్రకటించడం తనను షాక్‌కు గురిచేసిందని ప్రపంచ నెంబర్ మూడో సీడ్ రోజర్ ఫెదరర్ అన్నాడు. ముర్రే తీసుకున్న తాజా నిర్ణయం మొత్తం టెన్నిస్ ప్రపంచానికే తీరని లోటని అభివర్ణించాడు. తన క్రీడా జీవితంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించిన ఆండీ ముర్రే వింబుల్డన్ టోర్నీతో తన కెరీర్‌కే గుడ్‌బై చెప్పాలని ప్రకటించడం విచారకరమని అన్నాడు. ‘ముర్రే ఆకస్మిక ప్రకటనతో నిరాశచెందాను. ఈ సంచలన ప్రకటన నన్ను కొంతవరకు షాక్‌కు గురిచేసింది. ఏదేమైనా టెన్నిస్ రంగం గొప్ప ఆటగాడిని కోల్పోతోంది’ అని ఫెదరర్ ఆదివారం ఇక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అన్నాడు. ‘ముర్రే ఎంతోమంది మాలాంటి ఆటగాళ్లను ఎదుర్కొన్నాడు. అతని ఆటతీరు మాకెంతో ఇష్టం. అతనికి శత్రువులెవరూ లేరు. నెమ్మదస్తుడు, నిజాయితీపరుడు, అనుకున్న విజయాలను అందుకున్నాడు. రెండుసార్లు వింబుల్డన్ ట్రోఫీని ముద్దాడాడు’ అని అన్నాడు వరల్డ్ నెంబర్ మూడో స్టార్ ఆటగాడు ఫెదరర్.

  చిత్రాలు.. ముర్రే * ఫెదరర్


  0 0

  మెల్‌బోర్న్, జనవరి 13: ప్రపంచ టెన్నిస్ స్టార్ దిగ్గజాలు రోజర్ ఫెదరర్, నవోక్ జొకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్‌పై కిరీటం కైవసం చేసుకునేందుకు కనే్నశారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్, విక్టోరియాలో భారీ ఎత్తున ఈ ఏడాది ప్రథమార్థంలో నిర్వహిస్తున్న తొలి గ్రాండ్‌శ్లామ్ ఇదే. ఆస్ట్రేలియా ఓపెన్ నిర్వహించడం వరుసగా ఇది 107వ సారి. ఈ పోటీలు ఈనెల 14 నుంచి 27వరకు నుంచి మెల్‌బోర్న్‌లో జరుగనున్నాయి. అనారోగ్యం కారణంగా రెండు రోజుల కిందట టెన్నిస్‌కు గుడ్‌బై పలికిన ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు ఆండీ ముర్రేకు ఇదే ఆఖరి మెగా ఈవెంట్ కానుంది. ఇప్పటివరకు రెండుసార్లు వింబుల్డన్ ట్రోఫీలను ముద్దాడాడు. ప్రపంచ నెంబర్ వన్ జొకోవిచ్, మూడో సీడ్ ఫెదరర్ (డిఫెండింగ్ చాంపియన్)ను యువ సంచనం, నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ ఈ మెగా ఈవెంట్‌లో ఛాలెంజ్ చేయనున్నాడు. ఈ అతి పెద్ద టోర్నమెంట్‌లో దిగ్గజ ఆటగాళ్లపై పైచేయి సాధించేందుకు జ్వెరెవ్ అత్యుత్సాహంతో ఉన్నాడు. గత ఆరు నెలలుగా తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న ఆండీ ముర్రే రానున్న టోర్నమెంట్లలో ఆడే అవకాశం ఏకోశానా కనిపించకపోవడంతో టెన్నిస్ నుంచి రిటైరవుతున్నట్టు రెండు రోజుల కిందట మీడియా సమావేశంలో ఉద్వేగభరితంగా తెలిపాడు. వింబుల్డన్ పోటీల తర్వాత తాను పూర్తిగా టెన్నిస్ నుంచి తప్పుకోనున్నానని ముర్రే స్పష్టం చేశాడు. ఆరోగ్యం సహకరించి ఉంటే సోమవారం నుంచి జరుగనున్న వింబుల్డన్ వంటి మెగా టోర్నమెంట్‌లో దిగ్గజ ఆటగాళ్లతో పోటీ పడే అవకాశం ఉండేది. కాలినొప్పి వల్ల గత ఏడాది మెల్‌బోర్న్ టోర్నీ నుంచి వెనుతిరిగి నిరాశపరిచిన 31 ఏళ్ల జొకోవిచ్ గత ఏడాది ఏటీపీ ఫైనల్స్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్‌పై గెలుపు ద్వారా మళ్లీ తన మునుపటి ఫామ్‌ను కొనసాగించాడు. జొకోవిచ్ గత ఏడాది సెప్టెంబర్‌లో మూడోసారి యూఎస్ ఓపెన్‌లో గెలుపుతో 14 గ్రాండ్‌శ్లామ్‌లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ విజయాలతో జొకోవిచ్ అత్యధిక గ్రాండ్‌శ్లామ్‌లు గెల్చుకున్న రాఫెల్ నాదల్‌కు మూడు స్థానాలు వెనుక, ఫెదరర్‌కు ఆరు స్థానాలు ముందు నిలిచాడు. ‘నేను ఉత్తమ ఆటతీరును కనబరుస్తున్నాను. మెగా ఈవెంట్‌లో ప్రత్యర్థిపై పైచేయి సాధించగలననే నమ్మకం ఉంది’ అని అన్నాడు ఆస్ట్రేలియా ఓపెన్‌లో తలపడుతున్న మరో స్టార్ ఆటగాడు 37 ఏళ్ల స్విస్ స్టార్ ఫెదరర్.
  చిత్రాలు.. నవోక్ జొకోవిచ్ *అలెగ్జాండర్ జ్వెరెవ్


  0 0

  తిథి: 
  శుద్ధ అష్టమి రా.7.24, కలియుగం - 5120 శాలివాహన శకం - 1940
  నక్షత్రం: 
  రేవతి ఉ.8.42
  వర్జ్యం: 
  రా.తె.5.23 నుండి
  దుర్ముహూర్తం: 
  మ.12.24 నుండి 01.12 వరకు తిరిగి మ.02.48 నుండి 03.36 వరకు
  రాహు కాలం: 
  ఉ.7.30 నుండి 9.00 వరకు విశేషాలు: భోగి పండుగ, మకర మాసారంభం, ఉత్తరాయణ పుణ్యకాలం
  మేషం: 
  (అశ్విని, భరణి, కృత్తిక 1పా.) చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్ర్తిలతో తగాదాలేర్పడే అవకాశాలుంటాయి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలుంటాయి.
  వృషభం: 
  (కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) సంపూర్ణ ఆరోగ్యంగా వుంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు.
  మిథునం: 
  (మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) విదేశయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. మనోవిచారాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా వుంటాయి. ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త వహించుట మంచిది. వ్యాపార రంగంలో లాభాలుంటాయి.
  కర్కాటకం: 
  (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) విదేశయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయరాదు. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంది. వృత్తి, ఉద్యోగ రంగంలోనివారికి ఆటంకాలెదురగును. ఆరోగ్యం గూర్చి ప్రత్యేక శ్రద్ధ అవసరం.
  సింహం: 
  (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్ర్తిల మూలకంగా లాభం వుంటుంది. మంచి ఆలోచనలను కలిగివుంటారు. వ్యాపార రంగంలో లాభాలుంటాయి బంధు, మిత్రులు గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తారు.
  కన్య: 
  (ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం వుంది. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోండి. ఆర్థిక ఇబ్బందులను అధిగమించుటకు ఋణప్రయత్నాలు చేస్తారు. బంధు, మిత్రుల సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి.
  తుల: 
  (చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) ధర్మకార్యాలు చేయుటయందు ఆసక్తి పెరుగుతుంది. దైవదర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యముంటుంది. మానసికానందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభముంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.
  వృశ్చికం: 
  (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) నూతన వ్యక్తులను నమ్మి మోసపోరాదు. సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్తపడుట మంచిది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలెదురవడంతో ఇబ్బంది పడతారు. దైవదర్శనానికి ప్రయత్నిస్తారు. ఋణప్రయత్నాలు ఫలిస్తాయి. సోదర వైరం కలిగే అవకాశముంటుంది.
  ధనుస్సు: 
  (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) మనస్సు చంచలంగా ఉంటుంది. బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్తపడుట మంచిది. అనారోగ్య బాధలనుభవిస్తారు. కలహాలకు అవకాశముంటుంది. చెడు సహవాసానికి దూరంగా నుండుటకు ప్రయత్నించాలి.
  మకరం: 
  (ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) ప్రయత్నం మేరకు స్వల్పలాభముంటుంది. వృధా ప్రయాణాలెక్కువ చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలుంటాయి. ఋణప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధు, మిత్రుల సహకారం లభిస్తుంది.
  కుంభం: 
  (ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) వ్యవసాయ రంగంలోనివారికి లాభదాయకంగా వుంటుంది. తొందరపాటువల్ల ప్రయత్న కార్యాలు చెడిపోతాయి. చెడును కోరేవారికి దూరంగా నుండుట మంచిది. శారీరకంగా బలహీనమేర్పఢుతుంది. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు.
  మీనం: 
  (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందుల అధిగమిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలుగకుండా జాగ్రత్త అవసరం. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ధైర్యసాహసాలతో నూతన కార్యాలు ప్రారంభిస్తారు. దైవధ్యానం చేస్తారు.
  Date: 
  Monday, January 14, 2019
  author: 
  గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి

  0 0

  అమరావతి, జనవరి 13: రాష్ట్రంలోని అన్నదాతకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్రాంతి కానుక ప్రకటించారు. ఇకపై వ్యవసాయానికి 9గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం అందిస్తున్న 7గంటల ఉచిత విద్యుత్‌ను 9గంటలకు పెంచాలని, ఇందుకు సంబంధించి విధివిధానాలు రూపొందించాలని, అమలుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఇంధన, విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. మార్చి నెలాఖరులోగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెండింగ్‌లో లేకుండా చూడాలని పంపిణీ సంస్థలకు సూచించారు. రాష్టవ్య్రాప్తంగా 9గంటల ఉచిత విద్యుత్ వల్ల 17లక్షల మంది రైతులు లబ్ధి పొందుతారని, బంగారం లాంటి పంటలు పండించుకోగలుగుతారని అధికారులతో ఆదివారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు అన్నారు. 9గంటల ఉచిత విద్యుత్ సరఫరాకు అదనంగా 2800 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమవుతుందని అంచనా వేసినట్లు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ ముఖ్యమంత్రికి తెలిపారు. ప్రస్తుతం వ్యవసాయానికి వినియోగిస్తున్న 10831 యూనిట్లకు ఇది అదనమన్నారు. సుమారు 12వందల కోట్ల రూపాయల అదనపు భారం ప్రభుత్వంపై పడుతుందని చెప్పారు. ఉచిత విద్యుత్, కొత్త కనెక్షన్లకు గాను ప్రస్తుతం వ్యవసాయ రంగానికి రాయితీ కింద 6030.17 కోట్లు ఖర్చవుతుండగా అదనపు విద్యుత్ వల్ల ఇది 7230.17 కోట్లకు చేరుతుందని తెలిపారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ తాను ముఖ్యమంత్రిగా ఉన్న 1994-2004 మధ్యకాలంలో 9గంటల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేశామని గుర్తుచేశారు. ఇప్పుడు జన్మభూమి కార్యక్రమంలో భాగంగా 15రోజుల క్రితం 9గంటల ఉచిత విద్యుత్‌ను ప్రకటించామన్నారు. రైతుల సంక్షేమం తప్ప తనకింకేదీ ప్రధానం కాదని తేల్చిచెప్పారు. మనది రైతుహితం కోరే ప్రభుత్వమని, ‘ముందు రైతులే’ అనే నినాదం పాటిస్తామన్నారు. అన్నదాతల సంక్షేమానికి ఎంత ఖర్చయినా వెనుకాడేది లేదని స్పష్టం
  చేశారు. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ కోసం ఇంత భారీ మొత్తంలో రాయితీని దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వటం లేదన్నారు. నాణ్యమైన ఉచిత విద్యుత్, ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా రైతుల సాధికారత కోసం కృషి జరుగుతోందని తెలిపారు. వ్యవసాయ కనెక్షన్లు అన్నింటినీ మార్చి 2019కల్లా పూర్తిగా ఇవ్వాలని విద్యుత్ పంపిణీ సంస్థలను ఆదేశించారు. వ్యవసాయ రంగాన్ని సుసంపన్నం చేయటం, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయటమే తమ ముందున్న లక్ష్యాలన్నారు. ప్రతి ఎకరానికి సాగునీరు, విద్యుత్, రైతుకు ఆర్థిక భద్రత కల్పించే దిశగా కార్యాచరణ రూపొందించామని వివరించారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే రాష్ట్ర ముఖచిత్రమే మారిపోతుందన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా వల్ల రాష్ట్రానికి లబ్ధి చేకూరుతుందని చెపుతూ దాదాపు 80శాతం మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. రాష్ట్ర విభజన తరువాత 22 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటుతో సంక్షోభాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని గుర్తుచేశారు. తాము అధికారంలోకి వచ్చి చేపట్టిన సంస్కరణల ఫలితంగా మిగులు విద్యుత్ రాష్ట్రంగా రూపుదిద్దుకుందని పునరుద్ఘాటించారు. 2014లో 9వేల మెగావాట్లుగా ఉన్న స్థాపిత సామర్థ్యం 18వేల మెగావాట్లకు చేరిందని తెలిపారు. ప్రభుత్వ అద్భుత పనితీరుకు ఇది నిదర్శనమన్నారు. రైతులకు 16లక్షల ఇంధన సామర్థ్య సోలార్ పంపుసెట్లు అందజేయనున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. పాత పంపుసెట్ల స్థానంలో ఒక్కొక్కటీ రూ. 40వేల విలువైన 42వేల పంపుసెట్లు పంపిణీ చేశామని చెప్పారు. ఇవి స్మార్ట్ ప్యానెల్, సిమ్‌కార్డులు కలిగి ఉంటాయని, దీనివల్ల రైతులు ఇంట్లో ఉండే ఫోన్ల ద్వారా తమకు అనుకూలమైన సమయాల్లో ఆన్, ఆఫ్ చేసుకునే వీలుంటుందని వివరించారు. ఇంధన సామర్థ్య పంపుసెట్ల ద్వారా 30శాతం విద్యుత్ ఆదా అవటమే కాకుండా 15శాతం నీటి పంపింగ్ సాధ్యపడుతుందన్నారు. ఇంధన సామర్థ్యంతో ఆదాచేసే సొమ్మును రైతుల సంక్షేమానికే వినియోగిస్తామని వెల్లడించారు. ఈ పంపుసెట్ల వల్ల రైతులకు ఐదేళ్ల పాటు నిర్వహణ ఖర్చుల భారం కూడా తగ్గుతుందని చంద్రబాబు తెలిపారు.
  రైతులకు కొత్తగా వౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా ప్రస్తుతం ఒక్కో వ్యవసాయ పంపుసెట్టుపై ఇస్తున్న రాయితీ లక్ష రూపాయలకు పెరుగుతుందని ఇంధన శాఖ మంత్రి కిమిడి కళావెంకట్రావు చెప్పారు. ఏపీ డిస్కంలు ఇప్పటికే రాష్ట్రంలో 42వేల ఇంధన సామర్థ్య పంపుసెట్లను అమర్చినట్లు అజయ్ జైన్ తెలిపారు. ఈ ఏడాది రూ. 2625 కోట్ల అంచనా వ్యయంతో 75వేల సోలార్ పంపుసెట్లు (రూ 3.5 లక్షల విలువైనవి) అమర్చనున్నట్లు వివరించారు. 3 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన సౌర పంపుసెట్లకు రైతులు రూ. 55వేలు చెల్లిస్తే సరిపోతుందన్నారు. 9గంటల ఉచిత విద్యుత్ సరఫరాకు సంబంధించి త్వరలో ముఖ్యమంత్రికి సమగ్ర నివేదికను అందజేయనున్నట్లు ట్రాన్స్‌కో సీఎండీ, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి కే విజయానంద్ తెలిపారు. టెలీకాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, ముఖ్య కార్యదర్శి జీ సాయిప్రసాద్, విద్యుత్ శాఖ సలహాదారు కె రంగనాథం, ట్రాన్స్‌కో జేఎండీలు దినేష్ పరుచూరి, ఉమాపతి, డిస్కంల సీఎండీలు ఎంఎం నాయక్, హెచ్‌వై దొర, నెడ్‌క్యాప్ ఎండీ కమలాకరబాబు, ఏపీ ఎస్పీడీసీఎల్ ఎండీ ఆదిశేషు పాల్గొన్నారు.


  0 0

  న్యూఢిల్లీ/షార్జా, జనవరి 13: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కుంభకోణాన్ని మరుగున పరిచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ధ్వజమెత్తారు. ఈ కుంభకోణం భయంతోనే ఆయన అవినీతికి పాల్పడుతున్నారని, ప్రధాన సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. లండన్ కేంద్రంగా పనిచేస్తున్న కామనె్వల్త్ సెక్రటేరియట్ ఆర్బిట్రల్
  ట్రిబ్యునల్ (సీఎస్‌ఏటీ) అధ్యక్షుడు/సభ్యుడిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఏకే సిక్రీని నామినేట్ చేయాలని మోదీ ప్రభుత్వం గత నెలలో నిర్ణయించినట్టుగా వచ్చిన కథనాన్ని రాహుల్ ఈ సందర్భంగా ఉటంకించారు. ఈనెల 8న జరిగిన ఉన్నతాధికార కమిటీలో సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి అలోక్ వర్మను తొలగించడానికి న్యాయమూర్తి ఏకే సిక్రీ ఓటే అత్యంత నిర్ణయాత్మకంగా మారిందని రాహుల్ అన్నారు. న్యాయాన్ని వక్రీకరిస్తే అరాచకమే రాజ్యమేలుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఇందుకోసం ఎలాంటి సంస్థనైనా నిర్వీర్యం చేస్తున్నారని, రాఫెల్ కుంభకోణం నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని రాహుల్ అన్నారు. మోదీకి ఈ కుంభకోణం భయం పట్టుకోవడం వల్లే అన్నిరకాల అక్రమాలకు ఆయన ఒడిగడుతున్నారని రాహుల్ ఆరోపించారు. ఇదిలావుండగా, కామనె్వల్త్ ట్రిబ్యునల్‌కు
  నామినేట్ చేసేందుకు ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనను న్యాయమూర్తి సిక్రీ తిరస్కరించినట్టు స్పష్టమవుతోంది. ఈ పదవికి తన ఆమోదాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టుగా ఆదివారం రాత్రి సిక్రీ ప్రభుత్వానికి ఓ లేఖ రాసినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయ. అయతే వర్మ ఉద్వాసనకు, ఆ నిర్ణయం తీసుకున్న కమిటీలో సిక్రీ ప్రమేయానికి ఎలాంటి సంబంధం లేదని, ఈ రెండింటికి ముడిపెట్టడం తప్పని ఆ వర్గాలు వెల్లడించాయ. ఈ విషయంలో అనవసరమైన సంక్షోభాన్ని సృష్టిస్తున్నారని పేర్కొన్నాయ. నిజానికి 2018 డిసెంబర్‌లోనే కావాలనే ట్రిబ్యునల్ పదవికి నామినేషన్ విషయంలో సిక్రీ ఆమోదం తీసుకున్నట్టుగా ఈ వర్గాలు వెల్లడించాయ.
  రెండు రోజుల పర్యటనార్థం దుబాయ్ వచ్చిన రాహుల్ గాంధీ ఆదివారం షార్జా పాలకుడు సుల్తాన్ బిన్ మహమ్మద్‌ను కలుసుకుని ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. షార్జా సుల్తాన్‌తో జరిగిన చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని పేర్కొన్న రాహుల్ రెండు దేశాల మధ్య సామరస్యపూర్వక సంబంధాలు బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ఈ రెండు రోజుల పర్యటనలో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న రాహుల్ భారతీయ సంతతి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడంతోపాటు వారి సేవలనూ శ్లాఘించారు.


  0 0

  విజయవాడ: రాష్ట్రంలోని 4లక్షల మంది ప్రభుత్వ పెన్షనర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి కానుక అందజేశారని, ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఏనాటి నుంచో కోరుతున్నట్లుగా పెన్షనర్లలో 70ఏళ్లకే 10శాతం అదనపు పింఛను మంజూరు చేస్తూ జీవో నెంబరు 6ను జారీ చేసిందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ టీవీ ఫణిపేర్రాజు తెలిపారు. ప్రస్తుతం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తమ డిమాండ్లను సీఎం విశాల దృక్పథంతో ఆమోదించి ఈ జీవో జారీ చేశారని, దీనివల్ల ప్రభుత్వంపై రూ.200 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. అయినప్పటికీ తక్షణం 70వేల మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. బాబు నిర్ణయం పట్ల ఉద్యోగులంతా ఆనందంగా, కృతజ్ఞతలతో ఉంటారన్నారు. అందరూ సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలపడానికి ఉవ్విళ్లూరుతున్నారన్నారు. ఈ జీవో ప్రకారం 75నుండి 80ఏళ్ల వరకు ఉన్న పెన్షన్‌దారులకు 15శాతం, 80నుండి 85ఏళ్ల వరకు 20శాతం, 85నుండి 90ఏళ్ల వరకు 25శాతం, 90 నుండి 95ఏళ్ల వరకు 30శాతం, 95 నుండి 100 ఏళ్ల వరకు 35శాతం, ఆపై బడినవారికి 50 శాతం అదనపు పెన్షన్ మంజూరవుతుందని వారు వివరించారు.


  0 0

  అమరావతి: రాష్ట్రంలో ప్రతి ఇంటికీ పెద్దకొడుకుగా గత నాలుగున్నరేళ్లలో అభివృద్ధిని సాధించామని, సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కడా రాజీపడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పారదర్శకంగా, పైసా అవినీతికి తావులేకుండా అర్హులకు పథకాల పంపిణీ జరుగుతోందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిరంతరం కొనసాగించేందుకు రేపటి తరం కోసం మరోసారి ఆశీర్వదించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలకు ఆదివారం ఆయన భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పింఛన్లు రెట్టింపు చేసి ఇంటింటికీ పెద్దకొడుకుగా సంక్రాంతి కానుక ఇచ్చామని, ఇది తనకెంతో సంతృప్తి ఇస్తోందన్నారు. నిరుపేదల కళ్లల్లో వెలుగులు చూడటమే నిజమైన సంక్రాంతి అని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 50,61,906 సామాజిక భద్రత పింఛన్లు ఇస్తున్నట్లు ఈసందర్భంగా తెలిపారు. దివ్యాంగులకు నెలకు రూ. 3వేలు ఇస్తామని, రెండు చేతుల్లేని దివ్యాంగులకు నెలకు రూ. 10వేలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రజలు, దేశ విదేశాల్లోని తలుగువారంతా భోగి, మకర సంక్రాంతి ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. తెలుగు వాకిట వెలుగు ముగ్గులు వేసి మన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పే సృజనాత్మక వేడుక సంక్రాంతి పండుగ అన్నారు. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే పుణ్యకాలమని ప్రజలు అనాదిగా విశ్వసిస్తున్నారన్నారు. పల్లె
  లోగిళ్లలో ఆహ్లాదం వెల్లివిరుస్తుందని, జానపద కళారూపాల సందడి నెలకొంటుందన్నారు. భోగిమంటలతో ప్రారంభమయ్యే సంక్రాంతి సంబరాలు కనుమతో ముగించడం సంప్రదాయమని, రంగురంగుల రంగవల్లులు, వైవిధ్యమైన ముగ్గులు తెలుగింటి ఆడపడచుల కళాసృజనకు నిదర్శనమని చెప్పారు. జీవన సమరంలో ఎక్కడో దూరతీరాల్లో ఉంటూ పండుగ వేళ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కలుసుకుంటారని, ఇది మన దేశ కుటుంబ వ్యవస్థ గొప్పతనమన్నారు. పల్లెసీమల్లో సుహృద్భావ సంబంధాలకు సంక్రాంతి నిదర్శనమని తెలిపారు. పంట చేతికొచ్చిన సంతోషంతో జరుపుకునే పండుగే సంక్రాంతి అన్నారు. ఇది రైతులకు నిజమైన పండుగ అని అభివర్ణించారు. సంక్రాంతి నవ్యాంధ్రప్రదేశ్‌కు నవక్రాంతి కావాలని అభిలషించారు. నాలుగున్నరేళ్ల నాడు విభజన తరువాత జరిగిన ఎన్నికల్లో ప్రజలు తన అనుభవానికి, పాలనాదక్షతకు పట్టం కట్టారని, ఎక్కడా రాజీ పడకుండా రాష్ట్ర పురోభివృద్ధికి రోజుకు 18గంటలు కష్టపడుతున్నానని తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం, సిబ్బంది సహకారంతో రెండంకెల వృద్ధిరేటు సాధించామని గుర్తుచేశారు. గత నాలుగేళ్లుగా వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ వ్యవసాయ రంగంలో వృద్ధిరేటు 17.18 శాతం నమోదయిందని తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో రైతుల ఆదాయం రెట్టింపైందని, 2013-14కు రూ. 1.28 లక్షల కోట్లు రాగా, 2017-18లో అది 2.53 లక్షల కోట్లకు (18.97 శాతం) పెరిగిందని వివరించారు. రైతుల పండుగ సంక్రాంతి ప్రకృతికి కర్షకులు నివేదించే కృతజ్ఞతల వేడుక అని చంద్రబాబు ఉద్ఘాటించారు. పట్టిసీమ ద్వారా నాలుగేళ్లలో రూ. 44వేల కోట్ల విలువైన పంటలు పండాయని తెలిపారు. ఇదే సమయంలో రాయలసీమకు కృష్ణా జలాలు తరలించి చెరువులు నింపామని, క్రమంగా కరవుఛాయలు తొలగిపోతున్నాయన్నారు. పట్టిసీమ స్ఫూర్తితో పంచనదుల మహాసంగమ పనులకు శ్రీకారం చుట్టామని పునరుద్ఘాటించారు. పోలవరం ప్రాజెక్ట్ పనులు 65శాతానికి పైగా పూర్తయ్యాయంటూ ఇటీవల కాంక్రీట్ పనుల్లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన అంశాన్ని ప్రస్తావించారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులు శరవేగంతో పరుగులు తీస్తున్నాయని, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం తథ్యమని, కియా మోటారు కార్ల పరిశ్రమను అనంతపురానికి తెచ్చామని వివరించారు. రేపటి తరం భవితకు రాష్ట్భ్రావృద్ధిని కొనసాగించటానికి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు తమకు తిరిగి మద్దతు పలికి ఆశీర్వదించాలని చంద్రబాబు తెలుగువారికి పిలుపునిచ్చారు.


  0 0

  నాగాయలంక: మత్స్యకారుల జీవన ప్రమాణాలను ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నంలో భాగంగా స్థానిక శ్రీరామపాదక్షేత్రం పుష్కర ఘాట్ వేదికగా రాష్ట్ర స్థాయి సంప్రదాయ పడవల పోటీలు ఆదివారం కోలాహలంగా ప్రారంభమయ్యాయి. ఉపసభాపతి బుద్ధప్రసాద్ చొరవతో రెండు సంవ్సరాలుగా నిర్వహిస్తున్న ఈ పడవ పోటీలకు అనూహ్య స్పందన వస్తోంది. గత సంవత్సరం జిల్లా స్థాయిలో పడవల పోటీలు నిర్వహించగా ఈ సంవత్సరం రాష్ట్ర స్థాయిలో పడవల పోటీలు నిర్వహించడం విశేషం. ఈ పోటీలను రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ జయరామరెడ్డి, రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి అధ్యక్షుడు జస్టిస్ గ్రంధి భవానీ ప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు. తొలి రోజైన ఆదివారం కోల పడవల విభాగంలో పోటీలు నిర్వహించారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుండి 38 జట్లు పోటీల్లో పాల్గొనాల్సి ఉండగా తొలి రోజు 16 జట్లు పాల్గొన్నాయి. మిగిలిన జట్లకు రెండవ రోజైన సోమవారం పోటీలు నిర్వహించనున్నారు. డ్రాగన్ పడవల పోటీలను కూడా సోమవారం నిర్వహించనున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉత్సాహంగా సాగిన పడవల పోటీలను వీక్షించేందుకు జిల్లా నలుమూలల నుండే కాకుండా గుంటూరు, ప్రకాశం, ఇతర జిల్లాల నుండి కూడా సందర్శకులు తరలి రావడం విశేషం. ఒక పక్క పడవల పోటీలు, మరో పక్క భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించారు. రంగవల్లులతో పాటు లెమన్ అండ్ స్పూన్ వంటి పోటీల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కృష్ణానదిలో సహజ సిద్ధంగా ఏర్పడిన ద్వీపాన్ని నవ్యలంకగా తీర్చిద్దారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ అర్జునుడు, ఏలూరు రేంజ్ డీఐజీ రవికుమార్, పర్యాటక శాఖ ఇడీ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.


  0 0

  గుడివాడ: ఎన్టీఆర్ టూ వైఎస్సార్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక లింగవరం రోడ్డులోని ఎమ్మెల్యే కొడాలి నాని కే కనె్వన్షన్‌లో గత మూడు రోజులుగా జరుగుతున్న జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఆదివారం ఆరు పళ్ళ విభాగంలో పోటీలను నిర్వహించారు. 18జతల ఎడ్లు తొలి తొమ్మిది స్థానాల కోసం హోరాహోరీగా పోటీపడ్డాయి. ఈ పోటీల్లో గుంటూరు జిల్లా నర్సరావుపేట అగ్రహారానికి చెందిన చందోలు వెంకయ్య, పొన్నూరు మండలం గోళ్ళమూడిపాడు గ్రామానికి చెందిన ఉప్పల లక్ష్మయ్య చౌదరిల ఎడ్ల జత నిర్ణీత సమయంలో 5,100అడుగుల మేర బండను లాగి మొదటి స్థానంలో నిలిచింది. కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం బాసుముక్కలకు చెందిన డేగల నందిబుక్య, డేగల రాజేశ్వరి ఎడ్ల జత 4,843అడుగుల దూరం బండను లాగి 2వ స్థానంలో నిలిచింది. అలాగే కృష్ణాజిల్లా పెనమలూరు మండలం కానూరుకు చెందిన డీవీఆర్ మెమోరియల్ అధినేత దేవభక్తుని సుబ్బారావు ఎడ్ల జత 4,800అడుగుల దూరం బండను లాగి 3వ స్థానంలో, గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం గణపవరానికి చెందిన మేకల శోభారాణి ఎడ్ల జత 4,800అడుగుల దూరం బండను లాగి 4వ స్థానంలో, గుంటూరు జిల్లా పొన్నూరు మండలం వల్లభరావుపాలేనికి చెందిన కొండబోలు ఫణికుమార్, చిలకలూరిపేట మండలం దండమూడికి చెందిన వెల్లంకి ఆదిత్యల ఎడ్ల జత 4,726 అడుగుల దూరాన్ని లాగి 5వ స్థానంలో, గుంటూరు జిల్లా మేడికోడూరు మండలం పాలడుగు గ్రామానికి చెందిన కనగాల అచ్చయ్య ఎడ్ల జత 4,665అడుగుల దూరాన్ని లాగి 6వ స్థానంలో, గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ మండలం శ్రీనివాసపురం కాలనీకి చెందిన దప్పిలి అంజిరెడ్డి ఎడ్ల జత 4,664అడుగుల దూరాన్ని లాగి 7వ స్థానంలో, కృష్ణాజిల్లా ఘంటసాల మండలం ఘంటసాల పాలేనికి చెందిన వేమూరి వౌర్య చంద్రారావు ఎడ్ల జత 4,642అడుగుల దూరాన్ని లాగి 8వ స్థానంలో, గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడుకు చెందిన కానాల వెంకటరెడ్డి ఎడ్ల జత 4,430 అడుగుల దూరాన్ని లాగి 9వ స్థానంలో నిలిచాయి. విజేతలకు వరుసగా రూ.40వేలు, రూ.35వేలు, రూ.30వేలు, రూ.25వేలు, రూ.22వేలు, రూ.18వేలు, రూ.15వేలు, రూ.13వేలు, రూ.10వేల నగదు బహుమతులను అందజేశారు. ముందుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి లంకదాసరి ప్రసాదరావు, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి శిష్ట్లా దత్తాత్రేయులు తదితరులు పోటీల్లో పాల్గొనే రైతులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పోటీలను దగ్గరుండి పర్యవేక్షించారు.


  0 0

  మచిలీపట్నం: గ్రావిటీ ద్వారా పోలవరం నీటిని జూన్, జూలై నాటికి డెల్టాకు నీరు విడుదల చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మచిలీపట్నం హిందూ కళాశాలలో ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి సంక్రాంతి సంబరాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్-2 పిడుగు బాబూరావు అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి ఉమ మాట్లాడుతూ ఆంధ్రుల జీవనాడి పోలవరం కలను త్వరలోనే సాకారం చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి ఎన్ని ఒడిదుడుకులు ఎదురవుతున్నా పోలవరం నిర్మాణంలో రికార్డులు సృష్టిస్తున్నామే తప్ప వెనుకడుగు వేయడం లేదన్నారు. పట్టిసీమ ద్వారా 200 టీఎంసీల నీటిని డెల్టాకు అందించడం జరిగిందన్నారు. గత నాలుగు సంవత్సరాల క్రితం రూ.55వేల కోట్లు ఉన్న స్థూల ఉత్పత్తి నేడు రూ.99వేల కోట్లకు చేరిందన్నారు. గ్రావిటీ ద్వారా పోలవరం ప్రాజెక్ట్ నుండి కృష్ణా డెల్టాకు 240 టీఎంసీల నీటిని జూన్, జూలై నాటికి విడుదల చేస్తామన్నారు. లక్షా 98వేల రూపాయలుగా ఉన్న జిల్లా తలసరి ఆదాయాన్ని రానున్న మార్చి నాటికి రెండు లక్షల 20వేల రూపాయలు ఉండేలా కృషి చేస్తున్నామన్నారు. న్యాయ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ గత నాలుగున్నర సంవత్సరాలుగా కనీవినీ ఎరుగని రీతిలో పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాకు వచ్చిన సాగునీటితో రైతులు ఆనందంగా ఉన్నారన్నారు. ఈ ప్రాంత చిరకాల వాంఛ బందరు ఓడరేవు నిర్మాణ పనులు ఈ నెలాఖరు నాటికి ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ తెలుగు జాతి ఆనందడోలికల్లో అన్ని పిండి వంటకాలతో ఒక రోజు ముందుగానే సంక్రాంతి పండుగ జరుపుకునే విధంగా ప్రభుత్వం సహకరించడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాబాప్రసాద్, ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్, డీఆర్‌డీఎ పీడీ చంధ్రశేఖరరాజు, మత్స్య శాఖ జెడీ యాకూబ్ బాషా, ఎంపీడీవో జివి సూర్యనారాయణ, తహశీల్దార్ కె శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


  0 0

  విజయవాడ, జనవరి 13: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న లక్షా 80వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులకు అశనిపాతంగా మారిన సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం) రద్దు చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 31న ‘చలో అసెంబ్లీ’ ఆందోళన కార్యక్రమం నిర్వహించనున్నామని సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి రామాంజనేయులు యాదవ్ తెలిపారు. స్థానిక హిందీ సేవాసదన్‌లో ఆదివారం సీపీఎస్ రద్దుకు చేపట్టాల్సిన పోరాటాలపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన విలేఖరులకు వెల్లడించారు. ఈ విధానాన్ని రద్దుచేసే అంశంపై ప్రభుత్వ నిర్ణయం కోసం ఈ నెల 26 వరకు వేచిచూస్తామన్నారు. సీపీఎస్ ఉద్యోగుల ప్రయోజనాలే ఏకైక లక్ష్యంగా 31న ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాజీపఠాన్ మాట్లాడుతూ తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోలో 30రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తామని అక్కడి ప్రభుత్వం ప్రకటించగా, తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం కమిటీల పేరిట కాలయాపన చేస్తోందన్నారు. వాస్తవానికి దీని కోసం అసెంబ్లీ తీర్మానం అవసరం లేదని, జీవో 653, 654, 655ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తున్నట్లు కొత్త జీవో విడుదల చేస్తే ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నిండుతాయని ఆయన పేర్కొన్నారు.


  0 0

  శ్రీశైలం టౌన్, జనవరి 13: శ్రీశైలం పుణ్యక్షేత్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్నారుట్ల మలుపు వద్ద ఘాట్‌రోడ్డులో ఆదివారం ఉదయం ఓ ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైంది. మలుపువద్ద అదుపుతప్పిన బస్సు రక్షణ గోడను ఢీకొని ముందుకు దూసుకెళ్లింది. దీంతో బస్సు ముందుభాగం లోయలోకి వెళ్లగా వెనుకభాగం గాల్లో తేలియాడింది. అయితే ప్రయాణికులకు ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్టక్రు చెందిన సుమారు 50 మంది భక్తులు శ్రీశైల భ్రమరాంబిక, మల్లికార్జున స్వామివార్ల దర్శనార్థం ప్రైవేటు బస్సులో శ్రీశైలం బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న బస్సు చిన్నారుట్ల మలుపు వద్దకు రాగానే అదుపుతప్పి రక్షణ గోడను ఢీకొని లోయలోకి దూసుకెళ్లింది. అయితే చెట్లు, మట్టిగడ్డలు అడ్డుపడడంతో బస్సు లోయలో పడిపోకుండా నిలిచిపోయింది. బస్సు వెనుకభాగం గాలిలో తేలియాడింది. దీంతో ప్రయాణికులు ప్రాణభయంతో హాహాకారాలు చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు దించడంతో అంతా ఊపీరి పీల్చుకున్నారు.


  0 0

  అనంతపురంటౌన్, జనవరి 13: అనంతపురం నగరంలో ఏర్పాటుచేసిన దివంగత మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ విగ్రహాలను కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారం ఆవిష్కరించారు. 2014లో రాష్ట్ర విభజన సమయంలో ఉవ్వెత్తున ఎగసిన సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా అనంతపురం నగరంలో అల్లరిమూకలు భారీ విధ్వంసానికి పాల్పడ్డాయి. నగరంలోని సప్తగిరి సర్కిల్‌లో ఉన్న రాజీవ్‌గాంధీ, టవర్‌క్లాక్ సమీపంలోని ఇందిరాగాంధీ విగ్రహాలను ఆందోళనకారులు ధ్వంసం చేసి తగులబెట్టారు. నాలుగేళ్లు గడిచిన తరువాత పీసీసీ అధ్యక్షుడు రఘువీరా ముందుకువచ్చి తగులబడిన విగ్రహాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయించారు. కొత్తగా ఏర్పాటుచేసిన ఇందిర, రాజీవ్ విగ్రహాలను కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కర్నాటక మాజీ మంత్రి రేవణ్ణ, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి శైలజానాథ్ పాల్గొన్నారు.
  చిత్రం..అనంతపురంలో ఇందిరాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య


  0 0

  కడియం, జనవరి 13: తూర్పుగోదావరి జిల్లాలో కడియం పల్ల వెంకన్న నర్సరీలో మొ క్కలతో సంక్రాంతి సంబరాన్ని సూచించే ఆకృతిని తీర్చిదిద్దారు. ప్లాంట్ స్కేపింగ్‌లో ఉపయోగించే బోర్డర్ ప్లాంట్స్‌తో పల్లె వాతావరణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. రంగ రంగుల పతంగులు వినీలాకాశంలో ఎగురుతున్న దృశ్యాన్ని నయనానందకరంగా ఆవిష్కరించారు. హ్యాపీ సంక్రాంతి అనే తెలుగు పదాలను 60వేల పూల మొక్కలతో కూర్చారు. తెలుగు సంస్కృతీ సంప్రదాయాల వైభవాన్ని చాటుతూ ఈ మొక్క లు కూర్పుచేసినట్టు యజమాని పల్ల సత్యనారాయణ మూర్తి తెలిపారు.


older | 1 | .... | 2041 | 2042 | (Page 2043) | 2044 | 2045 | .... | 2067 | newer