Are you the publisher? Claim or contact us about this channel


Embed this content in your HTML

Search

Report adult content:

click to rate:

Account: (login)

More Channels


Showcase


Channel Catalog


older | 1 | .... | 2042 | 2043 | (Page 2044) | 2045 | 2046 | .... | 2069 | newer

    0 0

    శ్రీకాకుళం, జనవరి 13: దేశంలో నలుమూలల నుంచి 15 మంది పైలట్లు, ఐటీడీఏ ద్వారా పౌర మోటారింగ్‌లో శిక్షణ పొందిన ఇద్దరు గిరిజన పైలట్లు, వీరితోపాటు 40 మంది సహాయక సభ్యులు ఆధ్వర్యంలో ఆదివాసీ గిరుల్లో బెలూన్(ఏరో స్పోర్ట్సు) ఫెస్టివల్ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. జిల్లాలో సీతంపేట ఏజెన్సీ చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ఏరో స్పోర్ట్సు ఫెస్టివల్‌కు వేదిక అయింది. సీతంపేట ఎన్టీఆర్ అడ్వంచర్ పార్కు ఉత్తరాంధ్రలో ఇప్పటికే ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టి ప్రసిద్ధిగాంచగా, ఆదివారం నుంచి మూడు రోజుల పాటు ఇదే పార్కు ఏరో స్పోర్ట్సు ఫెస్టివల్‌కు వేదికగా నిలిచింది. సాహసం చేయరా డింభకా..అనే నినాదంతో ఈ వేడుకలను నిర్వహించడానికి సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఏర్పాటుచేసింది. సాహసంతో కూడిన ఈ క్రీడలలో పాల్గొనడానికి అధిక సంఖ్యలో ఆన్‌లైన్‌లో పేర్లును నమోదు చేసుకున్నారు. సాహస విన్యాసాలు పలువురిని ఆకట్టుకుని ప్రేరణ కలిగించాయి. సాహసం చేయరా డింభకా..ఏరో స్పోర్ట్సు ఫెస్టివల్‌ను సీతంపేటలో జిల్లా కలెక్టర్ కె.్ధనంజయరెడ్డి ఆదివారం ప్రారంభించారు. హాట్ ఎయిర్ బెలూన్‌లో జిల్లా కలెక్టర్‌తోపాటు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి లోతేటి శివశంకర్ విహరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సాహస క్రీడలు నిర్వహించడం రాష్ట్రం, జిల్లా చరిత్రలో వినూత్నమన్నారు. సీతంపేట మంచి పర్యాటక భవిత కలిగిన ప్రదేశమన్నారు. ఇటువంటి ప్రదేశాల్లో పర్యాటకులను ఆకర్షించడానికి ఏరో స్పోర్ట్సు వంటి క్రీడలు దోహదం చేస్తాయని చెప్పారు. పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందడం వల్ల సీతంపేట ప్రాంతంలో వివిధ ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. తద్వారా ఆదాయ ఆర్జన కలిగి గిరిజనులు ఆర్థికంగా ముందంజ వేయడానికి దోహదం చేస్తుందని కలెక్టర్ అన్నారు. సీతంపేట ప్రాంతం ప్రకృతి అందాలకు నిలయమని పేర్కొంటూ జగతి మెట్టలో పర్యాటక రిసార్టును నిర్మిస్తున్నామని, సీతంపేటలో గిరిజన మ్యూజియంను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎకోపార్కును మంజూరు చేశామని చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం రూ. 3 కోట్లతో శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం నిర్మించనుందని వివరించారు. ఈ వనరులు అన్ని పర్యాటక అభివృద్ధికి తద్వారా ఆదాయ, ఉపాధి మార్గాలకు నాంది కాగలవని అన్నారు. భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి శివశంకర్ మాట్లాడుతూ సాహస క్రీడలు సిమ్లా, మనాలి ఉత్తరాఖండ్, జార్ఖండ్ ప్రాంతాల్లో అధికంగా, మధ్యప్రదేశ్‌లో కొన్ని ప్రదేశాల్లో నిర్వహిస్తారన్నారు. సీతంపేట ప్రాంతంలో సాహస క్రీడలు నిర్వహించడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని, పర్యాటక అభివృద్ధికి, ప్రాంత అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామన్నారు. సాహసం చేయరా డింభకా..క్రీడలకు ఇప్పటికి 270 మంది ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారని తెలిపారు. మూడు రోజులపాటు నిర్వహించే ఏరో స్పోర్ట్సు ఫెస్టివల్‌లో పారా మోటారింగ్ సాధనాలు, హాట్ ఎయిర్ బెలూన్లు, పారా సైలింగు సాధనాలు, రిమోట్ కంట్రోల్ ఫ్లైయింగ్ సాధనాలతో పాల్గొంటున్నారని చెప్పారు. ఐటీడిఏ సీతంపేట టూరిజం.కామ్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌తోపాటు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా ఫ్లైయింగ్ చేయడానికి నమోదు చేసుకోవచ్చని చెప్పారు.
    చిత్రం..ఫెస్టివల్‌లో పాల్గొన్న కలెక్టర్, ఐటీడీఏ పీవో


    0 0

    హైదరాబాద్, జనవరి 13: గత ఐదేళ్ళుగా తమ బంధువులే తనపై అత్యాచారానికి పాల్పడుతున్నారని అత్యాచారానికి గురైన బాలిక స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన హైదరాబాద్ పాతబస్తీ కామాటిపుర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 2018 డిసెంబర్ 24వ తేదీన బాలిక స్వయంగా పోలీస్ భరోసా కేంద్రాన్ని ఆశ్రయించింది. 2015 నుంచి తనపై అత్యాచారం జరుగుతోందని బాలిక ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు విస్తుపోయారు. ఏమిటి ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదని బాలికను ప్రశ్నించగా తనను చంపుతామని బెదిరించారని వాంగ్మూలం ఇచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందుతుల్ని అరెస్టు చేయకుండా జాప్యం చేస్తున్నారని బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ ముందు ఆదివారం ధర్నాకు దిగారు. దీంతో విషయం మీడియాకు పొక్కడంతో పోలీసులు ఉరుకుపరుగులతో నిందితుల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తామని బాలిక తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. ముగ్గురు వ్యక్తులు తనను గృహ నిర్భందంలో ఉంచి అత్యాచారం చేస్తున్నారని, అలాగే అప్పుడప్పుడు వారి స్నేహితులు తనపై అత్యాచారం చేసేవారని బాలిక ఫిర్యాదులో పేర్కొంది. విషయం చెప్పితే బంధువులకు చెబుతామని అత్యాచార సంఘటనకు సంబంధించిన వీడియోను బాలికకు చూపించేవారని వారి తల్లిదండ్రులు పోలీసుల ముందు వాపోయారు. బాలికతో పాటు నిందితులకు కౌన్సిలింగ్ ఇచ్చామని పోలీసులు తెలిపారు. అయితే కౌన్సిలింగ్ తర్వాత కూడ బాలికను తీసుకుపోవడానికి ప్రయత్నం చేయడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక నిందితుడు రాజస్తాన్‌లో ఉంటే అరెస్టు చేశామని, మిగతావారిని త్వరలో అరెస్టు చేస్తామని హైదరాబాద్ కమిషనర్ అంజనీకుమార్ చెప్పారు.


    0 0

    విజయవాడ, జనవరి 13: నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఆయువుపట్టయిన విజయవాడ - గుంటూరు - తెనాలి నగరాలతో రైలు మార్గాన్ని మరింత అనుసంధానం చేసేందుకు గుంటూరు - తెనాలి మధ్య రైల్వే డబ్లింగ్, విద్యుదీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీనివల్ల మరిన్ని రైళ్లు గుంటూరు మీదుగా నడికుడి వైపు వెళ్లేందుకు వీలు కలుగుతుంది. అలాగే గుంటూరు నుండి చెన్నైకు సరకు రవాణాకు మరిన్ని గూడ్స్ రైళ్లు ఏర్పాటు చేసే అవకాశం ఏర్పడుతుంది. 2018-19 సంవత్సరానికి రూ.40వేల కోట్లు కేటాయించగా, దీంతోపాటు మొత్తంపై ఇప్పటివరకు రూ.170కోట్లు ఖర్చు చేశారు. ఈ డబ్లింగ్ ప్రాజెక్టులో ఇప్పటికే రెండు పెద్ద, 40 చిన్న వంతెనలు నిర్మించారు. మట్టిపనులు, నేల చదును పనులు పూర్తయ్యాయి. మిడ్ సెక్షన్‌లో క్లాస్-2 పట్టాతో ట్రాక్ అనుసంధానం పూర్తయింది. గుంటూరు, సంగం జాగర్లమూడి, వేజండ్ల, తెనాలి వద్ద యార్డులు పునరుద్ధరించారు. వేజండ్ల వద్ద కొత్త సేషన్ భవన నిర్మాణం పూర్తయింది. రెండు కొత్త ఫ్లాట్‌ఫారాల నిర్మాణం ముగింపు దశలో ఉంది.


    0 0

    విజయవాడ, జనవరి 13: సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్, విశాఖ, కృష్ణా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు భారీగా ప్రజలు తరలివెళ్తుండటం, టోల్‌గేట్ల వద్ద కిలోమీటర్ల పొడవునా వాహనాలు ఆగిపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో టోల్‌ఫీజులను రద్దుచేస్తూ రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ శనివారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఈ ఉత్తర్వులతో తమకు సంబంధం లేదని కొందరు, తమ చేతికి అందలేదని మరికొందరు ఆదివారం ఉదయం వరకు కూడా యథావిథిగా టోల్‌ఫీజు వసూలు చేస్తుండటంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అప్రమత్తమైన డీజీపీ ఆర్పీ ఠాకూర్ పోలీసు అధికారులను టోల్‌ప్లాజాలకు పంపారు. ఎక్కడా టోల్‌ఫీజు వసూలు చేయకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు. ఇదిలావుండగా, ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నప్పటికీ అక్రమంగా టోల్‌ఫీజులు వసూలు చేసిన నిర్వాహకులపై తక్షణం చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ డిమాండ్ చేశారు. విజయవాడ - హైదరాబాద్ హైవేపై నిర్దాక్షిణ్యంగా టోల్‌ఫీజులు వసూలు చేయడం రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థత, చేతగాని తనానికి నిదర్శనమంటూ ఎద్దేవా చేశారు.


    0 0

    కర్నూలు, జనవరి 13: రాష్ట్ర శాసనసభ, లోక్‌సభకు మే నెలలో జరగనున్న సాధారణ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ, జనసేన దృష్టి సారించి ఆ మేరకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా టీడీపీ సహజంగా ఎన్నికల సమయం వరకూ జాబితా విడుదల చేసిన సందర్భం లేదు. అయితే ఈసారి అందుకు భిన్నంగా తొలి జాబితాను జనవరిలో విడుదల చేస్తానని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. దాంతో ఆశావహులు తొలి జాబితాలో చోటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ నెలలో జాతీయ రాజకీయాలు, శాసనసభ సమావేశాలు, ధర్మపోరాట దీక్ష చివరి సభ వంటి ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నందున తొలి జాబితాను ఫిబ్రవరిలో విడుదల చేస్తారని ఆ పార్టీ కీలక నేతలు భావిస్తున్నారు. ఫిబ్రవరి 10వ తేదీ తరువాతే తొలి జాబితా వస్తుందని చివరి వారంలో రెండవ జాబితా, మార్చి రెండవ వారంలో మూడవ జాబితా ఎన్నికల నామినేషన్ల సమయంలో చివరి జాబితా విడుదల చేస్తారని వారంటున్నారు. ఇక వైసీపీ అధినేత జగన్ కూడా తమ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ఫిబ్రవరిలోనే ప్రకటించవచ్చని ఆ పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. జగన్ త్వరలో బస్సు యాత్ర ప్రారంభించనున్నారని ఈలోగా తొలి జాబితాపై కసరత్తు పూర్తి చేస్తారని వారు భావిస్తున్నారు. ఈ నెల చివరి వారంలో బస్సు యాత్ర ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు వారన్నారు. ఆ తరువాత యాత్రలో భాగంగా పార్టీ అభ్యర్థుల ఎంపికపై పార్టీ కీలక నేతలతో చర్చించి తదుపరి జాబితాలు ఒకొక్కటిగా విడుదల చేస్తారని అంచనా వేస్తున్నారు. ఇక జనసేన పార్టీ అభ్యర్థులకు సంబంధించి కూడా జాబితాను ఫిబ్రవరిలోనే ప్రకటించవచ్చని ఆ పార్టీ అభిమానులు పేర్కొంటున్నారు. ఈ నెల చివరికి రాష్ట్రంలో సుమారు 125 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుందని వారికి సమాచారం ఉన్నట్లు స్పష్టమవుతోంది. వీరి పేర్లను ఫిబ్రవరి తొలి వారంలో విడుదల చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు మెగా అభిమానులు, జనసేనపార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న వారు వెల్లడిస్తున్నారు.


    0 0

    నిజామాబాద్, జనవరి 13: ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు దత్తత తీసుకున్న నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని మోతె గ్రామంలో సర్పంచ్ సహా వార్డు మెంబర్ స్థానాలన్నీ ఏకగ్రీవం అయ్యాయి. దీంతో మోతె గ్రామానికి ప్రభుత్వం ప్రకటించిన పది లక్షల రూపాయల ప్రత్యేక నజరానా అందనుంది. తొలివిడత ఎన్నికలు జరుగుతున్న ఆర్మూర్ డివిజన్ పరిధిలోని మోతె గ్రామంలో సర్పంచ్ స్థానాన్ని ఆశిస్తూ పలువురు పోటీలో నిలిచినప్పటికీ, ఆదివారం నాటి నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగిసే నాటికి ఒక్క నామినేషన్ మాత్రమే మిగిలింది. దీంతో బరిలో మిగిలిన రజిత మోతె గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమెతో పాటు మిగతా వార్డు స్థానాలను కూడా గ్రామ కమిటీ చొరవతో ఏకగ్రీవంగా ఎన్నుకుని, అందరి ఆమోదంతో ఉప సర్పంచ్ ఎన్నికను కూడా ఇప్పటికే పూర్తి చేసుకున్నారు. గ్రామ ఉప సర్పంచ్‌గా కళ్లెం రాజేష్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ఏకగ్రీవాలు చేసుకుని ఆదర్శంగా నిలిచిన మోతె గ్రామంపై కేసీఆర్ వరాల జల్లులు కురిపిస్తారని స్థానికులు ఆశిస్తున్నారు. వాస్తవంగానే మొదటి నుంచీ మలివిడత తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ చేపట్టడానికి ముందు మోతె గ్రామాన్ని సందర్శించి ఇక్కడి మట్టిని ముడుపుగా కట్టుకుని తీసుకెళ్లడం జరిగింది.
    ప్రత్యేక రాష్ట్రం సాధించిన తరువాతే ఈ ముడుపు చెల్లించుకుంటానని ప్రతిజ్ఞ చేశారు. ఈ మేరకు 2014లో తెలంగాణ ఆవిర్భావం జరిగిన మీదట కేసీఆర్ ప్రత్యేకంగా మోతె గ్రామాన్ని సందర్శించి తన ముడుపును చెల్లించుకోవడం జరిగింది. ఈ పల్లెను తానే స్వయంగా దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించి ఇప్పటికే పలు ప్రగతి పనుల కోసం పెద్దఎత్తున నిధులను మంజూరు చేశారు. ప్రస్తుతం ఈ గ్రామంలో సర్పంచ్ సహా అన్ని వార్డు స్థానాలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో మోతె అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.


    0 0

    సూర్యాపేట, జనవరి 13: జిల్లా ఏర్పాటు తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలో పలుచోట్ల ఏకగ్రీవంగా సర్పంచ్‌లను ఎన్నుకున్నారు. మొత్తంగా మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తుండగా తొలి విడతలో 7 మండలాల పరిధిలోని 161 పంచాయతీ సర్పంచ్, 1456 వార్డు స్థానాలకు ఆదివారం నామినేషన్‌ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో రాత్రి అందిన సమాచారం మేరకు జిల్లాలో 13 పంచాయతీల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తొలి విడతలో అత్యధికంగా సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని చివ్వెంల మండల పరిధిలో 4 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. చివ్వెంల మండల కేంద్రం పంచాయతీ సర్పంచ్‌గా టీ ఆర్ ఎస్ బలపరిచిన జూలకంటి సుధాకర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కాగా 10 మంది వార్డు సభ్యులను సైతం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీమ్లా తండ సర్పంచ్‌గా ధరావత్ హుడియా, పాచ్యానాయక్ తండ సర్పంచ్‌గా ధరావత్ రవి ఎన్నికయ్యారు.


    0 0

    ఆదిలాబాద్, జనవరి 13: అడవి రాజుకు ఆపదొచ్చింది. పెద్దపులి పేరు చెబితేనే గజ గజ వణికిపోయే రోజులు పోయాయి. అడవిలో మనుషుల్ని చూసి ఏకంగా పెద్దపులులే భయపడి పారిపోవాల్సిన పరిస్థితులు కళ్లెదుటే సాక్షాత్కరిస్తున్నాయి. ఇందుకు కారణం ఇటీవలే ఆదిలాబాద్ జిల్లా టైగర్ జోన్ పరిధిలోని పెంబి అటవీ ప్రాంతంలో కరెంట్ తీగలు అమర్చి పక్కావ్యూహంతో పెద్దపులిని హతమార్చి, పులి చర్మాన్ని విక్రయిస్తూ అడ్డంగా దొరికిపోయిన సంఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఏడాదిన్నర కాలంలోనే ఆదిలాబాద్ జిల్లాలో వేటగాళ్ళ ఉచ్చుకు రెండు పెద్దపులులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఇందుకు బాధ్యులైన నలుగురు అటవీ అధికారులను సస్పెండ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయడం గమనార్హం. మరోవైపు కలప స్మగ్లింగ్ ప్రతి రోజూ ఆదిలాబాద్ జిల్లా నుంచి సాగుతోంది. అటవీ సిబ్బంది, అధికారులు లోపాయికారిగా కలప స్మగ్లర్లు, వేటగాళ్ళతో కుమ్మక్కై అటవీ సంపదను కొల్లగొడుతున్నారని స్పష్టమవుతోంది. పొరుగు మహారాష్టల్రో గల తాడోబ, ప్రాణహిత టైగర్‌జోన్ పరిధి నుంచి పెద్దపులులు ఈ జిల్లా అటవీ ప్రాంతానికి వస్తూ తలదాచుకునేవి కాగా ఇక్కడ అధికారులు సంరక్షణపై నిర్లక్ష్యం చూపడం, వేటగాళ్ళకు భయపడి ఈ జిల్లా నుంచి పులులు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నట్లు బయటపడింది. 2014లో పులుల గణన జరగగా కవ్వాల్‌లో రెండు, కాగజ్‌నగర్‌లో అటవీ డివిజన్‌లో 6 పెద్ద పులులు ఉన్నట్లు గుర్తించారు. 2018లో చేపట్టిన జంతు గణనలో 5 పులులు మాత్రమే ఉన్నట్లు నిర్దారణకు వచ్చారు. కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలో 6 పులులు ఉన్నట్లు గుర్తించగా ప్రస్తుతం మాత్రం 4 పులులే ఉన్నట్లు అధికారులు తేల్చిచెబుతున్నారు. వీటికి జన్మించిన నాలుగు పులి పిల్లలు ఏడాదికాలానికి ప్రాణహిత దాటి చంద్రపూర్ జిల్లాలోకి వెళ్ళినట్లు అటవీ అధికారులు పేర్కొంటున్నారు. ఇటీవల అడవుల్లో సీసీ కెమెరాలు అమర్చగా కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్‌లోని ఖానాపూర్ రేంజ్ సోమార్‌పేట్ వద్ద పెద్దపులి అడుగు జాడలు బయటపడ్డాయి. నిర్మల్, ఖానాపూర్ రహదారిపై ఒక పులి, ఇటీవల ఇందన్‌పెల్లి రేంజ్ కవ్వాల్ రేంజ్ పరిధిలో మరో పెద్దపులి సంచరిస్తూ అటవీ శాఖ అమర్చిన సీసీ కెమెరాల్లో చిక్కడం గమనార్హం. అయితే వారం రోజుల కిందటా కడెం మండలం పాండ్వపూర్ అడవిలో మేకల మందపై దాడిచేసిన పెద్దపులి ఛాయలను గుర్తించిన వేటగాళ్ళు 8.5 మీటర్ల పొడవున కరెంట్ తీగలను అమర్చి దప్పిక తీర్చుకునేందుకు వెళ్తున్న పులిని మాటువేసి హతమార్చారు. కరెంట్ తీగలతో చనిపోయిన పులి నుండి చర్మాన్ని తొలిచి రూ.25లక్షలకు విక్రయించేందుకు ఇచ్చోడలో బేరం ఆడుతూ గుగ్లావత్ ప్రకాష్ అనే నిందితుడు పట్టుబడ్డాడు. నీలుగాయిని వేటాడి మాంసం విక్రయిస్తున్న కేసులో ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశారు.
    కలప స్మగ్లర్లపై పీడీయాక్ట్‌కు రంగం సిద్ధం
    కోట్లాది రూపాయల విలువైన కలపను స్మగ్లింగ్ చేస్తూ అటవీ సంపదను కొల్లగొడుతున్న కరడుగట్టిన స్మగ్లర్లపై పీడీయాక్ట్ కేసులు నమోదు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. స్మగ్లింగ్ చేస్తూ కేసులు నమోదైన 12 మంది కలప స్మగ్లర్లపై పీడీ కేసులు నమోదు చేయనున్నామని డీఎఫ్‌వో ప్రభాకర్ తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో 18 మంది కలప స్మగ్లర్లు, మంచిర్యాల జిల్లాలో 12 మంది, నిర్మల్ జిల్లాలో 18 మందిపై పీడీయాక్ట్ కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసేలా పోలీసు, అటవీ శాఖ ప్రణాళిక రూపొందించింది.


    0 0

    చౌటుప్పల్, జనవరి 13: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే.జోషి ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని చౌటుప్పల్ ఆర్డీవో ఆదేశించడంతో పంతంగి టోల్‌ప్లాజా వద్ద జాతీయ రహదారిపై టోల్ వసూళ్లను ఆదివారం మధ్యాహ్నం నుంచి నిలిపివేసారు. సంక్రాంతి పండును పురస్కరించుకోని టోల్‌గేట్ల వద్ద వాహనాలు నిలిచిపోవడం, ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవడాన్ని గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పండుగ ముందు, పండుగ తర్వాత రోజు 13,16 తేదీలలో టోల్‌ను రద్దు చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారుల అధికారులు, కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి 13,16 తేదీల్లో టోల్ వసూళ్లను నిలిపివేయాలని ఆదేశించారు. కానీ జీఎంఆర్ సిబ్బంది అవేమి పట్టించుకోకుండా టోల్ వసూళ్లను కొనసాగించింది. ఉదయం పత్రికల్లో చూసిన ప్రయాణికులు టోల్‌గేట్ వద్ద ఘర్షణకు దిగారు. టోల్ ఎందుకు వసూలు చేస్తున్నారని అధికారులు, సిబ్బందిని నిలదీసారు. జీఎంఆర్ సిబ్బందితో పత్రికను చూపిస్తూ వాగ్వాదానికి దిగారు. ఎలాంటి ఘర్షణ జరుకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘర్షణను నివారించేందుకు తంటాలుపడ్డారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చౌటుప్పల్ ఆర్డీవో సూరజ్‌కుమార్ పంతంగి టోల్‌ప్లాజా వద్దకు చేరుకోని జీఎంఆర్ అధికారులు, సిబ్బందితో చర్చలు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో టోల్ వసూళ్లను నిలిపివేయలేమని తేల్చిచెప్పడంతో జాతీయ రహదారుల సంస్థ పీడీతో ఫోన్‌లో మాట్లాడారు. టోల్ వసూళ్లను నిలిపివేయకుంటే జీఎంఆర్‌కు సహకరించలేమని, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్న బాధ్యత మీదేనని హెచ్చరించారు.
    ఆర్డీవో ఆదేశాల మేరకు ఎట్టకేలకు 11.00 గంటల తర్వాత టోల్ వసూళ్లను నిలిపివేసారు. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. టోల్‌గేట్లను తెరిచడంతో వాహనాలు సునాయసంగా వెళ్తున్నాయి. మధ్యాహ్నం తర్వాత జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ పంతంగి టోల్‌ప్లాజాను సందర్శించి టోల్ వసూళ్లను నిలిపివేయడం, ట్రాపిక్ జామ్ కాకుండా వాహనాలు వెళ్తుండటంతో తిరిగివెళ్లారు.
    చిత్రాలు.. టోల్‌గేట్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు,
    * ఘటనా స్థలానికి వచ్చిన కలెక్టర్ అనిత


    0 0

    సూర్యాపేట, జనవరి 13: రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపడుతున్నామని, మూడు విడతలుగా నిర్వహించే ఎన్నికలకు సంబంధించి మొదటి విడతకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి తెలిపారు. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఆదివారం జిల్లాకేంద్రంలోని పోలీస్‌శాఖ అతిధిగృహంలో జిల్లా ఎన్నికల పరిశీలకుడు టి.చిరంజీవులు, జిల్లా కలెక్టర్ దుగ్యాల అమయ్‌కుమార్, జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు ఉదయ్‌కుమార్, జిల్లా ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లుతో పాటు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల ఏర్పాట్లు, కోడ్ అమలు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. సమావేశ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పంచాయతీ శాసనసభ ఎన్నికలను రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించామని, అదే రితీన పంచాయతీ ఎన్నికలను కూడా నిర్వహించేలా ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. పంచాయతీ ఎన్నికలు బ్యాలెట్ పేపర్‌ల ద్వారా నిర్వహించనున్నందున ఎలాంటి లోటుపాట్లకు ఆస్కారం లేకుండా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలిపారు. శాసనసభ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించినప్పటికీ వ్యయ నియంత్రణలో సరైన విజయం సాధించలేకపోయామన్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని పక్కాగా అమలుచేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కోడ్‌ను ఉల్లంఘిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని కేసులు నమోదు చేస్తామన్నారు. పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చు వివరాలను పర్యవేక్షించే బాధ్యతలను ఎంపీడీవోలకు అప్పగించినట్లు తెలిపారు. ఈసీ నిబంధనలు ఉల్లఘించి ఎక్కువ ఖర్చులు చేసే అభ్యర్థ్ధులకు నోటీసులు అందిస్తామని, అంతేకాకుండా వ్యయాల వివరాలను సక్రమంగా చూపించని పక్షంలో వారి ఎన్నికను కూడ రద్దు చేసే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. అందువల్ల సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులంతా తమతమ ఎన్నికల ఖర్చులను నియమిత పద్ధతుల్లో ఉంచడంతో పాటు నిజాయితీతో అందించాలని కోరారు. వేలంపాటలు నిర్వహించి పంచాయతీలను ఏకగ్రీవాలు చేయడం చట్టరీత్యా నేరమని, అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తూ కేసులు నమోదు చేస్తామని అలా చేస్తే ఏడాది వరకూ జైలుశిక్ష పడే అవకాశం ఉంటుందని, అంతేకాకుండా ఎన్నికైన వారిపై అనర్హత వేటు పడుతుందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల్లో చీకటి ఉండకుండా అన్ని కేంద్రాల్లో లైట్లు ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేంద్రాల్లో వెలుతురు సక్రమంగా లేక వృద్ధులు తికమక పడినట్లుగా తమ దృష్టికి వచ్చినందున ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఓటర్లకు తగిన విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఓటర్లను చైతన్యం చేసేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. పంచాయతీలను ఏకగ్రీవాలు చేస్తె లక్షల రూపాయల నిధులు ఇస్తామని కొన్ని చోట్ల శాసనసభ్యులు ప్రకటనలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోందని, ఫిర్యాదులు అందితే ఓటర్లను ప్రలోభపెట్టినట్లుగా భావించి కేసులు నమోదు చేస్తామన్నారు. జేసీ డి.సంజీవరెడ్డి, డీఆర్వో పి.చంద్రయ్య, ఆర్డీవో, డీఎస్పీ పాల్గొన్నారు.
    చిత్రం..సూర్యాపేటలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి


    0 0

    విజయవాడ, జనవరి 13: దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో ఉద్యోగుల సమస్యలు పరిష్కారవౌతున్నాయని, అయితే వచ్చే ఎన్నికల నోటిఫికేషన్ జారీలోపు 3 ప్రధాన డిమాండ్లను ఆమోదించాల్సి ఉందని ఏపీ ఎన్జీఓ సంఘం నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్ చంద్రశేఖరరెడ్డి, బండి శ్రీనివాసరావు తెలిపారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించాలని, తమ డిమాండ్ల సాధనకు అవసరమైతే ప్రత్యేక్ష పోరుకు సిద్ధమని ప్రకటించారు. ఏపీ ఎన్జీఓ సంఘానికి నాలుగున్నరేళ్లు ప్రధాన కార్యదర్శిగా, ఐదున్నరేళ్లు అధ్యక్షుడిగా పనిచేసిన పరుచూరి అశోక్‌బాబు స్వచ్ఛంద పదవీ విరమణ సందర్భంగా ఆదివారం ఇక్కడ సంఘం కార్యవర్గ సమావేశం ఉత్కంఠ భరితంగా జరిగింది. 13 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు సహా మొత్తం 45మంది ప్రతినిధులు హాజరయ్యారు. కృష్ణా జిల్లా జేఏసీ చైర్మన్ ఎ విద్యాసాగర్ ప్రధాన కార్యదర్శి పదవిని ఆశించడంతో ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. చివరకు ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎన్ చంద్రశేఖరరెడ్డి అధ్యక్షునిగా, ఆయన స్థానంలో ప్రధాన కార్యదర్శిగా బండి శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈసందర్భంగా ఉద్యోగుల్లో సందడి నెలకొంది. ఎన్నిక అనంతరం నేతలు ఎన్జీఓ హోంలో తొలుత చంద్రశేఖరరెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ తామంతా అశోక్‌బాబు ఆశయ సాధన కోసం కృషి చేస్తామని చెప్పారు. తమకు అనుబంధంగా 105 సంఘాలతో ఏర్పాడిన జేఏసీకి మొదటి నుండి ఎన్జీఓ సంఘ అధ్యక్షుడు చైర్మన్‌గా వ్యవహరిస్తూ వచ్చారన్నారు. ఈ సంఘాలన్నింటినీ ఏకతాటిపై నిలిపే బాధ్యతను ఇక నుండి తాను చేపట్టబోతున్నానన్నారు. రాష్ట్ర విభజన అనంతరం కట్టుబట్టలతో దాదాపు 20వేల మంది సచివాలయ, డైరెక్టరేట్ ఉద్యోగులు ఇక్కడకు వచ్చామన్నారు. వీరందరికీ సొంతగూడు కల్పించేందుకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని మరోసారి ముఖ్యమంత్రిని కోరనున్నట్లు తెలిపారు. 2018 జూలై నుంచి 11వ పీఆర్‌సీ అమలుకావాల్సి ఉండగా ఇప్పటికీ జాప్యం జరుగుతున్నందున తక్షణం 35శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి లక్షా 86వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని, ఇందుకోసం ఢిల్లీ తరహాలో మన శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. పెన్షన్ లేని ప్రభుత్వ కొలువు ఒక ఉద్యోగమే కాదని ఆయనన్నారు. సమాన పనికి సమాన వేతనం కోసం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి గత 20ఏళ్లగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించాలని ఆయన కోరారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న రెండు విడతల డీఏను విడుదల చేయాలని కోరారు. కాంట్రాక్టు మహిళా ఉద్యోగులకు మెటర్నిటీ సెలవులను ముఖ్యమంత్రి మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నూతన ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులంతా రాష్ట్భ్రావృద్ధికి, ముఖ్యమంత్రి ఆశయ సాధన కోసం కృషి చేస్తూ, ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ రాత్రీపగలు పనిచేస్తున్నారని గుర్తు చేశారు. ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనేది నినాదంగానే మిగలకుండా ఉద్యోగుల బాగోగులు చూడాలని కోరారు. ఉద్యోగుల కాంట్రిబ్యూషన్‌తో కొనసాగుతున్న హెల్త్‌కార్డు పథకం ఏమాత్రం అమలు కావడం లేదని, దీన్ని నిర్లక్ష్యం చేస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలన్నారు. సంఘం మాజీ అధ్యక్షుడు అశోక్‌బాబు మాట్లాడుతూ సాధారణంగా ప్రతిఒక్కరూ ఉన్నత పదవులు ఆశిస్తారని, ఎన్నికల్లోనూ పోటీలుంటాయని, తర్వాత కలిసి పనిచేయడం ఒక సంప్రదాయంగా వస్తోందన్నారు. విద్యాసాగర్ ఏమాత్రం అసంతృప్తికి గురికాలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
    అంబరాన్నంటిన సంబరాలు
    ఎన్జీఓ హోం సమీపంలోని ఒక ప్రైవేటు కల్యాణ మంటపంలో ఆదివారం ఉదయం సమావేశం జరుగుతున్నంత సేపూ వెలుపల ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రం నలుమూలల నుండి భారీ సంఖ్యలో ఉద్యోగులు తరలివచ్చారు. అధికారిక ప్రకటన వెలువడిన తరువాత ఉద్యోగులు ఉత్సాహంగా బాణసంచా కాలుస్తూ రోడ్లపై నృత్యాలు చేశారు. ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన బండి శ్రీనివాసరావు ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఎన్జీఓ సంఘం అధ్యక్షునిగా, నీటి పారుదల సంఘం ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అత్యధిక జిల్లా కమిటీలు వెన్నంటి నిలవడంతో ఆయన ఎన్నిక సుగమమైంది.

    చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న చంద్రశేఖరరెడ్డి


    0 0

    సూళ్లూరుపేట, జనవరి 13: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సన్నాహం చేస్తోంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఈనెల 24న పీఎస్‌ఎల్‌వీ-సీ 44 రాకెట్ నింగిలోకి ఎగరనుంది. ఈ రాకెట్ ద్వారా రోదసీలోకి పంపే మైక్రోశాట్-ఆర్ ఉపగ్రహాన్ని ఆదివారం బెంగళూరులోని ఉపగ్రహ తయారీ కేంద్రం నుంచి రోడ్డు మార్గాన అత్యంత భారీ భద్రత నడుమ షార్‌కు చేరింది.
    బెంగళూరు నుంచి తీసుకొచ్చిన ఉపగ్రహాన్ని శాటిలైట్ క్లీన్ రూమ్‌లో పెట్టి తుది పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది షార్ నుంచి ఇదే తొలి ప్రయోగం కావడం విశేషం.
    జనవరిలో ప్రయోగించాల్సిన చంద్రయాన్-2 ప్రయోగం ఏప్రిల్‌కు వాయిదా పడడంతో ఈనెలలో పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాన్ని చేపట్టేందుకు ఇస్రో శాస్తవ్రేత్తలు సర్వం సిద్ధం చేస్తున్నారు.
    ఇప్పటికే ఈ ప్రయోగాకి సంబంధింని రాకెట్ నాలుగు దశల అనుసంధాన పనులను శాస్తవ్రేత్తలు పూర్తిచేశారు. సోమవారం నుంచి రాకెట్ శిఖర భాగాన ఉపగ్రహాన్ని అమర్చి రాకెట్‌ను ప్రయోగానికి సిద్ధం చేస్తారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ ఉపగ్రహం భూపరిశీలన నిమిత్తం ప్రయోగిస్తున్నారు. ఇస్రో వర్గాల సమాచారం మేరకు 24న అర్థరాత్రి 11:38 గంటలకు రాకెట్ ప్రయోగం జరగనుంది.
    చిత్రం..భారీ భద్రత నడుమ షార్‌కు వెళ్తున్న మైక్రోశాట్-ఆర్ ఉపగ్రహం


    0 0
  • 01/13/19--15:08: సై
  • జంగారెడ్డిగూడెం, జనవరి 13:సంక్రాంతికి కోడి పందేలు నిషేధిస్తూ ఉన్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలు చేసేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని పోలీసులు చెబుతుంటే, ఆరునూరైనా భోగి రోజు నుండి సంక్రాంతి నాలుగు రోజులూ కోడి పందాలు ఆడి తీరుతామని పశ్చిమగోదావరి జిల్లాలో నిర్వాహకులు చెబుతున్నారు. కోడి పందాలు నిర్వహించే ప్రదేశాలు గుర్తించి పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు.
    జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు కూడా కోడి పందేలు అరికట్టేందుకు రంగంలోకి దిగారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ చిటికెన మురళీకృష్ణ ఆదివారం జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్‌లోని రెండు సర్కిల్స్‌లోని పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోడి పందేలు, గ్యాంబ్లింగ్ నిర్వహించే ప్రదేశాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశామన్నారు. పోలీస్ వాహనాలతో పెట్రోలింగ్ చేస్తామని డీఎస్పీ స్పష్టం చేశారు. ధర్మాజీగూడెం, టి.నరసాపురం, జంగారెడ్డిగూడెం, గోపాలపురం, కొయ్యలగూడెం పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇప్పటికే బరులు ధ్వంసం చేసినట్టు చెప్పారు. ఇంకా బరులు ధ్వంసం చేసే కార్యక్రమం కొనసాగిస్తున్నట్టు చెప్పారు.
    కోడి పందేలు నిరోధించేందుకు సబ్ డివిజన్‌లోని పోలీసులకు సెలవులు రద్దుచేసినట్టు చెప్పారు. ప్రతీ పోలీసు విధి నిర్వహణలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు. పలు మండలాల్లో పోలీసులు బరుల వద్దకు వెళ్ళి ఏర్పాట్లను అడ్డుకున్నారు. ఇదిలా ఉండగా నిర్వాహకులు రాజకీయ పార్టీలకు అతీతంగా ఆదివారం రహస్య ప్రదేశాల్లో సమాలోచనలు సాగించారు. మండలంలో భారీ పందేలు జరిగే శ్రీనివాసపురంలో ప్రధాన బరిని వైసీపీ ఆధ్వర్యంలోను, బైపాస్ రోడ్డులో శ్రీనివాసపురం రోడ్డు జంక్షన్‌లోని తోటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోను, కొయ్యలగూడెం మండలం రామానుజపురంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోను, జంగారెడ్డిగూడెం పట్టణంలోని సుబ్బంపేటలోని పామాయిల్ తోటలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోను కోడి పందేలు నిర్వహించేందుకు ఒప్పందాలు కుదిరినట్టు తెలిసింది. మండలంలోని కేతవరం, పేరంపేట, ఎ.పోలవరం, గురవాయిగూడెం, తాడువాయి గ్రామాలలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోను, లక్కవరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక బరి, తెలుగుదేశం పార్టీ సహకారంతో వైసీపీ నేతలు మరొక బరి, నాగులగూడెంలో వైసీపీ ఆధ్వర్యంలో ఒక బరి నిర్వహించేందుకు ఒప్పందాలు కుదిరినట్టు తెలిసింది.
    కోడి పందేలతోపాటు పేకాట, గుండాటలు వంటి గ్యాంబ్లిగ్‌కు కూడా ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాల నుండి గ్యాంబ్లర్లు దిగినట్టు సమాచారం. భోగి రోజు ఉదయం 10 గంటలకు పందాలు వేసేందుకు సర్వసన్నద్ధంగా ఉంటామని నిర్వాహకులు బాహాటంగా చెబుతున్నారు. బరుల వద్ద స్థలం రోలర్లతో చదును చేయించి, ట్యాంకర్లతో తడిపి, ఇనుప ముళ్లకంచె వేసేందుకు ఇనుప స్తంభాలు పాతడం కోసం గోతులు కూడా తవ్వి ఉంచారు. ఇనుప స్తంభాలు, ముళ్ల వైరు రహస్య ప్రదేశాల్లో ట్రాక్టర్లలో లోడు చేసి ఉంచారు. భోగిరోజు బరుల వద్ద నిఘా వున్న పోలీసులు వెళ్లిపోగానే అరగంటలో స్తంభాలు పాతి, ఫెన్సింగ్ వేసేందుకు, సీటింగ్ ఏర్పాట్లు చేసేందుకు వందలాది మంది కూలీలను కూడా సంసిద్ధంగా ఉంచారు. పోలీసులు ఎంత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినా, రెవెన్యూ అధికారులు 144 సెక్షన్ నిషేధాజ్ఞలు జారీ చేసినా పందేలు ఆగవని పందాల రాయుళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుండి పందాలకు కోళ్లను తీసుకువచ్చే బృందాలు ఇప్పటికే పట్టణంలోను, పరిసర గ్రామాల్లోని తోటల్లో కోళ్లతో మకాం చేశారు. పందేల రాయుళ్ల కోసం పట్టణంలోని లాడ్జి గదులన్నీ బుక్ అయిపోయాయి.
    ఎప్పటిలా ఈ ఏడాది కూడా ఆనవాయితీగా కోడి పందేలు జరిగి తీరుతాయని రాజకీయ నేతలు ఢంకా బజాయిస్తున్నారు. అలాగే మొగల్తూరు మండలంలో కోడి పందేలు నిర్వహించేందుకు పందేలరాయుళ్లు సన్నాహాలు చేస్తున్నారు. మొగల్తూరు స్టేషన్ పరిధి మొగల్తూరు కోట, రామన్నపాలెం చిల్లపెంకుల దిబ్బ, కెపి పాలెం నార్త్, పేరుపాలెం సౌత్, కాళీపట్నం గ్రామాలతో పాటు ఈ ఏడాది మండలంలోని వారతిప్ప గ్రామంలో కొత్త బరిలో పందేలు జరుగుతాయని సమాచారం.

    చిత్రం..కోడి పందాల బరికోసం ఏర్పాటు చేసిన స్తంభాలను కూల్చివేస్తున్న పోలీసులు


    0 0
  • 01/14/19--04:29: సంక్రాంతి
  • మకరరాశిలో సూర్యుని ప్రవేశమే
    ఉత్తరాయణం మకర సంక్రమణం
    ఇంటింటి ముగ్గుల ముంగిళ్ల ముత్యాలు
    స్వచ్ఛతా సంస్కృతి క్రాంతి సంక్రాంతి!

    ఎడ్ల మెడలో మువ్వల గంటల గలగల
    ఇరు సంజల రేగు ధూళి సువర్ణ రజను
    పరిపూర్ణతల పల్లెలు పరిఢవిల్లిన

    రాజనాల సొబగు ప్రజానీరాజనాల
    ధనధాన్య సమన్విత శ్రీలక్ష్మి కళల
    తరళతల వనె్నలిచ్చు క్రాంతి సంక్రాంతి!

    ఇహభోగాల నిచ్చు సకలం భోగి
    హరిదాసు కీర్తనల హరిలోరంగస్మరణ
    బుడబుక్కలవాని హరహర ధ్వానం
    బసవన్న నృత్య మృదుపద సంగతి గతుల
    పశువులకు పలు వనె్న చినె్న అలంకరణ
    పొలాల పొలివేయడం కనుమ ప్రత్యేకం!
    ఆనందాల ఆవాహన పెద్దల స్మృతి పెద్ద పండుగ
    సౌభాగ్యాల సౌజన్యాలకు మూలాధారం
    ధనమే కదా జనులకు నిజ ఇంధనం
    పండుగ పరమార్థం పరులకై సాయపడాలి అందరం
    ధాన్యం ధనం దేశాన సరిగ అందరిదరి
    ప్రవహించిన అన్నం పరమాన్నంగా
    గొంతుగొంతునా నిండుగ పండు పరమార్థం
    సంక్రాంతి పండుగ! క్రాంతి సంక్రాంతి!!


    0 0
  • 01/14/19--04:35: రంగవల్లి
  • 19 చుక్కలు 19 వరుసలు
    కట్టమూరి సుభాషిణి (గుంటూరు)
    ------------------------------------------------


    0 0
  • 01/14/19--04:42: రంగవల్లి
  • 30 చుక్కలు 10 వరుసలు 10 వచ్చే వరకు సరిచుక్క
    జంజనం త్రివేణీ శివ (మంగళగిరి)
    ---------------------------------------------------------------


    0 0

    సంక్రాంతి పర్వదినం శుద్ధ అష్టమి భద్రాష్టమి నవమినాడు ధ్వజ నవమి నాడు వస్తాయి. ఉత్కళ దేశంలో శుద్ధ దశమిని శాంబరీ దశమిగా పాటిస్తారు. ద్వారాలకు, గడపలకు పూజలు నిర్వహిస్తారు. ఏకాదశినాడు పుత్రదైకాదశి వస్తుంది. శుద్ధ చతుర్దినాడు విరూపాక్షుడయిన శివుణ్ణి పూజిస్తారు. దానే్న వినూపాక్ష వ్రతం అని అంటారు. పుష్యమీ నక్షత్రం రోజులుండే పూర్ణిమ వచ్చిన మాసానే్న పుష్యమాసం అంటారు. శ్రావణపూర్ణిమనాడు వేదపఠనం మొదలెడతారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం జిల్లాలో వడ్డాదిలో తీర్థాలు నిర్వహిస్తారు. తమిళనాడులో ప్రతీ దేవాలయంలో చాలా గొప్పగా ఉత్సవాలు జరుపుతారు. తమిళనాడులో 3తైపూసమ్2 అంటారు.
    పుష్యకృష్ణపక్షం
    కృష్ణపాడ్యమినాడు విద్యావ్యాప్తి వ్రతం, అష్టమిరోజున కాలాష్టమి, నవమి రోజున అన్వాష్టకాశ్రాద్ధం, ఏకాదశి రోజున షట్‌తిలైకాదశి, ద్వాదశి రోజున సంప్రాప్తి ద్వాదశి, చతుర్దశినాడు యమతర్పణ పూజాదులు నిర్వహించడం సంప్రదాయం. అదే గోదావరి తీరవాసులు దానినే 3చొల్లంగి అమావాస్య2గా పాటిస్తారు. తూర్పుగోదావరి జిల్లా ఏడుపాయలలో ఒక్కటైన తుల్యభాగ సాగరంలో కలవటంవలన ఈ రోజు స్నానం ఇందులో చేస్తే సర్వశుభాలు కలుగుతాయి.
    ఉత్తరాయణం రోజు సూర్యుడు మకరరాశిలో ప్రవేశించి ఉత్తరగతుడవుతుండంవల్ల ఈ రోజును 3మకర సంక్రాంతి2 అంటారు. ఈరోజున తెలుగు ప్రజలు ఇళ్లన్నీ గొబ్బెమ్మలతో అలంకరించి, ముగ్గులు వేసి ఎంతో సుందరంగా తీర్చిదిద్దుతారు. కొత్త ధాన్యం ఇంటికి రావడంతోనే దేవునికి నైవేద్యాలు సమర్పిస్తారు. ఇక చివరి రోజైన కనుమ రైతులకు సంబంధించినది. దీనినే అధర్వణవేదంలో 3అనడుత్సవం2 అంటారు. ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత వుండటంవలన ఈ పుష్యమాసమంతా చాలా శుభప్రదమైనది.
    సంక్రాంతి అంబరాన్నంటే సంబరాల పండగ. పుడమి పులకించిపోతుంది రంగు రంగుల ఇండ్ల ముంగిళ్ళలో వేసే ముగ్గులతో. క్రొత్త ధాన్యంతో గ్రామీణ ప్రాంతాల్లోని గాదెలన్నీ కూడా కళకళలాడు సందర్భం. భోగి పండగ రోజున భోగిమంటల్లో ఇంట్లో వున్నటువంటి పనికిరాని కట్టె వస్తువులను ఆ భోగిమంటల్లో వేస్తారు. భోగిమంటల కార్యక్రమం అయిపోగానే భోగిపళ్ల స్నానాల కార్యక్రమం వుంటుంది. సంక్రాంతి పండగ రోజున ఇళ్ళ ముంగిళ్ళన్నీ రంగు రంగుల ముగ్గులతో, హరివిల్లులతో, రంగవళ్లికలతో ప్రతీ ఇంటి ముంగిలి కళకళలాడుతుంటాయి. అలా వేసిన ముగ్గుల్లో గొబ్బెమ్మలు ఉంచి అందులో గరికపోచలు రేగుపళ్ళు, పూలు ఉంచుతారు. గొబ్బెమ్మకు సంబంధించిన పాటలు కూడా బాగానే వాడుకలో వున్నాయి. గొబ్బెమ్మను గౌరీదేవి ప్రతిరూపంగా చూస్తారు. ఈ సంక్రాంతి పండుగకు హరిదాసులు కాషాయ వస్త్రాలు ధరించి, మెడలో పూలమాలలు, రుద్రాక్ష దండలు వేసుకొని నామలు పెట్టుకొని తలపై అక్షయపాత్ర పెట్టుకొని, ఒక చేత్తో చిడతలు, భుజం మీద తుంబుర పెట్టుకొని, కాళ్ళకు గజ్జెలు కట్టుకొని పద్యాలు, నృత్యాలు చేసుకుంటూ ఊరంతా కలియతిరుగుతారు. అదేవిధంగా బసవన్నలయితే గంగిరెద్దులను పట్టుకొని వాటిపై రంగు రంగుల వస్త్రాలతో అలంకరించి, కొమ్ములకు వస్త్రాలు కట్టి, గజ్జెలతో అలంకరించి సన్నాయి మేళాలతో విన్యాసాలు చేసుకుంటూ గ్రామీణ ప్రాంతాల్లో కన్పిస్తారు. ఈ పండగకు బొమ్మలకొలువులను కూడా మన ఇండ్లల్లో ఏర్పాటుచేసుకుంటాం. పేరంటాండ్రకు ఆకులు, వక్కలు, పండ్లు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకుంటారు.
    ఇక అసలు ఘట్టం సంక్రాంతి వచ్చిందంటే చాలు, ప్రతీ ఇంట్లో కట్టెల పొయ్యి వెలిగించి పిండి వంటల కార్యక్రమాన్ని చేపడతారు. ఇలాంటి పండుగలే మానవుల్లో కలివిడితనాన్ని, ఉమ్మడి కుటుంబాల్లోని వ్యక్తులమీద ప్రేమాభిమనాలు తగ్గిపోకుండా చూస్తున్నాయి. ఇక కనుమ రోజున అంటే సంకాంతి పండగ మరుసటి రోజు పశువులకు ప్రధానమైనది. ఇలా సంక్రాంతి పండుగను మూడు రోజులు-్భగి, సంక్రాంతి, కనుమలుగా ఎంతో సంబరాలతో ఆడంబరంగా జరుపుకుంటాము.


    0 0

    తెలుగువారు సంస్కృతీ ప్రియులు. సంప్రదాయబద్ధులు. ఆచార వ్యవహార పరాయణులు. తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలలో పండుగలు ఒక భాగం. తెలుగువారికి ముక్కోటి దేవతలు ఉన్నట్లే, అందుకు తగినట్లుగానే పండుగలు కూడా ఉన్నాయి. చైత్ర వైశాఖాది ద్వాదశ మాస పర్యంతం, పాడ్యమి మొదలగు ముప్పది తిథులకు సంవత్సరం మొత్తంమీద ఏదో ఒక పండుగ ఉంటూనే ఉంటుంది. ఎన్ని పండగులు వచ్చినా శ్రమను లెక్కచేయకుండా, ఖర్చుకు వెనుకాడకుండా తెలుగువారు ప్రతీ పండుగను ఇనుమడించిన ఉత్సాహంతో జరుపుకుంటారు. ఇల్లు అలికి ముగ్గులు పెట్టి ఇంటిని, పూజామందిరాలను ఆయా పండుగలకు పూజలకు అనుగుణంగా అలంకరించి ఆయా పూజలను, పండుగలను భక్తిశ్రద్ధలతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు.
    అయితే, పండుగలను జరుపుకోవడమనే సంప్రదాయం తరతరాలుగా, యుగయుగాలుగా నాటి నుండి నేటివరకు అప్రతిహతంగా, అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ వస్తున్నప్పటికీ ఇటీవలి కాలంలో మారుతున్న కాల మాన పరిస్థితుల దృష్ట్యా క్రమేపీ ఆ సంప్రదాయం సన్నగిల్లుతూ వస్తోన్నట్లుగా కనిపిస్తోంది.
    ఉదాహరణకు తెలుగువారు పెద్ద పండుగగా పిలుచుకునే ‘సంక్రాంతి’ పండుగనే తీసికొంటే- గతంలో సంక్రాంతి పండుగకు నెల రోజుల ముందే హడావుడిమొదలయ్యేది. ధనుర్మాసం ప్రారంభమైన నాటినుండి అంటే నెల పట్టిన నాటినుండి తెలుగువారి లోగిళ్ళలో ఇంతులు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిముందు కలాపి జల్లి రంగు రంగుల రంగవల్లికలు తీర్చిదిద్దటం మొదలుపెట్టేవారు. మరోవైపు కాళ్ళకు గజ్జెలు, ఒక చేత చిఱతలు, మరొకచేత వీణ, కంఠహారాలు, నుదుట తిరునామం, తలపై భిక్షాపాత్రతో సంప్రదాయ పంచెకట్టుతో ‘హరిలో రంగ హరీ’, ‘శ్రీమద్రామాయణ గోవిందో హరి’ అంటూ హరి కీర్తనలు పాడుతూ అపర నారదునిలా హరిదాసు గ్రామంలో వీధి వీధికీ తిరుగుతూ గడప గడపన భిక్ష స్వీకరిస్తూ ప్రతీ గ్రామాన్ని వైకుంఠథామంగా మార్చేసేవాడు. దారికిరువైపులా బంతి, చామంతి పూలు స్వాగత కుసుమాంజలి సమర్పిస్తున్నట్లు తలలూపుతుంటే, తెలిమంచుతెరలను చీల్చుకుంటూ వస్తోన్న హరిదాసు రూపం కానవచ్చేది. ఆపై హరిదాసు గొంతు శ్రావ్యసుభగమై, కావ్య తరంగమై గుడి గోపురాన చిరుగంటలు గణ గణధ్వనులతో గోమాత దరిజేరే లేగదూడ మెడలోని చిరుమువ్వుల సవ్వడితో సమ్మిళితమై చిరుగాలి అలలపై తేలుతూ వచ్చి నిద్దుర మంచుతెరలను చీల్చుకుంటూ కర్ణ్భేరి ప్రహరీ దాటి గుండె గదులలో దూరి మానస తంత్రులను మీటి మేలుకొలుపు పాడేది.
    సంక్రాంతి పండుగకు వారం రోజుల ముందే గ్రీటింగ్‌కార్డుల కోసం యువతీ యువకుల ఆరాటం మొదలయ్యేది. తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా బాపు గీతలు, రమణ రాతలతో కూడిన అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు గ్రీటింగ్ కార్డుల ఎంపిక హడావుడి మొదలయ్యేది. ఒకవైపు నూనూగు మీసాల న్నూ యవ్వనుల ఆటల పోటీలు, మరోవైపు రంగు రంగుల సీతాకోక చిలుకల్లాంటి కనె్నపడతుల గొబ్బెమ్మల ముచ్చట్లు, పంట వసూళ్ళ హడావులో అటు రైతులు, అరిసెలు, పోకుండలు, సున్నుండలు, జంతికలు, చక్కిలాల వంటి సంక్రాంతి పిండి వంటల తయారీలో ఇటు గృహిణులు తలమునకలై ఉండేవారు. ఆపై బాల బాలికలకు భోగిపళ్ళు పోయడం, పెద్ద పండగ -అనగా సంక్రాంతి రోజున పెద్దలను స్మరించుకోవడం, బొమ్మల కొలువుల ఏర్పాటు, విందు భోజనాలు, కొత్త అల్లుళ్ళ అలకలు- పెద్ద పండగ పేరు సార్థమయ్యేంత హడావుడి. పండగ చివరి రెండు రోజులు -కనుమ, ముక్కనుమ రోజులలో పాడి పంటలలో తమకు చేదోడువాదోడుగా వున్న పశు సంతతి పట్ల కృతజ్ఞతగా రైతులు పశువులను, కొట్టాలను, ముఖ్యంగా ఎడ్లబండ్లను అందంగా అలంకరించేవారు. ఈమధ్యలో ‘డూడూ బసవన్న’, ‘అయ్యగారికీ దండం పెట్టు’ అంటూ గంగిరెడ్ల వాళ్ళు, ‘అంబ పలుకు జగదాంబ పలుకు’ అంటూ బుడబుక్కలవాళ్ళు, జంగమదేవరలు, పిట్టలదొదూర వంటి పగటివేషగాళ్ళు ఊరంతా సందడి చేసేవారు. సంక్రాంతి ప్రత్యేక వ్యాసాలతో కవితలు, కథనాలు, చిత్రాలతో పత్రికల ప్రత్యేక సంచికలు కళకళలాడిపోయేవి.
    ఇక సంక్రాంతి సంబరాలలో చివరగా చెప్పుకుంటున్నప్పటికీ అత్యంత ముఖ్యమైనది కోడిపందేలు. అలనాటి పలనాటి వీర చరిత్రకు తార్కాణంగా బ్రహ్మనాయుడు, నాగమ్మల పౌరుషానికి ప్రతిరూపాలుగా కోడిపందేలు జరుగుతాయి.
    సంక్రాంతి నెల రోజుల సందడి అంతా సంక్రాంతి పండుగ చివరి రోజున ఇంటి ముంగిట రథం ముగ్గు వేసి సంక్రాంతి లక్ష్మికి వీడ్కోలు పలకడంతోను, అలాగే ‘‘అల వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబు దాపల’ దాగిన వారిని సైతం తన హరినామ సంకీర్తనామృతంలో ఓలలాడించిన హరిదాసును దక్షిణ తాంబూలాదులతో సత్కరించి సాగనంపడంతోను పరిసమాప్తమయ్యేది.
    అయితే ఈ సంక్రాంతి వైభవమంతా ఈనాటి టెలివిజన్, స్మార్ట్ఫోన్‌ల పుణ్యమా అని కనుమరుగైపోతోంది. తెల్లవారు జామున నిద్రలేచి ముగ్గులు వేసేవారు లేక ఇంటివాకిళ్లు వెలవెలపోతున్నాయి. నేడు సంక్రాంతి ముగ్గులు ఇంటి వాకిళ్ళల్లో కాకుండా ‘ముగ్గుల పోటీ’ ప్రాంగణాల్లో మాత్రమే దర్శనమిస్తున్నాయి. ఇంటి ముంగిట భోగిమంటలు నాలుగు రోడ్ల కూడలిలోకి చేరిపోయి కట్టెల పొయ్యిల్లా మారిపోయాయి. హరిదాసు, గంగిరెద్దుల వాళ్ళు, బుడబుక్కల వాళ్ళు వంటి కళాకారులు సరైన ఆదరణ లేక బక్కచిక్కిపోయారు. ట్విట్టర్ శుభాకాంక్షలు, ఫేస్‌బుక్ పోస్టింగులు, వాట్సప్ మెస్సేజ్‌ల ఉరవడిలో గ్రీటింగ్ కార్డుల ప్రాభవం కోల్పోయాయి.
    శారీరక శ్రమకు వెరసి ఇంటిలో అరిసెలు, పోకుండలు వంటి సంక్రాంతి పిండివంటల తయారీ కొండెక్కి అంగట్లో కొనితెచ్చుకోవడం లేకుంటే ఆన్‌లైన్‌లో ఆర్డర్ బుక్ చెయ్యడం వ్యవహారమైపోయింది. ఆవుపేడ, భోగి పిడకలు సైతం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తున్నారంటే ఈనాటి సంక్రాంతి పండుగ పరిస్థితి ఏమిటో అర్థం చేసికోవచ్చు.
    పత్రికలు సైతం ఏవో ఒకటి రెండు కవితలో, వ్యాసాలో ప్రచురించి మమ అనిపించేస్తున్నాయి. టెలివిజన్ ఛానల్స్‌వారు ఆదిలో సంక్రాంతి సంబరాలు పతిబింబించే కార్యక్రమాలు ప్రసారం చేసినప్పటికీ, ప్రజలు టెలివిజన్‌కు అడిక్ట్ అయిపోయారని, టిఆర్‌పి రేటింగ్‌లు పెరిగాయని గమనించి రాను రాను కార్యక్రమాల తీరుతెన్నులు మార్చేసి సంక్రాంతి సినిమాల తాజా విశేషాలతోను, సినిమా తారల ఇంటర్వ్యూలతోను కార్యక్రమాలను నింపేస్తున్నారు.
    సంక్రాంతి పండుగ సంబరాల ఆనవాళ్ళు, ఆచారాలు ఒకటొకటిగా కనుమరుగవుతున్నప్పటికీ, నాటికి నేటికి నిలిచివున్న ఆచారం మాత్రం ఒకటి ఉంది. అదే కోడిపందేలు. ఈ కోడిపందాలు సంక్రాంతి ప్రాభవాన్ని దశదిశలా వ్యాపింపజేసి సంక్రాంతికి పేరుప్రఖ్యాతులు తెచ్చాయి. ఎంతగా అంటే సంక్రాంతి అంటే కోడిపందేలు, కోడిపందేలు అంటే సంక్రాంతి అన్నంతగా! నిజం చెప్పాలంటే నేడు తెలుగునాట క్రికెట్ పోటీలకంటే కోడిపందేలకే ఎక్కువ ఆదరణ వున్నదనటంలో అతిశయోక్తిలేదు.
    సంక్రాంతి యొక్క గత వైభవాన్ని, ప్రాభవాన్ని ఏళ్ళ తరబడి ప్రత్యక్షంగా చూసినవారికి కళావిహీనమైన నేటి సంక్రాంతిని చూస్తుంటే ‘ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు?’ అని బరువెక్కిన గుండెలు, బోసిపోయిన లోగిళ్ళు ప్రశ్నిస్తున్నట్లుంటాయి.
    ఈమధ్య నోస్టాల్జియా ఒక ఫ్యాషనైపోయిందని కొందరు విమర్శిస్తే విమర్శించవచ్చుగాక, వాస్తవ చిత్రమైతే ఇలాగే ఉంది. ‘‘సంప్రదాయం నిలిచే వుంటుంది హమేషా అదే తమాషా’’ అన్న కవివాక్కుకు అపప్రథ తెచ్చేలా!


    0 0

    ధర్మరాజుకు ఒకసారి ఒక సందేహం కలిగింది. ‘‘రాజు ఎవరి ధనానికి స్వామి అవుతాడు. అతని ప్రవర్తన ఏవిధంగా ఉంటే ఆదర్శమైన రాజు అని ప్రజలు అంటారు. ఈ సందేహలకు సమాధానం చెప్పుమని అతను పితామహుడైన భీష్ముని ప్రార్థించాడు. అప్పుడు భీష్ముడు అతనికి ధర్మ సందేహలన్నీ తీర్చి, ఉదాహరణగా ఒక రాజు గురించి ఇలా చెప్పాడు
    - ‘‘బ్రాహ్మణులు కాని వారి ధనానికి మాత్రమే రాజు స్వామి అవుతాడు. కర్మ భ్రష్టులైన బ్రాహ్మణులను కూడా రాజు ఉపేక్షించరాదు. ఎవరి రాజ్యంలో ద్విజుడు దొంగ అవుతాడో, ఆ అపరాధం రాజుదే కాని ఇంకొకరిది కాదు. ఆపాపం కూడా రాజుదే అవుతుంది. బ్రాహ్మణులను రక్షించవలసిన బాధ్యత కూడా రాజుదే. ఆ కారణంగా రాజు నకుడి లాంటి రాజర్షులు తప్పక విప్ర రక్షణ కర్తవ్యంగా భావించే వారు. దీని గురించి ఒక కథ ఉంది. పూర్వ కాలంలో కైకయదేశాన్ని పాలించిన రాజు వ్రతశీలి. అతను వేదాధ్యయన చేస్తున్న అతనిని ఒక క్రూర రాక్షసుడు పట్టుకున్నాడు. అప్పుడు ఆ రాక్షసునితో ఇలా అడిగాడు -‘‘నాగ్రామాల్లో దొంగ, లోభి, మద్యం సేవించే వాడు, యజ్ఞం చేయనివాడు కాని లేరు. మరి నువ్వు ఎందుకు నన్ను పట్టుకొన్నావు. అలాగే విద్వాంసుడు కాని బ్రాహ్మణుడు వ్రతనిష్ఠ లేని వాడు, ఆహితాగ్ని కానివాడు, యజ్ఞం చెయ్యని వాడు నా రాజ్యంలో లేరు మరి నువ్వెందుకు నువ్వు నాలో ప్రవేశించావు?
    ఇంకా నా రాజ్యంలో బ్రాహ్మణులు భూరి దక్షిణలతో యజ్ఞాలు చేస్తున్నారు. బ్రాహ్మణులు షట్కర్మలలో నిలిచి ఉన్నా వారు వేదం చదువుతారు, చదివిస్తారు. యజ్ఞం చేస్తారు. చేయిస్తారు. దానం చేస్తారు, దానం తీసుకొంటారు. వారు ఇతరులను పూజిస్తారు, పూజింప బడతారు. వారికి వివేకం, జ్ఞానం ఉన్నాయి. వారు సత్యమే పలుకుతారు. ఇలాంటి బ్రాహ్మణులు కల రాజ్యం నాది. మరి నా రాజ్యంలో ఎందుకు ప్రవేశించావు?
    ఇంకా నా రాజ్యంలో క్షత్రియులు యాచించరు. సత్యాన్ని ధర్మాన్ని అనుసరిస్తారు. వారు వేదాలు చదువుకుంటారు కాని చదివింపరు. క్షత్రియ ధర్మ నిరతులు వారు యజ్ఞాలు చేస్తారు కాని చేయించరు. వారు బ్రాహ్మణులను కాపాడుతారు కాని భీరువుల్లాగ యుద్ధ భూమినుండి పారిపోరు. మరి నీవు నాలో ఎందుకు ప్రవేశించావు?
    ఇంకా నా రాజ్యంలో తక్కినవారి గురించి వివరిస్తాను ఆలకించు. నారాజ్యంలోని వైశయులు వ్యవసాయం, పశుపాలనం, వాణిజ్యం- వీటితో కపట రహితంగా జీవిస్తారు. వారు అధిక ప్రసంగం చేయరు. క్రియాశీలురు సత్యమే మాట్లాడుతారు. వారి ఇంద్రియ నిగ్రహం శుచిత్వం, వివేకం, స్నేహం ఎన్నడూ వదలరు. తమ విధులను కూడా వదలరు అయినా నీవు నాలో ఎందుకు ప్రవేశించావు?
    అదే విధంగా నా దేశంలోని శూద్రులు ఏ అసూయ లేకుండా, తమ తమ కర్మలను చేయుటలో శ్రద్ధవహిస్తారు. వారు తక్కిన మూడు వర్ణాలవారిని ఆశ్రయించి ఉంటారు. ఈ విధంగా నా రాజ్యంలో నాలుగు వర్ణాలప్రజలు తమ ధర్మాలను నిర్వహిస్తూ ఉన్నారు అయినా నీవు నన్ను ఆవేశించావు.
    నేను వ్యక్తిగతంగా రాజ్యంలోని దీనులు, అనాధలు వృద్ధులు, బలహీనులు, రోగులు, స్తల్రు- వీరందరి పట్ల వివేకంతో ప్రవర్తిస్తాను. దేశ ధర్మాలు, కుల ధర్మాలు విచ్ఛిన్నం అవకుండా కాపాడుతున్నాను. అయినా నీవు నాలో ఎందుకు ప్రవేశించావు?
    నా రాజ్యంలో తాపసులు పూజించబడి రక్షింప బడుతారు. వారు నా చేత సత్కరింపబడతారు. నేను ఇతరులకు పెట్టకుండా ఏదీ భుజించను పరస్ర్తిలను తలవను. నారాజ్యంలో బ్రహ్మచారి కానివాడుఎవడూ భిక్షాటన చేయడు. సన్యాసి బ్రహ్మచర్యం పాటిస్తాడు. ఋత్విక్కు కాని వాడు హుతం చెయ్యడు.
    అయినా నీవు నాలో ప్రవేశించావు. నేను ఎన్నడూ విద్వాంసులను, తాపసులను వృద్ధులను అవమానించలేదు. నేను ధర్మాన్ని ఆచరిస్తాను. గృహస్థును. అదే విధంగా నా యొక్క పురోహతుడు గొప్ప తపస్సంపన్నుడు. సర్వధర్మాలు తెలిసిన వాడు. నేను దానంతో విద్యను వాంఛిస్తాను. సత్యంతో ధనాన్ని కోరుతాను. సేవించి గురువులను పొందుతాను. మరి ఇలాంటి గుణాలు ఉన్న ననె్నందుకు ఆవహించావు? నాకు నీ వంటి రాక్షసులంటే భయం లేదు.
    నా రాజ్యంలో విధవలు లేరు, జూదరి అయిన విప్రుడు లేడు. దొంగ లేడు. అధికారం లేకుండా యజ్ఞం చేయించేవాడు లేడు. ధర్మ కోసం నిరంతరం పోరాడే నాశరీరంలో గాయపడని భాగం లేదు. అలాంటి ధర్మ దత్తమైన నాదేహంలో నువ్వు ప్రవేశించావు. గో, బ్రాహ్మణ, యజ్ఞాలవల్ల నాప్రజలు నిరంతరం నా శుభాన్ని కోరుతారు. మరి నువ్వెలా ప్రవేశించావు’’ రాజు అప్పటి వరకూ విశదీకరించి తన రాజ్యం గురించి, పాలన గురించి, ప్రజలు ధర్మబుద్ధి గురించి, సకల వివరాలు వౌనంగా అతని లోపలకి ప్రవేశించి అన్ని వింటున్న రాక్షసుడు అప్పుడు రాజుతో ఇలా అన్నాడు.
    ‘స్ర్తీల వ్యభిచారం వలన రాజులు చేసే అక్రమాల వల్ల విప్రుల కర్మ దోషం వల్ల ప్రజలకు భయం కలుగుతుంది. అటువంటి రాజుల రాజ్యంలో వర్షాలు పడవు, ప్రాణం తీసే రోగాలతో ప్రజలు బాధపడతారు. వారు ఎప్పుడూ యుద్ధ భయంతో ఆకలి భయంతో జీవిస్తూ ఉంటారు.
    విప్రులు సంయమనంతో ఎక్కడ ఉంటే అక్కడ యక్ష రాక్షస పిశాచాల వల్ల, అసురుల వల్ల ఏ భయమూ ఉండదు. నీవు సర్వావస్థలలోను ధర్మాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలను పాలించావు. కనుక ఓ మహారాజా నీవు ఇంటికి వెళ్ళు.
    నీకు శుభమగుగాక. గో, బ్రాహ్మణులను ప్రజలను రక్షించే రాజుకు రాక్షసుల వల్ల అగ్నివల్ల భయం ఎక్కడిది? ఏ రాజు ముందు శుభాశ్శీసులు చేస్తూ పలుకుతూ వేద బ్రాహ్మణులు నడుస్తారో, ఎవరికి బ్రాహ్మణుడు ఒక ముఖ్యమైన బలమో ఎవరి ప్రజలు అతిధులను ఆదరించటంలో ప్రియంకలిగి ఉంటారో, ఆరాజులు స్వర్గాన్ని జయిస్తారు. ఈ మాటలు కైకయ రాజుతో చెప్పి రాక్షసుడు రాజు దేహాన్ని విడిచి పెట్టి వెళ్ళి పోయాడు.
    -ఇంకావుంది


    0 0

    కాని నీవద్ద గల ధనరాశికి తరుగుదల కానరాదు.
    త్వాం హి సత్యమద్రినో విద్మ దాతారమిషామ్‌ విద్మ దాతారం రరుూణామ్‌॥
    (ఋ.8-46-2)
    ‘‘ఓ దీనదయాళో! మాకు నిజమైన అన్నదాతవు, ధనదాతవు నీవే.’’ ఈ సృష్టిలో ఆహారాన్ని తీసుకొనే జీవులను లెక్కించలేము. నా దృష్టిలో ఆ జీవులు అనంతం. ఒక్కొక్క జీవజాతిలో వేలాది కోట్ల జీవులున్నాయి. ఆ జీవులన్ని తినే ఆహార సామగ్రి కూడ అనంతమే. అంత అనంత ఆహార సామగ్రిని అనంత ధనవంతుడవైన నీవే రుూయగలుగుతున్నావు. అందుచేత ‘దశస్యా నో మఘవన్ నూ చిత్’ ‘‘ఓ ధనేశ్వర! మాకాధనాన్ని శీఘ్రంగా ఇమ్ము’’ నీవాలస్యం చేస్తే మా అశాంతమైన మనస్సు మరింత అశాంతమైపోతుంది. ఓ పరమేశ్వర! ‘దదీ రేక్ణస్తనే్వ దదిర్వసు దదిర్వాజేషు పురుహూత వాజినమ్...’॥
    నీవు ఈ శరీర పోషణకు తగిన ధనాన్ని, నివాసాన్ని ఇస్తున్నావు. మాకు జ్ఞానప్రబోధార్థం జ్ఞానిని కూడ అనుగ్రహిస్తున్నావు. సమస్తమూ అనుగ్రహించే ఓ ప్రభూ! శారీరక ధనాన్ని బుద్ధ్ధినాన్ని ఇమ్ము.
    తమింద్రం దానమీమహే శవసానమభీర్యమ్‌ ఈశానం రాయ ఈమహే॥ (ఋ.8-46-6)
    ‘‘ఓ అనంత బలశాలీ! నిన్ను దానాన్ని అర్థిస్తున్నాం. అభయప్రదాతా! ధనేశ్వరుడవైన నినే్న కోరుతున్నాం.’’
    ధనమూ మరియు జనమూ వినాశనమైపోవుట చూస్తున్నా. ధనం తప్పక వినాశనమైపోతుందని భయం కలుగుతూ ఉంది. కాబట్టి ఓ అభయదానశీలా! మాకు ధనమే వద్దు. నీవే కావాలి. ధనస్వామివైన నీవే కావాలి. ఈ సద్భుద్ధి మాలో స్థిరంగా ఉండనిమ్ము అందువలన ‘్ధయో వాజేభి రావిథ’ ‘‘మా బుద్ధులను జ్ఞానంచేత పవిత్రం చేయి.’’
    ప్రభంగం దుర్మతీనామింద్ర శవిష్ఠా భర రయి మస్మభ్యం యుజ్యమ్‌॥
    (ఋ.8-46-19)
    ‘‘దేవాధిదేవ! సదా మావెంట ఉండి దుర్బుద్ధులను నాశనంచేసే ధనాన్ని ఇమ్ము’’
    ‘‘ఓ దేవాధిదేవా! మానవుడు ధనాన్ని పొంది ఉన్మత్తుడైపోతాడు. బుద్ధియందు సమతౌల్యాన్ని కోల్పోతాడు. ఒకప్పుడు మూఢునిగా మారిపోతాడు. కొన్ని సందర్భాలలో జ్ఞానియయిన వాని మనస్సులోకూడ అహంకారాన్ని, దురభిమానాలను పుట్టిస్తుంది. అందుచేత అనంత జ్ఞాన సంపన్నా! బుద్ధి సంశోధకమూ, దుర్బుద్ధి నివారకమూ, విమల ప్రకాశమూ, అజ్ఞాన నివారకమూ, దుష్టజ్ఞాన వినాశకమూ అయిన సుజ్ఞానాన్ని మాకు వరప్రదానంచేయి. కాని ఓ త్రిలోకాత్మా! ఇంత మాత్రం దయను తప్పక చూపు. ఎందుకంటే-
    సనితః సుసనితరుగ్రచిత్ర చేతిష్ఠ సూనృత
    ప్రాసహా సమ్రాట్ సహురిం సహంతం భుజ్యుం వాజేషు పూర్వ్యమ్‌॥ ఋ.8-46-20
    ఓ ధనాధిపతీ! పరమేశ్వరా! నీ వరప్రదానమైన ధనమూ నీ కరుణాపూర్ణమైన రక్షణ మమ్ము పెడదారి పట్టించకుండ ఉండుగాక! నీ రక్షణలో మేము మూడుపూవులు ఆరుకాయలుగా వర్ధిల్లెదముగాక! నీ ధన వరప్రదానంతో సమాజంలో ఔన్నత్యాన్ని కూడ పొందెదముగాక! కాని ఎన్నడూ నీ ఆజ్ఞోల్లంఘన మాత్రం చేయకుందుముగాక! అల్పజ్ఞతవలన మేమట్టి తప్పిదానికి పాల్పడకుండెదముగాక! నీవు చెప్పిన పవిత్ర సందేశ వాక్యాలలోనే నేనొక మాట చెబుతున్నాను.
    త్వం విశ్వా దధిషే కేవలాని యాన్యావిర్యా చ గుహా వసూని
    కామ మినే్మ మఘవన్మా వి తారీ స్త్వమాజ్ఞాతా త్వమింద్రాసి దాతా॥ (ఋ.10-54-5)
    ఇంకావుంది...


older | 1 | .... | 2042 | 2043 | (Page 2044) | 2045 | 2046 | .... | 2069 | newer