Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

గాంధీలో స్వైన్‌ఫ్లూ బాధితులకు చికిత్స

$
0
0

హైదరాబాద్: నగరంలో స్వైన్‌ఫ్లూ బాధితుల సంఖ్య రానురాను విస్తరిస్తోంది. గాంధీ ఆసుపత్రలో చేరిన పదిమందికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని వచ్చిందని ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ శ్రావణ్‌కుమార్ వెల్లడించారు.


రెండు నౌకల్లో అగ్నిప్రమాదం

$
0
0

మాస్కో: భారత్, టర్కిష్, లిబియాన్ సిబ్బందితో వెళుతున్న రెండు నౌకల్లో అగ్నిప్రమాదం సంభవించి దాదాపు 11 మంది చనిపోయారు. రష్యా నుంచి క్రిమియా ద్వీపకల్పాన్ని వేరుచేసే కెర్చ్ జలసంధి ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. సోమవారం ఒక నౌక నుంచి మరో నౌకకు ఇంధనం మార్చుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. రెండు నౌకల్లోనూ టర్కీ, లిబియా, భారతీయ పౌరులు ఉన్నట్లు సమాచారం.

గవర్నర్‌ను కలిసిన బీజేపీ నేతలు

$
0
0

హైదరాబాద్: ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీకి చెందిన నేతలు ఈరోజు గవర్నర్ నరసింహాన్ కలుసుకున్నారు. టీటీడీ దేవస్థానంలో జరుగుతున్న అవినీతిపై వారు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. టీడీపీ నేతలే టీటీడీలో అవినీతికి పాల్పడుతున్నారని వారు అన్నారు. కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ ఉన్నారు. టీటీడీ అవినీతి కార్యక్రమాలపై విచారణ జరిపించాలని కోరారు.

శివస్వామి పార్ధీవదేహాన్ని దర్శించుకుంటున్న భక్తులు

$
0
0

బెంగళూరు: నడిచే దేవుడు శివకుమార స్వామీజీ పార్థీవదేహాన్ని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. లింగాయత్‌ల ఆరాధ్య దైవంగా పిలిచే శివస్వామిజీని సరిహద్దు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ భక్తులు తరలివెళ్లారు. మఠంలోని వజ్రమహోత్సవ భవనానికి సమీపంలోని మ్యూజియం వద్ద పార్థీవదేహాన్ని ఉంచారు. ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు స్వామిని మహాసమాధి చేయనున్నారు.

ప్రభుత్వ సేవలను సరళతరం చేశాం:మోదీ

$
0
0

వారణాశి: ప్రభుత్వం అందించే వివిధ సేవలను నేరుగా లబ్ధిదారులకు చేరేందుకు సరళతరం చేశామని ప్రధాని మోదీ అన్నారు. ఆయన వారణాశిలో ఏర్పాటుచేసిన ‘ప్రవాస భారతీయ దివాస్(పిబిడి) 2019’లో ప్రసంగించారు. గతంలో భారతదేశం చేయలేదు అని భావించనవి కూడా ఈ నాలుగన్నరేళ్లలో సాధించగలిగామని అన్నారు. దేశంలో కొనసాగుతున్న దోపిడీని గుర్తించి అంతమొందించే పరిష్కార మార్గాలను కనుగొన్నామని, ఫలితంగా 5,78,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం లబ్ధిదారులకు అందించామని చెప్పారు. భారత్ పలు అంశాల్లో ప్రపంచంలో ముందు ఉందని అన్నారు. అంతర్జాతీయ సోలార్ కూటమే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు.

మల్దాలో బీజేపీ ర్యాలీ

$
0
0

కోల్‌కతా: మల్దాలో బీజేపీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా మాట్లాడుతూ బెంగాల్ ప్రజలు కమ్యూనిస్టులను తరిమికొట్టినట్లే తృణమూల్ కాంగ్రెస్‌ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్

$
0
0

హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఈరోజు సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆయన కేంద్ర అటవీ శాఖ మంత్రి హర్షవర్ధన్ కుమారుడు మయాంక్ వివాహ వేడుకల్లో పాల్గొని రాత్రికి హైదరాబాద్ కి చేరుకుంటారు.

శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారి మూసివేత

$
0
0

జమ్మూకాశ్మీర్:శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిని మూసివేశారు. తీవ్రమైన మంచు కురుస్తుండటంతో జవహర్ సొరంగమార్గానికి ఇరువైపులా రాకపోకలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. విపరీతంగా పేరుకుపోయిన మంచును తొలగిస్తున్నారు. మంచులో చిక్కుకుపోయిన పర్యాటకులను రక్షిస్తున్నారు.


చంద్రబాబును ప్రజలు నమ్మరు:కన్నా

$
0
0

విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం తన పబ్బం గడుపుకునేందుకు అగ్రవర్ణాల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు.

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఉద్యోగి

$
0
0

మేడ్చల్:అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారంనాడు మల్కాజిగిరి మత్స్య శాఖ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. మత్స్యశాఖ అధికారి వెంకటేశ్వరరావురూ.10వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు

వైకాపాలో చేరిన మేడా మల్లికార్జునరెడ్డి

$
0
0

హైదరాబాద్: టీడీపీ శాసనసభ్యుడు, ఏపీ ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జున రెడ్డి వైకాపాలో చేరారు. ఆయన ఈరోజు జగన్ నివాసమైన లోటాస్‌పాండ్‌లో వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంతకుముందే మల్లికార్జున రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తూ ప్రకటన చేశారు.

బాలనెరుపు-నివారణ చిట్కాలు

$
0
0

కొందరికి చిన్నవయస్సులోనే జుట్టు తెల్లబడుతుంది. దీనే్న బాలనెరుపు అంటారు. ఈ కారణంగా వారు నలుగురిలోకి చొరవగా వెళ్లి మాట్లాడలేరు. సమస్యకు తక్షణ, సులువైన పరిష్కారంగా డై మొదలుపెడతారు. అయితే దీనివల్ల చర్మ సమస్యల వంటి ప్రతికూల ప్రభావాలతో పాటు జుట్టు కూడా బలహీనపడి కాంతిని కోల్పోతుంది. నిజానికి జుట్టు రంగు ముందే నిర్ణయించబడుతుంది. జుట్టు కుదుళ్ళలోని మెలనోసైట్స్ అనే కణాలు జుట్టుకి రంగునిస్తాయి. శరీరంలోని మెలనిన్ స్థాయిని జుట్టు రంగులు మారతాయి. వృద్ధుల్లో మెలనిన్ ఉత్పత్తి ఆగిపోయి జుట్టు తెల్లబడుతుంది. దీన్ని తిరిగి నల్లగా మార్చటం సాధ్యం కాదు. అయితే బాల్యం, యవ్వనంలో ఈ సమస్య వస్తే దానికి తగు చిట్కావైద్యం, ఆహార నియమాల సాయంతో ఎదుర్కోవచ్చు.
* బాలనెరుపు ఉన్నవారు రోజూ కప్పు ఉసిరికాయ రసం తాగితే జుట్టు కుదుళ్ళు బలపడటమేగాక నెరుపు ఆగుతుంది.
* పది గ్రాముల వెల్లుల్లి పొట్టును బూడిద చేసి వంద మిల్లీ లీటర్ల ఆలివ్ ఆయిల్లో కలిపి పదిరోజులు నిల్వచేసి దాన్ని రోజూ రాత్రి తలకు రాసుకుని ఉదయం తలస్నానం చేస్తే జుట్టు నెరుపు ఆగుతుంది.
* కరివేపాకు, గుంటగలగరాకు, పొన్నగంటి కూరలను కలిపి రుబ్బి తలకు రాసి ఆరిన తర్వాత తలస్నానం చెయ్యాలి. ఈ మిశ్రమాలతో పాటు నేల ఉసిరిని కూడా కలుపుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
* రెండు కప్పుల నీటిలో గుప్పెడు రాచ ఉసిరికాయలు వేసి ఉడికిన తర్వాత వాటిని గుజ్జుగా చేసి దానికి సమపాళ్ళలో గోరింటాకు పొడి కలిపి కుదుళ్ళకి పట్టించాలి. ఇలా వారానికి కనీసం మూడు సార్లు చేస్తే క్రమంగా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.
* ఒక గినె్నలో నాలుగు చెంచాల నిమ్మరసం, కాఫీ పొడి, గుడ్డు సొన, రెండు చెంచాల కొబ్బరినూనె, రెండు చెంచాల వడగట్టిన ఉసిరి రసం కలిపి మూడు గంటలపాటు అలాగే ఉంచాలి. తర్వాత దాన్ని జుట్టు కుదుళ్ల మొదలు చివరల వరకు పట్టించి ఆరిన తర్వాత తలస్నానం చేస్తే తెల్లజుట్టు నల్లబడుతుంది.
* గోరింటాకు, మందార ఆకు, కరివేపాకులను సమపాళ్ళలో తీసుకుని మెత్తగా రుబ్బి తలకు పట్టించి, ఆరిన తర్వాత తలస్నానం చేయాలి. ఇలా క్రమంగా చేస్తుంటే బాల నెరుపు పోయి జుట్టు నల్లబడటమే కాక, జుట్టు కుదుళ్ళు గట్టిపడతాయి.
* గుప్పెడు తులసి ఆకులను తీసుకుని ఒక కప్పు నీటిలో వేసి, కాచిన తర్వాత ఆ నీటిని చల్లార్చి గోరువెచ్చగా అయిన తర్వాత ఆ నీటిని కుదుళ్ళలోకి ఇంకేలా రోజూ రాస్తూ ఉంటే జుట్టు నల్లగా మారుతుంది.
* రోజువారీ ఆహారంలో కరివేపాకును పచ్చడి, పొడి వంట రూపాల్లో విరివిగా వాడాలి.
* పరగడుపున రుబ్బిన పచ్చి కరివేపాకు ముద్ద తీసుకుంటే మరింత మెరుగైన ఫలితం ఉంటుంది.

స్కేట్ బోర్డ్ సెలబ్రెటీ

$
0
0

మనవళ్లు, మనవరాళ్లతో కాలక్షేపం చేయాల్సిన వయస్సులో సెలబ్రెటీగా మారిపోయారు ఫిన్లాండ్‌కు చెందిన 65 సంవత్సరాల లీనా సల్మీ.. స్కేట్‌బోర్డ్‌తో అవలీలగా ఫీట్లు చేస్తూ అందరినీ ఆకర్షిస్తున్నారు. కేవలం తను చేయడమే కాకుండా, స్కేట్ బోర్డ్ నేర్చుకోవాలనుకునేవారికి 65 సంవత్సరాల వయస్సులో ఇన్‌స్ట్రక్టర్‌గా మారిపోయారు. నాలుగు సంవత్సరాల కిందట కాలక్షేపం కోసం ఆమె స్కేటింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఇప్పుడు పెద్దవాళ్లతో పాటు చాలామంది యువతీ యువకులు కూడా ఆమె దగ్గర ట్రైనింగ్ కోసం వస్తున్నారు. యుగాండాలోని స్కేట్ పార్క్‌కు ఏదైనా సాయం చేయాలనుకున్న లీనా అక్కడికి మొదటిసారి వెళ్లినప్పుడు 60 స్కేట్ బోర్డులు, ఇతర వస్తువులను తీసుకెళ్లి ఇచ్చారు. ‘‘పెద్దవాళ్లు అయ్యేకొద్దీ ఫలానా పనే చేయాలని కాకుండా, ఎవరు ఏమనుకుంటారో అనుకోకుండా ఎవరికి నచ్చిన పని వారు చేస్తూ.. మీకు నచ్చినట్లుగా జీవిస్తేనే మంచిది.. నేను కూడా నా తుది శ్వాస వరకూ రైడ్ చేస్తూనే ఉండాలనేదే నా కోరిక’’ అని చెబుతారు లీనా..

మెరిసే చర్మానికి యోగ

$
0
0

ప్రకాశవంతమైన మెరిసే చర్మానికి యోగా ఎంతో దోహదపడుతుంది. మన ముఖాన్ని అద్దంలో చూడగానే కనిపించేది ముందుగా చర్మమే.. మరి ఆ చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే సంరక్షణ తప్పనిసరి. చర్మ సంరక్షణలో యోగా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మరి చర్మం నిగారింపును పెంచే యోగాసనాలను చూద్దామా..
నిలబర్చే భంగిమ
శిరస్సును నిలబర్చే యోగా భంగిమను అభ్యసించడం వల్ల ముఖం, మెదడుకు రక్తప్రవాహం వేగవంతం అవుతుంది. ఈ విధమైన యోగాసనం ద్వారా చర్మంపై గీతలు తగ్గడానికి, చర్మం సాగకుండా ఉండటానికి సహాయపడుతుంది. ఈ భంగిమ గురుత్వాకర్షణ ప్రభావాన్ని వ్యతిరేకిస్తుంది. కాబట్టి ముఖ చర్మ కాంతి పెరిగేలా చేస్తుంది.
విల్లు
ఈ భంగిమలో శరీర ఆకృతిని ఊహించుకున్నట్లయితే విల్లు ఆకారంలో వంగి ఉంటుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. ఈ యోగాసన అభ్యసించడం వల్ల జీర్ణవ్యవస్థ ఉత్తేజం పొందుతుంది. ఊపిరితిత్తులకు ఆక్సిజన్ ప్రవాహాన్ని పెంచుతుంది. ఇది వెనె్నముక దృఢంగా అవ్వడానికి, అంతర్గత శక్తి పెరగడానికి ఈ ఆసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. రక్తం, చర్మంలోని విష పదార్థాలను వేరుచేసి బయటకు పంపేస్తుంది. ఫలితంగా చర్మం శుభ్రపడి మెరుపులీనుతుంది.
ప్లాగ్
ఈ యోగాసనాన్ని అభ్యసించేటప్పుడు బోర్లా పడుకుని శరీరం పైభాగాన్ని నెడుతూ తలను ఆకాశం వైపు సాగదీయాలి. ఈ యోగాసనం అభ్యసించడం వల్ల శరీరంలోని హార్మోన్లు నియంత్రణలో ఉంటాయి. ఈ ఆసనం ముఖ్యంగా థైరాయిడ్ గ్రంథిని ఉత్తేజపరుస్తుంది.
శ్వాసక్రియ
శ్వాసను గణనల ద్వారా నియంత్రిస్తుండడం వల్ల మనస్సు పునఃశక్తిని పొందుతుంది. ఫలితంగా చర్మంపై ఎలాంటి ఒత్తిడి పడకుండా అందంగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది.
భరద్వాజాసన
ఈ భంగిమలో ముందుగా కాళ్ళను లోనికి మడవాలి. తరువాత రెండు చేతులను పక్కకు విస్తారించి చాపపై కూర్చోవాలి. వెనె్నముక బలోపేతం అయ్యేవిధంగా లోతైన శ్వాసను తీసుకోవాలి. ఇప్పుడు చాపపై ఎడమ చేతివైపుకు తిరగాలి. ఈ సమయంలో కుడి చేతిని కుడి తొడపై మడవాలి. ఇప్పుడు శ్వాసను బయటకు వదలాలి. కొన్ని సెకన్ల తరువాత యథాస్థానానికి వచ్చేయాలి. ఇలాగే రెండోవైపు అంటే ఎడమవైపు కూడా చేయాలి.
లాభాలు
* శిరస్సు నిలబర్చే యోగా భంగిమ వల్ల రక్తప్రవాహం వేగవంతం అయి, మలినాలు తొలగిపోతాయి.
* విల్లు భంగిమ వల్ల జీర్ణ వ్యవస్థ ఉత్తేజితమవుతుంది.
* ప్లాగ్ భంగిమ శరీరంలోని హార్మోన్లను క్రమబద్దీకరిస్తుంది. ఫలితంగా రుతుక్రమ సమస్యలు తొలగిపోతాయి.
* శ్వాసక్రియ వ్యాయామం వల్ల మనస్సుకు ప్రశాంతత, శక్తి లభిస్తుంది.
* భరద్వాజాసన వల్ల వెనె్నముక బలోపేతం అవుతుంది. కడుపు చుట్టూ ఉన్న కొవ్వు కరిగిపోయి కండరాలు బలోపేతం అవుతాయి.

యాప్ సాయంతో పరీక్షల్లో రాణింపు

$
0
0

పరీక్షల సమయం వచ్చేసింది. ఫిబ్రవరి చివరి వారంలో ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలవబోతున్నాయి. ఇంకా నెల సమయం ఉంది కదా అనుకుంటున్నారేమో.. ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టకపోతే అంతే సంగతులు.. అదీ ఒక పద్ధతి ప్రకారం టైం టేబుల్ వేసుకుని మరీ చదివితే పరీక్షల్లో తప్పకుండా రాణించవచ్చు. పరీక్షలు అనగానే విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు కూడా ఒకటే టెన్షన్. విద్యార్థులు పరీక్షల కోసం రాత్రీ పగలూ చదువుకునే సమయం, ఇన్నాళ్లుగా చదివిన పాఠాలు, విషయాల్ని మననం చేసుకుంటూ నమూనా పరీక్షలు రాసే సందర్భాలు చాలా ముఖ్యమైనవి. ఈ సమయంలోనే సిలబస్ పూర్తిగా చదవలేదనో, చదివినా గుర్తుంటుందో లేదో అనే అనుమానాలు విద్యార్థులను వేధిస్తుంటాయి. చూసేవారికి ఇది చిన్న విషయంగా అనిపించినా విద్యార్థులకు ఇది ఒత్తిడి కలిగించే అంశమే.. ఇలాంటి ఒత్తిళ్ల నుంచి విద్యార్థులను బయటపడేసి, ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు ఉపయోగపడే యాప్స్ అనేకం ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యేవారికి ఉపయోగపడే ఆ యాప్స్ వివరాలను తెలుసుకుందాం..
* పరీక్షలకు సిద్ధమయ్యేవారు గత సంవత్సరాల్లో వచ్చిన ప్రశ్నలు, సరైన జవాబులను తెలుసుకునే ప్రయత్నం చేయటం తెలిసిందే.. అయితే గతంలో మాదిరిగా ఇప్పుడు వీటికోసం లెక్కకు మించిన గైడ్స్ కొనే బదులుగా పాత పరీక్ష పత్రాలను ఆప్ రూపంలో అందిస్తోంది విక్రమ్ సిరీస్. ‘‘ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ప్రిపరేషన్’’ అనే ఈ యాప్‌లో ఇంటర్‌కు సంబంధించిన పలు గ్రూపుల తెలుగు, ఇంగ్లీషు మీడియం ప్రశ్నా పత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఎన్నో ఏళ్ళ పేపర్లు ఒకేచోట ఇమేజ్ రూపంలో పొందవచ్చు.
* ఒత్తిడికి దూరంగా పరీక్షలకు మానసికంగానూ సిద్ధమయ్యేందుకు ‘‘ఇంపాక్ట్ ఇండియా’’ వంటి యాప్స్ ఉపయోగపడతాయి. ఇందులో సమయపాలన, జ్ఞాపకశక్తి పెంచే మెళకువలు, ఒత్తిడిని అధిగమించే చిట్కాలు, నెగోషియేషన్ స్కిల్స్ వంటి అంశాలకు సంబంధించిన అనేక వీడియోలు ఉంటాయి. ఈ యాప్ నుంచి అనుబంధ యూట్యూబ్ పేజీకి వెళ్లి దీనికి సంబంధించిన వీడియోలను వీక్షించవచ్చు.
* గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇంగ్లీషు పరీక్ష కాస్త కష్టంగా అనిపించడం సహజమే.. అలాంటివారికి ‘‘ఇంగ్లీష్ గ్రామర్ టెస్ట్’’ అనే యాప్ సాయం తీసుకోవచ్చు. ఇందులో ఇంటర్మీడియట్, అప్పర్ ఇంటర్మీడియట్ అనే విభాగాల్లో గల 1200 ఇంగ్లీష్ గ్రామర్ అంశాలు దశలవారీగా సాధన చేస్తే ఇంగ్లీషు పరీక్షను సులభంగా ఎదుర్కోవచ్చు.
* మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల్లో సబ్జెక్టు ఎంత ముఖ్యమో ఫార్ములాలూ అంతే ముఖ్యం. చాలామంది వీటిని గుర్తుంచుకునే విషయంలో తడబడుతుంటారు. ఇలాంటివారి కోసం ‘‘్ఫర్ములా డెక్’’ అనే యాప్ ఉపయోగపడుతుంది. వ్యక్తిగత వివరాలతో యాప్‌లో ఎకౌంట్ తెరచి అందులో కోరిన విభాగంలో ఫార్ములాలు నేర్చుకోవచ్చు.
* కొందరు ఎంత బాగా చదివినా పరీక్షా కేంద్రం వద్దకు వెళ్లేసరికి కంగారు పడుతుంటారు. ఇలాంటివారు పరీక్షకు ముందు శ్రావ్యమైన సంగీతం వింటే మంచిది. దీనికోసం ‘‘కామ్’’ వంటి యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుని హెడ్‌ఫోన్స్‌తో వింటే మనసు ప్రశాంతంగా ఉండి ఏకాగ్రతతో పరీక్ష రాయగలరు.
* సిలబస్ అంతా చదివి చివరలో రివిజన్ చేసుకోవాలనుకున్నప్పుడు మొత్తం పుస్తకాలను తిరగేయడం తలనొప్పి. ఇలాంటి సమయంలో మొబైల్‌లో ‘‘తెలంగాణా ఎస్.సి.ఇ.ఆర్.టి. బుక్స్’’ అనే యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ భాషలో ఒకటి నుండి పది తరగతుల పుస్తకాల పీడీఎఫ్‌లు అందుబాటులో ఉంటాయి.
* పుస్తకాలు చదవటం కంటే అవే అంశాలను వీడియో రూపంలో చూస్తే విద్యార్థులకు బాగా గుర్తుంటాయి. ఈ అవకాశం అందించే యాప్స్‌లో ‘‘ఖాన్ అకాడమీ’’ ఒకటి. ఇందులో మ్యాథ్స్, సైన్స్, ఆర్ట్స్, హ్యుమానిటీస్, తదితర అంశాల సమాచారం ప్రాథమిక స్థాయి నుంచి డిగ్రీ స్థాయి వరకు వీడియోల రూపంలో లభిస్తుంది.
* అలాగే యూట్యూబ్‌లో తెలుగు రాష్ట్రాల పదో తరగతి పాఠాలు వివరంగా తెలుసుకోవాలంటే ‘‘డిజిటల్ టీచర్’’ వంటివాటిని ఆశ్రయించవచ్చు.
* పరీక్షలకు తయారయ్యేవారు సమయపాలన పాటించటం ఎంతైనా అవసరం. సమయం, సిలబస్‌లను బట్టి సమయపాలన కోసం మొబైల్‌లో ‘‘ఎగ్జామ్ కౌంట్‌డౌన్’’ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షల తేదీలు, సిలబస్ వివరాలు పొందుపరిస్తే కౌంట్‌డౌన్ రూపంలో ఎప్పటికప్పుడు సమయానుకూలంగా చెబుతూ ఉంటుంది. దీంతో ఎటువంటి హడావుడి, గాబరా లేకుండా తగినట్లుగా చదువుకోవచ్చు.
* పరీక్షల ముందు నుంచే ‘‘నిఘంటు’’ యాప్స్‌ను వాడటం వల్ల కొత్త పదాల స్పెల్లింగ్స్ నేర్చుకుని తప్పులు రాయకుండా చూసుకోవచ్చు.


మహాభారతంలో ఉపాఖ్యానాలు -106

$
0
0

లోకంలో మూడు రకాల ప్రాణులు ఉన్నారు. కష్టాలు రాకమునుపే వాటి నివారణ ఉపాయం ఆలోచించేవాడు అనాగతవిధాత.
సరియైన సమయంలో ఆత్మ రక్షణకు ఉపాయం వెతికేవాడు ప్రత్యుత్పన్నమతి. ఈ రెండు రకాల వారు సుఖంగా ఉన్నతిని పొందుతారు.
ఇక మూడవరకం వారు ప్రతీ పనికి అవసరం లేని ఆలస్యం చేసేవాడిని దీర్ఘసూత్రుడు అంటారు. వాడు నశిస్తాడు. దీనికి ఉదాహరణగా ఒక కద ఉంది. అదే మూడు చేపల కద. పూర్వము ఒక చెరువులో చాలా చేపలు జీవించేవి. అందులో మూడు చేపలు మూడు రకాల మనస్తత్వాలు కలవి. ఒకదానికి చాలా ముందు చూపు ఉంది. రెండవది సమయానికి తగిన పని చేసే తెలివితేటలు కలది. మూడవది ప్రతి పనికి అక్కర్లేని ఆలస్యం చేస్తూ సరియైన నిర్ణయం తీసుకోలేనిది.
ఒకమారు కొందరు బెస్తవాళ్ళు ఆ చెరువు గుంటలోని నీటిని తోడి పారబోస్తున్నారు. చెరువులో నీరు తగ్గిపోవడం చూసి మొదటి చేప అయిన దీర్ఘదర్శి తక్కిన మిత్రులతో ఇలా అంది. ‘‘ఈ చెరువులో నివసించే మనందరికీ గొప్ప ఆపద కలుగబోతున్నది. తప్పించుకునే దారి ఇప్పుడే వెతకాలి. మనం ఇక్కడి నుంచి వేరొక చోటికి వెళ్ళిపోవాలి. కీడు రాకముందే మంచి ఉపాంతో తొలగించు కొనే వారికి ప్రాణభయం ఉండదు. కనుక ఇంకొక చెరువుకు పోదాం పదండి’’.
అప్పుడు రెండవ చేప అయిన ప్రాప్తకాలజ్ఞం ఇలా అంది. ‘‘మిత్రమా! నీవు చెప్పిన సలహా బాగుంది. కాని మనం అంత తొందర పడవలసిన అగత్యం లేదని నా అభిప్రాయం’’.
తరువాత మూడవ చేప అయిన దీర్ఘసూత్రం స్నేహితులతో ఇలా అంది. ‘సమయం వచ్చినప్పుడు నా బుద్ధికి తగిన యుక్తి తోస్తుంది. అది ఎప్పుడూ నవ్వులపాలు కాదు’’.
దీర్ఘదర్శి వారి మాటలు విని ఆ సన్నటి నీటి దారిలో ప్రయాణం చేసి ఇంకొక పెద్ద మడుగులోకి చేరుకుంది.
చాలామటుకు నీరు తోడి పోసి జాలరులు అనేక ఉపాయాలతో చెరువులోని చేపలను పట్టుకున్నారు. మిగిలిన చేపలతో పాటు దీర్ఘసూత్రం కూడా వలలో చిక్కుకుంది. ప్రాప్తకాలజ్ఞం కూడా వలను నోటితో పట్టుకొని దొరికినట్లు నటించింది. జాలర్లు చేపలన్నీ వలలోనే ఉన్నాయి అని తలచారు. ప్రాప్తకాలజ్ఞం త్రాటిని నోటకరుచుకొని తక్కిన చేపలతోపాటు పైకి వచ్చింది. తర్వాత పక్కనున్న పెద్ద చెరువులో ఆ చేపలున్న వలను కడుగుతున్నప్పుడు మెల్లిగా చెరువులోని నీటిలోకి జారుకుంది. కాని ఏ విధమైన తెలివితేటలు, చొరవ లేని దీర్ఘసూత్రం మాత్రం కదలలేక అన్ని ఇంద్రియాలు పట్టుతప్పి చచ్చిపోయింది. నెత్తి మీదకు వచ్చిన ఆపదను అప్పుడు కూడా తెలుసుకోలేని మూర్ఖుడు దీర్ఘసూత్రం లాగే నశిస్తాడు.
కాని ‘నేను తెలివి గలవాడిని, అవసరం అయినప్పుడు ఆలోచించ వచ్చులే’ అని నిర్లక్ష్యం చేసేవాడు ప్రాప్తకాలజ్ఞంలా ప్రాణ సంకటంలో చిక్కుకుంటాడు.
అలాకాక రాబోయే ఉపద్రవాన్ని ముందే ఊహించి తగిన తరుణోపాయం ముందే ఆలోచించే వాడు, సమయానికి తగిన బుద్ధిని ఉపయోగించేవాడు ఈ ఇద్దరూ సుఖంగా వృద్ధిలోకి వస్తారు. సరియైన ఆలోచనలు లేనివాడు నశిస్తాడు. ఈ సత్యాన్ని మూడు చేపల కద చెప్తున్నది.
-ఇంకావుంది

స్వాధ్యాయ సందోహం-200

$
0
0

జనులకు ఇట్టివారి కంటె హితైషులు లోకంలో మరొకరు ఉండరు. సహజంగా విద్వాంసులలో ఉండే ఈ సద్గుణాలను చూచి నేను కూడ విద్వాంసుడను కావాలనే కోరిక కలుగుతున్నది.
వివరణ:- ఈ మంత్రంలో విద్వాంసుల మాహాత్మ్యాన్ని సంక్షిప్తంగా వివరించడం జరిగింది.
క్రతూయంతి క్రతవః :- వారు క్రతు= కర్మలను చేయుటయే సహజ స్వభావంగా కలవారు. ఇట్టి విద్వాంసులను గురించి ముండకోపనిషత్తు (3-1-4)
విజానన్ విద్వాన్ భవతి నాతివాదీ. ఆత్మక్రీడ ఆత్మరతిః
క్రియావానేష బ్రహ్మవిదాం వరిష్ఠః॥
‘‘సర్వమూ తెలిసిన విద్వాంసుడు ఎక్కువగా మాటలాడడు. ఆత్మయందే రమిస్తూ ఆత్మనే ప్రేమిస్తూ ఉంటాడు. అతడు బ్రహ్మజ్ఞానులలో శ్రేష్ఠుడైన క్రియాశీలుడుగా ఉంటాడు’’ శ్రేష్ఠుడైన బ్రహ్మజ్ఞానియే క్రియాశీలుడై యుంటే అది సామాన్యులకు మార్గదర్శకమే కదా. ఈ భావానే్న స్పష్టంగా ‘తే హి దేవస్య సవితః సవీమని క్రతుం సచంతే సచితః సచేతసః’’ (ఋ.10-64-7)
‘‘సర్వజ్ఞులైన ఆ సుజ్ఞనులు పరమాత్మ ఆదేశానుసారం సదా కర్మలను చేస్తూనే ఉంటారు’’ అని ఋగ్వేదం చెప్పింది. ఆ సుజ్ఞానులకు ఆదర్శం భగవానుడే. భగవంతుడే నిత్యకర్మశీలుడు. ఆయనను ఆదర్శంగా గొన్న సుజ్ఞాని నిష్క్రియాపరుడెలా కాగలడు? జ్ఞానిని అనుసరించేవారు మాత్రం కర్మదూరులుగా ఎలా ఉండగలరు? ఎవరైనా అలా కర్మదూరులై ఉండేవారిని వేదం దస్యులని వ్యవహరించింది.
హృత్సు ధీతయః:- అట్టి సుజ్ఞానులైన విద్వాంసులు సర్వదా దైవాన్ని మనస్సులో ధ్యానం చేస్తారు.
వేనంతి వేనాః:- ఆ విద్వాంసులు ఆచరించే సదాచార పరాయణత్వమే వారిలో గల బుద్ధి వైభవాన్ని- బ్రహ్మవర్చస్సును ప్రకటిస్తుంది.
పతయంత్యాదిశః:- అధర్మ, అన్యాయ మార్గాలతో ఆజ్ఞాపించేవారి ఆజ్ఞలను ధిక్కరిస్తారు. కర్మ, జ్ఞాన మార్గాల ఫలం సదసద్వివేకం. అంటే మంచి చెడుల విచక్షణ జ్ఞానం. ఇట్టి జ్ఞాన స్వరూపులు అధర్మ, అన్యాయ మార్గాలతో ఆదేశించేవారి ఆజ్ఞలను ధిక్కరించం సహజమే కదా.
న మర్డితా విద్యతే అన్య ఏభ్యః:- ఇట్టి జ్ఞానుల కంటె అన్యులైన వారు మానవులకు సుఖకారకులెవరూ ఉండరు. ఎందుకంటే జ్ఞానులు అధర్మ, అన్యాయాలకు విరోధులు కావడమే. అందుకే వారు జనులకు హితైషులుగా ఉంటారు. విద్వాంసులు సర్వదా ‘సదా దేవాస ఇళయా సచేమహి’ (ఋ.10-64-11) ‘‘విద్వాంసులమైన మేము జ్ఞానవంతులమూ మరియు ప్రియభాషణులమై యుందుము గాక’’ అని కోరుకొంటారు. అంటే మా మాట ఎప్పుడూ మా సుజ్ఞానభూషితమై యుండాలని వారి ఆకాంక్ష. విద్వాంసుల మరియు సుజ్ఞానులలోని ఈ సద్గుణాలను చూచి ముగ్ధులైన కారణంగా ‘దేవేష్వధి మే కామా అయంసత’ ‘‘నా అభీష్టాలన్నీ విద్వాంసులలో చిక్కుకొన్నాయి’’ అంటే నేను కూడ విద్వాంసుడను కావాలనుకొంటున్నాను అనే కాంక్ష నాలో కలుగుతున్నది.
***
ఉత్తమ ఉపదేశకులు పాపాల నుండి రక్షించగలరు
అవంతు నః పితరః సుప్రవాచనా ఉత దేవీ దేవపుత్రే ఋతావృధా
రథం న దుర్గాద్వసవః సుదానవో విశ్వస్మాన్నో అంహసో నిష్పిపర్తన॥
భావం:- మేలును కోరి హితోపదేశం చేసేవారు, విద్యాబోధకులు, దైవ శాసనాలను సృష్ట్ధిర్మాలను (ఋతం) శ్రద్ధగా ఆచరించేవారు, దివ్యగుణ సంపన్నులైన గురువులు, తల్లిదండ్రులు మమ్ము రక్షింతురుగాక!. సరిగా లేని మార్గంలో రథచోదకుడు రథాన్ని నిపుణంగా నడిచిన మంచి మార్గానికి తెచ్చే విధంగా ఉత్తమ జ్ఞానప్రదాతలైన వసువులారా! పాపాలనుండి మమ్ము విముక్తులను చేసి రక్షించండి.
వివరణ:- అజ్ఞానం కారణంగా పాపాచరణకు బుద్ధికి చొరవ కలుగుతుంది. తల్లి-దండ్రులు, గురువులు ఆ పాపాచరణ నుండి రక్షణ చేయగలరు. బాల్యంలో బాలురు తల్లిదండ్రులవద్దనే ఉంటారు కాబట్టి వారి నడవడిక, వ్యవహారాలు, సంస్కారాలు బాలుడిమీద చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. తల్లిదండ్రులు పిల్లల ఎడల శ్రద్ధచూపితే వారిని సంస్కారవంతులుగా, సద్గుణవంతులుగా తీర్చిదిద్దగలరు. శ్రద్ధ చూపకుంటే వారు తమ బిడ్డలను సంఘవిద్రోహకశక్తులుగా చేయగలరు.
పిల్లలలోని మంచితనంగాని చెడ్డతనం గాని తల్లిదండ్రులలోనిది గానే గమనింపవచ్చు. ఆ విధంగా బాల్యంలో పడిన సంస్కారాలన్ని ఆ బాలుని జీవితపర్యంతమూ ఉంటాయి. బాలుర శీల వైభవ విషయంలో తల్లిదండ్రుల తర్వాత ప్రధాన భూమిక వహించేవారు గురువులు. ఆచార్యులు, ఆచార్య శబ్దానికర్థం ఆచారం గ్రాహయతి= సదాచారాన్ని గ్రహించి ఇతరులచే ఆచరింపచేసేవాడని.

సుందరకాండ

$
0
0

విషాదమంటే నరకమే. నరకమంటే-
తనెవరో తనకు తెలుస్తూ ఉంటుంది. కాని తన దుఃఖం నుండి తాను తప్పించుకోలేక బాధపడుతూ ఉంటాడు.
నివేద్యఈ స్థితి నుండి తననెవరైనా తప్పించాలి. కనుక స్వామి-
సో‚హం నైవ గమిష్యామి కిష్కింధాం నగరీమితః
అందుకని వెళ్ళను. సీతను చూడకుండా కిష్కింధను చూడటం సాధ్యం కాదు. అనుకొన్నాడు. ఇదీ సంగతి.
తాను సర్వంచేసే ననుకొన్నాడు. చూడవలసినది లేదనుకొన్నాడు చూడవలసిన వస్తువునకు స్థితి లేదనుకొన్నాడు. తాను చూడలేకపోవటంలో లోపం లేదనుకొన్నాడు.
నహిద్రక్ష్యామి యది తాం లంకాయాం జనకాత్మజాం
అనే నైవహి వేగేన గమిష్యామి సురాలయం.
సముద్రాన్ని దాటడానికి సిద్ధపడుతూన్న సమయంలో వానరులను చూసి- లంకలో సీతను చూడలేకపోతే ఈ వేగంతో దేవ లోకాని వెడతాను- అని చేసిన ప్రతిజ్ఞనే మరచిపోయేడు. కనుక ఈ స్థితిలో - వినాశే బహవోదోష జీవన్భద్రాణి పశ్యతి.
అని అనుకొన్నాడు.
ఇదీ సాధకుడైన వానికి కాని వానికి తేడా. ఎంత విషయదంలో ఉన్నా ఆంజనేయస్వామి మనస్సు బలహీనపడదు. స్వాస్థ్వాన్ని కోల్పోదు. ఆత్మ హత్యకు దారితీయదు. ఇదే అంగదుడయితే ఏ చిన్న ప్రతిఘటనను తట్టుకోలేడు. ప్రాయోపవేశం అంటాడు. మరణమంటాడు. అందువలననే స్వామి-
తాపసో వా భవిష్యామి నియతో వృక్షమూలికః
ఏ చెట్టు క్రిందో ఉంటూ తాపసునిలా బ్రతుకుతాను. అనుకొంటాడు. కొంత సేపటిలో మళ్ళీ ఆలోచన మారుతుంది.
లంకతో సహరావణుని తీసికొని రాముని ముందు పెట్టనా- అని అనుకొంటాడు.
ఇలా అస్తవ్యస్త ఆలోచనలతో సాధకుడు అహంకారమూలక అజ్ఞానంలో పడతాడు. దానివలన దుఃఖం-దానివలన కార్య విఘ్నత. కలిగితే సాధకుడు భ్రష్టుడవుతాడు కాస్త సుకృతమేదైనా అడ్డుపడితే తిరిగి తన మార్గంలోకి వస్తాడు. కనుకనే-
ధ్యానశోక పరీతాత్మ చింతయామాస వానరః
శోకముతోబాటు ధ్యాన పరీతాత్ముడైన స్వామి ఆలోచించేడు.
అలా ఒక్కసారి తన లక్ష్య మూర్తిని ధ్యానించేటప్పటికి
యావత్సీతాం హి పశ్యామి రామపత్నీం యశస్వీనీం
తావదేతాం పురీం లంకాం విచినోమి పునః పునః
యశస్విని అయిన రామపత్నిని చూసేవరకు పునఃపునః లంకలో వెదుకుతూనే ఉంటాడు. ఎందుకని? చూసేనన్న యశస్సును తనకు ఆమెయే యివ్వాలి.
తెచ్చుకొన్నాడన్న యశస్సనూ రామునికి ఆమెయే యివ్వాలి.
బంధించేడన్న యశస్సును రావణునికీ ఆమెయే యివ్వాలి.
అందుకని- అలా అనుకొన్నాడు. ఇదీ కార్యజ్ఞానం.
ఇంతవరకు తాను వెదకినచోట్ల ఎక్కడో అక్కడ నిజంగా సీత కనబడితే తనకు అంతకంటె దుఃఖం మరొకటుంటుందా! అట్టి సీతను తాను అంగీకరింపగలడా! అలా సీతను చూసి లంక నుండి తాను కిష్కింధకు వెళ్ళగలడా!
ఆయాసం వలన వచ్చిన ఆలోచనే కాని యిది జ్ఞానమా! కనుక- సుందరకాండ పారాయణ వ్రతస్థులకు ఈ దాక్ష్యం ఏర్పడాలి ఆక్షణంలో స్వామి పోగొట్టుకొన్నదేమిటో- దాని తాము పోగొట్టుకొన కూడదు. స్వామి మనకోసం పోగొట్టుకొంటే మనం మన కోసం నిలబెట్టుకోవాలి. సరే- అలా ఆకార్య జ్ఞానాన్ని పొందేడో లేదో దుఃఖ నాశనమయింది దుఃఖం నాశనం కాగానే సుఖప్రాప్తికి తగిన దర్శనం కలుగుతుంది. అందుకే-
అశోక వనికాచేయం దృశ్యతే యా మహాద్రుమా
ఇమామధిగమిష్యామి నహీయం విచితామయా- అని అనుకొన్నాడు.
ఇంకావుంది...

పరమహంస బోధామృతము

$
0
0

143.్భగవద్భక్తి పుస్తకములను జదువుటవలన లభించునా? పంచాంగములో ఒకానొక దినమున ఇరువది దుక్కుల వాన కురి1యునని వ్రాయబడియున్నది. కాని యా పంచాంగమును మెలిపెట్టి పిండుటచే ఒక చుక్కయైనను వచ్చునా? అదేవిధమున శాస్తమ్రులలో అనేక సద్వాక్యములు ఉండవచ్చును. కాని వానిని పఠించిన మాత్రమున నెవ్వడును పారమార్థికుడు గాజాలడు. భగవద్భక్తి కలుగవలుయుననిన, నీవా శాస్తమ్రులలో చెప్పబడిన ధర్మములను అనుష్ఠింపవలయును.
144. పరమేశ్వరుని మ్రోల యుక్తి, ధీశక్తి, పాండిత్యము- ఇవేమియు కొరగావు. అచట మూగవాడు మాటలాడును, గ్రుడ్డివాడు చూచును, చెవిటివాడు వినును.
145. శాస్తమ్రులను జదివినమాత్రాన ఈశ్వరుని తత్త్వమును నిరూపంపబూనుట కేవలము కాశీపటమును జూచి కాశి యెట్టితో మరియొకరికి వర్ణింపబూనుట వంటిది.
146. ‘గంజాయి’ అను మాటను వేయిసార్లు ఉచ్ఛరించినను గంజాయియొక్క మత్తు కలుగదు. కొంచెము గంజాయి తెచ్చి నీరు మొదలగువానితో గలిపి నూఱి యా రసమును త్రాగుము; అపుడు నిజముగా నీకు నిషాకలుగును. ‘‘దేవుడా! దేవుడా’’ యని దేవులాడుటచే నేని లాభము? శ్రద్ధ్భాక్తులతో సాధన చేయుము. అపుడుదేవని దర్శనము లభించును.
147. తన పాండిత్యమును ఐశ్వర్యమును జూచుకొని గర్వపడువానికి తత్త్వజ్ఞానము లభింపజాలదు. అట్టివానితోనీవిట్లు చెప్పెదవు గాక: ‘‘ఒకానొక చోట నొక సాధువు ఉన్నాడు, చూచివత్తము, వత్తువా?’’ ఆతడేదియో సాకు చెప్పి రాజాలననును. సాధువులను, సన్న్యాసులను జూడబోవుట తనవంటి ఘనునకు తగదని భావించును. అజ్ఞానమువలన నిట్టి గర్వము కలుగును జుమీ!
148. అల్ప విద్యవంతునకుఅహంభావము ఎక్కువ. నేనొకనితో భగవంతుని గూర్చి ప్రసంగించితిని. ఆతడిట్లనెను: ‘‘ఆఁ! నాకివన్నియు తెలిసినవే!’’ అంత నేనిట్లంటిని. ‘‘్ఢల్లీకి వెళ్లి వచ్చినవాడు నేను ఢిల్లీకి వెడలితినని చాటుకొనుచు బోవునా?’’ పెద్ద మనుష్యుడెవ్వడైనను తాను పెద్ద మనుష్యుడనని చెప్పుకొనునా?’’
149. గ్రంథములు గ్రంతులు- మనలను బంధించు ముడులు; తరచుగా ఈ అర్థమే వానికి జెల్లును. గర్వమునంతయు విడిచి సత్యమును గ్రహింపవలయునను తీవ్ర వాంఛతో విడిచి సత్యమును గ్రహింపవలయునను తీవ్ర వాంఛతోజదువని యెడల గ్రంథ పఠనము దుష్పాండిత్యము, అహంభావము మొదలగువానిని బెంచును; హృదయమున నివి అనేక గ్రంథులై బాధించును.
150. బూడిదప్రోవుపై పోసిన నీరు వెంటనే ఇగిరిపోవునుగదా! గర్వమే ఈ బూడిదెప్రోవు. గర్వముతో ఉబ్బిపోవు వాని హృదయమును ప్రార్థనలును ధ్యానములును ఫలవంతములుగాజాలవు.
వాదోపవాదముల సారహీనత
151. కూజాను నీటిలో ముంచునపుడు బుడబుడమని ధ్వని చేయును. కాని నిండినతోడనే శబ్దము అణగును. అటులనే బ్రహ్మసాక్షాత్కారము పొందనివాడు బ్రహ్మమును గూర్చి లొడలొడ వ్యర్థవాదములు చేయుచుండును. సాక్షాత్కారమును బొందినవాడో, నిశ్శబ్దముగా బ్రహ్మానందము ననుభవించుచుండును.
152. పామర జనులు ధర్మమును గూర్చి బ్రహ్మాండమైన ప్రసంగములు చేయుదురు. కాని అణుమాత్రమైనను ఆచరింపరు. జ్ఞానియో, వాని యావజ్జీవము ధర్మాచరణము యొక్క స్వరూపమైయున్నను ధర్మమును గూర్చి మాటాడనే మాటాడడు.
ఇంకావుంది...
శ్రీ రామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల
శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము - సంగ్రహ జీవిత సహితము - అనువాదకుడు: శ్రీ చిరంతనానందస్వామి

మానవత్వమే మహోన్నతం

$
0
0

‘మఠం’ అంటే నిత్యపూజలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, స్తోత్ర పారాయణలు కాదు.. మానవసేవలో తరించాలన్నదే ఆయన ఆకాంక్ష. మతం, కులం, రాజకీయాలకు అతీతంగా మానవత్వం మూర్త్భీవించిన పరిపూర్ణ వ్యక్తిగా ఆయన జనం గుండెల్లో నిలిచారు. ‘కాయక’ (శారీరక శ్రమ), ‘దాసోహ’ (సమర్పణా భావం) అనే రెండు సద్గుణాలను ఆచరించి ఆయన తన జీవితాన్ని పునీతం చేసుకున్నారు. సామాజిక, విద్య, సేవారంగాల్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించినందునే కోట్లాదిమంది ప్రజలు ఆయనను ‘నడిచే దేవుడి’గా ఆరాధిస్తారు.
111 ఏళ్ల వయసులో శివైక్యం చెందిన తుమకూరు సిద్దగంగ మఠాధిపతి శివకుమార స్వామీజీ తన జీవితాంతం అభాగ్యుల సేవలో తరించారు. ఆకలిదప్పులతో అలమటించేవారి కోసం, విద్యాగంధానికి నోచుకోని వారి కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. మానవత్వమే గొప్ప మతమని త్రికరణ శుద్ధిగా నమ్మిన ఆయన తన మఠాన్ని మహా విశ్వవిద్యాలయంగా మార్చారు. ‘త్రివిధ దాసోహి’, ‘ఆధునిక బసవణ్ణ’, ‘నడిచే దేవుడి’గా జన నీరాజనాలందుకొన్న స్వామీజీ నిరంతర సేవా కార్యక్రమాలతో అంతర్జాతీయ ఖ్యాతిని గడించారు. కీర్తిప్రతిష్టలకు, ప్రచార ఆర్భాటానికి దూరంగా ఉంటూనే పేదరికం, ఆకలి, సామాజిక రుగ్మతల నిర్మూలనకు తుది శ్వాస వరకూ కృషి చేశారు. అన్ని మతాలు, సామాజిక వర్గాలకు చెందిన కోట్లాదిమంది భారతీయులు గౌరవించే అత్యంత పూజనీయుడు అయిన ఆయన సామాజిక మార్పును తీసుకొచ్చారు.
ధర్మసత్రంలో ఉంటూ చదువు..
శివకుమార స్వామీజీ మాగడి తాలూకాలోని వీరాపురలో 1907 ఏప్రిల్ 1న జన్మించారు. పాఠశాల విద్యను అభ్యసిస్తుండగా తల్లి మరణించడంతో ఆయన తుమకూరులోని తన అక్క ఇంట్లో పెరిగారు. 1922లో అప్పటి సిద్దగంగ మఠాధిపతి శ్రీ శివయోగి వద్ద ఆధ్యాత్మిక సాధనకు శ్రీకారం చుట్టారు. రావ్ బహద్దూర్ గుబ్బితోట ధర్మసత్రంలో ఉంటూ ఓ వైపు చదువు కొనసాగిస్తూనే మరోవైపు సిద్దగంగ మఠం కార్యకలాపాలతో మమేకమయ్యారు. 1930లో శ్రీ శివయోగి శివైక్యం చెందడంతో శివకుమార స్వామీజీ మఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని యోగ సాధన చేసేవారు. ఉదయం ఏడు గంటలకు భక్తులకు దర్శనం ఇచ్చి ఆశీర్వదించేవారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 12-30 గంటల వరకూ భక్తుల యోగక్షేమాలను విచారించేవారు. చిన్నారుల క్షేమం కోసం ఆయన ఎంతగానో పరితపించేవారు. పిల్లలు క్రమశిక్షణతో చదువుకోవాలని, వేళకు భోజనం చేయాలని చెప్పేవారు. ఎన్ని పనులున్నా నిత్యం శివపూజ చేసేవారు. లక్ష గంటల పాటు శివపూజ చేసి ఆయన సంచలనం సృష్టించారు. సంస్కృత భాష పరిరక్షణ కోసం అకుంఠిత దీక్షతో కృషి చేశారు.
పేదపిల్లలకు విద్య..
సిద్దగంగ మఠంలో తొలిసారిగా 500 మంది పిల్లలకు విద్యాదాన కార్యక్రమాన్ని స్వామీజీ ప్రారంభించగా, ఇపుడు అక్కడ చదువుకొన్న విద్యార్థుల సంఖ్య ఏడున్నర లక్షలను మించిపోయింది. ఎంతోమంది విద్యార్థులు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, న్యాయవాదులుగా స్థిరపడ్డారు. కులం, మతం, వర్గం అనే తారతమ్యం లేకుండా పేద పిల్లలందరికీ విద్యను అందించాలన్న ఆయన సంకల్పం ఫలించింది.
దానమే ‘దాసోహం’
లింగాయత్ సామాజిక వర్గానికి ఆరాధ్యుడైన బసవేశ్వరుడు చెప్పిన మాటలను శివకుమార స్వామీజీ ఆచరణలో పాటిస్తూ ఆదర్శప్రాయుడిగా నిలిచారు. బసవణ్ణ బోధనల మేరకు ప్రతి వ్యక్తీ తన జీవనం కోసం పనిచేయాలని, ఇతరుల సంపాదన కోసం ఆశపడరాదని ఆయన ఉద్బోధించేవారు. ఎంతగా సంపాదించినా నిరాడంబరంగా బతకాలని, సమాజానికి ఎంతోకొంత దానం చేయాలని భక్తులకు హితవు చెప్పేవారు. దానమే ‘దాసోహం’ అని ఆయన అభివర్ణించేవారు. ‘దాసోహం’ పేరిట ఆయన సుమారు ఎనిమిది దశాబ్దాల పాటు ఇతరుల నుంచి సేకరించిన ధనాన్ని, ఆహార ధాన్యాలను పేద ప్రజల కోసం వెచ్చించారు. నిరుపేద పిల్లలకు విద్యనందించేందుకు, అభాగ్యులకు ఆకలి బాధ తీర్చేందుకు మాత్రమే ఆయన తొలి ప్రాధ్యాన్యం ఇచ్చేవారు. ఎన్నో విషయాలపై అవగాహన ఉన్నప్పటికీ స్వామీజీ తక్కువగా మాట్లాడేవారు. ఇతరులు చెప్పే విషయాలను వినేందుకు ఎక్కువ సమయం కేటాయించేవారు. ఆర్భాటంగా ఆలయాలను నిర్మించడం కన్నా, భారీ ఉద్యానవనాలను ఏర్పాటు చేయడం కన్నా మంచి పుస్తకాలతో గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించేవారు. పిల్లలకు విద్యతో పాటు శుచికరమైన భోజనం అందించాలని భక్తులకు చెప్పేవారు. సిద్దగంగ మఠం ఆధ్వర్యంలో ఏటా సుమారు తొమ్మిది వేల మంది విద్యార్థులకు ఉచిత విద్య, భోజన వసతులను అందించేలా ఆయన శాశ్వత ప్రాతిపదికపై ఏర్పాట్లు చేశారు. విద్యార్థుల చదువుకు అనుగుణంగా విశాలమైన హాస్టల్ భవనాలను ఏర్పాటు చేయించారు. దశాబ్దాల క్రితం ఆయన తుమకూరు సమీప గ్రామాల్లోకి స్వయంగా వెళ్లి బియ్యం, ఆహార ధాన్యాలను, కూరగాయలను సేకరించేవారు. స్వామీజీ పడుతున్న కష్టాలను చూసి కొన్నాళ్లకు గ్రామాల్లోని వ్యాపారులు, సంపన్నులు నేరుగా మఠానికి బియ్యం, కూరగాయలు చేరవేయడం ప్రారంభించారు. వందకు పైగా విద్యాసంస్థలను మఠం ఆధ్యర్యంలో నడుపుతూ పేద విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూసేవారు. తుమకూరు, హసన్, బెంగళూరు రూరల్ జిల్లాలకు చెందిన సుమారు మూడు వేల గ్రామాల నుంచి పీఠానికి ఆహార ధాన్యాలు అందుతున్నాయి. ప్రతిరోజూ మూడు గ్రామాల నుంచి నిత్యావసర సరకులు అందుతుంటాయి. నిర్ణీత తేదీల ప్రకారం ఈ గ్రామాల వారు ఆహార పదార్థాలను భక్తిశ్రద్ధలతో మఠానికి చేరవేయడం ఆనవాయితీగా మారింది. వివిధ కులాలు, మతాలు, సామాజిక వర్గాలకు చెందిన వారు మఠానికి ఆర్థికంగా, వస్తు రూపంలో విరాళాలు ఇస్తుంటారు.
హృదయంలోనే దైవం..
తెల్లవారు జామునే నాలుగు గంటలకు నిద్రలేచి ‘ఇష్ట లింగ’ అర్చన చేయడం స్వామీజీకి అలవాటు. అరచేతిలో చిన్న లింగాన్ని ఉంచుకొని ధ్యానం చేసేవారు. మఠం ఆవరణలో నిర్మించిన ఆరు ఆలయాలను ప్రతిరోజూ సందర్శిస్తూ భక్తులను కలుసు కునేవారు. అయితే, పూజలు చేయాలని మాత్రం ఆయన గుడులకు వెళ్లేవారు కాదు. ఆలయాలంటే భక్త్భివం ఉన్నా, తన అరచేతిలోనే దైవం ఉందని భావించి మనసులోనే ప్రార్థన చేసేవారు. తనకు, దైవానికి మధ్య ఆలయం గాని, పూజారి గాని, మరో మధ్యవర్తి గాని ఉండరాదని విశ్వసించేవారు. అన్ని విషయాల్లోనూ పురుషులకు దీటుగా మహిళలకు సమానత్వం దక్కాలని ఆరాటపడేవారు. రుతు సమయంలో మహిళలను ఆధ్యాత్మిక కార్య్రకమాలకు దూరంగా ఉంచాలన డాన్ని స్వామీజీ నిరసించారు. కుల వివక్షకు అతీతంగా పిల్లలకు చదువు చెప్పించేవారు.
మతం కంటే మానవత్వం గొప్పదన్న భావం ఉన్నపుడే మానవాళి నిజమైన అభివృద్ధిని సాధిస్తుందని భక్తులకు స్వామీజీ చెప్పేవారు. లింగాయత్‌లే కాదు, అన్ని సామాజిక వర్గాల వారూ ఆయనను ఆరాధించేవారు. ఎంతోమంది నాయకులు మఠానికి వచ్చినా, రాజకీయ పార్టీల ప్రభావం తనపైన, మఠంపైన పడకుండా ఆయన జాగ్రత్త పడేవారు. లింగాయత్‌లకు ‘మతపరమైన ప్రత్యేక హోదా’ అనే అంశంలో రాజకీయ కోణాలున్నట్లు స్వామీజీ గమనించారు. లింగాయత్‌లకు ప్రభుత్వం ‘ప్రత్యేక హోదా’ ఇచ్చినా ఇవ్వకపోయినా అది ప్రాధాన్యత లేని అంశంగానే ఆయన పరిగణించారు. ఇలాంటి మహోన్నత వ్యక్తిత్వమే ఆయన విజయ రహస్యం అయింది. ‘మానవత్వమే మిన్న’ ఆయన బోధన అందరికీ శిరోధార్యం.

Viewing all 69482 articles
Browse latest View live