Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్ర్తీ కథలు -శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్ర్తీ

$
0
0

‘‘రాయగా రాయగా భాష స్వాధీనమవుతుంది. రాయగా రాయగా క్రాంత దర్శిత నిశితం అవుతుంది, రాయగా రాయగా తపస్సు సిద్ధించి మహర్షి అవుతావు. మహర్షి కానివాడు, కథలు రాయలేడు’’ అంటారు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్ర్తీ గారు. ఇంగ్లీషు వాసనలంటని అసలుసిసలు తెనుగు జాతీయ కథా రచయిత ఆయన. ఆయనదొక విశిష్ట మూర్తిమత్వం. భాష, భావం, పాత్రల ప్రవృత్తీ, అన్నింటా నూటికి నూరుపాళ్లూ తెనుగుదనం జొప్పించిన స్రస్ట, ద్రష్ట కూడా ఆయన.
తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం తాలూకా పొలమూరు ఆయన జన్మస్థలం. వల్లూరు, వేటపాలెం శాస్ర్తీగారు విద్యాభ్యాసం చేసిన గ్రామాలు. వేదం, జ్యోతిషం మొదలు అనేక ధర్మశాస్త్రాలను ఔపాసన పట్టిన ఆయన అష్టావధానాలున్నూ చేశారు. కాని ఆధునిక కథ చేసుకున్న అదృష్టమో ఏమో? శాస్ర్తీగారు క్రమేపీ, వచన రచన పట్టి; అందునా వాడుక భాషలోనే కథారచన సొంతం చేసుకుని, దానిని పరిపుష్టం, సుసంపన్నం చేశారు. ఆయనకు 1956లో కనకాభిషేకం జరిగిందీ అంటే అబ్బురం కాదు!
ఏ రచయిత అయినా- సారస్వత చరిత్రలో నిత్యనూతన తారగా భాసిల్లవలనంటే, సమకాలీన సంఘ జీవితానికి ప్రతినిధి కావాలి. అతని కథలకు నాటి సంఘ జీవితమే ముడిసరుకు కావాలి. కొండంత జీవితానికి గోరంత దీపాలుగా రాణించాయి యిరవయ్యవ శతాబ్దపు నవీన కథలు.
అట్టివాటిలో శాస్ర్తీ గారి కథలు- ఒజ్జ బంతులు, మేలి మణిపూసలు, వస్తు రూపేణా, శిల్ప దృష్ట్యా అత్యుత్తమమయిన కథలు మాత్రమే గాక వారి కథలు, అభ్యుదయ కామన గలవి. చిత్తశుద్ధికీ, ధైర్య పటిమకు నిదర్శనాలు. లక్ష్యశుద్ధి గల కళాఖండాలు.
అసలు సంఘసంస్కరణోద్యమం 19వ శతాబ్దంలోనే ప్రారంభమైనా, అది ఇరవయ్యవ శతాబ్దాన్ని అమిత సంరంభంగా అందుకుంది. ఒకప్రక్క జాతీయోద్యమం, మరోప్రక్క వ్యావహారిక భాషోద్యమం, అంతటా సంఘ సంస్కరణోద్యమం రుూ మూడూ త్రివేణీ సంగమంగా రెండు ప్రపంచ సంగ్రామాల మధ్య నలిగిపోకుండా, వెల్లువెత్తిన నవీన యుగానికి నాటి కందుకూరి, గురజాడ, గిడుగు పిడుగు గారలు త్రిమూర్తులు! వారు ప్రసాదించిన నడబండీ సాయంతో, సాహిత్యాన్ని ప్రజల భాషలో పరుగులు తీయిస్తూ ఉద్యమ రథంగా మార్చిన శ్రీపాద వంటి ఎందరో మహానుభావులు కథనే వజ్రాయుధంగా ఎంచుకున్నారు.
సుబ్రహ్మణ్యశాస్ర్తీగారు వీరేశలింగం గారి ప్రభావంతోనే కథారచయితగా మారిపోయారు. 1915లో ప్రప్రథమంగా ఆంధ్రపత్రిక వారి కథను వేసుకుంది. మరి నాలుగు కథలు ప్రబుద్థాంత పత్రికలో వెలువడ్డాయి. ప్రబుద్ధాంధ్రకు శాస్ర్తీగారే సారధులు. దరిమిలా 14 కథలు రెడ్డిరాణి పత్రికలో పడి, సంచలనే సృష్టించాయి! వీటిని గ్రుచ్చెత్తి ఆయన పూలదండ అన్న సంపుటం ప్రచురించినాడే, దానిని ఆంధ్ర కథా సరస్వతి గళసీమలో అలంకరించాడు. ఆ దండ నేటికీ వాడిపోలేదు. మరో శతాబ్దానికికూడా యింకా గుబాళింపులు వెదజల్లుతూనే వుంటాయి. అందులోని కథాకుసుమాలు. శాస్ర్తీగారి కథలో రామలక్ష్మి, ముందు హాలహలము పిదప అమృతమూ, వెలిపెడితే అల్లుడైనాడు, మేనరికం తప్పులేదు వగైరా కథలు వితంతు పునర్వివాహానికి ఉద్యమించిన కథలు. ఇక రజస్వలానంతర వివాహం ఆ రోజుల్లో తగని నేరం!
- సశేషం
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..


శ్రీనరసింహ శతకము

$
0
0

సీ నరసింహ! నాకు దుర్ణయములే మెండాయె
సుగుణమొక్కటి లేదు చూడఁ జనిన
అన్యకాంతలమీఁద నాశమానఁగలేను
బరుల క్షేమముఁజూచి బ్రతుకలేను
ఇటువంటి దుర్బుద్దు లిన్ని నాకున్నవి
నేనుఁ జేసెడి వన్ని- నీచకృతులు
నావంటి పాపిష్ఠి నరుని భూలోకాన
బుట్టఁజేసితివేల భోగిశయన!
తే అబ్జదళనేత్ర! నా తండ్రివైనఫలము
నేరములు గాచి రక్షింప వీవెదిక్కు
భూషణవికాస! శ్రీ్ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

భావం: నరసింహప్రభూ! నాకు గలవన్నీ చెడ్డ ఆలోచనలే. నేను మంచివాణ్ణిగాను. ఇప్పటికీ పరస్ర్తిల మోజు తగ్గలేదు. ఇతరుల సుఖాన్ని చూచి ఓర్వలేను. అన్ని ఇన్ని అని చెప్పలేనన్ని చెడ్డ ఆలోచనలే నావి. నేను చేసేవన్ని చెడ్డపనులే. నా వంటి అధముణ్ణి లోకంలో ఎందుకు పుట్టించావు? నాకు నీవు తండ్రివైనందువల్ల నా తప్పులన్నింటిని మన్నించి నన్ను రక్షింపుము.

maatata

$
0
0
Cross Image: 
Date: 
Wednesday, January 23, 2019

నాదో కొత్త జర్నీ

$
0
0

‘కొత్తగా మా ప్రయాణం’ హీరో ప్రియాంత్ ముచ్చట్లు
ఓ బ్యాంకులో సీనియర్ మేనేజర్‌ని. నటనపై ఆసక్తితో హీరో అయ్యాను. స్నేహితులు సహకరించి సినిమా చేశారు. ఆడియన్స్ ఆదరిస్తారన్నదే నా ఆశ.
ప్రియాంత్‌ని హీరోగా పరిచయం చేస్తూ నిశ్చయ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘కొత్తగా మా ప్రయాణం’. యామిని భాస్కర్, భానుశ్రీ హీరోయిన్లు. దర్శకుడు రమణ మొగిలి. ఈనెల 25న సినిమా విడుదల సందర్భంగా హీరో ప్రియాంత్ మీడియాతో మాట్లాడాడు. టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిందని, ఫన్, లవ్, యాక్షన్‌తో సినిమా ఆకట్టుకుంటుందన్న నమ్మకంతో ఉన్నామన్నాడు. నేటి తరం యూత్ ఆలోచనలు బేస్ చేసుకుని సినిమా తెరకెక్కించామన్నాడు. చదువు పూర్తిచేసిన చాలామంది కుర్రాళ్లు ఇతర ప్రాంతాల్లో జాబ్స్ చేస్తూ తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారని, ఒకరకంగా వారు స్వేచ్ఛాజీవితానికి అలవాటుపడ్డానరన్నారు. అలాంటి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా నటిస్తున్నా. ప్రేమించుకుని ఇద్దరు కలిసి ఉండి ఎవరికీ ఏం కావాలో షేర్ చేసుకునే తరహాలో ఉంటుంది. అలాగని ఇది లివింగ్ రిలేషన్ కాదు. దానికంటే కొత్తగా ఉంటుంది. హీరోకి ప్రేమ, పెళ్లి, కుటుంబం వంటి విలువలపై అంతగా నమ్మకముండదు. అలాంటివాడు మన సాంప్రదాయం విలువను, గొప్పతనాన్ని తెలుసుకున్న తర్వాత ఎలా మారాడు? అన్నది ఆద్యంతం ఆసక్తికరంగా చూపించాం. హీరోయిన్లు యామిని భాస్కర్, భానుశ్రీ ఇద్దరూ చక్కగా నటించారు. సినిమాలో రొమాన్స్ ఆశించే స్థాయిలోనే ఉంటుంది. ఎక్కడ వల్గారిటీ ఉండదు. మాది హైదరాబాద్. నేను ఇక్కడే ఓ బ్యాంకులో సీనియర్ మేనేజర్‌గా పనిచేసాను. సినిమా అంటే ఆసక్తి ఉంది. ఆ ఆసక్తితో అవకాశాల కోసం చాలా తిరిగాను. ఇక మా స్నేహితులు ముగ్గురు కల్సి సినిమాను నిర్మిస్తున్నారు. అలా హీరోగా మారాను. తప్పకుండా యూత్‌తోపాటు ఫ్యామిలీ అందరికీ నచ్చేలా ఉంటుంది. ఈ సినిమా తరువాత మరో సినిమా ఫిబ్రవరిలో మొదలవుతుంది. అదికూడా డిగ్రీ పూర్తిచేసి బేవార్స్‌గా తిరిగే నేటితరం కుర్రాడి కథ. నాకు సహజమైన కథల్లోనే నటించాలని ఉంది అంటూ ముగించారు.

మళ్లీ మళ్లీ చూడాల్సిందే..

$
0
0

అనురాగ్ కొణిదెన హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘మళ్లీ మళ్లీ చూశా’. క్రిషి క్రియేషన్స్ పతాకంపై సాయిదేవ రామన్ దర్శకత్వంలో కొణిదెన కోటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శే్వత అవస్తి, కైరవి తక్కర్‌హీరోన్‌లుగా నటిస్తున్నారు. ఈచిత్ర టీజర్‌ను నిర్మాత సురేష్‌బాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా సురేష్‌బాబు మాట్లాడుతూ- మళ్ళీ మళ్లీ చూశా టీజర్‌చాలా ఫ్రెష్‌గా ఉంది. కంటెంట్ యూత్‌కు బాగా చేరువయ్యేలాంది. టీమ్‌కు ఆల్ ది బెస్ట్ అన్నారు. దర్శకుడు సాయిదేవ రామన్ సురేష్‌బాబుకు ధన్యవాదలు తెలిపారు. ప్రకృతి సృష్టించిన అందమైన ప్రేమ కథా చిత్రం మా మళ్లీ మళ్లీ చూశా సినిమా అన్నారు. నిర్మాత కోటేశ్వరరావు కొణిదెన మాట్లాడుతూ కంటెంట్ నచ్చింది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే ఆడియో రిలీజ్ తేదీని ప్రకటిస్తాం అన్నారు. హీరో అనురాగ్ మాట్లాడుతూ-కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నందుకు హ్యాపీగా ఉందన్నారు.

డార్క్ మిఠాయి

$
0
0

సాఫ్ట్‌వేర్ కుర్రాడు సాయి భ్రమల్లో బతుకుతుంటాడు. పగటి కలలు పోటుగాడిని ఉద్యోగం నుంచి తొలగిస్తుంది కంపెనీ. పెళ్లి చేసుకోవాలనుకుంటే ఓ సమస్య ఎదురవుతుంది. మూడురోజుల్లో ఓ దొంగను పట్టుకుంటేనే పెళ్లి జరుగుతుంది, లేదంటే లేదు. అటువంటి సందర్భంలో స్నేహితుడు జానీతో కలిసి దొంగను పట్టుకోవడానికి సాయి బయలుదేరతాడు. ఈ ప్రయాణంలో అతడికి ఎదురైన సమస్యలేంటి? సాయి దొంగను పట్టుకున్నాడా? లేదా? అసలు, దొంగ ఎవరు? సాయి పెళ్లి జరిగిందా? లేదా? ఫిబ్రవరి 22న విడుదలవుతున్న సినిమా చూసి తెలుసుకోవచ్చంటున్నాడు దర్శకుడు ప్రశాంత్‌కుమార్. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి హీరోలుగా ప్రశాంత్‌కుమార్ దర్శకత్వం వహించిన డార్క్ కామెడీ చిత్రం ‘మిఠాయి’. డాక్టర్ ప్రభాత్‌కుమార్ నిర్మాత. ఫిబ్రవరి 22న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం టీజర్ విడుదల చేశారు. నిర్మాత ప్రభాత్‌కుమార్ మాట్లాడుతూ ఇద్దరు స్నేహితుల నేపథ్యంలో నడిచే చిత్రమిది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలకు విశేష స్పందన లభిస్తోంది. సాయిగా రాహుల్ రామకృష్ణ బాగా నటించాడు. ఫిబ్రవరి 22న ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం అన్నారు. కమల్ కామరాజు, భూషణ్ కల్యాణ్, రవివర్మ, అజయ్ ఘోష్, అర్ష, శే్వతావర్మ, అదితి మ్యాకల్, విజయ్ మరార్, గాయత్రి గుప్తా ప్రధాన తారాగణం. ఛాయాగ్రహణం రవివర్మన్ నీలమేఘం, సంగీతం వివేక్‌సాగర్ సమకూరుస్తున్నారు.

బన్నీని మిస్సయ్యా..

$
0
0

కన్ను కొట్టి వరల్డ్‌వైడ్ క్రేజ్ సాధించిన బ్యూటీ ప్రియాప్రకాశ్ వారియర్. ఆమె లీడ్ రోల్ చేసిన ‘ఒరు ఆడార్ లవ్’ తెలుగులో ‘లవర్స్‌డే’గా విడుదలకు సిద్ధమైంది. మలయాళంలో ఒమర్ లులు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నిర్మాతలు ఎ గురురాజ్, సిహెచ్ వినోద్‌రెడ్డి సుఖీభవ సినిమాస్ బ్యానర్‌పై ప్రేమికుల దినం ఫిబ్రవరి 14న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ వచ్చిన ప్రియాప్రకాశ్ వారియర్ మీడియాకు చెప్పిన ముచ్చట్లు.

పాపులారిటీ..: వింకిల్ గాళ్ ట్యాగ్ నా కెరీర్‌కు హెల్పయ్యింది. పాపులార్టీనీ తెచ్చిపెట్టింది. దాన్ని దాటి ఎదగాలన్న ఆశ మాత్రం ఉంది. ఈ ఇమేజ్ నాకూ, కుటుంబానికి కొత్తగానే అనిపించినా, ఆ టైంలో నా చేతికి మొబైల్ కూడా ఇవ్వలేదు. నేనేం బోర్డింగ్ స్కూల్లో చదవడం లేదుగా, కాలేజ్‌కు వెళ్తున్నా. అయినా, కొన్ని రోజులుపాటు నన్ను బయటకు కూడా పంపలేదు. అమ్మనాన్న కాస్త టెన్షన్ పడ్డారు. మీడియా నేరుగా ఇంటికొచ్చి కలిసేది. వారికి ఇంటర్వ్యూస్ ఇచ్చేదాన్ని. సోషల్ మీడియాతో పాజిటివ్, నెగెటివ్ రెండూ ఉన్నాయి. నావరకు చూస్తే మంచే జరిగింది. ఓ రీజినల్ సినిమా సాంగ్ వైరలైంది. లక్షలాది మంది ఆ పాటను చూశారు.
అదొక్కటే కాదు..: ‘ఒరు ఆడార్ లవ్’తో వచ్చిన క్రేజ్‌తో తెలుగు సహా ఇతర భాషా పరిశ్రమల నుంచీ అవకాశాలు వచ్చాయి. నేను కొన్నింటిని అంగీకరించినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదు. ఎందుకంటే ఏడాదిపాటు ఒరు ఆడార్ లవ్ స్టోరీతో బిజీగా ఉన్నాం. ముందుగా మేం సాంగ్ మాత్రమే షూట్ చేశాం. అది రిలీజైంది. మంచి పేరొచ్చింది. అప్పటికి సినిమా ఇంకా చిత్రీకరించనే లేదు. ఈ సినిమాకు కమిటవ్వడం వల్ల నేను ఇతర సినిమాల్లో నటించలేనని చెప్పానే తప్ప.. రెమ్యూనరేషనో, మరేదో కారణం కాదు. అవకాశాలు ఇన్ని అని కచ్చితంగా చెప్పలేను. తెలుగులో తర్వాత బన్సీతో నటించే అవకాశం వచ్చింది. కానీ చేయలేకపోయాను. కథలను నేనే వింటాను. కథ గురించి నాన్నతో డిస్కస్ చేస్తాను. నిర్ణయం నాదే.
శ్రీదేవి సినిమా కోసం..: ‘శ్రీదేవి బంగ్లా’ సినిమాకు సంబంధించి నాకు లీగల్ నోటీసులు వచ్చాయంటూ వార్తలొచ్చాయి. నా సినిమాకు సంబంధించి కాంట్రవర్సీ ఉండాలని అనుకోను. ఒకవేళ మీరన్నట్టు ఏదైనా సమస్య ఉంటే డైరెక్టర్, నిర్మాతలకు సంబంధించింది. నావరకు పాత్రను నేనెలా చేశాననే చూస్తా. స్క్రిప్ట్ విన్నప్పుడు బాగా అనిపించింది. లేడీ ఓరియెంటెడ్ సినిమా కాబట్టి ఒప్పుకున్నా.
నటిగా...: నటిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. పర్టికులర్‌గా ఉన్న ట్యాగ్స్‌ను దాటి ఎదగాలనుంది. అంతే తప్ప ఒత్తిడిగా భావించడం లేదు. ‘ఒరు ఆడార్ లవ్’లో కన్నుగీటే సీన్ వన్ టేక్‌లో చేశా. ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేయలేదు. నా కుటుంబంలో ఎవరికీ సినిమాలతో సంబంధం లేదు. చిన్నప్పట్నుంచి సినిమాలను ఎక్కువగా చూస్తుండేదాన్ని. నా స్నేహితులు నాతో ఎప్పటిలాగే ఉంటున్నారు. స్నేహితులతో కలిసి బయటకువెళ్ళడానికి ఇష్టపడతాను.
స్కూల్ లైఫ్‌లో..: ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదలవుతోన్న మలయాళ సినిమా. సినిమాపై అంచనాలున్నాయి. స్కూల్ లైఫ్‌లో జీవితం గురించి చెప్పే సినిమా ఇది. నాకు ‘ఒరు ఆడార్ లవ్’ పాటకు సంబంధించి ఎంతో హైప్ వచ్చింది. మరోపక్క విమర్శలూ ఉన్నాయి. కొందరు ఆ పాటలో నటించొద్దని కూడా అన్నారు. నా తొలి సినిమాతోనే చాలా విషయాలు నేర్చుకున్నాననిపించింది. నా తదుపరి చిత్రాల గురించి ఇప్పుడే చెప్పలేను.

మహర్షి.. చలో..అబుదాబి

$
0
0

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహర్షి’. కాగా ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌కి పొల్లాచిలో జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా చాలాభాగం షూటింగ్‌ను కూడా పూర్తిచేసుకుంది. అలాగే పొల్లాచిలో షూటింగ్ ఈ వారం చివర్లో ముగియనుంది. తరువాత షెడ్యూల్ మహర్షి చిత్ర బృందం హైదరాబాద్‌లో చేయనుంది. అలాగే ఆ తరువాత ఈ సినిమా చివరి షెడ్యూల్‌ను అబూధాబీలో చేయనున్నారు. ఈ సినిమాలో మహేష్‌బాబు సరసన పూజాహెగ్డే కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, అశ్వినీదత్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం శాటిలైట్ హక్కులను ప్రముఖ టెలివిజన్ ఛానల్ అయిన జెమినీ టీవీ దక్కించుకుంది. ఏప్రిల్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఉత్సాహంగా మిస్టర్ మజ్ను

$
0
0

అఖిల్ అక్కినేని హీరోగా ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మిస్టర్ మజ్ను’. యు/ఎ సర్ట్ఫికేట్ సాధించిన ఈ చిత్రం 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఇప్పటికే పాటలు, ట్రైలర్‌కు ఆడియెన్స్‌నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అఖిల్ అక్కినేని సరసన నిధి అగర్వాల్ హీరోయిన్. చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా తన కెరీర్‌కు ఓ కొత్త టర్న్ ఇవ్వనుందన్న ఉత్సాహం అఖిల్‌లో కనిపిస్తోంది.

నో పాలిటిక్స్..!!

$
0
0

ప్రతి పార్లమెంటు ఎన్నికలు జరిగే సమయంలో బాలీవుడ్ నుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు. ఈసారి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనాకపూర్ కాంగ్రెస్ తరఫున పోటీచేయబోతున్నట్లుగా మీడియాలో వార్తలువచ్చిన విషయం తెల్సిందే. భోపాల్‌నుండి కరీనాకపూర్‌తో పోటీ చేయించేందుకు కాంగ్రెస్‌వారు ప్రయత్నాలు చేస్తున్నారంటూ జాతీయ మీడియాలోకూడా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆమె అభిమానుల్లో చర్చ మొదలైంది. ఈ సమయంలో కరీనాకపూర్ తన గురించి మీడియాలో వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది. అసలు తాను రాజకీయాల గురించి ఆలోచించిందే లేదని తనకు రాజకీయాలపై ఆసక్తిలేదని పేర్కొంది. ప్రస్తుతానికైతే ఆ ఆలోచన లేదని నన్ను ఎవరుకూడా రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించలేదు. ఏ పార్టీవారు నన్ను సంప్రదించలేదంది. ప్రస్తుతం తన దృష్టి మొత్తం కూడా సినిమా ఇండస్ట్రీపైనే ఉందని తాను మరే విషయాల గురించి ఆలోచించడం లేదు. రాజకీయాల్లో రాణించాలనే ఆశ నాకు లేదని క్లారిటీగా చెప్పింది.

కారు జోరుకి హస్తం బేజారు

$
0
0

కూసుమంచి, జనవరి 22: మండల వ్యాప్తంగా జరిగిన పంచాయతీ ఎన్నికల పలితాలలో కారు దూసుకెళ్ళగా హస్తం డీలా పడింది. మండలంలోని మొత్తం 41గ్రామ పంచాయతీలలో టిఆర్‌ఎస్ పార్టీ-24, కాంగ్రెస్ పార్టీ-12, సిపిఎం-3, టిడిపి-1, ఇండిపెండెంట్-1 గెలుచుకున్నాయి. పంచాయతీ ఎన్నికల ఫలితాలు మండల వ్యాప్తంగా ఉహకు విరుద్ధంగా అంచనాలు తలకిందులు చేస్తూ టిఆర్‌ఎస్ పార్టీకి భారీగా గ్రామ పంచాయతీలు గెలుచుకుంది. తొలుత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగినప్పటికీ పంచాయతీ ఎన్నికలలో సీన్ రివర్స్ అయ్యింది. మండల వ్యాప్తంగా ఓటమిపై కాంగ్రెస్ పార్టీ విశే్లషణలు జరుపుతుంది. గెలిచిన ఆనందంలో టిఆర్‌ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటుండగా ఓటమిపై కాంగ్రెస్ పార్టీ విశే్లషణలు జరుపుతుంది. మండల వ్యాప్తంగా కైవసం చేసుకున్న స్థానాలు టిఆర్‌ఎస్ పార్టీ గెలిచిన స్థానాలు అగ్రహరం -బుర్ర ఆంజనేయులు, ఆజ్మీర హీరామన్ తండ - మూడు కోటు, సంద్యతండ - బాణోత్ ఉపేందర్, చేగోమ్మ - రెడ్డిమల్ల రమణమ్మ, చౌటపల్లి- దామళ్ళ మమత, గైగోళ్ళపల్లి - శ్యాంసుందర్‌రెడ్డి, గంగబండతండ - బాణోత్ కిషన్, గోరీలాపాడు తండ - బాణోత్ సరస్వతి(ఏకగ్రీవం), గురవాయిగూడెం - కుంభం రమ, జక్కేపల్లి - నల్లబోలు మాధవి, జక్కేపల్లి ఎస్‌సికాలని - రాయబారపు స్వాతి, జీళ్ళచెరువు - కొండ సత్యం, జుజ్జులరావుపేట - మందడి పద్మ, కేశవాపురం - తాళ్ళూరి వెంకటేశ్వరరావు, కూసుమంచి - చెన్న మోహన్, లింగారంతండ - బాణోత్ నాగేశ్వరరావు, లోక్యాతండ - జర్పుల పద్మ, మల్లాయగూడెం - బదావత్ బిబ్లి, మంగలితండ - తేజావత్ రాములు, మునిగేపల్లి - గుగ్గిళ్ల మోహన్, ముత్యాలగూడెం - బొల్లికొండ శ్రీను, నాయకన్‌గూడెం - కాసాని సైదులు, నర్సింహుల గూడెం - జక్కుల వెంకటేశ్వర్లు, పెరికసింగారం -వాసంశెట్టి వెంకన్న, రాజుపేట బజార్ - మండవ వెంకటేశ్వర్లు, తురకగూడెం - కనె్నబోయిన కౌసల్య, కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందిన స్థానాలు భగవత్‌వీడు - బర్మావత్ రవి, బోడియాతండ - భుక్యా రాణీ, ఈశ్వరమాధారం - ఎర్రబోలు సూర్యనారాయణరెడ్డి, గట్టుసింగారం - నెల్లూరి ఖాదర్‌బాబు, కిష్టాపురం - పందిరి పద్మ, కోక్యాతండ - బాణోత్ మంగమ్మ, కొత్తూరు - లోడిగ కృష్ణవేణి(ఏకగ్రీవం), దర్మాతండ - జర్పుల పింప్లి(ఏకగ్రీవం), లాల్‌సింగ్‌తండ - ధరావత్ వెంకటి, పోచారం - రామసహాయం శశికళ, రాజుపేట - వాసంశెట్టి అరుణ, సిపిఎం పార్టీనుండి గెలుపొందిన స్ధానాలు మల్లేపల్లి - పోట్టపింజర నాగేశ్వరరావు, నేలపట్ల - రెంటాల ధనమ్మ, పాలేరు - యడవల్లి రమణమ్మ, టీడీపి నుండి ఎర్రగడ్డతండ - జర్పుల శ్రీనులు గెలుపొందారు.

ఎట్టకేలకు ఈనామ్‌కు అంగీకారం

$
0
0

ఖమ్మం, జనవరి 22: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ఎంతోకాలంగా మిర్చి పంటను కూడా ఈనామ్ పద్ధతి ద్వారా కొనుగోలు చేసేందుకు మార్కెట్ శాఖాధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మిర్చి కొనుగోళ్ళను ఈనామ్ పద్ధతి ద్వారా ఈసీజన్ నుండి ప్రారంభించేందుకు వ్యాపారులతో గత నెల జరిపిన చర్చలు ఫలించలేదు. చివరిగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఆయేషా మస్రత్‌ఖానం ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో వ్యాపారులు అంగీకరించారు. మిర్చి పంట కొనుగోళ్ళలో ఈనామ్ పద్దతి అమలు చేయడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని వ్యాపారులు జెసి ఎదుట విన్నవించుకున్నారు. మార్కెట్‌కు ఒకొక్క రైతు 50నుండి 60మిర్చి బస్తాలు తీసుకువస్తారని, దీనివల్ల ఒకటి, రెండు బస్తాలను మాత్రమే కోసి పంటను పరిశీలించడం జరుగుతుందని, దీని ద్వారా తాము తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయని వ్యాపారులు జెసి ఎదుట వాపొయ్యారు. దీంతో జాయింట్ కలెక్టర్ వ్యాపారులు, రైతులతో విడివిడిగా చర్చలు జరిపారు. కాగా ఈ చర్చల్లో ఈనామ్‌ను అమలు చేయడం వల్ల వ్యాపారులకు జరిగే నష్టాలు, లాభాలు ఏమిటని ప్రశ్నించి తెలుసుకున్నారు. అనంతరం ఇదే మాదిరిగా రైతులతో, రైతు సంఘాలతో చర్చించి ఈనామ్ పద్దతి ద్వారా వచ్చే లాభ, నష్టాలను జెసికి వివరించారు. దీంతో జెసి ఈ మిర్చి సీజన్ నుండి ఖచ్చితంగా కొనుగోళ్ళలో ఈనామ్ పద్దతిని అమలు చేయాలని ఆదేశించారు. దీనికి జిల్లా కలెక్టర్ నుండి కూడా ఆదేశాలు వచ్చినట్లు ఆమె తెలిపారు. ఈనామ్ అమలు ద్వారా రైతులకు నష్టాల కంటే లాభాలే అధికశాతం ఉన్నాయన్నారు. ఈనామ్‌ను ఖచ్చితంగా అమలు చేసి రైతులకు లాభాలు చేకూరేలా కృషి చేయాలని వ్యాపారులకు సూచించారు. రైతులు మార్కెట్‌కు తీసుకువచ్చే మిర్చి బస్తాలలో ఎన్ని బస్తాలనైనా కోసి పంటను పరిశీలించుకోవచ్చని, దీనికి ఎటువంటి అభ్యంతరాలు లేవని, ఖచ్చితంగా ఈనామ్ ద్వారా మిర్చిని కొనుగోలు చేయాలని ఆదేశించారు. అనంతరం జెసి మార్కెట్‌లోని మిర్చియార్డును పరిశీలించి అధికారులకు పలు సూచనలు తెలిపారు. ఈ సమావేశంలో మార్కెట్ డిఎంఓ సంతోష్‌కుమార్, అధికారులు మల్లయ్య, బజార్, నర్సింహరావు, ఆంజనేయులతో పాటు రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్ నల్లమల వెంకటేశ్వర్లు, వ్యాపారులు పాల్గొన్నారు.

రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలి

$
0
0

కొత్తగూడెం రూరల్, జనవరి 22: రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించేందుకు కార్మికలు, అధికారులు కృషి చేయాలని సింగరేణి డైరక్టర్లు ఎస్ శంకర్, ఎస్ చంద్రశేఖర్, భాస్కర్‌రావులు అన్నారు. అన్ని ఏరియాల జీఎంలతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో డైరక్టర్లు మాట్లాడారు. ఉత్పత్తి, ఉత్పాదక, ఓబి వెలికితీత, రక్షణ, నాణ్యత, రవాణా గురించి క్షుణ్ణంగా చర్చించారు. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ పూర్తి రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తిని సాధించాలని అధికారులకు సూచించారు. పోటీ మార్కెట్‌లో నిలదొక్కుకునేందుకు నాణ్యతతో కూడిన బొగ్గు ఉత్పత్తిని సాధించాలని అన్నారు. భూగర్భ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి తగు చర్యలు తీసుకోవాలని, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలని, ఉత్పత్తి చేసిన బొగ్గును రవాణా చేసేందుకు చర్యలు ప్రారంభించాలని అన్నారు. ఈ సమావేశంలో ఏరియా జీఎం రమణమూర్తి, ఎస్‌ఓ టూ జిఎం నారాయణరావు, ఏరియా ఇంజనీరు దామోదర్, ఏజెంట్ జిపి రావ్, డిజిఎం ఐ ఇ జ్యోతి, జికె వోసి మేనేజర్ కరుణాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ఫుట్‌పాత్ వ్యాపారస్థులకు మున్సిపాల్టీ నోటీసులు
పాల్వంచ, జనవరి 22: పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రధాన సెంటర్‌లలో ఫుట్‌పాత్‌పై చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వ్యాపారులకు ఫుట్‌పాత్‌పై వ్యాపారాలను తొలగించాలని గత మూడు రోజుల నుంచి మున్సిపల్ కమిషనర్ ఎస్‌కె షఫీ ఉల్లా నోటీసులను అందజేస్తున్నారు. స్థానిక శాస్ర్తిరోడ్డు, నటరాజ్‌సెంటర్, బీసీఎం జాతీయ రహదారిపై ఉన్న ఫుట్‌పాత్‌పై గత అనేక సంవత్సరాలుగా చిరు వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తుండటంతో ఒక్కసారిగా మున్సిపల్ అధికారులు దుకాణాలను తొలగించాలని నోటీసులు ఇవ్వడంతో వ్యాపారాలు లబోదిబో మంటున్నారు. నోటీసులు ఇచ్చిన మూడు రోజులలో దుకాణాలను తొలగించాలని, లేనిపక్షంలో మున్సిపల్ సిబ్బందిచే దుకాణాలను తొలగిస్తామని హెచ్చరించారు. శాస్ర్తిరోడ్డు, బిసిఎం జాతీయ రహదారిపై గత అనేక సంవత్సరాలుగా రోడ్డువైపు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న వారికి అనేక ఫైనాన్స్, ఇతర ఇబ్బందులు ఉన్నాయని, ఒక్కసారిగా దుకాణాలను ఖాళీ చేపిస్తే తమ జీవన పరిస్థితి ఎలా అని మున్సిపల్ అధికారులను ప్రశ్నిస్తున్నారు. చిరు వ్యాపారస్థులకు మున్సిపల్ అధికారులు ప్రత్యామ్నాయంగా దుకాణాలు నెలకొల్పేందుకు స్థలాలను చూపించాలని పలువురు వ్యాపారాలు కోరుతున్నారు. మున్సిపల్ కమిషనర్ మాత్రం రోజు రోజుకు పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచలో ప్రజలు అధికమవ్వడంతో పాటు వాహనాలు పెరిగి పోవడంతో పుట్‌ఫాత్‌పై వ్యాపారాలు చేస్తూ వాహనాదారులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. ఏది ఏమైనప్పటికీ చిరు వ్యాపారులు మాత్రం అధికారులు తమ జీవన స్థితిగతులపై దెబ్బతీయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.

గార్ల మండలంలో టీఆర్‌ఎస్ విజయకేతనం

$
0
0

గార్ల, జనవరి 22: పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. గార్ల మండలంలోని 20 గ్రామపంచాయతీల్లో టిఆర్‌ఎస్ పార్టీ తొమ్మిది స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ ఏడు, స్వతంత్ర అభ్యర్థులు ముగ్గురు, న్యూడెమోక్రసీ పార్టీ ఒక్క స్థానంలో సర్పంచులను గెలుకున్నారు. సోమవారం అర్ధరాత్రి వరకు జరిగిన ఎన్నికల కౌంటింగ్‌లో గెలిచిన అభ్యర్థుల జాబితాను మండల పరిషత్ అభివృద్ధి అధికారి డి శిరీష మంగళవారం వెల్లడించారు. అత్యధిక మెజార్టీతో సీతంపేట పంచాయతీ సర్పంచ్ బానోతు లావణ్య గెలుపొందగా మూడు ఓట్లతో గోపాలపురం పంచాయతీ సర్పంచ్ భూక్య భారతి గెలుపొందారు. మిగిలిన స్థానాల్లో బాలాజీతండాలో రత్నాకర్ శంకర్(కాంగ్రెస్)232ఓట్లు, బియ్యారం తండాలో బానోతు ప్రవళిక(టిఆర్‌ఎస్)400 ఓట్లు, చిన్న బంజరలో ఉష (టిఆర్‌ఎస్)308 ఓట్లు, చిన్నకిష్టాపురంలో గంగావత్ రుక్మిణి (టిఆర్‌ఎస్)424 ఓట్లు, కోట్యానాయక్‌తండాలో బానోతు శ్రీను (కాంగ్రెస్)384 ఓట్లు, మద్దివంచలో కుసిని బాబురావు (న్యూడెమోక్రసీ)361 ఓట్లు, మర్రిగూడెంలో భూక్య బుజ్జి( కాంగ్రెస్)962 ఓట్లు, ముల్కనూరులో వట్టం జానకీరాణీ (టిఆర్‌ఎస్)946 ఓట్లు, పెద్దకిష్టాపురంలో గంగావత్ కుంతి (స్వతంత్ర)863 ఓట్లు, పోచారంలో భూక్య మోతీలాల్(టిఆర్‌ఎస్)888 ఓట్లు, పుల్లూరులో మలోతు జ్యోతి (కాంగ్రెస్) 775 ఓట్లు, రాజుతండాలో భూక్య రాంబాయి (కాంగ్రెస్)303 ఓట్లు, రాంపురంలో గుగులోతు తారాబాయి (కాంగ్రెస్)326 ఓట్లు, శేరిపురంలో ధారవత్ సక్రు(స్వతంత్ర) 367ఓట్లతో విజయం సాధించారు. కాగా గార్ల మేజర్ గ్రామపంచాయతీలో అజ్మీరా బన్సీలాల్, పినిరెడ్డిగూడెంలో నునావత్ జ్యోతిలు టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులుగా, బుద్దారం పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ నుంచి భూక్య కమిలి, సత్యనారాయణపురంలో స్వతంత్ర అభ్యర్థి బాదావత్ రాందాస్‌లు ఎన్నికల బరిలో నిలువగా గ్రామస్థులంతా సంఘటితమైన ఏకగ్రీవం చేసుకున్నారు. కాగా ఉపసర్పంచ్ పదవుల ప్రక్రియను పూర్తి చేసినట్లు ఎంపిడిఓ శిరీష తెలిపారు.

మధిర మండలంలో 4 పంచాయతీలు ఏకగ్రీవం

$
0
0

మధిర, జనవరి 22: మధిర మండలంలో 4 గ్రామపంచాయతీల సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలోని అల్లీనగరం గ్రామపంచాయతీ సర్పంచ్, 8వార్డులకు ఒక్కొక్కరు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో ఈ పంచాయతీ నామినేషన్ల ఉపసంహరణకు ముందే ఏకగ్రీవం అయింది. ఈ పంచాయతీ సర్పంచ్‌గా స్వతంత్ర అభ్యర్థి గోసు చిన్నవేలాద్రిని ఏనుకొన్నారు. అదే విధంగా ఖమ్మంపాడు సర్పంచ్ స్థానానికి 2 నామినేషన్లు రాగా 2వ నామినేషన్ వేసిన అభ్యర్థి ఉపసంహరించుకోవడంతో టిఆర్‌ఎస్ బలపరిచిన దొండపాటి రుక్మిణమ్మతోపాటు 10 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆత్కూరు సర్పంచ్ స్థానానికి 7 నామినేషన్లు రాగా మిగిలిన 6గురు ఉపసంహరించుకోవడంతో అబ్బూరి సంధ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వార్డులకు నామినేషన్లు వేసిన వారు కూడా ఉపసంహరించుకోవడంతో వార్డులు కూడా ఏకగ్రీవం అయ్యాయి. రామచంద్రాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి 3 నామినేషన్లు రాగా ఇద్దరు ఉపసంహరించుకోవడంతో టిఆర్‌ఎస్ బలపరిచిన మార్త నరసింహరావుతోపాటు 8 మంది వార్డు సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయింది. మండలంలో మొత్తం 27 గ్రామపంచాయతీలు, 236 వార్డులు ఉండగా అందులో 4 గ్రామపంచాయతీలు, 36 వార్డులు ఏకగ్రీవం కావడంతో 23 పంచాయతీలకు, 200 వార్డులకు ఈ నెల 30వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.

బడ్జెట్‌లో ఆర్టీసికి 1శాతం నిధులు కేటాయించాలి
* ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్టక్రార్యదర్శి గడ్డం లింగమూర్తి
ఖానాపురంహవేలి, జనవరి 22: రాష్టబ్రడ్జెట్‌లో ఆర్టీసి రక్షణ, అభివృద్ధికోసం ఒక శాతం నిధులు కేటాయించాలని స్ట్ఫాఅండ్ వర్కర్స్ పెడరేషన్ (సిఐటియు) రాష్ట్ర కార్యదర్శి గడ్డం లింగమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక బస్‌డిపో ఎదుట నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ప్రజారంగం ఆర్టీసిని రక్షించి అభివృద్ధిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఆర్టీసి కార్మికుల వేతన ఒప్పంద సవరణ, సర్వీస్ రక్షణ ఒప్పందం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వలన ఆర్టీసి అనేక రకాలుగా నష్టం చవిచూస్తుందన్నారు. ఆర్టీసికి టోల్‌టాక్స్‌ల నుండి మినహాయింపు ఇవ్వాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా డిజిల్, విడిభాగాల ధరలను ప్రభుత్వమే భరించాలన్నారు. ప్రభుత్వం వివిధ వర్గాలకు ఇస్తున్న రాయితీలను బడ్జెట్‌లో కేటాయించి ప్రతి నెలా ఆర్టీసికి చెల్లించాలని డిమాండ్ చేశారు. తార్నాక అసుపత్రిలో దళారి వ్యవస్థను అరికట్టి నాణ్యమైన మందులను అందించడంతో పాటు సూపర్‌స్పెషాల్టి అసుపత్రిగా అభివృద్ధి పర్చాలని కోరారు. కార్మికులపై పడుతున్న పనిభారాన్ని తగ్గించాలన్నారు. అన్ని కేటగిల్లో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి గుండుమాధవరావు, రీజియన్ అధ్యక్షుల యర్రంశెట్టి వేంకటేశ్వర్లు, ప్రచార కార్యదర్శి తోకల బాబు, డిపోకార్యదర్శి పిట్టల సుధాకర్ నాయకులు గుర్రం రామారావు, బొక్క నాగిరెడ్డి, నెల్లూరి బాస్కర్, విజయలక్ష్మీ, జ్యోతి, విజయనిర్మల, తోటకూర శ్రీనివాసరావు, వీరభద్రం, కొలిపాక శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.


కలెక్టరేట్‌లో 1950 కాల్ సెంటర్

$
0
0

కర్నూలు ఓల్డ్‌సిటీ, జనవరి 22:ఓటరు జాబితాలో ఓటు ఉందా లేదా అనే అంశంపై అనుమానాలు నివృత్తి చేసేందుకు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన 1950 కాల్ సెంటర్‌ను మంగళవారం కలెక్టర్ సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ రవిసుభాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటరు సమాచారం తెలుసుకునేందుకు టోల్ ఫ్రీ నెం.08518-1950కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. ఈ కేంద్రంలో ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకూ అన్ని పని దినాల్లో ఓటరు సమాచారాన్ని తెలిపేందుకు సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. కాంటాక్ట్ అధికారిగా డీఆర్వో వ్యవహరిస్తారని తెలిపారు. ఓటరు సమాచారాన్ని తెలిపే టోల్ ఫ్రీ నెంబర్‌పై విస్తృత ప్రచారం నిర్వహించాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు.
రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించాలి
* డీఆర్వో వెంకటేశం
కర్నూలు ఓల్డ్‌సిటీ, జనవరి 22:ఈ నెల 26వ తేదీ నిర్వహించే భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని డీఆర్‌ఓ వెంకటేశం జిల్లా అధికారులను ఆదేశించారు. డీఆర్‌ఓ మంగళవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో రిపబ్లిక్ డే వేడుకల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించే రిపబ్లిక్ డేకు అధికారులందరూ హాజరై అప్పగించిన పనులు పూర్తి చేయాలన్నారు. విధుల్లో ఉత్తమ సేవలందించిన సిబ్బంది జాబితాను పంపాలని సూచించారు. డీఆర్‌డీఏ, డ్వామా, హౌసింగ్, వ్యవసాయ అనుబంధ శాఖలు, ఎస్సీ, బీసీ, మైనార్టీ, గిరిజన, తదితర కార్పొరేషన్లు, డీఎస్‌ఓ, డీటీసీ, అటవీ, పోలీసు, తదితర శాఖలు గత నాలుగున్నరేళ్లలో సాధించిన ప్రగతి, తాజా సమాచారంపై శకటాల ప్రదర్శనతో పాటు ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారును ఆదేశించారు.
పూజలందుకుంటున్న
అహోబిలేసుడు
ఆళ్లగడ్డ, జనవరి 22: పారువేట ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి మర్రిపల్లె గ్రామం చేరుకున్న అహోబిలేసుని ఉత్సవ పల్లకికి గ్రామస్థులు పెద్ద ఎత్తున ఎదురేగి స్వాగతం పలికారు. మంగళవారం స్వామి పల్లకి గ్రామంలో పర్యటించి తెలుపులపై ఆశీనులై ప్రజలనుండి పూజలందుకున్నారు. పల్లకిలో కొలువైన శ్రీ జ్వాలా నరసింహస్వామి, శ్రీ ప్రహ్లాదవరద స్వామిలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలో తిరుణాల వాతావరణం నెలకొంది.

కేసీఆర్‌తో జతకడితే జగన్‌కు రాజకీయ సమాధే.

$
0
0

నందికొట్కూరు, జనవరి 22:ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిన తెలంగాణ సీఎం కేసీఆర్‌తో జతకట్టిన వైసీపీ అధినేత జగన్‌కు ఈ ఎన్నికల్లో రాజకీయ సమాధి తప్పదని కాంగ్రెస్‌పార్టీ నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి జోస్యం చెప్పాడు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశిస్తే పులివెందుల నుంచైనా, కుప్పం నుంచైనా పోటీ చేసి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. బైరెడ్డి మంగళవారం పట్టణంలోని తన నివాసంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బైరెడ్డి మాట్లాడుతూ అధికారమే పరమాధిగా భావించి జగన్ కేసీఆర్‌తో చేతులు కలిసి ఘోర తప్పిదం చేశాడన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటే ఒప్పుకునేది లేదని బహిరంగంగా ప్రకటించిన కేసీఆర్‌ను జగన్ ఎలా సమర్థిస్తాడని ప్రశ్నించారు. రాజకీయ అనుభవం లేని జగన్ ఆంధ్రుల అభిమానాన్ని తాకట్టు పెట్టడం భావ్యం కాదన్నారు. సత్తా ఉంటే పోటీ చేసి గెలవాలి కానీ, ఆంధ్రులను అవమానపరచిన వారి మద్దతు కూడగట్టుకోవడం వైసీపీ రాజకీయ అనుభవలేమిని ఎత్తిచూపుతుందన్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు ఇంతకాలం ప్రధాని మోదీ వెంట తిరిగి ఇప్పుడు ఎన్నికల కోసం బీజేపీని విమర్శించడం విడ్డూరంగా వుందన్నారు. ఇంతకాలం సంక్షేమ పథకాలు అమలు చేయకుండా కేవలం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సమయంలో సంక్షేమ ఫలాలు అందిస్తామని రోజుకో పథకం ప్రవేశపెట్టడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలో నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, డబ్బు పెట్టెలతో చేసే రాజకీయం ఎక్కువ కాలం నిలవదన్నారు. ఈనెల 28వ తేదీ నంద్యాలలో కాంగ్రెస్‌పార్టీ కార్యాలయం ప్రారంభిస్తున్నామని, రాష్ట్ర నాయకులు హాజరవుతారని కావున కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు. కాగా నంద్యాల ఎంపీ స్థానానికి పోటీ చేయాలని కార్యకర్తలు ఈ సందర్భంగా బైరెడ్డిని కోరారు.

హిమాలయ గురూజీ సేవలు అమోఘం

$
0
0

కర్నూలు, జనవరి 22:పేద ప్రజల కోసం నింతరం సేవలు అందిస్తున్న హిమాలయ గురూజీ సేవలు అమోఘమని వైద్య శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ కొనాయాడారు. కర్నూలు ప్రభుత్వాసుపత్రికి వచ్చే వారి కోసం ఏర్పాటు చేసిన ఉచిత భోజన వితరణ కేంద్రాన్ని మంగళవారం మంత్రి ఫరూక్ శాంతి ఆశ్రమ ట్రస్టు వ్యవస్థాపకులు హిమాలయ గురూజీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కర్నూలు జిల్లాతో పాటు తెలంగాణలోని అలంపూర్, మానవపాడు జూనియర్ కాలేజీ విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్న భోజనం అందించిన ఘనత గురూజీకి దక్కిందన్నారు. ఇవేకాకుండా వృద్ధాశ్రమాలు, అంగన్‌వాడీ సెంటర్లలో చిన్నారులకు భోజనం అందజేయడం హర్షణీయమన్నారు. హిమాలయ గురూజీ స్ఫూర్తితోనే రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తుందన్నారు. గురూజీ పేదల కోసం చేపట్టే సేవా కార్యక్రమాలకు తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.
చంద్రబాబు సీఎం కావడం రాష్ట్ర ప్రజల అదృష్టం
* మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి
చాగలమర్రి, జనవరి 22: రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ఉండడం మన రాష్ట్ర ప్రజల అదృష్టమని మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి కొనియాడారు. మంగళవారం చాగలమర్రిలో అనారోగ్యంతో బాధపడుతున్న సింగిల్‌విండో మాజీ అధ్యక్షులు నారపురెడ్డిని ఆయన పరామర్శించారు. అనంతరం మార్కెట్‌యార్డు మాజీ డైరెక్టర్ షాబుల్ మొహిద్దీన్ స్వగృహంలో విలేఖరులతో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు బాగా కష్టపడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రిని తిరిగి గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. మిగతా ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల్లో గెలువడం అసాధ్యమన్నారు. అభివృద్ధితోనే సీఎం చంద్రబాబు తిరిగి అధికారంలోకి వస్తారన్నారు. రైతుల కోసం సాగునీటి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయుటకు ఆయన ఎంతో కృషి చేస్తున్నారని ప్రశంసించారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తాను తెలుగుదేశం పార్టీ తరపున నంద్యాల ఎంపీ స్థానానికి పోటీ చేయుటకు సిద్ధంగా ఉన్నానని గంగుల ప్రకటించారు. ప్రజలు కూడా ఆశీర్వదించాలని కోరారు. తాను నంద్యాల ఎంపీగా ఉన్నప్పుడు నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశానని తెలిపారు. రైల్వే బ్రాడ్‌గేజ్, జాతీయరహదారి విస్తరణ, ఎలక్ట్రిక్ గ్రేడ్ సాగునీటి ప్రాజెక్టులు త్వరగా పనులు చేపట్టుటకు కృషి చేశానని తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. ఈ ప్రాంతంలో ఖనిజ సంపద ఎక్కువగా ఉందని ఇతర ప్రాంతాలకు ఈ ఖనిజ సంపద వెళ్లకుండ ఇక్కడే పరిశ్రమలు స్థాపించాల్సి ఉందన్నారు. జాతీయ రహదారి విస్తరణ పనులు పూర్తికాకపోయినా టోల్‌గేటు వసూలు చేయడం తగదని, ఈ నెల 28లోపు టోల్‌గేటు ఆపివేయకుంటే తమ కార్యకర్తలు ఆందోళనలకు దిగుతారని ఆయన హెచ్చరించారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తాను ప్రత్యేకంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

నేరాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు

$
0
0

కర్నూలు, జనవరి 22:నేరాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఫకీరప్ప ఆదేశించారు. ముఖ్యంగా పేకాట, మట్కాను పూర్తిగా అరికట్టాలన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో మంగళవారం డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు పటిష్టంగా పని చేస్తేనే బాధితులకు న్యాయం జరిగి నిందితులకు శిక్ష పడుతుందన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకూ నమోదైన కేసుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలు గురించి అడిగి తెలుసుకోవడంతో పాటు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులు, యుఐ కేసుల గురించి ఆరా తీశారు. స్థానిక పోలీసు అధికారులు ఫ్యాక్షన్ పికెట్‌లను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి, రిజిస్టర్లలో సంతకాలు చేయాలన్నారు. ఫ్యాక్షన్ సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వచ్చే నెల నేషనల్ లోక్ అదాలత్‌లో రాజీ అయ్యే కేసులు పరిష్కారమయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో సాంకేతిక నైపుణ్య వినియోగం పెరగాలన్నారు. రద్దీ కూడళ్లలో సీసీ టీవీలు ఖచ్చితంగా ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలకు ముందే ఫ్యాక్షన్ గ్రామాల జాబితా తయారు చేయాలన్నారు. హిస్టరీ షీట్, రౌడీషీట్ జాబితాలను పరిశీలించి వాటిపై చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమైన కేసులను పరిశీలించి వాటిపై చర్యలు తీసుకోవాలని సబ్‌డివిజన్ స్థాయి అధికారులను ఆదేశించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయా సబ్ డివిజన్‌ల పరిధిలోని పోలీస్‌స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఐక్యూ సొల్యూషన్స్ కరుణాకర్‌రెడ్డి టీమ్ సభ్యులు సీడీఆర్ అనలసిస్ సాఫ్‌టవేర్(టవర్‌డంప్, టవర్ లొకేషన్, ఇంటర్‌నెట్ ప్రొటోకాల్ డేటా రిపోర్టు) గురించి పోలీసు అధికారులకు వివరించారు.
కార్యకర్తలే కొండంత అండ
* మంత్రి భూమా అఖిలప్రియ
చాగలమర్రి, జనవరి 22: భూమా కుటుంబానికి కార్యకర్తలే కొండంత అండ అని మంత్రి భూమా అఖిలప్రియ తెలిపారు. మంగళవారం స్థానిక కోటగడ్డ వీధిలో, పాత బ్యాంకు వీధిలో, వినాయక నగర్‌లో మంత్రి సమక్షంలో హుసేన్‌బాషా తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్యకర్తల అండతోనే తమ కుటుంబం ఈ స్థాయికి చేరిందన్నారు. భూమా దంపతులు చనిపోగానే తమ కుటుంబానికి దిక్కు ఎవరు ఉండరని, ప్రత్యర్థులు భావించారని, కాని కార్యకర్తల అండగా నిలిచారని ఆమె తెలిపారు. కార్యకర్తల రుణాన్ని ఎప్పటికి తీర్చుకోలేమని మంత్రి స్పష్టం చేశారు. తమ తల్లి భూమాశోభానాగిరెడ్డి చనిపోయినా నియోజకవర్గ ప్రజలు ఓట్లు వేసి గెలిపించడం తమ కుటుంబంపై గల ఆదరాభిమానాలకు నిదర్శనమన్నారు. తాము కూడా ప్రజలనమ్మకాన్ని వమ్ముచేయకుండ అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. పెన్షన్ పైకాన్ని పెంచడమేకాక ముస్లిం మైనార్టీల అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు కేటాయించారని ఆమె తెలిపారు. నగళ్లపాడు గ్రామంలో గ్రామదర్శినిలో ఆమె ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

నాడు ఎద్దుల బండ్లు, సైకిళ్లు.. నేడు ఆటోలు, ట్రాక్టర్ల ట్యాక్స్ రద్దు

$
0
0

కర్నూలు సిటీ, జనవరి 22:నాడు టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఎద్దులబండ్లు, సైకిళ్ల ట్యాక్స్ రద్దు చేయగా నేడు సీఎం చంద్రబాబు ఆటోలు, ట్రాక్టర్ల ట్యాక్స్ రద్దు చేశారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఎన్‌ఎండీ.్ఫరూఖ్ పేర్కొన్నారు. నగరంలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అధ్యక్షతన మంత్రి ఫరూక్ ఆటో డ్రైవర్లతో కలిసి సీఎం చంద్రబాబు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. అనంతరం మంత్రి పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ 1983లో ఎన్టీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు సైకిల్‌తో పాటు ఎద్దుల బండ్లకు ట్యాక్స్ ఉండేదని, దీంతో ఎన్టీఆర్ పేదలపై పన్నుల భారం ఉండకూడదని వెంటనే రద్దు చేశారని గుర్తుచేశారు. అలాగే ఆటో నడుపుకుంటూ జీవనం సాగించే ఆటో డ్రైవర్లపై జీవితకాలపు పన్ను(లైఫ్ ట్యాక్స్), ట్రాక్టర్లకు త్రైమాసిక పన్ను రద్దు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు. ఇక ప్రభుత్వాసుపత్రిలో రూ. 120 కోట్ల వ్యయంతో క్యాన్సర్ ఆసుపత్రితో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామన్నారు. జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని, ఓర్వకల్లు పరిశ్రమల హబ్‌గా ఏర్పడుతోందని ఈ నేపథ్యంలో కర్నూలుకు ఎయిర్‌పోర్టు అవసరం చాలా ఉందన్నారు. సోమిశెట్టి మాట్లాడుతూ ఆటోలు, ట్రాక్టర్లకు లైఫ్ ట్యాక్స్ రద్దు చేయడం దేశంలోనే ఇదే తొలిసారి అన్నారు. పింఛన్ల మొత్తం పెంపు, డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కింద ఆర్థిక చేయూత, తదితర ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే ప్రతిపక్ష పార్టీ నాయకులకు భయం పుట్టుకొందన్నారు. పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర నిధులతోనే పూర్తవుతుందని కొందరు కేంద్ర మంత్రులే ప్రకటిస్తుంటే మరో కేంద్ర మంత్రి గడ్కరీ పోలవరానికి కావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందనడం హాస్యాస్పదం అన్నారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబించడమే కాకుండా ప్రభుత్వ వ్యవస్థలను నాశనం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం 2 నెలల్లో పతనం కానుందన్నారు. ఫెడరల్ ఫ్రంట్‌లో కేసీఆర్, జగన్ తప్ప మరొక లేరని, 2019 ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థులదే గెలుపని, ప్రధాని ఎవరనేది నిర్ణయించేది కూడా సీఎం చంద్రబాబే అన్నారు. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు విశ్వరూపం చూసి వైసీపీ నాయకులకు భయం పుట్టుకొందన్నారు. టీడీపీ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా ప్రజలకు అవసరమైన పథకాలు ప్రవేశపెట్టిందని, దీంతో ప్రజలు చంద్రబాబుకు బ్రహ్మరథం పడుతున్నారని, దానిని చూసి జీర్ణించుకోలేక వైసీపీ నేతలు పిచ్చిపట్టినట్లు చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారన్నారు. 90శాతం మంది ప్రజలు సంతృప్తితో ఉన్నారని ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వాసుత్రులు
* రూ. 3.15 కోట్లతో ప్రసూతి భవనం ఆధునీకరణ * వైద్య విద్య, మైనారిటీ శాఖ మంత్రి ఫరూక్
కర్నూలు, జనవరి 22:కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నామని వైద్య విద్య, మైనారిటీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తెలిపారు. నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆవరణలో మంగళవారం మంత్రి ఫరూక్ రూ. 3.15 కోట్ల అంచనా వ్యయంతో పాత ప్రసూతి భవనం ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. ఎన్‌టీఆర్ వైద్య సేవ ద్వారా 1046 జబ్బులకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కాన్పులకు అవసరమైతే సిజేరియన్ చేయడానికి ఎన్‌టీఆర్ వైద్య సేవ ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల్లో అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఇక ఆసుపత్రి ఆవరణలోని లెక్చర్ హాల్ మరమ్మతులకు రూ. 10 లక్షలు, మిలీనియం బ్లాక్ మంజూరుకు చర్యలు తీసుకుంటామన్నారు. మాతా, శిశు మరణాల రేటును తగ్గించేందుకు కృషి చేయాలన్నారు. కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. ఆసుపత్రుల ఆధునీకరణ, సీటీస్కాన్ తదితర ఆధునిక వైద్య పరికరాల కొనుగోలుకు ప్రభుత్వం పుష్కలంగా నిధులు ఇస్తోందన్నారు. వైద్యులు ప్రత్యక్ష దైవాలని, అలాంటి వారు రోగులకు మంచి వైద్య సేవలు అందించాలన్నారు. కర్నూలు ఆసుపత్రి ఇప్పటికే మంచి పేరు సంపాదించుకుందన్నారు. ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ మాట్లాడుతూ మిలీనియం బ్లాక్ ఏర్పాటుకు కృషి చేయాలని మంత్రి ఫరూక్‌కు విజ్ఞప్తి చేశారు. టీడీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆసుపత్రి అభివృద్ధి, ఆధునిక పరికరాల కొనుగోలుకు సీఎం చంద్రబాబు కోట్ల రూపాయలు మంజూరు చేశారన్నారు. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కర్నూలు ఆసుపత్రి సేవలు అందిస్తుందన్నారు. ఈ ఆసుపత్రి నానాటికీ అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లోకి కర్నూలు ఆసుపత్రిలో ఓపీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, ఇందుకు డాక్టర్లను అభినందిస్తున్నామన్నారు.
బట్టమేక పక్షులను సంరక్షించుకోవాలి
* దేశవ్యాప్తంగా 200 పక్షులే.. * రోళ్లపాడు వన్యప్రాణి కేంద్రాన్ని సందర్శించిన మీ బృందం
మిడుతూరు, జనవరి 22:ప్రపంచంలోనే అంతరించిపోతున్న పక్షి జాతుల్లో ఒకటైన ‘ది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్’ బట్టమేక పక్షులను సంరక్షించుకోవాలని ‘మీ’ కమిటీ బృందం సభ్యులు సూచించారు. ‘మీ’ బృందం చైర్మన్, విశ్రాంత ఐఎఫ్‌ఎస్ అధికారి డా. ఎస్‌కె.ఖండూరి, బృందం సభ్యులు కేఎఫ్‌ఆర్‌ఐ సైంటిస్టు జైసన్, ప్రపంచ బ్యాంకు కన్సల్టెంట్ డా. అరుణ్‌మని డిక్సిట్, ఐఎఫ్‌ఎస్ అధికారి వినోద్‌కుమార్ మంగళవారం మండల పరిధిలోని రోళ్లపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. రాష్ట్రంలోని పర్యాటక క్షేత్రాలను అభివృద్ధి చేయాలంటే ఏయే పనులు చేపట్టాలో ముందుగా తెలుసుకోవాలన్న ఉద్దేశ్యంతో పర్యటిస్తున్న ఈ బృందం రోళ్లపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల కోసం కేంద్రం పరిధిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం భారత దేశ వ్యాప్తంగా కేవలం 200 బట్టమేక పక్షులు మాత్రమే సంచరిస్తున్నాయని, ఈ పక్షుల సంచారం ఏపీతో పాటు రాజస్థాన్, మహారాష్ట్ర, కర్నాటక పరిసర ప్రాంతాల్లో ఉందన్నారు. ప్రపంచ పటంలో రోళ్లపాడు వన్యప్రాణి కేంద్రానికి గుర్తింపుతెచ్చిన బట్టమేక పక్షుల సంతతి ఈ ప్రాంతంలో పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కాగా శాంచురీ పరిధిలో జింకల సంతతిని తగ్గించేందుకు, జింకల వల్ల నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం పెంచాలనే విషయాలపై కూడా నివేదిక అందజేస్తామన్నారు.

Viewing all 69482 articles
Browse latest View live